
‘లెహెర్’ మాటున ‘మాదీ’
విశ్లేషణ: తాజాగా బంగాళాఖాతం నుంచి చడీచప్పుడు లేకుండా దూసుకువస్తూన్న ‘లెహర్’ తుపాను నవంబర్ 28న కోస్తాంధ్రను భీకరంగా తాకబోతున్నట్టు హెచ్చరికలు వస్తున్నాయి. ‘హెలెన్’ పేరుతో ఉన్న తుపాను శాంతించక ముందే ‘లెహర్’ ముంచుకొచ్చే సూచనలు కనిపిస్తున్నాయి. దీనితో ఆంధ్రప్రదేశ్ ఆర్థిక పరిస్థితి కకావికలమయ్యే ప్రమాదం మరింత పెరగవచ్చు.
ఆంధ్రప్రదేశ్ ఇప్పుడు ఏకకా లంలో ఎదుర్కొంటున్నన్ని ఉప ద్రవాలు, ఇంతటి తీవ్రస్థాయి లో, ఇంతకుముందెన్నడూ ఎదు ర్కొనలేదంటే అతిశయోక్తి కాదే మో! వీటిలో కొన్ని ఉపద్రవాలు ఇటీవలి మాసాలలో వరసగా వచ్చిన పెనుతుపానులు. కాగా, తెలుగువాళ్లు ప్రకృతి వైపరీత్యా లను సహితం మించిపోయి గాడితప్పిన ‘ప్రవృత్తి’ మూలంగా తెలుగు జాతినే ముమ్మరించిన అనర్థదాయకై మెన కృత్రిమ ‘తుపానులు’ కూడా చూస్తున్నాం!
కొని తెచ్చుకుంటున్న ఆపద
బంగాళాఖాతం స్థావరంగా తరచుగా కోస్తా ప్రాంతాల నూ, అప్పుడప్పుడూ రాయలసీమ, తెలంగాణ ప్రాంతాల ను చుట్టబెడుతూన్న తుపానులకీ, తమ అవసరాల కోసం మనుషులు ప్రాణదాత ఈ పర్యావరణాన్నీ, ప్రకృతి సంప దనూ కుళ్లబొడుస్తున్న ఫలితంగా తలెత్తుతున్న పరిణామా లకీ ఉన్న సంబంధం గురించి శాస్త్రవేత్తలు నిరంతరం పరి శోధిస్తూనే ఉన్నారు. అలాగే మనకు మనం దెబ్బతీసుకుం టున్న సమతుల్యత గురించి కూడా ప్రపంచ వ్యాపితం గానే శాస్త్రవేత్తలు, వాతావరణ శాస్త్రజ్ఞులూ నిరంతరం పరిశోధనలు జరుపుతూనే ఉన్నారు. భూఖండం ఎలా వేడెక్కిపోతున్నదో, దాని ప్రభావం వాతావరణ పరిస్థితుల మీద ఎలా పడుతున్నదో కొంత కాలంగా హెచ్చరిస్తూనే ఉన్నారు. వాతావరణంలో పెరిగిపోతున్న బొగ్గుపులుపు వాయు సాంద్రతనూ, కాలుష్యాన్ని నియంత్రించాల్సిన అవసరం ఎంత ఉందో ఘోషిస్తూనే ఉన్నారు. వాతావరణ మార్పుల వల్ల పెక్కుమార్లు సంభవిస్తున్న తుపానులు, పెనుతుపానులు దేశాలను ముప్పెరగొంటూ పంటలూ పరిసరాలనూ అతలాకుతలం చేస్తూ జన జీవితాన్ని ఎలా అల్లకల్లోలంలోకి నెడుతున్నాయో మనం చూస్తున్నాం, అనుభవిస్తున్నాం.
విస్మరించరాని విషయాలు
కొలది రోజులలోనే రెండు పెను తుపానులు (ఫయలిన్, హెలెన్) ఆంధ్రప్రదేశ్‌ను చుట్టుముట్టి లక్షలాది ఎకరాల లోని వరి, పత్తి, అరటి, కొబ్బరి, కూరగాయలు, మామిడి, బొప్పాయి వగైరా పంటలనీ, తోటలనీ నేలమట్టం చేశా యి. జన నష్టం కలిగించాయి. ఇళ్లను, ఇతర ఆస్తులను ఊడ్చిపెట్టాయి. అనేక గ్రామాలను ముంచెత్తాయి. ఆధు నిక సాంకేతిక పరిజ్ఞానం తోడు వచ్చినందున వాతావరణ శాస్త్రవేత్తలు కొంతకాలంగా చాలా సందర్భాలలో చేస్తున్న వాతావరణ హెచ్చరికలు అంచనాలు తప్పడం లేదనుకుం టున్న సమయమిది. అయితే శాస్త్రవేత్తలను సహితం పల్టీలు కొట్టించే పెను తుపానులు ఆకస్మికంగా విరుచుకు పడుతున్నాయి. పర్యావరణంలో వేగంగా ముమ్మరిస్తున్న మార్పులను మనం ఎంత మాత్రం విస్మరించే వీలులేదని ఈ విపరిణామాలు హెచ్చరిస్తున్నాయి. ‘వానకన్నా ముం దు వరద’ అన్నట్టుగా ఈ పరిణామం ఆకాశంలోనూ, నేల మీద, సముద్రాంతరాలలోనూ జరుగుతోందని పలు దేశాల పరిశోధకుల అంచనా.
పొంచి ఉన్న ‘మాదీ’
తాజాగా బంగాళాఖాతం నుంచి చడీ చప్పుడు లేకుండా దూసుకువస్తూన్న ‘లెహర్’ తుపాను నవంబర్ 28న కోస్తాంధ్రను భీకరంగా తాకబోతున్నట్టు హెచ్చరికలు వస్తున్నాయి. ‘హెలెన్’ పేరుతో ఉన్న తుపాను శాంతించక ముందే ‘లెహర్’ ముంచుకొచ్చే సూచనలు కనిపిస్తున్నా యి. దీనితో ఆంధ్రప్రదేశ్ ఆర్థిక పరిస్థితి కకావికలమయ్యే ప్రమాదం మరింత పెరగవచ్చు. కథ అప్పుడే ముగిసేట్లు లేదు! ‘లెహర్’ తర్వాత రంగంలోకి దూకడానికి అప్పుడే మరొక ఉగ్ర తుపాను ‘మాదీ’ కాచుకు కూర్చుంది సుమా! ఈసారి ‘లెహర్’ తుపాను బీభత్సం వాయువేగాన్ని 170-180 కిలోమీటర్లకు పెంచే ప్రమాదముందనీ సంకేతాలు వస్తున్నాయి. ఈ సరికొత్త తుపాను తీవ్రతను శాస్త్రవేత్తలు అంతర్జాతీయ ప్రమాణాల ప్రకారం తుపాను శక్తిని కొలిచే ‘స్టాషిర్-సింస్సన్’ (భూకంపాల శక్తిని అం చనా వేసే ‘రిక్టర్ స్కేల్’ లాగా) ద్వారా అంచనా వేశారు.
శాస్త్రవేత్తల లెక్కల ప్రకారం తొలి ఐదంచెలలో‘లెహర్’ ఇప్పటికి మూడవ స్థానంలో నిలిచింది! మొదటి రెండు పెద్ద తుపానులూ తమ చలనగతిని ఆకస్మికంగా ఒక స్థానం నుంచి మరొక మార్గంలోకి చిత్రగతులలో అనూ హ్యంగా సాగిపోయి శాస్త్రవేత్తలను, పాలనా యంత్రాం గాన్నీ నిద్రాహారాలు లేకుండా చేశాయి. ఈశాన్య రుతు పవనాల పేరిట ఈ పెనుతుపానులు సాగిస్తున్న ‘దోబూ చులాట’ ప్రజా బాహుళ్యానికీ, రాష్ట్ర ఆర్థిక పరిస్థి తికీ అగ్ని పరీక్షగా పరిణమించింది. దక్షిణ అండమాన్ దీవులలోని ఫోర్ట్‌బ్లెయిర్‌కు 200 కిలోమీటర్ల దూరంలో ప్రస్తుతం ‘లెహర్’ కేంద్రీకరించి ఉంది. ఇది కూడా ఏ ‘చాపల్యం’తో తన చలనగతిని ఎప్పుడు, ఎలా మార్చుకుంటుందో శాస్త్ర వేత్తలకు కూడా అంతుచిక్కని జోస్యం గానే ఉండిపోయే లా ఉంది! 2010లో తమిళనాడు కోస్తాలో కేంద్రీకరించిన ‘జాల్’ నుంచి ‘లెహర్’ దాకా తుపానులు ప్రజాజీవనానికి ప్రమాదకర సంకేతాలు అందిస్తూనే వచ్చాయి!
ఇవి సుడి తుపానులు
ఆసియాతో పాటు ప్రపంచంలోని పలు ఖండాలలో, భార త్‌తో పాటు పెక్కు దేశాలలో వాతావరణం కేవలం సాధా రణ తుపానుల స్థాయి దగ్గరే ఉండిపోవడం లేదు. వాటిని దాటి, తరచుగా ‘సుడి తుపానులు’ (టార్నొడోలు) కూడా అవతరిస్తున్నాయి. ఈ దృశ్యాలనే మహాకవి శ్రీశ్రీ ‘టార్నా డో, టార్పీడో / అవి విలయం / ఇది సమరం’ అని ఆలం కారికంగా వర్ణించాడు! ఈ వాతావరణ, ప్రకృతి విలయ దృశ్యాలకు శాస్త్రవేత్తలు భీకర తుపానుల ప్రత్యేకతను గుర్తించడానికి కొంత కాలంగా కొన్ని పేర్లను పెడుతు న్నారు. అలాంటివే ‘జాల్’, ఫయలిన్, హెలెన్. గురు వారం (28న) విలయ నృత్యానికి కుచ్చెళ్లు సవరించు కుంటున్న ‘లెహర్’! శివుడి ‘మూడోకన్ను’ లాంటి ఈ ‘ఉగ్రతుపానుల’ పుట్టుకకు కేంద్రస్థానం పసిఫిక్ మహాస ముద్రమని ఒక అంచనా! దశాబ్దన్నరగా వాతావరణం లోకి చొచ్చుకువచ్చిన ఈ వినూత్న దృశ్యానికే / వ్యవస్థకే ‘పసిఫిక్ ఫినామినా’ అని పేరు!
ఎల్-నినో; లా-నీనా
ఈ మార్పుల వల్ల రెండు రకాల కొత్త పరిణామాలు దూసు కువచ్చాయి. ఒకటి ఎల్-నినో, రెండు లా-నీనా. వీటిలో ఒకటి ప్రపంచంలో పలుచోట్ల తీవ్ర కరవు పరిస్థితులకు దారితీయగా, మరొకటి బిళ్లబీటుగా విరుచుకుపడే పెను తుపానులకూ దారితీస్తుంది. ఈ పరిణామాలు కొన్నేళ్లుగా హిందూ మహాసముద్ర ప్రాంత దేశాలను కూడా తీవ్రంగా ప్రభావితం చేస్తున్నాయి. రేపు ముమ్మరించనున్న సరికొత్త ‘లెహర్’ తుపాను సహా ఫయిలిన్, హెలెన్‌లు ఈ అసాధా రణ పరిణామంలో భాగమేనని గుర్తించాలి. ఇటీవల ప్రతీ రెండు మూడేళ్లకూ క్రిస్మస్ సమయంలో, ఈ పరిణామం దేశాలపైన ‘దాడుల’కు సిద్ధమవుతోంది! ఎన్ని ఉపగ్ర హాలు మన నెత్తిమీద తాండవిస్తున్నప్పటికీ ఇప్పుడు ఈ ‘ఉగ్రతుపాను’ల బెడద ‘వానరాకడ, ప్రాణం పోకడ తెలియవన్న’ నానుడిలాగానే తయారైంది! ఇటీవల మన శాస్త్రవేత్తలు అంగారక గ్రహానికి పంపించిన ‘మామ్’ భూమికి 80,000 కిలోమీటర్ల ఎత్తు నుంచి విస్పష్టమైన వాతావరణ తొలి ఛాయాచిత్రాన్ని పంపించింది.
రాక్షసుల మాదిరిగా నోళ్లు తెరుచుకుని చిత్రగతులలో సంచరిస్తున్న తుపాను మేఘాల తాండవ దృశ్యాల్ని అందులో చూపిం చింది! ఎందుకంటే, భూ ఉపరితలంలో 71 శాతం ప్రాం తాన్ని సముద్రాలు, మహా సముద్రాలూ చుట్టబెట్టి ఉన్నా యి. ఇందులో భూఖండం మీద ఉన్న జలరాశిలో 97 శాతం నీళ్లు మహాసముద్రాల అధీనంలో ఉన్నాయి! ప్రతి రోజూ ప్రపంచం చుట్టూ ఉరుములు, మెరుపులతో కూడిన తుపానులు 40,000 దాకా ఉంటాయని అంచనా!
పరిమితులు గుర్తించొద్దా?
1959 సెప్టెంబర్‌లో వచ్చిన తుపాను ‘వీరా’ 5,000 మంది చావుకు కారణం కాగా, 1977లో దివిసీమను కుదిపేసిన ఉగ్రతుపాను 10,000 మందికి పైగా ప్రజల ప్రాణాలు తోడుకుంది! కాగా, 1990 నాటికే ప్రపంచ వ్యాపితంగా వాతావరణ హెచ్చరికల కోసం, పరిశీలన కోసం ఏర్పడిన 10 వేల పరిశోధనా కేంద్రాలు, 800 సౌండింగ్ స్టేషన్లు, వందల కొలది పరిశోధనా నౌకలూ, సముద్రాల ప్రవర్తనా సరళి గురించి గాని, వాతావరణ ప్రవర్తన గురించి గానీ కీలకమైన ప్రశ్నలకు తగిన సమాధానాలు రాబట్టుకోలేక పోతున్నామని శాస్త్రవేత్తలే ప్రకటించడం మానవుడి పరి మితుల్ని కూడా మరొక్కసారి గుర్తు చేసినట్టవుతోందని పరి శోధకుల అంచనా! ఏ పరిశోధనలు, ఏ శాస్త్ర చర్చలు ఎలా ఉన్నా, అగ్రరాజ్యాలు రకరకాల పేర్లతో అణుపాటవ పరీక్షల్ని, కాలుష్య నివారణకు నిర్దేశించిన ‘క్యోటో’ సభ తీర్మానాల ఉల్లంఘనలను శాశ్వతంగా ఆపకుండా వాతా వరణంలోనూ, పర్యావరణ పరిరక్షణలోనూ మానవాళి కనీస విజయాలను కూడా సాధించలేదు!
- ఏబీకే ప్రసాద్, సీనియర్ సంపాదకులు