Vivek Athreya
-
‘సరిపోదా శనివారం’ మూవీ థాంక్స్ మీట్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)
-
నాని ‘సరిపోదా శనివారం’ మూవీ స్టిల్స్
-
‘సరిపోదా శనివారం’ టాక్ ఎలా ఉందంటే..?
‘అంటే సుందరానికి’తర్వాత నేచురల్ స్టార్ నాని, క్రియేటివ్ డైరెక్టర్ వివేక్ ఆత్రేయ కాంబినేషన్లో తెరకెక్కిన చిత్రం ‘సరిపోదా శనివారం’. ప్రియాంక అరుల్ మోహన్ హీరోయిన్ గా నటిస్తున్న ఈ మూవీలో ఎస్జే సూర్య పవర్ ఫుల్ రోల్ ప్లే చేశాడు. ఇప్పటికే విడుదలైన ట్రైలర్, సాంగ్స్ సినిమాపై అంచనాలను పెంచేశాయి. దానికి తోడు సినిమా ప్రమోషన్స్ కూడా గట్టిగా చేయడంతో ‘సరిపోదా శనివారం’పై భారీ హైప్ క్రియేట్ అయింది. భారీ అంచనాల మధ్య నేడు(ఆగస్ట్ 29) ఈ చిత్రం ప్రేక్షకుల ముందుకు వచ్చింది.ఇప్పటికే ఓవర్సీస్తో పాటు పలు చోట్ల ఫస్ట్‌డే ఫస్ట్ షో పడిపోయింది. సినిమా చూసిన ప్రేక్షకులు సోషల్ మీడియా వేదికగా తమ అభిప్రాయాన్ని వెల్లడిస్తున్నారు. ‘సరిపోదా శనివారం కథేంటి?, నాని-వివేక్ ఆత్రేయ ఖాతాలో హిట్ పడిందా లేదా? తదితర విషయాలను ఎక్స్(ట్విటర్) వేదికగా చర్చిస్తున్నారు. అవేంటో చూసేయండి. . ఇది కేవలం నెటిజన్ల అభిప్రాయం మాత్రమే. ఇందులో పేర్కొన్న అంశాలకు ‘సాక్షి’తో బాధ్యత వహించదు.ఎక్స్‌లో ఈ చిత్రానికి పాజిటివ్ టాక్ వస్తుంది. నాని, ఎస్జే సూర్య తమ నటనతో అదరగొట్టేశారని, వారి కోసమే ఈ సినిమా చూడాలని నెటిజన్స్ కామెంట్ చేస్తున్నారు. రొటీన్ స్టోరీయే అయినా.. వివేక్ తెరపై డిఫరెంట్‌గా చూపించాడని అంటున్నారు. మరికొంత మంది అయితే ఇది యావరేజ్ మూవీ అని కామెంట్ చేస్తున్నారు. స్క్రీన్‌ప్లే ఫేలవంగా ఉందని, సెకండాఫ్ కాస్త సాగదీతగా ఉందని అంటున్నారు. చాలా మంది జేక్స్ బిజాయ్ నేపథ్య సంగీతంపై ప్రశంసలు కురిపిస్తున్నారు. బీజీఎం అదరగొట్టేశాడని.. సినిమాకు అదే ప్లస్ అని కామెంట్ చేస్తున్నారు. Review : Screenplay🕵️♂️ VivekAthreya Not upto The Mark ..1st Half - SJ Surya & Nani Don't Miss it Theatre Interval 🥵🥵🥵 🔥🔥🔥🔥Potharu Motham Potharu2nd Half Bit booring bit lengthy & a Mass entertainment .BGM 🥵🔥🥵🔥🥵🔥 Over all 3.5/5#SaripodhaaSanivaaram pic.twitter.com/DJstRjHcOu— 𝐍𝐚𝐯𝐞𝐞𝐧 𝐑𝐞𝐝𝐝𝐲 (@_NaveenReddy_14) August 28, 2024 వివేక్ ఆత్రేయ స్క్రీన్‌ప్లే గొప్పగా ఏమీ లేదు. కానీ ఫస్టాఫ్ ఎస్జే సూర్య, నానిల యాక్టింగ్ అదుర్స్. వారి కోసమే సినిమా చూడాలి. ఇంటర్వెల్ బ్యాంగ్ అదిరిపోయింది. పోతారు.. మొత్తం పోతారు. ఇక సెకండాఫ్ మాస్ ఎంటర్టైన్మెంట్. బీజీఎం అదిరిపోయిందని ఓ నెటిజన్ కామెంట్ చేశారు.#SaripodhaaSanivaaram is a satisfactory action drama that had moments of excellence but at the same time had moments where the film was too dragged out and predictable. The introduction block, interval block, climax block, and few confrontation scenes between Nani and SJ Surya…— Venky Reviews (@venkyreviews) August 28, 2024 #SaripodhaaSanivaaram@JxBe yem taagi kottav bro ah BGM mad antey mad mind lo nundi povatle #SaripodhaasanivaaramMovie nundi bayata ochinapati nundi vintune unna movie hittuuuu 💯 @NameisNani Recent ga chusina movies lo satisfying ga unna movie ede @DVVMovies pic.twitter.com/TU2f5aZqaS— Subbu (@allam700423) August 28, 2024Interval To Climax okate RaMp 🔥🔥🔥🔥🔥🙏🔥🙏🔥🔥🔥🔥🔥🔥🔥🔥🔥🔥🙏🙏🙏🔥🔥🔥🔥Biggest Blockbuster on Cards 🎴 🎯💪Congratulations to the Natural Star @NameisNani gaaru 🙏🔥😍and @DVVMovies 🙏🤝🥳#SaripodhaaSanivaaram #Nanipic.twitter.com/88WtCAy6hQ— JACK 𝕏 (@JACK_2K02) August 29, 2024#SaripodhaaSanivaaram : “Block-Buster”👉Rating : 3.5/5 ⭐️ ⭐️Positives:👉 #Nani👉 #SjSurya Performance👉BGM👉ScreenplayNegatives:👉 Lengthy👉Bit Routine Story#SaripodhaSanivaaram— CRICKET & CINEMA (@CRICKETCINEMAA) August 29, 2024Hat trick kottesamu 🔥🔥🥁Dasara 🥇hi Nanna 🥈Saripodhaasanivaaram🥉❤️ @NameisNani Anna nee story selection ki 🫡😍🔥🔥🔥 @iam_SJSuryah @priyankaamohan @SVR4446 @DVVMovies 💐💐#SaripodhaaSanivaaram #Nani pic.twitter.com/2iloeFm1H9— KADAPA SREENU (@SREENU_24) August 29, 2024#SaripodhaaSanivaaram First Half:- One of the most unique intros in TFI that only #Nani can pull off ❤️- Followed by an engaging screenplay with good moments and fun elements 👌- Then comes the interval – Potharu Mottham Potharu 🥵❤️🔥- #JakesBejoy on steroids 🥵🔥Yes, it… pic.twitter.com/6FWRllhusO— Movies4u Official (@Movies4u_Officl) August 28, 2024#SaripodhaaSanivaaramReview:Positives:- Vivek Athreya's writing with well-placed moments 💥- Jakes Bejoy's BGM 🔥- Interval 💥🔥- SJ Suryah's kickass acting 🙌- Nani's natural performance 💥- Characterizations 👌- A few repetitive setup scenes in the first half. pic.twitter.com/xGwG5YEOwi— Vikram_90 (@CiritSanthosh) August 29, 2024 -
నాని ఈ సినిమాకు ఛాన్స్ ఇవ్వలేదు..
-
సుదర్శన్ థియేటర్లో ‘సరిపోదా శనివారం’ ట్రైలర్ విడుదల ఈవెంట్ (ఫొటోలు)
-
మన సినిమాతో ఈ నెలాఖరు అదిరిపోతుంది: నాని
‘‘హైదరాబాద్‌లోని సుదర్శన్ థియేటర్ నాకు చాలా స్పెషల్. ఈ థియేటర్లో మీ అందరితో (అభిమానులు, ప్రేక్షకులు) కలసి ‘సరిపోదా శనివారం’ ట్రైలర్ లాంచ్ వేడుక చేసుకోవడం చాలా సంతోషంగా ఉంది. మన సినిమాతో ఈ నెలాఖరు అదిరిపోతుంది. మీ ప్రేమను నాపై ఇలానే చూపిస్తూ ఉంటే వంద శాతం కష్టపడి మరిన్ని మంచి చిత్రాలు ఇవ్వడానికి ప్రయత్నిస్తూనే ఉంటా’’ అని హీరో నాని అన్నారు. వివేక్ ఆత్రేయ దర్శకత్వంలో నాని, ప్రియాంకా అరుళ్ మోహన్ జంటగా నటించిన చిత్రం ‘సరిపోదా శనివారం’. డీవీవీ దానయ్య, కల్యాణ్ దాసరి నిర్మించిన ఈ సినిమా ఈ నెల 29న తెలుగు, తమిళ, కన్నడ, మలయాళ, హిందీ భాషల్లో విడుదల కానుంది. హైదరాబాద్‌లో నిర్వహించిన ఈ చిత్రం ట్రైలర్ లాంచ్ ఈవెంట్లో నాని మాట్లాడుతూ– ‘‘29న థియేటర్స్‌లో ‘సరిపోదా శనివారం’ని సెలబ్రేట్ చేసుకుందాం’’ అన్నారు.నటుడు ఎస్జే సూర్య మాట్లాడుతూ– ‘‘చాలా మంచి కంటెంట్ ఉన్న చిత్రం ఇది.. తప్పకుండా పెద్ద హిట్ అవుతుంది’’ అని పేర్కొన్నారు. ‘‘గ్యాంగ్ లీడర్’ సినిమా తర్వాత నానీగారితో ‘సరిపోదా శనివారం’ చేశాను. అందరూ కుటుంబంతో వెళ్లి మా సినిమా చూడండి’’ అని ప్రియాంకా అరుళ్ మోహన్ చెప్పారు. ‘‘మా సినిమా మైండ్ బ్లోయింగ్‌గా ఉంటుంది’’ అన్నారు డీవీవీ దానయ్య. -
తొలి పాటలోనే 'గరం గరం' అంటూ నాని రచ్చ
నాని హీరోగా నటిస్తున్న పాన్ ఇండియా చిత్రం 'సరిపోదా శనివారం'. వివేక్ ఆత్రేయ దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమాలో ప్రియాంకా అరుల్ మోహన్ హీరోయిన్గా నటిస్తున్నారు. ఎస్.జె.సూర్య కీలకపాత్రలో నటిస్తున్నారు. డీవీవీ ఎంటర్టైన్మెంట్ బ్యానర్‌పై డీవీవీ దానయ్య, కల్యాణ్ దాసరి నిర్మిస్తున్నారు. ఇప్పటికే ఈ సినిమా షూటింగ్ పూర్తి చేసుకుని విడుదలకు సిద్ధంగా ఉంది.తాజాగా ఈ సినిమా నుంచి ఫస్ట్ సాంగ్‌ను మేకర్స్ విడుదల చేశారు. 'గరం గరం' అంటూ సాగే ఈ పాట నాని అభిమానుల్లో జోష్‌ను నింపుతుంది. హై బడ్జెట్‌తో యూనిక్ అడ్వంచర్‌గా రూపొందుతున్న ఈ సినిమా తెలుగు, తమిళ, కన్నడ, మలయాళ, హిందీ భాషల్లో ఆగస్టు 29న విడుదల కానుంది. ఈ చిత్రానికి సంగీతం జేక్స్ బిజోయ్ అందించారు. -
నాని 'సరిపోదా శనివారం' గ్లింప్స్ విడుదల.. టైటిల్ సీక్రెట్ ఇదే
నాని హీరోగా వివేక్ ఆత్రేయ దర్శకత్వంలో ‘సరిపోదా శనివారం’ పాన్ ఇండియా రేంజ్లో తెరకెక్కుతోంది. 'అంటే సుందరానికీ' సినిమా తర్వాత వీరిద్దరి కాంబినేషన్లో ఈ సినిమా తెరకెక్కుతుంది. ప్రియాంకా అరుళ్ మోహనన్ హీరోయిన్గా నటిస్తున్న ఈ చిత్రంలో ఎస్జే సూర్య ఓ కీలక పాత్రలో పోలీస్ ఆఫీసర్‌గా కనిపించనున్నాడు. డీవీవీ ఎంటర్టైన్మెంట్స్ పతాకంపై డీవీవీ దానయ్య ఈ ప్రాజెక్ట్‌ను నిర్మిస్తున్నాడు. ఆగష్టు 29న ఈ చిత్రం విడుదల కానుంది. నేడు నాని పుట్టినరోజు సందర్భంగా ‘సరిపోదా శనివారం’ మూవీ నుంచి గ్లింప్స్‌ను విడుదల చేశారు మేకర్స్.. ఇందులో నాని యాంగ్రీమెన్లా కనిపిస్తున్నాడు. ఎస్ జే సూర్య వాయిస్‌తో గ్లింప్స్ ప్రారంభం అవుతుంది. వారం మొత్తంలో శనివారం మాత్రమే హీరో నానిలో కోపం కట్టలు తెంచుకుంటుంది. దీనినే ఈ గ్లింప్స్‌లో చూపించారు. వారంలో అన్ని రోజుల్లో సాదాసీదాగా ఉంటూ.. శనివారం మాత్రమే శక్తిమంతుడిగా కనిపించే హీరో కథగా ఈ మూవీ ఉండనుంది. యాక్షన్‌కు.. వినోదానికి ఇందులో పెద్ద పీట వేసినట్లు తెలుస్తోంది. నాని క్యారెక్టర్ డిజైన్ చాలా ఫ్రెష్ గా ఉంది. గ్లింప్స్‌లో డైలాగ్స్ లేకపోయినా అతని స్క్రీన్ ప్రెజెన్స్ అద్భుతంగా ఉంది. నాని సిగరెట్ తాగే విధానం పాత్రకు చైతన్యాన్ని తెస్తుంది. వెనుక సీటులో అజయ్ ఘోష్ కూర్చొని ఉండగా నాని రిక్షా తొక్కే సన్నివేశం మెచ్చుకోదగినది. గ్లింప్స్‌తో ఫ్యాన్స్‌ను నాని మెప్పించాడని చెప్పవచ్చు. -
హైదరాబాద్‌లో సరిపోదా...
‘అంటే సుందరానికీ!’ చిత్రం తర్వాత హీరో నాని, డైరెక్టర్ వివేక్ ఆత్రేయ కాంబినేషన్లో తెరకెక్కుతోన్న చిత్రం ‘సరిపోదా శనివారం’. ప్రియాంకా అరుళ్ మోహన్ హీరోయిన్గా నటిస్తున్న ఈ సినిమాలో ఎస్జే సూర్య కీలక పాత్ర చేస్తున్నారు. డీవీవీ ఎంటర్టైన్మెంట్స్పై డీవీవీ దానయ్య, కల్యాణ్ దాసరి నిర్మిస్తున్న ఈ సినిమా తాజా షెడ్యూల్ హైదరాబాద్‌లో ్రపారంభమైంది. ‘‘సరిపోదా శనివారం’ చిత్రంలో నాని పూర్తిగా యాక్షన్–΄్యాక్డ్ అవతార్‌లో కనిపిస్తారు. హై బడ్జెట్, భారీ కాన్వాస్‌తో ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నాం. నవంబరులో ఒక షెడ్యూల్ పూర్తి చేశాం. రెండో షెడ్యూల్‌ని హైదరాబాద్‌లో ్రపారంభించాం. ఈ షెడ్యూల్లో ఇంటెన్స్ యాక్షన్ బ్లాక్‌తో పాటు నాని, ఇతర ప్రధాన తారాగణంపై కొంత టాకీ పార్ట్‌ని చిత్రీకరించనున్నాం. పాన్ ఇండియా చిత్రంగా రూ΄÷ందుతున్న ఈ సినిమా తెలుగు, తమిళ, కన్నడ, మలయాళం, హిందీ భాషల్లో రిలీజ్ కానుంది’’ అన్నారు మేకర్స్. ఈ చిత్రా నికి సంగీతం: జేక్స్ బిజోయ్, కెమెరా: మురళి జి. -
ఫైట్‌తో ప్రారంభం
‘అంటే..సుందరానికీ!’ చిత్రం తర్వాత హీరో నాని, దర్శకుడు వివేక్ ఆత్రేయ కాంబినేషన్లో రూపొందుతున్న తాజా సినిమా ‘సరిపోదా శనివారం’. ప్రియాంకా అరుళ్ మోహనన్ హీరోయిన్గా నటిస్తున్న ఈ చిత్రంలో ఎస్జే సూర్య ఓ కీలక పాత్రధారి. ఈ సినిమా రెగ్యులర్ షూటింగ్ ఓ యాక్షన్ సీక్వెన్స్‌తో మంగళవారం హైదరాబాద్‌లోప్రారంభమైంది. ఫైట్ మాస్టర్ రామ్–లక్ష్మణ్ ఈ ఫైట్ ఎపిసోడ్‌ను పర్యవేక్షిస్తున్నారు. ఈ షెడ్యూల్లో కొన్ని యాక్షన్ సన్నివేశాలతో పాటు నాని, ఇతర ప్రధాన తారాగణం పాల్గొనగా కీలక సన్నివేశాలను చిత్రీకరిస్తున్నారు. డీవీవీ ఎంటర్టైన్మెంట్స్ పతాకంపై డీవీవీ దానయ్య, కల్యాణ్ దాసరి నిర్మిస్తున్న ఈ చిత్రానికి సంగీతం: జేక్స్ బిజోయ్. -
మాట నిలబెట్టుకున్న నాని.. కొత్త సినిమా ప్రకటన.. వారిద్దరికీ ఛాన్స్
దసరా సందర్భంగా ఫ్యాన్స్‌కు అదిరిపోయే కానుకను ఇచ్చాడు హీరో నాని. తన కొత్త సినిమా ప్రకటన వచ్చేసింది. అందుకు సంబంధించిన ఒక టైటిల్ వీడియోను ఆయన విడుదల చేశాడు. ఈ ఏడాదిలో 'దసరా' సినిమా తర్వాత 'హాయ్ నాన్న' అనే సినిమాను డిసెంబర్ 7న విడుదల చేస్తున్నారు. ఈలోపే నాని మరో సినిమాను లైన్లో పెట్టాడు. 'సరిపోదా శనివారం' అనే టైటిల్‌ను ఫిక్స్ చేశారు. (ఇదీ చదవండి: బూతులను సమర్థించిన శివాజీని ఢీ కొట్టిన శోభ) ‘అంటే సుందరానికీ’ సినిమా దర్శకుడు వివేక్ ఆత్రేయ కాంబినేషన్లో తాజాగా నాని మరో సినిమాను ప్రకటించాడు. ఈ చిత్రంలో ప్రియాంకా అరుళ్ మోహన్ హీరోయిన్గా నటిస్తుంది. డీవీవీ ఎంటర్టైన్మెంట్స్పై డీవీవీ దానయ్య, కల్యాణ్ దాసరి ఈ సినిమాను నిర్మించనున్నారు. మాట నిలబెట్టుకున్న నాని నాని గ్యాంగ్ లీడర్ సినిమాతో టాలీవుడ్‌కు పరిచయమైంది హీరోయిన్ ప్రియాంక మోహన్. కానీ ఆ సినిమా తర్వాత ఆమెకు పెద్దగా ఆఫర్స్ రాలేదు. ఆ సినిమా ప్రమోషన్స్‌లో మాట్లాడుతూ.. ప్రియాంక యాక్టింగ్ తనకు బాగా నచ్చిందని కచ్చితంగా ఆమెతో మరో సినిమా చేస్తానని నాని అప్పట్లో మాటిచ్చాడు. చెప్పినట్లుగానే ఇప్పుడు ఆమెకు మరో ఛాన్స్‌తో తన మాట నిలబెట్టుకున్నాడు నాని. 'అంటే సుందరానికీ' సినిమా దర్శకుడు వివేక్ ఆత్రేయ టాలెంట్‌కు ఫిదా అయిన నాని అతడితో కూడా కచ్చితంగా మరో సినిమా చేస్తానని ప్రకటించాడు. 'సరిపోదా శనివారం' అనే సినిమాలో వారిద్దరికి ఛాన్స్ ఇచ్చి.. తన మాటను నిలబెట్టుకున్నాడు నాని. -
సరిపోదా శనివారం?
‘అంటే సుందరానికీ’ చిత్రం తర్వాత హీరో నాని, దర్శకుడు వివేక్ ఆత్రే కాంబినేషన్లో మరో సినిమా తెరకెక్కనుంది. ఈ చిత్రంలో ప్రియాంకా అరుళ్ మోహన్ హీరోయిన్. డీవీవీ ఎంటర్టైన్మెంట్స్పై డీవీవీ దానయ్య, కల్యాణ్ దాసరి ఈ సినిమాను నిర్మించనున్నారు. ఈ చిత్రాన్ని శనివారం ప్రకటించారు. అలాగే ఈ నెల 23న ఓ అప్డేట్, 24న ఈ సినిమా ్ర΄ారంభోత్సవం జరపనున్నట్లు మేకర్స్ వెల్లడించారు. ఈ చిత్రానికి ‘సరిపోదా శనివారం’ అనే టైటిల్ అనుకుంటున్నారని సమాచారం. -
అనుష్క నంబర్ అనుకుని వందల సార్లు..: డైరెక్టర్
'అంటే సుందరానికీ' సినిమాతో ప్రేక్షకులను అలరించాడు యంగ్ డైరెక్టర్ వివేక్ ఆత్రేయ. చాలా విభిన్న కథలతో సినీ అభిమానులను అలరించారు. మెంటల్ మదిలో, బ్రోచేవారెవరురా లాంటి చిత్రాలు తెరకెక్కించారు. అయితే తాజాగా ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న ఆయన పలు ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ప్రస్తుతం సోషల్‌మీడియాలో నెగెటివిటీ విస్తరించిందన్నారు. కొంతమంది నెటిజన్లు కావాలనే తనపై విమర్శలు చేస్తున్నారని ఆత్రేయ చెప్పారు. సెలబ్రిటీలు సోషల్‌మీడియాకు దూరంగా ఉంటేనే ఇలాంటివి తగ్గుతాయని తెలిపారు. కొవిడ్ సమయంలో ఎదురైన సంఘటను దర్శకుడు వెల్లడించారు. డైరెక్టర్ వివేక్ ఆత్రేయ మాట్లాడుతూ.. 'కొవిడ్ సమయంలో నా స్నేహితుడి ఫాదర్ అనారోగ్యం బారిన పడ్డారు. ఆయనకు రక్తం అవసరం కావడంతో బ్లడ్ రక్తదాత కోసం చాల వెతికాం. నా ఫోన్ నంబర్ని జత చేస్తూ అందరికీ మేసేజెస్ పంపా. ఈ విషయం తెలుసుకున్న నటి అనుష్క మాకు సాయం చేయడం కోసం ఆ సందేశాన్ని తన సోషల్‌మీడియాలో షేర్ చేసింది. అయితే ఆ ఫోన్ నంబర్ అనుష్కదే అనుకుని అందరూ పొరబడ్డారు. చాలామంది కాల్స్ కూడా చేశారు. ఆ పోస్ట్ పెట్టిన తర్వాత నా ఫోన్‌కు వచ్చిన కాల్స్ ఎవరూ ఊహించి ఉండరు. ఒకరు వీడియో కాల్ చేస్తే.. మరొకరు షర్ట్ లేకుండా ఫొటోలు పంపారు. ఇక ఆ దారుణాలను నేను చెప్పలేను. హీరోయిన్ల జీవితం ఇంత కష్టంగా ఉంటుందా అని షాక్‌కు గురయ్యా. ఆ తర్వాత ఆ ఫోన్ నంబర్ బ్లాక్ చేశా.' అని అన్నారు. అంటే సుందరానికీ చిత్రానికి వచ్చిన స్పందనపై ఆయన మాట్లాడారు. ఆ చిత్రానికి వచ్చిన ఫలితంపై పూర్తి బాధ్యత నాదేనని చెప్పారు. ఆ సినిమా కొంతమంది నచ్చగా.. మరికొందరు నిడివి ఎక్కువ ఉందని కామెంట్స్ చేశారు. సినిమా నిడివి పది నిమిషాలు ఎక్కువైందని తెలుసు.. కానీ ఎడిట్ చేయడానికి వీల్లేకుండా పోయింది. ఎందుకంటే ఒక సీన్‌కు మరో సీన్‌కు లింక్ ఉంది. అయితే సినిమాకు ఎక్కువగా దగ్గర కాకూడదని ఈ చిత్రం ద్వారా నేర్చుకున్నా. ఎందుకంటే అంటే సుందరానికీ ఫలితం నన్ను తీవ్రంగా బాధించింది.' అని అన్నారు. -
తేది గుర్తుంచుకోండి.. 'అంటే సుందరానికీ' ఓటీటీలో ఆరోజే..
Nani Ante Sundaraniki OTT Streaming Date Announced: నేచురల్ స్టార్ నాని, మలయాళ బ్యూటీ నజ్రియా నజీమ్ జోడిగా నటించిన లెటెస్ట్ మూవీ ‘అంటే.. సుందరానికీ’. ‘మెంటల్ మదిలో’, ‘బ్రోచేవారెవరురా’ లాంటి చిత్రాలతో చక్కటి గుర్తింపు తెచ్చుకున్న వివేక్ ఆత్రేయ ఈ చిత్రానికి దర్శకత్వం వహించారు. ఇందులో నాని ఓ బ్రాహ్మణ కుర్రాడిగా, నజ్రియా క్రిస్టియన్ అమ్మాయిగా జంటగా నటించిన విషయం తెలిసిందే. ఫుల్ కామెడీ రొమాంటిక్ ఎంటర్టైనర్గా తెరకెక్కిన ఈ చిత్రం జూన్ 10న ప్రేక్షకుల ముందుకు వచ్చి మొదట పాజిటివ్ టాక్ తెచ్చుకోగా తర్వాత నెమ్మదిగా కలెక్షన్లు తగ్గాయి. ఇదిలా ఉంటే ఇప్పుడు ఈ మూవీ ఓటీటీ వేదికపై సందడి చేసేందుకు సిద్ధంగా ఉంది. ప్రముఖ ఓటీటీ దిగ్గజం నెట్‌ఫ్లిక్స్‌లో జులై 10 నుంచి తెలుగు, మలయాళం, తమిళ భాషల్లో స్ట్రీమింగ్ కానుంది. ఈ విషయాన్ని సోషల్ మీడియా వేదికగా నెట్‌ఫ్లిక్స్ ఇండియా సౌత్ అధికారికంగా ప్రకటించింది. 'సుందర్ అండ్ లీల వెడ్డింగ్ స్టోరీని చూసేందుకు మీ అందరినీ సాదరంగా ఆహ్వానిస్తున్నాం. తేది గుర్తుంచుకోండి' అంటూ ట్వీట్ చేసింది. చదవండి:👇 విషాదం: కేన్సర్‌తో పోరాటం.. అంతలోనే కరోనా.. 30 ఏళ్లకే స్టార్ నటుడు మృతి బాధాకరమైన పెళ్లిళ్లకు మీరే కారణం.. సమంత కామెంట్స్ వైరల్ వేశ్య పాత్రలో యాంకర్ అనసూయ..! అందుకు నాకు అర్హత లేదు: మహేశ్ బాబు You are cordially invited to witness the wedding story of Sundar and Leela 🥰❤️ Save the date! Ante Sundaraniki is coming to Netflix on the 10th of July in Telugu, Malayalam and Tamil.@NameisNani #NazriyaFahadh #VivekAthreya pic.twitter.com/yRw3XIewK5 — Netflix India South (@Netflix_INSouth) July 3, 2022 -
'అంటే.. సుందరానికీ' వచ్చిన కలెక్షన్లు ఎంతంటే ?
Nani Ante Sundaraniki First Week Box Office Collections: నేచురల్ స్టార్ నాని హీరోగా నటించిన లెటెస్ట్ మూవీ ‘అంటే..సుందరానికీ’.‘మెంటల్ మదిలో’, ‘బ్రోచేవారెవరురా’లాంటి చిత్రాలతో చక్కటి గుర్తింపు తెచ్చుకున్న వివేక్ ఆత్రేయ ఈ చిత్రానికి దర్శకత్వం వహించారు. మలయాళ బ్యూటీ నజ్రియా నజీమ్ హీరోయిన్గా నటించింది. ఈ చిత్రంలో నాని ఓ బ్రాహ్మణ కుర్రాడిగా, నజ్రియా క్రిస్టియన్ అమ్మాయిగా జోడి కట్టారు. ప్యూర్ కామెడీ రొమాంటిక్ ఎంటర్టైనర్గా తెరకెక్కిన ఈ చిత్రం జూన్ 10న విడుదలై బాక్సాఫీస్ వద్ద మంచి టాక్‌ను సంపాదించుకుంది. ఈ సినిమా మొదటి వారం హిట్ టాక్‌తో దూసుకెళ్లినా, తర్వాత కలెక్షన్లు తగ్గుముఖం పట్టాయి. ఈ సినిమా ఫస్ట్ వీక్ పూర్తయ్యే సరికి వరల్డ్‌వైడ్‌గా రూ. 18.39 కోట్ల షేర్ వసూళ్లను రాబట్టింది. గ్రాస్ పరంగా రూ. 32.60 కోట్లు కొల్లగొట్టి నాని కెరీర్లో మంచి హిట్ మూవీగా సినిమా నిలిచిందని సినీ వర్గాలు పేర్కొన్నాయి. ఏరియాలా వారీగా ఈ మూవీ మొదటి వారం కలెక్షన్లు ఈ కింది విధంగా ఉన్నాయి. నైజాం- రూ. 5.58 కోట్లు సీడెడ్- రూ. 1.13 కోట్లు ఉత్తరాంధ్ర- రూ. 1.33 కోట్లు ఈస్ట్- రూ. 0.93 కోట్లు వెస్ట్- రూ. 0.79 కోట్లు గుంటూరు- రూ. 0.87 కోట్లు కృష్ణా- రూ. 0.84 కోట్లు నెల్లూరు- రూ. 0.58 కోట్లు మొత్తం ఏపీ, తెలంగాణ కలిపి- 12.05 కోట్లు (రూ. 20.40 కోట్లు గ్రాస్) కర్ణాటకతోపాటు దేశవ్యాప్తంగా- 1.34 కోట్లు ఓవర్సీస్- 5 కోట్లు ప్రపంచవ్యాప్తంగా- రూ. 18.39 కోట్లు (రూ. 32.60 కోట్లు గ్రాస్) చదవండి: సైలెంట్‌గా తమిళ హీరోను పెళ్లాడిన తెలుగు హీరోయిన్.. కాలేజ్‌లో డ్యాన్స్ చేసిన సాయి పల్లవి.. వీడియో వైరల్.. ఓటీటీలోకి 'విరాట పర్వం'.. ఎప్పుడంటే ? -
మన పిల్లలకైనా ఆ సమస్య ఉండకూడదు: నజ్రియా నజీమ్
Nazriya Nazim Says Ante Sundaraniki Story Is Unique: ‘‘నేను కథ వినేటప్పుడు భాష గురించి ఆలోచించను. సగటు ప్రేక్షకుడిలానే కథ వింటాను. ‘అంటే.. సుందరానికీ’ కథ అద్భుతం. ఎన్నో భావోద్వేగాలున్న ఇలాంటి అరుదైన కథ చేయడం చాలా ఎగ్జయిటింగ్‌గా అనిపించింది’’ అని నజ్రియా నజీమ్ పేర్కొన్నారు. నాని హీరోగా వివేక్ ఆత్రేయ దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం ‘అంటే.. సుందరానికీ’. నవీన్ యెర్నేని, రవిశంకర్ వై. నిర్మించిన ఈ సినిమా ఈ నెల 10న విడుదలవుతోంది. ఈ సందర్భంగా చిత్రకథానాయిక నజ్రియా నజీమ్ మాట్లాడుతూ– ‘‘చైల్డ్ ఆర్టిస్ట్‌గా నా కెరీర్ మొదలుపెట్టాను. టీవీలో పని చేశాను. రెండేళ్లు వరుసగా సినిమాలు చేశాను. ఆ తర్వాత ఫాహద్ ఫాజిల్ (మలయాళ హీరో)ని పెళ్లి చేసుకుని సినిమాలకు బ్రేక్ ఇచ్చాను. ‘అంటే.. సుందరానికీ’ కథ ఎగ్జయిటింగ్‌గా అనిపించడంతో రీ ఎంట్రీ ఇచ్చాను. ఇందులో నేను చేసిన లీలా థామస్ పాత్రలో చాలా లేయర్స్ ఉన్నాయి. తెలుగు నాకు కొత్త భాష అయినప్పటికీ నా పాత్రకి నేనే డబ్బింగ్ చెప్పాను. చదవండి: నయనతారతో పెళ్లిపై స్పందించిన విఘ్నేష్ శివన్.. మైత్రీ మూవీ మేకర్స్‌లో ‘అంటే.. సుందరానికీ’కి మొదట నేను సైన్ చేశాను. తర్వాత ఈ సంస్థలో ఫాహద్‌కి ‘పుష్ప’ అవకాశం వచ్చింది. ఈ రెండూ గొప్ప కథలు కావడం మా అదృష్టం’’ అన్నారు. కులాంతరం, మతాంతర వివాహాల గురించి మాట్లాడుతూ – ‘‘కులం, మతం.. వీటన్నింటికంటే ప్రేమ గొప్పది. కులాంతర, మతాంతర వివాహాల సమస్య ఇంకా ఉంది. మన పిల్లల తరానికైనా ఈ సమస్య ఉండకూడదని కోరుకుంటున్నాను’’ అన్నారు నజ్రియా. -
సూర్య చేసిన ఆ సినిమా.. నాకొస్తే బాగుండేదనిపించింది: నాని
నేచురల్ స్టార్ నాని హీరోగా వివేక్ ఆత్రేయ దర్శకత్వంలో ప్రముఖ నిర్మాణ సంస్థ మైత్రీ మూవీ మేకర్స్ నిర్మించిన రొమాంటిక్ కామెడీ ఎంటర్ టైనర్ 'అంటే సుందరానికీ'. ఈ చిత్రం ద్వారా నజ్రియా టాలీవుడ్‌కి ఎంట్రీ ఇవ్వబోతుంది. జూన్ 10న ప్రపంచ వ్యాప్తంగా ఈ మూవీ విడుదల కాబోతుంది. ఈ సందర్భంగా తాజాగా హీరో నాని మీడియాతో ముచ్చటించారు. ఆ విశేషాలు.. వివేక్ ఆత్రేయతో మీ జర్నీ ఎలా ఉంది? కొత్త డైరెక్టర్లతో లేదా ఒకటి రెండు సినిమాలు తీసిన దర్శకులతో ఎందుకు సినిమాలు చేస్తావని అందరూ నన్ను అడుగుతుంటారు. ప్రజెంట్ లీడింగ్‌లో ఉన్న దర్శకుల కంటే.. ఫ్యూచర్లో లీడింగ్ డైరెక్టర్‌తో పని చేస్తే.. అప్పుడు మనం వాళ్ల జర్నీలో కూడా పాలు పంచుకోవచ్చు అనే చిన్న స్వార్థం నాకు ఉంటుంది. వివేక్‌తో మాట్లాడినా.. ఆయన సినిమాలు చూసినా... భవిష్యత్తులో టాప్ డైరెక్టర్లలో ఒకరిగా ఉంటాడనిపించింది. అందుకే ఆయనతో సినిమా కమిట్ అయ్యాను. కొత్త దర్శకులు చెప్పిన కథను తీస్తారో లేదో తెలియదు.. మీరు మాత్రం అలాంటి వాళ్లను ఎలా నమ్ముతారు? అది నమ్మకం అంతే. మొదట్లో చాలా మంది నన్ను నమ్మి సినిమాలు తీశారు. ఇప్పుడు నాకంటూ ఒక ఇమేజ్‌ని సంపాదించుకున్నా. అందుకే.. టాలెంట్ ఉన్నవాళ్లకి నేను అవకాశం ఇవ్వాలనుకుంటాను. అంటే..సుందరానికిలో కొత్తగా ఏం చూపిస్తున్నారు? నేను ఇంతకు ముందు తీసిన ఫన్ జానర్ సినిమాల్లో ఎలాంటి కామెడీ చేశానో.. దానికి చాలా భిన్నంగా ఇందులో చేస్తాను. డైలాగ్స్ కానీ, పాత్ర ప్రవర్తన కానీ డిఫరెంట్‌గా ఉంటుంది. తెరపై కొత్త నానిని చూస్తారు. ఫస్ట్ టైం బ్రాహ్మణ కుర్రాడి పాత్రని చేశారు కదా? ఏమైనా హోం వర్క్ చేశారా? లేదు. మన సినిమాల్లో ఇలాంటి పాత్రలు ఉన్నప్పుడు.. ఉన్నదాని కంటే కాస్త ఎక్కువ చూపిస్తాం. వాళ్ల మాటలను కూడా ఢిపరెంట్‌గా చూపించి కామెడీ పండిస్తాం. కానీ ఇందులో ఎవరినైనా సరే కించపరిచి కామెడీ చేసిన సీన్స్ ఉండవు. వివేక్ ఆత్రేయ ఓ బ్రాహ్మణ కుర్రాడు. వాళ్ల ఇంట్లో అమ్మ, నాన్న ఎలా ఉంటారు, వాళ్ల ఆచారాలు ఏంటి? ఎలా ప్రవర్తిస్తారు ..ఇలాంటి విషయాలను చాలా చక్కగా చూపించాడు. ఇందులో మీరు అమాయకుడైన సుందరం పాత్రని పోషించారు. ఆ పాత్ర గురించి? ట్రైలర్ చూసి సుందరం చాలా ఇన్నోసెంట్, వాళ్ల నాన్న చేతిలో నలిగిపోతున్నాడు అనిపించొచ్చు కానీ.. వాడు చాలా వరస్ట్ ఫెల్లో(నవ్వుతూ..). వివేక్ కూడా నాకు కథ చెప్పినప్పుడు అదే చెప్పాడు. ‘వీడు వరస్ట్ ఫెలో సర్. కానీ ప్రతి ఫ్రేమ్‌లో వీడిని ప్రేమించాలి’ అని అన్నాడు. అలా చేయడం పెద్ద టాస్క్ మాకు. ఔట్పుట్ చాలా చక్కగా వచ్చింది. నరేశ్‌తో బాండింగ్? ఇంతకు ముందు నరేశ్‌తో నేను చేసిన ఏ సినిమాలు కూడా.. అంటే సుందరానికి.. దరిదాపుల్లో ఉండవు. మా ఇద్దరి కాంబినేషన్ ఈ చిత్రంలో వేరే లెవల్‌కు వెళ్లిపోతుంది. కులాంతర వివాహాలపై చాలా సినిమాలు వచ్చాయి. ఇందులో కొత్తగా ఏం చూపించారు? ఇందులో రెండు కొత్త విషయాలు ఉంటాయి. ఒకటి ట్రైలర్లో చెప్పేశాం. రెండోది థియేటర్స్‌లో చూడాల్సిందే. రియల్ లైఫ్‌లో కూడా మీది ప్రేమ వివాహం. ఈ సినిమాలో మీ రియల్ లైఫ్ సన్నివేశాలు ఉన్నాయా? నా పెళ్లి చాలా సింపుల్‌గా జరిగింది. ఇరు కుటుంబాల పెద్దలు మాట్లాడుకొని మా పెళ్లి చేశారు. అయితే చిన్న ప్రాబ్లం ఏంటంటే.. అమ్మాయి వాళ్లదేమో సైంటిస్ట్ ఫ్యామిలీ.. నేనేమో సినిమాలు అంటూ పిచ్చోడిలా తిరుగుతున్నా. ఫ్యూచర్ ఎలా ఉంటుందో కూడా తెలియదు. అప్పుడు నాకు ఇవ్వొచ్చా లేదా అని అమ్మాయి ఫ్యామిలీ టెన్షన్ పడింది. నన్ను కలిశాక ఒప్పుకొని హ్యాపీగా పెళ్లి చేశారు. ఈ చిత్రంలోకి నజ్రియా ఎలా వచ్చింది? నేను, వివేక్ అనుకొనే నజ్రియాను తీసుకొచ్చాం. ఈ కథలో హీరోహీరోయిన్ ఇద్దరికీ ప్రాధాన్యత ఉంటుంది. లీలా పాత్రకు ఎవరైతే బాగుంటుందని ఆలోచించిన ప్రతిసారి మేమిద్దరం.. నజ్రియాలాగే ఉంటే బాగుంటుందని అనుకునేవాళ్లం. నజ్రియాలాగా ఎందుకు ఆమెనే తీసుకుంటే బాగుంటుంది కదా అనుకొని కథ వినిపించాం. పెద్ద పెద్ద హీరోల సినిమాలు వస్తేనే ఒప్పుకోని నజ్రియా.. ఈ కథ విన్నవెంటనే ఎగిరి గంతేసి.. చేసేద్దాం అని చెప్పారు. కథను బాగా నమ్మితే తప్ప నజ్రియా ఒప్పుకోదు. ‘శ్యామ్ సింగరాయ్’ విడుదల టైంలో టికెట్ల రేట్లు చాలా తక్కువగా ఉన్నాయని మాట్లాడారు. ఇప్పుడేమో ఫిల్మ్ మేకర్సే టికెట్ల రేట్లను తగ్గిస్తున్నారు. అంటే సుందరానికి ఎలా ఉండబోతుంది? సోషల్ మీడియాలో ఇలాంటి కామెంట్లు చూశాను. అసలు నేను ఏ సందర్భంలో రేట్ల గురించి మాట్లాడాను? టికెట్ల రేట్లు రూ.30, రూ.40 ఉన్నప్పుడు నేను అలా అన్నాను. కనీసం రూ.100, రూ.120 లేకుంటే ఎలా అని అడిగాను. ఇప్పుడు రూ. 500 అయితే.. చూశావా మీ కోసం 500 పెంచాలా? అంటున్నారు. ఎవరు పెంచమన్నారు? ఆర్ఆర్ఆర్ లాంటి పెద్ద సినిమాలకు పెంచితే తప్పులేదు కానీ.. అన్ని సినిమాలకు అదే స్థాయిలో పెంచితే అది చాలా పెద్ద తప్పు. కనీస ధరలు ఉంటే చాలు. టీజర్లో మీ లుక్ బారిష్టర్ పార్వతీశం ని గుర్తిచేసింది.. ఇందులో ఆ నవల ప్రేరణ ఉందా ? ఆ నవలకు ఈ సినిమాకు ఎలాంటి సంబంధం లేదు. పంచె కట్టే సమయంలోనే బారిష్టర్ పార్వతీశం గుర్తొస్తుంది. అప్పుడే ఎందుకు అనేది సినిమా చూసినప్పుడు తెలుస్తుంది. ‘శ్యామ్ సింగరాయ్’ది సీరియస్ సబ్జెక్..ఇది కామెడీ జానర్. మీకు కొంచె రిలీఫ్ అనిపించిందా? సబ్జెక్ట్ సీరియస్ అయినా.. కామెడీ అయినా షూటింగ్లో పడే కష్టాలు పడాల్సిందే. సీన్ బాగా రావాలనే తపన, ఒత్తిడి ఎప్పటికీ ఉంటుంది. అయితే సీరియస్ చిత్రాల్లో ఫైటింగ్‌లు, ఎగరడాలు, దూకడాలు ఉంటాయి. కామెడీ మూవీస్‌లో అలాంటివి ఉండవు అంతే. సౌత్ సినిమాలు పాన్ ఇండియా స్థాయిలో బాగా ఆడుతున్నాయి. మరోపక్క బాలీవుడ్ స్ట్రగుల్ అవుతుంది. ఈ ఫేజ్‌ని ఎలా చూస్తారు? ఇది సినిమాకే గోల్డెన్ ఫేజ్. బాలీవుడ్, టాలీవుడ్ అని కాదు.. ఇండియా వైజ్‌గా సినిమాకు ఇది మంచి ఫేజ్. వంశీ పైడిపల్లి, విజయ్ మూవీలో మీరు నటిస్తున్నారని వార్తలు వినిపిస్తునాయి? రోజుకో కొత్త పుకార్లు పుట్టుకొస్తున్నాయి. మహేశ్‌తో మూవీ, ప్రశాంత్ నీల్‌తో పాన్ ఇండియా చిత్రం అంటూ.. రూమర్స్ వస్తున్నాయి. రేపు నేను నిజంగానే ఏదైనా కొత్త ప్రాజెక్ట్ అనౌన్స్ చేస్తే అది కూడా పుకారే అనుకుంటారేమో(నవ్వుతూ..) మైత్రీ మూవీస్ మేకర్స్ గురించి? టాలీవుడ్లో లీడింగ్ ప్రొడెక్షన్ హౌస్‌గా మైత్రీ మూవీ మేకర్స్ మారింది. గొప్ప గొప్ప నిర్మాతలు ఉన్నారు కానీ.. వీళ్లంత బ్యాక్ టు బ్యాక్ సినిమాలు తీసేవాళ్లు లేరు. గ్యాంగ్ లీడర్‌తో వీళ్లతో సినిమా చేసే అవకాశం కలిసింది. ఇప్పుడు మళ్లీ ఇలాంటి సినిమాతో కలిసి పనిచేయడం చాలా హ్యాపీ. దసరా సినిమా ఎంత వరకు వచ్చింది? 25 శాతం షూటింగ్ పూర్తయింది. ఇది కామెడీ మూవీ.ఇందులో మతాలకు సంబంధించిన పాయింట్‌ని టచ్ చేసినప్పుడు కాంట్రవర్సీ అయ్యే అవకాశం ఉంది కదా? అస్సలు లేదు. రియల్ లైఫ్‌లో లేనివి చూపిస్తే.. కాంట్రవర్సీ అవుతుంది. కానీ రియల్ లైఫ్‌లో మన ఫ్యామిలీలాగే ఉన్నది ఉన్నట్లుగా,.. వాళ్లలోని మంచితనాన్ని బయటకు చూపిస్తే మనోభావాలు ఎలా దెబ్బతింటాయి? సెలబ్రేట్ చేసుకుంటారే తప్ప.. ఎక్కడా హర్ట్ కారు. వివేక్ సాగర్ సంగీతం గురించి? వివేక్ సాగర్ కథకు ఒక ఆయుధంలాంటి వాడు. ఆయన పాటలు విన్నవెంటనే.. సంగీత్ ఫంక్షన్లో పెట్టి డ్యాన్స్ వేయాలనిపించవు. కానీ కథను ఎంత ఇంపాక్ట్పుల్గా చెప్పాలో..అంత చూపిస్తాడు. ఇప్పుడు ఆయన గురించి ఏం మాట్లాడినా అతియోశక్తిగా అనిపిస్తుంది. సినిమా విడుదల తర్వాత మాట్లాడుతాను. పాన్ ఇండియా సినిమాలు పెరుగుతున్నాయి. మీరు కూడా అలాంటి చిత్రాలు చేసే ఆలోచన ఉందా? నా ఉద్దేశంలో పాన్ ఇండియా సినిమా అంటే.. మనం చెప్పుకోవడం కాదు..ప్రేక్షకులు చెబితేనే అది పాన్ ఇండియా చిత్రం. మంచి కథ తీస్తే చాలు.. అది పాన్ ఇండియా చిత్రమే. అందుకు పుష్ప చిత్రమే నిదర్శనం. ఒక సినిమా కోసం దేశమంతా ఎదురుచూస్తే అది పాన్ ఇండియా చిత్రం. అంతేకాని మనం పోస్టర్ మీద వేసుకున్నంత మాత్రాన అది పాన్ ఇండియా చిత్రం కాదు. ఈ మధ్యలో వచ్చిన సినిమాల్లో.. అది నేను చేస్తే బాగుండు అని అనిపించిన చిత్రం ఏదైనా ఉందా? జై భీమ్ సినిమా చూసినప్పుడు.. ఇలాంటి కథ తెలుగులో వస్తే బాగుంటుంది అనిపించింది. అలాంటి కథ ఏ హీరోకి వచ్చినా ఓకే.. నాకు వస్తే ఇంకా హ్యాపీ మీ నిర్మాణ సంస్థలో వచ్చే సినిమాలు? మీట్ క్యూట్, హిట్ 2 చిత్రాలు రాబోతున్నాయి. -
'అంటే సుందరానికీ' కథ మొదట మంచు విష్ణుకి చెప్పా
నేచురల్ స్టార్ నాని హీరోగా నటిస్తున్న చిత్రం 'అంటే సుందరానికీ'. వివేక్ ఆత్రేయ దర్శకత్వంలో ప్రముఖ నిర్మాణ సంస్థ మైత్రీ మూవీ మేకర్స్ నిర్మిస్తోంది. నజ్రియా తెలుగులో హీరోయిన్గా పరిచయం కాబోతున్న ఈ సినిమా జూన్ 10న ప్రపంచ వ్యాప్తంగా తెలుగు, తమిళ, మలయాళ భాషల్లో విడుదల కానుంది. ఈ నేపథ్యంలో దర్శకుడు వివేక్ ఆత్రేయ మీడియాతో 'అంటే సుందరానికీ' విశేషాలు పంచుకున్నారు. 'అంటే సుందరానికీ' ట్రైలర్ చూస్తే బలంగా నవ్వించాలని ఫిక్స్ అయినట్లు అనిపించింది ? కేవలం నవ్వించడమే కాదు అన్నీ రకాల ఎమోషన్స్ ఫీలౌతారు. ఎమోషనల్ గా కూడా చాలా బలమైన కంటెంట్ వుంటుంది. ట్రైలర్ లో బ్రాహ్మణ, క్రిస్టియన్ లవ్ కనిపించింది కదా.. భారతీ రాజా 'సీతాకోక చిలుక' ప్రేరణ ఉందా ? లేదండీ. 'సీతాకోక చిలుక' తో సంబంధం లేదు. నాని లుక్ బారిష్టర్ పార్వతీశం ని గుర్తిచేసింది.. ఇందులో ఆ నవల ప్రేరణ ఉందా ? నాకు చాలా ఇష్టమైన నవల బారిష్టర్ పార్వతీశం. ఈ కథలో ఒక చిన్న ఎపిసోడ్లో దాని ప్రేరణ తీసుకొని పంచకట్టు, మిగతా సరంజామా పెడితే బావుంటుందనిపించి పెట్టాం. ఐతే దీనికి కథకి ఎలాంటి సంబంధం లేదు. 'అంటే సుందరానికీ' కథ ఎప్పుడు పుట్టింది? ఐదేళ్ళ క్రితమే ఈ కథ ఐడియా వచ్చింది. మొదట విష్ణుతో షేర్ చేసుకున్న. ఈ కథకి నాని ఐతే బావుంటుందని అప్పుడే అనుకున్నాం. నాని గారు ఈ కథ విన్నతర్వాత ఎలా స్పందించారు ? నాని గారు చాలా ఎగ్జయిట్ అయ్యారు. చాలా నిజాయితీ గల కథ. నాని గారు ఇప్పటివరకూ ఇలాంటి పాత్రని చేయలేదు. కథలో పాత్రలు కనిపిస్తాయి తప్పితే ప్రత్యేకమైన ఎలివేషన్స్ ఏమీ వుండవు. చాలా హానెస్ట్ గా వుంటుంది. ఒక సంప్రదాయవాద సమాజం నుండి బయటికి రావాలనే సందేశం ఇందులో వుంటుందా ? సంప్రదాయవాద సమాజం అనేది ప్రత్యేకమైన సబ్జెక్ట్. దీని గురించి చర్చ వుండదు. ఐతే మనం ఎలాంటి సమాజం వైపు రావాలనే చిన్న సోషల్ కామెంట్ ఇందులో వుంటుంది. ఐతే అది క్లాసులు పీకినట్లు వుండదు. పాత్రల నుండే సహజంగా వస్తుంది. ఆ పాత్రలు మాట్లాడేటప్పుడు అవును కరక్టే కదా అని ప్రేక్షకులు ఫీలౌతారు. మతాలకి సంబధించిన పాయింట్ టచ్ చేసినప్పుడు వివాదాలు వచ్చే అవాకాశం వుంది కదా.. మరి ఎలా డీల్ చేశారు ? చాలా సెన్సిటివ్ పాయింట్ ఇది. ఈజీగా హర్ట్ అయ్యే పాయింట్. ఐతే ఎవరినీ హర్ట్ చేయకుండా ఒకరు తక్కువ ఒకరు ఎక్కువ అని అని కాకుండా పూర్తి వినోదాత్మకంగా ఈ చిత్రాన్ని తీశాం. సెన్సార్ బోర్డ్ ఎలాంటి కట్స్ లేకుండా క్లీన్' యూ' సర్టిఫికేట్ ఇవ్వడమే దీనికి నిదర్శనం. ఇందులో అభ్యంతరకరమైన అంశాలు వుంటే.. సెన్సార్ క్లీన్ యూ ఇవ్వదు కదా. దాదాపు మూడు గంట ల రన్ టైం వుంది కదా .. ఇది ఇబ్బంది కాదా ? రన్ టైం అనేది సమస్య కాదు. ఈ కథలో చెప్పాల్సిన విషయాలు చాలా వున్నాయి. ఆ విషయాలు చెప్పడానికి నాకు కావాల్సిన లెంత్ ఇది. మంచి కథ తీశామని సినిమా యూనిట్ అంతా చాలా నమ్మకంగా వున్నాం. సినిమా చూస్తున్నపుడు ఈ లెంత్‌ని ఫీలవ్వరు. చాలా హాయిగా గడిచిపోతుంది. ఒకప్పుడు ఇంటర్ క్యాస్ట్ వివాహాలు అంటే అడ్డంకులు ఉండేవి. ఇప్పుడు పరిస్థితులు మారాయి కదా.. ఇప్పుడు ఇలాంటి కథ చెప్పే ఆవశ్యకత ఉందా ? ఇప్పటికీ ఇంటర్ క్యాస్ట్ వివాహాలకు చాలా అడ్డంకులు వున్నాయి. న్యూస్‌లో రాకపోవడం, వినీవినీ రొటీన్ అయిపోవడం జరుగుతుంది కానీ చాలా మంది ఈ సమస్య ఎదుర్కొంటున్నారు. ఎన్నో పరువు హత్యలు వెలుగు చూస్తున్నాయి కదా. ఐతే మేము చాలా హ్యూమరస్ అప్రోచ్ తో ఈ కథని డీల్ చేశాం. మీ అందరికీ తప్పకుండా నచ్చుతుంది. చాలా సీరియస్ పాయింట్లని కూడా వినోదాత్మకంగా చెబుతుంటారు. అది మీ స్టయిల్ అనుకోవచ్చా ? అది మన అప్రోచ్ అండీ. ఒక సీరియస్ విషయాన్నీ ఇంకా సీరియస్ గా ఒకే టోన్ లో చెప్పడం కంటే దాన్ని వినోదాత్మకంగా చెప్పి ఫైనల్ గా చెప్పాల్సిన పాయింట్ ని చెబితే దాని ఇంపాక్ట్ ఎక్కువ వుంటుందని భావిస్తాను. నాని గారితో వర్క్ చేయడం ఎలా అనిపించింది ? నాని గారు ఎప్పుడూ ఒక స్టార్ లా బిహేవ్ చేయలేదు. ఆయన సెట్ లో ఉన్నంత సేపు సుందర్ లానే వుండేవారు.అలా వున్నపుడు డైరెక్ట్ చేయడం చాలా ఈజీ. అలాగే నజ్రియా గారు కూడా అంతే. 'అంటే సుందరానికీ' పాన్ ఇండియా సబ్జెక్ట్ కదా.. సౌత్ కే పరిమితం చేయడానికి కారణం ? 'అంటే సుందరానికీ' కథ యూనివర్సల్ కథ. ఐతే కథ రాసినప్పుడే ఇది సౌత్ కి బావుంటుందని అనుకున్నాం. ఓటీటీల ప్రభావం పెరిగింది కదా.. సినిమాకి కథ చేసి ప్రేక్షకులని థియేటర్లోకి రప్పించడం సవాల్ గా ఉందా ? ఇప్పుడున్న పరిస్థితిలో కచ్చితంగా సవాలే. అయితే సినిమా థియేటర్ లో అందరితో చూసి ఎంజాయ్ చేయడం గొప్ప అనుభూతి. అందుకే ఇలాంటి సినిమాలు వస్తున్నపుడు ప్రేక్షకులు థియేటర్లో చూసి ఆనందించాలని కోరుతున్నాను. 'అంటే సుందరానికీ' లో బలమైన కంటెంట్ వుంది. తప్పకుండా ప్రేక్షకులు థియేటర్ కి వచ్చి సినిమాని చూస్తారు. ప్రతి సినిమాకి జోనర్ మారుస్తున్నారు కదా ? నన్ను నేను కొత్తగా మలుచుకోవడం కోసమే. నాకు నేను బోర్ కొట్టకుండా ప్రేక్షకులకు బోర్ కొట్టించకుండా ఎప్పటికప్పుడు కొత్త కథలు చేయాలనే వుంటుంది. భవిష్యత్ లో ఎలాంటి సినిమా చేయాలని వుంది ? ఒక యాక్షన్ డ్రామా చేయాలని ఎప్పటి నుండో వుంది. తప్పకుండా చేస్తా. దర్శకుడే రచయిత అవ్వడం వలన సినిమా క్వాలిటీ తగ్గుతుందా ? లేదండీ. అలా ఏం వుండదు. కథ లో లోపం వుంటే క్వాలిటీ తగ్గుతుంది కానీ దర్శకుడే రచయిత అవ్వడం చేత క్వాలిటీ తగ్గడం అంటూ వుండదు. చదవండి: Namita: గ్రాండ్‌గా హీరోయిన్ సీమంతం, ఫొటోలు వైరల్ హోటల్లో పని చేశాను, అది తెలిసి చిరంజీవి బాధపడ్డాడు, అంతేకాదు.. -
అంటే సుందరానికి టీజర్ లాంచ్ ఈవెంట్
-
'అంటే సుందరానికి' వచ్చేది అప్పుడే!
కస్తూరి పూర్ణ వెంకట శేషసాయి పవన రామసుందర ప్రసాద్ (కేపీవీఎస్ఎస్పీఆర్ సుందర ప్రసాద్).. ఏంటీ.. పేరు ఇంత పొడుగు ఉందని ఆలోచిస్తున్నారా? విషయం తెలియాలంటే మాత్రం సమ్మర్ వరకు వేచి ఉండక తప్పదు. నాని హీరోగా వివేక్ ఆత్రేయ దర్శకత్వంలో రూపొందుతున్న సినిమా ‘అంటే.. సుందరానికీ!’. ఇందులో నాని పాత్ర పేరు కేపీవీఎస్ఎస్పీఆర్ సుందర ప్రసాద్. ఈ చిత్రంలో నజ్రియా ఫాహద్ హీరోయిన్. నవీన్ ఎర్నేని, వై. రవిశంకర్ నిర్మిస్తున్నారు. ఈ సినిమాలోని నాని ఫస్ట్ లుక్‌ను శనివారం విడుదల చేసి, సినిమాను ఈ వేసవిలో విడుదల చేయనున్నట్లు తెలిపారు. -
ఆట త్వరలో ఆరంభం
నాని హీరోగా వివేక్ ఆత్రేయ దర్శకత్వంలో ఇటీవలే ఓ సినిమాని ప్రకటించారు. తాజాగా ఈ సినిమాకు ‘అంటే సుందరానికీ!’ అనే ఆసక్తికరమైన టైటిల్‌ను కర్టెన్ రైజర్ వీడియో ద్వారా ప్రకటించారు. నవీన్ యర్నేని, రవిశంకర్ .వై నిర్మించనున్న ఈ సినిమా ద్వారా మలయాళ నటి నజ్రియా ఫాహద్ తెలుగు సినిమాకు పరిచయం కాబోతున్నారు. సంగీత ప్రాధాన్యమున్న వినోదాత్మక చిత్రం ఇదని చిత్రబృందం తెలిపింది. ఈ టైటిల్ ప్రీలుక్ పోస్టర్లో పంచె కట్టుకుని ఎక్కడికో వెళ్లడానికి సిద్ధమైనట్టుగా కనిపిస్తున్నారు నాని. ‘‘మునుపు ఎన్నడూ లేనంతగా ప్రేమిస్తాం. అలానే నవ్విస్తాం. 2021ని గ్రాండ్‌గా ముగిద్దాం. ఆట త్వరలోనే ప్రారంభిస్తాం’’ అని ఈ సినిమా గురించి అన్నారు నాని. అంటే.. ఈ చిత్రం వచ్చే ఏడాది చివర్లో విడుదలవుతుందని అర్థం అవుతోంది. ఈ సినిమాకు సంగీతం: వివేక్ సాగర్, కెమెరా: నికేత్ బొమ్మి, ఎడిటర్: రవితేజ గిరిజాల, సీఈఓ: చెర్రీ. -
నాని కొత్త సినిమా అప్డేట్ వచ్చేసింది..
నాచ్యులర్ స్టార్ నానీ చేయబోయే 28వ సినిమా అబ్డేట్ వచ్చేసింది. వివేక్ ఆత్రేయ దర్శకత్వంలో, మైత్రీ మూవీ మేకర్స్ బ్యానర్‌పై తెరకెక్కుతున్న ఈ సినిమాకు ‘అంటే సుందరానికి...’ అనే క్రేజీ టైటిల్‌ను ప్రకటించారు. మలయాళ నటి నజ్రియా నజీమ్ నటిస్తున్న తొలి తెలుగు సినిమా ఇదే. ఇప్పటి వరకు నజ్రీయా తెలుగులో నటించకపోయినప్పటికీ ఆమెకు తెలుగు అభిమానులు చాలా మంది ఉన్నారు. అంతేకాకుండా ఈ సినిమాలో నజ్రియా తన పాత్రకు తానే డబ్బింగ్ చెప్పుకొంటుండటంతో ఆమె ఫ్యాన్‌కు పండగే. ఈ సినిమాతో డైరెక్ట్‌గా తెలుగులో నటిస్తుండటంతో అభిమానులు తెగ సంబరపడిపోతున్నారు. ఇక ఈ సినిమా ఎప్పుడు విడుదల కోసం ఆసక్తిగా ఎదురుచుస్తున్నారు.(‘తెలుగులో తొలిసారిగా.. టైటిల్ తేదీని వైరల్ చేయండి’) ఇక నికేత్ బొమ్మి సినిమాటోగ్రఫీ అందించనుండగా, డైరెక్టర్ వివేక్ రచయితగానూ మారారు. ఇప్పటికే ‘బ్రోచేవారేవరురా’, ‘మెంటల్ మదిలో’వంటి హిట్ సినిమాలతో అతి తక్కువ కాలంలోనే వివేక్ మంచి గుర్తింపును సంపాదించుకున్నారు. నవీన్ ఎర్నేని, రవి శంకర్ సంయుక్తంగా ఈ సినిమాను నిర్మిస్తుండగా, వివేక్ సాగర్ సంగీతం అందిస్తున్నారు. ప్రస్తుతం నాని ‘టక్ జగదీష్’ సినిమా చేస్తున్నారు. ఆ తర్వాత ‘శ్యామ్ సింగరాయ్’ చేస్తారు. ఆ తర్వాత ఈ సినిమా సెట్స్ మీదకు వెళ్లనున్నట్లు సమాచారం. (శ్యామ్ సింగరాయ్‌లో విలన్‌గా నారా రోహిత్) -
మొదటిసారి తెలుగులో.. సంతోషంగా ఉంది: నజ్రియా
మలయాళం సినిమా ‘బెంగళూరు డేస్’ ఫేం నజ్రియా నజీమ్ తెలుగు అభిమానులకు దీపావళికి సర్ప్రైజ్ ఇచ్చారు. త్వరలో తెలుగు ప్రేక్షకులను ఆలరించడానికి వస్తున్నట్లు సోషల్ మీడియాలో ప్రకటించారు. ‘బ్రోచేవారేవరురా’, ‘మెంటల్ మదిలో’ సినిమా దర్శకుడు వివేక్ ఆత్రేయ దర్శకత్వం, మైత్రీ మూవీ మేకర్స్‌లో.. నాచ్యులర్ స్టార్ నానీతో కలిసి తెలుగు ప్రేక్షకులను పలకరించబోతున్నట్లు నజ్రియా పేర్కొంది. అయితే నానీ 28వ చిత్రమైన ఈ సినిమా టైటిల్‌ను నవంబర్ 21వ తేదీన ప్రకటించనున్నట్లు చిత్ర యూనిట్ తెలిపింది. ఈ సందర్భంగా నజ్రియా ఈ కార్యక్రమానికి సంబంధించిన పొస్టర్‌ను శుక్రవారం ఇన్‌స్టాగ్రామ్‌లో షేర్ చేస్తూ... ‘ఇదే నా మొదటి తెలుగు సినిమా గాయ్స్.. అద్భుతమైన టీంతో వర్క్ చేయబోతున్నందుకు చాలా సంతోషంగా ఉంది. నవంబర్ 21 తేదీని వైరల్ చేయండి.. ట్యూన్ చేయండి, హ్యాపీ దీపావళి’ అంటూ రాసుకొచ్చారు. (చదవండి: ఈ నెల 21న కలుద్దామంటున్న నాని!) View this post on Instagram A post shared by Nazriya Nazim Fahadh (@nazriyafahadh) ఇక తన పోస్టు చూసిన కన్నడ నటి, దివంగత హీనో చిరంజీవి సర్జా భార్య మెఘనా రాజ్, నజ్రీయాకు శుభాకాంక్షలు తెలిపారు. ‘శుభాకాంక్షలు మై బేబీ గల్’ అంటూ నజ్రీయా పోస్టుకు మెఘానా ట్యాగ్ చేసి షేర్ చేశారు. కాగా నజ్రియా, మెఘనాలు 2013లో వచ్చిన మాలయాళ చిత్రం ‘మాడ్ డాడ్’లో కలిసి నటించారు. అయితే ఇప్పటి వరకు నజ్రీయా తెలుగులో నటించకపోయినప్పటికీ తనంటే చేవి కొసుకునే తెలుగు అభిమానులు చాల మంది ఉన్నారు. ఇక ఆమె తెలుగులో నటిస్తున్నట్లు ప్రకటించడంతో అభిమానులు తెగ సంబరపడిపోతున్నారు. ఇక ఈ సినిమా ఎప్పుడు విడుదల కోసం ఆసక్తిగా ఎదురుచుస్తున్నారు. -
ఈ నెల 21న కలుద్దామంటున్న నాని!
ఈ ఏడాది ‘వీ’ సినిమాతో అందరిని అలరించిన నేచురల్ స్టార్ నాని ప్రస్తుతం పాత కలకత్తా బ్యాక్‌డ్రాప్‌లో సాగే శ్యామ్ సింగరాయ్ సినిమా చేస్తున్నాడు. టాక్సీవాలాతో గుర్తింపు తేచ్చుకున్న రాహుల్ సంకృత్యాన్ దీనికి దర్శకత్వం వహిస్తుండగా.. సాయి పల్లవి, కృతి శెట్టి హీరోయిన్లుగా నటిస్తున్నారు. ఈ సినిమా షూటింగ్ అవుతుండగానే మరో సినిమాను పట్టాలెక్కించేదుకు సిద్ధం అయ్యాడు నాని. కరోనా లాక్డౌన్ సమయాన్ని కుటుంబంతో సరదాగా గడిపిన నాని తన నెక్ట్స్ ప్రాజెక్ట్‌పై సన్నాహాలు చేస్తున్నాడు. ఈ క్రమంలో నాని తన కొత్త సినిమాను ప్రకటించాడు. మైత్రీ మూవీ మేకర్స్ సంస్థలో ఓ సినిమా చేయనున్నాడు. ఇది నానికి తన కెరీర్లో 28వ సినిమా. దర్శకుడు వివేక్ ఆత్రేయ ఈ సినిమాను తెరకెక్కించనున్నాడు. చదవండి: డైరెక్టర్ అవుదాం అనుకుని యాక్టర్ నానికి జోడిగా కేరళ భామ నజ్రియా నజీమ్ నటించనున్నారు. ఇదిలా ఉండగా ఇప్పటి వరకు తమిళ్, మలయాళంలోనే నటించిన నజ్రియాకు డైరెక్టు తెలుగులో ఇదే మొదటి సినిమా కావడం విశేషం. ఈ సినిమా టైటిల్‌ను, మిగతా పూర్తి సమాచారాన్నిదీపావళి తరువాత నవంబర్ 21న వెల్లడించనున్నట్లు తెలిపారు. ఈ విషయాన్ని బీఏ రాజు తన ట్విటర్ అకౌంట్లో షేర్చేశారు. ఈ మేరకు ఓ పోస్టర్‌ను విడుదల చేశారు. ‘నవంబర్ 21న కలుద్దాం.. ఆ లోపు దీపావళి శుభాకాంక్షలు. అన్నట్లు తెలుగు కుటుంబానికి నజ్రియా ఫర్హద్‌కు స్వాగతం’ అని పేర్కొన్నారు. చదవండి: నానికి విలన్‌గా యంగ్ హీరో అంటే.. అదన్నమాట.. November 21న #CurtainRaiser తో కలుద్దాం మరి.. ఆలోగా.. HAPPY DIWALI 💥 అన్నట్టు.. Nazriya Fahadh Welcome to మన తెలుగు Film Family 🎉@NameisNani #NazriyaFahadh #VivekAthreya #Nani28 pic.twitter.com/3QGuP7BpYL — BARaju (@baraju_SuperHit) November 13, 2020 -
గ్రీన్ సిగ్నల్
‘మెంటల్ మదిలో, బ్రోచేవారెవరురా’ సినిమాలతో తన ప్రత్యేకతను చాటుకున్నారు దర్శకుడు వివేక్ ఆత్రేయ. ఇప్పుడు నానీతో ఓ సినిమా చేయడానికి సిద్ధమయ్యారని సమాచారం. ఈ మధ్యనే వివేక్ వినిపించిన కథకి నాని గ్రీన్‌సిగ్నల్ ఇచ్చారట. ప్రస్తుతం ‘వి’ చిత్రాన్ని పూర్తి చేసి, ‘టక్ జగదీష్’ షూటింగ్లో బిజీగా ఉన్నారు నాని. ఆ తర్వాత ‘శ్యామ్ సింగరాయ్’ అనే సినిమా చేయనున్నారు. ఈ సినిమాలు పూర్తయ్యాక వివేక్ ఆత్రేయ దర్శకత్వంలో చేసే సినిమాను ప్రారంభిస్తారని సమాచారం. ఈ ఏడాది చివర్లో ఈ సినిమా సెట్స్ మీదకు వెళ్లే అవకాశముంది.