నైరుతి బంగాళాఖాతంలో అల్పపీడన ద్రోణి ఏర్పడింది.
విశాఖపట్నం: నైరుతి బంగాళాఖాతంలో అల్పపీడన ద్రోణి ఏర్పడింది. ఉత్తర తమిళనాడు, దక్షిణ కోస్తా, తెలంగాణ మీదుగా ద్రోణి ఏర్పడినట్టు వాతావరణ శాఖ అధికారులు తెలిపారు.
ఆదివారం ఉదయంలోగా అల్పపీడనంగా మారే అవకాశముందని తెలిపారు. దీని ప్రభావం వల్ల ఉత్తర కోస్తా ప్రాంతంలో అక్కడక్కడా, దక్షిణ కోస్తాలో చెదురుముదురుగా వర్షాలు పడే అవకాశముందన వాతావరణ శాఖ అధికారులు తెలిపారు.