heat waves
-
వామ్మో.. అప్పుడే భానుడి భగభగలు!
సాక్షి, హైదరాబాద్: తెలంగాణ రాష్ట్రంలో ఉష్ణోగ్రతలు వేగంగా పెరుగుతున్నాయి. పలు ప్రాంతాల్లో సాధారణంకంటే 2 నుంచి 4 డిగ్రీ సెల్సియస్ అధికంగా నమోదవుతున్నాయి. రానున్న మూడు రోజులు ఇదే తరహాలో ఉష్ణోగ్రతలు (Temperatures) అధికంగా నమోదు కావొచ్చని వాతావరణ శాఖ సూచించింది. ఉత్తర తెలంగాణలోని కొన్ని ప్రాంతాల్లో వడగాడ్పులు (Heat Wave) వీచే అవకాశముందని హెచ్చరించింది. ఆదివారం రాష్ట్రంలో గరిష్ట, కనిష్ట ఉష్ణోగ్రతలు పరిశీలిస్తే... గరిష్ట ఉష్ణోగ్రత ఆదిలాబాద్‌లో 40.3 డిగ్రీ సెల్సియస్, కనిష్ట ఉష్ణోగ్రత మెదక్‌లో 19.2 డిగ్రీ సెల్సియస్‌గా నమోదైంది. ఆదిలాబాద్‌లో సాధారణం కంటే 3.4 డిగ్రీ సెల్సియస్ అధికంగా గరిష్ట ఉష్ణోగ్రత నమోదు కాగా, భద్రాచలం, హైదరాబాద్, ఖమ్మం, మహబూబ్‌నగర్‌లో 3 డిగ్రీల చొప్పున అధికంగా ఉష్ణోగ్రత నమోదైంది. కనిష్ట ఉష్ణోగ్రతలు సైతం చాలా ప్రాంతాల్లో 1 నుంచి 3 డిగ్రీలు అధికంగా నమోదయ్యాయి. అధిక ఉష్ణోగ్రతల నుంచి ఉపశమనం పొందేందుకు ప్రజలు ఏసీలు, ఎయిర్ కూలర్లను ఆశ్రయిస్తున్నారు. దీంతో విద్యుత్ వినియోగం భారీగా పెరుగుతోందని అధికారులు చెబుతున్నారు. రానున్న మూడు రోజులు వడగాలులు వీచే అవకాశం ఉన్నందున్న.. అత్యవసరం అయితే తప్ప ప్రజలు బయటకు రావొద్దని అధికారులు హెచ్చరించారు. అటు ఆంధ్రప్రదేశ్‌లోనూ ఎండలు పెరగడంతో ఏపీ వాసులు ఉక్కిరిబిక్కిరి అవుతున్నారు.మండుతున్న ఎండలు... బోసిపోయిన రోడ్లురాష్ట్రంలో ఎండలు మండుతున్నాయి. ఎండల తీవ్రత కారణంగా ప్రజలు రోడ్లపైకి రావడం తగ్గించారు. ఎండ వేడిమికి తోడు వడగాలులు కూడా వీస్తుండటంతో ఆదివారం మధ్యాహ్నం హైదరాబాద్‌లో సచివాలయం వద్ద రోడ్లు ఇలా బోసిపోయి కనిపించాయి. మరో మూడు రోజుల పాటు అధిక ఉష్ణోగ్రతలు కొనసాగుతాయని వాతావరణ శాఖ వెల్లడించిన నేపథ్యంలో భాగ్యనగరవాసులకు మరింత ఉక్కపోత ఖాయంగా కనిపిస్తోంది. 21 నుంచి రెండు రోజులపాటు వర్షాలు మండుతున్న ఎండలతో ఉక్కిరిబిక్కిరి అవుతున్న నగరవాసులకు వాతావరణ శాఖ చల్లటి కబురు చెప్పింది. ఈ నెల 21 నుంచి వర్షాలు కురిసే అవకాశం ఉందని తెలిపింది. రెండు రోజులపాటు తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు (Rain) కురుస్తాయని పేర్కొంది. గత కొద్దిరోజులుగా దంచికొడుతున్న ఎండలకు ప్రజలు అల్లాడిపోతున్నారు. గత ఏడాదితో పోల్చితే ఈసారి ఉష్ణోగ్రతలు అధికంగా నమోదవుతున్నాయి. ఈ సంవత్సరం ఫిబ్రవరిలోనే వేసవిని తలపించేలా ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. చదవండి: RRR వరకు హెచ్ఎండీఏ విస్తరణతో డీటీసీపీకి బ్రేక్ -
మండుతున్న ఎండలు : సమతుల ఆహారంతోనే ఆరోగ్యం
జిల్లాలో ఎండల తీవ్రత పెరిగింది. మార్చిలోనే ఎండలు ముదురుతున్నాయి. రాబోయే రోజుల్లో తీవ్రమైన ఎండలతోపాటు వడగాల్పులు వీచే అవకాశం ఉందని ఇప్పటికే వాతావరణ శాఖ హెచ్చరించింది. ఈ కాలంలో మనం తీసుకునే ఆహారం అత్యంత కీలకంమని వైద్య నిపుణులు హెచ్చరిస్తున్నారు. ఒక వైపు అధిక ఉష్ణోగ్రతలు ఉన్నప్పుడు శరీరం డీ హైడ్రేషన్‌కు గురయ్యే అవకాశం ఉంది. చెమట అధికంగా ఉత్పన్నమవుతుంది. ఇలా ఉంటే శరీరంలోని లవణాలు తగ్గిపోయి వడదెబ్బ బారిన పడే అవకాశాలున్నాయి. ఈ నేపథ్యంలో కొన్ని సూచనలు తప్పక పాటించాలని చెబుతున్నారు. వైఎస్సార్ కడప జిల్లాలో 40 డిగ్రీల సెంటీగ్రేడ్ల లోపు నిత్యం ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. రెండు రోజుల్లో 42 వరకూ నమోదయ్యే అవకాశం ఉందని వాతావరణ శాఖ నిపుణులు హెచ్చరించారు. ఈ నేపత్యంలో వేసవి తాపాన్ని తట్టుకోలేక చాలామంది చల్లని ద్రవ పదార్థాలు తీసుకునేందుకు ఇష్టపడతారు. వేసవిలో చర్మవ్యాధులకు గురయ్యే అవకాశం ఎక్కువగా ఉంటంది. ఇవన్నీ ఎదుర్కొవాలంటే రోగ నిరోధకశక్తి పెంచే విధంగా....ప్రతి ఒక్కరూ సమతుల ఆహారం తీసుకోవాలి. మనం తినే ఆహారం మన ఆరోగ్యాన్ని కాపాడుతుందనే ఆలోచన కలిగి ఉండాలి. ఎక్కువ నీరు తీసుకోవాలి శరీరంలో 70 శాతం నీరు ఉంటుంది. అధిక ఉష్ణోగ్రతలు తగ్గించడంలో నీరు ప్రముఖ పాత్ర పోషిస్తుంది. ఈ విధంగా ప్రతిరోజు 3–5 లీటర్ల వరకు నీరు తీసుకుంటూ ఉండాలి. శరీరం డీ హైడ్రేషన్‌కు గురి కాకుండా చూసుకోవాలి. నిర్లక్ష్యం వహిస్తే వడదెబ్బకు గురయ్యే అవకాశం ఉంది. తాజా పండ్లు తీసుకోవాలి ప్రతి రోజూ నీరు, పోషకాల శాతం ఎక్కువగా ఉన్న ఆహారాన్ని తీసుకోవాలి. తాజా పుచ్చకాయ, కర్బూజ, బొప్పాయి, జామ, అరటి, యాపిల్ పండ్లు తీసుకోవాలి. నిమ్మ, నారింజ, బత్తాయి, కమల రసాలు శ్రేయేస్కరం. రాగులు, జొన్నలు తదితర చిరుధాన్యాలు తీసుకోవడం కూడా మంచిది. ఇవి శక్తిని ఇవ్వడంతోపాటు ఎండల్లో నిస్సత్తువ రాకుండా చూస్తుంది. ద్రవ పదార్థాలు తీసుకోవాలి ఎండలో ఎక్కువగా తిరిగే వారు ద్రవ పదర్థాలను తీసుకుంటూ రావాలి. మజ్జిగతో పాటు కొబ్బరినీరు, లస్సీ, చెరుకు రసం అధికంగా వినియోగించాలి. ఉల్లిపాయల్లో శరీరాన్ని చల్లబరిచే గుణం కలిగి ఉంది. ఉల్లిని నిత్యం ఆహారంలో తీసుకుంటే వడ దెబ్బ బారిన పడే అవకాశాలు తక్కువ. మజ్జిగ శరీరంలోని జీర్ణ వ్యవస్థను ఆరోగ్యంగా ఉంచడంతోపాటు అందులో ప్రో బయోటిక్స్ అధికంగా ఉంటాయి. కొబ్బరినీరు ఈ కాలంలో తరుచుగా తీసుకుంటే ఖనిజ లవణాలు ఎక్కువ శక్తిని ఇచ్చి వడగాలులు, వేగి గాలుల నుంచి శరీరాన్ని రక్షిస్తుంది. పటిష్టమైన రోగ నిరోధక శక్తి వేసవిలో బలమైన రోగ నిరోధక వ్యవస్థను బలోపేతం చేసుకోవాలి. తీసుకునే ఆహారంలో ఖనిజ లవణాలు అధికంగా ఉండేలా చూడాలి. పాలు, గుడ్లు, టమోటా, నారింజ, పసుపు రంగు కూరగాయలు, చిలకడదుంప, చేపలు, బ్లాక్ బెర్రి, బ్లూ బెర్రి తినడం మంచిది. ఆహారంలో సొరకాయ, బీరకాయ, దోసకాయ, పొట్లకాయ తదితర కూరగాయలు వినియోగించడం శ్రేయస్కరం.చదవండి: 60లో 20లా మారిపోయాడుగా : హీరోలకే పోటీ, ఫ్యాన్స్ కమెంట్లు వైరల్ప్రతి ఒక్కరూ జాగ్రత్తలు పాటించాలి ప్రతి ఒక్కరూ ఎండలో అవసరమైతే తప్ప బయటికి రాకుండా ఉండడం ఎంతో మంచిది. తలపై రక్షణకు గొడుగు లేదా టోపీ పెట్టుకోవాలి. చేనేత, కాటన్ దుస్తులు ధరించి మంచిది. ఎక్కువ నీరు తాగడంతోపాటు మనిషికి సరిపడేలా నిద్రపోవాలి. ప్రతిరోజు వ్యాయామం మరింత మంచిది. ఎండలు ఎక్కువగా ఉండడంతో కాపీ, టీలు అలవాటున్న వారు వీలైనంత తగ్గించుకుంటే మంచిది. – డాక్టర్ శ్రీనాథరెడ్డి, సూపరింటెండెంట్, వైఎస్సార్ ఏరియా ఆస్పత్రి, కడప -
తెలంగాణ ప్రజలకు గమనిక.. ఈ జిల్లాలకు ఎల్లో అలర్ట్
సాక్షి, హైదరాబాద్: తెలంగాణలో మార్చిలోనే ఎండలు దంచికొడుతున్నాయి. మార్చి నెలలోనే సాధారణం కంటే ఎక్కువగా రికార్డు స్థాయిలో గరిష్ట ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. మరోవైపు.. రానున్న రెండు రోజుల్లో గరిష్ఠ ఉష్ణోగ్రతలు 42 డిగ్రీలకు పైగా నమోదయ్యే అవకాశం ఉందని వాతావరణ శాఖ హెచ్చరించింది. ఈ క్రమంలోనే పలు జిల్లాలకు ఎల్లో అలర్ట్ జారీ చేసింది.తెలంగాణ వ్యాప్తంగా మార్చి నెలలోనే గరిష్ఠ ఉష్ణోగ్రతలు 40 డిగ్రీలకుపైగా నమోదవుతున్నాయని హైదరాబాద్ వాతావరణ కేంద్రం తెలిపింది. సాధారణం కన్నా 3.3 డిగ్రీలు అధికంగా ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయని, ప్రధానంగా ఉత్తర తెలంగాణ జిల్లాల్లో ఎండల తీవ్రత ఎక్కువగా ఉందని అధికారులు చెబుతున్నారు. రానున్న రెండు రోజుల్లో గరిష్ఠ ఉష్ణోగ్రతలు 42 డిగ్రీలకు పైగా నమోదయ్యే అవకాశం ఉందన్నారు.ఇదే సమయంలో మంచిర్యాల, ఆదిలాబాద్, కొమురంభీమ్, జగిత్యాల, పెద్దపల్లి, కరీంనగర్ జిల్లాల్లో ఎండ తీవ్రతతో పాటు వడగాలుల ప్రభావం అధికంగా ఉంటుందని ఐఎండీ తెలిపింది. ఈ జిల్లాల్లో ఎల్లో హెచ్చరికలను జారీ చేసింది. అలాగే, శనివారం గరిష్ఠ ఉష్ణోగ్రతలు 42 డిగ్రీల వరకు నమోదయ్యే అవకాశం ఉన్నందున మరో 7 జిల్లాల్లోనూ శనివారం నుంచి ఎల్లో హెచ్చరికలు అమల్లోకి వస్తాయని పేర్కొంది. హైదరాబాద్, చుట్టుపక్కల ప్రాంతాల్లో 39 డిగ్రీల వరకు ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయని వాతావరణ శాఖ తెలిపింది.అయితే.. మార్చి 20 నుంచి 24 తేదీల్లో మాత్రం రాష్ట్రంలో అకాల వర్షాలు కురిస్తాయని వాతావరణశాఖ అధికారులు హెచ్చరికలు జారీ చేశారు. అవి కూడా బలమైన ఉరుములతో కూడిన అకాల వర్షాలు కురుస్తాయని తెలిపింది. ఈ వాతావరణం ఎప్పటికప్పుడు మారుతుందని కూడా పేర్కొన్నారు. అయితే.. ప్రస్తుతానికి మాత్రం వేడికి బాధపడాల్సిందేనని.. మార్చి 20 తర్వాత మాత్రం రైతులు కాస్త జాగ్రత్తగా ఉండాలని అధికారులు సూచిస్తున్నారు. -
ముంచుకొస్తున్న ఎండలు.. ముందు జాగ్రత్తలివే..
ఈ ఏడాది దేశంలో మార్చి నుంచే ఎండలు దంచి కొట్టనున్నాయని వాతావరణశాఖ హెచ్చరించింది. ఇలా మార్చి నుంచే ఎండలు మండిపోతే ఇక ఏప్రిల్, మే నెలల్లో ఎండలు ఎలా ఉంటాయోనని చాలా మంది ఇప్పటి నుంచే బెంబేలెత్తిపోతున్నారు. దీనికితోడు ఈ ఏడాది గతంలో ఎన్నడూ లేని విధంగా హీట్ వేవ్స్ వస్తాయని వాతావరణశాఖ అంచనా వేస్తోంది. ఈ నేపధ్యంలో వేసవి కాలంలో ఎదురయ్యే అనారోగ్య సమస్యల నివారణకు వైద్య నిపుణులు పలు సూచనలు చేస్తున్నారు. అవేమిటో ఇప్పుడు చూద్దాం..వేసవి కాలంలో డీహైడ్రేషన్‌కు గురికాకుండా ఉండేందుకు దాహం వేయకపోయినా తరచూ నీటిని తాగుతుండాలి.రోజులో ఒకటి రెండుసార్లు ఓరల్ రీహైడ్రేషన్ సొల్యూషన్ (ఓఆర్ఎస్)ని ఉపయోగించాలి. అలాగే నిమ్మరసం, మజ్జిగ /లస్సీ, పండ్ల రసాలతో పాటు ఇంట్లో తయారుచేసిన ఇతర పానీయాలలో కొద్దిగా ఉప్పు కలిపి తీసుకోవాలి.బయటకు వెళ్లేటప్పుడే కాకుండా ఇంట్లో ఉన్పప్పుడు కూడా వదులుగా ఉండే కాటన్ దుస్తులను ధరించాలి. అలాగే తప్పనిసరై బయటకు వెళ్లినప్పుడు ఎండ నుంచి రక్షణ పొందేందుకు గొడుగు, టోపీ, టవల్ వంటివి ఉపయోగిస్తూ నేరుగా శరీరానికి ఎండ తాకకుండా చూసుకోవాలి.ఎప్పటికప్పుడు వాతావరణానికి సంబంధించిన వార్తలను తెలుసుకోవాలి. వాతావరణ మార్పులకు అనుగుణంగా నడుచుకోవాలి. అధిక ఉష్ణోగ్రతలు ఉన్నప్పుడు తప్పనిసరైతేనే బయటకు వెళ్లాలి.వేసవిలో ఉదయం వేళ కిటికీలు, కర్టెన్లను మూసివేయాలి. సాయంత్రం సమయంలో చల్లని గాలి లోపలికి వచ్చేవిధంగా కిటికీలను తెరిచివుంచాలి.శిశువులు, పిల్లలు, గర్భిణులు, ఆరుబయట పనిచేసేవారు, మానసిక అనారోగ్యం కలిగినవారు, శారీరకంగా అనారోగ్యంతో ఉన్నవారు, గుండె జబ్బులు లేదా అధిక రక్తపోటు ఉన్నవారు వేడి వాతావరణంలోనికి వెళ్లినప్పడు వారికి వడదెబ్బ తగిలే అవకాశం ఉంది. అలాంటివారు డీహైడ్రేషన్‌కు గురికాకుండా చూసుకోవాలి.అధిక ఉష్ణోగ్రతలు ఉన్న రోజ్లులో మధ్యాహ్నం 12:00 నుంచి 3:00 గంటల మధ్య ఎండలో బయటకు వెళ్లకుండా ఉండాలని వైద్య నిపుణులు సూచిస్తున్నారు. ఎండ ఎక్కువగా ఉండే సమయాల్లో వంట చేయడాన్ని తగ్గించాలి. ముందుగానే వంటపనులు పూర్తిచేసుకోవాలి. అలాగే వంట చేసే ప్రదేశంలో గాలి ఆడేందుకు తలుపులు, కిటికీలు తెరిచివుంచాలి.పార్క్ చేసిన వాహనాలలో పిల్లలను లేదా పెంపుడు జంతువులను వదిలివెళ్లకూడదు. ఎందుకంటే వాహనం లోపల ఏర్పడే ఉష్ణోగ్రత వారి ప్రాణానికే ప్రమాదం తీసుకొస్తుందనే సంగతిని గమనించాలి.ఎండల కారణంగా వికారం లేదా వాంతులు, తలనొప్పి, విపరీతమైన దాహం, మూత్రవిసర్జన తగ్గడం, వేగంగా శ్వాస తీసుకోవడం, అధికంగా గుండె కొట్టుకోవడం లాంటి లక్షణాలు కనిపిస్తే వెంటనే సమీపంలోని వైద్యుడిని సంప్రదించాలని నిపుణులు సూచిస్తున్నారు. ఇది కూడా చదవండి: ఆకర్షించే స్క్వేర్ వేవ్స్.. దగ్గరకు వెళ్తే అంతే సంగతులు -
IPE Global: డేంజర్ మార్కు దాటేస్తున్న... భుగభుగలు
ఈ వేసవిలో ఉత్తర భారతమంతా కనీవిని ఎండలతో తల్లడిల్లిపోయింది. ఢిల్లీలో ఏకంగా 40 రోజుల పాటు 40 డిగ్రీల సెంటీగ్రేడ్‌కు పై చిలుకు ఉష్ణోగ్రతలు నమోదై జనాలను బెంబేలెత్తించాయి. అలస్కాలో హిమానీ నదాలు ఇటీవలి కాలంలో వేసిన అంచనాలను కూడా మించి శరవేగంగా కరిగిపోతున్నట్టు తాజా అధ్యయనాలు తేల్చాయి. భూగోళానికి ఊపిరితిత్తులుగా చెప్పే అమెజాన్ సతత హరిత అరణ్యాలే క్రమంగా ఎండిపోతున్నాయి. ఎన్నడూ లేనంతగా కార్చిచ్చుల బారిన పడుతున్నాయి.సౌదీ అరేబియాలో ఏకంగా 50 డిగ్రీలు దాటేసిన ఎండలకు తాళలేక 1,300 మందికి పైగా మరణించారు. ఈ ఉత్పాతాలన్నీ సూచిస్తున్నది ఒక్కటే. భూగోళం శరవేగంగా విపత్కర పరిస్థితుల్లోకి వెళ్తోంది. వాతావరణ మార్పుల ప్రభావం శాస్త్రవేత్తల అంచనాలకు కూడా అందనంత దారుణ ప్రభావం చూపుతోంది. భూతాపం ఈ శతాబ్దంలోనే ఏకంగా 2.5 డిగ్రీలకు పైగా పెరిగి మొత్తం మానవాళినే వినాశనం వైపు నెట్టడం ఖాయమని వందలాది మంది ప్రపంచ ప్రఖ్యాత వాతావరణ నిపుణులు, శాస్త్రవేత్తలు ముక్త కంఠంతో హెచ్చరిస్తున్నారు! పారిశ్రామికీకరణ ముందు స్థాయితో పోలిస్తే భూతాపం ఇప్పటికే 1.2 డిగ్రీ సెంటీగ్రేడ్ మేరకు పెరిగింది. అది 1.5 డిగ్రీలను దాటితే ఊహించని ఉత్పాతాలు తప్పవని సైంటిస్టులు ఎప్పటినుంచో మొత్తుకుంటున్నారు. అలాంటిది, ప్రస్తుత పరిస్థితులను చూస్తుంటే ఈ శతాబ్దాంతానికే భూతాపంలో పెరుగుదల 2.5 డిగ్రీల డేంజర్ మార్కును దాటేయడం ఖాయమని ప్రపంచ వాతావరణ సంస్థ నిర్వహించిన తాజా అంతర్జాతీయ సర్వే తేలి్చంది. ఎండాకాలంలో ప్రపంచవ్యాప్తంగా జరుగుతున్న కనీవినీ ఎరగని విపరిణామాలు తదితరాలను పరిగణనలోకి తీసుకున్న మీదట ఈ అంచనాకు వచి్చంది. గత ఏడాది కాలంగా ప్రపంచవ్యాప్తంగా సగటు ఉష్ణోగ్రతలు ప్రతి నెలా రికార్డులు బద్దలు కొట్టాయి. ఈ ఏడాది సంభవించిన ఎల్‌నినో ఇప్పటిదాకా నమోదైన ఐదు అత్యంత శక్తిమంతమైన ఎల్ నినోల్లో ఒకటిగా నిలిచింది. శిలాజ ఇంధనాల వాడకం తదితరాల వల్ల జరుగుతున్న భారీ కాలుష్యం వంటివి వీటికి తోడవుతున్నాయి. గ్లోబల్ వారి్మంగ్‌లో మూడొంతులు కేవలం కార్బన్ డయాక్సైడ్ (సీఓటూ) ఉద్గారం వల్లనే జరుగుతోంది. వాతావరణంలో సీఓటూ స్థాయి పెరుగుతున్న కొద్దీ వేడి గాలులు, హరికేన్లు, కార్చిచ్చులు, వరదలు వచి్చపడుతున్నాయి. గ్రీన్ హౌస్ వాయు ఉద్గారాల్లో చైనా, అమెరికా, భారత్ టాప్ 3లో ఉన్నాయి. అయితే గ్లోబల్ వార్మింగ్‌కు ప్రధానంగా సంపన్న దేశాలే కారణమని ఐపీఈ గ్లోబల్ క్లైమేట్ చేంజ్ హెడ్ అబినాశ్ మహంతీ చెప్పుకొచ్చారు. ఆ దేశాల్లో గత రెండు శతాబ్దాలుగా జరిగిన మితిమీరిన పారిశ్రామికీరణ పర్యావరణానికి చెప్పలేనంత చేటు చేసిందని వివరించారు. ‘‘ఇప్పుడు కూడా సంప్రదాయేతర ఇంధనాల వాడక తదితరాల ద్వారా గ్లోబల్ వారి్మంగ్‌కు అడ్డుకట్ట వేస్తామన్న పెద్ద దేశాల ప్రకటనలు మాటలకే పరిమితమవుతున్నాయి. ఫలితంగా భరించలేని ఎండలు, ఆ వెంటే వరదలు, హరికేన్ల వంటి ఉత్పాతాలు కొన్నేళ్లుగా సాధారణ పరిణామంగా మారిపోతున్నాయి. ఇవన్నీ ప్రమాద సూచికలే’’ అని పర్యావరణవేత్తలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికైనా మేల్కొని గ్రీన్ హౌస్ వాయు ఉద్గారాలకు అడ్డుకట్ట వేయకపోతే పరిస్థితి చేయి దాటిపోయే రోజు ఎంతో దూరంలో లేదని హెచ్చరిస్తున్నారు. ఉత్తరాదిన పాతాళానికి భూగర్భ జలాలు20 ఏళ్లలో 450 క్యుబిక్ కి.మీ. మేరకు మాయంఉత్తర భారతదేశంలో భూగర్భ జల వనరులు శరవేగంగా అడుగంటుతున్నాయి! ఎంతగా అంటే, 2002 నుంచి 2021 మధ్య కేవలం 20 ఏళ్లలోనే కంగా 450 క్యుబిక్ కిలోమీటర్ల మేర భూగర్భ జలాలు లుప్తమైపోయినట్టు ఐఐటీ గాం«దీనగర్ తాజా సర్వే తేల్చింది. దేశంలోకెల్లా అతి పెద్ద జలాశయమైన ఇందిరా సాగర్ మొత్తం నీటి పరిమాణానికి ఇది ఏకంగా 37 రెట్లు ఎక్కువని సర్వేకు సారథ్యం వహించిన ఐఐటీ గాం«దీనగర్ సివిల్ ఇంజనీరింగ్, ఎర్త్ సైన్సెస్ విభాగంలో విక్రం సారాబాయి చైర్ ప్రొఫెసర్ విమల్ మిశ్రా వివరించారు! అందుబాటులో ఉన్న సంబంధిత గణాంకాలతో పాటు శాటిలైట్ డేటా తదితరాలను విశ్లేíÙంచి ఈ మేరకు తేలి్చనట్టు తెలిపారు. వాతావరణ మార్పుల ప్రభావం ఇలాగే కొనసాగితే ఈ ధోరణి మరింతగా ఊపందుకుంటుందని హెచ్చరించారు. ‘‘ఉత్తరాదిన గత 75 ఏళ్లలో వర్షపాతం ఇప్పటికే 8.5 శాతం తగ్గిపోయింది. వాతావరణం 0.5 డిగ్రీల మేరకు వేడెక్కింది. దాంతో సాగునీటికి డిమాండ్ అమాంతంగా పెరిగిపోయి విచ్చలవిడిగా బోర్లు పుట్టుకొచ్చాయి. దాంతో కనీసం భూగర్భ జల వనరులు 12 శాతం తగ్గిపోయాయి’’ అని మిశ్రా వెల్లడించారు. ఒక్క 2009లోనే వర్షాకాలంలో అల్ప వర్షపాతం, చలికాలంలో హెచ్చు ఉష్ణోగ్రతల దెబ్బకు ఉత్తరాదిన భూగర్భ జలాలు 10 శాతం మేర తగ్గిపోయాయని అంచనా! ‘‘గ్లోబల్ వారి్మంగ్ మరింత పెరిగే సూచనలే ఉన్నందున భూగర్భ జలాలు ఇంకా వేగంగా ఎండిపోయేలా ఉన్నాయి. ఎలా చూసినా ఇవన్నీ ప్రమాద సంకేతాలే. ఉత్తర భారత దేశంలో ఉష్ణోగ్రతలు గనుక 1 నుంచి 3 డిగ్రీల మేరకు పెరిగితే భూగర్భ జలాలు మరో 10 శాతం దాకా తగ్గిపోతాయి’’ అంటూ సర్వేలో పాల్గొన్న హైదరాబాద్ ఎన్జీఆర్ఐ పరిశోధకులు కూడా ఆందోళన వెలిబుచ్చారు. సర్వే ఫలితాలను జర్నల్ ఎర్త్ తదుపరి సంచికలో ప్రచురించనున్నారు. – సాక్షి, నేషనల్ డెస్క్ -
విమాన ప్రయాణం నాలుగు గంటలు ఆలస్యం..కారణం..
దిల్లీ నుంచి బాగ్డోగ్రాకు వెళ్లాల్సిన ఇండిగో విమానం వాతావరణంలోని వేడిగాలుల వల్ల దాదాపు నాలుగు గంటలు ఆలస్యంగా బయలుదేరింది. దిల్లీలో పెరుగుతున్న ఉష్ణోగ్రతల వల్ల విమానప్రయాణాల్లో అంతరాయం ఏర్పడుతోందని ఎయిర్పోర్ట్ వర్గాలు తెలిపాయి.ఎయిర్పోర్ట్ అధికారులు తెలిపిన వివరాల ప్రకారం..సోమవారం మధ్యాహ్నం 2:10 గంటలకు దిల్లీలోని ఇందిరాగాంధీ అంతర్జాతీయ విమానాశ్రయం నుంచి పశ్చిమ బెంగాల్‌లోని సిలిగురి సమీపంలో ఉన్న బాగ్డోగ్రాకు వెళ్లాల్సిన ఇండిగో విమానం సాయంత్రం 6:15గంటలకు బయలుదేరింది. దిల్లీలో వేడిగాలుల తీవ్రత పెరుగుతోంది. సోమవారం 45డిగ్రీల ఉష్ణోగ్రతతో గాలులు వీయడం వల్ల ప్రయాణంలో అంతరాయం ఏర్పడింది.ఈ సందర్భంగా ఇండిగో ప్రతినిధి మాట్లాడుతూ..‘అధిక ఉష్ణోగ్రతల వల్ల దిల్లీ నుంచి బాగ్డోగ్రాకు వెళ్లే ఇండిగో విమానం 6E 2521 ప్రయాణం ఆలస్యమైంది. ఇండిగో అన్నింటికంటే ప్రయాణికుల భద్రతకు అధిక ప్రాధాన్యత ఇస్తోంది. వేడిగాలులతో కొన్నిసార్లు ప్రమాదం జరిగే అవకాశం ఉంటుంది. దాంతో ఆలస్యం అనివార్యమైంది. సంస్థ నిత్యం ప్రయాణికులకు సమాచారం అందిస్తుంది. ప్రయాణికులకు జరిగిన అసౌకర్యానికి చింతిస్తున్నాం’ అని చెప్పారు.హీట్ వేవ్స్ప్రపంచ వాతావరణ సంస్థ(డబ్ల్యూఎంఓ) ప్రకారం..వరుసగా ఐదు లేదా అంతకంటే ఎక్కువ రోజులపాటు సగటు ఉష్ణోగ్రత కంటే గరిష్ఠ ఉష్ణోగ్రత ఐదు డిగ్రీలు అధికంగా నమోదైతే దాన్ని హీట్‌వేవ్‌గా పరిగణిస్తారు. ప్రభావిత ప్రాంతం గరిష్ట ఉష్ణోగ్రత రెండు రోజుల పాటు వరుసగా 45 డిగ్రీల కంటే ఎక్కువగా ఉంటే అది వేడి గాలులుగా మారే ప్రమాదముందని డబ్ల్యూఎంఓ తెలిపింది. ఈ హీట్‌వేవ్‌ను ‘నిశ్శబ్ద విపత్తు’ అని కూడా పిలుస్తారు. భారత్‌లో హీట్‌వేవ్స్ సాధారణంగా మార్చి-జూన్ మధ్య, అరుదైన సందర్భాల్లో జులైలోనూ సంభవిస్తాయి. ఇటీవల దిల్లీలోని నరేలాతోపాటు ఉత్తర్‌ప్రదేశ్‌లోని ప్రయాగ్‌రాజ్‌లో అత్యధికంగా 47.1 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదైంది. ఈ నేపథ్యంలో వాతావరణ శాఖ అధికారులు దిల్లీలో ఆరెంజ్ అలర్ట్ జారీ చేశారు. -
తెలుగు రాష్ట్రాల్లో మొదలైన వానలు
హైదరాబాద్/గుంటూరు, సాక్షి: వేసవి తాపం నుంచి ఊరట ఇస్తూ తెలుగు రాష్ట్రాల్లో వాతావరణం మారింది. ఇరు రాష్ట్రాల్లో పలు జిల్లాల్లో వర్షాలు మొదలయ్యాయి. విదర్భ నుంచి తమిళనాడుకు విస్తరించి ఉన్న ద్రోణి ప్రభావంతో.. తెలంగాణలో మూడు రోజులపాటు మోస్తరు వానలు, అలాగే ఏపీలో నాలుగు రోజులపాటు వానలు కురవనున్నాయి.తెలంగాణలో 19 జిల్లాల్లో ఉరుములు, మెరుపులతో కూడిన వానలు ఉంటాయని వాతావరణ శాఖ తెలిపింది. ఇప్పటికే హైదరాబాద్, నగర శివారుతో పాటు మెదక్, సిద్ధిపేటలో వర్షం కురుస్తోంది. మరికొన్ని చోట్ల తేలికపాటి వానలు పడుతున్నాయి. వరంగల్, హనుమకొండలో ఆకాశం మేఘావృతం అయ్యి ఉంది.SEVERE STORMS ALERT - MAY 7As marked in the map, East, Central TG to get massive storms, heavy winds, lightining next 24hrs. West TG to get scattered storms ⚠️Hyderabad already had some rains this morning, more scattered storms ahead today with nice respite from heat 😍 pic.twitter.com/fhzs79oYbN— Telangana Weatherman (@balaji25_t) May 7, 2024ఇక కోస్తా మీదుగా కొనసాగుతున్న ద్రోణి వల్ల నేటి నుంచి మూడు రోజులు పాటు కోస్తా జిల్లాల్లో వర్షాలు కురవనున్నాయి. గంటకు 40-50 కిలోమీటర్ల వేగంతో గాలులు కురుస్తాయని తెలిపింది. ఈనెల తొమ్మిదో తేదీ వరకు ఇదే వాతావరణం కొనసాగుతుందని అమరావతి వాతావరణ కేంద్రం తెలిపింది.మరోవైపు.. నిన్న సాయంత్రం అరకు చింతపల్లి ప్రాంతాల్లో వడగళ్ల వాన కురిసింది. విశాఖలో రాత్రి 9 తర్వాత వర్షం పడింది. ఈ ఉదయం కూడా ఉమ్మడి విశాఖ జిల్లాల్లో భారీ వర్షం పడుతోంది.దీంతో పలు చోట్ల రహదారులు జలమయం కాగా, రాకపోకలకు అంతరాయం ఏర్పడుతోంది. ఇక శ్రీకాకుళంలో ఈదురు గాలులతో కూడిన వర్షం పడుతోంది. 6th May 5:25 pm : Heavy Thunderstorms forming in a line along YSR Kadapa, Annamayya, Anantapur and also along Palnadu districts close to Nallamala forest range. Next 2 hours, parts of these districts will see good spells of rain with Thunderstorms. Stay indoors !! pic.twitter.com/fChTo2MPSi— Andhra Pradesh Weatherman (@praneethweather) May 6, 2024 అయితే.. రాయలసీమ జిల్లాలలో ఇవాళ కూడా గరిష్ట ఉష్ణోగ్రతలతో వడగాలులు కొనసాగినా.. వడగండ్ల వానలు పడే అవకాశం ఉందని వాతావరణ కేంద్రం హెచ్చరించింది. ఇక సోమవారం నంద్యాల జిల్లా బనగానపల్లిలో 46.4 డిగ్రీల సెల్సియస్ ఉష్ణోగ్రత నమోదయ్యిందని.. బుధవారం నుంచి వాతావరణం చల్లబడొచ్చని చెబుతోంది. ఇంకోపక్క.. కాకినాడ, తూర్పుగోదావరి, ఏలూరు, ఎన్టీఆర్, గుంటూరు జిల్లాల్లో మాత్రం వడగాడ్పులు వీయొచ్చని వాతావరణశాఖ అంచనా. -
47 డిగ్రీలూ దాటేసింది! రాష్ట్రంలో రికార్డు స్థాయిలో ఎండలు
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలో ఉష్ణోగ్రతలు రోజురోజుకు రికార్డు స్థాయిలో నమోదవుతున్నాయి. గత ఏడాది మే నెలాఖరులో పెద్దపల్లి జిల్లాలో ఏకంగా 47.8 డిగ్రీల గరిష్ట ఉష్ణోగ్రతగా నమోదవగా.. ఈసారి మే మొదటివారంలోనే దానికి సమీపానికి చేరింది. ఆదివారం జగిత్యాల జిల్లా వెల్గటూరులో 47.1 డిగ్రీల సెల్సియస్ గరిష్ట ఉష్ణోగ్రత నమోదైంది. అదే విధంగా జగిత్యాల జిల్లా గొదురులో 46.8, అల్లీపూర్లో 46.7, కరీంనగర్ జిల్లా వీణవంకలో 46.7 డిగ్రీల ఉష్ణోగ్రతలు నమోదైనట్టు రాష్ట్ర ప్రణాళిక శాఖ విభాగం వెల్లడించింది. ఆదివారం రాష్ట్రవ్యాప్తంగా దాదాపు 30 ప్రాంతాల్లో 45 డిగ్రీలకుపైగా ఉష్ణోగ్రతలు నమోదైనట్టు అధికారులు చెప్తున్నారు. ఎండల వేడి తార స్థాయికి చేరడంతో జనాలు ఉక్కిరిబిక్కిరి అవుతున్నారు. మరో రెండు రోజులు ఇలాగే.. వానలకూ చాన్స్ రాష్ట్రంలో మరో రెండు రోజులు ఇలాగే ఎండలు తీవ్రంగా ఉంటాయని వాతావరణ శాఖ హెచ్చరించింది. చాలాచోట్ల గరిష్ట ఉష్ణోగ్రతలు సాధారణం కంటే ఎక్కువగా నమోదవుతాయని.. వడగాడ్పులు తీవ్రంగా వీచే అవకాశమూ ఉందని తెలిపింది. రాష్ట్రవ్యాప్తంగా అధిక ఉష్ణోగ్రతలు, వడగాడ్పులు కొనసాగుతున్నా.. పలుచోట్ల తేలికపాటి నుంచి మోస్తరు వానలు పడవచ్చని వెల్లడించింది. మంగళ, బుధ, గురువారాల్లో అక్కడక్కడా ఉరుములు, మెరుపులు, ఈదురుగాలులతో కూడిన వానలు పడతాయని తెలిపింది. వర్షాలకు సంబంధించి.. జయశంకర్ భూపాలపల్లి, భద్రాద్రి కొత్తగూడెం, ఖమ్మం, మహబూబాబాద్, ములుగు, నల్లగొండ, సూర్యాపేట, వరంగల్, హన్మకొండ, యాదాద్రి భువనగిరి, రంగారెడ్డి, మహబూబ్‌నగర్, నాగర్‌కర్నూల్, వనపర్తి, నారాయణపేట, జోగుళాంబ గద్వాల జిల్లాలకు ఎల్లో అలర్ట్ జారీ చేసింది. -
నేడు, రేపు తీవ్ర వడగాడ్పులు
సాక్షి, విశాఖపట్నం: భానుడి భగభగలు తగ్గడం లేదు. ఎండ మంటలు చల్లారడం లేదు. రాష్ట్రం నిప్పుల కుంపటిలా మారింది. గురు, శుక్రవారాల్లో వడగాడ్పులు మరింత తీవ్రం కానున్నాయని విపత్తుల నిర్వహణ సంస్థ ఎండీ రోణంకి కూర్మనాథ్ తెలిపారు. గురువారం 31 మండలాల్లో తీవ్ర వడగాల్పులు, 234 మండలాల్లో వడగాల్పులు వీచే అవకాశం ఉందని పేర్కొన్నారు. విజయనగరం జిల్లాలో 15, పార్వతీపురం మన్యంలో 8, శ్రీకాకుళంలో 5, ప్రకాశంలో 2, అల్లూరి సీతారామరాజు జిల్లాలో ఒక మండలంలో తీవ్రవడగాల్పులు వీచే అవకాశం ఉందన్నారు. పల్నాడు జిల్లాలో 21, ప్రకాశం 18, ఏలూరు 18, తూర్పుగోదావరి 17, నెల్లూరు 16, గుంటూరు 16, అనకాపల్లి 15, శ్రీకాకుళం 15, కాకినాడ 13, తిరుపతి 12, కృష్ణా 11, ఎన్టీఆర్ 11, బాపట్ల 11, విజయనగరం 10, అల్లూరి సీతారామరాజు 9, కోనసీమ 9, పార్వతీపురం మన్యం 7, వైఎస్సార్ 5, విశాఖపట్నం 1, అనంతపురం 1, పశ్చిమగోదావరి జిల్లాలో ఒక మండలంలో వడగాల్పులు వీచే అవకాశం ఉందని వివరించారు. శుక్రవారం 30 మండలాల్లో తీవ్ర వడగాల్పులు, 121 మండలాల్లో వడగాల్పుల ప్రభావం ఉంటుందని తెలిపారు. నిప్పులుగక్కిన ఎండ రాష్ట్రవ్యాప్తంగా బుధవారం కూడా ఎండ నిప్పులుగక్కింది. పల్నాడు జిల్లా కొప్పునూరులో 46.2 డిగ్రీలు, తిరుపతి జిల్లా మంగానెల్లూరులో 46, ఎన్టీఆర్ జిల్లా చిల్లకల్లులో 45.8, నంద్యాల జిల్లా బనగానపల్లె, నెల్లూరు జిల్లా మర్రిపాడులో 45.7, చిత్తూరు జిల్లా కొత్తపల్లిలో 45.6, ప్రకాశం జిల్లా ఎండ్రపల్లిలో 45.5, వైఎస్సార్ జిల్లా సింహాద్రిపురంలో 44.9, బాపట్ల జిల్లా వల్లపల్లిలో 44.6, అనకాపల్లి జిల్లా దేవరాపల్లిలో 44.5, కర్నూలు జిల్లా పంచలింగాలలో 44 డిగ్రీల గరిష్ట ఉష్ణోగ్రతలు నమోదైనట్లు వివరించారు. 21 జిల్లాల్లో 43 డిగ్రీలకు పైగా అధిక ఉష్ణోగ్రతలు నమోదయ్యాయని తెలిపారు. 79 మండలాల్లో తీవ్ర వడగాల్పులు, 118 మండలాల్లో వడగాల్పులు వీచాయని తెలిపారు. ప్రజలు వీలైనంతవరకు ఉదయం 11 నుంచి సాయంత్రం 4 గంటల వరకు ఇంట్లోనే ఉండాలని, ఎండదెబ్బ తగలకుండా టోపీ, గొడుగు, టవల్, కాటన్ దుస్తులు ఉపయోగించాలని సూచించారు. వృద్ధులు, గర్భిణులు, బాలింతలు తగిన జాగ్రత్తలు తీసుకుని అప్రమత్తంగా ఉండాలన్నారు. -
రెండ్రోజులు మండే ఎండలు
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రం నిప్పుల కుంపటిని తలపిస్తోంది. తెలంగాణవ్యాప్తంగా ఉష్ణోగ్రతలు రోజురోజుకూ పెరుగుతున్నాయి. దక్షిణ, ఆగ్నేయ దిశల నుంచి వడగాడ్పులు వీస్తుండటంతో చాలా ప్రాంతాల్లో ఎండలు భగ్గుమంటున్నాయి. గత వారం రోజులుగా రాష్ట్రంలో సాధారణం కంటే 2 నుంచి 4 డిగ్రీల సెల్సియస్ మేర ఎక్కువగా ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. తేమ శాతం పెరగడం, పొడి వాతావరణంతో వడగాడ్పుల తీవ్రత కూడా అధికమవుతోంది. మాడుతున్న నల్లగొండ..: సోమవారం రాష్ట్రంలోని ప్రధాన నగరాల్లోకెల్లా నిజామాబాద్‌లో 43.8 డిగ్రీల సెల్సియస్ గరిష్ట ఉష్ణోగ్రత నమోదైంది. ఖమ్మంలో సాధారణం కంటే 4.4 డిగ్రీలు ఎక్కువ ఉష్ణోగ్రత నమోదవగా భద్రాచలం, మహబూబ్‌నగర్, హైదరాబాద్‌లలో 2–3 డిగ్రీలు ఎక్కువగా ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. మరోవైపు రాష్ట్ర ప్రణాళిక శాఖ గణాంకాల ప్రకారం రాష్ట్రంలోని చాలా చోట్ల గరిష్ట ఉష్ణోగ్రతలు అత్యధికంగానే నమోదయ్యాయి. నల్లగొండ జిల్లా మతూర్లో 45.5 డిగ్రీలు, ములుగు జిల్లా మంగపేటలో 45.2 డిగ్రీలు, నల్లగొండ జిల్లా తిమ్మాపూర్‌లో 45.1 డిగ్రీలు, అదే జిల్లాలోని మాడుగులపల్లిలో 45.0 డిగ్రీల మేర గరిష్ట ఉష్ణోగ్రతలు రికార్డయ్యాయి. పలుచోట్ల తీవ్రంగా వడగాడ్పులు రానున్న రెండ్రోజులు పలుచోట్ల వడగాడ్పులు వీచే అవకాశం ఉందని వాతావరణ శాఖ హెచ్చరించింది. ఈ మేరకు 12 జిల్లాలకు ఆరెంజ్ అలర్ట్ జారీ చేసింది. ములుగు, భద్రాద్రి కొత్తగూడెం, నల్లగొండ, ఖమ్మం, సూర్యాపేట, వరంగల్, హనుమకొండ, మహబూబాబాద్, మహబూబ్‌నగర్, నాగర్‌కర్నూల్, వనపర్తి, నారాయణపేట, జోగులాంబ గద్వాల జిల్లాల్లోని పలుచోట్ల ఈ నెల 30 నుంచి మే 2వ తేదీ వరకు తీవ్ర వడగాల్పులకు అవకాశం ఉందంటూ ఆయా జిల్లాలకు ఆరెంజ్ అలర్ట్‌ను వాతావరణ శాఖ జారీ చేసింది. తక్షణ చర్యలు చేపట్టేలా ఆయా జిల్లా యంత్రాంగాలు అప్రమత్తంగా ఉండాలని సూచించింది. -
హీట్‌వేవ్ అలర్ట్: భారత వాతావరణ శాఖ ట్వీట్
న్యూఢిల్లీ: భారత వాతావరణ శాఖ (IMD) సోమవారం దేశంలోని కొన్ని ప్రాంతాల్లో హీట్ వేవ్ అలర్ట్ జారీ చేసింది. దీనికి సంబంధించిన ఇండియా మ్యాప్‌ను తన ఎక్స్ (ట్విటర్) ఖాతాలో షేర్ చేసింది. ఇందులో హీట్‌వేవ్ ఎక్కువగా ఉన్న రాష్ట్రాలను హైలెట్ చేసింది.గంగా పశ్చిమ బెంగాల్, బీహార్‌లోని అనేక ప్రాంతాల్లో హీట్ వేవ్ పరిస్థితులు ఎక్కువగా ఉంటాయని, ఒడిషా, తూర్పు ఉత్తరప్రదేశ్, సబ్-హిమాలయన్ పశ్చిమ బెంగాల్, జార్ఖండ్‌లో వేడి తరంగాలకు అవకాశం ఉందని భారత వాతావరణ శాఖ పేర్కొంది.Heat wave to Severe Heat Wave conditions very likely in many pockets of Gangetic West Bengal and Bihar, isolated pockets of Odisha and heat wave conditions very likely in east Uttar Pradesh, Sub-Himalayan West Bengal, Jharkhand, Konkan & Goa, Saurashtra & Kutch.... pic.twitter.com/vFezec7hUy— India Meteorological Department (@Indiametdept) April 29, 2024 హీట్ వేవ్ ఎక్కువగా ఉన్న ప్రాంతాలను వెల్లడించడం మాత్రమే కాకుండా.. హీట్ వేవ్ పరిస్థితుల్లో.. తీసుకోవాల్సిన జాగ్రత్తలను కూడా ఐఎండీ తన ఎక్స్ ఖాతాలో షేర్ చేసింది.మీకు దాహం లేకపోయినా మిమ్మల్ని మీరు హైడ్రేట్‌గా ఉంచుకోవడానికి తగినంత నీరు/ఓఆర్ఎస్ తాగండి.వేడి ఎక్కువగా ఉండటం వల్ల 12 గంటల నుంచి 4 గంటల వరకు బయట చేయాల్సిన పనిని కొంత వాయిదా వేసుకోండి.వేడి నుంచి తప్పించుకోవడానికి నీడగా ఉండే ప్రదేశాల్లో నిలబడండి.పిల్లలు, వృద్దులు, జబ్బుపడిన వారిని ఎండ వేడి నుంచి జాగ్రత్తగా కాపాడుకోవాలి.ఎండ సమయంలో లేత రంగు బట్టలను ధరించండి.తలను కప్పుకోవదానికి గుడ్డ, టోపీ వంటి వాటిని ఉపయోగించాలి.DO's during #Heatwave@moesgoi@DDNewslive@ndmaindia@airnewsalerts pic.twitter.com/59FtYPB35v— India Meteorological Department (@Indiametdept) April 28, 2024 -
మరో మూడు రోజులు సూర్య ప్రతాపం.. బయటకెళ్తే డేంజరే!
హైదరాబాద్/ గుంటూరు, సాక్షి: తెలుగు రాష్ట్రాల్లో ఎండల తీవ్రత కొనసాగుతున్నది. పగలు రాత్రి తేడా లేకుండా ఉక్కపోత వాతావరణం కొనసాగుతోంది. ఇరు రాష్ట్రాల్లో గరిష్ఠ ఉష్ణోగ్రతలు 45 డిగ్రీలు దాటేశాయి. దీంతో ప్రజలు ఉక్కిరి బిక్కిరి అవుతున్నారు. అయితే.. రానున్న మూడు రోజుల్లో ఉష్ణోగ్రతలు మరింతగా పెరుగుతాయని వాతావరణ శాఖలు హెచ్చరిస్తున్నాయి. వడగాడ్పులు అంతకంతకూ పెరుగుతాయని, ప్రజలంతా అప్రమత్తంగా ఉండాలని హెచ్చరిస్తున్నాయి. ఒకపక్క.. ఏపీలో గురువారం 16 జిల్లాల్లో 43 డిగ్రీల కన్నా అధికంగా ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. దాదాపు 102 మండలాల్లో వడగాడ్పులు వీచాయి. మరో 72 మండలాల్లో తీవ్ర వడగాడ్పులు వీచాయి. రానున్న మూడు రోజుల్లో రాయలసీమ, కోస్తాంధ్రలో ఉష్ణోగ్రతలు అత్యధికంగా నమోదు కావొచ్చని వాతావరణ శాఖ చెబుతోంది. శుక్రవారం ఏపీలో 174 మండలాల్లో వడగాల్పులు, 56 మండలాల్లో తీవ్ర వడగాల్పులు వీచే అవకాశం ఉందని హెచ్చరించింది. మరోపక్క.. తెలంగాణలోనూ పలు జిల్లాల్లో వడగాల్పులు వీస్తాయని హైదరాబాద్ వాతావరణ కేంద్రం తెలిపింది. రాబోయే మూడు రోజుల్లో రామగుండం, భద్రచాలం పరిధిలో అత్యధిక ఉష్ణోగ్రతలు నమోదు అవుతాయని, వృద్ధులు గర్భీణీలు అప్రమత్తంగా ఉండాలని హెచ్చరించింది. ఇక రేపు తెలంగాణలో పలు చోట్ల తేలికపాటి జల్లులు పడే అవకాశం ఉందని తెలిపింది. -
సమ్మర్.. కాస్త కూల్! ఒక్కసారిగా తగ్గిన ఉష్ణోగ్రతలు
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలో ఒక్కసారిగా ఎండలు తగ్గాయి. కొన్నిరోజుల పాటు భారీగా నమోదైన గరిష్ట ఉష్ణోగ్రతలు ఒక్కసారిగా పతనమయ్యాయి. వడగాడ్పుల తీవ్రత సైతం తగ్గడంతో ప్రజలకు కాస్త ఉపశమనం కలిగింది. దాదా పు పదిరోజులుగా రాష్ట్రంలో గరిష్ట ఉష్ణోగ్రతలు సాధారణం కంటే 5 డిగ్రీల సెల్సియస్ అధికంగా నమోదవుతూ వచ్చాయి. ఒకవైపు అత్యధిక ఉష్ణోగ్రతలు.. మరోవైపు ఉక్కపోత.. వీటికి తోడు వడగాడ్పుల ప్రభావంతో రాష్ట్ర ప్రజలు ఉక్కిరిబిక్కిరి అయ్యారు. మున్ముందు వేసవి తీవ్రతను తలుచుకుని ఆందోళనకు గురయ్యారు. కానీ బుధవారం నుంచి వాతావరణం చల్లబడటం ప్రారంభించింది. బుధవారం రాత్రి చల్లటి గాలులు వీయగా, గురువారం కూడా దాదాపుగా అలాంటి వాతావరణమే కొనసాగింది. ప్రస్తుతం రాష్ట్రంలో గరిష్ట ఉష్ణోగ్రతలు సాధారణం కంటే తక్కువగా నమోదయ్యాయి. సగటున 2 డిగ్రీల సెల్సీయస్ నుంచి 5 డిగ్రీల సెల్సీయస్ తక్కువగా నమోదు కావడం గమనార్హం. గురువారం రాష్ట్రంలోని ప్రధాన ప్రాంతాల్లో గరిష్ట, కనిష్ట ఉష్ణోగ్రతలు పరిశీలిస్తే.. గరిష్ట ఉష్ణోగ్రత నల్లగొండలో 39 డిగ్రీల సెల్సీయస్, కనిష్ట ఉష్ణోగ్రత ఆదిలాబాద్‌లో 20.2 డిగ్రీల సెల్సీయస్‌గా నమోదైంది. ఆదిలాబాద్‌లో గరిష్ట ఉష్ణోగ్రత సాధారణం కంటే 9.6 డిగ్రీల సెల్సీయస్ తక్కువగా నమోదు కావడం గమనార్హం. కాగా మరో రెండ్రోజులు ఇలాంటి వాతావరణమే ఉంటుందని వాతావరణ శాఖ సూచిస్తోంది. తేలికపాటి నుంచి మోస్తరు వానలు రాష్ట్ర సరిహద్దు ప్రాంతంలో ఉపరితల ద్రోణి కొనసాగుతున్నట్లు వాతావరణ శాఖ తెలిపింది. మరోవైపు మరఠ్వాడ నుంచి మధ్య మహారాష్ట్ర ప్రాంతంలో ఉపరితల ఆవర్తనం కొనసాగుతోందని, ఇది సముద్రమట్టం నుంచి సగటున 1.5 కిలోమీటర్ల ఎత్తులో కేంద్రీకృతమై ఉన్నట్లు వివరించింది. ఈ పరిస్థితుల నేపథ్యంలో ఉష్ణోగ్రతల్లో క్షీణత చోటు చేసుకుందని తెలిపింది. వీటి ప్రభావంతో రాష్ట్రంలో అక్కడక్కడా తేలికపాటి వర్షాలు.. ఒకట్రెండు చోట్ల మోస్తరు వర్షాలు కూడా కురవొచ్చని సూచించింది. కొన్ని జిల్లాల్లో గంటకు 40 నుంచి 50 కీలోమీటర్ల వేగంతో ఈదురుగాలులతో కూడిన మోస్తరు వర్షాలు నమోదయ్యే అవకాశం ఉన్నట్లు వివరించింది. ఆదిలాబాద్, కుమ్రుంభీం ఆసిఫాబాద్, మంచిర్యాల, నిర్మల్, నిజామాబాద్, జగిత్యాల, రాజన్న సిరిసిల్ల, సంగారెడ్డి, కామారెడ్డి జిల్లాల్లో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ సూచించింది. -
ఏపీ ప్రజలకు అలర్ట్.. రేపు ఈ మండలాల్లో తీవ్ర వడగాల్పులు
గుంటూరు: రాష్ట్రంలో పలు మండలాల్లో తీవ్రవడగాల్పులు వీచే అవకాశం ఉన్నట్లు ఏపీ విపత్తుల నిర్వహణ సంస్థ తెలిపింది. బుధవారం 11 మండలాల్లో తీవ్రవడగాల్పులు, 134 మండలాల్లో వడగాల్పులు వీచే అవకాశం ఉందని అలాగే ఎల్లుండి 16 మండలంలో తీవ్ర వడగాల్పు అలాగే 92 మండలాల్లో వడగాల్పులు వీచే అవకాశం ఉన్నట్లు విపత్తుల సంస్థ ఎండి రోణంకి కూర్మనాథ్ తెలిపారు. రేపు తీవ్రవడగాల్పులు వీచే అవకాశం ఉన్న మండలాలు(11): మన్యం జిల్లాలో 2 మండలాలు, శ్రీకాకుళం జిల్లాలో 8మండలాలు, విజయనగరం వేపాడ మండలంలో తీవ్రవడగాల్పులు వీచే అవకాశం ఉంది. రేపు వడగాల్పులు వీచే అవకాశం ఉన్న మండలాలు(134): శ్రీకాకుళం జిల్లా 17 మండలాలు, విజయనగరం జిల్లాలో -25, పార్వతీపురంమన్యం-11, అల్లూరిసీతారామరాజు-10, విశాఖపట్నం-3, అనకాపల్లి- 16, కాకినాడ- 10, కోనసీమ- 9, తూర్పుగోదావరి- 19, పశ్చిమగోదావరి- 4, ఏలూరు- 7, కృష్ణా, ఎన్టీఆర్ జిల్లాల్లో-2, పల్నాడు అమరావతి మండలంలో వడగాల్పులు వీచే అవకాశం ఉందని చెప్పారు. ప్రజలు వీలైనంతవరకు ఉదయం 11 నుంచి సాయంత్రం 4 వరకు ఇంట్లోనే ఉండాలి, వృద్దులు, గర్భిణీలు, బాలింతలు తగిన జాగ్రత్తలు తీసుకుని అప్రమత్తంగా ఉండాలి. డీహైడ్రేట్ కాకుండా ఉండటానికి ORS (ఓరల్ రీహైడ్రేషన్ సొల్యూషన్), ఇంట్లో తయారుచేసిన పానీయాలైనలస్సీ, నిమ్మకాయ నీరు, మజ్జిగ, కొబ్బరి నీరు మొదలైనవి త్రాగాలని విపత్తుల సంస్థ ఎండి కూర్మనాథ్ సూచించారు. మండలాల పూర్తి వివరాలు క్రింది లింక్‌లో -
నిడమనూరు@44.5 రాష్ట్రం నిప్పుల కొలిమి..
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలో భానుడి భగభగలు ప్రజలను ఉక్కిరిబిక్కిరి చేస్తున్నాయి. వేగంగా వీస్తున్న వడగాడ్పులు జన జీవనాన్ని స్తంభింపజేస్తున్నాయి. ఏప్రిల్ మొదటి వారంలో ఈ స్థాయిలో వరుసగా అత్యధిక ఉష్ణోగ్రతలు నమోదు కావడం గత ఐదేళ్లలో ఇదే తొలిసారి అని వాతావరణ శాఖ అధికారులు చెబుతున్నారు. సాధారణంగా ఏప్రిల్ మూడో వారం లేదా చివరి వారంలో వడగాడ్పుల ప్రభావం ఎక్కువగా ఉంటుంది. కానీ ఈసారి మొదటి వారం నుంచే వేడి గాలులు వీయడం ప్రారంభమైంది. వాతావరణంలో మార్పులే ఉష్ణోగ్రతల పెరుగుదలకు కారణమని అధికారులు వివరిస్తున్నారు. సోమవారం సాధారణం కంటే 1.6 డిగ్రీల సెల్సియస్ అధిక ఉష్ణోగ్రత నమోదైంది. 14 జిల్లాల్లో అత్యధిక ఉష్ణోగ్రతలు: ఏప్రిల్ 8న రాష్ట్రంలో నమోదు కావాల్సిన సగటు ఉష్ణోగ్రత 39.2 డిగ్రీల సెల్సియస్ కాగా 40.9 డిగ్రీల సెల్సియస్ నమోదైంది. సాధారణ సగటు కంటే 32 జిల్లాల్లో అధిక ఉష్ణోగ్రత నమోదు కాగా... 14 జిల్లాల్లో అత్యధిక ఉష్ణోగ్రత నమోదైంది. నల్లగొండ, సూర్యాపేట, ఖమ్మం జిల్లాల్లో 42 డిగ్రీ సెల్సీయస్ కంటే అధికంగా నమోదు కావడం గమనార్హం. ఖమ్మం, మహబూబ్‌నగర్, మెదక్ జిల్లాల్లో సాధారణం కంటే 3 డిగ్రీ సెల్సీయస్ అధిక ఉష్ణోగ్రత నమోదైంది. ఇక రాష్ట్రవ్యాప్తంగా 16 ప్రాంతాలు అధిక ఉష్ణోగ్రతలతో కుతకుతలాడాయి. ఈ ప్రాంతాల్లో గరిష్ట ఉష్ణోగ్రత 43 డిగ్రీ సెల్సీయస్ కంటే అధికంగా నమోదైంది. సోమవారం రాష్ట్రంలోని కొన్ని ప్రాంతాల్లో ఆకాశం మేఘావృతం కావడంతో తక్కువ ఉష్ణోగ్రత నమోదైనప్పటికీ వాతావరణంలో తేమ శాతం పెరగడంతో ఉక్కపోత అధికంగా ఉంది. తప్పనిసరైతేనే బయటకెళ్లాలి రానున్న రెండ్రోజులు భద్రాద్రి కొత్తగూడెం, హనుమకొండ, జయశంకర్ భూపాలపల్లి, జోగుళాంబ గద్వాల, ఖమ్మం, మహబూబాబాద్, మహబూబ్‌నగర్, ములుగు, నాగర్‌కర్నూల్, నల్లగొండ, నారాయణపేట, సూర్యాపేట, వనపర్తి, వరంగల్ జిల్లాల్లో గరిష్ట ఉష్ణోగ్రతలు 41 డిగ్రీ సెల్సీయస్ నుంచి 44 డిగ్రీ సెల్సీయస్ మధ్యన నమోదు కావచ్చని వాతావరణ శాఖ అంచనా వేసింది. గురువారం నుంచి రాష్ట్రంలో గరిష్ట ఉష్ణోగ్రతలు కాస్త తగ్గే అవకాశం ఉందని అధికారులు చెబుతున్నారు. మంగళ, బుధ వారాల్లో ఆదిలాబాద్, కుమ్రుంభీం ఆసిఫాబాద్, మంచిర్యాల, నిర్మల్, నిజామాబాద్, జగిత్యాల, రాజన్న సిరిసిల్ల, కరీంనగర్, కామారెడ్డి జిల్లాల్లోని కొన్నిచోట్ల వడగాడ్పుల తీవ్రత అధికంగా ఉంటుందని వాతావరణ శాఖ అంచనా వేసింది. ఈ మేరకు ఎల్లో అలర్ట్‌ను జారీ చేసింది. అత్యవసర పనులుంటే తప్ప మధ్యాహ్నం 12 గంటల నుంచి సాయంత్రం 4.30 గంటల మధ్య బయటకు రావొద్దని అధికారులు హెచ్చరిస్తున్నారు. తప్పనిసరి పరిస్థితుల్లో బయటకు వెళ్లేవారు తగిన జాగ్రత్తలు పాటించాలని సూచించారు. కాగా రాష్ట్రంలోని కొన్ని ప్రాంతాల్లో మంగళ, బుధ వారాల్లో ఉరుములు, మెరుపులతో పాటు గంటకు 30 నుండి 40 కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలులతో కూడిన తేలికపాటి నుండి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ సూచించింది. -
తెలుగు రాష్ట్రాల్లో మండుతున్న ఎండలు
సాక్షి, విజయవాడ: తెలుగు రాష్ట్రాల్లో ఎండలు మండుతున్నాయి. ఏపీలో సాధారణం కన్నా 6 డిగ్రీలు అధికంగా ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. 64 మండలాల్లో తీవ్ర వడ గాలులు, 222 మండలాల్లో వడగాలులు వీచే అవకాశం ఉందని వాతావరణ శాఖ వెల్లడించింది. విజయనగరం, శ్రీకాకుళం, పార్వతీపురం మన్యం, అనకాపల్లి, కాకినాడ, తూ.గో, విశాఖలో వడగాలుల ప్రభావం ఉంటుందని, అల్లూరి, బాపట్ల, ఏలూరు, గుంటూరు, అంబేద్కర్ కోనసీమ, కృష్ణా, ఎన్టీఆర్, పల్నాడు, ప్రకాశం, నెల్లూరు, తిరుపతి, పశ్చిమగోదావరి జిల్లాల్లో వడగాలులు వీచే అవకాశం ఉందని ఐఎండీ పేర్కొంది. ప్రజలు అప్రమత్తంగా ఉండాలని ఐఎండీ సూచించింది. మరో రెండు రోజుల్లో ఉత్తర కోస్తా, రాయలసీమలోని కొన్ని ప్రాంతాల్లో పిడుగులు పడే అవకాశం ఉందని ఐఎండీ తెలిపింది. -
ఉపశమనం.. తెలంగాణకు నాలుగు రోజుల వర్ష సూచన!
సాక్షి, హైదరాబాద్: తెలంగాణలో ఎండలు దంచికోడుతున్నాయి. రాష్ట్ర వ్యాప్తంగా 41 నుంచి 43 డిగ్రీల మధ్య ఉష్ణోగ్రతలు నమోదవుతున్నట్లు తెలుస్తోంది. ఈరోజు(ఆదివారం) రేపు(సోమవారం) రెండు రోజుల పాటు రాష్టానికి తీవ్రమైన ఎండలతో పాటు వడగాల్పుల హెచ్చరికలను ఐఎండీ జారీచేసింది. ఉదయం 11 నుంచి సాయంత్రం 4 వరకు ప్రజలు బయటకు రావద్దని ఐఎండీ హెచ్చరించింది. ఇక.. వడగాల్పుల తీవ్రత అధికంగా ఉండటంతో ఈరోజు పలు జిల్లాలకు ఆరెంజ్ అలెర్ట్ జారీ చేసింది. భద్రాద్రి కొత్తగూడెం, ఖమ్మం, నల్గొండ, సూర్యాపేట, వనపర్తి, జోగులంబ గద్వాల జిల్లాలకు వడగాల్పుల నేపథ్యంలో ఆరెంజ్ అలర్ట్ జారీ చేసింది ఐఎండీ. రేపు (సోమవారం) రాష్ట్రంలో వనపర్తి జోగులాంబ గద్వాల జిల్లాలో అక్కడక్కడ వడగాల్పులు విచే అవకాశం ఉండడంతో ఎల్లో అలర్ట్ జారీ చేసింది. మరోవైపు.. ఈరోజు నుంచి రాష్ట్రవ్యాప్తంగా వాతావరణంలో భిన్న పరిస్థితులు ఏర్పడే అవకాశం ఉంది. కాస్త ఉపశమనం.. నాలుగు రోజుల వర్ష సూచన ఇప్పటికే తీవ్రమైన ఎండలతో ఉక్కిరిబిక్కిరి అవుతున్న రాష్ట్ర ప్రజలకు కాస్త ఉపశమనం లభించనున్నట్లు తెలుస్తోంది. ఈరోజు(ఆదివారం) నుంచి రాష్ట్రవ్యాప్తంగా నాలుగు రోజులు రాష్ట్రానికి వర్ష సూచన ఉన్నట్లు ఐఎండీ పేర్కొంది. ఉరుములు మెరుపులతో కూడిన తేలికపాటి నుంచి మోస్తారు వర్షాలు కురిసే ఛాన్స్ ఉంది. ఈరోజు ఉరుములు మెరుపులతో పాటు గంటకు 30 నుంచి 40 కిలోమీటర్ల వేగంతో ఈదురు గాలులతో కూడిన వర్షం పలు జిలాల్లో కురిసే అవకాశం ఉంది, ఆదిలాబాద్, కొమరం భీం ఆసిఫాబాద్, మంచిర్యాల, నిర్మల్, వికారాబాద్, జగిత్యాల, కామారెడ్డి జిల్లాలకు వర్ష సూచనతో ఎల్లో అలెర్ట్ జారీ చేసింది ఐఎండీ. రేపు అదిలాబాద్ కొమరం భీమ్ ఆసిఫాబాద్ మంచిర్యాల్ నిర్మల్ నిజామాబాద్ జగిత్యాల కరీంనగర్ పెద్దపల్లి జయశంకర్ భూపాలపల్లి ములుగు మెదక్ కామారెడ్డి జిల్లాలో అక్కడక్కడ ఉరుములు మెరుపులతో పాటు గంటకు 40 నుంచి 50 కిలోమీటర్ల ఈదురుగాలులతో కూడిన వర్షం కురిసే అవకాశం ఉండడంతో ఎల్లో అలెర్ట్ జారీ చేసింది. -
AP: జర జాగ్రత్త.. మూడు రోజులు మండే ఎండలే..
సాక్షి, విశాఖపట్నం: ఏపీలో ఎండల తీవ్రత పెరుగుతోంది. ఈ క్రమంలోనే రాష్ట్రంలో రానున్న మూడు రోజులు ఎండ తీవ్రత పెరగనున్నట్టు వాతావరణ శాఖ హెచ్చరించింది. ఎల్‌నినో ప్రభావంతో ఏప్రిల్, మే నెలలో రాష్ట్రవ్యాప్తంగా అధిక ఉష్ణోగ్రతలు నమోదవుతాయని వాతావరణ శాఖ అధికారులు చెబుతున్నారు.ఇక, రానున్న మూడు రోజుల్లో ప్రతీరోజు ఒక డిగ్రీ సెల్సియస్ ఉష్ణోగ్రత అధికంగా నమోదయ్యే అవకాశముంది. ఇప్పటికే రాష్ట్రంలో సాధారణం కంటే రెండు నుంచి మూడు డిగ్రీల సెల్సియస్ అధిక ఉష్ణోగ్రత నమోదైంది. కర్నూలులో అత్యధికంగా 42.2, నంద్యాలలో 42 డిగ్రీలు, అనంతపూర్‌లో 41.2 డిగ్రీలు, కడపలో 41 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదు అయినట్టు వాతావరణశాఖ అధికారులు తెలిపారు. రాయలసీమ జిల్లాలో సాధారణ కంటే 2.6 డిగ్రీల ఉష్ణోగ్రత నిన్న(సోమవారం) రికార్డు అయ్యింది. ఇక, రాష్ట్రంలో విశాఖలోనే అత్యల్పంగా 31.6 డిగ్రీల సెల్సియస్ ఉష్ణోగ్రత నమోదైంది. మరోవైపు.. సోమవారం అనకాపల్లి, విజయనగరం, నంద్యాల జిల్లాల్లోని ఒక్కో మండలంలో తీవ్రంగా వడగాలులు వీచాయి. మంగళ, బుధవారాల్లో 10 మండలాల్లో వడగాల్పులు వీచే అవకాశం ఉందని విపత్తుల నిర్వహణ సంస్థ వెల్లడించింది. సోమవారం ఆరు మండలాల్లో తీవ్రవడగాల్పులు, 37 మండలాల్లో వడగాల్పులు వీచినట్లు అధికారులు తెలిపారు. ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించారు. -
AP: జర జాగ్రత్త.. మూడు రోజులు మండే ఎండలే..
సాక్షి, విశాఖపట్నం: ఏపీలో ఎండల తీవ్రత పెరుగుతోంది. ఈ క్రమంలోనే రాష్ట్రంలో రానున్న మూడు రోజులు ఎండ తీవ్రత పెరగనున్నట్టు వాతావరణ శాఖ హెచ్చరించింది. ఎల్‌నినో ప్రభావంతో ఏప్రిల్, మే నెలలో రాష్ట్రవ్యాప్తంగా అధిక ఉష్ణోగ్రతలు నమోదవుతాయని వాతావరణ శాఖ అధికారులు చెబుతున్నారు. ఇక, రానున్న మూడు రోజుల్లో ప్రతీరోజు ఒక డిగ్రీ సెల్సియస్ ఉష్ణోగ్రత అధికంగా నమోదయ్యే అవకాశముంది. ఇప్పటికే రాష్ట్రంలో సాధారణం కంటే రెండు నుంచి మూడు డిగ్రీల సెల్సియస్ అధిక ఉష్ణోగ్రత నమోదైంది. కర్నూలులో అత్యధికంగా 42.2, నంద్యాలలో 42 డిగ్రీలు, అనంతపూర్‌లో 41.2 డిగ్రీలు, కడపలో 41 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదు అయినట్టు వాతావరణశాఖ అధికారులు తెలిపారు. రాయలసీమ జిల్లాలో సాధారణ కంటే 2.6 డిగ్రీల ఉష్ణోగ్రత నిన్న(సోమవారం) రికార్డు అయ్యింది. ఇక, రాష్ట్రంలో విశాఖలోనే అత్యల్పంగా 31.6 డిగ్రీల సెల్సియస్ ఉష్ణోగ్రత నమోదైంది. మరోవైపు.. సోమవారం అనకాపల్లి, విజయనగరం, నంద్యాల జిల్లాల్లోని ఒక్కో మండలంలో తీవ్రంగా వడగాలులు వీచాయి. మంగళ, బుధవారాల్లో 10 మండలాల్లో వడగాల్పులు వీచే అవకాశం ఉందని విపత్తుల నిర్వహణ సంస్థ వెల్లడించింది. సోమవారం ఆరు మండలాల్లో తీవ్రవడగాల్పులు, 37 మండలాల్లో వడగాల్పులు వీచినట్లు అధికారులు తెలిపారు. ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించారు. -
తెలంగాణ: దంచికొడుతున్న ఎండలు.. వడగాలుల హెచ్చరిక
సాక్షి, హైదరాబాద్: తెలంగాణలో ఎండలు దంచికొడుతున్నాయి. తెలంగాణలోని పలు జిల్లాలో 43 డిగ్రీలకుపైగా ఉష్ణోగ్రతలు నమోదు అవుతున్నాయి. ఉదయం నుంచే ఉక్కపోత తోడవుతోంది. ఈ క్రమంలో.. రాష్ట్రానికి వడగాలుల ముప్పు పొంచి ఉందని వాతావరణ శాఖ హెచ్చరికలు జారీ చేసింది. సోమవారం నుంచి ఉష్ణోగ్రతలు మరింత పెరిగే అవకాశముండడంతో.. ఎండ తీవ్రత దృష్ట్యా ప్రజలు అప్రమత్తంగా ఉండాలని, అవసరమైతేనే బయటకు రావాలని వాతావరణ శాఖ అధికారులు తెలిపారు. మూడు రోజులపాటు వడగాలులు వీచే అవకాశం ఉందని చెబుతున్నారు. ఇక.. ఉత్తర తెలంగాణ జిల్లాలతో పాటు ఉమ్మడి నల్గొండ, మహబూబ్‌నగర్ జిల్లాలకు వడగాల్పుల హెచ్చరికలు జారీ చేసింది. తెలంగాణలో 15 జిల్లాలకు ఆరెంజ్ అలర్ట్ జారీ చేసింది. రాబోయే 5 రోజుల్లో మరింత పెరిగే అవకాశం ఉందని తెలిపింది. -
మండుతున్న ఎండలు.. తెలంగాణలో ఆరెంజ్ అలర్ట్!
సాక్షి, హైదరాబాద్: తెలంగాణలో ఎండలు దంచికొడుతున్నాయి. మార్చి చివరి వారంలోనే భానుడు చుక్కలు చూపిస్తున్నాడు. ఇక, ఈ ఏడాదిలోనే అత్యధిక ఉష్ణోగ్రతలు ఆదిలాబాద్ జిల్లాలో నమోదయ్యాయి. రికార్డు స్థాయిలో మంగళవారం 42.3 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదైంది. వివరాల ప్రకారం.. ఆదిలాబాద్ జిల్లాలోని తలమడుగు, జైనథ్ మండలాల్లో మంగళవారం గరిష్ఠంగా 42.3 డిగ్రీల ఉష్ణోగ్రతలు నమోదు కాగా.. బేల మండలం చప్రాలలో 42.1 డిగ్రీల ఉష్ణోగ్రత రికార్డు అయ్యింది. ఇక, కుమురంభీం ఆసిఫాబాద్ జిల్లా ఆసిఫాబాద్‌లో 42 డిగ్రీలు నమోదైంది. మరోవైపు రాష్ట్రవ్యాప్తంగా 12 జిల్లాల్లో 40.8 డిగ్రీల నుంచి 42.3 డిగ్రీల మధ్య గరిష్ఠ ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. 26.03.2024 DAILY WEATHER REPORT OF TELANGANA pic.twitter.com/Uxr05ZS5oZ — mchyderabad dwr (@mchyderaba94902) March 26, 2024 మరోవైపు.. రానున్న మూడు రోజులు కూడా సాధారణం కన్నా రెండు నుంచి మూడు డిగ్రీల వరకు ఉష్ణోగ్రతలు పెరుగుతాయని వాతావరణశాఖ హెచ్చరించింది. కాగా.. రాష్ట్ర అభివృద్ధి, ప్రణాళికా సంస్థ ఎండల పెరుగుదలపై ప్రజలను అప్రమత్తం చేస్తూ ‘ఆరెంజ్’ హెచ్చరికలను జారీచేసింది. ఎండలో పనిచేసేవారు, మధ్యాహ్నం పూట ప్రయాణాలు చేసేవారు అప్రమత్తంగా ఉండాలని నిపుణులు సూచిస్తున్నారు. పిల్లలు సైతం ఎండలో తిరగరాదని హెచ్చరిస్తున్నారు. ఇదిలా ఉండగా.. పలుచోట్ల వర్షం కురిసిన్నట్టు వాతావరణ శాఖ అధికారులు తెలిపారు. -
హాట్.. హాట్ సమ్మర్
సాక్షి, విశాఖపట్నం:ఈ ఏడాది వేసవి దడ పుట్టించనుంది. అసాధారణ ఉష్ణోగ్రతలతో అల్లాడించనుంది. ఎక్కువ రోజులు వడగాడ్పులు వీస్తూ హాట్‌హాట్‌గా ఉండనుంది. రానున్న వేసవి తీవ్రంగానే ఉంటుందని జాతీయ, అంతర్జాతీయ వాతావరణ సంస్థలు అంచనా వేస్తున్నాయి. తాజాగా భారత వాతావరణ శాఖ (ఐఎండీ) కూడా అదే అంచనాకు వచ్చింది. దక్షిణాది రాష్ట్రాలతోపాటు ఏపీలోనూ ఉష్ణతాపం తీవ్రంగానే ఉంటుందని పేర్కొంది. మార్చి నుంచి మే వరకు మూడు నెలలు వేసవి సీజన్‌గా పరిగణిస్తారు. ఈ మూడు నెలల్లోకెల్లా మే నెలలో ఉష్ణతీవ్రత అధికంగా ఉంటుంది. ఈ వేసవిలో ఉష్ణోగ్రతలు సాధారణంకంటే 5–8 డిగ్రీల వరకు ఎక్కువగా నమోదయ్యే అవకాశాలు ఉన్నాయి. పైగా ఇవి ఎక్కువ రోజులు కొనసాగనున్నాయి. అందువల్ల వడగాడ్పులు, తీవ్ర వడగాడ్పుల ప్రభావం అధికంగా ఉండనుంది. ఆంధ్రప్రదేశ్‌లో వేసవికాలంలో సగటున 5–6 రోజులు వడగాడ్పులు వీస్తాయి. కానీ.. గత ఏడాది జూన్ నాలుగో వారం వరకు సుదీర్ఘంగా వేసవి తీవ్రత కొనసాగింది. దీంతో 17 రోజులు వడగాడ్పులు వీచాయి. ఈ వేసవిలో 2019 నాటి ఉష్ణోగ్రతలు పునరావృతం కావచ్చని వాతావరణ నిపుణులు చెబుతున్నారు. ఈ ఎండాకాలంలో ఉష్ణతీవ్రత కోస్తాంధ్రలో ఎక్కువగా ఉంటుందని ఐఎండీ సీనియర్ శాస్త్రవేత్త కరుణాసాగర్ ‘సాక్షి’కి చెప్పారు. వేసవిలో రెండు రోజులకు మించి సాధారణం కంటే 4–5 డిగ్రీలు అధికంగా ఉష్ణోగ్రతలు నమోదైతే హీట్ వేవ్స్ గాను, 45 డిగ్రీలు, అంతకంటే ఎక్కువ ఉష్ణోగ్రతలు రికార్డయితే తీవ్ర వడగాడ్పులు గాను పరిగణిస్తారు. ఆంధ్రప్రదేశ్‌లో మార్చి మూడో వారం నుంచే ఉష్ణోగ్రతల తీవ్రత పెరుగుతూ వడగాడ్పుల (హీట్ వేవ్స్)కు ఆస్కారం ఉందని అమరావతి వాతావరణ కేంద్రం డైరెక్టర్ ఎస్.స్టెల్లా చెప్పారు. రాత్రి ఉష్ణోగ్రతలు సైతం.. మరోవైపు రాత్రి ఉష్ణోగ్రతలు కూడా సాధారణం కంటే ఎక్కువగా రికార్డవుతాయని ఐఎండీ అంచనా వేస్తోంది. సాధారణంగా పగటి పూట అధిక ఉష్ణోగ్రతలు నమోదైనా రాత్రి ఉష్ణోగ్రతలు తక్కువగా నమోదైతే వాతావరణం కాస్త చల్లబడి ఉపశమనం కలిగిస్తుంది. కానీ.. ఈ ఏడాది అందుకు భిన్నంగా రాత్రి ఉష్ణోగ్రతలు కూడా పెరుగుతాయని ఐఎండీ తెలిపింది. దీంతో పగలు (గరిష్ట), రాత్రి (కనిష్ట) ఉష్ణోగ్రతల పెరుగుదలతో ఎక్కువ ఉష్ణతాపం అనుభూతి కలగనుంది. ఇటీవల ముగిసిన శీతాకాలం సీజన్ కూడా అంతగా చల్లదనం లేదు. సీజన్ మొత్తమ్మీద ఒక్క రోజు కూడా కోల్డ్ వేవ్స్ (అతి శీతల పవనాలు) వీయలేదు. రాష్ట్రంలో కనిష్ట ఉష్ణోగ్రతలు సాధారణం కంటే 2–3 డిగ్రీలకు మించి తక్కువగా నమోదు కాకపోవడంతో శీతల ప్రభావం చూపలేదు. దీని ప్రభావం కూడా ఈ వేసవిపై పడుతుందని వాతావరణ నిపుణులు అంచనా వేస్తున్నారు. కాగా.. ఎల్‌నినో పరిస్థితులు కూడా జూన్ ఆరంభం వరకు కొనసాగే అవకాశం ఉన్నందున అప్పటివరకు అధిక ఉష్ణతాపం, వడగాడ్పులు కొనసాగనున్నాయి. నైరుతి రుతు పవనాలు ప్రవేశించే వరకు ఎల్‌నినో ఉంటుంది. ఆ తర్వాత లానినా పరిస్థితులతో సముద్ర ఉష్ణోగ్రతలు అనుకూలంగా మారనున్నాయి. అనంతపురంతో ఆరంభం రాష్ట్రంలో ఉష్ణోగ్రతల పెరుగుదల అప్పుడే మొదలైంది. వేసవి సీజన్ ఆరంభంలోనే అనంతపురంలో శనివారం 41.1 డిగ్రీల గరిష్ట ఉష్ణోగ్రత నమోదైంది. ఇది సాధారణం కంటే 4.6 డిగ్రీలు అధికం. కర్నూలు, నంద్యాల, నందిగామ తదితర ప్రాంతాల్లో 40 డిగ్రీలకు చేరువలో ఉష్ణోగ్రతలు రికార్డయ్యాయి. మరికొద్ది రోజుల్లోనే రాష్ట్రంలో పలుచోట్ల 40 డిగ్రీలకు చేరుకుంటాయని వాతావరణ నిపుణులు చెబుతున్నారు. -
2023 హాటెస్ట్ వేసవి
2023లో ఎండలు అక్షరాలా మండిపోయా యి. ఎంతగా అంటే, మానవ చరిత్రలో రికార్డయిన అత్యంత హెచ్చు ఉష్ణోగ్రతలు ఈ ఎండాకాలంలోనే నమోదయ్యాయి. ఈ ఏడాదే ప్రపంచవ్యాప్తంగా నెలకొన్న రికార్డులు బద్దలయ్యేంతటి వడ గాడ్పులు, వాటి అనంతర పరిణామాలు ఇందుకు మరింతగా దోహదం చేశాయి. కొన్ని దశాబ్దాలుగా భూగోళం అంతటా ఉష్ణోగ్రతలు క్రమంగా పెరిగిపోతున్న పరిణామానికి ఇది ప్రమాదకరమైన కొనసాగింపేనని పర్యావరణవేత్తలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు... 2023 వేసవి 1880లో ప్రపంచవ్యాప్తంగా వాతావరణ వివరాలు నమోదు చేయడం మొదలు పెట్టిన నాటినుంచి అత్యంత వేడిమితో కూడినదిగా రికార్డు సృష్టించింది. ఈ ఆందోళనకర గణాంకాలను న్యూయార్క్‌లోని నాసాకు చెందిన గొడార్డ్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ స్పేస్ సైన్స్ (జీఐఎస్ఎస్) వెల్లడించింది. ‘ఇప్పటికైనా మేలుకుని గ్లోబల్ వారి్మంగ్‌కు, ముఖ్యంగా విచ్చలవిడిగా సాగిస్తున్న పర్యావరణ విధ్వంసానికి అడ్డుకట్ట వేయడం ప్రపంచ దేశాల ముందున్న తక్షణ కర్తవ్యం’ అని పర్యావరణ ప్రియులు, శాస్త్రవేత్తలు∙ఆందోళన వ్యక్తం చేస్తున్నారు పులి మీద పుట్రలా... ఈ వేసవిలో ఎండలు గత రికార్డులన్నింటిన్నీ బద్దలు కొట్టడం వడ గాడ్పుల పాత్ర చాలా ఎక్కువే. ఈ ఏడాది ప్రపంచంలో చాలా ప్రాంతాలను అవి తీవ్రంగా వణికించాయి... ► ఇటు అమెరికా నుంచి అటు జపాన్ దాకా, యూరప్ నుంచి దక్షిణ అమెరికా ఖండం దాకా కానీ వినీ ఎరగని స్థాయిలో వేడి గాలులు అతలాకుతలం చేసి వదిలాయి. ► ఇటలీ, గ్రీస్ తో పాటు పలు మధ్య యూరప్ దేశాల్లో విపరీతమైన వర్షపాతానికి కూడా ఈ గాలులు కారణమయ్యాయి. ► ఈ వడ గాడ్పుల దుష్పరిణామాలను ఏదో ఒక రూపంలో ప్రపంచమంతా చవిచూసింది. ఇవీ రికార్డులు... ఈ ఏడాది ఎండలు అన్ని రికార్డులనూ బద్దలు కొట్టి పర్యావరణ ప్రియుల ఆందోళనలను మరింతగా పెంచాయి. ► ముఖ్యంగా జూన్, జూలై, ఆగస్ట్ ఉమ్మడి ఉష్ణోగ్రతలు నాసా రికార్డుల్లోని గత అన్ని గణాంకాల కంటే 0.23 డిగ్రీ సెంటిగ్రెడ్ ఎక్కువగా నమోదయ్యాయి. ► అదే 1951–1980 మధ్య అన్నీ వేసవి కా సగటు ఉష్ణోగ్రత కంటే ఏకంగా 1.2 డిగ్రీ సెంటిగ్రేడ్ ఎక్కువగా తేలాయి! మేలుకోకుంటే అంతే... గ్రీన్ హౌస్, కర్బన ఉద్గారాలు ఉష్ణోగ్రతల్లో విపరీతమైన పెరుగుదలకు ప్రధాన కారణమని నాసా జెట్ ప్రొపల్షన్ లేబోరేటరీలో క్లైమేట్ సైంటిస్ట్, ఓషనోగ్రఫర్ జోష్ విల్లిస్ అంటున్నారు. ‘ కొన్నేళ్లుగా భూగోళం స్థిరంగా వేడెక్కుతూ వస్తోంది. ప్రధానంగా మనిషి నిర్వాకమే ఈ వాతావరణ అవ్యవçస్థకు దారి తీస్తోంది. సాధారణంగా కూడా ఎల్ నినో ఏర్పడ్డప్పుడు ప్రపంచవ్యాప్తంగా ఉష్ణోగ్రతలు అనూహ్యంగా పెరగడం రివాజు’ అని ఆయన అన్నారు. ఎలా నమోదు చేస్తారు? నాసా ఉష్ణోగ్రతల రికార్డు పద్ధతిని జిస్ టెంప్ అని పిలుస్తారు. ► దీనిలో భాగంగా భూ ఉపరితల ఉష్ణోగ్రతలను ప్రపంచవ్యాప్తంగా ఉన్న వేల వాతావరణ కేంద్రాల ద్వారా ఎప్పటికప్పుడు సేకరిస్తారు. ► నౌకలు తదితర మార్గాల ద్వారా సముద్ర ఉపరితల ఉష్ణోగ్రతలను కూడా సేకరిస్తారు. ► 1951–1980 మధ్య కాలాన్ని సూచికగా తీసుకుని, ఆ 30 ఏళ్ల సగటుతో పోలిస్తే ఏటా ఉష్ణోగ్రతల తీరుతెన్నులు ఎలా ఉన్నదీ లెక్కిస్తారు. మరీ విపరీతమైన మార్పులుంటే తక్షణం అన్ని దేశాలనూ అప్రమత్తం చేస్తారు. ‘ఈ రికార్డు స్థాయి ఉష్ణోగ్రతల దు్రష్పభావం మున్ముందు కూడా ప్రపంచం మొత్తం మీదా చెప్పలేనంతగా ఉండనుంది’ – బిల్ నెల్సన్, నాసా అడ్మినిస్ట్రేటర్ సముద్ర ఉపరితల ఉష్ణోగ్రతల్లో అత్యంత హెచ్చుదల నమోదవడమే ఈసారి కనీ వినీ ఎరుగని ఎండలకు ప్రధాన కారణం. – జోష్ విల్లిస్, క్లైమేట్ సైంటిస్ట్, ఓషనోగ్రఫర్, నాసా జెట్ ప్రొపల్షన్ లేబొరేటరీ – సాక్షి, నేషనల్ డెస్క్ -
వేధిస్తున్న విపరిణామాలు
వందేళ్లలో ప్రపంచ ఉష్ణోగ్రతలు అనూహ్యంగా పెరిగాయి. ఫలితంగా వ్యవసాయోత్పత్తులు దెబ్బతింటున్నాయి. దీనివల్ల ఆహోరోత్పత్తుల ధరలు చుక్కలనంటి, ఆహార కొరత ఏర్పడే ప్రమాదం ఉంది. అయితే, వందేళ్లలో మారిన ప్రకృతి విపరిణామాల గురించి ఆలోచిస్తున్నాం సరే, మరి సమాజంలో ఇంకా మారని దుష్పరిణామాల గురించి ఆలోచిస్తున్నామా? మనుషుల మధ్య ఉన్న పెక్కు సామాజిక అసమానతలు ఇప్పటికీ తొలగిపోవడం లేదు. అంటరానితనమనే రుగ్మత ఇంకా పీడిస్తున్న పెను‘రోగం’గానే ఉంది. ‘ఎల్‌నినో’ వాతావరణాన్ని ప్రభావితం చేస్తే... కుల వ్యవస్థ, మత వ్యవస్థలు సంఘ జీవనాన్ని ఇప్పటికీ కలుషితం చేస్తూనే ఉన్నాయి. ‘‘గత వందేళ్లలోనే ప్రపంచ ఉష్ణోగ్రతలు 1.5 డిగ్రీల సెంటీగ్రేడ్ పెరిగాయి. 2100 సంవ త్సరానికల్లా అనూహ్యంగా 4 సెంటిగ్రేడ్ డిగ్రీలు పెరగనున్నాయి. కాగా, ఇంతవరకు ప్రపంచ వాతావరణ రికార్డులో లేని వేడిమి 2022లో నమోదైంది. అంతేగాదు, తరచుగా దక్షిణ ఆసియాలో బిళ్లబీటుగా ఉధృతమవుతున్న వేడిగాలులు రానున్న సంవత్సరాల్లో కూడా కొనసాగ బోతున్నాయి. ఇంతగా వేడి గాలులు భారతదేశంలోని ఉత్తరాది రాష్ట్రా లలోనే గాక, దక్షిణాది రాష్ట్రాలను కూడా అమితంగా పీడిస్తున్నాయి. ఢిల్లీని 72 ఏళ్ల చరిత్రలో ఎరగని ఉష్ణోగ్రతలు ఈ ఏడాది కుదిపేశాయి. ప్రపంచ వాతావరణంలో అనూ హ్యమైన స్థాయిలో (40 డిగ్రీల సెంటి గ్రేడ్‌కు మించి) వేడిగాలులు వీచే ఈ పరిస్థితుల్లో, భారత్, చైనా, పాకిస్తాన్, ఇండోనేసియా లాంటి దేశాల్లో బయటి పనిచేసుకుని బత కాల్సిన దినసరి కార్మికులు యమ యాతనలకు గురికావల్సి వస్తుంది. 1971–2019 సంవత్సరాల మధ్య ఇండియాను చుట్టబెట్టిన అసాధా రణ వేడిగాలుల ఫలితంగా వేలాది మంది ప్రాణాలు కోల్పోయారు. ఈ పరిస్థితులు మళ్లీ పునరావృతమయ్యే ప్రమాదం ఉంది.’’ – ప్రొఫెసర్స్ వినోద్ థామస్, మెహతాబ్ అహ్మద్ జాగిల్,నేషనల్ యూనివర్సిటీ ఆఫ్ సింగపూర్ ఈ ‘మిడిమేల’మంతా భారతదేశాన్ని ఎలా చుట్టబెడుతోంది? మరో వైపు, గత ఏడేళ్లుగా పసిఫిక్ మహాసముద్రం నుంచి ఏనాడూ ఎరుగ నంతటి వేడి గాలులకు నిలయమైన ‘ఎల్‌నినో’ వాతావరణ దృశ్యం భారత దేశాన్ని ‘కుమ్మేస్తూ’ ముంచుకొస్తోంది. ఫలితంగా వ్యవసాయో త్పత్తులు దెబ్బతింటున్నాయి. దీనివల్ల తీవ్రమైన సామాజిక పరిస్థి తులు తలెత్తి, ఆహోరోత్పత్తుల ధరలు చుక్కలనంటి, ఆహార కొరత ఏర్పడే ప్రమాదం ఉందని సిడ్నీ యూనివర్సిటీ ఆర్థిక శాస్త్రాచార్యులు డేవిడ్ యుబిలావా హెచ్చరిస్తున్నారు. ‘ఎల్‌నినో’ ప్రభావం అన్ని చోట్లా ఒకే తీరుగా ఉండదు. కాకపోతే, పెక్కు దేశాలకు వర్తక వ్యాపారాల సంబంధ బాంధవ్యాలున్నందువల్ల ఆర్థికపరమైన ఒడిదు డుకులు అనివార్యమవుతాయి. కొన్నిచోట్ల కరువు కాటకాలతో పాటు, సామాజిక ఒడిదుడుకులు అనివార్యమనీ అంచనా! ఇప్పటికే మనుషుల మధ్య పెక్కు సామాజిక అసమానతలు ఉన్నాయి. అంటరానితనమనే రుగ్మత పెక్కుమందిని ఇంకా పీడిస్తున్న పెను‘రోగం’గానే ఉంది. ‘ఎల్‌నినో’ లాంటి వాతావరణం వల్ల వారి జీవితాలకు మరిన్ని అవాంతరాలు తోడవుతున్నాయి. ఈ జాఢ్యం ఇప్పుడే గాదు, ‘ఏలినాటి శని’గా మనదాకా దాపురించి ఉన్నందుననే – మహాకవి జాషువా ఏనాడో ఇలా చాటాడు: ‘‘అంటరాని తనంబునంటి భారత జాతి భువన సభ్యత గోలుపోయె... నిమ్న జాతుల కన్నీటి నీరదములు పిడుగులై దేశమును కాల్చివేయు’’ అంతేనా? తాను ‘పుట్టరాని చోట పుట్టినందుకు’ అసమానతా భారతంలో ఎన్ని అగచాట్లకు గురయ్యాడో వెలిబుచ్చిన గుండె బాధను అర్థం చేసుకోగల మనస్సు కావాలని ఇలా కోరుకున్నాడు: ‘‘ఎంత కోయిల పాట వృథయయ్యెనొ కదా చిక్కు చీకటి వన సీమలందు ఎన్ని వెన్నెల వాగు లింకి పోయెనొ కదా కటికి కొండల మీద మిటకరించి ఎన్ని కస్తూరి జింక లీడేరెనొ కదా మురికి తిన్నెల మీద పరిమళించి ఎన్ని ముత్తెపురాలు భిన్నమయ్యెనొ కదా పండిన వెదురు జొంపములలోన ఎంత గంధవహన మెంత తంగెటి జున్ను యెంత రత్నకాంతి యెంత శాంతి ప్రకృతి గర్భమందు భగ్నమైపోయెనొ పుట్టరాని చోట బుట్టుకతన...’’ ‘ఎల్‌నినో’ వాతావరణాన్ని ప్రభావితం చేస్తే... కుల వ్యవస్థ, మత వ్యవస్థలు సంఘ జీవనాన్ని ఇప్పటికీ ఎలా కలుషితం చేస్తున్నాయో ‘గబ్బిలం’ దీనావస్థ ద్వారా జాషువా వ్యక్తం చేశారు. ‘పూజారి’ లేని సమయం చూసి నీ బాధను శివుడి చెవిలో విన్నవించుకోమంటాడు. అప్పటికీ ఇప్పటికీ – పిడుక్కీ, బియ్యానికీ ఒకే మంత్రంగా వ్యవస్థ అవస్థ పడుతూనే ఉంది. కనుకనే జాషువా ‘ముప్పయి మూడు కోట్ల దేవతలు ఎగబడ్డ దేశంలో భాగ్యవిహీనుల కడుపులు చల్లారుతాయా’ అని ప్రశ్నించాడు! అలాగే అనేక ప్రకృతి వైపరీత్యాల నుంచి మానవుల్ని క్షేమంగా గట్టెక్కించే ఔషధాలు, వాటి విలువల్ని తొలిసారిగా ప్రపంచానికి వెల్లడించిన 18వ శతాబ్ది కవి చెళ్లపిళ్ల నరస కవి. ఒక్క ‘కరణి’ అన్న పదంతోనే (ఒక రీతి, ఒక పద్ధతి) ధరణిని శ్వాసించి, శాసించిన కవి! ఆయన గ్రంథం ‘యామినీ పూర్ణతిలకా విలాసం’ ఎన్ని రకాల ఔషధాలనో వెల్లడించింది: చనిపోయిన వారిని బతికించే ఔషధి – ‘సంజీవకరణి’, విరిగిపోయిన ఎముకల్ని అతికించేది– ‘సంధాన కరణి’, తేజస్సును కోల్పోయిన మనిషికి తేజస్సు ప్రసాదించే ఔషధం– ‘సౌవర్ణకరణి’, మనిషి శరీరంలో విరిగి పోయిన ఎముక ముక్కల్ని తొలగించేసేది – ‘విశల్యకరణి’. ఇవన్నీ నరస కవి చూపిన ప్రకృతి లోని పలు రకాల ఔషధాలు! కళల్ని మెచ్చుకుని వాటికి కాంతులు తొడిగే శిల్పుల్ని నిరసించడం తగదు గదా! ఎందుకని? ‘వానతో వచ్చే వడగండ్లు’ నిలుస్తాయా?! ఏబీకే ప్రసాద్ సీనియర్ సంపాదకులు abkprasad2006@yahoo.co.in -
ఊపిరి పీల్చుకున్న జనం! ఒక్కసారిగా మారిన వాతావరణం.. విజయవాడలో భారీ వర్షం
సాక్షి, అమరావతి: నైరుతి రుతుపవనాలు ఆంధ్రప్రదేశ్‌లో క్రమంగా విస్తరిస్తున్నాయి. వీటి ప్రభావంతో పలు చోట్ల మోస్తరు నుంచి భారీ వర్షాలు కురుస్తున్నాయి. దీంతో భగ భగ మండే ఎండల నుంచి ప్రజలు కాస్త ఉపశమనం పోందుతున్నారు. తాజాగా విజయవాడలో మంగళవారం మధ్యాహ్నం నుంచి భారీ వర్షం కురుస్తోంది. దాదాపు రెండు గంటలుగా భారీ వర్షం కురుస్తుండటంతో నగర వాసులకు ఊరట లభించింది. భారీ వర్షం నేపథ్యంలో నగరంలోని పలు రోడ్లు జలమయ్యాయి. నైరుతి రుతుపవనాలు రాష్ట్రంలోకి ప్రవేశించినా బిపర్ జోయ్ తుపాను కారణంగా విస్తరణ ఆలస్యం కావడంతో రైతులు, సాధారణ ప్రజలు వర్షాల కోసం ఎదురుచూస్తున్నారు. తెలంగాణలో.. తెలంగాణలో వేడిగాలులు, ఎండలతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్న సంగతి తెలిసిందే. మంగళవారం రంగారెడ్డి జిల్లాలో షాద్‌నగర్‌లో వర్షం కురవగా.. హైదరాబాద్‌లో ఎండలు కాస్తున్నాయి. చదవండి: 5 తరాలు, 85 మంది కుటుంబ సభ్యులు.. 102 ఏళ్ల బామ్మకు ఘనంగా పుట్టిన రోజు వేడుకలు -
ఆంధ్రప్రదేశ్‌లో ఈ నెల 20 నుంచి వర్షాలు...ఇంకా ఇతర అప్డేట్స్
ఆంధ్రప్రదేశ్‌లో ఈ నెల 20 నుంచి వర్షాలు...ఇంకా ఇతర అప్డేట్స్
-
ఏపీ: తీవ్రమైన వడగాల్పులతో జాగ్రత్త!
సాక్షి, న్యూఢిల్లీ: వర్షాకాలం వచ్చినా.. వేసవి తాపం నుంచి భారత్ ఊరట పొందడం లేదు. రుతుపవనాలు ప్రవేశించినా కూడా పలు రాష్ట్రాల్లో ఇంకా తొలకరి పలకరింపు జరగలేదు. మరోవైపు కొన్ని రాష్ట్రాల్లో వడగాల్పులు తప్పవని హెచ్చరికలు జారీ చేసింది భారత వాతావరణ శాఖ. ఒడిశా, పశ్చిమ బెంగాల్, జార్ఖండ్, ఆంధ్రప్రదేశ్, ఉత్తర ప్రదేశ్, బీహార్, మధ్యప్రదేశ్, తెలంగాణ, తమిళనాడులో తీవ్ర నుంచి అతితీవ్ర వడగాల్పులు వీస్తాయని వాతావరణ శాఖ హెచ్చరించింది. అక్కడక్కడా వర్షాలు పడినప్పటికీ.. చాలావరకు ఆయా రాష్ట్రాల్లో అధిక ఉష్ణోగ్రతలే ఉంటాయని తెలిపింది. తెలుగు రాష్ట్రాలనైతే ఎండలు హడలెత్తిస్తున్నాయి. ఏపీ విషయానికొస్తే.. దాదాపు 300 మండలాలకు వడగాల్పుల హెచ్చరికలు జారీ అయ్యాయి. 23 మండలాల్లో మరీ తీవ్రంగా ఉండొచ్చని అంచనా వేస్తోంది. పెద్దలు, పిల్లలు, అనారోగ్యంతో బాధపడేవాళ్లు.. అవసరమైతేనే బయటకు రావాలని, డీహైడ్రేషన్ నేపథ్యంలో దాహం వేయకున్నా నీరు తాగాలని వైద్య నిపుణులు సూచించారు. ఇక బాపట్ల, అల్లూరి, ఏలూరు, తూర్పు గోదావరి జిల్లాల్లో 44 డిగ్రీల వరకు ఉష్ణోగ్రతలు నమోదు అయ్యే అవకాశాలున్నాయని అంచనా వేస్తోంది ఐఎండీ. బిపర్జోయ్ తుపాను బలహీనపడడం, మరో 12 గంటలపాటు పరిస్థితి కొనసాగేలా కనిపిస్తుండడంతో.. రేపు సాయంత్రానికిగానీ, ఎల్లుండికిగానీ ఏపీలో రుతుపవనాల ప్రభావం కనిపించొచ్చని అంచనా వేస్తోంది వాతావరణ శాఖ. ఇదీ చదవండి: జూన్ మూడోవారంలోనూ నిప్పుల కొలిమిలా తెలంగాణ -
ఏపీలో నమోదవుతున్న గరిష్ట ఉష్ణోగ్రతలు
-
ఎండకు భయపడి.. బడికి దూరం..!
మంచిర్యాలఅర్బన్: జిల్లాలో రోజు రోజుకు భానుడి భగభగలకు ప్రజలు అల్లాడిపోతున్నారు. ఉదయం 9గంటల నుంచే ఎండలు మండిపోతున్నాయి. ఫ్యాన్లు, కూలర్లు సైతం ఎండ వేడిమి నుంచి ఉపశమనం కలిగించడం లేదు. మధ్యాహ్నం పూట బయటకు రావాలంటే భయపడే పరిస్థితులున్నాయి. ఈ నెల 12న పాఠశాలలు పునఃప్రారంభం కావడంతో తల్లిదండ్రుల్లో ఆందోళన కలిగిస్తోంది. రెండు పూటల బడులు నిర్వహిస్తున్నారు. జిల్లాలో 1046 పాఠశాలలుండగా 1,15,324 మంది విద్యార్థులు చదువుతున్నారు. ఎంపీపీ, జెడ్పీపీ 683 పాఠశాలల్లో 37,207 మంది, 30 ప్రభుత్వ పాఠశాలల్లో 2648 మంది చదువుతున్నారు. ఈ పాఠశాలల్లో విద్యార్థుల హాజరు శాతం 15 నుంచి 20వరకు నమోదైనట్లు తెలుస్తోంది. ఆశ్రమ, రెసిడెన్షియల్ పాఠశాలలో విద్యార్థుల హాజరు శాతం రెండంకెలు కూడా దాటని పరిస్థితి. ప్రతీరోజు వసతిగృహలతో కూడిన విద్యాలయాల ప్రిన్సిపాల్, ఎస్వోలు పిల్లలకు ఫోన్ చేసి రమ్మని చెబుతున్నా ఎండలు తగ్గాక వస్తామంటూ దాటవేస్తున్నట్లు తెలుస్తోంది. ఉదయం నుంచి సాయంత్రం వరకు పాఠశాలల్లోనే ఉండాల్సి రావడంతో కొందరు విద్యార్థులు వాంతులు, విరేచనాల బారిన పడుతున్నట్లు తెలుస్తోంది. ఒకరోజు వచ్చిన విద్యార్థి మరో రోజు రావటం లేదని తెలుస్తోంది. ఈ నెల 20న విద్యా దినోత్సవం రోజున పుస్తకాలు అందించనుండడంతో పుస్తకాలు లేకుండానే పాఠాలు సాగుతున్నాయి. వసతి గృహాల్లో.. వసతితో కూడిన విద్యాలయాల్లో మరోలా ఉంది. తొమ్మిది టీఎస్‌డబ్ల్యూఆర్‌ఈఐ సొసైటీ స్కూళ్లలో 2605 మంది విద్యార్థులు చదువుతున్నారు. టీఎస్‌ఆర్‌ఈఐ సొసైటీ స్కూల్లో 581మంది, 16 టీడబ్ల్యూ డిపార్ట్మెంట్ ఆశ్రమ పాఠశాలల్లో 2668 మంది, అర్బన్ రెసిడెన్షియల్లో 88 మంది, 18 కేజీబీవీల్లో 4405 మంది అభ్యసిస్తున్నారు. ఐదు మోడల్స్కూళ్లలో 3,399, ఎనిమిది ఎంజేపీటీబీసీసీడబ్ల్యూ ఆర్ఈఐఎస్ స్కూళ్లలో 3342 మంది చదువుతున్నారు. నాలుగురోజుల గడుస్తున్నా పట్టుమని పదిమంది కూడా రాని పరిస్థితి. వాతావరణం చల్లబడే వరకై నా పాఠశాలలు వేళలు మార్చడం.. ఒంటిపూట బడులపై దృష్టి సారించాలని కోరుతున్నారు. ఒంటిపూట పెడితే బాగుంటుంది.. ఎండలు బాగా ఉన్నా యి.. ఇంట్లోనే కూలర్ తిరుగుతుంటే తట్టుకో లేకపోతున్నాం. బడిలో పిల్లలు ఉండలేని పరిస్థితి. ఫ్యాన్ ఉన్నా వడగాల్పులతో ఇబ్బందిగా ఉంది. అందుకే మా బాబును మధ్యాహ్నం వచ్చి ఇంటికి తీసుకెళ్తున్నా. ఒక్కపూట బడిపెడితే మంచిగుండు.. చల్లబడే వరకు రెండు పూటలకు పంపాలంటే భయంగా ఉంది. -
హెచ్చరిక: ఏపీలో నేడూ భగభగలే.. బయటకు రాకపోవడమే బెటర్
సాక్షి, అమరావతి/విశాఖపట్నం: రాష్ట్రంలోని చాలా ప్రాంతాల్లో శనివారం కూడా అధిక ఉష్ణోగ్రతలు నమోదయ్యే అవకాశమున్నట్లు విపత్తుల నిర్వహణ సంస్థ మేనేజింగ్ డైరెక్టర్ బీఆర్ అంబేడ్కర్ వెల్లడించారు. అల్లూరి జిల్లాలోని నెల్లిపాక, చింతూరు, కూనవరం, వైఎస్సార్ జిల్లాలోని కమలాపురం, వీరపునాయునిపల్లె, ఎర్రగుంట్ల, ఏలూరు జిల్లా కుక్కునూరు, పార్వతీపురం మన్యం జిల్లాలోని కొమరాడ మండలంలో తీవ్ర వడగాడ్పులు వీస్తాయని తెలిపారు. మరో 256 మండలాల్లో వడగాడ్పులు వీచే అవకాశముందన్నారు. విజయనగరం, పార్వతీపురం మన్యం, అల్లూరి సీతారామరాజు, కాకినాడ, అంబేడ్కర్ కోనసీమ, తూర్పు గోదావరి, పశ్చిమ గోదావరి, ఏలూరు, కృష్ణా, ఎన్టీఆర్, గుంటూరు, బాపట్ల, పల్నాడు, ప్రకాశం, నెల్లూరు జిల్లాల్లోని కొన్ని ప్రాంతాల్లో శనివారం 45–47 డిగ్రీల వరకు ఉష్ణోగ్రతలు నమోదయ్యే అవకాశం ఉందన్నారు. అలాగే, శ్రీకాకుళం, కర్నూలు, నంద్యాల, అనంతపురం, వైఎస్సార్, అన్నమయ్య, చిత్తూరు, తిరుపతి జిల్లాల్లోని పలు ప్రాంతాల్లో 42–44 డిగ్రీల వరకు ఉష్ణోగ్రతలు నమోదయ్యే అవకాశముందన్నారు. 20 జిల్లాల్లో 42–45 డిగ్రీల ఉష్ణోగ్రతలు మరోవైపు.. శుక్రవారం రాష్ట్రవ్యాప్తంగా ఎండలు మండాయి. 20 జిల్లాల్లో 150 మండలాలకు పైగా 42–45 డిగ్రీల వరకు ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. ఫలితంగా అనేక ప్రాంతాల్లో తీవ్ర వడగాడ్పులు వీచాయి. పల్నాడు, కృష్ణా, ఏలూరు, బీఆర్ అంబేడ్కర్ కోనసీమ, గుంటూరు, కాకినాడ, బాపట్ల, ఎన్టీఆర్, కర్నూలు, అల్లూరి సీతారామరాజు జిల్లాల్లో తీవ్ర వడగాడ్పులు వీచాయి. ఈ జిల్లాల్లో 44 డిగ్రీలకు పైగానే ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. పల్నాడు జిల్లా రావిపాడులో రాష్ట్రంలోకెల్లా అత్యధికంగా 45 డిగ్రీల గరిష్ట ఉష్ణోగ్రత రికార్డయింది. అదే జిల్లా ఈపూరు, విజయనగరం జిల్లా కనిమెరకలో 44.9 డిగ్రీలు, ఏలూరు జిల్లా శ్రీరామవరం, ఈదులగూడెంలో 44.8 డిగ్రీలు, ప్రకాశం జిల్లా కొనకనమిట్లలో 44.8 డిగ్రీలు, బాపట్లజిల్లా వల్లపల్లిలో 44.6 డిగ్రీల ఉష్ణోగ్రతలు నమోదైంది. ఆయా ప్రాంతాల్లో 50 డిగ్రీలకు పైగా ఉష్ణతీవ్రత ఉన్న అనుభూతి కలిగింది. ఉదయం తొమ్మిది గంటలకే పలుచోట్ల 40 డిగ్రీల ఉష్ణోగ్రతలు రికార్డయ్యాయి. అలా సాయంత్రం ఐదు గంటల వరకూ అదే తీవ్రత కొనసాగింది. వడగాడ్పుల ధాటికి జనం అల్లాడిపోతున్నారు. ఇళ్ల నుంచి బయటకు రావడానికి బెంబేలెత్తిపోతున్నారు. అలాగే, గాలిలో తేమ అధికంగా ఉండడంతో ఉక్కపోత కూడా జనాన్ని ఇబ్బందిపెడుతోంది. ఈనెల 8 వరకు వడగాడ్పుల ప్రభావం కొనసాగుతుందని వాతావరణ నిపుణులు చెబుతున్నారు. రానున్న మూడ్రోజులు రాష్ట్రంలోని ఉత్తర కోస్తా, దక్షిణ కోస్తా, రాయలసీమల్లో సాధారణంకంటే 2–4 డిగ్రీలు అధికంగా ఉష్ణోగ్రతలు నమోదవుతాయని భారత వాతావరణ శాఖ (ఐఎండీ) వెల్లడించింది. అదే సమయంలో అక్కడక్కడ ఉరుములు, మెరుపులతోపాటు పిడుగులు సంభవించే అవకాశముందని, గంటకు 40–50 కి.మీల వేగంతో ఈదురుగాలులు కూడా వీస్తాయని వివరించింది. విస్తరిస్తున్న రుతుపవనాలు ఇక నైరుతి రుతుపవనాలు దక్షిణ అరేబియా సముద్రం, మాల్దీవుల్లోని కొన్ని ప్రాంతాలు, లక్షద్వీప్‌లోని కొన్ని ప్రాంతాలకు కొమరిన్‌లోని అన్ని ప్రాంతాలు, దక్షిణ బంగాళాఖాతంలోని కొన్ని భాగాల్లోకి విస్తరించినట్లు వాతావరణ శాఖ తెలిపింది. వచ్చే రెండ్రోజుల్లో మరింత విస్తరించే అవకాశముందని పేర్కొంది. ఇది కూడా చదవండి: ఏపీలో పుష్కలంగా కరెంటు -
ఏపీలో హై అలర్ట్.. రాబోయే ఐదు రోజులూ అప్రమత్తంగా ఉండాల్సిందే..!
సాక్షి, అమరావతి/విశాఖపట్నం: రాబోయే ఐదు రోజులు రాష్ట్రంలో ఎండల తీవ్రత ఎక్కువగా ఉంటుందని విపత్తుల నిర్వహణ సంస్థ తెలిపింది. శుక్రవారం 302 మండలాల్లో వడగాడ్పుల ప్రభావం ఉంటుందని పేర్కొన్నారు. అనకాపల్లి జిల్లా అనకాపల్లి, బుచ్చయ్యపేట, చోడవరం, కె.కోటపాడు, కశింకోట, కోటవురట్ల, మాకవరపాలెం, నర్సీపట్నం, నాతవరం, సబ్బవరం మండలాలు, కాకినాడ జిల్లా కోటనందూరు, తుని మండలాలు, విజయనగరం జిల్లా జామి, కొత్తవలస మండలాలు, విశాఖలోని పద్మనాభం మండలంలో వడగాడ్పుల తీవ్రత ఉంటుందని తెలిపారు. ఎండ తీవ్రత దృష్ట్యా ప్రయాణాల్లో ఉన్నవారు తప్పనిసరిగా జాగ్రత్తలు తీసుకోవాలని చెప్పారు. వడగాడ్పులు, అకాల వర్షాలు, పిడుగుపాటు పట్ల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించారు. ఉరుములు మెరుపులతో కూడిన వర్షం పడేటప్పుడు చెట్ల కింద నిలబడవద్దని విజ్ఞప్తి చేశారు. రైతులు వ్యవసాయ పనుల్లో తగిన చర్యలు తీసుకోవాలని సూచించారు. చదవండి: ప్రమాదాన్ని ముందే పసిగట్టిన గజరాజు.. గోవిందరాజు స్వామి ఆలయంలో ఏం జరిగింది? -
‘అత్యవసరం అయితేనే బయటకు రండి’
హైదరాబాద్/అమరావతి: భగ్గుమంటోన్న భానుడి ప్రభావంతో.. అడుగు బయటపెట్టాలంటే ఒకటికి పదిసార్లు ఆలోచిస్తున్నారు తెలుగు రాష్ట్రాల ప్రజలు. ఇప్పటికే నిప్పుల కొలిమిని తలపిస్తున్న తెలంగాణ, ఆంధ్రప్రదేశ్‌లలో ఉష్ణోగ్రతలు.. మరో మూడు రోజులపాటు ఇదే తీవ్రతతో కొనసాగుతాయని వాతావరణ శాఖ హెచ్చరికలు జారీ చేస్తోంది. పగటిపూటే కాదు.. రాత్రి పూట ఉష్ణోగ్రతలు కూడా పెరుగుతాయని చెబుతోంది. తెలుగు రాష్ట్రాల్లో ఎండలు మండిపోతున్నాయి. రికార్డు స్థాయిలో నమోదు అవుతుండడం.. ఒక పక్క ఉక్కపోత, మరోవైపు వడగాల్పులతో ఉక్కిరి బిక్కిరి అయిపోతున్నారు. వాయవ్య భారత్ నుంచి వీస్తున్న వేడిగాలుల కారణంగా రాష్ట్రంలో ఉష్ణోగ్రతల తీవ్రత పెరిగినట్లు ఇదివరకే భారత వాతావరణ విభాగం వివరించింది. అయితే.. మరో మూడు రోజులు కూడా రాష్ట్రంలో పొడి వాతావరణం కొనసాగే అవకాశం ఉందని పేర్కొంది. ► గరిష్ఠ ఉష్ణోగ్రతలు 44 డిగ్రీలకు పైనే నమోదయ్యే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం వేసిన అంచనా నిజమైంది. తెలంగాణలో 45 డిగ్రీల ఉష్ణోగ్రతలు నమోదు అయ్యాయి. హైదరాబాద్ చుట్టుపక్కల జిల్లాల్లో పగటి ఉష్ణోగ్రతలు గరిష్టంగా 41 డిగ్రీల దాకా నమోదయ్యాయి. అత్యవసరమైతే తప్ప బయటకు వెళ్లొద్దని వాతావరణ శాఖ హెచ్చరించింది. దిగువ స్థాయిలోని గాలులు వాయవ్య దిశ నుంచి తెలంగాణ వైపుకు వీస్తున్నాయని వాతావరణ శాఖ అధికారులు వివరించారు. వరంగల్ 43, నల్లగొండ, ఖమ్మం 44, భూపాలపల్లిలో 45 డిగ్రీలు, నల్గొండ నిడమనూరులో 45 డిగ్రీలు, ములుగు తాడ్వాయి 44.5 డిగ్రీల సెల్సియస్ టెంపరేచర్లు నమోదు అయ్యాయి. ► మరోవైపు ఏపీలో ఏకంగా 46 డిగ్రీల ఉష్ణోగ్రతలు నమోదు అయ్యాయి. వడగాలుల తీవ్రత కూడా అధికమైంది. భానుడి ప్రతాపంతో ఏపీలోని కోస్తాంధ్ర, రాయలసీమ ప్రాంతాలు నిప్పుల కొలిమిలా మారాయి. సాధారణం కంటే 4-6 డిగ్రీల మేర అధికంగా ఉష్ణోగ్రతలు నమోదవుతున్నట్లు అమరావతిలోని వాతావరణ కేంద్రం వెల్లడించింది. ప్రస్తుతం గరిష్ఠ ఉష్ణోగ్రత దాదాపుగా 46 డిగ్రీలు దాటిపోయింది. ప్రకాశం 46, ఏలూరు, విజయవాడలో 47, గుంటూరులలో 48 డిగ్రీలు, రాజమండ్రిలో అత్యధికంగా 49 డిగ్రీల టెంపరేచర్లు నమోదు అయినట్లు తెలుస్తోంది. ► ఇక వడదెబ్బతో తెలంగాణలో ముగ్గురు(తాజాగా.. హైదరాబాద్ రాజేంద్రనగర్‌లో ఓ మహిళ), ఏపీలో ఇద్దరు మృతి చెందినట్లు తెలుస్తోంది. కామారెడ్డి జిల్లా బాన్సువాడలో ఏకంగా 20 మంది వడదెబ్బ బారినపడి ఆస్పత్రిపాలయ్యారు. పరిస్థితి మరో మూడురోజులు ఇలాగే ఉంటుందని.. అత్యవసరమైతే తప్ప బయటకు వెళ్లొద్దని వాతావరణ శాఖ హెచ్చరిస్తోంది. ► వాతావరణ మార్పులతో హెపటైటిస్-బీ ప్రమాదం పొంచి ఉందని వైద్య నిపుణులు హెచ్చరిస్తున్నారు. బయటకు వెళ్లేవాళ్లు తలకు రక్షణ ధరించాలని, మంచినీళ్లు, సహజ సిద్ధమైన పానీయాలు, ఓఆర్ఎస్ లాంటి ఎనర్జీ డ్రింక్స్ వెంటపెట్టుకుని వెళ్లడం ఉత్తమమని నిపుణులు సూచిస్తున్నారు. వడదెబ్బ నుంచి రక్షణ కోసం సన్ స్క్రీన్ లోషన్ వాడడం, కాటన్ దుస్తులు.. కళ్లజోడు ధరించడం లాంటి సూచనలు చేస్తున్నారు. ఇదీ చదవండి: డిశ్చార్జికి రీచార్జికి మధ్య.. -
Temperature : విజయవాడలో మండుతున్న ఎండలు (ఫొటోలు)
-
అమ్మ బాబోయ్..మెట్రోలో ఇంత మందినా!
-
రాష్ట్రంలో మంటలు కంటిన్యూ.. గ్రేటర్ మినహా రాష్ట్రమంతా ఆరెంజ్ అలర్ట్ జారీ
ఎండలు మండుతుండటంతో వేరుశనగ పంట తీసేందుకు వెళ్లిన కూలీలు.. ఆ మొక్కలనే గుడిసెగా మార్చు కుని పనిచేసుకుంటున్న దృశ్యమిది. ఆదిలాబాద్ జిల్లా తాంసి మండలం వడ్డాడి గ్రామశివార్లలో ఈ దృశ్యం కనిపించింది. – సాక్షి ఫొటోగ్రాఫర్ , ఆదిలాబాద్ సాక్షి, హైదరాబాద్/సాక్షి నెట్వర్క్: రాష్ట్రంలో ఎండలు మండుతున్నాయి. రికార్డుస్థాయిలో గరిష్ట ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. ఇంట్లో నుంచి కాలు బయటపెట్టాలన్నా భయపడేలా వడగాడ్పులు వీస్తున్నాయి. గాలిలో తేమశాతం బాగా పెరగడంతో విపరీతంగా ఉక్కపోత ఉంటోంది. మరో రెండు రోజులు కూడా ఇదే పరిస్థితి ఉంటుందని, గరిష్ట ఉష్ణోగ్రతలు మరింతగా పెరుగుతాయని వాతావరణశాఖ హెచ్చరించింది. ఈ మేరకు గ్రేటర్ హైదరాబాద్ మినహా రాష్ట్రవ్యాప్తంగా అన్ని ప్రాంతాలకు ఆరెంజ్ అలర్ట్‌ను జారీ చేసింది. గురు, శుక్రవారాల్లో రాష్ట్రంలోని చాలాచోట్ల 41 డిగ్రీల సెల్సియస్ నుంచి 44 డిగ్రీల సెల్సియస్ వరకు గరిష్ట ఉష్ణోగ్రతలు నమోదయ్యే అవకాశం ఉందని తెలిపింది. అధిక ఉష్ణోగ్రతల నేపథ్యంలో వడగాడ్పులు సైతం వీస్తాయని వివరించింది. 22 నుంచి కొన్నిరోజులు ఉపశమనం శనివారం (ఈ నెల 22వ తేదీ) నుంచి ఎండలు కాస్త తగ్గుముఖం పట్టే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది. రాష్ట్రవ్యాప్తంగా చాలాచోట్ల సాధారణ ఉష్ణోగ్రతలు నమోదవుతాయని.. కొన్నిచోట్ల సాధారణం కంటే తక్కువ ఉష్ణోగ్రతలు నమోదయ్యే చాన్స్ ఉందని వెల్లడించింది. గ్రేటర్ హైదరాబాద్ పరిసర ప్రాంతాల్లో ఉష్ణోగ్రతలు మరింత తగ్గవచ్చని అంచనా వేసింది. వాతావరణంలో నెలకొంటున్న పలు మార్పులే దీనికి కారణమని వివరించింది. దాదాపు నాలుగైదు రోజుల పాటు ఉష్ణోగ్రతలు తగ్గిన తర్వాత మళ్లీ పెరిగే అవకాశం ఉందని పేర్కొంది. గురువారం వాయవ్య తెలంగాణ, శుక్రవారం తూర్పు తెలంగాణ జిల్లాల్లో అక్కడక్కడా ఉరుములు, మెరుపులు, ఈదురు గాలులతో కూడిన వర్షాలు కురిసే అవకాశం ఉందని వెల్లడించింది. అప్రమత్తంగా ఉండాలి.. ఓవైపు అధిక ఉష్ణోగ్రతలు, వడగాడ్పులు, ఈదురుగాలులతో కూడిన వానలు పడే అవకాశం నేపథ్యంలో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని వాతావరణ శాఖ సూచించింది. బయటికి వెళ్లేవారు తగిన జాగ్రత్తలు తప్పనిసరిగా తీసుకోవాలని స్పష్టం చేసింది. వీలైనంత వరకు మధ్యాహ్న సమయంలో ఇంట్లోనే ఉండాలని పేర్కొంది. ఇక బుధవారం రాష్ట్రంలో గరిష్ట ఉష్ణోగ్రత ఆదిలాబాద్‌లో 42.3 డిగ్రీలుగా నమోదైనట్టు తెలిపింది. సాధారణం కంటే అధికంగా.. రాష్ట్రంలో గరిష్ట ఉష్ణోగ్రతలు సాధారణం కంటే 2 నుంచి 4 డిగ్రీల సెల్సియస్ మేర అధికంగా నమోదవుతున్నట్టు వాతావరణ శాఖ వెల్లడించింది. ఖమ్మంలో సాధారణం కంటే ఏకంగా 3.2 డిగ్రీలు అధికంగా నమోదవడం గమనార్హం. నల్లగొండలో 2.4 డిగ్రీలు.. భద్రాచలం, మెదక్‌లలో 1.9 డిగ్రీలు, హన్మకొండలో 1.7 డిగ్రీలు, నిజామాబాద్, రామగుండంలలో 1.6 డిగ్రీల మేర అధికంగా నమోదైనట్టు తెలిపింది. – పగటి ఉష్ణోగ్రతలకు తగినట్టుగా రాత్రి ఉష్ణోగ్రతలూ సాధారణం కంటే ఒకటి, రెండు డిగ్రీలు అధికంగా ఉంటున్నాయని వాతావరణ శాఖ వెల్లడించింది. చాలాచోట్ల అర్ధరాత్రి దాటే వరకు కూడా ఉక్కపోత కొనసాగుతోందని వివరించింది. – ఇక జగిత్యాల జిల్లా మల్లాపూర్‌లో 44.5 డిగ్రీలు, జయశంకర్ భూపాలపల్లి జిల్లా మహదేవ్‌పూర్‌లో 44.5 డిగ్రీలు, ఆదిలాబాద్ జిల్లా తలమడుగులో 44.3 డిగ్రీల గరిష్ట ఉష్ణోగ్రతలు నమోదైనట్టు రాష్ట్ర ప్రణాళికా విభాగం తమ వెబ్సైట్లో తెలిపింది. – ఎండ తీవ్రత కారణంగా రాష్ట్రవ్యాప్తంగా ఉదయం పది, పదకొండు గంటల సరికే రోడ్లన్నీ నిర్మానుష్యంగా మారిపోతున్నాయి. ఏప్రిల్‌లోనే ఈ పరిస్థితి ఉంటే.. మే నెలలో ఎండల తీవ్రత మరెలా ఉంటుందోనన్న ఆందోళన వ్యక్తమవుతోంది. దేశవ్యాప్తంగా భగభగలు న్యూఢిల్లీ: భానుడి ప్రతాపంతో దేశవ్యాప్తంగా పలు రాష్ట్రాలు అల్లాడిపోతున్నాయి. రికార్డు స్థాయిలో ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. ఉత్తరప్రదేశ్‌లోని ప్రయాగ్‌రాజ్‌లో, ఒడిశాలోని బారిపడలో 44.5 డిగ్రీలు నమోదైనట్లు వాతావరణ శాఖ వెల్లడించింది. ఢిల్లీలో కొన్ని రోజులుగా 40 డిగ్రీలకు పైగానే నమోదవుతున్నాయి. ఈశాన్య రాష్ట్రాల్లోనూ ఎండ ప్రచండంగా ఉంది. దాంతో త్రిపురలో ‘స్టేట్ స్పెసిఫిక్ డిజాస్టర్’ ప్రకటించారు. కేరళలోనూ ఎండలు మండుతున్నాయి. పశ్చిమ బెంగాల్, ఏపీ, బిహార్ తదితర రాష్ట్రాల్లో తీవ్ర వడగాడ్పులు రెండు రోజులుంటాయని ఏపీలో ఈ నెల 21, 22ల్లో వర్షం పడొచ్చని వాతావరణ శాఖ చెప్పింది. -
ఏపీ వాసులకు అలర్ట్: ఆ ప్రాంతాల్లో తీవ్ర వడగాడ్పులు
సాక్షి, అమరావతి: రాష్ట్రంలోని 29 మండలాల్లో మంగళవారం తీవ్రమైన వడగాడ్పులు, అధిక ఉష్ణోగ్రతలు నమోదైనట్లు విపత్తుల నిర్వహణ సంస్థ ఎండీ బీఆర్ అంబేద్కర్ తెలిపారు. అత్యధికంగా అనకాపల్లి జిల్లాలో 17 మండలాల్లో వడగాడ్పులు వీచాయని చెప్పారు. కాకినాడ జిల్లాలో 2, కృష్ణా 1, నంద్యాల 2, విశాఖ 2, విజయనగరం 2, వైఎస్సార్ జిల్లాలో 3 మండలాల్లో తీవ్ర వడగాడ్పులు వీచినట్లు పేర్కొన్నారు. మరో 110 మండలాల్లో వడగాడ్పుల తీవ్రత ఎక్కువగా ఉన్నట్లు తెలిపారు. వైఎస్సార్ జిల్లా కడప పట్టణంలో 44.7, నంద్యాల జిల్లా ఆత్మకూరు, గోస్పాడులో 44.5, అనకాపల్లి జిల్లా కోటవురట్ల మండలం కైలాసపట్నం, కర్నూలు జిల్లా మంత్రాలయం, పార్వతీపురం మన్యం జిల్లా సాలూరులో 44.4 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదైంది. వాతావరణ శాఖ అంచనాల ప్రకారం బుధవారం 98 మండలాల్లో వడగాడ్పులు వీచే అవకాశం ఉందని అంబేద్కర్ తెలిపారు. చదవండి: ప్రభుత్వ స్కూళ్లలో నైట్ వాచ్మన్లు.. విద్యాశాఖ మార్గదర్శకాలు జారీ.. గౌరవ వేతనం ఎంతంటే? -
AP: విపత్తుల శాఖ వార్నింగ్.. రెండు రోజులు జాగ్రత్తగా ఉండండి
సాక్షి, అమరావతి: ఏపీ ప్రజలను రాష్ట్ర విపత్తుల నిర్వహణ సంస్థ అధికారులు హెచ్చరించారు. రేపు(శుక్రవారం), ఎల్లుండి(శనివారం) వడగాల్పులు వీచే అవకాశం ఉందని విపత్తుల శాఖ పేర్కొంది. దీంతో, అప్రమత్తంగా ఉండాలని సూచనలు చేసింది. కాగా, రేపు ఏడు మండలాల్లో తీవ్ర వడగాల్పులు, 168 మండలాల్లో వడగాల్పులు.. ఎల్లుండి 106 మండలాల్లో వడగాలులు వీచే అవకాశం ఉందని ఏపీ విపత్తుల నిర్వహణ సంస్థ ఎండీ తెలిపారు. ఈ నేపథ్యంలో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని, ఎండ నుంచి తగిన జాగ్రత్తలు తీసుకోవాలని సూచించింది. రేపు వడగాల్పులు వీచే అవకాశం ఉన్న మండలాలు(168).. అల్లూరిసీతారామరాజు జిల్లా- 7, అనకాపల్లి -13, తూర్పుగోదావరి- 14, ఏలూరు- 11, గుంటూరు- 11, కాకినాడ -14, కోనసీమ- 6, కృష్ణా - 11, నంద్యాల -4, ఎన్టీఆర్ -16, పల్నాడు -8, పార్వతీపురంమన్యం -12, శ్రీకాకుళం -13, విశాఖపట్నం -4, విజయనగరం -22, వైఎస్సార్ -2 మండలాల్లో వడగాల్పులు ప్రభావం చూపే అవకాశం ఉంది. ఇక, గురువారం అనకాపల్లి -8, కాకినాడ -1, నంద్యాల-1, విజయనగరం-1 మండలంలో తీవ్రవడగాల్పులు, 60 మండలాల్లో వడగాల్పులు నమోదయ్యాయి. -
అమ్మో ఎండలు.. తెలుగు రాష్ట్రాల్లో ‘సూర్య’ ప్రతాపం (ఫొటోలు)
-
ఏపీలో ఈ ప్రాంతాలకు రెడ్ అలర్ట్.. అప్రమత్తంగా ఉండాల్సిందే..!
సాక్షి, అమరావతి: రాష్ట్రంలో బుధవారం ఎండల తీవ్రత ఎక్కువగా ఉండే అవకాశం ఉందని, ప్రధానంగా 4 మండలాలపై తీవ్ర ప్రభావం ఉంటుందని విపత్తుల నిర్వహణ సంస్థ ఎండీ బీఆర్ అంబేద్కర్ తెలిపారు. అల్లూరి సీతారామరాజు జిల్లా కూనవరం మండలంలో 45 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదయ్యే అవకాశం ఉందని తెలిపారు. కాకినాడ జిల్లా కోటనందూరు, అనకాపల్లి జిల్లా గొలుగొండ, నాతవరం, మండలాల్లో 42 డిగ్రీల కంటే ఎక్కువ ఉష్ణోగ్రతలు నమోదయ్యే అవకాశం ఉండడంతోపాటు తీవ్ర వడగాల్పులు వీస్తాయని భారత వాతావరణ శాఖ హెచ్చరించినట్లు తెలిపారు. 126 మండలాల్లో ఉష్ణోగ్రతలు 40 డిగ్రీలు దాటతాయని, వడగాలుల ప్రభావం ఉంటుందన్నారు. కాగా, మంగళవారం అనకాపల్లి జిల్లా బుచ్చయ్యపేట మండలంలో అత్యధికంగా 42.9 డిగ్రీలు, అనకాపల్లి మండల కేంద్రం, కోటవురట్లలో 42.4 డిగ్రీలు, మాకవరపాలెంలో 42.5, కాకినాడ జిల్లా తొండంగిలో 41.8, తునిలో 41.5 డిగ్రీల ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. చదవండి: ఔట్ సోర్సింగ్, కాంట్రాక్టు ఉద్యోగినులకు ఏపీ సర్కార్ గుడ్‌న్యూస్ -
ఇకనైనా కళ్ళు తెరుస్తారా?
ప్రపంచానికి మరోసారి ప్రమాద హెచ్చరిక. పారిశ్రామికీకరణ మునుపటి స్థాయితో పోలిస్తే పుడమి తాపం ఇప్పటికే 1.1 డిగ్రీల సెంటీగ్రేడ్ పెరిగింది. ఈ లెక్కన గ్రీన్హౌస్ వాయు ఉద్గారాలను గణనీయంగా తగ్గించాలనీ, ఈ శతాబ్ది చివరకు భూతాపోన్నతి 1.5 డిగ్రీల లోపలే ఉండేలా చూసు కోవాలనీ చెప్పుకున్న ఊసులు, చేసుకున్న బాసలు తీరా రానున్న పదేళ్ళలోనే పూర్తిగా భగ్నం కానున్నాయి. ‘ఆఖరి అవకాశంగా తెరిచి ఉన్న తలుపు సైతం మూసుకుపోతోంద’ని ప్రపంచ అగ్రశ్రేణి శాస్త్రవేత్తల బృందం ‘ఇంటర్ గవర్నమెంటల్ ప్యానెల్ ఆన్ క్లైమేట్ ఛేంజ్’(ఐపీసీసీ) చేసిన హెచ్చరిక మానవాళికి మేలుకొలుపు. ఇప్పటికైనా గ్రీన్హౌస్ వాయు ఉద్గారాలను నియంత్రించడానికి ప్రభుత్వాలు తక్షణం బరిలోకి దిగితే, ఎంతో కొంత ప్రయోజనమని సోమవారం నాటి తాజా నివేదిక కర్తవ్యాన్ని బోధిస్తోంది. వాతావరణ కాలుష్యానికి ప్రధాన కారణమైన సంపన్న దేశాలు దీన్ని చెవి కెక్కించుకోకుండా, వర్ధమాన, నిరుపేద దేశాలదే బాధ్యత అన్నట్టు ప్రవర్తిస్తుండడమే ఇప్పుడున్న చిక్కు. విషాదం ఏమిటంటే– పాపం ఎవరిదైనా, ఫలితం ప్రపంచమంతా అనుభవించాల్సిందే! ఐపీసీసీ 1988లో ఏర్పాటైన నాటి నుంచి ఇది ఆరో నివేదిక. ఈ ఆరో అంచనా నివేదిక (ఏఆర్6) కు సంబంధించిన నాలుగో విడత వివరాలివి. ఇదే ఆఖరి విడత కూడా! మునుపటి మూడు ప్రధాన విభాగాల నివేదికలోని కీలక సమాచారాన్ని ఒకచోట గుదిగుచ్చి అందిస్తున్నారు గనకనే ఈ చివరి దాన్ని ఐపీసీసీ ఏఆర్6 ‘సంకలన నివేదిక’ అన్నారు. 2021 ఆగస్ట్, 2022 ఫిబ్రవరి, ఏప్రిల్‌లలో వచ్చిన మొదటి మూడూ వాతావరణ సంక్షోభం, దాని పర్యవసానాలు, గ్రీన్హౌస్ వాయువులను తగ్గించే మార్గాల గురించి చెప్పాయి. తాజా ‘సంకలన నివేదిక’ ప్రధానంగా మునుపటి ప్రచురణ ల్లోని కీలక ఫలితాల పునశ్చరణ. భూతాపం ‘మళ్ళీ తగ్గించలేని స్థాయికి’ చేరుతోందనీ, మానవాళికి దుష్పరిణామాలు తప్పవనీ, కఠిన చర్యలతోనే ప్రమాదాన్ని నివారించగలమనీ ఇది హెచ్చరిస్తోంది. అపార ధనబలం, సాంకేతిక సామర్థ్యం తమ సొంతమైన ధనిక దేశాలు కేవలం అప్పులు, ప్రైవేట్ రంగ పెట్టుబడులిచ్చి వాతావరణ పరిరక్షణ చర్యకు సహకరించామని చేతులు దులుపుకొంటే సరిపోదు. ఈ 2020 –30 మధ్య ఇప్పుడు చేస్తున్న దానికి కనీసం 6 రెట్లయినా వాతావరణంపై పెట్టుబడి పెడితే తప్ప, తాపోన్నతిని 1.5 డిగ్రీల లోపు నియంత్రించే లక్ష్యం సాధ్యం కాదట. అలాగే, 2020 నాటి స్థాయిలోనే మన వాతావరణ విధానాలు బలహీనంగా ఉంటే, ఈ శతాబ్ది చివరకు భూతాపం 3.2 డిగ్రీలు పెరుగుతుంది. ఒకసారి 1.5 డిగ్రీలు దాటి ఎంత పెరిగినా, ఆ వాతావరణ నష్టం పూడ్చలేనిది. మానవాళికి మహా విపత్తు తప్పదు. పెను ప్రభావం పడే దేశాల్లో భారత్ ఒకటని నివేదిక తేల్చింది. వడగాడ్పులు, కార్చిచ్చులు, ఆకస్మిక వరదలు, సముద్రమట్టాల పెరుగుదల,పంటల ఉత్పత్తి తగ్గుదల, 2050 నాటికి 40 శాతం జనాభాకు నీటి కొరత – ఇలా పలు ప్రమాదాలు భారత్‌కు పొంచివున్నాయి. అయితే, వాతావరణ మార్పుల నివారణ భారాన్ని అందరూ పంచు కోవాలనే ‘వాతావరణ న్యాయ’ సూత్రానికి ఈ నివేదిక జై కొట్టడం మన లాంటి దేశాలకు ఊరట. మునుపు మూడు విడతల్లో ప్రచురించిన వేలకొద్దీ శాస్త్రీయ సమాచారాన్ని సంక్షిప్తంగా, ప్రపంచవ్యాప్తంగా విధాన నిర్ణేతలకు వారు చేపట్టాల్సిన చర్యలను సారాంశరూపంలో అందించడం తాజా సంకలన నివేదిక ప్రత్యేకత. నవంబర్ 20న దుబాయ్‌లో యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ ఆతిథ్య మివ్వనున్న ఐరాస తదుపరి వాతావరణ సదస్సు ‘కాప్ 28’కు ఈ నివేదిక ఒక దిక్సూచి. 2015లో ప్యారిస్ వాతావరణ ఒప్పందం నాటి నుంచి నేటి వరకు గ్రీన్హౌస్ వాయు ఉద్గారాలను తగ్గించడంలో వివిధ దేశాల పురోగతిని ఆ ‘కాప్ 28’లో మదింపు చేస్తారు. ఇప్పటి దాకా చేస్తున్నవేవీ చాలట్లేదని తాజా నివేదిక సాక్షిగా తెలుస్తూనే ఉంది. వెరసి, వాయు ఉద్గారాలను తగ్గించే లక్ష్యంలో ప్రభుత్వా లన్నీ విఫలమయ్యాయి. నిజానికి, ఐపీసీసీ ఓ సమగ్ర నివేదిక ఇచ్చేందుకు 6 నుంచి 8 ఏళ్ళు పడుతోంది. అయినా గ్రీన్హౌస్ గ్యాస్‌లు పెరుగుతూనే ఉన్నాయి. నివేదికల పరిమాణం, సంక్షోభంపై చర్యల అత్యవసరం కూడా పెరుగుతూనే వచ్చాయి. ఇప్పటికైనా ప్రపంచ దేశాలు కఠిన చర్యలు చేపట్టకుంటే, ఆ తర్వాత ఏం చేసినా చేతులు కాలాక ఆకులు పట్టుకున్నట్టే! ఉద్గారాలను గణనీయంగా తగ్గించడం, పునరుత్పాదక ఇంధనంపైనా – ఇతర తక్కువ కర్బన సాంకేతికతల పైనా దృష్టి సారించి శిలాజ ఇంధనాల వినియోగం మానేయడం, అటవీ పెంపకం లాంటివి ప్రభుత్వాలు చేయాల్సిన పని. అలాగే, ‘వాతావరణాన్ని బాగు చేసే’ మార్గాల్ని అన్వేషించాలి. గాలిలో నుంచి కార్బన్ డయాక్సైడ్ను పీల్చేసే ‘డైరెక్ట్ ఎయిర్ క్యాప్చర్’ టెక్నాలజీలను అభివృద్ధి చేయాలి. ఐరాస ప్రధాన కార్యదర్శి మాట విని, ధనిక దేశాలు 2040 నాటికి ‘నెట్ జీరో’ను అందుకొనేలా తమ లక్ష్యాన్ని ముందుకు జరుపుకొంటే మంచిది. ఈ దేశాలు తమ వాతావణ బాధ్యతను నిర్వర్తించేలా చూడడం ఇప్పుడు సవాలు. ధనిక ప్రపంచపు బాధ్యతారహిత, మొండి వైఖరికి మిగతా అందరూ మూల్యం చెల్లించాల్సి రావడం మహా దారుణం. ఐపీసీసీ తదుపరి నివేదిక 2030లో కానీ రాదు. కాబట్టి భూతాపోన్నతిని 1.5 డిగ్రీల లోపలే నియంత్రించేలా చర్యలు చేపట్టడా నికి ఈ ఏఆర్6 తుది ప్రమాద హెచ్చరిక. మేల్కొందామా? లేక కళ్ళు తెరిచి నిద్ర నటిద్దామా? ప్రస్తుతం ఛాయిస్ ప్రపంచ దేశాలదే! ఒకసారి పరిస్థితి చేయి దాటేశాక మాత్రం ఏం చేసినా ఫలితం శూన్యం. -
వేడి అలలు... జీవజాలానికి ఉరితాళ్లు! పరిస్థితి ఇలాగే కొనసాగితే..
నానాటికీ పెరుగుతున్న ఉష్ణోగ్రతలు, భూతాపం (గ్లోబల్ వార్మింగ్) వల్ల భూఉపరితం క్రమంగా వేడెక్కుతోంది. భూమిపై విలువైన జీవావరణ వ్యవస్థ దెబ్బతింటోంది. పర్యావరణ విధ్వంసం చోటుచేసుకుంటోంది. ఈ పరిణామం కేవలం భూమి ఉపరితలంపైనే కాదు, సముద్రాల అంతర్భాగాల్లోనూ సంభవిస్తున్నట్లు అమెరికాలోని వాషింగ్టన్ డీసీలో ఉన్న నేషనల్ ఓషియానిక్, అట్మాస్పియరిక్ అడ్మినిస్ట్రేషన్(ఎన్ఓఏఏ) నిర్వహించిన తాజా అధ్యయనంలో వెల్లడయ్యింది. అధిక ఉష్ణోగ్రతల వల్ల సముద్రాల అడుగు భాగం సైతం వేడెక్కుతోందని, అక్కడున్న జీవజాలం ప్రమాదకర పరిస్థితులను ఎదుర్కొంటోందని తేలింది. ఫలితంగా సముద్ర జీవావరణ వ్యవస్థ తీవ్రంగా ప్రభావితమవుతున్నట్లు పరిశోధకులు చెప్పారు. భూతాపంతో సముద్రాల్లో వేడి అలల తీవ్రత పెరుగుతోంది. ఇవన్నీ ప్రమాద ఘంటికలే’’ అని హెచ్చరించారు. ఏమిటీ భూతాపం? శిలాజ ఇంధనాల వినియోగం, కర్బన ఉద్గారాల వల్ల వాతావరణ మార్పులు, తద్వారా భూ ఉపరితలంపై ఉష్ణోగ్రతలు పెరగడమే భూతాపం. భూగోళంపై జనాభా వేగంగా పెరుగుతుండడంతో అదే స్థాయిలో శిలాజ ఇంధనాల వినియోగం సైతం పెరుగుతోంది. బొగ్గు, చమురు, గ్యాస్ వంటివి మండించడం వల్ల భూమి వేడెక్కుతుంది. దీంతోపాటు అడవుల నరికివేత, పారిశ్రామిక విప్లవం, అగ్నిపర్వతాల పేలుళ్లు, నీరు వేగంగా ఆవిరి కావడం, అడవుల్లో కార్చిచ్చు వంటివి కూడా భూతాపానికి కారణాలే. వాస్తవానికి సూర్య కాంతి వల్ల సంభవించే వేడి వాతావరణంలోకి తిరిగి వెనక్కి వెళ్తుంది. శిలాజ ఇంధనాల వాడకం వల్ల ఉత్నన్నమయ్యే విష వాయువులు వేడి వెనక్కి వెళ్లకుండా అడ్డుకుంటాయి. దీంతో భూమిపై ఉష్ణోగ్రత పెరిగిపోతుంది. ఈ ప్రభావం సముద్రాలపైనా పడుతుంది. అధ్యయనంలో ఏం తేలిందంటే... ► మెరైన్ హీట్‌వేవ్స్‌గా పిలిచే సముద్రాల అంతర్భాగాల్లోని వేడి అలల తీవ్రత, వ్యవధి అధికంగా ఉంది. సముద్రాల లోపలి ఉష్ణోగ్రతలు వేర్వేరు ప్రాంతాల్లో 0.5 డిగ్రీల సెల్సియస్ నుంచి 3 డిగ్రీల సెల్సియస్ దాకా పెరిగాయి. ► సముద్ర ఉష్ణోగ్రతల పెరుగుదలకు భూతాపం కారణమని సైంటిస్టులు నిర్ధారించారు. ► హీట్‌వేవ్స్ ప్రభావం ఏ ఒక్క ప్రాంతానికో పరిమితం కాదు. ప్రపంచవ్యాప్తంగా అన్ని సముద్రాల్లో ఈ ప్రభావం స్పష్టంగా కనిపిస్తోంది. ► సముద్రాల ఉపరితలంలో హీట్వేవ్స్పై గత పదేళ్లుగా పరిశోధనలు కొనసాగిస్తున్నామని, అంతర్భాగంలోని వేడి అలలు, అక్కడి పరిణామాలు, జీవజాలం ప్రభావితం అవుతున్న తీరు గురించి తెలుసుకోవడం ఇదే మొదటిసారి అని ఎన్ఓఏఏ రీసెర్చ్ సైంటిస్టు దిల్లాన్ అమామా చెప్పారు. ► సముద్రాల్లో ఉండే ప్లాంక్టన్ అనే సూక్ష్మజీవుల నుంచి భారీ పరిమాణంలోని వేల్స్ దాకా అన్ని రకాల జీవులు హీట్‌వేవ్స్ వల్ల ప్రభావితమవుతున్నాయి. ► ఒక ప్రాంతం నుంచి మరో ప్రాంతానికి సముద్ర జీవుల వలసలు ఆగిపోతున్నాయి. వాటిలో పునరుత్పాదక శక్తి దెబ్బతింటోంది. వివిధ జీవుల మధ్య అనుసంధానం తెగిపోతుంది. ఒక్క మాటలో చెప్పాలంటే మొత్తం సముద్ర జీవావరణ వ్యవస్థ ప్రమాదంలో పడుతున్నట్లే లెక్క. ► భూతాపం వల్ల నీరు ఇలాగే వేడెక్కడం కొనసాగితే ఈ శతాబ్దం ఆఖరు నాటికి సముద్రాల్లోని పగడపు దీవులన్నీ అంతరించిపోతాయని ఐక్యరాజ్యసమితి పర్యావరణ కార్యక్రమం వెల్లడించింది. ► సముద్రాల ఉష్ణోగ్రత 1.5 డిగ్రీలు పెరిగితే 70–90 శాతం, 2 డిగ్రీలు పెరిగితే పూర్తిగా పగడపు దీవులు మాయమవుతాయని యునెస్కో పేర్కొంది. సముద్రాలే రక్షణ ఛత్రం భూతాపం వల్ల ఉత్పన్నమయ్యే ఉష్ణోగ్రత లో 90% మిగులు వేడిని సముద్రాలే శోషించుకుంటాయి. భూమిని చల్లబరుస్తాయి. సముద్రాలే లేకుంటే భూమి అగ్నిగుండం అయ్యేది. సాగరాల ఉష్ణోగ్రత గత శతాబ్ద కాలంలో సగటున 1.5 డిగ్రీల సెల్సియస్ పెరిగింది. మెరైన్ హీట్‌వేవ్స్ గత పదేళ్లలో 50% పెరిగాయి. భూతాపం పెరుగుదలను అడ్డుకోకపోతే సముద్రాలు సలసల కాగిపోవడం ఖాయం. ఫలితంగా భూమి అగ్నిగోళంగా మారుతుంది మానవులతో సహా జీవుల మనుగడ ప్రశ్నార్థకమే అవుతుంది. – సాక్షి, నేషనల్ డెస్క్ -
భానుడి ఉగ్రరూపం: భవిష్యత్తులో సమ్మర్లో చుక్కలే..!
తిరువనంతపురం: భారత్‌లో రానున్న సంవత్సరాలలో వేసవి ఉగ్రరూపం చూపిస్తుందని వరల్డ్ బ్యాంకు నివేదిక అంచనా వేసింది. ముందస్తుగా వేసవి కాలం రావడంతో పాటు వడగాడ్పులు ఎక్కువ రోజులు కొనసాగి ప్రమాదకరంగా మారుతాయని తెలిపింది. ప్రపంచంలో వేసవి తీవ్రత అత్యధికంగా ఉన్న దేశాల్లో భారత్ అగ్రస్థానంలో నిలుస్తుందని, మానవ మనుగడకే ముప్పుగా మారుతుందని హెచ్చరించింది. గత కొన్ని దశాబ్దాలుగా ప్రతీ ఏడాది వేసవిలో ఉష్ణోగ్రతలు విపరీతంగా పెరిగిపోవడం, వడగాడ్పులకు వేలాది మంది మృత్యువాత పడుతున్న విషయాన్ని ఆ నివేదిక గుర్తు చేసింది. ‘‘క్లైమేట్ ఇన్వెస్ట్మెంట్ ఆపర్చునిటీస్ ఇన్ ఇండియాస్ కూలింగ్ సెక్టార్’’ అన్న పేరుతో వరల్డ్ బ్యాంక్ ఒక నివేదికను రూపొందించింది. కేరళ ప్రభుత్వ భాగస్వామ్యంతో తిరువనంతపురంలో వరల్డ్ బ్యాంకు రెండు రోజులు నిర్వహించనున్న భారత వాతావరణం, అభివృద్ధి భాగస్వామ్యుల సదస్సులో ఈ నివేదికను విడుదల చేయనుంది. ఈ సారి వేసవి ముందస్తుగా రావడంతో పాటు, ఎక్కువ కాలం కొనసాగుతుందని, ప్రజల ఆయుష్షు పరిమితిని తగ్గించే అవకాశం ఉందని, ఆర్థికంగా సైతం తీవ్ర ప్రభావం చూపిస్తుందని హెచ్చరించింది. భారత్‌లో పని చేసే వర్గంలో 75% మంది అంటే దాదాపుగా 38 కోట్లమంది మండుటెండల్లో చెమటోడుస్తూ పని చేస్తారని, వారందరి ప్రాణాలకు వడగాడ్పులు ముప్పుగా మారుతాయని నివేదిక వెల్లడించింది. 2030 నాటికి ప్రపంచవ్యాప్తంగా వడగాడ్పుల వల్ల 8 కోట్ల మంది ఉద్యోగాలు కోల్పోతే, వారిలో 3.4 కోట్ల మంది భారత్‌లో ఉంటారని బ్యాంక్ అంచనా వేసింది. ఇదీ చదవండి: ‘ఫోర్బ్స్’ శక్తివంతమైన మహిళ నిర్మలా సీతారామన్ -
రానున్న మూడు రోజులు ‘మంట’లే.. వీలైతేనే బయటకు రండి!
సాక్షి, అమరావతి: రాష్ట్రంలో మరో మూడు రోజల పాటు అధిక ఉష్ణోగ్రతలు నమోదయ్యే అవకాశం ఉందని, ప్రజలు అప్రమత్తంగా ఉండాలని రాష్ట్ర విపత్తుల నిర్వహణ సంస్థ గురువారం ప్రకటించింది. 83 మండలాల్లో తీవ్ర వడగాడ్పులు, మరో 157 మండలాల్లో వడగాలుల ప్రభావం ఉంటుందని పేర్కొంది. శుక్ర, శని, ఆదివారాల్లో రాష్ట్రంలోని పలు జిల్లాల్లో 46ని– 47 డిగ్రీల ఉష్ణోగ్రతలు నమోదయ్యే అవకాశం ఉంది. అలాగే మరికొన్ని జిల్లాల్లో 43ని నుంచి 45, మరికొన్ని జిల్లాల్లో 40–42 డిగ్రీల ఉష్ణోగ్రతలు నమోదయ్యే అవకాశముంది. ఈ మూడు రోజులు ప్రజలు వీలైనంత వరకు ఇంట్లోనే ఉండాలని, వడదెబ్బ తగలకుండా ఓరల్ రీహైడ్రేషన్ సొల్యూషన్ (ఓఆర్ఎస్), లస్సీ, నిమ్మరసం, మజ్జిగ, కొబ్బరి నీళ్లు వంటివి తీసుకోవాలని రాష్ట్ర విపత్తుల నిర్వహణ సంస్థ డైరెక్టర్ తెలిపారు. చదవండి: పందులకూ ఓ పందెం! విజేతలకు రూ.2 లక్షల బహుమతి -
వడగాలి.. చల్లబడుతోంది
సాక్షి, అమరావతి: గత రెండేళ్లుగా రాష్ట్రంలో అధిక వేడి (వడ గాలి, హీట్ వేవ్) నమోదవుతున్న రోజుల సంఖ్య తగ్గుతున్నట్లు కేంద్ర పర్యావరణ గణాంకాల నివేదిక – 2022 వెల్లడించింది. ఇదే సమయంలో చలి వాతావరణం ఉండే రోజుల సంఖ్య పెరుగుతోంది. అయితే, చలి రోజుల్లో కొంత హెచ్చుతగ్గులు కనిపిస్తున్నాయి. వివిధ రాష్ట్రాల్లో సంవత్సరాల వారీగా అత్యధిక ఉష్ణోగ్రతలు నమోదైన రోజులు, చలి వాతావరణం ఉన్న రోజుల వివరాలను నివేదిక వివరించింది. ► రాష్ట్రంలో 2014 సంవత్సరంలో 16 రోజుల పాటు అత్యధిక ఉష్ణోగ్రతలు నమోదవగా, ఆ తర్వాతి సంవత్సరాల్లో కొంత తగ్గాయి. 2019 సంవత్సరంలో 13 రోజుల పాటు అత్యధిక ఉష్ణోగ్రతలు నమోదైనట్లు నివేదిక వెల్లడించింది. 2020లో 3 రోజులు, 2021లో నాలుగు రోజులు మాత్రమే అత్యధిక ఉష్ణోగ్రతలు నమోదైనట్లు నివేదిక తెలిపింది. ► అత్యల్ప ఉష్ణోగ్రతలు 2014లో మూడు రోజులు మాత్రమే. 2021లో ఒక రోజే అత్యల్ప ఉష్ణోగ్రత నమోదైనట్లు నివేదిక వెల్లడించింది. కానీ ఈ సంఖ్య 2018లో 8 రోజులు, 2020లో 6 రోజులుగా ఉంది. ► ఇతర రాష్ట్రాల్లో 2014లో ఒడిశాలో అత్యధికంగా 17 రోజులు అత్యధిక ఉష్ణోగ్రతలు నమోదైనట్లు పేర్కొంది. పంజాబ్, పశ్చిమ బెంగాల్ రాష్ట్రాల్లో 12 రోజులు చొప్పున, రాజస్థాన్‌లో 11 రోజులు, మధ్యప్రదేశ్‌లో 10 రోజులు, తెలంగాణలో రెండు రోజులు అత్యధిక ఉష్ణోగ్రతలు నమోదైనట్లు నివేదిక వెల్లడించింది. ఆ తర్వాత 2019లో ఎక్కువ రాష్ట్రాల్లో ఎక్కువ రోజులపాటు అత్యధిక ఉష్ణోగ్రతలు నమోదైనట్లు నివేదిక పేర్కొంది. గత రెండేళ్లుగా అన్ని రాష్ట్రాల్లోనూ వేడి రోజులు తగ్గిపోయినట్లు తెలిపింది. హీట్ వేవ్ అంటే.. ఏదైనా ప్రదేశంలో వరుసగా రెండు రోజులు 45 డిగ్రీలు అంతకంటే ఎక్కువ ఉష్ణోగ్రత ఉంటే హీట్ వేవ్ పరిస్థితులుగా పరిగణిస్తారు. రాష్ట్రంలో 2016 మే 2వ తేదీన ప్రకాశం జిల్లా వెలిగండ్లలో అత్యధికంగా 48.6 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదైంది. 2017 మే 17వ తేదీన ప్రకాశం జిల్లా టంగుటూరులో అత్యధికంగా 47.8 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదైంది. 2020 మే 23న ప్రకాశం జిల్లా కనిగిరిలో 47.8 డిగ్రీలు, 2021 మార్చి 31 ప.గో. జిల్లా పెదపాడులో 45.9 డిగ్రీల సెంటీగ్రేడ్ ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. ఈ సమయంలో వేడిగాలులు వీస్తాయని అధికారులు చెబుతున్నారు. -
Telangana Weather: తెలంగాణకు ఆరెంజ్ అలర్ట్
సాక్షి, హైదరాబాద్: తెలంగాణకు ఆరెంజ్ అలర్ట్ పరిస్థితులు నెలకొన్నాయి. మరో నాలుగు రోజులపాటు అధిక ఉష్ణోగ్రతలు కొనసాగుతాయని, అప్రమ్తతంగా ఉండాలని ప్రజలకు వాతావరణ శాఖ హెచ్చరికలు జారీ చేసింది. పలు చోట్ల గరిష్టంగా 47 డిగ్రీల సెల్సియస్ పైగా ఉష్ణోగ్రతలు నమోదు అవుతుండడంతో రాష్ట్రం నిప్పుల కొలిమిని తలపిస్తోంది. రాష్ట్రంలో వడగాడ్పులు, తీవ్ర ఉక్కపోతతో జనం కుతకుతలాడుతున్నారు. రాత్రిపూట కూడా ఉక్కపోతగా ఉంటుండటంతో ఇబ్బందిపడుతున్నారు. సాధారణంగా మే నెలలో మధ్యలో ఉష్ణోగ్రతలు అధిక స్థాయికి చేరుతాయి. కానీ నెల ప్రారంభంలోనే ఎండలు మండిపోతున్నాయి. రాష్ట్రంలో పగలు, రాత్రి ఉష్ణోగ్రతలు సాధారణం కంటే 2 నుంచి 4 డిగ్రీలు అధికంగా నమోదవుతున్నాయని.. ఇదే పరిస్థితి ఇంకొన్నిరోజులు కొనసాగుతుందని వాతావరణ శాఖ ప్రకటించింది. నల్లగొండ, మెదక్, ఆదిలాబాద్‌లలో గరిష్ట ఉష్ణోగ్రతలు నమోదవడం గమనార్హం. చెదురుముదురు వర్షాలు ఇక తెలుగు రాష్ట్రాలపై ఉపరితల ద్రోణి స్థిరంగా కొనసాగుతోంది. ఈ ప్రభావంతో రెండు మూడు రోజులపాటు అక్కడక్కడా తేలికపాటి వానలు పడతాయని వాతావరణ శాఖ వెల్లడించింది. ఆయాచోట్ల ఉరుములు, మెరుపులతోపాటు ఈదురుగాలులు వీస్తాయని వివరించింది. -
AP: భగభగలు..
సాక్షి, అమరావతి/రెంటచింతల: రాష్ట్రంలో ఎండలు మండిపోతున్నాయి. పగటిపూట బయటకు రావాలంటేనే ప్రజలు భయపడిపోతున్నారు. ఉ.9 గంటల నుంచి సా.5 గంటల వరకు ఎండ తీవ్రత ఎక్కువగా ఉంటోంది. వారం రోజులుగా అన్ని ప్రాంతాల్లో సగటున 3 డిగ్రీల చొప్పున అధిక ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. సాధారణంగా ఉ.8 నుంచి 10 గంటల మధ్య 26–28 డిగ్రీల ఉష్ణోగ్రత ఉండాల్సి వుండగా ప్రస్తుతం 30 నుంచి 32 డిగ్రీలు నమోదవుతోంది. 10 నుంచి 12 గంటల మధ్య 36–38 డిగ్రీలు ఉండాల్సి వుండగా 40 డిగ్రీలు నమోదవుతోంది. ఇక మ.12–3 గంటల మధ్య 43, 44 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదవుతోంది. రాత్రి ఉష్ణోగ్రతలు కూడా 26–29 నుంచి 30–32 డిగ్రీలకు పెరిగాయి. మే నెలాఖరు వరకు ఇదే పరిస్థితి ఇక మే 8వ తేదీ వరకు ఈ పరిస్థితి ఇంకా పెరిగే అవకాశం ఉంటుందని వాతావరణ శాఖ స్పష్టంచేసింది. ఆ తర్వాత నెలాఖరు వరకు రాష్ట్రంలో ఎండల తీవ్రత ఎక్కువగానే ఉంటుందని చెబుతున్నారు. మరోవైపు.. మధ్యప్రదేశ్, రాజస్థాన్‌ను అతలాకుతలం చేస్తున్న వేడిగాలులు అక్కడి నుంచి తెలంగాణ మీదుగా ఒడిశా వైపు వీస్తున్నాయి. ఈ గాలులు ఉత్తరాంధ్ర మీదుగా వెళ్తుండడంతో పార్వతీపురం మన్యం, విజయనగరం, శ్రీకాకుళం జిల్లాల్లో ఎక్కువ ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. చిత్తూరు, కర్నూలు జిల్లాల్లోను వాటి ప్రభావం ఉంటోంది. నిప్పుల కొలిమిలా రెంటచింతల గుంటూరు జిల్లాలోని రెంటచింతల నిప్పుల కొలిమిని తలపిస్తోంది. బుధ, గురు, శుక్రవారాలలో వరుసగా మూడ్రోజులుగా 44.6, 44.2 45.4 గరిష్ట ఉష్ణోగ్రతలు నమోదైయ్యాయి. శనివారం గరిష్టంగా 47.2 డిగ్రీలు, కనిష్ట ఉష్ణోగ్రత 29.5 డిగ్రీలుగా నమోదు కావడంతో ఒక్కసారిగా రెంటచింతల అగ్నిగుండంగా మారింది. పనులకు వెళ్లిన కూలీలు ఎండకు తట్టుకోలేక ఉ.11 గంటలకే ఇంటి ముఖం పట్టారు. వడగాడ్పులతో వృద్ధులు, బాలింతలు, గర్భిణులు, చిన్నారులు అనేక ఇబ్బందులకు గురయ్యారు. అలాగే, రాష్ట్రంలోని పలు ప్రాంతాల్లో శనివారం 43, 44 డిగ్రీల ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. చిత్తూరు జిల్లా పడమలలో అత్యధికంగా 44.9 డిగ్రీలు, నెల్లూరు జిల్లా కలిగిరిలో 44.6, గుంటూరు జిల్లా పిడుగురాళ్లలో 44.1, శ్రీకాకుళం జిల్లా కొత్తూరులో 44, ప్రకాశం జిల్లా యద్ధనపూడి, కర్నూలు జిల్లా మహానంది, పెరుసోమల, ప్రకాశం జిల్లా పెద్దదోర్నాల, గొల్లవిడిపిలో 43.9, అనంతపురం జిల్లా తరిమెలలో 43.8 డిగ్రీల ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. ఎండల్లో తీసుకోవాల్సిన జాగ్రత్తలు.. ► సాధ్యమైనంత వరకు ఎండ తీవ్రంగా ఉన్న సమయంలో బయటకు వెళ్లకూడదు. ► తలపై టోపీ లేకపోతే కర్చీఫ్ కట్టుకోవాలి. పలుచటి కాటన్ వస్త్రాలు ధరించడం మేలు. ► ఉప్పు కలిపిన మజ్జిగ, గ్లూకోజ్ కలిపిన నీటిని తాగాలి. ► వడ దెబ్బకు గురైన వారిని వెంటనే చల్లటి ప్రాంతానికి చేర్చాలి. తడిగుడ్డతో శరీరాన్ని తుడుస్తూ ఉండాలి. ► మంచినీరు ఎక్కువగా తాగాలి. ఇంటి నుంచి బయటకు వెళ్లేముందు ఒక గ్లాసు మంచి నీరు తాగాలి. ► ఎండలో నుంచి వచ్చిన వెంటనే చల్లని నిమ్మరసం, కొబ్బరినీరు తాగాలి. ► ఎండలో ఉన్నప్పుడు తల తిరుగుతుంటే వెంటనే ఆస్పత్రికి వెళ్లాలి. 5న అండమాన్ సముద్రంలో అల్పపీడనం వాయుగుండంగా బలపడే అవకాశం దక్షిణ అండమాన్ సముద్రంలో మే 5న అల్పపీడనం ఏర్పడనుంది. తొలుత 4న ఆ ప్రాంతంలో ఉపరితల ఆవర్తనం ఏర్పడిన తర్వాత 24 గంటల్లో అల్పపీడనంగా మారుతుంది. అనంతరం బలమైన అల్పపీడనంగాను, ఆపై వాయుగుండంగాను బలపడుతుంది. ఇది ఉత్తర, ఈశాన్య దిశగా కదులుతూ మయన్మార్ వైపు పయనించే అవకాశం ఉందని వాతావరణ నిపుణులు అంచనా వేస్తున్నారు. అదే జరిగితే రాష్ట్రంపై అంతగా ప్రభావం ఉండే అవకాశంలేదు. అందుకు భిన్నంగా పశ్చిమ/వాయవ్య దిశగా పయనిస్తే మాత్రం రాష్ట్రంలో వర్షాలకు ఆస్కారం ఉంటుందని చెబుతున్నారు. మరోవైపు.. ఈ వాయుగుండం తీరాన్ని దాటాక రాష్ట్రంలో ఉష్ణ తీవ్రత పెరుగుతుందని వాతావరణ శాఖ రిటైర్డ్ అధికారి ఆర్. మురళీకృష్ణ ‘సాక్షి’కి చెప్పారు. -
14 మండలాల్లో తీవ్ర వడగాడ్పులు
సాక్షి, అమరావతి: రాష్ట్ర వ్యాప్తంగా శుక్రవారం (నేడు)14 మండలాల్లో తీవ్ర వడగాడ్పులు, 102 మండలాల్లో వడగాడ్పులు వీస్తాయని ఏపీ విపత్తుల నిర్వహణ సంస్థ హెచ్చరించింది. బయటకు వెళ్లేటప్పుడు ప్రజలు మరింత అప్రమత్తంగా ఉండాలని సూచించింది. ఉష్ణోగ్రతలు పెరుగుతున్న నేపథ్యంలో తగిన జాగ్రత్తలు తీసుకోవాలని తెలిపింది. ఆ.. మండలాలివే.. అల్లూరి సీతారామరాజు జిల్లాలోని డుంబ్రిగూడ, అడ్డతీగల, అనకాపల్లి జిల్లాలోని నాతవరం, నర్సీపట్నం, కాకినాడ జిల్లాలో కోటనంమూరు, పల్నాడు జిల్లాలో అమరావతి, పార్వతీపురం మన్యం జిల్లాలో భామిని, కొమరాడ, గుమ్మలక్ష్మీపురం, కురుపాం, సాలూరు, విజయనగరం జిల్లాలో డెంకాడ, వేపాడ, లక్కవరపు కోట మండలాల్లో తీవ్ర వడగాడ్పులు వీస్తాయి. అలాగే ఎన్టీఆర్ జిల్లాలో 16, నంద్యాలలో 12, అనకాపల్లిలో 11, పల్నాడులో 11, వైఎస్సార్‌లో 11, పార్వతీపురం మన్యంలో 9, విజయనగరంలో 8 మండలాలతో పాటు మిగిలిన చోట్ల మొత్తం 102 మండలాల్లో వడ గాడ్పులు ప్రభావం చూపే అవకాశం ఉంది. -
భానుడి భగభగలతో బతకలేం బాబోయ్! ఆరెంజ్ అలర్ట్ జారీ
సాక్షి, న్యూఢిల్లీ: దేశవ్యాప్తంగా ఎండలు మండిపోతున్నాయి. భానుడి భగభగలతో ఉత్తరాది రాష్ట్రాలు అల్లాడిపోతున్నాయి. వేడి, ఉక్కపోతతో ప్రజలు ఉక్కిరిబిక్కిరి అవుతున్నారు. మధ్యప్రదేశ్, ఉత్తరప్రదేశ్ సహా పలు రాష్ట్రాల్లో పగటి ఉష్ణోగ్రతలు 45 డిగ్రీలు దాటిపోయాయి. ఢిల్లీలోని సిరి ఫోర్ట్ కాంప్లెక్స్ వద్ద గురువారం అత్యధికంగా 44.2 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదైంది. ఈ నేపథ్యంలో ఢిల్లీ సహా ఐదు రాష్ట్రాలకు భారత వాతావరణ శాఖ ఆరెంజ్ అలర్ట్ జారీచేసింది. చదవండి👉🏻 విద్యార్థులకు ఫ్రీ హెయిర్ కటింగ్ చేయించిన టీచర్లు.. అసలు మ్యాటర్ ఏంటంటే! ఢిల్లీ, రాజస్థాన్, ఉత్తరప్రదేశ్, హరియాణా, ఒడిశాల్లో వచ్చే మూడురోజుల్లో పగటి ఉష్ణోగ్రతలు మరింత పెరుగుతాయని హెచ్చరికలు జారీచేసింది. మే తొలివారంలో వర్షాలు పడే వరకూ ఇదే పరిస్థితి కొనసాగుతుందని ఐఎండీ తెలిపింది. ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించింది. ఇక పెరిగిన ఉష్ణోగ్రతల నేపథ్యంలో విద్యుత్‌కు భారీ డిమాండ్ ఏర్పడింది. బొగ్గు నిల్వలు అడుగంటడంతో థర్మల్ విద్యుత్ తయారీ సంకటంలో పడిందని మహారాష్ట్ర విద్యుత్ శాఖ మంత్రి చెప్పడం గమనార్హం. కొరత కారణంగా ఇప్పటికే చాలా రాష్ట్రాల్లో విద్యుత్ కోతలు షురూ అయ్యాయి. చదవండి👉 క్షణక్షణం ఉత్కంఠ.. ఎప్పుడు ఏ ప్రమాదం ముంచుకొస్తుందో -
వడగాలుల ముప్పు; ఉత్తర భారతదేశానికి ఐఎండీ హెచ్చరిక
ఢిల్లీ: ఉత్తర భారతదేశానికి వడగాలుల ముప్పు ఉందంటూ భారత వాతావరణ శాఖ (ఐఎండీ) గురువారం హెచ్చరికలు జారీ చేసింది. పాకిస్తాన్ నుంచి వాయువ్య భారతదేశం దిశగా వీస్తున్న పొడిగాలుల ప్రభావంతో ఉత్తర భారతదేశంలో ఉష్ణోగ్రతలు పెరగనున్నాయి. దీంతో రానున్న రెండు రోజుల్లో తీవ్ర వేడి గాలులు వీస్తాయని తెలిపింది. ముఖ్యంగా ఢిల్లీ, పంజాబ్, రాజస్థాన్, హర్యానా, ఉత్తర్ ప్రదేశ్‌పై వేడి గాలుల ప్రభావం ఎక్కువగా ఉండనుంది. ఇప్పటికే జమ్మూకశ్మీర్‌లో పలు చోట్ల వేడి గాలులు వీస్తున్నట్లు ఐఎండీ గుర్తించింది. పాకిస్తాన్లో పొడి గాలులతో ఉష్టోగ్రతలు మరింత పెరిగే అవకాశం ఉందని తెలిపింది. సాధారణ ఉష్ణోగ్రతల కంటే 6.5 డిగ్రీలు అధికంగా నమోదయ్యే అవకాశాలు ఉన్నాయని.. ప్రజలంతా అప్రమత్తంగా ఉండాలని ఐఎండీ స్పష్టం చేసింది. ఇదే విషయమై ఐఎండీ అధికార ప్రతినిధి కుల్దీప్ శ్రీవాత్సవ స్పందించారు. '' మైదాన ప్రాంతాల్లో గరిష్ట ఉష్ణోగ్రత 40 డిగ్రీల సెల్సియస్ కంటే ఎక్కువగా ఉన్నప్పుడు "హీట్ వేవ్'' అని ప్రకటిస్తాం. ప్రస్తుత పరిస్థితుల దృశ్యా వర్షాకాలం సీజన్లోనూ 40 డిగ్రీల కంటే ఎక్కువ ఉష్ణోగ్రతలు నమోదయ్యే అవకాశం ఉంది.సాధారణంగా, జూన్ 20 వరకు దేశ రాజధాని సహా పలు ప్రాంతాల్లో వేడి తరంగాలు రావడం సహజమే. కానీ ఈసారి గరిష్ట ఉష్ణోగ్రత పెరగడం వెనుక రుతుపవనాల రాక ఆలస్యం కావడమే కారణం'' అని చెప్పుకొచ్చారు. ఇక అమెరికాతో పాటు కెనడాలో ఎండలు మండిపోతున్నాయి. సాధారణ ఉష్ణోగ్రతల కంటే ఎక్కువగా నమోదవుతుండడంతో ప్రజలు అల్లాడిపోతున్నారు. గత నాలుగైదు రోజుల్లోనే వడగాడ్పులకు తాళలేక కెనడాలోని వెన్కౌర్ ప్రాంతంలో 200 మందికి పైగా మృతి చెందారు. ఫసిఫిక్ మహాసముద్రంలో వాతావరణంలోని మార్పుల కారణంగా తీవ్రమైన ఒత్తిడి వల్ల హీట్ డోమ్ ఏర్పడడంతో అమెరికాలోని కాలిఫోర్నియా నుంచి కెనడాలోని ఆర్కిటిక్ ప్రాంతాల వరకు ఎండలు భగభగలాడుతున్నట్టుగా బెర్కెలే ఎర్త్‌కి చెందిన పర్యావరణ శాస్త్రవేత్త జెకె హస్ఫాదర్ చెప్పారు -
ఏపీలో ఎండ దంచి కొడుతోంది
సాక్షి, అమరావతి: రాష్ట్రవ్యాప్తంగా ఓవైపు కరోనా ఉధృతి కొనసాగుతోంది. అంతేస్థాయిలో ఎండలు మండిపోతున్నాయి. ఇప్పటికే తూర్పు, పశ్చిమగోదావరి జిల్లాల్లో అక్కడక్కడా వడదెబ్బ కేసులు నమోదయ్యాయి. దీంతో వైద్య ఆరోగ్యశాఖ అప్రమత్తమైంది. వడదెబ్బ సోకకుండా అవగాహన కల్పించడంతో పాటు అన్ని ఆస్పత్రుల్లోనూ చికిత్సకు ఏర్పాట్లు పూర్తి చేసింది. కుటుంబ సంక్షేమ శాఖ అన్ని జిల్లాల అధికారులకు ఎండ వేడికి తీసుకోవాల్సిన జాగ్రత్తలు, అధికారుల తీసుకోవాల్సిన జాగ్రత్తలపై స్పష్టమైన ఆదేశాలిచ్చింది. రానున్న రోజుల్లో ఎండ తీవ్రత పెరిగే అవకాశమున్నట్టు హెచ్చరికలు ఉండటంతో దీనికి కావాల్సిన అన్ని జాగ్రత్తలు తీసుకుంటున్నారు. కరోనా కేసుల కారణంగా ఇప్పటికే వైద్య ఆరోగ్యశాఖ సిబ్బంది సెలవులు లేకుండా పనిచేస్తున్నారు. అన్ని సబ్సెంటర్లతో పాటు ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలకు సైతం ఫస్ట్ ఎయిడ్ కిట్లు సరఫరా చేశారు. ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అధికారులు సూచించారు. పల్లెల్లో విస్తృత ప్రచారం పల్లెల్లో జనాన్ని అప్రమత్తం చేశారు. ఉపాధి హామీ లేదా ఇతర రైతు పనులకు వెళ్లిన వారిని ఉదయం 11 గంటలలోగా ఇంటికి చేరుకోవాల్సిందిగా ప్రచారం నిర్వహిస్తున్నారు. ఎఫ్ఎం రేడియో, కేబుల్ టీవీలు, కళాజాతాల ద్వారా ఎండ తీవ్రత, దీనికి తీసుకోవాల్సిన జాగ్రత్తలపై ప్రచారం నిర్వహిస్తున్నారు. రాష్ట్రవ్యాప్తంగా గ్రామ స్థాయి, మండల స్థాయిలో మెడికల్ క్యాంపుల నిర్వహణ చేపట్టారు. గిరిజన ఏజెన్సీ ప్రాంతాల్లో ఏఎన్ఎంల ద్వారా ప్రత్యేక మెడికల్ కిట్లను అందజేస్తున్నారు. సురక్షితమైన తాగునీరు అందించాల్సిందిగా పంచాయతీరాజ్, మునిసిపాలిటీ అధికారులను కోరారు. ఎన్జీవో సంఘాలు ప్రత్యేక చలివేంద్రాలు, మజ్జిగ ఏర్పాట్లు చేయాలని సూచించారు. టీకాలకు ఉదయమే రండి కోవిడ్ వ్యాక్సిన్‌తో పాటు చిన్నారులకు ప్రతి బుధ, శనివారాలు వ్యాధినిరోధక టీకాలు నిర్వహణ జరుగుతుంది. ఎండల తీవ్రత నేపథ్యంలో ఉదయం 9 గంటలలోగా వ్యాక్సిన్ తీసుకుని వీలైనంత త్వరగా ఇంటికి వెళ్లాలని కుటుంబ సంక్షేమ శాఖ కోరింది. ప్రతి ఆస్పత్రిలోనూ ఓఆర్ఎస్ పౌడర్‌తో పాటు, సన్‌స్ట్రోక్‌కు సంబంధించిన అన్ని రకాల మందులూ అందుబాటులో ఉంచారు. గర్భిణులు వైద్య పరీక్షలకు ఉదయం రావాలని, తిరిగి త్వరగా వెళ్లాలని, వారిని ఉదయమే తెచ్చే బాధ్యత ఆశా కార్యకర్తలు చూసుకోవాలని ఆదేశించారు. ఏదైనా సన్‌స్ట్రోక్ లక్షణాలుంటే స్థానిక ప్రాథమిక ఆరోగ్య కేంద్రానికి వెంటనే వెళ్లాలని సూచించారు. 108కు ఫోన్ చేసి అంబులెన్సులో రావచ్చునని, లేదంటే 104కు కాల్ చేసి డాక్టరు సలహాలు తీసుకుని పాటించవచ్చునని కుటంబ సంక్షేమ శాఖ విజ్ఞప్తి చేసింది. సన్‌స్ట్రోక్ లక్షణాలు ఇవే ► విపరీతంగా తలనొప్పి రావడం, కళ్లు తిరిగినట్టుండటం ► నీరసంగా ఉండటం, నాలుక తడారిపోవడం ► ఒళ్లంతా చెమటలు పట్టినట్టు, శరీరం పాలిపోయినట్టు కావడం ► శ్వాస వేగంగా తీసుకోవడం, గుండె దడగా ఉండటం ► శరీరంలో ఉష్ణోగ్రతలు పెరగడం ► వాంతులు వచ్చినట్టు ఉండటం ఈ జాగ్రత్తలు తీసుకుంటే సమస్య రాదు ► వీలైనంత వరకు ఎండలో తిరగకపోవడం ► వెళ్లినా గొడుకు విధిగా వాడటం ► కావాల్సినన్ని మంచినీళ్లు దఫాలుగా తాగుతుండటం ► పల్చటి మజ్జిగ, కొబ్బరి నీళ్లు తీసుకోవడం ► అలసటగా ఉన్నట్టయితే ఓఆర్ఎస్ పౌడర్ మంచినీళ్లలో కలిపి తాగడం అన్నీ సిద్ధంగా ఉంచాం ఓఆర్ఎస్తో పాటు ఐవీ ఫ్లూయిడ్స్, యాంటీబయాటిక్స్ మందులు సిద్ధంగా ఉంచాం. ఇప్పుడిప్పుడే కొన్ని హీట్‌వేవ్ (వడదెబ్బ) కేసులు నమోదవుతున్నాయి. మెడికల్, పారామెడికల్ సిబ్బంది అప్రమత్తంగా ఉండాలని చెప్పాం. ఏరోజుకారోజు వడదెబ్బ కేసులను నివేదికను పంపించాలని కోరాం. చిన్నారులు, గర్భిణులు, బాలింతలు వృద్ధులు వీలైనంత వరకు ఇంటికే పరిమితం కావాలి. – డా.గీతాప్రసాదిని, ప్రజారోగ్య సంచాలకులు -
దంచికొడుతున్న ఎండలు, అయితే ఇవి మంచికే!
సాక్షి, అమరావతి: మండుటెండలు మంచికే అంటున్నారు వాతావరణ నిపుణులు. నిప్పులు కురిసే ఎండలు, వడగాడ్పుల వల్ల మంచి ఏమిటనే సందేహం తలెత్తడం సహజం. అయితే ఎండల తీవ్రత అధికంగా ఉంటూ వడగాడ్పులు వీచిన సంవత్సరంలో వచ్చే నైరుతి రుతుపవనాలు ఎంతో సానుకూలంగా ఉంటాయని వాతావరణ నిపుణులు చెబుతున్నారు. ఫలితంగా సమృద్ధిగా వర్షాలు కురుస్తాయని పేర్కొంటున్నారు. అందుకే వేసవి తాపం వల్ల జనం అవస్థలు, ఇబ్బందులు ఎదుర్కొన్నప్పటికీ ఆ తర్వాత వచ్చే నైరుతి రుతుపవనాల సీజనుకు ముందస్తుగా వచ్చే ఎండలు ఎంతో మేలు చేస్తాయంటున్నారు. మరోవైపు ఏటా పసిఫిక్ మహాసముద్రంలో లానినా, ఎల్‌నినో పరిస్థితులేర్పడుతుంటాయి. లానినా పరిస్థితులుంటే ఆ ఏడాది ఎండల తీవ్రత అధికంగా ఉంటూ నైరుతి రుతుపవనాలు ఆశాజనకంగా ఉండడానికి దోహదపడతాయి. అలాగే ఎల్‌నినో పరిస్థితులేర్పడితే ఆ సంవత్సరం వేసవి తాపం అంతగా కనిపించదు. కానీ వర్షాలు సమృద్ధిగా కురవక కరువుకు దారితీస్తుంది. ప్రస్తుతం పసిఫిక్ మహా సముద్రంలో మోస్తరు లానినా పరిస్థితులున్నాయి. అక్కడ సముద్ర ఉపరితల ఉష్ణోగ్రతలు సాధారణం కంటే కాస్త తక్కువగా నమోదవుతున్నాయి. రానున్న రోజుల్లో ఉపరితల ఉష్ణోగ్రతలు పెరిగే అవకాశం ఉందని భారత వాతావరణ విభాగం (ఐఎండీ) అంచనా వేస్తోంది. ఇలా సముద్ర ఉపరితల ఉష్ణోగ్రతల పెరుగుదల రుతుపవనాలకు అనుకూల పరిస్థితులు ఏర్పడేందుకు దోహదపడతాయి. ప్రస్తుతం మార్చి మూడో వారం నుంచే ఎండలు మండిపోతున్నాయి. సాధారణంకంటే 4–7 డిగ్రీలు అధికంగా ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. పలుచోట్ల వడగాడ్పులు, కొన్నిచోట్ల తీవ్ర వడగాడ్పులు వీస్తున్నాయి. వేసవి ఆరంభానికి ముందే అసాధారణ ఉష్ణోగ్రతలు నమోదవుతూ జనాన్ని హడలెత్తిస్తున్నాయి. మరోవైపు ఈ ఏప్రిల్, మే నెలల్లో ఉత్తర, వాయవ్య, తూర్పు మధ్య భారతదేశంలో పగటి ఉష్ణోగ్రతలు అధికంగా నమోదవుతాయని ఐఎండీ తాజా నివేదికలో తెలిపింది. అదే సమయంలో అక్కడితో పోల్చుకుంటే దక్షిణాది రాష్ట్రాల్లో కొన్నిచోట్ల ఒకింత తక్కువగా రికార్డవుతాయని పేర్కొంది. ఉత్తర, వాయవ్య, మధ్య భారతదేశంలో ఉష్ణతీవ్రత ప్రభావం మన రాష్ట్రంపై కూడా ఉంటుందని వాతావరణశాఖ రిటైర్డ్ అధికారి ఆర్.మురళీకృష్ణ ‘సాక్షి’కి చెప్పారు. అటునుంచి వీచే వేడి, పొడి గాలుల వల్ల ఇక్కడ కూడా ఉష్ణతాపం పెరుగుతుందన్నారు. వేసవిలో ఉష్ణోగ్రతలు అధికంగా నమోదైన ఏడాది వచ్చే నైరుతి రుతుపవనాలు సకాలంలో ప్రవేశించడంతో పాటు సమృద్ధిగా వర్షాలు కురుస్తాయని చెప్పారు. అందువల్ల ఈ సీజనులో అధిక ఉష్ణోగ్రతలు నైరుతి రుతుపవనాలకు సానుకూలమని తెలిపారు ఎండ, వడగాలులతో అట్టుడుకుతున్న రాష్ట్రం సాక్షి, అమరావతి/సాక్షి విశాఖపట్నం/మంగళగిరి: రాష్ట్రంలో ఎండ ప్రచండరూపం దాల్చింది. ఉదయం నుంచే భానుడు భగభగలాడుతున్నాడు. వడగాలులు పెరిగాయి. గురువారం రాజస్థాన్‌లోని థార్ ఎడారిలో 45 డిగ్రీల ఉష్ణోగ్రతలు నమోదుకాగా.. మన రాష్ట్రంలోని 50 ప్రాంతాల్లో ఇదేమాదిరిగా 45 డిగ్రీల ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. 78 మండలాల్లో తీవ్రమైన వడగాలులు వీయగా 197 మండలాల్లో వడగాలుల ప్రభావం ఎక్కువగా ఉన్నట్టు విపత్తుల నిర్వహణ సంస్థ వెల్లడించింది. ప్రకాశం జిల్లాలోని కొనకమిట్ల, కందుకూరుల్లో 45.8 డిగ్రీల అత్యధిక ఉష్ణోగ్రత నమోదైంది. రానున్న రెండురోజుల్లో వడగాలులు మరింత అధికంగా ఉంటాయని అమరావతి వాతావరణ పరిశోధన కేంద్రం సంచాలకురాలు స్టెల్లా చెప్పారు. గుంటూరు జిల్లా మంగళగిరి మండలం నీరుకొండలోని ఎస్ఆర్ఎం యూనివర్సిటీ ఆవరణలోని వాతావరణ పరిశోధన కేంద్రంలో గురువారం ఆమె విలేకరులతో మాట్లాడారు. శుక్ర, శనివారాల్లో గుంటూరు, ప్రకాశం, కృష్ణా జిల్లాల్లో ఉష్ణోగ్రతలు మరింత పెరిగే అవకాశముందని చెప్పారు. ఉభయగోదావరి, నెల్లూరు, రాయలసీమల్లో వడగాడ్పుల ప్రభావం అధికంగా ఉంటుందన్నారు. శని, ఆదివారాల్లో నెల్లూరు, చిత్తూరు జిల్లాల్లో వడగాడ్పులు, రాయలసీమలో రెండు డిగ్రీలు ఉష్ణోగ్రతలు పెరిగే అవకాశముందన్నారు. 1953 మార్చి 29న విజయవాడలో 43.5 డిగ్రీల అధిక ఉష్ణోగ్రత నమోదైందని, అనంతరం ఇన్ని సంవత్సరాల తర్వాత మార్చి 31వ తేదీ బుధవారం 43.3 డిగ్రీల రెండో అత్యధిక ఉష్ణోగ్రత నమోదైందని చెప్పారు. రానున్న రెండు రోజుల్లో ప్రజలు అత్యవసరమైతే తప్ప బయటకు రావద్దని, తగు జాగ్రత్తలు తీసుకుని వడదెబ్బ నుంచి రక్షణ పొందాలని సూచించారు. రెండు రోజులు వర్ష సూచన దక్షిణ అండమాన్ సముద్రంలో కొనసాగుతున్న అల్పపీడనం శుక్రవారం ఉదయం బలపడి.. తీవ్ర అల్పపీడనంగా మారే సూచనలున్నాయని వాతావరణశాఖ వెల్లడించింది. ఇది తదుపరి 24 గంటల్లో బలపడి ఉత్తర అండమాన్ సముద్రం, పరిసర ప్రాంతాల్లో వాయుగుండంగా మారే సూచనలున్నాయని అధికారులు తెలిపారు. దీనికి తోడు.. ఉత్తర–దక్షిణ ఉపరితల ద్రోణి జార్ఖండ్ నుంచి ఉత్తర కోస్తాంధ్ర వరకు 1.5 కిలోమీటర్ల ఎత్తులో ఏర్పడింది. దీని ప్రభావంతో ఉత్తరాంధ్రతో పాటు ఉభయ గోదావరి జిల్లాల్లో ఈ నెల శని, ఆదివారాల్లో ఉరుములతో కూడిన తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు, కృష్ణా, గుంటూరు జిల్లాల్లోని తీర ప్రాంతాల్లో తేలికపాటి జల్లులు పడే అవకాశాలుయని అధికారులు తెలిపారు. ఉత్తర కోస్తా తీరం వెంబడి రానున్న రెండు రోజులు గంటకు 40 నుంచి 50 కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలులు వీస్తాయని, మత్స్యకారులు వేటకు వెళ్లరాదని అధికారులు హెచ్చరించారు. -
నాలుగు రెట్లు పెరగనున్న భూతాపం
సాక్షి, న్యూఢిల్లీ : 1901 నుంచి 1918 మధ్య భారత్‌లో వాతావరణ ఉష్ణోగ్రత 0.7 డిగ్రీల సెల్సియస్ పెరగ్గా, 2,100 సంవత్సరాంతానికి దేశంలో ఉష్ణోగ్రత 4.4 డిగ్రీల సెల్సియస్, అంటే ఇప్పటి కంటే నాలుగింతలు పెరగుతుందని కేంద్ర ప్రభుత్వం అంచనా వేసింది. 1976 నుంచి 2005 వరకు 30 ఏళ్ల కాలంలో పెరిగిన సగటు ఉష్ణోగ్రతకు ఈ పెరగనున్న ఉష్ణోగ్రత సమానమని, కర్బణ ఉద్ఘారాల కారణంగానే ఉష్ణోగ్రత పెరుగుతోందని ప్రభుత్వ నివేదిక వెల్లడించింది. ‘అసిస్మెంట్ ఆఫ్ క్లైమేట్ చేంజ్ ఒవరి ది ఇండియన్ రీజియన్’ పేరిట కేంద్ర ప్రభుత్వం వాతావరణ మార్పులపై నివేదికను విడుదల చేసింది. దేశ ఉష్ణోగ్రత దాదాపు నాలుగు డిగ్రీలు పెరగడమంటే వడగాలులు కూడా నాలుగింతలు పెరగడమే. ఇది పర్యావరణ సమతౌల్యంపైనే కాకుండా వ్యవసాయం, నీటి వనరులపై తీవ్ర ప్రభావం చూపిస్తుంది. నీటి వనరులు బాగా తరగిపోతాయి. వ్యవసాయ ఉత్పత్తులు బాగా పడిపోతాయి. పర్యవసానంగా జీవ వైవిధ్యంపై ప్రభావంతోపాటు ఆహారం కొరత ఏర్పడుతుంది. తద్వారా ప్రజారోగ్యం దెబ్బతింటుంది. ఇప్పటికే దేశంలోని పలు ప్రాంతాల్లో కొన్ని రకాల మొక్కలు, జంతువులు నశించి పోతున్నాయని, నాలుగు డిగ్రీల ఉష్ణోగ్రత పెరగడం వల్ల ఇవి మరింత వేగంగా నశించిపోయే ఆస్కారం ఉందని నివేదికలో ప్రభుత్వం ఆందోళన వ్యక్తం చేసింది. ప్రపంచం మొత్తం మీద భూ ఉష్ణోగ్రత సరాసరి మూడు నుంచి ఐదు డిగ్రీల సెల్సియస్ పెరగవచ్చని నివేదిక అంచనా వేసింది. భూ ఉష్ణోగ్రత పెరుగుదలను రెండు డిగ్రీల సెల్సియస్‌కు పరిమితం చేయాలని 2015లో పారిస్‌లో కుదర్చుకున్న అంతర్జాతీయ ఒప్పందం లక్ష్యంగా పెట్టుకుంది. ఈ లెక్కన ఆ లక్ష్య సాధనలో ప్రపంచ దేశాలు విఫలమైనట్లే. -
తగ్గుతున్న ఉష్ణతాపం
సాక్షి,విశాఖపట్నం: రాష్ట్రంలో పగటి ఉష్ణోగ్రతలు క్రమంగా తగ్గుముఖం పడుతున్నాయి. వడగాడ్పుల తీవ్రత ఒకట్రెండు రోజులున్నా.. ఎండలు మాత్రం అంతగా ఉండవని వాతావరణ కేంద్రం అధికారులు తెలిపారు. రాయలసీమ నుంచి తమిళనాడు వరకూ సముద్రమట్టానికి 1.5 కి.మీ. ఎత్తులో ఉపరితల ద్రోణి విస్తరించి ఉండటమే దీనికి కారణమంటున్నారు. ద్రోణి ప్రభావంతో రాష్ట్రంలో పలు చోట్ల ఉరుములతో కూడిన జల్లులు కురిసే సూచనలున్నాయని వాతావరణ శాఖ తెలిపింది. రాయలసీమలో మాత్రం గురు, శుక్రవారాల్లో ఒకట్రెండు చోట్ల 40 నుంచి 43 డిగ్రీల వరకూ ఉష్ణోగ్రతలు నమోదవుతాయని వెల్లడించింది. నైరుతి రుతు పవనాలు చురుగ్గా కదులుతున్నాయి. కేరళ తీరాన్ని ఎప్పుడు తాకుతాయన్నదానిపై రెండు రోజుల్లో స్పష్టత వస్తుందని అధికారులు చెప్పారు. -
నిప్పులకొలిమి : మరో 24 గంటలు ఇదే తీరు..
సాక్షి, న్యూఢిల్లీ : ఉత్తరాది సహా దేశంలోని పలు ప్రాంతాల్లో కొనసాగుతున్న వడగాడ్పులు మరో 24 గంటలు కొనసాగుతాయని భారత వాతావరణ విభాగం (ఐఎండీ) బుధవారం వెల్లడించింది. బంగాళాఖాతంలో నైరుతి రుతుపవనాలు మరింత బలపడినప్పటికీ మరో ఒకట్రెండు రోజులు అధిక ఉష్ణోగ్రతలు, వేడిగాలులు కొనసాగుతాయని తెలిపింది. ఉత్తర, మధ్య భారత్‌లో పలు ప్రాంతాల్లో అత్యధిక ఉష్ణోగ్రతలు నమోదవుతూ వేడిగాలులు వీస్తున్నాయని, కొన్ని ప్రాంతాల్లో ఉష్ణోగ్రత 47 డిగ్రీల సెల్సియస్ దాటుతోందని ఐఎండీ పేర్కొంది. ప్రస్తుత వడగాడ్పులు, అత్యధిక ఉష్ణోగ్రతలు రానున్న 24 గంటల్లో కొనసాగే అవకాశం ఉందని వెల్లడించింది. రానున్న 24 గంటల్లో తెలంగాణ, మరాఠ్వాటా, ఒడిషా, జార్ఖండ్, బిహార్, పంజాబ్, కర్ణాటకల్లో వేడిగాలులు వీస్తాయని..విదర్భ, పశ్చిమ రాజస్ధాన్‌లో అత్యధిక ఉష్ణోగ్రతలతో వేడిగాలులు వీస్తాయని ఐఎండీ పేర్కొంది. చదవండి : ఉత్తర భారతంలో రెడ్ అలర్ట్ -
బెజవాడలో బేజారెత్తిస్తున్న ఎండలు
సాక్షి, అమరావతి : కృష్ణా జిల్లాను వడగాడ్పులు దడ పుట్టిస్తున్నాయి. సాధారణం కంటే నాలుగు నుంచి 5 డిగ్రీలు అధికంగా నమోదు అవుతున్నాయి. జనాన్ని బెంబేలెత్తిస్తున్నాయి.. ఉదయం నుంచి సాయంత్రం వరకు నిప్పుల కుంపటిని తలపిస్తున్నాయి. మున్ముందు ఇవి మరింత ప్రతాపం చూపించనున్నాయి. రోజురోజుకూ ఉష్ణోగ్రతలు పెరగడమే తప్ప తగ్గడం లేదు. ఎండలు నిప్పుల వర్షాన్ని తలపిస్తుండటంతో జనం అల్లాడుతున్నారు. ఉదయం ఏడెనిమిది గంటలకే సూర్యుడు సుర్రుమంటున్నాడు. మధ్యాహ్నానికి మరింత మండుతున్నాడు. ఇలా సాయంత్రం వరకూ సెగలు కక్కుతున్నాడు. రాత్రి వేళ కూడా వేడిగాలులు వీస్తూ జనాన్ని అవస్థలు పెడుతున్నాయి. దీంతో తెల్లారిందంటే చాలు.. మళ్లీ వడగాడ్పులు ఎలా ప్రతాపం చూపుతాయోనని జిల్లా వాసులు ఆందోళన చెందుతున్నారు. గత మూడు రోజులుగా సాధారణం కంటే రెండు నుంచి నాలుగు డిగ్రీల అధిక ఉష్ణోగ్రత నమోదు అవుతోంది. నెలాఖరు వరకూ ఇదే విధమైన ఎండ తీవ్రత ఉంటుందని వాతావరణ కేంద్రం వెల్లడించింది. మరో నాలుగు రోజులు ప్రజలు జాగ్రత్తగా ఉండాలని సూచించింది. వృద్ధులు, చిన్నారులు ఇళ్లలోనే ఉండాలని, అత్యవసరమైతే తప్ప బయటకు రావొద్దని సూచనలు చేసింది. విజయవాడలో అత్యధికం జిల్లాలో శనివారం పలుచోట్ల అధిక ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. నిన్న విజయవాడలో అత్యధికంగా 45.1, రూరల్‌లో 44.3 డిగ్రీల ఉష్ణోగ్రత రికార్డయింది. వీరులపాడులో 44.2, తిరువూరు 43.2, చందర్లపాడు 42.9, విజయవాడ నగరం, గన్నవరం విమానాశ్రయంలో 42 డిగ్రీల చొప్పున గరిష్ట ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. రోహిణీ కార్తెలో.. ఈనెల 25 నుంచి రోహిణి కార్తె ప్రారంభం కానుంది. ఇప్పటికే వడగాడ్పుల తీవ్రతతో జనం అవస్థలు పడుతున్నారు. రోహిణీ కార్తె ప్రవేశిస్తే గాడ్పుల తీవ్రత మరింత పెరగనుంది. రానున్న రెండు రోజులు కృష్ణా జిల్లాలో సాధారణంకంటే 2–3 డిగ్రీలు అధికంగా ఉష్ణోగ్రతలు నమోదై వడగాడ్పులు కొనసాగుతాయని అమరావతి వాతావరణ కేంద్రం అధికారులు ‘సాక్షి’కి చెప్పారు. ఎందుకిలా? ఇటీవల సంభవించిన ఉంపన్ తుపాను గాలిలో తేమను లాక్కుని పోయింది. మరోవైపు ప్రస్తుతం రాష్ట్రం వైపు ఉత్తర భారతదేశం నుంచి పశ్చిమ, వాయువ్య గాలులు వీస్తున్నాయి. ఇవి ఉష్ణగాలులను మోసుకు వస్తున్నాయి. ఫలితంగా అధిక ఉష్ణోగ్రతలు, వడగాడ్పులకు కారణమవుతున్నాయని వాతావరణ నిపుణులు చెబుతున్నారు. కాగా రాష్ట్రవ్యాప్తంగా అధిక ఉష్ణోగ్రతలు కొనసాగుతున్నాయి. పలు ప్రాంతాల్లో 47 డిగ్రీల ఉష్ణోగ్రతలు నమోదు అయ్యాయి. తీసుకోవాల్సిన జాగ్రత్తలు వడగాడ్పుల వేళ జనం ఇళ్లలోనే ఉండాలి. తప్పనిసరి పరిస్థితుల్లో బయటకు వెళితే గొడుగు ధరించాలి. తలకు, ముఖానికి మాస్క్/కర్చీఫ్ కట్టుకుని వెళ్లాలి. బయటకు వెళ్లి వచ్చాక తీపి పదార్థాలు తినకూడదు. తరచూ మంచినీళ్లు తాగాలి. డీహైడ్రేషన్‌కు గురికాకుండా మంచినీరు, ఉప్పు కలిపిన మజ్జిగ, నిమ్మరసం నీళ్లు తాగాలి. తెల్లని కాటన్ వస్త్రాలు ధరించాలి. ఐస్ నీళ్లు, కూల్డ్రింకులు తాగకూడదు. -
కరోనా కన్నా ఇప్పుడు ఎండలే విలన్!
న్యూఢిల్లీ : వేసవి వేడి గాలులకు ఏటా కూలి నాలి చేసుకునే పేదలు, దిగువ, మధ్య తరగతి ప్రజలు ఎంతో మంది మరణిస్తుంటారు. అందుకనే వేసవి కాలంలో మాటి మాటికి నీళ్లు తాగండి, చెట్ల నీడన సేద తీరండి, ఎండలోకి వెళ్లొద్దంటూ వాతావరణ శాఖ అధికారులు హెచ్చరిస్తుంటారు. గతేడాది భారత్‌లో ఎండ వేడికి తాళలేక అధికార లెక్కల ప్రకారమే 350 మంది మరణించారు. ఈసారి కరోనా వైరస్‌కన్నా ఎక్కువ మంది ఎండను తట్టుకోలేకనే మరణిస్తారని అమెరికాలోని ‘నేచురల్ రిసోర్సెస్ డిఫెన్స్ కౌన్సిల్’ హెచ్చరించింది. భారత్‌లో కొనసాగుతోన్న లాక్డౌన్ కారణంగా ఉపాధి కోల్పోయిన వలస కార్మికులు ఎంతో మంది భగభగ మండుతోన్న ఎండలోనే తమ స్వస్థలాలకు బయలు దేరిన విషయం తెల్సిందే. వారిలో ఇప్పటికే కొంత మంది ఎండకు, ఆకలికి తాళలేక మరణించారు. ఇంకా ఎంతోమంది మృత్యువాత పడే ప్రమాదం ఉందని ఆ అమెరికా సంస్థ హెచ్చరించింది. ఇది అత్యధిక ఉష్ణోగ్రత కలిగిన దశాబ్దంకాగా ఇప్పటికే ఢిల్లీలో ఉష్ణోగ్రత 41 డిగ్రీల సెల్సియస్‌కు చేరుకుంది. రాజస్థాన్ లాంటి ఎడారి రాష్ట్రాల్లో ఉష్ణోగ్రత 45 డిగ్రీలకు చేరుకుంది. జూన్ మొదటి వారం వరకు ఈసారి ఎండలు తీవ్రంగా ఉంటాయని, అందుకు తగిన జాగ్రత్త చర్యలు తీసుకోవాలంటూ ‘నేషనల్ డిజాస్టర్ మేనేజ్మెంట్ అథారిటీ’ మార్గదర్శకాలను కూడా విడుదల చేసింది. ప్రజలంతా ఇంట్లో ఉండాలని, క్రమం తప్పకుండా మంచినీళ్లు తగడంతోపాటు శరీరాన్ని చల్లగా ఉంచేందుకు నిమ్మరసం, లస్సీ, మజ్జిగ, మామిడి పళ్ల రసం తీసుకోవాలంటూ అనేక సూచనలు చేసింది. స్వస్థలాలకు వెళ్లేందుకు రోడ్డెక్కిన వేలాది మంది వలస కార్మికులు వందల కొద్దీ కిలోమీటర్లు నడుస్తున్న వారికి కనీస ఆహారం దొరకడం లేదు. మజ్జిగ, మామిడి పళ్ల గురించి ఆలోచించే ఆస్కారమే లేదు. ఎండ వేడి వల్ల అతిసారం వస్తోందని, ఊపిరితిత్తుల జబ్బులతోపాటు, కార్డియోవాస్కులర్ అనే గుండె జబ్బు కూడా వస్తుందని ఎన్డీఎంఏకు చెందిన అనూప్ కుమార్ శ్రీవాత్సవ తెలియజేశారు. ఇప్పటికే కరోనా కేసులతో దేశంలోని ప్రభుత్వ ఆస్పత్రులు కిటకిటలాడుతుంటే ఉష్ణతాపానికి గురయ్యే వారిని రక్షించడం కష్టమవుతుందని ఆయన ఆందోళన వ్యక్తం చేశారు. (మాస్క్‌లతో శ్వాసకోశ సమస్యలు!) 2015లో వీచిన వడగాల్పులకు దేశంలో రెండువేల మందికి పైగా మరణించారు. అంతకుముందు 2010లో ఒక్క అహ్మదాబాద్‌లోనే వడగాడ్పుల వల్ల 1300 మంది మరణించారు. అందుకని ఆ సంవత్సరం నుంచే ‘దక్షిణాసియా తొలి ఉష్ణ నివారణ కార్యాచరణ ప్రణాళిక’ అమల్లోకి వచ్చింది. ఈ ప్రణాళికను అమలు చేయడం ద్వారా ఒక్క అహ్మదాబాద్‌లోనే 1100 మంది మరణాలను అధికారులు అరికట్టకలిగారు. ప్రజలు జాగ్రత్తలు తీసుకోవడంతోపాటు అధికారులు రోజుకు రెండు పూటల రోడ్లను తడపడం, ఎక్కడికక్కడ చలివేంద్రాలు, మజ్జిగ కేంద్రాలను ఏర్పాటు చేయడంతోపాటు ట్రాఫిక్ పోలీసులు నిర్వహించాల్సిన విధుల గురించి కూడా ఈ కార్యాచరణ ప్రణాళికలో వివరించారు. కరోనా మహమ్మారి దాడి నేపథ్యంలో లాక్‌డౌన్‌ను అమలు చేయడంలో అధికార యంత్రాంగం తలముక్నలై ఉండగా, ఉపాధి కోల్పోయి రోడ్డున పడ్డ వలస కార్మికుల పరిస్థితి ఏమిటని ఊహిస్తేనే ఒళ్లు జలదరించక తప్పదు! (వలస కూలీలపై కేంద్రం కీలక నిర్ణయం) -
ఈసారి నడి వేసవిలో నిప్పుల వాన
సాక్షి, విశాఖపట్నం: ఈ ఏడాది తీవ్ర స్థాయిలో ఉష్ణోగ్రతలు ఉంటాయని భారత వాతావరణ విభాగం హెచ్చరించింది. భూతాపం కారణంగా సాధారణం కంటే 1 డిగ్రీ సెల్సియస్ వరకు ఉష్ణోగ్రత అధికంగా నమోదవుతుందని తెలిపింది. నడి వేసవిలో నిప్పుల వాన కురిపించేంతలా ఎండలు కాస్తాయని వెల్లడించింది. గరిష్ట ఉష్ణోగ్రతలు 45 డిగ్రీలకు పైగా నమోదు కావొచ్చని నిపుణులు అంచనా వేస్తున్నారు. భూ తాపంతో వాతావరణంలో వస్తున్న పెను మార్పులే దీనికి కారణమని చెబుతున్నారు. ఎండల తీవ్రత మార్చి 2వ వారం నుంచే మొదలుకానుంది. ముఖ్యంగా దక్షిణాది రాష్ట్రాల్లో ఈ ప్రభావం ఎక్కువగా ఉండనుంది. మే నెల నుంచి వడగాడ్పుల ప్రభావం: వాతావరణ శాఖ నివేదిక ప్రకారం... మే నెల మొదటి వారం నుంచి వడగాడ్పుల ప్రభావం మొదలు కానుంది. గతేడాదితో పోల్చిచూస్తే.. వడగాడ్పుల ప్రభావం అంతగా ఉండకపోవడం ఉపశమనం కల్గించినా.. అదే సమయంలో ఉష్ణోగ్రతలు గరిష్ట స్థాయిలో నమోదు కానుండడంతో జాగ్రత్త వహించాల్సిన అవసరం ఉందని హెచ్చరిస్తున్నారు. దక్షిణ కోస్తా, రాయలసీమల్లో గరిష్ట ఉష్ణోగ్రతలు అత్యధిక రోజులు నమోదు కానున్నాయి. -
వడగాల్పులు ఎలా, ఎందుకు వస్తాయి?
సాక్షి, న్యూఢిల్లీ : గత మూడు దశాబ్దాలుగా ఎన్నడు లేనివిధంగా దేశవ్యాప్తంగా సుదీర్ఘంగా వీస్తున్న వడగాడ్పులకు 200 మందికిపైగా మరణించారు. రుతుపవనాలు ఆలస్యంగా రావడమే సుదీర్ఘ వడగాడ్పులకు కారణం. మత్యువాత పడిన వారిలో ఎక్కువ మంది పట్టణ ప్రాంతాల్లో నివసిస్తున్న పేదవాళ్లే. వడగాడ్పులంటే కేవలం వేడి గాలులుగానే భావించరాదు. ఈ వేడి గాడ్పుల్లో ఉష్ణోగ్రత ఎక్కువగా ఉండడమే కాకుండా తేమ శాతం (ఉక్క) ఎంత ? సూర్యుడి నుంచి ప్రత్యక్షంగా లేదా పరోక్షంగా వచ్చే రేడియేషన్ ప్రభావం ఎంత? అన్న అంశాల ఆధారంగా ప్రజలపై వడ గాడ్పుల ప్రభావం ఉంటుంది. తక్కువ ఉష్ణోగ్రత ఉండి, ఎక్కువ తేమ ఉన్న, ఎక్కువ ఉష్ణోగ్రత ఉండి, తక్కువ తేమ ఉన్నా వేడి ప్రభావం ఒకేలా ఉంటుంది. ఉదాహరణకు 43 శాతం ఉష్ణోగ్రత ఉండి, గాలిలో తేమ 40 శాతం ఉన్నా, ఉష్ణోగ్రత 33 శాతం ఉండి, తేమ 95 శాతం ఉంటే ప్రభావం ఒకే స్థాయిలో ఉంటుంది. సాధారణంగా గ్రామీణ ప్రాంతాలకన్న పట్టణ ప్రాంతాల్లో, ముఖ్యంగా రాత్రి ఉష్ణోగ్రత ఎనిమిది డిగ్రీల సెల్సియస్ వరకు ఎక్కువగా ఉంటుందని నిపుణులు ఇదివరకే తేల్చి చెప్పారు. పట్టణ ప్రాంతాల్లో రాత్రి ఉష్ణోగ్రత ఎక్కువగా ఉండడానికి కారణం. పగటి ఉష్ణోగ్రతను గ్రహించిన కాంక్రీటు నిర్మాణాల నుంచి రాత్రి పూట ఉష్ణం బయటకు వెలువడడమే. గ్రామీణ ప్రాంతాల్లో చెట్లు చేమలు ఎక్కువగా ఉండడం, పట్టణ ప్రాంతాల్లో చెట్లు తక్కువగా ఉండి, కాంక్రీటు నిర్మాణాలు ఎక్కువగా ఉండడం ఉష్ణోగ్రత ఎక్కువగా ఉండడానికి కారణం. పట్టణంలో పేదలు నివసించే ప్రాంతంలో ఉష్ణోగ్రత మరీ ఎక్కువగా ఉంటుంది. వారిళ్లు చిన్నగా, దగ్గరదగ్గరగా ఉండడం, వెంటిలేటర్లు లేని రేకుల షెడ్లు అవడం అందుకు కారణం. బయట 41 డిగ్రీల సెల్సియస్ ఉంటే వారి రేకుల ఇళ్లలో 43 డిగ్రీల సెల్సియస్ ఉష్ణోగ్రత ఉంటుంది. బయట ఉష్ణోగ్రత 38 డిగ్రీలకు పడిపోయినప్పటికీ పేదల ఇళ్లలో ఉష్ణోగ్రత 40 డిగ్రీలు ఉంటుందని ‘కౌన్సిల్ ఆన్ ఎనర్జీ, ఎన్విరాన్మెంట్ అండ్ వాటర్’కు చెందిన నిపుణులు హెమ్ ధొలాకియా తెలిపారు. పేదల ఇళ్లు ఏ ప్రాంతంలో ఉన్నాయన్న అంశంపై కూడా వారి ఇళ్లలోని ఉష్ణోగ్రత ఆధారపడి ఉంటుంది. కొండ ప్రాంతంలో ఉంటే పగలు వేడి, రాత్రి చల్లగా, పట్టణం మధ్యలో ఉంటే మరో విధంగా ఉంటుంది. వడగాడ్పులు ఎప్పుడు వస్తాయి? కొండ ప్రాంతాల్లో ఉష్ణోగ్రత కనీసం 30 డిగ్రీల సెల్సియస్ దాటితే వడగాడ్పులు వీస్తాయి. అదే కోస్తా ప్రాంతంలో 37 డిగ్రీలు దాటితే, మైదాన ప్రాంతాల్లో 40 డిగ్రీల సెల్సియస్ దాటితే వడ గాల్పులు వీస్తాయి. దేశంలో గత 15 ఏళ్లుగా వడగాడ్పుల తీవ్రత పెరిగింది. అందుకు కారణం వాతావరణంలో వచ్చిన మార్పులు ఒకటైతే పట్టణ ప్రాంతాల్లో కాంక్రీటు నిర్మాణాలు భారీగా పెరిగి పోవడం మరో కారణం. ఓ ప్రాంతంలో వరుసగా రెండు రోజుల ఉష్ణోగ్రత 45 డిగ్రీలు కొనసాగితే ‘నేషనల్ డిజాస్టర్ మేనేజ్మెంట్ అథారిటీ’ మార్గదర్శకాల ప్రకారం నివారణ చర్యలు తీసుకోవాలి. అంటే రోడ్లను నీటితో తడపడం, చెట్లు ఎక్కువగా ఉన్న పార్కులను 24 గంటలపాటు తెరచి ఉంచడం, ప్రజలకు మజ్జిగ కేంద్రాలను ఏర్పాటు చేయడం, పేదలను వేసవి శిబిరాలకు తరలించడం లాంటి చర్యలు తీసుకోవాలి. అత్యధికంగా రాజస్థాన్‌లో 51 డిగ్రీలు ఈసారి దేశంలోనే అత్యధికంగా రాజస్థాన్‌లోని చురు ప్రాంతంలో 51 డిగ్రీల ఉష్ణోగ్రత వరుసగా మూడు రోజులు కొనసాగింది. బీహార్, గుజరాత్, హర్యానా, మధ్యప్రదేశ్, ఉత్తరప్రదేశ్, ఒడిశా వడగాడ్పుల ప్రభావం తీవ్రంగా ఉండింది. ఒక్క బీహార్లోనే ఈసారి వడగాడ్పులకు 70 మందికి పైగా మరణించారు. ఈసారి దేశంలోని 65.39 శాతం మంది ప్రజలు 40 శాతానికిపైగా ఉష్ణోగ్రతలో సంచరించారని, వారిలో 37 శాతం మంది రోజుకు పది గంటలకుపైగా ఉష్ణోగ్రతకు గురయ్యారని శాటిలైట్ ఛాయాచిత్రాల ద్వారా ‘డబ్లూఆర్ఐ ఇండియా సస్టేనబుల్ సిటీస్’కు చెందిన సీనియర్ ప్రాజెక్ట్ అసోసియేట్ పీ. రాజ్ భగత్ తేల్చి చెప్పారు. ‘వాయు’ తుపాను కారణంగా ఈసారి రుతుపవనాల్లో జాప్యం జరిగిందని ఆయన తెలిపారు. 1992 నుంచి 2015 మధ్య వడ దెబ్బకు దేశంలో 22,562 మంది మరణించడంతో దేశంలోని ప్రతిన గరం ‘హీట్‌వేవ్ యాక్షన్ ప్లాన్’ను అమలు చేయాలని కేంద్ర వాతావరణ శాఖ ఆదేశించింది. అయితే నగరపాలికా సంస్థలు చలి వేంద్రాలు ఏర్పాటు చేయడం మినహా పెద్దగా నివారణ చర్యలు తీసుకున్న దాఖలాలు కనిపించడం లేదు. క్లైమెట్ స్మార్ట్ నగరాలు అవశ్యం నగరాల్లో ఉష్ణోగ్రతలు పెరగకుండా నివారించేందుకు ‘క్లైమెట్–స్మార్ట్ నగరాలు’ శరణ్యమని నిపుణులు తెలియజేస్తున్నారు. వీధుల్లో, ప్రభుత్వ స్థలాల్లో, పార్కుల్లో చెట్లు పెంచడం, నీటి నిల్వ కుంటలను ఏర్పాటు చేయడం, అందరికి అందుబాటులోకి ప్రభుత్వ నల్లాలు తీసుకరావడం, వేడి గాలులను తట్టుకునేలా ఇళ్ల నిర్మాణం, ఏర్ కూలర్లలో కనీస ఉష్ణోగ్రతను 18 నుంచి 24కు పెంచడం, వాహన కాలుష్యాన్ని నియంత్రించడం లాంటి చర్యలు ‘క్లైమెట్–స్మార్ట్ నగరాలు’ ప్రణాళికలో ఉంటాయి. -
ఆ 8 ప్రాంతాలు మండిపోతున్నాయి...
సాక్షి, న్యూఢిల్లీ : భూగోళం అగ్నిగోళంగా మారుతోంది. ప్రపంచంలోనే అట్టుడుకిపోతోన్న 15 ప్రాంతాల్లో ఉత్తర, కేంద్ర భారత్‌లోని ఎనిమిది ప్రాంతాలు చోటు చేసుకున్నాయి. వాటిల్లో రాజస్తాన్‌లోని చురు, గంగానగర్ ప్రాంతాలున్నాయని ‘ఎల్ డొరాడో’ అనే వాతావరణ సంస్థ వెబ్సైట్ సోమవారం వెల్లడించింది. ఆదివారం నాడు చురులో 48.9, గంగానగర్‌లో 48.6 డిగ్రీల సెల్సియస్‌కు ఉష్ణోగ్రతలు నమోదయ్యాయని తెలిపింది. వాటితోపాటు రాజస్తాన్‌లోని ఫలోడి, బికనర్, జైసాల్మర్, మధ్యప్రదేశ్‌లోని నౌగాంగ్, కజూరహో, హర్యానాలోని నార్నౌల్ ప్రాంతాలు మండిపోతున్నాయి. నైరుతి, కేంద్ర భారత్ ప్రాంతాల్లో తీవ్ర ఉష్ణోగ్రతలు మరో రెండు రోజులపాటు కొనసాగి తగ్గుముఖం పట్టే అవకాశాలు ఉన్నాయని భారత వాతావరణ శాఖ తెలిపింది. పశ్చిమ రాజస్థాన్, మధ్యప్రదేశ్‌లోని పలు ప్రాంతాల్లో తీవ్ర వడగాల్పులు, తూర్పు రాజస్థాన్, జమ్మూ కశ్మీర్, హిమాచల్ ప్రదేశ్, పంజాబ్, హర్యానా, చండీగఢ్, ఢిల్లీ, ఉత్తరప్రదేశ్, సౌరాష్ట్ర, కచ్, విదర్భ, మరాఠ్వాడ ప్రాంతాల్లో మోస్తారు వడగాల్పులు వీచే అవకాశం ఉందని వాతావరణ శాఖ హెచ్చరించింది. పాకిస్థాన్, రాజస్తాన్ ఎడారుల్లో ఉత్పన్నమైన వేడి కారణంగా ఈ వడగాలులు వీస్తున్నాయని, రాళ్లవాన, ఈదురు గాలులతో కూడిన వర్షాల వల్ల మరో రెండు రోజుల్లో వాతావరణం చల్లబడే అవకాశం ఉందని వెల్లడించింది. రాజస్తాన్‌లోని పలు ప్రాంతాల్లో ఆదివారం ఉష్ణోగ్రతలు 44 డిగ్రీల సెల్సియస్‌ను దాటడంతో ఓ రైతు సహా ముగ్గురు మరణించారు. తూర్పు, ఉత్తర భారత్ ప్రాంతాల్లో జూన్ 7 నుంచి 9 వరకు వర్షాలు పడే అవకాశం ఉందని, పశ్చిమ బెంగాల్, ఒడిశా, కర్ణాటక, కేరళ మారుమూల ప్రాంతాల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని భారత వాతావరణ శాఖ తెలిపింది. -
మరింత తీవ్రంకానున్న ఉష్ణోగ్రతలు
-
రాత్రి సమయంలోనూ తగ్గని సెగలు
-
నిప్పుల గుండాలుగా తెలుగు రాష్ట్రాలు
-
బెదిరిపోతున్న బెజవాడ వాసులు..
సాక్షి, అమరావతి/ హైదరాబాద్ : రెండు తెలుగు రాష్ట్రాలు నిప్పుల గుండాలను తలపిస్తున్నాయి. భానుడి ప్రతాపంతో తెలుగు రాష్ట్రాల ప్రజలు అల్లాడుతున్నారు. అలాగే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం అగ్నిగుండాన్ని తలపిస్తోంది. రోహిణీ కార్తె ప్రవేశించిన ఒక రోజులోనే భానుడు తన ప్రతాపం చూపిస్తున్నాడు. సాధారణం కంటే మూడు, ఆరు డిగ్రీల అధిక ఉష్ణోగ్రతలతో దక్షిణ కోస్తాంధ్ర, రాయలసీమ ప్రాంతాలు అట్టుడికిపోతున్నాయి. జనం ఉక్కపోతతో అల్లాడిపోతున్నారు. గుంటూరు, కృష్ణా, చిత్తూరు, వైఎస్ఆర్, నెల్లూరు జిల్లాల్లో వడగాల్పులు వీస్తున్నాయి. గుంటూరు జిల్లా రెంటచింతల మండలంలోని జంగమహేశ్వరంలో 46డిగ్రీలు, తిరుపతి, విజయవాడ, రాజధాని అమరావతిలో 45డిగ్రీల ఉష్ణోగ్రతలు నమోదవుతున్నట్టు భారత వాతావరణ శాఖ తెలిపింది. రానున్న మూడు రోజులు కోస్తాంధ్ర, రాయలసీమల్లో ఉష్ణోగ్రతలు మూడు, నాలుగు డిగ్రీలు అధికంగా నమోదవుతాయని అంచనా వేస్తున్నారు. మరో వారంపాటు ఉష్ణోగ్రతలు మరింతగా పెరిగే పరిస్థితులు ఉన్నాయని చెప్తున్నారు. ఏపీలో కనిష్ట ఉష్ణోగ్రతలు కూడా పెరుగుతున్నాయి. రాత్రి వేళ పలుచోట్ల 28 నుంచి 33 డిగ్రీలు నమోదవుతున్నాయి. అంటే ఇవి సాధారణం కంటే నాలుగు, ఆరు డిగ్రీలు అధికం. ఫలితంగా రాత్రి వేళ కూడా ఉష్ణతీవ్రతతో కూడిన గాలులు వీస్తున్నాయి. మరోవైపు వడగాల్పులకు విజయనగరం జిల్లాలో ఒకరు, గుంటూరు జిల్లాలో ఇద్దరు మృతిచెందినట్టు సమాచారం. బెదిరిపోతున్న బెజవాడ వాసులు భానుడు ప్రతాపానికి బెజవాడ వాసులు బెదిరిపోతున్నారు. రోళ్లు పగిలే రోహిణీ కార్తె ఎండలతో ఉక్కిరిబిక్కిరి అవుతున్నారు. ఉదయం నుంచి బయటకు రావాలంటేనే జంకుతున్నారు. రోహిణీ కార్తెలో రోళ్లు పగిలే ఎండలు ప్రజలకు చుక్కలు చూపిస్తున్నాయి. గతంలో ఎన్నడూ లేని విధంగా రికార్డు స్థాయిలో ఉష్ణోగ్రతలు నమోదు అవుతుండటం, గాలిలో తేమ శాతం పెద్దఎత్తున పడిపోతుండటంతో ప్రజలు అల్లాడిపోతున్నారు. ఇక తెలంగాణ రాష్ట్రంలోని 20 ప్రాంతాల్లో 47 డిగ్రీలు కన్నా ఎక్కువ ఉష్ణోగ్రతలు నమోదు కావడం, నిజామాబాద్‌లో 17, హైదరాబాద్‌లో 20 శాతానికి గాలిలో తేమ శాతం పడిపోవడం ఆందోళన కలిగిస్తోంది. తెలంగాణలోని 20 గ్రామాల్లో అత్యధిక ఉష్ణోగ్రతలు నమోదు కావడంతో... వాతావరణ శాఖ ప్రమాద హెచ్చరికలు జారీ చేసింది. మంచిర్యాల జిల్లా వేమన్‌పల్లి మండలం నీల్వాయి గ్రామంలో రాష్ట్రంలోనే అత్యధికంగా 47.8 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదయిందని ప్లానింగ్ డెవలప్మెంట్ సొసైటీ వెల్లడించింది. సంబంధిత వీడియో కోసం ఇక్కడ క్లిక్ చేయండి -
ఆంధ్రప్రదేశ్‌లో భానుడి భగభగలు
-
సైరా సినిమాలో సైడ్ ఆర్టిస్టు మృతి
సాక్షి, హైదరాబాద్: ఎండ తీవ్రతకు ఓ రష్యన్ వ్యక్తి మృతి చెందిన ఘటన గచ్చిబౌలి పోలీస్‌స్టేషన్ పరిధిలో చోటు చేసుకుంది. వివరాల ప్రకారం.. రష్యా దేశానికి చెందిన అలెగ్జాండర్ (38) టూరిస్ట్ వీసాపై మార్చి నెలలో హైదరాబాద్‌కు వచ్చాడు. మంగళవారం ఉదయం 10.30 గంటల సమయంలో గచ్చిబౌలిలోని డీఎల్ఎఫ్ గేట్ నెంబర్–1 వద్ద అపస్మారక స్థితిలో పడి ఉండటంతో పోలీసులు వెంటనే కొండాపూర్ ఏరియా ఆస్పత్రికి తరలించారు. అక్కడి వైద్యుల సూచన మేరకు గాంధీ ఆస్పత్రిలో చేర్పించారు. అలెగ్జాండర్ చికిత్సపొందుతూ మంగళవారం సాయంత్రం మృతి చెందినట్లు వైద్యులు తెలిపారు. మృతుడికి చెందిన కెమెరాలోని ఫొటోల ఆధారంగా ఈ నెల 4, 5వ తేదీల్లో సైరా సినిమాలో సైడ్ ఆర్టిస్టుగా నటించినట్లు పోలీసులు గుర్తించారు. గచ్చిబౌలి సమీపంలోని ఓ హోటల్లో నివాసం ఉంటున్న అలెగ్జాండర్, ఈ నెల 10 హోటల్ నుంచి ఖాళీ చేశాడు. తర్వాత రోడ్లపైనే తిరుగుతూ కనిపించినట్లు పోలీసులు పేర్కొంటున్నారు. వడదెబ్బ కారణంగానే అలెగ్జాండర్ మృతి చెందాడని, గోవాలో ఉండే అతని స్నేహితుడు బోరెజ్‌కు సమాచారం అందించామని పోలీసులు తెలిపారు. బోరెజ్ వచ్చిన తరువాతే పోస్టుమార్టం నిర్వహిస్తామని పోలీసులు పేర్కొన్నారు. ఈ మేరకు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు. -
వేడిని పెంచుతున్న ఫుట్‌పాత్‌లు
సాక్షి, న్యూఢిల్లీ : సుందర నగరాల్లో సాధారణంగా రోడ్ల పక్కన ఎండ ఎక్కువ పడకుండా ఎల్తైన చెట్లు, పక్కన పాదాచారుల కోసం సిమ్మెంట్ టైల్స్‌తో కూడిన ఫుట్‌పాత్‌లు కనిపిస్తాయి. పగటి పూట ఎండ వేడిని తగ్గించేందుకు రోడ్లు పక్కనున్న ఎల్తైన చెట్లు ఎంతగానో ఉపయోగపడుతాయి. సిమ్మెంట్ ఫుట్‌పాత్‌లు, పక్కనుండే పలు అంతస్తుల భవనాలు పగటి పూట ఎండలోని వేడిని గ్రహించి రాత్రి పూట వాతావరణంలోకి వదులుతాయి. తద్వారా రాత్రిపూట వాతావరణం ఆశించినంత లేదా కావాల్సినంత చల్లగా ఉండక పోవచ్చు. మానవులు ఆరోగ్యంగా ఉండాలంటే రాత్రిపూట వాతావరణం చల్లగా ఉండాలనేది వైద్యులు ఎప్పుడే తేల్చి చెప్పారు. అయితే సిమ్మెంట్ ఫుట్‌పాత్‌లు, ఎల్తైన కాంక్రీటు భవనాలు రాత్రి పూట వాతావరణం వేడికి కారణం అవుతున్నాయని శాస్త్రవేత్తలు ఇప్పుడు కనిపెట్టారు. మాడిసన్లోని విస్కాన్సిన్ యూనివర్శిటీ పరిశోధకులు సైకిల్ మోటర్లకు జీపీఎస్ డివైస్‌లు, ఉష్ణోగ్రత సెన్సర్లు అమర్చి పగటి పూట, రాత్రివేళ వివిధ రోడ్లలో వాటిని నడిపి ఉష్ణోగ్రతలను నమోదు చేశారు. ఏ ప్రాంతంలో ఉష్ణోగ్రతలు హెచ్చుతగ్గుల్లో ఉన్నాయో గమనించి ఎందుకున్నాయో తెలుసుకునేందుకు ఆయా ప్రాంతాలకు వెళ్లి అక్కడి పరిసరాలను పరిశీలించారు. కింద కాంక్రీట్ ఫుట్పాతులున్నా, పైన ఛత్రిలాగా గుబురైన చెట్లు ఉన్న చోట వేడి తక్కువగా ఉండడం, పక్కన ఎల్తైన కాంక్రీటు భవనాలుంటే వేడి స్థాయిలో మార్పులు ఉండడం గమనించారు. పార్కుల వద్ద ఎక్కువ చెట్లు ఉండడం వల్ల అక్కడి వాతావరణం ఎక్కువగా చల్లగా ఉండడం తెల్సిందే. ఆ ప్రాంతంలో నివసిస్తున్న ప్రజలు ఇతర వేడి ప్రాంతాలకు పనులపై తరచూ వెళ్లి రావడం వల్ల కూడా (చలి, వాతావరణంల మధ్య సర్దుబాటు కుదరక) వారి ఆరోగ్యం దెబ్బతింటుందట. పల్లెల్లో అంతగా చెట్లు లేకున్నా పట్టణాల్లో ఎక్కువ చెట్లున్నా పట్టణాల్లో వాతావరణంలో వేడి ఎక్కువగా ఉండడానికి కారణం (వాహనాల కాలుష్యాన్ని మినహాయించి) వేడిని గ్రహించి రాత్రికి దాన్ని వదిలేసే కాంక్రీట్ భవనాలే. అందుకని కాంక్రీటు భవనాల మధ్య చెట్లు ఉండడంతోపాటు కాంక్రీట్ ఫుట్‌పాత్‌లకు బదులు, గడ్డితో కూడిన ఫుట్‌పాత్‌లు ఉండడం మంచిదని పరిశోధకులు సూచిస్తున్నారు. చెట్లు పార్కులకే పరిమితం కాకుండా ప్రతివీధి, ప్రతి సంధులో చెట్లు ఉండడం వల్ల వాతావరణం చల్లగా ఉండడంతోపాటు సమ ఉష్ణోగ్రత ఉండి ప్రజల ఆరోగ్యానికి ఢోకా ఉండదని వారంటున్నారు. -
వడదెబ్బతో బస్సులోనే ప్రభుత్వ ఉద్యోగి మృతి
సాక్షి, గోకవరం : వడదెబ్బతో ఓ ప్రభుత్వ ఉద్యోగి బస్సులోనే మృత్యువాత పడ్డారు. తూర్పు గోదావరి జిల్లా గోకవరం ఆర్టీసీ డిపోకు చెందిన బస్సులో ఆదివారం ఈ సంఘటన చోటుచేసుకుంది. కాకినాడ అటవీశాఖలో పని చేస్తున్న మడి గంగరాజు ఇవాళ ఉదయం భార్యతో కలిసి కుమారుడి దగ్గరకు బయల్దేరారు. ఎండ తీవ్రత అధికంగా ఉండటంతో గంగరాజు మధ్యలోనే అస్వస్థతకు గురై... బస్సులోనే మృతి చెందారు. అప్పటివరకూ తనతో మాట్లాడిన భర్త విగతజీవిగా మారడంతో భార్య భోరున విలపించారు. ఈ సంఘటన స్థానికంగా విషాదాన్ని నింపింది. -
ఎండల తీవ్రతపై సీఎస్ సమీక్ష
సాక్షి, అమరావతి : రాష్ట్రంలో ఎండల తీవ్రతపై ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఎల్వీ సుబ్రహ్మణ్యం ఆదివారం సమీక్ష నిర్వహించారు. ముందస్తు చర్యలు తీసుకోవాల్సిందిగా ఆయన ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్లను ఆదేశించారు. ప్రజల్లో అవగాహన పెంచి జాగ్రత్తలు తీసుకునేలా చూడాలని ఆదేశాలు ఇచ్చారు. అలాగే రాష్ట్రవ్యాప్తంగా విస్తృతస్థాయిలో చలివేంద్రాలు ఏర్పాటు చేయాలని, తాగునీటితో పాటు, మజ్జిగ కూడా అందించేలా చర్యలు తీసుకోవాలని సూచించారు. ప్రభుత్వేతర సంస్థలు, స్వచ్ఛంద సంస్థలు, ధార్మిక సంస్థలను చలివేంద్రాలు ఏర్పాటు చేసేలా ప్రోత్సహించాలని అన్నారు. ఆస్పత్రులు, దేవాలయాలు, చర్చ్‌లు, మసీదులు, రైల్వేస్టేషన్లు, బస్టాండ్లలో తాగునీటి వసతి కల్పించాలని, ప్రజలకు అందుబాటులో ఉండేలా మందులు, అంబులెన్సులతో వైద్యబృందాలు సిద్ధంగా ఉండాలన్నారు. పశువుల కోసం నీళ్లు నింపిన తొట్టెలు ఏర్పాటు చేయాలని, వేసవి కాలంలో తీసుకోవాల్సిన రక్షణ చర్యలపై ప్రజలకు మీడియా ద్వారా విస్తృత ప్రచారం కల్పించాలని సీఎస్ సూచనలు చేశారు. కాగా రాష్ట్రం నిప్పుల కొలిమిగా మారిన విషయం తెలిసిందే. పలుచోట్ల 45 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదు అయింది. ఇక తూర్పు గోదావరి జిల్లా తాళ్ళరేవు మండలం పాత కోరంగిలో వడదెబ్బ తగిలి వృద్ధ దంపతులు మృతి చెందారు. నిన్న వ్యవసాయ పనులకు వెళ్లిన గుబ్బల కామరాజు, సుభద్రమ్మ వడదెబ్బకు గురయ్యారు. ముందుగా భార్య, అనంతరం భర్త మృతి చెందాడు. -
రాబోయే వారం రోజులు ఎండలే ఎండలు...
సాక్షి, హైదరాబాద్ : మార్చిలోనే ఎండలు మండిపోతున్నాయి. మే నెల రాకముందే సూర్యుడు... జనాలకు చుక్కలు చూపిస్తున్నాడు. అయితే రాబోయే వారం రోజులు మరింతగా ఎండలు మండిపోనున్నాయి. సాధారణం కన్నా ఆరు డిగ్రీల అధిక ఉష్ణోగ్రతలు నమోదు కానున్నట్లు కేఎల్ యూనివర్సిటీ వాతావరణ విభాగం వెల్లడించింది. మార్చి 25వ తేదీ వరకూ ఆంధ్రప్రదేశ్‌లో తూర్పు గోదావరి, పశ్చిమ గోదావరి, కృష్ణా, గుంటూరు, ప్రకాశం, నెల్లూరు,వైఎస్సార్ జిల్లాల్లో ఉష్ణోగ్రత అధికంగా ఉంటుందని, అదేవిధంగా తెలంగాణలో కూడా ఉష్ణోగ్రతలు ఎక్కువగా ఉంటాయని పేర్కొంది. ‘గత 69 సంవత్సరాల్లో (1951-2018) మార్చి నెలలో ఇప్పటివరకూ చూడని విధంగా ఉష్ణోగ్రతలు నమోదు అవుతాయి. ఇవి సాధారణ ఉష్ణోగ్రతల కంటే ఆరు సెల్సియన్ ఎక్కువగా ఉంటాయి. రెండు రాష్ట్రాల్లోని ప్రజల అప్రమత్తంగా ఉండాలి. ఎక్కువ మొత్తంలో ద్రవ పదార్థాలు, నీళ్లు తాగాలి. ఎండ సమయంలో ప్రయాణాలు వాయిదా వేసుకోవడం, అవసరం అయితే తప్ప బయటకు వెళ్లకుండా ఉండాలి’ అని వాతావరణ శాఖ సూచనలు చేసింది. -
ఈసారి ఎండలు భగభగలే!
-
ఈసారి భగభగలే!
సాక్షి, హైదరాబాద్: సీజన్ ప్రకారం మార్చి ఒకటో తేదీ (శుక్రవారం) నుంచి వేసవి ప్రారంభమైంది. జూన్ ఒకటో తేదీ వరకు ఎండాకాలం కొనసాగనుంది. కానీ పదిరోజుల కింది నుంచే ఎండలు ఠారెత్తిస్తున్నాయి. ఈసారి ఏప్రిల్, మే నెలల్లో భానుడి ప్రతాపం ఎలా ఉంటుందో ఊహించుకునేందుకే భయమేస్తోంది. రానున్న రోజుల్లో రాజస్తాన్, ఉత్తరప్రదేశ్ రాష్ట్రాల నుంచి తెలంగాణపైకి వడగాల్పులు వీస్తాయని వాతావరణ శాఖ స్పష్టం చేసింది. దీంతోపాటుగా దేశంలో వడగాడ్పులు అధికంగా వచ్చే డేంజర్ జోన్లో తెలంగాణ ఉండటంతో ఈసారి ఇక్కడ భానుడి భగభగలు తప్పవని స్పష్టమైంది. రాష్ట్రంలో కొన్నిచోట్ల 47 నుంచి 49 డిగ్రీల సెల్సియస్ వరకు ఉష్ణోగ్రతలు నమోదవుతాయని హైదరాబాద్ వాతావరణ కేంద్రం హెచ్చరించింది. గతేడాది కంటే అధికంగా ఉష్ణోగ్రతలు నమోదవుతాయని అధికారులు స్పష్టం చేశారు. ఆదిలాబాద్, భద్రాచలం వంటి చోట్లనైతే 48–49 డిగ్రీల వరకు ఉష్ణోగ్రతలు నమోదు కానున్నాయి. హైదరాబాద్‌లో 47 డిగ్రీల వరకు ఉష్ణోగ్రతలు చేరుకునే అవకాశముంది. ఈ మార్పులు, సూచనలతో ప్రభు త్వం కూడా వేసవి కార్యాచరణ ప్రణాళికను తక్షణమే అమలు చేయాల్సిన పరిస్థితి తలెత్తింది. మూడు నెలల్లో 20 రోజులపాటు వడగాడ్పులే వేసవిలో ఏదో ఒక నిర్దిష్టమైన రోజున సాధారణంగా ఉండాల్సిన ఉష్ణోగ్రత కంటే ఐదారు డిగ్రీలు అధికంగా ఉంటే ఆ వాతావరణ పరిస్థితిని ‘వడగాడ్పులు’అంటారు. సాధారణం కంటే ఏడు డిగ్రీల వరకు ఉష్ణోగ్రత అధికంగా నమోదైతే తీవ్రమైన వడగాడ్పులుగా పరిగణిస్తారు. 47 డిగ్రీల వరకు చేరుకుంటే తీవ్రమైన వడగాడ్పులనే అంటారు. ఇలాంటి పరిస్థితి.. తెలంగాణలో వచ్చే మూడు నెలల్లో 20 రోజుల వరకు నమోదయ్యే అవకాశముందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం హెచ్చరించింది. వడగాడ్పులు వచ్చే పరిస్థితిని వాతావరణ శాఖ ముందే గుర్తించగలదు. కాబట్టి జాగ్రత్తలు తీసుకోవడానికి వీలు కుదురుతుంది. 2016 సంవత్సరం వేసవిలో ఏకంగా 27 రోజులు వడగాడ్పులు తెలంగాణలో నమోదయ్యాయి. వడగాడ్పులతో గతంలో రాష్ట్రంలో పెద్ద ఎత్తున మరణాలు సంభవించిన సంగతి తెలిసింది. 2015లో అత్యధికంగా 541 మంది వడదెబ్బతో చనిపోయారు. ఇక ఉష్ణోగ్రత సాధారణంగా ఉన్నా గాలిలో తేమ శాతం పెరిగితే దాని తీవ్రత మరింత ఎక్కువగా ఉంటుంది. ఉదాహరణకు ఉష్ణోగ్రత 34 డిగ్రీలున్నా.. వాతావరణంలో తేమ 75% ఉంటే.. అది సాధారణంగా 49 డిగ్రీల ఉష్ణోగ్రతతో సమానం. ఉష్ణోగ్రత 31 డిగ్రీలుగా ఉండి.. తేమ 100% ఉంటే అది కూడా 49 డిగ్రీల ఉష్ణోగ్రతతో సమానం. కనుక ఉష్ణోగ్రత, వాతావరణంలో తేమ శాతాన్ని బట్టి కూడా తీవ్రతలో హెచ్చుతగ్గులుంటాయి. ఎండలు తీవ్రంగా ఉంటే రెడ్ అలర్ట్ వాతావరణశాఖ ఎండల తీవ్రతను బట్టి ప్రజలను అప్రమత్తం చేస్తుంది. సాధారణం కంటే ఆరు డిగ్రీలపైగా ఉష్ణోగ్రతలు నమోదైతే అత్యంత తీవ్రమైన ఎండగా గుర్తించి రెడ్ అలర్ట్ జారీచేస్తారు. సాధారణం కంటే నాలుగైదు డిగ్రీల వరకు అధికంగా ఉష్ణోగ్రతలు నమోదైతే ఆరెంజ్ అలర్ట్ జారీచేస్తారు. సాధారణ ఉష్ణోగ్రతల కంటే కొద్దిగా ఎక్కువగా నమోదైతే వేడి రోజుగా గుర్తించి ఎల్లో (హీట్‌వేవ్ వార్నింగ్) అలర్ట్ ఇస్తారు. సాధారణం కంటే తక్కువ ఉష్ణోగ్రతలు నమోదైతే వైట్ అలర్ట్ జారీచేస్తారు. ఏటేటా పెరుగుతున్న ఉష్ణోగ్రతలు 1971 నుంచి ఇప్పటివరకు ప్రతి ఏటా ఉష్ణోగ్రతలు పెరుగుతూనే ఉన్నాయని హైదరాబాద్ వాతావరణ కేంద్రం డైరెక్టర్ వైకే రెడ్డి వెల్లడించారు. ఈ మేరకు శుక్రవారం ఆయన విలేకరులతో మాట్లాడారు. మార్చి ఒకటో తేదీ నుంచి సమ్మర్ క్యాలెండర్ ఇయర్ ప్రారంభం అవుతుందన్నారు. ఈ వేసవిలో తెలుగు రాష్ట్రాల్లో వడగాడ్పులు ప్రతిఏటా కంటే ఈ ఏడాది కొంచెం ఎక్కువ ఉంటాయని ఆయన హెచ్చరించారు. తెలంగాణలో ప్రతి సంవత్సరం కంటే ఈ ఏడాది సాధారణం కంటే 0.5 డిగ్రీల నుంచి 1 డిగ్రీ వరకు అధికంగా ఉంటాయన్నారు. గతేడాది కంటే అధికంగా నమోదవుతాయన్నారు. 2010లో వడగాడ్పుల ప్రభావం తెలుగు రాష్ట్రాలపై చాలా తీవ్రంగా ఉందన్నారు. 2016లో ఆంధ్రప్రదేశ్‌లో వడదెబ్బ మరణాలు 720కి పైగా నమోదు అయ్యాయని గుర్తుచేశారు. 2015 తెలంగాణ రాష్ట్రంలో భద్రాచలం ప్రాంతంలో ఉష్ణోగ్రత రికార్డు స్థాయిలో 47 డిగ్రీలకు పైనే నమోదైందన్నారు. – వైకే రెడ్డి, డైరెక్టర్, హైదరాబాద్ వాతావరణ కేంద్రం -
హైదరాబాద్‌లోనూ 45 డిగ్రీల ఉష్ణోగ్రతలు!
-
వడగాడ్పులతో ఉక్కిరిబిక్కిరి
సాక్షి, న్యూఢిల్లీ : రానున్న కొద్దిరోజులు దేశవ్యాప్తంగా వడగాడ్పులు వీస్తాయని, కొన్ని ప్రాంతాల్లో ఉష్ణోగ్రతలు 48 డిగ్రీల సెల్సియస్ వరకూ చేరుకుంటాయని భారత వాతావరణ కేంద్రం (ఐఎండీ) హెచ్చరించింది. తెలంగాణ, ఢిల్లీ, ఛండీఘడ్, యూపీ, హర్యానా, పంజాబ్, మధ్యప్రదేశ్, రాజస్థాన్, మరాఠ్వాడా ప్రాంతాల్లో గరిష్ట ఉష్ణోగ్రతలు సాధారణం కన్నా 1.6 నుంచి 3 డిగ్రీల వరకూ అధికంగా నమోదయ్యాయని పేర్కొంది. అధిక ఉష్ణోగ్రతలతో వడదెబ్బ, ఉక్కపోతలకు లోనయ్యే ప్రమాదం ఉందని, ఈ పరిస్థితుల దృష్ట్యా ప్రజలు తగిన జాగ్రత్తలు పాటించాలని తెలిపింది. రానున్న ఐదురోజుల్లో వడగాడ్పులు, అధిక ఉష్ణోగ్రతలు నమోదవుతాయని ఐఎండీ అంచనా వేసింది. పగటి ఉష్ణోగ్రతలు మూడు నుంచి ఐదు డిగ్రీల సెల్సియస్ వరకూ పెరుగుతాయని పేర్కొంది. ఇక తెలంగాణలో నిజామాబాద్, ఆదిలాబాద్ జిల్లాల్లో రికార్డు స్థాయిలో ఉష్ణోగ్రతలు నమోదవుతాయని, రాష్ట్రంలోని ఇతర ప్రాంతాల్లోనూ తీవ్ర వడగాడ్పులు వీస్తాయని తెలిపింది. -
కొండెక్కిన కోడి
నిజామాబాద్ అర్బన్: కోడి ధర కొండెక్కింది. చికెన్ ధర ఒక్కసారిగా రూ. 270కి చేరింది. వారం వ్యవధిలో రూ.50 పెరగడం గమనార్హం. నిజామాబాద్‌లో గత వారం స్కిన్లెస్ చికెన్ ధర రూ.220. అయితే, ఆదివారం ఒక్కసారిగా రూ.50 పెంచేసి రూ.270కి కిలో చొప్పున విక్రయించారు. ఎండలు మండిపోతున్న తరుణంలో కోళ్ల దిగుమతి తగ్గిపోయిందని, అందుకే ధర పెరుగుతోందని వ్యాపారులు చెబుతున్నారు. వడగాలుల తీవ్రతకు పౌల్ట్రీ ఫామ్‌లలో కోళ్లు చనిపోతున్నాయంటున్నారు. ఎండల తీవ్రత పెరిగే కొద్దీ చికెన్ ధరలు మరింత పెరిగే అవకాశముందని చెబుతున్నారు. చికెన్ ధర పెరుగుతుండడంతో మాంస ప్రియులు ఆందోళన చెందుతున్నారు. -
మబ్బులు తాత్కాలికమే
నరసాపురం : భానుడు ఉగ్రరూపం దాల్చడంతో జిల్లావాసులు ఎండల్ని తట్టుకోలేక ఆపసోపాలు పడుతున్నారు. బయటకు రావడానికి భయపడుతున్నారు. అత్యవసర పనులపై రోడ్డెక్కుతున్న వారికి చుక్కలు కనిపిస్తున్నాయి. ఇదే పరిస్థితి జిల్లాలో మరో వారం రోజులు కొనసాగే అవకాశం ఉందని వాతావరణ శాఖ అధికారులు చెబుతున్నారు. ఈనెల 28వ తేదీ వరకూ అత్యధిక ఉష్ణోగ్రతలు నమోదయ్యే అవకాశం ఉందని విశాఖలోని వాతావరణ కేంద్రం హెచ్చరికలు జారీ చేసింది. రెండు రోజులుగా ఉష్ణోగ్రతలు కాస్త తగ్గినప్పటికీ అది తాత్కాలికమేనని వాతావరణ అధికారులు పేర్కొంటున్నారు. నైరుతి రుతు పవనాలు సమీపించే వరకూ పరిస్థితి ఎలా ఉంటుందనేది చెప్పలేమంటున్నారు. క్యుములోనింబస్ మేఘాల ప్రభావంతో అక్కడడక్కడా ఈదురు గాలులతో కూడిన వర్షాలు కూడా పడే అవకాశం ఉన్నప్పటికీ.. మరో వారం రోజులపాటు వేడిగాలుల తీవ్రత ఉంటుందని స్పష్టం చేస్తున్నారు. మూడేళ్లలో ఎప్పుడూ లేదు ఈ ఏడాది ఉష్ణోగ్రతల ప్రభావం తెలుగు రాష్ట్రాల్లో ఎక్కువగా ఉంది. మన జిల్లాపై దీని తీవ్రత ఈ ఏడాది మరింత ఎక్కువైంది. జిల్లాలో ఇప్పటికే మూడేళ్లలో ఎన్నడూలేనంత స్థాయిలో ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. గడచిన 20 రోజుల్లో అత్యధికంగా 47 డిగ్రీలు, అత్యల్పంగా 29 డిగ్రీలు ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. 15 రోజుల నుంచి సగటున 40 డిగ్రీలు దాటి ఉష్ణోగ్రత నమోదవుతోంది. గత ఏడాది మే నెలలో ఇన్ని రోజులపాటు, ఈ స్థాయిలో ఉష్ణోగ్రతలు లేవు. అప్పట్లో వేసవి సీజన్ మొత్తం తీసుకుంటే 40–47 డిగ్రీల మధ్య ఉష్ణోగ్రతలు 11 రోజుల పాటే నమోదైనట్టు వాతావరణ శాఖ చెబుతోంది. 2014, 2015 సంవత్సరాల్లోనూ ఇదే రకమైన పరిస్థితి. మొత్తంగా ఈ ఏడాది ఎండలు జిల్లా వాసులను మాడ్చేస్తున్నాయి. ఇప్పటికే వడదెబ్బకు గురై జిల్లాలో 50 మందికి పైగా మృతి చెందారు. ఇదిలావుండగా.. నైరుతి రుతుపవనాలు అండమాన్ ద్పీపాన్ని తాకాయి. ఈ నెలాఖరు నాటికి కేరళ తీరాన్ని తాకుతాయని వాతావరణ అధికారులు చెబుతున్నారు. రుతుపవనాలు మన జిల్లా వరకు వచ్చి.. నేల పూర్తిస్థాయిలో చల్లబడాలంటే జూన్ 10–15 తేదీల వరకు ఆగాలి్సందేనంటున్నారు. పెరిగిన తేమ శాతం వాతావరణంలో 20 రోజులుగా భారీ మార్పులు కనిపిస్తున్నాయి. పగటిపూట గాలిలో తేమశాతం 65–70 మధ్య నమోదవుతోంది. ఉష్ణోగ్రతలు కూడా 45 డిగ్రీలు నమోదవుతున్నాయి. గాలిలో తేమ శాతం పెరగడం, ఉష్ణోగ్రతలు ఎక్కువగా ఉండటంతో ప్రజలను వడగాడ్పు, ఉక్కబోత ఇబ్బంది పెడుతున్నాయి. అనేకమంది డీహైడ్రేషన్‌కు గురవుతున్నారు. గాలిలో తేమశాతం తగ్గి.. ఇదే స్థాయిలో ఉష్ణోగ్రతలు నమోదైనా ఇబ్బందిగానే ఉంటుందని చెబుతున్నారు. అలాంటప్పుడు చెమటలు తక్కువగా పట్టి వడగాడ్పు తీవ్రత పెరుగుతుంది. ఈ నెలలో 19, 20, 21 తేదీల్లో జిల్లా ప్రజలు ఇదే పరిస్థితిని ఎదుర్కొన్నారు. రాత్రి పూట కూడా గాలిలో తేమశాతం 75–85 మధ్య ఉంటోంది. దీనివల్ల రాత్రి ఉష్ణోగ్రతలు 32 డిగ్రీల పైనే నమోదవుతున్నాయి. దీంతో రాత్రి వేళ ప్రజలు ఉక్కబోతకు గురై నీరసించి కంటిమీద కునుకులేకుండా ఇబ్బందులు పడుతున్నారు. ఆరోగ్యంపై తీవ్ర ప్రభావం పెరిగిన ఉష్ణోగ్రతలు ఆరోగ్యంపై తీవ్ర ప్రభా వం చూపుతాయని నరసాపురం పట్టణానికి చెందిన వైద్యుడు డాక్టర్ బళ్ల మురళి చెప్పారు. చెమట, ఉక్కబోతతో కూడిన వేడి గాలుల ప్రభావం వల్ల ఆస్త్మా రోగులు గుండెపోటుకు గురయ్యే అవకాశం ఉందన్నారు. వడగాడ్పుల బారిన పడితే వయసు, వ్యాధులతో సంబంధం లేకుండా మరణాలు సంభవిస్తాయన్నారు ఉక్కబోత ఎక్కువ పగటిపూట గాలిలో తేమశాతం పెరగడం వల్ల ఉక్కబోత ఎక్కువైంది. రానున్న రోజుల్లో ఇది మరింత ఎక్కువ కావచ్చు. తేమ శాతం తగ్గి ఉష్ణోగ్రతలు ఇలాగే కొనసాగితే వడగాడ్పుల తీవ్రత పెరుగుతుంది. ఏదేమైనా మరో వారం రోజులపాటు ఉష్ణోగ్రతలు ఇదేవిధంగా కొనసాగే అవకాశం ఉంది. ఇదే సందర్భంలో అల్పపీడనాలకూ ఆస్కారం కనిపిస్తోంది. క్యుములోనింబస్ మేఘాల కారణంగా కొద్దిపాటి వర్షాలు పడొచ్చు. ఏదేమైనా ఎండల విషయంలో ప్రజలు జాగ్రత్తగా ఉండాలి. నైరుతి రుతుపవనాలు అనుకున్న దానికంటే ఒకరోజు ముందుగానే.. ఈనెల 31 నాటికి కేరళ తీరాన్ని తాకుతాయంటున్నారు. – ఎ.నరసింహరావు, వాతావరణ శాఖ అధికారి, నరసాపురం -
నేడు రేపు తీవ్ర వడగాడ్పులు
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలో అనేకచోట్ల మంగళ, బుధవారాల్లో తీవ్రమైన వడగాడ్పులు వీస్తాయని హైదరాబాద్ వాతావరణ కేంద్రం హెచ్చరించింది. ఉరుములు మెరుపులతో కూడిన మోస్తరు వర్షాలు కురిసే అవకాశముందని తెలిపింది. మరోవైపు సోమవారం హన్మకొండ, రామగుండంలలో 45 డిగ్రీల చొప్పున పగటి ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. ఇతరచోట్ల కూడా 40 నుంచి 44 డిగ్రీల వరకు నమోదయ్యాయి. తీవ్రమైన వడగాడ్పుల కారణంగా ప్రజలు విలవిల్లాడిపోతున్నారు. ఇంటి నుంచి బయటకు రావడానికి జంకుతున్నారు. ఇదే పరిస్థితి ఈ నెలాఖరు వరకు ఉండే అవకాశముందని అంటున్నారు. మధ్యలో మోస్తరు వర్షాలు కురిసే అవకాశముందని వాతావరణ కేంద్రం అధికారులు చెబుతున్నారు. సోమవారం నమోదైన ఉష్ణోగ్రతలు (సెల్సియస్‌ల్లో) ప్రాంతం ఉష్ణోగ్రత హన్మకొండ 45.0 రామగుండం 45.0 నిజామాబాద్ 44.0 భద్రాచలం 43.8 ఆదిలాబాద్ 43.7 మెదక్ 43.5 నల్లగొండ 43.2 మహబూబ్‌నగర్ 43.1 ఖమ్మం 41.0 హకీంపేట 40.3 హైదరాబాద్ 40.2 -
మరో రెండు రోజులు వడగాడ్పులు
రామగుండం: తెలంగాణలోని వివిధ జిల్లాల్లో మరో రెండు రోజులు అంటే ఈనెల 24వ తేదీ వరకు అత్యంత భయంకరమైన వేడితో కూడిన వడగాడ్పులు వీయనున్నాయని ఇండియా మెట్రోలాజికల్ విభాగం పేర్కొంది. ఈ మేరకు వాతావరణ పరిస్థితుల గురించి రాష్ట్రవ్యాప్తంగా వివిధ విభాగాలకు జాగ్రత్తలు తీసుకోవాలంటూ ఉత్తర్వులు జారీ అయ్యాయి. ఇప్పటికే రాష్ట్రవ్యాప్తంగా రికార్డు స్థాయిలో గరిష్ట ఉష్ణోగ్రతలు నమోదవుతుండడంతో రాబోయే రెండు రోజులు మరింత జాగ్రత్తగా వ్యవహరించాలని సూచించింది. -
బయటికి రాలేం బాబోయ్!
-
బయటికి రాలేం బాబోయ్!
రాష్ట్రవ్యాప్తంగా ఠారెత్తిస్తున్న ఎండలు ⇒ 45 డిగ్రీలకుపైగా నమోదవుతున్న ఉష్ణోగ్రతలు ⇒ వడదెబ్బకు 12 మంది మృతి ⇒ ఒక్క నల్లగొండ జిల్లాలోనే ఏడుగురు.. ⇒ మరో రెండు రోజులు తీవ్ర వడగాడ్పులు ⇒ హైదరాబాద్ వాతావరణ కేంద్రం హెచ్చరిక సాక్షి, హైదరాబాద్/నెట్వర్క్ రాష్ట్రం నిప్పుల కొలిమిని తలపిస్తోంది. 45 డిగ్రీలకు పైగా నమోదవుతున్న ఉష్ణోగ్రతలతో జనజీవనం అల్లాడిపోతోంది. భానుడి ప్రతాపంతో గరిష్ట ఉష్ణోగ్రతలు పెరిగిపోవడంతోపాటు.. ఉదయం 9 గంటల నుంచే వడగాడ్పులు వీస్తుండడంతో జనం ఉక్కిరిబిక్కిరవుతున్నారు. మండే ఎండల ధాటికి బయటికి రావాలంటేనే జంకుతున్నారు. ఇంట్లో ఉంటే ఫ్యాన్ల నుంచి వచ్చే వేడిగాలితో తట్టుకోలేక.. బయటికెళ్తే ఎండలను భరించలేక సతమతమవుతున్నారు. పగటి ఎండల తీవ్రత రాత్రిళ్లు కూడా తగ్గడం లేదు. దీంతో రాత్రి పూట వేడి వాతావరణం నెలకొంటోంది. మరోవైపు ఆదివారం ఒక్కరోజు వడదెబ్బకు 12 మంది మృతిచెందారు. ఒక్క నల్లగొండ జిల్లాలోనే ఏడుగురు మృతి చెందగా.. యాదాద్రి భువనగిరి జిల్లాలో ఇద్దరు, సూర్యాపేట, రాజన్న సిరిసిల్ల జిల్లా, కామారెడ్డి జిల్లాల్లో ఒక్కరు చొప్పున మరణించారు. మరో 2 రోజులు తీవ్ర వడగాడ్పులు రాష్ట్రంలో మరో 2 రోజులపాటు తీవ్రమైన వడగాడ్పులు ఉంటాయని హైదరాబాద్ వాతావరణ కేంద్రం హెచ్చరించింది. తర్వాతి రెండు రోజులు అక్కడక్కడ ఉరుములు మెరుపులతో కూడిన మోస్తరు వర్షాలు కురిసే అవకాశముందని తెలిపింది. మరోవైపు ఆదివారం రాష్ట్రంలో అత్యధిక ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. హన్మకొండ, రామగుండంలలో 45 డిగ్రీల చొప్పున గరిష్ట ఉష్ణోగ్రతలు రికార్డయ్యాయి. ఇతర ప్రాంతాల్లోనూ 40 నుంచి 44 డిగ్రీల మధ్య ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. ఆదివారం నమోదైన ఉష్ణోగ్రతలు (సెల్సియస్‌ల్లో) ప్రాంతం ఉష్ణోగ్రత హన్మకొండ 45.0 రామగుండం 44.6 నల్లగొండ 44.4 ఆదిలాబాద్ 44.3 నిజామాబాద్ 43.9 మహబూబ్‌నగర్ 43.6 మెదక్ 43.6 ఖమ్మం 43.0 హైదరాబాద్ 42.0 హకీంపేట 40.3 -
నిప్పుల కుంపటి
-
నిప్పుల కుంపటి
రాష్ట్రవ్యాప్తంగా మండుతున్న ఎండలు ► చాలా ప్రాంతాల్లో 45 – 46 డిగ్రీల మేర గరిష్ట ఉష్ణోగ్రతలు ► రాష్ట్రంలో పెరుగుతున్న వడదెబ్బ మృతుల సంఖ్య ► ఇప్పటివరకు 171 మంది మృతిచెందినట్లు విపత్తు నిర్వహణ శాఖ ప్రకటన.. మరో 4 రోజులు వడగాడ్పుల హెచ్చరిక ► ప్రత్యామ్నాయ చర్యలు చేపట్టని అధికార యంత్రాంగం ► వేసవి కార్యాచరణ ప్రణాళిక అమలు శూన్యం సాక్షి హైదరాబాద్, నెట్వర్క్ భారీగా పెరిగిన ఉష్ణోగ్రతలతో రాష్ట్రం నిప్పుల కుంపటిగా మారింది. ఎండల తీవ్రత, వడగాడ్పులతో జనం విలవిల్లాడుతున్నారు. వడదెబ్బకు గురై పిట్టల్లా రాలిపోతున్నారు. రాష్ట్రంలో వేసవి ప్రారంభమైనప్పటి నుంచి ఇప్పటివరకు 171 మంది వడదెబ్బ కారణంగా మృతి చెందారని విపత్తు నిర్వహణ శాఖ శనివారం ప్రకటించింది. ఇక శనివారం నల్లగొండలో అత్యధికంగా 46 డిగ్రీల సెల్సియస్ గరిష్ట ఉష్ణోగ్రత నమోదైంది. ఆదిలాబాద్, భద్రాచలం, రామగుండంలలో 45 డిగ్రీల చొప్పున.. హన్మకొండ, మహబూబ్‌నగర్, నిజామాబాద్‌లలో 44, ఖమ్మంలో 43, హైదరాబాద్‌లో 42, హకీంపేటలో 41 డిగ్రీల చొప్పున ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. ఎండ తీవ్రత కారణంగా జనం పగటిపూట ఇళ్లలోంచి బయటకు వెళ్లాలంటే భయపడుతున్నారు. ఖమ్మం జిల్లాలో అత్యధికంగా.. రాష్ట్రంలో అత్యధికంగా ఖమ్మం జిల్లాలో 56 మంది వడదెబ్బతో చనిపోయారు. కరీంనగర్లో 27 మంది, నల్లగొండలో 25 మంది, మంచిర్యాలలో 12 మంది మరణించారు. రైతు సమగ్ర సర్వే చేస్తున్న వ్యవసాయ విస్తరణాధికారి ఒకరు విధుల్లోనే మరణించడం గమనార్హం. ఇక వందల సంఖ్యలో జనం ఎండదెబ్బ కారణంగా అస్వస్థతకు గురయ్యారు. పాత ఆదిలాబాద్ జిల్లా పరిధిలో ఎండల తీవ్రత మరింత ఎక్కువగా ఉంది. ముఖ్యంగా సింగరేణి గనులున్న ప్రాంతాల్లో ఎండ నిప్పులు కక్కుతోంది. చాలా మండలాల్లో 45 డిగ్రీలకుపైగానే గరిష్ట ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. వడగాడ్పుల కారణంగా వందల సంఖ్యలో అస్వస్థతకు గురై ఆస్పత్రుల పాలయ్యారు. మరిన్ని రోజులు వడగాడ్పులు.. ఆంధ్రప్రదేశ్ సముద్ర తీరం వెంబడి అల్పపీడన ద్రోణి ఉండటంతో ఉత్తర భారతదేశం నుంచి వేడి గాలులు వీస్తున్నాయని... ఫలితంగా ఏపీ, తెలంగాణలపై వడగాడ్పులు పంజా విసురుతున్నాయని హైదరాబాద్ వాతావరణ కేంద్రం డైరెక్టర్ వై.కె.రెడ్డి చెప్పారు. మరో నాలుగు రోజుల పాటు రాష్ట్రంలో తీవ్రస్థాయిలో వడగాల్పులు ఉంటాయని హెచ్చరించారు. నైరుతి రుతు పవనాలు ప్రవేశించే వరకు కూడా వడగాడ్పులు కొనసాగినా ఆశ్చర్యపోవాల్సిన పనిలేదని పేర్కొన్నారు. వేసవి ప్రణాళిక అమలు ఏదీ? భారీ స్థాయిలో ఎండలు మండుతున్నా, జనం పిట్టల్లా రాలిపోతున్నా తగిన చర్యలు చేపట్టడంలో ప్రభుత్వ యంత్రాంగం విఫలమైందనే ఆరోపణలు వస్తున్నాయి. ఎండ తీవ్రత నుంచి ప్రజలను కాపాడేందుకు రాష్ట్ర విపత్తు నిర్వహణ శాఖ వేసవి కార్యాచరణ ప్రణాళికను రూపొందించింది. దాని ప్రకారం ఆయా శాఖలు రాష్ట్రవ్యాప్తంగా నగరాలు, పట్టణాలు, పల్లెల్లో చర్యలు తీసుకోవాలి. కానీ ఆ దిశగా చర్యలేమీ కనిపించడం లేదు. కొన్ని శాఖలైతే అసలు పట్టించుకోవడం లేదు. వడగాడ్పులుంటే ఆర్టీసీ బస్సులను మధ్యాహ్నం 12 నుంచి 4 గంటల మధ్య నడపకూడదన్న నిబంధన ఉంది. కానీ అది అమలుకావడం లేదు. ఆరు బయట శారీరక శ్రమ చేసే వారికి నీడ కల్పించాలని, ఫ్యాక్టరీల్లో చల్లదనం వసతి కల్పించాలనే నిబంధనలున్నా ఎవరూ పట్టించుకోవడం లేదు. ఇక తాగునీరు, వైద్య వసతి, నీడ కల్పించడం వంటి చర్యలూ లేవు. అమలు చేయాల్సిన వేసవి ప్రణాళిక ఇదీ సాధారణ ఉష్ణోగ్రత 40 డిగ్రీలుగా ఉండి, దానికి అదనంగా నాలుగైదు డిగ్రీలు పెరిగితే (45 డిగ్రీలకు చేరుకుంటే) అధిక ఉష్ణోగ్రత, వడగాడ్పుల పరిస్థితిగా పరిగణిస్తారు. అదే ఏడు డిగ్రీలు అధికంగా 46–47 డిగ్రీల వరకు ఉంటే దాన్ని తీవ్రమైన వడగాడ్పుల పరిస్థితిగా పరిగణిస్తారు. ఈ ప్రకారం అత్యంత తీవ్రమైన ఎండలు, వడగాడ్పుల పరిస్థితి ఉన్నప్పుడు రెడ్ అలర్ట్, తీవ్రమైన ఎండలు ఉన్నప్పుడు ఆరెంజ్ అలర్ట్, ఎండలు కాస్త ఎక్కువగా ఉన్నప్పుడు ఎల్లో అలర్ట్‌లను జారీచేయాల్సి ఉంటుంది. కానీ అవేమీ జరగడం లేదు. → రాష్ట్రవ్యాప్తంగా నగరాలు, పట్టణాల్లో ఎల్ఈడీ స్క్రీన్స్ పెట్టి ఉష్ణోగ్రతల వివరాలు ప్రదర్శించడం → రేడియో ద్వారా ప్రజలను అప్రమత్తం చేయడం →ఐస్ ప్యాక్స్, ఐవీ ఫ్లూయిడ్స్‌ను అందుబాటులో ఉంచడం →108 సర్వీసును, ఆరోగ్య కార్యకర్తలను, ఆశ వర్కర్లను అందుబాటులో ఉంచడం. ఆరోగ్య కేంద్రాల వేళలను పెంచడం. వడదెబ్బకు గురైనవారి కోసం ఆస్పత్రుల్లో ప్రత్యేకంగా వార్డులను నెలకొల్పడం → ఆరు బయట శారీరక శ్రమ చేసే వారికి తగు నీడ కల్పించడం. మధ్యాహ్నం ఒంటి గంట నుంచి ఐదింటి వరకు పనివేళలు లేకుండా చూడడం. ఫ్యాక్టరీల్లో ఏసీ వసతి కల్పించడం → ఎండలు, వడగాడ్పుల పరిస్థితిపై ట్వీటర్, ఫేస్బుక్, వాట్సప్ వంటి సామాజిక మాధ్యమాలను ఉపయోగించి ప్రజలను అప్రమత్తం చేయడం. మొబైల్ ఫోన్లకు ఎస్సెమ్మెస్‌లు పంపడం → అత్యంత తీవ్రత ఉన్న ప్రాంతాలను గుర్తించి ప్రత్యేక ఏర్పాట్లు చేయడం వడదెబ్బ తగలకుండా ఏంచేయాలి? → వీలైనంత వరకు ఎండలో వెళ్లకపోవడం మంచిది. వెళ్లాల్సి వస్తే గొడుగు తప్పనిసరిగా వాడాలి. తలపై టోపీ లేదా రుమాలు చుట్టుకోవడం వంటివి చేయాలి. → తెలుపు లేదా లేత రంగుల పలుచటి వస్త్రాలను ధరించాలి → ఉప్పు కలిపిన మజ్జిగ లేదా చిటికెడు ఉప్పు కలిపిన గ్లూకోజ్ నీరు లేదా ఓరల్ రీహైడ్రేషన్ ద్రవం తాగాలి. → ఎవరైనా వడదెబ్బకు గురైతే వెంటనే చల్లటి ప్రదేశానికి తరలించాలి. గాలి తగిలేలా ఏర్పాట్లు చేయాలి. శరీర ఉష్ణోగ్రత సాధారణ స్థాయికి వచ్చేదాకా చల్లని నీటిలో ముంచిన తడి వస్త్రంతో శరీరమంతా తుడుస్తూ ఉండాలి. వీలైనంత త్వరగా సమీపంలోని ఆస్పత్రికి తరలించాలి. తండ్రి, కొడుకును బలిగొన్న వడదెబ్బ రాష్ట్రవ్యాప్తంగా ఎండల తీవ్రత కారణంగా పెద్ద సంఖ్యలో జనం వడదెబ్బకు గురవుతున్నారు. ఆరుబయట పనిచేసేవారు, అత్యవసర పనుల మీద వెళుతున్నవారు ఎండ తీవ్రత కారణంగా అస్వస్థతకు గురవుతున్నారు. శనివారం వడదెబ్బ కారణంగా నల్లగొండ జిల్లా చిట్యాలలో కొద్దిగంటల వ్యవధిలోనే తండ్రి, కుమారుడు మృతి చెందారు. చిట్యాలకు చెందిన కొండె దశరథరావు(60), ఆయన రెండో కుమారుడు శివ (32) గ్రామాల్లో తిరుగుతూ జాతకాలు చెప్పి పొట్టపోసుకుంటారు. ఇలా వరంగల్ వెళ్లిన దశరథరావు వడదెబ్బకు గురై ఆస్పత్రి పాలయ్యాడు. ఆయన కోసం వెళ్లిన కుమారుడు శివ కూడా ఎండదెబ్బకు గురయ్యాడు. కొద్ది గంటల వ్యవధిలోనే ఇద్దరూ మృతిచెందడంతో వారి కుటుంబం విషాదంలో మునిగిపోయింది. ఇక మేడ్చల్ జిల్లాలో ఒకరు, యాదాద్రి జిల్లా ఘట్కేసర్లో ఒక పశువుల కాపరి, కరీంనగర్ జిల్లాలో ఇద్దరు, హైదరాబాద్‌లో ఒకరు, ఆదిలాబాద్ జిల్లాలో ఒక రైతు, సూర్యాపేట జిల్లాలో ఇద్దరు మరణించారు. నల్లమల.. విలవిల ఎండల తీవ్రతకారణంగా వన్యప్రాణులూ విలవిల్లాడుతున్నాయి. అడవుల్లోని నీటి వనరులన్నీ ఎండిపోవడంతో మృత్యువాతపడుతున్నాయి. అడవుల నుంచి సమీపంలోని గ్రామాల్లోకి వచ్చి వేటగాళ్ల ఉచ్చులో చిక్కుకుంటున్నాయి. ముఖ్యంగా నల్లమల అటవీ ప్రాంతంలో పరిస్థితి తీవ్రంగా ఉంది. గత కొద్దిరోజుల్లోనే వందకుపైగా జింకలు మృత్యువాతపడినట్లు అంచనా. ఇటీవలే నాగర్‌కర్నూల్ జిల్లా బక్కాలింగాయపల్లిలో ఓ చిరుతపిల్ల నీటి కోసం వచ్చి వ్యవసాయ బావిలో పడింది. పాత మహబూబ్‌నగర్ జిల్లా పరిధిలోని ఉప్పునుంతల, లింగాల, కొల్లాపూర్, బల్మూర్, అమ్రాబాద్, పదర మండలాల పరిధిలో పెద్ద సంఖ్యలో మృతిచెందిన దుప్పులను అటవీ అధికారులు గుర్తించారు. అయితే ఈ అటవీ ప్రాంతంలో జంతువులకు తాగునీటి కోసం 109 నీటి నిల్వ సాసర్లను అటవీ శాఖ ఏర్పాటు చేసింది. కానీ వాటిలో నీటిని నింపే పరిస్థితి లేదు. ఇక అడవిలోని 120 చెంచు నివాస ప్రాంతాల్లోనూ నీటికి కటకట ఏర్పడింది. నీటి వనరులు ఎండిపోవడంతో చెలిమలు తవ్వుకుని.. కిలోమీటర్ల దూరం నుంచి తాగునీటిని తెచ్చుకుంటున్నారు. పాత ఆదిలాబాద్ జిల్లాలోని కవ్వాల్ అటవీ ప్రాంతంలోనూ ఇదే పరిస్థితి నెలకొంది. మరోవైపు జనగామ జిల్లా దేవరుప్పుల మండలం చిన్నమడూరుకు వలసవచ్చే సైబీరియన్ కొంగలు భానుడి ప్రతాపానికి బలవుతున్నాయి. వారం రోజులుగా ఎండ తీవ్రత పెరగడంతో రోజూ పెద్ద సంఖ్యలో మృత్యువాత పడుతున్నాయి. -
తెలుగు రాష్ట్రాల్లో మండుతున్న ఎండలు..
-
మరో నాలుగు రోజులు వడగాడ్పులు
హైదరాబాద్ వాతావరణ కేంద్రం హెచ్చరిక ► నల్లగొండ, రామగుండంలలో 46 డిగ్రీల గరిష్ట ఉష్ణోగ్రత ► రాష్ట్రవ్యాప్తంగా చాలా చోట్ల 40 డిగ్రీలపైనే నమోదు సాక్షి నెట్వర్క్: వచ్చే నాలుగు రోజుల పాటు రాష్ట్రవ్యాప్తంగా పలు ప్రాంతాల్లో తీవ్రస్థాయిలో వడగాడ్పులు వీస్తాయని హైదరాబాద్ వాతావ రణ కేంద్రం హెచ్చరించింది. ప్రజలు అప్రమ త్తంగా ఉండాలని సూచించింది. రోహిణీ కార్తె దగ్గర పడుతుండటంతో ఎండలు మండిపోతు న్నాయి. ఉదయం 9 గంటల నుంచే వేడి గాలు లు వీస్తున్నాయి. జనం ఇళ్లలోంచి బయటకు వచ్చేందుకే భయపడుతున్నారు. శుక్రవారం నల్లగొండ, రామగుండంలలో 46 డిగ్రీల మేర గరిష్ట ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. రాష్ట్రవ్యా ప్తంగా చాలాచోట్ల 40 నుంచి 45 డిగ్రీల వరకు గరిష్ట ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. ఖమ్మంలో సాధారణం కంటే 5 డిగ్రీలు ఎక్కువ గా 45 డిగ్రీలు, నల్లగొండలో సాధారణం కంటే 4.8 డిగ్రీలు ఎక్కువగా నమోదయ్యాయి. రాష్ట్రంలో వడదెబ్బతో శుక్రవారం 20 మంది మృత్యువాత పడ్డారు. అందులో 14 మంది ఉమ్మడి నల్లగొండ జిల్లాలో పరిధిలోని వారే. రాలిపోతున్న పక్షులు రాష్ట్రవ్యాప్తంగా చాలా ప్రాంతాల్లో ఉష్ణోగ్రతలు రికార్డు స్థాయిలో నమోదవుతుండటంతో జంతువులు, పక్షులు కూడా విలవిల్లాడుతు న్నాయి. జయశంకర్ భూపాలపల్లి జిల్లా వెంకటాపురంలో తహసీల్దార్ కార్యాలయంతో పాటు క్వార్టర్స్ ఆవరణలో రావిచెట్లపై ఉన్న గబ్బిలాలు పదుల సంఖ్యలో చనిపోతున్నాయి. అన్నమూ ఉడికిపోతోంది.. ఎండలు మండిపోతుండడంతో ఆ వేడికి అన్న మూ ఉడికిపోతోంది. జయశంకర్ భూపాల పల్లి జిల్లా నాగారం గ్రామానికి చెందిన పెను మల్ల కృష్ణారెడ్డి, అంబిక దంపతులు చిన్న గిన్నెలో బియ్యాన్ని నానబెట్టి ఉదయం ఎండలో పెట్టారు. సాయంత్రానికల్లా ఆ బియ్యం ఉడికిపోయి అన్నంగా తయారైంది. శుక్రవారం నమోదైన గరిష్ట ఉష్ణోగ్రతలు (సెల్సియస్‌ల్లో) ప్రాంతం ఉష్ణోగ్రత నల్లగొండ 46 రామగుండం 45.8 భద్రాచలం 45.4 ఖమ్మం 45.2 నిజామాబాద్ 44.9 ఆదిలాబాద్ 44.8 హన్మకొండ 44.5 మెదక్ 43.7 హైదరాబాద్ 42.5 హకీంపేట 40.7 -
తెలంగాణ భగభగ
సాక్షి, హైదరాబాద్: ప్రచండ భానుడి ప్రతాపంతో రాష్ట్రం మండిపోతోంది. ఈ వేసవిలోనే అత్యధిక ఉష్ణోగ్రతలు నమోదవుతుండటంతో జనం అల్లాడి పోతున్నారు. గత నాలుగైదు రోజులుగా రోజురోజు కు ఉష్ణోగ్రతలు పెరిగిపోతుండటంతో రాష్ట్రం నిప్పు ల కుంపటిలా మారింది. గురువారం చాలా చోట్ల అత్యధిక ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. 46 డిగ్రీల సెల్సియస్‌ను మించి ఉష్ణోగ్రతలు నమోదు కావ టంతో నల్లగొండ, రామగుండం, భద్రాచలం తది తర ప్రాంతాలు భగభగలాడిపోయాయి. ఆదిలాబా ద్, మహబూబ్‌నగర్, నిజామాబాద్‌లు కూడా 45 డిగ్రీల వేడితో మండిపోయాయి. హైదరాబాద్, పరి సర ప్రాంతాలు మినహా మిగతా అన్ని ప్రాంతాల్లో ఉష్ణోగ్రతలు 43 డిగ్రీలను మించి నమోదయ్యాయి. ఉద యం 10 గంటల నుంచి భానుడి ప్రతాపం తీవ్రం కావటంతో జనం బయటకు రావడానికే భయ పడుతున్నారు. ఎండకు తోడు వడగాలుల తీవ్రత కూడా అధికంగా ఉండటంతో సాయంత్రం 6 గంట ల వరకు జనం అవస్థలు పడాల్సి వచ్చింది. మరి కొద్ది రోజులు ఇదే తీవ్రత ఉంటుందని వాతావరణ కేంద్రం పేర్కొంది. గురువారం నమోదైన ఉష్ణోగ్రతలు నల్లగొండ 46.4 భద్రాచలం 46.2 రామగుండం 46.0 ఆదిలాబాద్ 45.3 ఖమ్మం 45.0 నిజామాబాద్ 43.9 మహబూబ్‌నగర్ 43.8 మెదక్ 43.4 హైదరాబాద్ 42.2 -
ప్రకృతి మాయాజాలం చేస్తోంది...
ఈ ఫోటోను చూడండి. ఓ వైపు ఎండలు మండిపోతున్నాయి. అయితే ఇక్కడ మాత్రం సమ్మర్లో వింటర్‌ను తలపిస్తోంది కదూ. ఇదే ప్రకృతి మాయాజలం అంటే. ఒకవైపు భానుడి భగభగలకు జనం అల్లాడిపోతుంటే...మరోవైపు మండువేసవిలో దట్టమైన పొగమంచు కనువిందు చేస్తోంది. ఇక్కడ ఉన్న సిక్కోలు (శ్రీకాకుళం) సిత్రాలే ఇందుకు నిదర్శనం. శ్రీకాకుళం పట్టణంలో శుక్రవారం తెల్లవారుజామున దట్టంగా మంచు కురిసింది. అంతలో కాసేపటికే సూరీడు సుర్రుమంటూ విరుచుకుపడ్డారు. ఈ వింత పరిస్థితి చూసి ప్రజలు ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు. ఒక రోజు... 15 ప్రసవాలు... మహబూబ్ నగర్ జిల్లా మక్తల్ ప్రభుత్వ ఆస్పత్రిలో నిన్న (శుక్రవారం) ఒకేరోజు రికార్డు స్థాయిలో 15 ప్రసవాలు చేశారు. వాటిలో 10 సిజేరియన్, ఐదు సాధారణ కాన్పులు ఉన్నాయి. ఈ సందర్భంగా డీఎంహెచ్ఓ శ్రీనివాస్ మాట్లాడుతూ మక్తల్ ప్రభుత్వ ఆస్పత్రిలో మూడు నెలల నుంచి ప్రసవాల సంఖ్య గణనీయంగా పెరిగిందన్నారు. 3 నెలల్లో 871 కాన్పులు చేశామని, వీటిలో 102 సిజేరియన్ ఆపరేషన్లు ఉన్నాయన్నారు. -
నిప్పులకొలిమి
- పెరుగుతున్న ఉష్ణోగ్రతలు - అల్లాడుతున్న ప్రజలు - అవుకులో గరిష్టంగా 43.98 డిగ్రీలు నమోదు - ఎమ్మిగనూరులో 14.93 కిలోమీటర్ల వేగంతో వడగాల్పులు కర్నూలు(అగ్రికల్చర్): రోజురోజుకు పెరుగుతున్న ఎండలతో జిల్లా ప్రజలు విలవిలలాడుతున్నారు. శనివారం జిల్లా వ్యాప్తంగా ఉష్ణోగ్రతలు రికార్డు స్థాయిలో నమోదు అయ్యాయి. గరిష్టంగా అవుకులో 43.98 డిగ్రీల నమోదైంది. కర్నూలు నగరంతో సహా జిల్లా మొత్తం దాదాపు ఇదే స్థాయిలో ఎండలు ఉన్నాయి. మరో వైపు వడగాలుల తీవ్రత పెరిగింది. ఎమ్మిగనూరులో 14.93 కిలోమీటర్ల వేగంతో వడగాలులు వీచడంతో ప్రజలు ఉక్కిరిబిక్కిరి అయ్యారు. గోనెగండ్లలో 12.35, కొలిమిగుండ్లలో 11.19, కర్నూలు (దిన్నెదేవరపాడు)లో 11.17 కిలోమీటర్ల వేగంతో వడగాలులు వీచాయి. ఒకవైపు పెరిగిపోతున్న ఉష్ణోగ్రతలు, మరోవైపు వడగాలుల తీవ్రతతో వడదెబ్బకు గురయ్యే వారిసంఖ్య పెరిగిపోతోంది. వదడెబ్బ మృతులు పెరిగిపోతున్నారు. మొన్నటి వరకు ఉష్ణోగ్రతలు గరిష్టంగా 42.8 డీగ్రీలు ఉన్నాయి. శనివారం ఒక్కరోజులోనే ఒక డిగ్రీకి పైగా ఉష్ణోగ్రతలు పెరిగిపోయాయి. రోజురోజుకు ఎండల తీవ్రత పెరిగిపోతుండటంతో వృద్ధులు, చిన్నారులు, గర్భిణులు అల్లాడుతున్నారు. ఉష్ణోగ్రతలు పెరిగిపోతుండటంతో భూగర్భ జలాలు వేగంగా పడిపోతున్నాయి. జిల్లా సగటున ఫిబ్రవరి నెలలో 9.19 మీటర్లలోతులో ఉన్న భూగర్భ జలాలు 10.69 మీటర్ల అడుగుకు పడిపోయాయి. నెల రోజుల వ్యవధిలోనే ఒకటిన్నర మీటర్ల మేర భూగర్బ జలాలు పడిపోయాయి. భూగర్భ జలాలు పడిపోతుండటంతో నీటి సమస్య తీవ్రం అవుతోంది. వారానికి ఒక రోజు కూడ నీళ్లు సరఫరా కాని గ్రామాలు వందల్లో ఉన్నాయి. నీటి ఎద్దడి ఏర్పడటంతో మినరల్ వాటర్‌కు డిమాండ్ పెరిగింది. గ్రామాల్లో మినరల్ వాటర్ అమ్మకాలు మూడు, నాలుగు రెట్లు పెరగడం గమానార్హం. జిల్లాలోని వివిధ ప్రాంతాల్లో ఉష్ణోగ్రతల తీవ్రత ఇలా మండలం ఉష్ణోగ్రతలు అవుకు 43.98 కోవెలకుంట్ల 43.93 మద్దికెర 43.47 చాగలమర్రి 43.28 సి.బెలగల్ 43.17 రుద్రవరం 43.17 ఆళ్లగడ్డ 43.01 సంజామల 42.88 పగిడ్యాల 42.71 మిడుతూరు 42.69 ఎమ్మిగనూరు 42.66 కర్నూలు 42.20 -
హైదరాబాద్ @ 39.2 డిగ్రీలు
నగరవాసులను ఉక్కిరిబిక్కిరి చేస్తున్న ఎండలు సాక్షి, హైదరాబాద్: వేడి గాలులు నగర ప్రజలను ఉక్కిరిబిక్కిరి చేస్తున్నాయి. గడిచిన 24 గంటల్లో హైదరాబాద్‌లో 39.2 డిగ్రీల గరిష్ట ఉష్ణోగ్రత నమోదైంది. మరో 48 గంటల పాటు హైదరాబాద్‌లో 40 డిగ్రీల మేర ఉష్ణోగ్రతలు నమోదయ్యే అవకాశాలున్నాయని, వేడిగాలులు కూడా కొనసాగుతాయని వాతావరణ శాఖ హెచ్చరించింది. ఎండలో బయటికి వెళ్లేవారు వడదెబ్బ బారిన పడకుండా తగిన జాగ్రత్తలు తీసుకోవాలని వైద్యులు సూచిస్తున్నారు. విద్యుత్ వినియోగం పైపైకి... నగరంలో ఉష్ణోగ్రతలు అనుహ్యంగా పెరగడం తో విద్యుత్ వినియోగం కూడా రెట్టిపైంది. గ్రేటర్లో గత 2 రోజుల్లో విద్యుత్ వినియోగం 53.8 మిలియన్ యూనిట్లు నమోదైంది. మార్చి లోనే పరిస్థితి ఇలా ఉంటే ఏప్రిల్, మేలో విద్యు త్ వినియోగం 60 ఎంయూలు దాటే అవకాశం ఉందని డిస్కం అంచనా వేస్తోంది. పెరుగుతు న్న విద్యుత్ ఒత్తిడిని తట్టుకోలేక ఫీడర్లు ట్రిప్ప వుతూ సరఫరాకు అంతరాయం కలిగిస్తు న్నా యి. ఒత్తిడిని తట్టుకునేవిధంగా ఇప్పటికే సరఫ రా వ్యవస్థను తీర్చిదిద్దినట్లు చెబుతున్నారు. రాష్ట్రమంతటా ఇదే పరిస్థితి.. గడిచిన 24 గంటల్లో ఆదిలాబాద్‌లో 41 డిగ్రీల గరిష్ట ఉష్ణోగ్రత నమోదైంది. మహబూబ్‌నగర్, నల్లగొండ, నిజామా బాద్, రామగుండంలలో 40 డిగ్రీల చొప్పున, హన్మకొండ, ఖమ్మం, మెదక్‌లలో 39 డిగ్రీల చొప్పున ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. మరో 48 గంటలు రాష్ట్రంలో సాధారణం కంటే 2–3 డిగ్రీలు అధికంగా ఉష్ణోగ్రతలు నమోదవుతాయని హైదరా బాద్ వాతావరణ కేంద్రం హెచ్చరించింది. పెరిగిన విద్యుత్ డిమాండ్... ఎండల తీవ్రత దృష్ట్యా రాష్ట్రంలో విద్యుత్ డిమాండ్ అమాంతం పెరిగింది. గత మార్చిలో 148.73 మిలియన్ యూనిట్లుగా ఉన్న విద్యుత్ డిమాండ్ కాస్తా ఈ మార్చిలో ఏకంగా 184.11 మి.యూనిట్లకు పెరిగింది. వడదెబ్బతో నలుగురి మృతి నెట్వర్క్: వడదెబ్బతో ఆదివారం వేర్వేరు ప్రాంతాల్లో నలుగురు మృతిచెందారు. నల్లగొండ జిల్లా తిరుమలగిరి మండలం యల్లాపురంలో గడగోజు దుర్గాచారి(51), రంగుండ్లలో ఆంగోతు రవి నాయక్, ఇదే జిల్లా వేములపల్లి మండలం శెట్టిపాలెంలో నక్క చంద్రమ్మ (70), మెదక్ జిల్లా వెల్దుర్తి మండలం మాసాయిపేటలో గొల్ల నర్సింలు (56) వడదెబ్బతో మృతి చెందారు. -
మృత్యుగాలి.. మళ్లీ వస్తుందా?
- రెండేళ్ల కిందట తెలుగు రాష్ట్రాలను గడగడలాడించిన వడగాడ్పులు - 2015 మే చివర్లో ఆంధ్ర, తెలంగాణలో 2,500 మంది మృత్యువాత - భూతాపం కారణంగా పదేళ్లకోసారి పునరావృతమయ్యే ప్రమాదం - కొంతమేరకైనా కాపాడుతున్న హైదరాబాద్‌పై కాలుష్యం దుప్పటి - లేకుంటే రెండేళ్లకోసారి పెను వడగాడ్పుల విజృంభణ - వడగాడ్పులపై భారత్, విదేశీ వాతావరణ పరిశోధకుల అధ్యయనంలో వెల్లడి - ఎదుర్కోవడానికి ప్రభుత్వాలు సిద్ధం కావాలంటున్న పరిశోధకులు సరిగ్గా రెండేళ్ల కిందట.. వేసవిలో మే చివరి వారం.. ఒక్కసారిగా వడగాడ్పులు ఉధృతమయ్యాయి. రెండు తెలుగు రాష్ట్రాల్లో జనం పిట్టల్లా రాలిపోయారు. ఏకంగా 2,500మంది వడగాడ్పుల దెబ్బకు అసువులుబాశారు. ఈ ప్రాంతంలో ఆ స్థాయి వడగాడ్పులు వందేళ్లకోసారి వస్తాయని అంచనా. కానీ భూతాపం పెరగడం వల్ల ఈ ప్రమాదం ఏకంగా పది రెట్లు పెరిగిపోయిందని వాతావరణ నిపుణుల అంచనా. అంటే తెలుగు రాష్ట్రాల్లో ప్రతి పదేళ్లకోసారి ఆ స్థాయి వడగాడ్పులు వీచే ప్రమాదం పొంచి వుంది. ఇంకా చెప్పాలంటే హైదరాబాద్ మహానగరం, పరిసరాల మీద నింగిలో దట్టంగా ఆవరించి ఉండే కాలుష్యం దుప్పటి తొలగిపోతే.. ఆ భీకర వడగాడ్పుల ముప్పు ప్రతి రెండేళ్లకోసారి ముంచుకొస్తుందని నిపుణులు చెబుతున్నారు. ముందుగా గుర్తించ గలిగితే ప్రయోజనం వడగాడ్పులు, భూతాపానికి సంబంధం ఉందని సూత్రప్రాయంగా చెప్పటం సరిపోదని.. ఇటువంటి పెను వడగాడ్పులు ఏ నెలలో రావచ్చు, ఎన్ని రోజులు కొనసాగవచ్చు అనేది ముందస్తుగా అంచనా వేయగలిగితే ప్రభుత్వం అందుకు అనుగుణంగా ప్రణాళికలు రూపొందించుకోగలదని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ విపత్తు నిర్వహణ విభాగ అధికారి నాగేంద్ర కె. బియానీ ఈ సమావేశంలో పేర్కొన్నారు. ఏదేమైనా వడగాడ్పులను ఎదుర్కోవడానికి తాము ఎప్పుడూ ప్రణాళికలు రచిస్తామని చెప్పారు. కానీ ఏటా రెండు తెలుగు రాష్ట్రాల్లో వడగాడ్పుల వల్ల జబ్బుపడుతున్న వారు, మరణిస్తున్న వారి సంఖ్యను చూస్తే.. ఈ ప్రణాళికలు సరిపోవట్లేదన్నది స్పష్టమవుతోంది. ‘అహ్మదాబాద్ వడగాడ్పు కార్యాచరణ ప్రణాళిక’ మంచి మార్గదర్శకమని పరిశీలకులు అభిప్రాయపడుతున్నారు. అక్కడ 2010లో వడగాడ్పుల మరణాల సంఖ్య 700గా ఉంటే 2015 నాటికి అది 20కి తగ్గిపోయింది. అటువంటి ప్రణాళికనే విజయవాడ కోసం అభివృద్ధి చేసినట్లు బియానీ తెలిపారు. అయితే ఈ విషయంలో వివిధ మంత్రిత్వశాఖలు, నగర పాలక సంస్థలోని వివిధ విభాగాల మధ్య చాలా సమన్వయం అవసరమవుతుందన్నారు. తేమ శాతం పెరిగితే మరింత తీవ్రం... గాలిలో తేమ శాతం (హ్యుమిడిటీ) ఎక్కువగా ఉండటం వల్ల వడగాడ్పుల ప్రభావం మరింత తీవ్రమవుతుందని ఢిల్లీ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ పరిశోధకుడు కృష్ణా అచ్యుతరావు వివరించారు. యూనివర్సిటీ ఆఫ్ కాలిఫోర్నియా ఎట్ బర్కిలీ, లారెన్స్ బర్కిలీ నేషనల్ లేబొరేటరీ పరిశోధకులతో కలసి తాము నిర్వహించిన అధ్యయనంలో ఈ విషయం తేలినట్లు చెప్పారు. 2015 మే నెలలో ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల్లో పెను వడగాడ్పుల వెంటనే పాకిస్తాన్‌లోని కరాచీలోనూ అదే తరహా వడగాడ్పులు విజృంభించాయి. అక్కడ 700 మంది మృత్యువాతపడ్డారు. అయితే తెలుగు రాష్ట్రాల్లో వడగాడ్పుల సమయంలో నమోదైన ఉష్ణోగ్రతల కంటే కరాచీలో వడగాడ్పుల సమయంలో ఉష్ణోగ్రతలు ఐదారు డిగ్రీలు తక్కువగా నమోదయ్యాయి. అయినా కరాచీలో వడగాడ్పుల తీవ్రతకు ప్రధాన కారణం.. అక్కడ వాతావరణంలో తేమ శాతం ఎక్కువగా ఉండటమే. ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల్లో ఆ తేమ శాతం 20 శాతంగా ఉంటే.. కరాచీలో 35 శాతం నుంచి 70 శాతం వరకూ నమోదైంది. తేమ శాతం ప్రభావంపై ఉత్తర అమెరికా, యూరప్ దేశాల్లో ప్రత్యేక సూచికలు ఉంటాయి. కానీ అవి దక్షిణాసియా దేశాలకు వర్తించవు. ఈ నేపథ్యంలో దక్షిణాసియాకు వర్తించేలా ఉష్ణోగ్రత, హ్యుమిడిటీ తదితర వివరాలతో కూడిన వేడి సూచికలను అభివృద్ధి చేయడానికి పరిశోధకులు కృషి చేస్తున్నారు. ఇటువంటి సూచికలు ప్రభుత్వాలు తగిన ప్రణాళికలు రూపొందించడానికి దోహదపడతాయి. మానవ కల్పిత భూతాపంతో లింకు... ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాలను గడగడలాడించిన 2015 నాటి భీకర వడగాడ్పుల మీద అధ్యయనం చేసిన భారత, విదేశీ వాతావరణ నిపుణులు మూడు ప్రధాన సూత్రీకరణలకు వచ్చారు. ఆ పరిశోధకుల బృందంలో ఒకరైన యూనివర్సిటీ ఆఫ్ ఆక్స్ఫర్డ్ ప్రొఫెసర్ కార్స్టెన్ హాస్టీన్.. ‘ఆ పెను వడగాడ్పులకు మనుషుల వల్ల జరిగిన వాతావరణ మార్పుకు సంబంధం ఉంద’నేందుకు బలమైన ఆధారాలు కనుగొన్నట్లు చెప్పారు. వాతావరణ ప్రమాదాలపై అవగాహన పెంపొందించే అంశం మీద ఈ ఏడాది ఫిబ్రవరి 28న ఢిల్లీలో జరిగిన రౌండ్ టేబుల్ సమావేశంలో ఆయన మాట్లాడారు. తమ అధ్యయన నివేదికను అమెరికన్ మెటియోరాలాజికల్ సొసైటీ బులెటిన్‌లో ప్రచురణ కోసం సమర్పించారు. కాలుష్య దుప్పటిని తొలగిస్తే మరింత వేడి... ‘మున్ముందు ఇప్పటికన్నా మరింత తీవ్రమైన వడగాడ్పులు వచ్చే ప్రమాదం ఉంది. వాటిని ఎదుర్కోవడానికి ప్రభుత్వాలు సిద్ధం కావాల్సి ఉంది. అలాగే పారిశ్రామిక కార్యకలాపాలు, రవాణా వాహనాల ద్వారా వాతావరణంలోకి విడుదలయ్యే కాలుష్యాలను శుభ్రం చేసినట్లయితే.. మరింత బలమైన వడగాడ్పులు వస్తాయి. గతంలో ఉత్తర అమెరికా, యూరప్‌లలో ఇదే విధంగా జరిగింది’ అని ఆ సమావేశంలో పరిశోధకులు హెచ్చరించారు. దక్షిణాసియా భూభాగాన్ని ఎక్కువగా కప్పి ఉంచే కాలుష్యం దుప్పటి.. సూర్యుడి వేడిమిలో కొంతైనా భూ ఉపరితలాన్ని తాకకుండా నిరోధిస్తోంది. అయితే దీనర్థం గాలి కాలుష్యం మంచిదని కాదు. గాలి కాలుష్యం ఏటా ప్రపంచవ్యాప్తంగా 70 లక్షల మందిని బలితీసుకుంటోంది. వర్షపాతంపైనా ప్రతికూల ప్రభావం చూపుతోంది. ఈ కాలుష్యాన్ని శుభ్రం చేసే క్రమంలో మరింత అధిక ఉష్ణోగ్రతలను ఎదుర్కొనేందుకు ముందుగా సిద్ధం కావాలి. - సాక్షి నాలెడ్జ్ సెంటర్ (దథర్డ్పోల్.నెట్ సౌజన్యంతో) -
ఖరీఫ్‌కు సన్‌స్ట్రోక్!
♦ పంటల సాగుకు కరుణించని వరుణుడు ♦ ఎండ, వడగాడ్పులకు సాగు చేసిన పైర్లు సైతం ఎండుముఖం ♦ విద్యుత్ సరఫరాకు తరచూ అంతరాయం ఆందోళనలో అన్నదాతలు జూలై మాసం.. రైతన్నకు ఎంతో కీలకం. జూన్ నెల సగంలోనే నైరుతీ రుతుపవనాల రాకతో ఖరీఫ్ సీజన్ ప్రారంభమవుతుంది. జూలై నెలంతా పంటల సాగులో అన్నదాతలు బిజీబిజీగా ఉంటారు. విత్తనాలు, ఎరువులు, పురుగుమందుల కోసం పరుగులు తీస్తుంటారు. కానీ, ఈ ఏడాది జిల్లాలో ఎక్కడా ఆ హడావిడి కనిపించడం లేదు. తొలకరికి ముందే మండుటెండల్లో వచ్చిపోరుున వరుణుడు.. రుతుపవనాలు వచ్చినాగానీ మొహం చాటేశాడు. జూలై నెల సగం గడిచిపోతున్నా.. జిల్లాపై కనికరం చూపడం లేదు. పైగా, భానుడి ప్రతాపం, వడగాడ్పులు వెరసి ఇప్పటికే సాగుచేసిన పంటలను ఎండుముఖం పట్టిస్తున్నారుు. అన్నదాతకు నిద్ర లేకుండా చేస్తున్నారుు. ఒంగోలు టూటౌన్ : జిల్లాలో ఖరీఫ్ సీజన్‌కు సన్‌స్ట్రోక్ తగులుతోంది. వర్షాలు కురవాల్సిన సమయంలో వేడిగాలులతో రైతులకు షాక్ కొడుతోంది. వరుణుడి దోబూచులాటకుతోడు వ్యవసాయ విద్యుత్ సరఫరాలో నిత్యం అంతరాయం పంటలపై పగతీర్చుకుంటూ అన్నదాతను ఆందోళనకు గురిచేస్తున్నారుు. ఖరీఫ్ సీజన్ ప్రారంభమై నెలరోజులైనా.. నేటికీ సక్రమంగా వర్షాలు కురవలేదు. అరకొరగా సాగుచేసిన లేతపైర్లు సైతం ఈదురుగాలులు, వడగాడ్పులతో విలవిల్లాడుతున్నాయి. గత రెండేళ్ల కరువు పరిస్థితులు ఈ ఏడాది కూడా కొనసాగే పరిస్థితులు కనిపిస్తున్నారుు. కొత్తగా పంటల సాగు సంగతి అటుంచితే.. ఇప్పటికే వేసిన పంటలైనా చేతికొస్తాయో లేదోనని రైతులకు బెంగపట్టుకుంది. 2,35,857 హెక్టార్లకుగానూ 27,500 హెక్టార్లలోనే సాగు... జిల్లాలో ఖరీఫ్ సీజన్ ప్రారంభమై నెలదాటింది. ప్రారంభంలో ముందస్తుగా మురిపించిన వర్షాలు పంటల సాగుపై రైతులకు ఆశలు పెంచారుు. అన్నదాతలు వెంటనే పలు రకాల పంటలు సాగుచేశారు. కానీ, అనంతరం వర్షాలు లేకపోవడంతో ఖరీఫ్ సాగు చతికిలపడింది. ప్రస్తుత సీజన్లో 2,35,857 హెక్టార్లలో వివిధ పంటలు సాగు కావాల్సి ఉండగా, ఇప్పటి వరకు సుమారు 27,500 హెక్టార్లలో సాగయ్యూరుు. వరి 32,185 హెక్టార్లకుగానూ 20 హెక్టార్లలోనే సాగైంది. జొన్న 220 హెక్టార్లకుగానూ అసలు సాగుకే నోచుకోలేదు. సజ్జ 17,030 హెక్టార్లకుగాను కేవలం 600 హెక్టార్లలోనే సాగైంది. రాగి, మొక్కజొన్న, అలసంద, సొయాచిక్కుడు పంటల సాగు ఎక్కడా కనిపించడంలేదు. సాగుచేసిన పంటల పరిస్థితి అగమ్యగోచరం... ఖరీఫ్‌లో పూర్తిస్థారుులో పంటల సాగు సంగతి అటుంచితే, సాగుచేసిన పంటల పరిస్థితి అగమ్యగోచరంగా మారింది. పెసర 4,145, మినుము 600, కంది 1,191, వేరుశనగ 1,661 హెక్టార్లలో సాగుచేశారు. 4,579 హెక్టార్లకుగానూ 8,856 హెక్టార్లలో భారీగా నువ్వు సాగుచేశారు. ఈ సీజన్లో 6,008 హెక్టార్లకుగాను కేవలం 485 హెక్టార్లలోనే కూరగాయలు సాగు చేశారు. జీలుగ కూడా మరో 100 హెక్టార్లలో సాగైంది. సాగుచేసిన పంటలన్నీ వివిధ దశల్లో ఉన్నాయి. కొన్ని పంటలు పూత, కాయ దశలో ఉండగా, వర్షాలు లేక ప్రతికూల పరిస్థితులు వాటిని వేధిస్తున్నారుు. గతంలో ఎన్నడూ లేని విధంగా జూలై నెలలో వడగాడ్పులు, ఎండలకు తోడు విద్యుత్ అంతరాయంతో సాగునీటి కష్టాలు పంటలను నాశనం చేస్తున్నారుు. తీరప్రాంతంలో ఎండుతున్న వేరుశనగ... జిల్లాలోని తీరప్రాంతంలో ఇప్పటికే విస్తారంగా సాగైన వేరుశనగ వడగాడ్పుల దెబ్బకు విలవిల్లాడుతోంది. తరచూ విద్యుత్ అంతరాయంతో బోర్లు సైతం పనిచేయక రైతులు అష్టకష్టాలు పడుతున్నారు. కరెంటు ఎప్పుడు వస్తుందో.. ఎప్పుడు పోతుందో తెలియని పరిస్థితి. ఈదురుగాలుల దెబ్బకు కరెంటు నిలవకపోవడంతో రైతులు విద్యుత్ మోటార్ల వద్దే పడిగాపులు కాయాల్సి వస్తోంది. ఈ కష్టాలు చాలవన్నట్లు అడుగంటిన భూగర్భజలాలతో బోర్లలో నీరు రావడం గగనమవుతోంది. విద్యుత్ మోటార్లు తరచూ మొరాయిస్తున్నారుు. పంట చేతికందే పరిస్థితి లేకపోవడంతో రైతులకు కంటిమీద కునుకు లేకుండాపోతోంది. జిల్లావ్యాప్తంగా రోజూ కారుమబ్బులు.. కటిక చీకట్లు తప్ప.. చుక్క వానపడని పరిస్థితి నెలకొనడంతో దిక్కుతోచని స్థితిలో రైతులు ఆకాశంవైపు చూస్తున్నారు. జిల్లాలోని పశ్చిమ ప్రాంతంలో అరుుతే ఖరీఫ్ పంటల సాగు దాదాపు నిలిచిపోయినట్టు చెప్పాలి. ఎటుచూసినా ఎడారిని తలపిస్తోంది. ఇదే పరిస్థితి కొనసాగితే ఈ ఏడాది తీవ్ర కరువు తప్పదని రైతులు ఆందోళన చెందుతున్నారు. -
మరో 3 రోజులు తీవ్ర వడగాడ్పులు
హైదరాబాద్ వాతావరణ శాఖ వెల్లడి రామగుండంలో అత్యధికంగా 45.8 డిగ్రీలు నమోదు సాక్షి, హైదరాబాద్: మరో 3 రోజుల పాటు తెలంగాణలో తీవ్ర వడగాడ్పులు వీస్తాయని హైదరాబాద్ వాతావరణ శాఖ తెలిపింది. మంగళవారం రామగుండంలో అత్యధికంగా 45.8 డిగ్రీల ఉష్ణోగ్రత రికార్డు అయింది. కొత్తగూడెంలో వడగాడ్పులకు ప్రజలు అల్లాడిపోయారు. అక్కడ దాదాపు 50 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదైందని స్థానికులు పేర్కొంటున్నారు. కాగా, హైదరాబాద్‌లో మంగళవారం గరిష్టంగా 40.8 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదైంది. వడదెబ్బతో 51 మంది మృతి సాక్షి, నెట్వర్క్: మంగళవారం వడదెబ్బతో రాష్ట్రంలోని వివిధ జిల్లాల్లో 51 మంది మృతి చెందారు. ఖమ్మం జిల్లాలో 21 మంది, వరంగల్ జిల్లాలో 11 మంది, నల్లగొండ జిల్లాలో ఏడుగురు, ఆదిలాబాద్ జిల్లాలో ఆరుగురు, కరీంనగర్ జిల్లాలో నలుగురు, మెదక్ జిల్లాలో ముగ్గురు మృతిచెందారు. ప్రధాన పట్టణాల్లో నమోదైన ఉష్ణోగ్రతలు ప్రాంతం ఉష్ణోగ్రత రామగుండం 45.8 భద్రాచలం 45.2 హన్మకొండ 44.3 ఖమ్మం 44.0 ఆదిలాబాద్ 43.3 నల్లగొండ 43.0 హైదరాబాద్ 40.8 -
మూడో రోజూ భగభగ
కొత్తగూడెం: పారిశ్రామిక ప్రాంతం కొత్తగూడెంపై భానుడు ప్రతాపం చూపుతూనే ఉన్నాడు. వరుసగా మూడోరోజు 50 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదైంది. ఎండవేడికి తోడు మంగళవారం వడగాలులు విపరీతంగా వీయడంతో ప్రజలు అల్లాడిపోయారు. సింగరేణి కార్మిక ప్రాంతం ఖమ్మం జిల్లా కొత్తగూడెం పట్టణం, పరిసర ప్రాంతాల్లో ప్రజలు ఎండ వేడితో భయాందోళనకు గురవుతున్నారు. ఇప్పటికే పలువురు వృద్ధులు, కూలీలు వడదెబ్బకు గురై మృత్యువాత పడ్డారు. మరికొంతమంది ఆస్పత్రుల్లో చికిత్స పొందుతున్నారు. ఎండదెబ్బ తగలడంతో ఈ మూడురోజులుగా ఆస్పత్రుల్లో రోగుల సంఖ్య పెరుగుతోంది. కార్మిక ప్రాంతాలు, స్థానిక ఓపెన్‌కాస్టు గనికి అతి సమీపంలో ఉన్న ప్రజలు, కార్మిక కుటుంబాల పరిస్థితి మరీ దారుణంగా ఉంది. నిత్యం వీస్తున్న వేడి గాలులు, భానుడి ప్రభావంతో ఇళ్లల్లో సైతం ఉండలేక పోతున్నారు. కార్మికుల ఇళ్లకు ఏసీలు పెట్టుకునేందుకు యాజమాన్యం అనుమతించకపోవడం, కూలర్ల గాలి ఏమాత్రం సరిపోకపోవడంతో ఉక్కపోత మధ్య కార్మిక కుటుంబాలు జీవనం సాగిస్తున్నాయి. ఓపెన్‌కాస్టు గనిలో మధ్యాహ్నం షిఫ్టుకు వెళ్లే కార్మికుల సంఖ్య విపరీతంగా తగ్గుముఖం పట్టింది. సాధారణం కంటే రెండు డిగ్రీల ఉష్ణోగ్రత అధికంగా ఉండటం, బొగ్గు పెళ్లల మధ్య ఉండటంతో వేడి మరింత ఎక్కువగా ఉండటం వల్ల విధులకు హాజరయ్యే కార్మికులు జంకుతున్నారు. ఎండదెబ్బ కారణంగా జాతీయ రహదారి మొత్తం నిర్మానుష్యంగా మారిపోయింది. మధ్యాహ్నం రోడ్లు, షాపులు ఖాళీగా దర్శనమిచ్చాయి. రోడ్లవెంట ఉండే చిరు వ్యాపారులు ఎండల కారణంగా వ్యాపారాలను మానుకోవాల్సిన పరిస్థితి నెలకొంది. అధిక ఉష్ణోగ్రతలు నమోదవుతుండటంతో రోడ్లవెంట నీళ్లు చల్లించాలని ప్రజలు డిమాండ్ చేస్తున్నారు. -
విరిగిపడ్డ విద్యుత్ స్తంభాలు
కరీంనగర్ జిల్లా తిమ్మాపూర్ మండలం ఎల్ఎండీ పోలీస్‌స్టేషన్ సమీపంలో బుధవారం సాయంత్రం వడగాలుల తీవ్రతకు విద్యుత్ స్తంభాలు విరిగిపడ్డాయి. రెండు స్తంభాలు రాజీవ్ రదారిపై పడటంతో రాకపోకలకు స్వల్ప అంతరాయం ఏర్పడింది. విద్యుత్ తీగలు తెగిపోవటంతో మండలంలోని పలు గ్రామాలకు సరఫరా నిలిచిపోయింది. -
పాపం పసివాళ్లు.. దూప చావు
అడవిలో మండుటెండలో నీళ్ల కోసం అల్లాడి ప్రాణాలు విడిచిన అన్నదమ్ములు ఎక్కడా చుక్కనీరు దొరక్క గొంతెండి మృత్యువాత రోజంతా ఎండలోనే చిన్నారుల మృతదేహాలు వాళ్లకు నీటికోసం వెళ్లి వడదెబ్బతో స్పృహ తప్పిన తల్లి తెల్లారితే అక్క పెళ్లి.. తమ్ముళ్ల మృతితో ఆగిన వైనం ఆదిలాబాద్ జిల్లాలో దారుణం చెన్నూర్ రూరల్: ‘అమ్మా.. దూపైతందమ్మా..!’ ఆ మాటలకు కన్నపేగు కదిలింది.. కానల్లోకి వెళ్లింది.. గంటైంది.. రెండు గంటలైంది..! అమ్మ రాలేదు.. గొంతు తడవలేదు.. ‘అన్నా.. అమ్మేది..? దూపైతంది..!’ తమ్ముడి చేయిపట్టి నడిపించాడు అన్న.. తడారిన గొంతులతో ఇద్దరూ కలసి నీటిచుక్క కోసం అడవిలోని వాగులువంకలు వెతికారు.. ఎక్కడా దొరకలేదు. ఆ చిన్నారులకేం తెలుసు..? నీళ్లకోసం వెళ్లిన అమ్మ ఎండదెబ్బకు సొమ్మసిల్లి పడిపోయిందని..! మృత్యువుకేం తెలుసు? పాలుగారే ఆ పసివాళ్లపై యమపాశం విసరొద్దని..! అక్క పెళ్లి కోసం ఆనందంగా వెళ్తున్న ఆ అన్నదమ్ముల్ని తనతో తీసుకెళ్లొద్దని..!! తెల్లారాకే తెలిసింది.. నీటికోసం అల్లాడి.. నడి అడవిలో తండ్లాడి.. మండే ఇసుక దిబ్బల్లో పొర్లాడి.. పోరాడి.. ఆ చిన్నారులు ప్రాణం వదిలారని!! ఆదిలాబాద్ జిల్లా అడవుల్లో చోటుచేసుకున్న ఈ హృదయవిదారక ఘటన కరువు రక్కసికి దర్పణం పడుతోంది. మండుటెండలో.. కాలినడకన.. ఆదిలాబాద్ జిల్లా చెన్నూర్ మండలంలోని లింగంపల్లికి చెందిన ఏలాది లచ్చుకు ఇద్దరు కూతుళ్లు మంజుల, సునీత. ఇద్దరు కుమారులు మధుకర్(12), అశోక్(8). ఆమె భర్త లస్మయ్య పిల్లలు చిన్నతనంలో ఉండగానే మృతి చెందాడు. వీరిది నిరుపేద కుటుంబం. కూలీ పనులు చేసుకొని జీవనం కొనసాగిస్తోంది. మధుకర్ ఐదో తరగతి, అశోక్ రెండో తరగతి చదువుతున్నారు. పెద్ద కుమార్తె మంజుల వివాహం లింగంపల్లికి సమీపంలోని బుద్దారం గ్రామానికి చెందిన వ్యక్తితో నిశ్చయమైంది. పెళ్లి కుమారుని ఇంటి వద్దే వివాహానికి ఏర్పాట్లు చేశారు. సోమవారమే పెళ్లి. ఆనవాయితీ ప్రకారం మంజులను ముందుగానే పెళ్లి కొడుకు ఇంటికి తీసుకెళ్లారు. చిన్న కూతురు సునీతను ఇంటి వద్దే ఉంచి తల్లి లచ్చు.. ఆదివారం ఉదయం 10 గంటలకు తన కొడుకులు మధుకర్, అశోక్‌లను తీసుకొని లింగంపల్లి నుంచి కిష్టంపేట మీదుగా గుట్ట దారిలో బయల్దేరింది. 11 గంటల ప్రాంతంలో బుద్దారం అటవీ ప్రాంతంలో దాహం వేస్తోందని కొడుకులు అనడంతో తల్లి తాగేందుకు నీరు తీసుకొస్తానని చెప్పి అటవీ ప్రాంతంలోకి వెళ్లి దారి తప్పింది. మండుటెండలో నీటికోసం అటూఇటూ తిరిగిన లచ్చు వడదెబ్బ తాకి ఓచోట సృ్పహ తప్పిపడిపోయింది. ఇటు ఇద్దరు చిన్నారులకూ వడదెబ్బ తాకింది. నీటి చుక్క కోసం వారు కూడా అడవంతా వెతికారు. కానీ లాభం లేకపోయింది. చివరికి ఎక్కడా నీటిజాడ దొరక్క ఎర్రటి ఎండలో విలవిల్లాడుతూ ప్రాణాలు విడిచారు. రోజంతా మండుటెండలోనే..: మండుతున్న ఎండ పైన.. కాలిపోతున్న ఇసుక కింద.. ఈ పరిస్థితి మధ్య రోజంతా చిన్నారుల మృతదేహాలు అడవిలోనే పడిఉన్నాయి. మరుసటి రోజుకుగానీ ఈ దారుణం వెలుగుచూడలేదు. సోమవారం ఉదయం ఉద్దారం గ్రామస్తులు పండ్ల సేకరణ కోసం అడవిలోకి వెళ్లగా స్పృహ తప్పిన లచ్చు కనిపించింది. నీరు తాగించడంతో కొన ప్రాణాలతో ఉన్న ఆమె మృత్యువు నుంచి బయటపడింది. కన్నీళ్లు పెట్టుకుంటూ తన కుమారుల కోసం వెతకగా గ్రామానికి రెండు కిలోమీటర్ల దూరంలో అటవీ ప్రాంతంలో ఇద్దరి మృతదేహాలు కనిపించాయి. వారిని చూడగానే ఆమె గుండెలవిసేలా రోదించింది. ఉద్దారం గ్రామస్తులు బంధువులకు సమాచారం అందించడంతో వారు ఘటనాస్థలానికి వె ళ్లి లచ్చును తీసుకొచ్చారు. అనంతరం చిన్నారుల మృతదేహాలను లింగంపల్లికి తరలించారు. ఆగిన పెళ్లి..: తమ్ముళ్లు ఇద్దరూ వడదెబ్బతో మృత్యువాతపడటంతో మంజుల వివాహం నిలిచిపోయింది. అప్పటికే ఇంటి ముందు పెళ్లి పందిరితోపాటు వివాహానికి అన్ని ఏర్పాట్లూ చేశారు. అభం, శుభం తెలియని ఇద్దరు చిన్నారుల మృతితో ఇటు లింగంపల్లిలో అటు బుద్దారంలో విషాదఛాయలు అలుముకున్నాయి. ఆ కుటుంబాన్ని ఆదుకుంటాం: ఓదెలు వడదెబ్బతో చనిపోయిన చిన్నారుల కుటుంబాన్ని ఆదుకుంటామని ప్రభుత్వ విప్ నల్లాల ఓదెలు చెప్పారు. సోమవారం ఆయన లింగంపల్లి వెళ్లి లచ్చు కుటుంబాన్ని పరామర్శించారు. ఆర్థికసాయం కింద రూ.10వేలు అందజేశారు. బాధిత కుటుంబానికి డబుల్ బెడ్రూం ఇల్లు మంజూరు చేసినట్లు చెప్పారు. -
తెలుగు రాష్ట్రాల్లో విచిత్ర వాతావరణం..!
విశాఖపట్నం: తెలుగు రాష్ట్రాల్లో ప్రస్తుతం విచిత్ర వాతావరణం నెలకొంది. వడగాడ్పులు, వేడిగాలులతో పాటు అకాల వర్షాలు, ఉరుములు, మెరుపులతో ఈ భిన్న పరిస్థితి ఏర్పడింది. ఉదయం నుంచి సాయంత్రం వరకు నిప్పుల వాన కురుస్తుంటే.. సాయంత్రానికి అకాల వర్షం అలజడి రేపుతోంది. దీనికి ఈదురు గాలులు కూడా తోడై జనాన్ని భయకంపితులను చే స్తూ ఆస్తి నష్టాన్ని కలిగిస్తున్నాయి. రెండ్రోజులుగా పడమర దిశ నుంచి వస్తున్న వెస్టర్న్ డిస్టర్బెన్స్ (పశ్చిమ ఆటంకాలు) ప్రభావమే ఈ పరిస్థితికి కారణమని వాతావరణ నిపుణులు చెబుతున్నారు. వెస్టర్న్ డిస్టర్బెన్స్ ప్రభావంతో క్యుములోనింబస్ మేఘాలేర్పడి ఉరుములు, మెరుపులతో కొద్దిసేపట్లోనే సుడిగాలులతో కూడిన వర్షం కురుస్తుందని రిటైర్డ్ వాతావరణ అధికారి రాళ్లపల్లి మురళీకృష్ణ ‘సాక్షి’కి చెప్పారు. మరో రెండు, మూడు రోజుల పాటు ఇదే వాతావరణం కొనసాగుతుందని, తర్వాత మళ్లీ ఎండలు, వడగాడ్పులు విజంభిస్తాయని ఆయన విశ్లేషించారు. మరోవైపు రెండు రాష్ట్రాల్లోనూ అధిక ఉష్ణోగ్రతలు, వడగాడ్పులూ కొనసాగుతూనే ఉన్నాయి. సోమవారం రామగుండంలో 46.4 డిగ్రీల గరిష్ట ఉష్ణోగ్రత నమోదైంది. దేశంలోకెల్లా ఇదే అత్యధిక ఉష్ణోగ్రత కావడం విశేషం. రెంటచింతల, నందిగామల్లో 44, నిజామాబాద్, తిరుపతి, కడప, అనంతపురంలలో 43, కర్నూలు, విజయవాడల్లో 42, హైదరాబాద్, నెల్లూరు, తునిల్లో 41, ఒంగోలు, ఆరోగ్యవరం, కాకినాడల్లో 40 డిగ్రీల గరిష్ట ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. రానున్న రెండు రోజులు తెలంగాణలోని ఖమ్మం, నల్లగొండ, కరీంనగర్ జిల్లాల్లోనూ, ఆంధ్రప్రదేశ్‌లోని తూర్పు, పశ్చిమ గోదావరి, కృష్ణా, గుంటూరు, ప్రకాశం, నెల్లూరు, అనంతపురం, కర్నూలు జిల్లాల్లోనూ వడగాడ్పుల తీవ్రత ఉంటుందని భారత వాతావరణ విభాగం సోమవారం రాత్రి విడుదల చేసిన నివేదికలో తెలిపింది. ఆయా ప్రాంతాల్లో గరిష్ట ఉష్ణోగ్రతలు 40 నుంచి 45 డిగ్రీల మధ్య నమోదవుతాయని పేర్కొంది. అదే సమయంలో తెలంగాణలోని ఆదిలాబాద్, కరీంనగర్, నిజామాబాద్, ఖమ్మం, వరంగల్, నల్గొండ, రంగారెడ్డి, హైదరాబాద్, మెదక్, మహబూబ్‌నగర్ జిల్లాల్లోను, ఆంధ్రప్రదేశ్‌లోని శ్రీకాకుళం, విజయనగరం, విశాఖపట్నం, గుంటూరు, చిత్తూరు, కడప, కర్నూలు, అనంతపురం జిల్లాల్లో కొన్నిచోట్ల ఉరుములు, ఈదురుగాలులతో కూడిన అకాల వర్షాలు కురిసే అవకాశం ఉందని వివరించింది. -
వేడి గాలులకు 22,562 మంది మృతి
న్యూఢిల్లీ: భారత దేశం నిప్పుల కొలిమిలా తయారైంది. చండప్రచండంగా వీస్తున్న వేడి గాలులకు మనుషులు పిట్టల్లా రాలుతున్నారు. మహారాష్ట్రలోని బీడ్‌లో యోగిత అనే 12 ఏళ్ల బాలిక పదే పదే మంచి నీళ్ల కోసం ఎండలో బిందె పట్టుకొని వెళ్లడం వల్ల గుండెపోటుతో మరణించింది. తాజాగా చోటుచేసుకున్న ఈ సంఘటన దేశ ప్రజలను కలచివేసింది. ఈ ఏడాది ఇప్పటికే ఎండ వేడికి తాళలేక వందమందికి పైగా మత్యువాత పడ్డారు. అనధికార లెక్కల ప్రకారం ఈ సంఖ్య ఇంకా ఎక్కువగానే ఉంటుంది. నష్టపరిహారం చెల్లించాల్సి వస్తుందనే కారణంగా చాలా రాష్ట్రాలు వేడి గాలుల కారణంగా చనిపోతున్న వారి సంఖ్యను సంక్రమంగా లెక్కించడం లేదు. అందుబాటులో ఉన్న లెక్కల ప్రకారం 1992 నుంచి ఎంతో మంది మత్యువాత పడుతున్న ప్రభుత్వ నివారణ చర్యలు అంతంత మాత్రమే. నాటి నుంచి నేటి వరకు వేడి గాలులకు దేశంలో 22,562 మంది మరణించారు. ఈ సంఖ్య ఇంకా ఎక్కువగానే ఉంటుందని విపత్తు నివారణ సంస్థ స్వయంగా అంగీకరించడం గమనార్హం. ఈ 23 ఏళ్ల కాలంలో ప్రతి ఏటా 400లకు తగ్గకుండా మత్యువాత పడ్డారు. 1992, 1994 సంవత్సరాల్లో వెయ్యి మందికిపైగా చనిపోయారు. 1995, 1998 సంవత్సరాల్లో ఈ సంఖ్యగా వెయ్యికిపైగా ఉంది. 2015 సంవత్సరంలో మాత్రం ఏకంగా 2,422 మంది మరణించారు. గత కొన్ని సంవత్సరాల నుంచి ప్రతి ఏట భారత్‌లో ఎండ వేడి, వేడి గాలుల తీవ్రత పెరుగుతూ వస్తోంది. ముఖ్యంగా ఉత్తరాది, వాయువ్య భారత్, మధ్య భారత్ ప్రాంతాలతోపాటు తమిళనాడు, ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల్లో ఎండలు దంచి కొడుతున్నాయి. అధికారిక లెక్కల ప్రకారం ఈ ఏడాది ఇప్పటికే 45 మంది మరణించారు. తెలంగాణలో 66 మంది మరణించారని ఏప్రిల్ 6వ తేదీన ప్రకటించిన రాష్ట్ర ప్రభుత్వం కేవలం 16 మంది మాత్రమే మరణించారని సవరించిన జాబితాలో పేర్కొంది. మత్యువాతను తప్పించుకునేందుకు ఎండలోకి రావద్దని ప్రభుత్వాలు ప్రజలకు ఉచిత సలహాలను ఇస్తోంది. రెక్కాడితేగానీ డొక్కాడని దినసరి కూలీలు, భవన నిర్మాణ కార్మికులు, కూరగాయల అమ్మకందారులు, రోడ్డును ఆశ్రయించి వ్యాపారం చేసుకునే హ్యాకర్లు రోడ్డెక్కకుండా ఉండగలరా? ఇక నిలువ నీడలోని బిచ్చగాళ్లు, అనాథలు, వద్ధుల సంగతి సరేసరి. వారు నీటపట్టున విశ్రాంతి తీసుకుంటే వారికి పూట గడవదు. ఇలాంటి వారందరికి ప్రభుత్వం సమ్మర్ షెల్టర్లను ఏర్పాటుచేసి ఆహార వసతిని కూడా ఏర్పాటు చేయాల్సిన అవసరం ఉంది. -
మరో రెండు రోజులు తీవ్ర వడగాలులు: వాతావరణ శాఖ
హైదరాబాద్ : తెలుగు రాష్ట్రాల్లో భానుడు సెగలు కక్కుతున్నాడు. ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల్లోని పలు జిల్లాల్లో ఉష్ణోగ్రతలు 40 డిగ్రీలు దాటాయని వాతావరణ శాఖ వెల్లడించింది. అలాగే మరికొన్ని జిల్లాల్లో 42 డిగ్రీలకుపైగా ఉష్ణోగ్రతలు నమోదు అవుతున్నాయని పేర్కొంది. మరో రెండు రోజులు తీవ్ర వడగాలులు ఇలాగే ఉంటాయని వాతావరణ శాఖ తెలిపింది. భారీ ఎండలు నేపథ్యంలో ప్రజలు పలు జాగ్రత్తలు తీసుకోవాలని వాతావరణ శాఖ సూచించింది. -
వడగాడ్పులు వాయిదా...
వేడి గాలులను అడ్డుకుంటున్న ఆగ్నేయ, దక్షిణ చల్లని గాలులు సాక్షి, విశాఖపట్నం: వారం రోజుల నుంచి అదేపనిగా ఉడికిస్తున్న ఉష్ణోగ్రతలు ఇప్పుడిప్పుడే తగ్గుముఖం పడుతున్నాయి. దీంతో తెలుగు రాష్ట్రాల ప్రజలు వడగాడ్పుల నుంచి కాస్త ఊరట చెందనున్నారు. కొన్ని రోజులుగా పశ్చిమ, ఉత్తర దిశల నుంచి వస్తున్న వేడి గాలుల ప్రభావంతో తెలుగు రాష్ట్రాల్లో సాధారణం కంటే ఆరు డిగ్రీలకు పైగా పగటి(గరిష్ట) ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. తాజాగా సముద్రం పైనుంచి వీస్తున్న ఆగ్నేయ, దక్షిణ(చల్లని) గాలులు.. ఉత్తర, పశ్చిమ గాలులను అడ్డుకుంటున్నాయి. దీంతో గరిష్ట ఉష్ణోగ్రతలు క్షీణిస్తున్నాయి. ఈ నేపథ్యంలో భారత వాతావరణ విభాగం వారం రోజుల నుంచి కొనసాగిస్తున్న వడగాడ్పుల హెచ్చరికలను గురువారం రెండు రాష్ట్రాల్లోనూ ఉపసంహరించింది. కొద్దిరోజుల పాటు ఇదే పరిస్థితి కొనసాగవచ్చని రిటైర్డ్ వాతావరణ అధికారి ఆర్.మురళీకృష్ణ 'సాక్షి'కి తెలిపారు. మరోవైపు పశ్చిమ బెంగాల్ నుంచి ఒడిశా మీదుగా ఉత్తర కోస్తాంధ్ర వరకు ఉపరితల ద్రోణి ఏర్పడింది. సముద్రమట్టానికి 0.9 కిలోమీటర్ల ఎత్తులో కొనసాగుతోంది. ఇది కూడా కోస్తాలో ఉష్ణ తీవ్రతను కాస్త తగ్గించడానికి దోహదపడుతోంది. గురువారం నందిగామలో 38, గన్నవరంలో 37, తునిలో 36, విశాఖ, కాకినాడల్లో 35, కర్నూలు, అనంతపురంలలో 41, తిరుపతిలో 40 డిగ్రీల సాధారణ ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. దక్షిణ, ఆగ్నేయ గాలులు, ద్రోణి ప్రభావం పాక్షికంగా ఉన్న తెలంగాణలో కోస్తాతో పోల్చుకుంటే ఎండలు అధికంగానే ఉన్నాయి. నిజామాబాద్‌లో 41, రామగుండంలో 40, హైదరాబాద్‌లో 39 చొప్పున గరిష్ట ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. ఎండలపై అప్రమత్తత సాక్షి, హైదరాబాద్: రాష్ట్రవ్యాప్తంగా భానుడి ప్రతాపంతో జనం విలవిలలాడుతున్నారు. ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల నుంచి సామాజిక ఆరోగ్య కేంద్రాలు, ఏరియా ఆస్పత్రులు, జిల్లా ఆస్పత్రులు కిటకిటలాడుతున్నాయి. ఈ నేపథ్యంలో రాష్ట్రవ్యాప్తంగా ఆరోగ్య సంచాలకులు సర్క్యులర్ జారీ చేశారు. ఆరోగ్యశాఖలో పనిచేస్తున్న సిబ్బందికి రెండు మాసాలు సెలవులు రద్దు చేస్తున్నట్లు ప్రకటించారు. ఏరోజుకారోజు ప్రతి ఆస్పత్రి నుంచి పరిస్థితిపై నివేదిక హైదరాబాద్‌లోని డెరైక్టర్ కార్యాలయానికి పంపించాలని సూచించారు. ఇప్పటికే కొన్నిజిల్లాల్లో సెలైన్ బాటిళ్లు, వోఆర్ఎస్ ప్యాకెట్ల కొరత ఉన్నట్టు తెలిసింది. -
మార్పులే...వడగాల్పులు
-
నేడు కూడా కొనసాగనున్న వడగాల్పులు
విశాఖపట్నం: తెలుగు రాష్ట్రాలలో నేడు కూడా వడగాల్పులు కొనసాగనున్నాయని విశాఖపట్నంలోని వాతావరణ కేంద్రం శుక్రవారం వెల్లడించింది. ఛత్తీస్‌గఢ్ నుంచి తెలంగాణ, కోస్తాంధ్ర మీదుగా, దక్షిణ తమిళనాడు వరకు ఉపరితల అల్పపీడన ద్రోణులు కొనసాగుతున్నాయని తెలిపింది. అయితే ఒకటి, రెండు చోట్లు తేలికపాటి వర్షాలు పడే అవకాశం ఉందని పేర్కొంది. కాగా అటు తెలంగాణ, ఇటు ఆంధ్రప్రదేశ్‌లోని పలు ప్రాంతాల్లో గురువారం సాయంత్రం వర్షపు జల్లులు పడ్డాయి. -
ఉసురు తీస్తున్న వడగాల్పులు
1,344కు పెరిగిన వడదెబ్బ మృతులు స్వల్పంగా తగ్గిన ఉష్ణోగ్రతలు హైదరాబాద్: రాష్ట్రం నిప్పుల కొలిమిలా మారిన నేపథ్యంలో వీస్తున్న వడగాలులను తట్టుకోలేక వృద్ధులు, పిల్లలతోపాటు చాలా చోట్ల మధ్యవయస్కులు మరణిస్తున్నారు. ఈ వేసవిలో వడగాల్పుల వల్ల మృతిచెందిన వారి సంఖ్య గురువారం సాయంత్రానికి అధికారిక గణాంకాల ప్రకారమే 1,344కు చేరింది. ఈ విషయాన్ని రాష్ట్ర విపత్తు నిర్వహణ శాఖ ధ్రువీకరించింది. ప్రకాశం జిల్లాలో అత్యధికంగా 305 మంది వడదెబ్బతో మృత్యువుపాలయ్యారు. అనధికారిక లెక్పకల ప్రకారం ఈ మృతుల సంఖ్య రెండువేలుపైగా ఉంటుందని అంచనా. ఇక గురువారంనాడు రాష్ట్రవ్యాప్తంగా 29 మంది చనిపోయారు. ఇందులో అత్యధికంగా తూర్పుగోదావరి జిల్లాకు చెందినవారు 16 మంది ఉన్నారు. బుధవారంతో పోల్చితే గురువారం రాష్ట్రవ్యాప్తంగా గరిష్ట ఉష్ణోగ్రతలు కొద్దిగా తగ్గాయి. మరో రెండు రోజులపాటు వడగాల్పులు కొనసాగుతాయని వాతావరణ నిపుణులు తెలిపారు. ఈ మృతుల కుటుంబాలకు రూ. లక్ష ఎక్స్‌గ్రేషియా చెల్లించేందుకు నిధులు లేవని జిల్లా కలెక్టర్లు పేర్కొన్నారు. అత్యవసరమైతే ట్రెజరీ రూల్-27 కింద నిధులు డ్రా చేసుకోవాలని ప్రభుత్వం సూచించింది. ఈ మేరకు రెవెన్యూ శాఖ ముఖ్య కార్యదర్శి జేసీ శర్మ ఉత్తర్వులిచ్చారు. -
ఇది ప్రకృతి వైపరీత్యం కాదా ?
న్యూఢిల్లీ: దేశంలో ఏటా వేలాది మందిని పొట్టన పెట్టుకుంటున్న చండ ప్రచండ వడ గాలులు ప్రకృతి వైపరీత్యం కాదా ? చలి గాలులను ప్రకృతి వైపరీత్యాల జాబితాలో చేర్చినప్పుడు, అదే కోవకు చెందిన వడ గాలులను మాత్రం ప్రకృతి వైపరీత్యాల జాబితాలో ఎందుకు చేర్చరు? 2012లో ఉత్తర భారతాన్ని అతి శీతల గాలులు గజగజ వణికించి ఎంతో మంది ప్రాణాలను బలి తీసుకున్నప్పుడు భారత ప్రభుత్వం చలి గాలులను ప్రకృతి వైపరీత్యాల జాబితాలో చేర్చింది. ఈ ఏడాది ఇప్పటి వరకు వడ గాలులతో దేశంలో 1150 మందిని, తెలుగు రాష్ట్రాల్లో దాదాపు 900 మందిని బలితీసుకున్నాయి. 2004 నుంచి 2014 వరకు దేశంలో వడ గాలుల వల్ల చనిపోయిన వారి సంఖ్య 63 శాతం పెరిగిదంటే దీని తీవ్రతను అర్థం చేసుకోవచ్చు. అయినా వడ గాలులను ప్రకృతి వైపరీత్యంగా గుర్తించడంలో కేంద్ర ప్రభుత్వం ఎందుకు తాత్సారం చేస్తోంది? వడ గాలులను ప్రకృతి వైపరీత్యంగా ఈపాటికే గుర్తించినట్లయితే వందలాది మంది ప్రజల ప్రాణాలను పరిరక్షించి ఉండే వాళ్లమని జాతీయ ప్రకృతి వైపరీత్యాల నివారణ సంఘం (ఎన్డీఎంఏ) సీనియర్ సభ్యుడు కమల్ కిషోర్ తెలిపారు. ఇదే సంఘానికి చైర్మన్‌గా పని చేసిన తెలంగాణ నాయకుడు మర్రి శశిధర్ రెడ్డి తన హయాంలో వడ గాలులను ప్రకృతి వైపరీత్యంగా గుర్తించేందుకు తన వంతు కృషి తీవ్రంగానే చేశారు. 2013లో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో వడ గాలులకు దాదాపు 1150 మంది మరణించడంతో (ఆ ఏడాది దేశవ్యాప్తంగా 1450 మంది మరణించారు) చలించిన శశిధర్ రెడ్డి వడ గాలులను ప్రకృతి వైపరీత్యంగా గుర్తించాలనే ప్రతిపాదనను అప్పటి ప్రధాన మంత్రి మన్మోహన్ సింగ్ దృష్టికి తీసుకెళ్లారు. స్పందించిన ఆయన చిదంబరం, శరద్ పవార్, సుశీల్ కుమార్ షిండే, హరీష్ రావత్, మాంటెక్ సింగ్ అహ్లువాలియాలతో మంత్రుల బృందాన్ని ఏర్పాటు చేశారు. ఆ బృందం పలు సార్లు సమావేశమైనా ఎలాంటి నిర్ణయం తీసుకోలేదు. ఇంతలో పార్లమెంట్ ఎన్నికలు రావడంతో మర్రి శశిధర్ రెడ్డి ప్రతిపాదన అటకెక్కింది. ప్రస్తుతం జాతీయ ప్రకృతి వైపరీత్యాల జాబితాలో భూకంపాలు, తుఫాన్లు, కరువు కాటకాలు, కొండ చెరియలు విరిగి పడడం, వడగళ్ల వర్షాలు చోటుచేసుకున్నాయి. ఈ జాబితాలో ఉన్న ప్రకృతి వైపరీత్యాల వల్ల మరణం సంభవిస్తే లక్షన్నర రూపాయల ఆర్థిక సహాయం అందజేస్తారు. ఇక్కడ ప్రాణ నష్టానికి పరిహారం ముఖ్యం కాదని, ముందస్తు నివారణ చర్యలకు ఎంతో అవకాశం ఉంటుందని కమల్ కిషోర్ చెప్పారు. వడ గాలులను ప్రకృతి వైపరీత్యంగా ప్రభుత్వం గుర్తించినట్టయితే కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు పరస్పర సహకారం, సమన్వయంతో నష్ట నివారణ చర్యలు చేపడుతాయని అన్నారు. అన్ని ప్రభుత్వ సంస్థలు సమన్వయంతో వడ గాలుల పట్ల ప్రజల్లో విస్తృతంగా అవగాహన కార్యక్రమాలను నిర్వహించడం, బాధితులకు సరైన వైద్య సహాయం అందించడం, వారికి సరైన సమ్మర్ షెల్టర్లు, చలి వేంద్రాలు ఏర్పాటు చేయడం లాంటి చర్యలకు అవకాశం ఉంటుందని ఆయన వివరించారు. -
మరో 48 గంటలపాటు వడగాల్పులు
విశాఖపట్నం: రెండు తెలుగు రాష్ట్రాలలో మరో రెండు రోజుల పాటు వడగాల్పులు కొనసాగనున్నాయని విశాఖపట్నంలోని వాతావరణ కేంద్రం గురువారం వెల్లడించింది. కోస్తాంధ్ర మీదుగా ఉపరితల ద్రోణి కొనసాగుతుందని తెలిపింది. ఈ నెల 30 నాటికి నైరుతి రుతుపవనాలు కేరళ తీరాన్ని తాకే అవకాశం ఉందని వాతావరణ కేంద్రం పేర్కొంది. -
మరి రెండు రోజులపాటు అధిక ఉష్ణోగ్రతలు
-
మరో 24 గంటలపాటు తీవ్ర వడగాల్పులు
విశాఖపట్నం: ఉత్తర ఛత్తీస్‌గఢ్‌పై ఉపరితం ఆవర్తనం ఆవరించి ఉందని విశాఖపట్నంలోని వాతావరణ కేంద్రం వెల్లడించింది. ఈ నేపథ్యంలో దక్షిణ కోస్తాంధ్రలో 24 గంటలపాటు తీవ్ర వడగాల్పులు వీస్తాయని తెలిపారు. ఈ నేపథ్యంలో దక్షిణ కోస్తా ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించింది. అయితే భారీ ఎండలకు తోడు వడగాల్పుల వల్ల తెలుగు రాష్ట్రాలలోని మొత్తం 23 జిల్లాలలో 500 మందికి పైగా మరణించిన సంగతి తెలిసిందే. -
ఏపీలో వడదెబ్బకు 551మంది మృతి
హైదరాబాద్ : ఆంధ్రప్రదేశ్‌లో ఇప్పటివరకూ వడదెబ్బకు 551మంది మృతి చెందినట్లు హోంమంత్రి నిమ్మకాయల చినరాజప్ప తెలిపారు. ఆయన మంగళవారమిక్కడ మీడియా సమావేశంలో మాట్లాడుతూ బాధిత కుటుంబాలకు రూ.లక్ష చొప్పున పరిహారం అందచేస్తామన్నారు. మండల అధికారులతో కమిటీ వేసి మృతుల వివరాలు నమోదుకు జిల్లా కలెక్టర్లను ఆదేశించినట్లు చినరాజప్ప తెలిపారు. టీడీపీ గుర్తింపు రద్దు చేయమని ఎన్నికల కమిషన్‌ను కాంగ్రెస్ పార్టీ కోరటం హాస్యాస్పదమని చినరాజప్ప అన్నారు. రాష్ట్రంలో డిపాజిట్లు లేకుండా పోయిన పార్టీ...కాంగ్రెస్ పార్టీ అని ఆయన ఎద్దేవా చేశారు. ఆ పార్టీ గుర్తింపును ఎప్పుడో రద్దు చేయాల్సిందని చినరాజప్ప ఎదురు దాడి చేశారు. ఎన్నికల ముందు ఇచ్చిన హామీలన్నీ నెరవేర్చామని, రాజధానికి అడ్డంకులు సృష్టించాలని చూసి ఇలాగే విఫలమయ్యారన్నారు. -
వడదెబ్బకు 44 మంది బలి
ఉగ్రరూపం దాల్చుతున్న సూర్యుడు జనాన్ని బలితీసుకుంటున్నాడు. పసిముద్ద నుంచి పండుటాకుల వరకు రాలిపోతున్నారు. వడదెబ్బ, వడగాలులు ప్రజలను బెంబేలెత్తిస్తున్నాయి. గార్లలో ఆరు నెలల పాప మృత్యువాతపడింది. ఓ తునికాకు కార్మికురాలు, ఓ వ్యవసాయ కూలీ, ఓ కొబ్బరి బోండాల వ్యాపారిని మృత్యువు వడదెబ్బ రూపంలో కబళించింది. కొందరు ఎండకు సొమ్మసిల్లి అక్కడికక్కడే మృతిచెందారు. అస్వస్థతకు గురై కొందరు నిద్రలోనే తనువు చాలించారు. జిల్లాలో సోమవారం 44 మంది మృతి చెందారు. సొసైటీ మాజీ డెరైక్టర్... నేలకొండపల్లి: మండలంలోని మండ్రాజుపల్లి సోసైటీ మాజీ డైరె క్టర్ లావూరి బద్ధు (67) వడదెబ్బతో మృతి చెందాడు. మృతుడికి భార్య, ముగ్గురు కూతుళ్లు, ఇద్దరు కుమారులు ఉన్నారు. మధిరలో కొబ్బరిబోండాల వ్యాపారి మధిర: మధిర పట్టణంలోని బాపూజీ రోడ్డుకు చెందిన కొబ్బరి బోండాల వ్యాపారి ఎండీ ఇబ్రహీం(40) ఎండ తీవ్రతతో సోమవారం మృతిచెందాడు. మృతుడికి భార్య, ఇద్దరు కుమార్తెలు ఉన్నారు. కామేపల్లిలో వృద్ధురాలు కామేపల్లి: మండల పరిధిలోని ఊట్కూర్ గ్రామంలో గూడూరు రామసూర్య(70) ఆదివారం తీవ్ర వడదెబ్బకు గురై అర్ధరాత్రి మృతి చెందింది. అశ్వారావుపేటలో ఒకరు అశ్వారావుపేట రూరల్: మండల పరిధిలోని వినాయకపురం కాలనీ గ్రామానికి చెందిన ఎస్కే మస్తాన్ (50) సోమవారం ఉదయం కూలీ పనులకు వెళ్లి తిరిగి మధ్యాహ్నా సమయంలో ఇంటికి వచ్చాడు. ఇంటికి వచ్చిన కొంత సమయానికి ఆయన సొమ్మసిల్లి పడిపోయి అక్కడిక్కడే మృతి చెందాడు. పాల్వంచలో వ్యవసాయ కూలీ.. పాల్వంచ రూరల్: మండల పరిధిలోని జగన్నాథపురం గ్రామానికి చెందిన దారావత్ దస్మా (46) వ్యవసాయ కూలీగా జీవనం సాగిస్తోంది. సోమవారం కూలీ పనికి వెళ్లి అస్వస్థతకు గురైంది. ఇంటికి వచ్చి పడుకుంది. నిద్రలోనే దస్మా మృతిచెందింది. ఎర్రుపాలెంలో ఇద్దరు.. ఎర్రుపాలెం : మండలంలోని భీమవరం గ్రామానికి చెందిన గంగారపు నాగయ్య (67) వడదెబ్బతో మృతి చెందాడు. ఈయన పొలంలో ఎరువులు వేస్తుండగా స్పృహ కోల్పోయాడు. ఇంటికి తీసుకొచ్చి ఆర్ఎంపీ వైద్యునితో ప్రథమ చికిత్స అందిస్తుండగా మృతిచెందాడు. లక్ష్మీపురం గ్రామానికి చెందిన శతాధిక వృద్ధురాలు వెన్నపూస నాగరత్నమ్మ(101) ఎండ తీవ్రత తట్టుకోలేక మృత్యువాత పడింది. సత్తుపల్లిలో ఒకరు.. సత్తుపల్లి : మండలంలోని కిష్టాపురం గ్రామానికి చెందిన గుడిమెట్ల సత్యావతి(54) సోమవారం వడదెబ్బకు గురై మృతి చెందింది. బయ్యూరంలో ఒకరు బయ్యారం: మండలంలోని గంధంపల్లి గ్రామానికి కన్నేటి వెంకటేశ్వరరావు(65) ఎండతీవ్రత మూలంగా అస్వస్థతకు గురై మృతిచెందినట్లు కుటుంబసభ్యులు తెలిపారు. బూర్గంపాడులో ముగ్గురు బూర్గంపాడు : మండల కేంద్రం బూర్గంపాడులో గౌతమిపురం కాలనీకి చెందిన పెరుమాళ్ల సురేష్(32) గతరెండురోజుల క్రితం వడదెబ్బకు గురయ్యాడు. కుటుంబసభ్యులు ఇంటి వద్ద చికిత్సలు జరిపిస్తున్న క్రమంలో సోమవారం తెల్లవారుజామున మృతి చెందాడు. మృతుని భార్య, ఇద్దరు పిల్లలున్నారు. బూర్గంపాడుకు చెందిన దడిగల నాగేశ్వరరావు(50) సోమవారం వడదెబ్బతో మృతిచెందాడు. గత మూడురోజులుగా తీవ్రఅస్వస్తతకు గురైన ఆయన సోమవారం ఉదయం మృతిచెందాడు. వేపలగడ్డ గ్రామానికి చెందిన వర్సా పెదనాగయ్య(55) వడదెబ్బకు గురై సోమవారం సాయంత్రం మృతిచెందాడు. ఆదివారం ఉదయం పొలం పనులకు వెళ్లి వడదెబ్బకు గురైన నాగయ్య చికిత్స పొందుతు సోమవారం సాయంత్రం మృతిచెందాడు. మణుగూరులో ఒకరు.. మణుగూరు: మండలంలోని రామానుజరవం పంచాయతీ చిక్కుడుగుంట గ్రామానికి చెందిన దార్ల నాగభూషణం(52)ఆదివారం మధ్యాహ్నం పని పక్క గ్రామానికి వెళ్లొచ్చాడు. సాయంత్రం కొంత నలతగా ఉందని అన్నం తిని పడుకున్నాడు. సోమవారం ఉదయం ఎంతసేపటికి నిద్ర లేవక పోవడంతో కుటుంబ సభ్యులు వెళ్లి చూసేసరికి మృతి చెంది ఉన్నాడు. అశ్వారావుపేటలో ఇద్దరు.. అశ్వారావుపేట రూరల్: మండల పరిధిలోని పేరాయిగూడెం గ్రామానికి చెందిన తగరం లక్ష్మి (55) వడ దెబ్బకు గురై పరిస్థితి విషమించి మృతి చెందింది. వ్యవసాయ పనులకు వెళ్లి వడదెబ్బకు గురై పట్టణంలోని కాళింగుల బజార్‌కు చెందిన పౌడి సూర్యనారాయణ (56) మృతి చెందాడు. గుండాలలో ఒకరు గుండాల : మండలంలోని ఆళ్లపల్లి గ్రామానికి చెందిన సత్యమోజు వీరాచారి(45) వడదెబ్బతో మూడు రోజుల క్రితం అస్వస్థతకు గురయూడు. ఆదివారం స్థానిక ఆస్పత్రికి తీసుకెళ్లి వైద్యం అందించినప్పటికి తగ్గలేదు. సోమవారం తెల్లవారు జామున మృతిచెందాడు. మృతుడికి భార్య, ఇద్దరు కుమారులు ఉన్నారు. వెంకటాపురంలో ఒకరు.. అశ్వాపురం: మండలంలోని తుమ్మల చెరవు గ్రామపంచాయతీ వెంకటాపురం గ్రామంలో కాకాటి అచ్చయ్య(75) వడదెబ్బతో మృతి చెందాడు. ఏన్కూరులో ఒకరు ఏన్కూరు: మండల పరిధిలోని ఆరికాయలపాడుకు చెందిన కూరపాటి చిన్నబుచ్చయ్య(60) తన భార్య జయమ్మతో కలిసి సోమవారం మధ్యాహ్నం కాలినడకన కొణిజర్ల మండలం శ్రీనివాసనగర్‌కు వెళ్లాడు. తిరిగివస్తుండగా మార్గమధ్యంలో దాహం వేసి పెదవాగులో చెలిమి వద్దకు వెళ్లాడు. కళ్లు తిరిగి అక్కడే కూప్పకూలి మృతి చెందాడు. మృతుడికి ఇద్దరు కుమారులు ఉన్నారు. పెనుబల్లిలో ముగ్గురు పెనుబల్లి : పెనుబల్లికి చెందిన నాగుబండి అనరసూర్య (70), లింగగూడేనికి చెందిన నల్లమోతు రాఘవమ్మ (70), పార్థసారథిపురానికి చెందిన బెల్లంకొండ కోటమ్మ (68) వడదెబ్బకు గురై మృతి చెందారు. కల్లూరులో ఒకరు కల్లూరు: కల్లూరు మండలం చెన్నూరు గ్రామ పంచాయతీ పరిధిలోని రావికంపాడు గ్రామానికి చెందిన యడవల్లి వెంకటయ్య (65) వడదెబ్బకు గురై మృతి చెందాడు. మృతుడికి భార్య రుక్మిణమ్మ, కుమారుడు, కుమార్తె ఉన్నారు. కూసుమంచిలో ఇద్దరు.. కూసుమంచి: మండలంలో వడదెబ్బకు గురై సోమవారం ఇద్దరు మృతిచెందారు. గోరీలపాడుతండాకు చె ందిన బాణోత్ భీక్యా (55) వడగాలులకు తట్టుకోలేక మృతిచెందాడు. ఇతని భార్య కమలి గత నాలుగేళ్లుగా మంచానికే పరిమితం కాగా ఇతనే ఆమెకు సపర్యలు చేస్తూ , తండాలో అన్నం అడుక్కుంటూ తనతో పాటు భార్యను సాకుతున్నాడు. వడదెబ్బకు గురై సోమవారం మృతి చెందాడు. వీరికి ఇద్దరు అబ్బాయిలు కాగా ఒకరు మృతి చెందాడు. మరొకరు వికలాంగుడు. దీంతో తండాలో విషాధ ఛాయలు అలముకున్నాయి. భగవత్‌వీడులో... మండలంలోని భగవత్వీడుకు చెందిన భూక్యా మారోని (70 వడదెబ్బకు తాళలేక మృతిచెందింది. ఆమె గత రెండు రోజులుగా అస్వస్థతకు గురైంది. వేంసూరులో ముగ్గురు వేంసూరు : మండల కేంద్రమైన వేంసూరుకు చెందిన కోట సుందరం(70), కందుకూరు గ్రామానికి చెందిన బూరుగు లక్ష్మయ్య(79), వెంకటాపురం గ్రామానికి చెందిన పాల సరసమ్మ(80) వడదెబ్బతో మృతి చెందారు. పడుకున్న మహిళ పడుకున్నట్లుగానే.. ఖమ్మం అర్బన్: ఖమ్మం శివారులోని ధంసలాపురం కాలనీకి చెందిన చింతల బుచ్చమ్మ(70) సోమవారం మధ్యాహ్నం ఆరుబయట పడుకుని అలానే మృతి చెందింది. మృతురాలికి ముగ్గురు కూతుళ్లు ఉన్నారు. వృద్ధుడి మృతి భద్రాచలం టౌన్: వడదెబ్బకు పట్టణంలోని కొత్త కా లనీకి చెందిన సుంకర సత్యనారాయణ (65) మృతి చెందాడు. గత వారం రోజులుగా వీస్తున్న వడగాల్పులకు సత్యనారాయణ ఆది వారం జ్వరంతో పాటు తీవ్ర అస్వస్థతకు గురయ్యాడు. దీంతో పట్టణంలోని ఓ ఎమర్జెన్సీ ఆసుపత్రిలో ఆదివారం చికిత్స అందచేశారు. పరిస్థితి విషమించిందని ఆసుపత్రి వర్గాలు కొత్తగూడెం ఆసుపత్రికు రిఫర్ చేశారు. దీంతో అంబులెన్స్‌లో తరలిస్తుండగానే మార్గమధ్యంలో మృతి చెందాడు. ముదిగొండలో ఒకరు ముదిగొండ: మండల పరిధిలోని కమలాపురంలో తెల్లాకుల వెంకట్రావమ్మ(75) వడదెబ్బతో మృతి చెందారు. సోమవారం వెంకట్రావమ్మ మృతదేహాన్ని స్థానిక సర్పంచి బత్తుల వీరారెడ్డి, ఎంపీటీసీ సభ్యురాలు వాక రామతారక సందర్శించి నివాళులు అర్పించారు. చండ్రుగొండలో ఇద్దరు.. చండ్రుగొండ : మండలంలోని పోకలగూడెం గ్రామంలో వడదెబ్బతో ఎదుళ్ళ అప్పయ్య (60) మృతి చెందాడు. పెనుబల్లి మండలం లింగగూడెం గ్రామానికి చెందిన అప్పయ్య నాలుగురోజుల క్రితం అతడి పెద్దకూతురు ఇంటికి పోకలగూడెం వచ్చాడు.ఈ క్రమంలో వడదెబ్బకు గురై మరణించాడు. మృతుడికి భార్య నాగరత్నం, నలుగురు కుమార్తెలు ఉన్నారు. చండ్రుగొండలోని ఎస్సీకాలనీకి చెందిన కుంపటి సుందరం (55) వడదెబ్బతో మృతి చెందాడు. అతడికి భార్య సీతమ్మ, నలుగురు పిల్లలు ఉన్నారు. తిరుమలాయపాలెంలో ఇద్దరు... తిరుమలాయపాలెం: మండలంలోని చంద్రుతండా గ్రామంలో బోడ రుక్కి(68) వడదెబ్బతో మృతి చెందింది. మృతురాలికి కుమారుడు ఉన్నాడు. బచ్చోడుతండా గ్రామానికి చెందిన భూక్యా దుబ్లో(48) వారం రోజుల క్రితం వడదెబ్బ బారిన పడి తీవ్ర అస్వస్థతకు గురయ్యాడు. సోమవారం ఆరోగ్యం పూర్తిగా విషమించి ప్రాణాలు కోల్పోయాడు. మృతుడికి భార్య జమ్మా, ఇద్దరు కుమారులు ఉన్నారు. కొత్తగూడెంలో... కొత్తగూడెం అర్బన్: మున్సిపాలిటీ పరిధిలోని హనుమాన్‌బస్తీకి చెందిన మాటేటి మల్లయ్య(70) గత మూడు రోజుల నుంచి వడదెబ్బ తాకి ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నాడు. సోమవారం మృతి చెందాడు.మండల పరిధిలోని కారుకొండ రామవరానికి చెందిన కూలీ తడికమల్లా నారాయణ(40) వడదెబ్బ తగిలి ఆసుపత్రిలో చికిత్స పొందుతు మరణించాడు. గాజులరాజం బస్తీలో చిత్తు కాగితలు సేకరించే ఏసు(35) రోజు స్థానిక కమ్యూనీటి హాల్లో రాత్రి సమయంలో పడుకునే వాడు. ఎండదెబ్బ తగిలి సోమవారం కమ్యూనిటీ హాల్లోనే చనిపోయాడు. వడదెబ్బతో స్వామి శారదానంద మృతి బాసర(ఆదిలాబాద్) : ముథోల్ మండలం బాసర గ్రామానికి చెం దిన అతా రజితా సా దన ఆశ్రమ వ్యవస్థాప కుడు స్వామి శారదా నంద ఉరఫ్ వనం సత్యనారాయుణరావు (75) వడదెబ్బతో ఆ దివారం చనిపోయూరు. వారం రోజులుగా తన పనుల నిమిత్తం ఎండలో తిరగడంతో అస్వస్థత కు గురయ్యూడు. వాంతులు, విరేచనాలు కావ డంతో వైద్యులను ఆశ్రరుుంచాడు. పరిస్థితి విష మించడంతో ఇంట్లోనే చని పోరుునట్లు వైద్యుడు సంతోష్ తెలిపారు. ఖమ్మం జిల్లా ముదిగొండ మండలం వనం కిష్టాపురం గ్రామానికి చెందిన ఈయన ఆరేళ్ల నుంచి ఇక్కడ ఉంటున్నారు. ఆయనకు కుమారుడు, కూతురు ఉన్నారు. ఇల్లెందులో ఇద్దరు... ఇల్లెందు : మండలంలోని రొంపేడు గ్రామపంచాయతీ క్యాంపు రొంపేడుకు చెందిన పూనెం సుక్కమ్మ(55) సోమవారం తునికాకు సేకరణకు వెళ్లింది. తిరిగి ఇంటికి రాగానే వాంతులు, విరోచనాలయ్యూరుు. వైద్యం కోసం తరలించే క్రమంలోనే మృతి చెందింది. పట్టణంలోని 21వ వార్డు మంథినిఫైల్ బస్తీకి చెందిన ఎడ్ల ఐలమ్మ(63) వడ దెబ్బకు గురై మృతి చెందింది. తల్లాడలో ఇద్దరు.. తల్లాడ : మండల పరిధిలోని పాత మిట్టపల్లి గ్రామానికి చెందిన కంచెపోగు వెంకటనరసమ్మ(48) రెండు రోజుల క్రితం వడదెబ్బకు గురైం ది. పరిస్థితి విషమించటంతో సోమవారం మృతి చెందింది. ఆమెకు కుమారుడు,ఇద్దరు కుమార్తెలు ఉన్నారు. రామానుజవరంలో రామానుజవరం గ్రామంలో శీలం వెంకట్రామమ్మ(55)కు గత మూడు రోజుల క్రితం వడదెబ్బ తగిలింది. చికిత్స పొందతూ సోమవారం మృతి చెందింది. మృతురాలికి భర్త, కుమారుడు, కు మార్తె ఉన్నారు. జూలూరుపాడులో ఒకరు.. చినేనిపేటతండా(జూలూరుపాడు): మండలంలోని మాచినేనిపేటతండా గ్రామ పంచాయతీ పరిధిలోని పెద్దతండాకు చెందిన లాకావతు లక్కి(80) వడదెబ్బతో ఆదివారం రాత్రి మృతి చెందినట్లు కుటుంబసభ్యులు తెలిపారు. -
వడగాలులు..చిరుజల్లులు
ఎండలకు పెద్దలే తల్లడిల్లిపోతుంటే.. పసివాళ్లేం భరించగలరు. అందుకే గొంతెండిపోతుంటే ఓ బాలుడు వీధి కొళాయి నీటి ధారల్ని ఆత్రంగా తాగాడు. రావికమతం సినీమాహాలు సమీపంలో సోమవారం కనిపించిందీ దృశ్యం. - ఈదురుగాలులతో వింత వాతావరణం - ఓ మహిళ దుర్మరణం సాక్షి, విశాఖపట్నం : తీవ్ర వడగాడ్పులతో జిల్లా, నగరం అట్టుడుకిపోతోంది. వడదెబ్బకు మృత్యువాత పడుతున్న వారి సంఖ్య రోజు రోజు రోజుకూ పెరిగిపోతోంది. సోమవారం మరో 31 మందిని పొట్టనబెట్టుకుంది. వీరిలో జిల్లాలో 20 మంది, నగర పరిధిలో 11 మంది ఉన్నారు. ఉష్ణోగ్రతలు 40 డిగ్రీలకు పైగానే నమోదవుతూ దడ పుట్టిస్తున్నాయి. నగరం (విమానాశ్రయం)లో సోమవారం 41.4 డిగ్రీల ఉష్ణోగ్రత రికార్డయింది. ఆదివారం (45 డిగ్రీలు)తో పోల్చుకుంటే ఇది దాదాపు 4 డిగ్రీలు తక్కువ. అయినా ఉష్ణతీవ్రత అటు నగరంలోను, ఇటు జిల్లాలోనూ బాగానే కనిపించింది. ఉదయం నుంచి ఉడుకును వెదజల్లుతూనే ఉంది. అయితే ఆరు రోజుల నుంచి అదే పనిగా వణికిస్తున్న వడగాడ్పులతో అల్లాడుతున్న జనానికి సోమవారం సాయంత్రం ఒకింత సాంత్వన చేకూర్చింది. సాయంత్రం అనూహ్యంగా వాతావరణం మారిపోయింది. కొన్నిచోట్ల ఈదురుగాలులతో పాటు తేలికపాటి జల్లులు కురిసి వాతావరణాన్ని చల్లబరిచింది. నగరంలోని పలు ప్రాంతాల్లో ఈ గాలులకు దుమ్ము, ధూళి ఎగసి పడింది. నగరంలోని మురళీనగర్, శివారు ప్రాంతాలు, పెందుర్తి, అడవివరం, గాజువాక, దబ్బందతో పాటు చోడవరం, చీడికాడ, కె.కోటపాడు ప్రాంతాల్లో కొన్నిచోట్ల జల్లులు, మరికొన్ని చోట్ల వర్షం కురిసింది. తొలుత భారీ ఈదురుగాలులు హడావుడి చేశాయి. తర్వాత జల్లులు కురిసి వేడి తీవ్రతను కాస్త తగ్గించడంతో జనం ఊరట చెందారు. జిల్లాలోని ఎస్.రాయవరం మండలం పెనుగొల్లు శివారు నీలాద్రిపురంలో ఈదురుగాలులకు చెట్టుపడి నూకరత్నం అనే మహిళ దుర్మరణం పాలయింది. ప్రస్తుత పరిస్థితులను బట్టి పగలు వేడిగాలులు కొనసాగుతూ సాయంత్రం వేళ ఇలాంటి వాతావరణమే కొన్నాళ్లు ఉంటుందని వాతావరణ నిపుణులు చెబుతున్నారు. -
మరో 48 గంటలపాటు తీవ్ర వడగాలులు
విశాఖపట్నం: ఏపీ, తెలంగాణల్లో మరో 48 గంటలపాటు తీవ్ర వడగాలులు ఉంటాయని వాతావరణ శాఖ ఆదివారం విశాఖపట్నంలో వెల్లడించింది. ఛత్తీస్‌గఢ్‌పై ఆవర్తనం తొలగిందని స్పష్టం చేసింది. ఈ నేపథ్యంలో ఎండల తీవ్రత మరింత పెరిగే అవకాశం ఉందని తెలిపింది. సాధరాణం కంటే 7 డిగ్రీల ఉష్ణోగ్రతలు పెరగవచ్చని పేర్కొంది. వడగాలుల వల్ల ఇరు రాష్ట్రాలలో ఇప్పటి వరకు దాదాపు 500 మంది మరణించిన సంగతి తెలిసిందే. -
రెడ్ అలర్ట్ ప్రకటించిన ఐఎండీ
న్యూఢిల్లీ : ఉష్ణోగ్రతలు అసాధారణ స్థ నేపధ్యంలో భారత వాతావరణ శాఖ శనివారం దేశంలో రెడ్ అలర్ట్ ప్రకటించింది. ఇక ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాలు భానుడి భగభగలతో మండిపోతున్నాయి. ఇప్పటివరకూ రెండు తెలుగు రాష్ట్రాల్లో వడదెబ్బకు 427మంది మృత్యువాత పడ్డారు. కాగా రాగల రెండు, మూడు రోజుల్లో ఉష్ణోగ్రతలు మరింత పెరిగే అవకాశం ఉన్నందున ప్రజలు అప్రమత్తంగా ఉండాలని ఐఎండీ హెచ్చరించింది. వాయవ్య భారతం నుంచి వీస్తున్న పొడి గాలులతో విదర్భ, తెలంగాణ, రాయలసీమల్లో ఎండలు మండిపోతున్నాయి. ఎండ తీవ్రతతో పాటు ఉక్కపోత అధికం కావటంతో ప్రజలు అల్లాడిపోతున్నారు. ఉత్తర తెలంగాణలో పరిస్థితి మరింత దారుణంగా ఉంది. ఇక హైదరాబాద్‌లో 43.6 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదు అయింది. గత అయిదేళ్లలో ఇదే అత్యధికం. తెలంగాణ రాష్ట్రంలో నల్గొండ జిల్లాలో 67మంది, ఆంధ్రప్రదేశ్‌లో ప్రకాశం జిల్లాలో 64మంది వడదెబ్బకు మృతి చెందారు. ఏపీలో 204 , తెలంగాణలో 223 వడదెబ్బ మరణాలు నమోదు అయ్యాయి. ఇక వడదెబ్బకు మృతి చెందినవారు కుటుంబాలకు ఆపద్భందు పథకం కింద రూ. 50 వేల ఆర్థిక సహాయం అందుతుందని అధికారులు వెల్లడించారు. -
అబ్బా...ఇది ఏమి ఎండ!!
తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్‌కు భానుడు తన ప్రతాపం చూపించాడు. స్వచ్ఛ హైదరాబాద్‌లో భాగంగా మహేశ్వరం నియోజకవర్గ పరిధిలోని ఎన్టీఆర్ నగర్, రైతు బజార్లను పరిశీలించేందుకు ఆయన బుధవారం వచ్చారు. అప్పటికే మిట్ట మధ్యాహ్నమైంది. ఎండలు మండుతున్నాయి. ఎండ వేడిమితో పాటు చెమటలు పట్టడంతో సీఎం ఉక్కిరిబిక్కిరయ్యారు. మొత్తం మీద ఆయన పర్యటన ఆద్యంతం ఊపిరి సలపకుండా సాగింది. ఈ క్రమంలో ఆయన హావభావాలను 'సాక్షి' కెమెరాలో బంధించింది. -
కోస్తా జిల్లాల్లో పెరుగుతున్న ఉష్ణోగ్రతలు
విశాఖ : కోస్తా జిల్లాల్లో ఉష్ణోగ్రతలు పెరుగుతున్నాయి. మూడు రోజులుగా సగటున ఉష్ణోగ్రత నాలుగు డిగ్రీలు పెరిగింది. ఇక కృష్ణాజిల్లా మచిలీపట్నంలో 37 డిగ్రీలు నమోదు అయ్యింది. మరో రెండ్రోజుల పాటు ఉష్ణోగ్రతలు పెరుగుతాయని విశాఖపట్నం వాతావరణ కేంద్రం తెలిపింది. కాగా ఈ ఏడాది వర్షాలు మాత్రం అనుకున్న స్థాయిలో పడటం లేదు. మరోవైపు సీజన్ ప్రారంభమై దాదాపు రెండు నెలలు దాటినా వర్షపాతంలో భారీ లోటు నమోదు కావడంతో రైతాంగంలో తీవ్ర ఆందోళన వ్యక్తమవుతోంది. ఒకవైపు ఇప్పటికే విత్తనాలు వేసి వరుణుడి కోసం రైతులు ఆకాశంవైపు దీనంగా చూస్తున్నారు. ఇటీవల రెండు మూడు రోజుల పాటు రాష్ట్రంలో కొద్దిమేర వర్షాలు పడినా అవి నాట్లు వేసేందుకు సరిపోవని రైతులు ఆందోళన చెందుతున్నారు. -
సాధారణం కన్నా ఎక్కువగా ఉష్ణోగ్రతలు నమోదు
విశాఖ : జులై నెల మొదలైనా ఉష్ణోగ్రతలు ఏ మాత్రం తగ్గలేదు. ఇంకా పలు ప్రాంతాల్లో వడగాల్పులు కొనసాగుతున్నాయి. ఆంధ్రప్రదేశ్, తెలంగాణలలో వడగాల్పులు ఎండలు మండిపోతున్నాయి. గురువారం కూడా కోస్తా, సీమల్లో సాధారణంకన్నా ఎక్కువగా ఉష్ణోగ్రతలు నమోదు అవుతాయని భారత వాతావరణ విభాగం హెచ్చరించింది. రాష్ట్రంలోకి రుతుపవనాలు ప్రవేశించి దాదాపు నెల కావస్తున్నా... వర్షాల జాడ కానరాకపోవడమే.. ఈ వడగాల్పుల ప్రభావానికి కారణమని అధికారులు చెబుతున్నారు. చాలా చోట్ల సాధారణం కంటే 5 నుంచి 8 డిగ్రీల ఉష్ణోగ్రతలు అధికంగా నమోదవుతున్నట్లు తెలిపారు. ఛత్తీస్‌గఢ్ నుంచి దక్షిణ కోస్తాంధ్ర, తెలంగాణ మీదుగా దక్షిణ తమిళనాడు వరకు ఏర్పడిన అల్పపీడన ద్రోణి స్థిరంగా కొనసాగుతోంది. దీని ప్రభావంతో ఇరు రాష్ట్రాల్లో వర్షాలు కురిసే అవకాశం ఉందని శాస్త్రవేత్తలు వెల్లడించారు. -
వణికిస్తున్న వడగాలులు
42 డిగ్రీల కన్నా అధిక ఉష్ణోగ్రతలు నమోదు ఉదయం నుంచే వేడి గాలులు అర్ధరాత్రి దాటినాతగ్గని తీరు భారీగా పెరిగిన వడదెబ్బ మృతుల సంఖ్య బయటికి రావాలంటేనే బెంబేలెత్తుతున్న జనం జిల్లాలో వడగాలులు వణికిస్తున్నాయి. వడదెబ్బకు జనం పిట్టల్లా రాలిపోతున్నారు. గత కొద్దిరోజులుగా వడదెబ్బకు గురై మృతిచెందుతున్నవారి సంఖ్య భారీగా పెరిగిపోతుండటం మరింత ఆందోళన కలిగిస్తోంది. పగటివేళ బయటికి రావాలంటేనే జనం బెంబేలెత్తిపోతున్నారు. రోహిణీ వెళ్లిపోయింది.. ఇక వాతావరణం చల్లబడుతుందని ఆశించినవారికి అడియాసే ఎదురైంది. మృగశిర కార్తె ప్రవేశించినా ఎండలు తగ్గకపోగా.. వాటికి వడగాలులు తోడయ్యాయి. దీంతో జనం అల్లాడిపోతున్నారు. జూన్ 17వ తేదీ వచ్చినా రుతుపవనాల జాడ లేకపోవడం జిల్లా వాసులను ఆందోళనకు గురిచేస్తోంది. మచిలీపట్నం : గత వారం రోజులుగా జిల్లాలో సగటున 41, 42 డిగ్రీల ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. ఉదయం ఆరు గంటల నుంచే వడగాలులు ప్రారంభమవుతున్నాయి. దీంతో చిన్నారులు, వృద్ధులు అల్లాడిపోతున్నారు. ఉదయం 10 గంటల నుంచే రోడ్లన్నీ నిర్మానుష్యంగా మారుతున్నాయి. రుతుపవనాల రాక ఆలస్యమైన నేపథ్యంలో మరో రెండు, మూడు రోజుల పాటు కోస్తా తీరంలో ఉష్ణోగ్రతలు ఇదే విధంగా కొనసాగుతాయని విశాఖపట్నం రాడార్ కేంద్రం అధికారి నరసింహారావు తెలిపారు. రుతుపవనాలు బాపట్ల, నంద్యాల వరకు వచ్చాయని చెప్పారు. కోస్తా తీరంలో వేడిగాలుల ప్రభావం అధికంగా ఉండటంతో రుతుపవనాల రాక ఆలస్యమవుతోందన్నారు. దీనికి తోడు ఒరిస్సా నుంచి తమిళనాడు వరకు కోస్తా తీరం వెంబడి అల్పపీడన ద్రోణి ఉందని, దీంతో అక్కడక్కడ ఉరుములతో కూడిన ఓ మోస్తరు వర్షపాతం నమోదవుతుందని చెప్పారు. జిల్లాలోకి రుతుపవనాలు ప్రవేశించడానికి మూడు, నాలుగు రోజులు సమయం పడుతుందని ఆయన తెలిపారు. క్యూములోనింబస్ మేఘాల కారణంగా అక్కడక్కడ వర్షాలు నమోదైనా సముద్రతీరం వెంబడి వేడిగాలులు వీస్తున్నాయన్నారు. వడగాలుల తీవ్రత అధికంగా ఉండటంతో జిల్లాలో ఇప్పటికే ఒంటిపూట బడులు నిర్వహించాలని అధికారులు ఆదేశించారు. వడగాలుల తీవ్రత అధికమైతే ఒంటిపూట బడులను కొనసాగించాలని ఉపాధ్యాయలు, ఉపాధ్యాయ సంఘాల నాయకులు కోరుతున్నారు. వడగాలుల కారణంగా జనం బయటికి రావడానికి భయపడుతున్నారని, దీంతో వ్యాపారాలు అంతంత మాత్రంగానే సాగుతున్నాయని వ్యాపారులు చెబుతున్నారు. -
విశాఖవాసుల్ని బెంబేలెత్తిస్తున్న వడగాల్పులు!
విశాఖ: పగటి ఉష్టోగ్రతలు పెరగడం విశాఖవాసుల్ని బెంబేలెత్తిస్తోంది. విశాఖపట్నంలో పగటి ఉష్ణోగ్రతలు మళ్లీ పెరిగాయి. పెరిగిన ఉష్ణోగ్రతలు కారణంగా వడగాల్పులతో విశాఖవాసులు అల్లాడుతున్నారు. ఉత్తర, కోస్తా జిల్లాలకు నైరుతి రుతుపవనాలు మరో రెండు రోజులు ఆలస్యంగా వచ్చే అవకాశం ఉందని వాతావరణ శాఖ అధికారులు వెల్లడించారు. క్యుములోనింబస్ మేఘాలతో అక్కడక్కడ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ అంచనా వేసింది. గత రెండు రోజులుగా విశాఖతోపాటు, తూర్పు గోదావరి, పశ్చిమ గోదావరి జిల్లాల్లో వడగాల్పులు ఎక్కువగా నమోదయ్యాయి. కేవలం పశ్చిమ గోదావరి జిల్లాల్లో వడగాల్పులకు 50 మందికి పైగా మృత్యువాత పడ్డారు.