breaking news
imd
-
ఐదు రోజులు.. ఏపీ అంతటా వానలే వానలు
సాక్షి, విశాఖపట్నం: ఐదు రోజులపాటు ఏపీ అంతటా వర్షాలు కురిసే అవకాశముందని వాతావరణ శాఖ వెల్లడించింది. తూర్పు విదర్భ నుంచి ఏపీ మీదుగా ద్రోణి కొనసాగుతుందని సముద్ర వాతావరణం అలజడిగా ఉండనుందని అధికారులు పేర్కొన్నారు. ఉత్తర కోస్తా తీరంలో ఐదు రోజులపాటు మత్స్యకారులు వేటకు వెళ్ళరాదని.. గడిచిన 24 గంటల్లో విజయనగరం జిల్లా వేపాడలో 9సెంమి అత్యధిక వర్షపాతం నమోదైందని ఐఎండీ తెలిపింది.మరోవైపు, భారతదేశంలో బలహీనమైన రుతుపవనాలకు కారణమయ్యే ఎల్‌నినో ప్రభావం ఖరీఫ్ సీజన్లో ఆంధ్రప్రదేశ్, తెలంగాణ సహా 12 రాష్ట్రాలపై తీవ్రంగా ఉండే అవకాశం ఉందని కేంద్ర వ్యవసాయ శాఖ ప్రకటించింది. ఉత్తరప్రదేశ్ తమిళనాడు, కర్ణాటక, ఒడిశా, గుజరాత్, రాజస్తాన్, బిహార్, మధ్యప్రదేశ్, జార్ఖండ్, మహారాష్ట్రలపైనా తీవ్ర ప్రభావం ఉంటుందని పేర్కొంది. ఆయా రాష్ట్రాల్లో ఎల్ నినో ముప్పు తీవ్రతను తగ్గించడానికి సమన్వయంతో కూడిన చర్యలు చేపట్టాలని ఆదేశించింది.ఎల్ నినో ప్రభావం సాపేక్షంగా ఎక్కువగా ఉండే అవకాశం ఉన్న రాష్ట్రాల్లోని సంబంధిత జిల్లాల కలెక్టర్లు, వ్యవసాయ శాఖలు, కృషి విజ్ఞాన కేంద్రాలు, ఇతర విభాగాలతో సమన్వయ సమావేశాలను నిర్వహించాలని కేంద్ర వ్యవసాయ శాఖ మంత్రి శివరాజ్‌సింగ్ చౌహాన్ సూచించారు. ఖరీఫ్–2026 ఏర్పాట్లపై అధికారులతో ఆయన సమీక్ష నిర్వహించారు.వర్షపాతం తక్కువగా ఉన్న జిల్లాల్లో ముందస్తు అత్యవసర ప్రణాళికలు రూపొందించి అమలు చేయాలన్నారు. వర్షపాతం లోటును దృష్టిలో పెట్టుకొని పత్తి, పప్పుధాన్యాల సాగు విస్తీర్ణాన్ని పెంచాలని చెప్పారు. ఈ ఏడాదికి సంబంధించి 12 ఎల్ నినో ప్రభావిత రాష్ట్రాల్లోని 326 జిల్లాలకు అత్యవసర ప్రణాళికలు సిద్ధం చేస్తున్నట్లు అధికార వర్గాలు తెలియజేశాయి. -
ఏపీకి వాతావరణ శాఖ బిగ్ అలర్ట్
సాక్షి, విజయవాడ: ఆంధ్రప్రదేశ్‌లో వాతావరణ పరిస్థితులు ఒక్కసారిగా మారిపోయాయి. రాష్ట్రంలోని పలు జిల్లాలకు వాతావరణ శాఖ ఎల్లో అలర్ట్ జారీ చేసింది. రాబోయే మరికొన్ని గంటలు అత్యంత కీలకమని హెచ్చరించింది. పిడుగులతో కూడిన భారీ వర్షాలు, ఈదురు గాలులు వీసే అవకాశం ఉండటంతో ప్రజలను అప్రమత్తంగా ఉండాలని సూచించింది.వాతావరణ శాఖ అంచనాల ప్రకారం.. బుధవారం సాయంత్రంలోపు గంటకు 30 నుంచి 40 కిలోమీటర్ల వేగంతో ఈదురు గాలులు వీచే అవకాశం ఉంది. కొన్ని ప్రాంతాల్లో ఉరుములు, మెరుపులతో కూడిన కుండపోత వర్షాలు కురిసే అవకాశం ఉండటంతో లోతట్టు ప్రాంతాల్లో నీరు నిలిచే ప్రమాదం ఉందని హెచ్చరించింది. ఇప్పటికే ఆకాశం మేఘావృతమవడంతో అధికారులు అప్రమత్తమయ్యారు.వర్ష ప్రభావం కారణంగా విద్యుత్ అంతరాయాలు, రవాణా అంతరాయాలు సంభవించే అవకాశాలు ఉండటంతో స్థానిక యంత్రాంగం తగిన చర్యలు తీసుకుంటోంది. ముఖ్యంగా విజయవాడ, మచిలీపట్నం, గుడివాడ, నూజివీడు ప్రాంతాల్లో వర్ష తీవ్రత ఎక్కువగా ఉండొచ్చని అంచనా.🔴 రెడ్ అలర్ట్:విజయనగరం, విశాఖపట్నం, అల్లూరి సీతారామరాజు, అనకాపల్లి, కాకినాడ జిల్లాల్లో అక్కడక్కడ పిడుగులతో కూడిన మోస్తరు నుంచి భారీ వర్షాలు పడే అవకాశం ఉంది.🟡 ఎల్లో అలర్ట్:తూర్పుగోదావరి, ఏలూరు, కృష్ణా, బాపట్ల జిల్లాల్లో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉంది.విపత్తుల నిర్వహణ సంస్థ ప్రజలను చెట్ల కింద, విద్యుత్ స్తంభాలు, భారీ హోర్డింగ్స్ వద్ద నిలబడరాదని హెచ్చరించింది. అవసరం లేకుండా బయటకు వెళ్లకూడదని సూచించింది. మొత్తం పరిస్థితిని చూస్తే రాబోయే గంటలు రాష్ట్రానికి కీలకంగా మారనున్నాయి. -
తెలుగు రాష్ట్రాల్లో భారీ వర్షాలు.. ఐఎండీ కీలక సూచనలు
సాక్షి, విశాఖపట్నం/ హైదరాబాద్:వాతావరణ శాఖ తెలంగాణకు కీలక హెచ్చరికలు జారీ చేసింది. ఈ నెల 18 నుంచి 24 వరకు భారీ వర్షాలు కురిసే ఛాన్స్ ఉందని తెలిపింది. ఈ నేపథ్యంలో ఎల్లో అలర్ట్ జారీ చేసింది. హైదరాబాద్‌తో సహా పలు జిల్లాలకు భారీ వర్ష సూచనలు జారీ చేసింది. ఈ నేపథ్యంలో ప్రభుత్వం అప్రమత్తమైంది. తగిన జాగ్రత్తలు తీసుకోవాలని జిల్లా అధికారులకు ఆదేశాలు జారీ చేసింది.మరోవైపు ఆంధ్రప్రదేశ్‌లో సైతం భారీగా వర్షాలు కురుస్తున్నాయి. నేడు పలు ప్రాంతాల్లో పిడుగులతో కూడిన భారీ వానలు పడే అవకాశం ఉన్నట్లు వాతావరణ శాఖ తెలిపింది. ఉత్తరాంధ్ర, కోస్తాంధ్ర జిల్లాల్లో మోస్తరు వర్షాలు పడే అవకాశం ఉందని తెలిపింది. అదేవిధంగా ఎండలు సైతం తీవ్రంగా ఉండనున్నట్లు పేర్కొంది. -
ఏపీలో భారీ వర్షం.. పొంగి పొర్లుతున్న వాగులు
-
ఏపీకి రెయిన్ అలర్ట్...! ఆ జిల్లాలో భారీ వర్షాలు
-
తక్కువ కరెంట్‌తో ఎక్కువ కూలింగ్
ఎల్ నినో నేపథ్యంలో వర్షాకాలం మొద లైంది. వర్షపాతం సాధారణ స్థాయికన్నా తక్కువగా ఉండగలదని భారత వాతావరణ పరిశోధనా శాఖ (ఐఎండీ) అంచనా. పసిఫిక్ సముద్రంలో రూపుదిద్దుకుంటున్న ఎల్ నినో పరిస్థితుల దృష్ట్యా, భారత్‌లో వర్షపాతం ఈసారి దీర్ఘకాలిక సగటు (ఎల్.పి.ఏ.)లో 90% మేరకు మాత్రమే ఉండగలదని భావిస్తున్నారు. ఎల్ నినో ఉష్ణ ధోరణులు తేమతో నిండిన పవనాలను బలహీనపరుస్తాయి. ఫలితంగా వర్షపాతం కొన్నిచోట్ల మరీ ఎక్కువ, కొన్నిచోట్ల మరీ తక్కువగా ఉంటుంది. దక్షిణాసియాలో సగటుకన్నా తక్కువ వర్ష పాతం ఎల్ నినో ప్రపంచ ప్రభావాలలో ఒకటిగా ప్రపంచ వాతా వరణ సంస్థ (డబ్లు్య.ఎం.ఓ.) పేర్కొంది. మారుతున్న వాతావరణ పరిస్థితి అనివార్యంగా కొన్ని సమస్యలను సృష్టిస్తుంది. దోమలు, ఈగల వంటి ద్వారా సోకే బ్యాక్టీరియా, వైరస్ల జబ్బులు మొదలవుతాయి. ఆహారం, నీటి లభ్యతపై ఒత్తిడి పెరుగుతుంది. విద్యుదుత్పాదన దెబ్బతింటుంది. ఇప్పటికే దేశంలోని అనేక ప్రాంతాల నుంచి వడగాడ్పులు, రాత్రిపూట కూడా ఉష్ణో గ్రతలు ఎక్కువగానే ఉండటానికి సంబంధించిన వార్తలు చూస్తు న్నాం. ఇవన్నీ కలిసి శీతలీకరణ సాధనాలు, పద్ధతుల వైపు ప్రజలు మొగ్గేటట్లు చేస్తాయి. ఫ్యాన్లు, డిజర్ట్ కూలర్లు, సంచార ఎయిర్ కండిషనర్లు (కార్లు, బస్సులు, రైళ్ళలో), చిల్లర్లు, శీతల గిడ్డంగులు వంటివాటికి గిరాకీ పెంచుతాయి. గృహాలు, ఆఫీసులు, ఫ్యాక్టరీలకు వాటి డిమాండ్లకు అనుగుణంగా కూలింగ్ సిస్టంలు అవసరమవు తాయి. దీనికి విండో, స్లి్పట్, సెంట్రలైజ్డ్ ఏసీలను పెంచుకుంటూ పోవడం స్థిరమైన పరిష్కారం అనిపించుకోదు. కొత్త రూమ్ ఏసీలకు 2025–2035 కాలానికి మరో 13–15 కోట్ల యూనిట్లు జోడు కాగలవని అంచనా. ఇవి విద్యుత్ పంపిణీ వ్యవస్థపై భారాన్ని పెంచుతాయి. 2035లో ఉండగలదని భావిస్తున్న లోడులో వీటి వాటాయే దాదాపు 180 గిగావాట్లు! ప్రస్తుతం, వేసవిలో వినియోగం పతాక స్థాయిలో ఉన్న దశలో ఏసీ యూనిట్లు స్వాహా చేస్తున్న విద్యుత్తు సుమారు 60–70 గిగావాట్లని తేలింది. అంతటా వేడి వాడలే!పట్టణాలు, నగరాల్లో కొన్ని ప్రాంతాలు ‘వేడి వాడలు’గా పేరు మోస్తున్నాయి. జనాభా తక్కువగా ఉన్న ప్రాంతాలకన్నా జనసాంద్రత ఎక్కువగా ఉన్న ప్రాంతాల్లో ఉష్ణోగ్రత కొన్ని డిగ్రీలు ఎక్కువగా ఉంటోంది. నగరాల్లో ఏసీలు పరిసరాల్లోకి మరింత వేడిని విడుదల చేస్తున్నాయి. ఫలితంగా, శీతలీకరణ యంత్రాలకు డిమాండ్ మరింత పెరుగుతోంది. అదొక విష వలయం. వీలైనంత తక్కువ విద్యుత్తును గ్రహించి వాతావరణాన్ని చల్లబరచే సిస్టంలను గుర్తించేందుకు మన దేశంలో స్టార్ రేటింగ్ కొలమానం ఉంది. ఏసీలకు ఈ రేటింగ్ సిస్టంను 2009లో ప్రవేశ పెట్టారు. మొదట్లో ఇది స్వచ్ఛంద లేబుల్గా ఉండేది. తర్వాత, తప్పనిసరిగా పేర్కొనాలని నిబంధన తెచ్చారు. తదనంతరం, కనిష్ఠ శక్తి వినియోగ ప్రమాణాల (ఎం.ఇ.పి. ఎస్.)ను ప్రవేశపెట్టారు. తర్వాత, ఇండియన్ సీజనల్ ఎనర్జీ ఎఫిషి యన్సీ నిష్పత్తి (సీర్)ని 2015లో అమలులోకి తెచ్చారు. ఈ ప్రమా ణాలు ఏసీ మార్కెట్‌పై కొంత ప్రభావాన్ని చూపాయి. సదరు సాధ నానికి లభించిన స్టార్లను బట్టి వినియోగదారులు రకరకాల ఏసీలు కొనడానికి ప్రాధాన్యం ఇస్తున్నారు. వస్తూత్పత్తి సంస్థలు కూడా ఇన్ వెర్టర్ టెక్నాలజీ వంటి మెరుగుదలలతో కొత్త వస్తువులను మార్కెట్లోకి తెస్తున్నాయి. వాతావరణం పట్టని ఏసీలుఅంతవరకు బాగానే ఉందిగానీ, సాంకేతికపరంగానూ, అమలు లోనూ కొన్ని లోపాలు కొనసాగుతున్నాయి. బర్కిలీలోని యూనివ ర్సిటీ ఆఫ్ కాలిఫోర్నియాలో ఇండియా ఎనర్జీ అండ్ క్లైమేట్ సెంటర్ పరిశోధకులు 2025లో ఒక అధ్యయనం నిర్వహించారు. పరీక్షా విధానాలు ప్రాథమికంగా పొడి వాతావరణంలో శీతలీకరణను మదింపు చేస్తున్నాయనీ, భారతదేశంలోని హాట్–హ్యూమిడ్ వాతా వరణంలో కీలకమైన అంశంగా మారే గాలిలో వేడితేమను తగ్గించే లేదా తొలగించే అంశాన్ని పరిగణనలోకి తీసుకోవడం లేదనీ వారు పేర్కొన్నారు. దానివల్ల ఏమవుతుందంటే, ల్యాబొరేటరీ పరీక్షల్లో ఏసీలు బాగా పనిచేస్తాయి. వాస్తవిక పరిస్థితుల్లో పనితీరు పేలవంగా ఉంటుంది. లేదా విద్యుత్తును ఎక్కువ స్వాహా చేసి ప్రదేశా లను అతి శీతలంగా మారుస్తాయి. జపాన్, దక్షిణ కొరియా వంటి దేశాలతో పోలిస్తే అమలుచేస్తున్న ఎం.ఇ.పి.ఎస్.ల విషయంలో కూడా ఇండియా వెనుకబడే ఉందని ఈ అధ్యయనం పేర్కొంది. భారత్‌లోని సగటు యూనిట్‌తో పోలిస్తే ఆ దేశాల్లోని ఏసీలు దాదాపు రెండింతల ఇంధన వినియోగ సామర్థ్యాన్ని కనబరుస్తున్నా యని అధ్యయనంలో వెల్లడైంది. కేంద్రీకృత కూలింగ్ మెరుగుఇండియా కూలింగ్ కార్యాచరణ ప్రణాళిక అనేది మరో ప్రయత్నం. దీనికి 2019లో శ్రీకారం చుట్టారు. ఈ ప్రణాళిక కింద వివిధ ఐడియాలను పరీక్షించి చూస్తున్నారు. డిస్ట్రిక్ట్ కూలింగ్ సిస్టం (డీసీఎస్) వాటిలో ఒకటి. కొన్ని ఐరోపా నగరాల్లో వాడుకలో ఉన్న సెంట్రలైజ్డ్ హీటింగ్ సిస్టంల తరహాలో దానికి రూపకల్పన చేశారు. డీసీఎస్ కింద కొన్ని భవనాల సముదాయానికి సెంట్రలైజ్డ్ కూలింగ్ సిస్టం పెడతారు. నీరు, విద్యుత్, గ్యాస్ సరఫరా చేసే పైపుల మాదిరి గానే కూలింగ్ కూడా గొట్టాల ద్వారా పంపిణీ అవుతుంది. అది సమర్థమైన సిస్టంగా పేరు తెచ్చుకుంది. వ్యర్థ జలాలను శుద్ధి చేసి ఆ నీటిని సెంట్రల్ ప్లాంట్ వినియోగించుకుంటుంది. వ్యర్థంగా బయట కొచ్చే వేడిని చిల్లర్లు గ్రహించుకుంటాయి. అదే ఇంట్లోని ఏసీలకైతే రిఫ్రిజిరెంట్ గ్యాసులు అవసరమవుతాయి. కేంద్రీకృత వ్యవస్థ కావడం వల్ల, కూలింగ్ డిమాండ్‌ను మరింత సమర్థంగా నిర్వహించవచ్చు. విమానాశ్రయాలు, ఐటీ సంస్థల సముదాయాలు, పారిశ్రామికవాడలు, విశ్వవిద్యాలయాల ప్రాంగణాలు వంటిచోట్ల డీసీఎస్ అనువైనది. సింగపూర్, దుబాయ్, ఖతార్, యూఏఈలలో ఇది ప్రయోజనకరమైనదిగా తేలింది. మన దేశంలో ‘శీతలీకరణను కూడా ఒక సేవ’ కింద మార్చడానికి రెగ్యులేటరీ, లీగల్, ఫినాన్షియల్ పరంగా, ఇతరత్రా కొన్ని ప్రతిబంధకాలున్నాయి. కొన్నేళ్ళ క్రితం ఢిల్లీలోని కనాట్ ప్లేస్‌లో డీసీఎస్ ఏర్పాటుకు ప్రయత్నాలు సాగాయిగానీ, వివిధ క్షేత్ర స్థాయి సమస్యల వల్ల అవి ఫలించలేదు. సాపేక్షంగా చూస్తే, గుజరాత్‌లోని గిఫ్ట్ సిటీలో మాదిరిగా కొత్త ప్రాజెక్టులలో వాటిని అమలులోకి తేవడం తేలిక. ఆంధ్రప్రదేశ్ నూతన రాజధాని అమరావతిలో కూడా డీసీఎస్‌ను పొందుపరచనున్నారు. వివిధ నగరాల్లో ఆకాశ హార్మ్యా లతో కొత్త జనావాస ప్రాంతాలు పుట్టుకొస్తున్నాయి. వాటిలో డీసీఎస్‌ను ప్రోత్సహించేందుకు ఇది సరైన సమయం. దేశానికి ఒక సమగ్ర శీతలీకరణ విధానం అవసరం. అది తక్కువ విద్యుత్తుతో ఎక్కువ శీతలీకరణను అందించేందిగా ఉండాలి. వివిధ ప్రాంతాల్లోని పరిస్థితులకు తగ్గట్లుగా శీతలీకరణ సాధనాలకు కొత్త డిజైన్లు అవసరం. నూతన శీతలీకరణ టెక్నాల జీలపై పరిశోధన సాగాలి. అదే సమయంలో, వడగాడ్పులకు ఎక్కువ అవకాశం ఉన్న ప్రాంతాల్లో చల్లదనాన్ని ఇచ్చే పైకప్పుల వంటి కొత్త ప్రయత్నాలకు సామూహిక స్థాయిలో ప్రయత్నాలు చేయాలి.దినేశ్ సి. శర్మవ్యాసకర్త సైన్స్ అంశాల వ్యాఖ్యాత -
దంచికొడుతున్న వర్షం.. చెరువులైన రోడ్లు
-
హైదరాబాద్ లో భారీ వర్షం...
-
గాడ్జిల్లా వచ్చేస్తోంది! భారత్‌పై దాని నీడ పడితే..
గాడ్జిల్లా సముద్రం నుంచి బయటకు వస్తే నగరాలు వణికిపోతాయి. ఎందుకంటే అది సృష్టించే విధ్వంసం కనీవినీ ఎరుగని రీతిలో ఉంటుంది. అది సినిమా కథ. కానీ ఇప్పుడు పసిఫిక్ మహాసముద్రంలో రూపుదిద్దుకుంటున్న ‘గాడ్జిల్లా’ మాత్రం సైంటిస్టులను సైతం ఆందోళనకు గురిచేస్తోంది. ప్రపంచం మొత్తం దానివైపు చూస్తుంటే.. భారత్‌కు మాత్రం మరో భయం వెంటాడుతోంది. ఎందుకంటే ఈ దాని నీడ గనుక పడితే జరిగిన నష్టం.. పెను సంక్షోభానికి దారి తీస్తుంది కాబట్టి!. వాతావరణ ప్రపంచంలో ప్రస్తుతం ఒక్కటే చర్చ నడుస్తోంది. అదే "గాడ్జిల్లా ఎల్ నినో". సాధారణంగా రెండు నుంచి ఏడు సంవత్సరాలకు ఒకసారి కనిపించే ఎల్ నినో ఈసారి.. అసాధారణంగా బలపడే సంకేతాలు ఇస్తోంది. ఐక్యరాజ్యసమితికి చెందిన ప్రపంచ వాతావరణ సంస్థ (WMO), యూరప్‌కు చెందిన ప్రముఖ వాతావరణ అంచనా కేంద్రాలు విడుదల చేసిన తాజా నివేదికలు ప్రపంచవ్యాప్తంగా ఆందోళన రేకెత్తిస్తున్నాయి.ఎల్ నినో అనేది పసిఫిక్ మహాసముద్రంలోని నీటి ఉష్ణోగ్రతల్లో సంభవించే మార్పు. సాధారణంగా పసిఫిక్‌లో వీచే ట్రేడ్ విండ్స్ వేడి నీటిని ఆసియా వైపు నెట్టేస్తుంటాయి. కానీ ఎల్ నినో సమయంలో ఆ గాలులు బలహీనపడతాయి. ఫలితంగా వేడి నీరు మధ్య, తూర్పు పసిఫిక్ వైపు వ్యాపిస్తుంది. ఈ ఒక్క మార్పు ప్రపంచ వాతావరణ వ్యవస్థ మొత్తాన్ని ప్రభావితం చేస్తుంది.శాస్త్రవేత్తలు ప్రత్యేకంగా గమనించే "నినో-3.4" ప్రాంతంలో సముద్ర ఉపరితల ఉష్ణోగ్రతలు ఇప్పటికే సాధారణం కంటే 0.9 డిగ్రీల సెల్సియస్ ఎక్కువగా నమోదయ్యాయి. ఎల్ నినో ప్రకటించేందుకు అవసరమైన 0.5 డిగ్రీల పరిమితిని ఇది దాటేసింది. డిసెంబర్ నాటికి ఈ వ్యత్యాసం 3 నుంచి 4 డిగ్రీల సెల్సియస్ వరకు చేరే అవకాశం ఉందని యూరోపియన్ ఫోర్కాస్ట్ మోడళ్లు సూచిస్తున్నాయి.అదే జరిగితే 1997-98, 2015-16 సూపర్ ఎల్ నినో రికార్డులు బద్దలయ్యే అవకాశం ఉంది. అందుకే దీనికి "గాడ్జిల్లా ఎల్ నినో" అనే పేరు పెట్టారు. గాడ్జిల్లాలా.. ఈ ఎల్ నినో కూడా ప్రపంచ వాతావరణ వ్యవస్థపై భారీ ప్రభావం చూపవచ్చని భావించి ఆ పేరు పెట్టారు. భారత్‌పైనే ఎక్కువ ఎందుకు?గాడ్జిల్లా ఎల్‌నినో గురించి భారత్ ఎక్కువగా ఆందోళన చెందడానికి బలమైన కారణాలే ఉన్నాయి. దేశంలో ఏడాది మొత్తం కురిసే వర్షాల్లో దాదాపు 70 శాతం నైరుతి రుతుపవనాల ద్వారానే వస్తుంది. వ్యవసాయ భూముల్లో సగానికి పైగా ఇప్పటికీ వర్షాధారంగానే సాగవుతున్నాయి. అందుకే వర్షాకాలంలో చిన్న మార్పు వచ్చినా దాని ప్రభావం కోట్లాది మంది రైతులు, గ్రామీణ ఆర్థిక వ్యవస్థపై నేరుగా పడుతుంది.సాధారణంగా ఎల్‌నినో సమయంలో పసిఫిక్ మహాసముద్రంలో ఉష్ణోగ్రతలు పెరగడంతో వర్షాలను తీసుకొచ్చే గాలి ప్రవాహాలు తూర్పు వైపుకు మళ్లుతాయి. దీంతో భారత ఉపఖండానికి చేరాల్సిన తేమ తగ్గిపోతుంది. ఫలితంగా రుతుపవనాలు బలహీనపడటం, సాధారణం కంటే తక్కువ వర్షాలు నమోదవడం జరుగుతుంది.ఇప్పటికే భారత వాతావరణ శాఖ (IMD) ఈ ఏడాది వర్షపాతం సాధారణ స్థాయి కంటే తక్కువగా ఉండొచ్చని అంచనా వేసింది. 1971-2020 మధ్యకాల సగటుతో పోలిస్తే ఈసారి కేవలం 90 శాతం వర్షపాతం మాత్రమే నమోదయ్యే అవకాశం ఉందని పేర్కొంది. అంతేకాదు, లోటు వర్షాలు నమోదయ్యే అవకాశం 60 శాతం వరకు ఉందని హెచ్చరించింది.అయితే సమస్య కేవలం వర్షాలు తగ్గడమే కాదు. వర్షాలు తగ్గితే ముందుగా దెబ్బతినేది వ్యవసాయ రంగం. వరి, పత్తి, మొక్కజొన్న, పప్పుధాన్యాల వంటి పంటల దిగుబడులు తగ్గే ప్రమాదం ఉంటుంది. రైతుల ఆదాయం పడిపోవచ్చు. భూగర్భ జలాల నిల్వలు తగ్గవచ్చు. జలాశయాలు పూర్తిస్థాయిలో నిండకపోతే తాగునీటి, సాగునీటి సమస్యలు తలెత్తే అవకాశం ఉంటుంది.దీని ప్రభావం చివరికి సాధారణ ప్రజలపై కూడా పడుతుంది. పంటల ఉత్పత్తి తగ్గితే కూరగాయలు, ధాన్యాలు, పప్పులు వంటి నిత్యావసర వస్తువుల ధరలు పెరిగే అవకాశం ఉంటుంది. ఆహార ద్రవ్యోల్బణం పెరిగితే దేశ ఆర్థిక వ్యవస్థపైనా ఒత్తిడి పెరుగుతుంది. అందుకే శాస్త్రవేత్తలు గాడ్జిల్లా ఎల్‌నినోను కేవలం వాతావరణ ఘటనగా కాకుండా.. వ్యవసాయం, ఆహార భద్రత, ఆర్థిక వ్యవస్థలను ప్రభావితం చేసే కీలక పరిణామంగా చూస్తున్నారు.గతం ఏం చెబుతోందంటే..1997-98లో ప్రపంచం అత్యంత శక్తివంతమైన ఎల్ నినోను చూసింది. 2015-16లో మరోసారి సూపర్ ఎల్ నినో నమోదైంది. ఆ సమయంలో భారత్‌లో సాధారణం కంటే కేవలం 86 శాతం వర్షపాతం మాత్రమే నమోదైంది. పలు రాష్ట్రాలు కరువు బారిన పడ్డాయి. వ్యవసాయ దిగుబడులు తగ్గాయి. ఆహార ద్రవ్యోల్బణం పెరిగింది. అయితే అప్పట్లో భారత్‌కు ఒక రక్షణ కవచం లభించింది. అదే ఇండియన్ ఓషన్ డైపోల్ (IOD). 1997లో బలమైన పాజిటివ్ IOD ప్రభావంతో ఎల్ నినో దెబ్బ కొంతవరకు తగ్గింది. కానీ ఈసారి పరిస్థితి భిన్నంగా ఉంది. ప్రస్తుతం ఐవోడీ తటస్థ స్థితిలోనే ఉండే అవకాశం ఉందని అంచనాలు చెబుతున్నాయి. అంటే ఎల్ నినో ప్రభావాన్ని తగ్గించే సహజ మిత్రుడు ఈసారి భారత్‌కు అందుబాటులో ఉండకపోవచ్చు.ఎల్ నినోను భారత్ వర్షాకాలానికి విలన్‌గా భావిస్తే.. ఐవోడీని హీరోగా చెప్పొచ్చు. ఎల్ నినో వల్ల తగ్గే వర్షాలను కొంతవరకు భర్తీ చేసి, దేశాన్ని కరువు ముప్పు నుంచి కాపాడే శక్తి దీనికి ఉంటుంది. అదెలాగంటే.. ఎల్ నినో వల్ల భారత్‌లో వర్షాలు తగ్గే ప్రమాదం ఉంటుంది. అలాంటి సమయంలో భారత మహాసముద్రంలో ఏర్పడే ఐవోడీ వాతావరణ పరిస్థితి కొన్నిసార్లు రక్షకుడిలా పనిచేస్తుంది. ఇది అనుకూలంగా ఉంటే ఎల్ నినో ప్రభావాన్ని తగ్గించి, భారత్‌కు అదనపు వర్షాలు కురిసేలా సహాయపడుతుంది.ప్రపంచంపై ప్రభావం..అలాగని గాడ్జిల్లా ఎల్ నినో ప్రభావం భారత్‌కే పరిమితం కాదు. ఆస్ట్రేలియా, ఇండోనేషియా, ఫిలిప్పీన్స్లలో తీవ్ర కరువు పరిస్థితులు ఏర్పడే ప్రమాదం ఉంది. కొన్ని ప్రాంతాల్లో అడవి మంటలు పెరిగే అవకాశం ఉంది. మరోవైపు అమెరికా, పెరూ, ఈక్వెడార్ వంటి దేశాల్లో భారీ వర్షాలు, వరదలు సంభవించవచ్చు. ప్రపంచ ఆహార ఉత్పత్తి వ్యవస్థ కూడా దెబ్బతినే అవకాశం ఉందని నిపుణులు హెచ్చరిస్తున్నారు. పంట దిగుబడులు తగ్గితే ఆహార ధరలు పెరగవచ్చు. ఇప్పటికే ప్రపంచవ్యాప్తంగా కొనసాగుతున్న సరఫరా సమస్యలు మరింత తీవ్రమయ్యే ప్రమాదం ఉంది.కరువు ఖాయమేనా?కచ్చితంగా కాదు. ఎల్ నినో ఒక ప్రమాద సంకేతం మాత్రమే. అది తుది ఫలితం కాదు. వర్షాకాలాన్ని ప్రభావితం చేసే ఇతర అంశాలు కూడా ఉన్నాయి. స్థానిక వాతావరణ పరిస్థితులు, సముద్ర ఉష్ణోగ్రతలు, గాలి ప్రవాహాల తీరు వంటి అంశాలు కూడా కీలక పాత్ర పోషిస్తాయి. అయినా సరే.. ప్రపంచ వాతావరణ నిపుణులు ఇప్పుడు పసిఫిక్‌పై ప్రత్యేక నిఘా పెట్టడానికి కారణం ఉంది. ఎందుకంటే ఇది సాధారణ ఎల్ నినో కాదనే సంకేతాలు కనిపిస్తుండడమే. నోట్: ఇది వివిధ వాతావరణ సంస్థలు, శాస్త్రవేత్తల అంచనాల ఆధారంగా రూపొందించిన విశ్లేషణాత్మక కథనం మాత్రమే. వాతావరణ పరిస్థితులు మారే కొద్దీ అంచనాలు, ప్రభావాలు కూడా మారే అవకాశం ఉంటుంది. -
APకి నైరుతి రుతుపవనాలు.. జోరుగా వానలు
-
రెండు రోజుల్లో వర్షాలు కానీ... IMD షాకింగ్ రిపోర్ట్
-
ఎండలకు బ్రేక్.. తెలంగాణపై వర్షాల మోత
మండిపోతున్న ఎండలతో అల్లాడుతున్న తెలంగాణకు వాతావరణ శాఖ చల్లని కబురు చెప్పింది. అరేబియా సముద్రంలో ఏర్పడుతున్న కీలక వాతావరణ వ్యవస్థల ప్రభావంతో రాష్ట్రవ్యాప్తంగా వర్షాలు విస్తరించే అవకాశాలు కనిపిస్తున్నాయని ప్రకటించింది. పలు ప్రాంతాల్లో ఉరుములు, మెరుపులు, ఈదురుగాలులతో కూడిన వర్షాలు కురిసే అవకాశం ఉందని అధికారులు హెచ్చరిస్తున్నారు. కొన్ని ప్రాంతాల్లో భారీ వర్షాలు కూడా నమోదయ్యే సూచనలు కనిపిస్తున్నాయి.అరేబియా సముద్రం మీదుగా కేరళ తీరానికి సమీపంలో మధ్య ట్రోపోస్ఫియర్ స్థాయిలో భారీ వాయుగుండం (మిడ్ ట్రోపోస్ఫెరిక్ వోర్టెక్స్) ఏర్పడే అవకాశముందని వాతావరణ నిపుణులు చెబుతున్నారు. దీనికి తోడు కేరళ తీరం నుంచి ఒడిశా వరకు ఉపరితల ద్రోణి విస్తరించే పరిస్థితులు కనిపిస్తున్నాయి. ఈ రెండు వాతావరణ వ్యవస్థల ప్రభావంతో దక్షిణ, మధ్య భారతదేశంలో విస్తృతంగా వర్షాలు కురిసే అవకాశాలు ఏర్పడ్డాయి.ఈ ప్రభావం తెలంగాణపైనా స్పష్టంగా కనిపించనుంది. రాష్ట్రంలోని పలు ప్రాంతాల్లో ఉరుములు, మెరుపులతో కూడిన వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది. కొన్ని ప్రాంతాల్లో గంటకు 30 నుంచి 40 కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలులు కూడా వీచే అవకాశం ఉందని హెచ్చరించింది. ముఖ్యంగా నల్లగొండ, సూర్యాపేట, వరంగల్, హనుమకొండ, నాగర్‌కర్నూల్ జిల్లాల్లో భారీ వర్షాలు కురిసే అవకాశముండటంతో వాతావరణ శాఖ ఎల్లో అలర్ట్ జారీ చేసింది. తక్కువ సమయంలో అధిక వర్షపాతం నమోదయ్యే అవకాశం ఉండటంతో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించింది.అదే సమయంలో హైదరాబాద్‌తో పాటు మిగిలిన జిల్లాల్లోనూ మోస్తరు వర్షాలు కురిసే అవకాశముందని అంచనా వేస్తున్నారు. లోతట్టు ప్రాంతాల్లో నీరు నిలిచే పరిస్థితులు ఏర్పడే అవకాశం ఉండటంతో అధికారులు అప్రమత్తంగా ఉండాలని సూచించారు.ఇక కేరళ, తీర కర్ణాటక ప్రాంతాల్లో జూన్ 10-11 వరకు భారీ నుంచి అతి భారీ వర్షాలు కొనసాగనున్నట్లు వాతావరణ అంచనాలు చెబుతున్నాయి. అక్కడ ఏర్పడుతున్న వాతావరణ పరిస్థితుల ప్రభావం మహారాష్ట్ర, తెలంగాణ, ఒడిశా, పశ్చిమ బెంగాల్ రాష్ట్రాలపైనా కనిపించనుంది. దీంతో ఈ ప్రాంతాల్లో పిడుగులు, ఉరుములతో కూడిన వర్షాలు నమోదయ్యే అవకాశముందని నిపుణులు పేర్కొంటున్నారు.వ్యవసాయ రంగానికి ఈ వర్షాలు ఊరటనిచ్చే అవకాశం ఉన్నప్పటికీ, పిడుగులు, ఈదురుగాలుల ప్రమాదం ఉన్నందున రైతులు, ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అధికారులు సూచిస్తున్నారు. ముఖ్యంగా ఉరుములు, మెరుపులు సంభవించే సమయంలో చెట్ల కింద నిలబడకుండా, బహిరంగ ప్రదేశాల్లో ఎక్కువసేపు గడపకుండా జాగ్రత్తలు తీసుకోవాలని హెచ్చరిస్తున్నారు. -
కేరళం తీరాన్ని తాకిన నైరుతి.. దంచికొడుతున్న వర్షాలు
నైరుతి రుతుపవనాలు కేరళ తీరాన్ని తాకినట్లు ప్రాథమిక సమాచారం వెలువడుతోంది. దీంతో రాష్ట్రవ్యాప్తంగా వర్షాలు ఒక్కసారిగా పెరిగి, అనేక జిల్లాల్లో భారీ వర్ష సూచనలు జారీ అయ్యాయి. కొన్ని ప్రాంతాల్లో పరిస్థితి తీవ్రత పెరగడంతో అధికారులు ఆరెంజ్ అలర్ట్ ప్రకటించారు. అయితే ఈ ప్రవేశాన్ని భారత వాతావరణ శాఖ (IMD) ఇంకా అధికారికంగా ధ్రువీకరించాల్సి ఉంది.కేరళలోని సుమారు 15 జిల్లాల్లో మోస్తరు నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉన్నట్లు స్థానిక వాతావరణ అంచనాలు చెబుతున్నాయి. కొన్ని ప్రాంతాల్లో గాలులతో కూడిన వర్షాలు, తీర ప్రాంతాల్లో అలల ఉధృతి పెరగవచ్చని హెచ్చరికలు జారీ అయ్యాయి. దీంతో తీర ప్రాంత ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అధికారులు సూచిస్తున్నారు.ఇదే సమయంలో కర్ణాటక, తమిళనాడుకు భారీ వర్షాలు కురిసే అవకాశం కనిపిస్తోంది. దక్షిణ తమిళనాడు, చెన్నై ప్రాంతాల్లో కూడా వర్ష సూచనలు వెలువడుతున్నాయి. అక్కడ కూడా మేఘావృత వాతావరణం నెలకొని, రాబోయే గంటల్లో వర్షాలు పెరిగే అవకాశం ఉందని అంచనా వేస్తున్నారు.మరోవైపు నైరుతి రుతుపవనాలు ఈసారి సాధారణం కంటే ఆలస్యంగా, దాదాపు పది రోజుల ఆలస్యంతో కేరళ తీరాన్ని తాకినట్లు నిపుణులు చెబుతున్నారు. అయితే వీటి తీవ్రత ఆశించినంత బలంగా లేదని భారత వాతావరణ శాఖ ప్రాథమిక విశ్లేషణలో పేర్కొంది. రుతుపవనాల ప్రస్తుత దశ బలహీనంగానే కొనసాగుతోందని ఐఎండీ అంచనా వేస్తోంది.ఇక రాబోయే వారం రోజుల్లో ఈ రుతుపవనాలు క్రమంగా కర్ణాటక, ఆంధ్రప్రదేశ్, తెలంగాణ వైపు విస్తరించే అవకాశం ఉన్నట్లు సూచనలు ఉన్నాయి. మరో వారం తర్వాతే తెలుగు రాష్ట్రాల్లో వర్షాలు పడే చాన్స్ కనిపిస్తోంది. దక్షిణ భారతంలో వర్షపాతం పెరుగుతుందా లేదా అన్నది రుతుపవనాల బలం, దిశపై ఆధారపడి ఉంటుందని వాతావరణ నిపుణులు చెబుతున్నారు.ప్రస్తుతం కేరళలో వర్షాలు మొదలైన నేపథ్యంలో అధికారులు పరిస్థితిని నిరంతరం పర్యవేక్షిస్తున్నారు. రాబోయే రోజుల్లో రుతుపవనాల వేగం ఎలా మారుతుందన్నదానిపై స్పష్టత రావాల్సి ఉంది. -
తెలంగాణకు భారీ వర్ష సూచన
-
తెలంగాణకు ఐఎండీ బిగ్ అలర్ట్
హైదరాబాద్: రాష్ట్రంలో వాతావరణం ఒక్కసారిగా మారనుంది. బుధ, గురువారాల్లో పలు జిల్లాల్లో ఓ మోస్తరు నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ హెచ్చరించింది. దీంతో పలు ప్రాంతాలకు ఆరెంజ్ అలర్ట్ జారీ చేయడం గమనార్హం.తెలంగాణలో రాబోయే రెండు రోజులు వర్షాలు మరింత ఉధృతంగా కురిసే అవకాశాలు ఉన్నాయని వాతావరణ శాఖ తెలిపింది. రాష్ట్రంలోని అనేక జిల్లాల్లో ఓ మోస్తరు నుంచి భారీ వర్షాలు నమోదయ్యే అవకాశం ఉందని పేర్కొంది. ఆదిలాబాద్, కుమురంభీం ఆసిఫాబాద్, మంచిర్యాల, నిర్మల్, నిజామాబాద్, జగిత్యాల, రాజన్న సిరిసిల్ల, కరీంనగర్, పెద్దపల్లి, జయశంకర్ భూపాలపల్లి, ములుగు, భద్రాద్రి కొత్తగూడెం, ఖమ్మం, నల్గొండ, సూర్యాపేట.. .. మహబూబాబాద్, వరంగల్, హనుమకొండ జిల్లాల్లో అక్కడక్కడ భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని అధికారులు వెల్లడించారు. ఈ జిల్లాలకు ఆరెంజ్ అలర్ట్ జారీ చేయగా, మిగిలిన జిల్లాలకు ఎల్లో అలర్ట్ హెచ్చరికలు జారీ చేసింది. ఉరుములు, మెరుపులతో కూడిన ఈదురు గాలులు వీచే అవకాశం కూడా ఉందని హెచ్చరించారు.అదే సమయంలో నైరుతి రుతుపవనాలు రేపటిలోగా కేరళ, తమిళనాడును తాకే అవకాశాలు ఉన్నాయని వాతావరణ శాఖ అంచనా వేసింది. దీని ప్రభావంతో తెలంగాణలో వర్షాల తీవ్రత పెరిగే సూచనలు కనిపిస్తున్నాయి.మంగళవారం రాష్ట్రంలోని పలు ప్రాంతాల్లో వర్షం కురిసింది. ఖమ్మం జిల్లా ఏన్కూరు మండలంలో 7.9 సెంటీమీటర్ల వర్షపాతం రికార్డైంది. తల్లాడలో 6 సెం.మీ, భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అశ్వారావుపేటలో 4 సెం.మీ, దమ్మపేటలో 3 సెం.మీ, ములుగు జిల్లా వెంకటాపురం మండలంలో 1.7 సెం.మీ వర్షం కురిసింది. మరోవైపు ఎండల తీవ్రత కూడా కొనసాగుతోంది. సూర్యాపేట జిల్లా గరిడేపల్లిలో 44.8 డిగ్రీల అత్యధిక ఉష్ణోగ్రత నమోదైంది. రాష్ట్రంలోని మరో 27 జిల్లాల్లో 40.2 నుంచి 44.7 డిగ్రీల మధ్య ఉష్ణోగ్రతలు రికార్డయ్యాయని అధికారులు తెలిపారు. -
IMD బిగ్ షాక్ నైరుతి వర్షాలపై ఎల్-నినో ఎఫెక్ట్
-
బ్రహ్మపురిః47.2
న్యూఢిల్లీ: దేశంలోని చాలా రాష్ట్రాలు మండుతున్న ఎండలతో అల్లాడుతున్నాయి. ఆదివారం మహారాష్ట్ర విదర్భ ప్రాంతంలో ఉన్న బ్రహ్మపురిలో దేశంలోనే అత్యధికంగా 47.2 డిగ్రీల సెల్సియస్ ఉష్ణోగత్ర రికార్డయ్యింది. ఇది సాధారణం కంటే 4.6 డిగ్రీలు ఎక్కువ. యూపీలోని బాందాలో 46.8, రాజస్తాన్‌లోని గంగానగర్‌లో 46 డిగ్రీలు, హరియాణాలోని సిర్సాలో 46, మహారాష్ట్రలోని చంద్రాపూర్‌లో 45.6, వార్థాలో 45.5 డిగ్రీల సెల్సియస్ ఉష్ణోగ్రతలు నమోదయ్యాయని భారత వాతావరణ శాఖ(ఐఎండీ) తెలిపింది. రాజస్తాన్‌లో 47 డిగ్రీల వరకు నమదయ్యే అవకాశముందంది. కాగా, మే 29వ తేదీ తర్వాత క్రమేపీ ఎండల నుంచి ఉపశమనం కలగనుందని ఐఎండీ అంచనా వేసింది. -
IMD హెచ్చరిక.. వచ్చేస్తున్న హీట్ వేవ్ 4రోజులు దంచుడే..దంచుడు
-
తెలుగు రాష్ట్రాలకు తీపి కబురు ముందుగానే రుతుపవనాలు
-
తెలుగు రాష్ట్రాలకు ఐఎండీ బిగ్ అలర్ట్
తెలుగు రాష్ట్రాల్లో ఎండలు దంచికొడుతున్నాయి. అదే సమయంలో ద్రోణి ప్రభావంతో అక్కడక్కడా వర్షాలు పడుతున్నాయి. ఈ భిన్నవాతావరణంలో ఇరు రాష్ట్రాల ప్రజలు ఉక్కిరి బిక్కిరి అవుతున్నారు. అకాల వర్షాలతో రైతులూ పంట నష్టపోతున్నారు. ఈ లోపు వాతావరణ శాఖ ఇరు రాష్ట్రాలను అప్రమత్తం చేసింది. ద్రోణి ప్రభావంతో.. అటు ఆంధ్రప్రదేశ్, ఇటు తెలంగాణలోని పలు ప్రాంతాల్లో వచ్చే మూడు రోజులు తేలికపాటి నుంచి ఓ మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని తెలిపింది. బలమైన ఈదురు గాలులు సహా పిడుగులతో కూడిన జల్లులు కురుస్తాయని.. ప్రజలు అప్రమత్తంగా ఉండాలని వాతావరణ శాఖ అధికారులు హెచ్చరించారు. అదే సమయంలో.. తెలంగాణ, ఏపీలో పలు జిల్లాల్లో ఇప్పటికే గరిష్ట ఉష్ణోగ్రతలు 45 డిగ్రీలకు చేరాయి. వడగాలులు ముప్పు కూడా పొంచి ఉందని.. కాబట్టి అప్రమత్తంగా ఉండాలని హెచ్చరించింది.ఏపీలో శుక్ర, శనివారాల్లో పలు చోట్ల తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురవడం సహా గంటకు సుమారు 40 - 50 కిలోమీటర్ల వేగంతో గాలులు వీచే ఛాన్స్ ఉంది. అలాగే.. ఇటు తెలంగాణలోనూ కొన్ని జిల్లాల్లో తేలికపాటి నుంచి మోస్తారు వర్షాలు కురిసే అవకాశం ఉంది. ఈ నేపథ్యంతో వేడి, తేమ సహా అసౌకర్యమైన వాతావరణ పరిస్థితులు ఏర్పడనుందని వాతావరణ శాఖ తెలిపింది. రాగల మూడు రోజుల్లో గరిష్ఠ ఉష్ణోగ్రతలు.. వర్షాలతో ఇదే తరహా వాతావరణం నెలకొంటుందని పేర్కొంది. మరో మూడు రోజులపాటు..ఏపీలోని కృష్ణా జిల్లా పాలకాయతిప్ప వద్ద సముద్రంను చూసి మత్స్యకారులు ఆశ్చర్యపోతున్నారు. గత రెండు రోజులుగా వెయ్యి మీటర్లు ముందుకు చొచ్చుకుని వచ్చింది. ఏడు నుంచి ఎనిమిది మీటర్ల ఎత్తున సమద్రుపు అలలు ఎగసిపడుతున్నాయి. ఇన్నేళ్లలో.. ఈ సీజన్లో ఎప్పుడూ సముద్రాన్ని ఇలా చూడలేదని మత్స్యకారులు చెబుతున్నారు. చల్లటి కబురువాతావరణ శాఖ చల్లటి కబురు చెప్పింది. ఈ ఏడాది ముందుగానే రుతుపవనాలు ప్రవేశిస్తాయని.. మే రెండో లేదంటే మూడో వారం తీరాన్ని తాకుతాయని తెలిపింది. -
ఏపీలో పలు జిల్లాలకు పిడుగుపాటు హెచ్చరికలు
సాక్షి,అమరావతి: ఏపీలో పలు జిల్లాలకు వాతావరణ శాఖ పిడుగుపాటు హెచ్చరికలు జారీ చేసింది. రాగల మూడు గంటల్లో అల్లూరి సీతారామరాజు, అనకాపల్లి జిల్లాల్లో అక్కడక్కడ పిడుగులతో కూడిన మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ అధికారులు తెలిపారు. కర్నూలు, నంద్యాల, ప్రకాశం, మార్కాపురం జిల్లాల్లో అక్కడక్కడ పిడుగులతో కూడిన తేలికపాటి వర్షాలు కురిసే అవకాశం ఉంది. 40-60కిమీ వేగంతో బలమైన ఈదురు గాలులతో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని కోరారు. -
ఈసారి వానలు తక్కువే: ఐఎండీ
న్యూఢిల్లీ: ఈ ఏడాది వర్షాలు సాధారణం కంటే తక్కువగానే కురిసే అవకాశాలున్నాయని భారత వాతావరణ శాఖ(ఐఎండీ) తెలిపింది. దాదాపు మూడేళ్ల తర్వాత ఎల్ నినో పరిస్థితులు జూన్‌లో ఏర్పడే సూచనలు కనిపిస్తున్నాయని, దీని ప్రభావం నైరుతి రుతు పవనాలపై పడనుందని అంచనా వేసింది. సాధారణంగా జూన్ నుంచి సెపె్టంబర్ వరకు సాధారణ వర్షపాతం సరాసరిన 87 సెంటీమీటర్ల కాగా, ఈసారి 80 సెంటీమీటర్ల వర్షపాతమే నమోదయ్యే అవకాశముందని ఐఎండీ చీఫ్ మహాపాత్ర పేర్కొన్నారు. దేశంలోని అత్యధిక ప్రాంతాల్లో ఇవే పరిస్థితులుంటాయన్నారు. అయితే, ఈశాన్య, వాయువ్య, దక్షిణ భారతంలోని కొన్ని ప్రాంతాల్లో మాత్రం సాధారణం, అంతకంటే ఎక్కువ వర్షపాతం నమోదయ్యే అవకాశం ఉందన్నారు. -
వేసవి కబురు చల్లగా!
సాక్షి, హైదరాబాద్: వేసవి సీజన్‌పై ఐఎండీ చల్లని వార్త చెప్పింది. ఈసారి ఉష్ణోగ్రతలు సాధారణ స్థితిలోనే నమోదవుతాయని వెల్లడించింది. ఏప్రిల్– జూన్ మధ్య కాలంలో ఉష్ణోగ్రతలు, హీట్‌వేవ్ అంచనాలను బుధవారం వాతావరణ శాఖ విడుదల చేసింది. దేశవ్యాప్తంగా గరిష్ట ఉష్ణోగ్రతలు సాధా రణం, అంతకంటే తక్కువగా నమోదవుతాయని వివరించింది. అయితే కనిష్ట ఉష్ణోగ్రతలు మాత్రం సాధారణం కంటే ఎక్కువగా నమోదు కావొచ్చని తెలిపింది. దీంతో పగటి పూట సాధారణ వాతావరణం ఉన్నప్పటికీ రాత్రి వేళ మాత్రం ఉక్కపోత ప్రభావం ఉంటుందని తెలిపింది. రాష్ట్రంలో వాతావరణ పరిస్థితిని పరిశీలిస్తే... ఏప్రిల్–జూన్ మధ్య కాలంలో రాష్ట్రంలోని చాలా ప్రాంతాల్లో గరిష్ట ఉష్ణోగ్రతలు సాధారణ స్థితిలోనే నమోదవు తాయని, రెండు, మూడు తూర్పు ఆగ్నేయ జిల్లాల్లో మాత్రం సాధారణం కంటే కాస్త ఎక్కువగా నమోదవుతాయని వివరించింది. ఏప్రిల్ నెలలో సాధా రణ ఉష్ణోగ్రతలే నమోదయ్యే అవకాశం ఉందని, కొన్ని పశ్చిమ ప్రాంత జిల్లాల్లో సాధారణం కంటే కాస్త తక్కువ ఉష్ణోగ్రతలు నమోదవుతాయని, కనిష్ట ఉష్ణోగ్రతలు మధ్య తెలంగాణలో సాధారణం కంటే తక్కువగా ఉంటాయని, మిగిలిన ప్రాంతాల్లో సాధారణం, కాస్త ఎక్కువగా ఉండొచ్చని వివరించింది.హీట్‌వేవ్ తక్కువే...: ప్రస్తుత వేసవి సీజన్లో రాష్ట్రంలో హీట్‌వేవ్ రోజులు తక్కు వగానే ఉంటాయని వాతావరణ శాఖ వివరించింది. గత మూడేళ్లుగా హీట్‌వేవ్ రోజులు తగ్గుతూ వచ్చాయి. 2024 వేసవి సీజన్లో 22 రోజుల పాటు వడగాలులు నమోదు కాగా గతేడాది కేవలం 10 రోజులు మాత్రమే నమోదయ్యాయి. ముందస్తు వర్షాలతో గత వేసవి సీజన్లో వరుసగా చాలా రోజులు వాతావరణం చల్లగా ఉంది. ప్రస్తుత సీజన్లో కూడా హీట్‌వేవ్ ప్రభావం అంతంతమాత్రమేనని, గరిష్టంగా 5 నుంచి 10 రోజుల్లోపై ఉంటుందని వాతావరణ శాఖ నిపుణులు చెబుతున్నారు. నెలవారీగా వర్షపాతం గణాంకాలతో పోలిస్తే ఈసారి ఏప్రిల్–జూన్ నెలల్లో వర్షాలు సాధారణం కంటే ఎక్కువగా ఉంటాయని వాతావరణ శాఖ వివరించింది. ఆదిలాబాద్, నిజామాబాద్ జిల్లాల్లోని కొన్ని ప్రాంతాలు మినహాయిస్తే రాష్ట్రంలోని చాలా ప్రాంతాల్లో సాధారణం, అంతకంటే ఎక్కువ వర్షపాతం ఉంటుంది. బుధవారం రాష్ట్రంలో ఉష్ణోగ్రతలు సాధారణ స్థితిలోనే నమోదయ్యాయి. రాష్ట్రంలోని ప్రధాన నగరాల్లో ఉష్ణోగ్రతలు పరిశీలిస్తే గరిష్ట ఉష్ణోగ్రత ఆదిలాబాద్‌లో 39.3డిగ్రీ సెల్సియస్, కనిష్ట ఉష్ణోగ్రత నల్లగొండలో 21.4డిగ్రీ సెల్సియస్‌గా నమోదైంది. రాష్ట్రంలోని చాలా ప్రాంతాల్లో గరిష్ట ఉష్ణోగ్రతలు సాధారణం కంటే 2డిగ్రీల మేర తక్కువగా నమోదయ్యాయి,. -
ఎండల ఎఫెక్ట్.. ఐఎండీ కీలక ఆదేశాలు
మార్చి నెల ప్రారంభంలోనే భానుడు భగభగలు మండిపోతున్నాయి. దేశవ్యాప్తంగా ఎండల తీవ్రత అధికమైంది. ఈ నేపథ్యంలోనే భారత వాతావరణ శాఖ కీలక హెచ్చరికలు జారీ చేసింది. 12 రాష్ట్రాలకు హీట్‌వేవ్ హెచ్చరికలు జారీ చేసింది. ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించింది.మరోవైపు తెలుగు రాష్ట్రాల్లో సైతం ఎండలు మండిపోతున్నాయి. దీంతో ప్రజలు ఎండ వేడిమికి ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఇప్పుడే ఇలా ఉంటే ఇక వేసవి ఎలా ఉంటుందా అని భయాందోళనలకు గురవుతున్నారు. కాగా నిన్న ఆంధ్రపదేశ్ కర్నూలులో 39.4 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదైంది. నంద్యాల, వైఎస్సార్ కడప, అనంతపురం తదితర ప్రాంతాల్లో సైతం గరిష్ఠ ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. -
హైదరాబాద్ ఐఎండీ ఆఫీస్‌కు బాంబు బెదిరింపు మెయిల్
సాక్షి, హైదరాబాద్: హైదరాబాద్ వాతావరణ శాఖ (ఐఎండీ) కార్యాలయానికి బాంబు బెదిరింపు మెయిల్ రావడంతో కలకలం రేగింది. ఒక్కసారిగా ఉద్యోగులు బయటకు పరుగులు తీశారు. బేగంపేట ఆఫీస్‌లో 14 ఆర్డీఎక్స్ బాంబులను అమర్చినట్లు మెయిల్ రావడంతో పోలీసులు వెంటనే అప్రమత్తమయ్యారు. తనిఖీలు చేపట్టారు. బాంబు లేదని పోలీసుల తేల్చారు. ఇటీవల తెలుగు రాష్ట్రాల్లో హైకోర్టుతో పాటు పలు జిల్లా కోర్టులకు బాంబ్ బెదిరింపులు కలకలం రేపుతున్న సంగతి తెలిసిందే.గత నెలలో రాజమండ్రి జిల్లా కోర్టులో బాంబు ఉందంటూ బెదిరింపు రావడంతో కోర్టు భవనాన్ని ఖాళీ చేయించి డాగ్ స్క్వాడ్ బృందాలతో తనిఖీలు చేపట్టారు. మరోవైపు నాంపల్లి సీబీఐ కోర్డుకు, కరీంనగర్ కోర్టుకు బాంబు బెదింరింపులు రావడంతో పోలీసులు హుటాహుటీన అక్కడికి చేరుకున్నారు. న్యాయవాదులను కోర్టు సిబ్బందిని బయిటకి పంపారు. అనంతరం డాగ్ స్క్వాడ్ బృందాలతో తనిఖీలు చేపట్టారు. అయితే ఇటీవల తరచుగా కోర్టులకు, పాఠశాలలకు బాంబు బెదిరింపులు వస్తున్నాయి. ఇటీవల ఢిల్లీలోని ఓ కోర్టు భవనంలో బాంబు పెట్టామంటూ బెదిరింపులు వచ్చాయి. అంతే కాకుండా తరచుగా విద్యాలయాలకు బెదిరింపులు వస్తున్నాయి. -
ఈసారి సుర్రు! సుర్రు! జాగ్రత్త..
-
ఉత్తరాదికి IMD హెచ్చరిక
-
తెలుగు రాష్ట్రాలకు వాతావరణ శాఖ బిగ్ అలర్ట్
తెలుగు రాష్ట్రాల్లో వాతావరణం ఒక్కసారిగా మారిపోయింది. అల్పపీడన ప్రభావంతో ఆంధ్రప్రదేశ్, తెలంగాణల్లో వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ అంచనా వేస్తోంది. ముఖ్యంగా ఏపీలోని నెల్లూరు, చిత్తూరు జిల్లాలకు ఫ్లాష్‌ఫ్లడ్ హెచ్చరికలు జారీ అయ్యాయి. ఆకస్మిక వరదల నేపథ్యంలో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అధికారులు సూచిస్తున్నారు. నదులు, వాగులు ఉప్పొంగే అవకాశం ఉన్నందున తగిన జాగ్రత్తలు తీసుకోవాలని హెచ్చరించారు.దిత్వా తుపాను (Cyclone Ditwah) ప్రభావంతో నెల్లూరు, చిత్తూరు జిల్లాల్లో ఇప్పటికే భారీ వర్షాలు కురుస్తుండగా, కొన్ని ప్రాంతాల్లో రహదారులు నీటమునిగాయి. రవాణాకు తీవ్ర అంతరాయం కలుగుతోంది. విద్యుత్ సరఫరా కూడా కొన్ని చోట్ల నిలిచిపోయింది. అత్యవసర పరిస్థితుల్లో సహాయక బృందాలు సిద్ధంగా ఉన్నాయని అధికార యంత్రాగం తెలిపింది. ప్రజలు అవసరమైతే మాత్రమే బయటకు రావాలని.. వర్షాల సమయంలో వాగులు, చెరువుల దగ్గరికి వెళ్లకూడదని సూచించారు.గూడురులో భారీ వర్షం కారణంగా.. నాలుగు కాలనీల్లోకి వరద నీరు చేరింది. చిల్లకూరు జాతీయ రహదారిపై వాహనాల రాకపోకలకు ఇబ్బంది కలుగుతోంది. గూడూరు, విందూరులకు పూర్తిగా రాకపోకలకు నిలిచిపోయాయి. పంబలేరు, ఉప్పుటేరు వాగులు పొంగిపొర్లుతున్నాయి. వాకాడు బ్యారేజ్ 8 గేట్లు ఎత్తి నీటిని దిగువకు విడుదల చేశారు.ఇక తెలంగాణలో కూడా వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ అంటోంది. హైదరాబాద్‌తో పాటు ఇతర జిల్లాల్లో మోస్తరు నుంచి భారీ వర్షాలు పడే అవకాశం ఉందని అంచనా వేసింది. రైతులు తమ పంటలను రక్షించుకోవాలని సూచించింది. వర్షాల ప్రభావం వల్ల రవాణా, విద్యుత్ వ్యవస్థల్లో అంతరాయం ఏర్పడే అవకాశం ఉందని అధికారులు హెచ్చరించారు. అదే సమయంలో.. తెలంగాణలో చలి తీవ్రతఈ నెల 9వ తేదీ తర్వాత తెలంగాణ అంతటా చలి తీవ్రత పెరుగుతుందని వాతావరణ శాఖ హెచ్చరించింది. రాత్రి, ఉదయం వేళల్లో ఉష్ణోగ్రతలు గణనీయంగా తగ్గే అవకాశం ఉంది. ప్రజలు తగిన జాగ్రత్తలు తీసుకోవాలని, ముఖ్యంగా శ్వాసకోశ సమస్యలు ఉన్నవాళ్లు, వృద్ధులు, చిన్నపిల్లలు మరింత అప్రమత్తంగా ఉండాలని సూచిస్తున్నారు. -
Cyclone Ditwah: బంగాళాఖాతంలో కొనసాగుతున్న దిత్వా తుపాను
-
దూసుకొస్తున్న దిత్వా తుఫాన్.. రెండు రోజులు భారీ వర్షాలు
-
80 కిలోమీటర్ల దూరంలో ముంచుకొస్తున్న మృత్యువు
-
Heavy Rain: దక్షిణ కోస్తాలో అతిభారీ వర్షాలు పడే అవకాశం
-
ఏపీకి దిత్వా ముప్పు!
విశాఖపట్నం: సెన్యార్ ముప్పు తొలగిందని అనుకునేలోపే మరో తుపాను దూసుకొస్తోంది. దీనికి దిత్వాగా నామకరణం చేశారు. నైరుతి బంగాళాఖాతంలో ఏర్పడిన వాయు గుండం.. శ్రీలంక వైపు కదులుతూ రాగల 12 గంటల్లో తీవ్ర తుపానుగా మారే అవకాశం ఉంది. ఈ నేపథ్యంలో తమిళనాడు, పుదుచ్చేరి, ఆంధ్రప్రదేశ్ తీర ప్రాంతాలను భారత వాతావరణ శాఖ(IMD) అప్రమత్తం చేసింది. దిత్వా ప్రస్తుతం ట్రింకోమలీ(శ్రీలంక)కి 200 కి.మీ, పుదుచ్చేరికి 610 కి.మీ, చెన్నైకి ఆగ్నేయంగా 700 కి.మీ దూరంలో కేంద్రీకృతమై ఉంది. గడిచిన 6 గంటల్లో 15 కి.మీ వేగంతో కదిలింది. ఆదివారం తెల్లవారుజాముకి నైరుతి బంగాళాఖాతం తమిళనాడు, పుదుచ్చేరి, దక్షిణకోస్తా తీరాలకు చేరుకునే అవకాశం ఉంది. ఈ ప్రభావంతో.. ఏపీలో రేపు ఓ మోస్తరు నుంచి భారీ వర్షాలు పడొచ్చని వాతావరణ శాఖ అంచనా వేస్తోంది. శని, ఆదివారాల్లో మాత్రం భారీ నుంచి అతిభారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ చెబుతోంది. తుపాను నేపథ్యంలో దక్షిణకోస్తా, రాయలసీమ జిల్లాల అధికార యంత్రాంగాలు అప్రమత్తం అయ్యాయి. తీరం వెంబడి 80-90 కిలోమీటర్ల వేగంగా ఈదురు గాలులు వీస్తాయని.. తీర ప్రాంత ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించింది. దిత్వా తుపాను నేపథ్యంలో అన్ని పోర్టులలో రెండో ప్రమాద హెచ్చరికలు జారీ చేశారు. మత్స్యకారులను వేటకు వెళ్లొద్దని సూచించారు.మరోవైపు దిత్వా ప్రభావం ఉత్తర తమిళనాడు, పుదుచ్చేరిలపై కూడా ఉండనుంది. దీంతో పలు జిల్లాలకు ఎల్లో అలర్ట్ జారీ చేశారు. ఈ తుపానుకు దిత్వాగా యెమెన్ నామకరణం చేసింది. దీనర్థం పువ్వు అని. -
సైక్లోన్ సెన్యార్: తుఫానుగా బలపడిన తీవ్ర వాయుగుండం
మలక్కా జలసంధి ప్రాంతంలో ఏర్పడిన తీవ్ర వాయుగుండం తుపానుగా బలపడింది. భారత వాతావరణ శాఖ (IMD) అంచనా ప్రకారం.. ఇది వేగంగా ముందుకు కదులుతూ 24 గంటల్లో బలహీనపడే అవకాశం ఉంది. ఈ ప్రభావంతో ఆంధ్రప్రదేశ్ సహా పలు తీర రాష్ట్రాల్లో భారీ వర్షాలు కురవనున్నాయి. ఈ తుపానుగా సెన్యార్గా(Cyclone Senyar) పేరు పెట్టారు.మలక్కా జలసంధి (Strait of Malacca).. దక్షిణ ఆండమాన్ సముద్రం ప్రాంతంలో తక్కువ పీడన ప్రాంతం ఏర్పడిన వాయుగుండం ఈ ఉదయం తుఫానుగా మారింది. మలేషియా జార్జ్‌టౌన్‌కు సుమారు 260 కి.మీ. పశ్చిమ-దక్షిణ పశ్చిమ దూరంలో, నికోబార్ దీవులకు 600 కి.మీ. తూర్పు-దక్షిణ తూర్పున కేంద్రీకృతమై ఉంది. పశ్చిమ దిశగా గంటకు సుమారు 10 కి.మీ. వేగంతో కదులుతోంది. కాగా.. యూఏఈ దీనికి సెన్యార్ అని సూచించింది. దీనర్థం "సింహం" అని.IMD అంచనా ప్రకారం.. సెన్యార్ తుఫాను మొదట పశ్చిమ-దక్షిణ పశ్చిమ దిశగా కదిలి, తర్వాతి 48 గంటల్లో తిరిగి తూర్పు దిశగా మళ్లనుంది. ఇండోనేషియా సమీపంలో తీరం తాకే అవకాశం ఉందని.. 24 గంటలపాటు తుఫాను తీవ్రతను కొనసాగించి, తర్వాత క్రమంగా బలహీనపడనుందని పేర్కొంది.సెన్యార్ ప్రభావంతో.. అండమాన్ & నికోబార్ దీవులు, తమిళనాడు, కేరళ, లక్షద్వీప్, ఆంధ్రప్రదేశ్ తీర ప్రాంతాల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది. తుఫాను ప్రభావంతో తీర ప్రాంతాల్లో బలమైన గాలులు వీచే అవకాశం ఉందని వాతావరణ శాఖ వెల్లడించింది. సముద్రంలో అలలు ఎత్తుగా ఎగసే అవకాశం ఉండటంతో, మత్స్యకారులకు హెచ్చరికలు జారీ అయ్యాయి. -
తెలంగాణను వీడని మోంథా
మోంథా తుపాన్ మొత్తానికి వాయుగుండంగా బలహీనపడింది. సాయంత్రం కల్లా దీని ప్రభావం పూర్తిగా పోతుందని భారత వాతావరణ శాఖ (IMD) పేర్కొంది. అయితే ఈ ప్రభావంతో రాగల కొన్ని గంటల్లో తెలంగాణతో పాటు ఒడిశా, ఛత్తీస్‌గఢ్‌లో భారీ వర్షాలే పడనున్నాయని హెచ్చరిక జారీ చేసింది. ఈ నేపథ్యంలో.. తెలంగాణ ప్రభుత్వం, అధికార యంత్రాగం అప్రమత్తమైంది. తెలంగాణలో మోంథా ఎఫెక్ట్‌తో తేలికపాటి నుంచి భారీ వర్షాలు కురవనున్నాయి. మహబూబాబాద్, వరంగల్, హన్మకొండ, జనగామ, సిద్ధిపేట, యాదాద్రి జిల్లాలకు రెడ్ అలర్ట్ జారీ అయ్యింది. 9 జిల్లాలకు ఆరెంజ్, మరో 9 జిల్లాలకు ఎల్లో అలర్ట్ జారీ చేసింది వాతావరణ శాఖ. పలు జిల్లాల్లో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురవనున్నాయి. 35-45కి.మీ. వేగంతో ఈదురు గాలులు వీస్తాయని హైదరాబాద్ వాతావరణ కేంద్రం తెలిపింది.ఆరు జిల్లాలకు సెలవులు.. భారీ వర్షాల నేపథ్యంతో వరంగల్, సిద్ధిపేట, ములుగు, ఉమ్మడి కరీంనగర్, హన్మకొండ, యాదాద్రి జిల్లాల్లో స్కూళ్లకు ఆయా జిల్లాల కలెక్టర్లు సెలవు ప్రకటించారు. ఫ్లాష్‌ఫ్లడ్ హెచ్చరికజగిత్యాల, నిర్మల్, నిజామాబాద్ జిల్లాలకు ఫ్లాష్‌ఫ్లడ్ హెచ్చరికలు జారీ అయ్యాయి. మోంథా ప్రభావం ఇలా.. మోంథా తుపాను వాయుగుండంగా బలహీనపడింది. భద్రాచలానికి 120కి.మీ... ఖమ్మంకు 180 కి.మీ... ఒడిశా మల్కన్‌గిరికి 130 కి.మీ. వాయుగుండంగా కేంద్రీకృతమైంది. సాయంత్రం కల్లా పూర్తి బలహీనంగా మారిపోనుంది.సీఎం సమీక్షతుఫాను ప్రభావిత జిల్లాల కలెక్టర్లు, ఉన్నతాధికారులతో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఇవాళ వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించనున్నారు. -
తీరం దాటిందని లైట్ తీసుకోకండి.. ఈరోజు కూడా ప్రమాదంలోనే AP..
-
Cyclone Montha: వణికిపోతున్న కాకినాడ ఉప్పాడ బీచ్ లో రాకాసి అలలు
-
APకి మోంథా హెచ్చరిక.. దూసుకొస్తున్న తుఫాన్
-
ముంచుకొస్తున్న సూపర్ సైక్లోన్
-
తెలుగు రాష్ట్రాలకు బిగ్ అలర్ట్.. తీవ్ర తుపానుగా మోంథా
ఆగ్నేయ బంగాళాఖాతంలో నెమ్మదిగా కదులుతూ వాయుగుండంగా క్రమక్రమంగా బలపడుతోంది. రేపటికి తీవ్ర వాయుగుండంగా బలపడి ఆ తరవాత తుఫాన్ గా రూపాంతరం చెందుతుందని భారత వాతావరణ శాఖ చెబుతోంది. ఈ క్రమంలో.. తమిళనాడు, ఆంధ్రప్రదేశ్, పశ్చిమ బెంగాల్, ఒడిషా రాష్ట్రాలను అప్రమత్తం చేసింది. అయితే.. బంగాళాఖాతంలో 27 నాటికి తీవ్ర తుఫాన్ మోంథాగా రూపాంతరం చెందనుంది. ఈ ప్రభావంతో గరిష్టంగా గంటకు 90-110 కిలోమీటర్ల వేగంతో గాలులు వీస్తాయని ఐఎండీ హెచ్చరిస్తోంది. మోంథా ప్రభావంతో.. ఏపీ తీరానికి తీవ్ర తుపాను ఉండే అవకాశం ఉందని, ఈనెల 28న కాకినాడ దగ్గర తీరం దాటుందని తెలిపింది. ప్రస్తుతం.. ప్రస్తుతం పోర్ట్ బ్లెయిర్‌కు పశ్చిమ-నైరుతి దిశలో 420 కి.మీ., విశాఖపట్నంకి పశ్చిమ-నైరుతి దిశలో 990 కి.మీ., చెన్నైకి తూర్పు-ఆగ్నేయంలో 990 కి.మీ., కాకినాడకి ఆగ్నేయంగా 1000 కి.మీ,. గోపాల్పూర్ దక్షిణ-ఆగ్నేయంలో 1040 కి.మీ. కొనసాగుతూ వాయుగుండంగా బలపడుతోంది. ఎల్లుండి ఉదయం నాటికి (27వ తేదీ) నైరుతి, దానికి ఆనుకుని ఉన్న పశ్చిమ-మధ్య బంగాళాఖాతం మీదుగా తుఫానుగా మారే అవకాశం కనిపిస్తోంది. ఈ తుపానుకు థాయ్‌లాండ్ సూచన మేరకు మోంథాగా(Cyclone Montha) నామకరణం చేసిన సంగతి తెలిసిందే. ఈ తుపాన్ ప్రభావంతో ఏపీ, తెలంగాణాల్లో వచ్చే ఐదు రోజులు భారీ వర్షాలు కురవనున్నాయి. దీంతో ఇరు రాష్ట్రాల అధికార యంత్రాంగాలు అప్రమత్తం అవుతున్నాయి. ఉద్యోగులకు సెలవులు రద్దుమోంథా తుఫాన్ హెచ్చరికలతో విశాఖ జిల్లా యంత్రాంగం అప్రమత్తమైంది. ఉద్యోగులకు సెలవులు రద్దు చేస్తూ కలెక్టర్ ఆదేశాలు జారీ చేశారు. వచ్చే మూడు రోజులు ఎంతో కీలకమని.. అప్రమత్తంగా ఉండాలని సూచించారు. జిల్లా, డివిజన్, మండల ,గ్రామ స్థాయి అధికార యంత్రాంగం హెడ్ క్వార్టర్స్ లోనే ఉండాలని.. ఎలాంటి విపత్కర పరిస్థితి ఎదురైనా ఎదుర్కోవడానికి అధికార యంత్రాంగం సిద్ధంగా ఉండాలన్నారు. వేటపై నిషేధం విధిస్తూ మత్స్యకారులకు హెచ్చరికలు జారీ చేశారు. ఇప్పటికీ సముద్రంలోకి వెళ్లి ఉంటే ఒడ్డుకు చేరుకోవడానికి చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు. అధికారులు రిలీఫ్ సెంటర్ల ఏర్పాటుకు సిద్ధంగా ఉండాలన్నారు. ‘‘చెట్లు పడిపోతే వెంటనే తొలగించడానికి ఏర్పాట్లు చేసుకోవాలి. త్రాగునీటికి ఇబ్బందులు రాకుండా అన్ని ముందస్తు జాగ్రత్తలు చేసుకోవాలి. విద్యుత్ సరఫరాకి అంతరాయం కలిగితే వెంటనే పునరుద్ధరించడానికి చర్యలు చేపట్టాలి.జనరేటర్లు,డీజిల్ అందుబాటు లో సిద్ధం గా ఉంచుకోవాలి. ఎన్డీఆర్ఎఫ్, ఎస్డీఆర్ఎఫ్ బృందాలు సిద్ధంగా ఉంచాలి’’ అని అన్నారు. తుఫాను వల్ల భారీ వర్షాలు , పెనుగాలులు వచ్చే అవకాశం ఉన్నందున.. తీర ప్రజలు సురక్షిత ప్రాంతాలకు చేరుకోవాలని, పల్లపు ప్రాంతాల ప్రజలు నీటిని తరలించేందుకు ఏర్పాట్లు చేసుకోవాలని కోరారు. -
దూసుకొస్తున్న వాయుగుండం.. మరికొన్ని గంటల్లో..!
-
తెలంగాణలో ఈ జిల్లాల్లో ఇవాళ, రేపు వానలు, ఏపీలో ఇలా..
తెలుగు రాష్ట్రాల్లో కొన్నిరోజులుగా భిన్నవాతావరణం నెలకొంటోంది. పగలంతా ఎండ ఉంటూ.. సాయంత్రం ఆకస్మికంగా వర్షాలు కురుస్తున్నాయి. ఈ తరుణంలో.. వాతావరణ శాఖ తెలంగాణలోని పలు జిల్లాలకు భారీ వర్ష సూచన చేసింది. ఉపరితల ఆవర్తన ప్రభావంతో.. తెలంగాణలోని 17 జిల్లాలకు ఎల్లో అలర్ట్ జారీ చేసింది(Telangana Yellow Alert). భద్రాద్రి కొత్తగూడెం, ములుగు, భూపాలపల్లి, మహబూబాబాద్, మేడ్చల్, రంగారెడ్డి, సూర్యాపేట జిల్లాల్లో ఇవాళ తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని తెలిసింది. గంటకు 40 కిలోమీటర్ల వేగంతో ఈదుపు గాలులు వీస్తాయని, పిడుగులు పడే అవకాశం ఉందని హెచ్చరించింది. అయితే రేపు మాత్రం మహబూబ్‌నగర్, నల్లగొండ, వరంగల్, సిద్ధిపేట, మేడ్చల్, జనగాం, యాదాద్రి, వికారాబాద్ జిల్లాల్లో భారీ వర్షాలు పడతాయని పేర్కొంది. ఇక రాజధాని హైదరాబాద్ నగరంలో ఇవాళ సాయంత్రం సమయంలో, అలాగే రేపు కుండపోత కురిసే అవకాశముందని(Hyderabad Rains) వాతావరణ శాఖ తెలిపింది. మరోవైపు.. ఏపీలో వాతావరణం దాదాపుగా పొడిగా ఉండొచ్చని ఇక్కడి వాతావరణశాఖ చెబుతోంది. అయితే.. రాయలసీమ ప్రాంతంలో ఉపరితల ఆవర్తనం ప్రభావంతో ఇవాళ భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది(AP Rains News). ఉదయం, సాయంత్రం ఆకస్మిక వర్షాలు పడే అవకాశం ఉన్నట్లు సమాచారం.అక్టోబర్ నెలలో 10+10+11.. అక్టోబర్ నెలలోనూ మొత్తం మూడు దశల్లో వర్షాలు కురవొచ్చని వాతావరణ శాఖ అంచనా వేస్తోంది. అక్టోబర్ 1–10 మధ్య ఉత్తర, తూర్పు తెలంగాణలో భారీ వర్షాలు.. అక్టోబర్ 10–20 మధ్య ఓ మోస్తరు వర్షాలు, అక్టోబర్ 21–31 మధ్య ఈశాన్య రుతుపవనాల ప్రభావంతో మళ్లీ భారీ వర్షాలు పడే అవకాశం ఉందని చెబుతోంది.ఇదీ చదవండి: ఇక నుంచి డిజిటల్ పాస్‌లు -
25న అల్పపీడనం
సాక్షి, హైదరాబాద్: తూర్పు మధ్య బంగాళాఖాతం..దాని సమీపంలోని ఉత్తర బంగాళాఖాతం ప్రాంతంలో ఈ నెల 25న అల్పపీడనం ఏర్పడే అవకాశముందని వాతావరణ శాఖ వెల్లడించింది. ఇది క్రమంగా బలపడి 24 గంటల తర్వాత పశ్చిమ వాయవ్య దిశలో కదిలి.. పశ్చిమ మధ్య బంగాళాఖాతం, దక్షిణ ఒడిశా, ఉత్తరాంధ్ర కోస్తా తీరం సమీపంలో వాయుగుండంగా మారొచ్చు. ఇది దక్షిణ ఒడిశా, ఉత్త రాంధ్ర కోస్తా తీర ప్రాంతంలో ఈ నెల 27వ తేదీ ఉదయంకల్లా తీరాన్ని దాటే అవకాశం ఉన్నట్టు వాతావరణ శాఖ వెల్ల డించింది.ఉత్తర అండమాన్ సముద్ర ప్రాంతంలో ఏర్పడిన ఉపరితల ఆవర్తనం దక్షిణ మహారాష్ట్ర తీరం వరకు కొనసా గుతుంది. ఈశాన్య ఉత్తరప్రదేశ్, సమీప బిహార్ ప్రాంతంలో ఉపరితల చక్రవాత ఆవర్తనం పశ్చిమ విదర్భ వరకు కొనసా గుతుంది. వీటి ప్రభావంతో రానున్న రెండ్రోజులు రాష్ట్రంలోని పలు జిల్లాల్లో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉన్నట్టు వాతావరణ శాఖ స్పష్టం చేసింది.25 శాతం అధిక వర్షపాతం ప్రస్తుత నైరుతి రుతుపవనాల సీజన్ సంతృప్తికర వర్షాలనే నమోదు చేసింది. నైరుతి సీజన్లో ఈనెల 21వ తేదీ నాటికి 69.78 సెంటీమీటర్ల సాధారణ వర్షపాతం నమోదు కావాల్సి ఉండగా, ఇప్పటివరకు 87.44 సెంటీమీటర్ల వర్షం కురిసింది. సాధారణ వర్షపాతం కంటే 25% అధికంగా నమోదైనట్టు రాష్ట్ర ప్రణాళిక శాఖ గణాంకాలు చెబుతున్నాయి. ⇒ నైరుతి సీజన్లో ఇప్పటివరకు మెదక్, నాగర్‌కర్నూల్, యాదాద్రి భువనగిరి, సిద్దిపేట జిల్లాల్లో అత్యధిక వర్షపాతం నమోదు కాగా, 18 జిల్లాల్లో అధిక వర్షపాతం, 11 జిల్లాల్లో సాధారణ వర్షపాతం నమోదైంది. ⇒ మండలాల వారీగా పరిశీలిస్తే... 103 మండలాల్లో అత్యధిక వర్షపాతం, 272 మండలాల్లో అధిక వర్షపాతం, 2,333 మండలాల్లో సాధారణ వర్షపాతం, 13 మండలాల్లో మాత్రం లోటు వర్షపాతం నమోదైంది. ప్రస్తుతం నైరుతి రుతుపవనాల ఉపసంహరణ ప్రక్రియ కొనసాగుతోంది. ఇప్పటికే పంజాబ్, రాజస్తాన్ రాష్ట్రాల్లోని చాలా ప్రాంతాల్లో రుతుపవనాల ఉపసంహరణ పూర్తయ్యింది. ఈ సమయంలో రుతుపవనాల కదలికలు చురుకుగా ఉండడంతో వానలు సైతం భారీగా నమోదయ్యే అవకాశముంది. ఈ నెల 25న తూర్పుమధ్య బంగాళాఖాతంలో అల్పపీడనం ఏర్పడే అవకాశం ఉండడంతో రాష్ట్రంలోనూ భారీ వర్షాల నమోదుకు అవకాశం ఉందని వాతావరణ శాఖ సూచించింది. -
తెలంగాణలో రేపు ఈ జిల్లాల్లో భారీ వర్షాలు
సాక్షి, హైదరాబాద్: ఉపరితల ఆవర్తనం, ద్రోణి ప్రభావంతో రేపు(సెప్టెంబర్ 21, ఆదివారం) తెలంగాణ అంతటా భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ కేంద్రం ప్రకటించింది. పలు జిల్లాల్లో కుండపోత తప్పదంటూ శనివారం ఒక ప్రకటన విడుదల చేసింది. అందులో.. మహబూబ్‌నగర్, కామారెడ్డి, సంగారెడ్డి, వికారాబాద్, మహబూబాబాద్, కొత్తగూడెం, సిరిసిల్ల, జగిత్యాల, నిజామాబాద్, ఆదిలాబాద్ జిల్లాల్లో భారీ వర్షాలు కురుస్తాయని పేర్కొంది. ఉరుములు, పిడుగులతో కుంభవృష్టి కురిసే అవకాశం ఉందని హెచ్చరించింది. ఇక హైదరాబాద్ వాతావరణ కేంద్రం ప్రకారం.. ఉపరితల ఆవర్తనం (surface circulation) ప్రభావంతో.. వాతావరణంలో విపరీతమైన మార్పులు చోటు చేసుకుంటున్నాయి. ఉదయం నుంచి ఎండలు దంచి కొడుతూ.. సాయంత్రం సమయంలో వర్షాలు కురుస్తున్నాయి.ఐంఎడీ అంచనా ప్రకారం ఈ నెలలో సాధారణం కంటే 109% అధిక వర్షపాతం నమోదయ్యే అవకాశం ఉంది. దీంతో రాగల 10 రోజులూ ఈ తరహా వర్షాలు తప్పవని, ఇవి ఆకస్మిక వరదల ముప్పు దారి తీయొచ్చని హెచ్చరిస్తోంది. -
హైదరాబాద్‌లో దంచికొడుతున్న వర్షం
సాక్షి,హైదరాబాద్: హైదరాబాద్‌లో మరోసారి వర్షం దంచికొడుతోంది. గురువారం (సెప్టెంబర్ 18) నగరంలో పలు ప్రాంతాల్లో నిమిషాల వ్యవధిలో విరుచుకుపడ్డ వాన ధాటికి నగర జీవనం కకావికలమైంది. గంటల వ్యవధిలోనే రికార్డు స్థాయి వర్షపాతం నమోదైంది.జూబ్లీహిల్స్, బంజారాహిల్స్, పంజాగుట్ట, యూసుఫ్‌గూడ, ఫిల్మ్‌నగర్, మాదాపూర్, సరూర్‌నగర్, మారేడ్‌పల్లి, ఉప్పల్, సుల్తాన్‌బజార్, కోఠి, అబిడ్స్, నాంపల్లి, రాణిగంజ్, ముషీరాబాద్, చిక్కడపల్లి, మణికొండ, షేక్‌పేట, రాయదుర్గంలో వర్షం బీభత్సం సృష్టిస్తోంది. ఫలితంగా రోడ్లపై ఎక్కడికక్కడ వర్షపు నీరు నిలిచిపోయి..నగర రోడ్లు చెరువులను తలపిస్తున్నాయి. ఆఫీస్‌ల నుంచి ఇంటికి వచ్చే సమయం కావడంతో ప్రధాన రహదారులపై ట్రాఫిక్ స్తంభించింది.భారీ వర్షానికి లోతట్టు ప్రాంతాల్లో భారీగా వరదనీరు చేరింది. మోకాళ్లలోతులో నీరు నిలిచిపోయింది. పలు కాలనీల్లో మోటార్ల ద్వారా నీటిని బయటకు పంపుతున్నారు. ఇళ్లలోని వస్తువులు, నిత్యావసరాలు తడిచిపోయాయని స్థానికులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ప్రజలు ఇంటి నుంచి బయటకు రాలేక తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. -
హైదరాబాద్‌లో కుండపోత వాన
సాక్షి,హైదరాబాద్: నగరంలో కుండపోత వాన కురుస్తోంది. వర్షం ధాటికి లోతట్టు ప్రాంతాలు జలమయమయ్యాయి. పలు ప్రాంతాల్లో ట్రాఫిక్ అంతరాయం కలిగింది. ఉప్పల్ టూ వరంగల్ రహదారి మార్గంలో ట్రాఫిక్ జామ్ కావడంతో వాహనదారులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు.ఆదివారం సాయంత్రం నుంచి మాదాపూర్, బంజారాహిల్స్, జూబ్లీహిల్స్, ఎల్బీనగర్, ఉప్పల్, హయత్‌నగర్, టోలీచౌకీ, మియాపూర్, అమీర్‌పేట్, పంజాగుట్ట, అబ్ధుల్లాపూర్‌మెట్, పెద్దఅంబర్పేట్లలో భారీ వర్షపాతం నమోదైంది. కుషాయిగూడా, కాప్రా, ఏఎస్రావు నగర్, చర్లపల్లి, ముషీరాబాద్, చిక్కడపల్లి, నారాయాణగూడ, అంబర్పేట్, నల్లకుంటలలో వర్ష పడుతోంది. దీంతో రోడ్లన్నీ జలమయం అయ్యాయి. కొన్ని చోట్ల లోతట్టు ప్రాంతాల్లోకి వరద నీరు చేరింది. -
తెలంగాణలోని కొన్ని జిల్లాల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు
-
రోజుకు 54,794 పిడుగులు!
వర్షం పడుతోందంటే మెరుపులు, పిడుగులు పడడం సహజం. పిడుగు శబ్దం ఎలా ఉంటుందో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. కిలోమీటర్ల దూరంలో పడ్డా మన పక్కనే పడినట్టు ఉంటుంది. 2024–25లో ఇలా మనదేశంలో ఎన్ని పిడుగులు పడ్డాయో తెలుసా? 2 కోట్లకుపైగానే! అంటే రోజుకు సగటున 54,794! 2025–26లో జూలై 30 నాటికి దేశ వ్యాప్తంగా పిడుగుల వల్ల 1,626 మంది మనుషులు, 52,367 మూగజీవాలు ప్రాణాలు కోల్పోయాయి.ఒక డిగ్రీ సెల్సియస్ ఉష్ణోగ్రత పెరిగితే తేమ 7 శాతం పెరుగుతుంది. ఫలితంగా పిడుగులు 10–12 శాతం పెరుగుతాయని అధ్యయనాలు చెబుతున్నాయి. భారత్‌లో వేసవికాలంలో భానుడి ప్రతాపం, అలాగే అరేబియా సముద్రం, బంగాళాఖాతం వేడెక్కడం వంటివి కూడా పిడుగులకు అనువైన పరిస్థితులు సృష్టిస్తున్నాయి. బంగాళాఖాతం సముద్ర ఉపరితల ఉష్ణోగ్రతలు 4 డిగ్రీలు పెరిగిందని, తూర్పు రాష్ట్రాల్లో తుపాన్లకు కారణమయ్యే తేమకు ఆజ్యం పోస్తున్నాయని క్లైమేట్ రెసీలియెంట్ అబ్జర్వింగ్ సిస్టమ్స్ ప్రమోషన్ కౌన్సిల్ (సీఆర్‌ఓపీసీ) వ్యవస్థాపకులు సంజయ్ శ్రీవాస్తవ వెల్లడించారు. పర్యావరణ విపత్తుల వల్ల కలిగే నష్టాలను తగ్గించేందుకు పనిచేస్తున్న స్వచ్ఛంద సంస్థ ఇది.46 శాతం పిడుగుపాటు మరణాలే!ఈ ఏడాది ఏప్రిల్–జూలై మధ్య వర్షాలు, పిడుగుల కారణంగా దేశవ్యాప్తంగా 1,626 మంది మరణించారని కేంద్ర హోంశాఖ ఇటీవల రాజ్యసభలో వెల్లడించింది. 1967 నుంచి 2020 వరకు పిడుగుపాటుతో భారత్‌లో 1,01,000 మంది మరణించారని నేషనల్ క్రైమ్ రికార్డ్స్ బ్యూరో (ఎన్ సీఆర్బీ) డేటా చెబుతోంది. 2002–24 మధ్య దేశంలో వాతావరణ సంబంధ మరణాలలో దాదాపు 46 శాతం పిడుగుల వల్ల సంభవించాయని ఎన్సీఆర్బీ తెలిపింది. ఐఎండీ, సీఆర్‌ఓపీసీ ప్రకారం 2019–20లో 51.7 లక్షల పిడుగుపాటు సంఘటనలు నమోదయ్యాయి. 2024–25లో ఈ సంఖ్య 2 కోట్లకుపైగా పెరిగింది.ముందస్తు హెచ్చరికలుఐఎండీ ప్రస్తుతం 86 శాతం కచ్చితత్వంతో పిడుగులను అంచనా వేస్తోంది. పిడుగులు పడే అవకాశం ఉందని అయిదు రోజుల ముందే హెచ్చరిస్తోంది. జిల్లాల పేర్లను రెండు రోజుల ముందుగా వెల్లడిస్తోంది. ప్రమాదం సంభవించే అవకాశం ఉన్నరోజున ప్రభావిత ప్రాంతాల వివరాలతో ప్రతి మూడు గంటలకు హెచ్చరికలు జారీ చేస్తోంది. ఐఎండీ, ఐఐటీ మద్రాస్ భాగస్వామ్యంతో పిడుగులు అధికంగా పడే ప్రాంతాలను సీఆర్‌ఓపీసీ గుర్తించింది. ముప్పు నివారణ ప్రణాళికలో భాగంగా దామినీ యాప్, వాట్సాప్ గ్రూప్స్ ద్వారా పంచాయతీ నియమించిన భద్రతా సమన్వయకర్తలకు రియల్–టైమ్ హెచ్చరికలను పంపుతున్నారు. జాతీయ పిడుగుపాటు నష్టనివారణ కార్యక్రమం కింద హెచ్చరికల కోసం మైక్రోఫోన్స్, సీసీటీవీ కెమెరాలు, లౌడ్‌స్పీకర్లతో కూడిన స్మార్ట్ స్తంభాలను గ్రామీణ ప్రాంతాల్లో ఏర్పాటు చేస్తున్నారు. తాటి చెట్లను నాటడం మొదలు అనేక అవగాహన ప్రచారాలు కూడా చేపట్టారు. పట్టణ ప్రాంతాల్లోనూ..నగరవాసులు కమ్యూనికేషన్ సిస్టమ్స్ వంటి విద్యుదయస్కాంత మౌలిక సదుపాయాలను ఎక్కువగా వాడుతున్నారని ఇది పిడుగు ప్రమాదాన్ని పెంచుతుందని భారత వాతావరణ శాఖ (ఐఎండీ) డైరెక్టర్ జనరల్ మృత్యుంజయ మహపాత్ర చెబుతున్నారు. కాంక్రీట్, తారు, గాజు వంటివి వేడిని గ్రహించి, ప్రసరింపజేయడం వల్ల కలిగే ఉష్ణ ప్రభావం నగరాలను గ్రామీణ ప్రాంతాల కంటే వేడిగా మారుస్తోందట. ఈ పరిస్థితులు పిడుగుపాట్లకు దారితీస్తున్నాయట.విమానయాన సంస్థలకు..వర్షాకాలంలో పిడుగుపాట్ల వల్ల ఏటా దాదాపు 2,000 విమానాలను దారి మళ్లిస్తున్నారు. దీనివల్ల విమానయాన సంస్థలకు ఏటా సుమారు రూ.300 కోట్ల నష్టం వాటిల్లుతోందట. -
ఏపీలో పలుచోట్ల భారీ వర్షాలు పడే చాన్స్!
విజయవాడ: ఏపీలో పలు చోట్ల మోస్తరు నుంచి భారీ వర్షాలు పడే అవకాశం ఉందని రాష్ట్ర విపత్తుల నిర్వహణ సంస్థ స్పష్టం చేసింది. ఉపరితల ఆవర్తన ప్రభావంతో ఏపీలో మూడు రోజులు పిడుగులతో కూడిన మోస్తరు నుంచి భారీ వర్షాలు పడతాయని తెలిపింది. ఏలూరు, ఎన్టీఆర్, గుంటూరు, బాపట్ల, పల్నాడు, అల్లూరి సీతారామరాజు జిల్లాల్లో పలు చోట్ల భారీ వర్షాలు పడే అవకాశం ఉన్నట్లు విపత్తుల నిర్వహణ సంస్థ మేనేజింగ్ డైరెక్టర్ ప్రఖర్ జైన్ తెలిపారు. మిగతా జిల్లాల్లో కొన్ని చోట్ల తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు పడే అవకాశం ఉందన్నారు. ఎల్లుండి నుంచి మత్స్యకారులు వేటకు వెళ్లరాదన్నారు. ప్రజలు చెట్ల క్రింద శిథిలావస్థలో ఉన్న భవనాలు, హోర్డింగ్స్ వద్ద ఉండరాదన్నారు. తీరం వెంబడి 40 నుంచి 60 కి.మీ వేగంతో ఈదురుగాలులు వీచే అవకాశం ఉందన్నారు. దీన్ని దృష్టిలో పెట్టుకుని ప్రజలు అప్రమత్తంగా ఉండాలన్నారు. -
బలపడుతున్న ఉపరితల ఆవర్తనం
సాక్షి, అమరావతి/సాక్షి, విశాఖపట్నం: వాయవ్య బంగాళాఖాతంలో ఒడిశా, పశ్చిమ బెంగాల్ తీరాలపై కొనసాగుతున్న ఉపరితల ఆవర్తనం బలపడనుందని వాతావరణ శాఖ తెలిపింది. దీని ప్రభావంతో బుధవారం అల్పపీడనం ఏర్పడే అవకాశం ఉందని వెల్లడించింది. ఉపరితల ఆవర్తనంతో ఉత్తరాంధ్రలోని పలు జిల్లాల్లో ఇప్పటికే పలుచోట్ల భారీ వర్షాలు పడుతుండగా మరో మూడు రోజులు అవి కొనసాగుతాయని పేర్కొంది.దీంతోపాటు కోస్తాంధ్ర, రాయలసీమల్లోనూ అక్కడక్కడ వానలు పడే అవకాశం ఉందని వివరించింది. సోమవారం శ్రీకాకుళం, పార్వతీపురం మన్యం, విజయనగరం జిల్లాల్లో పలుచోట్ల భారీ వర్షాలు కురిశాయి. శ్రీకాకుళం జిల్లా నందిగం మండలం మదనపురంలో 3.6 సెంటీమీటర్ల వర్షం కురిసింది. అదే మండలంలోని నందిగంలో 2.7 సెంటీమీటర్ల వర్షం పడింది. పార్వతీపురం జిల్లా గుమ్మలక్ష్మీపురం, శ్రీకాకుళం జిల్లా పాలకొండలో రెండు సెంటీమీటర్ల వర్షం కురిసింది.వచ్చే మూడు రోజులు ఉత్తరాంధ్రలో అక్కడక్కడ మోస్తరు నుంచి భారీ వర్షాలు, మిగతా జిల్లాల్లో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉన్నట్లు విపత్తుల నిర్వహణ సంస్థ తెలిపింది. 40 నుంచి 50 కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలులు వీస్తాయని పేర్కొంది. మంగళవారం శ్రీకాకుళం, విజయనగరం, పార్వతీపురం మన్యం, అల్లూరి సీతారామరాజు, విశాఖపట్నం, అనకాపల్లి జిల్లాల్లో అక్కడక్కడా మోస్తరు నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వెల్లడించింది.కాకినాడ, అంబేద్కర్ కోనసీమ, తూర్పుగోదావరి, పశ్చిమగోదావరి, ఏలూరు, కృష్ణా, ఎనీ్టఆర్, గుంటూరు జిల్లాల్లో పలుచోట్ల తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు, మిగిలిన జిల్లాల్లో అక్కడక్కడ తేలికపాటి వర్షాలు పడతాయని పేర్కొంది. బుధవారం విశాఖపట్నం జిల్లాల్లో అక్కడక్కడా మోస్తరు నుంచి భారీ వర్షాలు శ్రీకాకుళం, విజయనగరం, పార్వతీపురం మన్యం, అల్లూరి సీతారామరాజు, అనకాపల్లి, కాకినాడ, కోనసీమ, తూర్పుగోదావరి, పశ్చిమగోదావరి, ఏలూరు, కృష్ణా, ఎనీ్టఆర్, గుంటూరు, బాపట్ల జిల్లాల్లో పలుచోట్ల తేలికపాటి వర్షాలు కురుస్తాయని తెలిపింది. సముద్రం అల్లకల్లోలంగా మారే అవకాశం ఉన్నందున ఈ నెల 27 వరకూ ఉత్తరాంధ్ర జిల్లాల్లోని మత్స్యకారులు వేటకు వెళ్లరాదని వాతావరణ అధికారులు హెచ్చరించారు. -
ఏపీకి భారత వాతావరణశాఖ తీవ్ర హెచ్చరిక
విశాఖపట్నం: ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాలతో ఆంధ్రప్రదేశ్ అతలాకుతలం అవుతోంది. పలు జిల్లాల్లో ఇప్పటికే వాగులు, వంకలు పొంగిపొర్లి రాకపోకలు స్తంభించిపోయాయి. ఈ తరుణంలో గురువారం భారత వాతావరణశాఖ ఏపీకి తీవ్ర హెచ్చరికలు జారీ చేసింది.రాబోయే 24 గంటల్లో రాష్ట్రంలోని పలు జిల్లాలకు ఆకస్మిక వరద (ఫ్లాష్ ఫ్లడ్) ముప్పు పొంచి ఉందని భారత వాతావరణ విభాగం తెలిపింది. తూర్పుగోదావరి, గుంటూరు, కృష్ణా, పశ్చిమగోదావరి, కేంద్ర పాలిత ప్రాంతం యానాంకు ఈ హెచ్చరికలు జారీ చేసింది. మరో వైపు బంగాళాఖాతంలో కొనసాగుతున్న అల్పపీడనం శుక్రవారం మరింత బలపడి అల్పపీడనంగా మారే అవకాశముందని తెలుస్తోంది.పశ్చిమ మధ్య వాయవ్య బంగాళాఖాతంలో కొనసాగుతున్న అల్పపీడనం.. పశ్చిమ వాయవ్య దిశగా ఉత్తరాంధ్ర ఒడిశా వైపు కదిలే అవకాశముందని విశాఖ వాతావరణ శాఖ అంచనా వేస్తోంది. దీని ప్రభావంతో రాగల వారం రోజుల పాటు కోస్తాంధ్రలో వర్షాలు పడే అవకాశముందని వాతావరణకేంద్రం అధికారి జగన్నాథ్ కుమార్ తెలిపారు.ఏపీ వ్యాప్తంగా గురువారం పలుజిల్లాలో భారీ వర్షాలు కొనసాగాయి. విజయవాడ ప్రకాశం బ్యారేజీ వద్ద ఎగువ నుంచి వరదలతో అధికారులు అప్రమత్తమయ్యారు. బ్యారేజీ వద్ద 4 లక్షల క్యూసెక్కులకు పైగా వరద ప్రవాహం వచ్చి చేరుతోంది. దీంతో ఒకటో నంబర్ ప్రమాద హెచ్చరిక జారీ చేశారు. గడిచిన 24 గంటల్లో ఏలూరులో 22, ముమ్మిడివరంలో 18, అమలాపురంలో 13 సెంటీమీటర్ల వర్షపాతం నమోదైంది. కళింగపట్నం, విశాఖ, కాకినాడ, మచిలీపట్నం పోర్టుల్లో ప్రమాద సూచికను ఏగురవేశారు. వరద నీటిలో ఈతకు వెళ్లడం, చేపల వేటకు వెళ్లవద్దని సూచించారు. -
ఏపీలో మళ్లీ భారీ వర్షాలు.. ఆ జిల్లాలకు వార్నింగ్
సాక్షి,విశాఖ: ఏపీకి వాతావరణ శాఖ హెచ్చరిక జారీ చేసింది. ఆదివారం (ఆగస్ట్10) రాష్ట్రంలో పలు జిల్లాలో భారీ వర్షాలు పడే అవకాశం ఉందని అంచనా వేసింది. ఇందులో భాగంగా రాయలసీమ, దక్షిణ కోస్తా జిల్లాలకు ఎల్లో అలెర్ట్ జారీ చేసింది. పల్నాడు, ప్రకాశం ,కర్నూలు, అనంతపురం, అన్నమయ్య , వైఎస్సార్ ,నంద్యాల జిల్లాల్లో మోస్తారు నుంచి భారీ వర్షాలు పడే అవకాశం ఉందని తెలిపింది. 30 నుంచి 40కి.మీ వేగంతో గాలువు వీస్తాయని వాతావరణ శాఖ వెల్లడించింది. -
హైదరాబాద్‌లో మరికాసేపట్లో అతిభారీ వర్షం
సాక్షి, హైదరాబాద్: నగరానికి వాతావరణ శాఖ హెచ్చరిక జారీ చేసింది. మంగళవారం సాయంత్రం భారీ నుంచి అతిభారీ వర్షం కురవొచ్చని అంచనా వేస్తోంది. ఈ క్రమంలో అధికార యంత్రాంగం అప్రమత్తమైంది. ఆఫీసులు, పనులు ముగిసే వేళలో వర్షం కురిసే అవకాశం ఉండడంతో ప్రజలూ అప్రమత్తంగా ఉండాలని సూచించింది. మరోవైపు.. తెలంగాణలో పలు జిల్లాల్లో ఓ మోస్తరు నుంచి భారీ వర్షాలు కురుస్తున్నాయి. రాగల మూడు రోజులు భారీ వర్షాలు తప్పవని వాతావరణ శాఖ ఇదివరకే హెచ్చరికలు జారీ చేసింది. -
నేడు భారీ నుంచి అతిభారీ వర్షం.. మంత్రి పొన్నం విజ్ఞప్తి
హైదరాబాద్‌కు వాతావరణ శాఖ బిగ్ అలర్ట్ జారీ చేసింది. ఇవాళ (శనివారం) భారీ నుంచి అతి భారీ వర్షం తప్పదని హెచ్చరికలు జారీ చేసింది. శుక్రవారం ఏకధాటిగా నాలుగు గంటలపాటు కురిసిన వానతో నగరంలో పలుప్రాంతాలు నీట మునిగిన సంగతి తెలిసిందే. దీంతో అధికార యంత్రాంగం అప్రమత్తమైంది.ఇప్పటికే జలదిగ్బంధంలో ఉన్న ప్యాట్నీ సింధీ కాలనీలో బోట్ల సాయంతో అధికారులు సహాయక చర్యలు చేపట్టారు. కంటోన్మెంట్ సిబ్బంది మోటార్ల సహాయంతో నీళ్లను తొలగిస్తున్నారు. నాలా రిటైనింగ్ వాల్ కట్టకపోవడంతోనే ఇళ్లలోకి వర్షపు నీరు చేరినట్లు స్థానికులు చెబుతున్నారు. ఇక హైదరాబాద్ వర్షాలపై హుస్నాబాద్ ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో మంత్రి పొన్నం ప్రభాకర్ శనివారం మీడియాతో మాట్లాడారు. ‘‘హైదరాబాద్‌లో లోతట్టు ప్రాంతాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని విజ్ఞప్తి చేస్తున్నా. వర్షాలపై సీఎం ఎప్పటికప్పుడు పర్యవేక్షణ జరుపుతున్నారు. లోతట్టు ప్రాంతాలపై ఎక్కడైనా ఇబ్బందులుంటే వెంటనే అధికారుల దృష్టికి తీసుకురండి. ఇప్పటికే జీహెచ్ఎంసీ కమిషనర్, జిల్లా కలెక్టర్, హైడ్రా కమిషనర్ , పోలీస్ కమిషనర్, వాటర్ వర్క్ ఇతర అధికారులను అప్రమత్తం చేస్తూ వారితో మాట్లాడడం జరిగింది.. హైదరాబాద్ నగరానికి సంబంధించి నీళ్లు ఎక్కడ నిల్వ లేకుండా సిబ్బంది వెంట వెంటనే తొలగిస్తున్నారు. మొత్తం 141 వాటర్ లాగింగ్ పాయింట్స్ పై అధికారులు సమన్వయం చేసుకుంటూ అక్కడ ఇబ్బందులు లేకుండా చూసుకున్నాం. జీహెచ్ఎంసీ ,రెవెన్యూ , పోలీస్ అధికారులు ప్రజల ఇబ్బందులు వస్తె పరిష్కారం చేయడానికి సిద్ధంగా ఉన్నారు. ప్రజలు ధైర్యంగా ఉండాలి ఏదైనా విపత్తు వస్తె అధికారులకు వెంటనే తెలియజేయాలి’’ అని పొన్నం నగరవాసులను కోరారు.మరోవైపు.. భారీ వర్షాల దృష్ట్యా అధికారులు అప్రమత్తంగా ఉండాలని సీఎం రేవంత్‌రెడ్డి ఇప్పటికే ఆదేశించారు. సమన్వయంతో పని చేయాలని సూచించారు. ప్రజల ఫిర్యాదులకు వెంటనే స్పందించి చర్యలు చేపట్టాలన్నారు. -
ఢిల్లీలో దంచికొట్టిన వాన
ఢిల్లీలో బుధవారం సాయంత్రం వాతావరణం మారిపోయింది. నగరంతో పాటు శివారులో కుండపోత భారీ వర్షం కురిసింది. దీంతో రోడ్లపై నీరు నిలిచిపోయి.. భారీగా ట్రాఫిక్ జామ్ అయ్యింది. పని వేళలు ముగిసే సమయం కావడంతో నగర వాసులు తీవ్ర ఇబ్బందులు పడ్డారు. భారీ వర్షం పడొచ్చని చెబుతూ వాతావరణ శాఖ(IMD) రెడ్ అలర్ట్ జారీ చేసింది. ప్రజలు అప్రమత్తంగా ఉండాలని, అవసరమైతేనే బయటకు రావాలని ఢిల్లీ అధికార యంత్రంగాణం పలు సూచనలు జారీ చేసింది. #WATCH | Heavy rain lashes parts of Delhi. Visuals from the GRG Road, which is waterlogged. pic.twitter.com/EOVN69XZRQ— ANI (@ANI) July 9, 2025నగర వ్యాప్తంగా పలు అండర్‌పాస్‌లను మూసేస్తున్నట్లు చెబుతూ.. ఆ వైపుగా వెళ్లే వాళ్లు జాగ్రత్తగా ఉండాలని తెలిపింది. భారీ వర్షం నేపథ్యంలో వాహనదారులు అప్రమత్తంగా ఉండాలని కోరింది.అందుకు తగ్గట్లే నగరంలో పలు చోట్ల భారీ వర్షం పడింది.#WATCH | Heavy rain lashes parts of Delhi, visuals near Kartavya Path. pic.twitter.com/vPgcg2iuiU— ANI (@ANI) July 9, 2025VIDEO | Delhi: Heavy rain lashes parts of the national capital, bringing relief from heat. Visuals from Constitution Club. (Full video available on PTI Videos - https://t.co/n147TvqRQz)#Delhi pic.twitter.com/vsrcgn1i7Q— Press Trust of India (@PTI_News) July 9, 2025 -
ఏపీకి ఐఎండీ బిగ్ అలర్ట్
సాక్షి, విశాఖపట్నం: ఏపీకి భారత వాతావరణ శాఖ బిగ్ అలర్ట్ జారీ చేసింది. వచ్చే వారం రోజులు వాతావరణం అల్లకల్లోలంగా ఉంటుందని చెబుతూ.. ఉత్తరాంధ్రకు భారీ వర్ష సూచన చేసింది. అదే సమయంలో దక్షిణ కోస్తాలోనూ విస్తారంగా వర్షాలు పడతాయని తెలిపింది. ఉత్తర ఒడిశాను అనుకుని ఉన్న బంగాళాతంలో ఉపరితల ఆవర్తనం బలంగా కొనసాగుతోంది. రుతుపవనాల పురోగతికి మారిన వాతావరణం అనుకూలంగా మారింది. ఈ నేపథ్యంలోనే భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ తెలిపింది. ప్రస్తుతం ఒడిశాలోని గోపాల్ పూర్ వరకు నైరుతి విస్తరించి ఉంది. తీరం వెంబడి ఇప్పటికే గరిష్టంగా 40కి.మీ వేగంతో గాలులు వీస్తున్నాయి. ఆవర్తన ప్రభావంతో పాతపట్నంలో 5, పార్వతీపురంలో 5 ,టెక్కలి.. సాలూరు.. శ్రీకాకుళం.. ఆనందపురంలో 4, విజయనగరం, కళింగపట్నం. అనకాపల్లిలో 3 సెంమీ చొప్పున వర్షపాతం నమోదు అయ్యింది. -
మునిగిన ముంబై.. అండర్ గ్రౌండ్ మెట్రో స్టేషన్‌ను ముంచెత్తిన వరద నీరు.. వీడియో వైరల్
ముంబై: ముంబై మునిగింది. దేశ ఆర్థిక రాజధాని వర్షాలతో అతలాకుతలమైంది. నైరుతి రుతు పవనాల ప్రభావంతో రాత్రి నుంచి ముంబైలో వర్షాలు కురుస్తున్నాయి. దీంతో ముంబై మహానగరానికి వాతావరణ శాఖ రెడ్ అలెర్ట్ జారీ చేసింది. కుండపోతవానకు నగరం నరకంలా మారింది. రవాణా స్తంభించి పోయింది.రోడ్లు చెరువుల్లా మారడంతో వాహనదారులు తీవ్రంగా ఇబ్బంది పడుతున్నారు. ప్రధాన కూడళ్లలో భారీ ఎత్తున ట్రాఫిక్ నిలిచిపోయింది. ట్రాక్‌లపైకి వాన నీరు చేరడంతో రైల్వే సర్వీసుల్లో అంతరాయం ఏర్పడింది. మే 10న ప్రారంభమైన వర్లీ మెట్రో స్టేషన్‌కు వరదనీరు పోటెత్తింది. ఆ దృశ్యాలు సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి. ట్రైన్ వచ్చే వరకు, వచ్చిన తర్వాత ట్రైన్ లోపలికి వెళ్లేందుకు వినియోగించే స్టేషన్ గేట్ల వరకు మాత్రమే కాకుండా ప్లాట్‌ఫామ్‌లను నీరు ముంచెత్తింది. వెలుగులోకి వచ్చిన ఆ వీడియోల్లో ప్లాట్ ఫామ్ పూర్తిగా బురద నీటితో నిండిపోయి ఉండటాన్ని చొడొచ్చు.Newly inaugurated Worli underground metro station of Aqua line 3 submerged in water this morning. #MumbaiRain pic.twitter.com/D0gwopOXBE— Tejas Joshi (@tej_as_f) May 26, 2025 అంతేకాదు, మెట్రో లోపల తీసిన మరో వీడియోలో పైకప్పులో లీకేజీ కారణంగా ప్లాట్‌ఫారమ్‌పై నుండి నీరు ప్రవహించింది. భారీ ఎత్తున నీరు నిలిచిపోవడంతో మెట్రోసర్వీసులకు ఆటంకం ఏర్పడింది. అయితే, అండర్ గ్రౌండ్ మెట్రో స్టేషన్లో వరదకు కారణం డ్రైనేజీ వ్యవస్థ సరిగ్గా లేకపోవడమే కారణమని తెలుస్తోంది. ముంబై మూడు లైన్ల అండర్‌గ్రౌండ్ మెట్రోస్టేషన్‌ను బాంద్రా-కుర్లా కాంప్లెక్స్ (BKC) నుండి వర్లిలోని ఆచార్య అత్రే చౌక్ వరకు సేవల్ని అందిస్తోంది. ఈ మెట్రో సేవలు ఈ నెల ప్రారంభంలో మే 10న అందుబాటులోకి వచ్చాయి. ఇటీవలే ప్రారంభమైన మెట్రోస్టేషన్‌ను వరద నీరు ముంచెత్తడంతో మౌలిక సదుపాయాల గురించి ప్రశ్నలు తలెత్తాయి. -
నైరుతి రుతుపవనాల ఎఫెక్ట్.. తెలుగు రాష్ట్రాల్లో భారీ వర్షాలు
సాక్షి,హైదరాబాద్: తెలుగు రాష్ట్రాలకు వాతావరణ శాఖ హెచ్చరికలు జారీ చేసింది. రానున్న నాలుగు రోజుల పాటు విస్తారంతో పాటు,భారీ ఎత్తున వర్షాలు కురిసే అవకాశం ఉందని తెలిపింది. ఈ ఏడాది తెలంగాణలో ఈసారి 13 రోజులు ముందుగానే నైరుతి రుతుపవనాలు ప్రవేశించాయి. ఫలితంగా నేటి నుంచి నాలుగు రోజులు వర్షాలు కురిసే అవకాశం ఉందని అంచనా వేసింది. వికారాబాద్, సంగారెడ్డి, మెదక్, కామారెడ్డి ,మహబూబ్ నగర్, నాగర్ కర్నూల్ ,వనపర్తి, నారాయణపేట, జోగులాంబ గద్వాల్ జిల్లాల్లో భారీ ఎత్తున వర్షాలు పడనుండగా.. గంటకు 30 నుంచి 40 కిలోమీటర్ల వేగంతో ఈదురు గాలులతో కూడిన వర్షాలు అక్కడక్కడా కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ అధికారులు వివరించారు. ఈదురు గాలులతో పాటు పిడుగులు పడే అవకాశం ఉండడంతో రైతులు అప్రమత్తంగా ఉండాలని సూచించారు. 🌩️ Active Weather Alert for Monday🌧️From Mumbai to Madurai and Dibrugarh to Visakhapatnam, thunderstorms and showers are on the move! ⚡☁️Stay prepared and keep your umbrellas handy! ☔#WeatherUpdate #RainAlert pic.twitter.com/RiWQSHRxeE— Weather & Radar India (@WeatherRadar_IN) May 26, 2025ఇటు ఆంధ్రప్రదేశ్‌లోనూ నైరుతి రుతు పవనాలు విస్తరించాయి. వారం రోజులు ముందే రాష్ట్రాన్ని నైరుతి పలకరించింది. రాష్ట్రంలో ఆవరించిన ఉపరితల ద్రోణి ఛత్తీస్ ఘడ్ వరకు వ్యాపించి ఉంది.దీంతో రాగల 24 గంటల్లో పశ్చిమ మధ్య బంగాళాఖాతంలో అల్ప పీడనం ఏర్పడే అవకాశం ఉంది. ఆ సమయంలో ఉత్తర , దక్షిణ కోస్తాల్లో తేలికపాటి ఈదురు గాలులు ఉంటాయి. రాబోయే నాలుగు రోజుల్లో ఉత్తర కోస్తాలో చాలా చోట్ల భారీ వర్షాలు పడే అవకాశం ఉంది. దక్షిణ కోస్తాలో ఒకటి రెండు చోట్ల భారీ వర్షాలు పడే అవకాశం ఉందని విశాఖ వాతావరణ కేంద్రం తెలిపింది. -
రెయిన్ అలెర్ట్.. ఏపీలో రెండు రోజుల పాటు భారీ వర్షాలు
సాక్షి,విశాఖ: ఏపీలో రెండు రోజుల పాటు వర్షాలు కురవనున్నట్లు వాతవరణ శాఖ హెచ్చరికలు జారీ చేసింది.దక్షిణ కొంకణ్, గోవా ఆనుకుని ఈస్ట్ అరేబియా సముద్రంపై అల్పపిడనం ఏర్పడింది. ఈ అల్పపీడన ద్రోణి తెలంగాణ వరకు వ్యాపించింది. దాని ప్రభావంతో దాని ప్రభావంతో కోస్తాలో అక్కడక్కడ ఉరుములతో కూడిన జల్లులు.. ఒకటి రెండు చోట్ల భారీ వర్షాలు కూడా పడే అవకాశం ఉందని విశాఖ వాతావరణ కేంద్రం తెలిపింది.అల్పపీడన ప్రభావంతో ఎన్టీఆర్, గుంటూరు, పల్నాడు, కృష్ణా జిల్లాల్లో భారీ వర్షాలతో పాటు పలు చోట్ల ఉరుములతో కూడిన జల్లులు కురవనున్నాయి. ఉరుములతో కూడిన జల్లులు పడే ప్రాంతంలో 50 నుండి 60 కిలోమీటర్ల వేగంతో గాలులు వీస్తుండగా..ఇవాళ, రేపు ఈ రెండు రోజుల పాటు వాతవరణ పరిస్థితి ఇలాగే కొనసాగే అవకాశం ఉంది.గడచిన 24 గంటల్లో.. అమరావతి 9, పొదిలి 7, మాచర్ల 6, విశాఖ, మచిలీపట్నం, జంగ మహేశ్వరపురం 5 సెంటీమీటర్ల వర్షపాతం నమోదైంది. -
మరో నాలుగైదు రోజుల్లో రుతుపవనాలు!
న్యూఢిల్లీ: రైతాంగానికి శుభవార్త. నైరుతి రుతుపవనాలు మరో నాలుగైదు రోజుల్లో కేరళకు చేరుకొనే అవకాశం ఉందని భారత వాతవరణ విభాగం(ఐఎండీ) ప్రకటించింది. పరిస్థితులు అందుకు పూర్తి అనుకూలంగా ఉన్నాయని మంగళవారం ఒక ప్రకటనలో స్పష్టంచేసింది. ఈ నెల 27వ తేదీ నాటికి రుతుపవనాలు కేరళను తాకుతాయని ఐఎండీ గతంలో ప్రకటించింది. కానీ, అంతకంటే రెండు రోజుల ముందే రానున్నాయని మారుతున్న వాతావరణ పరిస్థితులను బట్టి తాజాగా అంచనా వేసింది. అదే జరిగితే 2009 తర్వాత నైరుతి రుతుపవనాలు త్వరగా రావడం ఇదే మొదటిసారి అవుతుంది.2009లో మే 23న కేరళలో అడుగుపెట్టాయి. సాధారణంగా ఈ రుతుపవనాలు ప్రతిఏటా జూన్ 1వ తేదీ కల్లా కేరళలో ప్రవేశిస్తాయి. జూన్ 8 నాటికి దేశమంతటా వ్యాపిస్తాయి. సెప్టెంబర్ 17 నుంచి రుతుపవనాల ప్రభావం తగ్గడం మొదలవుతుంది. అక్టోబర్ 15 కల్లా పూర్తిగా తగ్గిపోతుంది. అయితే, ఈసారి దాదాపు ఐదు రోజుల ముందుగానే నైరుతి రుతుపవనాలు వస్తుండడంవిశేషం. 2018లో మే 29, 2019లో జూన్ 8, 2020లో జూన్ 1, 2021లో జూన్ 3, 2022లో మే 29, 2023లో జూన్ 8, 2024లో మే 30న రుతుపవనాలు కేరళలో అడుగుపెట్టాయి.ఈ ఏడాది సాధారణం కంటే అధిక వర్షపాతం నమోదవుతుందని ఐఎండీ ఇప్పటికే వెల్లడించింది. ఎల్–నినో పరిస్థితులు ఏర్పడే అవకాశాలు లేవని తెలియజేసింది. భారత్‌లో వ్యవసాయ రంగానికి నైరుతి రుతుపవనాలు అత్యంత కీలకం. దేశవ్యాప్తంగా జలాశయాలు నిండడానికి, విద్యుత్ ఉత్పత్తికి ఇవి దోహదపడుతుంటాయి. దేశంలో 42.3 శాతం జనాభాకు వ్యవసాయ రంగమే ఆధారం. దేశజీడీపీలో ఈ రంగం వాటా 18.2%నైరుతి రుతుపవనాల రాక కంటే ముందు దేశంలో పలు ప్రాంతాల్లో వర్షాలు కురుస్తున్నాయి. ప్రధానంగా ఉత్తరాదిన ఈ పరిణామం కనిపిస్తోంది. అరేబియా సముద్రంలో ఏర్పడిన అల్పపీడనం క్రమంగా బలపడి మరో రెండు రోజుల్లో తుపానుగా మారనుందని వాతావరణ శాస్త్రవేత్తలు చెబుతున్నారు. దీనవల్ల నైరుతి రుతుపవనాలు కేరళ దిశగా వేగంగా ముందుకు కదులుతాయని అంటున్నారు. ఉత్తర కేరళలో ఇప్పటికే భారీ వర్షాలు కురుస్తున్నాయి. వయనాడ్, కాసరగోడ్, కన్నూర్, కోజికోడ్ జిల్లాల్లో రెడ్ అలర్ట్, పాలక్కాడ్, మలప్పురం, త్రిసూర్ జిల్లాలో ఆరెంజ్ అలర్ట్ ప్రకటించారు. -
చురుగ్గా నైరుతి రుతుపవనాలు.. ముందుగానే తొలకరి!
విశాఖ: దేశవ్యాప్తంగా ఈ ఏడాది వర్షాలు ముందుగానే పలకరించనున్నాయి. ఐదు రోజుల ముందుగానే నైరుతి రుతుపవనాలు వచ్చే అవకాశం ఉందని భారత వాతావరణ శాఖ (ఐఎండి) స్పష్టం చేసింది. దక్షిణ, మధ్య, ఈశాన్య బంగాళాఖాతంలో విస్తరించిన రుతుపవనాలు చురుగ్గా కదులుతున్నట్లు ఐఎండీ తెలిపింది. మే 25వ తేదీ నాటికి నైరుతి రుతుపవనాలు వచ్చే అవకాశం ఉందని ఐఎండీ స్పష్టం చేసింది.ఉపరితల ఆవర్తనాల ప్రభావంతో వచ్చే వారం రోజులు వర్షాలు ఉధృతి కొనసాగే అవకాశాలు ఎక్కువగా ఉన్నట్లు పేర్కొంది. కాకినాడ, కోనసీమ, ఉభయ గోదావరి జిల్లాలు, వైఎస్సార్, నంద్యాల జిల్లాల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు పడే అవకాశం ఉంది. దక్షిణ కోస్తా, రాయలసీమ జిల్లాల్లో వచ్చే 24 గంటట్లో భారీ వర్షాలకు అవకాశం ఉంది. తీరం వెంబడి గంటకు 55 కి.మీ వేగంతో ఈదురు గాలులు వీచే అవకాశం ఉందని, మత్స్యకారులు వేటకు వెళ్లొద్దని హెచ్చరికలు జారీ చేశారు. నిన్న(సోమవారం) రేపల్లెలో 9 సెం.మీ వర్షపాతం నమోదైంది. -
దక్షిణ కోస్తా, సీమ మీదుగా ఉపరితల ద్రోణి
సాక్షి, విశాఖపట్నం: నైరుతి బంగాళాఖాతం, ఆగ్నేయ బంగాళాఖాతంలో ఏర్పడిన ఉపరితల ఆవర్తనం ప్రస్తుతం పశ్చిమ మధ్య బంగాళాఖాతంలో కొనసాగుతోంది. దీనికి అనుబంధంగా ఆగ్నేయ బంగాళాఖాతంలో ఏర్పడిన ఉపరితల ద్రోణి ప్రస్తుతం దక్షిణ కోస్తాంధ్ర, రాయలసీమ మీదుగా ఆవరించి ఉంది. దీని ప్రభావంతో నేడు, రేపు రాష్ట్రంలో అక్కడక్కడా తేలికపాటి నుంచి ఒక మోస్తరు వర్షాలు పడే అవకాశం ఉందని ఏపీ వాతావరణ శాఖ అధికారులు తెలిపారు.దక్షిణకోస్తా, రాయలసీమ జిల్లాల్లో ఒకట్రెండు చోట్ల భారీ వర్షాలు పడతాయని వెల్లడించారు. కోస్తాంధ్ర జిల్లాల్లో గంటకు 50 నుంచి 60 కిమీ వేగంతో ఈదురుగాలులు వీస్తాయని తెలిపారు. కాగా, పగటి ఉష్ణోగ్రతలు కొన్ని ప్రాంతాల్లో 40 డిగ్రీలు దాటే సూచనలున్నాయని కూడా పేర్కొన్నారు. -
తెలుగు రాష్ట్రాలకు రెయిన్ అలర్ట్.. ఆ జిల్లాల్లో భారీ వర్షాలు
సాక్షి, హైదరాబాద్: తెలంగాణలో 21 జిల్లాల్లో వర్షాలు కురిసే అవకాశముందని వాతావరణ శాఖ వెల్లడించింది. గంటకు 30-40 కి.మీ వేగంతో ఈదురుగాలులు వీస్తాయని పేర్కొంది. పలు జిల్లాల్లో మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని.. 17 జిల్లాలకు ఆరెంజ్ అలర్ట్‌ను అధికారులు జారీ చేశారు.కోస్తాంధ్రలో ఒక్కసారిగా మారిన వాతావరణంకోస్తాంధ్రలో ఒక్కసారిగా వాతావరణం మారిపోయింది. రాయలసీమలో పిడుగులతో కూడిన వర్షాలు పడే అవకాశం ఉందని వాతావరణ కేంద్రం పేర్కొంది. పలు చోట్ల అధిక ఉష్ణోగ్రతలు నమోదయ్యే అవకాశం ఉందని వెల్లడించింది.తెలుగు రాష్ట్రాల్లో కొన్ని రోజులుగా వాతావరణంలో భిన్నమైన మార్పులు జరుగుతున్నాయి. ఏపీ, తెలంగాణలో పలు జిల్లాల్లో విపరీతమైన ఎండలు, వడగాల్పులతో ప్రజలు అల్లాడిపోతున్నారు. ఇక కొన్ని చోట్ల కురిసిన అకాల వర్షాలకు రైతులు ఇబ్బందులు పడుతున్నారు. -
ఉపరితల ద్రోణి ప్రభావంతో ఏపీలో పలు చోట్ల వర్షాలు
-
రెండు రోజులు తేలికపాటి వర్షాలు
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలో రానున్న రెండు రోజులు పలు జిల్లాల్లో తేలికపాటి వర్షాలు కురిసే అవకాశం ఉన్నట్లు వాతావరణ శాఖ తెలిపింది. ఈశాన్య విదర్భ నుంచి తెలంగాణ, అంతర్గత కర్ణాటక, రాయలసీమ, తమిళనాడు మీదుగా గల్ఫ్ ఆఫ్ మన్నార్ వరకు ఉత్తర– దక్షిణ ఉపరితల ద్రోణి కొనసాగుతోంది. ఇది క్రమంగా ఈశాన్య మధ్యప్రదేశ్ నుంచి విదర్భ, తెలంగాణ, అంతర్గత కర్ణాటక, తమిళనాడు మీదుగా సముద్రమట్టం నుంచి సగటున 1.5 కిలోమీటర్ల ఎత్తులో కొనసాగుతోంది.దీని ప్రభావంతో రాష్ట్రంలోని పలు ప్రాంతాల్లో తేలికపాటి వర్షాలు, కొన్నిచోట్ల మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ విభాగం వెల్లడించింది. 24 జిల్లాల్లో అక్కడక్కడా ఉరుములు, మెరుపులు, ఈదురుగాలులతో కూడిన వర్షాలు, కొన్నిచోట్ల వడగళ్ల వానలు కురిసే అవకాశం తెలిపింది.జయశంకర్ భూపాలపల్లి, ములుగు, భద్రాద్రి కొత్తగుడెం, ఖమ్మం, నల్లగొండ, సూర్యాపేట, మహబుబాబాద్, వరంగల్, హన్మకొండ, జనగామ, సిద్దిపేట, యాదాద్రి భువనగిరి, రంగారెడ్డి, హైదరాబాద్, మేడ్చల్ మల్కాజిగిరి, వికారాబాద్, సంగారెడ్డి, మెదక్, మహబూబ్‌నగర్, నాగర్‌కర్నూల్, వనపర్తి, జోగులాంబ గద్వాల జిల్లాల్లో తేలికపాటి వర్షాలు కురుస్తాయని పేర్కొంది. ఈ జిల్లాలకు ఎల్లో అలర్ట్ జారీ చేసింది. పాక్షికంగా ఆకాశం మేఘావృతమై ఉంటుందని తెలిపింది. మరింత పెరిగిన గరిష్ట ఉష్ణోగ్రతలు రాష్ట్రంలో ఉష్ణోగ్రతలు మరింత పెరిగాయి. ఆదివారం ఆదిలాబాద్‌లో అత్యధిక గరిష్ట ఉష్ణోగ్రత 43.5 డిగ్రీ సెల్సియస్‌గా నమోదైంది. కనిష్ట ఉష్ణోగ్రత మెదక్‌లో 23.8 డిగ్రీ సెల్సియస్‌గా రికార్డయ్యింది. ఆదిలాబాద్, ఖమ్మం, నిజామాబాద్‌లో గరిష్ట ఉష్ణోగ్రతలు సాధారణం కంటే 2 నుంచి 3 డిగ్రీ సెల్సియస్ అధికంగా నమోదయ్యాయి. రానున్న రెండు రోజులు పలు ప్రాంతాల్లో గరిష్ట ఉష్ణోగ్రతలు సాధారణం కంటే అధికంగా నమోదయ్యే అవకాశం ఉందని వాతావరణ విభాగం పేర్కొంది. ఆదివారం రాష్ట్రంలోని ప్రధాన కేంద్రాల్లో నమోదైన గరిష్ట ఉష్ణోగ్రతలు (సెల్సియస్‌లలో) కేంద్రం గరిష్టం కనిష్టం ఆదిలాబాద్ 43.5 25.2 భద్రాచలం 39.4 29.0 దుండిగల్ 38.7 27.2 హకీంపేట్ 38.5 27.5 హనుమకొండ 40.0 25.5 హైదరాబాద్ 38.8 26.5 ఖమ్మం 40.4 27.0 మహబూబ్‌నగర్ 40.0 30.1 మెదక్ 41.8 23.8 నల్లగొండ 40.0 24.4 నిజామాబాద్ 43.1 27.2 రామగుండం 41.4 26.2 -
తెలుగు రాష్ట్రాల వాతావరణంపై ... IMD షాకింగ్ ప్రకటన
-
ఈసారి సాధారణం కంటే అధిక వర్షపాతం
న్యూఢిల్లీ: రైతన్నలకు శుభవార్త. ఈ ఏడాది రుతుపవనాల సీజన్లో సాధారణం కంటే అధిక వర్షపాతం నమోదయ్యే అవకాశం ఉందని భారత వాతావరణ శాఖ(ఐఎండీ) మంగళవారం ప్రకటించింది. వర్షపాతం 96 శాతం నుంచి 104 శాతం నమోదైతే సాధారణ వర్షపాతంగా పరిగణిస్తారు. ఈసారి దేశంలో మొత్తం దీర్ఘకాల సగటు వర్షపాతం 105 శాతంగా ఉంటుందని ఐఎండీ డైరెక్టర్ జనరల్ మృత్యుంజయ్ మోహపాత్ర తెలియజేశారు.సాధారణ వర్షపాతానికి 30 శాతం, సాధారణం కంటే అధిక వర్షపాతానికి 33 శాతం, సాధారణం కంటే అత్యధిక వర్షపాతానికి 26 శాతం అవకాశాలు ఉన్నట్లు వెల్లడించారు. రుతుపవనాల ప్రభావంతో ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, మహారాష్ట్ర, ఒడిశా, ఛత్తీస్‌గఢ్, కర్ణాటక రాష్ట్రాల్లో విస్తారంగా వర్షాలు కురిసే అవకాశాలు ఉన్నట్లు ఐఎండీ స్పష్టంచేసింది.తమిళనాడుతోపాటు ఈశాన్య రాష్ట్రాల్లో సాధారణం కంటే తక్కువ వర్షపాతం నమోదవుతుందని వెల్లడించింది. మొత్తం సీజన్లో ఎల్‌నినో పరిస్థితులు నెలకొనే అవకాశం లేదని తెలియచెప్పింది. 1971 నుంచి 2020 మధ్య కాలంలో దేశవ్యాప్తంగా సీజన్ వర్షపాతం దీర్ఘకాల సగటు 87 సెంటీమీటర్లుగా నమోదైందని ఐఎండీ తెలియజేసింది. నైరుతి రుతుపవనాలు ప్రతిఏటా జూన్ 1వ తేదీకల్లా కేరళలో ప్రవేశిస్తుంటాయి. సెప్టెంబర్ రెండోవారం కల్లా రుతుపవనాల సీజన్ ముగుస్తుంది. -
ఈసారి ఎండలు ఎక్కువే!
న్యూఢిల్లీ: ఈసారి ఎండల భగభగ తప్పదని వాతావరణ శాఖ హెచ్చరించింది. దేశంలో ఏప్రిల్, మే, జూన్ నెలల్లో ఎండలు సాధారణానికి మించిన తీవ్రతతో ఉండొచ్చని భారత వాతావరణ శాఖ(ఐఎండీ) తెలిపింది. మధ్య, పశ్చిమ, వాయవ్య భారతం మైదాన ప్రాంతాల్లో వడగాడ్పులు ఎక్కువ రోజులు కొనసాగే అవకాశముందని కూడా అంచనా వేసింది. తూర్పు, పశ్చిమ భారతం మినహా దేశంలోని మిగతా అన్ని ప్రాంతాల్లోనూ ఈసారి సాధారణ గరిష్ట స్థాయికి మించి ఉష్ణోగ్రతలు నమోదయ్యే అవకాశముందని పేర్కొంది. తూర్పు, పశ్చిమ భారత్‌లో సాధారణ ఉష్ణోగ్రతలే కొనసాగుతాయంది. అత్యధిక ప్రాంతాల్లో కనిష్ట ఉష్ణోగతలు సైతం సాధారణ స్థాయికి మించి ఉండే అవకాశముందని ఐఎండీ చీఫ్ మృత్యుంజయ మహాపాత్ర సోమవారం వర్చువల్ మీడియా సమావేశంలో వివరించారు. ‘ఏప్రిల్ నుంచి జూన్ వరకు ఉత్తర, తూర్పు, మధ్య భారతదేశం, వాయవ్య భారతంలోని మైదాన ప్రాంతాల్లో సాధారణం కంటే రెండు నుంచి నాలుగు రోజులు అధికంగానే వడగాడ్పులు వీచే అవకాశముంది. మామూలుగా, ఈ కాలంలో నాలుగు నుంచి ఏడు రోజులు మాత్రమే వడగాడ్పులు వీస్తుంటాయి’అని ఆయన తెలిపారు. వడగాడ్పుల తీవ్రత తెలుగు రాష్ట్రాలైన తెలంగాణ, ఆంధ్రప్రదేశ్‌ల్లో రాజస్తాన్, గుజరాత్, హరియాణా, పంజాబ్, మధ్యప్రదేశ్, మహారాష్ట్ర, ఉత్తరప్రదేశ్, బిహార్, జార్ఖండ్, పశ్చిమబెంగాల్, ఒడిశా, ఛత్తీస్‌గఢ్‌లతోపాటు కర్ణాటక తమిళనాడుల్లోని ఉత్తర ప్రాంతాల్లో ఎక్కువగానే ఉంటుందని ఐఎండీ పేర్కొంది. -
43.5 డిగ్రీలకు ఉష్ణోగ్రతలు.. మండిపోతున్న ఎండలు
భువనేశ్వర్: దేశంలోని పలు ప్రాంతాల్లో ఎండ వేడిమి ఠారెత్తిస్తోంది. ఒడిశా(Odisha)లోని పలు నగరాల్లో ఇప్పటికే వేడిగాలులు వీస్తున్నాయి. భారత వాతావరణ శాఖ (ఐఎండీ) అందించిన సమాచారం ప్రకారం ఒడిశాలోని బౌధ్ సోమవారం వరుసగా మూడవ రోజు దేశంలోనే అత్యధిక ఉష్ణోగ్రతలు(Highest temperatures) నమోదైన ప్రదేశంగా నిలిచింది.సోమవారం ఈ నగరంలో గరిష్ట ఉష్ణోగ్రత 43.5 డిగ్రీల సెల్సియస్‌గా నమోదైంది. ఒడిశాలోని బార్గడ్లో 42 ఢిగ్రీల సెల్సియస్ ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. ఈ జాబితాలో ఆంధ్రప్రదేశ్‌లోని కర్నూలు మూడవ స్థానంలో నిలిచింది. ఇక్కడ గరిష్ట ఉష్ణోగ్రత 41.3 డిగ్రీల సెల్సియస్‌గా నమోదైంది. ఢిల్లీ-ఎన్సీఆర్లో సోమవారం గరిష్ట ఉష్ణోగ్రత చాలా రోజుల తర్వాత 30 డిగ్రీల కంటే తక్కువగా నమోదయ్యింది.మంగళవారం నుండి ఉష్ణోగ్రత క్రమంగా పెరుగుతుందని, మార్చి 25- 31 మధ్య రాజధానిలో ఉష్ణోగ్రత 40 డిగ్రీలు దాటవచ్చని వాతావరణశాఖ అంచనా వేసింది. ఢిల్లీలో సోమవారం గరిష్ట ఉష్ణోగ్రత 29.2 డిగ్రీలుగా నమోదయ్యింది. ఇది సాధారణం కంటే 2.1 డిగ్రీలు తక్కువ. ఢిల్లీతో పాటు ఇతర మైదాన ప్రాంతాలలో ఉష్ణోగ్రతలు తగ్గడానికి జమ్ముకశ్మీర్‌లో కురుస్తున్న హిమపాతం కారణంగా నిలిచింది. ఒడిశా విషయానికొస్తే బౌధ్‌లో శనివారం 42.5 డిగ్రీల సెల్సియస్, ఆదివారం 43.6 డిగ్రీల సెల్సియస్ ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. ఒడిశాలోని ఆరు జిల్లాలకు మంగళవారం వాతావరణ శాఖ వేడిగాలుల హెచ్చరిక జారీ చేసింది.ఇది కూడా చదవండి: జో బైడెన్ సంతానానికి సీక్రెట్ సర్వీస్ రక్షణ తొలగింపు -
కచ్చితత్వం దిశగా...
పక్షుల, పాముల, జంతువుల ప్రవర్తనను చూసీ...ఆకాశం తీరుతెన్నులు గమనించీ, గాలివాటు, దాని వేగం గ్రహించీ వాతావరణాన్ని అంచనా కట్టే గతకాలపు రోజుల నుంచి ఇవాళ ఏం జరుగుతుందో, వచ్చే నాలుగైదు రోజుల్లో ఎలాంటి వాతావరణం ఉండబోతున్నదో, రాగల సంవత్సరమంతా ఎలాంటి స్థితిగతులుంటాయో స్పష్టంగా వివరించే సమాచారం అందరికీ అందుబాటులో కొచ్చింది. గత నూట యాభయ్యేళ్లుగా అవిచ్ఛిన్నంగా ఈ పనిలోనే నిమగ్నమై కోట్లాది పౌరులకు చేదోడువాదోడుగా నిలిచిన భారతీయ వాతావరణ విభాగం(ఐఎండీ) తన వార్షికోత్సవాన్ని మంగళ వారం ప్రధాని మోదీ సమక్షంలో ఘనంగా నిర్వహించుకుంది. ఒక దేశ విజ్ఞాన శాస్త్ర అవగాహన ఆ దేశంలోని వైజ్ఞానిక సంస్థల ప్రగతిలో ప్రతిఫలిస్తుందని ఈ సందర్భంగా మోదీ చెప్పిన మాట అక్షరసత్యం. ఈ నూటయాభయ్యేళ్లలో ఐఎండీ సాధించిన ప్రగతి ఇందుకు సాక్ష్యం. ‘వాన రాకడ... ప్రాణం పోకడ’ ఎవరికీ తెలియదనే నానుడి నుంచి మనం చాలా దూరం వచ్చాం. ఇక పోవటం ఖాయమనుకున్న ప్రాణాన్ని నిలబెట్టడానికీ, పునర్జన్మ ఇవ్వడానికీ అధునాతన వైద్య సదుపాయాలు విస్తృతంగా అందుబాటులోకొచ్చాయి. అలాగే వాన ఎక్కడ కురుస్తుందో, దాని తీవ్రత ఏపాటో అంచనా వేయగలుగుతున్నాం. తుపాను ఏర్పడే అవకాశాలు, దాని గమ్యం, గమనం, అది మోసుకు రాగల విపత్తు గురించీ హెచ్చరించటంతో పాటు కరవుకాటకాల ప్రమాదాన్ని తెలియజెప్పటం ఆ రంగంలో సాధించిన ప్రగతికి తార్కాణం. మూడు రోజుల వరకూ వాతావరణం ఎలా ఉండబోతు న్నదో చెప్పే స్వల్పకాలిక అంచనాలు, పదిరోజుల వరకూ వాతావరణ పోకడల్ని వివరించగల మధ్య శ్రేణి అంచనాలు, నెల పాటు ఏ వారమెలా వుంటుందో తెలియజేయగల సామర్థ్యం ఇప్పుడు మన సొంతం. ఇంకా స్థానిక వాతావరణాలను అంచనా వేయగలిగే దిశగా ఐంఎండీ ముందుకెళ్తోంది.పేరులో తప్ప జనాభా రీత్యా, సంపద రీత్యా, లేదా విస్తీర్ణం రీత్యా ఏ రకంగానూ ‘గ్రేట్’ అనే పదానికి అర్హత లేని బ్రిటన్ నుంచి వచ్చిన వలస పాలకులు ఈ దేశంలోని వాతావరణ తీరుతెన్నులు చూసి అయోమయంలో పడ్డారు. వీటిని సక్రమంగా అంచనా వేసే సాధనాలు లేకపోతే సరిగా పాలించటం అసాధ్యమన్న నిర్ణయానికొచ్చిన ఫలితంగానే 1875లో సర్ చార్లెస్ చాంబర్లేన్ నేతృత్వంలో ఐఎండీని నెలకొల్పారు. అంతవరకూ రైతులు సంప్రదాయంగా అనుసరిస్తూ వచ్చిన విధానాలన్నీ క్రమేపీ కనుమరుగై వాతావరణ అధ్యయనం కొత్త పుంతలు తొక్కటం ప్రారంభించింది. కేవలం బ్రిటన్ వాతావరణాన్ని పోలి వుంటుందన్న ఏకైక కారణంతో తమ వెసులుబాటు కోసం సిమ్లాలోని పర్వత ప్రాంతంలో మొదలెట్టిన ఐఎండీ వల్ల పెద్దగా ప్రయోజనం ఉండటం లేదని గ్రహించాక 1928లో పుణేకు తరలిరావటం, ఆ తర్వాత రెండో ప్రపంచ యుద్ధ కాలంలో ఢిల్లీకి వెళ్లటం తప్పనిసరైంది. ఐఎండీ డైరెక్టర్ జనరల్‌గా వచ్చిన గిల్బర్ట్ వాకర్ 1904–1924 మధ్య రెండు దశాబ్దాల సమయంలో భారత వాతావరణంలో చోటుచేసుకున్న అసాధారణతలపై అధ్యయనం చేయటంతో అనేక అంశాలు బయటపడ్డాయి. ముఖ్యంగా ఉష్ణమండల ప్రాంత పసిఫిక్ మహా సముద్ర జలాలపై ఉండే వాయుపీడనంలో వచ్చే హెచ్చుతగ్గులే ప్రపంచ వ్యాప్తంగా వాతావరణ స్థితిగతులను ప్రభావితం చేస్తున్నాయని ఆ అధ్యయనం తేల్చాక వాతావరణాన్ని అర్థంచేసుకునే తీరే మారిపోయింది. పసిఫిక్ జలాలపై ఉండాల్సిన సాధారణ ఉష్ణోగ్రతలో మైనస్ 17 డిగ్రీల సెల్సియస్ మేరకు హెచ్చితే లాæనినో... ఆ ఉష్ణోగ్రత మైనస్ 17 డిగ్రీల కన్నా తగ్గితే లానినా ఏర్పడు తుందని తేలింది అప్పుడే. ఇదంతా అర్థమయ్యాక రాగల కాలంలో వాతావరణమెలా వుండనున్నదో అంచనా వేయటం సులభమైంది. వాతావరణంలో విడిచిపెట్టే బెలూన్లు గాలిలో తేమనూ, ఉష్ణోగ్రతనూ ఇట్టే చెప్పగలుగుతుండగా ఉపగ్రహాలు నేల పరిస్థితుల గురించి సమాచారం ఇస్తున్నాయి.స్వాతంత్య్రానంతరం వాతావరణాన్ని కొలవటానికి రాడార్ల వంటి ఉపకరణాలు అందుబాటు లోకొచ్చాయి. 1971లో తొలి తుపాను హెచ్చరిక కేంద్రం ఏర్పాటైతే, 1990ల్లో ఇస్రో ఉపగ్రహాలు పంపే డేటాతో వాతావరణ అంచనాల కచ్చితత్వం పెరిగింది. సెకనుకు కొన్ని లక్షల గణనలను చేయగలిగిన అధునాతన సూపర్ కంప్యూటర్ వినియోగం మొదలయ్యాక రుతుపవనాలు, తుపానుల గురించి మాత్రమే కాదు... వడగాల్పులు, వరదల వంటి వైపరీత్యాల గురించి కూడా చెప్పగలుగుతున్నారు. మన దేశంలో సాగుకు యోగ్యమైన భూమిలో 60 శాతం కేవలం వర్షాధారం కావటం, జనాభాలో మూడింట రెండొంతుల మందికి జీవనాధారం వ్యవసాయమే కావటం వల్ల ఐఎండీ చెప్పే అంచనాలు ఎంతో అవసరం. అందుకే వర్షాలు సరిగ్గా ఎక్కడ పడతాయో, ఏ ప్రాంతంలో వడగాడ్పులు వీచవచ్చో, ఎక్కడ పిడుగులు పడే అవకాశం ఉన్నదో కూడా పదేళ్లుగా చెప్పగలుగుతోంది. కృత్రిమ మేధ దీన్ని మరింత పదునెక్కించింది.ఐఎండీ అంచనాల వల్ల ప్రభుత్వాలు అప్రమత్తమై లక్షలమందిని సురక్షిత ప్రాంతాలకు తరలించటం, వేలాది ప్రాణాలను కాపాడుకోవటం సాధ్యమవుతోంది. ఇది మున్ముందు ఇంకా విస్తరించి కనీసం అయిదురోజుల ముందు 90 శాతం కచ్చితత్వంతో చెప్పగలిగే విధానాలను అభివృద్ధి చేసుకోవాలనీ, ఆఖరికి భూకంపాల రాకడను సైతం పసిగట్టగలగాలనీ ఐఎండీ 2047 విజన్ డాక్యుమెంటు విడుదల సందర్భంగా మోదీ చేసిన సూచన శిరోధార్యం. ఈ అంచనాలు మన దేశానికి మాత్రమే కాదు...ఆసియా ప్రాంత దేశాలకు సైతం ఎంతో మేలుచేస్తాయి. పంటల దిగుబడిపై, ఆర్థికవ్యవస్థ తీరుతెన్నులపై మరింత మెరుగైన అంచనాలకు తోడ్పడతాయి. -
పలు రాష్ట్రాలకు కోల్డ్‌వేవ్ అలర్ట్
న్యూఢిల్లీ:ఉత్తర భారతంలోని పలు రాష్ట్రాలకు వాతావరణ శాఖ(IMD) అలర్ట్ ఇచ్చింది. జమ్ముకశ్మీర్,పంజాబ్,హర్యానా,రాజస్థాన్,ఢిల్లీలో డిసెంబర్ 30 నుంచి జనవరి 2 వరకు తీవ్రమైన చలి(కోల్డ్‌వేవ్) ఉంటుందని హెచ్చరించింది. ఉత్తరప్రదేశ్‌లోని తూర్పు,పశ్చిమ ప్రాంతాల్లోనూ ఉష్ణోగ్రతలు కనిష్టస్థాయికి పడిపోయి చలి తీవ్రంగా ఉంటుందని తెలిపింది. హిమాచల్‌ప్రదేశ్‌లో మరో రెండు రోజుల పాటు మంచు(Snow) కురుస్తుందని వెల్లడించింది. కశ్మీర్లో మంచు ప్రభావంతో ఇప్పటికే రోడ్లపై ట్రాఫిక్‌కు అంతరాయం ఏర్పడుతోంది. ఇక్కడ పలు విమానాలు, రైళ్లు ఇప్పటికే రద్దయ్యాయి. ఇక దేశ రాజధాని ఢిల్లీలో మరో రెండు రోజులపాటు తేలికపాటి నుంచి ఓ మోస్తరు వర్షాలు పడతాయని వాతావరణశాఖ తెలిపింది. ఢిల్లీకి వాతావరణశాఖ ఆరెంజ్ అలర్ట్ జారీ చేసింది.ఇదీ చదవండి: హాలిడే సీజన్‌పై టోర్నడోల ఎఫెక్ట్ -
AP Rains: ఏపీలో మరో రెండ్రోజులు వర్షాలు
విశాఖపట్నం, సాక్షి: పశ్చిమ మధ్య బంగాళాఖాతంలో బలహీన పడిన వాయుగుండం.. అల్ప పీడనంగా నైరుతి దిశగా పయనిస్తోంది. ఈ క్రమంలో.. ఏపీకి మరో రెండ్రోజులు వర్షాలు తప్పవని విశాఖ వాతావరణ కేంద్రం తెలిపింది.ఇప్పటికే వాయుగుండం ప్రభావంతో రాష్ట్రంలో భారీ వర్షాలు పడుతున్నాయి. గడచిన 24 గంటల్లో పల్నాడులో కుండపోత వాన పడింది. దక్షిణ కోస్తా, రాయలసీమ జిల్లాల్లో మరో రెండు రోజులపాటు విస్తారంగా వర్షాలు పడతాయని వాతావరణ శాఖ చెబుతోంది.రేపు, ఎల్లుండి నెల్లూరు, ప్రకాశం జిల్లాలలో భారీ వర్షాలు పడనున్నాయి. కోస్తా తీరం వెంబడి కొనసాగనున్న తీవ్రమైన ఈదురు గాలులు కొనసాగుతాయి. మత్స్యకారులు వేటకు వెళ్ళరాదని ఇప్పటికే సూచించింది వాతావరణ శాఖ.ఇదీ చదవండి: అకాల వర్షం నిండా ముంచేసింది -
బంగాళాఖాతంలో వాయుగుండం..ఉత్తరాంధ్రలో భారీ వర్షాలు
సాక్షి,విశాఖ : పశ్చిమ మధ్య బంగాళాఖాతంలో వాయుగుండం ఏర్పడింది. తీవ్ర అల్పపీడనం బలపడి వాయుగుండంగా మారింది. విశాఖపట్నంనకు 640 కిలోమీటర్ల దూరంలో,చెన్నైకి 370 కిలోమీటర్ల దూరంలో వాయుగుండం కేంద్రీకృతమై ఉంది. వాయుగుండం ప్రభావంతో ఉత్తరాంధ్రలో విస్తారంగా వర్షాలు, కొన్ని చోట్ల భారీ వర్షాలు పడనున్నాయి. గంటకు 55 కిలోమీటర్ల వేగంతో గాలులు వీచే అవకాశమున్నట్లు వాతావరణ కేంద్రం తెలిపింది. వాయుగుండం ఏర్పడి వాతావరణం అల్లకల్లోలంగా ఉన్న ఈ పరిస్థితుల్లో ఆంధ్రప్రదేశ్ తీరంలో మత్స్య కారులు వేట నిషేధం విధించింది. కళింగపట్నం , విశాఖ, కాకినాడ, గంగవరం, మచిలీపట్నం పోర్టులో 3వ నెంబర్ ప్రమాద హెచ్చరికలు జారీ చేసింది. -
ఆరెంజ్ అలర్ట్.. ఆ జిల్లాలకు వాతావరణ శాఖ హెచ్చరికలు
-
ఏపీలో ఈ జిల్లాల్లో అతి భారీ వర్షాలు
విశాఖపట్నం, సాక్షి: నైరుతి బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం.. కోస్తా, రాయలసీమలపై తీవ్ర ప్రభావం చూపెట్టనుంది. ఇప్పటికే సముద్ర వాతావరణం అలజడిగా మారగా.. విశాఖ తీరం వెంట తేలికపాటి వర్షం మొదలైంది. రేపటి నుంచి నగరం సహా కోస్తా జిల్లాల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు పడతాయని వాతావరణ శాఖ హెచ్చరించింది.ఓవైపు చలి తీవ్రత.. మరోవైపు తేలికపాటి వర్షం విశాఖను వణికిస్తోంది. అల్పపీడన ప్రభావంతో రేపటి నుంచి నాలుగు రోజులు వర్షాలు పడతాయని వాతావరణ శాఖ ఇప్పటికే ప్రకటించింది. తాజాగా.. తీరం వెంబడి 35 -45 కిమీ వేగంతో ఈదురు గాలులు వీస్తాయని తెలిపింది. అలాగే.. రాబోయే మూడు రోజుల్లో కోస్తా, రాయలసీమ భారీ వర్షాలు పడొచ్చని అంచనా వేస్తోంది. ఇప్పటికే.. దక్షిణ కోస్తా మత్స్యకారులు వేటకు వెళ్ళరాదని విశాఖ వాతావరణ కేంద్రం హెచ్చరించింది. మరోవైపు వాతావరణశాఖ అంచనాలకు తగ్గట్లే నెల్లూరు, తిరుపతి జిల్లాల్లో భారీ వర్షం మొదలైంది. నెల్లూరు, తిరుపతి, కాకినాడ, అనకాపల్లి, విశాఖ జిల్లాలకు ఆరెంజ్ అలర్ట్ ప్రకటించారు. రేపు ఆయా జిల్లాల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు పడతాయని పేర్కొంది. అలాగే.. రేపు కృష్ణా, బాపట్ల, ప్రకాశం, విజయనగరం జిల్లాల్లో భారీ వర్షాలు పడొచ్చని చెబుతూ ఎల్లో అలెర్ట్ జారీ చేసింది వాతావరణ శాఖ. -
రాష్ట్రానికి వాన గండం.. దూసుకొస్తున్న అల్పపీడనం
సాక్షి,విశాఖ : రాష్ట్రానికి వానగండం పొంచి ఉంది. బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం ఇవాళ (బుధవారం) తమిళనాడు - శ్రీలంక తీరాలకు చేరుకునే అవకాశం ఉందని భాతర వాతావరణ శాఖ అధికారులు అంచనా వేశారు.ఈ అల్పపీడనం దక్షిణ కోస్తా, రాయలసీమపై ఈరోజు, రేపు ప్రభావం చుపనుంది. ఫలితంగా నెల్లూరు, తిరుపతి జిల్లాల్లో పలు చోట్ల భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని సమాచారం. అల్పపీడనం నేపథ్యంలో రేపు నెల్లూరు, తిరుపతి, అన్నమయ్య, చిత్తూరు, సత్యసాయి జిల్లాలకు ఎల్లో అలెర్ట్ జారీ చేశారు. కాగా, ఆగ్నేయ బంగాళాఖాతంలో అల్పపీడనం కొనసాగుతోంది. అది పశ్చిమ వాయువ్య దిశగా కదులుతూ 24 గంటల్లో మరింతగా బలపడే అవకాశం ఉన్నట్లు వాతావరణశాఖ తెలిపింది. బుధవారం నాటికి శ్రీలంక-తమిళనాడు తీరాలకు చేరే అవకాశం ఉంది. దీని ప్రభావంతో డిసెంబర్ 15 వరకు... కొన్నిచోట్ల తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురుస్తాయని వాతావరణశాఖ తెలిపింది. -
AP : అమ్మో .. మళ్లీ వానలా
సాక్షి,అమరావతి: రాష్ట్రంలో మరోసారి వర్షాలు కురవనున్నాయి. బంగాళాఖాతంలో మంగళవారం అల్పపీడనం ఏర్పడినట్లు వాతావరణశాఖ పేర్కొంది. ఇది రేపటికి తమిళనాడు - శ్రీలంక తీరాలకు చేరుకునే అవకాశం ఉందని అంచనా వేస్తోంది. వీటి ప్రభావం దక్షిణ కోస్తా, రాయలసీమపై రెండు రోజుల పాటు ప్రభావం చూపనుంది. దీని ప్రభావంతో బుధవారం నుంచి శుక్రవారం వరకు కోస్తా, రాయలసీమలో జిల్లాల్లో అక్కడక్కడా భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని ఐఎండీ పేర్కొంది. చిత్తూరు, తిరుపతి, అన్నమయ్య జిల్లాల్లో వర్షాలు ఎక్కువగా కురుస్తాయని తెలిపింది.మంగళవారం అల్లూరి, కాకినాడ, కోనసీమ, పశ్చిమగోదావరి, కృష్ణా, నెల్లూరు, కర్నూలు, నంద్యాల, అనంతపురం, శ్రీ సత్యసాయి, వైఎస్సార్ జిల్లాల్లో కొన్నిచోట్ల తేలికపాటి వర్షాలు పడే అవకాశం ఉందని వెల్లడించింది. బుధవారం ప్రకాశం, నెల్లూరు, తిరుపతి, అన్నమయ్య, చిత్తూరు జిల్లాల్లో కొన్నిచోట్ల,గురువారం తిరుపతి, అన్నమయ్య, చిత్తూరు, నెల్లూరు, వైఎస్సార్, శ్రీసత్యసాయి జిల్లాల్లో భారీ వర్షాలు పడే అవకాశం ఉందని వాతావరణ శాఖ అంచనా -
దూసుకొస్తున్న ‘ఫెంగల్’
సాక్షి, అమరావతి/సాక్షి, విశాఖపట్నం : ఫెంగల్ తుపాను దూసుకొస్తోంది. నైరుతి బంగాళాఖాతంలో కొనసాగుతున్న తీవ్ర వాయుగుండం ఉత్తర వాయువ్య దిశగా గంటకు 12 కి.మీ వేగంతో కదులుతూ ట్రింకోమలీకి తూర్పుగా 110 కిలోమీటర్లు, నాగపట్నానికి ఆగ్నేయంగా 350 కి.మీ., పుదుచ్చేరికి ఆగ్నేయంగా 450 కి.మీ., చెన్నైకి ఆగ్నేయంగా 500 కి.మీ.ల దూరంలో కేంద్రీకృతమైందని వాతావరణ శాఖ, విశాఖ తుపాను హెచ్చరికల కేంద్రం తెలిపాయి. ఇది బుధవారం సా.5.30కు తుపానుగా బలపడింది. అనంతరం.. శ్రీలంక తీరాన్ని దాటి తమిళనాడు తీరం వైపు కదిలే అవకాశముంది. 30న దక్షిణ తమిళనాడు, శ్రీలంక మధ్యలో తీరం దాటే అవకాశాలున్నాయని.. ఆ తర్వాత బలహీనపడి తీవ్ర వాయుగుండంగా మారనున్నట్లు వెల్లడించాయి. దీని ప్రభావం ముఖ్యంగా నెల్లూరు జిల్లాలోనూ, రాయలసీమలోని తిరుపతి జిల్లాలోనూ ఉంటుందని వాతావరణ శాఖ అధికారులు హెచ్చరించారు. అలాగే, కోస్తాంధ్రలో అక్కడక్కడ గురు, శుక్ర, శనివారాల్లో భారీ నుంచి అతిభారీ వర్షాలు, రాయలసీమలో అక్కడక్కడా భారీ వర్షాలు కురిసే అవకాశముంది. మిగిలిన చోట్ల తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు విస్తారంగా పడతాయన్నారు. ప్రకాశం, కడప, అన్నమయ్య జిల్లాల్లోనూ ఒకట్రెండు చోట్ల భారీ వర్షాలు పడే సూచనలున్నాయని.. అందుకనుగుణంగా చర్యలు తీసుకోవాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని అప్రమత్తం చేసింది. మత్స్యకారులెవరూ డిసెంబరు 3 వరకూ వేటకు వెళ్లొద్దని అధికారులు హెచ్చరించారు. ఇక తుపాను కారణంగా విశాఖపట్నం, మచిలీపట్నం, నిజాంపట్నం, కృష్ణపట్నం పోర్టుల్లో ఒకటో నంబరు ప్రమాద హెచ్చరిక.. కాకినాడ, గంగవరం పోర్టుల్లో సిగ్నల్–4తో ఒకటో నంబరు ప్రమాద హెచ్చరిక జారీచేశారు. మరోవైపు.. నెల్లూరు, చిత్తూరు, అన్నమయ్య జిల్లా రాయచోటి కలెక్టరేట్లలో ప్రత్యేక కంట్రోల్ రూం ఏర్పాటుచేశారు. ప్రజలకు ఏమైనా ఇబ్బందులు ఎదురైతే 9491077356 (చిత్తూరు).. నెల్లూరు ప్రజలు 0861–2331261 టోల్‌ఫ్రీ నంబర్లలో సంప్రదించాలి. అధికారులకు ఆయా జిల్లాల కలెక్టర్లు సెలవులు రద్దుచేశారు.రైతులు అప్రమత్తంగా ఉండాలి..ఫెంగల్ తుపాను దూసుకొస్తున్న నేపథ్యంలో రైతులు అప్రమత్తంగా ఉండాలి. భారీ వర్షాల నేపథ్యంలో వరి కోతలు, ఇతర వ్యవసాయ పనుల్లో రైతులు తగిన జాగ్రత్తలు తీసుకోవాలి. పంట పొలాల్లో నిలిచే అదనపు నీరు వీలైనంత త్వరగా బయటకుపోయేలా రైతులు ఏర్పాట్లుచేసుకోవాలి. పండించిన ధాన్యాన్ని సురక్షిత ప్రదేశాల్లో ఉంచాలి. – రోణంకి కూర్మనాథ్, ఏపీ విపత్తుల నిర్వహణ సంస్థ ఎండీ -
ఫెంగల్ పంజా.. చూస్తుండగానే కూలిన భవనం
చెన్నై: తమిళనాడులో ఫెంగల్ తుఫాను బీభత్సం సృష్టిస్తోంది. బుధవారం ఉదయం నుంచి ఫెంగల్ ధాటికి రాష్ట్రంలో పలు జిల్లాలు జలమయమయ్యాయి. లోతట్టు ప్రాంతాలు నీట మునిగాయి. మైలాదుత్తురై జిల్లా కేంద్రంలోని ఓ పాత భవనం ఫెంగల్ దెబ్బకు కుప్పకూలింది. దీంతో వాతావరణ శాఖ రాష్ట్రంలోని ప్రాంతాల్లో ఎల్లో అలెర్ట్ జారీ చేసింది. అలాగే బంగాళాఖాతంలో ఏర్పడిన తీవ్ర వాయుగుండం ఉత్తర-వాయవ్య దిశగా కదులుతూ తమిళనాడు, శ్రీలంక తీరాలవైపు పయనిస్తుందని వాతావరణ శాఖ వెల్లడించింది. ఫలితంగా రాబోయే 24గంటల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందనే అంచనాలతో.. తమిళనాడు ప్రభుత్వం అప్రమత్తమైంది. రాష్ట్రంలోని 15 జిల్లాలలోని కాలేజీలు, స్కూళ్లకు రెండురోజుల పాటు సెలవు ప్రకటించింది.వాతావరణ శాఖ వివరాల ప్రకారం.. నైరుతి బంగాళాఖాతంలో ఏర్పడిన తీవ్ర అల్పపీడనం ఆరు గంటలపాటు గంటకు 13 కిలోమీటర్ల వేగంతో ఉత్తర-వాయువ్య దిశగా ప్రయాణించింది. సాయంత్రం 5:30 గంటల సమయంలో త్రికోణమలీకి తూర్పు- ఆగ్నేయంగా 130 కిలోమీటర్లు నాగపట్టినానికి ఆగ్నేయంగా 400 కిలోమీటర్లు, పుదుచ్చేరికి ఆగ్నేయంగా 510 కిలోమీటర్లు, చెన్నైకి ఆగ్నేయంగా 590 కిలోమీటర్లు దూరంలో ఉన్నట్లు పేర్కొంది. VIDEO | An old house collapsed in Tamil Nadu's Mayiladuthurai due to heavy rains earlier today.(Full video available on PTI Videos - https://t.co/n147TvrpG7)#TamilNaduRains pic.twitter.com/sYHwEFfO5W— Press Trust of India (@PTI_News) November 27, 2024 -
ఏపీలో పిడుగులతో వర్షాలు
అమరావతి, సాక్షి: బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం బలపడింది. వాయుగుండంగా మారి.. పశ్చిమ వాయవ్య దిశగా కదులుతోంది. మరో 24 గంటల్లో తీవ్ర వాయుగుండగా మారే అవకాశం కనిపిస్తోంది. ఈ ప్రభావంతో పిడుగులతో కూడిన వర్షాలు పడతాయని ఐఎండీ హెచ్చరిస్తోంది.రేపటి నుంచి ఏపీపై వాయుగుండం ప్రభావం కనిపించనుంది. రాష్ట్రంలో మూడు రోజులపాటు వర్షాలు ఉంటాయని వాతావరణ శాఖ తెలిపింది. దక్షిణ కోస్తా, ఉత్తర కోస్తాలో రేపు, ఎల్లుండి తేలికపాటి వర్షాలు కురవనున్నాయి. ఈ నెల 28, 29న నెల్లూరు, ప్రకాశం, తిరుపతి, విశాఖ, శ్రీకాకుళం జిల్లాల్లో వర్షాలు పడనున్నాయి.తీరప్రాంతాల్లో 35 నుంచి 55 కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలులు వీచే అవకాశం ఉందని.. దక్షిణ కోస్తాలో మత్స్యకారులు వేటకు వెళ్లొద్దని వాతావరణ శాఖ వెల్లడించింది. మరోవైపు.. కోస్తాంధ్రలో ఒకటో నెంబర్ ప్రమాద హెచ్చరిక జారీ చేశారు. కోస్తాంధ్ర రైతులు అప్రమత్తంగా ఉండాలని అధికారుల సూచించారు. -
భారత్‌లో విచిత్రమైన వాతావరణం!! 123 ఏళ్ల తర్వాత..
ఢిల్లీ: భారత్‌లో దాదాపు 120 ఏళ్ల తర్వాత విచిత్రమైన వాతావరణ పరిస్థితులు కనిపిస్తున్నాయి. నవంబర్ నెల వచ్చేసింది. అయినా చలి జాడ లేకుండా పోయింది. దీంతో ఈ నెల కూడా సూర్యతాపం తప్పదని వాతావరణ నిపుణులు అంచనా వేస్తున్నారు.భారత్‌లో నెలకొన్ని ఈ అసాధారణ వాతావరణ పరిస్థితులపై ఢిల్లీలో జరిగిన మీడియా సమావేశంలో భారత వాతావరణ శాఖ(IMD) డైరెక్టర్ జనరల్ మృత్యుంజయ మహాపాత్ర వివరించారు. బంగాళాఖాతంలో అల్పపీడనలు తరచూ ఏర్పడడం, తూర్పు గాలుల ప్రభావం, పశ్చిమ దిశ నుంచి ఎలాంటి అవాంతరాలు లేకపోవడం.. తదితర కారణాల వల్ల దేశవ్యాప్తంగా వాతావరణం వెచ్చగా ఉంటోందని వెల్లడించారు. అలాగేవాతావరణ శాఖ గణాంకాల ప్రకారం.. 1901 తర్వాత ఈ ఏడాది అక్టోబర్ అత్యంత వెచ్చని నెలగా రికార్డయ్యింది. సాధారణం కంటే.. 1.23 డిగ్రీల సెల్సియస్ ఉష్ణోగ్రత అధికంగా నమోదైంది. అలాగే దేశవ్యాప్తంగా సరాసరి ఉష్ణోగ్రత చూసినా.. 1.84 డిగ్రీల సెల్సియస్(20.01 డిగ్రీల సెల్సియస్ బదులు 21.85 డిగ్రీల సెల్సియస్ నమోదైంది) అధికంగానే రికార్డు అయ్యింది. ఈ గణాంకాలను బట్టి నవంబర్ నెల కూడా ఉష్ణోగ్రతల్లో తగ్గుముఖం ఉండకపోవచ్చని ఐఎండీ అంచనా వేస్తోంది. అలాగే.. రాబోయే రెండు వారాలు అధిక ఉష్ణోగ్రతలు కొనసాగవచ్చని చెబుతోంది.అంటే.. ఈసారి నవంబర్ చలితో వణికించదని ఐఎండీ డైరెక్టర్ మహాపాత్ర చెబుతున్నారు. అలాగే.. డిసెంబర్ నుంచి మొదలయ్యే చలి జనవరి, ఫిబ్రవరి నెలలపాటు కొనసాగుతుందని వెల్లడించారు. అంతేకాదు.. దక్షిణ భారతంలో నవంబర్ నెలలో రుతుపవనాల తిరోగమనం సమయంలో సాధారణం కంటే అధిక వర్షపాతం నమోదు అయ్యే అవకాశం ఉందని కూడా తెలిపారాయన. -
ఏపీకి ముంచుకొస్తున్న వాయుగుండం.. పలు జిల్లాలకు రెడ్ అలర్ట్
సాక్షి,అమరావతి: మరి కొద్ది గంటల్లో బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం వాయుగుండంగా బలపడే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది. ఈ ప్రభావంతో ఆంధ్రప్రదేశ్‌లోని పలు జిల్లాల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు పడనున్నట్లు అంచనా వేసింది.ఈ తరుణంలో దక్షిణ కోస్తా, రాయలసీమకు వాతావరణ శాఖ హై అలర్ట్ ప్రకటించింది. ఈనెల 17న పుదుచ్చేరి, తమిళనాడు, దక్షిణ కోస్తా దగ్గర వాయుగుండం తీరం దాటుతుందని వాతావరణ శాఖ ప్రకటించింది. నెల్లూరు, ప్రకాశం, అన్నమయ్య, చిత్తూరు, వైఎస్సార్, తిరుపతి జిల్లాలకు రెడ్ అలర్ట్ జారీ చేసింది. రేపు, ఎల్లుండి దక్షిణ కోస్తా, రాయల భారీ వర్షాలు , కొన్ని చోట్ల అత్యంత భారీ వర్షాలు పడనున్నాయి. ఫ్లాష్ ఫ్లడ్ సంభవించే అవకాశం ఉందని, ప్రజలు అప్రమత్తంగా ఉండాలని వాతావరణ శాఖ సూచనలు జారీ చేసిందిబంగాళాఖాతంలో వాయుగుండం ఏర్పడనుండటంతో మత్స్యకారులు సముద్రంలో వేటకు వెళ్లొద్దని ఆదేశాలు జారీ చేసింది. ఇప్పటికే వేటలో ఉన్న మత్స్యకారులను వెనక్కి రావాలని స్పష్టం చేసింది. ప్రజా రవాణా, రైల్వేల రాకపోకలపై నిరంతర పర్యవేక్షణ వుండాలని వాతావారణ శాఖ సూచనలు జారీచేసింది. -
ఏపీకి మళ్లీ తుఫాను ముప్పు
సాక్షి, విశాఖపట్నం: నైరుతి రుతుపవనాల ఉపసంహరణ మొదలైన క్రమంలో ఈశాన్య రుతుపవనాలు చురుగ్గా కదులుతున్నాయి. వాస్తవానికి ఏటా అక్టోబర్ 20న ఈశాన్య రుతుపవనాలు రాష్ట్రాన్ని తాకుతుంటాయి. ఈసారి చురుగ్గా ముందుకు కదులుతుండటంతో.. 15 నాటికి దక్షిణ కోస్తాలోకి వచ్చే అవకాశాలున్నాయని వాతావరణ నిపుణులు చెబుతున్నారు. దీని ప్రభావంతో దక్షిణ కోస్తా, రాయలసీమలో వర్షాలు జోరందుకోనున్నాయని వెల్లడించారు. మరోవైపు.. దక్షిణ బంగాళాఖాతంలో ఈనెల 12న ఉపరితల ఆవర్తనం ఏర్పడనుందని విశాఖ తుపాను హెచ్చరికల కేంద్రం అధికారులు తెలిపారు. ఇది 16 నాటికి బలపడి తుపానుగా మారే సూచనలున్నాయని అంచనా వేస్తున్నారు. అయితే.. దీని ప్రభావం తమిళనాడు, దక్షిణ కోస్తా జిల్లాలపై ఉండే సూచనలున్నాయని చెప్పారు. ప్రస్తుతం కేరళ, తమిళనాడు మీదుగా నైరుతి బంగాళాఖాతంలో సముద్ర మట్టానికి 4.5 కి.మీ. ఎత్తులో ఉపరితల ద్రోణి కొనసాగుతోందని వెల్లడించారు. దీని ప్రభావంతో నెల్లూరు, ప్రకాశం, చిత్తూరు, అనంతపురం, రాయలసీమల్లో అక్కడక్కడా మోస్తరు వానలు పడే అవకాశాలున్నాయనీ.. అదేవిధంగా.. కృష్ణా, గుంటూరు జిల్లాల్లోనూ చెదురుమదురు వానలు కురుస్తాయని ఏపీ వాతావరణ కేంద్రం అధికారులు తెలిపారు. -
10 రాష్ట్రాలకు భారీ వర్ష సూచన
న్యూఢిల్లీ: దేశంలోని పలు రాష్ట్రాల్లో భారీ వర్షాలు కురుస్తున్నాయి. బీహార్‌లో భారీ వర్షాలకు అక్కడి జనం అతలాకుతలమవుతున్నారు. తూర్పు యూపీలో రెండు రోజులుగా భారీ వర్షాలు కురుస్తున్నాయి. ఈశాన్య రాష్ట్రాల్లోనూ భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది.రాబోయే ఐదారు రోజుల్లో ఈశాన్య ప్రాంతాల్లో భారీ నుండి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణశాఖ అంచనా వేసింది. అసోం, మేఘాలయ, అరుణాచల్ ప్రదేశ్, నాగాలాండ్, మణిపూర్, మిజోరాం, త్రిపుర తదితర 10 రాష్ట్రాల్లో కుండపోత వర్షాలకు అవకాశం ఉంది. రాబోయే 24 గంటల్లో ఉప-హిమాలయ పశ్చిమ బెంగాల్, బీహార్, సిక్కిం, అండమాన్- నికోబార్ దీవులలో కూడా భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది.ఉత్తరాఖండ్, తూర్పు ఉత్తరప్రదేశ్, తూర్పు రాజస్థాన్‌లోని కొన్ని ప్రాంతాల్లో తేలికపాటి నుండి ఓ మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉంది. కేరళ, కోస్టల్ కర్నాటక, లక్షద్వీప్ తదితర దక్షిణాది ప్రాంతాలలో తేలికపాటి నుండి ఓ మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉంది, తమిళనాడు, ఆంధ్రప్రదేశ్, తెలంగాణలోని కొన్ని ప్రాంతాల్లో వర్షాలు కురిసే అవకాశం ఉంది. గుజరాత్లో భారీ వర్షాలు కురుస్తున్నాయి.సెంట్రల్ పొల్యూషన్ కంట్రోల్ బోర్డ్ అందించిన డేటా ప్రకారం ఢిల్లీ ఎయిర్ క్వాలిటీ ఇండెక్స్ 106గా నమోదైంది. ఈ ఏడాది రుతుపవనాలు వారం రోజులు ఆలస్యంగా వచ్చాయి. రాజస్థాన్, గుజరాత్‌లలో రుతుపవనాల ఉపసంహరణ సెప్టెంబర్ 23 నుండి ప్రారంభమైంది. ఢిల్లీలో రుతుపవనాల ఉపసంహరణ సాధారణంగా సెప్టెంబర్ 25న జరుగుతుంది. అయితే ఈ సంవత్సరం గణనీయంగా ఆలస్యమవుతోంది.ఇది కూడా చదవండి: పెరిగిన గ్యాస్ సిలిండర్ ధర.. ఎంతంటే? -
ముంబైని మరోసారి ముంచెత్తనున్న భారీ వర్షాలు
ముంబై : మహరాష్ట్రకు వాతావరణ శాఖ మరోసారి హెచ్చరికలు జారీ చేసింది. మరోసారి భారీ వర్షాలు పడే అవకాశం ఉందని అంచనా వేసింది. రెండ్రోజుల క్రితం భారీ వర్షాలు ముంబై నగరాన్ని ముంచెత్తాయి. ఫలితంగా పలు ప్రాంతాలు జలమయమయ్యాయి. లోతట్టు ప్రాంతాలు నీట మునిగాయి. జనజీవనం స్తంభించి పోయింది. ఈ తరుణంలో శుక్రవారం మధ్యాహ్నం వాతావరణ శాఖ ముంబైకి మరోసారి హెచ్చరికలు జారీ చేసింది. బలమైన పశ్చిమ గాలుల కారణంగా శుక్రవారం ఓ మోస్తరు నుండి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది. శుక్రవారం నుంచి శనివారం ఉదయం 8గంటల వరకు ఎల్లో అలెర్ట్ జారీ చేసింది.ఈ సందర్భంగా పాల్ఘర్, రాయ్‌గఢ్ పరిసర జిల్లాలకు ఆరెంజ్ అలర్ట్ జారీ చేసినట్లు వాతావరణ శాఖ అధికారులు తెలిపారు. అంతేకాదు ముంబైలోని పలు ప్రాంతాల్లో భారీ నుండి అతి భారీ వర్షాలు, ఉరుములు, మెరుపులు, ఈదురు గాలులు వీచే అవకాశం ఉందని తెలుస్తోంది.👉చదవండి : సీఎం సార్.. కర్మ సిద్ధాంతం అంటే ఇదే కదా -
ముంబైలో వర్ష బీభత్సం
ముంబై: మహరాష్ట్రలో వర్ష బీభత్సం సృష్టిస్తుంది. బుధవారం సాయంత్రం నుంచి కురుస్తున్న భారీ వర్షానికి ముంబై రోడ్లు జలమయమయ్యాయి. ట్రాఫిక్ స్తంభించిపోయింది. వర్షం కారణంగా స్పైస్‌జెట్, విస్తారాతో పాటు పలు సంస్థలు విమానాలను దారి మళ్లించాయి. వాతావరణ శాఖ బుధవారం ఉదయం ముంబైతో పాటు పొరుగు జిల్లాలకు హెచ్చరిక జారీ చేసింది. భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని అంచనా వేసింది. వాతావరణ శాఖ హెచ్చరికల అనంతరం మధ్యాహ్నం నుంచి ముంబైలోని పలు శివారు ప్రాంతాలలో భారీ వర్ష పాతం నమోదైంది. ములుండ్ దాని పరిసరాల్లో భారీ వర్షంతో లోతట్టు ప్రాంతాలు నీట మునిగాయి. వాతావరణ శాఖ అధికారి సుష్మా నాయర్ మాట్లాడుతూ, ఉత్తర కొంకణ్ నుండి దక్షిణ బంగ్లాదేశ్ వరకు దక్షిణ ఛత్తీస్‌గఢ్ దాని పరిసర ప్రాంతాలలో తుఫాను ద్రోణి నడుస్తుందని చెప్పారు. ఫలితంగా ముంబై, థానే, రాయ్‌గఢ్, రత్నగిరి జిల్లాల్లో అత్యధిక వర్షపాతం నమోదు కావడంతో పాటు ఉరుములు, మెరుపులతో కూడిన ఈదురు గాలులతో భారీ వర్షం కురుస్తుందన్నారు. ఈ వారంలో కొంకణ్, గోవాలో దీని ప్రభావం ఎక్కువగా ఉందని ఆమె వావాతవరణ శాఖ అధికారి సుష్మా నాయర్ చెప్పారు. -
హైదరాబాద్‌కు మరోసారి భారీ వర్షసూచన
సాక్షి,హైదరాబాద్:రాజధాని హైదరాబాద్ నగరంలో వరుసగా మూడోరోజు ఆదివారం(సెప్టెంబర్22) భారీ వర్షం పడే ఛాన్సుందని వాతావరణశాఖ తెలిపింది.నాగోల్, బండ్లగూడ, ఉప్పల్, బోడుప్పల్, మీర్పేట్, ఎల్బీనగర్,దిల్సుఖ్నగర్ తదితర ప్రాంతాల్లో భారీ వర్షం పడనుందని వాతావరణశాఖ తెలిపింది.కాగా, శుక్ర,శనివారాలు సాయంత్రం భారీ వర్షం కురిసింది. ఈ వర్షానికి నగరంలో రోడ్లపై వరదలు పోటెత్తి ఎక్కడికక్కడ ట్రాఫిక్‌జామ్ అయింది. దీంతో వాహనదారులు గంటల తరబడి రోడ్లపై ట్రాఫిక్‌లో చిక్కుకుపోయారు. పలు చోట్ల విద్యుత్‌తీగలపై చెట్లు,ఫ్లెక్సీలు పడి విద్యుత్ అంతరాయాలు ఏర్పడ్డాయి. ఇదీ చదవండి: హైదరాబాద్‌లో కుండపోత వర్షం -
ఏపీకి మరో తుపాన్ ముప్పు!
సాక్షి, విశాఖపట్నం: ఈ నెలాఖరులో రాష్ట్రానికి తుపాను ముప్పు పొంచి ఉన్నట్లు వాతావరణ శాఖ నిపుణులు చెబుతున్నారు. ఉత్తర బంగాళాఖాతం, మధ్య బంగాళాఖాతం పరిసర ప్రాంతాల్లో ఈ నెల 24న ఏర్పడే అల్పపీడనం తీవ్రరూపం దాల్చి తుపానుగా మారే అవకాశాలు కనిపిస్తున్నాయని పేర్కొన్నారు. తుపానుగా మారితే.. ఉత్తరాంధ్రలో భారీ నుంచి అతి భారీ వర్షాలు, ఉభయగోదావరి, కృష్ణా, గుంటూరు జిల్లాల్లో భారీ వర్షాలు కురిసే అవకాశాలుంటాయని తెలిపారు. పశ్చిమ వాయువ్య దిశగా వీస్తున్న గాలుల ప్రభావంతో 20 నుంచి రాష్ట్రంలో వర్షాలు కురిసే సూచనలున్నాయని చెప్పారు. -
దేశంలో పలు రాష్ట్రాల్లో భారీ వర్షాలు
న్యూఢిల్లీ: దేశంలోని పలు రాష్ట్రాలు భారీ వర్షాలతో అతలాకుతలమవుతున్నాయి. బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం ప్రభావంతో పశ్చిమ బెంగాల్, ఒడిశా, తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, ఛత్తీస్‌గఢ్‌లోని వివిధ ప్రాంతాల్లో భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణశాఖ(ఐఎండీ) హెచ్చరికలు జారీచేసింది.కోస్తా ఆంధ్ర ప్రదేశ్‌లోని కొన్ని ప్రాంతాల్లో ఈరోజు(సోమవారం) భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ అంచనా వేసింది. ఛత్తీస్‌గఢ్‌లోని దక్షిణ ప్రాంతంలో సోమవారం భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది. రానున్న మూడు రోజుల్లో ఒడిశాలో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది. రాష్ట్రంలోని ఐదు జిల్లాల్లో ఐఎండీ రెడ్ అలర్ట్ ప్రకటించింది. మత్స్యకారులు సెప్టెంబర్ 11 వరకు సముద్రంలోకి వెళ్లవద్దని వాతావరణశాఖ అధికారులు సూచించారు.ఇది చదవండి: Surat: వినాయక మండపంపై రాళ్ల దాడి.. పలువురు అరెస్ట్ -
ఆంధ్రప్రదేశ్‌కు పొంచి ఉన్న మరో ముప్పు
సాక్షి, అమరావతి : భారీ వర్షంతో ఆంధ్రపద్రశ్కు భారీ ముంపు పొంచి ఉంది. రాష్ట్రంలో మరోసారి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ హెచ్చరించింది.రాష్ట్రంలో మరోసారి భారీ వర్షాలు కురవనున్నాయి. రానున్న 48గంటల్లో బంగాళాఖాతంలో మరో అల్పపీడనం ఏర్పడనుంది. ఉత్తర అండమాన్ సమీపంలో ఏర్పడనున్న ఈ అల్పపీడనం క్రమంగా తుఫానుగా మారే అవకాశం ఉంది.ఈ తుఫాను ఉత్తరాంధ్ర, దక్షిణ ఒడిశా తీరం దాటుతుందని వాతావరణ శాఖ అధికారులు అంచనా వేస్తున్నారు. వాయిగుండం సృష్టించిన విలయం మరువకముందే మరో తుఫాను గండం ముంచుకొస్తుండడంతో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అధికారులు సూచిస్తున్నారు. -
తెలంగాణ అంతటా మరోసారి భారీ వర్షాలు.. వాతావరణ శాఖ హెచ్చరిక
ఢిల్లీ: తెలుగు రాష్ట్రాల్లో వర్షం బీభత్సం సృష్టిస్తోంది. ఏకధాటిగా కురుస్తున్న వర్షంతో వాగులు, వంకలు పొంగి పొర్లుతున్నాయి. జనజీవనం అస్తవ్యస్థమైంది. లోతట్టు ప్రాంతాల్లో నీటి మునిగాయి. వర్షం బీభత్సంతో వాహనాలు సైతం కొట్టుకుపోతున్నాయి. పలువురు నీట మునిగి ప్రాణాలు పోగొట్టుకుంటున్నారు. మహబూబాబాద్‌లో కురస్తున్న భారీ వర్షాలకు ఇంటికన్నె-కేసముద్రం మధ్య రైల్వే ట్రాక్ ధ్వంసమైంది. ఫలితంగా రైళ్ల రాకపోకలు ఆగిపోయాయి. పరిస్థితుల్ని చక్కదిద్దేందుకు కేంద్ర హోంశాఖ ఆదేశాలకు ఎన్డీఆర్ఎఫ్ బృందాలు రంగంలోకి దిగాయి.ఈ నేపథ్యంలో ఆదివారం మధ్యాహ్నం ఐఎండీ గుజరాత్‌తో పాటు ఇప్పటికే వరదలతో అల్లాడుతున్న తెలంగాణా అంతటా భారీ వర్షాలు కురుస్తాయని ఐఎండీ హెచ్చరికలు జారీ చేసింది. బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం కారణంగా ఖమ్మం జిల్లా తిరుమలాయపాలెంలో 52 సెంటీమీటర్ల వర్షపాతం నమోదైంది. ఇది రాష్ట్రంలో ఈ సీజన్లో అత్యధిక వర్షపాతం. వరంగల్, మహబూబాబాద్, సూర్యాపేట జిల్లాల్లో 40 సెంటీమీటర్ల కంటే ఎక్కువ వర్షపాతం నమోదైంది. దీంతో లోతట్టు ప్రాంతాల్లో తీవ్ర నష్టం వాటిల్లింది. భారీ వర్షాల కారణంగా దక్షిణ మధ్య రైల్వే ఆదివారం రాష్ట్రంలో ప్రయాణించే పలు రైళ్లను రద్దు చేసి దారి మళ్లించింది. హైదరాబాద్‌లోనూ శనివారం ఉదయం 8.30 గంటల నుంచి ఆదివారం ఉదయం 8.30 గంటల వరకు భారీ వర్షం కురిసింది. 2020 వరదల మాదిరిగానే 30 సెం.మీ కంటే ఎక్కువ వర్షాలు కురిసే అవకాశం ఉన్న అనుకూల వాతావరణంతో నగరానికి ఉపశమనం కలిగినట్లు తెలిపింది.ఆదిలాబాద్, నిర్మల్, నిజామాబాద్, కామారెడ్డి మహబూబ్ నగర్, వనపర్తి, నారాయణపేట, గద్వాల్, ఆసిఫాబాద్, జగిత్యాల, భూపాలపల్లి, ములుగు, వరంగల్, హనుమకొండ, జనగాం సహా రాష్ట్రంలోని 15 జిల్లాల్లో ఆదివారం భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని ఐఎండీ అంచనా వేసింది. గుజరాత్లో సైతం1976 తర్వాత అరేబియా సముద్రంలో తొలిసారి తుపాను విధ్వంసం సృష్టిస్తోంది. గుజరాత్లో ఆగస్ట్ 25 నుంచి ఆగస్ట్ 29 వరకు కురిసింది. ఈ వర్షం ధాటికి 47 మంది మరణించారు. ఈ తరుణంలో ఆదివారం (సెప్టెంబర్1) వాతవారణ శాఖ మరోసారి హెచ్చరికలు జారీ చేసింది. ఈ రోజు నుంచి ప్రారంభమైన వర్షాలు సెప్టెంబర్ 5వరకు కొనసాగే అవకాశం ఉందని తెలిపింది. -
తెలంగాణలో రెండు రోజులపాటు వర్షాలు
సాక్షి,హైదరాబాద్: రుతుపవనాలు చురుగ్గా కదులుతుండటం, బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడన ప్రభావంతో శుక్ర,శనివారాల్లో తెలంగాణలో భారీ వర్షాలు కురిసే అవకాశాలున్నాయి. ఉరుములు, మెరుపులతో కూడిన వర్షాలు పడతాయని వాతావరణ కేంద్రం తెలిపింది. గంటకు 30 నుంచి 40 కిలోమీటర్ల వేగంతో గాలులు వీచే అవకాశం ఉంది.రాజధాని హైదరాబాద్ నగరంలో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే ఛాన్సుంది. ఆదిలాబాద్, కొమరంభీం ఆసిఫాబాద్, మంచిర్యాల, ములుగు, భద్రాద్రి కొత్తగూడెం, ఖమ్మం, సూర్యాపేట, మహబూబ్ నగర్, వనపర్తి, నారాయణపేట, జోగులాంబ గద్వాల్ జిల్లాలలో అక్కడక్కడ భారీ వర్షాలు కురిసే అవకాశం ఉండటంతో ఈ జిల్లాలకు ఎల్లో అలర్ట్ జారీ చేశారు. -
తెలంగాణలో ఐదు రోజుల పాటు వర్షాలు: ఐఎండీ
సాక్షి,హైదరాబాద్: జార్ఖండ్ పరిసర ప్రాంతాల్లో ఆవర్తనం కొనసాగుతోంది. ఆవర్తనం కారణంగా తెలంగాణలో వర్షాలు కురుస్తాయని వాతావరణశాఖ తెలిపింది.రాబోయే ఐదు రోజులపాటు తెలంగాణలో తేలికపాటి నుంచి మోస్తారు వర్షాలకు అవకాశం ఉందని వెల్లడించింది.కొమురంభీం ఆసిఫాబాద్, మంచిర్యాల, నిర్మల్, నిజామాబాద్, జగిత్యాల, రాజన్న సిరిసిల్ల, కరీంనగర్, పెద్దపల్లి, వికారాబాద్, సంగారెడ్డి, మెదక్, కామారెడ్డి, మహబూబ్‌నగర్, నాగర్ కర్నూల్, వనపర్తి జిల్లాల్లో వర్షం కురిసే అవకాశం ఉంది. -
హైదరాబాద్‌లో భారీ వర్షం.. రోజంతా వర్ష సూచన
సాక్షి,హైదరాబాద్: రాజధాని హైదరాబాద్ నగరంలో శుక్రవారం(ఆగస్టు16) మధ్యాహ్నం భారీ వర్షం కురిసింది. మణికొండ, పంజాగుట్ట, బంజారాహిల్స్, జూబ్లీహిల్స్, టోలిచౌకిలో వర్షం దంచికొట్టింది. దీంతో రోడ్లపై వాహనదారులు ఇబ్బందులు పడ్డారు. పలుచోట్ల ట్రాఫిక్‌జామ్ అయింది. నగరవ్యాప్తంగా క్యుములోనింబస్మేఘాలు కమ్ముకోవడంతో మధ్యాహ్నం నగరంలోని చాలా ప్రాంతాల్లో భారీ వర్షం పడే అవకాశముందని వాతావరణకేంద్రం తెలిపింది. అత్యవసర పనులు ఉంటేనే ఇళ్లలో నుంచి బయటికి రావాలని, నగరవాసులు అప్రమత్తంగా ఉండాలని జీహెచ్ఎంసీ సూచించింది.కాగా, గురువారం రాత్రి కురిసిన గాలివానకు నగరంలోని చాలా ప్రాంతాలు అతలాకుతలమైన విషయం తెలిసిందే. హైదరాబాద్ నగరంతో పాటు దక్షిణ తెలంగాణలోని పలు జిల్లాల్లోనూ భారీ వర్షాలు పడే ఛాన్సున్నట్లు సమాచారం. -
బిగ్ అలర్ట్.. ఈ తెలంగాణ జిల్లాలకు అత్యంత భారీ వర్షాలు
హైదరాబాద్, సాక్షి: తెలంగాణలో పది జిల్లాలకు ఆరెంజ్ అలర్ట్ ప్రకటించింది హైదరాబాద్ వాతావరణ కేంద్రం. మరో రెండ్రోజులపాటు ఈ జిల్లాల్లో భారీ నుంచి అత్యంత భారీ వర్షాలు ఉంటాయని తెలిపింది. దీంతో అధికార యంత్రాంగం అప్రమత్తమైంది. మరోవైపు రాజధాని హైదరాబాద్‌ను కూడా భారీ వర్షం ముంచెత్తే అవకాశం ఉందని తెలిపింది. భద్రాది కొత్తగూడెం, హనుమకొండ, జగిత్యాల, జయశంకర్ భూపాలపల్లి, ఖమ్మం, కొమరం భీమ్ ఆసిఫాబాద్, మహబూబాబాద్, మంచిర్యాల, ములుగు, వరంగల్ జిల్లాలకు ఆరెంజ్ అలర్ట్ జారీ చేసింది. రెండు నుంచి మూడు రోజులపాటు భారీ వర్ష సూచన ఉన్నట్లు పేర్కొంది. అలాగే బలమైన ఈదురుగాలులు వీచే అవకాశం ఉందని తెలిపింది. మరోవైపు ఇప్పటికే ఆ పది జిల్లాల్లో ఎడతెరిపి లేకుండా నిన్నటి నుంచి వర్షం కురుస్తూనే ఉంది. వాగులు, వంకలు పొంగుతున్నాయి. ఇక ఇవాళ(శనివారం) సాయంత్రం హైదరాబాద్ తో పాటు పరిసర జిల్లాల్లో సాయంత్రం భారీ వర్షం కురిసే అవకాశం ఉందని వాతావరణ కేంద్రం తెలిపింది. వాతావరణ శాఖ తాజా ప్రకటనతో జీహెచ్ఎంసీ యంత్రాంగం అప్రమత్తమైంది. -
అలర్ట్: తెలంగాణకు భారీ వర్ష సూచన
సాక్షి,హైదరాబాద్: తెలంగాణలో వచ్చే వారం నుంచి పది రోజులు వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ(ఐఎండీ) తెలిపింది. బంగాళాఖాతంలో కొనసాగుతున్న ఆవర్తనం ప్రభావంతో భారీ వర్షాలు కురుస్తాయని వెల్లడించింది.ఆవర్తనం బలపడిన కారణంగా సోమవారం రాష్ట్రంలోని పలు జిల్లాల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే ఛాన్స్ ఉందని తెలిపింది. భారీ వర్షాల నేపథ్యంలో నిజామాబాద్, వికారాబాద్, సంగారెడ్డి, మెదక్, కామారెడ్డి జిల్లాలకు వాతావరణశాఖ ఆరెంజ్ అలర్ట్ జారీ చేసింది. -
17 రాష్ట్రాల్లో దంచికొట్టుడు వానలు
దేశం అంతటా వివిధ ప్రాంతాల్లో భారీ వర్షాలు కురుస్తున్నాయి. తాజాగా గోవాలోని రైల్వే సొరంగ మార్గంలోకి నీరు చేరడంతో కొంకణ్ రైల్వే రూట్లో రాకపోకలు నిలిచిపోయాయి. మరోవైపు ఉత్తరాఖండ్‌లోని చమోలీ జిల్లాలోని పాతాళగంగ లాంగ్సీ టన్నెల్ సమీపంలో భారీగా కొండచరియలు విరిగిపడటంతో బద్రీనాథ్ జాతీయ రహదారిని మూసివేశారు. రానున్న మూడు, నాలుగు రోజుల పాటు 17 రాష్ట్రాల్లో భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ హెచ్చరికలు జారీ చేసింది.బీహార్, హిమాలయ, పశ్చిమ బెంగాల్, సిక్కిం, మేఘాలయలో భారీ వర్షాలు కురుస్తాయని అంచనా వేస్తూ భారత వాతావరణ శాఖ (ఐఎండీ) రెడ్ అలర్ట్ జారీచేసింది. తూర్పు ఉత్తరప్రదేశ్, తూర్పు మధ్యప్రదేశ్, గోవాలకు ఆరెంజ్ అలర్ట్ జారీ చేసింది. అదేవిధంగా జూలై 12-14 మధ్య మహారాష్ట్ర, కోస్టల్ కర్ణాటకలో భారీ వర్ష సూచనను అందిస్తూ ఆరెంజ్ అలర్ట్ జారీ చేసింది. పంజాబ్, హర్యానా, చండీగఢ్, ఢిల్లీలో జులై 11-13 వరకు ఉరుములు, మెరుపులతో కూడిన కుండపోత వర్షాలు కురుస్తాయని వాతావరణశాఖ హెచ్చరించింది. ఉత్తరాఖండ్, హిమాచల్ ప్రదేశ్, ఉత్తరప్రదేశ్, జమ్ముకశ్మీర్, లడఖ్, తూర్పు రాజస్థాన్ సహా దక్షిణ భారతదేశంలోని కొన్ని రాష్ట్రాల్లో రానున్న ఐదు రోజుల పాటు ఉరుములు, మెరుపులతో కూడిన భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది.హిమాచల్ ప్రదేశ్ రాజధాని సిమ్లా, మండీ, కాంగ్రా, కిన్నౌర్, కులు జిల్లాల్లో భారీ వర్షాల కారణంగా 28 రోడ్లపై ట్రాఫిక్ స్తంభించింది. 32 విద్యుత్ ట్రాన్స్ఫార్మర్లు, 16 నీటి సరఫరా ప్రాజెక్టులు నిలిచిపోయాయి. అసోంలోని 26 జిల్లాల్లో 17 లక్షల మందికి పైగా ప్రజలు వరదల ప్రభావానికి గురయ్యారు. రాష్ట్రంలో వరదల కారణంగా ఇప్పటి వరకు 84 మంది మృతి చెందారు. కొండచరియలు విరిగిపడటం, తుఫాను కారణంగా 13 మంది ప్రాణాలు కోల్పోయారు. కజిరంగా నేషనల్ పార్క్‌లో వరదల కారణంగా తొమ్మిది ఖడ్గమృగాలు సహా మొత్తం 159 వన్యప్రాణులు ప్రాణాలు కోల్పోయాయి. -
ముంబయిని ముంచెత్తుతున్న భారీ వర్షాలు
ముంబయి: మహారాష్ట్ర రాజధాని ముంబయి నగరాన్ని వర్షాలు ముంచెత్తుతున్నాయి. ఆదివారం రాత్రి నుంచి కురుస్తున్న భారీ వర్షానికి నగరంలోని ప్రధాన రోడ్లపై పలు చోట్ల నీరు నిలిచి ట్రాపిక్ జామ్ అయింది. పలు రూట్లలో లోకల్ రైలు సర్వీసులకు అంతరాయం కలిగింది. ట్రాక్‌పై చెట్లు పడిపోవడంతో కసారా-టిట్వాలా సెక్షన్లో రైళ్లను రద్దు చేశారు. నగరంలో మరో నాలుగు రోజుల పాటు భారీ వర్షాలు పడే ఛాన్సుందని భారత వాతావరణ శాఖ (ఐఎండీ) తెలిపింది. నగరంలో రోడ్లపై నీళ్లు నిలిచిన వీడియోలను పలువురు ముంబైకర్లు సోషల్ మీడియాలో షేర్ చేస్తున్నారు. -
ఏపీలో రుతుపవనాలకు స్వల్ప విరామం!
విశాఖపట్నం: ఆంధ్రప్రదేశ్‌లో నైరుతి రుతుపవనాల కదలికలో స్వల్ప విరామం చోటుచేసుకుంది. జూలై 6 వరకు ఏపీలో ఉష్ణోగ్రతలు పెరగనున్నట్లు వాతావరణ శాఖ వెల్లడించింది. కొన్ని ప్రాంతాల్లో నాలుగు నుంచి ఐదు డిగ్రీల సెల్సియస్ అధికంగా ఉష్ణోగ్రత నమోదు కానున్నాయి. నిన్న(మంగళవారం) బాపట్లలో 35.8, మచిలీపట్నంలో 35.6, తునిలో 35.5 విశాఖ ఎయిర్‌పోర్టు 34.8 డిగ్రీ సెల్సియస్ ఉష్ణోగ్రత నమోదైంది. ఈరోజు( బుధవారం) కోస్తా జిల్లాల్లో అక్కడక్కడ ఆకాశం మేఘావృతమై తేలికపాటి వర్షాలు కురిసే అవకాశం ఉంది. గంటకు 30 నుంచి 40 కిలోమీటర్ల వేగంతో తీరం వెంబడి గాలులు వీస్తున్నాయని అధికారులు తెలిపారు.దేశమంతా నైరుతి రుతుపవనాలు విస్తరించాయి. నిన్న(మంగళవారం) రాజస్థాన్, హర్యానా, పంజాబ్ రాష్ట్రాల అంతట నైరుతి రుతుపవనాలు విస్తరించినట్లు భారత వాతావరణ శాఖ తెలిపింది. వారం రోజుల ముందుగానే దేశం మొత్తం నైరుతి రుతుపవనాలు విస్తరించినట్లు వాతావరణ అధికారులు వెల్లడించారు.Southwest monsoon covered the entire country on 2nd July 2024. pic.twitter.com/d0QTxAP6Ps— मौसम विज्ञान केंद्र जयपुर (@IMDJaipur) July 2, 2024 ఈ నెల 8వ తేదీన దేశవ్యాప్తంగా విస్తరించాల్సిన నైరుతి రుతుపవనాలు వారం రోజుల ముందుగా జూలై 2న విస్తరించాయి. ఈసారి నైరుతి రుతుపవనాలు రెండు మూడురోజు ముందుగానే దేశంలోకి ప్రవేశించాయి. మే30వ తేదీన నైరుతి రుతుపవనాలు కేరళలో ప్రవేశించాయి. ఇక.. మరో నాలుగైదు రోజుల పాటు వాయువ్య, తూర్పు ఈశాన్య భారతంలో నైరుతి రుతుపవనాలు కదులుతాయని వాతావరణ శాఖ పేర్కొంది. -
భారీ వర్షాలు.. ఏడు రాష్ట్రాలకు రెడ్ అలర్ట్
న్యూఢిల్లీ: ఉత్తర భారతాన్ని భారీ వర్షాలు ముంచెత్తుతున్నాయి. ఏకధాటిగా కురుస్తున్న వర్షాలకు లోతట్టు ప్రాంతాలు మునిగిపోతున్నాయి. వరదల ధాటికి పలు చోట్ల రోడ్డు రవాణా స్తంభిస్తోంది. భారీ వర్షాలు మరికొన్ని రోజులపాటు కొనసాగే అవకాశాలున్నాయని భారత వాతావరణశాఖ(ఐఎండీ) సోమవారం(జులై )1 వెల్లడించింది.వర్షాలు ఎక్కువగా కురిసే అవకాశమున్న ఏడు రాష్ట్రాల్లో ఐఎండీ రెడ్ అలర్ట్ జారీ చేసింది. అరుణాచల్‌ప్రదేశ్, త్రిపుర, పశ్చిమబెంగాల్, సిక్కిం, గుజరాత్, అస్సాం, మేఘాలయ రాష్ట్రాల్లో 4వ తేదీ వరకు రెడ్ అలర్ట్ అమలులో ఉంటుందని తెలిపింది. మోస్తరు వర్షాలు కురిసే ఛాన్సున్న హిమాచల్‌ప్రదేశ్, ఉత్తరాఖండ్, పంజాబ్, హరియాణా, ఉత్తర్‌ప్రదేశ్, రాజస్థాన్, బిహార్, తమిళనాడు, మహారాష్ట్ర, గోవా తదితర రాష్ట్రాల్లో ఆరెంజ్ అలర్ట్ జారీ చేసింది. వచ్చే నాలుగైదు రోజుల్లో దేశంలోని వాయవ్య, తూర్పు, ఈశాన్య ప్రాంతాల్లో నైరుతి రుతుపవనాలు మరింత చురుగ్గా కదిలే అవకాశం ఉందని ఐఎండీ వెల్లడించింది. -
14 రాష్ట్రాలకు భారీ వర్షసూచన
ఢిల్లీ ఎన్సీఆర్తో సహా దేశంలోని పలు రాష్ట్రాల్లో వర్షం కారణంగా వాతావరణం ఆహ్లాదకరంగా మారింది. కర్ణాటక, అరుణాచల్ ప్రదేశ్, అసోం, మేఘాలయ, కేరళ,తమిళనాడు, పుదుచ్చేరి, మహారాష్ట్ర, గోవా, ఒడిశా, అండమాన్ నికోబార్ దీవుల్లో భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ తెలిపింది. రాగల 24 గంటల్లో దేశంలోని 14 రాష్ట్రాల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని పేర్కొంది. కొన్ని రాష్ట్రాల్లో 115.5 నుంచి 204.4 మి.మీ. వర్షపాతం నమోదయ్యే అవకాశం ఉందని వాతావరణశాఖ అంచనా వేసింది. ఈ సమయంలో బలమైన గాలులు కూడా వీచే అవకాశాలున్నాయని తెలిపింది.సోమవారం సాయంత్రం ఢిల్లీలో ఆకాశం మేఘావృతమై, పలు ప్రాంతాల్లో తేలికపాటి వర్షం కురిసింది. మంగళవారం ఉరుములతో కూడిన తేలికపాటి వర్షం కురుస్తుందని, బలమైన గాలులు వీస్తాయని వాతావరణ శాఖ అంచనా వేసింది. గరిష్ట ఉష్ణోగ్రత 40 డిగ్రీల సెల్సియస్ , కనిష్ట ఉష్ణోగ్రత 31 డిగ్రీల సెల్సియస్‌గా ఉండి, చిరుజల్లులు కురిసే అవకాశం ఉందని తెలిపింది.దేశంలో కొన్ని రాష్ట్రాలకు వాతావరణశాఖ హీట్‌వేవ్ హెచ్చరికను కూడా జారీ చేసింది. పంజాబ్, బీహార్‌లోని వివిధ ప్రాంతాల్లో అత్యధిక ఉష్ణోగ్రతలు నమోదవుతాయని తెలిపింది. గత 24 గంటల్లో జైసల్మేర్ (పశ్చిమ రాజస్థాన్)లో అత్యధికంగా 45.0 డిగ్రీల సెంటీగ్రేడ్ గరిష్ట ఉష్ణోగ్రత నమోదైంది. హర్యానా-చండీగఢ్-ఢిల్లీ, ఎన్సీఆర్, తూర్పు యూపీ, బీహార్‌లోని వివిధ ప్రాంతాల్లో 38 నుంచి 40 డిగ్రీల సెల్సియస్ మధ్య ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయని వాతావరణ శాఖ వివరించింది. -
ముంబైని ముంచెత్తిన భారీ వర్షం
ముంబై: దేశ ఆర్థిక రాజధాని ముంబైని శనివారం(జూన్22) సాయంత్రం భారీ వర్షం ముంచెత్తింది. దీంతో ముంబై వాసులకు వేసవి వేడి నుంచి పూర్తి ఉపశమనం దొరికినట్లయింది. పశ్చిమ తీరం వెంబడి రానున్న నాలుగైదు రోజుల్లో భారీ వర్షాలు కురుస్తాయని భారత వాతావరణ శాఖ ఇప్పటికే ప్రకటించింది. కర్ణాటక, కేరళ,గోవాలకు ఐఎండీ ఏకంగా రెడ్అలర్ట్ ప్రకటించింది. ఒడిషాకు ఆరెంజ్ అలర్ట్ ప్రకటించింది. రానున్న ఐదు రోజుల్లో ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, తమిళనాడు, పుదుచ్చేరి, యానాంలకు తేలికపాటి నుంచి ఓ మోస్తరు వర్షాలు కురవొచ్చని ఐఎండీ వెల్లడించింది. -
హీట్‌వేవ్ ముగిసింది.. ఇక వానలే వానలు
న్యూఢిల్లీ: ఉత్తరభారతానికి భారత వాతావరణశాఖ(ఐఎండీ) గుడ్‌న్యూస్ చెప్పింది. జూన్ 23-25 తేదీల మధ్య అధిక ఉష్ణోగ్రతలు పూర్తిగా తగ్గుముఖం పడతాయని తెలిపింది. ప్రస్తుతం ఉత్తరప్రదేశ్‌లోని కొన్ని ప్రాంతాల్లో మాత్రం 40కిపైగా డిగ్రీల ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయని వెల్లడించింది. పశ్చిమతీరంలో భారీ వర్షాలు పడే అవకాశముందని రెడ్ అలర్ట్ జారీ చేసింది. రానున్న నాలుగైదు రోజుల్లో కేరళ, కర్ణాటక, మహారాష్ట్ర,గోవాల్లో భారీ వర్షాలు పడే అవకాశముందని తెలిపింది. వెస్ట్‌బెంగాల్, ఒడిశా, జార్ఖండ్, బిహార్లలో భారీ వర్షాలతో పాటు బంగాళాఖాతం నుంచి బలమైన గాలులు వీయనున్నాయని వెల్లడించింది. -
రుతుపవనాలపై ‘ఐఎండీ’ కీలక ప్రకటన
న్యూఢిల్లీ: దేశంలో ఈ సీజన్లో ఇప్పటివరకు సాధారణం కంటే సగటున 20 శాతం వర్షాలు తక్కువగా పడ్డాయని భారత వాతావరణశాఖ(ఐఎండీ) తెలిపింది. మధ్య భారతంలో 29 శాతం వర్షపాతం తక్కువగా నమోదవగా దక్షిణాది రాష్ట్రాల్లో మాత్రం సాధారణం కంటే 17 శాతం అధిక వర్షపాతం నమోదైంది. వాయువ్య రాష్ట్రాల్లో ఏకంగా సాధారణం కంటే 68 శాతం తక్కువ వర్షపాతం రికార్డవగా ఈశాన్య రాష్ట్రాల్లో మాత్రం 20 శాతం తక్కువ వర్షం పడింది. సాధారణంగా జూన్ 1 నుంచి జులై 8వ తేదీ దాకా రుతుపవనాలు దేశవ్యాప్తంగా విస్తరించే క్రమంలో పడే వర్షాలను సమ్మర్ వర్షాలుగా పిలుస్తారు. ఇవి రైతులు విత్తనాలు విత్తుకునేందుకు కీలకమైన వర్షాలు. ‘రుతుపవనాల విస్తరణకు కాస్త బ్రేక్ పడింది. అవి కాస్త బలహీనమయ్యాయి. అయితే అవి ఎప్పుడు బలపడతాయో అప్పుడు కొద్ది సమయంలోనే కుండపోత వర్షాలు కురుస్తాయి’అని ఐఎండీ అధికారి ఒకరు తెలిపారు. -
నార్త్‌లో ఎండలు.. సౌత్‌లో వర్షాలు
సాక్షి,ఢిల్లీ: దేశంలో విచిత్ర వాతావరణ పరిస్థితులు నెలకొన్నాయి. ఉత్తరాదిన భానుడు భగభగలాడుతుండగా దక్షిణాదిన వర్షాలు పడుతూ వాతావరణం చల్లగా మారింది. ఉత్తరాదిలో ముఖ్యంగా రాజధాని ఢిల్లీలో హీట్‌వేవ్ జూన్ 14వరకు కొనసాగుతుందని భారత వాతావరణశాఖ(ఐఎండీ) వెల్లడించింది.గరిష్ట ఉష్ణోగ్రతలు 47 డిగ్రీల సెంటిగ్రేడ్ దాటవచ్చని తెలిపింది. ఎల్లో అలర్ట్ జారీ చేసింది. ఎండల ధాటికి ఢిల్లీలో జనం బయటికి రావాలంటేనే జడుస్తున్నారు. ఢిల్లీతో పాటు హర్యానా, ఉత్తరప్రదేశ్, బీహార్, ఛత్తీస్‌గఢ్‌లోనూ ఎండలు మండిపోతున్నాయి. ఇక్కడ పలు జిల్లాల్లో గరిష్ట ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. -
మూడు రోజులు తేలికపాటి వర్షాలు
సాక్షి, విశాఖపట్నం: రాష్ట్రంలో మరో మూడు రోజులు తేలికపాటి వర్షాలు కురవనున్నాయి. ప్రస్తుతం దిగువ ట్రోపో ఆవరణంలో దక్షిణ, నైరుతి దిశ నుంచి గాలులు వీస్తున్నాయి. మరోవైపు నైరుతి రుతుపవనాలు కోస్తాంధ్రలోని విస్తరిస్తున్నాయి. ఫలితంగా కోస్తాంధ్ర, రాయలసీమల్లో వచ్చే మూడు రోజులు అక్కడక్కడా తేలికపాటి వానలు కురిసే అవకాశాలున్నాయి. ఉరుములు, మెరుపులతోపాటు పిడుగులు కూడా సంభవిస్తాయని ఐఎండీ తెలిపింది. ఆదివారం విజయనగరం, పార్వతీపురం మన్యం, అల్లూరి సీతారామరాజు, కర్నూలు, నంద్యాల, అనంతపురం జిల్లాల్లో పిడుగులు పడే ప్రమాదం ఉందని, ఆయా ప్రాంతాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని రాష్ట్ర విపత్తుల నిర్వహణ సంస్థ హెచ్చరించింది. కాగా.. శనివారం ఉదయం నుంచి రాత్రి వరకు ప్రకాశం జిల్లా బెస్తవారిపేటలో అత్యధికంగా 3.6 సెం.మీ., దుత్తలూరు (నెల్లూరు) 3.2, యాడికి (అనంతపురం) 2.8 సెం.మీ. వర్షపాతం నమోదైంది. -
అంచనాల కంటే ముందే.. రైతులకు గుడ్ న్యూస్
న్యూఢిల్లీ, సాక్షి: నైరుతి రుతుపవనాలు కేరళ తీరాన్ని తాకాయని గురువారం ప్రకటించిన భారత వాతావరణ శాఖ.. మరో చల్లని వార్త చెప్పింది. అనుకున్న తేదీ కన్నా ముందే పలు ప్రాంతాల్లోకి ఇవి ప్రవేశించే సూచనలు కనిపిస్తున్నాయని తాజాగా వెల్లడించింది. ఇప్పటికే త్రిపుర, మేఘాలయ, అస్సాం, పశ్చిమబెంగాల్, సిక్కిం రాష్ట్రాల్లోకి రుతుపవనాలు ప్రవేశించాయి. లక్షద్వీప్, కేరళ, కర్ణాటక, తమిళనాడు సహా పలు ప్రాంతాల్లోకి ముందే ప్రవేశించే పరిస్థితులు కనిపిస్తున్నాయి. సాధారణంగా జూన్ 1వ తేదీన నైరుతి రుతుపవనాలు కేరళలోకి ప్రవేశిస్తాయి. ఆ తర్వాత జూన్ 5 నాటికి అరుణాచల్ ప్రదేశ్, త్రిపుర, నాగాలాండ్, మేఘాలయ, మిజోరం, మణిపుర్, అస్సాం రాష్ట్రాలకు చేరుకుంటాయి. అయితే.. ఇదీ చదవండి: ఏపీలో పలుచోట్ల భారీ వర్షంఈసారి రుతుపవనాల ఆగమనం సమయంలోనే బంగాళాఖాతంలో రెమాల్ తుపాను ఏర్పడింది. ఇది రుతుపవనాల గమనాన్ని బలంగా లాగిందని, అందుకే నిర్ణీత సమయానికంటే ముందుగానే అవి ఈశాన్య రాష్ట్రాలకు చేరుకున్నాయని వాతావరణ శాస్త్రవేత్తలు వివరించారు.వ్యవసాయ ఆధారిత ఆర్థిక వ్యవస్థకు జీవనాడిగా నైరుతి రుతుపవనాలను పేర్కొంటారు. మరోవైపు తెలుగు రాష్ట్రాలకు కూడా జూన్ 5వ తేదీలోపే రుతుపవనాలు చేరతాయని వాతావరణ శాఖ తెలిపింది. అయితే ఈలోపు ప్రీ మాన్ సూన్ వల్ల అత్యధిక ఉష్ణోగ్రతలు నమోదు అవుతాయని తెలిపింది. అక్కడక్కడా వర్షాలు పడ్డప్పటికీ.. మరో మూడు రోజులపాటు అధిక ఉష్ణోగ్రతలు నమోదు అవుతాయని ఐఎండీ హెచ్చరించింది. -
ఢిల్లీలో రికార్డ్ టెంపరేచర్ సెన్సార్ తప్పిదమే: ఐఎండీ
న్యూఢిల్లీ: ఢిల్లీ సమీపంలోని ముంగేశ్‌పూర్‌లో దేశ చరిత్రలోనే అత్యధిక ఉష్ణోగ్రత నమోదైందంటూ వచ్చిన వార్తలు కలకలం రేపాయి. ఆ వార్తలుపై తాజాగా ఐఎండీ స్పందించింది. బుధవారం మధ్యాహ్నం 2.30 సమయంలో 52.9 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదైనట్టు వచ్చిన వార్తల్లో వాస్తవం లేదని పేర్కొంది. కేవలం సెన్సార్ తప్పదం వల్లనే అత్యధికంగా ఉష్ణోగత్ర నమోదైట్లు ఐఎండీ తెలిపింది. డేటా తప్పుగా చూపించిన సెన్సార్ లోపాలపైన పరిశీలన చేస్తున్నామని ఐఎండీ తెలిపింది.Record 52.9 degrees Celsius in Delhi's Mungeshpur was "error in sensor": IMDRead @ANI Story | https://t.co/jd07Ywo0dT#IMD #Mungeshpur pic.twitter.com/WsKBmDF9OP— ANI Digital (@ani_digital) May 29, 2024 52.9 డిగ్రీలన్నది అధికారికంగా నిర్ధారణ కాలేదని కేంద్ర మంత్రి కిరణ్ రిజజు నిన్న స్పష్టం చేసిన విషయం తెలిసిందే. ‘‘ఢిల్లీలో అంత ఉష్ణోగ్రత నమోదైందంటే నమ్మశక్యంగా లేదు. వాస్తవమేమిటో తెలుసుకోవాలని ఐఎండీ అధికారులకు సూచించాం. దీనిపై త్వరలో స్పష్టత వస్తుంది’’ అంటూ ఆయన ‘ఎక్స్’లో పోస్టు చేశారు. దాంతో నిజానిజాలను పరిశీలిస్తున్నట్టు ఐఎండీ డైరెక్టర్ జనరల్ ఎం.మహాపాత్ర తెలిపారు. ‘‘డేటాలో తప్పులు దొర్లి ఉండొచ్చు. అంతటి ఉష్ణోగ్రత నిజమే అయితే స్థానిక పరిస్థితులేవైనా కారణమై ఉండొచ్చు అని అన్నారు. ఇక.. ముంగేశ్‌పూర్ వాతావరణ కేంద్ర సెన్సర్లను స్పెషలిస్టుల బృందం నిశితంగా అధ్యయనం చేస్తోంది’’ అని వివరించారు. బుధవారం రాజస్తాన్‌లోని ఫలోదీలో 51 డిగ్రీలు, పరిసర ప్రాంతాల్లో 50.8 డిగ్రీలు, హరియాణాలోని సిర్సాలో 50.3 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదైంది. ఢిల్లీలోని నజఫ్గఢ్లో 49.1 డిగ్రీలు, పుసాలో 49, నరేలాలో 48.4 డిగ్రీలు నమోదైంది. ఢిల్లీలోని సఫ్దర్జంగ్లో ప్రాంతంలో 46.8 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదైంది. -
మండిపోయిన ఢిల్లీ.. దేశ చరిత్రలోనే అత్యధిక ఉష్ణోగ్రత
సాక్షి,ఢిల్లీ: దేశ రాజధాని ఢిల్లీలో భానుడు నిప్పులు కురిపిస్తున్నాడు. ఇప్పటివరకు కనీవినీ ఎరుగని రీతిలో ఢిల్లీ వాసులకు హీట్‌వేవ్ సెగ తలుగుతోంది. రికార్డు స్థాయి ఉష్ణోగ్రతలతో రాజధాని వాసులు బెంబేలెత్తుతున్నారు.భారత వాతావరణ శాఖ(ఐఎండీ) తెలిపిన వివరాల ప్రకారం ఢిల్లీ మంగేశ్‌పూర్ బుధవారం (మే29) మధ్యాహ్నం 2.30 గంటలకు రికార్డు స్థాయిలో 52.3 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదైంది. దేశచరిత్రలో ఇప్పటివరకు నమోదైన అత్యధిక ఉష్ణోగ్రత ఇదే. మరోపక్క ఎండ వేడిమి తట్టుకోలేక ఉపశమనం కోసం ఢిల్లీ వాసులు కూలర్లు, ఏసీలు రికార్డుస్థాయిలో వినియోగిస్తున్నారు. దీంతో ఢిల్లీలో ఎప్పుడూ లేనంతగా విద్యుత్ వినియోగం 8302 మెగావాట్లకు చేరింది. ఢిల్లీతో పాటు రాజస్థాన్‌లోనూ 50 డిగ్రీల ఉష్ణోగ్రత రియల్ ఫీల్ పరిస్థితులు నెలకొన్నాయి.అంతలోనే వర్షం...ఓ పక్క దేశచరిత్రలోనే అత్యధిక ఉష్ణోగ్రతలు నమోదైన కొద్ది సేపటికే ఢిల్లీలో అకస్మాత్తుగా వర్షం పడింది. అరేబియా సముద్రంలో అల్పపీడనం, పశ్చిమ దిశగా వీస్తున్న గాలుల ప్రభావంతో వాతావరణం ఒక్కసారిగా మారిపోయింది. కొద్దిసేపు ఢిల్లీలో చిరు జల్లులు కురిశాయి. -
ఐదు రోజుల్లో కేరళకు రుతుపవనాలు
తిరువనంతపురం: వాతావరణ శాఖ(ఐఎండీ) గుడ్‌న్యూస్ చెప్పింది. నైరుతి రుతుపవనాలు మరో 5 రోజుల్లో కేరళను తాకేందుకు అనుకూల పరిస్థితులు ఏర్పడనున్నాయని తెలిపింది. కేరళను తాాకిన తర్వాత రుతుపవనాలు సకాలంలో తర్వాత దేశమంతా విస్తరించేందుకు అవకాశాలున్నాయని పేర్కొంది. ఈసారి దేశంలో సాధారణం, సాధారణం కంటే ఎక్కువ వర్షాలు పడనున్నాయని తెలిపింది. ఈశాన్యంలో మాత్రం సాధారణం కంటే తక్కువ వర్షాలు పడతాయని వెల్లడించింది. రానున్న ఐదురోజుల్లో పశ్చిమ తీరంతో పాటు తమిళనాడు, పుదుచ్చేరి, కారైకల్, కోస్తాంధ్ర, తెలంగాణ, రాయలసీమ, కర్ణాటకల్లో ఓ మోస్తరు వర్షాలు కురుస్తాయని తెలిపింది. అయితే రాజస్థాన్, పంజాబ్, హర్యానా, ఢిల్లీల్లో హీట్‌వేవ్ పరిస్థితులు ఈ నెలాఖరువరకు కొనసాగుతాయని తెలిపింది. -
Cyclone Remal: ‘రెమాల్’తో బెంగాల్ అతలాకుతలం
కోల్‌కతా: తీవ్ర తుపాను ‘రెమాల్’ ధాటికి పశ్చిమబెంగాల్ అతలాకుతలమవుతోంది. దీని ప్రభావంతో గంటకు 110–120 కిలోమీటర్ల వేగంతో బలమైన గాలులు వీస్తాయని వాతావరణ శాఖ తెలిపింది. బెంగాల్ తీరప్రాంత జిల్లాల్లో అత్యంత భారీ వర్షాలు కురిసే అవకాశాలున్నాయని, కోల్‌కతా పరిసర ప్రాంతాల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు పడతాయని వివరించింది. తీరప్రాంతాల నుంచి 1.1 లక్షల మందిని ఆదివారం యంత్రాంగం సురక్షిత ప్రాంతాలకు తరలించింది. రెమాల్తో నష్టం తక్కువేనని వాతావరణ శాఖ అధికారి ఒకరు తెలిపారు. ఉత్తర, దక్షిణ పరగణాల జిల్లాల్లోని బలహీన నిర్మాణాలు, విద్యుత్, సమాచార వ్యవస్థలు, కచ్చా రోడ్లు, పంటలు, తోటలకు నష్టం వాటిల్లవచ్చని చెప్పారు. తుపాను హెచ్చరికల నేపథ్యంలో ఈస్టర్న్, సౌత్ ఈస్టర్న్ రైల్వేలు ఆది, సోమవారాల్లో కొన్ని రైళ్లను రద్దు చేశాయి. కోల్‌కతా విమానాశ్రయం అధికారులు ఆదివారం మధ్యాహ్నం నుంచి 21 గంటలపాటు బయలుదేరాల్సిన, రావాల్సిన 394 సరీ్వసులను రద్దు చేశారు. పోలీసులు, ఫైర్ సిబ్బందితోపాటు ఎన్డీఆర్ఎఫ్, ఎస్డీఆర్ఎఫ్ బృందాలను అప్రమత్తం చేశారు. బెంగాల్‌తోపాటు ఉత్తర ఒడిశాలో 26, 27వ తేదీల్లో తుపాను ప్రభావంతో అతి భారీ వర్షాలు పడతాయని వాతావరణ శాఖ తెలిపింది. అస్సాం, మేఘాలయ, మణిపూర్, త్రిపుర, అరుణాచల్ ప్రదేశ్, నాగాలాండ్ తుపాను ప్రభావం తీవ్రంగానే ఉంటుందని అంచనా వేసింది. రక్షణ, సహాయక కార్యక్రమాల సన్నద్ధతపై అధికారులతో ప్రధాని మోదీ ఆదివారం సమీక్ష జరిపారు.బంగ్లాదేశ్‌లో...బంగ్లాదేశ్‌లోని పేరా, మోంగ్లా పోర్టుల్లో అత్యంత ప్రమాద 10వ నంబర్ హెచ్చరికను, కోక్స్ బజార్, చిట్టోగ్రామ్లలో 9వ నంబర్ హెచ్చరికలను ఎగురవేశారు. అలలు సాధారణం కంటే 8 నుంచి 12 అడుగుల వరకు ఎత్తులో ఎగసిపడుతున్నాయి. 8 లక్షల మందిని సురక్షిత ప్రాంతాలకు తరలించారు. చిట్టగాంగ్ ఎయిర్‌పోర్టులో విమాన సరీ్వసులను రద్దు చేశారు. -
‘మధ్యాహ్నం 12 నుంచి 3 వరకూ బయటికెళ్లొద్దు’
ఢిల్లీ-ఎన్సీఆర్తో సహా ఉత్తర భారతదేశం అంతటా వేడిగాలులుల వీస్తున్నాయి. మరికొద్ది రోజుల పాటు ఢిల్లీలో వేడిగాలులు విధ్వంసం సృష్టించే అవకాశం ఉందని వాతావరణ శాఖ అంచనా వేసింది. వాతావరణ శాఖ తెలిపిన వివరాల ప్రకారం మే 28 వరకు ఢిల్లీ, పంజాబ్, హర్యానా, చండీగఢ్‌లలో వేడిగాలుల ప్రభావం కనిపిస్తుంది. అలాగే జమ్మూ, హిమాచల్ ప్రదేశ్, పశ్చిమ ఉత్తరప్రదేశ్, తూర్పు మధ్యప్రదేశ్, మధ్య మహారాష్ట్ర, గుజరాత్‌లలోనూ అత్యధిక ఉష్ణోగ్రతలు నమోదుకానున్నాయి.వాతావరణ శాఖ తెలిపిన వివరాల ప్రకారం గడచిన శనివారం ఢిల్లీలో ఉష్ణోగ్రత 46.9 డిగ్రీల సెల్సియస్‌గా నమోదయ్యింది. ఇది సాధారణం కంటే 7 డిగ్రీల అధికం. రానున్న నాలుగు రోజుల్లో ఢిల్లీ ఎన్సీఆర్తో సహా ఉత్తర భారతదేశంలోని పలు ప్రాంతాల్లో వేడిగాలుల వీయనున్న కారణంగా వాతావరణ శాఖ రెడ్ అలర్ట్ ప్రకటించింది.మే 28 వరకు రాజస్థాన్, ఢిల్లీ, పంజాబ్, హర్యానా, చండీగఢ్‌లలో రాత్రిపూట అధిక ఉష్ణోగ్రతలు నమోదయ్యే అవకాశం ఉందని వాతావరణ శాఖ అంచనా వేసింది. దేశంలోని పలు ప్రాంతాల్లో వేడిగాలులు వీయనున్న దృష్ట్యా ప్రజలు మధ్యాహ్నం 12 గంటల నుంచి 3 గంటల వరకు ఇళ్లలోనే ఉండాలని వాతావరణ శాఖ సూచించింది. ఆ సమయంలో వేడిగాలులు ఉధృతంగా ఉంటాయని, వడదెబ్బకు గురికాకుండా ఉండేందుకు ఇంట్లోనే ఉండడం ఉత్తమమని సలహా ఇచ్చింది. -
తెలంగాణలో దంచికొట్టనున్న వానలు.. హైదరాబాద్‌కు కుంభవృష్టి హెచ్చరిక!
హైదరాబాద్, సాక్షి: తెలంగాణలో రాబోయే నాలుగు రోజులు భారీ వర్షాలు కురవచ్చని హైదరాబాద్ వాతావరణ కేంద్రం అంచనా వేస్తోంది. వర్షాలు పడే సమయంలో గంటకు 40 నుంచి 50 కిలోమీటర్ల వేగంతో గాలులు వీస్తాయని తెలిపింది. కొన్నిచోట్ల మాత్రం ఈదురు గాలులతో కూడిన తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని వెల్లడించింది. అలాగే.. రాజధాని హైదరాబాద్ నగరంలో కుంభవృష్టి తప్పదని హెచ్చరిస్తూ యెల్లో అలర్ట్ జారీ చేసింది. వాతావరణ కేంద్రం హెచ్చరికలతో అధికార యంత్రాంగం వరుణ గండాన్ని ఎదుర్కొనేందుకు సిద్ధమవుతోంది. ఇదిలా ఉంటే.. పశ్చిమ విదర్భ దాని పరిసర ప్రాంతాల్లో సముద్ర మట్టానికి 0.9 కి.మీ ఎత్తులో ఆవర్తనం ఏర్పడిందని వాతావరణకేంద్రం తన ప్రకటనలో స్పష్టం చేసింది.నాలుగు రోజులు ఇలా.. 🌧️గురువారం(నేడు) ఆసిఫాబాద్, మంచిర్యాల, పెద్దపల్లి, భూపాలపల్లి, ములుగు, కొత్తగూడెం, ఖమ్మం, నల్గొండ, సూర్యాపేట, మహబూబాబాద్, వరంగల్, హన్మకొండ, జనగాం, యాదాద్రి భువనగిరి, రంగారెడ్డి, హైదరాబాద్, మేడ్చల్ మల్కాజ్గిరి, వికారాబాద్ సంగారెడ్డి, మెదక్, మహబూబ్‌నగర్, నాగర్ కర్నూల్, వనపర్తి, నారాయణపేట, జోగులాంబ గద్వాల జిల్లాల్లో గంటకు 40-50 కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలులు వీస్తూ.. ఉరుములు, మెరుపులతో కూడిన వర్షాలు కురిసే సూచనలున్నాయి.🌧️శుక్రవారం రోజున ఆదిలాబాద్, ఆసిఫాబాద్, నిర్మల్, నిజామాబాద్, జగిత్యాల, ములుగు, కొత్తగూడెం, ఖమ్మం, నల్గొండ, సూర్యాపేట, సిద్దిపేట, భువనగిరి, రంగారెడ్డి, హైదరాబాద్, మల్కాజ్గిరి, వికారాబాద్, సంగారెడ్డి, మెదక్, కామారెడ్డి, మహబూబ్‌నగర్, నాగర్ కర్నూల్, వనపర్తి, నారాయణపేట, జోగులాంబ గద్వాల జిల్లాల్లో అక్కడక్కడ వానలు పడే ఛాన్స్ ఉంది. 🌧️19, 20న తేదీల్లోనూ ఉరుములు, మెరుపులు, ఈదురుగాలులతో వర్షాలు కురిసే అవకాశాలున్నాయని వివరించింది. 🌧️వాతావరణ శాఖ అంచనాల ప్రకారమే.. బుధవారం కుమ్రంభీం ఆసిఫాబాద్, ఆదిలాబాద్, కామారెడ్డి, నిజామాబాద్‌తో పాటు పలు జిల్లాల్లో అక్కడక్కడ తేలికపాటి నుంచి మోస్తరు వర్షాపాతం నమోదైంది. -
Telangana: జూన్ మొదటి వారంలో నైరుతి
సాక్షి, హైదరాబాద్: రాష్ట్ర ప్రజలకు వాతావరణ శాఖ చల్లని కబురు చెప్పింది. గతేడాదితో పోలిస్తే ఈసారి రాష్ట్రంలో సంతృప్తికర వర్షాలు కురుస్తా యని తెలిపింది. జూన్ మొదటి వారంలోనే రాష్ట్రంలోకి నైరుతి రుతుపవనాలు ప్రవేశిస్తాయని పేర్కొంది. నైరుతి రుతుపవనాల సీజన్‌పై ప్రాథ మిక అంచనాలను వాతావరణ శాఖ విడుదల చేసింది. ‘సాధారణంగా మే నెల చివరి వారంలో దక్షిణ అండమాన్ సముద్రంలోకి నైరుతి రుతుప వనాలు ప్రవేశిస్తాయి. ఆ తర్వాత రెండు వారాల్లో కేరళను తాకిన తర్వాత క్రమంగా ఇతర ప్రాంతాలకు వ్యాప్తి చెందుతాయి. కానీ ఈ సీజన్లో కాస్త ముందుగానే దక్షిణ అండమాన్ సముద్రంలోని నైరుతి రుతుపవనాలు ప్రవేశించే పరిస్థితు లు ఎక్కువగా ఉన్నాయి. ఈ క్రమంలో జూన్ ఒకటో తేదీన కేరళను తాకుతాయి. అవి క్రమంగా వ్యాప్తి చెంది ఆరు రోజుల్లో తెలంగాణలోకి ప్రవే శిస్తాయి..’ అని వాతావరణ శాఖ వెల్లడించింది. ఎల్‌నినో బలహీనపడే అవకాశం‘ఈ ఏడాది జూన్ నుంచి సెప్టెంబర్ మధ్యన నైరుతి రుతుపవనాల సీజన్లో వర్షాలు ఆశాజనకంగా ఉంటాయి. గతేడాది కంటే కాస్త ఎక్కువ వర్షాలు కురిసే అవకాశం ఉంది. ప్రస్తుతం భూమధ్యరేఖ పసిఫిక్ ప్రాంతంలో మధ్యస్థ ఎల్‌నినో పరిస్థితులు నెలకొని ఉన్నాయి. నైరుతి సీజన్ ప్రారంభంలో ఎల్‌నినో పరిస్థితులు బలహీనపడే అవకాశం ఎక్కువగా ఉన్నాయి. దీంతో వర్షపాతం సాధారణం కంటే ఎక్కువగా ఉంటుంది. రాష్ట్రంలో నైరుతి రుతు పవనాల సీజన్లో కురవాల్సిన సాధారణ వర్ష పాతం 72.21 సెంటీమీటర్లు. గత 2021, 2022 సీజన్లలో సాధారణం కంటే 40 శాతం అధిక వర్షాలు నమోదయ్యాయి. అయితే 2023 నుంచి ఎల్‌నినో ప్రభావంతో వర్షపాతం ఒక్కసారిగా తగ్గింది. గతేడాది వానాకాలం సీజన్లో సాధారణ వర్ష పాతం నమోదైనప్పటికీ కొన్ని ప్రాంతాల్లో తీవ్ర మైన డ్రైస్పెల్స్, కొన్ని ప్రాంతాల్లో కుండపోత వానలు నమోదయ్యాయి. రాష్ట్రవ్యాప్తంగా చూస్తే సాధారణ వర్షపాతం నమోదు కాగా.. జిల్లాల వారీగా పరిస్థితి మాత్రం భిన్నంగా ఉంది. చాలా మండలాల్లోని అనేక ప్రాంతాల్లో లోటు వర్షపాతం నమోదయ్యింది. కాగా ఈసారి నైరుతి సీజన్ ప్రథ మార్థంలో ఎల్‌నినో ప్రభావం బలహీనపడి, సీజన్ ప్రారంభం నుంచే వర్షాలు కురుస్తాయని, రాష్ట్రంలో సీజన్ సాధారణ వర్షపాతం 72.21 సెంటీమీటర్ల కంటే ఎక్కువ వర్షపాతమే నమోదు కావొచ్చని వివ రించింది. నైరుతి సీజన్లో 106 శాతం వర్షపాతం నమోదయ్యే అవకాశం ఉందని తెలిపింది.తేలికపాటి నుంచి మోస్తరు వర్షసూచనపశ్చిమ విదర్భ, దాని పరిసర ప్రాంతాలలో ఏర్పడిన ఆవర్తనం బుధవారం తూర్పు విదర్భ దాని పరిసర ప్రాంతాల్లో కేంద్రీకృతమై ఉన్నట్లు వాతావరణ శాఖ వివరించింది. ఇది సముద్ర మట్టం నుంచి సగటున 0.9 కిలోమీటర్ల ఎత్తులో కొనసాగుతున్నట్లు తెలిపింది. రాష్ట్రానికి దక్షిణ, ఆగ్నేయ దిశ నుంచి బలమైన గాలులు వీస్తున్నట్లు సూచించింది. రానున్న రెండ్రోజులు రాష్ట్రంలోని కొన్ని జిల్లాల్లో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉన్నట్లు తెలిపింది. ఆదిలాబాద్, కుమ్రుంభీం ఆసిఫాబాద్, మంచిర్యాల, నిర్మల్, నిజామాబాద్, భద్రాద్రి కొత్తగూడెం, ఖమ్మం, నల్లగొండ, సూర్యాపేట, రంగారెడ్డి, హైదరాబాద్, మేడ్చల్ మల్కాజిగిరి, వికారాబాద్, సంగారెడ్డి, కామారెడ్డి, మహబూబ్‌నగర్, నాగర్‌కర్నూల్, వనపర్తి, నారాయణపేట జిల్లాల్లో అక్కడక్కడా తేలికపాటి వానలు కురిసే అవకాశం ఉందని వివరించింది.బుధవారం రాష్ట్రంలో చాలాచోట్ల గరిష్ట ఉష్ణోగ్రతలు సాధారణం కంటే తక్కువగా నమోదయ్యాయి. ప్రధాన నగరాల్లో నమోదైన గరిష్ట ఉష్ణోగ్రతలు పరిశీలిస్తే.. నల్లగొండలో 39.5 డిగ్రీల సెల్సియస్ గరిష్ట ఉష్ణోగ్రత, మెదక్‌లో 21.5 డిగ్రీ సెల్సియస్ కనిష్ట ఉష్ణోగ్రత నమోదైంది. -
తెలంగాణ: మళ్లీ భారీ వర్షం కురిసే ఛాన్స్
సాక్షి,హైదరాబాద్: తెలంగాణలో బుధవారం(మే8) కూడా భారీ వర్షం కురిసే అవకాశాలున్నాయని వాతావరణ శాఖ తెలిపింది. ఉరుములు మెరుపులతో కూడిన వడగళ్ల వర్షం కురవచ్చని పేర్కొంది.పలు జిల్లాలకు వాతావరణ శాఖ ఎల్లో అలర్ట్ జారీ చేసింది. సిరిసిల్ల, సిద్దిపేట, యాదాద్రి, రంగారెడ్డి, వికారాబాద్, సంగారెడ్డి, మెదక్. నాగర్ కర్నూల్లో ఓ మోస్తరు నుంచి భారీ వర్షం కురిసే చాన్స్ ఉందని తెలిపింది. గంటకు 40 కిలో మీటర్ల వేగంతో ఈదురుగాలులు వీస్తాయని వెల్లడించింది. కాగా రాజధాని హైదరాబాద్ సహా తెలంగాణ వ్యాప్తంగా మంగళవారం భారీ వర్షం కురిసిన విషయం తెలిసిందే. ఈ వర్షం ప్రభావంతో జిల్లాల్లో పంట నష్టపోయి రైతులు ఇబ్బంది పడగా హైదరాబాద్ నగరంలో తీ వ్ర ట్రాఫిక్‌జామ్‌లతో వాహనదారులు ఇబ్బందులు ఎదుర్కొ న్నారు. -
ఒడిశా, పశ్చిమ బెంగాల్, బీహార్ రాష్ట్రాలకు చల్లని కబురు
ఒడిశా, పశ్చిమ బెంగాల్, బీహార్ రాష్ట్రాలకు వాతావరణ శాఖ చల్లని కబురు చెప్పింది. మే నెల రాకతో ఎండలు మరింత ముదరడంతో భానుడి భగభగలతో ప్రజలు అల్లాడిపోతున్నారు.ఈ తరుణంలో తూర్పు ప్రాంతంలో ఉరుములతో కూడిన గాలివాన కారణంగా రానున్న మూడు రోజుల ఒడిశా, పశ్చిమ బెంగాల్, బీహార్లలో వేడిగాలులు తగ్గుతాయని భారత వాతావరణ విభాగం (ఐఎండీ) శుక్రవారం తెలిపింది.రానున్న మూడు రోజుల పాటు వేడిగాలులు ఈ మూడు రాష్ట్రాల్లో కొనసాగుతాయని ఐఎండీ శాస్త్రవేత్త డాక్టర్ నరేష్ కుమార్ తెలిపారు. ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, కర్ణాటక, తమిళనాడులో రాబోయే నాలుగు రోజుల పాటు ఇలాంటి వేడి వాతావరణం కొనసాగుతుందని వెల్లడించారు. తెలంగాణ, పశ్చిమ బెంగాల్, కోస్తా కర్ణాటకలో వడగాలులు వీస్తాయని ఐఎండీ ఆరెంజ్ అలర్ట్ ప్రకటించింది. -
హీట్‌వేవ్ అలర్ట్: భారత వాతావరణ శాఖ ట్వీట్
న్యూఢిల్లీ: భారత వాతావరణ శాఖ (IMD) సోమవారం దేశంలోని కొన్ని ప్రాంతాల్లో హీట్ వేవ్ అలర్ట్ జారీ చేసింది. దీనికి సంబంధించిన ఇండియా మ్యాప్‌ను తన ఎక్స్ (ట్విటర్) ఖాతాలో షేర్ చేసింది. ఇందులో హీట్‌వేవ్ ఎక్కువగా ఉన్న రాష్ట్రాలను హైలెట్ చేసింది.గంగా పశ్చిమ బెంగాల్, బీహార్‌లోని అనేక ప్రాంతాల్లో హీట్ వేవ్ పరిస్థితులు ఎక్కువగా ఉంటాయని, ఒడిషా, తూర్పు ఉత్తరప్రదేశ్, సబ్-హిమాలయన్ పశ్చిమ బెంగాల్, జార్ఖండ్‌లో వేడి తరంగాలకు అవకాశం ఉందని భారత వాతావరణ శాఖ పేర్కొంది.Heat wave to Severe Heat Wave conditions very likely in many pockets of Gangetic West Bengal and Bihar, isolated pockets of Odisha and heat wave conditions very likely in east Uttar Pradesh, Sub-Himalayan West Bengal, Jharkhand, Konkan & Goa, Saurashtra & Kutch.... pic.twitter.com/vFezec7hUy— India Meteorological Department (@Indiametdept) April 29, 2024 హీట్ వేవ్ ఎక్కువగా ఉన్న ప్రాంతాలను వెల్లడించడం మాత్రమే కాకుండా.. హీట్ వేవ్ పరిస్థితుల్లో.. తీసుకోవాల్సిన జాగ్రత్తలను కూడా ఐఎండీ తన ఎక్స్ ఖాతాలో షేర్ చేసింది.మీకు దాహం లేకపోయినా మిమ్మల్ని మీరు హైడ్రేట్‌గా ఉంచుకోవడానికి తగినంత నీరు/ఓఆర్ఎస్ తాగండి.వేడి ఎక్కువగా ఉండటం వల్ల 12 గంటల నుంచి 4 గంటల వరకు బయట చేయాల్సిన పనిని కొంత వాయిదా వేసుకోండి.వేడి నుంచి తప్పించుకోవడానికి నీడగా ఉండే ప్రదేశాల్లో నిలబడండి.పిల్లలు, వృద్దులు, జబ్బుపడిన వారిని ఎండ వేడి నుంచి జాగ్రత్తగా కాపాడుకోవాలి.ఎండ సమయంలో లేత రంగు బట్టలను ధరించండి.తలను కప్పుకోవదానికి గుడ్డ, టోపీ వంటి వాటిని ఉపయోగించాలి.DO's during #Heatwave@moesgoi@DDNewslive@ndmaindia@airnewsalerts pic.twitter.com/59FtYPB35v— India Meteorological Department (@Indiametdept) April 28, 2024 -
తెలుగు రాష్ట్రాల్లో మండుతున్న ఎండలు
సాక్షి, విజయవాడ: తెలుగు రాష్ట్రాల్లో ఎండలు మండుతున్నాయి. ఏపీలో సాధారణం కన్నా 6 డిగ్రీలు అధికంగా ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. 64 మండలాల్లో తీవ్ర వడ గాలులు, 222 మండలాల్లో వడగాలులు వీచే అవకాశం ఉందని వాతావరణ శాఖ వెల్లడించింది. విజయనగరం, శ్రీకాకుళం, పార్వతీపురం మన్యం, అనకాపల్లి, కాకినాడ, తూ.గో, విశాఖలో వడగాలుల ప్రభావం ఉంటుందని, అల్లూరి, బాపట్ల, ఏలూరు, గుంటూరు, అంబేద్కర్ కోనసీమ, కృష్ణా, ఎన్టీఆర్, పల్నాడు, ప్రకాశం, నెల్లూరు, తిరుపతి, పశ్చిమగోదావరి జిల్లాల్లో వడగాలులు వీచే అవకాశం ఉందని ఐఎండీ పేర్కొంది. ప్రజలు అప్రమత్తంగా ఉండాలని ఐఎండీ సూచించింది. మరో రెండు రోజుల్లో ఉత్తర కోస్తా, రాయలసీమలోని కొన్ని ప్రాంతాల్లో పిడుగులు పడే అవకాశం ఉందని ఐఎండీ తెలిపింది. -
మండే ఎండల్లో వర్ష సూచన: వాతావరణ శాఖ
న్యూఢిల్లీ: రోజురోజుకి భానుడి భగభగలు ఎక్కువైపోతున్నాయి. ఢిల్లీ, ముంబై, హైదరాబాద్ నగరాల్లో వేడి అంతకంతకు పెరిగిపోతోంది. ఈ తరుణంలో భారత వాతావరణ శాఖ (IMD) దేశంలోని రానున్న రెండు రోజుల్లో కొన్ని ప్రాంతాల్లో వేడిగాలులు వీస్తాయని, మరి కొన్ని ప్రాంతాల్లో వర్షం పడుతుందని వెల్లడించింది. ఒడిశా, పశ్చిమ బెంగాల్, జార్ఖండ్, విదర్భ, ఉత్తర కర్ణాటక, ఆంధ్రప్రదేశ్, యానాం, రాయలసీమ, తెలంగాణలలో ఈరోజు, రేపు వేడిగాలుల ఎక్కువగా ఉండే అవకాశం ఉందని ఐఎండీ తెలిపింది. తమిళనాడు, పుదుచ్చేరి, కేరళ, అస్సాం, మేఘాలయ, నాగాలాండ్, మణిపూర్, త్రిపుర, అరుణాచల్ ప్రదేశ్, ఒడిశా, పశ్చిమ బెంగాల్‌లోని కొన్ని ప్రాంతాల్లో వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ వెల్లడించింది. ఈ ఏడాది దేశంలో గరిష్ట ఉష్ణోగ్రత సాధారణం కంటే ఎక్కువగా నమోదవుతుందని ఐఎండీ ఇటీవల అంచనా వేసింది. ఏప్రిల్ ప్రారంభం నుంచి దేశంలోని చాలా ప్రాంతాల్లో 40 నుంచి 42 డిగ్రీల సెల్సియస్ ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయని, దీని కారణంగా హీట్ స్ట్రోక్ ప్రమాదం పెరిగిందని ఇప్పటికే పేర్కొన్నారు. -
నిప్పుల కొలిమి
ఎవరో తరుముకొచ్చినట్టు ఈసారి చాలాముందుగానే ఎండాకాలం వచ్చిపడింది. ఫిబ్రవరి నుంచే సెగలూ పొగలూ ఎగజిమ్మిన సూరీడు అంతకంతకూ తన ప్రతాపాన్ని పెంచుతూ పోతున్నాడు. రోజూ నమోదవుతున్న ఉష్ణోగ్రతలను చూస్తుంటే భారత వాతావరణ విభాగం(ఐఎండీ) హెచ్చరించినట్టు నిరుటికన్నా వేసవితాపం మరింత అధికంగా వుంటుందని అర్థమవుతోంది. ఇంచుమించు రోజూ 39–41 డిగ్రీల సెల్సియస్ మధ్య ఉష్ణోగ్రతలుంటున్నాయి. వాస్తవానికి పదేళ్లుగా దేశంలో ఎండల తీవ్రత పెరిగింది. పాత రికార్డులు బద్దలవుతున్నాయి. నిరుడు మార్చి ఎండ తీవ్రత 1901 నాటి రికార్డును అధిగమించిందని ఐఎండీ తెలిపింది. ఆ తర్వాత వరసగా ఏప్రిల్, మే, జూన్ నెలలు వేటికవే అత్యధిక ఉష్ణోగ్రతల్లో కొత్త పోకడలను నమోదు చేశాయి. రానున్న రోజుల్లో ఈ తీవ్రత మరింత పెరుగుతుందే తప్ప తగ్గదని వాతావరణ శాస్త్రజ్ఞులు చెప్తున్న జోస్యాలు భయపెడుతున్నాయి. దీనికి తోడు ఈసారి వానలు సైతం అంతంతమాత్రం కావటంతో జలాశయాలు నిండుకున్నాయి. భూగర్భ జలాలు లోలోతులకు పోతున్నాయి. నిరుడు ఎల్‌నినో ప్రభావం కారణంగా దక్షి ణాసియా ప్రాంత దేశాలన్నీ తక్కువ వర్షపాతాన్ని నమోదు చేశాయి. రివాజుగా జూన్ నెల మొదట్లో కేరళను తాకాల్సిన రుతుపవనాలు ఏడు రోజులు ఆలస్యంగా వచ్చాయి. ఆ తర్వాత సెప్టెంబర్ వరకూ మెరుగ్గానే వర్షాలు పడ్డాయి. కొన్నిచోట్ల భారీ వర్షాలు పడటంతో వరదలు కూడా ముంచు కొచ్చాయి. మొత్తానికి దాదాపు 94 శాతం వర్షపాతం నమోదైంది. ఆ తర్వాత అక్టోబర్ మొదలుకొని మార్చి వరకూ వర్షాల మాట అటుంచి కనీసం మబ్బుల జాడైనా కనబడలేదు. ఇది చాలదన్నట్టు ఫిబ్రవరి నుంచే ఎండల తీవ్రత పెరగటంతో జలాశయాల్లో నీరు అంతంతమాత్రంగానే వుంది. ఈ మూడు నెలలూ సాధారణంగా అయితే నాలుగు నుంచి ఎనిమిది రోజులు మాత్రమే వడగాడ్పులు తీవ్రంగా వీచాలి. కానీ ఇది పది నుంచి 20 రోజుల వరకూ ఉండొచ్చని ఐఎండీ చెబుతోంది. ముఖ్యంగా గుజరాత్, మధ్యప్రదేశ్, మహారాష్ట్ర, కర్ణాటక, కేరళ, లక్షద్వీప్, అండమాన్ నికోబార్ దీవులు, తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, ఒడిశాల్లో ఉష్ణోగ్రతలూ, వడగాడ్పుల తీవ్రత అధికంగా వుండొచ్చని వాతావరణ విభాగం హెచ్చరిస్తోంది. మండే ఎండలు, తీవ్ర వడగాడ్పులు, కుండపోత వర్షాలు, ముంచెత్తే వరదలు ఎవరూ ఆపగలిగేవి కాదు. కానీ ప్రపంచ దేశాలు సమష్టిగా నిర్ణయాలు తీసుకుని, సమర్థంగా అమలు చేయగలిగే కార్యాచరణను రూపొందిస్తే వీటి తీవ్రతను తగ్గించటానికి ఆస్కారం వుంటుంది. ప్రపంచ వాతావరణ సంస్థలు(డబ్ల్యూఎంఓ) మొన్న మార్చి 19న విడుదల చేసిన ప్రపంచ వాతావరణ నివేదిక ఏమంత ఆశాజనకంగా లేదు. నిరుటికన్నా 2024 మరింత ప్రమాదకరంగా వుండగలదని హెచ్చరించింది. కార్బన్ డై ఆక్సైడ్, మీథేన్, నైట్రస్ ఆక్సైడ్, క్లోరోఫ్లోరో కార్బన్లు వంటి గ్రీన్ హౌస్ వాయువులు వాతావరణంలో పరిమితులకు మించి పెరిగి పోవటం వల్ల ఉష్ణోగ్రతలు అధికమై సముద్ర ఉపరితల జలాలను వేడెక్కిస్తున్నాయని ఆ నివేదిక తెలిపింది. ఆఖరికి అంటార్కిటిక్, ఆర్కిటిక్ ప్రాంతాల్లో భారీ మంచు పలకలు కరగటం నిరుడు బాగా ఎక్కువైందని వివరించింది. ఆర్థికవృద్ధి పేరుతో ప్రభుత్వాలు పర్యావరణానికి నష్టం చేకూర్చే విధానాలు అవలంబించటమే ప్రస్తుత పరిస్థితికి కారణం. భారత, బంగ్లాదేశ్‌లలో పర్యావరణ విధ్వంసం వల్ల నిరుడు ఏప్రిల్ నెలలో వడగాడ్పుల తీవ్రత 30 రెట్లు పెరిగిందని వాతావరణ శాస్త్రవేత్తలు లెక్కేశారు. ఎండల తీవ్రత, వడగాడ్పుల వల్ల సహజంగానే రానున్న రోజుల్లో నీటి కొరత మరింత ఎక్కువకావొచ్చు. ఎన్నికల సీజన్ కావటంతో ఈ సమస్యపై వాగ్యుద్ధాల మోత కూడా ఎక్కువేవుంటున్నది. కారణం మీరంటే మీరని తెలంగాణ రాష్ట్రంలో అధికార, విపక్షాలు మాటలు విసురుకుంటున్నాయి. ఆ మాటెలావున్నా ప్రభుత్వాలు అప్రమత్తంగా ఉండి వడ గాడ్పు లపై, ఎండల తీవ్రతపై ప్రజలను హెచ్చరించటం అవసరం. లేనట్టయితే వడదెబ్బ మరణాలు పెరిగే అవకాశం వుంది. మన దేశంలో వడగాడ్పులను ప్రకృతి వైపరీత్యంగా పరిగణించటం లేదు. చెప్పాలంటే వేటిని వడదెబ్బ మరణాలుగా లెక్కేయాలన్న అంశంలో ఎలాంటి కొలమానమూ లేదు. నిరుడు డిసెంబర్లో లోక్‌సభలో వడగాడ్పులను ప్రకృతి విపత్తుగా లెక్కేసి, బాధిత ప్రజల సహాయపునరావాసాల కోసం నిధులందించాలని డిమాండ్ వచ్చింది. కానీ కేంద్రం నుంచి పెద్దగా స్పందన లేదు. పర్యవసానంగా బాధిత కుటుంబాలకు ఎలాంటి సాయమూ అందటం లేదు. కేవలం కొన్ని రాష్ట్రాలు మాత్రమే ఇందుకు మినహాయింపు. ఎన్డీఎంఏ 2016 నుంచి కొన్ని మార్గదర్శకాలు విడుదల చేస్తోంది. అక్కడితో దాని పాత్ర ముగుస్తోంది. ఎండ తీవ్రత ఉన్నపుడు ఆరుబయట కార్మికులతో పనిచేయించకుండా చూడటం, ఎక్కడికక్కడ తాగునీటి సౌకర్యం కల్పించటం, ప్రజారోగ్య సిబ్బందిని సంసిద్ధంగా ఉంచటం, అవసరమైన ప్రాంతాలకు సహాయబృందాలను తరలించటం కీలకం. ఇలాంటి జాగ్రత్తలతో వడగాడ్పు మరణాల నివారణ సాధ్యమే. అలాగే ఇరుకిరుకు ఇళ్లలో మగ్గి పోయే మురికివాడల ప్రజలనూ, మరీ ముఖ్యంగా వృద్ధులనూ, గర్భిణులనూ, బాలింతలనూ వడగాడ్పుల నుంచి సంరక్షించటానికి ఏం చేయగలమో ప్రభుత్వాలు ఆలోచించాలి. ఈ కృషిలో స్థానిక సంస్థల పాత్ర పెంచటం, అందుకు అవసరమైన నిధులు అందించటం ప్రభుత్వాల బాధ్యత. అన్నిటికీ మించి వడగాడ్పులను ప్రకృతి వైపరీత్యంగా పరిగణించి, ఆ విషయంలో పౌరులను అప్రమత్తం చేసేందుకూ, వారిని కాపాడేందుకూ అనుసరించాల్సిన విధానాలను రూపొందించటం తక్షణావసరమని కేంద్ర ప్రభుత్వం గుర్తించాలి. -
తెలంగాణ: దంచికొడుతున్న ఎండలు.. వడగాలుల హెచ్చరిక
సాక్షి, హైదరాబాద్: తెలంగాణలో ఎండలు దంచికొడుతున్నాయి. తెలంగాణలోని పలు జిల్లాలో 43 డిగ్రీలకుపైగా ఉష్ణోగ్రతలు నమోదు అవుతున్నాయి. ఉదయం నుంచే ఉక్కపోత తోడవుతోంది. ఈ క్రమంలో.. రాష్ట్రానికి వడగాలుల ముప్పు పొంచి ఉందని వాతావరణ శాఖ హెచ్చరికలు జారీ చేసింది. సోమవారం నుంచి ఉష్ణోగ్రతలు మరింత పెరిగే అవకాశముండడంతో.. ఎండ తీవ్రత దృష్ట్యా ప్రజలు అప్రమత్తంగా ఉండాలని, అవసరమైతేనే బయటకు రావాలని వాతావరణ శాఖ అధికారులు తెలిపారు. మూడు రోజులపాటు వడగాలులు వీచే అవకాశం ఉందని చెబుతున్నారు. ఇక.. ఉత్తర తెలంగాణ జిల్లాలతో పాటు ఉమ్మడి నల్గొండ, మహబూబ్‌నగర్ జిల్లాలకు వడగాల్పుల హెచ్చరికలు జారీ చేసింది. తెలంగాణలో 15 జిల్లాలకు ఆరెంజ్ అలర్ట్ జారీ చేసింది. రాబోయే 5 రోజుల్లో మరింత పెరిగే అవకాశం ఉందని తెలిపింది. -
Weather: జాగ్రత్త.. ఈసారి ఎండల మంటలే!
న్యూఢిల్లీ: దేశవ్యాప్తంగా ఎండలు మండిపోతున్నాయి. చాలా ప్రాంతాల్లో గరిష్ట ఉష్ణోగ్రతలు 40 డిగ్రీలు దాటిపోయాయి. సాధారణంతో పోలిస్తే 2–3 డిగ్రీలు అధికంగా నమోదవుతున్నాయి. తెలంగాణతోపాటు తమిళనాడు, కర్ణాటక, కేరళ రాష్ట్రాల్లో వేడి సెగలు రేగుతున్నాయి. గత రెండు నెలలకు సంబంధించి ఈ రాష్ట్రాల్లో అత్యంత లోటు వర్షపాతం కొనసాగుతున్నట్టు వాతావరణ శాఖ గణాంకాలు స్పష్టం చేస్తున్నాయి. తీవ్ర వర్షాభావం,అధిక వేడి ఉండే ఎల్‌నినో పరిస్థితులు జూన్ వరకు కొనసాగే అవకాశం కనిపిస్తోందని.. అంటే వచ్చే రెండు నెలలు ఎండల మంటలు తప్పకపోవచ్చని వాతావరణ నిపుణులు చెప్తున్నారు. కొన్ని రాష్ట్రాల్లో ప్రభుత్వాలు ప్రజలు అప్రమత్తంగా ఉండాలంటూ ఇప్పటికే హెచ్చరికలు కూడా జారీ చేశాయి. ఈసారి భగభగలు తప్పనట్టే.. దేశవ్యాప్తంగా ఈ వేసవికాలంలో భానుడి భగభగలు తప్పకపోవచ్చని వాతావరణ నిపుణులు చెప్తున్నారు. ఆసియా ఖండంలోని దేశాల్లో తీవ్ర వర్షాభావం, అధిక వేడికి కారణమయ్యే ఎల్‌నినో పరిస్థితులు జూన్ వరకు కొనసాగవచ్చని పేర్కొంటున్నారు. భారత వాతావరణ శాఖ కూడా దీనిపై ఇప్పటికే ప్రకటన జారీ చేసింది. ఈసారి సాధారణం కంటే అధికంగా వడగాడ్పులు వీయవచ్చని కూడా అంచనా వేసింది. పరిస్థితులు కూడా ఇందుకు అనుగుణంగానే కనిపిస్తున్నాయి. ప్రస్తుతం (మార్చి చివరివారంలో) ఉండాల్సిన సాధారణ ఉష్ణోగ్రతల కంటే రెండు, మూడు డిగ్రీలు అధికంగా నమోదవుతున్నాయి. చాలా చోట్ల 40 డిగ్రీలకుపైనే నమోదు దేశవ్యాప్తంగా చాలా ప్రాంతాల్లో 40 డిగ్రీలకుపైగా ఉష్ణోగ్రతలు నమోదవుతున్నట్టు వాతావరణ శాఖ గణాంకాలు చెప్తున్నాయి. ముఖ్యంగా దక్షిణ, పశి్చమ భారత రాష్ట్రాలు తెలంగాణ, తమిళనాడు, కర్ణాటక, కేరళ, మహారాష్ట్ర, గుజరాత్, రాజస్థాన్‌లలో ఉష్ణోగ్రతలు పెరుగుతున్నాయి. తీవ్రమవుతున్న ఎండల విషయంలో అప్రమత్తంగా ఉండాలని కర్ణాటక రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటికే ప్రజలకు హెచ్చరికలు, మార్గదర్శకాలు జారీ చేసింది. తమిళనాడు, కేరళ ప్రభుత్వాలు కూడా ప్రజలు జాగ్రత్తగా ఉండాలని సూచించాయి. ఉత్తర భారతంలోనూ పలు ప్రాంతాల్లో ఎండలు మండుతున్నాయి. దేశ రాజధాని ఢిల్లీలో సాధారణం కంటే మూడు డిగ్రీలు అధికంగా ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. తీవ్రమైన ఉక్కపోత.. ఆరు బయట జాగ్రత్త అధిక ఉష్ణోగ్రతలతో వాతావరణంలో తేమ శాతం పెరిగిపోతుండటంతో ప్రజలు ఉక్కపోతతో అల్లాడుతున్నారు. దీనికితోడు పలు ప్రాంతాల్లో వేడిగాలులు వీస్తుండటం మరింత సమస్యగా మారిందని నిపుణులు చెప్తున్నారు. అత్యవసరమైతే తప్ప మధ్యాహ్న సమయంలో బయట తిరగకూడదని, ఆరు బయట అధిక శారీరక శ్రమతో కూడిన పనులు చేయకూడదని వైద్యులు సూచిస్తున్నారు. వీలైనంత మేర నీటిని తాగుతూ ఉండాలని, శరీరం చల్లగా ఉండేలా చూసుకోవాలని వివరిస్తున్నారు. జిమ్‌లు, బయటా వ్యాయామాలు చేసేవారు కూడా జాగ్రత్తగా ఉండాలని.. డీహైడ్రేషన్, ఇతర పరిస్థితుల వల్ల ఆరోగ్యం ఒక్కసారిగా దెబ్బతినవచ్చని హెచ్చరిస్తున్నారు. ‘దక్షిణం’లో తీవ్ర వర్షాభావం.. భారత వాతావరణ శాఖ గణాంకాల ప్రకారం.. ఫిబ్రవరి, మార్చి నెలలకు సంబంధించి తెలంగాణతోపాటు తమిళనాడు, కర్ణాటక, కేరళ రాష్ట్రాలలో తీవ్ర వర్షాభావ పరిస్థితులు నెలకొన్నాయి. ఆంధ్రప్రదేశ్, రాజస్థాన్, మహారాష్ట్ర, పంజాబ్‌లతోపాటు ఈశాన్య రాష్ట్రాల్లో వర్షాభావ పరిస్థితులు ఉన్నాయి. మిగతా ప్రాంతాల్లో కాస్త లోటు నుంచి సాధారణ వర్షపాతం నమోదైనట్టు గణాంకాలు చెప్తున్నాయి. సాధారణం కంటే 2 డిగ్రీలు అదనంగా నమోదు సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలోనూ ఉష్ణోగ్రతలు పెరిగిపోయాయి. చాలా ప్రాంతాల్లో సాధారణం కంటే 2 డిగ్రీలు అధికంగా గరిష్ట ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. వాతావరణంలో తేమశాతం పెరగడంతో ఉక్కపోత కూడా తీవ్రంగా ఉంది. కనిష్ట ఉష్ణోగ్రతలు కూడా సాధారణం కంటే ఎక్కువగా నమోదవుతుండటంతో.. రాత్రిపూట కూడా వేడిగా ఉంటున్న పరిస్థితి ఉందని వాతావరణశాఖ అధికారులు తెలిపారు. ఉమ్మడి ఆదిలాబాద్, నిజామాబాద్, ఖమ్మం, కరీంనగర్ జిల్లాల్లో ఉష్ణోగ్రతలు ఎక్కువగా ఉన్నట్టు వెల్లడించారు. కాగా.. రాష్ట్రంలోని 33 జిల్లాలకుగాను 20 జిల్లాల్లో ఉష్ణోగ్రతలు 40 డిగ్రీలు దాటినట్టు రాష్ట్ర ప్రణాళిక–అభివృద్ధిశాఖ పేర్కొంది. ఈ మేరకు ఉష్ణోగ్రతల అంచనాలను విడుదల చేసింది. ఉత్తర, తూర్పు తెలంగాణ జిల్లాల్లో సాధారణం కంటే అధికంగా ఉష్ణోగ్రతలు నమోదవుతాయని అంచనా వేసింది. ఆయా ప్రాంతాల్లో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించింది. ఏప్రిల్‌లో మరింత ఎక్కువ ఎండలు.. గతేడాది కంటే వేగంగా ఈసారి ఉష్ణోగ్రతలు అధికంగా నమోదవుతున్నాయి. వాతావరణంలో నెలకొంటున్న మార్పుల వల్లే ఈ పరిస్థితి కనిపిస్తోంది. అయితే ప్రస్తుత పరిస్థితులను బట్టి చూస్తే వచ్చే వారం రోజుల పాటు ఎండ వేడి ఎక్కువగా ఉన్నా వడగాడ్పులు వీచే అవకాశం లేదు. ఏప్రిల్‌లో గరిష్ట ఉష్ణోగ్రతలు మరింత ఎక్కువగా ఉంటాయని అంచనా. ఏప్రిల్, మే నెలలకు సంబంధించిన ఉష్ణోగ్రతల అంచనాలను ఏప్రిల్ 1న విడుదల చేస్తాం. గరిష్ట ఉష్ణోగ్రతలు వరుసగా మూడు రోజులపాటు సాధారణం కంటే 2, 3 డిగ్రీలు అధికంగా నమోదై, మరింత పెరిగే అవకాశం ఉన్నప్పుడు అలర్ట్‌లను జారీ చేస్తాం. ఏప్రిల్ నుంచి వేసవి ముగిసేవరకు ఉష్ణోగ్రతల అంచనాలు, జాగ్రత్తలపై రోజువారీగా బులిటెన్ విడుదల చేస్తాం. – నాగరత్న, ఐఎండీ డైరెక్టర్ ప్రధాన కేంద్రాల్లో ఉష్ణోగ్రతల తీరు (డిగ్రీల సెల్సియస్‌లలో) కేంద్రం గరిష్టం కనిష్టం ఆదిలాబాద్ 40.8 25.5 భద్రాచలం 40.0 25.0 నిజామాబాద్ 39.9 25.0 ఖమ్మం 39.6 24.0 నల్లగొండ 39.5 24.2 హైదరాబాద్ 39.2 24.6 మహబూబ్‌నగర్ 39.2 25.0 మెదక్ 39.2 21.1 దుండిగల్ 39.1 22.2 హకీంపేట్ 39.0 20.1 రామగుండం 38.6 24.6 హన్మకొండ 38.0 22.5 ఈ జాగ్రత్తలు తప్పనిసరి ఎండలు మండిపోతున్న నేపథ్యంలో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని వైద్య నిపుణులు సూచిస్తున్నారు. ముఖ్యంగా ఆరుబయట పనిచేసేవారు, ఏదైనా పని కోసం బయటికి వెళ్లేవారు జాగ్రత్తగా ఉండాలని చెప్తున్నారు. తరచూ నీళ్లు తాగాలని, డీహైడ్రేషన్ తలెత్తకుండా చూసుకోవాలని స్పష్టం చేస్తున్నారు. ఇంకా వైద్యులు సూచనలు ఇవీ.. బయటికి వెళ్లేవారు తెలుపు, లేత రంగుల పలుచటి కాటన్ వ్రస్తాలు ధరించాలి. తలపై టోపీ పెట్టుకోవాలి. లేదా రుమాలు చుట్టుకోవాలి. నీళ్లు, నిమ్మరసం, కొబ్బరినీళ్లు, మజ్జిగ, ఓఆర్ఎస్ వంటివి తాగుతూ ఉండాలి. ఎండ వేడిలో అధికంగా పనిచేయకూడదు. ఇబ్బందిగా అనిపిస్తే చల్లని ప్రదేశంలో సేదతీరాలి. అధిక వేడి వల్ల ఆహారం త్వరగా పాడైపోతుంది. అలాంటివి తింటే డయేరియాకు గురయ్యే ప్రమాదం ఉంటుంది. పిల్లలు, గర్భిణులు, వృద్ధులు మధ్యాహ్నం పూట బయటికి వెళ్లొద్దు. -
దేశరాజధాని ఢిల్లీలో పెరిగిన ఉష్ణోగ్రతలు
దేశరాజధాని ఢిల్లీలో ఉక్కపోతల కాలం మొదలయ్యింది. ఢిల్లీలో ఉష్ణోగ్రత 33 డిగ్రీలు దాటింది. గత వారం రోజులుగా ఉష్ణోగ్రతలు నిరంతరం పెరుగుతూనే ఉన్నాయి. వాతావరణ శాఖ అంచనాల ప్రకారం రానున్న మూడునాలుగు రోజుల్లో ఉష్ణోగ్రతలు రెండు నుంచి మూడు డిగ్రీలు పెరిగే అవకాశం ఉంది. రానున్న రోజుల్లో విపరీతమైన వేడి వాతావరణం ఉండనుందని, పలు రాష్ట్రాల్లో వేడిగాలులు మొదలు కానున్నాయిని వాతావరణ శాఖ తెలిపింది. ఢిల్లీలో గరిష్ట ఉష్ణోగ్రతలతో పాటు కనిష్ట ఉష్ణోగ్రతలు కూడా పెరుగుతున్నాయి. సోమవారం ఢిల్లీలో గరిష్ట ఉష్ణోగ్రత 33.2 డిగ్రీల సెల్సియస్‌గా నమోదైంది. వాతావరణ శాఖ తెలిపిన వివరాల ప్రకారం ప్రస్తుత కనిష్ట ఉష్ణోగ్రత 15.8 డిగ్రీల సెల్సియస్, ఇది సీజన్ సగటు కంటే ఒక డిగ్రీ తక్కువ. తేమ శాతం 40 నుంచి 94 శాతం వరకు ఉంటున్నదని వాతావరణ శాఖ తెలిపింది. వాతావరణ శాస్త్రవేత్తల అంచనాల ప్రకారం రాబోయే రెండుమూడు రోజుల్లో ఢిల్లీ-ఎన్సీఆర్లో ఉష్ణోగ్రత 35 డిగ్రీలకు చేరుకోనుంది. కనిష్ట ఉష్ణోగ్రత 19 డిగ్రీల సెల్సియస్‌కు చేరే అవకాశం ఉంది. భారత వాతావరణ శాఖ (ఐఎండీ)తెలిపిన వివరాల ప్రకారం మార్చి 26న ఈశాన్య భారతదేశం, పశ్చిమ బెంగాల్‌లోని ఉప-హిమాలయ ప్రాంతంలో ఉరుములతో కూడిన వర్షం కురిసే అవకాశం ఉందని పేర్కొంది. -
రైతులకు ఉపగ్రహ ఊతం
ఉత్తర భారతదేశ రైతులు ఒకవైపు దేశ రాజధానిలో కనీస మద్దతు ధరతో పాటు ఇతర హక్కుల సాధన కోసం పోరు కొనసాగిస్తున్నారు. ఇంకోవైపు శ్రీహరి కోటలోని సతీశ్ ధవన్ అంతరిక్ష కేంద్ర శాస్త్రవేత్తలు వాతావరణాన్ని మరింత మెరుగ్గా అంచనా వేసేందుకు ఇన్శాట్–3డీఎస్ ఉపగ్రహాన్ని విజయవంతంగా ప్రయోగించారు. ఈ ఉపగ్రహం వాన రాకడ, పోకడలతోపాటు వాతావరణానికి సంబంధించి మరింత కచ్చితమైన అంచనాలను రూపొందించేందుకు ఉద్దేశించినది. రైతులతోపాటు, మత్స్యకారులకూ ఉపయోగపడుతుంది. వాతావరణ మార్పుల నేపథ్యంలో ఈ రెండు వర్గాలు పలు సమస్యలు ఎదుర్కొంటున్న విషయం తెలిసిందే. ఈ వర్గాలకు సకాలంలో అందే హెచ్చరికలు, దీర్ఘకాలిక అంచనాలు ఎంతో ఉపయోగపడతాయి. వాతావరణ మార్పుల ప్రభావం వల్ల 2050 నాటికి గోధుమ, వరి దిగుబడుల్లో గణనీయ మైన తగ్గుదల ఉంటుందని శాస్త్రవేత్తలు ఇప్పటికే హెచ్చరించారు. ఇన్షాట్–3డీఎస్ ప్రయోగం దేశంలోనే అతి పురాతనమైన ఉపగ్రహ ప్రయోగ కార్యక్రమం తాలూకూ పరిణతికి నిదర్శనం. ఇండియన్ నేషనల్ శాటిలైట్ (ఇన్శాట్) కార్యక్రమానికి యాభై ఏళ్ల క్రితమే బీజం పడింది. 1975లో ఇన్శాట్ శ్రేణి ఉపగ్రహాల ప్రయోగాలకు అనుమతులు లభించాయి. 1982లో తొలి ఉపగ్రహం (ఇన్శాట్–1ఏ) ప్రయోగం జరిగింది. మొదట్లో ఈ ఉపగ్రహాల్లో అత్యధికం ఫోర్డ్ ఏరోస్పేస్ అండ్ కమ్యూనికేషన్స్ కార్పొరేషన్ నుంచి కొనుగోలు చేసి, ఫ్లారిడా(యూఎస్)లోని కేప్ కానవెరల్ నుంచి ప్రయోగించేవారు. ఇన్శాట్–1 శ్రేణి ఉపగ్రహాల కారణంగా భారతీయ వాతావరణ విభాగం ఉపగ్రహ ఆధారిత వాతావరణ అంచనాల రంగంలోకి అడుగుపెట్టింది. తుపానులు, ఈదురుగాలులతోపాటు అల్పపీడనా లను కూడా ఉపగ్రహాల సాయంతో పరిశీలించడం మొదలైంది. 1992లో ప్రయోగించిన ఇన్శాట్–2 శ్రేణి ఉపగ్రహాలు మునుపటి వాటి కంటే సాంకేతికంగా ఎంతో పురోగతి సాధించినవి కావడం గమనార్హం. దేశీయంగా తయారు చేసిన చాలా హై రెజొల్యూషన్ రేడియో మీటర్లను ఇందులో ఉపయోగించారు. ఫలితంగా రోజువారీ వాతావరణ అంచనాలు, ముందస్తు అంచనాలు, మేఘాల ఛాయాచిత్రాల సేకరణ సులువు అయ్యింది. సమాచార వినిమయానికి కూడా... ఇన్శాట్–1, ఇన్శాట్– 2 శ్రేణి ఉపగ్రహాలు అటు వాతావరణ అంచనాలతోపాటు ఇటు సమాచార వినిమయం, బ్రాడ్‌కాస్టింగ్ రంగా లకూ ఎంతో ఉపయోగపడ్డాయి. ఇన్శాట్–2 శ్రేణిలోని కొన్ని ఉప గ్రహాల్లో వాతావరణ సంబంధిత పేలోడ్లు అసలు లేకపోవడం గమ నార్హం. కొన్ని రకాల సమాచారాన్ని సేకరించేందుకు (తుపానుల మధ్య భాగం వంటివి) భారత వాతావరణ విభాగం (ఐఎండీ) అమెరికా రక్షణ శాఖ ఉపగ్రహాలపై ఆధారపడింది. ఈ సమస్యను అధిగ మించే లక్ష్యంతో ఐఎండీ 2002లో మెట్శాట్ను ప్రయోగించింది. తరు వాతి కాలంలో దీని పేరును కల్పన–1గా మార్చారు. కర్నాల్ (హరియాణా)లో పుట్టి, ‘నాసా’ వ్యోమగామిగా ఎదిగి 2002లో స్పేస్‌షటిల్ ప్రమాదంలో మరణించిన కల్పనా చావ్లా స్మరణార్థమన్న మాట! ఈ సమయంలోనే వాతావరణ పరిశోధనలకు ప్రత్యేకంగా ఒక ఉపగ్రహం ఉంటే బాగుంటుందన్న అభిప్రాయాన్ని ఐఎండీ వ్యక్తం చేసింది. ఫలితంగానే 2013లో ఇన్శాట్–3డీ శ్రేణి మూడోతరం వాతా వరణ ఉపగ్రహ ప్రయోగం జరిగింది. 2016లో ఇదే శ్రేణిలో ఇంకో ఉపగ్రహాన్ని కూడా విజయవంతంగా కక్ష్యలోకి ప్రవేశపెట్టారు. ఈ ఏడాది ఫిబ్రవరి –17న ప్రయోగించిన ఉపగ్రహం ఇన్శాట్–3డీ శ్రేణిలో తాజాది. కేంద్ర భూశాస్త్ర మంత్రిత్వ శాఖ ఈ ఉపగ్రహానికి నిధులు సమకూర్చింది. ఐఎండీతోపాటు నేషనల్ సెంటర్ ఫర్ మీడియం రేంజ్ వెదర్ ఫోర్కాస్టింగ్ (నోయిడా), ఇండియన్ ఇన్ స్టి ట్యూట్ ఆఫ్ ట్రాపికల్ మెటియరాలజీ (పూణే) వంటి సంస్థలు ఈ ఉపగ్రహం అందించే సమాచారాన్ని ఉపయోగించుకుంటాయి. వాతావరణం, సముద్ర సంబంధిత సమగ్ర సమాచారాన్ని ఇన్శాట్–3డీఎస్ ద్వారా అందుకోవచ్చు. దీంట్లోని పరికరాలు ఆరు రకాల పౌనఃపున్యాలలో ఛాయాచిత్రాలు తీయగలవు. నేల నుంచి మొదలుపెట్టి అంతరిక్షం వరకూ వేర్వేరు ప్రాంతాలకు సంబంధించిన ఉష్ణోగ్రతలు, తేమశాతం వంటి వివరాలూ సేకరించగలవు. సముద్ర, భూ ఉపరితల ఉష్ణోగ్రతలు, మేఘాల లక్షణాలు, పొగమంచు, వాన, మంచు ఆవరించిన ప్రాంతం, పడిన మంచు మందం, కార్చిచ్చులు, వాతావరణంలోని కాలుష్యకారక కణాలు, టోటల్ ఓజోన్ వంటి వివరాలన్నింటినీ ఎప్పటికప్పుడు సేకరించేందుకు ఈ ఉపగ్రహం ఉపయోగపడుతుంది. ఈ దశలో ఒక వైపు ఉపగ్రహ నిర్మాణంలో దేశీ టెక్నాలజీల వాడకం పెంచుకుంటూనే ఇంకోవైపున ఉపగ్రహ సమాచారాన్ని అందుకునేందుకు, విశ్లేషించేందుకు అవసరమైన భూతల సామర్థ్యాన్ని కూడా భారత్ పెంచుకుంది. వాతావరణ ఉపగ్రహాల నుంచి సమా చారం అందుకునేందుకు ఐఎండీ కొత్త కొత్త ఎర్త్ స్టేషన్స్ నిర్మాణాన్ని చేపట్టింది. సమాచారాన్ని అప్పటికప్పుడు విశ్లేషించేందుకు కంప్యూ టింగ్ సామర్థ్యాన్ని కూడా పెంచుకుంది. వాతావరణ మోడలింగ్ కోసం సూపర్ కంప్యూటర్ను ఇచ్చేందుకు అమెరికా నిరాకరించిన 1980లలో సెంటర్ ఫర్ డెవలప్మెంట్ ఆఫ్ టెలిమాటిక్స్ (సీ– డాక్)ను ఏర్పాటు చేసి, దేశీయంగానే హై స్పీడ్ కంప్యూటింగ్ వ్యవస్థ లను అభివృద్ధి చేసే పనిలో పడింది. అప్పటి నుంచి ఇప్పటివరకూ భారత్ వాతావరణ సంబంధిత సూపర్ కంప్యూటింగ్ వ్యవస్థల నిర్మా ణంలో అగ్రగామి దేశంగా నిలిచింది. తాజాగా అంటే గత ఏడాది మరింత అత్యాధునిక వాతావరణ పరిశోధనల కోసం కేంద్ర భూపరి శోధన మంత్రిత్వ శాఖ రెండు సూపర్ కంప్యూటర్ల నిర్మాణానికి సిద్ధమైంది. ఫ్రెంచ్ కంపెనీ సాయంతో పది కోట్ల డాలర్ల ఖర్చుతో వీటిని నిర్మించనున్నారు. నోయిడా, పూణెల్లోని కేంద్రాల్లో వీటిని ఏర్పాటు చేయనున్నారు. టెక్నాలజీతోపాటు మారుతూ... వాతావరణ అంచనాల ఫలితాలను సామాన్యులకు చేర్చేందుకు ఐఎండీ టెక్నాలజీతోపాటుగా మారుతూ వచ్చింది. అడ్వయిజరీస్, ఎర్లీ వార్నింగ్, షార్ట్ – మీడియం రేంజ్ స్థానిక అంచనాల వంటివి అందించే వ్యవస్థలను కూడా కాలక్రమంలో ఏర్పాటు చేసుకుంది. ఒకప్పుడు వాతావరణ సమాచారాన్ని టెక్స్ట్ ఎస్ఎంఎస్ రూపంలో పంపితే, మొబైల్ ఫోన్ల కాలంలో వేర్వేరు భాషల్లో సమాచారాన్ని అందించే వీలేర్పడింది. అయితే వీటి ఆధారంగా నిర్ణయాలు తీసుకోవడం రైతులకు ఎంతవరకూ ఆచరణ సాధ్యమన్నది ఇప్పుడు ప్రశ్నగా మారింది. వాట్సప్, సోషల్‌మీడియా ప్లాట్‌ఫామ్‌ల వంటి అనేకానేక సమాచార మాధ్యమాలు అందుబాటులోకి వచ్చిన నేపథ్యంలో ఈ ప్రశ్నకు మరింత ప్రాధాన్యమూ ఏర్పడుతోంది. నకిలీ, తప్పుడు వార్తలు విచ్చలవిడిగా ప్రవహిస్తున్న ఈ కాలంలో విశ్వసనీయమైన సమాచారం అందించేందుకు భారత వాతావరణ విభాగం ప్రత్యేక దృష్టి పెట్టాల్సిన అవసరముంది. ఆర్థిక వ్యవస్థకు ఊతమిచ్చేందుకు సాంకేతిక పరిజ్ఞానాన్ని వాడుకోవాలన్న భారత ప్రయత్నాల్లో ఇన్శాట్–3డీఎస్ ఒక కీలకమైన మైలురాయి అని చెప్పాలి. విదేశాల నుంచి ఉపగ్రహాల కొనుగోళ్లు, ప్రయోగాలు నిర్వహించే స్థితి నుంచి మనం సొంతంగా వాతావరణ ఉపగ్రహాల తయారీ, ప్రయోగాలను చేపట్టే స్థితికి చేరాము. అది కూడా భారతీయ రాకెట్ల సాయంతో మనకు కావాల్సిన కక్ష్యలో ప్రవేశ పెట్టగలుగుతున్నాము. సాంకేతిక పరిజ్ఞాన లభ్యతలో ఉన్న అంతరా లను జాగ్రత్తగా గుర్తించడం, విదేశీ టెక్నాలజీలను ఔపోసన పట్టడం, వ్యవస్థలు–ఉప వ్యవస్థల నిర్మాణానికి తగిన కార్యక్రమాలను అమల్లోకి తేవడం, ఇండియన్ స్పేస్ ఆర్గనైజేషన్ , ఐఎండీ, ఇతర శాస్త్రీయ సంస్థలతో సన్నిహితంగా పనిచేయడం వంటి అనేకానేక చర్యల వల్ల ఈ అభివృద్ధి సాధ్యమైంది. ఇటీవలి కాలంలో దేశీ టెక్నాలజీ పరిశ్రమల ముఖచిత్రంలో గణనీమైన మార్పులు వస్తున్నాయి. మైక్రో ఉపగ్రహ సమూహాల ప్రయోగంలో ప్రైవేట్ సంస్థలు బిజీగా ఉంటున్నాయి. వేగంగా ముంచుకొస్తున్న వాతావరణ మార్పులను దృష్టిలో పెట్టుకుని భారత ప్రభుత్వం కూడా సాంకేతిక పరిజ్ఞాన రంగంలో స్వావలంబ నకు, మరీ ముఖ్యంగా అత్యాధునిక టెక్నాలజీల విషయంలో మరిన్ని ఎక్కువ పెట్టుబడులు పెట్టాల్సిన అవసరం ఎంతైనా ఉంది. దినేశ్ సి. శర్మ వ్యాసకర్త సైన్స్ అంశాల వ్యాఖ్యాత (‘ద ట్రిబ్యూన్’ సౌజన్యంతో) -
రాబోయే రోజుల్లో... దేశంలోని వాతావరణం ఇలా..
దేశంలో వాతావరణ పరిస్థితులు నిరంతరం మారుతూ ఉంటాయి. ప్రస్తుతం దేశంలోని కొన్ని రాష్ట్రాల్లో దట్టమైన పొగమంచు నెలకొనివుంది. దక్షిణ భారతదేశంలో వర్షాకాలం కొనసాగుతోంది. హిమాచల్‌లోని కొండ ప్రాంతాల్లో మంచు కురుస్తోంది. జమ్మూకశ్మీర్‌లో ఎముకలు కొరికే చలి వ్యాపించింది. శుక్రవారం రాత్రి శ్రీనగర్‌లో ఈ సీజన్లో అత్యంత చలి వాతావరణం ఏర్పడింది. నగరంలో ఉష్ణోగ్రత -4.6 డిగ్రీల సెల్సియస్‌గా నమోదైంది. భారత వాతావరణ శాఖ (ఐఎండీ) అంచనాల ప్రకారం రానున్న రెండు రోజుల్లో దేశంలోని కొన్ని రాష్ట్రాల్లో వర్షాలు కురిసే అవకాశం ఉంది. రాబోయే మూడు రోజుల్లో వాయువ్య, మధ్య, తూర్పు భారతదేశంలో కనిష్ట ఉష్ణోగ్రతలు దాదాపు రెండు నుంచి నాలుగు డిగ్రీల సెల్సియస్ వరకూ తగ్గే అవకాశం ఉంది. #WATCH | Tamil Nadu: Heavy rain lashes parts of Coimbatore city early morning pic.twitter.com/2b9NmFCStR — ANI (@ANI) December 9, 2023 తమిళనాడులోని కోయంబత్తూరులో శనివారం ఉదయం భారీ వర్షం కురిసింది. వాతావరణ శాఖ అంచనా ప్రకారం దేశంలోని జార్ఖండ్, బీహార్, యూపీ, పశ్చిమ బెంగాల్, నాగాలాండ్, మణిపూర్, మిజోరం, త్రిపుర, మేఘాలయ, అస్సాం, అరుణాచల్ ప్రదేశ్, లక్షద్వీప్, ఛత్తీస్‌గఢ్, ఒడిశా, మధ్యప్రదేశ్, కోస్తా ఆంధ్ర ప్రదేశ్, తమిళనాడు, కేరళ , అండమాన్, నికోబార్ దీవులలో వర్షాలు కురుస్తాయి. పంజాబ్, హర్యానా, ఢిల్లీలో దట్టమైన పొగమంచు కమ్ముకునే అవకాశం ఉంది. తమిళనాడు, కేరళలో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది. డిసెంబర్ 12న పశ్చిమ బెంగాల్, సిక్కింలో వర్షాలు, వడగళ్ల వాన కురిసే అవకాశం ఉంది. డిసెంబర్ 10న దక్షిణ భారతదేశంలో కొన్ని చోట్ల భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది. రాజస్థాన్‌లోనూ చలి ప్రభావం పెరుగుతున్నదని వాతావరణ శాఖ తెలిపింది. ⛈️ Weather Alert! Possibility of scattered rain in parts of #Karnataka and #Kerala! 🌧️ #RainyDay #KarnatakaWeather #KeralaRain pic.twitter.com/2zg3lu1P3U — Weather & Radar India (@WeatherRadar_IN) December 9, 2023 ఇక ఢిల్లీ-ఎన్సీఆర్ విషయానికి వస్తే శనివారం ఉదయం చల్లగాలులు వీచాయి. వాతావరణ శాఖ తెలిపిన వివరాల ప్రకారం ఢిల్లీ-ఎన్సీఆర్లో డిసెంబర్ 15 తర్వాత చలి గణనీయంగా పెరగనుంది. కనిష్ట ఉష్ణోగ్రత ఆరు డిగ్రీల సెల్సియస్ వరకు చేరుకోవచ్చు. ఇది కూడా చదవండి: కొవ్వొత్తుల ఫ్యాక్టరీలో అగ్నిప్రమాదం.. ఆరుగురు మృతి! -
తుపానులకు పేర్లు ఎందుకు? ఎవరు పెడతారు?
ఈ సంవత్సరంలో నాలుగో తుపాను ఇప్పుడు భారతదేశాన్ని చుట్టుముట్టేయడానికి సిద్ధంగా ఉందని వాతావరణశాఖ (ఐఎండీ) హెచ్చరించింది. ‘మిథిలీ’ తుపాను బీభత్సం మరువక ముందే ‘మిచాంగ్’ తుపాను విరుచుకుపడబోతోందని వాతావరణశాఖ అధికారులు చెబుతున్నారు. ‘మిచాంగ్’ తుపాను డిసెంబర్ 4న తమిళనాడు రాజధాని చెన్నై, ఆంధ్రప్రదేశ్‌లోని మచిలీపట్నం మధ్య తీరాన్ని తాకే అవకాశం ఉన్నదని భారత వాతావరణ కేంద్రం తెలియజేసింది. ఇంతకీ తుపానులకు పేర్లు ఎందుకు పెడతారు? వాటి మధ్య తేడాలేమైనా ఉంటాయా? హుద్‌హుద్.. తిత్లీ.. పెథాయ్ పేర్లు వేరైనా ఇవన్నీ మన దేశంలో విరుచుకుపడిన తుపానులే. ఒకే ప్రాంతంలో ఒకేసారి ఒకటి కన్నా ఎక్కువ తుపానులు సంభవించినప్పుడు వాటి మధ్య తేడా, ప్రభావాలను గుర్తించేందుకు వాటికి ఇలా పేర్లు పెడుతుంటారు. ఆగ్నేయాసియాలోని దేశాలే తుపానులకు పేర్లు పెడుతుంటాయి. ఉదాహరణకు తిత్లీ పేరును పాకిస్తాన్, గజను శ్రీలంక సూచించాయి. గతంలో ఒడిశా, పశ్చిమ బంగాలను వణికించిన తుపానుకు అంఫన్ అని పేరు పెట్టింది థాయ్‌లాండ్. అంఫన్ అంటే థాయిలాండ్ భాషలో ఆకాశం అని అర్థం. కనీసం 61 కిలోమీటర్ల వేగం కలిగిన గాలులతో కూడిన తుపాను సంభవించినప్పుడే వాటికి పేర్లు పెట్టడమనేది సంప్రదాయంగా వస్తోంది. అమెరికాలో తుపాన్లను టోర్నెడోలని, చైనాలో టైఫూన్స్, హిందూ మహాసముద్రంలో సంభవించే తుపాన్లను సైక్లోన్స్ అని పిలుస్తారు. ఆస్టేలియా పశ్చిమ తీరంలో సంభవించే తుపాన్లను విల్లీవిల్లీస్, వెస్ట్ ఇండీస్ దీవుల్లోని తుపాన్ల ను హరికేన్స్ అని అంటారు. ఉత్తర హిందూ మహాసముద్రంలో సంభవించే తుపానులకు పేర్లు పెట్టడం 2004 సెప్టెంబరు నుంచి మొదలైంది. హిందూ మహా సముద్ర తీర ప్రాంతంలోని బంగ్లాదేశ్, భారత్, మాల్దీవులు, మయన్మార్, ఒమన్, పాకిస్తాన్, శ్రీలంక, థాయ్‌లాండ్ పేర్లలోని మొదటి ఆంగ్ల అక్షరాల జాబితా ఆధారంగా తుపాన్లకు పేర్లు పెడుతుంటారు. 2018లో ఈ జాబితాలో ఇరాన్, ఖతార్, సౌదీ అరేబియా, యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్, యెమెన్ చేరాయి. దీంతో ఈ దేశాల సంఖ్య 13కు చేరుకుంది. నిసర్గా తుపానుకు బంగ్లాదేశ్, గతి తుపానుకు భారత్, నివార్‌కు ఇరాన్, బురేవికి మాల్దీవులు, తౌక్టేకి మయన్మార్, యాస్కి ఒమన్ పేర్లు పెట్టాయి. భారతదేశం.. గతితో పాటు తేజ్, మురాసు, ఆగ్, వ్యోమ్, జహర్, ప్రోబాహో, నీర్, ప్రభాజన్, ఘుర్ని, అంబుడ్, జలాధి, వేగా వంటి పేర్లను సూచించింది. వాతావరణ శాఖ నిబంధనల మేరకే ఈ పేర్లు పెట్టాల్సి ఉంటుంది. ఇవి ఉచ్ఛరించడానికి సులభంగా, ఎనిమిది అక్షరాలలోపే ఉండాలి. ఇవి ఎవరి భావోద్వేగాలను, విశ్వాసాలను దెబ్బతీయకూడని విధంగా ఉండాలి. తుపాన్లకు పేర్లు పెట్టడం వలన వాటిని గుర్తుపెట్టుకోవడం సులభమవుతుంది. ఆ తుపాను కదలికల మీద హెచ్చరికలు జారీ చేయడానికి వీలవుతుంది. ఒకేసారి రెండు, మూడు తుపానులు వచ్చిన పక్షంలో వాటిని గుర్తించడానికి అనువుగా ఉంటుంది. ఈ పేర్ల వలన ఏ తుపాను ఎప్పుడు వచ్చిందనేది గుర్తుపెట్టుకోవడం మరింత సులభమవుతుంది. ప్రజలకు హెచ్చరికలు జారీ చేయడానికి ఈ విధానం అనువుగా ఉంటుంది. ఇది కూడా చదవండి: కాంగ్రెస్ గెలిస్తే సీఎం ఎవరు? ఓడితే బాధ్యులెవరు? -
వరల్డ్ టాలెంట్ ర్యాంకింగ్‌లో వెనుక పడిన భారత్.. రీజన్ ఇదే!
ఇంటర్నేషనల్ ఇన్స్టిట్యూట్ ఫర్ మేనేజ్మెంట్ డెవలప్మెంట్ (IMD) విడుదల చేసిన డేటా ప్రకారం, 2023 వరల్డ్ టాలెంట్ ర్యాంకింగ్‌లో భారత్ ఇంతకు ముందుకంటే కూడా నాలుగు స్థానాలు దిగజారింది. దీనికి సంబంధించిన మరిన్ని వివరాలు ఈ కథనంలో తెలుసుకుందాం. నివేదికల ప్రకారం.. ప్రపంచంలోని 64 ఆర్థిక వ్యవస్థలలో భారతదేశం 56 స్థానం పొందింది. 2022లో ఇండియా ర్యాంక్ 52 కావడం గమనార్హం. ఈ లెక్కన గతం కంటే ఇండియా నాలుగు స్థానాలు కిందికి వెళ్ళింది. భారతదేశ మౌలిక సదుపాయాలు మెరుగుపడినప్పటికీ, ప్రతిభ పోటీతత్వాన్ని మరింత మెరుగుపరచాల్సిన అవసరం ఉందని చెబుతున్నారు. ఇది మెరుగుపడితే ఇండియా మరింత ముందుకు వెళుతుందని అభిప్రాయపడుతున్నారు. 2023 ఐఎండీ వరల్డ్ టాలెంట్ ర్యాంకింగ్‌లో స్విట్జర్లాండ్ అగ్రస్థానంలో ఉండగా, లక్సెంబర్గ్ రెండవ స్థానంలో ఉంది, ఐస్లాండ్, బెల్జియం, నెదర్లాండ్స్ తర్వాతి స్థానాల్లో నిలిచాయి. అమెరికా 15వ స్థానంలో, యూకే 35, చైనా 41 ఉన్నాయి. చివరి రెండు స్థానాల్లో బ్రెజిల్ 63, మంగోలియా 64 చేరాయి. ఇదీ చదవండి: భారత్‌లో ధాన్యం ధరలు పెరిగే అవకాశం! కారణం ఇదే.. ఐఎండీ వరల్డ్ టాలెంట్ ర్యాంకింగ్ అనేది క్వాలిటీ లైఫ్, చట్టబద్ధమైన కనీస వేతనం, ప్రాథమిక & మాధ్యమిక విద్యతో సహా వివిధ అంశాలను పరిగణనలోకి తీసుకుని నిర్ణయించడం జరుగుతుంది. దీని ప్రకారం భవిష్యత్ సంసిద్ధతలో భారతదేశం 29వ స్థానంలో ఉన్నట్లు తెలిసింది. -
కోస్తాలోని పలు ప్రాంతాల్లో వర్షాలు
-
తెలుగు రాష్ట్రాల్లో కురుస్తున్న భారీ వర్షాలు
సాక్షి, హైదరాబాద్/విశాఖ: ఈశాన్య బంగాళాఖాతంలో ఆవర్తన ప్రభావంతో.. తెలుగు రాష్ట్రాల్లో భారీ వర్షాలు కురుస్తున్నాయి. ఆవర్తనం రేపటి కల్లా బలపడి అల్పపీడనంగా మారనుంది. ఈ క్రమంలో.. మరో రెండు మూడు రోజులపాటు భారీ నుంచి అతిభారీ వర్షాలు కురవొచ్చని హెచ్చరికలు జారీ చేసింది భారత వాతావరణ శాఖ. ఇప్పటికే తెలంగాణలో పలు జిల్లాలకు అలర్ట్‌లు జారీ చేసింది వాతావరణ శాఖ. తొమ్మిది జిల్లాలకు ఆరెంజ్, 18 జిల్లాలకు ఎల్లో అలర్ట్ జారీ చేసింది. హైదరాబాద్‌కు భారీ వర్షసూచన చేయడంతో జీహెచ్ఎంసీ అప్రమత్తమైంది. ► తెలంగాణలో.. నిన్నటి నుంచి పలు జిల్లాల్లో ఎడతెరిపి లేకుండా వాన కురుస్తోంది. భూపాలపల్లి, ఉమ్మడి ఆదిలాబాద్‌లో వాగులు పొంగిపొర్లి.. పలు గ్రామాలకు రాకపోకలకు స్తంభించాయి. నిర్మల్ జిల్లా కడెం ప్రాజెక్టుకు వరద పోటెత్తడంతో.. రెండు గేట్లను ఎత్తి వరదనీటిని దిగువకు వదులుతున్నారు. MASSIVE DOWNPOURS triggering in Nirmal, Nizamabad, Jagitial belt to cover Kamareddy, Sircilla, Karimnagar, Sangareddy, Medak, Siddipet in coming 2hrs Chances looks highly favourable for morning rains in HYD. Will continue to update. Better prefer public transport this morning — Telangana Weatherman (@balaji25_t) September 4, 2023 ► ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాను.. మళ్లీ వర్షాలు ప్రజలకు దడపుట్టిస్తున్నాయి. ఈ ఉదయం నుంచి ఆదిలాబాద్ కేంద్రంలో భారీ వాన కురుస్తుండగా.. రోడ్లు జలమయం అయ్యాయి. ఇప్పటికే రాకపోకలు నిలిచిపోగా.. ప్రజలు తీవ్రమైన ఇబ్బందులు పడుతున్నారు. ► భూపాలపల్లిలోనూ నిన్నటి నుంచి వాన కురుస్తుండడంతో.. ఓపెన్ కాస్ట్ పనులకు అంతరాయం కలుగుతోంది. ► నిజామాబాద్‌లోనూ భారీ వర్షాలు కురుస్తున్నాయి. డిచ్‌పల్లిలో అత్యధిక వర్షపాతం నమోదు అయ్యింది. ► ఉమ్మడి మెదక్‌లోనూ భారీ వర్షం కురుస్తోంది. గరిష్టంగా 13 సెం.మీ. వర్షపాతం నమోదైనట్లు సమాచారం. ఆంధ్రప్రదేశ్ దక్షిణ కోస్తా ప్రాంతంలో.. రేపు, భారీ నుంచి అతిభారీ వర్షాలు కురుస్తాయని హెచ్చరించింది. బలంగా గాలులు వీస్తాయని, ఎల్లుండి సైతం భారీ వానలు ఉంటాయని అప్రమత్తం చేస్తోంది. కర్నూలు: జిల్లాలో భారీ వర్షం కురుస్తోంది. పలు ప్రాంతాలు జలమయం అయ్యాయి. ఇక వర్షం నేపథ్యంలో.. రాయలసీమ జోన్ ఎస్సై అభ్యర్థుల దేహదారుఢ్య పరీక్షలు వాయిదా పడ్డాయయి. ఆంధ్రప్రదేశ్ లోని రాయలసీమ జోన్ పరిధిలో(సెప్టెంబర్ 4 వ తేది) కర్నూల్ APSP 2 వ బెటాలియన్ లో సోమవారం జరగాల్సిన ఎస్సై అభ్యర్థుల దేహదారుఢ్య పరీక్షలను భారీ వర్షం కారణంగా వాయిదా వేస్తున్నట్లు కర్నూల్ రేంజ్ డీఐజీ సెంథిల్ కుమార్ తెలిపారు. ఈ పరీక్షలను సెప్టెంబరు 21 తేదికి వాయిదా వేస్తున్నట్లు తెలిపారు. నెల్లూరు: ఎగువ ప్రాంతాలలో కురుస్తున్న వర్షాలకు సోమశిల జలాశయానికి వరద పెరుగుతోంది. ఇన్ ఫ్లో 13,897 క్యూసెక్కులు.. అవుట్ ఫ్లో 2,774 క్యూసెక్కులుగా ఉంది. ప్రస్తుత నీటిమట్టం 17.610 టీఎంసీలు కాగా.. జలాశయం పూర్తి కెపాసిటీ 78 టీఎంసీలు. అనంతపురం: తాడిపత్రిలో భారీ వర్షం కురుస్తోంది. పలు వాగులు వంకలు పొంగిపొర్లడంతో వాహనాల రాకపోకలకు ఇబ్బంది కలుగుతోంది. -
తెలంగాణలో ఈ జిల్లాలకు భారీ వర్షాలు
సాక్షి, హైదరాబాద్: వాయువ్య బంగాళాఖాతం పరిసర ప్రాంతాల్లో ఆవర్తనం కొనసాగుతోంది. ఈ ప్రభావంతో రాగల 12 గంటల్లో అల్పపీడనం ఏర్పడనుంది. ఇప్పటికే పశ్చిమ, వాయువ్య దిశల నుంచి తెలంగాణ వైపు గాలులు వీస్తుండగా.. మూడు రోజులపాటు వర్షాలు కురవొచ్చని వాతావరణ శాఖ అంచనా వేస్తోంది. రాగల మూడు రోజుల పాటు తెలంగాణ రాష్ట్రంలో చాలా చోట్ల వర్షాలు కురవనున్నాయి. రేపు(శుక్రవారం), ఎల్లుండి(శనివారం) అక్కడక్కడా కొన్ని జిల్లాల్లో భారీ వర్షాలు కురవొచ్చని వాతావరణ శాఖ చెబుతోంది. మూడు రోజులు ఉరుములు, మెరుపులతో కూడిన వర్షాలు కురుస్తాయని తెలిపింది. ఆదిలాబాద్, కుమ్రంభీం ఆసిఫాబాద్, మంచిర్యాల, నిర్మల్, నిజామాబాద్, జగిత్యాల్, రాజన్న సిరిసిల్ల, కరీంనగర్, పెద్దపల్లి, జయశంకర్ భూపాలపల్లి, ములుగు, మహబూబాబాద్, వరంగల్, హన్మకొండ, కామారెడ్డి జిల్లాలలో రేపు(శుక్రవారం) భారీ వర్షాలు కురుస్తాయని తెలిపింది. వచ్చే రెండు రోజులపాటు ఈ జిల్లాలకి ఎల్లో అలర్ట్ హెచ్చరికలు జారీ చేసింది వాతావరణ శాఖ. ఇక రాజధాని హైదరాబాద్ నగరంలో వచ్చే రెండు రోజులపాటు తేలికపాటి నుంచి మోస్తారు వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది. -
Heavy Rains: ఉత్తర భారతానికి ఈ పరిస్థితి ఎందుకు?
ఢిల్లీ: ఆలస్యంగా వచ్చిన రుతుపవనాలు, బిపర్జోయ్ తుపాను ప్రభావమూ ఓ పక్క.. ఇంకోపక్క అధిక ఉష్ణోగ్రతల ప్రభావమూ ఈ యేడు వానల్ని ఆలస్యం చేశాయి. అయితే ఈలోపు రికార్డు స్థాయిలో ఉత్తరాదిన కురుస్తున్న వర్షాలు.. అతలాకుతలం చేస్తున్నాయి. భీకర వర్షాలతో సగానికి పైగా ఉత్తర భారతం నీట మునిగింది. మరోపక్క ఆస్తి నష్టంపై ఇప్పుడే అంచనాకి రాలేని స్థితిలో.. మృతుల సంఖ్యా వందకు పైనే ఉండొచ్చని తెలుస్తోంది. అయితే ఉన్నట్లుండి ఉత్తరాదిపై వరుణుడు ఇంతగా ప్రతాపం చూపించడానికి కారణంపై భారత వాతావరణ శాఖ స్పందించింది. ఉత్తర భారతంలో నెలకొన్న అసాధరణ పరిస్థితిపై ఐఎండీ స్పష్టత ఇచ్చింది. పశ్చిమ భాగంలో నెలకొన్న సంక్షోభం(వాతావరణ మార్పులు).. అదే సమయంలో రుతుపవనాల ప్రభావం వల్ల ఉత్తర భారత దేశంలో ఈ భీకర వర్షాలు కురుస్తున్నాయని భారత వాతావరణ శాఖ అంటోంది. అలాగే జులై మొదటి వారంలో కురిసిన వర్షాలు.. మొత్తం దేశానికి లోటును భర్తీ చేశాయని తెలిపింది ఐఎండీ. ये आवाज किसकी है? #DelhiRains . Who know this ? #Chandigarh #Atlee #JawanPrevue #Heavyrainfall #Manali #PriyAnkit #TejRan #oriele #emeutes #himachalfloods pic.twitter.com/TC2OgiNqwd — Baba Chuskiwale (@BabaChuskiWale) July 10, 2023 #WATCH | Himachal Pradesh: Latest visuals from Mandi around Victoria Bridge and Panchvakhtra Temple. pic.twitter.com/1jnhmTr8V6 — ANI (@ANI) July 10, 2023 వర్షాకాలంలో సంచిత వర్షపాతం 243.2 మిల్లీమీటర్లకు చేరుకుంది, ఇది సాధారణం 239.1 మిమీ కంటే రెండు శాతం ఎక్కువ అని IMD ప్రకటించింది. అలాగే.. జూన్ చివరి నాటి కల్లా దేశం మొత్తం మీద 148.6 మి.మీ నమోదు కాగా.. అది సాధారణ వర్షపాతం కంటే 10 శాతం తక్కువ తెలిపింది. వాస్తవానికి ఈ జులైలో సాధారణ వర్షపాతమే నమోదు అవుతుందని ఐఎండీ అంచనా వేసింది. కానీ.. వాతావరణ మార్పుల వల్ల అంచనాలు తప్పి అధిక వర్షాలు కురుస్తున్నాయి. जितना हम प्रकृति को नुकसान पहुंचाएंगे, वो हमे भी उतना ही नुकसान पहुंचाएगी 😥 Pray for Himachal #Heavyrainfall #HimachalPradesh #flood #Himachalrain #himachalflood #staysafe #mandi #Kullu pic.twitter.com/j222xFbmbc — कंचन शर्मा (@itsKanchan7) July 10, 2023 ఉత్తర భారతంలో చాలా రాష్ట్రాల్లో ఎడతెరిపి లేకుండా భారీ వర్షాలు కురుస్తున్నాయి. కొండచరియలు విరిగిపోవడం, ఆకస్మాత్తుగా వరదలు పొటెత్తడంతో తీవ్ర నష్టం వాటిల్లుతోంది. పలు నదులు ఉప్పోంగి ప్రవహిస్తున్నాయి. భారీ వర్షాలకు ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. లోతట్టు ప్రాంతాలు జలమయమయ్యాయి. పలు చోట్ల ఎన్డీఆర్ఎఫ్ సిబ్బంది, స్థానిక యంత్రాంగం రంగంలోకి దిగి వరదల్లో చిక్కుకున్నవారిని కాపాడుతున్నారు. వరదల ధాటికి.. వాహనాలు, రోడ్లు, వంతెనలు, భవనాలు సైతం కొట్టుకుపోతున్నాయి. #WATCH | Water level in Yamuna river reaches near danger mark at Old Railway Bridge. pic.twitter.com/oNfL7qwe1c — ANI (@ANI) July 10, 2023 #Heavyrainfall #HimachalPradesh pic.twitter.com/L0RGEKkzbI — Satendra Pandit (@SatendraPandi10) July 10, 2023 రాజధాని ఢిల్లీ రీజియన్ సహా.. హిమాచల్ ప్రదేశ్, ఉత్తరాఖండ్, పంజాబ్, హర్యానా, జమ్ము కశ్మీర్, రాజస్థాన్‌కూ ఇంకా వాన ముప్పు తప్పలేదని వాతావరణ శాఖ హెచ్చరించింది. యమునా నది ఉగ్ర రూపం దాల్చి.. ముంచెత్తడానికి సిద్ధమవుతోంది. మరోవైపు సెంట్రల్ వాటర్ కమిషన్.. నీటి నిల్వలపైనా ఒక ప్రకటన చేసింది. రిజర్వాయర్లోల నీటి సామర్థ్యం మెరుగుపడిందని పేర్కొంది. -
IMD Alert: దంచికొడుతున్న వాన.. ఇంకా ముప్పు పొంచి ఉంది.. జాగ్రత్త!
ఢిల్లీ: వరదలతో అతలాకుతలం అవుతున్న ఉత్తరభారతానికి ఇంకా ముప్పు పొంచి ఉందని భారత వాతావరణ శాఖ తెలిపింది. మరో రెండు రోజులు భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని స్పషం చేసింది. ఇప్పటికే జమ్మూకశ్మీర్, హిమాచల్ ప్రదేశ్, ఉత్తరాఖండ్ లకు ఆరెంజ్ అలెర్ట్ జారీ చేసింది. పంజాబ్, హర్యానా, యూపీ, రాజస్థాన్ లకు ఎల్లో అలెర్ట్ జారీ చేసింది. ఎడతెరిపి లేని వర్షాల కారణంగా నదుల్లో వరద నీరు ఉద్ధృతంగా ప్రవహిస్తోంది. ప్రవాహ వేగానికి బ్రిడ్జిలు కుప్పకూలిపోతున్నాయి. పలు భవనాలు నీటమునిగాయి. నగరాలు నుంచి పల్లెలదాక కాలనీలు జలమయమయ్యాయి. దీంతో జనజీవనం అస్తవ్యస్తమైంది. మరో రెండు రోజుల పాటు ప్రజలు జాగ్రత్తగా ఉండాలని ఐఎమ్‌డీ హెచ్చరికలు జారీ చేసింది. నదీ ప్రవాహాలకు దగ్గరగా వెళ్లకూడదని ఆదేశాలు జారీ చేసింది. ఉత్తరభారతాన్ని భారీ వర్షాలు వణికిస్తున్నాయి. కొండచరియలు విరిగి పడిన ఘటనల్లో 19 మంది చనిపోయారు. ఢిల్లీలోని యమున సహా పలు నదులు పొంగిపొర్లుతున్నాయి. ఆకస్మిక వరదలతో రహదారులపై రాకపోకలు స్తంభించాయి. దేశ రాజధానిలో నాలుగు దశాబ్దాల్లో ఎన్నడూ లేనంత వర్షం కురిసింది. 24 గంటల వ్యవధిలో ఏకంగా 153 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదైంది. 1982 జూలై తర్వాత, ఈ స్థాయిలో వాన దంచికొట్టడం ఇదే ప్రథమం. ఇదీ చదవండి: ఉత్తరాదిని ముంచెత్తిన వర్షాలు.. జనజీవనం అస్తవ్యస్తం.. -
ఢిల్లీని కుదిపేస్తున్న కుంభవృష్టి.. 40 ఏళ్లలో ఇదే తొలిసారి..
ఢిల్లీ: ఎడతెరిపిలేని వర్షాలు దేశ రాజధానిని కుదిపేస్తున్నాయి. ఢిల్లీలో రెండో రోజూ భారీగా వర్షం కురుస్తోంది. గత 24 గంటల్లో ఏకంగా 153 సెంటీమీటర్ల వర్షం నమోదైంది. గత 40 ఏళ్లలో ఒకే రోజులో ఈ స్థాయిలో వర్షం సంభవించడం ఇదే తొలిసారి కావడం గమనార్హం. 1982 జులైలో మొదటిసారి ఇంత భారీ వర్షం కురిసింది. ఏకధాటిగా కురుస్తున్న వర్షాలతో లోతట్టు ప్రాంతాలన్నీ ఇప్పటికే జలమయమయ్యాయి. రానున్న మరో 2-3 రోజులపాటు తీవ్ర స్థాయిలో వర్షాలు కురిసే అవకాశాలు ఉన్నాయని భారత వాతావరణ శాఖ అంచనా వేసింది. దీంతో దేశ రాజధానిలో ఎల్లో అలర్ట్‌ను జారీ చేశారు అధికారులు. #WATCH | Delhi wakes up to rain lashing several parts of the city; visuals from Mayur Vihar Phase II area pic.twitter.com/WVXuHMyR0E — ANI (@ANI) July 9, 2023 భారీ వానల కారణంగా లోతట్టు ప్రాంతాలు నీటమునిగాయి. వాహనదారులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. రోడ్ల మీద వరద నీరు చేరడంతో అండర్ పాస్‌లను అధికారులు మూసివేశారు. రానున్న నాలుగు, ఐదు రోజుల్లో జమ్మూ, హిమాచల్ ప్రదేశ్, ఉత్తరాఖండ్, పంజాబ్, హర్యానా, పశ్చిమ ఉత్తర ప్రదేశ్‌లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉన్నట్టు వాతావరణ శాఖ అధికారులు హెచ్చరించారు. దేశంలో నైరుతి రుతుపవనాల ప్రభావం విశేషంగా కొనసాగుతోంది. పంజాబ్, హర్యానాల్లో ఊహించినదానికంటే ముందుగానే వచ్చాయి. పంజాబ్, హర్యానా, ఛండీగఢ్‌లో ఆరెంజ్ అలర్ట్ జారీ చేశారు అధికారులు. వర్షాల కారణంగా ఢిల్లీలో ఇప్పటికే 15 ఇల్లు కూలిపోగా.. ఓ వ్యక్తి మరణించాడని అధికారులు తెలిపారు. ఇదీ చదవండి: ఢిల్లీలో భారీ వర్షం.. ఇండియా గేట్, నోయిడాలో భారీగా ట్రాఫిక్ జామ్ -
చల్లటి కబురు.. తెలుగు రాష్ట్రాల్లో రెండు రోజుల పాటు వర్షాలు
సాక్షి, హైదరాబాద్: భానుడి సెగలతో ఉక్కిరిబిక్కిరి అయిన తెలుగు రాష్ట్రాలకు వాతావరణ శాఖ చల్లటి కబురు చెప్పింది. రానున్న రెండ్రోజులు తెలుగు రాష్ట్రాల్లో వర్షాలు కురుస్తాయని ప్రకటించింది. ఈ నేపథ్యంలో వేసవి తాపం, మండే ఎండలు, వడగాడ్పుల నుంచి తెలుగు ప్రజలకు కాస్త ఉపశమనం దొరకనుంది. రుతుపవనాలు ప్రస్తుతం చురుగ్గా కదులుతుండడంతో తెలుగు రాష్ట్రాల్లో వర్షాలు కురుస్తున్నాయి. ఈ క్రమంలో తెలుగు రాష్ట్రాలలో ఓ మోస్తరు నుంచి తేలికపాటి వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ కేంద్రం తెలిపింది. తెలంగాణలో.. మంచిర్యాల, కరీంనగర్, పెద్దపల్లి, భూపాలపల్లి, ములుగు జిల్లాల్లో భారీ వానలు కురిసే అవకాశం ఉండగా.. ఆదిలాబాద్, నిజామాబాద్, జగిత్యాల జిల్లాల్లో ఓ మోస్తరు వర్షాలు కురువనున్నట్లు తెలిపింది. మరో వైపు ఆంధ్రప్రదేశ్‌లోనూ ఓ మోస్తరు నుంచి తేలికపాటి వర్షాలు.. శ్రీకాకుళం, మన్యం, అనకాపల్లి, అల్లూరి, ఉభయగోదావరి, కృష్ణా, గుంటూరు, ప్రకాశం, నెల్లూరు, కడప, సత్యసాయి, నంద్యాల జిల్లాలోనూ ఓ మోస్తరు మంచి తేలికపాటి వర్షాలు పడునున్నట్లు వాతావరణ కేంద్రం తెలిపింది. చదవండి: నాతో సెల్ఫీ కావాలా.? -
ఆకాశం నుంచి పెద్ద శబ్థం.. భయాందోళనలో జనం.. అక్కడ ఏం జరిగింది!
వేలూరు(చెన్నై): జిల్లాలోని గుడియాత్తం సమీపంలో ఆదివారం రాత్రి ఆకాశం నుంచి ఒక వస్తువు పెద్ద శబ్దంతో కింద పడటంతో స్థానికులు భయాందోళన చెందారు. గుడియాత్తం తాలూకా నెల్లూరుపేట పంచాయతీ పరిధిలోని లింగుండ్రం గ్రామంలో ఆదివారం రాత్రి 7 గంటల సమయంలో ఆకాశం నుంచి ఒక విచిత్రమైన వస్తువు పడింది. గమనించిన స్థానికులు పెద్ద సంఖ్యలో అక్కడికి వచ్చి చూశారు. అక్కడ పారాచూట్ లాంటి వస్తువు, సమీపంలో సిగ్నిల్ ఉన్న చిన్న పెట్టెను కనుగొన్నారు. గుడియాత్తం పోలీసులకు సమాచారం అందజేశారు. పోలీసులు అక్కడికి చేరుకుని విచారణ జరిపారు. ఆ సమయంలో సిగ్నల్స్ ఉన్న చిన్న పెట్టెలో కేంద్ర ప్రబుత్వ జాతీయ వాతావరణ కేంద్రం, మీనంబాక్కం, చెన్నై అనే చిరునామా, ఫోన్ నంబరు ఉండడంతో చెన్నైలోని వాతావారణ కార్యాలయానికి ఫోన్ చేసి విచారించారు. దీంతో చెన్నై వాతావరణ కేంద్రం నుంచి వివిధ ప్రాంతాల్లో వాతావరణ మార్పులపై అధ్యయనం చేసేందుకు సిగ్నల్స్ ఉన్న పెట్టె సహకారంతో పంపినట్లు అధికారులు తెలిపారు. పోలీసులు వాటిని సేకరించి పోలీస్ స్టేషన్లో భద్రపరిచారు. చదవండి: ఆరో తరగతిలోనే పెళ్లి.. నేనున్నానని తోడు నిలిచిన భార్య.. డాక్టర్ కొలువుకు ‘నీట్’గా -
అల్పపీడనంగా మారుతున్న ‘బిపర్జోయ్’.. ఆ ప్రాంత ప్రజలకు హెచ్చరికలు జారీ
న్యూఢిల్లీ: గుజరాత్ తీరప్రాంత జిల్లాలను అతలాకుతలం చేసిన బిపర్జోయ్ తుపాను తాజాగా రాజస్తాన్‌పై ప్రతాపం చూపుతోంది. దీని ప్రభావం కారణంగా రాజస్థాన్, గుజరాత్ పరిసర ప్రాంతాల్లో కొన్ని చోట్ల భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని ఐఎండీ తెలిపింది. బిపార్జోయ్ తుఫాను ప్రస్తుతం అల్పపీడనంగా మారుతోందని తెలిపింది. ముఖ్యంగా దక్షిణ రాజస్థాన్, ఉత్తర గుజరాత్‌లోని పరిసర ప్రాంతాల్లో భారీ వర్షాలు కురుస్తాయని, గంటకు 50కి.మీ వేగంతో ఈదురుగాలులు వీచే అవకాశమున్నట్లు అధికారులు తెలిపారు. ఈ నేపథ్యంలో ఆ ప్రాంతంలో మత్స్యకారులు వెటకు వెళ్లద్దని హెచ్చరికలు జారీ చేశారు. భారత వాతావరణ విభాగం (IMD) డైరెక్టర్ జనరల్, మృత్యుంజయ్ మహపాత్ర తెలిపిన వివరాల ప్రకారం.. ఆదివారం నుంచి బుధవారం వరకు తూర్పు, దక్షిణ భారతదేశంలోని కొన్ని ప్రాంతాలలో రుతుపవనాల పురోగతికి ఈ పరిస్థితులు అనుకూలంగా మారుతాయని తెలిపారు. బైపోర్‌జోయ్ గుజరాత్‌లోని తీరప్రాంతాల్లో విధ్వంసాన్ని సృష్టించింది ఆ ప్రాంత ప్రజల రోజూవారి జీవనాన్ని స్తంభింపచేసింది. ముఖ్యంగా కచ్ జిల్లాలో ఇది ఎక్కువ ప్రభావం చూపింది. In 1999, a Super Cyclone that struck #Odisha claimed 10,000+ lives…back then, #india had only PSLV rocket& 4 sats Today, India has 50+ sats & 4 rockets, #BiparjoyCyclone barrels into #Gujarat and there’s 2 casualties That’s the power of #space #tech for you 🇮🇳🚀#isro #imd pic.twitter.com/2zhpyslRg5 — Sidharth.M.P (@sdhrthmp) June 16, 2023 తెలుగు రాష్ట్రాలపై ప్రభావం.. సాధారణంగా ఈపాటికే ఆంధ్రప్రదేశ్‌లో వర్షాలు దంచికొట్టాలి. కానీ, ఎర్రటి ఎండలు మాత్రం మే నెలను తలపిస్తున్నాయి. పైగా అరేబియా సముద్రంలో ఏర్పడిన బిపర్జోయ్ తుపాను.. రుతుపవనాలపై పడింది. దీంతో తెలుగు రాష్ట్రాల్లో ఉష్ణోగ్రతలు గరిష్టంగానే కొనసాగుతుండగా.. వర్షాలు ఇంకా ఆలస్యంగా కురవొచ్చని వాతావరణ శాఖ అంచనా వేసింది. Fresh visuals of #BiparjoyCyclone hitting Kutch coastal areas of Gujarat with a wind velocity of approximately 145 kmph during #LANDFALL#Gujaratcyclone #BiparjoyUpdate #BiparjoyNews pic.twitter.com/IbshQG4LYW — BN Adhikari, IIS(Rtd) (@AdhikariBN) June 15, 2023 The Depression (Remnant of Cyclonic Storm ‘Biparjoy’) over central parts of South Rajasthan & neighbourhood at 2330 IST of 17th June, about 60 km SSW of Jodhpur. Very likely to continue to move ENE-wards and maintain the intensity of Depression till forenoon of 18th June. pic.twitter.com/CMb5sfee8H — India Meteorological Department (@Indiametdept) June 17, 2023 -
సైక్లోన్ బిపర్‌జోయ్‌తో 8 రాష్ట్రాల్లో అతిభారీ వర్షాలు
సైక్లోన్ బిపర్జోయ్ గురువారం సాయంత్రం గుజరాత్ తీరాన్ని తాకనుంది. ఈ నేపథ్యంలో భారత వాతావరణ శాఖ ఎప్పటికప్పుడు పరిస్థితిని సమీక్షిస్తూ.. అప్రమత్తత చేస్తూ వస్తోంది. ముందస్తు జాగ్రత్తగా గుజరాత్ వ్యాప్తంగా విద్యా సంస్థలు మూతపడ్డాయి. దాదాపు 17 ఎన్డీఆర్ఎఫ్ బృందాలు, 12 ఎస్డీఆర్ఎఫ్ టీంలు సిద్ధంగా ఉన్నాయి. ఇక ఎనిమిది రాష్ట్రాలకు, కేంద్రపాలిత ప్రాంతాలకు అతిభారీ వర్షాల హెచ్చరికలు జారీ చేసింది ఐఎండీ. బిపర్జోయ్ ఇవాళ పోర్బందర్, ద్వారకా వద్ద తీరాన్ని తాకే అవకాశం కనిపిస్తోంది. రేపు సాయంత్రం జఖావూ పోర్ట్ వద్ద తీరం దాటోచ్చని వాతావరణ శాఖ అంచనా వేస్తోంది. ఉత్తర-ఈశాన్య దిశగా కదిలే క్రమంలో గురువారం సౌరాష్ట్ర, కచ్‌పై విరుచుకుపడే అవకాశం ఉండడంతో రెడ్ అలర్ట్ జారీ చేసింది వాతావరణ శాఖ. దాదాపు 125 నుంచి 135 కిలోమీటర్ల వేగంతో తీరాన్ని తాకుతూ.. 150 కిలోమీటర్ల వేగంతో ఈదురు గాలులు వీయొచ్చని హెచ్చరించింది. బిపర్జోయ్ తుపాను కారణంగా.. గుజరాత్, రాజస్థాన్, మధ్య ప్రదేశ్, కేరళ, తమిళనాడు, కర్ణాటక, మహారాష్ట్ర, గోవా, లక్షద్వీప్‌లకు భారీ నుంచి అతి భారీ వర్ష హెచ్చరికలు జారీ అయ్యాయి. రెండు రోజులపాటు అంటే జూన్ 15 నుంచి 17 మధ్య ఈ తీవ్రత కొనసాగుతుందని వాతావరణ శాఖ తెలిపింది. మరోవైపు ప్రభుత్వం ఇప్పటికే 38 వేల మందిని సముద్ర తీరం నుంచి ఖాళీ చేయించినట్లు ప్రకటించింది. అయితే ఆ సంఖ్య 44వేలదాకా ఉంటుందని క్షేత్రస్థాయిలోని అధికారులు అంటున్నారు. 1965 నుంచి ఇప్పటిదాకా గుజరాత్‌ను తాకిన మూడో తుపానుగా బిపర్జోయ్ నిలవనుంది. ముంబైలో అలర్ట్ బిపర్జోయ్ కారణంగా ఇప్పటికే ముంబైలో భారీ వర్షాలు కురుస్తున్నాయి. అరేబియా సముద్రంలో అలలు ఉవ్వెత్తున్న ఎగసి పడుతున్నాయి. పశ్చిమ రైల్వేలో పలు రైలు రద్దుకాగా, కొన్నింటిని ఆయా మార్గాల్లో కుదించి నడుపుతున్నారు. #WATCH | Visuals from Jakhau Port in Bhuj, where a large number of boats have been parked as fishing has been suspended in the wake of #CycloneBiparjoy. Cyclone 'Biparjoy' is expected to cross near Gujarat's Jakhau Port by the evening of 15th June pic.twitter.com/KA7OKJE68O — ANI (@ANI) June 14, 2023 #WATCH | High tide waves hit Mumbai as cyclone 'Biporjoy' intensifies (Visuals from Gateway of India) pic.twitter.com/C1vhrHiWZS — ANI (@ANI) June 14, 2023 Cyclone Warning for Saurashtra & Kutch Coasts: RED MESSAGE. VSCS BIPARJOY at 0530IST of today over NE Arabian Sea near lat 21.9N & long 66.3E, about 280km WSW of Jakhau Port (Gujarat), 290km WSW of Devbhumi Dwarka. To cross near Jakhau Port (Gujarat) by evening of 15June as VSCS. pic.twitter.com/DQPh75eXwY — India Meteorological Department (@Indiametdept) June 14, 2023 #WATCH | High tide waves hit Gujarat as cyclone #Biparjoy intensified into a severe cyclonic storm (Visuals from Dwarka) pic.twitter.com/4c8roLFre1 — ANI (@ANI) June 14, 2023 ఇదీ చదవండి: బిపర్జోయ్ డ్యామేజ్ ఏ రేంజ్లో జరుగుతుందంటే.. -
బిపర్జోయ్ తుపాను మహోగ్రరూపం
బిపర్జోయ్ తుపాను ఉగ్రరూపం దాల్చింది. ఇది మరో 10 గంటల్లో అత్యంత తీవ్ర తుపానుగా మారే అవకాశం కనబడుతోంది. దీని ప్రభావంతో గుజరాత్ తీర ప్రాంతలో భారీగా ఈదురుగాలులు వీచే అవకాశం ఉంది. గుజరాత్‌పై పెద్దగా ప్రభావం చూపే అవకాశం లేదని ఇప్పటికే ఐఎండీ స్పష్టం చేసిననప్పటికీ సౌరాష్ట్ర, కచ్ దగ్గర తీరాన్ని తాకే అవకాశం ఉండటంతో తీరం వెంబడి ఉన్న ప్రాంతాల్లో దీని ప్రభావం అధికంగా ఉండే అవకాశాలు కనబడుతున్నాయి. బిపర్జోయ్ తుపాను ప్రభావంతో సముద్రం అల్లకల్లోలంగా మారింది. మత్య్సకారులు వేటకు వెళ్లొద్దని అధికారులు ఇప్పటికే హెచ్చరికలు జారీ చేశారు అధికారులు. మరొకవైపు ఈ తుపాను ప్రభావంతో రానున్న ఐదు రోజులపాలు గుజరాత్లో భారీ వర్షాలు పడే అవకాశం ఉందని వాతావరణ శాఖ స్పష్టం చేసింది. కర్ణాటక, గోవా రాష్ట్రాలకు భారీ వర్ష సూచన ఉంది. వాతావవరణ శాఖ సైక్లోన్ అలర్ట్ జారీ చేయడంతో గుజరాత్ ప్రభుత్వం అప్రమత్తమైంది. దీనిలో భాగంగా గుజరాత్ ముఖ్యమంత్రి భూపేంద్ర పటేల్ అధికారులతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. అత్యంత తీవ్ర తుపానుగా మారే దృష్ట్యా అధికారులు అంతా సిద్ధంగా ఉండాలని ఆదేశించారు. ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి రాజ్‌కుమార్, డీజీపీ వికాస్ సహాయ్, రిలీఫ్ కమిషనర్ అలోక్ పాండే, రెవెన్యూ శాఖ, ఇంధన శాఖ, రోడ్డు భవనాల శాఖల ఉన్నతాధికారులు ఈ సమావేశంలో పాల్గొన్నారు. ఇదిలా ఉంచితే, రాబోయే ఐదు రోజుల్లో గుజరాత్‌లోని కచ్, పాకిస్తాన్‌లోని కరాచీలపై ఈ తుపాను ప్రభావం అధికంగా ఉండే అవకాశం ఉంది. - ఉదయ్ కుమార్, సాక్షి వెబ్‌డెస్క్ -
అత్యంత తీవ్ర రూపంలో బిపోర్జాయ్.. ఈ రాష్ట్రాలకు అలర్ట్
అరేబియాలో ఏర్పడిన బిపోర్జాయ్ #CycloneBiparjoy తుపాను అత్యంత తీవ్ర రూపం దాల్చనుందని భారత వాతావరణ శాఖ హెచ్చరించింది. రాబోయే 24 గంటల్లో తీవ్ర రూపం దాల్చి.. భారీ వర్షాలకు కారణమవుతుందని శనివారం ఒక ప్రకటనలో తెలిపింది. బిపోర్జాయ్ ప్రభావంతో కర్ణాటక, గోవా, మహారాష్ట్రలో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని తెలిపింది. అలాగే.. కర్ణాటక-మహారాష్ట్ర సరిహద్దుల్లోని తెలంగాణ ప్రాంతాల్లోనూ తేలికపాటి నుంచి భారీ వర్షాలు పడొచ్చని తెలిపింది. మత్స్యకారులు అరేబియా సముద్రంలో చేపల వేటకు వెళ్లొద్దని అధికారులు హెచ్చరిస్తున్నారు. తుపాను ఉధృతి పెరిగే సమయంలో బలమైన ఈదురు గాలులు వీయనున్నాయి. తుపాన్ మరింత బలపడి ఉత్తర-ఈశాన్య దిశగా పయనించనుంది. ప్రస్తుతం గోవాకు 690 కి.మీ. దూరంలో పశ్చిమాన.. ముంబైకి పశ్చిమనైరుతి దశలో 640 కిలోమీటర్ల దూరంలో తుపాను కేంద్రీకృతమై ఉంది. భారీ అలల కారణంగా గుజరాత్ ఫేమస్ తితాల్ బీచ్‌ను అధికారులు నాలుగు రోజులపాటు మూసేశారు. VSCS BIPARJOY lay centered at 0830IST of today, near latitude 16.7N and longitude 67.4E, about 700 km WNW of Goa, 620 km WSW of Mumbai, 600 km SSW of Porbandar and 910 km S of Karachi. To intensify further and move NNE-wards gradually during next 24 hours. pic.twitter.com/o4LHhzOuP8 — India Meteorological Department (@Indiametdept) June 10, 2023 So finally #CycloneBiparjoy might have decided to end up somewhere between Gujarat and Pakistan area. More as we move on.... pic.twitter.com/GOxXZG1Mhx — Leanguy (@The_Techocrat) June 10, 2023 ఇదీ చదవండి: ఒడిశా ప్రమాద ఘటనాస్థలిలో దుర్వాసన.. ఇంకా శవాలున్నాయా? -
ముంచుకొస్తున్న 'బిపర్ జోయ్' తుఫాను..అలర్ట్ చేసిన వాతావరణ శాఖ!
అరేబియా సముద్రంలో అత్యంత తీవ్రమవుతున్న బిపర్ జోయ్ తుపాను రానున్న 36 గంటల్లో మరింత తీవ్రం కానుందని వాతావరణ శాఖ(ఐఎండీ) పేర్కొంది. మరో రెండు రోజుల్లో ఉత్తర వాయువ్య దిశగా పయనిస్తుందని ఐఎండీ ట్వీట్ చేసింది. జూన్ 08 రాత్రి 11.30 గంటలకు గోవాకిమ నైరుతి దిశలో 840 కిలోమీటర్లు, ముంబైకి పశ్చిమ నైరుతి దిశలో 870 కిలోమీటర్లు, ముంబైకి నైరుతిగా 901 కిలోమీటలర్ల దూరంలో కేంద్రీకృతమైనట్లు పేర్కొంది. నిజానికి ఈ బిపర్ జోయ్ తుపాను తూర్పు మధ్య అరేబియా సముద్రం మీదుగా ఏర్పడి..నెమ్మది నెమ్మదిగా బలపడుతూ..రానున్న 36 గంటల్లో క్రమక్రమంగా తీవ్ర రూపం దాల్చనుందని వాతావరణ శాఖ వెల్లడించింది. ఆ తర్వాత రెండు రోజుల్లో ఉత్తర వాయువ్య దిశగా కదిలే అవకాశం ఉన్నట్లు ఐఎండీ ట్విట్టర్లో తెలిపింది. ఈ తుపాను కారణంగా దక్షిణ గుజరాత్, సౌరాష్ట్ర సహా తీర ప్రాంతాల్లో తేలికపాటి వర్షాలు, ఉరుములతో కూడిన జల్లులు కురిసే అవకాశం ఉందని తెలిపింది. ఇదిలా ఉండగా ఈ తుపాను ప్రభావిత ప్రాంతాల్లోని మత్స్యకారులు సముద్రంలోకి వేటకు వెళ్లవద్దని వాతావరణ శాఖ సూచించింది. అలాగే సముద్రంలోకి వెళ్లిన వారు వెంటనే తిరిగి రావాలని హెచ్చరించడమే గాక జూన్ 14 వరకు సముద్రంలో చేపల వేటను నిలిపేయాలని కోరింది. (చదవండి: వాతావరణ శాఖ చల్లటి కబురు.. మరో 48 గంటల్లో కేరళను తాకనున్న నైరుతి రుతుపవనాలు) -
వాతావరణ సమాచారం ఇక నిరంతరం
సాక్షి, విశాఖపట్నం: కచ్చితమైన వాతావరణ అంచనాల్లో భారత వాతావరణ విభాగానికి (ఐఎండీకి) ప్రపంచ దేశాల్లో పేరుంది. ఇప్పుడు తాజాగా అందుబాటులోకి వస్తున్న ఆధునిక సాంకేతిక పరిజ్ఞానాన్ని అందిపుచ్చుకుంటూ ఐఎండీ మరింత ముందుకెళ్తోంది. వాతావరణ సమాచారాన్ని విస్తృతం చేయడంపైనా దృష్టిసారిస్తోంది. ఇందులో భాగంగా దేశవ్యాప్తంగా రాడార్ వ్యవస్థను బలోపేతం చేస్తోంది. ప్రస్తుతమున్న రాడార్ కేంద్రాలను ఆధునీకరించడంతోపాటు కొత్త రాడార్ కేంద్రాలను కూడా ఏర్పాటుచేస్తోంది. తూర్పు తీర ప్రాంతంలో అత్యదిక సామర్థ్యం కలిగిన ఎస్–బ్యాండ్ డాప్లర్ వెదర్ రాడార్ కేంద్రాలు విశాఖపట్నం, మచిలీపట్నం, చెన్నై, కోల్‌కతాల్లో ఉన్నాయి. వీటి పరిధి 500 కిలోమీటర్ల వరకు విస్తరించి ఉంటుంది. ఆయా కేంద్రాల పరిధిలో అల్పపీడనాలు, వాయుగుండాలు, తుపాన్ల స్థితిగతులు, వాటి తీవ్రత, ప్రభావం, గమనం, గాలుల తీవ్రత, వర్షపాతం వంటి వాటిని ఎలక్ట్రో మ్యాగ్నెటిక్ వేవ్స్ ద్వారా అంచనావేస్తూ ఎప్పటికప్పుడు సమగ్ర సమాచారాన్ని తెలియజేస్తాయి. వాయుగుండాలు, తుపానులు తీరానికి ఎంత దూరంలో ఉన్నాయో, ఎంత ఎత్తులో ఉన్నాయో, ఎక్కడ తీరాన్ని దాటుతాయో గుర్తిస్తాయి. అంతేకాదు.. రాడార్ కేంద్ర స్థానం నుంచి 18 కిలోమీటర్ల ఎత్తులో ఉన్న మేఘాల తీరుతెన్నులనూ రికార్డు చేస్తాయి. స్వదేశీ పరిజ్ఞానంతోనే.. ఈ నేపథ్యంలో.. ఐఎండీ ఇప్పుడు కోల్‌కతా, చెన్నై సహా ఆంధ్రప్రదేశ్‌లోని విశాఖపట్నం, మచిలీపట్నం డాప్లర్ వెదర్ రాడార్ కేంద్రాల ఆధునీకరణకు చర్యలు తీసుకుంటోంది. ఇందులో భాగంగా ప్రస్తుతమున్న డాప్లర్ రాడార్ పరికరాలు, యంత్ర సామగ్రికి బదులు అత్యాధునిక సాంకేతిక పరిజ్ఞానం కలిగిన యంత్ర పరికరాలను అమర్చనున్నారు. ప్రస్తుతం నడుస్తున్న డాప్లర్ రాడార్ స్టేషన్లు విదేశీ టెక్నాలజీతో ఏర్పాటుచేసినవే. అయితే, ఆధునీకరణలో భాగంగా ఏర్పాటయ్యేవి మాత్రం పూర్తి స్వదేశీ పరిజ్ఞానంతో తయారైనవే ఉండనున్నాయి. వీటిలో సింగిల్ యాంటెన్నాలకు బదులు డ్యూయెల్ పోలరైజ్డ్ యాంటెన్నాలు ఏర్పాటుచేస్తారని భావిస్తున్నారు. త్వరలో పాతవాటి స్థానంలో కొత్తవి అమర్చనున్నారు. ఇవీ ప్రయోజనాలు.. ప్రస్తుతమున్న డాప్లర్ వెదర్ రాడార్ కేంద్రాలు ప్రతి గంటకూ వాతావరణ సమాచారాన్ని అందిస్తున్నాయి. ఆధునీకరణలో భాగంగా కొత్త యంత్ర పరికరాలను ఏర్పాటుచేస్తారు. వీటితో ఇకపై నిరంతరం రాడార్ కార్యకలాపాలు కొనసాగుతాయి. ఫలితంగా అంతరాయం లేకుండా ఎప్పటికప్పుడు వాతావరణ సమాచారాన్ని తెలుసుకునే వీలుంటుంది. అంతేకాదు.. వాతావరణ పరిస్థితులను బట్టి మరింత కచ్చితమైన సమాచారాన్ని తెలుసుకోవడానికి వినియోగించుకుంటారు. రెండు దశాబ్దాల క్రితం నాటివి.. నిజానికి.. విశాఖపట్నం, మచిలీపట్నం డాప్లర్ వెదర్ రాడార్ కేంద్రాలు దాదాపు రెండు దశాబ్దాల క్రితం ఏర్పాటయ్యాయి. ఇప్పుడు వాటిలో పనిచేస్తున్న యంత్ర పరికరాలకు అప్పుడప్పుడు సాంకేతిక సమస్యలు తలెత్తుతున్నాయి. ఇప్పుడు వాటి స్థానంలో కొత్తవి అమరిస్తే మరి కొన్నేళ్లపాటు అవాంతరాల్లేకుండా కచ్చితత్వంతో కూడిన వాతావరణ సమాచారం నిరంతరం అందిస్తాయని నిపుణులు చెబుతున్నారు. -
బెంబేలెత్తిస్తున్న ‘అసని’ తుపాన్.. అసలు ఆ పేరు ఎలా వచ్చిందంటే?
బంగాళాఖాతంలో ఏర్పడిన వాయుగుండం తుఫాన్‌గా మారింది. ఇది గంటకు 75 కి.మీ వేగంతో గాలులు వీచే అవకాశం ఉండడంతో పాటు మరింత బలంగా మారే సూచనలు ఉన్నట్లు వాతావరణ శాఖ హెచ్చరించింది. దీనికి సైక్లోన్ అసని అని పేరు పెట్టారు. ఈ తుపానుకు శ్రీలంక పేరుని సూచించింది. సింహళ భాషలో దీని అర్థం 'కోపం'. హుద్‌హుద్.. తిత్లీ.. పెథాయ్.. పేర్లు వేరైనా ఇవన్నీ మన రాష్ట్రాన్ని అతలాకుతులం చేసిన తుపానులు. తాజాగా ఇప్పుడేమో అసని తుపాను. తుపాన్లకి అసలు పేరు ఎందుకు? వాతావరణ కేంద్రాల నుంచి వెలువడే సమాచారం ఎలాంటి గందరగోళం లేకుండా ప్రజలకు సవ్యంగా చేరేందుకే తుపానులకు పేర్లు పెట్టడం ఆనవాయితీ. కనీసం 61 కి.మీ. వేగం గాలులతో కూడిన తుపాను సంభవించినప్పుడే పేర్లు పెట్టడం సంప్రదాయంగా వస్తోంది. ఎందుకంటే ఒకే ప్రాంతంలో ఒకేసారి ఒకటి కన్నా ఎక్కువ తుపానులు సంభవిస్తే వాటి మధ్య తేడా, ప్రభావాల్ని గుర్తించేందుకు ఈ పేర్లు ఉపయోగపడతాయి. ఆగ్నేయాసియాలో దేశాలే తుపానులకు పేర్లు పెడుతున్నాయి. ఉదాహరణకు ‘తిత్లీ’ పేరును పాకిస్థాన్ సూచించింది. హిందూ మహా సముద్ర తీర ప్రాంతంలోని 8 దేశాలైన బంగ్లాదేశ్, ఇండియా, మాల్దీవులు, మయన్మార్, ఒమన్, పాకిస్థాన్, శ్రీలంక, థాయ్‌లాండ్ పేర్లలోని మొదటి ఆంగ్ల అక్షరాల జాబితా ఆధారంగా తుపాన్లకు పేర్లు పెట్టారు. 2018లో ఈ ప్యానెల్లో ఇరాన్, ఖతార్, సౌదీ అరేబియా, యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్, యెమెన్ చేరాయి. దీంతో ఈ దేశాల సంఖ్య 13కు చేరుకుంది. ఉచ్ఛరించడానికి సులువుగా, ఎనిమిది అక్షరాల లోపే పేర్లు ఉండాలి. ఎవరి భావోద్వేగాలు, విశ్వాసాలను దెబ్బతీయకూడదు. (ఫొటో గ్యాలరీ కోసం ఇక్కడ క్లిక్ చేయండి) -
ఎండలు తగ్గేదేలే.. ఏకంగా 122 ఏళ్ల గరిష్ట ఉష్ణోగ్రతలు
న్యూఢిల్లీ: వేసవి రాగానే భానుడు తగ్గేదేలే అన్నట్లు తన ప్రతాపం చూపిస్తున్నాడు. ప్రత్యేకంగా దేశంలోని వాయువ్య, మధ్య భారతదేశంలో ఎండలు మండిపోతున్నాయి. పలు ప్రాంతాల్లో ప్రజలు వేసవి తాపాన్ని నుంచి బయటపడేందుక ప్రత్యామ్నాయ మార్గాలను చూస్తున్నారు. ఈ ఏడాది ఏప్రిల్ నెలలో వరుసగా 35.9, 37.78 డిగ్రీల సెల్సీయస్ నమోదైనట్లు భారత వాతావరణ శాఖ తెలిపింది. ఈ స్థాయి సగటు ఉష్ణోగ్రతలు నమోదు కావడం 122 ఏళ్లలో ఇది నాలుగో సారి. మార్చి, ఏప్రిల్‌లలో అధిక ఉష్ణోగ్రతలు నిరంతర తక్కువ వర్షపాతం కారణంగా ఉన్నాయని ఐఎండీ డైరెక్టర్ జనరల్ మృత్యుంజయ్ మహపాత్ర తెలిపారు. దేశంలోని వాయువ్య, పశ్చిమ మధ్య భాగాలైన గుజరాత్, రాజస్థాన్, పంజాబ్, హర్యానాలో అధికంగా ఉష్ణోగ్రతలు నమోదవుతున్నట్లు తెలిపారు. మే నెలలో ఎండ వేడి మరింత పెరిగే అవకాశమున్నట్లు చెప్పారు. ఈ సందర్భంగా.. పలు ప్రాంతాల్లో వర్షపాతం సాధారణం కంటే ఎక్కువగా నమోదయ్యే అవకాశం ఉన్నట్లు పేర్కొన్నారు. వాయువ్య, ఈశాన్య భారతదేశంలోని కొన్ని ప్రాంతాలు అలాగే తీవ్ర ఆగ్నేయ ద్వీపకల్పంలో మేలో సాధారణం కంటే తక్కువ వర్షపాతం నమోదయ్యే అవకాశం ఉందని అన్నారు. చదవండి: ఇండియన్ అబ్బాయి.. ఆఫ్రికా అమ్మాయి.. అలా ఒకటయ్యారు! -
అంచనాలు నిజం కావాలి!
ఎండలు మండిపోతున్న వేళ... ఇది చల్లటి వార్తే. అంతకంతకూ పెరుగుతున్న పెట్రోల్, డీజిల్ ధరలు, వాటితో పాటు ఆకాశానికి అంటుతున్న ఆహార ధరలు, వెరసి విరుచుకు పడుతున్న ద్రవ్యోల్బణ పరిస్థితుల్లో కొంత ఉపశమన వార్త. ఆ చల్లటి కబురు ఏమిటంటే – ఈ ఏడాది వర్షాలు సకాలంలోనే పడతాయట! రాబోయే నైరుతి రుతుపవనాల్లో దేశంలో సగటు వర్షపాతం ‘సాధారణం’గానే ఉంటుందట! రాబోయే వర్షాకాలానికి సంబంధించి భారత వాతావరణ శాఖ (ఐఎండీ) వెల్లడించిన తొలి అంచనా ఇది. అయితే, సగటు వర్షపాతమంటే ఎంత అనే పరిణామాన్ని తగ్గించి, నిర్వచనాన్ని సవరించడం గమనార్హం. కాకపోతే, ఐఎండీ అంచనాలు నిజమైతే, కూరగాయల ధరలపై నేరుగా ప్రభావం చూపి, భారం కొంత తగ్గుతుందని ఆశ. కొన్నేళ్ళుగా ఏటా సగటు వర్షపాతం బాగుంది. కరోనాలో పట్టణాలను వదిలి వలసపోతున్న శ్రామికవర్గానికి గ్రామాల్లో వ్యవసాయం రంగంలో ఉపాధి కల్పనకు ఈ ‘సాధారణ’ వర్షపాతం ఉపయోగపడింది. ఈసారీ నైరుతి రుతుపవనాలు బాగుంటే, వ్యవసాయ రంగానికి మరింత ఊపు నిస్తుంది. కరోనా తగ్గుముఖం పట్టి, జనం తిరిగి పట్టణాల బాట పడుతుండడంతో, గ్రామీణ భారతంలో శ్రామికులకు మళ్ళీ గిరాకీ ఉంటుంది. కూలీ హెచ్చి, వారి కొనుగోలు శక్తీ పెరుగుతుందని భావన. జనాభాలో సగానికి పైగా వర్షాధారిత వ్యవసాయం మీదే ఆధారపడే దేశానికి సాధారణ వర్షపాతం, తద్వారా పెరిగే గ్రామీణ వినియోగం, మెరుగుపడే ఆర్థిక వ్యవస్థ శుభసూచనలే. జూన్ – సెప్టెంబర్ సీజన్‌కు సంబంధించి ఏటా ఐఎండీ రెండుసార్లు అంచనాలిస్తుంది. ఏప్రిల్‌లో చెప్పింది తొలి అంచనా. మళ్ళీ సరిగ్గా నైరుతి రుతుపవనాలు రావడానికి ముందు మే నెల చివరలో మరింత నిర్దిష్టమైన రెండో అంచనా వస్తుంది. ప్రస్తుతానికైతే... మధ్య పసిఫిక్‌ను వేడెక్కించి, నైరుతి భారతావనిపై వర్షాలను ఆవిరి చేసే ‘ఎల్‌నినో’ లాంటి పరిస్థితులేమీ ఉండవనే లెక్కతో ఐఎండీ తొలి అంచనా వేసింది. రాగల నాలుగు నెలల కాలం ‘ఎల్‌నినో’కు వ్యతిరేకంగా, భారత్‌కు లబ్ధి చేకూర్చే ‘లానినా’ పరిస్థితులు ఉన్నాయట. అయితే, ‘దీర్ఘకాలిక సగటు (ఎల్పీఏ)’ వర్షపాతం అంటే ఒకప్పుడు 89 సెంటీమీటర్ల వర్షపాతమని లెక్క. 1951 నుంచి 2000 వరకు 50 ఏళ్ళ సగటును బట్టి అలా తీర్మానించారు. కానీ, ప్రతి దశాబ్దానికి ఒకసారి దాన్ని సవరించాల్సి ఉంటుంది. నాలుగేళ్ళ క్రితం 1961 నుంచి 2010 సగటును చూసుకొని, ఆ నిర్వచనాన్ని 88 సెంటిమీటర్లకు తగ్గించారు. తాజాగా ఈ ఏడాది 1971 నుంచి 2020 వరకు సగటును బట్టి, దాన్ని మళ్ళీ సవరించారు. ‘ఇప్పుడిక ఎల్పీఏ అంటే 87 సెంటీమీటర్ల వర్షపాతమే’ అని తీర్మానించారు. సాధారణంగా ఎల్పీఏ లెక్కలో 96 నుంచి 104 శాతం మధ్య ఎంత వర్షం కురిసినా, ఆ ఏడాది వర్షపాతం ‘సాధారణ’మనే అంటారు. ఆ పద్ధతిలో రానున్న నైరుతి రుతుపవనాలు సాధారణ వర్షపాతం అందిస్తాయని వాతావరణ శాఖ చెబుతోంది. మంచిదే. కానీ, ఎల్పీఏ నిర్వచనం ప్రకారం మునుపటి దశాబ్దాలతో పోలిస్తే సగటు వర్షపాతం 2 సెంటీమీటర్ల మేర తగ్గడం ఒకింత ఆందోళన కరం. ఒక్క సెంటీమీటరేగా అనుకోవడానికి వీల్లేదు. ఆ ఒక్క సెంటీమీటర్ సగటు వర్షపాతం వివిధ ప్రాంతాల్లో, విభిన్న రకాలుగా ఉండే వర్షాలలోని మార్పులకు సంకేతం. వాతావరణ శాఖ మాత్రం శతాబ్ద కాలంలో ప్రతి దశాబ్దానికోసారి సగటు వర్షపాతంలో మార్పులొస్తాయనీ, ఒక 30 ఏళ్ళ కాలం తగ్గుతూ వస్తే, తర్వాతి 30 ఏళ్ళు పెరుగుతూ వస్తాయని వివరిస్తున్నారు. ప్రస్తుతం మనం నిర్జల శకం చివరలో ఉన్నాం గనక వచ్చే 30 ఏళ్ళ తేమ శకంలో వర్షపాతం బాగుంటుందని భరోసా ఇస్తున్నారు. నిజానికి, వాన రాకడ – ప్రాణం పోకడ ఎవరైనా ఎంత కచ్చితంగా చెప్పగలరన్నది ప్రశ్న. అందులోనూ కాలచక్రంలో మార్పులతో, రుతువులు ముందు వెనుకలవుతూ అనిశ్చిత వర్తమాన వాతావరణంలో ఇది మరింత క్లిష్టమే. ఇక, పాశ్చాత్య దేశాల అత్యాధునిక పరిజ్ఞానంతో కూడిన వాతావరణ అంచనాలతో పోలిస్తే, మన దగ్గర అంచనాలు ఎంత నిర్దుష్టమనేదీ మరో ప్రశ్న. మన వాతావరణ అంచనాలు గతంలో పలు సందర్భాల్లో విఫలమైన ఉదాహరణలూ అనేకం. ఆ అప్రతిష్ఠనూ, అనుమానాలనూ ఐఎండీ పోగొట్టుకోవాలి. అలాగే ఒకప్పుడు వాతావరణ కేంద్రాల డేటా బాగా ఆలస్యమయ్యేది కూడా! అయితే, ఇప్పుడు ఆటోమేటెడ్ వ్యవస్థకు మారడంతో, ఏ క్షణానికి ఆ క్షణం డేటా వస్తుందని ఐఎండీ కథనం. అలాగే, ఒకప్పుడు 1000 పై చిలుకు వాతావరణ కేంద్రాలే ఉండగా, ఇప్పుడు 4 వేల కేంద్రాలున్నాయి. వీటన్నిటి వల్లే ఎల్పీఏ సహా అనేక అంశాలను ఎప్పటికప్పుడు సవరించుకుంటూ, అంచనాలు వేయగలుగుతున్నామనేది వాతావరణ శాఖ మాట. వాతావరణ అంచనాలు ఎంత కచ్చితంగా ఉంటే, వ్యవసాయాధారిత దేశంలో రైతులు సహా అనేక వర్గాలకు అంత ఉపయోగం. అందుకే, మొక్కుబడిగా కాక నిక్కచ్చిగా ఇవ్వడం ముఖ్యం. దేశ వార్షిక సగటు వర్షపాతం 117.6 నుంచి 116 సెంటీమీటర్లకు తగ్గినట్టు లెక్క. ఈ పరిస్థితుల్లో దేశంలో కురిసే మొత్తం వర్షంలో దాదాపు 75 శాతానికి ఆధారమైన నైరుతి రుతుపవనాలు కీలకం. వరుసగా ఈ నాలుగో ఏడాదీ అవి సకాలంలో, సవ్యంగా వర్షిస్తే ప్రజానీకానికి హర్షమే. రుతుపవనాలతో పాటు మొదలయ్యే ఖరీఫ్ సాగుకు ఎరువులు మరో సమస్య. ఏడాదిగా ప్రపంచమంతటా ఎరువులు, వాటి ముడిపదార్థాల ధరలు ద్విగుణం, త్రిగుణమయ్యాయి. ఉక్రెయిన్‌లో యుద్ధంతో దిగుమతీ గడ్డుగా మారింది. మరి ఆఖరులో హడావిడి పడక, తగిన ప్రణాళికతో దేశ పాలకులు సిద్ధమవుతున్నారా? -
దూసుకోస్తున్న 'అసని తుపాను'...భారీ నుంచి అతి భారీ వర్షాలు
న్యూఢిల్లీ: ఆగ్నేయ బంగాళాఖాతం, దక్షిణ అండమాన్ సముద్రంలో ఏర్పడిన అల్పపీడనం మరో 24 గంటల్లో తీవ్ర అల్పపీడనంగా మారుతుందని భారత వాతావరణ కేంద్రం (ఐఎండీ) ఆదివారం తెలిపింది. అల్పపీడనం వాయుగుండంగా మారే క్రమంలో తీరం వెంట బలమైన గాలులు వీస్తున్నాయని వెల్లడించింది. దక్షిణ అండమాన్ సముద్రం మీదుగా కదులుతున్న అల్ప పీడనం తూర్పు ఈశాన్య దిశగా కదులుతూ మరింతగా బలపడింది. ఈ అల్పపీడనం ఉత్తర దిశగా కదులుతూ అండమాన్ సముద్రం, దాని పరిసర ప్రాంతంలో వాయుగుండంగా మారనుంది. దీని ప్రభావం అండమాన్ నికోబార్ దీవులపై అధికంగా ఉండే అవకాశం ఉందని ఐఎండీ తెలిపింది. అక్కడ బలమైన ఈదురుగాలులు, మోస్తరు నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని అధికారులు వెల్లడించారు. తుఫాను బంగ్లాదేశ్, ఉత్తర మయన్మార్ వైపు కదులుతుందని గత వారం ఐఎండీ అంచనా వేసింది. ఏదేమైనా తుపాన్ ప్రభావం తూర్పు, ఈశాన్య భారతంపై ఉండే అవకాశం కనిపిస్తోంది. అండమాన్ నికోబార్ దీవులలోని కొన్ని చోట్ల భారీ నుంచి అతి భారీ వర్షాలు కురుస్తాయని అంచనా. ఇది మార్చి 20న అల్ప పీడనంగా మారి..మార్చి 21వ తేదీన 'అసని' తుఫానుగా రూపాంతరం చెందుతుందని అధికారులు పేర్కొన్నారు. మత్స్యకారులు మార్చి 22 వరకు బంగాళాఖాతం, అండమాన్ సముద్రం, అండమాన్ నికోబార్ దీవులతో పాటు తూర్పు-మధ్య ఈశాన్య బంగాళాఖాతంలోకి వెళ్లవద్దని వాతావారణ శాఖ సూచించింది. అండమాన్ నికోబార్ చీఫ్ సెక్రటరీ జితేంద్ర నారాయణ్ తుఫాను దృష్ట్యా మార్చి 22 వరకు - నాలుగు రోజుల పాటు అన్ని పర్యాటక కార్యకలాపాలను నిలిపివేశారు. (చదవండి: దేశంలోనే ఫస్ట్.. కేజ్రీవాల్ సంచలన నిర్ణయం.. అది జరిగితే..) -
విస్తరిస్తున్న అల్పపీడనం.. ఉత్తరాంధ్ర జిల్లాలకు భారీ వర్ష సూచన
సాక్షి ,మహారాణిపేట (విశాఖ దక్షిణ): తూర్పు మధ్య బంగాళాఖాతం దాని పరిసర ప్రాంతాల్లో ఏర్పడిన అల్పపీడనం విస్తరించింది. అల్పపీడనానికి అనుబంధంగా ఉపరితల ద్రోణి కూడా ఏర్పడింది. రాగల 24 గంటల్లో దక్షిణ ఒడిశా–ఉత్తర ఆంధ్రప్రదేశ్ తీరాలకు చేరుకుంటుంది. అల్పపీడనం కారణంగా గంటకు 40- 50 కి.మీ వేగంతో గాలులు వీచే అవకాశం ఉంది. ఈ ప్రభావం వల్ల రానున్న 48 గంటల్లో ఉత్తరాంధ్ర జిల్లాలతోపాటు తూర్పు గోదావరి జిల్లాల్లో భారీ వర్షాలు అక్కడక్కడ కురిసే అవకాశం ఉందని వాతావరణ కేంద్రం ప్రకటించింది. ఉపరితల ఆవర్తనం సగటు సముద్ర మట్టానికి 5.8 కిలో మీటర్లు వంగి ఉంది. అలాగే తూర్పు–పడమర ద్రోణి సగటు సముద్రమట్టం కంటే 4.5, 5.8 కిలోమీటర్ల ఎత్తు మధ్య విస్తరించి ఉంది. ఇప్పుడు అల్పపీడనానికి సంబంధించి ఉపరితల ఆవర్తనం గుండా వెళుతోంది. ఇది లక్షద్వీప్ ప్రాంతం, ఉపరితల ఆవర్తనం ఆగ్నేయ అరేబియా సముద్రం మధ్య బంగాళాఖాతం ఉత్తర భాగంలో ఉన్న ఇతర అల్పపీడనం ప్రాంతంతో సంబంధం కలిగి ఉందని వాతావరణ కేంద్ర అధికారులు చెప్పారు. తెలంగాణలో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు పడే సూచనలు ఉన్నట్లు అధికారులు తెలిపారు. ఈ ప్రభావం వల్ల రానున్న 48 గంటల్లో ఏపీలో పలుప్రాంతాల్లో ఉరుములు, మెరుపులతో కూడిన వర్షాలు పడతాయని, శ్రీకాకుళం, విజయనగరం, విశాఖపట్నం, తూర్పు గోదావరి జిల్లాల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది. దక్షిణ కోస్తాంధ్ర, రాయలసీమ ప్రాంతాల్లో తేలికపాటి నుంచి ఓ మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది. చదవండి: ఆర్టీసీ బస్సుకు నిప్పంటించిన యువకుడు! -
11న అల్పపీడనం!
సాక్షి, విశాఖపట్నం: ఉత్తర కోస్తా తీరంలో ఏర్పడిన ఉపరితల ద్రోణి మంగళవారం మధ్యాహ్నానికి బలహీనపడింది. ఈ నెల 11 లేదా 12న బంగాళాఖాతంలో కోస్తాకు సమీపంలో అల్పపీడనం ఏర్పడే సూచనలున్నాయి. ఇది క్రమంగా దిశ మార్చుకుని ఒడిశా వైపు పయనించే అవకాశాలున్నాయని వాతావరణ కేంద్రం అధికారులు తెలిపారు. దీని ప్రభావంతో 11, 12 తేదీల్లో రాష్ట్రంలో విస్తారంగా వర్షాలు పడతాయన్నారు. బుధ, గురువారాల్లో రాష్ట్రంలో మోస్తరు వర్షాలు పడే సూచనలున్నాయని చెప్పారు. కోస్తాంధ్రలో బుధవారం ఒకటి రెండు చోట్ల భారీవర్షాలు పడతాయని చెప్పారు. దేశవ్యాప్తంగా రుతుపవనాలు బలహీనంగా ఉన్నాయి. రుతుపవనాలు బలహీనంగా ఉన్న సమయంలో రాయలసీమలో ఎక్కువగా వర్షాలు పడే అవకాశాలున్నాయి. గడిచిన 24 గంటల్లో విజయనగరంలో 7 సె.మీ, గరివిడిలో 5.8 సెంటీమీటర్ల వర్షపాతం నమోదైంది. -
భారత్‌లో 121 ఏళ్ల తర్వాత ఇది రెండోసారి..
న్యూఢిల్లీ: ఇటీవల కురిసిన వర్షాల కారణంగా గత 121 ఏళ్లలో రెండో అత్యధిక వర్షంపాతం మే నెలలో నమోదైనట్లు భారత వాతావరణ శాఖ గురువారం తన నివేదికలో తెలిపింది. మేలో కురిసిన రికార్డు వర్షపాతానికి.. క్రితం సంభవించిన టౌటే, యాస్ తుపానుల ప్రభావము, పాశ్చాత్య అవాంతరాలు కారణమని వాతావరణ శాఖ పేర్కొంది. ఇక దేశవ్యాప్తంగా 2021 మేలో 107.9 మి.మీ వర్షపాతం నమోదైందని వెల్లడించింది. ఇది సాధారణం నమోదయ్యే వర్షపాతం కన్నా 74 శాతం ఎక్కువని తెలిపింది. 1901 మేలో నమోదైన అతి తక్కువ ఉష్ణోగ్రత తర్వాత, 1917 లో 32.68 డిగ్రీల సెల్సియస్, తర్వాత 1977లో 33.84 డిగ్రీల సెల్సియస్ ఉష్ణోగ్రత నమోదుకాగా.. ప్రస్తుతం నాలుగోసారి అత్యల్పంగా ఈ మేలో 34.18 డిగ్రీల నమోదైనట్లు ఐఎండీ తెలిపింది. తుపానుల కారణంగానే.. ఈ రెండు తుపానులు పశ్చిమ, తూర్పు తీరాల వెంబడి ఉన్న రాష్ట్రాలపై మాత్రమే కాకుండా దేశంలోని ఇతర ప్రాంతాలకు కూడా వర్షపాతం తీసుకొచ్చాయని వెల్లడించింది. ఉదాహరణకు, 'తౌక్టే' తుఫాను బలహీనపడటంతో, ఇది ఉత్తర భారతదేశం వైపు వెళ్లి ఉత్తర భారతదేశంలోని అనేక ప్రాంతాల్లో వర్షాలు కురిపించింది. అదేవిధంగా, ‘యాస్’ తూర్పు భారతదేశంలో జార్ఖండ్, బీహార్‌తో సహా వర్షాలు కురిసింది. 2021 వేసవిలో మూడు నెలల్లో, ఉత్తర భారతదేశంలో పాశ్చాత్య అవాంతర కార్యకలాపాల పౌనపున్యాలు సాధారణం కంటే ఎక్కువగా ఉన్నాయని ఐఎండీ తెలిపింది. ఇక మే 29, 30 తేదీలలో మాత్రమే వాయువ్య రాజస్థాన్‌లో మినహా దేశంలో ఎక్కడా కూడా చెప్పకోదగిన ఉష్ణోగ్రతలు సంభవించలేదని ఐఎండీ తెలిపింది. చదవండి: గాలి కోసం 10 వేల మొక్కలు నాటాడు.. చివరికి గాలి అందక కన్నుమూశాడు -
అతి తీవ్ర తుపానుగా మారనున్న 'యాస్' తుపాను
న్యూఢిల్లీ : తూర్పు మధ్య బంగాళాఖాతంలో వాయుగుండం కొనసాగుతోంది. 'యాస్' తుపాను మరో 12 గంటల్లో బలపడి తీవ్ర తుపానుగా.. 24 గంటల్లో అతి తీవ్ర తుపానుగా మారనుంది. తూర్పు మధ్య బంగాళాఖాతంలో 620 కి.మీ దూరంలో.. పోర్ట్‌బ్లేయర్‌కు వాయవ్య దిశలోనూ.. 530 కి.మీ ఒడిశాలోని పారదీప్‌కు అగ్నేయ దిశలో.. 620 కి.మీ వాయవ్య దిశలో బెంగాల్ వైపు కేంద్రీకృతమై ఉంది. ఉత్తర వాయవ్య దిశగా తుపాన్ పయనిస్తోంది. 26న ఒడిశా, బెంగాల్ మధ్య తీరం దాటనుంది. గంటకు 155 కి.మీ నుంచి 185 కి.మీ వేగంతో పెనుగాలులు వీచే అవకాశం ఉంది. ఉత్తర ఒడిశా, దక్షిణ బెంగాల్‌పై తీవ్ర ప్రభావం చూపనుంది. తీరం దాటిన తర్వాత రాంచీ వైపుగా తుపాను పయనించనుంది. శ్రీకాకుళం, విజయనగరం, విశాఖ జిల్లాలపై తీవ్ర ప్రభావం చూపనుంది. గంటకు 70 కి.మీ వేగంతో గాలులు వీచే అవకాశం ఉంది. శ్రీకాకుళం జిల్లాకు తుపాను హెచ్చరికలు సాక్షి, శ్రీకాకుళం : 'యాస్' తుపాను ప్రభావం నేపథ్యంలో కలెక్టర్ తుపాను హెచ్చరికలు జారీ చేశారు. సాయంత్రం నుంచి తీరం వెంబడి..గంటకు 40 కి.మీ నుంచి 50 కి.మీ వేగంతో గాలులు వీస్తాయని ఆయన తెలిపారు. ఆక్సిజన్ వాహనాలు ట్రాఫిక్‌లో చిక్కుకోకుండా చూడాలని, రైతులు పంటలను కోత కోసి ఉంటే సురక్షిత ప్రాంతాలకు తరలించాలని సూచించారు. తుపాను ప్రభావిత ప్రాంతాల్లో తాగునీటి సరఫరా.. విద్యుత్ పునరుద్ధరణ, వైద్య శిబిరాల ఏర్పాటుపై సిద్ధంగా ఉండాలన్నారు. -
స్మార్ట్ రేసులో భారత నగరాల వెనుకంజ
న్యూఢిల్లీ: ప్రపంచ స్మార్ట్ సిటీల జాబితాలో భారతదేశంలోని ప్రధాన నగరాలు కాస్త వెనుకంజ వేశాయి. ఈ జాబితాలో సింగపూర్ టాప్‌లో నిలిచింది. ఐఎండీ, ఎస్‌యూటీడీలు సర్వే చేసి 2020 స్మార్ట్ సిటీ సూచీని తయారు చేశాయి. ఈ జాబితాలో గతేడాదితో పోలిస్తే భారతీయ నగరాల ర్యాంకులు దిగజారాయి. జాబితాలో హైదరాబాద్ 85, న్యూఢిల్లీ 86, ముంబై 93, బెంగళూరు 95వ స్థానాల్లో నిలిచాయి. 2019లో ఈ నగరాలు వరుసగా 67, 68, 78, 79 స్థానాలు దక్కించుకున్నాయి. కరోనా సంక్షోభానికి తయారుగా లేకపోవడంతో దేశీయ నగరాలు ఇబ్బంది పడ్డాయని సర్వే తెలిపింది. సాంకేతికత నిత్యనూతనంగా(అప్ టు డేట్) లేని చోట కరోనా ప్రభావం ఎక్కువగా ఉందని తెలిపింది. భారతీయ నగరాలు ప్రధానంగా ఎదుర్కొంటున్న సమస్య వాయు కాలుష్యమని ఇక్కడ నివసించేవారు అభిప్రాయపడ్డారు. వాయు కాలుష్యం తర్వాత హైదరాబాద్, ఢిల్లీలో కనీస సౌకర్యాలు లేకపోవడం, ముంబై, బెంగళూరుల్లో ఇరుకు రోడ్లు ప్రధాన సమస్యలుగా నిలిచాయి. అంతర్జాతీయంగా చూస్తే జాబితాలో సింగపూర్ తర్వాత హెల్సిన్కి, జ్యూరిచ్, ఆక్లాండ్, ఓస్లో, కోపెన్‌హాగెన్, జెనీవా, తైపీ, ఆమ్స్టర్డామ్, న్యూయార్క్‌లు ఉన్నాయి. జాబితా రూపొందించడం కోసం ప్రతి నగరంలో వందలాదిమందిని సర్వే చేశారు. సర్వే కోసం 15 సూచికలను వాడారు. కీలకంగా ఆరోగ్యం, భద్రత, రవాణా, అవకాశాలు, పాలన తదితర అంశాల్లో సాంకేతికత వినియోగంపై సర్వేలో ఎక్కువ దృష్టి పెట్టారు. స్మార్ట్‌సిటీలపై కరోనా ప్రభావం తీసివేయలేనిదని, సాంకేతికత బాగా ఉన్న చోట్ల ప్రభావం తక్కువని ఐఎండీ ప్రొఫెసర్ అర్టురోబ్రిస్ చెప్పారు.


