
సాక్షి , హైదరాబాద్: ప్రముఖ సంగీత దర్శకుడు ఆదిత్యన్ (63) కన్నుమూశారు. కిడ్నీ ఫెయిల్యూర్ కారణంగా తమిళ సంగీత దర్శకుడు ఆదిత్యన్ హైదరాబాద్‌లో మంగళవారం రాత్రి తుదిశ్వాస విడిచారు. హైదరాబాద్‌లో ఉంటున్న కుమార్తెను చూడటానికి వచ్చిన ఆయన అకస్మాత్తుగా అనారోగ్యంతో కుప్పకూలిపోయారు. రేపు (డిసెంబర్7) చెన్నైలో ఆదిత్యన్ అంత్యక్రియలు నిర‍్వహించనున్నారు.
90 లలో తమిళం, మలయాళంతో పాటు తెలుగు సినిమాలకు ఆదిత్యన్ సంగీతాన్ని అందించారు. అమరన్, సీవల్ పేరి పాండి, కోవిల్‌పట్టి వరలక్ష్మి తదితర చిత్రాలు ఆయన సంగీత సారధ్యంలో వచ్చిన ప్రముఖ చిత్రాలు. తన సొంత చిత్రాలకు, ఇతర స్వరకర్తలకు కూడా అనేక పాటలను పాడారు. అంతేకాదు ఇండియా, మలేషియాలో విడుదలైన తమిళ పాప్, రీమిక్స్ ఆల్బమ్స్ ద్వారా ప్రసిద్ది చెందారు. అలాగే స్థానిక టీవీలో ఎనిమిదేళ్లపాటు ఆదిత్యన్ కిచెన్ పేరుతో వంటల కార్యక్రమాన్ని కూడా నిర్వహించారు.
ఆదిత్యన్ అకాలమృతిపై పలువురు సినీ ప్రముఖులు, ఇతర నటీనటులు దిగ్ర్భాంతిని, సంతాపాన్ని వ్యక‍్తం చేశారు.
Comments
Please login to add a commentAdd a comment