
మనిషిని పోలిన మనుషులు ఏడుగురు ఉంటారంటారు. మనలా ఉండే మనలాంటి ఇంకొకడిని చూస్తే మనమెలా ఫీలవుతాం? గమ్మత్తుగా ఉంటుంది కదూ! ట్విన్స్ విషయంలో ఇది రెగ్యులరే కానీ, ఎక్కడో మనకు తెలియని ఓ ప్రదేశంలో మనలాంటి పోలికలతో ఓ మనిషి ఉంటే? అసలు అలాంటి మనిషి ఒకర్ని మనం చూస్తామా? చూస్తే, వారిని ఒక పేరు పెట్టి పిలవాలంటే ఏమని చెప్పొచ్చు? ఇంగ్లిష్‌లో ఒక పదం ఉంది దీనికోసమే.. డొప్పెల్‌గ్యాంగర్ (Doppelganger)అని.
మనలాంటి పోలికలతో ఉండే మరొకర్ని మనకు డొప్పెల్‌గ్యాంగర్ అని చెబుతారు. సామాన్య జనంలో డొప్పెల్‌గ్యాంగర్స్ అంటే మనకు మనమే చెప్పుకుంటాం, అంతవరకే తెలుస్తుంది కానీ, సెలెబ్రిటీలలో ఇలాంటిది కనిపిస్తే మాత్రం అది ప్రపంచానికీ తెలిసిపోతుంది. ‘అర్రే! నువ్ ఆ హీరోలానే ఉంటావ్!’ అంటూ ఎవరన్నా చెప్పితే సిగ్గుపడతాం కానీ, ఉండొచ్చు. ఉండడంలో తప్పేం లేదుగా! డొప్పెల్‌గ్యాంగర్ అన్న పదం ఇక్కడ హ్యాపీగా వాడేసుకోవచ్చు. ఇండియన్ సినిమాలో సూపర్‌స్టార్ స్టేటస్‌ను సంపాదించిన ఐశ్వర్యరాయ్ తెలుసు కదా? ఆమె పోలికలతోనే ఉంటారు హీరోయిన్ స్నేహా ఉల్లాల్. స్నేహాను చాలాసార్లు ఈ ప్రశ్నే అడిగారు కూడా! ఆమె ఎప్పట్లానే నవ్వుతూ. ‘‘నా అదృష్టం’’ అని సమాధానమిస్తారు. ప్రియాంకా చోప్రా, కత్రినా కైఫ్, నరేంద్ర మోడీ, బరాక్ ఒబామా, రోజర్ ఫెదరర్, అర్భాజ్ ఖాన్ ఇలా చాలామంది సెలెబ్రిటీలకు డొప్పెల్‌గ్యాంగర్స్‌ను చూడొచ్చు!
Comments
Please login to add a commentAdd a comment