నేచురల్ స్టార్ నాని హీరోగా నటిస్తున్న చిత్రం 'అంటే సుందరానికీ'. వివేక్ ఆత్రేయ దర్శకత్వంలో ప్రముఖ నిర్మాణ సంస్థ మైత్రీ మూవీ మేకర్స్ నిర్మిస్తోంది. నజ్రియా తెలుగులో హీరోయిన్‌గా పరిచయం కాబోతున్న ఈ సినిమా జూన్ 10న ప్రపంచ వ్యాప్తంగా తెలుగు, తమిళ, మలయాళ భాషల్లో విడుదల కానుంది. ఈ నేపథ్యంలో దర్శకుడు వివేక్ ఆత్రేయ మీడియాతో 'అంటే సుందరానికీ' విశేషాలు పంచుకున్నారు.
'అంటే సుందరానికీ' ట్రైలర్ చూస్తే బలంగా నవ్వించాలని ఫిక్స్ అయినట్లు అనిపించింది ?
కేవలం నవ్వించడమే కాదు అన్నీ రకాల ఎమోషన్స్ ఫీలౌతారు. ఎమోషనల్ గా కూడా చాలా బలమైన కంటెంట్ వుంటుంది.
ట్రైలర్ లో బ్రాహ్మణ, క్రిస్టియన్ లవ్ కనిపించింది కదా.. భారతీ రాజా 'సీతాకోక చిలుక' ప్రేరణ ఉందా ?
లేదండీ. 'సీతాకోక చిలుక' తో సంబంధం లేదు.
నాని లుక్ బారిష్టర్ పార్వతీశం ని గుర్తిచేసింది.. ఇందులో ఆ నవల ప్రేరణ ఉందా ?
నాకు చాలా ఇష్టమైన నవల బారిష్టర్ పార్వతీశం. ఈ కథలో ఒక చిన్న ఎపిసోడ్‌లో దాని ప్రేరణ తీసుకొని పంచకట్టు, మిగతా సరంజామా పెడితే బావుంటుందనిపించి పెట్టాం. ఐతే దీనికి కథకి ఎలాంటి సంబంధం లేదు.
'అంటే సుందరానికీ' కథ ఎప్పుడు పుట్టింది?
ఐదేళ్ళ క్రితమే ఈ కథ ఐడియా వచ్చింది. మొదట విష్ణుతో షేర్ చేసుకున్న. ఈ కథకి నాని ఐతే బావుంటుందని అప్పుడే అనుకున్నాం.
నాని గారు ఈ కథ విన్నతర్వాత ఎలా స్పందించారు ?
నాని గారు చాలా ఎగ్జయిట్ అయ్యారు. చాలా నిజాయితీ గల కథ. నాని గారు ఇప్పటివరకూ ఇలాంటి పాత్రని చేయలేదు. కథలో పాత్రలు కనిపిస్తాయి తప్పితే ప్రత్యేకమైన ఎలివేషన్స్ ఏమీ వుండవు. చాలా హానెస్ట్ గా వుంటుంది.
ఒక సంప్రదాయవాద సమాజం నుండి బయటికి రావాలనే సందేశం ఇందులో వుంటుందా ?
సంప్రదాయవాద సమాజం అనేది ప్రత్యేకమైన సబ్జెక్ట్. దీని గురించి చర్చ వుండదు. ఐతే మనం ఎలాంటి సమాజం వైపు రావాలనే చిన్న సోషల్ కామెంట్ ఇందులో వుంటుంది. ఐతే అది క్లాసులు పీకినట్లు వుండదు. పాత్రల నుండే సహజంగా వస్తుంది. ఆ పాత్రలు మాట్లాడేటప్పుడు అవును కరక్టే కదా అని ప్రేక్షకులు ఫీలౌతారు.
మతాలకి సంబధించిన పాయింట్ టచ్ చేసినప్పుడు వివాదాలు వచ్చే అవాకాశం వుంది కదా.. మరి ఎలా డీల్ చేశారు ?
చాలా సెన్సిటివ్ పాయింట్ ఇది. ఈజీగా హర్ట్ అయ్యే పాయింట్. ఐతే ఎవరినీ హర్ట్ చేయకుండా ఒకరు తక్కువ ఒకరు ఎక్కువ అని అని కాకుండా పూర్తి వినోదాత్మకంగా ఈ చిత్రాన్ని తీశాం. సెన్సార్ బోర్డ్ ఎలాంటి కట్స్ లేకుండా క్లీన్' యూ' సర్టిఫికేట్ ఇవ్వడమే దీనికి నిదర్శనం. ఇందులో అభ్యంతరకరమైన అంశాలు వుంటే.. సెన్సార్ క్లీన్ యూ ఇవ్వదు కదా.
దాదాపు మూడు గంట ల రన్ టైం వుంది కదా .. ఇది ఇబ్బంది కాదా ?
రన్ టైం అనేది సమస్య కాదు. ఈ కథలో చెప్పాల్సిన విషయాలు చాలా వున్నాయి. ఆ విషయాలు చెప్పడానికి నాకు కావాల్సిన లెంత్ ఇది. మంచి కథ తీశామని సినిమా యూనిట్ అంతా చాలా నమ్మకంగా వున్నాం. సినిమా చూస్తున్నపుడు ఈ లెంత్‌ని ఫీలవ్వరు. చాలా హాయిగా గడిచిపోతుంది.
ఒకప్పుడు ఇంటర్ క్యాస్ట్ వివాహాలు అంటే అడ్డంకులు ఉండేవి. ఇప్పుడు పరిస్థితులు మారాయి కదా.. ఇప్పుడు ఇలాంటి కథ చెప్పే ఆవశ్యకత ఉందా ?
ఇప్పటికీ ఇంటర్ క్యాస్ట్ వివాహాలకు చాలా అడ్డంకులు వున్నాయి. న్యూస్‌లో రాకపోవడం, వినీవినీ రొటీన్ అయిపోవడం జరుగుతుంది కానీ చాలా మంది ఈ సమస్య ఎదుర్కొంటున్నారు. ఎన్నో పరువు హత్యలు వెలుగు చూస్తున్నాయి కదా. ఐతే మేము చాలా హ్యూమరస్ అప్రోచ్ తో ఈ కథని డీల్ చేశాం. మీ అందరికీ తప్పకుండా నచ్చుతుంది.
చాలా సీరియస్ పాయింట్లని కూడా వినోదాత్మకంగా చెబుతుంటారు. అది మీ స్టయిల్ అనుకోవచ్చా ?
అది మన అప్రోచ్ అండీ. ఒక సీరియస్ విషయాన్నీ ఇంకా సీరియస్ గా ఒకే టోన్ లో చెప్పడం కంటే దాన్ని వినోదాత్మకంగా చెప్పి ఫైనల్ గా చెప్పాల్సిన పాయింట్ ని చెబితే దాని ఇంపాక్ట్ ఎక్కువ వుంటుందని భావిస్తాను.
నాని గారితో వర్క్ చేయడం ఎలా అనిపించింది ?
నాని గారు ఎప్పుడూ ఒక స్టార్ లా బిహేవ్ చేయలేదు. ఆయన సెట్ లో ఉన్నంత సేపు సుందర్ లానే వుండేవారు.అలా వున్నపుడు డైరెక్ట్ చేయడం చాలా ఈజీ. అలాగే నజ్రియా గారు కూడా అంతే.
'అంటే సుందరానికీ' పాన్ ఇండియా సబ్జెక్ట్ కదా.. సౌత్ కే పరిమితం చేయడానికి కారణం ?
'అంటే సుందరానికీ' కథ యూనివర్సల్ కథ. ఐతే కథ రాసినప్పుడే ఇది సౌత్ కి బావుంటుందని అనుకున్నాం.
ఓటీటీల ప్రభావం పెరిగింది కదా.. సినిమాకి కథ చేసి ప్రేక్షకులని థియేటర్లోకి రప్పించడం సవాల్ గా ఉందా ?
ఇప్పుడున్న పరిస్థితిలో కచ్చితంగా సవాలే. అయితే సినిమా థియేటర్ లో అందరితో చూసి ఎంజాయ్ చేయడం గొప్ప అనుభూతి. అందుకే ఇలాంటి సినిమాలు వస్తున్నపుడు ప్రేక్షకులు థియేటర్లో చూసి ఆనందించాలని కోరుతున్నాను. 'అంటే సుందరానికీ' లో బలమైన కంటెంట్ వుంది. తప్పకుండా ప్రేక్షకులు థియేటర్ కి వచ్చి సినిమాని చూస్తారు.
ప్రతి సినిమాకి జోనర్ మారుస్తున్నారు కదా ?
నన్ను నేను కొత్తగా మలుచుకోవడం కోసమే. నాకు నేను బోర్ కొట్టకుండా ప్రేక్షకులకు బోర్ కొట్టించకుండా ఎప్పటికప్పుడు కొత్త కథలు చేయాలనే వుంటుంది.
భవిష్యత్ లో ఎలాంటి సినిమా చేయాలని వుంది ?
ఒక యాక్షన్ డ్రామా చేయాలని ఎప్పటి నుండో వుంది. తప్పకుండా చేస్తా.
దర్శకుడే రచయిత అవ్వడం వలన సినిమా క్వాలిటీ తగ్గుతుందా ?
లేదండీ. అలా ఏం వుండదు. కథ లో లోపం వుంటే క్వాలిటీ తగ్గుతుంది కానీ దర్శకుడే రచయిత అవ్వడం చేత క్వాలిటీ తగ్గడం అంటూ వుండదు.
చదవండి: Namita: గ్రాండ్‌గా హీరోయిన్ సీమంతం, ఫొటోలు వైరల్
హోటల్‌లో పని చేశాను, అది తెలిసి చిరంజీవి బాధపడ్డాడు, అంతేకాదు..
Comments
Please login to add a commentAdd a comment