పశ్చిమ మధ్య బంగాళాఖాతంలో ఉపరితల ఆవర్తనం అల్పపీడనంగా మారింది. దీంతో కోస్తాంధ్ర, తెలంగాణలో పలుచోట్ల విస్తారంగా వర్షాలు, కొన్ని చోట్ల భారీ వర్షాలు పడే అవకాశం ఉంది.
విశాఖపట్నం: పశ్చిమ మధ్య బంగాళాఖాతంలో ఉపరితల ఆవర్తనం అల్పపీడనంగా మారింది. దీంతో కోస్తాంధ్ర, తెలంగాణలో పలుచోట్ల విస్తారంగా వర్షాలు, కొన్ని చోట్ల భారీ వర్షాలు పడే అవకాశం ఉంది.
రాయలసీమలో మాత్రం ఓ మోస్తరుగా వర్షాలు పడతాయని విశాఖ వాతావరణ కేంద్రం తెలిపింది. దక్షిణ కోస్తా తీరం వెంబడి గంటకు 45 నుంచి 50 కి.మీ వేగంతో ఈదురు గాలులు వీస్తున్నాయని, మత్యకారులు అప్రమత్తంగా ఉండాలని విశాఖ వాతావరణ కేంద్రం తెలిపింది.