Ante Sundaraniki Movie
-
మాట నిలబెట్టుకున్న నాని.. కొత్త సినిమా ప్రకటన.. వారిద్దరికీ ఛాన్స్
దసరా సందర్భంగా ఫ్యాన్స్‌కు అదిరిపోయే కానుకను ఇచ్చాడు హీరో నాని. తన కొత్త సినిమా ప్రకటన వచ్చేసింది. అందుకు సంబంధించిన ఒక టైటిల్ వీడియోను ఆయన విడుదల చేశాడు. ఈ ఏడాదిలో 'దసరా' సినిమా తర్వాత 'హాయ్ నాన్న' అనే సినిమాను డిసెంబర్ 7న విడుదల చేస్తున్నారు. ఈలోపే నాని మరో సినిమాను లైన్లో పెట్టాడు. 'సరిపోదా శనివారం' అనే టైటిల్‌ను ఫిక్స్ చేశారు. (ఇదీ చదవండి: బూతులను సమర్థించిన శివాజీని ఢీ కొట్టిన శోభ) ‘అంటే సుందరానికీ’ సినిమా దర్శకుడు వివేక్ ఆత్రేయ కాంబినేషన్లో తాజాగా నాని మరో సినిమాను ప్రకటించాడు. ఈ చిత్రంలో ప్రియాంకా అరుళ్ మోహన్ హీరోయిన్గా నటిస్తుంది. డీవీవీ ఎంటర్టైన్మెంట్స్పై డీవీవీ దానయ్య, కల్యాణ్ దాసరి ఈ సినిమాను నిర్మించనున్నారు. మాట నిలబెట్టుకున్న నాని నాని గ్యాంగ్ లీడర్ సినిమాతో టాలీవుడ్‌కు పరిచయమైంది హీరోయిన్ ప్రియాంక మోహన్. కానీ ఆ సినిమా తర్వాత ఆమెకు పెద్దగా ఆఫర్స్ రాలేదు. ఆ సినిమా ప్రమోషన్స్‌లో మాట్లాడుతూ.. ప్రియాంక యాక్టింగ్ తనకు బాగా నచ్చిందని కచ్చితంగా ఆమెతో మరో సినిమా చేస్తానని నాని అప్పట్లో మాటిచ్చాడు. చెప్పినట్లుగానే ఇప్పుడు ఆమెకు మరో ఛాన్స్‌తో తన మాట నిలబెట్టుకున్నాడు నాని. 'అంటే సుందరానికీ' సినిమా దర్శకుడు వివేక్ ఆత్రేయ టాలెంట్‌కు ఫిదా అయిన నాని అతడితో కూడా కచ్చితంగా మరో సినిమా చేస్తానని ప్రకటించాడు. 'సరిపోదా శనివారం' అనే సినిమాలో వారిద్దరికి ఛాన్స్ ఇచ్చి.. తన మాటను నిలబెట్టుకున్నాడు నాని. -
అనుష్క నంబర్ అనుకుని వందల సార్లు..: డైరెక్టర్
'అంటే సుందరానికీ' సినిమాతో ప్రేక్షకులను అలరించాడు యంగ్ డైరెక్టర్ వివేక్ ఆత్రేయ. చాలా విభిన్న కథలతో సినీ అభిమానులను అలరించారు. మెంటల్ మదిలో, బ్రోచేవారెవరురా లాంటి చిత్రాలు తెరకెక్కించారు. అయితే తాజాగా ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న ఆయన పలు ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ప్రస్తుతం సోషల్‌మీడియాలో నెగెటివిటీ విస్తరించిందన్నారు. కొంతమంది నెటిజన్లు కావాలనే తనపై విమర్శలు చేస్తున్నారని ఆత్రేయ చెప్పారు. సెలబ్రిటీలు సోషల్‌మీడియాకు దూరంగా ఉంటేనే ఇలాంటివి తగ్గుతాయని తెలిపారు. కొవిడ్ సమయంలో ఎదురైన సంఘటను దర్శకుడు వెల్లడించారు. డైరెక్టర్ వివేక్ ఆత్రేయ మాట్లాడుతూ.. 'కొవిడ్ సమయంలో నా స్నేహితుడి ఫాదర్ అనారోగ్యం బారిన పడ్డారు. ఆయనకు రక్తం అవసరం కావడంతో బ్లడ్ రక్తదాత కోసం చాల వెతికాం. నా ఫోన్ నంబర్ని జత చేస్తూ అందరికీ మేసేజెస్ పంపా. ఈ విషయం తెలుసుకున్న నటి అనుష్క మాకు సాయం చేయడం కోసం ఆ సందేశాన్ని తన సోషల్‌మీడియాలో షేర్ చేసింది. అయితే ఆ ఫోన్ నంబర్ అనుష్కదే అనుకుని అందరూ పొరబడ్డారు. చాలామంది కాల్స్ కూడా చేశారు. ఆ పోస్ట్ పెట్టిన తర్వాత నా ఫోన్‌కు వచ్చిన కాల్స్ ఎవరూ ఊహించి ఉండరు. ఒకరు వీడియో కాల్ చేస్తే.. మరొకరు షర్ట్ లేకుండా ఫొటోలు పంపారు. ఇక ఆ దారుణాలను నేను చెప్పలేను. హీరోయిన్ల జీవితం ఇంత కష్టంగా ఉంటుందా అని షాక్‌కు గురయ్యా. ఆ తర్వాత ఆ ఫోన్ నంబర్ బ్లాక్ చేశా.' అని అన్నారు. అంటే సుందరానికీ చిత్రానికి వచ్చిన స్పందనపై ఆయన మాట్లాడారు. ఆ చిత్రానికి వచ్చిన ఫలితంపై పూర్తి బాధ్యత నాదేనని చెప్పారు. ఆ సినిమా కొంతమంది నచ్చగా.. మరికొందరు నిడివి ఎక్కువ ఉందని కామెంట్స్ చేశారు. సినిమా నిడివి పది నిమిషాలు ఎక్కువైందని తెలుసు.. కానీ ఎడిట్ చేయడానికి వీల్లేకుండా పోయింది. ఎందుకంటే ఒక సీన్‌కు మరో సీన్‌కు లింక్ ఉంది. అయితే సినిమాకు ఎక్కువగా దగ్గర కాకూడదని ఈ చిత్రం ద్వారా నేర్చుకున్నా. ఎందుకంటే అంటే సుందరానికీ ఫలితం నన్ను తీవ్రంగా బాధించింది.' అని అన్నారు. -
నానికి బిగ్ షాక్.. చేతిలో ఒకే ఒక సినిమా!
కెరీర్ బిగినింగ్ నుంచి చేతినిండా చిత్రాలతో ఎప్పుడూ బిజీగా కనిపించాడు నేనురల్ స్టార్ నాని. అయితే అంటే సుందరానికి తర్వాత ఈ స్పీడ్ తగ్గింది. చేతిలో ఉన్న ఒకే ఒక సినిమా దసరా ఎట్టిపరిస్థితుల్లో విజయం సాధించాలని కోరుకుంటున్నాడు. అందుకే అన్ని జాగ్రత్తలు తీసుకుంటున్నాడు. 2017లో విడుదలైన మిడిల్ క్లాస్ అబ్బాయి(MCA) తర్వాత నానికి ఆ స్థాయి విజయం లభించలేదు. మధ్యలో వచ్చిన ‘జెర్సి’ నానికి పేరు తెచ్చి పెట్టింది కాని, మిడిల్ క్లాస్ అబ్బాయి రేంజ్ లో అయితే విజయాన్ని అందుకోలేకపోయింది. ఇటీవల విడుదలైన శ్యామ్ సింగ రాయ్, అంటే సుందరానికి చిత్రాల పై చాలా ఆశలు పెట్టుకున్నాడు నాని. అయితే వీటిల్లో శ్యామ్ సింగ రాయ్ కొంత ఇంప్రెస్ చేసినప్పటికీ, అంటే సుందరానికి మాత్రం బాక్సాఫీస్ దగ్గర దారుణమైన ఫలితాన్ని అందుకుంది. ఓ విధంగా నానికి షాక్ ఇచ్చింది. (చదవండి: కేజీయఫ్ 3లో ‘రాఖీభాయ్ ’కాకుండా మరో హీరో!) అందుకే చేతినలో ఉన్న ఒకే ఒక సినిమా దసరా ఎట్టిపరిస్థితుల్లో విజయం సాధించాలని నాని బలంగా కోరుకుంటున్నాడు. అందుకు తగ్గట్లే దసరా మూవీని దసరా సీజన్ లో కాకుండా తనకు బాగా కలిసొచ్చిన డిసెంబర్ లోనే రిలీజ్ చేయాలనుకుంటున్నాడు.గతంలో డిసెంబర్ లో విడుదలైన మిడిల్ క్లాస్ అబ్బాయి పెద్ద విజయాన్ని అందుకుంది. అందుకే ఈసారి సెంటిమెంట్ కు జై కొడుతున్నాడు నేచురల్. దసరా మూవీని డిసెంబర్ లో రిలీజ్ చేసేందుకు సిద్ధమవుతున్నాడు. మరి నాని సెంటిమెంట్ వర్కౌటై విజయం లభిస్తుందో లేదో చూడాలి. -
కొత్త సినిమాలతో కళకళలాడుతున్న ఓటీటీ వరల్డ్
ఓటీటీ వరల్డ్ ఒక్కసారిగా కొత్త సినిమాలతో కళకళలాడుతోంది. ఇప్పటికే మేజర్, విరాటపర్వం మూవీస్ నెటిజన్స్ ను ఉర్రూతలూగిస్తున్నాయి. ఈ వారం ఇండియాస్ మోస్ట్ అవైటెడ్ చిత్రం, కమల్ హాసన్ కమ్ బ్యాక్ మూవీ ‘విక్రమ్’ ఓటీటీలోకి రానుంది. జులై 8 నుంచి హాట్ స్టార్ లో తెలుగు,తమిళం సహా ఇతర భాషల్లో స్ట్రీమ్ కానుంది. బాక్సాఫీస్ దగ్గర 400 కోట్లకు పైగా కొల్లగొట్టిన విక్రమ్ థియేటర్స్ లోకి వచ్చిన 35 రోజుల్లో ఇప్పుడు ఓటీటీలోకి ఎంట్రీ ఇస్తోంది. (చదవండి: 1200 మందితో రామ్‌చరణ్ రిస్కీ ఫైట్!) విక్రమ్ తో పాటు నాని నటించిన లేటెస్ట్ ఫిల్మ్ అంటే సుందరానికి ఓటీటీ లోకి వచ్చేస్తోంది. జులై 10 నుంచి నెట్ ఫ్లిక్స్ లో స్ట్రీమింగ్ కు రెడీ అవుతోంది. థియేటర్స్ లోకి వచ్చిన నెల రోజులకు ఓటీటీలోకి వస్తున్నాడు సుందరం. మరోవైపు సమ్మర్ సోగాళ్లు కూడా ఓటీటీలోకి వచ్చేస్తున్నారు. విక్టరీ వెంకటేశ్, మెగా ప్రిన్స్ వరుణ్‌తేజ్ హీరోలుగా ఎఫ్3 జులై మూడో వారంలో సోనీ లివ్‌లో స్ట్రీమింగ్ కానుంది. మరోవైపు మోడర్న్ లవ్ పేరుతో ఆంథాలజీ సిరీస్‌ని తీసుకొస్తోంది అమెజాన్ ప్రైమ్. హైదరాబాద్ నేపథ్యంలో 6 కథలను ఇందులో చూపించనుంది. ఆదిపిని శెట్టి, నిత్యామీనన్, రీతువర్మ, సుహాసిని, రేవతి, నరేష్ , మాళవిక నాయర్ ముఖ్య పాత్రల్లో నటించారు. ఈ ఆరు కథలను నగేష్ కుకునూర్, వెంకటేష్ మహా, ఉదయ్ గుర్రాల, దేవిక తెరకెక్కించారు. జులై 8 నుంచే ఈ ఆంథాలజీ ప్రైమ్ లో అందుబాటులో ఉండనుంది. -
తేది గుర్తుంచుకోండి.. 'అంటే సుందరానికీ' ఓటీటీలో ఆరోజే..
Nani Ante Sundaraniki OTT Streaming Date Announced: నేచురల్ స్టార్ నాని, మలయాళ బ్యూటీ నజ్రియా నజీమ్ జోడిగా నటించిన లెటెస్ట్ మూవీ ‘అంటే.. సుందరానికీ’. ‘మెంటల్ మదిలో’, ‘బ్రోచేవారెవరురా’ లాంటి చిత్రాలతో చక్కటి గుర్తింపు తెచ్చుకున్న వివేక్ ఆత్రేయ ఈ చిత్రానికి దర్శకత్వం వహించారు. ఇందులో నాని ఓ బ్రాహ్మణ కుర్రాడిగా, నజ్రియా క్రిస్టియన్ అమ్మాయిగా జంటగా నటించిన విషయం తెలిసిందే. ఫుల్ కామెడీ రొమాంటిక్ ఎంటర్టైనర్గా తెరకెక్కిన ఈ చిత్రం జూన్ 10న ప్రేక్షకుల ముందుకు వచ్చి మొదట పాజిటివ్ టాక్ తెచ్చుకోగా తర్వాత నెమ్మదిగా కలెక్షన్లు తగ్గాయి. ఇదిలా ఉంటే ఇప్పుడు ఈ మూవీ ఓటీటీ వేదికపై సందడి చేసేందుకు సిద్ధంగా ఉంది. ప్రముఖ ఓటీటీ దిగ్గజం నెట్‌ఫ్లిక్స్‌లో జులై 10 నుంచి తెలుగు, మలయాళం, తమిళ భాషల్లో స్ట్రీమింగ్ కానుంది. ఈ విషయాన్ని సోషల్ మీడియా వేదికగా నెట్‌ఫ్లిక్స్ ఇండియా సౌత్ అధికారికంగా ప్రకటించింది. 'సుందర్ అండ్ లీల వెడ్డింగ్ స్టోరీని చూసేందుకు మీ అందరినీ సాదరంగా ఆహ్వానిస్తున్నాం. తేది గుర్తుంచుకోండి' అంటూ ట్వీట్ చేసింది. చదవండి:👇 విషాదం: కేన్సర్‌తో పోరాటం.. అంతలోనే కరోనా.. 30 ఏళ్లకే స్టార్ నటుడు మృతి బాధాకరమైన పెళ్లిళ్లకు మీరే కారణం.. సమంత కామెంట్స్ వైరల్ వేశ్య పాత్రలో యాంకర్ అనసూయ..! అందుకు నాకు అర్హత లేదు: మహేశ్ బాబు You are cordially invited to witness the wedding story of Sundar and Leela 🥰❤️ Save the date! Ante Sundaraniki is coming to Netflix on the 10th of July in Telugu, Malayalam and Tamil.@NameisNani #NazriyaFahadh #VivekAthreya pic.twitter.com/yRw3XIewK5 — Netflix India South (@Netflix_INSouth) July 3, 2022 -
వరుస ఫ్లాపులు.. నాని పరిస్థితి ఇలా అయిందేంటి?
ఒకప్పుడు నానికి మినిమం గ్యారెంటీ హీరో ఇమేజ్ ఉండేది. పక్కింటి కుర్రాడిలా కనిపిస్తాడు.. సింపుల్ స్టోరీస్ తో ఇంప్రెస్ చేస్తాడని ఆడియెన్స్ థియేటర్ వరకు వచ్చేవారు. ‘జెర్సీ’ వరకు నాని జర్నీ బాగానే సాగింది. ఈ మూవీ తర్వాత నుంచే నేచురల్ స్టార్‌కు కష్టాలు మొదలయ్యాయి. గ్యాంగ్ లీడర్, వీ, టక్ జగదీష్, శ్యామ్ సింగ రాయ్, అంటే సుందరానికి చిత్రాలు నానీకి కావాల్సిన హిట్స్ గా మారలేకపోయాయి. ఒక బ్లాక్ బస్టర్ రేంజ్ వరకు వెళ్లలేకపోయాయి. (చదవండి: కొరటాలపై కోపంగా ఉన్న ఎన్టీఆర్ ఫ్యాన్స్, కారణం ఇదే!) నాని కంటూ ఒక ఇమేజ్ ఉంది. ఆ ఇమేజ్ కు తగ్గట్లు ఎప్పుడూ అలాంటి చిత్రాలే చేస్తే ఎలా? అందుకే ప్రయోగాత్మక పాత్రలు చేస్తున్నట్లు నేచురల్ స్టార్ చెప్పుకొస్తున్నాడు. కాని ఈ ప్రయోగాలు నానికి తన సెక్షన్ ఆడియెన్స్ ను దూరం చేస్తున్నాయి. ప్రస్తుతం దసరా అనే టైటిట్ లో తెరకెక్కుతున్న చిత్రంలో నటిస్తున్నాడు నాని. తెలుగులో వస్తోన్న శక్తివమంతమైన నాటు మూవీ అంటున్నాడు నేచురల్. ప్రస్తుతం 30 శాతం వరకు షూటింగ్ పూర్తైంది. ఈ మూవీతోనైనా నాని టాలీవుడ్ కు పవర్ ఫుల్ కమ్ బ్యాక్ ఇస్తాడేమో చూడాల్సి ఉంది. -
ఓటీటీకి అంటే సుందరానికి, స్ట్రీమింగ్ డేట్, టైం ఫిక్స్.. ఎక్కడంటే!
Ante Sundaraniki Movie OTT Streaming: నేచురల్ స్టార్ నాని నటించిన లెటెస్ట్ మూవీ ‘అంటే..సుందరానికీ’. ‘మెంటల్ మదిలో’, ‘బ్రోచేవారెవరురా’ లాంటి చిత్రాలతో చక్కటి గుర్తింపు తెచ్చుకున్న వివేక్ ఆత్రేయ ఈ చిత్రానికి దర్శకత్వం వహించారు. మలయాళ బ్యూటీ నజ్రియా నజీమ్ ఈ మూవీతో హీరోయిన్గా టాలీవుడ్‌కు పరిచయమైంది. ఇందులో నాని ఓ బ్రాహ్మణ కుర్రాడిగా, నజ్రియా క్రిస్టియన్ అమ్మాయిగా జోడి కట్టిన సంగతి తెలిసిందే. చదవండి: హెల్త్అప్డేట్: ‘కెప్టెన్’ విజయకాంత్ కాలివేళ్లు తొలగింపు ఫుల్ కామెడీ రొమాంటిక్ ఎంటర్టైనర్గా తెరకెక్కిన ఈ చిత్రం జూన్ 10న ప్రేక్షకుల ముందుకు వచ్చి పాజిటివ్ టాక్‌ను తెచ్చుకుంది. మొదటి వారం హిట్ టాక్‌తో దూసుకెళ్లినా ఈ సినిమా తర్వాత నెమ్మదిగా కలెక్షన్లు తగ్గుముఖం పట్టాయి. ఇదిలా ఉంటే ఇప్పుడు మూవీ ఓటీటీ స్ట్రీమింగ్పై ఆసక్తి నెలకొంది. ఈ నేపథ్యంలో అంటే సుందరానికి డిజిటల్ రిలీజ్‌కు సంబంధించి ఓ ఆసక్తికర అప్డేట్ నెట్టింట చక్కర్లు కొడుతుంది. ప్రముఖ ఓటీటీ దిగ్గజం నెట్‌ఫ్లిక్స్ ఈ మూవీని మంచి డీల్‌కు సొంతం చేసుకుందని సమాచారం. చదవండి: సినీ కార్మికుల సమ్మెపై సీనియర్ నటుడు నరేశ్ స్పందన జూలై మొదటి వారంలోనే ఈ సినిమాను విడుదల చేసేందుకు నిర్వహకులు ప్లాన్ చేస్తున్నారట. తాజాగా నెట్‌ఫ్లిక్స్ మూవీ స్ట్రీమింగ్ కోసం డేట్, టైం ఫిక్స్ చేసినట్లు తెలుస్తోంది. ఈ తాజా బజ్ ప్రకారం.. జూలై 8వ తేదీన నెట్‌ఫ్లిక్స్ విడుదల చేయబోతుంది. అంటే జూలై 7వ తేదీ రాత్రి 12:30 గంటల నుంచే ఈ సినిమా తెలుగు, తమిళం, మలయాళం, కన్నడ భాషల్లో అందుబాటులోకి రానుందని సమాచారం. త్వరలోనే దీనిపై అధికారిక ప్రకటన కూడా రానుందని తెలుస్తోంది. -
'అంటే.. సుందరానికీ' వచ్చిన కలెక్షన్లు ఎంతంటే ?
Nani Ante Sundaraniki First Week Box Office Collections: నేచురల్ స్టార్ నాని హీరోగా నటించిన లెటెస్ట్ మూవీ ‘అంటే..సుందరానికీ’.‘మెంటల్ మదిలో’, ‘బ్రోచేవారెవరురా’లాంటి చిత్రాలతో చక్కటి గుర్తింపు తెచ్చుకున్న వివేక్ ఆత్రేయ ఈ చిత్రానికి దర్శకత్వం వహించారు. మలయాళ బ్యూటీ నజ్రియా నజీమ్ హీరోయిన్గా నటించింది. ఈ చిత్రంలో నాని ఓ బ్రాహ్మణ కుర్రాడిగా, నజ్రియా క్రిస్టియన్ అమ్మాయిగా జోడి కట్టారు. ప్యూర్ కామెడీ రొమాంటిక్ ఎంటర్టైనర్గా తెరకెక్కిన ఈ చిత్రం జూన్ 10న విడుదలై బాక్సాఫీస్ వద్ద మంచి టాక్‌ను సంపాదించుకుంది. ఈ సినిమా మొదటి వారం హిట్ టాక్‌తో దూసుకెళ్లినా, తర్వాత కలెక్షన్లు తగ్గుముఖం పట్టాయి. ఈ సినిమా ఫస్ట్ వీక్ పూర్తయ్యే సరికి వరల్డ్‌వైడ్‌గా రూ. 18.39 కోట్ల షేర్ వసూళ్లను రాబట్టింది. గ్రాస్ పరంగా రూ. 32.60 కోట్లు కొల్లగొట్టి నాని కెరీర్లో మంచి హిట్ మూవీగా సినిమా నిలిచిందని సినీ వర్గాలు పేర్కొన్నాయి. ఏరియాలా వారీగా ఈ మూవీ మొదటి వారం కలెక్షన్లు ఈ కింది విధంగా ఉన్నాయి. నైజాం- రూ. 5.58 కోట్లు సీడెడ్- రూ. 1.13 కోట్లు ఉత్తరాంధ్ర- రూ. 1.33 కోట్లు ఈస్ట్- రూ. 0.93 కోట్లు వెస్ట్- రూ. 0.79 కోట్లు గుంటూరు- రూ. 0.87 కోట్లు కృష్ణా- రూ. 0.84 కోట్లు నెల్లూరు- రూ. 0.58 కోట్లు మొత్తం ఏపీ, తెలంగాణ కలిపి- 12.05 కోట్లు (రూ. 20.40 కోట్లు గ్రాస్) కర్ణాటకతోపాటు దేశవ్యాప్తంగా- 1.34 కోట్లు ఓవర్సీస్- 5 కోట్లు ప్రపంచవ్యాప్తంగా- రూ. 18.39 కోట్లు (రూ. 32.60 కోట్లు గ్రాస్) చదవండి: సైలెంట్‌గా తమిళ హీరోను పెళ్లాడిన తెలుగు హీరోయిన్.. కాలేజ్‌లో డ్యాన్స్ చేసిన సాయి పల్లవి.. వీడియో వైరల్.. ఓటీటీలోకి 'విరాట పర్వం'.. ఎప్పుడంటే ? -
రెస్పాన్స్ చూస్తుంటే కడుపు నిండిపోయింది: నాని
‘‘మంచి చిత్రాలు చాలా అరుదుగా వస్తాయి. ‘అంటే.. సుందరానికీ’ కూడా అరుదైన సినిమానే. ఇలాంటి చిత్రాన్ని మనందరం ముందుకు తీసుకెళ్తే తెలుగు సినిమా వేస్తున్న కొత్త అడుగులో భాగం అవుతాం. ఇది మనందరి సినిమా.. ఇది మనందరి విజయం. మనందరి సెలబ్రేషన్. అంటే.. సుందరానికీ’కి వస్తున్న స్పందన, అభిమానుల సందేశాలు చూస్తుంటే కడుపు నిండిపోయింది’’ అని హీరో నాని అన్నారు. వివేక్ ఆత్రేయ దర్శకత్వంలో నాని, నజ్రియా నజీమ్ జంటగా నటించిన చిత్రం ‘అంటే.. సుందరానికీ’. నవీన్ యెర్నేని, వై.రవిశంకర్ నిర్మించిన ఈ సినిమా ఈ నెల 10న రిలీజైంది. ఈ సందర్భంగా సోమవారం బ్లాక్ బస్టర్ సక్సెస్ మీట్లో వివేక్ ఆత్రేయ మాట్లాడుతూ– ‘‘అంటే.. సుందరానికీ’ లాంటి వైవిధ్యమైన కథను ఒప్పుకున్న నానీకి, నిర్మాతలకు థ్యాంక్స్’’ అన్నారు. ‘‘జంధ్యాలగారి ‘అహ నా పెళ్ళంట, శ్రీవారికి ప్రేమలేఖ’ లాంటి క్లాసిక్ సినిమా ‘అంటే.. సుందరానికీ’. మా బ్యానర్లో ఎప్పటికీ నిలిచిపోయే చిత్రమిది’’ అన్నారు నవీన్ యెర్నేని. సంగీత దర్శకుడు వివేక్ సాగర్, నటి అరుణ భిక్షు మాట్లాడారు. చదవండి: రక్తం మరిగిన పులి 'గ్యాంగ్‌స్టర్ గంగరాజు'.. ఆసక్తిగా ట్రైలర్ ఆ వీడియో బయటకు రావడంతో దారుణంగా ట్రోల్ చేశారు, ఇక అప్పడే.. -
సాక్షితో న్యాచురల్ స్టార్ నాని
-
నవ్వులతో నవరాగాలు ఒలికిస్తున్న నివేదా థామస్ (ఫోటోలు)
-
కొత్త ట్రెండ్.. స్టేజ్‌పై స్టార్ హీరోల స్టెప్పులు
ఒకప్పుడు హీరోలు స్టేజ్‌పై తమ సినిమాలోని డైలాగ్స్ చెపి అభిమానులను ఖుషీ చేసేశారు. కానీ ఇప్పుడు హీరోలు అదే స్టేజ్‌పై స్టెప్పులేయడం ట్రెండ్‌గా మారింది. ప్రీ రిలీజ్ ఈవెంట్స్, సక్సెస్ మీట్స్ లో మైక్ పట్టుకుని అభిమానులను ఉద్దేశించి మాట్లాడాల్సిన హీరోలు అంతటితో ఆగకుండా అదే స్టేట్ పై స్టెప్పులేస్తూ ఈవెంట్ వచ్చిన ఆడియెన్స్ ను ఉర్రూతలూగిస్తున్నారు. సినిమా సక్సెస్ ను అందరితో షేర్ చేసుకుంటున్నారు. ఇటీవల సర్కారు వారు పాట ప్రమోషన్స్ లో సూపర్ స్టార్ మహేశ్ బాబు స్టేజ్‌పై స్టెప్పులేసి టోటల్ టాలీవుడ్‌ను ఆశ్చర్యపరిచాడు. (చదవండి: వేదికపై మహేష్‌బాబు డ్యాన్స్) అలాగే ఎఫ్3 సక్సెస్ మీట్లో విక్టరీ వెంకటేష్ కూడా స్టేస్పై డాన్స్ చేశారు.తాజాగా అంటే సుందరానికీ ప్రీ రిలీజ్ ఈవెంట్ లో నాని, నజ్రియా మాత్రమే కాకుండా టోటల్ యూనిట్ ఈ సినిమా ప్రమోషనల్ సాంగ్ కు స్టెప్పులేసింది. The TRIO of Team #F3Movie rocks the stage dancing for 'Kurradu Baboye' DJ Mix 💥💥😍😍 Triple Blockbuster FUNtastic Celebrations! 🥳 📽️ https://t.co/YuJh17JmAd#F3TripleBlockbuster@VenkyMama @IAmVarunTej @AnilRavipudi @ThisIsDSP @SVC_official @adityamusic @shreyasgroup pic.twitter.com/UptRcOSs9b — Sri Venkateswara Creations (@SVC_official) June 4, 2022 కరోనా కాలంలో థియేటర్స్‌కి ప్రేక్షకులను రప్పించడం కోసమే హీరోలో ఇలా డాన్స్ చేస్తున్నారు. ఇది మంచి పరిణామమే అని ఇటీవల అల్లు అరవింద్ అన్నారు. .ప్రేక్షకులను థియేటర్స్ కు రప్పించేందుకు ఇండస్ట్రీకి కొన్ని సూచనలు కూడా చేశారు. వాటిల్లో హీరోలు సీరియస్ గా ప్రమోషన్స్ పై ఫోకస్ పెట్టాలని చెప్పారు. Sundar, Leela and their families are enjoying themselves on the stage with the Hook Step ❤️ Watch #AnteSundaraniki Pre Release Celebrations Live Now 💥💥#PKforSundar ❤️🔥 - https://t.co/tZCkxpv1zw IN CINEMAS TOMORROW 💥@NameisNani #NazriyaFahadh pic.twitter.com/4Ca25cStuR — Mythri Movie Makers (@MythriOfficial) June 9, 2022 -
మైత్రీ మూవీస్, శ్రేయాస్ మీడియాపై మాదాపూర్ పీఎస్‌లో కేసు నమోదు
-
‘అంటే సుందరానికీ’ నిర్మాణ సంస్థపై కేసు నమోదు
అనుమతి తీసుకోకుండానే ‘అంటే సుందరానికీ’ మూవీ ప్రీరిలీజ్ ఈవెంట్ నిర్వహించారంటూ ప్రముఖ నిర్మాణ సంస్థ మైత్రీ మూవీస్, శ్రేయాస్ మీడియాపై మాదాపూర్ పోలీసులు కేసు నమోదు చేశారు. నాని, నజ్రియా నటించిన తాజా చిత్రం ‘అంటే సుందరానికీ’. ఈ చిత్రం ప్రీరిలీజ్ ఈవెంట్‌ని గురువారం మాదాపూర్ శిల్పకళా వేదికలో ఘనంగా జరిగింది. ఈ ఈవెంట్‌కి పవన్ కల్యాణ్ ముఖ్య అతిథిగా వెళ్లారు. (చదవండి: ‘అంటే..సుందరానికీ’ మూవీ రివ్యూ) అయితే ప్రీరిలీజ్ ఈవెంట్‌కి పవన్ కల్యాణ్ లాంటి స్టార్ హీరో వస్తున్నప్పటీకీ.. పోలీసులకు సమాచారం ఇవ్వకుండా శ్రేయాస్ మీడియా ఈ ఈవెంట్‌ని నిర్వహించింది. దీంతో నిబంధనలు ఉల్లఘించారంటూ శ్రేయాస్ మీడియా ఈవెంట్ మేనేజర్ సురేశ్‌తో పాటు మైత్రీ మూవీస్‌పై సెక్షన్ 188 కింద కేసు నమోదు చేశారు. -
‘అంటే..సుందరానికీ’ మూవీ రివ్యూ
టైటిల్ : అంటే..సుందరానికీ నటీనటులు : నాని, నజ్రియా నజీమ్, నరేశ్ హర్షవర్థన్, నదియా, రోహిణి తదితరులు నిర్మాణ సంస్థ : మ్రైతీ మూవీ మేకర్స్ నిర్మాతలు:నవీన్ యెర్నేని, రవిశంకర్ వై. దర్శకత్వం : వివేక్ ఆత్రేయ సంగీతం : వివేక్ సాగర్ సినిమాటోగ్రఫీ : నికేత్ బొమ్మి ఎడిటర్ :రవితేజ గిరిజాల విడుదల తేది : జూన్ 10,2022 ‘శ్యామ్ సింగరాయ్’తో మళ్లీ హిట్ ట్రాక్ ఎక్కాడు నేచురల్ స్టార్ నాని. ఆ మూవీ ఇచ్చిన హిట్ కిక్‌తో వరుస సినిమాలు చేస్తున్నాడు. అయితే ఫలితాన్ని పట్టించుకోకుండా.. కొత్త జానర్స్‌ని ట్రై చేయడం నానికి అలవాటు. సినిమా సినిమాకి తన పాత్ర, కథలో వేరియేషన్ ఉండేలా చూసుకుంటాడు. వరసగా యాక్షన్ డ్రామా చిత్రాలు చేస్తూ వచ్చిన నాని.. ఈ సారి మాత్రం తనకు అచ్చొచ్చిన కామెడీ జానర్‌తో ‘అంటే.. సుందరానికీ’అంటూ ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. ఈ చిత్రంతో మలయాళ బ్యూటీ నజ్రియా నజీమ్ టాలీవుడ్‌కు పరిచయం అవుతుంది. ఇప్పటికే విడుదలైన టీజర్, పాటలకు పాజిటివ్ రెస్పాన్స్ రావడం.. దానికి తోడు మూవీ ప్రమోషన్స్ కూడా గ్రాండ్‌గా చేయడంతో ‘అంటే.. సుందరానికీ’పై హైప్ క్రియేట్ అయింది. భారీ అంచనాల మధ్య ఈ శుక్రవారం(జూన్ 10) విడుదలైన ఈ మూవీని ప్రేక్షకులు ఏ మేరకు ఆదరించారో రివ్యూలో చూద్దాం. కథేంటంటే సుందర్(నాని)..సంప్రదాయ బ్రాహ్మణ కుటుంబానికి చెందిన యువకుడు. అతని తండ్రి(నరేశ్) కుటుంబ ఆచార వ్యవహారాలకు చాలా ప్రాధాన్యత ఇస్తుంటాడు.తన వంశంలో పుట్టిన ఏకైక కుమారుడు సుందర్‌ని కూడా తనలాగే పద్దతిగా పెంచాలనుకుంటాడు. సుందర్ చిన్నవయసులో చిరంజీవి సినిమాలో చైల్డ్ ఆర్టిస్ట్‌గా నటించే అవకాశం వచ్చినట్లే వచ్చి చేజారిపోతుంది. దీంతో కొడుకు జాతకంలో ఏదో దోషం ఉందని జ్యోతిష్యుడు జోగారావు(శ్రీకాంత్ అయ్యంగార్)ని సంప్రదిస్తుంది అతని ఫ్యామిలీ. అప్పటి నుంచి సుందర్ జీవితమే మారిపోతుంది. డబ్బు కోసం జోగారావు ఈ దోషం, ఆ దోషం అంటూ సుందర్‌తో రకరకాల హోమాలు చేయిస్తాడు. దీంతో సుందర్‌కి విసుగెత్తి ఇంట్లో అబద్దాలు చెప్పడం ప్రారంభిస్తాడు. మరోవైపు క్రిస్టియన్ ఫ్యామిలీకి చెందిన యువతి లీలా థామస్(నజ్రియా నజీమ్) ఫ్యామిలీ కూడా మతంపై మమకారం ఎక్కువ. ఆమె తండ్రి(అలగం పెరుమాల్) హిందువులు పెట్టిన ప్రసాదం కూడా స్వీకరించడు. అలాంటి ఫ్యామిలీకి చెందిన సుందర్, లీలాలు..ప్రేమలో పడతారు. ఇరు కుటుంబాలను ఒప్పించడానికి రకరకాల అబద్దాలు ఆడతారు. ఆ అబద్దాలు వీరి జీవితంలో ఎలాంటి అల్లకల్లోలానికి దారి తీశాయి? సుందర్, లీలాలు చెప్పిన ఆబద్దాలు ఏంటి? ఇతర మతస్థులతో స్నేహం అంటేనే మండిపడే సుందర్, లీలాల కుటుంబ సభ్యులు వీరికి పెళ్లికి ఎలా ఒప్పుకున్నారు? అనేది తెలియాలంటే థియేటర్స్‌లో ‘అంటే సుందరానికీ’సినిమా చూడాల్సిందే. ఎలా ఉందంటే.. వేరు వేరు మతాలకు చెందిన అబ్బాయి, అమ్మాయి ప్రేమించుకోవడం.. వారి పెళ్లికి పెద్దలు నిరాకరించడం.. పేరెంట్స్‌ని ఎదురించి, అష్టకష్టాలు పడి వారు పెళ్లి చేసుకోవడం..ఈ కాన్సెఫ్ట్‌తో గతంలో చాలా సినిమాలే వచ్చాయి.‘అంటే సుందరానికీ’ కథ కూడా ఇంచుమించు ఇలానే ఉంటుంది..అయితే పాత కథకు కొత్త ట్రీట్మెంట్ ఇచ్చి, కాస్త కామెడీగా చిత్రాన్ని మలిచాడు దర్శకుడు వివేక్ ఆత్రేయ. పద్దతులు ఆచారాల ముసుగులో లోపలి మనిషిని చంపుకోవద్దు. మతం కంటే మానవత్వం గొప్పదనే విషయాన్ని అంతర్లీనంగా చెబుతూ ఓ అందమైన లవ్‌స్టోరీని చూపించాలనుకున్నాడు. అయితే ఈ విషయంలో దర్శకుడు కాస్త విఫలం అయ్యాడు. ఎలాంటి అశ్లీలతకు తావివ్వకుండా..కంప్లీట్ క్లీన్ ఎంటర్టైనర్గా సినిమాను తెరకెక్కించినా.. కథనం మాత్రం సాదాసీదాగా సాగుతుంది. ఫస్టాప్‌లో బ్రాహ్మణ కుర్రాడు సుందర్ బాల్యంలో వచ్చే ఒకటి రెండు సన్నివేశాలు తప్పా మిగతావేవి అంతగా ఫన్ని క్రియేట్ చేయలేదు. హీరోయిన్ని పరిచయం చేయడానికి చాలా సమయం తీసుకున్నాడు దర్శకుడు. దీనికి తోడు హీరో కంటే ముందే ఆమెకు మరో లవ్ స్టోరిని యాడ్ చేసి ఫస్టాఫ్ అంతా సాగదీశాడనిపిస్తుంది. ఇక సెకండాఫ్‌లో అసలు కథ మొదలవుతుంది. సుందర్, లీలా ఇద్దరు అమెరికాకు వెళ్లడం.. పెళ్లి కోసం అబద్దం చెప్పి ఇండియాకు రావడంతో అసలు స్టోరీ ముందుకు సాగుతుంది. వీరిద్దరు చెప్పిన అబద్దాలే నిజంగా జరగడంతో అసలేం జరిగిందనే ఉత్కంఠ మొదలవుతుంది. ఆ నేపథ్యంలో వచ్చిన కామెడీ సీన్స్ కూడా బాగున్నాయి. క్లైమాక్స్‌లో ‘ప్రెగ్నేన్సీ అనేది చాయిస్ మాత్రమే కానీ. ఆప్షన్ కాదు’ అని హీరో చెప్పే డైలాగ్ హృదయాలను హత్తుకుంటుంది. దాదాపు మూడు గంటల నిడివి ఉండడం సినిమాకు మైనస్. మొత్తంగా అబద్దాలతో కాసేపు నవ్వించి.. చివర్లో చిన్న సందేశం ఇచ్చి ప్రేక్షకులను థియేటర్స్ నుంచి బయటకు పంపాడు దర్శకుడు. ఎవరెలా చేశారంటే.. యాక్షన్ అయినా.. కామెడీ అయినా తనదైన నటనతో మెప్పిస్తాడు నాని. పాత్రలో పరకాయ ప్రవేశం చేస్తాడు. ఈ చిత్రంలో కూడా అంతే.. సుందర్ ప్రసాద్ పాత్రలో ఒదిగిపోయాడు. తనదైన కామెడీతో నవ్వించాడు. లీలా థామస్‌గా నజ్రియా ఆకట్టుకుంది. తెలుగులో ఇది ఆమెకు తొలి సినిమా అయినా.. చాలా బాగా నటించింది. పైగా తన పాత్రకు తానే డబ్బింగ్ చెప్పుకోవడం విశేషం. సుందర్ తండ్రిగా నరేశ్ మరోసారి తన అనుభవాన్ని తెరపై చూపించాడు. ఇక సంప్రదాయ బ్రాహ్మణ కుటుంబానికి చెందిన మహిళగా, భర్త మాటకు ఎదురు చెప్పలేని భార్యగా రోహిణి తనదైన నటనతో ఆకట్టుకుంది. హీరోయిన్ తల్లిగా నదియ, తండ్రిగా అలగం పెరుమాల్ తమ పాత్రలకు న్యాయం చేశారు. ఇక ఈ సినిమాలో అనుపమ పరమేశ్వరన్ కూడా ఉంది. ఈ విషయాన్ని చిత్ర యూనిట్ ఎందుకు దాచిపెట్టిందో తెలియదు కానీ.. ఆమె పాత్ర మాత్రం అందరిని ఆకట్టుకుంది. సుందర్ సహోద్యోగి సౌమ్య పాత్రలో అనుపమ మెరిసింది. ఇక సుందర్ బాస్‌గా హర్షవర్ధన్ తనదైన కామెడీతో నవ్వించాడు. మిగిలిన నటీనటులు తమ పాత్రల పరిధిమేర నటించారు. ఇక సాంకేతిక విషయానికొస్తే.. వివేక్ సాగర్ సంగీతం పర్వాలేదు. పాటలు అంతంత మాత్రమే అయినా.. నేపథ్య సంగీతం మాత్రం కొత్తగా ఉంది. నికేత్ బొమ్మి సినిమాటోగ్రఫీ చాలా బాగుంది. ఎడిటర్ రవితేజ గిరిజాల తన కత్తెరకు ఇంకాస్త పనిచెప్పాల్సింది.ముఖ్యంగా ఫస్టాఫ్‌లో కొన్ని సీన్స్‌ని మరింత క్రిస్పీగా కట్ చేయాల్సింది. మైత్రీ మూవీ మేకర్స్ ప్రొడక్షన్ వ్యాల్యూస్ రిచ్‌గా ఉన్నాయి. - అంజి శెట్టె, సాక్షి వెబ్‌డెస్క్ -
‘అంటే.. సుందరానికీ’ ప్రీ రిలీజ్ వేడుక (ఫోటోలు)
-
‘అంటే..సుందరానికీ’ ట్విటర్ రివ్యూ
నేచురల్ స్టార్ నాని హీరోగా నటించిన లెటెస్ట్ మూవీ ‘అంటే..సుందరానికీ’.‘మెంటల్ మదిలో’, ‘బ్రోచేవారెవరురా’లాంటి చిత్రాలతో చక్కటి గుర్తింపు తెచ్చుకున్న వివేక్ ఆత్రేయ ఈ చిత్రానికి దర్శకత్వం వహించారు. మలయాళ బ్యూటీ నజ్రియా నజీమ్ హీరోయిన్గా నటించింది. ప్యూర్ కామెడీ రొమాంటిక్ ఎంటర్టైనర్గా తెరకెక్కిన ఈ చిత్రంలో నాని ఓ బ్రాహ్మణ కుర్రాడిగా, నజ్రియా క్రిస్టియన్ అమ్మాయిగా నటించింది. ఇప్పటికే విడుదలైన టీజర్, పాటలు సినిమాపై భారీ అంచనాలను పెంచాయి. బ్రాహ్మణ కుర్రాడు, క్రిస్టియన్ అమ్మాయిల మధ్య ప్రేమ ఎలాంటి పరిణామాలకు దారి తీస్తుందనే కాన్సెప్ట్‌తో ఈ చిత్రాన్ని తెరకెక్కించినట్లు ట్రైలర్ చూస్తే అర్థమవుతోంది. చాలా కాలం తర్వాత నాని మరోసారి కామెడీ చిత్రంతో వస్తుండటంతో ‘అంటే..సుందరానికీ’కోసం ఫ్యాన్స్ ఎంతో ఆతృతగా ఎదురు చూశారు. భారీ అంచనాల మధ్య ఈ చిత్రం నేడు(జూన్ 10) ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఇప్పటికే ఓవర్సీస్తో పాటు పలు చోట్ల బొమ్మ పడిపోయింది. దీంతో ఈ సినిమా చూసిన ప్రేక్షకులు సోషల్ మీడియా వేదికగా తన అభిప్రాయాన్ని తెలియజేస్తున్నారు. ‘అంటే సుందరానికీ’ కథేంటి? ఎలా ఉంది? తదితర విషయాలను ట్విటర్ వేదికగా చర్చిస్తున్నారు. అవేంటో చూడండి.అయితే, ఇది కేవలం ప్రేక్షకుడి అభిప్రాయం మాత్రమే. అందులో వారు పేర్కొన్న అంశాలకు ‘సాక్షి’ బాధ్యత వహించదు. #AnteSundaraniki A Classy Romantic Comedy that is both Entertaining and Emotional! The movie is engaging even though it feels lengthy at times and comedy is natural. The emotions worked well. Nani, Nazriya, and the rest of the cast was perfect. Go for it 👍 Rating: 3.25/5 — Venky Reviews (@venkyreviews) June 9, 2022 ‘అంటే సుందరానికీ’లో కామెడీ, ఎమోషనల్ రెండూ వర్కౌట్ అయ్యాయి. ఒక్కోసారి లెంగ్తీగా అనిపించినా, రొటీన్ కామెడీ సీన్స్ ఉన్నప్పటికీ సినిమా ఎంగేజింగ్‌గా ఉంటుంది. భావోద్వేగాలు బాగా పనిచేశాయి. నాని, నజ్రియా, మిగతా నటీనటులు పర్ఫెక్ట్గా నటించారు. ఓ నెటిజన్ ట్వీట్ చేశాడు 1st half just baundi.. 2nd half Chala baundi .. back to back good movies from Vivek athreya.. nani, nazriya, Vivek athreya, Harsha vardhan, naresh 👌👍 #AnteSundaraniki — Indebted to Petla🔔 (@JakDexxter) June 10, 2022 ఫస్టాఫ బాగుంది. సెకండాఫ్ చాలా బాగుంది. వివేక్ ఆత్రేయకు మరో విజయం దక్కింది. నాని, నజ్రియా, హర్షవర్థన్, నరేశ్‌ల యాక్టింగ్ బాగుంది అని ఓ నెటిజన్ కామెంట్ చేశాడు. Brilliant n flawless writing in second half esp climax…Sensibilities, emotions chala baga chupinchadu…First half too slow adhokkate complaint..Nani and Nazriya pair, acting, BGM is perfect #AnteSundaraniki — Pandagowwww (@ravi_437) June 10, 2022 సెకండాఫ్, క్లైమాక్స్ అదిరిపోయింది. కానీ ఫస్టాఫ్ చాలా స్లోగా ఉంది.నాని, నజ్రియ జంట తెరపై బాగుంది. వివేక్ సాగర్ చక్కటి బీజీఎం అందించాడు అని ఓ నెటిజన్ చెప్పుకొచ్చాడు. #AnteSundaraniki is nonstop nonsense, loud unfunny characters with literally no humor with very thin plot. After two great scripts Jersey, Shyam singha roy very bad selection of script by @NameisNani . — Sean (@SimiValleydude) June 10, 2022 #AnteSundaraniki good watch!! Very clean writing by vivek atreya and @NameisNani with unique timing nailed it. Go for it... 3.5/5 — Rahul Reddy (@Rahulreddy118) June 10, 2022 -
నాని నటనే కాదు.. వ్యక్తిత్వం అంటే ఇష్టం: పవన్ కల్యాణ్
‘‘తెలుగు చలనచిత్ర పరిశ్రమ ఏ ఒక్కరి సొత్తు కాదు.. ఒక కుటుంబానిది కాదు.. ఇది మనందరిది. మా సినిమా బాగుండాలని ఎక్కువగా కోరుకుంటాం.. అది సహజం. అంతేకానీ ఎదుటివారి సినిమా బాగుండకూడదని కోరుకోం. ఇండస్ట్రీలో రాజకీయపరంగా విభిన్నమైన ఆలోచనలు ఉండొచ్చు.. అయినప్పటికీ సినిమా వేరు.. రాజకీయం వేరు. ఆ స్పష్టత నాకుంది’’ అని హీరో పవన్ కల్యాణ్ అన్నారు. నాని, నజ్రియా నజీమ్ జంటగా వివేక్ ఆత్రేయ దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం ‘అంటే.. సుందరానికీ’. నవీన్ యెర్నేని, రవిశంకర్ వై. నిర్మించిన ఈ చిత్రం నేడు విడుదలవుతోంది. ఈ సందర్భంగా గురువారం జరిగిన ప్రీ రిలీజ్ వేడుకలో ముఖ్య అతిథి పవన్ కల్యాణ్ మాట్లాడుతూ– ‘‘నాని విలక్షణమైన నటుడు.. తన నటనే కాదు.. వ్యక్తిత్వం అంటే నాకు ఇష్టం.. గౌరవం. తనకు మరిన్ని హిట్ సినిమాలు ఇవ్వాలని దేవుణ్ణి కోరుకుంటున్నాను. వివేక్ ఆత్రేయ ఈ సినిమాని అద్భుతంగా తీసి ఉంటాడని నమ్ముతున్నాను. భవిష్యత్‌లో నవీన్ యెర్నేని, రవిశంకర్గార్ల నిర్మాణంలో హరీష్ శంకర్ దర్శకత్వంలో నేను హీరోగా ‘భవదీయుడు భగత్‌సింగ్’ సినిమా చేయబోతున్నాం’’ అన్నారు. నాని మాట్లాడుతూ– ‘‘నేను ఇండస్ట్రీకి వచ్చిన 14 ఏళ్లలో అందరి హీరోలను కలిశాను. కానీ పవన్ కల్యాణ్‌గారిని కలిసే సందర్భం రాలేదు. ఇప్పుడు కలిశాక చిన్నప్పటి నుంచి కలిసి ఉన్న ఫీలింగ్ కలుగుతోంది. ఈ సినిమా చేసినందుకు గర్వపడుతున్నాను. ‘అంటే.. సుందరానికీ’ నాట్ ఎంటర్టైన్మెంట్.. ఇట్స్ ఎంజాయ్మెంట్’’ అన్నారు. నవీన్ యెర్నేని మాట్లాడుతూ– ‘‘అంటే.. సుందరానికీ’ సినిమా బ్లాక్ బస్టర్ అవుతుందనే నమ్మకం ఉంది. కుటుంబమంతా ఎంజాయ్ చేసే చిత్రమిది’’ అన్నారు. సుకుమార్ మాట్లాడుతూ– ‘‘అంటే.. సుందరానికీ’ ప్రివ్యూ చూశా. ఫస్టాఫ్ చూసి ‘పర్లేదమ్మా.. బాగుంది’ అని వివేక్ ఆత్రేయకి చెప్పా. సెకండాఫ్ చూశాక నా అహం పోయింది.. మనస్ఫూర్తిగా ఆత్రేయని హత్తుకుని మంచి సినిమా తీశావని అభినందించాను’’ అన్నారు. (ఫొటో గ్యాలరీ కోసం ఇక్కడ క్లిక్ చేయండి) -
నజ్రియాతో కలిసి నాని భార్య స్టెప్పులు.. వీడియో వైరల్
నేచురల్ స్టార్ నాని హీరోగా నటించిన తాజా చిత్రం ‘అంటే సుందరానికీ’. ఈ మూవీతో మలయాళ బ్యూటీ నజ్రియా నజీమ్ టాలీవుడ్ ఎంట్రీ ఇస్తోంది. వివేక్ ఆత్రేయ దర్శకత్వం వహించిన ఈ చిత్రం రేపు(జూన్ 10)న విడుదల కాబోతుంది. ప్రమోషన్స్‌లో భాగంగా తాజాగా ఈ చిత్రం నుంచి ఓ సాంగ్‌ని విడుదల చేశారు మేకర్స్. అందులో నాని,నజ్రియా స్టెప్పులు అదిరిపోయాయి. ప్రస్తుతం ఈ సాంగ్ యూట్యూబ్‌లో దూసుకెళ్తోంది. (చదవండి: మన పిల్లలకైనా ఆ సమస్య ఉండకూడదు: నజ్రియా నజీమ్) ఇదిలా ఉంటే.. ఈ పాటకు నజ్రియాతో కలిసి స్టెప్పులేసింది నాని భార్య అంజన. స్క్రీన్‌పై పాట ప్లే అవుతుంటే.. నజ్రీయా, అంజనా..తమకు నచ్చిన విధంగా స్టెప్పులేశారు. ఇక చివర్లో వీరితో నాని కూడా జత కట్టాడు. ఈ వీడియోని నజ్రీయా ఇన్‌స్టాలో షేర్ చేస్తూ.. నాని, అంజనలతో కలిసి డ్యాన్స్ చేయడం ఆనందంగా ఉందని రాసుకొచ్చింది. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. View this post on Instagram A post shared by Nazriya Nazim Fahadh (@nazriyafahadh) -
200 సినిమాలు చేశా.. నేను చేసిన బెస్ట్ తండ్రి పాత్ర ఇదే!
‘‘నేనిప్పటి వరకు రెండొందలకు పైగా సినిమాలు చేశాను. కానీ, ‘అంటే.. సుందరానికీ’ చిత్రంలో నేను చేసిన బ్రాహ్మణ పాత్రకు తగ్గట్టుగా డబ్బింగ్ చెప్పడానికి తొమ్మిది రోజులు పట్టింది. ఇన్ని రోజులు డబ్బింగ్ చెప్పుడం ఎప్పుడూ జరగలేదు.. ఇదంతా వివేక్ ఆత్రేయ డ్రాఫ్టింగ్ వల్లే జరిగింది’’ అని నటుడు వీకే నరేశ్ అన్నారు. నాని, నజ్రియా నజీమ్ జంటగా వివేక్ ఆత్రేయ దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం ‘అంటే.. సుందరానికీ’. నవీన్ యెర్నేని, రవిశంకర్ నిర్మించిన ఈ చిత్రం రేపు (శుక్రవారం) విడుదలవుతోంది. ఈ చిత్రంలో నాని తండ్రిగా నటించిన వీకే నరేశ్ మాట్లాడుతూ.. ‘‘గతంలో జంధ్యాలగారి సినిమాల్లో బ్రాహ్మణుడి పాత్రల్లో నటించాను. చదవండి: బిగ్‌బాస్ విన్నర్ సన్నీపై దాడి, పోలీసులకు ఫిర్యాదు ఇప్పుడు ‘అంటే.. సుందరానికీ’లో చేశాను. ఈ చిత్రంలో నేను చేసిన తండ్రి పాత్ర ది బెస్ట్. దానికి కారణాలు వివేక్ రూపుదిద్దిన విధానం, నాని, నాకు మధ్య కామెడీ టైమింగ్. ఎమోషన్స్‌ను క్యారీ చేస్తూ ఆడియన్స్‌ను నవ్వించే కీలకమైన పాత్ర నాది. రెండు భిన్నమైన మనస్తత్వాలు గల కుటుంబాల మధ్య ఏం జరిగింది? అనేది ఈ సినిమాలో ఆసక్తిగా ఉంటుంది. మొత్తంగా చెప్పాలంటే ఈ సినిమా పదహారు కూరల తెలుగు కంచం. నా కెరీర్‌ను తర్వాతి స్థాయికి తీసుకెళ్లే మూవీ అవుతుంది. మైత్రీ మూవీస్ మంచి కుటుంబ కథా చిత్రాలకు ఆణిముత్యం లాంటి సంస్థ. ప్రస్తుతం నేను లీడ్ రోల్లో రెండు సినిమాలు చేస్తున్నాను’’ అన్నారు. చదవండి: తమ రిలేషన్‌ను అధికారికంగా ప్రకటించిన లవ్‌బర్డ్స్ -
మన పిల్లలకైనా ఆ సమస్య ఉండకూడదు: నజ్రియా నజీమ్
Nazriya Nazim Says Ante Sundaraniki Story Is Unique: ‘‘నేను కథ వినేటప్పుడు భాష గురించి ఆలోచించను. సగటు ప్రేక్షకుడిలానే కథ వింటాను. ‘అంటే.. సుందరానికీ’ కథ అద్భుతం. ఎన్నో భావోద్వేగాలున్న ఇలాంటి అరుదైన కథ చేయడం చాలా ఎగ్జయిటింగ్‌గా అనిపించింది’’ అని నజ్రియా నజీమ్ పేర్కొన్నారు. నాని హీరోగా వివేక్ ఆత్రేయ దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం ‘అంటే.. సుందరానికీ’. నవీన్ యెర్నేని, రవిశంకర్ వై. నిర్మించిన ఈ సినిమా ఈ నెల 10న విడుదలవుతోంది. ఈ సందర్భంగా చిత్రకథానాయిక నజ్రియా నజీమ్ మాట్లాడుతూ– ‘‘చైల్డ్ ఆర్టిస్ట్‌గా నా కెరీర్ మొదలుపెట్టాను. టీవీలో పని చేశాను. రెండేళ్లు వరుసగా సినిమాలు చేశాను. ఆ తర్వాత ఫాహద్ ఫాజిల్ (మలయాళ హీరో)ని పెళ్లి చేసుకుని సినిమాలకు బ్రేక్ ఇచ్చాను. ‘అంటే.. సుందరానికీ’ కథ ఎగ్జయిటింగ్‌గా అనిపించడంతో రీ ఎంట్రీ ఇచ్చాను. ఇందులో నేను చేసిన లీలా థామస్ పాత్రలో చాలా లేయర్స్ ఉన్నాయి. తెలుగు నాకు కొత్త భాష అయినప్పటికీ నా పాత్రకి నేనే డబ్బింగ్ చెప్పాను. చదవండి: నయనతారతో పెళ్లిపై స్పందించిన విఘ్నేష్ శివన్.. మైత్రీ మూవీ మేకర్స్‌లో ‘అంటే.. సుందరానికీ’కి మొదట నేను సైన్ చేశాను. తర్వాత ఈ సంస్థలో ఫాహద్‌కి ‘పుష్ప’ అవకాశం వచ్చింది. ఈ రెండూ గొప్ప కథలు కావడం మా అదృష్టం’’ అన్నారు. కులాంతరం, మతాంతర వివాహాల గురించి మాట్లాడుతూ – ‘‘కులం, మతం.. వీటన్నింటికంటే ప్రేమ గొప్పది. కులాంతర, మతాంతర వివాహాల సమస్య ఇంకా ఉంది. మన పిల్లల తరానికైనా ఈ సమస్య ఉండకూడదని కోరుకుంటున్నాను’’ అన్నారు నజ్రియా. -
ఈవారం సినిమా జాతర.. ఏకంగా 22 చిత్రాలు, సిరీస్‌లు
Theatres OTT Releases: 22 Movies Web Series In June 2nd Week 2022: మొన్నటివరకు పెద్ద సినిమాలు థియేటర్లలో సందడి చేశాయి. మే చివరి వారం, జూన్ మొదటి వారంలో పెద్ద హీరోల సినిమాలు బాక్సాఫీస్ వద్ద మంచి కలెక్షన్లతో దూసుకుపోయాయి. మొన్న విడుదలైన మేజర్, విక్రమ్, పృథ్వీరాజ్ మూవీస్ మంచి టాక్ తెచ్చుకుంటున్నాయి. ఇక ఇప్పుడు చిన్న సినిమాల హవా కొనసాగనుంది. థియేటర్, ఓటీటీలతో కలుపుకుని ఏకంగా 22 సినిమాలు, వెబ్ సిరీస్‌లు సందడి చేసేందుకు సిద్ధమయ్యాయి. వీటిలో నేచురల్ స్టార్ నాని, మలయాళ బ్యూటీ నజ్రియా నజీమ్ నటించిన 'అంటే.. సుందరానికీ'తోపాటు మరో 12 చిత్రాలు ఉన్నాయి. అలాగే 10 వెబ్ సిరీస్‌లు కూడా అలరించేందుకు సిద్ధమయ్యాయి. అవేంటో ఓ లుక్కేద్దామా ! 1. అంటే సుందరానికీ- జూన్ 10 2. సురాపానం- జూన్ 10 3. చార్లీ 777-జూన్ 10 4. జరిగిన కథ- జూన్ 10 5. డియర్ ఫ్రెండ్ (మలయాళం)-జూన్ 10 6. జన్హిత్ మే జారీ (హిందీ)- జూన్ 10 7. జురాసిక్ వరల్డ్ డొమినియన్- జూన్ 10 8. హసెల్ (Hustle)(నెట్‌ఫ్లిక్స్)- జూన్ 8 9. ఇన్నలే వార్ (సోనీ లివ్)- జూన్ 9 10. డాన్ (నెట్‌ఫ్లిక్స్)- జూన్ 10 11. కిన్నెరసాని (జీ5)- జూన్ 10 12. సీబీఐ5: ది బ్రెయిన్ (నెట్‌ఫ్లిక్స్)- జూన్ 12 వెబ్ సిరీస్‌లు.. 1. మిస్ మార్వెల్ (వెబ్ సిరీస్-డిస్నీ ప్లస్ హాట్‌స్టార్)- జూన్ 8 2. కోడ్ ఎమ్ (సీజన్ 2-ఊట్, జీ5)- జూన్ 8 3. బేబీ ఫీవర్ (వెబ్ సిరీస్-నెట్‌ఫ్లిక్స్)- జూన్ 8 4. ది బ్రోకెన్ న్యూస్ (వెబ్ సిరీస్-జీ5)- జూన్ 10 5. అర్థ్ (వెబ్ సిరీస్-జీ5)- జూన్ 10 6. ఉడాన్ పటోలాస్ (వెబ్ సిరీస్-అమెజాన్ మినీ టీవీ)- జూన్ 10 7. ఫస్ట్ కిల్ (వెబ్ సిరీస్-నెట్‌ఫ్లిక్స్)- జూన్ 10 8. ఇంటిమసీ (స్పానిష్ సిరీస్-నెట్‌ఫ్లిక్స్)- జూన్ 10 9. పీకీ బ్లైండర్స్ (వెబ్ సిరీస్-నెట్‌ఫ్లిక్స్)- జూన్ 10 10. సైబర్ వార్ (వెబ్ సిరీస్-ఊట్)- జూన్ 10 -
పండగే పండగ.. జూన్‌లో సినిమాల జాతర!
మొన్నటిదాకా భారీ బడ్జెట్ సినిమాలు దుమ్ములేపాయి. కరోనాతో వెలవెలబోయిన థియేటర్లకు జనాలను రప్పిస్తూ తిరిగి కళకళలాడేలా చేశాయి. దీంతో అప్పటిదాకా రిలీజ్ చేయాలా? వద్దా? అని ఆలోచించిన సినిమాలన్నీ వరుసపెట్టి విడుదలవుతున్నాయి. ఈ క్రమంలో కొన్ని బోల్తా కూడా కొట్టాయి. మరికొన్ని అంచనాలకు మించిన విజయాన్ని అందుకున్నాయి. ఇదే హుషారుతో జూన్ నెల కూడా బోలెడన్ని సినిమాలతో రెడీ అయింది. ఇప్పటికే జూన్ 3న సౌత్‌లో రిలీజైన రెండు సినిమాలు మేజర్, విక్రమ్, పృథ్వీరాజ్ మంచి హిట్లుగా నిలిచాయి. మరి రానున్న రోజుల్లో ఏమేం సినిమాలు రిలీజవుతున్నాయో చూద్దాం.. జూన్ 10న 'అంటే సుందరానికీ', 'సురాపానం, జరిగిన కథ', '777 చార్లీ', 'జురాసిక్ వరల్డ్ డొమీనియన్' సినిమాలు రిలీజవుతున్నాయి. 17వ తేదీన 'గాడ్సే', 'విరాటపర్వం', కన్నడ డబ్బింగ్ మూవీ 'కే3', కీర్తి సురేశ్ 'వాశి', 'కిరోసిన్' ప్రేక్షకుల ముందుకు రానున్నాయి. ఇవన్నీ ఒక ఎత్తయితే జూన్ చివరి వారంలో రిలీజవుతున్న సినిమాలు మరో ఎత్తు. జూన్ ఆఖరి వారంలో ఏకంగా 9 సినిమాలు విడుదలవుతున్నాయి. జూన్ 23న 'కొండా', 24న 'సమ్మతమే', '7 డేస్ 6 నైట్స్', 'ఒక పథకం ప్రకారం', 'గ్యాంగ్‌స్టర్ గంగరాజు', '10th క్లాస్ డైరీస్', 'సదా నన్ను నడిపే', 'సాఫ్ట్వేర్ బ్లూస్' సినిమాలు థియేటర్లలో సందడి చేయనున్నాయి. కృష్ణ వ్రింద విహారి సినిమా కూడా జూన్ నెలలోనే రిలీజ్ చేసేందుకు ప్లాన్ చేస్తున్నారు. వీటితో పాటు మరికొన్ని చిన్న మూవీస్ కూడా తమ లక్ పరీక్షించుకునేందుకు రెడీ అవుతున్నాయి. మరి వీటిలో ఏ సినిమాలకు ప్రేక్షకులు జై కొడతారనేది చూడాలి. చదవండి: ఏమిచ్చి మీ రుణం తీర్చుకోగలను: ఉదయభాను భావోద్వేగం నాకు సినిమా అవకాశాలు లేకుండా పోయాయి సల్మాన్ కంటతడి -
సూర్య చేసిన ఆ సినిమా.. నాకొస్తే బాగుండేదనిపించింది: నాని
నేచురల్ స్టార్ నాని హీరోగా వివేక్ ఆత్రేయ దర్శకత్వంలో ప్రముఖ నిర్మాణ సంస్థ మైత్రీ మూవీ మేకర్స్ నిర్మించిన రొమాంటిక్ కామెడీ ఎంటర్ టైనర్ 'అంటే సుందరానికీ'. ఈ చిత్రం ద్వారా నజ్రియా టాలీవుడ్‌కి ఎంట్రీ ఇవ్వబోతుంది. జూన్ 10న ప్రపంచ వ్యాప్తంగా ఈ మూవీ విడుదల కాబోతుంది. ఈ సందర్భంగా తాజాగా హీరో నాని మీడియాతో ముచ్చటించారు. ఆ విశేషాలు.. వివేక్ ఆత్రేయతో మీ జర్నీ ఎలా ఉంది? కొత్త డైరెక్టర్లతో లేదా ఒకటి రెండు సినిమాలు తీసిన దర్శకులతో ఎందుకు సినిమాలు చేస్తావని అందరూ నన్ను అడుగుతుంటారు. ప్రజెంట్ లీడింగ్‌లో ఉన్న దర్శకుల కంటే.. ఫ్యూచర్లో లీడింగ్ డైరెక్టర్‌తో పని చేస్తే.. అప్పుడు మనం వాళ్ల జర్నీలో కూడా పాలు పంచుకోవచ్చు అనే చిన్న స్వార్థం నాకు ఉంటుంది. వివేక్‌తో మాట్లాడినా.. ఆయన సినిమాలు చూసినా... భవిష్యత్తులో టాప్ డైరెక్టర్లలో ఒకరిగా ఉంటాడనిపించింది. అందుకే ఆయనతో సినిమా కమిట్ అయ్యాను. కొత్త దర్శకులు చెప్పిన కథను తీస్తారో లేదో తెలియదు.. మీరు మాత్రం అలాంటి వాళ్లను ఎలా నమ్ముతారు? అది నమ్మకం అంతే. మొదట్లో చాలా మంది నన్ను నమ్మి సినిమాలు తీశారు. ఇప్పుడు నాకంటూ ఒక ఇమేజ్‌ని సంపాదించుకున్నా. అందుకే.. టాలెంట్ ఉన్నవాళ్లకి నేను అవకాశం ఇవ్వాలనుకుంటాను. అంటే..సుందరానికిలో కొత్తగా ఏం చూపిస్తున్నారు? నేను ఇంతకు ముందు తీసిన ఫన్ జానర్ సినిమాల్లో ఎలాంటి కామెడీ చేశానో.. దానికి చాలా భిన్నంగా ఇందులో చేస్తాను. డైలాగ్స్ కానీ, పాత్ర ప్రవర్తన కానీ డిఫరెంట్‌గా ఉంటుంది. తెరపై కొత్త నానిని చూస్తారు. ఫస్ట్ టైం బ్రాహ్మణ కుర్రాడి పాత్రని చేశారు కదా? ఏమైనా హోం వర్క్ చేశారా? లేదు. మన సినిమాల్లో ఇలాంటి పాత్రలు ఉన్నప్పుడు.. ఉన్నదాని కంటే కాస్త ఎక్కువ చూపిస్తాం. వాళ్ల మాటలను కూడా ఢిపరెంట్‌గా చూపించి కామెడీ పండిస్తాం. కానీ ఇందులో ఎవరినైనా సరే కించపరిచి కామెడీ చేసిన సీన్స్ ఉండవు. వివేక్ ఆత్రేయ ఓ బ్రాహ్మణ కుర్రాడు. వాళ్ల ఇంట్లో అమ్మ, నాన్న ఎలా ఉంటారు, వాళ్ల ఆచారాలు ఏంటి? ఎలా ప్రవర్తిస్తారు ..ఇలాంటి విషయాలను చాలా చక్కగా చూపించాడు. ఇందులో మీరు అమాయకుడైన సుందరం పాత్రని పోషించారు. ఆ పాత్ర గురించి? ట్రైలర్ చూసి సుందరం చాలా ఇన్నోసెంట్, వాళ్ల నాన్న చేతిలో నలిగిపోతున్నాడు అనిపించొచ్చు కానీ.. వాడు చాలా వరస్ట్ ఫెల్లో(నవ్వుతూ..). వివేక్ కూడా నాకు కథ చెప్పినప్పుడు అదే చెప్పాడు. ‘వీడు వరస్ట్ ఫెలో సర్. కానీ ప్రతి ఫ్రేమ్‌లో వీడిని ప్రేమించాలి’ అని అన్నాడు. అలా చేయడం పెద్ద టాస్క్ మాకు. ఔట్పుట్ చాలా చక్కగా వచ్చింది. నరేశ్‌తో బాండింగ్? ఇంతకు ముందు నరేశ్‌తో నేను చేసిన ఏ సినిమాలు కూడా.. అంటే సుందరానికి.. దరిదాపుల్లో ఉండవు. మా ఇద్దరి కాంబినేషన్ ఈ చిత్రంలో వేరే లెవల్‌కు వెళ్లిపోతుంది. కులాంతర వివాహాలపై చాలా సినిమాలు వచ్చాయి. ఇందులో కొత్తగా ఏం చూపించారు? ఇందులో రెండు కొత్త విషయాలు ఉంటాయి. ఒకటి ట్రైలర్లో చెప్పేశాం. రెండోది థియేటర్స్‌లో చూడాల్సిందే. రియల్ లైఫ్‌లో కూడా మీది ప్రేమ వివాహం. ఈ సినిమాలో మీ రియల్ లైఫ్ సన్నివేశాలు ఉన్నాయా? నా పెళ్లి చాలా సింపుల్‌గా జరిగింది. ఇరు కుటుంబాల పెద్దలు మాట్లాడుకొని మా పెళ్లి చేశారు. అయితే చిన్న ప్రాబ్లం ఏంటంటే.. అమ్మాయి వాళ్లదేమో సైంటిస్ట్ ఫ్యామిలీ.. నేనేమో సినిమాలు అంటూ పిచ్చోడిలా తిరుగుతున్నా. ఫ్యూచర్ ఎలా ఉంటుందో కూడా తెలియదు. అప్పుడు నాకు ఇవ్వొచ్చా లేదా అని అమ్మాయి ఫ్యామిలీ టెన్షన్ పడింది. నన్ను కలిశాక ఒప్పుకొని హ్యాపీగా పెళ్లి చేశారు. ఈ చిత్రంలోకి నజ్రియా ఎలా వచ్చింది? నేను, వివేక్ అనుకొనే నజ్రియాను తీసుకొచ్చాం. ఈ కథలో హీరోహీరోయిన్ ఇద్దరికీ ప్రాధాన్యత ఉంటుంది. లీలా పాత్రకు ఎవరైతే బాగుంటుందని ఆలోచించిన ప్రతిసారి మేమిద్దరం.. నజ్రియాలాగే ఉంటే బాగుంటుందని అనుకునేవాళ్లం. నజ్రియాలాగా ఎందుకు ఆమెనే తీసుకుంటే బాగుంటుంది కదా అనుకొని కథ వినిపించాం. పెద్ద పెద్ద హీరోల సినిమాలు వస్తేనే ఒప్పుకోని నజ్రియా.. ఈ కథ విన్నవెంటనే ఎగిరి గంతేసి.. చేసేద్దాం అని చెప్పారు. కథను బాగా నమ్మితే తప్ప నజ్రియా ఒప్పుకోదు. ‘శ్యామ్ సింగరాయ్’ విడుదల టైంలో టికెట్ల రేట్లు చాలా తక్కువగా ఉన్నాయని మాట్లాడారు. ఇప్పుడేమో ఫిల్మ్ మేకర్సే టికెట్ల రేట్లను తగ్గిస్తున్నారు. అంటే సుందరానికి ఎలా ఉండబోతుంది? సోషల్ మీడియాలో ఇలాంటి కామెంట్లు చూశాను. అసలు నేను ఏ సందర్భంలో రేట్ల గురించి మాట్లాడాను? టికెట్ల రేట్లు రూ.30, రూ.40 ఉన్నప్పుడు నేను అలా అన్నాను. కనీసం రూ.100, రూ.120 లేకుంటే ఎలా అని అడిగాను. ఇప్పుడు రూ. 500 అయితే.. చూశావా మీ కోసం 500 పెంచాలా? అంటున్నారు. ఎవరు పెంచమన్నారు? ఆర్ఆర్ఆర్ లాంటి పెద్ద సినిమాలకు పెంచితే తప్పులేదు కానీ.. అన్ని సినిమాలకు అదే స్థాయిలో పెంచితే అది చాలా పెద్ద తప్పు. కనీస ధరలు ఉంటే చాలు. టీజర్లో మీ లుక్ బారిష్టర్ పార్వతీశం ని గుర్తిచేసింది.. ఇందులో ఆ నవల ప్రేరణ ఉందా ? ఆ నవలకు ఈ సినిమాకు ఎలాంటి సంబంధం లేదు. పంచె కట్టే సమయంలోనే బారిష్టర్ పార్వతీశం గుర్తొస్తుంది. అప్పుడే ఎందుకు అనేది సినిమా చూసినప్పుడు తెలుస్తుంది. ‘శ్యామ్ సింగరాయ్’ది సీరియస్ సబ్జెక్..ఇది కామెడీ జానర్. మీకు కొంచె రిలీఫ్ అనిపించిందా? సబ్జెక్ట్ సీరియస్ అయినా.. కామెడీ అయినా షూటింగ్లో పడే కష్టాలు పడాల్సిందే. సీన్ బాగా రావాలనే తపన, ఒత్తిడి ఎప్పటికీ ఉంటుంది. అయితే సీరియస్ చిత్రాల్లో ఫైటింగ్‌లు, ఎగరడాలు, దూకడాలు ఉంటాయి. కామెడీ మూవీస్‌లో అలాంటివి ఉండవు అంతే. సౌత్ సినిమాలు పాన్ ఇండియా స్థాయిలో బాగా ఆడుతున్నాయి. మరోపక్క బాలీవుడ్ స్ట్రగుల్ అవుతుంది. ఈ ఫేజ్‌ని ఎలా చూస్తారు? ఇది సినిమాకే గోల్డెన్ ఫేజ్. బాలీవుడ్, టాలీవుడ్ అని కాదు.. ఇండియా వైజ్‌గా సినిమాకు ఇది మంచి ఫేజ్. వంశీ పైడిపల్లి, విజయ్ మూవీలో మీరు నటిస్తున్నారని వార్తలు వినిపిస్తునాయి? రోజుకో కొత్త పుకార్లు పుట్టుకొస్తున్నాయి. మహేశ్‌తో మూవీ, ప్రశాంత్ నీల్‌తో పాన్ ఇండియా చిత్రం అంటూ.. రూమర్స్ వస్తున్నాయి. రేపు నేను నిజంగానే ఏదైనా కొత్త ప్రాజెక్ట్ అనౌన్స్ చేస్తే అది కూడా పుకారే అనుకుంటారేమో(నవ్వుతూ..) మైత్రీ మూవీస్ మేకర్స్ గురించి? టాలీవుడ్లో లీడింగ్ ప్రొడెక్షన్ హౌస్‌గా మైత్రీ మూవీ మేకర్స్ మారింది. గొప్ప గొప్ప నిర్మాతలు ఉన్నారు కానీ.. వీళ్లంత బ్యాక్ టు బ్యాక్ సినిమాలు తీసేవాళ్లు లేరు. గ్యాంగ్ లీడర్‌తో వీళ్లతో సినిమా చేసే అవకాశం కలిసింది. ఇప్పుడు మళ్లీ ఇలాంటి సినిమాతో కలిసి పనిచేయడం చాలా హ్యాపీ. దసరా సినిమా ఎంత వరకు వచ్చింది? 25 శాతం షూటింగ్ పూర్తయింది. ఇది కామెడీ మూవీ.ఇందులో మతాలకు సంబంధించిన పాయింట్‌ని టచ్ చేసినప్పుడు కాంట్రవర్సీ అయ్యే అవకాశం ఉంది కదా? అస్సలు లేదు. రియల్ లైఫ్‌లో లేనివి చూపిస్తే.. కాంట్రవర్సీ అవుతుంది. కానీ రియల్ లైఫ్‌లో మన ఫ్యామిలీలాగే ఉన్నది ఉన్నట్లుగా,.. వాళ్లలోని మంచితనాన్ని బయటకు చూపిస్తే మనోభావాలు ఎలా దెబ్బతింటాయి? సెలబ్రేట్ చేసుకుంటారే తప్ప.. ఎక్కడా హర్ట్ కారు. వివేక్ సాగర్ సంగీతం గురించి? వివేక్ సాగర్ కథకు ఒక ఆయుధంలాంటి వాడు. ఆయన పాటలు విన్నవెంటనే.. సంగీత్ ఫంక్షన్లో పెట్టి డ్యాన్స్ వేయాలనిపించవు. కానీ కథను ఎంత ఇంపాక్ట్పుల్గా చెప్పాలో..అంత చూపిస్తాడు. ఇప్పుడు ఆయన గురించి ఏం మాట్లాడినా అతియోశక్తిగా అనిపిస్తుంది. సినిమా విడుదల తర్వాత మాట్లాడుతాను. పాన్ ఇండియా సినిమాలు పెరుగుతున్నాయి. మీరు కూడా అలాంటి చిత్రాలు చేసే ఆలోచన ఉందా? నా ఉద్దేశంలో పాన్ ఇండియా సినిమా అంటే.. మనం చెప్పుకోవడం కాదు..ప్రేక్షకులు చెబితేనే అది పాన్ ఇండియా చిత్రం. మంచి కథ తీస్తే చాలు.. అది పాన్ ఇండియా చిత్రమే. అందుకు పుష్ప చిత్రమే నిదర్శనం. ఒక సినిమా కోసం దేశమంతా ఎదురుచూస్తే అది పాన్ ఇండియా చిత్రం. అంతేకాని మనం పోస్టర్ మీద వేసుకున్నంత మాత్రాన అది పాన్ ఇండియా చిత్రం కాదు. ఈ మధ్యలో వచ్చిన సినిమాల్లో.. అది నేను చేస్తే బాగుండు అని అనిపించిన చిత్రం ఏదైనా ఉందా? జై భీమ్ సినిమా చూసినప్పుడు.. ఇలాంటి కథ తెలుగులో వస్తే బాగుంటుంది అనిపించింది. అలాంటి కథ ఏ హీరోకి వచ్చినా ఓకే.. నాకు వస్తే ఇంకా హ్యాపీ మీ నిర్మాణ సంస్థలో వచ్చే సినిమాలు? మీట్ క్యూట్, హిట్ 2 చిత్రాలు రాబోతున్నాయి. -
రీ ఎంట్రీ ఇవ్వడం సంతోషంగా ఉంది: హీరోయిన్
Nani Adade Sundara Movie Trailer Launch In Chennai: నేచురల్ స్టార్ నాని కథానాయకుడిగా నటించిన ‘అంటే.. సుందరానికి’ (Ante Sundaraniki Movie) చిత్రం ఈ నెల 10వ తేదీన తెలుగుతో పాటు తమిళం, మళయాళం భాషల్లో విడుదలకు సిద్ధమవుతోంది. ఇందులో నటి నజ్రియా నజీమ్ నాయికిగా రీఎంట్రీ ఇస్తున్నారు. రేవతి తదితరులు ముఖ్యపాత్రలు పోషించిన ఈ చిత్రానికి వివేక్ ఆత్రేయ దర్శకుడు. మైత్రీ మూవీస్ సంస్థ నిర్మించిన ఈ చిత్రం ఈ తమిళంలో ‘అడడే సుందరా’ (Adade Sundara Movie) పేరుతో విడుదల కానుంది. ట్రైలర్ ఆవిష్కరణ కార్యక్రమాన్ని శుక్రవారం సాయంత్రం చెన్నైలో నిర్వహించారు. హీరో నాని మాట్లాడుతూ ఈ చిత్రం చేయడం తనకు చాలా సంతోషంగా ఉందన్నారు. శ్యామ్ సింగరాయ్ వంటి యాక్షన్ కథా చిత్రం తరువాత వినోదంతో కూడిన ఈ ఫ్యామిలీ ఎంటర్టైన్మెంట్ చేయడం సముచితంగా అనిపించిందని తెలిపారు. ఈ మూవీ చాలా సంతృప్తికరంగా వచ్చిందని, అన్ని వర్గాల ప్రేక్షకులను అలరిస్తుందనే నమ్మకం ఉందన్నారు. చాలా గ్యాప్ తరువాత ఈ చిత్రం ద్వారా రీ ఎంట్రీ ఇవ్వడం సంతోషంగా ఉందని నటి నజ్రియా నజీమ్ పేర్కొన్నారు. చదవండి: అడవి శేష్ 'మేజర్' ప్రామిస్.. అలాంటి వారికి సపోర్ట్..