music composer
-
పెళ్లిబంధంలోకి అడుగుపెట్టిన ప్రముఖ సంగీత దర్శకుడు!
ప్రముఖ సంగీత నిర్మాత, కంపోజర్ యశ్‌రాజ్ ముఖాటే వివాహాబంధంలోకి అడుగుపెట్టారు. తన స్నేహితురాలు అల్పనాను ఆయన పెళ్లాడారు. ఈ జంట తమ వివాహాన్ని రిజిస్టర్ చేసుకున్నారు. దీనికి సంబంధించిన ఫోటోలను యశ్‌రాజ్ తన ఇన్‌స్టాలో పంచుకున్నారు. ఈ విషయం తెలుసుకున్న ఆయన అభిమానులు నూతన దంపతులకు శుభాకాంక్షలు చెబుతున్నారు. ప్రముఖ నటి సుప్రియా పిల్గావ్కర్, కుషా కపిల, తన్మయ్ భట్, జామీ లీవర్ ఈ జంటను అభినందించారు. కాగా.. యష్‌రాజ్ తన రసోదే మే కౌన్ థా మాషప్ తర్వాత ప్రసిద్ధి చెందాడు. అప్పటి నుంచి యష్‌రాజ్ వినోదభరితమైన సంగీతం, రీమిక్స్‌లు, వీడియోలను సృష్టిస్తూ గుర్తింపు తెచ్చుకున్నారు. అతనికి యూట్యూబ్, ఇన్‌స్టాగ్రామ్‌లో పెద్ద ఎత్తున ఫాలోవర్స్ కూడా ఉన్నారు. డైలాగ్‌లను ఆకట్టుకునే ట్యూన్లుగా మార్చడంలో అతనిది ప్రత్యేకమైన శైలి. వినోదాత్మక కంటెంట్‌ను రూపొందిస్తూ ప్రేక్షకులను ఆకట్టుకుంటున్నారు. గత రెండేళ్లలో అజయ్ దేవగన్, షెహనాజ్ గిల్ వంటి ప్రముఖులు కూడా యష్రాజ్తో కలిసి పనిచేశారు. View this post on Instagram A post shared by Yashraj Mukhate (@yashrajmukhate) -
పదహారు ప్రాయంలోనే సంగీత సు'స్వరా'యల్గా.. జస్లీన్ రాయల్
సుస్వరాయల్ పదహారు సంవత్సరాల వయసులోనే రకరకాల మ్యూజిక్ ఇన్స్ట్రూమెంట్స్ను ప్లే చేసే నైపుణ్యం జస్లీన్ రాయల్ సొంతం అయింది. ఆ తరువాత ఒకే సమయంలో మల్టీపుల్ మ్యూజిక్ ఇన్స్ట్రూమెంట్స్ ప్లే చేస్తూ అందరినీ ఆశ్చర్యానికి గురి చేసేది. ‘పంచి హో జవాన్’ సింగిల్‌తో సంగీత ప్రపంచంలో తనదైన పేరు తెచ్చుకుంది. ‘బార్ బార్ దేఖో’ (2015)తో బాలీవుడ్లో కంపోజర్‌గా బ్రేక్ వచ్చింది. ‘ఎలాంటి శిక్షణ తీసుకోకుండానే మ్యూజిక్ కంపోజర్ అయ్యాను. నా మీద నాకు ఉన్న నమ్మకమే దీనికి కారణం. కాలేజీ రోజుల్లో అందరూ ప్లాన్ బీ గురించి ఆలోచిస్తున్న సమయంలో కూడా నా మార్గం మ్యూజిక్ మాత్రమే అనుకున్నాను. రియాల్టీ షోలో సెమీ–ఫైనల్స్ వరకు వెళ్లడం ద్వారా తొలిసారి గుర్తింపు లభించింది’ అంటున్న జస్లీన్‌కు మెలోడీలు అంటే ఇష్టం. ప్రయాణాలు అంటే ఇష్టం. ప్రయాణమార్గాలలో తట్టే ట్యూన్లను పాటలుగా మలచడం అంటే ఇష్టం. కంపోజర్, సింగర్ అయిన జస్లీన్ రాయల్ తన తొలి ప్రాధాన్యత కంపోజింగ్ మాత్రమే అంటుంది. (ఇవి చదవండి: 'సహస్రనామం' సమ్మోహన విజయం!) -
రూ. 29 లక్షల కేసు విషయంలో ఏఆర్ రెహ్మాన్‌పై ఫిర్యాదు
సంగీత దర్శకుడు ఏఆర్ రెహ్మాన్‌పై చైన్నె పోలీస్ కమిషనర్ కార్యాలయంలో ఫిర్యాదు చేశారు. వివరాలు.. శస్త్ర చికిత్స వైద్య నిపుణుల సంఘం 2018లో ఏఆర్ రెహ్మాన్‌తో ఒక సంగీత కచ్చేరిని నిర్వహించ తలపెట్టింది. అందుకు అడ్వాన్స్‌గా రహ్మాన్‌కు రూ.29.50 లక్షలు ఇచ్చారు. అయితే అనివార్య కారణాల వల్ల ఆ సంగీత కచ్చేరి రద్దు అయ్యింది. కాగా రెహ్మాన్‌కు ఇచ్చిన అడ్వాన్స్ నగదును తమకు తిగిరి ఇవ్వలేదని, చెల్లించేలా చర్యలు తీసుకోవాలంటూ వైద్య నిపుణుల సంఘం నిర్వాహకులు ఫిర్యాదులో పేర్కొన్నారు. కాగా ఇటీవల ఏఆర్.రెహ్మాన్ చైన్నెలో నిర్వహించిన సంగీత కచ్చెరీ రసాభాసగా మారిన విషయం తెలిసిందే. (ఇదీ చదవండి: ప్రభాస్ రియాక్షన్ కోరుకుంటున్న 'పెదకాపు' హీరో) పరిమితికి మించిన టిక్కెట్లు విక్రయించడం వల్ల టిక్కెట్లు కొనుగోలు చేసిన చాలా మంది సంగీత కచ్చేరి ఆవరణలోకి వెళ్లలేక అసంతృప్తితో వెనుదిరిగారు. ఈ వ్యవహారం పోలీసుల విచారణ వరకూ వెళ్లింది. ఆ సంఘటనపై ఏఆర్.రెహ్మాన్ క్షమాపణ చెప్పినా చాలా మంది సంగీత ప్రియులు ఆయనపై ఆసంతృప్తిని వ్యక్తం చేశారు. -
యాక్టింగ్ ఛాన్సులు వచ్చినా వదులుకుంది.. కేతకి ఇంట్రెస్ట్ అదేనట
ఏ గూటి చిలక ఆ గూటి పలుకే పలుకుతుంది...అన్నట్లు సంగీతకారుల కుటుంబంలో జన్మించిన కేతకి మతేంగోకర్కు చిన్నప్పటి నుంచే పాట అంటే ఇష్టం. తండ్రి ప్రసాద్ మ్యూజిక్ డైరెక్టర్. తల్లి సువర్ణ సింగర్. నటిగా కూడా మెప్పించింది కేతకి. ‘షాల’ ఆమె డెబ్యూ ఫిల్మ్. ఈ సినిమా కోసం అవకాశం తనను వెదుక్కుంటూ వచ్చింది. దర్శకుడు సుజిత్ ఒక టెలివిజన్ మ్యూజిక్ షోలో కేతకిని చూసి తన సినిమాలోని పాత్రకు ఎంపిక చేశాడు. నటనలో మంచి మార్కులు తెచ్చుకున్నప్పటికీ ‘నటన’ కంటే సంగీతానికే ఎక్కువ ప్రాధాన్యత ఇస్తానంటోంది కేతకి. రోజుకు నాలుగు గంటల పాటు సంగీత సాధన చేస్తుంది. ‘మహేష్ మంజ్రేకర్ సినిమాలో నటించిన తరువాత ఎన్నో అవకాశాలు వెదుక్కుంటూ వచ్చినా సంగీతానికే ప్రాధాన్యత ఇవ్వాలని నిర్ణయించుకున్నాను. మంచి సింగర్‌గా పేరు తెచ్చుకోవాలనుకుంటున్నాను. క్లాసిక్ నుంచి కాంటెంపరరీ మ్యూజిక్ వరకు నన్ను నేను నిరూపించుకోవాలనుకుంటున్నాను’. గత సంవత్సరం ‘మాయి’ ఆల్బమ్‌తో మ్యూజిక్ కంపోజర్‌గా కూడా తన ప్రతిభ చాటుకుంది కేతకి. ఈ ఆల్బమ్‌లోని తొమ్మిది పాటలను శంకర్ మహాదేవన్, మహాలక్ష్మీ అయ్యర్‌లాంటి ప్రసిద్ధ గాయకులు పాడారు. ‘మన దగ్గర ఉమెన్ మ్యూజిక్ కంపోజర్లు తక్కువగా ఉన్నారు. ఈ పరిస్థితిలో మార్పు రావాల్సిన అవసరం ఉంది. మంచి మ్యూజిక్‌ను ప్రేక్షకులు ఆదరిస్తారు. చాలామందికి మ్యూజిక్ కంపోజిషన్‌లో అద్భుత ప్రతిభ ఉన్నా ఆత్మవిశ్వాసం లేకపోవడం వల్ల దూరంగా ఉంటున్నారు’ అంటుంది కేతకి. -
నటితో సీక్రెట్ మ్యారేజ్.. అప్పుడే అసలు కథ మొదలైంది!
సింగర్ హర్షిత్ సక్సేనా ఓ ఇంటివాడయ్యాడు. నటి సమోనికా శ్రీవాత్సవను పెళ్లి చేసుకున్నాడు. గత నెలలో గుట్టుచప్పుడు కాకుండా పెళ్లి చేసుకున్న వీరిద్దరూ తాజాగా ఈ విషయాన్ని సోషల్ మీడియాలో వెల్లడించారు. హర్షిత్ జాతీయ మీడియాకిచ్చిన ఇంటర్వ్యూలో మాట్లాడుతూ.. 'సమోనికా, నేను ముంబైలో కలిశాం. మా మధ్య కేవలం పరిచయం మాత్రమే ఉంది. కానీ మా పేరెంట్స్ మమ్మల్ని ఒక జంటగా గుర్తించారు. సమోనికా తల్లి మా పేరెంట్స్‌తో మాట్లాడటంతో ఇదంతా మొదలైంది. మాది పెద్దలు కుదిర్చిన వివాహం. మూడు రోజులపాటు ఎంతో ఘనంగా జరిగింది. పెళ్లికి రెండు రోజుల ముందే నిశ్చితార్థం చేసుకున్నాం. కేవలం అతి దగ్గరి బంధుమిత్రుల మధ్యే వివాహం జరిగింది అని వెల్లడించారు. వీరి పెళ్లి ఛత్తీస్‌ఘడ్‌లోని రాయ్‌ఘర్‌లో ఫిబ్రవరి 9న ఫైవ్‌స్టార్ హెటల్లో జరిగింది. ఈ పెళ్లి విషయాన్ని గుట్టుగా ఉంచడానికి గల కారణాన్ని వెల్లడిస్తూ.. నాకు వరుస షెడ్యూల్స్ ఉన్నాయి. పెళ్లయిపోయిన వెంటనే వరుస పెట్టి లైవ్ షోలు ఉన్నాయి. అందుకే పెళ్లి గురించి ఎవరికీ చెప్పలేదు. కానీ నా ఫ్రెండ్స్ కోసం రిసెప్షన్ ఏర్పాటు చేసే ఆలోచనలో ఉన్నాను' అని వెల్లడించాడు. View this post on Instagram A post shared by Harshit Saxena (@harshitsaxena_official) -
Grammy Awards 2023: నవరాగాల తేజం..రిక్కీ కేజ్
గత సంవత్సరం గ్రామీ గెలుచుకున్న తరువాత లాస్ వేగాస్లోని ఎంజీఎం గ్రాండ్ మార్క్యు బాల్రూమ్లో భారతీయత ఉట్టిపడేలా ‘నమస్తే’ అంటూ ప్రేక్షకులకు అభివాదం చేశాడు మ్యూజిక్ కంపోజర్ రిక్కీ కేజ్. భారతీయత అతడి బలం. తనను ముందుకు నడిపించే ఇంధనం. లాస్ ఏంజెల్స్(యూఎస్) మైక్రోసాఫ్ట్ థియేటర్లో భారత కాలమానం ప్రకారం సోమవారం ఉదయం జరిగిన 65 వ గ్రామీ పురస్కార ప్రదానోత్సవంలో రాక్ లెజెండ్ స్టీవర్డ్ కోప్లాండ్తో కలిసి ‘గ్రామీ’ అవార్డ్‌ను అందుకున్నాడు రిక్కీ కేజ్. స్టీవర్డ్ కోప్లాండ్తో కలిసి చేసిన ‘డివైన్ టైడ్స్’ ఆల్బమ్‌కు బెస్ట్ ఇమాసివ్ ఆడియో ఆల్బమ్ విభాగంలో గ్రామీ దక్కింది. రిక్కీకి కెరీర్లో ఇది మూడో గ్రామీ... సంగీతరంగంలో ప్రతిష్ఠాత్మకంగా భావించే గ్రామీ అవార్డ్‌ను ముచ్చటగా మూడోసారీ సొంతం చేసుకున్నాడు బెంగళూరుకు చెందిన మ్యూజిక్ కంపోజర్ రిక్కీ కేజ్. 2015లో అమెరికన్ రాక్ లెజెండ్ స్టీవర్డ్ కోప్లాండ్తో కలిసి చేసిన ‘విండ్స్ ఆఫ్ సంసార’ ఆల్బమ్‌కు తొలిసారిగా గ్రామీ అవార్డ్ దక్కింది. స్టీవర్డ్ కోప్లాండ్తో కలిసి చేసిన ‘డివైన్ టైడ్స్’ ఆల్బమ్‌కు మూడోసారి గ్రామీ అవార్డ్ (బెస్ట్ ఇమాసివ్ ఆడియో ఆల్బమ్ విభాగం)లో అందుకున్నాడు రిక్కీ. గత సంవత్సరం ఇదే ఆల్బమ్ ‘బెస్ట్ న్యూ ఏజ్ ఆల్బమ్’ విభాగంలో రెండోసారి గ్రామీ దక్కింది. డివైన్ టైడ్స్... ప్రకృతి ప్రపంచానికి నివాళి. ఈ ఆల్బమ్‌లో తొమ్మిది పాటలు ఉన్నాయి. మన హిమాలయాల అందాల నుంచి స్పెయిన్ అరణ్యాల అందాల వరకు మ్యూజిక్ వీడియోల్లో కనువిందు చేస్తాయి. ‘నా సంగీతంలో భిన్న సంస్కృతుల ప్రభావం కనిపించినప్పటికీ నా మూలాలు మాత్రం భారత్‌లోనే ఉన్నాయి’ అంటాడు రిక్కీ కేజ్. మూడోసారి ‘గ్రామీ’ వరించిన సందర్భంగా ఇన్‌స్టాగ్రామ్‌లో కోప్లాండ్తో ఉన్న ఫోటో పోస్ట్ చేసి ‘సూపర్ గ్రేట్ఫుల్, మై థర్డ్ గ్రామీ అవార్డ్’ అని తన ఆనందాన్ని పంచుకున్నాడు రిక్కీ కేజ్. నార్త్ కరోలినా (యూఎస్)లో జన్మించాడు రిక్కీ. ఎనిమిది సంవత్సరాల వయసు నుంచి తల్లిదండ్రులతో పాటు బెంగళూరులో ఉంటున్నాడు. స్థానిక బిషప్ కాటన్ స్కూల్లో చదువుకున్నాడు. ఆక్స్ఫర్డ్ డెంటల్ కాలేజీలో చదువుకునే రోజుల్లో సంగీతంలోనే కెరీర్ వెదుక్కుంటానని తల్లిదండ్రులతో చెప్పాడు. ఇలా చెప్పడం తండ్రికి నచ్చలేదు. ఆ తరువాత మాత్రం ఆయన కాస్త మెత్తబడ్డాడు. డెంటల్ సర్జరీలో డిగ్రీలో పూర్తి చేసిన తరువాత, పట్టా తండ్రి చేతికి ఇచ్చి తనకు ఇష్టమైన సంగీతపు దారిలో ప్రయాణం ప్రారంభించాడు. టీవీలోని మ్యూజిక్ షోల ద్వారా చిన్నప్పుడే రిక్కీకి సంగీతంపై ఆసక్తి మొదలైంది. ఇంట్లో పెద్ద మ్యూజిక్ కలెక్షన్ ఉండేది. రాక్ బాండ్ ‘ఏంజెల్ డస్ట్’లో గిటార్ ప్లేయర్‌గా సంగీత ప్రపంచంలోకి అడుగు పెట్టిన రిక్కీ ఆ తరువాత ఫుల్‌టైమ్ కంపోజర్‌గా మారాడు. నస్రత్ ఫతే అలీఖాన్, పండిట్ రవిశంకర్, పీటర్ గాబ్రియెల్ తనకు ఇష్టమైన సంగీతకారులు. జింగిల్స్ చేయడం అంటే రిక్కీకి చాలా ఇష్టం. జింగిల్స్ చేయడం అంటే తన దృష్టిలో రోజూ వ్యాయామం చేయడం లాంటిది. సృజనాత్మక పరిధిని పెంచుకోవడంలాంటిది. ఎన్నో భాషల్లో, ఎన్నో జానర్స్‌లో జింగిల్స్ చేస్తున్నప్పుడల్లా తనలో అదనపు శక్తి వచ్చినట్లుగా భావిస్తాడు. ఇప్పటివరకు మూడువేలకు పైగా జింగిల్స్ చేశాడు. ప్రపంచవ్యాప్తంగా వంద మ్యూజిక్ అవార్డ్లు గెలుచుకున్నాడు. రిక్కీకి నచ్చిన పుస్తకం రిచర్డ్ డాకిన్స్ ది గాడ్ డిలూజన్. నిజానికి రిక్కీ తండ్రి, తాతతో సహా బంధువుల్లో చాలామంది వైద్యులుగా పనిచేశారు. ‘రిక్కీలో ఆర్టిస్టి్టక్ జీన్స్ తాత నుంచి వచ్చాయి’ అని మురిసిపోతుంది తల్లి పమ్మి. తాత జానకిదాస్ నటుడు, భావుకుడు, స్వాతంత్య్ర సమరయోధుడు. 2014లో తన గర్ల్‌ఫ్రెండ్ వర్షను వివాహం చేసుకున్నాడు రిక్కీ కేజ్. నవ రత్నాలు ‘డివైన్ టైడ్స్’ విడుదల అయిన కొత్తలో ఈ ఆల్బమ్‌కు గ్రామీ అవార్డ్ గెలుచుకునే సంపూర్ణ అర్హతలు ఉన్నాయని కితాబు ఇచ్చారు సంగీత విశ్లేషకులు. వారి మాట నిజమైంది. ‘డివైన్ టైడ్స్’ లోని వండర్స్ ఆఫ్ లైఫ్, హిమాలయాస్, అవర్హోమ్, ఆర్డ్ ఆఫ్ డివోషన్, పాస్టోరల్ ఇండియా, ఐయామ్ ఛేంజ్, ఏ ప్రేయర్, గాంధీ, మదర్ ఎర్త్... తొమ్మిది ట్రాక్స్ నవరత్నాలుగా పేరు తెచ్చుకున్నాయి. ఈ ఆల్బమ్‌లో మూలసూత్రం ఏమిటి? మనతో మనం... అంటే ఎవరికి వారు తమ వ్యక్తిగత ప్రంచంలోకి వెళ్లి తమను తాము కొత్తగా పరిచయం చేసుకోవడం. తమను తాము విశ్లేషించుకోవడం, విశ్లేషణ ఫలితాలను ఆచరణలోకి తీసుకురావడం. కాలంతో పాటు మనం... కాలంపై మనదైన సంతకం ఉండాలి. కాలం చెప్పే పాఠాలను శ్రద్ధగా వినాలి. కాలం విసిరే ప్రశ్నలకు జవాబు వెదుక్కోవాలి. కాలం విసిరే సవాళ్లకు పరిష్కారాలు ఆలోచించాలి. మన గ్రహంతో మనం... భూమికి మనం ఎంతో రుణపడి ఉన్నాం. ఆ రుణం తీరేది కాదు. మనం చేయాల్సిందల్లా చెట్టును కాపాడుకోవాలి. చెట్టుపైన పిట్టను కాపాడుకోవాలి. పర్యావరణ పరిరక్షణ నినాదం మన శ్వాసలో భాగం కావాలి. వ్యక్తిత్వ నిర్మాణంలో నేస్తం ఆసక్తిగా మొదలై, అభిరుచిగా మారి రిక్కీ జీవితంలోకి వచ్చిన సంగీతం ‘సంగీతమే నా వ్యక్తిత్వం’ అనే స్థాయికి చేరుకుంది. అదే శ్వాస అయింది. చాలామంది తల్లిదండ్రులు తమ పిల్లలు సంగీతంలో కెరీర్‌ను వెదుక్కోవడానికి ఇష్టంగా లేరు. దీని గురించి ప్రస్తావిస్తూ ‘మన దేశంలో తల్లిదండ్రులు పిల్లల కెరీర్‌కు సంబంధించిన నిర్ణయాలను పాషన్పై కాకుండా భయంపై తీసుకుంటారు. ఈ ధోరణిలో మార్పు రావాల్సిన అవసరం ఉంది. ఆర్థికకోణాన్ని దృష్టిలో పెట్టుకొని కెరీర్‌ను ఎంచుకోవడం కాకుండా ఆనందాన్ని దృష్టిలో పెట్టుకొని ఎంచుకోవాలి. సంప్రదాయ వృత్తులకు దూరంగా తాము ఎంచుకున్న మార్గం ద్వారా మీ పిల్లలు పెద్దగా డబ్బు సంపాదించలేకపోవచ్చు. అయితే డబ్బు కంటే విలువైన ఆనందాన్ని సొంతం చేసుకుంటారు’ అంటాడు రిక్కీ కేజ్. గ్రామీ అవార్డ్ అందుకున్న యంగెస్ట్ ఇండియన్, మూడు గ్రామీలు అందుకున్న ‘వోన్లీ ఇండియన్’గా తనదైన ప్రత్యేకత సంపాదించుకున్న రిక్కీ కేజ్ (41)... ‘సంగీతం అనేది హాయిగా విని ఆస్వాదించడానికి మాత్రమే కాదు మన వ్యక్తిత్వ నిర్మాణంలో సహాయపడుతుంది. మన పాటలలో ఎక్కువగా ప్రేమ, శాంతి, మంచితనం చుట్టూ అల్లుకున్నవే’ అంటాడు. -
'మాటలు రావడం లేదు, ఈ అవార్డు భారత్‌కు అంకితమిస్తున్నా'
సంగీత ప్రపంచంలో ప్రతిష్టాత్మంగా భావించే గ్రామీ అవార్డుల ప్రదానోత్సవంలో భారత్‌కు చెందిన మ్యూజిక్ కంపోజర్ రిక్కీ కేజ్ తన సత్తా చాటాడు. ఇప్పటికే రెండు సార్లు గ్రామీ పురస్కారాలను అందుకున్న ఆయన తాజాగా మరోసారి అవార్డును ఎగరేసుకుపోయారు. బెస్ట్ ఇమ్మర్సివ్ ఆడియో ఆల్బమ్ కేటగిరీలో 'డివైన్ టైడ్స్'కు గానూ గ్రామీ అవార్డు పొందారు. ఈ పురస్కారాన్ని డివైన్ టైడ్స్‌కు పనిచేసిన డ్రమ్మర్ స్టీవార్ట్ కోప్‌ల్యాండ్‌తో షేర్ చేసుకున్నారు. కాగా మూడు గ్రామీ అవార్డులు సాధించిన ఏకైక భారతీయుడిగా రిక్కీ రికార్డు నెలకొల్పారు. ఈ సంతోషకర క్షణాలను ట్విటర్ ద్వారా అభిమానులతో షేర్ చేసుకున్నారు రిక్కీ. 'మూడో గ్రామీ అవార్డు గెలిచినందుకు చాలా సంతోషంగా ఉంది. మాటలు రావడం లేదు. ఈ పురస్కారాన్ని భారత్‌కు అంకితమిస్తున్నా' అని ట్వీట్ చేశారు. దీనిపై నెటిజన్లు స్పందిస్తూ రిక్కీకి శుభాకాంక్షలు చెప్తున్నారు. ఇకపోతే ఇమ్మర్సివ్ ఆడియో ఆల్బమ్ కేటగిరీలో క్రిస్టినా, నిదరోస్డోమెన్స్ జెన్టెకర్, ట్రోండ్ హెమ్సోలిస్టెన్, ద చైన్‌స్మోకర్స్, జేన్ ఐరాబ్లూమ్ బ్యాండ్ట్రూప్స్ పోటీపడ్డాయి. కానీ వీటన్నింటిని వెనక్కు నెట్టి కేజ్ విజయ బావుటా ఎగురవేశారు. ఎవరీ రిక్కీ కేజ్ అమెరికా ఉత్తర కెరోలినాలో 1981లో భారతీయ దంపతులకు రిక్కీ కేజ్ జన్మించారు. 8 ఏళ్ల వయసులోనే వారు స్వదేశానికి వచ్చి బెంగళూరులో సెటిలయ్యారు. బెంగళూరులోని ఆక్స్ఫర్డ్ డెంటల్ కాలేజీలో రిక్కీ కేజ్ డిగ్రీ పూర్తి చేశారు. 2015లో మొదటిసారి గ్రామీ అవార్డు పొందారు. బెస్ట్ న్యూ ఏజ్ ఆల్బమ్ కేటగిరీలో విండ్స్ ఆఫ్ సంసారాకు ఈ పురస్కారం పొందారు. 2022లో ఇదే కేటగిరీలో డివైన్ టైడ్స్కుగానూ అవార్డు అందుకున్నారు. తాజాగా డివైన్ టైడ్స్‌కు మరోసారి అవార్డు అందుకోవడం విశేషం. ఇకపోతే చిన్న వయసులోనే గ్రామీ అవార్డు పొందిన భారతీయ వ్యక్తిగా అందరి దృష్టి ఆకర్షించారు రిక్కీ కేజ్. Just won my 3rd Grammy Award. Extremely grateful, am speechless! I dedicate this Award to India.@copelandmusic Herbert Waltl Eric Schilling Vanil Veigas Lonnie Park pic.twitter.com/GG7sZ4yfQa — Ricky Kej (@rickykej) February 6, 2023 చదవండి: సార్ ఆడియో లాంచ్.. స్టేజీపై పాట పాడిన ధనుష్ -
మ్యూజిక్ డైరెక్టర్‌ను పెళ్లాడిన ప్రముఖ సింగర్.. ఫోటోలు వైరల్
బాలీవుడ్ సింగర్ పాలక్ ముచ్చల్ మ్యూజిక్ డైరెక్టర్ మిథూన్ శర్మ వివాహ బంధంలోకి అడుగుపెట్టారు. గత కొన్నాళ్లుగా ప్రేమలో మునిగితేలిన ఈ జంట పెళ్లితో ఒక్కటయ్యారు. దీనికి సంబంధించిన ఫోటోలు నెట్టింట వైరల్‌గా మారాయి. రెడ్ కలర్ లెహంగాలో పాలక్ మెరిసిపోతుండగా, మిథూన్ శర్మ గోధుమ రంగు షేర్వానీలో కనిపించారు. ఎల్లప్పుడూ కలిసి ఉండాలని మేమిద్దరం ఇలా ఒక్కటయ్యం అంటూ పెళ్లి ఫోటోలను సోషల్ మీడియా వేదికగా షేర్ చేశారు. దీంతో కొత్త జంటకు పలువురు ప్రముఖులు సహా నెటిజన్ల నుంచి శుభాకాంక్షలు వెల్లువెత్తాయి. సోనూ నిగమ్, కైలాష్ ఖేర్, కృషికా లుల్లా, రుబీనా దిలైక్, అభినవ్ శుక్లా వంటి పలువురు సెలబ్రిటీలు వీరి రిసెప్షన్‌కు హాజరై నూతన జంటను ఆశీర్వదించారు. కాగా పాలక్ ఏక్ థా టైగర్’ ‘అషికీ–2’ ‘యం.ఎస్ ధోనీ: ది అన్‌టోల్డ్ స్టోరీ’ వంటి సినిమాల్లో పాటలు పాడిన సంగతి తెలిసిందే. View this post on Instagram A post shared by Palak Muchhal (@palakmuchhal3) -
PVR Raja: షార్ట్ ఫిలిమ్స్‌లో ఆస్కార్ అవార్డే లక్ష్యం
విజయనగరం టౌన్: చిన్నప్పటి నుంచి చిత్రరంగంలో అడుగుపెట్టాలనే ఆకాంక్షే ఆ యువకుడిని షార్ట్ ఫిలిమ్స్‌లో ఉన్నతశిఖరాలు అధిరోహించేలా చేసింది. ఏ కాంటెస్ట్‌లో పాల్గొన్నా గెలుపొందిన మొదటి మూడు చిత్రాలు ఆయన రచన, సంగీత దర్శకత్వం చేసినవే కావడం విశేషం. ఇప్పటివరకూ షార్ట్ ఫిలి మ్స్‌లో వందలాది అవార్డులు అందుకున్న విజయనగరం యువకుడు పెనుమత్స వెంకట రామరాజు (పీవీఆర్రాజా) ఎప్పటికైనా షార్ట్ ఫిలిమ్స్‌లో ఆస్కార్ అవార్డ్ తీసుకోవడమే లక్ష్యమని చెబుతున్నాడు. విజయనగరంలోని కంటోన్మెంట్ ప్రాంతానికి చెందిన పెనుమత్స వెంకట రామరాజు (పీవీఆర్ రాజా) సత్యవతి, చంద్రశేఖర్ రాజుల తొలిసంతానం. బీఏ వరకూ మహారాజా కళాశాలలో చదివి, సంగీతం పట్ల మక్కువతో మహారాజా ప్రభుత్వ సంగీత, నృత్యకళాశాలలో గాత్రం, వయోలిన్, భరతనాట్యం, వీణ తదితర అంశాలలో తర్ఫీదు పొందాడు. షాలోమ్స్ మ్యూజిక్ సెంటర్లో గిటార్ తదితర ఇన్‌స్ట్రుమెంట్స్‌పై సాధన చేశాడు. రచనలు చేయడం అలవాటు. 2012 నుంచి ఇప్పటివరకూ తెలుగు, కన్నడ, హిందీ, తమిళ్, ఆంగ్ల భాషల్లో సుమారు 250కి పైగా లఘుచిత్రాలకు సంగీత దర్శకుడిగా పనిచేశాడు. 2017లో ఒకే ఏడాదిలో ఆయన సంగీతం సమకర్చిన లఘుచిత్రాలకు వరుసగా ఏడుసార్లు ఉత్తమ సంగీత దర్శకుడిగా అవార్డులు అందుకున్నారు. 2007లో చెన్నైలో ఏఆర్ రెహమాన్ నిర్వహించిన హూ.లలల్లా మ్యూజిక్ బ్యాండ్హంట్లో షాలోమ్ తరఫున టాప్ 18లో నిలిచాడు. తానా ఇంటర్నేషనల్ తెలుగు ఫిలిం ఫెస్టివల్–2017 అవార్డు దక్కింది. 2020లో రాంగోపాల్ వర్మ నిర్వహించిన స్పార్క్ ఓటీటీ షార్ట్ ఫిలిం కాంటెస్ట్‌లో తొమ్మిదివేల చిత్రాలలో పీవీఆర్ సంగీత దర్శకత్వం వహించిన మూడు చిత్రాలు టాప్ 18లో నిలిచాయి. టాప్ 5లో నిలిచిన రెండు చిత్రాలు ఉత్తమ చిత్రాల అవార్డులు సొంతం చేసుకున్నాయి. అదేవిధంగా 2020లో సైమా షార్ట్ ఫిలిం అవార్డ్స్‌లో ఎంఆర్ ప్రొడక్షన్స్ అంతరార్థం చిత్రానికి ఉత్తమ సంగీత దర్శకుడిగా ఎంపికయ్యాడు. షార్ట్ ఫిలిం మాస్ట్రోగా పేరు సంపాదించుకున్నారు. దర్శకుడు పూరీ జగన్నాథ్ సొంత నిర్మాణ సంస్ధ వైష్ణో మీడియా నిర్మించిన ఆర్య–3 లఘుచిత్రంతో పీవీఆర్ రాజా సంగీత దర్శకుడిగా పరిచయమయ్యాడు. పేపర్ బాయ్ చిత్ర దర్శకుడు జయశంకర్ దర్శకత్వంలో విటమిన్ షీ ఓటీటీ చిత్రానికి సంగీత దర్శకత్వం అందించాడు. ప్రముఖ డ్యాన్సర్ యశ్వంత్ మాస్టర్ తొలివీడియో ఆల్బం దిల్ అంత అదిరే చిత్రానికి సంగీత దర్శకత్వం వహించడంతో పాటు ఎల్బీ శ్రీరామ్ స్వీయ నిర్మాణంలో పదికి పైగా లఘు చిత్రాలకు సంగీతం సమకూర్చారు. తల్లిదండ్రుల ప్రోత్సాహంతోనే.. తల్లిదండ్రుల ప్రోత్సాహంతో, సంగీతం పట్ల మక్కువతో షార్ట్ ఫిలిమ్స్ వైపు అడుగులు వేశాను. బేగంపేటలో శంకర్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో నడుస్తున్న శ్రద్ధ స్కూల్ ఆఫ్ స్పెషల్ నీడ్స్ చిల్డ్రన్ పాఠశాలలో పిల్లలకు సంగీతం నేర్పించడం మరిచిపోలేని అనుభూతి. ప్రతి ఒక్కరి జీవితంలో గుర్తుండిపోయేలా చిత్రాలను తీస్తాను. సంగీతంలో నేను రచించే పుస్తకం ప్రతి ఇంట్లో ఉండే పెద్ద బాలశిక్షలా ఉండిపోవాలని కోరుకుంటున్నాను. – పెనుమత్స వెంకటరామరాజు (పీవీఆర్ రాజా), సంగీత దర్శకుడు, విజయనగరం -
'తొమ్మిదో ఏట వివాహం.. అప్పుడు నా భార్యకు మూడేళ్లు'
ఘంటసాల సంగీతం సమకూర్చిన సినిమాల టైటిల్స్‌లో.. ‘సంగీతం – ఘంటసాల, సహాయకులు – పట్రాయని సంగీతరావు’ అని కనిపించేవి.అలా సంగీతరావు పేరు సినీ ప్రేక్షకులకు సుపరిచితం. ఘంటసాల గురువులు పట్రాయని సీతారామశాస్త్రి. వారి కుమారుడే సంగీతరావు.గురువుగారి మీద భక్తి మాత్రమే కాదు, తన ఆలోచలకు తగినవానిగా భావించి ఘంటసాల, సంగీతరావును తనకు సహాయకుడిని చేసుకున్నారు. జూన్ 2, 2021 రాత్రి 7 గం. 50 ని.లకు 101 సంవత్సరాల వయసులో సంగీతరావు కన్నుమూశారు.ఈ సందర్భంగా..సంగీతరావు సుమారు నాలుగు మాసాల క్రితం సాక్షికి ఇచ్చిన ఆఖరి ఇంటర్వ్యూ వివరాలు. నేను రౌద్రి నామ సంవత్సరంలో పుట్టాను. నా తరవాత ఇద్దరు తమ్ముళ్లు. నారాయణమూర్తి, ప్రభాకరరావు. ఆ తరవాత ఆడపిల్ల పుట్టినప్పుడు అమ్మ నిర్యాణం చెందింది. ఆడపిల్ల కూడా కన్నుమూసింది. ఆ తరవాత మా జీవితం కష్టసాధనం అయింది. మా నాన్నగారికి మమ్మలి పెంచడం కష్టమైంది. నాన్నగారు సాలూరు వచ్చేశారు. అక్కడ మాకు ఒక చిన్న ఇల్లు ఉండేది. అక్కడ మా ముగ్గురు అన్నదమ్ముల్ని మా దొడ్డమ్మ ఓలేటి లక్ష్మినరసమ్మ పెంచింది. ఆవిడ మంచి సమర్థురాలు. ఆవిడకు సాహిత్య జ్ఞానం ఉండేది. ఆవిడ పోయేవరకు మా ఇంట్లోనే ఉంది. అక్కడ చాలామంది సంగీత విద్యార్థులు సంగీతం నేర్చుకోవటానికి నాన్న దగ్గర వచ్చేవారు. రొంబ నరసింహరెడ్డి అనే విద్యార్థి కూడా వచ్చేవాడు. అతను మంచి వ్యాయామ విశారద. నా చేత కూడా చేయించేవాడు. బాగా పాడేవాడు. హరికథలు కూడా చెప్పేవారు. మా తాతగారిది కిండ్లాం అగ్రహారం. అది ఆరామద్రావిడ గ్రామం అది. మాదిసంగీత కుటుంబం కావటం చేత బాల్యంలోనే సరళీ స్వరాల దగ్గర నుంచి అన్ని రకాల పాటలు పాడుతూ ఉండటం అలవాటైంది నాకు. మా కుటుంబంలో మా తాతయ్యగారి దగ్గర నుంచి అందరూ ఒక రకమైన భక్తిప్రపత్తులతో ఉండేవారు. విశిష్టంగా పూజలు చేయటం వంటివి ఉండేది కాదు. సహజంగా భగవంతుని మీద భక్తి ఉండేది. తాతగారి శిక్షణలో తాత్విక రచనలు కంఠస్థం అయ్యేవి. నాగావళి ఒడ్డున... ఐదో ఏట అక్షారాభ్యాసం చేసినప్పటి నుంచి స్కూల్‌కి వెళ్లడం, ఇంటికి రావడం అలవాటు. నేను చదువుకునే రోజుల్లో చాలా బహుమతులు అందుకున్నాను. అందులో ముఖ్యంగా గుర్తున్నది ఆక్స్‌ఫర్ట్ డిక్షనరీ. స్పోర్ట్స్‌లో కూడా బహుమతులు వచ్చాయి. నాగావళి నది బ్రిడ్జి పక్కనే ఉన్న ఎలిమెంటరీ స్కూల్లో 1926లో ఒకటో తరగతి శివరావుపంతులు గారి దగ్గర చదివాను. చదువుకున్నాను. ఆ స్కూల్‌ని ఒక పురోహితుల కుటుంబం నడిపేది. ఆ పక్కనే కొబ్బరి ఉండలు అమ్మే దుకాణం ఉండేది. అక్కడ కానీకి మూడు ఉండలు ఇచ్చేవారు. గ్రామఫోను వింటూ సాధన.. శివరావు పంతులు గారు ఆ గ్రామంలో సంగీతాభిలాష ఉన్నవారికి నాన్నతో సంగీతం చెప్పించడానికి పిలిపించారు. అప్పుడు మేం శ్రీపాద సుబ్బారావు పంతులు గారు అనే పండితుడి ఇంట్లో ఒక భాగంలో ఉండేవాళ్లం. వాళ్లమ్మాయికి నాకు అప్పట్లో నాన్న సరిగమలు చెప్పటం గుర్తుంది. ప్రతి రోజూ నేను స్కూల్ నుంచి వస్తున్నప్పుడు ఒక గ్రామఫోను రికార్డు వినేవాడిని. అది విన్నప్పుడు నాకు అత్యాశ్చర్యం వేసింది. ఇంటికి వచ్చి, అమ్మతో, ‘డబ్బాలో నుంచి పాటలు వస్తున్నాయి’ అని చెప్పాను. అప్పుడే గ్రామఫోను రికార్డులు కొత్తగా వచ్చాయి. బిడాలం రాసప్ప అనే ఆయన పెద్ద గొంతుకతో పాడిన పాటలు ఆ రికార్డులో విన్నాను. రాసప్పగారి గ్రామఫోను రికార్డులు వింటూ పాటలు పాడటం అలవాటైంది. చిన్నతనం నుంచి నేర్చుకోవటం కంటె విని గ్రహించిందే ఎక్కువ. అలా పాడటం అలవాటైంది. ఏ మాత్రం మొహమాటం లేకుండా, ఎవరు పాడమన్నా గట్టిగా పాడేసేవాడిని. అప్పట్లోనే అక్కడ నాన్నకి కొత్తకొత్త పరిచయాలు ఏర్పడ్డాయి. కొన్ని కుటుంబాల వారు నాన్న చేత సంగీతం చెప్పించుకునేవారు. ఇవి కాకుండా, ఆర్థికంగా శ్రీమంతులు కూడా కొందరు నాన్న దగ్గర సంగీత సాధన చేసేవారు. గరిమెళ్ల గోదావరి శర్మ అనే ఆయన మా నాన్న దగ్గరే సంగీత కృషి చేశారు. ఆయన నాటకాల్లో లెగ్ హార్మోనియం వాయించేవారు. ముఖ్యంగా రోషనారా నాటకంలో ఆయన హార్మోనియం ప్రత్యేకం. చిర్రావూరు నరసింహారావు అనే కళాకారుడు రోషనారా వేషం వేసేవారు. బొబ్బిలి కోటలో... బొబ్బిలి రాజు గారికి పట్టాభిషేకం జరిగే సమయంలో ఆయన పట్టాభిషేకం మీద నారాయణశాస్త్రిగారు అనే పండితుడు రాగమాలికలో కృతి రచించి నాతో పాడించారు. బొబ్బిలి రాజావారికి పూజామహల్ అని ఒక పూజా గృహం ఉండేది. అక్కడ పూజ సందర్భంలో సంగీతం పాడేవారు మా గురువు గారు. నన్ను కూడా రోజూ తీసుకువెళ్తుండేవారు. ఆ కార్యక్రమానికి వచ్చినవారికి బొబ్బిలి రాజదాసీలు తాంబూలాలు ఇచ్చేవారు. సంభావన కూడా అందించేవారు. ఆరోజుల్లో బొబ్బిలి వైభవోపేతంగా ఉండేది. బొబ్బిలికి దగ్గరలోనే ఆయనకు పట్టాభిషేకం జరిగింది. అక్కడ తాజ్‌మహల్‌లాంటి మహల్ ఉండేది. అది ఇప్పటికీ ఉంది. దానిని గెస్ట్ హౌస్ అనేవారు. బొబ్బిలి రాజా చీఫ్ మినిస్టర్‌గా ఉండేవారు. అలా బొబ్బిలిలో ఐదు వరకు చదువుకున్నాను. రెండు మూడు తరాల పేర్లు... నాన్నకి ఏదో ఒకటి రాసుకోవటం బాగా అలవాటు. ఆయనను అనుకరించటం చేత మాకూ అదే అలవాటైంది. చిన్నతనం నుంచి పుస్తక పఠనం ఉండేది. మొగలాయి దర్బారు వంటి సంప్రదాయ రచనలు, భయంకర నారీ పిశాచి వంటి డిటెక్టివ్ నవలలు అన్నీ చదివేవాడిని. నా పదేళ్ల నుంచి చదివిన జ్ఞాపకం ఉంది. మా మాతామహులు పురాణ శ్రవణం చేసేవారు. అలా భాగవతం పద్యాలన్నీ కంఠస్థం వచ్చాయి. చిన్నప్పటి నుంచి కవీశ్వరుల గురించి వినటం అలవాటు. తిరుపతి వేంకట కవుల గురించి నాన్నగారు చెప్పేవారు. ఇంజరం, యానాము, పల్లెపాలెము అంటూ చెప్పిన పద్యాలు వినేవాడిని. మా తాతయ్య అతి బాల్యం నుంచి భారతరామాయణ భారతాలు చెప్పేవారు. పౌరాణిక గాథలన్నీ నాకు చిన్నప్పటి నుంచి అలవాటు. ఆయన సహజంగా ఒక అమాయకమైన భక్తుడు కూడాను. అప్పట్లోనే వెంకటపార్వతీశ కవులు, తిరుపతి వెంకట కవులు, వీరేశలింగం,... తెలుగు సాహిత్యంలో ఉండే రెండు మూడు తరాల కవుల పేర్లు తెలుసు. వివాహం... మా తల్లి నా చిన్నతనంలోనే గతించారు. నాకు తొమ్మిదో ఏట వివాహం అయిపోయింది. అప్పుడే శారదా బిల్లు అమలులోకి వస్తోంది. ఆ బిల్లు ప్రకారం బాల్య వివాహాలు చేసుకోకూడదు. అందువల్ల ఆ బిల్లు ఇంకా అమలులోకి రాకముందే కిళ్లా అగ్రహారం వాస్తవ్యులు ఆకొండి లింగమూర్తి గారి అమ్మాయితో వివాహం జరిగిపోయింది. నా వివాహ సమయానికి నా భార్య వయసు మూడేళ్లు. పేరు శ్రీలక్ష్మి. స్వరపల్లవి గ్రంథం... అప్పట్లో నాన్నగారు సంచారంలో సంగీత కచేరీలకు తిరుగుతుండేవారు. అక్కడ ఆకొండి నారాయణ శాస్త్రి అనే సంగీత పండితుడు ఉండేవారు. నన్ను ఆయన దగ్గరకు సంగీతానికి పంపించారు. ఆయన వీణ, వయొలిన్ వాయించేవారు. బొబ్బిలి గరల్స్ స్కూల్లో సంగీతం మాస్టారుగా ఉండేవారు. అక్కడ పని చేసే వారికి సంగీత కళాశాల ప్రిన్సిపాల్‌కి ఉన్నంత గౌరవం ఉండేది. నేను అక్కడ ‘స్వర పల్లవి’ అనే గ్రంథం గురించి తెలుసుకున్నాను. స్వర పల్లవులు నేర్చుకున్నాను. ఆ రోజుల్లో ఈ స్వర పల్లవులు మిగతా వారు చెప్పేవారు కాదు. ఈ గ్రంథం బొబ్బిలిలో ఉండే ‘వాసా’ వారు రచించారు. ఆ రచనల్నీ వీణ మీద వాయించడానికి వీలుగా ఉండేవి. కల్యాణి రాగం, హిందోళ రాగం కలిపి మొత్తం పది స్వర పల్లవులు చెప్పుకున్నాను. అక్కడే నవరాగ మాలిక వర్ణం కూడా చెప్పుకున్నాను. సంగీత నిర్వహణ.. నా చిన్నతనం నుంచే సంగీత నృత్య రూపకాలకు సంగీతం చేసే అవకాశం వచ్చింది. క్షీరసాగర మథనం, చండాలిక, శాకుంతలం, శ్రీనివాస కల్యాణం, హరవిలాసం, కల్యాణ రుక్మిణి వంటి నృత్యరూపకాలకు సంగీతం అందించాను. కూచిపూడి నాటకాలకు బాలాంత్రపు రజనీకాంతరావు, ద్వారం భావనారాయణ, మల్లిక్ వంటివారు సంగీతం అందించేవారు. ‘శ్రీనివాస కల్యాణం’ నృత్య రూపకానికి సంగీతం సమకూర్చటం గురించి చర్చ జరిగినప్పుడు బిఎన్ రెడ్డిగారు డైరెక్టరుగా ఉన్నారు. ఆయన క్షీరసాగర మథనం, చండాలిక, శాకుంతలం వంటి సంగీత రూపకాలకు నన్ను సంగీతం సమకూర్చమన్నారు. శ్రీనివాస కల్యాణం తరవాత హరవిలాసం, కల్యాణ రుక్మిణి చేశాను. నాన్నకు శిష్యుడయ్యారు.. 1936లో మ్యూజిక్ కాలేజీకి ఆదిభొట్ల నారాయణదాసు ఆ తరవాత ద్వారం వెంకటస్వామినాయుడుగారు ప్రిన్సిపాల్‌గా పని చేశారు. ఆయన తరవాత ప్రిన్సిపాల్‌గా అపాయింట్ చేయటానికి... ద్వారం నాయుడుగారు ఎనమండుగురిని సెలక్ట్ చేశారు. అందులో నాన్నగారు ఉన్నారు. అక్కడ అప్పటికే నాన్నగారు గానకచేరీలు చేస్తుండేవారు. స్థానిక విద్వాంసులంతా నాన్న మీద అభిమానంతో ఉన్నారు. విజయనగరంలో ఉండే వారిని సెలక్ట్ చేసుకోవటం మంచిదనే సూచనతో, నాన్న ఆ కాలేజీ ప్రిన్సిపాల్ అయ్యారు. ఆ సమయంలోనే ఘంటసాల గారు నాన్నకు శిష్యుడయ్యారు. మద్రాసుకి... 1952లో మద్రాసు వచ్చాను. అప్పుడు ఘంటసాల ‘పరోపకారం’ సినిమా తీస్తున్నారు. నేను ఆయన దగ్గరే ఉన్నాను. ఆయనకు కొన్ని పాటలు పాడి, మళ్లీ విజయనగరం వెళ్లిపోయాను. ఆ తరవాత మళ్లీ 1954లో తిరుపతి వెళ్లాను. అప్పుడు ఘంటసాల గారు నన్ను పిలిపించి, నన్ను ఆయన దగ్గరే ఉండిపోమన్నారు. ఆయన మాట ప్రకారం ఘంటసాలగారితో అక్కడే ఉండిపోయాను. 1971 వరకు కూడా ఘంటసాల గారితో వాళ్లింటోనే ఒక భాగంలో ఉండేవాడిని. 1971 నాటికి ఆయన ఆరోగ్యం సరిగా ఉండేది కాదు. ఉత్సాహంగా ఉండే వారు కాదు. కూచిపూడి ఆర్ట్ అకాడెమీ... కూచిపూడి ఆర్డ్ అకాడెమీని వెంపటి చిన సత్యం గారు నిర్వహించేవారు. అక్కడ నన్ను సంగీతం క్లాసులు నిర్వహించమన్నారు. ఘంటసాల గారిని అడిగితే ఆయన ‘ప్రస్తుతం పనులు లేవు కదా! వెళ్లు’ అన్నారు. అలా కూచిపూడి ఆర్డ్ అకాడెమీలో చేరి, గాయకుడిగా, వాద్య కారుడిగా వారి దగ్గరే ఉండిపోయాను. 1974లో ప్రవేశించి 2012లో వెంపటి చిన సత్యం గారు పోయేవరకు అక్కడే ఉండిపోయాను. నా జీవితమంతా అక్కడే గడిచిపోయింది. ఘంటసాలగారితో అప్పట్లో జర్మనీ, ఇంగ్లండ్ వెళ్లాను. ఆ తరవాత అమెరికా వెళ్లాను. కూచిపూడి ఆర్ట్ అకాడెమీలో ప్రవేశించాక యూరప్, హవాయ్ ద్వీపాలు, అమెరికాలోని అన్ని ప్రదేశాలు తిరిగాను. అమెరికా, రష్యాలకు ఇండియా ఫెస్టివల్స్ జరిగినప్పుడు వెళ్లాను. ఆహారపు అలవాట్లు... సంప్రదాయ బ్రాహ్మణ కుటుంబంలో పుట్టడం వల్ల నా ఆహారపు అలవాట్లు కూడా అవే ఉండేవి. పప్పు, కూర, పచ్చడి, పులుసు, ఊరగాయలు తినేవాడిని. ఆవకాయ, అప్పడాలు, వడియాలతో పాటు,.ఆవకాయలు, నిమ్మకాయ, దబ్బకాయ వంటి సంవత్సరమంతా నిల్వ ఉండే పదార్థాలన్నీ తినేవాడిని. నా వయసు వాళ్లందరికీ ఇప్పుడు ఉండే స్వీట్ల కంటె...మినప సున్ని, పాకం చలిమిడి వంటి వాటి మీదే మక్కువ ఉండేది. అన్నిరకాల స్వీట్లు తెలిసినా, నేను దేనికోసమూ తాపత్రయ పడినట్లు జ్ఞాపకం లేదు.మా కుటుంబంలో సంగీత సాధన చేసిన మొట్టమొదటి మనిషి మా తాతగారు వెంకటనరసింహశాస్త్రి పట్రాయని. మా ఇంటి పేరు గురించి చెప్పినప్పుడు ఒక మాట చెప్పాలి. మా ముందు తర ం వారు ‘పట్రాయుడు’ అని చెప్పేవారట. మా నాన్న దగ్గర నుంచి ‘పట్రాయని’ గా మారింది. ఒకాయన చేత శతావధానం చేయించారు మా నాన్న. ఆయన మా ఇంటి పేరు విని, ఇంటి పేర్లు ద్వితీయా విభక్తిలో ఉండాలి అన్నారట. దానితో మా ఇంటి పేరు పట్రాయుడు నుంచి పట్రాయనిగా మారింది. ఆ కషాయం తాగితే దగ్గు బాగా తగ్గుతుందనేవారు అరవయ్యేళ్ల తరవాత కూడా నేను వార్ధక్యం వచ్చిందనుకోలేదు. తొంభయ్యేళ్లు వచ్చిన తరవాత కూడా వార్ధక్యం వచ్చిందన్న అనుభూతి లేదు. ఈ మధ్యనే అంటే వందేళ్లు నిండిన తరవాత క్రమేపీ దృష్టి అవి తగ్గుతుంటే, ‘ఏమిటీ ఇలా ఉన్నాను’ అనే భావన కలుగుతోంది.మా చిన్నతనంలో సాలూరులో ప్రతి సంవత్సరం కలరా వచ్చేది. ఆ వ్యాధితో పోయిన వారిని సన్నాయి మేళంతో తీసుకువెళ్లేవారు. నేను రెండు మూడు క్లాసులు చదువుత్ను రోజుల్లో ఆ ప్రాంతంలో మలేరియా ఎక్కువ ఉండేది. నేను మద్రాసు వచ్చేదాకా కూడా ఈ వ్యాధి ఉన్నట్టు గుర్తు. మీజిల్స్ వ్యాధి చాలా సార్లు వచ్చింది. ఆ రోజుఎల్లో ఎక్కువగా ఆయుర్వేద వైద్యులుండేవారు. సాలూరులో రాజకుంటుంబాలకు సంబంధించిన ఒక వైద్యుడు ఉండేవారు. చాలా మంచి మనిషి. ఆయనకు ఒక ఆశ్రమం కట్టిచ్చారు. అందులోనే ఒక కొట్లో ఉండేవారు. ఆయన ఏదో మందు ఇస్తూ ఉండేవారు. ఎవ్వరినీ కానీ కూడా అడిగేవారు కాదు. కాని అక్కడకు వచ్చినవారు ఒక కానీ ఇచ్చేవారు. ఆయన చనిపోయిన తరవాత చూస్తే రెండు బస్తాల కాన్లు వచ్చాయి. సాలూరు ప్రాంతంలో అడ్డసరం చెట్లు ఎక్కువగా ఉండేవి. అవి వైద్యానికి బాగా ఉపయోగపడేవి. వాటి ఆకులను పుటం పెట్టి, ఆ కషాయం తాగితే దగ్గు బాగా తగ్గుతుందనేవారు. ఆ రోజుల్లోనే ఘంటసాల అరెస్టు అయ్యారు నా చిన్నతనంలో డిస్ట్రిక్ట్ కలెక్టర్లు తెల్లదొరలే ఉండేవారు. స్వాతంత్రం వచ్చేనాటికి నేను సంసారంలో ప్రవేశించాను. అప్పుడు కలివెరలో ఐదేళ్లున్నాను. తమ్మినేని పాపారావు అన్నాయన ఆ గ్రామానికి ఎంఎల్ఏగా ఉండేవారు. స్వతంత్ర సాధన గురించి రాజకీయాలు ఎక్కువగా ఉండేవి. చాలామంది అరెస్టులు అవుతుండేవారు. అల్లర్లు జరిగాయి. రాజకీయ పోరాటాలు జరిగాయి. ఆ రోజుల్లోనే ఘంటసాల అరెస్టు అయ్యారు. అప్పట్లో ఆయన రోడ్డు మీదకు వెళ్లి అల్లర్లకు సంబంధించి పాటలు పాడేవారు.1936లో జరిగిన ఎలక్షన్స్‌లో కాంగ్రెస్ పోటీ చేసింది. సాలూరు నుంచి పోటీ చేసిన వి. వి. గిరి గారు పోటీ చేశారు. ఆయనకు పోటీగా బొబ్బిలిరాజు నిలబడ్డారు. ఎన్నికల ప్రచారానికి వచ్చిన వి. వి. గిరిగారు, అక్కడ ఉన్న పేరయ్య హోటల్లో భోజనం చేశారు. ఆ ఎన్నికల్లో ఆయనే గెలిచారు. – సంభాషణ: వైజయంతి పురాణపండ -
సంగీత విద్వాంసుడు సంగీతరావు కన్నుమూత
సాక్షి, చెన్నై: సుప్రసిద్ధ సంగీత విద్వాంసుడు, శతాధిక వృద్ధుడు అయిన పట్రాయని సంగీతరావు ఇకలేరు. కరోనా మహమ్మారి బారిన పడ్డ ఆయన బుధవారం రాత్రి 9 గంటల ప్రాంతం లో చెన్నైలో కన్నుమూశారు. సినీ సంగీత దిగ్గజం ఘంటసాలకు సహాయకుడిగా పనిచేసిన ఆయనకు ఇద్దరు కుమారులు, ముగ్గురు కుమా ర్తెలు. 1920 నవంబర్ 2న విజయనగరం జిల్లా కిండాం అగ్రహారంలో జన్మించిన సంగీతరావు వయసు 101 ఏళ్లు. పట్రాయని వారి సంగీత కుటుంబంలో మూడోతరానికి చెందిన సంగీత రావు అసలు పేరు నరసింహమూర్తి. అయితే, హార్మోనియం వాయించడంలో దిట్ట అయిన ఆయన సంగీతరావుగానే సుపరిచితులు. ఘంటసాల స్వర సహాయకుడిగా 1974 వరకు సుమారు పాతికేళ్ల పాటు తెలుగు సినిమాతో సంగీతరావు జీవితం ముడిపడివుంది. సాహితీ రంగంలోనూ సంగీతరావు ఎంతో ప్రతిభను కనపరిచారు. తెలుగు స్వతంత్ర, ఆంధ్రప్రభ, ఆంధ్రపత్రిక, జగతి వంటి ప్రముఖ పత్రి కలలో సంగీతరావు రచనలు వచ్చాయి. తమిళనాడు ప్రభుత్వం సంగీతరావును కలై మామణి బిరుదుతో సత్కరించింది. చదవండి: వరదగూడు.. కనువిందు చేసెను చూడు! -
Pendyala Nageswara Rao: నాన్న చెబితే అదే ఫైనల్...
శివశంకరీ శివానందలహరీ... రసికరాజ తగువారముకామా... మది శారదా దేవి మందిరమే... శేషశైలావాసా శ్రీవెంకటేశా... చూడాలని ఉంది అమ్మా చూడాలని ఉంది... నీలిమేఘాలలో గాలి కెరటాలలో... కొండగాలి తిరిగింది.. గుండె ఊసులాడింది.. ఏటిలోని కెరటాలు ఏరు విడిచిపోవు... ఒకటనేమిటి... వేల పాటలు నేటికీ తెలుగు వారి గుండెలను పారవశ్యంలో ముంచెత్తుతున్నాయి.. ఆనందంతో గుండె తడి చేసున్నాయి... పాటలకు జీవం కలిగించేలా సంగీతాన్ని అందించారు పెండ్యాల నాగేశ్వరరావు.. కుటుంబంలో పిల్లలతో అతి సామాన్యుడిలా ఉండేవారు అంటున్నారు పెండ్యాల రెండవ కుమార్తె డాక్టర్ సుజాత నాన్నగారు గుంటూరు జిల్లా వణుకూరులో 1917లో పుట్టారు. సీతారామయ్య, వెంకమ్మ తల్లిదండ్రులు. నాన్నగారి ఆరు నెలల వయసులోనే వారి తల్లిగారు స్వర్గస్థులయ్యారు. తాతగారు రెండో వివాహం చేసుకున్నారు. ఆవిడ నాన్నగారిని సవతి కొడుకులాగే చూశారు. తాతగారి దగ్గరే సంగీతంలో ఓనమాలు దిద్దారు. నాన్న ఏడో తరగతి చదువుతుండగా డబుల్ ప్రమోషన్ వచ్చింది. తాతగారిని జీతం కట్టమని అడిగితే, ఆయన కట్టలేదు. అందువల్ల నాన్న పెద్దగా చదువుకోలేకపోయారు. నాన్నగారి నాయనమ్మ సుబ్బమ్మగారే నాన్నను పెంచి, పెద్ద చేశారు. ఆవిడనే ‘అమ్మా!’ అని పిలిచేవారు. ఆవిడే సీత అనే అమ్మాయితో నాన్న వివాహం జరిపించారు. ఒక ఆడపిల్ల పుట్టేవరకు నాయనమ్మ జీవించి ఉన్నారు. కన్నతల్లిని చూడలేకపోయారన్న బాధ నాన్నను జీవితాంతం వెంటాడింది. మాతో ‘అమ్మా! మీరు అదృష్టవంతులు, తల్లి ప్రేమకు నోచుకున్నారు’ అనేవారు. నాన్న స్వరపరచిన ‘చూడాలని ఉంది అమ్మా చూడాలని ఉంది’ పాట నాన్న గుండె లోతుల్లో నుంచి వచ్చింది. తనను సవతి తల్లి సరిగా చూడకపోయినా, ఆవిడ పిల్లల్ని తన సొంత తమ్ముళ్లు, చెల్లెళ్లుగానే చూసుకున్నారు నాన్న. తెల్లటి బెంగాలీ పంచె కట్టుతో, తెల్లటి గ్లాస్కో జుబ్బాకి బంగారు గుండీలతో ఉండే వస్త్రాలలో నాన్న స్వచ్ఛంగా కనిపిస్తారు. బాగా చదివించారు.. నాన్నగారికి మేం నలుగురు ఆడపిల్లలం. నిర్మల, సుజాత, వనజ, మంజుల. ‘అయ్యో! నలుగురు ఆడపిల్లలు’ అనే భావన ఉండేది కాదు. సంగీతంలో ఎత్తుకి ఎదగలేమనుకున్నారో ఏమో, మమ్మల్ని బాగా చదివించారు. నాన్న మాతో అన్ని విషయాలూ స్నేహంగా చర్చించేవారు. ఒకసారి నాతో, ‘అమ్మాయీ! తలకాయ అటుఇటు కదుపుతుంటే నీళ్ల చప్పుడు వస్తోంది. తలలో నీళ్లున్నట్లున్నాయి’ అన్నారు. ‘ఏమీ లేదు నాన్నా’ అంటే, ‘అంతేనంటావా’ అన్నారు. ఆయన గొంతులో పలికే మాటలో మాధుర్యం, చేతిరాతలో అందం ఉంటాయి. అరటి ఆకుల్లో భోజనం మాది సంప్రదాయ బ్రాహ్మణ కుటుంబం. ఇంట్లో చాలా సంవత్సరాల వరకు భోజనాల బల్ల కూడా లేదు. అమ్మ మడి కట్టుకుని వంట చేసి, అరటి ఆకులు వేసి వడ్డిస్తుంటే, అందరూ జోకులు వేసుకుంటూ నవ్వుకుంటూ భోజనం చేసేవారు. నాన్న సినిమా రంగంలో ఉండటం వల్ల, మా మావయ్య, బాబయ్యలు సినిమా అవకాశాల కోసం ప్రయత్నించటానికి మా ఇంటికి వస్తుండేవారు. నాన్నగారు ఏం చేసేవారు... నాన్న సినిమాలలో బిజీగా ఉన్న రోజుల్లో మూడు షిఫ్టులు పనిచేసేవారు. పొద్దున్న ఎనిమిదికి వెళితే, ఇంటికి వచ్చేసరికి రాత్రి రెండయ్యేది. ఈ సందర్భంగా నాన్న చెప్పిన ఒక సంఘటన గుర్తుకు వస్తోంది. ‘అనురాగము విరిసేనా’ పాట చేస్తున్నప్పుడు, ఆఫీసు పక్కింటివారు ఆ పాట వినటం కోసం పనులన్నీ మానుకుని కూర్చునేవారట. ప్రతీ పాటా ఓ పరీక్షే నాన్న ప్రతి పాటను ఒక పరీక్షగా భావించేవారు. పాట రికార్డింగ్ అయ్యాక, ఆఫీస్ బాయ్ సైతం ‘బావుంది’ అన్న తరవాతే ఓకే చేసేవారు. ఓకే చేశాక కూడా ఎక్కడైనా తనకు నచ్చలేదనిపిస్తే, మరుసటి రోజు మళ్లీ మార్చేవారు. ఎన్ని రీరికార్డింగులు చేసినా ఇరిటేట్ అయ్యేవారు కాదు. కొన్ని పాటలు స్వరపరుస్తున్నప్పుడు ‘అసలు ఈ పాట అందరూ వింటారా?’ అనుకునేవారు. ‘మీరజాలగలడా నాయానతి...’ పాట ప్రేక్షకులకు నచ్చిందో లేదో తెలుసుకోవాలని, ఆంధ్రలో సినిమా థియేటర్లో ప్రేక్షకుల మధ్యన కూర్చుని గమనించారట. వారంతా సంతోషంతో తలలాడిస్తుంటే, ‘నా పాటలు నిలిచిపోతాయి’ అని తృప్తి పడ్డారట. నాన్న ఒకసారి ఒక పెళ్లికి వెళ్లినప్పుడు అక్కడ ‘శివశంకరి..’ పాట వస్తుంటే, వింటూ తాళం వేస్తున్నారట. నాన్న వెనకాల కూర్చున్న ఒకాయన, ‘ఆయనను చూడండి ఏదో పెద్ద సంగీతం విద్వాంసుడిలా తాళం వేస్తున్నారు’ అంటే అప్పుడు అక్కడ మరో పెద్దాయన ‘ఆయనే పెండ్యాలగారు’ అన్నారట. ఆ అంశం ఒక పత్రికలో ప్రచురిస్తే, అది నాన్న భద్రంగా దాచుకున్నారు. నాన్న చెబితే అదే ఫైనల్... కాలేజీల వారు నాన్నను జడ్జిగా పిలిచేవారు. సినిమాలో అవకాశం కోసం చిన్న, పెద్ద తేడా లేకుండా పాడుతుంటే విని, ‘బాగా పాడారు కానీ మీ ఊరు వెళ్లిపోండి’ అనేవారు. ‘బాగా పాడారు’ అనేది వారిని తృప్తి పరచడానికి, ‘వెళ్లిపో’మనటం వాళ్ల శ్రేయస్సు కోరి. సినిమా సంగీతానికి ఏ గొంతు ఎలా ఉంటే బావుంటుందో నాన్నకు బాగా తెలుసు. ‘పెండ్యాలగారు మెచ్చుకున్నారంటే, వాళ్లు అదృష్టవంతులు’ అనుకునేవారు. ఘంటసాల గారి గొంతును ‘పెండ్యాల గారు అర్థం చేసుకున్నట్లుగా ఎవ్వరూ అర్థం చేసుకోలేదు’ అన్నారు కొందరు విమర్శకులు. పి. సుశీల, ఎస్. జానకి వంటి ఎంతో మంది గాయకులను నాన్నగారే సినిమా పరిశ్రమ కు పరిచయం చేశారు. నాన్న వ్యక్తిత్వం ఎవరెస్ట్ కంటె గొప్పది. ఎంత ఇష్టమో.. ‘పెండ్యాల గారు ఈ పాట పాడండి’ అని బంధువులు అడిగిన పాటను ఎంతో పరవశంతో పాడేవారు. ఆయనకు నచ్చిన ప్రేక్షకులు వారే. నాన్న మంచి మూడ్‌లో ఉన్నప్పుడు ‘ఒక్క పాట పాడు నాన్నా’ అని మేం అడిగితే ‘జ్ఞాపకం లేదమ్మా’ అనేవారు. ‘మేం అందిస్తాం నాన్నా’ అంటే పాడేవారు. నాన్న చాలా గుప్తదానాలు చేశారు. ఆకలితో ఉన్నవారికి జేబులో ఎంత ఉంటే అంత ఇచ్చేసేవారు. ఒకసారి ఒక కుర్రవాడికి పావలా ఇచ్చారటం. ఆ రోజుల్లో కానీలు ఉండేవి. అది చూసిన మా బాబయ్య (నాన్న సవతి తమ్ముడు), అన్నయ్య దేవుడు అని మాతోత చాలా సార్లు చెప్పాడు. సినీ మ్యుజీషియన్స్ అసోసియేషన్ కోసం నాన్న చేసిన కృషి ఫలితంగా ఇప్పుడు చాలామందికి పెన్షన్లు వస్తున్నాయి. ఆరాధ్య దైవం శ్రీనివాసుడు.. నాన్నకు దైవభక్తి ఎక్కువ. ‘వేంకటేశాయ నమః’ అంటూ పూలతో ఆత్మార్పణం చేసేవారు. ఆయన ఆరాధ్య దైవం వెంకటేశ్వరస్వామి. వారానికోసారి తిరుపతి వెళ్లేవాళ్లం. నాన్న తిరుమలలో చేయించని సేవ లేదు. వెంకటేశ్వర స్వామి మీద స్వరపరిచిన పాటలు భక్తిలో లీనమై చేశారు. ‘శేష శైలావాసా శ్రీవెంకటేశా’ పాటను అందరూ ఇప్పటికీ కీర్తన అనుకుంటారు. నాకు నాన్న స్వరపరిచి, మంగళంపల్లి బాలమురళీ కృష్ణ గారు పాడిన ‘ఏటిలోని కెరటాలు..’ పాట చాలా ఇష్టం. ఒకే టేక్‌లో శివశంకరి... వేటూరి గారు విజయవాడ ఆకాశవాణి వారి కోసం రచించిన ‘సిరికాకొలను చిన్నది’ రూపకాన్ని నాన్న స్వరపరిచారు. నాలుగైదు సినిమాల్లో చిన్నచిన్న పాత్రలు వేశారు. జగేదకవీరుని కథ చిత్రంలోని ‘శివశంకరి..’ పాటను ఘంటసాల గారితో బాగా ప్రాక్టీస్ చేయించి, ఒకే టేక్‌లో ఓకే చేశారు. విజయానంద చంద్రిక అనే కొత్త రాగాన్ని కనిపెట్టి, ‘జయభేరి’ చిత్రంలో ‘రసికరాజ తగువారము కామా’ పాటలో ఆ రాగం వాడారట. ‘శ్రీఘంటసాల పంచరత్నములు’ పేరుతో వెలువడిన ఐదు పాటలలో, నాన్నగారు స్వరపరిచిన ‘మది శారదా దేవి’, ‘శివశంకరీ’, ‘ముక్కోటి దేవతలు..’ పాటలు ఉన్నాయి. పెద్దలంతా నాన్నను మాస్టారూ అంటే, నాన్న ఘంటసాల గారిని ‘మాస్టారూ’ అనేవారు. కాంబినేషన్స్ వంట చేసేది... అమ్మనాన్నలది అన్యోన్య దాంపత్యం. ప్రేమ, ఆప్యాయతలను అర్థం చేసుకోవటమే దాంపత్యం అని వారిని చూస్తే అర్థమవుతుంది. భోజనం చేసేటప్పుడు, అమ్మ మారు వడ్డింపు అడిగితే, ‘వద్దు’ అని నాన్న అంటే, ‘ఏం వంట బాలేదా’ అని అడిగేది. ‘సీతమ్మా ఈ రోజు వంట బాగుంది’ అని నాన్న అంటే అమ్మ ఆనందపడేది. నాన్నకి కాంబినేషన్స్‌తో వంట చేసేది. తోటకూర – మజ్జిగ పులుసు, కంది పచ్చడి – పచ్చి పులుసు, కొబ్బరి కాయ – మామిడి కాయ పచ్చడి, గారెలు – అల్లం పచ్చడి. నాన్నకి అల్లం గారెల పచ్చడి ఇష్టం. ఆయన ఎన్ని తినగలరో అమ్మకి మాత్రమే తెలుసు. గణపతిం భజే... 1976 డిసెంబర్లో గుంటూరులో పెద్ద సన్మానం చేశారు. సకల గాయక సంగీత విభావరి పేరున సినీ కళాకారులు నాన్నగారి సమక్షంలో పాడారు. నాన్నకు ‘సంగీత సామ్రాట్’ బిరుదు ఇచ్చారు. వైజాగ్‌లో 1983లో పూర్ణకుంభం, వేదమంత్రాలతో, రోజా పూల బాట లో నడిపించి, సన్మానం చేశారు. ‘నన్ను దేవుణ్ని చేసేశారు’ అని నాన్న చెప్పారు. వాళ్లు దేవుణ్ని చేశారో, నాన్నే దేవుడు అయ్యారో తెలియదు కానీ, అది జరిగిన కొద్ది కాలానికే నాన్న కన్నుమూశారు. ఆ రోజు వినాయక చవితి. అమ్మ ఉండ్రాళ్లు, అల్లం పచ్చడి చేసింది. నేను మా వారు మధ్యాహ్నం ఇంటికి వెళ్లేసరికి నాన్న భోజనం చేసి, పడక్కుర్చీలో కూర్చుని ఆయాసపడుతున్నారు. హాస్పిటల్‌కి చేరుకునేసరికే కార్డియాక్ అరెస్ట్‌తో అంతా అయిపోయింది. అన్ని ఊళ్లలో ఈ వార్తను కరపత్రాలు గా పంచారు. ‘వాతాపి గణపతిం భజే’ అని సంగీతాన్ని ప్రారంభించిన నాన్నగారు ఆ గణపతి పుట్టినరోజు నాడే ఆయనలో ఐక్యమైపోయారు. - సంభాషణ: వైజయంతి పురాణపండ -
14 ఏళ్ల బంధం.. నేను, సిద్ధాంత్ విడిపోతున్నాం: దర్శకుడు
బాలీవుడ్లో మొట్టమొదటి స్వలింగ సంపర్క జంటగా గుర్తింపు తెచ్చుకున్నారు దర్శకుడు అపూర్వ అస్రానీ, మ్యూజిక్ డైరెక్టర్ సిద్ధాంత్ పిల్లై. గత 14 ఏళ్లుగా వీరిద్దరూ కలిసి ఉంటున్నారు. కొద్ది రోజుల క్రితమే సొంతంగా ఇళ్లు కూడా తీసుకున్నారు. ఈ క్రమంలో దర్శకుడు అపూర్వ అస్రానీ శనివారం సంచలన ప్రకటన చేశాడు. తామిద్దరం విడిపోతున్నామని.. 14 ఏళ్ల తమ బంధానికి ముగింపు పలుకుతున్నట్లు ప్రకటించాడు. ‘‘మా ప్రయాణంలో కొన్ని తప్పులు చేశాం’’ అంటూ ఇన్స్టాగ్రామ్ వేదికగా ఈ ప్రకటన చేశాడు అపూర్వ అస్రానీ. దాంతో పాటు ఓ నోట్‌ని కూడా షేర్ చేశాడు. దీనిలో.. ‘‘నేను, సిద్ధాంత్ విడిపోతున్నట్లు ప్రకటించడానికి చాలా బాధపడుతున్నాను. దేశంలో చాలా మంది ఎల్జీబీటీక్యూ కపుల్స్‌కి మేం ఆదర్శంగా నిలిచాం. ఈ విషయం వారందరిని నిరాశపరుస్తుందని నాకు తెలుసు. కానీ ఈ 14 ఏళ్ల కాలంలో ప్రతి రోజు ఎంతో ముఖ్యమైనది.. విలువైనది. ఇన్నేళ్ల తర్వాత మేం స్నేహపూర్వకంగా విడిపోతున్నాం’’ అని తెలిపాడు ‘‘మన దేశంలో స్వలింగ సంపర్క జంటకు ఎలాంటి ప్రేరణలు, ఆదర్శాలు ఉండవు. మేం ఏర్పాటు చేసుకున్న ఈ ప్రత్యేకమైన మార్గంలో కొన్ని తప్పులు చేశాం. స్వలింగ సంపర్కులమైనప్పటికి మా ప్రేమ గురించి ధైర్యంగా ప్రకటించాం.. అంతేకాక కలిసి ఉండాలనే సాహసోపేతమైన నిర్ణయం తీసుకున్న తొలి తరం ఎల్జీబీటీక్యూ జంట మేమే. దీని గురించి చెప్పడానికి నాకు ఎలాంటి బాధ లేదు. కానీ జీవితంలో ఎన్నో మార్పులు చోటు చేసుకుంటాయి. మా ప్రయాణంలో కూడా ఆ మార్పులు వచ్చాయి. దాంతో మేం విడిపోక తప్పడం లేదు’’ అన్నాడు. ‘‘ఈ సందర్భంగా మీ అందరిని కోరిది ఒక్కటే. ఇలాంటి క్లిష్ట పరిస్థితుల్లో మా గోప్యతని, మనోభావాలని గౌరవించాలని కోరుకుంటున్నాను. ఎలాంటి ఊహాగానాలను ప్రచారం చేయవద్దని మిమ్మల్ని అభ్యర్థిస్తున్నాను. మీ మెసేజ్‌లలో కూడా మమ్మల్ని ట్యాగ్ చేయవద్దు. భవిష్యత్తుపై నమ్మకం ఉందనే మాటతో దీన్ని ముగించాలనుకుంటున్నాను. సిద్, నేను అనే కాదు మాలో ప్రతి ఒక్కరం కోరుకునేది ప్రేమ, కమిట్మెంట్, సురక్షితమైన నివాసం. నమ్మకంపై ఆశలు వదులుకోకండి’’ అంటూ అపూర్వ అస్రానీ ఈ నోట్‌ని ముగించాడు. View this post on Instagram A post shared by Apurva (@apurva_asrani) ఇక కొద్ది రోజుల క్రితం అపూర్వ నటి సంధ్య మ్రిదులతో కలిసి ఉన్న ఫోటోని తన ఇన్‌స్టాగ్రామ్‌లో షేర్ చేశాడు. దీనిలో ఆమెని మ్యాచ్‌మేకర్ అని.. తనను మ్యాచ్ చేసింది అని తెలిపాడు. అపూర్వ అస్రానీ, సిద్ధాంత్ గతేడాది గోవాలో సొంతంగా ఇల్లు కూడా తీసుకున్నారు. ఈ సందర్భంగా ‘‘గత 13 ఏళ్లుగా మమ్మల్ని కజిన్స్‌గా చెప్పుకుంటూ ఒకే ఇంట్లో కలిసి ఉండేవాళ్లం. మా గురించి చుట్టుపక్కల వారికి తెలియకుండా ఉండటం కోసం గది తలుపులు మూసి ఉంచేవాళ్లం. కొద్ది రోజుల క్రితం మా సొంత ఇంటిని కొనగోలు చేశాం. మేం పార్ట్నర్స్మని ఇప్పుడు మా ఇరుగుపొరుగు వారికి మేమే స్వచ్ఛందంగా చెప్తున్నాం. ఎల్జీబీటీక్యూ కుటుంబాలకు ధైర్యం చెప్పడానికి ఈ ప్రకటన చేస్తున్నాం’’ అంటూ ట్వీట్ అపూర్వ ట్వీట్ చేశాడు. ఇలా ప్రకటించిన ఏడాదిలోపే విడిపోతున్నట్లు ప్రకటించి అందరికి షాకిచ్చాడు. For 13 years we pretended to be cousins so we could rent a home together. We were told 'keep curtains drawn so neighbors don't know 'what' you are'. We recently bought our own home. Now we voluntarily tell neighbors we are partners 💕. It's time LGBTQ families are normalised too. pic.twitter.com/kZ9t9Wnc7i — Apurva (@Apurvasrani) May 29, 2020 చదవండి: ‘ప్రియురాలి’తో మహిళ.. తీసుకెళ్లిన పోలీసులు 'గే'ల కోసం మాట్లాడితే రూ.10 లక్షల ఫైన్ -
ఆయన పాట కమనీయం.. స్వరం రమణీయం
కొన్నేళ్ళుగా తన డ్రీమ్ ప్రాజెకై్టన మ్యూజికల్ ఫిల్మ్ ‘99 సాంగ్స్’తో ఏప్రిల్ 16న తెలుగు, తమిళ, హిందీ భాషల్లో పలకరించనున్న ప్రపంచ ప్రసిద్ధ సంగీత దర్శకుడు ఏ.ఆర్. రెహమాన్ ‘సాక్షి’తో ఎక్స్‌క్లూజివ్‌గా, సుదీర్ఘంగా సంభాషించారు. అందులో నుంచి కొన్ని ముఖ్యాంశాలు... ► రచయితగా, నిర్మాతగా కొత్త జర్నీ గురించి... రెహమాన్: దశాబ్దాలుగా సంగీత ప్రపంచంలోనే గడుపుతున్నా. కొత్తగా ఏదైనా చేయమని నా మైండ్ చెప్పింది. ఆస్కార్ అవార్డు తర్వాత హాలీవుడ్లో 5 ఏళ్ళున్నా. అక్కడి సినిమాలు చేశా. ఆ టైమ్‌లో కొన్ని వర్క్‌షాప్స్ చేశా. మనం ఎందుకు ఓ కథ చెప్పకూడదని అప్పుడనిపించింది. సంగీతం అనేది యూనివర్సల్ సబ్జెక్ట్. ప్రపంచంలో మంచి కథలున్నప్పుడు మనమూ చెప్పవచ్చనుకొని ‘99 సాంగ్స్’ కథ రాశాను. తల్లితో రెహమాన్ ► కొత్త రెహమాన్ పుట్టారననుకోవచ్చా? ఇదో మ్యూజికల్ ఫిల్మ్ లాగా అనిపిస్తోంది. (నవ్వేస్తూ...) అవును నిర్మాతగా కొత్త రెహమాన్నే. ఈ సినిమాలో పాటలు ఎక్కువే. అలాగని సినిమా పూర్తిగా సంగీతం గురించే కాదు. సామాజిక అంశాలూ ఉన్నాయి. ఈ కొత్త ప్రపంచానికీ, పాత ప్రపంచానికీ మధ్య వైరుధ్యాలనూ, డిమాండలోని తేడాలనూ మా కథ చూపిస్తుంది. ► మీ నిజజీవిత ఘట్టాలేమైనా కథలో పెట్టారా? లేదు. ఇది ఫ్రెష్స్టోరీ. వృత్తిలో భాగంగా చాలామందిని కలిశా. ఎన్నో ప్రదేశాలు చూశా. కొత్త క్యారెక్టర్లను చూశా. మనుషుల్ని రకరకాలుగా విడదీస్తున్న వేళ మ్యూజిక్, స్పోర్ట్స్, సినిమా... వీటి గురించి అందరినీ కలుపుతాయి. ముఖ్యంగా సినిమా. మా సినిమా రైట్ టైమ్‌లో వస్తోంది. ► ఈ కథపై దాదాపు ఏడేళ్లు వర్క్ చేశారట? ఒక అమ్మాయికి, ఒక అబ్బాయి వంద పాటలు రాయడమనేది నా బేసిక్ థాట్. కానీ ప్రేక్షకులకు పాటలే సరిపోవు. వాళ్లకు సినిమా చూస్తున్నామనే అనుభూతి కలగాలి. మ్యూజిక్, విజువల్స్ కలిస్తే బాగుంటుంది. ముందు తరాలవారు అలానే చేశారు. కె. విశ్వనాథ్ గారు తీసిన ‘శంకరాభరణం’, ‘స్వాతిముత్యం’, బాలచందర్‌గారి ‘సింధుభైరవి’, మణిరత్నం ‘నాయగ¯Œ ’ ఇలాంటి సినిమాలు చూసి చాలా నేర్చుకున్నా. దర్శకులు శంకర్, సంజయ్ లీలా భన్సాలీ గ్రాండియర్ విజువల్స్‌తో పాటలను తెరకెక్కిస్తారు. ప్రతి దర్శకుడు, మ్యూజిక్ కంపోజర్ మైండ్స్ వేర్వేరు. ఈ ‘99 సాంగ్స్’ డైరెక్టర్ విశ్వేశ్ కృష్ణమూర్తి, నేను కలిసి ఉమ్మడి కలగా ఈ సినిమా చేశాం. ► చెన్నై సంగీత ప్రపంచానికి ఇది మీ కానుక...? అనుకోవచ్చు. 1980లలో తెలుగు, తమిళం, కన్నడం, మలయాళం... ఇలా సౌత్‌లో ఉన్న సినీ జీనియస్‌లు అందరూ మద్రాసులోనే ఉండేవారు. తర్వాత ఏ ఇండస్ట్రీకి ఆ ఇండస్ట్రీ అయిపోయింది. ఓసారి దిలీప్ కుమార్ గారు మద్రాసులో 6 నెలలున్నారు. ఓ సినిమా చేశారు. అలా చెన్నైలో హిందీ సినిమాల షూటింగ్‌లూ జరిగాయి. అలాంటి మంచి రోజులు రావాలని, మరో స్వర్గం రావాలనీ మా సినిమా ఓ చిన్ని ప్రయత్నం. ► మ్యూజికల్ ఫిల్మ్స్ ఇండియాలో తక్కువ. నిర్మాతగా తొలిసారే ఇలాంటి ఛాలెంజ్...? (నవ్వేస్తూ) రెగ్యులర్‌గా ఉంటే, తీస్తే లైఫ్ బోర్ కొడుతుంది. అందుకే ఈ ఛాలెంజ్. జనం లవ్, యాక్షన్ ఫిల్మ్స్ చూశారు. ఓ మ్యూజికల్ సినిమా చూడబోతున్నామనే ఎగ్జయిట్మెంట్ వారికి ఉంటుంది. థియేటర్స్‌లో పాటలు వస్తున్నప్పుడు కొందరు మొబైల్ బ్రౌజింగ్‌లో ఉంటారు. ఏకకాలంలో ‘మల్టీఫుల్ థింగ్స్’ కోరుకుంటున్నారు. కానీ ఈ సినిమాకు అలా జరగదు. బిగువైన స్క్రీన్‌ప్లేతో ‘99 సాంగ్స్’ ఉంటుంది. ► తమిళం, హిందీ, తెలుగులో రిలీజ్ చేస్తున్నారు. పాటలకు, గాయకుల విషయంలో జాగ్రత్తలు? ప్రతి పాటకూ 10 –13 రివిజన్స్ జరిగాయి. లిప్‌సింక్, మీనింగ్, పొయిట్రీ చూసుకున్నాం. అనువాదం చేయకుండా స్వేచ్ఛగా ఏ భాషకు ఆ భాషలో పాటలు రాశారు. డబ్బింగ్ సినిమాలా ఉండకూడదనుకున్నా. (నవ్వేస్తూ) అందర్నీ కష్టపెట్టి చాలా రివైజింగ్ వెర్షన్స్ చేశాం. కొన్నిసార్లు సింగర్స్నూ మార్చాం. తెలుగులో సీతారామశాస్త్రి గారు ‘సాయి..’ సాంగ్ బ్యూటిఫుల్‌గా రాశారు. అలాగే వెన్నెలకంటి కుమారుడు రాకేందు మౌళి. ► భారత చరిత్రలో తొలిసారి డాల్బీ ఎట్మాస్ టెక్నాలజీతో రిలీజ్ చేస్తున్న సౌండ్ ట్రాక్ ఆల్బమ్ అట కదా ఇది... అవును. ఆడియో త్వరలోనే రిలీజ్ చేస్తాం. ఫస్ట్ డాల్బీ సౌండ్ ట్రాక్ మా సినిమాతో లాంచ్ అవడం గౌరవంగా ఉంది. ఈ సినిమాను హిందీలోనే విడుదల చేద్దామనుకున్నాం. జియో స్టూడియోస్ మాతో అసోసియేటయ్యాక తెలుగు, తమిళంలోనూ చేయాలనుకున్నాం. ► మొదట మీకు కథ తట్టిందా? లేక సంగీతమా? (నవ్వుతూ) కథే! కథలో నుంచే సంగీతం వచ్చింది. కథ ప్రకారమే పాటలు ఉంటాయి. ► కె.విశ్వనాథ్ తీసిన ‘శంకరాభరణం’, ‘స్వాతిముత్యం’ సినిమాలు నచ్చాయన్నారు. మీరు ఆ టైమ్‌లో ఉంటే, ఆ సినిమాలకు చేసి ఉంటే...? లేదండీ. వాటికి లెజెండ్స్ వర్క్ చేశారు. కేవీ మహాదేవన్ గారిని నా గురువుగా భావిస్తాను. కర్ణాటక సంగీతం నుంచి తీసుకొని ఆయన సినిమాకు చేసిన ట్యూన్స్‌ను మ్యాచ్ చేయలేం. ► విశ్వనాథ్ గారి లాంటి వారితో ఓ మ్యూజిక్ ఫిల్మ్ చేయాలని మీరు ఆశపడుతుంటారా? ‘ఇఫీ’ ఫంక్షన్ లో గోవాలో విశ్వనాథ్‌గారిని కలిశా. గంట మాట్లాడా. ఆయనకి చాలా వినయం. అలాంటి అద్భుత చిత్రాలన్నీ భగవత్ కృప అని వినయంగా చెప్పారు. కమల్‌హాసన్ గారిని కలిసినప్పుడు రెండు గంటలు మాట్లాడుకున్నాం. ‘సాగర సంగమం’ రూపకల్పనలో విశ్వనాథ్‌గారి కృషి, అందరి మేధామథనం సంగతుల్ని నెమరేసుకున్నాం. ► మ్యూజిక్, రచన, నిర్మాణం... ఏది కష్టం? ఏ విషయాన్ని అయినా మూలాల నుంచి తపనతో నేర్చుకోవాలి. మ్యూజిక్‌లో నేను ఫాలో అయిన ఈ విధానాన్నే ప్రొడక్షన్, రైటింగ్లోనూ చేశా. సినిమా నిడివి మూడున్నర గంటలు వచ్చింది. కథాంశం పాడవకుండా ఉండేలా రెండు గంటల్లో సినిమా ఉండేలా కొత్త ఎడిట్ చేశాం. ‘మామ్’ చిత్ర ఎడిటర్ మోనిషా పని చేశారు. ట్రైలర్ కట్ కోసం దర్శకుడు అట్లీని సంప్రదించాం. కమర్షియల్ వేలో కట్ చేశారాయన. తమిళ వెర్షన్ కు దర్శకుడు గౌతమ్ మీనన్ డైలాగ్స్ అందించారు. ఆస్కార్ గెలిచిన ‘లా లా ల్యాండ్’కు చేసిన పియానో ప్లేయర్ మా సినిమాకు పనిచేశారు. చాలామంది అంతర్జాతీయ నిపుణులు, నా స్నేహితులు నన్ను గైడ్ చేశారు. ► నిర్మాతల కష్టాలు అర్థమయ్యాయా? (నవ్వేస్తూ) ప్రొడ్యూసర్ జాబ్ జూదం లాంటిది. నిర్మాతగా ఒక్క తప్పుడు నిర్ణయం తీసుకుంటే ఫినిష్. చాలామంది నష్టపోయారు. కానీ ధైర్యంగా ముందుకు వెళ్లకపోతే లైఫ్ లేదు. ఒక మ్యూజిక్ డైరెక్టర్‌గా ‘సినిమాలో మంచి పాట ఇది.. వినండి’ అని నేనెప్పుడూ చెప్పను. కానీ నిర్మాత బాధ్యతలు వేరు. కెప్న్ ఆఫ్ ది షిఫ్ మనమే. సినిమాను రిలీజ్ చేయాల్సిన బాధ్యతా నిర్మాతలదే. కానీ ఈ ప్రొడక్ట్ ఒక్క నిర్మాతదే కాదు. డైరెక్టర్స్, ఆర్టిస్ట్స్, టెక్నీషియన్స్... ఇలా చాలామంది కలిస్తేనే ఒక సినిమా. వీటికి తోడు ఏఆర్ రెహమాన్ సినిమా అంటే కొన్ని అంచనాలు ఉంటాయి. వాటినీ అందుకోవాలి. ఇందులో అందరి కృషీ ఉంది. ► నిర్మాతగా, రచయితగా... కొనసాగుతారా? ‘99 సాంగ్స్’ రిలీజ్ కోసం చూస్తున్నా. నేను నిర్మాతగా కొనసాగాలో లేదో జనం నిర్ణయిస్తారు. ► సినిమా రఫ్కట్ మీ అమ్మగారికి చూపించారట అవును. ఆమె తన అభిప్రాయాలను నిక్కచ్చిగా చెబుతారు. ఆ సమయంలో అమ్మ అనారోగ్యంతో మంచం మీదున్నారు. ఆవిడ చూసి ఇంగ్లీష్ సినిమాలా ఉందన్నారు. ఇనిషియల్ కట్, కథలోని సీన్లు ఆమెకి అలా అనిపించాయి. ► దర్శకులు శంకర్ ఇదే మాట అన్నట్లున్నారు? ఆయన ఓ పాట చూశారు. విజువల్స్ అంత గ్రాండ్‌గా అనిపిస్తుండడం హ్యాపీగా ఉంది. హాలీవుడ్ విజువల్స్, భారతీయ ఆత్మ – మా సినిమా. ► మీ చిత్రదర్శకుడు విశ్వేశ్కి మీ సలహాలేమైనా? లేదు. 2016లో ఈ సినిమాను స్టార్ట్ చేశాం. వర్క్, పోస్ట్ ప్రొడక్షన్స్ వర్క్స్ నాలుగేళ్లు జరిగాయి. ► రాబోయే రోజుల్లో సినీ డైరెక్టర్‌గా కూడా...? లేదు. ‘లే మస్క్’ అనే ఓ చిన్న వర్చ్యువల్ రియాలిటీ ఫిల్మ్ మాత్రం తీశా. దర్శకత్వం అంటే, 2–3 ఏళ్ళు అన్నీ పక్కన పెట్టేయాలి. (నవ్వేస్తూ) నన్ను సంగీతం వదిలేయమంటారా ఏమిటి? ► మీరు వర్క్ చేసిన రాజ్–కోటితో అనుబంధం? కోటి గారిని కలుస్తుంటా. అన్నయ్య లేని నాకు ఆయన అన్నయ్య. రాజ్ గారిని చూసి చాలా కాలమైంది. ఆయనను కలవాలని ఉంది. ► గత ఏడాది మీ అమ్మ గారి లానే, లెజండ్ సింగర్ ఎస్పీ బాలు దూరమయ్యారు... (బాధగా)ఎస్పీబీ గారి లాంటి సింగర్ మరొకరు రారు. 40 వేల పాటలు పాడిన ఆయనను ఇంకెవరూ మ్యాచ్ చేయలేరు. 1982 –83 టైమ్‌లో అనుకుంటా... నా ఫస్ట్ పెర్ఫార్మెన్స్ ఆయన బర్త్ డేకి, మద్రాస్ మ్యూజిక్ అకాడెమీలో జరిగింది. నా మ్యూజిక్ డైరెక్షన్ లో వచ్చిన సినిమాల్లో ఆయన పాడిన పాటలన్నీ మళ్ళీ వీడియో రికార్డ్ చేయిద్దామని అనుకున్నాను. ఆయన ఎగ్జయిటయ్యారు. కానీ ఇంతలో కరోనా వ్యాప్తి. ప్రాజెక్ట్ ఆగింది. ఆయన వెళ్ళిపోయారు. ► ఆస్కార్ సాధించారు. మన సిన్మాలకి బెస్ట్ ఫారిన్ఫిల్మ్గా ఆస్కారొచ్చే ఛాన్స్? మన ఫిల్మ్‌మేకర్స్ ఏం మిస్సవుతున్నామో గమనించాలి. బావిలో కప్పల్లా ఉండిపోకూడదు. మనం వెళ్ళాలి, పోటీ పడాలి. నేను ‘ఫ్యూచర్ ప్రూఫ్స్’ వర్క్‌షాప్ కూడా చేశా. మార్కెటింగ్‌లో, క్రియేటివ్ సైడ్ కొత్త ఆలోచనలను సమీకరించడానికి ఈ ఛానెల్‌ను స్టార్ట్ చేశా. నేను అనకూడదు కానీ హాలీవుడ్లో భారతీయ సినిమాల పట్ల చిన్న రేసిజమ్ ఉంది. ఏ భాష సినిమా అయినా బాలీవుడ్ అనేస్తారు. నిజానికి, అద్భుతమైన డైరెక్టర్లు, సాంకేతిక నిపుణులు ఉన్నారు మన దగ్గర. మన మధ్య ఉన్న గ్యాప్‌ను కూడా పూడ్చుకోవాలి. ► నార్త్, సౌత్ మధ్య వివక్ష మాటేమిటి? అదో పెద్ద కథ. మరోసారి మాట్లాడతా. కానీ, జనరల్‌గా సౌత్ డైరెక్టర్స్ నార్త్‌లో చేస్తున్నారు. నార్త్ హీరోలు సౌత్‌లో నటిస్తున్నారు. జనం సమైక్యంగానే ఉన్నాం. తెలుగువారు తమిళం, తమిళం వారు తెలుగును ఇష్టపడతారు. హిందీవారు తమిళ పాటలను ఇష్టపడతారు. సో.. వుయార్ యునైటెడ్. వుయార్ హ్యాపీ ఇండియా. ► మీరు మళ్ళీ స్ట్రైట్ తెలుగు ఫిల్మ్ చేసేదెప్పుడు? ‘ఏ మాయ చేసావే’ స్ట్రైటేగా! మంచి కథ, దర్శకుడు కుదిరితే మళ్లీ చేస్తా. తెలుగంటే ఇష్టం. నా దగ్గరవాళ్ళతో తెలుగులోనే మాట్లాడుతుంటా. ► ఇటీవల ఓ ఫంక్షన్ లో ఈ తరం సంగీత దర్శకులు యువన్ శంకర్, జీవీ ప్రకాశ్, అనిరు«ధ్ మిమ్మల్ని పొగుడుతుంటే ఏమనిపించింది? ఈ తరంలో చాలా ఉత్సాహం కనిపిస్తోంది. వారు ప్రేమను చూపించడాన్ని గౌరవంగా ఫీలవుతున్నా. ఆర్టిస్టులందరూ కలిసి ఉంటే మరిన్ని అద్భుతాలు వస్తాయి. యువ సంగీతజ్ఞుల కోసం మేం ‘మాజా’ అనే యాప్ స్టార్ట్ చేశాం. ఇండిపెండెంట్ మ్యూజిక్‌ను ముందుకు తీసుకెళ్ళి, ఆర్థిక భద్రత కల్పిస్తుంది. ► మీరు చాలామందికి స్ఫూర్తి. కొత్తతరాన్ని చూసి మీరు ఇన్ స్పైర్ అవుతారనుకోవచ్చా? అవును. ప్రతిభావంతుల్ని ప్రోత్సహిస్తున్నా. ఎవరైనా కొత్త మ్యూజిక్‌ను ట్రై చేసినప్పుడు మెచ్చుకుంటే వారిలో మరింత జోష్ వస్తుంది. ► మీరు చాలామందిని ట్రైన్ చేస్తున్నారు కదా? మా కె.ఎం కన్జర్వేటరీ ద్వారా చాలామంది పైకొస్తు్తన్నారు. మేం కొన్ని షోలు చేశాం. కొన్నిసార్లు ఈ పాటను మరోలా పాడదామని అనిపిస్తుంటుంది. ఒకసారి నీతీ మోహన్, జనితాగాంధీ లాంటి యంగ్‌స్టర్స్ ఆడుతూ, పాడే శైలి చూశా. స్టేజ్‌పై ఎలా ఉండాలనే విషయాల్ని నేను వారిని చూసి నేర్చుకున్నా. మనం ఇంకా బాగా పాడాలి, ఏదో రిటైర్డ్ ఆఫీసర్లలా బిగుసుకోని ఉండకూడదని (నవ్వేస్తూ) అనుకున్నా. ఇప్పుడు బన్నీ, సిధ్ శ్రీరామ్ బాగా షైనవుతున్నారు. హ్యాపీగా ఉంది. ► మీ సంగీతానికి వారసులెవరు? మీ ఇంట్లో... నా అకాడెమీలోని స్టూడెంట్స్‌ను సొంత బిడ్డలుగా భావిస్తా. అమీన్, సార్థక్ కల్యాణి, పూర్వీ కౌటిశ్, ఔరంగాబాద్ అంజలీ గైక్వాడ్... ఇలా నా లెగసీని కంటిన్యూ చేయడానికి చాలామంది ఉన్నారు. అందులో నా బిడ్డలూ భాగస్వాములే. ► మీరీ స్థాయికి చేరుకోవడంలో మీ అమ్మగారి పాత్ర? గత ఏడాది మా అమ్మ మాకు దూరమయ్యారు. నేను, నా ఫ్యామిలీ ఒక్కసారిగా కుప్పకూలిపోయాం. మా అమ్మకి మేం అంతలా అటాచ్ అయ్యాం. నా పిల్లలు, నా సిస్టర్స్ ఆ బాధను తట్టుకోలేక ఏడుస్తుంటే, నా బాధను దిగమింగుకొని, వాళ్లల్లో ఆత్మస్థైర్యం నింపాల్సిన బాధ్యత తీసుకున్నా. మా అమ్మగారు ఈ లోకాన్ని వదిలి మరో మంచి లోకాన్ని చేరుకున్నారు. ఈ విషయాన్ని మా ఫ్యామిలీ మెంబర్స్‌కు కన్విన్సింగ్‌గా చెప్పడం నాకు చాలా కష్టంగా అనిపించింది. ఆమె త్యాగం, గైడ్‌లైన్స్, ధైర్యమే మమ్మల్ని ఈ స్థాయిలో నిలిపాయి. మా అమ్మ పేరిట చెన్నైలో ఓ స్మారక చిహ్నం నిర్మిస్తున్నాం. ► ప్రపంచసిన్మాకి, భారతీయ సినిమాకు తేడా? ప్రపంచవ్యాప్తంగా మన సంస్కృతి తెలియాలి. మనం బెగ్గర్స్ కాదు. మనకంటూ ఓ స్టేటస్, ఉనికి, ఐకమత్యం ఉన్నాయని ప్రపంచం మొత్తం తెలియాలి. కష్టపడి పనిచేసే తత్వం మన నేలలోనే ఉంది. అంతర్జాతీయ ప్రేక్షకులు మన ప్రతిభను గుర్తించాలి. ఇండియా అనగానే ఏదో పేదరికంలో మగ్గే దేశం అన్నట్లు జాలి చూపిస్తుంటారు వారి సినిమాల్లో. అది కరెక్ట్ కాదు. అందుకే, నాకు ‘బాహుబలి’ నచ్చింది. ‘ఎవెంజర్స్’, ‘లార్డ్ ఆఫ్ ది రింగ్స్’ లాగా ఈ సినిమాకు ప్రపంచవ్యాప్త గుర్తింపు దక్కింది. మన దగ్గర్నుంచి యంగ్ ఫిల్మ్‌మేకర్స్ మంచి ప్రతిభావంతులు వస్తున్నారు. మన సినిమాలు ప్రపంచస్థాయిని చేరుకోవాలని కోరుకుంటున్నా. – రెంటాల జయదేవ -
సినిమా నుంచి అనిరుధ్‌ను సైడ్ చేశారు!
చియాన్ విక్రమ్ 60వ సినిమా షూటింగ్ నేడు లాంఛనంగా ప్రారంభమైంది. ఈ సందర్భంగా దర్శకుడు కార్తీక్ సుబ్బరాజు సంగీత దర్శకుడు సంతోష్ నారాయణన్‌కు స్వాగతం చెప్తూ ట్వీట్ చేశాడు. కానీ ఈ ట్వీట్ అభిమానులను ఒక్కసారిగా షాక్‌కు గురి చేసింది. కారణం.. ఈ చిత్రానికి గతంలో అనిరుధ్ రవిచందర్ సంగీతాన్ని అందిస్తాడని ప్రకటించారు. కానీ ఏమైందో ఏమోకానీ సడన్‌గా అతడిని సైడ్ చేస్తూ సంతోష్ పేరును ప్రకటించారు. "అవును, ఈ సినిమాకు సంతోష్ నారాయణన్ సంగీతం అందిస్తున్నాడు. మమ్మల్ని అర్థం చేసుకుని అండగా నిలిచినందుకు అనిరుధ్‌కు కృతజ్ఞతలు. ఈ రోజే చిత్రీకరణ ప్రారంభమవుతోంది" అంటూ కార్తీక్ సుబ్బరాజు ట్వీట్ చేశాడు. చిత్రయూనిట్ తీసుకున్న ఈ నిర్ణయంపై కొందరు హర్షం వ్యక్తం చేస్తుండగా మరికొందరు మాత్రం అనిరుధ్ మాస్ బీజీఎమ్ మిస్ అవుతామని కామెంట్లు చేస్తున్నారు. Yes... It's A Santosh Narayanan Musical!! Welcome to the Gang @Music_Santhosh Thanks @anirudhofficial for your understanding & Support ... #Chiyaan60 shoot starts from TODAY... Need all your Support, Blessings and Love 🙏 More updates to follow.... pic.twitter.com/ZqmFKU6J86 — karthik subbaraj (@karthiksubbaraj) March 10, 2021 ఇక మీ సినిమాలో సిమ్రాన్, వాణి భోజన్ ప్రధాన పాత్రల్లో నటిస్తున్నారు. లలిత్ కుమార్ తన సొంత నిర్మాణ సంస్థ సెవర్ స్క్రీన్ స్టూడియోపై ఈ సినిమా నిర్మిస్తున్నాడు. మరోవైపు విక్రమ్ 'పొన్నియిన్ సెల్వన్' అనే మరో యాక్షన్ డ్రామా సినిమా చేస్తున్నాడు. చదవండి: విక్రమ్‌కు సవాలు విసురుతున్న ఇర్ఫాన్ పఠాన్ అఖిల్ పేరు ఛాతీ మీద పచ్చబొట్టు వేయించుకున్న ఫ్యాన్ -
'జయప్రద నాన్న దగ్గర సంగీతం నేర్చుకుంది'
నాన్న పాటలకు గాలి కూడా సడి సేయదు ఏరువాక సాగాలోరన్నో చిన్నన్నో.. ఆడుతూ పాడుతూ పనిచేస్తుంటే... హాయిగా ఆలుమగలై కాలం గడపాలి.. సడి సేయకోగాలి సడిసేయబోకే.. ఓ బాటసారీ నను మరువకోయి... నీ సుఖమే నే కోరుతున్నా.. వెన్నెలరేయీ ఎంతో చలీచలీ.. ఈ పగలు రేయిగా వెండి వెన్నెలగ మారినదేమి చెలీ.. లెక్క లేనన్ని సుమధుర గీతాలను అందించారు మద్దూరి వేణుగోపాల్.. ఆయనే మాస్టర్ వేణు.. పాతాళభైరవి లో హేమండ్ ఆర్గాన్ బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్ చేసి, పండితుల చేత ఔరా అనిపించుకున్నారు. సంగీతంలో ఎంత ఘనులో, అల్లరిలోనూ అంతే సమానులు అంటున్నారు హోలీ ఏంజెల్స్ స్కూల్లో మ్యూజిక్ టీచర్‌గా పనిచేసిన వారి పెద్దకుమారుడు మద్దూరి వెంకట సుబ్రహ్మణ్యమూర్తి ఉరఫ్ మూర్తిచందర్. ఆ వివరాలు వారి మాటలలోనే.. నాన్నగారు బందరులో 1920 –22 మధ్యకాలంలో పుట్టారు. సరిగ్గా ఏ సంవత్సరమో తెలియదు. తాతగారు మద్దూరి సుబ్బయ్య నాయుడు, నాయనమ్మ గంగమ్మలకు నాన్నగారు ఒక్కరే సంతానం. తాతగారిది కలంకారీ అచ్చులు వేసే, మధ్యతరగతి కుటుంబం. నాన్నగారికి ఎనిమిది సంవత్సరాల వయసులోనే తాతగారు పోయారు. నాన్నగారిని వారి మావయ్యగారైన హనుమకొండ వెంకట్రామయ్య పెంచి, పెద్ద చేసి, వారి అమ్మాయితో నాన్న వివాహం జరిపించారు. ఆవిడ చాలా త్వరగా కన్నుమూయటంతో మా అమ్మను రెండో వివాహం చేసుకున్నారు. మేం ఇద్దరం మగపిల్లలం. నా పేరు మద్దూరి వెంకట సుబ్రహ్మణ్య మూర్తి. తమ్ముడికి భానుచందర్ అని పేరు పెట్టి, నన్ను మూర్తి చందర్‌గా మార్చారు. తమ్ముడు సినిమాలలో నటిస్తున్నాడు. గదిలో పది గంటల సాధన.. మొదటి భార్య తమ్ముడిని మా అమ్మ తన సొంత తమ్ముడిలా చూసింది. నాన్నగారి మేనమామ హార్మోనియం వాయించేవారు. మా తాతగారు పోవటంతో ఆయనే నాన్న బాధ్యతను తీసుకుని, కఠినమైన క్రమశిక్షణతో పెంచారు. నాన్న అల్లరి పనులు చేసేవారు. నాన్నను ఒక గదిలో పెట్టి తాళం వేసి, రోజుకి పది గంటలు బయటకు రాకుండా హార్మోనియం సాధన చేయించేవారు. లోపల నుంచి హార్మోనియం శబ్దం వినపడకపోతే వేళ్ల మీద కొట్టేవారు. నాన్నకు ఆటలంటే ఇష్టం. ఆడుకుని వచ్చి దెబ్బలు తినేవారు. పదకొండు సంవత్సరాలకే హార్మోనియం మీద పట్టు వచ్చి, మచిలీపట్నంలో పెద్ద పెద్ద వారందరికీ వాయించారు. పైడ్పైపర్ కథలో ఎలుకల్లాగ అందరూ నాన్నని చుట్టుముట్టి పాడించుకునేవారు. ముంౖ»ñ పారిపోయారు.. టీన్ ఏజ్ వచ్చాక, హిందీ సినిమా పాటలు ఇష్టపడ్డారు. ఒకరోజు తన అదృష్టం వెతుక్కుంటూ ముంబై వెళ్లిపోయి, వసంతదేశాయ్ దగ్గర హార్మోనిస్టుగా చేరారు. అప్పుడు నాన్న వయసు 20 సంవత్సరాలు. అక్కడ కొంతకాలం పనిచేశాక, మద్రాసు హెచ్ఎంవిలో చేరారు. ఆ రోజుల్లో ప్రైవేట్ రికార్డ్సు పబ్లిష్ చేసేవారు. అక్కడ గాయకులకు పాటలు నేర్పి, రికార్డు చేయటం నాన్న పని. ఆ రోజుల్లోనే వైజయంతిమాల నాన్నగారి సంగీతంలో రెండు పాటలు పాడారు. హెచ్ఎంవి నుంచి విజయ స్టూడియోలో స్టాఫ్ మ్యూజిక్ డైరెక్టర్‌గా చేరి, రికార్డింగ్, బ్యాక్ గ్రౌండ్ చేసేవారు. మాయాబజార్, పాతాళభైరవి చిత్రాలలో బ్యాక్ గ్రౌండ్‌స్కోర్, హేమండ్ ఆర్గాన్ని నాన్నగారు మాత్రమే హ్యాండిల్ చేశారు. ఆ పియానోని ఇండియాలో నాన్నగారే మొదట వాడారు. ‘రోజులు మారాయి’ చిత్రంలోని ‘ఏరువాక సాగాలో’ పాటకు ఎస్.డి. బర్మన్ చాలా ఇన్‌స్పయిర్ అయ్యి, ఆయన తన సినిమాలో ఈ పాటను పెట్టుకున్నారట. మారలేకపోయారు.. 1960 నుంచి సుమారు 12 సంవత్సరాలు నాన్‌స్టాప్‌గా పనిచేశారు నాన్న. ఆ పన్నెండు సంవత్సరాలు ఆయనతో చాలా అరుదుగా గడిపేవాళ్లం. క్రమేపీ సంగీత విలువలు పడిపోతుండటంతో నెమ్మదిగా ఫేడ్ అవుట్ అయిపోతూ వచ్చారు. అప్పటి నుంచి మాతో ఎక్కువకాలం గడిపారు. విశ్రాంతి సమయం దొరకటంతో ప్రతిరోజూ పియానో లేదా సితార్ రెండు గంటలు తప్పనిసరిగా వాయించుకునేవారు. మాకు టి. నగర్లో పెద్ద ఇల్లు ఉండేది. మా అమ్మ శకుంతల వల్లే ఆ ఇల్లు నిలబడింది. నాన్నకి ఆదాయం తగ్గినప్పుడు, ఇల్లు అద్దెకు ఇచ్చి, డబ్బు జాగ్రత్త చేసేది. ‘అమ్మా! నీకు మేమిద్దరం కాదు, నాన్న మూడో కొడుకుతో సమానం’ అనేవాడిని. కొందరు సంగీతకారులు మా ఇంట్లో అద్దెకు ఉండేవారు. వారు ఇబ్బందుల్లో ఉన్నప్పుడు భోజనం పెట్టి, ఎంతో కొంత డబ్బు ఇచ్చేవారు. (ఎడమ నుంచి కుడి) మూర్తి చందర్, భానుచందర్ చాలా చిలిపి.. నాన్నలో ఉన్న చిలిపితనం, పసితనం.. చివరి రోజుల వరకు చూశాం. నాన్నతో మేం స్నేహితుల్లా ఉండేవాళ్లం. ఇంట్లో పెద్దవాళ్లు సైలెంట్‌గా, చిన్నవాళ్లు చురుకుగా ఉంటారు. నేను డల్‌గా ఉండటం వల్ల అమ్మనాన్నలకి బెంగగా ఉండేది. నా మీద రెట్టింపు ప్రేమ చూపించేవారు. ప్రతి శుక్రవారం నాన్న, నేను ఇంగ్లీషు సినిమాకి వెళ్లేవాళ్లం. కాలేజీకి వచ్చేసరికి నాకు, తమ్ముడికి ఇద్దరికీ సంగీతం వచ్చింది. కాని, మమ్మల్ని ప్రభుత్వ ఉద్యోగాలలో పెట్టాలనుకున్నారు. మామిడిచెట్లు మామిడి పళ్లనే ఇస్తాయి. మా ఇద్దరికీ సంగీతం మీద ఆసక్తి ఆగలేదు. తమ్ముడు భానుచందర్ నాన్నగారి ఆర్కెస్ట్రాలో గిటార్ వాయించేవాడు. మన సంప్రదాయ సంస్కృతి సంగీతంలో ఉండాలి అనేవారు. ఆ విషయం ఇప్పుడు అర్థం అవుతోంది.. సంపూర్ణమైన భోజనం పాత పాటలే అని. స్టూడియోలో సింహమే... ఏ పూర్వజన్మ సుకృతమో కానీ, నాన్న అన్నిరకాల వాద్యపరికరాలు వాయించేవారు. రికార్డింగ్ స్టూడియోలోకి వెళితే సింహంలా చాలా క్రూరంగా ఉండేవారు. ఎవరు తప్పు చేసినా ఒక టీచర్లా వాళ్లని కొట్టి, వాద్యపరికరం లాగేసుకుని ఆయనే వాయించేసేవారు. ‘మావారి మంచితనం’ చిత్రంలో ఎన్టిఆర్ జయప్రదలకు ఒక పాట చేశారు. ఆ పాట విన్న జయప్రద సితార్ తెచ్చుకుని, నాన్న దగ్గర సంగీతం నేర్చుకున్నారు. ఇద్దరూ నా దగ్గరే.. నాన్నకి చెట్లంటే ఇష్టం. రూఫ్ గార్డెన్ చేశారు. ధ్యానం, తోటపని.. వీటితో చాలా ప్రశాంతంగా ఉండేవారు. ఇంటి వ్యవహారాలు అమ్మ చూసుకునేది. మాతో ఆడేవారు.. ఒకసారి ఎన్టిఆర్ అమ్మతో, ‘అమ్మా! మాస్టర్‌గారు ఏం చేస్తున్నారు?’ అని అడిగితే, సినిమాలు లేక ఖాళీగా ఉన్నారని చెప్పింది. అప్పుడు ఆయన తీస్తున్న ‘మావారి మంచితనం’ సినిమాకు సంగీతం చేసే అవకాశం ఇచ్చారు. అదే నాన్న చేసిన ఆఖరి సినిమా. ఆ సినిమా పాటల రికార్డింగ్ హైదరాబాద్‌లో పూర్తి చేసుకుని, అక్కడ నుంచి వస్తూ మాకు చరఖా, గాలిపటాలు తెచ్చి, మాతో సమానంగా ఎగరేశారు. బొంగరాలు, గోళీలు బాగా ఆడేవారు. గోళీ కొడితే పగలాల్సిందే. అందరితోటీ పరాచికాలాడేవారు. కొలీగ్స్‌కి తొడపాశం పెట్టడం ఆయనకు ఇష్టం. ఘంటసాల గారికి కూడా పెట్టారు. నాన్నగారిని చూసి బాలు కూడా తొడపాశం ప్రారంభించారు. కళ్లల్లో నీళ్లు ఆగలేదు.. పి. పుల్లయ్య, శాంతకుమారి దంపతులు నాన్నని ‘ఏరా అబ్బాయి’ అంటూ ఆప్యాయంగా పిలిచేవారు. నాన్నకు క్యాన్సర్ వచ్చిందని తెలిసి ఆయన ఏడు పదుల వయసులో మూడు అంతస్తులు ఎక్కి నాన్నను చూసి వెళ్తూ, మెట్ల మీద కూలబడిపోయి, గట్టిగా ఏడ్చేశారు. రక్తసంబంధం లేకపోయినా అంత ప్రేమగా ఉండేవారు. నాన్న క్యాన్సర్‌తో 1981లో, అమ్మ 1991లో పోయారు. అమ్మకు అనారోగ్యంగా ఉన్నప్పుడు ఆసుపత్రిలో డ్రెస్సింగ్ చేసేటప్పుడు నేను అమ్మ పక్కనే ఉండటానికి నాకు అనుమతి ఇచ్చారు. ‘ఆడపిల్ల లేని లోటు తీర్చావు’ అని ఆప్యాయంగా అంది అమ్మ. అమ్మానాన్న నా చేతుల్లోనే పోయారు. మా తాతయ్య గారికి అమ్మ వాళ్లు ఫ్యామిలీ ఫ్రెండ్స్. వాళ్లు సంగీతం నేర్చుకోవటానికి వచ్చేవారు. అప్పటికి అమ్మకి పాతికేళ్లు. నాన్నగారు చాలా అందంగా ఉండేవారు. అమ్మ సైలెంట్‌గా లవ్ చేసి, ఎక్స్‌ప్రెస్ చేయలేదేమో అనుకుంటాను. అమ్మ దగ్గర ఉండి మరీ నాన్న పెళ్లి చేయించింది. చివరకు అమ్మకు ప్రేమ దక్కింది అనుకుంటాను. అదొక మిస్టరీ. అమ్మ నాన్‌వెజ్ వంటకాలు బాగా చేసేది. ఆవిడ పొద్దున్న మార్కెట్‌కి వెళ్లి ఫిష్ తెచ్చి, పసుపు వేసి బాగా తోమి, మసాలాలు వేసి మధ్యాహ్నం రెండు గంటలకు వంట పూర్తి చేసేది. పది నిమిషాలలో భోజనం పూర్తి చేసేసేవాళ్లం. ‘అమ్మ ఐదు గంటలు వంట చేస్తే, మనం ఐదు నిమిషాలలో పూర్తి చేసేస్తాం’ అని సరదాగా అనేవాడిని. ఆ విషయం నాన్న అందరికీ చెప్పేవారు. పాన్, పొగాకు నమలటం ఆయనకు ఇష్టం. - మూర్తి చందర్ (మాస్టర్ వేణు పెద్ద కుమారుడు) సంభాషణ: వైజయంతి పురాణపండ -
హాలీవుడ్ కంపోజర్ మోరికోన్ మృతి
ఆస్కార్ అవార్డ్గ్రహీత ప్రముఖ హాలీవుడ్ మ్యూజిక్ కంపోజర్ ఎన్నియో మోరికోన్ (91) కన్నుమూశారు. 1928 నవంబర్ 10న రోమ్‌లో జన్మించారు మోరికోన్ వెస్ట్రన్ మ్యూజిక్‌లో తనదైన ముద్ర వేశారు. దాదాపు నాలుగువందల సినిమాలకు సౌండ్‌ట్రాక్స్ కంపోజ్ చేశారు. ‘ది గుడ్ ది బ్యాడ్ ది అగ్లీ’, ‘ది మిషన్’, ‘వన్స్ అపాన్ ఏ టైమ్ ఇన్ ది వెస్ట్’, ‘ది అన్‌టచబుల్స్’ వంటి సినిమాలకు మోరికోన్ అందించిన సౌండ్ ట్రాక్స్ ఆయన్ను చాలా పాపులర్ చేశాయి. ఐదుసార్లు (డేస్ ఆఫ్ హెవెన్, ది మిషన్, ది అన్‌టచబుల్స్, బుగ్సీ, మలేనా చిత్రాలకు) ఆస్కార్‌కు నామినేట్ అయిన మోరికోన్ ఫైనల్‌గా 2015లో వచ్చిన ‘ది హేట్‌ఫుల్ ఎయిట్’ అనే చిత్రానికి బెస్ట్ ఒరిజినల్ స్కోర్ విభాగంలో ఆస్కార్ అవార్డు సాధించారు. అలాగే సంగీతానికి అందించిన కృషికి గౌరవంగా ఆస్కార్ అకాడమీ ఆయనకు జీవితసాఫల్య పురస్కారాన్ని 2007లో అందించింది. మోరికోన్ మృతి పట్ల పలువురు హాలీవుడ్ ప్రముఖులు విచారం వ్యక్తం చేశారు. ‘మీ సంగీతంతో ఎప్పటికీ బతికే ఉంటారు. మీరు నాకు గురువులాంటివారు’ అని ఇండియన్ స్టార్ కమల్‌హాసన్ ట్వీట్ చేశారు. -
యూట్యూబ్ గొడవ: మ్యూజిక్ కంపోజర్ హత్య
న్యూఢిల్లీ : యూట్యూబ్ ఛానల్ విషయంలో ఏర్పడ్డ కక్ష భోజ్‌పురి మ్యూజిక్ కంపోజర్ ప్రాణం తీసింది. ఈ సంఘటన ఢిల్లీలోని ద్వారకలో ఆలస్యంగా వెలుగుచూసింది. పోలీసులు తెలిపిన వివరాల మేరకు.. ఢిల్లీ, ద్వారకకు చెందిన భోజ్‌పురి మ్యూజిక్ కంపోజర్ ముఖేశ్ చౌదరి ఓ యూట్యూబ్ ఛానల్ నడుపుతున్నాడు. ఈ నేపథ్యంలో అతడికి సంతోష్, విక్కీలు పరిచయమయ్యారు. వీరిద్దరూ కూడా మ్యూజిక్ కంపోజర్లు అవ్వటంతో సన్నిహితంగా ఉండేవారు. ఓ రోజు సంతోష్ తమ యూట్యూబ్ ఛానల్( ఆర్యన్ ఎంటర్టైన్మెంట్ మీడియా)కు సంబంధించిన పాస్వర్డ్, యూజర్ ఐడీని ముఖేశ్‌తో షేర్ చేశాడు. కొద్దిరోజుల తర్వాత ఆ ఛానల్ యూట్యూబ్‌నుంచి డిలేట్ అయిపోయింది. తమ ఛానల్ డిలేట్ అవ్వటానికి ముఖేశ్ కారణమని భావించిన సంతోష్, విక్కీలు అతడిపై కక్ష కట్టారు. ఎలాగైనా అతడ్ని చంపి పగ తీర్చుకోవాలనుకున్నారు. ( పుట్టిన రోజు వేడుకని పిలిచి... ) వారం రోజుల క్రితం ముఖేశ్ స్టూడియోకు వెళ్లిన వారు అతడి చేతులు, కాళ్లు కట్టేసి గొంతు నులిమి చంపేశారు. అనంతరం ఓ బ్లాంకెట్‌లో శవాన్ని చుట్టి టేబుల్ కింద దాచేశారు. అనంతరం కొన్ని విలువైన వస్తువులతో అక్కడినుంచి పరరాయ్యారు. నాలుగు రోజుల తర్వాత స్టూడియోనుంచి దుర్వాసన రావటంతో స్థానికులు పోలీసులకు సమాచారం ఇచ్చారు. స్టూడియోలోని టేబుల్ కింద కుళ్లిన స్థితిలో ముఖేశ్ మృతదేహం కనిపించింది. కేసు నమోదుచేసుకున్న పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు. సీసీ టీవీ ఫుటేజీల ఆధారంగా సంతోష్, విక్కీలను అదుపులోకి తీసుకుని విచారించగా నేరం చేసినట్లు ఒప్పుకున్నారు. సంతోష్ తన కంటే పాపులర్ అయిపోతాడన్న అసూయ తోటే ముఖేశ్.. ఆర్యన్ ఎంటర్టైన్మెంట్ మీడియా యూట్యూబ్ ఛానల్‌ను డిలేట్ చేసినట్లు వారు తెలిపారు. ఛానల్ డిలేట్ అవ్వటం కారణంగా ఆర్థికంగా తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నామని నిందితులు పేర్కొన్నారు. -
సంగీత దర్శకుడు వాజీద్‌ఖాన్ మృతి
-
ప్రముఖ సంగీత దర్శకుడు కన్నుమూత
ముంబై: బాలీవుడ్ ప్రముఖ సంగీత దర్శకుడు, గాయకుడు వాజీద్ ఖాన్(42) ఆదివారం రాత్రి కన్నుమూశారు. అనారోగ్య సమస్యలతో బాధపడుతున్న ఆయన ముంబైలోని చెంటూర్ ఆసుపత్రిలో తుది శ్వాస విడిచారు. ఆయనకు కిడ్నీ సమస్యలు ఉండటంతో కొన్ని నెలల క్రితం కిడ్నీ మార్పిడి చేసుకున్నారు. ఇదిలా వుంటే కొద్ది రోజుల క్రితమే ఆయన కరోనా బారిన పడ్డారు. కాగా సాజిద్- వాజిద్ పేరిట సంగీతాన్ని సమకూరుస్తూ వాజీద్ ఖాన్ పాపులర్ అయ్యారు. బాలీవుడ్‌కు ఎన్నో హిట్ సాంగ్స్ అందించారు. లాక్‌డౌన్‌లోనూ హీరో సల్మాన్ ఖాన్ "భాయ్ భాయ్" పాటకు సంగీతం అందించారు. (తాప్సీ ఇంట్లో విషాదం..) ఆయన మృతి పట్ల బాలీవుడ్ ప్రముఖులు సంతాపం వ్యక్తం చేస్తున్నారు. 'వాజీద్ ఖాన్ నవ్వు తనకు ఎప్పటికీ గుర్తుండిపోతుంద'ని ప్రియాంక చోప్రా పేర్కొన్నారు. 'అతను మనల్ని వదిలి శాశ్వతంగా వెళ్లిపోయాడంటే ఇప్పటికీ నమ్మలేకపోతున్నా. ఆయన మరణం సంగీత ప్రపంచానికి తీరని లోటు' అని సింగర్ హర్షదీప్.. వాజీద్ కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలిపారు. సింగర్ నుంచి రాజకీయ నాయకుడిగా ఎదిగిన బబుల్ సుప్రియో అతని మరణ వార్త విని షాక్‌కు లోనయ్యానన్నారు. మంచి మిత్రుడిని, ప్రతిభావంతుడిని కోల్పోయానంటూ విచారం వ్యక్తం చేశారు.(ప్రముఖ సంగీత దర్శకుడు కన్నుమూత) -
ప్రముఖ సంగీత దర్శకుడు కన్నుమూత
తిరువనంతపురం: ప్రముఖ సంగీత దర్శకుడు ఎంకే అర్జునన్(84) సోమవారం కన్నుమూశారు. అర్జునన్ మాస్టర్‌గా పిలవబడే ఆయన కొచ్చిలోని నివాసంలో అనారోగ్యంతో మృతి చెందారు. దాదాపు 700పైగా పాటలకు సంగీతాన్ని అందించిన అర్జునన్ మాస్టర్ మాలయాళ చిత్ర పరిశ్రమలో సంగీత దర్శకుడిగా తనకంటూ ఓ ప్రత్యేకతను తెచ్చుకున్నారు. 1968లో ‘కరుత పౌర్ణమి’ అనే మలయాళం సినిమాలోని పాటలకు మ్యూజిక్‌ను అందించి సంగీత దర్శకుడిగా చిత్ర పరిశ్రమకు పరిచయమయ్యారు. ఇక 2017లో ‘భయంకం’ చిత్రానికి గాను కేరళ ఉత్తమ సంగీత దర్శకుడిగా అవార్డును అందుకున్నారు. ‘నీలా నిశిధిని’, ‘కస్తూరి మనక్కున్నేలో’, ‘పాడుతా వీన్యూమ్ పాడుమ్’వంటి ఎన్నో పాటలకు ఆయన సంగీతం అందించారు. -
‘దయనీయ స్థితిలో సంగీత దిగ్గజం’
ముంబై : నేషనల్ ఫిల్మ్ అవార్డు, పద్మశ్రీలు వరించినా ఆయన బ్యాంక్ ఖాతాలో ఇప్పుడు చిల్లిగవ్వ లేదు. ఆర్ట్ చిత్రాలకు తన సుస్వర స్వరాలతో జీవం పోసిన ఆ దిగ్గజ కళాకారుడు ప్రస్తుతం దిక్కుతోచని స్ధితిలో పడిపోయారు. గోవింద్ నిహ్లాని తమస్ చిత్రానికి గాను మ్యూజిక్ కంపోజర్ వన్రాజ్ భాటియాకు 1988లో నేషనల్ ఫిల్మ్ అవార్డు లభించగా, 2012లో ప్రతిష్టాత్మక పద్మశ్రీ అవార్డు అందివచ్చింది. వినూత్న స్వరాలతో 1970, 1980 ప్రాంతాల్లో కళాత్మక చిత్రాలకు ప్రాణం పోసిన వన్రాజ్ భాటియా ప్రస్తుతం 92 ఏళ్ల వయసులో రోజువారీ ఖర్చుల కోసం జేబు వెతుక్కునే స్థితిలో ఉన్నారు. వృద్ధాప్యంలో వెంటాడే వ్యాధులతో చేతిలో చిల్లిగవ్వ లేకుండా నెట్టుకొస్తున్నానని ఆయన వాపోయారు. తాను జ్ఞాపకశక్తిని కోల్పోతున్నానని, మోకాళ్ల నొప్పులు, ఇతర ఆరోగ్య సమస్యలతో బాధపడుతున్నానని, ఇప్పుడు తన బ్యాంకు ఖాతాలో ఒక్క రూపాయి కూడా లేదని ముంబై మిర్రర్‌తో ఆయన చెప్పుకొచ్చారు. తాను కేవలం పనిమనిషి సేవలపై ఆధారపడి బతుకు వెళ్లతీస్తున్నానని, దైనందిన ఖర్చుల కోసం విదేశాల నుంచి తెప్పించుకున్న వంట సామాగ్రిని అమ్ముకునేందుకు సిద్ధపడ్డానని ఆవేదన వ్యక్తం చేశారు. తాను దశాబ్ధాలుగా వైద్య సేవలను పొందలేదని, దీంతో కచ్చితంగా తనకు ఎలాంటి అనారోగ్య సమస్యలు ఉన్నాయో వెల్లడించలేనని చెప్పారు. 1989లో సంగీత నాటక అకాడమీ అవార్డునూ సొంతం చేసుకున్న భాటియా లండన్ రాయల్ అకాడమీ ఆఫ్ మ్యూజిక్‌లోనూ పాశ్చాత్య శాస్ర్తీయ సంగీతాన్ని అభ్యసించారు. -
సంగీత దిగ్గజం ఖయ్యాం కన్నుమూత
ముంబై: బాలీవుడ్ దిగ్గజ సంగీత దర్శకుడు, పద్మభూషణ్ గ్రహీత మొహమ్మద్ జహుర్ ఖయ్యాం హష్మి(93) సోమవారం కన్నుమూశారు. కొన్నేళ్లుగా ఊపిరితిత్తుల ఇన్ఫెక్షన్తో బాధపడుతున్న ఖయ్యాం ముంబైలోని సుజయ్ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. గత నెల 28న ఆయన ఆరోగ్యం క్షీణించడంతో వెంటిలేటర్ అమర్చారు. అయితే సోమవారం రాత్రి 9.30 గంటలకు కార్డియాక్ అరెస్ట్(గుండె ఆగిపోవడం)తో ఖయ్యాం తుదిశ్వాస విడిచారని సన్నిహితవర్గాలు తెలిపాయి. లూథియానా నుంచి 17 ఏళ్లకే ఖయ్యాం సంగీత ప్రయాణం మొదలైంది. ‘ఉమ్రావ్ జాన్’ ‘కభీకభీ’ సినిమాలతో ఖయ్యాం పేరు బాలీవుడ్లో మార్మోగిపోయింది. ‘ఉమ్రావ్ జాన్’ సినిమాకు అందించిన సంగీతానికి గానూ ఖయ్యాంను జాతీయ అవార్డు వరించింది. కభీకభీ, ఉమ్రావ్ జాన్ సినిమాలకు ఫిలింఫేర్ అవార్డులు కూడా దక్కాయి. ఆయనకు 2007లో సంగీత నాటక అకాడమి అవార్డు వరించింది. అంతేకాకుండా 2011లో భారత ప్రభుత్వం పద్మభూషణ్ అవార్డుతో ఖయ్యాంను సత్కరించింది. కాగా, ఖయ్యాం మృతిపై ప్రధాని నరేంద్ర మోదీ, మహారాష్ట్ర సీఎం ఫడ్నవీస్, గాయని లతా మంగేష్కర్, సంగీత దర్శకుడు సలీం మర్చంట్‌తో పాటు పలువురు సినీ, రాజకీయ ప్రముఖులు తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ఆయన కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలియజేశారు. -
అది నా అదృష్టం
తమిళ, తెలుగు, హిందీ భాషల్లో కథానాయికగా మంచి పేరు తెచ్చుకున్నారు శ్రుతీహాసన్. తండ్రి కమల్‌హాసన్‌కు తగ్గ తనయగా మార్కులు కొట్టేస్తూనే, సొంత అభిమానులను సంపాదించుకున్నారామె. కథానాయికగా డిఫరెంట్ క్యారెక్టర్స్‌ను ఎంచుకుంటూ ముందుకు వెళుతోన్న శ్రుతిలో మ్యూజిక్ కంపోజింగ్ టాలెంట్ కూడా ఉందని ప్రత్యేకించి చెప్పకర్లేదు. యాక్టింగ్, మ్యూజిక్వైజ్గా మీ ఎక్స్పీరియన్స్ ఎలా ఉంది? అన్న ప్రశ్నను శ్రుతీ ముందు ఉంచితే– ‘‘మా నాన్నగారు నటించి, దర్శకత్వం వహించిన ‘హే రామ్’లో నేను ఓ గెస్ట్ రోల్ చేశాను. అయితే నటిగా అది నాకు మొదటి సినిమా అని నేను అనుకోవడంలేదు. కానీ ఆ సినిమాతో కెమెరా ముందుకు వచ్చినందుకు ఫుల్ హ్యాపీ. దాదాపు తొమ్మిదేళ్ల క్రితం బాలీవుడ్లో ‘లక్’ మూవీ చేశాను. యాక్టర్‌గా నా తొలి మూవీ అదే. సినిమా ప్రపంచాన్ని నా కళ్లు అర్థం చేసుకుంది అప్పుడే. అందుకే ‘లక్’ని నా మొదటి సినిమాలా భావిస్తున్నాను. యాక్టర్‌గా నా జర్నీ బాగుంది. ఇక మ్యూజిక్ కంపోజింగ్ అనేది నా న్యాచురల్ ఎక్స్టెన్షన్. సాధారణంగా చాలామందిలో యాక్టింగ్ లేదా మ్యూజిక్ ఏదో ఒక టాలెంట్ మాత్రమే ఉంటుంది. కానీ ఆ రెండింటినీ నేను చేయగలుగుతుండటం నా అదృష్టంగా భావిస్తున్నా’’ అని పేర్కొన్నారామె. ప్రస్తుతం మహేశ్ మంజ్రేకర్ దర్శకత్వంలో రూపొందుతోన్న ఓ హిందీ చిత్రంలో శ్రుతీహాసన్ కథానాయికగా నటిస్తున్నారు. ఇందులో హీరో విద్యుత్ జమాల్. -
ప్రముఖ సంగీత దర్శకుడు హఠాన్మరణం
సాక్షి , హైదరాబాద్: ప్రముఖ సంగీత దర్శకుడు ఆదిత్యన్ (63) కన్నుమూశారు. కిడ్నీ ఫెయిల్యూర్ కారణంగా తమిళ సంగీత దర్శకుడు ఆదిత్యన్ హైదరాబాద్‌లో మంగళవారం రాత్రి తుదిశ్వాస విడిచారు. హైదరాబాద్‌లో ఉంటున్న కుమార్తెను చూడటానికి వచ్చిన ఆయన అకస్మాత్తుగా అనారోగ్యంతో కుప్పకూలిపోయారు. రేపు (డిసెంబర్7) చెన్నైలో ఆదిత్యన్ అంత్యక్రియలు నిర్వహించనున్నారు. 90 లలో తమిళం, మలయాళంతో పాటు తెలుగు సినిమాలకు ఆదిత్యన్ సంగీతాన్ని అందించారు. అమరన్, సీవల్ పేరి పాండి, కోవిల్పట్టి వరలక్ష్మి తదితర చిత్రాలు ఆయన సంగీత సారధ్యంలో వచ్చిన ప్రముఖ చిత్రాలు. తన సొంత చిత్రాలకు, ఇతర స్వరకర్తలకు కూడా అనేక పాటలను పాడారు. అంతేకాదు ఇండియా, మలేషియాలో విడుదలైన తమిళ పాప్, రీమిక్స్ ఆల్బమ్స్ ద్వారా ప్రసిద్ది చెందారు. అలాగే స్థానిక టీవీలో ఎనిమిదేళ్లపాటు ఆదిత్యన్ కిచెన్ పేరుతో వంటల కార్యక్రమాన్ని కూడా నిర్వహించారు. ఆదిత్యన్ అకాలమృతిపై పలువురు సినీ ప్రముఖులు, ఇతర నటీనటులు దిగ్ర్భాంతిని, సంతాపాన్ని వ్యక్తం చేశారు.