నర్సింగ్ వివాదంలో సీబీఐ కేసు నమోదు
న్యూఢిల్లీ: భారత రెజ్లర్ నర్సింగ్ యాదవ్ డోపింగ్ వివాదానికి సంబంధించి సెం ట్రల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్ (సీబీఐ) కేసును నమోదు చేసింది. ఐపీసీ కోడ్ 506, 328 (విషాహారం), 120-బి (కుట్ర) ప్రకారం కేసును నమోదు చేశారు. రియో ఒలింపిక్స్‌కు ముందు నిర్వహించిన డోప్ పరీక్షల్లో నర్సింగ్ యాదవ్ నిషేధిత ఉత్పేర్రకాలు వాడినట్లు తేలింది.
అరుుతే జాతీయ డోపింగ్ నిరోధక సంస్థ (నాడా) నర్సింగ్‌పై కుట్ర జరిగిందని విశ్వసించి అతనికి క్లీన్‌చిట్ ఇచ్చింది. కానీ రియోకు చేరుకున్నాక కోర్టు ఆఫ్ ఆర్బిట్రేషన్ (సీఏఎస్) ‘నాడా’ నిర్ణయాన్ని తప్పుబడుతూ నర్సింగ్‌పై నాలుగేళ్ల నిషేధాన్ని విధించడంతోపాటు ఒలింపిక్స్ నుంచి తప్పించింది. హరియాణాలో జరిగిన శిక్షణ శిబిరం సందర్భంగా తన ఆహారంలో గుర్తుతెలియని వ్యక్తులు కావాలనే నిషేధిత ఉత్పేర్రకాలు కలిపారని నర్సింగ్ యాదవ్ ఆరోపించాడు.