
సాక్షి,అమరావతి: రాష్ట్రంలో మరోసారి వర్షాలు కురవనున్నాయి. బంగాళాఖాతంలో మంగళవారం అల్పపీడనం ఏర్పడినట్లు వాతావరణశాఖ పేర్కొంది. ఇది రేపటికి తమిళనాడు - శ్రీలంక తీరాలకు చేరుకునే అవకాశం ఉందని అంచనా వేస్తోంది. వీటి ప్రభావం దక్షిణ కోస్తా, రాయలసీమపై రెండు రోజుల పాటు ప్రభావం చూపనుంది.
దీని ప్రభావంతో బుధవారం నుంచి శుక్రవారం వరకు కోస్తా, రాయలసీమలో జిల్లాల్లో అక్కడక్కడా భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని ఐఎండీ పేర్కొంది. చిత్తూరు, తిరుపతి, అన్నమయ్య జిల్లాల్లో వర్షాలు ఎక్కువగా కురుస్తాయని తెలిపింది.
మంగళవారం అల్లూరి, కాకినాడ, కోనసీమ, పశ్చిమగోదావరి, కృష్ణా, నెల్లూరు, కర్నూలు, నంద్యాల, అనంతపురం, శ్రీ సత్యసాయి, వైఎస్సార్ జిల్లాల్లో కొన్నిచోట్ల తేలికపాటి వర్షాలు పడే అవకాశం ఉందని వెల్లడించింది. బుధవారం ప్రకాశం, నెల్లూరు, తిరుపతి, అన్నమయ్య, చిత్తూరు జిల్లాల్లో కొన్నిచోట్ల,గురువారం తిరుపతి, అన్నమయ్య, చిత్తూరు, నెల్లూరు, వైఎస్సార్, శ్రీసత్యసాయి జిల్లాల్లో భారీ వర్షాలు పడే అవకాశం ఉందని వాతావరణ శాఖ అంచనా