‘సినీతారల స్వచ్ఛ హైదరాబాద్’
సాక్షి, హైదరాబాద్: తెలుగు సినిమా పరిశ్రమ ఆధ్వర్యంలో ఈ నెల 16 నుంచి 20 వరకు స్వచ్ఛ హైదరాబాద్ కార్యక్ర మం జరుగుతుందని రా ష్ట్ర సినిమాటోగ్రఫీ మంత్రి తలసాని శ్రీనివాస్‌యాదవ్ తెలిపారు. గురువారం తెలుగు సినీ ప్రముఖులు డి.సురేష్ బాబు, సి.కళ్యాణ్, కోదండరామిరెడ్డి, శివరామకృష్ణ మంత్రిని కలసి స్వచ్ఛ హైదరాబాద్‌లో పాల్గొనేందుకు ఆస క్తి కనబరుస్తూ లేఖ అందజేశారు. ఈ కార్యక్రమంలో పాల్గొనేందుకు ముందుకు రావడం పై మంత్రి వారిని అభినందించారు.