
సాక్షి, విజయవాడ: తెలుగు రాష్ట్రాల్లో ఎండలు మండుతున్నాయి. ఏపీలో సాధారణం కన్నా 6 డిగ్రీలు అధికంగా ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. 64 మండలాల్లో తీవ్ర వడ గాలులు, 222 మండలాల్లో వడగాలులు వీచే అవకాశం ఉందని వాతావరణ శాఖ వెల్లడించింది.
విజయనగరం, శ్రీకాకుళం, పార్వతీపురం మన్యం, అనకాపల్లి, కాకినాడ, తూ.గో, విశాఖలో వడగాలుల ప్రభావం ఉంటుందని, అల్లూరి, బాపట్ల, ఏలూరు, గుంటూరు, అంబేద్కర్ కోనసీమ, కృష్ణా, ఎన్టీఆర్, పల్నాడు, ప్రకాశం, నెల్లూరు, తిరుపతి, పశ్చిమగోదావరి జిల్లాల్లో వడగాలులు వీచే అవకాశం ఉందని ఐఎండీ పేర్కొంది. ప్రజలు అప్రమత్తంగా ఉండాలని ఐఎండీ సూచించింది. మరో రెండు రోజుల్లో ఉత్తర కోస్తా, రాయలసీమలోని కొన్ని ప్రాంతాల్లో పిడుగులు పడే అవకాశం ఉందని ఐఎండీ తెలిపింది.