పారిస్ ఒలింపిక్స్‌లో మూడో డోపింగ్ కేసు నమోదైంది. అఫ్గానిస్తాన్‌కు చెందిన జూడో ఆటగాడు మొహమ్మద్ సమీమ్ ఫైజాద్ డోపింగ్ పరీక్షలో దొరికిపోయాడు. అతను నిషిద్ధ ఉత్ప్రేరకాలు తీసుకున్నట్లు పరీక్షల్లో తేలింది. దీంతో అతన్ని అఫ్గాన్ జట్టు నుంచి తప్పించారు. 81 కేజీల కేటగిరీలో తొలి బౌట్‌లో పాల్గొన్న సమయంలోనే 22 ఏళ్ల ఫైజాద్ నుంచి రక్త, మూత్ర నమూనాలను సేకరించారు.
అనంతరం ప్రపంచ డోపింగ్ నిరోధక సంస్థ (వాడా) ఆధ్వర్యంలోని ల్యాబ్‌లో పరీక్షించగా పాజిటివ్ రిపోర్ట్ వచ్చిం ది. పారిస్ క్రీడల్లో పట్టుబడిన మూడో డోపీ సమీమ్ ఫైజాద్. ముగ్గురు మహిళలు, ముగ్గురు పురుషుల బృందంతో అఫ్గాన్ ఈ విశ్వక్రీడల్లో పాల్గొంటుంది.
Comments
Please login to add a commentAdd a comment