TV actor
-
మమ్మల్ని వదిలేయండి.. చెత్త కామెంట్లు పెట్టొద్దు.. విడాకులపై నటి క్లారిటీ
మనవళ్లతో ఆడుకునే సమయంలో పెళ్లి చేసుకోవడమేంటో.. ఇంతకీ కలిసున్నారా? మొదటి పెళ్లిలాగే ఇది కూడా ముక్కలైందా? అంటూ మలయాళ నటుడు క్రిస్ వేణుగోపాల్ (Kris Venugopal)పై బోలెడన్ని విమర్శలు వచ్చాయి. అతడు మూడుముళ్లు వేసిన నటి దివ్య శ్రీధర్ (Divya Sreedhar)పైనా ట్రోలింగ్ జరిగింది. ఆస్తి కోసమే ఈ పెళ్లి చేసుకుంది కాబోలంటూ పలువురూ ఆమెను తిట్టిపోశారు. ఆ విమర్శలను తిప్పికొడుతూ ఇద్దరూ కొత్త జీవితం ప్రారంభించారు. ఎవరి జీవితాల్లోకి తొంగి చూడట్లేదుగతేడాది నవంబర్‌లో వేదమంత్రాల సాక్షిగా ఒక్కటయ్యారు. మొన్నటిదాకా ముసలాడికి పెళ్లేంటన్న జనాలు ఇప్పుడు ఇద్దరూ విడిపోయారంటూ ప్రచారం మొదలుపెట్టారు. తాజాగా ఈ రూమర్లపై దివ్య శ్రీధర్ స్పందించింది. ఓ వీడియో రిలీజ్ చేసింది. 'మేము ఎవరి జీవితాల్లోకి తొంగిచూడట్లేదు. ఎవరికీ ఏ హానీ తలపెట్టలేదు. మరెందుకు మా జీవితాల గురించి ఇష్టారీతిన రాస్తున్నారు. ఎవరికి నచ్చినట్లు వారు ఏవేవో కథలు అల్లేసుకుంటున్నారు. విడాకులు తీసుకుంటున్నట్లు ప్రచారం..మా జంట మీకు నచ్చకపోతే మమ్మల్ని వదిలేయండి. చెత్త కామెంట్లు మాత్రం పెట్టకండి. మమ్మల్ని ప్రేమిస్తున్నవారందరికీ థాంక్యూ. ఇప్పుడీ వీడియో చేయడానికి ప్రధాన కారణం.. నా భర్త నాకోసం లిప్‌స్టిక్, చాక్లెట్స్ వంటి కొన్ని బహుమతులు పంపించాడు. ప్రేమికుల రోజు ఈ వారంలోనే వస్తుండటంతో మా ఆయన ఎన్నో బహుమతులిస్తున్నాడు. అవన్నీ మీకు చూపించాలని, నా సంతోషాన్ని మీతో పంచుకోవాలని అనుకున్నాను. కానీ మేము విడాకులు తీసుకుంటున్నట్లు ప్రచారం మొదలుపెట్టారు.బహుమతులు చూపించాలనుకున్నా..అది చూసి చాలా బాధేసింది. మేము కలిసే ఉన్నాం.. నా జీవితంలో ఇంత ప్రేమ నేనెప్పుడూ పొందలేదు. చాలా సంతోషంగా ఉంది. ఇలాంటి జ్ఞాపకాలు కూడబెట్టుకుంటున్నప్పుడు అన్నింటినీ మైమరిచిపోతున్నాను' అని చెప్పుకొచ్చింది. క్రిస్ వేణుగోపాల్, దివ్య శ్రీధర్ పాతరమట్టు సీరియల్లో కలిసి నటించారు. గతేడాది ఇద్దరూ రెండో పెళ్లి చేసుకున్నారు. పలు సీరియల్స్‌లో యాక్ట్ చేసిన వేణుగోపాల్ పల్లు రైజింగ్, తెలివు, సంబవస్తలతు నిన్నుమ్ వంటి చిత్రాల్లోనూ నటించాడు. దివ్య శ్రీధర్ సీరియల్స్‌లో విలనిజం పండించే పాత్రలు పోషిస్తూ ఉంటుంది. View this post on Instagram A post shared by Divya Sreedhar (@divyasreedhar24) చదవండి: చరణ్‌కు ఆడపిల్ల పుడుతుందేమోనని భయంగా ఉంది: చిరంజీవి -
ప్రముఖ బుల్లితెర నటి ఇంటి కిచెన్ లో ప్రమాదం
బుల్లితెర జంట ఇంద్రనీల్ (Indraneil)-మేఘన (Meghana)కు పెద్ద ప్రమాదమే తప్పింది. వారి ఇంట్లో గ్యాస్‌స్టవ్ పేలింది. ఆ ఘటన జరిగిన సమయంలో కిచెన్‌లో ఎవరూ లేకపోవడంతో పెద్ద ప్రమాదం తప్పిందని ఇద్దరూ ఊపిరి పీల్చుకున్నారు. ఈ పేలుడు గురించి మేఘన మాట్లాడుతూ.. నేను స్టవ్‌పై ఒక ఆమ్లెట్ వేసుకుని హాల్లో కూర్చున్నాను. ఇంతలో సడన్‌గా కరెంట్ రావడంతో టప్మని ఏదో బ్లాస్ట్ అయినట్లు శబ్ధం వచ్చింది. నా కళ్ల ముందే..ఏసీ పేలిందేమోనని అన్ని గదుల్లోకి వెళ్లి చూశా.. ఎక్కడా ఏం కనిపించలేదు. కిచెన్‌కు వచ్చేసరికి గ్లాస్ స్టవ్ నా కళ్లముందే ఇంకా పగులుతోంది. మూడేళ్లకిందటే ఈ స్టవ్ తీసుకున్నాను. అంతలోనే ఇలా జరిగింది. నా ఒక్కరికే కాదు చాలామందికి ఇలాంటి సమస్య ఎదురైంది. ఒకరింట్లోనైతే వారి తల్లి వంట చేస్తుండగా ఆ స్టవ్ పేలి ఆ గాజుముక్కలు తన ముఖానికి గుచ్చుకున్నాయంట! ఇంద్రనీల్- మేఘన ఇంట్లో పేలిన గ్యాస్‌స్టవ్ ఫోటోలనా కెరీర్ ఏం కావాలి?నేను ఆర్టిస్ట్‌ను. స్టవ్ పేలేసమయంలో నేనూ అక్కడే ఉండుంటే ఆ ముక్కలు నా ముఖానికి గుచ్చుకుంటే నా పరిస్థితేంటి? నా కెరీర్ ఏం కావాలి? ఇది చిన్న ప్రమాదం కాదు. దీనిపై కచ్చితంగా కోర్టుకెళ్తాం. గ్లాస్ స్టవ్ వాడాలంటేనే భయంగా ఉంది. అందుకే ఇకపై స్టీల్ స్టవ్ వాడతాను. దయచేసి వంటింట్లో అందరూ జాగ్రత్తగా ఉండండి అని మేఘన సూచించింది. కాగా వీరిద్దరూ చక్రవాకం సీరియల్లో నటించారు.చదవండి: ఆ విషయంలో ప్రభాస్ గ్రేట్.. తనను చూసి నేర్చుకోవాలి: పృథ్వీరాజ్ -
19 రోజులుగా తిండీనీరు మానేసిన నటుడు.. పరిస్థితి విషమం
బుల్లితెర నటుడు గురుచరణ్ సింగ్ (Gurucharan Singh) తీవ్ర ఉపవాసంతో ప్రాణాల మీదకు తెచ్చుకున్నాడు. 19 రోజులుగా ఏమీ తినకుండా, కనీసం మంచినీళ్లు కూడా తాగకుండా ఉంటున్న అతడు అపస్మారక స్థితిలోకి వెళ్లిపోయాడు. దీంతో అతడిని ఆస్పత్రిలో చేర్పించారు. వైద్యుల చికిత్స అనంతరం స్పృహలోకి వచ్చాడు కానీ పూర్తిగా కోలుకోలేదు. ఇటీవల ఆస్పత్రి బెడ్‌పై ఉన్న వీడియోను నటుడు సోషల్ మీడియాలో షేర్ చేశాడు. అయితే ప్రస్తుతం అతడి పరిస్థితి విషమంగా ఉందని తెలుస్తోంది.కొద్దిరోజులు మిస్సింగ్.. తర్వాత!దీని గురించి గురుచరణ్ స్నేహితురాలు భక్తి సోని మాట్లాడుతూ.. గురుచరణ్ కొన్నిరోజులపాటు కనిపించకుండా పోయాడు. అయితే ఇంటికి తిరిగి వచ్చినప్పటినుంచి అతడి ప్రవర్తలో చాలా మార్పు వచ్చింది. అంతేకాకుండా చాలావరకు ఆహారాన్ని తీసుకోవడమే తగ్గించేశాడు. కేవలం ద్రవాహారమే సేవించాడు. కొంతకాలానికి అది కూడా మానేశాడు. ఆఖరికి నీళ్లు తాగడం కూడా ఆపేశాడు. 19 రోజులుగా పిడికెడంత అన్నం, గ్లాసు మంచినీళ్లు కూడా ముట్టుకోలేదు.గేమ్ ఛేంజర్ సినిమా రివ్యూ కోసం ఇక్కడ క్లిక్ చేయండిడాక్టర్ల మాట కూడా వినడం లేదుదీనివల్ల అతడి శరీరం బలహీనమైపోయింది. అపస్మారక స్థితిలోకి వెళ్లిపోయాడు. అలాగే ఇండస్ట్రీలో అతడి పనికి తగ్గ గుర్తింపు రాకపోవడంతో కలత చెందాడు. అందుకే మరో మార్గాన్ని ఎంచుకున్నాడు. నీరు, తిండి త్యాగం చేశాడు. వైద్యుల చికిత్సతో స్పృహలోకి వచ్చాడు. కానీ తన పరిస్థితి ఆందోళనగానే ఉంది. డాక్టర్లు చెప్పే మాటలు వినిపించుకోవడం లేదు. ఇప్పటికీ ఏవీ తినను, తాగను అని మొండికేస్తున్నాడు. అందరూ తనను ఒప్పించడానికి ప్రయత్నిస్తున్నారు కానీ ఆయన ఎవరి మాటా లెక్క చేయడం లేదు.సన్యాసం తీసుకోవాలనుకున్నాడునిజానికి ఆ మధ్య అతడు కనిపించకుండా పోయాడు కదా.. అప్పుడు గురుచరణ్ సన్యాసం తీసుకోవాలని హిమాలయాలకు వెళ్లాలనుకున్నాడు. కానీ ఎవరో గురువు నుంచి ఫోన్ కాల్ రావడంతో వెనక్కు వచ్చేశాడు. అప్పటినుంచి ఆ గురువు మార్గంలోనే వెళ్తున్నాడు. మునుపటిలా సాధారణ జీవనం గడిపేందుకు అస్సలు ఇష్టపడటం లేదు అని సోని చెప్పుకొచ్చింది.ఏం జరిగిందంటే?బుల్లితెర నటుడు గురుచరణ్ సింగ్ గతేడాది ఏప్రిల్‌లో ఉన్నట్లుండి కనిపించకుండా పోయాడు. ఏప్రిల్ 22న ముంబైకి వెళ్లాల్సిన అతడు అక్కడికీ వెళ్లలేదు, అటు ఇంటికీ తిరిగి రాలేదు. నాలుగురోజులపాటు అతడి కోసం ఎదురుచూసిన తల్లిదండ్రులు చివరకు పోలీసులను ఆశ్రయించారు. నటుడి కోసం అటు కుటుంబ సభ్యులు, ఇటు పోలీసులు గాలింపు చేపడుతూ ఉండగా సడన్‌గా ఓ రోజు (మే 18న) రాత్రి గురుచరణ్ ఇంటికి వచ్చాడు. ఆధ్యాత్మిక బాటలో పయనించాలనే ఇల్లు వదిలి వెళ్లిపోయానని, కానీ సాధారణ జీవితం గడపమని దేవుడు సంకేతాలివ్వడంతో తిరిగి వచ్చానని ఓ ఇంటర్వ్యూలో చెప్పాడు. కానీ సాధారణ జీవితం గడిపేందుక అతడు ఏమాత్రం ఇష్టపడటం లేదని తెలుస్తోంది. ఇతడు తారక్ మెహతాకా ఉల్టా చష్మా (Taarak Mehta Ka Ooltah Chashmah) సీరియల్‌తో పేరు తెచ్చుకున్నాడు.చదవండి: గేమ్ ఛేంజర్‌పై ప్రేక్షకుల రివ్యూ.. సినిమా మధ్యలో వెళ్లిపోయామంటూ..! -
లైంగిక వేధింపులు.. కన్నడ నటుడు అరెస్ట్
ప్రముఖ కన్నడ బుల్లితెర నటుడు చరిత బాలప్పను పోలీసులు శుక్రవారం అరెస్టు చేశారు. లైంగికంగా వేధిస్తున్నాడంటూ నటి చేసిన ఆరోపణలతో అతడిని అదుపులోకి తీసుకున్నారు. ఫిర్యాదులో పేర్కొన్న వివరాల ప్రకారం.. 29 ఏళ్ల నటికి 2017లో బాలప్పతో పరిచయం ఏర్పడింది. పైకి మంచివాడిగా నటించిన బాలప్ప ఆమెను ప్రేమించాడు. నటి కూడా తిరిగి ప్రేమించాలని వెంటపడ్డాడు. బలవంతపెట్టాడు. అలా ఇద్దరూ శారీరకంగా కలుసుకున్నారు.బెదిరింపులుఅయితే తనకు డబ్బు కావాలని, అడిగినంత ఇవ్వకపోతే ప్రైవేట్ ఫోటోలు వాట్సాప్ గ్రూపుల్లో, సోషల్ మీడియాలో షేర్ చేస్తానని బెదిరించాడు. నటి ఒంటరిగా ఉంటోందని తెలుసుకుని ఆమె ఇంటికి వెళ్లి నానా రచ్చ చేశాడు. ఈ విషయాలను బయటపెడితే తనకున్న ధనబలంతో, రాజకీయ నాయకుల అండతో నటిపైనే కేసు పెట్టి జైలుకు పంపిస్తానని హెచ్చరించాడు. చంపడానికి కూడా వెనకాడనని బెదిరించాడు. దీంతో నటి పోలీసులను ఆశ్రయించింది. వారు బాలప్పను అరెస్ట్ చేసి విచారణ మొదలుపెట్టారు. కాగా సదరు నటికి ఇదివరకే విడాకులవగా ఒంటరిగా నివసిస్తోంది.చదవండి: Pushpa 2: దమ్ముంటే పట్టుకోరా వీడియో సాంగ్ రిలీజ్ -
కొరియోగ్రాఫర్‌ను పెళ్లాడిన బుల్లితెర నటుడు
ప్రస్తుతం సినీ ఇండస్ట్రీలో పెళ్లిళ్ల సీజన్ నడుస్తోంది. తాజాగా మరో నటుడు ఓ ఇంటివాడయ్యారు. బాలీవుడ్లో ఫేమస్ సీరియల్ నటుడు కిన్షుక్ వైద్య పెళ్లిబంధంలోకి అడుగుపెట్టారు. హిందీలో కొరియోగ్రాఫర్‌గా రాణిస్తున్న దీక్షా నాగ్‌పాల్‌ను వివాహం చేసుకున్నాడు. దీనికి సంబంధించిన ఫోటోలను సోషల్ మీడియా ద్వారా పంచుకున్నారు.కాగా.. కిన్షుక్ వైద్య షక లక బూమ్ బూమ్ సీరియల్‌తో గుర్తింపు తెచ్చుకున్నాడు. వీరి వివాహా వేడుక అలీబాగ్‌లో జరిగింది. ఈ పెళ్లికి సన్నిహితులు, బుల్లితెర తారలు కూడా హాజరయ్యారు. మహారాష్ట్ర సంప్రదాయ వేడుకలో ఈ జంట వివాహం చేసుకున్నారు. ఈ ఏడాది ఆగస్టులో కిన్షుక్- దీక్షా ల నిశ్చితార్థం జరిగింది. దాదాపు మూడు నెలల తర్వాత వివాహాబంధంలోకి అడుగుపెట్టారు. ఈ విషయం తెలుసుకున్న ఫ్యాన్స్ నూతన వధూవరులకు అభినందనలు చెబుతున్నారు. అంతేకాకుండా కిన్షుక్ వైద్య రాధా కృష్ణ, వో తో హై అల్బేలా, కర్న్ సంగిని వంటి సీరియల్స్‌లోనూ కనిపించారు. View this post on Instagram A post shared by Diiksha Nagpal (@diikshanagpal) -
న్యూజర్నీ: దీపావళి వేళ నటి గృహప్రవేశ వేడుక (ఫొటోలు)
-
లేటు వయసులో పెళ్లి.. 'తండ్రి దొరికినందుకు పిల్లలు హ్యాపీ'
బుల్లితెర నటుడు క్రిస్ వేణుగోపాల్ పెళ్లి చేసుకున్నాడు. 49 ఏళ్ల వయసులో నటి దివ్య శ్రీధర్‌తో ఏడడుగులు వేశాడు. కేరళలోని గురువాయూర్‌లో మంగళవారం వీరి వివాహం జరిగింది. వీళ్లిద్దరూ పాతరమట్టు అనే సీరియల్లో కలిసి నటించారు.ఫస్ట్ ప్రపోజ్ ఎవరంటే?ఈ వివాహం గురించి నటి దివ్య మాట్లాడుతూ.. నాకు మొదట ప్రపోజ్ చేసింది అతడే.. పెళ్లి చేసుకోవాలనుందని చెప్పాడు. నాకేమీ అర్థం కాలేదు. తీరా.. అతడు నన్ను మాత్రమే పెళ్లి చేసుకోవాలనుకుంటున్నట్లు తెలిపాడు. అందుకు నన్ను ఒప్పించాడు కూడా! దీని గురించి నా కూతురు, కొడుక్కి చెప్తే వాళ్లు ఎంతగానో సంతోషించారు. తమకు తండ్రి దొరికాడని ఖుషీ అయ్యారు అని తెలిపింది.ఇద్దరూ నటులేకాగా క్రిస్ వేణుగోపాల్ సీరియల్స్‌తో పాటు సినిమాల్లోనూ యాక్ట్ చేస్తుంటాడు. దివ్య శ్రీధర్.. మలయాళ సీరియల్స్‌లో నెగెటివ్ షేడ్స్ ఉన్న పాత్రలతో అలరిస్తూ ఉంటుంది. -
తండ్రిగా ప్రమోషన్ పొందిన బిగ్‌బాస్ విన్నర్
బుల్లితెర జంట, బిగ్‌బాస్ ఫేమ్ ప్రిన్స్ నరుల- యువికా చౌదరి పేరెంట్స్‌గా ప్రమోషన్ పొందారు. యువికా శనివారం నాడు(అక్టోబర్ 19న) పండంటి బిడ్డకు జన్మనిచ్చింది. ఈ విషయాన్ని ప్రిన్స్ తండ్రి జోగిందర్ ధృవీకరించాడు.బిగ్‌బాస్ షోలో మొదలైన లవ్స్టోరీకాగా యువిక, ప్రిన్స్‌ల లవ్ స్టోరీ.. బిగ్‌బాస్ హౌస్‌లోనే మొదలైంది. 2015లో హిందీ బిగ్‌బాస్ తొమ్మిదో సీజన్లో వీరిద్దరూ పాల్గొన్నారు. మొదట స్నేహితులుగా ఉన్నారు. తర్వాత ప్రేమికులుగా మారారు. ప్రిన్స్ ఈ సీజన్ టైటిల్ కూడా ఎగరేసుకుపోయాడు. 2016లో ఎంగేజ్మెంట్ చేసుకున్నారు. రెండేళ్లు గ్యాప్ తీసుకున్నాక పెళ్లి చేసుకున్నారు. పెళ్లయిన ఆరేళ్లకు వీరు తల్లిదండ్రులు కాబోతున్నారు.ఐవీఎఫ్..తన ప్రెగ్నెన్సీ జర్నీ గురించి ఇటీవలే యువికా మాట్లాడుతూ.. ప్రిన్స్ కెరీర్ దృష్టిలో పెట్టుకుని పిల్లల గురించి ఆలోచించలేదు. కానీ ఒకానొక సమయంలో ఒక విషయం అర్థమైంది. వయసు పెరిగేకొద్దీ శరీరం అన్నింటికీ సహకరించదని తెలిసొచ్చింది. అప్పుడు ఇద్దరం చర్చించుకుని ఐవీఎఫ్‌కు వెళ్లాం అని చెప్పుకొచ్చింది.మరిన్ని బిగ్‌బాస్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి -
రావణుడిపై ప్రేమతో పచ్చబొట్టు వేయించుకున్న బుల్లితెర నటుడు
కొందరికి కొన్నిరకాల పాత్రలు పెద్దగా నప్పవు. అందులోనూ పౌరాణిక పాత్రలు అందరికీ అంతగా సెట్టవవు. కొద్దిమందికి మాత్రమే పర్ఫెక్ట్గా సూటవుతాయి. అందులో ఒకరే బుల్లితెర నటుడు నికితిన్ ధీర్. శ్రీమద్ రామాయణ్ సీరియల్లో ఇతడు రావణుడిగా ఆకట్టుకుంటున్నాడు. కేవలం పేపర్‌పై ఉన్న డైలాగులు బట్టీపట్టి చెప్పడం లేదు. ఆ పాత్రను అర్థం చేసుకున్నాడు. రావణుడిని లోతుగా చదివి అందులోకి పరకాయ ప్రవేశం చేశాడు.కుడికాలిపై టాటూశివభక్తుడిగా, రావణుడిగా అలరిస్తున్న నికితిన్ తాజాగా తన కుడికాలిపై పచ్చబొట్టు వేయించుకున్నాడు. ఎన్నో అనుభవాలకు నిలువుటద్దమే జీవితం. మనకు నిజమైన సంపద శరీరమే! పురాతన కాలం నుంచి సనాతన ప్రజలు పచ్చబొట్లను నమ్మేవారు. మనం చనిపోయాక కూడా అవి మనతోనే ఉన్నాయంటారు. టాటూ అనేది చెరగని ముద్రవంటిది.9 నెలలుగా..రావణుడి పాత్ర పోషించే అవకాశం ఇచ్చిన మహాదేవుడికి కృతజ్ఞతలు. 9 నెలలుగా ఈ పాత్రలో జీవిస్తూ తనను అర్థం చేసుకునే ప్రయత్నం చేస్తున్నాను. తనలాంటి(రావణుడి వంటి) రాజు మరొకరు ఉండరని తనకూ తెలుసు. తనలాంటి రాక్షసుడు ఇంకెవరూ లేరని కూడా తెలుసు. తనలాంటి నిష్ట బ్రాహ్మణుడు కూడా ఎవరూ ఉండరని ఎరుక.నా లైఫ్‌లోకి వచ్చినందుకు..తను వీణ వాయిస్తే ఆ సంగీతం వినేందుకు దేవతలు దిగి వస్తారు. ఆయన చంద్రహాస ఖడ్గాన్ని పట్టుకున్నప్పుడు అదే దేవతలు భయంతో దాక్కుంటారు. అలాంటి నువ్వు నా జీవితంలోకి చ్చినందుకు థ్యాంక్స్ అని ఇన్స్టాగ్రామ్ పోస్ట్‌లో రాసుకొచ్చాడు. వీణ, చంద్రహాస ఖడ్గాన్ని పచ్చబొట్టుగా వేయించుకున్నాడు. View this post on Instagram A post shared by निकितिन धीर (@nikitindheer) -
Maanas: అప్పుడలా.. ఇప్పుడిలా.. వాటే డెడికేషన్! (ఫోటోలు)
-
యాంకర్‌గా ప్రయాణం ప్రారంభించి..!
బుల్లితెర అంటే కొందరికి ఇప్పటికీ చిన్న చూపే అని నిస్పందేహంగా చెప్పవచ్చు. అయితే కళాకారులుగా సాధించాలనుకునే వారికి ఆరంభంలోనూ, అంతిమంలోనూ చాలా మందికి జీవితాన్నిచ్చేది బుల్లితెరనే అన్నది వాస్తవం. ఇప్పుడు ప్రముఖ హీరోయిన్లుగా రాణిస్తున్న వారిలో చాలా మంది బుల్లితెర నుంచి వచ్చినవారే కావడం గమనార్హం. ఈ వరుసలో ఇప్పుడు లేడీ సూపర్‌స్టార్‌గా రాణిస్తున్న నయనతార కూడా ఉన్నారన్నది చాలా మందికి తెలియకపోవచ్చు. నయనతార అసలు పేరు డయానా మరియం కురియన్. మధ్యతగతి కుటుంబానికి చెందిన ఈ కేరళాకుట్టికి చిన్నతనం నుంచి సినిమాలంటే చాలా ఆసక్తి అట. దీంతో ఆమె బంధువు ఒకరు సినీ రంగంలో పని చేస్తుండడంతో ఆయన ద్వారా తన పొటోలను కొందరు సినీ దర్శక, నిర్మాతలకు చేరాయి. అయితే నటినవ్వాలనే తన కోరికను నెరవేర్చుకోవడానికి బుల్లితెరను మార్గంగా చేసుకున్నారు. అలా టీవీ యాంకర్‌గా తన పయనాన్ని ప్రారంభించి సినిమా వాళ్ల దృష్టిలో పడ్డారు. అలా 2005లో తమిళంలో అయ్యా అనే చిత్రం ద్వారా కథానాయకిగా పరిచయం అయ్యారు. తొలి చిత్రంలోనే సుప్రీమ్స్టార్ శరత్‌కుమార్‌కు జంటగా నటించి విజయాన్ని అందుకున్న నయనతార రెండో చిత్రంలో సూపర్‌స్టార్ రజనీకాంత్‌కు జంటగా నటించే లక్కీఛాన్స్‌ను దక్కించుకున్నారు. ఆ తరువాత వరుసగా అవకాశాలు తలపుతట్టడంతో కథానాయకిగా 20 ఏళ్ల పాటు లేడీసూపర్‌స్టార్‌గా వెలిగిపోతున్నారు. ఇటీవల ఒక భేటీలో నయనతార పేర్కొంటూ తన జీవిత చక్రం సినీ రంగప్రవేశం చేసిన తరువాత తలకిందులైందన్నారు. ఏదో ఒక రోజు తాను ఈ రంగంలో ఉన్నత స్థాయికి చేరుకుంటానని కలలో కూడా ఊహించలేదన్నారు. అదే విధంగా తన జీవిత లక్ష్యం గురించి చెబుతూ బీకామ్ పట్టభద్రురాలైన తాను చార్టెడ్ అకౌంటెంట్(సీఏ) అవ్వాలని ఆశ పడ్డానన్నారు. తాను నటి కాకుంటే కచ్చితంగా సీఏ అయ్యి ఉండేదానినని తన బంధువులతో చెబుతుండేదానినని అన్నారు. అయితే నయనతార సీఏ కావాలన్న కోరిక నెరవేరకున్నా ఇప్పుడు లేడీ సూపర్‌స్టార్‌గా రాణిస్తున్నారు. కృషితో నాస్తి దుర్భిక్షం అనడానికి ఇంతకంటే నిదర్శనం ఏముంటుంది. -
25 రోజులు మిస్సింగ్.. నటుడిని గుర్తుపట్టని తల్లి!
బుల్లితెర నటుడు గురుచరణ్ సింగ్ ఆ మధ్య ఉన్నట్లుండి కనిపించకుండా పోయాడు. ఏప్రిల్ 22న ముంబైకి వెళ్లాల్సిన ఆయన అక్కడికి చేరుకోలేదు. అలాగని ఇంటికీ తిరిగి రాలేదు. రోజులు గడుస్తున్నా కుమారుడి జాడ లేకపోవడంతో తండ్రి పోలీసులను ఆశ్రయించాడు. అటు కుటుంబం, ఇటు పోలీసులు నటుడి కోసం గాలింపు చేపట్టగా 25 రోజుల తర్వాత (మే 18న) గురుచరణ్ నెమ్మదిగా ఇంటికి చేరుకున్నాడు.చూడగానే గుర్తుపట్టలేదుఇంటికి వెళ్లాక తన పేరెంట్స్ స్పందన గురించి తాజాగా ఓ ఇంటర్వ్యూలో మాట్లాడాడు. గురుచరణ్ మాట్లాడుతూ.. 25 రోజుల తర్వాత ఓ రోజు రాత్రి నేను ఇంటికి చేరుకున్నాను. అప్పుడు ఇంటి తలుపు తెరిచిన అమ్మ నన్నసలు గుర్తుపట్టలేదు. ఎవరో వచ్చారంటూ మా నాన్నను పిలిచింది. ఆయన నన్ను చూసి వీడు మన సోను అని చెప్పాడు. వెంటనే అమ్మ నన్ను దగ్గరికి తీసుకుని భావోద్వేగానికి లోనైంది. సంతోషంతో ఏడ్చేశాంముగ్గురం ఇంట్లోకి వెళ్లాక చాలాసేపు ఏడ్చాం. అవి సంతోషంతో వచ్చిన కన్నీళ్లు అని చెప్పుకొచ్చాడు. ఆధ్యాత్మిక బాటలో పయనించాలన్న ఉద్దేశంతోనే నటుడు ఇంటి నుంచి వెళ్లిపోయాడు. కానీ దేవుడు సాధారణ జీవితం గడపమని సంకేతాలివ్వడంతోనే తిరిగి ఇంటికి వచ్చినట్లు పేర్కొన్నాడు. కాగా గురు చరణ్.. తారక్ మెహతాకా ఉల్టా చష్మా సీరియల్లో సోధి పాత్రలో నటించి గుర్తింపు తెచ్చుకున్నాడు.చదవండి: ఫారెన్ ట్రిప్‌లో దోపిడికి గురైన ప్రముఖ నటి.. లక్షల డబ్బుతో పాటు -
'ఇండియా వరల్డ్ కప్ గెలిచింది.. ఏదైనా పని ఉంటే కాస్తా చెప్పండి'.. బుల్లితెర నటుడు విజ్ఞప్తి!
సినీ ఇండస్ట్రీలో ఎత్తుపల్లాలు సహజం. స్టార్డమ్ అనేది అందరికీ ఒకేలా ఉండదు. ఒకప్పుడు స్టార్‌గా ఉన్నవాళ్లు అవకాశాల కోసం ఎదురు చూడాల్సిన సందర్భాలు కూడా వస్తాయి. ఒకానొక సమయంలో పని కోసం అడుక్కోవాల్సిన పరిస్థితులు ఎదుర్కోవాల్సి వస్తుంది. తాజాగా అలాంటి పరిస్థితి బాలీవుడ్ బుల్లితెర నటుడు కరణ్ పటేల్‌కు ఎదురైంది. 'యే హై మొహబ్బతే' స్టార్ కరణ్ పటేల్ తన ఇన్స్టాగ్రామ్ చేసిన పోస్ట్ నెట్టింట చర్చనీయాశంగా మారింది.కరణ్ పటేల్ తన ఇన్‌స్టాలో రాస్తూ..'దేశంలో సాధారణ ఎన్నికలు ముగిశాయి. ఇండియా టీ20 ప్రపంచ కప్ గెలిచింది. దీపికా పదుకొణె బేబీ బంప్ వార్త కూడా మనందరికీ తెలిసింది. త్వరలోనే తల్లిదండ్రులు కాబోతున్న వారికి నా అభినందనలు. ఇప్పుడు తిరిగి పని చేసుకోవాల్సిన సమయం. కాస్టింగ్ అవకాశం ఉంటే ఎవరైనా నాకు తెలియజేయండి.' అంటూ సోషల్ మీడియాలో రాసుకొచ్చారు.బుల్లితెర నటుడు కరణ్ పటేల్ చివరిసారిగా 2020లో ‘కసౌతి జిందగీ కే’ అనే సీరియల్లో కనిపించారు. అంతే కాకుండా ఏక్తా కపూర్ నటించిన కహానీ ఘర్ ఘర్ కిలో కూడా కనిపించాడు. ప్రముఖ టీవీ సీరియల్ 'యే హై మొహబ్బతే'తో ఇండస్ట్రీలో గుర్తింపు తెచ్చుకున్నారు. ఇందులో అతనితో పాటు దివ్యాంక త్రిపాఠి కూడా నటించింది. అయితే గతంలో కరణ్ పటేల్‌కు రియాలిటీ షో బిగ్‌బాస్‌లో అవకాశం వచ్చినా తిరస్కరించాడు. -
ఆమెతో జోడీయే ఇష్టపడ్డారు.. నేను ప్రేమించిన నటిని తిట్టిపోశారు!
స్క్రీన్ మీద కనిపించే కొన్ని జంటలను ప్రేక్షకులు ఇష్టపడతారు. రియల్ లైఫ్‌లో కూడా వారిని జోడీలాగే చూడాలనుకుంటారు. అలా కాకుండా వేరొకరిని ప్రేమిస్తే అస్సలు సహించలేరు. ఇలాంటి ఇబ్బందికర పరిస్థితి కున్వర్ అమర్జీత్- చార్లీ చౌహన్ జంటకు ఎదురైంది. దిల్ దోస్తీ డ్యాన్స్ అనే సీరియల్లో కున్వర్ రేయాన్ష్ సింఘానియా పాత్రలో నటించాడు. ఈ రోల్‌తోనే గుర్తింపు తెచ్చుకున్నాడు. ఆన్‌స్క్రీన్‌లో ఆమెతో.. ఆఫ్ స్క్రీన్‌లో మరొకరితో..ఇందులో అతడు నటి శక్తి మోహన్‌తో జోడీ కట్టాడు. వీళ్లు రియల్ లైఫ్‌లో కూడా జంటగా కలిసుంటే చూడాలని ముచ్చటపడ్డారు ఫ్యాన్స్. కానీ కున్వర్.. మరో నటి చార్లీ చౌహన్తో ప్రేమలో పడ్డాడు. ఇది అభిమానులకు మింగుడుపడలేదట. మీ జోడీ బాగోలేదని ముఖం మీదే చెప్పారట! దీని గురించి కున్వర్ మాట్లాడుతూ.. దిల్ దోస్తీ డ్యాన్స్ సీరియల్లోని నా పాత్రను ప్రేక్షకులు ప్రేమించారు. తనను ద్వేషించారుఅందులో నాతో జోడీ కట్టిన అమ్మాయినే ప్రేమించాలని భావించారు. కానీ అప్పుడు నేను చార్లీతో లవ్‌లో పడ్డాను. దీంతో జనాలు ఆమెను ఎక్కువ ద్వేషించారు. తిట్టుకున్నారు. మేము దాదాపు నాలుగేళ్లు కలిసున్నాం. తర్వాత పరిస్థితులు కూడా మారిపోవడంతో విడిపోయాము అని చెప్పుకొచ్చాడు. కాగా వీళ్లిద్దరూ కలిసున్నప్పుడు నాచ్ బలియే ఐదో సీజన్లో జంటగా పాల్గొన్నారు.చదవండి: 550 సార్లు రీ-రిలీజ్ అయిన ఏకైక సినిమా.. ఈ విషయాలు తెలుసా..? -
విడాకుల రూమర్స్.. ఈ ప్రపంచం గురించి పట్టించుకోనంటున్న నటుడు
బుల్లితెర జంట సంజయ్ గగ్నానీ, పూనమ్ ప్రీత్ ప్రేమించి పెళ్లి చేసుకున్నారు. 2021లో వీరు వైవాహిక బంధాన్ని ప్రారంభించారు. అయితే వీరి మధ్య సఖ్యత కుదరడం లేదని, త్వరలోనే విడిపోవడం ఖాయమంటూ గత కొన్నిరోజులుగా వార్తలు వైరలవుతున్నాయి. ఇందుకు తోడు సంజయ్ ఇన్స్టాగ్రామ్ స్టోరీలో ఓ పోస్ట్ పెట్టి తొలగించాడట! ఇంకేముంది.. ఈ దంపతులిద్దరూ విడాకులు తీసుకోబోతున్నారని కథనాలు అల్లేశారు.ఫస్ట్ టైం చూసి..తాజాగా ఈ రూమర్స్‌పై సంజయ్ స్పందించాడు. మేము విడిపోతున్నామన్న వార్త మొదటిసారి చదివినిప్పుడు షాకయ్యాను. ఎలా రియాక్ట్ అవ్వాలో కూడా అర్థం కాలేదు. నా భార్య అంటే నాకెంతో ఇష్టం. తను ఇది చూస్తే ఎంత బాధపడుతుందోనని కంగారుపడ్డాను. కానీ ఆమె కూడా ఒక యాక్టర్ కాబట్టి ఇవన్నీ అర్థం చేసుకోగలదనిపించింది.ఈ ప్రపంచం ఏమనుకున్నా..ఈ ఇండస్ట్రీలో ఇలాంటి రూమర్స్ సర్వసాధారణమే! మేమేంటో మాకు తెలుసు. ఒకరిపై ఒకరికి ఎనలేని ప్రేమ ఉంది. కాబట్టి ఈ ప్రపంచం మా గురించి ఏమనుకుంటుందనే అస్సలు పట్టించుకోము. అలాగే ఈ పుకారును కూడా లైట్ తీసుకున్నాం. అయితే విడాకుల కోసం లాయర్‌ను సంప్రదించానని ప్రచారం చేశారు. ఎంత నవ్వుకున్నానో..అది విని అయితే ఎంత నవ్వుకున్నానో నాకే తెలియదు అని చెప్పుకొచ్చాడు. ఇకపోతే కుండలీ భాగ్య సీరియల్ తర్వాత సంజయ్ మరే ధారావాహికలోనూ కనిపించలేదు. అన్నీ నెగెటివ్ రోల్స్ వస్తుండటం వల్లే దేనికీ ఒప్పుకోలేదంటున్నాడు. తాజాగా యూట్యూబ్‌లో రిలీజైన రాత్ అభి అనే సాంగ్‌లో సంజయ్ మెరిశాడు.చదవండి: రిలేషన్షిప్లో అది దాటొద్దు.. నేను నేర్చుకున్న గుణపాఠమిదే: గౌతమి -
భర్తతో విడిపోతే ప్రపంచం అంతమైపోయినట్లా! సానియా మరో పెళ్లి చేసుకోవాలి!
విడాకులు తీసుకుంటే మళ్లీ పెళ్లి చేసుకోవాలా..? చేసుకోవాల్సిందే అంటున్నాడు పాకిస్తాన్ నటుడు నబీల్ జాఫర్. 'మైండ్ నా కర్నా విత్ అహ్మద్ అలీ బట్' అనే టాక్ షోకు హాజరైన అతడు విడాకుల తర్వాత జీవితం చీకటిమయం కాకూడదంటున్నాడు. జాఫర్ మాట్లాడుతూ.. ఏ మహిళ అయినా విడాకులు తీసుకోవడమనేది దురదృష్టకరం. కానీ భర్తతో విడిపోగానే ప్రపంచమే అంతమైపోయినట్లు చింతించకూడదు. జీవిత భాగస్వామిని వెతుక్కోవాలి.. మరో పెళ్లి చేసుకోవాలి. సానియా మీర్జాకు కూడా మంచి పార్ట్నర్ దొరికితే రెండో పెళ్లి చేసుకోవాలి అని చెప్పుకొచ్చాడు.ప్రేమించి పెళ్లి చేసుకుంటే..కాగా భారత టెన్నిస్ దిగ్గజం సానియా మీర్జా.. పాకిస్తాన్ క్రికెటర్ షోయబ్ మాలిక్ ప్రేమించుకున్నారు. ప్రేమకు సరిహద్దులు అడ్డు కాదంటూ 2010లో పెళ్లి చేసుకున్నారు. వీరి ప్రేమకు గుర్తుగా 2018లో కుమారుడు ఇజహాన్ జన్మించాడు. ఈ ఏడాది ప్రారంభంలో వీరి బంధానికి విడాకుల కార్డు పడింది. షోయబ్.. పాక్ నటి సనా జావెద్‌ను పెళ్లి చేసుకోవడంతో సానియాతో విడాకుల విషయం ఆలస్యంగా, అధికారికంగా తెలిసొచ్చింది. అతడికి మూడోది.. ఆమెకు రెండోదిషోయబ్కు ఇది మూడో పెళ్లి. హైదరాబాదీ అమ్మాయి ఆయేషా సిద్ధిఖికి తలాక్ ఇచ్చాకే సానియాను పెళ్లి చేసుకున్నాడు. పద్నాలుగేళ్ల బంధాన్ని తెంచుకుని పాక్ నటి సనా జావెద్‌ను మూడో పెళ్లి చేసుకున్నాడు. ఆమెకు గతంలో పాక్ గాయకుడు ఉమైర్ జైస్వాల్‌తో పెళ్లి జరగ్గా వీరిద్దరూ గతేడాది విడిపోయారు. ఈ ఏడాది ప్రారంభంలో షోయబ్‌ను రెండోసారి మనువాడింది.చదవండి: ఫోన్లు చేసి రావాలనేవారు.. భయంతో నేనసలు వెళ్లేదాన్నే కాదు!: హీరామండి నటి -
Serial Actor Chandu: నేను పిచ్చివాడినైపోతా.. నటుడు చందు చివరి మాటలు వైరల్
తెలుగు సీరియల్ నటుడు చంద్రకాంత్ మరణంతో అతడి కుటుంబం కన్నీరుమున్నీరుగా విలపిస్తోంది. ఇటీవల పవిత్రతో కలిసి కారులో ప్రయాణిస్తున్న సమయంలో యాక్సిడెంట్ జరగ్గా అతడికి తీవ్ర గాయాలయ్యాయి. ఈ ప్రమాదంలో నటి పవిత్ర గుండెపోటుతో కన్నుమూసింది. ప్రియురాలి మరణాన్ని జీర్ణించుకోలేకపోయిన చందు ఎవరూ ఊహించని నిర్ణయం తీసుకున్నాడు. ఐదేళ్లుగా నటితో సహజీవనంతల్లిని, కట్టుకున్న భార్యను, పిల్లలను వదిలేసి తిరిగి రాని లోకాలకు వెళ్లిపోయాడు. ఈ క్రమంలో అతడి వాట్సాప్ చాట్ ఒకటి నెట్టింట వైరల్‌గా మారింది. పవిత్రను ప్రేమించాక భార్యాపిల్లల్ని వదిలేశాడు చందు. ఐదేళ్లుగా నటితోనే కలిసుంటున్నాడు. సడన్‌గా ఆమె తనను వదిలేసి పోవడంతో చందు డిప్రెషన్లోకి వెళ్లిపోయాడు. ఈ క్రమంలో వాట్సాప్‌లో తన సహనటి కరాటే కల్యాణికి మెసేజ్‌లు చేశాడు.ఈ జన్మకు చాలునేను వెళ్లిపోతాను.. ఈ జన్మకు ఇక చాలు.. కానీ అప్పుడే ఎవరికీ చెప్పకండి అన్నాడు. అలా మాట్లాడొద్దని ఆమె వారిస్తున్నా ఆ మాటల్ని లెక్క చేయలేదు. నేను వెళ్లిపోతేనే కరెక్ట్. లేదంటే నేను పిచ్చోడిని అయిపోతా, తాగుబోతునైపోయి ఇంట్లోవాళ్లను ఇబ్బంది పెడతాను అంటూ ఏడుస్తున్న ఎమోజీని షేర్ చేశాడు. ఈ చాట్ ఇప్పుడు నెట్టింట వైరల్‌గా మారింది.చదవండి: చనిపోతానని ముందే హింటిచ్చిన నటుడు.. ఐదేళ్ల నుంచి పట్టించుకోట్లేదంటూ విలపించిన తల్లి -
బుల్లితెర నటి కేసులో ట్విస్ట్.. ప్రియుడు సూసైడ్!
సినీ ఇండస్ట్రీలో తీవ్ర విషాదం చోటు చేసుకుంది. ప్రముఖ బుల్లితెర నటుడు చందు బలవన్మరణానికి పాల్పడ్డారు. హైదరాబాద్‌లోని నార్సింగ్ పోలీస్ స్టేషన్ పరిధిలో అల్కాపూర్ కాలనీలో ఆయన ఆత్మహత్య చేసుకున్నారు. సమాచారం అందుకున్న పోలీసులు ఆత్మహత్యకు గల కారణాలపై దర్యాప్తు చేస్తున్నారు. కాగా.. చందు ప్రస్తుతం త్రినయిని, రాధమ్మ పెళ్లి, కార్తీక దీపం లాంటి సీరియల్స్‌లో నటించారు. కాగా.. 2015లో శిల్పను ప్రేమ వివాహం చేసుకున్న చందుకు ఇద్దరు పిల్లలు కూడా ఉన్నారు.కాగా.. ఇటీవలే రోడ్డు ప్రమాదంలో బుల్లితెర నటి పవిత్ర జయరాం మృతి చెందిన సంగతి తెలిసిందే. గత ఆరేళ్లుగా చందుకు టీవీ నటి పవిత్ర జయరాంతో పరిచయం ఉన్నట్లు తెలుస్తోంది. ఇటీవలే పవిత్ర పుట్టినరోజు సందర్భంగా తనను రమ్మంటుంది అంటూ సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. అంతే కాకుండా ఓ యూట్యూబ్ ఛానెల్‌తో తనకు బ్రెయిన్ వ్యాధి ఉందని వెల్లడించారు. కాగా.. పవిత్రతో సహజీవనం చేసిన చందు ఆమెను గుర్తు చేసుకుంటూ ఆవేదన చెందారు. ఈ నేపథ్యంలో చందు సూసైడ్ చేసుకోవడం ఒక్కసారిగా టాలీవుడ్లో చర్చనీయాంశంగా మారింది. ఈ సంఘటనతో సీరియల్ నటి పవిత్ర జయరాం యాక్సిడెంట్ కేసు కీలక మలుపులు తిరగనుంది. -
బుల్లితెర నటి పర్సనల్ వీడియో లీక్
తెలుగు బుల్లితెర నటి జ్యోతిరాయ్ గుప్పెడంత మనసు సీరియల్‌తో టాలీవుడ్ ప్రేక్షకుల గుండెల్లో చోటు సంపాదించుకుంది. కన్నడ ఇండస్ట్రీలో ఫేమస్ అయిన నటి దాదాపు 20కి పైగా సీరియల్స్‌లో నటించింది. అంతేకాకుండా చాలా సినిమాల్లోనూ కనిపించింది. శాండల్‌వుడ్‌లో ఫుల్ ఫాలోయింగ్ ఉన్న నటీమణుల్లో జ్యోతిరాయ్ ఒకరు. సోషల్ మీడియాలో తన గ్లామర్ ఫోటోలు షేర్ చేస్తూ కుర్రకారుకు నిద్రలేకుండా చేసే ఈ బ్యూటీ ఇప్పుడు పలు ఇబ్బందులు ఎదుర్కొంటున్నట్లు వార్తలు వస్తున్నాయి.కర్ణాటకకు చెందిన ఎంపీ ప్రజ్వల్ రేవణ్ణపై అసభ్యకర వీడియో కేసు దేశవ్యాప్తంగా సంచలనం సృష్టిస్తుండగా.. ప్రముఖ కన్నడ టెలివిజన్ నటి జ్యోతిరాయ్ పర్సనల్ వీడియో, ఫోటోలు లీక్ అంటూ సోషల్ మీడియాలో ఒక వార్త వైరల్ అవుతోంది. అందుకు సంబంధించిన వీడియో ఫేస్బుక్, ట్విట్టర్, టెలిగ్రామ్ సహా అన్నీ సోషల్ మీడియా ప్లాట్‌ఫారమ్‌లలో షేర్ అవుతుంది. జ్యోతిరాయ్ ఏం చెప్పారు..?ఇంటర్నెట్లో వైరల్ అవుతున్న అశ్లీల వీడియో, ఫొటోలపై నటి జ్యోతిరాయ్ మీడియా ముందు ఎలాంటి క్లారిటీ ఇవ్వలేదు. ఈ ఫోటోలు, వీడియోలు చూసి తీవ్ర భావోద్వేగానికి లోనైన జ్యోతిరాయ్ ఈ విషయమై కొద్ది రోజుల క్రితం సైబర్ క్రైమ్ డిపార్ట్మెంట్కు ఫిర్యాదు చేసినట్లు తెలిసింది. 'వీటికి సంబంధించిన కొన్ని మెసేజ్‌లు రావడంతో నేను మానసికంగా షాక్ అయ్యాను. ఇలాంటి నీచమైన చర్యలకు పాల్పడే వారిని పట్టించుకోకపోతే అది నా వ్యక్తిగత జీవితంపైనే కాకుండా వృత్తి జీవితంపైనా ప్రభావం చూపుతుంది.వీటి వల్ల నాతో పాటు నా కుటుంబ ప్రతిష్ట ప్రమాదంలో ఉన్నందున చట్టపరంగా వారిపై వెంటనే చర్యలు తీసుకుంటారని నేను అభ్యర్థిస్తున్నాను. తప్పుడు వీడియోలు వ్యాప్తి చేస్తున్న వారిపై చర్యలు తీసుకోకుంటే నేను చాలా ఇబ్బందులు ఎదుర్కొవాల్సి వస్తుంది. వీలైనంత త్వరగా వారిపై కఠిన చర్యలు తీసుకోవాలి.' అని జ్యోతిరాయ్ కోరినట్లు తెలిసింది.వార్నింగ్ ఎంటి..?జ్యోతిరాయ్‌కు సంబంధించిన పర్సనల్ వీడియో, ఫోటోలు అంటూ.. మొదటగా ఒక సోషల్ మీడియా ఖాతా నుంచి వైరల్ అయ్యాయి. అందులో అశ్లీలంగా ఉన్న దృశ్యాలను చూసిన వారందరూ షాక్ అయ్యారు. తన పేజీకి వెయ్యి మంది సబ్స్క్రైబర్స్ కాగానే.. జ్యోతిరాయ్ ఫోటోలు, వీడియోలు మరిన్ని పోస్ట్ చేస్తానని ఒక మేసేజ్ కూడా చేర్చడంతో కర్ణాటకలో పెద్ద దుమారమే రేగుతుంది. అందులో ఉండేది జ్యోతిరాయ్నేనా అనే సందేహాలు కూడా వ్యక్తమౌతున్నాయి. ఆ వీడియోలో ఉండేది జ్యోతిరాయ్ కాదంటూ ఆమెకు మద్ధతుగా అభిమానులు నిలిచారు. ఇప్పటికే పోలీస్ స్టేషన్లలో ఫిర్యాదు కూడా చేశారు. ఇప్పటి వరకైతే ఈ వీడియో, ఫోటోల గురించి జ్యోతిరాయ్ అధికారికంగా రియాక్ట్ కాలేదు. త్వరలో ఆమె స్పందిస్తారని తెలుస్తోంది. View this post on Instagram A post shared by Jyothi Poorvaj (Jayashree Rai K K) (@jyothipoorvaj) -
నటుడు 'దయ' మృతికి కారణాలివే..
సీరియల్ నటుడు దయ అలియాస్ పవిత్రనాథ్ మృతి అభిమానులను కలిచివేస్తోంది. మొగలిరేకులు, చక్రవాకం సీరియల్స్‌తో పవిత్రనాథ్ ఎంతో పాపులారిటీ సంపాదించుకున్నారు. ముఖ్యంగా దయ పాత్రతో అందరికీ గుర్తుండిపోయారు. ఈ రోల్ తన కెరీర్‌కు ఎంతో ప్లస్ పాయింట్ అయింది. ఈ పాత్ర ద్వారానే తనకంటూ ప్రత్యేక అభిమానులను సంపాదించుకున్నారు. తర్వాత ఎన్నో సీరియల్స్‌లో నటించినా మొగలిరేకులు, చక్రవాకం తెచ్చిపెట్టినంత పేరు మాత్రం రాలేదు. నాలుగురోజులుగా అస్వస్థత కొంతకాలంగా బుల్లితెర మీద కనిపించకుండా పోయిన పవిత్రనాథ్ మార్చి 1న మరణించారు. ఆయన ఆకస్మిక మరణంపై అభిమానులు విచారం వ్యక్తం చేస్తున్నారు. ఇంత చిన్న వయసులోనే మరణించడానికి గల కారణాలేంటని ఆరా తీస్తున్నారు. పవిత్రనాథ్ కొంతకాలంగా ముభావంగా ఉంటున్నారట. ఇండస్ట్రీ మిత్రులకు సైతం దూరంగా ఉన్నట్లు తెలుస్తోంది! గత నాలుగురోజులుగా పవిత్రనాథ్ అస్వస్థతకు లోనయ్యారు. గుండె కొట్టుకోవడం ఆగిపోయింది! ఊపిరి తీసుకోవడంలో సమస్య తలెత్తడంతో ప్రైవేట్ ఆస్పత్రికి తరలించారు. అప్పటికే పరిస్థితి విషమించగా.. హార్ట్ ఫెయిల్యూర్ కారణంతో పవిత్రనాథ్ మరణించారని వైద్యులు వెల్లడించారు. కాగా కొన్నేళ్ల క్రితం పవిత్రనాథ్.. అతడి భార్య శశిరేఖ మధ్య గొడవలు తలెత్తాయి. భర్త మీద ఎన్నో ఆరోపణలు చేసింది. అయినా సరే నటుడు వాటి గురించి పట్టించుకోలేదు. ఏనాడూ సదరు ఆరోపణల మీద స్పందించడానికి కూడా ఇష్టపడలేదు. అయితే ఆ సమయంలో మానసికంగా వేదన అనుభవించాడని ఆయన సన్నిహితులు చెప్తూ ఉంటారు. చదవండి: ప్రముఖ బుల్లితెర నటుడు మృతి.. ఆఖరి చూపు కూడా చూసుకోలేకపోయామంటూ.. వ్యాపారవేత్తతో హీరోయిన్ 'రెజీనా' పెళ్లి ఫిక్స్ -
ఢీకొట్టిన ఆర్టీసీ బస్సు.. నడవలేని స్థితిలో నటుడు..
మలయాళ సీరియల్ నటుడు కార్తీక్ ప్రసాద్ ఆరోగ్య పరిస్థితి దయనీయంగా ఉంది. వారం రోజులుగా ఆస్పత్రిలోనే చికిత్స తీసుకుంటున్న ఆయన ఇప్పటికీ కోలుకోలేకపోతున్నాడు. గత వారం మౌనరాగం సీరియల్ షూటింగ్ ముగించుకుని రోడ్డుపై నడుచుకుంటూ ఇంటికి వెళ్తున్న సమయంలో ఆర్టీసీ(కేఎస్ఆర్టీసీ) బస్సు ఆయనను వెనక నుంచి ఢీ కొట్టింది. ఈ ఘటనలో తీవ్రంగా గాయపడి అపస్మారక స్థితికి వెళ్లిపోయిన ఆయనను స్థానికులు ఆస్పత్రిలో చేర్పించారు. తలకు, కాలికి బలమైన గాయాలు తగిలినట్లు వైద్యులు గుర్తించారు. తాజాగా నటి బీనా ఆంటోని.. కార్తీక్ హెల్త్ అప్డేట్ వెల్లడించింది. 'కార్తీక్ పరిస్థితి ఎలా ఉందని చాలామంది మెసేజ్‌లు చేస్తున్నారు. నిజంగా తన పరిస్థితి ఏమీ అంత బాగోలేదు. నడవడానికి చాలా సమయం పట్టేలా ఉంది. రెండు కాళ్ల చర్మం ఊడిపోయింది. అక్కడ మాంసం ముద్ద కూడా లేదట! ఇప్పటికే రెండు, మూడు ప్లాస్టిక్ సర్జరీలు చేశారు. ఇంకా చేయాలంటున్నారు. కార్తీక్‌తో మాట్లాడలేదు కానీ అతడి భార్యతో మాట్లాడాను. భరించలేనంత నొప్పి ఉండటంతో పెయిన్ కిల్లర్స్ ఇస్తున్నారట!' అని చెప్పుకొచ్చింది. చదవండి: ప్రముఖ బుల్లితెర నటుడు మృతి.. ఆఖరి చూపు కూడా చూసుకోలేకపోయామంటూ.. -
'మొగలిరేకులు' నటుడు దయ కన్నుమూత
ప్రముఖ బుల్లితెర నటుడు పవిత్రనాథ్ కన్నుమూశారు. మొగలిరేకులు సీరియల్లో దయగా గుర్తింపు తెచ్చుకున్న ఆయన చిన్నవయసులోనే మరణించారు. ఈ విషయాన్ని నటుడు ఇంద్రనీల్ భార్య మేఘన సోషల్ మీడియాలో వెల్లడించింది. 'పవి.. ఈ బాధను మేము వర్ణించలేకపోతున్నాం.. మా జీవితాల్లో నువ్వు ఎంతో ముఖ్యమైనవాడివి. నీ మరణవార్త అబద్ధమైతే బాగుండనిపిస్తోంది. ఇది నిజం కాకూడదు.. నువ్వు మమ్మల్ని వదిలి వెళ్లిపోయావనే విషయాన్ని జీర్ణించుకోలేకపోతున్నాం. చివరి చూపు కూడా.. కనీసం ఆఖరి చూపు కూడా చూసుకోలేకపోయాం. గుడ్‌బై కూడా చెప్పలేకపోయాం. నిన్ను ఎంతో మిస్ అవుతున్నాం.. నీ ఆత్మకు శాంతి చేకూరాలి. ఆ భగవంతుడు నీ కుటుంబానికి మరింత శక్తినివ్వాలి' అంటూ ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్ట్ పెట్టింది. అయితే నటుడి మరణానికి గల కారణాలు తెలియాల్సి ఉంది. కాగా బుల్లితెరపై సంచలనం రేపిన మొగలిరేకులు, చక్రవాకం సీరియల్స్‌లో పవిత్రనాథ్ ముఖ్యపాత్రలో నటించారు. 'మొగలిరేకులు' ధారావాహికలో ఇంద్రనీల్ తమ్ముడు దయగా మెప్పించి తెలుగు ప్రేక్షకులకు దగ్గరయ్యారు. View this post on Instagram A post shared by Meghna Raami (@raamimeghna) చదవండి: డ్రగ్స్ కేసులో అనూహ్య మలుపు.. క్రిష్ నమూనాల సేకరణ..! -
మూడేళ్ల ముచ్చట.. విడిపోయిన బుల్లితెర జంట
ఈ మధ్య పెళ్లిళ్లు మూణ్నాళ్ల ముచ్చటగానే మిగిలిపోతున్నాయి. బుల్లితెర జంట అభిషేక్ మాలిక్- సుహాని చౌదరి కూడా ఆ కోవలోకే వస్తారు. వీరిద్దరూ 2021లో ఎంతో ఘనంగా పెళ్లి చేసుకున్నారు. మీ జంట చూడముచ్చటగా ఉందని, కలకాలం కలిసుండాలని కోరుతూ అతిథులు అక్షింతలు వేసి దీవించారు. కానీ మూడేళ్లకే వీరి వైవాహిక బంధం బీటలు వారింది. తాము విడిపోయామంటూ నటుడు అభిషేక్ వెల్లడించాడు. తమ మధ్య సరైన సఖ్యత లేకపోవడం వల్లే ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలిపాడు. కనెక్షన్ మిస్ అవుతోంది అభిషేక్ మాలిక్ మాట్లాడుతూ.. 'మా ఇద్దరి మనస్వత్వాలు వేరు. మా మధ్య సరైన అండర్స్టాండింగ్ కూడా లేదు. మా మధ్య ఏదో కనెక్షన్ మిస్ అవుతున్నాం. దీని గురించి ఇద్దరం చర్చించుకున్నాం. విడాకులు తీసుకుంటేనే ఇద్దరం సంతోషంగా ఉండలగమని నిర్ణయించుకున్నాం. కలిసి బంధాన్ని కొనసాగించేందుకు మాకు సహేతుక కారణాలేవీ కనిపించట్లేదు. బలవంతంగా కలిసుండి ఒకరి జీవితాన్ని ఎందుకు నాశనం చేయడం? అందుకే విడిపోయాం. తనకేమో కలలు.. నేనేమో బిజీ నేను నా వర్క్‌తో చాలా బిజీగా ఉంటున్నాను. తనేమో ఏవేవో కలలు కంటోంది. పైగా తను ముంబైకి కొత్త. ఇక్కడ తనకు పెద్దగా స్నేహితులు కూడా లేరు. నా ఫ్రెండ్సే తనకు మిత్రులుగా మారారు. ఇండస్ట్రీకి చెందిన నా స్నేహితులు తనను ఎంతో ప్రేమిస్తారు. నాకంటే తనే ఎక్కువగా వారితో కలిసి బయటకు వెళ్తూ ఉండేది. అయితే ఆ ఫ్రెండ్స్ కూడా నేను నా భార్యకు ఎక్కువ సమయం కేటాయించడం లేదని అనేవారు. ఆ మాట నాకు బలంగా గుచ్చుకుంది. అది కాస్తా ఇంతవరకు వచ్చింది. విడాకుల కోసం దరఖాస్తు కూడా చేశాం' అని చెప్పుకొచ్చాడు. ప్రేమ పెళ్లి- మూడేళ్లకే విడాకులు కాగా అభిషేక్- సుహాని తొమ్మిదినెలల పాటు డేటింగ్ చేసి 2021లో పెళ్లి చేసుకున్నారు. మూడేళ్లకే విడాకులు తీసుకోబోతుండటంతో అభిమానులు విచారం వ్యక్తం చేస్తున్నారు. అభిషేక్ మాలిక్.. ఛల్-షే ఔర్ మాత్ అనే సీరియల్‌తో 2012లో బుల్లితెరపై ఎంట్రీ ఇచ్చాడు. ఏక్ వివాహ్ ఐసా బీ, భాగ్యలక్ష్మి, యే హై మొహబ్బతే, కుంకుమ్ భాగ్య వంటి సీరియల్స్‌తో మరింత గుర్తింపు తెచ్చుకున్నాడు. సుహాని చౌదరి మోడల్‌గా రాణిస్తోంది. చదవండి: శాలువా ఎందుకు విసిరేశారు? వివాదంపై క్లారిటీ ఇచ్చిన హీరో తండ్రి -
ప్యాంక్రియాటిక్ కేన్సర్ వల్ల గుండె ఆగిపోతుందా?
ప్రముఖ బాలీవుడ్ టీవీ నటుడు రితురాజ్ సింగ్ 59 ఏళ్ల వయసులో కార్డియాక్ అరెస్టుతో మృతి చెందిన సంగతి తెలిసిందే. ఆయన గత కొంతకాలం ప్యాంక్రియాటిక్ (క్లోమ గ్రంధి క్యాన్సర్) వ్యాధితో బాధపడుతున్నారు. ఇటీవలే ఆస్పత్రిలో చేరి చికిత్స తీసుకుని డిశ్చార్జ్ అయ్యి ఇంటికి కూడా వెళ్లారు. ఏమైందో ఏమో గత రాత్రి అకస్మాత్తుగా కార్షియాక్ అరెస్టుకు గురై చనిపోయారు. దీంతో ఒక్కసారిగా బాలీవుడ్ సినీ ఇండస్ట్రీలో విషాద ఛాయలు అలుముకున్నాయి. అస్సలు ఈ ప్యాక్రియాటిక్ క్యాన్సర్ గుండె లయలపై ప్రభావం చూపిస్తుందా?. అది ప్రాణాంతకమా? ఇక్కడ ప్యాంక్రియాస్ అనగా క్లోమ గ్రంధి. ఇది శరీరంలో అతి ముఖ్యమైన అవయవం. ఎందుకంటే శరీరంలోని గ్లూకోజ్‌ని ప్రాసెస్ చేయడానికి అవసరమైన ఇన్సులిన్ని ఉత్పత్తి చేస్తుంది. ఈ ప్యాంక్రియాస్ అనేది కాలేయం కింద, పిత్తాశయం, కడుపు, ప్రేగులకు దగ్గరగా ఉండే ఆకు ఆకారంలో ఉండే అవయవం. ఆహారం జీర్ణం చేయడానికి ముఖ్యమైన ఎంజైమ్‌ని ఉత్పత్తి చేస్తుంది. అందువల్ల దీనిలో ఏదైనా సమస్య వస్తే పలు రకాల ఆరోగ్య సమస్యలకు దారితీస్తుంది. ప్యాంక్రియాటిక్ రుగ్మతలు అంటే.. జీర్ణక్రియ, రక్తంలో చక్కెర నియంత్రణలో సమస్యలను కలిగిస్తాయి. ఇది సర్వసాధారణ రుగ్మత అధిక ఆల్కహాల్ తీసుకోవడం లేదా పిత్తాశయ రాళ్లు వంటి కారణాల వల్ల క్లోమగ్రంధిలో సమస్య తలెత్తి కడపు నొప్పి, వికారం, వాంతులకు దారితీస్తుంది. తీవ్రమైన రుగ్మత కాలేయ క్యాన్సర్. దీని కారణంగా కామెర్లు, అతిగా బరువు తగ్గడం తదితర సమస్యలు వస్తాయి. ప్యాంక్రియాటిక్ రుగ్మత లక్షణాలు.. పొత్తి కడుపు నొప్పి నిరంతరం తీవ్రమైన కడుపు నొప్పి, తరచుగా వెనుకకు ప్రసరించడం. ప్యాంక్రియాటిక్ రుగ్మతల లక్షణం. ఈ నొప్పి తీవ్రతలో మారవచ్చు మరియు తినడం లేదా పడుకున్న తర్వాత తీవ్రమవుతుంది. ప్యాంక్రియాటైటిస్ లేదా ప్యాంక్రియాటిక్ క్యాన్సర్ వంటి పరిస్థితుల వల్ల చుట్టుపక్కల కణజాలంపై వాపు, అడ్డుపడటం లేదా ఒత్తిడి కారణంగా ఇది సంభవిస్తుంది. వికారం, వాంతులు ప్యాంక్రియాటిక్ రుగ్మతలు జీర్ణక్రియలో ఆటంకాలు కలిగిచడంతో వికారం, వాంతులు వంటి వాటికి దారితీస్తుంది. ఈ లక్షణాలు తరచుగా పొత్తికడుపు నొప్పితో పాటుగా ఉంటాయి. ఇవి కొవ్వు లేదా పెద్దగా భోజనం తినడం ద్వారా వస్తుంది. కామెర్లు చర్మం, కళ్ళు పసుపు రంగులోకి మారడాన్ని కామెర్లు అని పిలుస్తారు. అది కాస్త ప్యాంక్రియాటిక్ క్యాన్సర్ లేదా పిత్త వాహిక అవరోధం వంటి కాలేయ రుగ్మతలకు దారితీయొచ్చు. ముఖ్యంగా పిత్తాశయం నుంచి ప్రేగులలోకి పిత్త ప్రవాహాన్ని అడ్డుకోవడం వల్ల రక్తప్రవాహంలో బిలిరుబిన్ అధికంగా ఏర్పడటంతో కామెర్లు రావడం జరుగుతుంది. అనూహ్యంగా బరువు తగ్గడం అనూహ్యంగా బరువు తగ్గడం అనేది ప్యాంక్రియాటిక్ రుగ్మతకు సంబంధించిన సాధారణ లక్షణం. ముఖ్యంగా ప్యాంక్రియాటిక్ క్యాన్సర్‌లో ఆకలి లేకపోవడం, పోషకాలు శోషించుకోలేకపోవడం, తగిన జీవక్రియలు లేకపోవడం తదితర లక్షణాలు తలెత్తుతాయి. ప్రేగు కదలికల్లో మార్పులు ప్యాంక్రియాటిక్ రుగ్మతలు విరేచనాలు, జిడ్డుగల లేదా జిడ్డుగల మలం లేదా లేత-రంగు మలం వంటి ప్రేగు కదలికలలో మార్పులకు దారితీయవచ్చు. సరైన జీర్ణక్రియకు అవసరమైన ప్యాంక్రియాటిక్ ఎంజైమ్‌ల ఉత్పత్తి తగినంతగా లేకపోవడం వల్ల ఈ మార్పులు సంభవించవచ్చు. మధుమేహం దీర్ఘకాలిక ప్యాంక్రియాటైటిస్ లేదా ప్యాంక్రియాటిక్ క్యాన్సర్ వంటి కొన్ని ప్యాంక్రియాటిక్ రుగ్మతలు ఇన్సులిన్‌ను ఉత్పత్తి చేసే ప్యాంక్రియాస్ సామర్థ్యాన్ని దెబ్బతీస్తాయి. ఇది డయాబెటిస్ మెల్లిటస్కు దారితీస్తుంది. జీర్ణ సమస్యలు ప్యాంక్రియాటిక్ రుగ్మతలు ఉన్న వ్యక్తులు ఉబ్బరం, గ్యాస్, అజీర్ణం, తక్కువ మొత్తంలో ఆహారం తీసుకున్న తర్వాత కూడా కడుపు నిండిన అనుభూతి వంటి జీర్ణ సమస్యలతో బాధపడతారు. క్లోమ గ్రంధి రుగ్మతలు కార్డియాక్ అరెస్ట్‌కు ఎలా దారితీస్తాయంటే.. ప్యాంక్రియాటైటిస్ లేదా క్లోమ గ్రంధి క్యాన్సర్ వంటి క్లోమ సంబంధిత రుగ్మతలు కార్డియాక్ అరెస్ట్‌కు కారణమయ్యే అవకాశం ఉంది. ప్యాంక్రియాస్ వాపు లేదా క్యాన్సర్ బారిన పడినప్పుడు, అది గుండెతో సహా సమీపంలోని అవయవాలకు తీవ్రమైన మంట, హాని కలిగించే పదార్థాలను విడుదల చేస్తుంది. ఈ వాపు శరీరంలో రకరకాల సమస్యలను ప్రేరేపిస్తుంది. ముఖ్యంగా గుండె పనితీరుకు కీలకమైన పొటాషియం, కాల్షియం వంటి ఎలక్ట్రోలైట్లలో అసమతుల్యతకు దారితీస్తుంది. అలాగే, ప్యాంక్రియాటిక్ రుగ్మతలు శరీరంపై గణనీయమైన నొప్పి, ఒత్తిడిని కలిగిస్తాయి. ఇది హృదయ స్పందన రేటు, రక్తపోటు పెరుగుదలకు దారితీస్తుంది.క్రిటికల్ పరిస్థితుల్లో అది కాస్త గుండెపై ఈ ఒత్తిడి ఏర్పడి ఎలక్ట్రోలైట్ అసమతుల్యత ఏర్పడి తత్ఫలితంగా గుండె ఆగిపోవడానికి దారితీస్తుంది. ఇక్కడ గుండె అకస్మాత్తుగా కొట్టుకోవడం ఆగిపోతుంది. (చదవండి: నటుడు శరత్‌బాబు ఉసురు తీసింది ఆ వ్యాధే!) -
బిగ్‌బాస్ షోలో కలిశారు.. రెండేళ్లుగా సహజీవనం.. ఇంతలో!
వాలంటైన్స్ డేకు ఇంకా ఒక్క రోజే సమయముంది. రేపు (ఫిబ్రవరి 14న) ప్రేమికులు తమ స్పెషల్ డేను ఎంతో ఘనంగా సెలబ్రేట్ చేసుకుంటారు. ఆల్రెడీ ప్రేమలో ఉన్నవారు ఒకరికొకరు గిఫ్టులు ఇచ్చిపుచ్చుకుని మురిసిపోతారు. వన్‌సైడ్ లవర్స్.. తమ ప్రేమను ఈసారైనా బయటపెట్టాల్సిందే, అటు నుంచి గ్రీన్ సిగ్నల్ రావాల్సిందే అన్న విధంగా ప్లాన్లు చేసుకుంటున్నారు. అంతా ప్రేమ మైకంలో ముగిని తేలుతున్న ఈ సమయంలో బుల్లితెర జంట మాత్రం విడిపోతున్నట్లు ప్రకటించి షాకిచ్చింది. ఒకే ఇంట్లో ఉంటూ.. నటీనటులు ఇజాజ్ ఖాన్- పవిత్ర పూనియా.. హిందీ బిగ్‌బాస్ 14వ సీజన్లో ఒకరినొకరు ఇష్టపడ్డారు. అన్నీ కలిసొస్తే.. అదే ఏడాది పెళ్లి చేసుకుంటామన్నారు. కానీ అంతలోనే పెళ్లి విషయం పక్కనపెట్టేసి రెండేళ్లు సహజీవనం చేశారు. కొద్ది నెలలుగా వీరి మధ్య విభేదాలు వస్తున్నాయంటూ పుకార్లు షికార్లు చేశాయి. తాజాగా ఇదే నిజమని తేలిపోయింది. బ్రేకప్ నిజమని అంగీకరించారు. మొన్నటివరకు ఇద్దరూ ఒకే అపార్ట్మెంట్లో ఉండగా గత నెలలో ఇజాజ్ ఆ ఇంటి నుంచి బయటకు వచ్చేశాడు. పవిత్ర మాత్రం ప్రస్తుతం అదే ఇంట్లో ఉంటోంది. ఎక్స్పైరీ అయిపోయింది బ్రేకప్ గురించి పవిత్ర మాట్లాడుతూ.. 'ప్రతిదానికీ ఎక్స్పైరీ డేట్ ఉంటుంది. ఏదీ శాశ్వతంగా ఉండిపోదు. ప్రేమ బంధాలకు కూడా ఇది వర్తిస్తుంది. రిలేషన్స్ కూడా కలకాలం ఉండిపోవు. కొన్ని నెలల క్రితమే ఇజాజ్, నేను విడిపోయాం. అప్పటికి, ఇప్పటికి అతడిని గౌరవిస్తూనే ఉన్నాను. తన క్షేమమే కోరుకుంటున్నాను. కానీ మా మధ్య ప్రేమబంధం మాత్రం ముగిసిపోయింది' అని చెప్పుకొచ్చింది. బ్రేకప్ నిజమే.. అటు ఇజాజ్ కూడా బ్రేకప్ నిజమేనని ఒప్పుకున్నాడు. పవిత్ర తన కెరీర్లో సక్సెస్ కావాలని కోరుకుంటున్నట్లు ఆకాంక్షించాడు. కాగా పవిత్ర చివరగా నాగమణి అనే సీరియల్లో కనిపించింది. ఇజాజ్.. జవాన్ సినిమాలో కనిపించాడు. బిగ్‌బాస్ షో ద్వారా ఒక్కటైన ఈ జంట పలు ఈవెంట్లకు, షోలకు కలిసే వెళ్లేవారు. ఎంతో ముచ్చటగా కనిపించే ఈ లవ్ బర్డ్స్ విడిపోతున్నారని తెలిసి అభిమానులు విచారం వ్యక్తం చేస్తున్నారు. చదవండి: ధనుష్ పాటపై సెన్సేషనల్ కామెంట్స్ చేసిన మాజీ భార్య -
రెండోసారి ఆడపిల్ల.. సంతోషంలో నటి.. ఘనంగా ఫంక్షన్
పర్ల్ మానే.. మొదట్లో పాటల ప్రోగ్రామ్‌కు, తర్వాత వంట ప్రోగ్రామ్, డ్యాన్స్ షో.. ఇలా దాదాపు అన్ని రకాల కార్యక్రమాలకు హోస్ట్‌గా వ్యవహరించింది. యాంకర్‌గా వచ్చిన గుర్తింపుతో సినిమా ఛాన్సులూ అందుకుంది. సహాయ నటిగా క్రేజ్ తెచ్చుకున్న ఈ బ్యూటీ మలయాళ బిగ్‌బాస్ షోలోనూ పాల్గొని ఫస్ట్ రన్నరప్‌గా నిలిచింది. ఈమె తెలుగులో ఓ సినిమాలో నటించింది. నాగశౌర్య 'కళ్యాణ వైభోగమే' చిత్రంలో వైదేహి అనే పాత్రలో యాక్ట్ చేసింది. బిగ్‌బాస్ షోలో లవ్ ఇకపోతే ఈమె బిగ్‌బాస్ షోలో బుల్లితెర నటుడు శ్రీనిష్ అరవింద్‌తో లవ్‌లో పడింది. షో అయిపోగానే పెళ్లి కూడా చేసుకున్నారు. 2019లో పెళ్లి పీటలెక్కగా 2021లో నీల అనే కూతురు జన్మించింది. ఈ ఏడాది జనవరి 13న మరోసారి కూతురు పుట్టింది. తాజాగా ఈ పాపకు నామకరణం చేశారు. రెండో కూతురికి 'నితారా శ్రీనిష్' అన్న పేరు ఖరారు చేసినట్లు సోషల్ మీడియాలో తెలిపారు. పాప పుట్టి 28 రోజులు.. 'నితారా శ్రీనిష్ జన్మించి 28 రోజులవుతోంది. ఇది తన బారసాల. మా మనసులు సంతోషంతో ఉప్పొంగిపోతున్నాయి. మీ ఆశీర్వాదాలు కావాలి..' అంటూ ఫ్యామిలీ ఫోటోలను పర్ల్ మానే, శ్రీనిష్ ఇన్‌స్టాగ్రామ్‌లో షేర్ చేశారు. ఇది చూసిన అభిమానులు నటి దంపతులకు శుభాకాంక్షలు తెలుపుతున్నారు. మీ కుటుంబం చూడముచ్చటగా ఉందని కామెంట్లు చేస్తున్నారు. View this post on Instagram A post shared by Pearle Maaney (@pearlemaany) View this post on Instagram A post shared by Pearle Maaney (@pearlemaany) చదవండి: 'దేవర'లో ఎన్జీఆర్‌కు జోడీగా శ్రుతి మరాఠే.. ఇన్‌స్టాలో వెరీ పాపులర్ -
పెళ్లి చేసుకోవడమే ఆలస్యం.. ఇంతలోనే షాకిచ్చిన బిగ్‌బాస్ బ్యూటీ!
బుల్లితెర జంట పవిత్ర పూనియా- ఇజాజ్ ఖాన్ విడిపోయారంటూ గత కొంతకాలంగా పుకార్లు షికార్లు చేస్తున్నాయి. చాలాకాలంగా ఈ రూమర్స్‌పై నోరు విప్పని పవిత్ర తొలిసారి స్పందిస్తూ ఆసక్తికర వ్యాఖ్యలు చేసింది. 'నా అభిమానులతో నేనెప్పుడూ టచ్‌లోనే ఉంటాను. అందరినీ ఒకటే అభ్యర్థిస్తున్నా.. దయచేసి దీని(బ్రేకప్ రూమర్స్) గురించి ఎవరూ మాట్లాడొద్దు. మా ప్రైవసీకి భంగం కలిగించొద్దు. నన్ను, అలాగే ఇజాజ్‌ను కూడా సపోర్ట్ చేయండి. మా మధ్య ఏదైతే జరిగిందో బహుశా ఏదో ఒక కారణం వల్లే అది జరిగుండొచ్చు. పెళ్లికి నో.. ఆ వార్తలు నిజమే! ఇప్పుడు నేను నా కెరీర్ పైనే ఫోకస్ చేయాలనుకుంటున్నాను. ఈ మధ్యే నా తండ్రిని కోల్పోయాను. నాకు ఒక అన్నయ్య ఉన్నాడు. కానీ అతడు నన్ను తల్లిగా చూస్తాడు. నేను తనను చిన్నపిల్లాడిగా చూసుకుంటాను. ఇప్పుడు నా కుటుంబానికి నా అవసరం ఎంతో ఉంది. నా కోసం, నా కుటుంబం కోసం కొన్ని పనులు చేయాల్సి వస్తోంది. అది మీరు ప్రేమతో అర్థం చేసుకుంటారని ఆశిస్తున్నాను. ఇప్పుడు ఇంతకంటే ఏం చెప్పలేను. నా ఫ్యామిలీ బాధ్యతలు నేను భుజాన ఎత్తుకున్నాను. ఇప్పట్లో పెళ్లి చేసుకోవాలన్న ఆలోచనే లేదు. మా రిలేషన్ గురించి ఏదైతే ప్రచారం జరుగుతుందో అది నిజమే!' అంటూ బ్రేకప్ వార్తలు వాస్తవమేనని ధ్రువీకరించింది నటి. బిగ్‌బాస్ హౌస్‌లో మొదలైన లవ్ కాగా పవిత్ర పూనియా.. లవ్ యూ జిందగీ, యే హై మొహబ్బతే, నాగిన్ వంటి సీరియల్స్‌లో నటించింది. అలాగే హిందీ బిగ్‌బాస్ 14వ సీజన్లోనూ పాల్గొంది. ఇజాజ్ ఖాన్ విషయానికి వస్తే.. ఈ నటుడు గతంలో అనిత హస్సనందానీతో డేటింగ్ చేశాడు. కొంతకాలానికే ఆమెకు బ్రేకప్ చెప్పి కెనడియన్ సింగర్ నటలై డి లుసియోతో ప్రేమలో పడ్డాడు. పెళ్లి చేసుకోవడమే ఆలస్యం అనుకునే సమయానికి వీరి బంధం ముక్కలైంది. బిగ్‌బాస్ 14వ సీజన్లో పాల్గొన్నప్పుడు నటి పవిత్ర పూనియాతో పరిచయం ఏర్పడగా అది కాస్తా ప్రేమగా మారింది. వీరు గతేడాది అక్టోబర్‌లో నిశ్చితార్థం కూడా చేసుకున్నారు. పెళ్లి చేసుకుంటారనుకులోపే బ్రేకప్ చెప్పుకుని అభిమానులకు షాకిచ్చారు. చదవండి: ప్రియుడిని పెళ్లాడిన నటి.. జీవితాంతం ఈ చేయి విడవనంటూ.. -
ప్రముఖ నటుడి ఇంట్లో చోరీ.. నగదు, బంగారం మాయం!
ప్రముఖ టీవీ నటుడి ఇంట్లో చోరీ జరిగింది. తమిళనాడుకు చెందిన శబరినాథన్.. పలు సీరియల్స్‌లో నటిస్తున్నాడు. సేలం కోరిమేడు సమీపంలోని బృందావనం గార్డెన్ ఏరియాలో నివాసం ఉంటున్నాడు. గత నెల 23న చిన్నాన్న అంత్యక్రియలకు హాజరయ్యేందుకు శబరినాథన్ కుటుంబ సభ్యులు. ఇంటికి తాళం వేసి పనమరుత్తుపట్టికి వెళ్లారు. తిరిగి 24వ తేదీన అందరూ ఇంటికి వచ్చారు. అయితే శబరినాథన్ ఫ్యామిలీ తిరిగొచ్చే సమయానికి ఇంటి తాళం పగలగొట్టి, తలుపులు తెరిచి ఉన్నాయి. లోపలికి వెళ్లి పరిశీలించగా.. రూ.లక్ష నగదు, 5 గోల్డ్ కాయిన్స్, కొన్ని వెండి వస్తువులు చోరీకి గురైనట్లు గుర్తించారు. వెంటనే అలగాపురం పోలీసులకు ఫిర్యాదు చేశారు. కేసు నమోదుతో దర్యాప్తు చేపట్టగా దొంగ దొరికాడు. ధర్మపురికి చెందిన మణికంఠన్.. ఈ చోరీకి పాల్పడినట్లు పోలీసులు గుర్తించారు. ఇతడిని అరెస్ట్ చేసి, సెంట్రల్ జైలుకి తరలించారు. -
ఎంగేజ్మెంట్ అయిన ఏడాదికి పెళ్లి చేసుకున్న బుల్లితెర నటి (ఫోటోలు)
-
ఆ కారణం వల్లే ఇండస్ట్రీని వదిలేసి రైతుగా మారాను: నటుడు
బుల్లితెర నటుడు రాజేశ్ శర్మ రైతుగా మారాడు. మంచి అవకాశాలు రాకపోవడం వల్లే నటనకు గుడ్‌బై చెప్పి కర్షకుడిగా మారానంటున్నాడు. మొదట ఇతడి నిర్ణయం విని ఊరికే అంటున్నాడేమో అనుకున్నారు, కానీ నిజంగానే రైతుగా మారి పొలం పండిస్తున్నాడు. తాజాగా అతడు ఓ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ.. '2017లో నేను యాక్టింగ్ మానేద్దామనుకున్నాను. అప్పుడే మా నాన్నకు చెప్పాను. వారసత్వంగా వస్తున్న పొలం ఉంది కదా.. నేను పంట పండిస్తా అన్నాను. తను నా మాట పెద్దగా పట్టించుకోలేదు. కానీ నేను అనుకున్నది చేసి చూపించాను. ప్రకృతి నాతో చెలగాటం ఆడింది రైతుగా మారడానికి ప్రధాన కారణం.. నటుడిగా నాకు మంచి అవకాశాలు రాలేదు, కెరీర్లో ఎదుగుదల లేకుండా పోయింది. అదే రైతుగా మారితే.. నాకు నచ్చినవి పండించొచ్చు, నచ్చిన ప్రయోగాలు చేయవచ్చు. అందుకే పొలంలో దిగాను. దాదాపు ఐదేళ్లుగా వ్యవసాయం చేస్తున్నాను. ఎన్నో ఇబ్బందులు ఎదుర్కొన్నాను. ప్రకృతి నాతో ఎన్నోసార్లు ఆడుకుంది. 20 ఎకరాల పొలంలో 15 వేల మొక్కలు నాటితే వరదల్లో కొట్టుకుపోయాయి. నాలుగేళ్ల తర్వాత కూడా మళ్లీ అలాంటి నష్టమే జరిగింది. ఆర్థికంగా చాలా నష్టపోయాను. దివాలా తీశా లాక్డౌన్లో నేను దాచుకున్న సేవింగ్స్ అంతా ఖర్చయ్యాయి. చేతిలో చిల్లిగవ్వ లేదు. ఒక్కమాటలో చెప్పాలంటే దివాలా తీశాను. అప్పులు ఎక్కువవడంతో తీవ్ర ఒత్తిడికి లోనయ్యాను. ఆ సమయంలో నేను ఎంతో నేర్చుకున్నాను. నా పిల్లలు నన్ను రైతుగా మారిన నటుడు అని చెప్తుంటే గర్వంగా అనిపిస్తుంది' అని చెప్పుకొచ్చాడు. కాగా రాజేశ్ శర్మ.. సారాభాయ్ వర్సెస్ సారాభాయ్ అనే సీరియల్లో నటించాడు. ఇది 2004-2006 మధ్య కొనసాగిన ఈ సీరియల్ సూపర్ హిట్‌గా నిలిచింది. 2017లో దీనికి సీక్వెల్ కూడా వచ్చింది. ఆ సమయంలో గత సీరియల్ నటీనటులంతా కలిసి పార్టీ కూడా చేసుకున్నారు. చదవండి: హీరోయిన్గా బోర్ కొట్టిందంటున్న బ్యూటీ.. ఇకపై మరో టాలెంట్ చూపిస్తుందట! -
నా గర్ల్‌ఫ్రెండ్ వల్ల భార్య చాలా బాధపడింది: సీరియల్ నటుడు ప్రభాకర్
సీరియల్ యాక్టర్ ప్రభాకర్ గురించి తెలుగు ప్రేక్షకులకు కొత్తగా పరిచయం చేయాల్సిన అవసరం లేదు. గత కొన్నేళ్ల నుంచి పలు ఛానెల్స్‌లో సీరియల్స్‌తో అలరిస్తున్నాడు. తాజాగా ఓ షోకి భార్యతో సహా వచ్చిన ప్రభాకర్.. తన ప్రేమ-పెళ్లి విషయాల గురించి మాట్లాడాడు. తన గర్ల్‌ఫ్రెండ్ వల్ల భార్య బాధపడిన సందర్భాన్ని గుర్తుచేసుకున్నాడు. ఇంతకీ అసలేం జరిగింది? ఏం జరిగింది? ప్రముఖ ఛానెల్లో ప్రసారమైన ఈ షోలో ప్రభాకర్-మలయాజ పెళ్లి ఫొటోల్ని స్క్రీన్‌పై ప్లే చేయగానే.. తమది దొంగపెళ్లి అని, ఆర్య సమాజ్‌లో ఏడడుగులు వేశామని అన్నాడు. అయితే ఖమ్మం నుంచి వచ్చిన తన ఫ్రెండ్.. పెళ్లిలో కన్యాదానం చేశాడని అప్పటి సంగతుల్ని ప్రభాకర్ గుర్తుచేసుకున్నాడు. (ఇదీ చదవండి: 'బిగ్‌బాస్ 7' ఎలిమినేషన్లో ట్విస్ట్.. ఒకేసారి ఇద్దరు ఔట్!) గర్ల్‌ఫ్రెండ్ వల్ల భార్య.. 'నాకు ఓ గర్ల్‌ఫ్రెండ్ ఉండేది. ఆ విషయంలో నా భార్య చాలా బాధపడింది. ఆ సందర్భాన్ని ఎలాగోలా సరిచేసుకుని మనస్ఫూర్తిగా నా భార్యకు సారీ చెప్పాను. అయితే నేను సారీ చెప్పడం గొప్పకాదు. తను నన్ను క్షమించడం గొప్ప విషయం' అని భార్య మలయజ గురించి చెప్పాడు. ఆ తర్వాత ఆమె బుగ్గపై అందరూ చూస్తుండగానే ముద్దుపెట్టుకున్నాడు. ప్రస్తుతం ఈ షో ప్రోమో వైరల్‌గా మారింది. ఇకపోతే ప్రభాకర్ పలు సీరియల్స్ చేస్తూ బిజీగా ఉండగా, అతడి భార్య మలయజ స్వతహాగా యాక్టర్ కానప్పటికీ షార్ట్ ఫిల్మ్స్‌లో నటిస్తూ ఉంటుంది. సొంత యూట్యూబ్ ఛానెల్ కూడా ఉంది. అలానే ప్రభాకర్ కొడుకు సుహాస్ ఆటిట్యూడ్ స్టార్ గా ఇప్పటికే చాలామందికి పరిచయం. కూతురు దివిజ కూడా పలు సినిమాల్లో నటించింది. (ఇదీ చదవండి: 'బిగ్‌బాస్'లోకి వెళ్లొచ్చాక నా భార్యకి అలాంటి మెసేజులు: హీరో వరుణ్ సందేశ్) -
సినీ ఇండస్ట్రీలో విషాదం.. హార్ట్ ఎటాక్‌తో బుల్లితెర నటుడు మృతి!
ఇటీవల గుండెపోటు మరణాలు తరచుగా సంభివిస్తున్నాయి. వయసుతో సంబంధం లేకుండా ప్రతి ఒక్కరినీ ఎటాక్ చేస్తోంది. హార్ట్ ఎటాక్‌తో సంభవిస్తున్న మరణాలు ప్రతి ఒక్కరినీ కలవరపెడుతున్నాయి. తాజాగా హిందీ, తమిళ బుల్లితెర నటుడు పవన్ హార్ట్ ఎటాక్‌తో మరణించారు. అతని వయస్సు ప్రస్తుతం 25 ఏళ్లే. చిన్న వయసులోనే కార్డియాక్ అరెస్ట్‌తో కన్నుమూయడంతో సినీ పరిశ్రమలో విషాదం నెలకొంది. (ఇది చదవండి: యోగి ఆదిత్యనాథ్‌ను కలవనున్న రజనీకాంత్.. ఎందుకంటే?) పవన్ సొంత ఊరు కర్ణాటక మాండ్యా జిల్లాలోని హరిహరపుర గ్రామానికి చెందినవారు కాగా.. సరస్వతి, నాగరాజు ఆయన తల్లిదండ్రులు. యాక్టింగ్ నిమిత్తం కొంతకాలంగా పవన్ ముంబయిలోనే ఉంటున్నారు. ఈ క్రమంలోనే శుక్రవారం తెల్లవారుజామున గుండెపోటు రావటంతో ఆస్పత్రికి తరలించగా మృతి చెందారు. శుక్రవారం ఆయన మృతదేహాన్ని స్వగ్రామానికి తీసుకువచ్చి అంత్యక్రియలు నిర్వహించారు. కాగా.. పవన్ హిందీ, తమిళ భాషల్లో రాణిస్తున్నారు. ఇప్పటికే చాలా హిందీ, తమిళ టీవీ సీరియళ్లలో నటించారు. ఈ విషయం తెలుసుకున్న సినీ, రాజకీయ ప్రముఖులు సంతాపం వ్యక్తం చేస్తున్నారు. అతని మృతి పట్ల మాండ్యా ఎమ్మెల్యే హెచ్‌టీ మంజు, మాజీ ఎమ్మెల్యే కేబీ చంద్రశేఖర్ విచారం వ్యక్తం చేశారు. (ఇది చదవండి: 1990లో చిరంజీవికి ఇదే పరిస్థితి వస్తే ఆయన్ను నిలబెట్టిన సినిమా ఇదే) నటుడి భార్య కన్నుమూత ఇటీవలే కన్నడ ప్రముఖ నటుడు విజయ్ రాఘవేంద్ర భార్య స్పందన.. థాయ్‌ల్యాండ్ వెకేషన్లో ఉండగా గుండెపోటు రావడంతో హఠాత్తుగా కన్నుమూసింది. కన్నడ సూపర్ స్టార్ పునీత్ రాజ్ కుమార్ 2021లో గుండె పోటుతోనే మృతి చెందారు. ఆయన మృతి యావత్ సినీ ప్రపంచాన్ని, అభిమానులను శోకసంద్రంలో ముంచేసింది. చిన్న వయసులోనే గుండెపోటు రావడం ప్రజలను భయాందోళనకు గురి చేస్తోంది. -
ముచ్చటగా మూడోసారి విడాకులకు సిద్ధమైన బిగ్‌బాస్ కంటెస్టెంట్
బిగ్‌బాస్ కంటెస్టెంట్, నటుడు రాహుల్ మహాజన్ 48 ఏళ్ల వయసులో ముచ్చటగా మూడోసారి విడాకులు తీసుకోనున్నాడు. ఖజకిస్తాన్ మోడల్, భార్య నటల్య ఇలినాతో విడిపోయేందుకు సిద్ధమయ్యాడు. ఈ జంట గతేడాది విడాకుల కోసం దరఖాస్తు చేసిన విషయం ఇప్పుడు బయటపడింది. నాలుగేళ్లుగా వివాహబంధంలో ఉన్న జంటకు ఆది నుంచి మనస్పర్థలు తలెత్తగా.. వీలైనంత వరకు కలిసి ఉండేందుకే వారు ప్రయత్నించారని తెలుస్తోంది. అయితే కలిసుండి కొట్లాడటం కన్నా విడిపోవడమే మంచిదని వారు విడాకులకు దరఖాస్తు చేసినట్లు సమాచారం. మరి విడాకులు మంజూరయ్యాయా? లేదా? అనేది తెలియాల్సి ఉంది. మూడోసారి విడాకులు కాగా రాహుల్ 2006లో శ్వేతా సింగ్‌ను పెళ్లాడాడు. వీరిద్దరూ కేవలం రెండేళ్లపాటే కలిసుండగా తర్వాత విడిపోయారు. అనంతరం ఇతడు.. రాహుల్ దుల్హానియా లేజాయేగా అనే రియాలిటీ షోలో డింపీ గంగూలీని కలిశాడు. ఈ షోలోనే ఆమెతో ప్రేమలో పడ్డ అతడు 2010లో పెళ్లి చేసుకున్నాడు. కానీ వీరి సంసార జీవితం కూడా సవ్యంగా సాగలేదు. 2015లో వీరు చెరోదారి చూసుకున్నారు. ఆ తర్వాత 2019లో నటాషాను పెళ్లాడాడు. వీరిద్దరూ స్మార్ట్ జోడీ అనే షోలో కూడా పాల్గొన్నారు. ఇప్పుడు ఈ బంధం కూడా వర్కవుట్ కాకపోవడంతో విడాకులకు రెడీ అయ్యాడు. ఎవరికీ చెప్పాలనుకోవడం లేదు అయితే ఈసారి రాహుల్ ఈ బాధను తట్టుకోలేకపోయాడని తెలుస్తోంది. తనకు పెళ్లిబంధమే అచ్చిరావట్లేదని సన్నిహితులతో వాపోయాడట! ఇప్పుడిప్పుడే ఈ బాధ నుంచి తేరుకుని తిరిగి తన వర్క్‌పై దృష్టి పెడుతున్నాడట! ఈ విడాకుల వార్త గురించి రాహుల్‌ను ప్రశ్నించగా అతడు స్పందిస్తూ.. 'నా వ్యక్తిగత విషయాన్ని అందరికీ చెప్పడం నాకిష్టం లేదు. నా జీవితంలో ఏం జరుగుతుందనేది ఎవరికీ చెప్పాలనుకోవడం లేదు. నేనిప్పుడేదీ మాట్లాడలేను' అని చెప్పుకొచ్చాడు. చదవండి: సెంచరీ కొట్టిన మ్యూజిక్ డైరెక్టర్.. హీరోగా కొత్త సినిమా -
బుల్లితెర నటి ఇంట్లో చోరీ
చెన్నై: స్థానిక మధురవాయిల్‌లో ఒకేసారి రెండు ఇళ్లల్లో దుండగులు చోరీకి పాల్పడడం ఆ ప్రాంతంలో కలకలానికి దారి తీసింది. వివరాల్లోకి వెళితే.. ప్రముఖ బుల్లితెర నటి లతారావ్ భర్త రాజ్‌కమల్ కూడా నటుడే. వీరికి చెన్నైలోని స్థానిక మధురవాయిల్, కృష్ణానగర్ 15వ వీధిలో పెద్ద బంగ్లా ఉంది. దీనిని షూటింగ్‌లకు అద్దెకు ఇస్తుంటారు. కాగా ఈ బంగ్లాకు వేసి వున్న తాళం తెరిచి ఉందంటూ నటి లతారావ్కు సమాచారం అందింది. ఆమె లోపలికి వెళ్లి చూడగా రూ.లక్ష విలువైన ఎల్ఈడీ టీవీని ఎవరో దొంగిలించినట్లు తెలిసింది. దీంతో ఆమె వెంటనే మధురవాయిల్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. అదే ప్రాంతానికి చెందిన తిరువళ్లూర్ జిల్లా బీజేపీ నేత పొన్ ప్రభాకరన్ ఇంటి ముందు వున్న కారు కూడా చోరీకి గురైంది. దీంతో ఈ రెండు ఘటనలపై మదురవాయిల్ పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. చదవండి: ప్రముఖ సింగర్‌తో అనిరుధ్ ప్రేమాయణం -
బిగ్‌బాస్‌లో లవ్.. బుల్లితెర జంట పెళ్లి.. పిల్లల కోసం ట్రై చేస్తున్నా..
బిగ్‌బాస్ షోలో లవ్ స్టోరీలో కామన్.. కానీ ఈ ప్రేమకథలన్నీ షోకు శుభం కార్డు పడే సమయానికే ముగిసిపోతాయి. అంటే చాలామటుకు డ్రామానే ఉంటుంది. కొందరు మాత్రం నిజంగా ప్రేమించుకుని, బయటకు వచ్చాక కూడా దాన్ని కొనసాగిస్తూ ఉంటారు. అలా బిగ్‌బాస్ షోతో మొదలైన ప్రేమను పెళ్లితో పదిలపర్చుకున్న జంట ప్రిన్స్ నరూలా- యువికా చౌదరి. వీరిద్దరూ తొలిసారి హిందీ బిగ్‌బాస్ 9వ సీజన్లో కలుసుకున్నారు. అప్పటినుంచి వీరి మధ్య సమ్సమ్థింగ్ స్టార్ట్ అయింది. బిగ్‌బాస్ హౌస్‌లో హార్ట్ షేప్ పరాటా చేసి మరీ తనను మెప్పించాడు ప్రిన్స్. ఏడాది తిరిగేసరికి వీరు పెళ్లి కూడా చేసుకున్నారు. 2016 నుంచి భార్యాభర్తలుగా కలిసి జీవిస్తున్న వీరు ఎంతోకాలంగా పిల్లల కోసం ఎదురుచూస్తున్నారు. తాజాగా ఈ విషయంపై నటి యువికా చౌదరి మాట్లాడుతూ.. యుక్త వయసు రాగానే పెళ్లెప్పుడు? అని అడుగుతారు. పెళ్లి చేసుకున్నాక పిల్లల్నెప్పుడు కంటున్నావు? అని ప్రశ్నిస్తారు. ఈ ప్రశ్న వినీవినీ విసుగెత్తిపోయింది. నిజానికి మేము పెళ్లయిన వెంటనే పిల్లల కోసం ప్లాన్ చేసుకున్నాం. కానీ ఆ భగవంతుడి ఆలోచన మరోలా ఉన్నట్లుంది. అతడు రాసిన రాతను మనం మార్చలేం కదా! అని చెప్పుకొచ్చింది యువికా చౌదరి. కాగా ప్రిన్స్ నరూలా.. ఎమ్‌టీవీ రోడీస్ 19లో గ్యాంగ్స్ లీడర్స్‌లో ఒకరిగా పార్టిసిపేట్ చేస్తున్నాడు. యువికా గతేడాది వచ్చిన సైబర్ వార్ సినిమా, రూహనియత్ అనే వెబ్ సిరీస్‌లో చివరిసారిగా కనిపించింది. చదవండి: లవ్ ఎట్ ఫస్ట్ సైట్ కాదట.. లస్ట్ ఎట్ ఫస్ట్ సైట్ అంటున్న డర్టీ పిక్చర్ హీరోయిన్ -
హీరోతో కీర్తి నిశ్చితార్థం.. వంశాన్ని ముందుకు తీసుకెళ్లలేనంటూ ఎమోషనల్
సీరియల్స్ ద్వారా గుర్తింపు తెచ్చుకుని బిగ్‌బాస్ షోతో ఎంతోమంది అభిమానులను సంపాదించుకుంది నటి కీర్తి భట్. రోడ్డుప్రమాదంలో తన కుటుంబం మొత్తాన్ని కోల్పోయిన ఆమె జీవితంలో ఎన్నో కష్టనష్టాలను, బాధలను అనుభవించి ఈ స్థాయికి ఎదిగింది. యాక్సిడెంట్లో తీవ్రంగా గాయపడ్డ కీర్తి.. ఎప్పటికీ పిల్లల్ని కనలేదని వైద్యులు చెప్పారు. దీంతో ఆమె పెళ్లికి ముందే పాపను దత్తత తీసుకుని పెంచుకుంది. ఆ చిన్నారిలోనే సంతోషాన్ని వెతుక్కుంది. కానీ ఆ ఆనందం కూడా ఎంతోకాలం నిలవలేదు. బిగ్‌బాస్ ఆఫర్ వచ్చిన సమయంలోనే పాప కన్నుమూసింది. తాజాగా కీర్తి భట్ గుడ్‌న్యూస్ చెప్పింది. త్వరలోనే పెళ్లి పీటలెక్కబోతున్నట్లు తెలిపింది. ఈ మేరకు ఓ షోలో దర్శకుడు, హీరో విజయ కార్తీక్ తోటతో నిశ్చితార్థం జరిగింది. ఇందుకు సంబంధించిన ప్రోమో నెట్టింట చక్కర్లు కొడుతోంది. ఇందులో కార్తీక్, కీర్తి పూలదండలు మార్చుకున్నారు. 'నీకు నేను తోడుగా ఉంటా, సపోర్ట్‌గా ఉంటా.. నీ తల్లిదండ్రులను నా పేరెంట్స్ అనుకుంటా! నన్ను వదలకుండా ఇలాగే చూసుకో' అంటూ కంటతడి పెట్టుకుంది కీర్తి. తర్వాత వీరిద్దరూ ఉంగరాలు మార్చుకున్నారు. తనకు కాబోయే అత్తామామల గురించి కీర్తి మాట్లాడుతూ.. 'నేను వారి వంశాన్ని నెక్స్ట్ లెవల్‌కు తీసుకుని వెళ్లలేనని నాకు తెలుసు. ఆ విషయాన్ని వాళ్లకు చెప్తే ఒకటే మాట అన్నారు. నీకు పాప ఎందుకమ్మా? నువ్వే మాకు పాప.. మనం పాపను దత్తత తీసుకుందాం' అన్నారు అంటూ భావోద్వేగానికి లోనైంది కీర్తి. కీర్తికి కాబోయే భర్త కార్తీక్ విషయానికి వస్తే.. చిత్తూరులోని మదనపల్లిలో పుట్టి పెరిగిన విజయ కార్తీక్ మొదట సాఫ్ట్వేర్ కంపెనీలో పని చేశాడు. తర్వాత సినిమా మీదున్న ప్రేమతో ఉద్యోగాన్ని వదిలేసి ఇండస్ట్రీలో చేరాడు. కన్నడ భాషలో నాలుగు సినిమాల్లో హీరోగా నటించాడు. తెలుగులో ఏబీ పాజిటివ్, చెడ్డీ గ్యాంగ్ సినిమాలు చేశాడు. View this post on Instagram A post shared by @keerthi_mahesh_universe View this post on Instagram A post shared by keerthi_bhat💙 (@always_keerthibhat_fanz) చదవండి: ఈ వారం ఓటీటీలోకి 24 సినిమాలు హీరోయిన్ సీక్రెట్ పెళ్లిపై నటి సంచలన వ్యాఖ్యలు.. ఊహించని ట్విస్ట్ -
బెడ్రూమ్లో కెమెరా.. నన్ను టార్చర్ పెట్టాడు: మాజీ భర్తపై నటి ఆరోపణలు
కోలీవుడ్ బుల్లితెర జంట సంయుక్త- విష్ణుకాంత్‌ల పెళ్లి మూన్నాళ్ల ముచ్చటే అయింది. ప్రేమించి, పెద్దలను ఒప్పించి వేదమంత్రాల సాక్షిగా ఏడడుగులు వేసిన వీరిద్దరూ రెండు నెలలకే విడిపోతున్నట్లు ప్రకటించి అభిమానులకు షాకిచ్చారు. అప్పటినుంచి వీరు ఒకరిపై మరొకరు ఆరోపణలు చేసుకుంటూ తరచూ వార్తల్లో నిలుస్తున్నారు. మొదట విష్ణుకాంత్.. సంయుక్త తన మాజీ ప్రియుడిని ఇంకా మర్చిపోలేదని, తనకు గతంలో ఒక లవ్ స్టోరీ ఉందన్న విషయాన్ని కూడా చెప్పలేదంటూ ఆమెకు సంబంధించిన ఓ ఆడియో క్లిప్ లీక్ చేశాడు. అది నెట్టింట వైరల్ అవడంతో పలువురూ సంయుక్తను తిట్టిపోశారు. ఈ క్రమంలో తానే తప్పూ చేయలేదని, విష్ణుకాంతే తనకు నరకం చూపించేవాడని ఆరోపించింది నటి. శారీరకంగా, మానసికంగా వేధించాడంటూ సంచలన ఆరోపణలు చేసింది. అడల్ట్ వీడియోలు చూడమని బలవంతం చేసేవాడని, తనతో హింసాత్మకంగా ప్రవర్తించేవాడంది. బెడ్రూమ్లో కెమెరా పెట్టి అన్నింటినీ రికార్డు చేయడానికి ప్రయత్నిస్తే తాను వ్యతిరేకించానని చెప్పుకొచ్చింది. తనను భార్యగా కాకుండా వ్యభిచారిలా చూశాడని కన్నీళ్లు పెట్టుకుంది. తనకు అలర్జీ వచ్చినప్పుడు ఆస్పత్రికి వెళ్తానంటే అంగీకరించలేదని, అప్పుడు ఎంతో బాధేసిందని ఆవేదన వ్యక్తం చేసింది సంయుక్త. అయితే సంయుక్త ఆరోపణలను విష్ణుకాంత్ తిప్పికొట్టాడు. 'ఆమె ఇప్పటికీ తన తప్పు ఒప్పుకోవడం లేదు. తనను తాను రక్షించుకోవడానికి నా మీద నిందలు మోపుతోంది. తను చెప్పేది నిజమైతే అందుకు తగ్గ సాక్ష్యాలు చూపించాలిగా. నేను శారీరకంగా, లైంగికంగా టార్చర్ పెట్టానంటోంది. మరి చూడటానికి ఆరోగ్యంగానే కనిపిస్తుందిగా! సంయుక్త చెపుతోందంతా అబద్ధం. నేను ఎటువంటి తప్పు చేయలేదు. నా ప్రతిష్టను దిగజార్చేందుకే ఆమె ఇదంతా చేస్తోంది. సాక్ష్యాధారాలు లేకుండా ఆమె చెప్పే మాటలను ఎవరూ నమ్మకండి' అని కోరాడు. చదవండి: ఒక్క సినిమాతో ఫేమస్.. తల్లి కాబోతున్న నటి -
బిగ్‌బాస్‌తో పాపులారిటీ.. హీరోగా వరుస అవకాశాలు
నటుడు కవిన్ సక్సెస్ఫుల్ హీరోగా ఎదుగుతున్నారు. టీవీ సీరియల్ ద్వారా పరిచయమైన ఈయన ఆ తర్వాత బిగ్ బాస్ రియాల్టీ గేమ్ షోతో మరింత పాపులర్ అయ్యారు. దీంతో కవీన్‌కు సినిమా అవకాశాలు రావడం మొదలు పెట్టాయి. అలా ఆయన నటించిన లిఫ్ట్ చిత్రం ఓటీటీలో స్ట్రీమింగ్ అయినా మంచి పేరు తెచ్చి పెట్టింది. ఇటీవల కవిన్ కథానాయకుడిగా నటించిన డాడా చిత్రం మంచి విజయాన్ని సాధించింది. కాగా తాజాగా మరో నూతన చిత్రంలో నటించడానికి సిద్ధమయ్యారు ఇందులో ఆయనకు జంటగా అయోత్తి చిత్రం ఫేమ్ ప్రీతి ఇస్రాణి నాయకగా నటిస్తోంది. ఈ చిత్రాన్ని ఇంతకుముందు పలు విజయవంతమైన చిత్రాలను నిర్మించిన రోమియో పిక్చర్స్ సంస్థ అధినేత రాహుల్ నిర్మిస్తున్నారు. ఈ చిత్రం ద్వారా నృత్య దర్శకుడు, నటుడు సతీష్ దర్శకుడుగా పరిచయం అవుతున్నారు. దీనికి యువ క్రేజీ సంగీత దర్శకుడు అనిరుధ్ సంగీతాన్ని అందిస్తున్నారు. ఇంకా పేరు నిర్ణయించని ఈ చిత్రం శుక్రవారం చైన్నెలో పూజాకార్యక్రమాలతో ప్రారంభమైంది. చైన్నె పరిసర ప్రాంతాల్లో షూటింగును నిర్వహించి పూర్తిచేయనున్నట్లు దర్శకుడు తెలిపారు. ఇది ఈతరం యువతను ఆకట్టుకునే విధంగా కమర్షియల్ అంశాలతో కూడిన ఎంటర్టైనర్ కథా చిత్రంగా ఉంటుందని ఆయన పేర్కొన్నారు. -
హోటల్లో విగతజీవిగా కనిపించిన నటుడు
చలనచిత్ర పరిశ్రమలో మరో విషాదం చోటు చేసుకుంది. ప్రముఖ నటుడు నితేశ్ పాండే(51) కన్నుమూశారు. మహారాష్ట్రలోని నాసిక్‌లో గత రాత్రి షూటింగ్ ముగించుకుని హోటల్లో విశ్రాంతి తీసుకున్న నితీశ్ విగతజీవిగా కనిపించారు. గుండెపోటుతో ఆయన మరణించి ఉండవచ్చని భావిస్తున్నారు. పోలీసులు ఈ ఘటనపై కేసు నమోదు చేసుకుని విచారణ ప్రారంభించారు. కాగా ఆయన మృతి పట్ల పలువురు సెలబ్రిటీలు విచారం వ్యక్తం చేస్తున్నారు. నితేశ్ మరణవార్తపై ఆయన బంధువు, నిర్మాత సిద్దార్థ్ నగర్ స్పందిస్తూ.. 'అవును, ఆయన మనల్ని వదిలి వెళ్లిపోయారు. నా సోదరి అర్పిత పాండే(నితేశ్ భార్య) షాక్‌లో ఉంది. ఆమెతో పాటు నితేశ్ తండ్రి కూడా మధ్యాహ్నంకల్లా ఇక్కడ ఉంటారు. మాకంతా షాకింగ్‌గా ఉంది. మాటలు రావడం కూడా కష్టమవుతోంది. తను నా కంటే చిన్నవాడు. తనకెలాంటి అనారోగ్య సమస్యలు లేవు' అని తెలిపారు. కాగా నితేశ్ ప్రముఖ టీవీ సీరియల్ అనుపమతో పాటు కుచ్ తో లాగ్ కహేంగే, ప్యార్ కా దర్ద్ మీఠా మీఠా ప్యారా ప్యారా, ఏక్ రిష్తా సాజేదారి కా వంటి పలు సీరియల్స్‌లో నటించారు. బుల్లితెరపైనే కాకుండా వెండితెరపై కూడా సత్తా చాటారు. ఓం శాంతి ఓమ్ సినిమాలో షారుక్ ఖాన్ అసిస్టెంట్‌గా నటించారు. బదాయి దో, దబాంగ్ 2, మదారి వంటి పలు చిత్రాల్లో నటించారు. అభయ్, వాట్ ద ఫోక్స్ వంటి పలు వెబ్ సిరీస్‌లోనూ యాక్ట్ చేశారు. చదవండి: హీరోయిన్ రంభ కూతురిని చూశారా? అచ్చం తల్లిలాగే ఉందిగా విషాదం.. కారు ప్రమాదంలో నటి మృతి -
తనకంటే చిన్నవాడితో లవ్.. రెండేళ్లకే బ్రేకప్ చెప్పిన నటి
బుల్లితెర జంట జీషన్ ఖాన్, రేహ్న పండిత్(రేహ్న మల్హోత్రా) విడిపోయారంటూ గత కొంతకాలంగా పుకార్లు షికార్లు చేస్తున్నాయి. తాజాగా అదే నిజమైంది. తమ మధ్య ప్రేమబంధం ముగిసిందని నటి రేహ్న వెల్లడించింది. ఆమె మాట్లాడుతూ.. 'జీషన్‌తో నా ప్రయాణం ముగిసింది. మేమిద్దరం కలిసి ఉండట్లేదు. మళ్లీ కలవాలన్న ఆలోచన కూడా లేదు. గతకొంతకాలంగా జరుగుతున్న ప్రచారానికి తెరదించాలనుకున్నాను. అందుకే ఈ విషయం చెప్తున్నా. ఇక మీదట జీషన్ గురించి నన్ను ఎటువంటి ప్రశ్న అడగకండి. ఎందుకంటే అంతా అయిపోయింది. ఇక్కడితో దీన్ని వదిలేయండి' అని చెప్పుకొచ్చింది. అటు జీషన్ కూడా 'అవును, బ్రేకప్ చెప్పుకున్నాం. ఇక మీదట దీని గురించి మాట్లాడాలనుకోవడం లేదు. నా వైపు నుంచి చివరిసారిగా రేహ్నకు వీడ్కోలు చెబుతున్నా' అని తెలిపాడు. కాగా జీషన్, రేహ్న కుంకుమ్ భాగ్య సీరియల్ సెట్లో కలిశారు. అప్పటినుంచే ప్రేమలో ఉన్నారు. 2021 అక్టోబర్‌లో తమ ప్రేమను అధికారికంగా వెల్లడించారు. జీషన్ కన్నా రేహ్న వయసులో పెద్దదైనప్పటికీ ఎప్పుడూ తమ మధ్య పొరపచ్చాలు రాలేదని వీరు గతంలో చెప్పుకొచ్చారు. ఏమైందో ఏమో కానీ సడన్‌గా గత నెలలో రేహ్నాతో బ్రేకప్ అయిందని పోస్ట్ పెట్టాడు జీషన్. మళ్లీ ఆ వెంటనే.. అలాంటిదేమీ లేదని కలిసిపోయామని క్లారిటీ ఇచ్చారు. కాకపోతే కొన్ని గొడవలు జరిగాయని, ఇద్దరం వాటి నుంచి బయటపడి ఒకరినొకరు అర్థం చేసుకుని కలిసిపోవడానికి సమయం పట్టిందన్నారు. ఒక్కసారి ప్రేమించాక జీవితాంతం తన చేయి వదలనని చెప్పాడు జీషన్. గొడవలకు ముగింపు పలికి మళ్లీ కలిసిపోయారనుకుంటున్న సమయంలో శాశ్వతంగా విడిపోతున్నట్లు వెల్లడించి ఫ్యాన్స్‌కు షాకిచ్చింది జంట. చదవండి: రష్మికను నేనేమీ అనలేదు: ఐశ్వర్య రాజేశ్ -
పెళ్లైన రెండు నెలలకే భర్తతో విడాకులు? నటి ఇన్‌స్టా పోస్ట్ వైరల్
సినిమా ఇండస్ట్రీలో ప్రేమలు, బ్రేకప్‌లు ఎంత కామనో, పెళ్లిళ్లు, విడాకులు కూడా అంతే కామన్‌గా మారింది. ఎంతో అన్యోన్యంగా కనిపించిన జంటలు కొద్దికాలానికే విడిపోతున్నారు. అలా ఇండస్ట్రీలో ఇప్పటికే పలువురు విడాకులు తీసుకొని ఎవరిదారి వాళ్లు చూసుకున్నారు. తాజాగా మరో సినీ జంట కూడా విడాకులు తీసుకున్నారు. అయితే పెళ్లి చేసుకున్న రెండు నెలలకే వాళ్లు ఈ నిర్ణయానికి రావడం గమనార్హం. తమిళంలోని ప్రముఖ సీరియల్ ‘సిప్పినీల్ ముత్తు’ లో సంయుక్త-విష్ణుకాంత్ కలిసి నటించారు. వారి పరిచయం ప్రేమకు దారితీసింది. కొన్నాళ్ల డేటింగ్ అనంతరం పెద్దలను ఒప్పించి మార్చి 3న వైభవంగా పెళ్లి చేసుకున్నారు. చూడముచ్చటగా కనిపించే ఈ జంట మొదట్లో బాగానే ఉన్నా ఆ తర్వాత కలిసుండలేమంటూ ప్రకటించారు. సోషల్ మీడియాలో తమ పెళ్లి ఫోటోలన్నింటిని డిలీట్ చేసి షాకిచ్చారు. చదవండి: హీరో అజిత్ రీల్ కూతురు చనిపోయినట్లు పోస్టర్ కలకలం అంతేకాకుండా ఇద్దరూ ఇన్‌స్టాలో స్పెషల్ నోట్‌తో విడిపోతున్నాం అంటూ ఇన్‌డైరెక్ట్ కోట్స్ చేస్తున్నారు. విష్ణుకాంత్ తన ఇన్‌స్టా స్టోరీలో.. 'ఎఫైర్స్ నిజమైన ప్రేమను ఫేక్ లవ్‌గా మార్చేస్తాయి. నో మోర్ సైలెన్స్' అంటూ ఓ పోస్ట్ చేశాడు. సంయుక్తా కూడా.. 'ఒక మహిళను శక్తివంతంగా ఎదుర్కోలేనప్పుడు ఇలాంటి నిందలు వేస్తారు.. ఫేక్‌లవ్' అంటూ ఇన్‌స్టా స్టోరీ లో పంచుకుంది. ఇది కొత్త జీవితానికి ఆరంభం అని, ఇప్పట్నుంచి మరింత ధృడంగా ముందుకు వెళ్తానంటూ పేర్కొంది. ప్రస్తుతం కోలీవుడ్‌లో వీరి విడాకుల వ్యవహారం హాట్‌టాపిక్‌గా మారింది. పెళ్లైన రెండు నెలలకే విడిపోవడం ఏంటని పెదవి విరుస్తున్నారు. చదవండి: బాయ్‌ఫ్రెండ్‌తో రొమాంటిక్ వీడియోను షేర్ చేసిన హీరోయిన్ -
నవ్యస్వామితో డేటింగ్‌పై క్లారిటీ ఇచ్చిన 'విరూపాక్ష' నటుడు
బుల్లితెర నటుడు రవికృష్ణ-నవ్య స్వామి జోడీకి ఉన్న క్రేజ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ఓ సీరియల్లో జంటగా నటించిన వీరిద్దరు అప్పట్నుంచి ఎక్కడ చూసిన జంటగా కనిపిస్తున్నారు. పలు ఎంటర్టైన్మెంట్ షోలకి జంటగా వెళ్తున్నారు. ఈ క్రమంలో వీరి మధ్య సంథింగ్ సంథింగ్ అంటూ ఎప్పట్నుంచో వార్తలు వస్తున్నాయి. ఇద్దరూ ప్రేమలో ఉన్నారని అందుకే కలిసి ఇన్ని ప్రాజెక్టులు చేస్తున్నారంటూ గుసగుసలు వినిపిస్తున్నాయి. అయితే ఈ వార్తలపై అలాంటిదేమీ లేదు, మేం జస్ట్ ఫ్రెండ్స్ అంటూ ఎప్పట్నుంచో సమాధానం ధాటేస్తున్న రవికృష్ణకు తాజాగా మరోసారి ఇలాంటి ప్రశ్నే ఎదురైంది. మీకు, నవ్యస్వామికి ఉన్న రిలేషన్ ఏంటని యాంకర్ ప్రశ్నించగా.. సీరియల్లోనే తాము మొదటిసారి కలుసుకున్నామని, అప్పట్నుంచి తమ మధ్య మంచి స్నేహం ఉందని తెలిపాడు. అయితే ఒకవేళ నవ్యస్వామి వచ్చి ప్రపోజ్ చేస్తే మాత్రం ఆలోచిస్తాను అంటూ ఆమెతో రిలేషన్‌షిప్‌పై ఇండైరెక్ట్ హింట్ ఇచ్చాడు. ప్రస్తుతం రవికృష్ణ చేసిన ఈ కామెంట్స్ నెట్టింట వైరల్‌గా మారాయి. ఇక రీసెంట్గా విరూపాక్ష సినిమాలో రవికృష్ణ కీలక పాత్రలో కనిపించి ఆకట్టుకున్న సంగతి తెలిసిందే. -
15 ఏళ్ల బంధానికి ముగింపు.. బాలీవుడ్ జంట విడాకులు!
బాలీవుడ్ జంట బర్క బిష్త్, ఇంద్రనీల్ సేన్‌గుప్తా కొంతకాలంగా దూరంగా ఉంటున్న సంగతి తెలిసిందే! వీరిద్దరూ ఎప్పటికైనా కలిసిపోతారని అనుకుంటున్న సమయంలో శాశ్వతంగా విడిపోవాలని నిశ్చయించుకున్నట్లు తెలిపి ఫ్యాన్స్‌కు షాకిచ్చారు ఈ దంపతులు. తాజాగా ఓ ఇంటర్వ్యూలో తాము విడాకులు తీసుకుంటున్నట్లు వెల్లడించింది బర్క. 'అవును, మేము విడాకులు తీసుకుంటున్నాం. త్వరలోనే అందుకు సంబంధించిన పత్రాలు వచ్చేస్తాయి. నా జీవితంలో తీసుకున్న అత్యంత కఠిన నిర్ణయమిదే! నేను ఇప్పుడు సింగిల్ మదర్‌ను. నా కూతురు మీరాయే నా సర్వస్వం. ప్రస్తుతం ఓటీటీలో కొన్ని మంచి ప్రాజెక్టులలో నటిస్తున్నాను. టీవీ, సినిమాల్లో అవకాశాలు వచ్చినా చేసేందుకు సిద్ధం' అని చెప్పుకొచ్చింది బర్క. కాగా బర్క, ఇంద్రనీల్.. 'ప్యార్ కె దో నామ్- ఏక్ రాధ, ఏక్ శ్యామ్' అనే సీరియల్లో జంటగా నటించారు. 2007లో వచ్చిన ఈ సీరియల్ సెట్స్‌లోనే వీరిద్దరూ ప్రేమలో పడ్డారు. డ్యాన్స్ షో నాచ్ బలియే మూడో సీజన్లోనూ వీరిద్దరూ జంటగా పాల్గొన్నారు. 2008 మార్చిలో వివాహం చేసుకున్న వీరికి మీరా అనే కూతురు జన్మించింది. ఏమైందో ఏమో కానీ, గత రెండేళ్లుగా వీరిద్దరూ విడివిడిగానే జీవిస్తున్నారు. ఈ క్రమంలోనే విడాకులు తీసుకుంటున్నారు. బర్క.. బుల్లితెరపై ప్రసారమయ్యే సీరియల్స్‌తో పాటు రాజ్‌నీతి వంటి పలు చిత్రాల్లోనూ నటించింది. ఇంద్రనీల్.. హిందీ, బెంగాలీ భాషల్లో అనేక సినిమాల్లో నటించాడు. తెలుగులో ఐతే 2లోనూ ముఖ్య పాత్ర పోషించాడు. ఇకపోతే ఇంద్రనీల్ బెంగాలీ నటి ఇషా సాహాతో డేటింగ్ చేస్తున్నట్లు కొంతకాలంగా ప్రచారం జరుగుతోంది. మరోవైపు బర్క కూడా నటుడు ఆశిశ్ శర్మతో ప్రేమాయణం సాగిస్తున్నట్లు ఊహాగానాలు వెలువడ్డాయి. ఈ రిలేషన్‌షిప్‌పై ఇంతవరకు వీరెవరూ స్పందించనేలేదు. చదవండి: సైలెంట్‌గా ఓటీటీలోకి వచ్చేసిన రావణాసుర -
Kannada TV Actor Sampath J Ram: సినీ ఇండస్ట్రీలో విషాదం.. యువ నటుడు ఆత్మహత్య!
సినీ ఇండస్ట్రీలో విషాదం నెలకొంది. ప్రముఖ కన్నడ బుల్లితెర నటుడు సంపత్ జె. రామ్(35) సూసైడ్ చేసుకున్నారు. ఈ విషయాన్ని సహా నటుడు రాజేశ్ ధృవ తన ఫేస్బుక్లో వెల్లడించారు. ఈ విషయం తెలుసుకున్న కన్నడ ఇండస్ట్రీ విషాదంలో మునిగిపోయింది. సంపత్ శనివారం రాత్రి బెంగళూరు నెలమంగళలోని తన నివాసంలో ఆత్మహత్యకు పాల్పడ్డారు. కాగా.. సంపత్ ఇటీవల తగినన్నీ అవకాశాలు లేకపోవడంతో డిప్రెషన్‌తో బాధపడుతున్నట్లు తెలుస్తోంది. ఆయన స్వగ్రామమైన కర్ణాటకలోని చిక్ మంగళూరు జిల్లా నరసింహరాజపురలో అంత్యక్రియలు నిర్వహించనున్నారు. సంపత్ 'అగ్నిసాక్షి' సీరియల్‌తో గుర్తింపు తెచ్చుకున్నారు. అతని మృతిపై మరో నటుడు రాజేశ్ ధృవ ఎమోషనల్ నోట్ రాసుకొచ్చారు. 'నువ్వు ఇంకా చాలా సినిమాలు చేయాలి.. చాలా పోరాటం మిగిలి ఉంది. మీ కలలను సాకారం చేసుకోవడానికి ఇంకా సమయం ఉంది. దయచేసి తిరిగి రండి.' భావోద్వేగానికి గురయ్యారు. -
గర్ల్‌ఫ్రెండ్ సూసైడ్.. 3 ఏళ్ల తర్వాత నటిని పెళ్లాడిన నటుడు
బుల్లితెర నటీనటులు షీన్ దాస్, రోహన్ రాయ్ వైవాహిక బంధంలో అడుగుపెట్టారు. పియా అల్బెలా సీరియల్లో నటించిన వీరిద్దరూ ఏప్రిల్ 22న మూడుముళ్ల బంధంతో ఒక్కటయ్యారు. కశ్మీర్లో అత్యంత సన్నిహితుల సమక్షంలో వేడుకగా వీరి వివాహం జరిగింది. తమ పెళ్లి ఫోటోలను షీన్ దాస్ సోషల్ మీడియా వేదికగా అభిమానులతో పంచుకుంది. ప్రస్తుతం ఈ ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి. షీన్ దాస్ ఎరుపు రంగు చీరలో మెరిసిపోతుండగా కొత్త పెళ్లికొడుకు రోహన్ గోల్డెన్ షేర్వానీ ధరించాడు. వీరిని చూసిన అభిమానులు ఎంత ముచ్చటగా ఉన్నారో అంటూ కొత్త జీవితం ఆరంభించిన నూతన దంపతులకు శుభాకాంక్షలు చెప్తున్నారు. కాగా రోహన్ రాయ్‌కు గతంలో దిశా సాలిన్తో ఎంగేజ్మెంట్ జరిగింది. దివంగత నటుడు సుశాంత్ సింగ్ రాజ్‌పుత్‌కు ఆమె మేనేజర్‌గా వ్యవహరించింది. 2020లో సుశాంత్ ఆత్మహత్య చేసుకోవడానికి కొన్ని రోజుల ముందు దిశ 14వ అంతస్థు నుంచి దూకి మరణించింది. ఆ తర్వాత తీవ్ర బాధలో కూరుకుపోయిన రోహన్ రాయ్ అనుకోకుండా షీన్ దాస్‌తో ప్రేమలో పడ్డాడు. తనతో ఏడడుగులు నడిచి ప్రేమను పెళ్లి బంధంతో పదిలపర్చుకున్నాడు. View this post on Instagram A post shared by LEVEL UP STUDIO®️ (@levelupstudio01) View this post on Instagram A post shared by Zool Production (@zool_production) View this post on Instagram A post shared by Zool Production (@zool_production) View this post on Instagram A post shared by ♡Sheen🧸 (@sheenkiduniya) చదవండి: పిచ్చి వేషాలు అని తిట్టిన నిర్మాతకు ఇచ్చిపడేసిన సామ్ -
చిరంజీవితో పోలికే నాకు మైనస్.. రాజ్ కుమార్ కామెంట్స్ వైరల్!
సినీ ఇండస్ట్రీలో రాజ్ కుమార్ గురించి పెద్దగా తెలియని వారు ఉండరు. 30 ఏళ్లుగా వెండితెరపై తనదైన నటనతో మెప్పించారు. ఇప్పటికీ సినీ ఇండస్ట్రీలో కొనసాగుతున్నారు. టాలీవుడ్లో జూనియర్ చిరంజీవిగా గుర్తు పొందిన రాజ్ కుమార్ ఎన్నో సినిమాల్లో, సీరియల్స్‌లోనూ నటించారు. ప్రస్తుతం సినిమాలకు దూరంగా ఉంటున్న ఆయన సీరియల్స్‌లో నటిస్తున్నారు. తాజాగా ఓ యూట్యూబ్ ఛానెల్‌కు ఇచ్చిన ఇంటర్య్వూలో పలు ఆసక్తికర విషయాలను పంచుకున్నారు. రాజ్ కుమార్ మాట్లాడుతూ.. 'చిరంజీవి లాగా పోలికలు ఉండటం నా అదృష్టం. కానీ అలా ఉండటం వల్లే నేను హీరోగా సక్సెస్ కాలేక ఇక్కడే మిగిలిపోయా. నేను చిరంజీవి పోలికలతో ఉండటం చూసేవారికి గొప్పగా ఉంటుంది. కానీ ఇండస్ట్రీలో మాత్రం అది నాకు మైనస్ పాయింట్. మెగాస్టార్ పోలికలతో ఉన్నందుకు గర్వపడతా. చిరంజీవిలా ఉంటానే కానీ.. ఆయనకు ఎక్కడా కూడా సరిపోను. ఆయనొక దిగ్గజం. నన్ను ఆయనతో పోల్చే సరికి మర్రిచెట్టు కింద కలుపు మొక్కలా అయిపోయా. తెలుగులో జూనియర్ చిరంజీవిగా ఇండస్ట్రీలో గుర్తింపు రావడంతో కన్నడ ఇండస్ట్రీకి వెళ్లిపోయా. నేను, శ్రీకాంత్, విక్రమ్, అజిత్, ఆనంద్ ఒకేసారి ఇండస్ట్రీకి వచ్చాం. చిరంజీవి నన్ను తొక్కేశారన్నారు. అలా జరిగి ఉంటే నేను సీరియల్స్‌లో కూడా కనిపించేవాడిని కాదు.' అంటూ ఎమోషనలయ్యారు. కాగా.. ప్రస్తుతం రాజ్ కుమార్ సీరియల్స్‌లో నటిస్తూ బిజీగా ఉన్నారు. చిరంజీవి చేతుల మీదుగా అవార్డు అందుకోవటం సంతోషంగా ఉందని పేర్కొన్నారు. ప్రస్తుతం రాజ్ కుమార్ చేసిన వ్యాఖ్యలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. రాజ్ కుమార్ ప్రస్తుతం జనని, కేరాఫ్ అనసూయ వంటి సీరియల్స్‌లో నటిస్తున్నారు. -
త్వరలో పేరెంట్స్ కాబోతున్న బుల్లితెర జంట
బుల్లితెర జంట గౌతమ్ రోడ్, పంఖురి అవస్థి త్వరలో పేరెంట్స్ కాబోతున్నారు. మరో మూడు నెలల్లో ఈ ప్రపంచంలోకి అడుగుపెట్టనున్న బేబీకి స్వాగతం చెప్పేందుకు ఎంతో ఎగ్జయిట్‌గా ఉన్నారీ దంపతులు. పంఖురి అవస్థి గర్భం దాల్చిన ఆరు నెలల తర్వాత ఈ గుడ్‌న్యూస్‌ను అభిమానులకు వెల్లడించింది. తాజాగా ఓ ఇంటర్వ్యూలో గౌతమ్ మాట్లాడుతూ.. 'తండ్రిని కాబోతున్నందుకు చాలా సంతోషంగా ఉంది. ఒక్కసారి తండ్రయ్యావంటే నీకు రాత్రిళ్లు నిద్ర ఉండదని చాలామంది చెప్తున్నారు. సరే, అయితే నేను రాత్రంతా వర్కవుట్స్ చేస్తా. ఉదయం ఎలాగో నా భార్య బేబీని చూసుకుంటుంది. రాత్రిళ్లు ఆ బాధ్యత నేను తీసుకుంటా. పంఖురికి ఇప్పుడు ఆరో నెల. కడుపులో బిడ్డ తంతోది కూడా! ఎప్పుడెప్పుడు బిడ్డను ఎత్తుకుందామా? అని ఎంతగానో ఎదురుచూస్తున్నాం' అని చెప్పుకొచ్చాడు. పంఖురి మాట్లాడుతూ.. 'గర్భంతో ఉన్న రోజులన్ని నాకెంతో ప్రత్యేకం. నా శరీరంలో ఎన్నో మార్పులు వచ్చాయి. అన్నీ నా మంచికే! మొదట నాకు పీరియడ్స్ రాకపోతే లేట్‌గా వస్తుందేమో అనుకున్నాను. దాన్ని ఎక్కువగా పట్టించుకోలేదు. గౌతమ్ నిద్రపోయిన తర్వాత రాత్రి నేను ఓసారి టెస్ట్ చేసుకున్నాను. పాజిటివ్ వచ్చింది. ఎంత ఆనందం వేసిందో! పెళ్లైన ఐదేళ్లకు పేరెంట్స్ కాబోతున్నాం. త్వరలో అమ్మను కాబోతున్నందుకు పట్టలేనంత సంతోషంగా ఉంది' అని చెప్పుకొచ్చింది. కాగా పంఖురి.. రజియా సుల్తాన్, యే హై ఆషికీ, సూర్యపుత్ర కర్ణ్, మేడమ్ సర్ వంటి పలు సీరియల్స్‌లో నటించింది. గౌతమ్ రోడ్ విషయానికి వస్తే అతడు బా బహు ఔర్ బేబీ, లక్కీ, సూర్యపుత్ర కర్ణ్, సరస్వతీ చంద్ర, కాలభైరవ రహస్య 2 వంటి సీరియల్స్‌లో యాక్ట్ చేశాడు. View this post on Instagram A post shared by Gautam Rode (@rodegautam) View this post on Instagram A post shared by Pankhuri Awasthy Rode (@pankhuri313) -
కేవలం గుడ్లు, రోటీలతోనే బతికా: సర్దార్ గబ్బర్ సింగ్ నటుడు
బాలీవుడ్ నటుడు శరద్ కేల్కర్ మొదట బుల్లితెర నటుడిగా ఇండస్ట్రీలో అడుగుపెట్టారు. ఆ తర్వాత వాయిస్ ఓవర్ ఆర్టిస్ట్‌గా కూడా రాణించారు. శరద్ 2004లో హిందీ సినిమా హల్ చల్ ద్వారా సినీరంగంలోకి అడుగు పెట్టారు. శరద్ హిందీతో పాటు తెలుగు, తమిళ్, మరాఠి భాషా సినిమాల్లో నటించారు. టాలీవుడ్లో సర్దార్ గబ్బర్ సింగ్ మూవీలో రాజా భైరోన్ సింగ్ పాత్రలో నటించారు. అయితే తన కెరీర్ ప్రారంభంలో ఎదురైన అనుభవాలను ఇటీవల ఓ ఇంటర్వ్యూలో పంచుకున్నారు. 2002లో ముంబయికి వచ్చాక చిత్ర పరిశ్రమలో ఎదురైన కష్టాలను గుర్తుచేసుకున్నాడు. ఇటీవల ఆయన పాల్గొన్న సైరస్ బ్రోచా పాడ్‌కాస్ట్‌లో ఈ విషయాలను వెల్లడించారు. శరద్ కేల్కర్ మాట్లాడుతూ.. 'నేను బాంద్రాలోని బజార్ రోడ్లో ఒక గదిలో ఉండేవాన్ని. ఒకే రూమ్‌లో తొమ్మిది మంది కలిసి ఉండేవాళ్లం. అదే రూమ్‌ను రాజస్థానీ డాబాగా ఉపయోగించేది. అక్కడ ఒక చపాతీ 2 రూపాయలకు అమ్మేవారు. అక్కడే నేను గ్యాస్ సిలిండర్లు చూసుకునేవాడిని. అందుకు వారితో నా ఒప్పందం రోజుకు నాలుగు గుడ్లు, రెండు రోటీలు. అది రెండుపూటలా ఇవ్వాలి. నేను అలా రోజుకు రూ. 25తోనే బతికా. మేము ఏదైనా పని దొరికినప్పుడు మాత్రమే పార్టీ చేసుకునేవాళ్లం. అప్పట్లో తాను పనిచేసే జిమ్‌లో నెలకు రూ. 2750 సంపాదించేవాడిని. ఆ తర్వాత ఓ ఫ్యాషన్ షోలో రూ. 5000 ఆఫర్ చేసినప్పుడు చాలా సంతోషంగా అనిపించింది.' అని అన్నారు. -
త్వరలో తల్లి కాబోతున్న దృశ్యం నటి, బేబీ బంప్ ఫోటోలు వైరల్
బాలీవుడ్ జంట ఇషితా దత్తా, వత్సల్ సేత్ త్వరలో తల్లిదండ్రులు కాబోతున్నారు. ఈ శుభవార్తను బీటౌన్ కపుల్ సోషల్ మీడియా వేదికగా అభిమానులతో పంచుకుంది. సముద్ర తీరంలో ఇషితా బేబీ బంప్‌కు వాత్సల్ ఆప్యాయంగా ముద్దు పెట్టిన ఫోటోలను ఇరువురూ ఇన్స్టాగ్రామ్ ఖాతాలో షేర్ చేశారు. దీనికి బేబీ ఆన్ బోర్డ్ అని క్యాప్షన్ జోడించారు.. దీంతో సెలబ్రిటీలు, అభిమానులు ఈ జంటకు శుభాకాంక్షలు తెలుపుతున్నారు. ఇకపోతే ప్రస్తుతం ఈ దంపతులు తమ కుటుంబంతో గోవాలో వెకేషన్ ఎంజాయ్ చేస్తున్నారు. అమ్మ కాబోతున్న ఆనంద క్షణాల కోసం ఎదురు చూస్తున్నానంటోంది ఇషిత. 'నాకెంతో ఎగ్జయిటింగ్‌గా ఉంది. అంతా కొత్తగా అనిపిస్తోంది. కడుపులో ఓ బిడ్డ పెరుగుతుందంటే ఆ అనుభవమే ఎంతో డిఫరెంట్‌గా ఉంది' అని చెప్పుకొచ్చింది. వాత్సల్ మాట్లాడుతూ.. మా పెళ్లై ఐదేళ్లవుతోంది. కెరీర్లో సెటిలయ్యాక పిల్లల గురించి ఆలోచించాలి వంటి నిబంధనలేమీ పెట్టుకోలేదు. జీవితంలో పెళ్లనేది ఎంత ముఖ్యమైన ఘట్టమో పిల్లలు మన లైఫ్‌లోకి రావడం కూడా అంతే ముఖ్యమైన విషయం. పనెప్పుడూ ఉండేదే, కానీ మన కుటుంబంలోకి చిన్నారి వస్తుందంటే జీవితంలో అందమైన అధ్యాయానికి తెర దీసినట్లే' అని పేర్కొన్నాడు. కాగా ఏక్ ఘర్ బనౌంగా, బేపనా ప్యార్, తోడా సా బాదల్ తోడా సా పాని వంటి సీరియల్స్‌లో నటించిన ఇషితా సినిమాల్లోనూ యాక్ట్ చేసింది. హిందీ దృశ్యం, దృశ్యం 2లో సినిమాల్లో తన నటనతో అభిమానులను కట్టిపడేసింది. వాత్సల్ సేత్ విషయానికి వస్తే అతడు నటుడు, మోడల్ కూడా! వాత్సల్ సీరియల్స్‌తో పాటు సినిమాల్లోనూ నటించాడు. టార్జాన్: ద వండర్ కార్, హీరోస్, హాస్టల్, మలంగ్ వంటి పలు చిత్రాల్లో నటించాడు. ఆదిపురుష్ సినిమాలో ఇంద్రజిత్తు పాత్ర పోషిస్తున్నాడు. View this post on Instagram A post shared by Ishita Dutta Sheth (@ishidutta) -
తండ్రైన ‘ఉరి’ నటుడు.. పండంటి ఆడబిడ్డకు జన్మనిచ్చిన ఆయన భార్య
ప్రముఖ బాలీవుడ్ నటుడు మోహిత్ రైనా తండ్రి అయ్యాడు. శుక్రవారం ఆయన భార్య అదితి శర్మ పండంటి ఆడబిడ్డకు జన్మనిచ్చింది. ఈ విషయాన్ని మోహిత్ స్వయంగా సోషల్ మీడియా వేదికగా ప్రకటించారు. కూతురు వేలు పట్టుకుని ఉన్న ఫొటోను షేర్ చేస్తూ మోహిత్ మురిసిపోయాడు. ‘మేము ఇద్దరం కాస్తా ముగ్గురం అయ్యాం. ఈ ప్రపంచంలోకి మా బేబీ గర్ల్‌కి స్వాగతం’ అంటూ ఫ్యాన్స్‌తో గుడ్‌న్యూస్ పంచుకున్నాడు. బుల్లితెరపై మంచి క్రేజ్‌ను సంపాదించుకున్న మోహిత్ రైనా ఉరి సినిమాలో క్యారెక్టర్ ఆర్టిస్ట్‌గా వెండితెర ఎంట్రీ ఇచ్చాడు. ‘దేవోమ్ కా దేవ్ మహాదేవ్’ అనే టీవీ సిరీస్‌తో బుల్లితెరపై పాపులర్ అయ్యాడు. ఈ క్రమంలో విక్కీ కౌషల్ ‘ఉరి ది సర్జికల్ స్ట్రైక్’ చిత్రంలో కీలక పాత్ర పోషించి దేశవ్యాప్తంగా గుర్తింపు పొందాడు. View this post on Instagram A post shared by Mohit Raina (@merainna) -
గుట్టుచప్పుడు కాకుండా రెండో పెళ్లి చేసుకున్న నటుడు, ఏడాదిగా..
బుల్లితెర నటుడు వివియన్ సేన సీక్రెట్‌గా పెళ్లి చేసుకున్నాడట. ప్రేయసి నోరన్ అలీతో అతడు ఏడుగులు నడిచాడంటూ ఓ వార్త బీటౌన్‌లో వైరల్‌గా మారింది. వీరు పెళ్లి చేసుకుని కొన్ని రోజులో, నెలలో కాదు ఏకంగా ఓ సంవత్సరమే అవుతోందట! ఈజిప్ట్‌కు చెందిన నోరన్తో అతడు ఎంతోకాలంగా డేటింగ్లో ఉన్నాడు. ఈ క్రమంలో గతేడాది అతడు అతికొద్ది మంది సమక్షంలో ఆమెను వివాహం చేసుకున్నట్లు తెలుస్తోంది. అప్పటినుంచి వీళ్లు కలిసే ఉంటున్నారట. ముంబై లోఖండ్‌వాలాలోని ఓ అపార్ట్మెంట్లో కలిసి జీవిస్తున్నారు. ఇదే విషయాన్ని నటుడిని అడగ్గా అతడు స్పందించడానికి నిరాకరించాడు. కాగా సేన గతంలో నటి వాబిజ్ దొబర్జీని పెళ్లాడాడు. వీరిద్దరి మధ్య మనస్పర్థలు రావడంతో 2021 డిసెంబర్ 18న విడాకులు తీసుకున్నారు. గతేడాది వివియన్ రెండో పెళ్లి గురించి మాట్లాడుతూ.. 'నేను నోరన్ అలీని ప్రేమిస్తున్నాను. నాలుగున్నరేళ్ల క్రితం మేము కలుసుకున్నాం. ఓ ఇంటర్వ్యూ కోసం ఆమె నన్ను సంప్రదించింది. నేను ఓకే చెప్పేంతవరకు దాదాపు మూడు నెలలు ఎదురుచూసింది. ఆ తర్వాత ముంబైలో ఓ పని ఉందని మా మేనేజ్మెంట్ తనను సంప్రదించారు. అప్పుడు ఇద్దరం ఫ్రెండ్స్ అయ్యాం.. త్వరలోనే ప్రేమికులుగా మారాం. మా పెళ్లి ఎప్పుడు? ఎక్కడ? జరుగుతుందనేది నాకే తెలియదు. కానీ ఒకవేళ వివాహం చేసుకున్నా దాన్ని సీక్రెట్‌గానే ఉంచుతాను. ఎందుకంటే అది నా వ్యక్తిగత విషయం. దాన్ని సోషల్ మీడియాలో ప్రకటించి హడావుడి చేయను. నోరన్కు కూడా ఇలాంటి ఆర్భాటాలు నచ్చవు. తనొక సాధారణ గృహిణిగా ఉండాలనుకుంటోంది' అని చెప్పుకొచ్చాడు. -
కోట శ్రీనివాసరావుకు గొంతు అరువిచ్చిన డబ్బింగ్ ఆర్టిస్ట్ మృతి
ప్రముఖ బాలీవుడ్ నటుడు షానవాజ్ ప్రధాన్(56) గుండెపోటుతో మరణించారు. ముంబైలో శుక్రవారం జరిగిన అవార్డుల ప్రదానోత్సవంలో షానవాజ్ ఛాతీలో నొప్పి అంటూ స్పృహ తప్పి పడిపోయారు. వెంటనే ఆయన్ను కోకిలాబెన్ ఆస్పత్రికి తరలించగా అప్పటికే మరణించినట్లు వైద్యులు ధ్రువీకరించారు. అవార్డుల ఫంక్షన్ కార్యక్రమంలో పాల్గొన్న లగాన్ నటుడు యశ్పాల్ శర్మ ఈ విషయాన్ని సోషల్ మీడియాలో వెల్లడించాడు. 'ముంబైలో అవార్డుల ప్రదానోత్సవ కార్యక్రమానికి హాజరయ్యాను. వందలాది మంది ఆర్టిస్టులతో ప్రాంగణం కళకళలాడుతోంది. ఇంతలో అవార్డు అందుకున్న షానవాజ్ అకస్మాత్తుగా స్పృహ తప్పి పడిపోయారు. వెంటనే ప్రోగ్రాం నిలిపివేసి ఆయన్ను హాస్పిటల్‌కు తీసుకెళ్లినప్పటికీ బతికించుకోలేకపోయాం. అందరి కళ్ల ముందే ఆయన ప్రాణాలు వదిలారు' అని భావోద్వేగానికి లోనయ్యాడు. కాగా షానవాజ్.. 'అలిఫ్ లైలా', 'హరి మర్చి లాల్ మిర్చి', 'బంధన్ సాత్ జన్మోన్ కా' సహా పలు సీరియల్స్‌లో నటించారు. 'ప్యార్ కోయ్ ఖేల్ నహీ', 'ఫాంటమ్', 'రేస్' వంటి చిత్రాల్లోనూ యాక్ట్ చేశారు. 'బెటర్ లైఫ్ ఫౌండేషన్', 'మీర్జాపూర్', 'హోస్టేజెస్' వంటి వెబ్‌సిరీస్‌లో కూడా ఆయన పలు పాత్రలు పోషించారు. అంతే కాకుండా 'దూకుడు', 'బృందావనం', 'అతడు', 'జులాయి', 'రేసు గుర్రం', 'రచ్చ', 'ఛత్రపతి', 'మున్నా' సహా ఎన్నో తెలుగు సినిమాలకు, ఫారిన్ సినిమాలకు హిందీ డబ్బింగ్ చెప్పారు. ఎక్కువగా కోట శ్రీనివాసరావుకు ఆయన హిందీ వర్షన్లో డబ్బింగ్ చెప్పినట్లు తెలుస్తోంది. View this post on Instagram A post shared by Yashpal Sharma (@iyashpalsharma) చదవండి: కమెడియన్ గీతాసింగ్ ఇంట తీవ్ర విషాదం -
ఖరీదైన లగ్జరీ కారు కొన్న బుల్లితెర నటుడు
బిగ్‌బాస్ హిందీ 13వ సీజన్ కంటెస్టెంట్, బుల్లితెర నటుడు పరాస్ చాబ్రా గుడ్ న్యూస్ చెప్పాడు. కొత్త కారు కొనుగోలు చేసిన విషయాన్ని సోషల్ మీడియా ద్వారా వెల్లడించాడు. కార్ల షోరూమ్‌కు వెళ్లిన పరాస్ మెర్సిడిస్ బెంజ్ కారు కొన్నాడు. ఈ సందర్భంగా కేక్ కట్ చేసి ఆ ఆనందకర క్షణాలను అభిమానులతో పంచుకుంటూ ఇన్‌స్టాగ్రామ్‌లో వీడియో పోస్ట్ చేశాడు. ఈ వీడియోలో పరాస్‌కు షోరూమ్ నిర్వాహకులు పుష్ప గుచ్ఛంతో ఆహ్వానం పలికారు. అనంతరం నటుడు తన కొత్త కారును ఓసారి నడపడంతోపాటు లోపల ఎలా ఉందో కూడా చూపించాడు. ఈ పోస్ట్ చూసిన ఫ్యాన్స్ పరాస్‌కు శుభాకాంక్షలు చెప్తున్నారు. ఇకపోతే ఈ కారు ధర రూ.50 లక్షల పైనే అని తెలుస్తోంది. కాగా కొంతకాలంగా మానసిక రుగ్మతతో బాధపడుతున్న పరాస్ ఇటీవలే దానినుంచి కోలుకున్నాడు. దీని గురించి అతడు తాజాగా ఓ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ.. 'నేను ప్రతిదానికి ఆందోళన చెందేవాడిని. దీనికోసం చికిత్స తీసుకుంటున్నా. చాలారోజుల తర్వాత మానసికంగా ఆరోగ్యంగా ఉన్నాననిపిస్తోంది. నేను సంప్రదించిన డాక్టర్ నన్ను కోలుకునేలా చేశాడు. నా వృత్తిలో వరుసగా ఛాన్సులు రావు. కొన్నిసార్లు రెండు ప్రాజెక్టుల మధ్య గ్యాప్ వస్తుంటుంది. దీంతో నేను చాలా టెన్షన్ పడేవాడిని. కానీ చిత్రపరిశ్రమలో అలాంటివి సర్వసాధారణమని చెప్తూ తిరిగి నన్ను సాధారణ స్థితికి తీసుకొచ్చాడు' అని చెప్పుకొచ్చాడు. View this post on Instagram A post shared by Paras Chhabra (@paraschhabra) చదవండి: భార్యకు చిత్రహింసలు.. ఇంటివైపు కన్నెత్తి చూడని నటుడు -
డైరెక్టర్‌ను పెళ్లాడిన బుల్లితెర నటుడు.. ఫోటోలు వైరల్
అనుపమ సీరియల్ ఫేమ్, బుల్లితెర నటుడు రుషద్ రానా వివాహబంధంలోకి అడుగుపెట్టారు. క్రియేటర్ డైరెక్టర్ కేటకీ వలవల్కర్ను ఆయన పెళ్లాడారు. బుధవారం ముంబయిలో జరిగిన వేడుకలో పలువురు బాలీవుడ్ సెలబ్రీటీలు హాజరయ్యారు. నూతన వధూవరులకు ఆశీర్వదించారు. ఈ వేడుకలో రూపాలీ గంగూలీ, సుధాన్షు పాండే, నిధి షా, గౌరవ్ ఖన్నాతో సహా పలువురు తారలు పాల్గొని పెళ్లిలో సందడి చేశారు. ముంబయిలో స్నేహితులు, కుటుంబ సభ్యుల సమక్షంలో పెళ్లి వేడుక ఘనంగా జరిగింది. మరాఠీ సంప్రదాయాల ప్రకారం పెళ్లి జరుపుకున్నారు. ప్రస్తుతం ఈ జంట పెళ్లి ఫోటోలు సోషల్ మీడియాలో వైరలవుతున్నాయి. అయితే గతంలో ఖుష్నుమ్ను వివాహం చేసుకున్న రుషాద్ 2013లో విడిపోయారు. రుషద్ రానా అనుపమ సీరియల్‌తో ఫేమస్ అయ్యారు. కొన్నేళ్ల పాటు ప్రేమలో ఉన్న ఈ జంట వివాహబంధంతో ఇవాళ ఒక్కటయ్యారు. దర్శకురాలైన కేటకీ వలవల్కర్ చాలా కాలంగా బాలీవుడ్ పరిశ్రమలో కొనసాగుతున్నారు. View this post on Instagram A post shared by Rups (@rupaliganguly) -
ఫ్యాన్స్ అత్యుత్సాహం, న్యూ ఇయర్ ఈవెంట్లో నటుడికి గాయం
సినిమాలు, సీరియల్స్‌లో కనిపించే తారలు కళ్లముందుకొస్తే ఎలా ఉటుంది? ఒక్క సెల్ఫీ ప్లీజ్.. అంటూ అభిమానులు ఎగబడుతారు. ఎలాగైనా ఫోటో దిగాలన్న ఆరాటంలో ఒకర్నొకరు తోసుకుంటూ మురీ ముందుకొస్తారు. ఈ క్రమంలో నటీనటులు ఇబ్బంది పడ్డ సందర్భాలెన్నో! తాజాగా బాలీవుడ్ బుల్లితెర జంట గుర్మీత్ చౌదరి- దెబీనా బెనర్జీ కొత్త సంవత్సర వేడుకలో పాల్గొన్నారు. అత్యుత్సాహం ప్రదర్శించిన ఫ్యాన్స్ ఫోటోల కోసం ఎగబడ్డారు. వారిని ఆపలేక అష్టకష్టాలు పడ్డాడు గుర్మీత్. ఈ క్రమంలో అతడి కాలికి గాయమైంది. దీంతో వారిద్దరూ ఆ ఈవెంట్ నుంచి వెంటనే వెళ్లిపోయారు. ఇందుకు సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. ఇక ఈ వీడియో చూసిన నెటిజన్లు భార్యను రక్షించేందుకు ప్రయత్నించిన గుర్మీత్ నిజంగానే మంచి భర్త అని పొగుడుతుంటే మరికొందరు మాత్రం 'అమ్మో, ఎంత పెద్ద దెబ్బలు తాకాయో, వెంటనే అంబులెన్స్‌లో తీసుకెళ్లండి', 'ఐదేళ్ల పిల్లాడు కూడా ఆ దెబ్బలను చూపించి షో చేయడు' అని సెటైర్లు వేస్తున్నారు. కాగా గుర్మీత్, దెబీనా రామాయణ్(2008) సీరియల్లో రాముడు, సీతగా నటించారు. అప్పుడు ఏర్పడిన పరిచయం ప్రేమకు దారి తీయడంతో 2011లో పెళ్లి చేసుకున్నారు. వీరికి ఈ ఏడాది ఏప్రిల్, నవంబర్లలో ఇద్దరు కూతుర్లు జన్మించారు. View this post on Instagram A post shared by Viral Bhayani (@viralbhayani) చదవండి: ఆయనతో నటించాలనుంది.. మనసులో మాట బయటపెట్టిన త్రిష నా స్థానంలో వేరొకరుంటే ఆత్మహత్య చేసుకునేవాళ్లు: నటి -
Tunisha Sharma Case: షీజాన్ ఖాన్‌ను ఉరితీయాలి.. కేంద్ర మంత్రి డిమాండ్
థానే: బుల్లి తెర నటి తునీషా శర్మ ఆత్మహత్యకు కారణమైన షీజాన్ ఖాన్‌ను కఠినంగా శిక్షించాలని కేంద్రమంత్రి రాందాస్ అథవాలే డిమాండ్ చేశారు. అదేవిధంగా ఆమె తల్లికి రూ.25లక్షలు నష్టపరిహారం చెల్లించాలని కోరారు. థానే జిల్లాలోని భయందర్‌లోని తునీషా శర్మ నివాసంలో ఆమె తల్లి వనితను గురువారం అథవాలే పరామర్శించారు. కూతురు అకాల మరణానికి న్యాయం చేయడంలో పూర్తి సహకారాన్ని అందిస్తామని హామీ ఇచ్చారు. అనంతరం ఆయన విలేకరులతో మాట్లాడుతూ.. తునీషా శర్మను సహనటుడు షీజాన్ ఖాన్ నమ్మించి మోసం చేయడం వల్లే ఆత్మహత్యకు పాల్పడిందని పేర్కొన్నారు. షీజాన్ ఖాన్‌కు ఉరిశిక్ష వేయాలని ఆయన డిమాండ్ చేశారు. తునీషా శర్మను కోల్పోవడం ఆమె తల్లికి తీరని లోటని, రాష్ట్ర ప్రభుత్వం ఆమెకు నష్టపరిహారంగా రూ.25లక్షలు చెల్లించాలని కోరారు. తమ పార్టీ రిపబ్లికన్ పార్టీ ఆఫ్ ఇండియా (అథవాలే) తరఫున ఆమెకు రూ.3లక్షలు నష్టపరిహారం ప్రకటించారు. తునీషా శర్మకు న్యాయం జరిగేందుకు ఉజ్జ్వల్ నికమ్‌ను ప్రత్యేక ప్రాసిక్యూటర్‌గా రాష్ట్ర ప్రభుత్వం నియమించాలని అథవాలే డిమాండ్ చేశారు. కాగా 24 ఏళ్ల తునీషా శర్మ సహ నటుడు షీజాన్ ఖాన్ మేకప్ రూమ్‌లో ఉరి వేసుకొని ఆత్మహత్యకు పాల్పడిన విషయం తెలిసిందే. ప్రస్తుతం షీజాన్నుపోలీసులు అదుపులోకి తీసుకొని విచారిస్తున్నారు. -
బాబాయి చనిపోతే నాన్న తాగి వచ్చాడు: కమెడియన్ కూతురు
ఇండస్ట్రీలో ఓ వెలుగు వెలిగిన కమెడియన్లలో లక్ష్మీపతి ఒకరు. బాబీ, అల్లరి, మురారి, నీ స్నేహం, తొట్టిగ్యాంగ్, పెదబాబు, కితకితలు.. ఇలా దాదాపు 40 సినిమాల్లో నటించారాయన. మరీ ముఖ్యంగా ఆయన సునీల్‌తో కలిసి చేసిన కామెడీ సీన్స్ చూస్తే ఇప్పటికీ కడుపుబ్బా నవ్వుకుంటారు. లక్ష్మీపతి అన్న శోభన్ కూడా ఇండస్ట్రీలో డైరెక్టర్‌గా రాణించారు. మహేశ్‌బాబు 'బాబీ', ప్రభాస్ 'వర్షం' సినిమాలకు ఈయనే దర్శకత్వం వహించారు. ఈ అన్నదమ్ములిద్దరూ కేవలం నెల రోజుల వ్యవధిలోనే కన్నుమూయడం అప్పట్లో సంచలనం రేపింది. తాజాగా ఈ అన్నదమ్ముల గురించి పలు ఆసక్తికర విషయాలను పంచుకుంది లక్ష్మీపతి కూతురు, ఆర్జే శ్వేతా లక్ష్మీపతి. 'సినిమాలను తీసే క్రమంలో ఆస్తులు పోయాయి. రెండు థియేటర్లు అమ్మేశారు. కొన్నాళ్లు బాబాయి కనిపించలేదు. ఆ తర్వాత ఒక లెటర్ వచ్చింది. అందులో బాబాయి ఒక చోట క్షేమంగా ఉన్నానని రాసి డబ్బులు కూడా పంపించాడు. నా పుట్టినరోజుకు ముందు గిఫ్ట్ పంపించాడు. ఆయన డైరెక్టర్‌గా పనిచేసిన తొలి చిత్రం బాబీ ఫ్లాప్ కావడంతో ఫ్యామిలీపై దెబ్బపడింది. ఆర్థికంగా కుటుంబం అంతా కష్టాలు పడింది. అందుకని నెక్స్ట్ మూవీ వర్షం ఎంతో కసితో తీశాడు. అది సక్సెస్ అయింది కానీ తర్వాత తీసిన చంటి ఫెయిల్యూర్‌గా నిలవడంతో మళ్లీ కష్టాలు మొదలయ్యాయి. బాబాయి చనిపోయినప్పుడు నేను వైజాగ్‌లో ఉన్నాను. అప్పుడు నా ఫోన్ పని చేయలేదు. రాత్రి 9 గంటలకు ఆఫీస్ ఫ్రెండ్స్ నా ఫ్లాట్కొచ్చి డోర్ కొట్టారు. అప్పుడే ఏదో నా మనసు కీడు శంకించింది, బాబాయ్‌కు బాలేదని చెప్పారు. నేను బస్సెక్కి ఇంటికి వెళ్తుంటే ఓ వార్తాపత్రికలో జనవరి 5న ఆయన చనిపోయారని చదివాను. ఆయనకు పొగ తాగడం తప్ప ఎటువంటి చెడ్డ అలవాటు లేదు. ఇంటికెళ్లేసరికి అందరూ ఏడుస్తున్నారు, కానీ నేను ఏడవలేదు. అందరూ నిద్రపోయాక ఏడ్చాను. బాబాయి లేరన్న బాధ తట్టుకోలేక నాన్న తాగి వచ్చాడు. ఆ కోపంతో నాన్నతో మాట్లాడలేదు. బాబాయి అంత్యక్రియలైపోయాక నేను వైజాగ్ వెళ్తుంటే నాన్న నన్ను పట్టుకుని ఏడ్చాడు. అయినా మాట్లాడకుండా వెళ్లిపోయాను. బాబాయి చనిపోయిన నెల రోజులకే ఫిబ్రవరి 5న నాన్న చనిపోయాడు. అప్పుడు కూడా నేను వైజాగ్‌లో ఉన్నాను. ఆరోజు పొద్దున నాన్న ఫోన్ చేసి అమ్మవాళ్లు ఇంకా ఇంటికి రాలేదేంటని అడిగారు. గంటలోపు వచ్చేస్తారులే అని చెప్పాను. తీరా మధ్యాహ్నం అయ్యేసరికి అమ్మ ఫోన్ చేసి నాన్నకు బాలేదని రమ్మన్నారు. వరుసగా ఫోన్లు రావడం మొదలైంది. విషయం సీరియస్ అని అర్థమైంది. వెంటనే హైదరాబాద్ వచ్చి నాన్నను కడసారి చూశాను. బాబాయి మరణంతో ఆయన బాగా డిప్రెషన్లోకి వెళ్లిపోయారు. అదే ఆయన్ను కుంగదీసింది' అని చెప్పింది శ్వేత. చదవండి: బుల్లితెర నటి సూసైడ్, పోస్ట్‌మార్టమ్‌లో ఏముందంటే? అజిత్ -త్రిష కాంబినేషన్లో మూవీ -
బుల్లితెర జంట హల్దీ ఫంక్షన్, ఫోటోలు వైరల్
బుల్లితెర నటుడు అమర్దీప్ ఇంట పెళ్లి వేడుకలు షురూ అయ్యాయి. ఇటీవలే అమర్దీప్- తేజస్వినిల నిశ్చితార్థం ఘనంగా జరగ్గా అందుకు సంబంధించిన ఫోటోలు నెట్టింట హల్చల్ చేశాయి. ఆ తర్వాత ఓ షోలో నెచ్చెలికి మర్చిపోలేని కానుకనిచ్చాడు అమర్. చనిపోయిన ఆమె తండ్రి మైనపు విగ్రహాన్ని బహుమతిగా ఇవ్వడంతో తేజస్వి ఎమోషనలైంది. ఇదిలా ఉంటే వీరి పెళ్లికి ముహూర్తం ఆసన్నమైనట్లు కనిపిస్తోంది. తాజాగా అమర్దీప్- తేజస్వినిల హల్దీ వేడుక ఘనంగా జరిగింది. బుల్లితెర నటీనటులు ఈ హల్దీ ఫంక్షన్లో తెగ సందడి చేశారు. ప్రస్తుతం ఇందుకు సంబంధించిన ఫోటోలు, వీడియోలు వైరల్‌గా మారాయి. View this post on Instagram A post shared by Amar❤️Teju (@amar_teju_fandom) చదవండి: యాంకర్‌కు ఇచ్చిపడేసిన ఇనయ తండ్రి కాబోతున్న రామ్‌చరణ్ -
బుల్లితెర నటుడి పెంకుటిల్లు, పాక సింపుల్‌గా ఎంత బాగుందో!
బుల్లితెర నటుడు ఏక్‌నాధ్ సీరియల్స్ ద్వారా ఎంతోమంది అభిమానులను సంపాదించుకున్నాడు. ఇన్స్టాగ్రామ్ రీల్స్‌తో ఫ్యాన్స్‌ను ఎంటర్టైన్ చేస్తూ ఉంటాడీ యాక్టర్. నటి, భార్య హారికతో కలిసి ఫోటోషూట్లకు పోజులివ్వడమే కాకుండా అందుకు సంబంధించిన ఫొటోలను, వీడియోలను సోషల్ మీడియాలో వదులుతూ ఉంటాడు. ఇటీవలే ఏక్‌నాధ్ పుట్టినరోజున ఖరీదైన ఐఫోన్ గిఫ్టిచ్చింది హారిక. ఇదిలా ఉంటే తాజాగా ఏక్‌నాధ్ తను పుట్టి పెరిగిన ఇంటిని చూపించాడు. చిట్టూర్పులోని తన పెంకుటిల్లును చూపిస్తూ హోమ్‌టూర్ వీడియో చేశాడు. ఇందులో గేటు తీసుకుని లోపలికి వెళ్లగానే దారికిరువైపులా బోలెడన్ని మొక్కలు, చెట్లు, తులసివనం దర్శనమిచ్చాయి. ఇంట్లోకి వెళ్లడానికి ముందు పెద్ద వరండా ఉంది. తర్వాత హాల్, బెడ్రూమ్, కిచెన్ వరుసగా ఉన్నాయి. అన్ని గదులు విశాలంగా, గంభీరంగా ఉన్నాయి. వంట చేసుకోవడానికి ఇంటి వెనుక ప్రత్యేకంగా ఓ పాక కూడా ఉంది. ఇంటి వెనకాల కూడా అరటి, మామిడి, ఉసిరి, కొబ్బరి, దానిమ్మ, నిమ్మ, బాదం, సపోటా చెట్లతో పెద్ద తోట ఉంది. ఈ ఇంటిని చూసిన నెటిజన్లు 'పల్లెటూరి వాతావరణానికి తగ్గట్లు ఇల్లు ఎంత చక్కగా ఉందో, ఆ సామాను, ఇల్లు', 'మొక్కలు అవన్నీ చూస్తుంటే మేము గడిపిన పాతరోజులు గుర్తుకు వస్తున్నాయి', 'ఓల్డ్ ఈజ్ గోల్డ్ అని ఊరికే అనలేదు' అంటూ కామెంట్లు చేస్తున్నారు. చదవండి: హీరోయిన్ ముఖంపై సూదులు, అసలేమైంది? ఆ విషయం అమ్మకు తెలిస్తే చెప్పుతో కొడుతుంది: గీతూ -
రోడ్డు ప్రమాదంలో బుల్లితెర నటి దుర్మరణం.. బైక్‌పై ఇంటికి వెళ్తుండగా..
సాక్షి, ముబై: కొల్హాపూర్ జిల్లాలో జరిగిన రోడ్డు ప్రమాదంలో మరాఠీ టెలివిజన్ నటి దుర్మరణం చెందారు. కళ్యాణి కురాలే జాదవ్ అనే 32 ఏళ్ల నటి శనివారం రాత్రి తన టూవీలర్‌పై ఇంటికి వెళ్లుండగా కాంక్రీట్ మిశ్చర్ ట్రాక్టర్‌ను ఢీకొట్టింది. సాంగ్లీ-కొల్హాపూర్ హైవేపై హలోండి కూడలి సమీపంలో ఈ ప్రమాదం జరిగింది. ఈ ఘటనలో తీవ్రంగా గాయపడిన కళ్యాణిని ఆసుపత్రికి తీసుకెళ్లగా అప్పటికే ఆమె మరణించినట్లు వైద్యులు ప్రకటించారు. సమాచారం అందుకున్న పోలీసులు సంఘటన స్థలానికి చేరుకున్నారు. ప్రమాదానికి కారణమైన ట్రాక్టర్ డ్రవర్‌ను అరెస్ట్ చేసి, అతనిపై కేసు మోదు చేసినట్లు పోలీసులు తెలిపారు. దీనిపై దర్యాప్తు చేస్తున్నట్లు పేర్కొన్నారు. కాగా కళ్యాణి తుజ్హత్ జీవ్ రంగా, దఖంచ రాజా జ్యోతిబా వంటి మరాఠీ టీవీ సీరియల్స్‌లో నటించి గుర్తింపు సాధించారు. జాదవ్ కొల్హాపూర్ నగరంలోని రాజారంపురి ప్రాంతంలో నివాసముంటోంది. ఇటీవలే ఆమె హలోండిలో రెస్టారెంట్ ప్రారంభించారు. శనివారం రాత్రి రెస్టారెంట్ మూసివేసి ఇంటికి వెళ్తున్న సమయంలో ఆమె ద్విచక్ర వాహనాన్ని ట్రాక్టర్ ఢీకొట్టినట్లు షిరోలి పోలీస్ అధికారి సాగర్ పాటిల్ తెలిపారు. -
నటుడి బర్త్‌డే.. ఐఫోన్ గిఫ్టిచ్చిన భార్య
ఫొటోషూట్స్, రీల్స్, యూట్యూబ్ వీడియోలతో తెగ హల్చల్ చేస్తుంటారు ఏక్‌నాధ్, హారిక. ఆన్‌స్క్రీన్ మీద హిట్ పెయిర్‌గా పేరు తెచ్చుకున్న ఈ జంట ఆఫ్ స్క్రీన్‌లో కూడా క్యూట్ పెయిర్‌గా వెలుగొందుతున్నారు. నవంబర్ 8న నటుడు ఏక్‌నాధ్ బర్త్‌డే. తన భర్త పుట్టినరోజును గ్రాండ్‌గా సెలబ్రేట్ చేసింది నటి హారిక. అరకులోని ఓ రిసార్ట్‌లో అర్ధరాత్రి ఏక్నాధ్తో కేక్ కట్ చేయించింది. అంతేకాదు, అతడి కోసం కొత్త బట్టలతో పాటు ఖరీదైన వస్తువును బహుమతిగా ఇచ్చింది. ఆ గిఫ్ట్ మరేంటో కాదు, ఐఫోన్ 14 ప్రొమాక్స్. దాదాపు లక్షన్నర రూపాయలు విలువ చేసే ఈ కానుకను చూసి గుడ్లు తేలేశాడు ఏక్‌నాధ్. భార్య ఎంతో ప్రేమగా ఇచ్చిన గిఫ్ట్ తనకెంతో బాగా నచ్చిందని చెప్పుకొచ్చాడు. కాగా వీరిద్దరూ ఓ తెలుగు సీరియల్లో జంటగా నటించారు. అప్పుడే వీరి మధ్య ప్రేమ చిగురించగా 2020లో పెళ్లి చేసుకున్నారు. చదవండి: కష్టపడి చేసిన సీన్స్ కట్ చేశారు, బాధేసింది: విలన్ నా కష్టాల్లో, కన్నీళ్లలో నావెంటే ఉన్నావు, థాంక్యూ: సమంత -
నీ భార్యతో రొమాన్సా? ఏం మాట్లాడుతున్నావో అర్థమవుతోందా?: నటుడు
బుల్లితెర సీరియల్ నటి చారు అసోపా- రాజీవ్ సేన్ల విడాకుల వ్యవహారం గత రెండురోజులుగా చర్చనీయాంశంగా మారింది. తప్పు చేసింది నువ్వంటే నువ్వని.. ఒకరిపై మరొకరు ఆరోపణలు గుప్పించుకుంటున్నారు. సహ నటుడు కరణ్ మెహ్రాతో రొమాంటిక్ రీల్ చేసింది నిజం కాదా? అని భార్యను మీడియా ముఖంగా నిలదీశాడు రాజీవ్. తాజాగా ఈ వ్యవహారంపై హిందీ బిగ్‌బాస్ 10వ సీజన్ కంటెస్టెంట్, నటుడు కరణ్ మెహ్రా స్పందించాడు. 'నీ భార్య చారుతో రొమాన్సా? అసలు ఏం మాట్లాడుతున్నావో అర్థమవుతోందా రాజీవ్ ? పదేళ్ల క్రితం ఓసారి చారును కలిశాను. తర్వాత ఢిల్లీకి షిఫ్ట్ అయ్యాను. అప్పుడెప్పుడో జూన్‌లో ప్రమోషనల్ ఈవెంట్ కోసం తనతో మాట్లాడాను. అదే చివరిసారి మేము మాట్లాడుకోవడం! ఇలా నాపై చెత్త ఆరోపణలు చేయడం దారుణం. అతడిపై పరువునష్టం దావా వేస్తాను' అని చెప్పుకొచ్చాడు. కాగా పలుమార్లు గొడవపడ్డ చారు అసోపా- రాజీవ్ ఈసారి మాత్రం విడాకులు తీసుకోవడానికే మొగ్గు చూపుతున్నారు. చదవండి: అంత ఈజీగా నిందలు ఎలా వేస్తారు? : నటి ఆవేదన నటుడికి ఇల్లమ్మేసి కొత్త డూప్లెక్స్ కొన్న జాన్వీ కపూర్ -
కొడుకుపై దారుణమైన ట్రోల్స్.. స్పందించిన నటుడు ప్రభాకర్
తన కొడుకుపై వస్తున్న ట్రోల్స్‌పై బుల్లితెర మెగాస్టార్, టీవీ నటుడు ప్రభాకర్ ఆసక్తికర రీతిలో స్పందించాడు. కాగా బుల్లితెరపై నటుడిగా, నిర్మాతగా తనకంటూ ప్రత్యేక గుర్తింపు సంపాదించుకున్నారు ఆయన. ఎన్నో సీరియల్స్‌కు నిర్మాతగా వ్యవహరించిన ఆయన చిన్న సినిమాలకు దర్శకత్వం కూడా వహిస్తున్నారు. ఇలా మల్టీ టాలెంట్‌తో సినీ, టీవీ రంగంలో దూసుకుపోతున్న ప్రభాకర్ తన వారసుడిగా కొడుకు చంద్రహాస్‌ను హీరోగా పరిచయం చేస్తున్న సంగతి తెలిసిందే. చదవండి: కొడుకు ఫొటో షేర్ చేస్తూ ఎమోషనల్ అయిన సౌందర్య రజనీకాంత్ ఇటీవల ఓ చానల్‌తో ముచ్చిటించిన ఆయన తన కొడుకును అందరికి పరిచయం చేశాడు. ఈ సందర్బంగా చంద్రహాస్‌ను చూపిస్తూ.. ‘హీరో కావాలనేది మా అబ్బాయి కల. ఇటీవల డిగ్రీ పూర్తి చేశాడు. ఇప్పుడు హీరోగా మూడు సినిమాలు చేస్తున్నారు. అందరి తనని ఆదరిస్తారని కోరుకుంటున్నా’ అన్నాడు. ఈ క్రమంలో చంద్రహాస్ చూపించిన యాటీట్యూడ్, ఆయన నిలుచున్న తీరు చూసి అంతా అతడిని ట్రోల్ చేయడం ప్రారంభించారు. వీడు హీరో ఏంటీ!.. ఇంకా ఒక్క సినిమా కూడా రాలేదు అప్పుడు పెద్ద స్టార్లా ఫోజులు కొడుతున్నాడు. బాగా యాటిట్యూడ్ చూపిస్తున్నాడు అంటూ చంద్రహాస్‌పై విమర్శలు గుప్పిస్తున్నారు నెటిజన్లు. ఈ క్రమంలో తాజాగా ఓ తెలుగు మీడియాతో మాట్లాడిన ప్రభాకర్ కొడుకుపై వస్తున్న ట్రోల్స్‌పై స్పందించాడు. మీ కొడుకు మూవీ ఎంట్రీపై నెపోటిజం మీద ఏమైనా ట్రోల్స్ వచ్చాయా? అని హోస్ట్ అడగ్గా ప్రభాకర్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. ఈ సందర్భంగా ప్రభాకర్ మాట్లాడుతూ.. వాడు వచ్చిందే ఇప్పుడు.. ఇంకా వాడి సినిమాలే బయటకు రాలేదు అన్నాడు. ‘‘పరిచయం చేసిన ఇంటర్య్వూపైనే అందరూ వీపరితంగా ట్రోల్ చేస్తున్నారు. ‘వీడు హీరో ఏంటీ? వాడు ఇటూ తిరిగాడు అటు తిరిగాడు ఎంటీ? జెబులో చేతులు పెట్టుకున్నాడేంటి. చదవండి: ‘సీతారామం’ చూసిన ఫైర్ బ్రాండ్ కంగనా రనౌత్.. హీరోయిన్‌పై గురించి ఏమన్నదంటే.. యూటిట్యూడ్ చూపిస్తున్నాడు’ అంటూ ఇష్టం వచ్చినట్లు ట్రోల్ చేస్తున్నారు. ఎలా అయితే ఏంటీ వాడు జనాల్లోకి వెళ్లాడు. వాళ్లు తిట్టుకుంటున్నారా? పోగుడుతున్నారా? పక్కన పెడితే జనాలకు వాడు తెలియాలని చెప్పాను. తర్వాత వాళ్ల ఇష్టం. వాడు బాగా చేస్తే బాగా చేశాడంటారు. చంద్రహాస్ నిలబడ్డ స్టైల్ వాళ్లకి నచ్చలేదు. అదే చెప్పారు. రేపు యాక్టింగ్ ఎంత బాగా చేస్తే అంత బాగా ఆదరిస్తారు. జనాలు చాలా ప్లేయిన్‌గా ఉంటారు. వారికి అనిపించింది చెబుతారు’ అని ప్రభాకర్ వ్యాఖ్యానించాడు. -
సినీ పరిశ్రమలో విషాదం.. ప్రముఖ నటుడు రవి ప్రసాద్ మృతి
సినీ పరిశ్రమలో విషాదం చోటు చేసుకుంది. ప్రముఖ కన్నడ టీవీ నటుడు మాండ్య రవి(43) అలియాస్ రవిప్రసాద్ కన్నుమూశారు. కొంతకాలంగా కాలేయ సంబంధిత సమస్యలతో బాధపడుతున్న ఆయన బెంగళూరులోని బీజీఎస్ ఆస్పత్రిలో చికిత్స పొందుతూ బుధవారం రాత్రి తుదిశ్వాస విడిచారు. ఆయనకు భార్య ఒక కుమారుడు ఉన్నారు. రవిప్రసాద్ హఠాన్మరణం పట్ల సినీ ప్రముఖులు, అభిమానులు తీవ్ర దిగ్భ్రంతి వ్యక్తం చేస్తున్నారు. చదవండి: రణ్వీర్ చెంప చెల్లుమనిపించిన బాడిగార్డ్! అసలేం జరిగిందంటే.. కాగా ఫేమస్ రచయిత డాక్టర్ హెచ్ఎస్ ముద్దెగౌడ కుమారుడే ఈ మాండ్య రవి. ఆయన కన్నడలోనే కాదు తెలుగు, తమిళ భాషల్లో సైతం పలు సీరియల్స్‌లో నటించారు. డైరెక్టర్ టీఎన్ సీతారాం తెరకెక్కించిన పలు సీరియల్స్‌లో ఆయన గుర్తింపు పొందారు. డైరెక్టర్ టీఎస్ నాగాభరణ తెరకెక్కించిన మహామయి సిరీయల్ ద్వారా బుల్లితెర ఎంట్రీ ఇచ్చిన రవిప్రసాద్ ‘చిత్రలేఖ’, ‘వరలక్ష్మి’, ‘ముక్కత ముక్త’, ‘యశోదే’ వంటి సీరియల్స్‌తో నటుడిగా మంచి గుర్తింపు తెచ్చుకున్నారు. చదవండి: మళ్లీ బుక్కైన తమన్.. ‘ఏంటమ్మా.. ఇది’ అంటూ మెగా ఫ్యాన్స్ ఫైర్ -
బుల్లితెర నటి బర్త్‌డే, బోలెడు బంగారం గిఫ్టిచ్చిన నటుడు
బుల్లితెర నటి విష్ణు ప్రియ సీరియల్స్‌లో తన నటనతో అదరగొడుతోంది. ప్రేక్షకులకు వినోదాన్ని అందించడంలో తగ్గేదే లేదన్నట్లుగా సీరియల్స్‌తో అలరిస్తోంది. అటు సోషల్ మీడియాలోనూ అభిమానులతో నిత్యం టచ్‌లో ఉంటున్న ఈ బ్యూటీ తన బర్త్‌డే కోసం షాపింగ్ చేసింది. బర్త్‌డే షాపింగ్ అంటే డ్రెస్సులు, మ్యాచింగ్ జ్యువెలరీస్ అనుకునేరు, కానే కాదు.. తన భర్తతో కలిసి బంగారు ఆభరణాల దుకాణానికి వెళ్లింది. తనకు నచ్చిన గాజులు, నెక్లెస్, ఇయర్ రింగ్స్‌లు ఎంపిక చేసుకుంది. ఇవన్నీ కలిపితే 200 గ్రాములకు పైనే ఉంటుంది అని చెప్పుకొచ్చింది విష్ణుప్రియ. భార్య సెలక్ట్ చేశాక బిల్లు కట్టడమే తరువాయి అన్నట్లుగా వాటన్నింటినీ ప్యాక్ చేయించి డబ్బులు చెల్లించాడు ఆమె భర్త, నటుడు సిద్దార్థ్ వర్మ. బంగారం లాంటి భార్య పుట్టినరోజుకు ఈమాత్రం గోల్డ్ జ్యువెలరీ గిఫ్ట్ ఇవ్వలేనా అంటున్నాడు. ఇక దీనికి సంబంధించిన వీడియోను 'నా బర్త్ డేకి మావారి బంగారు కానుక' అంటూ యూట్యూబ్‌లో రిలీజ్ చేసింది విష్ణు. ప్రస్తుతం ఈ వీడియో వైరల్‌గా మారింది. చదవండి: ఇలాగైతే జనాలు థియేటర్‌కు ఎందుకు వస్తారు: నరేశ్ ఫైర్ బిగ్‌బాస్ పింకీ పెళ్లి? యాంకర్ రవి ఏమన్నాడంటే? -
భార్యతో విడాకులు, కూతుర్ని కలవనీయట్లేదు: నటుడు
ప్రేమ-పెళ్లి-విడాకులు.. ఇండస్ట్రీలో తరచూ వినిపించే పదాలివి. ప్రేమ పుట్టెనే.. అని పాటలు పాడుకునే లోపే కొందరు బ్రేకప్ చెప్పుకుంటే మరికొందరు మాత్రం పెళ్లి చేసుకున్న కొన్నాళ్లకే విడాకులు తీసుకుంటున్నారు. కొద్దిమంది మాత్రమే మా ప్రేమ శాశ్వతం అంటూ తమ బంధాన్ని పదిలంగా కాపాడుకుంటున్నారు. బుల్లితెర స్టార్స్ ఆమిర్ అలీ, సంజీదా షైఖ్ ప్రేమించి పెళ్లి చేసుకున్నారు. ఎంతో అన్యోన్యంగా కలిసిమెలిసి ఉన్నారు. సరోగసి ద్వారా వీరికి కూరుతు ఐరా పుట్టింది. అంతలో ఏమైందో ఏమో.. తొమ్మిదేళ్ల వివాహ బంధానికి ఫుల్స్టాప్ చెప్తూ ఆమిర్-సంజీదా గతేడాది జనవరిలో విడాకులు తీసుకున్నారు. కానీ విడాకులకు గల కారణాన్ని మాత్రం ఏ ఒక్కరూ బయటకు చెప్పకుండా గోప్యత పాటిస్తున్నారు. అయితే విడాకుల తర్వాత కూతురిని కలవడానికి వీల్లేకుండా పోయిందని కుమిలిపోతున్నాడు ఆమిర్. తాజాగా ఆయన ఓ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ.. 'నా వైవాహిక జీవితం కుప్పకూలిపోయింది. అది నన్ను ఎంతగానో కుదిపేసింది. కానీ పరిస్థితులకు కుంగిపోకూడదని తిరిగి నిలబడ్డాను. ఇప్పుడు మామూలు మనిషినయ్యాను. ఇలా జరిగినందుకు నేను ఎవరినీ శాపనార్థాలు పెట్టను. అంతేకాదు, నా మాజీ భార్యకు కూడా అంతా మంచే జరగాలని కోరుకుంటాను. ప్రతిఒక్కరూ సంతోషంగా ఉండాలి. కాకపోతే గత 10 నెలలుగా నేను నా కూతుర్ని కలిసేందుకు అనుమతించడం లేదు. ఇది చాలా సున్నితమైన విషయం కాబట్టి, దీని గురించి పెద్దగా మాట్లాడదలుచుకోలేదు. దురదృష్టమేంటంటే.. ఏం జరిగినా ముందు మగవాడిదే తప్పని నిందిస్తారు. నా వ్యక్తిగత జీవితానికి సంబంధించిన విషయాలను నేను ఎప్పుడూ బయటపెట్టను. నాతో కొన్నేళ్లపాటు జీవించిన వ్యక్తిని గౌరవించడం నా బాధ్యత. కాబట్టి నేనేమీ చెప్పదలుచుకోలేదు' అని ఆమిర్ అన్నాడు. కాగా కొన్నేళ్లపాటు రిలేషన్లో ఉన్న ఆమిర్- సంజీదా 2012లో పెళ్లి చేసుకున్నారు. వీరు జంటగా నాచ్ బలియే 3 డ్యాన్స్ షోలో పాల్గొని విజేతగా నిలిచారు. 2020లో వీరు విడాకుల కోసం దరఖాస్తు చేయగా ఆ మరుసటి ఏడాది అవి మంజూరయ్యాయి. అంతేగాక పాపను తల్లికే అప్పజెప్పాలని నిర్ణయించడంతో తన కూతురును సంజీదా పెంచుకుంటోంది. చదవండి: యాక్షన్ మోడ్‌లో నాగ్.. ఘోస్ట్ ట్రైలర్ వచ్చేసింది.. గుండెపోటు.. 15 రోజుల తర్వాత స్పృహలోకి.. -
రాఖీ కట్టిన వ్యక్తితో నా మాజీ భార్య వివాహేతర సంబంధం: బుల్లితెర నటుడు
బుల్లితెర పాపులర్ సీరియల్ మే రిష్తా క్యా కెహ్లాతా హై నటుడు కరణ్ మెహ్రా తన మాజీ భార్య నిషా రావల్‌పై సంచలన ఆరోపణలు చేశాడు. ఆమె రోహిత్ సేతియాతో వివాహేతర సంబంధం పెట్టుకుందని, అతడితో కలిసి తనపై దాడి చేసిందని ఆరోపించాడు. 'నిషా తానో సింగిల్ మదర్నంటూ సానుభూతి పొందడానికి ప్రయత్నిస్తోంది. కానీ ఆమె నా ఇంట్లో ఉంటూ, నా డబ్బులే వాడుకుంటూ నా మీద కేసు గెలవాలని తపిస్తోంది. నా డాక్యుమెంట్స్, డబ్బులు, ల్యాప్‌ట్యాప్.. ప్రతీది ఆ ఇంట్లోనే ఉన్నాయి. అలాంటప్పుడు నువ్వు అమాయకురాలినని ఎలా ప్రూవ్ చేసుకుంటావు? అదంత ఈజీ కాదు. నా ఇంటికి నేను వెళ్లడానికి అనుమతి లేకుండా పోయింది. ఒక సూట్‌కేస్‌లో ఐదు జతల బట్టలిచ్చి వెళ్లగొట్టారు. 5 నెలల నుంచి రోడ్ల మీద పిచ్చోడిలా తిరుగుతున్నా. అక్కడ నిషా.. ఇంకా విడాకులు మంజూరు కాకముందే రోహిత్ అనే వ్యక్తితో వివాహేతర సంబంధం పెట్టుకుంది. అతడు మొదట్లో ఆమెకు రాఖీ కట్టిన అన్నగా పరిచయం చేసుకున్నాడు. కానీ వాళ్ల మధ్య ఇంత జరుగుతోందని తెలియలేదు. వాళ్లిద్దరూ కుమ్మక్కై నన్ను ఇంట్లోంచి వెళ్లగొట్టి, నామీద దాడి చేశారు. నన్ను, నా కుటుంబాన్ని చంపేస్తామని బెదిరించారు. ఆ రోహిత్ అసలు మంచివాడే కాదు. అతడికి లేని అలవాటంటూ లేదు. పొగ తాగుతాడు, మద్యం సేవిస్తాడు, గుట్కాపాన్ నములుతాడు.. అలాంటి వ్యక్తి నా ఇంట్లో నిషాతో, నా కొడుకుతో కలిసి ఉంటున్నాడు. అందుకే నా కొడుకును నాకు అప్పగించమని ఫైట్ చేస్తున్నాను' అని చెప్పుకొచ్చాడు. కాగా కరణ్ మెహ్రా తనను వేధింపులకు గురి చేస్తున్నాడంటూ నిషా రావల్ తన భర్తపై గతేడాది గృహ హింస కేసు పెట్టిన విషయం తెలిసిందే! పరస్పర ఆరోపణలు చేసుకున్న ఇద్దరూ విడిపోయినట్లు ప్రకటించడమే కాకుండా విడాకులకు దరఖాస్తు చేసుకున్నారు. చదవండి: వాచిపోయిన కాళ్లు... సోషల్ మీడియాలో కష్టాలు చెప్పుకున్న సోనమ్ కపూర్ అందరిముందే ఏడ్చేసిన స్టార్ హీరో! -
నటితో బుల్లితెర హీరో ఎంగేజ్మెంట్!
తెలుగు బుల్లితెర నటుడు అమర్దీప్ త్వరలో ఓ ఇంటివాడు కాబోతున్నాడు. నటి తేజస్వినిని పెళ్లాడబోతున్నాడు. తాజాగా అమర్దీప్, తేజస్వినిల నిశ్చితార్థం జరిగింది. ఈ వేడుకకు బిగ్‌బాస్ బ్యూటీ అరియానా హాజరైంది. పూలదండలు మార్చుకుని సంతోషంలో మునిగి తేలిపోతున్న అమర్- తేజస్వినిలతో ఫొటోలు దిగి వారికి శుభాకాంక్షలు తెలిపింది. ఇందుకు సంబంధించిన వీడియోను అరియానా సోషల్ మీడియా షేర్ చేసింది. ఇది చూసి సర్ప్రైజ్ అయిన ఫ్యాన్స్.. అదేంటి? అమర్, తేజు నిశ్చితార్థం చేసుకున్నారా? ఇదెప్పుడు జరిగిందని ప్రశ్నిస్తున్నారు. సడన్ షాకిచ్చారేంటి అంటూ కొందరు అభిమానులు సీరియల్ హీరోను నిలదీస్తున్నారు. ఇక త్వరలో కొత్త జీవితాన్ని ప్రారంభించబోతున్న కాబోయే వధూవరులకు శుభాకాంక్షలు తెలుపుతున్నారు. కాగా అమర్ దీప్.. జానకి కలనగలేదులో హీరోగా నటిస్తుండగా తేజస్వి కేరాఫ్ అనసూయ సీరియల్ చేస్తోంది. View this post on Instagram A post shared by Ariyana Glory (@ariyanaglory) చదవండి: ఓటీటీలో అమలాపాల్ విక్టిమ్ సిరీస్, ఎప్పటినుంచంటే? ఆ హీరోయిన్‌తో డేటింగ్ వార్తలపై నోరు విప్పిన చై, ఏమన్నాడంటే. -
భార్యకు ఏడువారాల నగలు కొనిచ్చిన డాక్టర్ బాబు
షాపింగ్.. ఈ పేరు వింటే చాలు అమ్మాయిలకు ఎక్కడలేని ఎనర్జీ వస్తుంది. ఎన్నిసార్లు షాపింగ్ చేసినా, ఎన్నిగంటలు తిరిగినా వారికి అలుపనేదే రాదు. ఎప్పటికప్పుడు ట్రెండ్‌కు తగ్గట్టుగా డ్రెస్సింగ్, నగలు ఉండాలని తహతహలాడుతుంటారు లేడీస్. అందులోనూ సెలబ్రిటీలు ఓ మెట్టు పైనే ఉంటారు. జనాలకు బోర్ కొట్టకుండా నిత్యనూతనంగా కనిపించేందుకు తెగ ప్రయత్నిస్తుంటారు. ఈ క్రమంలో వారి షాపింగ్ చిట్టా పెద్దగానే ఉంటుంది. పండగలకు, ఫంక్షన్లకు, పూజలకు, పునస్కారాలకు ఇలా ప్రతిదానికి ఏదో ఒక వంక పెట్టుకుని ఛలో షాపింగ్ అంటుంటారు. తాజాగా డాక్టర్ బాబు (కార్తీకదీపం నటుడు నిరుపమ్) భార్య కూడా షాపింగ్ చేసేందుకు వెళ్లింది. సత్యనారాయణ వ్రతం ఉందంటూ ఆభరణాలు కొనుగోలు చేసింది. ఈసారి ఏకంగా ఏడువారాల నగలు తన భర్తతో కొనుగోలు చేయించింది. కాకపోతే అవి పూర్తి బంగారంతో చేసినవి కాదు. 92.5 స్వచ్ఛమైన వెండి మీద బంగారం పూతపూసి తయారు చేసినవి. అంటే బంగారం లాంటి వెండి నగలు సొంతం చేసుకుందన్నమాట. ఈ షాపింగ్ దెబ్బతో డాక్టర్ బాబు.. అమ్మాయిలకు బట్టలు, నగలు పిచ్చి అని అది ఎప్పటికీ పోదని కామెంట్ చేశాడు. చదవండి: విడాకులు తీసుకోనున్న మరో టాలీవుడ్ జంట? ఆ బాధ గురించి ఎలా చెప్పాలో మాటలు కూడా రావట్లేదు -
షూటింగ్ లొకేషన్లో కన్నుమూసిన నటుడు
సీనియర్ నటుడు వీపీ ఖలీద్ (70) షూటింగ్ లొకేషన్లోనే కన్నుమూశారు. కేరళలోని వయక్కం సమీపంలో సినిమా షూటింగ్లో పాల్గొన్న ఖలీద్‌కు శుక్రవారం గుండెపోటు రావడంతో అక్కడికక్కడే మరణించారు. కాగా ఆయన ప్రస్తుతం దర్శకుడు జూడ్ ఆంటోనీ డైరెక్ట్ చేస్తున్న సినిమాలో నటిస్తున్నారు. ఈ క్రమంలో శుక్రవారం సెట్స్‌కు వెళ్లిన ఆయన ఉదయం అల్పాహారం తీసుకున్న అనంతరం వాష్‌రూమ్‌కు వెళ్లి తిరిగిరాలేదు. దీంతో అనుమానం వచ్చిన చిత్రయూనిట్ సభ్యులు లోనికి వెళ్లి చూడగా ఖలీద్ అపస్మారక స్థితిలో కనిపించారు. వెంటనే చిత్రబృందం ఆయన్ను ఆస్పత్రికి తీసుకెళ్లగా అప్పటికే చనిపోయినట్లు వైద్యులు నిర్ధారించారు. వీపీ ఖలీద్ సినిమాల్లో చిన్నచిన్న పాత్రలు చేసేవారు. తర్వాత బుల్లితెరపై ప్రసారమయ్యే సీరియల్స్‌లో నటించడంతో ప్రేక్షకులకు మరింత దగ్గరయ్యారు. ఆయన కుమారులు షైజు, జింసీ, ఖలీద్ రెహమాన్ ముగ్గురూ కూడా ఫిలిం ఇండస్ట్రీలో రాణిస్తున్నారు. చదవండి: రణ్‌బీర్ కపూర్ కారుకు యాక్సిడెంట్ ఈ సినిమాలో సూర్య, షారుక్‌లు ఫ్రీగా నటించారు -
నా డబ్బులు, క్రెడిట్ కార్డులు కొట్టేశారు: సీఐడీ నటుడు
నటుడు హృషికేశ్ పాండే అంటే ఎవరికీ పెద్దగా తెలియకపోవచ్చేమో కానీ సీఐడీ షోలో ఇన్స్పెక్టర్ సచిన్ అంటే మాత్రం ఇట్టే గుర్తుపడతారు. సీఐడీ సిరీస్‌తో ఎంతోమంది అభిమానులను సంపాదించుకున్నాడు హృషికేశ్. ఈ షోలో ఎన్నో కేసులను ఇట్టే చేధించే ఈయన ఇటీవల తన పర్సు, క్రెడిట్ కార్డు, ఇతరత్రా వస్తువులను పోగొట్టుకున్నాడట. అదెలాగో ఆయనే మాటల్లోనే.. 'జూన్ 5న నేను, నా ఫ్యామిలీతో కలిసి మహారాష్ట్రలోని ఎలిఫెంటా కేవ్స్ సందర్శించాం. ఆ తర్వాత కొలబా నుంచి టార్డియోకు వెళ్లేందుకు ఓ ఏసీ బస్సు ఎక్కాం. సాయంత్రం ఆరున్నర గంటలకు బస్సు దిగాము. అప్పుడు నా బ్యాగ్ చూసుకోగా అందులో నా డబ్బులు, క్రెడిట్ కార్డులు, ఆధార్ కార్డు, పాన్ కార్డు ఇతరత్రా వస్తువులు కనిపించకుండా పోయాయి. దీంతో వెంటనే ఈ విషయంపై పోలీసులకు ఫిర్యాదు చేశాను. రీల్ లైఫ్‌లో సీఐడీ ఇన్స్పెక్టర్గా పని చేసిన నేను ఎన్నో కేసులను చేధించాను. రియల్ లైఫ్‌లో కూడా చాలామంది వారి సమస్యలను నా వద్ద చెప్పుకుంటూ వాటిని పరిష్కరించమని కోరేవారు. నేను నాకు చేతనైనంత సాయం చేసేవాడిని. కానీ ఇప్పుడు నా దగ్గరే కొట్టేశారు. ఇదంతా ఏదో జోక్‌గా అనిపిస్తుండొచ్చు. ఏదేమైనా పోలీసులు వీలైనంత త్వరగా ఈ కేసు సాల్వ్ చేస్తారని ఆశిస్తున్నాను' అని చెప్పుకొచ్చాడు. కాగా ఇటీవలే సీఐడీ బృందం ఒకేచోట చేరి పార్టీ చేసుకుంది. దయానంద్ శెట్టి(ఇన్స్పెక్టర్ దయ), ఆదిత్య శ్రీవాత్సవ (సీనియర్ ఇన్స్పెక్టర్ అభిజీత్), దినేశ్ ఫడ్నీస్ (ఇన్స్పెక్టర్ ఫ్రెడ్రిక్స్), శ్రద్ధ మూసలే (డాక్టర్ సారిక), జాన్వీ చెడ (ఇన్స్పెక్టర్ శ్రేయ), అజయ్ నాగ్రత్ (సబ్ ఇన్స్పెక్టర్ పంకజ్) గెట్ టు గెదర్ ఏర్పాటు చేసుకున్నారు. View this post on Instagram A post shared by Hrishikesh Pandey (@hrishikesh.11) చదవండి: మాజీ భర్త చదువుసంధ్య లేదని తిట్టేవాడు: నటి -
గ్రాండ్‌గా కమెడియన్ కిరాక్ ఆర్పీ ఎంగేజ్మెంట్
కామెడీ పంచులతో ప్రేక్షకులను కడుపుబ్బా నవ్విస్తాడు కిరాక్ ఆర్పీ. టైమింగ్ మిస్ కాకుండా పంచ్‌లు వేస్తూ స్కిట్లు వదులుతుంటాడు. ప్రజలను పొట్టచెక్కలయ్యేలా నవ్వించే కమెడియన్ కిరాక్ ఆర్పీ తాజాగా పెళ్లి కొడుకుగా ముస్తాబయ్యాడు. తన ప్రేయసి లక్ష్మీ ప్రసన్నతో నిశ్చితార్థం చేసుకున్నాడు. ఇరు కుటుంబాలు, బంధుమిత్రులు, సన్నిహితుల సమక్షంలో గ్రాండ్‌గా ఈ వేడుక జరిగినట్లు తెలుస్తోంది. ఈ నిశ్చితార్థానికి నటుడు ధనరాజ్ కుటుంబ సమేతంగా హాజరై వారిని ఆశీర్వదించాడు. ఈ సందర్భంగా వారితో దిగిన ఫొటోను ఫేస్బుక్లో షేర్ చేస్తూ మరోసారి శుభాకాంక్షలు చెప్పాడు. ఆర్పీ ఎంగేజ్మెంట్కు ధనరాజ్‌తో పాటు పలువురు కమెడియన్లు, బుల్లితెర సెలబ్రిటీలు హాజరై సందడి చేశారు. ప్రస్తుతం దీనికి సంబంధించిన ఫొటోలు నెట్టింట వైరల్‌గా మారాయి. కాగా ఆర్పీ ఇటీవలే యూట్యూబ్ చానల్ మొదలు పెట్టాడు. ఇందులో మొట్టమొదటగా హోమ్ టూర్ వీడియో చేశాడు. అందులో లిఫ్ట్, హోం థియేటర్.. ఇలా అన్నింటినీ చూపించిన ఆర్పీ తన బెడ్రూమ్లోని ఓ అమ్మాయి ఫొటో చూపించి ఆమె తనకు కాబోయే భార్య అని జనాలకు పరిచయం చేశాడు. చదవండి: ఈ సినిమాతో నా కల నెరవేరింది.. మ్యూజిక్ డైరెక్టర్ శ్రీచరణ్ దుల్కర్ సల్మాన్ 'సీతారామం' రిలీజ్ డేట్ వచ్చేసింది! -
11 నెలలుగా నా ఇంట్లో నా భార్యతో ఉంటున్నాడు: నటుడు
Karan Mehra Accuses Wife Nisha Rawal Have Extramarital Affair: టీవీ నటి నిషా రావల్, నటుడు కరణ్ మెహ్రా విడిపోయి ఒక సవంత్సరం అవుతుంది. వీరి విడాకుల వ్యవహారం ఇంకా కొనసాగుతూనే ఉంది. గృహ హింస కేసు కింద నిషా ఫిర్యాదు చేయడంతో కరణ్‌ను పోలీసులు అరెస్ట్ చేశారు. దీంతో ఈ వివాదం మరింత తీవ్రమైంది. అయితే జూన్ 1న బెయిల్‌పై విడుదలైన కరణ్.. నిషాపై పలు ఆరోపణలు చేశాడు. తనను తానే హింసించుకుని అతడిపై తప్పుడు ఆరోపణలు చేస్తుందన్నాడు. భారీగా భరణం పొందేందుకే ఇలా చేస్తోందని పేర్కొన్నాడు. నిషా వివాహేతర సంబంధం పెట్టకుందని మీడియా ఎదుట ఆరోపించాడు. అంతేకాకుండా నిషా తనను మోసం చేసిందని ఆవేదన వ్యక్తం చేశాడు. 'ఇప్పటికీ నా ఇంట్లో ఒక వ్యక్తి నివసిస్తున్నాడు. గత 11 నెలలుగా ఆ వ్యక్తి నా ఇంట్లో నా భార్యతో (నిషాతో) ఉంటున్నాడు. అతను తన భార్యాపిల్లలను విడిచి పెట్టి నా భార్యతో కలిసి జీవిస్తున్నాడు. అంతేకాకుండా నా ఆస్తులు, కార్లు, వ్యాపారాలు లాక్కున్నారు. నిషాకు సన్నిహితులైన రోహిత్ వర్మ, మునీషా ఖట్వా ఇప్పుడు తనతో ఎందుకు లేరు.' అని కరణ్ మెహ్రా మీడియాతో తెలిపాడు. చదవండి: 👇 అతడిని ముద్దు పెట్టుకున్నా.. భర్తకు చెప్పిన సీరియల్ నటి ఇదిలా ఉంటే గతేడాది కరణ్ ఆరోపణలపై నిషా స్పందిస్తూ 'నాకు ఎలాంటి భరణం అక్కర్లేదు. నాతో కలిసి సంపాదించుకుంది నాకే ఎలా తిరిగి ఇస్తాడు. మేము కలిసి ప్రతిదీ నిర్మించాం. నేను నా చిన్నవయసు నుంచే సంపాదించడం ప్రారంభించాను. యే రిష్తా సీరియల్లో భాగం కాకముందు నుంచే నేను అతనికి సపోర్ట్‌గా నిలిచాను. నేను చాలా పని చేశాను. నేను ఎవరితో కలిసి పనిచేసిన కూడా వాణిజ్య ప్రకటనలకు కరణ్ బాధ్యత వహిస్తాడని హామీ ఇస్తున్నాను.' అని పేర్కొంది. చదవండి: 👇 నా భార్యే తలను గోడకేసి కొట్టుకుంది: టీవీ నటుడు -
‘గృహలక్ష్మి’ సీరియల్ నా జీవితానికి టర్నింగ్ పాయింట్..
విజయనగరం టౌన్: తెలుగు చలన చిత్రసీమలో దాదాపు 30 సినిమాల్లో నటించినప్పటికీ బుల్లితెర నటుడిగానే బాగా గుర్తింపు వచ్చింది. స్టార్ మాలో వచ్చే గృహలక్ష్మి సీరియల్ ఆయనకు మంచి పేరు తీసుకువచ్చింది. 69 ఏళ్ల వయసులో అలవోకగా నటిస్తూ అందరి మన్ననలు అందుకుంటున్నారు జిల్లాకు చెందిన బొమ్మిరెడ్డిపల్లి పేర్రాజు. ఆదివారం విజయనగరం వచ్చిన ఆయన సాక్షితో కాసేపు ముచ్చటించారు. ఆ ముచ్చట్లన్నీ ఆయన మాటల్లోనే.. జిల్లా కేంద్రంలోని కానుకుర్తివారి వీధిలో పుట్టాను. చదవండి: సినీనటుడు ఆలీ సడన్ సర్ప్రైజ్.. ఎవరికీ చెప్పకుండా.. 1969లో కోరుకొండ సైనిక్ స్కూల్ జాయినై రెండేళ్ల పాటు చదివి, అనివార్య కారణాల వల్ల మధ్యలోనే చదువు ఆపేశాను. మిత్రుడు నాలుగెస్సుల రాజుతో కలిసి మెట్రిక్యులేషన్ పూర్తిచేశాను. అనంతరం ఎంఆర్ కళాశాలలో ఇంటర్, బీకామ్ పూర్తిచేశాను. ఫ్రెండ్స్‌తో కలిసి ఢిల్లీ టూర్ వెళ్లినప్పుడు ఓ పత్రికలో వచ్చిన క్లిప్లింగ్ ఆధారంగా ఇండియన్ ఎయిర్ లైన్స్‌కు దరఖాస్తు చేయగా, ట్రాఫిక్ అసిస్టెంట్‌గా ఉద్యోగం వచ్చింది. 28 ఏళ్ల పాటు వివిధ ప్రాంతాల్లో పనిచేసి హిందీ, తెలుగు, పంజాబీ భాషల్లో ప్రావీణ్యం సంపాదించాను. సినిమా ఇండస్ట్రీ వాళ్లు ఢిల్లీ టూర్‌కి వచ్చినప్పుడు నాతో బాగా మాట్లాడేవారు. ఈ సమయంలో అల్లు అరవింద్ గారితో పరిచయం జరిగింది. వలంటరీ రిటైర్మెంట్ తీసుకున్న తర్వాత హైదరాబాద్‌కి వచ్చాను. ప్రముఖ నిర్మాత అల్లు అరవింద్‌ను కలవడంతో అల్లు అర్జున్ నటించిన హ్యాపీ చిత్రంలో నటించే అవకాశం వచ్చింది. తర్వాత స్టాలిన్, డాన్, హోమం, తదితర 30 చిత్రాలలో నటించాను. చిత్రసీమలో అంతగా పేరు ప్రఖ్యాతులు రాకపోవడంతో టీవీ సీరియళ్లపై దృష్టి సారించాను. ఈ సమయంలో స్టార్ మాలో ప్రసారం అయ్యే ఇంటింటి గృహలక్ష్మిలో నటించే అవకాశం వచ్చింది. ఈ సీరియల్ నా జీవితానికి ఓ టర్నింగ్ పాయింట్. ఇప్పటివరకు 26 సీరియళ్లలో నటించాను. మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్‌లో లైఫ్ మెంబర్‌గా ఉన్నాను. -
కొత్త ఫ్లాట్ కొన్న నటుడు, దాని వెల ఎన్ని కోట్లో తెలుసా?
బుల్లితెర నటుడు, బిగ్‌బాస్ కంటెస్టెంట్ కరణ్ కుంద్రా ప్రస్తుతం వరుస ప్రాజెక్టులతో బిజీబిజీగా ఉన్నాడు. ప్రియురాలు తేజస్వినితో త్వరలోనే పెళ్లికి రెడీ అవుతున్నట్లు కూడా వార్తలు వినిపిస్తున్నాయి. ఈ క్రమంలో తాజాగా అతడు ఓ ఇంటిని కొనుగోలు చేసినట్లు భోగట్టా! ముంబైలోని బాంద్రాలో ఓ లగ్జరీ ఫ్లాటును సొంతం చేసుకున్నట్లు ఓ వార్త సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది. ఆ ఫ్లాటులో నుంచి చూస్తే సముద్ర తీరం కనిపిస్తుందట. కుంద్రా కొత్తింట్లో ఓ లిఫ్టుతో పాటు స్విమ్మింగ్ పూల్ కూడా ఉన్నట్లు తెలుస్తోంది. ఇన్ని సౌకర్యాలున్న కొత్తింటి కోసం అతడు దాదాపు రూ.20 కోట్లు వెచ్చించినట్లు సమాచారం. ఇదిలా ఉంటే ప్రస్తుతం కరణ్ కుంద్రా బేచారి మ్యూజిక్ వీడియోలో నటిస్తుండగా మరోపక్క డ్యాన్స్ దీవాని జూనియన్స్ షోకు వ్యాఖ్యాతగా వ్యవరిస్తున్నాడు. అలాగే ఇలియానా, రణ్‌దీప్ హుడాలతో కలిసి ఓ సినిమా కూడా చేస్తున్నాడు. var request = 'https://www.sakshi.com/knowwidget/kwstr_511240763.json'; $.ajaxPrefilter( function (request) { if (request.crossDomain && jQuery.support.cors) { var http = (window.location.protocol === 'http:' ? 'http:' : 'https:'); request.url = http + '//cors-anywhere.herokuapp.com/' + request.url; } }); $.get( request,function (response){ if(response == ''){ $('#frameId').hide(); }else{ $('#frameId').show(); } }); చదవండి: పొలిటికల్ ఎంట్రీపై స్పందించిన వర్మ, ఏమన్నాడంటే.. -
దిక్కుతోచక ఏటీఎమ్ రూమ్‌లో నిద్రించేవాడిని: బుల్లితెర నటుడు
ముఖానికి రంగేసుకుని కెమెరా ముందు నవరసాలు పలికించే నటీనటుల జీవితంలో ఎన్నో విషాదాలు ఉంటాయి. కానీ వాటన్నింటినీ పైకి కనిపించనీయకుండా ముఖానికి మేకప్‌తో, పెదాలపై చిరునవ్వుతో స్క్రీన్‌పై కనిపిస్తూ జనాలను అలరిస్తూ ఉంటారు. బుల్లితెర స్టార్ అంకిత్ సివాచ్ కూడా ఈ కోవకే చెందుతాడు. మోడలింగ్ సమయంలో ఎన్నో ఒడిదుడుకులను ఎదుర్కొన్నానని తెలిపాడు. ఉత్తరప్రదేశ్‌లోని మీరట్‌లో జన్మించిన అంకిత్ తాజాగా మీడియాతో మాట్లాడుతూ.. 'ఢిల్లీలో ఓ పక్క చదువుకుంటూనే కాల్ సెంటర్లో పనిచేసేవాడిని. మోడలింగ్ పూర్తి చేయడానికి రూ.60,000 అవసరమయ్యాయి. కానీ దీనికోసం నా తల్లిదండ్రులను ఇబ్బంది పెట్టాలనుకోలేదు. ఎందుకంటే కేవలం నా ఇష్టంతో మోడలింగ్‌ను ఎంచుకున్నాను. నేను సంపాదించిన డబ్బులతోనే మోడలింగ్ పూర్తి చేయాలనుకున్నాను. అయితే వేసవిలో ఢిల్లీలో ఎండలు మండిపోతాయి. ఆ సమయంలో ఎండకు తాళలేక నేను ఏటీఎమ్ దగ్గర పనిచేసే వాచ్‌మెన్‌కు ఓ వంద రూపాయలు ఇచ్చి అక్కడ పడుకునేవాడిని. ఎందుకంటే అందులో ఏసీ ఉంటుంది కదా! అలా దాదాపు ఏడు వారాలపాటు ఏసీ కోసం ఏటీఎమ్‌లో నిద్రించేవాడిని. ఒకవేళ నాకు డబ్బు కావాలని పేరెంట్స్‌ను అడిగితే వాళ్లు ఒక్క మాట కూడా తిరిగి ప్రశ్నించకుండా నాకు మనీ పంపించేవారు. కానీ నాకది ఇష్టం లేదు. పైగా డబ్బులు దుబారా ఖర్చు పెట్టకూడదని ఫ్రెండ్స్‌తో పార్టీలకు కూడా వెళ్లేవాడిని కాదు. అందువల్ల వాళ్లు నన్ను ద్వేషించేవారు కూడా! ఇంట్లో(మీరట్‌లో) ఉంటే హాయిగా బతికేవాడినే, కానీ ఇక్కడికొచ్చాక చాలా కష్టాలు పడ్డాను' అని చెప్పుకొచ్చాడు. కాగా అంకిత్.. మన్మోహిని, యే జుకీసి నజర్, సఫర్నమ వంటి పలు సీరియల్స్‌లో నటిస్తున్నాడు. చదవండి: సాక్షి ఆడియన్స్ పోల్, సర్కారువారి పాటపై ప్రేక్షకుల రివ్యూ బాలీవుడ్ పరిస్థితి అయితే మరీ దారుణంగా ఉంది -
ఒంటిపై బట్టలేకుండా ఫొటోలు పంపమనేవారు: బుల్లితెర నటుడు
తాను కూడా కాస్టింగ్ కౌచ్ బాధితుడినే అంటున్నాడు టీవీ నటుడు అంకిత్ సివాచ్. మోడల్‌గా 12 ఏళ్ల క్రితమే కెరీర్ ఆరంభించిన ఈ నటుడు 2017లో బుల్లితెరపై ఎంట్రీ ఇచ్చాడు. పలు హిందీ సీరియళ్లలో నటిస్తూ మంచి గుర్తింపు సంపాదించుకున్నాడు అంకిత్. అయితే ఒకానొక సమయంలో అన్నీ వదిలేసి వెనక్కు వెళ్లిపోవాలనుకున్నానంటూ కాస్టింగ్ కౌచ్ అనుభవాలను పంచుకున్నాడు. 'అందరూ మంచివాళ్లు అని ఎప్పుడూ అనుకుంటూ ఉండేవాడిని. కానీ అలా అనుకోవడమే నా బలహీనతగా మారింది. ఈ వీక్నెస్ను ఎదుటివాళ్లు యూజ్ చేసుకోవచ్చు. ప్రతి ఒక్కరిలోనూ చెడు కూడా ఉంటుంది. కానీ అది రాక్షసత్వంగా మారి మిమ్మల్ని ముప్పుతిప్పలు పెట్టొచ్చు. మోడలింగ్ చేసేటప్పుడు నేను అలాంటి ఇబ్బందులనే ఎదుర్కొన్నాను. ఒంటి మీద బట్టలు లేకుండా ఫొటోలు పంపమనేవారు. నాకు ఇచ్చిన పనితో సంబంధం లేకుండా పార్టీలకు రావాలనేవారు. నన్ను వేధింపులకు గురి చేశారు. చాలాసార్లు మోడలింగ్ మానేద్దామా అనిపించింది. కొంతమందిని చూసినప్పుడు మన కళ్ల ముందు రాబంధులు నిలబడి మనల్ని పీక్కు తినడానికి వస్తున్నాయనిపించేది. అలాంటివారిని చూసినప్పుడు అన్నీ వదిలేసి వెనక్కు వెళ్లిపోదాం అనిపించేది. దీనివల్ల మానసిక ఒత్తిడికి లోనయ్యా. కుమిలిపోయాను. కానీ అధికారంలో ఉన్నవారు ఇతరులను దగా చేయడం మానవ స్వభావమని నన్ను నేను సంభాలించుకున్నాను. ఇది ప్రతి ఇండస్ట్రీలో ఉంది. వాటినుంచి మనం తప్పించుకోలేము. ఏదో ఒకసారి ఫేస్ చేయాల్సిందే. అలా నాకు ఎన్నో ప్రపోజల్స్ వచ్చాయి. నీకు ఇష్టమున్నా లేకపోయినా నీ కెరీర్ కోసమైనా ఆ పని చేసి తీరాల్సిందే అని ఒత్తిడి తెచ్చినవాళ్లు కూడా ఉన్నారు. అప్పుడు నేను స్వయంకృషితో ఎదిగిన సెలబ్రిటీల గురించి ఉదాహరణగా చెప్పేవాడిని. మేము చెప్పినదానికి కాంప్రమైజ్ కాకుండా నువ్వు ముందుకు వెళ్లగలననుకుంటున్నావా? అని బెదిరించేవాళ్లు కూడా!' అని చెప్పుకొచ్చాడు అంకిత్ సివాచ్. చదవండి: ఓటీటీల్లో మిస్ అవ్వకూడని టాప్ 6 సినిమాలు.. ప్రియుడితో లేచిపోయారంటూ వచ్చిన వార్తలపై రాజశేఖర్ కూతురు ఫైర్ -
ఆమెతో నా భర్త వివాహేతర సంబంధం, విడాకులు: నటి భావోద్వేగం
Nisha Rawal Opens Up On Karan Mehra's Extra-Marital Affair: టీవీ నటి నిషా రావల్ తన మాజీ భర్త, నటుడు కరణ్ మెహ్రాతో విడాకులపై మరోసారి స్పందించింది. కంగనా రనౌత్ హోస్ట్‌గా వస్తున్న లాక్అప్ రియాలిటీ షోలో నిషా పాల్గొంది. ఈ సందర్భంగా ఆమె గతేడాది తన జీవితంలో చోటు చేసుకున్న చేదు అనుభావాన్ని గర్తు చేసుకుని భావోద్వేగానికి లోనయ్యింది. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. పాయల్ రోహత్గీతో వివాహేతర సంబంధం బహిర్గతం అనంతరం తనని ఒంటిరిగా వదిలేసి తమ కుమారుడు కవిష్ను తీసుకుని ముంబై వెళ్లిపోయాడంటూ ఆమె కన్నీరు పెట్టుకుంది. చదవండి: ఆ హీరో నన్ను ఏకాంతంగా కలవాలి అన్నాడు: ‘చంద్రలేఖ’ హీరోయిన్ అలాగే ‘‘పాయల్ రాస్తోంగి కరణ్ సీక్రెట్‌గా మాట్లాడం చూసి నాకు అనుమానం వచ్చింది. దీంతో కరణ్‌ను నిలదీశాను. దీనికి అతడు ‘అవును నేను మరోకరితో ప్రేమలో ఉన్నాను. 5, 6 నెలలగా నేను, పాయల్ సీక్రెట్ రిలేషన్లో ఉన్నాం. నేను తనను ప్రేమిస్తున్నాను. అలాగే నిన్ను కూడా ఇష్టపడుతున్నా’ అని నాతో చెప్పాడు. అతడి మాటలు నన్ను తీవ్రంగా బాధించాయి. ఇక కరణ్‌ను మరోసారి నమ్మి మోసపోవాలనుకోలేదు. అందుకే విడిపోవాలని నిర్ణయించుకున్నా’ అని చెప్పింది. అంతేకాదు ‘కరణ్-పాయల్ల వివాహేతర సంబంధం బయట పెట్టాక మా మధ్య తరచూ గొడవలు అయ్యేవి. చదవండి: ఆగిపోయిన ‘బిగ్‌బాస్ నాన్‌స్టాప్’ లైవ్ స్ట్రీమింగ్, అసలేమైందంటే.. ఈ క్రమంలో కరణ్ నన్ను మానసికంగా, భౌతికంగా గాయపరిచాడు. అవే గాయాలతో మీడియా ముందుకు వచ్చిన నన్ను దారుణంగా ట్రోల్ చేశారు. కెచప్ రాసుకుని నాటకాలు ఆడుతుందంటూ ఈ సమాజం నన్ను నిందించింది’ అంటూ నిషా రావల్ కన్నీటి పర్యంతమైంది. కాగా గతేడాది నిషా రావల్, కరణ్‌ల విడాకుల వ్యవహరంగా బి-టౌన్లో హాట్‌టాపిక్‌గా మారింది. భర్త తనని వేధిస్తున్నాడని, భౌతికంగా గాయపరిచాడంటూ ఆమె పోలీసులను, మీడియాను ఆశ్రయించడంతో ఈ విషయం ఒక్కసారిగా పరిశ్రమలో గుప్పుమంది. ఈ కేసులో నటుడు కరణ్ మెహ్రా అరెస్టై జైలుకు వెళ్లిన సంగతి తెలిసిందే. అయితే ఇటీవల అతడు బెయిల్‌పై బయటకు కూడా వచ్చాడు. -
'నీచంగా చూస్తారు, జయసుధ తాగే కాఫీలో మోషన్ టాబ్లెట్లు కలిపారు'
మేకా రామకృష్ణ.. వందలాది సినిమాలు చేసిన అనుభవం ఆయనది. సినిమాలే కాదు బుల్లితెరపై సీరియళ్లు కూడా చేస్తూ ప్రేక్షకులకు చేరువయ్యాడీయన. ఆయన పేరు చెప్తే గుర్తు పట్టరేమో కానీ ఆకారం చూస్తే మాత్రం ఇట్టే గుర్తుపడతారు. తాజాగా అతడు ఓ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ.. ఇండస్ట్రీలో జరిగే అరాచకాలను బయటపెట్టాడు. సెట్స్‌లో ఆర్టిస్టులను దారుణంగా చూస్తారంటూ ఆవేదన చెందాడు. 'సినిమా ప్రొడక్షన్ బాయ్స్ చిన్న ఆర్టిస్టులను చులకగా చూస్తారు. అది ఒకరకంగా నరకం! చాలాసార్లు కళ్లల్లో నీళ్లు తిరిగాయి. అడుక్కునేవాడికి కూడా ఇదిగో తీస్కో అని మర్యాదగా ఇస్తాం, కానీ ప్రొడక్షన్ బాయ్స్ నీచాతినీచంగా ప్రవర్తిస్తారు. ఒక్కోసారి వాళ్లను నరికేయాలన్నంత కోపం వస్తుంది. ప్రొడ్యూసర్స్ ఏం చేస్తున్నారంటే ఫుడ్ పెట్టేదగ్గర నాలుగైదు కేటగిరీలు పెట్టేస్తున్నారు. మనం పొరపాటున మనకి కేటాయించిన దాంట్లో కాకుండా పక్కదాంట్లోకి వెళ్లామంటే హీనంగా చూస్తారు. హీరోలు, నిర్మాతలకు ఒకచోట, టెక్నికల్, డైరెక్షన్‌కు మరో దగ్గర, జూనియర్ ఆర్టిస్టులకు ఇంకో చోట, సెకండ్ గ్రేడ్ టెక్నీషియన్లకు మరో చోట టెంట్ వేస్తున్నారు. అక్కడ సపోర్టింగ్ ఆర్టిస్టులను నీచాతినీచంగా ట్రీట్ చేస్తారు. ఈ పాపం మీకు తగులుతుంది, నాశనం అయిపోతారు అని నేను తిట్టిన సందర్భాలు కూడా ఉన్నాయి. నేనే కాదు, ఎంతోమంది కళ్లలో నీళ్లు పెట్టుకున్నారు. కానీ ఈ విషయాలన్నీ దర్శక నిర్మాతలకు తెలియదు. ప్రొడక్షన్ బాయ్స్‌ని పొరపాటున ఎవరైనా తిడితే వాళ్లకు కాఫీలో మోషన్ టాబ్లెట్లు కలిపి ఇస్తారు. జయసుధగారికే అలా చేశారు. టాయ్లెట్లో ఉండే నీళ్లను మంచినీళ్లుగా ఇచ్చేవారు. ఇలా చాలా జరిగాయి. అందరినీ అనట్లేదు, కొంతమందినే అంటున్నా. ఒకసారి ఏమైందంటే.. సెట్లో ఎనిమిది మందితో భోజనం చేయడానికి కూర్చున్నా. వాళ్లందరికి వేడివేడిగా అక్కడే వండిన రైస్ వడ్డిస్తే నాకు మాత్రం బయట నుంచి తెచ్చిన అన్నం సెపరేట్‌గా పెట్టారు. అదేంటయ్యా, నాకూ అదే పెట్టొచ్చుగా అంటే మీకంత రేంజ్ లేదు, ఇక్కడెందుకు కూర్చున్నారని అడిగాడు. డైరెక్టర్, హీరోహీరోయిన్ల ముందు అలా అనేసరికి కళ్లలో నీళ్లు తిరిగాయి. నాకు జరిగిన అవమానానికి చచ్చిపోవాలనుకున్నా. షూటింగ్ లొకేషన్లలో హీరోయిన్లకే రూమ్ ఇచ్చి మిగతావాళ్లకు ఎవరికీ రూమ్ ఇవ్వరు. వాళ్లు బయట ఏ చెట్టు కిందో కూర్చుంటారు. ఇలాంటివి బయటపెడుతుంటే అవకాశాలివ్వడం లేదు. మేల్ ఆర్టిస్టులకు రెమ్యునరేషన్, పరువు మర్యాద ఏమీ ఉండట్లేదు. నిర్మాతలు ఒప్పుకున్నా ఛానల్ వాళ్లు మాత్రం నాలాంటి వాళ్లకు అవకాశాలివ్వడం లేదు' అని చెప్తూ మేకా రామకృష్ణ ఆవేదన చెందాడు. -
బుల్లితెర నటుడి ఇంట తీవ్ర విషాదం..
బుల్లితెర నటుడు షాహీర్ షైఖ్ ఇంట విషాదం నెలకొంది. గత కొద్దికాలంగా కరోనాతో పోరాడుతున్న అతడి తండ్రి షెహనావాజ్ షైఖ్ తుది శ్వాస విడిచారు. ఈ విషయాన్ని నటుడు అలీ గోని ట్విటర్ వేదికగా వెల్లడించాడు. మీ ఆత్మకు శాంతి చేకూరుగాక అంకుల్ అంటూ అలీ గోని ట్విటర్లో నివాళులు అర్పించాడు. కాగా షెహనావాజ్ కొద్దిరోజుల క్రితం కరోనా బారిన పడ్డారు. తీవ్ర కోవిడ్ లక్షణాలతో బాధపడుతున్న అతడిని ఆస్పత్రిలో చేర్పించి చికిత్స అందించారు. అయినప్పటికీ ఆయన ఆరోగ్యం కుదుటపడకపోగా పరిస్థితి రోజురోజుకూ క్షీణించింది. ఈ క్రమంలో గురువారం ఆయన మృత్యువు ఒడికి చేరుకున్నారు. ఆయన మృతి పట్ల పలువురు సెలబ్రిటీలు సంతాపం ప్రకటిస్తున్నారు. కాగా పలు సీరియళ్లతో పాపులారిటీ సంపాదించుకున్న షాహీర్ ఇటీవలే తండ్రయ్యాడు. షాహిర్, రుచికపూర్ దంపతులు సెప్టెంబర్ 9న పండంటి బిడ్డకు జన్మనిచ్చారు. కానీ ఇంతలోనే తన తండ్రిని కోల్పోవడంతో షాహీర్ తీవ్ర దుఃఖంలో మునిగిపోయాడు. Inna Lillahi wa inna ilayhi raji'un 🙏🏼 May Allah rest uncle’s soul in peace bhai @Shaheer_S stay strong bhai ❤️ — Aly Goni (@AlyGoni) January 19, 2022