కొరియోగ్రాఫర్‌ను పెళ్లాడిన బుల్లితెర నటుడు | Shaka Laka Boom Boom Actor Kinshuk Vaidya Is Married His Girlfriend Diiksha Nagpal, Video Goes Viral | Sakshi
Sakshi News home page

TV actor: కొరియోగ్రాఫర్‌ను పెళ్లాడిన బుల్లితెర నటుడు

Published Sun, Nov 24 2024 6:04 PM | Last Updated on Mon, Nov 25 2024 3:39 PM

Shaka Laka Boom Boom actor Kinshuk Vaidya is married

ప్రస్తుతం సినీ ఇండస్ట్రీలో పెళ్లిళ్ల సీజన్ నడుస్తోంది. తాజాగా మరో నటుడు ఓ ఇంటివాడయ్యారు.  బాలీవుడ్‌లో ఫేమస్ సీరియల్‌ నటుడు  కిన్షుక్ వైద్య పెళ్లిబంధంలోకి అడుగుపెట్టారు. హిందీలో కొరియోగ్రాఫర్‌గా రాణిస్తున్న దీక్షా నాగ్‌పాల్‌ను వివాహం చేసుకున్నాడు. దీనికి సంబంధించిన ఫోటోలను సోషల్ మీడియా ద్వారా పంచుకున్నారు.

కాగా.. కిన్షుక్ వైద్య షక లక బూమ్ బూమ్‌ సీరియల్‌తో గుర్తింపు తెచ్చుకున్నాడు.  వీరి వివాహా వేడుక అలీబాగ్‌లో జరిగింది. ఈ పెళ్లికి సన్నిహితులు, బుల్లితెర తారలు కూడా హాజరయ్యారు. మహారాష్ట్ర సంప్రదాయ వేడుకలో ఈ జంట వివాహం చేసుకున్నారు. ఈ ఏడాది ఆగస్టులో కిన్షుక్- దీక్షా ల నిశ్చితార్థం జరిగింది. దాదాపు మూడు నెలల తర్వాత వివాహాబంధంలోకి అడుగుపెట్టారు. ఈ విషయం తెలుసుకున్న ఫ్యాన్స్‌ నూతన వధూవరులకు అభినందనలు చెబుతున్నారు. అంతేకాకుండా కిన్షుక్ వైద్య రాధా కృష్ణ, వో తో హై అల్బేలా, కర్న్ సంగిని వంటి సీరియల్స్‌లోనూ కనిపించారు.
 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement