'అంటే.. సుందరానికీ' వచ్చిన కలెక్షన్లు ఎంతంటే ? | Nani Ante Sundaraniki First Week Box Office Collections | Sakshi
Sakshi News home page

Ante Sundaraniki Movie: నాని 'అంటే.. సుందరానికీ' ఫస్ట్ వీక్‌ కలెక్షన్లు ఎంతంటే ?

Published Fri, Jun 17 2022 8:41 PM | Last Updated on Fri, Jun 17 2022 8:46 PM

Nani Ante Sundaraniki First Week Box Office Collections - Sakshi

Nani Ante Sundaraniki First Week Box Office Collections: నేచురల్‌ స్టార్‌ నాని హీరోగా నటించిన లెటెస్ట్‌ మూవీ ‘అంటే..సుందరానికీ’.‘మెంటల్‌ మదిలో’, ‘బ్రోచేవారెవరురా’లాంటి చిత్రాలతో చక్కటి గుర్తింపు తెచ్చుకున్న వివేక్‌ ఆత్రేయ ఈ చిత్రానికి దర్శకత్వం వహించారు. మలయాళ బ్యూటీ నజ్రియా నజీమ్‌ హీరోయిన్‌గా నటించింది. ఈ చిత్రంలో నాని ఓ బ్రాహ్మణ కుర్రాడిగా, నజ్రియా క్రిస్టియన్‌ అమ్మాయిగా జోడి కట్టారు. ప్యూర్‌ కామెడీ రొమాంటిక్‌ ఎంటర్‌టైనర్‌గా తెరకెక్కిన ఈ చిత్రం జూన్‌ 10న విడుదలై బాక్సాఫీస్ వద్ద మంచి టాక్‌ను సంపాదించుకుంది. ఈ సినిమా మొదటి వారం హిట్ టాక్‌తో దూసుకెళ్లినా, తర్వాత కలెక్షన్లు తగ్గుముఖం పట్టాయి. 

ఈ సినిమా ఫస్ట్‌ వీక్‌ పూర్తయ్యే సరికి వరల్డ్‌వైడ్‌గా రూ. 18.39 కోట్ల షేర్ వసూళ్లను రాబట్టింది. గ్రాస్‌ పరంగా రూ. 32.60 కోట్లు కొల్లగొట్టి నాని కెరీర్‌లో మంచి హిట్‌ మూవీగా సినిమా నిలిచిందని సినీ వర్గాలు పేర్కొన్నాయి. ఏరియాలా వారీగా ఈ మూవీ మొదటి వారం కలెక్షన్లు ఈ కింది విధంగా ఉన్నాయి. 

నైజాం- రూ. 5.58 కోట్లు
సీడెడ్‌- రూ. 1.13 కోట్లు
ఉత్తరాంధ్ర- రూ. 1.33 కోట్లు
ఈస్ట్‌- రూ. 0.93 కోట్లు
వెస్ట్‌- రూ. 0.79 కోట్లు
గుంటూరు- రూ. 0.87 కోట్లు
కృష్ణా- రూ. 0.84 కోట్లు
నెల్లూరు- రూ. 0.58 కోట్లు
మొత్తం ఏపీ, తెలంగాణ కలిపి- 12.05 కోట్లు (రూ. 20.40 కోట్లు గ్రాస్‌)
కర్ణాటకతోపాటు దేశవ్యాప్తంగా- 1.34 కోట్లు
ఓవర్సీస్‌- 5 కోట్లు
ప్రపంచవ్యాప్తంగా- రూ. 18.39 కోట్లు (రూ. 32.60 కోట్లు గ్రాస్‌)

చదవండి: సైలెంట్‌గా తమిళ హీరోను పెళ్లాడిన తెలుగు హీరోయిన్‌..
కాలేజ్‌లో డ్యాన్స్‌ చేసిన సాయి పల్లవి.. వీడియో వైరల్‌..
ఓటీటీలోకి 'విరాట పర్వం'.. ఎప్పుడంటే ?

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement