Tamil
-
లెక్కల్లో మనం తమిళులకు వదిలేసిన... మన తెలుగు సినిమా
సాధారణంగా తొలి తెలుగు టాకీ అనగానే అందరి నోటా వచ్చే మాట ‘భక్త ప్రహ్లాద’ (1932). కానీ, అంతకన్నా ముందే తెరపై తెలుగు మాటలు, పాటలు వినిపించాయని తెలుసా? పది రీళ్ళ పూర్తి నిడివి ‘భక్త ప్రహ్లాద’ కన్నా ముందే రిలీజైన సదరు నాలుగు రీళ్ళ సినిమా గురించి విన్నారా? తెరపై తెలుగు వారి ఘన వారసత్వానికి గుర్తుగా నిలిచే ఆ సినిమాను అశ్రద్ధతో మనం మన లెక్కల్లో చేర్చుకోకుండా వదిలేశామంటే నమ్ముతారా? తమిళులు మాత్రం అది తమదిగా గొప్పగా చెప్పుకుంటున్నట్టు గమనించారా? సుదీర్ఘ పరిశోధనలో తొలి దక్షిణ భారతీయ భాషా టాకీ ‘కాళిదాస్’ (1931)పై అనేక కొత్త సత్యాలు బయటపడ్డాయి.భారతీయ చలనచిత్ర పరిశ్రమలో... మూగ సినిమాలను వెనక్కి నెడుతూ, మాట్లాడే చిత్రాలు వచ్చింది 1931లో! హిందీ–ఉర్దూల మిశ్రమ భాష హిందుస్తానీలో తయారై, 1931 మార్చి 14న విడుదలైన ‘ఆలమ్ ఆరా’ తొలి భారతీయ టాకీ చిత్రం. బొంబాయిలోని ఇంపీరియల్ ఫిల్మ్ కంపెనీ అధినేత అర్దేశిర్ ఎం. ఇరానీ ఆ చిత్రానికి దర్శకుడు, నిర్మాత. ‘ఆలమ్ ఆరా’ రిలీజై, ఘనవిజయం సాధించిన తర్వాత మరో ఏడు నెలలకు వచ్చిన ‘ఫస్ట్ ఇండియన్ తమిళ్ అండ్ తెలుగు టాకీ’ ఈ ‘కాళిదాస్’. అక్కడే... ఆ సెట్స్‌లోనే!‘ఆలమ్ ఆరా’ విజయంతోనే దక్షిణాది భాషల్లోనూ టాకీలు నిర్మించాలని ఇరానీకి ఆలోచన వచ్చింది. అలా అనుకున్నప్పుడు ఆయన తన వద్ద ఉన్న అనుభవజ్ఞుడైన దక్షిణాదీయుడు హెచ్.ఎం.రెడ్డి వైపు మొగ్గారు. హెచ్.ఎం.రెడ్డి ‘కాళిదాస్’కి నిర్దేశకుడై, తరువాతి కాలంలో ‘దక్షిణ భారత టాకీ పితామహుడి’గా పేరొందారు. గమ్మత్తేమిటంటే – బొంబాయిలోనే, తొలి భారతీయ టాకీ ‘ఆలమ్ ఆరా’ కోసం వేసిన సెట్స్‌లోనే ఈ ‘‘తొలి తమిళ – తెలుగు టాకీ ‘కాళిదాస్’నూ’’ చిత్రీకరించారు. రంగస్థల నటి, అప్పటికే దక్షిణాదిన కొన్ని మూకీ చిత్రాల్లో నటించిన టి.పి. రాజలక్ష్మి చిత్ర హీరోయిన్. మూకీల రోజుల నుంచి సినిమాల్లో ఉన్న మన తెలుగు వెలుగు ఎల్వీ ప్రసాద్ ‘ఆలమ్ ఆరా’లో లానే, ఈ ‘కాళిదాస్’లోనూ ఒక చిన్న వేషం వేశారు. మరి, ఈ చిత్రంలో టైటిల్ రోల్ పోషించిన నటుడెవరు? అసలు హీరో తెలుగువాడే!కాళిదాస్ పాత్రధారి ఎవరనే అంశంపై చరిత్రలో నరసింహారావు, హరికథా భాగవతార్ పి. శ్రీనివాసరావు, తమిళ నటుడు పి.జి. వెంకటేశన్... ఇలా రకరకాల పేర్లు ప్రచారంలో ఉన్నాయి. వాస్తవానికి, ఆ పాత్ర ధరించినది పైన పేర్కొన్న వారెవరూ కారు! ఆ నటుడి పేరు– వి.ఆర్. గంగాధర్. ఆ రోజుల్లోనే ‘‘బి.ఏ. చదివిన’’ ఉన్నత విద్యావంతుడు. అప్పట్లో ‘‘ప్రసిద్ధ క్యారెక్టర్ ఆర్టిస్ట్.’’ ఆయన, రాజలక్ష్మి జంటగా ‘కాళిదాస్’లో నటించారని తాజాగా బయటపడ్డ నాటి ప్రకటనలతో తేలిపోయింది. ఇంకో విశేషం ఉంది. అదేమిటంటే, ఆ ‘కాళిదాసు’ పాత్ర వేసిన సదరు గంగాధర్/ గంగాధరరావు అచ్చ తెలుగువాడు! అవును... ఇది ఇంతవరకు ఎవరూ పట్టించుకోని అంశం. మన సినీచరిత్రలో నమోదు కాని మరుగునపడిన సత్యం! ‘‘...ఆంధ్రా ప్రాంతం నుంచి వచ్చిన ఒకరిని కాళిదాసుగా నటింపజేశారు’’ అని సాక్షాత్తూ హీరోయిన్ రాజలక్షే్మ చెప్పారు. (ఆధారం: ‘గుండూసి’ పత్రికకు 1950లలో ఆమె ఇచ్చిన భేటీ).ఎల్వీ ప్రసాద్ సైతం అందులో హీరో తెలుగువాడని తేల్చిచెప్పారు. ‘‘...‘కాళిదాస్’కి హెచ్.ఎం.రెడ్డి దర్శకత్వం వహించగా, శ్రీమతి టి.పి. రాజలక్ష్మి, మరో తెలుగు నటుడు పాత్రలు పోషించారు’’ అని తన యాభై అయిదేళ్ళ జీవితానుభవాల ఆత్మకథనంలో పేర్కొన్నారు.అది... ఒకటి కాదు! మూడు చిత్రాలు!!‘కాళిదాస్’ తర్వాత రూపొంది, రిలీజైన ‘భక్త ప్రహ్లాద’ పూర్తి తెలుగు టాకీ. ఆ చిత్ర ప్రదర్శనలో తెలుగు మినహా మరో భాషే వినిపించదు. కానీ, ‘కాళిదాస్’ అలా కాదు! అసలు ఆ చిత్ర ప్రదర్శనే... ఒకటి కాదు... ఒకటికి మూడు చిన్న చిన్న చిత్రాల కదంబ ప్రదర్శన! ఆ మూడింటిలో ప్రధానమైనది– ‘కాళిదాస్’. ఈ రచయిత పరిశోధనలో తాజాగా తేలిందేమంటే... ఆ ఫిల్ము వరకు మొత్తం తెలుగు డైలాగుల్లోనే నడిచింది. ‘కాళిదాస్’తో పాటు కలిపి ఒకటే ‘ప్రోగ్రామ్’గా ప్రదర్శించిన మిగతా రెండు లఘు చిత్రాలు మాత్రం తమిళం. అవి... తమిళ దేశభక్తి గీతాలు, తమిళ కురత్తి పాటలు – డ్యాన్సు ఉన్న చిత్రాలు.కొన్నేళ్ళ క్రితమే అన్వేషణలో అందుబాటులోకి వచ్చిన ‘కాళిదాస్’ పాటల పుస్తకం ఆ ‘ప్రోగ్రామ్’ వివరాలను స్పష్టంగా పేర్కొంది. దాని ప్రకారం ఆ ‘‘ప్రోగ్రామ్’’ వివరాలు ఏమిటంటే... 1). దేశభక్తి నిండిన జాతీయవాద గీతాలు (తమిళంలోవి), కీర్తనలు (తెలుగులోని త్యాగరాయ కీర్తనలు), ప్రణయ గీతాలు (తమిళంలోవి), డ్యాన్స్ చూపిన 3 రీళ్ళ చిత్రం. 2). ‘కాళిదాస్’. ఇందులో కాళిదాస్ హాస్యఘట్టాల్లో ఒకటి, అలాగే అతని జీవితంలోని ప్రేమఘట్టం మరొకటి చూపారు. ఇది 4 రీళ్ళ చిత్రం. (ఇది పూర్తిగా తెలుగు డైలాగులతోనే తీసిన తెలుగు కథాచిత్రం). 3). హీరోయిన్ మిస్. టి.పి. రాజలక్ష్మి రంగస్థలంపై విజయవంతంగా అభినయిస్తూ, అప్పటికే ఎంతో పేరు సంపాదించుకున్న ‘కురత్తి’ డ్యాన్స్. ఇది 2 రీళ్ళ చిత్రం. కురత్తి డ్యాన్స్ అంటే పూసల దండలు, దారాలు విక్రయించేవారు వీథుల్లో చేసే నృత్యాలన్నమాట. మొత్తం ఈ 3 తక్కువ నిడివి చిత్రాల సమాహారమే ‘కాళిదాస్’ అన్నమాట. అన్నీ కలిపితే మొత్తం 9 రీళ్ళు. విడివిడిగా నిడివి తక్కువ గల ఈ మూడు లఘు చిత్రాలనూ కలిపి, ఒకే టాకీ ప్రదర్శనగా రిలీజ్ చేశారు. మూడూ కలిపి ఒకే షోగా వేశారు. అలా ఆ సినిమా ప్రదర్శన అటు తెలుగు డైలాగుల ‘కాళిదాస్’తో పాటు, తెలుగు త్యాగరాయ కీర్తనలు, తమిళ దేశభక్తి గీతాలు, కురత్తి డ్యాన్సుల కదంబ కార్యక్రమంగా జనం ముందుకు వచ్చింది. అన్ని భాషల వారినీ ఆకర్షించేందుకు వీలుగా ‘కాళిదాస్’ను ‘‘తొలి భారతీయ తమిళ, తెలుగు టాకీ చిత్రం’’గా పబ్లిసిటీ చేశారు. అదీ జరిగిన కథ. ‘కాళిదాస్’లో... అన్నీ తెలుగు డైలాగులే! తమిళం, హిందీ లేవు!!అయితే, ఇవాళ తమిళ సినీ చరిత్రకారులు ‘కాళిదాస్’ను వట్టి తమిళ టాకీగానే పేర్కొంటున్నారు. తమ భాష సినిమాగా లెక్కల్లో కలిపేసుకుంటున్నారు. కానీ, ‘కాళిదాస్’లో అసలు తమిళ డైలాగులే లేవు! హీరో తెలుగులో మాట్లాడితే, హీరోయిన్ తమిళంలో బదులు ఇచ్చిందనీ, పూజారి పాత్ర ధరించిన ఎల్వీ ప్రసాద్ లాంటి వారు హిందీలో సంభాషణలు పలికారనే ప్రచారంలోనూ వాస్తవం లేదు. ‘కాళిదాస్’ కథాచిత్రం మొత్తం తెలుగు డైలాగులతోనే తయారైంది. ఆ చిత్ర హీరోయిన్ అప్పట్లోనే చెప్పిన మాటలు, పత్రికల్లోని ఆనాటి సమీక్షలే అందుకు నిలువెత్తు సాక్ష్యం. ఆ ‘కాళిదాస్’ చిత్రంలో ‘‘నేను తమిళ, తెలుగు పాటలు పాడాను. తెలుగులో డైలాగులు చెప్పాను’’ అని ఆ సినిమా రిలీజు వేళలోనే హీరోయిన్ రాజలక్ష్మి పేర్కొనడం గమనార్హం. రాజలక్ష్మి ‘‘జన్మస్థలం (తమిళనాడులోని) తంజావూరు సమీప గ్రామం. తమిళం తప్ప, వేరొక భాషా పరిచయం లేదు.’’ అందుకే, ‘కాళిదాస్’ టాకీలో నటిగా మొత్తం తెలుగు డైలాగులే చెప్పాల్సి వచ్చినప్పుడు, ‘‘తెలుగు మాటలను ద్రావిడ లిపిలో (అంటే తమిళ లిపిలో అన్నమాట) రాసుకొని వల్లించాను’’ అని ఆమె వివరించారు.రాజ్యలక్ష్మి వేరొక సందర్భంలో మాట్లా డుతూ, ‘‘ఒకరోజు (దర్శకుడు) హెచ్.ఎం.రెడ్డి గారు నాతో మాట్లాడుతున్నారు. నాకు ఏవేమి వచ్చని ఆయన అడిగారు. కురత్తి పాటలు, నృత్యం తెలుసని చెప్పాను. అంతే... (అవి చేయించి) అది చిత్రీకరించారు. ఆ తర్వాత ‘కాళిదాస్’ అనే చిత్రాన్ని తెలుగులో తీశారు. అందులో రాకుమారిగా నటిస్తూ, ఆయన తెలుగులో చెప్పింది తమిళంలో రాసుకొని, చదువుకొని ఆ సంభాషణలు పలికే అవకాశం నాకు దక్కింది. అలా మొదటి టాకీయే (వివిధ అంశాల, లఘు చిత్రాల) ఒక కదంబ టాకీగా తమిళనాడుకొచ్చింది’’ అని తేటతెల్లం చేశారు. ‘కాళిదాస్’ తెలుగు ఫిల్మ్ అని చెప్పకనే చెప్పారు.మనం వదిలేసుకున్నాం! .. వాళ్ళు కలిపేసుకున్నారు!! ‘కాళిదాస్’లో ఒక్క హీరోయినే కాదు... హీరో సహా అందరూ తెలుగు లోనే మాట్లాడారు. తమిళం ఒక్క ముక్క కూడా లేదు. తమిళ మ్యాగజైన్ ‘ఆనంద వికటన్’ సైతం ‘‘...అందులో తమిళ మాటలు లేవు. కనుక్కుంటే, అది తెలుగు భాష అని తెలిసింది. (సినిమా ప్రదర్శన) మొదట్లో, మధ్యలో, చివరలో మాత్రం కొన్ని తమిళ పాటలు వచ్చాయి’’ అని అప్పటి తన సమీక్షలో తేల్చే సింది. (ఆధారం: ‘ఆనంద వికటన్’ 1931 నవంబర్ 16). అంటే, 10 రీళ్ళ పూర్తి నిడివి, పూర్తి తెలుగు టాకీ ‘భక్త ప్రహ్లాద’ కన్నా ముందే తొలిసారిగా తెలుగు మాటలు, పాటలతో వచ్చిన 4 రీళ్ళ లఘు కథాచిత్రం ‘కాళిదాస్’. ఆ ‘కాళిదాస్’లోనే మన తెలుగు మాట, పాట తొలిసారిగా వెండితెరపై వినిపించాయి. తెలుగు టాకీకి శ్రీకారం చుట్టాయి. తెలుగు భాషకు అంతటి ఘనత కట్టబెట్టింది ‘కాళిదాస్’ అయినా, అది మొత్తం తెలుగు డైలాగులే ఉన్న సినిమాయే అయినా... తెలుగువాళ్ళమైన మనం ఉదాసీనంగా ఆ సినిమాను లెక్కల్లో వదిలేసుకున్నాం. అతి శ్రద్ధ గల తమిళులేమో దాన్ని తమ తమిళ టాకీగా చరిత్రలో కలిపేసుకున్నారు. మరి, కేవలం తెలుగు డైలాగులతోనే తీసినప్పటికీ, ‘కాళిదాస్’ను అప్పట్లో తమిళ – తెలుగు సినిమాగా ఎందుకు చెప్పినట్టు? నాటి మద్రాస్ ప్రెసిడెన్సీ... తెలుగు, తమిళ, తదితర భాషల సమాహారం. అందరినీ ఆకర్షించాలన్నది సహజంగానే దర్శక, నిర్మాతల భావం. ఈ మూడు లఘు చిత్రాల కదంబ సినీ ప్రదర్శనతోనే... తెలుగు, తమిళ భాషలు రెండూ తెరపై తొలిసారిగా వినిపించాయి. ఆ చిత్రం మొట్టమొదట మద్రాసులో రిలీజవుతున్నప్పుడు ‘‘తమిళ – తెలుగు భాషల్లో తొలి వాక్చిత్రం’’ అంటూనే ప్రకటనలిచ్చారు. అంతేతప్ప, కేవలం తమిళ టాకీ అని చెప్పలేదు. అది గమనించాలి! ఆ రకంగా ‘కాళిదాస్’ ప్రోగ్రామ్‌లో తెర మీద తమిళంతో పాటు తెలుగు కూడా ఒకేసారి వినిపించింది కాబట్టి, తమిళంతో సమానంగా దీటుగా తెలుగూ నిలిచిందని గ్రహించాలి!! పూర్తి నిడివి టాకీల విషయంలో మాత్రం తమిళ ‘హరిశ్చంద్ర’ (రిలీజ్ 1932 ఏప్రిల్ 9) కన్నా ముందే తయారై, రిలీజైన తెలుగు ‘భక్త ప్రహ్లాద’ (1932 ఫిబ్రవరి 6)తో మనమే ముందున్నామని గుర్తించాలి!! దక్షిణాదిలో తొలి సినిమా పాటల పుస్తకంమూడు లఘు చిత్రాల కదంబ ప్రదర్శన ‘కాళిదాస్’లోని తమిళ, తెలుగు పాటలన్నీ హీరోయిన్ రాజలక్షే్మ పాడారు. అప్పట్లో ఈ సినిమా పాటల పుస్తకాన్ని ప్రత్యేకంగా ప్రచురించారు. దక్షిణాదిలో వచ్చిన తొలి సినిమా పాటల పుస్తకమిదే! పాటల పుస్తకంలో ‘కాళిదాస్’ చిత్ర కథా సంగ్రహం వివరాలను తెలుగు, తమిళం, ఇంగ్లీషు మూడు భాషల్లోనూ ప్రచురించడం విశేషం. పాటల పుస్తకం ముఖచిత్రంపై ‘కాళిదాస్’లో రాజలక్ష్మి నృత్యభంగిమ ఫొటో, మద్రాసు కినిమా సెంట్రల్లో సినిమా రిలీజ్ తేదీ తదితర వివరాలు ఇంగ్లీషులో వేశారు. ఇవాళ ఇంటర్నెట్ అంతటా కనిపించే ‘కాళిదాస్’ పోస్టర్ అదే! తెరపై తొలి తెలుగు పాట... త్యాగరాయ కీర్తన! అప్పటికే సుప్రసిద్ధురాలైన టి.పి. రాజలక్ష్మి రంగస్థలంపై పాడుతున్న పాపులర్ త్యాగరాయ కీర్తనలనే ఈ ‘కాళిదాస్’లోనూ ఆమెతో పాడించారు. పాటల పుస్తకంలోని ‘ఎంత రానీ...’ (హరికాంభోజి రాగం, దేశాది తాళం), ‘స్వరరాగ సుధారస...’ (శంకరాభరణ రాగం, ఆది తాళం) రెండు కీర్తనలే కాక ‘రామా నీయెడ ప్రేమ రహితులకు...’ (ఖరహరప్రియ రాగం, ఆది తాళం) అనే మూడో తెలుగు కీర్తన పాడిన సంగతి రాజలక్ష్మి అప్పట్లోనే చెప్పారు. వెండితెరపై వినిపించిన తొలి తెలుగు పాటలు ఇవే! అలా పూర్తి తెలుగు టాకీ ‘భక్త ప్రహ్లాద’ (1932) కన్నా ముందే తెరపై తెలుగు మాటలు, పాటలు వినిపించాయన్నది సత్యం.రీలు బాక్సుకు పూజలు, హారతులు‘కాళిదాస్’ 1931 అక్టోబర్ 31న మద్రాసులోని ‘కినిమా సెంట్రల్’లో రిలీజైంది. బొంబాయిలో తయారైన ఈ ‘కాళిదాస్’ ఫిల్ము రీళ్ళను తెచ్చినప్పుడు మద్రాస్ సెంట్రల్ రైల్వేస్టేషన్ నుంచి సినిమా హాలు దాకా వాల్‌ట్యాక్స్ రోడ్డులో జనం రీలు బాక్సు వెంట ఊరేగింపుగా నడిచారు. పూలు వెదజల్లారు. కొబ్బరికాయలు కొట్టారు. అగరువత్తులు, కర్పూరం వెలిగించారు. దాన్నిబట్టి, తెరపై స్థానిక భాషను వినిపించే టాకీ పట్ల ప్రజల్లో పెల్లుబికిన ఉత్సాహాన్ని అర్థం చేసుకోవచ్చు. సాంకేతికంగా సవాలక్ష లోపాలున్నా బొమ్మ బాక్సాఫీస్ హిట్. ‘కాళిదాస్’ తమిళులు అధికమైన సింగపూర్, మలేసియాలకూ వెళ్ళింది. స్థానిక తమిళుల్ని ఆకర్షించడం కోసం అక్కడ ‘కాళిదాస్’ను తమిళ సినిమాగానే పబ్లిసిటీ చేయడం గమనార్హం. తెలుగు తర్వాతే తమిళం! తొలి పూర్తి తమిళ టాకీ... ‘హరిశ్చంద్ర’! తెలుగు కథాచిత్రానికి... తమిళ పాటలు, కురత్తి డ్యాన్సులు పక్కన చేర్చి రిలీజ్ చేసిన ‘కాళిదాస్’ కదంబమాలిక విజయం దక్షిణాది సినీ చరిత్రలో కీలక పరిణామం. ఆ వెంటనే తెలుగులోనే పూర్తి నిడివి కథాకథన చిత్రమైన ‘భక్త ప్రహ్లాద’ టాకీ నిర్మాణానికి అది పురిగొల్పింది. ‘కాళిదాస్’ తీసిన హెచ్.ఎం. రెడ్డే దానికీ దర్శకుడు. పూర్తిగా తెలుగు మాటలు, పాటల ‘ప్రహ్లాద’ 1932 ఫిబ్రవరి 6న దేశంలోనే తొలిసారిగా రిలీజై, విజయవంతమైంది. ఈ పరిణామాలన్నీ అటుపైన పూర్తి నిడివి తమిళ టాకీ ‘హరిశ్చంద్ర’ (1932) రూపకల్పనకు దారితీశాయి. 1932 ఏప్రిల్ 9న పూర్తిగా తమిళ డైలాగులు, తమిళ పాటలతోనే రిలీజైన ‘హరిశ్చంద్ర’నే ఆ నాటి పత్రికలు ‘‘మొట్టమొదటి తమిళ టాకీ’’ అని పేర్కొన్నాయి (ఆధారం: ‘హిందూ’ డైలీ, 1932 ఏప్రిల్ 8). నిర్మాతలూ ‘హరిశ్చంద్ర’నే ‘‘తొలి పూర్తి నిడివి 100 శాతం తమిళ టాకీ’’ అని ప్రకటనల్లో అభివర్ణించారు. అలా ‘కాళిదాస్’ చిత్ర విజయాన్ని ప్రేరణగా తీసుకొనే... పూర్తి స్థాయి తెలుగు సినిమా, పూర్తి తమిళ సినిమా వచ్చాయి. తెరపై తొలిసారిగా పూర్తిగా తెలుగు డైలాగులతో, మన త్యాగరాయ కీర్తనలతో, తెలుగు హీరో, తెలుగు దర్శకుడితో తయారైన ‘కాళిదాస్’ను ఇప్పటికైనా మన సినిమాగా తెలుగు సినీచరిత్రలో తప్పనిసరిగా గుర్తించాలి. అది అవసరం. మనం చేతులారా వదిలేసుకుంటున్న మన తెలుగు వారి ఘన వారసత్వాన్ని మనమే నిలుపుకోవడం ముఖ్యం.(త్వరలో రానున్న దక్షిణాది సినీ చరిత్ర ‘మన సినిమా... ఫస్ట్ రీల్’ పుస్తకం ఆధారంగా)-రెంటాల జయదేవrjayadev@yahoo.com -
బిగ్‌బాస్ హౌస్‌లో బిగ్‌మ్యాన్.. ఫ్యాన్స్‌ను మెప్పిస్తాడా?
బిగ్‌బాస్ తమిళ్ సీజన్-8 అట్టహాసంగా ప్రారంభమైంది. ఈసారి కొత్త హోస్ట్ కంటెస్టెంట్స్ అందరినీ ఫ్యాన్స్‌కు పరిచయం చేశారు. గత ఏడు సీజన్స్ కమల్ హాసన్ హోస్ట్‌గా వ్యవహరించగా.. ఈ సారి కోలీవుడ్ స్టార్ విజయ్ సేతుపతి సరికొత్తగా కనిపించారు. హోస్ట్‌గా అందరితో నవ్వులు పూయించారు. అయితే ఈ సారి బిగ్‌బాస్ హౌస్‌లో తమిళ నిర్మాత, లిబ్రా ప్రొడక్షన్స్ అధినేత రవీందర్ చంద్రశేఖరన్ హౌస్‌లో అడుగుపెట్టారు. గతంలో నటి మహాలక్ష్మిని పెళ్లాడిన ఆయన పలుసార్లు వార్తల్లో నిలిచారు. వీరిద్దరి పెళ్లిపై సోషల్ మీడియాలో చాలా ట్రోల్స్ వచ్చాయి. డబ్బు కోసమే రవీందర్‌ను మహాలక్ష్మి పెళ్లి చేసుకుందంటూ ఆమెను నెటిజన్లు ట్రోల్ చేశారు. అంతేకాదు రవీందర్ భారీకాయం చూసి అతడిని బాడీ షేమింగ్ చేశారు నెటిజన్లు.గతంలో ఎక్కువగా వివాదాలతోనే ఫేమస్ అయిన రవీందర్ చంద్రశేఖరన్ తాజా తమిళ సీజన్లో బిగ్‌బాస్ హోస్లో అడుగుపెట్టారు. ఆదివారం ప్రారంభమైన ఈ షోలో మొత్తం 18 మంది కంటెస్టెంట్స్ హౌస్‌లోకి ఎంట్రీ ఇచ్చారు. ఈ ఏడాది కొత్త హోస్ట్ విజయ్ సేతుపతి రావడంతో తమిళ బిగ్‌బాస్ సీజన్‌పై మరింత ఆసక్తి పెరిగింది. #பிக்பாஸ் இல்லத்தில்.. #Fatman 😎 Bigg Boss Tamil Season 8 #GrandLaunch - இப்போது ஒளிபரப்பாகிறது.. நம்ம விஜய் டிவில.. #Nowshowing #BiggBossTamilSeason8 #TuneInNow #VijayTelevision #VJStheBBhost #VijaySethupathi #AalumPudhusuAattamumPudhusu #BiggBossTamil pic.twitter.com/LvYMbNhS1C— Vijay Television (@vijaytelevision) October 6, 2024 -
బిగ్‌బాస్ సీజన్-8.. కంటెస్టెంట్స్ వీళ్లేనా.. లిస్ట్ వైరల్!
టాలీవుడ్ బుల్లితెర ప్రేక్షకులను బిగ్‌బాస్ షో అలరిస్తోంది. ఈ షో ఇప్పటికే నాలుగు వారాలు పూర్తి చేసుకుంది. అయితే గతేడాది కంటే ఈసారి కాస్తా ఆడియన్స్‌కు ఇంట్రెస్ట్ తగ్గినట్లు కనిపిస్తోంది. అయితే ఇప్పటికే తెలుగు ప్రేక్షకులను అలరిస్తోన్న ఈ షో తమిళంలోనూ ఎంటర్టైన్ చేసేందుకు సిద్ధమైంది. తమిళ బిగ్ బాస్ ఎనిమిదో సీజన్‌కు విజయ్ సేతుపతి హోస్ట్‌గా వ్యవహరిస్తున్నారు. గతంలో కమల్ హాసన్ హోస్ట్‌గా ఉండగా.. బిజీ షెడ్యూల్ కారణంగా ఈసారి ఆయన తప్పుకున్నారు.ఈ నెల ఆరో తేదీ నుంచి తమిళ ఆడియన్స్‌ను అలరించేందుకు బిగ్‌బాస్ సీజన్-8 వచ్చేస్తోంది. ఈ ఆదివారం నుంచే విజయ్ టీవీ ప్రసారం కానుంది. విజయ్ టీవీలో రాత్రి 9.30 నుంచి 10.30 గంటల వరకు ప్రసారం ఈ షో ప్రసారం చేయనున్నారు. అంతేకాకుండా ప్రముఖ ఓటీటీ డిస్నీ ప్లస్ హాట్‌స్టార్‌లోనూ ఈ రియాలిటీ షోను చూడొచ్చు. కాగా.. ఇప్పటికే మేకర్స్ బిగ్‌బాస్ ప్రోమోను కూడా రిలీజ్ చేశారు.కంటెస్టెంట్స్ జాబితా వైరల్!బిగ్‌బాస్ తమిళ్ సీజన్-8లో కంటెస్టెంట్స్ గురించి పెద్దఎత్తున చర్చ నడుస్తోంది. ప్రముఖంగా నటుడు వీటీవీ గణేశ్ వినిపిస్తోంది. ఆయనతో పాటు సునీతా గొగోయ్, పాల్ డబ్బా అలియాస్ అనీష్, అన్షిత అక్బర్షా, కేఆర్ గోకుల్, ఐశ్వర్య, అరుణ్ ప్రసాద్, దార్శిక, సౌందర్య నంజుండన్, విజే విశాల్ పేర్లు టాప్-10లో ప్రధానంగా వినిపిస్తున్నాయి. తాజా నివేదిక ప్రకారం దాదాపు 16 మంది కంటెస్టెంట్లు బిగ్ బాస్ హౌస్‌లోకి ప్రవేశిస్తారని తెలుస్తోంది. ఆ తర్వాత మరో ముగ్గురు-నాలుగు వైల్డ్ కార్డ్ కంటెస్టెంట్లుగా ఎంట్రీ ఇవ్వనున్నారు.புது வீடு புது மனுசங்க, சண்ட போடுவாங்களா தெரியாது., ஆனா கண்டிப்பா சமாதானமா இருக்க மாட்டாங்க.. எதுவா இருந்தாலும் நான் Ready..🔥#GrandLaunch of Bigg Boss Tamil Season 8 - அக்டோபர் 6 முதல் மாலை 6 மணிக்கு நம்ம விஜய் டிவில.. 😎 #VJStheBBhost #Vijaysethupathi #BiggBossTamilSeason8 pic.twitter.com/gTjpbrL1x9— Vijay Television (@vijaytelevision) October 1, 2024 -
చదరంగం ఎత్తులే కాదు, డ్యాన్స్ స్టెప్పుల్లోనూ మనోడు తోపు, వైరల్ వీడియో
చెన్నైకి చెందిన ఇండియన్ చెస్ ప్లేయర్ దొమ్మరాజు గుకేశ్ స్టార్ ఆఫ్ ది సోషల్ మీడియాగా హల్ చల్ చేస్తున్నాడు. 17 ఏళ్ల వయసులోనే ఫిడే క్యాండిడేట్స్ టోర్నమెంట్ గెలిచి అత్యంత పిన్న వయసులోనే వరల్డ్ ఛాంపియన్షిప్ ఛాలెంజర్ గా నిలిచి చరిత్ర సృష్టించిన సంగతి తెలిసిందే. తాజాగా కుటుంబ సభ్యులతో కలిసి ఫ్యామస్ తమిళ సినిమా పాట స్టెప్పులతో అదర గొట్టాడు. మనసులాయో అంటూ దీనికి సంబంధించిన వీడియోను గుకేశ్ ఎక్స్‌లో పోస్ట్ చేశాడు. దీంతో ఇది వైరల్‌గా మారింది. చదరంగంలో ప్రత్యర్థులు తోకముడిచే స్టెప్పులే కాదు,అదిరే స్టెప్పులతో ఫ్యాన్స్‌ను మెస్మరైజ్ చేశాడు అంటున్నారు నెటిజన్లు. అంతేకాదు ‘‘యుద్ధంలో రాణి (చెస్‌లో క్వీన్ పాత్ర)ని ముందు పెట్టి ఎలా నెగ్గాలో తెలిసినవాడు, మొత్తానికి గుకేశ్ రెండో కోణాన్ని ఆవిష్కరించాడు’ అంటూ పలువురు వ్యాఖ్యానించారు. మరి మన ఆటగాడి స్టెప్పులేంటో మీరూ చూసేయండి. Manasilayo...with my family friends!Idhu epdi irukku 😎 pic.twitter.com/r2hkDWYiJE— Gukesh D (@DGukesh) September 29, 2024 -
తెలుగు హీరోలను మాయ చేస్తున్న కోలీవుడ్ డైరెక్టర్స్..
-
బిగ్‌బాస్ హోస్ట్‌గా ఆ స్టార్ హీరోనే.. !
బుల్లితెరపై అత్యంత ప్రేక్షాదరణ కలిగిన రియాలిటీ షోలల్లో బిగ్‌బాస్ రేంజ్ వేరు. ఏ భాషలోనైనా బిగ్‌బాస్‌కు ఉన్న పాపులారిటీ అంతా ఇంతా కాదు. మరికొద్ది రోజుల్లో ప్రారంభం కానున్న ఈ షోపై అప్పుడే చర్చ మొదలైంది. అసలు ఈ సీజన్లో ఎవరు హోస్ట్‌గా ఉండబోతున్నారన్న విషయంపై కోలీవుడ్‌లో గుసగుసలు వినిపిస్తూనే ఉన్నాయి. తమిళ బిగ్‌బాస్ హోస్ట్‌గా కమల్ హాసన్ తప్పుకోవడంతో ఎవరు వస్తారన్న ఆసక్తి ఆడియన్స్‌లో నెలకొంది.ఈ నేపథ్యంలోనే మరో కోలీవుడ్ స్టార్ హీరో వినిపిస్తోంది. ఉప్పెన సినిమాతో టాలీవుడ్ ప్రేక్షకులను మెప్పించిన విజయ్ సేతుపతి హోస్ట్‌గా వ్యవహరించనున్నట్లు తెలుస్తోంది. ఇటీవల ఈ లిస్ట్‌లో హీరో శింబు పేరు కూడా వినిపించింది. కానీ చివరికీ విజయ్ సేతుపతినే ఫైనల్ చేసినట్లు సమాచారం. దీనికి సంబంధించిన అధికారిక ప్రకటన ఇంకా రావాల్సి ఉంది.విజయ్ సేతుపతి ఎందుకంటే..తమిళ బిగ్‌బాస్ సీజన్-8కు విజయ్ సేతుపతిని ఎంపిక చేయాలన్న నిర్ణయానికి అదే ప్రధాన కారణమని తెలుస్తోంది. గతంలో ఆయన సన్ టీవీ ప్రముఖ షోలకు హోస్ట్‌గా వ్యవహరించారు. మాస్టర్ చెఫ్ షోతో పాటు మరో కార్యక్రమానికి ఆయన హోస్ట్‌గా వ్యవహరిస్తున్నారు. అందువల్ల రియాలిటీ షోకు హోస్ట్‌గా పనిచేయడం ఆయనకు కొత్తేమీ కాదు. అందుకే ఆ అనుభవం బిగ్‌బాస్‌కు పనికొస్తుందని మేకర్స్ భావిస్తున్నారు. కాగా.. బిగ్ బాస్ సీజన్- 8 అక్టోబర్ నెలలో ప్రారంభం కానుంది. త్వరలో కొత్త హోస్ట్‌తో ప్రోమోను మేకర్స్ రిలీజ్ చేయనున్నారు. కాగా.. బిజీ షెడ్యూల్ కారణంగా కమల్ హాసన్ ఈ షో నుంచి తప్పుకున్న సంగతి తెలిసిందే. -
తమిళ 'బిగ్‌బాస్'హోస్ట్ రేసులో ముగ్గురు స్టార్ హీరోలు
తమిళ 'బిగ్‌బాస్' రియాల్టీ షో కోసం కొత్త హోస్ట్ వచ్చేస్తున్నాడు. ఏడు సీజన్ల వరకు లోకనాయుడు కమల్ హాసన్ హోస్ట్‌గా సక్సెస్‌ఫుల్‌గా నడిపారు. కమల్ ఇమేజ్‌తో ఈ షో పట్ల కోలీవుడ్‌లో మంచి బజ్ ఉంది. అక్కడ రేటింగ్స్ కూడా బాగానే బిగ్ బాస్ రాబట్టాడు. మరో కొద్దిరోజుల్లో సీజన్ 8 ప్రారంభం కానుంది. ఇలాంటి సమయంలో కమల్ హాసన్ కీలక నిర్ణయం తీసుకున్నారు. వచ్చే సీజన్ నుంచి తాను హోస్ట్‌గా పనిచేయడంలేదని ప్రకటించారు. దీంతో కొత్తగా ఆ స్థానంలోకి ఎవరు వస్తారని బిగ్ బాస్ అభిమానులు ఎదురుచూస్తున్నారు.2017లో తమిళ్లో ప్రారంభమైన బిగ్ బాస్ తొలి సీజన్ నుంచి హోస్ట్‌గా కమల్ హాసన్ ఉన్నారు. అయితే, వచ్చే సీజన్లో తాను హోస్ట్‌గా కొనసాగడంలేదని చెప్పారు. తను ఒప్పుకున్న సినిమాలు ఎక్కువగా ఉండటంతో ఈ నిర్ణయం తీసుకున్నట్టు కమల్ వెల్లడించారు. కమల్ స్థానాన్ని భర్తి చేసేందుకు కోలీవుడ్ హీరో శింబు బిగ్ బాస్‌లోకి ఎంట్రీ ఇస్తున్నట్లు వార్తలు వస్తున్నాయి. 2022లో కమల్ హాసన్ తాత్కాలికంగా బిగ్ బాస్ నుంచి వైదొలిగినప్పుడు శింబు బిగ్ బాస్ అల్టిమేట్ షోను హోస్ట్ చేశాడు. ఇప్పుడు మళ్లీ బిగ్ బాస్ షోను హోస్ట్ చేసేందుకు శింబు రానున్నారని అభిమానులు కామెంట్లు చేస్తున్నారు. దీనిపై శింబు మేనేజర్ ఇలా తెలిపాారు. 'బిగ్ బాస్ షోకు నటుడు శింబు హోస్ట్ చేయబోతున్నాడన్న సమాచారంలో నిజం లేదని.. ఈ విషయమై తనను ఎవరూ సంప్రదించలేదని' ఆయన చెప్పారు. శింబు తర్వాత విజయ్ సేతుపతి, సూర్య పేర్లు ఆ లిస్ట్‌లో కనిపిస్తున్నాయి. సరికొత్తగా రమ్యకృష్ణ పేరును కూడా బిగ్ బాస్ యూనిట్ పరిశీలిస్తుందట. మరొ కొద్దిరోజుల్లో ఈ అంశంపై క్లారిటీ రానుంది. -
ప్లాస్టిక్ బాటిల్స్‌తో టీ షర్ట్స్..ఏకంగా రూ. 80 కోట్లు..!
ప్లాస్టిక్ బాటిల్స్‌తో టీ షర్ట్స్ తయారు చేయడం గురించి విన్నారా?. ఔను ఇది నిజం. ఎనిమిది పెట్ బాటిల్స్ ఉంటే ఒక టీ షర్ట్ రెడీ. ఇరవై-ముప్పై బాటిల్స్ ఉంటే జాకెట్, బ్లేజర్ సిద్ధం. ఎంత ఆశ్చర్యంగా ఉన్నప్పటికీ ఇదే నిజం. పైగా ఎకో లైన్ బ్రాండ్‌తో దుస్తులను మార్కెట్లోకి తీసుకొచ్చి లాభాలను ఆర్జించాడు. నేడు ఏకంగా ఎనభై కోట్ల టర్నోవర్‌గా కంపెనీగా మార్చాడు. అంతేగాదు పర్యావరణాన్ని సంరక్షిస్తూ కూడా కోట్లు గడించొచ్చని చాటి చెప్పాడు. అతడెవరంటే..చెన్నైలో పెట్టి పెరిగిన సెంథిల్ శంకర్ మెకానికల్ ఇంజనీర్. తండ్రి స్థాపించిన శ్రీరంగ పాలిమర్స్‌కి ఎం.డిగా బాధ్యతలు చేపట్టాడు. పాలియెస్టర్ రీసైకిల్ చేస్తున్న సమయంలో అతడికి వచ్చిన ఆలోచనే ఎకోలైన్ దుస్తులు. ఈ ఫ్యాషన్ బ్రాండ్ ఇప్పుడు ఆన్లైన్ మార్కెట్లో దూసుకుపోతోంది. ఇంతకీ బాటిల్స్‌తో చొక్కాలు ఎలా చేస్తారంటే... ఎలాగంటే..పెట్ బాటిల్స్‌కున్న మూతలు, రేపర్లు తొలగించిన తర్వాత క్రషింగ్ మెషీన్లో వేసి చిన్న ముక్కలు చేయాలి. ఆ ముక్కలను వేడి చేసి కరగబెట్టి ఫైబర్‌గా మార్చాలి. ఈ ఫైబర్ దారాలతో వస్త్రాన్ని రూపొందించాలి. క్లాత్‌తో మనకు కావల్సినట్లు టీ షర్ట్, జాకెట్, బ్లేజర్ వంటి రకరకాలుగా కుట్టుకోవడమే. వీటి ధర కూడా తక్కువే. ఐదు వందల నుంచి ఆరు వేల వరకు ఉంటుంది. అమెజాన్, ఫ్లిప్‌కార్ట్‌లోకి వెళ్లి ఎకోలైన్ అని సెర్చ్ చేయండి అంటున్నారు సెంథిల్.అయితే ఈ వస్త్రాన్ని రీసైకిల్ చేసిన పెట్ బాటిల్స్‌తో తయారు చేసినట్లు ప్రజలకు అర్థమయ్యేలా చేయడానికి తమకు చాలా సమయం పట్టిందన్నారు. దీని కోసం, కస్టమర్‌కు అవగాహన కల్పించడానికి వెబ్సైట్లో మొత్తం మేకింగ్ ప్రక్రియను వీడియో రూపంలో బహిర్గతం చేయల్సి వచ్చిందనిసెంథిల్ చెప్పారు. ఈ లోగా మిగతా కార్పొరేట్ కంపెనీలు పర్యావరణ అనుకూలంగా రూపొందుతున్న ఈ టీ షర్ట్‌లకు మద్దతు ఇవ్వడంతో అనూహ్యంగా కంపెనీ లాభాల బాట పట్టింది.ఇక ఈ ప్లాస్టిక్ బాటిల్స్ ప్రక్రియలో నీటిని ఆదా చేస్తారే గానీ వృధా కానియ్యరు. అలాగే వీళ్లు ఇందుకోసం బొగ్గును కూడా వినియోగించారు. చాలావరకు 90% సోలార్ ఎనర్జీపైనే ఆధారపడతారు. అంతేగాదు ఈ బాటిల్స్ వల్ల ఉత్పత్తి అయ్యే దాదాపు పదివేల టన్నులు కార్బన్డయాక్సైడ్ ఉద్గారాలను కూడా ఈ ప్రక్రియతో నిరోధించారు. అంతేకాదండోయ్ మనం ఈ ప్లాస్టిక్ దుస్తులను వాడి వాడి బోర్ కొట్టినట్లయితే..తిరిగి వాటిని ఈ కంపెనీకి ఇచ్చేయొచ్చు. వాటిని మళ్లీ రీసైకిల్ చేస్తుంది కూడా. అంతేగాదు ప్రధాని నరేంద్ర మోదీ సైతం ఈ ప్లాస్టిక్ బాటిల్స్‌తో తయారు చేసిన జాకెట్లను ధరించారు కూడా.ఇలా రూపొందించడానికి రీజన్..పర్యావరణ పరిరక్షణలో తన వంతు బాధ్యతగా ఈ ప్రక్రియకు నాంది పలికానని అన్నారు సెంథిల్ శంకర్. ప్రపంచవ్యాప్తంగా మనం వాడి పారేసిన ప్లాస్టిక్ బాటిళ్ల సంఖ్య నిమిషానికి మిలియన్ ఉంటున్నట్లు ఫోర్బ్స్ చెప్తోందన్నారు. ఒక బాటిల్ డీకంపోజ్ కావాలంటే నాలుగు వందల ఏళ్లు పడుతుందని, పైగా ఆ అవశేషాలు పల్లపు ప్రదేశాలకు కొట్టుకుపోతుంటాయని చెప్పారు. దీంతో ఇవన్నీ వర్షం కారణంగా కాలువలకు అడ్డుపడి వరదలకు కారణమవుతున్నాయని చెప్పుకొచ్చారు. ఈ నేపథ్యంలోనే తన వంతు బాధ్యతగా చెన్నైకి మూడు వందల కిలోమీటర్ల దూరంలో వేస్ట్‌గా పడి ఉన్న ప్లాస్టిక్ బాటిళ్లన్నింటిని సేకరిస్తున్నామని చెప్పారు. అంతేగాదు తమ ఫ్యాక్టరీలో రోజుకు 15 లక్షల బాటిళ్ల దాక రీసైకిల్ చేస్తున్నట్లు తెలిపారు. ఇక చివరిగా అందరూ పర్యావరణ సంరక్షణార్థం ఈ రీసైకిల్ ప్రక్రియలో పాలు పంచుకోండి అని పిలుపునిస్తున్నారు సెంథిల్ శంకర్.(చదవండి: నీట్ ఎగ్జామ్‌లో సత్తా చాటిన తండ్రి, కూతురు!..50 ఏళ్ల వయసులో..) -
సినీ ఇండస్ట్రీలో విషాదం.. ప్రముఖ సింగర్ కన్నుమూత!
సినీ ఇండస్ట్రీలో విషాదం నెలకొంది. ప్రముఖ తమిళ సింగర్ ఉమా రామనన్ కన్నుమూశారు. ప్రస్తుతం 69 ఏళ్ల వయసులో ఉన్న ఆమె అనారోగ్య కారణాలతోనే మృతి చెందినట్లు తెలుస్తోంది. దాదాపు మూడు దశాబ్దాలకు పైగా తన కెరీర్లో విజయవంతంగా రాణించారు. ఉమకు ఆమె భర్త ఏవీ రామనన్, కుమారుడు విఘ్నేశ్ రామనన్ ఉన్నారు.కాగా.. ఉమ 1977లో శ్రీ కృష్ణ లీల సినిమా కోసం ఎస్వీ వెంకట్రామన్ స్వరపరిచిన మోహనన్ కన్నన్ మురళి అనే పాటతో ఆమె ప్రయాణం ప్రారంభించింది. విజయలక్ష్మి వద్ద శాస్త్రీయ సంగీతంలో శిక్షణ పొందిన ఆమె ఏవీ రామమన్ను పెళ్లాడింది. ఆ తర్వాత ఇళయరాజా రచించిన పూంగతావే చొచ్చా తకవై పాట తమిళ చిత్ర పరిశ్రమలో ఆమెకు భారీ క్రేజ్‌ను తీసుకొచ్చింది. ఆమె శంకర్ గణేష్, టీ రాజేందర్, దేవా, ఎస్ఏ రాజ్‌కుమార్, మణి శర్మ, శ్రీకాంత్ దేవా, విద్యాసాగర్ వంటి సింగర్స్‌తో కలిసి పనిచేశారు. హిందీ చిత్రం ప్లేబాయ్ కోసం ఉమా ఒక పాట పాడారు. ఇళయారాజాతో కలిసి ఎక్కువగా పాటలు పాడారు. Woke up to the sad news of the death of my most fav singer,Uma Ramanan.Highly under-rated singer,she didn't get a fair share of her fame compared to her contemporaries.Every song of hers is a super hit,from 'Poongathave Thazthiravai...' Condolences to AV Ramanan sir. Om Shanthi!+ pic.twitter.com/5ahzsg9KYI— Ramesh रमेश ரமேஷ் (@Udumalai_Ramesh) May 2, 2024 -
డేనియల్ బాలాజీ హఠాన్మారణం: గుండెపోటు వస్తే అంతేనా..?
కోలీవుడ్ నటుడు డేనియల్ బాలాజీ (48) చిన్న వయసులోనే అకాల మరణం పొందారు. కుటుంభ సభ్యుల సమాచారం ప్రకారం..శుక్రవారం అర్థరాత్రి ఒక్కసారిగా తీవ్రమైన ఛాతినొప్పి రావడంతో అస్వస్థతకు గురయ్యారని, ఆస్పత్రికి తరలిస్తుండగా మార్గ మధ్యలోనే చనిపోయారని వెల్లడించారు. 50కి పైగా సినిమాల్లో నటించి మెప్పించిన ఆయన చిన్నవయసులోనే కానరాని లోకాలకు వెళ్లిపోవడ బాధకరం. అస్సలు గుండెపోటు వస్తే ఇక అంతేనా?..ప్రాణాలు కోల్పోవాల్సిందేనా? బయటపడలేమా అంటే.. చాలా ఘటనల్లో గుండెపోటు రావడం ఆస్పత్రికి తీసుకువెళ్లేలోపు చనిపోవడం జరగుతుంది. కానీ ఇలా గుండెపోటు వచ్చే ముందు కొన్ని సంకేతాలు వస్తాయట. వాటిని పట్టించుకోకపోవడంతోనే సమస్య తీవ్రమై ఆస్పత్రికి తరలించే వ్యవధి సరిపోక చనిపోవడం జరుగుతుందని వైద్యులు చెబుతున్నారు. ఎలాంటి వారికి వస్తుందంటే.. మధుమేహం, ఊబకాయం, ఒత్తిడి, రక్తపోటు వంటి సమ్యలున్న వారికి గుండె పోటు వచ్చే అవకాశం ఎక్కువని వైద్యులు చెబుతున్నారు. అలాగే కుటుంబ చరిత్రలో గుండె పోటు సంకేతాలు ఉంటే వారికి కూడా గుండె పోటు వచ్చే అవకాశం ఉంది. ముందుగా వచ్చే సంకేతాలు.. ఛాతి నొప్పి శ్వాస ఆడకపోవడం కుడి లేదా ఎడమ చేయి లాగడం ఛాతీ అసౌకర్యం ఆ నొప్పి 20 నిమిషాలకు పైనే ఉన్నా.. వికారం కష్టపడు, చేమాటోర్చు గుండెల్లో మంట అజీర్ణం లేదా కడుపు నొప్పి అలసట మరియు వాపు మైకము ఆ టైంలో ఏం చేయాలంటే.. ఈ సంకేతాలు కనిపించిన వెంటనే సార్బిట్రేట్(5 ఎంజీ నుంచి 10 ఎంజీ) ట్యాబ్లెట్‌ను నాలుక కింద పెట్టుకుని చప్పరించాలి. అయినా నొప్పి తగ్గకపోతే దాన్ని గుండె పోటుగా పరిగణించి వెంటనే వైద్య సాయం పొందడానికి చర్యలు తీసుకోవాలి. ఇలాంటి సమయంలో ఆస్పిరిన్ (300 ఎంజీ), క్లోపిడోగ్రిల్ (300 ఎంజీ), అటోర్వాస్టాటిన్( 80 ఎంజీ ) ట్యాబ్లెట్ తీసుకోవాలి. అప్పుడు ఈసీజీ కోసం ఆస్పత్రికి వెళ్లాలి. అయితే వీటిని పరిస్థితి క్రిటికల్ అనిపించినప్పుడే ఇవి వేసుకోవాలి. అలాగే వైద్యుని వెంటనే సంప్రదించి తాను ఏ ట్యాబ్లెట్ వేసుకున్నామో? వివరించాలి. ఇక్కడ ఇలాంటి లక్షణాలు కనిపించిన.. 30 నిమిషాలలోపు ఆస్పిరిన్ నమలడం వల్ల ప్లేట్లెట్ అభివృద్ధిని నిరోధిస్తుంది, అలాగే రక్తం గడ్డకట్టడాని ఆలస్యం చేస్తుంది. కొంతమంది రోగులు గుండె సంబంధిత సంఘటన కంటే రక్తపోటు అకస్మాత్తుగా పడిపోవడం వల్ల విపరీతమైన చెమట, మైకం వచ్చిందని చెబుతారు. అలాంటప్పుడూ రోగికి సార్బిట్రేట్ ట్యాబెలెట్ ఎట్టి పరిస్థితుల్లో ఇవ్వకూడదు. ఎందుకంటే..? ఇది బీపీను మరింత తగ్గిస్తుంది. ఈ విషయంపై పూర్తి అవగాహన ఉండి.. అవతలి వ్యక్తి పరిస్థితిని క్షణ్ణంగా తెలుసుకున్నాక ఇలాంటి ప్రథమ చికిత్సలను చేయాల్సి ఉంటుంది. ఇక్కడ ఈ ట్యాబ్లెట్లు వేసుకున్నాం కదా!.. గుండె నొప్పి తగ్గిందని వైద్యుని వద్దకు వెళ్లకుండా నిర్లక్ష్యంగా అస్సలు వ్యవహరించొద్దు. ఇది కేవలం అంబులెన్స్ లేదా ఆస్పత్రికి వెళ్లే సమయం వరకూ ప్రాణాలను కాపాడుకోవడానికే అనే విషయం గుర్తు పెట్టుకోవాలి. గోల్డెన్ అవర్‌లోపు తరలించాలి.. అంతేగాదు మెజారిటీ గుండెపోటు మరణాలు సమయానికి ఆస్పత్రికి చేరుకోకపోవడం వల్లనే జరుగుతున్నాయని నిపుణులు హెచ్చరిస్తున్నారు. గుండెపోటు వచ్చిన మొదటి గంటలోనే పేషెంట్‌ను ఆస్పత్రికి తీసుకెళ్తే ప్రాణాలతో బయట పడే ఛాన్స్ ఉందని అభిప్రాయపడుతున్నారు. చాలా కేసులలో బాధితులకు ఛాతిలో నొప్పి వచ్చిన కొన్ని గంటల తర్వాత ఆస్పత్రిలో చేరుతున్నారని.. అయితే అప్పటికే జరుగాల్సిన నష్టం జరుగుతుందని అంటున్నారు. ఎవరికైనా గుండెపోటు వచ్చిన గంటసేపటి వరకు కూడా శరీరానికి రక్తసరఫరా జరుగుతుందని.. ఇందులో మొదటి గంట తర్వాతనే రక్త ప్రసరణ ఆగిపోతుందని వైద్యులు అంటున్నారు. అందుకే గుండెపోటు వచ్చిన మొదటి గంటను గోల్డెన్ అవర్ లేదా గోల్డెన్ టైమ్ అని అంటారని తెలిపారు. ప్రతి ఒక్కరు ఈ గంట సమయంలోగా ఆసుపత్రిలో చేరాలని సూచిస్తున్నారు. (చదవండి: రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ఫాలో అయ్యే డైట్ ఇదే!) -
పెళ్లి పేరుతో శారీరకంగా!.. డైరెక్టర్‌పై స్టార్ హీరోయిన్ ఫిర్యాదు!
1997లో 'నాగమండలం' చిత్రంతో సినీ కెరీర్ ప్రారంభించిన నటి విజయలక్ష్మి. ఈ చిత్రంలో ప్రకాశ్ రాజ్‌కు జోడీగా నటించింది. మొదటి సినిమాతోనే ఫిల్మ్‌ఫేర్ ఉత్తమ నటి అవార్డును గెలుచుకుంది. ఆ తర్వాత జోడిహక్కి, భూమితై చొచ్చల మగా, అరుణోదయ, స్వస్తిక్, హబ్బా, సూర్యవంశం లాంటి కన్నడ సినిమాల్లో నటించారు. తెలుగులోనూ హనుమాన్ జంక్షన్, పృథ్వి నారాయణ చిత్రాల్లో కనిపించారు. ఆమె తమిళ చిత్ర పరిశ్రమలో చాలా చిత్రాలు చేశారు. మద్రాసులో జన్మించిన విజయలక్ష్మి కర్ణాటకలోని బెంగుళూరులో చదువుకుంది. తన కెరీర్లో దాదాపు 40 సినిమాల్లో నటించింది. తెలుగులోనూ హనుమాన్ జంక్షన్ సినిమాతో గుర్తింపు తెచ్చుకుంది. అంతే కాకుండా మోహన్‌లాల్‌తో కలిసి ఒక మలయాళ చిత్రం దేవదూతన్‌లో కూడా నటించింది. ఆత్మాహత్యాయత్నం 2006లో తండ్రి మరణంతో విజయలక్ష్మి నిద్రమాత్రలు వేసుకుని ఆత్మహత్యాయత్నానికి పాల్పడినట్లు అప్పట్లో వార్తలొచ్చాయి. అయితే మూడు సంవత్సరాల డేటింగ్ తర్వాత.. మార్చి 2007లో నటుడు సృజన్ లోకేష్‌తో ఎంగేజ్మెంట్ చేసుకుంది. అయితే ఊహించని సంఘటనలతో అతనితో నిశ్చితార్థం బ్రేకప్ అయింది. ఆ తర్వాత సినిమాలకే పరిమితమైన విజయలక్ష్మి గత కొన్నేళ్లుగా మళ్లీ వార్తల్లో నిలుస్తున్నారు. పెళ్లి పేరుతో మోసం తమిళనాడుకు చెందిన నామ్ తమిళర్ కట్చి పార్టీ అధినేత నటుడు, దర్శకుడు సీమాన్‌పై తీవ్ర ఆరోపణలు చేశారు. సీమాన్ తనను పెళ్లి చేసుకుంటానని మోసం చేశాడని ఆరోపిస్తూ ఫిబ్రవరి 2020లో పోలీసులకు ఫిర్యాదు చేసింది. అప్పట్లో అతని వేధింపులు తట్టుకోలేక 2020 జూలైలో మాత్రలు మింగిఆత్మహత్యకు ప్రయత్నించింది. అయితే ఇటీవలే ఆమె మరోసారి సీమాన్‌పై సంచలన ఆరోపణలు చేశారు. పెళ్లి పేరుతో నమ్మించి తనను శారీరకంగా వాడుకున్నారని విజయలక్ష్మి ఆరోపించింది. ప్రేమిస్తున్నట్లు నటించి 7 సార్లు బలవంతంగా అబార్షన్ చేయించాడని తెలిపింది. అంతే కాకుండా నా బంగారు నగలు తీసుకుని సీమాన్ మోసం చేశాడని వాపోయింది. తనకు న్యాయం చేయాలని కోరితే చంపేస్తానని బెదిరిస్తున్నారని ఇటీవల మరోసారి చెన్నై పోలీసులకు ఫిర్యాదు చేసింది. కేసు నమోదు చేసుకున్న పోలీసులు సీమాన్‌ను విచారణకు హాజరు కావాలని ఆదేశించారు. అయితే ఆయన విచారణకు హాజరుకాలేదు. మంగళవారం తప్పకుండా విచారణకు హాజరు కావాలని పోలీసులు మరోసారి హెచ్చరించారు. విజయలక్ష్మికి గైనకాలజిస్ట్ పరీక్ష విజయలక్ష్మి ఫిర్యాదుతో చెన్నై పోలీసులు పూర్తిస్థాయిలో దర్యాప్తు ప్రారంభించారు. సీమాన్‌ను విచారణకు ఆదేశించడమే కాకుండా.. విజయలక్ష్మికి వైద్య పరీక్షలు కూడా నిర్వహించారు. ఆమెకు 7 సార్లు గర్భస్రావం జరిగిందని ఆరోపణల నేపథ్యంలో గైనకాలజిస్టులతో వైద్య పరీక్షలు చేశారు. -
మా అమ్మానాన్న కూడా అడగలేదు!
‘మీ పెళ్లెప్పుడు’ అనే ప్రశ్న లైఫ్‌లో ఒక దశలో దాదాపు అందరికీ ఎదురవుతుంటుంది. సెలబ్రిటీలను అయితే ప్రతి ఇంటర్వ్యూలో, బయటికి వెళ్లినప్పుడు.. ఇలా తరచూ ఈ ప్రశ్న వెంటాడుతుంటుంది. ఇటీవల తమన్నాని ఓ అభిమాని, ‘‘పెళ్లెప్పుడు చేసుకుంటారు? తమిళ అబ్బాయిలెవరైనా నచ్చారా?’’ అని అడిగితే.. ‘‘ఇప్పటివరకూ మా అమ్మానాన్న కూడా అడగలేదు’’ అంటూ ఈ బ్యూటీ కాస్త అసహనంగా సమాధానం ఇచ్చారు. ఇక తమిళ అబ్బాయిలు ఎవరైనా నచ్చారా? అనే ప్రశ్నని ఉద్దేశించి ‘‘ప్రస్తుతం చాలా ఆనందంగా ఉన్నాను. నా జీవితం చాలా ఆనందంగా సాగుతోంది’’ అని పేర్కొన్నారామె. నెగటివిటీని ఎలా హ్యాండిల్ చేస్తారు? అనే ప్రశ్నకు – ‘‘విమర్శలు, ప్రశంసలు.. రెండూ వస్తుంటాయి. విమర్శలు వచ్చినప్పుడు ఎందుకు అలా అన్నారా? అని ఆలోచిస్తాను. అయితే విమర్శ, ప్రశంస.. ఏదైనా వారి వ్యక్తిగత అభి్ర΄ాయమే. అందుకని పెద్దగా పట్టించుకోను’’ అన్నారు తమన్నా. -
బిగ్ బాస్ చరిత్రలో ఇలాంటి పని చేసింది ఆమె మాత్రమే
బిగ్ బాస్ ద్వారా స్టార్స్ అయిన వారు చాలా మంది ఉన్నారు. ప్రతి భాషలోనూ, ప్రతి సీజన్లోనూ అలాంటి స్టార్లు ఉంటారు. వారిలో నటి ఓవియా ఒకరు. మలయాళీ అయిన ఓవియా తమిళ బిగ్ బాస్ మొదటి సీజన్‌తో అలరించింది. ఓవియాకు దక్కిన పాపులారిటీ తమిళంలో మరే బిగ్‌బాస్ స్టార్‌కి లేదన్నది నిజం. అప్పట్లో ఓవియా కోసం చాలా ఆర్మీ గ్రూపులు ఏర్పడ్డాయి. ఆ ఇమేజ్ ద్వారా తమిళ, మలయాళంలో అమెకు పలు సినిమా అవకాశాలు కూడా దక్కాయి. ఇప్పటి వరకు సుమారు 25 సినిమాలకు పైగా నటించిన ఈ బ్యూటీ తెలుగులో మాత్రం 'ఇది నా లవ్ స్టోరీ' అనే మూవీలో మాత్రమే మెరిసింది. (ఇదీ చదవండి: బస్ డిపోలో రజనీకాంత్ సందడి.. ఫోటోలు వైరల్) తమిళ బిగ్‌బాస్ చరిత్రలో ఓవియా ఒక సంచలనమే అని చెప్పాలి. ఆ షోలో ఆమె ఆత్మహత్యకు పాల్పడటం పెద్ద దుమారమే రేగింది. ఇలా బిగ్‌బాస్ చరిత్రలో జరగడం ఇదే తొలిసారి. దాంతో ఓవియా తమిళంలో సంచలనంగా మారింది. ఆ అలజడి కొద్దిరోజుల్లోనే ముగిసినా ఆమెకు ఎన్నో గొప్ప అవకాశాలు వచ్చాయి. ప్రస్తుతం ఆమె చూయిగం అనే వెబ్ సిరీస్‌తో బిజీగా ఉంది. ఈ సీరిస్ ప్రమోషన్లో భాగంగా ఇచ్చిన ఇంటర్వ్యూలో ఓవియా వివాహం గురించి పలు వ్యాఖ్యలు చేసింది. (ఇదీ చదవండి: డ్రగ్స్ కేసులో వరలక్ష్మి శరత్‌కుమార్‌కు నోటీసులు) గతంలో ఓవియా పెళ్లిపై చాలా గాసిప్స్ వచ్చాయి. ఓవియా లెస్బియన్ కాబట్టి పెళ్లి చేసుకోలేదని ఒకప్పుడు ప్రచారం జరిగింది. దీన్ని ఓవియా తాజాగ ఖండించింది. 'నేను లెస్బియన్‌ని కాదు. నాకు అలాంటి ఫీలింగ్స్ ఏమీ లేవు. అంతే కాకుండా ఇప్పుడు పెళ్లి గురించి నేను ఆలోచించడం లేదు. ఇప్పుడే కాదు, నా జీవితంలో ఇలాంటివి జరుగుతాయో లేదో కూడా తెలియదు. జీవితంలో పెళ్లి అనేది తప్పనిసరి అని నేనెప్పుడూ భావించలేదు. అందరూ అనుకుంటున్నట్లు నేను ఏ బిడ్డకు జన్మనివ్వలేదు. నేను ఇప్పటికీ ఒంటరిగానే ఉన్నాను. పెళ్లయ్యాక బిడ్డను కనాలనే ఆలోచన కూడా నాకు లేదు. పెళ్లయ్యాక ఒత్తిడిలో ఉండి జీవితాన్ని నాశనం చేసుకునే వారు చాలా మంది ఉన్నారు. నేను అలా ఉండాలనుకోను. నేను నా కోసమే జీవిస్తున్నాను' అని ఓవియా తెలిపింది. View this post on Instagram A post shared by Oviya (@happyovi) -
నో డౌట్.. ఈ కామన్ మహిళ బిగ్‌బాస్‌లోకి ఎంట్రీ ఖాయం
కోలీవుడ్ బిగ్‌బాస్-7లోకి కోయంబత్తూరుకు చెందిన షర్మిల ఎంట్రీ దాదాపు ఖాయంగానే కనిపిస్తుంది. ఆమె షోలో పాల్గొనాలని తమళనాట సోషల్ మీడియాలో బాగా ట్రెండ్ అవుతుంది. ఆమె కామన్ ఉమెన్ అయినా ఈ మధ్య సోషల్‌మీడియాలో వెరీ పాపులర్ అయింది. అంతే కాకుండా ఆమెకు కమల్ హాసన్ మద్ధతు కూడా ఉందని బహిరంగంగానే చెప్పవచ్చు. అక్కడ కూడా ఈ షో ఆగష్టు నెలలోనే ప్రారంభం కానుంది. షర్మిల ఎవరంటే.. తమిళనాడులోని కోయంబత్తూరు నగర ప్రైవేటు బస్సులో తొలి మహిళా డ్రైవర్‌గా అందరి మన్ననలను ఎం షర్మిల(24) పొందింది. కానీ ఆమె నడిపిన బస్సులో తమిళనాడు ఎంపీ కనిమొళి ప్రయాణం చేసిన కొన్ని గంటల్లోనే ఆ బస్సు డ్రైవర్ ఉద్యోగాన్ని షర్మిల కోల్పోవాల్సి వచ్చింది. ఉద్యోగంలో ఉన్నప్పుడే షర్మిల బాగా సెలబ్రటీ అయ్యారు. ఓ యువతిగా ఆమె బస్సు నడిపే విధానం సామాజిక మాధ్యమాలలో, మీడియాలో వైరల్ అయ్యాయి. దీంతో తమకు షర్మిల ఆదర్శం అంటూ అనేక మంది యువతులు సోషల్ మీడియాలో ఓపెన్‌గానే కామెంట్లు చేశారు. దీంతో ఒకరోజు ఆమె నడుపుతున్న బస్సులో ఎంపీ కనిమొళి ప్రయాణం చేశారు. దీంతో ఒక్కసారి అమె మరింత పాపులర్ అయింది. (ఇదీ చదవండి: అల్లు అర్జున్‌పై మారుతి ట్వీట్.. ఏకిపారేస్తున్న ప్రభాస్ ఫ్యాన్స్) బస్సు కండెక్టర్ వల్ల జాబ్ పోయింది షర్మిల కోసం ఎంపీ కనిమొళి రావడంతో అదే బస్సులో ఉన్న కండక్టర్‌కు నచ్చలేదు. దీంతో ఆమె ఎంపీ అనుచరులతో దురుసుగా ప్రవర్తించింది. దీంతో కండెక్టర్‌ను షర్మిల వారించింది. అయితే, ఆ కండక్టర్ మరింత దూకుడుగా వ్యవహరించడంతో తదుపరి స్టాప్‌లో కనిమొళితో పాటుగా మిగిలిన వారు బస్సు దిగి వెళ్లిపోయారు.అయితే.. ఆ తర్వాత ఏమి జరిగిందో ఏమోగానీ మరో స్టాప్‌లో బస్సును ఆపేసి షర్మిల దిగి వెళ్లిపోయింది. పబ్లిసిటీ కోసం వెంపర్లాడుతున్నానని తన యజమాని ఆగ్రహం వ్యక్తం చేసినట్టు ఆమె ఓ వీడియోలో తర్వాత చెప్పుకొచ్చింది. ఎంపీ కనిమొళి పట్ల తనతో బస్సులో ఉన్న మహిళా కండక్టర్ ప్రవర్తన సరిగా లేదని ఆమె ఆవేదన వ్యక్తం చేసింది. తాను ఇక ఆ బస్సు నడపనని షర్మిల స్పష్టం చేసింది. షర్మిలకు కమల్ సాయం వివాదంలో చిక్కుకొని ఉద్యోగం కోల్పోయిన డ్రైవర్ షర్మిలకు కారును గిఫ్ట్‌గా ఇచ్చి కమల్ హాసన్ అందరినీ ఆశ్యర్యపరిచారు. ఆమెను తన కార్యాలయానికి పిలిపించుకొని ‘కమల్ కల్చరల్ సెంటర్’ ద్వారా కారును బహుమతిగా అందించారు. ఇప్పటివరకు ఉద్యోగిగా ఉన్న ఆమె.. ఇకపై ఎంతో మందికి ఉపాధి కల్పించే విధంగా ఎదగాలని ఆకాంక్షించారు. ఇప్పుడు తాజాగా ఆమెకు బిగ్‌బాస్ ఎంట్రీ దాదాపు ఖాయం అని ప్రచారం జరుగుతుంది. షో ఎంట్రీ వరకు కమల్ నుంచి కచ్చితంగా సాయం అందుతుందని తెలుస్తోంది. (ఇదీ చదవండి: సూర్య 'కంగువ' ఫస్ట్ గ్లింప్స్ రిలీజ్) -
MS Dhoni And Sakshi Latest Photos: ఎల్జీఎం మూవీ ఆడియో, ట్రైలర్‌ను లాంచ్ చేసిన ధోనీ (ఫోటోలు)
-
బాసర IIIT ఘటన పై గవర్నర్ తమిళ సై ఆవేదన..!
-
Adipurush: అక్కడ టికెట్లు కొనేవారే లేరు.. షాక్‌లో ఫ్యాన్స్
ప్రపంచ వ్యాప్తంగా ఎక్కడ చూసినా 'ఆదిపురుష్' మానియానే కనిపిస్తుంది. ప్రభాస్-కృతిసనన్ నటించిన ఈ సినిమా (జూన్ 16) శుక్రవారం ప్రపంచవ్యాప్తంగా విడుదల కానుంది. ఈ నేపథ్యంలో పలు రాష్ట్రాల్లో మూడురోజుల వరకు అడ్వాన్స్ బుకింగ్స్ కూడా పూర్తి అయ్యాయి. ఆన్లైన్ బుకింగ్ పోర్టల్ వేదికగా సినీ ప్రియులు టికెట్లు బుక్ చేసుకుంటున్నారు. ఇప్పటి వరకు 3 లక్షలకు పైగా టిక్కెట్లు అమ్ముడుపోయినట్లు సమాచారం. కానీ అమెరికాలో 'ఆదిపురుష్' తమిళ వెర్షన్ కోసం కేవలం 24 టిక్కెట్లు మాత్రమే అమ్ముడు పోయాయని సమాచారం. యూఎస్‌లో 255 థియేటర్లలో మొత్తం 1009 షోలు మొదటిరోజు ప్రదర్శించబడుతున్నట్లు మేకర్స్ తెలిపారు. (ఇదీ చదవండి: నన్ను, నా బిడ్డను చంపేస్తాడు.. కాపాడండి సీఎం గారు: నటి) ఇందులో తెలుగు 552షోలు, హిందీ 436 షోలు ఉన్నాయి. వీటికి సంబంధించిన మొదటిరోజు టికెట్లు అన్నీ బుక్ అయ్యాయి. కానీ తమిళ్ వర్షన్‌కు 21 షోలకు గాను కేవలం 24 టిక్కెట్లు మాత్రమే అమ్ముడుపోయినట్లు సమాచారం. దీంతో ప్రభాస్ ఫ్యాన్స్ షాక్ అవుతున్నారట. ఈ టిక్కెట్ల విక్రయానికి సంబంధించిన సమాచారం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. తమిళనాడులో కూడా 'ఆదిపురుష్'కు చెప్పుకోదగ్గ స్థాయిలో స్క్రీన్లు కేటాయించలేదు. అందుబాటులో ఉన్న షోలకు కూడా రెస్పాన్స్ ఆశించిన స్థాయిలో లేదు. అక్కడ హిందీ, తెలుగు వెర్షన్లకు ఎటు చూసినా సోల్డ్ ఔట్ మెసేజ్‌లే కనిపిస్తుంటే.. తమిళ వెర్షన్ 20 శాతం టికెట్లు కూడా అమ్ముడవని పరిస్థితి. దీనిని బట్టి వారు సినిమాను వ్యతిరేకిస్తున్నారా? అన్నట్లు ఉంది. ఢిల్లీలో 'ఆదిపురుష్' రేంజ్ మామూలగా లేదు ఢిల్లీలోని పీవీఆర్ డైరెక్టర్స్ కట్ యాంబియెన్స్ మాల్లో 'ఆదిపురుష్' టికెట్ ధర చూసి అక్కడి వారందరూ అవాక్కవుతున్నారు. అక్కడ ఒక్కో టికెట్ ధర రూ.2200. అక్కడి థియేటర్లో 9.15pm షోకి 'ఆదిపురుష్' (హిందీ) 2D వెర్షన్ చూడాలంటే రూ.2000, చెల్లించాల్సి ఉంది. ఇదే థియేటర్లో 7pm షోకి 3D వెర్షన్ టికెట్ ధర రూ.2250 ఉంది. అంతే కాకుండా బాలీవుడ్లో మొదటిరోజు టిక్కెట్లన్ని సోల్డ్ ఔట్ అయ్యాయి. దీంతో ప్రభాస్ క్రేజ్ ఏ రేంజ్లో ఉందో దీనినిబట్టే తెలుస్తోందని ఫ్యాన్స్ అంటున్నారు. (ఇదీ చదవండి: సినిమా రంగంలోనే డ్రగ్స్ ఎందుకు?) -
తన భర్త నుంచి కాపాడాలంటూ సీఎం స్టాలిన్‌ని కోరిన నటి
కోలీవుడ్‌లో ప్రముఖ బుల్లితెర నటి దివ్య.. తన భర్త అర్ణవ్ నుంచి కాపాడాలంటూ తమిళనాడు ముఖ్యమంత్రి స్టాలిన్‌ను అభ్యర్థించింది. అక్కడ ప్రసారం అయ్యే 'సెవ్వంతి' సీరియల్‌తో నటి దివ్య ఫేమస్ అయింది. గతేడాది బుల్లితెర నటుడు అయిన అర్ణవ్‌ను ప్రేమించి పెళ్లి చేసుకుంది. గర్భందాల్చిన సమయంలో తన కడుపుపై అర్ణవ్ తన్నాడని, మానసికంగా హింసించాడని పోలీసులకు ఫిర్యాదు చేసింది. దీంతో అతన్ని పోలీసులు అరెస్ట్ చేశారు. అనంతరం అర్ణవ్ బెయిల్‌పై విడుదల అయ్యాడు. మరో ఇద్దరు మహిళలను ఆర్నవ్ మోసం చేశాడు? అర్ణవ్ ఇద్దరు మహిళలను మోసం చేశాడంటూ దివ్య ఆడియో విడుదల చేసింది. వారిద్దరిని కూడా పెళ్లి చేసుకుంటానని నమ్మించి మోసం చేశాడని తెలిపింది. బెయిల్‌పై విడుదల అయిన అర్ణవ్ తన మనుషులు, లాయర్లతో వచ్చి గొడవ పడ్డాడని దివ్య సంచలన ఆరోపణ చేసింది. అర్దరాత్రి ఒక్కసారిగా 15 మందితో తన ఇంటి తలుపు తట్టాడని తెలిపింది. వారందరూ తనను తోసుకుంటూ ఇంట్లోకి చొరబడ్డారని చెప్పుకొచ్చింది. (ఇదీ చదవండి: సినిమా రంగంలోనే డ్రగ్స్ ఎందుకు?) అతను బెయిల్‌పై ఉన్నాడు ముఖ్యమంత్రి స్టాలిన్‌కు ఆమె ఇలా ఫిర్యాదు చేసింది. 'ప్రస్తుతం అర్ణవ్ షరతులతో కూడిన బెయిల్‌పై ఉన్నాడు. ఈ సమయంలో అతను నా ఇంటికి రాకూడదు. నన్ను బెదిరించి, నా పాపను చంపడానికి ప్రయత్నించాడు. నేను ఎక్కడికి వెళ్తున్నానో అతనికి అన్నీ తెలుసు.. అందుకోసం ఒక వ్యక్తిని గూఢచారిగా పెట్టుకున్నాడు. ఎప్పటికైనా నన్ను చంపేస్తాడు. నా ఇంట్లో ఇద్దరు వృద్ధులు కూడా ఉన్నారు. అలాంటి పరిస్థితుల్లో అతను మా ఇంటికి వచ్చి బెదిరించాడు. పోలీసులకు ఫిర్యాదు చేసినా ఫలితం లేకుండా పోతుంది. ఆయనపై చర్యలు తీసుకునేలా చూడాలని ముఖ్యమంత్రిని కోరుతున్నాను’ అని దివ్య కన్నీరు పెట్టుకుంది. (ఇదీ చదవండి: Drugs Case: కేపీ చౌదరి ఫోన్ లిస్ట్‌లో సినీ ప్రముఖల లిస్ట్) -
Saurashtra Tamil Sangamam: అడ్డంకులున్నా ముందడుగే..
సోమనాథ్: మన దేశం వైవిధ్యానికి మారుపేరు అని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ చెప్పారు. విశ్వాసం నుంచి ఆధ్యాత్మిక దాకా.. అన్ని చోట్లా వైవిధ్యం ఉందని తెలిపారు. దేశంలో వేర్వేరు భాషలు, యాసలు, కళలు ఉన్నాయని గుర్తుచేశారు. ఈ వైవిధ్యం మనల్ని విడదీయడం లేదని, మన మధ్య అనుబంధాన్ని, సంబంధాలను మరింత బలోపేతం చేస్తోందని హర్షం వ్యక్తం చేశారు. బుధవారం ‘సౌరాష్ట్ర–తమిళ సంగమం’ వేడుక ముగింపు కార్యక్రమంలో ప్రధాని మోదీ వర్చువల్‌గా ప్రసంగించారు. అత్యంత ప్రతికూల పరిస్థితుల్లోనూ ఏదైనా కొత్త విజయం సాధించే శక్తి సామర్థ్యాలు మన దేశానికి ఉన్నాయని ఉద్ఘాటించారు. 2047 నాటికి భారత్‌ను అభివృద్ధి చెందిన దేశంగా తీర్చిదిద్దుకోవాలన్నదే మన ఆశయమని వివరించారు. ఈ లక్ష్య సాధనలో ఎన్నో అడ్డంకులు ఉన్నాయని, మనల్ని అటంకపరిచే శక్తులకు కొదవలేదని చెప్పారు. అయినప్పటికీ లక్ష్యాన్ని చేరుకోవడం తథ్యమని స్పష్టం చేశారు. స్వాతంత్య్రం వచ్చి 7 దశాబ్దాలు పూర్తయినా దేశంలో ఇంకా బానిస మనస్తత్వం ఇంకా కొనసాగుతుండడం ఒక సవాలేనని అన్నారు. బానిస మనస్తత్వం నుంచి మనకి మనమే విముక్తి పొందాలని, అప్పుడు మనల్ని మనం చక్కగా అర్థం చేసుకోగలమని, మన ఘనమైన వారసత్వాన్ని ముందుకు తీసుకెళ్లగమని ఉద్బోధించారు. అన్ని అడ్డంకులను అధిగమించి, మనమంతా కలిసి దేశాన్ని ముందుకు తీసుకెళ్దామని పిలుపునిచ్చారు. ఆరోగ్య సమస్యలను సరిహద్దులు ఆపలేవు న్యూఢిల్లీ: ఆరోగ్య రంగంలో మన ముందున్న సవాళ్లను దీటుగా ఎదిరించడానికి ప్రపంచ దేశాలన్నీ కలిసికట్టుగా పనిచేయాలని మ్రోదీ పిలుపునిచ్చారు. ‘వన్ ఎర్త్, వన్ హెల్త్–అడ్వాంటేజ్ హెల్త్‌కేర్ ఇండియా 2023’ సదస్సులో ఆయన వర్చువల్‌గా ప్రసంగించారు. ఆరోగ్య సంరక్షణ విషయంలో సమీకృత కృషిపై ప్రత్యేకంగా దృష్టి సారించామని చెప్పారు. మెరుగైన, చౌకైన వైద్య సేవలు అందరికీ అందాలన్నారు. -
తమిళంలో మాట్లాడాలన్న ఏఆర్ రెహమాన్.. నెటిజన్స్ ఫైర్!
ఏఆర్ రెహమాన్.. ఆయన పేరే ఒక బ్రాండ్. సుమారు 30 ఏళ్ల క్రితం సంగీత దర్శకుడిగా పరిచయమై ప్రపంచస్థాయిలో తన సత్తా చాటారు. ఒకేసారి రెండు ఆస్కార్ అవార్డులను సాధించిన ఘనత రెహమాన్‌కే సొంతం. దేశంలోనే గొప్ప సంగీత దర్శకుడిగా ఎదిగారు. తమిళం, తెలుగు, హిందీ, ఆంగ్లం సహా అనేక భాషల్లో ఆయన బాణీలు అందించారు. ఇప్పటికీ ఏఆర్ రెహమాన్ సంగీతాన్ని అందిస్తున్నారంటే ఆ చిత్రం కచ్చితంగా మ్యూజికల్ హిట్ అనే నమ్మకం ప్రేక్షకుల్లో ఉంటుంది. ఇటీవల ఈయన సంగీతాన్ని అందించిన పొన్నియిన్ సెల్వన్, వెందు తనిందది కాడు చిత్రాలు సంచలన విజయాన్ని అందుకున్నాయి. (ఇది చదవండి: సమంత డై హార్డ్ ఫ్యాన్.. ఏకంగా ఇంట్లోనే గుడి కట్టేస్తున్నాడు!) అయితే ఇటీవల చెన్నైలో జరిగిన ఆనంద వికటన్ సినిమా అవార్డ్స్- 2022 అవార్డ్ ఫంక్షన్‌కు తన భార్య సైరా భానుతో కలిసి ఆయన హాజరయ్యారు. అయితే ఈ వేడుకలో రెహమాన్ చేసిన పనికి నెటిజన్స్ ఫైర్ అవుతున్నారు. ఎందుకంటే తన భార్య సైరా భానును హిందీలో కాకుండా తమిళంలో మాట్లాడాలని రెహమాన్ సరదాగా కోరాడు. (ఇది చదవండి: ఏఆర్ రెహమాన్ భార్యను ఎప్పుడైనా చూశారా?) అయితే ఆమె తనకు తమిళం సరిగా రాదని.. సారీ చెబుతూ ఇంగ్లీష్‌లో మాట్లాడింది. నాకు రెహమాన్ వాయిస్ అంటే ఇష్టం. అది చూసే ప్రేమలో పడ్డాను' అంటూ మాట్లాడింది. అయితే తమిళంలో మాట్లాడాలంటూ తన భార్యకు రెహమాన్ చెప్పడంపై నెటిజన్స్ మండిపడుతున్నారు. కొందరేమో హిందీ భాషలోనే పాటలు పాడి సంపాదిస్తున్నావ్.. తమిళంలో మాట్లాడమని చెబుతావా అంటూ రెహమాన్‌ను తప్పుబడుతున్నారు. మరికొందరేమో హీందీ భాష దేశవ్యాప్తంగా మాట్లాడుతారని.. తమిళంలో కూడా హిందీ సాంగ్స్ ఫేమస్ అని చెప్పారు. ఏ భాషలో మాట్లాడాలనేది వారి వ్యక్తిగత అంశమని మరికొందరు మద్దతు తెలుపుతున్నారు. ఏదేమైనా భారతదేశంలో అన్ని భాషలు సమానమేనని కొందరు నెటిజన్స్ కామెంట్స్ చేశారు. கேப்புல பெர்பாமென்ஸ் பண்ணிடாப்ள பெரிய பாய் ஹிந்தில பேசாதீங்க தமிழ்ல பேசுங்க ப்ளீஸ் 😁 pic.twitter.com/Mji93XjjID — black cat (@Cat__offi) April 25, 2023 -
తెలుగు డైరెక్టర్స్ కి తమిళ హీరోలు ఎందుకు క్యూ కడుతున్నారో తెలుసా ..?
-
జీవితగా వస్తున్న రాధికా శరత్ కుమార్..
రక్షిత్ అట్లూరి హీరోగా, సంకీర్తనా విపిన్ హీరోయిన్గా నటించిన చిత్రం ‘ఆపరేషన్ రావణ్’. వెంకట సత్య దర్శకత్వంలో ధ్యాన్ అట్లూరి నిర్మించిన ఈ సినిమా నిర్మాణానంతర పనులు జరుపుకుంటోంది. ఈ చిత్రంలో జీవితపాత్ర చేస్తున్న రాధికా శరత్‌కుమార్ లుక్‌ని విడుదల చేశారు. ‘‘స్వాతిముత్యం, స్వాతి కిరణం’ లాంటి ప్రజాదరణ పొందిన చిత్రాల తర్వాత ‘ఆపరేషన్ రావణ్’లో నటనకి ప్రాధాన్యం ఉన్న జీవితపాత్ర చేశాను. తెలుగుతోపాటు తమిళంలో ఏక కాలంలో విడుదల కానున్న ఈ చిత్రంలో నటించడం సంతోషంగా ఉంది’’ అన్నారు రాధిక. -
పంచెకట్టులో మోదీ.. కాశీ తమిళ సంగమాన్ని ప్రారంభించిన ప్రధాని
వారణాసి: ఉత్తరప్రదేశ్‌లోని వారణాసిలో కాశీ-తమిళ సంగమాన్ని ప్రధాని నరేంద్ర మోదీ శనివారం ప్రారంభించారు. తమిళనాడు బీజేపీ చీఫ్ కె. అన్నామలై, సంగీత దర్శకుడు ఇళయరాజా కూడా ఈ ప్రారంభోత్సవంలో పాల్గొన్నారు. కాశీలో నేటి నుంచి నెల రోజులపాటు ఈ ఉత్సవాలు జరగనున్నాయి. ఉత్తర, దక్షిణ ప్రాంతాల మధ్య ఉన్న పురాతన సంస్కృతి, శతాబ్ధాల జ్ఞానాన్ని పంచుకునే లక్ష్యంతో కాశీ-తమిళ సంగమం కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు. దీనిని కేంద్ర ప్రభుత్వంతో కలిసి యూపీ సర్కార్ భారీ ఎత్తున నిర్వహిస్తోంది. ఈ కార్యక్రమలో ప్రధాని మోదీ ప్రత్యేక ఆకర్షణగా నిలిచారు. తమిళ సంప్రదాయమైన పంచెకట్టులో సమావేశానికి హాజరయ్యారు. అక్కడికి వచ్చిన వారిని మోదీ ప్రత్యేకంగా పలకరించారు. ఈ మేరకు ప్రధాని మాట్లాడుతూ.. ‘సంగమం’ భారతదేశ విభిన్న సంస్కృతుల వేడుక అని అన్నారు. మన దేశంలోని నదుల సంగమం, జ్ఞానం, ఆలోచనల్లో ఇది కీలక పాత్ర పోషిస్తుందన్నారు. కాశీ-తమిళనాడు సంగమం, గంగా యమునా సంగమం లాగే పవిత్రమైనదని తెలిపారు. కాశీ.. భారత దేశానికి ఆధ్యాత్మిక, సాంస్కృతిక రాజధాని అయితే తమిళనాడు.. దేశ పురాతన చరిత్రను కలిగి ఉందని వ్యాఖ్యినించారు. చదవండి: బుల్డోజర్లతో కూల్చివేతలు.. కథలేమైనా ఉంటే ఆ డైరెక్టర్‌కి చెప్పండి.. సినిమా తీస్తారు! ఇక కాశీలో 30 రోజుల పాటు తమిళనాడుకు చెందిన ద్రవిడ సంస్కృతి, సంప్రదాయాల గురించి వివిధ కార్యక్రమాలను నిర్వహించనున్నారు. ఈ సంగమంలో తమిళ విద్యార్థులు, రచయితలు, పండితులు, పారిశ్రామికవేత్తలు, ఇతర పార్టీల నేతలు కూడా పాల్గొంటున్నారు. తమిళనాడు నుంచి కాశీ వచ్చిన వారికి ప్రత్యేక ఏర్పాట్లు చేశారు. తమిళ వంటకాలు యూపీ ప్రజలకు పరిచయం చేయనున్నారు. తమిళ సంగీతం కాశీలో మారుమోగనుంది. కాశీ తమిళ సంగమం కోసం రామేశ్వరం నుంచి ప్రత్యేక రైలులో 216 మంది ఇవాళ వారణాసి చేరుకున్నారు. ఈవెంట్లో పాల్గొనేందుకు సుమారు మూడు వేల మంది తమిళనాడు భక్తులు 12 బృందాలుగా కాశీ చేరుకోనున్నారు. In Varanasi, addressing the 'Kashi-Tamil Sangamam.' It is a wonderful confluence of India's culture and heritage. https://t.co/ZX3WRhrxm9 — Narendra Modi (@narendramodi) November 19, 2022 -
వైరల్ ప్రధాని మెచ్చారు!
జాతీయోద్యమ కాలంలో పాట చూపించిన ప్రభావం తక్కువేమీ కాదు. ఊరూరు తిరిగింది... ఉర్రూతలూగించింది. అణువణువులో దేశభక్తి నింపుకొని కదం తొక్కింది.... పాట బలమైన ఆయుధం అయింది. అలాంటి తమిళ దేశభక్తి గీతం ఒకటి ఇప్పుడు సామాజిక వేదికలలో వైరల్ అయింది. ‘అద్భుతం’ అనిపించిన ఆ పాటను ఆలపించింది తమిళులు కాదు... అరుణాచల్‌ప్రదేశ్‌కు చెందిన అక్కాచెల్లెళ్లు... అశప్‌మై, కుమారి బెహల్టీలు స్వాతంత్య్ర సమరయోధుడు, మహాకవి సుబ్రహ్మణ్య భారతి రాసిన తమిళ దేశభక్తి గేయం ‘పారుక్కుళ్లే నల్ల నాళ్ ఎంగళ్ భారతినాడు’ను ఆలపించారు. ఈ పాట సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. మొదటిసారి ఈ వీడియోను అరుణాచల్‌ప్రదేశ్ ముఖ్యమంత్రి పేమా ఖండూ ట్విట్టర్లో పోస్ట్ చేసి ప్రశంసావాక్యాలు రాశారు. 24 నిమిషాల నిడివి ఉన్న ఈ వీడియోను చూసిన ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ట్విట్టర్లో స్పందించారు. ‘ఈ వీడియోను చూసి చాలా సంతోషంగా, గర్వంగా అనిపించింది. ఈ షైనింగ్ స్టార్స్‌కు అభినందనలు తెలియజేస్తున్నాను. అరుణాచల్ సిస్టర్స్ గొంతులో వినిపించిన తమిళదేశభక్తి గీతం ఏక్ భారత్, శ్రేష్ఠభారత్ స్ఫూర్తిని చాటుతుంది’ అని ట్వీట్ చేశారు ప్రధాని. ఇక సోషల్ మీడియా ‘కామెంట్ సెక్షన్’లో దేశంలోని అన్ని ప్రాంతాల నుంచి ప్రశంసలు వచ్చాయి. ‘అచ్చం తమిళ సిస్టర్స్ పాడినట్లుగానే ఉంది’ అని ఎంతోమంది అరుణాచల్ ప్రదేశ్ సిస్టర్స్‌ను ఆకాశానికెత్తారు. ‘మా అమ్మాయిలు కూడా అరుణాచల్‌ప్రదేశ్‌లోని గొప్పదేశభక్తి పాటలు పాడడానికి సిద్ధం అవుతున్నారు’ అని ఒక తమిళియన్ కామెంట్ పెట్టాడు. ‘మన దేశంలో ఎన్నో రాష్ట్రాలలో ఎన్నో దేశభక్తి గీతాలు ఉన్నాయి. అవి ఆ రాష్ట్రానికి మాత్రమే పరిమితమై పోకుండా, అందరికీ సుపరిచితమై పోవాలంటే ఇలాంటి ప్రయత్నాలు మరిన్ని జరగాలి’ అని ఒకరు స్పందించారు. మంచిదే కదా! -
రీ ఎంట్రీ ఇవ్వడం సంతోషంగా ఉంది: హీరోయిన్
Nani Adade Sundara Movie Trailer Launch In Chennai: నేచురల్ స్టార్ నాని కథానాయకుడిగా నటించిన ‘అంటే.. సుందరానికి’ (Ante Sundaraniki Movie) చిత్రం ఈ నెల 10వ తేదీన తెలుగుతో పాటు తమిళం, మళయాళం భాషల్లో విడుదలకు సిద్ధమవుతోంది. ఇందులో నటి నజ్రియా నజీమ్ నాయికిగా రీఎంట్రీ ఇస్తున్నారు. రేవతి తదితరులు ముఖ్యపాత్రలు పోషించిన ఈ చిత్రానికి వివేక్ ఆత్రేయ దర్శకుడు. మైత్రీ మూవీస్ సంస్థ నిర్మించిన ఈ చిత్రం ఈ తమిళంలో ‘అడడే సుందరా’ (Adade Sundara Movie) పేరుతో విడుదల కానుంది. ట్రైలర్ ఆవిష్కరణ కార్యక్రమాన్ని శుక్రవారం సాయంత్రం చెన్నైలో నిర్వహించారు. హీరో నాని మాట్లాడుతూ ఈ చిత్రం చేయడం తనకు చాలా సంతోషంగా ఉందన్నారు. శ్యామ్ సింగరాయ్ వంటి యాక్షన్ కథా చిత్రం తరువాత వినోదంతో కూడిన ఈ ఫ్యామిలీ ఎంటర్టైన్మెంట్ చేయడం సముచితంగా అనిపించిందని తెలిపారు. ఈ మూవీ చాలా సంతృప్తికరంగా వచ్చిందని, అన్ని వర్గాల ప్రేక్షకులను అలరిస్తుందనే నమ్మకం ఉందన్నారు. చాలా గ్యాప్ తరువాత ఈ చిత్రం ద్వారా రీ ఎంట్రీ ఇవ్వడం సంతోషంగా ఉందని నటి నజ్రియా నజీమ్ పేర్కొన్నారు. చదవండి: అడవి శేష్ 'మేజర్' ప్రామిస్.. అలాంటి వారికి సపోర్ట్.. -
ఒన్రే కులం, ఒరువనే దేవన్
స్వాతంత్య్రోద్యమంలో పాల్గొనకుండా, స్వాతంత్య్రం అనంతరం భారతదేశంలో తొలి నాయకుడిగా అవతరించినవారు అన్నాదురై. ఆయన పేరు చివర ఎం.ఎ. అనే రెండు అక్షరాలు ఎప్పుడూ కనిపించేవి. దానితోనే ఆయన గౌరవాన్ని అందుకునేవారు. బ్రాహ్మణేతర జస్టిస్ పార్టీలో ఉన్నతస్థాయి నేతల ఉపన్యాసాలను తమిళంలోకి అనువదించడం ద్వారా అన్నాదురై రాజకీయ జీవితం మొదలైంది. 1937–39 మధ్యలో జరిగిన తొలి హిందీ వ్యతిరేక ఉద్యమం ఆయన భాషా నైపుణ్యాన్ని తొలిసారిగా ఘనంగా చాటి చెప్పింది. ఆ భాషా కౌశలాన్ని ఆయన ఆ తర్వాత సినిమా స్క్రిప్టుల రచనకు కూడా ఉపయోగించారు. పెరియార్ ఇ.వి. రామస్వామి ఆయనను తన కుడి భుజంగా మార్చుకున్నారు! అయితే అనతికాలంలోనే అన్నాదురై ఆయనను స్థానభ్రంశం చెందించి, తానే అధినాయకుడిగా అవతరించారు. బహుశా అన్నాదురై విజయ రహస్యం పెరియార్ ఆలోచనలను, శక్తిమంతమైన భావజాలాన్ని సమర్థంగా ముందుకు నడిపించడంలోనే దాగుంది. పెరియార్ చెప్పిన నాస్తికతను ఆయన మధ్య యుగాల నాటి తమిళ సాధువు తిరుమలర్ మాటగా, ‘ఒన్రే కులం, ఒరువనే దేవన్’ (ఒకే కులం, ఒకే దేవుడు)’గా ప్రచారం చేశారు. వినాయకుడి విగ్రహాల ధ్వంసానికి పెరియార్ పిలుపునిస్తే, అన్నా దానికి భిన్నంగా తను విగ్రహాన్ని పగలగొట్టను, కొబ్బరికాయనూ కొట్టనని చెప్పి ప్రాచుర్యం సంపాదించారు. 1950 లో ద్రావిడ మున్నేట్ర కళగం (డి.ఎం.కె)ను స్థాపించి రాష్ట్ర పరిధిలో తమిళ జాతీయతను భద్రంగా ఎదిగేలా చేసిన అన్నాదురై, ద్వితీయ శ్రేణి నాయకత్వాన్ని బాగా ప్రోత్సహించారు. 60 ఏళ్ల కన్నా ముందే చనిపోవడంతో ఆయన ఉజ్వల భవితకు అకస్మాత్తుగా తెరపడింది. ఆయన చనిపోయినప్పుడు అంతిమయాత్రలో లక్షలాది మంది పాల్గొన్నారు. నిజానికి అది గిన్నిస్ రికార్డులోకి ఎక్కవలసిన ఘటన అని కూడా చాలా మంది చెబుతుంటారు. ఆకట్టుకునే జీరస్వరం గల ఈ అయిదుంపావు అడుగుల నాయకుడు రాజకీయంగా ఎదిగిన క్రమంలో ఆధునిక తమిళనాడు చరిత్రే దాగుంది! . (చదవండి: పోరు బాట.. అగ్గిబరాటా) -
ఫ్యాన్స్‌కి తీపి కబురు అందించిన నటి రాధ, మళ్లీ వస్తున్నానంటూ ట్వీట్..
Senior Actress Radha Re Entry To Small Screen After Long Gap: అలనాటి హీరోయిన్, ప్రముఖ సీనియర్ నటి రాధ.. అప్పటి తెలుగు ప్రేక్షకులకు ప్రత్యేకంగా ప్రత్యేకం పరిచయం అక్కర్లేని పేరు. తన అందం, అభినయం, నటన.. అంతకు మించి డ్యాన్స్‌తో ఎంతో ప్రేక్షకులను గుండెల్లో ఆమె నిలిచిపోయారు. 80, 90 దశకంలో ఆనాటి అగ్ర హీరోలు సూపర్ స్టార్ కృష్ణ, మెగాస్టార్ చిరంజీవి, బాలకృష్ణతో పలువురి హీరోలందరి సరసన ఆమె నటించారు. మెగాస్టార్ చిరంజీవి, బాలయ్యలతో పోటీ పోడుతూ డ్యాన్స్ చేసి పరిశ్రమలో తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నారు. చదవండి: ‘బంగార్రాజు’ ట్రైలర్ వచ్చేసింది, చై హంగామా మామూలుగా లేదుగా.. అలా స్టార్ హీరోయిన్గా ఓ వెలుగు వెలిగిన రాధ తమిళ్, మలయాళంలో కూడా హీరోయిన్గా నటించారు.అక్కడ కూడా ఆమె స్టార్ హీరోయిన్గా గుర్తింపు పొందారు. ఈ క్రమంలో రానూరానూ సినిమాలు తగ్గించిన రాధ పెళ్లి చేసుకుని పూర్తిగా నటనకు దూరమయ్యారు. భర్త, పిల్లలు, వ్యాపారంతో బిజీ అయిపోయారు. ఆమె తెరపై కనిపించి ఓ దశాబ్దమే గడిచింది. ఈక్రమంలో అప్పుడప్పుడు పలు ఈవెంట్స్‌లో మెరిసిన ఆమె పూర్తిస్థాయిలో తెరపై కనిపించలేదు. ఇదిలా ఉంటే తన ఫ్యాన్స్‌ను సర్ప్రైజ్ చేసే ఓ తీపి కబురు అందించారు రాధ. మళ్లీ వస్తున్నానంటూ ఆమె ట్వీట్ చేశారు. చదవండి: సల్మాన్ ఖాన్‌తో సీక్రెట్ డేటింగ్, క్లారిటీ ఇచ్చిన నటి సమంత.. ఈ మేరకు రాధ ట్వీట్ చేస్తూ.. త్వరలో బుల్లితెరపై సందడి చేయబోతున్నానంటూ ఓ షో ప్రోమోను వదిలారు. ‘చాలా గ్యాప్ తర్వాత మళ్లీ వస్తున్నా. ఓ రియాలిటీ షోకు న్యాయనిర్థేతగా వ్యవహరించేందుకు బుల్లితెరపైకి వస్తున్నాను. నా కో-జడ్జీగా నకుల్ వ్యవహరిస్తున్న ఈ సూపర్ క్వీన్స్ షో జీ తమిళ్లో ప్రసారం కాబోతోంది. ఈ షోకు జడ్జీగా ఉన్నందుకు చాలా సంతోషంగా ఉంది. ప్రతి క్షణాన్ని ఎంజాయ్ చేస్తున్నా. ఎంతోమంది అమ్మాయిల ప్రతిభను ఈ కార్యక్రమం ద్వారా చూడటం గర్వంగా ఉంది’ అంటూ రాసుకొచ్చారు. 90వ దశకంలో సినీ రంగానికి గుడ్ బై చెప్పిన రాధ పెళ్లి తర్వాత ముంబయిలో సెటిలయ్యారు. అడపాదడపా ఈవెంట్లలో దర్శనమిస్తూ అభిమానులను అలరించడం తప్ప హోస్ట్‌గా ఆమె కనిపించడం ఇదే తొలిసారి. కాగా ఈ షో జనవరి 16 నుంచి జీ తమిళంలో ప్రసారం కానుంది. After pretty long time , again as a judge for a reality show ! Nakul, my co judge is such a sweetheart ❤️That too on Zee Tamil! Enjoyed every bit of it! So proud to witness our talented girls!https://t.co/Kae1rQA7ax @ZeeTamil — Radha Nair (@ActressRadha) January 11, 2022 -
తెలుగు–తమిళ భీష్మాచార్యుడు
‘‘ఆంధ్రదేశంలో తెలుగు వాళ్లు తమిళనాడుకు వలస పోవడానికి ఎన్నో రాజకీయ, సాంఘిక, మత కారణాలు కలవు. అందులో తురక రాజులు రాజ్యాంగం చేసేట ప్పుడు మన ఆడవాళ్లపై కన్ను పడి ఆశపడే కారణం చేత ఆ రాజుల చేతులో పడి మానాన్ని పోగొట్టుకోవడానికి ఇష్టపడక దక్షిణం దిక్కుకు పయనమై వచ్చేస్తిరి. ఆంధ్రదేశం నుండి అలా వచ్చేట ప్పుడు మావాళ్ల అనుభవాలు, పడిన కష్టాలు, మా ముత్తాత, అవ్వ, తాతలు వారి బిడ్డలకు, మనవళ్లు, మనవరాళ్లకు కథలు కథలుగా చెప్పేవారు. ఇట్ట ఆది నుంచి వచ్చిన కథలు మా అవ్వ నాకు చిన్నప్పుడు చెప్పేది. అట్టా ఆ కథను మళ్లీ మళ్లీ ఎన్ని సార్లు విన్నానో లెక్కలేదు. ఉత్తరాన్నుంచి ఎనిమిది వందల ఏళ్ల క్రిందట వలస వచ్చి ఇక్కడ అడవులను నరికి నేలను సాగులోనికి తెచ్చిన మా పెద్దల కథే గోపల్లె’’ అంటూ తమిళ సాహితీ లోకంలో ‘కీరా’ గా సుప్రసిద్ధులైన కీ.రాజనారాయణన్ తమ తెలుగు జాతి మూలాలను గూర్చి ‘గోపల్లె’ నవలకు సంతరించిన ముందుమాటలో విశదం చేశారు. కీ. రా. పూర్తి పేరు రాయంకుల కృష్ణరాజు నారా యణ పెరుమాళ్ రామానుజ నాయకర్. ఎనిమిది శతాబ్దాల క్రిందట ఉత్తరాన ఉన్న ఆంధ్రప్రాంతం నుంచి తమిళనాడు పాండ్య మండలం (కరిచల్కాడు: నల్లరేగడి నేల)కు వలస వెళ్లిన కుటుంబానికి చెందిన వారు. వీరు తూత్తుకూడి జిల్లా కోవిల్పట్టి మండలం, ఇడై చేవల్ గ్రామంలో 1923 సెప్టెంబర్ 16న శ్రీకృష్ణ రామానుజం, లక్ష్మీ అమ్మ దంపతులకు జన్మించారు. 1965 నుంచి రచనా వ్యాసంగం ప్రారంభించి 1976లో ‘గోపల్లె గ్రామం’, దానికి కొనసాగింపుగా ‘గోపల్లె పురత్తు మక్కళ్’ పేరిట రెండో నవలను వెలువరించారు. నాటి గోపల్లె శతాబ్దాల కాలంలో పరిణామం చెందుతూ స్వాతంత్య్రోద్యమ కాలం నాటికి రూపుదిద్దుకున్న విధం ‘గోపల్లె పురత్తు మక్కళ్’ వివరిస్తుంది. దీనికి 1991లో కేంద్ర సాహిత్య అకాడమీ పురస్కారం లభించింది. వర్షం లేక ఎండిన నేలతల్లి కథలను అక్షరీకరిం చడంలో కీరా సిద్ధహస్తుడు. వీరివి ఏడు కథాసంపు టాలు, నాలుగు నవలలు, మూడు వ్యాస సంకల నాలు అచ్చయినాయి. 1982లో వీరు తమిళ మాండ లిక పద నిఘంటువును రూపొందించారు. 1984లో ఆయన ‘‘కరిసై కథైగళ్’’ సంపుటానికి సంపాదకునిగా వ్యవ హరించారు. తమిళనాడు టెక్స్›్టబుక్ కార్పొరేషన్ (టీఎన్టీబీ) దీన్ని ఆంగ్లంలోకి అనువ దింపజేసి హార్పర్ కోల్లిన్స్ వారిచే ముద్రింపజేసింది. ఆ పుస్తకం మార్చి 2021లో వెలుగుచూసింది. ‘గోపల్లె’లో కథా సంవిధానం పఠితకు విశ్రాం తిని కలిగిస్తుంది. విషాదంలో అద్భుత మాయావాద రసం రంగరించి ‘గోపల్లె’ నవలను తీర్చిదిద్దారు. భారతీయ సంస్కృతి, వైదిక విజ్ఞానం, భారతీయ ఆత్మ ఆవిష్కరణ నవల అంతటా పరుచుకొని ఉంటుంది. కథలో అతీతం, వర్తమానం కలిసి నడుస్తూ ఉంటాయి. పాశ్చాత్య సాహితీ విమర్శకులు చెప్పిన ‘మాజికల్ రియలిజం’, మహాభారతంలో వేదవ్యాసుడు ఆవిష్కరించిన అద్భుత రసావిష్కరణ ‘గోపల్లె’లో ఆవిష్కరించటం విశేషం. ‘గోపల్లె’ గ్రామం నవలను నంద్యాల నారాయణ రెడ్డి, ‘గోపల్లె పురత్తు మక్కళ్’ను ఆచార్య శ్రీపాద జయప్రకాశ్ తెలుగులోకి అనువదించారు. 1989లో పాండిచ్చేరి విశ్వవిద్యా లయం తమ ఫోక్ టేల్స్ డాక్యుమెంటేషన్ అండ్ సర్వే సెంటర్ శాఖకు కీరాను డైరెక్టర్‌గా నియమించి గౌరవించింది. ‘గోపల్లె’ నవలకు శరీరం తమిళమైతే ఆత్మ తెలుగు అన్నారాయన. ‘తెలుగు రాతల్ని (అక్షరాల్ని) చేత్తో తాకితే చాలుబా, అదే నిండా భాగ్యం’ అనే నిండైన తెలుగు భాషాభిమాని. ‘నాయన’, ‘భీష్మా చార్య’ అని తమిళులు ఆప్యాయంగా పిలుచుకున్న రాజనారాయణన్ ఈ మే 17న కన్నుమూశారు. ఆ సాహితీ మూర్తికి ఇదే అశ్రునివాళి. వ్యాసకర్త ప్రముఖ సాహితీవేత్త. డాక్టర్ తుర్లపాటి రాజేశ్వరి మొబైల్: 90787 43851 -
మరో విషాదం : ప్రముఖ టీవీ నటుడు ఆత్మహత్య
సాక్షి, చెన్నై: తమిళ టెలివిజన్ పరిశ్రమ మరో విషాదం చోటు చేసుకుంది. ప్రముఖ టీవీ నటుడు ఇంద్ర కుమార్ ఆత్మహత్య చేసుకున్నారు. తమిళనాడులోని పెరంబలూర్‌లో ఆయన స్నేహితుని నివాసంలో ఉరివేసుకుని ఉసురు తీసుకున్నారు. వరుస ఆత్మహత్యలతో సినీ పరిశ్రమలో విషాదం నెలకొంది. (హీరో వీరాభిమాని ఆత్మహత్య : ఆఖరి కోరిక) చెన్నైలోని శ్రీలంక శరణార్థి శిబిరంలో నివాసం ఉంటున్న ఇంద్ర కుమార్ తమిళ డైలీ సీరియల్స్ ద్వారా ఫ్యామస్ అయ్యారు. అయితే గురువారం రాత్రి తన స్నేహితులతో కలిసి సినిమా చూసి వచ్చిన కొన్ని గంటల్లోనే కుమార్ విగతజీవిగా మారడంతో అతని స్నేహితులు తీవ్ర దిగ్భ్రాంతిలో మునిగిపోయారు స్నేహితుల సమాచారం మేరకు కుమార్ మృతదేహాన్ని స్వాధీనం చేసుకుని పోస్టుమార్టం కోసం తరలించారు పోలీసులు. ఆత్మహత్యకు గల కారణాలపై ఆరా తీస్తున్నారు. అయితే అవకాశాలు రావడంలేదనే ఆందోళనతోనే ఇంద్ర కుమార్ ఆత్మహత్యకు పాల్పడినట్టు సమాచారం. మరోవైపు వివాహ జీవితంలో సమస్యలు, భార్యతో విభేదాలు కారణంగానే చనిపోయాడనే మరో వాదన కూడా వినిపిస్తోంది. కాగా కరోనా సంక్షోభ కాలంలో ఫిలిం ఇండస్ట్రీ కూడా కష్టాల్లో కూరుకుపోయింది. ఈ నేపథ్యంలో అవకాశాలు లేక చాలామంది నటీనటులు ఆత్మహత్యలకు పాల్పడుతుండటం ఆందోళన రేపుతోంది. ఈ వారంలో సినీ పరిశ్రమకు సంబంధించి ఇది రెండవ ఘటన. కేసరి, ఎంఎస్ ధోని: ది అన్‌టోల్డ్ స్టోరీ వంటి సినిమాల్లో నటించిన బాలీవుడ్ నటుడు సందీప్ నహర్ ఆత్మహత్యకు పాల్పడ్డారు. అంతకుముందు ప్రముఖ నటి, వీజే చిత్ర ఆత్మహత్య చేసుకున్న సంగతి తెలిసిందే. -
తండ్రి బాటలోనే కీర్తి సురేష్!
మహానటి సినిమాతో ఉత్తమ నటిగా జాతీయ స్థాయిలో గుర్తింపు తెచ్చుకున్న కీర్తి సురేష్ తెలుగు, తమిళ భాషల్లో హీరోయిన్గా బిజీగా వుంది. కీర్తి సురేష్ ఇప్పుడు మరో అవతారం ఎత్తడానికి సిద్ధంగా ఉన్నట్లు తెలుస్తోంది. నిర్మాతగా మారి ఒక వెబ్ సిరీస్‌ను రూపొందించడానికి కీర్తి సిద్దమౌతోంది. కథ బాగా నచ్చడంతో తమిళ వెబ్ సిరీస్‌ను నిర్మించాలని కీర్తి ఫిక్స్ అయ్యింది. ఇందుకు సంబంధించిన అన్ని ఏర్పాట్లను చేసుకుంటుంది. కీర్తి తండ్రి సురేశ్ కుమార్ కూడా నిర్మాత అన్న విషయం తెలిసిందే. ఇక కీర్తి సినిమాల విషయానికి వస్తే మిస్ ఇండియా, గుడ్ లక్ సఖి చిత్రాలు షూటింగ్‌ను పూర్తి చేసుకొని విడుదల అవడానికి సిద్ధంగా ఉన్నాయి. ఇక సర్కారు వారి పాట సినిమాలో కీర్తి, మహేష్ బాబు సరసన నటించనుంది. ఈ సినిమా వచ్చే ఏడాది ప్రేక్షకుల ముందుకు రానుంది. ఇక నితిన్‌తో చేస్తున్న షూటింగ్ లాక్డౌన్ కారణంగా ఆగిపోగా అది మొదలు కానుంది. చదవండి: ఆ లవ్ లెటర్‌ను దాచుకున్నా: కీర్తి సురేష్ -
తెలుగు ప్రజలకు ఫ్లిప్‌కార్ట్ శుభవార్త
ముంబై: ఈ- కామర్స్ దిగ్గజం ఫిప్కార్ట్ ఎప్పటికప్పుడు సరికొత్త ఆవిష్కరణలతో కస్టమర్లకు చేరువయ్యే ప్రణాళికలు రచిస్తోంది. తాజాగా తెలుగు, తమిళ, కన్నడ ప్రజలకు ప్లిప్‌కార్ట్ శుభవార్త తెలిపింది. ఇక మీదట (తెలుగు, తమిళ, కన్నడ భాషల)కు చెందిన వినియోగదారులు తమ ప్రాంతీయ భాషలలో షాపింగ్ చేయవచ్చని ఫ్లిప్‌కార్ట్ పేర్కొంది. ప్లిప్‌కార్ట్‌లో ఇప్పటివరకు కేవలం హిందీ మొబైల్ అప్లికేషన్‌కు మాత్రమే ఈ వెసలుబాటు ఉండేది. అయితే దేశ వ్యాప్తంగా ప్రాంతీయ భాషలలో సేవలను విస్తరించడం వల్ల వినియోగదారులకు సంస్థ మరింత చేరువయ్యే ప్రయత్నం చేస్తుంది. కాగా 54 ప్రాంతీయ భాషల పదాలను (తెలుగు, తమిళ, కన్నడ భాషలలో) బ్యానర్ పేజీలతో కలిపి వినియోగదారులకు అందించినట్లు పేర్కొంది. గత సెప్టెంబర్‌లో హిందీ భాషలో వినియోగదారులకు సేవలను అందించామని ఫ్లిప్‌కార్ట్ గుర్తుచేసింది. హిందీ భాషలలో సేవలందించడం ద్వారా వినియోగదారులు సంతృప్తికరంగా ఉన్నారని, ప్రస్తుతం దక్షిణాది రాష్ట్రాలలో భారీగా పెరుగుతున్న వినియోగదారులను దృష్టిలో ఉంచుకొని.. వారికి భాషాపరమైన ఇబ్బందులు తలెత్తకుండా ప్రాంతీయ భాషలలో సేవలందించనున్నట్లు తెలిపింది. ప్రాంతీయ భాషలలో సేవలందించే ప్రణాళికలో భాగంగా విశాఖపట్నం, మైసూర్‌లలో భాషలకు సంబంధించిన పదాలను అధ్యయనం చేశామని తెలిపింది. తాజా సేవలతో దేశవ్యాప్తంగా వినియోగదారులను ఫ్లిప్‌కార్ట్ ఆకట్టుకుంటుందని పేర్కొంది. (చదవండి: ఆహార రిటైల్‌లో ఫ్లిప్‌కార్ట్‌కు నో ఎంట్రీ!) -
‘ప్రాంతీయ భాషలకు అందలం’
చెన్నై : తమిళం సహా రాజ్యాంగంలోని 8వ షెడ్యూల్లో ప్రస్తావించిన భాషలను అధికార భాషలుగా ప్రకటించేందుకు ప్రభుత్వం చర్యలు చేపట్టాలని డీఎంకే చీఫ్ ఎంకే స్టాలిన్ కోరారు. తమిళ భాష అత్యంత ప్రాచీన భాషని ప్రధాని నరేంద్ర మోదీ చేసిన వ్యాఖ్యలను స్టాలిన్ స్వాగతించారు. ఎంతో ప్రాధాన్యత కలిగిన తమిళ భాషను అధికార భాషగా అభివృద్ధి చేయాలని ప్రధానిని కోరారు. శ్రీలంక, సింగపూర్ దేశాల్లో అధికార భాషగా వెలుగొందుతున్న తమిళ భాషకు భారత్‌లో ఆ హోదా లేదని గుర్తుచేశారు. హిందీ, సంస్కృతాన్ని బలవంతంగా రాష్ట్రాలపై రుద్దుతున్న ఎన్డీఏ ప్రభుత్వ తీరును ఖండిస్తున్నామని స్టాలిన్ వ్యాఖ్యానించారు. ప్రభుత్వ పథకాల పేర్లకు హిందీలో పేర్లు పెడుతున్నారని, వాటిని తమిళంలోకి తర్జుమా చేయడం లేదని మండిపడ్డారు. ప్రధాని నరేంద్ర మోదీ ఇటీవల తన చెన్నై పర్యటన నేపథ్యంలో పార్టీ శ్రేణులను ఉద్దేశించి మాట్లాడుతూ తమిళ భాషపై ప్రశంసలు కురిపించిన సంగతి తెలిసిందే. తమిళం అత్యంత ప్రాచీన భాషగా ఆయన అభివర్ణించారు. -
నటనకు గ్లామర్
ఇద్దరు పిల్లలకు తల్లి. ఎవ్వరూ నమ్మరు. నిజమో? కాదో? అయినా నమ్మించింది. తరచూ ఇండస్ట్రీ గ్లామర్‌ను తెచ్చుకునిదానికి నటన నేర్పిస్తుంది. కానీ ఈ అమ్మాయిని చూడండి నటనకు గ్లామర్ నేర్పించింది. నటికి నటనే ఐశ్వర్యం అనిపించింది. తమిళంలో ఆల్రెడీ మీరు స్టార్ హీరోయిన్. కానీ తెలుగులో కొత్త హీరోయిన్గా మొదలుపెడుతున్నారు. ఎలా అనిపిస్తోంది. పెద్ద డిఫరెన్స్ ఏమీ అనిపించలేదు. ఎందుకంటే బేసిగ్గా నా మాతృభాష తెలుగు. కానీ, నేను పుట్టి, పెరిగింది, స్కూల్, కాలేజ్ అంతా చెన్నైలో. నాన్నగారు(రాజేష్) ఇండస్ట్రీలో ఉన్నారు. తెలుగు తెలియడం వల్ల ఈ ఇండస్ట్రీ కొత్త అనే భావన కలగలేదు. చెన్నైలో పుట్టి, పెరిగారు కదా. కొందరు మరచిపోతారు లేదా స్పష్టంగా మాట్లాడలేరు.. ఇంట్లో అందరం తెలుగులోనే మాట్లాడుకుంటాం. బయట తమిళ్లో మాట్లాడతాను. అది కూడా చాలా ఫ్లూయెంట్‌గా. చెన్నైలో పుట్టి, పెరగడం వల్ల తెలుగుతో పోలిస్తే తమిళ్ చాలా బాగా మాట్లాడతా తమిళంలో చేసిన ‘కణా’ను తెలుగులో ‘కౌసల్య కృష్ణమూర్తి’ చేస్తున్నారు. ఆ ఎక్స్పీరియన్స్? తెలుగులో భీమనేని శ్రీనివాస్‌గారు డైరెక్ట్ చేశారు. ఆయన రీమేక్ కింగ్. మనందరికీ తెలుసు. పెద్దగా మార్పులు చేయలేదు. తెలుగు హీరోయిన్లంటే ఫేస్‌లో కొంచెం అందంగా కనిపించాలనే ఫీలింగ్ ఉంది. అలా కాకుండా న్యాచురల్‌గా చేశాను. సినిమా చూస్తున్నప్పుడు హీరోయిన్ని చూసినట్టు ఉండదు.. కౌసల్య పాత్రని మాత్రమే చూస్తారు. తెలుగు తెలుసన్నారు. డబ్బింగ్ చెప్పుకున్నారా? నేనే డబ్బింగ్ చెప్పాను. చాలా తమిళ్ సినిమాలకు డబ్బింగ్ చెప్పిన నేను ఫస్ట్ టైమ్ తెలుగు సినిమాకి చెబుతుంటే కొంచెం డిఫరెంట్‌గా అనిపించింది. కానీ, చాలా బాగుంది. తెలుగులో నేను ఇప్పుడు మూడు సినిమాలు చేస్తున్నా. విజయ్ దేవరకొండ సినిమాలో నా పాత్ర తెలంగాణ స్లాంగ్‌లో మాట్లాడాలి. అది డబ్బింగ్ చెప్పడం నాకు ఇంకా చాలెంజింగ్‌గా ఉంటుందనుకుంటా. క్రికెట్టంటే మెన్గేమ్ అన్నట్టుంటుంది. మరి ఫీమేల్ క్రికెటర్‌గా నటించడం చాలెంజింగ్‌గా ఉందా? కచ్చితంగా. అందుకే నేను ఈ ప్రాజెక్టు ఒప్పుకున్నా. క్రికెట్ చూస్తాను. కానీ ఎప్పుడూ బ్యాట్, బాల్ పట్టుకుంది లేదు. ఈ సినిమా కోసం కార్క్ బాల్తోనే ప్రాక్టీస్ చేశా. ఆ బాల్ చాలా హార్డ్‌గా ఉంటుంది. టెక్నిక్‌తో ఆడాలి. అది తెలియక దెబ్బలు తగిలించుకున్నా కూడా. ప్రాక్టిస్‌లో బౌలింగ్‌పై చాలా శ్రద్ధ పెట్టా. ‘కణ’ చిత్రానికి కంప్లీట్‌గా ఆరు నెలలు ప్రొఫెషనల్‌తో ట్రైనింగ్ తీసుకున్నా. సిన్సియర్‌గా చేశా. ఫీమేల్ సెంట్రిక్ మూవీని క్యారీ చేయగలను అనే కాన్ఫిడెన్స్ వచ్చిందా? ఫీమేల్ సెంట్రిక్ ఫిల్మ్ అందరికీ దొరకదు. దొరికినా మనకు స్ట్రాంగ్ ఫౌండేషన్ అవసరం. ఒక హీరోలాగా.. హీరోయిన్ స్క్రీన్‌పై కనిపించగానే కింద ఉన్నవాళ్లంతా అరుస్తున్నారంటే అదే స్టార్ వ్యాల్యూ. ఒకమ్మాయి తెరపై కనిపిస్తే ఎంత స్పందన వస్తుంటే అంత స్టార్ వ్యాల్యూ ఉన్నట్టు. ఒక హీరోయిన్‌కి ఓపెనింగ్స్ ఉండాలంటే తను పెద్ద స్టార్ అయ్యుండాలి. నేను ఇండస్ట్రీకొచ్చిన ఆరేళ్లలో చాలా సినిమాలు చేశా. ఈ అమ్మాయి మంచి పాత్రలు చేస్తుందన్నది నా ప్రత్యేకత.. ఈ అమ్మాయి మీద పెట్టుబడి పెడితే తిరిగి వస్తుందనిపించుకున్నప్పుడే మనం ఫిమేల్ సెంట్రిక్ ఫిల్మ్స్ చేయాలి. ‘కణా’ తో ఐశ్వర్యా రాజేష్ అంటే మంచిగా చేస్తుంది, డబ్బులు కూడా వస్తాయని పేరొచ్చింది. దాని తర్వాత నేను చెత్త సినిమాలు చేస్తే కరెక్ట్ కాదు. నేను కూడా స్మార్ట్‌గా మూవ్ చేయాలి. హీరోయిన్స్ సినిమాను సింగిల్‌గా లాగేస్తున్నప్పటికీ, హీరో, హీరోయిన్ల మధ్య రెమ్యూనరేషన్ తేడా చాలా ఉంది కదా... మీరెలా ఫీలవుతున్నారు? ఇది చాలా ఏళ్లుగా జరుగుతోంది. తెలుగు, తమిళ సినిమా ఏదైనా అంతే. కానీ, హిందీ సినిమా అలా కాదు. దీపికా పదుకోన్, ప్రియాంకా చోప్రా, ఆలియా భట్‌కి హెవీగానే ఇస్తున్నారు. వారు 15, 20 కోట్లు వసూలు చేస్తున్నారు ఇంచుమించు హీరోలతో సమానంగా. ఎందుకంటే వాళ్లు చాలా ఫిమేల్ సెంట్రిక్ ఫిల్మ్స్ చేస్తున్నారు, మంచి ఓపెనింగ్స్ ఉంటున్నాయి, బిజినెస్ ఉంది. అలా కూడా మన ట్రెండ్ మారితే బావుంటుంది. ఇప్పుడు నయనతారకి 5 కోట్లు ఇస్తున్నారంటే రెమ్యూనరేషన్ పెంచినట్టే కదా. హిందీలో ప్రియాంకా చోప్రా, ఆలియా భట్, సోనమ్ కపూర్.. ఇలా అందరూ ఫిమేల్ సెంట్రిక్ ఫిల్మ్స్ చేస్తున్నారు. వాళ్లకీ బిజినెస్ ఉంది. వ్యాపారాన్ని బట్టే కదా రెమ్యునరేషన్ ఇస్తారు. క్యాలిక్యులేటెడ్‌గా మాట్లాడుతున్నారు.. భవిష్యత్తులో నిర్మాత అయ్యే ఆలోచనలున్నాయా? అలాంటి ఆలోచన ఏమీ లేదు. నిర్మాత అవ్వాలంటే మనకి ఆర్థిక స్థోమత ఉండాలి. నిర్మాత జాబ్ అంత ఈజీ కాదు. దాన్ని హ్యాండిల్ చేయడం కష్టం. మీ సినిమాలను గమనిస్తే గ్లామర్ సైడ్ వెళ్లకుండా ట్రెడిషనల్ రోల్సే ఎక్కువ చేశారు. అదేం లేదు. నాకు ఏది సరిపోతుందో ఆ పాత్రలు చేస్తా. నాకు కూడా ప్రయోగాలు చేయాలని ఉంది, భవిష్యత్తులో చేస్తా. గ్లామర్ పాత్రలంటే చాలా వేరియేషన్స్ ఉన్నాయి. గ్లామర్‌కీ వల్గర్కి ఓ చిన్న లైన్ ఉంది. చూసినప్పుడు అందంగా కనిపిస్తే గ్లామర్ అంటారు.. చూసిన వెంటనే ‘అబ్బ.. ఏందిరా ఇది’ అంటే అది వల్గర్ అన్నమాట. ఎలాంటి గ్లామర్ నాకు సూట్ అవుతుందన్నది ఫస్ట్ నాకు తెలియాలి... దాన్నే గ్లామరస్ అంటారు. నా క్యారెక్టర్స్ వరకూ అన్నీ తల్లిగా, చెల్లిగా, స్కూల్ అమ్మాయిగా చే శా. ‘కౌసల్య కృష్ణమూర్తి’ సినిమాలో 16 ఏళ్ల అమ్మాయిగా చేశాను. హీరోలతో పోలిస్తే హీరోయిన్స్ లైఫ్ స్పాన్ తక్కువ. కెరీర్ పీక్‌లో ఉండగానే వీలైనన్ని ఎక్కువ సినిమాలు చేయాలనుకుంటారు... మా అమ్మ కూడా అలాగే అంటారు. పెద్దవారి ఆలోచన విధానం అంతే. అలా అనుకోకపోతేనే తప్పు. అంటే వారి అనుభవం అలాంటిది. మరి మీకేమైనా భయంగా అనిపించిందా? అలా ఏం లేదు. నాకెప్పుడూ అనిపించలేదు. ఎందుకంటే నా పనిని నమ్ముతాను.. నాపైన నమ్మకం ఉంది. అయితే చాలామంది కామెంట్స్ చేస్తుంటారు.. నువ్వేంటి హీరోయిన్... నీ బొంద? అని...(నవ్వు) డైరెక్ట్‌గా మిమ్మల్ని అనేవారా? అప్పుడు మీకెలా అనిపించింది? ఇన్‌డైరెక్ట్‌గా అనేవారు. నేను వెళ్లి కలిసినప్పుడు ఫ్రెండ్ రోల్, సిస్టర్ రోల్ ఇస్తాం అనేవారు.. అంటే వాళ్లది తప్పు అని చెప్పలేం. నాకు 18,19 ఏళ్ల టైమ్‌లోనే వెళ్లా. అప్పుడు బట్టలు కూడా సరిగ్గా వేసుకోవడం రాదు.. సరైన మేకప్ వేసుకోవడం రాదు. తలకి నూనెపెట్టుకుని వెళితే డైరెక్టర్లు అలాగే అంటారు కదా? హీరోయిన్లంటే గ్రూమింగ్స్ అని వేరుగా ఉంటాయి. బాంబే నుంచి అమ్మాయిలు వస్తే వాళ్ల పెరిగిన విధానం వేరుగా ఉంటాయి.. మనది వేరు. వాళ్లు కొంచెం ఫాస్ట్ అన్నమాట. షార్ట్స్, టీ షర్ట్స్తోనే ఉంటారు వాళ్లు. చాలా బ్రాడ్, సిటీ లైఫ్, మెట్రో లైఫ్. మనకు తెలీదప్పుడు. మరి ఆ బాధను ఎవరి వద్ద చెప్పుకున్నారు? ఎవరి వద్దా చెప్పలేదు.. నాకు నేను చెప్పుకున్నాను. ప్రతిరోజూ నిద్రపోయేముందు నేను హీరోయిన్ అవ్వాలి అని వందసార్లు చెప్పుకునేదాన్ని. ‘మీటూ’ అని వింటున్నారు కదా? అలాంటి ఎక్స్పీరియన్స్ ఏమైనా...? మీటూ... నేను ఎలాంటి అమ్మాయినంటే నావద్దకొచ్చి ఎవరైనా మాట్లాడితే చెప్పుతో కొట్టే రేంజ్ నాది. బేసిక్‌గా నేను చాలా బోల్డ్‌గా ఉంటాను. నన్ను ఇంట్లో అలా పెంచారేమో? అలా అందరూ ఉండాలంటే బాగా తెలివితేటలు ఉండాలి కదా? ఇప్పుడొచ్చే అమ్మాయిలకు చెప్పనవసరం లేదు. చాలా తెలివిగా ఉన్నారు. ఇలాంటి విషయాల గురించి నాకు తెలిసిన తర్వాత కడిగే చేపలో స్లిప్ అయ్యే చేపలాగా ఉంటానన్నమాట(నవ్వుతూ). ఎవరైనా పార్టీ ఉందంటూ ఆహ్వానిస్తే హైదరాబాద్ వెళుతున్నా, బాంబే వెళుతున్నా అంటూ తప్పించుకోవడమే. నెక్ట్స్ టైమ్ పిలిస్తే అయ్యో నేను ఊర్లో లేనే! అంటుంటాను. అలా ఉండాలంతే! మీకు ఫిల్మ్ బ్యాక్‌గ్రౌండ్ ఉంది కదా? మీ తాతగారు, నాన్నగారిని చూస్తూనే పెరిగారు కదా? అప్పుడు షూటింగ్‌లకు వెళ్లేవారా? లేదండి.. నాకు పదేళ్లున్నప్పుడే నాన్నగారు చనిపోయారు. నేను పుట్టినప్పటికే నాన్నగారు సినిమాల్లోంచి ఔట్ అయినట్టున్నారు. ఆల్మోస్ట్ నాకు నాలుగైదేళ్లు ఉన్నప్పుడే.. చాలా బ్యాడ్ సర్కిల్ ఆయనది. చాలా ఉన్నాయి ఆ కథలు ఇప్పుడెందుకులే. తాతగారి గురించి అస్సలు తెలియదు. శ్రీలక్ష్మిగారంటే హైదరాబాద్‌లో ఉండేవారు. శ్రీలక్ష్మిగారి తమ్ముడి కూతుర్ని నేను. మణిరత్నంగారితో(నవాబ్) సినిమా చేయడం ఎలా అనిపించింది? తక్కువ టైమ్‌లోనే ఆ అవకాశం వచ్చిందనుకుంటా? రియల్లీ... చాలా వండర్ ఫుల్ ఎక్స్పీరియన్స్. అయితే, తక్కువ టైమ్ ఏమీ కాదు ఆరేళ్లు అయ్యింది కదా(నవ్వుతూ). నేనంటే చాలా ఇష్టం ఆయనకి. ఆయన బ్యానర్లో నెక్ట్స్ సినిమా చేస్తున్నా. ఇందులో కథ మణిసార్ది. దర్శకత్వం వేరే అబ్బాయి చేస్తున్నాడు. మీ చేతిలో ఎప్పుడూ సినిమాలు ఉన్నాయి కదా? ‘కాకా ముటై్ట’ చిత్రం చేసిన తర్వాత ఏడాదిన్నర సినిమాలు లేవు. ‘కాకా ముటై్ట’ సినిమాలో ఇద్దరు పిల్లలకు తల్లిగా కూడా చేశా. అప్పుడు నాకు 21ఏళ్లు. ఆ సినిమా నాకు ప్రపం^è వ్యాప్తంగా పేరు తీసుకొచ్చింది. దానివల్లే నాకు హిందీ, మలయాళం సినిమాల్లో అవకాశాలొచ్చాయి.. ఒక నటిగా నేను ఎస్టాబ్లిష్ అయ్యానంటే ‘కాకా ముటై్ట’తోనే. ఇప్పుడు కూడా నన్ను ఎవరైనా చూస్తే ‘కాకా ముటై్ట’లో అమ్మగా నటించింది నువ్వే కదా? అంటారు. తల్లి పాత్ర చేయడం బ్యాడ్ అయిందనిపించిందా? అలాంటిదేం లేదు.. పేరు బాగా వచ్చింది. దాని తర్వాత దుల్కర్ సల్మాన్‌తో సినిమా వచ్చింది. ‘అందమైన జీవితం’ అని తెలుగులో డబ్బింగ్ చేశారు. చాలామంది యూ ట్యూబ్‌లో చూశారు. దుల్కర్ సల్మాన్, నివిన్ పాలి, అర్జున్ రాంపాల్, ధనుష్‌తో చేశా. ‘సగవ్’ అనే సినిమాలో 65–70 ఏళ్ల వృద్ధురాలి గెటప్ వేశా. ఫ్లాష్‌బ్యాక్‌లో చిన్న పిల్లగానూ చేశా. ఆ సినిమా సరిగ్గా ఆడలేదు. తెలుగులో ఏ హీరో అంటే ఇష్టం? జూనియర్ ఎన్టీఆర్, ప్రభాస్ అంటే ఇష్టం.. ఇక్కడున్న వారందరూ ఇష్టమే. కానీ, ఎందుకో జూ.ఎన్టీఆర్ అంటే చాలా ఇష్టం. ఆయన అన్ని సినిమాలు చూస్తాం. మా ఇంట్లో నా సొంత అన్న ఉన్నాడులే. వాడికి జూ.ఎన్టీఆర్ అంటే ఇష్టం. ఆయన యాక్టింగ్, పెర్ఫార్మెన్స్ సూపర్బ్. డ్యాన్స్ ఎంతో∙గ్రేస్‌తో చేస్తారాయన. అందుకే ఆయనంటే నాకిష్టం. ఆయనతో ఓ సినిమా చేస్తే హ్యాపీ. ‘కౌసల్య కృష్ణమూర్తి’ సినిమాలో మేకప్ లేదను కుంటా? లేదు. కాకపోతే గ్రౌండ్లో ఎండలో నిల్చోబెట్టారు కాబట్టి నల్లగా అయిపోయా. మేకప్ వేసినా, వేయకున్నా ఒకటే. టీత్ మీరు లక్కీ అనుకుని ఉంచారా? లేకపోతే ఏంటి? లక్కీ అనేం లేదు. అది తీస్తే మొత్తం సెట్ చేయడానికి ఆర్నెళ్లు పడుతుందన్నారు. బాగానే ఉంది. తీసుకోవడానికి టైమ్ లేదు. అందుకని అలాగే వదిలేశా. మీ డ్రీమ్‌రోల్స్ ఏంటి? నా డ్రీమ్‌రోల్స్ అంటూ ఏమీ లేదు. ఏ పాత్ర వచ్చినా కూడా ఇదే నా డ్రీమ్ రోల్, చాలా బాగా చేయాలనుకుంటాను. (నవ్వు) -
మోదీని ఉద్దేశించి సీఎం ట్వీట్.. ఆపై డిలీట్!
చెన్నై: హిందీయేతర రాష్ట్రాల్లో హిందీని తప్పనిసరి బోధించాలన్న ప్రతిపాదనపై తీవ్ర దుమారం రేగిన నేపథ్యంలో తమిళనాడు ముఖ్యమంత్రి ఎడపాడి కే పళనిస్వామి ప్రధానమంత్రి నరేంద్రమోదీని ఉద్దేశించి ఒక ట్వీట్ చేశారు. ఇతర రాష్ట్రాల్లో తమిళ భాషను ఐచ్ఛీక భాషగా ఎంచుకునే అవకాశం ఇవ్వాలని ప్రధాని మోదీని ఆయన తన ట్వీట్లో అభ్యర్థించారు. ఈ ట్వీట్ తీవ్ర చర్చనీయాంశమైంది. అయితే, అనంతరం పళనిస్వామి తన ట్వీట్‌ను తొలగించారు. ‘ఇతర రాష్ట్రాల్లో అభ్యసించేందుకు వీలుగా ఆప్షనల్ లాంగ్వేజ్‌గా తమిళాన్ని కూడా చేర్చాలని ప్రధానమంత్రి నరేంద్రమోదీని కోరుతున్నాను. ఇలా చేయడం ద్వారా ప్రపంచంలో అతి పురాతన భాషల్లో ఒకటైన తమిళానికి గొప్ప మేలు చేసినట్టు అవుతుంది’ అని ఆయన ట్వీట్ చేశారు. హిందేయేతర రాష్ట్రాల్లో హిందీ భాషను తప్పనిసరిగా బోధించాలంటూ గతవారం విడుదల చేసిన జాతీయ విద్యావిధానం ముసాయిదాలో ప్రతిపాదించడంపై తీవ్ర దుమారం రేగిన సంగతి తెలిసిందే. త్రిభాష విద్యావిధానంలో భాగంగా చేసిన ఈ ప్రతిపాదనపై తమిళనాడు, కర్ణాటక సహా దక్షిణాది రాష్ట్రాల్లో పెద్ద ఎత్తున వ్యతిరేకత వ్యక్తమయింది. హిందీని బలవంతంగా రుద్దేందుకు జరుగుతున్న ఈ ప్రయత్నానికి వ్యతిరేకంగా ఉద్యమిస్తామని డీఎంకే వంటి పార్టీలు హెచ్చరించాయి. దాంతో కేంద్రం ముసాయిదాలోంచి ఈ నిబంధనను తొలగించింది. సవరించిన నూతన జాతీయ విద్యా విధానం ముసాయిదాను విడుదల చేసింది. ‘ తాము నేర్చుకుంటున్న మూడు భాషల్లో ఒకటి లేదా అంతకంటే ఎక్కువ భాషలను మార్చుకోవాలనుకునే విద్యార్ధులు 6, 7 గ్రేడుల్లో (తరగతులు) ఆ పని చేయవచ్చు. మాధ్యమిక పాఠశాల బోర్డు పరీక్షల్లో మూడు భాషల్లోనూ ప్రావీణ్యాన్ని ప్రదర్శించగలిగిన విద్యార్ధులు ఆరు లేదా ఏడు తరగతుల్లో భాషను మార్చుకోవచ్చు.’అని సవరించిన ముసాయిదాలో పేర్కొన్నారు. భాషా నైపుణ్యంపై బోర్డు నిర్వహించే పరీక్షల్లో కేవలం ప్రాథమిక స్థాయిలోనే పరీక్ష ఉంటుందని తెలిపింది. పళనిస్వామి చేసిన ట్వీట్ ఇదే.. -
ఇండోనేషియా మహిళను పెళ్లాడిన తమిళ తంబి
అన్నానగర్: ఇండోనేషియా దేశానికి చెందిన మహిళను తమిళ సంప్రదాయం ప్రకారం తమిళనాడులోని కారైకుడి యువకుడు బుధవారం వివాహం చేసుకున్నాడు. వివరాలు.. కారైకుడి సమీపంలోని పల్లత్తూర్ ప్రాంతానికి చెందిన మునియాండి రైతు కుమారుడు కార్తికేయన్ (32). ఇతను డిప్లొమో చదివి సింగపూర్‌లోని ఓ ప్రైవేట్ సంస్థలో పనిచేస్తున్నాడు. అతనితో పాటు పనిచేసే ఇండోనేషియాకి చెందిన బెర్లిస్ (30), కార్తికేయన్ ప్రేమించుకున్నారు. ఇద్దరూ వివాహం చేసుకోవాలని నిర్ణయించుకున్నారు. వారిద్దరి కుటుంబీకులు పెళ్లికి ఒప్పుకున్నారు. దీంతో బెర్లిస్, తమిళ సంప్రదాయం ప్రకారం వివాహం చేసుకోవాలని కోరింది. బుధవారం కారైకుడిలోని పల్లత్తూరులో పెద్దల సమక్షంలో బెర్లిస్, కార్తికేయన్ వివాహం తమిళ సంప్రదాయం ప్రకారం జరిగింది. -
కోలీవుడ్‌కి విలన్‌గా...
దివంగత నటులు రావుగోపాలరావుది ప్రత్యేకమైన విలనిజమ్. డిఫరెంట్ డైలాగ్ డెలివరీ, విలక్షణమైన నటనతో ప్రేక్షకుల హృదయాల్లో చెరగని ముద్ర వేసుకున్నారాయన. ఆయన తనయుడు రావు రమేశ్ కూడా తండ్రికి తగ్గ తనయుడు అనిపించుకున్నారు. క్యారెక్టర్ ఆర్టిస్ట్‌గా, విలన్‌గా వైవిధ్యమైన పాత్రలతో తెలుగు ప్రేక్షకులను అలరిస్తున్న రావు రమేశ్ తాజాగా తమిళ చిత్రసీమలోకి విలన్‌గా అడుగుపెడుతున్నారు. ‘అఆ, ఛల్ మోహన్‌రంగ’ ఫేమ్ సినిమాటోగ్రాఫర్ నటరాజ్ సుబ్రమణియన్ హీరోగా తెరకెక్కనున్న ఓ చిత్రంలో ప్రతినాయకుని పాత్రకు రావు రమేశ్‌ని సంప్రదించారట. ఈ కథ విని, ఎగై్జట్ అయిన రావు రమేశ్ గ్రీన్‌సిగ్నల్ ఇచ్చారట. -
బిగ్‌బాస్2లో లిప్‌లాక్
తమిళ బిగ్‌బాస్2 రోజురోజుకు రసవత్తరంగా మారుతోంది.. హౌస్మేట్స్ మధ్య టాస్క్‌ల జోరు పెరిగింది.. హౌస్మేట్స్ జనని, ఐశ్వర్యల మధ్య లిప్‌లాక్ శుక్రవారం నాటి ఎపిసోడ్లో హైలెట్‌గా నిలిచింది. టాస్క్‌లో భాగంగా ముంతాజ్, బాలాజీ డైపర్లు వేసుకుని చిన్న పిల్లల్లా ప్రవర్తించారు. జనని, వైష్ణవి మీసాలు పెట్టుకుని మగాళ్లలాగా నటించారు. ఐశ్వర్య, రమ్య ట్విన్స్లాగా నటించి హౌస్మేట్స్ అడిగిన ప్రశ్నలకు ఒకరి తర్వాత ఒకరు సమాధానాలు చెప్పారు. ఎపిసోడ్ ప్రారంభంలో హౌస్మేట్స్ ఎంత ఉత్సాహంగా ఉన్నారో ముగింపుకు వచ్చేసరికి అంత బద్ధకంగా తయారయ్యారు. మొత్తానికి తమిళ్ బిగ్‌బాస్2 షో రోజురోజుకు మరింత ఎంటర్టైన్మెంట్ అందిస్తోంది. అంతకుమించి అనిపించేలా షో సాగిపోతోంది. కమల్‌హాసన్ హోస్ట్‌గా వ్యవహరిస్తున్న ఈ షో తమిళ టీవీ వీక్షకులను బాగానే ఆకట్టుకుంటోంది. -
తమిళనాడు వెళ్లనున్న ‘భరత్’...?
సూపర్ స్టార్ మహేష్ బాబు నటించిన ‘భరత్ అనే నేను’ చిత్రం మంచి కలెక్షన్సతో బాక్సాఫీస్ వద్ద భారీ విజయాన్ని అందుకున్న సంగతి తెలిసిందే. రాజకీయ నేపథ్యంలో సాగే ఈ చిత్రం రెండు తెలుగు రాష్ట్రాల్లోనే కాక చెన్నైలోను విడుదలై, అక్కడ కూడా మంచి వసూల్లు సాధించింది. దాంతో ఈ చిత్నాన్ని తమిళంలోను అనువాదించాలని చిత్న నిర్మాతలు భావిస్తున్నట్లు సమాచారం. ప్రస్తుతం డబ్బింగ్ పనులు ప్రారంభమయ్యాయని, అయితే విడుదల తేదీని త్వరలోనే ప్రకటిస్తారని పుకార్లు వినిపిస్తున్నాయి. అయితే దీని గురించి చిత్ర యూనిట్‌నుంచి ఎటువంటి అధికారిక సమాచారం వెలువడలేదు. కొరటాల శివ దర్శకత్వంలో రూపొందిన ఈ చిత్రాన్ని డీవీవీ దానయ్య నిర్మించగా కైరా అద్వానీ కథానాయకిగా నటించారు. -
ప్రముఖ సంగీత దర్శకుడు హఠాన్మరణం
సాక్షి , హైదరాబాద్: ప్రముఖ సంగీత దర్శకుడు ఆదిత్యన్ (63) కన్నుమూశారు. కిడ్నీ ఫెయిల్యూర్ కారణంగా తమిళ సంగీత దర్శకుడు ఆదిత్యన్ హైదరాబాద్‌లో మంగళవారం రాత్రి తుదిశ్వాస విడిచారు. హైదరాబాద్‌లో ఉంటున్న కుమార్తెను చూడటానికి వచ్చిన ఆయన అకస్మాత్తుగా అనారోగ్యంతో కుప్పకూలిపోయారు. రేపు (డిసెంబర్7) చెన్నైలో ఆదిత్యన్ అంత్యక్రియలు నిర్వహించనున్నారు. 90 లలో తమిళం, మలయాళంతో పాటు తెలుగు సినిమాలకు ఆదిత్యన్ సంగీతాన్ని అందించారు. అమరన్, సీవల్ పేరి పాండి, కోవిల్పట్టి వరలక్ష్మి తదితర చిత్రాలు ఆయన సంగీత సారధ్యంలో వచ్చిన ప్రముఖ చిత్రాలు. తన సొంత చిత్రాలకు, ఇతర స్వరకర్తలకు కూడా అనేక పాటలను పాడారు. అంతేకాదు ఇండియా, మలేషియాలో విడుదలైన తమిళ పాప్, రీమిక్స్ ఆల్బమ్స్ ద్వారా ప్రసిద్ది చెందారు. అలాగే స్థానిక టీవీలో ఎనిమిదేళ్లపాటు ఆదిత్యన్ కిచెన్ పేరుతో వంటల కార్యక్రమాన్ని కూడా నిర్వహించారు. ఆదిత్యన్ అకాలమృతిపై పలువురు సినీ ప్రముఖులు, ఇతర నటీనటులు దిగ్ర్భాంతిని, సంతాపాన్ని వ్యక్తం చేశారు. -
పరువు హత్యల కళిరు
తమిళసినిమా: పరువు హత్యలు ఇతివృత్తంగా తెరకెక్కించిన చిత్రం కళిరు అని ఆ చిత్ర దర్శకుడు జీజే.సత్య తెలిపారు. సీబీఎస్.ఫిలింస్, అప్పు స్టూడియోస్ సంస్థల అధినేతలు పి.విశ్వక్, ఏ.ఇనియవన్ నిర్మిస్తున్న ఈ చిత్రంలో నూతన నటీనటులు నటిస్తున్నారు. చిత్ర వివరాలను దర్శకుడు తెలుపుతూ ఇది పరువు హత్యల ప్రధాన ఇతివృత్తంగా రూపొందించిన చిత్రం అని తెలిపారు. కళిరు అంటే మగ ఏనుగు అనే అర్థం వస్తుందన్నారు. ఏనుగు యుద్ధంలో గాయాలకు గురైతే ఆత్మరక్షణ కోసం మొరటుతనంగా ప్రవర్తిస్తుందన్నారు. కొందరు రాజకీయనాయకులు తమ అధికార దాహం కోసం ఎలాంటి దురాగతాలౖకైనా పాల్పడతారని చెప్పే చిత్రంగా కళిరు ఉంటుందన్నారు. ప్రజల్ని భావోద్రేకాలకు గురి చేసి ఊరంతా ముప్పునకు గురైయ్యేలా చేసే రాజకీయవాదుల నైజాన్ని చెప్పే చిత్రం ఇదన్నారు అలా పరువు హత్యల ఇతివృత్తంగా ఈ చిత్రం ఉంటుందని చెప్పారు. ఇది సమాజంలో జరుగుతున్న సంఘటనలను సహజత్వానికి దగ్గరగా ఉండాలన్న భావంతో నూతన తారలతో రూపొందించామని చెప్పారు. విశ్వక్, అనుకృష్ణ, నీరజ, దీపాజయన్, శివకేశన్, దురైసుధాకర్, జీవా, ఉమాశంకర్, టీపొట్టిగణేశ్, కాదల్ అరుణ ప్రధాన పాత్రలు పోషించిన ఈ చిత్ర షూటింగ్‌ను 58 రోజుల్లో పూర్తి చేశామన్నారు. చిత్ర గీతాలను త్వరలోనే విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నట్లు దర్శకుడు చెప్పారు -
ఆంధ్ర కళాకారులకు తమిళనాట ప్రాచుర్యం
‘సాక్షి’తో పద్మభూషణ్ పాల్ఘాట్ మణి అయ్యర్ మనుమడు రాంప్రసాద్ రాజమహేంద్రవరం కల్చరల్: ‘ఆంధ్రదేశానికి చెందిన కళాకారులు ఎందరో తమిళనాట ప్రాచుర్యం పొందుతున్నారు. నాటి త్యాగయ్య నుంచి ఈ జిల్లాకు చెందిన మంగళంపల్లి బాలమురళీకృష్ణ, నేదునూరి కృష్ణమూర్తి, వైణికుడు చిట్టిబాబు, పశ్చిమగోదావరి జిల్లా పాలకొల్లుకు చెందిన ‘మాండొలిన్’ శ్రీనివాస్ వీరందరూ తమిళనాడులో ఎక్కువగా గుర్తింపుపొందారు ’ అన్నారు ప్రముఖ మృదంగ విద్వాంసుడు, పద్మభూషణ్ పాల్ఘాట్ మణి అయ్యర్ మనుమడు, సంగీత విద్వాంసుడు పాల్ఘాట్ రాంప్రసాద్. మణి అయ్యర్ జయంతి సంగీతోత్సవాలలో పాల్గొనడానికి నగరానికి వచ్చిన ఆయన ‘సాక్షి’తో ప్రత్యేకంగా మాట్లాడారు. తెలుగు కళాకారులు పొరుగున ఉన్న తమిళనాట గుర్తింపు పొందడం, సత్కారాలు అందుకోవడం మంచి పరిణామం, ప్రతిభకు ప్రాంతీయభేదాలు లేవు, ఉండకూడదని ఆయన అన్నారు. ‘స్వ’గతం నేను ఏడాదిలోపు వయసులో ఉండగానే, తాతగారు పాల్ఘాట్ మణి అయ్యర్ కన్ను మూశారు. ఆయనకు ముగ్గురు కుమారులు, ఇద్దరు కుమార్తెలు. నేను చివరి కుమారుడి కొడుకును. మిగిలిన అందరికీ ఆడపిల్లలే. నా తండ్రే సంగీతంలో నాకు గురువు. నేను మూడో తరానికి చెందిన సంగీతకళాకారుడిని. ప్రస్తుతం ప్రపంచబ్యాంకుకు ఆర్థిక సలహాదారుడిగా ఉన్నాను. నేటి సంగీతధోరణులపై.. స్పాన్సరర్లను కళాకారులు అవకాశాలను ఇమ్మని అడిగే రోజులు రావడంతో నాణ్యత తగ్గిపోతోంది. ఉత్తరభారతంలో ఈ పరిస్ధితి లేదు. హిందుస్థానీ కళాకారులు తమ స్ధాయిని నిలబెట్టుకుంటున్నారు. యువతకు నా సలహా.. సంగీతం ‘క్రాష్’ కోర్సుకాదు. ఇది ఒక కంప్యూటర్ కోర్సులా నేర్చుకోవడానికి కుదరదు. నిరంతర సాధన అవసరం. తాతగారు వేదికపై ప్రోగ్రాం ఇచ్చేలోపున కనీసం వందసార్లు సాధన చేసేవారని నా తండ్రి చెబుతూండేవారు. కావేరీ జలాలు సేవిస్తే సంగీతం, గోదావరి జలాలు సేవిస్తే సాహిత్యం అబ్బుతాయని చెబుతారు. ఈనగరంలో గాత్రకచేరీ ఇచ్చే అవకాశం రావడం నా అదృష్టంగా భావిస్తున్నాను.. -
బాహుబలి-2:ఆరు గంటల్లో కోటి వ్యూస్..!
-
బాహుబలి 2 ట్రైలర్ వచ్చేసింది
సగటు తెలుగు సినిమా ప్రేక్షకుడు ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న బాహుబలి 2 ది కంక్లూజన్ ట్రైలర్ వచ్చేసింది. తెలుగు, తమిళం, హిందీ, మళయాళం భాషల్లో బాహుబలి 2 ది కంక్లూజన్ ట్రైలర్లు విడుదలయ్యాయి. మొదట ఒక నిమిషం 52 సెకన్ల నిడివి కలిగిన తమిళ ట్రైలర్ ఆన్లైన్లో బయటకొచ్చింది. ఆ తర్వాత రెండు నిమిషాల 24 సెకన్ల నిడివి కలిగిన హిందీ ట్రైలర్‌ను కరణ్ జోహర్ ట్విట్టర్ ద్వారా షేర్ చేశారు. గురువారం ఉదయం సినీమ్యాక్స్‌లో తెలుగు ట్రైలర్‌ను విడుదల చేశారు. ట్రైలర్ విడుదల కార్యక్రమానికి ప్రభాస్, రానాలు హాజరయ్యారు. సినిమాపై ఉన్న అంచనాలను నిజం చేస్తూ మైండ్ బ్లోయింగ్ వీఎఫ్ఎక్స్తో ట్రైలర్ రూపుదిద్దుకుంది. రమ్యకృష్ణ కాలిని ఎవరో తాకుతున్నట్లు మొదలైన తమిళ ట్రైలర్.. బాహుబలిని కట్టప్ప పొడిచి చంపడం.. లాంటి ఉత్కంఠ భరిత సీన్లతో ముందుకు సాగింది. అయితే, కట్టప్ప బాహుబలిని ఎందుకు చంపాడు అనే ప్రశ్నను పొడిగిస్తూ.. ప్రశ్నార్ధకంగానే ఉంచేశారు. బాహుబలి-2లో ప్రభాస్, రానాలు ఈ సినిమాలో హీరో, విలన్లుగా నటిస్తున్న విషయం తెలిసిందే. అనుష్క, తమన్నాలు హీరోయిన్లు. ఆర్కా మీడియా వర్క్స్ ఈ చిత్రాన్ని నిర్మిస్తుండగా.. రాజమౌళి దర్శకత్వం వహిస్తున్నారు. సత్యరాజ్, రమ్యకృష్ణ, నాజర్ తదితరులు కీలకపాత్రల్లో నటిస్తున్నారు. తెలుగు ట్రైలర్ The most awaited "Baahubali2 - The Conclusion" Trailer is finally out! #Baahubali2Trailerhttps://t.co/KrGFW0rq3g — Baahubali (@BaahubaliMovie) March 16, 2017 తమిళం ట్రైలర్ #Baahubali2trailer mind blowing vfx... Just Wainting to see pic.twitter.com/xvPWiC9DD5 — Shivajisajiv (@shivajisajiv2) March 16, 2017 హిందీ ట్రైలర్ #Baahubali2Trailer https://t.co/53YkDNxqkh @ssrajamouli #Arka #AAFilms @dharmamovies #Prabhas @RanaDaggubati — Karan Johar (@karanjohar) March 16, 2017 -
భారతీయతకు ప్రతిబింబం సాహిత్యసదస్సులు
ఆధునిక తమిళ–తెలుగుకవితల సారూప్యతా సదస్సులో వక్తలు యానాం : మనుషులు రోబోలుగా మారిపోతున్న ప్రస్తుత తరుణంలో సాహిత్యసదస్సులు మానవత్వాన్ని ప్రేరేపిస్తాయని, ప్రాంతీయబేధాలు తొలగి భారతీయత ప్రతిఫలిస్తుందని కేంద్రసాహిత్యఅకాడమీ చెన్నై అధికారి ఇళంగోవన్ పేర్కొన్నారు. శుక్రవారం స్థానిక డాక్టర్ సర్వేపల్లిరాధాకృష్ణన్ ప్రభుత్వ ఆర్ట్స్ కళాశాల సెమినార్ హాలులో ఆధునిక తమిళ–తెలుగు కవితల సారూప్యతా సదస్సు సాహిత్య అకాడమీ సాధారణ మండలి సభ్యులు ఆర్ సంపత్ అధ్యక్షతన జరిగింది. ఈ సందర్భంగా ఇళంగోవన్ ముఖ్యఅతిథిగా పాల్గొని మాట్లాడుతూ సాహిత్య సదస్సులు ప్రజల మ«ధ్య సహృద్భావాన్ని పెంచడానికి తోడ్పడతాయన్నారు. పరిపాలనాధికారి దవులూరి సుబ్రహ్మణ్యేశ్వరరావు మాట్లాడుతూ నేటి యువత సాహిత్యంపై దృష్టిసారించాల్సిన ఆవశ్యకత ఉందన్నారు. సాహిత్యం చదవడం ద్వారా భాషపైపట్టు సాధించడంతో పాటు దేశంలోని వివిధ రచయితల సాహిత్యాన్ని చదివి దేశసంస్కృతిని తెలుసుకునే అవకాశం ఉంటుందన్నారు. ప్రముఖ సాహిత్య విమర్శకులు దాట్ల దేవదానం రాజు కీలకోపన్యాసం చేశారు. అనంతరం జరిగిన మొదటి సమావేశానికి తమిళ తెలుగు పాటల ఒక సారూప్యత అనే అంశానికి అవ్వై నిర్మల అధ్యక్షత వహించారు. అదేవిధంగా తమిళ–తెలుగు దళితపాటలపై ఎన్ వజ్రవేలు మాట్లాడుతూ తమిళ తెలుగు దళితసాహిత్యం తదితర అంశాల గురించి వివరించారు. తెలుగు–తమిళ కవిత్వంలో గాంధీ ప్రభావం అనేఅంశంపై పి అమ్ముదేవి ప్రసంగించారు. అనంతరం జరిగిన రెండో సమావేశంలో ప్రముఖ తమిళకవి సుబ్రహ్మణ్యభారతి, జాషువాల కవిత్వాల్లో జాతీయవాద అంశాలు గురించి ప్రముఖకవి, తెలుగువిశ్వ విద్యాలయం విశ్రాంత ఆచార్యులు కె సంజీవరావు మాట్లాడారు. మహాకవి భారతి, గురజాడ అప్పారావు గురించి ధనుంజయన్ వివరించారు. మూడో సమావేశానికి కవి దాట్ల దేవదానంరాజు అధ్యక్షత వహించగా తెలుగుకవుల కవితాపఠనం సాగింది. కార్యక్రమంలో కళాశాల ప్రిన్సిపాల్ జయరాజ్ డేనియల్, తెలుగుశాఖ అధ్యక్షులు వి భాస్కరరెడ్డి, ముమ్మిడి శ్రీవీరనాగప్రసాద్ వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన కవులు అధికసంఖ్యలో పాల్గొన్నారు. -
జననీ విత్ ఫైవ్
మలయాళంలో మంచి క్రేజ్ ఉన్న నటి జననీఅయ్యర్. ఆ మధ్య తమిళంలో అవన్ ఇవన్ లాంటి చిత్రాలతో మంచి నటనను ప్రదర్శించి పేరు తెచ్చుకున్న ఈ అమ్మడుకు తెగిడి చిత్రం మంచి విజయాన్ని అందించింది. అయితే మలయాళంలో బిజీ కావడంతో కోలీవుడ్‌కు చిన్న గ్యాప్ వచ్చింది. తాజాగా ఐదు చిత్రాలతో కోలీవుడ్ ప్రేక్షకులను అలరించడానికి రెడీ అవుతున్నారు. ఈ ఐదు చిత్రాల నిర్మాణం వివిధ దశల్లో ఉందంటున్న జననీ అయ్యర్ నటించిన అదేకంగళ్ చిత్రం ముందుగా తెరపైకి రావడానికి సిద్ధం అవుతోంది. దీని గురించి జననీ తెలుపుతూ అదేకంగళ్ చిత్రంలో సాధన అనే యువతిగా పాత్రికేయురాలి పాత్రలో నటిస్తున్నానని చెప్పారు. నటి శివద సేల్స్‌గర్ల్ పాత్రలో మరో హీరోయిన్ గా నటిస్తున్నారని, కలైయరసన్ హీరోగా నటిస్తున్న ఈ చిత్రం ట్రయాంగిల్ లవ్‌స్టోరీగా ఉంటుందన్నారు. సంగీతదర్శకుడు జిబ్రాన్ సంగీతం అంటే తనకు చాలా ఇష్టం అని, ఆయన సంగీతం సమకూర్చుతున్న ఈ చిత్రంలో నటించడం చాలా ఆనందంగా ఉందని తెలిపారు. ఇందులో ఐదు పాటలు ఉంటాయని చెప్పారు. నవ దర్శకుడు రోహిన్ ఈ చిత్రం ద్వారా దర్శకుడిగా పరిచయం అవుతున్నారని, ఆయనకిది తొలి చిత్రం అయినా మంచి అనుభవం ఉన్న దర్శకుడిలా చిత్రాన్ని తెరకెక్కిస్తున్నారని అన్నారు. అదేకంగళ్ చిత్రంలో నటించడం మంచి అనుభవం అని పేర్కొన్నారు. కాగా ఈ బ్యూటీ జై కు జంటగా బెలూన్ , అశ్విన్ కనుమను సరసన తొలైకాచ్చి, రమీజ్రాజాతో విధి మది ఉల్టా చిత్రాల్లో నటిస్తున్నారు. -
అమ్మకోసం మరో సింహాసనం
చెన్నై: అసాధారణ వ్యక్తిత్వం..పోరాట పంథాతో తుదికంటూ పోరాడి దేశ రాజకీయాల్లో తనకంటూ ఒక ప్రత్యేక స్థానాన్ని సంపాదించుకున్న మహిళా రాజకీయవేత్త తమిళనాడు ముఖ్యమంత్రి జయలలిత. తీవ్ర అనారోగ్యంతో బాధపడుతూ డిశంబర్ 5న అమ్మ కన్నుమూయడం తమిళ ప్రజలతో పాటు పలు వర్గాలు విషాదంలో మునిగిపోయాయి. కథానాయకిగా సినీరంగంలో వెలుగుతూ రాజకీయాల్లోకి ప్రవేశించి విప్లవనాయకిగా కీర్తి గడించిన అలనాటి అందాల తార జయలలితకు తమిళ సినీ రంగ ప్రముఖులు ట్విట్టర్ ద్వారా నివాళు లర్పించారు. ముఖ్యంగా తమిళ సినీ అగ్ర కథానాయికలు అమ్మ ఆత్మకు శాంతి కలగాలంటూ ట్విట్ చేశారు. హీరోయిన్లు గౌతం వాసు దేవ్ మీనన్, రాధిక, త్రిష, శృతి హాసన్ తదితరులు ఆమెకు నివాళులర్పించినవారిలో వున్నారు. స్వర్గంలో ఆమెకోసం మరోసింహాసనం ఎదురుచూస్తోందని హీరోయిన్ త్రిష ట్వీట్ చేశారు. తనకు అత్యంత ఇష్టమైన వ్యక్తి జయలలిత అంటూ ఆమె సంతాపం ప్రకటించారు. ఆమెను కలవడం అదృష్టమనీ, చాలా గర్వంగా ఉందంటూ జయలలిత కలిసిన క్షణాలను ఆమె గుర్తు చేసుకున్నారు. అతి ధైర్యవంతమైన మహిళల్లో జయలలిత ఒకరని శృతి హాసన్ ట్వీట్ చేశారు. తమిళనాడు అత్యంత సాహసోపేతమైన మహిళా నాయకురాలని కోల్పోయిందని, ఆమె మృతి తీరనిలోటని విచారం వ్యక్తం చేశారు. ఆమె ఒక ఫైటర్ , అందరికీ స్పూర్తి ప్రదాత అంటూ ప్రముఖ నటి రాధిక శరత్ కుమార్ ట్వీట్ చేశారు. ముఖ్యమంత్రి జయలలిత మరణం తమిళ ప్రజలకు తీరని లోటు..కానీ వారి గుండెల్లో శాశ్వతంగా మిగిలిపోతారని, ఆత్మకు శాంతి కలగాలని రాధిక ప్రార్థించారు. మరోవైపు తమిళనాడుకేకాదు...యావత్ భారతదేశానికే సాహస పుత్రిక అని సూపర్ స్టార్ రజనీకాంత్ ట్విట్టర్ ద్వారా అమ్మ మృతికి సంతాపం తెలిపారు. బల్గేరియాలో షూటింగ్ లో ఉన్న అజిత్ కుమార్ అమ్మ మృతిపట్ల తీవ్ర దిగ్భ్రాంతిని వ్యక్తం చేశారు. జీవితంలో అనేక యుద్ధాల్లో పోరాడుతూ ధైర్యంగా నిలబడ్డారనీ, ఈ సమయంలో ఈ విషాదాన్ని తట్టుకునే శక్తిని ఆ దైవం ప్రసాదించాలంటూ ట్వీట్ చేశారు. తనకు అత్యంత ఇష్టమైన వ్యక్తి జయలలిత అనీ హీరోయిన్ త్రిష సంతాపం ప్రకటించారు. స్వర్గంలో ఆమెకోసం మరోసింహాసనం ఎదురుచూస్తోందని ట్వీట్ చేశారు. ఆమెను కలవడం ఒక అదృష్టమనీ, ఇందుకు తనకు చాలా గర్వంగా ఉందంటూ జయలలితను కలిసిన క్షణాలను ఆమె గుర్తు చేసుకున్నారు. అతి ధైర్యవంతమైన మహిళల్లో జయలిలత ఒకరని మరో హీరోయిన్ శృతి హాసన్ ట్వీట్ చేశారు. తమిళనాడు ఒక సాహసోపేతమైన మహిళా నాయకురాల్ని కోల్పోయిందని, ఆమె మృతి తీరనిలోటని విచారం వ్యక్తం చేశారు. ఆమె ఒక ఫైటర్ , అందరికీ స్పూర్తి ప్రదాత అంటూ ప్రముఖ నటి రాధిక శరత్ కుమార్ ట్వీట్ చేశారు. ఆమె మరణం తమిళ ప్రజలకు తీరని లోటు..కానీ వారి గుండెల్లో శాశ్వతంగా మిగిలిపోతారని, ఆత్మకు శాంతి కలగాలని ప్రార్థించారు. వీరందరితో పాటు పార్తీపన్, మాధవన్, నకుల్ , జయం రవి తదితర పలువురు సినీ ప్రముఖులు జయలలిత ఆత్మకు శాంతి కలగాలంటూ ట్వీట్స్ చేసారు. Der will never be another U❤️ #ironlady #TamilNadusdaughter #myalmamatter #ChurchParkian #mostcherishedmemories #darkestdayinTN #heartbroken pic.twitter.com/DUa4159DO4 — Trisha Krishnan (@trishtrashers) December 5, 2016 -
అమ్మ ఆరోగ్యం: తమిళ టీవీ చానల్ షేర్ల లాభాలు
చెన్నై: తమిళనాడు ముఖ్యమంత్రి జయలలిత ఆరోగ్య పరిస్థితిపై నెలకొన్న ఆందోళన క్రమంలో స్టాక్ మార్కెట్లో టీవీ నెట్ వర్క్ షేర్లకు డిమాండ్ పెరిగింది. ఒకవైపు అంతర్జాతీయ ప్రతికూల సంకేతాల నేపథ్యంలో్ మార్కెట్లు తీవ్ర ఒడిదుడుకుల మధ్య కొనసాగుతూ నష్టాల్లో ట్రేడ్ అవుతున్నాయి. మరోవైపు అమ్మకు కార్డియాక్ అరెస్ట్ వార్తలతో తమిళ టీవీ చానళ్ల షేర్లకు డిమాండ్ పెరిగింది. దాదాపు 6- 9 లాభాలమధ్య కొనసాగుతున్నాయి. సన్ టీవీ నెట్వర్క్ షేరు 6.5 రాజ్ టీవీ 8.8 శాతం దూసుకెళ్లాయి. జీ ఎంటర్ టైన్ మెంట్ 2.17శాతం, టీవీ18 0.14 శాతం, డిష్ టీవీ 1.64 శాతం నష్టపోవడం గమనార్హం. కాగా సన్ టీవీ అధినేత కళానిధి మారన్ తమిళనాడు ప్రతిపక్ష పార్టీ డీఎంకే అధినేత కరుణానిధికి మారన్ మునిమేనల్లుడున్న సంగతి విదితమే. -
తమిళ ఖైదీల రికార్డు
► ఉత్పత్తుల తయారీ ద్వారా రూ.47.87 కోట్లు సంపాదన సాక్షి ప్రతినిధి, చెన్నై: రికార్డు సాధనకు జైలు జీవితం ఎంతమాత్రం అడ్డుకాదని నిరూపించారు తమిళనాడులోని ఖైదీలు. తమకు తెలిసిన వృత్తుల ద్వారా ఉత్పత్తులను తయారుచేసి విక్రయించడం ద్వారా 2015లో రూ.47.87 కోట్ల ఆదాయాన్ని సాధించారు. దేశంలోనే అత్యధిక మొత్తంగా రికార్డు సృష్టించారు. అనేక నేరాలకు పాల్పడి జైలు జీవితం అనుభవిస్తున్న ఖైదీలకు వారివారి పూర్వానుభవాన్నిబట్టి జైల్లో పనులను అప్పగిస్తుంటారు. దేశంలో మొత్తం 1,401 జైళ్లు ఉండగా 3లక్షల 66వేల 781 మంది ఖైదీలను ఉంచగల వసతి ఉంది. గత ఏడాది డిసెంబరు 31వ తేదీ నాటి లెక్కల ప్రకారం వాటి సామర్థ్యానికి మించిన ఖైదీలను అంటే 4 లక్షల 19వేల 623 మందిని ఉంచుతున్నట్లు తేలింది. వీరిలో 5,203 మంది మానసిక వికలాంగులు, హత్య కేసుల్లో నేరస్తులు 70,827 మంది ఉన్నారు. 2,08,276 మంది రిమాండు ఖైదీల్లో 80,528 మందికి రాయడం రాదు. అలాగే 16,365 మంది పట్టభద్రులు ఉన్నారు. 2015లో తమిళనాడు జైళ్లలోని ఖైదీలకు చేనేత, చిత్రలేఖనం, తోలు ఉత్పత్తుల తయారీ, బేకరీ ఉత్పత్తుల తయారీ వంటి బాధ్యతలను అప్పగించారు. ఖైదీలతో నడుస్తున్న ఫ్రీడం బజార్ ద్వారా ఈ ఉత్పత్తుల అమ్మకాలతో రూ.47.87కోట్లు సంపాదించి తమిళ ఖైదీలు దేశంలోనే ప్రథమస్థానంలో నిలిచారు. ఢిల్లీ ఖైదీలు రూ.31 కోట్లతో రెండో స్థానం, కేరళ ఖైదీలు రూ.22.9 కోట్లతో మూడవ స్థానంలో నిలిచినట్లు నేషనల్ క్రైం రికార్డ్సు బ్యూరో (ఎన్సీఆర్ బీ) బుధవారం ప్రకటించింది. -
నయనతార విలన్‌కి వెల్కమ్!
‘నాన్ దాన్ రుద్ర’ (నేనేరా రుద్ర).. అంటూ హిందీ దర్శకుడు అనురాగ్ కశ్యప్ తమిళ డైలాగులు చెబుతున్నారు. తమిళ భాషపై పట్టు సాధించాలని ప్రయత్నిస్తున్నారు. హిందీ వదిలేసి తమిళ సినిమా ఏదైనా తీస్తున్నారా? అనుకుంటున్నారా? దర్శకుడిగా కాదు, విలన్‌గా తమిళంలో ఎంట్రీ ఇస్తున్నారాయన. నయనతార పోలీసాఫీసర్‌గా నటిస్తున్న తమిళ సినిమా ‘ఇమైక్క నొడిగల్’. ఇందులో రౌడీ రుద్ర పాత్రలో అనురాగ్ నటించనున్నారు. విలన్‌గా అనురాగ్ కశ్యప్‌కి రెండో చిత్రమిది. ఆల్రెడీ ఏఆర్ మురుగదాస్ దర్శకత్వం వహించిన హిందీ సినిమా ‘అకీరా’లో విలన్ ఈయనే. ఆ సినిమాలో అనురాగ్ విలనిజంకి ఫిదా అయిన మురుగదాస్ తాజా తమిళ సినిమాకి ఆయన పేరును సూచించారట. ‘‘అనురాగ్ జీ.. వెల్కమ్ టు తమిళ ఇండస్ట్రీ’’ అని చిత్రదర్శకుడు అజయ్ జ్ఞానముత్తు పేర్కొన్నారు. ఇందులో నయనతార, అనురాగ్ మధ్య సన్నివేశాలు ఆసక్తికరంగా ఉంటాయని సమాచారం. ఈ సినిమాలో అథర్వ, రాశీ ఖన్నాలు ప్రధాన పాత్రల్లో నటిస్తున్నారు. -
3 నిమిషాల్లోనే తమన్నా తమిళం నేర్పిస్తుంది!
కేవలం మూడు నిమిషాల్లోనే మీకు తమిళ భాష నేర్చుకోవాలని ఉందా? అయితే, మీరు మిల్కీ బ్యూటీ తమన్నా క్రాష్ కోర్సులో చేరాల్సిందే. చెన్నైలోకి గడిపేందుకు సరిపడా తమిళ భాషను మీకు మూడు నిమిషాల్లో నేర్పించేస్తానంటూ తమన్నా ముందుకొచ్చింది. ఆటో రిక్షా మాట్లాడటం దగ్గరి నుంచి ఇడ్లీ తెప్పించుకోవడం వరకు తమిళం నేర్పిస్తానంటూ ఓ ఫన్నీ వీడియోతో ఆవంతిక యూట్యూబ్‌లో హల్చల్ చేస్తోంది. ‘ద క్వింట్’ వెబ్‌సిరీస్ కోసం యాంకర్‌కు సరదాగా తమిళ భాషను నేర్పించింది తమన్నా. చెన్నైలో, హైదరాబాద్‌లో తనను ‘తమన్నా’ అని కాకుండా ‘థమన్హా’ అని పిలుస్తారట. ఇంకా ఏం చెప్పిందో మీరే చూడండి! -
అవేమీ లేకపోయినా హ్యాపీగానే..
ఇప్పుడు నేను పొందినవన్నీ లేకపోయినా చాలా సంతోషంగా ఉండేదాన్ని అన్నారు నటి అనుష్క. దీనిబట్టి చూస్తే సాధించానన్న గర్వం, ఏదో పోగొట్టుకున్నానన్న వైరాగ్యం స్పష్టంగా తెలుస్తోంది కదూ’ఈ యోగా సుందరి తన గతాన్ని తరచూ గుర్తు చేసుకుంటున్నారు. అగ్ర నాయకిగా తమిళం, తెలుగు భాషల్లో ఏలుతున్నా ఏదో అసంతృప్తి వెంటాడుతున్నట్లు ఆమె మాటల్లో తొంగిచూస్తోందనిపిస్తోంది. నటి గా పుష్కర కాలంలోకి ప్రవేశించిన అనుష్క మనోగతం ఏమిటో ఆమె మాటల్లోనే చూద్దాం. నా నటజీవితం పదేళ్లు దాటింది. చిన్నప్పుడు ఇతర ప్రదేశాలకు వెళ్లితే అక్కడి పరిస్థితులు నచ్చేవి కావు. ఎప్పుడు ఇంటికి పారిపోదామా అని అనిపించేది. సినిమాకు వచ్చిన కొత్తలోనూ అలాంటి భావనే. సినీ రంగప్రవేశానికి ముందు నాది చాలా చిన్ని లోకం.చాలా తక్కువ మంది స్నేహితులు ఉండేవారు. టీవీ చూడడం, స్నేహితులతో గడపడం, పుస్తకాలు చదువుకోవడం ఇదే అప్పట్లో నా దిన చర్య. సినిమాలోకి వచ్చిన తరువాత అంతా తలక్రిందులైపోయింది. వెళ్లే ప్రదేశాల్లో జనం. ఆటోగ్రాఫ్ లంటూ అభిమానుల గోల, షూటింగ్‌లు. అంతస్తు ఇలా నా జీవితమే మారిపోయింది. ఇవన్నీ లేకపోయినా నా జీవితం సంతోషంగానే ఉండేది. సినిమా నా జీవితాన్ని వం ద శాతం మార్చేసింది. చాలా మంది స్నేహితులయ్యారు. ఎన్నో దేశాలు చు ట్టొచ్చాను. అభినందనలు, కీర్తి, ఇలా శిఖరానికి చేర్చింది సినిమా. అయితే ఇవేవీ నాకు తలకెక్కలేదు. ఇంటికి వెళి తే అన్నీ మర్చిపోయి ఒక సాధార ణ అమ్మాయిగా మసలుకుంటాను. సిని మాలో చాలా మంది స్నేహితులున్నా రు. వారంతా నాకు సొంతం అయిపోయారు. సినిమా నాకు చాలా నేర్పిం ది. తమిళం, తెలుగు భాషల్లో ప్రము ఖ నటిగా రాణిస్తున్నాను. నటన కు ప్రాముఖ్యత ఉన్న పా త్రలు అమరుతున్నాయి. ఇది చా లా సంతోషాన్నిస్తోంది. -
మళ్లీ చొరబడిన తమిళ జాలర్లు
తడ : పులికాట్ సరస్సులో చేపల వేట విషయమై గత కొన్నేళ్లుగా సాగుతున్న వివాదం తాజాగా మళ్లీ మొదలైంది. తాజాగా తమిళనాడుకు చెందిన చిన్నమాంగోడు, పెద్దమాంగోడు, పుదుకుప్పం జాలర్లు రెండు రోజులుగా ఆంధ్ర హద్దుల్లోని ప్రాంతంలో చేపల వేట కొనసాగిస్తున్నట్టు జాలర్ల సంఘ నాయకుడు బొమ్మన్ ధనుంజయ గురువారం తెలిపారు. దాదాపు పది పడవల్లో తమిళ జాలర్లు ఆంధ్రా హద్దుల్లోకి ప్రవేశించడంతో అక్కడ వేట సాగిస్తున్న ఆంధ్రా జాలర్లు వివాదాలు తలెత్తకుండా అక్కడి నుంచి వెనక్కు తిరిగి వచ్చేసినట్లు ఆయన తెలిపారు. దీనిపై ఎస్ఐకి ఫిర్యాదు చేశామని, న్యాయస్థానం ద్వారా పరిష్కరించేందుకు సన్నద్ధం అవుతున్నట్టు తెలిపారు. . -
సినిమాను వదిలేది లేదు!
ఎన్ని కష్టాలు ఎదురైనా సినిమాను వదలను అంటున్నారు సొగసులన్నీ తనలో ఇముడ్చుకున్న నటి కాజల్‌అగర్వాల్. సుదీర్ఘకాలంగా కథానాయకిగా రాణిస్తున్న అతి కొద్దిమంది నటీమణుల్లో ఒకరు కాజల్. తమిళం, తెలుగు, హిందీ అంటూ నటిగా తన పరిధిని విస్తరించుకున్న ఈ ఉత్తరాది భామకిప్పుడు అవకాశాలు తగ్గుముఖం పట్టాయని, ఇక ఇంటి దారి పట్టే సమయం ఆసన్నమైందన్న ప్రచారం జోరందుకుంది. అయితే అలాంటి ప్రచారాన్ని కాజల్ కొట్టి పారేశారు. వదల బొమ్మాళి వదలా అన్న చందాన ఎన్ని కష్టాలు ఎదురైనా తాను సినిమాను వదిలేది లేదనీ స్పష్టం చేశారు. దీని గురించి కాజల్అగార్వాల్ స్పందిస్తూ సాహసాలు అంటే తనకు చిన్నతనం నుంచీ చాలా ఇష్టం అన్నారు. ధైర్యం అన్నది తనకు ఈ రంగానికి రాకముందే మెండుగా ఉందన్నారు. అదే తనకు సినిమా వైపు అడుగులు వేయడానికి దోహదపడిందని చెప్పవచ్చు. కొత్త విషయాలను నేర్చుకోవాలి. అసాధ్యం అన్నది సాధ్యం చేసుకోవాలని తపిస్తుంటానన్నారు. తాను పుట్టి పెరిగింది ముంబయిలోనే అయినా కళాశాలలో చదువుకునే రోజుల్లో మేముండే ప్రాంతానికి మూడు కిలోమీటర్ల దూరంలో ఉండే ఊర్ల వివరాల గురించి తనకు అస్సలు తెలిసేది కాదన్నారు. మా ఇంటి చుట్టూ ఉండే ప్రజలే తన లోకంగా భావించేదానినన్నారు. బాహ్య ప్రపంచం గురించి అసలు తెలుసుకునే దానిని కాదని తెలిపారు.అలాంటి పరిస్థితుల్లో నటిగా అవకాశం వచ్చిందన్నారు. ఇంకొకరైతే నటించడానికి అంగీకరించేవారేకాదని, భయపడి పారిపోయేవారని అన్నారు. సహజంగానే తనకు ధైర్యం అధికం కాబట్టి సినిమా వైపు తన పయనం సాగిందని పేర్కొన్నారు. ఆ ధైర్యమే వైవిధ్యభరిత కథా పాత్రల్లో నటించడానికి ఊతమిచ్చిందన్నారు. తమిళం, తెలుగు భాషల్లో నటించే అవకాశాలు వచ్చాయని, భాషా సమస్య ఎదురైందని చెప్పారు. ఎన్ని కష్టాలు ఎదురైనా సినిమాను వదిలి వెళ్లేదిలేదనే నిర్ణయాన్ని తీసుకున్నట్లు తెలిపారు. ఈ విషయంలో వెనుకడుగు వేసేది లేదని స్పష్టం చేశారు.ఈ రంగంలో నిత్యం కొత్త కొత్త విషయాలను నేర్చుకుంటున్నానని, ఇక్కడ ఇంకా సాధించాల్సింది చాలా ఉందని కాజల్ అంటున్నారు. -
తమిళంలో రీమేక్‌గా గీతాంజలి
ప్రస్తుతం సినిమా రీమేక్‌ల మయం అయిపోయిందని చెప్పవచ్చు. ఒక భాషలో విజయవంతమైన చిత్రం ఇతర భాషల్లో రీమేక్ ఖాయం అవుతోంది. కారణం నమ్మకం.అక్కడ హిట్ అవడంతో ఇక్కడా ఆ సక్సెస్‌ను క్యాష్ చేసుకోవచ్చుననే ఆలోచనా కావచ్చు. అలా తాజాగా తెలుగులో నటి అంజలి టైటిల్ పాత్ర పోషించిన హారర్ కామెడీ కథా చిత్రం గీతాంజలి తమిళంలో రీమేక్ కానుందన్నది తాజా సమాచారం. హాస్యన టుడు శ్రీనివాసరెడ్డి అంజలికి జంటగా నటించిన ఈ చిత్రం తెలుగులో మంచి విజయాన్ని సొంతం చేసుకుంది. అంజలి ద్విపాత్రాభినం మంచి ప్రశంసలు అందుకుంది. రాజ్‌కిరణ్ దర్శకత్వం వహించిన గీతాంజలి 2014లో విడుదలైంది. ఆ చిత్రం ఇప్పుడు తమిళంలో రీమేక్ కానుందని కోలీవుడ్ సమాచారం. అంతే కాదు ఇందులో యువ సంగీతదర్శకుడు, సక్సెస్‌పుల్ హీరో జీవీ.ప్రకాశ్‌కుమార్ కథానాయకుడిగా నటించనున్నట్లు తెలుస్తోంది. ఇటీవల హలో నాన్ పేయ్ పేసురేన్ చిత్రం ద్వారా దర్శకుడిగా పరిచయమై తొలి విజయాన్ని అందుకున్న ప్రసాద్ ఈ చిత్రానికి మెగాఫోన్ పట్టనున్నట్లు సమాచారం. దీన్ని ఇంతకు ముందు పొల్లాదవన్, జిగర్తండా వంటి విజయవంతమైన చిత్రాలను నిర్మించిన ఫైవ్‌స్టార్ కథారేశన్ నిర్మించనున్నట్లు సమాచారం. ఇందులో హీరోయిన్గా అంజలి నటిస్తారా? అన్నది తెలియాల్సి ఉంది. ఈ చిత్రానికి సంబంధించిన పూర్తి వివరాలు త్వరలో వెల్లడి అయ్యే అవకాశం ఉన్నట్లు కోలీవుడ్ వర్గాల టాక్. -
త్వరలో ఎస్వీబీసీ తమిళ ఛానల్
తిరుమల: బుల్లితెరపై ఆధ్యాత్మిక కార్యక్రమాల్లో విశేష ఆదరణ పొందిన శ్రీవేంకటేశ్వర భక్తి చానల్ ప్రత్యేకంగా తమిళ భాషలో కనిపించనుంది. ప్రస్తుతం తెలుగు ఛానల్లోనే తమిళం,కన్నడం కార్యక్రమాలను ప్రసారం చేస్తున్నారు. శ్రీవారి దర్శనం కోసం వచ్చేవారిలో 45 శాతం తమిళ భక్తులు, 20శాతం కన్నడ భక్తులు ఉంటున్నారు. ఒకవైపు తెలుగు ఛానల్లో ఇతర భాషా కార్యక్రమాలు చేయటం సరికాదనే డిమాండ్.. మరోవైపు తమిళ, కన్నడ భక్తుల నుండి తమ భాషలకు కూడా ప్రాధాన్యతను ఇవ్వాలనే విజ్ఞప్తులు పెరిగాయి. దీంతో వీరికోసం ప్రత్యేకంగా తమిళంలోనే ఎస్వీబీసీ కార్యక్రమాలు ప్రసారం చేయాలని రెండేళ్ల కిందట టీటీడీ నిర్ణయించింది. ఆ మేరకు ఢిల్లీలోని సమాచార, బ్రాడ్ కాస్టింగ్ మంత్రిత్వశాఖకు దరఖాస్తు చేసుకుంది. అనుమతుల అనంతరం తమిళం, కన్నడ భాషలకు సంబంధించిన భక్తి కార్యక్రమాలను ప్రసారం చేయనున్నారు. -
నాగ్ నోట... తమిళ మాట!
ఫిమేల్ ఫ్యాన్ ఫాలోయింగ్ దక్కించుకున్న హీరోలు ఇంటిల్లిపాదికీ దగ్గరైపోతారు. అలా దగ్గరైనవాళ్లలో నాగార్జున ఒకరు. ఇప్పటికీ ఆయనకున్న ఫిమేల్ ఫాలోయింగ్ ఏ మాత్రం తగ్గకపోవడం విశేషం. ‘‘మానసికంగా ఇంకా యంగ్‌గానే ఉన్నాను. ఏ మగాడైనా ఆడవాళ్ల దృష్టిని ఆకట్టుకోవాలనుకుం టాడు. అది తప్పు కాదు. నిజం చెప్పాలంటే... ఆడవాళ్ల ఫాలోయింగ్ నాకు ఇంకా కావాలని ఉంది. ఆ ఫాలోయింగ్‌ను ఎంజాయ్ చేస్తా’’ అని నాగార్జున అన్నారు. తెలుగు, తమిళ భాషల్లో కార్తీ, తమన్నాతో కలిసి నటించిన ‘ఊపిరి’ (తమిళంలో ‘తోళా’) గురించి మాట్లాడుతూ - ‘‘తమిళంలో నా పాత్రకు నేనే డబ్బింగ్ చెప్పుకున్నా. నన్ను డబ్బింగ్ చెప్పమని ప్రోత్సహించింది కార్తీనే. ‘నా గొంతు వాడుకోవాలో? లేదో మీరే నిర్ణయించుకోండ’ని దర్శకుడు వంశీ పైడిపల్లి, కార్తీతో అన్నాను. నా వాయిస్ ఉంటేనే పాత్ర ఎలివేట్ అవుతుందన్నారు. దాంతో చెప్పా’’ అన్నారు. యంగ్ ఫ్యామిలీస్‌ని... ‘పడేసావే’ శుక్రవారం విడుదలవుతున్న ‘పడేసావే’ గురించి బుధవారం జరిగిన ప్లాటినమ్ డిస్క్ వేడుకలో నాగ్ మాట్లాడారు. కార్తీక్ రాజు, నిత్యాశెట్టి, శ్యామ్ ప్రధాన పాత్రల్లో నాగార్జున ప్రోత్సాహంతో అయాన్ క్రియేషన్స్ పతాకంపై చునియా దర్శకత్వంలో ఈ చిత్రం రూపొందింది. నాగార్జున మాట్లాడుతూ - ‘‘ఏడు నెలల క్రితం చునియా ఈ కథ చెప్పింది. నాకు చాలా నచ్చింది. నా సపోర్ట్ కావాలని అడిగింది. ‘నువ్వు సినిమా చెయ్. చూసి, నచ్చితే ప్రమోట్ చేస్తా’ అన్నాను. సినిమా చూశాను. నాకు చాలా నచ్చింది. యంగ్ ఫ్యామిలీస్‌కి బాగా నచ్చే చిత్రం ఇది. క్యారెక్టర్స్‌లో ఇన్వాల్వ్ అయిపోయి, చూశాను. అనూప్ పాటలు, కిరణ్ రాసిన డైలాగ్స్ చాలా బాగున్నాయి. టీమ్ అంతా కష్టపడి, ఇష్టంతో చేసిన చిత్రం ఇది’’ అన్నారు. -
ఐఫా-ఉత్సవం అదరహో..!
-
ఐఫా-ఉత్సవం అదరహో..!
ఇంటర్నేషనల్ ఇండియన్ ఫిల్మ్ అకాడెమీ - ఐఫా ఉత్సవం (సౌత్) 2016 వేడుక హైదరాబాద్‌లో అంగరంగ వైభవంగా సాగుతోంది. జియోనీ, రేనాల్ట్ సంస్థల సహ సమర్పణలో ఫార్చ్యూన్ సన్‌ఫ్లవర్ ఆయిల్ అందిస్తున్న ఈ ఉత్సవంకు గచ్చిబౌలిలోని ఔట్‌డోర్ స్టేడియమ్ వేదికగా నిలిచింది. తొలి రోజైన ఆదివారం తమిళ, మలయాళ సినీ పరిశ్రమలకు సంబంధించిన అవార్డుల ప్రదానం ఆర్భాటంగా జరిగింది. సోమవారం రాత్రి పొద్దుపోయే సమయానికి తెలుగు, కన్నడ సినీ పరిశ్రమల్లో ఉత్తమ చిత్రం, ఉత్తమ నటుడు, ఉత్తమ సంగీత దర్శకుడు తదితర అనేక విభాగాల్లో అవార్డుల ప్రదానం జోరుగా సాగుతోంది. అవార్డుల ప్రదానానికి ముందు అగ్ర నటీనటులు, సాంకేతిక నిపుణులు ఉల్లాసంగా గ్రీన్ కార్పెట్ మీదుగా నడుచుకుంటూ సభా ప్రాంగణంలోకి వచ్చారు. అగ్ర సంగీత దర్శకుడు దేవిశ్రీ ప్రసాద్ తన సంగీతంతో ప్రేక్షకుల్లో ఉత్సాహం నింపారు. రాత్రి 9:30 గంటలకు అవార్డుల వేడుక ప్రారంభమైంది. ముందుగా నటి కల్పన మృతికి సంతాపంగా సభికులందరూ ఒక నిమిషం మౌనం వ హించారు. అనంతరం తెలంగాణ రాష్ట్ర సినిమాటోగ్రఫీ శాఖ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ ప్రారంభోపన్యాసం చేశారు. హీరోలు అల్లు శిరీష్, నవదీప్, హీరోయిన్ రెజీనా వ్యాఖ్యాతలుగా వ్యవహరించారు. ప్రభుదేవా, శ్రీయా, భరత్ కొన్ని తమిళ హిట్ పాటలకు డ్యాన్స్ చేశారు. అనంతరం నేపథ్య గాయని విభాగంలో ‘బాహుబలి’ చిత్రంలోని ‘ఒడి బాహుబలి’ పాట పాడిన ‘సత్యయామిని’కి నిర్మాతలు కేఎస్ రామారావు, సి.అశ్వినీదత్ అవార్డు అందించారు. ఉత్తమ నేపథ్య గాయకుడి అవార్డును ‘శ్రీమంతుడు’ చిత్రంలోని ‘జతకలిసే’ పాటకు సాగర్ అందుకున్నారు. ఉత్తమ గేయ రచయితగా ‘శ్రీమంతుడు’ చిత్రంలోని ‘రామ రామ’ పాటకు రామజోగయ్య శాస్త్రి పురస్కారం అందుకున్నారు. అక్కినేని స్మారక పురస్కారాన్ని నాగార్జున, అమల, నాగ సుశీల, సుమంత్ అందుకున్నారు. తెలుగు సినిమా అవార్డులతో పాటు కన్నడ చిత్రాలకు కూడా పురస్కారాలను అందించారు. కన్నడ సినిమా అవార్డులకు విజయ్ రాఘవేంద్ర, అకుల్ బాలాజీ వ్యాఖ్యాతలుగా వ్యవహరించారు. ఈ వేడుకలో చిరంజీవి, బాలకృష్ణ, నాగార్జున, వెంకటేశ్, మహేశ్‌బాబు, అల్లు అర్జున్, రామ్ చరణ్, రానా, నాని, వివేక్ ఒబెరాయ్ తదితర హీరోలతో పాటు దర్శకులు కె.రాఘవేంద్రరావు, కొరటాల శివ, వీర శంకర్, నిర్మాతలు నిమ్మనగడ్డ ప్రసాద్, కేఎల్ నారాయణ, ‘దిల్’ రాజు వంటి పలువురు ప్రముఖులు పాల్గొన్నారు. సినీ ప్రముఖులతో రోజంతా సదస్సు సోమవారం ఉదయం నుంచి సాయంత్రం దాకా హైదరాబాద్‌లో సినీ రంగంపై ‘ఫిక్కీ - ఐఫా’ సదస్సు సాగింది. ‘ఫెడరేషన్ ఆఫ్ ఇండియన్ ఛాంబర్స్ ఆఫ్ కామర్స్ అండ్ ఇండస్ట్రీ’ (ఫిక్కీ) నిర్వహించిన ఈ సదస్సు సినిమా, వినోద రంగాల్లో వ్యాపార అవకాశాల కల్పన అంశంపై ప్రధానంగా దృష్టి నిలిపింది. తెలంగాణ ఐ.టి. శాఖ కార్యదర్శి జయేశ్ రంజన్, ప్రభుత్వ సలహాదారు బి.వి. పాపారావు సహా పలువురు ప్రభుత్వ అధికారులు ఈ సదస్సుకు విచ్చేశారు. సౌతిండియన్ ఫిల్మ్ చాంబర్ ఆఫ్ కామర్స్ ప్రతినిధులు, ఉత్తరాది నుంచి అగ్ర నిర్మాత రమేశ్ సిప్పీ, దర్శకుడు రాకేశ్ ఓం ప్రకాశ్ మెహ్రా తదితరులు ప్రత్యేకంగా హాజరయ్యారు. సదస్సులో ‘ప్రసాద్’ గ్రూప్ అధినేత ఎ. రమేశ్‌ప్రసాద్, అల్లు అరవింద్, డి. సురేశ్‌బాబు, ‘దిల్’ రాజు, శ్యామ్‌ప్రసాద్‌రెడ్డి, శరత్‌మరార్, కె. రాఘవేంద్రరావు, తమ్మారెడ్డి భరద్వాజ్, గుణశేఖర్ తదితరులు పాల్గొన్నారు. వినోద పరిశ్రమకు కార్యస్థానంగా హైదరాబాద్, డిజిటల్ కంటెంట్, తెలంగాణలో ఫిల్మ్ టూరిజమ్ తదితర వివిధ అంశాలపై నిపుణులు చర్చించారు. ప్రసిద్ధ ఆడియోగ్రాఫర్ - ఆస్కార్ అవార్డు విజేత అయిన రసూల్ పూకుట్టి, విజువల్ ఎఫెక్ట్స్ నిపుణులు పి.సి. సనత్, యానిమేషన్ రంగానికి చెందిన రాజీవ్ చిలకా తదితరులు ఈ చర్చల్లో పాల్గొన్నారు. -
దూసుకుపోతున్న సమంత
చెన్నై: వరుస ఆఫర్లతో హీరోయిన్ సమంత ఇటు తెలుగు, అటు తమిళ సినీరంగంలో దూసుకుపోతోంది. తమిళంలో వచ్చే ఏడాదికి అప్పుడే రెండు ప్రాజెక్టులకు ఓకే చెప్పిందట. రెండింటిలోనూ ఈ చెన్నై చిన్నది రైజింగ్ స్టార్ ధనుష్‌తోనే జతకడుతోంది. 'నవ మన్మథుడు' సినిమా ద్వారా తమిళ సూపర్ స్టార్‌తో తొలిసారి జతకట్టిన ఈ అమ్మడు ఇపుడు మరో రెండు తమిళ సినిమాలకు సైన్ చేసినట్టు సమాచారం. తమిళ దర్శకుడు వెట్రిమారన్ దర్శకత్వంలో వస్తున్న 'వాడ చెన్నై' అనే మూవీలో ధనుష్‌కు జోడీగా సమంత నటించనుంది. అలాగే మలయాళం బ్లాక్ బస్టర్ మూవీ రీమేక్ గా వస్తున్న మరో సినిమాలో కూడా సమంత యాక్ట్ చేయనుంది. ఈ రెండు వచ్చే ఏడాది సెట్స్ మీదకు రానున్నాయి. తమిళంలో ధనుష్, సమంత జంటగా నటించిన 'తంగమగన్' తెలుగులో 'నవ మన్మధుడు' పేరుతో రిలీజ్‌కు సిద్ధమవుతోంది. తీర్ సినిమాతో పాటు సూర్య హీరోగా 24 అనే మరో రెండు సినిమాలు సమంత ఖాతాలో ఉన్నాయి. అలాగే ప్రస్తుతం తెలుగులో ప్రిన్స్ మహేష్‌తో బ్రహ్మోత్సవం, నితిన్‌తో త్రివిక్రమ్ తెరకెక్కిస్తున్న అ.. ఆ.. (అనసూయ రామలింగం వర్సెస్ ఆనంద్ విహారి) సినిమాల షూటింగ్లో బిజీబిజీగా ఉంది. మరోవైపు త్రివిక్రమ్, సూర్యతో చేసే మరో సినిమాలో కూడా ఆమెనే హీరోయిన్గా ఎంపిక చేసినట్టు తెలుస్తోంది. తెలుగు, తమిళ భాషల్లో తెరకెక్కనున్న సినిమా కావడంతో సమంత అయితేనే మంచి ఆప్షన్ అని త్రివిక్రమ్ ఫిక్స్ అయినట్లు టాక్. -
వరుస ఆఫర్లతో దూసుకుపోతున్న క్రేజీ హీరోయిన్
చెన్నై: వరుస ఆఫర్లతో హీరోయిన్ సమంత ఇటు తెలుగు, అటు తమిళ సినీ రంగంలో దూసుకుపోతోంది. తమిళంలో వచ్చే ఏడాదికి గాను అపుడే రెండు నూతన ప్రాజెక్టులకు ఒకే చెప్పిందట. ఈ రెండింటిలోనూ ఈ చెన్నై చిన్నది రైజింగ్ స్టార్ ధనుష్ తోనే మళ్లీ జతకడుతూ వుండటం విశేషం,. 'నవ మన్మథుడు' సినిమా ద్వారా తమిళ సూపర్ స్టార్‌తో మొదటి సారి జతకట్టిన ఈ అమ్మడు ఇపుడు మరో రెండు తమిళ సినిమాలకు సైన్ చేసినట్టు సమాచారం. తమిళ దర్శకుడు వెట్రిమారన్ దర్శకత్వంలో వస్తున్న 'వాడ చెన్నై' అనే మూవీలో ధనుష్‌కు జోడీగా సమంత నటించనుంది. అలాగే మలయాళం బ్లాక్ బస్టర్ మూవీ రీమేక్ గా వస్తున్న ఇంకా పేరు ఖరారు చేయని మరో చిత్రంలో కూడా సమంత యాక్ట్ చేయనుంది. ఈ రెండు వచ్చే ఏడాది సెట్స్ మీదకు రానున్నాయి. కాగా తమిళంలో ధనుష్ సమంత హీరోహీరోయిన్లుగా నటించిన 'తంగ మగన్' తెలుగులో 'నవ మన్మధుడు' పేరుతో రిలీజ్‌కు సిద్ధమవుతోంది. తీర్, సూర్య హీరోగా 24 అనే మరో రెండు సినిమాలు సమంత ఖాతాలో ఉన్నాయి. అలాగే ప్రస్తుతం తెలుగులో ప్రిన్స్ మహేత్ తో బ్రహ్మోత్సవం, నితిన్‌తో త్రివిక్రమ్ తెరకెక్కిస్తున్న అ.. ఆ.. (అనసూయ రామలింగం వర్సెస్ ఆనంద్ విహారి) లు సినిమాల షూటింగ్లో బిజీబిజీగా ఉంది. మరోవైపు త్రివిక్రమ్ , సూర్యతో చేసే మరో సినిమాలో కూడా ఆమెనే హీరోయిన్ గా ఎంపిక చేసినట్టు తెలుస్తోంది. తెలుగు, తమిళ భాషల్లో తెరకెక్కనున్న సినిమా కావడంతో ఈగ భామ సమంతానే మంచి ఆప్షన్ అని త్రివిక్రమ్ ఫిక్స్ అయినట్లు టాక్. -
ఆయనలా వంద మందిని కొట్టాలనుకునేవాణ్ణి!
బర్త్‌డే సెలబ్రేట్ చేసుకోవడంలేదు ఈసారి పుట్టినరోజు జరుపుకోవడంలేదు. ఆ డబ్బును చెన్నై వరద బాధితుల సహాయార్థం ఖర్చు చేస్తాను. చెన్నైలో విష్ణు, విశాల్, లక్ష్మీరాయ్, వెంకట్ ప్రభు, సూరీ.. మేమంతా ఒక గ్యాంగ్. గతంలో నేపాల్‌లో ప్రకృతి వైపరీత్యం జరిగినప్పుడు సహాయం చేశాం. ఇప్పుడు చెన్నైకి మా వంతు సహాయం చేస్తున్నాం. ‘‘నేను పుట్టింది గుంటూరులో అయినా పెరిగింది చెన్నైలోనే. అక్కడ ఉన్నందువల్ల తమిళ సినిమాలు ఎక్కువగా చేస్తున్నా. ఇకనుంచీ తెలుగు చిత్రాలపై దృష్టి పెడతా’’ అని ఆది పినిశెట్టి అన్నారు. దర్శకుడు రవిరాజా పినిశెట్టి కుమారుడు అనే ముద్ర నుంచి బయట పడి తమిళంలో హీరోగా తనకంటూ మంచి గుర్తింపు తెచ్చుకున్నారు ఆది. ‘గుండెల్లో గోదారి’ తర్వాత ఆయన హీరోగా నటించిన ‘మలుపు’ విడుదలకు సిద్ధంగా ఉంది. నేడు ఆది పుట్టినరోజు. ఈ సందర్భంగా ఆయన మనోభావాలు ఈ విధంగా... ‘మలుపు’ని తెలుగు, తమిళ భాషల్లో మా అన్నయ్య సత్యప్రభాస్ దర్శకత్వంలో మా నాన్నగారు నిర్మించారు. తమిళంలో ప్రేక్షకాదరణ పొందింది. మంచి సినిమా కిల్ కాకూడదని తెలుగు రిలీజ్ కోసం మంచి తేదీ చూస్తున్నాం. జనవరిలో దొరికింది. ఈ చిత్రం తెలుగులో నాకు మంచి మలుపు అవుతుందనే నమ్మకం ఉంది. కాలేజీ ఫోర్త్ ఇయర్ ఎండింగ్లో ఈ కథ స్టార్ట్ అవుతుంది. స్టయిలిష్‌గా కనిపించడం కోసం బరువు తగ్గాను. నార్మల్‌గా వచ్చే సినిమాల కన్నా డిఫరెంట్‌గా ఉంటుంది. అల్లు అర్జున్ హీరోగా బోయపాటి శ్రీనుగారు దర్శకత్వం వహిస్తున్న ‘సరైనోడు’లో విలన్‌గా చేస్తున్నాను. మామూలుగా విలన్ అంటే అరవడం, పొడవడం అలా ఉంటుంది. కానీ, ఈ చిత్రంలో విలన్ చాలా డిఫరెంట్‌గా ఉంటాడు. అందుకే అంగీకరించాను. చిన్నప్పుడు చిరంజీవి అంకుల్ సినిమాలు చూసి, ఆయనలా మనమూ వందమందిని కొట్టాలి అనుకునేవాణ్ణి. కానీ, యాక్టింగ్‌ని సీరియస్‌గా తీసుకోలేదు. ఒక్కో ఆర్టిస్ట్‌కీ ఒక్కో శైలి ఉంటుంది. అమితాబ్బచ్చన్గారిదో స్టైల్. షారుక్‌ఖాన్, అక్షయ్ కుమార్లది మరో స్టైల్. తెలుగులో పవన్ కళ్యాణ్‌కీ ఓ స్టైల్ ఉంది. -
వై దిస్ కొలవరికి పదికోట్లు
చెన్నై: కొలవరి సాంగ్ మీకు గుర్తుండే ఉంటుందిగా ఒక్క దక్షిణాదినే కాకుండా మొత్తం భారత్ దేశాన్ని ఊపుఊపిన పాట అది. వై దిస్ కొలవెరీ అంటూ ధనుష్ గాత్ర పరిచిన ఈ గీతం ఎన్నిరకాల రికార్డులు సొంతం చేసుకుందో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం కూడా లేదు. ఎవరి నోట వెంట ఉన్నా ఆ సాంగే వినిపించేది. ఇప్పటికీ చాలా పార్టీల్లో ఆపాట సందడి చేస్తుంటుంది కూడా. కొన్ని తెలుగు, కొన్ని ఇంగ్లిష్, మరికొన్ని తమిళ, ఇతర భాషలకు చెందిన పదాలను కలిపి రాసిన ఈ పాట జనాల నోళ్లలో ఓ రేంజిలో నానింది. ఆ పాట ఇప్పుడు తాజాగా మరో రికార్డు సొంతం చేసుకుంది. ఇప్పటి వరకు ఈ సాంగ్‌ను చూసినవారి, విన్నవారి జాబితా పదికోట్లకు చేరి మరో రికార్డును రాసుకుంది. -
తెలుగువారికి తమిళ నిర్భంధమా...
న్యూఢిల్లీ: తమిళనాడులో తెలుగు విద్యార్థుల పట్ల చూపిస్తున్న వివక్షను వ్యతిరేకిస్తూ ఆ రాష్ట్రంలోని తెలుగు సంఘాలు, ఢిల్లీలోని తెలుగు సంఘాల ఆధ్వర్యంలో 23వ తేదీన జంతర్ మంతర్ వద్ద మహాధర్నా చేపట్టనున్నట్టు కేంద్రీయ హిందీ సమితి సభ్యుడు యార్లగడ్డ లక్ష్మీప్రసాద్ ప్రకటించారు. 9వ తేదీన ఈ ధర్నా జరగాల్సి ఉండగా, చెన్నై నగరంలో వర్ష భీభత్సం కారణంతో వాయిదా వేసినట్టు చెప్పారు. సీపీఐ నేత నారాయణ, తమిళనాడులోని తెలుగు సంఘాల నేతలతో కలిసి ఏపీభవన్‌లో గురువారం వైఎల్పీ విలేకరులతో మాట్లాడారు. భాషా అల్పసంఖ్యాకవర్గంగా ఉన్న తెలుగు, కన్నడ, మలయాళీ, ఉర్దూ భాష విద్యార్ధులకు అన్యాయం చేస్తూ 2006లో కరుణానిధి ప్రభుత్వం తెచ్చిన తమిళ నిర్భంధ చట్టాన్ని ఉపసంహరించుకోవాలన్నారు. మాతృ భాషలో చదువుకునే అవకాశం రాజ్యంగం కల్పించిందని, గతంలో సుప్రీంకోర్టు ఓ కేసులో తీర్పు కూడా ఇచ్చిందని చెప్పారు. సుప్రీంకోర్టులో పిటిషన్ కూడా దాఖలు చేయనున్నామని చెప్పారు. తమిళనాడు తెలుగు యువశక్తి అధ్యక్షుడు జగదీశ్వర్‌రెడ్డి మాట్లాడుతూ చెన్నైలో సహాయ కార్యక్రమాలు చేపట్టాలని తెలుగువారికి పిలుపునిచ్చారు. పార్లమెంటులో కేంద్ర హోంమంత్రి రాజ్‌నాథ్‌సింగ్‌ను కలిసి చెన్నైలోని బాధితులకు వారం రోజుల పాటు సరుకులు కొనుగోలు చేసుకోడానికి నగదు ఇవ్వాలని విన్నవించారు. ప్రేమలేఖలతో పని జరగదు : సీపీఐ నేత నారాయణ తమిళ నిర్భంత చట్టాన్ని రద్దుచేయడానికి ఆ రాష్ట్ర ప్రభుత్వానికి ప్రేమలేఖలు రాస్తే సరిపోదని, జయ ప్రభుత్వంపై అందరూ కలిసి ఒత్తిడి తేవాలని సీపీఐ నేత నారాయణ పిలుపునిచ్చారు. తెలుగు విద్యార్థుల పట్ల వైరుధ్యం చూపడం తగదన్నారు. తమిళనాడులోని తెలుగు విద్యార్థుల మనోభావాలు దెబ్బతీయకుండా జీవోను రద్దు చేయాలని డిమాండ్ చేశారు. ఇలాంటి నిర్భంద చట్టాలు ఇతర రాష్ట్రాల్లో విస్తరిస్తే భావా స్వేచ్ఛకు ప్రమాదం వాటిల్లనుందన్నారు. -
నిరసన అంటే ఇది కాదు!
సినిమా ఆయనకి ప్రాణం. సమాజం దాన్ని నిలబెట్టే ఊపిరి. ఈ రెంటిపై నిర్దిష్ట అభిప్రాయం ఉన్న విశ్వనటుడు కమల్‌హాసన్. ఈ 7వ తేదీ 61 ఏళ్ళు నిండుతున్న కమల్ త్వరలో ‘చీకటిరాజ్యం’తో పలకరిస్తున్నారు. అవార్డలు వెనక్కివ్వడం నుంచి పలు అంశాలపై ‘సాక్షి’తో ముచ్చటించారు. ‘చీకటి రాజ్యం’ డిఫరెంట్ యాక్షన్ థ్రిల్లర్. ఈ నెల 10న తమిళంలో (‘తూంగా వనమ్’) రిలీజ్. మంచి థియేటర్స్ కోసం తెలుగులో కాస్త ఆలస్యంగా 20న రిలీజ్ చేయనున్నాం. మామూలుగా అయితే ఒకేసారి రిలీజ్ చేస్తారు. కథ మీద నమ్మకంతో గ్యాప్ తీసుకున్నాం.{థిల్లర్ సినిమాల్లో డెప్త్ ఉండదు. కానీ ‘చీకటి రాజ్యం’లోని పాత్రల్లో డెప్త్, స్పీడ్ ఉంటాయి. సినిమాలో స్టంట్స్ స్టయిలిష్‌గా, రియలిస్టిక్‌గా ఉంటాయి. కమర్షియల్ వాల్యూస్ పుష్కలంగా ఉన్న సినిమా ఇది. ఒక సినిమా చూశామంటే అరే ఇలాంటి కథ మన భాషలో కూడా వస్తే బాగుంటుందనుకుంటాం. ఫ్రెంచ్ సినిమా ‘స్లీప్‌లెస్ నైట్’ థీమ్ బాగుంది. అందుకే, ‘చీకటిరాజ్యం’గా తీశాం. చెప్పాలంటే ‘సాగర సంగమం’ కూడా ‘ఝనక్ ఝనక్ పాయల్ బాజే’ ప్రేరణతో వచ్చిందే. సినిమా అనేది టాలెంట్‌తో మాత్రమే ముడిపడి ఉండదు. ప్రొడక్షన్‌కు తగ్గట్టు ఒక్కోసారి యాక్టర్స్‌ను తీసుకోవాల్సి వస్తుంది. కొంతమంది యాక్టర్స్‌కు టాలెంట్ ఉన్నా సరే, వాళ్లకి మార్కెట్ ఉండదు. కొంత మంది సినిమాకు బాగా సహకరిస్తారు. బాలచందర్‌గారు అవకాశం ఇవ్వకపోతే నేనీ స్థాయికి వచ్చేవాణ్ణి కాదు. నేను నా శిష్యులకు ఛాన్స్ ఇవ్వకపోతే నాకు కృత జ్ఞత లేనట్టే. కొత్త యాక్టర్స్‌కు, టెక్నీషియన్స్‌కి కచ్చితంగా అవకాశం ఇవ్వాలి. అందుకే, నా దగ్గర పనిచేసిన రాజేశ్ సెల్వాకు ‘చీకటిరాజ్యం’లో ఛాన్సిచ్చా.నేను చేసిన చాలా సినిమాల్ని జనం రిసీవ్ చేసుకున్నారు. అయితే, కొన్నిసార్లు జనం మెచ్చలేదు. ఎన్టీఆర్, ఎమ్జీఆర్, దిలీప్‌కుమార్ లాంటి మహానటులకే అది తప్పలేదు. ఎవరికీ వందశాతం సక్సెస్ రేటుండదు! విజయానికి ఒక్కరిని కారణమనలేం. అలాగే పరాజయానికి కూడా. సినిమా సమష్టి కృషి . మంచి సినిమా సరైన టైమ్‌లో రిలీజ్ కాకపోతే ఫ్లాపవుతుంది. నాకు సినిమాలంటే ఇష్టం. అదే నన్ను నడిపిస్తోంది.‘బాహుబలి’ పదేళ్ల క్రితం వచ్చినా హిట్ అయ్యేది. అంతెందుకు... ‘బాహుబలి’ దర్శకుడు రాజమౌళి పుట్టకముందే ‘మొఘల్ ఎ ఆజమ్’ లాంటి భారీ చిత్రం వచ్చి, హిట్ అయింది. మంచి సినిమాలు ఎప్పుడు వచ్చినా హిట్ అవుతాయి. ‘మరుద నాయగమ్’ను పునః ప్రారంభించడానికి చర్చలు జరుగుతున్నాయి. ‘షోలే’ వచ్చినప్పుడు అది చాలా అడ్వాన్స్డ్ సినిమా. కానీ అందరికీ రీచయింది. జనాన్ని తక్కువ అంచనా వేయకూడదు. ‘ఉత్తమ విలన్’ టైమ్‌లో నన్ను డెరైక్ట్ తెలుగు సినిమా ఎప్పుడు చేస్తావని అంతా అడిగారు. అందుకే ‘చీకటిరాజ్యం’ చేసేశా. వెంటనే టి.కె. రాజీవ్ కుమార్ దర్శకత్వంలో మళ్లీ ఇంకో తెలుగు, తమిళ సినిమా చేస్తున్నా. ప్రీ ప్రొడక్షన్ వర్క్ చేస్తున్నాం. చాలా కాలం తర్వాత అమల, జరీనావహాబ్లతో నటిస్తున్నా.భిన్నాభిప్రాయాల్ని సహించలేక, ప్రభుత్వ పరంగా ఇప్పుడు వ్యక్తమవుతున్న అసహనం అసాధారణం. దానిపై అంతా పోరాడాల్సిందే. కానీ, అవార్డుల్ని వెనక్కివ్వడం పరిష్కారం కాదు. నిరసనంటే ఇది కాదు. ఆ అవార్డులు ప్రతిభకు గుర్తింపుగా, జనం మెప్పుతో వేర్వేరు ప్రభుత్వాలిచ్చినవి. మనం గాంధీలా ‘సత్యాగ్రహం’తో వేరే మార్గంలో పోరాడాలి.‘ఆస్కార్’ కోసం ఆరాటం అనవసరం. నన్నడిగితే, మనదేశానికి వాళ్ళు చిత్రాలు పంపేలా మనం తయారవ్వాలి. ఎందుకంటే మనం దేశం నుంచి ఏడాదికి 1000 చిత్రాలు వస్తున్నాయి. హాలీవుడ్ వాళ్లు మన రికార్డ్‌ని దాటలేరు. అక్కడ సినిమాల్ని మనంత గా ప్రేమించరు. మనం సినిమాల్ని ప్రేమిస్తాం. -
మరో విభిన్న పాత్రలో!
సూర్య, అమలాపాల్ ముఖ్యపాత్రల్లో తమిళంలో పాండిరాజ్ దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం ‘పసంగ-2’. ఈ చిత్రాన్ని ‘మేము’ పేరుతో సాయి మణికంఠ క్రియే షన్స్ పతాకంపై జూలకంటి మధుసూదన్ రెడ్డి తెలుగులో అందిస్తున్నారు. అర్రోల్ కోర్రెల్ సంగీతం అందించిన ఈ చిత్రం ఆడియో త్వరలో విడుదల కానుంది. ‘‘ ‘తారే జమీన్ పర్’, ‘మనం’, ‘దృశ్యం’ తరహాలో వైవిధ్య కథాంశంతో ఫ్యామిలీ ఎంటర్ టైనర్‌గా దీన్ని తెరకెక్కించారు. సూర్య పాత్ర విభిన్నంగా ఉంటుంది’’ అని చెప్పారు. -
శ్రుతిమించుతున్న అభిమానం
కోలీవుడ్ సినీ అభిమానుల మధ్య ఉన్న విభేదాలు శ్రుతి మించుతున్నాయి. ఇన్నాళ్లు సినిమాల రిలీజ్ సమయంలో విమర్శలతో సరిపెట్టుకునే స్టార్ హీరోల అభిమానులు తాజాగా సోషల్ మీడియాలో అసత్య ప్రచారాలతో హీరోలను ఇబ్బందులకు గురిచేస్తున్నారు. తాజాగా ఇలాంటి అనుభవమే కోలీవుడ్ స్టార్ హీరో అజిత్‌కు ఎదురైంది. కోలీవుడ్‌లో నెంబర్ వన్ ప్లేస్‌కు పోటీ పడుతున్న అజిత్‌ను ఇతర హీరోల ఫ్యాన్స్ పరోక్షంగా ఇబ్బంది పెడుతున్నారు. ప్రస్తుతం 'వేదలం' సినిమా పనుల్లో బిజీగా ఉన్న అజిత్‌కు తీవ్ర గుండెపోటు వచ్చిందంటూ సోషల్ మీడియాలో ప్రచారం మొదలు పెట్టారు. అజిత్ మేనేజర్ సురేష్ చంద్ర పేరుతో ఫేక్ ట్విట్టర్ అకౌంట్ క్రియేట్ చేసిన ఆకతాయిలు, ఆ అకౌంట్ ద్వారా అజిత్‌కు హార్ట్ ఎటాక్ అంటూ ప్రచారం చేశారు. అయితే వెంటనే స్పందించిన సురేష్ చంద్ర, అది తన అకౌంట్ కాదని వివరణ ఇచ్చినా అప్పటికే ఆ వార్తను చాలామంది ఫ్యాన్స్ షేర్ చేయడంతో కోలీవుడ్‌లో హాట్ టాపిక్‌గా మారింది. ఈ ఘటనపై సైబర్ క్రైం పోలీస్‌లకు ఫిర్యాదు చేసిన సురేష్, ఈ ప్రచారం మొదలుపెట్టిన వ్యక్తులపై చర్యలు తీసుకోవాలని కోరారు. అభిమానుల ఆందోళనను గమనించిన అజిత్.. తన వేదలం సినిమా ఫైనల్ ఎడిటింగ్ జరగుతున్న స్టూడియోలో అభిమానులతో దిగిన ఫోటోలను సోషల్ మీడియాలో రిలీజ్ చేశాడు. దీంతో అభిమానులు అజిత్ ఆరోగ్యం విషయమై వచ్చిన వార్తలు ఏవీ నిజం కాదని ఊపిరి పీల్చుకున్నారు. -
కామెడీ ఆర్టిస్ట్ గా పరిచయమై..
ఎన్నో అద్భుతమైన పాత్రలతో దాదాపు 5 దశాబ్దాలుగా సినీ అభిమానులను అలరిస్తున్న అత్యుత్తమ నటి అశేష అభిమానులను వదిలి వెళ్లిపోయింది. తమిళ, తెలుగు, మళయాళ, కన్నడ, హిందీ భాషల్లో సుపరిచితురాలైన సీనియర్ నటి మనోరమ శనివారం అర్ధరాత్రి కన్నుమూశారు. గత కొంత కాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న ఆమె చెన్నైలోని అపోలో ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మృతిచెందారు. 1960, 1970 దశకాలలో తమిళ వెండితెరను శాసించిన మనోరమ 1937 మే 26న తమిళనాడులోని మన్నార్గుడిలో జన్మించారు. మనోరమ అసలు పేరు గోపిశాంత. 12 ఏళ్ల చిన్న వయసులోనే నాటకరంగంలోకి అడుగుపెట్టిన ఆమె స్టేజ్ ఆర్టిస్ట్ గా ఎంతో గుర్తింపు తెచ్చుకున్నారు. కరుణానిధి రాసిన ఎన్నో నాటకాలల్లో నటించారు. 1958లో రిలీజ్ అయిన మళ ఇట్ట మంగై సినిమాతో తొలిసారిగా వెండితెర మీద కనిపించారు మనోరమ. తొలి సినిమాలోనే కామెడీ ఆర్టిస్ట్ గా పరిచయం అయిన ఆమె ఆ తరువాత ఎక్కువగా ఆ తరహా పాత్రలే చేస్తూ వచ్చారు. 1963లో వచ్చిన కొంజమ్ కుమారి సినిమాలో హీరోయిన్గా నటించినా తరువాత కూడా కామెడీ పాత్రల మీదే దృష్టిపెట్టారు. అందుకే దాదాపు రెండు దశాబ్దాల పాటు తమిళ ఇండస్ట్రీలో ఆమె లేకుండా ఒక్క సినిమా కూడా రాలేదంటే అతిషయోక్తి కాదు. స్టార్ హీరోల సినిమాల నుంచి చిన్న హీరోల సినిమాల వరకు ఏ స్థాయి సినిమా అయిన అందులో మనోరమ కోసం ప్రత్యేకంగా ఓ పాత్రను రాసేవారు. తమిళ ఇండస్ట్రీలో నెంబర్ వన్ కమెడియన్స్ అనిపించుకున్న చాలా మందితో ఆమె జంటగా నటించారు. అలనాటి మేటి నటులు చంద్రబాబు, చో రామస్వామి, తంగవేళు, తెంగై శ్రీనివాసన్, ఎమ్ ఆర్ రాధ, నగేష్ లాంటి సీనియర్ నటులతో కలిసి ఎన్నో సినిమాల్లో హాస్యాన్ని పండిచారు. అంతేకాదు నలుగురు ముఖ్యమంత్రులతో కలిసి నటించిన అరుదైన రికార్డ్ మనోరమ సొంతం. తమిళనాడు ముఖ్యమంత్రులు అన్నాదురై, కరుణానిధి, ఎమ్ జి రామ్‌చంద్రన్, జయలలితలతో ఆమె కలిసి నటించారు. అల్లరి ప్రియుడు, కుంతీ పుత్రుడు, జెంటిల్‌మేన్, రిక్షావోడు, బావనచ్చాడు, అరుంధతి లాంటి సినిమాలతో తెలుగు ప్రేక్షకులకు కూడా దగ్గరయ్యారు మనోరమ. సినీరంగానికి ఆమె చేసిన సేవలకు గాను ఎన్నో పురస్కారాలు ఆమెను వరించాయి. తమిళనాడు ప్రభుత్వం కలైమామణి అవార్డ్ తో సత్కరించగా, భారత ప్రభుత్వం 2002లో పద్మ శ్రీ అవార్డ్ తో గౌరవించింది. 1988లో ఆమె నటించిన పుతియా పట్టై సినిమాకు గాను ఉత్తమ సహాయ నటిగా జాతీయ అవార్డ్ ను కూడా అందుకున్నారు. వీటితో పాటు తెలుగు, తమిళ రాష్ట్ర ప్రభుత్వాల అవార్డులు, ఫిలింఫేర్ అవార్డ్ లు ఎన్నో అందుకున్నారు. ఎన్నో అద్భుత పాత్రలతో సినీ అభిమానులను అలరించిన మనోరమ మరణం తమిళ పరిశ్రమకేకాదు యావత్ భారత సినీ పరిశ్రమకే తీరనిలోటు. భౌతికంగా ఆమె మనల్ని వదిలిపోయినా ఆమె చేసిన పాత్రలు, ఆమె పూయించిన నవ్వులు ఎప్పుడూ మనకు ఆ మహానటిని గుర్తు చేస్తూనే ఉంటాయి. -
ఓకే మణీ బంగారం!
భాష, ప్రాంతంతో సంబంధం లేకుండా కొంతమంది తారలకు బోలెడంత క్రేజ్. కేరళ కుట్టి నిత్యా మీనన్ సంగతి అక్షరాలా అదే! అమ్మడికి ఇప్పుడు మలయాళంలోనే కాదు... తమిళ, తెలుగు భాషల్లోనూ ఉన్న డిమాండ్ అంతా ఇంతా కాదు. కాస్తంత బొద్దుగా, పొట్టిగా ఉన్నప్పటికీ, అందంతో పాటు, కళ్ళతోనే కోటి భావాలు పలికించగల నేర్పు ఆమె సొంతం. అందుకే, ఆమెను తమ సినిమాల్లో తీసుకోవాలని దర్శక, నిర్మాతలు భావిస్తూ ఉంటారు. అయితే, పారితోషికం కన్నా కథ, తన పాత్ర నచ్చడం మీదే నిత్య దృష్టి అంతా! అలా చాలా సెలక్టివ్‌గా ఉండే ఈ యువ హీరోయిన్ ఆ మధ్య ‘సన్నాఫ్ సత్యమూర్తి’ తర్వాత తాజాగా గుణశేఖర్ దర్శకత్వంలోని ‘రుద్రమదేవి’లో కనిపించనున్నారు. తాజాగా ఆమె మణిరత్నం కొత్త సినిమాకు ఓ.కె. చెప్పారు. ఆ మధ్య ‘ఓ.కె. బంగారం’ సినిమాలో మణి డెరైక్షన్‌లో చేసిన నిత్యకు ఆయన డెరైక్షన్‌లో వరసగా ఇది రెండో సినిమా. ఇంకా పేరు పెట్టని పగ, ప్రతీకారాల కథ ఈ డిసెంబర్లో సెట్స్‌పైకి వెళ్ళనుంది. తమిళంలో తీస్తూ, తెలుగులో కూడా విడుదల చేయనున్న ఈ చిత్రంలో కార్తీ, ‘ఓ.కె. బంగారం’ ఫేమ్ దుల్కర్ సల్మాన్ ఎంపికయ్యారు. కథానుసారం ఈ హీరోలిద్దరూ ఒకరితో మరొకరు తలపడతారు. ‘‘ఇప్పటికే కీర్తీ సురేష్‌ను ఒక నాయికగా ఎంపిక చేశాం. ఇప్పుడు నిత్యా మీనన్ కూడా ఈ చిత్రంలో నటించడానికి అంగీకరించారు. త్వరలోనే మరిన్ని వివరాలు ప్రకటి స్తాం’’ అని చిత్ర యూనిట్ వర్గాలు చెప్పాయి. మొత్తానికి, మణిరత్నం ‘ఓ.కె. బంగారం’లో మొన్న సమ్మర్‌కి అందరినీ ఆకర్షించిన నిత్య ఇప్పుడు రవివర్మ కెమేరా, రెహమాన్ సంగీతంలో మళ్ళీ తెరపై వెలిగిపోనుంది. -
గవర్నర్ల పై టీడీపీ నేతలు తీవ్ర విమర్శలు
-
నిన్ను చూసి ఫ్లాటైపోయా!
భాష తెలియనప్పుడు ఉచ్చారణలో పొరపాట్లు దొర్లడం సహజం. ‘రామా’ అనే బదులు ‘రామ్మా’ అనేసే ప్రమాదం ఉంది. అలాగే, పక్కవాళ్లు కూడా అనకూడని మాటలు ఏవేవో అనిపించి, ఆనందం పొందుతుంటారు. ‘ఐ’, ‘ఎవడు’ చిత్రాల ఫేమ్ అమీ జాక్సన్‌కి ఈ మధ్య అదే జరిగింది. ఈ విదేశీ సుందరి తెలుగు, తమిళ, హిందీ ప్రేక్షకులకు సుపరిచితురాలే. ఇంగ్లిష్ తప్ప పాపం అమీకి ఏమీ తెలియదు. ఆ విషయం హిందీ నటుడు అక్షయ్‌కుమార్‌కి బాగా తెలుసు. ప్రభుదేవా దర్శకత్వంలో ఆయన హీరోగా నటిస్తున్న ‘సింగ్ ఈజ్ బ్లింగ్’లో అమీ జాక్సన్ కథానాయిక. ఇటీవల లొకేషన్లో ఈ చిత్రనిర్మాత అశ్విని యార్దీతో కలిసి అమీని అక్షయ్ ఆటపట్టించారు. ప్రభుదేవా దగ్గరికెళ్లి ‘మై తుమ్ పర్ ఫిదా హూ’ అనమన్నారట. దానర్థం ‘నిన్ను చూసి ఫ్లాట్ అయిపోయా’ అని తెలియక, ప్రభుదేవాతో అమీ అనడం, అతగాడు షాకవడం జరిగిపోయాయి. చివరకు అసలు విషయం తెలుసుకుని చిత్రబృందం అంతా హాయిగా నవ్వుకున్నారు. -
'సెల్వందన్'గా మహేష్ బాబు 'శ్రీమంతుడు'
చెన్నై: మహేష్ బాబు తాజా చిత్రం 'శ్రీమంతుడు'ను తమిళంలోకి డబ్ చేస్తున్నారు. ఈ చిత్రాన్ని 'సెల్వందన్' పేరుతో తమిళనాడులో విడుదల చేస్తున్నారు. కొరటాల శివ దర్శకత్వంలో మహేష్ బాబు నటించిన శ్రీమంతుడు చిత్రం వచ్చే నెల 7న విడుదల చేస్తున్నారు. తమిళంలోకి అనువదించిన సెల్వందన్ కూడా కూడా అదే రోజు విడుదల కానుంది. తమిళనాడులో మహేష్ బాబుకు ఫ్యాన్ ఫాలోయింగ్ బాగుంది. దీన్ని దృష్టిలో ఉంచుకుని శ్రీమంతుడు చిత్రాన్ని తమిళంలోకి డబ్ చేసినట్టు యూనిట్ వర్గాలు తెలిపాయి. 70 కోట్ల రూపాయల బడ్జెట్‌తో నిర్మించిన ఈ చిత్రంలో మహేష్ సరసన శృతి హాసన్ నటించారు. -
'చేతిలో ఫుల్లు సినిమాలతో యమ బిజీ'
చెన్నై: చేతిలో నిండుగా సినిమాలతో నటుడు హరీశ్ ఉత్తమాన్ బిజిబిజీగా ఉన్నాడు. పాండియ నాడు చిత్రంలో గొప్ప నటనను ప్రదర్శించి ఒక్కసారిగా వెలుగులోకి వచ్చిన ఆయన తెలుగు, తమిళ చిత్రాలతో తీరికలేకుండా సతమతమవుతున్నాడు. ప్రస్తుతం అతడు ప్రతినాయక పాత్ర పోషించిన శ్రీమంతుడు చిత్రం ఆగస్టు 7న విడుదల కానుంది. అందులో ఆయన తిరుగులేని విలన్ పాత్రను పోషించినట్లు చిత్ర వర్గాల సమాచారం. ఈ నేపథ్యంలో ఆయన మాట్లాడుతూ తెలుగులో తనకు ఇది నాలుగో చిత్రం అని చెప్పాడు. శ్రీమంతుడు చిత్రం తనకు చక్కటి భవిష్యత్తును ఇస్తుందన్న నమ్మకం ఉందని విశ్వాసం వ్యక్తం చేశాడు. దీంతోపాటు శర్వానంద్ నటిస్తున్న తాజా చిత్రం ఎక్స్‌ప్రెస్ రాజాలో కూడా నటిస్తున్నాడు. దీంతోపాటు తమిళంలో పాయుం పులి, విల్ అంబు, పైసల్ అనే చిత్రాలతో బిజీబిజీగా ఉన్నాడు. -
రజనీతో రాధిక ఆప్టే సినిమానట!
చెన్నై: ఇప్పటికే దక్షినాదిలోని తెలుగు చిత్రాల్లో నటించి గొప్ప అభిమానాన్ని దక్కించుకున్న ప్రముఖ నటి రాధికా ఆఫ్టే ఇప్పుడు తమిళంలో సందడి చేయనుంది. ఆమె తమిళ సూపర్ స్టార్ రజినీ కాంత్ సరసన నటించనున్నారని చిత్రవర్గాలు అంటున్నాయి. రజినీ త్వరలో 159వ చిత్రంలో(ఇంకా పేరు పెట్టలేదు) నటించనున్నారు. అయితే, ఈ చిత్రానికి హీరోయిన్గా ఎంపిక చేసే క్రమంలో ఇప్పటికే రాధికాతో సంప్రదింపులు పూర్తయ్యాయట. అయితే, అధికారికంగా తుది నిర్ణయం వెలువడాల్సి ఉంది. ఈ చిత్రంలో రజినీకాంత్ గ్యాంగ్‌స్టర్‌గా కనిపించనున్నారు. ఆగస్టు తొలివారంలో షూటింగ్ నిమిత్తం చిత్ర బృందమంతా మలేషియా వెళ్లనుంది. ఈ చిత్రానికి 'పా' దర్శకత్వం వహించనుండగా.. కలైపులి ఎస్ థను నిర్మాతగా వ్యవహరించనున్నారు. సంగీతం సంతోష్ నారాయణన్ అందిస్తున్నారు. కాగా, చిత్రంలో నటించే అంశంపై రాధికను సంప్రదించగా ఆమె మాత్రం స్పందించలేదు. ఆమె తెలుగులో ధోని, లెజెండ్ వంటి చిత్రాల్లో నటించారు. -
రమ్య నిర్ణయం ఏమిటో!
నటి రమ్య గుర్తుందా? కుత్తు రమ్య అంటే వెంటనే గుర్తుకు రావచ్చు. తమిళం, తెలుగు, కన్నడ అంటూ మూడు భాషల్లోనూ కథానాయికగా నటించించారు. అంతేకాదు రాజకీయవాదిగా కొన్నాళ్లు వెలిగారు. నటిగా 2003లో రంగప్రవేశం చేసిన రమ్య బెంగళూర్ బ్యూటీ. అక్కడ నటిగా పేరు తెచ్చుకున్న రమ్యకు ఆ తరువాత తమిళం తెలుగు భాషల్లోనూ అవకాశాలు తలుపుతట్టాయి. తమిళంలో కుత్తు, గిరి, పోల్లాదవన్, వారణం ఆయిరం చిత్రాల్లో నటించారు. తెలుగులో అభిమన్యు చిత్రంతో పరిచయమైన రమ్య ఈ మూడు భాషల్లోనూ నటిగా మంచి పేరు సంపాదించుకున్నారు. ఆ పేరు ప్రఖ్యాతులే ఆమెను రాజకీయాల వైపు తీసుకెళ్లాయని చెప్పవచ్చు.కర్ణాటకలో యువజన కాంగ్రెస్ సభ్యురాలిగా చేరి 2013 బై ఎలక్షన్స్‌లో రమ్య మాండ్య పార్లమెంట్ స్థానానికి పోటీ చేసి గెలిచారు. ఆ తరువాత అదే స్థానం నుంచి పోటీ చేసి ఓడిపోయారు. ఆపై రాజకీయ పాఠాలు నేర్చుకొస్తానని చెప్పి విదేశాలకు వెళ్లిన రమ్య ఒక ఏడాది తరువాత స్వరాష్ట్రానికి తిరిగి వచ్చారు.మధ్యలో విదేశానికి చెందిన ప్రేమికుడితో షికార్లు కొట్టిన ఈ భామ ఎదుట ఒక నిర్ణయానికి రాలేని మూడు అంశాలు అయోమయంలో పడేశాయట. పెళ్లా, సినిమాలా, రాజకీయాలా? ఈ మూడింటిలో ఏది రహదారి? దేన్ని ఎంచుకుని ముందుకు సాగాలి? అన్న మీమాంసలో పడ్డారని సినీవర్గాల టాక్.మరో విషయం ఏమిటంటే రాజకీయాల్లోకి రాక ముందు రమ్య నాలుగు చిత్రాలకు సంతకం చేశారు. అందులో దిల్ కా రాజ్ అనే చిత్రం టీజర్ ఇటీవల యూట్యూబ్‌లో విడుదలైంది. ఈ చిత్ర ప్రచారానికి రావలసిందిగా దర్శకనిర్మాతలు అడుగుతున్నారట. అందుకు అంగీకరించాలా? లేదా? అన్న సందిగ్ధంలో ఉన్నారట రమ్య? ఒకటి కాదు, రెండు కాదు, మూడు పడవల మీద కాలు వేస్తే ఎవరైనా ఇలా తికమక పడాల్సిందే అంటున్నాయి సినీ వర్గాలు. -
ఆ సినిమా సీన్లు లీకయ్యాయని ఫిర్యాదు
చెన్నై: తమిళనాడులో ఫాంటసీ డ్రామాగా రూపొందుతున్న చిత్రం 'పులి' సన్నివేశాలు లీకయ్యాయంటూ ఆ చిత్ర యూనిట్ పోలీసులకు ఫిర్యాదు చేసింది. తాము వాటిని తొలగించినా ఇంకా ఆన్లైన్లో కనిపిస్తున్నాయని ఈ చర్యలకు పాల్పడిన వారిపై కఠిన చర్యలు తీసుకోవాలంటూ క్రైం బ్రాంచ్ పోలీసులకు తెలిపారు. తమిళ సూపర్ స్టార్ విజయ్ ఈ చిత్రంలో హీరోగా నటిస్తున్న విషయం తెలిసిందే. అయితే, విజయ్ పుట్టిన రోజు సందర్భంగా దానికి సంబంధించిన తొలి టీజర్‌ను విడుదల చేశారు. అయితే, ఈ టీజర్ విడుదలకు రెండు మూడు రోజుల ముందే ఆన్లైన్లో విడుదలై హల్ చల్ చేసింది. దీంతో తాము ఎంతో కష్టపడి ప్లాన్ చేసుకొని విడుదల చేయాలనుకున్న సీన్లు ఇలా తమకంటే ముందే ఎవరు ఎలా విడుదల చేశారో అర్థం కాలేదని చెప్పారు. భారీ బడ్జెట్‌తో నిర్మిస్తున్న ఇలాంటి ప్రతిష్ఠాత్మక చిత్రాలను ముందే లీక్ చేస్తే చిత్ర నిర్మాతలే కాకుండా ఇండస్ట్రీ కూడా కుదేలవుతుందని చిత్ర దర్శకుడు చింబుదేవెన్ అన్నారు. ఈ చిత్రం సెప్టెంబర్‌లో హిందీ, తెలుగు, తమిళ భాషల్లో విడుదలకానుంది. -
బుల్లితెరపై...
తమిళ, తెలుగు, మలయాళ భాషల్లో మంచి నటిగా పేరు తెచ్చుకున్న కథానాయిక అమలాపాల్‌ను త్వరలో మనం బుల్లితెరపై చూడనున్నాం. చిత్ర దర్శకుడు విజయ్ను వివాహం చేసుకున్న అమలాపాల్ దాదాపుగా సినిమాలు తగ్గించేశారు. ఆమె నటించిన తమిళ చిత్రం ‘హైకూ’ ఇప్పుడు విడుదలకు సిద్ధంగా ఉంది. ఈ సినిమా తర్వాత మరే సినిమాకు ఆమె గ్రీన్ సిగ్నల్ ఇవ్వలేదు. ఇప్పుడు తన దృష్టిని బుల్లితెర వైపు మళ్లించారు. ఓ తమిళ చానల్లో రియాలిటీ షోకు న్యాయనిర్ణేతగా వ్యవహరించనున్నారు. డాన్స్ నేపథ్యంలో సాగే ఈ రియాలిటీ షోకు స్వతహాగా డాన్సర్ అయిన అమలాపాల్ అయితే బాగుంటుందని, నిర్వాహకులు అనుకున్నారట. కాన్సెప్ట్ కూడా నచ్చి, ఆమె వెంటనే అంగీకరించారట. -
చేతులు దాటాయి గనకే..!
‘‘అవును.. మా పెళ్లి ఆగిపోయింది. ఇది ఊహించని పరిణామమే. కానీ, పరిస్థితులు మన చేతులు దాటినప్పుడు, ఏం జరిగితే దాన్ని అంగీకరించాలి’’ అని త్రిష అంటున్నారు. తమిళ నిర్మాత, వ్యాపారవేత్త వరుణ మణియన్‌తో త్రిష పెళ్లి నిశ్చితార్థమై, ఆఖరుకు ఆగిపోయిన విషయం తెలిసిందే. నిశ్చితార్థం జరిగిన మూడు నెలలకు బ్రేకప్ ప్రకటించిన త్రిష, ‘‘నేను ఆ భగవంతుడి బిడ్డని. ఆయన ఏది నిర్ణయిస్తే అది అంగీకరిస్తా. ఏది జరిగినా అది ఆ దేవుడి ఇష్టప్రకారమే జరుగుతుందని నమ్ముతా’’ అని తాజా ఇంటర్వ్యూలో పేర్కొన్నారు. -
కొత్త సూర్యుడు
హీరోగా ఎంతో సంపాదిస్తాం... పేరు, ఇమేజ్, డబ్బు... ఎట్సెట్రా... ఎట్సెట్రా... మరి, మనిషిగా ఏం సంపాదించాలి? తెలుగునాడు దాకా విస్తరించిన తమిళ హీరో సూర్యను అడిగి చూడండి. చాలా చెబుతాడు... ‘ఎదిగినకొద్దీ ఒదిగి ఉండమ’నే ఫిలాసఫీకి నిదర్శనంగా నిలుస్తాడు. సినిమా నుంచి జీవితం దాకా కొత్త సూర్యుడు కనిపిస్తాడు. కొత్త దర్శకులు, కొత్త తరహా సినిమాలతో ఇటీవల తమిళ చిత్రసీమలో చాలా మార్పులొచ్చాయి. గతంలో ప్రతి ఆరేడేళ్ళకు మార్పు వచ్చేది. ఇప్పుడు ప్రతి రెండున్నరేళ్ళకు ఐడియాల్లో, ప్రేక్షకుల అభిరుచుల్లో మార్పు వస్తోంది. మారుతున్న టెక్నాలజీ, ఇంటర్నెట్ వల్ల - షార్ట్ ఫిల్మ్స్‌ను యూ ట్యూబ్‌లో పెట్టడం, ఫిల్ము పోయి సినిమా డిజిటలైజ్ కావడం, 5డి కెమేరాతో కూడా సినిమాలు తీయడం, కోటి బడ్జెట్ లోపలే రెండు గంటల సినిమా తీయగలగడం సాధ్యమయ్యాయి. రెగ్యులర్ మెలోడ్రామా పక్కనపెట్టి, కొత్త కంటెంట్‌ను జనం కోరుతున్నారు. ఇదంతా వెల్కమ్ చేయాల్సిన మార్పు. సమకాలీన తమిళ హీరోల గురించి మీరేమంటారు? ఒకే కథ, స్క్రిప్ట్‌ను ఒక్కో హీరో, ఒక్కో దర్శకుడు ఒక్కో రకంగా తీస్తారు. అలాగే, కొత్త జనరేషన్ వాళ్ళు ప్రేక్షకులకు కనెక్ట్ అయ్యే తీరు, వాళ్ళకు సినిమా ద్వారా చెప్పే విషయాలు, ఆ ఎక్స్ప్రెషన్స్ వేరుగా ఉంటాయి. ఒక యాడ్‌లా ఫాస్ట్‌గా చెప్పాలనుకుంటారు. ఎమోషన్ ఒక్క సెకన్లో అలా వచ్చి, వెళ్ళిపోవాలి. ఎమోషన్స్‌ను ఎక్స్టెండ్ చేయకూడదు. ఇప్పుడంతా టీ-20 జనరేషన్. న్యూ జనరేషన్ సినిమాకు మీరెలా సిద్ధమవుతున్నారు? ఒకటే మంత్రం. కొత్త ఆలోచనల్ని స్వాగతించడానికి సిద్ధంగా ఉండాలి. కొత్త దర్శకులతో పనిచేయాలి. వాళ్ల కొత్త ఐడియాలతో, ఎడ్వెంచరస్‌గా ముందుకెళ్ళాలి. ఈ సినిమాను మీరే నిర్మించడానికి కారణం? మలయాళంలో వచ్చిన ‘హౌ ఓల్డ్ ఆర్ యు’ నచ్చి, ‘జో’ మళ్ళీ తెర మీదకు రావాలంటే ఇలాంటి బలమైన ఉమన్ సెంట్రిక్ ఫిల్మే సరైనదని రీమేక్ చేశాం. నిర్మాణం మరొక రికి అప్పగించి, రాజీ పడే కన్నా బాగా తీసి, జనానికి మంచి కంటెంట్ ఇవ్వాలనుకుని, సొంతంగా నిర్మించా. చాలామంది స్త్రీలకు స్ఫూర్తి నిస్తోంది. పత్రికలన్నీ ‘ఎల్లా ఆన్గళుమ్ పార్క వేండియ పడమ్’ (మగవాళ్ళంతా చూడాల్సిన సినిమా) అని రాశాయి. తెలుగులో రిలీజ్ చేసే ఆలోచన ఏమైనా ఉందా? ‘జో’కు ఇక్కడ మంచి మార్కెటుంది. జనానికి తను బాగా తెలుసు. రీమేక్ చేయలేను. డబ్ చేయాలనుంది. రానున్న మీ చిత్రం తమిళంలో ‘మాస్’, తెలుగులో ‘రాక్షసుడు’ అంటున్నారు. సంబంధమే ఉన్నట్లు లేదు. (నవ్వేస్తూ...) రెండు టైటిల్స్కూ అండర్ కరెంట్‌గా ఒక సంబంధం ఉంది. తమిళంలో నా పాత్ర పేరు - మాసిలామణి. అందుకు తగ్గట్లుగా అక్కడ ‘మాస్’ అని పెట్టాం. తెలుగులో హీరో నాగార్జున గారు ‘మాస్’ పేరుతో ఒక సూపర్‌హిట్ చిత్రం చేసేశారు. దాంతో, కథకూ, పాత్రకూ తగ్గట్లు ‘రాక్షసుడు’ అని పెట్టాం. ఈ సినిమా హార్రర్ అనీ, థ్రిల్లర్ అనీ రకరకాలుగా... దర్శకుడు వెంకట్ ప్రభు కానీ, నేను కానీ గతంలో ఎప్పుడూ చేయని తరహా సినిమా. ఇది హార్రర్ సినిమా కాదు. దెయ్యాలు, భూతాల లాంటివి ఉండవు. భయ పెట్టే యాక్షన్ థ్రిల్లర్, ఎంటర్టైనర్ అని చెప్పవచ్చు. నయనతారతో వర్కింగ్ ఎక్స్పీరియన్స్ ఎలా ఉంది? ‘గజిని’తో మొదలుపెడితే... నయన్‌తో నాకిది మూడో సినిమా. ఆమెలో ఎంతో మెచ్యూరిటీ వచ్చింది. ఆమె నడుచుకుంటూ వచ్చి, కెమేరా ముందు నిల్చొనే విధానం, పనిచేసే తీరు ఎంతో మారింది. మీరు, దర్శకుడు వెంకట్ ప్రభు మంచి ఫ్రెండ్సనుకుంటా? (నవ్వుతూ...) మేమిద్దరం స్కూల్మేట్లం. అతను నా కన్నా కేవలం నాలుగు నెలలు చిన్న. అయినా సరే, నన్ను ‘అన్నా’ అని పిలుస్తాడు. (నవ్వులు...) నన్ను అలా పిలిచే మొట్టమొదటి దర్శకుడు అతనే! నేను, మహేశ్‌బాబు, వెంకట్ ప్రభు, యువన్ శంకర్‌రాజా, కార్తీక్ రాజా, తమ్ముడు కార్తీ - మేమందరం చెన్నైలో సెయింట్ బీట్స్ స్కూల్లో చదువుకున్నవాళ్ళమే. సినిమా అంటే దర్శకుడితో దాదాపు పది నెలలు కలిసి ప్రయాణించాలి. ముందు నుంచి స్నేహితులం కాబట్టి, మేము కలిసి పనిచేయడం ఈజీ అవుతుంటుంది. మీరు, మహేశ్, వెంకట్ ప్రభు కలసి చేయనున్నారని... (నవ్వేస్తూ...) అది మహేశ్‌బాబుతో కాదు. రవితేజ సార్, నేను, వెంకట్ ప్రభు కలసి సినిమా చేయాల్సింది. కానీ, కొన్ని కారణాల వల్ల అది ముందుకు వెళ్ళలేదు. సినిమా కథలో దర్శకుడికి కరెక్షన్స్ చెబుతారట! (ఒక్క క్షణం ఆగి...) అలాగని కాదు... దర్శకుల శక్తిసామర్థ్యాలు, వాళ్ళు అంతకు ముందు చేసిన ప్రాజెక్ట్‌లు నాకు తెలుసు. కాకపోతే, వాళ్ళ బెస్ట్ నా సినిమాకు ఇచ్చేలా చేయాలని చూస్తుంటా. ఆ విషయంలో నేను కొంత స్వార్థపరుణ్ణి. (నవ్వులు...) అందుకే, ఆ సినిమా కథ, స్క్రీన్‌ప్లే పరిధిలోనే ఎంత వరకు వెళ్ళవచ్చు, ఏయే కొత్త ఎలిమెంట్స్ తీసుకొచ్చి కలపవచ్చనేది చూస్తుంటాం. బేసిక్‌గా నా సబ్జెక్ట్‌లు నా కన్నా పెద్దవిగా ఉండాలని కోరుకుంటా. అంతే తప్ప నేను స్క్రిప్ట్‌నూ, కథనూ డామినేట్ చేయాలనుకోను. మీకు గ్రాఫిక్స్ మీద అవగాహన ఉందట? అంతలేదు. ‘అదెల్లా ఓవర్ బిల్డప్ సర్!’ (అదంతా మరీ ఓవర్‌గా బిల్డప్ ఇవ్వడం సార్). నాకో మంచి ఫ్రెండ్ ఉన్నాడు. అతను లండన్ వెళ్ళి, 15 ఏళ్లు అనుభవం సంపాదించి, చెన్నైకి తిరిగివచ్చాడు. అతను నా తాజా సినిమా గ్రాఫిక్స్‌కు హెల్ప్ చేశాడు. సినిమా మీద ఇంత అవగాహన ఉంది. దర్శకత్వం చేపట్టే ఛాన్సుందా? నాట్ ఎట్ ఆల్! అయామ్ హ్యాపీ విత్ మై డెరైక్టర్స్. కాకపోతే, నేను నటించలేకున్నా, మంచి విషయం ఉన్న చిన్నతరహా సినిమాలను నిర్మించాలని అనుకుంటున్నా. ఎందుకంటే, అలాంటి కథల్ని మన హీరో ఇమేజ్‌కు తగ్గట్లు మార్చడం, విషయాన్ని డైల్యూట్ చేయడం సరైనది కాదు. అందుకే, ఆ సినిమాల్లో నేను నటించకుండా, కేవలం నిర్మించాలనుకుంటున్నా. ఆస్కార్ సినిమాలు చూస్తుంటారా? ఇటీవల నచ్చిన హాలీవుడ్ హీరోలు? అంత లెవల్ లేదు సార్! నిజం చెప్పాలంటే, నేను అంత శ్రద్ధగా, రోజూ రాత్రి హాలీవుడ్ సినిమా చూసి పడుకొనే రకం కాదు. ఎక్కువగా స్క్రిప్టులు చదువుతుంటా. ప్రాంతీయ భాషా సినిమాలు చూస్తుంటా. వాటి గురించి తెలుసుకుంటూ ఉంటా. అంతే తప్ప, విదేశీ సినిమాలను చూసి ఇన్ఫ్లుయెన్స్ అవడం ఉండదు. ఆ మధ్య ఆస్కార్ వచ్చిన ‘బర్డ్ మ్యాన్’ చూశా. బాగుంది. కాకపోతే, ఆ సినిమా బాగా అర్థం కావడానికి, ఆ పాత్ర లాగా కనిపించడానికి అతని ప్రయత్నం గురించి అర్థం చేసుకోవడానికి ఒకటికి, నాలుగుసార్లు చూడాలి. మీ ఇంట్లోనే తమ్ముడు కార్తీ నుంచి మంచి పోటీ! నటుడిగా మీకూ, అతనికీ పోలికలు, తేడాలు? కార్తీ సినిమాలు తెగ చూస్తాడు. స్క్రీన్‌ప్లే, స్క్రిప్ట్, షాట్ డివిజన్ లాంటివి బాగా ఎనలైజ్ చేయగల సమర్థుడు. ఆ విషయంలో వాడికి నా కన్నా బెటర్ నాలెడ్జ్ ఉంది. నిజానికి, వాడు దర్శకుడు కావాలనుకున్నాడు. మణిరత్నం దగ్గర అసిస్టెంట్‌గా పనిచేశాడు. అందుకే, వాడికి సినిమా మేకింగ్‌లో విషయాలు తెలుసు. ఫలానా షాట్ ఎలా తీశారనేది అబ్జర్వ్ చేసి, అప్రీషియేట్ చేయడం ఒక్కోసారి నాకు తెలియదు. కానీ, కార్తీ అలా కాదు. వాడు సినిమాలు ఎంచుకొనే విధానం నాకు నచ్చుతుంది. వాడైనా, నేనైనా మా దగ్గరకొచ్చిన ఏ మంచి స్క్రిప్ట్‌నూ వదులుకోం. నాలుగైదేళ్ళుగా చేస్తున్నదదే. ధనుష్ లాగా బాలీవుడ్‌కు వెళ్ళాలని మీకెప్పుడూ అనిపించలేదా? నేనిక్కడ హ్యాపీగా ఉన్నా. ఇక్కడ ఎలాంటి వ్యాక్యూమ్ లేదు. అలాంటప్పుడు ఇక్కడ వదిలేసి, మరోచోటికి వెళ్ళడమెందుకు? మీ కుటుంబం సేవాకార్యక్రమాలు చేస్తారనీ, దిగువ తరగతికి చెందిన విద్యార్థులకు ఆర్థిక సహాయం చేస్తున్నారనీ విన్నాం. అవును. ‘అగరమ్ ఫౌండేషన్’ (అగరమ్ డాట్ ఇన్) అని సంస్థను 2006లో ప్రారంభించాం. 2010 నుంచి దానిలో ‘విదై’ అని ఒక ప్రత్యేక ప్రాజెక్ట్ ప్రారంభించాం. అందులో గవర్నమెంట్ స్కూల్స్‌లో చదివే ఫస్ట్ జనరేషన్ కిడ్స్ను ప్రోత్సహిస్తున్నాం. వాళ్ళు కాలేజ్ చదువు దాకా వెళ్ళి, డిగ్రీ పూర్తి చేసేవరకు సమస్తం మేము సమకూరుస్తాం. పిల్లలకు సైకోమెట్రిక్ టెస్ట్‌లు కూడా పెట్టి, వాళ్ళకు ఏది బాగా వస్తుందో ఆ కోర్సులో చేర్పిస్తాం. వాళ్ళకు ఏదో ఫీజు కట్టేసి వదిలేయడం కాకుండా, వాళ్ళు ప్రొఫెషనల్ డిగ్రీ చదివే నాలుగేళ్ళూ వాళ్ళ గురించి పట్టించుకొనే వలంటీర్లు ఉంటారు. ప్రతి వారం వాళ్ళకు వర్క్‌షాపులు పెడతాం. ఐ.ఎ.ఎస్. ఆఫీసర్లతో ఇంటరాక్షన్ పెడతాం. వాళ్ళ కమ్యూనికేషన్ స్కిల్స్ మెరుగుపరుస్తాం. అలా సమగ్రమైన విద్యను అందించడం మా ప్రాజెక్ట్ లక్ష్యం. దాని వల్ల వాళ్ళు బాగా చదువుకొని, మంచి ఉద్యోగాలు సంపాదించుకొని మళ్ళీ ‘అగరమ్’కు వచ్చి, వలంటీర్లుగా పనిచేస్తున్నారు. నటులుగా కన్నా, వ్యక్తులుగా మా కుటుంబానికి ఎక్కువ తృప్తినిస్తున్న పని ఇది. మీ నాన్న గారైన... ఆ తరం ప్రముఖ హీరో శివకుమార్ ప్రభావం మీ మీద ఏ మేరకు ఉంది? నాన్న గారి ప్రభావం చాలా ఉంది. మాలోని మంచి లక్షణాలన్నిటికీ మా అమ్మా నాన్నే కారణం. మాకు కొన్ని విలువలు నేర్పారు. చాలామంది నటీనటుల జీవితాల్లో ఏం జరిగిందో మా నాన్న గారు మాతో పంచుకునేవారు. ‘ఈ ఇమేజ్, ఈ జీవితం అంతా ఒక నీటి బుడగ లాంటిది. ఏ క్షణమైనా ఈ బుడగ పేలిపోతుంది. కోట్ల మంది చూసి, మెచ్చుకొనే సినీ జీవితం ఒక అదృష్టం. అయితే, అంతా మన ప్రతిభ అనుకొంటే పొరపాటు. మనకు తెలియని అతీత శక్తి ఆశీర్వాదం వల్ల ఈ పేరు ప్రతిష్ఠలు, డబ్బు వచ్చాయని గ్రహించాలి. ‘సక్సెస్, ఫెయిల్యూర్... ఏదీ శాశ్వతం కాదు. ప్రతిదీ వెళ్ళిపోతుంద’ని గుర్తుంచుకోవాలి’ అని చెబుతుంటారు. అదే నా జీవన సూత్రం. -
నచ్చినవాడు తగిలితే ప్రేమిస్తా
నేను ప్రేమించడానికి అర్హతలున్న వ్యక్తి ఇంకా తారసపడలేదు అంటున్నారు నటి తమన్న. వయసొచ్చి పెళ్లికాని హీరోయిన్లలో ఈ అమ్మడు ఒక్కరని ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. ఎందుకంటే దక్షిణాదిలోని తమిళం, తెలుగు భాషలతో పాటు హిందీలోనూ పాపులర్ నటి తమన్న. చిన్న గ్యాప్ తరువాత కోలీవుడ్‌లో ఆర్య సరసన శరవణనుమ్ శివ ఒన్నా పడిచ్చవంగా చిత్రంలో నటిస్తున్నారు. అదే విధంగా కార్తీ సరసన ద్విభాషా చిత్రం (తమిళం, తెలుగు) ఒకటి చేస్తున్నారు. దీంతో తమిళంలో మూడువసారి రౌండ్ కొట్టడానికి రెడీ అవుతున్నారన్నమాట. నటిగా దశాబ్దకాలం అనుభవం ఉన్న తమన్నకు ఎదురయ్యే ప్రశ్న ఏముంటుందో కూడా ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. ఎవరిని ప్రేమిస్తున్నారు? పెళ్లి ఎప్పుడు అన్న ప్రశ్నల వర్షం కురుస్తోందామెపై అయితే అలాంటి ప్రశ్నలకు తమన్న తప్పు పట్టడం లేదు. వారి ఏమంటున్నారో ఆమె మాటల్లోనే నన్ను కలుసుకునే వారంతా ఎవరి ప్రేమిస్తున్నారు? పెళ్లి ఎప్పుడు చేసుకుంటున్నారు? అని ప్రశ్నిస్తున్నారు. వాళ్లలా అడగడంలో తప్పు లేదు. ఎందుకంటే నేను చిత్రరంగ ప్రవేశం చేసి పదేళైంది. అందుకే వివాహం గురించి అడుగుతున్నారు. అయితే నా జీవితంలో అమ్మ, నాన్న, అన్నయ్యల ప్రేమ ఎప్పుడూ లభిస్తుంది. ఇకపోతే నేనెవర్నీ ప్రేమించ లేదు. అలాంటి అర్హత గల వ్యక్తి ఇంకా ఎదుటపడలేదు. సినిమాలో బిజీగా ఉండడం వలన ప్రేమించడానికి సమయం లేదు. అయితే నచ్చిన వాడు ఎదురైతే తప్పకుండా ప్రేమిస్తాను. -
ఒక్క చాన్స్ ఇవ్వరూ...
తమిళసినిమా: ప్లీజ్ ఒక్క ఛాన్స్ ఇవ్వరూ....? ఖడ్గం చిత్రంలో సంగీత నటించిన సన్నివేశం గుర్తు కొస్తుందా? నిజ జీవితంలోను చాలామంది నటీమణులు ఆ స్థాయి నుంచి వచ్చిన వారే. అందుకే జీవితాల్లోంచి పుట్టిందే సినిమా అంటారు. ఇక విషయానికొస్తే సరైన విజయం లేకపోతే ఎలాంటి హీరోయిన్ అయినా అవకాశాలు అడుక్కోవాల్సిందే. ప్రస్తుతం నటి మోనాల్ గజ్జర్ పరిస్థితి అలాంటిదే. ఆమె చిరునామా లేని నటేమి కాదు. తమిళం, తెలుగు, మలయాళం అంటూ పలు భాషల్లో హీరోయిన్గా నటించారు. ఆ మధ్య తెలుగులో అల్లరి నరేష్ సరసన సుడిగాడు వంటి సక్సెస్ఫుల్ చిత్రంలోను ఇటీవల తమిళంలో విక్రమ్‌ప్రభుకు జంటగా శిఖరం తొడు వంటి ప్రజాదరణ పొందిన చిత్రంలోనూ నటించారు. అయినా ప్రస్తుతం ఈ అమ్మడికి అవకాశాలు అంతంత మాత్రమే కారణం ఏమైనా మోనాల్ గజ్జర్ ప్రస్తుతం తమిళంలో నిలదొక్కుకోవాలని ఆశిస్తున్నారు. దీంతో మంచి అవకాశాల కోసం ఎదురు చూస్తున్నారు. అలా అవకాశాల వేటలో ప్రముఖ దర్శకుడు ఎ ఆర్ మురుగదాస్ ఆమె దృష్టిలో పడ్డారు. వెంటనే కోడంబాక్కం వచ్చి ఆయన్ని కలిసి మీ దర్శకత్వంలో నటించాలన్నది నా చిరకాల కోరిక అంటూ ఒక్క చాన్స్ ఇవ్వరూ! అంటూ అడిగేశారు. మీరు అవకాశం ఇస్తేచాలు పారితోషికం కూడా అక్కరలేదు అంటూ బోనస్ మాటలతో ఏఆర్ మురుగదాస్‌ను ఇంప్రెస్ చేసే ప్రయత్నం చేశారని తెలిసింది. అయితే ప్రస్తుతం హిందీ చిత్రంలో బిజీగా ఉన్న ఎ ఆర్ మురుగదాస్ తదుపరి తమిళ చిత్రంలో అవసరమైతే తప్పకుండా అవకాశం కల్పించే విషయం ఆలోచిస్తానని అన్నారట.