coastal andhra
-
37 మంది జైలు వార్డర్లపై క్రమశిక్షణా చర్యలు
ఆరిలోవ (విశాఖ జిల్లా): విశాఖ కేంద్ర కారాగారంలో నిబంధనలు ఉల్లంఘించిన 37 మంది వార్డర్లపై క్రమశిక్షణా చర్యలు చేపట్టినట్లు జైళ్ల శాఖ కోస్తాంధ్ర రీజియన్ డీఐజీ రవికిరణ్ తెలిపారు. విశాఖ కేంద్ర కారాగారం పర్యవేక్షణాధికారి ఎం.మహేశ్‌బాబు అవమానించారని.. విధి నిర్వహణలో కఠినంగా ఉంటున్నారంటూ వార్డర్లు తమ కుటుంబసభ్యులతో జైలు ప్రధాన ద్వారం ఎదుట ధర్నా చేశారు. ఈ విషయం తెలుసుకున్న డీఐజీ రవికిరణ్ శనివారం అర్ధరాత్రి రాజమండ్రి నుంచి విశాఖకు చేరుకున్నారు.వార్డర్లతో, జైలు సూపరింటెండెంట్‌తో చర్చించారు. ఆదివారం ఉదయం జైలును సందర్శించి.. ఖైదీలతో మాట్లాడారు. అనంతరం మీడియాతో మాట్లాడుతూ.. జైలులో ఉన్నతాధికారుల నుంచి కింది స్థాయి సిబ్బంది వరకు అందరికీ ఒకే విధమైన నిబంధనలు వర్తిస్తాయన్నారు. జైలు లోపలకు నిషేధిత వస్తువులు తెచ్చారని అనుమానం వస్తే.. ఎవరినైనా వెంటనే తనిఖీ చేయవచ్చని చెప్పారు. అందులో భాగంగా సూపరింటెండెంట్ సమక్షంలో డిప్యూటీ సూపరింటెండెంట్.. ఇద్దరు వార్డర్లను తనిఖీ చేశారని తెలిపారు. నిబంధనలను ఉల్లంఘించి జైల్ ముందు ధర్నా చేసి.. విధులకు గైర్హాజరైన 37 మంది వార్డర్లను రాష్ట్రంలోని వేర్వేరు జైళ్లకు బదిలీ చేశామన్నారు. -
AP Rains: ఏపీలో మరో రెండ్రోజులు వర్షాలు
విశాఖపట్నం, సాక్షి: పశ్చిమ మధ్య బంగాళాఖాతంలో బలహీన పడిన వాయుగుండం.. అల్ప పీడనంగా నైరుతి దిశగా పయనిస్తోంది. ఈ క్రమంలో.. ఏపీకి మరో రెండ్రోజులు వర్షాలు తప్పవని విశాఖ వాతావరణ కేంద్రం తెలిపింది.ఇప్పటికే వాయుగుండం ప్రభావంతో రాష్ట్రంలో భారీ వర్షాలు పడుతున్నాయి. గడచిన 24 గంటల్లో పల్నాడులో కుండపోత వాన పడింది. దక్షిణ కోస్తా, రాయలసీమ జిల్లాల్లో మరో రెండు రోజులపాటు విస్తారంగా వర్షాలు పడతాయని వాతావరణ శాఖ చెబుతోంది.రేపు, ఎల్లుండి నెల్లూరు, ప్రకాశం జిల్లాలలో భారీ వర్షాలు పడనున్నాయి. కోస్తా తీరం వెంబడి కొనసాగనున్న తీవ్రమైన ఈదురు గాలులు కొనసాగుతాయి. మత్స్యకారులు వేటకు వెళ్ళరాదని ఇప్పటికే సూచించింది వాతావరణ శాఖ.ఇదీ చదవండి: అకాల వర్షం నిండా ముంచేసింది -
కోస్తాంధ్రలో మూడు రోజులు భారీ వర్షాలు..
-
కోస్తాంధ్రకు భారీ వర్షసూచన
సాక్షి, విశాఖపట్నం/అమరావతి/వాకాడు: నైరుతి బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం స్థిరంగా కొనసాగుతోంది. తదుపరి రెండు రోజుల్లో వాయుగుండంగా బలపడే అవకాశం ఉందని విశాఖపట్నం తుపాను హెచ్చరికల కేంద్రం అధికారులు తెలిపారు. వాయుగుండంగా మారిన అనంతరం నెల్లూరు సమీపానికి చేరి.. అక్కడ దిశ మార్చుకుని తమిళనాడు వైపుగా పయనిస్తుందని, అక్కడే తీరం దాటే అవకాశాలున్నాయని వెల్లడించారు.దీని ప్రభావం శ్రీకాకుళం నుంచి నెల్లూరు వరకూ తీర ప్రాంతంలోని కోస్తాంధ్ర జిల్లాలపై ఎక్కువగా ఉంటుందని తెలిపారు. బుధవారం నుంచి ఈ నెల 22 వరకూ రాష్ట్రానికి వర్ష సూచన ఉందని వెల్లడించారు. బుధవారం విశాఖపట్నం, అనకాపల్లి, కాకినాడ, యానాం, నెల్లూరు, తిరుపతి జిల్లాల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు, విజయనగరం, కృష్ణా, బాపట్ల, ప్రకాశం జిల్లాల్లో భారీ వర్షాలు, శ్రీకాకుళం, పార్వతీపురం, అల్లూరి జిల్లాల్లో మోస్తరు వర్షాలు కురుస్తాయని వివరించారు. 19న ఉత్తరాంద్ర, దక్షిణ కోస్తా జిల్లాల్లో ఒకట్రెండు చోట్ల భారీ నుంచి అతి భారీ వర్షాలు పడే అవకాశం ఉందన్నారు. తీరం వెంబడి గంటకు 35 నుంచి 45 గరిష్టంగా 55 కి.మీ. వేగంతో బలమైన ఈదురుగాలులు వీస్తాయని, సముద్రం అల్లకల్లోలంగా ఉంటుందని పేర్కొన్నారు. మత్స్యకారులెవరూ ఈ నెల 22 వరకూ వేటకు వెళ్లరాదని హెచ్చరించారు.తీరంలో అలజడిఅల్పపీడనం కారణంగా మంగళవారం వాతావరణంలో అనూహ్య మార్పులు చోటుచేసుకున్నాయి. తిరుపతి జిల్లా సముద్ర తీరంలోని చిల్లకూరు, కోట, వాకాడు, తడ, సూళ్లూరుపేట మండలాల పరిధిలో సముద్రంలో భీకరమైన శబ్దాలతో అలలు ఎగసిపడుతున్నాయి. వాతావరణంలో ఒక్కసారిగా మార్పులు తలెత్తి మధ్యాహ్నం నుంచే చీకట్లు కమ్ముకుని తీవ్రమైన చలి గాలులు వీస్తున్నాయి. వాకాడు మండలం తూపిలిపాళెం సముద్ర తీరంలో భీకరమైన శబ్దాలతో అలలు ఉవ్వెత్తున ఎగసిపడుతున్నాయి. తీరప్రాంత ప్రజలు చలికి గజగజ వణుకుతున్నారు. సాయంత్రం 4 గంటలకే రాత్రిని తలపిస్తూ బయట తిరగలేని పరిస్థితి ఏర్పడింది. ఇప్పటికే వేటలో కొనసాగుతున్న మత్స్యకారులు తీవ్రమైన అలలు, చలి గాలులకి తట్టుకుని వేట చేయలేకున్నామని, తాము వేట ముగించుకుని, త్వరితగతిన ఒడ్డుకు వచ్చేస్తున్నామంటూ తోటి మత్స్యకారులకు ఫోన్ ద్వారా సమాచారం అందజేశారు. -
ఏపీని భయపెడుతున్న తుపాను
సాక్షి, విశాఖ: తమిళనాడుతో పాటు ఏపీని కూడా తుపాను భయపెడుతోంది. ఈ రాత్రికి తీవ్ర వాయుగుండం తుపానుగా మారనుందని వాతావరణ శాఖ అంటోంది. ఫెంగల్ తుపాను సమీపించే కొద్దీ.. భారీ వర్షాలు అతలాకుతలం చేస్తాయని హెచ్చరిస్తోంది... ఇప్పటికే దక్షిణ కోస్తా భారీ వర్షాలు, తీవ్ర గాలులతో ఉక్కిరి బిక్కిరి అవుతోంది. మరో ఐదు రోజులపాటు రాష్ట్రవ్యాప్తంగా వర్షాలు పడతాయని వాతావరణశాఖ చెబుతోంది. కోస్తా తీరం వెంబడి ఉన్న పోర్టులలో ఒకటవ నెంబర్ ప్రమాద హెచ్చరికలు జారీ చేశారు. వర్షాలు నేపథ్యంలో వ్యవసాయ పనులు చేసే రైతులు తగు జాగ్రత్తలు తీసుకోవాలని సూచించింది అధికార యంత్రాంగం. ఇక.. విశాఖ వాతావరణ కేంద్రం అధికారి జగన్నాథ్ కుమార్ ఆ వివరాలను మీడియాకు వెల్లడించారు. .. నైరుతి బంగాళాఖాతంలో తీవ్ర వాయుగుండం బుధవారం ఉదయం చెన్నైకు దక్షిణ ఆగ్నేయ దిశలో 550 కి.మీ, పుదుచ్చేరికి 470 కి.మీ కేంద్రీకృతమై ఉంది. ఉత్తర వాయువ్య దిశగా కదులుతూ.. తుపానుగా మారే అవకాశం ఉంది. రాగల రెండ్రోజులు ఉత్తర ఆగ్నేయ దిశలోనే ప్రయాణించి తమిళనాడు తీరంలో కేంద్రీకృతమయ్యే సూచనలు కనిపిస్తున్నాయి. దీని ప్రభావంతో దక్షిణ కోస్తా ప్రాంతంలో పలు చోట్ల గురువారం, శుక్రవారం మోస్తరు నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది. తీర ప్రాంతాల్లో 35 నుంచి 55 కి.మీ వేగంతో ఈదురుగాలులు వీచే అవకాశముందని అన్నారాయన.ఏపీపై తుపాను ప్రభావం వారంపాటు కొనసాగనుంది. రేపు సాయంత్రం నుంచి దక్షిణ కోస్తా తీర ప్రాంతాల్లో గంటకు 50-70 కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలులు వీచే అవకాశం ఉంది. వచ్చే ఐదు రోజుల్లో.. దక్షిణ కోస్తా. రాయలసీమ, ఉత్తరాంధ్రలో వర్షాలు కురుస్తాయని చెబుతోంది. ఈ నెల 30వ తేదీ దాకా మత్య్యకారులు సముద్రంలోకి వెళ్లొద్దని హెచ్చరికలు ఇదివరకే జారీ అయ్యాయి. ఇంకోవైపు.. తుపాను ప్రభావంతో తెలంగాణలోనూ వర్షాలు పడొచ్చని ఐఎండీ అంచనా వేస్తోంది. ఇప్పటికే తమిళనాడును భారీ వర్షాలు ముంచెత్తాయి. దీంతో విద్యాసంస్థలకు సెలవు ప్రకటించింది అక్కడి విద్యాశాఖ. -
రెండు రోజులపాటు కోస్తాంధ్రకు వర్ష సూచన
-
ఏపీలో రెండ్రోజులు భారీ నుంచి అతిభారీ వర్షాలు
అమరావతి, సాక్షి: మధ్యప్రదేశ్ తీర పరిసర ప్రాంతం మీదుగా కొనసాగుతున్న అల్పపీడన ప్రభావం, దీనికి అనుబంధంగా విస్తరించిన ఆవర్తనం రాష్ట్రం మీద ప్రభావం చూపించనుంది. ఈ ప్రభావంతో రెండ్రోజులపాటు ఏపీలో భారీ నుంచి అతిభారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ ప్రకటించింది. రేపు, ఎల్లుండి (జులై 18, 19వ తేదీల్లో) కోస్తాంధ్రలో పలుచోట్ల భారీ నుంచి అతిభారీ వర్షాలు కురుస్తాయని ఏపీ విపత్తుల నిర్వహణ సంస్థ ఎండీ రోణంకి కూర్మనాథ్ తెలిపారు. అలాగే.. మిగిలినచోట్ల విస్తృతంగా వర్షాలు పడే అవకాశం ఉందని అన్నారాయన. రాయలసీమలో అక్కడక్కడ తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని తెలిపారు.‘‘వర్షం పడే సమయంలో బలమైన ఈదురుగాలులు వీస్తాయి. వర్షాలతో పాటు పిడుగులు పడే అవకాశం ఉంది. పొలాల్లో పనిచేసే రైతులు, వ్యవసాయ కూలీలు, పశు-గొర్రెల కాపరులు చెట్లు క్రింద ఉండరాదు. లోతట్టు ప్రాంత ప్రజలు అప్రమత్తంగా ఉండాలి. తగిన జాగ్రత్తలు తీసుకోవాలి’’ అని సూచించారాయన. అలాగే.. అత్యవసర సహాయం కోసం టోల్ ఫ్రీ నెంబర్స్ 1070, 112, 18004250101 సంప్రదించాలని కోరారాయన. భారీ నుంచి అతి భారీ వర్ష సూచన జిల్లాలుశ్రీకాకుళం, విజయనగరం,మన్యం, అల్లూరి, విశాఖ, అనకాపల్లి, కాకినాడ భారీ నుంచి అతి భారీ వర్ష సూచన జిల్లాలుకోనసీమ,తూర్పుగోదావరి, పశ్చిమగోదావరి, ఏలూరు జిల్లాల్లో పలుచోట్లుభారీ నుంచి అతి భారీ వర్ష సూచన జిల్లాలుకృష్ణా, ఎన్టీఆర్, గుంటూరు, బాపట్ల, పల్నాడు, ప్రకాశం, నంద్యాల జిల్లాల్లో పలుచోట్ల భారీ నుంచి అతిభారీ వర్షాలు కురిసే అవకాశం -
కోస్తాంధ్ర, రాయలసీమలో రేపు భారీ వర్షాలు
-
AP: ఆ జిల్లాల్లో రెండు రోజుల పాటు వర్షాలు
సాక్షి, విశాఖపట్నం: రాష్ట్రంలో వాతావరణ పరిస్థితులు మారుతున్నాయి. నెలన్నర రోజులుగా వడగాడ్పులు, వడగాడ్పులు వీస్తున్నాయి. అత్యధిక ఉష్ణోగ్రతలు జనాన్ని బెంబేలెత్తిస్తున్నాయి. మునుపెన్నడూ లేనివిధంగా ఉష్ణోగ్రతలు 48 డిగ్రీలకు చేరుకుంటున్నాయి.ఈ తరుణంలో ఒకపక్క వడగాడ్పులు కొనసాగుతూనే మరోపక్క ఉరుములు, మెరుపులు, పిడుగులతో కూడిన వర్షాలు కురిసేందుకు అనుకూల పరిస్థితులు ఏర్పతున్నాయి. ఆది, సోమవారాల్లో కోస్తాంధ్ర, రాయల సీమల్లో అక్కడక్కడ తేలికపాటి వర్షాలతో పాటు గంటకు 40 నుంచి 50 కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలులు వీస్తాయని భారత వాతావరణ విభాగం (ఐఎండీ) శనివారం నివేదికలో వెల్లడించింది.ఈ నెల 7న (మంగళవారం) శ్రీకాకుళం, విజయనగరం, పార్వతీపురం మన్యం, విశాఖపట్నం, అనకాపల్లి, పల్నాడు, చిత్తూరు జిల్లాల్లో అక్కడక్కడ పిడుగులతో కూడిన మోస్తరు నుంచి భారీవర్షాలు, ఒకటి రెండు చోట్ల తేలికపాటి వర్షాలు కురిసే అవకాశం ఉందని తెలిపింది.మరోవైపు శనివారం ప్రకాశం జిల్లా దరిమడుగులో 47.5 డిగ్రీల గరిష్ట ఉష్ణోగ్రత రికార్డయింది. 28 మండలాల్లో తీవ్ర వడగాడ్పులు, 187 మండలాల్లో వడగాడ్పులు వీచాయి. ఆదివారం 30 మండలాల్లో తీవ్ర వడగాడ్పులు, 247 మండలాల్లో వడగాడ్పులు వీయనున్నాయి. సోమవారం 15 మండలాల్లో తీవ్ర వడగాడ్పులు, 69 మండలాల్లో వడగాడ్పులు వీయనున్నట్టు రాష్ట్ర విపత్తుల నిర్వహణ సంస్థ వివరించింది. -
ముందే హీటెక్కిన సీమ
సాక్షి, విశాఖపట్నం: ఈ ఏడాది రాయలసీమలో వేసవి సెగలు ముందే మొదలయ్యాయి. ఫిబ్రవరి నెలాఖరు నుంచే ఎండల తీవ్రత పెరుగుతోంది. మార్చి మొదటి వారం నుంచి మరింతగా విజృంభిస్తున్నాయి. ఏప్రిల్ నెలారంభంలో నమోదు కావాల్సిన పగటి (గరిష్ట) ఉష్ణోగ్రతలు ఇప్పటినుంచే రికార్డవుతున్నాయి. ప్రస్తుత ఉష్ణతాపాన్ని చూసి మున్ముందు ఇంకెంత తీవ్రతను చవి చూడాల్సి వస్తుందోనన్న ఆందోళన ఆ ప్రాంత వాసుల్లో నెలకొంటోంది. సాధారణంగా ఏప్రిల్ ప్రారంభం నుంచి 40 డిగ్రీలు, అంతకుమించి పగటి ఉష్ణోగ్రతలు నమోదవుతాయి. కానీ.. ఈ ఏడాది అందుకు భిన్నంగా మార్చి ఆరంభంలోనే 41 డిగ్రీలకు పైగా చేరుకుంటున్నాయి. ఈ నెల 2న శనివారం అనంతపురంలో 41, కర్నూలు 39, నంద్యాల, కడపలో 38 డిగ్రీల చొప్పున ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. 3న అనంతపురంలో 39, కర్నూలులో 39, నంద్యాల, కడపలో 38, 4న అనంతపురంలో 40, కర్నూలులో 39, నంద్యాల, కడపల్లో 38 డిగ్రీలు, 5న 4న అనంతపురంలో 40, కర్నూలులో 39, నంద్యాల, కడపల్లో 38 డిగ్రీల చొప్పున గరిష్ట ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. కొన్నాళ్లుగా రాష్ట్రంలోని మిగిలిన ప్రాంతాలకంటే రాయలసీమలోనే ఉష్ణతాపం అధికంగా కనిపిస్తోంది. అక్కడ సాధారణం కంటే 3–4 డిగ్రీలు అధికంగా ఉంటోంది. రాష్ట్రంలో విశాఖపట్నం, కళింగపట్నం మినహా అన్ని ప్రాంతాల్లో 33 నుంచి 37 డిగ్రీల మధ్య ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. దక్షిణ, ఉత్తర కోస్తాల్లో రాయలసీమ కంటే తక్కువగా ఉష్ణోగ్రతలు రికార్డవుతుండటం ఆ ప్రాంత వాసులకు ఒకింత ఊరటనిస్తోంది. సెగలకు ఇదీ కారణం కోస్తాంధ్ర కంటే రాయలసీమలో పగటి ఉష్ణోగ్రతలు ఎక్కువగా నమోదవడానికి గాలిలో తేమ తక్కువగా ఉండటమే కారణమని వాతావరణ నిపుణులు చెబుతున్నారు. సాధారణంగా గాలిలో తేమ తక్కువగా ఉంటే ఉష్ణతాపం పెరగడానికి దోహదపడుతుంది. ఈ తేమ 50 శాతం కన్నా తగ్గే కొద్దీ వేడి అధికమవుతుంది. కొద్ది రోజులుగా రాయలసీమలోని అనంతపురం, కర్నూలు, కడప, నంద్యాలలో తేమ 19 నుంచి 26 శాతం మాత్రమే ఉంటోంది. అందువల్ల అక్కడ రాష్ట్రంలోని ఇతర ప్రాంతాల కంటే అధిక ఉష్ణోగ్రతలు రికార్డవుతున్నాయి. వారంలో మరింత భగభగ రానున్న వారం రోజుల్లో రాష్ట్రంలో ఉష్ణోగ్రతలు మరింతగా పెరుగుతాయని వాతావరణ నిపుణులు పేర్కొంటున్నారు. ప్రస్తుతం కొన్నిచోట్ల సాధారణంకంటే 2–3 డిగ్రీలు అధికంగా నమోదవుతుండగా.. వారం పది రోజుల్లో అవి 4–5 డిగ్రీలకు ఎగబాకే అవకాశం ఉందని చెబుతున్నారు. -
AP: దూసుకొస్తున్న ‘మిచాంగ్’ తుపాను.. ఐఎండీ రెడ్ అలర్ట్
సాక్షి, అమరావతి: నైరుతి బంగాళాఖాతంలో వాయుగుండం తీవ్ర వాయుగుండంగా బలపడింది. రేపటికి తుపానుగా మారే అవకాశముందని విపత్తుల నిర్వహణ సంస్థ వెల్లడించింది. ఆ తర్వాత దక్షిణకోస్తా తీరానికి సమాంతరంగా పయనించనుందని, మంగళవారం మధ్యాహ్నం నెల్లూరు-మచిలీపట్నం మధ్య తీరం దాటే అవకాశముంది. నెల్లూరు జిల్లా వైపు మిచాంగ్ తుపాను దూసుకొస్తుంది. ఐఎండీ రెడ్ ఎలర్ట్ ప్రకటించింది. తుపాను హెచ్చరికల నేపథ్యంలో 4వ తేదీ జిల్లాలోని అన్ని విద్యా సంస్థలకు జిల్లా కలెక్టర్ ఎం హరి నారాయణన్ సెలవు ప్రకటించారు. Strong breeze now in Vizag . Similar 30-40kmph wind speed along the AP coast now !! #CycloneMichaung pic.twitter.com/BpcYuJrB1w — Vizag Weatherman@AP (@VizagWeather247) December 2, 2023 తుపాను ప్రభావంతో ఆదివారం నుండి మంగళవారం వరకు రాష్ట్ర వ్యాప్తంగా తేలికపాటి నుంచి మోస్తారు వర్షాలు కురవనున్నాయి. మంగళవారం అక్కడక్కడ భారీ నుంచి అతి భారీ వర్షాలు నమోదైయ్యే అవకాశం ఉందని వాతావరణ శాఖ పేర్కొంది. ఆదివారం నుంచి కోస్తా తీరం వెంబడి గంటకు 80 -100 కీమీ వేగంతో బలమైన గాలులు వీస్తాయని, మత్స్యకారులు మంగళవారం వరకు వేటకు వెళ్లరాదని, రైతులు వ్యవసాయ పనుల్లో తగిన జాగ్రత్తలు తీసుకోవాలని, ప్రజలు అప్రమత్తంగా ఉండాలని విపత్తుల సంస్థ మేనేజింగ్ డైరెక్టర్ అంబేద్కర్ హెచ్చరించారు. బంగాళాఖాతంలో ఏర్పడనున్న తుపాను కోస్తాంధ్రతో పాటు, రాయలసీమలోనూ పెను ప్రభావం చూపనుంది. దీంతో రాష్ట్ర ప్రభుత్వం అప్రమత్తమైంది. పరిస్థితిని నిరంతరం సమీక్షిస్తోంది. తుపాను ప్రభావిత జిల్లాల అధికారులు అప్రమత్తంగా ఉండాలని, ఆస్తి, ప్రాణ నష్టం జరగకుండా చర్యలు తీసుకోవాలని కలెక్టర్లను ఆదేశించింది. రాష్ట్ర, జిల్లా స్థాయిల్లో కంట్రోల్ రూమ్‌లు ఏర్పాటు చేసింది. తాడేపల్లిలో రాష్ట్ర కంట్రోల్ రూమ్ ఏర్పాటు చేసి, ఫోన్ నంబర్లను ప్రజలకు అందుబాటులోకి తెచ్చింది. విపత్కర పరిస్థితుల్లో ప్రజలను రక్షించేందుకు ఎన్డీఆర్ఎఫ్, ఎస్డీఆర్ఎఫ్ బృందాలను సిద్ధం చేసింది. చదవండి: ఏపీ రాజకీయాలపై తెలంగాణ ఎన్నికల ఫలితాల ఎఫెక్ట్ ఎంత? -
రేపు కోస్తా జిల్లాల్లో విస్తారంగా వర్షాలు
సాక్షి, విశాఖపట్నం: ఆగ్నేయ బంగాళాఖాతంలో అండమాన్ నికోబార్ పరిసర ప్రాంతాల్లో అల్పపీడనం ఏర్పడింది. క్రమంగా ఇది వాయువ్యదిశగా కదులుతూ పశ్చిమ బంగాళాఖాతంలో తీవ్ర వాయుగుండంగా మారే సూచనలు కనిపిస్తున్నాయి. దీంతో ఏపీ విపత్తుల నిర్వహణ సంస్థ ఒక ప్రకటన విడుదల చేసింది. రేపటికి(నవంబర్ 15కల్లా) పశ్చిమమధ్య బంగాళాఖాతంలో వాయుగుండగా మారే అవకావం కనిపిస్తోంది. వాయవ్య దిశగా పయనించి.. 16వ తేదీ నాటికి తీవ్రవాయుగుండంగా మారే అవకాశాలు ఉన్నాయి. ఈ ప్రభావం ఆంధ్రప్రదేశ్ తీర ప్రాంతంపై కనిపించనుంది. కోస్తా జిల్లాల్లో అక్కడక్కడ తేలికపాటి నుండి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉంది. శుక్రవారం నాటికి ఇది ఉత్తర- ఈశాన్య దిశగా తిరిగి ఒడిశా తీరానికి చేరుకుంటుంది. కోస్తాంధ్ర తీరంలో వర్షాల నేపథ్యంలో.. మత్స్యకారులెవరూ చేపల వేటకు వెళ్లొద్దని ఏపీ విపత్తుల నిర్వహణ సంస్థ హెచ్చరికలు జారీ చేసింది. -
15న బంగాళాఖాతంలో అల్పపీడనం
సాక్షి, విశాఖపట్నం: నైరుతి బంగాళాఖాతానికి ఆనుకుని ఆగ్నేయ బంగాళాఖాతంలో ఈ నెల 15న అల్పపీడనం ఏర్పడనుంది. ప్రస్తుత వాతావరణ పరిస్థితుల ఆధారంగా అది వాయుగుండంగా బలపడే అవకాశాలు అంతగా కనిపించడం లేదు. మరోవైపు 14వ తేదీ నుంచి ఈశాన్య, తూర్పు గాలులు బలోపేతం కానున్నాయి. వీటి ఫలితంగా ఉత్తర కోస్తాంధ్రలో తేలికపాటి వర్షాలు, రాయలసీమ, దక్షిణ కోస్తాంధ్రలో మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉంది. ఇంతలో 15న అల్పపీడనం ఏర్పడడం, ఈశాన్య, తూర్పు గాలులు తోడవడం వంటి కారణంతో వర్షాలకు ఆస్కారం ఉందని వాతావరణ నిపుణులు చెబుతున్నారు. మరోవైపు రానున్న మూడు రోజులు రాష్ట్రంలో పొడి వాతావరణమే నెలకొంటుందని భారత వాతావరణ శాఖ (ఐఎండీ) శుక్రవారం రాత్రి నివేదికలో తెలిపింది. -
బంగాళాఖాతంలో వాయుగుండం.. ఏపీకి వర్ష సూచన
సాక్షి, విశాఖపట్నం: ఆగ్నేయ బంగాళాఖాతంలో నైరుతి బంగాళాఖాతానికి ఆనుకుని కొనసాగుతున్న తీవ్ర అల్పపీడనం మరింత బలపడి సోమవారం వాయుగుండంగా మారింది. ఇది పశ్చిమ వాయవ్య దిశగా గంటకు 13 కిలోమీటర్ల వేగంతో పయనిస్తోంది. ఈ వాయుగుండం సోమవారం రాత్రికి శ్రీలంకలోని ట్రింకోమలికి తూర్పు ఆగ్నేయంగా 530, భారత్‌లోని కరైకల్‌కు తూర్పు ఆగ్నేయంగా 750 కిలోమీటర్ల దూరంలోను కేంద్రీకృతమై ఉంది. ఇది మంగళవారం సాయంత్రం వరకు పశ్చిమ వాయవ్య దిశగా కదులుతుందని, అనంతరం మలుపు తిరిగి క్రమంగా దక్షిణ నైరుతి వైపు పయనిస్తుందని, బుధవారం మధ్యాహ్నానికి శ్రీలంక వద్ద తీరాన్ని దాటుతుందని భారత వాతావరణ విభాగం (ఐఎండీ) సోమవారం రాత్రి నివేదికలో వివరించింది. దీని ప్రభావంతో మంగళవారం దక్షిణ కోస్తాంధ్ర, రాయలసీమల్లో ఒకటిరెండు చోట్ల తేలికపాటి నుంచి మోస్తరు వర్షం కురిసే అవకాశం ఉందని తెలిపింది. బుధవారం నుంచి రెండురోజుల పాటు రాష్ట్రంలో పొడి వాతావరణం నెలకొంటుందని పేర్కొంది. -
Rain Alet: దక్షిణ కోస్తా వైపునకు వాయుగుండం!.. భారీ వర్షాలకు అవకాశం
సాక్షి, విశాఖపట్నం: దక్షిణ అండమాన్ సముద్రానికి ఆనుకుని ఆగ్నేయ బంగాళాఖాతంలో ఈ నెల 5వ తేదీన అల్పపీడనం ఏర్పడనుంది. ఇది పశ్చిమ వాయవ్య దిశగా పయనిస్తూ ఏడో తేదీ ఉదయానికి వాయుగుండంగా బలపడనుంది. అనంతరం అదే దిశలో పయనిస్తూ నైరుతి బంగాళాఖాతంలోకి చేరుతుంది. క్రమంగా కదులుతూ ఎనిమిదో తేదీ ఉదయానికి ఉత్తర తమిళనాడు–పుదుచ్చేరి, దక్షిణ కోస్తాంధ్ర తీరానికి చేరుతుందని భారత వాతావరణ విభాగం (ఐఎండీ) శుక్రవారం రాత్రి నివేదికలో తెలిపింది. తొలుత ఈ వాయుగుండం దక్షిణ తమిళనాడు–పుదుచ్చేరి తీరాలకు చేరుకుంటుందని ఐఎండీ అంచనా వేసింది. తాజా అంచనాల ప్రకారం దిశ మార్చుకుని దక్షిణ కోస్తాంధ్ర తీరానికి చేరువయ్యే అవకాశం ఉందని పేర్కొంది. దీని ప్రభావం ఈ నెల ఆరో తేదీ తర్వాత దక్షిణ కోస్తాంధ్ర, రాయలసీమపై ఉంటుందని తెలిపింది. వాయుగుండం ప్రభావంతో కోస్తాంధ్ర, రాయలసీమల్లో కొన్నిచోట్ల విస్తారంగా, ఉత్తర కోస్తాలో అక్కడక్కడ తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉంది. మరోవైపు ప్రస్తుతం రాష్ట్రంపైకి ఈశాన్య, తూర్పు గాలులు వీస్తున్నాయి. ఫలితంగా రానున్న రెండు రోజులు ఉత్తర కోస్తాంధ్రలో పొడి వాతావరణ కొనసాగనుంది. దక్షిణ కోస్తాంధ్ర, రాయలసీమల్లో శనివారం ఒకటి, రెండుచోట్ల తేలికపాటి వర్షాలు కురుస్తాయని ఐఎండీ వివరించింది. చదవండి: మరోసారి గొప్ప మనసు చాటుకున్న సీఎం జగన్ -
కొనసాగుతున్న తూర్పు, ఈశాన్య గాలులు.. రెండు రోజులు తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు
సాక్షి, విశాఖపట్నం: రాష్ట్రంలో దిగువస్థాయి నుంచి తూర్పు, ఈశాన్య గాలులు వీస్తున్నాయి. ఇవి మరికొద్ది రోజులు కొనసాగనున్నాయి. వీటి ఫలితంగా రానున్న రెండు రోజులు కోస్తాంధ్ర, రాయలసీమల్లో ఒకటి, రెండు చోట్ల తేలికపాటి నుంచి ఓ మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని భారత వాతావరణ విభాగం (ఐఎండీ) శనివారం రాత్రి నివేదికలో తెలిపింది. అనంతరం పొడి వాతావరణం మొదలయ్యాక రాష్ట్రంలో చలి ప్రభావం అధికమవుతుందని వాతావరణ నిపుణులు చెబుతున్నారు. కాగా శనివారం తిరుపతి జిల్లా ఇనుగుంటలో 7.6 సెం.మీల భారీ వర్షం కురిసింది. -
ఏపీ ప్రజలకు అలర్ట్.. ఈ ప్రాంతాల్లో మూడు రోజులు వర్షాలు
సాక్షి, అమరావతి/విశాఖపట్నం: పశ్చిమ మధ్య బంగాళాఖాతంలో సోమవారం అల్పపీడనం ఏర్పడింది. దీనికి అనుబంధంగా సముద్రమట్టానికి 5.8 కిలోమీటర్ల ఎత్తులో ఉపరితల ఆవర్తనం కొనసాగుతోంది. ఈ అల్పపీడనం పశ్చిమ వాయవ్య దిశగా కదులుతూ బుధవారానికి ఏపీ తీరం వైపునకు పయనించే అవకాశం ఉంది. అల్పపీడనం, ఉపరితల ఆవర్తనం ప్రభావంతో రానున్న మూడు రోజులు కోస్తాంధ్రలో పలుచోట్ల, రాయలసీమలో ఒకటి, రెండు ప్రాంతాల్లో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని భారత వాతావరణ విభాగం (ఐఎండీ) సోమవారం రాత్రి ప్రకటించింది. చదవండి: రామోజీ అర్ధసత్యాల ‘పంచాయితీ’ అదే సమయంలో కోస్తాంధ్రలో అక్కడక్కడా భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని తెలిపింది. కోస్తాంధ్ర, రాయలసీమల్లో ఉరుములు, మెరుపులతోపాటు పిడుగులు పడవచ్చని వివరించింది. మరోవైపు కోస్తాంధ్ర తీరం వెంబడి గంటకు 40 నుంచి 45 కిలో మీటర్లు, గరిష్టంగా 55 కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలులు వీస్తాయని తెలిపింది. అందువల్ల సముద్రం అలజడిగా ఉంటుందని, రానున్న మూడు రోజులు మత్స్యకారులు చేపలవేటకు వెళ్లవద్దని సూచించింది. సోమవారం ఉదయం నుంచి రాత్రి వరకు హుకుంపేట (వైఎస్సార్ జిల్లా)లో 3.5 సెం.మీ., కపిలేశ్వరపురం (డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ కోనసీమ జిల్లా)లో 3.2, చాట్రాయి (ఏలూరు)లో 3.1, రాజానగరం (తూర్పుగోదావరి)లో 3, ఆళ్లగడ్డ (నంద్యాల జిల్లా)లో 2.9, జగ్గంపేట (కాకినాడ జిల్లా) 2.6, గొలుగొండ (అనకాపల్లి జిల్లా)లో 2.3 సెం.మీ.ల వర్షపాతం నమోదైంది. -
బంగాళాఖాతంలో అల్పపీడనం
సాక్షి, అమరావతి/సాక్షి, విశాఖపట్నం: దక్షిణ అండమాన్ సముద్రం, దాన్ని ఆనుకుని ఉన్న ఆగ్నేయ బంగాళాఖాతంలో అల్పపీడనం ఏర్పడింది. ఇది వాయవ్య దిశగా కదిలి నేటి (శనివారం) సాయంత్రానికి వాయుగుండంగా, ఆదివారానికి తుపానుగా బలపడే అవకాశం ఉందని వాతావరణశాఖ తెలిపింది. ఈ తుపానుకు అసాని అని పేరు పెట్టనున్నారు. తుపాను వాయవ్య దిశగా ప్రయాణించి 10వ తేదీన ఉత్తరాంధ్ర–ఒడిశా మధ్య తీరందాటే అవకాశం ఉందని వాతావరణ అధికారులు తెలిపారు. ఇది బంగ్లాదేశ్ వైపు ప్రయాణించే సూచనలు కూడా ఉన్నాయని, అయితే 10వ తేదీన విశాఖపట్నం తీరం సమీపానికి వచ్చే అవకాశం ఉందని చెప్పారు. దీనిప్రభావంతో రాష్ట్రవ్యాప్తంగా మూడురోజుల పాటు ఉరుములు, మెరుపులతో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు అక్కడక్కడ కురిసే అవకాశాలున్నాయని తెలిపారు. తీరం వెంబడి గంటకు 40 నుంచి 50 కిలోమీటర్ల వేగంతో గాలులు వీచే అవకాశం ఉన్నందున సముద్రం అల్లకల్లోలంగా ఉంటుందని విపత్తుల నిర్వహణ సంస్థ డైరెక్టర్ అంబేడ్కర్ తెలిపారు. మత్స్యకారులు వేటకు వెళ్లరాదని, వెళ్లినవారు వెంటనే తిరిగి రావాలని కోరారు. చదవండి: ఎంపీగా ఉండి కోర్టుకు రావడమేంటి? రఘురామకు హైకోర్టు చీవాట్లు -
కొనసాగుతున్న అల్పపీడనం
సాక్షి, అమరావతి/విశాఖపట్నం: బంగాళాఖాతంలో ఏర్పడిన అల్ప పీడనం భూమిపైకి చేరి ప్రస్తుతం తెలంగాణ ప్రాంతంలో కొనసాగుతోంది. ఇది విదర్భ మీదుగా ఉత్తరప్రదేశ్ వైపు పయనిస్తూ క్రమేపి బలహీనపడే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది. దీని ప్రభావంతో మన రాష్ట్రంలో పలుచోట్ల వర్షాలు కురుస్తున్నాయి. శ్రీకాకుళం, తూర్పు గోదావరి జిల్లాల్లో ఎక్కువ చోట్ల వర్షాలు పడ్డాయి. శ్రీకాకుళం జిల్లా మందసలో అత్యధికంగా 11 సెంటీమీటర్ల వర్షం కురిసింది. రాబోయే రెండురోజులు కోస్తాంధ్రలోని పలుచోట్ల ఉరుములు, మెరుపులతో కూడిన తేలికపాటి నుంచి ఒక మోస్తరు వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖాధికారులు తెలిపారు. ఈ నెల 23వ తేదీన బంగాళాఖాతంలో మరో అల్పపీడనం ఏర్పడే అవకాశం ఉంది. -
రాగల 48 గంటల్లో కోస్తాంధ్రలో భారీ వర్షాలు
-
కోస్తాకు తప్పిన వాయుగుండం ముప్పు
సాక్షి, విశాఖపట్నం: బంగాళాఖాతంలోని అల్పపీడనం దక్షిణ ఒడిశా-ఉత్తరాంధ్రల సమీపాన వాయవ్య బంగాళాఖాతంలో పశ్చిమ మధ్య ప్రాంతానికి ఆనుకుని కొనసాగుతోంది. దీనికి అనుబంధంగా సముద్రమట్టానికి 5.8 కిలోమీటర్ల ఎత్తులో తుఫాను ఆవర్తనం నెలకొంది. ఈ అల్పపీడనం ఈ రోజు సాయంత్రానికి వాయుగుండంగా బలపడవచ్చు. ఇది ఉత్తర వాయవ్య దిశగా ఒడిసా తీరం వెంబడి, వాయవ్య బంగాళాఖాతంలో పయనిస్తూ 48 గంటల్లో బెంగాల్ బంగ్లాదేశ్‌ల మీదకు వెళుతుందని వాతావరణ శాఖ అంచనా వేసింది. రేపు సాయంత్రానికి ఇది తీవ్ర వాయుగుండంగా కూడా మారే అవకాశం ఉన్నట్లు పేర్కొంది. చదవండి: వదలని వరద తూర్పు తీరం నుంచి పశ్చిమ తీరం వరకూ ద్రోణి కొనసాగుతోంది. ఇది మరో మూడురోజులు ప్రభావశీలంగా ఉంటుంది వీటి ప్రభావం తెలంగాణ కోస్తాంధ్రలమీద తక్కువగా కోస్తా రాయలసీమలో మాత్రం కొన్ని చోట్ల భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ అధికారులు చెబుతున్నారు. ఉత్తరాంధ్ర సుముద్రతీరం అల్లకల్లోలంగా ఉంటుంది. మత్స్యకారులు వేటకు పోరాదనీ వాతావరణ శాఖ అధికారులు సూచిస్తున్నారు. -
పొంగిన వాగులు, వంకలు
సాక్షి, నెట్వర్క్: రాష్ట్రంలోని పలు జిల్లాల్లో శుక్రవారం రాత్రి నుంచి శనివారం రాత్రి వరకు కురిసిన భారీ వర్షాలకు వాగులు, వంకలు పొంగి పొర్లాయి. పలు ప్రాంతాల్లో రాకపోకలు స్తంభించడంతో ప్రజలు ఇబ్బందులు పడ్డారు. వర్షాల ప్రభావంతో పలు చోట్ల పంటలు దెబ్బతిన్నాయి. ప్రకాశం, చిత్తూరు జిల్లాల్లో వాగుల్లో కొట్టుకుపోయి ఇద్దరు విద్యార్థులు మృతి చెందారు. ► గుంటూరు జిల్లాలో పోటేళ్లవాగు, ఓగేరు, పెరమవాగు, మొద్దువాగులు, కొండవీటి వాగులు పొంగిపొర్లాయి. దీంతో సచివాలయంతోపాటు పలు ప్రాంతాలకు రాకపోకలు నిలిచిపోయాయి. బాపట్ల మండలంలో అత్యధికంగా 151 మి.మీ. వర్షపాతం నమోదైంది. ► ప్రకాశం జిల్లాలో 14 మండలాల్లో కుండపోత వర్షం కురిసింది. గుండ్లకమ్మ వాగులో ట్రాక్టర్ కొట్టుకుపోయింది. వాగులో చిక్కుకున్న ఇద్దరిని గజ ఈతగాళ్లు ఒడ్డుకు చేర్చారు. పెంచికలపాడు వాగులో చిక్కుకున్న అంకయ్య అనే వ్యక్తిని కాపాడారు. కొత్తకోట వాగు ఉధృతిలో చిక్కుకున్న హరియాణకు చెందిన లారీ డ్రైవర్, క్లీనర్లను పోలీసులు ఒడ్డుకు చేర్చారు. తూర్పు వాగులో చిన అంబడిపూడి బీసీ కాలనీకి చెందిన పల్లపు శ్రావణ్‌కుమార్ (11), గుంజి విశాల్ అనే విద్యార్థులు ప్రమాదవశాత్తు నీటిలో కొట్టుకుపోయారు. గాలించి ఇరువురిని వైద్యశాలకు తరలించగా అప్పటికే శ్రావణ్ మృతిచెందాడు. జిల్లాలో అత్యధికంగా రాచర్ల మండలంలో 186.2 మి.మీ. వర్షం కురిసింది. ► వైఎస్సార్ జిల్లాలో ఒక్కరోజులోనే 7.1 సెం.మీ. వర్షపాతం నమోదైంది. కడపలోని ఆర్టీసీ బస్టాండ్ గ్యారేజీలోకి పెద్ద ఎత్తున నీరు చేరింది. ముద్దనూరు చెరువు కట్ట తెగింది. కలసపాడు బ్రిడ్జిపై నుంచి నీరు ప్రవహించింది. బుగ్గవంక ప్రాజెక్టుకు వరద పోటెత్తడంతో రెండు గేట్లు ఎత్తి దిగువకు వదిలారు. ► అనంతపురం జిల్లాలోని 63 మండలాల పరిధిలో ఒకే రోజు 23 మి.మీ. వర్షపాత సగటు నమోదైంది. వందలాది చెరువుల్లోకి పెద్దఎత్తున వర్షపునీరు చేరింది. ► చిత్తూరు జిల్లా వెదురుకుప్పం మండలంలోని తంగేళిమిట్ట వద్ద మద్దెలవంకలో సుమంత్ (14) అనే విద్యార్థి వాగులో కొట్టుకుపోయాడు. తనతో పాటు వాగులో జారిన ఇద్దరు ప్రాణాలతో బయటపడ్డారు. సుమంత్ ఆచూకీ తెలియరాలేదు. ► కర్నూలు జిల్లాలో నంద్యాల పట్టణ పరిధి పెద్దకొట్టాల సమీపంలోని నంది ఫారŠుచ్యనర్ వెంచర్లోకి భారీగా వరద నీరు చేరడంతో తొమ్మిది కుటుంబాలు జల దిగ్బంధంలో చిక్కుకుపోయాయి. వెంచర్ ప్రహరీని పగలగొట్టించి వరదనీరు బయటకు వెళ్లేలా చేశారు. ఆర్టీపీపీ యూనిట్లలోకి నీరు ఎర్రగుంట్ల: వైఎస్సార్ జిల్లా ఎర్రగుంట్లలో శనివారం భారీ వర్షం కురవడంతో రాయలసీమ థర్మల్ పవర్ ప్రాజెక్టు (ఆర్టీపీపీ) యూనిట్లలోకి నీరు వచ్చి చేరింది. దీంతో మోటార్లు, యంత్ర సామాగ్రి మునిగిపోయాయి. వెంటనే అప్రమత్తమైన అధికారులు నీటి పంపింగ్ చేపట్టారు. ఆర్టీపీపీ సీఈ ఎల్ మోహన్‌రావు మాట్లాడుతూ లోతట్టు ప్రాంతంలో నీరు చేరిందని, ఎలాంటి నష్టం జరగలేదని అన్నారు. నేడు, రేపు కోస్తాకు భారీ వర్షసూచన సాక్షి, విశాఖపట్నం: తూర్పు బిహార్ పరిసర ప్రాంతాల్లో కొనసాగుతున్న అల్పపీడన ప్రభావంతో ఏపీ తీరానికి సమీపాన పశ్చిమ మధ్య బంగాళాఖాతం, ఒడిశా మీదుగా ఉపరితల ద్రోణి ఏర్పడింది. ఇది సముద్ర మట్టానికి 1.5 నుంచి 5.8 కి.మీ. ఎత్తులో కొనసాగుతోంది. తెలంగాణ, రాయలసీమ మీదుగా దక్షిణ కర్ణాటక వరకూ 3.1కి.మీ. ఎత్తులో మరో ఉపరితల ద్రోణి ఏర్పడింది. వీటి ప్రభావంతో రాగల మూడు రోజుల పాటు కోస్తా, రాయలసీమల్లో వర్షాలు కురిసే సూచనలున్నాయి. ఆది, సోమవారాల్లో కోస్తాంధ్రలో భారీ వర్షాలు పడే అవకాశాలున్నాయి. -
నేడు, రేపు కోస్తాంధ్రలో వర్షాలు
సాక్షి, విశాఖపట్నం: అల్పపీడన ప్రభావంతో గురువారం, శుక్రవారం కోస్తాంధ్రలో అక్కడక్కడా ఉరుములు, మెరుపులతో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురుస్తాయని విశాఖపట్నం వాతావరణ కేంద్రం వెల్లడించింది. ► ఉత్తర ఒడిశా–పశ్చిమ బెంగాల్ తీరాలను ఆనుకొని వాయవ్య బంగాళాఖాతంలో తీవ్ర అల్పపీడనం కొనసాగుతోంది. దీనికి అనుబంధంగా 7.6 కి.మీ ఎత్తులో ఉపరితల ఆవర్తనం కొనసాగుతోందని తెలిపింది. ► కోస్తా తీరం వెంట గంటకు 50 నుంచి 60 కి.మీ వేగం గాలులతో సముద్రం అల్లకల్లోలంగా ఉండనుంది. రెండు రోజులపాటు కోస్తా తీర ప్రాంత మత్స్యకారులెవరూ వేటకు వెళ్లవద్దని అధికారులు హెచ్చరించారు. ► గత 24 గంటల్లో వర రామచంద్రాపురంలో 6 సెం.మీ, పోలవరం, పాడేరుల్లో 5, ప్రత్తిపాడు, పెద్దాపురంల్లో 4, చింతపల్లి, కుక్కునూరు, అమలాపురం, తాడేపల్లిగూడెం, కూనవరం, భీమడోలుల్లో 3 సెం.మీ వర్షపాతం నమోదైంది. -
మూడు రోజులు కోస్తాకు భారీ వర్ష సూచన
సాక్షి, విశాఖపట్నం: ఒడిశా తీరంలో ఉపరితల ఆవర్తనం, దానికి అనుబంధంగా ఉపరితల ద్రోణి కొనసాగుతోందని దీనికితోడు కోస్తాపై నైరుతి రుతుపవనాల ప్రభావం చురుగ్గా కొనసాగుతోందని విశాఖ వాతావరణ కేంద్రం అధికారులు వెల్లడించారు. వీటి ప్రభావంతో కోస్తాంధ్రలో రేపటి నుంచి మూడు రోజుల పాటు ఉరుములు, మెరుపులతో కూడిన మోస్తరు వర్షాలు విస్తారంగా కురుస్తాయి.రాయలసీమలో రానున్న మూడు రోజుల పాటు అక్కడక్కడా తేలికపాటి నుంచి మోస్తరు వానలు కురిసే అవకాశాలున్నాయి. రేపటి నుంచి మూడు రోజుల పాటు కోస్తాంధ్రలో అక్కడక్కడా భారీ వర్ష సూచన. కోస్తా తీరం వెంబడి గంటకు 45 నుంచి 50 కిమీ వేగంతో, పశ్చిమ మధ్య బంగాళాఖాతంలో గంటకు 40 –50 కిమీ వేగంతో గాలులు వీస్తాయని ప్రకటన. మత్స్యకారులెవ్వరూ వేటకు వెళ్లొద్దని హెచ్చరిక. గడిచిన 24 గంటల్లో కర్నూలులో 3 సెంమీ, సి.బెలగొళ, బద్వేల్, మంత్రా లయం, పలమనేరులో 2 సెంమీ వర్షపాతం నమోదైంది. -
ఆగ్నేయ బంగాళాఖాతంతో అల్ప పీడనం
సాక్షి, విజయవాడ: దక్షిణ అండమాన్ నుంచి ఆగ్నేయ బంగాళఖాతం వరకు అల్ప పీడనం ఏర్పడినట్లు ఆంధ్ర ప్రదేశ్ విపత్తు నిర్వాహణ శాఖ డైరెక్టర్ వెల్లడించారు. కాగా వచ్చే 24 గంటల్లో ఆగ్నేయ బంగాళాఖాతం నుంచి దక్షిణ అండమాన్ తీరంలో గంటకు 40 నుంచి 60 కిమీ వేగంతో ఈదురు గాలులు వీచే అవకాశం ఉందని తెలిపారు. అయితే ఈ అల్పపీడన ప్రభావం ఏపీపై ఉండే అవకాశం లేదన్నారు. దీని ప్రభావం వల్ల ఆగ్నేయా బంగాళాఖాతం, దక్షిణ అండామాన్ సముద్ర పరిస్థితులు కఠినంగా ఉంటాయన్నారు. ఇక ఆంధ్ర కోస్టు తీరంలో చాపల వేటకు వెళ్లే మత్సకారులు ఆగ్నేయ బంగాళాఖాతం వైపుకు వెళ్లోద్దని డైరెక్టర్ హెచ్చరించారు.