swatch hyderabad
-
నగరాన్ని జాతీయ స్థాయికి తీసుకెళ్లాలి
హైదరాబాద్ : హైదరాబాద్ నగర ప్రతిష్టను జాతీయ స్థాయికి తీసుకెళ్లి అగ్రగామిగా నిలపాలని పురపాలక, ఐటీ, పరిశ్రమల మంత్రి కె.తారకరామారావు అన్నారు. ప్రజల భాగస్వామ్యం లేని దే స్వచ్ఛ హైదరాబాద్ సాధ్యం కాదన్నారు. సోమవారం బాగ్‌లింగంపల్లిలోని అంబేడ్కర్ కళాశాలలో జీహెచ్ఎంసీ స్టాండింగ్ కమిటీ సభ్యుడు, రాంనగర్ డివిజన్ కార్పొరేటర్ వి. శ్రీనివాస్‌రెడ్డి ఆధ్వర్యంలో స్వచ్ఛ్ సర్వేక్షణ్ కార్యక్రమం చేపట్టారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సదస్సులో డిప్యూటీ సీఎం మహమూద్ అలీ, మంత్రులు కేటీఆర్, నాయిని నర్సింహారెడ్డి, తలసాని శ్రీనివాస్ యాదవ్, జీహెచ్ఎంసీ కమిషనర్ జనార్దన్‌రెడ్డి తదితరులు పాల్గొని ప్రసంగించారు. అంతకుముందు వీఎస్టీ చౌరస్తా నుంచి సుందరయ్య పార్కు వరకు 15,320 మంది రాంనగర్ డివిజన్ ప్రజలు భారీ స్థాయిలో స్వచ్ఛ్ సర్వేక్షణ్‌లో పాల్గొని గిన్నిస్ వరల్డ్ రికార్డు, యూనివర్సల్ బుక్ ఆఫ్ రికార్డులను సాధించారు. స్వచ్ఛ భారత్‌కు ముందే స్వచ్ఛ హైదరాబాద్ ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సభలో కేటీఆర్ మాట్లాడుతూ ప్రధాని మోదీ స్వచ్ఛ భారత్ ప్రారంభం చేయకముందే ముఖ్యమంత్రి కేసీఆర్ స్వచ్ఛ హైదరాబాద్‌ను ప్రవేశపెట్టారని గుర్తు చేశారు. నగరంలో గతంలో 3,500 మెట్రిక్ టన్నుల చెత్తను ఉత్పత్తి చేస్తే నేడు అంతకంటే ఎక్కువగా 4,500 మెట్రిక్ టన్నుల చెత్తను ఉత్పత్తి చేస్తున్నామని తెలిపారు. నగరంలో 20 వేల మంది పారిశుధ్య సిబ్బంది ఉన్నా హైదరాబాద్‌లో ఉన్న కోటి జనాభాకు వారు సరిపోరన్నారు. 44 లక్షల చెత్త బుట్టలు పంపిణీ చేశామని అయితే నగరంలో ఏ ఒక్కరూ ఈ బుట్టలను ఉపయోగించడం లేదన్నారు. ‘‘ఈ నగరం బాగుంటేనే నేను, నా భవిష్యత్ బాగుంటుందని’’పిల్లలే తల్లిదండ్రులకు చెప్పాలన్నారు. 2018 స్వచ్ఛ్ సర్వేక్షణ్ సర్వేలో ప్రతి ఒక్కరూ పాల్గొనాలని ఆయన పిలుపునిచ్చారు. అనంతరం సభలో పాల్గొన్న ప్రజలతో తడి పొడి చెత్తను తప్పకుండా వేరు చేస్తామని, బహిరంగ ప్రదేశాల్లో మల, మూత్ర విసర్జన చేయమని తదితర సూత్రాలతో కూడిన పత్రాన్ని చదివి ప్రతిజ్ఞ చేయించారు. హోం మంత్రి నాయిని మాట్లాడుతూ నగర బంగారు భవిష్యత్‌లో విద్యార్థులు భాగస్వాములు కావడం శుభపరిణామమని అన్నారు. కార్యక్రమంలో ప్రభుత్వ సలహాదారు జి.వివేక్, మాజీ మంత్రి జి.వినోద్, టీఆర్ఎస్ బీసీ సెల్ రాష్ట్ర అధ్యక్షుడు ముఠా గోపాల్, కార్పొరేటర్ ముఠా పద్మానరేశ్, గిన్నిస్ వరల్డ్ రికార్డు ప్రతినిధి లక్ష్మీరెడ్డి తదితరులు పాల్గొన్నారు. -
సమష్టి కృషితో స్వచ్ఛ హైదరాబాద్
- సహకరించాలని నగర ప్రజలకు సీఎం కేసీఆర్ పిలుపు - ఇంటింటా చెత్త సేకరణ కోసం వాహనాలు - రూ. 100 కోట్లతో 2,500 ఆటో ట్రాలీలు - బస్తీల్లో 1,500 ట్రై సైకిళ్లతో చెత్త సేకరణ - బల్క్ గార్బేజ్ కోసం భారీ వాహనాలు సాక్షి, హైదరాబాద్: స్వచ్ఛ హైదరాబాద్‌కు అవసరమైన నిధులు, వాహనాలు, ఇతర సదుపాయాలు కల్పించేందుకు ప్రభుత్వం సిద్ధంగా ఉందని, ప్రజలు సమష్టి కృషితో నగరాన్ని పరిశుభ్రంగా తీర్చిదిద్దడానికి సహకరించాలని ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావు పిలుపునిచ్చారు. నగరంలో చెత్త సేకరణకు కొనుగోలు చేయనున్న ఆటో ట్రాలీ మోడళ్లను ముఖ్యమంత్రి శనివారం క్యాంపు కార్యాలయంలో పరిశీలించి ఆమోదించారు. జీహెచ్ఎంసీ కమిషనర్ సోమేశ్‌కుమార్ ఆటో ట్రాలీల విశేషాలను సీఎంకు వివరించారు. నగరంలో ఇంటింటికీ వెళ్లి చెత్త సేకరించడానికి 2,500 ఆటో ట్రాలీలను ప్రభుత్వం సమకూర్చనుంది. ఒక్కో ట్రాలీ 600-700 ఇళ్లు తిరిగి రెండు క్యూబిక్ మీటర్ల చెత్తను సేకరించనుంది. తడి, పొడి చెత్తను వేర్వేరుగా ఉంచడానికి అనువుగా ట్రాలీలో ప్రత్యేక ఏర్పాట్లు ఉంటాయి. తేలిగ్గా డంప్ చేయడానికి అనువుగా ఆటో లిఫ్టింగ్ సౌకర్యం, రోడ్లపై చెత్త ఎగిరి పడకుండా మూత ఉంటుంది. పరిశుభ్రత, పచ్చదనానికి సూచికగా ఆకుపచ్చ రంగులోనే వాహనాలను డిజైన్ చేయాలని సీఎం ఆదేశించారు. డ్రైవర్లకే ఈ ఆటో ట్రాలీలు కొనివ్వనున్నట్లు తెలిపారు. ఒక్కో వాహనానికి రూ. 3.88 లక్షల చొప్పున రూ.వంద కోట్లు వీటి కోసం ఖర్చు చేస్తున్నామన్నారు. బస్తీల్లో చెత్త సేకరణకు 1,500 ట్రై సైకిళ్లు కొనాలని ఆదేశించారు. రెండు నెలల్లో ఆటో ట్రాలీలు, ట్రై సైకిళ్లు కొనాలన్నారు. వాణిజ్య, బల్క్ గార్బేజ్ సేకరణకు పెద్ద వాహనాలు ఏర్పాటు చేయాలన్నారు. తడి, పొడి చెత్తను వేర్వేరుగా వేయడానికి వీలుగా 22 లక్షల చెత్తబుట్టలు కొనడానికి ఆర్డర్ ఇచ్చిన విషయం గుర్తుచేశారు. నగరవ్యాప్తంగా భవన నిర్మాణ శిథిలాలు, ఇతర వ్యర్థాలను తొలగించడానికి కాంట్రాక్టర్ల నుంచి టెండర్లు పిలిచామని, త్వరలోనే పనులు ప్రారంభమవుతాయన్నారు. సీవరేజీ పనులు వేగంగా, సమర్థవంతంగా జరగడానికి 18 పెద్ద స్వీపర్స్‌ను సమకూరుస్తున్నట్లు చెప్పారు. నగరాన్ని 420 యూనిట్లుగా విభజించి స్వచ్ఛ హైదరాబాద్‌ను గొప్పగా నిర్వహించామని, ప్రజలు ఉద్యమ స్ఫూర్తితో పాల్గొన్నారన్నారు. స్వచ్ఛ హైదరాబాద్ ద్వారా ప్రభుత్వం దృష్టికి వచ్చిన సమస్యలు పరిష్కరించడానికి, నగర ప్రజాప్రతినిధుల సూచనలు అమలు చేయడానికి రూ.200 కోట్లు విడుదల చేశామని, పనులు పురోగతిలో ఉన్నాయని కేసీఆర్ పేర్కొన్నారు. -
నేడు ‘స్వచ్ఛ హైదరాబాద్’పై సమీక్ష
- నగర ప్రజాప్రతినిధులతో సీఎం సమావేశం సాక్షి, హైదరాబాద్: స్వచ్ఛ హైదరాబాద్ కార్యక్రమంపై నగరానికి చెందిన ప్రజాప్రతినిధులతో సీఎం కేసీఆర్ శనివారం ఎంసీహెచ్ఆర్డీలో సమావేశం కానున్నారు. ఈ సందర్భంగా హైదరాబాద్ నగరంలో చెత్త నిర్వహణకు సంబంధించి పలు నిర్ణయాలు తీసుకుంటారు. తాగునీరు, విద్యు త్తు, రోడ్లపై చర్చిస్తారు. వచ్చే నెలలో నిర్వహించే హరితహారంతోపాటు అభివృద్ధి కార్యక్రమాలపై చర్చించేందుకు సీఎం అన్ని జిల్లాల ఎస్పీలు, డీఎస్పీలతో ఆదివారం ఎంసీహెచ్ఆర్డీలో సమావేశం కానున్నారు. ముఖ్యమంత్రికి కృతజ్ఞతలు సిద్దిపేట, గజ్వేల్ నియోజకవర్గాలకు దేవాదుల తపాస్‌పల్లి రిజర్వాయర్ నుంచి ఎత్తిపోతల పథకాన్ని మంజూరు చేసినందుకు ఆ ప్రాంత రైతులు సీఎం కేసీఆర్‌కు కృతజ్ఞతలు తెలిపారు. నీటిపారుదల శాఖ మంత్రి హరీశ్‌రావు సారథ్యంలో రైతులు శుక్రవారం సాయంత్రం హైదరాబాద్‌లోని సీఎం నివాసంలో కలుసుకున్నారు. ఈ పథకం ద్వారా కొండపాక మండలంలోని 11, సిద్దిపేట మండలంలోని 5 గ్రామాలకు సాగునీరందుతుంద ని సీఎం రైతులకు భరోసా ఇచ్చారు. వేములవాడ రాజన్న ఆలయ అభివృద్ధికి రూ.100 కోట్లు కేటాయిస్తామని హామీ ఇచ్చిన సీఎంకు ఎమ్మెల్యే సీహెచ్ రమేష్‌బాబు కృతజ్ఞతలు తెలిపారు. గవర్నర్ కోటా కింద ఎమ్మెల్సీగా నామినేట్ అయిన ఎం.శ్రీనివాసరెడ్డి క్యాంపు కార్యాలయంలో సీఎంను కలసి కృతజ్ఞతలు తెలిపారు. -
'ఓయూలో లేకుంటే రైల్వే భూముల్లో కట్టిస్తాం'
హైదరాబాద్: ఓయూ భూములు లేకుంటే రైల్వే భూములు కొనుగోలు చేసైనా ఇళ్ల నిర్మాణం చేపడతామని ముఖ్యమంత్రి కేసీఆర్ అన్నారు. పార్శిగుట్టలో బౌద్ధ నగర్లో బుధవారం నిర్వహించిన స్వచ్ఛ హైదరాబాద్ కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు. స్వచ్ఛ హైదరాబాద్‌పై ఈ నెల 19న ఎంసీ హెచ్ ఆర్డీ కీలక సమావేశం ఉంటుందని తెలియజేశారు. ట్రాలీ ఆటోలతో చెత్త తరలిస్తామని హామీ ఇచ్చారు. హైదరాబాద్ క్లీన్ సిటీకి మహిళలు సారథ్యం వహించాలని కోరారు. ప్రతి ఇంటికి రెండు చెత్తబుట్టలు అందిస్తామని హామీ ఇచ్చారు. -
స్వచ్ఛ హైదరాబాద్‌లో మాజీ రౌడీషీటర్లు
హైదరాబాద్ : స్వచ్ఛ హైదరాబాద్ కార్యక్రమంలో మాజీ రౌడీషీటర్లు భాగస్వామ్యులయ్యారు. సంతోష్ నగర్ పైగాటూంబ్స్ వద్ద మంగళవారం మాజీ రౌడీ షీటర్లు స్వచ్ఛ హైదరాబాద్‌లో పాల్గొన్నారు. సౌత్ జోన్ పోలీసులు ఈరోజు ఉదయం మాజీ రౌడీ షీటర్లతో స్వచ్ఛ హైదరాబాద్ కార్యక్రమం చేయించారు. కాగా స్వచ్ఛ హైదరాబాద్‌లో ప్రతి ఒక్కరు పాల్గొనాలని సౌత్ జోన్ పోలీసులు పిలుపునిచ్చారు. -
అబ్బా...ఇది ఏమి ఎండ!!
తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్‌కు భానుడు తన ప్రతాపం చూపించాడు. స్వచ్ఛ హైదరాబాద్‌లో భాగంగా మహేశ్వరం నియోజకవర్గ పరిధిలోని ఎన్టీఆర్ నగర్, రైతు బజార్లను పరిశీలించేందుకు ఆయన బుధవారం వచ్చారు. అప్పటికే మిట్ట మధ్యాహ్నమైంది. ఎండలు మండుతున్నాయి. ఎండ వేడిమితో పాటు చెమటలు పట్టడంతో సీఎం ఉక్కిరిబిక్కిరయ్యారు. మొత్తం మీద ఆయన పర్యటన ఆద్యంతం ఊపిరి సలపకుండా సాగింది. ఈ క్రమంలో ఆయన హావభావాలను 'సాక్షి' కెమెరాలో బంధించింది. -
‘సినీతారల స్వచ్ఛ హైదరాబాద్’
సాక్షి, హైదరాబాద్: తెలుగు సినిమా పరిశ్రమ ఆధ్వర్యంలో ఈ నెల 16 నుంచి 20 వరకు స్వచ్ఛ హైదరాబాద్ కార్యక్ర మం జరుగుతుందని రా ష్ట్ర సినిమాటోగ్రఫీ మంత్రి తలసాని శ్రీనివాస్‌యాదవ్ తెలిపారు. గురువారం తెలుగు సినీ ప్రముఖులు డి.సురేష్ బాబు, సి.కళ్యాణ్, కోదండరామిరెడ్డి, శివరామకృష్ణ మంత్రిని కలసి స్వచ్ఛ హైదరాబాద్‌లో పాల్గొనేందుకు ఆస క్తి కనబరుస్తూ లేఖ అందజేశారు. ఈ కార్యక్రమంలో పాల్గొనేందుకు ముందుకు రావడం పై మంత్రి వారిని అభినందించారు. -
ఎమ్మెల్యేల ప్రతిపాదనలకు ప్రాధాన్యం ఇవ్వాలి
స్వచ్ఛ హైదరాబాద్ సమీక్షలో సీఎంను కోరిన అన్ని పార్టీల ఎమ్మెల్యేలు సాక్షి, హైదరాబాద్: నగరంలో ఈనెల 16 నుంచి నాలుగు రోజుల పాటు నిర్వహించనున్న స్వచ్ఛ హైదరాబాద్ కార్యక్రమంలో తమ ప్రతిపాదనలకు ప్రాధాన్యమివ్వాలని ఎమ్మెల్యేలు ముఖ్యమంత్రిని కోరారు. తమ ప్రతిపాదనల మేరకు అధికారులు స్పందించేలా ఆదేశాలివ్వాలని విన్నవించారు. నగరంలోని దాదాపు అన్ని నియోజకవర్గాల శాసనసభ్యులు గురువారం సచివాలయంలో ముఖ్యమంత్రి నిర్వహించిన సమీక్ష సమావేశానికి హాజరయ్యారు. అనంతరం టీడీపీ ఎమ్మెల్యే ప్రకాశ్‌గౌడ్ మీడియాతో మాట్లాడుతూ.. ప్రభుత్వం ఆలస్యంగానైనా స్వచ్ఛభారత్‌లో భాగంగా నగరంలోని పారిశుధ్య సమస్యలపై దృష్టి సారించడం సంతోషకరమన్నారు. మురుగునీరు, చెత్త చెదారం మొదలైన సమస్యలన్నింటినీ సీఎం దృష్టికి తీసుకెళ్లామని చెప్పారు. మన పరిసరాలను పరిశుభ్రంగా, కాలనీలను పచ్చగా ఉంచుకునేందుకు శ్రీకారం చుట్టిన ఈ కార్యక్రమంలో ప్రజలందరూ పాలుపంచుకోవాలని ఎమ్మెల్యే ఆర్.కృష్ణయ్య పిలుపునిచ్చారు. హైదరాబాద్‌ను పచ్చగా, పరిశుభ్రంగా తీర్చిదిద్దేందుకు కృషి చేస్తామని, ప్రభుత్వం చేస్తున్న స్వచ్ఛ హైదరాబాద్‌కు సంపూర్ణ సహకారం అందిస్తామని బీజేపీ శాసనసభపక్ష నేత కె.లక్ష్మణ్ తెలిపారు. కంటోన్మెంట్లో పారిశుధ్య సమస్యలను పరిష్కరించి, సుందరంగా తీర్చిదిద్దేందుకు నిధులను ఇస్తామని సీఎం హామీ ఇచ్చినట్టు కంటోన్మెంట్ బోర్డు వైస్ చైర్మన్ సదా కేశవరెడ్డి, మల్కాజిగిరి ఎమ్మెల్యే కనకారెడ్డి తెలిపారు. -
16నుంచి స్వచ్చ హైదరాబాద్