Nani Speech at 'Ante Sundaraniki Movie' Trailer Launch Event in Chennai - Sakshi
Sakshi News home page

Ante Sundaraniki Movie: అక్కడ కూడా 'అంటే.. సుందరానికి'.. ట్రైలర్‌ రిలీజ్‌..

Published Sun, Jun 5 2022 9:06 AM | Last Updated on Sun, Jun 5 2022 10:00 AM

Nani Adade Sundara Movie Trailer Launch In Chennai - Sakshi

Nani Adade Sundara Movie Trailer Launch In Chennai: నేచురల్‌ స్టార్‌ నాని కథానాయకుడిగా నటించిన ‘అంటే.. సుందరానికి’ (Ante Sundaraniki Movie) చిత్రం ఈ నెల 10వ తేదీన తెలుగుతో పాటు తమిళం, మళయాళం భాషల్లో విడుదలకు సిద్ధమవుతోంది. ఇందులో నటి నజ్రియా నజీమ్‌ నాయికిగా రీఎంట్రీ ఇస్తున్నారు. రేవతి తదితరులు ముఖ్యపాత్రలు పోషించిన ఈ చిత్రానికి వివేక్‌ ఆత్రేయ దర్శకుడు. మైత్రీ మూవీస్‌ సంస్థ నిర్మించిన ఈ చిత్రం ఈ తమిళంలో ‘అడడే సుందరా’ (Adade Sundara Movie) పేరుతో విడుదల కానుంది.  ట్రైలర్‌ ఆవిష్కరణ కార్యక్రమాన్ని శుక్రవారం సాయంత్రం చెన్నైలో నిర్వహించారు. 

హీరో నాని మాట్లాడుతూ ఈ చిత్రం చేయడం తనకు చాలా సంతోషంగా ఉందన్నారు. శ్యామ్‌ సింగరాయ్‌ వంటి యాక్షన్‌ కథా చిత్రం తరువాత వినోదంతో కూడిన ఈ ఫ్యామిలీ ఎంటర్‌టైన్‌మెంట్‌ చేయడం సముచితంగా అనిపించిందని తెలిపారు. ఈ మూవీ చాలా సంతృప్తికరంగా వచ్చిందని, అన్ని వర్గాల ప్రేక్షకులను అలరిస్తుందనే నమ్మకం ఉందన్నారు. చాలా గ్యాప్‌ తరువాత ఈ చిత్రం ద్వారా రీ ఎంట్రీ ఇవ్వడం సంతోషంగా ఉందని నటి నజ్రియా నజీమ్‌ పేర్కొన్నారు.

చదవండి: అడవి శేష్‌ 'మేజర్‌' ప్రామిస్‌.. అలాంటి వారికి సపోర్ట్‌..

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement