ఓ ఇంటివాడైన రవిశాస్త్రి.. ఉదయ్‌పూర్‌లో గ్రాండ్ వెడ్డింగ్! | Gehraiyaan actor Dhairya Karwa gets married in Jaipur | Sakshi

Dhairya Karwa: పెళ్లి చేసుకున్న 83 మూవీ నటుడు.. ఉదయ్‌పూర్‌లో గ్రాండ్ వెడ్డింగ్!

Apr 8 2025 2:38 PM | Updated on Apr 8 2025 3:21 PM

Gehraiyaan actor Dhairya Karwa gets married in Jaipur

ప్రముఖ బాలీవుడ్ నటుడు ధైర్య కర్వా ఓ ఇంటివాడయ్యారు. రాజస్థాన్‌లోని ఉదయపూర్‌లో జరిగిన వివాహా వేడుకలో మూడుముళ్ల బంధంలోకి అడుగుపెట్టారు. ఈ పెళ్లికి సంబంధించిన ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి. ఈ వివాహ వేడుకలో కేవలం సన్నిహితులు, కుటుంబ సభ్యులు మాత్రమే హాజరైనట్లు తెలుస్తోంది.

కాగా.. ధైర్య కర్వా బాలీవుడ్‌లో దీపికా పదుకొణె నటించిన గెహరియాన్‌ చిత్రంలో కీలక పాత్రలో నటించారు. అంతేకాకుండా యురి ది సర్జికల్ స్ట్రైక్ చిత్రంలో కెప్టెన్ సర్తాజ్ సింగ్ చందోక్ పాత్రలో కనిపించారు. ఆ తర్వాత స్పోర్ట్స్ డ్రామా 83 లాంటి సినిమాలతో అభిమానులను మెప్పించారు. 1983 ప్రపంచకప్ నేపథ్యంలో తెరకెక్కించిన చిత్రంలో రవిశాస్త్రి పాత్రలో ఆకట్టుకున్నారు. గతేడాది గ్యారాహ్ గ్యారాహ్ సినిమాలో నటించారు. పలు సినిమాలతో బాలీవుడ్‌లో అభిమానులను మెప్పించిన ధైర్య కర్వా పెళ్లిబంధంలోకి అడుగుపెట్టారు.  అయితే అతను చేసుకున్న ఆమె గురించి వివరాలేమీ తెలియదు. 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Photos

View all

Video

View all
Advertisement