
నేడు రేపు తీవ్ర వడగాడ్పులు
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలో అనేకచోట్ల మంగళ, బుధవారాల్లో తీవ్రమైన వడగాడ్పులు వీస్తాయని హైదరాబాద్ వాతావరణ కేంద్రం హెచ్చరించింది. ఉరుములు మెరుపులతో కూడిన మోస్తరు వర్షాలు కురిసే అవకాశముందని తెలిపింది. మరోవైపు సోమవారం హన్మకొండ, రామగుండంలలో 45 డిగ్రీల చొప్పున పగటి ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. ఇతరచోట్ల కూడా 40 నుంచి 44 డిగ్రీల వరకు నమోదయ్యాయి. తీవ్రమైన వడగాడ్పుల కారణంగా ప్రజలు విలవిల్లాడిపోతున్నారు. ఇంటి నుంచి బయటకు రావడానికి జంకుతున్నారు. ఇదే పరిస్థితి ఈ నెలాఖరు వరకు ఉండే అవకాశముందని అంటున్నారు. మధ్యలో మోస్తరు వర్షాలు కురిసే అవకాశముందని వాతావరణ కేంద్రం అధికారులు చెబుతున్నారు.
సోమవారం నమోదైన ఉష్ణోగ్రతలు (సెల్సియస్‌ల్లో)
ప్రాంతం ఉష్ణోగ్రత
హన్మకొండ 45.0
రామగుండం 45.0
నిజామాబాద్ 44.0
భద్రాచలం 43.8
ఆదిలాబాద్ 43.7
మెదక్ 43.5
నల్లగొండ 43.2
మహబూబ్‌నగర్ 43.1
ఖమ్మం 41.0
హకీంపేట 40.3
హైదరాబాద్ 40.2