హైదరాబాద్ వాతావరణ శాఖ వెల్లడి
రామగుండంలో అత్యధికంగా 45.8 డిగ్రీలు నమోదు
సాక్షి, హైదరాబాద్: మరో 3 రోజుల పాటు తెలంగాణలో తీవ్ర వడగాడ్పులు వీస్తాయని హైదరాబాద్ వాతావరణ శాఖ తెలిపింది. మంగళవారం రామగుండంలో అత్యధికంగా 45.8 డిగ్రీల ఉష్ణోగ్రత రికార్డు అయింది. కొత్తగూడెంలో వడగాడ్పులకు ప్రజలు అల్లాడిపోయారు. అక్కడ దాదాపు 50 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదైందని స్థానికులు పేర్కొంటున్నారు. కాగా, హైదరాబాద్‌లో మంగళవారం గరిష్టంగా 40.8 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదైంది.
వడదెబ్బతో 51 మంది మృతి
సాక్షి, నెట్‌వర్క్: మంగళవారం వడదెబ్బతో రాష్ట్రంలోని వివిధ జిల్లాల్లో 51 మంది మృతి చెందారు. ఖమ్మం జిల్లాలో 21 మంది, వరంగల్ జిల్లాలో 11 మంది, నల్లగొండ జిల్లాలో ఏడుగురు, ఆదిలాబాద్ జిల్లాలో ఆరుగురు, కరీంనగర్ జిల్లాలో నలుగురు, మెదక్ జిల్లాలో ముగ్గురు మృతిచెందారు.
ప్రధాన పట్టణాల్లో నమోదైన ఉష్ణోగ్రతలు
ప్రాంతం ఉష్ణోగ్రత
రామగుండం 45.8
భద్రాచలం 45.2
హన్మకొండ 44.3
ఖమ్మం 44.0
ఆదిలాబాద్ 43.3
నల్లగొండ 43.0
హైదరాబాద్ 40.8