సాధారణం కన్నా ఎక్కువగా ఉష్ణోగ్రతలు నమోదు
విశాఖ : జులై నెల మొదలైనా ఉష్ణోగ్రతలు ఏ మాత్రం తగ్గలేదు. ఇంకా పలు ప్రాంతాల్లో వడగాల్పులు కొనసాగుతున్నాయి. ఆంధ్రప్రదేశ్, తెలంగాణలలో వడగాల్పులు ఎండలు మండిపోతున్నాయి. గురువారం కూడా కోస్తా, సీమల్లో సాధారణంకన్నా ఎక్కువగా ఉష్ణోగ్రతలు నమోదు అవుతాయని భారత వాతావరణ విభాగం హెచ్చరించింది. రాష్ట్రంలోకి రుతుపవనాలు ప్రవేశించి దాదాపు నెల కావస్తున్నా... వర్షాల జాడ కానరాకపోవడమే.. ఈ వడగాల్పుల ప్రభావానికి కారణమని అధికారులు చెబుతున్నారు.
చాలా చోట్ల సాధారణం కంటే 5 నుంచి 8 డిగ్రీల ఉష్ణోగ్రతలు అధికంగా నమోదవుతున్నట్లు తెలిపారు. ఛత్తీస్‌గఢ్ నుంచి దక్షిణ కోస్తాంధ్ర, తెలంగాణ మీదుగా దక్షిణ తమిళనాడు వరకు ఏర్పడిన అల్పపీడన ద్రోణి స్థిరంగా కొనసాగుతోంది. దీని ప్రభావంతో ఇరు రాష్ట్రాల్లో వర్షాలు కురిసే అవకాశం ఉందని శాస్త్రవేత్తలు వెల్లడించారు.