Nazriya Nazim Says Ante Sundaraniki Story Is Unique: ‘‘నేను కథ వినేటప్పుడు భాష గురించి ఆలోచించను. సగటు ప్రేక్షకుడిలానే కథ వింటాను. ‘అంటే.. సుందరానికీ’ కథ అద్భుతం. ఎన్నో భావోద్వేగాలున్న ఇలాంటి అరుదైన కథ చేయడం చాలా ఎగ్జయిటింగ్‌గా అనిపించింది’’ అని నజ్రియా నజీమ్ పేర్కొన్నారు. నాని హీరోగా వివేక్ ఆత్రేయ దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం ‘అంటే.. సుందరానికీ’. నవీన్ యెర్నేని, రవిశంకర్ వై. నిర్మించిన ఈ సినిమా ఈ నెల 10న విడుదలవుతోంది.
ఈ సందర్భంగా చిత్రకథానాయిక నజ్రియా నజీమ్ మాట్లాడుతూ– ‘‘చైల్డ్ ఆర్టిస్ట్‌గా నా కెరీర్ మొదలుపెట్టాను. టీవీలో పని చేశాను. రెండేళ్లు వరుసగా సినిమాలు చేశాను. ఆ తర్వాత ఫాహద్ ఫాజిల్ (మలయాళ హీరో)ని పెళ్లి చేసుకుని సినిమాలకు బ్రేక్ ఇచ్చాను. ‘అంటే.. సుందరానికీ’ కథ ఎగ్జయిటింగ్‌గా అనిపించడంతో రీ ఎంట్రీ ఇచ్చాను. ఇందులో నేను చేసిన లీలా థామస్ పాత్రలో చాలా లేయర్స్ ఉన్నాయి. తెలుగు నాకు కొత్త భాష అయినప్పటికీ నా పాత్రకి నేనే డబ్బింగ్ చెప్పాను.
చదవండి: నయనతారతో పెళ్లిపై స్పందించిన విఘ్నేష్ శివన్..
మైత్రీ మూవీ మేకర్స్‌లో ‘అంటే.. సుందరానికీ’కి మొదట నేను సైన్ చేశాను. తర్వాత ఈ సంస్థలో ఫాహద్‌కి ‘పుష్ప’ అవకాశం వచ్చింది. ఈ రెండూ గొప్ప కథలు కావడం మా అదృష్టం’’ అన్నారు. కులాంతరం, మతాంతర వివాహాల గురించి మాట్లాడుతూ – ‘‘కులం, మతం.. వీటన్నింటికంటే ప్రేమ గొప్పది. కులాంతర, మతాంతర వివాహాల సమస్య ఇంకా ఉంది. మన పిల్లల తరానికైనా ఈ సమస్య ఉండకూడదని కోరుకుంటున్నాను’’ అన్నారు నజ్రియా.
Nazriya Nazim: మన పిల్లలకైనా ఆ సమస్య ఉండకూడదు: నజ్రియా నజీమ్
Published Wed, Jun 8 2022 8:18 AM | Last Updated on Wed, Jun 8 2022 9:59 AM
Advertisement
Advertisement
Comments
Please login to add a commentAdd a comment