మాట నిలబెట్టుకున్న నాని.. కొత్త సినిమా ప్రకటన.. వారిద్దరికీ ఛాన్స్‌ | Nani - Vivek Athreya 31st Film Titled Saripodhaa Sanivaaram - Sakshi
Sakshi News home page

Saripodaa Sanivaram Movie: మాట నిలబెట్టుకున్న నాని.. కొత్త సినిమా ప్రకటన.. వారిద్దరికీ ఛాన్స్‌

Oct 23 2023 12:59 PM | Updated on Oct 23 2023 1:10 PM

Nani Saripodaa Sanivaram Movie Announced - Sakshi

దసరా సందర్భంగా ఫ్యాన్స్‌కు అదిరిపోయే కానుకను ఇచ్చాడు హీరో నాని. తన కొత్త సినిమా ప్రకటన వచ్చేసింది. అందుకు సంబంధించిన ఒక టైటిల్‌ వీడియోను ఆయన విడుదల చేశాడు. ఈ ఏడాదిలో 'దసరా' సినిమా తర్వాత 'హాయ్‌ నాన్న' అనే సినిమాను డిసెంబర్‌ 7న విడుదల చేస్తున్నారు. ఈలోపే నాని మరో సినిమాను లైన్లో పెట్టాడు. 'సరిపోదా శనివారం' అనే టైటిల్‌ను ఫిక్స్‌ చేశారు.

(ఇదీ చదవండి: బూతులను సమర్థించిన శివాజీని ఢీ కొట్టిన శోభ)

‘అంటే సుందరానికీ’ సినిమా దర్శకుడు వివేక్‌ ఆత్రేయ కాంబినేషన్‌లో తాజాగా నాని మరో సినిమాను ప్రకటించాడు. ఈ చిత్రంలో ప్రియాంకా అరుళ్‌ మోహన్‌ హీరోయిన్‌గా నటిస్తుంది. డీవీవీ ఎంటర్‌టైన్మెంట్స్‌పై డీవీవీ దానయ్య, కల్యాణ్‌ దాసరి ఈ సినిమాను నిర్మించనున్నారు.

మాట నిలబెట్టుకున్న నాని
నాని గ్యాంగ్ లీడర్ సినిమాతో టాలీవుడ్‌కు పరిచయమైంది హీరోయిన్ ప్రియాంక మోహన్. కానీ ఆ సినిమా తర్వాత ఆమెకు పెద్దగా ఆఫర్స్‌ రాలేదు. ఆ సినిమా ప్రమోషన్స్‌లో మాట్లాడుతూ.. ప్రియాంక యాక్టింగ్‌ తనకు బాగా నచ్చిందని  కచ్చితంగా ఆమెతో మరో సినిమా చేస్తానని నాని అప్పట్లో మాటిచ్చాడు. చెప్పినట్లుగానే ఇప్పుడు ఆమెకు మరో ఛాన్స్‌తో తన మాట నిలబెట్టుకున్నాడు నాని. 'అంటే సుందరానికీ' సినిమా దర్శకుడు వివేక్‌ ఆత్రేయ టాలెంట్‌కు ఫిదా అయిన నాని  అతడితో కూడా కచ్చితంగా మరో సినిమా చేస్తానని ప్రకటించాడు. 'సరిపోదా శనివారం' అనే సినిమాలో వారిద్దరికి ఛాన్స్‌ ఇచ్చి..  తన మాటను నిలబెట్టుకున్నాడు నాని. 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement