Doping
-
డోపింగ్‌లో దొరికిన మారథాన్ విజేత
న్యూఢిల్లీ: రెండు నెలల క్రితం పుణేలో నిర్వహించిన హాఫ్ మారథాన్ పరుగులో విజేతగా నిలిచిన ప్రధాన్ విలాస్ కిరులేకర్ డోపింగ్‌లో దొరికిపోయాడు. దీంతో అతనిపై తాత్కాలిక నిషేధం విధించారు. డిసెంబర్లో నిర్వహించిన 21.09 కిలోమీటర్ల రేసును ప్రధాన్ విలాస్ అందరికంటే ముందుగా ఒక గంటా 4 నిమిషాల 22 సెకన్లలో పూర్తిచేసి విజేతగా నిలిచాడు. అయితే అతని నుంచి సేకరించిన రక్త, మూత్ర నమూనాల్ని ల్యాబ్‌లో పరీక్షించగా, నిషిద్ధ ఉ్రత్పేరకం మెల్డొనియమ్ తీసుకున్నట్లు తేలింది. దీంతో ప్రపంచ అథ్లెటిక్స్ (డబ్లూఏ)కు చెందిన స్వతంత్ర ఏజెన్సీ అథ్లెటిక్స్ ఇంటిగ్రిటీ యూనిట్ (ఏఐయూ) ప్రధాన్ విలాస్‌పై చర్యలు చేపట్టింది. గతనెల భారత్‌కు చెందిన లాంగ్ డిస్టెన్స్ రన్నర్ మాధురి కాల్ డోపింగ్ పరీక్షల్లో పట్టుబడటంతో ఏఐయూ సస్పెన్షన్ వేటు వేసింది. 2016లో రష్యా టెన్నిస్ స్టార్ మరియా షరపొవా కూడా ఈ మెల్డొనియమ్ ఉత్ప్రేరకం తీసుకున్నట్లు తేలడంతో ఆమెపై కూడా సస్పెన్షన్ వేటు వేశారు. సాధారణంగా మెల్డొనియమ్ను డాక్టర్లు హృద్రోగులకు, నరాల జబ్బులున్న రోగులకు శక్తి కోసం సిఫారసు చేస్తారు. -
‘నమ్మకం కోల్పోయాం’
దోహా: ప్రపంచ టెన్నిస్ నంబర్‌వన్ యానిక్ సినెర్ డోపింగ్ ఉదంతం... ఇటీవలే అతనికి విధించిన శిక్షపై సెర్బియా దిగ్గజం నొవాక్ జొకోవిచ్ తీవ్రస్థాయిలో అసంతృప్తి వ్యక్తం చేశాడు. అంతర్జాతీయ టెన్నిస్ ఇంటిగ్రిటీ ఏజెన్సీ (ఐటీఐఏ), ప్రపంచ డోపింగ్ నిరోధక సంస్థ (వాడా)లు రెండూ పక్షపాత ధోరణితో వ్యవహరించాయని 24 గ్రాండ్‌స్లామ్ టైటిళ్ల చాంపియన్ బాహాటంగా తన అసంతృప్తిని వెలిబుచ్చాడు. ‘తాజా ఘటనతో టెన్నిస్ ప్లేయర్లంతా నమ్మకం కోల్పోయారు. ఎందుకంటే ఇటు ఐటీఐఏ కానీ, అటు ‘వాడా’ కానీ సహేతుకంగా వ్యవహరించలేదు. నిస్పక్షపాత వైఖరి కనబరచలేదు. ఈ రెండు సంస్థల తీరు ఎంతమాత్రం ఆమోదయోగ్యం కానేకాదు. కచి్చతంగా ఒక విషయాన్ని చెప్పాలనుకుంటున్నా... టెన్నిస్ క్రీడ ఇమేజ్ను దిగజార్చేలా వ్యవహరించాయి. సుదీర్ఘకాలంగా నానుతున్న సినెర్ డోపింగ్ ఉదంతానికి కంటితుడుపు శిక్షతో పలికిన ముగింపు అసమంజసంగా ఉంది. ఎందుకంటే నేను ఈ విషయమై చాలా మంది ప్లేయర్లతో మాట్లాడాను. వారి అభిప్రాయలను నాతో పంచుకున్నారు. వాళ్లందరు కూడా రెండుసార్లు పట్టుబడిన సినెర్‌కు విధించిన మూడు నెలల శిక్షపై అసంతృప్తిగా ఉన్నారు’ అని జొకోవిచ్ అన్నాడు. ‘సినెర్–ఐటీఐఏ–వాడా’ల మధ్య కుదిరిన ఒప్పందం జరిగిన తప్పిదానికి తగిన శిక్షను ఖరారు చేయలేకపోయిందని పెదవి విరిచాడు. సినెర్లాగే రెండు నమూనాల్లో పాజిటివ్‌గా తేలిన స్పానిష్ మహిళా ఫిగర్ స్కేటర్ లౌరా బార్కెలోపై ‘వాడా’ ఏకంగా ఆరేళ్ల నిషేధం తాజాగా తెరపైకి వచ్చింది. క్రీడాలోకంలో చర్చనీయాంశమైంది. ‘వాడా’ వివరణ ఇది... మాడ్రిడ్: డోపింగ్‌లో దొరికిన టెన్నిస్ స్టార్ సినెర్‌కు, స్పెయిన్ స్కేటర్ లౌరా బార్కెరోలకు వేర్వేరు శిక్షలు విధించడంపై ‘వాడా’ వివరణ ఇచ్చింది. ‘ఇద్దరి నమూనాల్లో పాజిటివ్‌గా తేలినప్పటికీ లౌరా తన శరీరంలోకి నిషిద్ధ ఉత్రేరకాలు ఎలా ప్రవేశించాయో సరైన కారణాన్ని చెప్పలేకపోయింది. ఈ కారణాన్ని బలపరిచే రుజువు (సాక్ష్యం)ను చూపించలేదు. కానీ సినెర్ కావాలని తీసుకోలేదని, బహుశా తాను తీసుకున్న మెడిసిన్ లేదంటే మసాజ్‌కు వాడిన తైలం రూపంలో తన శరీరంలోకి ప్రవేశించి ఉండొచ్చని తను వాడిన మెడిసిన్లతో సహా సంజాయిషీ ఇచ్చాడు’ అని ‘వాడా’ తెలిపింది. -
ఎట్టకేలకు సినెర్‌పై నిషేధం
లండన్: వరల్డ్ టాప్ ర్యాంక్ టెన్నిస్ ప్లేయర్ యానిక్ సినెర్‌పై ఎట్టకేలకు మూడు నెలల నిషేధం విధించారు. స్టార్ అయినా... ఎంతటి వారైనా... డోపింగ్‌కు పాల్పడితే శిక్ష తప్పదనే సంకేతాన్ని ప్రపంచ డోపింగ్ నిరోధక సంస్థ (వాడా) ఇచ్చినట్లయ్యింది. దాదాపు ఏడాదిగా నలుగుతున్న ఈ కేసుకు ఎట్టకేలకు నిషేధంతో తెర పడనుంది. మూడు గ్రాండ్‌స్లామ్‌ల విజేత, ఇటలీకి చెందిన ప్రపంచ నంబర్‌వన్ సినెర్ గత మార్చిలో డోపింగ్‌లో పట్టుబడ్డాడు.అతని నమూనాల్లో నిషిద్ధ ఉత్ప్రేరకాలు తీసుకున్నట్లు తేలినా... ఈ టాప్ ర్యాంకర్‌పై అంతర్జాతీయ టెన్నిస్ ఇంటిగ్రిటీ ఏజెన్సీ (ఐటీఐఏ) మెతక వైఖరి అవలంభించింది. అతని టెస్టు ఫలితాన్ని ప్రపంచానికి తెలియనివ్వలేదు. కొన్ని నెలల తర్వాత బయటికి పొక్కినా కూడా 23 ఏళ్ల సినెర్ తను ఉద్దేశ పూర్వకంగా తీసుకోలేదని, బహుశా మసాజ్‌కు వాడిన తైలం వల్లా తన శరీరంలోకి ప్రవేశించి ఉండొచ్చనే వివరణతో ఐటీఐఏ సంతృప్తి చెంది పెద్దగా చర్యలేం తీసుకోలేదు. దీంతో టెన్నిస్ ఇంటిగ్రిటీపై ప్రపంచవ్యాప్తంగా విమర్శలు వెల్లువెత్తాయి. పలువురు దిగ్గజాలు, స్టార్లు, విశ్లేషకులు ‘ఒక్కొక్కరికి ఒక్కోలా చట్టాలు–చర్యలా’ అంటు దుమ్మెత్తిపోశారు. అయినా ఐటీఐఏ నిమ్మకు నీరెత్తినట్లే ఉండిపోయింది కానీ చర్యలు మాత్రం చేపట్టలేదు. ‘వాడా’ మాత్రం పరీక్షల్లో పట్టుబడ్డాడు కాబట్టి ఏడాదైనా నిషేధం విధించాలని స్పోర్ట్స్ అర్బిట్రేషన్ కోర్టులో అప్పీల్ చేసింది. చివరకు తాజాగా ఐటీఐఏ, సినెర్, వాడాల మధ్య ఒప్పందం కుదరడంతో వాడా ఇటీవల అప్పీల్‌ను ఉపసంహరించుకుంది. ఒప్పందంలో భాగంగా మూడు నెలలు నిషేధం విధించేందుకు ఐటీఐఏ సిద్ధమవగా... సినెర్ కూడా విమర్శలకు చెక్ పెట్టేందుకు సమ్మతించడంతో డోపింగ్ వివాదం ముగిసింది. ఫిబ్రవరి 9వ తేదీ నుంచి మే 4 వరకు ఈ నిషేధం అమలవుతుంది. ఈ కాలంలో అతను ఏ స్థాయి టెన్నిస్ టోర్నీల్లో పాల్గొనేందుకు వీలుండదు. అయితే మే 25 నుంచి జరిగే సీజన్ రెండో గ్రాండ్‌స్లామ్ టోర్నీ ఫ్రెంచ్ ఓపెన్ ఆడేందుకు ఎలాంటి ఇబ్బంది లేకపోవడంతో అతను బరిలోకి దిగుతాడు. ఇదేం సస్పెన్షన్? సినెర్‌కు విధించిన మూడు నెలల శిక్ష పట్ల టెన్నిస్‌లో పలువురు ఆటగాళ్లు ఆశ్చర్యం వ్యక్తం చేశారు. గతంలో విమర్శించిన తరహాలోనే సినెర్ చాలా తక్కువ శిక్షతో బయటపడ్డాడని... టెన్నిస్‌లో ఒక్కో ఆటగాడికి ఒక్కో రకమైన నిబంధన ఉందని వారు వ్యాఖ్యానించారు. ‘సినెర్ సన్నిహితులు తమ పరపతిని బాగా ఉపయోగించినట్లుంది. కేవలం మూడు నెలల నిషేధంతో సరిపెట్టేలా చేసుకోగలిగారు. ఒక్క టైటిల్ వెనక్కి తీసుకోలేదు. కనీసం ప్రైజ్‌మనీలో కూడా కోత విధించలేదు. మరి అతను తప్పు చేసినట్లా, చేయనట్లా. టెన్నిస్‌కు దురదృష్టకరమైన రోజు. ఇక్కడ నిజాయితీ మిగల్లేదు’ అని కిరియోస్ అన్నాడు. మూడు గ్రాండ్‌స్లామ్ టైటిల్స్ గెలిచిన స్టాన్ వావ్రింకా కూడా ఇదే అభిప్రాయం వ్యక్తం చేశాడు. ‘టెన్నిస్ ఇక ఏమాత్రం స్వచ్ఛమైన ఆట కానే కాదు’ అని చెప్పాడు. టెన్నిస్ ప్లేయర్స్ అసోసియేషన్ కూడా ‘ఇక్కడి వ్యవస్థ నిజంగా చెడిపోయింది. ఇది ఒక క్లబ్‌లా మాత్రమే వ్యవహరిస్తోంది. ఒక్కో కేసుకు ఒక్కో రకంగా స్పందిస్తోంది. అన్నింటా అసమానతలు ఉన్నాయి. ఎలాంటి పారదర్శకత, పద్ధతి లేవు. ఇది ఆటగాళ్లను అగౌరవపర్చడమే. ఇకపై మార్పు అవసరం’ అని స్పందించింది. -
నేను డోపీని కాదు
న్యూఢిల్లీ: తెలుగు షట్లర్ గరగ కృష్ణప్రసాద్ డోపీగా తేలడంతో నాలుగేళ్ల నిషేధానికి గురయ్యాడు. అయితే తను మాత్రం డోపీని కానే కాదని, తన ఒంట్లో ఎలాంటి నిషేధిత ఉత్ప్రేరకాలకు చోటే లేదని కుండబద్దలు కొట్టినట్లు చెప్పాడు. 2022లో థామస్ కప్‌లో టైటిల్ గెలిచిన భారత జట్టులో కృష్ణ ప్రసాద్ సభ్యుడిగా ఉన్నాడు. అతను సాయిప్రతీక్తో జోడీగా పురుషుల డబుల్స్‌లో పోటీపడ్డాడు. అయితే గతేడాది అతని రక్త,మూత్ర నమూనాలను పరిశీలించగా అందులో నిషిద్ధ ఉత్ప్రేరకం “హ్యూమన్ క్రొనిక్ గొనడొట్రొపిన్ (హెచ్‌సీజీ) ఉన్నట్లు పరీక్షల్లో తేలింది. జాతీయ డోపింగ్ నిరోధక సంస్థ (నాడా) తాజాగా అతనిపై నాలుగేళ్ల నిషేధం విధించింది. నిజానికి గత సెప్టెంబర్‌లోనే ‘నాడా’ చర్యలు తీసుకోవాల్సి ఉండగా... తెలుగు షట్లర్ అప్పీలుకు వెళ్లాడు. ఇటీవలే అప్పీలును తిరస్కరించడంతో కృష్ణ ప్రసాద్‌పై సస్పెన్షన్ వేటు పడింది. 2019లో జరిగిన దక్షిణాసియా క్రీడల్లో కృష్ణ ప్రసాద్ డబుల్స్ టైటిల్ సాధించాడు. అతనితో పాటు శ్వేతపర్ణ పండాపై కూడా “నాడా’ వేటు పడింది. కోవిడ్ సమయంలో వాడిన దగ్గు టానిక్‌లో నిషిద్ధ ఉత్ప్రేరకాలు ఉండటంతో అప్పట్లో కూడా ఇలాంటి ఆరోపణల్నే కృష్ణ ప్రసాద్ ఎదుర్కొన్నాడు. అయితే నేరుగా కావాలని తీసుకోకపోవడంతో అప్పుడు తేలిగ్గానే బయటపడ్డాడు. ఈసారి మాత్రం నిషేధానికి గురయ్యాడు. ‘నాపై విధించిన నిషేధంపై భారత బ్యాడ్మింటన్ సంఘం అధ్యక్షుడు హిమంత బిశ్వ శర్మ సార్‌ను సంప్రదించాలని అనుకుంటున్నాను. ఈ కేసు, సమస్యపై ఆయనకే వివరిస్తాను’ అని కృష్ణప్రసాద్ అన్నాడు. సాధారణంగా హార్మోన్ల సమతూకం లోపించినపుడు కూడా హెచ్‌సీజీ నివేదికలో తేడాలొస్తాయని అతను వాదిస్తున్నాడు. మరోవైపు శ్వేతపర్ణ తన సస్పెన్షన్‌పై స్పందించేందుకు తిరస్కరించింది. ఆమె సోదరి రుతుపర్ణ కూడా షట్లరే! ఇద్దరు ఇంటా బయటా జరిగిన పలు టోర్నీల్లో రాణించారు. -
ఎందుకీ వివక్ష.. ఏమిటీ ద్వంద్వ ప్రమాణాలు?!
సెర్బియా దిగ్గజం నొవాక్ జొకోవిచ్(Novak Djokovic) అంతర్జాతీయ టెన్నిస్ సమగ్రతా సంస్థ (ఐటీఐఏ) తీరుపై తీవ్రస్థాయిలో మండిపడ్డాడు. డోపీలుగా తేలిన యానిక్ సినెర్(Jannik Sinner), స్వియాటెక్(Iga Swiatek)ల ఉదంతంపై ఐటీఐఏ వ్యవహారశైలిని దుయ్యబట్టాడు. ఐటీఐఏ అవలంభిస్తున్న ద్వంద్వ ప్రమాణాలు సిగ్గుచేటంటూ ఘాటు వ్యాఖ్యలు చేశాడు. బ్రిస్బేన్ ఈవెంట్ కోసంఅదే విధంగా.. టాప్ స్టార్ల డోపింగ్ మరకలపై గోప్యతను పాటించి టెన్నిస్ సమాజం నుంచి నిజాన్ని దాచడంపై సరికాదని పేర్కొన్నాడు. తన కెరీర్లో 24 గ్రాండ్‌స్లామ్ టైటిల్స్ సాధించిన జొకోవిచ్.. బ్రిస్బేన్ ఇంటర్నేషనల్ టోర్నీతో కొత్త సీజన్‌ను ప్రారంభించేందుకు సిద్ధమయ్యాడు. 2009 తర్వాత బ్రిస్బేన్ ఈవెంట్ ఆడేందుకు వచ్చిన అతడు మీడియాతో మాట్లాడాడు. ఈ సందర్భంగా.. ‘సినెర్ ఉద్దేశ పూర్వకంగా నిషిద్ధ ఉ్రత్పేరకాలు తీసుకున్నాడా లేదంటే ప్రమేయం లేకుండా తీసుకున్నాడా అనే విషయంపై నేను చర్చించడం లేదు.ఇదేం వివక్షో నాకైతే అర్థం కావడం లేదుఎందుకంటే గతంలో డోపీగా తేలితే సస్పెన్షన్‌కు గురైన ఎంతోమంది ప్లేయర్లు ఉన్నారు. కొందరు దిగువ ర్యాంకు ప్లేయర్లు తమ డోపింగ్ కేసు–నిషేధం పరిష్కారమవ్వాలని ఏడాదిగా చూస్తున్నారు. కానీ వీళ్ల (సినెర్, స్వియాటెక్) విషయాన్నేమో ప్రపంచానికి తెలీకుండా గోప్యత పాటించడం, తూతూ మంత్రపు నిషేధం చర్యలతో సరిపెట్టడం, మొత్తం టెన్నిస్ సమాజానికి కళ్లకు గంతలు కట్టడం వంటివి చేస్తున్న టెన్నిస్ ఇంటిగ్రిటీ వ్యవహారశైలీ నన్ను తీవ్రంగా నిరాశపరిచింది.ఇది ఆటకున్న ఇమేజ్ను డ్యామేజ్ చేసేలా ఉంది. ఒక సమాఖ్య అందరు ఆటగాళ్లను సమానంగా చూడదా? ఒక్కొక్కరికి ఒక్కో నిబంధనలు ఉంటాయా? ఇదేం వివక్షో నాకైతే అర్థం కావడం లేదు’ అని జొకోవిచ్ సమాఖ్య తీరుపై విమర్శలతో విరుచుకుపడ్డాడు. తానైతే ప్రస్తుతం కొత్తసీజన్పై తాజాగా దృష్టి సారించినట్లు చెప్పాడు.ఘనమైన రికార్డుఇదిలా ఉంటే.. ఈ ఏడాది ఆరంభంలో మోకాలికి శస్త్రచికిత్స చేయించుకున్న జొకోవిచ్ వింబుల్డన్‌లో ఫైనల్ చేరాడు. ఆస్ట్రేలియన్ ఓపెన్‌లో ఈ సెర్బియన్ సూపర్‌స్టార్‌కు చక్కని రికార్డు ఉంది. ఇక్కడ అతడు 10 టైటిల్స్ సాధించాడు. -
శ్రీలంక క్రికెటర్‌కు భారీ ఊరట.. మూడేళ్ల నిషేధం ఎత్తివేత!
శ్రీలంక క్రికెటర్ నిరోషన్ డిక్విల్లా( Niroshan Dickwella)కు భారీ ఊరట లభించినట్లు తెలుస్తోంది. ప్రపంచ డోపింగ్ నిరోధక సంస్థ(WADA) అతడికి క్లీన్చిట్ దక్కినట్లు సమాచారం. ఈ నేపథ్యంలో డిక్‌విల్లాపై ఉన్న మూడేళ్ల నిషేధాన్ని ఎత్తివేసినట్లు తెలుస్తోంది. శ్రీలంక ప్రీమియర్ లీగ్-2024 సందర్భంగా డిక్‌విల్లాపై డోపింగ్ ఆరోపణలు వచ్చాయి.ఈ వికెట్ కీపర్ బ్యాటర్ తన ఆట తీరును మెరుగుపరచుకునేందుకు నిషేధిత ఉత్ప్రేరకాలు వాడినట్లు శ్రీలంక యాంటీ డోపింగ్ ఏజెన్సీ(SLADA)కు సమాచారం వచ్చింది. ఈ నేపథ్యంలో నిరోషన్ డిక్విల్లాకు పరీక్షలు నిర్వహించగా పాజిటివ్‌గా తేలింది. దీంతో అతడు ఏ ఫార్మాట్లోనూ క్రికెట్ ఆడకుండా మూడేళ్లపాటు నిషేధం పడింది.ఈ నేపథ్యంలో నిరోషన్ డిక్విల్లా వాడాను ఆశ్రయించగా.. అతడికి ఊరట లభించినట్లు డైలీ మిర్రర్ లంక పేర్కొంది. డిక్విల్లా నిషేధిత ప్రేరకాలు వాడలేదని.. అతడు తీసుకున్న పదార్థాలతో బ్యాటింగ్ ప్రదర్శన మెరుగుపడే అవకాశం లేదని లీగల్ టీమ్ ఆధారాలు సమర్పించినట్లు తెలిపింది. ఫలితంగా నిరోషన్ డిక్‌విల్లాపై నిషేధం ఎత్తివేయాల్సిందిగా వాడా ఆదేశించినట్లు పేర్కొంది.కాగా 31 ఏళ్ల నిరోషన్ డిక్విల్లా 2014లో శ్రీలంక తరఫున అంతర్జాతీయ క్రికెట్లో అరంగేట్రం చేశాడు. ఈ వికెట్ కీపర్ ఇప్పటి వరకు 54 టెస్టులు, 55 వన్డేలు, 28 టీ20లు ఆడి.. ఆయా ఫార్మాట్లలో వరుసగా 2757, 1604, 480 పరుగులు సాధించాడు. అయితే, క్రమశిక్షణ ఉల్లంఘనకు పాల్పడ్డాడన్న కారణంగా నిషేధం ఎదుర్కోవడం అతడికి అలవాటే.కోవిడ్ సమయంలో 2021లో బయో బబుల్ నిబంధనలు అతిక్రమించినందుకు నిరోషన్ డిక్‌విల్లాపై ఏడాది పాటు సస్పెన్షన్ వేటు పడింది. అతడితో పాటు ధనుష్క గుణతిలక, కుశాల్ మెండిస్ కూడా ఇదే తప్పిదం కారణంగా నిషేధం ఎదుర్కొన్నారు. ఇక గతేడాది న్యూజిలాండ్‌తో టెస్టు సందర్భంగా నిరోషన్ డిక్విల్లా శ్రీలంక తరఫున బరిలోకి దిగాడు. ఆ తర్వాత ఫ్రాంఛైజీ క్రికెట్‌కే అతడు పరిమితమయ్యాడు. -
స్వియాటెక్‌పై ఉదారత ఎందుకు?
బుడాపెస్ట్ (రొమేనియా): వింబుల్డన్, ఫ్రెంచ్ ఓపెన్ మాజీ చాంపియన్ సిమోనా హాలెప్ అంతర్జాతీయ టెన్నిస్ ఇంటిగ్రిటీ ఏజెన్సీ పక్షపాత వైఖరిపై మండిపడింది. గతంలో తాను డోపింగ్‌లో పట్టుబడితే నాలుగేళ్ల నిషేధం విధించిన టెన్నిస్ వర్గాలు ఇప్పుడు స్వియాటెక్ డోపీగా తేలితే ఒకే ఒక్క నెల సస్పెన్షన్‌తో సరిపెట్టడంపై ఆమె తీవ్రస్థాయిలో ఆక్షేపించింది. క్రీడాకారుల పట్ల ఇలాంటి పక్షపాత వైఖరి ఎంతమాత్రం తగదని బాహాటంగా తన ఆక్రోశాన్ని వెళ్లగక్కింది. ‘నేను ఎంతసేపు స్థిమితంగా కూర్చొని ఆలోచించినా ఈ వ్యత్యాసమెంటో అంతుచిక్కడం లేదు’ అని ఇన్‌స్టాగ్రామ్‌లో తన అసంతృప్తిని పోస్ట్ చేసింది. ‘ఎంత ఆలోచించినా... ఆశ్చర్యమే తప్ప అసలెందుకీ వివక్షో తెలియడం లేదు. ఒకే రకమైన శిక్షకు ఒకే రకమైన తీర్పు ఉండదా? ఎంతగా ప్రయతి్నంచినా కూడా ఇదేం లాజిక్కో అర్థమవడం లేదు. కనీసం అంతర్జాతీయ టెన్నిస్ ఇంటిగ్రిటీ ఏజెన్సీ (ఐటీఐఏ) వద్దనయినా సరైన సమాధానం దొరుకుతుందేమో చూడాలి. నా విషయంలో కఠినంగా వ్యవహరించిన టెన్నిస్ ఏజెన్సీ... స్వియాటెక్ విషయంలో ఎందుకంత ఉదాíసీనంగా వ్యవహరించాలి. నేను నేరుగా నిషేధిత ఉ్రత్పేరకాలు తీసుకోలేదని ఎంత వాదించినా వినని ఐటీఐఏ స్వియాటెక్ చెబితే వినడమెంటో తెలియడం లేదు’ అని తనకు జరిగిన అన్యాయంపై తీవ్రస్థాయిలో విరుచుకుపడింది. 2018లో ఫ్రెంచ్ ఓపెన్, 2019లో వింబుల్డన్ నెగ్గిన హాలెప్... 2022 యూఎస్ ఓపెన్ సందర్భంగా నిర్వహించిన పరీక్షల్లో నిషిద్ధ ఉ్రత్పేరకం ‘రొక్సాడ్యుస్టట్’ తీసుకున్నట్లు తేలడంతో ఏకంగా నాలుగేళ్ల నిషేధం విధించారు. తర్వాత ఆమె న్యాయపోరాటం చేయడంతో కోర్ట్ ఆఫ్ అర్బిట్రేషన్ ఫర్ స్పోర్ట్స్ శిక్షను 9 నెలలకు తగ్గించింది. అయితే ఆమె ఏడాదిన్నర పాటు ఆటకు దూరమైంది. కానీ తాజాగా స్వియాటెక్‌కు కేవలం 30 రోజుల శిక్ష విధించడాన్ని తప్పుబట్టింది. ‘నేనెప్పుడు మంచినే కోరుకుంటా. టెన్నిస్‌లోనూ నీతి న్యాయం సమానంగా ఉండాలని ఆశిస్తా. కానీ ఇంతటి అసమానతలు చూసి తట్టుకోవడం నా వల్ల కావట్లేదు’ అని ఐటీఐఏ తీరును దుయ్యబట్టింది. ఇటీవల ఐటీఐఏ వ్యవహారం తరచూ విమర్శలపాలవుతోంది. పురుషుల టాప్ ర్యాంక్ ప్లేయర్ యానిక్ సినెర్ ఈ ఏడాది మార్చిలో రెండు సార్లు డోపింగ్‌లో దొరికిపోయినా టెన్నిస్ ఏజెన్సీ మెతక వైఖరి అవలంభించడంతో పలువురు టెన్నిస్ దిగ్గజాలు తీవ్రస్థాయిలో విమర్శలు గుప్పించారు. -
స్వియాటెక్ ‘డోపీ’
లండన్: అంతర్జాతీయ టెన్నిస్‌లో అగ్ర స్థాయిలో మరోసారి డోపింగ్ ఉదంతం కలకలం రేపింది. ఇటీవలే పురుషుల నంబర్‌వన్ యానిక్ సినెర్ (ఇటలీ) డోపింగ్‌లో పట్టుబడగా ఈసారి మహిళల స్టార్ ప్లేయర్ వంతు వచ్చిoది. ఐదు గ్రాండ్‌స్లామ్ టోర్నీల విజేత, ప్రపంచ రెండో ర్యాంకర్ ఇగా స్వియాటెక్ (పోలండ్) డోపింగ్‌లో పట్టుబడింది. అయితే అదృష్టవశాత్తూ ఆమె తక్కువ శిక్షకే పరిమితమైంది. స్వియాటెక్‌పై కేవలం నెల రోజుల నిషేధం విధిస్తున్నట్లు ఇంటర్నేషనల్ టెన్నిస్ ఇంటిగ్రిటీ ఏజెన్సీ (ఐటీఐఏ) ప్రకటించింది. ఈ ఉదంతంలో స్వియాటెక్‌పై ఇప్పటికే తాత్కాలిక నిషేధం విధించారు. ఆమె దీనిని సవాల్ చేయడానికి ముందు ఈ ఏడాది సెపె్టంబర్ 22 నుంచి అక్టోబర్ 4 మధ్య కాలంలో సస్పెన్షన్‌లోనే ఉంది. ఆ సమయంలో స్వియాటెక్ మూడు టోర్నీలో కొరియా ఓపెన్, చైనా ఓపెన్, వుహాన్ ఓపెన్లకు దూరమైంది. దాంతో మరో ఎనిమిది రోజులు మాత్రమే ఆమె శిక్ష మిగిలి ఉండగా... ఇది డిసెంబర్ 4తో ముగుస్తుంది. గత రెండు సీజన్లలో ఎక్కువ భాగం వరల్డ్ నంబర్‌వన్‌గా ఉన్న స్వియాటెక్ వరుస విజయాలతో తన ఆధిపత్యాన్ని ప్రదర్శించింది. టోర్నీలో లేని సమయంలో ఆగస్టులో ఆమె ఇచ్చిన శాంపిల్స్‌లో డోపీగా తేలింది. నిషేధిత ఉత్ప్రేరకం ‘ట్రైమెటాజిదైన్’ను ఆమె వాడినట్లు పరీక్షలో బయటపడింది. అయితే ఇది తాను ఉద్దేశపూర్వకంగా తీసుకోలేదని పేర్కొంది. జెట్ లాగ్, నిద్రలేమి వంటి సమస్యల కోసం వాడిన మందులో ఇది ఉందని, దీని వాడకం తమ దేశంలో చాలా సాధారణమని ఆమె వివరణ ఇచ్చిoది. విచారణ సమయంలో స్వియాటెక్ వివరణపై సంతృప్తి చెందిన ఐటీఐఏ ఆమె తప్పేమీ లేదంటూ స్వల్ప శిక్షతో సరిపెట్టింది. నెల రోజుల నిషేధంతో పాటు 1,58,944 డాలర్లు (రూ. 1 కోటి 34 లక్షలు) జరిమానాగా విధించింది. 23 ఏళ్ల స్వియాటెక్ ఇప్పటి వరకు కెరీర్లో మొత్తం 21 సింగిల్స్ టైటిల్స్ సాధించింది. ఇందులో ఐదు గ్రాండ్‌స్లామ్ టోర్నీలు (ఫ్రెంచ్ ఓపెన్–2024, 2023, 2022, 2020; యూఎస్ ఓపెన్–2022) కూడా ఉండటం విశేషం. -
స్టార్ రెజ్లర్ బజరంగ్ పునియాపై సస్పెన్షన్ వేటు..
భారత స్టార్ రెజ్లర్, టోక్యో ఒలింపిక్స్ కాంస్య పతక విజేత బజరంగ్ పునియాకు భారీ షాక్ తగిలింది. డోపింగ్ టెస్ట్ కోసం శాంపిల్స్ ఇవ్వడానికి నిరాకరించినందుకు పునియాను నాలుగేళ్లపాటు నేషనల్ యాంటీ డోపింగ్ ఏజెన్సీ (నాడా) సస్పెండ్ చేసింది. నాడా యాంటీ డోపింగ్ నిబంధనలలోని ఆర్టికల్ 10.3.1ని ఉల్లంఘించిన కారణంగా పూనియాపై వేటు పడింది.అసలేం జరిగిందంటే?ఈ ఏడాది మార్చి 10న జాతీయ జట్టుకు ఎంపిక కోసం జరిగిన సెలక్షన్ ట్రయల్స్‌లో బజరంగ్ పునియా తన యూరిన్ శాంపిల్స్ ఇవ్వడానికి నిరాకరించాడు. దీంతో ఇదే నేరానికి సంబంధించి నాడా ఈ ఏడాది ఏప్రిల్ 23న బజరంగ్ పునియాను తాత్కాలికంగా సస్పెండ్ చేసింది. ఆ తర్వాత ప్రపంచ రెజ్లింగ్ గవర్నింగ్ బాడీ (UWW) కూడా బజరంగ్‌పై నిషేధం విధించింది.ఈ క్రమంలో బజరంగ్ ఎందుకు శాంపిల్స్ ఇవ్వడానికి నిరాకరించాడో వివరణ కోరుతూ నోటీసు ఇవ్వమని ప్రపంచ డోపింగ్ నిరోధక ఏజెన్సీ.. నాడాకు ఆదేశాలు జారీ చేసింది. దీంతో నాడా ఏప్రిల్ 26లోపు తన వివరణ ఇవ్వాలని పూనియాకు నోటీసు జారీ చేసింది.అందుకు పూనియా స్పందించలేదు. అయితే నాడా మే 7లోపు వివరణ ఇవ్వాలని మళ్లీనోటీసు జారీ చేసింది. ఆ నోటీసులకు కూడా పూనియా సమాధానమివ్వలేదు. దీంతో ఈ ఏడాది మేలో నాడా అతడిపై తాత్కాలిక నిషేదం విధించింది.అయితే నాడా నోటిసులకు స్పందించని బజరంగ్ పూనియా.. నాడా యాంటీ డిసిప్లినరీ డోపింగ్ ప్యానెల్ (ADDP)కు మాత్రం తన వివరణ ఇచ్చాడు. పరీక్షల కోసం నాడా అధికారులు గడువు దాటిన కిట్లను వాడడంతోనే నమూనాలను ఇవ్వలేదని చెప్పుకొచ్చాడు. దీంతో మే 31న బజరంగ్‌పై జాతీయ డోపింగ్ నిరోధక సంస్థ (నాడా) విధించిన సస్పెన్షన్‌ను నాడా క్రమశిక్షణ సంఘం (ఏడీడీపీ) తాత్కాలికంగా ఎత్తివేసింది. కాగా ఈ ఏడాది జూన్ 23న మరోసారి నాడా బజరంగ్ పునియాకు నోటీసులు ఇచ్చింది. జూలై 11 లోపు వివరణ ఇవ్వాలని నోటీసులో నాడా పేర్కొంది. ఈసారి మాత్రం తనపై వచ్చిన ఆరోపణలకు బజ్రంగ్ జులై 11న వ్రాతపూర్వకంగా సమాధనమిచ్చాడు. ఆ తర్వాత సెప్టెంబరు 20, అక్టోబరు 4న భజరంగ్ వివాదంపై ఏడీడీపీ ప్యానల్ విచారణ చేపట్టింది. ఈ విచారణలో అతడు డోపింగ్ నిబంధలు ఉల్లంఘించినట్లు ఏడీడీపీ గుర్తించింది. ఈ క్రమంలోనే అతడిపై నాడా నాలుగేళ్ల పాటు నిషేదం విధించింది. -
వినేశ్‌కు ‘నాడా’ నోటీసులు
న్యూఢిల్లీ: భారత స్టార్ రెజ్లర్ వినేశ్ ఫొగాట్‌కు జాతీయ డోపింగ్ నిరోధక సంస్థ (నాడా) నోటీసులు జారీ చేసింది. ఎప్పుడు ఎక్కడ ఉన్నారనే అంశంపై 14 రోజుల్లోగా వివరణ ఇవ్వాలని కోరింది. ఈనెల 9న హరియాణాలోని ఖర్ఖోడ గ్రామంలో డోప్ టెస్టు నిర్వహించాలనుకుంటే ఆ సమయంలో వినేశ్ అందుబాటులో లేకపోవడంతో ‘నాడా’ ఈ నోటీసులు జారీ చేసింది. పారిస్ ఒలింపిక్స్‌లో ఫైనల్‌కు చేరిన వినేశ్ ఫొగాట్... వంద గ్రాములు అధిక బరువు కారణంగా అనర్హతకు గురైంది. ఆ తర్వాత కెరీర్‌కు వీడ్కోలు పలికి రాజకీయాల్లోకి అడుగుపెట్టిన వినేశ్... హరియాణాలోని జులానా నియోజకవర్గం నుంచి కాంగ్రెస్ అభ్యరి్థగా అసెంబ్లీ ఎన్నికల బరిలో నిలిచింది. ప్రస్తుతం ఎన్నికల ప్రచారంలో తలమునకలై ఉన్న వినేశ్ హరియాణాలో విసృతంగా పర్యటిస్తోంది. ఈ నేపథ్యంలో ‘ఎప్పుడు ఎక్కడ ఉన్నారనే వివరాలు అందించనందుకు గానూ వినేశ్‌కు నోటీసులు అందించాం. డోప్ నిరోధక అధికారి హాజరైన సమయంలో వినేశ్ అందుబాటులో లేదు. అందుకే ఈ నోటీసులు జారీ చేశాం’ అని ‘నాడా’ నోటీసులు పేర్కొంది. నిబంధనల ప్రకారం ఏడాది కాలంలో మూడుసార్లు వివరాలు అందించడంలో విఫలమైన అథ్లెట్లపై ‘నాడా’ క్రమశిక్షణ చర్యలు తీసుకుంటుంది. -
‘డోపీ’ కిరణ్ బలియాన్
న్యూఢిల్లీ: భారత మహిళా షాట్‌పుట్ క్రీడాకారిణి కిరణ్ బలియాన్ డోప్ టెస్టులో విఫలమైంది. అమె నిషేధిత ఉత్ప్రేరకాలు తీసుకున్నట్లు పరీక్షల్లో తేలడంతో జాతీయ డోపింగ్ నిరోధక సంస్థ (నాడా) ఆమెపై చర్యలు చేపట్టింది. కాగా ఈ డోపీల జాబితా నుంచి స్టార్ రెజ్లర్, టోక్యో ఒలింపిక్స్ కాంస్య పతక విజేత బజరంగ్ పూనియాను తప్పించారు. నిజానికి అతను డోపీగా ఏ టెస్టులోనూ నిరూపణే కాలేదు. కానీ మార్చిలో జరిగిన సెలక్షన్ ట్రయల్స్‌లో పాల్గొన్న బజరంగ్ మూత్ర నమూనాలు ఇవ్వలేదన్న కారణంతో ‘నాడా’ క్రమశిక్షణ చర్యల్లో భాగంగా ఏప్రిల్ 23న అతన్ని సస్పెండ్ చేసింది. తాజా నిర్ణయంతో బజరంగ్‌కు పెద్ద ఊరట లభించినట్లయ్యింది. 25 ఏళ్ల కిరణ్ గతేడాది చైనాలో జరిగిన ఆసియా క్రీడల్లో కాంస్య పతకం సాధించింది. తద్వారా షాట్‌పుట్‌లో పతకం గెలిచిన రెండో మహిళా అథ్లెట్‌గా ఆమె గుర్తింపు పొందింది.జాతీయ ఇంటర్ స్టేట్ చాంపియన్íÙప్ (2023)లో బంగారు పతకం గెలిచిన ఆమె ఈ ఏడాది ఫెడరేషన్ కప్‌లో రజతం చేజిక్కించుకుంది. ‘నాడా’ నిర్వహించిన డోపింగ్ (శాంపిల్–ఎ) పరీక్షలో ఆమె నిషేధిత స్టెరాయిడ్ తీసుకున్నట్లు తేలడంతో తాత్కాలిక నిషేధం విధించారు. ‘బి’ శాంపిల్ పరీక్షలోనూ విఫలమైతే ఆమెపై గరిష్టంగా నాలుగేళ్ల నిషేధం పడే అవకాశముంది. షట్లర్ కృష్ణ ప్రసాద్ కూడా... ఆంధ్రప్రదేశ్ షట్లర్, డబుల్స్ స్పెషలిస్ట్ గరగ కృష్ణ ప్రసాద్ కూడా డోపింగ్‌లో దొరికిపోయాడు. రెండేళ్ల క్రితం జరిగిన థామస్ కప్ (2022)లో స్వర్ణ పతకం గెలిచిన భారత పురుషుల జట్టులో సభ్యుడైన కృష్ణ ప్రసాద్ నిషేధిత ఉత్ప్రేరకాలు తీసుకున్నట్లు తేలింది. అతని నుంచి సేకరించిన రక్త, మూత్ర నమూనాల్లో హ్యూమన్ కొరియోనిక్ గొనడొట్రొపిన్ (హెచ్‌సీజీ) పాజిటివ్ రిపోర్టు వచి్చంది. దీంతో అతనిపై తాత్కాలిక వేటు పడింది. 2014 ఇంచియోన్ ఆసియా క్రీడల్లో కాంస్యం నెగ్గిన హ్యామర్ త్రోయర్ మంజుబాలా డోపీగా తేలడంతో ఆమెపై కూడా చర్యలు తీసుకున్నారు. వీరితో పాటు ఫెడరేషన్ కప్‌లో రజతం నెగ్గిన షాలిని చౌదరి (డిస్కస్ త్రో), చావి యాదవ్ (రన్నర్), డీపీ మనూ (జావెలిన్ త్రోయర్), దీపాన్షి (రన్నర్), పర్వేజ్ ఖాన్ (రన్నర్), ఆర్జు (రెజ్లింగ్), వుషు ప్లేయర్లు మేనకా దేవి, మన్జిందర్ సింగ్, గౌతమ్ శర్మలు కూడా డోపింగ్‌లో పట్టుబడ్డారు. -
పాక్ రెజ్లర్ అలీ అసద్‌పై నాలుగేళ్ల నిషేధం
కరాచీ: ప్రదర్శన మెరుగయ్యేందుకు నిషేధిత ఉ్రత్పేరకాలు ఉపయోగించిన పాకిస్తాన్ రెజ్లర్ అలీ అసద్‌పై ఇంటర్నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ (ఐటీఏ) నాలుగేళ్ల నిషేధం విధించింది. 2022 బర్మింగ్హమ్ కామన్వెల్త్ గేమ్స్‌లో అలీ అసద్ పురుషుల ఫ్రీస్టయిల్ 57 కేజీల విభాగంలో కాంస్య పతకం సాధించాడు. కాంస్య పతక బౌట్లో అలీ అసద్ 11–0తో సూరజ్ సింగ్ (న్యూజిలాండ్)పై గెలుపొందాడు.అయితే, 2022 కామన్వెల్త్ గేమ్స్ సందర్భంగా నిర్వహించిన డోపింగ్ పరీక్షల్లో అలీ అసద్ నిషేధిత ఉ్రత్పేరకాలు వాడినట్లు తేలింది. దాంతో 2022 నవంబర్‌లో అలీ అసద్‌పై తాత్కాలిక నిషేధం విధించారు. అలీ అసద్ నెగ్గిన కాంస్య పతకాన్ని వెనక్కి తీసుకొని నాలుగో స్థానంలో నిలిచిన న్యూజిలాండ్ రెజ్లర్ సూరజ్ సింగ్‌కు ఈ పతకాన్ని అందించారు. ఈ కేసును రెండేళ్లపాటు విచారించిన ఐటీఏ అలీ అసద్‌ను దోషిగా నిర్ధారిస్తూ ఈ వారంలో అతడిపై నాలుగేళ్ల నిషేధాన్ని విధించింది. విచారణ సమయంలో అలీ అసద్ గైర్హాజరు కావడంతో ఐటీఏ తుది నిర్ణయాన్ని ప్రకటించింది. -
సినెర్‌కు శిక్ష లేదా!
వాషింగ్టన్: వరల్డ్ నంబర్‌వన్ టెన్నిస్ ప్లేయర్ యానిక్ సినెర్ (ఇటలీ)ని పెద్ద వివాదం చుట్టుముట్టింది. అతను రెండుసార్లు స్టెరాయిడ్ పరీక్షల్లో విఫలమైనా ఎందుకు చర్య తీసుకోవడం లేదంటూ ఇతర ఆటగాళ్లు తమ ఆగ్రహాన్ని ప్రదర్శిస్తున్నారు. సినెర్‌ను పోటీల్లో ఇంకా ఎలా ఆడనిస్తున్నారని ప్రశ్నించిన వారు... అసోసియేషన్ ఆఫ్ టెన్నిస్ ప్రొఫెషనల్స్ (ఏటీపీ) ద్వంద్వ ప్రమాణాలను పాటిస్తోందని విమర్శించారు. ఈ ఏడాది మార్చిలో నిషేధిత అనబాలిక్ ఉ్రత్పేరకాన్ని తీసుకున్నందుకు రెండుసార్లు సినెర్ ‘పాజిటివ్’గా తేలాడు. అయితే మంగళవారం వరకు కూడా ఎవరికీ ఈ విషయం తెలియదు. ఎందుకు ఈ విషయాన్ని ఇంత కాలం రహస్యంగా ఉంచారని, ఈనెల 26 నుంచి జరిగే యూఎస్ ఓపెన్‌లో అతడిని ఎలా అనుమతిస్తున్నారని పలువురు వ్యాఖ్యానించారు. ‘వేర్వేరు ఆటగాళ్లకు వేర్వేరు నిబంధనలు’ అంటూ షపవలోవ్ (కెనడా) ట్వీట్ చేయగా... ఇలాంటి పనికి నిషేధం తప్ప మరో శిక్షే లేదని నిక్ కిరియోస్ (ఆ్రస్టేలియా) తీవ్రంగా స్పందించాడు. ఈ ఏడాది జనవరిలో ఆస్ట్రేలియన్ ఓపెన్‌లో విజేతగా నిలిచిన తన కెరీర్లో తొలి గ్రాండ్‌స్లామ్ టైటిల్ నెగ్గిన సినెర్ జూన్‌లో వరల్డ్ నంబరవన్ ర్యాంక్‌కు చేరుకున్నాడు. చేతికి గాయాలు తగిలినప్పుడు లేదా కోసుకుపోయినప్పుడు వాడే ఆయింట్మెంట్, స్ప్రేలలో ఉండే ‘క్లోస్టెబల్’ స్పోర్ట్స్ నిషేధిత జాబితాలో ఉంది. మార్చిలో ఇండియన్ వెల్స్ టోర్నీ సమయంలోనూ, టోర్నీ ముగిసిన వారం తర్వాత సినెర్ ఇచ్చిన శాంపిల్స్‌లో ఈ ఉత్రే్పరకం ఉన్నట్లు తేలింది. దాంతో ఈ టోర్నీలో సినెర్ సెమీస్ చేరడం ద్వారా వచ్చిన 3,25,00 డాలర్ల ప్రైజ్‌మనీని వెనక్కి తీసుకోవడంతోపాటు 400 పాయింట్లలో కూడా కోత విధించారు. దీనిపై అప్పీల్ చేసిన సినెర్ తాను ఉద్దేశపూర్వకంగా తీసుకోలేదని, దానిని వాడిన ఫిజియోథెరపిస్ట్ మసాజ్ చేసిన కారణంగా తన శరీరంలోకి ప్రవేశించిందని, ఇక ముందు అలా జరగకుండా డోపింగ్ నిబంధనలు పాటిస్తానని స్పష్టం చేశాడు. అతని వాదనను అంగీకరిస్తూ టెన్నిస్ ఇంటి గ్రిటీ ఏజెన్సీ (ఐటీఐఏ) సినెర్ తప్పేమీ లేదంటూ క్లీన్ చిట్ కూడా ఇచి్చంది. అయితే తాజాగా ‘దురదృష్టకర ఘటనను మరిచి ముందుకు సాగుతాను’ అని సినెర్ సోషల్ మీడియాలో పోస్ట్ చేయడంతో మళ్లీ చర్చ మొదలైంది. ఇలాంటి విషయాలను సాధ్యమైనని ఎక్కువ రోజులు రహస్యంగా ఉంచి, అంతా మరచిపోయేలా చేస్తూ అగ్రశ్రేణి ఆటగాళ్లను రక్షించడం కొత్త కాదని... అదే ఏ 400వ ర్యాంక్ ప్లేయర్ అయిఉంటే అది సాధ్యం కాదని మాజీ ప్లేయర్, టెన్నిస్ దిగ్గజం క్రిస్ ఎవర్ట్ కూడా అభిప్రాయపడింది. మున్ముందు ఈ విషయంలో ఎలాంటి పరిణామాలు జరుగుతాయనేది ఆసక్తికరం. -
LPL 2024: శ్రీలంక స్టార్ క్రికెటర్‌పై వేటు..
శ్రీలంక వికెట్ కీపర్ బ్యాటర్ నిరోషన్ డిక్వెల్లాపై సస్పెన్షన్ వేటు పడింది. లంక ప్రీమియర్ లీగ్-2024(ఎల్పీఎల్) సందర్భంగా నిర్వహించిన డోపింగ్ పరీక్షల్లో విఫలమైనందుకు శ్రీలంక క్రికెట్ బోర్డు (ఎస్ఎల్సీ) అతడిపై వేటు వేసింది.లీగ్‌లో గాలె మార్వెల్స్ జట్టుకు కెప్టెన్‌గా వ్యవహరిస్తున్న డిక్వెల్లాపై శుక్రవారం నుంచే నిషేధం అమల్లోకి వచ్చినట్లు ఎస్ఎల్సీ పేర్కొంది. డోపింగ్ పరీక్షల్లో అతడు కొకైన్ తీసుకున్నట్లు తెలినట్లు పలు రిపోర్ట్లు పేర్కొంటున్నాయి.కాగా డిక్‌వాలా వివాదాల్లో చిక్కుకోవడం ఇదేమి తొలిసారి కాదు. అంతకుముందు 2021లో ఇంగ్లండ్ పర్యటనలో బయో-బబుల్ ప్రోటోకాల్‌లను ఉల్లంఘించినందుకు డిక్‌వాలా ఏడాది నిషేధాన్ని ఎదుర్కొన్నాడు. ఇక డిక్వెల్లా జాతీయ జట్టు తరఫున 54 టెస్టులు, 55 వన్డేలు, 28 టీ20లు ఆడాడు. -
పారాలింపిక్స్‌కు ముందే భారత్‌కు ఎదురుదెబ్బ
భువనేశ్వర్: పారాలింపిక్స్ ప్రారంభం కాకముందే భారత్‌కు గట్టి దెబ్బ తగిలింది. కచ్చితంగా పతకంతో తిరిగి వస్తాడనుకున్న భారత పారా షట్లర్, టోక్యో పారాలింపిక్స్ స్వర్ణ పతక విజేత ప్రమోద్ భగత్‌పై నిషేధం పడింది. డోపింగ్ నియమావళిని ఉల్లంఘించినందుకు ప్రమోద్‌పై 18 నెలలపాటు సస్పెన్షన్ విధిస్తున్నట్లు ప్రపంచ బ్యాడ్మింటన్ సమాఖ్య (బీడబ్ల్యూఎఫ్) మంగళవారం వెల్లడించింది. దీంతో 2020 టోక్యో పారాలింపిక్స్‌లో పసిడి పతకం గెలిచిన ప్రమోద్.. ఈ నెల 28న ప్రారంభం కానున్న పారిస్ పారాలింపిక్స్‌కు దూరమయ్యాడు. పోటీలు లేని సమయంలో క్రీడాకారులు డోపింగ్ పరీక్షలకు అందుబాటులో ఉండేందుకు తాము ఎక్కడ ఉన్నామనే వివరాలు అందించాల్సి ఉంటుంది. మూడుసార్లు వివరాలు ఇవ్వని పక్షంలో ఆ క్రీడాకారుడిపై చర్యలు తీసుకుంటారు. ఈ విషయంలో ప్రమోద్ విఫలమయ్యాడు. ఏడాది వ్యవధిలో ఎక్కడెక్కడ ఉన్నారనే వివరాలు ప్రమోద్ అందించని కారణంగా అతడిపై బీడబ్ల్యూఎఫ్ సస్పెన్షన్ విధించింది. ‘టోక్యో పారాలింపిక్స్ చాంపియన్ ప్రమోద్ భగత్‌పై ఏడాదిన్నరపాటు సస్పెన్షన్ విధించాం. బీడబ్ల్యూఎఫ్ డోపింగ్ నిరోధక నిబంధనల ప్రకారం ఈ నిర్ణయం తీసుకున్నాం. గత 12 నెలల్లో ఎక్కడ ఉన్నాడనే వివరాలు ఇవ్వకపోవడంతోనే నిషేధం విధించాం’ అని బీడబ్ల్యూఎఫ్ ఒక ప్రకటనలో తెలిపింది. ‘ఇది చాలా కఠిన నిర్ణయం. ఎక్కడున్నానో చెప్పడంలో జరిగిన పొరపాటుకు భారీ మూల్యం చెల్లించుకోవాల్సి వచ్చింది. గత ఏడాదిలో రెండుసార్లు టెస్టుకు అందుబాటులో లేను. మూడోసారి పూర్తి వివరాలు సమర్పించా. అయినా నా అప్పీల్‌ను స్వీకరించలేదు. పారిస్ పారాలింపిక్స్ కోసం సిద్ధమవుతున్న సమయంలో ఇలాంటి అనూహ్య ఘటన ఎదురవడం చాలా బాధగా ఉంది. గుండె పగిలినట్లయింది. నా బృందం ఎంతో ప్రయత్నించినా ఫలితం లేకపోయింది. కోర్ట్ ఆఫ్ ఆర్బిట్రేషన్ ఆఫ్ స్పోర్ట్ (సీఏఎస్) నిర్ణయాన్ని గౌరవిస్తున్నా’ అని ప్రమోద్ వివరించాడు. నిషేధం విషయంలో గత నెలలో సీఏఎస్‌లో ప్రమోద్ అప్పీల్ చేసుకోగా.. సీఏఎస్ డోపింగ్ నిరోధక విభాగం దాన్ని తాజాగా తోసిపుచ్చింది. ఈ ఏడాది మార్చి 1 నుంచే ఈ నిషేధం అమల్లోకి రాగా.. వచ్చే ఏడాది సెపె్టంబర్ ఒకటి వరకు కొనసాగనుంది. ఒడిశాకు చెందిన ప్రమోద్ కేంద్రం నుంచి 2021లో దేశ అత్యున్నత క్రీడా పురస్కారం ‘ఖేల్‌రత్న’... 2022లో ‘పద్మశ్రీ’ అందుకున్నాడు. టోక్యో పారాలింపిక్స్ సింగిల్స్ ఎస్ఎల్ 3 విభాగంలో స్వర్ణం గెలిచిన ప్రమోద్... పారా ప్రపంచ చాంపియన్íÙప్లలో ఐదుసార్లు టైటిల్స్ గెలిచాడు. -
డోపింగ్‌లో పట్టుబడ్డ అఫ్గానిస్తాన్ జూడో ప్లేయర్
పారిస్ ఒలింపిక్స్‌లో మూడో డోపింగ్ కేసు నమోదైంది. అఫ్గానిస్తాన్‌కు చెందిన జూడో ఆటగాడు మొహమ్మద్ సమీమ్ ఫైజాద్ డోపింగ్ పరీక్షలో దొరికిపోయాడు. అతను నిషిద్ధ ఉత్ప్రేరకాలు తీసుకున్నట్లు పరీక్షల్లో తేలింది. దీంతో అతన్ని అఫ్గాన్ జట్టు నుంచి తప్పించారు. 81 కేజీల కేటగిరీలో తొలి బౌట్లో పాల్గొన్న సమయంలోనే 22 ఏళ్ల ఫైజాద్ నుంచి రక్త, మూత్ర నమూనాలను సేకరించారు. అనంతరం ప్రపంచ డోపింగ్ నిరోధక సంస్థ (వాడా) ఆధ్వర్యంలోని ల్యాబ్‌లో పరీక్షించగా పాజిటివ్ రిపోర్ట్ వచ్చిం ది. పారిస్ క్రీడల్లో పట్టుబడిన మూడో డోపీ సమీమ్ ఫైజాద్. ముగ్గురు మహిళలు, ముగ్గురు పురుషుల బృందంతో అఫ్గాన్ ఈ విశ్వక్రీడల్లో పాల్గొంటుంది. -
తొలి ‘డోపీ’ దొరికాడు!
ఒలింపిక్స్‌లో ప్రారంబోత్సవ వేడుకలకు ముందే డోపింగ్‌తో ఆటగాడు సస్పెండ్ అయ్యాడు. ఇరాక్‌కు చెందిన జూడో ఆటగాడు సజ్జాద్ సెహెన్ నిషేధిత ఉత్రే్పరకాలు మెటాన్డినోన్, బోల్డెనోన్ తీసుకున్నట్లుగా పరీక్షలో తేలింది. మంగళవారం జరిగే పోటీల్లో ఈ జూడో ప్లేయర్ 81 కేజీల విభాగంలో పోటీ పడాల్సి ఉండగా, ఇప్పుడు ‘పాజిటివ్’గా దొరికిపోయాడు. దాంతో అతడిని పోటీల నుంచి తప్పించడంతో పాటు ఒలింపిక్స్‌కు సంబంధించిన ఎలాంటి కార్యక్రమంలోనూ పాల్గొనకుండా నిషేధం విధిస్తున్నట్లు ఇంటర్నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ (ఐటీఏ) ప్రకటించింది. -
Paris Olympics: పర్వీన్ హుడాపై నిషేధం.. విశ్వ క్రీడలకు దూరం
Parveen Hooda suspended- భారత మహిళా బాక్సర్ పర్వీన్ హుడా పారిస్ ఒలింపిక్స్ బెర్త్‌ను కోల్పోయింది. ప్రపంచ డోపింగ్ నిరోధక సంస్థ (వాడా) సస్పెన్షన్ వల్లే ఆమె పారిస్ విశ్వక్రీడలకు దూరం కానుంది.‘వాడా’ రిజిస్టర్డ్ టెస్టింగ్ పూల్ (ఆర్టీపీ) నియమావళి ప్రకారం ఆమె ఎప్పుడు ఎక్కడ ఉన్నారనే సమాచారాన్ని ఇవ్వడంలో విఫలమైంది. గత 12 నెలలుగా మూడుసార్లు పరీ్వన్ ఈ సమాచారాన్ని ఇవ్వలేకపోవడంతో ‘వాడా’ ఆమెపై 22 నెలలు నిషేధం విధించింది. పర్వీన్ ఈ తప్పిదాన్ని ఉద్దేశపూర్వకంగా చేయలేదని ‘వాడా’ అధికారులకు భారత బాక్సింగ్ సమాఖ్య (బీఎఫ్ఐ) వివరణ ఇచ్చింది.దాంతో ‘వాడా’ ఈ నిషేధాన్ని 14 నెలలకు కుదించింది. శుక్రవారంతో మొదలైన ఈ నిషేధం వచ్చే ఏడాది జూలై వరకు కొనసాగుతుందని బీఎఫ్ఐ తెలిపింది. గత ఏడాది హాంగ్జౌలో జరిగిన జరిగిన ఆసియా క్రీడల్లో మహిళల 57 కేజీల కేటగిరీలో పర్వీన్ కాంస్య పతకం సాధించి పారిస్ ఒలింపిక్స్‌కు అర్హత సాధించింది. ఇక పర్వీన్‌పై నిషేధం నేపథ్యంలో ఇప్పుడు 57 కేజీల విభాగంలో బెర్త్ ఖాళీ అయింది. ఈ క్రమంలో.. పర్వీన్ స్థానంలో జాస్మిన్ లాంబోరియాను బీఎఫ్ఐ.. వరల్డ్ క్వాలిఫయర్-2 బరిలో దించాలనే యోచనలో ఉన్నట్లు సమాచారం.ఇదిలా ఉంటే.. పారిస్ ఒలింపిక్స్‌లో మహిళల, పురుషుల విభాగాలలో ఏడు చొప్పున ఒలింపిక్ వెయిట్ కేటగిరీలు ఉండగా... భారత్ నుంచి ఇప్పటికే ముగ్గురు మహిళా బాక్సర్లు (నిఖత్ జరీన్–50 కేజీలు; ప్రీతి–54 కేజీలు; లవ్లీనా బొర్గొహైన్–75 కేజీలు) పారిస్ ఒలింపిక్స్‌కు అర్హత పొందారు. పురుషుల విభాగంలో భారత్ నుంచి ఎవరూ అర్హత సాధించలేదు. పర్వీన్‌పై నిషేధం కారణంగా... ఈనెల 23 నుంచి జూన్ 3 వరకు బ్యాంకాక్‌లో జరిగే వరల్డ్ ఒలింపిక్ క్వాలిఫయింగ్ టోర్నీలో భారత్ మహిళల విభాగంలో మూడు వెయిట్ కేటగిరీల్లో (57, 60, 66 కేజీలు), పురుషుల విభాగంలో ఏడు వెయిట్ కేటగిరీల్లో పోటీపడుతుంది. -
డోపింగ్ టెస్ట్‌లో పట్టుబడ్డ ఇద్దరు అంతర్జాతీయ క్రికెటర్ల సస్పెన్షన్
డోపింగ్ నిరోధక నిబంధనలు ఉల్లంఘించారని రుజువు కావడంతో జింబాబ్వే క్రికెట్ బోర్డు (ZC) ఇద్దరు అంతర్జాతీయ క్రికెటర్లను సస్పెండ్ చేసింది. వెస్లీ మధేవెరె, బ్రాండన్ మవుటా బ్లడ్ శాంపిల్స్‌లో మాదకద్రవ్యాలు వినియోగించినట్లు తేలడంతో ఆ దేశ క్రికెట్ బోర్డు ఈ నిర్ణయం తీసుకుంది. మధేవెరె, మవుటాలపై నిషేధం తక్షణమే అమల్లోకి వస్తుందని ZC ప్రకటించింది. విచారణ పూర్తయ్యే వరకు వీరిద్దరూ ఎలాంటి క్రికెట్ కార్యకలాపాల్లో పాల్గొనరని పేర్కొంది. 26 ఏళ్ల మవుటా ఇటీవలే ఐర్లాండ్‌తో జరిగిన సిరీస్‌లో జింబాబ్వేకు ప్రాతినిథ్యం వహించగా.. మధేవెరె గత కొంతకాలంగా జట్టుకు దూరంగా ఉన్నాడు. లెగ్ బ్రేక్ బౌలర్ అయిన మవుటా జింబాబ్వే తరఫున 4 టెస్ట్‌లు, 12 వన్డేలు, 10 టీ20లు ఆడి ఓవరాల్‌గా 26 వికెట్లు పడగొట్టాడు. మవుటా టెస్ట్‌ల్లో ఓ హాఫ్ సెంచరీ కూడా చేశాడు. మధేవెరె విషయానికొస్తే.. 23 ఏళ్ల ఈ స్పిన్ బౌలింగ్ ఆల్‌రౌండర్ జింబాబ్వే తరఫున 2 టెస్ట్‌లు, 36 వన్డేలు, 60 టీ20లు ఆడి 26 వికెట్లు, 1100 పైగా పరుగులు సాధించాడు. అసలే వరుస పరాజయాలతో సతమతమవుతున్న జింబాబ్వేకు ఇది మరో పెద్ద ఎదురుదెబ్బగా పరిగణించాలి. ఇటీవలే ఆ జట్టు హెడ్ కోచ్ డేవ్ హటన్ బాధ్యతల నుంచి తప్పుకోగా.. తాత్కాలిక హెడ్ కోచ్‌గా వాల్టర్ చాగుటా నియమితుడయ్యాడు. -
హాలెప్‌పై నాలుగేళ్ల నిషేధం
లండన్: డోపింగ్ నిబంధనలను అతిక్రమించినందుకు... రొమేనియా టెన్నిస్ స్టార్, ప్రపంచ మాజీ నంబర్‌వన్ సిమోనా హాలెప్‌పై ఇంటర్నేషనల్ టెన్నిస్ ఇంటెగ్రిటీ ఏజెన్సీ (ఐటీఐఏ) నాలుగేళ్లపాటు నిషేధం విధించింది. 31 ఏళ్ల హాలెప్ 2022 యూఎస్ ఓపెన్ సందర్భంగా డోపింగ్ పరీక్షలో విఫలమైంది. దాంతో ఆమెపై 2022 అక్టోబర్‌లో తాత్కాలిక నిషేధం విధించారు. ఐటీఐఏ ప్యానెల్ విచారణలో హాలెప్ ఉద్దేశపూర్వకంగానే డోపింగ్ నియమావళిని ఉల్లంఘించిందని తేలింది. దాంతో ఆమెపై నిషేధాన్ని అక్టోబర్ 2026 వరకు పొడిగించారు. 2017లో ప్రపంచ నంబర్‌వన్‌గా అవతరించిన హాలెప్ రెండు గ్రాండ్‌స్లామ్ (2018లో ఫ్రెంచ్ ఓపెన్, 2019లో వింబుల్డన్) సింగిల్స్ టైటిల్స్ సాధించింది. మరోవైపు ఐటీఐఏ విధించిన నిషేధాన్ని కోర్ట్ ఆఫ్ ఆర్బిట్రేషన్ ఫర్ స్పోర్ట్‌లో సవాలు చేస్తానని హాలెప్ తెలిపింది. -
డోపింగ్‌లో పట్టుబడ్డ దీపా కర్మాకర్‌పై వేటు
న్యూఢిల్లీ: రియో ఒలింపిక్స్‌లో భారత మెరికగా అందరి దృష్టిని విశేషంగా ఆకర్షించిన స్టార్ జిమ్నాస్ట్ దీపా కర్మాకర్ డోపింగ్‌లో పట్టుబడింది. నిషిద్ధ ఉత్ప్రేరకాలు తీసుకున్నట్లు పరీక్షల్లో తేలడంతో ఆమెపై అంతర్జాతీయ టెస్టింగ్ ఏజెన్సీ (ఐటీఏ) 21 నెలల నిషేధం విధించింది. 2016లో ‘రియో’ విశ్వవేదికపై ప్రమాదకరమైన ‘ప్రొడునొవా’ విన్యాసంతో దీప ఆకట్టుకుంది. ప్రదర్శన ముగిసి ల్యాండింగ్ సమస్యతో త్రుటిలో ఆమె కాంస్య పతకాన్ని కోల్పోయి చివరకు నాలుగో స్థానంతో తృప్తి పడింది. అయితే భారత విశ్లేషకులు, క్రీడాభిమానులంతా ఆమె ప్రదర్శనను ఆకాశానికెత్తారు. తదనంతరం గాయాల బెడదతో మరే మెగా ఈవెంట్లోనూ ఆమె పాల్గొనలేకపోయింది. నిజానికి 2021 అక్టోబర్‌లోనే ఆమె డోపింగ్‌లో పట్టుబడింది. కానీ ఈ విషయాన్ని ఇప్పుడు బహిర్గతం చేశారు. అప్పటి నుంచి శిక్షాకాలం అమలు కావడంతో ఈ ఏడాది జూలై 10వ తేదీతోనే నిషేధం ముగుస్తుంది. -
డోపింగ్‌లో పట్టుబడిన ద్యుతీచంద్.. తాత్కాలిక నిషేధం
భారత టాప్ అథ్లెట్ క్రీడాకారిణి ద్యుతీచంద్ డోపింగ్ టెస్టులో పట్టుబడింది. ద్యుతీకి నిర్వహించిన శాంపిల్- ఏ టెస్టు రిజల్ట్ పాజిటివ్‌గా వచ్చింది. నిషేధిత సార్స్(SARS) ఉత్ప్రేరకం వాడినట్లు తేలడంతో వరల్డ్ యాంటీ డోపింగ్ ఎజెన్సీ(WADA) ఆమెను తాత్కాలికంగా బ్యాన్ చేస్తున్నట్లు బుధవారం ఒక ప్రకటనలో తెలిపింది. ''ద్యుతీ శరీరంలో సార్స్ ఎస్-4 Andarine, ఓ డెఫినిలాండ్రైన్, సార్మ్స్ (ఎన్బోర్సమ్), మెటాబోలైట్ లాంటి నిషేధిత పదార్థాలు కనిపించాయి. ఇవి ఆమె శరీరానికి తగినంత శక్తి సామర్థ్యాలు ఇస్తూ పురుష హార్మోన్ లక్షణాలను ఉత్పత్తి చేయడంలో తోడ్పడుతాయి. ఇది నిషేధిత ఉత్ప్రేరకం. ప్రస్తుతం ద్యుతీ అబ్జర్వేజన్‌లో ఉందని.. శాంపిల్-బి టెస్టు పరిశీలించాకా ఒక నిర్ణయం తీసుకుంటాం'' అని వాడా తెలిపింది. ఇక గతేడాది సెప్టెంబర్-అక్టోబర్‌లో జరిగిన జాతీయ అథ్లెటిక్స్ చాంపియన్‌షిప్‌లో పాల్గొన్న ద్యుతీచంద్ 200 మీటర్ల ఫైనల్‌కు అర్హత సాధించడంలో విఫలమైంది. ఇక 100 మీటర్ల ఫైనల్స్‌లో ఆరో స్థానంలో సరిపెట్టుకుంది. అంతకముందు 2018లో జరిగిన ఏషియన్ గేమ్స్‌లో 100, 200 మీటర్ల విభాగాల్లో రజత పతకాలు సొంతం చేసుకుంది. ఇక 2013, 2017, 2019 ఏషియన్ చాంపియన్‌షిప్స్‌లో కాంస్య పతకాలు సాధించింది. ఇక 2019లో యునివర్సైడ్ చాంపియన్‌షిప్‌లో 100 మీటర్ల విభాగంలో స్వర్ణం సాధించిన తొలి మహిళా స్ప్రింటర్‌గా రికార్డులకెక్కింది. Dutee Chand has been temporarily suspended following a positive analytical finding by WADA. The sample B test and hearing have not yet been released. pic.twitter.com/de0Blbsdnm — Doordarshan Sports (@ddsportschannel) January 18, 2023 చదవండి: Australian Open: బిగ్‌షాక్.. రఫేల్ నాదల్ ఓటమి -
డోపింగ్ టెస్ట్‌లో పట్టుబడ్డ భారత స్టార్ వెయిట్ లిఫ్టర్
భారత క్రీడారంగంలో మరోసారి డోపింగ్ కలకలం రేగింది. స్టార్ మహిళా వెయిట్ లిఫ్టర్, రెండుసార్లు కామన్వెల్త్ గేమ్స్ స్వర్ణ పతక విజేత కుముక్చమ్ సంజిత చాను (మణిపూర్) డోపింగ్ టెస్ట్‌లో విఫలమైంది. ఆమె నుంచి సేకరించిన శాంపుల్స్‌లో నిషేధిత ఉత్ప్రేరకం డ్రొస్టనొలోన్ను గుర్తించినట్లు డోపింగ్ నిరోధక అధికారులు (డీసీఓ) వెల్లడించారు. దీంతో సంజితపై జాతీయ డోపింగ్ నిరోధక సంస్థ (నాడా) ప్రాథమిక నిషేధం విధించింది. శాంపిల్ సేకరించిన నాటి నుంచే సంజితపై నిషేధం అమల్లో ఉంటుందని నాడా పేర్కొంది. కాగా, గతేడాది జరిగిన జాతీయ క్రీడల సందర్భంగా సంజిత నుంచి శాంపుల్స్ సేకరించారు. ఆ పోటీల్లో 49 కేజీల విభాగంలో పోటీపడ్డ సంజిత రజత పతకం కైవసం చేసుకుంది. ఈ పోటీలో టోక్యో ఒలింపిక్స్ రజత పతక విజేత మీరాబాయి చాను స్వర్ణం నెగ్గింది. -
డోపింగ్ టెస్టులో ఫెయిల్.. స్టార్ అథ్లెట్‌పై రెండేళ్ల నిషేధం!
భారత జిమ్నాస్టిక్స్ అథ్లెట్ దీపా కర్మాకర్ డోపింగ్ టెస్టులో ఫెయిల్ అయ్యింది. యాంటీ డోపింగ్ టెస్టులో ఫెయిల్ కావడంతో రెండేళ్ల నిషేధానికి గురయ్యే అవకాశాలున్నట్లు వార్తలు వస్తున్నాయి. ఇంటర్నేషనల్ జిమ్నాస్టిక్స్ ఫెడరేషన్ (ఎఫ్ఐజీ), జిమ్నాస్టిక్స్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా (జీఎఫ్ఐ), నేషనల్ యాంటీ డోపింగ్ ఏజెన్సీ (WADA) నిర్దేశించిన మార్గదర్శకాలను దీపా కర్మాకర్ అనుసరించడంలో ఫెయిల్ అయ్యిందని సమాచారం. అయితే శాయ్(SAI) కానీ.. భారత జిమ్నాస్టిక్స్ ఫెడరేషన్ కానీ దీపా కర్మాకర్ నిషేధం గురించి అధికారిక ప్రకటన చేయలేదు. జాతీయ, అంతర్జాతీయ క్రీడా పోటీల్లో పాల్గొనే అథ్లెట్లు రిజిస్టర్డ్ టెస్టింగ్ పూల్ (ఆర్టీపీ) కింద రిజిస్టర్ చేసుకోవాలి. ఇలా రిజిస్టర్ అయిన ప్రతీ అథ్లెట్, ప్రతీ ఏడాది యాంటీ డోపింగ్ టెస్టు కోసం నమూనాలు సమర్పించాల్సి ఉంటుంది. సాంపిల్స్ సమర్పించకపోతే వారిపై ఏడాది నుంచి రెండేళ్ల వరకూ నిషేధం పడుతుంది. ఇక 2016 రియో ఒలింపిక్స్‌లో నాలుగో స్థానంలో నిలిచిన దీపా కర్మాకర్ తృటిలో పతకం మిస్ చేసుకున్న సంగతి తెలిసిందే. 2014 కామన్వెల్త్ గేమ్స్‌లో రజతం, 2015 ఏషియన్ ఛాంపియన్‌షిప్స్‌లో దీపా కర్మాకర్ రజతం సాధించింది. 2018 అర్టిస్టిక్ జిమ్నాస్టిక్స్ వరల్డ్ కప్‌లో మెర్సిన్‌లో స్వర్ణం గెలిచిన ఆమె కొట్బస్లో రజతం సాధించింది. 2015లో అర్జున అవార్డుని పొందిన దీపా కర్మాకర్.. 2016లో ప్రతిష్టాత్మక మేజర్ ధ్యాన్‌చంద్ ఖేల్ రత్న అవార్డు సొంతం చేసుకుంది. -
టెన్నిస్ స్టార్ సిమోనా హలెప్‌పై నిషేధం
రొమేనియా టెన్నిస్ స్టార్.. మాజీ వరల్డ్ నంబర్‌వన్ సిమోనా హలెప్ డోపింగ్ టెస్టులో పట్టుబడింది. దీంతో అంతర్జాతీయ టెన్నిస్ ఇంటెగ్రిటీ ఏజెన్సీ(ఐటీఐఏ) శుక్రవారం హలెప్‌పై తాత్కాలిక నిషేధం విధించింది. విషయంలోకి వెళితే.. ఆగస్టులో యూఎస్ ఓపెన్‌లో పాల్గొన్న హలెప్ డోపింగ్ టెస్టులో భాగంగా శాంపిల్ ఇచ్చింది. ఈ నేపథ్యంలోనే హలెప్ రోక్సాడుస్టాట్(FG-4592)అనే నిషేధిత డ్రగ్ తీసుకున్నట్లు తేలింది. కాగా 2022లో వరల్డ్ యాంటీ డోపింగ్ ఏజెన్సీ(వాడా) రోక్సాడుస్టాట్ డ్రగ్‌ను నిషేధిత జాబితాలో చేర్చింది. ఈ క్రమంలోనే టెన్నిస్ యాంటీ డోపింగ్ ప్రోగ్రామ్ (TADP) ఆర్టికల్ 7.12.1 ప్రకారం 31 ఏళ్ల హలెప్‌ను తాత్కాలికంగా సస్పెండ్ చేసినట్లు ఐటీఐఏ ధృవీకరించింది. కాగా తనను సస్పెండ్ చేయడంపై స్పందించిన సిమోనా హలెప్ ఇన్స్టాగ్రామ్ వేదికగా ఎమోషనల్ అయింది.''ఇన్నేళ్ల నా కెరీర్లో మోసం చేయాలనే ఆలోచన ఒక్కసారి కూడా మనస్సులోకి రాలేదు. ఎందుకంటే మోసం అనేది నా విలువలకు పూర్తిగా విరుద్ధం. కానీ తెలియకుండా చేసిన ఒక పని నన్ను బాధిస్తుంది. కానీ నేను తెలియక చేసింది తప్పు కాదని నిరూపించుకోవడానికి చివరి వరకు ప్రయత్నిస్తా. గత 25 ఏళ్లలో టెన్నిస్‌పై పెంచుకున్న ప్రేమను, సాధించిన టైటిల్స్‌ను, గౌరవాన్ని కాపాడుకునేందుకు కృషి చేస్తా'' అంటూ ముగించింది. ఇక సిమోనా హలెప్ 2006లో ప్రొఫెషనల్ టెన్నిస్ క్రీడాకారిణిగా మారింది. ఆమె ఖాతాలో రెండు టెన్నిస్ గ్రాండ్ స్లామ్ టైటిల్స్‌తో పాటు 24 డబ్ల్యూటీఏ టూర్ టైటిల్స్ గెలుచుకుంది. 2017 నుంచి 2019 మధ్య హలెప్ రెండుసార్లు మహిళల టెన్నిస్ నెంబర్ వన్ క్రీడాకారిణిగా కొనసాగింది. రొమేనియా తరపున ఈ ఘనత సాధించిన తొలి మహిళా టెన్నిస్ ప్లేయర్‌గా రికార్డులకెక్కింది. ఆమె కెరీర్లో 2018లో ఫ్రెంచ్ ఓపెన్, 2019లో వింబుల్డన్ గ్రాండ్‌స్లామ్ టైటిల్స్ సాధించింది. pic.twitter.com/bhS2B2ovzS — Simona Halep (@Simona_Halep) October 21, 2022 చదవండి: సూపర్-12 మ్యాచ్‌లు.. టీమిండియా పూర్తి షెడ్యూల్, వివరాలు -
డిస్కస్ త్రోయర్ కమల్‌ప్రీత్‌పై మూడేళ్ల నిషేధం
న్యూఢిల్లీ: భారత మహిళా డిస్కస్ త్రోయర్ కమల్‌ప్రీత్ కౌర్‌పై ప్రపంచ అథ్లెటిక్స్ (డబ్ల్యూఏ) మూడేళ్ల నిషేధం విధించింది. ఆమె నిషిద్ధ ఉత్ప్రేరకాలు తీసుకున్నట్లు తేలడంతో ఇదివరకే తాత్కాలిక సస్పెన్షన్ వేటు పడింది. తాజాగా డబ్ల్యూఏకి చెందిన అథ్లెటిక్స్ ఇంటిగ్రిటీ యూనిట్ (ఏఐయూ) తుది విచారణ అనంతరం శిక్ష ఖరారు చేసింది. ఆమెకు నాలుగేళ్ల నిషేధం విధించాల్సి ఉండగా, నిషేధిత ఉత్ప్రేరకాలు తీసుకున్నట్లు విచారణలో అంగీకరించడంతో ఏడాది మినహాయించారు. మార్చిలో ఏఐయూ కమల్‌ప్రీత్ రక్తమూత్ర నమూనాలు సేకరించి పరీక్షించగా ‘పాజిటివ్’ అని తేలడంతో అదే నెల 29న సస్పెన్షన్ వేటు వేశారు. దీంతో ఆమె భారత ప్రభుత్వ పురస్కారాలు, ప్రోత్సాహకాలకు దూరం కానుంది. గతేడాది టోక్యోలో జరిగిన ఒలింపిక్స్‌లో ఆమె ఆరో స్థానంలో నిలిచింది. -
వెస్టిండీస్ క్రికెటర్‌పై నాలుగేళ్ల నిషేధం..
వెస్టిండీస్ బ్యాటర్ జాన్ కాంప్బెల్పై జమైకా యాంటీ డోపింగ్ కమిషన్ నాలుగేళ్ల నిషేధం విధించింది. డోపింగ్ నిబంధనలను అతిక్రమించినందుకు ఈ నిర్ణయం తీసుకున్నట్లు జమైకా యాంటీ డోపింగ్ కమిషన్ తెలిపింది. అదే విధంగా డోపింగ్ పరీక్షల కోసం కాంప్‌బెల్ తన రక్త నమూనాలను కూడా ఇవ్వడానికి నిరాకరించాడని కమీషన్ ఆరోపించింది. "కాంప్‌బెల్ డోపింగ్ నిరోధక నియమాన్ని ఉల్లంఘించాడు. జమైకా యాంటీ డోపింగ్ కమిషన్ నియమం 2.3ను అతడు అతిక్రమించాడు. అయితే తమకు లభించిన ఆధారాలు ప్రకారం కాంప్‌బెల్ ఉద్దేశపూర్వకంగా డోపింగ్ నిబంధనలను ఉల్లంఘించలేదు. అయినప్పటికీ జాడ్కో నియమం10.3.1 ప్రకారం అతడిపై 4 ఏళ్ల నిషేదం విధించబడుతుంది" అని జమైకా యాంటీ డోపింగ్ కమిషన్ ఓ ప్రకటనలో పేర్కొంది. కాగా కాంప్‌బెల్ ఇప్పటి వరకు విండీస్ తరపున 20 టెస్టులు, 6 వన్డేలు, 2 టీ20లు ఆడాడు. చదవండి: Happy Birthday Zaheer Khan: 'దేశంలో చాలా మంది ఇంజనీర్లున్నారు.. నువ్వు ఫాస్ట్ బౌలర్ అవ్వు' -
జావెలిన్ త్రోయర్ శివ్పాల్పై నాలుగేళ్ల నిషేధం
న్యూఢిల్లీ: గత ఏడాది అక్టోబర్‌లో డోపింగ్ పరీక్షలో దొరికిపోయిన భారత అగ్రశ్రేణి జావె లిన్ త్రోయర్ శివ్‌పాల్ సింగ్‌పై జాతీయ డోపింగ్ నిరోధక సంస్థ (నాడా) నాలుగేళ్ల నిషేధం విధించింది. ఉత్తరప్రదేశ్‌కు చెందిన 27 ఏళ్ల శివ్‌పాల్ టోక్యో ఒలింపిక్స్‌లో పాల్గొని 27వ స్థానంలో నిలిచాడు. 2019 ఆసియా చాంపియన్íÙప్లో అతను రజతం సాధించాడు. -
డోపింగ్‌లో దొరికిన భారత డిస్కస్ త్రోయర్ నవ్‌జీత్ కౌర్
ఇటీవల బర్మింగ్‌హామ్ కామన్వెల్త్ గేమ్స్‌లో పోటీపడ్డ భారత మహిళా డిస్కస్ త్రోయర్ నవ్‌జీత్ కౌర్ ధిల్లాన్ డోపింగ్ పరీక్షలో విఫలమైంది. గత నెలలో ప్రపంచ చాంపియన్‌షిప్ కంటే ముందు ఆమె నుంచి సేకరించిన శాంపిల్స్‌లో నిషేధిత ఉత్ప్రేరకాల ఆనవాళ్లు ఉన్నాయని అథ్లెటిక్స్ ఇంటెగ్రిటీ యూనిట్ (ఏఐయూ) శనివారం ప్రకటించింది. పంజాబ్‌కు చెందిన 27 ఏళ్ల నవ్‌జీత్ 2018 గోల్డ్‌కోస్ట్ కామన్వెల్త్ గేమ్స్‌లో కాంస్య పతకం నెగ్గింది. బర్మింగ్‌హామ్ గేమ్స్‌లో మాత్రం ఆమె ఎనిమిదో స్థానంలో నిలిచింది. గత జూన్‌లో చెన్నైలో జరిగిన ఇంటర్ స్టేట్ చాంపియన్‌షిప్‌లో, కజకిస్తాన్‌లో జరిగిన కొసనోవ్ స్మారక మీట్లో నవ్‌జీత్ స్వర్ణ పతకాలు సాధించింది. నవ్‌జీత్‌పై నాలుగేళ్ల నిషేధం విధించే అవకాశముంది. -
భారత్‌కు వరుస షాక్‌లు.. డోప్ టెస్ట్‌లో పట్టుబడ్డ మరో అథ్లెట్
Commonwealth Games 2022: బర్మింగ్‌హామ్ వేదికగా ఈనెల 28 నుంచి ప్రారంభంకానున్న కామన్వెల్త్ క్రీడా సంగ్రామానికి ముందు భారత్‌కు వరుస షాక్‌లు తగులుతున్నాయి. ఇప్పటికే నలుగురు అథ్లెట్లు డోప్ టెస్ట్‌లో విఫలమై మెగా ఈవెంట్ నుంచి నిష్క్రమించగా.. తాజాగా మరో అథ్లెట్‌కు నేషనల్ యాంటీ డోపింగ్ ఏజెన్సీ (నాడా) నిర్వహించిన డోప్ టెస్ట్‌లో పాజిటివ్ రిపోర్ట్ వచ్చినట్టు తెలుస్తోంది. మహిళల 4x100 మీటర్ల బృందంలోని మరో సభ్యురాలు (ఇదివరకే ఈ విభాగంలో ఓ సభ్యురాలు డోప్ టెస్టులో విఫలమైంది) డోప్ టెస్ట్‌లో పట్టుబడినట్లు అథ్లెటిక్స్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా ప్రతినిధి ధృవీకరించారు. అయితే ఆ అథ్లెట్ పేరు వెల్లడించడానికి ఆయన నిరాకరించారు. కాగా, గతవారం ఇద్దరు పారా అథ్లెట్లు (అనీష్ కుమార్, సురేంద్రన్ పిళ్లై) సహా మరో ఇద్దరు భారత అథ్లెట్లు (స్ప్రింటర్ ధనలక్ష్మీ, ట్రిపుల్ జంపర్ ఐశ్యర్య బాబు) డోప్ టెస్ట్‌లో విఫలమైన విషయం తెలిసిందే. తాజా ఘటనతో భారత బృందంలో డోపీల సంఖ్య 5కు చేరింది. చదవండి: డోపింగ్‌లో దొరికిన ‘కామన్వెల్త్’ అథ్లెట్లు -
డోపింగ్‌లో దొరికిన ‘కామన్వెల్త్’ అథ్లెట్లు
న్యూఢిల్లీ: కామన్వెల్త్ క్రీడలకు వారం రోజుల ముందు బర్మింగ్‌హామ్‌కు అర్హత సంపాదించిన స్ప్రింటర్ ఎస్. ధనలక్ష్మి, ట్రిపుల్ జంపర్ ఐశ్వర్య బాబు డోపింగ్ పరీక్షల్లో పాజిటివ్‌గా తేలారు. ఇద్దరు నిషిద్ధ ఉత్ప్రేరకాలు తీసుకున్నట్లు తేలడంతో సస్పెన్షన్ వేటు వేశారు. 37 మంది సభ్యుల అథ్లెట్ల బృందం నుంచి తప్పించారు. 100 మీ. పరుగు, 4x100 మీ. రిలే పరుగుకు అర్హత సంపాదించిన ధనలక్ష్మి నుంచి అథ్లెటిక్స్ ఇంటిగ్రిటీ యూనిట్ (ఏఐయూ) మేలో, జాతీయ డోపింగ్ నిరోధక సంస్థ (నాడా) జూన్‌లో నమూనాలు సేకరించింది. ఈ రెండు పరీక్షల్లోనూ ఆమె విఫలమైంది. రిలే బృందం నుంచి ఆమెను తప్పించి ఎం.వి.జిల్నాను ఎంపిక చేశారు. గత నెలలో జాతీయ ఇంటర్ స్టేట్ చాంపియన్‌షిప్‌లో పాల్గొన్న ఐశ్వర్య 14.14 మీటర్ల జంప్‌తో జాతీయ రికార్డుతో స్వర్ణం గెలిచింది. ఆ సమయంలోనే ఆమె నమూనాలను సేకరించిన ‘నాడా’ పరీక్షించగా నిషేధిత ఉత్ప్రేరకాలు తీసుకున్నట్లు తేలింది. -
కామన్ వెల్త్ గేమ్స్‌కు ముందు భారత్‌కు భారీ షాక్..!
బర్మింగ్‌హామ్ వేదికగా జరగనున్న కామన్ వెల్త్ గేమ్స్-2022కు ముందు భారత్‌కు భారీ షాక్ తగిలింది. భారత స్టార్ స్ప్రింటర్ ధనలక్ష్మి, ట్రిపుల్ జంపర్ ఐశ్వర్యబాబు డోప్ టెస్టులో పట్టుబడ్డారు. దీంతో వీరిద్దరు కామన్ వెల్త్ గేమ్స్ నుంచి తప్పుకున్నారు. అథ్లెటిక్స్ ఇంటిగ్రిటీ యూనిట్ బుధవారం నిర్వహించిన డోప్ టెస్టులో ధనలక్ష్మి నిషేధిత స్టెరాయిడ్ తీసుకున్నట్లు తేలింది. ధనలక్ష్మి కామన్ వెల్త్ గేమ్స్‌కు 100 మీటర్లు, 4x100 మీటర్ల రిలే జట్టులో ద్యుతీ చంద్, హిమా దాస్ ,శ్రబాని నందా వంటి వారితో పాటుగా ఎంపికైంది. కాగా ధనలక్ష్మి గతేడాది 100 మీటర్ల రేసులో స్టార్ స్ప్రింటర్ ద్యుతీ చంద్‌ను ఓడించి సంచలనం సృష్టించింది. దీంతో పాటు గత నెలలో ధనలక్ష్మి 200 మీటర్ల పరుగుల రేసులో పరుగుల చిరుత హిమదాస్‌పై విజయం సాధించింది. ఇక ఐశ్వర్యబాబు విషయానికి వస్తే.. గత నెలలో చెన్నైలో జరిగిన జాతీయ అంతర్ రాష్ట్ర అథ్లెటిక్స్ ఛాంపియన్షిప్ సందర్భంగా నాడా అధికారులు ఐశ్వర్య శాంపిల్‌ను తీసుకున్నారు. తాజాగా ఆమె కూడా నిషేధిత డ్రగ్ తీసుకున్నట్లు తేలింది. ఆమె కామన్ వెల్త్ గేమ్స్-2022కు ట్రిపుల్ జంప్, లాంగ్ జంప్ ఈవెంట్లకు ఆమె ఎంపికైంది. చదవండి: Commonwealth Games 2022: కామన్ వెల్త్ గేమ్స్.. భారత అథ్లెట్లలో స్ఫూర్తి నింపిన ప్రధాని -
డోపింగ్‌కు పాల్పడ్డ బంగ్లాదేశ్ పేసర్‌పై వేటు
బంగ్లాదేశ్ యువ పేసర్ షోహిదుల్ ఇస్లాంపై ఐసీసీ (అంతర్జాతీయ క్రికెట్ కౌన్సిల్) అనర్హత వేటు వేసింది. నిషేధిత ఉత్ప్రేరకాలు వాడినట్లు రుజువు కావడంతో ఐసీసీ అతనిపై 10 నెలల నిషేధం విధించింది. ఈ ఏడాది మే 28 నుంచి పది నెలల పాటు నిషేధం అమల్లో ఉంటుందని ప్రకటించింది. అనర్హత వేటు అన్ని ఫార్మాట్లకు వర్తిస్తుందని వివరించింది. బంగ్లాదేశ్ తరఫున ఓ టీ20 ఆడిన 27 ఏళ్ల షోహిదుల్.. 2023 మార్చి 28 తర్వాతే మైదానంలోకి అడుగపెట్టాలని ఆదేశించింది. డోపింగ్ నిరోధక కోడ్ ఆర్టికల్ 2.1ని ఉల్లంఘించిన నేరాన్ని షోహిదుల్ అంగీకరించిన తరువాత ఐసీసీ ఈ మేరకు ప్రకటన విడుదల చేసింది. షోహిదుల్ మూత్ర నమూనాలో నిషేధిత పదార్థం క్లోమిఫెన్ ఉన్నట్లు ఐసీసీ నిర్ధారించింది. కాగా షోహిదుల్ ఇస్లాం ఇటీవల న్యూజిలాండ్, సౌతాఫ్రికా, వెస్టిండీస్ల్లో పర్యటించిన బంగ్లాదేశ్ జట్టులో సభ్యుడిగా ఉన్నాడు. అయితే జట్టు సమీకరణల్లో భాగంగా అతనికి తుది జట్టులో అవకాశం లభించలేదు. చదవండి: WC 2023: టాప్‌లోకి దూసుకువచ్చిన బంగ్లాదేశ్.. ఏడో స్థానంలో రోహిత్ సేన! -
డోపింగ్‌లో పట్టుబడ్డ దక్షిణాఫ్రికా క్రికెటర్.. నిషేధం విధించిన ఐసీసీ
దుబాయ్: సౌతాఫ్రికా బ్యాటర్ జుబేర్ హమ్జాపై అంతర్జాతీయ క్రికెట్ కౌన్సిల్ (ఐసీసీ) నిషేధం విధించింది. డోపింగ్ నిరోధక నిబంధనలు ఉల్లంఘించిన కారణంగా హమ్జాను 9 నెలల పాటు క్రికెట్ సంబంధిత కార్యకలాపాలకు దూరంగా ఉండాలని ఐసీసీ ఆదేశించింది. డోపింగ్ నిరోధక నియమాన్ని ఉల్లంఘించినట్టు అంగీకరించడంతో హమ్జాపై డిసెంబర్ 22, 2022 వరకు నిషేధం అమల్లో ఉంటుందని ఐసీసీ మంగళవారం ప్రకటించింది. 17 జనవరి 2022న హమ్జా నుంచి సేకరించిన నమూనాలో నిషేధిత పదార్థమైన ఫ్యూరోసెమైడ్ గుర్తించినట్లు ఐసీసీ పేర్కొంది. ఈ ఏడాది జనవరి 17 నుంచే నిషేధం అమల్లో ఉంటున్నందున మార్చి 22న హమ్జా న్యూజిలాండ్‌పై చేసిన 31 పరుగులు రికార్డుల్లో నుంచి తొలగించనున్నట్లు తెలిపింది. కాగా, 26 ఏళ్ల హమ్జా దక్షిణాఫ్రికా తరఫున 6 టెస్ట్‌లు, ఓ వన్డే ఆడాడు. హమ్జా ఖాతాలో రెండు అర్ధ సెంచరీలు నమోదై ఉన్నాయి. చదవండి: BAN Vs SL Test: టెస్టుల్లో ముష్ఫికర్ రహీమ్ అరుదైన రికార్డు! -
సౌతాఫ్రికా క్రికెటర్‌ను సస్పెండ్ చేసిన ఐసీసీ
దక్షిణాఫ్రికా క్రికెటర్ జుబేర్ హంజాను బుధవారం ఐసీసీ అంతర్జాతీయ క్రికెట్ నుంచి సస్పెండ్ చేసింది. డోపింగ్ టెస్టులో సౌతాఫ్రికా క్రికెటర్ పాజిటివ్‌గా తేలడంతో ఐసీసీ ఈ నిర్ణయం తీసుకుంది. హంజాపై వేసిన వేటు తక్షణమే అమల్లోకి వస్తుందని ఐసీసీ తెలిపింది. కాగా ఈ విషయంపై క్రికెట్ సౌతాఫ్రికా(సీఎస్ఏ) ఒక ప్రకటన విడుదల చేసింది. ఐసీసీ విధించిన సస్పెన్షన్‌ను జుబేర్ హంజా అంగీకరించాడని పేర్కొంది. ''ఈ ఏడాది జనవరిలో ఐసీసీ కొందరు ప్రొటీస్ ఆటగాళ్లకు యాంటీ డోపింగ్ టెస్టు నిర్వమించింది. కాగా టెస్టులో జుబేర్ హంజా పాజిటివ్‌గా తేలాడు. డోపింగ్ టెస్టులో జుబేర్ హంజా ఐసీసీకి సహకరించాడని.. పాజిటివ్‌గా తేలడంపై డ్రగ్స్ తీసుకున్నట్లు తానే స్వయంగా ఒప్పుకున్నాడు. అయితే అతనిపై ఐసీసీ వేటు మాత్రమే వేసిందని.. జుబేర్ భవిష్యత్తులో మళ్లీ క్రికెట్ ఆడే అవకాశం ఉంది. అందుకు సీఎస్ఏ, సాకా, డబ్ల్యూపీసీఏ మద్దుతు ఉంటుంది'' అని సీఎస్ఏ తెలిపింది. కాగా 2019లో పాకిస్థాన్‌తో జరిగిన టెస్టు ద్వారా జుబేర్ హంజా అంతర్జాతీయ క్రికెట్లో అరంగేట్రం చేశాడు. ఇప్పటివరకు ఆరు టెస్టులు ఆడి 212 పరుగులు సాధించాడు. గతేడాది నవంబర్‌లో నెదర్లాండ్స్‌తో మ్యాచ్ ద్వారా వన్డేల్లో ఎంట్రీ ఇచ్చిన హంజా 56 పరుగులు చేశాడు. ఆ తర్వాత కోవిడ్‌తో ఆ సిరీస్ రద్దయ్యిఇంది. ఇక గతవారం బంగ్లాదేశ్‌తో సిరీస్‌కు సీఎస్ఏ జట్టును ప్రకటించింది. కాగా జుబేర్ హంజా వ్యక్తిగత కారణాలతో బంగ్లాతో సిరీస్ నుంచి స్వయంగా వైదొలిగాడు. చదవండి: PAK vs AUS: 20 పరుగుల వ్యవధిలో ఆలౌట్.. పేరును సార్థకం చేసుకున్న పాక్ జట్టు క్రికెట్ చరిత్రలో అత్యంత చెత్త నిర్ణయానికి 30 ఏళ్లు.. -
జింబాబ్వే క్రికెటర్ బ్రెండన్ టేలర్‌పై ఐసీసీ నిషేధం
జింబాబ్వే సీనియర్ ఆటగాడు బ్రెండన్ టేలర్‌పై ఐసీసీ మూడున్నరేళ్లు నిషేధం విధించింది. అవినీతి నిరోధక నియమావళిని ఉల్లంఘించడంతో పాటు, డ్రగ్స్ తీసుకుని యాంటీ డోపింగ్ కోడ్ ను కూడా అతిక్రమించినట్లు తేలింది. దీంతో ఐసీసీ అతనిపై నిషేధం విధిస్తూ నిర్ణయం తీసుకుంది. టేలర్ అన్ని ఫార్మాట్లలో కలిపి జింబాబ్వే తరఫున 2004 నుంచి 2021 వరకు 284 మ్యాచ్ లు ఆడాడు. మొత్తం 9,938 పరుగులు చేశాడు. వాటిలో 17 సెంచరీలు ఉన్నాయి. అయితే గతేడాదే బ్రెండన్ టేలర్ అంతర్జాతీయ క్రికెట్‌కు గుడ్‌బై చెప్పాడు. కాగా బ్రెండన్ టేలర్ ఇటీవలే ఓ లేఖలో సంచలన విషయాలు వెల్లడించాడు. గతంలో ఓ భారత వ్యాపారవేత్త క్రికెట్ లీగ్ పై చర్చించేందుకు భారత్ రావాలని కోరాడని, తాను వెళితే డ్రగ్స్ తో పార్టీ ఇచ్చి, తాను డ్రగ్స్ తీసుకున్నప్పటి వీడియోతో బ్లాక్ మెయిల్ చేశారని టేలర్ లేఖలో తెలిపాడు. ఫిక్సింగ్ కు పాల్పడాలంటూ తనకు 15 వేల డాలర్లు కూడా ఇచ్చారని వెల్లడించాడు. అయితే ఈ సమాచారాన్ని తమతో వెంటనే పంచుకోలేదంటూ ఐసీసీ బ్రెండన్ టేలర్ పై ఆగ్రహం వ్యక్తం చేసింది. కాగా తన తప్పిదాలను టేలర్ అంగీకరించాడని ఐసీసీ పేర్కొంది. -
‘శిక్ష’ ముగిసిన డోపీలకూ జాతీయ క్రీడా పురస్కారాలు
న్యూఢిల్లీ: తెలిసో... తెలియకో... డోపింగ్ ఉచ్చులో పడి శిక్ష పూర్తి చేసుకున్న క్రీడాకారులకు ఊహించని ఊరట లభించింది. ప్రతిష్టాత్మక జాతీయ క్రీడా పురస్కారాలకు వారి పేర్లను కూడా ఇకపై పరిశీలించనున్నారు. దీంతో అమిత్ పంఘాల్‌లాంటి భారత స్టార్ బాక్సర్‌కు ‘అర్జున’ తదితర అవార్డులు దక్కనున్నాయి. 2012లో డోపింగ్ మరక వల్లే అమిత్ అవార్డులకు దూరమయ్యాడు. అయితే నిషేధకాలం పూర్తి చేసుకున్న వారినే ఎంపిక చేస్తారు. ఈసారి టోక్యో ఒలింపిక్స్ వల్లే జాతీయ క్రీడా పురస్కారాల ఎంపిక, ప్రదానోత్సవ కార్యక్రమం వాయిదా పడింది. ఒలింపిక్స్ పతక విజేతలకు కూడా అవకాశమివ్వాలనే ఉద్దేశంతో కేంద్ర క్రీడాశాఖ ఈ ప్రక్రియను వాయిదా వేసింది. ఇప్పటికే కమిటీని నియమించిన ప్రభుత్వం త్వరలోనే వారి నుంచి ప్రతిపాదనలు స్వీకరించి అవార్డు విజేతలను ప్రకటించనుంది. చదవండి: భారత టీ20 ప్రపంచకప్ జట్టు ప్రకటన.. కొత్త బాధ్యతల్లో ధోని -
అభిమానులకు షాక్.. వచ్చే ఒలింపిక్స్‌లో ఆ క్రీడ డౌటే
స్విట్జర్లాండ్: వెయిట్ లిఫ్టింగ్ అభిమానులకు ఇంటర్నేషనల్ ఒలింపిక్ కమిటీ(ఐవోసీ) షాక్ ఇవ్వనుంది. 2024 పారిస్ ఒలింపిక్స్ నుంచి వెయిట్ లిఫ్టింగ్ క్రీడను ఎత్తివేసేందుకు ప్రణాళికను సిద్దం చేస్తుంది. దీనిపై ఇప్పటికే చర్చలు జరిపినట్లు.. త్వరలోనే దీనికి ఆమోదముద్ర వేయనున్నట్లు ఐవోసీ ఒక ప్రకటనలో తెలిపింది. వెయిట్ లిఫ్టింగ్‌లో పాల్గొంటున్న అథ్లెట్లలో చాలామంది డోపింగ్‌కు పాల్పడినట్లు తెలిసిందంటూ ఐవోసీ పేర్కొంది. ముఖ్యంగా కొంతమంది ఆటగాళ్లు బరువులు ఎత్తడానికి నిషేదిత డ్రగ్స్ వాడుతున్నట్లు వాదనలు వినిపించాయి. అంతేగాక డ్రగ్స్ వాడుతూ తమ కెరీర్‌ను కొనసాగిస్తున్నారని తేలింది. దీనిపై గతంలోనే ఇంటర్నేషనల్ వెయిట్‌లిఫ్టింగ్ ఫెడరేషన్ (ఐడబ్ల్యూఎఫ్)కు ఐవోసీ హెచ్చరికలు సైతం జారీ చేసింది. వెయిట్ లిఫ్టింగ్‌లో పెద్ద ఎత్తున డోపీలు పట్టుబడుతుండడంతో ఐవోసీ కఠిన చర్యలకు సిద్ధమైంది. ఈ నేపథ్యంలోనే వచ్చే పారిస్ ఒలింపిక్స్ నుంచి వెయిట్ లిఫ్టింగ్‌ను సస్పెండ్ చేయడంపై నిర్ణయం తీసుకోనుంది. అయితే తాము పేర్కొన్న సంస్కరణల అమలుపై ఐడబ్ల్యూఎఫ్ చర్యలు తీసుకుంటే.. 2028 లాస్ ఏంజిల్స్ ఒలింపిక్స్‌లో వెయిట్ లిఫ్టింగ్‌ను తిరిగి చేర్చే అంశాన్ని పరిశీలిస్తామని ఐవోసీ వెల్లడించింది. ఇక టోక్యో ఒలింపిక్స్‌లో వెయిట్ లిఫ్టింగ్ విభాగంలో భారత అథ్లెట్ మీరాబాయి చాను రజతం గెలుచుకున్న సంగతి తెలిసిందే. వెయిట్‌లిఫ్టింగ్ 49 కేజీల విభాగంలో పోటీపడింది. మొత్తమ్మీద 202 కేజీలు ఎత్తిన మీరాబాయి.. స్వర్ణం కోసం జరిగిన మూడో అటెంప్ట్‌లో మాత్రం విఫలమైంది. క్లీన్ అండ్ జెర్క్‌లో 117 కేజీలు ఎత్తే క్రమంలో తడబడింది. కాగా ఒలింపిక్స్ ప్రారంభమైన రెండో రోజే దేశానికి పతకం అందించి చరిత్ర సృష్టించింది. ఇక వెయిట్ లిఫ్టింగ్ విభాగంలో కరణం మల్లీశ్వరీ(కాంస్యం, 2000 సిడ్నీ ఒలింపిక్స్) తర్వాత దేశానికి రెండో పతకం అందించిన మహిళగా మీరాబాయి నిలిచింది. -
పాపం రష్యా.. పతకాలు గెలిచినా జాతీయ గీతం వినిపించదు
టోక్యో: రష్యా స్విమ్మర్లు రిలోవ్, కొలెస్నికోవ్ అమెరికన్ల ‘కనక’పు కోటని బద్దలు కొట్టి మరీ బంగారు, రజత పతకాలు గెలిచారు. మరో వైపు జిమ్నాస్ట్‌లు అమెరికా మెరుపు విన్యాసాలకు చెక్ పెట్టారు. అకయిమోవా, లిస్టునోవా, మెల్నికొవా, వురజొవాతో కూడిన రష్యా జట్టు అమెరికా హ్యాట్రిక్ స్వర్ణావకాశాన్ని దెబ్బతీసి మరీ విజేతగా నిలిచింది. ఇంతటి ఘనవిజయాలు సాధించిన రష్యన్లకు పోడియం వద్ద అసంతృప్తే దక్కుతోంది. వ్యవస్థీకృత డోపింగ్ ఉదంతంతో రష్యా దేశంపై నిషేధం కొనసాగుతుండడమే దీనికి కారణం. అయితే నిష్కళంక అథ్లెట్లను మాత్రం రష్యా ఒలింపిక్ కమిటీ (ఆర్ఓసీ) జెండా కింద పోటీపడేందుకు అవకాశమిచ్చింది. దీంతో పోడియంలో వారి మెడలో పతకాలు పడినా అక్కడ జాతీయ గీతం వినిపించదు. ఓ సంగీతం వినిపిస్తారు. జెండా బదులు ఆర్ఓసీ జెండాను ఎగరేస్తారు. ఇది రష్యా అథ్లెట్లకు పతకం గెలిచిన ఆనందాన్ని దూరం చేస్తోంది -
రెజ్లర్ సుమిత్‌పై నిషేధం
న్యూఢిల్లీ: డోపింగ్‌లో పట్టుబడిన కామన్వెల్త్గేమ్స్ చాంపియన్, భారత రెజ్లర్ సుమిత్ మాలిక్‌పై నిషేధం విధించారు. దీంతో 28 ఏళ్ల హరియాణా రెజ్లర్ ఒలింపిక్స్ ఆశలకు దాదాపు తెరపడినట్లే. అతను అప్పీల్ చేసుకునేందుకు ఒక వారం గడువిచ్చినప్పటికీ ఒలింపిక్స్ సమయానికల్లా ఈ విచారణ ముగిసే అవకాశాల్లేవు. గత నెల సోఫియాలో నిర్వహించిన ప్రపంచ ఒలింపిక్ క్వాలిఫయర్స్‌లో 125 కేజీల ఫ్రీస్టయిల్ కేటగిరీలో పోటీపడిన భారత రెజ్లర్ మెగా ఈవెంట్‌కు అర్హత సంపాదించాడు. కానీ ఆ పోటీ సందర్భంగా నిర్వహించిన డోపింగ్ పరీక్షల్లో అతను నిషేధిత ఉత్ప్రేరకాలు తీసుకున్నట్లు తేలడంతో సస్పెన్షన్ వేటు వేశారు. తాజాగా ‘బి’ శాంపిల్‌ను కూడా పరీక్షించగా ఉత్ప్రేరకాలు తీసుకున్నట్లు తేలింది. దీంతో ప్రపంచ రెజ్లింగ్ యూనియన్ (యూడబ్ల్యూడబ్ల్యూ) శుక్రవారం అతనిపై రెండేళ్ల నిషేధాన్ని విధిస్తూ నిర్ణయం తీసుకుంది. 2018 గోల్డ్‌కోస్ట్ కామన్వెల్త్ గేమ్స్‌లో చాంపియన్‌గా నిలిచిన సుమిత్ మాలిక్ అదే ఏడాది భారత ప్రభుత్వం నుంచి క్రీడాపురస్కారం ‘అర్జున’ అవార్డు అందుకున్నాడు. 2017లో న్యూఢిల్లీ ఆతిథ్యమిచ్చిన ఆసియా చాంపియన్‌షిప్, జోహన్నెస్‌బర్గ్‌లో జరిగిన కామన్వెల్త్ చాంపి యన్‌షిప్‌లలో అతను రన్నరప్‌గా నిలిచి రజత పతకాలు సాధించాడు. -
డోపింగ్ టెస్ట్‌లో పట్టుబడ్డ మహిళా క్రికెటర్..
న్యూఢిల్లీ: మధ్యప్రదేశ్‌కు చెందిన దేశవాళీ మహిళా క్రికెటర్ అన్షులా రావ్ డోపింగ్ పరీక్షలో పట్టుబడింది. దీంతో ఆమెపై జాతీయ డోపింగ్ ఏజెన్సీ (నాడా) నాలుగేళ్ల నిషేధం విధించింది. ఈ క్రమంలో డోపింగ్ బ్యాన్‌కు గురైన తొలి మహిళా క్రికెటర్‌గా అపకీర్తి మూటగట్టుకుంది. నిషేధిత ఉత్ప్రేరకం ‘19–నోరాండ్రోస్టెరాన్’ తీసుకున్నందుకు గాను ఆమెపై సస్పెన్షన్ వేటు పడింది. దోహా ప్రయోగాశాలలో నిర్వహించిన పరీక్షల్లో ఆమె మూత్ర నమూనాల్లో అనబాలిక్ ఆండ్రోజెనిక్ స్టెరాయిడ్ (ఏఏఎస్) ఉన్నట్లు తేలింది. అయితే అది తన శరీరంలోకి ఎలా వచ్చిందనే విషయమై ఆమె నోరు విప్పలేదు. కాగా, అన్షులా చివరిసారిగా 2019-20లో బీసీసీఐ నిర్వహించిన అండర్-23 టీ20 టోర్నీలో పాల్గొంది. నాడా పరిథిలోకి బీసీసీఐ వచ్చాక బయటపడిన తొలి కేసు ఇదే కావడం విశేషం. చదవండి: కోహ్లీ నాలుగేళ్ల సంపాదన ఒక్క ఫేక్ ఫైట్ ద్వారా ఆర్జించాడు -
రెజ్లర్ సుమిత్‌పై రూ. 16 లక్షల జరిమానా!
న్యూఢిల్లీ: భారత హెవీవెయిట్ రెజ్లర్, టోక్యో ఒలింపిక్స్ బెర్త్ దక్కించుకున్న సుమిత్ మలిక్ (125 కేజీలు) డోపింగ్ పరీక్షలో విఫలమవ్వడంతో భారత రెజ్లింగ్ సమాఖ్య (డబ్ల్యూఎఫ్ఐ) భారీ మూల్యం చెల్లించుకోనుంది. యునైటెడ్ వరల్డ్ రెజ్లింగ్ (యూడబ్ల్యూడబ్ల్యూ) ఆధ్వర్యంలో జరిగిన వరల్డ్ ఒలింపిక్ క్వాలిఫయింగ్ టోర్నీలో సుమిత్ డోపింగ్‌లో పట్టుబడటంతో అతనిపై తాత్కాలికంగా ఆరు నెలలపాటు నిషేధం విధించారు. దాంతో సుమిత్ టోక్యో ఒలింపిక్స్‌కు దూరమయ్యాడు. డోపింగ్‌లో పట్టుబడినందుకు సుమిత్ బదులుగా ఈ విభాగంలోనే మరో భారత రెజ్లర్‌ను పంపించే వీలు లేకుండాపోయింది. డోపింగ్‌లో దొరికిన రెజ్లింగ్ సమాఖ్యపై యూడబ్ల్యూడబ్ల్యూ రూ. 16 లక్షల జరిమానా విధిస్తుంది. ఈ మొత్తాన్ని డోపింగ్‌లో పట్టుబడ్డ రెజ్లర్ నుంచి వసూలు చేస్తారు. ఫలితంగా ఇప్పుడు సుమిత్ తన జేబు ద్వారా రూ. 16 లక్షలు భారత రెజ్లింగ్ సమాఖ్యకు చెల్లించాలి. ఒకవేళ జరిమానా మొత్తం చెల్లించకపోతే సుమిత్‌పై భారత రెజ్లింగ్ సమాఖ్య జీవితకాల నిషేధం విధించే అవకాశముంది. సుమిత్ ‘బి’ శాంపిల్ కూడా పాజిటివ్ వస్తే అతను రూ. 16 లక్షల జరిమానాతోపాటు టోక్యో ఒలింపిక్స్ సన్నాహాల కోసం హరియాణా ప్రభుత్వం నుంచి తీసుకున్న రూ. 5 లక్షలను తిరిగి ఇవ్వాల్సి ఉంటుంది. -
Tokyo Olympics: డోపింగ్‌లో సుమిత్ విఫలం
న్యూఢిల్లీ: భారత హెవీవెయిట్ ఫ్రీస్టయిల్ రెజ్లర్ సుమిత్ మలిక్ టోక్యో ఒలింపిక్స్‌లో పాల్గొనాలనుకున్న ఆశలు ఆవిరయ్యాయి. గత నెలలో బల్గేరియాలో జరిగిన వరల్డ్ ఒలింపిక్ క్వాలిఫయింగ్ టోర్నీలో 125 కేజీల విభాగంలో రజత పతకం సాధించిన సుమిత్ మలిక్ టోక్యో ఒలింపిక్స్ బెర్త్ సంపాదించాడు. అయితే ఇదే టోర్నీ సందర్భంగా నిర్వహించిన డోపింగ్ పరీక్షలో సుమిత్ విఫలమయ్యాడు. సుమిత్ శాంపిల్‌లో నిషేధిత మెథిలెక్సాన్ ఉత్ప్రేరకం ఆనవాళ్లు ఉన్నట్లు తేలింది. దాంతో సుమిత్‌పై యునైటెడ్ వరల్డ్ రెజ్లింగ్ (యూడబ్ల్యూడబ్ల్యూ) తాత్కాలిక నిషేధం విధించింది. ఈ నిషేధం కారణంగా సుమిత్ టోక్యో ఒలింపిక్స్‌లో భారత్‌కు ప్రాతినిధ్యం వహించే అవకాశం కోల్పోయినట్టే. ఒకవేళ సుమిత్ ‘బి’ శాంపిల్ కూడా పాజిటివ్ వస్తే అతనిపై కనీసం రెండేళ్ల నిషేధం పడే అవకాశం ఉంది. -
నెలరోజులు గది నుంచి బయటికి రాలేకపోయా: పృథ్వీ షా
ముంబై: టీమిండియా యువ ఆటగాడు పృథ్వీ షా.. ఒకవైపు నుంచి అతని ఆటతీరు గమనిస్తే సెహ్వాగ్, సచిన్‌లు గుర్తుకురావడం ఖాయం. పృథ్వీ ఆడే కొన్ని షాట్లు వారిద్దరి స్టైల్‌ను పోలి ఉంటాయి. అలాంటి పృథ్వీ షా 2018 అండర్ 19 టీ20 ప్రపంచకప్‌కు టీమిండియాకు నాయకత్వం వహించాడు. అతని సారధ్యంలోనే టీమిండియా నాలుగోసారి అండర్ 19 ప్రపంచకప్‌ను సాధించింది. ఈ దెబ్బతో పృథ్వీ షా ఒక్కసారిగా టీమిండియా సీనియర్ జట్టులో చోటు సంపాదించాడు. ఏకంగా టెస్టు మ్యాచ్ ద్వారా టీమిండియా తరపున అరంగేట్రం చేసిన పృథ్వీ వెస్టిండీస్‌తో జరిగిన టెస్టు మ్యాచ్‌లో డెబ్యూ సెంచరీతో ఆకట్టుకొని అందరిచూపు తన వైపుకు తిప్పుకున్నాడు. పృథ్వీ షా జోరును చూసి అంతా మరో సచిన్.. సెహ్వాగ్‌లా పేరు తెచ్చుకుంటాడని భావించారు. సరిగ్గా నాలుగు నెలల తిరగ్గానే సయ్యద్ ముస్తాక్ అలీ ట్రోఫీ నిర్వహణలో భాగంగా ఆటగాళ్లందరికి బీసీసీఐ డోపింగ్ టెస్టు నిర్వహించింది. కాగా డోపింగ్ టెస్టులో పృథ్వీ షా పట్టుబడ్డాడు. దగ్గుకు సంబంధించి తీసుకున్న సిరప్‌లో నిషేధిత డ్రగ్ ఉన్నట్లు తేలడంతో పృథ్వీ షాపై 8 నెలల బ్యాన్ పడింది. దీంతో బంగ్లాదేశ్‌తో హోం సిరీస్‌తో పాటు కీలకమైన దక్షిణాఫ్రికా పర్యటనకు షా దూరమయ్యాడు. ఆ ఎనిమిది నెలలు పృథ్వీ షా చీకటిరోజులుగా భావించాడు. తాజాగా మరోసారి ఆ చీకటి రోజులను పృథ్వీ మరోసారి గుర్తుచేసుకున్నాడు. ''నేను, నా తండ్రి తప్పు చేశామని.. ఆరోజు డాక్టర్‌ను కన్సల్ట్ అయి ఉంటే ఆ బ్యాన్ నామీద పడేది కాదని పేర్కొన్నాడు. నాపై 8 నెలల బ్యాన్ పడడంపై.. ఈ అంశంలో నాతో పాటు నా తండ్రి కూడా పరోక్షంగా కారణమయ్యాడు. నాకు బాగా గుర్తు.. మేం ఇండోర్‌లో సయ్యద్ ముస్తాక్ అలీ ట్రోఫీ కోసం ప్రిపేర్ అవుతున్నాం. అయితే రెండు రోజుల నుంచి నాకు జలుబు.. దగ్గు ఉంది. ఇక ఆరోజు రాత్రి డిన్నర్ చేయడానికి బయటకు వెళ్లాం.. నా తండ్రికి ఫోన్ చేసి మాట్లాడుతుండగా విపరీతంగా దగ్గు రావడం మొదలైంది. దీంతో మార్కెట్ దగ్గు తగ్గడానికి ఏదైనా సిరప్ ఉంటే వెళ్లి తెచ్చుకో.. నీ ఆరోగ్యం జాగ్రత్త అని చెప్పాడు. అయితే ఇక్కడే నేను తప్పు చేశాను. దగ్గుకు సంబంధించి డాక్టర్‌ను కన్సల్ట్ అవ్వకుండా మార్కెట్‌కు వెళ్లి సిరప్ తెచ్చుకొని రెండురోజులు తాగాను. మూడో రోజు డోపింగ్ టెస్టులో పట్టుబడ్డాను.. నిషేధిత డ్రగ్ వాడినందుకు బీసీసీఐ నాపై 8 నెలల బ్యాన్ విధించింది. దీంతో మానసికంగా చాలా కుంగిపోయా. రెండు నెలల పాటు ఒంటరిగా గదిలోనూ ఉంటూ ఎన్నో నిద్రలేని రాత్రులు గడిపా. ఆ బ్యాన్ నా కెరీర్‌ను నాశనం చేస్తుందని.. నా ముఖం ఎలా చూపించాలో అర్థం కాక నాలో నేను కుమిలిపోయేవాడిని. ఆ డిప్రెషన్ నుంచి బయటపడేందుకు లండ్కు వెళ్లా.. అక్కడికి వెళ్లినా అవే ఆలోచనలు నన్ను చట్టుముట్టడంతో నెలరోజుల పాటు గదిలో నుంచి బయటికి రాలేకపోయా.'' అంటూ చెప్పుకొచ్చాడు. అయితే పృథ్వీ తాను చేసిన తప్పును బీసీసీఐ ఎదుట నిజాయితీగా ఒప్పుకోవడంతో పాటు తనకు తెలియకుండా నిషేధిత డ్రగ్(టెర్బుటాలిన్) వాడినట్లు తేలడంతో అతనిపై బ్యాన్ తొలిగించింది. ఆ తర్వాత బెంగళూరులోని నేషనల్ క్రికెట్ అకాడమీ(ఎన్సీఏ)లో చేరిన పృథ్వీ షా ద్రవిడ్ పర్యవేక్షణలో మరింత రాటు దేలాడు. ఆ తర్వాత ఐపీఎల్ 2020 సీజన్లో ఢిల్లీ క్యాపిటల్స్ తరపున మంచి ప్రదర్శన కనబరిచిన షా ఆసీస్ టూర్‌కు ఎంపికయ్యాడు. అయితే ఆసీస్‌తో జరిగిన మొదటి టెస్టులో డకౌట్‌గా వెనుదిరిగి విమర్శల పాలవడంతో పాటు జట్టులో స్థానం కోల్పోయాడు. ఆ తర్వాత జరిగిన దేశవాలీ టోర్నీ అయిన విజయ్ హజారే ట్రోఫీలో మాత్రం దుమ్మురేపాడు. నాలుగు సెంచరీలతో చెలరేగిన పృథ్వీ ఆ టోర్నీలో 827 పరుగులు చేసి టాపర్‌గా నిలిచాడు. ఆ తర్వాత ఐపీఎల్ 14వ సీజన్లోనూ పృథ్వీ ఆకట్టుకున్నాడు. ఢిల్లీ క్యాపిటల్స్ తరపున 8 మ్యాచ్‌లాడిన షా 308 పరుగులతో రాణించాడు. ఐపీఎల్లో ఆకట్టుకున్నా డబ్ల్యూటీసీ ఫైనల్‌తో పాటు ఇంగ్లండ్‌తో జరగనున్న ఐదు టెస్టుల సిరీస్‌కు పృథ్వీ షాను పరిగణలోకి తీసుకోలేదు. అయితే శ్రీలంక పర్యటనకు వెళ్లే టీమిండియా రెండో జట్టుకు అతను ఎంపికయ్యే అవకాశాలు ఉన్నాయి. చదవండి: రిస్క్ తగ్గించుకుంటే మంచిది.. లేకుంటే కష్టమే పృథ్వీ షా ముందు బరువు తగ్గు.. ఆ తర్వాత చూద్దాం! -
భారత అథ్లెట్ గోమతి అప్పీల్ తిరస్కరణ
న్యూఢిల్లీ: కోర్ట్ ఆఫ్ ఆర్బిట్రేషన్ ఫర్ స్పోర్ట్స్ (సీఏఎస్)లో భారత మిడిల్ డిస్టెన్స్ రన్నర్ గోమతి మరిముత్తుకు చుక్కెదురైంది. డోపింగ్‌కు పాల్పడినందుకు గోమతిపై 2019లో నాలుగేళ్ల నిషేధం పడింది. దీనిని సవాల్ చేస్తూ ఆమె సీఏఎస్‌ను ఆశ్రయించింది. 2019 ఆసియా చాంపియన్‌షిప్‌లో 800 మీటర్ల పరుగులో గోమతి స్వర్ణం గెలవగా... ఆ తర్వాత ఆమె డోపింగ్‌లో పట్టుబడటంతో వరల్డ్ అథ్లెటిక్స్ డిసిప్లినరీ ట్రిబ్యునల్ నాలుగేళ్ల నిషేధం విధించింది. తాను పాలీ సిస్టిక్ ఓవరీ సిండ్రోమ్‌తో బాధపడుతుండటంతో పాటు గర్భస్రావం జరిగిన కారణంగా శరీరంలో 19–నోరాన్డ్రోస్టిరోన్ ఎక్కువగా కనిపించిందని, సరైన రీతిలో పరీక్షలు కూడా నిర్వహించలేదని ఆమె తన అప్పీల్లో పేర్కొనగా... ఆర్బిట్రేటర్ జాన్ పాల్సన్ దానిని త్రోసి పుచ్చి నిషేధం కొనసాగుతుందని తీర్పునిచ్చారు. -
డోప్ టెస్టులో పట్టుబడ్డ ఇద్దరు భారత అథ్లెట్లు
న్యూఢిల్లీ: భారత్ తరఫున ఈ ఏడాది జరిగే టోక్యో ఒలింపిక్స్‌లో పాల్గొనాల్సిన ఇద్దరు భారత అథ్లెట్లు డోపీలుగా తేలారు. గత నెలలో పాటియాలా వేదికగా జరిగిన ఇండియన్ గ్రాండ్‌ప్రి మీట్లో నిర్వహించిన డోపింగ్ పరీక్షలో వీరిద్దరు విఫలమైనట్లు జాతీయ డోపింగ్ నిరోధక సంస్థ (నాడా) డైరెక్టర్ జనరల్ నవీన్ అగర్వాల్ శనివారం తెలిపారు. అయితే వారి పేర్లను మాత్రం ఆయన వెల్లడించలేదు. ఈ ఇద్దరు అథ్లెట్ల నుంచి సేకరించిన శాంపిల్స్‌లో శక్తినిచ్చే మిథైల్హెక్సాన్–2–అమైన్ అనే నిషేధిత ఉత్ప్రేరకం ఉన్నట్లు తేలిందని ఆయన పేర్కొన్నారు. వీరిని త్వరలోనే ‘నాడా’ క్రమశిక్షణా ప్యానెల్ (ఏడీడీపీ) ముందు ప్రవేశపెట్టే అవకాశం ఉంది. అక్కడ దోషులుగా తేలితే వారిపై రెండు నుంచి నాలుగేళ్ల పాటు నిషేధం విధించే అవకాశం ఉంది. -
సత్నాం సింగ్‌పై రెండేళ్ల నిషేధం
న్యూఢిల్లీ: ప్రతిష్టాత్మక జాతీయ బాస్కెట్‌బాల్ సంఘం (ఎన్బీఏ) జట్టుకు భారత్ నుంచి ప్రాతినిధ్యం వహించిన తొలి బాస్కెట్‌బాల్ ప్లేయర్‌గా ఘనతకెక్కిన సత్నాం సింగ్ భమారా డోపింగ్‌లో దొరికిపోయాడు. దీంతో 25 ఏళ్ల భమారాపై రెండేళ్ల నిషేధం విధిస్తున్నట్లు జాతీయ డోపింగ్ నిరోధక సంస్థ (నాడా) క్రమశిక్షణా ప్యానెల్ గురువారం ప్రకటించింది. బెంగళూరులో దక్షిణాసియా క్రీడల సన్నాహక శిబిరం సందర్భంగా గతేడాది నవంబర్‌లో నిర్వహించిన పరీక్షల్లోనే సత్నాం సింగ్ డోపీగా తేలడంతో రెండేళ్ల సస్పెన్షన్ వేటు వేశారు. దీన్ని సవాలు చేసిన సత్నాం డోపింగ్ నిరోధక క్రమశిక్షణా కమిటీ (ఏడీడీపీ)తో విచారణ జరిపించాలని ‘నాడా’ను కోరాడు. ఈ విచారణలో సత్నాం ‘వాడా’ నిషేధిత ఉత్ప్రేరకం హైజినమైన్ను తీసుకున్నట్లు తేలిందని ‘నాడా’ గురువారం నిర్ధారించింది. గతేడాది నవంబర్ నుంచే శిక్ష అమల్లోకి వస్తుందని పేర్కొన్న జాతీయ సంస్థ 19 నవంబర్ 2021 వరకు అతను ఎలాంటి టోర్నీల్లో ఆడరాదంటూ నిషేధం విధించింది. ఐదేళ్ల క్రితం ఎన్బీఏ డెవలప్మెంట్ లీగ్‌లో టెక్సాస్ లెజెండ్స్‌కు ప్రాతినిధ్యం వహించిన భమారా ఈ ఘనత సాధించిన తొలి భారతీయునిగా చరిత్ర సృష్టించాడు. ఆసియా చాంపియన్‌షిప్స్, 2018 కామన్వెల్త్ గేమ్స్, 2019 ప్రపంచకప్ క్వాలిఫయర్స్‌లో భారత్‌కు ప్రాతినిధ్యం వహించాడు. -
ఒలింపిక్స్ నుంచి రష్యా ఔట్
జెనీవా : కోర్ట్ ఆఫ్ ఆర్బిట్రేషన్ ఫర్ స్పోర్ట్స్ (కాస్) గురువారం రష్యాపై రెండేళ్ల నిషేధం విధించింది. దీని ప్రకారం రానున్న రెండు ఒలింపిక్స్ క్రీడల్లో లేదా రెండు ప్రపంచ చాంపియన్‌షిప్ ఈవెంట్లలో రష్యా దేశానికి ప్రాతినిధ్యం ఉండదు. ఆ దేశం తరఫున ఎవరూ పాల్గొనడానికి వీల్లేదు. అంతేకాకుండా రెండేళ్ల పాటు ఎలాంటి క్రీడల ఆతిథ్య హక్కుల కోసం రష్యా బిడ్డింగ్‌లో పాల్గొనకూడదు. అయితే డోపింగ్‌తో సంబంధం లేనట్లు నిరూపించుకునే రష్యా ఆటగాళ్లు వచ్చే ఏడాది జరుగనున్న టోక్యో ఒలింపిక్స్, 2022 బీజింగ్ వింటర్ గేమ్స్, ప్రపంచ చాంపియన్‌షిప్స్ టోర్నీల్లో తమ దేశం తరఫున కాకుండా ‘న్యూట్రల్’ అథ్లెట్లుగా పాల్గొనేందుకు అనుమతిచి్చంది. -
అంతర్జాతీయ అథ్లెటిక్స్ సమాఖ్య మాజీ అధ్యక్షుడికి రెండేళ్ల జైలు
పారిస్: అంతర్జాతీయ అథ్లెటిక్స్ సమాఖ్య (ఐఏఏఎఫ్) మాజీ అధ్యక్షుడు లామినే డియాక్‌కు రెండేళ్ల జైలు శిక్ష పడింది. రష్యా డోపీలను నిషేధించకుండా పోటీల్లో పాల్గొనేలా అవినీతికి పాల్పడటంతో పారిస్ కోర్టు 87 ఏళ్ల డియాక్‌ను దోషిగా తేల్చి శిక్ష ఖరారు చేసింది. సెనెగల్ దేశానికి చెందిన ఆయన 1999 నుంచి 2015 వరకు సుదీర్ఘకాలం పాటు ఐఏఏఎఫ్‌లోనే అత్యంత ప్రభావవంతమైన అధ్యక్షుడిగా పనిచేశారు. అయితే ఆయన పెద్ద ఎత్తున అవినీతికి పాల్పడినట్లు ఆరోపణలు వచ్చాయి. దీనిపై విచారించిన కోర్టు జైలుశిక్షతోపాటు 5 లక్షల యూరోలు (రూ. 4 కోట్ల 34 లక్షలు) జరిమానా కూడా విధించింది. శిక్ష ఖరారు చేస్తున్న సమయంలో డియాక్ కోర్టులోనే ఉన్నారు. ఆయన అవకతవకలు, అవినీతి ఉదంతాలపై ఈ శిక్షను విధిస్తున్నట్లు మహిళా న్యాయమూర్తి తీర్పును చదివి వినిపించారు. రష్యా డోపీలకు ఉద్దేశపూర్వకంగానే అండదండలు అందించినట్లు కోర్టు తేల్చిందని ఆమె చెప్పారు. -
‘మీ పతకాలు వెనక్కి ఇచ్చేయండి’
న్యూఢిల్లీ: డోపింగ్‌లో విఫలమైన రెజ్లర్లు ‘ఖేలో ఇండియా’ క్రీడల్లో సాధించిన పతకాలతో పాటు ధ్రువపత్రాలను వెనక్కి ఇచ్చేయాలని భారత రెజ్లింగ్ సమాఖ్య (డబ్ల్యూఎఫ్ఐ) ఆదేశించింది. ప్రభుత్వ మార్గదర్శకాల ప్రకారమే ఈ విధంగా చేస్తున్నట్లు డబ్ల్యూఎఫ్ఐ సహాయక కార్యదర్శి వినోద్ తోమర్ తెలిపారు. గత నాలుగు సీజన్ల ‘ఖేలో ఇండియా’ గేమ్స్‌తో పాటు స్కూల్ యూత్, యూనివర్సిటీ క్రీడల్లో పతకాలు సాధించిన 12 మంది రెజ్లర్లు డోపింగ్‌లో విఫలమయ్యారు. ఇందులో ఆరుగురు ఫ్రీస్టయిల్ రెజ్లర్లు కాగా, మరో ఆరుగురు గ్రోకో రోమన్ విభాగానికి చెందినవారు. వీరి నుంచి పతకాలను వెనక్కి తీసుకోవడంలో అనుబంధ రాష్ట్ర సంఘాలు సహాయం చేయాలని డబ్ల్యూఎఫ్ఐ కోరింది. డోపింగ్ పరీక్షలో విఫలమైన రెజ్లర్లలో రోహిత్ దహియా (54 కేజీలు), అభిమన్యు (58 కేజీలు), వికాస్ కుమార్ (65 కేజీలు), విశాల్ (97 కేజీలు), వివేక్ భరత్ (86 కేజీలు), జస్దీప్ సింగ్ (25 కేజీలు), మనోజ్ (55 కేజీలు), కపిల్ పల్‌స్వల్ (92 కేజీలు), జగదీశ్ రోకడే (42 కేజీలు), రోహిత్ అహిరే (72 కేజీలు), విరాజ్ రన్వాడే (77 కేజీలు), రాహుల్ కుమార్ (63 కేజీలు) ఉన్నారు. -
ఐపీఎల్లో డోపింగ్ పరీక్షలు
దుబాయ్: క్రికెటర్లపై డోపింగ్ పరీక్షల విషయంలో ఎలాంటి ఉదాసీనతకు తావు ఇవ్వరాదని జాతీయ డోపింగ్ నిరోధక సంస్థ (నాడా) భావిస్తోంది. అందుకే దుబాయ్‌లో సెప్టెంబర్ 19 నుంచి నవంబర్ 10 వరకు జరగనున్న ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) టి20 టోర్నీలో డోపింగ్ పరీక్షలు నిర్వహించాలని ‘నాడా’ నిర్ణయించింది. ఇందు కోసం శాంపిల్స్‌ను సేకరించేందుకు ‘నాడా’కు చెందిన ముగ్గురు ఉన్నతాధికారులు, ఆరుగురు డోప్ కంట్రోల్ అధికారులు యూఏఈకి వెళ్లనున్నారు. ఐపీఎల్లో కనీసం 50 మంది క్రికెటర్లు శాంపిల్స్ తీసుకోవాలని ఈ సంస్థ ప్రాథమికంగా నిర్ణయం తీసుకుంది. ‘నాడాకు చెందిన తొమ్మిది మంది అధికారులు యూఏఈలో ఉంటారు. వారికి యూఏఈ డోపింగ్ నిరోధక సంస్థ కూడా సహకరిస్తుంది. మేం సిద్ధం చేసిన బయో బబుల్‌లోనే వారు కూడా ఉంటారు. దీనికయ్యే మొత్తం ఖర్చును ఎవరు భరిస్తారనేది మాత్రం మేం ఇప్పుడే చెప్పలేం’ అని బీసీసీఐ సీనియర్ అధికారి ఒకరు వెల్లడించారు. పరీక్షల కోసం మూడు మ్యాచ్ వేదికలతో పాటు రెండు ప్రాక్టీస్ వేదికల వద్ద కలిపి మొత్తం ఐదు డోపింగ్ టెస్టు కేంద్రాలను ఏర్పాటు చేస్తారు. మరో వైపు కొందరు ఆటగాళ్ల బ్లడ్ శాంపిల్స్ కూడా తీసుకొని ఖతర్‌లో ‘వాడా’ గుర్తింపు పొందిన కేంద్రంలో పరీక్షించే అవకాశం కూడా ఉంది. -
నర్సింగ్ వస్తున్నాడు...
ముంబై: నాలుగేళ్ల క్రితం రియో ఒలింపిక్స్‌కు అర్హత సాధించినా... చివరి నిమిషంలో అనుమానాస్పదరీతిలో డోపింగ్‌లో పట్టుబడిన భారత స్టార్ రెజ్లర్ నర్సింగ్ యాదవ్‌పై విధించిన నాలుగేళ్ల నిషేధం గడువు ముగిసింది. ఈ మేరకు ప్రపంచ డోపింగ్ నిరోధక సంస్థ (వాడా) నుంచి 30 ఏళ్ల నర్సింగ్కు అధికారికంగా ఈ–మెయిల్ ద్వారా సమాచారం వచ్చింది. దాంతో మహారాష్ట్రకు చెందిన నర్సింగ్ యాదవ్ రెజ్లింగ్ కెరీర్‌కు కొత్త ఊపిరి వచ్చింది. ఈ ఏడాది జరగాల్సిన టోక్యో ఒలింపిక్స్ వచ్చే సంవత్సరానికి వాయిదా పడటంతో నర్సింగ్కు మళ్లీ ఒలింపిక్స్‌లో పాల్గొనే ద్వారాలు తెరుచుకున్నాయి. ‘గత శనివారం నాకు ‘వాడా’ నుంచి నా నిషేధం గడువు ముగిసినట్లు మెయిల్ వచ్చింది. ఇక నుంచి భవిష్యత్‌లో జరిగే అన్ని రెజ్లింగ్ టోర్నమెంట్లలో పాల్గొనేందుకు నాకు అర్హత ఉంది. (ఆర్సీబీతోనే నా ప్రయాణం) 74 కేజీల విభాగంలో నిర్వహించే జాతీయ శిక్షణ శిబిరానికి తన పేరును కూడా పరిగణనలోకి తీసుకోవాలని భారత రెజ్లింగ్ సమాఖ్యకు నేను లేఖ రాశాను’ అని నర్సింగ్ తెలిపాడు. ఈ ఏడాది డిసెంబర్లో సెర్బియా రాజధాని బెల్గ్రేడ్లో జరిగే ప్రపంచ రెజ్లింగ్ చాంపియన్‌షిప్‌లో భారత్‌కు ప్రాతినిధ్యం వహించడమే లక్ష్యంగా ప్రాక్టీస్ మొదలుపెడతానని నర్సింగ్ పేర్కొన్నాడు. ‘నా జీవితలక్ష్యం ఒలింపిక్ పతకం సాధించడమే. ఒలింపిక్ పతకం సాధిస్తేనే నా కథకు సరైన ముగింపు లభించినట్టు. ఒలింపిక్ పతకం నెగ్గేందుకు మరో అవకాశం లభించడం నా తలరాతలో రాసి పెట్టుందనే నమ్ముతున్నాను’ అని నర్సింగ్ అన్నాడు. నర్సింగ్ రాకతో 74 కేజీల విభాగం మళ్లీ ఆసక్తికరంగా మారింది. ఇప్పటికైతే టోక్యో ఒలింపిక్స్‌కు భారత్ నుంచి 74 కేజీల విభాగంలో ఎవరూ బెర్త్ సాధించలేదు. ఈ బెర్త్ రేసులో మరో స్టార్ రెజ్లర్ సుశీల్ కుమార్, జితేందర్, ప్రవీణ్ రాణాలతో కలిసి నర్సింగ్ కూడా చేరాడు. 2015 ప్రపంచ చాంపియన్‌షిప్‌లో నర్సింగ్ 74 కేజీల విభాగంలో కాంస్యం సాధించడంతో 2016 రియో ఒలింపిక్స్‌కు అర్హత సాధించాడు. వాస్తవానికి ఈ విభాగంలోనే బరిలో ఉన్న రెండు ఒలింపిక్స్ పతకాల విజేత సుశీల్ కుమార్ గాయం కారణంగా 2015 ప్రపంచ చాంపియన్‌షిప్‌కు దూరంగా ఉన్నాడు. భారత రెజ్లింగ్ సమాఖ్య (డబ్ల్యూఎఫ్ఐ) నిబంధనల ప్రకారం తొలుత ఒలింపిక్స్‌కు అర్హత పొందిన వారే ఎలాంటి ట్రయల్స్ లేకుండా ఒలింపిక్స్‌లో పాల్గొనవచ్చు. కానీ తాను గాయం కారణం గా ప్రపంచ చాంపియన్‌షిప్‌కు అందుబాటులో లేనని... రియో ఒలింపిక్స్‌కు ఎవరిని పంపించాలనే నిర్ణయం తనకు, నర్సింగ్కు మధ్య ట్రయల్ బౌట్ నిర్వహించి తీసుకోవాలని సుశీల్ కోరాడు. కానీ సుశీల్ విన్నపాన్ని డబ్ల్యూఎఫ్ఐ తోసిపుచ్చి నర్సింగ్‌కే రియో ఒలింపిక్స్‌లో పాల్గొనే అర్హత ఉందని స్పష్టం చేసింది. అయితే రియో ఒలింపిక్స్‌కు రెండు వారాలు ఉన్నాయనగా నర్సింగ్ డోపింగ్‌లో పట్టుబడటం, అతనిపై నిషేధం విధించడం జరిగింది. -
యువ క్రికెటర్‌పై రెండేళ్ల నిషేధం
ఢాకా: బంగ్లాదేశ్ యువ పేసర్ కాజీ అనిక్ ఇస్లామ్‌పై రెండేళ్ల నిషేధం పడింది. డోప్ టెస్టులు విఫలం కావడంతో అతనిపై రెండేళ్లు నిషేధం విధిస్తూ జాతీయ క్రికెట్ బోర్డు నిర్ణయం తీసుకుంది. 2018లో నిర్వహించిన డోప్ టెస్టులో విఫలం కావడంతో అతనిపై ఎట్టకేలకు నిషేధం పడింది. రెండేళ్ల క్రితం జరిగిన అండర్-19 వరల్డ్‌కప్‌లో బంగ్లాదేశ్ లీడింగ్ వికెట్ టేకర్‌గా నిలిచిన కాజీ ఇస్లామ్.. అదే ఏడాది నిర్వహించిన డోప్ టెస్టులో విఫలయ్యాడు. నిషేధిత ఉత్రేరకం మెథామ్‌ఫిటామైన్‌ను కాజీ తీసుకున్నట్లు రుజువు కావడంతో నిషేధం తప్పలేదు. (బీసీసీఐ తీరు దారుణం: యువరాజ్) కాగా, ఆ నిషేధం 2019 ఫిబ్రవరి 8 వ తేదీ నుంచి అమల్లోకి వచ్చిందని తాజాగా బీసీబీ ఓ ప్రకటనలో స్పష్టం చేసింది. కాగా, ఆ ఉత్ప్రేరకాన్ని తీసుకుని తప్పు చేసినట్లు కాజీ అనిక్ బోర్డు పెద్దల ముందు అంగీకరించినట్లు బీసీబీ తెలిపింది. అయితే కావాలని కాజీ చేయలేదని భావించిన బీసీబీ.. అతనిపై రెండేళ్ల నిషేధంతో సరిపెట్టినట్లు పేర్కొంది. ఎటువంటి విచారణ లేకుండా కాజీ తన తప్పును ఒప్పుకోవడంతో సమయంతో పాటు డబ్బును కూడా ఆదా చేశాడని, దాంతో అతనిపై రెండేళ్ల నిషేధం సరైనది భావించినట్లు బీసీబీ ప్రకటనలో వెల్లడించింది. కాజీ తన ఫస్ట్‌క్లాస్ కెరీర్లో నాలుగు మ్యాచ్‌లు ఆడి 15 వికెట్లు తీశాడు. -
ప్రదీప్... కొత్త రకం డోపీ
న్యూఢిల్లీ: భారత క్రీడా రంగంలో కుదుపు! 2018 కామన్వెల్త్ గేమ్స్‌లో 105 కేజీల విభాగంలో రజత పతకం నెగ్గిన భారత వెయిట్‌లిఫ్టర్ ప్రదీప్ సింగ్ సరికొత్త డోపింగ్‌కు పాల్పడ్డాడు. హ్యూమన్ గ్రోత్ హార్మోన్ (హెచ్‌జీహెచ్) డోపింగ్‌లో ఈ పంజాబ్ లిఫ్టర్ దొరికిపోయాడు. ఈ హెచ్‌జీహెచ్ కేసు ప్రపంచానికి ముందే పరిచయమైనా... భారత్‌లో ఇదే తొలి కేసు. జాతీయ డోపింగ్ నిరోధక సంస్థ (నాడా) పరీక్షల్లో లాక్‌డౌన్‌కు ముందే మార్చిలో పట్టుబడినప్పటికీ ‘బి’ శాంపిల్‌తో ధ్రువీకరించుకున్న తర్వాత ‘నాడా’ తాజాగా వెల్లడించింది. అథ్లెట్లు అత్యంత అరుదుగా ఈ తరహా మోసానికి పాల్పడతారు. ఇది మామూలు ఉత్ప్రేరకం కాదు. మెదడులోని గ్రంథి స్రావాల ద్వారా ఉత్తేజితమయ్యే ఉత్ప్రేరకం. రైల్వేస్‌కి చెందిన వెయిట్‌లిఫ్టర్ ప్రదీప్ హెచ్‌జీహెచ్‌కు పాల్పడినట్లు తేలడంతో భారత వెయిట్‌లిఫ్టింగ్ సమాఖ్య నాలుగేళ్ల నిషేధం విధించింది. దీనిపై ‘నాడా’ డైరెక్టర్ నవీన్ అగర్వాల్ మాట్లాడుతూ ‘ఇలాంటి డోపింగ్ కేసు మన దేశంలో మొదటిది. మార్చిలోనే సంబంధిత సమాఖ్యకు సమాచారమిచ్చాం. నిజానికి పోటీల్లేని సమయంలో డిసెంబర్లో అతని నుంచి నమూనాలు సేకరించాం. ‘వాడా’ గుర్తింపు పొందిన ‘దోహా’ ల్యాబ్‌కు పంపి పరీక్ష చేయగా దొరికిపోయాడు’ అని తెలిపాడు. ఫిబ్రవరిలో జరిగిన జాతీయ చాంపియన్‌షిప్‌లో ప్రదీప్ 102 కేజీల కేటగిరీలో పాల్గొని స్వర్ణం గెలిచాడు. మార్చిలో డోపింగ్‌లో దొరికిన వెంటనే ‘నాడా’ ఇచ్చిన సమాచారం మేరకు భారత వెయిట్‌లిఫ్టింగ్ సమాఖ్య అతన్ని శిబిరం నుంచి తప్పించింది. హెచ్‌జీహెచ్ అంటే... కొన్ని రకాల మెడిసిన్ ద్వారా హెచ్‌జీహెచ్ శరీరంలోకి ఉత్పత్తి అవుతుంది. మానవ శరీరాన్ని అత్యంత చాకచక్యంగా ఉత్తేజితం చేస్తుంది. ఎముక, ఇతర దెబ్బతిన్న అవయ వం పెరుగుదలకు దోహదం చేస్తుంది. ఎముకశక్తిని పటిష్టపరుస్తుంది. కండరాల సామర్థ్యాన్ని పెంచుతుంది. అంతర్జాతీయ డోపిం గ్ నిరోధక సంస్థ (వాడా) ప్రకారం 2010 నుంచి ఈ తరహా డోపింగ్‌కు పాల్పడింది కేవలం 15 మందే. ఇందులో ఇద్దరు లండన్ ఒలింపిక్స్ సమయంలో దొరికిపోయారు. -
భారత రోయింగ్‌లో డోపింగ్ కలకలం
న్యూఢిల్లీ: ఒకే క్రీడకు చెందిన ఆటగాళ్లు పెద్దసంఖ్యలో డోపీలుగా తేలడం... వారంతా మైనర్లు కావడం భారత క్రీడారంగంలో కలకలం రేపింది. ఏకంగా 22 మంది జూనియర్ రోయర్లు నిషిద్ధ ఉత్ప్రేరకాలు తీసుకున్నట్లు జాతీయ డోపింగ్ నిరోధక సంస్థ (నాడా) పరీక్షల్లో తేలింది. వీరిలో చాలా మంది ‘ఖేలో ఇండియా’ గేమ్స్‌లో పాల్గొన్న వారే కావడం గమనార్హం. పోటీలు లేని సమయంలో హైదరాబాద్‌లో ఉన్నప్పుడు వీరి నుంచి సేకరించిన నమూనాల్లో అంతా ఒకే రకమైన నిషిద్ధ ఉత్ప్రేరకాలు తీసుకున్నట్లు తేలడం పలు అనుమానాలను రేకెత్తిస్తోంది. థాయ్‌లాండ్‌లో జరిగిన ఆసియా జూనియర్ రోయింగ్ చాంపియన్‌షిప్ కోసం అప్పుడు వీరంతా హైదరాబాద్ శిబిరంలో శిక్షణ తీసుకుంటున్నారు. 2005లో ‘నాడా’ మొదలయ్యాక ఇలా ఒకే ఆటకు చెందిన ఇంత మంది పట్టుబడటం ఇదే తొలిసారి.] వీరంతా 16 ఏళ్ల నుంచి 18 ఏళ్ల లోపు (మైనర్లు) వారే కావడంతో నిబంధనల ప్రకారం రోయర్ల పేర్లు వెల్లడించడం లేదు. దీనిపై తదుపరి చర్యలు తీసుకునేందుకు ‘నాడా’ సిద్ధమైంది. జాతీయ డోప్ టెస్టింగ్ లాబోరేటరీపై నిషేధం ఉండటంతో ‘నాడా’... దోహా లాబోరేటరీలో నమూనాల్ని పరీక్షించింది. ఇందులో జూనియర్ రోయర్లంతా ఒకే రకమైన ఉత్ప్రేరకాన్ని తీసుకున్నట్లు తేలింది. ఈ ఘటనను తీవ్రంగా పరిగణించిన భారత రోయింగ్ సమాఖ్య (ఆర్ఎఫ్ఐ) విచారణ చేపట్టనుంది. బహుశా రోయర్లు తీసుకున్న ఆహార పదార్థాలే కారణం కావొచ్చని ఆర్ఎఫ్ఐ ప్రాథమికంగా భావిస్తోంది. తదుపరి దర్యాప్తులోనే ఈ విషయాలు వెల్లడవుతాయని ఆర్ఎఫ్ఐ కార్యదర్శి శ్రీరామ్ తెలిపారు. -
వివాదంలో వరల్డ్ చాంపియన్
న్యూయార్క్: ప్రపంచ 100 మీ. స్ప్రింట్ చాంపియన్, అమెరికన్ స్టార్ క్రిస్టియాన్ కోల్‌మన్‌పై సస్పెన్షన్ వేటు పడింది. డోపింగ్ టెస్టుకు పిలిచినపుడు అందుబాటులోకి రాకపోవడంతో అథ్లెటిక్స్ ఇంటిగ్రిటీ యూనిట్ (ఏఐయూ) అతనిపై తాత్కాలిక నిషేధం విధించింది. ఈ విషయంపై తుది విచారణ పూర్తయ్యే వరకు అతను ఎలాంటి పోటీల్లో పాల్గొనరాదని ఆదేశించింది. గత ఏడాదే అతను ‘ఎప్పుడు ఎక్కడ’ నిబంధనను పాటించకపోవడంతో చర్య తీసుకోవాలనుకున్నప్పటికీ ప్రపంచ చాంపియన్‌షిప్ కావడంతో ఏఐయూ కాస్త వెనుకంజ వేసింది. అయితే గడిచిన 12 నెలల కాలంలో మూడుసార్లు టెస్టులకు ప్రయత్నించినా...తాను ఎక్కడున్నాడనే సమాచారాన్ని కోల్మన్ ఇవ్వకపోవడంతో తాజాగా చర్యలు తీసుకున్నారు. దీనిపై కోల్మన్ స్పందిçస్తూ గత డిసెంబర్ 9న ఏఐయూ నుంచి ఫోన్ కాల్ వచ్చినప్పటికీ తను క్రిస్మస్ షాపింగ్‌లో బిజీగా ఉండటం వల్లే కాల్‌కు స్పందించలేకపోయానని ట్వీట్ చేశాడు. ఈ ఒక్క ఫోన్ కాల్కే తనను సస్పెండ్ చేయడం విడ్డూరమని అన్నాడు. దీనిపై ఏఐయూ మాట్లాడుతూ పలుమార్లు ప్రయత్నించినా టెస్టులు చేసుకునేందుకు అతను అందుబాటులో లేకపోవడంతోనే ప్రపంచ డోపింగ్ నిరోధక సంస్థ (వాడా) నిబంధనల మేరకే చర్యలు తీసుకున్నామని తెలిపింది. -
‘ఎక్కడ ఉన్నారో ఎందుకు చెప్పలేదు’
ముంబై: క్రికెటర్లు తమ డోపింగ్ పరీక్షల పరిధిలోకి వచ్చిన తర్వాత తొలిసారి జాతీయ డోపింగ్ నిరోధక సంస్థ (నాడా) తమదైన శైలిలో కొరడా ఝళిపించింది. ఐదుగురు బీసీసీఐ కాంట్రాక్ట్ క్రికెటర్లు నిబంధనల ప్రకారం తమ వివరాలు వెల్లడించడంలో విఫలమయ్యారని నోటీసులు జారీ చేసింది. టెస్టు స్పెషలిస్ట్ పుజారా, రవీంద్ర జడేజా, లోకేశ్ రాహుల్‌తో పాటు మహిళా క్రికెటర్లు స్మృతి మంధాన, దీప్తి శర్మలకు నోటీసులు పంపించినట్లు ‘నాడా’ పేర్కొంది. దీనికి సాఫ్ట్వేర్ సమస్యలే కారణమంటూ భారత క్రికెట్ నియంత్రణ మండలి (బీసీసీఐ) ఇచ్చిన వివరణతో ‘నాడా’ సంతృప్తి చెందినట్లుగా కనిపించడం లేదు. పూర్తి వివరాలు ఇవ్వకుండా... సుదీర్ఘ కాలంగా ‘నాడా’ పరిధిలోకి రాకుండా తప్పించుకుంటూ వచ్చిన బీసీసీఐ కూడా కొన్నాళ్ల క్రితమే ప్రభుత్వ ఆదేశాలతో తప్పనిసరి పరిస్థితుల్లో డోపింగ్ వ్యవస్థలో భాగమైంది. ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన నేషనల్ రిజిస్టర్డ్ టెస్టింగ్ పూల్ (ఎన్‌ఆర్‌టీపీ)లో క్రికెటర్లతో సహా మొత్తం 110 మంది ఆటగాళ్లు ఉన్నారు. ఏడాదిలో కనీసం ఎప్పుడైనా ‘నాడా’ కోరినప్పుడు ఆటగాళ్లు తమ వివరాలు ఇవ్వాల్సి ఉంటుంది. ఇందులో ముఖ్యంగా ‘ఏ సమయంలో ఎక్కడ ఉన్నారు’ అనేది కీలకమైంది. ఫలానా సమయంలో తాము ఫలానా చోట ఉన్నామంటూ ఆటగాళ్లు స్వయంగా యాంటీ డోపింగ్ అడ్మినిస్ట్రేషన్ అండ్ మేనేజ్మెంట్స్ సిస్టమ్స్ (ఏడీఏఎంఎస్) ఫామ్‌లో వివరాలు భర్తీ చేయాలి. నిజానికి ఈ ‘ఎప్పుడు ఎక్కడ’ నిబంధనను తొలగించాలంటూనే సుదీర్ఘ కాలం బీసీసీఐ పోరాడింది. ఇది ఎవరికి వారు వ్యక్తిగతంగా చేయవచ్చు. అయితే పెద్దగా చదువుకోని ఆటగాళ్లు ఎవరైనా కొందరు ఉంటే ఇబ్బంది పడవచ్చు కాబట్టి వారి తరఫున ఆయా క్రీడా సమాఖ్యలు కూడా భర్తీ చేసే వెసులుబాటు ఉంది. ఈ బాధ్యతను సమాఖ్యలు తీసుకున్నాయి కూడా. అయితే ఈ ఐదుగురు ఆటగాళ్ల వివరాలు మాత్రం ‘నాడా’కు అందలేదు. ఇదేం వివరణ... సమాచారం అప్లోడ్ చేయకపోవడంపై బీసీసీఐ తమ వైపు నుంచి వివరణ పంపించింది. ఏడీఏఎంఎస్కు సంబంధించి పాస్వర్డ్ విషయంలో కొంత సమస్య రావడం వల్లే తాము వివరాలు వెల్లడించలేకపోయామని బోర్డు పేర్కొంది. అయితే ‘నాడా’ డీజీ నవీన్ అగర్వాల్ దీనిపై సంతృప్తి చెందలేదు. ఈవెంట్లు జరిగే సమయంలో సమస్య ఉండకపోవచ్చు కానీ లాక్డౌన్ కారణంగా మూడు నెలలుగా ఎలాంటి ఆటలు లేవు కాబట్టి ఈ సమస్యలో ‘ఎప్పుడు ఎక్కడ’ నిబంధన ఎంతో కీలకమని ఆయన అన్నారు. ‘బీసీసీఐ దీనికి కారణం ఏమిటో చెప్పింది. అయితే దీనిపై మేం చర్చిస్తాం. నిజంగా పొరపాటు జరిగిందా లేదంటే దీనిని తొలి వైఫల్యం కింద లెక్క కట్టాలా అనేది తర్వాత నిర్ణయిస్తాం’ అని ఆయన అన్నారు. మూడుసార్లు ఇదే తరహాలో వివరాలు ఇవ్వడంలో విఫలమైతే దానిని డోపింగ్గా భావించి రెండేళ్ల నిషేధం విధించేందుకు ‘నాడా’కు అధికారం ఉంది. ఆ మాత్రం చేయలేరా? తాజా అంశంపై పేరు చెప్పడానికి ఇష్టపడని ఒక సీనియర్ బీసీసీఐ అధికారి స్పందిస్తూ... చిన్న పాస్వర్డ్ సమస్యను పరిష్కరించునేందుకు ఇంత సమయం పడుతుందా అని ప్రశ్నించారు. ‘క్రికెటర్లంతా ఇప్పుడు ఖాళీగానే ఉన్నారు. అన్ని సౌకర్యాలు ఉన్నాయి. పైగా ఇన్స్టాగ్రామ్ చాట్లలో కూడా కనిపిస్తున్నారు. తమ వివరాలు ఇవ్వాలని ఈ ఐదుగురికి బీసీసీఐ చెబితే సరిపోయేది కదా. పైగా అందరికీ సొంత మేనేజర్లు కూడా ఉన్నారు. వారు చేయలేరా? ఈ సారికి క్షమిస్తే సరి. ‘నాడా’ అధికారికంగా హెచ్చరిక జారీ చేస్తే ఎవరు బాధ్యులు’ అని ఆయన ప్రశ్నించారు. -
సంజిత చాను డోపీ కాదు
న్యూఢిల్లీ: భారత మహిళా వెయిట్‌లిఫ్టర్ సంజిత చాను డోపీ కాదని అంతర్జాతీయ వెయిట్‌లిఫ్టింగ్ సమాఖ్య (ఐడబ్ల్యూఎఫ్) తెలిపింది. అమె నమూనాల్లో కచ్చితమైన ఉత్ప్రేరకాల ఆనవాళ్లు లేకపోవడంతో ఐడబ్ల్యూఎఫ్ ఈ నిర్ణయం తీసుకుంది. ‘ప్రపంచ డోపింగ్ నిరోధక సంస్థ (వాడా) సిఫార్సు మేరకు సంజితపై మోపిన డోపింగ్ కేసును కొట్టివేస్తున్నాం’ అని ఐడబ్ల్యూఎఫ్ ఈ–మెయిల్లో తెలిపింది. 26 ఏళ్ల మణిపూర్ లిఫ్టర్ 53 కేజీల కేటగిరీలో 2014 గ్లాస్గో, 2018 గోల్డ్‌కోస్ట్ కామన్వెల్త్ గేమ్స్‌లో బంగారు పతకాలు గెలుపొందింది. అయితే 2017 నవంబర్‌లో అమెరికాలో ప్రపంచ చాంపియన్‌షిప్ పోటీలకు ముందు ఆమె నుంచి నమూనాలు సేకరించారు. సంజిత నిషేధిత ఉత్ప్రేరకాలు తీసుకున్నట్లు ఫలితం వచ్చింది. దీంతో ఆమెపై 2018 మేలో సస్పెన్షన్ వేటు వేశారు. దీనిపై ఆమె నిర్దోషినంటూ మొదటి నుంచి వాదిస్తూనే వచ్చింది. ఎట్టకేలకు న్యాయం గెలిచిందన్న చాను తను ఇన్నాళ్లు పడిన మానసిక క్షోభకు ఐడబ్ల్యూఎఫ్ క్షమాపణలు చెప్పాలని, నష్ట పరిహారం కూడా అందజేయాలని డిమాండ్ చేసింది. వారి నిర్వాకం వల్ల తను టోక్యో ఒలింపిక్స్ అర్హత పోటీలకు దూరమయ్యానని, దీనికి మూల్యం ఎవరు చెల్లిస్తారని ఆమె ఘాటుగా స్పందించింది. -
21 ఏళ్లకే డోపింగ్ చేశా: ఆర్మ్‌స్ట్రాంగ్
పారిస్: అమెరికా సూపర్ సైక్లిస్ట్‌గా... ప్రతిష్టాత్మక సైకిల్ రేసు ‘టూర్ డి ఫ్రాన్స్’కే మేటి చాంపియన్‌గా వెలుగువెలిగిన లాన్స్ ఆర్మ్‌స్ట్రాంగ్ 2012లో డోపీగా తేలాక ప్రభ కోల్పోయాడు. దిగ్గజస్థాయి నుంచి దిగజారిపోయి జీవితకాల నిషేధానికి గురయ్యాడు. డోపింగ్ బాగోతాన్ని తన కెరీర్ తొలినాళ్ల నుంచే మొదలు పెట్టినట్లు ఆర్మ్‌స్ట్రాంగ్ సెలవిచ్చాడు. 21 ఏళ్ల వయసులోనే తొలి ప్రొఫెషనల్ సీజన్లో డోపింగ్‌కు పాల్పడినట్లు అంగీకరించాడు. విటమిన్ ఇంజెక్షన్ల ద్వారా, ఇత రత్రా మెడిసిన్ల ద్వారా డోపింగ్‌కు పాల్పడినట్లు చెప్పాడు. అతనిపై తీసిన ఓ డాక్యుమెంటరీలో ఈ విషయాన్ని స్వయంగా తానే వివరించాడు. ‘లాన్స్’ పేరిట రెండు భాగాలుగా ప్రసారం కానున్న ఈ డాక్యుమెంటరీ మే 24, 31 తేదీల్లో చూడొచ్చు. -
అథ్లెట్ జూమా ఖాతూన్‌పై నాలుగేళ్ల నిషేధం
న్యూఢిల్లీ: డోపింగ్‌లో పట్టుబడటంతో భారత మహిళా మిడిల్ డిస్టెన్స్ రన్నర్ జూమా ఖాతూన్‌పై అంతర్జాతీయ అథ్లెటిక్స్ సమాఖ్య నాలుగేళ్లపాటు నిషేధం విధించింది. అంతర్జాతీయ డోపింగ్ నిరోధక సంస్థ (వాడా) నిర్వహించిన పరీక్షలో ఆమె నిషేధిత ఉత్ప్రేరకం ‘డి హైడ్రోక్లోరోమిథైల్ టెస్టోస్టిరాన్’ వాడినట్లు తేలింది. 2018 జూన్‌లో గువాహటి వేదికగా జరిగిన అంతర్ రాష్ట్ర చాంపియన్‌షిప్‌లో జుమా 1500, 5000 మీటర్ల విభాగాల్లో కాంస్య పతకాలు సాధించింది. ఈ పోటీల సందర్భంగా ఆమె నుంచి జాతీయ డోపింగ్ టెస్టింగ్ లేబొరేటరీ (ఎన్‌డీటీఎల్) శాంపిల్స్ సేకరించి పరీక్ష చేయగా నెగెటివ్ అని తేలింది. అయితే అదే శాంపిల్‌ను ‘వాడా’ పరీక్షించగా పాజిటివ్‌గా తేలడం గమనార్హం. జుమాపై నిషేధం ఈ ఏడాది విధించినా... ఈ నిషేధం మాత్రం 2018 నుంచి అమల్లోకి రానుంది. ఫలితంగా 2018 జూన్ నుంచి నవంబర్ వరకు ఆమె పాల్గొన్న ఈవెంట్స్‌లో సాధించిన అన్ని ఫలితాలను రద్దు చేశారు. -
‘తెలియక తప్పు చేశా..నరకం చూశా’
న్యూఢిల్లీ: గతేడాది డోపింగ్ టెస్టులో విఫలమై ఎనిమిది నెలల నిషేధం ఎదుర్కొన్న భారత యువ క్రికెటర్ పృథ్వీ షా.. ఆ సమయం చాలా నరకంగా అనిపించిందన్నాడు. ఒక చిన్నపొరపాటుకు డోపింగ్‌లో పట్టుబడటం ఒకటైతే, కొందరు చేసే విమర్శలు ఇంకా బాధించాయన్నాడు. ఆ కష్ట సమయాన్ని ఓర్పుగా భరించానని పేర్కొన్న పృథ్వీ షా.. ఆ విమర్శలకు బ్యాట్‌తోనే సమాధానం చెప్పాలనుకున్నానని తెలిపాడు. తాను డోపింగ్ టెస్టులో విఫలమై క్రికెట్‌కు దూరమైన సమయంలో ఒక విషయం మాత్రం బోధపడిందన్నాడు.తాను వంద శాతం ప్రజల్ని సంతృప్తి పరచలేనని విషయం అర్థమైందన్నాడు. తాను ఇంటి దగ్గర కూర్చోవాల్సిన పరిస్థితుల్లో ఎన్నో జీవిత పాఠాలు నేర్చుకున్నానన్నాడు. (భారత్ సాయం కోరిన అక్తర్) ‘ నా క్రికెట్ కెరీర్లో అండర్-19 వరల్డ్‌కప్ గెలవడం ఒక మరచిపోలేని జ్ఞాపకమైతే, అరంగేట్రం టెస్టు మ్యాచ్‌లో సెంచరీ చేయడం మరొక జ్ఞాపకం. ఈ రెండు ఎప్పటికీ మరచిపోలేనివి. ఇక డోపింగ్ కంట్రోల్ అనేది నా చేతుల్లోనే ఉంటుంది. గాయాలు అనేవి మన చేతుల్లోఉండవు. విమర్శలు అనేవి జీవితంలో ఒక భాగమే. విమర్శలు చేసేటప్పుడు అది మంచి విమర్శగా ఉండాలి. అది మనకు ఉపయోగపడాలి. నిజంగా 2019 సంవత్సరం నాకు చేదు జ్ఞాపకాల్ని మిగిల్చిపోయింది. ప్రతీ విమర్శను మనం డిఫెన్స్ చేసుకోవాల్సిన అవసరం లేదు. సమయం వచ్చినప్పుడు బ్యాట్‌తోనే వాటికి సమాధానం చెబుతా’ అని పృథ్వీ షా తెలిపాడు. ‘గతేడాది ఫిబ్రవరిలో జరిగిన ముష్తాక్ అలీ టోర్నీలో ముంబై తరఫున ఆడిన నేను తీవ్ర జలుబు, దగ్గుతో బాధపడ్డాను. దీంతో తక్షణ ఉపశమనం కోసం దగ్గుమందు వాడాను. ఆసీస్ టూర్లో అయిన కాలి గాయం నుంచి త్వరగా కోలుకోవాలనే ఆతృతలో కనీస జాగ్రత్తలు పాటించకుండా కాఫ్ సిరప్ విషయంలో ప్రోటోకాల్ పాటించలేదు. కనీసం బీసీసీఐ డాక్టర్‌ను కానీ, వేరే డాక్టర్‌ను కానీ సంప్రదించాల్సి ఉండాల్సింది. తొందర్లో చిన్న మెడిసినే కదా అని ఆ సిరప్ వాడాను. అది నిషేధిత మెడిసన్ అనే విషయం తెలియదు. దాంతో ఇబ్బందుల్లో పడ్డాను’ అని పృథ్వీ షా చెప్పుకొచ్చాడు. ఆ తెలియక చేసిన తప్పుకు నరకం అనుభవించానని ఈ యువ ఓపెనర్ తనలోని ఆవేదనను మరోసారి వెళ్లగక్కాడు. (రవిశాస్త్రి ‘ట్రేసర్ బుల్లెట్’ వైరల్..!) -
థాయ్‌లాండ్ వెయిట్‌లిఫ్టింగ్ సమాఖ్యపై వేటు
బుడాపెస్ట్: నిర్ణీత సంఖ్యలో కంటే ఎక్కువగా వెయిట్‌లిఫ్టర్లు డోపింగ్‌లో దొరికిపోవడంతో... థాయ్‌లాండ్, మలేసియా వెయిట్‌లిఫ్టింగ్ సమాఖ్యలపై అంతర్జాతీయ వెయిట్‌లిఫ్టింగ్ సమాఖ్య (ఐడబ్ల్యూఎఫ్) వేటు వేసింది. దాంతో ఈ రెండు దేశాల లిఫ్టర్లు వచ్చే ఏడాది టోక్యో ఒలింపిక్స్‌కు దూరం కానున్నారు. థాయ్‌లాండ్‌పై మూడేళ్ల నిషేధం విధించడంతోపాటు 2 లక్షల డాలర్ల జరిమానా వేశామని... మలేసియాపై ఏడాదికాలం నిషేధం విధించామని ఐడబ్ల్యూఎఫ్ తెలిపింది. గత బుధవారం నిషేధానికి సంబంధించిన సమాచారం థాయ్‌లాండ్, మలేసియా వెయిట్‌లిఫ్టింగ్ సమాఖ్యలకు ఇచ్చామని, నిషేధంపై కోర్టు ఆఫ్ ఆర్బిట్రేషన్ ఆఫ్ స్పోర్ట్ (సీఏఎస్)లో అప్పీల్ చేసుకునేందుకు 21 రోజుల గడువు ఉందని ఐడబ్ల్యూఎఫ్ తెలిపింది. 2018 ప్రపంచ చాంపియన్ షిప్లో థాయ్‌లాండ్‌కు చెందిన తొమ్మిది మంది లిఫ్టర్లు డోపింగ్‌లో పట్టుబడ్డారు. -
అబిగెయిల్ స్పియర్స్‌పై నిషేధం
పారిస్: డోపింగ్‌లో పట్టుబడినందుకు అమెరికాకు చెందిన మహిళల టెన్నిస్ డబుల్స్ స్టార్ ప్లేయర్ అబిగెయిల్ స్పియర్స్‌పై అంతర్జాతీయ టెన్నిస్ సమాఖ్య (ఐటీఎఫ్) 22 నెలలపాటు నిషేధం విధించింది. 2019 యూఎస్ ఓపెన్ గ్రాండ్‌స్లామ్ టోర్నీ సందర్భంగా స్పియర్స్‌కు నిర్వహించిన డోపింగ్ పరీక్షల్లో ఆమె నిషేధిత ఉ్రత్పేరకాలు ప్రాస్టీరోన్, టెస్టోస్టిరాన్ వాడినట్లు తేలింది. ‘తన శరీరంలోకి నిషేధిత ఉత్ప్రేరకాలు ఎలా వచ్చాయో స్పియర్స్ ఇచ్చిన వివరణను విన్నాం. ఆమె వివరణను అంగీకరించాం. అయితే ఆమె తప్పు చేసినందుకు నిషేధం ఎదుర్కోవాల్సిందే’ అని ఐటీఎఫ్ తెలిపింది. డోపింగ్ ఫలితాలు వచి్చన తేదీ 2019 నవంబర్ 7 నుంచి నిషేధం అమలవుతుందని వచ్చే ఏడాది సెపె్టంబర్ 6 వరకు కొనసాగుతుందని ఐటీఎఫ్ తెలిపింది. స్పియర్స్ తన కెరీర్లో 21 డబుల్స్ టైటిల్స్ గెలిచింది. 2017 ఆ్రస్టేలియన్ ఓపెన్‌లో కొలంబియా ప్లేయర్ యువాన్ సెబాస్టియన్ కబాల్‌తో జతగా స్పియర్స్ మిక్స్డ్ డబుల్స్ విభాగంలో విజేతగా నిలిచింది. 2013, 2014 యూఎస్ ఓపెన్ మిక్స్డ్ డబుల్స్ విభాగాల ఫైనల్స్‌లో స్పియర్స్ ఓడిపోయి రన్నరప్ ట్రోఫీ సాధించింది. -
డోపీలు సుమీత్, రవి
న్యూఢిల్లీ: అంతర్జాతీయ స్థాయిలో నిలకడగా రాణిస్తున్న భారత బాక్సర్ సుమీత్ సాంగ్వాన్... షూటర్ రవి కుమార్ డోపింగ్ పరీక్షల్లో పట్టుబడ్డారు. వీరిద్దరు ప్రపంచ డోపింగ్ నిరోధక సంస్థ (వాడా) నిషేధిత ఔషధాల జాబితాలో ఉన్నవాటిని వినియోగించినట్టు డోప్ పరీక్షల్లో తేలింది. సుమీత్ 2017 ఆసియా ఛాంపియన్ షిప్ లో రజతం గెలిచాడు. సుమీత్ ఎక్టెజోలామైడ్ ఉత్ప్రేరకం వాడినట్లు జాతీయ డోపింగ్ నిరోధక సంస్థ (నాడా) తెలిపింది. గత ఏడాది జరిగిన కామన్వెల్త్ గేమ్స్, ఆసియా క్రీడల్లో 10 మీటర్ల ఎయిర్ రైఫిల్ విభాగంలో కాంస్య పతకాలు గెలిచిన షూటర్ రవి కుమార్ ప్రొప్రానోలోల్ ట్యాబ్లెట్‌ను వాడినట్లు డోప్ పరీక్షలో తేలింది. మైగ్రేన్ తలనొప్పి వచ్చినపుడు డాక్టర్ వద్దకు వెళ్లగా అతను ఈ ట్యాబ్లెట్ రాసిచ్చాడని రవి తెలిపాడు. -
రష్యాకు శృంగభంగం!
అంతర్జాతీయ ఈవెంట్లలో అవకాశం దొరికిందే తడవుగా క్రీడాభిమానుల్ని అబ్బురపరిచి వారి హృదయాల్లో శాశ్వత స్థానం పొందడానికి.. చరిత్ర పుటల్లోకెక్కడానికి క్రీడాకారులంతా శక్తివంచన లేకుండా కృషి చేస్తారు. అందుకోసం తమ క్రీడా నైపుణ్యానికి నిరంతరం పదును పెట్టుకుంటూ, ఎంచుకున్న ఆటలో ప్రత్యర్థిని మట్టికరిపించడానికి అవసరమైన మెలకువలన్నీ నేర్చుకుంటారు. కానీ రష్యా ఈ మార్గాన్ని విడిచిపెట్టి తన ప్రతిభాపాటవాలన్నిటినీ దొంగచాటుగా నిషిద్ధ ఉత్ప్రేరకాలు వాడటంలో చూపించి, వాటి సాయంతో పతకాలు కొల్లగొడుతోందని ఏడెనిమిదేళ్లుగా ఆరోపణలుంటున్నాయి. వాటిని ఎప్పటికప్పుడు ఆ దేశం కొట్టిపడేస్తోంది. తమ క్రీడాకారుల్ని చూసి అసూయతో ఇలా తప్పుడు ఆరోపణలకు దిగుతున్నారని విరుచుకుపడుతోంది. కానీ గత నెలాఖరున ప్రపంచ డోపింగ్ నిరోధక సంస్థ ‘వాడా’ నియమించిన కమిటీ అవన్నీ పచ్చి నిజాలని ధ్రువీకరించి, నాలుగేళ్ల పాటు రష్యాకు ఏ అంతర్జాతీయ పోటీల్లోనూ ప్రవేశం లేకుండా నిషే«ధించాలని సిఫార్సు చేసింది. తాజాగా ఆ సిఫార్సును ‘వాడా ఆమోదించిన పర్యవసానంగా వచ్చే ఏడాది టోక్యోలో జరగనున్న ఒలింపిక్స్‌తోపాటు అదే సంవత్సరం జరిగే పారాలింపిక్స్, 2022లో జరగబోయే యూత్ ఒలిపింక్స్, వింటర్ ఒలింపిక్స్ క్రీడోత్సవాల్లో రష్యా జట్లు పాల్గొనడానికి వీలుండదు. అంతేకాదు... వచ్చే నాలు గేళ్లలో అది ఏ అంతర్జాతీయ క్రీడా పోటీలకూ ఆతిథ్యం కూడా ఇవ్వడం సాధ్యపడదు. విశ్వవేదికల్లో నిర్వహించే క్రీడలు సమీపిస్తున్నాయంటే అందరిలోనూ ఉత్సాహం ఉంటుంది. స్వయంగా వీక్షిద్దామని వెళ్లినవారికి సరే... ప్రపంచంలో మూలమూలనా క్రీడాభిమానులకు అవి సాగినన్నాళ్లూ పండగే. అయితే వాటిల్లో ఆడుతున్నవారంతా ఉత్ప్రేరకాలు మింగి చెలరేగుతున్నారని తెలిస్తే వారంతా ఎంతో నొచ్చుకుంటారు. సోవియెట్ యూనియన్‌గా ఉన్నప్పుడు ఏ క్రీడలోనైనా పతకాలు రాబట్టుకోవడానికి అది విశేషమైన కృషి చేసేది. తాము నమ్మిన సిద్ధాంతాలకు అనుగుణంగా మొదట్లో అది అంతర్జాతీయ క్రీడోత్సవాలకు దూరంగా ఉన్నా 1952లో మొదటిసారి ప్రవేశించింది మొదలుకొని ఆ దేశ క్రీడాకారులు మంచి ప్రతిభ కనబరిచేవారు. అన్ని ఈవెంట్లలో పోటీబడి పతకాలు సొంతం చేసుకునేవారు. సోవియెట్ విచ్ఛిన్నమయ్యాక 1992 నుంచి నాలుగేళ్లు అది అంత ర్జాతీయ పోటీలకు దూరంగా ఉండిపోయింది. తిరిగి 1996లో తొలిసారి అట్లాంటా ఒలింపిక్స్‌లో ఆడింది. గత వైభవాన్ని అందుకోవడానికి రష్యా చేస్తున్న కృషిని ప్రపంచమంతా ప్రశంసించింది. అన్ని దేశాలూ దాని స్ఫూర్తితో తమ క్రీడాకారుల ప్రతిభాపాటవాలకు పదును పెట్టడానికి కృషి చేశాయి. కానీ రష్యా ప్రతిభకు మూలాలు నిషిద్ధ ఉత్ప్రేరకాల్లో ఉన్నాయని వెల్లడయ్యాక ప్రపంచమే నివ్వెరపోయింది. తొలిసారి 2014లో జర్మనీకి చెందిన చానెల్ ఏఆర్డీ ప్రసారం చేసిన డాక్యుమెంటరీ అందరినీ దిగ్భ్రాంతిపరిచింది. రష్యన్ అథ్లెట్లు ఒక పద్ధతి ప్రకారం డోపింగ్‌కు పాల్పడుతూ ప్రపంచ క్రీడలకు మచ్చ తెస్తున్నారని అది తేల్చి చెప్పింది. పర్యవసానంగా ఆ దేశానికి చెందిన క్రీడా బాధ్యులు పలువురు పదవులనుంచి తప్పుకున్నారు. ఈ చానెల్ వెల్లడించిన అంశాల్లో నిజానిజాలు తేల్చడానికి ‘వాడా’ అప్పట్లోనే ఒక నిజనిర్ధారణ సంఘాన్ని నియమించింది. ఆ మరుసటి ఏడాది ఏఆర్డీ రెండో డాక్యుమెంటరీ విడుదల చేసింది. రష్యా, కెన్యా అథ్లెట్లు అసాధారణమైన రీతిలో డోపింగ్‌కు పాల్పడ్డా రని అంతర్జాతీయ అథ్లెటిక్ సంఘాల సమాఖ్య(ఐఏఏఎఫ్) డేటా ఆధారంగా ఆ డాక్యుమెంటరీ తేల్చి చెప్పింది. క్రీడా ప్రపంచంలో ఉన్నతంగా నిలవడం కోసం డోపింగ్‌ను రష్యా రాజ్య వ్యవస్థే ఒక క్రమ పద్ధతి ప్రకారం ప్రోత్సహిస్తున్నదని ‘వాడా’ నివేదిక కూడా ఆరోపించింది. ఇప్పుడు రష్యాపై విధించిన నిషేధంమాటెలా ఉన్నా ఇన్నాళ్లుగా ‘వాడా’ ఏం చేసిందన్న ప్రశ్నలు తలెత్తకమానవు. రష్యా డోపింగ్ నిరోధక సంస్థ ‘రుసాదా’ తమ నిబంధనలకు అనుగుణంగా పని చేయడం లేదని 2015లోనే ‘వాడా’ ప్రకటించింది. కానీ ఆ తర్వాత కూడా రష్యా క్రీడాకారులు విశ్వ క్రీడావేదికల్లో పాలుపంచుకున్నారు. ఇప్పుడు కూడా ‘మచ్చలేని’ రష్యా క్రీడాకారులు స్వతంత్ర హోదాలో ఒలింపిక్స్‌లో పాల్గొనవచ్చునని ‘వాడా’ చెబుతోంది. తమ నిబంధనలకు అనుగుణంగా నడుచుకోవడం లేదని ‘రుసాదా’పై అభియోగం మోపినప్పుడు అప్పట్లోనే నిషేధం దిశగా ఆలోచిం చివుంటే వేరుగా ఉండేది. ‘వాడా’ నివేదిక చూశాక రష్యా ప్రభుత్వం ‘రుసాదా’ అధిపతిని వెళ్లగొ ట్టింది. కానీ తమ క్రీడా మంత్రిత్వ శాఖకు ఈ కుంభకోణంతో ప్రమేయం లేదని తెలిపింది. ఈ విష యంలో నిష్పాక్షికంగా విచారణ జరిపితే తాము అన్నివిధాలా సహకరిస్తామని దేశాధ్యక్షుడు పుతిన్ అప్పట్లో తెలిపారు. కానీ మాస్కోలోని ల్యాబొరేటరీల్లో డోపింగ్ పరీక్షల నివేదికలన్నీ తారుమారయ్యా యని ‘వాడా’ 2016లో తేల్చింది. అప్పట్లో జరిగిన ఒలింపిక్స్‌లో రష్యా అథ్లెటిక్స్ విభాగంలో పోటీ పడకుండా నిషేధించింది. పూర్తిస్థాయి నిషేధానికి మరో మూడేళ్లు పట్టింది. ఈ మూడేళ్లలోనూ జరి గిన వివిధ క్రీడోత్సవాల్లో రష్యా పాల్గొనడం వల్ల వేరే దేశాల క్రీడాకారులకు అన్యాయం జరిగివుం డదా అన్న సందేహం ఎవరికైనా కలుగుతుంది. నిరుడు సెప్టెంబర్‌లో ‘రుసాదా’ను తిరిగి చేర్చుకున్న ప్పుడు మాస్కో ల్యాబొరేటరీల్లోని డేటా తమకు ఇవ్వాలని ‘వాడా’ షరతు పెట్టింది. కానీ ఇష్టాను సారం మార్చి తమకు అందజేశారని అది ఆలస్యంగా తెలుసుకుంది. రష్యా క్రీడా ప్రపంచంలోని చీకటి కోణాల గురించి ఇప్పటికి పుంఖానుపుంఖాలుగా కథనాలు వెలువడ్డాయి. కొత్త కుంభకోణం వెల్లడైనప్పుడల్లా పాతది వెలవెలబోవడం రివాజుగా మారింది. పతకాల మోజులో పడి, అడ్డదారిలో వాటిని కొల్లగొట్టడానికి ప్రయత్నించి రష్యా ఇప్పుడు ప్రపంచం ముందు దోషిగా నిలబడింది. తన క్రీడాకారుల బంగారు భవిష్యత్తును తానే నాశనం చేసింది. ‘వాడా’ విధించిన నిషేధంపై అప్పీల్‌కు వెళ్లి ఇంకా తాను సుద్దపూసనని అది చెప్పుకోవడానికి ప్రయత్నిస్తుందా లేక క్షమాపణ చెప్పి నాలు గేళ్లపాటు అన్నిటికీ దూరంగా ఉండి ప్రాయశ్చిత్తం చేసుకుంటుందా అన్నది వేచి చూడాలి. -
ఇది సానుకూల మలుపు
న్యూఢిల్లీ: భారత క్రికెట్ నియంత్రణ మండలి (బీసీసీఐ) కూడా డోపింగ్ విషయంలో జాతీయ డోపింగ్ నిరోధక సంస్థ (నాడా) పరిధిలోకి రావడాన్ని కేంద్ర క్రీడాశాఖ మంత్రి కిరణ్ రిజిజు స్వాగతించారు. క్రీడల్లో పారదర్శకత కోసం ఇది కీలక మలుపు అవుతుందని ఆయన వ్యాఖ్యానించారు. ‘ఎలాంటి అంశాలు, సమస్యలు అపరిష్కృతంగా ఉండాలని నేను కోరుకోవడం లేదు. విభేదాలన్నీ పరస్పర చర్చలతో పరిష్కరించుకోవాలి. నేను క్రీడలు, క్రీడాకారుల మేలు కోరేవాడిని. వాటిలో అన్నీ పారదర్శకంగా జరగాలని భావిస్తా’ అని రిజిజు అన్నారు. మరోవైపు క్రీడా శాఖతో చర్చల కోసం బోర్డు సీఈఓ రాహుల్ జోహ్రిని పంపడాన్ని బీసీసీఐ సీనియర్ సభ్యులు ఒకరు తప్పు పట్టారు. ఒలింపిక్స్‌లో క్రికెట్ చేర్చాలని ప్రయత్నిస్తున్న ఐసీసీ బృందంలో జోహ్రి కూడా సభ్యుడని... దానికి ఉన్న డోపింగ్ అడ్డంకిని తొలగించేందుకే క్రికెట్‌నూ ‘నాడా’లో చేర్చేందుకు జోహ్రి అంగీకరించారని ఆయన విమర్శించారు. -
ఇక నాడా డోప్ టెస్టులకు టీమిండియా ఆటగాళ్లు..!
న్యూఢిల్లీ : భారత క్రికెటర్లు ఇక నాడా (నేషనల్ యాంటి డోపింగ్ ఏజన్సీ) డోపింగ్ టెస్టుల్లో పాల్గొనాల్సిందేనని క్రీడా మంత్రిత్వశాఖ స్పష్టం చేసింది. ఆటగాళ్లందరూ సమానమేనని, ఈ విషయంలో క్రికెటర్లకు ఎలాంటి మినహాయింపులు ఉండవని క్రీడాశాఖ కార్యదర్శి ఆర్ఎస్ జులానియా వెల్లడించారు. ఇక ఈ నిర్ణయంతో టీమిండియా ఆటగాళ్లు నాడా పరిధిలోకి రానున్నారు. అయితే, నాడా పనితీరుపై బీసీసీఐకి అభ్యంతరాలు ఉన్నాయి. అందుకనే బోర్డే తన ఆటగాళ్లకు ఇన్నాళ్లూ డోప్ టెస్టులు నిర్వహిస్తూ వస్తోంది. ఇదిలాఉండగా.. ప్రపంచ డోపింగ్ నిరోధక సంస్థ (వాడా) నిషేధిత జాబితాలో ఉన్న టెర్బుటలైన్ ఉత్ప్రేరకాన్ని వాడిన యువ క్రికెటర్ పృథ్వీ షా 8 నెలల నిషేదానికి గురైన సంగతి తెలిసిందే. అవగాహన లేకే టెర్బుటలైన్ మెడిసిన్ తీసుకున్నట్లు పృథ్వీ బీసీసీఐకి వివరణ ఇచ్చాడు. కావాలని కాకుండా మెడిసిన్‌గా తీసుకోవడంతో బోర్డు కరుణించి అతనికి తక్కువ శిక్ష విధించింది. ఇక డోప్ టెస్ట్‌లు, శిక్షలు ఖరారు చేయడం పరస్పర విరుద్ధ ప్రయోజనం కిందకు వస్తుందని కేంద్ర క్రీడల శాఖ ఇటీవల బీసీసీఐకి లేఖ రాసింది. అంతర్జాతీయ డోపింగ్ వ్యతిరేక ఏజెన్సీ గుర్తించిన సంస్థ ద్వారానే డోప్ టెస్ట్‌లు నిర్వహించాలని బోర్డుకు సూచించింది. (చదవండి : డోప్ టెస్టులో పృథ్వీ షా విఫలం) అయితే, బీసీసీఐ మాత్రం తమ డోపింగ్ టెస్టులు అత్యున్నత నాణ్యతా ప్రమాణాలతో జరుగుతున్నాయన్న పేర్కొనడం విశేషం. ఇక క్రీడాశాఖ స్పష్టమైన ఆదేశాల నేపథ్యంలో టీమిండియా ఆటగాళ్లు నాడా డోపింగ్ పరీక్షల్లో పాల్గొనాల్సిందే. నాడా పనితీరుపై అనుమానాలు ఉన్నాయని బీసీసీఐ యాంటి డోపింగ్ మేనేజర్ అభిజిత్ సాల్వి అన్నారు. అందుకనే బీసీసీఐ ఆందోళన చెందుతోందని చెప్పారు. ఆ సంస్థ పేలవ పనితీరు ఫలితంగా ఎంతమంది ఇబ్బందులు పడ్డారో అందరికీ తెలుసునని చెప్పుకొచ్చారు. -
పాపం పృథ్వీ షా.. ఎంత దురదృష్టవంతుడో..!
భారత యువ క్రికెటర్ పృథ్వీ షాపై బీసీసీఐ నిషేదం నవంబర్ వరకు కొనసాగనుండటంతో షాకు తీవ్ర నిరాశ ఎదురైంది. గత సంవత్సరం అక్టోబర్‌లో డోపింగ్ పరీక్షలో షా విఫలమవడంతో అతడిపై బీసీసీఐ 8 నెలలపాటు నిషేధం విధించింది. మార్చి 16 నుంచి నవంబర్ వరకు కొనసాగించనున్నారు. ఈ సందర్భంగా ఇంగ్లండ్ ఫాస్ట్ బౌలర్ జోఫ్రా ఆర్చర్ 2015లో చేసిన ట్వీట్ సామాజిక మాధ్యమాల్లో ఇప్పుడు చక్కర్లు కొడుతోంది. ‘పాపం షా.. దురదృష్టవంతుడు’ అన్న ట్వీట్ ప్రస్తుత పరిస్థితికి సరిగ్గా సరిపోవటంతో క్రికెట్ అభిమానులు దాన్ని వెలికితీసి మరీ వైరల్ చేస్తున్నారు. గతంలోనూ ఆర్చర్ చేసిన చెప్పిన జోస్యం నిజమైంది. అతను ఊహించినట్టుగానే వన్డే వరల్డ్‌కప్‌కు ఆతిథ్యమిచ్చిన ఇంగ్లండ్ జట్టు టైటిల్ గెలిచింది. చదవండి: అంతా నా తలరాత.. : పృథ్వీషా డోపింగ్ టెస్టులో విఫలమయిన పృథ్వీపై నిషేధం కొనసాగుతుందని బీసీసీఐ మంగళవారం ప్రకటించింది. నిషేధం నవంబర్ వరకు కొనసాగుతుందన్న విషయం తెలిసిన పృథ్వీ షా భావోద్వేగంగా ట్వీట్ చేశాడు. తన దగ్గుమందు ఇంత పని చేస్తుంది అనుకోలేదని కలత చెందాడు. చిన్నపాటి అజాగ్రత్త వల్ల శిక్ష అనుభవిస్తున్నానన్నాడు. మిగతా క్రీడాకారులు తనను చూసైనా జాగ్రత్తపడతారని భావిస్తున్నానన్నాడు. చిన్న మందులైనా సరే క్రీడాకారులు చాలా జాగ్రత్తగా ఉండాలని సూచించాడు. పృథ్వీ షా గత సంవత్సరం అక్టోబర్‌లో వెస్టిండీస్‌తో టెస్ట్ మ్యాచ్ ఆడాడు. -
అంతా నా తలరాత.. : పృథ్వీషా
ముంబై : డోపింగ్ టెస్టులో విఫలమై, 8 నెలల నిషేధానికి గురైన ముంబై యువ క్రికెటర్, భారత టెస్టు ఓపెనర్ పృథ్వీ షా తన తప్పును అంగీకరించాడు. ఇదంతా తన తలరాతని, దానిని పూర్తిగా గౌరవిస్తానన్నాడు. పృథ్వీషా నుంచి సేకరించిన శాంపిల్స్‌ను పరీక్షించగా నిషేధిత ఉత్ప్రేరకం తీసుకున్నట్లు తేలింది. దీంతో బీసీసీఐ అతనిపై 8 నెలల నిషేధం విధించిన విషయం తెలిసిందే. అయితే దీన్ని తాజాగా కాకుండా పాత తేదీ (మార్చి 16)తో విధించడం వల్ల వచ్చే నవంబర్ 15వ తేదీతో ఈ నిషేధం ముగుస్తుంది. ఈ వ్యవహారంపై పృథ్వీషాపై ట్విటర్ వేదికగా సుదీర్ఘ పోస్టుతో వివరణ ఇచ్చుకున్నాడు. ‘నవంబర్ 15 వరకు క్రికెట్ ఆడలేనని ఈ రోజే తెలిసింది. ఫిబ్రవరిలో జరిగిన ముష్తాక్ అలీ టోర్నీలో ముంబై తరఫున ఆడిన నేను తీవ్ర జలుబు, దగ్గుతో బాధపడ్డాను. దీంతో తక్షణ ఉపశమనం కోసం దగ్గుమందు వాడాను. ఆసీస్ టూర్లో అయిన కాలి గాయం నుంచి త్వరగా కోలుకోవాలనే ఆతృతలో కనీస జాగ్రత్తలు పాటించకుండా కాఫ్ సిరప్ విషయంలో ప్రోటోకాల్ పాటించలేదు. నా తలరాతను నేను అంగీకరిస్తాను. నడుము నొప్పి నుంచి కోలుకోవాలని ప్రయత్నిస్తున్న నాకు ఈ వార్త ఖంగుతినిపించింది. మందుల విషయంలో అథ్లెట్లు ఎంత జాగ్రత్తగా ఉండాలో నా పరిస్థితిని చూసిన వారికి అర్థం అవుతోంది. మనకు అందుబాటులో లభించే మందులైనా, చిన్నదే అయినా ఆటగాళ్లు ప్రొటోకాల్ పాటించాల్సిందే. నాకు మద్దతుగా నిలిచిన బీసీసీఐ, శ్రేయోభిలాషులకు ధన్యవాదాలు. క్రికెటే నా సర్వస్వం... భారత్, ముంబై తరపున ఆడటం కంటే నా జీవితంలో మరో గొప్ప విషయం లేదు. దీనిని నుంచి త్వరగా కోలుకోని పునరాగమనం చేస్తాను’ అని పృథ్వీ షా పేర్కొన్నాడు. షాతో పాటు మరో ఇద్దరు జూనియర్ క్రికెటర్లు అక్షయ్, దివ్య గజ్‌రాజ్‌లకు కూడా ఇదే విధమైన నిషేధానికి గురయ్యారు. షా తీసుకున్న దగ్గుమందులో నిషేధిత టెర్బుటలైన్ అనే ఉత్ప్రేరకం ఉంది. ఇది ప్రపంచ డోపింగ్ నిరోధక సంస్థ (వాడా) నిషేధిత జాబితాలో ఉంది. దీనిపై అవగాహన లేకే తీసుకున్న పృథ్వీ తగిన మూల్యం చెల్లించుకున్నాడు. అంగేట్ర టెస్ట్‌లోనే సెంచరీతో అదరగొట్టిన ఈ యువ సంచలనం.. ఆస్ట్రేలియా పర్యటనలో ప్రాక్టీస్ మ్యాచ్‌లో గాయపడి జట్టుకు దూరమయ్యాడు. అనంతరం ఐపీఎల్ ఆడినా అవకాశం రాలేదు. ఇక వెస్టిండీస్ ఏ పర్యటనలో పాల్గొన్న షా.. నడుపు నొప్పితో మధ్యలోనే వైదొలిగాడు. చదవండి: డోప్ టెస్టులో పృథ్వీ షా విఫలం -
డోప్ టెస్టులో పృథ్వీ షా విఫలం
న్యూఢిల్లీ : ముంబై యువ క్రికెటర్, భారత టెస్టు ఓపెనర్ పృథ్వీ షా డోపింగ్ టెస్టులో దొరికిపోయాడు. అతని నుంచి సేకరించిన శాంపిల్స్‌ను పరీక్షించగా నిషేధిత ఉత్ప్రేరకం తీసుకున్నట్లు తేలింది. దీంతో బీసీసీఐ అతనిపై 8 నెలల నిషేధం విధించింది. కానీ దీన్ని తాజాగా కాకుండా పాత తేదీ (మార్చి 16)తో విధించడం వల్ల వచ్చే నవంబర్ 15వ తేదీతో నిషేధం ముగుస్తుంది. మరో ఇద్దరు జూనియర్ క్రికెటర్లు అక్షయ్, దివ్య గజ్‌రాజ్‌లకు కూడా ఇదే విధమైన నిషేధాన్ని బోర్డు విధించింది. అయితే పృథ్వీ షా కావాలని ఉత్ప్రేరకాన్ని తీసుకోలేదు. దగ్గుతో బాధపడుతుండగా దగ్గుమందులో నిషేధిత టెర్బుటలైన్ అనే ఉత్ప్రేరకం ఉంది. ప్రపంచ డోపింగ్ నిరోధక సంస్థ (వాడా) నిషేధిత జాబితాలో టెర్బుటలైన్ ఉత్ప్రేరకం ఉంది. దీనిపై అవగాహన లేకే తీసుకున్నట్లు పృథ్వీ బోర్డుకు వివరణ ఇచ్చాడు. కావాలని కాకుండా మెడిసిన్‌గా తీసుకోవడంతో బోర్డు కరుణించి 8 నెలలతో సరిపెట్టింది. నిషేధం సరే... మరి ఐపీఎల్ ఆడాడుగా! బోర్డు ప్రతిభావంతుడైన యువ క్రికెటర్ పృథ్వీ షాపై కరుణ చూపించడం బాగానే ఉంది. అతని కెరీర్‌కు ఇబ్బంది లేకుండా పాత తేదీతో విధించింది. అలాంటపుడు ఐపీఎల్ ఆడిన సంగతి మరిచిందా. మార్చి 15 నుంచి నిషేధం అమలైతే మార్చి 23 నుంచి మొదలైన ఐపీఎల్ 12వ సీజన్లో ఢిల్లీ క్యాపిటల్స్ తరఫున ఆడాడుగా... మరి ఇదేరకమైన నిషేధమో బోర్డే సెలవివ్వాలి! -
మన్‌ప్రీత్ కౌర్‌కు భారీ షాక్
న్యూఢిల్లీ : ఆసియా చాంపియన్‌గా నిలిచిన షాట్‌పుటర్ మన్‌ప్రీత్ కౌర్‌పై వేటు పడింది. డోపింగ్‌కు పాల్పడినందుకు ఆమెపై జాతీయ డోపింగ్ వ్యతిరేక సంస్థ (నాడా) నాలుగు సంవత్సరాల పాటు నిషేధం విధించింది. ఈ విషయాన్ని ‘నాడా’ డైరెక్టర్ జనరల్ నవీన్ అగర్వాల్ నిర్ధారించారు. 2017లో మన్‌ప్రీత్ నాలుగు సార్లు డోపింగ్ పరీక్షల్లో విఫలమైంది. ఆమెపై తాత్కాలిక నిషేధం విధించిన జూలై 20, 2017నుంచి తాజా శిక్ష అమల్లోకి వస్తుంది. అయితే తనపై విధించిన నిషేధాన్ని సవాల్ చేస్తూ యాంటీ డోపింగ్ అప్పీల్ ప్యానెల్‌కు ఆమె అప్పీల్ చేసుకునే అవకాశం కల్పించారు. కాగా శాంపుల్ సేకరించిన నాటి నుంచి ఆమె అన్ని ఫలితాలు చెల్లవంటూ ‘నాడా’ ప్యానెల్ తీర్పునివ్వడంతో 2017లో గెలుచుకున్న ఆసియా చాంపియన్‌షిప్ స్వర్ణంతో పాటు జాతీయ రికార్డును కూడా మన్‌ప్రీత్ కోల్పోనుంది. షాట్‌పుట్‌లో 18.86 మీటర్ల రికార్డు మన్‌ప్రీత్ పేరిటే ఉంది. 2017లో ఆసియా గ్రాండ్‌ప్రి, ఫెడరేషన్ కప్, ఆసియా అథ్లెటిక్స్ చాంపియన్‌షిప్, ఇంటర్ స్టేట్ చాంపియన్‌షిప్‌లలో ఆమె ఏకంగా నాలుగు సార్లు ‘పాజిటివ్’గా తేలింది. వీటిలో ఒక సారి మెటనొలోన్, మరో మూడు సార్లు డైమిథైల్‌బుటిలమైన్ వంటి నిషేధిక ఉత్ప్రేరకాలు తీసుకున్నట్లు బయటపడింది. -
భారత టెన్నిస్‌లో తొలి డోపీ...
భారత టెన్నిస్‌లో తొలి డోపీ పట్టుబడ్డాడు. 16 ఏళ్ల టీనేజ్ కుర్రాడు ఆర్యన్ భాటియా... గతేడాది ఢిల్లీలో జరిగిన ఫెనెస్టా ఓపెన్ జాతీయ టెన్నిస్ చాంపియన్‌షిప్ సందర్భంగా నిషిద్ధ ఉత్ప్రేరకం తీసుకున్నట్లు జాతీయ డోపింగ్ నిరోధక సంస్థ పరీక్షల్లో తేలింది. వెంటనే అతనిపై సస్పెన్షన్ వేటు వేశారు. అయితే అఖిల భారత టెన్నిస్ సంఘం కార్యదర్శి హిరణ్మయ్ ఛటర్జీ మాట్లాడుతూ ఆర్యన్ కావాలని ఉత్ప్రేరకాలు తీసుకోలేదని, జలుబుతో బాధపడుతుండగా డాక్టర్ ప్రిస్క్రిప్షన్‌తో వేసుకున్న మెడిసిన్ ద్వారా ఈ సమస్య తలెత్తిందని వెల్లడించారు. దీనిపై అప్పీలు చేసుకునే అవకాశాన్ని ఇచ్చినట్లు ఆయన తెలిపారు. -
భారత వెయిట్‌లిఫ్టర్ సంజితపై నిషేధం ఎత్తివేత
డోపింగ్ ఆరోపణలతో భారత వెయిట్‌లిఫ్టర్ సంజిత చానుపై విధించిన నిషేధాన్ని ఎత్తివేసి, విచారణ కొనసాగించాలని అంతర్జాతీయ వెయిట్‌లిఫ్టింగ్ సమాఖ్య నిర్ణయించింది. గతేడాది కామన్వెల్త్ క్రీడల్లో సంజిత 53 కేజీల విభాగంలో స్వర్ణం గెల్చుకుంది. దీనికిముందు 2017 ప్రపంచ చాంపియన్‌షిప్ సందర్భంగా ఆమె మూత్ర నమూనాలు సేకరించి పరీక్షకు పంపారు. అందులో పాజిటివ్‌గా తేలడంతో కామన్వెల్త్ క్రీడల అనంతరం మే 15న నిషేధం విధించారు. అయితే డోపింగ్ పరీక్షలకు సంజిత నమూనాల సేకరణలో జాప్యం చోటుచేసుకుని... కేసు సంక్లిష్టం కావడమే నిషేధం ఎత్తివేతకు కారణంగా తెలుస్తోంది. -
ఎందాకొచ్చింది మీ దర్యాప్తు?
న్యూఢిల్లీ: ఢిల్లీ హైకోర్టు సోమవారం సీబీఐని తలంటింది. రెజ్లర్ నర్సింగ్ యాదవ్‌ను రియో ఒలింపిక్స్ (2016)లో పాల్గొనకుండా డోపీగా మార్చిన ఉదంతంపై విచారణ ఎంతవరకు వచ్చిందని ప్రశ్నించింది. ‘రియో’కు అర్హత పొందిన నర్సింగ్‌ను మెగా ఈవెంట్ నుంచి తప్పించాలనే దురుద్దేశంతో కొందరు అతను తినే ఆహారంలో డ్రగ్స్ కలిపినట్లు ఆరోపణలొచ్చాయి. ఏదేమైనా డోపీ మరకతో నర్సింగ్ చివరి నిమిషంలో ఒలింపిక్స్‌కు దూరమయ్యాడు. అనంతరం న్యాయపోరాటం చేస్తున్నాడు. దీనిపై సీబీఐ విచారణ చేపట్టినప్పటికీ ఇంతవరకూ అతీగతీ లేకుండా ఉంది. దీంతో సీబీఐ తీరుపట్ల హైకోర్టు తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేసింది. కేసు విచారణ ఎప్పటికీ పూర్తి చేస్తారని, దర్యాప్తు ఎంతవరకు వచ్చిందో తదుపరి కోర్టు విచారణ జరిగే ఫిబ్రవరి 1వ తేదీకల్లా తెలపాలని జస్టిస్ నజ్మీ వాజిరి ఆదేశించారు. ‘ఇప్పటి వరకు ఏం చేశారు. రెండున్నరేళ్లు గడుస్తున్నా ఎందుకు చర్యలు చేపట్టలేదు. ఇది సీబీఐ అనుకుంటున్నారా లేక మరేదైనా ఏజెన్సీనా’ అని ఆగ్రహం వ్యక్తం చేశారు. రెజ్లింగ్, బాక్సింగ్ క్రీడాకారుల కెరీర్ నాశనమవడం భారత క్రీడల ప్రగతికి చేటని జస్టిస్ నజ్మీ ఈ సందర్భంగా వ్యాఖ్యానించారు. -
డోపింగ్‌లో దొరికిన నిర్మల
న్యూఢిల్లీ: భారత మహిళా అథ్లెట్ నిర్మలా షెరాన్ డోపింగ్‌లో దొరికింది. ప్రపంచ డోపింగ్ నిరోధక సంస్థ (వాడా) నిర్వహించిన పరీక్షల్లో ఆమె నిషిద్ధ ఉత్ప్రేరకాలు తీసుకున్నట్లు తేలింది. దీంతో భారత అథ్లెటిక్స్ సమాఖ్య (ఏఎఫ్ఐ) నిర్మలపై వేటు వేసింది. జకార్తా ఆసియా క్రీడల్లో 400 మీటర్ల పరుగు పందెంలో పోటీపడిన ఆమె నాలుగో స్థానంలో నిలిచింది. ఈ డోపింగ్ వ్యవహారంపై ఏఎఫ్ఐ చీఫ్ అదిలె సుమరివాలా స్పందించారు. ‘ఆసియా క్రీడల కోసం ఏఎఫ్ఐ ఏర్పాటు చేసిన శిక్షణ శిబిరాలకు నిర్మలా ఎప్పుడూ హాజరు కాలేదు. ఎక్కడ ఉందో అనే వివరాలను మాకెప్పుడు చెప్పలేదు. అందుకే రిలే ఈవెంట్లలో ఆమెను ఎంపిక చేయలేదు. డోపీగా తేలడంతో నాలుగేళ్ల పాటు నిషేధం విధిస్తున్నాం’ అని సుమరివాలా అన్నారు. -
సస్పెన్షన్‌లో ఉన్న క్రికెటర్‌కి జట్టులో చోటు..
ఢిల్లీ: చిత్రవిచిత్రమైన పనులు చేయడంలో భారత క్రికెట్ కంట్రోల్ బోర్డు(బీసీసీఐ) రూటే సపరేటు. డోపింగ్‌లో సస్పెన్షన్‌కు గురైన క్రికెటర్‌ను దులీప్ ట్రోఫీకి ఎంపిక చేసిన బోర్డు అభాసుపాలైంది. పంజాబ్ వికెట్ కీపర్-బ్యాట్స్‌మన్ అభిషేక్ గుప్తాకు ఇండియా రెడ్ జట్టులో చోటు కల్పించారు. అయితే, అతడి సస్పెన్షన్ సెప్టెంబర్ 14తో ముగుస్తుంది. కానీ దులీప్ ట్రోఫీ వచ్చే నెల 17 నుంచి సెప్టెంబర్ 8 వరకు జరగనుంది. గుప్తా నిషిద్ధ ఉత్ర్పేరకం టర్బుటలిన్ ఉపయోగించినట్టు డోపింగ్ పరీక్షలో బయటపడడంతో అతడిపై జనవరి 15 నుంచి ఎనిమిది నెలలపాటు సస్పెన్షన్ వేటు వేశారు. అయినా సెలెక్టర్లు అతడిని ఎంపిక చేయడం ఆశ్చర్యం కలిగిస్తోంది. చదవండి: డోపింగ్‌కు పాల్పడినందుకు కీపర్‌పై వేటు -
డోపింగ్ టెస్టులో దొరికిన పాక్ క్రికెటర్!
ఇస్లామబాద్: పాకిస్తాన్ క్రికెటర్ అహ్మద్ షెహజాద్ డోపింగ్ పరీక్షలో దోషిగా తేలాడు. అతడు నిషేదిత ఉత్ప్రేరకాలు తీసుకున్నట్లు రుజువైంది. ఈ విషయాన్ని పాకిస్తాన్ క్రికెట్ బోర్డు (పీసీబీ) మంగళవారం అధికారికంగా ప్రకటించింది. అతనికి నోటిసులు జారీ చేస్తూ.. 14 రోజుల్లో వివరణ ఇవ్వాలని కూడా ఆదేశించింది. ఈ మేరకు బోర్డు అధికారిక ట్విటర్లో ఈ విషయాన్ని వెల్లడించింది. షెహజాద్ పాకిస్తాన్‌లోనిర్వహించిన పరీక్షల్లోనే డోపింగ్‌కు పాల్పడినట్లు రుజువైందని, కానీ భారత్‌లోని ల్యాబ్‌కు పంపించి పీసీబీ మరోసారి నిర్ధారించుకుందని డాన్ పత్రిక పేర్కొంది. గత జూన్‌లో పేరు చెప్పకుండా ఓ క్రికెటర్ డోపింగ్ పాల్పడ్డాడని తెలిపిన పీసీబీ రిపోర్టులు అందడంతో నోటీసులు జారీ చేసింది. అంతర్జాతీయ క్రికెట్ మండలి (ఐసీసీ) నిబంధనల ప్రకారం ఎలాంటి క్రికెట్ ఆడకుండా షెహజాద్‌పై కొంత కాలం నిషేదం పడే అవకాశం ఉంది. నిలకడలేమి ఆటతో జట్టులో చోటు కోల్పోయిన 26 ఏళ్ల షెహజాద్.. స్కాట్లాండ్తో జరిగిన రెండు టీ20ల్లో కేవలం 38 పరుగులు మాత్రమే చేశాడు. దీంతో ఆస్ట్రేలియా, జింబాంబ్వేలతో జరిగిన ముక్కోణపు సిరీస్‌కు దూరమయ్యాడు. ఇక డోప్ టెస్టులో విఫలమైన పాక్ క్రికెటర్లలో షెహజాద్ మొదటి వాడేం కాదు.. 2012లో డోప్ టెస్టులో విఫలమైన పాక్ లెఫ్టార్మ్ స్పిన్నర్ రాజా హసన్ రెండేళ్ల నిషేదం ఎదుర్కొనగా.. యాసిర్ షా, అబ్దుర్ రెహమాన్‌లు తాత్కాలిక నిషేదాలు ఎదుర్కొన్నారు. -
సీఎంపై డోప్ టెస్ట్ నిర్వహించాలన్న బీజేపీ నేత
చండీగఢ్ : పంజాబ్‌లో ప్రభుత్వ ఉద్యోగులందరికీ డోప్ టెస్ట్‌లు విధిగా నిర్వహించాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించిన నేపథ్యంలో సీఎం, ఆయన మంత్రివర్గ సహచరులపైనా ఈ పరీక్షలు నిర్వహించాలని ఓ బీజేపీ నేత కోరారు. ప్రభుత్వ ఉద్యోగుల నియామకం నుంచి సర్వీసులోని వివిధ దశల్లో వారికి డోప్ టెస్ట్‌లు నిర్వహించేలా మార్గదర్శకాలు రూపొందించి, అవసరమైన ఉత్తర్వులు జారీ చేయాలని పంజాబ్ సీఎం అమరీందర్ సింగ్ బుధవారం రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శిని ఆదేశించిన సంగతి తెలిసిందే. రాష్ట్రంలో డ్రగ్ సమస్యను ఎదుర్కొనేందుకు కాంగ్రెస్ ప్రభుత్వం చేపట్టిన చర్యపై బీజేపీ నేత హర్జిత్ సింగ్ గ్రెవాల్ స్పందిస్తూ డోప్టెస్ట్ను కేవలం పోలీసులు, ప్రభుత్వ ఉద్యోగుల వరకే ఎందుకు పరిమితం చేశారని ప్రశ్నించారు. ముఖ్యమంత్రి, ఆయన కేబినెట్ సహచరులపై కూడా డోప్ టెస్ట్‌లు నిర్వహించాలని గ్రెవాల్ కోరారు. డ్రగ్ కళంకిత రాజకీయ నేతలు ప్రభుత్వంలో ఉంటే వారు డ్రగ్ స్మగ్లర్లు, సరఫరాదారులకు సహకరించడం కొనసాగిస్తారని అన్నారు. -
డోపీగా తేలడంపై పెదవి విప్పిన మెకల్లమ్..
వెల్లింగ్టన్: 2016 ఐపీఎల్ సందర్భంగా న్యూజిలాండ్ మాజీ కెప్టెన్ బ్రెండన్ మెకల్లమ్ డోపింగ్ పరీక్షల్లో విఫలమైనట్లు ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. ఈ విషయాన్ని మెకల్లమ్ స్వయంగా వెల్లడించాడు. అయితే అతను తాను వాడిన ఉత్ప్రేరకం విషయంలో మినహాయింపు ఉన్నట్లుగా ధ్రువపత్రం సమర్పించడం ద్వారా నిషేధం తప్పించుకున్నట్లు స్పష్టం చేశాడు. 2016లో భారత్‌లో ఒక ప్రముఖ ఆటగాడు డోప్ పరీక్షలో విఫలమైనట్లుగా ప్రపంచ డోపింగ్ నిరోధక సంస్థ (వాడా) పేర్కొంది. అయితే అతను ఎవరన్నది భారత క్రికెట్ కంట్రోల్ బోర్డు(బీసీసీఐ) అప్పట్లో దాచి పెట్టింది. దీనిపై ఇప్పుడు మెక్కలమే స్వయంగా తాను డోపీగా దొరికిన విషయాన్ని పేర్కొన్నాడు. ‘ఆ సమయంలో ఇన్హేలర్ అతిగా వాడాను. బీసీసీఐ నాకు సహకరించింది’ అని మెక్‌కలమ్ తెలిపాడు. రెండేళ్ల క్రితం గుజరాత్ లయన్స్ తరపున ఆడినప్పుడు ఆస్తమా బాధితుడైన మెకల్లమ్ ఢిల్లీలో కాలుష్యం వల్ల బాగా ఇబ్బంది పడటంతో ఎప్పుడూ వాడే ఇన్హేలర్ మందు ఎక్కువ స్థాయిలో తీసుకున్నాడట. దీని ఫలితంగా డోప్ పరీక్షల్లో అతను పట్టుబడ్డాడట. దీనిపై బీసీసీఐ అతడిని వివరణ కోరగా.. స్వీడన్‌కు చెందిన వైద్య నిపుణుల నుంచి ధ్రువపత్రం సమర్పించడం ద్వారా నిషేధం నుంచి బయటపడినట్లు వెల్లడైంది. -
డోపింగ్‌లో పట్టుబడిన షెహజాద్
పాకిస్తాన్ క్రికెట్ జట్టు ఓపెనర్ అహ్మద్ షెహజాద్ డోప్ టెస్టులో విఫలమయ్యాడు. ఈ ఏడాది ఏప్రిల్‌లో జరిగిన పాకిస్తాన్ కప్ వన్డే టోర్నీ సందర్భంగా సేకరించిన శాంపుల్స్‌లో అతను డోపింగ్‌కు పాల్పడినట్లు నిర్ధారణ అయింది. దీంతో పీసీబీ (పాకిస్తాన్ క్రికెట్ బోర్డు) షెహజాద్‌పై విచారణకు ఆదేశించింది. ప్రత్యేక కమిటీ ముందు అతను విచారణకు హాజరుకానున్నాడు. పాకిస్తాన్ తరఫున 13 టెస్టులు, 81 వన్డేలు, 57 టి20లు ఆడిన షెహజాద్‌పై కనిష్టంగా 3 నెలలు... గరిష్టంగా 6 నెలలు సస్పెన్షన్ వేటు పడే అవకాశం ఉంది. ప్రాథమిక పరీక్షలో షెహజాద్ డోపింగ్‌కు పాల్పడినట్లు రుజువైందని... పూర్తి స్థాయి విచారణ అనంతరం అధికారిక ప్రకటన విడుదల చేయనున్నట్లు బోర్డు అధికారి తెలిపారు. -
డోపింగ్‌కు పాల్పడినందుకు కీపర్‌పై వేటు
న్యూఢిల్లీ: పంజాబ్ వికెట్ కీపర్ అభిషేక్ గుప్తాపై బీసీసీఐ 8 నెలల సస్పెన్షన్ వేటు వేసింది. 27 ఏళ్ల పంజాబ్ ఆటగాడు నిషేధిత ఉత్ప్రేరకం టెర్బుటలైన్ తీసుకున్నట్లు పరీక్షల్లో తేలడంతో సస్పెండ్ చేశారు. ఈ మేరకు జనవరి నిర్వహించిన బీసీసీఐ డోపింగ్ టెస్టింగ్ ప్రోగ్రామ్‌లో అభిషేక్ నిషేధిత ఉత్పేరకం వాడినట్లు తేలింది. ఈ విషయాన్ని గురువారం బీసీసీఐ ఒక ప్రకటనలో పేర్కొంది. దాంతో అతనిపై 8 నెలల నిషేధం విధించింది. అయితే దగ్గు టానిక్‌లో ఉండే ఉత్ప్రేరకాన్ని తను డాక్టర్ సూచన మేరకే వాడినట్లు అభిషేక్ ఇచ్చిన వివరణతో నిషేధాన్ని 8 నెలలకే పరిమితం చేసింది. ఈ నిషేధం జనవరి 15వ తేదీ నుంచి సెప్టెంబర్ 14 తేదీ వరకూ అమల్లో ఉంటుందని బీసీసీఐ స్పష్టం చేసింది. ఇలా డోపింగ్ పాల్పడిన తొలి పంజాబ్ క్రికెటర్‌గా అభిషేక్ కావడం గమనార్హం. -
డోపీగా తేలిన సంజిత చాను
న్యూఢిల్లీ: గోల్డ్‌కోస్ట్ కామన్వెల్త్ క్రీడల్లో స్వర్ణం గెలిచి సంబరాల్లో ఉన్న భారత వెయిట్ లిఫ్టర్ సంజీత చానుకు భారీ షాక్ తగిలింది. డోప్ టెస్టులో ఆమె నిషిద్ధ ఉత్ప్రేరకాలు వాడినట్లు తేలడంతో అంతర్జాతీయ వెయిట్ లిఫ్టింగ్ సమాఖ్య (ఐడబ్ల్యూఎఫ్) ఆమెపై తాత్కాలిక నిషేధం విధించింది. గోల్డ్‌కోస్ట్ గేమ్స్‌లో 53 కేజీల విభాగంలో బరిలోదిగిన ఆమె ఓవరాల్‌గా 192 కేజీల బరువెత్తి బంగారు పతకం సొంతం చేసుకుంది. 2014 గ్లాస్గో క్రీడల్లోనూ 48 కేజీల విభాగంలో స్వర్ణం గెలిచింది. తాజాగా డోప్ టెస్టులో ఆమె నిషిద్ధ ఉత్ప్రేరకాలు వినియోగించినట్లు తేలడంతో ఈ నిర్ణయం తీసుకున్నట్లు ఐడబ్ల్యూఎఫ్ గురువారం తన వెబ్సైట్లో పేర్కొంది. ‘సంజీత చాను నుంచి సేకరించిన శాంపుల్స్‌లో నిషిద్ధ ఉత్ప్రేరకాలు (టెస్టోస్టిరాన్) వాడినట్లు రుజువైంది. యాంటీ డోపింగ్ రూల్స్ ప్రకారం ఇది నేరం. ఒకవేళ ఆమె డోపింగ్ నిరోధక నియమాలను ఉల్లంఘించలేదని నిరూపితమైతే... సంబంధిత నిర్ణయాన్ని కూడా తిరిగి ప్రకటిస్తాం’ అని ఐడబ్ల్యూఎఫ్ తెలిపింది. కాగా డోప్ టెస్టు కోసం శాంపిల్స్‌ను ఎప్పుడు సేకరించారనే విషయం పై మాత్రం ఎలాంటి స్పష్టత ఇవ్వలేదు. ఈ అంశంపై స్పందించేందుకు భారత వెయిట్ లిఫ్టింగ్ సమాఖ్య అధికారులు అందుబాటులో లేరు. ప్రస్తుతం హిమాచల్ ప్రదేశ్‌లోని జాతీయ క్యాంపులో శిక్షణ తీసుకుంటున్న చాను ఈ నిర్ణయంతో క్యాంపు వదిలి స్వస్థలమైన మణిపూర్‌కు పయనమైంది. -
50 లక్షల డాలర్లు చెల్లిస్తా
లాస్ఏంజెల్స్: సైక్లింగ్ రేస్ టూర్ డి ఫ్రాన్స్ దిగ్గజం లాన్స్ ఆర్మ్‌స్ట్రాంగ్ నిషేధిత ఉత్ప్రేరకాలు వాడిన కేసులో 50 లక్షల డాలర్ల (రూ. 33 కోట్లు) జరిమానా చెల్లించేందుకు కోర్టులో అంగీకరించాడు. అమెరికా పోస్టల్ సర్వీస్ తరఫున రేసుల్లో పాల్గొంటున్న సమయంలో ఆర్మ్‌స్ట్రాంగ్ డోప్ పరీక్షల్లో పట్టుబడ్డాడు. దీంతో ఆర్మ్‌స్ట్రాంగ్ తమను ఉద్దేశపూర్వకంగా మోసం చేశాడని ఆరోపిస్తూ పోస్టల్ సర్వీస్ సంస్థ, మాజీ సహచరుడు ఫ్లాయిడ్ ల్యాండిస్లు అతడిపై 10 కోట్ల డాలర్లకు (రూ. 661 కోట్లు) కేసు వేశారు. దీనికి సంబంధించి వచ్చే నెల 7న విచారణకు హాజరు కావాల్సి ఉంది. అయితే... ఆర్మ్‌స్ట్రాంగ్ లాయర్ల అభ్యర్థన మేరకు పరిహారంపై ఒప్పందానికి రావాల్సిందిగా యూఎస్ న్యాయ విభాగం సూచించింది. దీంతో ఈ దిగ్గజ సైక్లిస్ట్ ఉపశమనం పొందినప్పటికీ... ఈ కేసు వెలుగులోకి రావడానికి కారణమైన ల్యాండిస్ న్యాయ ఖర్చులకు మరో 10 లక్షల 65 వేల డాలర్లు అదనంగా చెల్లించాల్సి ఉంటుంది. డోపింగ్‌తో కెరీర్ కోల్పోయిన ఆర్మ్‌స్ట్రాంగ్... కేసుల కారణంగా మరింత ఆర్థిక ఇబ్బందుల్లో చిక్కుకున్నట్లు తెలుస్తోంది. టెక్సాస్ రాష్ట్రం ఆస్టిన్లోని తన ఇంటిని 75 లక్షల డాలర్లకు అమ్మకానికి పెట్టడమే దీనికి ఉదాహరణ. -
స్కూల్ గేమ్స్‌నూ వీడని చీడ!
న్యూఢిల్లీ: అంతర్జాతీయ ఈవెంట్లు, జాతీయ స్థాయి టోర్నీలలో డోపింగ్ వివాదాలు ఎప్పటికప్పుడు బయట పడుతూనే ఉంటాయి. పెద్ద స్థాయిలో ఇలాంటివి కొత్త కాదు. కానీ పాఠశాల స్థాయిలో ప్రతిభను ప్రోత్సహించేందుకు ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా నిర్వహించిన ‘ఖేలో ఇండియా’ పోటీల్లో కూడా డోపింగ్‌లో పట్టుబడటం అసాధారణం. తొలిసారి నిర్వహించిన ఈ క్రీడల అండర్–17 విభాగంలో మొత్తం 12 మంది డోపింగ్‌కు పాల్పడినట్లు తేలింది. వీరిలో ఐదుగురు స్వర్ణ పతకాలు నెగ్గిన వారుండటం గమనార్హం. జాతీయ డోపింగ్ నిరోధక సంస్థ (నాడా) నివేదిక ప్రకారం నిషేధిత ఉత్ప్రేరకం వాడిన ఈ 12 మందిలో నలుగురు రెజ్లర్లు, ముగ్గురు బాక్సర్లు, ఇద్దరు జిమ్నాస్ట్‌లతో పాటు జూడో, వాలీబాల్, అథ్లెటిక్స్‌కు చెందిన ఒక్కో ఆటగాడు ఉన్నాడు. వీరిలో ఒక అమ్మాయి కూడా ఉంది. జనవరి 31 నుంచి ఫిబ్రవరి 3 వరకు ‘ఖేలో ఇండియా’ క్రీడలు దేశంలోని వివిధ నగరాల్లో జరిగాయి. ‘పట్టుబడిన ఆటగాళ్లలో ఎక్కువ మంది ఫ్యూరోసెమైడ్, టర్బు టలైన్ వాడినట్లు తేలింది. అయితే ‘వాడా’ నిబంధనల ప్రకారం ఈ ఉత్ప్రేరకాలు ప్రత్యేక కేటగిరీలో ఉన్నాయి కాబట్టి ఇంకా నిషేధం గురించి ఆలోచించలేదు’ అని అధికారులు వెల్లడించారు. అయితే పూర్తిగా నిషేధం ఉన్న స్టెనజలోల్ను వాడిన ఒక బాక్సర్‌పై మాత్రం తాత్కాలిక నిషేధం విధించారు. డోపింగ్‌లో దోషులుగా తేలితే వీరందరిపై కనీసం 2 నుంచి 4 సంవత్సరాల నిషేధం పడుతుంది. -
‘డోపీ’ దవిందర్ సింగ్...
న్యూఢిల్లీ: భారత అగ్రశ్రేణి జావెలిన్ త్రోయర్ దవిందర్ సింగ్ కంగ్ డోపింగ్ టెస్టులో పట్టుబడ్డాడు. గత నవంబర్‌లో అతని నుంచి అథ్లెటిక్స్ ఇంటిగ్రిటీ యూనిట్ (ఏఐయూ) సేకరించిన రక్త, మూత్ర నమూనాలను పరిశీలించగా దవిందర్ నిషిద్ధ ఉత్ప్రేరకం తీసుకున్నట్లు తేలింది. దీంతో భారత అథ్లెటిక్స్ సమాఖ్య (ఏఎఫ్ఐ) వెంటనే అతన్ని పాటియాలలో జరిగిన ఇండియన్ గ్రాండ్‌ప్రి–1 పోటీల నుంచి తప్పించింది. తక్షణమే శిక్షణ కేంద్రం నుంచి నిష్క్రమించాలని ఆదేశించింది. ఇప్పటికైతే తాత్కాలిక నిషేధం విధించినప్పటికీ ‘బి’ శాంపిల్‌లోనూ దోషిగా తేలితే అతనిపై నాలుగేళ్ల నిషేధం పడనుంది. 29 ఏళ్ల దవిందర్ గతేడాది లండన్‌లో జరిగిన ప్రపంచ చాంపియన్‌షిప్‌లో ఫైనల్ రౌండ్‌కు అర్హత సాధించి ఈ ఘనత వహించిన తొలి భారత అథ్లెట్‌గా గుర్తింపు పొందాడు. తాజాగా ఏఐయూ పరీక్షల్లో దొరికిన తొలి భారత డోపీగానూ నిలిచాడు. క్రీడారంగాన్ని కుదిపేసిన రష్యా వ్యవస్థీకృత డోపింగ్ ఉదంతంతో అంతర్జాతీయ అథ్లెటిక్స్ సమాఖ్య ఏఐయూను ఏర్పాటు చేసింది. -
ఎన్నో ఆశలతో వచ్చాను.. కానీ!
సియోల్: దక్షిణ కొరియాలో జరగుతున్న శీతాకాల ఒలింపిక్స్‌లో డోపింగ్ ఆరోపణలు మొదలయ్యాయి. డోపింగ్ టెస్టులో విఫలమైన జపాన్‌కు చెందిన షార్ట్ ట్రాక్ స్పీడ్ స్కేటర్ కీయ్ సైటోను ఒలింపిక్స్ నుంచి తప్పించారు. డోపింగ్ టెస్టులో విఫలమైనట్లు సోమవారం తమకు తెలిసిందని పేర్కొన్న జపాన్ అధికారులు తమ స్కేటర్ కీయ్ సైటోపై అనర్హత వేటు వేస్తున్నట్లు మంగళవారం వెల్లడించారు. తొలిసారి శీతాకాల ఒలింపిక్స్‌లో పాల్గోబోతున్న ఆ స్కేటర్ నిషేధిత అసిటలోజమైడ్ ను వినియోగించినట్లు టెస్టుల్లో తేలినట్లు సమాచారం. కోర్ట్ ఆఫ్ అర్బిట్రేషన్ ఫర్ స్పోర్ట్స్ త్వరలోనే అతడిపై చర్యలు తీసుకోనుంది. ఫిబ్రవరి 4న జపాన్ నుంచి ఒలింపిక్ గ్రామానికి వచ్చిన ప్లేయర్ కీయ్ సైటోకు నిర్వహించిన డోప్ టెస్ట్ ఫలితాలు చూసి అధికారులు షాకయ్యారు. మరోవైపు డోపీగా తేలిన స్కేటర్ కీయ్ సైటో మాట్లాడుతూ.. డోపింగ్ చేయాలని నేనెప్పుడూ భావించలేదు. వింటర్ ఒలింపిక్స్‌లో పాల్గొని పతకం సాధించాలని ఎంతో ఆశగా ఇక్కడికి వచ్చాను. కానీ డోప్ టెస్టుల్లో విఫలమైనట్లు తెలియగానే షాక్‌కు గురయ్యాను. నా నిర్దోషిత్వాన్ని నిరూపించుకునేందుకు ప్రయత్నిస్తా. తోటి ఆటగాళ్లకు భారం అవ్వకూడదని భావిస్తున్నాను. ప్రస్తుతం జపాన్ స్పోర్ట్స్ మేనేజ్మెంట్ నిర్ణయానికి కట్టుబడి బరిలో దిగలేకపోతున్నాంటూ ఆవేదన వ్యక్తం చేశాడు. కాగా, గత జనవరి 29న అంతర్జాతీయ స్కేటింగ్ యూనియన్ (ఐఎస్‌యూ) ఈ జపాన్ స్కేటర్ కీయ్ సైటోకు నిర్వహించిన డోప్ టెస్టుల్లో నెగటీవ్ అని వచ్చిన విషయం తెలిసిందే. జపాన్‌కు చెందిన షార్ట్ ట్రాక్ స్పీడ్ స్కేటర్ కీయ్ సైటో (కుడి) -
బాహుబలులను పంపుతున్నాం: రష్యా
మాస్కో: ఒలింపిక్స్‌లో పతకాలు గెలవటంలో పోటీపడే దేశాలలో రష్యా ఒకటి. అయితే దక్షిణ కొరియాలో జరగనున్న శీతాకాల ఒలింపిక్స్‌లో రష్యా పాల్గొంటుందా లేదా అనేది సగటు క్రీడాభిమానులకు కలిగిన సందేహం. గత కొన్ని రోజులుగా ప్రపంచమంతా ఈ అంశంపై పెద్ద చర్చ జరుగుతోంది. శీతాకాల ఒలింపిక్స్‌లో రష్యా పాల్గొనటంపై ఎందుకింత చర్చ అనుకుంటున్నారా.. రియో ఒలింపిక్స్‌లో కొంత మంది ఆటగాళ్లు డోపింగ్‌లో పట్టుబడంటంతో రష్యా అపఖ్యాతి మూటగట్టుకుంది. దీంతో శీతాకాల ఒలింపిక్స్‌లో పాల్గొంటుందా లేదా అని సర్వత్రా ఉత్కంఠ నెలకొంది. ఈ ఉత్కంఠకు తెరదించుతూ ఒలింపిక్స్‌లో పాల్గొంటున్నామని రష్యా ప్రకటించింది. రష్యా ప్రకటనతో ఒలింపిక్ అభిమానుల అనుమానాలు పటాపంచలు అయ్యాయి. ఎందుకంటే ఒలింపిక్‌లో రష్యా అథ్లెట్స్ ప్రదర్శన అలాంటిది. అథ్లెట్స్ సంఖ్య తగ్గినా పతకాలు తెచ్చే 169మంది బాహుబలులను పంపుతున్నామని రష్యా ప్రకటించింది. ఈ సంఖ్య గతంలో జరిగిన ఒలింపిక్స్ పోటీలకు పంపిన అథ్లెట్ల కంటే తక్కువే ఉంది. రియో ఒలింపిక్స్‌కి 232 మందిని, వాంకోవర్ ఒలింపిక్స్‌కి 177 మందిని పంపింది. రష్యా అథ్లెట్లను శీతాకాల ఒలింపిక్స్‌కి పంపకపోతే ఆ దేశ జెండా, జాతీయ గీతం ప్రదర్శనలో ఉండబోదని అంతర్జాతీయ ఒలింపిక్ సంఘం (ఐఓసీ) ముందే హెచ్చరించింది. ఒలింపిక్స్ ప్యానెల్ నిర్వహించే డోపింగ్ పరీక్షలోనూ నెగ్గాలని, లేకపోతే ఆదేశం నిర్వహించిన పరీక్షలపై అనుమానాలు కలిగే అవకాశం ఉంటుందని ఐఓసీ తెలిపింది. -
డోప్ టెస్ట్‌లో యూసఫ్ పఠాన్ విఫలం
-
పఠాన్‌కు షాకిచ్చిన బీసీసీఐ
సాక్షి, ముంబై : టీమిండియా బ్యాట్స్‌మన్ యూసఫ్ పఠాన్‌కు బీసీసీఐ షాక్ ఇచ్చింది. డోప్ టెస్ట్‌లో విఫలం కావటంతో అతనిపై 5 నెలల వేటు వేస్తున్నట్లు ప్రకటించింది. గతేడాది ఓ దేశీవాళి టీ-20 మ్యాచ్ సందర్భంగా నిర్వహించిన పరీక్షల్లో యూసఫ్ నిషేధ ఉత్ప్రేరకాన్ని తీసుకున్నట్లు తేలింది. టర్‌బ్యూటలైన్(దగ్గు మందుకు సంబంధించింది) పదార్థాన్ని యూసఫ్ తీసుకున్నాడు. ఒకవేళ ఆటగాడు ఆ డ్రగ్‌ను తప్పనిసరిగా తీసుకోవాల్సి వస్తే మాత్రం అందుకు అధికారులు అనుమతి తప్పనిసరిగా తీసుకోవాల్సి ఉంటుంది. కానీ, పఠాన్ గానీ, టీం డాక్టర్ గానీ ఈ విషయాన్ని అధికారులకు తెలియజేయలేదు. ఇక డోపింగ్ ఆరోపణలు వచ్చినప్పుడే బీసీసీఐ అతన్ని తాత్కాలికంగా సస్పెండ్ చేసింది. దీంతో అతను రంజీ మ్యాచ్‌లకు కూడా దూరం అయ్యాడు. పఠాన్ ఇచ్చిన వివరణకు సంతృప్తి చెందిన బీసీసీఐ తక్కువ శిక్షతో సరిపెట్టినట్లు తెలుస్తోంది. కాగా, గత ఆగష్టు 15వ తేదీ నుంచి అతనిపై నిషేధం అమలులోకి రాగా.. ఆ లెక్కన జనవరి 14తో ఆ సస్పెన్షన్ ముగియనుండటం పఠాన్‌కు ఊరటనిచ్చే విషయం. ఇంతకు ముందు 2012లో ఐపీఎల్ ప్రదీప్ సంగ్వాన్ కూడా ఇలాగే డోపింగ్‌కు పాల్పడి 18 నెలల నిషేధం ఎదుర్కున్నాడు. -
నేను తప్పు చేయలేదు: గాట్లిన్
లండన్: ప్రపంచ స్ప్రింట్ చాంపియన్ జస్టిన్ గాట్లిన్ తన శిక్షణ సిబ్బంది నిర్వాకంపై స్పందించాడు. ఓ బ్రిటిష్ దినపత్రిక నిర్వహించిన స్టింగ్ ఆపరేషన్‌లో తన కోచ్ మిచెల్, ఏజెంట్ వాగ్నర్ ఇద్దరు నిషేధిత ఉత్ప్రేరకాలు అమ్మేందుకు సిద్ధపడినట్లు తేలింది. ఈ వీడియో టేపులు అథ్లెట్ వర్గాల్లో పెను దుమారం రేపింది. దీనిపై 35 ఏళ్ల అమెరికన్ స్ప్రింట్ స్టార్ గాట్లిన్ మాట్లాడుతూ... వారిద్దరి నిర్వాకంతో తనకు ఎలాంటి సంబంధం లేదన్నాడు. ‘నా కోచ్, ఏజెం ట్ ఈ డోపింగ్ స్కామ్‌లో ఉండటం చూసి... నేను ఒక్కసారిగా షాక్‌కు గురయ్యా. ఆశ్చర్యపోయా. వెంటనే వాళ్లిద్దరిని తొలగించా. నేను మాత్రం ఏ తప్పూ చేయలేదు. ఇప్పటికే రెండు సార్లు డోపీగా శిక్ష అనుభవించిన నేను మళ్లీ వాటి జోలికి వెళ్లలేదు’ అని గాట్లిన్ తన ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్ట్ చేశాడు. -
క్రికెట్‌ను ‘నాడా’లో చేర్చండి
న్యూఢిల్లీ: జాతీయ డోపింగ్ నిరోధక సంస్థ (నాడా) నిర్వహించే డోపింగ్ పరీక్షలకు భారత క్రికెటర్లు కూడా హాజరయ్యేలా చూడాలని ప్రపంచ డోపింగ్ నిరోధక సంస్థ (వాడా) భారత ప్రభుత్వాన్ని కోరింది. ఈ మేరకు కేంద్ర క్రీడా శాఖ మంత్రి రాజ్యవర్ధన్ సింగ్ రాథోడ్‌కు ‘వాడా’ నేరుగా లేఖ రాసింది. లేదంటే తాము ‘నాడా’ గుర్తింపును రద్దు చేస్తామని కూడా హెచ్చరించింది. ఇదే విషయాన్ని అంతర్జాతీయ క్రికెట్ మండలి (ఐసీసీ)కి కూడా తెలియజేసిన ‘వాడా’, డోపింగ్ పరీక్షల విషయంలో బీసీసీఐని తగిన విధంగా ఆదేశించాలంటూ ఒత్తిడి పెంచే ప్రయత్నం చేసింది. దేశంలోని అన్ని క్రీడాంశాల్లో పాల్గొనే ఆటగాళ్లకు డోపింగ్ పరీక్షలు నిర్వహించే అధికారం ‘నాడా’కు మాత్రమే ఉంది. అయితే ఎప్పుడంటే అప్పుడు పరీక్షలకు హాజరు కావాల్సి ఉంటుందంటూ ఇందులోని ఒక నిబంధనను భారత క్రికెటర్లు వ్యతిరేకిస్తున్నారు. బీసీసీఐ ‘నాడా’కు దూరంగా ఉండి ఒక ప్రైవేట్ డోపింగ్ ఏజెన్సీతో తమ పరీక్షలు నిర్వహించుకుంటోంది. -
అచ్చం అదే పోలిక!!
మనిషిని పోలిన మనుషులు ఏడుగురు ఉంటారంటారు. మనలా ఉండే మనలాంటి ఇంకొకడిని చూస్తే మనమెలా ఫీలవుతాం? గమ్మత్తుగా ఉంటుంది కదూ! ట్విన్స్ విషయంలో ఇది రెగ్యులరే కానీ, ఎక్కడో మనకు తెలియని ఓ ప్రదేశంలో మనలాంటి పోలికలతో ఓ మనిషి ఉంటే? అసలు అలాంటి మనిషి ఒకర్ని మనం చూస్తామా? చూస్తే, వారిని ఒక పేరు పెట్టి పిలవాలంటే ఏమని చెప్పొచ్చు? ఇంగ్లిష్‌లో ఒక పదం ఉంది దీనికోసమే.. డొప్పెల్గ్యాంగర్ (Doppelganger)అని. మనలాంటి పోలికలతో ఉండే మరొకర్ని మనకు డొప్పెల్గ్యాంగర్ అని చెబుతారు. సామాన్య జనంలో డొప్పెల్గ్యాంగర్స్ అంటే మనకు మనమే చెప్పుకుంటాం, అంతవరకే తెలుస్తుంది కానీ, సెలెబ్రిటీలలో ఇలాంటిది కనిపిస్తే మాత్రం అది ప్రపంచానికీ తెలిసిపోతుంది. ‘అర్రే! నువ్ ఆ హీరోలానే ఉంటావ్!’ అంటూ ఎవరన్నా చెప్పితే సిగ్గుపడతాం కానీ, ఉండొచ్చు. ఉండడంలో తప్పేం లేదుగా! డొప్పెల్గ్యాంగర్ అన్న పదం ఇక్కడ హ్యాపీగా వాడేసుకోవచ్చు. ఇండియన్ సినిమాలో సూపర్‌స్టార్ స్టేటస్‌ను సంపాదించిన ఐశ్వర్యరాయ్ తెలుసు కదా? ఆమె పోలికలతోనే ఉంటారు హీరోయిన్ స్నేహా ఉల్లాల్. స్నేహాను చాలాసార్లు ఈ ప్రశ్నే అడిగారు కూడా! ఆమె ఎప్పట్లానే నవ్వుతూ. ‘‘నా అదృష్టం’’ అని సమాధానమిస్తారు. ప్రియాంకా చోప్రా, కత్రినా కైఫ్, నరేంద్ర మోడీ, బరాక్ ఒబామా, రోజర్ ఫెదరర్, అర్భాజ్ ఖాన్ ఇలా చాలామంది సెలెబ్రిటీలకు డొప్పెల్గ్యాంగర్స్ను చూడొచ్చు! -
సీబీఐ విచారణలో నిజాలు తెలుస్తాయి
రెజ్లర్ నర్సింగ్ యాదవ్ ఆశాభావం ముంబై: సీబీఐ విచారణలో తాను నిష్కళంకుడిగా తేలతానని డోపింగ్ కారణంగా నాలుగేళ్ల నిషేధం ఎదుర్కొంటున్న భారత రెజ్లర్ నర్సింగ్ యాదవ్ ఆశాభావం వ్యక్తం చేశాడు. ‘ప్రస్తుతం సీబీఐ విచారణ కొనసాగుతోంది. త్వరలోనే అసలు విషయం తెలుస్తుంది. న్యాయం నా పక్షానే ఉంటుందని నమ్ముతున్నాను. రియో ఒలింపిక్స్‌లో పాల్గొంటే పతకం సాధించేవాణ్ణి. ఎందుకంటే ఆ గేమ్స్ విజేతను నేను గతంలోనే ఓడించాను. ప్రస్తుతం నా ప్రాక్టీస్‌ను ఆపలేదు. 2020 టోక్యో ఒలింపిక్స్‌లో పతకమే లక్ష్యంగా ఉన్నాను’ అని 28 ఏళ్ల నర్సింగ్ యాదవ్ తెలిపాడు. ఎవరో కావాలని తన శాంపిల్‌ను టాంపరింగ్ చేశారని, అందుకే ఫలితం పాజిటివ్‌గా వచ్చిందని నర్సింగ్ అప్పట్లో ఆరోపించాడు. దీంతో అసలు విషయం తేల్చేందుకు సీబీఐ నడుం బిగించింది. -
వెక్కిరింతల నడుమ విజయం...
గతంలో రెండుసార్లు (2001లో, 2006లో) డోపింగ్‌లో దొరికిపోయి ఆరేళ్ల పాటు నిషేధం ఎదుర్కొన్న 35 ఏళ్ల జస్టిన్ గాట్లిన్ తాజా ఫలితంతో సంబరాలు చేసుకున్నాడు. ఒలింపిక్స్, ప్రపంచ చాంపియన్‌షిప్ వేదికపై బోల్ట్‌ను ఓడించాలని ఐదుసార్లు ప్రయత్నించి నాలుగుసార్లు రెండో స్థానంతో, మరోసారి మూడో స్థానంతో సరిపెట్టుకున్న గాట్లిన్ ఈసారి మాత్రం తన లక్ష్యాన్ని నెరవేర్చుకున్నాడు. డోపింగ్ నేపథ్యం ఉండటంతో... లండన్ ఒలింపిక్స్, రియో ఒలింపిక్స్‌లో మాదిరిగా ఈసారీ గాట్లిన్‌కు ప్రేక్షకుల నుంచి వెక్కిరింతలు ఎదురయ్యాయి. హీట్స్‌లో, సెమీఫైనల్లో, ఫైనల్లో అతను ట్రాక్‌పై వచ్చినపుడు, అతడిని పరిచయం చేసినపుడు ప్రేక్షకులు గోల చేశారు. అయినా ఇవేమీ పట్టించుకోని గాట్లిన్ ఆఖరికి విజేతగా నిలిచి అందరి నోళ్లు మూయించాడు. రేసు పూర్తయ్యాక ఫలితం వచ్చిన వెంటనే గాట్లిన్... బోల్ట్‌కు ఎదురువెళ్లి మోకాళ్లపై కూర్చొని అభివాదం చేసి తన క్రీడా స్ఫూర్తిని చాటుకున్నాడు. మరోవైపు గాట్లిన్ విజయానికి అర్హుడని, అతనికి వెక్కిరింతలు అవసరంలేదని బోల్ట్ వ్యాఖ్యానించాడు. అంతర్జాతీయ పోటీల్లో 100 మీటర్ల ఫైనల్ రేసులో బోల్ట్‌కు ఎదురైన రెండో ఓటమి ఇదే కావడం గమనార్హం. చివరిసారి 2013 జూన్‌లో రోమ్‌లో జరిగిన డైమండ్ లీగ్ మీట్లో బోల్ట్‌కు గాట్లిన్ చేతిలోనే ఓటమి ఎదురైంది. -
మన్‌ప్రీత్ కౌర్‌పై తాత్కాలిక నిషేధం
ప్రపంచ చాంపియన్‌షిప్‌కు దూరం న్యూఢిల్లీ: భారత స్టార్ షాట్‌పుట్ క్రీడాకారిణి మన్‌ప్రీత్ కౌర్ మరోసారి డోపింగ్‌లో పట్టుబడింది. దీంతో భారత అథ్లెటిక్స్ సమాఖ్య ఆమెపై తాత్కాలికంగా నిషేధం విధించింది. ఏప్రిల్ 24న చైనాలో జరిగిన తొలి అంచె ఆసియా గ్రాండ్‌ప్రిలో డోపింగ్ పరీక్షల నిమిత్తం ఆమె నుంచి యూరిన్ శాంపిల్ తీసుకున్నారు. దీంట్లోనూ ఆమె నిషేధిత ఉత్ప్రేరకాలు వాడినట్టు తేలడంతో వేటు పడింది. ఈ దెబ్బతో ఆమె వచ్చే నెల 4 నుంచి 13 వరకు లండన్‌లో జరిగే ప్రపంచ చాంపియన్‌షిప్‌కు దూరం కానుంది. అలాగే ఇటీవల భువనేశ్వర్‌లో జరిగిన ఆసియా అథ్లెటిక్స్ పోటీల్లో సాధించిన స్వర్ణం కూడా కోల్పోయినట్టే. గత నెలలో జరిగిన ఫెడరేషన్ కప్ సందర్భంగా ఆమె నుంచి సేకరించిన శాంపిల్‌లోనూ నిషేధిత ఉత్ప్రేరక ఆనవాళ్లు ఉన్నట్టు తేలిన విషయం తెలిసిందే. ఇక ఆమె ‘బి’ శాంపిల్ కూడా పాజిటివ్‌గా తేలితే నాలుగేళ్ల నిషేధం ఎదుర్కొంటుంది. -
డోపింగ్‌లో దొరికిన మన్‌ప్రీత్ కౌర్
న్యూఢిల్లీ: భారత మేటి అథ్లెట్ మన్‌ప్రీత్ కౌర్ డోపింగ్‌లో పట్టుబడింది. ఇటీవలే భువనేశ్వర్‌లో జరిగిన ఆసి యా చాంపియన్‌షిప్‌లో ఆమె షాట్‌పుట్‌లో స్వర్ణం గెలిచింది. లండన్‌లో వచ్చే నెలలో జరిగే ప్రపంచ చాంపియన్‌షిప్‌కూ అర్హత సంపాదించింది. ఇప్పుడు స్వర్ణం, బెర్త్ రెండూ కోల్పోయే పరిస్థితి తలెత్తింది. గత నెలలో జరిగిన ఫెడరేషన్ కప్ సందర్భంగా ఆమె నుంచి సేకరించిన నమూనాలను పరీక్షించగా... ‘ఎ’ శాంపిల్‌లో నిషిద్ధ డిమిథైల్‌బుటిలమైన్ ఉత్ప్రేరకాన్ని తీసుకున్నట్లు తేలింది. తదుపరి ‘బి’ శాంపిల్ కూడా ఇలాగే పాటిజివ్ రిపోర్టు వస్తే ఆమెపై క్రమశిక్షణ చర్యలు తీసుకుంటామని భారత అథ్లెటిక్స్ సమాఖ్య అధికారి అన్నారు. -
ఇలాంటి వాడితో పెళ్లా.. నాకొద్దు!
గురుద్వారాలో తనను పెళ్లి చేసుకోడానికి వచ్చని వరుడు.. బాగా డ్రగ్స్ మత్తులో ఉండటంతో, ఇలాంటి వ్యక్తిని తాను పెళ్లి చేసుకునేది లేదని పెళ్లి కూతురు ఛీకొట్టి వెళ్లిపోయింది. ఈ ఘటన పంజాబ్‌లోని దీనానగర్ పట్టణంలో జరిగింది. గురుదాస్‌పూర్ నగరానికి 12 కిలోమీటర్ల దూరంలో ఉండే ఈ పట్టణంలోని దసరా గ్రౌండ్ ప్రాంతానికి చెందిన లారీ డ్రైవర్ కుమార్తె సునీతా సింగ్‌కు ఇటీవల జస్ప్రీత్ సింగ్ అనే యువకుడితో పెళ్లి కుదిరింది. మహారాజా రంజిత్ సింగ్ గురుద్వారాలో పెళ్లికి అన్ని ఏర్పాట్లు జరిగాయి. భారీగా ఊరేగింపుతో వచ్చిన పెళ్లికొడుకు కారులోంచి కాలు బయట పెట్టగానే అడుగులు తడబడ్డాయి. అది చూసిన సునీత.. అతడు బాగా డ్రగ్స్ తీసుకుని ఉన్నాడని, అలాంటి డ్రగ్ అడిక్ట్‌తో తాను పెళ్లి చేసుకునేది లేదని తెగేసి చెప్పింది. దాంతో పెళ్లి కొడుకు తల్లిదండ్రులు షాకయ్యారు. లారీ డ్రైవర్ అయిన జస్ప్రీత్ కాలికి గాయమైందని, అందుకే అతడి అడుగులు తడబడుతున్నాయని నచ్చజెప్పేందుకు చాలా ప్రయత్నించారు. కానీ సునీత మాత్రం తన నిర్ణయానికి గట్టిగా కట్టుబడింది. పెళ్లికొడుకును వెంటనే వైద్య పరీక్షలకు తీసుకెళ్లాలని ఆమె డిమాండ్ చేసింది. అయితే, సమయానికి అక్కడి కమ్యూనిటీ హెల్త్ సెంటర్లో డ్రగ్స్‌కు సంబంధించిన పరీక్షలు చేయడానికి తగిన పరికరాలు లేవు. దాంతో గురుదాస్‌పూర్‌లో ఒక ప్రైవేటు ల్యాబ్‌లో పరీక్షలు చేయించాల్సిందిగా ఆమె చెప్పింది. అక్కడ టెస్ట్ చేస్తే, జస్ప్రీత్ డ్రగ్స్ తీసుకున్నట్లు తేలింది. దాంతో గురుద్వారా సమీపంలో ఉన్న ఒక పోలీసు స్టేషన్లో పెళ్లికొడుకుపై సునీత ఫిర్యాదు చేసింది. చివరకు రెండు కుటుంబాలు పెళ్లిని రద్దు చేసుకోడానికి అంగీకరించాయి. అంతకుముందు మార్చుకున్న బంగారు ఉంగరాలను కూడా ఎవరికి వారు తిరిగి ఇచ్చేశారు. తన కూతురు మంచి నిర్ణయం తీసుకుందని, పెళ్లి చేసుకున్న తర్వాత కూడా అతడు డ్రగ్స్ సేవించి వస్తే ఆమె ఎలా సంతోషంగా ఉంటుందని సునీత తండ్రి కమల్ సింగ్ అన్నారు. -
‘బి’ శాంపిల్ టెస్టుకూ హాజరుకాని సుబ్రతా పాల్
న్యూఢిల్లీ: డోపింగ్‌లో విఫలమైన భారత ఫుట్‌బాల్ జట్టు మాజీ కెప్టెన్ సుబ్రతా పాల్ తన ‘బి’ శాంపిల్ టెస్టుకు కూడా హాజరుకాలేదు. ‘ఎ’ శాంపిల్‌లో తను నిషేధిత ఉత్ప్రేరకం వాడినట్టు తేలిన విషయం తెలిసిందే. అయితే ‘బి’ శాంపిల్ టెస్టులో తానేమిటో తెలుస్తుందని అతను అప్పీల్ చేసుకోగా... సోమవారంలోగా హాజరు కావాలని జాతీయ డోపింగ్ వ్యతిరేక సంస్థ (నాడా) దీనికి తుది గడువునిచ్చింది. కానీ స్వతంత్ర ప్రభుత్వ పరిశీలకుని ఆధ్వర్యంలో జరిగే ఈ టెస్టుకు పాల్ అనూహ్యంగా దూరమయ్యాడు. ఈ పరీక్షకు హాజరుకాకుండా తనకు మరికొంత సమయం గడువు కావాలని కోరాడు. దీంతో సుబ్రతా పాల్ ఉద్దేశపూర్వకంగానే డ్రగ్స్‌ను వాడినట్లుగా ఉందని పలువురు అనుమానిస్తున్నారు. -
డోపింగ్ పాల్పడితే ఇక జైలే
కొత్త చట్టం చేసే దిశగా కేంద్ర క్రీడాశాఖ న్యూఢిల్లీ: డోపింగ్‌కు పాల్పడ్డవారికి జైలు శిక్ష విధించేలా చట్టం తీసుకురావాలని భారత క్రీడామంత్రిత్వ శాఖ యోచిస్తోంది. దీని కోసం జాతీయ డోపింగ్ నిరోధక ఏజెన్సీ(నాడా) డైరెక్టర్ జనరల్ నవీన్ అగర్వాల్ ఒక సమావేశం ఏర్పాటుచేసి ప్రయత్నాలు ప్రారంభించారు. ఈ సమావేశంలో కేంద్ర క్రీడామంత్రి విజయ్ గోయల్ కూడా పాల్గొన్నారు. ‘ఇంతకుముందు జాతీయ స్థాయిలో ఉన్న డోపింగ్ సమస్య ఇప్పుడు విశ్వవిద్యాలయాలు, పాఠశాల స్థాయిలకు కూడా చేరడం ఎంతో బాధిస్తోంది. డోపింగ్‌ను క్రిమినల్ చర్యగా భావించి వారిని శిక్షించేందుకు ప్రత్యేక చట్టం తీసుకువస్తున్నాం. జర్మనీ, ఆస్ట్రేలియా లాంటి దేశాల్లో అమలవుతున్న ఈ విధానాన్ని అధ్యయనం చేస్తున్నాం. ఆటగాళ్లే కాక డోపింగ్ విషయంలో భాగస్వాములైన కోచ్‌లు, ట్రైనర్లు, డాక్టర్లను కూడా శిక్షించేలా చర్యలు తీసుకుంటాము’ అని గోయల్ ప్రకటించారు. ఆటగాళ్లు ఉపయోగించేందుకు అనువుగా ఉండే డ్రగ్ కంపెనీల పేర్లను వాడా ప్రకటిస్తే బాగుంటుందని గోయల్ అభిప్రాయపడ్డారు. కోచి స్టేడియాన్ని తనిఖీ చేయనున్న గోయల్ వచ్చే అక్టోబర్‌లో సొంతగడ్డపై జరుగనున్న ఫిఫా అండర్–17 ప్రపంచకప్ ఏర్పాట్లపై కేంద్రం దృష్టిపెడుతోంది. ఈక్రమంలో ప్రపంచకప్ వేదికైన శుక్రవారం కేరళలోని కోచిలో ఉన్న జవహర్లాల్ నెహ్రూ స్టేడియాన్ని కేంద్ర క్రీడామంత్రి విజయ్ గోయల్ తనిఖీ చేయనున్నారు. ఈనెల ప్రారంభంలోనే ఫిఫా కమిటీ కోచి స్టేడియంపై సమీక్షించింది. మే 15 లోగా స్టేడియంలోని ఏర్పాట్లన్నీ పూర్తవుతాయని ఆశాభావం వ్యక్తం చేసింది. గడుపు సమీపిస్తున్న వేళ ఏర్పాట్లను పరిశీలించడానికి గోయల్ కోచి రానున్నారు. అలాగే కోచిలోని సాయ్ కార్యకలపాలపైనా సమీక్ష సమావేశాన్ని గోయల్ నిర్వహించనున్నట్లు క్రీడా మంతిత్వ శాఖ ఓ ప్రకటనలో తెలిపింది. కోచి స్టేడియాన్ని తనిఖీ చేసిన అనంతరం టోర్నీ మిగతా ఐదు వేదికలను కూడా సందర్శించనున్నట్లు పేర్కొంది. గతనెలలో ఫిఫా తనిఖీ బృందం స్థానిక జవహర్లాల్ స్టేడియాన్ని సందర్శించి ఏర్పట్లపై అసంతృప్తి వ్యక్తం చేసింది. మే 15లోగా పనులన్నీ పూర్తి చేయాలని నిర్వాహకులకు తుది గడువు విధించింది. -
డోపీగా పట్టుబడ్డ క్రికెటర్.. రెండేళ్ల నిషేధం!
వెల్లింగ్టన్: నిషేధిత ఉత్ప్రేరకాలు వాడిన న్యూజిలాండ్ క్రికెటర్ అడ్డంగా దొరికిపోయాడు. ప్రదర్శన పెంచుకునేందుకు డ్రగ్స్ తీసుకున్నఅడమ్ కింగ్ అనే క్రికెటర్ పై రెండేళ్లపాటు నిషేధం విధించారు. అనబోలిక్ స్టెరాయిడ్స్, హార్మోన్లు వాడినట్లు డోప్ టెస్టుల్లో తేలినందున న్యూజిలాండ్ స్పోర్ట్స్ ట్రిబ్యూనల్ ఈ నిర్ణయం తీసుకుంది. మిడియం ఫాస్ట్ బౌలర్ అయిన అడమ్ కింగ్ పరపరౌము క్రికెట్ క్లబ్ తరఫున 2011లో అరంగేట్రం చేశాడు. న్యూజిలాండ్ హాకే కప్ లో 2013 నుంచి 2016 వరకు ఆడాడు. 2014లో నిషేధిత నాండ్రోలోన్, టెస్టోస్టిరాన్ ను వాడినట్లు తేలింది. 2015 నుంచి హార్మోన్లు తీసుకుంటున్నట్లు మెడికల రెగ్యులేటర్ మెడ్ సేఫ్ వెల్లడించింది. తెలివి తక్కువ చర్యతో అడమ్ భారీ మూల్యం చెల్లించుకున్నాడని ఓ ప్రతినిధి గ్రేమ్ స్టీల్ తెలిపారు. కివీస్ క్రికెటర అడమ్ కింగ్ మీడియాతో మాట్లాడుతూ.. ‘శరీరం దృఢంగా కనిపించేందుకు ఈ పని చేశాను. అధిక బరువు పెరగడంతో సమస్యలు ఎదుర్కున్నాను. మోకాలు సమస్య బాధిస్తోంది. భవిష్యత్తు ఎలా ఉంటుందో చెప్పలేను’ అంటూ ఆవేదన వ్యక్తంచేశాడు. -
98.5 శాతం సరైన నిర్ణయాలే!
అంతర్జాతీయ క్రికెట్లో అంపైర్ నిర్ణయ సమీక్షా పద్ధతి (డీఆర్ఎస్)ను ఉపయోగించడం వల్ల అంపైర్లు 98.5 శాతం వరకు సరైన నిర్ణయాలు వెలువరిస్తున్నారని అంతర్జాతీయ క్రికెట్ మండలి (ఐసీసీ) చీఫ్ ఎగ్జిక్యూటివ్ డేవిడ్ రిచర్డ్సన్ సంతృప్తి వ్యక్తం చేశారు. 94 శాతం వరకు సరైన ఫలితాలు రావాలని తాము లక్ష్యంగా పెట్టుకున్నా... అది మరింత మెరుగ్గా ఉందని ఆయన అన్నారు. డోపింగ్ ఫలితాలను మరింత పక్కాగా తేల్చేందుకు ఈ ఏడాది నుంచి రక్త పరీక్షలు కూడా ప్రవేశ పెడుతున్నామన్న రిచర్డ్సన్ ... క్రికెట్‌ను ఒలింపిక్స్‌లో చేర్చే విషయంపై మరోసారి త్వరలోనే చర్చలు నిర్వహించనున్నట్లు వెల్లడించారు. -
మళ్లీ లవ్ ఆల్
టెన్నిస్ క్రీడాకారిణి మారియా షరపోవా టెన్నిస్‌లో ‘లవ్’ అంటే జీరో. షరపోవా ఇప్పుడు ‘లవ్’లో ఉంది. ఆటను ఫ్రెష్‌గా... లవ్ నుంచి స్టార్ట్ చేయబోతోంది! అసలైతే... లవ్ అంటే ప్రేమ. షరపోవాను ఎంతోమంది లవ్ చేశారు. ఆమె మాత్రం ఆటనే లవ్ చేసింది. బ్యాన్ తర్వాత.. ఈ ఏడాది షరపోవా ఆడబోతున్న తొలి ఆట కోసం ప్రపంచమంతా కళ్లలో లవ్వొత్తులు వేసుకుని ఎదురు చూస్తోంది. షరపోవా కోపంగా ఉంది! కోపంగా ఉన్నప్పుడు రాకెట్‌తో లాగిపెట్టి బంతిని కొడుతుంది. ప్రాక్టీస్ వాల్‌ను పిడిగుద్దులు గుద్దినట్టుగా బంతిని వాల్ పైకి ఈడ్చి కొడుతూనే ఉంటుంది. షరపోవా మంచి అమ్మాయి. ఊరికినేతనకు కోపం రాదు. చేసిన తప్పు కాదు... చెప్పిన తప్పు! కొన్నాళ్లుగా షరపోవా కోపంగానే ఉంటోంది. ఏడాది క్రితం డోపింగ్ టెస్ట్‌లో ఆ అమ్మాయి దొరికిపోయింది. నిజానికి ‘దొరికిపోయేంత’ పెద్ద తప్పు తనేం చేయలేదు. ‘అరె! ఈ మందును నేను ఎప్పటి నుంచో వాడుతున్నా’ అని పబ్లిగ్గా చెప్పింది. అదే తప్పయింది! నిరుడు జనవరిలో ఆస్ట్రేలియన్ ఓపెన్‌కు ముందు డ్రగ్ టెస్ట్ చేసినప్పుడు ఆమె ఒంట్లో ‘మెల్డోనియం’ అనే మందు బయటపడింది. అదేమీ నిషేధించిన ఔషధం కాదు. అయితే వరల్డ్ యాంటీ డోపింగ్ ఏజెన్సీ 2016 జనవరి 1 నుంచి నిషేధిత ఔషధాలలో దానిని కూడా చేర్చడంతో షరపోవా దోషి కావలసి వచ్చింది! అందుకు పడిన శిక్ష ఆట నుంచి రెండేళ్ల బ్యాన్! షరపోవా నివ్వెరపోయింది. తన వాదన వినిపించింది. శిక్షాకాలం రెండేళ్ల నుంచి పదిహేను నెలలకు తగ్గిపోయింది. కానీ షరపోవా కోపం తగ్గిపోలేదు. తలో రాయి విసిరినా.. నో సారీ కోపంగా ఉన్నప్పుడు షరపోవా గోడల్ని పగలగొట్టే మాట నిజమే కానీ, ఇప్పుడామె కొద్దిగా మారింది. కోపం నుంచి కొద్దికొద్దిగా పికప్ అవుతోంది. మెడిటేషన్ చేస్తోంది. హార్వర్డ్ బిజినెస్ స్కూల్లో చిన్నపాటి అధ్యయనం చేస్తోంది. మంచి మంచి బుక్స్ చదువుతోంది. బయోగ్రఫీ రాస్తోంది. ఇవి కాక.. బాక్సింగ్ ప్రాక్టీస్ చేస్తోంది! బాక్సింగ్ మధ్యలో తనకు నచ్చని వ్యక్తులు గుర్తొస్తే, ఆ కోపాన్ని బాక్సింగ్ బ్యాగ్ మీద చూపిస్తోంది. బ్యాగ్‌కి ఏమీ కాదు. కానీ పంచ్ పడిన ప్రతిసారీ.. ఆమె లోపల కదలాడే మనుషుల దవడలు పగిలిపోతున్నాయి! నైస్. ఎవరివై ఉంటాయి షరపోవా ఊహాల్లోని ఆ శత్రుచిత్రాలు? ఎవరివైనా కావచ్చు. ఆమెను చాలామందే చికాకు పరిచారు. డేవిడ్ హెగర్టీ! ఇంటర్నేషనల్ టెన్నిస్ ఫెడరేషన్ ప్రెసిడెంట్. ఆమె బ్యాన్ నిర్ణయం అతడిదే; ఇంకా.. సాటి ప్లేయర్లు జాన్ మెకన్రో, ప్యాట్ క్యాష్, జెన్నిఫర్ కాప్రియాటీ, సెరెనా విలియమ్స్, రోజర్ ఫెడరర్, రాఫెల్ నాదల్, ఆండీ ముర్రే, నొవాక్ జొకోవిచ్.. వీళ్లలో ఎవరి దవడలైనా కావచ్చు. వీళ్లంతా తలో మాట వేశారు. ఇలా చేసిందంటే నమ్మలేక పోతున్నాం అని ఒకరు, తన 35 టైటిళ్లనీ వెనక్కు తీసేసుకోవాలి అని ఒకరు, సారీ చెప్పినా ఒప్పుకోవద్దని ఒకరు... ఇలా తలో రాయి విసిరారు. షరపోవా ఇప్పటికీ సారీ చెప్పలేదు. ఎప్పటికీ చెప్పేది లేదని కూడా అన్నారు. బ్యాన్ తీరిపోయాక జర్మనీలోని స్టట్గార్ట్ క్లే కోర్టులో ఏప్రిల్ 26న తొలి టోర్నమెంట్ ఆడబోతున్నారు. ఆట ఒక్కటే నిజమైన బాయ్‌ఫ్రెండ్ ఇష్టమైన వాళ్లకు దూరంగా ఎన్నాళ్లైనా, ఎన్నేళ్లైనా దూరంగా ఉండగలం. ఇష్టమైన ఆటకు ఒక రోజు కూడా ఉండలేం. షరపోవాకు టెన్నిస్ అంటే కేవలం ఇష్టం కాదు. ప్రాణం. పద్దెనిమిదవ యేటే టెన్నిస్‌లో ఆమె వరల్డ్ నం.1 ర్యాంకులోకి వచ్చేశారు. అదే ఏడాది 18వ బర్త్‌డే పార్టీలో అమెరికన్ పాప్ రాక్ బ్యాండ్ ‘మెరూన్ 5’ సింగర్ ఆడమ్ లెవీన్ ఆమెకు పరిచయం అయ్యాడు. డేటింగ్ అయ్యాక అతడు లేడు. ఆట మాత్రమే ఉంది. తర్వాత అమెరికన్ టెలివిజన్ ప్రొడ్యూజర్ చార్లీ ఎబర్సోల్ ఆమె జీవితంలోకి వచ్చాడు. కొన్నాళ్ల డేటింగ్ తర్వాత అతడూ లేడు. ఆట ఉంది. ఆ తర్వాత స్లొవేనియా బాస్కెట్‌బాల్ ప్లేయర్ సషా ఉజాసిక్, తర్వాత బల్గేరియన్ టెన్నిస్ ప్లేయర్ గ్రిగర్ డిమిట్రోవ్. వీళ్లూ మిగల్లేదు! ప్రతిసారీ ఆట ఒక్కటే షరపోవాతో ఉంటోంది. ఆట కోసం ప్రేమను వదులుకోవడం లేదు షరపోవా. ఆటను మాత్రమే ఆమె ప్రేమించింది. పన్నెండేళ్ల క్రితం వరల్డ్ నంబర్ 1 అయిన షరపోవాకు ఇప్పుడు ఏ ర్యాంకూ లేదు. మళ్లీ కొత్తగా జీవితాన్ని మొదలు పెట్టాలి. ర్యాంకులే ఆమె జీవితం అని కాదు దీని అర్థం. అసలంటూ రాకెట్ పట్టడమే ఆమె లైఫ్. షరపోవా రష్యన్ ప్రొఫెషనల్ ప్లేయర్. ఇరవై రెండేళ్లుగా యు.ఎస్.లో ఉంటోంది. ఒలింపిక్ మెడలిస్ట్. గెలిస్తే ప్రాక్టీస్... ఓడితే షాపింగ్! మ్యాచ్ గెలిచినప్పుడు షరపోవా వెంటనే తర్వాతి మ్యాచ్‌కు ప్రాక్టీస్ మొదలు పెడతారు. మ్యాచ్‌లో ఓడిపోయినప్పుడు ఆ ప్రెజర్ నుంచి బయట పడడానికి షాపింగ్‌కి వెళతారు! ఇప్పుడంటే బ్యాన్ టైమ్‌లో సరదాగా బాక్సింగ్‌కి వెళుతున్నారు కానీ, షరపోవాకు టెన్నిస్ తప్ప మరే ఆటా ఇష్టం లేదు. పిప్పీ లాంగ్‌స్టాకింగ్ బుక్స్ చదివే అలవాటు ఆమెకు ఇంకా పోలేదు. ‘ఇంకా’ అంటే.. ఇంత పెద్దయినా! పిప్పీ లాంగ్‌స్టాకింగ్... స్వీడిష్ రచయిత్రి ఆస్ట్రిడ్ లిండ్‌గ్రెన్ నవలల్లోని ఒక అమ్మాయి క్యారెక్టర్. పిప్పీ జుట్టు ఎర్రగా ఉంటుంది. రెండు జడలు ఉంటాయి. సింగిల్ హ్యాండ్‌తో తన గుర్రాన్ని అదుపు చేస్తుంటుంది. చురుగ్గా ఉంటుంది. ఆ పాత్రలో తనను తాను ఊహించుకుంటుందట షరపోవా. అందుకే ఆమెకు పిప్పీ అంటే అంతిష్టం. బాల్యం నుంచి దూర దూరంగా వచ్చేస్తున్నకొద్దీ, బాల్యం ఆమెకు దగ్గర దగ్గరగా రావడం షరపోవా జీవితంలోని ఒక విశేషం. చిన్నపిల్ల నవ్వు, చిన్నపిల్ల చూపు, చిన్నపిల్ల వెక్కిరింపు ఇవెక్కడికీ పోలేదు. ఆమె దగ్గర చిన్నప్పటి స్టాంప్ కలెక్షన్ ఇంకా పోగవుతూనే ఉంది. చిన్నప్పటి ఆమె జ్ఞాపకాల సుగంధ పరిమళం స్టెల్లా మెకార్ట్నీ ఎప్పుడూ ఆమె ఒంటిని అంటుకునే ఉంటుంది! యాదృచ్ఛికంగా.. అదే రోజు! సోవియెట్ యూనియ¯Œ లో చెర్నోబిల్ అణు ప్రమాదం సంభవించిన తర్వాత ఏడాదికి న్యాగన్ పట్టణంలో షరపోవా పుట్టింది. ఆ పట్టణం చెర్నోబిల్ దుర్ఘటన జరిగిన ప్రిప్యత్ పట్టణానికి 3,500 కి.మీ. దూరంలో ఉంటుంది. ఉండడం కాదు, చెర్నోబిల్ ప్రమాద ప్రభావం పడకుండా ఉండేందుకు షరపోవా తల్లిదండ్రులే ముందు జాగ్రత్తగా ప్రిప్యత్ నుంచి ఎంత దూరంగా వీలైతే అంత దూరంగా వెళ్లిన తర్వాతే బిడ్డను కనాలని నిర్ణయించుకుని న్యాగన్‌లో తలదాచుకున్నారు. చెర్నోబిల్ ప్రమాదం 1986 ఏప్రిల్ 26న జరిగింది. ముప్పై ఏళ్ల తర్వాత మళ్లీ ఇప్పుడు అదే రోజున షరపోవా తన ‘రీబర్త్’ టెన్నిస్‌ను ఆడబోతున్నారు. తండ్రి స్నేహితుడు రాకెట్ ఇచ్చాడు షరపోవాకు రెండేళ్ల వయసులో ఆమె కుటుంబం సోచ్ సిటీకి మారింది. అక్కడ ఆమె తండ్రికి అలెగ్జాండర్ కఫెల్కి కోవ్ అనే వ్యక్తి పరిచయం అయ్యాడు. అలెగ్జాండర్ తన పద్నాలుగేళ్ల కొడుకు ఎవ్‌జెనీకి టెన్నిస్‌లో శిక్షణ ఇప్పిస్తున్నప్పుడు ఈ ఇద్దరి పెద్దమనుషులు కలుసుకోవడం జరిగింది. తర్వాత రెండేళ్లకు తండ్రితో పాటు ఆట చూడడానికి వచ్చిన షరపోవాను చూసి ముచ్చట పడి ఆ చిన్నారికి కూడా ఓ టెన్నిస్ రాకెట్ కొనిచ్చాడు అలెగ్జాండర్. అదే తొలిసారి షరపోవా రాకెట్ పట్టుకోవడం. లోకల్ పార్క్‌లో చాలాకాలం పాటు ఆ రాకెట్‌తోనే ఆడింది షరపోవా. తర్వాత రష్యన్ కోచ్ యూరి యట్కిన్ దగ్గర టెన్నిస్ పాఠాలు నేర్చుకుంది. తొలి ఆటలోనే షరపోవాలోని అతి ప్రత్యేకమైన ‘హ్యాండ్–ఐ కోఆర్డినేషన్’ని గమనించాడు కోచ్. మార్టినా నవ్రతిలోవా ‘లిఫ్ట్’ ఇచ్చారు! ఆరవ యేట మాస్కోలో మార్టినా నవ్రతిలోవా నడుపుతున్న టెన్నిస్ క్లినిక్‌లో చేరడం షరపోవా కెరీర్‌ను మలుపుతిప్పింది. మార్టినా ఈ చిన్నారిని ఫ్లోరిడాలోని ఐ.ఎం.జి.అకాడమీకి రికమండ్ చేశారు! ఆండ్రీ అగస్సీ, మోనికా సెలెస్, అన్నా కోర్నికోవా లాంటి టెన్నిస్ దిగ్గజాలు ట్రైనింగ్ తీసుకున్న అకాడమీ అది. కానీ షరపోవా తండ్రి దగ్గర డబ్బుల్లేవు. అప్పు చేయాలి. డబ్బైతే అప్పు చేయగలడు కానీ, ఇంగ్లిషులో మాట్లాడలేడు కదా! ఇంట్లో ఎవ్వరికీ ఇంగ్లిష్ రాదు. ఆ భయంతో ఏడాది తాత్సారం చేసి, చివరికి ధైర్యం చేశాడు. అయితే వీసా నిబంధనలు తండ్రీ కూతుళ్లను మాత్రమే యు.ఎస్.లోకి రానిచ్చాయి. తల్లి ఎలీనా రెండేళ్ల పాటు భర్తకు, కూతురికి దూరంగా రష్యాలోనే ఉండిపోవలసి వచ్చింది. కూతురి కోసం ప్లేట్లు కడిగాడు 1994లో షరపోవా, ఆమె తండ్రి తొలిసారి అమెరికాలో అడుగుపెట్టేనాటికి వాళ్ల దగ్గరున్న డబ్బు 700 డాలర్లు. ఇప్పటి లెక్కల్లో కేవలం 47 వేల రూపాయలు. వాటిని జాగ్రత్తగా వాడుకుంటూనే ఫ్లోరిడాలోని చుట్టుపక్కల ఇళ్లల్లో ప్లేట్లు కడగడం వంటి చిన్న చిన్న ఉద్యోగాలు చేశారు యూరి. తర్వాతి ఏడాదికల్లా అకాడమీ ప్రవేశానికి అర్హమైన తొమ్మిదేళ్ల వయసు రాగానే కూతుర్ని ఐ.ఎం.జి.లో చేర్చారు. ఇక షరపోవాకి ట్యూషన్ ఫీజు, ఇతర సదుపాయాలు, సౌకర్యాలు అన్నీ అకాడమీవే. అలా కెరీర్‌తో పాటు, షరపోవా జీవితం కూడా యు.ఎస్.తో ఫిక్స్ అయిపోయింది. ఆటల్లోనే కాదు, చారిటీల్లో కూడా ఇప్పుడామె పెద్ద సెలబ్రిటీ. సర్వీస్ ఓరియెంటెడ్ యువ క్రీడాకారిణి. స్వీట్ ఎట్ హార్ట్! సుగర్‌పోవా అనే క్యాండీ అమెరికాలో విరివిగా దొరుకుతుంది. ఫన్నీగా ఉంటుంది. నోట్లో వేసుకుంటే స్వీట్‌గా ఉంటుంది. క్యాండీల వ్యాపారి జెఫ్ రూబిన్.. షరపోవా పేరు మీదే, ఆమెతో కలసి ఈ సుగర్‌పోవా క్యాండీని సృష్టించాడు. దాని అమ్మకాలపై వచ్చే డబ్బు ‘షరపోవా చారిటీ’కి వెళుతుంది. ఒక సందర్భంలో షరపోవా తన పేరును సుగర్పోవాగా మార్చుకోవాలని కూడా అనుకున్నారు! అంతగా షరపోవా వల్ల ఆ ప్రోడక్ట్ ఇమేజ్ పెరిగిపోయింది. ప్రస్తుతం హార్వర్డ్ బిజినెస్ స్కూల్లో షరపోవా చదువుతున్న షార్ట్‌టర్మ్ కోర్సు కూడా తన క్యాండీ బిజినెస్‌ను విస్తృతం చెయ్యడానికి ఉపయోగపడేదే. ఇదీ షరపోవా బ్రీఫ్ బయోగ్రఫీ. అసలు ఆమె ఇంగ్లిష్ ఎలా నేర్చుకుందీ, కనీస విద్యార్హతలు లేకుండానే హార్వర్డ్‌లో ఇప్పుడు కోర్సు ఎలా చేస్తోందీ అనే డీటెయిల్స్ కావాలనుకునేవారు తను రాయబోతున్న పుస్తకం కోసం వచ్చే సెప్టెంబర్ వరకు ఆగాలి. మొదట ఇంగ్లిష్‌లో, తర్వాత రష్యన్ భాషలో పబ్లిష్ కాబోతున్న ఆ పుస్తకం.. నో డౌట్.. ఇన్స్పైరింగ్గా ఉంటుంది. ‘కెరీర్ గ్రాండ్‌స్లామ్’ ఘనత మహిళల టెన్నిస్ చరిత్రలో ఇప్పటివరకు 10 మంది మాత్రమే ‘కెరీర్ గ్రాండ్‌స్లామ్’ (నాలుగు వేర్వేరు గ్రాండ్‌స్లామ్ టైటిల్స్ సాధించడం) ఘనతను అందుకున్నారు. అప్పటికే మూడు గ్రాండ్‌స్లామ్ టైటిల్స్ నెగ్గిన షరపోవా 2012లో ఫ్రెంచ్ ఓపెన్ టైటిల్ దక్కించుకోవడం ద్వారా ఈ ఘనత సాధించారు. పద్నాలుగేళ్లకే ప్రొఫెషనల్ తొమ్మిదేళ్ల వయసులోనే అండర్–16 టోర్నమెంట్లో విజేతగా నిలిచిన షరపోవా ఒక్కో మెట్టు అధిగమిస్తూ కెరీర్లో ముందుకు సాగారు. 14 ఏళ్లకే ప్రొఫెషనల్‌గా మారారు. 2003లో నాలుగు గ్రాండ్‌స్లామ్ టోర్నమెంట్లలో (ఆస్ట్రేలియన్, ఫ్రెంచ్, వింబుల్డన్, యూఎస్ ఓపెన్) మెయిన్ ‘డ్రా’ మ్యాచ్‌ల్లో ఆడారు. 2004లో షరపోవా కెరీర్ మలుపు తిరిగింది. ఆ ఏడాది వింబుల్డన్ టోర్నీ ఫైనల్లో టాప్ సీడ్, డిఫెండింగ్ చాంపియన్ సెరెనా విలియమ్స్ (అమెరికా)పై వరుస సెట్లలో షరపోవా గెలిచి 17 ఏళ్లకే వింబుల్డన్ చాంపియన్‌గా అవతరించి పెను సంచలనం సృష్టించారు. అదే ఏడాది సీజన్ ముగింపు టోర్నీ డబ్ల్యూటీఏ ఫైనల్స్‌లో సెరెనాను మరోసారి ఓడించి షరపోవా ప్రపంచ ర్యాంకింగ్స్‌లో నాలుగో స్థానానికి ఎగబాకారు. 2005లో తొలిసారి ప్రపంచ నంబర్‌వన్ ర్యాంక్‌ను సంపాదించారు. షరపోవా ఆటతీరు దూకుడుగా ఉంటుంది.. రివర్స్ ఫోర్‌హ్యాండ్ షాట్లు ఎక్కువగా ఆడే షరపోవా సంప్రదాయ వాలీ, ఓవర్‌హెడ్ స్మాష్‌లు అంతగా ఆడరు. వీటికి బదులు నెట్ వద్దకు దూసుకొస్తూ బంతి గాల్లో ఉన్నపుడు వాలీ షాట్లు ఆడటాన్ని ఇష్టపడతారు. ఆటద్వారా షరపోవా సంపాదించిన ప్రైజ్‌మనీ 3 కోట్ల 64 లక్షల 84 వేల 486 డాలర్లు (రూ. 245 కోట్లు). -
విండీస్ క్రికెటర్ రసెల్‌పై ఏడాది నిషేధం
డోపింగ్ నిబంధనలను అతిక్రమించినందుకు వెస్టిండీస్ ఆల్‌రౌండర్ ఆండ్రీ రసెల్‌పై ఏడాది పాటు నిషేధం విధించారు. స్వతంత్ర డోపింగ్ నిరోధక ట్రిబ్యునల్ మంగళవారం ఈ తీర్పు వెలువరించింది. నిషేధం వెంటనే అమల్లోకి వస్తుంది. 2015లో మూడు వేర్వేరు తేదీల్లో తాను ఎక్కడ ఉన్నాడో తెలపాలంటూ ప్రపంచ డోపింగ్ నిరోధక సంస్థ (వాడా) ఆదేశించగా, ఆ వివరాలను ఇవ్వడంలో రసెల్ విఫలమయ్యాడు. నిబంధనల ప్రకారం స్పందించకపోవడాన్ని డ్రగ్ పరీక్షలో విఫలమైనట్లుగానే భావిస్తారు. విండీస్ తరఫున రసెల్ 51 వన్డేలు, 43 టి20 మ్యాచ్‌లు ఆడాడు. -
బోల్ట్ చేజారిన రిలే స్వర్ణం
లుసానే: జమైకా స్టార్ అథ్లెట్ ఉసేన్ బోల్ట్ సాధించిన తొమ్మిది ఒలింపిక్ స్వర్ణాలలో ఒకటి తగ్గనుంది. 2008 బీజింగ్ ఒలింపిక్స్‌లో బోల్ట్, మైకేల్ ఫ్రాటెర్, అసఫా పావెల్, నెస్టా కార్టర్ సభ్యులుగా ఉన్న జమైకా రిలే జట్టు 4్ఠ100 మీ టర్ల రిలేలో స్వర్ణ పతకం సాధించింది. అయితే ఈ రిలే జట్టు సభ్యుడైన నెస్టా కార్టర్ డోపింగ్‌లో పట్టుబడటంతో... అంతర్జాతీయ ఒలింపిక్ కమిటీ (ఐఓసీ) ఈ ఫలితాన్ని రద్దు చేస్తున్నట్లు ప్రకటించింది. బోల్ట్ వరుసగా మూడు ఒలింపిక్స్ (2008 బీజింగ్, 2012 లండన్, 2016 రియో) క్రీడల్లో మూడేసి స్వర్ణాలు (100, 200 మీటర్లు, 4్ఠ100 మీ.రిలే) సాధించాడు. -
రెజ్లర్ నర్సింగ్ స్టేట్మెంట్ రికార్డు చేసిన సీబీఐ
న్యూఢిల్లీ : డోపింగ్ కేసులో భారత రెజ్లర్ నర్సింగ్ యాదవ్ స్టేట్మెంట్ను సీబీఐ అధికారులు రికార్డు చేశారు. ఈ సందర్భంగా నర్సింగ్ యాదవ్ మాట్లాడుతూ... త్వరలో రెజ్లింగ్ బరిలోకి వస్తానని ఆశాభావం వ్యక్తం చేశాడు. తాను డోపింగ్ కేసులో తన నిర్దోషిత్వాన్ని నిరూపించుకుంటానని కడదాకా పోరాడతానని యాదవ్ ఇది వరకే ప్రకటించాడు. కాగా నర్సింగ్ యాదవ్‌పై డోపింగ్ ఆరోపణలతో అతడిపై కోర్ట్ ఆఫ్ ఆర్బిట్రేషన్ ఫర్ స్పోర్ట్స్ నాలుగేళ్లు నిషేధం విధించిన విషయం తెలిసిందే. దీంతో ఒలింపిక్స్ నుంచి అతడు చివరి నిమిషంలో వైదొలగాల్సి వచ్చింది. డోప్ పరీక్షలో విఫలమైన నర్సింగ్ యాదవ్‌కు భారత డోపింగ్ నిరోధక సంస్థ (నాడా) క్లీన్ చిట్ ఇవ్వడాన్ని ప్రపంచ డోపింగ్ నిరోధక సంస్థ(వాడా).. క్రీడల అర్బిట్రేషన్ కోర్టు (కాస్)లో సవాల్ చేయగా.. విచారణలో నర్సింగ్ దోషిగా తేలాడు. మరోవైపు డోపింగ్ ఆరోపణలతో అతడిపై సీబీఐ కేసు నమోదు చేసింది. -
నాలుగేళ్లలో 379 మంది డోపీలు...
న్యూఢిల్లీ: గత నాలుగేళ్ల కాలంలో భారత్‌లో 379 మంది క్రీడాకారులు డోపింగ్‌లో పట్టుబడ్డారని కేంద్ర క్రీడల మంత్రి విజయ్ గోయల్ తెలిపారు. ఈ మేరకు రాజ్యసభలో మంగళవారం ఆయన లిఖితపూర్వక సమాధానం ఇచ్చారు. జాతీయ డోపింగ్ నిరోధక సంస్థ (నాడా) అందించిన సమాచారం ప్రకారం 2013లో 96 మంది... 2014లో 95 మంది, 2015లో 120 మంది... ఈ ఏడాది అక్టోబరు వరకు 68 మంది క్రీడాకారులు డోపింగ్‌లో పట్టుబడ్డారని విజయ్ గోయల్ తెలిపారు. -
స్ప్రింటర్ ధరమ్‌వీర్‌పై నిషేధం
న్యూఢిల్లీ: రియో ఒలిం పిక్స్‌కు ముందు డోపిం గ్లో దొరికిన స్ప్రింటర్ ధరమ్వీర్ సింగ్‌పై జా తీయ డోపింగ్ వ్యతిరేక సంస్థ (నాడా) ఎనిమిదేళ్ల నిషేధం విధించింది. దీంతో ఈ హరియాణా అథ్లెట్ కెరీర్ ఇక ముగిసినట్టే. జూలై 11న బెంగళూరులో జరిగిన ఇండియన్ గ్రాండ్‌ప్రి మీట్లో నిర్వహించిన డోపింగ్ పరీక్షలో ధరమ్వీర్ నుంచి శాంపిల్ తీసుకున్నారు. ఈ పోటీల్లోనే తను 20.45 సె. టైమింగ్‌తో జాతీయ రికార్డు నెలకొల్పుతూ ఒలింపిక్స్‌కు అర్హత సాధించాడు. అరుుతే అతడిచ్చిన శాంపిల్‌లో నిషేధిత ఎనబోలిక్ స్టెరారుుడ్ వాడినట్టు తేలడంతో చివరి నిమిషంలో రియో ఒలింపిక్స్‌కు దూరం కావాల్సి వచ్చింది. ఈ 200మీ. రన్నర్‌కు ఇది రెండో డోపింగ్ అతిక్రమణ కావడంతో ‘నాడా’ కఠినంగా వ్యవహరించింది. 2012లో జరిగిన జాతీయ ఇంటర్ స్టేట్ చాంపియన్‌షిప్స్‌లోనూ తను 100మీ. రేసులో స్వర్ణం నెగ్గినా... డోపింగ్ టెస్టుకు దూరంగా ఉండడంతో అతడి పతకాన్ని వెనక్కి తీసుకున్నారు. -
మళ్లీ యూఎన్ గుడ్‌విల్ అంబాసిడర్‌గా షరపోవా
డోపింగ్ ఆరోపణలతో ప్రస్తుతం నిషేధం ఎదుర్కొంటున్న రష్యా టెన్నిస్ స్టార్ మరియా షరపోవా మరోసారి ఐక్యరాజ్య సమితి గుడ్‌విల్ అంబాసిడర్ కానుంది. వచ్చే ఏడాది ఏప్రిల్‌తో షరపోవాపై కొనసాగుతున్న 15 నెలల నిషేధం ముగుస్తుంది. ఆ తర్వాత తను ఈ బాధ్యతలను చేపడుతుంది. డోప్ పరీశక్షలో నిషేధిత మెల్డోనియం ఆనవాళ్లు కనిపించడంతో ఈ ఏడాది మార్చిలో ఆమెపై రెండేళ్ల నిషేధం విధించారు. దీంతో తమ తొమ్మిదేళ్ల అనుబంధాన్ని యూఎన్ తెగదెంపులు చేసుకుని షరపోవాపై సస్పెన్షన్ విధించింది. -
నర్సింగ్ వివాదంలో సీబీఐ కేసు నమోదు
న్యూఢిల్లీ: భారత రెజ్లర్ నర్సింగ్ యాదవ్ డోపింగ్ వివాదానికి సంబంధించి సెం ట్రల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్ (సీబీఐ) కేసును నమోదు చేసింది. ఐపీసీ కోడ్ 506, 328 (విషాహారం), 120-బి (కుట్ర) ప్రకారం కేసును నమోదు చేశారు. రియో ఒలింపిక్స్‌కు ముందు నిర్వహించిన డోప్ పరీక్షల్లో నర్సింగ్ యాదవ్ నిషేధిత ఉత్పేర్రకాలు వాడినట్లు తేలింది. అరుుతే జాతీయ డోపింగ్ నిరోధక సంస్థ (నాడా) నర్సింగ్పై కుట్ర జరిగిందని విశ్వసించి అతనికి క్లీన్చిట్ ఇచ్చింది. కానీ రియోకు చేరుకున్నాక కోర్టు ఆఫ్ ఆర్బిట్రేషన్ (సీఏఎస్) ‘నాడా’ నిర్ణయాన్ని తప్పుబడుతూ నర్సింగ్పై నాలుగేళ్ల నిషేధాన్ని విధించడంతోపాటు ఒలింపిక్స్ నుంచి తప్పించింది. హరియాణాలో జరిగిన శిక్షణ శిబిరం సందర్భంగా తన ఆహారంలో గుర్తుతెలియని వ్యక్తులు కావాలనే నిషేధిత ఉత్పేర్రకాలు కలిపారని నర్సింగ్ యాదవ్ ఆరోపించాడు. -
అటు నిషేధం... ఇటు బహుమతి
మాస్కో: డోపింగ్ ఆరోపణల నేపథ్యంలో ఇటీవలి రియో పారాలింపిక్స్‌లో రష్యా అథ్లెట్లను నిషేధించిన విషయం తెలిసిందే. అయితే ఈ క్రీడల ప్రారంభోత్సవంలో మాత్రం అనూహ్యంగా రష్యా పతాకం కనిపించింది. బెలారస్ క్రీడా, పర్యాటక శాఖకు చెందిన ప్రతినిధి ఆండ్రే ఫొమోచ్కిన్ ఆ దేశ అథ్లెట్లకు సంఘీభావంగా పతాకాన్ని చేతపట్టి పరేడ్‌లో పాల్గొన్నాడు. దీనికి ఎంతగానో సంతోషపడిన రష్యా అతడికి ఏకంగా ఉచితంగా అపార్ట్‌మెంట్‌ను బహుమతిగా ఇవ్వాలని నిర్ణయించింది. ఈ విషయాన్ని రష్యా విదేశాంగ శాఖ అధికార ప్రతినిధి మరియా జకరోవా ధృవీకరించారు. అన్ని విషయాలను పూర్తిగా ఇప్పుడు చెప్పలేకపోయినా అపార్ట్మెంట్ ఇచ్చేది మాత్రం నిజమేనని స్పష్టం చేశారు. మరోవైపు ఫొమోచ్కిన్ చర్యకు భారీ మూల్యమే చెల్లించుకోవాల్సి వచ్చింది. నిషేధానికి గురైన దేశ పతాకాన్ని ప్రదర్శించినందుకు నిర్వాహకులు అతడి గుర్తింపును రద్దుచేసి స్వదేశానికి పంపారు. -
డోపింగ్ కేసుపై సీబీఐ విచారణ!
న్యూఢిల్లీ: రియో ఒలింపిక్స్ కు ముందు దేశ వ్యాప్తంగా తీవ్ర దుమారం రేపిన రెజ్లర్ నర్సింగ్ యాదవ్ డోపింగ్ కేసును కేంద్ర దర్యాప్తు సంస్థ సీబీఐ విచారణకు స్వీకరించనుంది. ఈ మేరకు తమ విజ్ఞప్తిని మన్నించిన కేంద్ర ప్రభుత్వం సీబీఐ విచారణకు ఆదేశించినట్లు భారత రెజ్లింగ్ సమాఖ్య అధ్యక్షుడు బ్రిజ్ భూషణ్ శరణ్ సింగ్ శుక్రవారం స్సష్టం చేశారు. దీనిలో భాగంగా ప్రధాని కార్యాలయంలోని అధికారుల్ని కలిసి ఈ కేసుపై సమగ్ర దర్యాప్తు చేయాలని కోరినట్లు ఆయన పేర్కొన్నారు. 'నర్సింగ్ యాదవ్ డోపింగ్ ఉదంతంపై పూర్తిస్థాయి దర్యాప్తు చేపట్టాలని ప్రభుత్వాన్ని కోరాం. ఈ కేసుకు సంబంధించి ప్రధాని కార్యాలయంలో అధికారుల్ని కలిశా. ఇందుకు పీఎంవో కార్యాలయం సానుకూలంగా స్పందించి సీబీఐ విచారణకు ఆదేశించింది. ఈ కేసులో తదుపరి విచారణను సీబీఐ దర్యాప్తు చేస్తుంది' అని బ్రిజ్ భూషణ్ తెలిపారు. గత జూన్‌లో నర్సింగ్ యాదవ్ డోపింగ్ వివాదంలో ఇరుక్కున సంగతి తెలిసిందే. దీంతో రియో ఒలింపిక్స్ లో పాల్గొనాలన్న నర్సింగ్ ఆశలు ఆవిరయ్యాయి. దాంతో పాటు నాలుగేళ్ల నిషేధం విధిస్తూ 'కోర్ట్ ఆఫ్ ఆర్బిట్రేషన్ ఫర్ స్పోర్ట్స్ (సీఏఎస్) తీర్పునిచ్చింది. అయితే తాను డోపింగ్ పాల్పడలేదని, ఎవరో చేసిన కుట్రకు బలయ్యానని నర్సింగ్ యాదవ్ ఆరోపించాడు. ఈ వాదనకు భారత రెజ్లింగ్ సమాఖ్య కూడా మద్దతుగా నిలిచింది. -
డోపీలను క్షమించకండి: నాదల్
న్యూఢిల్లీ:ఇటీవల కాలంలో తరచు వెలుగుచూస్తున్న డోపింగ్ వివాదాలపై స్పెయిన్ బుల్ రఫెల్ నాదల్ తీవ్రంగా మండిపడ్డాడు. డోపింగ్‌కు పాల్పడిన వారికి ఎటువంటి క్షమాబిక్షను ప్రసాదించుకుండా చేస్తేనే క్రీడల్లో పారదర్శకత వస్తుందన్నాడు. ఒక్కసారి డోపీలుగా తేలితే ఆయా క్రీడాకారులను ప్రపంచంలో ఎక్కడ కూడా ప్రాతినిథ్యం లేకుండా చేయాలన్నాడు. క్రీడల్లో నాణ్యత పెంచాలంటే ఇదే సరైన మార్గమని నాదల్ సూచించాడు. డేవిస్ కప్ వరల్డ్ గ్రూప్ ప్లే ఆఫ్ మ్యాచ్‌ల్లో భాగంగా భారత్‌లో ఉన్న నాదల్.. డోపింగ్ కు పాల్పడే మోసగాళ్లకు వేసే శిక్షలు అత్యంత కఠినంగా ఉండాలన్నాడు. మన దగ్గర ఉన్న అత్యుత్తమ యాంటీ డోపింగ్ విధానంతో డోపీలకు అడ్డుకట్ట వేసిన రోజే క్రీడ అనేది క్లీన్‌గా ఉంటుందన్నాడు. దాదాపు 25 మంది క్రీడాకారులు నిషేధిత డ్రగ్స్ తీసుకుంటున్నారంటూ రష్యా హ్యాకింగ్ గ్రూప్ ఫాన్సీ బీర్స్ చేసిన పోస్ట్ తాజాగా కలకలం రేపింది. ఇలా నిషేధిత డ్రగ్స్ తీసుకునే వారిలో విలియమ్స్ సిస్టర్స్(సెరెనా-వీనస్) ఉన్నారంటూ పేర్కొంది. దీంతో మరోసారి డోపింగ్ అలజడి రేగింది. గతంలో రష్య క్రీడాకారిణి మారియా షరపోవా డోపింగ్ కు పాల్పడిన కారణంగా నిషేధానికి గురైన సంగతి తెలిసిందే. -
సెరెనా, వీనస్ లు డోపింగ్ కి పాల్పడ్డారా?
అమెరికన్ మహిళా టెన్నిస్ దిగ్గజాలు సెరెనా విలియమ్స్, వీనస్ లు డోపింగ్ కు పాల్పడ్డారా?. ప్రపంచ డోపింగ్ నిరోధక సంస్థ(వాడా) వెబ్ సైట్ ను హ్యాక్ చేసిన హ్యాకర్లు ఈ విషయాన్నే నొక్కి చెబుతున్నారు. సెరెనా, వీనస్ లతో పాటు రియో ఒలింపిక్స్ లో నాలుగు బంగారుల పతకాలు సాధించిన జిమ్నాస్ట్ సిమోన్ బైల్స్ కూడా నిషేధ ఉత్ర్పేరకాలు వాడినట్లు వారు పేర్కొన్నారు. వాడా వెబ్ సైట్ ను హ్యాక్ చేసిన రష్యాకు చెందిన 'ఫ్యాన్సీ బీరర్స్' హ్యాకర్లు అమెరికన్ ఆటగాళ్లకు సంబంధించిన డాక్యుమెంట్లను బయటపెట్టినట్లు అంతర్జాతీయ మీడియా తెలిపింది. వాడా డేటాబేస్ లోని వివరాలను క్షుణ్ణంగా పరిశీలించిన మీదట డజన్ల కొద్ది అమెరికన్ అథ్లెట్లు నిషేధిత ఉత్ప్రేరకాలు వాడినా.. వారు క్రీడల్లో పాల్గొనేందుకు వాడా అంగీకరించినట్లు ఫ్యాన్సీ బీరర్స్ పేర్కొంది. ఈ వార్తలపై స్పందించిన వాడా తమ వెబ్ సైట్ హ్యాకింగ్ కు గురైనట్లు ప్రకటించింది. క్రీడాకారులు గాయపడినప్పుడు ఉపయోగించే మందులలో వాడా నిషేధిత ఉత్ప్రేరకాన్ని అమెరికన్లు ఉపయోగించినట్లు ఫ్యాన్సీ బీరర్స్ తెలిపింది. వాడా నిబంధనల ప్రకారం గాయాల దృష్ట్యా నిషేధిత మందు వినియోగం అనివార్యమైనప్పుడు మాత్రమే వాటిని తీసుకోవాలి. ఈ నిబంధనను అడ్డంపెట్టుకుని అవసరం ఉన్నా లేకపోయినా అమెరికన్ అథ్లెట్లు దొంగ సర్టిఫికేట్లను సృష్టించి ఉత్ప్రేరకాలను తీసుకున్నారని ఫ్యాన్సీ బీరర్స్ పేర్కొంది. రియోలో అమెరికా సాధించిన పతాకాలన్నీ నిషేధిత ఉత్ర్పేరకం ఉపయోగించి గెలుచుకున్నవేనని ఆరోపించింది. క్రీడాకారులకు చెందిన రహస్య సమాచారాన్ని దొంగిలిచడాన్ని వాడా ఖండించింది. గత మూడు వారాలుగా వాడా వెబ్ సైట్ ను హ్యాక్ చేసేందుకు హ్యాకర్లు ప్రయత్నిస్తున్నట్లు వాడా చైర్మన్ తెలిపారు. ఫ్యాన్సీ బీరర్స్ తెలిపిన వివరాల ప్రకారం.. నిషేధిత ఉత్ప్రేరకాలైన ఆక్సీకొడోన్, హైడ్రోమార్ఫోన్, ప్రిడ్నిసోన్, మిథైల్ ప్రిడ్నిసోలోన్ లను సెరెనా విలియమ్స్ 2010, 2014, 2015లలో వినియోగించినట్లు చెప్పింది. ప్రిడ్నిసోన్, ప్రిడ్నిసోలోన్, ట్రైయామ్సీలోన్ లాంటి నిషేధిత ఉత్ర్ఫేరకాలను 2010, 2011, 2012, 2013లలో వీనస్ ఉపయోగించినట్లు పేర్కొంది. అయితే, నిషేధిత ఉత్ర్పేరకాలను ఉపయోగించిన అథెట్లను వాడా ఎందుకు అనుమతించిందనే వివరాలు డేటాబేస్ లో లేవని తెలిపింది. రియోలో నాలుగు స్వర్ణాలు సాధించిన జిమ్నాస్ట్ బైల్స్ మిథైల్ ఫెనిడేట్ అనే నిషేధిత ఉత్ప్రేరకాన్నివినయోగించినా ఆమెపై నిషేధం విధించలేదని చెప్పింది. ఫ్యాన్సీ బీరర్స్ ప్రకటనలపై అంతర్జాతీయ ఒలింపిక్ కమిటీ(ఐఓసి) స్పందించింది. హ్యాకర్ల గ్రూప్ ప్రకటించిన ఆటగాళ్లలో ఎవరూ డోపింగ్ కు పాల్పడలేదని పేర్కొంది. ప్రపంచస్థాయి అథ్లెట్ల గౌరవానికి భంగం కలిగేలా చేయడాన్ని ఖండించింది. -
నర్సింగ్ యాదవ్ పై నాలుగేళ్ల నిషేధం
-
నర్సింగ్ యాదవ్ పై నాలుగేళ్ల నిషేధం
రియో డి జనీరో: భారత రెజ్లర్ నర్సింగ్ యాదవ్ ఒలింపిక్స్ ఆశలపై కోర్ట్ ఆఫ్ ఆర్బిట్రేషన్ ఫర్ స్పోర్ట్స్ (సీఏఎస్) నీళ్లు చల్లింది. అతడిపై నాలుగేళ్లు నిషేధం విధించింది. దీంతో చివరి నిమిషంలో ఒలింపిక్స్ నుంచి అతడు వైదొలగాల్సి వచ్చింది. ఈ రోజు జరగనున్న పురుషుల 74 కేజీల ఫ్రీస్టయిల్ రెజ్లింగ్ ఈవెంట్లో అతడు బరిలో దిగాల్సివుంది. డోపింగ్‌లో 'నాడా' ఇచ్చిన క్లీన్ చీట్ ను సీఏఎస్ లో 'వాడా' సవాల్ చేసింది. కుట్ర కారణంగానే అతడు డోపింగ్ లో ఇరుక్కున్నాడన్న వాదనను సీఏఎస్ అంగీకరించలేదు. అతడి ప్రమేయం లేకుండా ఇదంతా జరిగిందనడానికి ఎటువంటి ఆధారాలు లేవని, నర్సింగ్ పై నాలుగేళ్లు నిషేధం విధిస్తున్నట్టు సీఏఎస్ పేర్కొంది. రియో ఒలింపిక్స తొలి మ్యాచ్‌లో ఫ్రాన్స్ రెజ్లర్ జలీమ్ ఖాన్‌తో నర్సింగ్ పోటీపడాల్సివుంది. సీఏఎస్ తీర్పు దురదృష్టకరమని భారత రెజ్లింగ్ సమాఖ్య(డబ్ల్యూఎఫ్) వ్యాఖ్యానించింది. ఒలింపిక్స్ కు అర్హత సాధించిన ఆటగాడిపై చివరి నిమిషంలో నిషేధం విధించడం పట్ల డబ్ల్యూఎఫ్ అధ్యక్షుడు బీబీ శరణ్ ఆశ్చర్యం వ్యక్తం చేశారు. -
'300 టెస్టులను ధైర్యంగా ఎదుర్కొన్నాం'
రియో ఒలింపిక్స్ నేపథ్యంలో రష్యా డోపింగ్ టెస్టుల వివాదంలో కొన్ని క్రీడాంశాలలో గట్టెక్కగా మరికొన్ని ఈవెంట్లలో పోటీలో పాల్గొనకుండానే ఇంటిబాట పట్టింది. ముఖ్యంగా రష్యా అథ్లెట్లు ఒక్కో డోపింగ్ టెస్టులో పదుల సంఖ్యలో విఫలమైన విషయం తెలిసిందే. ఈ విషయంపై రష్యా క్రీడాశాఖ మంత్రి విటాలీ ముక్తో కొన్ని ఆసక్తికర విషయాలను శనివారం మీడియాకు వెల్లడించారు. ఏది ఏమైతేనేం రియో ఒలింపిక్స్ సందర్భంగా ఆటగాళ్లకు ఎన్ని అడ్డంకులు ఎదురైనా మేము ఆ అవరోధాలను సమర్థవంతంగా ఎదర్కొని ముందుకు సాగిపోతున్నామని పేర్కొన్నారు. రియో ఒలింపిక్స్ సందర్భంగా రష్యా అథ్లెట్లు 300 కంటే ఎక్కువ డోపింగ్ టెస్టులను దిగ్విజయంగా ఎదుర్కొందన్నారు. అయితే జూలైలో ప్రపంచ డోపింగ్ నిరోధక సంస్థ(వాడా) లో కీలక సభ్యుడిగా ఉన్న కెనడా ప్రొఫెసర్ రిచర్డ్ మెక్ లారెన్ దర్యాప్తు జరిపి రష్యా అథ్లెట్ల డోపింగ్ బాగోతాన్ని బయటపెట్టగా, కొందరు అథ్లెట్లపై నిషేధం వేటు పడింది. వాడా నివేదిక కంటే ముందుగానే తీసుకున్న శాంపిల్స్ టెస్టు చేయగా, వాటి ఫలితాల ఆధారంగానే అంతర్జాతీయ ఒలింపిక్ సంఘం(ఐఓసీ) మా ఆటగాళ్లకు అవకాశం కల్పించిందని క్రీడాశాఖ మంత్రి వెల్లడించారు. -
కెన్యా అథ్లెటిక్స్ మేనేజర్ వెనక్కి..
లండన్: డోపింగ్ పరీక్షల గురించి ముందుగానే సమాచారం ఇచ్చేందుకు లంచం డిమాండ్ చేశాడనే ఆరోపణలపై కెన్యా అథ్లెటిక్స్ మేనేజర్ మైకేల్ రోటిచ్ను రియో గేమ్స్ నుంచి వెనక్కి రప్పించారు. సండే టైమ్స్, జర్మనీ టీవీ చానెల్ ఏఆర్డీ సంయుక్తంగా నిర్వహించిన స్టింగ్ ఆపరేషన్‌లో అతను దొరికిపోయాడు. 10 వేల పౌండ్లు ఇస్తే డోపింగ్ చేసిన అథ్లెట్లకు టెస్టుల గురించి ముందుగానే సమాచారం చేరవేస్తానని ఇందులో తేలింది. దీంతో రోటిచ్ను కెన్యా అథ్లెటిక్స్ సమాఖ్య వెంటనే వెనక్కి రప్పించింది. -
బ్రెజిల్ అథ్లెట్లకు డోప్ టెస్టులు చేయలేదు!
రియోడీజనీరో: రియో ఒలింపిక్స్ కు నెల రోజుల ముందు నుంచి ఇప్పటివరకూ తమ అథ్లెట్లకు డోపింగ్ టెస్టులు చేయలేదని ఆతిథ్య బ్రెజిల్ అధికారులు షాకింగ్ వార్త తెలిపారు. జూలై 1 - 24 తేదీల మధ్య ఒక్క అథ్లెట్ కు కూడా డోప్ టెస్టులు చేయలేదని వెల్లడించింది. ఈ విషయంపై ఇతర దేశాల నుంచి తీవ్ర విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ప్రతి దేశం తమ అథ్లెట్లకు కచ్చితంగా డోపింగ్ టెస్టులు నిర్వహించాలి కానీ రియోకు ఆతిథ్యమిచ్చిన బ్రెజిల్ అలా చేయకపోవడంపై ఇతర దేశాల అథ్లెట్లు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఇప్పుడు ఈ వివాదం అక్కడ చర్చనీయాంశంగా మారింది. ప్రపంచ డోపింగ్ నిరోధక సంస్థ(వాడా) తమ దేశ డోపింగ్ టెస్టింగ్ లాబోరేటరీని మూసివేసిన కారణంగా డోప్ టెస్టులు చేయలేదని బ్రెజిల్ వివరణ ఇచ్చుకుంది. డోపింగ్ టెస్టులు ఎందుకు నిర్వహించలేదో తెలపాలంటూ వాడా డైరెక్టర్ బ్రెజిల్ అధికారులను ప్రశ్నించగా, అసలు విషయాన్ని బయటపెట్టారు. అయితే ఈ వివరణపై వాడా అసంతృప్తి వ్యక్తం చేసింది. తమ దేశంలోని మరో మూడు ల్యాబ్ లకు శాంపిల్స్ పంపించినా, అక్కడ పరికరాలు లేనందున టెస్టులకు వీలుకాలేదని బ్రెజిల్ చెబుతోంది. జూన్ 22న బ్రెజిల్ లాబోరేటరీపై విధించిన నిషేధాన్ని జూలై 20న ఎత్తివేసిన విషయం తెలిసిందే. -
‘అధర్మవీర్’
♦ డోపింగ్‌లో దొరికిన ధరమ్వీర్ సింగ్ ♦ అథ్లెట్ ‘ఎ’ శాంపిల్ పాజిటివ్ న్యూఢిల్లీ: రియో ఒలింపిక్స్‌కు ముందు మరో భారత ఆటగాడు డోపింగ్ వివాదంలో నిలిచాడు. 200 మీ. పరుగులో పాల్గొనేందుకు అర్హత సాధించిన అథ్లెట్ ధరమ్వీర్ సింగ్ నిషేధిక ఉత్ప్రేరకం తీసుకున్నట్లు తేలింది. అతని ‘ఎ’ శాంపిల్ నివేదిక పాజిటివ్‌గా వచ్చినట్లు, అందులో అనబాలిక్ స్టెరాయిడ్ గుర్తించినట్లు సమాచారం. అయితే ఈ విషయాన్ని జాతీయ డోపింగ్ నిరోధక సంస్థ (నాడా) అధికారికంగా ప్రకటించలేదు. మంగళవారం రాత్రి ఇతర భారత జట్టు సభ్యులతో కలిసి ధరమ్వీర్ రియోకు బయల్దేరాల్సి ఉంది. కానీ అతడు జట్టుతో చేరకపోవడంతో అనుమానం తలెత్తింది. దీనిపై వివరణ ఇస్తూ ‘నాడా’ అధికారి ఒకరు అథ్లెట్ పేరు నేరుగా ప్రస్తావించకుండా ఒక ఆటగాడు పట్టుబడ్డాడనే విషయాన్ని మాత్రం నిర్ధారించారు. అతని ‘బి’ శాంపిల్ కూడా పరీక్షించాల్సి ఉంది. దాని ఫలితాలు వచ్చేందుకు కనీసం వారం రోజులు పడుతుంది కాబట్టి ఒక వేళ అందులో నెగెటివ్‌గా తేలినా... ధరమ్వీర్ రియో వెళ్లగలడా లేదా అనేది సందేహమే. రెండో సారి హరియాణాలోకి రోహ్టక్కు చెందిన ధరమ్వీర్ బెంగళూరులో జరిగిన జాతీయ మీట్లో 20.45 సెకన్లలో 200 మీ. పరుగు పూర్తి చేసి (అర్హతా ప్రమాణం 20.50 సె.) ఒలింపిక్స్‌కు క్వాలిఫై అయ్యాడు. 36 ఏళ్ల తర్వాత ఈ విభాగంలో పోటీ పడుతున్న తొలి భారత ఆటగాడిగా చరిత్ర సృష్టించాడు. అయితే గత కొంత కాలంగా పెద్దగా రాణించలేకపోతున్న ధరమ్వీర్ సాధించిన టైమింగ్‌పై అప్పుడే కొంత మంది సందేహాలు వ్యక్తం చేశారు. జాతీయ శిబిరంలో కాకుండా రోహ్టక్లో సొంత కోచ్‌తో కలిసి సాధన చేస్తుండటం అనుమానాలు పెంచింది. 2012లోనే జాతీయ అథ్లెటిక్స్ చాంపియన్‌షిప్‌లో 100 మీ. పరుగులో ధరమ్వీర్ స్వర్ణం సాధించాడు. అయితే డోపింగ్ పరీక్షలో పాల్గొనేందుకు నిరాకరించాడు. దాంతో అధికారులు అతని పతకాన్ని రద్దు చేశారు. గత రికార్డు కారణంగా ఈ సారి మళ్లీ డోపీగా తేలితే అతనిపై కనీసం ఎనిమిదేళ్ల నిషేధం పడే అవకాశం ఉంది. -
‘క్లీన్చిట్’ను సమీక్షిస్తాం
నర్సింగ్ వివాదంపై ‘వాడా’ ప్రకటన న్యూఢిల్లీ: డోపింగ్ వివాదంనుంచి బయట పడ్డానని ఆనందంలో ఉన్న రెజ్లర్ నర్సింగ్ యాదవ్‌కు మరో పరీక్ష ఎదురైంది. నర్సింగ్ నిర్దోషి అంటూ జాతీయ డోపింగ్ నిరోధక సంస్థ (నాడా) ఇచ్చిన క్లీన్‌చిట్‌పై ప్రపంచ డోపింగ్ నిరోధక సంస్థ (వాడా) స్పందించింది. ఈ మొత్తం వ్యవహారాన్ని తాము మరోసారి సమీక్షిస్తామని ‘వాడా’ ప్రకటించింది. ‘ఈ కేసుకు సంబంధించిన ఫైల్‌కు మాకు పంపమని ‘నాడా’ను కోరాం. మేం దీనిని మరోసారి సమీక్షిస్తాం. ఇప్పుడే ఇంకా ఏమీ చెప్పలేం’ అని వాడా ఉన్నతాధికారి మ్యాగీ డ్యురాంగ్ వెల్లడించారు. మరోవైపు నర్సింగ్ మంగళవారం ప్రధాని నరేంద్ర మోదీని కలిశాడు. ఎలాంటి ఆందోళనా లేకుండా దేశానికి పతకం తెచ్చేలా దృష్టిపెట్టాలని మోదీ సూచించారని చెప్పాడు. -
ఇందర్జీత్ దోషే
‘బి’ శాంపిల్ కూడా పాజిటివ్ నాలుగేళ్లు నిషేధం పడే అవకాశం న్యూఢిల్లీ: రెజ్లర్ నర్సింగ్ యాదవ్ డోపింగ్ కథ సుఖాంతమైన మరుసటి రోజే భారత క్రీడారంగానికి మరో షాక్ తగిలింది. ఇప్పటికే డోపింగ్ ఆరోపణలు ఎదుర్కొంటున్న షాట్‌పుటర్ ఇందర్జీత్ ‘బి’ శాంపిల్ కూడా పాజిటివ్‌గా తేలింది. దీంతో అతను రియో ఒలింపిక్స్‌కు దాదాపు దూరమైనట్టే. ప్రస్తుతానికి నాడా అతడిపై తాత్కాలిక సస్పెన్షన్ విధించి రెండో నోటీసును జారీ చేసింది. అయితే నాడా క్రమశిక్షణ సంఘం ముందు హాజరై మరోసారి తన కేసుపై వాదనలు చేసే అవకాశం ఇందర్జీత్కు ఉంది. ఇక నూతన వాడా నిబంధనల మేరకు ఈ హరియాణా అథ్లెట్‌పై నాలుగేళ్లు వేటు పడే అవకాశాలున్నాయి. జూన్ 22న తీసుకున్న ‘ఎ’ శాంపిల్ ఫలితాన్ని గత నెల 25న వెల్లడించారు. దీంట్లో ఇందర్జిత్ నిషేధిత ఆండ్రోస్టెరాన్, ఎటియోకొలనొలోన్ ఉత్ప్రేరకాలు తీసుకున్నట్టు తేలింది. తాజాగా ‘బి’ శాంపిల్ ఫలితం కూడా పాజిటివ్‌గా రావడంతో... తను రియో ఆశలు వదులుకోవాల్సి వచ్చింది. -
ఇందర్ జిత్ అవుట్?
న్యూఢిల్లీ: డోపింగ్‌లో పట్టుబడ్డ భారత షాట్ పుట్ ఆటగాడు ఇందర్ జిత్ సింగ్ .. రియో ఒలింపిక్స్ లో పాల్గొనే అవకాశాలు దాదాపు సన్నగిల్లాయి. ఇందర్ జిత్ నుంచి రెండోసారి సేకరించిన శాంపిల్స్ ఫలితాల్లో కూడా అతను విఫలమయ్యాడు. జాతీయ యాంటీ డోపింగ్ ఏజెన్సీ(నాడా) నిర్వహించిన ఇందర్ జిత్ బి'శాంపిల్ ఫలితంలో నిషేధిత డ్రగ్స్ తీసుకున్నట్లు తేలింది. దీంతో అతని రియో అవకాశాలకు తెరపడినట్లే కనబడుతోంది. గత నెల 22వ తేదీన ఇందర్ జిత్ కు నిర్వహించిన డోపింగ్ టెస్టులో నిషేధిత డ్రగ్స్ తీసుకున్నట్లు తేలింది. కాగా, డోపింగ్ కు తాను పాల్పడలేదని ఇందర్ జిత్ స్పష్టం చేశాడు. ఎవరో చేసిన కుట్రలో తాను బలయ్యానంటూ నాడాకు విన్నవించాడు. అయితే రెండోసారి శాంపిల్‌ను తీసుకుని పరీక్షించినా ఫలితం పాజిటివ్ గానే వచ్చింది. దీంతో అతని రియో భవితవ్యం ప్రశ్నార్ధకరంగా మారింది. గతేడాది ఆసియన్ చాంపియన్ షిప్లో స్వర్ణం సాధించిన ఇందర్ జిత్ రియోకు అర్హత సాధించాడు. దీంతో రియో ఒలింపిక్స్ అర్హత సాధించిన తొలి భారతీయుడిగా గుర్తింపు సాధించాడు. అంతకుముందు 2014లో ఇంచియాన్‌లో జరిగిన ఆసియన్ గేమ్స్ లో ఇందర్ జిత్ ఆకట్టుకుని కాంస్య పతకం సాధించాడు. అయితే ఇప్పుడు ఇందర్ జిత్ డోపింగ్ లో పట్టుబడటంతో అతని పరిస్థితి అగమ్యగోచరంగా కనిపిస్తుంది. . ఒకవేళ డోపింగ్ ఉదంతంలో దోషిగా తేలితే మాత్రం అతని కెరీర్ కు ముప్పు వాటిల్లే ప్రమాదం ఉంది. -
కనీసం టీ కూడా తాగడం లేదు..
వారణాసి:గత కొన్ని రోజులుగా డోపింగ్ వివాదంలో చిక్కుకున్న భారత రెజ్లర్ నర్సింగ్ యాదవ్‌కు ఉపశమనం లభించడంతో వారణాసిలో అతని ఇంటి వద్ద పండుగ వాతావారణం నెలకొంది. గత నెల్లో నర్సింగ్ పై వెలుగు చూసిన డోపింగ్ వివాదానికి జాతీయ డోపింగ్ ఏజెన్సీ(నాడా) ఎట్టకేలకు పుల్ స్టాప్ పెడుతూ క్లియరెన్స్ ఇవ్వడంతో అతని నివాసం సందడిగామారింది. పలువురు అభిమానులు స్వీట్లు పంచుకుంటూ సంబరాలు చేసుకోగా, నర్సింగ్ యాదవ్ తల్లి భూల్నా దేవి ఆనందం వ్యక్తం చేశారు. నర్సింగ్ పై వచ్చిన డోపింగ్ ఆరోపణల్ని కొట్టిపారేసిన తల్లి.. ఈ వివాదం అనంతరం తన కుమారుడు కనీసం టీ కూడా తాగడం లేదన్నారు. నర్సింగ్ జీవితంలో అతి పెద్ద దుమారం రేపిన డోపింగ్ ఘటన తరువాత అతను దాదాపు అన్ని అలవాట్లను వదిలేసుకున్నాడంటూ ఆమె ఆవేదన వ్యక్తం చేశారు. సోమవారం సాయంత్రం నర్సింగ్ కు డోపింగ్ వివాదంలో క్లీన్ చిట్ ఇస్తూ నాడా నిర్ణయం తీసుకున్న సంగతి తెలిసిందే. దీంతో అతను రియో ఒలింపిక్స్ లో పాల్గొనేందుకు మార్గం సుగుమం అయ్యింది. నాడా-2015 యాంటీ కాపీయింగ్ నిబంధనల్లోని ఆర్టికల్ 10.4 ప్రకారం నర్సింగ్ కు ఉపశమనం లభించింది. దీంతో భారత్ నుంచి 74 కేజీల రెజ్లింగ్ విభాగంలో నర్సింగ్ ప్రాతినిథ్యం షురూ అయ్యింది. -
రెజ్లర్ నర్సింగ్కు ఊరట
న్యూఢిల్లీ: డోపింగ్ వివాదంలో ఇరుక్కున భారత రెజ్లర్ నర్సింగ్ యాదవ్ కు ఊరట లభించింది . గత కొన్ని రోజులుగా నర్సింగ్ చుట్టూ అలుముకున్న డోపింగ్ వివాదానికి జాతీయ డోపింగ్ నిరోధక ఏజెన్సీ(నాడా) ఎట్టకేలకు పుల్ స్టాప్ పెట్టింది. డోపింగ్ వ్యవహారంలో నర్సింగ్ కు క్లీన్ చిట్ ఇస్తూ నాడా తుది నిర్ణయం తీసుకుంది. నాడా-2015 యాంటీ కాపీయింగ్ నిబంధనల్లోని ఆర్టికల్ 10.4 ప్రకారం నర్సింగ్ కు అవకాశం కల్పించింది. దీంతో రియో ఒలింపిక్స్‌లో 74 కేజీల రెజ్లింగ్ విభాగంలో నర్సింగ్ పాల్గొనేందుకు దాదాపు లైన్ క్లియరయ్యింది. ఈ మేరకు తుది నిర్ణయాన్ని సోమవారం సాయంత్ర ప్రకటించిన నాడా.. డోపింగ్ వివాదంలో నర్సింగ్ తప్పిదం లేదని పేర్కొంది. ఎవరో చేసిన కుట్రకు నర్సింగ్ బలయ్యాడని స్పష్టం చేసింది. ఈ విషయంలో అసలు నర్సింగ్ ప్రమేయం లేదని నమ్మిన కారణంగానే అతనికి క్లీన్ చిట్ ఇచ్చినట్లు నాడా డైరెక్టర్ నవీన్ అగర్వాల్ తెలిపారు. అయితే ఈ విషయాన్ని వాడా (వరల్డ్ యాంటీ డోపింగ్ ఏజెన్సీ) కి నాడా నివేదించనుంది. గత నెల్లో నర్సింగ్ పై డోపింగ్ వివాదం వెలుగు చూసిన సంగతి తెలిసిందే. గత నెల 5న హరియాణాలోని సోనేపట్ భారత స్పోర్ట్స్ అథారిటీ (సాయ్) కేంద్రంలో నర్సింగ్కు డోపింగ్ పరీక్ష నిర్వహించగా అతను నిషేధిత ఉత్ప్రేరకం మెథాన్‌డైనన్ వాడినట్లు తేలింది. అయితే దీనిపై నర్సింగ్ పలు ఆరోపణలు చేశాడు. తనను కావాలనే కుట్రలో ఇరికించారని పేర్కొన్నాడు. దీనిలో భాగంగా నాడాను ఆశ్రయించాడు. ఇప్పటికే నర్సింగ్ యాదవ్ వాదనలను పలుమార్లు విన్న నాడా చివరకు అతనికి ఊరటనిస్తూ నిర్ణయం తీసుకుంది. ఈ డోపింగ్ వివాదాన్ని భారత రెజ్లింగ్ సమాఖ్య(డబ్యూఎఫ్ఐ)కూడా సీరియస్ గా తీసుకుని నర్సింగ్ కు మద్దతుగా నిలిచింది. -
రెజ్లర్ నర్సింగ్కు ఊరట
-
తీర్పు ఎప్పుడు వస్తుందో!
స్పష్టత ఇవ్వని ‘నాడా’ న్యూఢిల్లీ: రెజ్లర్ నర్సింగ్ యాదవ్ డోప్ ఉదంతంపై విచారణ పూర్తి చేసిన నాడా (జాతీయ డోపింగ్ నిరోధక సంస్థ) తీర్పు విషయంలో మాత్రం ఏటూ తేల్చడం లేదు. శని లేదా సోమవారాల్లో తీర్పు వెలువరిస్తామని చెప్పినా ఇందులోనూ స్పష్టత కరువైంది. ఈ విషయంపై నాడా, నర్సింగ్ తరఫు న్యాయవాదులను సంప్రదించినా ప్యానెల్ తీర్పు ఎప్పుడు ఇస్తుందో తమకూ తెలియదని చెప్పారు. దీంతో నర్సింగ్ రియో ఆశలు రోజు రోజుకూ సన్నగిల్లుతున్నాయి. మరోవైపు ఈ విషయంపై రెజ్లింగ్ సమాఖ్యకు కూడా ఎలాంటి సంకేతాలు అందడం లేదు. ఒలింపిక్ విలేజ్‌కు భారత్ అథ్లెట్లు రియో డి జనీరో: రియో ఒలింపిక్స్ కోసం ఇప్పటికే బ్రెజిల్‌కు వచ్చిన భారత అథ్లెట్లు... ఒలింపిక్ విలేజ్‌కు చేరుకుంటున్నారు. భారీ భారత బృందంలో ఇప్పటికే సగం మంది ఇక్కడికి చేరుకున్నారు. అథ్లెట్లు ముందుగా రావడం వల్ల ఇక్కడి వాతావరణానికి బాగా అలవాటుపడుతున్నారని చెఫ్ డి మిషన్ రాకేశ్ గుప్తా అన్నారు. ఆగస్టు 2న భారత అథ్లెట్లకు స్వాగత కార్యక్రమం ఏర్పాటు చేస్తామన్నారు. -
తేలని భవితవ్యం!
నర్సింగ్పై నాడా విచారణ పూర్తి శని లేదా సోమ వారాల్లో తీర్పు ఒలింపిక్స్ అవకాశం లేనట్లే న్యూఢిల్లీ: డోపింగ్‌లో పట్టుబడ్డ రెజ్లర్ నర్సింగ్ యాదవ్.. ఒలింపిక్స్‌లో పాల్గొనే అంశంపై సందిగ్ధత కొనసాగుతూనే ఉంది. రెండు రోజుల పాటు రెజ్లర్‌ను సుదీర్ఘంగా విచారించిన నాడా (జాతీయ డోపింగ్ నిరోధక సంస్థ) తీర్పును వాయిదా వేసింది. దీంతో నర్సింగ్ ఒలింపిక్స్ ఆశలు సన్నగిల్లడంతో పాటు ఏం జరుగుతుందోననే ఉత్కంఠ మాత్రం పెరిగింది. అయితే శని లేదా సోమ వారాల్లో తీర్పు వెలువడే అవకాశాలున్నాయని సమాచారం. గురువారం కూడా విచారణకు హాజరైన నర్సింగ్ తరఫు న్యాయవాదులు డోప్ పరీక్ష ఫలితాలపై తమ వాదనలను వినిపించారు. దీన్ని నోట్ చేసుకున్న నాడా న్యాయ బృందం పూర్తిస్థాయి నివేదికను క్రమశిక్షణ కమిటీకి అందజేయనుంది. ‘విచారణ పూర్తయింది. శని లేదా సోమవారాల్లో తీర్పు రావొచ్చు. అయితే నర్సింగ్ ఒలింపిక్స్ వెళ్లేందుకు అర్హుడు కాడని నాడా బలంగా వాదిస్తోంది. ఎందుకంటే అతనిపై కుట్రపూరితంగా నేరం మోపారని రెజ్లర్ చెబుతున్నాడు. కానీ ఇందుకు సంబంధించిన ఆధారాలు, రుజువులు మాత్రం చూపలేకపోతున్నాడు. తను తాగే నీటిలో ఏదో కలిపారని అఫిడవిట్ దాఖలు చేశాడు. కానీ నాడా, వాడాను సంతృప్తిపరిచే స్థాయిలో దాన్ని రుజువు చేయలేకపోతున్నాడు. ఉద్దేశపూర్వకంగా తను తప్పు చేయకపోతే అందుకు సంబంధించిన ఆధారాలను ఇవ్వాలని లేకపోతే శిక్ష పడుతుందని ఘాటుగా హెచ్చరించాం. ఓ అంతర్జాతీయ స్థాయి అథ్లెట్‌గా తను తీసుకునే ఆహారంపై శ్రద్ధ తీసుకోకుంటే ఎలా అని ప్రశ్నించాం. అయినా సరే ప్యానెల్‌కు నర్సింగ్ సమర్పించిన ఆధారాలు ఏమాత్రం సరితూగడం లేదు’ అని నాడా న్యాయవాది గౌరాంగ్ కాంత్ పేర్కొన్నారు. ‘వాడా’ నిబంధన ప్రకారం సరైన ఆధారాలు ఇవ్వని పక్షంలో ఒలింపిక్స్‌కు అనర్హత వేటు వేస్తూ శిక్ష పడుతుంది. మరోవైపు నర్సింగ్కు న్యాయం జరగాలని అతని మద్దతుదారులు నాడా ప్రధాన కార్యాలయం ముందు నినాదాలు చేశారు. సాయ్ సెంటర్‌కు పోలీసులు సోనేపట్: డోపింగ్‌పై నర్సింగ్ ఇచ్చిన ఫిర్యాదు మేరకు పోలీసుల బృందం ‘సాయ్’లో విచారణ జరిపింది. సాక్షులు, కోచ్‌లు, వార్డెన్లతో పాటు మరికొంత మందిని కూడా ప్రశ్నించామని నేర విచారణ విభాగం (సీఐఏ) అధికారి ఇందర్వీర్ తెలిపారు. ఈ కేసును దర్యాప్తు చేసేందుకు ఈయనను ప్రత్యేకంగా నియమించారు. కేసుతో సంబంధం ఉన్న అందరి నుంచి స్టేట్మెంట్లను సేకరించామని, నర్సింగ్ అనుమానాలు వ్యక్తం చేసిన రెజ్లర్ జితేశ్‌ను తర్వాత విచారిస్తామని ఇందర్వీర్ చెప్పారు. పోలీసులు విచారణ జరుపుతున్నప్పుడు భారత రెజ్లింగ్ సమాఖ్య అధ్యక్షుడు బ్రిజ్‌భూషణ్ శరణ్ అక్కడే ఉన్నారు. ఇక్కడి పరిస్థితులు చూస్తుంటే ఏదైనా జరగొచ్చనే అనుమానం వ్యక్తం చేశారు. సాయ్ సెంటర్ తమ పరిధిలోకి రాదని అందుకే జోక్యం చేసుకోలేకపోతున్నామన్నారు. నర్సింగ్పై వాడా కన్ను! మొత్తానికి నర్సింగ్ డోపింగ్ అంశం వాడా దృష్టికి కూడా వెళ్లింది. వాడా సలహా మేరకే ఈ నెల 5న రెజ్లర్‌కు సంబంధించి రెండో శాంపిల్‌ను సేకరించి పరీక్షించినా అందులోనూ పాజిటివ్ ఫలితమే వచ్చింది. వాస్తవంగా జూన్ 25న సేకరించిన రెండు శాంపిల్స్‌లో మొదట ఒకదాన్ని పరీక్షించగా పాజిటివ్ ఫలితం వచ్చింది. దీంతో ఈనెల 21న నర్సింగ్ సమక్షంలో బి-శాంపిల్‌నూ టెస్టు చేయగా అక్కడ కూడా ప్రతికూల ఫలితమే వచ్చింది. దీంతో వాడా ఆదేశాల మేరకు ఈనెల 5న నర్సింగ్ నుంచి ప్రత్యేకంగా రక్త, మూత్ర నమూనాలను తీసి పరీక్షించామని నాడా డెరైక్టర్ జనరల్ నవీన్ అగర్వాల్ తెలిపారు. మరోవైపు నాడా విచారణలో నర్సింగ్ నిర్దోషిగా తేలితే ప్రవీణ్ రాణా స్థానంలో మళ్లీ అతన్ని ఎంపిక చేస్తామని ఐఓఏ వెల్లడించింది. -
డోప్ టెస్ట్‌లో దొరికిన 120 మంది
లుధియానా: శాంతిభద్రతలు పరిరక్షించాల్సిన పోలీస్ డిపార్ట్మెంట్లో ఉద్యోగాల కోసం దరఖాస్తు చేసుకున్న అభ్యర్థులు మత్తుపదార్ధాలు వాడి అడ్డంగా దొరికిపోయారు. పంజాబ్ రాష్ట్ర ప్రభుత్వం తొలిసారిగా పోలీస్ రిక్రూట్మెంట్లో అభ్యర్థులకు డోప్ టెస్ట్‌లు నిర్వహిస్తోంది. ఇందులో భాగంగా నిర్వహించిన పరీక్షల్లో 120 మంది అభ్యర్థులు ఉత్ప్రేరకాలు వాడినట్లు గుర్తించారు. పక్కరాష్ట్రం హర్యానాలో ఇటీవల పోలీస్ రిక్రూట్మెంట్ సందర్భంగా మత్తు పదార్ధాలు వాడిన నలుగురు అభ్యర్థులు మృతి చెందడంతో పాటు వంద మందికి పైగా తీవ్ర అస్వస్థతకు గురైన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో పంజాబ్ ప్రభుత్వం అభ్యర్థులకు డోప్ టెస్ట్‌లు నిర్వహిస్తోంది. అభ్యర్థులు మార్ఫిన్, ప్రొఫోగ్జిఫిన్, ఆంఫీటమైన్, కన్నాబిస్ లాంటి ఉత్ప్రేరకాలను వాడుతున్నట్లు పరీక్షల్లో గుర్తించారు. వీరందరి వద్ద మరో శాంపిల్ తీసుకొని పరీక్షించనున్నట్లు అధికారులు వెల్లడించారు. ఇవే ఫలితాలు పునరావృతమైతే.. వారిని రిక్రూట్మెంట్ నుంచి తప్పించడంతో పాటు, ఆసుపత్రిలో ప్రత్యేక చికిత్స అందిస్తామని వారు తెలిపారు. -
ఇందర్జీత్ పాసయ్యాడు!
న్యూఢిల్లీ: డోపింగ్ ఆరోపణల్లో చిక్కుకున్న భారత అథ్లెట్ ఇందర్జీత్ సింగ్‌కు బుధవారం కాస్త తెరిపినిచ్చే ప్రకటన వెలువడింది. జూన్ 29న హైదరా బాద్‌లో అతనికి నిర్వహించిన రెండో పరీక్షలో ఫలితం ‘నెగెటివ్’ గా వచ్చింది. జూన్ 22న జరిగిన తన తొలి డోపింగ్ పరీక్షలో ‘ఎ’ శాంపిల్ పాజిటివ్‌గా తేలి రియో అవకాశాలు కోల్పోయిన షాట్‌పుటర్ ఇందర్జీత్కు ‘బి’ శాంపిల్ ఫలితం నెగెటివ్‌గా వస్తేనే ఊరట లభించే అవకాశముంది. జూలై 10, 11 తేదీల్లో కూడా అతనిపై నిర్వహించిన పరీక్షల ఫలితాలు రావాల్సి ఉంది. దోషిగా తేలితే అతనిపై కనీసం నాలుగేళ్ళ నిషేధం పడుతుంది. -
రెండో పరీక్షా తప్పాడు!
డోపింగ్ టెస్టులో మళ్లీ నర్సింగ్ విఫలం పోలీసు విచారణ ప్రారంభం ‘నాడా’ విచారణకు హాజరు న్యూఢిల్లీ: డోపింగ్ ఆరోపణలతో రియో ఒలింపిక్స్‌కు దూరమైన రెజ్లర్ నర్సింగ్ యాదవ్‌ను రెండో అవకాశం కూడా ఆదుకోలేకపోయింది. జూలై 5న హాజరైన డ్రగ్ పరీక్షలో కూడా నర్సింగ్ విఫలమైనట్లు సమాచారం. ‘పది రోజుల తర్వాత హాజరైన డోపింగ్ టెస్టులో కూడా మార్పు ఏమీ లేదు. అతను ఇచ్చిన రెండు శాంపిల్స్‌లో కూడా అవే నిషేధిత ఉత్ప్రేరకం మెథడినోన్ లక్షణాలు కనిపించాయి’ అని భారత రెజ్లింగ్ సమాఖ్య ప్రతినిధి ఒకరు వెల్లడించారు. జూన్ 25న తొలి పరీక్షలో విఫలం కావడంతో నర్సింగ్పై ఇప్పటికే తాత్కాలిక నిషేధం విధించడంతో పాటు అతని స్థానంలో ఒలింపిక్స్‌కు ప్రవీణ్ రాణాను ఎంపిక చేశారు. వారు చేసి ఉండవచ్చు: తనపై కుట్ర జరిగిందంటూ నర్సింగ్ యాదవ్ చేసిన ఫిర్యాదుపై బుధవారం పోలీస్ విచారణ మొదలైంది. మాజీ రెజ్లింగ్ సహచరులు ఇద్దరు కుట్రకు కారణమంటూ నర్సింగ్ సోనేపట్ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశాడు. ‘నన్ను కావాలనే ఇరికించారంటూ మొదటినుంచీ చెబుతున్నాను. నాపై ఆరోపణలు రుజువు కాకపోతే నేనే రియో వెళతాను. నా ఆహారంలో ఏదో కలిపేందుకు ప్రయత్నించిన వారిని నేను గుర్తు పట్టాను. ఇవే వివరాలు పోలీసులకు అందించాను’ అని నర్సింగ్ చెప్పాడు. తాము అనుమానిస్తున్న ఆ ఇద్దరు రెజ్లర్లు ఛత్రశాల్ (సుశీల్ శిక్షణా కేంద్రం)కు చెందిన జితేశ్, సుమీత్ అని వెల్లడించిన సమాఖ్య అధ్యక్షుడు బ్రిజ్‌భూషణ్... మరిన్ని విషయాలు బయటపడాలంటే సీబీఐ విచారణ చేయాలన్న నర్సింగ్ డిమాండ్‌కు మద్దతు ఇస్తున్నట్లు ప్రకటించారు. మరోవైపు డోపింగ్‌తో ప్రపంచం దృష్టిలో పడ్డామని క్రీడా మంత్రి విజయ్ గోయల్ వ్యాఖ్యానించారు. ఈ చర్చకు త్వరలోనే ముగింపు ఇస్తామన్న ఆయన... అప్పటి వరకు ఒకరిని మరొకరు నిందించుకుంటూ పుకార్లు ఆపాలని సూచించారు. ‘నాడా’ ముందు హాజరు: డోపింగ్ ఆరోపణలపై వివరణ ఇచ్చుకునేందుకు నర్సింగ్ యాదవ్ బుధవారం జాతీయ డోపింగ్ నిరోధక సంస్థ (నాడా) ముందు హాజరయ్యాడు. సాయంత్రం 4 గంటలనుంచి దాదాపు మూడు గంటలకు పైగా అతని విచారణ కొనసాగింది. దీనిపై తుది నివేదిక గురువారం వచ్చే అవకాశం ఉంది. మరో వైపు నర్సింగ్ తల్లిదండ్రులు, మిత్రులు తమవాడికి న్యాయం చేయాలంటూ వారణాసి సమీపంలోని అచ్గరా గ్రామంలో ధర్నా నిర్వహించారు. వారణాసిలో స్థానికుల మద్దతు తీసుకుంటూ శనివారం ప్రధాని మోది కార్యాలయాన్ని ఘెరావ్ చేయాలని కూడా వారు నిర్ణయించారు. -
ఆ విషయంలో వేరే ఆప్షనే లేదు : కేంద్ర మంత్రి
ఒలింపిక్స్‌లో పాల్గొననున్న ఆటగాళ్ల స్థానంలో మరొకరికి అవకాశం ఇచ్చేది లేదని క్రీడాశాఖ మంత్రి విజయ్ గోయల్ స్పష్టంచేశారు. యాంటీ డోపింగ్ ప్యానెల్ నిషేధించిన ఆటగాళ్ల స్థానంలో వేరొకరికి చాన్స్ ఇవ్వడం లాంటివి ఉండవని ఆయన అభిప్రాయపడ్డారు. రియోకు అర్హత సాధించిన ఓ ప్లేయర్ ఎవరైనా డోపింగ్ టెస్టులో విఫలమైతే ఈ విషయంలో వేరే ఆప్షన్ ఉండదని మంత్రి గోయల్ పేర్కొన్నారు. ఒకవేళ ఒలింపిక్స్‌కు అర్హత సాధించిన ప్లేయర్ తీవ్ర అస్వస్థతకు లోనైన ప్రత్యేక సందర్భాలలో మాత్రమే రీప్లేస్మెంట్ గురించి ఆలోచిస్తారని చెప్పారు. ప్రత్యేకంగా పర్మిషన్ తీసుకుని ఇతర ఆటగాడిని రియోకు పంపిస్తే తనకు ఎలాంటి అభ్యంతరం లేదని తెలపారు. మరోవైపు నర్సింగ్ యాదవ్ స్థానంలో పురుషుల ఫ్రీస్టయిల్ 74 కేజీల విభాగంలో భారత్ నుంచి ప్రవీణ్ రాణా బరిలోకి దిగనున్నాడని ప్రచారంలో ఉంది. భారత ఒలింపిక్ సంఘం (ఐఓఏ) యునెటైడ్ వరల్డ్ రెజ్లింగ్‌కు ఈ విషయంపై సమాచారం అందించింది. -
నర్సింగ్పై కుట్రలో సుశీల్ హస్తం!
న్యూఢిల్లీ: రియో ఒలింపిక్స్‌లో పాల్గొననున్న రెజ్లర్ నర్సింగ్ యాదవ్ భారత డోపింగ్ నిరోధక సంస్థ(నాడా) డోప్ టెస్టుల్లో పట్టుబడిన తర్వాత తెరమీదకు కొత్త అంశాలు వస్తున్నాయి. డోప్ టెస్టులో పట్టబడ్డ నర్సింగ్ సోదరుడు వినోద్ యాదవ్ ఈ వివాదంపై తీవ్రంగా స్పందించాడు. ఇదంతా మరో రెజ్లర్ సుశీల్ కుమార్, అతని సన్నిహితులు పన్నిన కుట్ర అని ఆరోపించాడు. సోనెపాట్ లోని సాయ్ సెంటర్లో శిక్షణ తీసుకుంటున్న నర్సింగ్ తినే ఆహారంలో కావాలనే సుశీల్‌కు సంబంధించిన వ్యక్తులు ఏదైనా కలిపి ఉంటారని అనుమానం వ్యక్తం చేశాడు. సాయ్ సెంటర్లో వంటలు చేసే వ్యక్తి సుశీల్ కుమార్ ప్రాక్టీస్ చేసే బృందానికి చెందిన వాడని, దీనిపై సుశీల్ హస్తం ఉంటుందని జాతీయ మీడియాకు వెల్లడించాడు. ఈ కుట్ర పన్నింది కచ్చితంగా సుశీల్ తరఫు వ్యక్తులేనని మరిన్ని వివరాలు త్వరలోనే తెలుస్తాయని నర్సింగ్ సోదరుడు వినోద్ పేర్కొన్నాడు. మరోవైపు నర్సింగ్ స్థానంలో మరో రెజ్లర్ ప్రవీణ్ రాణాను రియోకు పంపించాలని భారత రెజ్లింగ్ సమాఖ్య అధ్యక్షుడు బ్రిజ్ భూషన్ శరణ్ సింగ్ నిర్ణయించారు. -
మన ఘనతపై మచ్చ
ఎన్నడూ లేని విధంగా ఈసారి భారత్ నుంచి ఏకంగా 120 మంది క్రీడాకారులు రియో ఒలింపిక్స్‌కు వెళుతున్నారని సంబరపడ్డాం. దేశంలో క్రీడల పట్ల ఆసక్తి పెరగడం, ప్రభుత్వం కూడా ప్రణాళికాబద్ధంగా వ్యవహరిస్తుండటంతో రియోకు భారీ బృందం వెళుతోంది. గతంతో పోలిస్తే ఈసారి పతకాల సంఖ్య పెరిగే అవకాశం ఉందని, సుమారు 10 పతకాలు మనోళ్లు తెస్తారని అంచనా. ఇప్పటికే ఆర్చరీ క్రీడాకారులు బ్రెజిల్ చేరిపోయి సాధన మొదలెట్టారు. మిగిలిన క్రీడలకు సంబంధించిన క్రీడాకారులు అమెరికా, యూరోప్‌లలో రకరకాల ప్రదేశాలలో ప్రాక్టీస్ చేస్తూ రియోకు సన్నద్ధమవుతున్నారు. అంతా సాఫీగా సాగుతుందనుకుంటున్న సమయంలో డోపింగ్ కలకలం వెలుగులోకి రావడం పెద్ద షాక్. సాక్షి క్రీడావిభాగం: రెజ్లర్ నర్సింగ్ యాదవ్ డోపింగ్‌లో దొరికినా అతడిపై ఎంతో కొంత సానుభూతి కనిపించింది. రెజ్లింగ్ సమాఖ్య కూడా నర్సింగ్ గత చరిత్రను దృష్టిలో ఉంచుకుని మద్దతుగా నిలబడింది. నర్సింగ్ అంశంపై చర్చ వాడిగా సాగుతున్న సమయంలోనే మరో అథ్లెట్ ఇందర్జీత్ సింగ్ డోపింగ్‌లో దొరికిపోవడం మన ప్రతిష్టను దిగజార్చింది. గతంలో అడపాదడపా భారత అథ్లెట్లు డోపింగ్‌లో పట్టుబడ్డా... ఈసారి ఒలింపిక్స్‌కు ముందు భారీ అంచనాలతో ఉన్న అథ్లెట్లు దొరికిపోవడం దేశానికి చెడ్డపేరు తెస్తోంది. భారత్‌లో క్రీడాకారులు డోపీలుగా దొరకడం ఇది తొలిసారేం కాదు. 2004 ఏథెన్స్ ఒలింపిక్స్ సమయంలోనూ భారత్‌లో డోపింగ్ కలకలం రేగింది. అప్పుడు ఇద్దరు వెయిట్‌లిఫ్టర్లు పట్టుబడ్డారు. దీంతో ఒక రకంగా వెయిట్లిఫ్టింగ్కు ఆదరణ బాగా తగ్గిపోయింది. 2000లో డిస్కస్ త్రోయర్ సీమా అంటిల్, 2001లో కుంజరాణి, 2010లో సనామచా చాను కూడా డోపింగ్‌లో దొరికారు. అయితే అప్పటితో పోలిస్తే ఇప్పుడు టెక్నాలజీ పెరిగింది. క్రీడల పట్ల, క్రీడాకారుల పట్ల ఆదరణ పెరిగింది. గత రెండు ఒలింపిక్స్‌లలో పతకాల సంఖ్య పెరగడంతో దేశంలో క్రీడాసంస్కృతి పెరిగింది. రియోకు వెళ్లే అథ్లెట్లకు ప్రభుత్వం భారీగా డబ్బు ఇచ్చింది. ‘టాప్’ స్కీమ్ పేరిట అందరికీ ఆర్థిక సహాయం అందజేసింది. దీంతో పాటు పలు ప్రైవేట్ సంస్థలు వ్యక్తులు కూడా సహకారం అందించారు. ఈ నేపథ్యంలో అథ్లెట్లు పతకాలు తెస్తారని ఆశలూ పెరిగాయి. అయితే ఆటల ప్రారంభానికి ముందే ఇద్దరు అథ్లెట్లు దొరకడంతో అందరిలోనూ సంశయం మొదలైంది. క్లీన్చిట్ ఎలా ఇచ్చారు? జాతీయ డోపింగ్ నిరోధక సంస్థ (నాడా) భారత అథ్లెంట్లందరికీ వారం రోజుల క్రితం ‘క్లీన్చిట్’ ఇచ్చింది. రియోకు వెళుతున్న వారందరికీ పరీక్షలు నిర్వహించామని, అందరూ క్లీన్ అని ప్రకటించింది. కానీ వారం తిరిగే సరికే ఇద్దరు అథ్లెట్ల పేర్లను అదే ‘నాడా’ బయటపెట్టింది. నిజానికి ఇప్పుడు బయటపడ్డ ఫలితాలు గత నెలలో తీసుకున్న శాంపిల్స్వి. మరి ఆ ఫలితాలను చూడకుండానే ముందుగా ఎందుకు ప్రకటన చేశారనేది ప్రశ్నార్థకం. అటు రెజ్లర్ నర్సింగ్ యాదవ్, ఇటు షాట్‌పుటర్ ఇందర్జీత్ ఇద్దరూ తాము అమాయకులమే అని, తమపై కుట్ర జరిగిందని ఆరోపిస్తున్నారు. ఒక అథ్లెట్ బ్లడ్, యూరిన్ శాంపిల్ ఇచ్చిన సమయంలో అథ్లెట్ సమక్షంలోనే దానిని లాక్ చేస్తారు. ఆ తర్వాత మిషన్ల సహాయంతో మాత్రమే వాటిని తెరుస్తారు. కాబట్టి అథ్లెట్ శాంపిల్‌ను మార్చారనే ఆరోపణల్లో నిజం లేదనుకోవాలి. ఇక నర్సింగ్ యాదవ్ చేసిన ఆరోపణలు భిన్నంగా ఉన్నాయి. అతడితో పాటు అతడి రూమ్మేట్ కూడా డోపింగ్‌లో దొరికాడు. ఈ ఇద్దరూ తినే ఆహారంలో ఏదో కలిపారనే అనుమానాలు వ్యక్తమయ్యాయి. వీళ్లిద్దరూ భారత స్పోర్ట్స్ అథారిటీ (సాయ్) శిక్షణా కేంద్రంలోనే శిక్షణ తీసుకుంటున్నారు. హరియాణాలోని సోనేపట్‌లో ఉన్న ఈ కేంద్రంలోనే రెజ్లర్లందరికీ శిక్షణ ఇస్తున్నారు. తనపై కుట్ర జరిగిందని, దీనిపై సీబీఐ విచారణ జరపాలని నర్సింగ్ కోరుతున్నాడు. గతంలో నర్సింగ్కు మంచి రికార్డు ఉంది. ఎప్పుడూ ఏ స్థాయిలోనూ డోపింగ్‌కు పాల్పడిన ఆనవాళ్లు లేవు. ఇంతకాలం ఇంత క్లీన్‌గా ఉన్న వ్యక్తి ఒలింపిక్స్ సమయంలో డోపింగ్ చేయకపోవచ్చు. నిజానికి గత నెలలో అతనికి మూడుసార్లు డోపింగ్ పరీక్షలు నిర్వహిస్తే అందులో రెండుసార్లు క్లీన్చిట్ వచ్చింది. మూడో సందర్భంలో బ్లడ్ శాంపిల్‌లో ఎలాంటి సమస్యా లేదు. కేవలం యూరిన్ శాంపిల్‌లో మాత్రమే తేడా ఉంది. ఇవన్నీ దృష్టిలో ఉంచుకుని నర్సింగ్కు రెజ్లింగ్ సమాఖ్య నుంచే కాకుండా అన్ని వైపుల నుంచీ మద్దతు లభించింది. కానీ ఇందర్జీత్ విషయంలో పరిస్థితి అలా లేదు. భారత అథ్లెట్లందరికీ నిర్వహించే జాతీయ క్యాంప్‌లో ఇందర్జీత్ శిక్షణ తీసుకోలేదు. తన వ్యక్తిగత కోచ్‌తో ప్రత్యేకంగా శిక్షణ తీసుకుంటున్నాడు. అక్కడ ఏం జరుగుతుందనేది ఎవరికీ తెలియదు. అలాగే ప్రతి నెలా క్రీడాకారులు తాము ఎక్కడ ఉండేదీ ‘నాడా’కు తెలపాలి. కానీ గత నెల ఇందర్జీత్ జూన్‌లో ఓ పరీక్షకు హాజరు కాలేదు. రెండో పరీక్షకు హాజరై దొరికిపోయాడు. అయితే ఇంకా తన ‘బి’ శాంపిల్ పరీక్ష ఫలితం రాలేదు. ఒకవేళ ఆ పరీక్షలో కూడా అతను పాజిటివ్‌గా తేలితే ఇక రియోకు వెళ్లడం సాధ్యం కాదు. అంతేకాకుండా రెండు నుంచి నాలుగేళ్లు నిషేధం కూడా పడుతుంది. తమ కెరీర్లో ఒకసారైనా ఒలింపిక్స్‌లో పాల్గొనాలని క్రీడాకారులందరూ కలలు కంటారు. దీనిని సాకారం చేసుకోవడం కోసం ఏళ్ల పాటు కష్టపడతారు. కుటుంబాలను, వ్యక్తిగత సంతోషాలను వదిలేస్తారు. కాబట్టి కావాలని డోపింగ్‌కు పాల్పడే క్రీడాకారుల సంఖ్య తక్కువగానే ఉంటుంది. కానీ కొంతమంది మరీ అత్యాశకు వెళతారు. ఏదో ఒకటి చేసి పతకం గెలవాలనే ఉద్దేశంతో, పరీక్షలకు దొరక్కుండా రకరకాల మార్గాల ద్వారా నిషేధిత ఉత్ప్రేరకాలు తీసుకుంటారు. కానీ ప్రస్తుతం టెక్నాలజీ రోజు రోజూకూ మెరుగుపడుతున్నందున ఇలాంటివి దాగవు. తప్పు చేసిన అథ్లెట్ ఏదో ఒక రోజు దొరకాల్సిందే. ఏమైనా రియోకు ముందు ఈ పరిణామాలు ఎంతమాత్రం మంచివి కాదు. ఈ ఇద్దరితోనే ఇది ఆగిపోవాలని కోరుకుందాం. ఇందర్జిత్ తీసుకున్న ఆండ్రోస్టెరాన్, ఎథియోక్లొనోలోన్ రెండూ నిషిద్ధ జాబితాలో ఉన్నాయి. జీవనిర్మాణ క్రియల్లో ఇవి ప్రముఖ పాత్ర పోషిస్తాయి. కండరాల పెరుగుదల, శరీరాకృతిని తీర్చిదిద్దుకోవడానికి ఈ ఉత్ప్రేరకాలు బాగా దోహదపడతాయి. బరువైన వస్తువులు మోసే వాళ్లు లేదా శక్తిని బాగా ఉపయోగించే అథ్లెట్లు వీటిని తీసుకుంటారు. దీనివల్ల శరీరంలోని శక్తి ఒక్కసారిగా బయటకు వచ్చేస్తుంది. షాట్‌పుట్, హామర్ త్రో అథ్లెట్లు ఈ డ్రగ్స్‌ను నోటి ద్వారా లేదా ఇంజెక్షన్ల రూపంలో ఎక్కువగా తీసుకుంటారు. కొన్నిసార్లు ఒకే డ్రగ్‌ను లేదా రెండింటిని కలిపి తీసుకుంటారు. -
నర్సింగ్ స్థానంలో ప్రవీణ్ రాణా
యునెటైడ్ రెజ్లింగ్‌కు ఐఓఏ సమాచారం కొర్సిర్ సర్వే (స్విట్జర్లాండ్): డోపింగ్‌లో పట్టుబడిన భారత స్టార్ రెజ్లర్ నర్సింగ్ యాదవ్ రియో ఒలింపిక్స్‌లో పాల్గొనే అవకాశాలకు తెరపడింది. నర్సింగ్ యాదవ్ స్థానంలో పురుషుల ఫ్రీస్టయిల్ 74 కేజీల విభాగంలో భారత్ నుంచి ప్రవీణ్ రాణా బరిలోకి దిగనున్నాడు. ఈ మేరకు భారత ఒలింపిక్ సంఘం (ఐఓఏ) యునెటైడ్ వరల్డ్ రెజ్లింగ్‌కు సమాచారం అందించింది. వాస్తవానికి నర్సింగ్ యాదవ్ డోపింగ్‌లో దొరికాడని ఆదివారం బయట పడినా... వారం రోజులకంటే ముందుగానే ఈ విషయాన్ని జాతీయ డోపింగ్ నిరోధక సంస్థ (నాడా) ఐఓఏకు తెలియజేయడం... ఈ సమాచారాన్ని యునెటైడ్ వరల్డ్ రెజ్లింగ్‌కు ఐఓఏ అందజేయడం జరిగింది. క్వాలిఫయింగ్ టోర్నీలో కాకుండా పోటీలు లేని సమయంలో నర్సింగ్ యాదవ్ డోపింగ్‌లో దొరికినందుకు.... అతని స్థానంలో భారత్ నుంచి వేరే రెజ్లర్‌ను పంపించే వెసులుబాటును కల్పిస్తున్నట్లు గత వారమే ఐఓఏకు యునెటైడ్ వరల్డ్ రెజ్లింగ్ సమాచారం ఇచ్చింది. ఒకవేళ ప్రత్యామ్నాయం లేకపోతే భారత్‌కు దక్కిన బెర్త్ ఖాళీ అవుతుందని ప్రకటించింది. దాంతో నర్సింగ్ యాదవ్ స్థానంలో ప్రవీణ్ రాణా పేరును సూచిస్తూ యునెటైడ్ వరల్డ్ రెజ్లింగ్‌కు ఐఓఏ తెలిపింది. ఈ మేరకు యునెటైడ్ వరల్డ్ రెజ్లింగ్ మంగళవారం తమ అధికారిక వెబ్సైట్లో ఈ వార్తను ప్రచురించింది. -
నర్సింగ్పై కుట్ర జరిగింది
-
నర్సింగ్పై కుట్ర జరిగింది
♦ ‘సాయ్’ అధికారిపై రెజ్లర్ అనుమానం ♦ డబ్ల్యూఎఫ్ఐ అధ్యక్షుడు బ్రిజ్‌భూషణ్ సింగ్ వెల్లడి ♦ ‘నాడా’ క్లీన్చిట్ ఇస్తేనే ‘రియో’లో బరిలోకి ♦ ఇప్పటికైతే తాత్కాలిక నిషేధం ♦ డోప్‌లో దొరికిన నర్సింగ్ సహచరుడు సందీప్ న్యూఢిల్లీ: డోపింగ్ పరీక్షలో విఫలమైన రెజ్లర్ నర్సింగ్ యాదవ్‌కు భారత రెజ్లింగ్ సమాఖ్య (డబ్ల్యూఎఫ్ఐ) బాసటగా నిలబడింది. రియో ఒలింపిక్స్‌కు వెళ్లకుండా నర్సింగ్పై కుట్ర జరిగిందని డబ్ల్యూఎఫ్ఐ అధ్యక్షుడు, బీజేపీ ఎంపీ అయిన బ్రిజ్‌భూషణ్ శరణ్ సింగ్ తెలిపారు. డోపింగ్‌లో విఫలమైన సమాచారం అందుకున్న వెంటనే ఈనెల 19న నర్సింగ్ యాదవ్ డబ్ల్యూఎఫ్ఐకు లిఖితపూర్వకంగా ఫిర్యాదు చేశాడన్నారు. హరియాణాలోని సోనెపట్ భారత స్పోర్ట్స్ అథారిటీ (సాయ్)లో శిక్షణ శిబిరం సందర్భంగా తాను తీసుకున్న ఆహారంలో ఉద్దేశపూర్వకంగా నిషేధిత ఉత్ప్రేరకాలు కలిపారని... ఈ కుట్ర వెనుక ‘సాయ్’ అధికారితోపాటు శిబిరంలో ఉన్న ఇతర ఆటగాళ్ల పాత్ర ఉందని నర్సింగ్ అనుమానం వ్యక్తం చేసినట్లు ఆయన తెలిపారు. ‘నెల రోజుల వ్యవధిలో నర్సింగ్కు మూడు డోప్ టెస్టులు నిర్వహించడం అనుమానం రేకెత్తిస్తోంది. నర్సింగ్ ప్రాక్టీస్ భాగస్వామిగా ఉన్న మరో రెజ్లర్ సందీప్ తులసీ యాదవ్ కూడా డోపింగ్‌లో పట్టుబడటం మరింత ఆశ్చర్యకరంగా ఉంది. నర్సింగ్ ఫిర్యాదు ఇచ్చిన వెంటనే దానిని కేంద్ర క్రీడా మంత్రిత్వ శాఖకు పంపించాం. ప్రభుత్వంలోని ఇతర ముఖ్యులకు ఈ సమాచారాన్ని అందించాం. నర్సింగ్పై కుట్ర జరిగిన విషయాన్ని ప్రపంచ రెజ్లింగ్ సమాఖ్యతోపాటు జాతీయ డోపింగ్ నిరోధక సంస్థ (నాడా)కు వివరించాం’ అని ఆయన అన్నారు. తుది విచారణ తర్వాతే... రియో ఒలింపిక్స్‌లో నర్సింగ్ యాదవ్ పాల్గొంటాడా లేదా అనే విషయం ‘నాడా’ క్రమశిక్షణ సంఘం ఇచ్చిన నివేదిక ఆధారంగా నిర్ణయిస్తామని కేంద్ర క్రీడల మంత్రి విజయ్ గోయల్ స్పష్టం చేశారు. ‘నాడా క్లీన్చిట్ ఇస్తేనే నర్సింగ్‌ను రియో ఒలింపిక్స్‌కు పంపిస్తాం. ఇప్పటికైతే అతనిపై తాత్కాలిక నిషేధం విధించాం. విచారణ సందర్భంగా తన వాదన వినిపించేందుకు నర్సింగ్కు పూర్తి అవకాశం ఇస్తాం’ అని విజయ్ గోయల్ తెలిపారు. మరో రెజ్లర్ కూడా... సోనెపట్ ‘సాయ్’ కేంద్రంలో నర్సింగ్ యాదవ్‌కు ప్రాక్టీస్ భాగస్వామిగా ఉన్న సందీప్ తులసీ యాదవ్ కూడా నిషేధిత ఉత్ప్రేరకం మెథన్‌డైనోన్ వాడినట్లు తేలింది. మహారాష్ట్రకే చెందిన సందీప్ 2013లో హంగేరిలో జరిగిన ప్రపంచ సీనియర్ రెజ్లింగ్ చాంపియన్‌షిప్‌లో 66 కేజీల గ్రీకో రోమన్ విభాగంలో కాంస్య పతకం సాధించాడు. దురదృష్టకరం: సుశీల్ భారత రెజ్లింగ్‌లో డోపింగ్ వివాదం దురదృష్టకర పరిణామమని బీజింగ్, లండన్ ఒలింపిక్స్‌లో కాంస్య, రజత పతకాలు సాధించిన స్టార్ రెజ్లర్ సుశీల్ కుమార్ వ్యాఖ్యానించాడు. ‘భారత రెజ్లింగ్‌కు ఈ దుస్థితి రావడం దురదృష్టకరం. నా కెరీర్లో నా సహచర రెజ్లర్లకు ఎప్పుడూ మద్దతుగా నిలిచాను. వరుసగా మూడో ఒలింపిక్స్‌లోనూ పతకం సాధించాలని ఆశించాను. అయితే గత నెల రోజులుగా నేను ప్రాక్టీస్ చేయడంలేదు. రియోలో నా సహచరులు పతకాలు సాధించాలని ఆకాంక్షిస్తున్నాను’ అని సుశీల్ తెలిపాడు. ‘సీబీఐ విచారణ జరిపించాలి’ డోపింగ్ వివాదంపై సీబీఐ విచారణ జరిపించాలని రెజ్లర్ నర్సింగ్ యాదవ్ డిమాండ్ చేశాడు. రియో ఒలింపిక్స్‌కు తాను ఎంపికైన వ్యవహారం కోర్టు దాకా వెళ్లిందని, సోనెపట్ శిక్షణ కేంద్రంలో పాల్గొంటే తనకు ప్రాణహాని ఉందంటూ గతంలో సీఐడీ నివేదిక ఇచ్చిందని అతను గుర్తు చేశాడు. ‘నాడా’ విచారణ సంఘం సభ్యులకు అన్ని వివరాలు వెల్లడిస్తానని, తనకు అన్ని వర్గాల నుంచి మద్దతు ఉందని, ఇప్పటికీ తాను ఒలింపిక్స్‌లో పాల్గొంటాననే నమ్మకం ఉందని నర్సింగ్ విశ్వాసం వ్యక్తం చేశాడు. -
రెజ్లర్ వివాదంపై వివరాలు ఇవ్వండి: మోదీ
న్యూఢిల్లీ:డోపింగ్ టెస్టులో విఫలమైన భారత రెజ్లర్ నర్సింగ్ యాదవ్ వివాదం ఇప్పుడు ప్రధాని నరేంద్ర మోదీ వద్దకు చేరింది. డోపింగ్ టెస్టులో నర్సింగ్ విఫలం కావడం, ఆపై అది కాస్త తీవ్ర దుమారం రేపడంతో మోదీ స్పందించారు. ఆ వివాదానికి సంబంధించిన వివరాలను తనకు అందజేయాలంటూ భారత రెజ్లింగ్ ఫెడరేషన్ ను కోరారు. ఈ మేరకు భారత రెజ్లింగ్ ఫెడరేషన్ అధ్యక్షుడు బ్రిజ్ భూషణ్ కలిసిన మోదీ.. ప్రస్తుత వివాదం గురించి అడిగి తెలుసుకున్నారు. దీనిలో భాగంగా ఆ వివరాలను తక్షణమే తనకు పంపాలంటూ బ్రిజ్ భూషణ్ కు తెలియజేశారు. రియో ఒలింపిక్స్‌కు అర్హత సాధించిన భారత స్టార్ రెజ్లర్ నర్సింగ్ యాదవ్ (74 కేజీలు) డోపింగ్ పరీక్షలో పట్టుబడిన సంగతి తెలిసిందే. హరియాణాలోని సోనేపట్ భారత స్పోర్ట్స్ అథారిటీ (సాయ్) కేంద్రంలో నర్సింగ్కు నిర్వహించిన డోపింగ్ పరీక్షలో అతను విఫలమయ్యాడు. అతని నుంచి సేకరించిన నమూనాలో నిషేధిత ఉత్ప్రేరకం మెథాన్‌డైనన్ వాడినట్లు తేలిందని జాతీయ డోపింగ్ నిరోధక సంస్థ (నాడా) స్పష్టం చేసింది. ఈ నేపథ్యంలో నర్సింగ్ యాదవ్ రియోకు వెళ్లడంపై సందిగ్ధత ఏర్పడింది. మరోవైపు తనను రియోకు వెళ్లకుండా చేయడానికి కుట్ర జరిగిందని నర్సింగ్ ఆరోపిస్తున్నాడు. తాను ఎటువంటి నిషేధిత డ్రగ్స్ తీసుకోలేదని, ఎవరో కావాలనే తన భోజనంలో డ్రగ్స్ కలిపి ఇరికించే యత్నం చేసి ఉంటారని నర్సింగ్ అనుమానిస్తున్నాడు. -
అయ్యో... నర్సింగ్!
రియో ఒలింపిక్స్‌కు ముందు భారత్‌కు గట్టి దెబ్బ తగిలింది. పతకం తెస్తాడని ఆశించిన భారత స్టార్ రెజ్లర్ నర్సింగ్ యాదవ్ డోపింగ్ పరీక్షలో విఫలమయ్యాడు. దీంతో రియో ఒలింపిక్స్‌లో అతను బరిలో దిగే అవకాశాలు సన్నగిల్లాయి. ఒలింపిక్స్ ఎంట్రీల తుది గడువు తేదీ కూడా ముగియడంతో ఈ విభాగంలో భారత ప్రాతినిధ్యం కూడా అనుమానంగా మారింది. * డోపింగ్‌లో దొరికిన భారత రెజ్లర్ * రియో ఒలింపిక్స్‌లో పాల్గొనేది అనుమానం న్యూఢిల్లీ: భారత రెజ్లింగ్‌కు శరాఘాతం. రియో ఒలింపిక్స్‌కు అర్హత సాధించిన భారత స్టార్ రెజ్లర్ నర్సింగ్ యాదవ్ (74 కేజీలు) డోపింగ్ పరీక్షలో పట్టుబడ్డాడు. ఈనెల 5న హరియాణాలోని సోనేపట్ భారత స్పోర్ట్స్ అథారిటీ (సాయ్) కేంద్రంలో నర్సింగ్కు డోపింగ్ పరీక్ష నిర్వహించారు. అతని నుంచి సేకరించిన నమూనాలో నిషేధిత ఉత్ప్రేరకం మెథాన్‌డైనన్ వాడినట్లు తేలిందని జాతీయ డోపింగ్ నిరోధక సంస్థ (నాడా) డెరైక్టర్ జనరల్ నవీన్ అగర్వాల్ ప్రకటించారు. ‘నర్సింగ్ డోప్ పరీక్షలో విఫలమయ్యాడు. ‘ఎ’ శాంపిల్‌తోపాటు ‘బి’ శాంపిల్ కూడా పాజిటివ్‌గా వచ్చింది. అతని సమక్షంలోనే ‘బి’ శాంపిల్‌ను తెరిచాం. శనివారం ‘నాడా’ క్రమశిక్షణ సంఘం ఎదుట నర్సింగ్ హాజరయ్యాడు. ఈ విషయంపై మరిన్ని నివేదికలు రావాలి. సాధ్యమైనంత తొందరగా ఈ విచారణను ముగిస్తాం. రియో ఒలింపిక్స్‌లో నర్సింగ్ పాల్గొంటాడా లేదా అనేది ఇప్పుడే చెప్పలేం’ అని నవీన్ అగర్వాల్ తెలిపారు. సుశీల్‌కు అవకాశం లేదు! రియో ఒలింపిక్స్‌లో నర్సింగ్ యాదవ్ పురుషుల ఫ్రీస్టయిల్ 74 కేజీల విభాగంలో పోటీ పడాల్సింది. అయితే డోపింగ్ టెస్టులో పట్టుబడటంతో అతను ‘రియో’కు వెళ్లేది అనుమానంగా మారింది. ఒకవేళ నర్సింగ్పై వేటు పడితే అతని స్థానంలో మరో భారత రెజ్లర్ సుశీల్ కుమార్‌ను ‘రియో’ పంపించే అవకాశం లేదని భారత ఒలింపిక్ సంఘం (ఐఓఏ) సెక్రటరీ జనరల్ రాజీవ్ మెహతా స్పష్టం చేశారు. ‘ఒలింపిక్ ఎంట్రీల తుది గడువు జులై 18తో ముగిసింది. నర్సింగ్ స్థానాన్ని వేరే రెజ్లర్‌తో భర్తీ చేసే అవకాశం లేదు’ అని ఆయన తెలిపారు. ప్రాతినిధ్యం లేనట్టే.. గతేడాది ప్రపంచ చాంపియన్‌షిప్‌లో కాంస్యం నెగ్గి నర్సింగ్ యాదవ్ రియో బెర్త్ దక్కించుకున్నాడు. అయితే బెర్త్ పొందిన నర్సింగ్ యాదవ్‌తో తనకు ట్రయల్స్ ఏర్పాటు చేయాలని, ఈ ట్రయల్స్‌లో గెలిచిన వారిని రియో ఒలింపిక్స్‌కు పంపించాలని ఇదే విభాగంలో భారత మరో స్టార్ రెజ్లర్ సుశీల్ కుమార్ కోరాడు. కానీ భారత రెజ్లింగ్ సమాఖ్య సుశీల్ అభ్యర్థనను తిరస్కరించింది. దాంతో సుశీల్ ఢిల్లీ హైకోర్టును ఆశ్రయించాడు. అయితే ఢిల్లీ హైకోర్టు కూడా సుశీల్ వాదనను కొట్టివేసింది. తాజాగా ఎంట్రీల తుది గడువు ముగియడం, నర్సింగ్ డోపింగ్‌లో దొరకడంతో ఈసారి రియో ఒలింపిక్స్‌లో 74 కేజీల విభాగంలో భారత ప్రాతినిధ్యం ఉండకపోవచ్చు. మళ్లీ పరీక్షలు నిర్వహించండి... డోప్ టెస్టులో పట్టుబడ్డ నర్సింగ్ యాదవ్‌కు భారత రెజ్లింగ్ సమాఖ్య (డబ్ల్యూఎఫ్ఐ) మద్దతుగా నిలిచింది. ‘గత పదేళ్లలో ఏనాడూ నర్సింగ్ డోపింగ్‌లో దొరకలేదు. అతనిపై ఎవరో కుట్ర పన్నారు’ అని డబ్ల్యూఎఫ్ఐ అధికారి ఒకరు అన్నారు. నర్సింగ్ యాదవ్‌కు మళ్లీ తాజాగా డోపింగ్ పరీక్షలు నిర్వహించాలని అతని కోచ్ జగ్మల్ సింగ్ కోరారు. ఈసారీ పాజిటివ్‌గా వస్తే నర్సింగ్ తప్పు చేశాడని అంగీకరిస్తామని అన్నారు. ‘నర్సింగ్ డోపింగ్‌లో దొరికాడన్న వార్త విని షాక్‌కు గురయ్యా. పదేళ్ల వయసు నుంచి అతను తెలుసు. ఎన్నోసార్లు అతను డోపింగ్ పరీక్షల్లో పాల్గొన్నాడు. కానీ ఏనాడూ విఫలం కాలేదు. కావాలనే అతణ్ని ఇరికించారు. ఈ కుట్ర ఎవరు చేశారో నేను చెప్పలేను. వారి పేర్లు చెబితే ఆధారాలు చూపించాలని అంటారు. శిక్షణ సమయంలో నర్సింగ్ తీసుకుంటున్న ఆహారంలో ఎవరో నిషేధిత ఉత్ప్రేరకాలు కలిపారని అనుమానిస్తున్నాం’ అని జగ్మల్ తెలిపారు. నర్సింగ్ డోపింగ్ వివాదం అనంతరం సుశీల్ కుమార్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. ‘గౌరవం అనేది అడిగితే రాదు. కష్టపడి దానిని సాధించాలి’ అని అతను అన్నాడు. ‘ఇదెంతో దురదృష్టకర పరిణామం. ఒలింపిక్స్‌కు మరో 11 రోజులే ఉన్నాయి. ఈ అంశం భారత పతకావకాశాలను ప్రభావితం చేస్తుంది. నర్సింగ్ స్థానంలో సుశీల్‌ను పంపించే విషయంపై రెజ్లింగ్ సమాఖ్య, భారత ఒలింపిక్ సంఘం నుంచి ఎలాంటి సమాచారం లేదు. తుది నిర్ణయం ఎలా ఉన్నా దానిని స్వాగతిస్తాం’ అని సుశీల్ కోచ్ సత్పాల్ సింగ్ అన్నారు. నాపై కుట్ర జరిగింది... ‘రియో ఒలింపిక్స్‌కు నేను వెళ్లకూడదని ఉద్దేశపూర్వకంగా నన్ను ఇరికించారు. ఏనాడూ నేను నిషేధిత ఉత్ప్రేరకాలు తీసుకోలేదు. వాస్తవాలు త్వరలోనే వెలుగులోకి వస్తాయి. ఈ అంశంలో భారత ఒలింపిక్ సంఘం నాకు మద్దతుగా నిలుస్తుందని విశ్వసిస్తున్నాను.’ - నర్సింగ్ యాదవ్ ‘ఏ క్రీడాకారుడైనా డోపింగ్‌లో పట్టుబడితే నిబంధనల ప్రకారం చర్యలు తీసుకుంటాం. డోపింగ్‌లో దొరికిన వారిని ఒలింపిక్స్‌కు పంపించం’ - రామచంద్రన్, ఐఓఏ అధ్యక్షుడు -
రియోకు ముందే భారత్ కు ఎదురుదెబ్బ!
-
నర్సింగ్ యాదవ్ పై కుట్ర పన్నారు: కోచ్ జగ్మల్
న్యూఢిల్లీ: రియో ఒలింపిక్స్ నేపథ్యంలో నేషనల్ యాంటీ డోపింగ్ ఏజెన్సీ(నాడా) జరిపిన డోపింగ్ టెస్టుల్లో నర్సింగ్ యాదవ్ నిషేధిత ఉత్ప్రేరకాలు వాడినట్లు కథనాలు రావడం కుట్ర పూరిత చర్యల్లో భాగమేనని అతని కోచ్ జగ్మల్ సింగ్ మండిపడ్డాడు. నర్సింగ్ యాదవ్ రియో అవకాశాలు దెబ్బతీయాలని ఇలాంటివి చేస్తున్నారని ఆయన ఆరోపించాడు. నర్సింగ్ పరువు తీసి, అతన్ని వెనక్కి తగ్గేలా చేయడంలో భాగమే ఈ వార్తలని ఆయన విమర్శించారు. అసలు ఏం జరగుతుందో తమకు అర్థం కావడంలేదని, నర్సింగ్ ఎలాంటి నిషిద్ద ఉత్ప్రేరకాలు వాడలేదని జగ్మల్ సింగ్ వివరించాడు. తొలుత సుశీల్ కుమార్ తో రియో బెర్త్ కోసం వివాదాలు, ఇప్పుడు డోపింగ్ వివాదం నర్సింగ్ ను చుట్టుముట్టడం నిజంగా బాధాకరమన్నాడు. నర్సింగ్ యాదవ్ మొదట 'ఏ' శాంపిల్ టెస్టులో పాజిటివ్ రావడంతోపాటు రెండోసారి నిర్వహించిన 'బి' శాంపిల్ టెస్టుల్లో కూడా పాజిటివ్ నివేదిక వచ్చినట్లు మీడియాలో కథనాలు వెలువడిన సంగతి తెలిసిందే. -
రియోకు ముందే భారత్ కు ఎదురుదెబ్బ!
న్యూఢిల్లీ: రియో ఒలింపిక్స్‌కు ముందే భారత్‌కు గట్టి ఎదురుదెబ్బ తగిలింది. భారత స్టార్ రెజ్లర్ నర్సింగ్ యాదవ్ రియో ఒలింపిక్స్ లో పాల్గొంటాడా లేదా అన్న దానిపై స్పష్టతలేదు. రియోకు ముందు జరిపిన డోపింగ్ టెస్టులో నర్సింగ్ విఫలమయ్యాడని కథనాలు ప్రచారంలో ఉన్నాయి. నేషనల్ యాంటీ డోపింగ్ ఏజెన్సీ(ఎన్ఏడీఏ) ఈ నెలలో ఆటగాళ్లకు డోపింగ్ టెస్టులు చేసింది. తాజాగా వెలువడిన డోపింగ్ పరీక్షల ఫలితాలలో నర్సింగ్ పాజిటివ్‌గా తేలినట్లు సమాచారం. అతడి నుంచి తీసుకున్న శాంపిల్ 'బి'లో కూడా నిషేధిత ఉత్ప్రేరకాలు వాడినట్లు తేలింది. నర్సింగ్ సమక్షంలోనే ఎన్ఏడీఏ శాంపిల్ 'బి' టెస్టులు చేసింది. పూర్తి నివేదిక రాగానే నర్సింగ్‌ను రియో పంపాలా.. వద్దా అనే దానిపై నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది. అయితే భారత రెజ్లింగ్ సమాఖ్య ఇప్పటివరకూ నర్సింగ్ యాదవ్ విషయంపై ఎలాంటి అధికారిక ప్రకటన విడుదల చేయలేదు. ఆగస్టు 5 నుంచి 21 వరకు జరగనున్న రియో ఒలింపిక్స్ లో 74 కేజీల విభాగంలో భారత్ తరఫున నర్సింగ్ బరిలో దిగనున్న విషయం తెలిసిందే. -
రష్యాపై నిర్ణయం నేడు!
పారాలింపిక్స్‌కు కూడా అనుమానం మాస్కో: డోపింగ్ స్కామ్ నేపథ్యంలో... రియో ఒలింపిక్స్‌లో పాల్గొనకుండా రష్యాపై నిషేధం విధించాలా? వద్దా? అనే అంశంపై అంతర్జాతీయ ఒలింపిక్ కమిటీ (ఐఓసీ) నేడు (ఆదివారం) తుది నిర్ణయానికి రానుంది. ఈ మేరకు సమావేశం కానున్న ఐఓసీ ఎగ్జిక్యూటివ్ బోర్డు ఈ అంశంపై పూర్తిస్థాయిలో చర్చలు జరపనుంది. రష్యా ట్రాక్ అండ్ ఫీల్డ్ అథ్లెట్లపై కోర్టు ఆఫ్ ఆర్బిట్రేషన్ ఫర్ స్పోర్ట్స్ (సీఏఎస్) కోర్టు ఇచ్చిన తీర్పును కూడా పరిశీలించనుంది. సెప్టెంబర్‌లో జరిగే పారాలింపిక్స్‌లో కూడా పాల్గొనకుండా రష్యాపై నిషేధం విధించాలని అంతర్జాతీయ పారాలింపిక్స్ సమాఖ్య (ఐపీసీ) కొత్త డిమాండ్‌ను లేవనెత్తింది. మరోవైపు దేశం మొత్తంపై కాకుండా దోషులుగా తేలిన అథ్లెట్లపై మాత్రం నిషేధం విధించేలా ఐఓసీని ఒప్పించేందుకు రష్యా ప్రయత్నాలు ముమ్మరం చేసింది. -
రష్యాకు ఎదురుదెబ్బ!
ట్రాక్ అండ్ ఫీల్డ్ అథ్లెట్లకు నో ఎంట్రీ తీర్పు వెలువరించిన సీఏఎస్ నిషేధం దిశగా అడుగులు లుసానే: డోపింగ్ స్కామ్‌తో తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్న రష్యాకు మరో ఎదురుదెబ్బ తగిలింది. తమ ట్రాక్ అండ్ ఫీల్డ్ అథ్లెట్లు రియోలో పాల్గొనకుండా అంతర్జాతీయ అథ్లెటిక్స్ సమాఖ్య (ఐఏఏఎఫ్) విధించిన నిషేధాన్ని ఎత్తివేయాలంటూ దాఖలు చేసిన పిటిషన్‌ను కోర్టు ఆఫ్ ఆర్బిట్రేషన్ ఫర్ స్పోర్ట్స్ (సీఏఎస్) గురువారం తోసిపుచ్చింది. రష్యా అథ్లెట్లు రియోలో పాల్గొనేందుకు అర్హత లేదని స్పష్టం చేసింది. అలాగే ఐఏఏఎఫ్ విధించిన నిషేధాన్ని సమర్థిస్తూ తీర్పు వెలువరించింది. ‘తమ కింద పనిచేసే జాతీయ సమాఖ్యలను ఐఏఏఎఫ్ సస్పెండ్ చేసినప్పుడు దానికి సంబంధించిన అథ్లెట్లు కూడా అనర్హులవుతారు. ఇది ఐఏఏఎఫ్ నిబంధనల్లో స్పష్టంగా ఉంది. ఫలితంగా ఆయా సమాఖ్యలకు చెందిన అథ్లెట్లు గేమ్స్‌లో పాల్గొనడానికి వీల్లేదు’ అని సీఏఎస్ కోర్టు పేర్కొంది. కోర్టు తీర్పుతో రష్యాకు చెందిన 68 మంది ట్రాక్ అండ్ ఫీల్డ్ అథ్లెట్ల భవిష్యత్ ప్రస్తుతానికి సందిగ్దంలో పడింది. కోర్టు తీర్పు అథ్లెట్లకు అంతిమయాత్ర వంటిదని రష్యా పోల్‌వాల్ట్ మాజీ చాంపియన్ ఇసిన్ బయోవా తెలిపింది. ఐఓసీ ఏం చేస్తుందో...! సీఏఎస్ తీర్పు తర్వాత బంతి ఇప్పుడు అంతర్జాతీయ ఒలింపిక్ కమిటీ (ఐఓసీ) కోర్టులోకి వెళ్లింది. ఓ రాష్ట్రమే డోపింగ్‌కు కేంద్రంగా మారడంతో రష్యాపై కచ్చితంగా నిషేధం విధించాల్సిందేనని చాలా దేశాలు పట్టుబడుతున్నాయి. మరోవైపు రియో ఒలింపిక్స్‌కు మరో 15 రోజులే గడువు ఉండటంతో ఇప్పుడు ఐఓసీ ఎలా స్పందిస్తుందో వేచిచూడాలి. సీఏఎస్ తీర్పు తర్వాత రష్యాకు చెందిన మిగతా క్రీడాకారులు కూడా గే మ్స్‌లో పాల్గొనే అంశంపై స్పష్టత కరువైంది. రష్యాపై పూర్తి నిషేధం విధించడానికి ఆర్బిట్రేషన్ కోర్టు తీర్పు తొలి అడుగని విశ్లేషకులు భావిస్తున్నారు. -
రష్యాపై వారంలో నిర్ణయం: ఐఓసీ
లుసానే: డోపింగ్ స్కామ్ నేపథ్యంలో రియో ఒలింపిక్స్‌లో పాల్గొనకుండా రష్యాపై నిషేధం విధించాలా? వద్దా? అనే అంశంపై వారంలో నిర్ణయం తీసుకుంటామని అంతర్జాతీయ ఒలింపిక్ కమిటీ (ఐఓసీ) బుధవారం స్పష్టం చేసింది. అయితే రష్యా ఆటగాళ్లు గేమ్స్‌లో పాల్గొనే అంశంపై కోర్టు ఆఫ్ ఆర్బిట్రేషన్ ఫర్ స్పోర్ట్స్ (సీఏఎస్) గురువారం తుది తీర్పు వెలువరించే అవకాశం ఉంది. దీంతో అప్రమత్తమైన ఐఓసీ ఎగ్జిక్యూటివ్ బోర్డు... న్యాయపరమైన అంశాలను క్షుణ్ణంగా పరిశీలించిన తర్వాతే తుది నిర్ణయానికి రావాలని భావిస్తోంది. మరోవైపు రష్యా క్రీడా మంత్రి విటాలి ముట్కోతో పాటు ఇతర మంత్రులను రియోకు రాకుండా నిషేధం విధించిన ఐఓసీ.. రష్యాలో ఎలాంటి అంతర్జాతీయ ఈవెంట్లను నిర్వహించొద్దని ఆదేశాలు జారీ చేసింది. రష్యాపై నిషేధం విధించాలని ‘వాడా’ కూడా గట్టిగా కోరుకుంటోంది. అమెరికా, కెనడా, జర్మనీ, జపాన్‌లు కూడా దీనికి మద్దతుగా నిలిచాయి. అయితే మొత్తం రష్యాపై నిషేధంపై కాకుండా డోపింగ్‌లో విఫలమైన అథ్లెట్లను రియోకు రాకుండా అడ్డుకోవాలని మరికొన్ని దేశాలు పిలుపునిస్తున్నాయి. ఓవరాల్‌గా ఒలింపిక్ చరిత్రలో రష్యా అంశంపై ఓ సంచలనాత్మక తీర్పు రావడం మాత్రం ఖాయమని విశ్లేషకులు భావిస్తున్నారు. అయితే ఈ వివాదాలతో సంబంధం లేకుండా రష్యా 387 మంది అథ్లెట్లను రియోకు ఎంపిక చేసిం ది. ఈ భారీ బృందానికి రష్యా ఒలింపిక్ సంఘం ఎగ్జిక్యూటివ్ బోర్డు ఆమోద ముద్ర వేసింది. -
ఆ రెజ్లర్ ఎవరికీ కనిపించకుండా...
సోఫియా: ప్రతిష్టాత్మక ఒలింపిక్స్‌లో పాల్గొనాలనేది ఏ ఆటగాడికైనా అంతిమ లక్ష్యం. అయితే అనుకోకుండా ఇలాంటి అవకాశం వచ్చినా.. ఓ రెజ్లర్ మాత్రం విచిత్రంగా ఎవరికీ కనిపించకుండా పోయాడు. ఎంత వెతికినా ఫలితం లేకపోయేసరికి అతడి స్థానంలో తమ జూనియర్ జాతీయ జట్టు కోచ్‌ను బరిలోకి దింపుతున్నారు. బల్గేరియాకు చెందిన 27 ఏళ్ల ఫ్రీస్టయిల్ రెజ్లర్ ల్యూబెన్ ఇలీవ్ ఒలింపిక్స్‌లో 125కేజీ కేటగిరీలో పాల్గొనాల్సి ఉంది. అయితే రష్యాలో శిక్షణ శిబిరంలో పాల్గొన్న అనంతరం ఈనెల 4న ఆటగాళ్లంతా బల్గేరియాకు చేరుకున్నా ఇలీవ్ మాత్రం మిస్ అయ్యాడు. ‘అతడు ఎక్కడున్నాడో ఎవరికీ తెలీడం లేదు. మేం అతడిని చేరుకోలేకపోతున్నాం. అందుకే తన స్థానంలో జూనియర్ కోచ్ డిమిటర్ కుమ్చెవ్ను ఆడిస్తున్నాం’ అని ఫ్రీస్టయిల్ కోచ్ వాలెంటిన్ రేచెవ్ అన్నారు. మేలో జరిగిన యూరోపియన్ ఒలింపిక్ క్వాలిఫయర్‌లో బెలారస్ రెజ్లర్ యూసుప్ జలిలౌ డోపింగ్‌లో పట్టుబడడంతో ఇలీవ్ రియో బెర్త్ దక్కించుకున్నాడు. -
రష్యాలో సీమా పూనియా శిక్షణ!
భారత డిస్కస్ త్రోయర్ సీమా పూనియా... డోపింగ్ స్కామ్‌తో విమర్శలు ఎదుర్కొంటున్న రష్యాలో శిక్షణ తీసుకోవడానికి సిద్ధమవుతోంది. ప్రస్తుతం రష్యాలోనే ఉన్న ఆమె రష్యన్ కోచ్ విటాలియో పిచ్లెంకోవ్తో కలిసి సామాజిక సైట్లలో కనిపిస్తోంది. ఈ నేపథ్యంలో ఇక్కడే శిక్షణ తీసుకునేందుకు తనకు అనుమతి ఇవ్వాలని కేంద్ర క్రీడాశాఖ, నాడా, సాయ్, అథ్లెటిక్స్ సమాఖ్యలను మెయిల్ ద్వారా కోరింది. ‘రష్యాలో శిక్షణ విషయంపై అనుమతి కోరా. ఇంటి నెంబర్‌తో సహా ఇక్కడి అడ్రస్‌ను ఇస్తానని చెప్పా. ఆగస్టు మొదటి వారం ఇక్కడే ఉండి ఆ తర్వాత రియో వెళ్తా’ అని పూనియా పేర్కొంది. అయితే ఈ విషయంలో భారత అథ్లెటిక్స్ సమాఖ్య (ఏఎఫ్ఐ) ఎటూ తేల్చుకోలేకపోతోంది. ప్రస్తుతానికి తాము ఎలాంటి అనుమతి ఇవ్వలేదని ఏఎఫ్ఐ అధికారి ఒకరు తెలిపారు. రష్యాలో శిక్షణ కోసం తన సొంత డబ్బును ఉపయోగించుకుంటున్నానని పూనియా తెలిపింది. అయితే పూనియాకు శిక్షణ ఇవ్వనున్న విటాలియో.... లండన్ ఒలింపిక్స్‌లో డోపింగ్‌లో పట్టుబడ్డ డార్యా పిచ్లెంకోవ్కు తండ్రి. -
డోపింగ్‌లో దొరికిన రెజ్లర్ వినోద్
ఆసీస్ తరఫున ఒలింపిక్స్‌కు దూరం మెల్బోర్న్: భారతీయ సంతతికి చెందిన రెజ్లర్ వినోద్ కుమార్ డోపింగ్‌లో దొరికిపోయాడు. 2015లో ఆస్ట్రేలియా పౌరసత్వం పొందిన తను 66కేజీ గ్రీకో రోమన్ విభాగంలో ఆసీస్ తరఫున ఒలింపిక్స్‌లో బరిలోకి దిగాల్సి ఉంది. అయితే అల్జీరియాలో జరిగిన ఆఫ్రికన్/ఓసియానియా ఒలింపిక్ క్వాలిఫయర్ పోటీల్లో వినోద్ డోపింగ్ టెస్టులో విఫలమయ్యాడు. ఏ, బీ శాంపిళ్లు కూడా పాజిటివ్‌గా తేలడంతో నాలుగేళ్ల సస్పెన్షన్‌కు గురయ్యాడు. అయితే క్రీడామధ్యవర్తిత్వ కోర్టుకు 30 రోజుల్లోగా అప్పీల్ చేసుకునేందుకు అతనికి అవకాశం ఇచ్చారు. వినోద్‌ను జట్టు నుంచి ఆసీస్ తప్పించింది. -
డోపింగ్‌లో దొరికిన రెజ్లర్ వినోద్
మెల్బోర్న్: భారతీయ సంతతికి చెందిన రెజ్లర్ వినోద్ కుమార్ డోపింగ్ టెస్టులో దొరికిపోయాడు. 2015లో ఆస్ట్రేలియా పౌరసత్వం పొందిన వినోద్ 66 కేజీల గ్రీకో రోమన్ విభాగంలో ఒలింపిక్‌లో బరిలోకి దిగాల్సి ఉంది. అయితే అల్జీరియాలో జరిగిన ఆఫ్రికన్/ఓసియానియా ఒలింపిక్ క్వాలిఫయర్ పోటీల్లో పాల్గొన్న వినోద్ అక్కడి డోపింగ్ టెస్టులో విఫలమయ్యాడు. అతని ఏ, బీ శాంపిళ్లు పాజిటివ్‌గా తేలడంతో నాలుగేళ్ల సస్పెన్షన్‌కు గురయ్యాడు. అయితే క్రీడామధ్యవర్తిత్వ కోర్టుకు 30 రోజుల్లోగా అప్పీల్ చేసుకునే అవకాశం ఇచ్చారు. వెంటనే వినోద్‌ను ఒలింపిక్స్ జట్టు నుంచి తప్పించాలని రెజ్లింగ్ ఆస్ట్రేలియాకు ఆ దేశ ఒలింపిక్ కమిటీ సూచించింది. -
ప్రమాదంలో రస్సెల్ కెరీర్?
సెయింట్ కిట్స్: వెస్టిండీస్ స్టార్ ఆటగాడు, ఆల్ రౌండర్ ఆండ్రీ రస్సెల్ కెరీర్ ప్రమాదంలో పడింది. డోపింగ్ టెస్టులకు ఆండ్రీ రస్సెల్ పలుమార్లు గైర్హాజరీ కావడంతో అతనిపై రెండేళ్ల పాటు నిషేధం పడే అవకాశాలు కనబడుతున్నాయి. ఏడాదిలో మూడుసార్లు స్థానిక డోపింగ్ పరీక్షలకు హాజరు కావాల్సిన ఉన్నా రస్సెల్ మాత్రం ఆ నిబంధనల్ని ఉల్లఘించాడు. వరల్డ్ యాంటీ డోపింగ్ ఏజెన్సీ(డబ్యూఏడీఏ) నియామవళి ప్రకారం ప్రతీ అథ్లెట్ ఏడాదిలో మూడు సార్లు స్థానిక యాంటీ డోపింగ్ కమిషన్ ముందు హాజరు కాకుండా ఉంటే అతను డోపింగ్ కు పాల్పడినట్లు నిర్ధారిస్తారు. దీనిలో భాగంగా జమైకా యాంటీ డోపింగ్ కమిషన్(జడ్కో) నిర్వహించే పరీక్షలకు రస్సెల్ హాజరుకాలేదు. ఈ విషయాన్ని వరల్డ్ యాంటీ డోపింగ్ ఏజెన్సీ దృష్టికి తీసుకువెళ్లడంతో అతనిపై విచారణకు రంగం సిద్ధం చేసింది. ఈ విచారణలో రస్సెల్ ఉద్దేశ పూర్వకంగానే డోపింగ్ పరీక్షలకు హాజరు కాలేదని తేలితే అతనిపై సుమారు రెండేళ్ల పాటు అంతర్జాతీయ నిషేధం అమలయ్యే అవకాశం ఉంది. దాంతో పాటు పలు దేశాల్లో జరిగే లీగ్ లకు కూడా రస్సెల్ దూరం కాక తప్పదు. ఇండియన్ ప్రీమియర్ లీగ్ లో కోల్ కతా నైట్ రైడర్స్ జట్టుకు రస్సెల్ ప్రాతినిథ్యం వహిస్తుండగా, బిగ్ బాష్ లీగ్‌లో సిడ్నీ థండర్ కు, పాకిస్తాన్ సూపర్ లీగ్(పీఎస్ఎల్)లో ఇస్లామాబాద్ యునైటెడ్ జట్టుకు రస్సెల్ ఆడుతున్నాడు. -
భారత అథ్లెట్లంతా ‘క్లీన్’
న్యూఢిల్లీ: వచ్చే నెలలో జరిగే రియో ఒలింపిక్స్‌లో పాల్గొనే భారత క్రీడాకారులందరికీ డోపింగ్ టెస్టులు నిర్వహించామని.. ఇందులో ఒక్కరు కూడా డోపింగ్‌లో పట్టుబడలేదని జాతీయ డోపింగ్ నిరోధక సంస్థ (నాడా) డెరైక్టర్ జనరల్ నవీన్ అగర్వాల్ స్పష్టం చేశారు. ‘రియోకు అర్హత సాధించిన భారత క్రీడాకారులంతా డోపింగ్ పరీక్షల్లో పాల్గొన్నారు. కొందరికి రెండుసార్లు, మరికొందరికి మూడుసార్లు నిర్వహించాం. విదేశాల్లో శిక్షణ తీసుకుంటున్న క్రీడాకారులకు కూడా ఈ టెస్టులు నిర్వహించాం’ అని అగర్వాల్ తెలిపారు.