
ప్రముఖ సంగీత నిర్మాత, కంపోజర్ యశ్‌రాజ్ ముఖాటే వివాహాబంధంలోకి అడుగుపెట్టారు. తన స్నేహితురాలు అల్పనాను ఆయన పెళ్లాడారు. ఈ జంట తమ వివాహాన్ని రిజిస్టర్ చేసుకున్నారు. దీనికి సంబంధించిన ఫోటోలను యశ్‌రాజ్ తన ఇన్‌స్టాలో పంచుకున్నారు. ఈ విషయం తెలుసుకున్న ఆయన అభిమానులు నూతన దంపతులకు శుభాకాంక్షలు చెబుతున్నారు. ప్రముఖ నటి సుప్రియా పిల్గావ్కర్, కుషా కపిల, తన్మయ్ భట్, జామీ లీవర్ ఈ జంటను అభినందించారు.
కాగా.. యష్‌రాజ్ తన రసోదే మే కౌన్ థా మాషప్ తర్వాత ప్రసిద్ధి చెందాడు. అప్పటి నుంచి యష్‌రాజ్ వినోదభరితమైన సంగీతం, రీమిక్స్‌లు, వీడియోలను సృష్టిస్తూ గుర్తింపు తెచ్చుకున్నారు. అతనికి యూట్యూబ్, ఇన్‌స్టాగ్రామ్‌లో పెద్ద ఎత్తున ఫాలోవర్స్ కూడా ఉన్నారు. డైలాగ్‌లను ఆకట్టుకునే ట్యూన్‌లుగా మార్చడంలో అతనిది ప్రత్యేకమైన శైలి. వినోదాత్మక కంటెంట్‌ను రూపొందిస్తూ ప్రేక్షకులను ఆకట్టుకుంటున్నారు. గత రెండేళ్లలో అజయ్ దేవగన్, షెహనాజ్ గిల్ వంటి ప్రముఖులు కూడా యష్‌రాజ్‌తో కలిసి పనిచేశారు.
Comments
Please login to add a commentAdd a comment