
పాకిస్తాన్ మాజీ క్రికెటర్ షోయబ్ మాలిక్.. అతని మాజీ భార్య, భారత టెన్నిస్ స్టార్ సానియా మీర్జా విడాకులు తీసుకుని ప్రస్తుతం వేరేవేరుగా ఉంటున్నారు. షోయబ్ పాకిస్తాన్‌లోనే స్థిరపడగా.. సానియా దుబాయ్‌లో నివాసం ఏర్పరచుకుంది. సానియా నుంచి విడిపోయాక షోయబ్ మరో పెళ్లి (పాకిస్తానీ నటి సనా జావేద్) చేసుకోగా.. సానియా మాత్రం కొడుకు ఇజాన్ మీర్జా మాలిక్‌తో కాలం వెల్లబుచ్చుతుంది.
తాజాగా ఓ పాకిస్తానీ టీవీ షోలో కొడుకు ఇజాన్ గురించి ప్రస్తావన రాగా షోయబ్ మాలిక్ స్పందించాడు. సానియాతో వేరు పడినా కొడుకు ఇజాన్‌తో సన్నిహితమైన బంధాన్ని కొనసాగిస్తున్నానని అన్నాడు. భౌతికంగా దూరంగా ఉన్నప్పటికీ.. వీడియో కాల్స్ ద్వారా ప్రతి రోజూ కాంటాక్ట్‌లో ఉంటానని తెలిపాడు.
కొడుకును చూసేందుకు నెలలో రెండు సార్లు దుబాయ్‌కు వెళ్తానని చెప్పాడు. ఆ సమయంలో తనే స్వయంగా ఇజాన్‌ను స్కూల్‌లో దింపి, పికప్ చేసుకుంటానని తెలిపాడు. తాము నేరుగా కలసినప్పుడు క్రీడలతో పాటు చాలా విషయాలు పంచుకుంటామని వివరించాడు.
ఇజాన్‌తో తన బంధాన్ని స్నేహ బంధంగా అభివర్ణించాడు. తమ ఇద్దరి మధ్య ఫ్రెండ్‌షిప్ బాండింగ్ ఉందని చెప్పుకొచ్చాడు. ఇజాన్ తనను బ్రో అని పిలుస్తాడని.. తను కూడా ఇజాన్‌ను అలాగే పిలుస్తానని తెలిపాడు.
కాగా, సానియా-షోయబ్‌ల వివాహ బంధం ఖులా (విడాకుల ప్రక్రియ) ద్వారా తెరపడింది. ఖులా తర్వాత ఇజాన్ కస్టడీ తల్లి సానియాకు దక్కింది. ప్రస్తుతం ఇజాన్ వయసు ఏడేళ్లు.
ఇదిలా ఉంటే, అంతర్జాతీయ క్రికెట్‌కు రిటైర్మెంట్ ప్రకటించిన తర్వాత షోయబ్ పలు దేశాల్లో లీగ్ క్రికెట్ ఆడుతున్నాడు. ఛాంపియన్స్ ట్రోఫీ-2025 సందర్భంగా అతను వ్యాఖ్యాతగా కనిపించాడు.
సానియా విషయానికొస్తే.. ప్రస్తుతం ఆమె పికిల్‌బాల్ ఓపెన్ 2025 టోర్నీ కోసం గ్లోబల్ స్పోర్ట్స్‌లో భాగస్వామిగా చేరింది. ఈ టోర్నీ మే 8-11 వరకు దుబాయ్‌లో జరగనుంది. ఈ టోర్నీని దుబాయ్ స్పోర్ట్స్ కౌన్సిల్ సహకారంతో నిర్వహిస్తుంది.
ఆరుసార్లు గ్రాండ్‌స్లామ్ ఛాంపియన్ అయిన సానియా.. ప్రస్తుతం పికిల్‌బాల్ వృద్ధికి కృషి చేస్తుంది. ఈ క్రీడ వాషింగ్టన్‌లో రాష్ట్రీయ క్రీడగా చలామణి అవుతుంది. పికిల్ బాల్ టెన్నిస్ మరియు టేబుల్ టెన్నిస్‌ను పోలి ఉంటుంది.
Comments
Please login to add a commentAdd a comment