తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్కు భానుడు తన ప్రతాపం చూపించాడు. స్వచ్ఛ హైదరాబాద్లో భాగంగా మహేశ్వరం నియోజకవర్గ పరిధిలోని ఎన్టీఆర్ నగర్, రైతు బజార్లను పరిశీలించేందుకు ఆయన బుధవారం వచ్చారు. అప్పటికే మిట్ట మధ్యాహ్నమైంది. ఎండలు మండుతున్నాయి. ఎండ వేడిమితో పాటు చెమటలు పట్టడంతో సీఎం ఉక్కిరిబిక్కిరయ్యారు. మొత్తం మీద ఆయన పర్యటన ఆద్యంతం ఊపిరి సలపకుండా సాగింది. ఈ క్రమంలో ఆయన హావభావాలను 'సాక్షి' కెమెరాలో బంధించింది.