భర్తతో విడిపోతే ప్రపంచం అంతమైపోయినట్లా! సానియా మరో పెళ్లి చేసుకోవాలి! | Pakistan Actor Nabeel Zafar Advice Indian Tennis Star Sania Mirza To Remarry | Sakshi
Sakshi News home page

సానియా మీర్జా రెండో పెళ్లి చేసుకోవాలి.. నటుడి సలహా

Published Sat, May 18 2024 7:32 PM | Last Updated on Sat, May 18 2024 7:46 PM

Actor Nabeel Zafar Advice Indian Tennis Star Sania Mirza To Remarry

విడాకులు తీసుకుంటే మళ్లీ పెళ్లి చేసుకోవాలా..? చేసుకోవాల్సిందే అంటున్నాడు పాకిస్తాన్‌ నటుడు నబీల్‌ జాఫర్‌. 'మైండ్‌ నా కర్నా విత్‌ అహ్మద్‌ అలీ బట్‌' అనే టాక్‌ షోకు హాజరైన అతడు విడాకుల తర్వాత జీవితం చీకటిమయం కాకూడదంటున్నాడు. జాఫర్‌ మాట్లాడుతూ.. ఏ మహిళ అయినా విడాకులు తీసుకోవడమనేది దురదృష్టకరం. కానీ భర్తతో విడిపోగానే ప్రపంచమే అంతమైపోయినట్లు చింతించకూడదు. జీవిత భాగస్వామిని వెతుక్కోవాలి.. మరో పెళ్లి చేసుకోవాలి. సానియా మీర్జాకు కూడా మంచి పార్ట్‌నర్‌ దొరికితే రెండో పెళ్లి చేసుకోవాలి అని చెప్పుకొచ్చాడు.

ప్రేమించి పెళ్లి చేసుకుంటే..
కాగా భారత టెన్నిస్‌ దిగ్గజం సానియా మీర్జా.. పాకిస్తాన్‌ క్రికెటర్‌ షోయబ్‌ మాలిక్‌ ప్రేమించుకున్నారు. ప్రేమకు సరిహద్దులు అడ్డు కాదంటూ 2010లో పెళ్లి చేసుకున్నారు. వీరి ప్రేమకు గుర్తుగా 2018లో కుమారుడు ఇజహాన్‌ జన్మించాడు. ఈ ఏడాది ప్రారంభంలో వీరి బంధానికి విడాకుల కార్డు పడింది. షోయబ్‌.. పాక్‌ నటి సనా జావెద్‌ను పెళ్లి చేసుకోవడంతో సానియాతో విడాకుల విషయం ఆలస్యంగా, అధికారికంగా తెలిసొచ్చింది. 

అతడికి మూడోది.. ఆమెకు రెండోది
షోయబ్‌కు ఇది మూడో పెళ్లి. హైదరాబాదీ అమ్మాయి ఆయేషా సిద్ధిఖికి తలాక్‌ ఇచ్చాకే సానియాను పెళ్లి చేసుకున్నాడు. పద్నాలుగేళ్ల బంధాన్ని తెంచుకుని పాక్‌ నటి సనా జావెద్‌ను మూడో పెళ్లి చేసుకున్నాడు. ఆమెకు గతంలో పాక్‌ గాయకుడు ఉమైర్‌ జైస్వాల్‌తో పెళ్లి జరగ్గా వీరిద్దరూ గతేడాది విడిపోయారు. ఈ ఏడాది ప్రారంభంలో షోయబ్‌ను రెండోసారి మనువాడింది.

చదవండి: ఫోన్లు చేసి రావాలనేవారు.. భయంతో నేనసలు వెళ్లేదాన్నే కాదు!: హీరామండి నటి

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement