cinema artists
-
నూరేళ్ల గురుదత్
‘నువ్వు కమ్యూనిస్టువా?’... ‘కాదు. కార్టూనిస్టుని’.... ‘నీకు మంచి జీవితం తెలియక ఈ దిక్కుమాలిన కొంపను ఇల్లు అనుకుంటున్నావు’... ‘దాన్దేముంది... మీకు ఫుట్‌పాత్‌ల మీద బతుకుతున్న లక్షల మంది గురించి తెలియదు. నేను వాళ్ల కంటే మెరుగే’... ‘నువ్వు నౌకరువి! గుర్తుంచుకో’... ‘నౌకర్నైతే? తల ఎత్తి మాట్లాడకూడదా?’... గురుదత్ సినిమాల్లోని డైలాగ్స్ ఇవి. దేశానికి స్వతంత్రం వచ్చి గొప్ప జీవితాన్ని వాగ్దానం చేశాక కూడా, ఎక్కడా ఆ వాగ్దానం నెరవేరే దారులు లేక, ఉద్యోగ ఉపాధులు లేక, పేదరికం పీడిస్తూ, మనుషుల్లో స్వార్థం, రాక్షసత్వం దద్దరిల్లుతున్న కాలంలో ‘ఇన్సాన్ కా నహీ కహీ నామ్ ఔర్ నిషాన్’ అనిపించిన ఒక భావుకుడు, దయార్ద్ర హృదయుడు, ఎదుటి వారి కళ్లల్లో నాలుగు కన్నీటి చుక్కలు చూడగానే సొమ్మసిల్లే దుర్బల మానసిక స్వరూపుడు గురుదత్ వచ్చి ఆడిన కళాత్మక నిష్ఠూరమే అతడి సినిమాలు. స్వతంత్రం వచ్చిన పదేళ్లకు ‘ప్యాసా’ తీసి ‘జిన్హే నాజ్ హై హింద్ పర్ ఓ కహా హై’ అని ప్రశ్నించాడు. స్వతంత్రం వచ్చిన 75 ఏళ్ల తర్వాత కూడా ఏదో ఒక పాదధూళి దొరికితే కష్టాల నుంచి బయట పడదామనుకునే∙కోట్లాది నిరుపేదలను చూసి నేటికీ అనవలసిందే కదా– ‘దేశాన్ని చూసి గర్వపడే పెద్దలారా... మీరెక్కడ?’కలకత్తాలో బాల్యం గడిపిన గురుదత్ ఇంటెదురు ఖాళీ జాగాలో జరిగే తిరునాళ్లలోని పేద కళాకారుల ఆటపాటలతో స్ఫూర్తి పొందాడు. అతనూ డాన్స్ చేస్తే ఆ సుకుమార రూపం అద్భుతంగా మెలికలు తిరిగేది. డాన్స్ అతణ్ణి నాటి ప్రఖ్యాత డాన్సర్ ఉదయ్‌శంకర్ దగ్గరకు చేర్చింది. ఆ తర్వాత పూణేకు! అక్కడ ప్రభాత్ థియేటర్లో డాన్స్‌మాస్టర్‌గా, అసిస్టెంట్ డైరెక్టర్‌గా అన్నింటికీ మించి దేవ్ ఆనంద్ స్నేహితుడిగా దారి మొదలెట్టాడు. బెంగాల్ పురోగామి ధోరణి, చదివిన పుస్తకాలతో ఏర్పరుచుకున్న బౌద్ధిక విమర్శ కళలో ఏం చెప్పాలో తెలిపాయి. అయితే సినిమా వ్యాపారకళ. వ్యాపారాన్నీ, కళనూ, ఆదర్శాన్నీ కలిపి నడిపించడం కష్టమైన పని. కాని ఆ పనిని గొప్పగా చేయగలిగిన జీనియస్ గురుదత్. అతనికి ముందు సినిమాల్లో డైలాగ్ ఉంది. గురుదత్ వచ్చి... ఆ డైలాగ్ చెప్పే సందర్భంలో తెర కవిత్వాన్ని చిందడం చూపగలిగాడు. అతనికి ముందు సినిమాల్లో వెలుతురూ చీకటీ ఉంది. గురుదత్ వచ్చి... వెలుగునీడల గాఢ పెనవేతను తెరపై నిలిపాడు. అతనికి ముందు సినిమాల్లో పాత్రలున్నాయి. గురుదత్ వచ్చి ఆ పాత్రల ప్రాంతం, మాట, నడత నిక్కచ్చి చేశాడు. ‘ఆర్ పార్’ (1954)తో ఈ ముద్ర మొదలైంది. ‘మిస్టర్ అండ్ మిసెస్ 55’ (1955), ‘ప్యాసా’ (1957), ‘కాగజ్ కే ఫూల్’ (1959), ‘చౌద్వీ కా చాంద్’ (1960), ‘సాహిబ్ బీబీ ఔర్ గులామ్’ (1962)ల వరకూ ఇదే ధోరణి కొనసాగింది. గాయని షంషాద్ బేగం అంది– ‘ఏ సినిమా తీసినా నిజాయితీతో తీశాడు. తప్పుడుతనంతో ఒక్కటీ తీయలేదు’.‘ప్యాసా’ క్లయిమాక్స్‌లో కవి పాత్రలో ఉన్న గురుదత్ పునరుత్థానం చెందుతాడు. సినిమాలో అతడు మరణించాడని జనం భావించాకే గుర్తింపు పొందుతాడు. నిజజీవితంలో కూడా అదే జరిగింది. పెద్ద హీరోల, దర్శకుల సినిమాల మధ్యలో... గురుదత్ జీవించి ఉండగా పేరు రాలేదు. మరణించాక కూడా రాలేదు. 1980లలో విదేశాలలో అతడి సినిమాలు ప్రదర్శింపబడి ప్రశంసలు దక్కాకే గురుదత్ పేరుకు ఉన్న మసి తొలిగింది. రాజ్‌కపూర్ ‘కాగజ్ కే ఫూల్’ చూసి ‘ఇది కాలం కంటే ముందే తీశాడు. రాబోయే తరాలే దీనిని పూజిస్తాయి’ అన్నాడు. అదే జరిగింది. నేడా సినిమా ప్రపంచంలోని ఎనిమిది యూనివర్సిటీల్లో పాఠ్యాంశంగా ఉంది.‘80 శాతం నటన నటీనటుల కళ్లతోనే పూర్తవుతుంది. మనం మనిషి కళ్లల్లో చూస్తాం. నటన కూడా అక్కడే తెలియాలి’ అనేవాడు గురుదత్. అతని సినిమాల్లో టైట్ క్లోజప్స్, కళ్లు చేసే అభినయం పాత్రలను ప్రేక్షకులతో కనెక్ట్ చేస్తాయి. తీయబోయే పాట ఎలా ఉంటుందో ముందే తెలుసు కనుక రికార్డింగ్ సమయంలో ఆశా భోంస్లే ఎదురుగా నిలబడి గురుదత్ ఎక్స్ప్రెషన్స్ ఇస్తూ ఉంటే ఆమె వాటికి తగినట్టుగా ఒయ్యారాలు పోతూ పాడిందట. ‘భవరా బడా నాదాన్ హై’ వినండి తెలుస్తుంది. గురుదత్ మన తెలుగు వహీదా రెహమాన్‌ను స్టార్‌ని చేశాడు. బద్రుద్దీన్ అనే బస్ కండక్టర్ని జానీవాకర్ అనే స్టార్ కమెడియన్ని చేశాడు. ఎస్.డి.బర్మన్, ఓపి నయ్యర్లతో సాహిర్ లుధియాన్వీ, మజ్రూ సుల్తాన్‌పురి, కైఫీ ఆజ్మీలతో అత్యుత్తమమైన పాటలను ఇచ్చాడు. సినిమాటోగ్రాఫర్ వి.కె.మూర్తి, రచయిత అబ్రార్ అల్వీల గొప్పతనం చాటాడు.వసంత కుమార్ పడుకోన్ అలియాస్ గురుదత్ జూలై 9, 1925న జన్మించి కేవలం 39 సంవత్సరాలు జీవించాడు. 14 ఏళ్ల కెరీర్లో గొప్ప గొప్ప క్లాసిక్స్ తీశాడు. గాయని గీతాదత్ను వివాహం చేసుకుని, వహీదా రెహమాన్ సాన్నిహిత్యం కోరి ఛిద్ర గృహజీవనం సాగించాడు. కాగితపు పూలకే అందలం దక్కే సంఘనీతికి కలత చెంది అర్ధంతరంగా జీవితం నుంచి నిష్క్రమించాడు. రేపటి నుంచి అతని శత జయంతి సంవత్సరం మొదలు. ‘ప్యాసా’ క్లయిమాక్స్‌లో ‘మనిషి నుంచి మనిషితనాన్ని లాక్కునే సమాజం మీదే నా ఫిర్యాదు’ అంటాడు గురుదత్. ఆ ఫిర్యాదు అవసరం మరింతగా పెరిగిన రోజులివి. గురుదత్ను పునర్ దర్శించాల్సిన సందర్భం. అవును. మెడలో ముళ్లహారం పడినా ముందుకేగా నడక.హమ్నెతో జబ్ కలియా మాంగీ కాంటోంకా హార్ మిలాజానే ఓ కైసే లోగ్ థే జిన్ కే ప్యార్ కో ప్యార్ మిలా... -
Sharvari Wagh: అది సినిమానా? ఓటీటీనా? టీవీ సీరియలా అని చూడను..
శార్వరీ వాఘ్.. అందం, అభినయం కలబోసుకున్న నటి. సినిమా నేపథ్య కుటుంబం నుంచి రాలేదు. నటన మీదున్న ఆసక్తితో గ్లామర్ ఫీల్డ్‌లోకి అడుగుపెట్టింది. టాలెంట్‌తో నిలదొక్కుకుంటోంది.శార్వరీ పుట్టిపెరిగింది ముంబైలో. తండ్రి శైలేశ్ వాఘ్.. బిల్డర్. తల్లి నమ్రతా వాఘ్.. ఆర్కిటెక్ట్. దివంగత నేత, మహారాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి, లోక్‌సభ మాజీ స్పీకర్ మనోహర్ జోషీ.. శార్వరీకి స్వయాన తాత (నమ్రతా వాఘ్ తండ్రి).శార్వరీ.. బీఎస్సీ గ్రాడ్యుయేట్. యాక్ట్రెస్ కావాలని చిన్నప్పుడే నిశ్చయించుకుంది. అందుకే పదహారవ ఏట నుంచే మోడలింగ్ స్టార్ట్ చేసింది. ఇంట్లోవాళ్లూ అభ్యంతరపెట్టలేదు.2013లో ‘క్లీన్ అండ్ క్లియర్ ఫ్రెష్ ఫేస్’ పోటీలో పాల్గొంది. గెలిచింది కూడా! ఆ విజయమే శార్వరీని గ్లామర్ ఫీల్డ్కి పరిచయం చేసింది. టీవీ కమర్షియల్స్‌లో నటించే చాన్స్‌లను తెచ్చిపెట్టింది.నటనను మరింత సీరియస్‌గా తీసుకుని జెఫ్ గోల్డ్ బర్గ్స్ స్టూడియోలో చేరింది నటనలో ఓనమాలు నేర్చుకోవడానికి. అంతేకాదు మరిన్ని మెలకువల కోసం థియేటర్లోనూ జాయిన్ అయింది. ఎక్కడ థియేటర్ వర్క్‌షాప్ జరిగినా హాజరయ్యేది.థియేటర్ వర్క్‌షాప్ ద్వారానే శార్వరీ గురించి బాలీవుడ్ డైరెక్టర్ లవ్ రంజన్కి తెలిసింది. ఆమె స్కిల్స్‌కి అబ్బురడి తన ‘ప్యార్‌కా పంచ్ నామా 2’ సినిమాకి అసిస్టెంట్ డైరెక్టర్‌గా పనిచేసే అవకాశాన్నిచ్చాడు. శార్వరీ తొలి ప్రాధాన్యం నటనకే అయినా ఆఫ్ స్క్రీన్ వర్క్ కూడా నేర్చుకోవాలనే తపనతో ఆ అవకాశాన్ని అందిపుచ్చుకుంది.బెస్ట్ అసిస్టెంట్ డైరెక్టర్ అనే కాంప్లిమెంట్‌ని తీసుకుంది. ఆ విషయం సంజయ్ లీలా భన్సాలీకి చేరి అతనూ ఆమెకు ఆఫర్ పంపాడు తను తీయబోతున్న సినిమా (బాజీరావ్ మస్తానీ)కు అసిస్టెంట్ డెరెక్టర్‌గా చేరమని. దాన్నీ పని నేర్చుకోవడానికి మరో అవకాశంగానే భావించి భన్సాలీ దగ్గరా అసిస్టెంట్‌గా చేరింది. అలా మొత్తం మూడు (మూడోది.. సోనూ కే టీటూ కీ స్వీటీ) సినిమాలకు అసిస్టెంట్ డైరెక్టర్‌గా పనిచేసింది.శార్వరీ 2020లో తెరంగేట్రం చేసింది.. ‘ద ఫర్గాటెన్ ఆర్మీ – ఆజాదీ కే లియే’ అనే వెబ్‌సిరీస్‌తో. ఇందులో ఆమెది ప్రధాన పాత్ర. ఇది అమెజాన్ ప్రైమ్ వీడియోలో స్ట్రీమ్ అవుతోంది. అదే ఏడు సిల్వర్ స్క్రీన్ మీదా వెలిగింది.. ‘బంటీ ఔర్ బబ్లూ 2’తో!తాజాగా ‘మహారాజా’ సినిమాతో మళ్లీ టాక్ ఆఫ్ ద బాలీవుడ్, ఫేవరెట్ ఆఫ్ ది ఆడియెన్స్‌గా మారింది శార్వరీ! మహారాజ్ లైబెల్ కేస్ ఆధారంగా తెరకెక్కిన ఈ నెట్‌ఫ్లిక్స్ సినిమాలో జైదీప్, జునైద్ ఖాన్‌లతోపాటు ఆమె నటనా విమర్శకుల ప్రశంసలు అందుకుంటోంది.స్క్రిప్ట్, స్క్రీన్ ప్లే, నా రోల్.. వీటి గురించే ఆలోచిస్తాను తప్ప అది సినిమానా? ఓటీటీనా? టీవీ సీరియలా అని చూడను. అసలు అవి మ్యాటరే కాదు! – శార్వరీ వాఘ్ -
సోషల్ మీడియా ట్రోల్స్ పై యాంకర్ శ్యామల రియాక్షన్
-
Jamuna: కళాభారతికి నీరాజనం
'వంశీ ఇంటర్నేషనల్ అండ్ శ్రీ సాంస్కృతిక కళాసారథి' సింగపూర్ సంస్ధల సంయుక్త ఆధ్వర్యంలో ప్రజానటి కళాభారతి డాక్టర్ జమున రమణారావు నటించిన సినిమాలలో ఆమె నటనా వైదుష్యంపై విశ్లేషణా ప్రసంగాలతో ‘‘మీరజాలగలడా నా యానతి’’ కార్యక్రమం అంతర్జాల వేదికపై శనివారం ఘనంగా నిర్వహించబడింది. భారత్, సింగపూర్, న్యూజిలాండ్, ఆస్ట్రేలియా, మలేషియా, హాంకాంగ్, ఖతార్, యుగాండా, కెనడా, అమెరికా దేశాల నుండి 35 మంది ప్రఖ్యాత రచయితలు ఈ కార్యక్రమంలో పాల్గొని జమున నటించిన చిత్రరాజాల నుండి 35 ఆణిముత్యాలు అయిన సినిమాలను ఎంపిక చేసుకొని, వాటిలో ఆమె కనబరిచిన నటనా ప్రావీణ్యం, వివిధ రకాల పాత్రలలో ఆమె ఇమిడిపోయిన తీరు గురించి విశ్లేషిస్తూ అద్భుతమైన ప్రసంగాలను చేశారు. ముఖ్యఅతిథిగా చెన్నై నుండి ప్రముఖ సినీ రచయిత భువనచంద్ర పాల్గొని జమున నటనా ప్రభావ విశేషాలను గూర్చి, నిజ జీవితంలో ఆమె కనబరిచిన ఉన్నతమైన వ్యక్తిత్వాన్ని గూర్చి ప్రసంగించారు. జమున కుమారులు, అమెరికా వాస్తవ్యులైన డా. వంశీ కృష్ణ ఈ కార్యక్రమంలో ప్రత్యేక అతిధిగా పాల్గొని తన మాతృమూర్తి చిత్రపటం ముందు జ్యోతిని వెలిగించి కార్యక్రమాన్ని ప్రారంభించారు. సుమారు 7 గంటల పాటు జరిగిన ఈ కార్యక్రమాన్ని ఆసాంతం వీక్షించి, అందరి ప్రసంగాలను విని ఇంతటి బృహత్ కార్యక్రమాన్ని చేపట్టినందుకు వంశీ -సింగపూర్ సంస్థలకు హృదయపూర్వక అభినందనలు తెలియజేశారు. విదేశాల వారితోపాటు హైదరాబాద్ నుండి ప్రముఖ రచయితలైన ఆచార్య టీ గౌరీ శంకర్, హాస్యబ్రహ్మ శంకరనారాయణ, డాక్టర్ కె వి కృష్ణకుమారి, డాక్టర్ తిరునగిరి దేవకీదేవి లు ప్రసంగవ్యాసాలను అందించడం విశేషం. "తాము కార్యక్రమం ఉద్దేశాన్ని తెలియపరచగానే పది దేశాల నుంచి స్పందించి 35మంది రచయితలు ముందుకొచ్చి విశ్లేషణ వ్యాసాలను అందించడం చాలా సంతోషకరంగా ఉందని, త్వరలో ఈ వ్యాసాలు అన్నింటితో వంశీ ప్రచురణగా, పుస్తకాన్ని ప్రచురిస్తామని" కార్యక్రమ ముఖ్య నిర్వాహకులు, వంశీ వ్యవస్థాపకులు డాక్టర్ వంశీ రామరాజు, శ్రీ సాంస్కృతిక కళాసారథి వ్యవస్థాపకులు కవుటూరు రత్నకుమార్ తెలియజేశారు. రచయిత్రి రాధిక మంగిపుడి సభా నిర్వహణ గావించగా అలనాటి మేటి చిత్రాలైన మిస్సమ్మ, శ్రీకృష్ణతులాభారం, గుండమ్మ కథ, అప్పుచేసి పప్పుకూడు, యశోదా కృష్ణ, మంగమ్మ శపథం, మూగమనసులు, చిరంజీవులు, బంగారు తల్లి.. వంటి చిత్రాలలో జమున నటించిన వైవిధ్యభరితమైన పాత్రల ఔచిత్యాన్ని చక్కగా రచయితలు అభివర్ణించారు. సినిమాలతో పాటు జమున గారితో వీరందరికీ ఉన్న ప్రత్యక్ష అనుబంధాన్ని గూర్చి కూడా తలచుకుంటూ ఆమెకు నివాళులు అర్పించారు. వంశీ అధ్యక్షురాలు డా తెన్నేటి సుధా దేవి, మేనేజింగ్ ట్రస్టీ శైలజా సుంకరపల్లి నిర్వహణా సహకారం అందించారు. ఇవి చదవండి: అను వైద్యనాథన్: సాహసాల నుంచి నవ్వుల వరకు -
ఆ లిస్ట్‌లో జూనియర్ ఎన్టీఆర్ ఒక్కడే.. ఫస్ట్ ప్లేస్‌లో ఎవరంటే?
యంగ్ టైగర్ జూనియర్ ఎన్టీఆర్ ప్రస్తుతం దేవర సినిమాతో బిజీగా ఉన్నారు. కొరటాల శివ దర్శకత్వంలో తెరకెక్కిస్తోన్న ఈ చిత్రంలో బాలీవుడ్ భామ జాన్వీ కపూర్ హీరోయిన్గా కనిపించనుంది. ఈ సినిమాతోనే శ్రీదేవి ముద్దుల కూతురు టాలీవుడ్ ఎంట్రీ ఇస్తోంది. అంతే కాకుండా ఈ చిత్రంలో బాలీవుడ్ స్టార్ సైఫ్ అలీఖాన్ కీలక పాత్ర పోషిస్తున్నారు. (ఇది చదవండి: ‘మహా’ సీఎంను కలిసిన రామ్‌చరణ్ దంపతులు..!) ఇప్పటికే ఆర్ఆర్ఆర్ సినిమాతో ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు తెచ్చుకున్న మన యంగ్ టైగర్ మరో ఘనత సాధించారు. 2023లో ఆసియాలో టాప్ 50లో నిలిచిన నటుల జాబితాలో చోటు సంపాదించారు. ఈ విషయాన్ని ఏషియన్ వీక్లీ మ్యాగజైన్ ప్రకటించింది. ఈ జాబితాలో తారక్ 25వ స్థానలో నిలిచారు. ఈ జాబితాను ఈస్టర్న్ ఐ 2023 వెల్లడించింది. ఈ లిస్ట్‌లో టాలీవుడ్ నుంచి ప్లేస్ దక్కించుకున్న ఏకైక హీరో జూనియర్ కావడం విశేషం. అయితే ఈ లిస్ట్‌లో బాలీవుడ్ బాద్షా షారుక్ ఖాన్ మొదటి స్థానంలో నిలవగా.. మరికొందరు బాలీవుడ్ తారలు జాబితాలో చోటు దక్కించుకున్నారు. ఆలియా భట్, ప్రియాంక చోప్రా జోనాస్ రెండు, మూడు స్థానాల్లో నిలిచారు. రణ్‌బీర్ కపూర్ 6వ, దళపతి విజయ్ 8వ స్థానంలో సాధించారు. కాగా.. ఎన్టీఆర్ నటిస్తోన్న దేవర పార్ట్-1 ఏప్రిల్ 5న రిలీజ్ కానుంది. (ఇది చదవండి: జూనియర్ ఎన్టీఆర్ వీరాభిమాని.. ఆయన పేరుతో ఏకంగా!) -
కుక్కలా మారిన వ్యక్తి..ఆడ కుక్కతో ప్రేమలో..
ఓ జపాన్ వ్యక్తి ఇటీవల కుక్కలా మారి వార్తల్లో నిలిచిన సంగతి తెలిసిందే. ఆ వ్యక్తి ఓ ప్రముఖ ఛానెల్‌కి ఇచ్చిన ఇంటర్యూలో.. కుక్కలా మారిన తర్వాత తన అసాధారణ జీవితం ఎలా ఉందో వివరిస్తూ..చాలా షాకింగ విషయాలు చెప్పాడు. అతడు చెప్పిన విషయాలు చూస్తే వామ్మో ఇవేం కోరికలు అనిపించేలా ఉన్నాయి. వివరాల్లోకెళ్తే..ఇటీవలే జపాన్‌కి చెందిన వ్యక్తి తనకెంతో ఇష్టమైన "కోలీ" అనే కుక్కలా మారి ఆశ్చర్యపర్చాడు. అందుకోసం ఎన్నో కంపెనీలు సంప్రదించగా ఓ కంపెనీ ముందుకు వచ్చి కుక్కను తలిపించే కాస్ట్యూమ్ డిజైన్ చేసేందుకు ముందుకు వచ్చింది. . ఇటీవలే అచ్చం కుక్కలా కనిపించే ఆ కాస్ట్యూమ్ని ధరించి వీధుల్లో హల్చల్ చేసి నెట్టింట వైరల్‌గా మారాడు కూడా. ఇప్పుడా వ్యక్తి తనకు ఇలా కుక్క జీవితం ఎంతో నచ్చిందని చెబుతున్నాడు. కుక్క మాదిరిగా నాలుగు కాళ్లపై నడవడం ఇబ్బందిగా ఉన్నా సంతృప్తిగా ఉందని చెప్పడం విశేషం. ఆ వ్యక్తి ఆ కుక్కలా కనిపించే కాస్ట్యూమ్స్ కోసం ఒకటి, రెండు కాదు ఏకంగా రూ. 12 లక్షలు ఖర్చుపెట్టాడు. అంత ఖర్చుపెట్టాడు కాబట్టి ఇష్టపడక ఏం చేస్తాడులే! అని అనుకోకండి. పైగా కుక్కలా అసాధారణ జీవితం గడుపుతున్న అతడికి కలుగుతున్న కోరికలు వింటే మాత్రం ఓర్నీ ఇవేం కోరికలు అని నోరెళ్లబెట్టడం ఖాయం. ఇంతకీ ఆ కుక్కలా మారిన వ్యక్తి తనలానే కుక్కలా మారాలనుకునే స్త్రీ కూడా ఉంటే బాగుండనని, ఆమెతో ప్రేమలో పడాలని అనుకుంటున్నాడట. అంతేకాదు కుక్కలా ఉన్న తనకు సినిమాలో నటించే అవకాశం వస్తే బావుండనని అంటున్నాడు. ఒక్క అవకాశం ఇస్తే తానేంటో చూపించుకుంటానని చెబుతున్నాడు. ఇలా జీవితం గడపడం ఎంత అసౌకర్యంగా అసాధారణంగా ఉన్నా తనకు అలా ఉండటమే ఇష్టమని తేల్చి చెప్పాడు. కోలీ జాతి కుక్కలంటే తనకెంతో ఇషమని అలా ఉండాలన్న కోరిక నెరవేరినందుకు సంతోషంగా ఉందని మరీ చెబుతున్నాడు. ఓర్నీ వెర్రీ వెయ్యి రకాలు అంటే ఏంటో అనుకున్నాం. ఇలానే ఉంటుందేమో కదా!. (చదవండి: వధువు ఎంట్రీ మాములుగా లేదుగా!ఐడియా అదుర్స్) -
ఇకపై కమీషన్ బాధలుండవ్, ఆర్టిస్టులకు ఐడీ కార్డులిస్తాం..: పోసాని
ఆంధ్రప్రదేశ్‌లో ఉన్న కళాకారులకు అండగా ఉంటామన్నారు ఏపీఎఫ్డీసీ చైర్మన్ పోసాని కృష్ణమురళి. రాష్ట్రంలోని ఆర్టిస్టులు, టెక్నీషియన్లందరికీ ఐడీ కార్డులు ఇస్తామన్నారు. బుధవారం నాడు ఆయన మీడియా సమావేశంలో మాట్లాడుతూ.. 'ఏపీలో ఉన్న ఆర్టిస్టులు, టెక్నీషియన్లు అందరికీ ఐడీ కార్డులు ఇస్తాం. దానివల్ల బయటవారికి ఆర్టిస్టుల ఎంపిక సులభతరమవుతుంది. సినిమా రంగంలో మా అసోసియేషన్ ఉంది కానీ, మాలో మెంబర్ అవాలంటే డబ్బులివ్వాలి. ఇతర అసోసియేషన్లోనూ డబ్బులు తీసుకుంటారు. కానీ ఇక్కడ ఒక్క రూపాయి కూడా కమీషన్ తీసుకోము. ప్రభుత్వం నిర్ణయించిన ఐదు విభాగాల్లో నంది నాటక అవార్డులకు ఎటు వంటి విమర్శలకు తావులేకుండా ఉత్తమ కళాకారులను ఎంతో పారదర్శకంగా ఎంపిక చేస్తున్నట్లు ఏపీఎఫ్డీసీ ఛైర్మన్ పోసాని కృష్ణ మురళి తెలిపారు. పోసాని కృష్ణ మురళి పాత్రికేయులతో మాట్లాడుతూ.. 'నంది నాటక పురస్కారాలకై ఉత్తమ కళాకారులను ఎంపిక చేసేందుకు అనుసరిస్తున్న ప్రక్రియను వివరించారు. ఈ అవార్డులకు కళాకారుల పతిభ, సామర్థ్యం ఆధారంగానే ఉత్తమ కళాకారులను ఎంపిక చేయడం జరుగుతుందని, ఈ ఎంపికలో ఎటు వంటి సిఫార్సులకు తావు ఉండదని ఆయన స్పష్టం చేశారు. విభాగాల వారీగా ఎంతో అనుభవం ఉన్న వారినే న్యాయ నిర్ణేతలుగా నియమించడం జరిగిందన్నారు. న్యాయ నిర్ణేతల ప్రొఫైల్స్‌ను ఏపీఎఫ్డీసీ అఫీషియల్ వెబ్సైట్లో అందుబాటులో ఉంచడం జరుగుతుందన్నారు. నిర్ణయించిన కార్యాచరణ ప్రకారం ఈ న్యాయ నిర్ణేతలు క్షేత్ర స్థాయిలో పర్యటన జరిపి విభాగాల వారీగా తుది ప్రదర్శనకు కళాకారులను ఎంపిక చేయడం జరుగుతుందన్నారు. పద్య నాటక విభాగానికి సంబందించిన న్యాయ నిర్ణేతలు తమ పర్యటనను సెప్టెంబరు 8 న కర్నూలు నుండి ప్రారంభించి 18 వ తేదీతో విశాఖపట్నంలో ముగిస్తారన్నారు. సాంఘిక నాటకం, యువజన నాటిక విభాగం న్యాయ నిర్ణేతలు సెప్టెంబరు 10 న పిఠాపురంలో ప్రారంభమై 18వ తేదీతో కర్నూలులో తమ పర్యటనను ముగిస్తారన్నారు. అదే విధంగా సాంఘిక నాటికలు, బాలల నాటికల న్యాయ నిర్ణేతలు సెప్టెంబరు 7న అనంతపురంలో ప్రారంభమై 18 వ తేదీన విశాఖపట్నంలో తమ పర్యటనను ముగిస్తారన్నారు. తుది ప్రదర్శనకు అర్హమైన కళా బృందాలను సెప్టెంబరు 19 వ తేదీ కల్లా ప్రకటించనున్నట్లు ఆయన తెలిపారు. విభాగాల వారీగా అందిన ధరఖాస్తులు ఈ ఏడాది పద్య, సాంఘిక నాటకం, బాలల, యువజన నాటికలతో పాటు నాటక రంగ తెలుగు రచనలు అనే ఐదు విభాగాల్లో నంది నాటక పురస్కారాలను అందజేసేందుకు అర్హులైన కళాకారులు, రచయితల నుంచి మొత్తం 118 ధరఖాస్తులు అందాయన్నారు. వీటిలో నాటక రంగ తెలుగు రచన విభాగానికై 3 ధరఖాస్తులు, పద్యనాటకానికై 26, సాంఘిక నాటకానికై 22, యువజన నాటికకు 9, సాంఘిక నాటికకు 49, బాలల నాటిక విభాగంలో 9మొత్తం 118 ధరఖాస్తులు అందినట్లు ఆయన తెలిపారు. వీటిలో నాటక రంగ తెలుగు రచన విభాగం క్రింద ఒక పుస్తకాన్ని ఎంపిక చేయాల్సి ఉందన్నారు. అదే విధంగా పద్యనాటకానికై 10 దరఖాస్తులను, సాంఘిక నాటకానికై 6, యువజన నాటికకు 5, సాంఘిక నాటికకు 12, బాలల నాటిక విభాగంలో 5 మొత్తం 39 ధరఖాస్తుదారులను తుది ప్రదర్శన కోసం ఎంపిక చేయాల్సి ఉందన్నారు. కళాకారులకు గుర్తింపు కార్డులు జారీ చేస్తాం…… రాష్ట్రంలోని కళాకారులు అందరికీ గుర్తింపు కార్డులు జారీచేయాలని నిర్ణయిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులను జారీ చేయడం జరిగిందని ఆయన తెలిపారు. రాష్ట్రానికి చెందిన కళాకారులు ఎక్కడున్నా సరే వారికి ఈ గుర్తింపు కార్డులు జారీచేయడం జరుగుతుందన్నారు. అదే విధంగా ఆ కళాకారుల వివరాలను అన్నింటిని అఫీషియెల్ వెబ్సైట్లో అందరికీ అందుబాటులో ఉంచడం జరుగుతుందన్నారు. ఏజంట్ల ప్రమేయం ఏమాత్రం లేకుండా సినిమా నిర్మాతలకు, దర్శకులకు ఎటు వంటి కళాకారులు కావాల్సి ఉన్నా నేరుగా వారి వివరాలను అందజేయడం జరుగుతుందన్నారు. తద్వారా కళాకారులు సినిమా నిర్మాతలు, దర్శకుల నుండి నేరుగా జీవనోపాది పొందేందుకు అవకాశం ఏర్పడు తుందన్నారు. అదే విధంగా ఏజంట్లకు ఎటు వంటి కమిషన్ చెల్లించాల్సిన పరిస్థితి కూడా తలెత్తదని ఆయన తెలిపారు. న్యాయ నిర్ణేతలు వీరే…… నాటక రంగ తెలుగు రచనలకు సంబందించి ఆచార్య అప్పాజోస్యుల సత్యనారాయణ (చీరాల), ఆచార్య గుమ్మా సాంబశివ రావు (విజయవాడ) మరియు ఆచార్య ఎన్.వి.కృష్ణారావును (గుంటూరు) న్యాయ నిర్ణేలుగా నియమించడం జరిగిందన్నారు. పద్యనాటక విభాగానికై కురుటి సత్యం నాయుడు (విశాఖపట్నం), ఎమ్.కుమార్ బాబు (తెనాలి), మెతుకపల్లి సూర్య నారాయణ యాదవ్ (ఏలూరు); సాంఘిక నాటకం, యువజన నాటికకు ఆకుల మల్లేశ్వర రావు (తిరుపతి), పి.శివ ప్రసాద్ (విశాఖపట్నం), ఎస్.ఆర్.ఎస్. ప్రసాద్ (ప్రొద్దుటూరు) మరియు సాంఘిక, బాలల నాటిక విభాగానికి డా.కె.జి.వేణు (విశాఖపట్నం), డా.దాసిరి నల్లన్న (తిరుపతి) మరియు పి.సుమ (సుబ్రహ్మణ్యం) (ఒంగోలు) వారిని న్యాయ నిర్ణేతలుగా నియమించడం జరిగిందని ఆయన తెలిపారు . ఇకపై కమీషన్లకు చెక్ జూనియర్ ఆర్టిస్టులు ఎంతో కష్టపడుతున్నా వారి డబ్బు సగం ఏజెంటే తింటున్నాడు. వారికి రూ.400 ఇస్తే అందులో రూ.200 ఏజెంటే కమీషన్ తీసుకుంటున్నాడు. కాబట్టి ఏజెంట్ల మధ్యవర్తిత్వమే వద్దు. డైరెక్టర్ ఆన్లైన్లో సెర్చ్ చేస్తే కళాకారుల వివరాలన్నీ వస్తాయి. ఎటువంటి మధ్యవర్తిత్వం లేకుండా డైరెక్ట్‌గా సినిమాలు చేయాలి. వారికి ఇంకా ఎటువంటి రాయితీలు ఇవ్వాలనేది ఆలోచిస్తున్నాం' అని తెలిపారు. బన్నీ రూ.5 లక్షలిచ్చాడు అల్లు అర్జున్‌కు జాతీయ ఉత్తమ నటుడి అవార్డు రావడంపై ఆయన స్పందిస్తూ.. 'బన్నీ చాలా మంచివాడు. నన్ను ఎంతో అభిమానిస్తాడు. ఓసారి నాకు రూ.5 లక్షలు ఇచ్చాడు. నాకెందుకిచ్చావని అడిగితే మీరు డబ్బు వృథా చేయరు, చాలామందికి గుండె ఆపరేషన్ చేయించారు, అది నాకు తెలుసు. మీరు మంచిపనికే ఉపయోగిస్తారు. అందుకే ఇచ్చానని చెప్పాడు. ఆ డబ్బును ఆర్థిక స్థోమత లేక చదువు ఆపేసిన ముగ్గురు విద్యార్థులకు చెరో లక్షన్నర ఇచ్చాను. దాన్ని చదువుకోసం వాడమని చెప్పాను. మిగిలిన రూ.50 వేలను మళ్లీ ముగ్గురికి పంచేసి కొత్త బట్టలు కొనుక్కోమన్నాను. ఈ డబ్బులిచ్చింది అల్లు అర్జున్, ఆయనకు థ్యాంక్స్ చెప్పమని లైవ్‌లో పిల్లలతో థ్యాంక్స్ చెప్పించాను' అని పేర్కొన్నారు పోసాని కృష్ణమురళి. చదవండి: ఆ ఫోటోలు లీక్ అవడంతో నిద్రలేని రాత్రులు.. ఉగ్రదాడితో బెదిరింపులు.. -
ఫాన్స్‌తో వ్యవహారం మామూలుగా ఉండదు..అదొక మనస్తత్వ శాస్త్రం!
అది న్యూస్ రిపోర్టర్ల వాట్సాప్ గ్రూప్. అందులో ఒక వీడియో. ఆ వీడియోలో.. కొత్తగా రిలీజ్ అయిన సినిమా థియేటర్ ముందు సినిమా హాల్ నుంచి బయటకు వచ్చిన వారిని "సినిమా ఎలా వుంది ? అని అడుగుతున్నారు . సాధారణంగా " సూపర్ " " హండ్రెడ్ డేస్ " వెయ్యి రోజులు ఖాయం " కలియుగాంతం దాకా ఈ సినిమా ఆడుతుంది " అని ఇలాంటి సందర్బాల్లో సమాధానాలు వస్తుంటాయి . అది అభిమానులు చెప్పే మాటలో లేక మానేజ్ చేసినవో తెలియదు. లోతుగా పరిశీలించి తెలుసుకోవాల్సినంత సీన్ లేదు. ఇలాంటి వీడియో ఒకటి ఉంటుంది అనుకొని దాన్ని చూడలేదు. ఆ గ్రూప్‌లో వచ్చిన కామెంట్స్ చూసి అసలు వీడియోలో ఏముందో అని క్లిక్ చేసి డౌన్ లోడ్ అయ్యాక చూసా. ఎవరో వ్యక్తి సినిమా బాగోలేదు అని కామెంట్ కామెంట్ చేసాడు. దానితో అక్కడ ఉన్న అభిమానులు అతనిపై దాడి చేసారు. చూడగానే మనసు చివుక్కు మంది. ఆ వ్యక్తి తన మనసులోని ఫీలింగ్స్ చెప్పాడో లేదా కావాలనే దుష్ప్రచారం చేసాడో .. తరువాతి మాట . సినిమా బాగా లేదు అనగానే దాడి చేస్తారా ? మనం ఏమైనా తాలిబన్ల రాజ్యంలో ఉన్నామా? అనిపించింది. హీరోల అభిమానులు అలాగే ఉంటారని మా బాల్యంలో చెప్పుకునేవారు. ఒకప్పుడూ ఎంజీఆర్ సినిమా తొలి రోజు సినిమాకు వెళితే అయన అభిమానులు తలతో ఫైట్ చేసేవారట. అమాయకుడు ఎవరైనా వెళితే తలపగలడం ఖాయం అట. అది ఎంత వరకు నిజమో కానీ ఫాన్స్ వ్యవహారం మామూలుగా ఉండదు . అదొక సామాజిక- మనస్తత్వ శాస్త్ర టాపిక్. ఒక్క మాటలో చెప్పాలంటే ఒక రకమయిన మానసిక రుగ్మత. కాలం మారినా దక్షిణాదిన ఈ ధోరణి మారలేదు. అభిమానులు తమకు అసెట్ అని చాలా మంది సో కాల్డ్ హీరోస్ అనుకొంటారు. అభిమానులు వీరి మెడకు వేలాడే గుదిబండలు అని .. పాపం గ్రహించలేరు. అంత తెలివితేటలు ఉండే అవకాశం తక్కువ. భ్రమల లోకంలో బతికేస్తుంటారు . సాగినన్నాళ్లు సాగుతుంది. ఒక్కోసారి ఆకాశం నుంచి నేలకు పడిపోతారు. నిన్నటి హీరో.. పాపం తీవ్ర డిప్రెషన్ తో బాధ పడుతున్నాడు . ఇంకా ఎంతో మంది ఇలాంటి కోవలో ఉన్నారో లేదా కాస్త తక్కువ స్థాయిలో డిప్రెషన్లో ఉన్నారు అనేదాని గురించి మాట్లాడడం .. విశ్లేషించడం టైం వేస్ట్. చిత్రమయిన విషయం ఏమిటంటే అంత బహిరంగంగా దాడి చేయడం. నిజానికి ఇది తప్పు .. మీకు అభిమానం ఉంటే సినిమా ఎందుకు బాగోలేదో చెప్పుమని అడగొచ్చు అంతే గాని దాడి చెయ్యడం ఏంటి ? అని ఎవరూ అడిగినట్లు లేరు . పోలీస్‌లు ఏమి చేసారో తెలియదు. అటుపై ఇంకో వీడియో చూసా. దాడి జరిగిన వ్యక్తి .. హీరో నన్ను ఇంటికి పిలిస్తే సంతోష పడుతాను అంటున్నాడు . అలాంటివి జరగవు అని నాకు తెలుసు. ఒక వేళా హీరో జరిగిన దానికి సారీ చెప్పాలనుకున్నా అభిమానులు .. సలహాదారులు చెప్పనివ్వరు. నెక్స్ట్ సీన్.. ఫేస్బుక్ ఫ్రెండ్ .. ఓ మహిళ. ఆ మధ్యలో మెసెంజర్లో లండన్ గురించి సమాచారం ఇచ్చారనుకొంటా! నా పోస్ట్‌ల పై కామెంట్స్ పెడుతుంటారు . నేను లోతుగా పరిశీలించలేదు. ఆమెకు దేవుడంటే భక్తి . విదేశాల్లో ఉన్నా భారతీయ సంస్కృతి సంప్రదాయాలు అంటే అమితంగా ఇష్ట పడే వ్యక్తి. ఆమె ఆ సినిమా నచ్చలేదని పోస్ట్ పెట్టినట్టున్నారు . దాని పై కొంత మంది తనని టార్గెట్ చేసుకొంటూ ఎలా మాట్లాడింది అంటూ.. పోస్ట్‌లు పెట్టారు . నేను ఎప్పుడో కానీ ఫేస్‌బుక్‌లోకి వెళ్లి ఇతరుల పోస్ట్‌లు చూడను. అనుకోకుండా ఈ పోస్ట్ కనిపించింది. ఆ సినిమాను విమర్శించింది కాబట్టి ఆమె హిందువు కాదు అని.. ఇంకా రకరకాలుగా కామెంట్స్ చేసారని అర్థం అయ్యింది. సినిమా సినిమానే . జీవితం కాదు. ఒకే ఇంట్లో ఒకరికి సినిమా నచ్చోచ్చు. ఇంకొరికి నచ్చక పోవచ్చు. అదేమీ అసాధారణం కాదు. సినిమా నచ్చకపొతే ఆమె తన అభిప్రాయాన్ని పోస్ట్ చేసారు . ఒకవేళ..లేదు సినిమా బాగుంది .. ఈ కోణం లో చూడాలి" అని కామెంట్ చెయ్యడం సమంజసం. తప్పు లేదు. కానీ వ్యక్తిగత దాడి చేయడానికి అసలు ఎవరు మీరు ? సినిమా అభిమానులా ? హీరో అభిమానులా? అంటే కాదు. నాకు ఇప్పటికీ అర్థం కాని విషయం ఏమిటంటే ఒక పార్టీ అభిమానులు (అందరూ కాదు .. కొందరు ) ఇలా పోస్ట్ లు పెట్టడాన్ని చూసాను. ఇదేమి పార్టీ వ్యవహారం కాదు. పార్టీ అధికారికంగా ఎలాంటి ప్రకటన ఇవ్వదు . వీరికి సినిమా నచ్చితే దాన్ని పోస్ట్ చేసుకోవచ్చు. సినిమాపై వస్తున్న విమర్శల్ని కూడా తిప్పి కొట్టొచ్చు. కానీ ఆ క్రమం లో వ్యక్తిగత కామెంట్స్ చేయడం .. పిచ్చి పిచ్చి లాజిక్‌లు తియ్యడం .. సినిమాను విమర్శించిన వారందరూ సంఘ వ్యతిరేఖ శక్తులు వీరికి భక్తి లేదు .. దేవుడంటే నమ్మకం లేదు అని కామెంట్స్ చెయ్యడం .. ఈ పనులు వల్ల వీరు ఏమి సాధించారో నాకైతే అర్థం కాలేదు. మొదట్లో సదరు హీరోపై నాకు సధాభిప్రాయం ఉండేది. కష్టపడుతాడు, అనుకొన్నది సాధించాలన్న పట్టుదల ఉంది అనుకొనే వాడిని. ఆ సినిమాపై, ప్రారంభంలో నాకు ఎలాంటి అభిప్రాయం లేదు . కానీ ఈ అభిమానులు చేసిన రచ్చ తరువాత ఒక నెగటివ్ ఫీలింగ్ వచ్చింది. నాలా నెగటివ్ ఫీలింగ్స్ తెచ్చుకొన్నవారు కచ్చితంగా వేలల్లో/లక్షల్లో వుంటారు. చాలా మంది అన్నీ గమనిస్తుంటారు. జరుగుతున్న దాన్ని బట్టి ఒక అభిప్రాయాన్ని ఏర్పర్చుకుంటారు. అభిమానం అంటే నిర్మాణాత్మక విమర్శలను ఆహ్వానించడం. అంతే కానీ తనకు నచ్చనిది అవతలి వారు చెప్పారు కనుక వారిపై మాటలతో దాడికి రెడీ అవ్వడం కాదు. అత్యుత్సాహంతో ఎవరో ఇద్దరు ముగ్గురు కామెంట్ చెయ్యడంతో నొచ్చుకొన్న ఆమె " ఛీ .. మీరు ఇలాంటి వారా?" అంటూ మొత్తం ఆ ఐడియాలజీ వర్గాన్ని అసహ్యించుకొంటూ పోస్ట్ పెట్టారు . సెల్ఫ్ గోల్ వేసుకోవడం అని దీన్నే అంటారని చెబుతున్నారు.మానసిక శాస్త్ర పరిశోధకులు, - వాసిరెడ్డి అమర్ నాథ్, మానసిక శాస్త్ర పరిశోధకులు, సీనియర్ విద్యావేత్త. (చదవండి: పేద విద్యార్థులకు అండగా నాట్స్ అధ్యక్షుడు) -
అడిగింది ఇస్తే.. హీరోయిన్గా అవకాశం ఇప్పిస్తానని నమ్మించి..
తిరువొత్తియూరు(చెన్నై): సినిమాలో హీరోయిన్ అవకాశం ఇప్పిస్తాను.. అందుకు నేనడిగినంత డబ్బులు ఇవ్వాలని ఓ యువతి వద్ద పలు లక్షలు మోసం చేసిన దుండగుల కోసం పొలీసులు గాలిస్తున్నారు. చైన్నె టీనగర్ ప్రకాశం రోడ్డులో ప్రసిద్ధ సినిమా నిర్మాణం ఈ క్రియేషన్ పేరుతో సంస్థ నడుపుతున్నారు. కొత్త సినిమాలకు నటీనటులు కావాలని కొందరు ప్రచారం చేస్తూ సంప్రదించిన యువతీయువకుల నుంచి భారీగా డబ్బులు వసూలు చేశారు. 3 నెలలు గడిచినా కొత్త సినిమాలో నటించడానికి తమకు పిలుపు రాలేదని మోసపోయిన యువతులు కార్యాలయానికి వెళ్లి అక్కడ ఉన్న చిత్ర నిర్మాణ సంస్థ డైరెక్టర్ జగదీశన్ (50)ను ప్రశ్నంచగా తమ సంస్థ తరపున నటించడానికి ఎవరినీ ఎంపిక చేయలేదని వారితో చెప్పారు. తాము ఎటువంటి ప్రకటనలను ఇవ్వలేదని అని చెప్పాడు. అది విని షాక్ తిన్న యువతీ, యువకులు ఏమి చేయాలో తోచలేదు. దీనిపై ఈ క్రియేషన్‌న్స్ కో–డైరెక్టర్ జగదీశన్ యువతులకు ఇచ్చిన సెల్‌ఫోన్ నంబర్ల ఆధారంగా తేనాంపేట పోలీస్‌స్టేషన్‌న్‌లో ఫిర్యాదు చేశారు. ఫిర్యాదు మేరకు యువతుల నుంచి డబ్బులు తీసుకుని పోలీసులను మోసం చేసిన అనుమానితుల సెల్‌ఫోన్ నంబర్లను పరిశీలిస్తున్నారు. చదవండి: ఒడిషా రైలు ప్రమాదం.. రైల్వే బోర్డు సంచలన నిర్ణయం -
అప్పుడే ఆదిపురుష్ దెబ్బకి.. ఆర్ఆర్ఆర్, పఠాన్ రికార్డ్స్ ఢమాల్
-
నరేష్ తో యాక్టింగ్ అనగానే నా గుండె ఆగిపోయింది
-
ప్రొఫెషన్ ఏదైనా.. యాక్టింగే ప్యాషన్, అదరగొడుతున్న భాగ్యనగర వాసులు
సికింద్రాబాద్‌కు చెందిన గిరి డయాబెటిక్ కన్సల్టేషన్ కోసం నగరంలోని ఓ ప్రముఖ ప్రభుత్వాసుపత్రిలో డాక్టర్‌ను కలవడానికి వెళ్లాడు. డాక్టర్‌ను చూడగానే ఆయన్ను ఎక్కడో బాగా చూసినట్టు అనిపించింది. కాసేపటికి గుర్తొచ్చింది. మొహమాటం పడకుండా ‘మీరు ఫలానా వెబ్ సిరీస్‌లో నటించారు కదా డాక్టర్?..’అంటూ అడిగాడు. ఆయన అవునంటూ చిరునవ్వుతో సమాధానమివ్వడంతో సంబరపడి పోయాడు. గిరి లాంటి అనుభవాన్ని నగరంలో చాలామంది ఎదుర్కొంటున్నారు. సీరియల్స్, వెబ్ సిరీస్‌లు బాగా చూసేవారికి ఇలాంటి వారు ఎక్కడో ఒకచోట తారస పడుతున్నారు. వెబ్ సిరీస్‌లు, సీరియల్స్ రూపంలో అవకాశాలను అందిపుచ్చుకుంటున్న నగరవాసులు, తమలో అప్పటివరకు అంతర్లీనంగా ఉన్న నటనా కౌశలాన్ని ప్రదర్శిస్తున్నారు. వీలైతే సినిమాల్లోనూ చాన్స్ కొట్టేస్తున్నారు. మొత్తం మీద ఏ వీధి వెదికినా ఆ వీధిలోనే గలరు యాక్టర్లు అన్నట్టుగా సిటీ మారిపోయిందంటే అతిశయోక్తి కాదు. సాక్షి, హైదరాబాద్: గతంలో నటులు అంటే నాటకాలనో, సినిమాలనో కెరీర్‌గా ఎంచుకున్నవారే అన్నట్టుగా ఉండేది. కానీ ఇప్పుడు పరిస్థితి మారిపోయింది. వృత్తిలా కాకుండా హాబీగా నటించేవారి సంఖ్య పెరిగిపోయింది. గత ఐదేళ్ల కాలంలో ఆన్లైన్ సరీ్వసుల మాదిరి ఈ హాబీ కూడా ఒక్కసారిగా ఊపందుకుంది. ముఖ్యంగా ఓటీటీ వేదికలు విస్తృతమవడం, పెద్దసంఖ్యలో సీరియల్స్, వెబ్ సిరీస్‌లు రూపుదిద్దుకుంటుండడంతో నటీనటులకు అవకాశాలు వెల్లువెత్తుతున్నాయి. పాత్రోచితంగా కనిపించే వ్యక్తులకు కాస్తంత శిక్షణ అందిస్తే చాలు పనై పోతోంది. వయసులకు అతీతంగా నగరంలో అనేకమందికి నటన ఓ ప్యాషన్‌గా మారిపోయింది. ప్రేక్షకాభిరుచిలో మార్పు... ► నటనలో పేరున్నవారు, బాగా తెలిసిన ముఖా లను మాత్రమే కాకుండా కొత్త వారిని కూడా ఆదరించే దిశగా ప్రేక్షకుల అభిరుచుల్లో స్పష్ట మైన మార్పు వచి్చంది. దీంతో నిర్మాతలు కొత్త నటీనటులతో ప్రయోగాలు చేయడానికి గతంలోలా భయపడడం లేదు. అంతేకాకుండా ఏ రంగంలో ఉన్నవారు ఆ రంగానికి సంబంధించిన పాత్ర లో కాస్త సులభంగా మమేకమ య్యే వీలుంటుంది. కాబట్టి వినూ త్న పద్ధతుల్లో సినిమాలో వైద్యుడిపాత్ర ఉంటే వైద్యుడిని, లాయర్ పాత్రకు లాయ ర్ని ఎంచుకుంటున్నారు. సర దాగా ఓ సీన్లో చేసేవారు కొందరైతే, ఇంకొందరు ప్రాధాన్యత కలిగిన పాత్రల్లోనూ తమ సత్తా చూపుతున్నారు. దీంతో రంగాలేమైనా తెరంగేట్రం సాధారణ విషయంగా మారిపోయింది. ఓ గంగవ్వ.. ఇంకో రామ్.. మరో శ్రీనివాస్ నటనపై ఉన్న ఆసక్తి కారణంగా సరదాగా టిక్ టాక్స్‌తో మొదలుపెట్టి రీల్స్, షార్ట్ వీడియోల్లో, సోషల్ మీడియా వేదికలపై కాస్తో కూస్తో పేరు సంపాదించుకున్నవారితో పాటు ఇతరత్రా రంగాల్లో ఉన్నవారు కూడా సీరియల్స్, వెబ్ సిరీస్‌ల్లో నటించేస్తున్నారు. సినిమా తారలుగానూ మారిపోతున్నారు. ఒక యూట్యూబ్ చానెల్ ప్రోగ్రామ్ ద్వారా పేరు తెచ్చుకున్న మారుమూల గ్రామానికి చెందిన గంగవ్వ దీనికో ఉదాహరణ. నగరానికి చెందిన ఫ్యాషన్ డిజైనర్ రామ్... గత కొంత కాలంగా సెలబ్రిటీల కోసం పనిచేస్తూ ఆ రంగంలో పేరొందారు. లుక్స్‌లో టాలీవుడ్ హీరోలకు తీసిపోని రామ్... గత లాక్ డౌన్ టైమ్‌లో దొరికిన ఖాళీ సమయాన్ని సద్వినియోగం చేసుకున్నారు. ‘పచ్చీస్ ’పేరుతో రూపొందించిన ఓ సినిమాలో హీరోగా నటించారు. ఆ సినిమా ప్రస్తుతం ఓటీటీలో అందుబాటులో ఉంది. నిర్మాణ రంగంలో ఉన్న మణికొండకు చెందిన శ్రీనివాస్‌కు కూడా నటనపై మక్కువ ఎక్కువ. కానీ ఎన్నో ఏళ్లపాటు తన అభిరుచిని, తనలోని నటనా కౌశలాన్ని తనలోనే దాచేసుకున్నారు. పిల్లలు పెద్దవాళ్లవడంతో వృత్తికి కాస్త విరామం ఇచ్చారు. సీరియల్స్‌తో పాటు సినిమాల్లోనూ రాణిస్తున్నారు. ఇక నగరంలో స్టోరీ టెల్లింగ్‌కు కేరాఫ్‌గా పేరొందిన దీపా కిరణ్ కూడా ఇటీవల యాంగర్ టేల్స్ అనే ఓటీటీ చిత్రంలో నటించారు. అందులోని నాలుగు పొట్టి కథల్లో ఒకటైన ‘యాన్ ఆఫ్టర్ నూన్ న్యాప్’లో ఆమె కనిపిస్తారు. ఈ ఎక్స్పీరియన్స్ తనకు కొత్త అనుభూతిని అందించిందని ఆమె అంటున్నారు. కేరక్టర్‌కు ఓకే.. కెరీర్‌గా నాట్ ఓకే ఇలాంటి నటులు వరుస పెట్టి సినిమాలు చేసేయాలనే ఆత్రుత ఏమీ చూపడం లేదు. తమ వృత్తికో, ఉద్యోగానికో ప్రాధాన్యత ఇస్తూనే ‘జస్ట్ ఫర్ ఏ ఛేంజ్’అన్నట్టుగా అడపాదడపా వచి్చన అవకాశాల్ని సది్వనియోగం చేసుకుంటున్నారు. సినిమా అనేది తమకు కేవలం అభిరుచి మాత్రమేనని చాలామంది అంటున్నారు. ‘‘నాట్యం’అనేది నా అభిరుచికి, నా ఆలోచనలకు దగ్గరగా ఉన్న సినిమా కాబట్టి నటించాను. అంతే తప్ప సినిమాల్ని కెరీర్‌గా తీసుకునే ఆలోచన లేదు..’అంటున్నారు సంధ్యారాజు. ప్రముఖ పారిశ్రామికవేత్త సత్యం రామలింగరాజు కుటుంబ సభ్యురాలైన ఈ సంప్రదాయ నృత్య కారిణి... ఇటీవలే నాట్యం అనే సినిమాలో కథానాయికగా నటించారు. ఆ సినిమా విమర్శకుల ప్రశంసలతో పాటు జాతీయ పురస్కారాన్ని కూడా అందుకుంది. అయినప్పటికీ ఆమె మరో చిత్రంలో నటించలేదు. అదే విధంగా నగరానికి చెందిన ప్రముఖ వ్యక్తిత్వ వికాస నిపుణుడు ఆకెళ్ల రాఘవేంద్ర కూడా ఒకటి రెండు చిత్రాల్లో కనిపించారు. -
'ప్రమాదానికి గురవుతున్న సినీకార్మికులకు సాయం అందడం లేదు'
బడ్జెట్లో సినీ కార్మికులకు నిధిని కేటాయించాలని దక్షిణ భారత సినీ కార్మికుల సమాఖ్య (ఫెఫ్సీ) అధ్యక్షుడు ఆర్కే సెల్వమణి ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు. ఆదివారం ఉదయం స్థానిక వడపళనిలోని ఫెఫ్సీ ఆవరణలో మీడియా సమావేశాన్ని ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. దక్షిణ భారత సినీ కార్మికుల పరిస్థితి ఇప్పటికీ శ్రమ, ప్రమాదాలతోనే నిండిపోయిందన్నారు. మూడేళ్లకోసారి సినీ నిర్మాతలతోనూ, బుల్లితెర నిర్మాతలతోనూ చర్చలు జరుపుతూ కార్మికుల వేతనాలను కొంచెం పెంచుకుందామని చెప్పారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు అందించే సాయం కిందిస్థాయి కార్మికుల దాకా చేరడం లేదన్నారు. అదేవిధంగా షూటింగ్లో పనిచేసే కార్మికుల్లో ఇప్పటి వరకు 100కు పైగా ప్రమాదాల్లో మరణించారని, రజనీకాంత్ కమల్ హాసన్ వంటి స్టార్ హీరోల షూటింగ్లో ప్రమాదవశాత్తూ మరణించే వారి కుటుంబాలకు మాత్రమే కాస్త సాయం అందుతుందని తెలిపారు. చిన్న చిత్రాల్లో ప్రమాదానికి గురైన వారికి ఎలాంటి సాయం అందట్లేదని పేర్కొన్నారు. సినీ కార్మికుల సాయం కోసం రానున్న వార్షిక బడ్జెట్లో ప్రభుత్వం కొంత నిధిని కేటాయించాలని విజ్ఞప్తి చేశారు. అదేవిధంగా 2010లో దివంగత ముఖ్యమంత్రి కరుణానిధి కార్మికుల ఇళ్ల కోసం పైయనూర్‌లో స్థలాన్ని కేటాయించారని, అక్కడ స్టూడియోలను నిర్మిస్తున్నట్లు తెలిపారు. దానికి కలైంజర్ అనే పేరుతో ఆయన శిలా విగ్రహాన్ని ఏర్పాటు చేస్తున్నట్లు చెప్పారు. వీటికి ఆర్థిక సాయం అందించాల్సిందిగా కోరారు. లైట్మెన్లకు సాయం కోసం సంగీత దర్శకుడు ఏఆర్ రెహమాన్ నిధిని ఏర్పాటు చేయడానికి ముందుకు వచ్చారని, అదేవిధంగా తమ సమాఖ్యలోని ఇతర కార్మికులకు సాయం అందించడానికి నిర్మాతలు, ప్రముఖ నటులు, సాంకేతిక నిపుణులు ముందుకు వస్తే బాగుంటుందని ఆర్కే సెల్వమణి కోరారు. -
హీరోయినే...హీరో
-
నటుడు గురుస్వామి మృతి
-
మహోజ్వల భారతి: చెయ్యనన్నాను కదా... ఎందుకలా చంపుతావ్!
ఏదీ లేనప్పుడు ఏదో ఒకదానితో అడ్జెస్ట్ అయిపోవడం జీవితంలో ఒక థియరీ. యస్వీఆర్ ఆ థియరీలో పడి కొట్టుకుపోలేదు. రంగస్థలంపై తను చేయాలనుకున్న పాత్రనే చేశారు. ఇష్టం లేని పాత్రను ‘చెయ్యను’అని చెప్పడం నేర్చుకున్నారు. సినిమాల్లోకి వచ్చాక కూడా ఆయన తన నైజం మార్చుకోలేదు. ఇందుకు నిదర్శనంగా ఒక సందర్భాన్ని చిత్రపరిశ్రమలో ప్రస్తావిస్తుంటారు. డైరెక్టర్ సి.పుల్లయ్యని ఎస్వీఆర్ ‘బావ బావ’ అని పిలిచేవారు. 1956లో పుల్లయ్య... సావిత్రి, అక్కినేని నాగేశ్వరరావులను పెట్టి ‘అర్ధాంగి’ సినిమా తియ్యాలనుకున్నారు. దాన్లో ఒక క్యారెక్టర్‌కి ఎస్వీఆర్ను అడిగారు పుల్లయ్య. అది మధ్యలోనే చనిపోయే క్యారెక్టర్. ‘‘నేను చెయ్యను. చెయ్యడానికి ఏముంది అందులో’’ అన్నారు ఎస్వీఆర్. అందుకు పుల్లయ్య – ‘‘లేదు బావా, లాస్ట్ వరకు నువ్వు లేకపోయినా, ప్రతి ఫ్రేములోనూ నువ్వు ఉన్న ఫీలింగే ఉంటుంది. అలా ఇస్తాను దానికి ట్రీట్మెంట్. నా మాట విని నువ్వా క్యారెక్టర్ చెయ్యి’’ అన్నారు. ఎస్వీఆర్ విసుక్కున్నారు. ‘బావ’ కాస్తా, ‘ఏవోయ్’ అయింది. ‘‘ ఏవోయ్... నేను చెయ్యనన్నాను కదా ఎందుకలా చంపుతావ్’’ అన్నారు. పుల్లయ్యకు కూడా కోపం వచ్చింది. ‘‘చూస్తూ ఉండు. ఆ క్యారెక్టర్‌కి కొత్తవాడిని బుక్ చేసి, నీకు మొగుణ్ణి తయారుచేయకపోతే నా పేరు పుల్లయ్యే కాదు!’’ అన్నారు. చివరికి ఆ పాత్ర గుమ్మడికి వచ్చింది. ఎస్వీ రంగారావు గారి వ్యక్తిత్వంలోని దృఢచిత్తాన్ని ఎరుక పరిచే ఒక సంఘటన మాత్రమే ఇది. నేడు ఆయన జయంతి. 1918 జూలై 3న కృష్ణా జల్లా నూజివీడులో జన్మించారు ఎస్వీఆర్. నిర్మలా కిషన్‌చంద్ ఈమె ఎవరో కారు. ప్రసిద్ధ బాలీవుడ్ నృత్య దర్శకురాలు సరోజ్ ఖాన్. నేడు ఆమె వర్ధంతి. ఇటీవలే 2020 జూలై 3న తన 71 ఏళ్ల వయసులో ముంబైలో మరణించారు. సరోజ్ రెండు వేలకు పైగా సినిమాలకు నృత్య దర్శకత్వం వహించారు. ఆమె తల్లిదండ్రులు కిషన్ చంద్ సాధు సింగ్, నోని సాధు సింగ్. సరోజ్ పుట్టిన కొద్ది రోజులకే దేశ విభజన జరగడంతో వీరి కుటుంబం ఇటువైపున భారత్‌లో స్థిరపడిపోయింది. హంస జీవరాజ్ మెహతా హంస జీవరాజ్ మెహతా ప్రసిద్ధ సంస్కరణవాది, సామాజిక కార్యకర్త, విద్యావేత్త, స్వాతంత్య్ర సమరయోధురాలు, స్త్రీవాది, రచయిత. నేడు ఆమె జయంతి. హంసా మెహతా 1897 జూలై 3 న ఒక నాగర్ బ్రాహ్మణ కుటుంబంలో జన్మించారు. ఈమె బరోడా రాష్ట్రానికి చెందిన దివాన్ మనుభాయ్ మెహతా కుమార్తె. 1918లో సరోజినీ నాయుడును, 1922లో మహాత్మా గాంధీని కలుసుకున్నారు. గాంధీ సలహాను అనుసరించి స్వాతంత్య్ర ఉద్యమ కార్యక్రమాలలో పాల్గొన్నారు. 1932లో ఆమెను ఆమె భర్తతో పాటు బ్రిటీష్ వారు అరెస్టు చేసి జైలుకు పంపారు. 97 ఏళ్ల వయసులో ఆమె 1995 ఏప్రిల్ 4న కన్నుమూశారు. (చదవండి: మహోజ్వల భారతి: ‘సైమన్ గో బ్యాక్’ అన్నది ఈయనే!) -
చేతన రాజ్ మరణం.. అందం కోసం ఎంత మూల్యం చెల్లించాలి?
మనం నటులం. సోషల్ మీడియాల్లో చేస్తున్న పోస్టుల విషయంలో బాధ్యతాయుతంగా వ్యవహరిం చాలి. నిజాయితీగా, వాస్తవికంగా ఆలోచిద్దాం. మనం సన్నగా, తెల్లగా ఉండాలన్న ప్రయత్నంలో ఉండొద్దు. ఈ విషయాలపై నిర్ద్వంద్వంగా మన మనసులోని భావాలను వ్యక్తం చేయాలి. మౌనంగా ఉండటం ఇంకో ప్రాణాన్ని బలి తీసుకోవచ్చు. నిజానికి ప్లాస్టిక్ సర్జరీ కారణంగా వినోద పరిశ్రమలో ప్రాణాలు కోల్పోయిన తొలి వ్యక్తి చేతన రాజ్ కానేకాదు. కొన్నేళ్ల క్రితం కూడా తెలుగు సినీ పరిశ్రమకు చెందిన ఒక నటీమణి కూడా ఇదే పరిస్థితి ఎదుర్కొన్నారు. లైపోసక్షన్ శస్త్ర చికిత్స కాస్తా వికటించడంతో ఆమె అమెరికాలో ప్రాణాలు కోల్పోయారు. తాజాగా అలాంటి దుర్విధిని ఎదుర్కొన్న చేతన రాజ్ ప్రస్తుత వినోద పరిశ్రమ వాస్తవాలను మరోసారి మన కళ్లముందు ఉంచుతోంది. ఈ వినోద ప్రపంచంలో ‘అందం’ అనేదానికి అసాధా రణమైన, వాస్తవ దూరమైన నిర్వచనాలు ఉన్నాయి. ఇది మహిళల విషయంలో చాలా ఎక్కువ. అయితే ఇదేదో పరిశ్రమ నుంచి వస్తున్న డిమాండ్ మాత్రమే అనుకునేందుకు వీల్లేదు. అందంగా, ఆకర్షణీయంగా ఉండాలని చిన్నప్పటి నుంచి ఆడపిల్ల లపై తల్లిదండ్రులు, సమాజం పెట్టే తీవ్రమైన ఒత్తిడి పరిణామం ఇది అని నేను నమ్ముతున్నాను. ఫ్యాషన్, రీటైల్ వస్త్ర వ్యాపారాన్నే ఉదాహరణలుగా తీసుకుందాం. అందంగా కనిపించడం మహిళల బాధ్యత అన్నట్టుగా ఉంటుంది. ఇలా ఉండటం కోసం శస్త్రచికిత్సలు చేయించుకున్న వారు ఎందరో నాకు తెలుసు. వీరిలో చాలామంది శరీరంపైని వెంట్రుకలను తొలగించుకునేందుకు లేజర్, రసాయన చికిత్సలు తీసుకున్నవారే. శరీరంపై వెంట్రుకలు ఉన్న మహిళలను ‘సెక్సీ’ అని పరిగణించరు మరి! ఈ సూత్రం మహిళలకు మాత్రమే. పురుషుల విషయానికి వస్తే అన్నీ నడిచిపోతాయి. లేజర్ ట్రీట్మెంట్లు, చర్మపు రంగును తేలిక చేసే ప్రయత్నాలు, రసాయ నాలతో చర్మాన్ని శుద్ధి చేయడం, పెదవులు బొద్దుగా కనిపించేందుకు కృత్రిమ రసాయనాలను నింపుకోవడం, బొటాక్స్, లైపోసక్షన్... ఇలాంటివన్నీ మహిళలు ఎందుకు చేయించుకుంటారంటే... అందం తాలూకూ ‘ప్రమాణాలు’ అందుకునే ప్రయత్నమే అని చెప్పాలి. కేన్సర్ కణితిని తొలగించిన తరువాత నాకూ బరువుకు సంబంధించిన సమస్యలు ఎదురయ్యాయి. సులువైన చిట్కాలూ బోలెడన్ని ఉన్నాయి. వాటి మాయలో పడటం పెద్ద కష్టం కాదు. కానీ తగిన ఆహారం తీసుకోవడం, నిర్దిష్టమైన అలవాట్లు పెంచుకోవడం, మార్చుకోవడం అవసరం. ఒకరకంగా చూస్తే సినిమాలు ఈ సమాజానికి దర్పణమని చెప్పాలి. దురదృష్టవశాత్తూ వాస్తవం మాత్రం దీనికి భిన్నంగా ఉంటుంది. ఏ సినిమా లోనైనా హీరోయిన్ మన పక్కింటి పిల్ల మాదిరిగానో లేదంటే రోడ్లో వెళు తూంటే తారసపడే అమ్మాయిలానో కనిపించిందా చెప్పండి? చాలా చాలా అరుదు. హీరోయిన్ల మాదిరిగా డ్రస్సులు నిజ జీవితంలో ఎవరూ వేసుకోరు. మేకప్పూ అలా చేసుకోరు. కానీ నెమ్మదిగా తెరపై హీరోయిన్లా కనిపించడం అనేది అందరి ఆశయమైపోయింది. ఇన్స్టాగ్రామ్ ఫిల్టర్ల మాదిరిగా అన్ని విషయాల్లోనూ అందరూ పర్ఫెక్ట్గా ఉండాలని కోరుకుంటున్నారు. ఇదంతా మహిళల గురించే. పురుషుల విషయానికి వస్తే అంటే.. హీరో బానపొట్ట వేసుకుని 65 ఏళ్ల వయసున్నా చెల్లిపోతోంది. పొరబాటునగానీ ఓ మహిళా కళాకారిణి కొంచెం ఒళ్లు చేసిందంటే చాలు... నానారకాల ఏడుపులతో సోషల్ మీడియా నిండి పోతుంది. వినోద పరిశ్రమలో ఓ మహిళ వయసు 30లు దాటుతున్నాయంటే... అందరి దృష్టిలోంచి కూడా జారిపోతున్నట్లు లెక్క. మలయాళం పరిశ్రమ ఆదర్శం వినోద పరిశ్రమలో లింగ వివక్షను కొద్దోగొప్పో సరిచేసే ప్రయత్నం చేస్తున్నది మలయాళ సినిమా పరిశ్రమ అని చెప్పవచ్చు. మేకప్ లేకుండా, శరీరాకృతి కనిపించేలా కాకుండా నటులను సాధారణ దుస్తుల్లోనే చూపిస్తున్నారు. కేశా లంకరణ విషయంలోనూ అన్నీ సాధారణంగా ఉండేలా జాగ్రత్తలు తీసుకుంటున్నారు. కృత్రిమ కనుబొమలు ధరించకుండా చూసుకుంటున్నారు. ఈ తేడాల ప్రభావం వారి నటనపై స్పష్టంగా కనిపిస్తోంది. వాస్తవికమైన, నిజాయితీతో కూడిన నటన ఆవిష్కృతమవుతోంది. దక్షిణాది సినీ పరిశ్రమలో సాధారణంగా హీరోల పారితోషికం కోట్లల్లో ఉంటుంది. మహిళలకు వచ్చే సరికి ఇది లక్షల్లో మాత్రమే. కేవలం కొద్దిమంది మాత్రమే ఈ స్థితిని మార్చ గలిగారు. అటు మహిళలూ, ఇటు పురుషుల మధ్య ఈ అంశాలపై చర్చ జరగా ల్సిన అవసరం ఉంది. సినిమాలు తీసేవాళ్లు, నిర్మాతలు, వినోద పరిశ్రమలో మార్పు తేగల సామర్థ్యం ఉన్న వారందరూ ఇకనైనా సమస్యలను కప్పిపుచ్చే ప్రయత్నాలు మానాలి. నటులు కూడా సోషల్ మీడియాలో ఎలాంటి పోస్టులు పెడుతున్నామో ఆలోచించి పెట్టాలి. చేతన రాజ్ ఫొటోలు చూస్తూంటే... నాకు ఆమెలో ఎలాంటి లోపాలూ కనిపించలేదు. మీ మాదిరి, నా మాదిరి, అందరి మాదిరిగా తనూ సాధారణంగానే కనిపించింది. కానీ మదిలో ఎలాంటి ప్రశ్నలు, ఎలాంటి పరిస్థితులు ఎదుర్కొని ఉంటుంది? కొన్ని సందర్భాల్లో ఇలాంటి యువతులపైనే కుటుంబం మొత్తం ఆధారపడి ఉంటుంది. సినిమా పరిశ్రమలో ‘ప్రవేశానికి’ నిర్దిష్టమైన రీతిలో కనిపించా లన్న తాపత్రయం చేతనను లైపోసక్షన్ శస్త్రచికిత్స వైపు నడిపించి ఉండవచ్చు. ఎందుకలా చేసిందో నిర్ణ యించే అధికారం మనలో ఎవరికీ లేదు. వ్యక్తులు ఎవరి నిర్ణయాలు వాళ్లు తీసుకుంటారు. కానీ ఒకటి మాత్రం కలుక్కుమంటూనే ఉంది. చేతన నిజంగా అంత మూల్యం చెల్లించాలా?.. - దివ్య స్పందన (రమ్య) కన్నడ నటి, లోక్‌సభ మాజీ సభ్యురాలు (‘ది ఇండియన్ ఎక్స్‌ప్రెస్’ సౌజన్యంతో) -
అమ్మకు రెండో పెళ్లి చేయాలని ఉంది: సురేఖ వాణి కూతురు
-
Actor Shritej Latest Interview: నటుడు శ్రీతేజ్ ఫుల్ ఇంటర్వ్యూ
-
నటుడు శ్రీతేజ్ ప్రత్యేక ఇంటర్వ్యూ ప్రోమో
-
ప్రముఖ నటుడు కన్నుమూత
ముంబై: సినిమా పరిశ్రమలో మరో విషాదం చోటు చేసుకుంది. సెలబ్రిటీలు వరుస మరణాలు చెందుతుండడంతో అభిమానులు తీవ్ర దిగ్భ్రాంతి చెందుతున్నారు. తాజాగా ప్రముఖ టీవీ, సినీ నటుడు రవి పట్వర్ధన్(83) నిన్న రాత్రి థానేలో కన్నుమూశారు. గత కొద్ది రోజులుగా అనారోగ్యంతో బాధపడుతున్న ఆయనకి నిన్న రాత్రి ఊపిరి ఆడకపోవడంతో ఇటీవల ఓ ప్రైవేటు ఆసుపత్రిలో చేర్చారు. చికిత్స అందిస్తున్న సమయంలో గుండెపోటు రావడంతో కన్నుమూశారు అని ఆయన పెద్ద కుమారుడు నిరంజన్ పట్వర్ధన్ తెలిపారు. రవి పట్వర్ధన్ కి సినీ పరిశ్రమలో దాదాపు నాలుగు దశాబ్దాల అనుభవం ఉంది. (చదవండి: రైతులు తల్లిదండ్రులతో సమానం) 1980లలో వచ్చిన హిందీ చిత్రాలైన తేజాబ్, అంకుష్ వంటి చిత్రాలలో నటించాడు. హిందీలో యశ్వంత్(1997), ఆశా అసవ్య సన్(1981), ఉంబార్థ(1982), జంజార్(1987), జ్యోతిబా ఫులే వంటి చిత్రాలలో నటించారు. 250కి పైగా సినిమాలలో నటించిన పట్వర్ధన్ హిందీ, మరాఠీ భాషలకు చెందిన టీవీ సీరియల్స్‌లోను నటించారు. అనిల్ కపూర్-మాధురి దీక్షిత్ చిత్రం తేజాబ్ లోని పబ్లిక్ ప్రాసిక్యూటర్ గా నటించిన మంచి గుర్తింపు తెచ్చుకున్నారు. తుజా అహే తుజ్‌పాష్‌లో ఆయన పోషించిన చిరస్మరణీయ పాత్ర పట్వర్ధన్‌ను ఎప్పుడూ గుర్తుంచుకునేలా చేస్తుందని థానే సంరక్షకుడు, రాష్ట్ర క్యాబినెట్ మంత్రి ఏక్నాథ్ షిండే అన్నారు. అతను చివరిసారిగా ప్రముఖ టీవీ సిరీస్ అగ్గబాయి ససుబాయిలో కనిపించాడు. -
29 ఫోన్ కెమెరాలతో చిత్రీకరణ
-
నాన్నకు నేను సినిమాల్లోకి రావడం ఇష్టం లేదు
‘పితా’ అంటూ ‘రెండు రెళ్లు ఆరు’లో అందరినీ నవ్వులలో ముంచారు. ‘నమస్కారవండయ్యా! నమస్కారవండయ్యా!’ అంటూ ‘సాగర సంగమం’లో బావి గట్టు మీద నవ్వులు పూయించారు. ఇక ‘చంటబ్బాయ్’లో పత్రిక ఎడిటర్‌గా శ్రీ లక్ష్మి కవితలను ప్రచురించలేక, బంగాళా భౌభౌ తినలేక ఆయన నవ్వించిన నవ్వులు అన్నీ ఇన్నీ కాదు. ఆయన పొట్టి ప్రసాద్.తెలుగు హాస్యంలో గట్టి ప్రసాద్. బ్లాక్ అండ్ వైట్ నుంచి కలర్ వరకు ఆయన సినీ ప్రయాణం సుదీర్ఘమైనది. ఆ తండ్రి గురించి ఎన్నో జ్ఞాపకాలను, ఆయనతో ఉన్న అనుబంధాన్ని∙ ఏకైక కుమారుడు కవిపురపు జగన్నాథరావు సాక్షితో పంచుకున్నారు. నాన్నగారు కృష్ణాజిల్లా ఆటపాకలో 1929 జనవరి 5న జన్మించారు. నాన్నగారి అసలు పేరు కవిపురపు ప్రసాదరావు. ఆయన కొద్దిగా పొట్టిగా ఉండటం వల్ల అందరూ పొట్టిప్రసాద్ అనేవారు. ఆ పేరే స్థిరపడిపోయింది. అందరూ ఆ పేరుతోనే గుర్తిస్తారు. నాన్నగారు సినిమాలలోకి వచ్చిన కొత్తలో టైటిల్స్‌లో ప్రసాద్ అనే ఉండేది. అమ్మ పేరు రాజ్యలక్ష్మి. వాళ్లది కృష్ణా జిల్లా కైకలూరు. నాన్నగారికి నేను ఒక్కడినే అబ్బాయిని. నా భార్య పేరు శారద. నాకు ఇద్దరు పిల్లలు. రాజేశ్వర ప్రసాద్, శ్రీరాజ్ఞి. నేను పుట్టటానికి ముందు ఒక ఆడపిల్ల పుట్టి పోయిందట. అందుకని నాన్నగారు ఆడపిల్లలను చూసి మురిసిపోయేవారు. కవిపురపు ప్రసాదరావు (పొట్టి ప్రసాద్) మేనత్తగారే పెంచారు... మాది సంప్రదాయ బ్రాహ్మణ కుటుంబం. నాన్న చిన్నతనంలోనే బామ్మ పోవటంతో ఆయన మేనత్త మైనంపాటి కామేశ్వరమ్మ ఆ లోటు తెలియకుండా కన్నతల్లిలా పెంచారు. క్రమశిక్షణ అలవాటు చేశారు. ఆవిడంటే మా తాతగారితో సహా ఇంట్లో అందరికీ హడలు. నాన్నగారు బి.కాం వరకు చదువుకున్నారు. నాటకాలలో గిరీశం పాత్రలో ప్రసిద్ధులైన కె. వెంకటేశ్వరరావు గారి రస సమాఖ్యలో నాటకాలు వేసేవారు. అది వాళ్ల మేనత్తగారికి ఇష్టం ఉండేది కాదు. ఆవిడకు తెలియకుండా గోడ దూకి వెళ్లి, మళ్లీ ఆవిడ చూడకుండానే గోడ దూకి వచ్చేసేవారట. ఇలా నాటకాలలో వేషం వేస్తూ, జీవితంలో ఆర్థికంగా స్థిరపడరేమోనని, పెళ్లి చేసేయాలనుకున్నారట తాతగారు. మేనత్తగారికి ఇష్టం లేకుండానే నాన్నగారికి పెళ్లి చేసేశారట. ఈ విషయాలు మా వాళ్లంతా మాట్లాడుకుంటున్నప్పుడు విన్నాను. సినిమాల కోసం... 1958లో నాన్నగారు నటించిన ఆకాశరామన్న నాటకం చూసి నిర్మాత చక్రపాణిగారు నాన్నగారిని వచ్చి కలవమన్నారు. సరేనని నాన్న ఎలాగో కష్టపడి మద్రాసు వెళ్లారు. ‘అప్పు చేసి పప్పు కూడు’ చిత్రంలో పెళ్లి కొడుకు వేషం వేశారు. అది నాన్నగారు నటించిన మొదటి సినిమా. ఆ తరవాత ఎల్. వి. ప్రసాద్ గారికి దగ్గర నెలవారీ జీతానికి పనిచేశారు. ఎక్కువ అవకాశాలు రాకపోవటంతో, మళ్లీ వెనక్కి వచ్చేద్దామనుకున్నారట. ఆ సమయంలో జె. వి. రమణమూర్తి సహాయపడ్డారట. పూజాఫలంలో నాన్న పెద్ద పాత్ర వేశారు. మళ్లీ సినిమాలలో ఇబ్బంది వచ్చి నాటకాలు వేయటం ప్రారంభించారు. పొట్టి ప్రసాద్ భార్య, కొడుకు, కోడలు, మనుమలు నిత్యం బంధుమిత్రులు.. చెన్నైలో నుంగంబాకంలో అద్దెకు ఉండేవాళ్లం. అమ్మ తరఫున చుట్టాలు ఎక్కువ. నాన్నగారు అందరితోనూ చాలా స్నేహంగా ఉండేవారు. అందువల్ల నాన్నగారికి స్నేహితులు ఎక్కువ. మా ఇంట్లో నిత్యం సంతర్పణ సాగేది. చిడతల అప్పారావు, అల్లు రామలింగయ్య, రావి కొండలరావు అందరూ భోజనానికి వచ్చేవారు. కొన్నాళ్ల తరవాత సాలగ్రామంలో స్థలం కొనుక్కున్నాం. మా పక్కనే సాక్షి రంగారావు గారు కూడా కొన్నారు. రెండు కుటుంబాల మధ్య గోడలు ఉండేవి కాదు. అంత కలసిమెలసి ఉండేవాళ్లం. నాన్నగారికి భక్తి ఎక్కువ. పండుగలు బాగా చేసేవారు. దసరా నవరాత్రులు తొమ్మిది రోజులు ఇంట్లో పెళ్లి జరుగుతున్నట్లు ఉండేది. అంత వైభవంగా చేసేవారు. నాన్నగారు చాలా స్ట్రిక్ట్... నాన్నగారు నా చదువు విషయంలో చాలా స్ట్రిక్ట్‌గా ఉండేవారు. ఆయనలా నేను ఇబ్బందులు పడకూడదని, చదువును నిర్లక్ష్యం చేయకూడదని తాపత్రయపడ్డారు. తొమ్మిదో తరగతి దాకా నాకు చదువు మీద శ్రద్ధ ఉండేది కాదు. పరీక్షల్లో ఫెయిలయ్యేవాడిని. పరీక్ష పేపర్లు ఇచ్చేరోజున నాకు చాలా దడగా ఉండేది. నా మార్కులు చూసి, నాన్నగారు కోపంగా, నా చేతిలో నుంచి పుస్తకాలు తీసుకుని విసిరేసేవారు. సెంట్రల్ సిలబస్ వల్ల చదవలేకపోతున్నానేమోనని, స్టేట్ సిలబస్ కోసం కేసరి స్కూల్లో చేర్పించారు. పదోతరగతి ఫస్ట్ క్లాసులో పాసయ్యాను. నాన్నగారు నమ్మలేదు. పదకొండు, పన్నెండు తరగతుల్లో కూడా మార్కులు బాగా వచ్చాయి. బి. కామ్ పూర్తి చేశాను. ఎం.కామ్ మధ్యలోనే ఆపేశాను. సినిమాలకు దూరంగా... నాన్నగారికి నేను సినిమా ఫీల్డ్‌లోకి రావటం ఇష్టం లేదు. మా ఇంటికి ఎవరైనా సినిమా వాళ్లు వచ్చినప్పుడు, నేను అక్కడ నిల్చుంటే కళ్లెర్రచేసేవారు. సంగీతమే ప్రాణం నాకు చిన్నప్పటి నుంచి సంగీతం అంటే ఇష్టం. కాని నాన్నగారికి ఇష్టం లేదు. ఒకసారి నాన్న తన స్నేహితులతో కలిసి మా ఇంటి హాల్లో కూర్చుని పాటలు వింటూ, నన్ను రూమ్‌లో కూర్చుని చదువుకోమన్నారు. నా దృష్టంతా సంగీతం మీదే ఉండటంతో, ఆయన మీద కోపంగా ఉండేది. ఒకసారి కీబోర్డు కొనిపెట్టమని నాన్నగారిని అడిగాను. ఆయన నో చెప్పారు. నేను మొండివాడిని కావటంతో, పేచీ పెట్టి, సాధించుకున్నాను. నా పద్ధతి చూసి, ‘నీకు కొడుకు పుడితేనే కాని, నేను ఎందుకు బాధ పడుతున్నానో నీకు తెలియదురా’ అనేవారు. కంపెనీ ఉద్యోగిగా.. నాన్నగారు నా కోసమని ఆయనకు తెలిసిన ఎం.ఎస్.మూర్తిగారి కంపెనీకి ఇంటర్వ్యూకి వెళ్లమంటే వెళ్లాను. అక్కడ వారు అడిగిన ప్రశ్నలకు చాలా తిక్కగా సమాధానాలు చెప్పాను. వాళ్లు పదిరోజుల తరవాత చెప్తామన్నారు. ఇంక రాదంతే అనుకున్నాను. కాని పిలుపు వచ్చింది. మొదటినెల జీతం వెయ్యి రూపాయలు వచ్చింది. నాన్నకు ఇస్తుంటే, ‘నాకెందుకు? నువ్వే జాగ్రత్తగా ఖర్చు చేసుకో’ అన్నారు. అయినా నాలో పెద్దగా మార్పు రాలేదు. ఉద్యోగం నుంచి ఇంటికి రాగానే సంగీత సాధనకు వెళ్లిపోయేవాడిని. ఒకరోజు... నాన్నకు ఒంట్లో బాగులేదని థమ్గారి ద్వారా కబురు వచ్చింది. ఇంటికి వచ్చి చూసేసరికి ఆయనకు స్ట్రోక్ రావటంతో, వెంటనే ఆసుపత్రికి తీసుకువెళ్లాను. నాన్నగారు ఇంట్లో ఉన్నప్పుడు చిన్న తువ్వాలు కట్టుకుని సింపుల్‌గా ఉండేవారు. ఆర్భాటంగా కనిపించటం ఆయనకు ఇష్టం ఉండేది కాదు. ఆయనకు విల్‌పవర్ ఎక్కువే. సిగరెట్ మానేయాలనుకున్నప్పుడు వెంటనే మానేశారు. దాని బదులు జర్దా అలవాటు చేసుకున్నారు. ఆ తరవాత అది మానేసి ముక్కుపొడుం మొదలుపెట్టారు. ఆ తరవాత అది కూడా మానేయాల నుకున్నారు. మానేశారు. నాన్నగారు ఉన్నన్ని రోజులు ఆయన మంచితనం తెలియలేదు. 1998 ఫిబ్రవరి 23న నాన్నగారు కన్నుమూశాక, ఆయన నా గురించి ఎందుకు బాధపడ్డారో అర్థమైంది. – కవిపురపు జగన్నాథరావు పదిరోజులు ఆసుపత్రిలో ఉన్నారు. గొంతు పాడైపోయింది. అప్పటికి నాన్నగారి చేతిలో ఐదారు సినిమాలున్నాయి. 400 సినిమాలకు డబ్బింగ్ చెప్పిన నాన్నగారు మాట్లాడలేకపోయేసరికి ఒత్తిడిలోకి వెళ్లిపోయారు. రెండేళ్ల పాటు వైద్యం చేయించిన తరవాత నాన్నగారికి మాట వచ్చింది. కాని సినిమాలు తగ్గిపోయాయి. మళ్లీ 1998లో నాన్నగారు తీవ్ర అనారోగ్యంతో బాధపడ్డారు. ఫిబ్రవరి 23న తన నవ్వులను దేవలోకంలో పూయించడానికి తరలి వెళ్లిపోయారు.నాన్నగారు పోయినప్పుడు గొల్లపూడి మారుతీరావుగారు, ‘పూర్ణానంద సత్రంలో పొట్టి ప్రసాద్ వేస్తున్న నాటకాన్ని, ఒక మామూలు సంచి భుజాన వేసుకుని, గేటు బయట నుంచి చూశాను. అప్పట్లో నాటకాలకు అంత ఆదరణ ఉండేది’ అని రాశారు. – సంభాషణ: డా. వైజయంతి పురాణపండ -
బెజవాడలో ‘అమ్మరాజ్యంలో.. ’ చిత్ర బృందం సందడి
మధురానగర్(విజయవాడ సెంట్రల్) : నగరంలోని రాజ్ యువరాజ్ థియేటర్లో శనివారం అమ్మరాజ్యంలో కడప బిడ్డలు చిత్రం ప్రమోషన్ లో భాగంగా చిత్ర నటీనటులు సందడి చేశారు. నటీనటులతో అభిమానులు సెల్ఫీ దిగేందుకు పోటీపడ్డారు. ముఖ్యంగా సీఎం జగన్మహన్రెడ్డి పాత్రధారుడు అజ్మల్, పవన్ కల్యాణ్ పాత్రధారుడు చైతులతో కరచాలనం చేసేందుకు ఫోటోలు దిగేందుకు యువత ఆసఇ్త కనబర్చారు. చిత్ర యూనిట్ సభ్యులు మాట్లాడుతూ.. అమ్మరాజ్యంలో కడప బిడ్డలు చిత్రం పూర్తి వినోదాత్మక చిత్రమని, ఇందులో రాజకీయం లేదని తెలిపారు. ప్రస్తుతం రాష్ట్రంలో ఉన్న రాజకీయ పరిస్థితులను మాత్రమే ఇందులో చూపించడం జరిగిందన్నారు. ఈ చిత్రం చూసిన వారికి మంచి వినోదం లభిస్తుందన్నారు. వీకెండ్లో ప్రతీ ఒక్కరూ కులమతాలు, రాజకీయాలకు అతీతంగా చూడాల్సిన చిత్రం అన్నారు. ప్రమోషన్ కార్యక్రమంలో చంద్రబాబు నాయుడు పాత్రధారుడు ధనుంజయ, డైరెక్టర్ సిద్ధార్ధ, కె ఎ పాల్, రోజా పాత్రలు పోషించిన నటీనటులు పాల్గొన్నారు. -
స్క్రీన్ ప్లే 16th October 2019
-
రాజకీయాల్ని పవన్ సినిమా అనుకుంటున్నారు
-
స్క్రీన్ ప్లే 10th September 2019
-
వైభవంగా తెలుగు సినీ రథసారధుల రజతోత్సవం
-
నటుడు ఫిర్యాదు చేయడంతో.. వంచకుడు అరెస్టు
కర్ణాటక, బనశంకరి: కన్నడ సినిమాల్లో నటించడానికి అవకాశం కల్పిస్తామని యువతులను పరిచయం చేసుకుని నమ్మించి డబ్బు తీసుకుని వంచనకు పాల్పడుతున్న మోసగాన్ని ఆదివారం సెంట్రల్ క్రైం బ్రాంచ్ పోలీసులు అరెస్ట్ చేశారు. సుంకదకట్టె హొయ్సళనగర వెంకటేశ్ భావసా (22) అనే యువకుడు ఈ మోసగాడు. కన్నడ సినిమా నటుల పేరుతో నకిలీ ఫేస్బుక్ అకౌంట్లు తెరిచి యువతులను పరిచయం చేసుకుని వారితో చాటింగ్ చేసేవాడు. యువతులకు సినిమాల్లో నటించే అవకాశం కల్పిస్తామని తన సహాయకుడు వెంకీరావ్ను సంప్రదించాలని వాట్సాప్ నెంబర్ ఇచ్చేవాడు. అతడే వెంకీరావ్ పేరుతో వాట్సాప్ ద్వారా పరిచయస్తులతో చాటింగ్ చేసి సినిమాల్లో నటించే అవకాశం కల్పిస్తామని నమ్మించి పలువురి నుంచి రూ.25 వేల చొప్పున తీసుకుని ముఖం చాటేశాడు. వీడియోకాల్ చేయడానికి ఓ యువతి ప్రయత్నించగా కాల్ రీసివ్ చేసుకుని కాల్ కట్ చేసి తప్పించుకున్నాడు. ఫిర్యాదుతో అరెస్టు తన పేరుతో ఫేస్బుక్ అకౌంట్ తెరిచి మోసాలకు పాల్పడుతున్నారని ఓ నటుడు సైబర్ క్రైం పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేయడంతో కేసు న మోదు చేసుకున్న పోలీసులు ఆదివారం వెంకటేశ్ భావసాను అరెస్ట్ చేశారు. సోషల్‌మీడియా వినియోగదారులు ప్రముఖుల పేరుతో వచ్చే కాల్స్, అకౌంట్ల పట్ల జాగ్రత్తగా ఉండాలని అదనపు పోలీస్ కమిషనర్ సందీప్‌పాటిల్ తెలిపారు. -
సాక్షి ఎక్సలెన్స్ అవార్డులు : తారలు తళుక్
-
నటనలో రాణిస్తూ..
సాక్షి, కొండమల్లేపల్లి (దేవరకొండ) : దేవరకొండ మండలానికి చెందిన మూడావత్ రమేశ్‌కు చిన్నప్పటి నుంచే నటనపై ఆసక్తి. అంతే కాకుండా డ్యాన్స్ అంటే చాలా ఇష్టం. దీంతో పలు లఘు చిత్రాల్లో నటించడంతో పాటు దేవరకొండలో రాక్‌స్టార్ డ్యాన్స్ అకాడమీ పేరుతో నృత్య శిక్షణ కేంద్రాన్ని ఏర్పాటు చేసి పలువురికి శిక్షణ ఇస్తున్నాడు. ప్రస్తుతం రాక్‌స్టార్ రమేశ్గా గుర్తింపు పొంది తన ప్రత్యేకతను చాటుకున్నాడు. గతంలో రమేశ్ డ్యాన్స్ బేబి డ్యాన్స్, డుం..డుం..డిగా..డిగా.. వంటి కార్యక్రమాల్లో పాల్గొని పలువురి మన్ననలు పొందాడు. ఓ వైపు నృత్య పోటీల్లో పాల్గొంటూనే లఘు చిత్రాల్లో నటించడంపై దృష్టి సారించాడు. ఈ క్రమంలోనే 2014లో టోల్ ఫ్రీ నెం.143, 2015లో క్లాస్ మేట్, 2016లో గణేశ్ లాంటి చిత్రాల్లో నటించి తన ప్రతిభను చాటాడు. ప్రోత్సాహం అందిస్తే మున్ముందు కొరియోగ్రాఫర్‌గా రాణిస్తానంటున్నాడు రమేశ్. సామాజిక అంశాలపై అవగాహన రాక్‌స్టార్ డ్యాన్స్ అకాడమీ ఆధ్వర్యంలో ఇప్పటికే పలు సామాజిక అంశాలకు సంబంధించి కార్యక్రమాలు చేపట్టాం. రానున్న రోజుల్లో సామాజిక అంశాలపై ప్రజలను మరింత చైతన్యవంతులను చేసేందుకు నావంతుగా కృషి చేస్తా. – మూఢావత్ రమేశ్ -
ఫస్ట్ లుక్ 5th June 2019
-
స్క్రీన్ ప్లే 6th May 2019
-
స్క్రీన్ ప్లే 5th March 2019
-
ప్రముఖ నటుడు వైజాగ్ ప్రసాద్ కన్నుమూత
హైదరాబాద్: ప్రముఖ సినీ నటుడు వైజాగ్ ప్రసాద్ ఆదివారం ఉదయం మరణించారు. అకస్మాత్తుగా ఆయనకు గుండెపోటు రావడంతో యశోద ఆసుపత్రికి తరలించారు. అప్పటికే మృతిచెందినట్లు వైద్యులు తెలిపారు. ఆయన వయసు 68 సంవత్సరాలు. అనేక తెలుగు సినిమా, టీవీ సీరియళ్లలో ఆయన నటించారు. రెండేళ్లుగా అనారోగ్య సమస్యలతో బాధపడుతూ ఇంటికే పరిమితం అయ్యారు. ఆయనకు భార్య విద్యావతి, ఇద్దరు పిల్లలున్నారు. వైజాగ్ ప్రసాద్ అసలు పేరు కొర్లాం పార్వతీ వరప్రసాద రావు. విశాఖపట్నంలోని గోపాలపట్నం ఆయన స్వస్థలం. వైజాగ్ నుంచి వచ్చారు కాబట్టి వైజాగ్ ప్రసాద్‌గా స్థిరపడిపోయింది. ప్రసాద్ తండ్రి ఉపాధ్యాయుడు. తల్లిదండ్రులకు ముగ్గురు అమ్మాయిల తర్వాత నాలుగో సంతానంగా జన్మించారు. ఊహ తెలియక ముందే తల్లి కన్నుమూసింది. మేనమామ దగ్గరుండి ఎస్ఎస్ఎల్సీ దాకా చదువుకున్నారు. చదువుకునే రోజుల నుంచే నాటకాల్లో నటించేవారు. నాటకాల పిచ్చితో అగ్రికల్చర్ బీఎస్సీ సీటు, ఎంబీబీఎస్ సీటు పోగొట్టుకున్నారని సమాచారం.1983లో వచ్చిన బాబాయ్ అబ్బాయ్ నటుడిగా ఆయన మొదటి సినిమా. నువ్వు నేను చిత్రంలో ఆయన పోషించిన ధనవంతుడైన కథానాయకుడి తండ్రి ప్రాత మంచి పేరు తెచ్చిపెట్టింది. భద్ర, జై చిరంజీవ, గౌరీ, జానకి వెడ్స్ శ్రీరామ్ లాంటి చిత్రాల్లో ఆయన నటనకు ప్రశంసలు లభించాయి. ప్రస్తుతం వైజాగ్ ప్రసాద్ కుమార్తె, కుమారులు అమెరికాలో ఉన్నారు. వారు రాగానే అంత్యక్రియలు జరుగుతాయని కుటుంబసభ్యులు తెలిపారు. ఆయన మృతదేహాన్ని నిమ్స్ ఆసుపత్రి మార్చురీలో భద్రపరిచారు. 'మా' తరపున వైజాగ్ ప్రసాద్ కుటుంబ సభ్యులకు 'మా' అధ్యక్షులు శివాజీరాజా, జనరల్ సెక్రటరీ డా. వి.కె. నరేష్ ప్రగాఢ సానుభూతి తెలిపారు. -
సినిమాకు కరుణా ‘నిధే’
తమిళ సినిమా: కరుణానిధి.. కేవలం రాజకీయాల్లోనే కాదు తనదైన సృజనాత్మక కథా కథనాలతో తమిళ చలనచిత్ర రంగంలో విప్లవం తీసుకొచ్చిన ఘనత ఆయనది. కరుణానిధి ఒక్క తమిళులకే కాదు.. మన తెలుగు వారికీ గర్వకారణమే. ఎందుకంటే ఆయన తెలు గు జాతికి చెందిన వారు కావడమే. ఈయన అసలు పేరు దక్షిణామూర్తి. చదువుకునే రోజుల్లోనే సాహిత్యంపై మక్కవ కలిగిన కరుణానిధి 14 ఏళ్ల వయసులోనే పాటలు పాడుతూ ద్రవిడవాదాన్ని ప్రచారం చేశారు. ఒక పక్క విద్యార్థి నాయకుడిగా ఉద్యమాలు చేస్తూనే.. మరో పక్క తన సినీ అభిరుచిని చాటుకునే ప్రయత్నం చేశారు. పరాశక్తితో విప్లవం రాజకుమారి సినిమా(1947)తో సినీజీవితాన్ని ప్రారంభించిన ఆయన..తొలి సినిమాతోనే తనదైన ముద్ర వేశారు. ఇక 1952లో ఆయన కథ, సంభాషణలను అందించిన పరాశక్తి చిత్రం తమిళ చిత్ర సీమలో పెను విప్లవం. ఈ చిత్రంలోని ఒక్కో పదం చురకత్తిలా స్వార్థ రాజకీయ వ్యవస్థను చీల్చి చెండాడింది. అంతేకాదు బ్రాహ్మణ కుల జాడ్యాన్ని ప్రస్తావించడంతో అనేక వివాదాల్లో చిక్కుకోవటంతో పాటు నిషేధాన్ని ఎదుర్కొంది. ఎట్టకేలకు 1952లో విడుదలైన పరాశక్తి ద్రవిడ ఉద్యమానికి మరింత ఊపునివ్వటమే కాకుండా అఖండ విజయం సాధించింది. నడిగర్ తిలగం శివాజీగణేశన్, ఎస్ఎస్. రాజేంద్రన్ వంటి ఎందరో నటులు ఈ చిత్రంతోనే పరిచయం అయ్యారు. అనంతరం కలంపణం, తంగరధం వంటి చిత్రాల్లో వితంతు వివాహాలు, అంటరానితనం తదితర అంశాల్లో కరుణ తనదైన శైలిలో సమాజానికి సందేశం ఇచ్చే ప్రయత్నం చేశారు. సినీరంగంలో ఆయనను, ఎంజీఆర్, జయలలితలను మోడరన్ ధియేటర్ అధినేత టీఆర్ సుందరం ఎంతగానో ప్రోత్సహించారు. ఎంజీఆర్, శివాజీగణేశన్, జయలలిత లాంటి ఎందరో ప్రముఖ నటీనటుల ఉన్నతికి కరుణానిధి కథ, కథనాలు, సంభాషణలు దోహదపడ్డాయి. ఇక, మక్కల్ తిలగం ఎంజీఆర్ రాజకీయ జీవితానికి కరుణ అందించిన సంభాషణలే కారణమన్నది జగమెరిగిన చరిత్ర. ఇటు సినీ, అటు రాజకీయ రంగంలో వారి మైత్రి ఒక మరపురాని ఘట్టంగా నిలిచింది. అందుకే తమిళ చిత్ర సీమకు కరుణను గొప్ప నిధిగా విశ్లేషకులు పేర్కొంటారు. సినీ సేవకు పట్టం చిత్ర పరిశ్రమకు చేసిన విశేష కృషికి గానూ ఆయనకు పలు అవార్డులు, బిరుదులు వరించాయి. 1971లోనే అన్నామలై విశ్వవిద్యాలయం గౌరవ డాక్టరేట్ బిరుదుతో సత్కరించింది. తెన్‌పాండి సింగం నవలకు గానూ తంజావూర్ తమిళ విశ్వవిద్యాలయం రాజరాజన్ అవార్డుతో సత్కరించింది. ఆయన సీఎం అయ్యాక సినీరంగం అభివృద్ధికి ఎంతో కృషి చేశారు. 2006లో సినిమాలకు తమిళ పేర్లు పెడితే పన్ను మినహాయింపు ఇచ్చి పరిశ్రమను ప్రొత్సహించారు. వెండితెర అజరామరాలు తొలిసారిగా జూపిటర్ పిక్చర్స్‌లో స్క్రీన్‌ప్లే రైటర్ గా చేరిన ఆయన రాజకుమారి చిత్రానికి కథనాన్ని అందించారు. ఈ చిత్రం విజయంతో ఆయన వెనుదిరిగి చూసుకోవాల్సిన అవసరం లేకపోయింది. ఈయన కథలతో నిర్మించిన చిత్రాలు తెలుగు తదితర భాషల్లో అనువాదమై విజయం సాధించాయి. ఆయన చివరగా 2011లో పొన్నార్శంకర్ చిత్రానికి స్క్రీన్‌ప్లే అందించారు. -
స్క్రీన్ ప్లే 31st July 2018
-
ఫస్ట్ లుక్ 30th July 2018
-
సెలవుపై వెళ్లి... డూప్‌గా మారి
ఒకరు బాలయ్యలా భారీ డైలాగులతో ఈరగదీస్తే.. మరొకరు ఏఎన్నార్‌లా స్టెప్పులతో స్టేజీపై కేక పుట్టిస్తారు. వాళ్లను చూస్తే నిజంగా హీరోలని చాలామంది భావిస్తారు.. భ్రమిస్తారు. ఆ మేనరిజం, హావభావాలు అచ్చు అలాగే ఉంటాయి మరి! ఆయా హీరోలకు జిరాక్స్‌లుగా, తెరపై సూపర్ డూపర్‌గా నటించిన ‘డూప్’ క్యారెక్టర్లకు ఒకప్పుడు ఎంతో ప్రాధాన్యం ఉండేది. అయితే టెక్నాలజీ నేపథ్యంలో, గ్రాఫిక్స్ మాయాజాలంతో డూప్ క్యారెక్టర్లకు ఆదరణ, అవకాశాలు రెండూ తగ్గాయి. ఏఎన్నార్, ఎన్టీఆర్, కృష్ణ, శోభన్‌బాబు తదితరులతో మొదలైన డూపులు ఇప్పటికీ కొనసాగుతున్నాయి. బంజారాహిల్స్: కృష్ణానగర్ అంటే బట్టలు, సెట్టింగ్‌లు, కెమెరాలు, మెస్ తదితర సామాగ్రి మాత్రమే కాదు... మనుషులను పోలిన మనుషులూ ఇక్కడ అద్దెకు దొరుకుతారు. అసలైన హీరోలకు ఏమాత్రం తీసిపోకుండా అభిమానులను అలరిస్తారు.. అచ్చంగా వారినే అనుకరిస్తారు. సినిమాల్లో హీరోలకు డూప్‌లుగా క్యారెక్టర్ వేసే వీరు... ఖాళీ సమయాల్లో స్టేజీ షోలు, ఎన్నికల ప్రచారాల్లోనూ పాల్గొని అలరిస్తుంటారు. ఎన్టీఆర్, ఏఎన్నార్, చిరంజీవి, వెంకటేష్, నాగార్జున, జూనియర్ ఎన్టీఆర్, ప్రభాస్, పవన్‌కల్యాణ్... ఇలా ప్రతి ఒక్కరీ డూప్‌లు ఇప్పుడు చాలామంది కనిపిస్తున్నారు. బ్లాక్ అండ్ వైట్.. భలే హిట్ బ్లాక్ అండ్ వైట్ సినిమా ప్రపంచంలో డూప్‌లకు భలే డిమాండ్ ఉండేది. ఫైటింగ్, జంపింగ్ తదితర సాహసోపేతర సన్నివేశాలకు డూప్‌లను ఆశ్రయించేవారు. ఇక డబుల్ యాక్షన్ సినిమాల్లో డూప్ పాత్రలు ఎక్కువగా ఉండేవి. ఈ క్రమంలోనే ఎన్టీఆర్‌కు సత్యనారాయణ డూప్‌గా చేయగా, కృష్ణానగర్‌లో నివసించే మూర్తి ఏఎన్నార్‌కు డూప్‌గా పని చేశాడు. చాలా సినిమాల్లోనూ వీరు ఆయా హీరోల పాత్రల్లో కనిపించారు. ‘మనం’ సినిమాలోనూ ఏఎన్నార్ డూప్‌గా మూర్తి చేశాడు. అదే విధం గా ఇక్కడే నివసిస్తూ అక్కినేనితో కాలేజీ బుల్లోడు, కలెక్టర్ గారి అబ్బాయి తదితర సినిమాల్లో నటించిన జూనియర్ ఆర్టిస్ట్ యూనియన్ ఏజెంట్ ఘంటసాల అందరికీ సుపరిచితమే. ఇక చిరంజీవిని పోలి ఉండే రాజ్‌కుమార్ ఆయన డూప్‌గా సుపరిచితం. అప్పట్లో ఒక్కో హీరో రోజుకు రెండు, మూడు సినిమాల్లో చేసేవారు. ఈ నేపథ్యంలోనే చిన్ని చిన్న సన్నివేశాల్లో డూప్‌లకు ఎక్కువగా ప్రాధాన్యమిచ్చేవారు. టెక్నాలజీ వచ్చింది.. ఆదరణ తగ్గింది సినిమాల్లో బ్లాక్ అండ్ వైట్ కాలం మారిపోయి.. రంగుల ప్రపంచం రావడం, దానికి అనుగుణంగా ఆధునిక టెక్నాలజీ అభివృద్ధి చెందడంతో డూప్‌లకు ప్రాధాన్యం తగ్గింది. ప్రధానంగా డబుల్ యాక్షన్ సినిమాల విషయంలో ఈ టెక్నాలజీని ఉపయోగించి ఒకే హీరోను ఇద్దరిగా చూపిస్తున్నారు. దీంతో డూప్‌ల అవసరం తగ్గుతూ వచ్చింది. అలాగే సాహసోపేత సన్నివేశాలను గతంలో డూప్లతో చిత్రించేవారు. అయితే ఇప్పుడు పూర్తిగా గ్రాఫిక్స్ టెక్నాలజీ రావడంతో అలాంటి వారికీ అవకాశాలు తగ్గిపోయాయి. చాలా సినిమాల్లో ఇప్పుడు గ్రాఫిక్స్‌నే ఎక్కువగా నమ్ముకుంటున్నారు. దీంతో డూపులకు చాలా మేరకు అవకాశాలు లేకుండా పోయాయి. అక్కినేనితోఅనుబంధం.. అక్కినేని నాగేశ్వరరావుకి డూప్‌గా చాలాసార్లు చేశాను. ఓ సినిమాలో అయితే 10 రోజులు షూటింగ్లో పాల్గొన్నారు. రోజుకు రూ.400 చెల్లించారు. అక్కినేని నటించిన చివరి సినిమా ‘మనం’లోనూ ఆయనకు డూప్‌గా చేసినందుకు ఆనందంగా ఉంది. – మూర్తి, ఏఎన్నార్ డూప్ అవకాశాల్లేవ్... అప్పట్లో డూప్‌లకు చాలా అవకాశాలు ఉండేవి. కానీ టెక్నాలజీ మారడంతో అవకాశాలు చాలా వరకు తగ్గిపోయాయి. సినిమాల్లో డూప్లతో చేయించేందుకు ఆసక్తి చూపడం లేదు. అవసరమైతే టెక్నాలజీ ద్వారా ఆ ఖాళీని భర్తీ చేస్తున్నారు. నేను 18 ఏళ్లుగా ఇండస్ట్రీలో ఉన్నాను. ఎన్నో స్టేజీ షోల్లో బాలకృష్ణ గారిలా అందరినీ అలరించాను. ‘ఆట’ సినిమాలో బాలయ్య వేషం వేశాను. ఎన్నికల ప్రచారంలోనూ పాల్గొన్నాను. – దివాకర్, బాలకృష్ణ డూప్ ప్రేమతో ప్రజల్లోకి... మా నాన్న సూపర్‌స్టార్ కృష్ణ దగ్గర డ్రైవర్‌గా పనిచేశారు. అలా సినీ పరిశ్రమపై ప్రేమ పెరిగింది. దీనికి తోడు పవన్‌కల్యాణ్ అంటే చాలా ఇష్టం. అందుకే ఆయనలా వేషం వేసేవాడిని. ఈ క్రమంలో ‘అంతర్వేది టు అమలాపురం టైటానిక్ షిప్’ పేరుతోఈ మధ్య విడుదలైన సినిమాలో గబ్బర్ సింగ్ వేషం వేశాను. అలాగే చాలా స్టేజీ షోల్లో పాల్గొన్నాను. హీరోలపై ప్రేమతో మేము ప్రజల్లోకి వెళ్లి, వాళ్ల ఆదరాభిమానాలు పొందగల్గుతున్నాం. – బాబీ, పవన్‌కల్యాణ్ డూప్ సెలవుపై వెళ్లి... డూప్‌గా మారి నేను కాకినాడ నగర పాలక సంస్థలో ఉద్యోగం చేసేవాడిని. సినిమాలంటే చాలా ఇష్టం. మోహన్‌బాబు సినిమాలు ఎక్కువగా చూసేవాడిని. ఆయనలా డైలాగులు చెప్పడం, హావభావాలు పలికించడంతో అచ్చం మోహన్‌బాబులా చేస్తున్నానని అనేవారు. దీంతో నన్ను నేను మోహన్‌బాబులా మార్చుకున్నాను. ఉద్యోగానికి సెలవు పెట్టి, సినీ అవకాశాల కోసం ప్రయత్నించాను. అలా చెన్నైలో మోహన్‌బాబును కలుసుకున్నాను. ఆయన దగ్గర అసిస్టెంట్‌గా చేరాను. రెండు, మూడు సినిమాల్లో డూప్‌గా మోహన్‌బాబు అవకాశం కల్పించారు. ఇక ఆయన కుమార్తె మంచు లక్ష్మీ తాను నిర్వహించిన ‘లక్ష్మీ టాక్ షో’ ద్వారా నన్ను మోహన్‌బాబు డూప్‌గా ప్రపంచానికి పరిచయం చేశారు. ఇవన్నీ మరిచిపోలేని సంఘటనలు. – చావలివిశ్వేశ్వర్రావు, మోహన్‌బాబు డూప్ -
స్క్రీన్ ప్లే 24th July 2018
-
సమ్మోహిని
అందం వెయ్యి పొరల వెనకాల దాగి ఉంటుంది. కానీ ప్రతి పొరకి ఆ అందం కాంతి వెలుగునిస్తుంది. గుణం కూడా అంతే. దాన్ని ఎన్ని పొరలతో కప్పినా సమ్మోహనంగానే ఉంటుంది. కళ్లకి కనబడే పొర వస్త్రాలైతే మనసుకు కనపడే పొర నేపథ్యం. నేను ఎవర్ని? నేను ఎక్కణ్ణుంచి వచ్చాను? నేను ఏమి చేస్తున్నాను? ఇవన్నీ గుణం అందం ముందు తేలిపోతాయి అంటుంది అదితీ రావ్ హైదరీ. పద్మావతి, సమ్మోహనం... వరుస విజయాలతో కెరీర్ పాజిటివ్‌గా ఉంది కదా? అవును. అయితే ఈ సక్సెస్ క్రెడిట్ మొత్తం డైరెక్టర్స్‌కే ఇస్తాను. వాళ్లు అలాంటి పాత్రలు రాయబట్టే నాకు నటించడానికి మంచి స్కోప్ దొరికింది. ఈ రెండు సినిమాలకన్నా ముందు మణిరత్నం సార్‌తో ‘చెలియా’ చేశాను. అదొక బ్యూటిఫుల్ ఎక్స్పీరియన్స్. ‘పద్మావతి’ కంప్లీట్లీ డిఫరెంట్. ఆ సినిమాలో నాది చిన్న పాత్ర. కానీ ప్రేక్షకులకు గుర్తుండిపోయే క్యారెక్టర్. అందుకే చేశాను. ‘సమ్మోహనం’ విషయానికొస్తే.. మోహనకృష్ణగారు ఈ కథ చెప్పినప్పుడు చాలా ఇంప్రెస్ అయ్యాను. అయితే డేట్స్ ఇష్యూ వల్ల ఈ సినిమా చేయగలుగుతానా? లేదా? అని వర్రీ అయ్యాను. ఫైనల్లీ ఎలాగోలా మేనేజ్ చేశాను. ‘సమ్మోహనం’ చేయకపోతే మంచి సినిమా మిస్సయ్యుండేదాన్ని. ‘పద్మావతి’లో మీ భర్త పాత్రధారి పెట్టే హింస, ‘సమ్మోహనం’లో బాయ్‌ఫ్రెండ్ హింస. ఓ అమ్మాయిగా రియల్ లైఫ్‌లో అబ్బాయిల నుంచి ఇలాంటి హెరాస్మెంట్స్? ఒకే ఒక్క ఇన్సిడెంట్ ఉంది. చిన్నప్పుడు స్కూల్‌కి ట్రైన్లో వెళ్లేదాన్ని. ఒక అంకుల్ అలా టచ్ చేస్తూ వెళ్లాడు. ఆ టచ్‌లో చెడు కనిపించింది. ‘ఇంకెప్పుడూ ఎవర్నీ ఇలా చేయొద్దు అంకుల్’ అని అతనివైపు చాలా డర్టీగా చూస్తూ అన్నాను. ఇంటి దగ్గర, ఇంట్లోనూ నాకెలాంటి సమస్యలూ రాలేదు. నేను మంచి వాతావరణంలో పెరిగాను. నా ఫ్యామిలీ మెంబర్స్ అంతా చాలా లిబరల్గా ఉంటారు. నన్ను ప్రొటెక్ట్ చేస్తూనే చాలా ఫ్రీడమ్ ఇచ్చేవారు. ‘గుడ్ టచ్’, ‘బ్యాడ్ టచ్’ గురించి ఇంట్లోవాళ్లు చెబితేనే తెలిసింది. ఆడపిల్లల్ని ఈ విషయంలో ఎడ్యుకేట్ చేయాలి. బ్యాడ్ టచ్ అని కనిపెట్టి అంకుల్‌కి ఎదురు తిరిగారంటే మీరు చాలా బోల్డ్ అనుకోవచ్చా? నిజానికి ధైర్యవంతురాలినో కాదో నాకు తెలియదు. ఆ టైమ్‌కి అది తప్పనిపించింది. తప్పు జరిగినప్పుడు మాత్రం మాట్లాడే ధైర్యం ఉంది. అయితే చాలా మటుకు పొలైట్‌గానే మాట్లాడతాను. ఫిల్మ్ ఇండస్ట్రీలో ‘ఉమెన్’కి రెస్పెక్ట్ దొరుకుతుందా? ఒకళ్లు మనల్ని రెస్పెక్ట్ చేయాలని ఎదురు చూడకూడదు. మన ప్రవర్తన చూసి ఆటోమేటిక్‌గా ఎదుటి వ్యక్తి మర్యాద ఇవ్వాలి. అలాగే మనల్ని మనం రెస్పెక్ట్ చేసుకునే తీరుని బట్టే మనల్ని ఎదుటి వ్యక్తులు గౌరవిస్తారు. నా మటుకు నేను చాలా హుందాగా ప్రవర్తిస్తాను. ఎదుటి వ్యక్తులు నాతో అలానే ఉంటారు. హాలీవుడ్లో నిర్మాత హార్వీ వెయిన్‌స్టీన్ పెట్టిన హింస గురించి కొందరు కథానాయికలు నలుగురికీ తెలిసేలా మాట్లాడారు. ఇక్కడ (ఇండియన్ ఫిల్మ్ ఇండస్ట్రీ) అలా మాట్లాడితే అవకాశాలు తగ్గుతాయా? నేను గమనించినంతవరకూ కొంత ఆ వాతావరణం ఉంది. వేధింపుల గురించి బయటికి చెబితే వాళ్లని కించపరచడమో, భయపెట్టడమో చేసేవాళ్లు ఉన్నారు. ఆ అమ్మాయిలకు పని కూడా తగ్గిపోతుంది. ఇండస్ట్రీలోవాళ్లు అమ్మాయిల్ని ‘ఆబ్జెక్ట్స్’లా కాకుండా ‘ఆర్టిస్ట్స్’లా చూడగలిగినప్పుడే ఈ పరిస్థితి మారుతుంది. అమ్మాయిలను నెగటివ్ దృష్టితో చూసేవాళ్ల గురించి ఈ మాట చెబుతున్నాను. సేవా కార్యక్రమాలేవైనా చేస్తుంటారా? అదంతా మనసుకి నచ్చి చేస్తా ను. పబ్లిసిటీ కోసం కాదు. ఉమెన్ రైట్స్, ఎడ్యుకేషన్ వంటి వాటి మీద ఆసక్తి. ఎడ్యుకేషన్ అమ్మాయిలకే కాదు.. అబ్బాయిలకు కూడా అందాలి. లేకపోతే వాళ్లకి అమ్మాయిల్ని ఎలా ట్రీట్ చేయాలో ఎప్పటికీ తెలియదు. అందుకే ఎడ్యుకేషన్ ఇంపార్టెంట్ అని ఫీల్ అవుతాను. అలాగే యానిమల్ రైట్స్ కోసం చేసే కార్యక్రమాల్లో పాల్గొంటాను. ప్రకృతిని కాపాడే కార్యక్రమాల్లో పార్టిసిపేట్ చేస్తాను. ‘చెలియా’లో లీల, ‘పద్మావతి’లో మల్లిక, ‘సమ్మోహనం’లో సమీరా.. అన్ని పాత్రలూ బాగా చేశారు. నటనలో ట్రైనింగ్ తీసుకుని సినిమాల్లోకి వచ్చారా? లేదు. నాకు తెలిసిందల్లా ఫీల్ అవ్వడం. డైరెక్టర్ ఒక మంచి క్యారెక్టర్ క్రియేట్ చేసినప్పుడు జెన్యూన్‌గా నేను ఆ పాత్రలా మారిపోవాలి. అలా జరగాలంటే నేనే ఆ పాత్ర అనుకోవాలి. ఆ క్యారెక్టర్ పడే బాధ, సంతోషం, ఆశ్చర్యం అన్నీ నాకు జరుగుతున్నట్లుగా ఫీల్ అవ్వాలి. అలా ఫీలై చేస్తాను కాబట్టే, ‘బాగా యాక్ట్ చేస్తున్నారు’ అని కాంప్లిమెంట్స్ అందుకోగలుగుతున్నా. అఫ్కోర్స్ ఆ క్యారెక్టర్స్ క్రియేట్ చేసిన డైరెక్టర్స్‌కి ఎక్కువ క్రెడిట్ ఇచ్చేస్తాను. ఆమిర్ ఖాన్ వైఫ్ కిరణ్ రావ్ మీ కజిన్ కదా? ఆమె మా అమ్మమ్మ సైడ్ రిలేటివ్. యాక్చువల్లీ ఆమిర్‌ని కిరణ్ పెళ్లి చేసుకున్నారనే కానీ తనదీ ఫిల్మీ ఫ్యామిలీ బ్యాగ్రౌండ్ కాదు. మేమిద్దరం బంధువులం అని చాలామందికి తెలియదు. ఎందుకంటే నా కెరీర్ కోసం ఆమిర్ భార్య కిరణ్ నా కజిన్ అని నేనెక్కడా చెప్పను. ప్రొఫెషనల్‌గా కిరణ్ నుంచి నేనెలాంటి సహాయం తీసుకోలేదు. మన కాళ్ళ మీద మనమే నిలబడాలి అని, నీ కెరీర్‌కి నువ్వే రెస్పాన్సిబుల్ అవ్వాలి అని ఇంట్లో నేర్పారు. కిరణ్, నేను చాలా క్లోజ్. నా వర్క్ చూసి, తను ప్రౌడ్‌గా ఫీలవుతుంది. వెంటనే నాకు మెసేజ్ పెడుతుంది. హీరోయిన్ అంటే ‘జస్ట్ గ్లామర్’ కోసం అని చాలామంది అనుకుంటారు. మీరేమంటారుæ? మేం సిల్వర్ స్క్రీన్‌ని అందంగా మార్చడానికి ఇక్కడ లేము. మా ప్రొఫెషన్లో అదొక చిన్న భాగం... అంతే. మేం ఇక్కడ ఉన్నది కథలో భాగం అవ్వడానికే. ఆ కథకు వేల్యూ తీసుకు రావడానికే అని నమ్ముతాను. హీరోయిన్ గురించి మాట్లాడేటప్పుడు ఆమె బాడీ, ఫేస్ గురించి కాదు.. పాత్ర గురించి మాట్లాడాలి. ముందు టాలెంట్ గురించి మాట్లాడాలి. బ్యూటీ, ఫిట్నెస్ ఓ బోనస్ అని నేను ఫీలవుతాను. సో.. ఓ క్యారెక్టర్ ఒప్పుకునేటప్పుడు మీరెలాంటి విషయాలకు ప్రాధాన్యం ఇస్తారు? సినిమా మొత్తం కనిపిస్తామా? 20 నిమిషాలే కనిపిస్తామా? అన్నది నాకు ముఖ్యం కాదు. ఆ స్క్రిప్టులో నా క్యారెక్టర్‌కి ఎంత వేల్యూ ఉందని చూస్తాను. హీరోయిన్ అంటే డ్యాన్స్‌లకే అనే సబ్జెక్ట్స్ చేయను. నేను చేసిన సినిమాలు గమనిస్తే మీకది అర్థమవుతుంది. హాలీవుడ్ హీరోయిన్లు ఇలానే ఆలోచిస్తారు. ఇక్కడ మనం కూడా అలానే ఉండాలన్నది నా ఒపీనియన్. మీ ప్లస్, మైనస్ పాయింట్స్ ఏంటి ? నా ప్లస్, మైనస్ రెండూ దాదాపు ఒకటే. ఒకటి సెన్సిటివిటీ (సున్నిత మనస్కురాలు). యాక్టర్‌గా అది చాలా ప్లస్. క్యారెక్టర్ని ఈజీగా ఫీల్ అవ్వగలను, సినిమా చేస్తున్నంతసేపూ ఆ క్యారెక్టర్‌తో ట్రావెల్ చేయగలను. ఆ క్రెడిట్ అంతా నా పేరెంట్స్‌కి ఇస్తాను. ఎందుకంటే వాళ్లూ సున్నిత మనస్కులే. ఇలా ఉండటం వల్ల ఓ మైనస్ ఉంది. నేనేం దాచుకోలేను (నవ్వుతూ). అప్సెట్ అయినా, ఏదైనా బాధలో ఉన్నా బయటకు కనిపించేస్తుంది. రెండోది పాజిటివ్ పర్సన్‌ని. నాకు వంద చెడ్డ విషయాలు చెప్పినా అందులో కూడా పాజిటివిటీని వెతుక్కోగలను. ప్రతి పనిలో, ప్రతి మనిషిలో మంచే చూడాలని నన్ను ఎంకరేజ్ చేసింది పాజిటివిటీయే. దాని వల్ల మైనస్ ఏంటంటే మనం ప్రతి దాంట్లో పాజిటివ్‌గా ఉంటే అడ్వాంటేజ్‌గా తీసుకుంటారు. మనల్ని మ్యానిపులేట్ చేయడానికి చూస్తుంటారు. అలాంటి సిచ్యువేషన్స్ ఏమైనా ఎదుర్కొన్నారా? సెట్లో ప్రతిసారి జరుగుతూనే ఉంటుంది. అయితే నేను చిన్న చిన్న విషయాలకి అప్సెట్ అయిపోయి కోపం తెచ్చుకునే టైప్ కాదు. నేను నిజంగా అప్సెట్ అయ్యానంటే వాళ్ళు చాలా ఇబ్బంది పెట్టినట్టు లెక్క. అందుకే నా ప్లస్‌లు, మైనస్‌లు దగ్గర దగ్గరగా ఉంటాయి. నేను 5 ఏళ్ల పాపలాగ. చిన్నదానికే ఆనందపడతాను. సినిమాలెందుకు చేస్తున్నారు? డబ్బు కోసమా? ప్యాషనా? 100 శాతం ప్యాషన్ వల్లే చేస్తున్నాను. అలా అని దాని ద్వారా వచ్చే నేమ్, ఫేమ్ ఇష్టం లేదని కాదు. చిన్నప్పటి నుంచి నేను సంపాదించే దాన్ని. డ్యాన్స్ చేస్తూనే సంపాదించేదాన్ని. అందుకే హీరోయిన్ అయ్యాను. ఇవన్నీ ఇష్టమే. గ్రేట్ డైరెక్టర్స్‌తో వర్క్ చేసినప్పుడు రెమ్యునరేషన్ పెద్దగా పట్టించుకోను. నా ఫస్ట్ ప్రయారిటీ ‘ఫలానా డైరెక్టర్స్ హీరోయిన్’ అనిపించుకోవాలన్నదే. ఆ తర్వాతే డబ్బు గురించి ఆలోచిస్తాను. ఒక ఎగ్జాంపుల్ చెబుతాను. నా కెరీర్ స్టార్టింగ్‌లో పెద్ద సినిమాకి చాన్స్ వస్తే, ఆ సినిమాలో హీరోయిన్గా నాకు చేయడానికి ఏమీ లేదు. ఓ సినిమాకి మంచి రెమ్యునరేషన్ ఇస్తానన్నారు. ఆ సినిమాలో నాకు పెద్దగా స్కోప్ లేదు. అందుకే ఒప్పుకోలేదు. నా రోల్, డైరెక్టర్ ఇంపార్టెంట్. అంటే.. రెగ్యులర్ కమర్షియల్ సినిమాలు నచ్చవా? మీరు చేసిన పాత్రలు కూడా గ్లామరస్‌గా ఉండవు. ఒకవేళ స్క్రిప్ట్ స్విమ్ సూట్ డిమాండ్ చేస్తే? ఆ డిమాండ్ చాలా జెన్యూన్‌గా ఉండాలి. అప్పుడు అభ్యంతరం చెప్పను. అయితే స్విమ్మింగ్ పూల్‌లో స్విమ్ సూట్లో దిగితే అందులో ఛీప్‌గా ఫీల్ అవ్వాల్సిన అవసరం ఏంటి? నాకు కమర్షియల్ సినిమాలు ఇష్టమే. మార్కెట్లో వాటి హవా ఎక్కువ. అయితే ఆ సినిమాలో కూడా హీరోయిన్గా నాకు ఏదైనా స్కోప్ ఉండాలని ఆశిస్తాను. అప్పుడే ఆ స్క్రిప్ట్‌కి ఓకే చెబుతాను. నంబర్ రేస్ మీద ఇంట్రెస్ట్‌గా ఉన్నారా? మీరు ప్రాపర్ రేస్‌లో కూడా లేరనుకుంటాను? పైగా లెంగ్త్ తక్కువ ఉన్న రోల్స్ కూడా చేసేస్తున్నారు? అందరం ఓన్లీ లీడ్ రోల్స్ చేస్తాం అనుకోకూడదు. నేను గెస్ట్ పాత్రలు చేయడానికి సిద్ధమే. అప్పుడే కెరీర్ ఇంట్రెస్టింగ్గా ఉంటుంది. కొన్నిసార్లు లీడ్ రోల్స్ కన్నా గెస్ట్ పాత్రలకే ఎక్కువ ఇంపార్టెన్స్ ఉంటుంది. ఫస్ట్, సెకండ్, థర్డ్.. ఈ ప్లేసెస్ ఇండస్ట్రీ , ఆడియన్స్ డిసైడ్ చేసేవి. అలా చేసినందున మా స్టార్ వాల్యూ ఏం పడిపోదు. రేస్‌లో పరిగెట్టే వాళ్ల కంటే ఆర్టిస్ట్‌లే ఎక్కువ కాలం నిలబడతారు, గుర్తుండిపోతారు. రేస్ అయిపోవచ్చు కానీ మారథాన్ అవ్వదు. అది కంటిన్యూ అవుతూనే ఉంటుంది. విద్యా బాలన్, కంగనా రనౌత్, రాణీ ముఖర్జీ, టబు లాంటి వాళ్లు రేస్‌లో పరిగెత్తడం లేదు. మంచి సినిమాలు క్రియేట్ చేస్తున్నారు. వాళ్లు చేస్తున్నది మారథాన్. మీ చిన్నప్పుడే మీ అమ్మానాన్న విడిపోయారు. అమ్మగారి దగ్గర పెరిగిన మీకు నాన్నను మిస్సయిన ఫీలింగ్ ఉండేదా? ఇద్దరు వ్యక్తుల మధ్య సఖ్యత కుదరకపోతే గౌరవంగా విడిపోవడం బెస్ట్ అనుకుంటాను. పేరెంట్స్ ఎప్పుడైనా పిల్లల కోసం సంతోషమైన వాతావరణాన్ని క్రియేట్ చేయగలగాలి. మా పేరెంట్స్ విడిపోయి చేసింది అదే. ఒకే గొడుగు కింద ఉంటూ, ఎప్పుడూ గొడవలు పడుతుంటే కూతురిగా నేను హ్యాపీగా ఉండేదాన్ని కాదు. నేను చాలా సంతోషమైన వాతావరణంలో పెరిగాను. ఎప్పుడంటే అప్పుడు డాడీని కలిసేదాన్ని. అప్పుడప్పుడూ కలవడం వేరు. రోజూ డాడీతోనే ఉండటం వేరు కదా? చిన్నప్పుడు బాధ అనిపించలేదు కానీ, ఇప్పుడు ఆలోచిస్తే మా నాన్నగారితో ఇంకొన్ని రోజులు టైమ్ స్పెండ్ చేసి ఉంటే బాగుండేదనిపిస్తోంది. ఆయన నాలుగేళ్ల క్రితమే చనిపోయారు. నేను పెరిగేటప్పుడు ఆయన్ని మిస్ అవ్వలేదు. ఏ విషయంలోనూ కొరత లేకుండా చూసుకున్నారు మా అమ్మ వాళ్లు. మా గ్రాండ్ పేరెంట్స్, మా మామయ్య, అందరూ నాకోసం ఉన్నారు. అయితే మా నాన్నగారికి నా ప్రొఫెషన్ గురించి ఏమీ తెలియదు. మా డాడ్ ఫ్యామిలీ అంతా ఇంజనీరింగ్ బ్యాక్‌డ్రాప్. ఒకసారి మా డాడీ ‘రో జంతా సెట్లో ఏం చేస్తారు? అన్ని గంటలు ఏం పని చేస్తుంటారు’ అని అడిగారు. ఆయనకు సినిమాలు ఎక్కువగా తెలియదు. నాన్నగారు ఇప్పుడుంటే కచ్చితంగా నాతో పాటు లొకేషన్‌కి వచ్చేవారు. నా గురించి గుడ్ థింగ్స్ వినేవారు. ఆ ఆనందాన్ని ఆయన మిస్సయ్యారని బాధ. మీ అమ్మగారు హిందూ, నాన్నగారు ముస్లిం కదా. మీరు ఏ దైవాన్ని నమ్ముతారు? రెండు మతాల బ్యాగ్రౌండ్ నుంచి వచ్చాను. మా ఇంట్లో అన్ని మతాలను నమ్ముతాం. రెండు వైపుల వారు చాలా ఓపెన్ మైండెడ్. ‘లివ్... లెట్ లీవ్’ అనే సిద్ధాంతాన్ని నమ్ముతాం. మా ఫ్యామిలీ రెండు వైపుల వారు ఎడ్యుకేటెడ్. ఓపెన్ మైండెడ్. కుల మతాలకు అతీతంగా స్నేహం చేస్తాం. అందరితో బాగుంటాం. హైదరాబాద్‌లోనే పుట్టారు కదా. తెలుగు ఎందుకు నేర్చుకోలేకపోయారు? ఇక్కడ పుట్టినా, నేను ఎక్కువగా నార్త్‌లో పెరిగాను. అమ్మ తెలుగు. నాన్న హిందీ. నాతో పాటు అమ్మ షూటింగ్‌కి వచ్చినప్పుడు టీమ్ అందరితో తెలుగులోనే మాట్లాడతారు. ‘మీ అమ్మగారు ఇంత బాగా తెలుగు మాట్లాడుతున్నారు, మీరెందుకు మాట్లాడట్లేదు?’ అని అడుగుతారు. నా చిన్నతనం అంతా డ్యాన్స్, ఆర్ట్‌తో గడిచిపోయింది. లాంగ్వేజ్‌లు నేర్చుకోవడానికి టైమ్ లేదు. అలాగే కొత్త లాంగ్వేజెస్ నేర్చుకోవడంలో నేను వీక్. ‘సమ్మోహనం’ సినిమాకు డబ్బింగ్ చెప్పుకున్నారు కదా? వేరే భాష సినిమాలు చేస్తున్నప్పుడు ఇంపార్టెంట్ విషయం ఏంటంటే ఆ దర్శకుడు విజన్‌ని అర్థం చేసుకోవడం. డైలాగ్స్ అన్నీ నా భాషలో రాసుకొని బట్టీపడతాను. ఇలా డైలాగ్స్ బట్టీపట్టడం చూసి మణీసార్ నన్ను ‘రామచిలుక’ అనేవారు. ‘సమ్మోహనం’లో హీరోయిన్ నార్త్ అమ్మాయి, తన తెలుగు కూడా అంత పర్ఫెక్ట్గా ఉండాల్సిన పని లేదు. అందుకని ఈజీగా చెప్పగలిగాను. ప్రస్తుతం సంకల్ప్ రెడ్డి డైరెక్షన్లో చేస్తున్న తెలుగు సినిమా గురించి? సంకల్ప్ సార్ ఈ కథ నాకు లాస్ట్ ఇయరే చెప్పారు. చాలా బాగా నచ్చింది. ఈ సినిమాని జస్ట్‌లో మిస్ అయ్యేదాన్ని. అనుకోకుండా ఓ హిందీ సినిమా డిలే అయింది. దాంతో మళ్లీ ఈ ప్రాజెక్ట్‌లోకి వచ్చాను. ఈ సినిమాతో పాటు మణీసార్ ‘నవాబ్’ సినిమా చేశాను. ఫైనల్లీ సోషల్ మీడియా ట్రాల్స్, కామెంట్స్ గురించి? మా అమ్మగారి ఫిలాసఫీ ఫాలో అవుతాను. ఎవరి పని వాళ్లు చేసుకోవాలి. ఎవరైనా మన గురించి చెడుగా మాట్లాడుతున్నారంటే అది వాళ్ల ఖర్మ అని వదిలేస్తాను. నాకు వీలున్నంత వరకు నా ఫ్యాన్స్‌కి రెస్పాండ్ అవుతాను. ఫ్యాన్స్ చాలా ప్రేమిస్తారు. వాళ్ల కోసం నేను చేయగలిగేది వాళ్లకు రెస్పాండ్ అవ్వడం. సోషల్ మీడియాలో వచ్చే నెగటివిటీకి ఇంపార్టెన్స్ ఇవ్వను. బీ పాజిటివ్ అనేది నా పాలసీ. అందుకే నెగటివిటీకి దూరంగా ఉంటాను. అలా ఉండగలిగితే మనం హాయిగా ఉండగలుగుతాం. – డి.జి. భవాని -
ఒక్క ఛాన్స్.. ఒకే ఒక్క చాన్స్..
ఒక్క ఛాన్స్.. ఒకే ఒక్క చాన్స్.. వెండితెరపై తన బొమ్మ పడాలని కోరుకునేవారు కోకొల్లలు.తెలుగు రాష్ట్రాల్లో ఒక్క అవకాశం కోసం కలలు కనేవారికి ఆశల ద్వారం ‘కృష్ణానగర్’ ఒక్కటే. తాము కోరుకున్న కలల తీరం చేరాలంటే అక్కడ అడుగు పెట్టాల్సిందే. దశాబ్దాల సినీ ప్రస్థానంలో తారలు మారుతున్నారు.. సాంకేతిక పరిజ్ఞానం మారుతోంది.. మొత్తం మహానగరమే మారింది.. కానీకృష్ణానగర్కు వచ్చేవారి ఆలోచనల్లో ఏ మాత్రం మార్పులేదు. అదే కల.. ఒక్క ఛాన్స్.. ఆ అవకాశంవస్తే ‘చిన్న క్లోజ్’.. అంతే. కునుకు పడితే ఎక్కడ తమకు వచ్చే అవకాశం చేజారిపోతుందోనని కళ్లల్లో ఆర్క్లైట్లు వెలిగించుకుని ఎదురు చూస్తుంటారు. కడుపులో ఆకలి రొద చేస్తున్నా.. బతుకు రంగువెలుస్తున్నా సరే మొహానికి మేకప్ వేసుకునే అవకాశం ఎవరిస్తారా అని ఆశగా ఎదురు చూస్తుంటారు. ఓ గణపతి కాంప్లెక్స్, మంగ టిఫిన్ సెంటర్, పూర్ణ టిఫిన్ సెంటర్, ప్రసాద్ ల్యాబ్స్, ఇందిరానగర్, జూనియర్ ఆర్టిస్ట్ అసోసియేషన్ కార్యాలయం.. ఆ చుట్టుపక్కల వీధులే.. భవనాల మెట్లే అడ్డాలుగా చేసుకొని ఒక్కో మెట్టూ ఎక్కించే అవకాశం కోసం ఎదురు చూస్తుంటారు. ఓ రవితేజ, త్రివిక్రమ్, సునీల్, బ్రహ్మాజీ.. సంపూర్ణేష్‌బాబు.. ఇలా ఒకప్పుడు ఈ ప్రాంతాన్ని ముద్దాడినవారే. ఇలాంటి వారే ఆదర్శం.. ఔత్సాహిక కళాకారులకు ఆశల స్వర్గంగా మారింది. అంతేనా.. అలనాటి ‘వేటగాడు’ చిత్రం నుంచి నేటి ‘సైరా’ సినిమా వరకూ కాల గమనంలో సాంకేతికంగా ఎన్నో మార్పులొచ్చాయి. నాటికి నేటికీ అవకాశాల్లోనూ, అందుకోసం వెదికే విధానంలోనూ భారీ మార్పులే చోటుచేసుకున్నాయి.సినీ రంగానికి సంబంధించి 24 క్రాఫ్ట్‌లే కాకుండా అదనంగా వచ్చిన విభాగాల్లోనూ భారీ మార్పులే వచ్చాయి. బంజారాహిల్స్: సంపూర్ణేష్ బాబు.. సినిమా అవకాశాల కోసం ఎక్కడా చక్కర్లు కొట్టలేదు.. ఏ అడ్డాకు వెళ్లలేదు.. సోషల్ మీడియా విప్లవం ద్వారా రాత్రికి రాత్రే అభిమానులను సొంతం చేసుకున్నారు.. లక్షలాది మంది ఫాలోవర్లను తన ఫేస్బుక్లో లైక్ కొట్టేలా చేసుకున్నారు.. అదే అతడిని సినీ పరిశ్రమ వైపు నడిపించింది.. నవ్వుల స్టార్‌గా మార్చింది.. సంపూర్ణేష్‌బాబు ఒక్కడి విషయంలోనే కాదు.. దర్శకుడు భాస్కర్, నవ్వుల కార్యక్రమాలు వేదికగా అనేక మంది యువకులు ఇప్పుడు ప్రతీ ఒక్కరి దృష్టిని ఆకర్షించడమే కాకుండా సినిమా అవకాశాలను దక్కించుకుంటున్నారు.. తమ అదృష్టాన్ని పరీక్షించుకుంటున్నారు. వీళ్లే కాదు మరెందరికో వేదికగా నిలిచి.. ఆర్టిస్ట్‌లకు వెలుగుదారులు పరుస్తోంది కృష్ణానగర్. ఒకప్పటి కృష్ణానగర్‌తో పోల్చుకుంటే ప్రస్తుతం ఎన్నో మార్పులు వచ్చాయి. అవేంటో ఒకసారి తరచి చూస్తే.. గణపతి కాంప్లెక్స్.. ఉదయం 6 గంటల ప్రాంతం.. అక్కడున్న ఓ కాంప్లెక్స్ వద్దకు ఒక్కొక్కరు వచ్చి చేరుతున్నారు.. చూస్తుండగానే చాలా మంది అక్కడికి వచ్చి చేరారు.. అంతా కబుర్లలో మునిగిపోయారు.. కాస్త చెవులు అటు వైపుగా వేస్తే వినిపించేవి సినీ అవకాశాల కోసం తాము పడే పాట్లు.. సినిమాల్లో వచ్చిన అవకాశాలు.. తాను నటించిన సన్నివేశాలు.. తమకు దక్కిన ఛాన్సులు.. ఇలా ఉదయమే కాదు.. సాయంత్రం 6 గంటలకు అక్కడంతా ఇదే పరిస్థితి.. పాతికేళ్లుగా చాలా మంది సినీ వినీలాకాశంలో అవకాశం పొందడానికి, పొందినవారు ఇక్కడికి వస్తూనే ఉంటారు.. అవకాశాలు వచ్చిన వారు ప్లేస్ మార్చవచ్చు.. కానీ నేటి తరం ఔత్సాహిక సినీ కళాకారులకు అదే అడ్డా.. అదే గణపతి కాంప్లెక్స్.. అడ్డా నుంచి ఆడిషన్ లెవల్‌కు వెళ్లిన నాటి అవకాశాలు ప్రస్తుతం సోషల్ వైపు నడుస్తున్నాయి. మంగ టిఫిన్ సెంటర్.. కాస్త అటుఇటుగా అర కిలోమీటర్ ముందుకు సాగితే మంగ టిఫిన్ సెంటర్. జూనియర్ ఆర్టిస్టులందరికీ అదొక హాట్‌స్పాట్.. ఈ అడ్డా మీదుగా చాలా మంది సినీపరి«శ్రమలో తమ అడుగులను వేసిన వారు ఉన్నారు. ఇప్పటికీ ఇంకా ఆ అడ్డా అలాగే కళాకారుల కలయిక ప్రాంతంగా నిలుస్తోంది. అందరినీ ఆదరిస్తోంది. ఇలా ఒకటి కాదు.. రెండు కాదు.. సినీ అవకాశాల కోసం పల్లెల నుంచి టౌన్ల నుంచి వచ్చే వారికి ఇలాంటి ప్రాంతాలు సినీ అవకాశాల వారధులుగా నిలుస్తున్నాయి. చెరిగిపోని గుర్తులు.. సారథి స్టూడియో, అన్నపూర్ణ, రామానాయుడు.. ఇలా పలు సినీ స్టూడియోలు అమీర్‌పేట, బంజారాహిల్స్, జూబ్లీహిల్స్ ప్రాంతాల్లోకి రావడంతో సినీ అవకాశాల కోసం వివిధ ప్రాంతాల నుంచి వచ్చే ఔత్సాహిక సినీ కార్మికులకు స్టూడియోల చుట్టుపక్కల ప్రాంతాలు అడ్డాలుగా మారాయి. ఇలా దాదాపు పాతికేళ్లుగా ఇవి ఇప్పటికీ అవకాశాలను కల్పిస్తూనే ఉన్నాయి. దీంతో చాలా మంది గణపతి కాంప్లెక్స్, మంగ టిఫిన్ సెంటర్, పూర్ణ టిఫిన్ సెంటర్, ప్రసాద్ ల్యాబ్స్, ఇందిరానగర్, జూనియర్ ఆర్టిస్ట్ అసోసియేషన్ కార్యాలయం తదితర ప్రాంతాలను తమ అడ్డాలుగా మలుచుకున్నారు. ఇవి ఇప్పటికీ వీరిని ఆదరిస్తూనే ఉన్నాయి. ప్రసాద్ ఫిలిం ల్యాబ్ అటూ ఇటూగా మారింది.. సినీ అవకాశాల కోసం వచ్చే చాలా మంది తమ ఆవాసాలను కృష్ణానగర్, ఇందిరానగర్ ప్రాంతాల్లోనే ఎక్కువగా ఉండటానికి ఇష్టపడతారు. దీనికి కారణాలు లేకపోలేదు. ఒకవైపు స్టూడియోలు, ఆర్టిస్ట్ యూనియన్ కార్యాలయాలు, అవకాశాలు కల్పించే అడ్డాలు ఇలా అన్నీ చుట్టుపక్కల ఉండటంతో వారంతా వచ్చి ఇక్కడే నివసించేవారు. గతంలో త్రివ్రిక్రమ్, రవితేజ, బ్రహ్మాజీ, సునీల్ ఇలా చాలా మంది తమ ప్రస్థానాన్ని ఇక్కడి నుంచే ప్రారంభించారు. ఇరుకు గదుల్లో అవకాశాల కోసం ఇక్కడున్నవారే. ఇప్పుడు అడ్డాల వద్దకు వచ్చే వారి సంఖ్య తగ్గినా ఒకప్పటిలాగే ఇప్పటికీ వస్తున్న వారూ ఉన్నారు. అంతా ‘సోషల్’యిజం సినిమాల్లో అవకాశాలు రావాలంటే ఒకప్పుడు ఆ డిషన్లు జరిగేవి. ఇందుకోసం పలు సినిమా కార్యా లయాలు ఔత్సాహిక సినీ కార్మికుల కోసం తలుపులు తెరుచుకునేవి. తనకు ఇలాగే దిల్ రాజు కార్యాలయంలో జరిగిన ఆడిషన్ ద్వారా సినిమా ల్లో అవకాశం వచ్చిందని చెబుతున్నారు వెంకటగిరికి చెందిన జూనియర్ ఆర్టిస్ట్ జమాల్. కానీ ప్రస్తు తం ఆ పరిస్థితులు పూర్తిగా మారిపోయాయి. ఒకప్పుడు ఆడిషన్స్ ద్వారా జరిగిన ఎంపిక ఇప్పుడు మారుతున్న కాలానికి, ట్రెండ్‌కు అనుగుణంగా మారిపోయింది. ఇందులో భాగంగానే ఎవరైనా అవకాశాల కోసం వెళ్తే యూట్యూబ్‌లో ఏమైనా సినిమాలున్నాయా.., షార్ట్ ఫిలిమ్స్ ఏమైనా చేశారా.. ఉంటే ఆయా వెబ్సైట్ లింక్‌ను పంపండి చూస్తామంటూ చెబుతున్నారు. మరోవైపు చాలా మంది ఇలానే సినిమా అవకాశాలు దక్కించుకుంటున్నారు. ఇలానే సంపూర్ణేష్ బాబు సోషల్ మీడియా ద్వారా హీరో అయ్యారు. భాస్కర్ దర్శకుడయ్యారు. ఇలా ఇప్పుడంతా సోషల్గానే చాలా మంది అవకాశాలు దక్కించుకుంటున్నారు. ఆ అడ్డాలో కలిస్తే ఆనందం.. సినిమా అవకాశాల కోసం ఇక్కడికి వచ్చే వారు చాలా మంది ఉంటారు. ముందుగా సినిమా అవకాశా>ల కోసం ప్రయత్నించే వారి అడ్డా ఎక్కడా అని చూస్తే గణపతి కాంప్లెక్స్ కనిపిస్తుంది. అక్కడికి రావడం వల్ల పలానా సినిమా ప్రారంభమవుతుందని, అవకాశాలున్నాయని తెలుస్తుంది. దీనివల్ల సినిమా అవకాశాలు దక్కించుకోవచ్చు. ప్రయత్నం చేస్తే ఏదైనా సాధ్యమవుతుందని ఈ అడ్డాలు చెబుతుంటాయి. ఇక్కడి నుంచి సినీ పరిశ్రమలో చాలా మందికి అవకాశాలు వచ్చాయి. దాదాపు పదిహేనేళ్లుగా గణపతి కాంప్లెక్స్ ప్రాంతంతో నాకు అనుబంధం ఉంది. – కాదంబరి కిరణ్, సినీనటుడు అవకాశాలను సృష్టించుకోవాలి.. సినిమా అవకాశాల కోసం నేను చాలా కాలం ప్రయత్నించాను. ఒకప్పుడు సినిమా కార్యాలయాల చుట్టూ తిరిగేవాడిని. ఆడిషన్స్ జరిగితే అవకాశం, అదృష్టం పరీక్షించుకొనేవాడిని. కానీ ఇప్పుడు పరిస్థితి పూర్తిగా మారిపోయింది. ఆడిషన్స్ జరగడం లేదు. చిన్నచిన్న యూట్యూబ్ వేదికగా చేసేటువంటి ఫిలింలు, షార్ట్‌ఫిల్మ్‌లు మన అవకాశాలను మారుస్తున్నాయి. సోషల్ మీడియా వేదికగా మనల్ని మనం ఇప్పుడు హీరోలుగా చేసుకోవచ్చు. ఇప్పుడు అవకాశాలు కూడా అలానే వస్తున్నాయి. – జమాల్, సినీ ఆర్టిస్ట్ -
ఆడిషన్స్ పేరుతో అసభ్య ఫొటోలు తీసి..
-
సినిమా ఛాన్స్‌లు ఇప్పిస్తానంటూ..
తిరుపతి : క్యాస్టింగ్ కౌచ్ సంస్కృతి చిన్న నగరాలకు కూడా పాకుతోంది. సినిమాల్లో నటించే అవకాశం ఇప్పిస్తానని యువతులను మోసగిస్తూ, వారిని అసభ్యంగా ఫోటోలు తీసి, అనంతరం బ్లాక్‌మెయిలింగ్‌కు పాల్పడుతున్న ముఠా ఆగడాలపై పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు నమోదు అయింది. ఇందుకు సంబంధించి సురేష్ అనే యువకుడితో పాటు అతని స్నేహితుల కోసం పోలీసులు గాలింపు చర్యలు చేపట్టారు. వివరాల్లోకి వెళితే చిత్తూరు జిల్లా చంద్రగిరి మండలం రంగంపేటకు చెందిన సురేష్ స్థానికంగా ఫోటో స్టూడియో నిర్వహిస్తున్నాడు. కొంతకాలంగా స్నేహితులతో కలిసి సినిమాల్లో ఛాన్సులు ఇప్పిస్తామంటూ ఆడిషన్స్ పేరుతో అమ్మాయిల అసభ్య ఫొటోలను తీసి, బ్లాక్ మెయిల్ చేయడం ప్రారంభించాడు. తన మాట వినని, వ్యతిరేకించిన వారి ఫొటోలను ఫేస్బుక్లో పెడుతూ అసభ్య పదాలతో సురేష్ బెదిరింపులకు పాల్పడుతున్నాడు. ఇందుకు సంబంధించి ఓ యువతి ధైర్యం చేసి తిరుపతి ఈస్ట్ పోలీసులకు ఫిర్యాదు చేసింది. ఈ మేరకు కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు. ఇందుకు సంబంధించి పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది. -
స్ర్కీన్ ప్లే 30th May 2018
-
చెరిగిపోయిన చిత్రాలు
తల వంచుకొని నడుస్తున్నాడు. ఆ వీధిలో జన సంచారం తక్కువగా ఉంది. ఒక ఇంటిలో నుండి రాధమనస్సు అనే పాట వినిపిస్తోంది. ఎక్కడ ఆ పాట వినిపించినా నిలబడి విని ఆనందించే అతడు, నేడు నిలవకుండా ముందుకు సాగిపోయాడు. వీధి మలుపులో ఒక ట్యూబులైటు వెలుగుతూ ఉంది. షాపువాడు సామానులను చాలా బాధ్యతతో కడుగుతూ సర్దుతున్నాడు. ‘‘ఏం అన్నా! సినిమాకు వెళ్లి వస్తున్నావా?’’ ‘‘లేదోయ్!’’ అంటూ అక్కడ పేరుకుపోయిన మురికి నీటిని దాటుతూ అన్నాడు. చెప్పులు తెగిపోయాయి. రెండు రోజులుగా ఎప్పుడు తెగిపోతాయోనని భయపెడ్తున్న చెప్పులు, ఆ రాత్రివేళ, ఇంటికి పోతున్న సమయంలో ఎవరూ లేని చోట తెగిపోయాయి. ‘ఇది ఒక రకంగా మంచిదే! రేపు ఎలాగైనా కుట్టించాలి. కనీసం 15 పైసలయినా అవుతాయి.’ అనుకొని వంగి రెండు చెప్పులను చేతిలోకి తీసుకుంటూ ఉండగా మనస్సులో పొంగిన దుఃఖాన్ని ‘‘ఛీ!’’ అంటూ బయటకు కక్కాడు. పచారీ కొట్టుముందు ఉన్న బెంచీ ఖాళీగా ఉంది. పడుకోవచ్చు. ఎసెస్సెల్సీ చదివి ఉండకపోతే దానిపై పడుకోవడానికి ధైర్యం వచ్చి ఉండేదే. తిరిగి నడక ప్రారంభించాడు. ఇంటిలో దీపం మినుక్కు మినుక్కుమంటోంది. తలుపు తట్టడానికి సిగ్గుపడి బయటే నిలబడ్డాడు. వీధి వరండా కిటికీ దగ్గర చీకటిలో ముఖం ఏదో అస్పష్టంగా కనిపిస్తోంది. ‘ఎవరా?’ అని అనుకునేలోగా తలుపు తెరుచుకుంది. అక్కే తలుపు తెరిచింది. ఆ మసక చీకటిలో ఆమె తలలో పెట్టుకున్న బంతిపువ్వు వాసన ప్రత్యేకంగా ఉంది. ‘‘ఏరా! మూగవాడిలా వసారాలో నిలబడిపోయావ్? తలుపు తడితే ఏం? ఇంతరాత్రి అయింది. వచ్చాడో లేదో అని చూసి బయట పడుకుందామని తలుపుతీసాను. ఇలా ఎంతసేపు నిల్చుంటావ్? ఎందుకిలా చేస్తున్నావ్? తలుపు కొడితే కదా ఎవరైనా తలుపు తెరుస్తారు. మంచివాడివిరా! సరే రా!’’ అరుగు కింద చప్పుడు చెయ్యకుండా చెప్పులు పడేశాడు. అక్క తలుపు గడియపెట్టిన చప్పుడుకు మేల్కొన్న నాన్న తలెత్తి చూశాడు. ‘‘ఎవరు శంకరమా? ఎక్కడరా ఇంతసేపు తిరిగి వస్తున్నావ్? వేళకు వచ్చి, ఇంత తిండి తిని పడుకుంటే ఏం? ఆడపిల్ల నీకోసం ఎంత సేపు మేల్కొని ఉంటుంది?’’ గోడలో కలిసిపోయినట్లు వొదిగి నిలబడిన శంకరాన్ని చూసి ‘‘నువ్వు రారా!’’ అని లోపలకు వెళ్లింది అక్క. అంతకు పూర్వమే వంటిల్లు కడగడం చేత అంతా తడితడిగా ఉంది. పచ్చరంగు గచ్చు అక్కడక్కడ పొడిపొడిగా ఉండి మెరుస్తోంది. అక్కడ ఒక గోనెపట్టా వేసి శంకరాన్ని కూర్చోమని చెప్పింది. వంటింటి గుమ్మం దగ్గరే నిలబడి ‘‘నాకు భోజనం వద్దు’’ అని చెప్పి తిరిగి వెళ్లిపోవడానికి సిద్ధమయ్యాడు. వేగంగా వచ్చి అతడి చెయ్యిపట్టుకొని పోకుండా ఆపింది. అతడి ముఖంలోకి చూసింది. అతడు తలవంచుకున్నాడు. ‘‘ఎందుకురా! భోజనం వద్దు అంటున్నావ్? రా! వచ్చి తిని నిద్రపో! చాలా పెద్దమనిషిని అనుకుంటున్నావా?’’ అని బలవంతంగా తీసుకొని వచ్చి గోనెమీద శంకరాన్ని కూర్చోబెట్టింది. వడ్డించిన భోజనం కంచాన్ని అతని ఎదురుగా పెట్టి ఎదురుగా చిన్న పీటను వేసుకొని కూర్చుంది. అతడు తినలేదు. కంచంలోని భోజనాన్ని ఉదాసీనంగా చూస్తుండిపోయాడు. ‘‘ఏరా! అలా చూస్తూ కూర్చున్నావ్? తిను ఎప్పుడో మధ్యాహ్నం తిన్నది కదా! సాయంకాలం కాఫీకూడా తాగి ఉండవ్!’’ అంది అక్క. ఆమె అమితమైన ప్రేమను చూసి అతడు తట్టుకోలేకపోయాడు. పొంగివస్తున్న దుఃఖాన్ని గొంతు లోపలే అణుచుకోవడానికి ప్రయత్నించాడు. పీటను అతడి పక్కకు జరుపుకుని కూర్చుంది ఆమె. ‘‘చెయ్యి పట్టు..’’ అంటూ భోజనాన్ని కలిపి ముద్దలు చేసి ఒక ముద్ద అతని చేతిలో పెట్టింది. ‘‘నువ్వొక్కడివేనా పనిలేకుండా ఉన్నావ్? ఊరిలో ఎంతమంది నీలా చదువుకొని ఉద్యోగాలు లేకుండా ఇంటిలో లేరు? ఏ ఇంటికి మాత్రం ద్వారం ఉండదు? అలాగే ఇదీను. నా విషయం చూడు. రోజురోజుకు వయసు మీదపడుతూనే ఉంది. నేనెవరి దగ్గర మొర పెట్టుకోను? చెయ్యి సరిగ్గా పట్టు. చూడు అన్నం కిందపడగలదు. ఎవరో పరాయివాళ్ల ఇంటికి వచ్చినట్లు బెరుకుగా వస్తావు. ఎవరింటిలోనో తింటున్నట్లు బిడియ పడుతున్నావ్. ఊ! నోటిలో పెట్టుకో!’’ ఇంకా కొంచెం అన్నం పెట్టించుకొని తిన్నాడు. వాకిట్లో చెయ్యి కడుక్కోవడానికి అక్క నీళ్లు పోస్తుంటే కడుక్కున్నాడు. ‘‘చూసుకొని వెళ్లు! దారిలో అడ్డదిడ్డంగా పడుకొని ఉంటారు. ఇవన్నీ సర్దిపెట్టి వస్తాను. వెళ్లి పడుకో!’’ పంచకు చేతులు తుడుచుకుంటూ పడుకోవడానికి వెళ్లి గదిలో లైటు వేశాడు. పెద్ద తమ్ముడు పడుకొని పొర్లుతున్నాడు. ఊయల ఊగుచున్న శబ్దం అయింది. ఆ శబ్దం అతడికి ఊహ తెలిసినప్పటి నుండి వినిపిస్తూనే ఉంది. అది అతడికి బాగా నచ్చే శబ్దం. ఆ ఊయలమీద అతడు, అక్క, తమ్ముడూ అందరూ సెలవు రోజుల్లో బస్సు ఆట ఆడేవారు. అతడే డ్రైవరు. చేతి నిండా క్యాలండరు ముక్కలను పట్టుకున్న తమ్ముడు కండక్టర్. ఊయలను ఊపి ఊపి చివరకు ఎక్కబోతుండగా ఒకసారి పడిపోతే నుదుట దెబ్బతగిలింది. ఇప్పటికీ అతడికి తెలియకుండా నుదుట మీద దెబ్బ తగిలిన చోట ఉన్న మచ్చదగ్గరకు చెయ్యి వెళ్లింది. చెల్లా చెదురుగా పడివున్న తమ్ముడి పుస్తకాలను బాగా సర్దిపెట్టాడు. బాగా చదివే తమ్ముడిని, కష్టంలో కష్టంగా భావించి కష్టపడి చదివిస్తున్నాడు నాన్న. అతడికి మాత్రం చదువూలేదు, ఉద్యోగమూలేదు. చొక్కా తీసి గోడకు ఉన్న హేంగర్‌కు తగిలించి గోడకు చేరబడి పక్కమీద కూర్చున్నాడు. నిద్రపోకపోయినా పడుకొని తీరాలి. ఇదేం కష్టం? ఇంటిలో ఉండడమే పెద్ద ఇబ్బందిగా ఉంది. అక్క వచ్చింది. అతడి తల పక్కగా ఆమె పక్క ఉంది. ‘‘ఇంకా ఏం ఆలోచిస్తున్నావ్? నిద్రపోలేదా?’’ అని అడిగింది అక్క. నిట్టూర్పు విడిచాడు అతడు. ఆమె రెండు తలదిండులను చేర్చి కూర్చుంది. మసగ్గావున్న నైట్ ల్యాంపు వెలుతురులో ఆమె చాలా అందంగా ఉంది. ఇంటిలో అందరి కంటే ఆమెదే మంచి రంగు. అయినా ఇంకా పెండ్లి కాలేదు. ‘‘ఆ కంపెనీలో ఎవరో ఫ్రెండ్ ఉన్నాడు, ఉద్యోగ విషయంగా రమ్మని చెప్పాడన్నావ్, వెళ్లావా?’’ కొద్దిసేపు మౌనంగా ఉండి అతడు మాట్లాడసాగాడు. ‘‘చూశావా ఎల్లుండి రమ్మని చెప్పాడు. దారిలో లాలాపత్రం దగ్గర ఆర్ముగం మామను చూశాను. రేపు తాళైయూత్తుకు రా! మా సిమ్మెంటు ఫ్యాక్టరీ సూపర్వైజర్తో చెప్తాను’’ అని అన్నాడు. అది ఎంతో భయంతో మెల్లగా చెప్పాడు. ‘‘వాళ్లింటిలో అందరూ బాగున్నారా? వాళ్ల అబ్బాయి ఉద్యోగంలో చేరాడట కదూ!’’ ‘‘ఊ! అందరూ మన నాన్నలాగే ఉంటారా? వాళ్ల అబ్బాయి ఉద్యోగంలో చేరాడట’’ ఆ మామ కొడుక్కి అక్కను ఇవ్వాలని అనుకున్నారు. మాటలు జరిగాయి. కానీ నిశ్చయం కాలేదు. ‘‘రేపు నువ్వు తాళయుత్తుకు ఎప్పుడు వెళ్తావ్?’’ ‘‘ఎందుకు అక్కా వెళ్లడం? అక్కడేం ఉద్యోగాలు రాసులు పోసుకొని కూర్చున్నారా?’’ ‘‘పోరా.. వెధవా!! ఆ మామ నిన్ను కావాలనే పిలిచాడు వెళ్లి రా! బస్సుకు డబ్బులు ఉన్నాయా? లేకపోయినా, నచ్చితే నడిచే పోతావ్?’’ అంది ఆమె. ‘‘ఊ! ఉన్నాయి.’’ ‘‘అబద్దం చెప్పకు’’ కూర్చున్న చోటునుండే, చెయ్యి ఎత్తి హేంగర్‌కు తగిలించి ఉన్న అతడి చొక్కా అందుకుంది. 5 పైసల నాణెం ఒకటి కిందపడింది. చొక్కా నుంచి ఒకటే చెమట వాసన. జేబులో చెయ్యిపెట్టి చూసింది. రెండు నలిగిపోయిన బస్సు టికెట్లు. వాటిని తీసి బయట పారేసింది. ‘‘ఎక్కడరా డబ్బులు? నాకు నీ గురించి తెలీదా?’’ అని లేచివెళ్లి బీరువా తెరిచింది. ఆమె తన బట్టల మడతల మధ్య నుంచి ఒక చాక్లెట్ డబ్బా తీసింది. డబ్బాలో నుంచి చిన్న కుంకుమ భరణి తీసుకొని వచ్చింది. అందులో నుంచి మడిచి పెట్టి ఉన్న ఒక రూపాయి నోటు తీసి అతడికి ఇచ్చింది. ‘‘ఎందుకక్కా!’’ అని అడిగాడు మెల్లగా. ‘‘సరేలే! చాల్లే! బెట్టు చెయ్యకు!’’ అని చెప్పి నవ్వింది. మరల దగ్గరకు వచ్చి కూర్చొని చొక్కాతీసి, చొక్కా చేతి మడతలను విప్పింది. అతని దగ్గర నుంచి రూపాయి తీసుకొని, ఆ మడతలో పెట్టింది. ‘‘ఈవేళే కదా! ఈ చొక్కా వేసుకున్నావ్? ఇంతలోనే ఇంత మురికిగా అయిందేమిటి?’’ సబ్బుతో స్నానం చెయ్యడమైనా మానేసినట్లున్నాడు. అతడు ఆమెను సూటిగా చూశాడు. ‘‘అంతా నేను చూస్తున్నాను, ఈమె ఇంటిలోనే కదా ఉంటుంది. ఈమెకు ఏం తెలుసులే.. అని అనుకుంటున్నావా?’’ అంది ఆమె. ‘‘సబ్బు రాసుకొని స్నానం చెయ్యడం మానేశావు. అంతా పేస్టుతో పళ్లు తోముకుంటుంటే.. నువ్వు మాత్రం 15 పైసలకు పండ్ల పొడి కొని పండ్లు తోముతున్నావ్? ఇదంతా గమనించి చూడ్డం అమ్మకు తెలీదు. ఒరేయ్! నీకు ఏమైందిరా?’’ ‘‘... ఉద్యోగం లేకపోయినంత మాత్రాన అంత పౌరుషంగా ఉండాలా? నన్ను చూడు ఇంటిలో కూర్చొని పది సంవత్సరాలయ్యింది. ఏమైనా నాకు నేను తగ్గించుకున్నానా? ఏమైనా నువ్వు చాలా పౌరుషవంతుడివిరా!’’ అంది ఆమె. చివరకు దుఃఖంతో ఆమె గొంతు జీరపోయింది. చప్పున అతడు తన ముఖాన్ని ఆమె ఒడిలో పెట్టుకొని పడుకున్నాడు. ఆమె అతడి వీపుమీద చెయ్యి వేసి నిమరసాగింది. (‘తమిళ చిన్న కథలు’ సౌజన్యంతో...) -
మొదటి సినిమా
ఈరోజు ఉదయం లేచినప్పట్నుంచీ చాలా చిరాకుగా ఉంది. మనసంతా ఏదో ఆందోళనతో నిండిపోయినట్టు అనిపిస్తోంది. గడియారంలో సెకండ్ల ముల్లు గంటల ముల్లంత చిన్నగా నడుస్తోంది. ఈ మధ్య కాలంలో అసలెప్పుడూ ఇలా లేదు. అసలు ఏ పని చేయాలో అర్థం కావడం లేదు. నాన్న, తమ్ముడు సినిమాకు వెళుతున్నారు. నేనిప్పటివరకూ సినిమా చూడలేదు. థియేటర్ ఎలా ఉంటుందో తెలీదు. తమ్ముడు ఇప్పటికే చాలాసార్లు నాన్నతో కలిసి సినిమాలు చూశాడు. నేను మాత్రం ఎప్పుడూ సినిమా చూసింది లేదు. ఎందుకో ఆ ఆలోచనే ఉండదు. ఇవ్వాళెందుకో మొదటిసారి సినిమా చూడాలనిపిస్తోంది. వాళ్లు వెళ్తూ వెళ్తూ ప్రతిసారీ, ‘‘సినిమాకు వెళ్తున్నాం. వస్తావా?’’ అని అడుగుతారు. ‘‘నాకిష్టం లేదు.’’ అంటుంటాను నేను. ఈసారి వాళ్లు అడక్కముందే, నేనే అన్నా – ‘‘నేనూ వస్తా’’. చిరాకు అంతా ఎక్కడికో ఎగిరిపోయింది. తెలియని ఉత్సాహమేదో నన్నలా పూర్తిగా పట్టేసుకున్నట్టు ఒకలాంటి ఆనందం. ఆలోచనలు మనం అనుకున్నట్టు మారిపోతాయేమో! సంతోషంగా ఉండటం, అన్నింటికంటే ముందు మనకు మనం అనుకోవడంలోనే ఉంటుందనుకుంటా. కొత్తబట్టలు వేసుకున్నా. నాకెంతో ఇష్టమైన చెప్పులు వేసుకున్నా. ఈ చెప్పుల గురించి చెప్పాలంటే పెద్ద కథే ఉంది. మా నాన్న, నేను ఒకసారి పక్క ఊరికి వెళ్లాం. మేం సినిమా చూడాలన్నా, పండగ బట్టలేమైనా కొనుక్కోవాలన్నా, ఇంకే పనున్నా పక్క ఊరికి వెళ్లాల్సిందే. అప్పుడది పండగ సీజన్ కూడా కాదు. ఏదో పెళ్లి ఉందంటే నాన్న, నేను, తమ్ముడు వెళ్లాం. ఆరోజు వర్షం బాగా పడుతోంది. బస్టాండ్‌కి వెళ్లడానికి ముందే ఎక్కువైంది వర్షం. ఒక చెప్పుల షాపు ముందు వర్షం తగ్గేంతవరకూ నిలబడ్డాం. నాన్న ఆ వర్షం ఎప్పుడు తగ్గుతుందా అని ఎదురుచూస్తున్నాడు. తమ్ముడికి ఇవేవీ పట్టవు కదా.. ఇంటికెళ్దామని గొడవ చేస్తున్నాడు. నాకేదీ కనిపించట్లేదు. మేం నిలబడ్డ చోటునే వరుసగా కొత్త కొత్త డిజైన్ చెప్పులు లైన్‌గా పెట్టి ఉన్నాయి. అవి తప్ప ఏం కనిపించట్లేదు. అదిగో అప్పుడు మెచ్చిన చెప్పులే ఇవి. నాన్నని ఎంతగా బతిమిలాడానో ఈ చెప్పుల కోసం. ఈరోజు ఈ చెప్పులు వేసుకొని సినిమాకు వెళుతున్నానంటే చాలా సంతోషంగా ఉంది. ఇంటి దగ్గర్నుంచి అర కిలోమీటరు దూరం నడిస్తే బస్టాండ్ వస్తుంది. అక్కడ బస్ ఎక్కితే ఇరవై నిమిషాల్లో పక్క ఊర్లో ఉండొచ్చు. బస్సెక్కి ఈ దారంతా వెళుతూంటే నాకు ఆరోజు పెళ్లికి వెళ్లిందే గుర్తొస్తోంది. కొన్ని నెలల్లోనే ఇదంతా ఎలా మారిపోయిందో కదా అని చుట్టూ ఉన్న ప్రదేశాలన్నీ బస్‌లోంచి చూస్తూ కూర్చున్నా. ఊరొచ్చేసింది. ఎర్రటి ఎండాకాలం కాబట్టి అప్పటికే సూర్యుడు మండిపోతున్నాడు. బస్టాండ్ నుంచి కొద్దిదూరం నడిచెళ్తే సినిమా థియేటర్ వచ్చేస్తుంది. ముగ్గురం ఎండలో నడుస్తున్నాం. సరిగ్గా అప్పుడే నాకిష్టమైన చెప్పు తెగిపోయింది. ‘అబ్బా! ఈ టైమ్‌లో ఇలా జరిగిందేంటీ?’ అనుకుంటూ ఆ తెగిపోయిన చెప్పుతోనే నడుస్తూ ఉన్నా. వల్ల కాలేదు. కొద్దిసేపటికి ఆ చెప్పులు చేతిలోకి తీసుకొని నడవడం మొదలుపెట్టా. ఎండకు కాళ్లు మండిపోతున్నాయి. ‘సినిమా వద్దు. ఏం వద్దు.’ అనిపించింది ఒక్కసారే. చుట్టుపక్కల ఎక్కడా ఒక్క చెప్పుల షాపు కూడా కనిపించట్లేదు.అంతలోనే అదే వెతుక్కుంటూ వచ్చిందా అన్నట్టు థియేటర్ కనిపించింది. ‘హమ్మయ్యా!’ అనుకుంటూ ఆ థియేటర్ గోడ వైపు పరిగెత్తి నీడలో నిలబడ్డా.‘‘ఇక్కడ ఆగావేంటీ? ఇది కాదు మనం వెళ్లే సినిమా!’’ అని ముందుకు నడిపించాడు. నాకు కాళ్లు కాలిపోతున్నాయి. ‘‘ఒరేయ్ తమ్ముడూ! కాసేపు నీ చెప్పులు ఇవ్వవూ..’’ అనడిగా.నేనేం అడిగినా, ఏం మాట్లాడినా నాతో గొడవ పెట్టుకునే నా తమ్ముడు, ఇవ్వాళేంటో అడగ్గానే చెప్పులు ఇచ్చేశాడు. అవి వేస్కొని కొద్దిదూరం నడిచా. మళ్లీ వాడికి కూడా కాళ్లు కాలుతాయి కదా అని ఇచ్చేశా. ఎంతదూరం నడుస్తున్నా ఈ థియేటర్ రావట్లేదు. వెనక్కి వెళ్లిపోవాలనిపించింది. అలాఅనిపించిందో లేదో థియేటర్ వచ్చేసింది. మూడు బెంచీ టికెట్లు కొన్నాడు నాన్న.నీడపట్టుకు వచ్చేశా కాబట్టి ఇప్పుడు బాగానే ఉంది. ‘‘సినిమా మొదలవ్వడానికి ఇంకా టైముంది’’ అని చెప్పి వెళ్లిపోయారు థియేటర్ వాళ్లు. నేను, నాన్న, తమ్ముడు బయటే కూర్చున్నాం. కాసేపటికి రోడ్డు మీద ఉన్న చెట్టు కిందకి వెళ్లి కూర్చున్నాం. అక్కడ కూర్చొని ఈ రోడ్డంతా గమనిస్తూ ఉంటే మా ఊరికీ, ఈ ఊరికీ ఎంత తేడానో కదా అనిపించింది. చాలాసేపు ఎవ్వరితో ఏం మాట్లాడకుండా రోడ్డు వైపే చూస్తూ కూర్చున్నా.థియేటర్ వాళ్లు లోపలి గేటు తెరిచారు. దాదాపుగా పరిగెత్తుకుంటూ వెళ్లి కూర్చున్నాం. బెంచీ టిక్కెట్లు. తెరేమో చాలా దగ్గరగా ఉంది. ఎంతోసేపు ఎదురుచూశాక కానీ సినిమాను ప్రారంభించలేదు. ఇంతసేపూనేను నా మొదటి సినిమా చూస్తున్నానన్న ఉత్సాహంతోనే కాళ్లు కాలినా ఏదీ పట్టించుకోలేదు. సినిమా మొదలైంది.చాలాసేపు ఇంత దగ్గరగా ఉన్న తెరను చూడటం చాలా ఇబ్బందిగా కనిపించింది. తలంతా ఎత్తి చూస్తే తప్ప తెరంతా కనిపించడం లేదు. అలా చూసీ చూసీ మెడ పట్టేసుకుంది. కాసేపు ఏం చూడకుండా పడుకున్నా. మధ్య మధ్యలోలేచి చూస్తుంటే మళ్లీ చూడాలనిపిస్తోంది. అలా ఎంతసేపు సినిమా చూశానో, ఎంతసేపు పడుకున్నానో తెలీదు కానీ, మొదటిసారి సినిమా చూడటం మాత్రం చాలా బాగుంది. ఒక ఊహాలోకంలోకి తీసుకుపోయి పడేసినట్టు అనిపించింది.నాన్న, తమ్ముడు ఇన్నిసార్లు పిలిచినా నేను ఇవ్వాళ్టివరకూ సినిమా ఎందుకు చూడలేదా అనిపించింది. సినిమా అయిపోయింది.అప్పటివరకూ సినిమాను ఎంతో ఇష్టంగా చూస్తున్న వాళ్లంతా బయటకు వెళ్లడానికి ఎగబడుతున్నారు. ఈ దృశ్యం నాకెందుకో వింతగా కనిపించింది. ఎవరో పిలుస్తున్నట్టు ఎందుకు వీళ్లంతా ఎగబడుతున్నారనిపించింది. నేనూ మెల్లిగా కుర్చీలోంచి లేచి బయటకొచ్చా. బయట ఇంత ఎండ ఉందన్న విషయం మళ్లీ గుర్తొచ్చింది. నా కాళ్లకు చెప్పులు లేవన్న విషయం కూడా ఆ వెంటనే గుర్తొచ్చింది. మేం థియేటర్‌కి వచ్చినప్పటితో పోలిస్తే ఇప్పుడు ఎండ ఇంకా ఎక్కువైంది. కాసేపు చెప్పులు వేసుకొని నడిచే ప్రయత్నం చేశా. కుదర్లేదు.‘‘పడెయ్యొచ్చు కదా!’’ అన్నాడు నాన్న.కానీ నేనెలా ఆ చెప్పుల్ని వదిలేసుకుంటాను? ఇష్టంగా కొన్నవి. కుట్టుకుంటే మళ్లీ పనికొస్తాయి. పడెయ్యిఅన్నాడు నాన్న కానీ పడేస్తే ఇప్పుడు మళ్లీ కొత్తవి, ఇలాంటివే, నేనిష్టపడేవే కొనిస్తాడా?చెప్పులు మళ్లీ చేతులోకి తీసుకొని నడుస్తున్నా. ఎండ మండిపోతోంది. కాళ్లు కాలిపోతున్నాయి. అలా చాలాసేపు చెప్పుల్లేకుండా నడుస్తుంటే అనిపించింది.‘అవును. నేనిలా చెప్పులు లేకుండా నడవడం చూస్తూ ఈ జనాలు నా గురించి ఏమనుకుంటూ ఉంటారు?’అక్కడ మొదలైంది నాలో నాకే ప్రశ్నలు మీద పడటం. ఈ ప్రశ్నల వల్లనో ఏమో కాళ్లు ఇప్పుడింకా ఎక్కువ కాలుతున్నాయి. ఒక్కో అడుగుకి ఒక్కో ప్రశ్న. ‘వీళ్లంతా నా గురించి ఏమనుకుంటున్నారో!’.సిగ్గనిపించింది. ఒక్క అడుగు కూడా ముందుకు వేయాలనిపించలేదు. కాసేపు చుట్టూ చూశా. ఎవ్వరి పనుల్లో వాళ్లున్నారు. చాలాసేపు వాళ్లను చూస్తూంటే అనిపించింది – ‘ఇందులో ఎంతమందిని నేను మళ్లీ కలుస్తా? ఇక్కడ చూసిన వాళ్లు నన్నెప్పుడైనా మళ్లీ చూస్తారా? చూసినా గుర్తుపడతారా? ఈ ప్రయాణంలో ఇక్కడ నేనొక మనిషిని అంతే కదా!’. ఆలోచనలు అలా నాకే తెలియకుండా పరుగులు పెడుతూ ఉంటే, ‘నేనెందుకు ఇప్పుడు ఎవరు నన్నెలా చూస్తున్నారో ఆలోచించాలి?’ అనుకున్నా. చేతిలో పట్టుకున్న చెప్పులు చేతిలోనే ఉన్నాయి. ఎండ అలాగే ఉంది. నాన్న, తమ్ముడు నాకంటే వేగంగా నడుస్తూనే ఉన్నారు. నేనూ వాళ్లను అందుకునేంత వేగంగా ముందుకెళ్లా. నాకోసమేనేమో అంతసేపూ కాసిన ఎండ ఒక్కసారే మాయమైంది. మబ్బులు కమ్ముకున్నాయి అంతటా. నాకవి గొడుగుపడుతున్నాయి. నా మొదటి సినిమా అనుభవం ఇప్పుడు కూడా బాగుంది. -
స్ర్కీన్ ప్లే 7th May 2018
-
నువ్వు రాయడం మొదలెట్టాక...
రాసి ప్రేక్షకులను, రాయక నిర్మాతలను యేడిపిస్తారని పేరుపడిన ఆత్రేయ కొంతకాలం తెలుగు సినీపరిశ్రమను శాసించారు. కానీ డెబ్భైల దశకంలో సినిమా పాటను వేగంగా, వైవిధ్యంగా రాయగల వేటూరి సుందర రామమూర్తి రంగప్రవేశం చెయ్యడంతో ఆత్రేయ కొంచెం వెనకబడ్డారు. అయితే వేటూరి మాత్రం ఆత్రేయను గురువుగా, గీతాచార్యునిగానే భావించేవారు. ఆత్రేయతో వుండే అనుబంధంతో వేటూరి ఆయనను కలిసినప్పుడల్లా పిచ్చాపాటీ మాట్లాడుకోవడం పరిపాటిగా వుండేది. అలా ఒక సందర్భంలో వయసులో తన కంటే పెద్దయిన ఆత్రేయ జుట్టు నల్లగా నిగనిగలాడుతూ వుండడం గమనించిన వేటూరి – ‘గురువుగారూ, నా తల అప్పుడే తెల్లబడిపోతోంది. మీ తల యింత నల్లగా వుండటంలోని రహస్యమేమి’టని అడిగారట! ఆత్రేయ నవ్వుతూ తను వాడుతున్న ఆయుర్వేదానికి చెందిన తలనూనె పేరు చెప్పారట! ఆ చిట్కా తెలిసిన వేటూరి కూడా ఆ నూనె రాయడం ప్రారంభించి తన గ్లామర్‌ను పెంచుకున్నారట! కొంతకాలం తర్వాత జుట్టు నల్లదనాన్ని జాగ్రత్తగా కాపాడుకొంటున్న వేటూరి, ఆత్రేయను చూడ్డానికి వెళ్లేసరికి ఆశ్చర్యకరంగా ఆయనకు ఆత్రేయ తెల్లని జుట్టుతో కనిపించారట! వేటూరి విస్తుపోతూ – ‘ఈ మధ్య మీరు (ఆ తలనూనె) రాయడం మానేసినట్టున్నారే?’ అని అడిగారట! దానికి బదులుగా ఆత్రేయ ‘అవును – నువ్వు రాయడం మొదలుపెట్టిన తర్వాత నేను రాయడం మానేశాను’ అన్నారట రాయడానికి రెండో అర్థాన్ని స్ఫురింపజేస్తూ చమత్కారంగా! ‘నువ్వు చాలా స్పీడుగా యెడా పెడా రాసి పారేస్తున్నావట! ఏం తొందరొచ్చిందయ్యా?’ అనే ఆత్రేయ ఆశీఃపూర్వకమైన మందలింపునకు వేటూరి వినమ్రంగా – ‘గురువుగారూ, మీ అంత గొప్ప యెలాగూ రాయలేను, మీ కంటే తొందరగానైనా రాయకపోతే నా బ్రతుకుదెరువు యెలాగండీ?’ అని బదులివ్వడం పై సంఘటనకు పూర్వరంగం! పంపినవారు: డా. పైడిపాల -
కాపీరైట్ నాది బ్రదర్!
సినిమా కష్టాలు అనే మాట వాడుతుంటాం. ఆ కష్టాల్లో కూడా రకరకాలు ఉంటాయి. అలాంటి ఒక కష్టాన్ని ఆరుద్ర తన ‘సినీ మినీ కబుర్లు’లో పంచుకున్నారు. చిన్నప్పుడు పిల్లలు పొలానికి వెళ్లినప్పుడు, అందులో ఒకడు ‘ఈ చెట్టు పళ్లు నావిరోయ్’ అనేస్తే మిగతావారు విధిగా ఆ చెట్టును వదిలేసి వేరేది చూసుకుంటారు. అదొక రాయబడని చట్టం. ఈ సరదా ఘటన కూడా అలాంటిదే. ‘‘ఒకనాడు నేను పాండిబజారులోని రాజకుమారి టాకీసులో ఆడుతున్న ఒక ఇంగ్లీషు సినిమాకి ఒక ప్రొడ్యూసర్ బలవంతం మీద రెండోసారి వెళ్లాను. ఇంటర్వెల్లో జూనియర్ సిగరెట్ తాగుతూ కనబడ్డాడు. ‘‘బ్రదర్! ఇది నువ్వు ఎడాప్ట్ చేయాలనుకుంటున్నావేమో! నేను రిజర్వు చేసుకున్నాను’’ అని జూనియర్ స్పష్టపరిచాడు. ‘‘ఇది నేను రెండోసారి చూస్తున్నాను బ్రదర్!’’ అని నేను చెప్పాను. ‘‘నేను మూడోసారి చూస్తున్నాను. అసిస్టెంట్ డైరెక్టర్‌కు సీనిక్ ఆర్డర్ ఏమిటో డిక్టేట్ చేస్తున్నాను, రాసుకుంటున్నాడు. దీనికి కాపీ రైటు నాది’’ అని జూనియర్ ప్రకటించాడు. చిత్రరంగంలో కాపీరైటు అంటే చట్టబద్ధమైన సర్వ స్వామ్యాలు కావు. కాపీ చేసే రైటు. ఆ చిత్రాన్ని కాపీ చేసే రైటు జూనియర్‌కు ఉందన్న సంగతి నా ప్రొడ్యూసర్‌కు నచ్చచెప్పటానికి నా తాతలు దిగివచ్చారు’’. (మీకు ఇలాంటి మరమరాలు తెలిస్తే మాకు రాయండి.) -
కోఆర్డినేటర్ వ్యవస్థను రద్దు చేయండి
సాక్షి, హైదరాబాద్: సినిమారంగంలో వివిధ పరిణామాలకు దారితీస్తున్న కోఆర్డినేటర్ వ్యవస్థను రద్దు చేసి, వారి స్థానంలో మేనేజర్ స్థాయి వ్యక్తులను కొనసాగించాలని సినిమాటో గ్రఫీ శాఖ మంత్రి తలసాని శ్రీనివాసయాదవ్ అన్నారు. ఆర్టిస్టులకు ప్రొడ్యూసర్స్ చెల్లిస్తున్న రెమ్యునరేషన్ నేరుగా వారి ఖాతాల్లో జమయ్యే విధంగా చూడాలని, అంతేకాకుండా ఆయా రంగాల్లోని వారికి చెల్లిస్తున్న రెమ్యునరేషన్‌ను షూటింగ్ ప్రాంతాలలో ప్రదర్శించాలని, ప్రొడ్యూసర్స్ కార్యాలయాలలో బోర్డులను ఏర్పాటు చేయాలని ఆయన సూచించారు. రాష్ట్ర ప్రభుత్వం, చలనచిత్ర రంగ ప్రముఖులతో ఉన్నతస్థాయి కమిటీని ఏర్పాటు చేయాలని శనివారం సచివాలయంలో తలసాని అధ్యక్షతన జరిగిన సమావేశంలో పలు నిర్ణయాలు తీసుకున్నారు. ఏదైనా అంశంపై మీడియా ముందుకు వెళ్లేందుకు ఐదుగురు సభ్యులతో కూడిన కమిటీని ఏర్పాటు చేసుకోవాలని, ఇందులో అన్ని రంగాల నుంచి ఒక్కొక్కరిని ఎంపిక చేసుకునేలా జాగ్రత్తలు పాటించాలని మంత్రి సూచించారు. కచ్చితమైన నిబంధన లను రూపొందించి వాటిని అతిక్రమించిన వారి పట్ల కఠినంగా వ్యవహరించేందుకు ఒక కార్యాచరణ రూపొందిస్తున్నట్లు మా జనరల్ సెక్రటరీ నరేశ్ పేర్కొన్నారు. ఆర్టిస్టుల నుంచి ఫిర్యాదులను స్వీకరించేందుకు ఎఫ్‌డీసీలో ప్రత్యేక ఫిర్యాదుల సెల్‌ను ఏర్పాటు చేయనున్నట్లు మంత్రి వెల్లడించారు. వేధింపులు, మోసాలకు గురయ్యే మహిళలు ఈ సెల్లో కానీ, షీ టీమ్స్‌కు కాని ఫిర్యాదు చేయాలని తెలిపారు. పుట్టగొడుగుల్లా పుట్టుకొ స్తున్న ఫిల్మ్ ఇన్స్టిట్యూట్లను నియం త్రించేందుకు మార్గదర్శకాలను రూపొం దించడానికి చర్యలు తీసుకుంటామని మంత్రి తెలిపారు. మహిళలకు షూటింగ్ ప్రాంతాలలో కనీస సౌకర్యాలను కల్పించాలని, ఆడిషన్స్ నిర్వహించే సమయాలలో తగు జాగ్రత్తలు తీసుకోవాలని సూచించడం జరిగిందన్నారు. వారం, పదిరోజుల్లో కమిటీ సమావేశాలు నిర్వహించి ఇటీవల జరిగిన పరిణామాల నివారణకు తీసుకోవాల్సిన చర్యలపై తుది నివేదికను తయారు చేసి ప్రభుత్వానికి అందిస్తే, అన్నివర్గాల వారితో చర్చించి మహిళా ఆర్టిస్టులకు తగు రక్షణ కల్పించేందుకు అవసరమైన చర్యలు తీసుకునేందుకు ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేస్తుందని మంత్రి వారికి వివరించారు. ఈ సమావేశంలో ఎఫ్డీసీ చైర్మన్ రాంమోహన్‌రావు, హోంశాఖ ప్రిన్సిపల్ సెక్రెటరీ రాజీవ్ త్రివేదీ, కార్మికశాఖ కమిషనర్ మహ్మద్ నదీమ్, ఎఫ్డీసీ ఈడీ కిషోర్‌బాబు, సీఐడీ ఎస్పీ అపూర్వారావు, మా అధ్యక్షుడు శివాజీరాజా, తెలుగు చలనచిత్ర దర్శకుల సంఘం అధ్యక్షుడు ఎన్.శంకర్, చిత్ర ప్రముఖులు జీవిత, తమ్మారెడ్డి భరద్వాజ, పరుచూరి వెంకటేశ్వరరావు, జెమిని కిరణ్, సి.కళ్యాణ్ పాల్గొన్నారు. -
‘అన్నదాత సుఖీభవ’కు అనుమతివ్వండి
సాక్షి, హైదరాబాద్: దేశవ్యాప్తంగా రైతన్నల ఆత్మహత్యలపై చర్చ జరుగుతోందని, ఆత్మహత్యల్లో మహారాష్ట్ర మొదటి స్థానంలో ఉండగా, తెలంగాణ రెండవ స్థానంలో ఉందని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి చాడ వెంకట్‌రెడ్డి అన్నారు. రైతుల ఆత్మహత్యలపై, సమస్యలపై సినిమా తీస్తే పాలకులు అడ్డంకులు సృష్టించడం సరికాదని అన్నారు. నారాయణమూర్తి తీసిన ‘అన్నదాత సుఖీభవ’ సినిమాను సెన్సార్ అడ్డుకోవడాన్ని నిరసిస్తూ ఆదివారం మఖ్దూంభవన్‌లో వామపక్ష పార్టీల నాయకులు విలేకరుల సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సమావేశంలో చాడ వెంకట్‌రెడ్డి, గోవర్ధన్, సీపీఎం నేత నర్సింగ్‌రావు, సజయ, విమలక్క, టీజేఎస్ సత్యంగౌడ్ తదితరులు పాల్గొన్నారు. సమావేశంలో పలువురు నేతలు మాట్లాడుతూ, జీఎస్టీ, నోట్లరద్దు వల్ల ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలు, స్వామినాథన్ కమిటీ సిఫార్సులు అమలు చేయాలనే విషయాలు ఈ సినిమాలో పొందుపర్చడం సెన్సార్‌కు, అటు ప్రభుత్వానికి నచ్చలేదని వారు విమర్శించారు. సెన్సార్ బోర్డు ప్రభుత్వాలకు వత్తాసు పలకడం కాకుండా ప్రజలకు ఉపయోగపడే సినిమాలకు అనుమతి ఇవ్వాలని నేతలు డిమాండ్ చేశారు. సెన్సార్ సర్టిఫికెట్ ఇవ్వండి: రైతు సంఘం సాక్షి, అమరావతి/గుంటూరు ఎడ్యుకేషన్: అన్నదాత సుఖీభవ చిత్రానికి సెన్సార్ సర్టిఫికెట్ మంజూరు చేయాలని ఆంధ్రప్రదేశ్ రైతుసంఘం విజ్ఞప్తి చేసింది. బడా పారిశ్రామిక వేత్తల రుణాల ఎగవేత, బ్యాంకుల వైఫల్యం, పాలకుల తీరును ఎత్తిచూపిన సన్నివేశాలను తొలగించమనటం ఏం న్యాయమని ప్రశ్నించింది. కాగా, భావ ప్రకటన స్వేచ్చను అడ్డుకోవడం కేంద్రానికి తగదని రాజ్యసభ మాజీ సభ్యుడు, రైతు నాయకుడు యలమంచిలి శివాజీ అన్నారు. ‘అన్నదాత సుఖీభవ’చిత్రంపై సెన్సార్ బోర్డు ఆంక్షలు విధించడం సమంజసం కాదన్నారు. -
డ్రగ్స్ కేసులో చార్జిషీట్‌కు రంగం సిద్ధం!
సాక్షి, హైదరాబాద్: సంచలనం సృష్టించిన పలువురు సినీ ప్రముఖుల డ్రగ్స్ వినియోగం, విక్రయం కేసులో ఎక్సైజ్ సిట్ చార్జి షీట్ వేసేందుకు సిద్ధమైంది. కోర్టు నుంచి అందిన ఎఫ్ఎస్ఎల్ నివేదిక ఆధారంగా సిట్ అధికారులు చార్జిషీట్ రూపొందిస్తున్నారు. ఒకట్రెండు రోజుల్లో దీన్ని కోర్టుకు సమర్పించనున్నారు. సిట్ విచారించిన వారిలో పూరీ జగన్నాథ్, రవితేజ, తరుణ్, నవదీప్, నందు, తనీష్, చార్మి, ముమైత్ ఖాన్, సుబ్బరాజు తదితరులు ఉన్నారు. విచారణలో ముగ్గురు సినీ ప్రముఖుల నుంచి రక్తం, గోళ్లు, వెంట్రుకల నమూనాలను సేకరించిన అధికారులు వాటిని ఫోరెన్సిక్ పరిశీలనకు పంపారు. తాజాగా ఫోరెన్సిక్ నివేదిక అందడంతో ఇద్దరు ప్రముఖులు డ్రగ్స్ తీసుకున్నట్లు నిర్ధారణ అయిందనే ప్రచారం జరుగుతోంది. కానీ సిట్ అధికారికంగా దీన్ని ధ్రువీకరించలేదు. -
స్క్రీన్ ప్లే 28th March 2018
-
స్క్రీన్ ప్లే 26th March 2018
-
గుండె తాకట్టు
ప్రస్తుతం వరుస సూపర్హిట్లతో దూసుకుపోతోన్న యంగ్ స్టార్ నటించిన ఓ సినిమాలోని సన్నివేశాలివి. మనిషికింత సాయం చేయడమే మానవత్వమని చెప్తూ గొప్ప సందేశాన్నిచ్చే ఈ సినిమా పేరేంటో చెప్పుకోండి చూద్దాం... చలపతి మాష్టారు కొడుకు చావు బతుకుల్లో ఉన్నాడు. ఆపరేషన్ చేయాలి. డబ్బుల్లేవు. నందు ఊరంతా తిరిగాడు అప్పిచ్చేవాళ్ల కోసం. ఎక్కడా రూపాయి దొరకలేదు. ఇంక మిగిలింది ఒక్కటే మార్గం. జంగయ్య. కానీ జంగయ్య దగ్గర అప్పు తీసుకోవడమంటే ఆత్మహత్యతో సమానం. అయినా సరే అనుకున్నాడు నందు. గర్ల్‌ఫ్రెండ్ పద్దుతో కలిసి జంగయ్య దగ్గరికెళ్లాడు. ‘‘ఏం తమ్మీ దారి తప్పొచ్చినవ్?’’ అడిగాడు జంగయ్య. ‘‘దారి చూపిస్తావనే వచ్చా’’‘‘దారి చూపిచ్చేడిదేముందీ? పైసల్ మిత్తికిచ్చుడే మన దందా. ఏం పెడ్తవ్?’’ తన దగ్గర ఏం లేదన్నాడు నందు. టైమ్ కూడా లేదన్నాడు. చలపతి మాష్టారు కొడుకును బతికించుకోవడానికి తల తాకట్టు పెట్టుకోవడానికైనా రెడీ అన్నాడు. ‘‘గాయనేమన్నా నీకు పుకట్ల చదువు చెప్పిండా?’’ అడిగాడు జంగయ్య.‘‘కాదు. నేను వానలో తడుస్తుంటే ఆయన నాకు గొడుగిచ్చాడు’’ సమాధానమిచ్చాడు నందు. ‘గొడుగా?’ అని ఆశ్చర్యంగా అడిగారు జంగయ్య, పద్దు. ‘‘అవును. టెన్త్ క్లాస్ ఎగ్జామ్స్ అప్పుడు వర్షంలో తడుస్తున్న నన్ను చూసి, ఆయన చేతిలో గొడుగు నాకిచ్చేసి, ఆయన తడుచుకుంటూ వెళ్లిపోయారు..’’ నందు మాటలను మధ్యలోనే ఆపేస్తూ, ‘‘జస్ట్ గొడుగిచ్చాడని ఐదు లక్షలా?’’ అంది పద్దు. ‘‘అంటే ఆ ప్రేమకు ఎంతివ్వొచ్చో ఎలా లెక్కగడతాం?’’ అడిగాడు నందు. ఐదు లక్షలు విలువ చేసేది ఏదైనా ఉంటే తాకట్టుగా పెట్టమన్నాడు జంగయ్య. ఇవ్వడానికి తన దగ్గర ఏమీ లేదన్నాడు నందు. ఇద్దరి మధ్యా కాసేపు నిశ్శబ్దం. ‘‘పోనీ ఈ శరీరంలో నీకు విలువైనది ఏదైనా ఉందనిపిస్తే, అది తీస్కో. నా కళ్లు? నా గుండె? పోనీ నా తల తాకట్టుపెట్టనా?’’ బతిమిలాడుకున్నాడు నందు. పిచ్చెక్కిందా అనడిగింది పద్దు. జంగయ్య ఏం మాట్లాడకుండా పక్కకెళ్లిపోయాడు. నందు అతణ్ని వెంబడిస్తూ నడిచాడు. జంగయ్య ఇందాక తాను కూర్చున్న చోటనుంచి వేరే దగ్గరికెళ్లి కూర్చొని, నందుని అడిగాడు. ‘‘నీ కళ్లూ, గుండె.. రాసిస్తవా?’’. మరో మాట మాట్లాడకుండా సరేనన్నాడు నందు. కానీ వెంటనే డబ్బులు కావాలన్నాడు. జంగయ్య బాండ్ పేపర్లు తీసి బయటపెట్టాడు. సంతకం చేయమన్నాడు. ‘నీకేమన్నా పిచ్చిపట్టిందా?’ అంటూ పద్దు మొత్తుకుంటున్నా, ఏమాత్రం ఆలోచించకుండా నందు ఆ పేపర్ల మీద సంతకం పెట్టేశాడు. నందు ఐదు లక్షలకు తన గుండెను, కళ్లను తాకట్టు పెట్టాడు. నెల తిరిగేలోపు డబ్బు కట్టాలి. ఒక్క నిమిషం లేటుగా వచ్చి, మొత్తం డబ్బులిచ్చినా, జంగయ్య తీసుకోడు. నందు డబ్బులు తీసుకొని ఆసుపత్రికి పరిగెత్తాడు. చలపతి మాష్టారు నందు చెయ్యి పట్టుకొని ఏడ్చాడు. ఆయన కొడుకు ఇంకాసేపట్లో బతికేస్తాడు. పద్దు ఆ సమయానికి ఇంకేదో చెప్పాలని ప్రయత్నించింది కానీ నందు వినే ఆలోచనలో లేడు. సరిగ్గా నెల తిరిగేసరికి నందు జీవితం మొత్తం మారిపోయింది. ఎప్పుడో చిన్నప్పుడు తనను వదిలేసి వెళ్లిన తండ్రి తిరిగొచ్చాడు. ఆ తండ్రి కోటీశ్వరుడు. నందు చేసిన అప్పులన్నీ తీర్చగలడు. జంగయ్య దగ్గర చేసిన అప్పు కూడా! ‘‘నిన్నటితోనే టైమైపోయింది.’’ అన్నాడు జంగయ్య.. తండ్రితో అప్పు తీర్చడానికి వచ్చిన నందు కళ్లలోకి సూటిగా చూస్తూ. ‘‘కావాలంటే ఇంట్రెస్ట్ ఎక్కువిస్తా’’ అన్నాడు నందు తండ్రి. ‘‘ఏంరా అగ్రిమెంట్ సంగతి మీ నాయనకు చెప్పలే.. ఏం తన్కా పెట్టినవో చెప్పు..’’ నందు సంతకం చేసిన అగ్రిమెంట్ గురించి విని అతని తండ్రి నవ్వాడు. ఇలాంటిది ఎక్కడా చెల్లదని జంగయ్యతో గొడవ పెట్టుకున్నాడు. ‘‘ఏం నందూ! మీ నాయన చానా గరమైతుండు? జర సమ్జాయించు. ఇచ్చినమాట ఖాతర్ చెయకపోతే ఈ జంగయ్య సంగతి తెల్సుగదా?’’ జంగయ్య నందుని చూస్తూ కోపంగా మాట్లాడాడు. నందు తండ్రిని కాసేపు ఏం మాట్లాడొద్దన్నట్టు చూశాడు. ‘‘ఏం నందూ! ఆ రోజు ఇచ్చినమాట మీద నిలబడతనన్నవ్?’’ ‘‘నేనిప్పటికీ ఆ మాట మీదే ఉన్నా. లేట్ అయిన విషయం తెలియక వచ్చాను. సారీ..’’ అన్నాడు నందు. జంగయ్యతో మళ్లీ బేరమాడ్డం మొదలుపెట్టాడు నందు తండ్రి. గొడవయింది. నందు తండ్రిని తీస్కొని అక్కణ్నుంచి వెళ్లిపోయాడు. జంగయ్య అడిగినరోజు నందు తన కళ్లను, గుండెను అతనికిచ్చేయాలి. ఇప్పుడు ఈ గొడవ తర్వాత ఇంకే మార్గమూ లేదు. ఏ రోజైనా ఆ అడిగే రోజు కావొచ్చు. అలాంటి రోజులు గడుస్తున్నాయి. నందు జీవితంలో ఊహించని మార్పులు చోటు చేసుకుంటున్నాయి. ఒకరోజు నందుకు ఓ కాల్ వచ్చింది. జంగయ్య ఆసుపత్రిలో ఉన్నాడు, అర్జంట్‌గా రమ్మని. నందు నిమిషం ఆలస్యం చెయ్యకుండా ఆసుపత్రికి పరిగెత్తాడు. జంగయ్య ఐసీయూలో బెడ్‌పై పడుకొని ఉన్నాడు. నందుని చూడగానే, ‘‘వచ్చినవా నందూ! నీ కళ్లు, గుండె నాకిస్తవ్గా?’’ అనడిగాడు జంగయ్య. ‘‘అవి నీకెప్పుడో రాసిచ్చాగా.. తీస్కో..’’ అన్నాడు నందు. ‘‘నీ గుండెల ధైర్యముందిరా.. నాకు తెలుసు. నేనింక ఎక్కువ సేపు బతక..’’ మాట్లాడలేక, ఊపిరి తీసుకొని, నందుని దగ్గరకు రమ్మన్నట్టు పిలిచాడు జంగయ్య. నందు అతని పక్కనే వచ్చి కూర్చున్నాడు. జంగయ్య ఒక పిల్లాడిని చూపిస్తూ, ‘‘నా కొడుకు భరత్. అమ్మ లేదు. నాయన గూడ ఉండడు. వీణ్ని నీ చేతుల్ల పెడుతున్న. వీడికి నీ కళ్లు కావాలి. నీ కళ్లతో చూసే లోకం చూపించు. వీడికి నీ గుండె కావాలి. అందర్నీ ప్రేమించే నీ గుండెతో వీడు కొందరినైనా ప్రేమించేటట్టు నేర్పించు. నడిపించు. ఇందుకోసమే నీ కళ్లు, గుండె రాయించుకున్నా. తప్పైతే నన్ను మాఫ్ చెయ్‌రా..’’ అంటూ, ఆ తర్వాత చెప్పాలనుకున్న రెండు మాటలను కూడా మధ్యలోనే ఆపేస్తూ ప్రాణాలొదిలేశాడు జంగయ్య. సూర్యుడు ఉదయిస్తున్న సమయమది. ‘‘భరత్ నా తమ్ముడు..’’.ప్రాణం విడవక ముందు నందు చెప్పిన ఈ మాటను జంగయ్య సరిగ్గా విన్నాడు. అదే అతను విన్న చివరిమాట కూడా. -
సినిమాలతో సమాజంపై దుష్ప్రభావం!
సాక్షి, హైదరాబాద్: సమాజంపై సినిమాల దుష్ప్రభావం చాలా ఉందని, మహిళలను అసభ్యంగా చిత్రీకరిస్తుండడం వల్లే వ్యభిచారానికి డిమాండ్ పెరిగిందని హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ చల్లా కోదండరాం వ్యాఖ్యానించారు. సినిమాల ప్రభావంతో 21 ఏళ్ల వయసులోనే యువత పెడదోవ పడుతున్నారని పేర్కొన్నారు. కుటుంబసభ్యులతో కలసి సినిమాలు చూసే పరిస్థితి లేదన్నారు. హైదరాబాద్‌లోని యూఎస్ కాన్సులేట్, ప్రజ్వల, తెలుగు సినీ పరిశ్రమల ఉమ్మడి ఆధ్వర్యంలో సోమవారం నిర్వహించిన ‘స్టాప్ డిమాండ్ ఇన్ సెక్స్ ట్రాఫికింగ్’ప్రచారోద్యమం ప్రారంభోత్సవంలో జస్టిస్ కోదండరాం మాట్లాడారు. ఇకముందైనా మంచి సినిమాలు తీయాలని సినీ పరిశ్రమకు విజ్ఞప్తి చేశారు. కార్యక్రమంలో పాల్గొన్న ప్రముఖ నిర్మాత అల్లు అరవింద్ దీనిపై స్పందించారు. ప్రేక్షకులకు ఆహ్లాదం పంచాలనే లక్ష్యంతో సినిమాలు తీస్తున్నామని, కుటుంబసభ్యులతో కలసి చూడదగిన రీతిలోనే సినిమాలు తీస్తున్నామని పేర్కొన్నారు. సమాజంలో చైతన్యం తేవాలి.. మహిళల అక్రమ రవాణా నిర్మూలనకు ప్రతి ఒక్కరూ కృషి చేయాలని యూఎస్ కాన్సుల్ జనరల్ కేథరిన్ హడ్డా పేర్కొన్నారు. అమెరికాలో మహిళల అక్రమ రవాణా నిరోధానికి అక్కడి ప్రభుత్వం గట్టి చర్యలు చేపట్టిందని తెలిపారు. సమాజంలో చైతన్యం తేవడం ద్వారా వ్యభిచారానికి డిమాండ్ తగ్గి.. మహిళల అక్రమ రవాణా, వ్యభిచారం కనుమరుగవుతాయని ప్రజ్వల సంస్థ వ్యవస్థాపకురాలు సునీతా కృష్ణన్ ఆశాభావం వ్యక్తం చేశారు. ప్రతి నెలా సగటున 60 మంది మహిళలను వ్యభిచార కూపాల నుంచి రక్షిస్తున్నామని చెప్పారు. కాగా.. తనకు ఇద్దరు కుమార్తెలు ఉన్నారని, వారికి మంచి సమాజాన్ని ఇవ్వాలన్నదే తన తాపత్రయమని సినీ నటుడు మంచు విష్ణు పేర్కొన్నారు. మానవ అక్రమ రవాణా నిర్మూలనకు కేంద్రం త్వరలో కొత్త చట్టం తీసుకురానుందని రాచకొండ పోలీస్ కమిషనర్ మహేశ్ భగవత్ తెలిపారు. ఈ కార్యక్రమంలో మహిళల అక్రమ రవాణా, వ్యభిచారానికి వ్యతిరేకంగా ప్రజల్లో చైతన్యం కలిగించేందుకు రూపొందించిన లఘు చిత్రాలను ప్రదర్శించారు. మహిళల అక్రమ రవాణాకు వ్యతిరేకంగా పోరాడుతున్న సునీతా కృష్ణన్‌ను జస్టిస్ ఎస్వీ భట్, జస్టిస్ నవీన్‌రావు, సినీ ప్రముఖులు తమ్మారెడ్డి భరద్వాజ, అక్కినేని అమల, రాష్ట్ర పరిశ్రమల శాఖ ముఖ్యకార్యదర్శి జయేష్ రంజన్, స్త్రీశిశు సంక్షేమ శాఖ కార్యదర్శి జగదీశ్వర్ తదితరులు అభినందించారు. -
వినోదానికి తెర
పాత గుంటూరు: సామాన్యుడికి వినోదం పంచే సినిమాకు తెర పడింది. నష్టాల నుంచి గట్టెక్కేందుకు థియేటర్ యజమానులు, పంపిణీదారులు, నిర్మాతలు ఉద్యమబాట పట్టి బంద్‌కు పిలుపునివ్వడంతో సినిమా హాళ్లు మూతబడ్డాయి. దీంతో ఈ రంగంపై ఆధారపడిన వేలాదిమంది ఉపాధి దెబ్బతింది. డిజిటల్ సర్వీసు ప్రొవైడర్లు వసూలు చేసే ధరల్ని తగ్గించాలని డిమాండ్ చేస్తూ దక్షిణ భారత చిత్ర పరిశ్రమ జాయింట్ యాక్షన్ కమిటీ పిలుపు మేరకు థియేటర్ యాజమాన్యాలు బంద్‌ను పాటిస్తున్నాయి. ఈనెల 2వ తేదీ నుంచి జిల్లాలోని 200 థియేటర్లు మూతబడ్డాయి. ఈనెల 9 వరకు బంద్ కొనసాగనుందని తెలిసింది. బంద్ ఎందుకు చేయాల్సి వచ్చింది? గతంలో సినిమాలను మనందరికీ తెలిసిన రీల్ ఫార్మెట్లో ప్రొజెక్టర్ల ద్వారా ప్రదర్శించేవారు. 12 ఏళ్ల కిందట డిజిటల్ సినిమా రంగప్రవేశం చేసింది. ల్యాబ్ నుంచి ప్రింట్ తెచ్చుకునే అవసరం లేకుండా హార్డ్ డిస్క్‌ను తెచ్చుకుని డిజిటల్ ప్రొజెక్టర్‌లో పెట్టి సినిమా వేసుకునే పరిజ్ఞానం వచ్చింది. ఈ టెక్నాలజీని తీసుకొచ్చిన వారిని డిజిటల్ సర్వీసు ప్రొవైడర్లు(డీఎస్పీ)లుగా వ్యవహరిస్తున్నారు. వీరు దేశమంతటా తమ టెక్నాలజీని దశల వారీగా అమర్చుకుంటూ వచ్చారు. ఇప్పుడు దేశంలో ఎక్కడా రీల్ ఫార్మెట్ లేదు. డిజిటల్ టెక్నాలజీ వచ్చిందని థియేటర్ యజమానులు ప్రొజెక్టర్లను తీసి పక్కన పడేశారు. ఇదే డిజిటల్ సర్వీసు ప్రొవైడర్లకు వరంగా మారింది. ఏకస్వామ్య విధానం అమలుచేయడానికి అవకాశం లభించింది. థియేటర్లలో అమర్చిన డిజిటల్ ప్రొజెక్టర్ల అద్దెను క్రమంగా కంపెనీలు పెంచుకుంటూ వెళ్లిపోయాయి. ఈ ఫీజు థియేటర్ యాజమాన్యాలకు భారంగా మారింది. దేశంలో డిజిటల్ సర్వీసు ప్రొవైడర్లు అయిన యూఎఫ్ఓ, క్యూబ్ కంపెనీలు మొండిగా వ్యవహరిస్తున్నాయి. అంతా వారి చేతుల్లోనే ఉండటంతో థియేటర్ల యాజమాన్యాలు కూడా మౌనంగా ఉండిపోయారు. డీఎస్పీలు అద్దెలు, చార్జీలను ఇష్టారాజ్యంగా వసూలు చేస్తున్నారు. ఒక్కో చోట ఒకలా వున్నాయి. ఇంగ్లిష్ సినిమాలకు ఎక్కడా వర్చువల్ ప్రింటింగ్ ఫీజు లేదు.. మనకు కూడా లేదు. ఉత్తరాదిలో హిందీ సినిమాలపై మన దగ్గర వసూలు చేస్తున్న ఫీజులో 50 శాతం మాత్రమే వసూలు చేస్తున్నారు. అదే సినిమా మన వద్ద వేస్తే వంద శాతం వీపీఎఫ్ చెల్లించాలి. ఉత్తరాదిలో అన్నీ హిందీ సినిమాలే కాబట్టి ఫీజు తక్కువగా వుంది. మన తెలుగు చిత్రాలకు పూర్తి ఫీజు చెల్లించాలి. ఈ ద్వంద్వ వైఖరిని దక్షిణాది నిర్మాతలు, పంపిణీదారులు వ్యతిరేకించారు. జేఎసీగా ఏర్పడి డిజిటల్ ప్రొజెక్టర్ అద్దె, వీపీఎఫ్ తగ్గించాలని డిమాండ్ చేస్తున్నారు. ప్రకటనల ఆదాయంపై బాదుడే ఈ డీఎస్పీలు నిర్మాతలు, పంపిణీదారుల నుంచి వసూలు చేసే వీపీఎఫ్ కాకుండా థియేటర్ యజమానుల నుంచి రెండురకాలుగా లబ్ధి పొందుతున్నాయి. అందులో ఒకటి డిజిటల్ ప్రొజెక్టర్ అద్దె కాగా, మరొకటి ప్రకటనల ఆదాయం. సినిమా థియేటర్లలో ప్రదర్శనకు ముందు, ఇంటర్వెల్ తర్వాత వేసే ప్రకటనల ఆదాయం మొత్తం డీఎస్పీలే తీసుకుంటున్నాయి.అందులో నామమాత్రంగా 10 నుంచి 15 శాతం మాత్రమే యాజమాన్యాలకు ఇస్తున్నారు. ప్రకటన సైజు తెలుపకుండానే నచ్చినంత సేపు వేసుకుంటూ యాజమాన్యాలకు నష్టాలు కలిగించడంతో పాటు ప్రేక్షకులను ఇబ్బందిపెడుతున్నారు. డిజిటల్ ప్రొజెక్టర్ల అద్దె ఇలా... నగరంలోని 4కె థియేటర్లు డిజిటల్ ప్రొజెక్టర్లకు వారానికి రూ.13,600 చెల్లిస్తున్నాయి. సాధారణ థియేటర్లు వారానికి రూ.10,300 చెల్లిస్తున్నాయి.వీటితో పాటు వీపీఎఫ్ నెలకు రూ.15 నుంచి రూ. 20 వేలకు వరకు చెల్లిస్తున్నాయి. -
నాన్న ఇంటికి రాలేదు!
తెలుగులో డిఫరెంట్ సినిమాలను ఇష్టపడే వారిని బాగా మెప్పించిన ఓ సినిమాలోని సన్నివేశాలివి. ఈ సినిమా స్క్రీన్‌ప్లే పరంగా చూపిన కొత్తదనం, చేసిన ప్రయోగం గుర్తించి, గుర్తుంచుకోదగ్గది. ఈ సినిమా పేరేంటో చెప్పుకోండి చూద్దాం.. సాయిరామ్‌కు మేనేజర్‌గా ప్రమోషన్ వచ్చి రెండు రోజులైంది. సాయిరామ్ కంటే మేనేజర్ అయ్యేందుకు ఎక్కువ అర్హతలున్న విశ్వనాథ్ రెండు రోజుల్నుంచి ఆఫీస్‌కు రాలేదు. ఆఫీస్‌కు వచ్చుంటే విశ్వనాథే మేనేజర్ అయ్యేవాడేమో! విశ్వనాథ్ ఎక్కడున్నాడు? సాయిరామ్ ఆలోచిస్తున్నాడు. ప్రమోషన్ వచ్చిన ఆనందం లేదు అతని కళ్లలో. విశ్వనాథ్ గురించే ఆలోచిస్తున్నాడు. ‘‘నాన్న ఇంకా ఇంటికి రాలేదంకుల్!’’ విశ్వనాథ్ కూతురు ముందురోజు రాత్రి ఫోన్లో చెప్పిన మాటలు సాయిరామ్‌కు పదేపదే గుర్తొస్తున్నాయి. అతనలా ఆలోచనల్లో ఉండగానే బేకరీ డెలివరీ బాయ్ ఒకతను వచ్చి, విశ్వనాథ్ ఆర్డర్ చేశాడంటూ కేక్ ఇచ్చి వెళ్లాడు. విశ్వనాథ్ తన కూతురు పుట్టినరోజు కోసం ఆర్డర్ చేసిన కేక్ అది. ఆ కేక్ తీసుకెళ్లి, విశ్వనాథ్ ఇంటికెళ్లాడు సాయిరామ్. విశ్వనాథ్ భార్య, కూతురు విశ్వనాథ్ కోసం ఎంతగానో ఎదురుచూస్తున్నారు. ఆ ఇల్లంతా నిశ్శబ్దంగా, ఏదో చెడు వార్త వినడానికి సిద్ధమవుతున్నట్టుగా ఉంది. ‘‘ఆయన ఎక్కడికెళ్లారో మీకు తెల్సా?’’ అడిగింది విశ్వనాథ్ భార్య. తెలీదన్నట్టు తలూపాడు సాయిరామ్. ఇంట్లో చిన్న చిన్న గొడవలనీ, ఎంత గొడవ జరిగినా, రాత్రి ఫ్రెండ్స్ ఇంట్లో పడుకుని, తెల్లారేసరికల్లా వచ్చేస్తారనీ, పాప ఫోన్ చేస్తుందని ఫోన్ ఎప్పుడూ ఆన్‌లోనే ఉంచుకుంటారనీ, పాప రాత్రినుంచి ఏమీ తినలేదని, వాళ్ల నాన్న వచ్చేదాకా ఏమీ తిననని కూర్చుందని, ఆయన ఎక్కడున్నారో తెలిస్తే ఇంటికి రమ్మని చెప్పండంటూ విశ్వనాథ్ భార్య చెప్తూ పోతోంది. సాయిరామ్ నోటినుంచి ‘సరే’ తప్ప ఇంకేమాటా బయటకు రావడం లేదు. సాయిరామ్ లేచి, ఇంటి బయటకొచ్చి, బండి స్టార్ట్ చేశాడు. ఇంట్లోనుంచి పాప.. ‘‘అంకుల్.. అంకుల్.. ఆగండి!’’ అంటూ పరిగెత్తుకుంటూ వచ్చింది. ‘‘మా నాన్నకు కోపమొచ్చినప్పుడు ఫ్రెండ్స్ దగ్గరకు వెళ్లరు. ఎక్కడికెళ్తారో నాకు తెలుసు. అక్కడికి తీసుకెళ్తారా? ప్లీజ్..’’ బతిమిలాడింది పాప. సాయిరామ్ తన బండిమీద పాపను ఎక్కించుకొని వెళ్తున్నాడు. కొద్దిదూరం వెళ్లాక, మెయిన్‌రోడ్ మీదనే ఉన్న ఒక బార్‌ను చూడడమే.. ‘‘ఇక్కడే.. ఇక్కడే..’’ అంటూ బండి ఆపింది పాప. ‘‘ఈ పైనే అంకుల్..’’ అంది ఆ పాప.‘‘మీ నాన్న డ్రింక్ చేయడు. ఏదో సరదాగా చెప్పుంటాడు..’’‘‘లేదంకుల్! మా నాన్న నాతో అస్సలు అబద్ధాలు చెప్పరు. ఒకసారి వెళ్లి చూద్దాం.. ప్లీజ్..’’ అంది పాప. నేను వెళ్లి చూసొస్తానంటూ సాయిరామ్ ఆ బార్ ఉన్న కాంప్లెక్స్ పై ఫ్లోర్‌కి వెళ్లాడు. కానీ సాయిరామ్‌కు తెలుసు.. అక్కడ విశ్వనాథ్ ఉండడని. చుట్టూ చూసినట్టు నటించాడు. విశ్వనాథ్ అక్కడ లేడని పాపతో చెప్పాడు. టెర్రస్‌పైన చూశారా? అక్కడ చూడండంటూ పాప మళ్లీ బతిమిలాడింది. సాయిరామ్ టెర్రస్ మీదకు వెళ్లకుండానే వెళ్లి చూసినట్టు, విశ్వనాథ్ అక్కడ కూడా లేడని పాపతో చెప్పాడు. సాయిరామ్‌కు ఎంత ప్రయత్నించినా ఏడుపు తన్నుకొస్తోంది. పాప ముందు మాత్రం స్థిరంగా నిలబడి, ‘‘మీ నాన్న ఎక్కడున్నా నేను తీసుకొస్తాను..’’ అని పాపకు ధైర్యమిచ్చే ప్రయత్నం చేశాడు. అదే సమయానికి సాయిరామ్‌కు ఒక ఫోన్‌కాల్ వచ్చింది. ‘‘నమస్తే సార్! నా పైసలు రెడీనా?’’ అని ఆ గొంతు పలికింది. ఫోన్లోని వ్యక్తి సాయిరామ్‌తో డబ్బులకోసం బేరాలు సాగిస్తున్నాడు. సాయిరామ్ ఒక లెక్క చెబుతూంటే, ఫోన్లోని వ్యక్తి అంతకు ఎన్నోరెట్లు కావాలంటున్నాడు.‘రేయ్ దాస్! ఇది మోసంరా.. నేన్నిన్ను నమ్మాను..’’ అన్నాడు సాయిరామ్.‘‘నీకంటే పెద్ద మోసగాడినా? ఆ విశ్వనాథ్ నీతోనే పనిచేశేటోడు.. ఆణ్నే నువ్వు మోసం చెయ్యాలని చూసినవ్..’’.. దాస్ మాటలను మధ్యలోనే ఆపేస్తూ.. ‘‘అవున్రా.! నాదే తప్పు. చెంపలు వేసుకుంటున్నా. వాణ్ని వదిలెయ్‌రా..’’ అంటూ బతిమిలాడుతున్నాడు సాయిరామ్. ‘‘నా బండమ్మి పాతికవేలు ఇస్తాన్రా..’’ ఏడుస్తూ అడిగాడు సాయిరామ్. ‘‘నీ బాధలు ఇంటుంటే ఏడుపొస్తోంది సాబ్! నా బాధలు చెప్తే నువు గుడ ఏడుస్తవ్. విశ్వనాథ్ ఏడున్నడో చెప్పాలంటే లక్షా యాభైవేలు రెడీ చేస్కో..’’ ఆ చివరి మాట చెప్పాక దాస్ ఫోన్ కట్ చేశాడు. సాయిరామ్‌కు విశ్వనాథ్ ఎక్కడున్నాడో తల్చుకోవాలంటేనే భయంగా ఉంది. తనకు ప్రమోషన్ వచ్చేంత వరకు విశ్వనాథ్‌ను ఆఫీస్‌కు రాకుండా చేయమని సాయిరామ్ దాస్‌కు డబ్బులు ఇచ్చాడు. దాస్ సాయిరామ్ ప్లాన్‌ను తిప్పికొట్టి ఎక్కువ డబ్బుకోసం విశ్వనాథ్‌ను కిడ్నాప్ చేసి తానొక్కడికే తెలిసిన ప్లేస్‌లో ఉంచాడు. దాస్ అడిగినంతా ఇస్తే తప్ప విశ్వనాథ్ దొరకడు.సాయిరామ్ సరిగ్గా ఆ నిమిషం నుంచి పిచ్చోడిలా తిరిగాడు డబ్బుల కోసం. వాళ్లనడిగి, వీళ్లనడిగి డబ్బు కూడగట్టుకున్నాడు. విశ్వనాథ్ జాడ చెప్పగలిగే ఒకే ఒక్క వ్యక్తి దాస్ ఫోన్ కోసం ఎదురుచూస్తున్నాడు. ఫోనొచ్చింది. ‘‘పైసల్ తీస్కొని ఆల్వాల్ స్టేషన్‌కి రా.. అక్కడ బ్రిడ్జీ ఎక్కి సరిగ్గా మధ్యలో ఆగు. కింద రెండో నెంబర్ ప్లాట్‌ఫాం మీద నేను కనిపిస్తా. పైసలు బ్రిడ్జి మీద పెట్టు. విశ్వనాథ్ ఏడున్నడో బల్లమీద చీటీ రాసి పెడతా. తేడా వస్తే నీ దోస్ నీకు కనిపించడు. యాదుంచుకో..’’ దాస్ చెప్పాల్సిందంతా చెప్పి ఫోన్ కట్ చేశాడు. సాయిరామ్ ఆల్వాల్ స్టేషన్‌కి వెళ్లి బ్రిడ్జి ఎక్కి, మధ్యలో ఆగి చూశాడు. దాస్ కనిపించాడు. పిలిచాడు. అతను పలకలేదు. గట్టిగా పిలిచాడు. అయినా అతను పలకలేదు. సాయిరామ్ పరిగెత్తుకుంటూ దాస్ కూర్చొని ఉన్న బెంచీ దగ్గరికెళ్లి చూశాడు. దాస్ అప్పుడే బెంచీ మీద వాలిపోతూ ఉన్నాడు. సాయిరామ్ అతణ్ని కదిలించి చూశాడు. అతను అప్పుడే చివరిశ్వాస విడిచాడు. సాయిరామ్ వణికిపోతూ అతణ్నుంచి దూరంగా కదిలాడు. చుట్టూ జనం చేరారు. విశ్వనాథ్ ఎక్కడున్నాడో చనిపోయిన దాస్‌కు మాత్రమే తెలుసు. -
శ్రీదేవీ జీవితంపై వర్మ సినిమా?
ముంబై : అనంతలోకాలకి వెళ్ళిన అందాల తార శ్రీదేవి మరణాన్ని సంచలన దర్శకుడు రామ్ గోపాల్ వర్మ అసలు తట్టుకోలేకపోతున్నారు. శ్రీదేవీ మరణించిందన్న విషయం తెలిసిన దగ్గర్నుంచి వర్మ బాధ వర్ణనాతీతం. సముద్రమంత ప్రేమను కురిపిస్తున్న అభిమానుల కోసమైనా దేవుడు తన మనసును మార్చుకుని ఆమెని వెనక్కి పంపాలంటూ పలు ట్వీట్స్ సైతం చేశారు. శ్రీదేవీ జీవితం గురించి ఎవరికీ తెలియని విషయాలంటూ అభిమానులకు ఓ ప్రేమ లేఖ కూడా రాశాడు. ఇప్పుడిక శ్రీదేవీ జీవితంపై సినిమా తీయాలని నిర్ణయించారట. శ్రీదేవీ జీవితం రామ్ గోపాల్ వర్మ సినిమా తీయబోతున్నారంటూ.. ఆయనకు అత్యంత సన్నిహితుడు, గీత రచయిత సిరశ్రీ ఓ టీవీ ఛానల్ ప్రొగ్రామ్‌లో చెప్పినట్టు తెలుస్తోంది. స్టోరీ తుది రూపం దాల్చగానే, ఈ బయోపిక్‌పై వర్మ అధికారిక ప్రకటన చేస్తారంటూ సిరశ్రీ చెప్పినట్టు సమాచారం. అయితే ఇప్పటి వరకు ఆర్జీవీ నుంచి దీనిపై ఎలాంటి ప్రకటనలు రాలేదు. అయితే రామ్ గోపాల్ వర్మ, శ్రీదేవీ జీవితంపై సినిమా తీయబోతున్నాడంటూ వార్తలు హల్ చల్ చేస్తున్న క్రమంలో, ఆయన ఈ సినిమాను ఏఏ కోణాల్లో తెరకెక్కిస్తారంటూ సర్వత్రా చర్చనీయాంశమైంది. ‘శ్రీదేవి అభిమానులకు నా ప్రేమలేఖ’’ అంటూ వర్మ పెట్టిన పోస్టులో బయటి ప్రపంచం ఊహించే దానికంటే సెలబ్రిటీల వాస్తవ జీవితం భిన్నంగా ఎలా ఉంటుందో... వాటన్నిటిలోకల్లా ప్రత్యేకమైనది శ్రీదేవి జీవితం అంటూ చెప్పుకొచ్చారు. శ్రీదేవీని అమితంగా ప్రేమించే రామ్ గోపాల్ వర్మ, ఆమెతో పాటు క్షణం క్షణం సినిమా తీశారు. -
స్క్రీన్ ప్లే 28th February 2018
-
స్ర్కీన్ ప్లే 17th February 2018
-
స్క్రీన్ ప్లే 14th February 2018
-
స్ర్కీన్ ప్లే 13th February 2018
-
ప్రేమ వ్యవహారంలో హెచ్చరించాడనే...
యశవంతపుర: బీబీఎంపీ ఛలవాదిపాళ్యం బీజేపీ కార్పొరేటర్ రేఖ భర్త కదిరేశ్ (49) హత్య కేసు కొత్త మలుపు తిరుగుతోంది. హత్యకేసులో నిందితుడిగా ఆరోపణలు ఎదుర్కొంటున్న నవీన్ ప్రేమ విషయంలో తల దూర్చినందుకే సినీ ఫక్కీలో హత్య చేసినట్లు ప్రచా రం జరుగుతోంది. బుధవారం సాయంత్రం జరిగిన హత్య కేసుకు సంబంధించి... దగ్గర సంబంధం యువతితో నిందితుడు నవీన్ కొద్ది కాలంగా ప్రేమ వ్యవహా రం నడుపుతున్నాడు. యువతిని దొంగపెళ్లి చేసుకో వాలని భావించాడు. విషయం తెలుసుకున్న కదిరేశన్ ఇటీవల నవీన్‌తోపాటు అతని స్నేహితులను ఇంటికి పిలిపించుకుని తనదైన శైలిలో హెచ్చరించి పంపాడు. ఇది కదిరేశ్, నవీన్‌ల మధ్య ఘర్షణకు దారితీసింది. దీని వెనుక పాతరౌడీ పీటర్ హస్తం ఉన్నట్లు సమాచారం. జై లు నుండి స్కెచ్ వేసి కదిరేశ్‌ను హతమార్చినట్లు తెలు స్తోంది. తన స్నేహితుడు వినయ్‌ను తీసుకొచ్చి ఒక్కసారిగా గొంతుపై చాకుతో పొడిచి హత్య చేయించినట్లు విచారణలో తేలింది. బుధవారం రాత్రి మృతదేహనికి విక్టోరియా ఆస్పత్రిలో పోస్టుమార్టం నిర్వహించిన వైద్యులు కుటుంబ సభ్యులకు అప్పగించారు. హంతకుల అరెస్టుకు నాలుగు బృందాలు: హోంమంత్రి రామలింగారెడ్డి బీజేపీ నాయకుడు కదిరేశ్ హత్య కేసుకు సంబంధించి నిందితుల కోసం నాలుగు ప్రత్యేక బృందాలు రంగంలోకి దిగినట్లు హోంమంత్రి రామలింగారెడ్డి తెలిపారు. బుధవారం రాత్రి విక్టోరియా ఆస్పత్రిలో మృతదేహన్ని పరిశీలించిన అనంతరం ఆయన విలేకరులతో మాట్లాడారు. చామరాజపేటలో కదిరేశ్ ఇంటి వద్దనే హత్య జరిగిందని ఇందులో నవీన్, వినయ్‌లు పాల్గొన్నట్లు పోలీసుల విచారణలో బయట పడిందన్నారు. కదిరేశ్ హత్య కేసు నిందితులను త్వరగా అరెస్టు చేస్తామని పశ్చిమ విభాగం అడిషనల్ పోలీసు కమిషనర్ బీకే సింగ్ తెలిపారు. -
స్ర్కీన్ ప్లే 7th February 2018
-
ఇరాక్‌లో తొలిసారి బాలీవుడ్ సినిమా
ముంబై: ఇరాక్, రష్యా, ఐవరీకోస్ట్ దేశాల్లో ఇండియాతో పాటు విడుదల కానున్న తొలి సినిమాగా పాడ్ మాన్ చరిత్రకెక్కనుందని సినిమా నిర్మాత ట్వింకిల్ ఖన్నా ట్విటర్లో తెలిపారు. దాదాపు ఈ సినిమా ప్రపంచవ్యాప్తంగా 50కి పైగా దేశాల్లో ఫిబ్రవరి 9(శుక్రవారం)న విడుదల కానుంది. ఆడవారి రుతుస్రావ సమస్య ప్రధానంగా చేసుకుని ఈ సినిమా రూపొందించారు. ఈ సినిమాలో అక్షయ్ కుమార్, సోనం కపూర్, రాధికా ఆప్టేలు హీరోహీరోయిన్లుగా నటిస్తున్నారు. ఈ సినిమాకు ఆర్. బాల్కి దర్శకత్వం వహించారు. -
స్ర్కీన్ ప్లే 1st February 2018
-
టికెట్ల ధరల పెంపుపై మంత్రివర్గ భేటీ
అమరావతి : ఆంధ్రప్రదేశ్‌లో సినిమా టికెట్ల ధరల పెంపుపై మంత్రి వర్గ ఉపసంఘం సమావేశం జరిగింది. ఈ సమావేశానికి మంత్రులు యనమల, చినరాజప్ప, నక్కా ఆనందబాబు ,సమాచార శాఖ కమీషనర్ వెంకటేశ్వర్ హాజరయ్యారు. సమాచార శాఖ కమీషనర్ వెంకటేశ్వర్ మాట్లాడుతూ..టికెట్ల ధరలు పెంచాలని థియేటర్ల యజమానులు డిమాండ్ చేస్తున్నారని తెలిపారు. ప్రజలపై ఎక్కువ భారం పడకుండా ధరలు పెంచే ఆలోచన ఉందన్నారు. జీఎస్టీ వచ్చాక థియేటర్లపై భారం పడిందని వెల్లడించారు. జీఎస్టీ తగ్గించాలని కౌన్సిల్‌కు లేఖ రాస్తానని చెప్పారు. వచ్చే నెల 14న టికెట్ల ధరలు ఎంత పెంచాలనేదానిపై నిర్ణయం తీసుకుంటామని వెల్లడించారు. -
స్క్రీన్ ప్లే 30th January 2018
-
సినిమాకు వెళ్లి ఇద్దరు బాలుర అదృశ్యం
పటాన్చెరు: సంగారెడ్డిజిల్లా పటాన్చెరు పోలీసు స్టేషన్ పరిధిలోని ఇస్నాపూర్‌లో ఇద్దరు బాలురు అదృశ్యమయ్యారు. సాయిరాం సహో(15), సాయితేజ(15)లు 9వ తరగతి చదువుతున్నారు. వీరిద్దరూ ఆదివారం సినిమాకని వెళ్లి ఇళ్లకు తిరిగి రాలేదు. దీనిపై పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. -
ఒకే ఒక్క ఛాన్స్..!
ఆశయం ఆవిరైపోయింది.. వెండి తెరపై తన బొమ్మను చూసుకోవాలని పరితపించింది. తల్లిదండ్రులకు కూడా చెప్పకుండా మహానగరంలో ఒంటరిగా కొంత కాలం మనుగడ సాగించింది. ‘ఒకే ఒక్క ఛాన్స్’ అంటూ సినీ నిర్మాతలు.. డైరెక్టర్ల చుట్టూ తిరిగింది. ప్రయత్నాలు ఎన్నో చేసింది. ఏ ఒక్కటీ కలిసి రాలేదు. ఆచూకీ పసిగట్టిన పోలీసులు అతి కష్టంపై ఆమెను తల్లిదండ్రుల చెంతకు చేర్చారు. అయితే ఆమెలోని కళాతృష్ణను అడ్డుకోలేకపోయారు. కళాకారిణిగా పూలహారాలు అలంకరించాల్సిన మెడ చుట్టూ ఉరితాడు బిగుసుకుంది. ఓ కళాజ్యోతి వెలుగు చూడకముందే ఆరిపోయింది. గుంతకల్లు టౌన్: పట్టణంలోని హనుమేష్‌నగర్‌కి చెందిన ప్రవీణ (17) అనే బాలిక జీవితంపై విరక్తి చెంది ఇంట్లోనే ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకుంది. ఈ ఘటన బుధవారం ఉదయం వెలుగు చూసింది. ఒన్‌టౌన్ పోలీసులు తెలిపిన మేరకు.. హనుమేష్‌నగర్‌కి చెందిన నీలావతి, ఉడదాల పెద్దన్న దంపతుల కుమార్తె ఉడదాల ప్రవీణకు చిన్నప్పటి నుంచి సినిమాలంటే మక్కువ. తన ప్రతిభను ప్రదర్శించి ఎలాగైనా సినిమాల్లో లేకపోతే చివరకు సీరియల్స్లోనైనా నటించాలనుకుంది. 2016 సంవత్సరంలో ఇంటి నుంచి పారిపోయి హైదరాబాద్‌కు చేరుకుంది. నెలరోజుల్లో తిరిగి ఇంటికి..: తల్లి ఫిర్యాదుతో అప్పట్లో ఒన్‌టౌన్ పోలీసులు మిస్సింగ్ నమోదు చేశారు. హైదరాబాద్‌లోని కృష్ణానగర్‌లో సినిమా ఛాన్స్ కోసం తిరుగుతుండటాన్ని గుర్తించి అదుపులోకి తీసుకుని కుటుంబసభ్యులకు అప్పగించారు. నెలరోజుల తర్వాత తిరిగి వచ్చిన అమ్మాయికి పెళ్లి చేస్తే కుదురుగా ఉంటుందేమోనని కుటుంబ సభ్యులు భావించారు. జీవితాశయం నెరవేరదని..: ఇంట్లో తనకు పెళ్లి సంబంధాలు చూస్తున్నారని తెలుసుకున్న ప్రవీణ ఇక తన జీవితాశయం నెరవేరదేమోనని మనస్తాపం చెందింది. మంగళవారం మధ్యాహ్నం ఇంట్లో ఎవ్వరూ లేని సమయంలో ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకుంది. కుమార్తె మరణాన్ని తల్లి జీర్ణించుకోలేకపోయింది. మృతురాలి తల్లి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసినట్లు ఒన్‌టౌన్ ఎస్ఐ యు.వి.ప్రసాద్ తెలియజేశారు. -
స్క్రీన్ ప్లే 19th January 2018
-
స్క్రీన్ ప్లే 12th January 2018
-
స్ర్కీన్ ప్లే 11th January 2018
-
ఆ నాటకం ఓ స్వప్న సాఫల్యం
ఆదిత్య హృదయం సినిమా కంటే రంగస్థలం అనేది ప్రజలు, వారి విలువలు, ప్రవృత్తులకు సంబంధించిన ఉత్తమ ప్రతిబింబంగా ఉంటుందని నేను చెబుతాను. ఉదాహరణకు, అవాస్తవాన్ని లేక పలాయనవాద కాల్పనికతను నమ్మింపజేయడం వెండితెర కంటే రంగస్థలం మీద చాలా కష్టం. సినిమాను ముందుగా తీసి చూపించడం కంటే, నాటకాన్ని అప్పటికప్పుడు ప్రదర్శించడం మరింత ఆసక్తిదాయకంగా ఉంటుంది. గత వారం లండన్‌లో నేను చూసిన ఒక సంగీత నాటకమే ఈరోజు మీకు నేను చెప్పబోతున్న ఉదాహరణ. ‘ఎవ్రీబడీ ఈజ్ టాకింగ్ ఎబౌట్ జేమీ’ అనే ఈ నాటకాన్ని బ్రిటన్ మధ్యప్రాంత పట్టణం షెఫీల్డ్‌లో రూపొందించారు. ఇది అమ్మాయిలా దుస్తులు ధరించాలనుకునే జేమీ అనే పదహారేళ్ల కుర్రాడి గురించిన కథ. అయితే జేమీ హిజ్రా కాదు. పైగా అతడు గే కావలసిన అవసరం కూడా లేదు. ఆకర్షణీయమైన రాణి కావాలనేది అతడి కల. ఆ కల ఎలా నెరవేరింది, శ్రోతల కోసం అతడు హీరోగా ఎలా పరిణమించాడు అనేదే నాటక ఇతివృత్తం. మరిన్ని వివరాల్లోకి వెళ్లడానికి ముందు ఈ నాటకం గురించి స్థూలంగా చెప్పనివ్వండి. అ సమయంలోనే అమెరికన్ హిప్– హాప్ సంగీత రూపకం హామిల్టన్ బాగా ప్రాచుర్యంలో ఉండేది. ఆ ప్రదర్శన టిక్కెట్లు పూర్తిగా అమ్ముడైపోయాయి. బ్లాక్ మార్కెట్లో ఒక టికెట్‌ను వెయ్యి పౌండ్లకు అమ్మినట్లు దళారులు ఘనంగా ప్రకటించారు. వాస్తవం ఏమిటంటే ప్రతి ఒక్కరూ హామిల్టన్ రూపకం గురించే మాట్లాడుతున్నారు తప్ప జేమీ గురించి ప్రస్తావించే వారు కూడా లేరు. లండన్‌లో ఆ రెండింటినీ నేను చూశాను. హామిల్టన్ చాలా మంచి ప్రదర్శన అంటే నేను నిరాకరించను. కానీ జేమీ మాత్రం అసాధారణమైంది, అరుదైనది కూడా. అదొక విశిష్ట రూపకం. మొత్తంమీద చెప్పాలంటే హామిల్టన్ రూపకం.. చూడటానికి మీరు పెట్టే డబ్బుకు తగిన విలువైనది కాదు. సగటు థియేటర్లలో ఉన్న ధర కంటే ఎక్కువ ధరను పెట్టినప్పటికీ, జేమీ కోసం మీరు పెట్టిన ప్రతి పెన్నీ కూడా విలువైనదే. బ్రిటన్ గర్వించదగిన నాటకంగా జేమీ ఎందుకు విశిష్టమైనదో తెలుసుకోవడానికి ఇప్పుడు మళ్లీ వెనక్కు వద్దాం. ఒక అబ్బాయి ఒక అమ్మాయిలాగా దుస్తులు ధరించాలన్న కోరికను వెల్లడిస్తే ప్రపంచంలో ఉన్న పలు సమాజాలలో అది కుటుంబ విషాదంగానూ, జనానికి చికాకును, సంకటస్థితిని కలిగించే ఘటనగాను తయారవుతుంది. అప్పటినుంచి అతడు తెరచాటునే ఉండాల్సి వస్తుంది. తలుపుల వెనుక అతడిని నిర్బంధిస్తారు. పైగా అతడిని ఇక మాట్లాడనివ్వరు. నిజాయితీగా చెప్పాలంటే, భారత్‌లో అతడితో మనం అలాగే వ్యవహరిస్తాం. కానీ ఈ నాటకం మాత్రం అలా చూపలేదు. అందుకే అది అత్యంత ప్రత్యేకమైన నాటకంగా నిలుస్తోంది. కార్మికవర్గం ప్రధానంగా ఉండే యార్క్‌షైర్ సెట్టింగులో, జేమీ ఆకాంక్షను జీవితానికి సంబంధించిన పరమ సంతోషకరమైన సంబరంగా చిత్రించారు. మీకు మీరు నిజాయితీగా ఉండి, మిగిలిన ప్రపంచం ఏం చెబుతుందో లెక్కపెట్టకుండా ఉన్నట్లయితే, ఈ నాటకంలో సగ భాగం ఈ ఆనందకరమైన సంబరాన్నే చూపిస్తుంది. మరొకటి ఇంకా ముఖ్యమైంది. మీరు కోరుకున్నట్లు ఉండాలని మీరు భావిస్తే ప్రపంచం మిమ్మల్ని ఆమోదిస్తుంది, అంతేకాకుండా మిమ్మల్ని గౌరవించడానికి కూడా ముందుకొస్తుంది. నాటకం కొనసాగిన రెండున్నర గంటల సమయంలో శ్రోతలు జేమీని చూసి, అతడి తల్లి తన కోరికను ప్రోత్సహించి, సమర్థించే తీరును చూసి పగలబడి నవ్వారు, ఏడ్చారు కూడా. జేమీ మారిన వస్త్రధారణను ఆమోదించని అతడి స్కూల్ టీచర్ తానెంత క్రూరమైన వ్యక్తి అన్నదాన్ని గుర్తించనప్పటికీ, అతడికి మద్దతు పలుకుతూ వచ్చిన తోటి విద్యార్థులు మాత్రం, పెద్దల కంటే పిల్లలే తరచుగా విజ్ఞత కలవారన్న అంశాన్ని శక్తివంతంగా శ్రోతలముందు పెడతారు. చివరకు మెరిసే దుస్తులతో వాటికి సరిపోలే మహిళలు వాడే స్టిలెట్టో హీల్స్‌తో, ఒక బ్లాండ్ విగ్‌తో, మేకప్‌తో జేమీ పాఠశాలకు వచ్చినప్పుడు ఈ నాటకం తనదైన సుందర క్లైమాక్స్‌కు చేరుకుంటుంది. జేమీ మైమరపించే అమ్మాయిని తలపించడంలో సందేహం లేదు కానీ, ఆ క్షణంలో మీరు తిలకించే అసలు మ్యాజిక్ ఏమిటంటే, మానవ స్వప్న సాఫల్యానికి చెందిన నిసర్గ సౌందర్యమే. అది ఆచార సంప్రదాయాలను తోసిపుచ్చినప్పటికీ, జేమ్స్ స్నేహితులు, ఇరుగు పొరుగువారు జేమీ నూతన వస్త్ర ధారణను పూర్తిగా ఆమోదిస్తారు. పరమలోభి అయిన అతడి తండ్రి మాత్రమే వీళ్లందరికీ దూరం జరుగుతాడు. నాటకం ముగియగానే శ్రోతలు సుదీర్ఘ కరతాళధ్వనులతో అభినందనల్లో ముంచెత్తారు. తర్వాత వెంటనే అందరూ లేచి నిలబడి మరీ ఆ నాటకాన్ని గౌరవించారు. జేమీ తండ్రిని ఛీకొట్టారు. కాబట్టి, మీరు ఈ సంవత్సరం లండన్ సందర్శించాలని అనుకుంటే.. అడుక్కుని, అరువు తీసుకుని, టిక్కెట్ దొంగిలించి అయినా సరే.. జేమీ నాటకం తప్పక చూడండి. ఇలాంటి నాట కాన్ని మీరు భారత్‌లో ఎన్నటికీ చూడలేరు. నిజం చెప్పాలంటే, ఇలాంటి నాటకాన్ని, ప్రదర్శనను మీ జీవితంలో మరెన్నడూ చూడలేరు కూడా. కొస మెరుపు : బ్రిటన్ సంగీత రూపకాల చరిత్రలో ‘ఎవ్రీబడీ ఈజ్ టాకింగ్ ఎబౌట్ జేమీ’ కొత్త ట్రెండ్ సృష్టించింది. 2017లో తొలిసారిగా ప్రదర్శితమైన ఈ సంగీత నాటకం సుప్రసిద్ధ పత్రికల ప్రశంసలను పొందుతోంది. బ్రిటన్‌లోని షెఫీల్డ్ పట్టణంలో, ఒక కౌన్సిల్ ఎస్టేట్‌లో నివసించే 16 ఏళ్ల కుర్రాడు జేమ్స్ పాత్ర మనిషి ఆకాంక్షలను సఫలం చేసుకునే కృషిని ఈ సంగీత రూపకంలో అత్యద్భుతంగా ప్రదర్శించింది. భవిష్యత్తు గురించి భయకంపితుడైన జేమ్స్ ప్రేమమూర్తి అయిన తన తల్లి, స్నేహాన్ని పంచే మిత్రుల దన్నుతో తనలోని దురభిప్రాయాలను అధిగమించి, అంధకారం నుంచి బయటపడటమే కాకుండా ప్రపంచం చూసి ఉండని ఒక సంచలనాత్మక ఘటనను ప్రపంచం ముందుకు తీసుకొచ్చాడు. చివరిక్షణంలో కూడా అనుకున్నది సాధించవచ్చని, మీరు కనే చిన్న చిన్న కలలను కూడా సాకారం చేసుకుని సమాజ ఆమోదం పొందవచ్చని ఒక సున్నితమైన అంశం ద్వారా ప్రపంచానికి చాటిచెప్పిన ఈ నాటకం పండితులను, పామరులను, విమర్శకులను కూడా ఏకమొత్తంగా ఆకర్షించి తిరుగులేని ప్రాచుర్యం పొందుతోంది. 2017 ఫిబ్రవరి 13న షెఫీల్డ్ లోని క్రుసిబుల్ థియేటర్లో ప్రదర్శన ప్రారంభమైన ఈ సంగీత రూపకం బ్రిటన్‌లోని పలు ప్రాంతాల్లో సంవత్సరం పొడవునా ప్రదర్శితమవుతూనే ఉంది. కరణ్ థాపర్ వ్యాసకర్త సీనియర్ పాత్రికేయులు ఈ–మెయిల్ : karanthapar@itvindia.net -
స్ర్కీన్ ప్లే 4th January 2018
-
స్ర్కీన్ ప్లే 1st January 2018
-
స్క్రీన్ ప్లే 29th December 2017
-
స్క్రీన్ ప్లే 28th December 2017
-
స్క్రీన్ ప్లే 27th December 2017
-
స్క్రీన్ ప్లే 26th December 2017
-
స్క్రీన్ ప్లే 26th December 2017
-
ఇంక నీకు ఆ చాన్స్ లేదులే!
తెలుగులో సూపర్‌హిట్ కామెడీ సినిమాల లిస్ట్‌లో ఎప్పటికీ స్థానం సంపాదించుకునే సినిమాలోని కొన్ని సన్నివేశాలివి. మొదటి సన్నివేశం నుంచి చివరి సన్నివేశం వరకూ ఆద్యంతం నవ్వించే ఈ సినిమాలో, ఉన్న కొన్ని సెంటిమెంట్ సీన్లను కూడా ఎప్పటికీ మరచిపోలేం. ఈ సినిమా పేరేంటో చెప్పుకోండి చూద్దాం.. నందు ఇల్లంతా సందడిగా ఉంది. ఆమె జీవితం ఒక్కసారే ఒక కొత్త మలుపు తీసుకుంది. ఇదంతా కాస్తంత భయంగా కూడా ఉందామెకు. ఎవరితోనో ఏదో చెప్పాలని మాత్రం అనుకుంటోంది. కానీ ఎవరు వింటారు? ఎవరికి చెప్పుకుంటుంది? నిశ్చితార్థం గ్రాండ్‌గా జరిగింది. ఇంకొన్ని రోజుల్లో పెళ్లి. పెళ్లవ్వగానే భర్తతో అమెరికా వెళ్లిపోతుంది. ఇన్ని కొత్త కొత్త సవాళ్లన్నీ ఒక్కసారే మీదపడటంతో ఆలోచనల్లో పడిపోయింది. నందు ఆలోచనలను బ్రేక్ చేస్తూ.. ‘‘ఏంటి నందూ!! ఏంటి అమెరికా కబుర్లూ..?’’ అడిగింది నందు అత్త సుజాత, నిశ్చితార్థం జరిగిన వారానికి ఇంటికి వచ్చిందామె. నందు అత్తపై కోపంగా ఉంది, నిశ్చితార్థానికి రాలేదని. ‘‘నేన్నీతో మాట్లాడను పో!’’ అంది నందు, కోపంగా. అదేరోజు రాత్రి. నందు తన గదిలో పుస్తకం చదువుతూ కూర్చుంది. సుజాత అప్పుడే నందు గదికి వచ్చింది. ‘‘ఏంటి నందూ! ఏం చదువుతున్నావ్?’’ అడిగింది సుజాత. నందు ముఖం తిప్పుకొని మళ్లీ పుస్తకం చదవడంలో పడిపోయింది. ‘‘నాకంటే ఈ పుస్తకం ఎక్కువా నీకు?’’ సుజాత. ‘‘నా ఎంగేజ్మెంట్ కంటే మీ అత్తగారెక్కువా నీకు?’’ ‘‘అది కాదు నందూ..’’ ‘‘నాకు నీ మీద ఇక్కడ దాకా కోపం ఉంది..’’ పీకమీద చెయ్యి పెట్టుకొని చెప్పింది నందు. ‘‘ఆరోజు నేనెంత డిజప్పాయింట్ అయ్యానో తెల్సా! ఇప్పుడొచ్చి మళ్లీ నాతో మాట్లాడవా అని అడుగుతోంది చూడు.. చిన్నప్పట్నుంచీ అత్తా అత్తా అని నీ వెనకే తిరిగేదాన్నిగా.. అందుకే నేనంటే లెక్కే లేదు నీకు..’’ నందు మాట్లాడుతూ పోతోంది. సుజాత ఏం మాట్లాడకుండా అలాగే కూర్చొని చూస్తోంది. కళ్లలో నీళ్లు. నందు, సుజాతకు దగ్గరగా వచ్చి, ‘‘అత్తా! నేను నిన్ను హర్ట్ చేశానా?’’ అడిగింది. ‘‘ఊహూ.. నేనే మిమ్మల్నందర్నీ బాధ పెట్టాను. నీకు తెలీదు నందూ.. పెళ్లయితే చాలా మారతాయి. నీకు తెలీదు. పుట్టింటికి వెళ్లాలంటే ఎన్నో పర్మిషన్లు, కారణాలు, సంజాయిషీలు. ఒక్కోసారి అనిపిస్తుంది.. నా వాళ్లను చూడటానికి నాకిన్ని ఆంక్షలా అని!’’ సుజాత మాటలను మధ్యలోనే ఆపేస్తూ.. ‘‘అత్తయ్యా! మావయ్య నిన్ను సరిగ్గా చూసుకోవట్లేదా?’’ అనడిగింది నందు. ‘‘అలాంటిదేమీ లేదు. మీ మావయ్య చెడ్డవాడు కాదు. అలా అని మంచివాడూ కాదు. మొగుడు. అంతే!’’ అత్తమాటలు నందుకి అర్థమైకానట్లు ఉన్నాయి. ఆలోచనల్లో పడింది. ‘‘నా పెళ్లైన ఇన్నేళ్లలో ఆయన ఒక్కసారైనా నన్ను భోంచేశావా అని అడగలేదంటే నువ్వు నమ్ముతావా?’’ ‘‘ఇదంతా మాకు ఎప్పుడూ ఎందుకు చెప్పలేదు నువ్వు..’’ ‘‘నా బాధలు చెప్పుకునేంత పెద్దవి కావు. మర్చిపోయేంత చిన్నవీ కావు..’’ సుజాత మాట్లాడుతూ ఉంటే నందు వింటూ, ఆలోచిస్తూ నిలబడింది. చాలా మాట్లాడింది సుజాత. నందుకి ఇవన్నీ కొత్తగానే ఉన్నాయి. పెళ్లంటే తనకున్న భయాన్ని పెంచలేదు, తగ్గించలేదు ఆ మాటలు. పెళ్లంటే అర్థమయ్యేలా చేశాయి అంతే. ‘‘ఈ పెళ్లిళ్లు ఎందుకు అవ్వాలి? మనం ఆడపిల్లలుగా ఎందుకు పుట్టాలి?’’ గట్టిగా ఏడుస్తూ మాట్లాడుతోంది సుజాత. నందు ఆవిడను గట్టిగా హత్తుకొని తనూ ఏడ్చేసింది. నందు, సుజాత పెరట్లో పూలు కోస్తున్నారు. నందు అప్పటికే సుజాతను ఒక ప్రశ్న అడగాలని, అందుకు ఒక మంచి సమయం దొరకాలని చూస్తూంది. ఇదే సరైన సమయం అనుకొని అడిగేసింది.. ‘‘అత్తయ్యా! నువ్వెవ్వరినైనా లవ్ చేశావా?’’ అని. ‘‘పొద్దున్నే నేనే దొరికానా నీకు?’’ సుజాత వెటకారంగా అడిగింది. ‘‘నేను సీరియస్‌గా అడుగుతున్నాను..’’ అంది నందు. సుజాత సిగ్గుపడుతూ, తల పక్కకు తిప్పింది. ‘‘ఆ! చేశావ్లే!!’’ నందు సుజాతను ఆటపట్టించడం మొదలుపెట్టింది. సుజాత నవ్వింది. ‘‘ఎవరు?’’ నందు. ‘‘పేరు తెలియదు. రోజూ నేను కాలేజ్‌కి వెళుతూంటే, సందు చివర ఉండేవాడు.’’ ‘‘ఏం చేసేవాడు?’’ ‘‘చూసి నవ్వేవాడు!’’ ఇద్దరూ నవ్వుకున్నారు. ‘‘అంతేనా?’’ అడిగింది నందు. ‘‘ఏంటి అంతేనా అంటావ్? ఆ మాత్రం నవ్వడానికి సంవత్సరం పట్టింది తెల్సా?’’ నవ్వుతూ సమాధానమిచ్చింది సుజాత. ‘‘తర్వాతా?’’ ‘‘నాకు పెళ్లి కుదిరింది. అతనికి ఆ విషయం తెలిసింది. తర్వాతెప్పుడూ సందు చివర అతను కనబడలేదు.. పాపం మంచోడు!’’ ‘‘పిరికోడు.. అందుకే నీ గురించి డాడీకి చెప్పడానికి భయపడి పారిపోయాడు..’’ ‘‘ఆ విషయం ఇంట్లో తెలిస్తే, చాలా గొడవై ఉండేది తెల్సా?’’ ‘‘అసలు చెప్తే కదా! గొడవయ్యేదో లేదో తెలిసేది!!’’ ‘‘నేను చెప్పలేదని ఎగతాళి చేస్తున్నావా?’’ కాదన్నట్టు తలూపి, ‘‘నేనెవర్నైనా ఇష్టపడితే, ధైర్యంగా ఆ విషయం డాడీతో చెప్పేదాన్నీ అంటున్నా..’’ అంది నందు. ‘‘ఇంక నీకు ఆ చాన్స్ లేదులే!’’ అంది సుజాత గట్టిగా నవ్వుతూ. ఒకర్ని ఇష్టపడే అలాంటి రోజు ఒకటి ముందు రోజుల్లో నిజంగానే వస్తుందని తెలియని నందు, సుజాతతో పాటే నవ్వింది. -
స్పైసీ సాంబార్
‘శుభం’ దగ్గరికి వచ్చేసింది 2017. అనడానికి శుభమే కానీ, సౌత్ సినీ ఇండస్ట్రీకి మొత్తమంతా శుభంగా ఏమీ జరగలేదు! పిక్చర్ హిట్లు, ఫట్ల మాట అటుంచండి. మాట జారడం, ముక్కుసూటిగా మాట్లాడ్డం.. ఈ ఏడాది పెద్ద కాంట్రవర్సీలు అయ్యాయి. కొందరు జైలుకు వెళ్లారు. కొందరు కన్నీళ్లు పెట్టుకున్నారు. కొందరు ‘సారీ’ చెప్పారు. కొందరు సవాళ్లు విసిరారు. ఇవన్నీ ఇక్కడితో ఆగిపోతే బాగుంటుంది. కొత్త సంవత్సరం హ్యాపీగా మొదలౌతుంది. ఇంతకీ ఏమిటా కాంట్రవర్సీలు? కట్టప్ప బాహుబలిని ఎందుకు చంపాడు? ఆడియెన్స్ టెన్షన్. బాహుబలి 2ని కన్నడిగులు రిలీజ్ చెయ్యనిస్తారా? సత్యరాజ్ టెన్షన్. రాజమౌళి కూల్‌గానే ఉన్నాడు. కూల్ కావలసింది కన్నడ ప్రేక్షకులు. తొమ్మిదేళ్ల క్రితం కావేరీ నీళ్ల గొడవలో సత్యరాజ్ కత్తి బయటికి తీశాడు. కత్తి అంటే కత్తి కాదు. యాంటీ–కన్నడ స్టేట్మెంట్. కావేరీ నీళ్లివ్వకపోతే నీళ్లకు బదులు ఇంకేవో పారతాయన్న అర్థంలో ఏదో అన్నాడు సత్యరాజ్. ఆ వీడియో సడన్‌గా నెట్లో పైకి తేలింది. కన్నడిగులు భగ్గుమన్నారు. టైమ్ చూసి సినిమా గేట్లు బంద్ చేశారు. బాహుబలి 2ని కర్ణాటకలో ఆడనివ్వం అన్నారు. నీళ్లు చల్లితే మంటలు చల్లారతాయి. నీళ్ల వల్లే మంటలు రేగితే? సత్యరాజ్ షాక్‌లోకి వెళ్లిపోయాడు. రాజమౌళి నీళ్లు చల్లి కట్టప్పని కూర్చోబెట్టాడు. ‘పర్లేదు ఏం కాదు’ అన్నాడు. ఇద్దరూ విడివిడిగా వీడియోలు రిలీజ్ చేశారు. ‘అర్థం చేసుకోండి ప్లీజ్’ అని రాజమౌళి రిక్వెస్ట్ చేశాడు. ‘హర్ట్ చేసి ఉంటే సారీ’ అని సత్యరాజ్ ప్లీజ్ చేశాడు. కన్నడిగులు చల్లబడ్డారు. సెన్సార్ కత్తెర తీసింది గవర్నమెంట్‌ని ఏదైనా అనాలంటే గట్స్ ఉండాలి. ఉంటే మాత్రం ఎందుకంటాం చెప్పంyì ? అసలే గవర్నమెంట్! ఎక్కడ కట్ చేయాలో అక్కడ కట్ చేస్తుంది. ‘మెర్సల్’ని కూడా అలాగే కట్ చేయబోయింది. సెన్సార్ బోర్డు కూడా కత్తెరతో రెడీ అయి కూర్చుంది. జీఎస్టీకి యాంటీగా అందులో హీరో డైలాగులు కొడతాడు. వాటిని కట్ చెయ్యాలని పై నుంచి ఆర్డర్స్! లేకపోతే బ్యాన్. ‘కట్ చెయ్యనివ్వం. బ్యాన్ కానివ్వం’ అని తమిళ్ ఆడియన్స్ థియేటర్ల దగ్గరికి గస్తీగా వచ్చి కూర్చున్నారు. పిక్చర్ బతికింది. ‘మెర్సల్’ రిలీజ్‌కు ముందు కూడా.. లోపల జీఎస్టీని చూసి.. సర్టిఫికెట్ ఇవ్వడానికి సెన్సార్ బోర్డ్ ‘నో’ అంది. రోడ్లు బ్లాక్ చేసి, ధర్నాలు చేసి మరీ బాక్సులు విడిపించుకున్నారు. ఈ ఏడాది సౌత్ సినీ ఇండస్ట్రీ మొత్తం మీద అతి పెద్ద కాంట్రావర్శి.. మెర్సల్. దిలీప్ జైలుకెళ్లొచ్చాడు ఫిబ్రవరిలో దిలీప్ సినిమా ఇండస్ట్రీకి పెద్ద షాక్ ఇచ్చాడు. కోలీవుడ్‌కి మాత్రమే ఆ షాక్ లిమిట్ కాలేదు. సౌత్ మొత్తానికీ కొట్టింది. ఆయనేం బ్లాక్ బస్టర్ ఇవ్వలేదు. ‘బ్యాడ్‌మ్యాన్’గా బయటికొచ్చాడు! మలయాళం, తమిళ్, తెలుగు, కన్నడ భాషల్లో నటిస్తున్న ఓ బ్యూటిఫుల్ స్టార్లెట్ని కిడ్నాప్ చేసి, లైంగికంగా వేధించడానికి కుట్ర పన్నాడని పోలీసులు దిలీప్ని అరెస్ట్ చేశారు. రెండు నెలలు జైల్లో ఉండి, బెయిల్‌పై బయటికి వచ్చాడు. హీరోకి విలన్ బుద్ధేమిటి అని అభిమానులు తలవంపుగా ఫీల్ అయ్యారు. మనకీ ఖర్మ ఏమిటి అని ‘రామ్‌లీల’ నిర్మాతలు తలలు పట్టుకున్నారు. అందులో దిలీప్‌ది లీడ్ రోల్. పొలిటికల్ కాన్స్పిరసీ థ్రిల్లర్. సరిగ్గా రిలీజ్‌కి రెడీగా ఉన్నప్పుడు దిలీప్ అరెస్ట్ అయ్యాడు. దిలీప్ మీద కోపం సినిమా పైకి మళ్లింది. మహిళా సంఘాలు, రాజకీయ పక్షాలు సినిమా రిలీజ్‌ను అడ్డుకున్నాయి. దిలీప్ని వేరుగా, సినిమాను వేరుగా చూడండి అని ఇండస్ట్రీ ప్రాధేయపడింది. సినిమా రిలీజ్ అయింది! అవడమే కాదు, బ్లాక్‌బస్టర్ అయింది! దిలీప్ పాత్రను పాత్రగానే చూసింది కోలీవుడ్. అపహరణ కేసులో దిలీప్ పాత్రేమిటో ఇంకా తేల్లేదు. కేసు నడుస్తోంది. ఫొటోలు లీక్ అయ్యాయి సౌత్ సినీ ఇండస్ట్రీలో ఈ ఏడాది మోస్ట్ కంగాళీ వ్యవహారం ‘సుచీలీక్స్’. శుచీ శుభ్రత ఏమాత్రం లేని లీక్స్! తమిళ్ సింగర్, రేడియో జాకీ సుచిత్రా కార్తీక్ తన ట్విట్టర్లో కొన్ని ఫొటోలు పోస్ట్ చేసింది. ఎవరెవరో ఎవరెవరితోనో ఉన్న మూవీస్టార్ల ఫొటోలు అవి. వాటిల్లో ధనుష్ కూడా ఉన్నాడు. కొన్ని గంటల తర్వాత సుచిత్ర వాటిని డిలీట్ చేసింది. ఆ తర్వాత మళ్లీ కొత్త ఫొటోలు పెట్టింది. సుచిత్ర భర్త నెత్తీనోరూ బాదుకుంటూ, ‘నా భార్య మెంటల్ కండిషన్ బాగోలేదు’ అంటూ ఓ వీడియో అప్లోడ్ చేశాడు. ‘ఇదేం గొడవ తల్లీ..’ అని పోలీసులు వెళ్లి అడిగితే, ‘నా ట్విట్టర్ అకౌంట్‌ని ఎవరో హ్యాక్ చేశారు’ అంది సుచిత్ర. ‘ఇంకా ఏవైనా లీక్స్ ఉన్నాయా చెప్పు’ అని అడిగారు. ఆ సంగతి హ్యాక్ చేసినవాళ్లకు కదా తెలుస్తుందీ’ అని అమాయకంగా కనురెప్పలు టపటపలాడించింది. మీడియా ఈ వ్యవహారానికి ‘సుచీలీక్స్’ అని పేరు పెట్టింది. వల్గర్‌గా మాట్లాడారు! ధన్యా రాజేంద్రన్ చెన్నై జర్నలిస్ట్. విజయ్ సినిమా ‘సుర’ మీద ట్విట్టర్లో క్యాజువల్‌గా ఆమె పెట్టిన కామెంట్‌కి విజయ్ అభిమానులంతా ఇంతెత్తున లేచారు. నానా మాటలు అన్నారు. రేప్ చేసి చంపుతాం అన్నారు. ఇంతాచేసి ‘సుర’ సినిమాను ఆమె డైరెక్టుగా ఏమీ అనలేదు. ఆ ‘సుర’ కూడా ఇప్పుడు రిలీజ్ అయింది కాదు. ఏడేళ్ల నాటిది! ‘‘షారుక్ ఖాన్ మూవీ ‘వెన్ హ్యారీ మెట్ సెజల్’ని చూశాను తల వాచి పోయింది. ఇంతకన్నా ‘సుర’ మూవీనే నయం. కనీసం ఇంటర్వెల్ వరకైనా చూడగలిగాను’’ అని ధన్య ట్వీట్ చేశాక ఆమెకు నరకం మొదలైంది. ‘‘ఆమె జర్నలిస్టు. విమర్శించే హక్కు ఉంటుంది. కానీ ఆ వెటకారమే మాకు నచ్చడం లేదు’’ అని మాత్రం ఒక మర్యాదపూర్వకమైన ట్వీట్ వచ్చింది ధన్యకు. చివరికి విజయ్ సీన్లోకి వచ్చి.. ‘స్త్రీలను గౌరవించడం మన సంప్రదాయం’’అని స్టేట్మెంట్ ఇచ్చాక గానీ ట్వీట్ల వర్షం ఆగలేదు. మమ్ముట్టీ ఫ్యాన్స్‌కి మండింది మలయాళం మూవీ ‘అంగమలి డైరీస్’తో అన్నా రేష్మా రాజన్ ఈ యేడాదే కొత్తగా ఫీల్డ్‌లోకి వచ్చింది. చాలామందికి నచ్చింది. మీడియావాళ్లక్కూడ. ఇంటర్వ్యూల మీద ఇంటర్వ్యూలు తీసుకున్నారు. ఓ ఇంటర్వ్యూలో రేష్మా రాంగ్ స్టెప్ వేసింది. నిజానికి అది రాంగ్ స్టెప్ కాదు. మమ్ముట్టీ, ఆయన కొడుకు దుల్కర్ సల్మాన్ల అభిమానులకు రాంగ్ అయింది. ‘‘మమ్ముట్టీ, దుల్కర్ ఇద్దరూ ఒకే సినిమాలో యాక్ట్ చేస్తుంటే.. మీరు ఎవరి పక్కన నటించడానికి ఇష్టపడతారు?’’ అన్నది క్వశ్చన్. వెంటనే రేష్మ.. దుల్కర్ పేరు చెప్పింది. ‘ఎందుకు?’ అనంటే, ‘మమ్ముట్టీ తండ్రి పాత్రకు బాగుంటారు’ అంది. అంతే.. ఆమె మీద ట్రాల్స్ మొదలయ్యాయి. ‘మోహన్‌లాల్ కావాలి కానీ, మమ్ముట్టీ వద్దా నీకు..’ అని వల్గర్ కామెంట్స్ స్టార్ట్ అయ్యాయి. (‘అంగమలి డైరీస్’ తర్వాత ‘వెలిపడింటే పుస్తకం’ అనే సినిమాలో మోహన్‌లాల్ పక్కన యాక్ట్ చేసింది రేష్మ). రేష్మ ఏడ్చేసింది. ఇంట్లో ఒక్కతే కూర్చొని కాదు. ఏడుస్తూ ఫ్యాన్స్‌కి క్షమాపణ చెప్తున్న వీడియోను ఫేస్బుక్లో పెట్టింది. కసాబా కామెంట్‌పై గొడవైంది పార్వతి ఇంకో కేరళ కుట్టి. ముక్కుసూటి నటి. ఏడ్చే టైపు కాదు. ఈ ఏడాది కేరళ ఇంటర్నేషనల్ ఫిల్మ్ ఫెస్టివల్లో ప్యానెల్ మెంబర్‌గా ఆమె మమ్ముట్టి ‘కసాబా’ మూవీని విమర్శించింది. అందులో మమ్ముట్టీ పోలీస్ ఆఫీసర్. రఫ్ క్యారెక్టర్. ఓ సీన్లో అతడు ఉమన్ పోలీస్ ఆఫీసర్ నడుముకు ఉన్న బెల్టును పట్టి లాగుతూ, స్త్రీల ప్రతిభను తక్కువ చేసే డైలాగులు చెప్తాడు. పార్వతికి అది నచ్చలేదు. బ్యాడ్ క్యారెక్టర్ అంది. మమ్ముట్టిని అనలేదు. మమ్ముట్టి వేసిన క్యారెక్టర్ని అంది. అది అర్థం చేసుకోకండా ఫ్యాన్స్ అంతా సోషల్ మీడియాలో పార్వతిని ఇష్టం వచ్చినట్లు తిట్టారు. స్టేజీ మీదే తిట్టేశారు సాయి ధన్సిక కన్నీళ్లు పెట్టుకోవడం, అమలాపాల్ బాగా హర్ట్ అవడం కూడా ఏడాది టాక్ ఆఫ్ ది సౌత్ అయింది. నవంబర్‌లో రిలీజ్ అయిన ‘విళిత్తిరు’ మూవీ ప్రెస్మీట్లో డైరెక్టర్ రాజేంద్రన్ (ఆ సినిమా డైరెక్టర్ కాదు)ను సాయి ధన్సిక స్టేజ్ మీదకు ఆహ్వానించడం మర్చిపోవడం ఆయన అభిమానులకు బాగా కోపం తెప్పించింది. అమలాపాల్‌కు జరిగిన ఇన్సల్ట్ వేరే ఇంకో ప్రోగ్రామ్‌లో. అమల లేని ఆ స్టేజ్‌పైన అమలను తిట్టింది ఎడిటర్ లెనిన్. ఒక ఇంటర్వ్యూలో అమల చెప్పిన మాటల్ని అపార్థం చేసుకుని అమలను కించపరిచేలా ఆయన మాట్లాడాడు. ‘తిరుట్టు పాయలే 2’ చిత్రం పోస్టర్లలో అమల నాభి కనిపిస్తుంది. దీనిపై విమర్శలు వచ్చినప్పుడు.. 2017లో కూడా మనం హీరోయిన్ నాభి గురించి మాట్లాడుతున్నాం అని అమల ఆశ్చర్యపోయింది. ఆ మాట లెనిన్‌కి కోపం తెప్పించింది. ‘నాభికేం కర్మ, నాభి లోపలికి కూడా చూపించేస్తారు ఈ హీరోయిన్లు.. ఛీ’ అన్నాడు! నేషనల్ అవార్డు విన్నర్ అయిన లెనిన్ ఇలా సంస్కారం లేకుండా మాట్లాడ్డంతో ఇండస్ట్రీ విస్తుపోయింది. శింబూ తల తెగబోయింది 2017లో ఇంకో పెద్ద కాంట్రవర్శీ... శింబూ షూటింగ్‌లను ఎగ్గొట్టి నిర్మాతలను ఇబ్బంది పెట్టడం. అతని ఇండిసిప్లీన్ బిహేవియర్ వల్ల స్కెడ్యూళ్లు దెబ్బతిని తమకు నష్టాలు వచ్చాయని మరికొందరు నిర్మాతలు బయటికి వచ్చారు. శింబును అసలే ఏ సినిమాలోకీ తీసుకోకూడదని తీర్మానించారు. శింబూ సారీ చెప్పి తప్పించుకున్నాడు. తమిళ్, కన్నడం, మలయాళం అయ్యాయి. ఇక తెలుగు ఒక్కటి మిగిలింది. ఇక్కడేం లేవా? పెద్దగా లేవు. ఉన్న ఒకదాన్నీ పెద్దది చేద్దామని మీడియా చూసింది కానీ, తెలుగు ప్రేక్షకులు పెద్దగా పట్టించుకోలేదు. మీకు గుర్తుండే ఉంటుంది. ‘రారండోయ్ వేడుక చూద్దాం’ ట్రైలర్ రిలీజ్ ఫంక్షన్లో నటుడు చలపతిరావుని మాట్లాడించి, íసినిమాలోని ఒక డైలాగ్‌కి ఆయన చేత ఆన్సర్ చెప్పించడంతో వివాదం మొదలైంది. ఇవండీ.. 2017లో అభిమానుల యాటిట్యూడ్ వల్ల యాక్టర్లకు వచ్చిన తిప్పలు, తలనొప్పులు; యాక్టర్ల బోల్డ్ బిహేవియర్ వాళ్ల అభిమానులకు వచ్చిన కోపాలు, తాపాలు. -
తెలుగు ప్రపంచ మహాసభలకు సినీ కళ
-
తారలు దిగివచ్చిన వేళ..
సాక్షి, హైదరాబాద్: ప్రపంచ తెలుగు మహాసభల్లో సోమవారం సినీ ప్రముఖులు సందడి చేశారు. ఒకరు ఇద్దరు కాదు 40 మందికిపైగా ఒకే వేదికపైకి చేరి అలరించారు. సోమవారం రాత్రి లాల్ బహుదూర్ స్టేడియంలో నిర్వహించిన ‘సినీ సంగీత విభావరి’లో సినీ ప్రముఖులు కృష్ణ, చిరంజీవి, బాలకృష్ణ, నాగార్జున, వెంకటేష్, మోహన్‌బాబు, రాఘవేంద్రరావు, సురేశ్‌బాబు, తమ్మారెడ్డి భరద్వాజ, అశ్వినీదత్, రాజమౌళి, జగపతిబాబు, రాజేంద్రప్రసాద్, ఆర్.నారాయణ మూర్తి, విజయ్ దేవరకొండ తదితరులు పాల్గొన్నారు. సినీ దిగ్గజాలతోపాటు గవర్నర్ నరసింహన్, మంత్రులు కేటీఆర్, తలసాని శ్రీనివాసయాదవ్‌లు హాజరయ్యారు. తొలుత వేదికపై పలువురు గాయనీగాయకులు ఆ పాత మధురపు పాటలతో ప్రేక్షకులను అలరించారు. సినీ ప్రముఖులకు సన్మానం వేదికపై కృష్ణ, చిరంజీవి, బాలకృష్ణ, నాగార్జున, మోహన్‌బాబు, జమున, వెంకటేశ్, రాజేంద్రప్రసాద్, బ్రహ్మానందం, కోట శ్రీనివాసరావు, రాఘవేంద్ర రావు, బి.నర్సింగ్‌రావు, రాజమౌళి, జయసుధ, ఎన్.శంకర్లను గవర్నర్, మంత్రులు సన్మానించారు. తెలుగే మాట్లాడుతా..: చిరంజీవి సీఎం కేసీఆర్ తెలుగు భాషను రక్షించేందుకు ఓ బాధ్యతగా ప్రపంచ తెలుగు మహాసభలను నిర్వహించడం ఆయన సంస్కారానికి నిదర్శనమని చిరంజీవి పేర్కొన్నారు. ఐదు రోజుల పాటు ఇంత గొప్పగా సభలు జరుగుతున్నాయంటే దానికి ప్రభుత్వ యంత్రాంగం చేస్తున్న కృషే కారణమని చెప్పారు. తెలుగును సంరక్షిస్తూ ముందు తరాలకు అందించాల్సిన బాధ్యత ప్రతి ఒక్కరిపై ఉందన్నారు. మన ఆలోచనలు ఏ భాష ద్వారా వస్తాయో.. అదే మన మాతృభాష అని పేర్కొన్నారు. ‘‘ఈ మహాసభలకు మంత్రి కేటీఆర్ నన్ను ఆహ్వానించడానికి వచ్చారు. అప్పుడు నేను కేటీఆర్ చేసిన అభివృద్ధి పనులను ఇంగ్లిష్‌లో చెబుతూ అభినందిస్తున్నాను. వెంటనే కేటీఆర్ స్పందించి.. ‘‘అన్నా.. నేను తెలుగు సభల కోసం మిమ్మల్ని పిలవడానికి వస్తే.. మీరేంటి ఇంగ్లిష్‌లో మాట్లాడుతున్నారనడంతో ఒక్కసారిగా ఆలోచనలో పడిపోయాను. నిజమే నేను ఆ క్షణంలో సత్యాన్ని గ్రహించాను. ఇకపై అన్ని సందర్భాల్లో తెలుగే మాట్లాడాలని నిర్ణయించుకున్నాను..’’ అని చిరంజీవి వెల్లడించారు. కేసీఆర్, కేటీఆర్‌లను సత్కరించాలి... ‘దేశ భాషలందు తెలుగు లెస్స’ అనే సామెతను గుర్తు చేస్తూ కేసీఆర్ ఈ సభలను ఏర్పాటు చేయడం అభినందనీయమని నటుడు మోహన్‌బాబు పేర్కొన్నారు. ఇంగ్లిష్ నేర్పించాలని ఒత్తిడి వస్తున్న రోజుల్లో ఈ సభలు ఎంతో దోహదపడతాయని చెప్పారు. సినీ పరిశ్రమకు చెందిన తమను పిలిచి సత్కరించడం నిజంగా అభినందనీయమన్నారు. కేటీఆర్ చేస్తున్న అభివృద్ధి పనులకుగాను ఆయనను సత్కరించేందుకు సొంతంగా శాలువా తెచ్చానని చెప్పారు. తాను తెచ్చిన శాలువా కప్పి కేటీఆర్‌ను సత్కరించారు. అలరించిన సినీ సంగీత విభావరి - కార్యక్రమంలో మహిళా దర్శకురాలు నందినిరెడ్డి దర్శకత్వం వహించిన ‘బతుకమ్మ’ పాటను ఈ సభల్లో చూపారు. ప్రముఖ యాంకర్లు ఉదయభాను, ఝాన్సీ, సుమలు ప్రధాన భూమిక పోషించిన ఈ పాట బాగా ఆకట్టుకుంది. - ప్రముఖ దర్శకుడు పైడిపల్లి వంశీ దర్శకత్వం వహించిన ‘హోలీ’ పాటను కూడా చూపారు. అందులో యువ నటుడు విజయ్ దేవరకొండ, మెర్లీన్ చోప్రాలు ప్రేక్షకులను అలరించారు. - దర్శకుడు హరీశ్‌శంకర్ ఆధ్వర్యంలో రూపొందించిన ‘తెలంగాణ చరిత్ర’ పాట వీక్షకుల్ని కట్టిపడేసింది. ఈ పాటను తెలంగాణ చరిత్రకు సంబంధించిన చరిత్రకారుల్ని, తెలంగాణలో ప్రాచుర్యం పొందిన ప్రదేశాలను గుర్తు చేస్తూ తీశారు. ఇందులో నటులు మెర్లీన్ చోప్రా, లావణ్య త్రిపాఠి, వరుణ్‌తేజ్, రాజ్‌తరుణ్, సింగర్ రేవంత్, సాయిధరమ్‌తేజ్, హెబ్బా పటేల్, షాలినీ పాండే, సునీత, సునీల్, చంద్రబోస్‌లు మెరిశారు. దీంతో స్టేడియంలోని ప్రేక్షకులు హర్షం వ్యక్తం చేశారు. - కార్యక్రమంలో నటులు కాంతారావు, ప్రభాకర్ రెడ్డి, శ్రీహరి కుటుంబాలను సత్కరించారు. -
నా బెస్ట్ చిత్రాలలో ఒకటిగా నిమిర్: ప్రియదర్శన్
తన ది బెస్ట్ చిత్రాలలో నిమిర్ చిత్రం ఒకటిగా నిలిచిపోతుందని చాలా కాన్ఫిడెంట్‌గా చెప్పారు ప్రముఖ దర్శకుడు ప్రియదర్శన్. ఈయన తెరకెక్కించిన తాజా చిత్రం నిమిర్. మలయాళంలో మంచి విజయాన్ని సాధించిన మహేషింటే ప్రతీకారం చిత్రానికిది రీమేక్. ఉదయనిధి స్టాలిన్ హీరోగా నటించిన ఇందులో నమిత ప్రమోద్, పార్వతి నాయర్ నాయికలుగా నటించారు. మూన్‌షాట్ ఎంటర్టైన్మెంట్ పతాకంపై సంతోష్ టి.కురువిల్లా నిర్మించిన ఈ చిత్రం షూటింగ్ పూర్తి చేసుకుని ప్రస్తుతం సెన్సార్ కార్యక్రమాలు జరుపుకుంటోంది. ఈ సందర్భంగా చిత్ర యూనిట్ చెన్నైలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో నిర్మాత మాట్లాడుతూ తానింతకు ముందు మలయాళంలో నాలుగు చిత్రాలు నిర్మాంచాననీ, తమిళంలో చేస్తున్న తొలి చిత్రం నిమిర్ అని చెప్పారు. వివిధ భాషల్లో 93 చిత్రాలు చేసిన లెజెండ్రీ దర్శకుడు ప్రియదర్శన్‌తో చిత్రం చేయడం సంతోషంగా ఉందన్నారు. కథానాయకుడు ఉదయనిధి స్టాలిన్ మాట్లాడుతూ తన సినీ కేరీర్‌లోనే నిమిర్ చాలా ముఖ్యమైన చిత్రంగా పేర్కొన్నారు. ఒక రోజు ప్రియదర్శన్ పిలిచి తన చిత్రంలో నటించమని అడిగారన్నారు. దీంతో తాను సార్ నిజంగానే అంటున్నారా? దర్శకుడెవరు? అని అడగ్గా నేనే దర్శకుడిని అని ఆయన చెప్పడంతో చెప్పలేనంత ఆనందం కలిగిందన్నారు. ఇందులో ముఖ్య పాత్రను పోషించిన దర్శకుడు మహేంద్రన్ తెరి చిత్రం తరువాత విలన్‌గా నటించమని చాలా అవకాశాలు వచ్చినా అంగీకరించలేదనీ, ప్రియదర్శన్ కోసమే ఈ చిత్రంలో నటించానని చెప్పారు. ఈ చిత్రం ప్రివ్యూ చూసి మనిదన్ చిత్రం తరువాత అంతకంటే మంచి చిత్రం చేశారని తన భార్య ప్రశంసించిందన్నారు. అయితే పాహద్ ఫాజిల్ నటనలో సగమే మీరు చేశారని అందనీ, అదీ ప్రశంస గానే తాను తీసుకున్నానని చెప్పారు. చిత్రం ప్రస్తుతం సెన్సార్ కార్యక్రమాలను జరుపుకుంటోందని, జనవరి 26న విడుదలకు సన్నాహాలు చేస్తున్నామని స్టాలిన్ వెల్లడించారు. ప్రియదర్శన్ మాట్లాడుతూ ఈ చిత్ర కథకు ఒక సాధారణ నటుడు అవసరం అవ్వడంతో ఉదయనిధిని ఎంపిక చేశామన్నారు. ఆయన ఇంతకుముందు చేసిన చిత్రాలేవీ తాను చూడలేదన్నారు. ఇది ఒక గ్రామీణ నేపథ్యంలో సాగే ఒక ఫోటోగ్రాఫర్ ఇతివృత్తంతో కూడిన కథా చిత్రం అని చెప్పారు. మలయాళంలో షాహద్ పాజిల్ కంటే తమిళ వెర్షన్లో ఉదయనిధి స్టాలిన్ చాలా బాగా నటించారని దర్శకుడు మహేంద్రన్ తనతో అన్నారని ప్రియదర్శన్ చెప్పారు. ఎవరికీ ఎలాంటి ఇబ్బంది కలిగించకుండా తన పని తాను చేసుకుపోయే ఒక యువకుడిని అవమాన పరుస్తారన్నారు. వారిపై ప్రతీకారం తీర్చుకునే వరకు తాను కాళ్లకు చెప్పులు కూడా తొడగనని ఆ యువకుడు శపథం చేస్తాడన్నారు. దాన్ని ఎలా నెరవేర్చుకున్నాడన్నదే నిమిర్ ఇతివృత్తం అని వివరించారు. మలయాళం చిత్ర కథను మాత్రమే తీసుకుని మరిన్ని కమర్షియల్ అంశాలను జోడించి ఈ చిత్రాన్ని రూపొందించామన్నారు. ఇది తన సినీ కేరీర్‌లోనే ముఖ్య చిత్రంగా నిలిచిపోతుందని నటి పార్వతీనాయర్ అన్నారు. -
‘చార్లీ చాప్లిన్’ సీక్వెల్లోనూ ఆ ఇద్దరే!
సినిమాలకు ఇపుడంతా సీక్వెల్స్ ట్రెండ్ నడుస్తోంది. హాలీవుడ్లో ఎప్పటినుంచో ఉన్నా అది ఇటీవల బాలీవుడ్, కోలీవుడ్, టాలీవుడ్‌లకూ పాకింది. ముఖ్యంగా కోలీవుడ్‌లో ఈ ట్రెండ్ అధికం అనే చెప్పాలి. ప్రస్తుతం నిర్మాణంలో ఉన్న 2.ఓ, కలగలప్పు 2, తమిళ పడం 2 ఈ తరహా చిత్రాలే. వీటికి తొలి భాగాలు మంచి విజయాన్ని పొందడంతో రెండవ భాగాలకు రెడీ అయ్యాయి. అలా తాజాగా తెరకెక్కుతున్న చిత్రం చార్లీచాప్లిన్ 2. 2002లో ప్రభు, ప్రభుదేవా, గాయత్రి రఘురామ్, అభిరామిలు కలిసి నటించిన చార్లీచాప్లిన్ మంచి విజయాన్ని సాధించింది. దాని దర్శకనిర్మాత శక్తి ఎన్.చిదంబరం తాజాగా సీక్వెల్‌ను తెరకెక్కిస్తున్నారు. టి.శివ నిర్మిస్తున్న ఈ చిత్రంలో హీరోగా ప్రభుదేవానే నటిస్తున్నారు. ఆయనకు జంటగా నిక్కీగల్రాణి ఎంపికయ్యింది. ఈ చిత్రం తొలి షెడ్యూల్‌ను పూర్తి చేసుకుని, రెండవ షెడ్యూల్‌ను ఈ నెల 15 నుంచి జరుపుకుంటోందని చిత్ర వర్గాలు తెలిపాయి. కాగా, తొలి భాగంలో నటించిన ప్రభు పాత్రలో ఎవరు నటిస్తారన్న సస్పెన్స్ కొనసాగుతున్న తరుణంలో తాజాగా ఇందులోనూ ప్రభు నటించనున్నారని చిత్రవర్గాలు వెల్లడించాయి. తమ చిత్రంలో ఆయన నటించడం సంతోషంగా ఉందని దర్శక నిర్మాతలు అన్నారు. అయితే హీరో పాత్రలను దాటి క్యారెక్టర్ ఆర్టిస్ట్‌గా మారిన ప్రభు ఇందులో ఏ తరహా పాత్రను పోషిస్తున్నారన్న విషయంపై సస్పెన్స్ కొనసాగుతోంది. అయితే ప్రభు చార్లీచాప్లిన్ చిత్రంలో పోషించిన పాత్రకు కొనసాగింపుగానే ఈ చిత్రంలోనూ చేస్తున్నారనే టాక్ వినిపిస్తోంది. ఇదే నిజం అయితే ప్రభు హీరోగా రెండవ ఇన్నింగ్ మొదలెట్టినట్లే అవుతుంది. -
5 నిమిషాల పర్ఫామెన్స్‌కు 5 కోట్లు
బాలీవుడ్ బ్యూటీ ప్రియాంక చోప్రా అంతర్జాతీయ స్థాయిలో దూసుకుపోతోంది. గత రెండేళ్లుగా బాలీవుడ్ కు దూరంగా ఉంటున్న ఈ బ్యూటీ హాలీవుడ్ సినిమాలు, టీవీ సీరీస్ లతో బిజీ బిజీగా ఉంది. అదే సమయంలో పలు అంతర్జాతీయ అవార్డు ఫంక్షన్లలోనూ సందడి చేస్తోంది. రెండేళ్ల తరువాత ఓ బాలీవుడ్ వేడుకకు హాజరు కానుంది ప్రియాంక.. అంతేకాదు ఈ వేడుకలో పర్ఫామ్ కూడా చేయనుంది. జీ సినీ అవార్డ్స్ కార్యక్రమంలో డ్యాన్స్ పర్ఫామెన్స్ ఇచ్చేందుకు అంగీకరించింది ప్రియాంక చోప్రా. ఈ నెల 19న జరగనున్న ఈ వేడుకలో ప్రియాంక 5 నిమిషాల పాటు డ్యాన్స్ చేయనుందట. అయితే ఈ పర్ఫామెన్స్ కు గానూ ఏకంగా 5 కోట్ల రూపాయల పారితోషికం అందుకుంటుందన్న ప్రచారం జరుగుతోంది. ప్రియాంకకున్న గ్లోబల్ ఇమేజ్, అంతర్జాతీయ మీడియాలో ఆమెకున్న ఫాలోయింగ్ కారణంగా అంత పారితోషికం ఇచ్చేందుకు జీ మీడియా ముందుకొచ్చిందట. రెండేళ్ల తరువాత ఈ బ్యూటీ బాలీవుడ్ వేడుకలో సందడి చేయనుండటంతో ఆమె పర్ఫామెన్సే... షోకు హైలెట్ గా నిలువనుంది. -
స్ర్కీన్ ప్లే 15th December 2017
-
సినీ సహాయ దర్శకుడు, నటుడు అరెస్ట్
సాక్షి, మేడ్చల్ : ఓ వ్యభిచార ముఠా గుట్టును ఎస్ఓటీ పోలీసులు రట్టు చేశారు. విటులను ఆన్లైన్ ద్వారా ఆకర్షిస్తూ వ్యభిచార కార్యకలాపాలు నిర్వహిస్తున్నారన్న సమాచారంతో ఎస్ఓటీ పోలీసులు ఘట్కేసర్లోని ఓ ఇంటిపై దాడులు జరిపారు. వెంకటాద్రి టౌన్షిప్ బస్టాండ్ సమీపంలో వ్యభిచార కార్యకలాపాలు నిర్వహిస్తున్నట్లు సమాచారంతో ఓ ఇంటిఫై ఎస్ఓటీ పోలీసులు శుక్రవారం దాడి చేసి ఐదుగురిని అదుపులోకి తీసుకున్నారు. వీరిలో సినీ సహాయ దర్శకుడు మూల రాజశేఖర్ రెడ్డి, సినీ ఆర్టిస్ట్ యార్లగడ్డ రవికుమార్ తో పాటు, ముగ్గురు మోడల్స్‌ను అదుపులోకి తీసుకున్నారు. ఎస్ఓటీ పోలీసులు వీరిని ఘట్కేసర్ పోలీసు స్టేషన్లో అప్పగించారు. కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. ఇందుకు సంబంధించి పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది. -
స్ర్కీన్ ప్లే 14th December 2017
-
స్ర్కీన్ ప్లే 13th December 2017
-
స్ర్కీన్ ప్లే 12th December 2017
-
అలరిస్తూ ఆలోచింపజేసే ‘బ్రహ్మ.కామ్’
సగటు ప్రేక్షకుడికి కావలసినంత వినోదాన్ని పంచి అదే సమయంలో ఆలోసింపజేసే చిత్రంగా బ్రహ్మ.కామ్ ఉంటుందని ఆ చిత్ర దర్శకుడు పురుష్ విజయ్ తెలిపారు. మెలినా కార్తికేయన్ నిర్మించిన ఈ చిత్రంలో నకుల్ హీరోగా నటించారు. ఆయనకు జంటగా ఆస్నాజవేరి నటించగా సిద్ధార్థ్ విపిన్, దర్శకుడు కె.భాగ్యరాజ్, నటి నీతూచంద్ర, కౌశల్య, ముట్టై రాజేంద్రన్ ముఖ్య పాత్రలు పోషించారు. ఇటీవలే ఆడియో ఆవిష్కరణ కార్యక్రమాన్ని జరుపుకున్న ఈ చిత్రం ఈ నెల 15న తెరపైకి రావడానికి సిద్ధమవుతోంది. ఈ సందర్భంగా చిత్ర వివరాలను దర్శకుడు తెలుపుతూ భగవంతుడిని అందరూ ఏదో ఒకటి కోరుతూనే ఉంటారు.. అయితే ఆయన సృష్టించిన మనకి ఏమేం చేయాలో ఆయనకు తెలియదా? అనే కాన్సెప్ట్‌తో తెరకెక్కించిన చిత్రం బ్రహ్మ.కామ్ అని తెలిపారు. ఇది పూర్తిస్థాయి వినోదంతో కూడిన చిత్రమే అయినా ఆలోచింపజేసే సన్నివేశాలు చాలానే ఉంటాయన్నారు. నకుల్ ఒక యాడ్ ఫిలిం డర్శకుడిగా, ఆస్నాజవేరి మోడల్‌గా, సిద్ధార్థ్ విపిన్ యాడ్ కంపెనీ నిర్వాహకుడిగా నటించారని తెలిపారు. నకుల్, సిద్ధార్థ్ విపిన్లిద్దరూ ఆస్నాజవేరిని ప్రేమిస్తుంటారని చెప్పారు. దర్శకుడు కె.భాగ్యరాజ్ దేవుడిగా నటించారన్నారు. దేవుడంటే కిరీటం ధరించి కాకుండా సాధారణ మనిషిలానే కనిపిస్తారని, ఆయన్ని నకుల్ ఎప్పుడూ ణేదో ఒకటి అడుగుతూ చేసే గోల ప్రేక్షకులను అలరిస్తుందని చెప్పారు. ఇక నీతూచంద్ర చిత్రంలోనూ నటిగానే నటించి ఒక గ్లామరస్ పాత్రలో కనువిందు చేయనున్నట్లు ఆయన తెలిపారు. -
స్ర్కీన్ ప్లే 11th December 2017
-
సౌదీ వాసులకు మళ్లీ సినిమా పండుగ
దుబాయ్ : సౌదీ అరేబియా వాసులకు 2018లో తొలిసారి థియేటర్లలో సినిమాను వీక్షించే అవకాశం దక్కనుంది. 2018 నుంచి పబ్లిక్ థియేటర్లను అనుమతించనున్నారు. ఈ మేరకు సౌదీ అరేబియా సాంస్కృతిక సమాచారా శాఖ మంత్రి అవాద్ బిన్ సాలే అలావద్ ఒక ప్రకటనలో తెలిపారు. 'తొలి సినిమాను మేం మార్చి 2018లో వస్తుందని అంచనా వేస్తున్నాం' అని ఆయన అన్నారు. సాధరణంగా సౌదీ అరేబియాలో సినిమా ఇండస్ట్రీ చాలా చిన్నది. కొన్ని మాత్రమే ఫీచర్ ఫిల్మ్స్, డాక్యుమెంటరీస్ ప్రతి ఏడాది వస్తుంటాయి. ఒక్క కోబార్లోని ఐమాక్స్ తప్ప మిగితా ఏ ప్రాంతాల్లో కూడా సినిమా హాళ్లు అనేవి లేవు. ఎప్పటి నుంచో వాటిని ప్రారంభించాలని చర్చలు జరుగుతున్నప్పటికీ సంప్రదాయాలకు పెద్ద పీట వేసే సౌదీలో ఆ నిర్ణయం ముందుకు వెళ్లలేదు. తాజాగా జరిపిన చర్చల్లో గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. ఇప్పటి వరకు సౌదీలో శాటిలైట్ ద్వారా, డీవీడీలు, వీడియోల ద్వారా మాత్రమే సినిమాలు వీక్షించేవాళ్లు. గత కొన్నేళ్లుగా సౌదీలో సినిమాలను బ్యాన్ చేసిన విషయం తెలిసిందే. -
సినిమా చూసి హత్యచేశాడు!
చండీగఢ్: సినిమా ప్రభావంతో ఐదేళ్ల చిన్నారిని కిడ్నాప్ చేసిన ఓ టీనేజ్ అబ్బాయి(16) చివరికి ఆ బాలికను నీటి తొట్టెలో ముంచి దారుణంగా హత్యచేసిన ఘటన హరియాణాలో చోటుచేసుకుంది. తన బావ అద్దెకు ఉంటున్న ఇంటి యజమాని కూతు రిని బుధవారం చాక్లెట్ల ఆశ చూపి నిందితుడు ఇంట్లోకి ఆహ్వానించినట్లు అంబాలా ఎస్పీ అభిషేక్ జోర్వాల్ మీడియాకు తెలిపారు. ఈ సమయం లో నిందితుడి బావ, కుటుంబ సభ్యులు ఉత్తరప్రదేశ్‌కు వెళ్లారన్నారు. అనంతరం బాలికను నిందితుడు ఇంట్లో నిర్బంధించాడన్నారు. తమ కుమార్తె కన్పించకపోవడంతో ఆమె తల్లిదండ్రులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఇంతలోనే నిందితుడు వారికి ఫోన్ చేసి రూ.20 లక్షలు డిమాండ్ చేశాడని అభిషేక్ పేర్కొన్నారు. దీంతో తాము ఆ కాల్‌ను ట్రేస్ చేశామన్నారు. కిడ్నాప్ వ్యవహారం పోలీసులకు తెలిసిపోయిందని అర్థమవడంతో నిందితుడు సదరు చిన్నారిని నీటి తొట్టెలో ముంచి హత్యచేశాడన్నారు. అనంతరం చిన్నారి మృతదేహాన్ని వాటర్ కూలర్లో దాచాడని తెలిపారు. ఆ ఇంటిపై అర్ధరాత్రి 1 గంట సమయం లో దాడిచేసి నిందితుడ్ని అదుపులోకి తీసుకున్నామన్నారు. అతను చేసిన తప్పుకు ఎంతమాత్రం పశ్చాత్తాపం వ్యక్తం చేయలేదనీ.. ఓ సినిమాలో చూపినట్లు ఈజీ మనీ కోసమే చిన్నారిని కిడ్నాప్చేసినట్లు వెల్లడిం చాడని పేర్కొన్నారు. నిందితుడి బావ చనిపోయిన బాలిక తండ్రి షాప్‌లోనే పనిచేస్తాడన్నారు. -
నాని తొలి సినిమా ఫస్ట్ లుక్, టైటిల్ ఎనౌన్స్ మెంట్
ఈ రోజు సాయంత్రం నాని తొలి సినిమా ఫస్ట్ లుక్ తో పాటు టైటిల్ ను కూడా ఎనౌన్స్ చేయనున్నారు. వరుస విజయాలతో స్టార్ హీరోగా దూసుకుపోతున్న నాని ఇప్పుడు తొలి సినిమా చేయటం ఏంటి అనుకుంటున్నారా..? హీరోగా మంచి విజయాలు సాధించిన నాని తొలిసారిగా పూర్తి స్థాయి నిర్మాతగా మారి ఓ సినిమా చేయబోతున్నాడు. గతంలో ఢీ ఫర్ దోపిడి సినిమా కోసం నాని నిర్మాతగా మారినా సొంతం నిర్మాణ సంస్థను ఏర్పాటు చేయలేదు. ఇప్పుడు సొంతగా వాల్ పోస్టర్ సినిమా అనే బ్యానర్ ను స్థాపించి ఆ బ్యానర్ లో ప్రశాంత్ ను దర్శకుడిగా పరిచయం చేస్తూ ఓ సినిమాను రూపొందిస్తున్నారు. ప్రశాంత్ చెప్పిన పాయింట్ విపరీతంగా నచ్చటంతో తానే స్వయంగా నిర్మాతగా మారి సినిమా చేయాలని ఫిక్స్ అయ్యారు. ఇప్పటికే 80 శాతం షూటింగ్ పూర్తి చేసుకున్న ఈ సినిమాను ఫిబ్రవరిలో రిలీజ్ చేయాలని భావిస్తున్నారట. ఈ రోజు సాయంత్రం ఈ సినిమా ఫస్ట్ లుక్ తో పాటు టైటిల్ లోగోనూ రిలీజ్ చేయనున్నారు. #Announcement Wall Poster Cinema Production no 1 pic.twitter.com/vWMPgEma3U — Nani (@NameisNani) 25 November 2017 -
నాని తొలి సినిమా ఫస్ట్ లుక్, టైటిల్ ఎనౌన్స్ మెంట్
-
ఆలుమగల డ్యూయెట్
పొద్దున్నే వచ్చిన న్యూస్ పేపర్ కనిపించలేదు. వెతగ్గా వెతగ్గా కిచెన్‌లో మిక్సీ పైన ఉంది. ‘ఏంటిక్కడా?’ అనడిగితే ‘ఇవాళ మీకా పేపర్ తాకే హక్కు లేదు. అది నాది’ అంది. ‘వై? కైకో?’ అన్నాను రెండు భాషల్లో. ‘అందులో నా రాజా ఉన్నాడు’ అంది. అనుమానం పెనుభూతం అయ్యింది. ‘ఎవడు వాడు? ఎన్నాళ్ల నుంచి సాగుతోంది ఈ భాగోతం’ అన్నాను. ‘నా చిన్నప్పటి నుంచి’ అంది. ‘ఆ... అంటే నన్ను మోసం చేసి పెళ్లి చేసుకున్నావన్నమాట’ అన్నాను. ‘కాదు... రాజాను త్యాగం చేసి మీచే తాళి కట్టించుకున్నాను’ అంది. పేపర్ విసురుగా లాక్కున్నాను. తిరగేశాను. ‘ఎక్కడ నీ ర్రా..జా’ జగ్గయ్యగారిలా బొంగురుగా అడిగాను. ‘కొత్తగా రెక్కలొచ్చేనా గూటిలోని గువ్వపిల్లకి’ అంటూ చూపించింది. ఇళయరాజా ఫొటో. హైదరాబాద్‌లో లైవ్ కన్సర్ట్ అట. పెద్ద యాడ్ ఇచ్చున్నారు.‘ఇతడే నా రాజా. నా పదహారేళ్ల వయసులో పదహారేళ్ల వయసు సినిమా పాట విన్నాను. సిరిమల్లె పువ్వా సిరిమల్లె పువ్వా...’ హమ్ చేసింది. ‘వింటే?’ ‘అప్పటి నుంచి మనసు పారేసుకున్నాను. మౌనగీతం పాటలు విని మౌనంగా, మౌనరాగం పాటలు విని మూగగా ఆరాధించాను. చిరంజీవి ‘ఆరాధన’ సినిమా చూసి ‘అరె ఏమైంది... ఒక మనసుకు రెక్కలొచ్చి ఎక్కడికో ఎగిరింది...’ అని నేను మా ఊరికి దూరంగా ఉన్న బీచ్‌కి వెళ్లి అక్కడి అలల్లో రాళ్లల్లో పాడుతూ ఉంటే బెస్తవాళ్లు పట్టుకొచ్చి ఇంట్లో వదిలిపెట్టారు. అంత పిచ్చి నాకు రాజా అంటే’ అంది. ఊపిరి కొంచెం పీల్చుకున్నాను. ‘అయితే అతడు నీ హాబీకి రాజా. కాని దిల్ కా రాజా నేనేగా’ అన్నాను. ‘ఆ మాట నిరూపించుకోవాలంటే షోకి రెండు టికెట్లు కొనండి’ అంది. ‘కొనకపోతే?’ ‘నన్ను ఇంట్లో కనలేకపోతారు’ ‘అంత పని చెయ్యొద్దు’ అని బుక్ మై షో ఓపెన్ చేశాను. టికెట్ల రేట్లు ఓ రేంజ్లో ఉన్నాయి. ‘ఇంత రేట్లా?’ అన్నాను. ‘జిఎస్టిని మర్చిపోయారా?’ అంది ‘టీవీలో చూడొచ్చు కదా డాళింగ్’ ‘వండిన కూర ఫ్రిజ్‌లో పెట్టి తిన్నట్టుగా ఉంటుంది. నథింగ్ డూయింగ్. నా రాజాను లైవ్‌లో చూడాల్సిందే.’ ‘అయినా ఆయనేం సింగర్ కాదు. పాడుతుంటే చూడటానికి. ఊరికే అలా నిలబడి రెండు కట్టెపుల్లలు ఆడిస్తూ ఉంటాడు. హీ ఈజ్ ఓన్లీ ఎ మ్యూజిక్ డైరెక్టర్ యూ నో మన పెళ్లి రిసెప్షన్లో పాట కచ్చేరి పెట్టించమంటే అన్నీ చక్రవర్తి పాటలే పెట్టించారు. అప్పుడే తెలిసింది మీ టేస్ట్ ఏమిటో’ ‘ఏయ్ చక్రవర్తి పాటలను ఏమీ అనొద్దు. నేను ఆయన ఫ్యాన్‌ని. నీకు తమిళ ఇళయరాజా అంటే ఎంతటి గొప్పో నాకు తెలుగు చక్రవర్తి అంటే అంత గొప్ప. అయినా సూళ్లూరుపేట అమ్మాయిని చేసుకోవడం తప్పయింది. అరవ వాసన ఎక్కడికి పోతుంది’ ‘సంగీతానికి కులం మతం ప్రాంతం వైఫై ఏరియా అంటూ ఏమీ ఉండవు మిస్టర్ రామ్మోహన్‌రావ్. మ్యూజిక్ ఈజ్ డివైన్’ ‘నో.. ఇప్పుడు నాకు వైన్ గుర్తు చేయకు’ ‘అంతకు మించి మీ నుంచి ఏం ఎక్స్పెక్ట్ చేయగలను కనుక’ ‘అలా అనకు. నీ సంతోషం కోసం ఏమైనా చేయగలను పల్లవీ. కావాలంటే ఒక చరణం పాడనా?’ ‘వద్దు’ ‘భార్యభర్తలు కలిసి పాడుకోవడం కన్నా అసలైన కచ్చేరి ఏముంటుంది చెప్పు. నీవేనా నను పిలిచినది... నీవేనా నను తలచినది’ పాడాను. తల పట్టుకుంది. మళ్లీ అందుకున్నాను. ‘నువ్వంటే నాకెందుకో అంత ఇదీ.. అంత ఇదీ’ పాడు ప్లీజ్ అన్నట్టుగా కళ్లలో కళ్లు పెట్టి చూశాను. ‘రావోయి చందమామా... మా వింత గాధ వినుమా’ మెల్లగా గొణిగింది. ‘తలచినదే జరిగినదా దైవం ఎందులకు... జరిగినదే తలచితివా శాంతి లేదు నీకు’ హితబోధ చేశాను. ‘మనసున ఉన్నదీ చెప్పాలని ఉన్నదీ మాటలు రావే ఎలా?’ అంది. ‘ప్రేమ యాత్రలకు బృందావనము నందనవనమూ ఏలనో’ సర్ది చెప్పడానికి చూశాను. అప్పటికి ఇడ్లీ అయిపోయి చట్నీ రెడీ చేయడానికి కొబ్బరి అందుకుంది. ‘పిలువకురా అలుగకురా నలుగురిలో నను ఓ రాజా’ ఇళయరాజా ఫొటోను చూస్తూ అంది. మనసు చివుక్కుమంది. ఇలాంటి సమయాల్లోనే మగాడు తన మనసులోని ప్రేమ అంతా చెప్పగలగాలి. అందుకున్నాను– ‘నీవు నా పక్కనుంటే హాయి. నీవు లేకుంటే చీకటి రేయి. నీ కన్నులలోన ఎన్నో ఎన్నో ఎన్నో కిరణాలు మెరిశాయి’ అన్నాను. అలా అంటూ రెండు చేతులూ పట్టుకున్నాను. ప్రతి ఉదయమూ భర్త తన భార్య చేతులను మెల్లగా తాకి కళ్లల్లో కళ్లు పెట్టి చూస్తే తగదాలు రావు అని ఎక్కడో చదివాను. ఇప్పుడు అప్లై చేశాను. తనూ నా కళ్లలోకి చూసింది. ‘ఇలాగే... ఇలాగే... సరాగమాడితే... వయ్యారం ఈ యవ్వనం ఊయలూగునే’... అన్నాను. ‘ఇళయరాజా పాట కదా’ అంది సంతోషంగా. ‘అవును’ అన్నాను. ‘మీరు ఇళయరాజా పాట పాడారా?’ ఆశ్చర్యపోయింది. ఆగు ఆన్నట్టుగా ఆమె వైపు చెయ్యి అడ్డం చూపించి సెల్ ఓపెన్ చేసి టకటకా రెండు టికెట్లు ఆన్లైన్లో కొనేశాను. కన్ఫర్మ్ మెసేజ్ వచ్చింది. చూపించాను. ఇంకా ఆశ్చర్యపోయింది. ‘ఏంటి... టికెట్లు కొన్నారా?’ ‘ఇప్పుడు ఇంకో ఇళయరాజా పాట పాడతాను చూడు’ అంటూ భుజాల మీద చేతులు వేశాను. ‘నువ్వడిగింది ఏనాడైనా లేదన్నానా నువ్వు రమ్మంటే ఎక్కడికైనా రానన్నానా నీ ముద్దుముచ్చట కాదన్నానా సరదా పడితే వద్దన్నానా హొయ్య’ ‘రామ్మోహన్‌రావ్’... అంటూ ముద్దుగా అల్లుకుపోయింది. మిక్సీలో చట్నీ నలుగుతోంది. కాని దానిని పట్టించుకునే టైమా ఇది? సినిమాలో సంసారం నా ఇంట్లో చేసిన ఉప్మా ‘అదే టచ్’ అంటూ తొలి రాత్రి బ్రహ్మానందానికి షాక్ ఇస్తుంది శ్రీలక్ష్మి. ఫ్లాష్‌బ్యాక్ కూడా చెప్తుంది. బాబూ మోహన్ (గోపి) ‘మానస సంచరరే...’ అని పాడుతుంటాడు, శ్రీలక్ష్మి డాన్స్ చేస్తుంటుంది. డాన్స్ అయిన తర్వాత కందిపోయిన శ్రీలక్ష్మి పాదాలకు వెన్న రాస్తాడు గోపి. తనను అంతగా ప్రేమించిన గోపి ఓ రోజు నీటిలో మునిగి పాడుతుండగా, మొసలి లాక్కు పోయిందని, గోపీ తన మనసు లాక్కుపోయాడని బాధపడుతుంది. గోపీని కాదని బ్రహ్మానందాన్ని పెళ్లి చేసుకోవడానికి కారణం బామ్మ తన పెళ్లి చూడాలన్న కోరికే కారణమంటుంది. ఫ్లాష్‌బ్యాక్‌లో లవ్వే కదా అని సరిపుచ్చుకుంటాడు బ్రహ్మానందం. ఓ రోజు... శ్రీలక్ష్మి, బ్రహ్మానందం మార్కెట్ నుంచి వస్తుంటే ఎదురు పడతాడు గోపి. అతడు బతికే ఉన్నాడని తెలిసి ఉద్వేగానికి లోనవుతుంది శ్రీలక్ష్మి. తన విజిటింగ్ కార్డిస్తాడు గోపి. మరో రోజు... శ్రీలక్ష్మి ఉప్మా చేసి, ఆ ఉప్మాను చూస్తూ కన్నీళ్లు పెట్టుకుంటుంది. గోపీకి ఉప్మా చాలా ఇష్టమని, ఉప్మా తీసుకెళ్లి గోపీకి ఇవ్వమని భర్తను కోరుతుంది. ఒక ఏడుపు ఏడ్చి అలాగే ఇస్తాను కానీ ఆకలవుతోంది త్వరగా వడ్డించమంటూ డైనింగ్ టేబుల్ కుర్చీ లాక్కుని కూర్చుంటాడు. ‘నా గోపీ తినకుండా ఎవ్వరూ తినడానికి వీల్లేదు’ అని పట్టుపడుతుంది. ‘నా ఇంట్లో... చేసిన ఉప్మా నేను తినడానికి వీల్లేదా’ అంటూ ఎగిరిపడతాడు బ్రహ్మానందం ఏడుపు, కోపం కలగలిసిన గొంతుతో. ఇంతలో ‘నీ చేత ఉప్మా చేయించుకుని తినాలపించింది రాధా’ బాబూ మోహన్ వాళ్లింటికి వస్తాడు ‘మావి చిగురు’ సినిమాలో. – నిష్ఠల -
రెండు గుండెల చప్పుడు
సాయంత్రం ఆరవుతోంది. గుడి చుట్టూ మూడు ప్రదక్షిణలు చేసి ఓ పక్కకొచ్చి కూర్చున్నాను. మనసంతా వికలంగా ఉంది. హృదయం ఉప్పెనలా ద్రవిస్తోంది. శ్రావణ్ మీద కోపమొచ్చిన ప్రతిసారీ ఈ గుడికే వస్తుంటాను. శ్రావణ్... ఒళ్లు మండిపోతోంది తల్చుకుంటేనే. ఫోన్ వైపు చూశాను. వాట్సాప్‌లో శ్రావ్ టైపింగ్ అని వస్తోంది. వెంటనే బ్లాక్ చేశాను. అది గమనించి కాల్ చేశాడు. ఫోన్ స్విచాఫ్ చేశాను. తొమ్మిదేళ్లు ప్రేమించుకున్నాం. ఏడాది క్రితం పెద్దలని ఒప్పించి పెళ్లి చేసుకున్నాం. చచ్చేంత పిచ్చి ఒకరికి ఒకరంటే. ఏం లాభం. ఒక్కరోజు కూడా తను నాకు ‘ఐ లవ్ యు’ చెప్పడు. నేను చెబితే ‘ఐ టూ’ అంటాడు. మనసులోని భావాలను అల్లి ఎన్నో లేఖలు రాశాను. చదివి బాగుందని కూడా చెప్పడు. వాట్సప్‌లో మెసేజ్ పెడితే చాలాసార్లు చూసి కూడా రిప్లై ఇవ్వడు. స్పెషల్ డే వస్తే ఏం ప్లాన్ చేసుకుందాం అని కూడా అడగడు. నేను ఎందుకు కోపగిస్తానో.. ఎందుకు బాధపడతానో అన్నీ తనకు తెలుసు. కానీ దేనికీ ఎక్స్ప్లనేషనే ఉండదు. ఇవన్నీ తన దృష్టిలో చిన్న చిన్న విషయాలే. కానీ అవే నా చిన్న చిన్న సంతోషాలు. నా ప్రేమ తనకి తట్టుకోలేనంత వెగటు.. వదులుకోలేనంత ఇష్టం. ఈ మాటలు నిన్న నైట్ తనే నాకు స్వయంగా చెప్పాడు. ‘నీ ప్రేమ షుగర్ ఎక్కువగా కలిపిన స్వీట్ లాంటిది. కాస్త తింటే ఎక్కువైపోతుంది. అలా అని తినకుండా ఉంటే నీరసించి చచ్చిపోతా. ఎందుకంటే నాకు మరో స్వీట్ పడదు’ అంటూ డైలాగ్స్ చెప్పాడు. ఎవడడిగాడు ఈ డైలాగ్స్ అన్నీ? నేను ఏమైనా వజ్రాల వడ్డాణం చేయించమని గోల చేశానా? కేవలం నా భావాలకి చిన్నగా స్పందించమంటాను. ‘నా మీదే పంచప్రాణాలు పెట్టుకున్న ఓ పిచ్చిది ఉంది కదా. దాని కోసం కాసేపు ఖాళీ చేసుకుందాం. కాసేపు కబుర్లు చెబుదాం’ అని తనకు అనిపించాలి కదా. మరీ పట్టనట్లు ఉంటాడు. అందుకే నిన్న నైట్ ఇల్లు వదిలి దగ్గరలోని హాస్టల్‌కి వచ్చేశాను. దూరంగా ఉంటేనైనా నా విలువ తెలిసొస్తుందని! పుట్టింటికే వెళ్లొచ్చు. కానీ నా శ్రావణ్‌ని ఎవరిముందు తక్కువ చెయ్యడం ఇష్టం ఉండదు. లవ్ చేసుకునే మొదట్లో నేను గుంటూర్లో ఇంట్లో ఉండేదాన్ని. తను వైజాగ్‌లో జాబ్ చేస్తుండేవాడు. ఓ రోజు కాల్ చేసి ‘రేపు ఊరొస్తున్నా.. ఐదారు రోజులుంటాను’ అన్నాడు. మనసుకు చాలా సంతోషంగా అనిపించింది. నా ఆనందాన్ని కనిపించకుండా ‘అయితే’ అని అడిగాను. ‘నిన్ను చూడాలనిపిస్తుందిరా. ఆదివారం నీ ఫ్రెండ్ అమ్ముని తీసుకుని బాబా టెంపుల్‌కి రా’ అన్నాడు. నేను సరే అన్నాను. తను ఊరొచ్చి రెండు రోజులు దాటింది. కలుద్దామన్న ఊసే లేదు! ఫోన్స్, చాటింగ్స్లోనూ ఆదివారం కలవడం గురించి మాట్లాడలేదు. నాకు బీపీ రైజ్ అయింది. ఫోన్ స్విచ్ ఆఫ్ చేశాను. మరునాడు సాయంత్రం 4 గంటలకి అమ్మ సెల్‌కి అమ్మూ ఫోన్ చేసింది. ‘నీ ఫోన్ ఎందుకే కలవట్లేదు? శ్రావణ్ చాలా సార్లు ట్రై చేశాడంట. ముందు తనకి కాల్ చెయ్యి.’ అని చెప్పి ఫోన్ కట్ చేసింది. దాంతో ఫోన్ ఆన్ చేశాను. వెంటనే కాల్ వచ్చింది. లిప్ట్ చేస్తే.. ‘ఏమైంది ఫోన్ ఆఫ్ చేశావు’ అని అడిగాడు ఏం తెలియనట్లు. అంటే నా అన్ని గంటల కోపానికి విలువే లేదు. అనిపించింది. అడిగేయ్యాలనిపించింది కానీ అహం అడ్డొచ్చింది. ‘ఎల్లుండి ౖవైజాగ్ వెళ్తున్నా. బస్టాప్కైనా రాగలవా?’ అన్నాడు. ఆశ్చర్యమేసింది. కోపం నషాళానికి ఎక్కింది. ‘బుద్ది ఉందా నీకు. ఏం చెప్పావు? ఆదివారం కలుస్తానని చెప్పి కలవాలనే మాటే మరిచిపోయి ఇప్పుడు నాటకాలు ఆడుతున్నావా?’ అంటూ నోటికి వచ్చినట్లు మాట్లాడేశాను. తనేదో చెప్పే ప్రయత్నం చేస్తుంటే.. నేను పట్టించుకోకుండా... ‘మరిచిపోకపోతే ఇంకేమైనట్లు? నీ మనసులో కలవాలనే ఆలోచన లేనప్పుడు నా ఆవేదనకు విలువలేదు. అందుకే, నేనే నిన్ను కలవను’ అని చెప్పి ఫోన్ కట్ చేశాను. అప్పుడో మెసేజ్ వచ్చింది.. ‘సోనా.. లవ్ యు సో మచ్.. ఊరువచ్చిన నాటి నుంచి నిన్ను కలవాలనిపిస్తుంది. కానీ మీ రిలేటివ్స్ ఎవరైనా చూస్తే మనకి ప్రాబ్లమ్ అయిపోతుందేమోనన్న ఆలోచనే నన్ను భయపెట్టింది. నీతో ఇదే విషయం చెబితే ఏదైతే అవుతుంది కలుస్తా అంటావ్. నాకోసం నువ్వు ఏం చెయ్యడానికైనా సిద్ధమని నాకు తెలుసు. అందుకే నా బాధని నీతో షేర్ చేసుకోలేకపోయాను. సారీరా.. కానీ, ఇప్పుడు నా పెయిన్ బాగా ఎక్కువగా ఉంది నిన్ను చూడకుండా వెళ్లలేను ప్లీజ్’ అంటూ మెసేజ్ చేశాడు. నిజంగానే నా కోపానికి విలువ లేదనిపించింది. అందుకే మరునాడు ఉదయాన్నే అమ్మూని తీసుకుని షాపింగ్ మాల్లో ఓ రౌండ్ వేశాను. నా వెంటే కాస్త దూరంలో తను కూడా నడిచాడు. ఆ విషయం నాకు, తనకి, అమ్మూకి తప్ప మరెవరికీ తెలియలేదు. నా జ్ఞాపకాలకు అడ్డుపడుతూ... ప్రసాదం తీసుకొచ్చి నా చేతిలో పెట్టారు గుడి పూజారి. టైమ్ చూస్తే ఎనిమిది దాటింది. పైకి లేచి ఆయన పాదాలకు మొక్కాను. ‘దీర్ఘ సుమంగళీభవ’ అని ఆశీర్వదించారు. ఎంత గొప్ప అర్థం. భార్యని దీవిస్తే భర్త రక్షింపబడతాడు. ఎంత గొప్ప దీవెనది!? భార్యాభర్తలు ఇద్దరు కాదు.. ఒక్కటే. ఆ సమయంలో నా కళ్లు మెరుస్తున్నా శ్రావణ్ నెగ్లిజెన్స్ గుర్తుకొచ్చి మనసు మాత్రం కాస్త భారంగానే నిట్టూర్చింది. అమ్మవారికి మరోసారి మనసులో మొక్కి హాస్టల్‌కి బయలుదేరాను. గుడి నుంచి హాస్టల్ రూట్లో నడకందుకున్న నా వేగానికి మరోవేగం అడ్డొచ్చింది. చేతిని వదిలించుకునే ప్రయత్నం చేశాను కానీ ఆ ప్రయత్నంలో ఎప్పుడూ శ్రావణే గెలుస్తాడు. ‘ఏంటి’ అంటూ కళ్లతో బెదిరించే ప్రయత్నం చేశాను. ‘సారీ! అన్నాడు. ‘ఆపింక.. రోడ్డు పక్కనే ఈ పంచాయితీ పెట్టకు’ అని ముందుకు నడవబోయాను. ఆగమన్నట్లు చెయ్యి అడ్డుపెట్టాడు. ‘సోనా సారీ... ఇంకెప్పుడు నెగ్లెక్ట్ చెయ్యను. ప్రతీది ముందే చెబుతాను. ఇంటికి వచ్చెయ్ ప్లీజ్. నువ్వు వెళ్లినప్పటి నుంచీ ఏం తినలేదు. ఆకలేస్తోంది’ అన్నాడు. అంతే! గుండె కరిగిపోయింది. అప్రయత్నంగానే కన్నీళ్లొచ్చాయి. తను ఆకలేస్తుందన్నా నిద్ర వస్తుందన్నా నేను తట్టుకోలేను. మనసు నిండా ఎంత కోపమున్నా ఎంత బాధున్నా అన్నీ వదిలేస్తాను. ఆదరబాదర అయిపోతాను. నా పిచ్చి కోపాన్ని నేనే తిట్టుకుంటూ.. ‘సారీ..’ అన్నాను. తను మౌనంగానే ఉన్నాడు. ఎదురుగా వచ్చిన కారు లైట్ వెలుగులో తన కళ్లను చూశాను. తన కళ్లు ఎప్పుడూ అబద్ధం చెప్పవు. తప్పుచేశాననిపించింది. మారాల్సింది తను కాదు! మారింది నేనే!! ఎందుకంటే ప్రేమను పంచినప్పుడు నాలో స్వార్థంలేదు! తిరిగి తన నుంచి ఆశించడం మొదలు పెట్టిన నాటి నుంచే మొదలైంది. అదే కాబోలు అమ్మ ప్రేమకు.. మిగిలిన ప్రేమలకు ఉన్న తేడా!! వెంటనే బ్యాగ్‌లో ఉన్న ప్రసాదం తీసిచ్చాను. తీసుకుని చాలా ఆత్రంగా తింటూ.. నా నోటికి అందించాడు. ‘రెస్టారెంట్లో తినేసి ఇంటికి వెళ్దాం’ అన్నాను.నడక మొదలైంది. ఇంకా మౌనంగానే ఉన్నాడు కుర్రాడు. తన చేతికి నా చేయి తాకేలా నడిచాను. అప్రయత్నంగానే నా చేయిపట్టుకున్నాడు. మరో కారు మా ఎదురుగా పోయింది. తను నావైపే చూస్తు నడుస్తున్నాడు. నేను కాస్త బెట్టుగా ముఖం తిప్పుకున్నా.చిన్నగా నవ్వు వచ్చింది అయినా.. బుజ్జగించి బ్రతిమాలేవాళ్లు ఉన్నప్పుడే కదా బుంగమూతికి విలువ. సంసారానికి అందమూనూ! సినిమాలో సంసారం ‘నవ మన్మధుడు’ సినిమాలో ధనుష్ తన తండ్రి ఎందుకు ఆత్మహత్య చేసుకున్నాడని ఆలోచిస్తూ డిప్రెషన్ మూడ్‌లో ఉంటాడు. ఆ సమయంలోనే భరత్ భార్య సమంత కడుపులో బిడ్డ కదలుతుందని చాలా సంబరపడుతూ భర్తతో చెబుతుంది. దానికి ఓ జీవం లేని నవ్వు నవ్వుతాడు భరత్. అది గమనించిన సమంత ‘జరిగింది తలుచుకుంటూ మన చుట్టూ జరిగే చిన్న చిన్న సంతోషాలను కూడా పట్టించుకోకపోతే ఎలానండి’ అంటుంది. దానికి బాధపడిన ధనుష్ ‘మా నాన్నని అందరూ దొంగ అనడం విని నా పాటికి నేను నా లైఫ్ చూసుకోలేకపోతున్నా’ అంటూ సీరియస్‌గా అక్కడి నుంచి వెళ్లిపోతాడు. కట్ చేస్తే...ధనుష్ లంచ్ బాక్స్ తీసుకెళ్లకుండా పనికి బయలుదేరతాడు. అది గమనించిన భార్య సమంత.. అతడి వెనకే పరుగుపెడుతూ ‘ఏమండీ.. ఏమండీ..’ అని అరుస్తుంది. కంగారు పడిన ధనుష్ వెనుతిరిగి ‘హేయ్ నీకేమైనా పిచ్చా... కడుపులో బిడ్డతో అలా పరుగుపెడుతున్నావ్?’ అంటాడు. ‘మీరు నా మీద కోపంతో.. లంచ్ బాక్స్ తీసుకెళ్లకుండా వెళ్తున్నారు’ అంటుంది చాలా అమాయకంగా! భార్య ప్రేమను గుర్తించిన భరత్... ‘పిచ్చిదానా నీ మీద కోప్పడ్డమే నాకు తెలీదు. ఇంకా నీ మీద కోప్పడి ఎక్కడికి వెళ్తాను చెప్పు?’ అని అడుగుతాడు చాలా ప్రేమగా. ‘ఏమో మీ వాలకం చూస్తే అలా అనిపించలేదు’ అంటుంది సమంత ముభావంగా! ఆ మాటలకు నవ్వుకున్న ధనుష్ ‘సరే రా ఇంట్లో దింపేస్తా’ అంటూ రెండు చేతులతో ఎత్తుకుని ఇంటికి నడుస్తాడు. ‘ఏమండీ ఏం చేస్తున్నారు? చూసేవాళ్లంతా ఏం అనుకుంటారు?’ అంటూ సమంత ఆశ్చర్యపోతుంటే.. ‘ఏం నా పెళ్లాన్నేగా ఎత్తుకెళ్తుంది’ అంటాడు ధనుష్. నిజమే మరి ప్రేమంటే.. కాలే కడుపుని, తడిసిన మనసుని గుర్తించడమే కదూ! – సంహిత నిమ్మన -
నిప్పుకణం
మెయిన్ స్ట్రీమ్ కమర్షియల్ తెలుగు సినిమాలో క్లాసిక్ అన్న పేరున్న ఒక సినిమాలోని సీన్స్ ఇవి. ఇంటర్వెల్ తర్వాతి సీన్ హీరోయిజాన్ని పీక్స్‌కు తీసుకెళ్లేలా ఉంటుంది. ఒక స్టార్ హీరో నటించారు ఈ సినిమాలో! దర్శక, రచయిత ఇప్పుడొక స్టార్ డైరెక్టర్. ఆ సినిమా ఏంటో చెప్పుకోండి చూద్దాం? అది సత్యనారాయణ మూర్తి ఇల్లు. బాశర్లపూడి గ్రామం. ఒక రాజకీయ నాయకుడి హత్య కేసుకు సంబంధించి సత్యనారాయణ మూర్తి మనవడు పార్థసారథిని విచారించడానికి సీబీఐ ఆఫీసర్ ఆంజనేయ ప్రసాద్ వచ్చి మూర్తికి ఎదురుగా కూర్చున్నాడు. ‘‘మీరో చిన్న సాయం చేయాలి!’’ ఆంజనేయ ప్రసాద్ నవ్వుతూ ప్రశాంతంగా అడిగాడు.‘‘నేనేం చేయగలను బాబూ!’’ మూర్తి అంతే ప్రశాంతంగా నవ్వుతూ సమాధానమిచ్చాడు.‘‘పార్థ్ధసారథి అని..’’‘‘పార్థూ నా మనవడు..’’ ఆంజనేయ ప్రసాద్ పూర్తి చేయకముందే మూర్తి అందుకొని జవాబు ఇచ్చేశాడు.‘‘ఆయన్ను ఒకసారి కలవాలి..’’ మూర్తి అనుమానంగా, భయంగా చూస్తూ కూర్చున్నాడు. ఏం జరుగుతుందో అర్థం కావడం లేదాయనకు. పార్థుని పిలవమని కాఫీ అందించడానికి వచ్చిన మనవరాలికి చెప్పాడు. ఆంజనేయ ప్రసాద్ ఆయనతో పాటు వచ్చిన టీమ్ అంతా కేసుకు సంబంధించిన విషయాలు మాట్లాడుకుంటున్నారు. పార్థూ దగ్గర్నుంచి తాము ఎలాంటి ఆధారాలు సేకరించవచ్చు అన్న విషయంపైనే మాట్లాడుకుంటున్నారు.తన కోసం ఎవరో వచ్చారని తెలియగానే గార్డెన్ నుంచి హాల్లోకి బయలుదేరాడు పార్థు. సీబీఐ బృందాన్ని చూడగానే అతడిలో కొంత వణుకు. చెమటలు పడుతున్నాయి.పార్థు ఆంజనేయ ప్రసాద్‌కు దగ్గరగా వచ్చి నిలబడ్డాడు.‘‘ఆంజనేయ ప్రసాద్.. సీబీఐ’’ అంటూ తన చేతిలోని విజిటింగ్ కార్డు పార్థుకి ఇచ్చాడు ఆంజనేయ ప్రసాద్.కంగారుగానే కార్డును అందుకొని చూసి తిరిగిచ్చేశాడు పార్థు. ‘‘ఇంత ఈజీగా దొరుకుతారనుకోలేదు.’’ నవ్వుతూ అన్నాడు ఆంజనేయ ప్రసాద్.పార్థు మరింత భయపడ్డాడు. ఒళ్లంతా చెమటలు పట్టాయి. దొరికిపోయినట్లు నిలబడ్డాడు. ఇంటర్వెల్ పడింది. ఇంటర్వెల్ తర్వాత.. అదే ఇల్లు. సీబీఐ ఆఫీసర్, పార్థు ఎదురెదురుగా కూర్చున్నారు.‘‘ఏంటలా చూస్తున్నారూ? కానిస్టేబుల్ కూడా రాని ఇంటికి సీబీఐ వాళ్లు వచ్చారనా?’’ పార్థుని అడిగాడు ఆంజనేయ ప్రసాద్ చేతిలో ఉన్న కొన్ని పేపర్స్ తిరగేస్తూ.‘‘ఎందుకొచ్చారని!’’ పార్థు సమాధానమిచ్చాడు.‘‘కొంచెం పెద్ద కథే! చిన్నగా చెప్తాను. నలభై రోజుల క్రితం అపోజిషన్ లీడర్ శివారెడ్డి మర్డర్ జరిగింది.. మీకు తెలిసే ఉంటుంది! ఆయనను చంపినవాడు ట్రైన్ ఎక్కి పారిపోయాడు. అతడినెవ్వరూ చూడలేదు. బట్ అతడిని చేజ్ చేసిన ఎస్పీ వెనక నుంచి చూశాడు. సో ఆ ట్రైన్ గుడివాడలో ఆగినప్పుడు చొక్కా చూసి ఆ ఎస్పీ కాల్చాడు. బట్ ఆ కాల్పుల్లో హంతకుడు కాకుండా వేరేవాడు చనిపోయాడు. అతని వివరాలు మాకు దొరకలేదు. బట్ శవం ఉన్న కంపార్ట్మెంట్, సీట్ నంబర్స్‌ని బట్టి రైల్వే డిపార్ట్మెంట్ నుంచి ఈ రిజర్వేషన్ చార్ట్ సంపాదించాం. ఇందులో మీ పేరు, వివరాలు ఉన్నాయి. బట్ యూ ఆర్ హియర్ అండ్ హెల్తీ!’’ కథంతా చెప్పుతూ వచ్చాడు ఆంజనేయ ప్రసాద్. పార్థు ఏమీ మాట్లడలేదు. ‘‘పార్థు మీరేగా?’’ అనుమానంగా మళ్లీ అడిగాడు ఆంజనేయ ప్రసాద్. అవునన్నట్టు తలూపాడు పార్థు. ‘‘వెల్! కమింగ్ టు ది పాయింట్.. మీరు రిజర్వ్ చేసుకున్న సీట్లో ఇంకొకరు ఎందుకు కూర్చున్నారు?’’ అడిగాడు ఆంజనేయ ప్రసాద్.‘‘విజయవాడలో మంచినీళ్ల కోసం దిగినప్పుడు ట్రైన్ మూవ్ అయిపోయింది. అక్కణ్నుంచి బై రోడ్ వచ్చాను. ఆ తర్వాత ఎవరు కూర్చున్నారో నాకు తెలీదు!’’‘‘వెల్ దెన్ మీరు విజయవాడలో ట్రైన్ దిగేముందు కంపార్ట్మెంట్లో అనుమానాస్పదంగా ఎవరైనా కనిపించారా?’’ అడిగాడు ఆంజనేయ ప్రసాద్. లేదన్నట్టు తలూపాడు పార్థు.ఆంజనేయ ప్రసాద్ ప్రశ్నల పరంపర కొనసాగుతూనే ఉంది. పార్థు తెలివిగా సమాధానాలు ఇస్తున్నాడు. దీనికి సంబంధించి మీకు ఏవైనా విషయాలు గుర్తొచ్చినా, తెలిసినా తనకు ఫోన్ చేసి చెప్పమంటూ ఆంజనేయ ప్రసాద్ కుర్చీలోంచి లేచాడు.‘‘నా దగ్గర మీ ఫోన్ నంబర్ లేదు’’ అన్నాడు పార్థు. ‘‘నో ప్రాబ్లమ్! నా కార్డు ఇస్తాను. మీకెప్పుడు గుర్తొస్తే అప్పుడు..’’ అంటూ విజిటింగ్ కార్డ్ చేతిలోకి తీసుకున్నాడు ఆంజనేయ ప్రసాద్.ఆయన టీమ్ అంతా ప్లాన్ ఫెయిలైందని నిరుత్సాహంగా నిలబడి చూస్తున్నారు.ఆ విజిటింగ్ కార్డు మీద పార్థు వేలి ముద్రలు ఉన్నాయి. కార్డుకు పౌడర్ అద్ది ఆంజనేయ ప్రసాద్ టీమ్ వేసిన ప్లాన్ అది.ఆంజనేయ ప్రసాద్ సహా టీమ్ అంతా అక్కణ్నుంచి వెళ్లిపోయారు. పార్థు తన చేతిలోని విజిటింగ్ కార్డుపై ఉన్న పౌడరును ఉఫ్ అని ఊది, ఆ కార్డును నలిపి పక్కనపడేశాడు. పార్థుగా ఆ ఇంటికి పరిచయమైన నందు.. తన స్టైల్లో!! -
అచ్చం అదే పోలిక!!
మనిషిని పోలిన మనుషులు ఏడుగురు ఉంటారంటారు. మనలా ఉండే మనలాంటి ఇంకొకడిని చూస్తే మనమెలా ఫీలవుతాం? గమ్మత్తుగా ఉంటుంది కదూ! ట్విన్స్ విషయంలో ఇది రెగ్యులరే కానీ, ఎక్కడో మనకు తెలియని ఓ ప్రదేశంలో మనలాంటి పోలికలతో ఓ మనిషి ఉంటే? అసలు అలాంటి మనిషి ఒకర్ని మనం చూస్తామా? చూస్తే, వారిని ఒక పేరు పెట్టి పిలవాలంటే ఏమని చెప్పొచ్చు? ఇంగ్లిష్‌లో ఒక పదం ఉంది దీనికోసమే.. డొప్పెల్గ్యాంగర్ (Doppelganger)అని. మనలాంటి పోలికలతో ఉండే మరొకర్ని మనకు డొప్పెల్గ్యాంగర్ అని చెబుతారు. సామాన్య జనంలో డొప్పెల్గ్యాంగర్స్ అంటే మనకు మనమే చెప్పుకుంటాం, అంతవరకే తెలుస్తుంది కానీ, సెలెబ్రిటీలలో ఇలాంటిది కనిపిస్తే మాత్రం అది ప్రపంచానికీ తెలిసిపోతుంది. ‘అర్రే! నువ్ ఆ హీరోలానే ఉంటావ్!’ అంటూ ఎవరన్నా చెప్పితే సిగ్గుపడతాం కానీ, ఉండొచ్చు. ఉండడంలో తప్పేం లేదుగా! డొప్పెల్గ్యాంగర్ అన్న పదం ఇక్కడ హ్యాపీగా వాడేసుకోవచ్చు. ఇండియన్ సినిమాలో సూపర్‌స్టార్ స్టేటస్‌ను సంపాదించిన ఐశ్వర్యరాయ్ తెలుసు కదా? ఆమె పోలికలతోనే ఉంటారు హీరోయిన్ స్నేహా ఉల్లాల్. స్నేహాను చాలాసార్లు ఈ ప్రశ్నే అడిగారు కూడా! ఆమె ఎప్పట్లానే నవ్వుతూ. ‘‘నా అదృష్టం’’ అని సమాధానమిస్తారు. ప్రియాంకా చోప్రా, కత్రినా కైఫ్, నరేంద్ర మోడీ, బరాక్ ఒబామా, రోజర్ ఫెదరర్, అర్భాజ్ ఖాన్ ఇలా చాలామంది సెలెబ్రిటీలకు డొప్పెల్గ్యాంగర్స్ను చూడొచ్చు! -
స్క్రీన్ టెస్ట్
► చిరంజీవి నటించి, కో–ప్రొడ్యూసర్‌గా చేసిన ఒక సినిమాకి ‘బెస్ట్ ఫీచర్ ఫిల్మ్ ఇన్ నేషనల్ ఇంటిగ్రేషన్’ అనే జాతీయ అవార్డు వచ్చింది. ఆ సినిమా పేరేంటì ? ఎ) స్వయంకృషి బి) ఆపద్భాందవుడు సి) యద్ధభూమి డి) రుద్రవీణ ► మహేశ్ బాబు నటి నమ్రతను ఏ సినిమా టైమ్‌లో పెళ్లి చేసుకున్నారో గుర్తు తెచ్చుకోండి. ఎ) వంశీ బి) బాబి సి) అతడు డి) నాని ► నటి భానుప్రియ 150 సినిమాలకు పైగా చేశారు. ఒకే సంవత్సరంలో ఆమెవి 14 సినిమాలు రిలీజయ్యాయి. అది ఏసంవత్సరమో కనుక్కోండి. ఎ) 1985 బి) 1986 సి) 1983 డి) 1987 ► ఎస్.ఎస్. రాజమౌళి మొదట సినిమాకు సంబంధించిన ఏ శాఖలో శిష్యరికం చేశారో తెలుసా? ఎ) అసిస్టెంట్ డైరెక్టర్ బి) కెమెరా అసిస్టెంట్ సి) అసిస్టెంట్ ఎడిటర్ డి) అసిస్టెంట్ రైటర్ ► చదువుకున్న అమ్మాయిలు’ చిత్రానికి స్క్రీన్‌ప్లే రైటర్‌గా చేసి, ఆ తర్వాత తెలుగు జాతి గర్వించదగ్గ దర్శకుడయ్యారు. ఆయనెవరు? ఎ) దాసరి నారాయణరావు బి) కె.రాఘవేంద్రరావు సి) కె.విశ్వనాథ్ డి) ఎ.కోదండరామిరెడ్డి ► గాయకుడు ఎస్.పి.బాల సుబ్రహ్మణ్యం 2012లో ఒక ప్రతిష్ఠాత్మకమైన పురస్కారాన్ని అందుకున్నారు. ఆ అవార్డు ఏమిటి? ఎ) పద్మశ్రీ బి) పద్మభూషణ్ సి) పద్మవిభూషణ్ డి) దాదాసాహెబ్ ఫాల్కే ► నటుడు కోట శ్రీనివాసరావు సినీరంగంలోకి రాకముందు ప్రభుత్వోద్యోగి. ఆయన ఏ శాఖలో పనిచేసే వారో తెలుసా? ఎ) బ్యాంకింగ్ రంగం బి) రోడ్లుభవనాలు సి) వాటర్ వర్క్స్ డి) ఇన్‌కంటాక్స్ డిపార్ట్మెంట్ ► ఈ నలుగురిలో ఒక నటి అసలు పేరు సుజాత నిడదవోలు. ఈమె తెర పేరు కూడా కనుక్కుంటారా? ఎ) జయప్రద బి) జయసుధ సి) జయలలిత డి) జయచిత్ర ► ‘కళాశాలలో... కళాశాలలో కాదా మనసొక ప్రయోగశాల...’ పాటను రాసిందెవరో చెప్పుకోండి చూద్దాం? ఎ) శ్రీకాంత్ అడ్డాల బి) జొన్నవిత్తుల సి) అనంత శ్రీరాం డి) సీతారామ శాస్త్రి ► డబ్బింగ్ ఆర్టిస్ట్ చిన్మయి ఏ హీరోయిన్‌కు తెలుగు, తమిళ్ రెండు భాషల్లోనూ వాయిస్ ఇవ్వడం ద్వారా ఫేమస్ అయ్యింది? ఎ) రకుల్ ప్రీత్ సింగ్ బి) తమన్నా సి) సమంత డి) అదా శర్మ ► హీరో నాని ట్విట్టర్ ఐడీ ఏంటో తెలుసా? ఎ) మై నేమ్ ఈజ్ నాని బి) నాని ఈజ్ మై నేమ్ సి) నేమ్ ఈజ్ నాని డి) యువర్స్ నాని ► నాగార్జునకు నటి, నిర్మాత సుప్రియ మేనకోడలు.మరి సుప్రియకు అఖిల్ ఏమవుతాడు? ఎ) మరిది బి) కొడుకు సి) అల్లుడు డి) బావ ► సావిత్రి తన 31 సంవత్సరాల సినీ కెరీర్లో అన్ని భాషలలో కలిపి ఎన్ని సినిమాల్లో నటించారు? ఎ) 264 బి) 275 సి) 233 డి) 245 ► కొరటాల శివ డైరెక్షన్లో చేసిన ‘మిర్చి’లో ప్రభాస్ ‘కత్తి వాడటం మొదలు పెడితే నాకన్నా బాగా ఎవరూ వాడలేరు..’ అని చెప్పిన డైలాగుని రాసిన దర్శకుడెవరు? ఎ) దశరథ్ బి) వంశీ పైడిపల్లి సి) కొరటాల శివ డి)బోయపాటి శ్రీను ► మద్రాస్ ఫిల్మ్ ఇనిస్టిట్యూట్‌లో కమలహాసన్ ఓ కెమెరామేన్‌తో కలిసి ట్రైనింగ్ తీసుకున్నారు. ఆయనెవరు? చిన్న క్లూ.. తర్వాత కాలంలో వారిద్దరూ చాలా సినిమాలకు వర్క్ చేశారు? ఎ) చోటా కె. నాయుడు బి) పి.సి. శ్రీరాం సి) వి.ఎస్.ఆర్ స్వామి డి) కె.వి.ఆనంద్ ► నటి కాజల్ కన్నడ భాషలో గాయనిగా కూడా చేశారు. ఆమె పాడిన పాటకు సంగీత దర్శకుడు ఎవరో తెలుసా? ఎ) దేవిశ్రీ ప్రసాద్ బి) అనూప్ రూబెన్స్ సి) ఎస్.ఎస్ తమన్ డి) సాయి కార్తీక్ ► మగధీర’ సినిమాలోని బైక్ యాక్షన్ సీక్వెన్స్‌లో జరిగిన ప్రమాదంలో ఏ ఫైట్ మాస్టర్ తీవ్ర గాయాల పాలయ్యాడు? ఎ) విజయన్ బి) స్టంట్ శివ సి) విజయ్ డి) పీటర్ హెయిన్ ► విజయనిర్మల తను నటించి, మొదటిసారిగా దర్శకత్వం వహించిన సినిమా ఏంటి? ఎ) రంగుల రాట్నం బి) మీనా సి) సాక్షి డి) పిన్ని ► పై ఫోటోలో ఉన్న నటిని గుర్తు పట్టగలరా? ఎ) కృష్ణకుమారి బి) రమాప్రభ సి) శ్రీలక్ష్మి డి) షావుకారు జానకి ► నందమూరి తారక రామారావు నటించిన ఈ ఫోటో ఏ సినిమాలోనిది? ఎ) కృష్ణావతారం బి) కృష్ణ పాండవీయం సి) కృష్ణార్జున యుద్ధం డి) కృష్ణలీలలు మీరు 6 సమాధానాల కంటే తక్కువ చెబితే... మీకు సినిమా అంటే ఇష్టం 10 సమాధానాల వరకూ చెప్పగలిగితే... మీకు సినిమా అంటే ఇంట్రెస్ట్ 15 సమాధానాల వరకూ చెప్పగలిగితే... మీకు సినిమా అంటే పిచ్చి 20 సమాధానాలూ చెప్పగలిగితే... ఇంకోసారి ఈ క్విజ్ చదవకండి! సమాధానాలు 1) డి 2) సి 3) ఎ 4) సి 5) సి 6) బి 7) ఎ 8) బి 9) ఎ 10) సి 11) సి 12) ఎ 13) ఎ) 14) సి 15) బి 16) సి 17) డి 18) బి 19) సి 20) ఎ -
సినిమా ఛాన్స్ ఇస్తానంటూ ..
-
దశమికి ‘దిల్’ రాజు చిత్రానికి!
.. కొబ్బరికాయ కొట్టడానికి సిద్ధమవుతున్నారీ హీరో, దర్శకుడు! రాజ్‌తరుణ్ హీరోగా ‘అలా ఎలా?’ ఫేమ్ అనీష్ కృష్ణ దర్శకత్వంలో ప్రముఖ నిర్మాత ‘దిల్’ రాజు ఓ సినిమా నిర్మించనున్నారనే వార్త ఎప్పట్నుంచో ఫిల్మ్‌నగర్‌లో చక్కర్లు కొడుతోంది. ఇప్పుడీ సిన్మా సెట్స్‌పైకి వెళ్లే టైమ్ వచ్చేసింది. విజయదశమికి పూజా కార్యక్రమాలతో లాంఛనంగా ప్రారంభించి, వెంటనే చిత్రీకరణకు వెళ్లాలనుకుంటున్నారు. మలయాళీ అమ్మాయి, తెలుగు అబ్బాయి మధ్య నడిచే ప్రేమకథతో వినోదాత్మకంగా ఈ చిత్రాన్ని రూపొందించనున్నట్టు సమాచారం. సంజన దర్శకత్వంలో ‘రాజుగాడు’తో పాటు అన్నపూర్ణ స్టూడియోస్ నిర్మిస్తున్న మరో సినిమాలోనూ రాజ్‌తరుణ్ నటిస్తున్నారిప్పుడు. ఈ మూడు చిత్రాల తర్వాత ‘గుండెజారి గల్లంతయ్యిందే, ఒక లైలా కోసం’ సిన్మాల ఫేమ్ విజయ్‌కుమార్ కొండా దర్శకత్వంలో ఎ.కె. ఎంటర్టైన్మెంట్స్ సంస్థ నిర్మించే సినిమాను అంగీకరించారట! -
సినీనటుడు శ్రీనివాస్‌రెడ్డి సందడి
ఆత్మకూరు: కమెడియన్‌గా , హీరోగా రాణిస్తున్న సినీ నటుడు శ్రీనివాసరెడ్డి మండల పరిధిలోని పి, యాలేరులో శుక్రవారం సందడి చేశారు. నాలుగు కథలతో .. నలుగురు కొత్త డైరెక్టర్లతో సినిమాలు చేస్తున్నట్లు ఆయన తెలియచేశారు . ఇందులో భాగంగానే ఆత్మకూరు మండలంలో పి, యాలేరులో సినిమా షూటింగ్‌కు వచ్చినట్లు చెప్పారు. ఆయనను చూడగానే గ్రామస్తులు పెద్ద ఎత్తున తరలివచ్చి ఆయనతో సెల్ఫీలు దిగేందుకు పోటీపడ్డారు. -
ఎన్.శంకర్ స్టుడియోకు ప్రభుత్వ స్థలం
హైదరాబాద్: తెలంగాణ రాజధాని నగరంలో మరో సినీ స్డూడియో అందుబాటులోకి రానుంది. తెలంగాణ ఉద్యమంలో తనదైన శైలిలో పోరాటం సాగించిన ప్రముఖ దర్శకుడు ఎన్.శంకర్ స్టూడియో నిర్మాణ రంగంలో అడుగుపెడుతున్నారు. ఉద్యమ సమయంలో ఆయన రూపొందించిన ‘జై బోలో తెలంగాణ’ సినిమా ప్రభావం ఏమిటన్నది అందరికీ తెలిసిందే. శంకర్ అంటే ప్రత్యేకాభిమానం కనబరిచే ముఖ్యమంత్రి కేసీఆర్ స్టూడియోకు అవసరమైన స్థలాలను ప్రతిపాదించాల్సిందిగా టీఎస్ఐఐసీ, రంగారెడ్డి జిల్లా యంత్రాంగాన్ని ఆదేశించారు. ఈ క్రమంలో శేరిలింగంపల్లి మండలం నానక్‌రామ్‌గూడ సర్వే నం.149లో ఎనిమిది ఎకరాలను శంకర్‌కు కేటాయించేందుకు టీఎస్ఐఐసీ సూత్రప్రాయంగా అంగీకరించింది. అదే సమయంలో ఖానామెట్‌లోని సర్వే నం.41/14లో పది నుంచి పదెకరాలను ప్రతిపాదిస్తూ జిల్లా యంత్రాంగం లేఖ రాసింది. ఈ రెండు స్థలాల్లో ఏదో ఒకదానిని ఖరారుచేస్తూ అతి త్వరలోనే ఉత్తర్వులు వెలువడనున్నాయి. టూ స్టేట్స్ రీమేక్: హిందీలో సూపర్ హిట్ అయిన ‘టూ స్టేట్స్’ సినిమాను ఎన్.శంకర్ తెలుగులో రీమేక్ చేస్తున్నారు. ప్రస్తుతం షూటింగ్ జరుపుకొంటున్న తెలుగు టూ స్టేట్స్లో సునీల్ హీరో. -
స్టంట్ యూనియన్ స్వర్ణోత్సవాలు
పెరంబూరు: దక్షిణ భారత సినీ, టీవీ స్టంట్ మాస్టర్స్ అండ్ స్టంట్ కళాకారుల యూనియన్ స్వర్ణోత్సవం నెహ్రూ ఇండోర్ స్టేడియంలో శనివారం నిర్వహించనున్నట్టు ఆ సంఘ అధ్యక్షుడు అనల్ అరసు వెల్లడించారు. గురువారం స్థానిక వడపళనిలోని స్టంట్ యూనియన్ కార్యాలయంలో విలేకరుల సమావేశంలో అనల్‌అరసు పేర్కొంటూ 1966లో స్టంట్ మాస్టర్ పులికేసి కన్నుమూయగా ఆయన అంత్యక్రియలకు కూడా డబ్బు లేక అవస్థలు పడిన పరిస్థితి నెలకొందన్నారు. ఆ సమయంలో ప్రఖ్యాత దర్శకుడు విఠలాచార్య సలహా మేరకు 1967లో స్టంట్ కళాకారుల యూనియన్ను ప్రారంభించినట్లు తెలిపారు. అలా దినదినాభివృద్ధి చెందిన యూనియన్ 50 వసంతాలు పూర్తి చేసుకుందన్నారు. ఈ స్వర్ణోత్సవాలను శనివారం సాయంత్రం నెహ్రూ ఇండోర్ స్టేడియంలో ఘనంగా నిర్వహించనున్నట్టు తెలిపారు. రజనీకాంత్, కమలహాసన్, తెలుగులో చిరంజీవీ, బాలకృష్ణ, మలయాళంలో మోహన్‌లాల్ ఇలా అన్ని దక్షిణాది భాషలకు చెందిన సినీ ప్రముఖులను ఆహ్వానించినట్లు చెప్పారు. తమ విజ్ఞప్తి మేరకు శనివారం షూటింగ్‌లను రద్దు చేసిన తమిళ నిర్మాతల మండలికి కృతజ్ఞతలు తెలిపారు. నృత్య దర్శకురాలు కళ నేతృత్వంలో.. స్వర్ణోత్సవ కార్యక్రమాన్ని తారల ఆటా, పాటా, హాస్యం, పోరాట దృశ్యాలు అంటూ ఇంతకు ముందు కనీవినీ ఎరుగని రీతిలో నిర్వహించనున్నట్లు చెప్పారు. నృత్య కార్యక్రమాలకు డాన్స్‌మాస్టర్ కళ నేతృత్వం వహిస్తున్నారని తెలిపారు. నటి కాజల్ అగర్వాల్, నటి మాలాశ్రీ ఈ వేదికపై డాన్స్ చేయబోతున్నారని వెల్లడించారు. శ్రియ, తాప్సీ, నటుడు జీవా ఇలా చాలామంది ప్రేక్షకులను అలరించనున్నారని తెలిపారు. బాధిత కుటుంబాలకు సాయం: స్టంట్ వృత్తిలో మృతి చెందిన వారి కుటుంబాలకు, తీవ్రంగా గాయపడిన వారికి ఈ వేదికపై ఆర్థికసాయం అందించనున్నట్లు అనల్‌అరసు తెలిపారు. కార్యక్రమం శనివారం సాయంత్రం ఐదు గంటల నుంచి రాత్రి 11గంటల వరకూ ఉంటుందని వెల్లడించారు. -
తెలుగు పద్యం, పాట అజరామరం
అనంతపురం కల్చరల్: సాహిత్యంలో తెలుగు పద్యం, పాట అజరామరమని సినీ గాయకుడు చంద్రతేజ అన్నారు. త్యాగరాజ సంగీత సభ వారు ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన ‘అనంత కళాకారులతో ముఖాముఖి’ కార్యక్రమంలో ఆయన పాల్గొని సినీ నేపథ్యంగా సాగిన అనేక విశేషాలను పంచుకున్నారు. బుధవారం స్థానిక త్యాగరాజ సంగీత సభ ఆడిటోరియంలో సభ అధ్యక్షుడు జ్ఞానేశ్వరరావు ఉత్తార్కర్ నేతృత్వంలో జరిగిన కార్యక్రమంలో చంద్రతేజ మాట్లాడుతూ తిరుపతి సంగీత కళాశాలలో తర్ఫీదు పొందిన తాను దేశ విదేశాల్లో కీర్తిగడించడానికి ఘంటసాల పాటే కారణమన్నారు. ప్రముఖ కవి సి.నారాయణరెడ్డి విల్సన్ హెరాల్డ్గా ఉన్న తన పేరును చంద్రతేజగా మార్చడంతో కొత్త జీవితం ప్రారంభమైందన్నారు. జిల్లా గాయనీ గాయకులు పాలసముద్రం నాగరాజారావు, లతాశ్యామ్, నాట్యాచార్యులు కృష్ణమూర్తిరాజు సినీరంగంలోని పలు ఆసక్తికరమైన విషయాలను చంద్రతేజతో ముఖాముఖి ద్వారా అభిమానులకు వివరించారు. చంద్రతేజగా సుప్రసిద్ధులైన విల్సన్ హెరాల్డ్ అనంతకు రావడం ఇక్కడి వారితో అద్భుతమైన సంగీత విషయాలను చర్చించడం ఆనందకరమని కళాకారులన్నారు. అనంతరం త్యాగరాజ సంగీత సభ కళాకారులు చంద్రతేజను ఘనంగా సన్మానించారు. కార్యక్రమంలో ప్రభావతి, రఘునాథ్, భరత్, శ్రీదేవి తదితరులు పాల్గొన్నారు. -
గ్లామర్ పార్ట్ పూర్తయింది
- సెప్టెంబర్‌లో సెకండ్ పార్ట్ మొదలవచ్చు - డ్రగ్ కేసులో ఎక్సైజ్ ఈడీ అకున్ సబర్వాల్ సాక్షి, హైదరాబాద్: డ్రగ్ కేసులో మొదటి ఎపిసోడ్ గ్లామర్ పార్ట్ విచారణ పూర్తయిందని ఎక్సైజ్ ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టర్ అకున్ సబర్వాల్ స్పష్టం చేశారు. సినీ ఇండస్ట్రీకి సంబంధించి ఇక రెండో జాబితా ఉండబోదని పరోక్షంగా వెల్లడించారు. శుక్రవారం ఇఫ్లూలో డ్రగ్స్ నియంత్రణపై జరిగిన అవగాహన కార్యక్రమంలో భాగంగా అకున్ మీడియాతో మాట్లాడారు. ఇప్పటివరకు అరెస్టయిన వారి విచారణలో వెల్లడైన అంశాలను బట్టి సెప్టెంబర్‌లో రెండో జాబితా ఉంటుందని తెలిపారు. తమపై ఎలాంటి ఒత్తిళ్లు లేవని, స్వతంత్రంగా, స్వేచ్ఛగా విచారణ చేస్తున్నామని పేర్కొన్నారు. ఇప్పటివరకు డ్రగ్స్ వ్యవహారంలో 11 కేసులు నమోదయ్యాయని, వాటిలో చార్జిషీట్ వేసేందుకు కసరత్తు పూర్తి చేశామన్నారు. పలువురి రక్తం, గోర్లు, వెంట్రుకల శాంపిల్స్ సేకరించామని, వాటిని ఫోరెన్సిక్ ల్యాబ్‌కు పంపామని చెప్పారు. ఆ రిపోర్టుల కోసం వేచిచూస్తున్నామని, అవి అందగానే చార్జిషీట్ దాఖలు చేస్తామని తెలిపారు. -
అనంతలో అవంతిక
అనంతపురం కల్చరల్ : అనంతపురంలో ప్రముఖ సినీనటి తమన్న సందడి చేసింది. మలబార్ గోల్డ్, డైమండ్స్ షోరూమ్‌ను ప్రారంభించడానికి గురువారం నగరానికి విచ్చేసిన తమన్నాను చూడటానికి అభిమానులు భారీగా తరలిరావడంతో సప్తగిరి సర్కిల్ కిటకిటలాడింది. మలబార్ షోరూమ్‌ను ప్రారంభించిన తర్వాత తమన్నా మాట్లాడుతూ నాణ్యమైన ఆభరణాలతో, స్వచ్ఛమైన బంగారంతో మలబార్ వారు ప్రపంచ వ్యాప్తంగా సేవలందిస్తున్నారని కొనియాడారు. ప్రస్తుతం తాను తెలుగు, తమిళం, హిందీ భాషల్లో ఏకకాలంలో నటిస్తుండటం ఆనందంగా ఉందన్నారు. ముఖ్యంగా ప్రపంచ వ్యాప్తంగా రికార్డు సృష్టించిన ‘బాహుబలి’ వంటి తెలుగు సినిమాలో నటించడం గర్వంగా ఉందని చెప్పారు. నిర్వాహకులు మాట్లాడుతూ 178వ షోరూమ్‌ను అనంతలో ప్రారంభిస్తున్నామని, తొలిసారి పూర్తీస్థాయి హాల్‌మార్క్ బంగారంతో పాటు ప్లాటినమ్, డైమండ్స్ ఆభరణాలను జిల్లాకు పరిచయం చేస్తున్నామన్నారు. కార్యక్రమంలో నగర మేయర్ స్వరూపతో పాటు వివిధ ప్రాంతాలకు చెందిన మలబార్ గోల్డ్ డైమండ్స్ షోరూముల నిర్వాహకులు హాజరయ్యారు. -
నేడు నగరానికి రానున్న సినీనటి తమన్నా
అనంతపురం కల్చరల్: నగరంలో ఏర్పాటు చేస్తున్న మలబార్ గోల్డ్, డైమండ్స్ షోరూమ్ ప్రారంభోత్సవం సందర్భంగా ప్రముఖ సినీనటి తమన్నా గురువారం నగరానికి రానున్నారు. మలబార్ ఆభరణాల 178వ షోరూమ్ జిల్లాలో ఏర్పాటు చేస్తున్నామని ఈ సందర్భంగా సంస్థ అంబాసిడర్‌గా వ్యవహరిస్తున్న తమన్నా ఉదయం 11.00 గంటలకు విచ్చేసి షోరూమ్‌ను ప్రారంభిస్తారని నిర్వాహకులు తెలిపారు. -
స్క్రీన్ ప్లే 14th July 2017
-
‘మేమూ మనుషులమే, మాకూ ఫ్యామిలీలు ఉన్నాయి’
హైదరాబాద్ : డ్రగ్స్ మాఫియా కట్టడికి మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ సహకరిస్తుందని ‘మా’ కార్యదర్శి, సీనియర్ నటుడు, నరేష్ తెలిపారు. తెలుగు చిత్ర పరిశ్రమలో డ్రగ్స్ వ్యవహారంపై ‘మా’ శుక్రవారం సాయంత్రం వివరణ ఇచ్చింది. ఈ సందర్భంగా నరేష్ మాట్లాడుతూ...‘ సినీ నటుల పేర్ల విషయంలో మీడియా సంయమనం పాటించాలి. నోటీసులు వచ్చినంత మాత్రాన తప్పు చేసినట్లు కాదు. విచారణకు పిలవడం వేరు. నేరం చేయడం వేరు. చట్టం తనపని తాను చేసుకుపోతుంది. తప్పుచేయనివారికి మా ఆర్టిస్టులకు పూర్తి మద్దతుగా ఉంటాం. తప్పు చేస్తే శిక్ష అనుభవించాల్సిందే. కొంతమంది చేసిన తప్పును అందరికీ ఆపాదించొద్దు. ఇది కొందరు వ్యక్తుల సమస్య. ఇండస్ట్రీ సమస్య కాదు. అధికారికంగా పేర్లు వచ్చినప్పుడు మాత్రమే మాట్లాడండి. మేము మనుషులమే. మాకు కుటుంబాలు ఉన్నాయి. డ్రగ్స్‌కు వ్యతిరేకంగా పోరాడటానికి ఇండస్ట్రీ సిద్ధంగా ఉంది. కేవలం ఒక్క చిత్ర పరిశ్రమను ఫోకస్ చేయడం సరికాదు.’ అని అన్నారు. ‘మా’ అధ్యక్షుడు శివాజీ రాజా మాట్లాడుతూ ‘ తప్పు చేయనివారికి ‘మా’ అండగా ఉంటుంది. తప్పు చేసినవారిని శిక్షించడంలో తప్పులేదు. ఏ ఇండస్ట్రీలో జరిగినా తప్పు తప్పే. అమాయకులను బలి పశువుల్ని చేయవద్దు. డ్రగ్స్ కేసులో ఉన్నది కొద్దిమంది సినిమావాళ్లు మాత్రమే. నోటీసుల రానివారికి కూడా నోటీసులు వచ్చినట్లు వార్తలు ప్రసారం చేయడం బాధాకరం. విచారణలో తెలంగాణ ప్రభుత్వానికి పూర్తిగా సహకరిస్తాం. డ్రగ్స్ మాఫియాతో సంబంధాలు ఉన్నవారి గురించి విచారణ అధికారి అధికారికంగా చెప్పేవరకూ ఆగండి. పేర్లను వేసే విషయంలో మీడియా సంయమనం పాటించాలి’ అని సూచన చేశారు. -
టాలీవుడ్‌ను ఆడిపోసుకుంటున్నారు: జీవిత
హైదరాబాద్ : టాలీవుడ్లో డ్రగ్స్ కలకలంపై నటి జీవిత సీరియస్‌గా స్పందించారు. కేవలం తెలుగు చిత్ర పరిశ్రమను ఆడిపోసుకుంటున్నారని, మిగిలినవారిని ఎవరూ పట్టించుకోవడం లేదని ఆమె అన్నారు. సినీ పరిశ్రమలో ఏదైన సంఘటన జరిగితే దాన్ని అందరికి ఆపాదించి చులకన చేయడం సరికాదన్నారు. సినిమా ఇండస్ట్రీ అంటేనే గ్లామర్ రంగం అని, నటీనటులను ...అభిమానులు అనుకరించే అవకాశం ఉన్నందున ...అందరూ కేర్‌ఫుల్‌గా, బాధ్యతాయుతంగా వ్యవహరించాల్సి ఉందన్నారు. డ్రగ్స్ వ్యవహారంలో నోటీసులు అందుకున్నవారు అంతా తప్పు చేశారనుకుంటే పొరపాటే అన్నారు. ఒకవేళ తప్పు చేసి ఉంటే భవిష్యత్‌లో మళ్లీ జరగకుండా దాన్ని సరిదిద్దుకోవాలని జీవిత సూచించారు. విపత్తులు, ఎలాంటి ఆపదలు ఎదురైనా తెలుగు చిత్ర పరిశ్రమ బాధ్యతాయుతంగా తమవంతు సాయం చేసేందుకు ఎప్పుడూ ముందు ఉంటుందన్నారు. డ్రగ్స్ వ్యవహారంలో ఒక్క టాలీవుడ్‌నే బాధ్యులుగా పేర్కొనడం సరైంది కాదని జీవిత అభిప్రాయపడ్డారు. ‘సినిమావాళ్ల గురించి ఎవరిమీదైనా, ఏదైనా రాయవచ్చనే ధోరణి ఉంది. యూట్యూబ్‌లో చేస్తే తెలుస్తుంది. అది చాలా ఇబ్బందికరంగా ఉంది. స్కూల్ పిల్లల వరకూ డ్రగ్స్ పాకాయి. అలాగే ఎప్పటి నుంచో పబ్‌లు, క్లబ్‌ల కల్చర్ ఉంది. ఇన్నాళ్లు ఏం చేశారు. ఎంత విచ్చలవిడిగా వదిలేశారు. ఎంతోమంది సొసైటీలో డ్రగ్స్ తీసుకుంటున్నారు. అయితే డ్రగ్స్ తీసుకుంటున్నారంటూ కేవలం సినిమావాళ్లను ముందుకు తీసుకురావడం సరికాదు. డ్రగ్స్ మాఫియాపై ప్రభుత్వం కఠిన చర్యలు తీసుకోవాలి. అలాగే అధికారుల లోపం కూడా ఉంది. సినిమా వాళ్లు డ్రగ్స్ తీసుకోవడం లేదని నేను అనడం లేదన్నారు. సినిమా ఇండస్ట్రీ దానికేమీ అతీతం కాదన్నారు. ప్రతి విషయానికి చిత్ర పరిశ్రమను టార్గెట్ చేయడం సరికాదు. పిల్లలను కూడా బలి తీసుకుంటున్న డ్రగ్స్‌పై సమాజం కూడా పోరాటం చేయాలి’ అని జీవిత పిలుపునిచ్చారు. -
‘తప్పు చేసినవాళ్లు శిక్ష అనుభవించాల్సిందే’
హైదరాబాద్ : తప్పు చేసినవారు శిక్ష అనుభవించాల్సిందేనని నిర్మాత సి.కల్యాణ్ అన్నారు. టాలీవుడ్లో డ్రగ్స్ ప్రకంపనలు కలకలం రేపుతున్న విషయం తెలిసిందే. డ్రగ్స్ వ్యవహారంలో ఎక్సైజ్ ఎన్ఫోర్స్మెంట్ నోటీసులు జారీ చేసిన తెలుగు సినిమా ప్రముఖుల పేర్లు అనధికారికంగా వెల్లడయ్యాయి. ఇందులో ప్రముఖ హీరోతో పాటు దర్శకుడు, ఇతర టెక్నీషియన్లు ఉన్నారు. ఈ వ్యవహారంపై సి. కల్యాణ్ శుక్రవారమిక్కడ మాట్లాడుతూ సిట్ విచారణకు తాము సహకరిస్తామన్నారు. ఇండస్ట్రీలో కొందరికి నోటీసులు మాత్రమే వచ్చాయన్నారు. అయితే నోటీసులు అందుకున్నంత మాత్రాన తప్పు చేసినట్లు కాదని ఆయన అభిప్రాయపడ్డారు. కాగా డ్రగ్స్ వ్యవహారంలో తమకు నోటీసులు అందిన మాట వాస్తవమేనని పలువురు అంగీకరించారు. విచారణకు హాజరై తమకు తెలిసిన విషయాలు చెబుతామన్నారు. కాగా డ్రగ్స్‌కేసులో ఇవాళ మరికొందరి పేర్లు వెల్లడి అయ్యే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. drugs racket, tollywood, C.kalyan,enforcement, cine celebrities, డ్రగ్స్ కేసు, ఎన్ఫోర్స్మెంట్ నోటీసులు, సినిమా ప్రముఖులు, టాలీవుడ్, సి.కల్యాణ్ -
డ్రగ్స్ కేసు: సినిమా ప్రముఖుల పేర్లు వెల్లడి!
హైదరాబాద్: డ్రగ్స్ వ్యవహారంలో ఎక్సైజ్ ఎన్ఫోర్స్మెంట్ నోటీసులు జారీ చేసిన తెలుగు సినిమా ప్రముఖుల పేర్లు అనధికారికంగా వెల్లడయ్యాయి. ఇందులో ప్రముఖ హీరోతో పాటు దర్శకుడు, ఇతర టెక్నీషియన్లు ఉన్నారు. ప్రముఖ హీరో రవితేజ, హీరోయిన్లు ముమైత్‌ఖాన్, చార్మి, దర్శకుడు పూరి జగన్నాథ్, కెమెరామేన్ శ్యాంకే నాయుడు, హీరోలు నవదీప్, తరుణ్, తనీష్, కేరక్టర్ ఆర్టిస్టు సుబ్బరాజు, ఆర్ట్ డైరెక్టర్ చిన్నా తదితరులకు ఎన్ఫోర్స్మెంట్ అధికారులు నోటీసులు జారీ చేసినట్టు తెలిసింది. నోటీసులు అందుకున్న వారు ఈ నెల 19 నుంచి 27 వరకు సిట్ ఎదుట విచారణకు వ్యక్తిగతంగా హాజరుకావాలని ఆదేశించారు. అయితే వీరి పేర్లను ఎక్సైజ్ అధికారులు అధికారికంగా వెల్లడించలేదు. ఇటీవల పట్టుబడిన డ్రగ్ వ్యాపారి కెల్విన్ ఫోన్లోని కాల్‌డేటా ఆధారంగా సినిమా ప్రముఖులకు నోటీసులు జారీ చేశారు. అయితే వీరంతా డ్రగ్స్ తీసుకుంటున్నారా? లేదా మాదకద్రవ్యాల క్రయవిక్రయాల్లో పాలుపంచుకుంటున్నారా అన్న అంశాన్ని లోతుగా విచారిచేందుకే నోటీసులు జారీచేసినట్లు ఉన్నతాధికారులు చెబుతున్నారు. డ్రగ్స్ కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న సినీ ప్రముఖులు నోటీసులు జారీ చేస్తూనే ఉన్నామని, ఇప్పటికే 10 మందికి నోటీసులు ఇచ్చామని ఎక్సైజ్ ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టర్ అకున్ సబర్వాల్ తెలిపారు. ఇంకా చాలా మంది సినీ ప్రముఖులు లిస్టులో ఉన్నారని వెల్లడించారు. నోటీసులు ఇచ్చిన వారిని సిట్ ఆఫీసులోనే విచారిస్తామని తెలిపారు. హీరోయిన్లను సిట్ ఆఫీసులో కాకుండా బయట విచారిస్తామన్నారు. విచారణ అంశాలు బయటకు వెల్లడించబోమని స్పష్టం చేశారు. -
వజ్రకరూరులో సినీనటుడు నాగినీడు
వజ్రకరూరు : మండల పరిధిలోని వివిధ గ్రామాల్లో శుక్రవారం సినీనటుడు నాగినీడు పర్యటించారు. ఈ సందర్భంగా మండలంలోని కొనకొండ్ల, చాబాల గ్రామాల్లోని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలతో పాటు వజ్రకరూర్ మోడల్ స్కూల్ విద్యార్థులతో సమావేశమయ్యారు. అనంతరం నాగినీడు సాక్షితో ప్రత్యేకంగా మాట్లాడారు. మర్యాద రామన్న సినిమా రిలీజ్ అయిన తర్వాత పలువురు నా వద్దకు వచ్చి మీ వాయిస్ బాగుందని చెప్పారన్నారు. అప్పటి నుంచి నాకు తెలిసిన విషయాలను నలుగురికీ చెప్పాలని నిర్ణయించుకున్నట్లు తెలిపారు. ఇది ఇలా ఉండగా నాగినీడుతో ఫొటోలు దిగేందుకు పలువురు విద్యార్థులు ఉత్సాహం చూపారు. ఆయన వెంట జేవీవీ రాష్ట్ర కార్యదర్శి హరిప్రసాద్‌యాదవ్, ఆర్డీటీ సీఓ నాగప్ప, తదితరులు ఉన్నారు. -
స్క్రీన్ ప్లే 5th July 2017
-
స్క్రీన్ ప్లే 3rd July 2017
-
సదరన్ స్పైస్ 2nd july 2017
-
భిక్షాటనతో జీవనం సాగిస్తున్న నటుడు
తమిళసినిమా: సినిమా మోహం ఓ చిరు నటుడిని బిచ్చమెత్తుకునేలా చేసింది. నటుడు భరత్, సంధ్య జంటగా నటించిన కాదల్ చిత్రం 2004లో సంచలన విజయం సాధించింది. ఈ చిత్రంలో ఒక చిన్న వేషం వేసి అందరినీ అలరించిన పల్లుబాబు ఇప్పుడు గుడి ముందు భిక్షాటన చేస్తూ జీవనం గడుపుతున్నాడు. ఆ చిత్రంలో సినిమా అవకాశాలను వెతుక్కుంటూ చెన్నైకి వచ్చి ఓ మ్యాన్షన్‌లో ఉండే యువకుడిగా పల్లుబాబు నటించాడు. అందులో విరుచ్చికాంత్ అనే పేరును పెట్టుకుని నేను నటిస్తే హీరోగానే, ఆ తరువాత రాజకీయం, సీఎం అంటూ అతను చెప్పే డైలాగ్స్ బాగా పాపులర్ అయ్యాయి. అయితే అతను మాత్రం పాపులర్ కాలేకపోయాడు. కాదల్ చిత్రం తరువాత పల్లుబాబుకు అవకాశాలు రాలేదు. దీంతో పేదరికం, తల్లిదండ్రుల మరణంతో పల్లుబాబు మానసికంగా కుంగిపోయాడు. చివరికు కడుపు నింపుకోవడానికి స్థానిక చూలైమేడులోని గుడి ముందు భిక్షాటన చేస్తూ జీవనం గడుపుతున్నాడని అతడిని చూసిన స్థానికులు తెలిపారు. -
స్క్రీన్ ప్లే 20th June 2017
-
హీరోయిన్ ఛాన్స్ ఇస్తానని..
హైదరాబాద్: సినిమాల్లో అవకాశం ఇస్తానని ఒక వ్యక్తి తనను మోసం చేశాడంటూ కృష్ణవేణి అనే యువతి పోలీసులను ఆశ్రయించింది. తనను మోసం చేసిన వ్యక్తిపై చర్య తీసుకోవాలని ఆమె కోరింది. ప్రముఖ దర్శకుడు పూరి జగన్నాథ్ దగ్గర అసిస్టెంట్‌గా పనిచేస్తున్నానని చెప్పి శ్రీనివాస్ అనే వ్యక్తి తనను మోసం చేశాడని ఖమ్మం జిల్లా రామాపురంకు చెందిన కృష్ణవేణి జూబ్లీహిల్స్ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేసింది. కొన్ని నెలల క్రితం విక్కీ అనే వ్యక్తి ద్వారా శ్రీనివాస్ పరిచయమయ్యాడని ఓ టీవీ చానల్‌తో చెప్పింది. పూరి జగన్నాథ్ దగ్గర అసిస్టెంట్‌గా పనిచేస్తున్నానని అతడు చెప్పాడని వెల్లడించింది. సినిమా పరిశ్రమలో తనకు పెద్దవాళ్లతో పరిచయాలు ఉన్నాయని చెప్పడంతో అతడిని నమ్మి డబ్బు ఇచ్చినట్టు చెప్పింది. సినిమాల్లో అవకాశం అడిగితే ‘కమిట్మెంట్’ అడిగాడని తెలిపింది. కమిట్మెంట్ అంటే ఏంటని అడిగితే.. తనతో ఏకాంతంగా గడిపితే గడిపితే హీరోయిన్ చేస్తానని చెప్పాడని వెల్లడించింది. అందుకు తాను ఒప్పుకోకపోలేదని, తన డబ్బు తిరిగివ్వాలని కోరితే తప్పించుకుని తిరుగుతున్నాడని ఆరోపించింది. కాగా, కృష్ణవేణి ఆరోపణలను శ్రీనివాస్ తోసిపుచ్చాడు. ఆమె ఎవరో తనకు తెలియదని, హీరోయిన్ ఛాన్స్ ఇప్పిస్తానని చెప్పలేదని అన్నాడు. తాను చిన్న సినిమాలు డిస్ట్రిబ్యూట్ చేస్తుంటానని తెలిపాడు. -
స్క్రీన్ ప్లే 1st May 2017
-
లేపాక్షి ఆలయంలో గుండు సుదర్శన్
లేపాక్షి : లేపాక్షి వీరభద్రస్వామి ఆలయాన్ని హాస్యనటుడు గుండు సుదర్శన్ శనివారం సాయంత్రం సందర్శించారు. ఈ సందర్భంగా ఆలయంలోని వీరభద్రస్వామి, దుర్గాదేవి అమ్మవార్లకు విశేష పూజలు నిర్వహించారు. అనంతరం ఆలయ విశిష్టత గురించి అర్చకులు సూర్యప్రకాష్‌రావు, నరసింహశర్మను అడిగి తెలుసుకుని సంతృప్తి వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ హాస్యనటుడిగా తనను ఆదరించిన అభిమానులకు ప్రతేక కృతజ్ఞతలు తెలిపారు. -
జిల్లాలో సినీ, టీవీ స్టూడియో నిర్మిస్తా
–హాస్య నటుడు గౌతంరాజు రాయవరం(మండపేట): ‘గోదావరి జిల్లాలో పుట్టినందుకు ఎంతో సంతోషిస్తున్నా. జిల్లావాసిగా కళామతల్లి రుణం తీర్చుకునేందుకు తగిన కృషి చేస్తున్నా’నన్నారు ప్రముఖ హాస్యనటుడు గౌతంరాజు. ఆత్మీయత, అనుబంధానికి జిల్లా పెట్టింది పేరని, మరో జన్మంటూ ఉంటే ఈ జిల్లాలోనే పుట్టాలని ఉందని చెప్పారు. రాయవరం సాయితేజా 20వ వార్షికోత్సవంలో పాల్గొనేందుకు వచ్చిన సందర్భంగా ఆయన విలేకరులతో మాట్లాడారు. ఆ వివరాలు ఆయన మాటల్లోనే.. పాఠశాల దశ నుంచే నాటకాలు రాజోలులో పుట్టిన నేను కాకినాడ కాకినాడ పీఆర్ కళాశాలలో బీఎస్సీ చదివాను. విద్యాభ్యాసం అనంతరం హైదరాబాద్‌లోని ఇంటర్మీడియేట్ బోర్డులో ఉద్యోగం చేశాను. సినిమారంగంపై ఉన్న ఆసక్తితో దీర్ఘకాలిక సెలవులో వెళ్లి, 1991లో ఉద్యోగానికి రాజీనామా చేశాను. పాఠశాల దశ నుంచి నాటకాలు వేశాను. కాకినాడలో చదువుతుండగా 42 ప్రదర్శనలు ఇచ్చాను. ‘పశ్చాత్తాపం, లాభం, ఏక్ దిన్ కా సుల్తాన్, ఆగండి ఆలోచించండి’ తదితర నాటకాల్లో నటించాను. అలా వచ్చింది అవకాశం.. సింగీతం శ్రీనివాసరావుగారి దర్శకత్వంలో వచ్చిన ‘వసంతగీతం’ సినిమాలో తొలిసారిగా నటించాను. ఇప్పటి వరకు 200కు పైగా సినిమాల్లో నటించాను. ‘ఘరానామొగుడు, కూలీ నెం1, ప్రేమకు వేళాయెరా, ఉగాది’ తదితర సినిమాలు గుర్తింపునిచ్చాయి. ‘జై శ్రీరామ్’ సినిమాలో తొలిసారి విలన్ వేషం వేశాను. ‘వెయ్యి అబద్ధాలు’ సినిమాలో తేజ మరోసారి విలన్ వేషం ఇచ్చారు.ఎందరో మహానటులు నాటక రంగం నుంచి వచ్చిన వారే. జిల్లాలో త్వరలో బీజీఆర్ ఫిల్మ్ అండ్ టీవీ స్టూడియో నిర్మాణం చేపడుతున్నాను. ఎక్కడ నిర్మించేది త్వరలోనే వెల్లడిస్తాను. తమిళ డైరెక్టర్ సాగా దర్శకత్వంలో త్వరలో సినిమా రూపొందిస్తున్నాం. ఆ సినిమాలో జిల్లాలో ఉన్న నటీనటులకు ప్రాధాన్యం ఇస్తాను. మే నెలాఖరుకు షూటింగ్ ప్రారంభిస్తాను. నా కొడుకు కృష్ణకు గుర్తింపు వచ్చింది... నా కుమారుడు కృష్ణంరాజును కృష్ణ పేరుతో సినిమా పరిశ్రమకు హీరోగా పరిచయం చేశాను. ‘లక్ష్మీదేవి సమర్పించు..నేడే చూడండి’ ఈ నెల ఏడున విడుదలై మంచి కలెక్షన్స్‌ను రాబట్టింది. ఈ సినిమాతో కృష్ణకు నటుడిగా మంచి మార్కులు వచ్చాయి. కృష్ణ మంచి డ్యాన్సర్ కావడంతో హీరో అవకాశం వచ్చింది. -
సినిమా ఫక్కీలో చోరీ..
జూపాడుబంగ్లా: సినిమా ఫక్కీలో మంగళవారం చోరీ జరిగింది. బాధితుడు, పోలీసుల వివరాల మేరకు.. తరిగోపుల గ్రామానికి చెందిన మాజీ వీఆర్వో సాయన్న నందికొట్కూరు స్టేట్‌బ్యాంకు ఆఫ్ ఇండియాలోంచి రూ.90వేల నగదును డ్రాచేసుకొని ప్యాంటు జేబులో పెట్టుకున్నాడు. ఆటోలో నందికొట్కూరు నుంచి తరిగోపులకు బయలుదేరాడు. మార్గమద్యలో నందికొట్కూరు నీలిశికారీపేటలో ఇద్దరు వ్యక్తులు ఆటోలో ఎక్కి సాయన్న పక్కలో కూర్చున్నారు. ఆటో రబ్బాని వేర్‌హౌస్ వద్దనున్న పెట్రోల్‌బంక్ వద్ద డీజిల్ పోయించుకునేందుకు డ్రైవర్ నిలబెట్టాడు. ఈలోగా సాయన్న ప్యాంట్ జేబులోంచి రూ.90వేల నగదును దోచుకున్న దుండగులు నీళ్లు తాగేందుకనే వంకతో ఆటోలోంచి దిగి వెళ్లిపోయారు. జూపాడుబంగ్లాకు చేరుకున్నాక జేబు తడుముకోగా డబ్బులు కనిపించకపోవటంతో స్థానిక పోలీసుస్టేషన్లో ఫిర్యాదు చేశాడు. -
రూ. 20 లక్షలు సాయం ప్రకటించిన నటి
టీనగర్(చెన్నై): ఢిల్లీలో ఆందోళన చేపట్టిన పదిమంది తమిళ రైతులకు నటి స్నేహ దంపతులు రూ. 20 లక్షల ఆర్థికసాయం ప్రకటించారు. రైతుల సమస్యలను పరిష్కరించాలని కోరుతూ 41 రోజులుగా ఢిల్లీలో జంతర్‌మంతర్ వద్ద తమిళ రైతులు ఆందోళన చేపట్టిన విషయం తెలిసిందే. ఈ క్రమంలో ఆదివారం వారు తాత్కాలికంగా తమ ఆందోళనను విరమించారు. ఢిల్లీ ఆందోళనలో పాల్గొన్న పదిమంది రైతులకు రూ. 2 లక్షల చొప్పున ఆర్థిక సాయాన్ని ప్రకటించారు. వారు ఆదివారం విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ తమిళనాట నెలకొన్న కరువు పరిస్థితుల కారణంగా రైతులు ఆత్మహత్యలు చేసుకోవడం బాధాకరమన్నారు. రైతులకు తమకు తోచిన సాయం అందజేసేందుకు ముందుకొచ్చినట్లు తెలిపారు. అలాగే అన్ని వర్గాలవారు రైతులను ఆదుకోవాలని కోరారు. -
ఈ ఏడాది రాజకీయాల్లోకి వస్తా: నటుడు
ఒంగోలు: ఈ ఏడాది ఆఖరుకు తాను రాజకీయరంగ ప్రవేశం చేయనున్నట్లు సినీ నటుడు సుమన్ ప్రకటించారు. తనకు కొన్ని ఆశయాలు, ఆకాంక్షలు ఉన్నాయని.. తన ఆశయాలకు తగ్గ పార్టీలోకి వెళ్లేందుకు నిర్ణయం తీసుకుంటానని చెప్పారు. శనివారం ఒంగోలులో పాఠశాల భవన ప్రారంభోత్సవానికి వచ్చిన ఆయన విలేకరులతో మాట్లాడారు. అభివృద్ధి, రైతుల సంక్షేమం, పోలీసులు, సైనిక కుటుంబాలను ఆదుకునేందుకు ప్రభుత్వం మంజూరు చేసే ఆర్థిక సాయం పెంపు, విద్యకు అవసరమైన ప్రోత్సాహం కల్పించడం వంటి అంశాలకు ఏ పార్టీ విలువిస్తుందో ఆ పార్టీవైపు తాను దృష్టి సారిస్తానని చెప్పారు. రిజర్వేషన్ల కారణంగా మేధాశక్తికి ఆటంకం కలగరాదని, విద్యార్థులు ఉన్నతంగా చదువుకునేందుకు ప్రత్యేక అవకాశాలు కల్పించాలన్నారు. రిజర్వేషన్లకు ఆటంకం కలగని రీతిలో మెడికల్, ఇంజినీరింగ్ కోర్సుల్లో మేధావులు దేశానికి ఉపయోగపడేలా అవకాశాలు ఉండాలన్నారు. సినీ పరిశ్రమ గురించి సుమన్ మాట్లాడుతూ చిన్న నిర్మాతలను ఆదుకునేందుకు తెలంగాణ ప్రభుత్వం ప్రత్యేకంగా మినీ థియేటర్లను నిర్మిస్తోందని, ఏపీ ప్రభుత్వమూ అదేవిధంగా ముందుకు రావాలని విజ్ఞప్తి చేస్తున్నానన్నారు. వీడియో పైరసీపై ఉక్కుపాదం మోపి, బ్లాక్ టికెటింగ్‌పై ప్రత్యేక చట్టాలు తీసుకురావాలని కోరారు. -
నెట్ కు లేనిది.. సినిమాకు ఎందుకు?
న్యూఢిల్లీ: భారత్ లో సెన్సార్ షిప్ చట్టాలను మార్చాలంటూ నటుడు, దర్శకుడు అమోల్ పాలేకర్ సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. గత 47 సంవత్సరాలుగా సెన్సార్ షిప్ ను ఎవరూ ప్రశ్నించలేదని.. మారుతున్న కాలంతో పాటు అందులోని నిబంధనలు కూడా మారాలని పాలేకర్ అన్నారు. ప్రస్తుతం వస్తున్న సినిమాల్లో ఎక్కువ మొత్తం కట్స్ లో పోతున్నాయని, కొన్ని సినిమాలైతే సర్టిఫికేషన్ కు నోచుకోవడం లేదని గుర్తు చేశారు. ఫ్రీడమ్ ఆఫ్ స్పీచ్ ను ఎక్కువగా ఇవ్వమని కోరడం లేదని అయితే సాంకేతిక అభివృద్ధిని దృష్టిలో ఉంచుకుని నిబంధనలు మార్చాల్సిన అవసరం ఉందని అన్నారు. ప్రస్తుత కాలంలో మాస్ మీడియా పలు రకాలుగా ప్రజలకు అందుబాటులో ఉంటోందని చెప్పుకొచ్చిన ఆయన.. నిబంధనలు కూడా ప్రజల అవసరాలకు తగిన విధంగా ఉండాలన్నారు. కాగా టీవీలు, ఇంటర్నెట్ లో కంటెంట్ పై సెన్సార్ షిప్ లేదని.. అదే సమాచారంతో రూపొందే సినిమా దగ్గరకు వచ్చేసరికే మాత్రం సెన్సార్ షిప్ పేరుతో కట్స్ ఎక్కువగా చేస్తున్నారని పిటిషన్ లో పాలేకర్ వాదించారు. ఈ మధ్య కాలంలో విడుదల కోసం తిప్పలు పడిన సినిమాలను గురించి పిటిషన్ లో వివరించారు. జాలీ ఎల్ఎల్బీ2 సినిమాలో కట్స్ విధించాలంటూ అలహాబాద్ హైకోర్టు చేసిన డిమాండ్ ను కూడా పిటిషన్ లో పేర్కొన్నారు. సినిమాలపై శ్యాం బెనగల్ కమిటీ సూచనలను అమలయ్యేలా చూడాలని పిటిషన్ లో కోరారు. -
పెద్ద సినిమాలకే పరిమితమైన థియేటర్లు
-సీనియర్ నటుడు సుమన్ ఆవేదన రాజోలు : థియేటర్లు పెద్ద సినిమాలకే పరిమితయయ్యాయని ప్రముఖ సినీ నటుడు సుమన్ ఆవేదన వ్యక్తం చేశారు. చంద్రబాలాజీ క్రియేషన్స్ నిర్మిస్తున్న సినిమా షూటింగ్ బుధవారం శివకోడులో ముగిసింది. ఈ సందర్భంగా సుమన్ విలేకరులతో మాట్లాడుతూ ముఖ్యమంత్రి చంద్రబాబు మినీ సినిమా థియేటర్ల ఏర్పాటుకు ఆలోచించాలన్నారు. దీని వల్ల చిన్న సినిమాలకు ఆదరణ, రాష్ట్రానికి ఆదాయంతో పాటు ఆర్టిస్టులకు ఉపాధి లభిస్తుందన్నారు. పెద్ద సినిమాల పైరసీ జరిగితే ఫ్యాన్స్ అడ్డుకుంటున్నారని, అదే చిన్న సినిమాల విషయంలో జరిగితే ఎవరూ పట్టించుకోవడం లేదన్నారు. కడలి గ్రామానికి చెందిన కె.వి.సాయికృష్ణ దర్శకత్వంలో ఈ చిత్రం షూటింగ్ 80 శాతం పూర్తయ్యింది. గుడిమూల, అంతర్వేది, శివకోడు, చించినాడ, చింతలపల్లిలతోపాటు కోనసీమలో పలు చోట్ల షూటింగ్ చేసినట్టు దర్శకుడు వివరించారు. సుమన్‌తో పాటు బెనర్జీ, పృథ్వీ, కృష్ణుడు తదితరులు నటించారని, మేలో విడుదల చేస్తామని చెప్పారు. -
మేకింగ్ ఆఫ్ మూవీ - బద్రినాథ్ కి దుల్హనియా
-
ఒక్క సీన్ కూడా మిస్ అవకుండా!
వాషింగ్టన్: చిన్నపిల్లలతో సినిమాకెళ్తే.. పెద్దలు పడే కష్టాలు.. అనుభవించినోళ్లకే తెలుస్తాయ్.. పిల్లలు అది కావాలి.. ఇది కావాలి అంటూ గోల.. అటూ ఇటూ తిరుగుతూ ఉంటారు.. సినిమాను సరిగా చూడనివ్వరు.. దాదాపు అందరూ ఇలాంటి సీన్లను ఎదుర్కొనే ఉంటారు. ఇదిగో అమెరికా.. కాలిఫోర్నియా రాష్ట్రంలోని పికో రివెరా సిటీలో కట్టిన ఈ సినీపోలిస్ థియేటర్లో పెద్దలకు అలాంటి గోల ఉండదు. పిల్లలతో సినిమాకెళ్లినా.. సినిమా మొత్తం ఒక్క సన్నివేశం కూడా మిస్ కాకుండా చూసి రావొచ్చు. ఇక్కడ పిల్లల వయసుకు తగ్గట్లుగా రకరకాల ఏర్పాట్లు చేశారు. ధియేటర్ ముందుభాగంలో పిల్లలు ఆడుకునేందుకు ప్లే ఏరియా ఉంటుంది. వాళ్ల పని వాళ్లది మన పని మనది. దీంతోపాటు తల్లిదండ్రుల ఒళ్లో కూర్చుని సినిమా చూసే విధంగానూ ఏర్పాట్లు చేశారు. బాగుంది కదూ.. -
సినీ నటిని గర్భవతిని చేసి...
బంజారాహిల్స్(హైదరాబాద్): ఫేస్బుక్లో పరిచయమైన యువతిని ప్రేమిస్తున్నట్లు నమ్మించి ఏడాదిపాటు సహజీవనం చేయడమేగాక ఆమె గర్భవతి అయ్యాక అబార్షన్ చేయించి పెద్దల సమక్షంలో పెళ్లి చేసుకోవాలని ఒత్తిడి చేసినందుకు ముఖం చాటేసిన బీటెక్ విద్యార్థిని జూబ్లీహిల్స్ పోలీసులు అరెస్టు చేసి గురువారం రిమాండ్‌కు తరలించారు. రహ్మత్‌నగర్‌లో నివాసం ఉండే యువతి(23) సినీ నటిగా, డబ్బింగ్ ఆర్టిస్ట్‌గా పని చేసేది. గుంటూరు జిల్లా వేల్పూరు గ్రామానికి చెందిన మేడ యశ్వంత్‌కుమార్ అనే బీటెక్ విద్యార్థితో 2014లో ఫేస్బుక్ ద్వారా పరిచయం ఏర్పడడంతో‡హ్మత్నగర్లో ఓ గదిని అద్దెకు తీసుకొని ఉంటున్నారు. 2016 డిసెంబర్ 2న యశ్వంత్‌కుమార్ అదే గదిలో ఆమెకు పసుపుతాడు కట్టి పెళ్ళి చేసుకున్నట్లు నమ్మించి శారీరకంగా దగ్గరయ్యారు. ఇటీవల ఆమె గర్భవతికాగా స్థానిక ఆస్పత్రికి తీసుకెల్లి అబార్షన్ చేయించాడు. పెళ్లి చేసుకోవాలని ఒత్తిడి చేయగా, అందుకు అతడు నిరాకరించడంతో బాధితురాలు ఆత్మహత్యాయత్నానికి పాల్పడింది. బాధితురాలి ఫిర్యాదు మేరకు యశ్వంత్‌కుమార్‌పై కేసు నమోదు చేసిన పోలీసులు గురువారం రిమాండ్‌కు తరలించారు. -
సినిమా చూపిస్త మావ..
⇒ బస్టాండ్లలో మినీ థియేటర్లు ⇒ ప్రతి పట్టణంలో ఒకటి ఉండేలా ఆర్టీసీ ప్రణాళిక ⇒ 354 థియేటర్ల నిర్మాణానికి ముందుకొచ్చిన బడా సంస్థ సాక్షి, హైదరాబాద్: ఎక్కాల్సిన బస్సు మిస్సవుతుంది. తరువాత బస్సుకు రెండుమూడు గంటల సమయం పడుతుంటుంది. అప్పటి వరకు ఏం చేయాలి! బస్టాండుల్లో పడిగాపులు కాసేకంటే హాయిగా, ఏసీ హాలులో కూర్చుని ‘కూల్’గా ఓ సినిమా చూసొచ్చి తర్వాతి బస్సు అందుకోవచ్చని పిస్తుంది. అందకు ఎక్కడో ఉన్న థియేటర్‌కు వెళ్లి రావాలంటే వ్యయ ప్రయాసలు... పైగా సమయానికి బస్సు అందుకోగలమో లేదో టెన్షన్! అదే బస్టాండులోనే ఓ సినిమా హాలుంటే! ఈ ఆలోచనకే కార్యరూపం ఇస్తోంది ఆర్టీసీ. ప్రయాణికులకు వినోదాన్ని కల్పించడమే కాకుండా... తద్వారా ఆదాయం పొందే లక్ష్యంతో రాష్ట్రవ్యాప్తంగా బస్టాండుల్లో మినీ థియేటర్లను అందుబాటులోకి తెచ్చేందుకు సిద్ధమవుతోంది. ప్రభుత్వానికి ప్రతిపాదన... దేశీయంగా మినీ థియేటర్ల నిర్వహణలో మంచి పేరున్న ఓ బడా కంపెనీ తెలంగాణ ఆర్టీసీ బస్టాండ్లలో 354 మినీ థియేర్లను ఏర్పాటు చేసేందుకు ముందుకు వచ్చింది. దీంతో వాటి నిర్మాణానికి అనుమతితోపాటు, విధివిధానాల నోటిఫికేషన్ కోసం ఆర్టీసీ ప్రభుత్వాన్ని ఆశ్రయించింది. అది రాగానే టెండర్లు పిలిచి థియేటర్ల నిర్మాణానికి శ్రీకారం చుట్టబోతోంది. తెలంగాణ వ్యాప్తంగా ప్రతి పట్టణంలోని బస్టాండులో కనీసం ఓ మినీ థియేటర్ ఉండేలా ప్రణాళికలు సిద్ధం చేస్తోంది. నిబంధనల సడలింపుతో స్పందన ప్రస్తుతం బస్సుల నిర్వహణతోనే ఆదాయాన్ని పొందుతున్న ఆర్టీసీ పీకల్లోతు ఆర్థిక ఇబ్బందుల్లో కూరు కుపోయింది. గతంలో తీసుకున్న అప్పుల తాలూకు వడ్డీలు, పాత బకాయిలు సంస్థకు గుదిబండగా మారాయి. కచ్చితంగా ప్రత్యామ్నా య రూపంలో ఆదాయాన్ని పొందాల్సిన పరిస్థితిలో బీఓటీ (నిర్మించు, నిర్వహించు, అప్పగిం చు) పద్ధతిలో ప్రాజెక్టులు చేపట్టాలని నిర్ణయించింది. ఇందు కోసం ప్రత్యేకంగా టిక్కెటేతర ఆదాయం కోసం రెవెన్యూ విభాగాన్ని ఏర్పాటు చేసింది. దానికి అధికారి వేణును ఈడీగా నియమించింది. కనీసం 4 వేల చదరపు అడుగుల విస్తీర్ణం అవసరమైనందున అంతమేర విశాలమైన భవనాలున్న చోట పైభాగంలో థియేటర్లు నిర్మిస్తారు. భవనాలు లేని చోట బస్టాండులోని ఖాళీ స్థలంలో నిర్మిస్తారు. నిర్మాణ సంస్థలను ఆకట్టుకునేందుకు అసెస్మెంట్ ఆఫ్ ల్యాండ్ వాల్యూ, అప్పెరంట్ వ్యాల్యూను తగ్గించారు. ప్రాజెక్టు అప్పగించిన తొలి నెల నుంచే ఆర్టీసీకి వాటా చెల్లించాల్సి ఉండగా, దాన్ని నిర్మాణ సమయం పూర్తయ్యే వరకు వసూలు చేయాల్సిన అవసరం లేకుండా కనిష్టంగా రెండేళ్ల హాలీడే ప్రకటించారు. కనీసం రూ.100 కోట్ల విలువైన ప్రాజెక్టు అయితే రెండేళ్లు, అంతకంటే విలువ ఎక్కువున్న ప్రాజెక్టులకు మూడేళ్ల హాలీడే ప్రకటించారు. వార్షిక లీజ్ రెంటల్‌ను కూడా తగ్గించారు. లీజు ఒప్పందం పూర్తయ్యాక, ఆసక్తి ఉంటే మరో 25 ఏళ్లపాటు నిర్వహించుకునేందుకు కేటాయించే విషయంలో ప్రాధాన్యమివ్వాలని నిర్ణయించారు. దీంతో నిర్మాణ సంస్థలు ముందుకొస్తున్నాయి. ముందుకొచ్చిన 14 సంస్థలు... తాజాగా మినీ థియేటర్లకు ఆసక్తి వ్యక్తీకరణ ప్రకటన విడుదల చేయటంతో 14 సంస్థలు ముందు కొచ్చాయి. మినీ థియేటర్లతో పాటు ఇతర బీఓటీ ప్రాజెక్టుల వల్ల ఆదాయం ఎలా ఉంటుందనే విషయంలో అధ్యయనం కోసం ఈడీ వేణు ఆధ్వర్యంలో అధికారులు మహారాష్ట్ర, కర్ణాటక, గుజరాత్, కేరళ తదితర రాష్ట్రాల్లో పర్యటించను న్నారు. -
కుమారదేవంలో సినీ సందడి
కొవ్వూరు రూరల్ : కుమారదేవంలో మంగళవారం ఓ సినిమా యూనిట్ సందడి చేసింది. అంజిరెడ్డి ప్రొడక్ష న్ నంబర్– 2 బ్యానర్‌పై టీవీ నటుడు, కథా రచయిత హర్షవర్ధ న్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న కొత్త చిత్రం షూటింగ్ గ్రామంలోని సినిమా చెట్టు, గోదావరి లంకల్లో జరుగుతోంది. మల్లెపువ్వు ఫ్రేమ్, చిత్ర హీరో మురళీకృష్ణ, బుల్లితెర యాంకర్, హీరోయి న్ శ్రీముఖిలపై మంగళవారం పాట చిత్రీకరణ జరిగింది. ఒకే షెడ్యూల్లో చిత్రీకరణ పూర్తి చేసి సినిమాను విడుదల చేయనున్నట్టు దర్శకుడు తెలిపారు. ఈ చిత్రానికి కథ, స్కీ న్‌ప్లే, దర్శకత్వం హర్షవర్థ న్ కాగా, కెమెరా రగుతు సురేష్, కో–డైరెక్టర్ రాజ్‌కుమార్, ఆర్ట్ ఆనంద్. -
స్టార్ లీడర్
‘ఒకప్పటి’ అనే మాట జయప్రదకు ఎప్పటికీ వర్తించదేమో! సినిమాల్లో ఉన్నా, లేకున్నా.. గ్లామర్‌లో ఆమె స్టార్. రాజకీయాల్లో ఏ పార్టీలో ఉన్నా, ఆ పార్టీకి ఆమె బ్రాండ్ లీడర్. పన్నెండేళ్ల వయసుకే సినిమాల్లోకి, ముప్పై రెండేళ్ల వయసులో రాజకీయాల్లోకి వచ్చేశారు జయప్రద. పెళ్లి కూడా అంతే! చిన్న వయసులోనే జరిగిపోయింది. ఇరవైనాలుగేళ్లన్నది పెళ్లికి చిన్న వయసేం కాదు. అయితే సినిమాల్లో బిజీగా ఉన్న ఒక స్టార్ నటికి అది బాల్య వివాహమే! జయప్రద తొలి సినిమా ‘భూమికోసం’. తొలి పార్టీ ‘తెలుగుదేశం’. ఇవి రెండూ ఆమెను మరికొన్ని సినిమాలకు, మరికొన్ని పార్టీలకు నడిపించాయి. పెళ్లే.. ఆమెను ఏడడుగులకు మించి ముందుకు నడిపించలేకపోయింది. జయప్రదకు పిల్లల్లేరు. వద్దనుకుంటే లేకపోవడం కాదు. పుట్టే భాగ్యం లేక లేకపోవడం కాదు. మరి ఎందుకు? బంజారాహిల్స్ రోడ్డు నంబర్ 12 సమీపంలోని జయప్రద విడిది గృహంలో కొన్నాళ్ల క్రితం సాక్షి ఫీచర్స్ ప్రతినిధి ఆమెను కలిశారు. ఆ రోజు మిగతా మీడియా ప్రతినిధులెవరూ లేరు. జయప్రద, సాక్షి. అంతే. అదొక అపూర్వమైన సందర్భం. జయప్రద ఎన్నో సినిమాల్లో నవ్వి ఉంటారు. ఆ రోజు నవ్విన నవ్వు ఏ సినిమాలోనూ లేనిది. చిన్న పిల్ల నవ్వినట్టు పడీ పడీ నవ్వారు. ఆమె పోటీ నటి శ్రీదేవి ‘పదహారేళ్ల వయసు’ సినిమాలో ‘కట్టుకథలు సెప్పి నేను కవ్విస్తే.. నేను నవ్విస్తే..’ అనే పాటలో నవ్విన నవ్వేం పనికొస్తుంది? అలా నవ్వారు. అంత నవ్వూ.. ‘మీకు పిల్లలెందుకు లేరు?’ అన్న ప్రశ్న దగ్గర సడన్‌గా ఆగిపోయింది! ‘మీరు పిల్లలెందుకు వద్దనుకున్నారు?’ అని నేరుగా అడగలేకపోయారు సాక్షి ప్రతినిధి. అందుకే ‘మీకు పిల్లలెందుకు లేరు?’ అని అడిగారు. జయప్రద గ్రహించారు. ‘మీరు నేరుగా అడగలేని ప్రశ్నకు సమాధానం కూడా నేను నేరుగా చెప్పలేనిదే’ అన్న భావం సాక్షి ప్రతినిధికి ఆమె మౌనంలో ధ్వనించింది. జయప్రద గత సోమవారం షిర్డీ దర్శనానికి వచ్చి వెళ్లారు. ఆలయ ప్రాంగణం బయట ఈ సౌందర్యరాశి కొన్ని నిమిషాలపాటు అభిమానులకు దర్శనమిచ్చారు. ఆమెలో నేటికీ ‘పూర్వపు నటి’ ఛాయలు మొదలు కాలేదు! సినిమాలు చేస్తే మళ్లీ చూస్తారు. రాజకీయాల్లోకి వస్తే మళ్లీ రాణిస్తారు. ప్రస్తుతం ఆమె కాంగ్రెస్‌లో ఉన్నారు! దేశంలో కాంగ్రెస్ ఉండీ లేనట్లు ఉన్నట్లే, జయప్రద కాంగ్రెస్‌లో ఉన్నారు. బీజేపీ ఆహ్వానిస్తే వెళ్లడానికి సిద్ధంగా ఉన్నారు. మొన్నటి వరకు జయప్రద పార్టీ ఆర్.ఎల్.డి. రాష్ట్రీయ లోక్ దళ్. 2014లో యూపీలోని బిజ్నోర్ నుంచి ఆ పార్టీ తరఫున ఎంపీగా పోటీ చేసి ఓడిపోయారు. అది అజిత్‌సింగ్ పార్టీ. అంతకు ముందు ఆమె పార్టీ ఆర్.ఎల్.ఎం. రాష్ట్రీయ లోక్ మంచ్. 2012 యూపీ అసెంబ్లీ ఎన్నికల్లో ఆ పార్టీ తరఫున ప్రచారం చేశారు. అప్పటికి ఆమె సమాజ్‌వాదీ పార్టీ నుంచి రెండోసారి రాంపూర్ ఎంపీగా ఉన్నారు. పార్టీ వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడుతున్నారని ఆ పార్టీ అమర్‌సింగ్‌తో పాటు, అతడికి బహిరంగ మద్దతు ఇచ్చిన జయప్రదనూ పార్టీ నుంచి బహిష్కరించడంతో అమర్‌సింగ్ సొంత పార్టీ పెట్టుకుని (అదే ఆర్.ఎల్.ఎం) జయప్రదను కూడా కలుపుకున్నారు. రీ ఎంట్రీ? నో ఎంట్రీ? సమాజ్‌వాదీ పార్టీలోకి రాకముందు టీడీపీలో ఉన్నారు జయప్రద. ఎన్టీఆర్ ఆమెను రాజకీయాల్లోకి తెచ్చారు. ఎన్టీఆర్ నుంచి చంద్రబాబు ఆమెను తన రాజకీయాల్లోకి తెచ్చుకున్నారు. తెలుగు మహిళను చేశారు. రాజ్యసభకూ పంపారు. చివరికి పార్టీ నుంచే బయటికి పంపేశారు. అక్కడి నుంచి సమాజ్వాదిలోకి వెళ్లిపోయారు జయప్రద. సినిమా ప్రొఫైల్ కన్నా, రాజకీయాల్లో జయప్రద ప్రొఫైల్ చాలా పెద్దది! మూడు వందల సినిమాల్లో నటించారు కదా అనిపించవచ్చు. ఒకవేళ నరేంద్రమోదీ కనుక 2019 ఎన్నికల కోసం ఆమెను పార్టీలోకి తీసుకోదలిస్తే ఆమె నటించిన సినిమాలన్నిటినీ ముందేసుకుని చూడమని మాత్రం అమిత్‌షాకు కచ్చితంగా పురమాయించరు. ఆరేళ్లు రాజ్యసభ సభ్యురాలిగా, పదేళ్లు ఎంపీగా జయప్రద అతి కీలకమైన అనేక ప్రభుత్వ కమిటీలలో సభ్యురాలిగా ఉన్నారు. అదొక పెద్ద జాబితా. మోదీకి పరిశ్రమలు ముఖ్యం. విదేశీ వ్యవహారాలు ముఖ్యం. ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ ముఖ్యం. ఇక ముఖ్యం అయినా కాకున్నా.. ఉమెన్ ఎంపవర్మెంట్ కూడా ఆయనకు ముఖ్యం. ఈ కమిటీలన్నింటిలోనూ పనిచేసిన అనుభవం జయప్రదకు ఉంది. అది మోదీ ఇమేజీకి ఉపయోగపడుతుంది. జయప్రద కూడా ఇప్పుడు మోదీ పాలనా విధానాలను సమర్థిస్తున్నారు. మొన్న షిర్డీ వచ్చినప్పుడు మోదీ నోట్ల ఉపసంహరణ నిర్ణయానికి అనుకూలంగా మాట్లాడారు. అయితే ఈ మాట్లాడ్డం ఒక ఎత్తుగడగా జరిగిందని మాత్రం అనుకోవడానికి లేదు. జయప్రదలోని రాజకీయ విజ్ఞత ఇంకా అంత ‘ఎత్తుకు’ ఎదగలేదు. ఇరవై ఆరేళ్ల రాజకీయ జీవితంలోనూ ఎక్కడా ఆమె తన ఉద్దేశాలను, ఉద్వేగాలను దాచుకోలేదు. కోపం వస్తే అరిచేశారు. భయం వేస్తే ఏడ్చేశారు. తను నమ్మినవాళ్ల వెంట వెళ్లిపోయారు. తనను నమ్ముకున్న వాళ్ల వెంట వచ్చేశారు. ఎన్నికల కోడ్‌ని కూడా చూసుకోకుండా.. మహిళా ఓటర్ల నుదుటిపై ఆప్యాయంగా బొట్టు పెట్టారు. ఇప్పుడు కూడా, తను మోదీ వైపు మాట్లాడుతున్నప్పటికీ.. మోదీకి రాజకీయ ప్రత్యర్థులైన ములాయంని కానీ, అఖిలేశ్‌ని కానీ ఆమె విమర్శించడం లేదు. ములాయం తనను పార్టీ నుంచి బహిష్కరించారన్న బాధ ఆమెలో లేదు. అఖిలేశ్ నాకు తమ్ముడి లాంటి వాడు. ములాయం నాకు తండ్రి లాంటి వారు అంటున్నారు. అలాగని ఆ తండ్రీకొడుకుల పాలనలో యూపీ భలే బాగుందని అనడం లేదు. ఆ రాష్ట్రంలో మహిళలకు భద్రత కరువైందని జయప్రద ఏమాత్రం సంశయం గానీ, సంకోచం గానీ లేకుండా అంటున్నారు. రాజకీయాల్లో ఇది అరుదైన గుణం. ఈ గుణం బీజేపీకైనా, ఇంకొక పార్టీకైనా ఎంతవరకు పనికొస్తుందనేదాన్ని బట్టి మాత్రమే జయప్రద రాజకీయ పునఃప్రవేశం అన్నది సంభవం అవుతుంది. అంతులేని కథ ‘భూమికోసం’ చిత్రం తర్వాత జయప్రద నటించిన పెద్ద సినిమా ‘అంతులేని కథ’. అప్పుడు ఆమె వయసు పదిహేనేళ్లు. డైరెక్టర్ కె.బాలచందర్! తమిళంలో హిట్ అయిన సినిమానే తెలుగులో తీస్తున్నారు ఆయన. తమిళ్లో సుజాత చేసిన పాత్రను ఇక్కడ జయప్రద వెయ్యాలి. అంత నిండైన పాత్రను ఈ అమ్మాయి చెయ్యగలదా? పెళ్లీడు దాటిపోయిన అమ్మాయిగా కనిపించాలి. కనిపించగలదా? సందేహాలన్నీ ఎగరగొట్టేశారు జయప్రద. బాలచందర్ ఎప్పుడో గానీ చప్పట్లు కొట్టరట. షూటింగ్లో రజనీకాంత్, జయప్రదల మధ్య సన్నివేశంలో జయప్రద నటనకు ఆయన క్లాప్స్ కొట్టారు. ‘సినిమాలకు పనికొస్తానా?’ అని ముందు భయపడిన జయప్రద.. ‘అంతులేని కథ’ విడుదలయ్యాక సినిమాలే జీవితంగా స్క్రీన్ మీదికి వచ్చేశారు. సిరిసిరిమువ్వ, భద్రకాళి, అడవిరాముడు, యమగోల, అందమైన అనుభవం, సాగర సంగమం, దేవత, మేఘసందేశం.. ఇవి కాక.. తమిళ్, కన్నడ, మలయాళం, హిందీ, బెంగాలీ, ఇంగ్లిష్ భాషల్లో మొత్తం మూడు వందలకు పైగా సినిమాలు చేశారు. ఇప్పటికీ అలాగే! జయప్రద ఆరోగ్యంగా ఉంటారు. అదే ఆమె అందం. ఆ అందానికి కారణం మాత్రం ఆమె తీసుకునే ఆహారం, తీసుకోని ఆహారం కూడా! ఎప్పుడోగానీ జయప్రద లంచ్‌లో, డిన్నర్లో రైస్ ఉండదు. పండ్లు, పండ్ల రసాలు, తాజా కూరగాయలు, ఎగ్ వైట్ ఆమ్లెట్ తీసుకుంటారు. సూప్స్ తాగుతారు. పూర్తిగా ఆకలి వేసే వరకు ఆగరు. కడుపు నిండా తినరు. పొట్ట తేలిగ్గా ఉంటే, ఒళ్లు హుషారుగా ఉంటుందట. ఈ ఆహార నియమాలతో పాటు యోగా చేస్తుంటారు. జిమ్‌కు వెళుతుంటారు. తొలి పారితోషికం 10 రూపాయలు ‘భూమికోసం’ చిత్రంలో చెల్లి చంద్రమ్మగా చిన్న వేషం వేశారు జయప్రద. తొలిషాట్ నెల్లూరులో. పొలాల మధ్య నుంచి తలపై బుట్ట పెట్టుకుని నడుచుకుంటూ వస్తుంటుంది. ఆ సినిమాకు ఆమెకు వచ్చిన రెమ్యునరేషన్ పది రూపాయలు. పోటా పోటీ జయప్రద, శ్రీదేవి ఇంచుమించు ఒకే ఈడు వారు. ఒక స్క్రీన్ కడుపున పుట్టిన తోబుట్టువుల్లా కనిపించేవారు. శోభన్‌బాబు నటించిన ‘దేవత’ సినిమాలో వీళ్లిద్దరూ అక్కాచెల్లెళ్లుగా కూడా నటించారు. అయితే బయట మాత్రం ఒకరితో ఒకరు ముభావంగా ఉండేవారు! ఎందుకనో దగ్గరితనం ఉండేది కాదు. ‘పోటీ ఉండేది కాబట్టి అలా ఉండేవాళ్లమేమో’ అని అనేవారు జయప్రద. రెండేళ్ల క్రితం 2015 నవంబర్ 27న హైదరాబాద్‌లో జయప్రద దత్తపుత్రుడు సిద్ధార్థ్ పెళ్లి జరిగింది. ఆ పెళ్లికి శ్రీదేవి వచ్చారు. ఆ సందర్భంలో వాళ్లిద్దరూ చాలా ఆత్మీయంగా కనిపించారు. పదవులు–బాధ్యతలు 1996–2002 : రాజ్యసభ సభ్యురాలు 1996–97 : పరిశ్రమలు, విదేశీ వ్యవహారాలు, ఎస్సీ, ఎస్టీల సంక్షేమం, సంప్రదింపులు, సమాచారం–ప్రసారాలు.. ఈ కమిటీలన్నింటిలో సభ్యురాలు. 2004 : ఎంపీగా ఎన్నిక. (యూపీలోని రాంపూర్ నియోజకవర్గం) 2004–09 : సమాచార సాంకేతిక పరిజ్ఞానం, మహిళా సాధికారత, జల సంరక్షణ, నిర్వహణలపై పార్లమెంటరీ ఫోరం.. ఈ కమిటీలన్నింటిలో సభ్యురాలు. 2009 : రెండోసారి ఎంపీగా ఎన్నిక (మళ్లీ అదే నియోజకవర్గం) 2009 : ఫైనాన్స్ కమిటీలో సభ్యురాలు. ఇవన్నీ కాక.. 2014 వరకు ప్రభుత్వ, ప్రైవేటు సామాజిక సేవాకార్యక్రమాలలో చురుకైన పాత్ర. వ్యక్తిగతం జయప్రద (54): నటి, రాజకీయ నాయకురాలు అసలు పేరు: లలితారాణి జననం: 3 ఏప్రిల్ 1962 జన్మస్థలం: రాజమండ్రి (ఆం.ప్ర) తల్లిదండ్రులు: కృష్ణారావు, నీలవేణి చదువు: బి.ఎ. భర్త: శ్రీకాంత్ నహతా సంతానం: లేరు ఉండడం: ముంబై, న్యూఢిల్లీ, హైదరాబాద్ అభిరుచులు: మ్యూజిక్, డ్యాన్స్, చిత్రలేఖనం - మాధవ్ శింగరాజు -
క్లిక్ సినీ క్రాప్ట్ సినిమా ఛాన్స్
పాత గుంటూరు : స్థానిక కొరిటెపాడులోని ఎల్వీఆర్ అండ సన్స్ క్లబ్లో క్లిక్ సినీ క్రాఫ్ట్ ఆడిషన్స్(ఎంపికలు) సోమవారం అట్టహాసంగా జరిగాయి. నవతరంలో దాగిన ప్రతిభను వెలికితీసి చిత్ర పరిశ్రమకు పరిచయం చేయాలనే తలంపుతో క్లిక్ సినీ క్రాఫ్ట్ ఆడిషన్స్‌ను ప్రారంభించిందని ప్రముఖ సంగీత దర్శకుడు శశిప్రీతమ్ తెలిపారు. సోమవారం జరిగిన ఆడిషన్స్‌లో 200 మంది ఔత్సాహికులు పాల్గొన్నారన్నారు. మరో రెండు రోజులపాటు ఆడిషన్స్‌ను నిర్వహించనున్నామని, ఆసక్తిగల యువత సద్వినియోగపరుచుకోవాలని చెప్పారు. కార్యక్రమంలో వర్ధమాన గాయని ప్రత్యూషశర్మ, వారి బృందం సభ్యులు పర్యవేక్షించారు. -
అదరగొడుతున్న సినీ తారలు.. నీరసించిన నేతలు
హైదరాబాద్ : నగర కార్పొరేటర్లు-సినీ స్టార్స్ మధ్య జరుగుతున్న క్రికెట్ టోర్నమెంట్ ఎల్బీస్టేడియంలో ఆదివారం కోలాహలంగా ప్రారంభమైంది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా మంత్రులు తలసాని శ్రీనివాస్, పోచారం శ్రీనివాస్ రెడ్డి, పట్నం మహేందర్ రెడ్డి, టీఆర్ఎస్ గ్రేటర్ అధ్యక్షుడు మైనంపాటి హాజరయ్యారు. సినీస్టార్స్ శ్రీకాంత్, తరుణ్, సంజనతో పాటు పలువురు సినీతారలు ప్రముఖులు రావడంతో.. టోర్నమెంట్లో సందడి నెలకొంది. ముందుగా మహిళ మ్యాచ్ ప్రారంభమైంది. ఈ మ్యాచ్‌లో టాస్ గెలిచిన మహిళ కార్పొరేటర్స్టీం ఫీల్డింగ్ ఎంచుకోగా.. సినీ తార సంజన జట్టు బ్యాటింగ్ చేస్తోంది. సంజన జట్టు భారీ స్కోరు దిశగా పయనిస్తుండటంతో.. కార్పొరేటర్ల జట్టు నీరసించింది. విద్యుత్ ఆదా చేయడానికి ఎల్ఈడీ లైట్ల వాడకం పెంచాలని సినీస్టార్స్ చేస్తున్న ప్రచారం ఆకట్టుకుంటోంది. -
చిరంజీవి ఫోన్‌తో వణుకు
తెనాలి: ఆ సంభాషణలు ప్రాస కోసం పాకులాడవు. పంచ్‌ల పదబంధాల్లోకి వెళ్లవు. సులువుగా అందరికీ అర్థమయ్యేలా ఉంటాయి. సన్నివేశం, సందర్భానికి తగినట్టుగా ప్రేక్షకుల్ని తీసుకెళ్తాయి. యుద్ధ సన్నివేశమైతే తూటాల్లా పేలతాయి. శత్రువుతో మాటల యుద్ధంలో భాస్వరంలా మండి అగ్గిని రగిలిస్తాయి. ప్రేమావిష్కరణలో గిలిగింతలు పెడతాయి. అమ్మ గురించి చెబితే మనసు పొరల్లోంచి ఆర్ద్రత పొంగుకొస్తుంది. జీవన తాత్వికత కొట్టొచ్చినట్టు గోచరిస్తుంది. సూటిగా, అలవోకగా, మనకు తెలిసిన పదాలతోనే మంత్రముగ్ధులను చేస్తున్న సంభాషణల రచయిత సాయిమాధవ్ బుర్రా. తెలుగు సినీ పరిశ్రమల్లో మాటలతో మెస్మరైజ్ చేసే రచయితలు చాలామంది ఉన్నా, వర్ధమాన సినీరచయితల్లో స్టార్ రైటర్ ఆయన. సంక్రాంతికి విడుదలైన ఖైదీ నెం.150, గౌతమీపుత్ర శాతకర్ణి సినిమాలకు ఆయన సంభాషణలే ప్రాణంపోశాయి. తెనాలిలో పుట్టిపెరిగిన సాయిమాధవ్ ’సాక్షి’తో ఆ అనుభూతులను ఫోన్లో పంచుకున్నారు. ఆ వివరాలు ఆయన మాటల్లోనే... వణుకొచ్చింది... శాతకర్ణికి క్లైమాక్స్ సీను రాసిన రెండోరోజే చిరంజీవి నుంచి ఫోన్. ఖైదీ నెంబరు 150కి రాయాలన్నారు. క్లైమాక్స్ సీన్లు రాసినా, చిత్రీకరణ పూర్తయేంత వరకూ అక్కడి జాగ్రఫీ ప్రకారం మార్పులు చేర్పులు చేస్తూనే ఉండాలి. అలాంటి సమయంలో చిరంజీవి గారే పిలిచి సినిమా చేయాలనడంతో వణుకొచ్చింది. ‘వినాయక్ కథ చెప్తారు.. ఎన్ని సీన్లు రాయాలంటే అన్ని రాయండి’ అన్నారు చిరంజీవి. చిరంజీవి సినిమాలు చూస్తూ పెరిగిన నాకు ఆయన సినిమాల్లో ఒక డైలాగ్ రాసినా సంతోషమే కదా? ఓకే అనేశాను. ఒకటి చారిత్రాత్మకం, మరొకటి సామాజికాంశంతో ముడిపడిన ఎంటర్టైన్మెంట్ చిత్రం. రెండు సమాంతరంగా చిత్రీకరించారు. ఆ విజయానందం అనన్యం మెగాస్టార్ చిరంజీవి 150వ సినిమా, బాలకృష్ణ 100వ సినిమా. ఈ రెంటికీ నేను రాయడం, అవి అద్భుతమైన విజయాలు సాధించడం ఆనందకరం. సహజంగా ఒకటే ఇండస్ట్రీ హిట్ ఉంటుంది. ఇలా జరిగిందంటే బాబా దయ. ఆ ఆనందాన్ని మాటల్లో చెప్పలేను. గాల్లో తేలిపోతున్నట్టుంది. క్రెడిట్ క్రిష్‌దే.. కృష్ణం వందే జగద్గురుమ్ సినిమా చేసేటప్పుడే తర్వాత శాతకర్ణి చేద్దామని దర్శకుడు క్రిష్ చెప్పారు. శాతకర్ణి గురించి అందరికీ తెలిసిన మేరకే నాకూ తెలుసు. గొప్ప కథ/చరిత్ర ఉన్నా ఎందుకు వెలుగులోకి రాలేదో తెలీదు. హిందూ శకంలో శాలివాహన శకం అంటాం. ఒక కాలానికి కొలమానంగా చెబుతున్నామంటే గొప్ప చరిత్రే కదా! అందుకే క్రిష్ ఆ చరిత్రను అధ్యయనం చేశారు. తన పరిశోధనను ఏమాత్రం ఆపకుండా లండన్ కూడా వెళ్లొచ్చారు. సంతృప్తిగా వచ్చిందనుకోగానే స్క్రీన్ టు స్క్రీన్ నరేషన్ ఇచ్చారు. బాలయ్య లేచి నమస్కరించారు ఖైదీ నెం.150 విడుదల కాగానే చిరంజీవి ఫోన్‌చేసి, ‘మీ వర్క్ చాలా ప్లస్సయింది’ అని చెప్పారు. తర్వాత కలిసినపుడు హగ్ చేసుకుని ‘సినిమాలో మీ సిగ్నేచర్ కనిపిస్తోంది..’ అన్నపుడు ఆనందమేసింది. శాతకర్ణి తర్వాత బాలయ్యబాబు ఎక్కడికెళ్లినా ఆ సినిమా డైలాగులే చెబుతున్నారు. ఒక ఫంక్షన్లో వక్తలు మాట్లాడేటప్పుడు నా ప్రస్తావన రాగానే బాలయ్యబాబు లేచి నిలబడి నమస్కారం చేశారు. నాకు భయమేసింది. వెంటనే నేనూ లేచి నమస్కారం పెట్టాను. తర్వాత కూడా మనం పనిచేద్దాం అన్నారాయన. ఆత్మసంతృప్తే ముఖ్యం స్టార్ రైటర్, మాటల మాంత్రికుడు.. అని నేను అనుకోవట్లేదు. ఎవరైనా అనుకుంటే ఆనందపడతాను. అలాగని పెద్ద సినిమాలకే రాస్తాననే పరిమితులు విధించుకోను. మంచి కథ, ప్రొడక్షన్లో రాసేందుకు అవకాశం ఉందనుకుంటే చిన్న సినిమా అయినా చేస్తాను. రచయితగా ఆత్మసంతృప్తి ముఖ్యం నాకు. నాటి నుంచి నేటి వరకూ.. మాది కళల నిలయం తెనాలి. అమ్మానాన్న ఇద్దరూ రంగస్థల నటులే. చిన్నప్పుడు అమ్మ నన్నూ నాటకాలకు తీసుకెళ్లేది. ఆరేళ్ల వయసులో ‘సత్యహరిశ్చంద్ర’ నాటకంలో లోహితాస్యుడు పాత్రకు ఎవరూ లేక నాకు మేకప్ వేశారు. ధూళిపాళ్ల, డీవీ సుబ్బారావు నటించారా నాటకంలో. ఆరో తరగతిలో స్కూల్లో దుర్యోధనుడి ఏకపాత్ర చేశా. చదువుతూనే నాటకాలు చూడటం, వేయడం చేశాను. ‘బ్రోచేవారెవరురా’ నేను రాసిన తొలి నాటకం. ప్రజానాట్యమండలి, అభ్యుదయ కళాసమితి, అభ్యుదయ రచయితల సంఘం నేనూ, నా స్నేహితుడు చెరుకుమల్లి సింగారావు పనిచేశాం. బాధలు, సంతోషాలు కలిసి పంచుకున్నాం. తెనాలిలో లేకపోతే గుంటూరు దాకా వెళ్లి సినిమాలు చూశాం. బొల్లిముంత శివరామకృష్ణ గురువు. సినిమాలకు ఘోస్ట్ రైటర్‌గా పనిచేసిన నూతలపాటి సత్యనారాయణ స్క్రిప్టు రాయడం నేర్పారు. సినిమాల్లోకని వచ్చి హైదరా‘బాధలు’ ఎన్నో అనుభవించా. అమ్మను కష్టపెట్టకుండా తొందరగా సినిమా అవకాశాలు రావాలని ప్రయత్నాలు చేశాను. నా తొలి టెలిఫిల్మ్ ‘అభినందన’. సీరియల్ ‘పుత్తడిబొమ్మ’. అప్పుడే దర్శకుడు క్రిష్‌తో పరిచయం ఏర్పడింది. భవిష్యత్ ప్రణాళికలు ప్రస్తుతం మహానటి సావిత్రి జీవిత చరిత్రను దర్శకుడు నాగ్అశ్విన్ తీస్తున్నారు. సావిత్రి పాత్రలో కీర్తి సురేష్‌ను తీసుకున్నారు. జెమినీగణేశన్ పాత్రధారి కోసం అన్వేషిస్తున్నారు. దీంతోపాటు హీరో కృష్ణ కుమార్తె మంజుల దర్శకత్వంలో ఓ ప్రేమకథా చిత్రానికి రాశాను. ఒకటి రెండు రోజుల్లో భారీ సినిమా ఒకటి ఫైనలేజ్ కానుంది. దర్శకుడు క్రిష్‌తో మరో సినిమాకు పనిచేయనున్నా. సాయిమాధవ్ సంభాషణల్లో కొన్ని.. ఈ ప్రపంచానికి నా మాటగా చెప్పు, ఈ దేశం ఉమ్మడి కుటుంబం. గదికీ గదికీ మధ్య గోడలుంటాయి. గొడవలుంటాయి. ఈ ఇల్లు నాదంటే నాదని కొట్టుకుంటాం. కానీ, ఎవడో వచ్చి నా ఇల్లంటే ఎగరేసి నరుకుతాం. సరిహద్దుల్లోనే మీకో శ్మశానం నిర్మిస్తాం. మీ మొండేల మీద మా జెండా ఎగరేస్తాం. దొరికినవాళ్లని తురుముదాం.. దొరకనివాళ్లని తరుముదాం.. పట్నాలు పల్లెటూళ్లకు పిల్లలు ఓటమిని పరుగెత్తించు.. అది నిన్ను విజయం దాకా తీసుకెళ్తుంది. మనమే కాదు బాబూ, మనముండే సోటు బతకాలా.. తోటోడూ బతకాలా.. నాయకుడంటే నమ్మించేవాడు కాదు, నడిపించేవాడు, గెలిచేవాడు కాదు, గెలిపించేవాడు గర్భగుడిలో వీధికుక్క ఉచ్చ పోసినంత మాత్రాన దేవుడు మైలపడడు -
అమ్మో.. బాపుగారి బొమ్మో
కదిరి : సినీనటి ప్రణీత గురువారం కదిరిలో సందడి చేసింది. ఓ రెస్టారెంట్ ప్రారంభోత్సవానికి ఆమె విచ్చేశారు. కదిరి ప్రాంత ప్రజలు, సినీ అభిమానులు పెద్ద సంఖ్యలో అక్కడికి చేరుకున్నారు. ప్రారంభోత్సవం అనంతరం ఆమె మీడియాతో మాట్లాడారు. కన్నడ, తమిళ భాషల్లో పలు సినిమాలు చేస్తున్నట్లు తెలిపారు. తెలుగులో ప్రస్తుతానికి తనకు సినిమాలు లేవని చెప్పారు. తాను హీరోయిన్గా నటించిన అత్తారింటికి దారేది సినిమాలో ‘కాటమరాయుడా.. కదిరి నరసింహుడా.. అనే పాట తనకెంతో ఇష్టమన్నారు. అందుకే కదిరిలో శ్రీ ఖాద్రీ లక్ష్మీనరసింహస్వామిని కూడా దర్శించానని చెప్పారు. -
మావుళ్లమ్మ సన్నిధిలో వరుణ్ సందేశ్
భీమవరం (ప్రకాశం చౌక్): భీమవరం పట్టణ ఇలవేల్పు మావుళ్లమ్మవారిని సినీ హీరో వరుణ్‌సందేశ్ దర్శించుకున్నారు. ఆలయంలో ప్రత్యేక పూజలు జరుపుకున్నారు. బీజేపీ నేత కనుమూరి రఘురామకృష్ణంరాజు కూడా అమ్మవారిని దర్శించుకున్నారు. స్థానిక వెంకటేశ్వర బుక్స్ అండ్ స్టేషనరీ యజమాని ప్రసాద్ ఎల్జీ 43 అంగుళాల ఎల్ఈడీ టీవీను ఆలయానికి బహూకరించారు. పాలకొల్లుకు చెందిన గుర్రం అమరకృష్ణ, ఫణి సత్యవతి 5 గ్రాములు, కొత్తపల్లి సూర్యప్రకాష్ (లాలు) 4 గ్రాములు, తటవర్తి పురుషోత్తం గుప్త, తారా దంపతులు 3.660 గ్రాముల బంగారం విరాళంగా సమర్పించారు. -
సినిమా చూపిస్త మామా!
ఖరీదైన వినోదం రెట్టింపు ధరలకు టిక్కెట్ల విక్రయం ఆన్లైన్లో బుక్ చేసి బ్లాక్‌లో అమ్మకాలు ప్రేక్షకుల జేబులు గుల్ల దందా వెనుక యాజమాన్యాలు మౌనం వహిస్తున్న రెవెన్యూ, పోలీసు వర్గాలు సాక్షి, రాజమహేంద్రవరం : సినిమా రిలీజ్ అయిందంటే చాలు ప్రేక్షకుల జేబులు గుల్ల అవుతున్నాయి. రిలీజైన మొదటి రెండు,మూడు రోజులు.. వారాంతాలు.. డిమాండ్ ఉన్న ప్రతి సమయంలో కూడా బ్లాక్ టిక్కెట్ల విక్రయం విచ్చలవిడిగా సాగుతోంది. థియేటర్ల ప్రాంగణంలోనే ఈ దందా సాగుతోంది. కొన్ని యాజమాన్యాలు ఈ దందాను అధికారికంగా నడిపిస్తున్నాయి. థియేటర్ సిబ్బందికి టిక్కెట్లు ఇచ్చి రెట్టింపు ధరలకు అమ్మిస్తున్నాయి. మరికొన్ని యాజమాన్యాలు బ్లాక్ టిక్కెట్ల విక్రయానికి అడ్డుకట్ట వేస్తున్నప్పటికీ జిల్లాలో 90 శాతం హాళ్లలో బ్లాక్ దందా యథేచ్ఛగా సాగుతోంది. ఈ విషయంపై అక్కడక్కడా ప్రేక్షకులు యాజమాన్యాలను అడుగుతున్నప్పటికీ బ్లాక్ టిక్కెట్ల విక్రయంతో తమకు సంబంధంలేదని చెప్పి తప్పించుకుంటున్నాయి. మీ థియేటర్ ప్రాంగణంలోనే టిక్కెట్లు విక్రయిస్తున్నారంటున్నా వారు ఎవరో తమకు పట్టించాలని వితండవాదం చేస్తున్నారు. బ్లాక్ టిక్కెట్ల విక్రయాన్ని అరికట్టాల్సిన బాధ్యత థియేటర్ యాజమాన్యాలపై ఉన్నప్పటికీ ఆ విషయం ఏమాత్రం పట్టించుకోవడంలేదు. బయట వ్యక్తులు వచ్చి థియేటర్ ప్రాంగణంలో బ్లాక్ టిక్కెట్లు విక్రయిస్తుంటే ఏ యాజమాన్యం చూస్తూ ఊరుకోదు. అలాంటిది థియేటర్ వద్ద నలుగురైదుగురు వ్యక్తులు బహిరంగంగా అరుస్తూ రూ.40 టిక్కెట్టు రూ.80, రూ.90 టిక్కెట్టు రూ.500 అంటూ అమ్ముతున్నారంటే వారి వెనుక యాజమాన్యాలు తప్పనిసరిగా ఉంటాయన్నది నగ్నసత్యం. అలా లేకపోతే ఎవరో బయట వ్యక్తులకు పదుల సంఖ్యలో టిక్కెట్లు ఎలా వస్తాయన్నది ఇక్కడ ప్రేక్షక్షులు అడుగుతున్న ప్రశ్న. దీనికి సరైన సమాధానం యాజమాన్యాల వద్ద లేదు. క్యూలో నిలబడి టిక్కెట్లు తీసుకుంటున్నారంటూ యాజమాన్యాలు చెబుతున్నాయి. క్యూలో నిలుచున్న వ్యక్తికి ఒక్క టిక్కెట్టు మాత్రమే ఇస్తారు. కుటుంబంతో వస్తే రెండు టిక్కెట్లు ఇస్తారు. అలాంటిది ఒక్కో వ్యక్తి వద్ద 30 నుంచి 50 టిక్కెట్లు ఎలా ఉంటున్నాయి?. ఆన్లైన్ దందా... థియేటర్లలో బాల్కనీ టిక్కెట్ ధర రూ.90, సెంకడ్ క్లాస్ రూ.75, థర్డ్ కాస్ల్ టిక్కెట్టు ధర రూ.30 ఉంటుంది. థియేటర్లను బట్టీ ఈ ధరలు కొంచెం పెరుగుతాయి. ఈ మూడు క్లాస్‌లలో బాల్కనీ టిక్కెట్లు మాత్రమే ఆన్లైన్లో అమ్మకానికి పెడతారు. ఇందులోనూ 50 శాతం టిక్కెట్లు మాత్రమే ఆన్లైన్లో పెడుతూ మిగతావి కౌంటర్లో విక్రయించాలి. ఆన్లైన్ టిక్కెట్లు బుక్ చేసుకున్న ప్రేక్షకుడికి ఇచ్చే టిక్కెట్‌పై అతని ఫొటోను నిబంధనల ప్రకారం తప్పక ముద్రించి ఉండాలి. కాని ఎక్కడా ఇది అమలు కావడంలేదు. ఒకే వ్యక్తి పేరుపై నాలుగు టిక్కెట్లు బుక్ చేస్తున్నారు. అలా బుక్ చేసిన టిక్కెట్లను థియేటర్ ప్రాంగణంలో విక్రయిస్తున్నారు. ఆన్లైన్ పత్రాలు తీసుకొస్తున్న ప్రేక్షకులకు కౌంటర్లో ఉన్న సిబ్బంది టిక్కెట్ ఇస్తున్నారు. నాలుగు టిక్కెట్లను వేర్వేరు వ్యక్తులు వచ్చి తీసుకుంటుంటే టిక్కెట్ ఇచ్చే సిబ్బంది ఎక్కడా ప్రశ్నించరు. ఆన్లైన్ పత్రంలో ప్రేక్షకుడి ఫొటో లేకపోయినా టిక్కెట్ ఇస్తారు. కౌంటర్ వద్దకు వచ్చిన ప్రేక్షకులు టిక్కెట్ కావాలని అడిగితే ఆన్లైన్లో అయిపోయాయంటూ సిబ్బంది సమాధానం చెబుతారు. నిబంధనల ప్రకారం చేస్తున్నామంటూ చెప్పుకోవడానికి ఓ 10 టిక్కెట్లు ఇచ్చి చేతులు దులుపుకుంటున్నారు. మిగిలి టిక్కెట్లను తమ సిబ్బందితో బ్లాక్‌లో విక్రయిస్తూ ప్రేక్షకులను నిలువునా దోచుకుంటున్నారు. చివరకు రూ.30, రూ.75ల టిక్కెట్లు కూడా బ్లాక్‌లో విక్రయిస్తున్నారు. సీజన్.. సినిమాను బట్టీ రేట్లు! సినిమా, హీరో, సీజన్, డిమాండ్‌ను బట్టి బ్లాక్ టిక్కెట్ల ధరలు రెట్టింపవుతుంటాయి. బుధవారం విడుదలైన ఓ అగ్రహీరో సినిమాకు రూ.90 టికెట్‌ను యాజమాన్యాలే అధికారికంగా రూ.150 చొప్పున విక్రయించాయి. బ్లాక్‌లో అయితే రూ.500 వరకు అమ్మారు. అదే మధ్యస్థాయి హీరో సినిమా అయినా ఈ ధర రూ.250 వరకు ఉంటుంది. ఇక వారాంతాలు, పండగ సీజన్లలో సినిమా చూడాలంటే నలుగురు ఉన్న కుటుంబం కనీసం రూ.1,000 ఖర్చు చేయాల్సిన పరిస్థితి. ఇక వాహనం పార్కింగ్, తినుబండారాలు, శీతలపానీయాలు రెట్టింపు ధరలకు అమ్ముతున్నా అడిగేవారు లేరు. థియేటర్లలో లభించే ఆహారం నాణ్యతపై ఫుడ్ కంట్రోలర్, సేఫ్టీ అధికారులు పట్టించుకున్న దాఖలాలు లేవు. థియేటర్ల వద్ద అధిక ధరలకు బ్లాక్‌లో టిక్కెట్లు విక్రయిస్తున్నప్పటికీ అరికట్టాల్సిన రెవెన్యూ, పోలీసు విభాగాలు మౌనం వహిస్తున్నాయి. కఠిన చర్యలు తీసుకుంటాం... సినిమా హాళ్లలో టిక్కెట్లు బ్లాక్‌లో విక్రయిస్తున్న విషయం మా దృష్టికి వచ్చింది. నిబంధనలకు విరుద్ధంగా ఎవరైనా టిక్కెట్లు బ్లాక్‌లో విక్రయిస్తే అందుకు బాధ్యత థియేటర్ యాజమాన్యానిదే. యాజమాన్యానికి తెలియకుండా ఒక్కో వ్యక్తి వద్ద పదుల సంఖ్యలో టిక్కెట్లు ఎలా ఉంటున్నాయి. ఆన్లైన్ టిక్కెట్ల విక్రయంపై కూడా పరిమితులు ఉన్నాయి. బ్లాక్ టిక్కెట్ల వ్యహారంపై కఠినంగా వ్యవహరిస్తాం. జిల్లావ్యాప్తంగా పోలీసు, రెవెన్యూ యంత్రాంగాన్ని అప్రమత్తం చేస్తాం. – హెచ్.అరుణ్‌కుమార్, జిల్లా కలెక్టర్. -
‘సినిమాల్లో అవే ఎక్కువ చూపిస్తున్నారు’
ఒకప్పటి వెండితెర స్వర్ణయుగ రూపశిల్పుల్లో ప్రముఖ సినీనటి జమున ఒకరు. దాదాపు 200 సినిమాల్లో, అందులోనూ అత్యధిక బాక్సాఫీస్ హిట్లు, జాతీయ, అంతర్జాతీయ అవార్డులతో మూడు దశాబ్దాలకు పైగా ముందువరుసలో కొనసాగిన నటీమణి. కళాభారతి, ప్రజానటిగా గుర్తింపుపొందిన జమున స్వస్థలమైన తెనాలిలో పోలేపెద్ది నరసింహమూర్తి, తుమ్మల వెంకట్రామయ్య, నందమూరి తారక రామారావు కళాపరిషత్ ఆధ్వర్యంలో రాష్ట్రస్థాయి తొమ్మిదో నాటికోత్సవాల్లో ఎన్టీఆర్ అవార్డు అందుకున్నారు. ఈ సందర్భంగా ’సాక్షి’తో కొద్దిసేపు మాట్లాడారు. నేటి తెలుగు సినిమాలు తలదించుకునేలా ఉన్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. ఆ వివరాలు ఆమె మాటల్లోనే.. తెనాలి అంటే నాకెంతో మమకారం. కళానిలయం తెనాలి అనగానే గుర్తొచ్చేది జగ్గయ్య, గుమ్మడి, కృష్ణ.. మూడుసార్లు ఊర్వశి అవార్డు పొందిన శారద. ఇలా ఒక్కొక్కరినీ తలచుకుంటే ఎంతో ఆనందమేస్తుంది. ప్రసిద్ధి చెందిన నాటక కళాకారులకు పుట్టిల్లు తెనాలి. చిన్నతనంలో ఇక్కడకొచ్చి సినిమాలు చూసేవాళ్లం. జగ్గయ్య తీసిన ‘పదండి ముందుకు’ సినిమాలో ఆయనతోపాటు నేనూ, జి.వరలక్ష్మి నటించాం. ఇక్కడే కాలువ ఒడ్డున షూట్ చేశారు. బ్రిటిష్ వారి దౌర్జన్యానికి బలైన పాత్రలో జి.వరలక్ష్మి నటించారు. ఆమె శవాన్ని మోసుకెళుతున్న సీను ఇక్కడ తీశారు. ఇక్కడే బాపూజీని చూశా నేను కర్ణాటకలోని హంపీలో పుట్టానని నన్ను హంపీ సుందరి అంటారు. పసుపు, పొగాకు ఎగుమతి వ్యాపారంలో మా నాన్న దుగ్గిరాల వచ్చి స్థిరపడ్డారు. ఐదో ఏట నుంచి సినిమాల్లోకి వెళ్లే వరకూ నా బాల్యం అక్కడే గడిచింది. దుగ్గిరాల అమ్మాయిగానే చలామణి అయ్యాను. బాల్యంలోని ఎన్నో మధురస్మృతులు ఇంకా గుర్తున్నాయి. 9–10 ఏళ్ల వయసులోనే తెనాలి సమీపంలో పూజ్య బాపూజీని చూడటం గొప్ప అనుభూతి. హైస్కూల్లో చదివేటపుడే ప్రజానాట్యమండలి వారి ‘మా భూమి’ నాటకంలో ఒక పాత్రతో రంగస్థలంపై అడుగుపెట్టాను. ఆ క్రమంలోనే చెన్నైకి వెళ్లి సినిమా రంగంలోకి ప్రవేశించాను. రంగస్థల సమాఖ్య ఏర్పాటు రంగస్థలంపై మమకారంతో రంగస్థల వృత్తి కళాకారుల సమాఖ్యను ఏర్పాటుచేశాను. తెనాలిలోనూ శాఖ నడిచింది. రాష్ట్రవ్యాప్తంగా 26 శాఖల్లో 10వేల మంది కళాకారులు సభ్యులుగా ఉండేవారు. అన్నం పెట్టిన రంగస్థలానికి ఊపిరిపోస్తున్న కళాకారులు, సమాజాలను ప్రోత్సహించాలనే భావనతో పింఛన్లు, ఇళ్ల నిర్మాణానికి సహకారం, ఇతర సేవాకార్యక్రమాలు నిర్వహించాను. ఆంధ్రప్రదేశ్ నాటక అకాడమి అధ్యక్షురాలిగా వీటిని విస్తృతం చేశాను. పేదకళాకారులకు నెలనెలా పింఛన్లు, సురభి సమాజాలకు ప్రోత్సాహం, బళ్లారి రాఘవ పేరిట తపాలబిళ్ల విడుదల నా హయాంలోనే.. తెలుగు రాష్ట్రాల్లో సాంస్కృతిక స్తబ్దత ప్రస్తుతం సాంస్కృతికపరంగా రెండు తెలుగు రాష్ట్రాల్లో స్తబ్దత నెలకొంది. ఔత్సాహికులకే కాదు, వృత్తి కళాకారులకు సైతం ఎలాంటి ప్రోత్సాహకాలు అందట్లేదు. ఎప్పట్నుంచో ఉనికిని కాపాడుకుంటూ వస్తున్న ‘సురభి’ వైభవం తెలంగాణ వచ్చాక తగ్గిపోయిందని నా భావన. ప్రభుత్వపరంగా అకాడమీల పునరుద్ధరణ జరగాలన్నది నా అభిమతం. ఈ మాత్రమైనా కళాసేవ జరుగుతుందంటే ఇలాంటి నాటక సమాజాల వల్లనే. చెడు ఎక్కువ చూపిస్తున్నారు.. తెలుగు సినిమాల్లో చోటుచేసుకున్న మార్పులు కచ్చితంగా సమాజానికి మంచి కలిగించేవి కావు. నాడు భక్త పోతన సినిమా చూసి ఒక బాలయోగి వస్తే, ఈ రోజుల్లో సినిమాలు చూసి రోడ్డుసైడ్ రోమియోలు పుట్టుకొస్తున్నారు. నాలాంటి సీనియర్ నటీనటులు తలదించుకునేలా ఉంటున్నాయి. మేం చిత్రరంగానికి వచ్చాక ప్రభోదాత్మక/ ప్రయోగాత్మక సినిమాలెన్నో వచ్చాయి. నైతిక విలువలే కాకుండా సంఘానికి పనికొచ్చే మంచిని ప్రభోదించాయి. ప్రస్తుతం చెడు ఎక్కువగా చూపిస్తున్న ఫలితంగా యువతరం చెడుమార్గంలో నడుస్తోంది. సామూహిక అత్యాచారాలనూ ఎక్కువగా వింటున్నాం. ఇది మంచి పరిణామం కాదని నా భావన. -
రాయల్కౌంటీలో ఆలీ సందడి
ప్రొద్దుటూరు: నూతన సంవత్సర వేడుకల సందర్భంగా స్థానిక రాయల్‌కౌంటీ రిసార్ట్స్‌లో ఆదివారం అర్ధరాత్రి రాయల్బాష్ కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు. కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా సినీ నటుడు ఆలీ హాజరు కాగా జబర్దస్త్ టీం సభ్యులు హైపర్ ఆలీ, రైజింగ్ రాజా, అభి, యోధా సిస్టర్స్ తదితరులు హాజరయ్యారు. ఈ సందర్భంగా వీరు నిర్వహించిన సాంస్కృతిక కార్యక్రమాలు అలరించాయి. ఇందులో రాయల్ కౌంటీ రిసార్ట్స్ ఎండీ జంపాల మధుసూదన్‌రెడ్డితోపాటు డైరెక్టర్లు, సీనియర్ ఆపరేషన్స్ మేనేజర్ మోహన్మలావత్ తదితరులు పాల్గొన్నారు. -
పురం అభివృద్ధికి రాజకీయ గ్రహణం
హిందూపురం అర్బన్ : పట్టణాభివృద్ధిని రాజకీయంగా కొందరు అడ్డుకుంటున్నారని రాష్ట్ర కళాకారుల ఐక్యవేదిక అధ్యక్షుడు, సినీనటుడు, స్వచ్ఛభారత్ జిల్లా అంబాసిడర్ నరేష్ తెలిపారు. స్థానిక ప్రెస్‌క్లబ్‌లో బుధవారం ఆయన విలేకరులతో మాట్లాడారు. స్వచ్ఛభారత్ రాష్ట్ర అంబాసిడర్, ఐటీ శాఖ సలహాదారులు జేఏ చౌదరి ఆధ్వర్యంలో 2015 ఫిబ్రవరిలో స్థానిక బస్టాండును స్వచ్ఛభారత్ మోడల్‌గా తీర్చిదిద్దాలని భూమిపూజ చేశామన్నారు. పార్కుగా మార్చడానికి ఆ ప్రాంతంలోని డ్రెయినేజీ కుంట సమస్యగా మారిందన్నారు. ఆర్టీసీ ఆర్ఎం, డీఎంలను కలిస్తే మూడు నెలల్లో పూర్తి చేస్తామన్నారు. ఏడాదయినా ఇప్పటికీ అతీగతీ లేదన్నారు. ఇదేంటని అడిగితే రాజకీయ పరిస్థితులు మీకు తెలియవా అంటున్నారన్నారు. దాతలు నిధులు ఇవ్వడానికి ముందుకు వస్తున్నారని, అధికారులు, నాయకులు సహకరిస్తే చాలన్నారు. సమావేశంలో స్వచ్ఛభారత్ కమిటీ పట్టణ చైర్మన్ సయ్యద్, కన్వీనర్ గోపికృష్ణ, సభ్యులు మున్నా, వెంకటేష్ బాబు, వికాస్, సడ్లపల్లి బాబు, పురుషోత్తంరెడ్డి, శ్రీనివాసులు, కృష్ణారెడ్డి, శ్రీను, హబిబ్ పాల్గొన్నారు.