Sania Mirza
-
నా కొడుకు నన్ను బ్రో అని పిలుస్తాడు: సానియా మీర్జా మాజీ భర్త షోయబ్ మాలిక్
పాకిస్తాన్ మాజీ క్రికెటర్ షోయబ్ మాలిక్.. అతని మాజీ భార్య, భారత టెన్నిస్ స్టార్ సానియా మీర్జా విడాకులు తీసుకుని ప్రస్తుతం వేరేవేరుగా ఉంటున్నారు. షోయబ్ పాకిస్తాన్‌లోనే స్థిరపడగా.. సానియా దుబాయ్‌లో నివాసం ఏర్పరచుకుంది. సానియా నుంచి విడిపోయాక షోయబ్ మరో పెళ్లి (పాకిస్తానీ నటి సనా జావేద్) చేసుకోగా.. సానియా మాత్రం కొడుకు ఇజాన్ మీర్జా మాలిక్‌తో కాలం వెల్లబుచ్చుతుంది.తాజాగా ఓ పాకిస్తానీ టీవీ షోలో కొడుకు ఇజాన్ గురించి ప్రస్తావన రాగా షోయబ్ మాలిక్ స్పందించాడు. సానియాతో వేరు పడినా కొడుకు ఇజాన్‌తో సన్నిహితమైన బంధాన్ని కొనసాగిస్తున్నానని అన్నాడు. భౌతికంగా దూరంగా ఉన్నప్పటికీ.. వీడియో కాల్స్ ద్వారా ప్రతి రోజూ కాంటాక్ట్‌లో ఉంటానని తెలిపాడు. కొడుకును చూసేందుకు నెలలో రెండు సార్లు దుబాయ్‌కు వెళ్తానని చెప్పాడు. ఆ సమయంలో తనే స్వయంగా ఇజాన్‌ను స్కూల్లో దింపి, పికప్ చేసుకుంటానని తెలిపాడు. తాము నేరుగా కలసినప్పుడు క్రీడలతో పాటు చాలా విషయాలు పంచుకుంటామని వివరించాడు.ఇజాన్‌తో తన బంధాన్ని స్నేహ బంధంగా అభివర్ణించాడు. తమ ఇద్దరి మధ్య ఫ్రెండ్షిప్ బాండింగ్ ఉందని చెప్పుకొచ్చాడు. ఇజాన్ తనను బ్రో అని పిలుస్తాడని.. తను కూడా ఇజాన్‌ను అలాగే పిలుస్తానని తెలిపాడు.కాగా, సానియా-షోయబ్‌ల వివాహ బంధం ఖులా (విడాకుల ప్రక్రియ) ద్వారా తెరపడింది. ఖులా తర్వాత ఇజాన్ కస్టడీ తల్లి సానియాకు దక్కింది. ప్రస్తుతం ఇజాన్ వయసు ఏడేళ్లు. ఇదిలా ఉంటే, అంతర్జాతీయ క్రికెట్‌కు రిటైర్మెంట్ ప్రకటించిన తర్వాత షోయబ్ పలు దేశాల్లో లీగ్ క్రికెట్ ఆడుతున్నాడు. ఛాంపియన్స్ ట్రోఫీ-2025 సందర్భంగా అతను వ్యాఖ్యాతగా కనిపించాడు. సానియా విషయానికొస్తే.. ప్రస్తుతం ఆమె పికిల్‌బాల్ ఓపెన్ 2025 టోర్నీ కోసం గ్లోబల్ స్పోర్ట్స్‌లో భాగస్వామిగా చేరింది. ఈ టోర్నీ మే 8-11 వరకు దుబాయ్‌లో జరగనుంది. ఈ టోర్నీని దుబాయ్ స్పోర్ట్స్ కౌన్సిల్ సహకారంతో నిర్వహిస్తుంది.ఆరుసార్లు గ్రాండ్‌స్లామ్ ఛాంపియన్ అయిన సానియా.. ప్రస్తుతం పికిల్‌బాల్ వృద్ధికి కృషి చేస్తుంది. ఈ క్రీడ వాషింగ్టన్లో రాష్ట్రీయ క్రీడగా చలామణి అవుతుంది. పికిల్ బాల్ టెన్నిస్ మరియు టేబుల్ టెన్నిస్‌ను పోలి ఉంటుంది. -
కమాన్.. ఉదిత్ జీ.. ముద్దు పెట్టు... సానియామీర్జా, ఫరాఖాన్ సందడి!
ఫిల్మ్ మేకర్ ఫరా ఖాన్,బాలీవుడ్ ప్రఖ్యాత దర్శకురాలు కొరియోగ్రాఫర్ ఫరా ఖాన్ తన వినోదాత్మక వ్లాగ్లకూ పేరొందారు. ఇక మాజీ టెన్నిస్ ప్లేయర్ హైదరాబాదీ సానియా మీర్జా గురించి కొత్తగా చెప్పక్కర్లేదు. కొన్నాళ్లుగా సన్నిహితులైన వీరిద్దరూ ఇటీవలే ఫరాఖాన్ ఇంటిలో కలిశారు. ఆమెతో పాటు ఆమె సోదరి అనమ్ మీర్జా కుమారుడు ఇజాన్ మీర్జా మాలిక్ కూడా ఉన్నారు. ఈ సందర్భంగా సానియా మీర్జా ఫరాతో కలిసి కిచెన్‌లో సందడి చేశారు. ఆమెతో పాటు వంట సెషన్లో పాల్గొన్నారు.ఈ సందర్భంగా సానియా క్లాసిక్ హైదరాబాదీ–శైలి చికెన్ 65 వంటకాన్ని తయారు చేశారు, అదనపు సాస్‌లతో తన స్వంత సృజనాత్మక ట్విస్ట్‌ను ఫరా దానికి జోడించింది. ఇలా కిచెన్ లో వంటలో దినుసులు కలపడంతో పాటు హాస్యం పంచడంలో కూడా ఇద్దరు స్నేహితులు పోటీ పడడంతో ఈ ఎపిసోడ్ అంతా నవ్వులు, సరదాలతో నిండిపోయింది. సానియా ప్రతిభ టెన్నిస్ కోర్ట్‌కు మించి విస్తరించిందో లేదో చూడండి అంటూ ఫరా తన యూట్యూబ్ ఛానెల్లో తమ కిచెన్‌లో షూట్ చేసిన వీడియోను పంచుకుంది.తద్వారా వీక్షకులకు నిజమైన హైదరాబాదీ చికెన్ 65 రెసిపీని నేర్చుకునే అవకాశాన్ని కూడా వీరు అందించారు, ఇది ఏ సందర్భానికైనా సరిపోయే క్రిస్పీ ఫ్లేవర్ఫుల్ డిష్ గా వర్ణించారు. ఇదంతా ఒకెత్తయితే... ఈ సందర్భంగా ఫరా చూపిన హాస్య చతురత వీక్షుకులకు నవ్వుల్ని పంచింది. హాస్య స్వభావానికి పేరొందిన ఫరా... సానియా కుమారుడిని ముద్దు పెట్టమని ఉల్లాసంగా అడిగే విధానం అందరి దృష్టిని ఆకర్షించింది. తన ఇంట్లో ఫుట్‌బాల్ ఆడుకుంటున్న ఆ కుర్రాడి నుంచి బంతిని తీసుకున్న ఫరా, ఇజాన్ తన బంతిని వెనక్కి తీసుకోవడానికి ప్రయత్నించినప్పుడు ‘‘నీ నుంచి కొన్ని బ్రౌనీ పాయింట్లు సంపాదించడానికి నేను మీకు బంతిని తిరిగి ఇవ్వవలసి ఉంది‘ అని చెప్పారు. బంతిని ఇవ్వాలంటే ఓ షరతు కూడా విధించారు. అదేమిటంటే... ‘‘మొదట నన్ను నువ్వు ముద్దు పెట్టుకోవాలి, అదెలాగో నీకు తెలుసు. కమాన్... ముద్దివ్వండి ఉదిత్ జీలా ’’ అంటూ ఆ బాలుడ్ని అడగడం నవ్వుల్తో ముంచెత్తింది. ఈ వీడియోను చూసిన నెటిజనులు కూడా ఫరా హాస్య చతురతను కొనియాడుతున్నారు.ఇటీవల ప్రముఖ బాలీవుడ్ గాయకుడు ఉదిత్ నారాయణ్ ముద్దు ఉదంతం నెట్టింట సంచలనం సృష్టించింది. ఓ సంగీత కార్యక్రమంలో పాల్గొన్న ఉదిత్ నారాయణ్... తన పాటలతో అభిమానుల్ని ఉర్రూతలూగించారు. అదే జోరులో ఆయన టిప్ టిప్ బర్సా పానీ పాట పాడుతూండగా పలువురు అభిమానులు ఆయన వేదికకు బాగా దగ్గరగా వచ్చేశారు. అలా పాట పాడుతూనే వేదిక మీద నుంచే ఒక అభిమానికి ఉదిత్ దగ్గరగా జరిగినప్పుడు ఆ యువతి ఆయనకు బుగ్గ మీద ముద్దు పెట్టేందుకు ప్రయత్నించింది. అప్పుడు ఆయన ఏకంగా ఆమె పెదాల మీదే ముద్దు పెట్టేశారు. దీంతో ఈ ఉదంతం నెట్టింట ఉదిత్‌పై తీవ్ర విమర్శలు, వ్యంగ్యాస్త్రాలు వెల్లువెత్తడానికి దారి తీసింది. ఈ నేపధ్యంలోనే ఫరా... సానియా మీర్జా కుమారుడితో ‘‘నాకు ముద్దివ్వు ఉదిత్ జీ అవ్వు.. అంటూ అనడం నెటిజన్లను ఆకర్షించింది. -
సానియా మీర్జా లేటెస్ట్ పోస్ట్ వైరల్ (ఫొటోలు)
-
సానియా మీర్జా బెస్ట్ ఫ్రెండ్.. టీమిండియా మాజీ క్రికెటర్ భార్య.. ‘మాయచేసే’ విద్య (ఫొటోలు)
-
దుబాయ్ స్పోర్ట్స్ అంబాసిడర్‌గా సానియా మీర్జా.. ఫొటోలు చూశారా?
-
పియర్సింగ్ సర్వీస్ గురించి తెలుసా..! సానియా మీర్జా..
పియర్సింగ్ సర్వీస్ గురించి సిటీలో ఉండేవాళ్లకు బాగా తెలుస్తుంది. ఇటీవల చెవితో సహా బాడీకి రకరకాల జ్యువెలరీని కుట్టించుకుంటున్నారు. ఇలా పెట్టుకోవడం ఓ ట్రెండ్‌లా ఫీలవ్వుతోంది యువత. కాలేజ్ అమ్మాయిల దగ్గర నుంచి ఇంట్లో ఉండే గృహిణుల వరకు అందరూ వీటిని ధరిస్తున్నారు. ఒకప్పుడు చిన్నిపిల్లలకు ముఖ్యంగా ఆడపిల్లలకు తొమ్మిదో నెల లేదా సవంత్సరంలోపు చెవులు కుట్టించేవారు పెద్దవాళ్లు. పైగా అదొక పెద్ద హడావిడి తంతులా ఉండేది. కానీ ఇప్పుడు సింపుల్‌గా కానిస్తున్నారు. ఎలాంటి ఏడుపులు ఉండవు. రక్తం కారకుండా మంచి సాంకేతికతో కూడిన పరికరాలతో చక్కగా కుట్టేస్తున్నారు. అదికూడా ఇంట్లోనే హాయిగా కుట్టించుకోవచ్చు. దీన్నే ఆంగ్లంలో పియర్సింగ్ సర్వీస్ అని పిలుస్తారు. ఇటీవల సానియా కూడా ఈ సర్వీస్‌తో ఇంట్లోనే చెవుల కుట్టించుకున్నట్లు సోషల్ మీడియా వేదికగా పేర్కొంది. అందుకు సంబంధించిన వీడియో నెట్టింట తెగ వైరల్ అవుతోంది.ఆ వీడియోలో సానియా దుబాయ్‌లోని తన ఇంటి నాలుగు గోడల మద్య ఓ సాంకేతిక నిపుణుడితో చెవులు కుట్టించుకున్నట్లు తెలిపింది. తన స్నేహితులు, సోదరి అనమ్ మీర్జాతో కలిసి మిరుమిట్లు గొలిపై స్టడ్ చెవిపోగులను కుట్టించుకుంది. తన బెస్ట్ ఫ్రెండ్స్‌తో సరదాగా గడిపిన ఈ మధుర క్షణాన్ని వీడియోలో బంధించిన దానికి "పర్ఫెక్ట్ గర్ల్స్ నైట్ ఇన్" అనే క్యాప్షన్‌తో నెట్టింట పోస్ట్ చేశారు. ఆ వీడియోలో సానియా తన చెవి అంతటా అద్దుతమైన చెవిపోగులను పెట్టుకుంది. View this post on Instagram A post shared by The PiercingSpot (@piercingspot)పియర్సింగ్ సర్వీస్:ప్రస్తుతం ఇది ఓ మంచి స్టైలిష్ వ్యాపారంలా సాగుతుంది. ఈ సర్వీస్‌తో నొప్పిలేకుండా చెవులు ఈజీగా కుట్టించుకోవచ్చు. కొందరు బాడీ అంతటా రకరకాలుగా కుట్టించుకుంటారు. జస్ట్ ఒక్క కాల్‌తో ఇంటికే నేరుగా వచ్చి సర్వీస్ అందిస్తారు. పైగా మనకు నచ్చిన చెవిపోగులను ఎంచుకుని మరీ పెట్టించుకోవచ్చు. ఇలాంటి హై రేంజ్ సర్వీస్ దుబాయ్, హైదరాబాద్ వంటి మహా నగరాల్లో అందుబాటులో ఉన్నాయి. చిన్న చిన్న పట్టణాల్లో కూడా అందుబాటులో ఉన్న జస్ట్ సాంకేతికతో స్టడ్చెవిపోగులు పెడతారంతే. అయితే ఈ అత్యాధునిక సర్వీస్‌లో మాత్రం ఫ్యాన్సీ, బంగారం లేదా వెండి చెవిపోగులను కూడా సెలెక్ట్ చేసుకుని మరి పెట్టించుకోవచ్చు. ఎలాంటి ఇన్ఫెక్షన్ల బారిన పడకుండా సర్వీస్ అందిచడమే గాక కనీసం రక్తం కూడా రాకుండా చాలా సింపుల్‌గా చెవులు కుట్టేస్తారు. View this post on Instagram A post shared by Anam Mirza (@anammirzaaa) (చదవండి: 'లాస్ట్ హోప్ కాదు... బెస్ట్ కేర్'..!) -
నేనెంతో అదృష్టవంతురాలిని మమ్మా: సానియా మీర్జా బర్త్‌డే స్పెషల్(ఫొటోలు)
-
కొడుకు పుట్టినరోజును గ్రాండ్‌గా సెలబ్రేట్ చేసిన సానియా మీర్జా.. వారం తర్వాత ఇలా (ఫొటోలు)
-
నా నవ్వుకు నువ్వే కారణం: సానియా మీర్జా పోస్ట్ వైరల్(ఫొటోలు)
-
మనసు నిండిపోయింది: బెస్ట్‌ఫ్రెండ్స్‌తో సానియా మీర్జా (ఫొటోలు)
-
‘స్పెక్టాక్యులర్ సౌదీ’ ఈవెంట్లో మెరిసిన తారలు (ఫొటోలు)
-
సానియాతో పెళ్లి?.. మీకు దమ్ముంటే ముందుకు రండి: షమీ వార్నింగ్ (ఫొటోలు)
-
సానియా మీర్జాతో పెళ్లి..? ఎట్టకేలకు స్పందించిన మహ్మద్ షమీ
టీమిండియా స్టార్ క్రికెటర్ మహ్మద్ షమీ-టెన్నిస్ స్టార్ సానియా మీర్జా వివాహం చేసుకోబోతున్నారంటూ గత కొన్ని రోజులగా ప్రచారం జరుగుతున్న సంగతి తెలిసిందే. ఇప్పటికే ఈ వార్తలను సానియా తండ్రి ఖండిస్తూ ఓ క్లారిటీ ఇచ్చినప్పటకి.. ఎదో ఒక చోట వీరిద్దరూ పెళ్లి ప్రస్తావన వస్తోంది. అయితే ఎట్టకేలకు ఈ వార్తలపై మహ్మద్ షమీ స్పందించాడు. ఇటీవలే శుభంకర్ మిశ్రా అనే యూట్యూబర్‌కు షమీ ఇంటర్వ్యూ ఇచ్చాడు. ఈ క్రమంలో తన రెండో పెళ్లి గురుంచి వస్తున్న పుకార్లపై షమీని శుభంకర్ మిశ్రా ప్రశ్నించాడు."ప్రతీ ఒక్కరూ సోషల్ మీడియా పట్ల బాధ్యతగా వ్యవహరించాలి. సానియాతో నా పెళ్లి అనేది కేవలం రూమర్స్ మాత్రమే. ఇలాంటి నిరాధారమైన వార్తలను ప్రచారం చేయడం మానుకోవాలి. మీ సరదా కోసం ఇతరుల మనోభావాలను దెబ్బతీయకూడదు. మీరు చేస్తుంది సరైనది కాదు. ఆ మధ్య కాలంలో నా ఫోన్ ఓపెన్ చేసి చూస్తే చాలు అవే మీమ్ప్ కనిపించేవి. మీమ్‌లు అనేది కేవలం వినోదం కోసం మాత్రమే. అంతే తప్ప అబద్దాలను ప్రచారం చేయడానికి కాదు. ట్రోలర్స్, మీమర్స్‌కు నేను ఒక్కటే చెప్పాలనుకుంటున్నాను.దయచేసి వ్యక్తిగత జీవితాల విషయానికి రావొద్దు. ఒకరి వ్యక్తిగత జీవితాన్నిఇంకొకరితో ముడివేస్తూ వారిని బజారుకి లాగవద్దు. మీకు దమ్ము ఉంటే ఇలాంటి పోస్టులను గుర్తింపు లేని సోషల్ మీడియా అకౌంట్స్ నుంచి కాకుండా నిజమైన అకౌంట్స్ నుంచి పోస్ట్ చేయండి.అప్పుడు నేను ఏమి సమాధానం చెప్పాలో అదే చెబుతా. దయచేసి ఎటువంటి వికృత చేష్ఠలు మానుకుని జీవితంలో ఎదగడానికి ప్రయత్నంచండి. మీ వంతు ప్రజలకు సహాయం చేయండి. మిమ్మల్ని మీరు మార్చుకోండి. అప్పుడే మీరు మంచి వ్యక్తిగా ఈ సమాజంలో జీవించగలరు" అని షమీ స్ట్రాంగ్ రిప్లే ఇచ్చాడు. కాగా షమీ ఇప్పటికే తన భార్య హసిన్ జహాన్‌కు విడాకులు ఇవ్వగా.. సానియా కూడా తన భర్త షోయబ్ మాలిక్‌తో విడిపోయింది. -
అనంత్- రాధిక వెడ్డింగ్: అందానికే అర్థంలా సానియా మీర్జా (ఫొటోలు)
-
షమీతో ఆమె పెళ్లి?.. స్పందించిన సానియా మీర్జా తండ్రి
భారత క్రీడా రంగంలో సానియా మీర్జా, మహ్మద్ షమీ తమకంటూ ప్రత్యేక గుర్తింపు దక్కించుకున్నారు. చిన్ననాటి నుంచే టెన్నిస్‌పై మక్కువ పెంచుకున్న సానియా అంతర్జాతీయ స్థాయిలో అనేక టైటిల్స్ సాధించి దేశ ఖ్యాతిని ఇనుమడింపజేశారు.మరోవైపు.. టీమిండియా ప్రధాన పేస్ బౌలర్లలో ఒకడిగా ఎదిగిన మహ్మద్ షమీ భారత జట్టు విజయాల్లో కీలక పాత్ర పోషిస్తూ భారీ అభిమానగణాన్ని సొంతం చేసుకున్నాడు.ఇద్దరికీ చేదు అనుభవమేఅయితే, సానియా- షమీ వృత్తిగతంగా ఉన్నత శిఖరాలను అధిరోహించినా.. వ్యక్తిగత జీవితంలో మాత్రం ఆటుపోట్లు ఎదుర్కొంటున్నారు. హసీన్ జహాన్ అనే మోడల్‌ను పెళ్లాడిన షమీకి ఒక కూతురు ఉంది.కొన్నాళ్లపాటు సజావుగా సాగిన షమీ కాపురం.. హసీన్ సంచలన ఆరోపణల నేపథ్యంలో విచ్ఛిన్నమైంది. మరోవైపు.. పాకిస్తాన్ మాజీ కెప్టెన్ షోయబ్ మాలిక్‌ను ప్రేమించి పెళ్లాడిన సానియా మీర్జాకు కూడా చేదు అనుభవమే మిగిలింది.సానియా కెరీరీర్లో బిజీగా ఉన్న సమయంలో షోయబ్ వివాహేతర సంబంధాలు పెట్టుకున్నాడని పాక్ మీడియా కథనాలు వెలువరించింది. ఈ నేపథ్యంలో వీరిద్దరు విడిపోతున్నారనే వార్తలు గుప్పుమనగా.. నటి సనా జావెద్‌ను పెళ్లాడి.. సానియాతో తన బంధం ముగిసిపోయిందని చెప్పకనే చెప్పాడు షోయబ్.ఇవన్నీ అబద్దాలుకాగా సానియా కుటుంబం సైతం ఈ విషయాన్ని ధ్రువీకరించింది. ప్రస్తుతం సానియా మీర్జా తన కుమారుడు ఇజహాన్‌కు పూర్తి సమయం కేటాయించి అతడి ఆలనాపాలనా చూసుకుంటూనే వృత్తిపరంగానూ బిజీ అయ్యారు.ఇదిలా ఉంటే.. సానియా మీర్జా- మహ్మద్ షమీ గురించి కొన్నాళ్ల క్రితం వదంతులు పుట్టుకొచ్చిన విషయం తెలిసిందే. వీరిద్దరు వివాహం చేసుకోబోతున్నారంటూ కొన్ని జాతీయ మీడియా చానెళ్లలో ప్రచారం జరిగింది.ఈ విషయంపై సానియా మీర్జా తండ్రి ఇమ్రాన్ మీర్జా తాజాగా స్పందించారు. ఎన్డీటీవీతో మాట్లాడుతూ.. ‘‘ఇవన్నీ అబద్దాలు. ఆమె కనీసం అతడిని నేరుగా ఒక్కసారి కూడా కలవనే లేదు’’ అంటూ అసత్యాలు ప్రచారం చేస్తున్న వారిపై మండిపడ్డారు.కాగా సానియా మీర్జా హజ్ యాత్రకు వెళ్తున్నట్లు ఇటీవల తన సోషల్ మీడియా అకౌంట్లో పోస్ట్ చేశారు. మరోవైపు.. వన్డే ప్రపంచకప్-2023లో అత్యధిక వికెట్ల వీరుడిగా నిలిచిన మహ్మద్ షమీ చీలమండ గాయానికి సర్జరీ చేయించుకుని.. ప్రస్తుతం విశ్రాంతి తీసుకుంటున్నాడు.చదవండి: రూ. 2 కోట్ల కారు.. బాబర్ ఆజంపై సంచలన ఆరోపణలు -
నా బయోపిక్‌లో ఈ హీరోల్లో ఎవరు నటించినా ఓకే.. నేను కూడా..
భారత టెన్నిస్ దిగ్గజం సానియా మీర్జా తాజాగా ద గ్రేట్ ఇండియన్ కపిల్ షోకు హాజరైంది. బాక్సర్ మేరీ కోమ్, బ్యాడ్మింటన్ సైనా నెహ్వాల్, షార్ప్ షూటర్ సిఫ్త్ కౌర్‌తో కలిసి ఈ షోలో పాల్గొంది. ఈ సందర్భంగా కపిల్ శర్మ సానియాను ఆసక్తికర ప్రశ్న అడిగాడు. ప్రియాంక చోప్రా మేరీ కోమ్ బయోపిక్‌లో నటించింది. ప్రియాంక కజిన్ పరిణతి చోప్రా.. సైనా నెహ్వాల్ బయోపిక్‌లో మెరిసింది. మంచి నటీనటులు ఎందరో..మరి మీ జీవిత చరిత్ర కథ సంగతేంటి? అని ఆరా తీశాడు. అందుకు సైనా నవ్వుతూ.. మన దేశంలో చాలామంది మంచి యాక్టర్స్ ఉన్నారు. ఎవరు నటించినా నాకు ఓకే.. లేదంటే నా పాత్రలో నేనే నటిస్తాను అని చెప్పుకొచ్చింది. దీంతో వెంటనే కపిల్ శర్మ.. నువ్వు ప్రేమించే వ్యక్తి పాత్రలో నటించాలనుందని గతంలో షారుక్ ఖాన్ చెప్పాడని గుర్తు చేశాడు. అందుకు సానియా.. అలాగైతే ముందు నేనెవర్నైనా ప్రేమించాలి కదా! అని బదులిచ్చింది.ఆ హీరోలైతేనే..షారుక్ ఖాన్ లేదా అక్షయ్ కుమార్ నా బయోపిక్‌లో నటిస్తానంటే కచ్చితంగా నా పాత్రలో నేనే నటిస్తాను అని చెప్పుకొచ్చింది. కాగా సానియా మీర్జా- షోయబ్ మాలిక్ ఇటీవలే విడాకులు తీసుకున్న సంగతి తెలిసిందే! సానియాకు విడాకులిచ్చిన వెంటనే షోయబ్ పాకిస్తాన్ నటి సనా జావెద్‌ను మూడో పెళ్లి చేసుకున్నాడు.చదవండి: Pihu Review: ఓటీటీలోనే బెస్ట్ చైల్డ్ మూవీ.. కానీ చూస్తే భయపడతారు! -
ప్రేమించే వ్యక్తి కావాలి కదా: సానియా మీర్జా వ్యాఖ్యలు వైరల్
భారత టెన్నిస్ దిగ్గజం సానియా మీర్జా ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. తాను ప్రస్తుతం ప్రేమించే వ్యక్తిని వెతుక్కోవాల్సిన స్థితిలో ఉన్నానని పేర్కొన్నారు. కాగా సానియా వ్యక్తిగత జీవితంలో ఒడిదుడుకులు ఎదురైన విషయం తెలిసిందే.ఎంతగానో ప్రేమించి.. ఆటంకాలను ఎదురించి పెళ్లాడిన పాకిస్తాన్ క్రికెటర్ షోయబ్ మాలిక్ ఆమెను మోసం చేశాడనే వార్తలు వినిపించాయి. ఈ క్రమంలో వీళ్లిద్దరి మధ్య పొరపొచ్చాలు తలెత్తాయని విడాకులు తీసుకుంటారనే ప్రచారం జరిగింది.అయితే, వీరిద్దరూ ఈ విషయంపై నేరుగా నోరు విప్పలేదు. కానీ.. షోయబ్ మాలిక్ ఏకంగా నటి సనా జావెద్‌ను పెళ్లాడి.. ఫొటోలతో షాకిచ్చాడు. దీంతో సానియా- షోయబ్‌ల బంధం ముక్కలైందని అందరికీ తెలిసిపోయింది.ఈ క్రమంలో సానియా మీర్జా కుటుంబం ఓ ప్రకటన విడుదల చేసింది. సానియా తనంతట తానుగా షోయబ్ నుంచి విడాకులు తీసుకుందని స్పష్టం చేసింది. ఏదేమైనా అతడి జీవితం బాగుండాలని సానియా ఆశిస్తున్నట్లు తెలిపింది.ఇదిలా ఉంటే.. విడాకుల తర్వాత సానియా మీర్జా తన కుమారుడు ఇజహాన్‌తో కలిసి దుబాయ్‌లో ఎక్కువగా గడుపుతూ ఉన్నారు. ఈ క్రమంలో ఆమె తాజాగా ‘ది గ్రేట్ ఇండియన్ కపిల్ షో’లో పాల్గొన్నారు. ఈ సందర్భంగా సానియా మీర్జా చేసిన వ్యాఖ్యలు వైరల్ అవుతున్నాయి.కాగా బాలీవుడ్ బాద్ షా షారుఖ్ ఖాన్ గతంలో ఎన్డీటీవీతో మాట్లాడుతూ.. ‘‘సానియా బయోపిక్ తీసినట్లయితే ఎంతో అద్భుతంగా ఉంటుంది. అన్నీ కుదిరితే నేనే ఆ సినిమా ప్రొడ్యూస్ చేస్తాను. ఒకవేళ ఆమె ఒప్పుకుంటే తనకు జంట(ప్రియుడి)గా కూడా నటిస్తాను’’ అని పేర్కొన్నాడు.ఈ క్రమంలో వ్యాఖ్యాత కపిల్ తాజాగా షారుక్ వ్యాఖ్యలను ప్రస్తావించగా.. ఇందుకు బదులుగా.. ‘‘ముందుగా నేను నా ప్రేమను కనుగొనాలి(ప్రేమించే వ్యక్తి) కదా’’ అని సానియా మీర్జా సమాధానమిచ్చారు.ఈ నేపథ్యంలో సానియా జీవితంతో రెండో అవకాశం తీసుకోవడానికి సిద్ధంగా ఉన్నారని.. అదే నిజమైతే అంతకంటే ఆనందం మరొకటి ఉండదని ఆమె ఫ్యాన్స్ మురిసిపోతున్నారు. ప్రతి ఒక్క స్త్రీకి తన జీవితాన్ని అందంగా మలచుకునే అవకాశం ఉందని.. మోసగాళ్ల కోసం తమ లైఫ్‌ను పణంగా పెట్టాల్సిన పనిలేదని కామెంట్లు చేస్తున్నారు. -
నేమ్‌ప్లేట్ మార్చేసిన సూపర్ మామ్ సానియా మీర్జా ఫోటోలు వైరల్
మనసుకు కష్టంగా అనిపించే, బాధించే టాక్సిక్ సంబంధాలను వదిలించుకున్న తరువాత మనసుకి ప్రశాంతంగా ఉంటుంది. ఇక మహిళలైతే సరికొత్త ఉత్సాహంతో తేజోవంతంగా ఉంటారు. భారత మాజీ స్టార్ టెన్నిస్ ప్లేయర్ సానియా మీర్జా అదే నిరూపిస్తోంది.భర్త షోయబ్ మాలిక్ నుండి విడాకులు తీసుకున్న తర్వాత సానియా మీర్జా సరికొత్త ఉత్సాహంతో కనిపిస్తోంది. ప్రస్తుతం దుబాయ్‌లో ఉన్న సానియా ఇంట్రస్టింగ్, సూపర్ క్యూట్ ఫోటోలను షేర్ చేసింది. అంతేకాదు నేమ్‌ప్లేట్ మార్చేసింది. దీంతో ఫ్యాన్స్ సంతోషాన్ని వ్యక్తం చేశారు. స్ట్రాంగ్ మమ్మీ అంటూ కమెంట్ చేశారు.సానియా మీర్జా 2023లో టెన్నిస్‌కు వీడ్కోలు పలికి రిటైర్మెంట్ ప్రకటించింది. ప్రస్తుతం ఆమె తన కొడుకు ఇజాన్ మీర్జా మాలిక్‌తో కలిసి దుబాయ్‌లో ఉంటోంది. సూపర్ మామ్లా తన బిడ్డ ఇజాన్‌ను సంతోషంగా ఉంచేందుకు, ఏ లోటూ లేకుండా పెంచేందుకు ప్రయత్నిస్తోంది. View this post on Instagram A post shared by Sania Mirza (@mirzasaniar)బిజీ వర్క్ షెడ్యూల్లో కూడా కొడుకు ఇజాన్ గురించి తపన పడే సానియా తాజాగా ఇజాన్‌తో అద్భుతమైన జ్ఞాపకాల పిక్స్‌ను ‘ఇది, అది’ అంటూ షేర్ చేసింది. ఇంకా కార్ రైడ్ నుండి , హెయిర్‌కట్ దాకా ఈ సెల్ఫీలుండటం విశేషం. నేమ్‌ప్లేట్‌లో ఇజాన్ ముఖ్యంగా నేమ్‌ప్లేట్‌లో ‘సానియా అండ్ ఇజాన్’ అని ఉన్న ఫోటో ఫ్యాన్స్‌ను విపరీతంగా ఆకర్షిస్తోంది. అంతేకాదు ‘చూజ్ టూబీ హ్యాపీ’, ఫ్యూయల్డ్ బై కెఫీన్ అండ్ సర్కాజం’ అని రాసి వున్న విభిన్న కప్పులను కూడా షేర్ చేయడం గమనార్హం. -
భర్తతో విడిపోతే ప్రపంచం అంతమైపోయినట్లా! సానియా మరో పెళ్లి చేసుకోవాలి!
విడాకులు తీసుకుంటే మళ్లీ పెళ్లి చేసుకోవాలా..? చేసుకోవాల్సిందే అంటున్నాడు పాకిస్తాన్ నటుడు నబీల్ జాఫర్. 'మైండ్ నా కర్నా విత్ అహ్మద్ అలీ బట్' అనే టాక్ షోకు హాజరైన అతడు విడాకుల తర్వాత జీవితం చీకటిమయం కాకూడదంటున్నాడు. జాఫర్ మాట్లాడుతూ.. ఏ మహిళ అయినా విడాకులు తీసుకోవడమనేది దురదృష్టకరం. కానీ భర్తతో విడిపోగానే ప్రపంచమే అంతమైపోయినట్లు చింతించకూడదు. జీవిత భాగస్వామిని వెతుక్కోవాలి.. మరో పెళ్లి చేసుకోవాలి. సానియా మీర్జాకు కూడా మంచి పార్ట్నర్ దొరికితే రెండో పెళ్లి చేసుకోవాలి అని చెప్పుకొచ్చాడు.ప్రేమించి పెళ్లి చేసుకుంటే..కాగా భారత టెన్నిస్ దిగ్గజం సానియా మీర్జా.. పాకిస్తాన్ క్రికెటర్ షోయబ్ మాలిక్ ప్రేమించుకున్నారు. ప్రేమకు సరిహద్దులు అడ్డు కాదంటూ 2010లో పెళ్లి చేసుకున్నారు. వీరి ప్రేమకు గుర్తుగా 2018లో కుమారుడు ఇజహాన్ జన్మించాడు. ఈ ఏడాది ప్రారంభంలో వీరి బంధానికి విడాకుల కార్డు పడింది. షోయబ్.. పాక్ నటి సనా జావెద్‌ను పెళ్లి చేసుకోవడంతో సానియాతో విడాకుల విషయం ఆలస్యంగా, అధికారికంగా తెలిసొచ్చింది. అతడికి మూడోది.. ఆమెకు రెండోదిషోయబ్కు ఇది మూడో పెళ్లి. హైదరాబాదీ అమ్మాయి ఆయేషా సిద్ధిఖికి తలాక్ ఇచ్చాకే సానియాను పెళ్లి చేసుకున్నాడు. పద్నాలుగేళ్ల బంధాన్ని తెంచుకుని పాక్ నటి సనా జావెద్‌ను మూడో పెళ్లి చేసుకున్నాడు. ఆమెకు గతంలో పాక్ గాయకుడు ఉమైర్ జైస్వాల్‌తో పెళ్లి జరగ్గా వీరిద్దరూ గతేడాది విడిపోయారు. ఈ ఏడాది ప్రారంభంలో షోయబ్‌ను రెండోసారి మనువాడింది.చదవండి: ఫోన్లు చేసి రావాలనేవారు.. భయంతో నేనసలు వెళ్లేదాన్నే కాదు!: హీరామండి నటి -
Sania Mirza: ఒంటరిగా ఉన్నపుడే మరింత బాగుంటుందంటున్న సానియా.. చిరునవ్వే ఆభరణం(ఫొటోలు)
-
Sania Mirza Eid Photos: స్పెషల్ అట్రాక్షన్‌గా సానియా మీర్జా.. అచ్చం ఆ హీరోయిన్లా ఉందంటూ కామెంట్లు (ఫొటోలు)
-
Eid Mubarak 2024: సానియా మీర్జాతో ఐఏఎస్ స్మితా సబర్వాల్ రంజాన్ వేడుకలు.. ఫొటోలు వైరల్
-
క్రికెటర్ల నుంచి మెసేజ్‌లు.. ఎవరీ అందాల తార? (ఫోటోలు)
-
ఇటీవలే మూడో పెళ్లి.. అప్పుడే మరో నటిపై కన్నేసిన స్టార్ క్రికెటర్!
పాకిస్తాన్ క్రికెటర్, సానియా మీర్జా మాజీ భర్త ఇటీవలే మూడో పెళ్లి చేసుకున్నారు. పాక్ నటి సనా జావెద్‌ను ఈ ఏడాది జనవరిలో పెళ్లాడారు. 2010లో సానియా మీర్జాను రెండో పెళ్లి చేసుకున్న షోయబ్ గతేడాది ఆమెతో విడిపోయారు. ఇటీవలే సనా జావెద్ బర్త్ డేను సెలబ్రేట్ చేసుకున్నారు. దీనికి సంబంధించిన ఫోటోలు సోషల్ మీడియాలో వైరలయ్యాయి. అయితే అంతలోనే షోయబ్ మరో నటి వెంట పడుతున్నట్లు తెలుస్తోంది. పాక్‌కే చెందిన స్టార్ నటి నవల్ సయీద్ ఇటివలే లైఫ్ గ్రీన్ హై అనే ఇంటర్వ్యూకు హాజరైంది. ఈ సందర్భంగా ఆమె తనకు పాకిస్థానీ క్రికెటర్ల నుంచి మెసేజ్‌లు వస్తున్నట్లు తెలిపింది. పెళ్లయిన క్రికెటర్ల నుంచి కూడా మేసేజేస్ వస్తున్నాయని చెప్పడంతో పరోక్షంగా షోయబ్ మాలిక్ గురించి ఆమె ప్రస్తావించినట్లు నెటిజన్స్ భావిస్తున్నారు. మీరు షోయబ్ మాలిక్ గురించే మాట్లాడుతున్నారా అని హోస్ట్ ప్రశ్నించగా.. ఆమె నవ్వుతూ అతని పేరు మరచిపోయినట్లు చెప్పడం గమనార్హం. దీంతో ఆ పెళ్లయిన క్రికెటర్లలో షోయబ్ మాలిక్ కూడా ఉన్నట్లు అభిమానులు ఫిక్సయిపోయారు. అలా చేయడం కరెక్ట్ కాదు.. మరి ఆ క్రికెటర్లు ఎలాంటి మెసేజ్‌లు పంపిస్తున్నారు అని అడగ్గా..' తాను వాటి గురించి చెప్పదలచుకోలేదని స్పష్టం చేసింది. అయితే క్రికెటర్లు అలా చేయడం కరెక్ట్ కాదని చెప్పింది. యాక్టర్స్ కంటే ఎక్కువగా క్రికెటర్లు, క్రీడాకారులనే చాలా మంది ఆదర్శంగా తీసుకుంటారని" నవల్ సయీద్ చెప్పుకొచ్చింది. View this post on Instagram A post shared by Sana Shoaib Malik (@sanajaved.official) -
Sania Mirza Photos: రాజకీయాల్లో ఎంట్రీ ఇవ్వనున్న సానియా?.. నిజమేనా? (ఫొటోలు)
-
హైదరాబాద్ ఎంపీగా సానియా మీర్జా పోటీ?!
భారత టెన్నిస్ దిగ్గజం సానియా మీర్జా గురించి ఆసక్తికర వార్త తెరమీదకు వచ్చింది. ఈ స్పోర్ట్స్ స్టార్ త్వరలోనే రాజకీయ రంగ ప్రవేశం చేయనుందనే వార్తలు వినిపిస్తున్నాయి. హైదరాబాద్ లోక్‌సభ ఎంపీగా సానియా పోటీ చేసే అవకాశం ఉందనే ఊహాగానాలు వస్తున్నాయి. కాంగ్రెస్ పార్టీ ఆమెను బరిలోకి దించాలనే యోచనలో ఉన్నట్లు నెట్టింట ప్రచారం జరుగుతోంది. కాగా లోక్‌సభ ఎన్నికలకు నగారా మోగిన విషయం తెలిసిందే. ఈ క్రమంలో ఇప్పటికే పార్టీలన్నీ తమ అభ్యర్థులను ఖరారు చేసే పనిలో పడ్డాయి. ఈ క్రమంలో ఎంఐఎం అధినేత అసదుద్దీన్ ఒవైసీకి కంచుకోటగా ఉన్న హైదరాబాద్‌లో.. బీజేపీ మాధవీ లతను పోటీకి దింపింది. అయితే, కాంగ్రెస్ పార్టీ మాత్రం అభ్యర్థి ఎంపిక విషయంలో ఆచితూచి నిర్ణయం తీసుకుంటున్నట్లు సమాచారం. ఎంఐఎంకు పట్టున్న హైదరాబాద్ నియోజకవర్గంలో సానియా మీర్జాను పోటీకి నిలపడం ద్వారా ఒవైసీకి చెక్ పెట్టవచ్చనే యోచనలో ఉందనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. కాగా అంతర్జాతీయ స్థాయిలో దేశ ఖ్యాతిని ఇనుమడింపజేసిన సానియా మీర్జా.. గతంలో తెలంగాణ రాష్ట్ర అంబాసిడర్‌గా ఉన్నారు. ఇక ఆమె చెల్లెలు ఆనం మీర్జా.. టీమిండియా మాజీ కెప్టెన్, కాంగ్రెస్ నాయకుడు మహ్మద్ అజారుద్దీన్ కోడలు అన్న విషయం తెలిసిందే. అజారుద్దీన్ కుమారుడు మహ్మద్ అసదుద్దీన్‌తో 2019లో ఆనం వివాహం జరిగింది. ఫలితంగా అప్పటికే మీర్జా- అజారుద్దీన్ మధ్య ఉన్న స్నేహం.. బంధుత్వంగా మారింది. ఇక కాంగ్రెస్ పార్టీలో నాయకుడిగా కొనసాగుతున్న అజారుద్దీన్ ఇటీవలి తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో జూబ్లీహిల్స్ నుంచి పోటీ చేసి ఓడిపోయాడు. అయితే, లోక్‌సభ ఎన్నికల నేపథ్యంలో సానియా మీర్జా అభ్యర్థిత్వం గురించి అజారుద్దీన్ కాంగ్రెస్ పెద్దల వద్ద ప్రస్తావించినట్లు తెలుస్తోంది. ఈ నేపథ్యంలో కాంగ్రెస్ పార్టీ సైతం ఈ అంశాన్ని లోతుగా పరిశీలిస్తున్నట్లు వార్తలు వస్తున్నాయి. ఈ మేరకు సోషల్ మీడియాలో ప్రచారం జరుగుతుండగా.. మీర్జా కుటుంబం నుంచి మాత్రం ఇంతవరకు ఎలాంటి స్పందనా రాలేదు. ఇదిలా ఉంటే.. సానియా మీర్జా.. తన భర్త షోయబ్ మాలిక్‌కు విడాకులు ఇచ్చినట్లు మీర్జా ఫ్యామిలీ ఇటీవల స్పష్టం చేసిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో కేవలం తన కుమారుడు ఇజహాన్ బాగోగులు, టెన్నిస్ అకాడమీ అభివృద్ధి పైనే దృష్టి సారించిన సానియా మీర్జా రాజకీయంగా స్టెప్ తీసుకోనున్నారంటూ వార్తలు రావడం ఆసక్తిని కలిగిస్తోంది. అయితే, దీనిపై ఎటువంటి అధికారిక ప్రకటనా వెలువడలేదు. -
Sania Mirza : దుబాయ్ వెకేషన్లో ఆహ్లాదంగా సానియా మీర్జా (ఫొటోలు)
-
దుబాయ్‌లో రెండు వారాలు ఇలా: సానియా మీర్జా ఫొటోలు వైరల్
భారత టెన్నిస్ దిగ్గజం సానియా మీర్జా కుటుంబంతో కలిసి సరదాగా సమయం గడుపుతున్నారు. ప్రతికూల భావనలు దరిచేరకుండా తన చుట్టూ పూర్తి సానుకూల వాతావరణం ఉండేలా చూసుకుంటున్నారు. చిన్నారి కుమారుడు ఇజహాన్, తన చెల్లెలు ఆనం మీర్జాతో కలిసి దుబాయ్ పర్యటనలో సానియా ఆహ్లాదంగా గడిపారు. ఈ క్రమంలో తన టూర్‌కు సంబంధించిన ఫొటోలను.. ‘‘గత రెండు వారాల్లో నాకు ఇష్టమైన పనులతో ఇలా గడిచింది’’ అనే క్యాప్షన్‌తో పంచుకున్నారు. కాగా సానియా మీర్జా తన భర్త, పాకిస్తాన్ క్రికెటర్ షోయబ్ మాలిక్‌కు విడాకులు ఇచ్చిన విషయం తెలిసిందే. షోయబ్ పాక్ నటి సనా జావెద్‌ను పెళ్లాడిన తర్వాత ఈ విషయం బయటకు వచ్చింది. సనాను వివాహం చేసుకున్నానంటూ షోయబ్ మాలిక్ ఫొటోలు విడుదల చేసిన తర్వాత.. సానియా కుటుంబం స్పందిస్తూ.. విడాకుల విషయాన్ని తెలియజేసింది. ఈ నేపథ్యంలో షోయబ్ మాలిక్ వివాహేతర సంబంధాల కారణంగానే సానియా ఈ మేరకు కఠిన నిర్ణయం తీసుకున్నట్లు పాక్ మీడియా కథనాలు వెల్లడించాయి. ఖులా ద్వారా తానే స్వయంగా అతడితో బంధం నుంచి విముక్తి పొందినట్లు పేర్కొన్నాయి. ఈ నేపథ్యంలో జీవితంలోని కఠిన దశను దాటే క్రమంలో సానియా మీర్జా తనకోసం తాను ఎక్కువ సమయం కేటాయించుకుంటున్నట్లు ఆమె సన్నిహితులు పేర్కొంటున్నారు. ఇదిలా ఉంటే.. దుబాయ్ పర్యటనలో భాగంగా సానియా మీర్జా పాక్ సింగర్ అతిఫ్ అస్లాం లైవ్ కన్సర్ట్కు హాజరయ్యారు. అస్లాం, అతడి భార్య సారాతో కలిసి లంచ్‌కు వెళ్లి క్వాలిటీ టైమ్ స్పెండ్ చేశారు. కాగా పాకిస్తాన్ ఆల్‌రౌండర్ షోయబ్ మాలిక్‌ను సానియా ప్రేమించి పెళ్లి చేసుకున్న విషయం తెలిసిందే. ఈ క్రమంలో వీరిద్దరు దుబాయ్‌లో కాపురం ఉన్నారు. అయితే, ఆట నుంచి విరామం తీసుకున్న తర్వాత షోయబ్‌తో కలిసి ఎక్కువ సమయం గడిపే క్రమంలో.. అతడి గురించి నిజాలు తెలియడంతోనే.. ఆమె అతడి నుంచి విడిపోయినట్లు వార్తలు వినిపించాయి. ఇక సానియాకు దుబాయ్‌లో టెన్నిస్ అకాడమీ ఉంది. ప్రస్తుతం అకాడమీ కార్యకలాపాలతో ఆమె బిజీగా ఉన్నట్లు తెలుస్తోంది. View this post on Instagram A post shared by Sania Mirza (@mirzasaniar) View this post on Instagram A post shared by Sania Mirza (@mirzasaniar) -
షోయబ్ మాలిక్ భార్యకు చేదు అనుభవం
పాకిస్తాన్ వెటరన్ ఆల్‌రౌండర్ షోయబ్ మాలిక్ భార్య, నటి సనా జావెద్‌కు చేదు అనుభవం ఎదురైంది. సొంత జట్టు అభిమానులే ఆమెను టీజ్ చేస్తూ అసహనం వెళ్లగక్కారు. కాగా భారత టెన్నిస్ దిగ్గజం సానియా మీర్జా నుంచి విడిపోయినట్లు ప్రకటించకముందే షోయబ్ మాలిక్.. సనాను పెళ్లాడిన ఫొటోలు బహిర్గతం చేసిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో సానియాతో విడిపోకముందే షోయబ్‌కు సనాతో రిలేషన్ ఉందంటూ పాక్ మీడియాలో కథనాలు వెలువడ్డాయి. వీరిద్దరు చేసిన మోసం బయటపడంతో సానియానే స్వయంగా విడాకులకు పూనుకున్నట్లు వార్తలు వినిపించాయి. ఇక షోయబ్‌కు ఇది మూడో వివాహం కాగా.. సనా జావెద్‌కు రెండో పెళ్లి. అయితే, పెళ్లైన నాటి నుంచే ఈ జంటపై నెటిజన్లు భారీ ఎత్తున ట్రోల్ చేస్తున్నారు. జీవిత భాగస్వాములకు ద్రోహం చేసి.. ఆ విషయం బయటపడగానే మళ్లీ నిఖా పేరిట తమ ‘బంధాన్ని’ పవిత్రం చేసుకునేందుకు పెద్ద నాటకమే ఆడారని మండిపడ్డారు. ముఖ్యంగా సానియా మీర్జా షోయబ్ కోసం ఎన్నో అవాంతరాలు దాటుకుని పాకిస్తానీని పెళ్లి చేసుకుందని.. అయినా ఆమె పట్ల ఇంత దారుణంగా ఎలా వ్యవహరిస్తారంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. సొంత జట్టు అభిమానులు సైతం షోయబ్ మాలిక్‌ను ఈ విషయంలో సోషల్ మీడియా వేదికగా తప్పుబట్టారు. తాజాగా పాకిస్తాన్ సూపర్ లీగ్ మ్యాచ్ సందర్భంగా సనా జావెద్‌కు నేరుగానే నిరసన సెగ తగిలింది. కరాచీ కింగ్స్‌కు ఆడుతున్న తన భర్త షోయబ్ మాలిక్‌కు మద్దతుగా ఆమె ముల్తాన్ స్టేడియానికి వచ్చింది. ముల్తాన్ సుల్తాన్స్ మ్యాచ్ సమయంలో డగౌట్ నుంచి సనా వెళ్తున్నపుడు కొంత మంది సానియా మీర్జా అంటూ గట్టిగా అరిచారు. దీంతో వాళ్లవైపు చూసిన సనా.. తనకేమీ పట్టనట్లుగా అక్కడి నుంచి వెళ్లిపోయింది. ఇందుకు సంబంధించిన దృశ్యాలను నెటిజన్లు సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున షేర్ చేస్తున్నారు. కాగా 42 ఏళ్ల షోయబ్ మాలిక్ తొలుత ఆయేషా సిద్దిఖి(2002)ను పెళ్లి చేసుకున్నాడు. ఆమె నుంచి విడిపోయిన తర్వాత 2010లో సానియా మీర్జాను వివాహమాడాడు. ఈ జంటకు కుమారుడు ఇజహాన్ ఉన్నాడు. అయితే, షోయబ్‌తో విభేదాలు తలెత్తిన కారణంగా సానియానే ఖులా ద్వారా అతడికి విడాకులివ్వడం గమనార్హం. ఈ క్రమంలో తాను సనాను పెళ్లి చేసుకున్నట్లు షోయబ్ సోషల్ మీడియా వేదికగా ప్రకటించాడు. చదవండి: హెండ్రిక్స్ విధ్వంసం.. సత్తా చాటిన డేవిడ్ మలాన్.. మాలిక్ పోరాటం వృథా Pakistan fans teasing Shoaib Malik's 3rd wife 'Sana Javed' by calling her "Sania Mirza"#PSL9 pic.twitter.com/EXr0OQywvQ — Don Cricket 🏏 (@doncricket_) February 20, 2024 -
PSL 2024 తొలిసారిగా అలా షోయబ్ మాలిక్ జంట: సనాపై నెటిజన్ల ట్రోలింగ్
పాకిస్తాన్ క్రికెటర్ షోయబ్ మాలిక్ మూడో భార్య నటి సనా జావేద్‌ను నెటిజన్లు దారుణంగా ట్రోల్ చేస్తున్నారు. ఇటీవల మూడో పెళ్లి చేసుకున్న మాలిక్, సనా జావేద్ జంటగా కలిసి తొలిసారిగా బహిరంగంగా కనిపించారు. ముల్తాన్ విమానాశ్రయం హోటల్‌కు వెళుతున్న దృశ్యాలు హల్చల్ చేశాయి. దీనిపై కొంతమంది ఫ్యాన్స్ సానుకూలంగా స్పందించినప్పటికీ, మరికొందమంది మాత్రం నెగిటివ్‌గా కమెంట్స్ చేశారు. పాకిస్థాన్ సూపర్ లీగ్ (PSL) తొమ్మిదో ఎడిషన్‌లో భాగంగా ఆదివారం జరిగిన ముల్తాన్ సుల్తాన్స్ vs కరాచీ కింగ్స్ మ్యాచ్‌కు ఆమె హాజరైంది. ఈ సందర్బంగా కరాచీ కింగ్స్‌కు ప్రాతినిధ్యం వహిస్తున్న మాలిక్ ఇన్నింగ్స్‌కు ఫిదా అయిపోయింది. గట్టిగా కేకలు వేస్తూ, ఉత్సాహంగా కనిపించింది. భర్త షోయబ్‌ను ఎంకరేజ్ చేస్తూ కనిపించింది. దీనికి సంబంధించిన వీడియోలు, చిత్రాలు వైరల్ గా మారాయి. మాజీ జీవిత భాగస్వాములను మోసం చేసిన ఈ జంటకు సిగ్గూ, శరం లేదంటూ కమెంట్ చేశారు. కొంచెం కూడా పశ్చాత్తాపం లేదంటూ విమర్శలకు దిగారు. అంతేకాదు షోయబ్ త్వరలో తన నాల్గవ భార్యను ఇంటికి తీసుకువస్తాడు, నిన్ను కూడా వదిలివేస్తాడంటూ విరుచుకుపడ్డారు. కాగా భారత టెన్నిస్ సంచలనం సానియా మీర్జాకు విడాకులిచ్చిన షోయబ్ మాలిక్ సనా జావేద్‌ను పెళ్లాడి అందర్నీ షాక్‌కు గురి చేశాడు. అలాగే 'ఖులా' ద్వారా విడిపోయారని సానియా మీర్జా తండ్రి స్వయంగా వెల్లడించారు. సనాకు ఇది రెండో పెళ్లికాగా, మాలిక్‌కు మూడో పెళ్లి. కాగా పాకిస్థాన్ సూపర్ లీగ్‌లో ముల్తాన్ సుల్తాన్స్‌తో జరిగిన కరాచీ కింగ్స్ మ్యాచ్ సందర్భంగా తొలుత బ్యాటింగ్ చేసిన ముల్తాన్ తొలి ఇన్నింగ్స్‌లో 185 పరుగులు చేసింది. ఓపెనర్ డేవిడ్ మలన్ 52 పరుగులు చేయగా, రీజా హెండ్రిక్స్ 54 బంతుల్లో 79 పరుగులు చేశాడు. ఛేజింగ్‌లో కరాచీ వరుసగా వికెట్లు కోల్పోయింది.అయితే నాలుగో నంబర్లో బ్యాటింగ్ చేసిన మాలిక్ 35 బంతుల్లో 53 పరుగులు చేశాడు. కానీ 55 పరుగుల తేడాతో ఓడిపోయింది.మరోవైపు షోయబ్ మాలిక్ స్వార్థపరుడంటూ మాజీ క్రికెటర్ అబ్దుల్ రజాక్ ఆరోపించడం గమనార్హం.. -
‘ఆడుదాం ఆంధ్ర’ ఆరంభం అదిరింది : సాకేత్ మైనేని
సాక్షి ప్రతినిధి–అమరావతి): పదకొండేళ్ల వయసులో తండ్రిని చూసి రాకెట్ పట్టిన బాలుడు.. ఎన్నో వ్యయప్రయాసలకోర్చి టెన్నిస్ స్టార్ సానియా మీర్జాతో జత కట్టే స్థాయికి ఎదిగాడు. అంతర్జాతీయ టెన్నిస్ క్రీడల్లో రాణిస్తూ ఆసియా క్రీడల్లో పురుషుల డబుల్స్ విభాగంలో రజత పతకం సాధించాడు.. అతనే అర్జున అవార్డు గ్రహీత, మన ఆంధ్రప్రదేశ్ క్రీడా యువ కెరటం సాకేత్ మైనేని. ‘ఆడుదాం ఆంధ్ర’ క్రీడా పోటీలను రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్న నేపథ్యంలో ఆయన ‘సాక్షి’కి ఇచ్చిన ప్రత్యేక ఇంటర్వ్యూలో పలు విషయాలపై ముచ్చటించారు. రాష్ట్ర క్రీడా రంగ అభివృద్ధికి ఇది ఆరంభమని, గ్రామీణ క్రీడాకారులను గుర్తించడానికి ప్రభుత్వం వేసిన ఈ తొలి అడుగు అభినందనీయమని ప్రశంసించారు. ఇంటర్వ్యూ విశేషాలు ఆయన మాటల్లోనే.. కృష్ణమ్మ ఒడి నుంచి క్రీడా రంగంలోకి.. కృష్ణా జిల్లా ఉయ్యూరులో జన్మించినప్పటికీ పెరిగిందంతా విశాఖపట్నంలోనే. చిన్నప్పటి నుంచీ క్రీడలపై ఆసక్తి ఉండేది. ఖోఖో, కర్రా–బిళ్లా్ల, గోలీలు అంటూ ప్రతి ఆటా ఆడేసేవాడిని. మా నాన్న టెన్నిస్ ఆడుతుంటే చూసి నాకూ ఆడాలనిపించింది. అలా 11 ఏళ్లకే ఆ గేమ్‌ను సీరియస్‌గా తీసుకున్నా. 12 ఏళ్లకు విజయనగరంలో జరిగిన రాష్ట్ర స్థాయి పోటీల్లో విజేతగా నిలిచా. 13 ఏళ్ల వయసులో నాకు టెన్నిస్ శిక్షణ ఇప్పించడం కోసం అమ్మానాన్నలు హైదరాబాద్‌కు తీసుకెళ్లారు. 17 ఏళ్ల వయసులో టెన్నిస్ స్కాలర్‌షిప్‌పై అండర్ గ్రాడ్యుయేట్ ప్రోగ్రామ్ కోసం అమెరికా వెళ్లాను. అక్కడ కోచింగ్ సర్టిఫికేషన్ పొందాను. ఖర్చుల కోసం అక్కడి స్థానిక క్లబ్లో శిక్షణ ఇచ్చాను. అకడమిక్స్‌లో కూడా అగ్రస్థానంలో నిలిచాను. అత్యుత్తమ డబుల్స్ ర్యాంకింగ్ 74వ స్థానంలో ఉన్నాను. 2014లో చైనాలో జరిగిన 17వ ఏషియన్ గేమ్స్‌లో సానియాతో జత కట్టి మిక్స్డ్ డబుల్స్‌లో స్వర్ణ పతకం, సనమ్ సింగ్‌తో జోడికట్టి డబుల్స్‌లో రజత పతకం గెలవడం నిజంగా అద్భుతమైన అనుభూతి. దక్షిణాసియా క్రీడల్లో సింగిల్స్, డబుల్స్ విభాగాల్లో 2016, 2019లో రజత పతకాలు సాధించా. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ నుంచి టెన్నిస్‌లో అంతర్జాతీయ స్థాయిలో నేను, సానియా మీర్జా మాత్రమే పతకాలు సాధించాం. సరదాగా ప్రారంభించిన ఈ క్రీడ చివరికి నా కెరీర్‌గా మారింది. ప్రస్తుతం డేవిస్ కప్‌లో భారత్‌కు ప్రాతినిథ్యం వహిస్తున్నా. కేంద్ర ప్రభుత్వం 2017లో అర్జున అవార్డుతో గౌరవిస్తే రాష్ట్ర ప్రభుత్వం ఉద్యోగం ఇవ్వాలని, స్థలం మంజూరు చేయాలని నిర్ణయించింది. 2024 పారిస్ ఒలింపిక్స్‌లో భారత్‌కు ప్రాతినిథ్యం వహించాలి.. ఇండియాకే ఓ గ్రాండ్‌స్లామ్ టైటిల్ తెచ్చివ్వాలనేది నా లక్ష్యం. ఈ అద్భుత ప్రయత్నం కొనసాగాలి ఏదైనా క్రీడలో తమ పిల్లవాడు రాణించేలా చేయాలంటే ఆ కుటుంబానికి చాలా ఇబ్బందులు ఎదురవుతాయి. ఆరి్థకంగానూ సమస్యలు వస్తాయి. అలాగే పిల్లవాడి చదువుపైనా ఆ క్రీడ ప్రభావం చూపుతుంది. సౌకర్యాలు లేకపోవడం ఆటంకంగా మారుతుంది. పాఠశాలకు వెళ్లి వచ్చేసరికే పిల్లాడు అలసిపోతుంటాడు. అలాగే తల్లిదండ్రులు తమ పిల్లలను టోర్నమెంట్లకు తీసుకెళ్లడానికి సమయాన్ని వెచ్చించాల్సి ఉంటుంది. అయినా అన్నిటిలో గెలుస్తాడని గ్యారెంటీ ఉండదు. ఇలాంటి అనేక ప్రతికూలతలను అధిగమించి నేను ఈ స్థాయికి చేరుకున్నానంటే దానికి నా తల్లిదండ్రులు ప్రసాద్, సరోజ, భార్య శ్రీలక్ష్మి, స్నేహితులతో పాటు ఎంతో మంది అందించిన ప్రోత్సాహం ఉంది. ప్రస్తుతం రాష్ట్రంలో చాలా క్రీడల్లో అవకాశాలు, మౌలిక సదుపాయాలు మెరుగుపడ్డాయి. వీటితో పాటు క్రీడలు చాలా చిన్న వయస్సు నుంచే సంస్కృతిలో భాగం కావాలి. ఈ విషయాన్ని రాష్ట్ర ప్రభుత్వం త్వరగా గుర్తించింది. ప్రతి గ్రామంలో యువత పోటీపడి క్రీడలను ఆస్వాదించడానికి ప్రోత్సహించేలా ‘ఆడుదాం ఆంధ్ర’ను ప్రారంభించింది. ఇందుకు నేను రాష్ట్ర ప్రభుత్వాన్ని అభినందిస్తున్నాను. ఇది ఓ ప్రారంభం.. దీనికి కొనసాగింపుగా శిక్షణా సౌకర్యాలను మెరుగు పరచడం ద్వారా భవిష్యత్తులో మన రాష్ట్రం నుంచి అనేక మంది ఛాంపియన్లను తయారు చేయగలుగుతాం. ఖరీదైన క్రీడ.. అయినా నేను సిద్ధం టెన్నిస్.. ప్రపంచంలో అత్యంత ప్రజాదరణ పొందిన క్రీడే కాదు ఖరీదైన క్రీడల్లో ఒకటి. అలాగే ఒక ప్రొఫెషనల్ ప్లేయర్ తన శిక్షణకు, ప్రపంచ వ్యాప్తంగా టోర్నమెంట్లలో పాల్గొనడానికి ఖర్చులకు నిధులు తానే సమకూర్చుకోవాలి. అందుకే పాఠశాల దశ నుంచే ఆటగాళ్లకు నిధులు సమకూరుస్తున్న రాష్ట్రాలు మాత్రమే మనదేశంలో అంతర్జాతీయ స్థాయి ఆటగాళ్లను తయారు చేయడంలో విజయం సాధించాయి. ఆంధ్రాలో ఆటగాళ్లను తయారు చేయడానికి మనకు మంచి టెన్నిస్ కోర్టులు, కోచ్‌లు లేరు. మాకు ప్రతిభగల ఆటగాళ్లను తయారు చేయగల సామర్థ్యం ఉంది. కానీ ఆటగాళ్లు చాలా చిన్న వయస్సులో శిక్షణ కోసం హైదరాబాద్, ఢిల్లీ, బెంగళూరు, గుజరాత్ వంటి రాష్ట్రాలకు, ఆ తర్వాత విదేశాలకు వెళ్లాల్సి వస్తోంది. ఆంధ్రాలో ఎక్కువ మంది యువత టెన్నిస్‌లో పాల్గొనేలా చేయడానికి, మనకు రాష్ట్రంలోనే మంచి టెన్నిస్ అకాడమీ, కోచ్ ఉండాలి. దీనిపై ప్రస్తుత ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి సానుకూలంగా ఉన్నారు. కాస్మోపాలిటన్ కల్చర్ ఉన్న విశాఖపట్నంలో టెన్నిస్ అకాడమికి స్థలం కేటాయిస్తామని హామీ ఇచ్చారు. నా వయసు ఇప్పుడు 36 ఏళ్లు. అంతర్జాతీయ స్థాయిలో ఎన్నో టోర్నమెంట్లలో పాల్గొన్న అనుభవంతో పాటు, అంతర్జాతీయ కోచ్‌గా కూడా నాకు గుర్తింపు ఉంది. మన రాష్ట్రంలో టెన్నిస్ క్రీడాకారులను తీర్చిదిద్దేందుకు నా నైపుణ్యాన్ని సంతోషంగా అందించడం కోసం నేను సిద్ధంగా ఉన్నా. -
ఆ అవకాశం మనం ఇవ్వకూడదు: సానియా మీర్జా
భారత టెన్నిస్ దిగ్గజం సానియా మీర్జా సోషల్ మీడియాలో ఎంతో చురుగ్గా ఉంటారు. తన ఫొటోషూట్లకు సంబంధించిన ఫొటోలతో పాటు.. కుమారుడు ఇజహాన్‌తో ఉన్న ఫొటోలను ఇటీవల ఎక్కువగా షేర్ చేస్తున్నారు. ముఖ్యంగా భర్త షోయబ్ మాలిక్ నుంచి విడిపోయిన తర్వాత.. అతడి పేరును ప్రస్తావించకుండానే తాను రెట్టించిన ఆత్మవిశ్వాసంతో ముందుకు సాగుతున్న తీరును వివరించే క్యాప్షన్లతో కొటేషన్లు పంచుకుంటున్నారు. ఈ క్రమంలో తాజాగా.. సానియా షేర్ చేసిన పోస్ట్ నెట్టింట వైరల్‌గా మారింది. ‘‘మన ఆత్మవిశ్వాసాన్ని దెబ్బతీసేందుకు సోకాల్డ్ కఠిన పరిస్థితులకు మనం అవకాశం ఇవ్వకూడదు’’ అన్న అర్థంలో సానియా మీర్జా తన అందమైన ఫొటోలకు ఇలా మరింత అందమైన క్యాప్షన్ ఇచ్చారు. ఇందులో ఆమె మల్టీకలర్ మ్యాచింగ్సెట్ ధరించి.. సింపుల్ మేకప్.. స్లీక్ హెయిర్‌తో తన సౌందర్యాన్ని మరింత ద్విగుణీకృతం చేసేలా కనిపించారు. View this post on Instagram A post shared by Sania Mirza (@mirzasaniar) ఇందుకు స్పందించిన నెటిజన్లు.. ‘‘మీరు చెప్పింది నిజం. ప్రతి ఒక్కరు ముందుగా తమను తాము ప్రేమించుకోవడం.. తమ ఆత్మాభిమానాన్ని కాపాడుకోవడం అలవాటు చేసుకోవాలి. మన తర్వాతే మనకు ఎవరైనా..! అన్న సందేశాన్ని ఎంత చక్కగా చెప్పారో’’ అంటూ సానియాను ప్రశంసిస్తున్నారు. కాగా పాకిస్తాన్ క్రికెటర్ షోయబ్ మాలిక్‌ను ప్రేమించి.. 2010లో పెళ్లాడారు సానియా మీర్జా. వీరికి 2018లో కుమారుడు ఇజహాన్‌కు జన్నించాడు. ఇక దుబాయ్‌లో కాపురం పెట్టిన ఈ క్రీడాకారుల జంట మధ్య విభేదాలు తలెత్తిన నేపథ్యంలో సానియా తన భర్తకు విడాకులిచ్చారు. షోయబ్ మాలిక్ వివాహేతర సంబంధాల వల్లే సానియా మీర్జా ఈ నిర్ణయం తీసుకున్నారని పాకిస్తాన్ మీడియా వెల్లడించడం విశేషం. అయితే, షోయబ్ తన మూడో పెళ్లి(నటి సనా జావెద్)కి సంబంధించిన ఫొటోలు విడుదల చేసిన తర్వాతే.. వీరి విడాకుల వ్యవహారం బయటపడటం గమనార్హం. ఇదిలా ఉంటే.. షోయబ్ మాలిక్ ప్రవర్తన అతడి కుమారుడు ఇజహాన్పై తీవ్ర ప్రతికూల ప్రభావం చూపిస్తోందంటూ పాక్ జర్నలిస్టు ఒకరు సంచలన వ్యాఖ్యలు చేశారు. సామా టీవీకి చెందిన నయీమ్ హనీఫ్ మాట్లాడుతూ.. షోయబ్ వల్ల స్కూళ్లో ఇజహాన్ అవమానాలకు గురికావాల్సి వస్తోందని పేర్కొన్నారు. అయితే, సానియా మాత్రం ఈ పరిణామాలపై ఇప్పటికీ నేరుగా స్పందించలేదు. View this post on Instagram A post shared by Sania Mirza (@mirzasaniar) -
ఆమె పట్ల ఎందుకింత ద్వేషం.. ఇంతకు దిగజారుతారా?
భారత టెన్నిస్ స్టార్ సానియా మీర్జాకు సంబంధించిన పాత వీడియో తాజాగా నెట్టింట చక్కర్లు కొడుతోంది. వైవాహిక బంధం గురించి ఆమె చేసిన వ్యాఖ్యలను హైలైట్ చేస్తూ అభిమానులు సానియాకు మద్దతుగా నిలుస్తున్నారు. పనిలో పనిగా సానియా గురించి తప్పుడు వార్తలు ప్రచారం చేస్తున్న వారికి దిమ్మతిరిగేలా కౌంటర్లు ఇస్తున్నారు. కాగా పాకిస్తాన్ క్రికెటర్ షోయబ్ మాలిక్‌ను సానియా ప్రేమించి పెళ్లాడిన విషయం తెలిసిందే. 2010లో వీరి వివాహం జరగగా.. అప్పటికి ఇద్దరూ కెరీర్లో మంచి స్థాయిలో ఉన్నారు. దుబాయ్‌లో కాపురం పెట్టిన ఈ జంటకు 2018లో కుమారుడు ఇజహాన్ జన్మించాడు. అన్యోన్య దంపతులుగా పేరొందిన సానియా- షోయబ్ విడిబోతున్నారంటూ గత కొన్నిరోజులుగా వార్తలు రాగా.. వాటిని నిజం చేస్తూ షోయబ్ మాలిక్ తన కొత్త భార్యను పరిచయం చేశాడు. నటి సనా జావెద్‌ను పెళ్లాడినట్లు సోషల్ మీడియాలో ఫొటోలు షేర్ చేశాడు. ఈ విషయంపై స్పందించిన సానియా కుటుంబం.. సానియా తనకు తానుగా షోయబ్‌కు విడాకులు ఇచ్చిందని అధికారిక ప్రకటన విడుదల చేసింది. కాగా కెరీర్‌కు వీడ్కోలు పలికిన తర్వాత వ్యక్తిగత జీవితానికి ఎక్కువ ప్రాధాన్యం ఇచ్చిన సానియా మీర్జాకు షోయబ్ వివాహేతర సంబంధాల గురించి తెలిసిందని సమాచారం. ఈ నేపథ్యంలోనే అతడి ప్రవర్తన నచ్చక అతడి నుంచి విడిపోయిందని పాక్ మీడియాలో కథనాలు వచ్చాయి. ఇక షోయబ్ పెళ్లి తర్వాత సానియా మీర్జా వరుస ఫొటోషూట్లు, ప్రొఫెషన్‌కు సంబంధించిన పనులతో బిజీ అయింది. అయితే, కొంతమంది ఆకతాయిలు మాత్రం.. సానియా రెండో పెళ్లి అంటూ తప్పుడు కథనాలు అల్లుతున్నారు. టీమిండియా క్రికెటర్ మహ్మద్ షమీ తాను పెళ్లి కొడుకు అవతారంలో ఉన్న ఫొటోను షేర్ చేయగా.. వక్రభాష్యాలు చెబుతూ ఈ టెన్నిస్స్టార్ను ట్రోల్ చేస్తున్నారు. ఈ నేపథ్యంలో సానియా అభిమానులు.. ‘‘సోషల్ మీడియాలో హైలైట్ కావడానికి ఇంతకు దిగజారుతారా? ఓ మహిళ గురించి ఇంత నీచంగా అబద్దాలు వ్యాప్తి చేస్తారా? ఆమె పట్ల ఎందుకింత ద్వేషం’’ అంటూ మండిపడుతున్నారు. వైవాహిక బంధం గురించి సానియా చేసిన వ్యాఖ్యలను ఈ సందర్భంగా ప్రస్తావిస్తూ.. షోయబ్ లాంటి వ్యక్తిని విడిచిపెట్టి ఆమె మంచి పనిచేసిందంటూ కామెంట్లు చేస్తున్నారు. పాత వీడియోలో ఏముంది? కొత్తగా పెళ్లి చేసుకున్న వ్యక్తులకు మీరిచ్చే సలహా ఏమిటని గతంలో ఓ మహిళ సానియా మీర్జాను ప్రశ్నించింది. ఇందుకు బదులిస్తూ.. ‘‘పెళ్లికి ముందు మీరెలా ఉన్నారో అలాగే ఉండండి. జీవిత భాగస్వామి చెప్పారని మిమ్మల్ని మీరు పూర్తిగా మార్చుకోవాల్సిన పనిలేదు. ఎందుకంటే.. మీలో ఉన్న ఆ ప్రత్యేక లక్షణాన్ని చూసే కదా వాళ్లు మీతో ప్రేమలో పడతారు’’ అని సానియా పేర్కొంది. Advice of Sania Mirza for Shoaib Malik ❤️#ShoaibMalik | #SanaJaved #SaniaMirza | #ShoaibMalikMarriage pic.twitter.com/9NxodlKidd — Sehrish Javed (@sehrish_javed18) January 21, 2024 -
సానియా ఆస్తుల విలువ ఎంతో తెలిస్తే...
-
‘మూడేళ్లుగా ఆమెతో రిలేషన్లో షోయబ్.. భర్తకు తెలియకుండా అలా’
పాకిస్తాన్ వెటరన్ క్రికెటర్ షోయబ్ మాలిక్ గత కొన్నిరోజులుగా వార్తల్లో నిలుస్తున్నాడు. విడాకులు- మూడో పెళ్లి- అద్భుత టీ20 రికార్డు- మ్యాచ్ ఫిక్సింగ్ ఆరోపణలు ఇలా వరుస ఘటనలతో అతడి పేరు పాక్ మీడియాలో మారుమ్రోగి పోతోంది. తాజాగా ఈ ఆల్‌రౌండర్ గురించి స్థానిక టీవీ చానెల్ సంచలన ఆరోపణలు చేసింది. ఇంతకీ సంగతేంటి??... భారత టెన్నిస్ స్టార్ సానియా మీర్జా 2010లో షోయబ్ మాలిక్‌తో కలిసి వివాహ బంధంలో అడుగుపెట్టిన విషయం తెలిసిందే. షోయబ్‌ను ప్రేమించి పెళ్లాడిన సానియా అప్పటికే డివోర్సీ అయిన షోయబ్‌ను ప్రేమించి పెళ్లి చేసుకున్న ఈ హైదరాబాదీ 2018లో కుమారుడు ఇజహాన్‌కు జన్మనిచ్చింది. ఈ జంట దుబాయ్‌లో నివాసం ఉండేది. ఇక గతేడాది ఆటకు రిటైర్మెంట్ ప్రకటించిన తర్వాత కుటుంబానికే సమయం కేటాయించిందట సానియా. ఈ క్రమంలో తన భర్త గురించి కొన్ని చేదు నిజాలు ఆమెకు తెలిశాయని.. అందుకే దంపతుల మధ్య విభేదాలు తలెత్తాయని వార్తలు వినిపించాయి. వాటినే నిజం చేస్తూ ఇటీవలే తాను మూడో పెళ్లి చేసుకున్నట్లు ప్రకటించాడు షోయబ్ మాలిక్. తానే విడాకులు ఇచ్చింది పాక్ నటి, మోడల్ సనా జావేద్‌ను వివాహమాడిన ఫొటోలు సోషల్ మీడియాలో షేర్ చేశాడు. ఈ విషయంపై స్పందించిన సానియా కుటుంబం.. తమ కూతురు ఏకపక్షంగా భర్తకు విడాకులిచ్చిందని ప్రకటన విడుదల చేసింది. ఆ తర్వాత సానియా కూడా ఈ విషయంపై ఒక్క మాట కూడా మాట్లాడలేదు. ఈ నేపథ్యంలో.. ‘‘తనపై వస్తున్న విమర్శలను లెక్కచేయక షోయబ్‌ను ప్రేమించి పెళ్లాడిన సానియాకు అతడు ద్రోహం చేసినా.. ఆమె ఎవరిపైనా నిందలు వేయకుండా హుందాగా ప్రవర్తిస్తున్నారు’’ అంటూ పాక్ మీడియా సానియా మీర్జాకు మద్దతుగా నిలవడం విశేషం. భర్తకు తెలియకుండా మూడేళ్లుగా ఈ క్రమంలో సామా టీవీ షోయబ్ మాలిక్- సనా జావేద్ బంధంపై సంచలన ఆరోపణలు చేస్తూ పాడ్‌కాస్ట్ రిలీజ్ చేసింది. అందులో ఉన్న వివరాల ప్రకారం.. ‘‘గత మూడేళ్లుగా వాళ్లిద్దరు సంబంధం కొనసాగిస్తున్నారు. భార్యాభర్తల బంధంలో ఎలా ఉంటారో అలాగే ఉంటున్నారు. కానీ ఈ విషయాలు ఉమైర్(సనా మొదటిభర్త)కు తెలియదు. అయితే, సానియా.. ఆమె కుటుంబానికి గతేడాదే షోయబ్- సనాల గురించి తెలిసింది. మాలిక్ ఫ్యామిలీకి కూడా విషయం తెలిసింది. అంతా కలిసి పరిస్థితిని చక్కదిద్ది షోయబ్- సానియాల బంధాన్ని నిలబెట్టాలని ప్రయత్నించారు. కానీ.. షోయబ్ ఎవరి మాటా వినేందుకు ఇష్టపడలేదు’’ అంటూ సామా టీవీ పేర్కొంది. అదే విధంగా.. తనను ఏ టీవీ షోకు ఆహ్వానించినా.. సనాను కూడా పిలవాలని షోయబ్ మాలిక్ కండిషన్లు పెట్టేవాడని ఆరోపించింది. కాగా సనా జావెద్‌కు గతంలో సింగర్ ఉమైర్తో పెళ్లైంది. అతడితో విడాకులు తీసుకున్న మూడు నెలల్లోపే ఆమె షోయబ్‌ను రెండో వివాహం చేసుకోవడం గమనార్హం. వరుస సంఘటనలు ఇక వ్యక్తిగతంగా షోయబ్ పరిస్థితి ఇలా ఉంటే.. కెరీర్ పరంగా ఇటీవలే అతడు అరుదైన ఘనత సాధించాడు. టీ20 క్రికెట్లో 13 వేల పరుగుల మైలురాయిని అందుకున్న ఆసియా తొలి బ్యాటర్‌గా చరిత్ర సృష్టించాడు. బంగ్లాదేశ్ ప్రీమియర్-2024 లీగ్‌లో ఫార్చ్యూన్ బరిషల్‌కు ప్రాతినిథ్యం వహిస్తున్న అతడు ఈ ఘనత సాధించాడు. అయితే, ఆ మైల్‌స్టోన్‌ను ఎంజాయ్ చేసేలోపే షోయబ్ మాలిక్‌పై ఫిక్సింగ్ ఆరోపణలు వచ్చాయి. అయితే, వీటిని షోయబ్ మాలిక్ ఖండించాడు. చదవండి: స్వర్గాన్ని నరకంగా మార్చిందెవరు? సానియా హృదయం ముక్కలు -
షోయబ్ మాలిక్‌తో ఎఫైర్? ఇన్నాళ్లకు క్లారిటీ ఇచ్చిన పాక్ నటి
పాక్ క్రికెటర్ షోయబ్ మాలిక్ మూడో పెళ్లి.. రీసెంట్ టైంలో సెన్సేషన్ అయిపోయింది. ఎందుకంటే గతకొన్నాళ్ల నుంచి షోయబ్-సానియా విడాకులపై వార్తలు వచ్చాయి. తాజాగా జరిగిన పెళ్లితో అది నిజమేనని తేలిపోయింది. షోయబ్.. పాక్ నటి సనా జావేద్‌ని ముచ్చటగా మూడో పెళ్లి చేసుకున్నాడు. అయితే కొన్నాళ్ల ముందు మరో పాక్ నటి.. ఈ ఆటగాడితో ఎఫైర్ నడిపిందని రూమర్స్ వచ్చాయి. ఆ బ్యూటీ సదరు పుకార్లపై ఇన్నాళ్లు ఓ క్లారిటీ ఇచ్చింది. అప్పట్లో తను ఎంతగా బాధపడ్డాననేది బయటపెట్టింది. పాకిస్థాన్ క్రికెటర్ షోయబ్ మాలిక్.. చాలా ఏళ్ల నుంచి జట్టులో ఉన్నాడు. 2002లో ఆయేషా సిద్ధిఖీని, 2010లో సానియా మీర్జాని పెళ్లి చేసుకున్నాడు. ఇప్పుడు అంటే 2024లో పాక్ నటి సనా జావేద్‌తో ఒక్కటయ్యాడు. అయితే కొన్నాళ్లముందు ఆయేషా ఒమర్ అనే నటితో షోయబ్.. ఓ మ్యాగజైన కవర్ పేజీ కోసం ఫొటో షూట్ చేశాడు. ఇందులో వీళ్లిద్దరూ వేరే లెవల్ కెమిస్ట్రీ పండించారు. సరిగ్గా అదే టైంలో సానియా విడాకులు తీసుకోబోతుందనే న్యూస్ బయటకొచ్చింది. దీంతో ఆయేషా బలైపోయింది. (ఇదీ చదవండి: చాన్నాళ్ల తర్వాత ఓటీటీలోకి వచ్చేసిన తెలుగు సినిమాలు) షోయబ్.. సానియాకు విడాకులు ఇచ్చేశాడని, దానికి ఆయేషా ఒమర్ కారణమని తెగ మాట్లాడుకున్నారు. మన దగ్గర ఊరికే మాట్లాడుకున్నారు. పాక్ మీడియాలో అయితే ఇష్టమొచ్చినట్లు రాసిపడేశారు. అయితే ఆ సమయంలో తను చాలా ఆందోళనకు గురయ్యానని ఆయేషా చెప్పుకొచ్చింది. తాజాగా ఓ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ.. ఎఫైర్ రూమర్స్ వల్ల తాను ఎంతలా మానసిక వేదన అనుభవించాననేది బయటపెట్టింది. 'ఆ దశ మొత్తం నాకు ఓ పీడకల లాంటిది. షోయబ్‌తో నాకు ఎఫైర్ సృష్టించడంతో పాటు పెళ్లి కూడా చేసేశారు. ఇంకా చెప్పాలంటే నాకు అతడితో సీక్రెట్‌గా పెళ్లయిపోయిందని నా బంధువులే చాలామంది నమ్మేంతలా పరిస్థితి చేయి దాటిపోయింది. అయితే నాకు ఈ పుకార్లు చదివినప్పుడు.. అలానే నా గురించి జనాలు మాట్లాడుకునేప్పుడు చాలా అంటే చాలా భయమేసేది. తెగ ఆందోళనపడేదాన్ని' అని ఆయేషా ఒమర్ చెప్పుకొచ్చింది. (ఇదీ చదవండి: 'నెరు' సినిమా తెలుగు రివ్యూ (ఓటీటీ)) View this post on Instagram A post shared by Sana Shoaib Malik (@sanajaved.official) -
Novak Djokovic-Sania Mirza: ఇండియా అంటే నాకు చాలా ఇష్టం.. సానియాతో కలిసి పనిచేస్తా: జకోవిచ్
ఆస్ట్రేలియన్ ఓపెన్‌లో వరల్డ్ నంబర్ 1, సెర్బియా టెన్నిస్ స్టార్ నొవాక్ జకోవిచ్ అదరగొడుతున్నాడు. జకోవిచ్ క్వార్టర్ ఫైనల్‌కు దూసుకెళ్లాడు. ఆదివారం జరిగిన నాలుగో రౌండ్ మ్యాచ్‌లో 35 ఏండ్ల అడ్రియన్ మన్నారినోను జకో చిత్తుగా ఓడించాడు. . వరుస సెట్లలో జోరు కొనసాగించిన ఈ సెర్బియా స్టార్ 6-0, 6-0, 6-3తో అలవోకగా గెలుపొంది రికార్డు స్థాయిలో 58వ సారి గ్రాండ్‌స్లామ్ క్వార్టర్స్‌లో అడుగుపెట్టాడు. ఇక ఇది ఇలా ఉండగా.. తాజాగా మూడో రౌండ్ అనంతరం సోనీ స్పోర్ట్స్‌కు జకోవిచ్ ఇంటర్వ్యూ ఇచ్చాడు. ఈ ఇంటర్వ్యూలో భారత టెన్నిస్ దిగ్గజం సానియా మీర్జా కూడా పాల్గోంది. భారత్‌తో తనకు మంచి సంబంధం ఉందని, అక్కడ టెన్నిస్ అభివృద్దికి సానియా మీర్జాతో కలిసి పనిచేస్తాని జకోవిచ్ తెలిపాడు. "భారత్‌తో నాకు గొప్ప అనుబంధం ఉంది. సెర్బియా, భారతదేశ చరిత్రను పరిశీలిస్తే చాలా సారూప్యతలు ఉన్నాయి. నాకు భారతీయలు అంటే చాలా ఇష్టం. వారు ఎల్లప్పుడూ నన్ను అభిమానుస్తునే ఉంటారు. భారతీయలకు ప్రేమభిమానాలు ఎక్కువ. ఇండియన్స్ క్రీడలను ఎక్కువగా ఇష్టపడతారు. భారత్‌లో క్రికెట్ ఒక మతంగా ఉన్నప్పటికీ.. టెన్నిస్‌ను కూడా ఎక్కువగా ఆదరిస్తారు. నేను దాదాపు పదేళ్ల క్రితం న్యూ ఢిల్లీలో ఎగ్జిబిషన్ మ్యాచ్‌ల కోసం భారత్‌కు వెళ్లాను. రెండు రోజులు పాటు అక్కడే ఉన్నాను. మళ్లీ ఇండియాకు రావాలనుకుంటున్నాను. భారత్‌లో పిల్లల అభివృద్ధికి ప్రత్యేకంగా రూపొందించిన కొన్ని కార్యక్రమాలలో భాగం కావాలని ఆశిస్తున్నాను. ఇటువంటి సేవా కార్యక్రామాలు నా భార్యకు కూడా ఎంతో ఇష్టం. అదే మా ఫౌండేషన్ లక్ష్యం కూడా. అదే విధంగా భారత్‌లో టెన్నిస్ అభివృద్దికి సంబంధించిన కార్యక్రమాల్లో కూడా నేను భాగం కావాలనకుంటున్నను. ఎక్కువ మంది పిల్లలు టెన్నిస్ రాకెట్ పట్టుకుని టెన్నిస్ ఆడటం నాకు చాలా ఇష్టం. టెన్నిస్ అభివృద్దికి నేను అన్ని విధాలగా కృషి చేస్తాను. ఈ మిషన్ కోసం మనమిద్దరం కలిసి పనిచేద్దాం" అని సానియా మీర్జాతో జకోవిచ్ పేర్కొన్నాడు. చదవండి: #ShoaibMalikSaniamirza: 'షోయబ్‌తో విడాకులు తీసుకుని కొన్ని నెలలైంది.. కానీ ఇప్పుడు తప్పట్లేదు' -
'షోయబ్‌తో విడాకులు తీసుకుని కొన్ని నెలలైంది.. కానీ ఇప్పుడు తప్పట్లేదు'
పాకిస్తాన్ వెటరన్ క్రికెటర్ షోయబ్ మాలిక్ ముచ్చటగా మూడో పెళ్లి చేసుకున్న సంగతి తెలిసిందే. ఓవైపు సానియా మీర్జాతో విడాకులపై వదంతులు ప్రచారం అవుతుండగానే.. నటి సనా జావెద్‌ను పెళ్లి చేసుకుని అందరికి షాకిచ్చాడు. ఎప్పటినుంచో వినిపిస్తున్న రూమర్స్‌ను షోయబ్ నిజం చేశాడు. సనా జావెద్‌ను వివాహమాడిన ఫోటోలను మాలికే స్వయంగా సోషల్ మీడియాలో షేర్ చేశాడు. ప్రస్తుతం ఇదే విషయం ఇరు దేశాల క్రీడా వర్గాల్లో చర్చానీయంశమైంది. ఇక ఈ విషయంపై సానియా కుటుంబం తాజాగా స్పందించింది. కొన్ని నెలల క్రితమే సానియా, షోయబ్ విడాకులు తీసుకున్నట్లు తెలిపింది. "సానియా ఎప్పుడూ తన వ్యక్తిగత జీవితాన్ని గోప్యంగా ఉంచుతుంది. కానీ ఇటువంటి క్లిష్ట పరిస్థితుల్లో ఆమె స్పందించక తప్పట్లేదు. షోయబ్, ఆమె విడాకులు తీసుకొని కొన్ని నెలలు అవుతోంది. షోయబ్‌కు తన న్యూ జర్నీ కోసం ఆమె శుభాకాంక్షలు తెలిపింది. ఇక అనవసర చర్చలు ఆపేయండి. ఆమె తన జీవితంలో చాలా కఠినమైన దశను ఎదుర్కొంటుంది. ఇటువంటి సమయంలో అభిమానులు, శ్రేయోభిలాషులందరూ ఆమెకు అండగా నిలవాలి. తన గోప్యతకు ఎటువంటి భంగం కలిగించకుండా గౌరవించాలని" ఓ ప్రకటనలో పేర్కొన్నారు. కాగా 2010లో తన మొదటి భార్య ఆయేషాతో విడాకులు తీసుకున్న షోయబ్ మాలిక్.. అదే ఏడాది సానియా మీర్జాను పెళ్లి చేసుకున్నాడు. ఈ ఇద్దరికీ 2018లో ఇజహాన్ పుట్టాడు. చదవండి: #ShoaibMalikSaniamirza: ఎల్లలు లేని ప్రేమ: స్వర్గాన్ని నరకంగా మార్చిందెవరు? View this post on Instagram A post shared by Imran Mirza (@imranmirza58) -
చరిత్ర సృష్టించిన షోయబ్ మాలిక్.. ఒకే ఒక్కడు
పాకిస్తాన్ వెటరన్ క్రికెటర్ షోయబ్ మాలిక్ అరుదైన ఘనత సాధించాడు. టీ20 క్రికెట్లో 13,000 పరుగులు మైల రాయిని అందుకున్న తొలి ఏషియన్ క్రికెటర్‌గా రికార్డులకెక్కాడు. ఓవరాల్‌గా టీ20 క్రికెట్ చరిత్రలో ఈ అరుదైన రికార్డు సాధించిన జాబితాలో మాలిక్ రెండో స్ధానంలో నిలిచాడు. తొలి స్ధానంలో యూనివర్సల్ బాస్ క్రిస్ గేల్(14562) ఉన్నాడు. బంగ్లాదేశ్ ప్రీమియర్ లీగ్-2024లో భాగంగా శనివారం ఫార్చ్యూన్ బరిషల్‌తో జరిగిన మ్యాచ్‌లో షోయబ్ ఈ ఘనతను నమోదు చేశాడు. ఈ లీగ్‌లో రంగాపూర్ రైడర్స్‌కు మాలిక్ ప్రాతినిథ్యం వహిస్తున్నాడు. ఇక ఇది ఇలా ఉండగా.. షోయబ్ మాలిక్ ముచ్చటగా మూడోసారి ఓ ఇంటివాడయ్యాడు. పాకిస్తాన్ నటి సనా జావేద్‌ను షోయబ్ పెళ్లి చేసుకున్నాడు. దీంతో భారత టెన్నిస్ స్టార్ సానియా మీర్జా- మాలిక్ మాలిక్‌ల 14 ఏళ్ల వివాహ బంధానికి ఎండ్ కార్డ్ పడింది. ఈ విషయాన్ని సానియా- మాలిక్ ఇద్దరూ దృవీకరించారు. కాగా వీరిద్దరికి 2010లో వివాహం జరిగింది. చదవండి: U19 World Cup 2024: వరల్డ్‌కప్‌లో బోణీ కొట్టిన టీమిండియా.. 84 పరుగులతో బంగ్లా చిత్తు -
విడిపోయిన సానియా–షోయబ్
కరాచీ/న్యూఢిల్లీ: భారత టెన్నిస్ స్టార్ సానియా మీర్జా, పాకిస్తాన్ క్రికెట్ జట్టు మాజీ కెప్టెన్ షోయబ్ మాలిక్‌ల 14 ఏళ్ల వివాహ బంధానికి విడాకుల కార్డు పడింది. ఇది జరిగి చాన్నాళ్లే అయినా... సోషల్ మీడియాలో వార్త చక్కర్లు కొడుతున్నా... ఇరు వర్గాల నుంచి అధికారికంగా ‘అవును... కాదు’ అనే మాట రాలేదు! ఎలాంటి స్పష్టత లేదు. కానీ షోయబ్ ముచ్చటగా మూడోసారి ఓ ఇంటివాడు కావడంతోనే ఇద్దరి వైవాహిక బంధం ముక్కలైనట్లు అధికారికంగా... ఆలస్యంగా తెలిసింది. పాకిస్తాన్ నటి సనా జావేద్‌ను పెళ్లి చేసుకున్న షోయబ్ తన ‘ఎక్స్’ (ట్విటర్) ఖాతాలో ఫొటోల్ని పంచుకున్నాడు. 41 ఏళ్ల ఈ పాక్ క్రికెటర్‌కు ఇది మూడో పెళ్లి. హైదరాబాదీ అమ్మాయి అయేషా సిద్ధిఖికు తలాక్ ఇచ్చాకే సానియా మీర్జాను 2010 ఏప్రిల్ 12న హైదరాబాద్ వేదికగా షోయబ్ మాలిక్ రెండో వివాహం చేసుకున్నాడు. నటి సనా జావేద్కేమో ఇది రెండో పెళ్లి. ఆమె 2020లో పాకిస్తాన్ సినీ గాయకుడు, రచయిత ఉమైర్ జైస్వాల్‌ను వివాహమాడింది. అయితే వీరిద్దరి బంధం 2023లో ముగిసింది. తాజాగా సోషల్ మీడియా ‘ఎక్స్’లో షోయబ్ మాలిక్–సనా జావేద్‌ల పెళ్లి ఫోటోలు వైరల్ కావడంతోనే బయటి ప్రపంచానికి సానియా–షోయబ్‌ల పెళ్లి పెటాకులైనట్లు తెలిసింది. అంతవరకు గుసగుసలే వినిపించేవి! ఇక ఈ విషయాన్ని టెన్నిస్ స్టార్ కుటుంబ వర్గాలు ధ్రువీకరించక తప్పలేదు. ‘అవును... వాళ్లిద్దరు విడిపోయారు. ఇది ‘తలాక్’ కాదు... ‘ఖులా’ ప్రకారం వారి బంధం రద్దయింది. ఇంతకుమించి చెప్పడానికి మా దగ్గరేమీ లేదు’ అని కుటుంబ వర్గాలు తెలిపాయి. గత ఏడాది అక్టోబర్‌లో తనయుడు ఇజ్హన్ ఐదో పుట్టిన రోజు వేడుకలకు షోయబ్ హాజరయ్యాడు. అయితే ఈ వేడుకల ఫొటోలను షోయబ్, సానియా వేర్వేరుగా తమ సోషల్ మీడియా అకౌంట్లలో పంచుకున్నారు. అప్పుడు నిశ్చి తార్థం... ఇప్పుడు వివాహం! 37 ఏళ్ల సానియాకు తన ప్రొఫెషనల్ కెరీర్లో ఒడిదొడుకులు ఎదురైనట్లే వ్యక్తిగత జీవితంలోనూ ఎదురయ్యాయి. ముందుగా కుటుంబ మిత్రులైన సొహ్రాబ్తో సానియాకు నిశ్చి తార్థం కూడా ఘనంగానే జరిగింది. కానీ కొన్ని నెలల వ్యవధిలోనే పెళ్లిదాకా రాకుండానే ఆ బంధం ముగిసింది. అనంతరం పాకిస్తానీ మాజీ కెపె్టన్ షోయబ్ మాలిక్‌ను వివాహమాడింది. వీరికి ఐదేళ్ల కుమారుడు ఇజ్హాన్ ఉన్నాడు. ప్రస్తుతం తల్లి సానియా దగ్గరే ఇజ్హాన్ పెరుగుతున్నాడు. తన 20 ఏళ్ల అంతర్జాతీయ టెన్నిస్ కెరీర్లో సానియా మొత్తం 43 డబుల్స్ టైటిళ్లు సాధించింది. ఇందులో మూడు మహిళల డబుల్స్ గ్రాండ్‌స్లామ్ టైటిల్స్, మూడు మిక్స్డ్ డబుల్స్ గ్రాండ్‌స్లామ్ టైటిల్స్ ఉన్నాయి. ఇది తలాక్ కాదు... ఖులా! సరిగ్గా 14 ఏళ్ల క్రితం 2010 ఏప్రిల్ 12న టెన్నిస్ స్టార్ సానియా, పాకిస్తాన్ క్రికెట్ స్టార్ షోయబ్ మాలిక్ వివాహం అంగరంగ వైభవంగా హైదరాబాద్‌లోని ఓ స్టార్ హోటల్లో జరిగింది. ఈ బంధం 12 ఏళ్ల పాటు 2022 వరకు సజావుగానే సాగింది. ఇరువురు తమ కెరీర్‌ను కొనసాగిస్తూనే దుబాయ్‌లో కాపురం పెట్టారు. అన్యోన్యంగా సాగిన వీరి కాపురం రెండేళ్ల క్రితం బీటలు వారింది. కెరీర్‌కు రిటైర్మెంట్ పలికి వ్యక్తిగత జీవితానికి సమయం కేటాయిస్తున్న సమయంలో పొరపొచ్చలు రావడంతో సానియా మీర్జా నుంచే విడాకుల ప్రతిపాదన వచ్చింది. ఇస్లాం చట్ట ప్రకారం దీన్ని ‘ఖులా’ అంటారు. వివాహ బంధం నుంచి భార్య ఏకపక్షంగా విడిపోవాలనుకుంటే ‘ఖులా’తో రద్దు చేసుకోవచ్చు. దీనికి భర్త నుంచి భరణం, ఇతరత్రా లాంఛనాలు పూర్తి చేయాల్సిన అవసరం ఉండదు. తలాక్ అనేది భర్త రద్దు చేసుకునే విడాకుల ప్రక్రియ. కొంతకాలంగా ఇద్దరు ఎడమొహం పెడమొహంగా ఉండటంతో 2022లోనే వివాహరద్దు తంతు వివాదాస్పదం కాకుండా జరిగిపోయిందని సమాచారం. -
షోయబ్ మాలిక్‌తో విడాకులు: స్పందించిన సానియా తండ్రి
Sania Mirza Takes 'Khula' From Shoaib Malik What It Means: భారత టెన్నిస్ స్టార్ సానియా మీర్జా- పాకిస్తాన్ క్రికెటర్ షోయబ్ మాలిక్‌ల విడాకులు ఇరు దేశాల క్రీడావర్గాల్లో హాట్‌టాపిక్‌గా మారాయి. అన్యోన్యంగా కనిపించే ఈ జంట మధ్య చిచ్చు రేపిందెవరంటూ పెద్ద ఎత్తున చర్చ నడుస్తోంది. తాను పాకిస్తానీ నటి సనా జావెద్‌ను పెళ్లాడినట్లు తెలుపుతూ షోయబ్ మాలిక్ సోషల్ మీడియాలో ప్రకటించడమే ఇందుకు కారణం. సానియా- షోయబ్ విడిపోనున్నానరంటూ గత కొన్నాళ్లుగా వదంతులు వ్యాపించాయి. అవే నిజాలు ఈ క్రమంలో తాజాగా షోయబ్.. సనాతో తన పెళ్లిని ధ్రువీకరిస్తూ అవి రూమర్లుకావు నిజాలని తేల్చాడు. ఈ నేపథ్యంలో సానియాకు విడాకులు ఇచ్చిన తర్వాత.. ఈ వివాహం చేసుకున్నాడా? లేదంటే.. సానియానే షోయబ్‌తో బంధం తెంచుకుందా? అనే చర్చ మొదలైంది. - Alhamdullilah ♥️ "And We created you in pairs" وَخَلَقْنَاكُمْ أَزْوَاجًا pic.twitter.com/nPzKYYvTcV — Shoaib Malik 🇵🇰 (@realshoaibmalik) January 20, 2024 నా కూతురే స్వయంగా ఈ నేపథ్యంలో సానియా మీర్జా తండ్రి ఇమ్రాన్ మీర్జా ఈ కూతురి గురించి వస్తున్న వార్తలపై స్పందించారు. ఈ మేరకు ఆయన పీటీఐతో మాట్లాడుతూ.. ఖులా పద్ధతి ప్రకారం సానియా షోయబ్‌కు విడాకులు ఇచ్చిందని స్పష్టం చేశారు. కాగా 2010లో సానియా- షోయబ్‌ల వివాహం జరుగగా.. 2018లో ఈ జంటకు కుమారుడు ఇజహాన్ జన్మించాడు. ఖులా అంటే.. ఇస్లామిక్ షరియా చట్టాల ప్రకారం.. వివాహిత తన భర్త నుంచి విడిపోవాలనుకుంటే ఖులా పద్ధతి పాటించవచ్చు. ఇందులో ఏకపక్షంగానే స్త్రీ తనంతట తాను నిర్ణయం తీసుకునే స్వేచ్ఛ ఉంటుంది. వివాహ సమయంలో భర్త తనకు ఇచ్చిన కానుకను తిరిగి పంపడం ద్వారా విడాకులు ఇవ్వాలని నిర్ణయించుకున్నట్లు తెలియజేయవచ్చు. -
రెండో పెళ్లి చేసుకున్న పాకిస్తాన్ మాజీ కెప్టెన్ షోయబ్ మాలిక్
-
స్వర్గాన్ని నరకంగా మార్చిందెవరు?..
ప్రేమకు ఎల్లలు ఉండవు.. మనస్ఫూర్తిగా ఒక వ్యక్తిని ఇష్టపడితే తనతో కలిసి బతికేందుకు సరిహద్దులు కూడా దాటడంలో తప్పు లేదంటుంది మనసు! భారత టెన్నిస్ దిగ్గజం సానియా మీర్జా- పాకిస్తాన్ స్టార్ క్రికెటర్ షోయబ్ మాలిక్‌లకు ఈ మాటలు సరిగ్గా సరిపోతాయంటారు వాళ్ల సన్నిహితులు. పాకిస్తానీ అయిన షోయబ్‌ను పెళ్లాడేందుకు హైదరాబాదీ సానియా ఎన్ని అవాంతరాలు ఎదుర్కొందో అందరికీ తెలిసిన విషయమే! ఏది ఏమైనా.. కాబోయే భర్త గురించి వినకూడని మాటలు వినిపించినా లెక్క చేయక అతడిని ధైర్యంగా పెళ్లాడింది సానియా. అయితే.. టెన్నిస్‌లో సానియా విఫలమైనా.. క్రికెట్ మ్యాచ్‌లో షోయబ్ ఫెయిలైనా.. రెండు వైపుల నుంచి విమర్శల బాణాలు దూసుకొచ్చేది సానియా మీదకే! టీమిండియా- పాకిస్తాన్ మ్యాచ్ జరిగినా ట్రోలింగ్ బాధితురాలు తనే! అయినా.. ఆత్మవిశ్వాసం చెక్కుచెదరనీయక సానియా కెరీర్ పరంగా.. వ్యక్తిగతంగా ముందుకు సాగింది. పెళ్లైన ఎనిమిదేళ్లకు మాతృత్వ మధురిమలను ఆస్వాదిస్తూ షోయబ్‌తో కలిసి తమ కలల పంట ఇజహాన్‌కు జన్మనిచ్చింది. తల్లైన తర్వాత మళ్లీ ఫిట్నెస్ సాధించి కొడుకుతో పాటు టెన్నిస్ కోర్టులో అడుగుపెట్టింది. కెరీర్లో ఉన్నత శిఖరాలకు నిజానికి.. ఐదేళ్ల వయసులోనే రాకెట్ సానియా.. ఇరవై ఏళ్ల సుదీర్ఘ కెరీర్లో ఎన్నో గొప్ప ఘనతలు సాధించింది. డబుల్స్‌లో నంబర్ వన్ స్థాయికి ఎదిగిన ఆమె కెరీర్లో మూడు డబుల్స్ గ్రాండ్‌స్లామ్, మూడు మిక్స్డ్ గ్రాండ్‌స్లామ్ టైటిల్స్ గెలిచింది. మొత్తంగా తన కెరీర్లో 43 డబుల్స్ ట్రోఫీలు గులిచింది. 91 వారాలు నంబర్ వన్‌గా కొనసాగిన ఘనత తన ఖాతాలో వేసుకుంది. కెరీర్లో ఉన్నత స్థాయిలో ఉన్న సమయంలోనే భర్తతో సానియాకు విభేదాలు తలెత్తాయంటూ వార్తలు వచ్చాయి. షోయబ్ మాలిక్ ప్రవర్తన నచ్చక ఆమె అతడికి దూరంగా ఉంటుందనే ఊహాగానాలు వినిపించాయి. ఆ నటితోనూ సాన్నిహిత్యం నటి అయేషా ఒమర్‌తో షోయబ్ సన్నిహితంగా మెలగడం వల్లే దంపతుల మధ్య విభేదాలు తలెత్తాయని పాక్ మీడియా కథనాలు ప్రచురించింది. అందుకు తగ్గట్లుగానే సానియా గురించి ఎదురైన ప్రశ్నలకు షోయబ్ సమాధానాలు దాటవేయటం.. సానియా సైతం హృదయం ముక్కలైదంటూ సోషల్ మీడియాలో పోస్టులు పెట్టడంతో ఈ వదంతులకు బలం చేకూరింది. వీటిని నిజం చేసే విధంగా.. ‘‘వివాహ బంధం.. విడాకులు రెండూ క్లిష్టమైనవే’’ అంటూ సానియా మీర్జా ఇటీవల మరో పోస్టు షేర్ చేయడంతో అనధికారికంగా విడాకుల విషయాన్ని ధ్రువీకరించినట్లయింది. తాజాగా.. నటి సనా జావెద్‌ను పెళ్లాడినట్లుగా షోయబ్ మాలిక్ ఫొటోలు షేర్ చేసి అధికారికంగా సానియాతో బంధం తెంచుకున్నట్లు పరోక్షంగా ప్రకటన చేశాడు. అప్పుడు అలా.. నిజానికి సానియా కంటే ముందే షోయబ్ మాలిక్ హైదరాబాద్‌కు చెందిన అయేషా సిద్ధిఖీని వివాహం చేసుకున్నాడన్న వార్తలు అప్పట్లో సంచలనం రేపాయి. ఆమెకు విడాకులు ఇవ్వకుండానే సానియాతో పెళ్లికి సిద్ధపడగా.. మధ్యవర్తుల జోక్యంతో వివాదం సద్దుమణిగినట్లు కథనాలు వెలువడ్డాయి. అయేషాతో విడాకుల నేపథ్యంలో షోయబ్ ఆమెకు రూ. 15 కోట్ల భరణం కూడా ఇచ్చినట్లు సమాచారం. అంగరంగ వైభవంగా పెళ్లి ఈ క్రమంలో ఏప్రిల్ 12, 2010లో షోయబ్ మాలిక్ సానియా మీర్జాను వివాహం చేసుకున్నాడు. హైదరాబాద్‌లోని తాజ్ క్రిష్ణ హోటళ్లో సంప్రదాయ పద్ధతిలో వీరి నిఖా జరిగింది. భారత్- పాకిస్తాన్ దేశాలకు చెందిన ఇద్దరు అగ్రశ్రేణి క్రీడాకారుల పెళ్లి ఇరు దేశాల్లోనూ పెద్ద వార్తగా మారిపోయింది. ఇక పెళ్లైన ఎనిమిదేళ్ల తర్వాత సానియా- షోయబ్‌లకు కుమారుడు ఇజహాన్ జన్మించాడు. అయితే, గత కొన్నేళ్లుగా నటి సనా జావెద్‌తో షోయబ్ సన్నిహితంగా మెలుగుతున్నాడన్న కారణంగా సానియా అతడికి దూరంగా ఉన్నాడనే వార్తలు వచ్చాయి. ఇప్పుడు వాటినే నిజం చేస్తూ పెళ్లి ఫొటోలతో షోయబ్ మాలిక్ క్లారిటీ ఇచ్చేశాడు. ఇక షోయబ్‌కు ఇది మూడో పెళ్లి కాగా.. సనా జావెద్‌కు రెండో పెళ్లి!! స్వర్గాన్ని నరకంగా మార్చిందెవరు? ఈ నేపథ్యంలో సానియా- షోయబ్ జోడీ అభిమానులు.. ‘‘ప్రేమకు ఎల్లలు ఉండవని సానియా నిరూపించింది. అందరిని ఎదిరించి షోయబ్‌ను పెళ్లాడింది. కానీ చివరకు ఏం మిగిలింది. సానియా- షోయబ్‌ల స్వర్గాన్ని నరకంగా మార్చిందెవరు? షోయబ్ మాలిక్ పోస్ట్ మా హృదయాలను ముక్కలు చేసింది’’ అంటూ సోషల్ మీడియా వేదికగా ఈ జంటను ట్రెండ్ చేస్తున్నారు. చదవండి: IND A Vs Eng Lions: భారత జట్టులో తిలక్, రింకూలకు చోటు: బీసీసీఐ ప్రకటన -
షోయబ్ మూడో పెళ్లి: ఇంతకీ ఎవరీ సనా? అపుడు ఆయేషా, ఇపుడు సానియా
పాకిస్తానీ క్రికెటర్ షోయబ్ మాలిక్, భారత టెన్నిస్ దిగ్గజం సానిమా మీర్జాను మోసం చేశాడా? ఆమెకు అన్యాయం చేసి మూడోపెళ్లి చేసుకున్నాడా? అసలు సానియాకు విడాకులిచ్చాడా? నటి సనా జావేద్‌తో షోయబ్ పెళ్లి ఫోటోలు వైరల్ కావడంతో ఇవే ప్రశ్నలు,చర్చలు జోరుగా నడుస్తున్నాయి. భారత టెన్నిస్ స్టార్ సానియా మీర్జా, పాకిస్తాన్ క్రికెట్ జట్టు మాజీ కెప్టెన్ షోయబ్ మాలిక్ పేర్లు క్రీడా ప్రపంచంలో తెలియను వారుండరు. అయితే పెళ్లిళ్ల విషయంలోవివాదంలో చిక్కుకోవడం షోయబ్‌కు ఇదే మొదటిసారికాదు. మొదటి భార్యకు విడాకులివ్వకుండానే సానియాతో పెళ్లికి సిద్ధమయ్యాడు. దీంతో షోయబ్ మొదటి భార్య కోర్టు కెక్కింది. అయేషా సిద్ధిఖీ సానియాతో పెళ్లికి కొన్ని రోజుల ముందు తనను మోసం చేశాడంటూ షోయబ్‌పై పోలీసులకు ఫిర్యాదు చేయడంతో షోయబ్ వ్యవహారం వెలుగులో వచ్చింది. 2002లో పెళ్లి చేసు కున్నాడంటూ “నిఖాహనామా” కాపీలను మీడియాకు చూపడంతో వివాదం రాజుకుంది. దీంతో తొలుత ఆమె వాదనను తిరస్కరించిన షోయబ్ చివరకు ఆయేషాను వివాహం చేసుకున్నట్లు అంగీకరించాడు. 2010, ఏప్రిల్ 7న ఆమెకు విడాకులు ఇచ్చాడు. రూ.15కోట్ల భరణం ఇచ్చినట్టు కూడా సమాచారం. తాజాగా శనివారం (జనవరి 20, 2024) పాపులర్ పాక్ నటి సనా జావేద్‌తో నిఖా చేసుకున్నట్టు షోయబ్ సోషల్ మీడియాలో ఫోటోషేర్ చేయడం అందర్నీ విస్మయపర్చింది. షోయబ్, సనా పెళ్లి ఫొటోలు సామాజిక మాధ్యమాల్లో వైరల్‌గా మారాయి. సనా జావేద్ ఎవరు? సనా జావేద్ కూడా ఇది రెండో పెళ్లి కావడం గమనార్హం. 2012లో గ్లాయర్ ప్రపంచంలోకి అడుగుపెట్టిన సనా షెహర్-ఎ-జాత్, ప్యారే అఫ్జల్, జరా యాద్ కర్, రుస్వాల్, డంక్, ఇంతేజార్ వంటి అనేక సీరియల్స్‌లో పనిచేసింది. రొమాంటిక్ డ్రామా 'ఖానీ'లో టైటిల్ రోల్ద్వారా బాగా పాపులర్ అయింది. సనా ప్రస్తుతం ARY డిజిటల్ డ్రామా, సుకూన్‌లో యాక్ట్ చేస్తోంది. షోయబ్ మాలిక్‌తో పెళ్లికి ముందు, పాకిస్తానీ గాయకుడు ఉమైర్ జస్వాల్‌ను 2020లో వివాహం చేసుకుంది. ఒకరికొరు 'ఖుబూల్ హై' అని చెప్పుకున్నది మొదలు వరుసగా బ్యూటిఫుల్ పిక్స్, నిరంతరం సోషల్ మీడియా అప్డేట్స్తో బ్యూటిఫుల్ కపుల్‌గా ఫ్యాన్స్‌ను ఆకట్టుకున్నారు. కొన్ని రోజులకే సడెన్‌గా వీరి పోస్ట్‌లు ఆగిపోవడం, ఆ తరువాత 2023లో ఇన్స్టానుంచి వెడ్డింగ్, ఈద్ తదితర వేడుకలకు సంబంధించిన ఫోటోలను ఇద్దరూ తొలగించడంతో వీరు విడిపోయారనే పుకార్లు మీడియాలో చక్కర్లు కొట్టాయి. అప్పుడే హింట్ గత ఏడాదినుంచి వీరిద్దరూ రిలేషన్ షిప్లో ఉన్నట్లు ఊహాగానాలున్నాయి. ఈ పుకార్లు మార్చి 25, 2023న సనాకు పుట్టినరోజు సందర్భంగా మరింత ఆజ్యం పోశాడు షోయబ్. ఇన్స్టాగ్రామ్ ఖాతాలో "హ్యాపీ బర్త్‌డే, బడ్డీ" అంటూ ఇద్దరు కలిసి ఉన్న ఫోటోలను షేర్ చేశాడు. అలా షోయబ్ తమ ప్రేమ, పెళ్లిపై తొలి హింట్ ఇచ్చాడు. సానియా ఆవేదనకు అద్దం లేటెస్ట్ పోస్ట్ బహుశా తన గుండె పగిలే షోయబ్ పెళ్లి వార్త ముందే తెలుసో ఏమో.. జీవితం అంటే అంత ఈజీ కాదు. జీవితంలో పెళ్లి, విడాకులు రెండూ కష్టమే. ఈరెండు దారుల్లో ఒకదానికి ఎంచుకోవడం మరీ కష్టం అంటూ ఆవేదనతో ఒక పోస్ట్‌ను షేర్ చేసింది. సానియాతో పెళ్లి సానియా, షోయబ్ 2010లో హైదరాబాద్‌లో ముస్లిం సంప్రదాయ పద్ధతిలో పెళ్లి చేసుకున్నారు. వీరికి 2018లో కుమారుడు ఇజాన్ పుట్టాడు. -
సానియా మీర్జాకు విడాకులు?.. నటిని పెళ్లాడిన షోయబ్ మాలిక్!
Shoaib Malik marries Pakistani actress Sana Javed:పాకిస్తాన్ వెటరన్ క్రికెటర్ షోయబ్ మాలిక్ మళ్లీ పెళ్లి చేసుకున్నాడు. పాకిస్తానీ నటి సనా జావెద్‌ను పెళ్లాడాడు. ఈ విషయాన్ని షోయబ్ మాలిక్ స్వయంగా వెల్లడించాడు. సోషల్ మీడియా వేదికగా తమ పెళ్లి ఫొటోలు పంచుకుంటూ.. ‘‘జంటగా మేము ఇలా’’ అంటూ హార్ట్ ఎమోజీలు జతచేశాడు షోయబ్ మాలిక్. షోయబ్‌ను ప్రేమించి పెళ్లి చేసుకున్న సానియా కాగా భారత టెన్నిస్ స్టార్, హైదరాబాదీ సానియా మీర్జా- షోయబ్ మాలిక్ ప్రేమించి పెళ్లి చేసుకున్న విషయం తెలిసిందే. 2010లో వీరి వివాహం జరుగగా.. 2018లో కుమారుడు ఇజహాన్ జన్మించాడు. అయితే, సానియా కంటే ముందు షోయబ్ మాలిక్ అయేషా సిద్దిఖీ అనే మహిళను పెళ్లి చేసుకున్నట్లు సమాచారం. ఆమె నుంచి విడిపోయిన తర్వాత సానియాను పెళ్లాడినట్లు తెలుస్తోంది. హృదయం ముక్కలైందన్న సానియా ఇదిలా ఉంటే.. గత కొంతకాలంగా సానియా- షోయబ్ మధ్య విభేదాలు తలెత్తాయనే వార్తలు వచ్చాయి. వీరిద్దరు విడాకులు తీసుకోబోతున్నారంటూ వదంతులు వ్యాపించాయి. నటి ఆయేషాతో ఓ ఫొటోషూట్‌లో షోయబ్ మాలిక్ అత్యంత సన్నిహితంగా కనిపించడం.. అదే సమయంలో హృదయం ముక్కలైందంటూ సానియా పోస్టులు పెట్టడం వీటికి ఊతమిచ్చింది. అదే విధంగా కుమారుడి పుట్టినరోజు వేడుకలోనూ సానియా- షోయబ్ అంటీ ముట్టనట్టుగానే వ్యవహరించడంతో విడాకుల వార్తలు విస్తృతంగా వ్యాపించాయి. ఈ నేపథ్యంలో సానియా మీర్జా బుధవారం నర్మగర్భ సందేశం పోస్ట్ చేయడంతో వీరు విడిపోయారని నిర్ధారణకు వచ్చారు నెటిజన్లు. వివాహ బంధం.. విడాకులు.. రెండూ క్లిష్టమైనవే: సానియా ‘‘వివాహ బంధం అత్యంత క్లిష్టమైనది. విడాకులు కూడా అంతే కష్టమైనవి. ఇందులో ఏది అత్యంత ఇబ్బందికరమైందో మీరే ఎన్నుకోండి. ఒబేసిటీ హార్డ్.. ఫిట్‌గా ఉండటం కూడా కష్టమే. మరి ఇందులో ఏది ఎంచుకుంటారు? అప్పుల్లో కూరుకుపోవడం కష్టంగా తోస్తుంది.. అదే సమయంలో ఆర్థికంగా క్రమశిక్షణతో ఉండటం కూడా అలాగే అనిపిస్తుంది. ఇందులో మీకు ఏం కావాలో ఎంచుకోండి. కమ్యూనికేట్ చేయడం.. కమ్యూనికేట్ చేయకుండా ఉండటం కూడా కష్టమే. ఇందులో ఏది అత్యంత కష్టమో మీరే ఎంచుకోండి. జీవితం నల్లేరు మీద నడకలాంటిది కాదు. తెలివిగా ఎంచుకోవాలి ఎప్పుడూ క్లిష్టతరంగానే ఉంటుంది. అయితే, అందులో మనకేదీ కావాలో మనం తెలివిగా ఎంచుకోవాలి’’ అని సానియా మీర్జా భావోద్వేగపూరిత నోట్ షేర్ చేసింది. ఇంతలో షోయబ్ మాలిక్ ఇలా శనివారం నటి సనా జావెద్‌తో పెళ్లి ఫొటోలను షేర్ చేయడం గమనార్హం. సానియా- షోయబ్ జంట అభిమానులు ఈ చేదు వార్తను జీర్ణించుకోలేకపోతున్నారు. ఇది ఏదైనా యాడ్ షూట్‌కు సంబంధించిన ఫొటో అయితే బాగుండని కామెంట్లు చేస్తున్నారు. Confirmation: Our beloved superstar @realshoaibmalik has tied the knot (Nikkah) with #SanaJaved. Wishing the new couple an amazing life ahead filled with happiness and joy! #ShoaibMalik ❤️ pic.twitter.com/l73fQwLmit — Arsalan H. Shah (@arsalanhshah) January 20, 2024 చదవండి: Ayodhya Ram Mandir Inauguration: అయోధ్యకు వెళ్లి తీరతా.. ఏం చేస్తారో చేసుకోండి: హర్భజన్ సింగ్ - Alhamdullilah ♥️ "And We created you in pairs" وَخَلَقْنَاكُمْ أَزْوَاجًا pic.twitter.com/nPzKYYvTcV — Shoaib Malik 🇵🇰 (@realshoaibmalik) January 20, 2024 -
సానియా–షోయబ్ మధ్య విభేదాలు!
ముంబై: భారత స్టార్ టెన్నిస్ క్రీడాకారిణి సానియా మీర్జా తన భర్త, పాకిస్తాన్ క్రికెటర్ షోయబ్ మాలిక్‌తో విడిపోయిందా! గతంలో కూడా పలుమార్లు వీరి విడాకులపై పుకార్లు రావడం, వాటిని సన్నిహితులు ఖండించడం జరిగాయి. అయితే ఈసారి జరిగిన పరిణామం మరోసారి అదే అనుమానాన్ని రేకెత్తిస్తోంది. షోయబ్ తన ఇన్స్టాగ్రామ్ అకౌంట్ నుంచి రిలేషన్షిప్ స్టేటస్‌లో చేసిన మార్పుతో ఈ చర్చ మొదలైంది. ఇప్పటివరకు షోయబ్ ప్రొఫైల్‌లో ‘సూపర్ ఉమన్ సానియా హజ్బెండ్’ అంటూ ఉండగా, ఇప్పుడు మారి ‘ఫాదర్ టు వన్’ అని వచ్చింది. దీంతో వీరిద్దరు విడిపోయారని వార్తలు వస్తున్నాయి. అయితే ఇది వారి వ్యక్తిగత వ్యవహారమని, దీనిపై ఏ రకంగా వారు స్పందించదల్చుకోలేదని సానియా కుటుంబ వర్గాలు వెల్లడించాయి. సానియా, షోయబ్ మధ్య 2010లో పెళ్లి జరగ్గా... 2018లో కొడుకు ఇజ్హాన్ పుట్టాడు. -
షోయబ్ మాలిక్ తో సానియా విడాకులు..ఇదిగో ప్రూఫ్
-
షోయబ్ మాలిక్‌తో సానియా విడాకులు?
-
Sania Mirza And Shoaib Divorce Rumours: సానియా, మాలిక్ విడాకుల రూమర్స్.. వైరలవుతున్న పెళ్లి ఫోటోలు
-
సానియా, మాలిక్ విడాకులు నిజమేనా..!? మరోసారి తెరపైకి
పాకిస్తాన్ స్టార్ క్రికెటర్ షోయబ్ మాలిక్, భారత టెన్నిస్ దిగ్గజం సానియా మీర్జా విడాకుల ఆంశం మరోసారి తెరపైకి వచ్చింది. వీరిద్దరూ త్వరలోనే తమ వివాహ బంధానికి స్వస్తి పలకనున్నట్లు ఊహాగానాలు వినిపిస్తున్నాయి. తాజాగా షోయబ్ మాలిక్ తన ఇన్స్టాగ్రామ్ బయోలో మార్పు చేయడమే ఇందుకు కారణం. ఇంతకుముందు షోయబ్ మాలిక్ ఇన్స్టాగ్రామ్ బయోలో 'సూపర్ ఉమెన్ సానియా మీర్జా' అని ఉండేది. అయితే ఇప్పుడు ఆ వాక్యాన్ని బయో నుంచి తొలగించి.. తన వ్యక్తిగత సమాచారాన్ని పొందుపరిచాడు. బయోలో ఇతర వివరాలతో పాటు "ఓ బిడ్డకు తండ్రిగా ఉన్నందుకు సంతోషంగా ఉందంటూ" మాలిక్ రాసుకొచ్చాడు. ఇది ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. దీంతో మాలిక్, సానియా విడాకులు తీసుకోవడం ఖాయమని నెటిజన్లు గుసగుసలాడుకుంటున్నారు. గతంలో కూడా.. కాగా కొన్ని నెలల క్రితం కూడా సానియా,షోయబ్ మధ్య విభేదాలు తలెత్తాయనీ, వారిద్దరూ విడాకులు తీసుకోబోతున్నారనే పుకార్లు తెగ షికార్లు చేశాయి. పాకిస్తానీ నటి అయేషా ఉమర్‌తో మాలిక్ వివాహేతర సంబంధం కొనసాగిస్తున్నాడనే ప్రచారం కూడా జరిగింది. అయితే ఈ వార్తలను అయేషా కొట్టిపారేసింది. అవన్నీ పుకార్లే అని ఆమె సృష్టం చేసింది. అయితే ఇదే సమయంలో సానియా,షోయబ్‌ల కొత్త టాక్ షో 'ది మీర్జా మాలిక్ షో'రావడంతో వారి విడాకుల ఊహాగానాలకు తెరపడింది. అయితే తాజాగా మాలిక్ చర్యతో మళ్లీ వారి విడాకుల వార్తలు సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్నాయి. కానీ ఈ వార్తలపై ఇప్పటివరకు సానియా, షోయబ్ ఎవరూ స్పందించలేదు. కాగా సానియా, షోయబ్ 2010లో వివాహం చేసుకున్నారు. వీరికి 2018లో ఇజహాన్ జన్మించాడు. చదవండి: IND vs WI: వెస్టిండీస్‌తో తొలి టీ20.. చరిత్రకు అడుగు దూరంలో టీమిండియా కెప్టెన్ -
ఎల్బీ స్టేడియంలో కేసీఆర్ ‘ఇఫ్తార్ విందు’.. హాజరైన ప్రముఖులు (ఫొటోలు)
-
సానియా మీర్జా ఫేర్‌వెల్‌లో సందడి చేసిన మహేశ్ దంపతులు
భారత స్టార్ టెన్నిస్ క్రీడాకారిణి సానియా మీర్జా అంతర్జాతీయ టెన్నిస్‌కు వీడ్కోలు పలికిన విషయం తెలిసిందే. ఈ క్రమంలో నిన్న (మార్చి 5) హైదరాబాద్‌లో జరిగిన ఫేర్వెల్ పార్టీలో పలువురు ప్రముఖులు పాల్గొన్నారు. టాలీవుడ్ నుంచి సూపర్ స్టార్ మహేశ్ బాబు తన సతీమణి నమ్రతా శిరోద్కర్‌తో కలిసి ఫేర్వెల్ పార్టీకి హాజరయ్యారు. ఇద్దరూ బ్లాక్ అవుట్‌ఫిట్‌లో ఈవెంట్లో స్పెషల్ అట్రాక్షన్‌గా నిలిచారు. ఇక సానియాతో దిగిన ఓ ఫోటోను షేర్ చేస్తూ.. ‘ఇన్నాళ్ల నీ ప్రయాణం చూస్తుంటే చాలా గర్వంగా ఉంది’ అంటూ మహేశ్ బాబు ట్వీట్ చేశాడు. దీనికి సంబంధించిన ఫోటో ప్రస్తుతం నెట్టింట వైరల్‌గా మారింది. కాగా సానియా మీర్జా కుటుంబంతో మహేశ్‌బాబు, నమ్రతకు మంచి అనుబంధం ఉంది. గతంలోనూ పలు ఫ్యామిలీ ఫంక్షన్స్‌లో వీళ్లు సందడి చేశారు. (ఫొటో గ్యాలరీ కోసం ఇక్కడ క్లిక్ చేయండి) What a journey!! So so proud of you! 🤗 @MirzaSania pic.twitter.com/qyWAIUs0XB — Mahesh Babu (@urstrulyMahesh) March 5, 2023 -
ఫేర్వెల్ ఫంక్షన్లో బిజీబిజీగా సానియా.. భర్త షోయబ్ మాలిక్ ఎక్కడ..?
Sania Mirza-Shoaib Malik: భారత స్టార్ టెన్నిస్ క్రీడాకారిణి సానియా మీర్జా ఇటీవలే ప్రొఫెషనల్ టెన్నిస్‌కు వీడ్కోలు పలికిన విషయం తెలిసిందే. ఈ క్రమంలో నిన్న (మార్చి 5) హైదరాబాద్‌లోని ఎల్బీ స్టేడియంలో జరిగిన ఫేర్వెల్ ఎగ్జిబిషన్ మ్యాచ్‌ల్లో పాల్గొన్న సానియా.. చివరిసారిగా రాకెట్ పట్టుకుని అందరినీ అలరించింది. ఫేర్వెల్ మ్యాచ్‌ల్లో భాగంగా జరిగిన సింగిల్స్ పోటీలో రోహన్ బోపన్నతో తలపడిన సానియా.. ఆ తర్వాత జరిగిన మిక్స్డ్ డబుల్స్‌లో బోపన్నతో జతకట్టి.. ఇవాన్ డోడిక్, మ్యాటెక్ సాండ్స్ జోడీని ఢీకొట్టింది. నామమాత్రంగా జరిగిన ఈ రెండు మ్యాచ్‌ల్లో సానియానే విజయం సాధించింది. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన ప్రత్యేక కార్యక్రమానికి హాజరైన తెలంగాణ మంత్రులు కేటీఆర్, శ్రీనివాస్ గౌడ్, భారత క్రికెట్ జట్టు మాజీ కెప్టెన్ మహ్మద్ అజహారుద్దీన్, హీరో దుల్కర్ సల్మాన్, భారత మాజీ క్రికెటర్ యువరాజ్ సింగ్ తదితరులు సానియాపై పొగడ్తల వర్షం కురిపించారు. ఫేర్వెల్ మ్యాచ్‌ల అనంతరం ఓ ప్రైవేట్ హోటల్లో జరిగిన రెడ్ ప్రత్యేక కార్పెట్ ఈవెంట్లో పాల్గొన్న సానియా.. సినీ, క్రీడా, రాజకీయ ప్రముఖులతో కలిసి సందడి చేసింది. ఈ కార్యక్రమంలో ఏఆర్ రెహ్మాన్, ప్రిన్స్ మహేశ్ బాబు సెంటర్ ఆఫ్ అట్రాక్షన్‌గా నిలిచారు. Wasim Akram and Shoaib Malik in an intense discussion after the match 🧐 What could they be discussing? 🤔#IUvKKpic.twitter.com/HHumHfhUnt — Cricket Pakistan (@cricketpakcompk) March 3, 2023 కాగా, సానియా గౌరవార్ధం నిన్న జరిగిన కార్యక్రమాల్లో ఆమె భర్త షోయబ్ మాలిక్ కనిపించకపోవడం చర్చనీయాంశంగా మారింది. నిన్నటి నుంచి నెటిజన్లు షోయబ్ ఆచూకీ కోసం గాలిస్తున్నారు. ఈ క్రమంలో జనాలకు కొన్ని ఆసక్తికర విషయాలు తెలిసాయి. ప్రస్తుతం షోయబ్ పాకిస్తాన్ సూపర్ లీగ్ షెడ్యూల్‌తో బిజీగా ఉన్నాడని తెలిసిందే. షోయబ్‌కు సంబంధించిన ఓ వీడియో సానియా ఫేర్వెల్ ఈవెంట్‌కు కొద్ది రోజుల కిందట నెట్టింట చక్కర్లు కొట్టింది. పీఎస్ఎల్లో కరాచీ కింగ్స్‌కు ప్రాతినిధ్యం వహించే షోయబ్.. ఆ ఫ్రాంచైజీ మెంటార్, పాక్ మాజీ కెప్టెన్ వసీం అక్రమ్‌తో వాదన తరహా డిస్కషన్‌కు దిగినట్లు ఆ వీడియో ద్వారా తెలుస్తోంది. భార్య సానియా కోసం ఏర్పాటు చేసిన ప్రత్యేక కార్యక్రమాల్లో షోయబ్ పాల్గొనకపోవడంతో ఈ వీడియో మరోసారి నెట్టింట ట్రెండింగ్‌లో నిలిచింది. సానియా-షోయబ్ జంట విడాకులు తీసుకున్నారని ప్రచారం జరుగుతున్న నేపథ్యంలో.. ఇరువురు మీకు మీరే మాకు మేమే అన్న రీతిలో వ్యవహరించడంతో వీరి మధ్య అంతా అయిపోయిందని, విడాకులే బాకీ అని నెటిజన్లు చర్చించుకుంటున్నారు. -
సానియా మీర్జా ఫేర్వెల్ ఈవెంట్ ప్రముఖుల సందడి (ఫొటోలు)
-
సానియా మీర్జా ఫేర్వెల్ మ్యాచ్.. సినీ, క్రీడా, రాజకీయ ప్రముఖుల సందడి (ఫొటోలు)
-
ఎల్బీ స్టేడియంలో జరిగిన ఎగ్జిబిషన్ మ్యాచ్ లో సానియా విజయం
-
కంటతడి పెట్టిన సానియా మీర్జా
సాక్షి, హైదరాబాద్: ఇటీవలే ప్రొఫెషనల్ టెన్నిస్‌కు గుడ్‌బై చెప్పిన భారత స్టార్ టెన్నిస్ క్రీడాకారిణి సానియా మీర్జా, హైదరాబాద్‌లోని ఎల్బీ స్టేడియంలో ఇవాళ (మార్చి 5) జరిగిన ఫేర్వెల్ ఎగ్జిబిషన్ మ్యాచ్‌లో పాల్గొంది. సింగిల్స్ విభాగంలో రోహన్ బోపన్నతో జరిగిన ఈ మ్యాచ్‌లో సానియా విజయం సాధించింది. మ్యాచ్ అనంతరం ఒక్కసారిగా భావోద్వేగానికి లోనైన సానియా.. తన 20 ఏళ్ల సుదీర్ఘ ప్రయాణంలో జరిగిన సంఘటనలు గుర్తు చేసుకుంటూ కంటతడి పెట్టింది. ఈ సందర్భంగా సానియా కొడుకు అమ్మ గ్రేట్ అంటూ తన ప్రేమను వ్యక్తం చేయడంతో స్టేడియం మొత్తం హర్షద్వానాలు మార్మోగింది. అనంతరం సానియా మిక్సడ్ డబుల్స్ మ్యాచ్ కూడా ఆడనుంది. ఈ మ్యాచ్‌లో రోహన్ బోపన్నతో జతకట్టనున్న సానియా.. ఇవాన్ డోడిక్, మ్యాటెక్ సాండ్స్ జోడీతో తలపడనుంది. సానియా ఆడే చివరి మ్యాచ్ చూసేందుకు క్రీడారంగానికి చెందిన వారితో పాటు టాలీవుడ్, బాలీవుడ్, ఇతర రంగాలకు చెందిన సెలబ్రిటీలు ఎల్బీ స్టేడియంకు చేరుకున్నారు. టీమిండియా మాజీ కెప్టెన్ మహ్మద్ అజహారుద్దీన్, సిక్సర్ల కింగ్ యువరాజ్ సింగ్, సీతారమం ఫేమ్ దుల్కర్ సల్మాన్ ఈ ఈవెంట్లొ సెంటర్ ఆఫ్ అట్రాక్షన్‌గా నిలిచారు. ఇవాళ సాయంత్రం ఓ ప్రైవేట్ హోటల్లో జరిగే రెడ్ కార్పెట్ ఈవెంట్‌కు కేంద్ర మంత్రి కిరణ్ రిజిజు, హీరోలు మహేష్ బాబు, అల్లు అర్జున్, ఏ ఆర్ రెహమాన్, సురేష్ రైనా, జహీర్ ఖాన్, ఇర్ఫాన్ పఠాన్‌తో తోపాటు మరికొందరు స్పోర్ట్స్, సినిమా స్టార్స్ హాజరుకానున్నారని సమాచారం. కాగా, సానియా తన 20 ఏళ్ల ప్రొఫెషనల్ టెన్నిస్ కెరీర్లో 6 గ్రాండ్ స్లామ్ టైటిల్స్, 43 WTA టైటిల్స్, ఏసియన్ గేమ్స్ లో 8 పతకాలు, కామన్వెల్త్ గేమ్స్ లో 2 మెడల్స్ సాధించిన విషయం తెలిసిందే. ఈ హైదరాబాదీ క్వీన్ డబుల్స్ లో 91 వారాల పాటు వరల్డ్ నెంబర్ వన్ ర్యాంక్‌లో కొనసాగింది. భారత టెన్నిస్‌కు సేవలందించినందకు గాను సానియాకు అత్యున్నత క్రీడా పురస్కారం ఖేల్ రత్న తోపాటు అర్జున, పద్మ భూషణ్, పద్మ శ్రీ అవార్డులు లభించాయి. సానియా ప్రస్తుతం మహిళల ఐపీఎల్లో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూర్ టీమ్‌కు మెంటర్‌గా వ్యవహరిస్తుంది. -
'చిన్నప్పుడు నువ్వు పెద్ద టార్చ్‌బేరర్..'
టీమిండియా వుమెన్స్ స్టార్ క్రికెటర్ స్మృతి మంధాన ఇప్పుడు బాగా పాపులర్. సౌరవ్ గంగూలీ బ్యాటింగ్ స్టైల్‌ను తలపించే స్మృతి మంధాన ఇటీవలే ముగిసిన టి20 ప్రపంచకప్‌లో తన ప్రదర్శనతో ఆకట్టుకుంది. తాజాగా వుమెన్స్ ప్రీమియర్ లీగ్(WPL 2023)లో భాగంగా మంధాన ఆర్సీబీ వుమెన్స్ కెప్టెన్‌గా ఎంపికైంది. రికార్డు స్థాయిలో రూ.3.4 కోట్లకు అమ్ముడై చరిత్ర సృష్టించింది. ఆర్సీబీ నాయకురాలిగా జట్టును నడిపించనున్న మంధాన ఇవాళ ఢిల్లీ క్యాపిటల్స్‌తో అమితుమీ తేల్చుకోనుంది. కాగా ఆర్సీబీ.. జట్టు మెంటార్‌గా టెన్నిస్ మాజీ స్టార్ సానియా మీర్జాను నియమించిన సంగతి తెలిసిందే. కాగా ఢిల్లీ క్యాపిటల్స్‌తో మ్యాచ్‌కు సన్నద్దమవుతున్న నేపథ్యంలో ఆర్సీబీ కెప్టెన్ స్మృతి మంధాన, సానియా మీర్జాలు ఒకరినొకరు ఇంటర్య్వూ చేసుకున్నారు. దీనికి సంబంధించిన వీడియోను ఆర్సీబీ తన ట్విటర్లో షేర్ చేసింది. ఈ సందర్భంగా సానియా, మంధానలు కెరీర్ పరంగా ఎదిగిన తీరు, ఒత్తిడిని తట్టుకొని ఆడిన మ్యాచ్‌లు, ఆర్సీబీ లాంటి స్టార్ ఫ్రాంచైజీకి వివిధ హోదాల్లో ప్రాతినిధ్యం వహించడం గురించి పిచ్చాపాటిగా మాట్లాడుకున్నారు. స్మృతి మంధాన మాట్లాడుతూ..'' నా ఇంట్లో సానియా మీర్జాను ఆదర్శంగా తీసుకున్నారు. సానియా ఎదుగుదల చూసి క్రికెట్ కంటే టెన్నిస్ ఆటను ఏంచుకోవాలంటూ ఎంకరేజ్ చేసేవారు. కానీ నా దృష్టంతా క్రికెట్‌పైనే ఉండేది. అందుకే నా చిన్నప్పుడు సానియా పెద్ద టార్చ్‌బేరర్‌లా కనిపించేది. ఎందుకంటే ప్రతి మహిళా అథ్లెట్ మరో సానియాలా తయారవుదామనుకునేవారు. అప్పట్లో ఇది బాగా ట్రెంట్ అయింది. 9 లేదా 10 ఏళ్లు అనుకుంటా నాకు బాగా గుర్తు.. మా అమ్మ నాతో ఒక విషయం చెప్పింది. ఎందుకు నువ్వు టెన్నిస్‌ను ఏంచుకోకూడదు.. అని ప్రశ్నించింది. దానికి నాకు క్రికెట్ అంటే అమితమైన ఆసక్తి.. ఇప్పటికిప్పుడు క్రికెట్ నుంచి టెన్నిస్‌లోకి రాలేను. అందుకే క్రికెట్లో రాణించి మరో సానియాలా పేరు తెచ్చుకుంటా అని అమ్మకు మాటిచ్చా'' అంటూ తెలిపింది. మంధాన మాటలకు స్పందించిన సానియా.. ''థ్యాంక్ గాడ్ బతికించావు.. లేకుండా నాకు పోటీగా మరొకరు వచ్చేవారేమో(నవ్వుతూ)'' పేర్కొంది. ఇక మంధాన జెర్సీ నెంబర్ 18 ధరించడంపై సానియా ప్రశ్నించింది. టీమిండియాలో నెంబర్-18కి ప్రత్యేక స్థానం ఉంది. అది కోహ్లి జెర్సీ.. ఆర్సీబీ కూడా కోహ్లికి 18వ నెంబర్ కేటాయించింది. క్రికెట్ చరిత్రలోనే కోహ్లి బెస్ట్ క్రికెటర్‌గా పేరు పొందాడు. మరి అలాంటి జెర్సీ నువ్వు ధరించడంపై ఏమంటావు అని సానియా అడిగింది. దీనికి మంధాన స్పందిస్తూ.. ''గత పదేళ్లుగా నా జెర్సీ నెంబర్ సంఖ్య కూడా 18. అయితే యాదృశ్చికంగా కింగ్ కోహ్లి జెర్సీ కూడా అదే. అతనితో నా ఆటను పోల్చలేను. కానీ ఆర్సీబీ కోహ్లి అంత పేరు తెచ్చుకోవాలని అదే జెర్సీ నెంబర్‌ను నాకు కంటిన్యూ చేసింది. దీనిని నేను స్వాగతిస్తా.'' అంటూ ముగించింది. The Smriti Mandhana Sania Mirza Interview On Bold Diaries, Sania and Smriti caught up to discuss cricket, tennis, pressure, privilege, RCB, women and other inspiring anecdotes.#PlayBold #ನಮ್ಮRCB #SheIsBold #WPL2023 pic.twitter.com/AFS9M6MFKa — Royal Challengers Bangalore (@RCBTweets) March 5, 2023 చదవండి: హై స్కోరింగ్ మ్యాచ్‌ల కోసం ఇంత దిగజారాలా? -
హైదరాబాద్ లో నేడు సానియా మీర్జా చివరి మ్యాచ్
-
అభిమానుల కోసమే.. హైదరాబాద్‌లో ఫేర్వెల్ మ్యాచ్
మహిళా టెన్నిస్ స్టార్ సానియా మీర్జా ఇటీవలే ఆటకు రిటైర్మెంట్ ప్రకటించిన సంగతి తెలిసిందే. గత నెలలో ఆస్ట్రేలియన్ ఓపెన్ గ్రాండ్‌స్లామ్ టోర్నీ సందర్భంగా రిటైర్మెంట్ నిర్ణయాన్ని ప్రకటించిన సానియా చివరగా దుబాయ్ ఓపెన్ టెన్నిస్ టోర్నీ ఆడింది. ఆ టోర్నీలో తొలి రౌండ్లోనే ఓడిపోయిన సానియా కెరీర్‌కు వీడ్కోలు పలికింది. అయితే సానియా మీర్జా పుట్టింది ముంబైలో అయినా పెరిగింది మాత్రం హైదరాబాద్‌లో అన్న సంగతి ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. హైదరాబాద్‌లోనే కెరీర్‌ను ప్రారంభించిన సానియా దేశం తరపున మహిళల టెన్నిస్‌లో అత్యున్నత శిఖరానికి చేరుకుంది. ఈ నేపథ్యంలోనే తాను పెరిగిన హైదరాబాద్‌లో సానియా చివరి మ్యాచ్ ఆడాలని భావించింది. అందుకే రేపు హైదరాబాద్‌లో ఫేర్వెల్ మ్యాచ్ ఆడనున్నట్లు సానియా మీర్జా మీడియా సమావేశంలో తెలిపింది. ఆదివారం ఉదయం 10 గంటలకు ఎల్బీ స్టేడియంలో ఈ మ్యాచ్ జరగనుంది. ఇప్పటికే అన్ని ఏర్పాట్లు పూర్తయ్యాయి. సానియా మీడియాతో మాట్లాడుతూ.. ''అభిమానుల కోసం రేపు చివరి మ్యాచ్ ఆడుతున్నా. విశేషం ఏంటంటే.. 20 ఏళ్ల క్రితం నేను ఎక్కడ టెన్నిస్ సాధన చేశానో అక్కడే ఆఖరి మ్యాచ్ ఆడునున్నా. ఈ మ్యాచ్ చూసేందుకు నా కుటుంబం, స్నేహితులు వస్తున్నారు. కెరీర్లో చివరి మ్యాచ్ కోసం ఎంతో ఆసక్తిగా ఎదరు చూస్తున్నా. విజయంతో కెరీర్‌ను ముగించాలని అనుకుంటున్నా'' అని సానియా వెల్లడించింది. అంతేకాదు తన కుమారుడు, కుటుంబంతో సమయం కేటాయిస్తానని ఈ టెన్నిస్ దిగ్గజం చెప్పుకొచ్చింది. ఇక ఎల్బీ స్టేడియంలో రేపు సానియా రెండు మ్యాచ్‌లు ఆడనుంది. సానియా, రోహన్ బోపన్న టీమ్స్ తలపడనున్నాయి. డబుల్స్‌లో సానియా – బోపన్న జోడీ ఇవాన్ డోడిగ్ – మ్యాటెక్ సాండ్స్ జంటను ఢీ కొట్టనుంది. సానియా చివరి సారి ఆడనున్న ఈ రెండు మ్యాచ్‌లు చూసేందుకు చాలామంది బాలీవుడ్, టాలీవుడ్ ప్రముఖులు తరలి రానున్నారు. తన 20 ఏళ్ల ప్రొఫెషనల్ కెరీర్లో సానియా ఆరు గ్రాండ్‌స్లామ్ టైటిల్స్‌తో కలిపి మొత్తం 43 డబ్ల్యూటీఏ టైటిల్స్ సాధించింది. 91 వారాలు డబుల్స్‌లో ప్రపంచ నంబర్‌వన్ ర్యాంక్‌లో నిలిచింది. ఆసియా క్రీడలు, కామన్వెల్త్ గేమ్స్‌లో పతకాలు సాధించింది. దేశ అత్యున్నత క్రీడా పురస్కారం ‘ఖేల్ రత్న’... ‘అర్జున అవార్డు’... పౌర పురస్కారాలు ‘పద్మభూషణ్’, ‘పద్మశ్రీ’ అందుకుంది. వచ్చే నెలలో సానియా మీర్జా కొత్త పాత్రలో కనిపించనుంది. మహిళల ప్రీమియర్ లీగ్ టి20 క్రికెట్ టోర్నీలో రాయల్ చాలెంజర్స్ బెంగళూరు జట్టుకు సానియా ‘మెంటార్’గా వ్యవహరించనుంది. చదవండి: WPL 2023: మ్యాచ్ 30 నిమిషాలు ఆలస్యంగా.. రిఫరీపై ఆటగాళ్ల మూకుమ్మడి దాడి -
ఒలింపిక్ పతకం లేకపోయినా బాధలేదు: సానియా భావోద్వేగం
Sania Mirza Retirement: ‘‘నా జీవితంలో టెన్నిస్ ఎప్పటికీ అంతర్భాగంగా ఉంటుంది. అయితే టెన్నిస్ మాత్రమే జీవితం కాదు. ప్రొఫెషనల్ అథ్లెట్‌గా ఎదుగుతున్న సమయంలోనే అలా భావించాను. కాబట్టి ఏనాడూ ఓటమి భయం లేదు. ఓడితే మళ్లీ వచ్చి గెలవగలమనే ధైర్యంతోనే ఆడాను. పరాజయాలు నాపై ప్రభావం చూపలేదు. ఓడినప్పుడు కొద్దిసేపు బాధపడినా దాంతో ప్రపంచం ఆగిపోదని నాకు తెలుసు. డబుల్స్ కారణంగానే నాకు గుర్తింపు దక్కింది. దానికి నేను గర్విస్తున్నా. సింగిల్స్‌లోనూ మన దేశం నుంచి ఎవరికీ సాధ్యం కాని రీతిలో టాప్–30లోకి వచ్చాను కాబట్టి అదీ గొప్ప ఘనతే. మణికట్టుకు శస్త్రచికిత్సల తర్వాత సింగిల్స్‌లో ఆడటం ఇబ్బందిగా మారడంతో డబుల్స్‌కు మారాను తప్ప ఆడలేక కాదు. ఎక్కడైనా నంబర్‌వన్ అంటే చిన్న విషయం కాదు. ఒలింపిక్ పతకం లేకపోయినా నేను సాధించినదాంతో సంతృప్తిగా ఉన్నా. నేనో ట్రెండ్ సెట్టర్‌గా భావించడం లేదు. నాకు వచ్చిన, నచ్చిన రీతిలో ఆడుతూ పోయాను. ఆ క్రమంలోనే ఈ విజయాలన్నీ వచ్చాయి’’ అని భారత టెన్నిస్ దిగ్గజం సానియా మీర్జా స్ఫూర్తిదాయక వ్యాఖ్యలు చేశారు. నంబర్ 1గా ఎదిగి.. ఓటమితో ముగింపు ఇరవై ఏళ్ల సుదీర్ఘ కెరీర్లో ఎన్నో సవాళ్లు ఎదుర్కొని.. నంబర్ 1 స్థాయికి ఎదిగిన ఈ హైదరాబాదీ ఆటకు వీడ్కోలు పలుకుతూ భావోద్వేగానికి లోనయ్యారు. దుబాయ్ ఓపెన్‌లో తొలి రౌండ్లోనే ఓటమి ద్వారా ప్లేయర్‌గా సానియా టెన్నిస్ కెరీర్ ముగిసిపోయింది. ఐదేళ్ల వయసులోనే రాకెట్ పట్టిన సానియా మీర్జా.. తన సుదీర్ఘ కెరీర్లో ఎన్నో విజయాలు అందుకున్నారు. మూడు డబుల్స్ గ్రాండ్‌స్లామ్, మూడు మిక్స్డ్ గ్రాండ్‌స్లామ్ టైటిల్స్ గెలిచి మరే ఇతర భారత మహిళా టెన్నిస్ ప్లేయర్‌కు సాధ్యం కాని రీతిలో రికార్డులు నెలకొల్పారు. 43 డబుల్స్ ట్రోఫీలు సాధించారు. 91 వారాలు వరల్డ్ నంబర్‌వన్‌గా కొనసాగారు. చదవండి: Sania Mirza: 'వండర్ ఉమన్'.. సానియాకు సలాం! ముక్కుసూటి జవాబులతో.. Smriti Mandhana: వారెవ్వా.. ఫ్రేమ్ టూ ఫ్రేమ్ దాదానే తలపించింది View this post on Instagram A post shared by Women’s Tennis Association (@wta) -
Sania Mirza: 'వండర్ ఉమన్'.. సానియాకు సలాం! ముక్కుసూటి జవాబులతో..
సానియా మీర్జా అంటే మూడు డబుల్స్ గ్రాండ్‌స్లామ్, మూడు మిక్స్డ్ గ్రాండ్‌స్లామ్ టైటిల్స్ మాత్రమేనా? సానియా మీర్జా అంటే 43 డబుల్స్ ట్రోఫీలు, 91 వారాలు వరల్డ్ నంబర్‌వన్ మాత్రమేనా? సానియా మీర్జా అంటే 20 ఏళ్ల పాటు టెన్నిస్ సర్క్యూట్లో ప్రొఫెషనల్‌గా కొనసాగడం మాత్రమేనా? వీటన్నింటికి సమాధానం ‘కాదు’ మాత్రమే! మన దేశంలో అమ్మాయిలు క్రీడల్లో అడుగు పెట్టడమే అరుదుగా అనిపించిన సమయంలో సానియా టెన్నిస్‌ను ఎంచుకొని కొత్త బాటను వేసింది. తన ఆటను, తన సామర్థ్యాన్ని నమ్ముకొని ముందుకు వెళ్లింది. ఈ క్రమంలో ఎన్ని ఆటుపోట్లు ఎదురైనా ధైర్యంగా ఎదుర్కొంది. ఆమె టెన్నిస్‌కే పరిమితం కాదు. భారత క్రీడలకే ఆమె ఒక ‘వండర్ ఉమన్’. ఎన్నో ఏళ్లుగా మహిళల క్రీడలకు సంబంధించి ఉన్న మూసను సానియా బద్దలు కొట్టింది. ఆటతోనే కాకుండా అవసరమైతే మాటతోనూ తలపడింది. తన స్థాయి ప్లేయర్‌ను ఒక ‘ఎర’గా వేశారంటూ పురుషాధిక్య సమాజపు నైజాన్ని నేరుగా ప్రశంసించింది. తన ఆటలో సంధించిన ఏస్‌ల తరహాలోనే మాటల్లో కూడా అంతే పదును చూపించింది. ఎలాంటి టెన్నిస్ నేపథ్యం లేని నగరం నుంచి, సాంప్రదాయ కట్టుబాట్లతో కూడిన తన సొంత నేపథ్యం నుంచి వచ్చి ప్రపంచ ర్యాంకింగ్స్‌లో సింగిల్స్‌లో 27 వరకు, డబుల్స్‌లో నంబర్‌వన్ వరకు సానియా ఎదగగలిగింది. ఒక స్టార్‌గా, దిగ్గజంగా ఆటపై సానియా ముద్ర అసమానం. శ్రమించే తత్వం, పట్టుదలతో ఆమె సాధించిన ఘనతలు స్ఫూర్తిదాయకం. టెన్నిస్‌లో ఉచ్ఛస్థితికి చేరుతున్న సమయంలో వెంట నడిచి వచ్చిన వివాదాలను ఆమె లెక్క చేయలేదు. చాలా మందిలా కన్నీళ్లు పెట్టుకొని కుప్పకూలిపోలేదు... మొండిగా నిలబడింది. అంతే వేగంగా వాటికి తగిన రీతిలో జవాబిచ్చింది. ఎవరి కోసమో తాను మారలేదు, తాను అనుకున్నట్లు ఆడింది, ఆటను ఆస్వాదించింది, అద్భుతాలు చేసింది. సానియాకు పెద్ద సంఖ్యలో వీరాభిమానులున్నారు. వేర్వేరు కారణాలతో ఆమెను ద్వేషించే వారూ ఉన్నారు. కానీ అవునన్నా, కాదన్నా ఏ రూపంలోనైనా ఆమె గుర్తింపును మాత్రం ఎవరూ కాదనలేరు. దశాబ్ద కాలానికి పైగా భారత క్రీడల్లో ‘సానియా మానియా’ అన్ని చోట్లా కనిపించింది, వినిపించింది. ఆమె ఏం చేసినా అది వార్తగా నిలిచింది. భారత టెన్నిస్ చరిత్రలో కేవలం ఐదుగురు మహిళలు మాత్రమే సింగిల్స్‌లో టాప్–200 వరకు రాగలిగారు. అందులో నలుగురు కనీసం వందో ర్యాంక్‌కు చేరువగా కూడా రాలేదు. అలా చూస్తే సానియా సాధించిన 27వ ర్యాంక్ విలువేమిటో అర్థమవుతుంది. దీంతో పాటు డబుల్స్‌లో శిఖరాన నిలిచి శాసించిన సానియా మీర్జా ఉజ్వల టెన్నిస్‌కు తెర పడింది. –సాక్షి క్రీడా విభాగం అందని ఒలింపిక్ పతకం సానియా కెరీర్లో ఎన్నో ఘనతలు ఉన్నా... ప్రతిష్టాత్మక ఒలింపిక్ పతకాన్ని మాత్రం ఆమె సొంతం చేసుకోలేకపోయింది. 2008, 2012, 2016, 2020ల్లో నాలుగు ఒలింపిక్స్‌లోనూ పాల్గొన్నా ఆమెకు అది లోటుగా ఉండిపోయింది. 2016 రియో ఒలింపిక్స్‌లో రోహన్ బోపన్నతో కలిసి కాంస్య పతక పోరులో ఓడి నాలుగో స్థానం సాధించడమే ఆమె అత్యుత్తమ ప్రదర్శన. ఆసియా క్రీడల్లో 2 స్వర్ణాలు, 3 రజతాలు, 3 కాంస్యాలతో పాటు కామన్వెల్త్ క్రీడల్లో ఒక రజతం, ఒక కాంస్యం ఆమె గెలుచుకుంది. పురుషాహంకారాన్ని ప్రశ్నిస్తూ... కెరీర్ ఆరంభంలో వచ్చిన కీర్తికనకాదులతో పాటు పలు వివాదాలు సానియాతో నడిచొచ్చాయి. జాతీయ జెండాను అవమానించినట్లు వార్తలు, స్కర్ట్‌లపై ‘ఫత్వా’లు జారీ, మసీదులో షూటింగ్, కొన్ని అసందర్భ వ్యాఖ్యలు, ఆ తర్వాత పాకిస్తానీ అయిన షోయబ్ మలిక్‌తో వివాహం... ఇలాంటివన్నీ ఆమెను ఒక వివాదాస్పదురాలిగా చిత్రీకరించాయి. వీటి వల్ల ఆమె చాలా సందర్భాల్లో ‘నెగెటివ్’ వార్తల్లో నిలిచింది. వాటిపై వివరణలు ఇచ్చుకునేందుకు ఆమె చాలా ఇబ్బంది పడాల్సి వచ్చింది. అయితే తర్వాతి రోజుల్లో తాను మరింత పరిణతి చెందానని, ఇలాంటివి పట్టించుకోవడం మానేశానని ఆమె చెప్పుకుంది. నిజంగా కూడా ఆపై కెరీర్ కీలక దశలో ఆమె తన ఆటతో మినహా మరే అంశంతోనూ ‘వార్త’గా మారలేదు. అయితే 2012 లండన్ ఒలింపిక్స్ సందర్భంగా రేగిన వివాదం సమయంలో ఆమె చేసిన వ్యాఖ్యలు మాత్రం సానియా వ్యక్తిత్వం గురించి చెబుతాయి. పురుషుల డబుల్స్‌లో లియాండర్ పేస్‌తో కలిసి బరిలోకి దిగేందుకు మహేశ్ భూపతి, రోహన్ బోపన్న నిరాకరించగా... విష్ణువర్ధన్‌ను ‘ఐటా’ ఎంపిక చేసింది. అయితే మిక్స్డ్ డబుల్స్‌లో సానియా మీర్జా తనతో కలిసి ఆడతానని హామీ ఇస్తేనే విష్ణుతో కలిసి బరిలోకి దిగుతానని పేస్ షరతు పెట్టాడు. ఈ విషయం తర్వాత తెలుసుకున్న సానియా దీనిని ‘పురుషా హంకారం’గా పేర్కొంది. పేస్ కోసం తనను ‘ఎర’గా వేశారంటూ విరుచుకుపడింది. వేర్వేరు సందర్భాల్లో కూడా ముక్కుసూటి జవాబులతో ఘాటుగా సమాధానాలు ఇవ్వడం సానియా శైలి. పెళ్లయిన ఆరేళ్ల తర్వాత కూడా ఇంకా ‘జీవితంలో స్థిరపడలేదేంటి’ అంటూ ఒక సీనియర్ జర్నలిస్ట్ అడిగిన ప్రశ్నపై... ‘నేను వరల్డ్‌నంబర్ కావడంకంటే తల్లిగా మారలేదేంటని మీరు అడుగుతున్నట్లున్నారు. నేనే కాదు ప్రతీ మహిళకు ఇలాంటి ప్రశ్నలే ఎదురవుతా యి. పెళ్లి చేసుకొని పిల్లల్ని కంటే తప్ప స్థిరపడినట్లు కాదా. నేను ఎన్ని గ్రాండ్‌స్లామ్ గెలిచినా వాటికి విలువ లేనట్లుంది’ అని తీవ్రంగా జవాబిచ్చింది. సానియా... ఓటమితో ముగింపు తన ప్రొఫెషనల్ టెన్నిస్ కెరీర్ చివరి టోరీ్నలో భారత స్టార్ సానియా మీర్జాకు తొలి రౌండ్లోనే ఓటమి ఎదురైంది. మంగళవారం జరిగిన దుబాయ్ ఓపెన్ టోర్నీ మహిళల డబుల్స్ తొలి రౌండ్లో సానియా మీర్జా (భారత్)–మాడిసన్ కీస్ (అమెరికా) జోడీ 4–6, 0–6తో వెరోనిక కుదెర్మెతోవా– సమ్సనోవా (రష్యా) ద్వయం చేతిలో ఓడిపోయింది. గంటపాటు జరిగిన ఈ మ్యాచ్‌లో సానియా–కీస్ జోడీ తమ సర్వీస్‌ను ఐదుసార్లు కోల్పోయింది. తొలి రౌండ్లో ఓడిన సానియా–కీస్లకు 7,900 డాలర్ల (రూ. 6 లక్షల 54 వేలు) ప్రైజ్‌మనీ లభించింది. వ్యక్తిగతం... 1986 నవంబర్ 15న సానియా మీర్జా ముంబైలో పుట్టింది. 2010లో పాకిస్తానీ క్రికెటర్ షోయబ్ మలిక్‌ను వివాహం చేసుకున్న సానియాకు నాలుగేళ్ల కుమారుడు ఇజ్హాన్ ఉన్నాడు. ‘ఏస్ అగైనెస్ట్ ఆడ్స్’ పేరుతో ఆమె ఆటోబయోగ్రఫీ వచ్చింది. కెరీర్లో ఎన్నో కంపెనీలకు బ్రాండ్ అంబాసిడర్‌గా వ్యవహరించిన సానియా జీవితాన్ని సినిమాగా తీయాలని ప్రతిపాదనలు వచ్చినా అవి ఫలించలేదు. ప్రస్తుతం భార్యాభర్తలిద్దరు కలిసి ‘మీర్జా మలిక్ షో’ అనే చాట్ షోను సమర్పిస్తున్నారు. ఇది పాకిస్తాన్‌లోని ‘ఉర్దూ ఫ్లిక్స్’ ఓటీటీలో ప్రసారమవుతోంది. భారత ప్రభుత్వం ద్వారా అర్జున, ఖేల్‌రత్న, పద్మశ్రీ, పద్మభూషణ్ అవార్డులు ఆమె అందుకుంది. ఆ ఆరు గ్రాండ్‌స్లామ్‌లు... మహిళల డబుల్స్: వింబుల్డన్ (2015), యూఎస్ ఓపెన్ (2015), ఆస్ట్రేలియన్ ఓపెన్ (2016; అన్నీ మార్టినా హింగిస్‌తో). మిక్స్డ్ డబుల్స్: ఆ్రస్టేలియన్ ఓపెన్ (2009), ఫ్రెంచ్ ఓపెన్ (2012; ఈ రెండూ మహేశ్ భూపతితో); యూఎస్ ఓపెన్ (2014; బ్రూనో సోరెస్‌తో). కెరీర్ రికార్డ్ సింగిల్స్: విజయాలు 271, పరాజయాలు 161 డబుల్స్: విజయాలు 536, పరాజయాలు 248 కెరీర్ ప్రైజ్‌మనీ: 72 లక్షల 65 వేల 246 డాలర్లు (రూ. 60 కోట్ల 20 లక్షలు) 1 భారత్ నుంచి డబ్ల్యూటీఏ టైటిల్ (సింగిల్స్, డబుల్స్) గెలిచిన, గ్రాండ్‌స్లామ్ సింగిల్స్‌లో నాలుగో రౌండ్‌కు చేరిన, వరల్డ్ ర్యాంకింగ్ టాప్–50లో నిలిచిన, మహిళల గ్రాండ్‌స్లామ్ గెలిచిన, డబ్ల్యూటీఏ ఫైనల్స్ గెలిచిన, వరల్డ్ నంబర్‌వన్‌గా నిలిచిన తొలి భారత ప్లేయర్ సానియా మీర్జా. పట్టుదలతో పైపైకి... సానియా మీర్జాకు 11 ఏళ్ల వయసు... హైదరాబాద్‌లోని ఒక కోర్టులో ఆమె సాధన కొనసాగుతోంది... అప్పటికి ఆమె రాకెట్ పట్టుకొని ఐదేళ్లవుతోంది. అయితే ఆమె కెరీర్‌పై తండ్రి ఇమ్రాన్ మీర్జాకు ఇంకా ఎలాంటి స్పష్టతా రాలేదు. సానియా ఏమాత్రం ఆడగలదు, అసలు పోటీ ప్రపంచంలో నిలబడగలదా, భవిష్యత్తు ఉంటుందా అనే సందిగ్ధత... అప్పటికే సన్నిహితులు కొందరు ‘మన అమ్మాయికి ఇలాంటి చిన్న స్కర్ట్‌లతో టెన్నిస్ అవసరమా’ అంటూ మాటలు విసురుతూనే ఉన్నారు. మరో మిత్రుడు వచ్చి ‘ఏంటి సానియాను మార్టినా హింగిస్‌ను చేద్దామనుకుంటున్నావా’ అంటూ వ్యంగ్య వ్యాఖ్య ఒకటి చేసి వెళ్లిపోయాడు. 16 ఏళ్ళ వయసుకే సింగిల్స్ గ్రాండ్‌స్లామ్ గెలిచి హింగిస్ సంచలనం సృష్టించిన రోజులవి. అలాంటి మాటలతో ఒక దశలో ఇమ్రాన్‌లో ఆందోళన పెరిగింది. కానీ దానిని బయట పడనీయలేదు. తర్వాతి రోజుల్లో మార్టినా హింగిస్‌తోనే జత కట్టి వరల్డ్ నంబర్‌వన్ జోడీగా నిలవడంతో పాటు 14 డబుల్స్ టైటిల్స్ కలిసి సాధించడం విశేషం. సహజసిద్ధమైన ప్రతిభకు తోడు కష్టపడే గుణం, పట్టుదల, పోరాటతత్వం, ఓటమిని అంగీకరించని నైజం వెరసి సానియాను అగ్ర స్థానానికి చేర్చాయి. కెరీర్ ఆరంభంలో విమానాలకు పెద్దగా ఖర్చు పెట్టలేని స్థితిలో దేశవ్యాప్తంగాటోర్నీ లు ఆడేందుకు ఆ కుటుంబం ఒక పాత కారును ఉపయోగించింది. అప్పుడు రోడ్డు ద్వారా ప్రయాణించిన దూరం ఎన్ని కిలోమీటర్లో కానీ... ఈ సుదీర్ఘ టెన్నిస్ ప్రయాణం మాత్రం వెలకట్టలేని విధంగా భారత క్రీడా చరిత్రలో నిలిచిపోయింది. జూనియర్ వింబుల్డన్ విజేతగా... ఆటలో ఓనమాలు నేర్చుకున్న తర్వాత హైదరాబాద్‌లో చిన్నటోర్నీ లు మొదలు జాతీయ స్థాయిలో కూడా వేర్వేరు నగరాల్లో జరిగే పోటీల్లో సానియా పోటీ పడింది. వెంటనే విజయాలు రాకపోయినా ఆమె ఆటలో ప్రత్యేకత ఉందని, దూకుడు కనిపిస్తోందని మాత్రం భారత టెన్నిస్ వర్గాల్లో చర్చ మొదలైంది. 13 ఏళ్ల వయసులో జాతీయ అండర్–14, అండర్–16 టైటిల్స్ గెలవడంతో సానియాకు అసలైన గుర్తింపు లభించింది. జూనియర్ స్థాయిలో ఆమె 10 సింగిల్స్, 13 డబుల్స్ టైటిల్స్ నెగ్గింది. ఆ తర్వాత అంతర్జాతీయ స్థాయిలో దూసుకుపోయేందుకు ఆమెకు ఎక్కువ సమయం పట్టలేదు. 2003 వింబుల్డన్టోర్నీ లో జూనియర్ బాలికల డబుల్స్‌లో రష్యాకు చెందిన అలీసా క్లెబనోవాతో కలిసి సానియా విజేతగా నిలిచింది. ఈ గెలుపుతో ఆమె భారత టెన్నిస్‌లో కొత్త తారగా అందరి దృష్టిలో పడింది. సొంతగడ్డపై... సరిగ్గా 20 ఏళ్ల క్రితం ఫిబ్రవరి 2003లో తన సొంత నగరంలో జరిగిన హైదరాబాద్ ఓపెన్‌లో వైల్డ్‌కార్డ్‌గా బరిలోకి దిగింది. అక్కడ తొలి రౌండ్లోనే ఓటమి ఎదురైనా రెండేళ్ల తర్వాత ఇదే వేదికపై ఆమె తనకు కావాల్సిన ఫలితాన్ని అందుకుంది. ఇదే హైదరాబాద్ ఓపెన్‌లో విజేతగా నిలిచి సింగిల్స్‌లో డబ్ల్యూటీఏ తొలి టైటిల్ సొంతం చేసుకుంది. సానియా కెరీర్లో ఇదే ఏకైక సింగిల్స్ ట్రోఫీ. ఆపై మరో నాలుగు టోర్నీ ల్లో ఫైనల్ చేరినా, ఆమె రన్నరప్ స్థానానికే పరిమితమైంది. 27వ ర్యాంక్‌కు... 2005లో యూఎస్ ఓపెన్‌లో నాలుగో రౌండ్ వరకు చేరడంతో ‘డబ్ల్యూటీఏ న్యూ కమర్’గా గుర్తింపు తెచ్చుకున్న తర్వాత సింగిల్స్‌లో కొంత కాలం సానియా జోరు కొనసాగింది. టైటిల్స్ లేకపోయినా పలువురు అగ్రశ్రేణి క్రీడాకారిణులపై సాధించిన కొన్ని సంచలన విజయాలు ఆమె సత్తాను చూపించాయి. ముఖ్యంగా హార్డ్ కోర్టుల్లో ప్రదర్శనతో ఆమె ర్యాంక్ మెరుగవుతూ వచ్చింది. ఎట్టకేలకు 2007 ఆగస్టులో సానియా సింగిల్స్‌లో ప్రపంచ ర్యాంకింగ్స్‌లో 27వ స్థానానికి చేరింది. ఇది ఆమె సింగిల్స్ కెరీర్లో అత్యుత్తమ దశ. అయితే ఆ తర్వాత దీనిని నిలబెట్టుకోవడంలో ఆమె విఫలమైంది. వరుస పరాజయాలు, మణికట్టు గాయాలు ఆమె సింగిల్స్ ఆటకు ప్రతిబంధకంగా మారాయి. దాంతో సింగిల్స్‌కు పూర్తిగా గుడ్‌బై చెప్పి డబుల్స్పైనే దృష్టి పెట్టాలని సానియా నిర్ణయించుకుంది. ఆమె తీసుకున్న ఈ కీలక నిర్ణయం భవిష్యత్తులో ఆమె కెరీర్‌కు కొత్త ఊపిరి పోసింది. డబుల్స్ స్టార్‌గా... సొంతగడ్డపై హైదరాబాద్ ఓపెన్లోనే లీజెల్ హ్యూబర్ కలిసి డబుల్స్‌లోనూ తొలి టైటిల్ (2004) సాధించిన సానియా సింగిల్స్ నుంచి పూర్తిగా తప్పుకున్న తర్వాత వరుస విజయాలు అందుకుంది. మహిళల డబుల్స్‌లో 82 మందితో జత కట్టిన సానియా 17 మంది వేర్వేరు భాగస్వాములతో కలిసి ఏకంగా 43 డబ్ల్యూటీఏ టైటిల్స్ గెలవగలిగింది. వీరందరిలోనూ 70వ భాగస్వామి అయిన మార్టినా హింగిస్‌తో ఆమె అద్భుత ఫలితాలు సాధించింది. ఒక దశలో ఈ జోడీ ఓటమి అనేదే లేకుండా సాగింది. 2015–16 మధ్య కాలంలో వీరిద్దరు వరుసగా 41 మ్యాచ్‌లలో గెలుపొందడం పెద్ద విశేషం. గ్రాండ్‌స్లామ్ మిక్స్డ్ డబుల్స్‌లో 14 మందితో ఆమె జోడీగా బరిలోకి దిగింది. ఇదే క్రమంలో 2015 ఏప్రిల్‌లో సానియా మొదటిసారి వరల్డ్ డబుల్స్ ర్యాంకింగ్స్‌లో ‘వరల్డ్ నంబర్‌వన్’ స్థానానికి చేరింది. అమ్మగా మారాక... హింగిస్‌తో కలిసి గెలిచిన 14 టైటిల్స్‌ను పక్కన పెట్టినా... ఇతర భాగస్వాములతో కలిసి సానియా ఖాతాలో 29 ట్రోఫీలు ఉన్నాయి. అయినా సరే సానియా–హింగిస్ జోడీ ఎన్నో చిరస్మరణీయ విజయాలు సాధించింది. అగ్గికి కి వాయువు తోడైనట్లుగా సానియా అద్భుత ఫోర్‌హ్యాండ్, హింగిస్ బ్యాక్ హ్యాండ్ కలిసి ప్రత్యర్థులను పడగొట్టాయి. అయితే కారణాలేమైనా హింగిస్‌తో విడిపోయిన తర్వాత సానియాకు సంతృప్తికర ఫలితాలు రాలేదు. ఆ తర్వాత 4టోర్నీ ల్లోనే ఆమె విజేతగా నిలిచింది. 2018 ఆరంభంలో గాయాలతో కొన్నిటోర్నీ లకు దూరమైన సానియా అదే ఏడాది చివర్లో కొడుకు పుట్టడంతో టెన్నిస్‌కు నిరవధిక విరామం ఇచ్చింది. అయితే ఏడాదిన్నర తర్వాత మళ్లీ పూర్తి ఫిట్‌గా మారి పునరాగమనం చేసిన అనంతరం మరో రెండు టైటిల్స్ గెలవడం విశేషం. చివరకు ఈ ఏడాది జనవరిలో తన రిటైర్మెంట్ గురించి సానియా ప్రకటన చేసింది. దుబాయ్ ఓపెన్ తన ప్రొఫెషనల్ కెరీర్లో చివరి టోర్నమెంట్ అని ప్రకటించింది. -
ఆటకు ఆల్విదా.. వీడ్కోలు పలికిన టెన్నిస్ దిగ్గజం
రెండు దశాబ్దాలుగా అంతర్జాతీయ యవనికపై భారత టెన్నిస్‌కు చిరునామాగా నిలిచిన సానియా మీర్జా తన కెరీర్‌కు వీడ్కోలు పలికింది. గత నెలలో ఆస్ట్రేలియన్ ఓపెన్ గ్రాండ్‌స్లామ్ టోర్నీ సందర్భంగా రిటైర్మెంట్ నిర్ణయాన్ని ప్రకటించిన ఈ హైదరాబాదీ స్టార్ దుబాయ్ ఓపెన్ తన కెరీర్లో చివరి టోర్నీ అని పేర్కొంది. మంగళవారం జరిగిన దుబాయ్ ఓపెన్ మహిళల డబుల్స్ తొలి రౌండ్లో సానియా (భారత్)–మాడిసన్ కీస్ (అమెరికా) జోడీ 4–6, 0–6తో వెరోనిక కుదెర్మెతోవా–లుది్మలా సమ్సనోవా (రష్యా) ద్వయం చేతిలో ఓడిపోయింది. తన 20 ఏళ్ల ప్రొఫెషనల్ కెరీర్లో సానియా ఆరు గ్రాండ్‌స్లామ్ టైటిల్స్‌తో కలిపి మొత్తం 43 డబ్ల్యూటీఏ టైటిల్స్ సాధించింది. 91 వారాలు డబుల్స్‌లో ప్రపంచ నంబర్‌వన్ ర్యాంక్‌లో నిలిచింది. ఆసియా క్రీడలు, కామన్వెల్త్ గేమ్స్‌లో పతకాలు సాధించింది. దేశ అత్యున్నత క్రీడా పురస్కారం ‘ఖేల్ రత్న’... ‘అర్జున అవార్డు’... పౌర పురస్కారాలు ‘పద్మభూషణ్’, ‘పద్మశ్రీ’ అందుకుంది. వచ్చే నెలలో సానియా మీర్జా కొత్త పాత్రలో కనిపించనుంది. మహిళల ప్రీమియర్ లీగ్ టి20 క్రికెట్ టోర్నీలో రాయల్ చాలెంజర్స్ బెంగళూరు జట్టుకు సానియా ‘మెంటార్’గా వ్యవహరించనుంది. -
అందాలన్నీ ఆర్సీబీలోనే.. స్మృతి, సానియా, ఎల్లిస్..!
మహిళల ఐపీఎల్ (WPL)లో అందమైన జట్టు ఏది అంటే..? ఏమాత్రం తడుంకోకుండా రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు పేరు చెప్పాలి. విధ్వంసకర ఆటతో పాటు మతి పోగొట్టే అందాలన్నీ ఆర్సీబీ సొంతమయ్యాయనడం అతిశయోక్తి కాదు. టీమిండియా డాషింగ్ ఓపెనర్ స్మృతి మంధన, ఆసీస్ ఆల్‌రౌండర్ ఎల్లిస్ పెర్రీ, ఇంగ్లండ్ కెప్టెన్ హీథర్ నైట్, ఆసీస్ పేసర్ మెగాన్ షట్, న్యూజిలాండ్ ఆల్‌రౌండర్ సోఫీ డివైన్, టీమిండియా పేసర్ రేణుకా సింగ్.. ఇలా చెప్పుకుంటూ పోతే జట్టు నిండా అందాలే ఉన్నాయి. ఇన్ని అందాలు చాలవన్నట్లు.. ఆర్సీబీ తమ కుటుంబంలోకి క్రికెటేతర అందాన్ని కూడా ఆహ్వానించింది. బెంగళూరు ప్రాంచైజీ స్టార్ టెన్నిస్ క్రీడాకారిణి సానియా మీర్జాను మెంటార్‌గా నియమించుకుంది. జట్టు అందాల పూతోటగా మారడం పట్ల ఆర్సీబీ అభిమానులు ఆనందాన్ని వ్యక్తం చేస్తున్నారు. ప్రపంచంలోని అందాలన్నీ ఒకే చోట చేరినట్లుందని సంబురపడిపోతున్నారు. అందంతో పాటు తమ ప్లేయర్స్ ఆటలోనూ మహరాణులంటూ మురిసిపోతున్నారు. ఆటతో పాటు అందాలను ఆస్వాదించే వారికి ఆర్సీబీ వంద శాతం కనువిందు కలిగిస్తుందని గర్వంగా చెప్పుకుంటున్నారు. కాగా, ఫిబ్రవరి 13న జరిగిన WPL మెగా వేలంలో ఆర్సీబీ ప్రపంచవ్యాప్తంగా ఉన్న క్రికెట్ అందాలన్నిటినీ ఏకం చేసింది. వేలంలో స్మృతి మంధనను 3.4 కోట్ల రికార్డు ధర వెచ్చించి సొంతం చేసుకున్న ఆర్సీబీ యాజమాన్యం.. రిచా ఘోష్‌ను 1.9 కోట్లకు, ఎల్లిస్ పెర్రీని 1.7 కోట్లకు, రేణుకా సింగ్‌ను 1.5 కోట్లకు, సోఫీ డివైన్‌ను 50 లక్షలకు, హీథర్ నైట్‌ను 40 లక్షలకు, మెగాన్ షట్‌ను 40 లక్షలకు, కనిక అహుజను 35 లక్షలకు, డేన్ వాన్ నికెర్క్ను 30 లక్షలకు, ఎరిన్ బర్న్స్‌ను 30 లక్షలకు, ప్రీతి బోస్‌ను 30 లక్షలకు, కోమల్ జంజద్ను 25 లక్షలకు, ఆశా శోభనను 10 లక్షలకు, దిశా కాసత్ను 10 లక్షలకు, ఇంద్రాణి రాయ్‌ను 10 లక్షలకు, పూనమ్ ఖేమ్నర్ను 10 లక్షలకు, సహన పవార్‌ను 10 లక్షలకు, శ్రేయాంక పాటిల్‌ను 10 లక్షలకు సొంతం చేసుకుంది. The pioneer in Indian sports for women, a youth icon, someone who has played Bold and broken barriers throughout her career, and a champion on and off the field. We are proud to welcome Sania Mirza as the mentor of the RCB women’s cricket team. 🤩#PlayBold @MirzaSania pic.twitter.com/eMOMU84lsC — Royal Challengers Bangalore (@RCBTweets) February 15, 2023 వేలంలో మొత్తంగా 18 ప్లేయర్లను (12 మంది స్వదేశీ, ఆరుగురు విదేశీ ప్లేయర్లు) కొనుగోలు చేసిన ఆర్సీబీ.. తాజాగా తమ హెడ్ కోచ్‌గా న్యూజిలాండ్‌కు చెందిన బెన్ సాయర్‌ను నియమించుకుంది. ఆర్సీబీ పర్స్‌లో ఇంకా 10 లక్షలు మిగిలాయి. -
RCB: ఆర్సీబీ మెంటార్‌గా భారత టెన్నిస్ స్టార్ సానియా మీర్జా
Women Premier League 2023 -RCB- Sania Mirza: మహిళల ప్రీమియర్ లీగ్-2023 నేపథ్యంలో రాయల్ చాలెంజర్స్ బెంగళూరు ఫ్రాంఛైజీ సరికొత్త సంప్రదాయానికి తెరతీసింది. క్రికెటేతర ప్లేయర్‌ను తమ కుటుంబంలోకి ఆహ్వానించింది. భారత టెన్నిస్ దిగ్గజం సానియా మీర్జాను ఆర్సీబీ మెంటార్‌గా నియమించినట్లు వెల్లడించింది. ఈ విషయాన్ని ట్విటర్ వేదికగా బుధవారం వెల్లడించింది. తమ మహిళా జట్టుకు మార్గదర్శనం చేసేందుకు ఇంతకంటే గొప్ప వ్యక్తి మరొకరు దొరకరంటూ సానియాకు స్వాగతం పలికింది. నమస్కార సానియా మీర్జా ‘‘మా కోచింగ్ సిబ్బంది క్రికెట్‌కు సంబంధించిన వ్యవహారాలు చూసుకుంటుంది. అయితే, కఠిన పరిస్థితులు, ఒత్తిడిని అధిగమించేందుకు మా మహిళా క్రికెటర్లకు సరైన మార్గదర్శి ఉండాలని భావించాం. చాంపియన్ అథ్లెట్, అవరోధాలు అధిగమించి దిగ్గజ ప్లేయర్‌గా ఎదిగిన వ్యక్తిని మా మెంటార్‌గా నియమించాం. మా కుటుంబంలోకి ఆమెకు స్వాగతం పలుకుతున్నాం. నమస్కార సానియా మీర్జా’’ అని ఆర్సీబీ ట్వీట్ చేసింది. ఆర్సీబీ నిర్ణయంపై అభిమానులు సానుకూలంగా స్పందిస్తున్నారు. మెంటార్‌గా సరైన వ్యక్తిని ఎన్నుకున్నారంటూ అభినందనలు తెలియజేస్తున్నారు. కఠిన సవాళ్లను ఎదుర్కొని కాగా టెన్నిస్ స్టార్‌గా ఎదిగే క్రమంలో ఎన్నో కఠిన సవాళ్లు ఎదుర్కొన్న సానియా మీర్జా.. వాటన్నింటినీ అధిగమించి ఒక్కో మెట్టు ఎక్కుతూ లెజెండ్‌గా ఎదిగారు. గ్రాండ్‌స్లామ్‌లతో సత్తా చాటి దేశ ఖ్యాతిని ఇనుమడింపజేశారు. ఇటీవలే ఆటకు వీడ్కోలు పలికిన ఆమె ఇప్పుడు సరికొత్త అవతారంలో కనిపించనున్నారు. మహిళా క్రికెట్ జట్టుకు మెంటార్‌గా బాధ్యతలు నిర్వర్తించబోతున్నారు. చదవండి: రెండోసారి పెళ్లి చేసుకున్న టీమిండియా స్టార్ హార్దిక్ పాండ్యా.. ఫొటోలు వైరల్ Ind Vs Aus 2nd Test: ఆసీస్‌తో రెండో టెస్టు ప్రత్యేకం.. ప్రధాని మోదీని కలిసిన పుజారా Chetan Sharma: వివాదంలో బీసీసీఐ చీఫ్ సెలక్టర్.. ఆటగాళ్లు ఇంజక్షన్లు తీసుకుంటారు.. వాళ్లు సూపర్స్టార్లు.. ఫిట్నెస్ లేకున్నా అంటూ.. While our coaching staff handle the cricket side of things, we couldn’t think of anyone better to guide our women cricketers about excelling under pressure. Join us in welcoming the mentor of our women's team, a champion athlete and a trailblazer! 🙌 Namaskara, Sania Mirza! 🙏 pic.twitter.com/r1qlsMQGTb — Royal Challengers Bangalore (@RCBTweets) February 15, 2023 -
రిటైర్మెంట్కు ముందు సానియా మీర్జాకు పరాభవం
రిటైర్మెంట్కు ముందు జరిగిన అబుదాబి ఓపెన్ టెన్నిస్ టోర్నీ-2023లో భారత స్టార్ టెన్నిస్ క్రీడాకారిణి సానియా మీర్జాకు పరాభవం ఎదురైంది. ఈ టోర్నీలో బెథానీ మాటెక్ (అమెరికా)తో బరిలోకి దిగిన హైదరాబాదీ తొలి రౌండ్లోనే నిష్క్రమించి అబాసుపాలైంది. సోమవారం జరిగిన మహిళల డబుల్స్ తొలి రౌండ్లో సానియా–బెథానీ ద్వయం 3–6, 4–6తో ఫ్లిప్కెన్స్ (బెల్జియం)–లౌరా సిగెముండ్ (జర్మనీ) జోడీ చేతిలో ఓడింది. 73 నిమిషాలపాటు జరిగిన ఈ మ్యాచ్‌లో సానియా జోడీ తమ సర్వీస్‌ను ఆరుసార్లు కోల్పోయింది. సానియా–బెథానీలకు 4,350 డాలర్లు (రూ. 3 లక్షల 60 వేలు) ప్రైజ్‌మనీగా లభించాయి. కాగా, ఫిబ్రవరి 27 నుంచి ప్రారంభం కానున్న దుబాయ్ టెన్నిస్ ఛాంపియన్‌షిప్‌తో ప్రొఫెషనల్ టెన్నిస్‌కు గుడ్‌బై చెప్పనున్నట్లు సానియా ఇదివరకే ప్రకటించిన విషయం తెలిసిందే. -
టెన్నిస్ స్టార్‌పై ఆనంద్ మహీంద్ర ట్వీట్ వైరల్: ఎలా మొదలు పెట్టిందో అలానే..
సాక్షి,ముంబై: ప్రముఖ వ్యాపారవేత్త , ఎం అండ్ ఎం ఆనంద్ మహీంద్ర ఎపుడూ సోషల్ మీడియాలో యాక్టివ్‌గా ఉంటూ ఫోలోయర్లకు ప్రేరణగా నిలుస్తుంటారు. స్ఫూర్తిదాయక కంటెంట్‌ను పంచు కుంటారు. అలాగే వినూత్న ఆవిష్కరణలు, జీవిత సలహాలు, ఒక్కోసారి ఫన్నీ వీడియోలు పంచుకుంటూ అందర్నీ ఆకర్షిస్తూ ఉంటారు. తాజాగా ట్విటర్లో ఒక సీక్రెట్‌ను రివీల్ చేశారు. టెన్నిస్ సంచలన సానియా మీర్జా తనకు స్ఫూర్తి అంటూ ట్వీట్ చేశారు. ఆనంద్‌మహీంద్ర మండే మోటివేషన్: గెలవాలనే ఆకలి ఏ దశలోనూ చచ్చిపోకూడదు! మహీంద్రా గ్రూప్ ఛైర్మన్ తన "మండే మోటివషన్"ని టెన్నిస్ స్టార్ సానియా మీర్జాపై స్ఫూర్తిదాయక పోస్ట్ షేర్ చేశారు. విజయం సాధించాలనే ఆకలితో ఆటను ఎలా ప్రారంభించిందో అదే ఉత్సాహంతో తన కరియర్ని ముగించిందంటూ కితాబిచ్చారు. అంతేకాదు తాను కూడా తన కెరీర్లో ఈ దశలోనైనా రాణించాలనే కోరికను సజీవంగా ఉంచుకోవాలనే విషయాన్ని గుర్తు చేసిందని మహీంద్రా తన ట్వీట్లో పేర్కొన్నారు. ఈ సందర్భంగా "పోటీ నా రక్తంలో ఉంది.. కోర్టులో అడుగుపెట్టిన ప్రతిసారీ నేను గెలవాలనే కోరుకుంటా.. అది చివరి గేమా లేక చివరి సీజనా అనే దానితో సంబంధం లేకుండా విజయాన్నే కోరుకుంటా’ అనే కోట్ ఉన్న సానియా ఫోటోను కూడా షేర్ చేయడం విశేషం.దీంతో ఇది నెటిజనులను బాగా ఆకట్టుకుంటోంది. లక్షా 40వేలకు పైగా వ్యూస్‌ని, రెండువేలకు పైగా లైక్‌లను పొందింది. చాలామంది ఆనంద్ మహీంద్ర అభిప్రాయంతో ఏకీభవించారు, "అద్భుతమైన క్రీడాకారిణి" అంటూ సానియాను అభివర్ణించారు. కాగా తన సుదీర్ఘ కరియర్లో అనేక టైటిల్స్‌ని, గ్రాండ్‌స్లాం ట్రోఫీలను గెల్చుకున్న సానియా మీర్జా ఇటీవల రిటైర్మెంట్ను ప్రకటించిన సంగతి తెలిసిందే. She ended her playing career the way she started it: with her hunger to succeed undiminished. Reminds me to keep the desire to excel alive, even at this stage in my career. She’s my #MondayMotivation pic.twitter.com/6GnQYieBEe — anand mahindra (@anandmahindra) February 6, 2023 -
భావోద్వేగానికి లోనైన సానియా.. ఇక్కడే మొదలు, ఇక్కడే ముగింపు అంటూ..
Sania Mirza Gets Emotional Video: ‘‘నా ప్రొఫెషనల్ కెరీర్ ఇక్కడే.. 2005లో 18 ఏళ్ల వయసులో మెల్బోర్న్లో మొదలైంది.. ఇక్కడే నా గ్రాండ్‌స్లామ్ కెరీర్ ముగిసిపోతోంది కూడా. రాడ్ లావెర్ ఎరీనా నాకు ఎంతో ప్రత్యేకం. నా చిన్నారి కుమారుడి సమక్షంలో ఇలా ఇక్కడ గ్రాండ్‌స్లామ్ ఫైనల్ ఆడతానని అస్సలు ఊహించలేదు. ఇంతకంటే మరో గొప్ప చోటు ఎక్కడా ఉండదు’’ అంటూ భారత టెన్నిస్ స్టార్ సానియా మీర్జా భావోద్వేగానికి లోనయ్యారు. ఆస్ట్రేలియా ఓపెన్-2023 మిక్స్డ్ డబుల్స్ ఫైనల్లో ఓటమి తర్వాత తన కెరీర్‌లోని మధుర క్షణాలను గుర్తు చేసుకుంటూ ఉబికి వస్తున్న కన్నీళ్లను ఆపుకోలేకపోయారు. ఓటమితో ముగింపు కాగా ఇప్పటికే తన రిటైర్మెంట్ నిర్ణయాన్ని ప్రకటించిన హైదరాబాదీ సానియా మీర్జా కెరీర్లో ఇదే ఆఖరి గ్రాండ్‌స్లామ్. మరో భారత టెన్నిస్ స్టార్ రోహన్ బోపన్నతో కలిసి ఫైనల్ చేరుకున్న సానియా మెల్బోర్న్లో జరిగిన శుక్రవారం నాటి మ్యాచ్‌లో ఓటమిని మూటగట్టుకున్నారు. బ్రెజిల్ జంట లూసియా స్టెఫానీ- రఫేల్ మాటోస్ చేతిలో ఓడిపోయిన భారత జోడీ రన్నరప్‌తో సరిపెట్టుకుంది. ఇక బ్రెజిల్ ద్వయానికి కూడా ఇదే తొలి ఆస్ట్రేలియా ఓపెన్ టైటిల్ కావడం విశేషం. కన్నీళ్లు పెట్టుకున్న సానియా.. 36 ఏళ్ల సానియా మీర్జా కెరీర్లో ఇది 11వ గ్రాండ్ స్లామ్ ఫైనల్. కాగా సానియా ఇప్పటి వరకు 43 డబుల్స్ టైటిళ్లు గెలిచారు. ఇందులో ఆరు గ్రాండ్‌స్లామ్ ట్రోఫీలు ఉన్నాయి. నంబర్ 1గా.. కానీ అదొక్కటే లోటు మహిళల డబుల్స్‌లో మూడు, మిక్స్డ్ డబుల్స్‌లో మూడుసార్లు విజేతగా నిలిచారు. అంతేగాక మహిళల డబుల్స్ కేటగిరీలో సానియా 91 వారాల పాటు నంబర్ 1 ర్యాంకులో కొనసాగారు. అయితే కెరీర్లో ఒక్కసారి కూడా ఆమె మేజర్ సింగిల్స్ టైటిల్ గెలవలేకపోయారు. ఇదే సానియా కెరీర్లో పెద్దలోటు అని చెప్పవచ్చు. ఇక ఇప్పుడు తన కుమారుడు ఇజహాన్ ఎదుట ఆడిన ఫైనల్లో ఓడిపోయిన సానియా కన్నీళ్లు పెట్టుకుంటూ వీడ్కోలు పలికారు. వి లవ్ యూ! ఇందుకు సంబంధించిన వీడియోను షేర్ చేసిన ఆస్ట్రేలియా ఓపెన్ నిర్వాహకులు.. ‘‘మేము నిన్ను ప్రేమిస్తూనే ఉంటాము సానియా’’ అని ట్వీట్ చేశారు. కాగా వచ్చే నెలలో దుబాయ్ వేదికగా జరుగనున్న డబ్లూటీఏ 1000 ఈవెంట్ తర్వాత సానియా తన టెన్నిస్ కోర్టుకు పూర్తిగా దూరం కానున్నారు. సానియా మీర్జా గ్రాండ్‌స్లామ్ టైటిళ్లు- భాగస్వాములు ►2006- ఆస్ట్రేలియా ఓపెన్- మిక్స్డ్ డబుల్స్- మహేశ్ భూపతి ►2012- ఫ్రెంచ్ ఓపెన్- మిక్స్డ్ డబుల్స్- మహేశ్ భూపతి ►2014- యూఎస్ ఓపెన్- మిక్స్డ్ డబుల్స్- బ్రూనో సోర్స్ ►2015- వింబుల్డన్- మహిళల డబుల్స్- మార్టినా హింగిస్ ►2015- యూఎస్ ఓపెన్- మహిళల డబుల్స్- మార్టినా హింగిస్ ►2016- ఆస్ట్రేలియా ఓపెన్- మహిళల డబుల్స్- మార్టినా హింగిస్ చదవండి: Axar Patel: పెళ్లి పీటలెక్కిన టీమిండియా స్టార్ ఆల్‌రౌండర్.. ఫొటోలు వైరల్ Ind Vs NZ: రాంచిలో మ్యాచ్ అంటే అంతే! టాస్ గెలిస్తే... “My professional career started in Melbourne… I couldn’t think of a better arena to finish my [Grand Slam] career at.” We love you, Sania ❤️@MirzaSania • #AusOpen • #AO2023 pic.twitter.com/E0dNogh1d0 — #AusOpen (@AustralianOpen) January 27, 2023 -
Australian Open: ఆశలు గల్లంతు! ఫైనల్లో సానియా-బోపన్న జోడి ఓటమి
మెల్బోర్న్: కెరీర్లో చివరి గ్రాండ్‌స్లామ్ టోర్నీ ఆడుతున్న హైదరాబాద్ వెటరన్ టెన్నిస్ స్టార్ సానియా మీర్జాకు ఆస్ట్రేలియన్ ఓపెన్ ఫైనల్లో చుక్కెదురైంది. మిక్స్డ్ డబుల్స్ ఫైనల్ మ్యాచ్‌లో సానియా మీర్జా-బోపన్న జోడి ఓటమి పాలైంది. బ్రెజిల్ జంట స్టెఫానీ-రఫెల్ చేతిలో 6-7, 2-6 తేడాతో భారత జోడి ఓడిపోయింది. ఇప్పటికే మహిళల డబుల్స్‌లోనూ సానియా-అనా డానిలినా (కజకిస్తాన్) జంట నిరాశపరిచిన సంగతి తెలిసిందే. అయితే, సీనియర్ ఆటగాడు బోపన్న సాయంతో ఆస్ట్రేలియా ఓపెన్ ఫైనల్లో విజయం సాధించి టైటిల్‌తో సానియాకు ఘనంగా వీడ్కోలు పలకాలని అభిమానులు ఆకాంక్షించగా వారి ఆశలు అడియాశలయ్యాయి. ఇక బ్రెజిల్ జంట స్టెఫానీ-రఫెల్‌కు ఇది తొలి గ్రాండ్ స్లామ్ టైటిల్ కావడం విశేషం. ఆస్ట్రేలియన్ ఓపెన్‌లో 2009 (మిక్స్డ్), 2016 (డబుల్స్)లలో సానియా విజేతగా నిలిచింది. (చదవండి: 'జొకోవిచ్.. మీ తండ్రి చేసిన పని సిగ్గుచేటు')) -
Australia Open: ఆస్ట్రేలియా ఓపెన్ ఫైనల్లో సానియా- బోపన్న జోడీ
Australian Open Mixed Doubles: ఆస్ట్రేలియా ఓపెన్ మిక్స్డ్ డబుల్స్ సెమీ ఫైనల్లో సానియా మీర్జా–రోహన్ బోపన్న (భారత్) జోడి అదరగొట్టింది. బుధవారం నాటి సెమీస్ మ్యాచ్‌లో థర్డ్ సీడ్ ద్వయం నీల్ స్కుప్స్కి(గ్రేట్ బ్రిటన్), డిసిరే(యూఎస్ఏ)ను ఓడించి సగర్వంగా ఫైనల్లో అడుగుపెట్టింది. ప్రత్యర్థిపై 7-6, 6-7, (10-6) తేడాతో విజయం సాధించి తుదిపోరుకు అర్హత సాధించింది. అలా సెమీస్‌కు చేరి.. ఇదిలా ఉంటే.. సానియా మీర్జా–రోహన్ బోపన్న ద్వయం కోర్టులోకి అడుగు పెట్టకుండానే మిక్స్డ్ డబుల్స్‌లో సెమీఫైనల్ బెర్త్‌ను ఖరారు చేసుకున్న విషయం తెలిసిందే. ఈ జోడీతో తలపడాల్సిన ఒస్టాపెంకో (లాత్వియా)–వెగా హెర్నాండెజ్ (స్పెయిన్) జోడీ గాయం కారణంగా బరిలోకి దిగకపోవడంతో భారత జంటను విజేతగా ప్రకటించారు. ఇలా సెమీస్‌కు చేరుకున్న సానియా- బోపన్న జోడీ మెరుగైన ప్రదర్శనతో ఇప్పుడు ఏకంగా ఫైనల్‌కు దూసుకెళ్లింది. కాగా కెరీర్లో చివరి గ్రాండ్ స్లామ్ ఆడుతున్న సానియా మీర్జా.. బోపన్న సాయంతో ఆస్ట్రేలియా ఓపెన్ ఫైనల్లోనూ విజయం సాధించి టైటిల్‌తో ఘనంగా వీడ్కోలు పలకాలని అభిమానులు ఆకాంక్షిస్తున్నారు. చదవండి: ICC ODI Rankings: నంబర్ వన్ బౌలర్‌గా సిరాజ్ ICC ODI Rankings: కోహ్లిని వెనక్కునెట్టిన గిల్.. హిట్‌మ్యాన్ ఏ స్థానంలో ఉన్నాడంటే..? In a fitting farewell, @MirzaSania's last dance will take place on the grandest stage! She and @rohanbopanna 🇮🇳 have qualified for the Mixed Doubles Final!@wwos • @espn • @eurosport • @wowowtennis • #AusOpen • #AO2023 pic.twitter.com/qHGNOvWMoC — #AusOpen (@AustralianOpen) January 25, 2023 -
‘మిక్స్డ్’ ప్రిక్వార్టర్ ఫైనల్లో సానియా జోడీ
తన కెరీర్లో చివరి గ్రాండ్‌స్లామ్ టోర్నీ ఆడుతున్న భారత టెన్నిస్ స్టార్ సానియా మీర్జా ఆ్రస్టేలియన్ ఓపెన్ మిక్స్డ్ డబుల్స్ విభాగంలో ప్రిక్వార్టర్ ఫైనల్లోకి దూసుకెళ్లింది. శనివారం జరిగిన తొలి రౌండ్లో సానియా–రోహన్ బోపన్న (భారత్) జోడీ 7–5, 6–3తో జైమీ ఫోర్లిస్–ల్యూక్ సావిల్లె (ఆస్ట్రేలియా) ద్వయంపై నెగ్గింది. 74 నిమిషాలపాటు జరిగిన ఈ మ్యాచ్‌లో సానియా–బోపన్న ప్రత్యర్థి సరీ్వస్‌ను నాలుగుసార్లు బ్రేక్ చేశారు. జీవన్–బాలాజీ ద్వయం సంచలనం చివరి నిమిషంలో ఆస్ట్రేలియన్ ఓపెన్ గ్రాండ్‌స్లామ్ టెన్నిస్ టోర్నీలో ఆడే అవకాశం దక్కించుకున్న భారత డబుల్స్ జోడీ జీవన్ నెడుంజెళియన్–శ్రీరామ్ బాలాజీ సంచలనం సృష్టించింది. శనివారం జరిగిన పురుషుల డబుల్స్ తొలి రౌండ్లో జీవన్–శ్రీరామ్ బాలాజీ ద్వయం 7–6 (8/6), 2–6, 6–4తో ఐదో సీడ్ ఇవాన్ డోడిగ్ (క్రొయేషియా)–ఆస్టిన్ క్రాయిసెక్ (అమెరికా) జోడీని బోల్తా కొట్టించి రెండో రౌండ్‌కు చేరుకుంది. -
Sania Mirza: ఆఖరి గ్రాండ్‌స్లామ్ టోర్నీ.. విజయంతో మొదలు
మెల్బోర్న్: హైదరాబాద్ వెటరన్ టెన్నిస్ స్టార్ సానియా మీర్జా మహిళల డబుల్స్‌లో ముందంజ వేసింది. కెరీర్లో ఆఖరి గ్రాండ్‌స్లామ్ టోర్నీ ఆడుతున్న ఆమె అనా డానిలినా (కజకిస్తాన్) కలిసి ఆస్ట్రేలియన్ ఓపెన్‌లో శుభారంభం చేసింది. తొలి రౌండ్లో సానియా–డానిలినా జోడీ 6–2, 7–5తో డాల్మా గాల్ఫీ (హంగేరి)–బెర్నార్డా పెర (అమెరికా) జంటపై విజయం సాధించింది. తొలి సెట్‌ను 25 నిమిషాల్లోనే వశం చేసుకున్న భారత్–కజకిస్తాన్ ద్వయానికి రెండో సెట్లో అనూహ్య పోటీ ఎదురైంది. 4–1తో గెలిచే దశలో కనిపించిన సానియా జోడీకి గాల్ఫీ–బెర్నార్డా వరుసగా 4 గేమ్‌లు గెలిచి సవాలు విసిరారు 5–5తో సమం చేశారు. అయితే తర్వాత వారి సర్వీస్‌ను బ్రేక్ చేయడం ద్వారా సానియా–డానిలినా జంట గెలుపొందింది. ఆస్ట్రేలియన్ ఓపెన్‌లో 2009 (మిక్స్డ్), 2016 (డబుల్స్)లలో సానియా విజేతగా నిలిచింది. చదవండి: Kaviya Maran: నన్ను పెళ్లి చేసుకుంటావా?.. సౌతాఫ్రికాలో కావ్య మారన్‌కు ప్రపోజల్.. వీడియో వైరల్ Hockey WC 2023: నెదర్లాండ్స్ సంచలన విజయం.. ఆస్ట్రేలియాను వెనక్కి నెట్టి చరిత్ర! బంగ్లాదేశ్ ప్రీమియర్ లీగ్‌లో సంచలనం.. పాక్ బ్యాటర్ ఊచకోత -
టెన్నిస్‌కు సానియా మీర్జా గుడ్‌బై.. భావోద్వేగ పోస్ట్
మెల్బోర్న్: భారత వెటరన్ టెన్నిస్ స్టార్ సానియా మీర్జా ఫిబ్రవరిలో జరిగే దుబాయ్ ఓపెన్ తర్వాత రిటైర్ అవుతున్నట్లు ప్రకటించింది. ఈ మేరకు ఆమె ట్విట్టర్లో భావోద్వేగపు లేఖను ‘లైఫ్ అప్డేట్’ అనే క్యాప్షన్‌తో పంచుకుంది. మూడు పేజీల ఈ లేఖలో తన 30 ఏళ్ల రాకెట్ పయనాన్ని, చివరి గమ్యాన్ని వివరించింది. ‘నా గ్రాండ్‌స్లామ్ ప్రయాణం 2005లో ఆ్రస్టేలియన్ ఓపెన్‌తోనే మొదలైంది. ఇప్పుడు గ్రాండ్‌స్లామ్ ఆట కూడా అక్కడే ముగించేందుకు సరైన వేదిక అనుకుంటున్నా. 18 ఏళ్ల క్రితం ఎక్కడైతే ఆరంభించానో అక్కడే ఆపేయబోతున్నా. ఇక కెరీర్లో చివరి టోర్నీ మాత్రం దుబాయ్ ఓపెన్. ఫిబ్రవరిలో ఈ టోరీ్నతో సుదీర్ఘ కెరీర్‌కు వీడ్కోలు పలుకుతాను. ఇన్నేళ్ల పయనంలో ఎన్నో ఆటుపోట్లే కాదు మరెన్నో మధురస్మృతులూ ఉన్నాయి’ అని అందులో పేర్కొంది. నాసర్ స్కూల్‌కు చెందిన ఆరేళ్ల బాలిక ఎలా టెన్నిస్ నేర్చుకుంది... తన కలలకు ఎక్కడ బీజం పడింది... అన్నింటికీ మించి దేశానికి ప్రాతినిధ్యం ఎలాంటి స్ఫూర్తినిచ్చిందో ఆ లేఖలో చెప్పుకొచ్చింది. అర్ధ సెంచరీని దాటిన తన గ్రాండ్‌స్లామ్ టోరీ్నల్లో గెలిచిన కొన్ని టైటిళ్లు దేవుడిచ్చిన వరమంది. ‘నా సుదీర్ఘ కెరీర్లో దేశానికి పతకాలు తేవడమే అతిపెద్ద గౌరవంగా భావిస్తాను. పతకం నా మెడలో పడినపుడు జాతీయ పతాకం రెపరెపలాడినపుడు కలిగే ఆనందం అన్నింటికి మించి ఉంటుంది. ఇప్పుడు దీన్ని తలచుకొని రిటైర్మెంట్ సందేశం రాస్తున్నప్పుడు చెరిగిపోని ఆ అనుభూతి నా కళ్లను చెమరుస్తోంది’ అని 36 ఏళ్ల సానియా పేర్కొంది. ఇదిలా ఉంటే, మహిళల డబుల్స్‌లో మాజీ నెంబర్ వన్ అయిన 36 ఏళ్ల సానియా మీర్జా.. డబుల్స్ విభాగంలో ఆస్ట్రేలియన్ ఓపెన్, వింబుల్డన్, యూఎస్ ఓపెన్ టైటిళ్లను, అలాగే మిక్స్డ్ డబుల్స్ విభాగంలో ఆస్ట్రేలియన్ ఓపెన్, ఫ్రెంచ్ ఓపెన్, యూఎస్ ఓపెన్ టైటిల్స్‌ను గెలిచింది. 2016 రియో ఒలింపిక్స్‌లో మిక్స్డ్ డబుల్స్‌లో సెమీఫైనల్లో ఓడిన సానియా జంట తృటిలో పతకం చేజార్చుకుంది. Life update :) pic.twitter.com/bZhM89GXga — Sania Mirza (@MirzaSania) January 13, 2023 -
తొలి రౌండ్లోనే సానియా జోడీ ఓటమి.. ప్రైజ్‌మనీ?
Adelaide Open 2023: భారత టెన్నిస్ స్టార్ సానియా మీర్జా కొత్త సంవత్సరాన్ని ఓటమితో ప్రారంభించింది. సోమవారం మొదలైన అడిలైడ్ ఓపెన్ ఇంటర్నేషనల్–2 టోర్నీలో సానియా మీర్జా–అనా డానిలినా (కజకిస్తాన్) జోడీ తొలి రౌండ్లోనే నిష్క్రమించింది. సానియా–డానిలినా ద్వయం 6–3, 3–6, 6–10తో ‘సూపర్ టైబ్రేక్’లో టాప్ సీడ్ స్టార్మ్ హంటర్ (ఆస్ట్రేలియా)–క్రిచికోవా (చెక్ రిపబ్లిక్) జోడీ చేతిలో ఓడిపోయింది. ఇక తొలి రౌండ్లోనే ఇంటిబాట పట్టిన సానియా– డానిలినా జోడీకి 4,350 డాలర్ల (రూ. 3 లక్షల 58 వేలు) ప్రైజ్‌మనీ దక్కింది. చదవండి: రిటైర్మెంట్ ప్రకటించిన స్టార్ ప్లేయర్ -
భారత తొలి ముస్లిం ఫైటర్ పైలట్‌గా సానియా మీర్జా
ఉత్తరప్రదేశ్‌లోని మీర్జాపూర్ చెందిన ఓ టీవీ మెకానిక్ కుమార్తె సానియా మీర్జా నేషనల్ ఢిఫెన్స్ అకాడమీ(ఎన్డీఏ) పరీక్షలో ఉత్తీర్ణత సాధించి వార్తల్లో నిలిచింది. దీంతో ఆమె భారత్‌లోనే తొలి ముస్లిం మహిళా ఫైటర్ పైలట్‌గా కానున్నట్లు భారత వైమానిక దళం(ఐఏఎఫ్) పేర్కొంది. ఆమె ఫైటర్ పైలట్‌గా ఎంపికవ్వడానికి ముందుగా నాలుగేళ్ల శిక్షణను విజయవంతంగా పూర్తి చేయాల్సి ఉందని ఐఏఎఫ్ తెలిపింది. ఈ మేరకు ఆమె ఎన్డీఏలో చేరి అకాడమీ కోర్సుగా ఫైటర్ పైలట్ స్ట్రీమ్‌ను ఎంచుకున్నట్లు తెలుస్తుంది. ఈక్రమంలో వైమానిక దళం ఆమె కల నిజమవ్వాలంటూ.. సానియాకు శుభాకాంక్షలు తెలిపింది. ఆమె ఎన్డీఏ ఎగ్జామ్‌లో 149వ ర్యాంకును సాధించింది. హిందీ మీడియంలో చదివినా విజయం సాధించవచ్చని నిరూపించింది సానియా. తాను తొలి మహిళా పైలట్ అవనీ చతుర్వేదిని చూసి ప్రేరణ పొంది రెండో ప్రయత్నంలో ఎన్డీఏలో విజయం సాధించినట్లు సానియా పేర్కొంది. (చదవండి: సోనియా వ్యాఖ్యలకు స్పందించకపోతే.. బాధ్యత పరంగా విఫలమైనట్లే: ధన్ఖర్) -
ప్రిక్వార్టర్ ఫైనల్లో రష్మిక; అడిలైడ్ టోర్నీతో సానియా సీజన్ షురూ
సాక్షి, హైదరాబాద్: అంతర్జాతీయ టెన్నిస్ సమాఖ్య (ఐటీఎఫ్) మహిళల టోర్నీలో హైదరాబాద్ అమ్మాయి శ్రీవల్లి రష్మిక ప్రిక్వార్టర్ ఫైనల్లోకి ప్రవేశించింది. నవీ ముంబైలో బుధవారం జరిగిన సింగిల్స్ తొలి రౌండ్లో రష్మిక 6–0తో రియా భాటియా (భారత్)పై గెలిచింది. రష్మిక తొలి సెట్ గెలిచాక రియా గాయం కారణంగా వైదొలగడంతో రెండో సెట్‌ను నిర్వహించలేదు. డబుల్స్ తొలి రౌండ్లో రష్మిక–వైదేహి (భారత్) జోడీ 4–6, 6–4, 10–8తో శ్రావ్య శివాని–జెన్నిఫర్ (భారత్) ద్వయంపై నెగ్గి క్వార్టర్ ఫైనల్లోకి దూసుకెళ్లింది. హైదరాబాద్‌కే చెందిన సౌజన్య బవిశెట్టి డబుల్స్‌లో క్వార్టర్ ఫైనల్లోకి చేరింది. తొలి రౌండ్లో సౌజన్య–షర్మదా (భారత్) జోడీ 6–4, 7–6 (11/9)తో సహజ–సోహా (భారత్) జంటను ఓడించింది. అడిలైడ్ టోర్నీతో సానియా సీజన్ షురూ భారత మహిళా టెన్నిస్ స్టార్ సానియా మీర్జా 2023 సీజన్‌ను అడిలైడ్ ఇంటర్నేషనల్ ఓపెన్ టోర్నీ ద్వారా ప్రారంభించనుంది. జనవరి 1 నుంచి 7 వరకు ఆస్ట్రేలియాలో జరిగే ఈ టోర్నీలో సానియా కజకిస్తాన్ ప్లేయర్ అన్నా డానిలినాతో కలిసి డబుల్స్ విభాగంలో బరిలోకి దిగనుంది. ఈ మేరకు నిర్వాహకులు ఈ టోర్నీలో ఆడుతున్న క్రీడాకారిణుల జాబితాను విడుదల చేశారు. ఈ ఏడాది సానియా 16 టోర్నీలలో పోటీపడగా... రెండు టోర్నీలలో (చార్ల్స్టన్ ఓపెన్, స్ట్రాస్‌బర్గ్ ఓపెన్) రన్నరప్ ట్రోఫీతో సంతృప్తి పడింది. ఆమె 26 మ్యాచ్‌ల్లో గెలిచి, 16 మ్యాచ్‌ల్లో ఓడిపోయింది. చదవండి: ICC Test Rankings: అదరగొట్టిన అక్షర్ పటేల్... కుల్దీప్, పుజారా, గిల్ సైతం.. BCCI: మా వల్ల కాదు.. తప్పుకొనే యోచనలో టీమిండియా ప్రధాన స్పాన్సర్! కిట్ స్పాన్సర్ కూడా! కారణం? -
సానియా మీర్జా చెల్లిని చూస్తే మతి పోవాల్సిందే (ఫొటోలు)
-
సానియా- షోయబ్ విడాకుల వార్తల్లో కొత్త ట్విస్ట్
భారత టెన్నిస్ స్టార్ సానియా మీర్జా తన భర్త షోయబ్ మాలిక్‌తో విభేదాల కారణంగా విడాకులకు సిద్ధమయ్యారనే వార్తలు కొద్ది రోజులుగా చక్కర్లు కొడుతున్నాయి. అయితే, వారు అధికారికంగా ఎలాంటి ప్రకటన చేయలేదు. తాజాగా ఈ విడాకుల వార్తల్లో కొత్త ట్విస్ట్ నెలకొంది. షోయబ్ మాలిక్ ఇన్స్టాగ్రామ్ బయో చూసి ఆయన ఇచ్చిన కొత్త ట్విస్ట్‌కు అంతా ఆశ్చర్యపోతున్నారు. తన ఇన్‌స్టా బయోలో తాను సూపర్‌వుమన్ సానియా మిర్జాకు భర్తను అంటూ రాసుకొచ్చారు షోయబ్. ‘అథ్లెట్, సూపర్‌వుమన్ సానియామిర్జాకు భర్త, ప్రేమకు ప్రతిరూపమైన ఒకరికి తండ్రి’ అని పేర్కొన్నారు. విడాకుల విషయంపై ప్రశ్నలు ఎదురవుతున్న నేపథ్యంలో..కొద్ది రోజుల క్రితం పుకార్ల నుంచి తనను, మీర్జాను ఒంటరిగా వదిలేయాలని విజ్ఞప్తి చేశారు షోయబ్ మాలిక్. ‘ఇది మా వ్యక్తిగతం. ఈ ప్రశ్నకు నేను, నా భార్య సమాధానం ఇవ్వటం లేదు. మమ్మల్ని వదిలేయండి.’ అని విజ్ఞప్తి చేశారు. మరోవైపు.. టెన్నిస్ స్టార్ మీర్జా సోలోగా ఫోటోషూట్స్ చేస్తుండటం రూమర్లకు మరింత బలం చేకూర్చుతున్నట్లవుతోంది. ఇది ఇలా ఉండగా.. ఖతర్ వేదికగా మంగళవారం జరిగిన అర్జెంటీనా, క్రొయేషియా మ్యాచ్ మైదానంలో తన సోదరితో పాటు సానియా తళుక్కుమనటం ప్రస్తుతం వైరల్‌గా మారింది. ఇదీ చదవండి: Sania Mirza-Shoaib Malik: విడాకులకు సిద్ధమైన సానియా? ‘ఒకే ఒక్క ప్రేమ’ అని ఫరా కామెంట్.. ముక్కలైన హృదయం అంటూ.. -
Sania Mirza: సానియా మీర్జా బర్త్‌డే.. షోయబ్ మాలిక్ పోస్ట్ వైరల్
Sania Mirza- Shoaib Malik: భారత టెన్నిస్ స్టార్ సానియా మీర్జా పుట్టినరోజు నేడు. ఆమె ఈరోజు(నవంబరు 15) 36వ వసంతంలో అడుగుపెడుతున్నారు. ఈ సందర్భంగా సోషల్ మీడియా వేదికగా సానియాకు శుభాకాంక్షలు వెల్లువెత్తుతున్నాయి. లవ్ యూ ఫరా ఈ క్రమంలో సానియా మీర్జా బెస్ట్ ఫ్రెండ్, బాలీవుడ్ కొరియోగ్రాఫర్,దర్శకురాలు ఫరా ఖాన్.. సానియా కేక్ కట్ చేస్తున్న వీడియోను షేర్ చేస్తూ ఆమెకు శుభాకాంక్షలు తెలిపారు. ఇందుకు స్పందించిన సానియా.. ‘‘లవ్ యూ’’ అంటూ బదులిచ్చారు. షోయబ్ విషెస్ ఇదిలా ఉంటే.. సానియా వైవాహిక జీవితానికి సంబంధించి ఇటీవల పలు వదంతులు వ్యాపిస్తున్న విషయం తెలిసిందే. భర్త షోయబ్ మాలిక్‌కు దూరంగా ఉంటున్న ఆమె విడాకులకు సిద్ధమయ్యారంటూ వార్తలు గుప్పుమంటున్నాయి. ఈ నేపథ్యంలో సానియా బర్త్‌డే సందర్భంగా షోయబ్ చేసిన పోస్టు వైరల్ అవుతోంది. అవన్నీ అబద్ధాలేనా? భార్య కళ్లల్లోకి ఆప్యాయంగా చూస్తూ ఉన్న ఫొటోను పంచుకున్న ఈ వెటరన్ క్రికెటర్.. ‘‘పుట్టిన రోజు శుభాకాంక్షలు. ఆయురారోగ్యాలు, సంతోషాలతో నీ జీవితం విలసిల్లాలి. నీదైన ఈ రోజును పూర్తిగా ఆస్వాదించు’’ అంటూ ఆమెను విష్ చేశాడు. ఈ ఫొటో చూసిన షోయబ్ ఫ్యాన్స్.. ‘‘విడాకుల రూమర్లు అబద్ధమని తేలినట్లేగా! మీది చూడముచ్చటైన జంట. మీరిలా ఎల్లప్పుడూ కలిసే ఉండాలి’’ అంటూ ఆకాంక్షిస్తున్నారు. కొడుకుతో సానియా- షోయబ్ సరిహద్దులు దాటిన ప్రేమ పాకిస్తాన్‌కు చెందిన ఆల్‌రౌండర్ షోయబ్ మాలిక్‌ను ప్రేమించిన సానియా.. 2010 ఏప్రిల్‌లో అతడిని వివాహం చేసుకున్న విషయం తెలిసిందే. వీరికి కుమారుడు ఇజహాన్ సంతానం. ఇక ఓ మోడల్‌తో షోయబ్ ప్రేమలో పడ్డాడని, అందుకే సానియాను దూరం పెట్టడంతో ఆమెకు విడాకులకు సిద్ధమయ్యారని పాక్ మీడియాలో ఇటీవల కథనాలు వచ్చాయి. ఈ నేపథ్యంలో సానియాతో కలిసి మీర్జా మాలిక్ షో చేస్తున్నట్లు ప్రకటించడం సహా ఇలా భార్య పుట్టిన రోజున షోయబ్ విషెస్ తెలపడం గమనార్హం. చదవండి: Sania Mirza-Shoaib Malik: విడాకులకు సిద్ధమైన సానియా? ‘ఒకే ఒక్క ప్రేమ’ అని ఫరా కామెంట్.. ముక్కలైన హృదయం అంటూ.. View this post on Instagram A post shared by Shoaib Malik (@realshoaibmalik) View this post on Instagram A post shared by Farah Khan Kunder (@farahkhankunder) -
Sania-Shoaib Malik: టీవీ షో కోసం విడాకుల డ్రామా.. జనాల్ని ఫూల్స్ చేశారా..?
భారత టెన్నిస్ స్టార్ సానియా మీర్జా, పాకిస్తాన్ వెటరన్ క్రికెటర్ షోయబ్ మాలిక్.. తమ దాంపత్య జీవితానికి పుల్‌స్టాప్ పెట్టనున్నట్లు గత కొద్ది రోజులుగా సోషల్‌మీడియా కోడై కూస్తున్న విషయం తెలిసిందే. పాక్ మోడల్ అయేషా ఒమర్‌తో షోయబ్ సీక్రెట్ రిలేషన్ మెయిన్టైన్ చేస్తున్న విషయం సానియాకు తెలిసిపోవడమే, వారి పెళ్లి పెటాకులు కావడానికి కారణమైందని నెట్టింట రకరకాల కథనాలు ప్రచారమయ్యాయి. View this post on Instagram A post shared by UrduFlix (@urduflixofficial) ఇటీవలి కాలంలో సానియా ఇన్‌స్టాలో పెట్టిన కొన్ని పోస్ట్‌లు, షోయబ్ మేనేజర్ విడాకుల విషయాన్ని దృవీకరించాడని వచ్చిన వార్తలు, మీర్జా-మాలిక్ వివాహ బంధానికి తెరపడినట్లు జరిగిన ప్రచారానికి మరింత బలం చేకూర్చాయి. విడాకుల విషయమై మీర్జా-మాలిక్ నుంచి ఎలాంటి రెస్పాన్స్ లేకపోవడంతో ఈ వార్తల్లో నిజం లేకపోలేదేమోనని ఇప్పుడిప్పుడే వారిరువురి ఫ్యాన్స్ ఓ కన్ఫర్మేషన్కు వస్తున్నారు. View this post on Instagram A post shared by Ayesha Omar (@ayesha.m.omar) అయితే, ఇంతలోనే మీర్జా-మాలిక్ గురించిన ఓ వార్త అభిమానులను కన్ఫ్యూజింగ్ స్టేట్లోకి నెట్టేసింది. మీర్జా-మాలిక్ ఇద్దరూ కలిసి ఓ టీవీ షో చేస్తున్నారని ఊర్దూఫ్లిక్స్ అనే ఓటీటీ ఫ్లాట్‌ఫామ్ ప్రకటించింది. ఈ షో.. 'ది మీర్జా మాలిక్ షో' గా అతి త్వరలో ప్రేక్షకుల ముందుకు రాబోతుందని ఊర్దూఫ్లిక్స్ తమ అధికారిక ఇన్‌స్టాలో పోస్ట్ చేసింది. ఈ వార్త తెలిసి అభిమానులు తలలు గోక్కుంటున్నారు. అసలు వీరి విడాకులు వార్త నిజమేనా లేక షో ప్రమోషన్లో భాగంగా జనాలను ఫూల్స్ చేశారా అన్న డైలమాలో ఉన్నారు. కొందరేమో.. ఈ షో వారిద్దరికీ చెడక ముందే ప్లాన్ చేసిందని, మీర్జా-మాలిక్‌ల వివాహ బంధానికి పుల్‌స్టాప్ పడిన వార్త నిజమేనని అనుకుంటున్నారు. కాగా, 2010లో ప్రేమ వివాహం చేసుకున్న సానియా మీర్జా, షోయబ్ మాలిక్ దంపతులకు 2018లో ఇజాన్ మీర్జా అనే బిడ్డ పుట్టాడు. ఇద్దరు తమతమ కెరీర్లతో బిజీగా ఉండటంతో సానియా ఇండియాలో, షోయబ్ పాక్‌లో ఉంటున్నారు. చదవండి: Sania Mirza: సానియా మీర్జాతో విభేదాలు!? నటితో షోయబ్ మాలిక్ ఫొటోలు వైరల్ -
Sania Mirza: సానియా మీర్జాతో విభేదాలు!? నటితో షోయబ్ మాలిక్ ఫొటోలు వైరల్
Sania Mirza- Shoaib Malik- Ayesha Omar: సోషల్ మీడియా వినియోగం పెరిగిన తర్వాత చాలా మంది సెలబ్రిటీలు అభిమానులకు మరింతగా చేరువయ్యే అవకాశం దొరికింది. తమ వ్యక్తిగత, వృత్తిగత జీవితానికి సంబంధించిన విశేషాలు పంచుకునే వెసలుబాటు కలిగింది. అయితే, ఒక్కోసారి నోరు తెరచి స్వయంగా ఏ విషయం చెప్పకపోయినా.. నేరుగా ఎలాంటి ప్రకటన చేయకపోయినా సరే.. వాళ్లు షేర్ చేసే ఫొటోలు, వాటికి జత చేసే క్యాప్షన్లు చాలు.. వాళ్ల పర్సనల్ లైఫ్ గురించి వదంతులు వ్యాపించడానికి! క్రీడా జంట సానియా మీర్జా- షోయబ్ మాలిక్ విషయంలో ప్రస్తుతం ఇదే జరుగుతోంది. భారత టెన్నిస్ స్టార్ సానియా మీర్జా- పాకిస్తాన్ వెటరన్ క్రికెటర్ షోయబ్ మాలిక్ విడాకులకు సిద్ధమయ్యారంటూ రూమర్లు గుప్పుమంటున్నాయి. ఇప్పటికే వీరిద్దరు విడిగా ఉంటున్నారని, విడాకులకు సంబంధించిన ప్రక్రియ పూర్తైన తర్వాత ప్రకటన చేయనున్నారంటూ వార్తలు వినిపిస్తున్నాయి. ఆమే కారణం అంటూ! అంతేకాదు.. ఓ పాకిస్తాన్ మోడల్ ఇందుకు కారణమని పాక్ మీడియాలో కథనాలు వస్తున్నాయి. ఇంతకీ ఆమె ఎవరు? ఆమె పేరు తెరపైకి రావడానికి కారణం ఏమిటంటే.. సదరు మోడల్ పేరు ఆయేషా ఒమర్. స్థానిక మ్యాగజీన్ కోసం షోయబ్ ఆమెతో కలిసి 2021లో ఓ బోల్డ్ ఫొటోషూట్ చేశాడు. హెల్త్ అండ్ ఫిట్‌నెస్‌పై అవగాహనలో భాగంగా రూపొందించిన వీడియోలో తమ తమ రంగాల్లో నిష్ణాతులైన వీళ్లు ఆ ఫొటోషూట్‌లో చాలా సన్నిహితంగా కనిపించారు. ఇందుకు సంబంధించిన ఫొటోలను ఆయేషా తన ఇన్‌స్టాగ్రామ్‌లో షేర్ చేయగా నెటిజన్లు విపరీతంగా ట్రోల్ చేశారు. షోయబ్ రెండో పెళ్లికి సిద్దమైనట్లుగా కనిపిస్తోంది అంటూ ఇష్టారీతిన కామెంట్లు చేశారు. స్విమ్మింగ్‌పూల్‌లో దిగి ఇలా ఫోజులివ్వడమే ప్రొఫెషనలిజమా అంటూ ప్రశ్నించారు. మీ భర్త కూడా ఇలాగే చేస్తే ఈ నేపథ్యంలో ఓ ఇంటర్వ్యూలో షోయబ్ మాలిక్ ఈ విషయం గురించి మాట్లాడుతూ.. ఫొటోషూట్ సమయంలో ఆయేషా తనకు సహకరించారంటూ వ్యాఖ్యలు చేశాడు. ఈ ఫొటోషూట్ గురించి మీ భార్య సానియా ఎలా స్పందించారని హోస్ట్ ప్రశ్నించగా.. సమాధానం దాటవేసిన షోయబ్.. ‘‘మీ భర్త కూడా ఇలాంటి ఫొటోషూట్‌లో పాల్గొంటే మీ రియాక్షన్ ఏంటీ’’అంటూ ఎదురు ప్రశ్నించాడు. PC: Ayesha Omar Instagram ఇందుకు వెంటనే స్పందించిన ఆమె..‘‘నాకింకా పెళ్లి కాలేదు’’అని సమాధానమిచ్చింది. అవునా.. మీ లాగే సానియా కూడా రియాక్ట్ అవ్వలేదు అంటూ నర్మగర్భ వ్యాఖ్యలు చేశాడు. ఇందుకు తోడు ఇటీవల సానియా.. ‘‘హృదయం ముక్కలైందంటూ’’వరుస పోస్ట్‌లు చేస్తూ ఉండటం ఈ రూమర్లకు ఊతమిచ్చింది. భార్యా కొడుకుతో షోయబ్ మాలిక్ ఆయేషా ఎవరంటే ఆయేషా ఒమర్ నటి, గాయని, యూబ్యూబర్. 1981లో జన్మించిన ఆమె తొలుత వీడియో ఆల్బమ్‌లతో లైమ్‌లైట్‌లోకి వచ్చారు. 2015లో కరాచీ సే లాహోర్ అనే రొమాంటిక్ కామెడీ సినిమాతో హీరోయిన్గా ఎంట్రీ ఇచ్చి కెరీర్ కొనసాగిస్తున్నారు. ఇక సానియా- షోయబ్ మాలిక్ విడాకుల వార్తల నేపథ్యంలో ప్రస్తుతం ఆయేషా- షోయబ్ మాలిక్ ఫొటోలు నెట్టింట వైరల్ అవుతున్నాయి. కాగా 2010లో పెళ్లి చేసుకున్న సానియా- షోయబ్‌కు కుమారుడు ఇజహాన్ సంతానం. చదవండి: T20 WC 2022 Final: ఇంగ్లండ్- పాక్ ఫైనల్‌కు వర్షం ముప్పు.. మ్యాచ్ రద్దు అయితే? IND vs NZ: టీమిండియా హెడ్ కోచ్‌గా వీవీఎస్ లక్ష్మణ్! View this post on Instagram A post shared by Ayesha Omar (@ayesha.m.omar) View this post on Instagram A post shared by Ayesha Omar (@ayesha.m.omar) View this post on Instagram A post shared by Ayesha Omar (@ayesha.m.omar) -
Sania Mirza: విడాకులకు సిద్ధమైన సానియా? ‘భర్త మోసాన్ని తట్టుకోలేకే’ అంటూ..
Sania Mirza- Shoaib Malik: భారత టెన్నిస్ స్టార్ సానియా మీర్జా వ్యక్తిగత జీవితానికి సంబంధించి సోషల్ మీడియాలో వదంతులు వ్యాపిస్తున్నాయి. భర్త షోయబ్ మాలిక్‌తో విభేదాల కారణంగా ఆమె విడాకులకు సిద్దమయ్యారనేది వాటి సారాంశం. కాగా టెన్నిస్‌లో అగ్రశ్రేణి క్రీడాకారిణిగా పలు ఘనతలు అందుకున్న సానియా.. పాకిస్తాన్ క్రికెటర్ షోయబ్ మాలిక్‌ను ప్రేమించి పెళ్లాడిన విషయం తెలిసిందే. బంధు మిత్రుల సమక్షంలో అంగరంగ వైభవంగా 2010 ఏప్రిల్‌లో ఈ క్రీడా జంట వివాహ బంధంలో అడుగుపెట్టింది. వీరికి కుమారుడు ఇజహాన్ సంతానం. ఇక పెళ్లైన నాటి నుంచి.. ముఖ్యంగా ఇండియా- పాకిస్తాన్ మ్యాచ్ సమయంలో సానియాను ఉద్దేశించి కొంతమంది ఆకతాయిలు విపరీతమైన ట్రోల్స్ చేసేవారు. అయితే, అవేమీ తమ బంధం మీద ప్రభావం చూపలేవంటూ భర్తతో కలిసి దిగిన ఫొటోలు షేర్ చేస్తూ.. ట్రోల్స్‌కు కౌంటర్ ఇచ్చేవారు సానియా. కానీ గత కొన్ని రోజులుగా ఈ దంపతుల మధ్య విభేదాలు తలెత్తినట్లు పాకిస్తాన్ మీడియాలో వార్తలు వస్తున్నట్లు ఇన్సైడ్ స్పోర్ట్ తన కథనంలో పేర్కొంది. అనుమానాలు పెంచిన ఆ కామెంట్! ఇటీవల దుబాయ్‌లో తమ కుమారుడి పుట్టినరోజు(అక్టోబరు 30) సెలబ్రేట్ చేసింది ఈ జంట. ఈ క్రమంలో షోయబ్ తన సోషల్ మీడియా అకౌంట్లో ఇందుకు సంబంధించిన ఫొటోలు షేర్ చేయగా.. సానియా మాత్రం తాను, తన కొడుకు మాత్రమే కలిసి ఉన్న ఫొటో పంచుకున్నారు. ఇందుకు స్పందించిన సానియా బెస్ట్ ఫ్రెండ్, బాలీవుడ్ కొరియోగ్రాఫర్ ఫరా ఖాన్.. ‘‘నీ జీవితంలో ఉన్న ఒకే ఒక, నిజమైన ప్రేమ.. ఇజహాన్‌తో నిన్ను చూసినప్పుడల్లా నాకిలాగే అనిపిస్తుంది’’ అని కామెంట్ చేశారు. దీనితో పాటు ఇటీవల కొడుకు తనను ఆప్యాయంగా ముద్దాడుతున్న ఫొటోను ఇన్‌స్టాలో షేర్ చేసిన సానియా.. ‘‘కఠిన పరిస్థితుల నుంచి నన్ను బయటకు తీసుకువచ్చే క్షణాలు’’ అంటూ క్యాప్షన్ జతచేశారు. అంతేకాదు.. ‘ముక్కలైన హృదయం ఎక్కడికి వెళ్తుంది’ అంటూ ఇన్‌స్టా స్టోరీలో రాయడం అనుమానాలను మరింత పెంచింది. ఈ పరిణామాల నేపథ్యంలో భర్తను ఉద్దేశించే సానియా ఇలాంటి పోస్టులు చేస్తున్నారంటూ నెటిజన్లు అభిప్రాయపడుతున్నారు. కాగా షోయబ్ మోసాన్ని తట్టుకోలేక సానియా విడాకులకు సిద్ధమయ్యారని.. గత కొన్నాళ్లుగా విడిగా ఉంటున్న ఈ జంట.. కొడుకు కోసం మాత్రమే అప్పుడప్పడూ కలుస్తున్నారంటూ పాక్ మీడియాలో కథనాలు వస్తున్నాయి. అయితే, ఇటు సానియా గానీ.. అటు షోయబ్ గానీ ఈ రూమర్లపై నోరు మెదపకపోవడం గమనార్హం. కాగా వెటరన్ ఆల్‌రౌండర్ షోయబ్ మాలిక్‌కు జాతీయ జట్టులో ఇటీవల అవకాశాలు సన్నగిల్లుతున్నాయి. టీ20 ప్రపంచకప్-2022కు అతడిని సెలక్టర్లు ఎంపిక చేయలేదన్న సంగతి తెలిసిందే. చదవండి: WC 2022: ఇంగ్లండ్‌తో సెమీస్‌కు ముందు టీమిండియాకు ఎదురుదెబ్బ! రోహిత్‌కు గాయం? Aus Vs Eng: ఇంగ్లండ్‌తో వన్డే సిరీస్.. ఆసీస్ జట్టు ప్రకటన.. ప్రపంచకప్ లక్ష్యంగా! View this post on Instagram A post shared by Sania Mirza (@mirzasaniar) View this post on Instagram A post shared by Sania Mirza (@mirzasaniar) Sania Mirza Instagram story. pic.twitter.com/BBKEztyCa6 — Avinash Aryan (@AvinashArya09) November 6, 2022 -
'యూఎస్ ఓపెన్‌కు దూరం'.. రిటైర్మెంట్ ప్లాన్‌లో మార్పులు
భారత టెన్నిస్ స్టార్ సానియా మీర్జా గాయం కారణంగా యూఎస్ ఓపెన్ నుంచి వైదొలుగుతున్నట్లు ప్రకటించింది. ఈ విషయాన్ని ఆమె స్వయంగా ఇన్స్టాగ్రామ్ ద్వారా వెల్లడించింది. వాస్తవానికి ఈ ఏడాది యూఎస్ ఓపెన్ గ్రాండ్‌స్లామ్ అనంతరం సానియా తన ప్రొఫెషనల్ ఆటకు గుడ్‌బై చెప్పాలనుకుంది. అయితే తాజాగా గాయంతో యూఎస్ ఓపెన్‌కు దూరం కావడంతో సానియా రిటైర్మెంట్లో పలు మార్పులు ఉండనున్నాయి. ఈ సందర్భంగా సానియా తన ఇన్‌స్టాగ్రామ్‌లో స్పందించింది. 'హాయ్ గయ్స్. ఒక క్విక్ అప్డేట్. నా దగ్గర అంత గొప్ప వార్త ఏమీ లేదు. రెండు వారాల క్రితం కెనడాలో ఆడుతున్నప్పుడు మోచేతికి గాయమయింది. నిన్న స్కానింగ్ చేయించుకునేంత వరకు ఆ గాయం ఎంత తీవ్రమైనదో నాకు అర్థం కాలేదు. మోచేతి దగ్గర లిగ్మెంట్ కాస్త దెబ్బతింది. ఈ కారణంగా కొన్ని వారాల పాటు ఆటకు దూరంగా ఉండబోతున్నాను. యూఎస్ ఓపెన్ నుంచి వైదొలగుతున్నా. ఈ పరిణామాల నేపథ్యంలో నా రిటైర్మెంట్ ప్లాన్స్ లో కొన్ని మార్పులు చోటు చేసుకునే అవకాశం ఉంది. ఎప్పటికప్పుడు సమాచారం అందిస్తూనే ఉంటా' అని ఆమె పేర్కొంది. మహిళల డబుల్స్‌లో మాజీ నెంబర్ వన్ అయిన సానియా మీర్జా డబుల్స్ విభాగంలో ఆస్ట్రేలియన్ ఓపెన్, వింబుల్డన్, యూఎస్ ఓపెన్లు ఒక్కోసారి నెగ్గింది. అలాగే మిక్స్డ్ డబుల్స్ విభాగంలో ఆస్ట్రేలియన్ ఓపెన్, ఫ్రెంచ్ ఓపెన్, యూఎస్ ఓపెన్లను కూడా గెలిచింది. ఇక 2016 రియో ఒలింపిక్స్‌లో మిక్స్డ్ డబుల్స్‌లో సెమీఫైనల్లో ఓడిన సానియా జంట తృటిలో పతకం చేజార్చుకుంది. చదవండి: BWF Championship 2022: అదరగొట్టిన సైనా నెహ్వాల్.. నేరుగా మూడో రౌండ్‌కు Victor Amalraj: పుస్తక రూపంలో భారత దిగ్గజ ఫుట్‌బాలర్ బయోగ్రఫీ.. -
సెమీస్‌లో నిష్క్రమించిన సానియా జోడీ
టొరంబో ఓపెన్ డబ్ల్యూటీఏ–1000 టెన్నిస్ టోర్నీ నుంచి సానియా మీర్జా (భారత్) –మాడిసన్ కీస్ (అమెరికా) జోడీ నిష్క్రమించింది. వరల్డ్ నంబర్ త్రీ కోకో గాఫ్–జెస్సికా పెగూలా (అమెరికా) జోడీతో జరిగిన మహిళల డబుల్స్ క్వార్టర్ ఫైనల్లో సానియా–మాడిసన్ కీస్ ద్వయం 5–7, 5–7తో ఓడిపోయింది. 77 నిమిషాలపాటు జరిగిన ఈ మ్యాచ్‌లో సానియా –కీస్ జోడీ మూడు డబుల్ ఫాల్ట్‌లు చేసి, తమ సర్వీస్‌ను నాలుగుసార్లు కోల్పోయింది. సెమీస్‌లో ఓడిన సానియా–కీస్ జోడీకి 39,680 డాలర్ల (రూ. 31 లక్షల 60 వేలు) ప్రైజ్‌మనీతోపాటు 350 ర్యాంకింగ్ పాయింట్లు లభించాయి. -
సెమీస్‌లో సానియా జంట
టొరంటో (కెనడా): నేషనల్ బ్యాంక్ ఓపెన్ డబ్ల్యూటీఏ–1000 టెన్నిస్ టోర్నీలో సానియా మీర్జా (భారత్)–మాడిసన్ కీస్ (అమెరికా) జంట సెమీఫైనల్లోకి దూసుకెళ్లింది. శనివారం జరిగిన డబుల్స్ క్వార్టర్ ఫైనల్లో సానియా–కీస్ ద్వయం 7–5, 3–6, 10–6తో ‘సూపర్ టైబ్రేక్’ లో సోఫియా కెనిన్ (అమెరికా)–యులియా పుతింత్సెవా (కజకిస్తాన్) జంటను ఓడించింది. 81 నిమిషాలపాటు జరిగిన ఈ మ్యాచ్‌లో సానియా–మాడిసన్ కీస్ ద్వయం నాలుగు ఏస్‌లు సంధించి, పత్యర్థిజోడీ సర్వీస్‌ను నాలుగు సార్లు బ్రేక్ చేసింది. చదవండి: Chicago Open ATP Challenger Tennis: పోరాడి ఓడిన సాకేత్–యూకీ బాంబ్రీ జోడీ -
క్వార్టర్ ఫైనల్లోకి దూసుకెళ్లిన సానియా జోడీ
టొరంటో: యూఎస్ ఓపెన్‌కు ముందు సన్నాహకంగా ఆడుతున్న కెనడియన్ ఓపెన్‌లో భారత టెన్నిస్ స్టార్ సానియా మీర్జా జోరు కొనసాగుతోంది. అమెరికన్ ప్లేయర్ మాడిసన్ కీస్‌తో జతకట్టిన హైదరాబాదీ స్టార్ మహిళల డబుల్స్‌లో క్వార్టర్ ఫైనల్లోకి దూసుకెళ్లింది. భారత కాలమానం ప్రకారం బుధవారం తెల్లవారుజామున జరిగిన ప్రిక్వార్టర్ ఫైనల్లో సానియా–కీస్ జంట 3–6, 6–4, 10–8తో టాప్ సీడ్ ఎలైజ్ మెర్టెన్స్ (బెల్జియం)– వెరొనిక కుడెర్మెటొవా (రష్యా) జోడీని కంగుతినిపించింది. తొలి సెట్‌ను కోల్పోయిన భారత్–అమెరికా ద్వయం తర్వాత రెండు సెట్లలోనూ పట్టుదలతో ఆడింది. హోరాహోరీగా జరిగిన ఆఖరి మూడో సెట్లో సానియా జోడీ పైచేయి సాధించి క్వార్టర్స్‌లోకి అడుగుపెట్టింది. ఆరో సీడ్ ఒస్టాపెంకో (లాత్వియా)–కిచెనొక్ (ఉక్రెయిన్), పుతిత్సెవా (కజకిస్తాన్)–కెనిన్ (అమెరికా) జోడీల మధ్య జరిగే ప్రిక్వార్టర్స్ విజేతతో సానియా జంట క్వార్టర్స్‌లో తలపడుతుంది. చదవండి: Diamond League 2022: డైమండ్ లీగ్ అథ్లెటిక్స్.. శ్రీశంకర్‌కు ఆరో స్థానం -
ప్రిక్వార్టర్స్‌లో సానియా జోడీ
టొరంటో: కెనడియన్ ఓపెన్‌లో భారత టెన్నిస్ స్టార్ సానియా మీర్జా మహిళల డబుల్స్‌లో శుభారంభం చేసింది. అమెరికా ప్లేయర్ మాడిసన్ కీస్‌తో జతకట్టిన సానియా తొలి రౌండ్లో 6–4, 3–6, 10–6తో అలైజ్ కార్నెట్ (ఫ్రాన్స్)–జిల్ టెయిక్మన్ (స్విట్జర్లాండ్) జంటపై విజయం సాధించింది. నేడు జరిగే ప్రిక్వార్టర్ ఫైనల్లో సానియా జోడీ... టాప్‌సీడ్ వెరొనిక కుడెర్మెటోవా (రష్యా)– ఎలైజ్ మెర్టెన్స్ (బెల్జియం) జంటతో తలపడుతుంది. మరో వైపు మాంట్రియల్ ఓపెన్ ఏటీపీ టోర్నమెంట్లో భారత వెటరన్ స్టార్ రోహన్ బోపన్న జోడీ కూడా ప్రిక్వార్టర్స్ చేరింది. తొలి రౌండ్లో బోపన్న–మిడిల్‌కూప్ (నెదర్లాండ్స్) ద్వయం 7–6 (7/5), 4–6, 10–6తో డెనిస్ షపొవలోవ్ (కెనడా)– కరెన్ కచనొవ్ (రష్యా) జంటపై గెలిచింది. ప్రిక్వార్టర్స్‌లో బోపన్న జోడీ పొలండ్‌కు చెందిన జెలిన్స్కీ–హుర్కాజ్ జంటతో తలపడుతుంది. -
వింబుల్డన్‌కు గుడ్‌బై.. భావోద్వేగ నోట్ షేర్ చేసిన సానియా మీర్జా
భారత టెన్నిస్ దిగ్గజం సానియా మీర్జా వింబుల్డన్ ఛాంపియన్‌షిప్‌కు వీడ్కోలు పలికింది. బుధవారం జరిగిన మిక్స్డ్ డబుల్స్ సెమీ ఫైనల్లో ఓడిన సానియా మీర్జా భావోద్వేగంతో ఒక నోట్‌ను ఇన్‌స్టాలో పోస్ట్ చేసింది. 2015 మహిళల డబుల్స్ విభాగంలో వింబుల్డన్ టైటిల్‌ను సానియా గెలుచుకుంది. అయితే సానియా తన కెరీర్లో ఇప్పటి వరకు వింబుల్డన్ మిక్స్డ్ డబుల్స్ విభాగంలో టైటిల్ మాత్రం సాధించలేకపోయింది. ఇక తన టెన్నిస్ కెరీర్లో ఆరు సార్లు గ్రాండ్‌స్లామ్ ఛాంపియన్‌గా సానియా నిలిచింది. ఇక డబ్ల్యూటీఏ సర్క్యూట్లో తనకిదే చివరి ఏడాది ఇంతకుముందు సానియా ప్రకటించిన సంగతి తెలిసిందే. "క్రీడలు మీ నుంచి చాలా తీసుకుంటాయి. క్రీడలు మనల్ని మానసికంగా, శారీరకంగా అలసటకు గురి చేస్తాయి. గంటల తరబడి కష్టపడి ఓడిపోయిన తర్వాత నిద్రలేని రాత్రులు మిగులుతాయి. కానీ ఇవన్నీ చాలా ప్రతిఫలాన్ని ఇస్తాయి.. ఏ ఇతర ఉద్యోగాలు ఇలాంటివి ఇవ్వలేవు. అందువల్ల నేను ఎప్పటికీ క్రీడలకు కృతజ్ఞరాలునే. కన్నీళ్లు,పోరాటం, ఆనందం నా క్రీడా జీవితంలో భాగం. వింబుల్డన్‌లో ఆడడం ఒక అద్భుతం. ఈసారి వింబుల్డన్‌లో ప్రేక్షకురాలిగా మాత్రమే మిగిలాను. ఇక గత 20 ఏళ్లుగా వింబుల్డన్‌లో ఆడడం గౌవరంగా భావిస్తున్నాను. ఐ విల్ మిస్ యూ ’’ అని సానియా పేర్కొంది. చదవండి: IND-W Vs SL-W: అఖరి వన్డేలో భారత్ ఘన విజయం.. సిరీస్ క్లీన్ స్వీప్ View this post on Instagram A post shared by Sania Mirza (@mirzasaniar) -
Wimbledon 2022: ముగిసిన సానియా పోరాటం.. సెమీస్‌లో నిష్క్రమణ
లండన్: వింబుల్డన్ గ్రాండ్‌స్లామ్‌లో భారత టెన్నిస్ యోధురాలు సానియా మీర్జా 21 ఏళ్ల సుదీర్ఘ ప్రయాణానికి ఎండ్‌కార్డ్ పడింది.కెరీర్లో ఆఖరి వింబుల్డన్ ఆడుతున్న సానియా.. ఈ గ్రాండ్‌స్లామ్‌లో ఒక్క మిక్స్డ్ డబుల్స్ టైటిల్ కూడా గెలవకుండానే కెరీర్‌కు ముగింపు పలుకనుంది. మిక్స్డ్ డబుల్స్ విభాగంలో క్రొయేషియా ఆటగాడు మేట్ పావిచ్‌తో కలిసి బరిలోకి దిగిన సానియా బుధవారం అర్థరాత్రి జరిగిన ఈ సెమీఫైనల్లో ఆమెరికన్-బ్రిటిష జంట డెసిరే క్రాజిక్, నీల్ స్కుప్స్కీ చేతిలో 6-4, 5-7, 4-6తో పరాజయంపాలైంది. వింబుల్డన్ మినహా సానియా ఖాతాలో మిగిలిన మూడు గ్రాండ్‌స్లామ్ మిక్స్డ్ డబుల్స్ టైటిల్స్ (యూఎస్ ఓపెన్, ఆస్ట్రేలియా ఓపెన్, ఫ్రెంచ్ ఓపెన్) ఉన్నాయి. ఓవరాల్‌గా సానియా ఖాతాలో మొత్తం ఆరు గ్రాండ్‌స్లామ్ టైటిల్స్ ఉన్నాయి. ఈ సీజన్ ఆఖరి గ్రాండ్‌స్లామ్ యూఎస్ ఓపెన్ తర్వాత సానియా టెన్నిస్‌కు గుడ్‌బై చెప్పనున్నట్లు ఇదివరకే ప్రకటించిన విషయం తెలిసిందే. సానియా గెలిచిన గ్రాండ్‌స్లామ్ టైటిల్స్ వివరాలు.. మిక్స్డ్ డబుల్స్: 2009 ఆస్ట్రేలియా ఓపెన్ 2012 ఫ్రెంచ్ ఓపెన్ 2014 యూఎస్ ఓపెన్ మహిళల డబుల్స్: 2015 వింబుల్డన్ 2015 యూఎస్ ఓపెన్ 2016 ఆస్ట్రేలియా ఓపెన్ చదవండి: Malaysia Masters Badminton 2022: సింధు శుభారంభం -
వింబుల్డన్‌లో సంచలనం.. సెమీస్‌కు దూసుకెళ్లిన సానియా జోడీ
లండన్: వింబుల్డన్ 2022లో భారత స్టార్ టెన్నిస్ క్రీడాకారిణి సానియా మీర్జా సంచలన విజయం నమోదు చేసింది. మిక్స్డ్ డబుల్స్ విభాగంలో క్రోయేషియాకు చెందిన మేట్ పావిక్‌తో జతకట్టిన హైదరాబాదీ సెమీఫైనల్స్‌కు దూసుకెళ్లింది. సోమవారం అర్ధరాత్రి జరిగిన క్వార్టర్ ఫైనల్లో ఆరో సీడ్ సానియా-పావిచ్ జోడీ 6-4, 3-6, 7-5 తేడాతో నాలుగో సీడ్ గాబ్రియెల డబ్రోస్కీ(కెనడా)-జాన్ పీర్స్(ఆస్ట్రేలియా) ద్వయంపై అద్భుత విజయం సాధించింది. గంటా 41 నిమిషాల పాటు సాగిన ఈ పోరులో సానియా జోడీ ఎనిమిది ఏస్‌లు సంధించడంతో పాటు పవర్ఫుల్ ఫోర్‌హ్యాండ్ షాట్లతో ప్రత్యర్ధిని ఉక్కిరిబిక్కిరి చేసింది. ఈ జోడీ సెమీస్‌లో రెండో సీడ్ డెసీరే క్రాజిక్-నీల్ స్కుప్స్కీ.. ఏడో సీడ్ జెలీనా ఓస్టాపెండో-రాబర్ట్ ఫరా జోడీల మధ్య పోటీలో విజేతను ఎదుర్కోనుంది. కెరీర్లో చివరి వింబుల్డన్ ఆడుతున్న సానియా.. మిక్స్డ్ డబుల్స్ విభాగంలో తొలిసారి సెమీస్‌లోకి ప్రవేశించడంతో కెరీర్‌ను టైటిల్‌తో ముగించాలని భావిస్తుంది. కాగా, ఈ టోర్నీ మహిళల డబుల్స్‌లోనూ పాల్గొన్న సానియా.. తొలి రౌండ్లోనే నిష్క్రమించిన విషయం తెలిసిందే. చదవండి: ఎదురులేని జొకోవిచ్.. వింబుల్డన్‌లో 13వసారి..! -
క్వార్టర్స్‌లో సానియా జంట
లండన్: భారత టెన్నిస్ స్టార్ సానియా మీర్జా–మ్యాట్ పావిచ్ (క్రొయేషియా) జంట వింబుల్డన్ గ్రాండ్‌స్లామ్ టోర్నీ మిక్స్డ్ డబుల్స్ లో క్వార్టర్ ఫైనల్ చేరుకుంది. రెండో రౌండ్లో డోడిగ్ (క్రొయేషియా)–లటీషా చాన్ (చైనీస్ తైపీ) జోడీ నుంచి సానియా–పావిచ్ (క్రొయేషి యా) జంటకు వాకోవర్‌లభించింది. -
సానియా జోడీ అవుట్
మహిళల డబుల్స్‌లో హైదరాబాద్ టెన్నిస్ స్టార్ సానియా మీర్జా జోడీ తొలిరౌండ్లోనే కంగుతింది. సానియా–లూసీ హ్రాడెకా (చెక్ రిపబ్లిక్) జంట 6–4, 4–6, 2–6తో మగ్దలినా ఫ్రెచ్ (పోలండ్)–బియట్రోజ్ హదడ్ (బ్రెజిల్) ద్వయం చేతిలో ఓడింది. సానియా మిక్స్డ్ డబుల్స్‌లో మలె పవిక్ (క్రొయేషియా)తో బరిలోకి దిగనుంది. పురుషుల డబుల్స్ తొలిరౌండ్లో రామ్‌కుమార్ రామనాథన్–బెర్కిక్ (బోస్నియా) ద్వయం 3–6, 6–7 (5/7), 6–7 (5/7)తో అమెరికా జోడీ మోన్రో– టామి పాల్ చేతిలో ఓడింది. చదవండి: Wimbledon 2022: స్వియాటెక్ ముందంజ -
తొలి రౌండ్లోనే సానియా జంట ఓటమి
రోత్సె ఓపెన్ టెన్నిస్ టోర్నీలో సానియా మీర్జా (భారత్)–లూసీ హర్డెస్కా (చెక్ రిపబ్లిక్) పోరాటం తొలి రౌండ్లోనే ముగిసింది. లండన్‌లో జరుగుతున్న ఈ టోర్నీ లో డబుల్స్ తొలి రౌండ్లో సానియా–హర్డెస్కా జోడీ గంటా 56 నిమిషాల్లో 5–7, 7–6 (7/3), 7–10తో షుకో అయోమా (జపాన్)–హావో చింగ్ చాన్ (చైనీస్ తైపీ) జంట చేతిలో ఓడింది. తొలి రౌండ్లో ఓడిన సానియా జోడీకి 4,200 డాలర్లు (రూ. 3 లక్షల 28 వేలు) ప్రైజ్‌మనీగా లభించాయి. -
క్వార్టర్ ఫైనల్లో సానియా జంట
రోత్సె క్లాసిక్ ఓపెన్ టెన్నిస్ టోర్నీలో మూడో సీడ్ సానియా మీర్జా (భారత్)–లూసీ హర్డెస్కా (చెక్ రిపబ్లిక్) జంట శుభారంభం చేసింది. బర్మింగ్హమ్లో సోమవారం జరిగిన మహిళల డబుల్స్ తొలి రౌండ్లో సానియా–లూసీ హర్డెస్కా ద్వయం 7–5, 6–2తో అలీసియా బార్నెట్–ఒలీవియా నికోల్స్ (బ్రిటన్) జోడీపై నెగ్గి క్వార్టర్ ఫైనల్లోకి ప్రవేశించింది. 80 నిమిషాలపాటు జరిగిన ఈ మ్యాచ్‌లో సానియా జంట ప్రత్యర్థి సర్వీస్‌ను ఐదుసార్లు బ్రేక్ చేసి తమ సర్వీస్‌ను రెండుసార్లు కోల్పోయింది. చదవండి: World Youth Weightlifting Championship: భళా గురు... -
టైటిల్ పోరుకు సానియా–హర్డెస్కా జంట
స్ట్రాస్‌బర్గ్ ఓపెన్ టెన్నిస్ టోర్నీలో టాప్ సీడ్ సానియా మీర్జా (భారత్)–లూసీ హర్డెస్కా (చెక్ రిపబ్లిక్) జోడీ ఫైనల్లోకి ప్రవేశించింది. ఫ్రాన్స్‌లో శుక్రవారం జరిగిన మహిళల డబుల్స్ సెమీఫైనల్లో సానియా–హర్డెస్కా ద్వయం 6–3, 6–3తో కైట్లిన్ క్రిస్టియన్ (అమెరికా)–లిద్జియా మరోజవా (రష్యా) జంటపై గెలిచింది. 69 నిమిషాలపాటు జరిగిన ఈ మ్యాచ్‌లో సానియా–హర్డెస్కా జోడీ ప్రత్యర్థి సర్వీస్‌ను నాలుగుసార్లు బ్రేక్ చేసింది. నేడు జరిగే ఫైనల్లో నికోల్ (అమెరికా)–దరియా సావిల్లె (ఆస్ట్రేలియా) జంటతో సానియా–హర్డెస్కా తలపడతారు. -
క్వార్టర్స్‌లో సానియా జంట
పారిస్: స్ట్రాస్‌బర్గ్ ఓపెన్ మహిళల టెన్నిస్ టోర్నీలో టాప్ సీడ్ సానియా మీర్జా (భారత్)–లూసీ హర్డెస్కా (చెక్ రిపబ్లిక్) జంట శుభారంభం చేసింది. మంగళవారం జరిగిన డబుల్స్ తొలి రౌండ్లో సానియా–హర్డెస్కా ద్వయం 3–6, 6–3, 10–8తో ‘సూపర్ టైబ్రేక్’లో లుద్మిలా కిచెనోక్ (ఉక్రెయిన్)–తెరీజా మిహలికోవా (స్లొవేకియా) జోడీపై విజయం సాధించింది. గంటా 34 నిమిషాలపాటు జరిగిన ఈ మ్యాచ్‌లో సానియా జోడీ రెండు ఏస్‌లు సంధించింది. తమ సర్వీస్‌ను మూడుసార్లు కోల్పోయి, ప్రత్యర్థి సర్వీస్‌ను మూడుసార్లు బ్రేక్ చేసింది. మ్యాచ్ హోరాహోరీగా సాగినా నిర్ణాయక సూపర్ టైబ్రేక్‌లో సానియా–హర్డెస్కా ద్వయం పైచేయి సాధించింది. -
సెమీఫైనల్లో సానియా–హర్డెస్కా జంట
ఇటాలియన్ ఓపెన్ డబ్ల్యూటీఏ మహిళల టెన్నిస్ టోర్నీలో సానియా మీర్జా (భారత్)–లూసీ హర్డెస్కా (చెక్ రిపబ్లిక్) జంట సెమీఫైనల్లోకి దూసుకెళ్లింది. రోమ్‌లో శుక్రవారం జరిగిన క్వార్టర్ ఫైనల్లో సానియా–హర్డెస్కా ద్వయం 6–4, 4–6, 10–8తో ‘సూపర్ టైబ్రేక్’లో అలెక్సా గ్వరాచి (చిలీ)– ఆంద్రియా క్లెపాక్ (స్లొవేనియా) జోడీపై విజయం సాధించింది. గంటన్నరపాటు జరిగిన ఈ మ్యాచ్‌లో సానియా–హర్డెస్కా జంట నాలుగు ఏస్‌లు సంధించింది. -
క్వార్టర్ ఫైనల్లో సానియా–హర్డెస్కా జంట
ఇటాలియన్ ఓపెన్ మహిళల టెన్నిస్ టోర్నీలో సానియా మీర్జా (భారత్)–లూసీ హర్డెస్కా (చెక్ రిపబ్లిక్) జంట క్వార్టర్ ఫైనల్లోకి ప్రవేశించింది. సానియా జోడీతో ఆడాల్సిన రిబకినా (కజకిస్తాన్)–సమ్సోనోవా (రష్యా) ద్వయం గాయం కారణంగా బరిలోకి దిగకపోవడంతో ఇండో–చెక్ జంటను విజేతగా ప్రకటించారు. ఇదే టోర్నీ పురుషుల డబుల్స్ ప్రిక్వార్టర్ ఫైనల్లో రోహన్ బోపన్న (భారత్)–మిడిల్‌కూప్ (నెదర్లాండ్స్) జోడీ 6–7 (3/7), 3–6తో కూలాఫ్ (నెదర్లాండ్స్)–స్కప్‌స్కీ (బ్రిటన్) జంట చేతిలో ఓడింది. -
సానియా జంటకు ఫైనల్లో నిరాశ.. సాకేత్‌కు పదో టైటిల్!
చార్ల్స్టన్ ఓపెన్ డబ్ల్యూటీఏ టెన్నిస్ టోర్నీలో సానియా మీర్జా (భారత్)–లూసీ హర్డెస్కా (చెక్ రిపబ్లిక్) జోడీ రన్నరప్‌గా నిలిచింది. అమెరికాలో ఆదివారం జరిగిన ఫైనల్లో సానియా–హర్డెస్కా జంట 2–6, 6–4, 7–10తో ‘సూపర్ టైబ్రేక్’లో నాలుగో సీడ్ మాగ్దా లినెట్ (పోలాండ్)–ఆంద్రియా క్లెపాచ్ (స్లొవేనియా) ద్వయం చేతిలో ఓడిపోయింది. ఫైనల్లో ఓడిన సానియా–హర్డెస్కా జోడీకి 25,900 డాలర్ల (రూ. 19 లక్షల 66 వేలు) ప్రైజ్‌మనీతోపాటు 305 ర్యాంకింగ్ పాయింట్లు లభించాయి. సాకేత్‌కు పదో టైటిల్ సాక్షి, హైదరాబాద్: భారత డేవిస్‌కప్ జట్టు సభ్యుడు, ఆంధ్రప్రదేశ్ టెన్నిస్ ప్లేయర్ సాకేత్ మైనేని తన కెరీర్లో పదో ఏటీపీ చాలెంజర్ డబుల్స్ టైటిల్‌ను సొంతం చేసుకున్నాడు. ఈక్వెడార్‌లో ఆదివారం ముగిసిన సాలినాస్ ఓపెన్ టోర్నీలో సాకేత్–యూకీ బాంబ్రీ (భారత్) జంట పురుషుల డబుల్స్ విభాగంలో విజేతగా నిలిచింది. ఫైనల్లో సాకేత్–యూకీ ద్వయం 4–6, 6–3, 10–7తో ‘సూపర్ టైబ్రేక్’ లో రెండో సీడ్ అరగాన్ (అమెరికా) –రొబెర్టో క్విరోజ్ (ఈక్వెడార్) జోడీపై గెలిచింది. విజేతగా నిలిచిన సాకేత్–యూకీ జోడీకి 3,100 డాలర్ల (రూ. 2 లక్షల 35 వేలు) ప్రైజ్‌మనీతోపాటు 80 ర్యాంకింగ్ పాయింట్లు లభించాయి. చదవండి: IPL 2022: స్టొయినిస్ ఆటలు సాగనివ్వని కుల్దీప్... లక్నో జోరుకు బ్రేక్! -
Charleston Open: సెమీస్‌లో సానియా జోడి...
Charleston Open- చార్ల్స్టన్ ఓపెన్ డబ్ల్యూటీఏ టెన్నిస్ టోర్నీలో సానియా మీర్జా (భారత్)–లూసీ హర్డెస్కా (చెక్ రిపబ్లిక్) జోడీ సెమీఫైనల్లోకి అడుగు పెట్టింది. అమెరికాలోని సౌత్ కరోలినాలో శుక్రవారం జరిగిన మహిళల డబుల్స్ క్వార్టర్ ఫైనల్లో సానియా–హర్డెస్కా జంట 3–6, 6–3, 10–6తో ‘సూపర్ టైబ్రేక్’లో మూడో సీడ్ అలెక్సా గురాచి (చిలీ)–జెస్సికా పెగూలా (అమెరికా) ద్వయంపై గెలిచింది. తొలి రౌండ్లో సానియా–హర్డెస్కా 7–5, 7–6 (7/5)తో ఫ్రాన్సెస్కా లొరెంజో–కేటీ వొలినెట్స్ (అమెరికా)లపై గెలిచారు. డబుల్స్ సెమీఫైనల్లో సాకేత్ జంట Salinas Open- సాలినాస్ ఓపెన్ ఏటీపీ చాలెంజర్ టెన్నిస్ టోర్నీలో సాకేత్ మైనేని–యూకీ బాంబ్రీ (భారత్) జంట సెమీఫైనల్లోకి దూసుకెళ్లింది. ఈక్వెడార్‌లో జరుగుతున్న ఈ టోర్నీలో పురుషుల డబుల్స్ క్వార్టర్ ఫైనల్లో సాకేత్–యూకీ ద్వయం 6–3, 6–4తో బెంజమిన్ లాక్–జాన్ లాక్ (జింబాబ్వే) జోడీపై గెలిచింది. తొలి రౌండ్లో సాకేత్–యూకీ జంట 6–3, 7–6 (8/6)తో టాప్ సీడ్ జీవన్ నెడుంజెళియన్–రామ్‌కుమార్ రామనాథన్ (భారత్) జోడీని ఓడించింది. చదవండి: GT Vs PBKS: ఎదురులేని టైటాన్స్.. గుజరాత్ ‘హ్యాట్రిక్’ -
జ్యోతి సురేఖకు నిరాశ.. బొపన్న, సానియా జంటలకు షాక్!
ఈ ఏడాది సెప్టెంబర్‌లో చైనాలో జరిగే ఆసియా క్రీడల్లో పాల్గొనే భారత ఆర్చరీ జట్ల ఎంపిక కోసం నిర్వహిస్తున్న సెలెక్షన్ ట్రయల్స్‌లో ఆంధ్రప్రదేశ్ స్టార్ ప్లేయర్ జ్యోతి సురేఖ విఫలమైంది. సోనిపట్‌లో మంగళవారం జరిగిన మహిళల కాంపౌండ్ విభాగం ట్రయల్స్‌లో సురేఖ రెండు మ్యాచ్‌ల్లో ఓడిపోయి ఎలిమినేషన్ రౌండ్లోనే నిష్క్రమించింది. సురేఖ 2014, 2018 ఆసియా క్రీడల్లో కాంస్యం, రజతం సాధించింది. ఇతర క్రీడాంశాలు బొపన్న జంట ఓటమి కాలిఫోర్నియా: మయామి ఓపెన్ మాస్టర్స్ సిరీస్ టెన్నిస్ టోర్నీ పురుషుల డబుల్స్ క్వార్టర్ ఫైనల్లో రోహన్ బోపన్న (భారత్)–షపోవలోవ్ (కెనడా) ద్వయం 2–6, 1–6తో వెస్లీ కూలాఫ్ (నెదర్లాండ్స్)–నీల్ స్కప్‌స్కీ (బ్రిటన్) జోడీ చేతిలో ఓడిపోయింది. క్వార్టర్ ఫైనల్లో ఓడిన బోపన్న జంటకు 61,100 డాలర్ల (రూ. 46 లక్షల 19 వేలు) ప్రైజ్‌మనీతోపాటు 180 ర్యాంకింగ్ పాయింట్లు లభించాయి. సానియా జోడీ పరాజయం కాలిఫోర్నియా: మయామి ఓపెన్ డబ్ల్యూటీఏ ప్రీమియర్ టెన్నిస్ టోర్నీ మహిళల డబుల్స్ క్వార్టర్ ఫైనల్లో సానియా మీర్జా (భారత్)–కిర్‌స్టెన్ ఫ్లిప్కెన్స్ (బెల్జియం) ద్వయం 3–6, 6–7 (3/7)తో జావోజువాన్ యాంగ్ (చైనా)–ఎకతెరీనా (రష్యా) జోడీ చేతిలో ఓడిపోయింది. సెమీఫైనల్లో మనిక బత్రా–అర్చన జంట ప్రపంచ టేబుల్ టెన్నిస్ (డబ్ల్యూటీటీ) దోహా కంటెండర్ టోర్నీ మహిళల డబుల్స్ క్వార్టర్ ఫైనల్లో మనిక బత్రా–అర్చన కామత్ (భారత్) ద్వయం 13–11, 8–11, 11–5, 13–11తో సూ వాయ్ యామ్–లీ హో చింగ్ (హాంకాంగ్) జోడీని ఓడించి సెమీఫైనల్‌కు చేరింది. మహిళల సింగిల్స్ ప్రిక్వార్టర్ ఫైనల్లో మనిక 5–11, 2–11, 4–11తో యింగ్ హాన్ (జర్మనీ) చేతిలో... పురుషుల సింగిల్స్ ప్రిక్వార్టర్ ఫైనల్లో సత్యన్ (భారత్) 11–5, 8–11, 7–11, 4–11తో కార్ల్సన్ (స్వీడన్) చేతిలో ఓడిపోయారు. చదవండి: Kane Williamson: వెయ్యిసార్లు చూసినా అదే నిజం.. చెత్త అంపైరింగ్! పాపం కేన్ మామ! -
క్వార్టర్ ఫైనల్లో సానియా జోడీ.. టాప్ సీడ్ జంటను ఓడించి బొపన్న జోడి సంచలనం
మియామి ఓపెన్ డబ్ల్యూటీఏ ప్రీమియర్ టెన్నిస్ టోర్నీలో సానియా మీర్జా (భారత్)–కిర్‌స్టెన్ ఫ్లిప్కెన్స్ (బెల్జియం) ద్వయం క్వార్టర్ ఫైనల్లోకి అడుగు పెట్టింది. కాలిఫోర్నియాలో సోమవారం జరిగిన మహిళల డబుల్స్ ప్రిక్వార్టర్ ఫైనల్లో సానియా–ఫ్లిప్కెన్స్ జోడీ 6–2, 6–4తో డెసిరె క్రాజిక్ (అమెరికా)–డెమీ షుర్స్ (నెదర్లాండ్స్) జంటను ఓడించింది. 74 నిమిషాలపాటు జరిగిన ఈ మ్యాచ్‌లో సానియా జోడీ మూడు ఏస్‌లు సంధించి, ప్రత్యర్థి సర్వీస్‌ను నాలుగుసార్లు బ్రేక్ చేసింది. టాప్ సీడ్ జోడీని ఓడించి క్వార్టర్స్‌కు... మియామి ఓపెన్ మాస్టర్స్ సిరీస్–1000 టెన్నిస్ టోర్నీలో రోహన్ బోపన్న (భారత్)–డెనిస్ షపోవలోవ్ (కెనడా) జంట సంచలనం సృష్టించింది. కాలిఫోర్నియాలో సోమవారం జరిగిన పురుషుల డబుల్స్ రెండో రౌండ్లో బోపన్న–షపోవలోవ్ ద్వయం 6–3, 7–6 (7/3)తో ప్రపంచ నంబర్‌వన్, టాప్ సీడ్ జంట పావిచ్–మెక్టిక్ (క్రొయే షియా)ను బోల్తా కొట్టించింది. ఈ ఓటమితో పావిచ్ వచ్చే వారం విడుదల చేసే డబుల్స్ ర్యాంకింగ్స్‌లో నంబర్‌వన్ ర్యాంక్‌ను కోల్పోనున్నాడు. -
టాప్ సీడ్ జోడీపై సానియా జంట సంచలన విజయం
ఖతర్ ఓపెన్ టెన్నిస్ టోర్నీలో సానియా మీర్జా (భారత్)–లూసీ హర్డెస్కా (చెక్ రిపబ్లిక్) జంట సంచలనం సృష్టించింది. బుధవారం జరిగిన మహిళల డబుల్స్ క్వార్టర్ ఫైనల్లో 7–6 (7/5), 4–3తో ప్రపంచ నంబర్‌వన్ ర్యాంక్, టాప్ సీడ్ జోడీ సినియకోవా–క్రిచికోవా (చెక్ రిపబ్లిక్)పై నెగ్గి సెమీఫైనల్లోకి దూసుకెళ్లింది. తొలి సెట్‌ను సొంతం చేసుకొని రెండో సెట్లో సానియా–హర్డెస్కా 4–3తో ఆధిక్యంలో ఉన్న దశలో సినియకోవా–క్రిచికోవా గాయంతో వైదొలిగారు. -
క్వార్టర్ ఫైనల్లో సానియా–హర్డెస్కా జోడీ
ఖతర్ ఓపెన్ టెన్నిస్ టోర్నీ మహిళల డబుల్స్ విభాగంలో సానియా మీర్జా (భారత్) –లూసీ హర్డెస్కా (చెక్ రిపబ్లిక్) జోడీ క్వార్టర్ ఫైనల్లోకి దూసుకెళ్లింది. దోహాలో మంగళవారం జరిగిన ప్రిక్వార్టర్ ఫైనల్లో సానియా–హర్డెస్కా ద్వయం 86 నిమిషాల్లో 7–5, 7–5తో ఎనిమిదో సీడ్ అనా డానిలినా (కజకిస్తాన్)–బీట్రిజ్ (బ్రెజిల్) జోడీపై గెలిచింది. తొలి రౌండ్లో సానియా–హర్డెస్కా6–4, 6–3తో మోనికా నికెలెస్కూ (రొమేనియా)–వెరా జ్వొనరేవా (రష్యా)లపై విజయం సాధించారు. -
సెమీఫైనల్లో ఓడిన సానియా జంట
దుబాయ్ ఓపెన్ టెన్నిస్ టోర్నీ డబుల్స్ విభాగంలో సానియా మీర్జా (భారత్)–లూసీ హర్డెస్కా (చెక్ రిపబ్లిక్) జంట పోరాటం సెమీఫైనల్లో ముగిసింది. హోరాహోరీగా సాగిన సెమీఫైనల్లో సానియా–హర్డెస్కా ద్వయం 6–2, 2–6, 7–10తో ‘సూపర్ టైబ్రేక్’లో కిచెనోక్ (ఉక్రెయిన్)–ఒస్టాపెంకో (లాత్వియా) జోడీ చేతిలో ఓడింది. సెమీస్‌లో నిష్క్రమించిన సానియా–హర్డెస్కా జోడీకి 12,500 డాలర్ల ప్రైజ్‌మనీ (రూ. 9 లక్షల 33 వేలు) లభించింది. -
Dubai Championships: సెమీస్‌లో సానియా జోడీ
దుబాయ్: భారత టెన్నిస్ స్టార్ సానియా మీర్జా దుబాయ్ టెన్నిస్ ఛాంపియన్షిప్స్ డబ్ల్యూటీఏ -500 టోర్నీలో సెమీస్‌కు దూసుకెళ్లింది. వైల్డ్ కార్డు ఎంట్రీగా బరిలోకి దిగిన సానియా చెక్ రిపబ్లిక్ క్రీడాకారిణి లూసీ రడెకాతో జతకట్టి, క్వార్టర్స్ లో జపనీస్-సెర్బియన్ జోడీ షుకో అయోమా, అలెక్సాండ్రా ను 7-5, 6-3 తేడాతో చిత్తు చేసి సెమీస్‌కు చేరింది. ఈ మ్యాచ్ ఆరంభం నుంచి పూర్తి ఆధిపత్యం ప్రదర్శిస్తూ వచ్చిన సానియా జంట.. ఏ దశలోనూ ప్రత్యర్ధికి అవకాశం ఇవ్వకుండా వరుస సెట్లలో మ్యాచ్‌ను ముగించింది. ఫైనల్లో సానియా జోడీ టాప్ సీడ్ జోడీలైన ఎనా షిబహారా (జపాన్)-షుయ్ జాంగ్(చైనా), ల్యుడ్మైలా కిచెనాక్ (ఉక్రెయిన్)-జలెనా ఓస్టాపెంకో జంటల మధ్య పోటీలో విజేతతో తలపడుతుంది. సానియా (బెతాని మాట్టెక్ సాండ్స్‌తో జత కట్టి) 2013లో చివరిసారిగా ఈ టోర్నీ విజేతగా నిలిచింది. చదవండి: మనీశ్ పాండే విధ్వంసం.. బౌండరీలు, సిక్సర్లతో వీరవిహారం -
Sania Mirza: క్వార్టర్స్‌కు దూసుకువెళ్లిన సానియా జోడీ
Dubai Tennis Championships: దుబాయ్ టెన్నిస్ ఛాంపియన్‌షిప్‌లో సానియా మీర్జా జోడీ అదరగొట్టింది. సానియా- లూసీ జంట క్వార్టర్స్‌లో అడుగుపెట్టింది. ఉత్కంఠ రేపిన బుధవారం నాటి మహిళల డబుల్స్ మ్యాచ్‌లో వరల్డ్ నెంబర్ 12 డెమీ జోడీని ఓడించింది. హోరాహోరీగా సాగిన మ్యాచ్‌లో 7(7)-6(3), 5-7, 11-9తో ప్రత్యర్థిపై విజయం సాధించింది ఈ జంట. ఇక క్వార్టర్ ఫైనల్లో వీరు జపాన్‌కు చెందిన షుకో- సెర్బియాకు చెందిన అలెగ్జాండ్రాతో తలపడనున్నారు. చదవండి: IPL 2022 Auction: అందమైన నవ్వు.. వేలంలో ప్రత్యేక ఆకర్షణ.. అందరి దృష్టి తన మీదే.. అసలు ఎవరామె? గుర్తుపట్టారా? -
Sania Mirza: ‘టాప్స్’లో సానియా మీర్జా
టార్గెట్ ఒలింపిక్ పోడియం స్కీమ్ (టాప్స్) కోర్ గ్రూప్‌లో సీనియర్ టెన్నిస్ క్రీడాకారిణి సానియా మీర్జా పేరును కూడా చేర్చారు. ఈ సీజన్ తర్వాత రిటైర్ అవుతున్నట్లు ప్రకటించిన సానియా... ఒలింపిక్స్ సన్నాహక అథ్లెట్లలో లేకున్నా కూడా ఈ ఏడాది ఆసియా క్రీడలను దృష్టిలో ఉంచుకొని ఆమెకు అవకాశం కల్పించారు. ఈ జాబితాలో రోహన్న బోపన్న, రామ్‌కుమార్ రామనాథన్, అంకితా రైనాలకు కూడా చోటు దక్కింది. -
టెన్నిస్ క్రీడాకారిణి సానియా మీర్జా ఫొటోలు
-
తొందర పడ్డానేమో! రిటైర్మెంట్పై సానియా మీర్జా వ్యాఖ్య
మెల్బోర్న్: ప్రస్తుత సీజన్ తర్వాత టెన్నిస్ నుంచి రిటైర్ అవుతున్నట్లు ప్రకటించిన భారత స్టార్ సానియా మీర్జా ఇప్పుడు దానిపై పశ్చాత్తాప పడుతోంది. నిర్ణయం సరైనదే అయినా ప్రకటించిన సమయం సరైంది కాదని, ఆ విషయంలో తొందరపడినట్లుగా భావిస్తున్నానని ఆమె పేర్కొంది. ఆస్ట్రేలియన్ ఓపెన్ నుంచి నిష్క్రమించిన తర్వాత ఆమె ఈ వ్యాఖ్య చేసింది. ‘ఇప్పుడు అంతా నా ఆట గురించి కాకుండా రిటైర్మెంట్ తర్వాతి విషయాలపైనే మాట్లాడుతున్నారు. దాని గురించే అడుగుతున్నారు. ఆఖరి సీజన్ అయినంత మాత్రాన నా ఆటలో, ఆలోచనా ధోరణిలో మార్పు ఉండదు. ప్రతీ మ్యాచ్ గెలవాలనే లక్ష్యంతోనే బరిలోకి దిగుతాను. ఆటను ఆస్వాదిస్తూనే గెలిచేందుకు 100 శాతం శ్రమిస్తాను. ఫలితం ఎలా వచ్చినా నా ప్రయత్నంలో లోపం ఉండదు. రిటైర్మెంట్ తర్వాతి అంశాల గురించి నేను అసలు ఆలోచించడమే లేదు. నిజాయితీగా చెప్పాలంటే రిటైర్మెంట్ గురించి నేను చాలా తొందరపడి ప్రకటన చేశాను. ఇప్పుడు దానికి నేను చింతిస్తున్నాను’ అని 35 ఏళ్ల సానియా మీర్జా వ్యాఖ్యానించింది. -
Sania Mirza: ఆస్ట్రేలియా ఓపెన్.. సానియా జంట ముందడుగు
Australia Open- Sania Mirza: ఆస్ట్రేలియా ఓపెన్ మిక్స్డ్ డబుల్స్ విభాగంలో సానియా మీర్జా (భారత్)–రాజీవ్ రామ్ (అమెరికా) జోడీ క్వార్టర్ ఫైనల్లోకి దూసుకెళ్లింది. రెండో రౌండ్ మ్యాచ్‌లో సానియా–రాజీవ్ ద్వయం 7–6 (8/6), 6–4తో ఎలెన్ పెరెజ్–మిడిల్‌కూప్ (నెదర్లాండ్స్) జోడీపై గెలిచింది. 87 నిమిషాలపాటు జరిగిన ఈ మ్యాచ్‌లో సానియా–రాజీవ్ రామ్ ద్వయం ఐదు ఏస్‌లు సంధించి తమ ప్రత్యర్థి జోడీ సర్వీస్‌ను నాలుగుసార్లు బ్రేక్ చేసింది. సాకారి, బదోసా అవుట్ మహిళల సింగిల్స్ విభాగంలో రెండు సంచలన ఫలితాలు నమోదయ్యాయి. ఐదో సీడ్ మరియా సాకరి (గ్రీస్), ఎనిమిదో సీడ్ పౌలా బదోసా (స్పెయిన్) ప్రిక్వార్టర్ ఫైనల్లో నిష్క్రమించారు. మాడిసన్ కీస్ (అమెరికా) 6–3, 6–1తో బదోసా ను ఓడించగా... 21వ సీడ్ జెస్సికా పెగూలా (అమెరికా) 7–6 (7/0), 6–3తో సాకరిపై గెలిచింది. ఇతర ప్రిక్వార్టర్ ఫైనల్స్‌లో టాప్ సీడ్, ప్రపంచ నంబర్‌వన్ యాష్లే బార్టీ (ఆస్ట్రేలియా) 6–4, 6–3తో అమండా అనిసిమోవా (అమెరికా)పై, నాలుగో సీడ్ క్రిచికోవా (చెక్ రిపబ్లిక్) 6–2, 6–2తో మాజీ నంబర్‌వన్ అజరెంకా (బెలారస్)పై విజయం సాధించి క్వార్టర్ ఫైనల్లోకి ప్రవేశించారు. చదవండి: Australia Open: నాదల్ దూకుడు.. మూడో సీడ్ జ్వెరెవ్‌కు షాక్ -
మిక్స్డ్ డబుల్స్‌లో సానియా మీర్జా జోడి శుభారంభం
ఆస్ట్రేలియన్ ఓపెన్ గ్రాండ్‌స్లామ్ తర్వాత అంతర్జాతీయ టెన్నిస్‌కు గుడ్‌బై చెప్పనున్న సానియా మీర్జా టోర్నీలో శుభారంభం చేసింది. మిక్స్డ్ డబుల్స్ విభాగంలో సానియా మీర్జా- రాజీవ్ రామ్ ద్వయం రెండో రౌండ్లో అడుగుపెట్టింది. తొలి రౌండ్లో వీరి జోడి సెర్బియాకు చెందిన అలెక్సాండ్రా క్రూనిక్- నికోలా కాకిక్ జోడిపై 6-3,6-7(3) తేడాతో నెగ్గి రెండో రౌండ్లో అడుగెపెట్టింది. కేవలం 69 నిమిషాల్లోనే ప్రత్యర్థిని మట్టికరిపించిన సానియా మీర్జా జోడి తొలి అంకాన్ని దిగ్విజయంగా పూర్తి చేసింది. చదవండి: Daniil Medvedev: గెలిచిన ఆనందం లేకుండా చేశారు.. ప్లేయర్ భావోద్వేగం -
టెన్నిస్ అభిమానులకు భారీ షాక్.. సానియా మీర్జా సంచలన నిర్ణయం
-
టెన్నిస్ అభిమానులకు భారీ షాక్.. సానియా మీర్జా సంచలన నిర్ణయం
భారత అగ్రశ్రేణి టెన్నిస్ క్రీడాకారిణి సానియా మీర్జా అభిమానులకు షాకింగ్ వార్త చెప్పింది. ప్రస్తుత సీజన్(2022) చివర్లో ప్రొఫెషనల్ టెన్నిస్‌కు వీడ్కోలు పలకనున్నట్లు ప్రకటించింది. ఆస్ట్రేలియన్ ఓపెన్ 2022 మహిళల డబుల్స్‌లో ఓటమి అనంతరం సానియా ఈ విషయాన్ని వెల్లడించింది. ఉక్రెయిన్ క్రీడాకారిణి నదియా కిచ్నోక్‌తో కలిసి ఆస్ట్రేలియన్ ఓపెన్ బరిలోకి దిగిన హైదరాబాదీ స్టార్ ప్లేయర్..తొలి రౌండ్లోనే ఇంటి దారి పట్టింది. స్లోవేనియా జోడీ చేతిలో సానియా జోడీ 4-6, 6-7(5)తేడాతో ఓటమిపాలైంది. గంటా 37 నిమిషాల పాటు సాగిన ఈ మ్యాచ్‌లో సానియా జోడీ గట్టిగానే పోటీనిచ్చినప్పటికీ ఓటమి తప్పలేదు. సానియా మిక్స్డ్ డబుల్స్‌లో అమెరికాకు చెందిన రాజీవ్ రామ్‌తో కలిసి బరిలోకి దిగనుంది. కాగా, ప్రస్తుతం డబుల్స్, మిక్స్డ్ డబుల్స్ మాత్రమే ఆడుతున్న సానియా.. 2013లో సింగిల్స్ పోటీ నుంచి తప్పుకుంది. సానియా సింగిల్స్ కెరీర్లో అత్యుత్తమంగా 27వ ర్యాంక్‌కు చేరుకుంది. చదవండి: Emma Raducanu: రాడుకాను బోణీ.. లేలాకు భారీ షాక్ -
సానియా మీర్జాకు షాక్... టోర్నీ నుంచి అవుట్!
Adelaide Open: కొత్త ఏడాదిలో భారత మహిళా టెన్నిస్ స్టార్ సానియా మీర్జా పోరాటం సెమీఫైనల్లో ముగిసింది. అడిలైడ్ ఓపెన్ డబ్ల్యూటీఏ టోర్నీలో సానియా (భారత్)–నాదియా కిచెనోక్ (ఉక్రెయిన్) జోడీ సెమీఫైనల్లో పోరాడి ఓడిపోయింది. యాష్లే బార్టీ–స్టార్మ్ సాండెర్స్ (ఆస్ట్రేలియా) ద్వయంతో జరిగిన మ్యాచ్‌లో సానియా–కిచెనోక్ 1–6, 6–2, 8–10తో ‘సూపర్ టైబ్రేక్’లో ఓటమి చవిచూశారు. సెమీస్‌లో బోపన్న ద్వయం మరోవైపు అడిలైడ్ ఓపెన్ పురుషుల టోర్నీలో రోహన్ బోపన్న–రామ్‌కుమార్ (భారత్) జంట సెమీఫైనల్‌కు చేరింది. క్వార్టర్ ఫైనల్లో బోపన్న–రామ్6–1, 6–3తో బోంజి (ఫ్రాన్స్)–హుగో నిస్ (మొనాకో)లపై నెగ్గారు. చదవండి: SA vs IND: "కోహ్లి స్థానంలో కెప్టెన్‌గా అతడే సరైనోడు" -
చరిత్ర సృష్టించిన షోయబ్ మాలిక్ మేనల్లుడు.. అరుదైన రికార్డు
కరాచీ: పాకిస్థాన్ వెటరన్ ఆల్‌రౌండర్ షోయబ్ మాలిక్, భారత స్టార్ టెన్నిస్ క్రీడాకారిణి సానియా మీర్జా మేనల్లుడు మహమ్మద్ హురైరా పాకిస్థానీ దేశవాళీ టోర్నీలో ట్రిపుల్ సెంచరీతో విధ్వంసం సృష్టించాడు. ఖైద్ ఏ ఆజమ్ ట్రోఫీలో భాగంగా నార్తర్న్ జట్టు తరఫున బరిలోకి దిగిన 19 ఏళ్ల హురైరా.. బలూచిస్థాన్‌పై అజేయ త్రిశతకం(341 బంతుల్లో 311 నాటౌట్; 40 ఫోర్లు, 4 సిక్సర్లు) సాధించి, అత్యంత పిన్న వయసులో ఈ ఘనత సాధించిన రెండో పాకిస్థానీ క్రికెటర్‌గా రికార్డు సృష్టించాడు. హురైరాకు ముందు పాక్ లెజెండరీ క్రికెటర్ జావెద్ మియాందాద్ ఈ ఘనత సాధించాడు. మియాందాద్ 1975లో 17 ఏళ్ల 310 రోజుల్లో ఫస్ట్ క్లాస్ క్రికెట్లో ట్రిపుల్ సెంచరీ సాధించాడు. హురైరా 19 ఏళ్ల 239 రోజుల వయసులో ఆ ఘనత సాధించాడు. ఓవరాల్‌గా పాకిస్థాన్ గడ్డపై ఇది 23వ ట్రిపుల్ సెంచరీ కాగా, ఆ ఘనత సాధించిన 22వ ఆటగాడిగా హురైరా నిలిచాడు. పాక్‌లో త్రిశకం బాదిన ఆటగాళ్లలో మైక్ బ్రేర్లీ(ఇంగ్లండ్), మార్క్ టేలర్(ఆసీస్), వీరేంద్ర సెహ్వాగ్(భారత్) ఉన్నారు. చదవండి: మూడు ఫార్మాట్లతో పాటు ఐపీఎల్‌లోనూ అతడే.. ప్రపంచ క్రికెట్లో ఒకే ఒక్కడు Northern's Mohammad Huraira who scored his maiden triple-century in the Quaid-e-Azam Trophy 2021-22 final-round clash against Balochistan talks about his heroic effort. #QeAT #HarHaalMainCricket pic.twitter.com/dz7n3MkZN7 — Pakistan Cricket (@TheRealPCB) December 20, 2021 MONUMENTAL EFFORT! 19-year-old Mohammad Huraira becomes the second youngest Pakistan batter to score a first-class triple century! 👏👏#HarHaalMainCricket pic.twitter.com/QtYRKDRCKT — Pakistan Cricket (@TheRealPCB) December 20, 2021 -
ఆమె భారత పౌరసత్వాన్ని రద్దు చేయండి.. సానియా మీర్జాపై నెటిజన్ల ఆగ్రహం
Sania Mirza Faces Backlash on Twitter For Supporting Pakistan: టీ20 ప్రపంచకప్2021లో పాకిస్తాన్ పోరాటం ముగిసింది. ఈ టోర్నమెంట్లో ఒక్క ఓటమి కూడా ఎరగని పాకిస్తాన్.. ఆస్ట్రేలియాతో గురువారం( నవంబర్11) జరిగిన రెండో సెమీఫైనల్లో అనుహ్యంగా ఓటమి పాలైంది. అయితే ఈ మ్యాచ్‌లో పాకిస్తాన్‌ని సపోర్ట్ చేయడానికి స్టేడియం వెళ్లిన సానియా మీర్జాపై నెటజన్లు మండిపడుతున్నారు. ఆమె భారతీయ పౌరసత్వాన్ని రద్దు చేయాలని, అంతేగాక ఆమెపై చట్ట వ్యతిరేక కార్యకలాపాల నిరోధ చట్టం (ఉపా) కేసు పెట్టి దేశ పౌరసత్వం రద్దు చేయాలని డిమాండ్ చేస్తున్నారు. సానియా మీర్జా భర్త షోయబ్ మాలిక్ పాకిస్తాన్‌కు ప్రాతినిధ్యం వహిస్తున్న సంగతి తెలిసిందే. ఇక ఈ మ్యాచ్‌లో పాక్ ఆటగాళ్లు ఫోర్లు, సిక్సర్లు కొట్టినప్పుడు.. ఆసీస్ ఆటగాళ్ల వికెట్లు తీసినప్పుడు చప్పట్లు కొడుతూ మద్దతు పలికింది. కాగా..సానియా మీర్జా వివాదాలకు గురి కావటం..ట్రోలింగ్ కు గురి కావటం కూడా కొత్తేమీ కాదు. స్కాట్లాండ్తో జరిగిన మ్యాచ్‌లోను షోయబ్ మాలిక్ సిక్సర్లు కొడుతుంటే..స్టాండ్స్‌లో కూర్చుని సానియా మీర్జా చప్పట్లు కొడుతూ కనిపించింది. అప్పుడు కూడా ఆమె ట్రోల్స్‌కు గురైంది. మరో వైపు పాక్ పేసర్ హసన్ అలీ భార్యని, ఆమె కుటుంబ సభ్యులను కూడా పాకిస్తాన్ అభిమానులు ట్రోలింగ్ చేస్తున్నారు. చదవండి: అత్యాచారం కేసులో హార్దిక్ పాండ్యా.. ? గ్యాంగ్‌స్టర్ భార్య సంచలన ఆరోపణలు..! -
Ind vs Pak: బావగారూ.. బావగారూ అంటూ ఫ్యాన్స్ కేకలు.. వీడియో షేర్ చేసిన సానియా
Sania Mirza Reacts After Fans Call Shoaib Malik ‘jeeja ji’: సానియా మీర్జా- షోయబ్ మాలిక్.. ఇండియా- పాకిస్తాన్ మ్యాచ్ అంటే చాలు... దాయాదుల పోరు గురించే కాదు.. ఈ జంట గురించి కూడా నెట్టింట చర్చ జరుగుతుంది... ఒక్కోసారి రచ్చ కూడా అవుతుంది.. అందుకే అక్టోబరు 24 నాటి భారత్- పాక్ పోరుకు ముందు తాను సోషల్ మీడియా నుంచి మాయమైపోతానంటూ సానియా మీర్జా ఓ వీడియో షేర్ చేశారు కూడా. అందుకు గల కారణాల గురించి ఇప్పుడు ప్రస్తావన అనవసరం. అయితే.. సోమవారం ఆమె పంచుకున్న వీడియో మాత్రం ఎంతో హృద్యంగా ఉంది. ఆదివారం పాకిస్తాన్‌తో మ్యాచ్‌లో కోహ్లి సేన బ్యాటింగ్ చేస్తున్న సమయంలో ఓ ఆసక్తికర సన్నివేశం చోటుచేసుకుంది. బౌండరీ వద్ద ఫీల్డింగ్ చేస్తున్న షోయబ్ మాలిక్‌ను ఉద్దేశించి... కొంతమంది అభిమానులు.. ‘‘బావగారూ.. బావగారూ..’’ అంటూ సంతోషంతో కేకలు వేశారు. ఈ వీడియోను సానియా మీర్జా రీషేర్ చేయగా... నెటిజన్ల నుంచి సానుకూల స్పందన వస్తోంది. అభిమానులు.. ‘‘ఇది చాలా క్యూట్‌గా ఉంది’’ అంటూ కామెంట్లు చేస్తున్నారు. ఇక సానియా మీర్జా సైతం.. స్మైలింగ్ ఎమోజీలతో పాటు రెండు హార్ట్ సింబల్స్ జతచేసి ఆనందాన్ని వ్యక్తం చేశారు. కాగా 2010లో పెళ్లి చేసుకున్న సానియా మీర్జా- షోయబ్ మాలిక్ 2018లో కుమారుడికి జన్మనిచ్చిన సంగతి తెలిసిందే. ఇక మాలిక్ కెరీర్ విషయానికొస్తే చాలా కాలంగా జట్టుకు దూరమైన షోయబ్ మాలిక్‌కు అనూహ్యంగా టీ20 వరల్డ్‌కప్ ఆడే జట్టులో ఆఖరి నిమిషంలో చోటు దక్కింది. సోహైబ్ మక్సూద్‌కు గాయం కావడంతో అతడి స్థానంలో మాలిక్ జట్టులోకి వచ్చాడు. ఇదిలా ఉండగా... ప్రపంచకప్‌లో టీమిండియా చేతిలో తమ పరాజయాల పరంపరకు బ్రేక్ వేస్తూ.. పాకిస్తాన్ ఘన విజయం సాధించింది. 10 వికెట్ల తేడాతో గెలుపొందింది. ఇక మ్యాచ్ అనంతరం టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లి, మెంటార్ ధోని పాక్ ఆటగాళ్లను అభినందిస్తూ క్రీడాస్ఫూర్తిని చాటుకున్న ఫొటోలు వైరల్ అవుతున్న సంగతి తెలిసిందే. చదవండి: Rashid Khan: కన్నీటి పర్యంతమైన నబీ.. రషీద్ ఖాన్ భావోద్వేగ పోస్టు.. T20 World Cup 2021 Ind vs Pak: ఓటమి అనంతరం కోహ్లి అలా.. ధోని ఇలా 🤣🤣❤️❤️ https://t.co/NE46xoSKfu — Sania Mirza (@MirzaSania) October 25, 2021 -
IND Vs PAK:సోషల్ మీడియా కు దూరంగా సానియా
-
Sania Mirza : భారత్-పాక్ మ్యాచ్ రోజు ఎవరికీ కనిపించకుండా మాయమైపోతాను..
Sania Mirza Plans To Disappear On India Pakistan Match Day: టీ20 ప్రపంచకప్‌లో భాగంగా భారత్-పాక్ జట్ల మధ్య ఈ నెల 24న జరగనున్న హై ఓల్టేజ్ పోరు నేపథ్యంలో భారత స్టార్ టెన్నిస్ క్రీడాకారిణి, పాక్ కోడలు సానియా మీర్జా ఇన్‌స్టా వేదికగా ఆసక్తికర పోస్ట్ చేసింది. మ్యాచ్ సమయంలో విషపూరిత వాతావరణాన్ని నివారించేందుకే ఆ రోజు సోషల్‌మీడియాకు దూరంగా ఉండాలని నిర్ణయించుకున్నట్లు పేర్కొంది. దాయాదులు పోరు జరుగుతున్న సమయంలో ఇరు దేశాల అభిమానులు ఉద్వేగంతో ఉంటారని, అందుకే తాను ఆ రోజు సోషల్‌మీడియా నుంచి మాయమైపోతానని ఇన్‌స్టాలో ఓ వీడియో మెసేజ్ షేర్ చేసింది. View this post on Instagram A post shared by Sania Mirza (@mirzasaniar) గతంలో భారత్-పాక్‌ల మధ్య మ్యాచ్ జరిగినప్పుడు ఇరు దేశాల అభిమానులు విపరీతంగా ట్రోల్ చేసిన నేపథ్యంలో సానియా ఈ మేరకు నిర్ణయించుకుని ఉంటుందంటూ నెటిజన్లు అభిప్రాయపడుతున్నారు. కాగా, సానియా భర్త షోయబ్ మాలిక్ పాక్ జట్టులో కీలక సభ్యుడిగా కొనసాగుతున్న విషయం తెలిసిందే. మరోవైపు పాకిస్థాన్ ఇప్పటి వరకు ప్రపంచ కప్ మ్యాచ్‌లలో భారత్‌ను ఓడించింది లేదు. ఈ మెగా టోర్నీలో భారత్-పాక్‌ల మధ్య 5 మ్యాచ్‌లు జరగ్గా.. టీమిండియా 4-0 ఆధిక్యంలో ఉంది. ఓ మ్యాచ్ రద్దైంది. ఇదిలా ఉంటే, టీ20 ప్రపంచకప్-2021లో భాగంగా గ్రూప్-ఏ, గ్రూ-బిలోని క్వాలిఫయర్స్ జట్ల మధ్య తొలి రౌండ్ లీగ్ మ్యాచ్‌లు ఇవాల్టి నుంచి ప్రారంభమయ్యాయి. ఈ మ్యాచ్‌ల అనంతరం మేజర్ జట్ల మధ్య సూపర్ 12 స్టేజ్ మ్యాచ్‌లు అక్టోబర్ 23 నుంచి ప్రారంభమవుతాయి. ఈ టోర్నీలో టీమిండియా లీగ్ దశలో తలపడబోయే మ్యాచ్‌ల విషయానికొస్తే.. అక్టోబర్ 24న పాక్‌తో, అక్టోబర్ 31న న్యూజిలాండ్‌తో, నవంబర్ 3న అఫ్గానిస్తాన్‌తో టీమిండియా తలపడనుంది. ఈ మ్యాచ్‌లన్నీ భారతకాలమానం ప్రకారం రాత్రి 7:30 గంటలకు ప్రారంభమవుతాయి. చదవండి: ధోని అభిమానులకు వరుస శుభవార్తలు.. తాజాగా మరొకటి -
సానియా మీర్జా ఖాతాలో 43వ డబుల్స్ టైటిల్
ఒస్ట్రావా (చెక్ రిపబ్లిక్): భారత మహిళా టెన్నిస్ స్టార్ సానియా మీర్జా ఈ ఏడాది తన ఖాతాలో తొలి డబుల్స్ టైటిల్‌ను జమ చేసుకుంది. ఆదివారం ముగిసిన ఒస్ట్రావా ఓపెన్ మహిళల టెన్నిస్ సంఘం (డబ్ల్యూటీఏ)–500 టోర్నీలో చైనా భాగస్వామి ష్వై జాంగ్‌తో కలిసి సానియా విజేతగా నిలిచింది. ఫైనల్లో రెండో సీడ్ సానియా–ష్వై జాంగ్ ద్వయం 6–2, 6–2తో మూడో సీడ్ కైట్లిన్ క్రిస్టియన్ (అమెరికా)–ఎరిన్ రౌట్లిఫ్ (న్యూజిలాండ్) జంటపై విజయం సాధించింది. చాంపియన్‌గా నిలిచిన సానియా –ష్వై జాంగ్ జోడీకి 25,230 డాలర్ల ప్రైజ్‌మనీ (రూ. 18 లక్షల 62 వేలు)తోపాటు 470 ర్యాంకింగ్ పాయింట్లు లభించాయి. ఈ విజయంతో 34 ఏళ్ల సానియా తన కెరీర్లో 43వ డబుల్స్ టైటిల్‌ను సాధించింది. చివరిసారి 2020 జనవరిలో హోబర్ట్ ఓపెన్‌లో నాదియా కిచెనోక్ (ఉక్రెయిన్)తో కలిసి టైటిల్ నెగ్గిన సానియా ఖాతాలో చేరిన మరో డబుల్స్ టైటిల్ ఇదే కావడం విశేషం. చదవండి: IPL 2021 RCB Vs MI:పొట్టి క్రికెట్లో చరిత్ర సృష్టించిన కింగ్ కోహ్లి.. -
ఒస్ట్రావా ఓపెన్ ఫైనల్లో సానియా మీర్జా జంట..
Sania Mirza in Doubles Final at Ostrava Open: ఈ ఏడాది తొలి డబుల్స్ టైటిల్ సాధించేందుకు భారత టెన్నిస్ స్టార్ సానియా మీర్జా విజయం దూరంలో నిలిచింది. చెక్ రిపబ్లిక్లో జరుగుతున్న ఒ్రస్టావా ఓపెన్ డబ్ల్యూటీఏ–500 టోర్నీలో సానియా మీర్జా (భారత్)–షుయె జాంగ్ (చైనా) ద్వయం ఫైనల్లోకి దూసుకెళ్లింది. శనివారం జరిగిన మహిళల డబుల్స్ సెమీఫైనల్లో సానియా–షుయె జాంగ్ జోడీ 6–2, 7–5తో ఇరి హొజుమి–మకోటో నినోమియా (జపాన్) జంటను ఓడించింది. 81 నిమిషాల్లో ముగిసిన ఈ మ్యాచ్‌లో సానియా–షుయె జాంగ్ ప్రత్యర్థి జోడీ సర్వీస్‌ను ఐదుసార్లు బ్రేక్ చేసి తమ సర్వీస్‌ను రెండుసార్లు కోల్పోయింది. నేడు జరిగే ఫైనల్లో కైట్లిన్ (అమెరికా)–ఎరిన్ (న్యూజిలాండ్) జోడీతో సానియా జంట ఆడుతుంది. చదవండి: Delhi vs Rajasthan: రాజస్తాన్ కెప్టెన్ సామ్సన్‌కు మళ్లీ భారీ జరిమానా.. -
Ostrava Open: సెమీఫైనల్లో సానియా మీర్జా జోడీ
Ostrava Open: ఒస్ట్రావా ఓపెన్ డబ్ల్యూటీఏ–500 టెన్నిస్ టోర్నీలో సానియా మీర్జా (భారత్)–షుయె జాంగ్ (చైనా) జోడీ సెమీఫైనల్లోకి ప్రవేశించింది. చెక్ రిపబ్లిక్లో శుక్రవారం జరిగిన క్వార్టర్ ఫైనల్లో రెండో సీడ్ సానియా–షుయె జాంగ్ ద్వయం 6–3, 3–6, 10–6తో ‘సూపర్ టైబ్రేక్’లో డానిలినా (కజకిస్తాన్)–మరోజవా (బెలారస్) జంటను ఓడించింది. నేడు జరిగే సెమీఫైనల్లో ఇరీ హోజుమి– నినోమియా (జపాన్) జోడీతో సానియా–షుయె జాంగ్ ద్వయం తలపడుతుంది. చదవండి: MS Dhoni: బ్రావో ఇలా చేశాడే అనుకుంటారు కదా.. ఆ విషయంలోనే మాకు ‘గొడవలు’! -
Naomi Osaka: మళ్లీ ఎప్పుడు ఆడతానో తెలీదు.. నిరవధిక విరామం
టోక్యో: వచ్చే నెలలో జరిగే ఇండియన్ వెల్స్ ఓపెన్ డబ్ల్యూటీఏ ప్రీమియర్ టెన్నిస్ టోర్నమెంట్ నుంచి మాజీ చాంపియన్ నయోమి ఒసాకా వైదొలిగింది. ఇటీవల యూఎస్ ఓపెన్‌లో డిఫెండింగ్ చాంపియన్‌గా బరిలోకి దిగిన ఒసాకా అనూహ్యంగా మూడో రౌండ్లో కెనడాకు చెందిన లేలా ఫెర్నాండెజ్ చేతిలో ఓడింది. ఆ ఓటమి అనంతరం మళ్లీ తాను రాకెట్ పట్టేది ఎప్పుడో తనకు కూడా తెలీదంటూ నాలుగు గ్రాండ్‌స్లామ్ టైటిల్స్ విజేత ఒసాకా ఆటకు నిరవధిక విరామాన్ని ప్రకటించింది. ఇండియన్ వెల్స్ టోర్నీ అక్టోబర్ 4 నుంచి 17 వరకు జరగనుంది. Ostrava Tennis Tournament: ఒస్ట్రావా ఓపెన్ టెన్నిస్ టోర్నమెంట్లో భారత స్టార్ క్రీడాకారిణి సానియా మీర్జా–షుయె జాంగ్ (చైనా) క్వార్టర్ ఫైనల్లోకి దూసుకెళ్లింది. చెక్ రిపబ్లిక్ లో జరుగుతున్న ఈ టోర్నీలో తొలి రౌండ్లో సానియా–షుయె జంగ్ ద్వయం 6–7 (3/7), 7–5, 10–7తో ‘సూపర్ టైబ్రేక్’లో ఇమీనా బెక్టాస్ (అమెరికా)–తారా మూర్ (బ్రిటన్) జోడీపై నెగ్గింది. చదవండి: Ind W Vs Aus W 2nd ODI: నిలవాలంటే గెలవాల్సిందే! -
రన్నరప్ సానియా మీర్జా జంట
క్లీవ్‌ల్యాండ్ ఓపెన్ టెన్నిస్ టోర్నమెంట్లో సానియా మీర్జా (భారత్)–క్రిస్టినా మెకేల్ (అమెరికా) జంట రన్నరప్ ట్రోఫీతో సంతృప్తి పడింది. ఆదివారం అమెరికాలోని ఒహాయోలో జరిగిన ఫైనల్లో సానియా–క్రిస్టినా ద్వయం 5–7, 3–6తో టాప్ సీడ్ సుకో అయోమా–ఎనా షిబహారా (జపాన్) జోడీ చేతిలో ఓడిపోయింది. రన్నరప్‌గా నిలిచిన సానియా జోడీకి 6,000 డాలర్ల (రూ. 4 లక్షల 40 వేలు) ప్రైజ్‌మనీతోపాటు 180 ర్యాంకింగ్ పాయింట్లు లభించాయి. -
సీజన్లో తొలి టైటిల్‌కు విజయం దూరంలో...
భారత టెన్నిస్ స్టార్ సానియా మీర్జా ఈ ఏడాది తొలి అంతర్జాతీయ టైటిల్‌కు విజయం దూరంలో నిలిచింది. అమెరికాలోని ఒహాయోలో జరుగుతున్న క్లీవ్‌ల్యాండ్ ఓపెన్ టెన్నిస్ టోర్నమెంట్లో సానియా మీర్జా (భారత్)–క్రిస్టినా మెకేల్ (అమెరికా) జంట ఫైనల్‌కు చేరింది. శనివారం జరిగిన డబుల్స్ సెమీఫైనల్లో సానియా–క్రిస్టినా ద్వయం 7–6 (7/5), 6–2తో ఐకెరి (నార్వే) –కేథరిన్ హ్యారిసన్ (అమెరికా) జోడీపై గెలుపొందింది. గంటా 23 నిమిషాల పాటు సాగిన మ్యాచ్‌లో ప్రత్యర్థి సర్వీస్‌ను సానియా జంట నాలుగు సార్లు బ్రేక్ చేసింది. మ్యాచ్ ముగిశాక తన కుమారుడు ఇజ్‌హాన్‌తో కలిసి సానియా ఆనందం పంచుకుంది. ఫైనల్లో టాప్ సీడ్ సుకో అయోమా–ఎనా షిబహార (జపాన్) జోడీతో సానియా–క్రిస్టినా జంట తలపడుతుంది. -
డబుల్స్ సెమీస్‌లో సానియా మీర్జా జంట
క్లీవ్‌ల్యాండ్ ఓపెన్ టెన్నిస్ టోర్నమెంట్లో సానియా మీర్జా (భారత్)–క్రిస్టినా మెక్‌హాలే (అమెరికా) జంట సెమీఫైనల్లో ప్రవేశించింది. అమెరికాలోని ఒహాయోలో శుక్రవారం జరిగిన మహిళల డబుల్స్ క్వార్టర్ ఫైనల్లో సానియా–క్రిస్టినా ద్వయం 6–3, 6–3తో మూడో సీడ్ లూసీ హర్డెకా (చెక్ రిపబ్లిక్)–షుయె జాంగ్ (చైనా) జంటపై సంచలన విజయం సాధించింది. 61 నిమిషాలపాటు సాగిన ఈ మ్యాచ్‌లో సానియా జోడీ ప్రత్యర్థి సర్వీస్‌ను ఐదు సార్లు బ్రేక్ చేసింది. సెమీఫైనల్లో ఐకెరి (నార్వే)–కేథరిన్ హ్యారిసన్ (అమెరికా) జంటతో సానియా–క్రిస్టినా జోడీ తలపడనుంది. -
సానియా జోడి పరాజయం
సిన్సినాటి: హార్డ్ కోర్ట్ సీజన్లో కొత్త భాగస్వామితో జత కట్టిన భారత టెన్నిస్ స్టార్ సానియా మీర్జాకు కలిసి రాలేదు. వెస్టర్న్ అండ్ సదరన్ (సిన్సినాటి) ఓపెన్ మహిళల డబుల్స్ తొలి రౌండ్లోనే సానియా జోడి పరాజయం పాలైంది. టోక్యో ఒలింపిక్స్‌లో ఓటమి తర్వాత సానియాకు అంతర్జాతీయ సర్క్యూట్లో ఇదే తొలి మ్యాచ్. వరల్డ్ సింగిల్స్ 22వ ర్యాంక్ అన్స్ జబర్ (ట్యునీషియా)తో సానియా ఈ సారి బరిలోకి దిగింది. అయితే మొదటి రౌండ్లో వెరొనికా కుదెర్మెటొవా (రష్యా) – ఎలినా రైబాకినా (కజకిస్తాన్) ద్వయం 7–5, 6–2తో సానియా–జబర్ జంటపై విజయం సాధించింది. 63 నిమిషాల్లో ముగిసిన ఈ మ్యాచ్‌లో సానియా, జబర్ కలిసి 4 ఏస్‌లు సంధించగా, 2 డబుల్ ఫాల్ట్‌లు చేశారు. హైదరాబాద్‌లో నెహ్రూ హాకీ టోర్నీ సాక్షి, హైదరాబాద్: జాతీయ స్థాయిలో ప్రత్యేక గుర్తింపు ఉన్న ప్రతిష్టాత్మక జవహర్లాల్ నెహ్రూ సీనియర్ హాకీ టోర్నమెంట్‌కు తొలి సారి హైదరాబాద్ ఆతిథ్యం ఇవ్వనుంది. 1964నుంచి జరుగుతున్న ఈ టోర్నీని తొలిసారి న్యూఢిల్లీ బయట నిర్వహిస్తున్నారు. నవంబర్ 14నుంచి 25 వరకు నగరంలో జరిగే ఈ టోర్నీలో రైల్వేస్, పంజాబ్ అండ్ సింధ్ బ్యాంక్, ఇండియన్ ఆయిల్, ఎయిర్ ఇండియా తదితర ప్రతిష్టాత్మక 16 జట్లు పాల్గొంటాయి. దాదాపు ఆరు దశాబ్దాలుగా యువ హాకీ ఆటగాళ్లను వెలుగులోకి తెచ్చి ఒలింపిక్స్ సహా ప్రధాన అంతర్జాతీయ టోర్నీలలో భారత్‌కు ప్రాతినిధ్యం వహించే స్థాయికి ఎదిగేలా చేయడంలో నెహ్రూ హాకీ టోర్నీ కీలక పాత్ర పోషించింది. ‘గూంచా గ్రూప్’ టోర్నీకి స్పాన్సర్‌గా వ్యవహరిస్తోంది. గురువారం జరిగిన మీడియా సమావేశంలో జేఎన్‌హెచ్‌టీ సొసైటీ అధ్యక్షుడు సుభాష్ కపూర్, ఇతర సభ్యులు పాల్గొన్నారు. -
యూఎస్ ఓపెన్ బరిలో సానియా మీర్జా
భారత మహిళా టెన్నిస్ స్టార్ సానియా మీర్జా ఈనెల 30 నుంచి న్యూయార్క్‌లో మొదలయ్యే చివరి గ్రాండ్‌స్లామ్ టోర్నీ యూఎస్ ఓపెన్‌లో పాల్గొననుంది. ఈ మేరకు నిర్వాహకులు ఆమెకు మహిళల డబుల్స్ విభాగంలో ‘వైల్డ్ కార్డు’ను కేటాయించారు. అమెరికా ప్లేయర్ కోకో వాండెవెతో కలిసి సానియా ఆడుతుంది. యూఎస్ ఓపెన్‌కు సన్నాహాల్లో భాగంగా ఈనెల 16 నుంచి జరిగే సిన్సినాటి ఓపెన్ టోర్నీలో ట్యునీíÙయా క్రీడాకారిణి ఆన్స్ జబూర్‌తో కలిసి సానియా బరిలోకి దిగనుంది. -
కలిసి రాలేదంతే...
టోక్యో ఒలింపిక్స్ తొలి రోజే మీరాబాయి చాను రజత పతకంతో భారత్ బోణీ కొట్టగా... రెండో రోజు ఆదివారం మాత్రం భారత శిబిరాన్ని బాగా కుంగదీసింది. ఉదయం షూటింగ్లో గురి తప్పగా...టెన్నిస్‌లో భారత జోడీ చేజేతులా ఓడింది. మధ్యాహ్నం స్విమ్మింగ్‌లో బోల్తా కొడితే... హాకీలో పురుషుల జట్టూ ఘోరంగా ఓడింది. బాక్సింగ్, రోయింగ్ కాస్త ఊరటనిచ్చాయి అంతే! టోక్యో: భారత శిబిరంలో అత్యంత ఒలింపిక్స్ అనుభవమున్న క్రీడాకారిణి ఎవరైనా ఉంటే అది హైదరాబాద్ టెన్నిస్ స్టార్ సానియా మీర్జానే! ఇప్పటికే మూడుసార్లు విశ్వ క్రీడల్లో ఆడింది. కెరీర్లో నాలుగో ఒలింపిక్స్ ఆడుతున్న ఈ విశేష అనుభవజ్ఞురాలు గెలవాల్సిన మ్యాచ్‌ను చేజేతులా ఓడిపోయింది. ఒలింపిక్స్‌లో అరంగేట్రం చేసిన అంకిత రైనాతో కలిసి మహిళల డబుల్స్‌లో బరిలోకి దిగిన సానియా ఆట అద్భుతంగా మొదలైనా... చివరకు ఫలితం మాత్రం తొలి రౌండ్లోనే ముగించింది. ఆదివారం జరిగిన మహిళల డబుల్స్ తొలి రౌండ్ మ్యాచ్‌లో సానియా–అంకిత జోడీ 6–0, 6–7 (0/7), 8–10తో ‘సూపర్ టైబ్రేక్’లో ఉక్రెయిన్ సోదరి ద్వయం నదియా–లిద్మిలా కిచెనోక్ చేతిలో కంగుతింది. తొలి సెట్‌ను కేవలం 21 నిమిషాల్లోనే వశం చేసుకున్న భారత జంట రెండో సెట్‌ను, మ్యాచ్‌ను గెలిచే స్థితిలో నిలిచింది. 5–3తో ఆధిక్యంలో ఉండగా సర్వీస్ సానియా జోడీదే కాగా... ఈ సర్వీస్ నిలబెట్టుకుని ఉంటే భారత్‌కు విజయం ఖాయమయ్యేది. అనూహ్యంగా భారత జంట సర్వీస్ చేసిన ఈ గేమ్ చేజారడంతో ప్రత్యర్థుల పోరాటంతో ఆట టైబ్రేక్‌కు వెళ్లింది. అక్కడా భారత జోడి ఓడింది. ఒలింపిక్స్ నిబంధనల ప్రకారం డబుల్స్‌లో నిర్ణాయక మూడో సెట్ ఉండదు. విజేతను తేల్చేందుకు సూపర్ టైబ్రేక్ నిర్వహిస్తారు. ఇందులో 1–8తో దాదాపు ఓడే దశలో ఉన్నప్పటికీ సానియా–అంకిత జోడీ వరుసగా 7 పాయింట్లు నెగ్గి స్కోరును 8–8 వద్ద సమం చేసింది. కానీ ఆ వెంటనే వరుసగా 2 పాయింట్లు కోల్పోవడంతో ఓటమి తప్పలేదు. -
టోక్యో ఒలింపిక్స్: సానియా జంటకు కష్టమే
టోక్యో: ఒలింపిక్స్ పతకాల వేటలో ఈసారి భారత టెన్నిస్ క్రీడాకారులకు ఆరంభం నుంచే కఠిన సవాల్ ఎదురుకానుంది. మహిళల డబుల్స్‌లో సానియా మీర్జా–అంకిత రైనా జంట తొలి రౌండ్లో నదియా–లైద్మిలా కిచెనోక్ (ఉక్రెయిన్) జంటతో తలపడనుంది. ఒకవేళ తొలి రౌండ్ అడ్డంకిని సానియా ద్వయం అధిగమిస్తే రెండో రౌండ్లో ఎలీనా వెస్నినా–వెరోనికా కుదెర్మెతోవా (రష్యా ఒలింపిక్ కమిటీ) జోడీతో ఆడే అవకాశముంది. వెస్నినా 2016 రియో ఒలింపిక్స్‌లో మకరోవా జోడీగా మహిళల డబుల్స్‌లో స్వర్ణం సాధించింది. మరోవైపు పురుషుల సింగిల్స్‌లో భారత ప్లేయర్ సుమిత్ నగాల్ తొలి రౌండ్లో ఇస్టోమిన్ (ఉజ్బెకిస్తాన్)తో ఆడతాడు. -
ఏఐటీఏపై బోపన్న విమర్శలు, సానియా మద్దతు
2012 లండన్ ఒలింపిక్స్‌కు ముందు... లియాండర్ పేస్‌తో డబుల్స్ ఆడేది లేదని మహేశ్ భూపతి, రోహన్ బోపన్న పట్టు... బలవంతంగా మిక్స్డ్ డబుల్స్‌లో పేస్ భాగస్వామిగా సానియా మీర్జా... పురుషాధిక్య ప్రపంచంలో తనను బలి పశువును చేశారని సానియా తీవ్ర వ్యాఖ్య! 2016 రియో ఒలింపిక్స్‌కు ముందు... పేస్‌తో కలిసి ఆడనని, డబుల్స్‌లో సాకేత్ మైనేనితోనే బరిలోకి దిగుతానని బోపన్న పట్టు... అలా కుదరదంటూ బలవంతంగా జోడీని ఎంపిక చేసిన ఏఐటీఏ!! 2020 టోక్యో ఒలింపిక్స్‌కు ముందు... ఇంకా వివాదమేమీ లేదు, అంతా బాగుందనే అనిపించిది. కానీ అలా అయితే అది భారత టెన్నిస్ ఎలా అవుతుంది...ఆటలకు ముందు వ్యాఖ్యల దుమారం రేగింది!!! న్యూఢిల్లీ: ఒలింపిక్స్‌లో తాను పాల్గొనే అవకాశాల విషయంలో అఖిల భారత టెన్నిస్ సంఘం (ఏఐటీఏ) అందరినీ తప్పుదోవ పట్టించిందని టెన్నిస్ ఆటగాడు రోహన్ బోపన్న వ్యాఖ్యానించాడు. సుమిత్ నగాల్‌కు జోడీగా తాను ఒలింపిక్స్‌లో పాల్గొనే అవకాశాలు లేవని తెలిసి కూడా అధికారులు ఇలా వ్యవహరించారని అతను విమర్శించాడు. బోపన్న వ్యాఖ్యలకు సానియా మీర్జా మద్దతు పలకగా... ఏఐటీఏ ప్రతిగా స్పందిస్తూ ఇద్దరి విమర్శలను ఖండించింది. నేపథ్యమిదీ... ఒలింపిక్స్ పురుషుల డబుల్స్‌లో పాల్గొనే జోడీగా రోహన్ బోపన్న–దివిజ్ శరణ్‌ల పేర్లను ఏఐటీఏ ప్రకటించింది. అయితే వీరిద్దరి ‘సంయుక్త ర్యాంక్’ 113 కాగా... అంతర్జాతీయ టెన్నిస్ సమాఖ్య (ఐటీఎఫ్) నిబంధనల ప్రకారం తక్కువ ర్యాంక్ కారణంగా వీరు అర్హత సాధించలేకపోయారు. ఆ తర్వాత పురుషుల సింగిల్స్‌లో పలువురు తప్పుకోవడంతో అనూహ్యంగా సుమిత్ నగాల్ అర్హత సాధించాడు. దాంతో దివిజ్ స్థానంలో నగాల్‌ను చేర్చి కొత్తగా ఈ జోడీని పరిశీలించమంటూ ఐటీఎఫ్‌ను ఏఐటీఏ కోరింది. చివరకు బోపన్న–నగాల్ జోడీకి కూడా అవకాశం దక్కలేదు. ఇదే విషయంపై వ్యాఖ్య చేసిన బోపన్న... అసలు ఏఐటీఏ అలాంటి ప్రయత్నమే చేయలేదని విమర్శించాడు. ‘నగాల్‌తో నా జోడీని ఐటీఎఫ్ అసలు అంగీకరించనే లేదు. గాయం తదితర బలమైన కారణం ఉంటే తప్ప చివరి తేదీ అయిన జూన్ 22 తర్వాత ఎలాంటి మార్పులు అంగీకరించబోమని ఐటీఎఫ్ స్పష్టం చేసింది. అయినా సరే మాకేదో అవకాశం ఉందని, తామేదో చేస్తున్నట్లుగా ఆటగాళ్లు, ప్రభుత్వం, మీడియా... ఇలా అందరినీ ఏఐటీఏ తప్పుదోవ పట్టించింది’ అని బోపన్న ట్వీట్ చేశాడు. దీనిని మద్దతుగా సానియా...‘అవునా...ఇదే నిజమైతే చాలా ఘోరం. సిగ్గు పడాల్సిన విషయం. దీని ప్రకారం చూస్తే మనిద్దరం కలిసి మిక్స్డ్ డబుల్స్‌లో పతకం సాధించే అవకాశం కూడా కోల్పోయాం. నీతో పాటు సుమిత్ పేరు పంపించినట్లు నాకు కూడా చెప్పారు’ అని ట్వీట్ చేసింది. అయితే ఈ విమర్శలన్నింటికీ ఏఐటీఏ కొట్టి పారేసింది. బోపన్న, సానియా వ్యాఖ్యలు పూర్తిగా అర్థరహితం. వారికి అసలేం తెలీదు. అర్హత గురించి రూల్ బుక్ చదివి మాట్లాడితే బాగుండేది. డబుల్స్ జోడీని మార్చమంటూ మేం ఐటీఎఫ్కి విజ్ఞప్తి చేశాం. అయితే ప్రత్యేక పరిస్థితుల్లోనే అది సాధ్యమవుతుందని వారు మాకు చెప్పారు. అయినా సరే డెడ్‌లైన్ ముగియడానికి ఏడు గంటల ముందు వరకు కూడా సమాచారం ఇస్తామని చెప్పి మేమూ వేచి చూసేలా చేశారు. ఇందులో తప్పుదోవ పట్టించడం ఏముంది. దాని వల్ల మాకేంటి లాభం. బోపన్న ఒలింపిక్స్‌లో ఆడాలని అతనికి సహాయం చేసేందుకే ప్రయత్నించాం. అంతగా అనుకుంటే అతను సొంతంగా తన ర్యాంకింగ్‌తో అర్హత సాధించాల్సింది. –అనిల్ ధుపార్, ఏఐటీఏ కార్యదర్శి -
ఒలింపిక్ కిట్‌తో సానియా డ్యాన్స్ అదుర్స్.. వైరల్ వీడియో
సాక్షి, హైదరాబాద్: టోక్యో వేదికగా ఒలింపిక్స్ క్రీడలు ఈ నెల 23 నుంచి ప్రారంభం కానున్న నేపథ్యంలో పలువురు భారత అథ్లెట్లు తమ సంతోషాన్ని సోషల్ మీడియా వేదికగా అభిమానులతో పంచుకుంటున్నారు. సోషల్ మీడియాలో యాక్టివ్‌గా ఉంటూ వ్యక్తిగత, వృత్తిపరమైన విషయాలను అభిమానులతో పంచుకునే టెన్నిస్ స్టార్ సానియా మీర్జా తాజాగా ఓ వీడియోను తన ఇన్స్టాగ్రామ్ ఖాతాలో పోస్ట్ చేసింది. ఆ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. View this post on Instagram A post shared by Sania Mirza (@mirzasaniar) ఒలంపిక్స్ గేమ్స్‌లో పాల్గొనబోతున్న సానియా మీర్జా కొత్త ఇండియన్ ఒలింపిక్ కిట్‌ను ధరించి డాన్స్ చేశారు. అమెరికన్ రాపర్ డోజా క్యాట్‌కు సంబంధించిన తాజా హిట్ పాట ‘కిస్ మి మోర్’కు బ్లూ కలర్ జెర్సీ ధరించి నృత్యం చేశారు. ‘నా పేరులో వచ్చే ఇంగ్లీష్ లెటర్ ‘ఏ’ను విస్తరిస్తే.. అందులో చాలా జీవితం ఉంది. దూకుడు, ఆశయం, సాధించడం, ఆప్యాయత అన్ని అందులో ఉన్నాయి’ అని ఆమె కామెంట్ జతచేశారు. ఆమె పోస్ట్ చేసిన ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ కాగా ఇప్పటికే 55వేల మంది లైక్ చేశారు. ఈ వీడియోను వీక్షించిన పారిశ్రామికవేత్త కుమార మంగళం బిర్లా కూతురు అనన్య బిర్లా.. ‘నీ డాన్స్ మూవ్మెంట్స్ నాకు చాలా నచ్చాయి. నీకు అభినందనలు’ అని కామెంట్ చేశారు. ఆమెకు పలువురు అభిమానులు టోక్యో ఒలంపిక్స్‌కు ‘ఆల్ ద బెస్ట్’ తెలుపుతూ కామెంట్లు చేస్తున్నారు. ఇక భారత ఒలంపిక్స్ అసోషియేషన్.. కొత్త ఇండియన్ ఒలింపిక్స్ కిట్‌ను గత నెల విడుదల చేసిన విషయం తెలిసిందే. అదే విధంగా నిన్న(మంగళవారం) ప్రధాని నరేంద్ర మోదీతో వీడియో కాన్ఫరెన్స్‌లో పాల్గొన్న సానియా.. టోక్యో ఒలంపిక్స్ కోసం తాను చేస్తున్న సాధన గురించి ప్రధానికి వివరించారు. మహిళల డబుల్స్ విభాగంలో సానియా, అంకితా రైనాతో కలిసి టోక్యో ఒలింపిక్స్‌లో భారత్‌కు ప్రాతినిధ్యం వహించనుంది. -
Wimbledon 2021: సూపర్ సబలెంకా
లండన్: కెరీర్లో 14 గ్రాండ్‌స్లామ్ టోర్నీలు ఆడినా... ఒక్కసారీ నాలుగో రౌండ్ దాటలేకపోయిన బెలారస్ భామ అరీనా సబలెంకా 15వ ప్రయత్నంలో మాత్రం సెమీఫైనల్ బెర్త్‌ను ఖరారు చేసుకుంది. వింబుల్డన్ గ్రాండ్‌స్లామ్ టోర్నీ మహిళల సింగిల్స్‌లో రెండో సీడ్‌గా బరిలోకి దిగిన సబలెంకా క్వార్టర్ ఫైనల్లో 6–4, 6–3తో 21వ సీడ్ ఆన్స్ జెబర్ (ట్యూనిషియా)పై గెలిచింది. 74 నిమిషాలపాటు జరిగిన ఈ మ్యాచ్‌లో సబలెంకా మూడు ఏస్‌లు సంధించి, ప్రత్యర్థి సర్వీస్‌ను మూడుసార్లు బ్రేక్ చేసింది. 27 విన్నర్స్ కొట్టిన ఆమె నెట్ వద్దకు 20 సార్లు దూసుకొచ్చి 11సార్లు పాయింట్లు సాధించింది. తొలి సెట్లో 5–4తో ఆధిక్యంలో ఉన్నదశలో దాదాపు పది నిమిషాలపాటు జరిగిన పదో గేమ్‌లో జెబర్ సర్వీస్‌ను బ్రేక్ చేసి సబలెంకా తొలి సెట్‌ను కైవసం చేసుకుంది. రెండో సెట్లో సబలెంకా రెండో గేమ్‌లో, ఎనిమిదో గేమ్‌లో జెబర్ సర్వీస్‌ను బ్రేక్ చేసి తన సర్వీస్‌లను నిలబెట్టుకొని విజయాన్ని ఖాయం చేసుకుంది. తాజా విజయంతో నటాషా జ్వెరెవా (1998), అజరెంకా (2011, 20112) తర్వాత వింబుల్డన్ టోర్నీలో సెమీఫైనల్ చేరిన మూడో బెలారస్ క్రీడాకారిణిగా సబలెంకా గుర్తింపు పొందింది. ప్లిస్కోవా జోరు... ఇతర క్వార్టర్ ఫైనల్స్‌లో ఎనిమిదో సీడ్, మాజీ నంబర్‌వన్ కరోలినా ప్లిస్కోవా (చెక్ రిపబ్లిక్) 6–2, 6–2తో గోలూబిచ్ (స్విట్జర్లాండ్)పై... టాప్ సీడ్, వరల్డ్ నంబర్‌వన్ యాష్లే బార్టీ (ఆస్ట్రేలియా) 6–1, 6–3తో తొమ్యానోవిచ్ (ఆస్ట్రేలియా)పై గెలిచి ఈ టోర్నీలో తొలిసారి సెమీఫైనల్‌కు చేరారు. మరో క్వార్టర్ ఫైనల్లో 2018 చాంపియన్ ఎంజెలిక్ కెర్బర్ (జర్మనీ) 6–2, 6–3తో కరోలినా ముకోవా (చెక్ రిపబ్లిక్)ను ఓడించి నాలుగోసారి సెమీఫైనల్ బెర్త్ దక్కించుకుంది. 2012లో సెమీస్ చేరిన కెర్బర్ 2016లో రన్నరప్‌గా నిలిచింది. గురువారం జరిగే సెమీఫైనల్స్‌లో బార్టీతో కెర్బర్; ప్లిస్కోవాతో సబలెంకా తలపడతారు. రెండో సీడ్ మెద్వెదేవ్‌కు షాక్ పురుషుల సింగిల్స్ ప్రిక్వార్టర్ ఫైనల్లో రెండో సీడ్ మెద్వెదేవ్ (రష్యా) 6–2, 6–7 (2/7), 6–3, 3–6, 3–6తో 14వ సీడ్ హుబర్ట్ హుర్కాజ్ (పోలాండ్) చేతిలో ఓడిపోయాడు. ఈ గెలుపుతో హుబర్ట్ తన కెరీర్లో తొలిసారి ఓ గ్రాండ్‌స్లామ్ టోర్నీలో క్వార్టర్ ఫైనల్ చేరాడు. నేడు జరిగే పురుషుల సింగిల్స్ క్వార్టర్ ఫైనల్స్‌లో ఫుచోవిచ్ (హంగేరి)తో జొకోవిచ్ (సెర్బియా); హుబర్ట్తో ఫెడరర్ (స్విట్జర్లాండ్); షపోవలోవ్ (కెనడా)తో ఖచనోవ్ (రష్యా); ఫీలిక్స్ (కెనడా)తో బెరెటిని (ఇటలీ) తలపడతారు. రోహన్ బోపన్న–సానియా మీర్జా (భారత్) మిక్స్డ్ డబుల్స్ మూడో రౌండ్ మ్యాచ్‌కు వర్షం అంతరాయం కలిగించింది. జీన్ జూలియన్ రోజర్ (నెదర్లాండ్స్)–ఆండ్రియా క్లెపాక్ (స్లొవేనియా) జోడీతో మ్యాచ్‌లో బోపన్న–సానియా జంట తొలి సెట్‌ను 3–6తో కోల్పోయింది. ఆ తర్వాత వర్షం రావడంతో మ్యాచ్‌ను నిలిపి వేశారు. -
Wimbledon 2021: సానియా జోడీ శుభారంభం
లండన్: ప్రతిష్టాత్మక వింబుల్డన్ టెన్నిస్ టోర్నమెంట్లో భారత స్టార్ క్రీడాకారిణి సానియా మీర్జా శుభారంభం చేసింది. నాలుగేళ్ల తర్వాత ఈ టోర్నీ బరిలోకి దిగిన హైదరాబాద్ టెన్నిస్ స్టార్.. అమెరికా ప్లేయర్ బెతాని మ్యాటెక్ సాండ్స్‌తో కలిసి అద్భుత విజయం సాధించింది. గురువారం జరిగిన మహిళల డబుల్స్ తొలి రౌండ్లో సానియా- బెతాని జోడీ 7-5, 6-3 తేడాతో ఆరో సీడ్ అలెక్సా గౌరచి(చిలీ)- డిసారియ క్రాక్జిక్(అమెరికా) జోడీపై వరుస సెట్లలో గెలుపొందింది. గంటా 28 నిమిషాల పాటు సాగిన ఈ పోరులో సానియా జోడీ అలవోకగా విజయాన్నందుకుంది. సానియా కెరీర్లో ఇది 121 విజయం కాగా.. ఈ మ్యాచ్‌లో ఆమె ఒక్క ఏస్ మాత్రమే సంధించింది. సానియా.. వింబుల్డన్‌లో 2017లో చివరిసారిగా బరిలోకి దిగింది. కాగా, టోక్యో ఒలింపిక్స్‌కు ముందు జరుగుతున్న ఈ మెగా గ్రాండ్‌స్లామ్ టోర్నీ సానియాకు చాలా కీలకంగా మారింది. కెరీర్ చరమాంకంలో ఉన్న 34 ఏళ్ల సానియా.. ఈ వింబుల్డన్‌లో ఎలాగైనా విజయం సాధించి విశ్వక్రీడల బరిలో నిలవాలని ప్లాన్ చేస్తుంది. ఇక టోక్యో ఒలింపిక్స్‌కు అర్హత సాధించడం ద్వారా భారత్తరఫున నాలుగు ఒలింపిక్స్‌లో పాల్గొన్న తొలి మహిళా అథ్లెట్‌గా ఆమె చరిత్ర సృష్టించనుంది. ఇదిలా ఉంటే, 2018లో ఇజాన్‌కు జన్మనిచ్చాక గతేడాది జనవరిలో హోబర్ట్ ఇంటర్నేషనల్ టైటిల్గెలిచి సెకండ్ఇన్నింగ్స్ఘనంగా ప్రారంభించిన ఈ పాక్ కోడలు.. ఆతర్వాత ఆశించిన స్థాయిలో రాణించలేకపోయింది. -
తొలి రౌండ్లోనే సానియా జంట ఓటమి
ఈస్ట్‌బార్న్: భారత టెన్నిస్ స్టార్ సానియా మీర్జా ఈస్ట్‌బార్న్ అంతర్జాతీయ టెన్నిస్ టోర్నమెంట్లో నిరాశపరిచింది. బెతాని మ్యాటెక్ సాండ్స్ (అమెరికా)తో జతకట్టిన హైదరాబాదీకి తొలి రౌండ్లోనే చుక్కెదురైంది. భారత కాలమానం ప్రకారం బుధవారం అర్ధరాత్రి దాటాక జరిగిన మహిళల డబుల్స్ మ్యాచ్‌లో సానియా–మ్యాటెక్ సాండ్స్ జోడీ 3–6, 4–6తో అమెరికా ద్వయం సబ్రినా శాంటామరియా–క్రిస్టీనా మెక్‌హాలె చేతిలో ఓడి టోర్నీ నుంచి నిష్క్రమించింది. -
‘సానియా మీర్జా కుమారుడికీ వీసా ఇవ్వండి’
న్యూఢిల్లీ: వింబుల్డన్ గ్రాండ్‌స్లామ్ టోర్నీ సహా రాబోయే కొన్ని వారాల్లో ఇంగ్లండ్‌లో పలు టోర్నీల్లో పాల్గొననున్న భారత టెన్నిస్ క్రీడాకారిణి సానియా మీర్జాకు వ్యక్తిగత సమస్య ఎదురైంది. తనతోపాటు తన కుమారుడు ఇజ్హాన్కు, సహాయకురాలికి కూడా వీసా ఇవ్వాలంటూ ఆమె చేసిన విజ్ఞప్తిని ఇంగ్లండ్ ప్రభుత్వం తిరస్కరించింది. క్రీడాకారిణిగా సానియాకు వీసా మంజూరు చేయగా... ప్రస్తుతం కరోనా కారణంగా భారత్ నుంచి వచ్చే ఇతర ప్రయాణీకుల విషయంలో ఇంగ్లండ్ దేశంలో ఆంక్షలు కొనసాగుతుండటమే అందుకు కారణం. దాంతో తన సమస్యను సానియా కేంద్ర ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లింది. రెండేళ్ల కుమారుడిని వదిలి తాను ఉండటం కష్టమని ఆమె పేర్కొంది. సానియా లేఖపై స్పందించిన కేంద్రం... విదేశీ వ్యవహారాల మంత్రిత్వ శాఖ ద్వారా ఇంగ్లండ్ ప్రభుత్వానికి ప్రత్యేక విజ్ఞప్తి చేసింది. లండన్‌లో భారత రాయబార కార్యాలయం ఈ విషయంలో సహకరిస్తుందని కేంద్ర క్రీడా శాఖ మంత్రి కిరణ్ రిజిజు స్పష్టం చేశారు. చదవండి: Roger Federer: ఫెడరర్‌కు భారీ షాక్...! -
పండుగ నాడు ఫొటోల కోసం సానియా మీర్జా తంటాలు
భారత టెన్నీస్ స్టార్ సానియా మీర్జా తన భర్త షోయబ్ మాలిక్‌తో కలిసి రంజాన్ పర్వదిన వేడుక చేసుకుంది. ఈ సందర్భంగా తన భర్తతో కలిసి దిగిన ఫొటోలను పంచుకుంది. ‘ఫొటోలు దిగేప్పుడు ఎన్ని కష్టాలో’ అంటూ ఇన్‌స్టాగ్రామ్‌లో పేర్కొంటూ ఐదు ఫొటోలు పంచుకుంది. ఆ ఫొటోలను చూస్తే మొదటి ఫొటో బాగానే రాగా.. మిగతా నాలుగు ఫొటోలు బ్లర్ కావడం.. షేక్ అవడం వంటివి జరిగాయి. దీంతో ఆ ఫొటోలు సక్రమంగా రాలేదు. ఇదే విషయాన్ని ఆమె ఇన్‌స్టా వేదికగా చెప్పింది. అనంతరం తన కుమారుడు ఇజాన్ మీర్జా మాలిక్‌తో కలిసి సముద్రపు ఒడ్డున సరదాగా నడయాడుతున్న ఫొటోలను కూడా సానియా మీర్జా పంచుకుంది. దీంతో పాటు ట్విటర్లో కూడా రంజాన్ శుభాకాంక్షలు తెలిపింది. ప్రస్తుత పరిస్థితుల్లో వీలైనంత తక్కువ మంది ప్రార్థనల్లో పాల్గొనండి. ఈ భారం నుంచి అల్లా ఈ భూమిని రక్షిస్తాడు’ అని కరోనా మహమ్మారి విషయమై పేర్కొంది. ప్రస్తుతం టోక్యో ఒలంపిక్స్ కోసం సానియా మీర్జా సిద్ధమవుతోంది. నాలుగేళ్ల తర్వాత ఒలంపిక్స్‌లో పాల్గొననున్నది. చదవండి: టోక్యో ఒలింపిక్ప్‌కు సానియా మీర్జా అర్హత View this post on Instagram A post shared by Sania Mirza (@mirzasaniar) -
సన్‌రైజర్స్ యాజమాన్యంపై సానియా మీర్జా తండ్రి ఫైర్..
హైదరాబాద్: సన్‌రైజర్స్ హైదరాబాద్ యాజమాన్యంపై భారత టెన్నిస్ స్టార్ ప్లేయర్ సానియా మీర్జా తండ్రి ఇమ్రాన్ మీర్జా ఆగ్రహం వ్యక్తం చేశాడు. హైదరాబాద్ జట్టులో స్థానిక ఆటగాళ్లకు అవకాశం ఇవ్వకపోవడంపై ఆయన మండిపడ్డాడు. ప్రస్తుత పరిస్థితులను బట్టి చూస్తే హైదరాబాద్ ఈ సీజన్లో ఎక్కువ విజయాలు నమోదు చేసే అవకాశాలు కనిపించట్లేదన్నాడు. సన్‌రైజర్స్ వరుస పరాజయాలపై ట్విటర్ వేదికగా స్పందించిన ఆయన.. టీం మేనేజ్మెంట్ తీరును తప్పుబట్టాడు. తుది జట్టులో ఆడేందుకు తెలుగు రాష్ట్రాల్లో ఒక్క ఆటగాడు కూడా కనిపించలేదా అని ప్రశ్నించాడు. గత సీజన్లో భావనక సందీప్‌ను తీసుకున్నా.. అతనికి తుది జట్టులో ఆడే అవకాశం ఇవ్వకపోగా.. ఈ సీజన్లో ఏకంగా వదిలించుకోవడం బాధించిందని ఆవేదన వ్యక్తం చేశాడు. తెలుగు రాష్ట్రాల నుంచి మహ్మద్ సిరాజ్ ఆర్సీబీకి ఆడుతుంటే.. అంబటి రాయుడు, హరిశంకర్ రెడ్డి చెన్నైకి ప్రాతినిధ్యం వహిస్తున్న విషయాన్ని ఆయన గర్తు చేశారు. అంతే కాకుండా ఐపీఎల్ వేదికల్లో హైదరాబాద్‌కు అవకాశం ఇవ్వకపోవడంపై కూడా ఆయన ఆగ్రహం వ్యక్తం చేశాడు. కరోనా విజృంభిస్తున్న వేళ అత్యంత సురక్షితమైన హైదరాబాద్‌లో మ్యాచ్‌లు నిర్వహించకపోవడం ఏంటని ఆయన నిలదీశాడు . సన్‌రైజర్స్ ఆటతీరు చూస్తుంటే ప్లేఆఫ్స్‌కు అర్హత సాధించేలా కనిపించట్లేదని, దీని వల్ల సొంత అభిమానులు దూరమవుతున్నారని పేర్కొన్నాడు. ఈ విషయమై సన్‌రైజర్స్ యాజమాన్యం ఆత్మపరిశీలన చేసుకోవాలని సూచించాడు. ప్రస్తుతం ఈ ట్వీట్ నెట్టింట హల్చల్ చేస్తోంది. కాగా, రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరుతో బుధవారం జరిగిన మ్యాచ్‌లో సన్‌రైజర్స్ 6 పరుగుల తేడాతో ఓడిన విషయం తెలిసిందే. 150 పరుగుల లక్ష్యాన్ని ఛేదించేందుకు బరిలోకి దిగిన ఆరెంజ్ ఆర్మీ ఓ దశలో 16 ఓవర్లలో 115/2 పరుగులతో పటిష్టంగా కనిపించింది. అయితే మిడిలార్డర్ పూర్తిగా చేతులెత్తేయడంతో హైదరాబాద్ మ్యాచ్‌ను చేజార్చుకుంది. చదవండి: అరుదైన క్లబ్లో చేరికకు వికెట్ దూరంలో.. -
టోక్యో ఒలింపిక్ప్‌కు సానియా మీర్జా అర్హత
న్యూఢిల్లీ: భారత టెన్నిస్ స్టార్ సానియా మీర్జా నాలుగేళ్ల తర్వాత టార్గెట్ ఒలింపిక్ పోడియం స్కీమ్ (టాప్స్)లో మళ్లీ చోటు సంపాదించింది. బుధవారం జరిగిన మిషన్ ఒలింపిక్ సెల్ సమావేశంలో ఈ నిర్ణయం తీసుకున్నారు. 34 ఏళ్ల సానియా ప్రత్యేక ర్యాంకింగ్ నిబంధన ఆధారంగా టోక్యో ఒలింపిక్స్‌కు అర్హత సాధించింది. సెమీఫైనల్లో సాయిదేదీప్య సాక్షి, హైదరాబాద్: జాతీయ ర్యాంకింగ్ మహిళల టెన్నిస్ టోర్నమెంట్లో హైదరాబాద్ ప్లేయర్ సాయిదేదీప్య సెమీఫైనల్లోకి ప్రవేశించింది. బెంగళూరులో జరుగుతున్న ఈ టోరీ్నలో బుధవారం జరిగిన సింగిల్స్ క్వార్టర్ ఫైనల్లో సాయిదేదీప్య 6–2, 6–4తో అవిష్క గుప్తా (జార్ఖండ్)పై గెలిచింది. డబుల్స్ క్వార్టర్ ఫైనల్లో సాయిదేదీప్య–అవిష్క జంట 1–6, 6–4, 6–10తో స్నిగ్ధ (కర్ణాటక)–వేద (తెలంగాణ) జోడీ చేతిలో ఓడిపోయింది. -
భర్తకు సానియా వెరైటీ బర్త్‌డే విషెస్
పాకిస్తాన్ క్రికెటర్ షోయబ్ మాలిక్ నేడు 39 పుట్టినరోజు జరుపుకుంటున్నాడు. ఈ సందర్భంగా ఆయన సతీమణి, భారత టెన్నిస్ స్టార్ సానీయా మీర్జా వెరైటీగా పుట్టినరోజు శుభాకాంక్షలు చెప్పింది. "ఎవరు లేకపోతే నేను బతకలేనో అతడికి హ్యాప్ బర్త్‌డే. నీకు రోజులు, నెలలు, ఈ సంవత్సరమంతా బాగుండాలని కోరుకుంటున్నాను. ముఖ్య విషయమేంటంటే నువ్వు ప్రాక్టీస్‌కు వెళ్లి వచ్చిన తర్వాత ఇదంతా చెప్తాను. ఇంతకీ ఇది బర్త్‌డే విషెసేనా?, కాదంటావా? ఇదంతా పోనీ కానీ, ఐ లవ్ యూ" అని రాసుకొచ్చింది. దీనికి భర్తతో కలిసి దిగిన ఫొటోను షేర్ చేసింది. (చదవండి: కరోనా : సానియా మీర్జా భావోద్వేగం) కాగా అభిమానుల నుంచి వ్యతిరేకత ఉన్నప్పటికీ సానియా మీర్జా, షోయబ్ మాలిక్ 2010 ఏప్రిల్ 12న పెళ్లి చేసుకున్నారు. వీరికి 2018లో ఇజ్జాన్ జన్మించాడు. ఇదిలా వుంటే ఈ మధ్యే సానియా కరోనా బారిన పడింది. ఈ విషయాన్ని ఆమె జనవరి 19న సోషల్ మీడియాలో వెల్లడిస్తూ తనకు స్వల్పంగా కోవిడ్-19 లక్షణాలున్నాయని పేర్కొంది. ఈ సమయంలో తన ఫ్యామిలీకి, ముఖ్యంగా తన రెండేళ్ల చిన్నారికి దూరంగా ఉండటం భయంకరంగా అనిపించిందని చెప్పుకొచ్చింది. ఎప్పుడు ఏం జరుగుతుందో తెలియదు కాబట్టి కరోనాను అసలు జోక్‌గా తీసుకోవద్దని సూచిస్తూ సుదీర్ఘ పోస్ట్‌ను షేర్ చేసింది. (చదవండి: భారత జూనియర్ మహిళల హాకీ జట్టుకు మరో గెలుపు) View this post on Instagram A post shared by Sania Mirza (@mirzasaniar) -
కరోనా : సానియా మీర్జా భావోద్వేగం
సాక్షి, హైదరాబాద్ : కరోనా మహమ్మారి ప్రపంచవ్యాప్తంగా ప్రతీ ఒక్కరినీ గడ గడలాడించింది. ఎన్ని జాగ్రత్తలు తీసుకున్నా.. ఎపుడు.. ఎక్కడనుంచి ఎలా వస్తుందో అనే భయం సామాన్యుల నుంచి ప్రముఖుల వరకు వెంటాడింది. తాజాగా టెన్నిస్ స్టార్ సానియా మీర్జా కోవిడ్ అనుభవాలను సోషల్ మీడియాలో పంచుకున్నారు. కరోనా సోకి ఒంటరిగా, కుటుంబానికి, బిడ్డకు దూరంగా ఉండటం చాలా భయానకం అంటూ భావోద్వేగానికి లోనయ్యారు. ఎంత జాగ్రత్తగా ఉన్నా తాను కూడా కరోనా వైరస్ బారినపడ్డాననీ, కానీ ఆ దేవుడి దయ వల్ల ప్రస్తుతం తాను ఆరోగ్యంగా ఉన్నానంటూ ఇన్‌స్టాలోను, ట్విటర్లోనూ పోస్ట్ చేశారు. తనకి కరోనా పాజిటివ్ అని తేలినప్పటికీ.. అదృష్టవశాత్తూ తనకు ఎలాంటి లక్షణాలు కనిపించ లేదని సానియా మీర్జా ఇన్‌స్టాలో వెల్లడించారు. అయినా ముందు జాగ్రత్త చర్యగా ఐసోలేషన్‌లోనే ఉన్నానన్నారు. అయితే ఈ సమయంలో కుటుంబానికి, ముఖ్యంగా తన రెండేళ్ల చిన్నారికి దూరంగా ఉండటం చాలా భయంకరంగా అనిపించిందన్నారు. కానీ కరోనాతో తీవ్ర అనారోగ్యానికి గురై, ఆసుపత్రిలో ఒంటరిగా, కుటుంబానికి, ఆత్మీయులకు దూరంగా ఉన్న వారి పరిస్థితి ఊహించడానికే కష్టం. ఎపుడు ఏం జరుగుతుందో తెలియదు..రోజుకో లక్షణం.. రోజుకో కొత్త స్టోరీ... ఇలాంటి అనిశ్చితి పరిస్థితిని డీల్ చేయడం అటు శారీరంగానూ, ఇటు మానసికంగానూ చాలా కష్టం. అందుకే కరోనా మహమ్మారిని అసలు జోక్‌గా తీసుకోవద్దు. దీని పట్ల జాగ్రత్తగా ఉందాం. మాస్క్‌లు ధరించడం, చేతులు శుభ్రంగా కడుక్కోడం ద్వారా మిమ్మల్ని మీ వాళ్లను కాపాడుకోండి. మన కుటుంబాన్ని రక్షించుకునేందుకు మనం చేయగలిగినదంతా చేయాలి. కలిసికట్టుగా ఈ యుద్ధం చేస్తున్నామంటూ సానియా పేర్కొన్నారు. View this post on Instagram A post shared by Sania Mirza (@mirzasaniar) -
సానియా మీర్జా ఫాంహౌస్ ఇంచార్జీ అరెస్ట్
-
వాడే నా జీవితం : సానియా
తల్లి కావడం గొప్ప వరం. ప్రతి మహిళ కూడా ‘అమ్మ’ పిలుపును అత్యుత్తమ గౌరవంగా భావిస్తుంది. బిడ్డను ఆడిస్తూ, పాడించాలని కోరుకుంటుంది. పార్కుల్లోకి తీసుకెళ్లి ప్రకృతిని పరిచయం చేయాలని ఆశపడుతుంది. కానీ కరోనా పుణ్యమా అని ఇప్పుడవన్నీ నాశనం అయ్యాయి. ఈ మహమ్మారి పిల్లల ఆహ్లాదకరమైన పనులన్నీ నాశనం చేసింది. పిల్లలకు స్కూళ్లుల్లేవు, బయటకు తీసుకెళ్దామంటే కరోనా భయం.ఇంట్లో ఉండే పిల్లలు నాలుగు గోడలమధ్యే ఉండాల్సిన పరిస్థితి. ఈ మహమ్మారి తల్లుల జీవితాలను చాలా కష్టతరం చేసింది. ఎందుకంటే చిన్న పిల్లలను జాగ్రత్తగా చూసుకోవటానికి వారికి కష్టమైన పని. చిన్న పిల్లలను ఆడించడం, చురుకుగా ఉంచాలంటే మాములు విషయం కాదు. కానీ ప్రతి తల్లి తన పిల్లలను ఇంట్లో వినోదభరితంగా మార్చడానికి ప్రయత్నిస్తుంది. దీనికి భారత స్టార్ టెన్నిస్ ప్లేయర్ సానియా మీర్జా అతీతం కాదు. కరోనా సమయంలో సానియా మీర్జా తన కొడుకు ఇజాన్ మీర్జా మాలిక్‌తో ఎక్కువ సమయం గడుపుతోంది. ఆమె అటు టెన్నిస్ ప్రాక్టీస్‌ను, ఇటు కొడుకు ఆలనా పాలనను సమతుల్యం చేసుకుంటూ ముందుకు సాగుతున్నారు.(చదవండి : బాబాయ్ ఫోర్ కొడితే.. బాబా సిక్సర్ బాదుతాడు) బిడ్డ పుట్టిన నాలుగు నెలలకే గ్రౌండ్లోకి అడుగుపెట్టిన సానియా.. కరోనా నేపథ్యంలో ఇంటికే పరిమితమయ్యారు. ఓ వైపు టెన్నిస్ ప్రాక్టీస్ చేస్తూనే.. తన లిటిల్ హీరో ఇజాన్ మీర్జా మాలిక్‌తో ‘అమ్మ’తనాన్ని ఆస్వాదిస్తున్నారు. కొడుకును గ్రౌండ్‌కు తీసుకెళ్లి స్వేచ్ఛగా తిప్పుతోంది. బుడ్డోడు చేసే చిలిపి పనులు చూసి మురిసిపోతుంది. ఆ ఫోటోలు సోషల్ మీడియాలో పోస్ట్ చేస్తూ తన ఆనందాన్ని పంచుకుంటుంది. ‘వాడే నా జీవితం.. నాలో భాగం నా లిటిల్ హీరో’ అంటూ సానియా మురిసిపోతుంది. తల్లి అయిన తర్వాత తన జీవితమే మారిపోతుందని చెబుతోంది. ఒక తల్లిగా నా కుమారుడిని ఆలనా, పాలన చూసూకోవడం తన బాధ్యత అంటుంది. ‘ఇది నాకు తెలిసిన అత్యంత నిస్వార్థమైన ప్రేమ, ఇది పొందుతున్న అద్భుతమైన అనుభూతి’ అంటూ సానియా తన కుమారుడి ఫోటోలను సోషల్ మీడియాలో పంచుకుంది.అక్టోబర్ 30, 2018న సానియా ఇజాన్ మీర్జా మాలిక్‌కు జన్మనిచ్చిన విషయం తెలిసిందే. -
ఎల్బీ స్టేడియం కోర్టులను ఇవ్వండి!
సాక్షి, హైదరాబాద్: భారత స్టార్ టెన్నిస్ క్రీడాకారిణి, ఆరు గ్రాండ్‌స్లామ్‌ల విజేత సానియా మీర్జా టెన్నిస్‌లో శిక్షణ ఇచ్చేందుకు ప్రభుత్వంతో కలిసి పని చేయాలని భావిస్తోంది. దీనికి సంబంధించి ఆమె సోమవారం తెలంగాణ రాష్ట్ర క్రీడా శాఖ మంత్రి వి.శ్రీనివాస్ గౌడ్‌ను కలిసింది. స్పోర్ట్స్ అథారిటీ ఆఫ్ తెలంగాణ (శాట్స్) ఆధీనంలోని టెన్నిస్ కాంప్లెక్స్‌ను ఇందు కోసం కేటాయించాలని ఆమె ప్రత్యేకంగా విజ్ఞప్తి చేసింది. సానియా మీర్జా అకాడమీ, రాష్ట్ర ప్రభుత్వ సంయుక్త భాగస్వామ్యంతో కోచింగ్ ఇచ్చేలా ప్రణాళిక రూపొందిస్తానని సానియా చెప్పింది. మరో వైపు తన మొయినాబాద్‌లోని తన సొంత అకాడమీని అవసరమైతే ప్రభుత్వం జిల్లాలనుంచి టెన్నిస్ క్రీడాకారులకు శిక్షణ, వసతి కోసం వినియోగించుకోవచ్చని కూడా పేర్కొంది. జిల్లాకు 15–20 మందిని ఎంపిక చేసి వారికి విదేశీ కోచ్‌ల ద్వారా శిక్షణ ఇప్పించే ఏర్పాట్లు చేస్తానని కూడా ఆమె హామీ ఇచ్చింది. సానియా అభ్యర్థనను పరిశీలిస్తామని, త్వరలో జరిగే కేబినెట్ సబ్ కమిటీలో చర్చించి నిర్ణయం తీసుకుంటామని మంత్రి స్పష్టం చేశారు. -
బాబాయ్ ఫోర్ కొడితే.. బాబా సిక్సర్ బాదుతాడు
లాక్డౌన్లో భాగంగా పలువురు క్రీడా ప్రముఖులు ఇంటికే పరిమితమైనప్పటికీ సోషల్ మీడియా వేదికగా తమ అభిమానులకు చేరువవుతున్నారు. సోషల్ మీడియాలో యాక్టివ్‌గా ఉండే సానియా మీర్జా తన వ్యక్తిగత, వృత్తిగత విషయాలకు సంబంధించిన ఫొటోలు, వీడియోలను అభిమానులతో పంచుకుంటున్నారు. అయితే తాజాగా సానియా తన కుమారుడు ఇజాన్ మీర్జా మాలిక్‌తో కలిసి సరదాగా చేసిన ఓ సంభాషణకు సంబంధించిన వీడియోను తన ఇన్స్టాగ్రామ్ ఖాతాలో పోస్ట్ చేశారు. ఈ వీడియోకు ‘బాబాయ్ (అసద్) 4 బౌండరీ కొడితే.. బాబా (షోయబ్ మాలిక్) సిక్సర్ కొడతారు’ అని సానియా కామెంట్ జతచేశారు. (‘ఆ పది మంది’ లేకుండా...) ఇక ఈ సంభాషణలో.. సానియా తన కుమారుడితో మాట్లాడుతూ.. కుక్క ఎలా అరుస్తుంది బేబీ అని అడిగితే.. చిన్నారి ఇజాన్ బౌబౌ అంటూ డాగ్‌లా అనుకరిస్తూ సమాధానం ఇస్తాడు. ఇక అసద్ బాబాయ్ (అసద్) ఏం చేస్తారని అడుగుతూనే.. అసద్ ఫోర్ కొడతారని బదులు ఇస్తారు సానియా. అదే విధంగా బాబా (మాలిక్) ఏం చేస్తారని అడుగుతూ.. బాబా సిక్సర్ బాదుతారని తన కూమారుడితో సానియా సరదాగా సంభాషిస్తారు. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. నెటిజన్లతో పాటు పలువురు క్రీడా ప్రముఖలు లైక్ చేస్తున్నారు. ఈ వీడియోను సోషల్ మీడియాలో ఇప్పటికే 1.7 లక్షల మంది లైక్ చేశారు. అక్టోబర్ 30, 2018న సానియా ఇజాన్ మీర్జా మాలిక్‌కు జన్మనిచ్చిన విషయం తెలిసిందే. View this post on Instagram Asad khaalu hits a 4 but Baba hits a 6 😏 he might be a bit biased 💕 🤣@izhaan.mirzamalik #Myizzy A post shared by Sania Mirza (@mirzasaniar) on Jun 27, 2020 at 11:34pm PDT -
సానియాతో పెళ్లి.. మాలిక్ ఏమన్నాడంటే
హైదరాబాద్: అభిమానుల నుంచి ఎంతో వ్యతిరేకత, ఎన్నో వివాదాల సమక్ష్యంలోనే భారత టెన్నిస్ స్టార్ సానియా మీర్జాను పాకిస్తాన్ స్టార్ క్రికెటర్ షోయబ్ మాలిక్ ఏప్రిల్ 12, 2008న వివాహం చేసుకున్నాడు. వీరికి 2018లో ఇజ్జాన్ జన్మించిన విషయం తెలిసిందే. అయితే భారత్ పాకిస్తాన్ల మధ్య ఎలాంటి గొడవలు జరిగినా, క్రికెట్ మ్యాచ్ జరిగినా ఈ జంటను టార్గెట్ చేయడం కొంతమంది నెటిజన్లకు సాధారణంగా మారింది. అయితే తమ పెళ్లై ఏళ్లు గడుస్తున్నప్పటికీ సానియాను తాను పెళ్లి చేసుకోవడంపై వస్తున్న అనేక వార్తలపై మాలిక్ తాజాగా స్పందిస్తూ అసక్తికర వ్యాఖ్యలు చేశాడు. (పీసీబీ పర్మిషన్.. భారత్‌కు షోయబ్!) ‘మీరు ప్రేమించిన వ్యక్తిని వివాహం చేసుకోవాలనుకున్నప్పుడు.. వారు ఎక్కడి నుంచి వచ్చారు, ఏ దేశం, రెండు దేశాల మధ్య ఏం జరుగుతుంది, రాజకీయ పరిస్థితులు ఎలా ఉన్నాయనే విషయాలను పట్టించుకోకూడదు. పట్టించుకోవాల్సిన అవసరం కూడా లేదు. ఒకరికొకరు నచ్చామా? అర్థం చేసుకున్నామా? ఇరు కుటుంబాలు ఒప్పుకున్నాయా? అనే విషయాల గురించి ఆలోచించాలి. భారత్‌లో నాకు చాలా మంది మంచి స్నేహితులు ఉన్నారు. ప్రస్తుతం రెండు దేశాల మధ్య ఉన్న పరిస్థితుల గురించి ఆందోళన గాని బాధ గాని పడటం లేదు. ఎందుకుంటే నేను క్రికెటర్‌ను రాజకీయ నాయకుడిని కాదు’ అంటూ మాలిక్ పేర్కొన్నాడు. (మొర్తజాకు కరోనా పాజిటివ్) దాదాపు ఐదు నెలల తర్వాత భార్యాబిడ్డ దగ్గరికి కరోనా లాక్డౌన్ కారణంగా మాలిక్ పాకిస్తాన్లో ఉండిపోగా సానియా, ఇజ్జాన్‌లు హైదరాబాద్‌లో ఉన్నారు. దీంతో గత ఐదు నెలలుగా భార్య, బిడ్డలకు మాలిక్ దూరమయ్యాడు. ఈనేపథ్యంలో రాబోయే ఇంగ్లాండ్ సిరీస్‌కు షోయబ్‌ను పాకిస్తాన్ క్రికెట్ సెలక్షన్ కమిటీ ఎంపిక చేసింది. దీంతో మళ్లీ కుటుంబాన్ని కలుసుకోలేనేమోనని బాధపడిన షోయబ్ పీసీబీకి ఓ విజ్ఞప్తి చేశాడు. జట్టుతో ఆలస్యంగా చేరతానని, కొన్ని రోజులు కుటుంబంతో గడిపి వవస్తానని బోర్డును కోరాడు. దీనికి పీసీబీ కూడా అంగీకరించింది. దీంతో ఎట్టకేలకు షోయబ్ తన భార్య, బిడ్డను కలుసుకోనున్నాడు. (‘ఆ విషయంలో జడేజాను మించినోడు లేడు’) -
పీసీబీ పర్మిషన్.. భారత్‌కు షోయబ్!
ఇస్లామాబాద్: కరోనా లాక్డౌన్ కారణంగా కుటుంబానికి దూరమైన షోయబ్ మాలిక్ విన్నపాన్ని పాకిస్తాన్ క్రికెట్ బోర్డు మన్నించింది. ఇంగ్లండ్ పర్యటనకు ముందు హైదరాబాద్‌లో చిక్కుకుపోయిన భార్య, పిల్లలతో గడిపేందుకు ప్రత్యేక అనుమతినిచ్చింది. మానవతా కోణంలోనే ఈ వెసులుబాటు కల్పించినట్టు పీసీబీ చైర్మన్ వసీం ఖాన్ పేర్కొన్నారు. కాగా, ఐదు నెలల క్రితం భారత్‌కు వచ్చిన సానియా మీర్జా లాక్డౌన్ విధించడంతో ఇక్కడే చిక్కుకుపోయారు. ఎప్పుడూ బిజీబిజీగా గడిపే తాము లాక్డౌన్ వేళలో కూడా ఒకే దగ్గర ఉండలేక పోయినందుకు ఆమె తీవ్ర విచారం వ్యక్తం చేశారు. (చదవండి: అప్పుడే నా మనసు ఆనందంగా ఉంటుంది: సానియా) బయో సెక్యూర్‌గా మ్యాచ్‌లు ఆగస్టు-సెప్టెంబర్‌లో ఇంగ్లండ్-పాక్ మధ్య మూడు టెస్టులు, మూడు టీ20 మ్యాచ్‌లతో సిరీస్‌లు జరుగనున్నాయి. ఇందుకోసం 28 మంది ఆటగాళ్లతో పాకిస్తాన్ క్రికెట్ టీమ్ జూన్ 28న ఇంగ్లండ్ బయల్దేరనుంది. కోవిడ్ నేపథ్యంలో ఈ మ్యాచ్‌లన్నీ బయో సెక్యూర్ వాతావరణంలో నిర్వహించేందుకు ఏర్పాట్లు చేసినట్టు పీసీబీ తెలిపింది. పాక్ ఆటగాళ్లు 14 రోజుల క్వారంటైన్ పూర్తి చేసుకున్న తర్వాత మ్యాచ్‌లు ప్రారంభమవుతాయి. ఇక జూలై 24న షోయబ్ జట్టుతో కలుస్తాడని పీసీబీ ఓ ప్రకటనలో తెలిపింది. కాగా, 38 ఏళ్ల షోయబ్ టెస్టు, వన్డే ఫార్మాట్ల నుంచి రిటైర్ అయిన సంగతి తెలిసిందే. టీ20లో మాత్రమే అతడు కొనసాగుతున్నాడు. (చదవండి: వీడియో షేర్ చేసిన హర్భజన్.. షాకిస్తున్న ఫ్యాన్స్!) -
సానియా, ప్రాంజలకు ఐటీఎఫ్ ఆర్థిక సాయం
న్యూఢిల్లీ: కరోనా నేపథ్యంలో సింగిల్స్, డబుల్స్ విభాగాల్లో తక్కువ ర్యాంకుల్లో ఉన్న టెన్నిస్ క్రీడాకారులకు ఆర్థిక సహాయం అందజేయనున్నట్లు అంతర్జాతీయ టెన్నిస్ సమాఖ్య (ఐటీఎఫ్) ప్రకటించింది. జాతీయ క్రీడా సమాఖ్యల ద్వారా అర్హులైన ఆటగాళ్లకు ఈ సహాయ నిధిని అందిస్తామని చెప్పింది. సింగిల్స్‌లో 500–700 మధ్య... డబుల్స్‌లో 175–300 మధ్య ర్యాంక్ ఉన్న ఆటగాళ్లను అర్హులుగా పేర్కొంది. ‘ఇదేం పెద్ద మొత్తం కాదు. ఒక్కో ఆటగాడికి 2000 డాలర్లు (రూ.1,51,100) లభించవచ్చు. జాతీయ సమాఖ్యలు అర్హులైన క్రీడాకారులను ఎంపిక చేసి వారికి అందజేస్తాయి’ అని ఐటీఎఫ్ ప్రకటించింది. దీని ప్రకారం 12 మంది భారత క్రీడాకారులు ఈ సహాయం పొందే వీలుంది. పురుషుల సింగిల్స్‌లో మనీశ్ కుమార్ (642 ర్యాంక్), అర్జున్ ఖడే (655)...డబుల్స్‌లో సాకేత్ మైనేని (180), విష్ణువర్ధన్ (199), అర్జున్ ఖడే (231), విజయ్ సుందర్ ప్రశాంత్ (300)... మహిళల సింగిల్స్‌లో కర్మన్‌కౌర్ (606), సౌజన్య భవిశెట్టి (613), జీల్ దేశాయ్ (650), ప్రాంజల యడ్లపల్లి (664)... డబుల్స్‌లో రుతుజా భోస్లే (196), సానియా మీర్జా (226) ఈ సహాయం అందుకోనున్నారు. తక్కువ ర్యాంకుల్లో ఉన్న 800 మంది క్రీడాకారుల్ని ఆదుకునేందుకు ఏటీపీ, డబ్ల్యూటీఏ, గ్రాండ్‌స్లామ్ టోర్నీ ఆతిథ్య దేశాలు, అగ్రశ్రేణి క్రీడాకారులు కలిసి 60 లక్షల డాలర్ల (రూ. 45 కోట్లు) సహాయనిధిని ఏర్పాటు చేశాయి. -
తెల్లని కుర్తాలో మెరిసిన సానియా
సోషల్ మీడియాలో యాక్టివ్‌గా ఉండే టెన్నిస్ స్టార్ సానియా మీర్జా తన వ్యక్తిగత , వృత్తిగత విషయాలకు సంబంధించిన ఫొటోలు, వీడియోలను షేర్ చేసి అభిమానులను అలరిస్తారు. రంజాన్ పర్వదినం సందర్భంగా ఆమె తన కుమారుడు ఇజాన్ మీర్జా మాలిక్‌తో దిగిన ఓ ఫొటోను ట్విటర్లో పోస్ట్ చేశారు. ‘రంజాన్ ఈద్ పండగ వేడుకలు’ అంటూ ఆమె క్యాప్షన్ జత చేశారు. కరోనా నేపథ్యంలో రంజాన్ పండుగను సానియా ఇంట్లోనే జరుపుకున్నారు. ఇక ముస్లిం సాంప్రదాయ వేషాధారణలో తెల్లని కుర్తాను ధరించిన సానియా.. ‘చాలా అందంగా కనిపిస్తున్నారు’అని అభిమానులు కామెంట్ చేస్తున్నారు. సానియా ముద్దుల కొడుకు ఇజాన్స్ కూడా సంప్రదాయ దుస్తుల్లో క్యూట్‌గా ఉన్నాడు. ‘లాక్డౌన్ సమయంలో నేను మా కుంటుంబ సభ్యులతో ఇంట్లోనే ఉంటూ రంజాన్ పండగ జరుపుకుంటున్నాను. దయ చేసి మీరు కూడా ఇంట్లోనే ఉండాలి’ అని సానియా మరో ట్వీట్లో అభిమానులకు విజ్ఞప్తి చేశారు. Eid vibes 🌙🤲🏽 #MyIzzy pic.twitter.com/O9BmeUBjql — Sania Mirza (@MirzaSania) May 25, 2020