
పారిస్: డోపింగ్‌లో పట్టుబడినందుకు అమెరికాకు చెందిన మహిళల టెన్నిస్ డబుల్స్ స్టార్ ప్లేయర్ అబిగెయిల్ స్పియర్స్‌పై అంతర్జాతీయ టెన్నిస్ సమాఖ్య (ఐటీఎఫ్) 22 నెలలపాటు నిషేధం విధించింది. 2019 యూఎస్ ఓపెన్ గ్రాండ్‌స్లామ్ టోర్నీ సందర్భంగా స్పియర్స్‌కు నిర్వహించిన డోపింగ్ పరీక్షల్లో ఆమె నిషేధిత ఉ్రత్పేరకాలు ప్రాస్టీరోన్, టెస్టోస్టిరాన్ వాడినట్లు తేలింది. ‘తన శరీరంలోకి నిషేధిత ఉత్ప్రేరకాలు ఎలా వచ్చాయో స్పియర్స్ ఇచ్చిన వివరణను విన్నాం. ఆమె వివరణను అంగీకరించాం. అయితే ఆమె తప్పు చేసినందుకు నిషేధం ఎదుర్కోవాల్సిందే’ అని ఐటీఎఫ్ తెలిపింది.
డోపింగ్ ఫలితాలు వచి్చన తేదీ 2019 నవంబర్ 7 నుంచి నిషేధం అమలవుతుందని వచ్చే ఏడాది సెపె్టంబర్ 6 వరకు కొనసాగుతుందని ఐటీఎఫ్ తెలిపింది. స్పియర్స్ తన కెరీర్‌లో 21 డబుల్స్ టైటిల్స్ గెలిచింది. 2017 ఆ్రస్టేలియన్ ఓపెన్‌లో కొలంబియా ప్లేయర్ యువాన్ సెబాస్టియన్ కబాల్‌తో జతగా స్పియర్స్ మిక్స్‌డ్ డబుల్స్ విభాగంలో విజేతగా నిలిచింది. 2013, 2014 యూఎస్ ఓపెన్ మిక్స్‌డ్ డబుల్స్ విభాగాల ఫైనల్స్‌లో స్పియర్స్ ఓడిపోయి రన్నరప్ ట్రోఫీ సాధించింది.
Comments
Please login to add a commentAdd a comment