DVV Danayya
-
నాని 'సరిపోదా శనివారం' గ్లింప్స్ విడుదల.. టైటిల్ సీక్రెట్ ఇదే
నాని హీరోగా వివేక్ ఆత్రేయ దర్శకత్వంలో ‘సరిపోదా శనివారం’ పాన్ ఇండియా రేంజ్లో తెరకెక్కుతోంది. 'అంటే సుందరానికీ' సినిమా తర్వాత వీరిద్దరి కాంబినేషన్లో ఈ సినిమా తెరకెక్కుతుంది. ప్రియాంకా అరుళ్ మోహనన్ హీరోయిన్గా నటిస్తున్న ఈ చిత్రంలో ఎస్జే సూర్య ఓ కీలక పాత్రలో పోలీస్ ఆఫీసర్‌గా కనిపించనున్నాడు. డీవీవీ ఎంటర్టైన్మెంట్స్ పతాకంపై డీవీవీ దానయ్య ఈ ప్రాజెక్ట్‌ను నిర్మిస్తున్నాడు. ఆగష్టు 29న ఈ చిత్రం విడుదల కానుంది. నేడు నాని పుట్టినరోజు సందర్భంగా ‘సరిపోదా శనివారం’ మూవీ నుంచి గ్లింప్స్‌ను విడుదల చేశారు మేకర్స్.. ఇందులో నాని యాంగ్రీమెన్లా కనిపిస్తున్నాడు. ఎస్ జే సూర్య వాయిస్‌తో గ్లింప్స్ ప్రారంభం అవుతుంది. వారం మొత్తంలో శనివారం మాత్రమే హీరో నానిలో కోపం కట్టలు తెంచుకుంటుంది. దీనినే ఈ గ్లింప్స్‌లో చూపించారు. వారంలో అన్ని రోజుల్లో సాదాసీదాగా ఉంటూ.. శనివారం మాత్రమే శక్తిమంతుడిగా కనిపించే హీరో కథగా ఈ మూవీ ఉండనుంది. యాక్షన్‌కు.. వినోదానికి ఇందులో పెద్ద పీట వేసినట్లు తెలుస్తోంది. నాని క్యారెక్టర్ డిజైన్ చాలా ఫ్రెష్ గా ఉంది. గ్లింప్స్‌లో డైలాగ్స్ లేకపోయినా అతని స్క్రీన్ ప్రెజెన్స్ అద్భుతంగా ఉంది. నాని సిగరెట్ తాగే విధానం పాత్రకు చైతన్యాన్ని తెస్తుంది. వెనుక సీటులో అజయ్ ఘోష్ కూర్చొని ఉండగా నాని రిక్షా తొక్కే సన్నివేశం మెచ్చుకోదగినది. గ్లింప్స్‌తో ఫ్యాన్స్‌ను నాని మెప్పించాడని చెప్పవచ్చు. -
RRR తర్వాత డీవీవీ దానయ్య బిగ్ ప్లాన్.. ఆ హీరో కోసం భారీ ఆఫర్
విజయ్ ఈ పేరు ఇప్పుడు సినీ పరిశ్రమలోనే కాకుండా, రాజకీయ వర్గాల్లోనే చర్చనీయాంశంగా మారింది. కోలీవుడ్‌లో అత్యధిక పారితోషికం అందుకుంటున్న అతి కొద్ది మంది నటుల్లో ఈయన ఒకరు. విజయ్ నటించిన చిత్రం ఆశించిన విజయాన్ని సాధించకపోయినా, నిర్మాతలకు నష్టాలు రానంతగా స్థాయికి ఆయన చేరుకున్నారని చెప్పడం అతిశయోక్తి కాదు. ఉదాహరణకు ఇటీవల తెరపైకి వచ్చిన 'లియో' చిత్రాన్నే తీసుకోవచ్చు. ఈ చిత్రం విమర్శకుల దాడిని ఎదుర్కొంది. టాక్ వ్యతిరేకంగా వచ్చినా, వసూళ్లు మాత్రం రికార్డు స్థాయిలోనే ఉన్నాయి. ప్రస్తుతం విజయ్ తన 68వ చిత్రంలో నటిస్తున్నారు. ఈయన తండ్రీ కొడుకులుగా ద్విపాత్రాభియనం చేస్తున్న ఈ చిత్రాన్ని వెంకట్‌ప్రభు దర్వకత్వంలో ఏజీఎస్ ఎంటర్టైన్మెంట్ సంస్థ నిర్మిస్తోంది. దీనికి 'ది గ్రేటెస్ట్ ఆఫ్ ఆల్ టైమ్' అనే టైటిల్‌ను ఖరారు చేసిన విషయం తెలిసిందే. ఈ చిత్రం షూటింగ్ శరవేగంగా జరుగుతోంది. దీంతో విజయ్ తర్వాత చిత్రం ఏమిటన్నది ఆసక్తిగా మారింది. కారణం ఈయన రాజకీయ రంగప్రవేశం గురించి పెద్ద చర్చే జరుగుతుండడమే. ఇలాంటి పరిస్థితుల్లో విజయ్ 69వ చిత్రం ఓకే అయినట్లు తాజాగా సోషల్ మీడియాలో ప్రచారం వైరల్ అవుతోంది. జూనియర్ ఎన్టీఆర్, రామ్ చరణ్ హీరోలుగా రాజమౌళి దర్వకత్వంలో అత్యంత భారీ బడ్జెట్లో నిర్మించిన చిత్రం ఆర్ఆర్ఆర్. ఆస్కార్ బరిలో మూడు అవార్డులను గెలుచుకోవండంతో చిత్ర నిర్మాత 'డీవీవీ దానయ్య' పేరు ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు పొందింది. ఆ సినిమా తర్వాత కోలీవుడ్ టాప్ హీరో విజయ్‌తో ఒక భారీ చిత్రాన్ని నిర్మించడానికి ఆయన సన్నాహాలు చేస్తున్నట్లు టాక్ సామాజిక మాధ్యమాల్లో వైరల్ అవుతోంది. విజయ్‌కు సౌత్ ఇండియాలో బిగ్ మార్కెట్ ఉంది. దీంతో తెలుగు డైరెక్టర్‌తో పాన్ ఇండియా సినిమా నిర్మించేందుకు దానయ్య ఉన్నారని సమాచారం. ఇప్పటికే కథ కూడా విజయ్‌కు వినిపించారట. అది విజయ్‌కు కూడా నచ్చిందని, ఆయన ఇందులో నటించడానికి సంసిద్ధతను వ్యక్తం చేసినట్లు టాక్. ఈ చిత్రానికి విజయ్ ఊహించని స్థాయిలో పారితోషికం డిమాండ్ చేసినట్లు వార్త హల్చల్ చేస్తోంది. ఇక దీనికి దర్శకుడు ఎవరన్నది త్వరలోనే నిర్ణయించే అవకాశం ఉన్నట్లు ప్రచారం జరుగుతోంది. ది గ్రేటెస్ట్ ఆఫ్ ఆల్ టైమ్ చిత్రాన్ని పూర్తి చేసిన తరువాత విజయ్ తన 70వ చిత్ర షూటింగ్‌కు సిద్ధం అవుతారని సమాచారం. విజయ్ గతంలో దిల్ రాజు నిర్మాతగా వారసుడు చిత్రాన్ని తెరకెక్కించిన విషయం తెలిసిందే. ఇదిలా ఉంటే ఆయన త్వరలో రాజకీయ రంగప్రవేశానికి సిద్ధం అవుతున్నట్లు, అందుకు అన్ని విధాలుగా సిద్ధం చేసుకుంటున్నట్లు ప్రచారం జోరందుకుంది. త్వరలోనే పార్టీ పేరును వెల్లడించడానికి సన్నాహాలు జరుగుతున్నట్లు టాక్ వైరల్ అవుతోంది. దీంతో కొన్ని ఏళ్లు విజయ్ సినిమాలకు దూరంగా ఉండే అవకాశం ఉన్నట్లు ప్రచారం జరుగుతోంది. -
'నా జీవితంలో ఇదొక అద్భుతమైన క్షణం'.. అల్లు అర్జున్ ట్వీట్ వైరల్!
ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ గురించి గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. గతేడాది ఉత్తమ జాతీయ నటుడిగా అవార్డ్ కూడా అందుకున్నారు. గంగోత్రి సినిమాతో కెరీర్ ప్రారంభించిన అల్లు అర్జున్ టాలీవుడ్లో స్టార్ హీరోగా గుర్తింపు తెచ్చుకున్నారు. ఆ తర్వాత బన్నీ మూవీ సూపర్ హిట్ కావడంతో ప్రేక్షకుల గుండెల్లో బన్నీగా స్థిరపడిపోయారు. అనంతరం 2007లో అల్లు అర్జున్ దేశముదురు అనే చిత్రంతో ప్రేక్షకుల ముందుకొచ్చారు. ఈ సినిమాలో హన్సిక మోత్వానీ హీరోయిన్గా నటించారు. ఈ చిత్రం రిలీజై సరిగ్గా నేటికి 17 ఏళ్లు పూర్తి చేసుకుంది. ఈ సందర్భంగా అల్లు అర్జున్ ట్వీట్ చేశారు. దేశముదురు డైరెక్టర్ పూరి జగన్నాధ్, నిర్మాత డీవీవీ దానయ్యకు అభినందనలు తెలిపారు. అల్లు అర్జున్ తన ట్వీట్లో రాస్తూ.. 'దేశముదురు చిత్రం ఈ రోజుకు 17 ఏళ్లు పూర్తి చేసుకుంది. నా జీవితంలో ఇదొక అద్భుతమైన క్షణం. డైరెక్టర్ పూరి జగన్నాధ్, నిర్మాత డీవీవీ దానయ్య, చిత్రబృందానికి నా ప్రత్యేక ధన్యవాదాలు. నా కెరీర్లో చిరస్మరణీయమైన విజయం అందించిన నా అభిమానులకు, ప్రేక్షకులకు ఎప్పటికీ కృతజ్ఞతలు' అంటూ పోస్ట్ చేశారు. ఇది చూసిన అభిమానులు బన్నీకి సైతం అభినందనలు చెబుతున్నారు. ఈ మేరకు ట్విటర్ వేదికగా పోస్టులు పెడుతున్నారు. కాగా.. అల్లు అర్జున్ ప్రస్తుతం సుకుమార్ డైరెక్షన్లో తెరకెక్కిస్తోన్న పుష్ప-2 చిత్రంలో నటిస్తున్నారు. ఈ మూవీని ఆగస్టు 15న విడుదల చేయనున్నట్లు ఇప్పటికే ప్రకటించారు. ఐకాన్ స్టార్‌కు జోడీగా శ్రీవల్లి రష్మిక మందన్నా నటిస్తోంది. Celebrating 17 MASSive years of Icon Star @alluarjun's #Desamuduru 🤙🏻 Every dialogue and song from this film continues to send electrifying chills down our spine!#PuriJagannadh @ihansika #Chakri#17YearsForDesamuduru pic.twitter.com/AxxFJpo4Kd — DVV Entertainment (@DVVMovies) January 12, 2024 17 years of #Desamuduru Movie . What a beautiful moment in time . Thanks to my director @PuriConnects , my producer @DVVMovies and the entire cast & crew . Gratitude forever to my fans and audience for a memorable blessing 🙏🏽 — Allu Arjun (@alluarjun) January 12, 2024 -
మాట నిలబెట్టుకున్న నాని.. కొత్త సినిమా ప్రకటన.. వారిద్దరికీ ఛాన్స్
దసరా సందర్భంగా ఫ్యాన్స్‌కు అదిరిపోయే కానుకను ఇచ్చాడు హీరో నాని. తన కొత్త సినిమా ప్రకటన వచ్చేసింది. అందుకు సంబంధించిన ఒక టైటిల్ వీడియోను ఆయన విడుదల చేశాడు. ఈ ఏడాదిలో 'దసరా' సినిమా తర్వాత 'హాయ్ నాన్న' అనే సినిమాను డిసెంబర్ 7న విడుదల చేస్తున్నారు. ఈలోపే నాని మరో సినిమాను లైన్లో పెట్టాడు. 'సరిపోదా శనివారం' అనే టైటిల్‌ను ఫిక్స్ చేశారు. (ఇదీ చదవండి: బూతులను సమర్థించిన శివాజీని ఢీ కొట్టిన శోభ) ‘అంటే సుందరానికీ’ సినిమా దర్శకుడు వివేక్ ఆత్రేయ కాంబినేషన్లో తాజాగా నాని మరో సినిమాను ప్రకటించాడు. ఈ చిత్రంలో ప్రియాంకా అరుళ్ మోహన్ హీరోయిన్గా నటిస్తుంది. డీవీవీ ఎంటర్టైన్మెంట్స్పై డీవీవీ దానయ్య, కల్యాణ్ దాసరి ఈ సినిమాను నిర్మించనున్నారు. మాట నిలబెట్టుకున్న నాని నాని గ్యాంగ్ లీడర్ సినిమాతో టాలీవుడ్‌కు పరిచయమైంది హీరోయిన్ ప్రియాంక మోహన్. కానీ ఆ సినిమా తర్వాత ఆమెకు పెద్దగా ఆఫర్స్ రాలేదు. ఆ సినిమా ప్రమోషన్స్‌లో మాట్లాడుతూ.. ప్రియాంక యాక్టింగ్ తనకు బాగా నచ్చిందని కచ్చితంగా ఆమెతో మరో సినిమా చేస్తానని నాని అప్పట్లో మాటిచ్చాడు. చెప్పినట్లుగానే ఇప్పుడు ఆమెకు మరో ఛాన్స్‌తో తన మాట నిలబెట్టుకున్నాడు నాని. 'అంటే సుందరానికీ' సినిమా దర్శకుడు వివేక్ ఆత్రేయ టాలెంట్‌కు ఫిదా అయిన నాని అతడితో కూడా కచ్చితంగా మరో సినిమా చేస్తానని ప్రకటించాడు. 'సరిపోదా శనివారం' అనే సినిమాలో వారిద్దరికి ఛాన్స్ ఇచ్చి.. తన మాటను నిలబెట్టుకున్నాడు నాని. -
ఘనంగా నిర్మాత డివివి దానయ్య కుమారుడి వివాహం (ఫొటోలు)
-
ఘనంగా ఆర్ఆర్ఆర్ నిర్మాత డీవీవీ దానయ్య తనయుడి పెళ్లి
-
గ్రాండ్‌గా నిర్మాత దానయ్య కుమారుడి పెళ్లి, వీడియో వైరల్
ప్రముఖ నిర్మాత డీవీవీ దానయ్య ఇంట పెళ్లి బాజాలు మోగాయి. ఆయన తనయుడు, యంగ్ హీరో కల్యాణ్ ఓ ఇంటివాడయ్యాడు. వేదమంత్రాల సాక్షిగా సమత మెడలో మూడు ముళ్లు వేశాడు. హైదరాబాద్‌లో ఘనంగా జరిగిన ఈ వేడుకకు టాలీవుడ్ నుంచి పలువురు సెలబ్రిటీలు హాజరై నూతన వధూవరులను ఆశీర్వదించారు. హీరోలు రామ్‌చరణ్, పవన్ కల్యాణ్, డైరెక్టర్ త్రివిక్రమ్, ప్రశాంత్ నీల్, రాజమౌళితో పాటు పలువురు ఈ వివాహ వేడుకకకు విచ్చేసి సందడి చేశారు. దానయ్య వచ్చిన అతిథులను దగ్గరుండి రిసీవ్ చేసుకుని వారితో పెళ్లిమండపంలో ఫోటోలు దిగాడు. ఇందుకు సంబంధించిన ఫోటోలు, వీడియోలు నెట్టింట వైరల్‌గా మారాయి. కొత్త పెళ్లికొడుకు కల్యాణ్ విషయానికి వస్తే అతడు అధీరా సినిమాతో హీరోగా ఎంట్రీ ఇస్తున్నాడు. ఆర్ఆర్ఆర్ టీమ్ రాజమౌళి, జూనియర్ ఎన్టీఆర్‌ల సమక్షంలో గతేడాది వేసవిలో ఈ సినిమా ప్రారంభమైంతది. జాంబిరెడ్డి ఫేమ్ ప్రశాంత్ వర్మ ఈ చిత్రానికి దర్శకత్వం వహిస్తున్నాడు. Happy Married Life @IamKalyanDasari 💐🎉#DVVDanayya#RamCharan #PrashanthNeel #SSRajamouli pic.twitter.com/MV3U1M9ar7 — Dheeraj Pai (@DheerajPai1) May 20, 2023 చదవండి: సీరియల్ నటీనటుల పెళ్లి.. ఆమెను ఎందుకు మోసం చేశావంటూ మండిపాటు -
ఆర్ఆర్ఆర్ నిర్మాత ఇంట మోగనున్న పెళ్లి బాజాలు
ప్రముఖ నిర్మాత డీవీవీ దానయ్య ఇంట పెళ్లి బాజాలు మోగనున్నట్లు తెలుస్తోంది. దానయ్య కుమారుడు, యంగ్ హీరో కల్యాణ్ ఓ ఇంటివాడు కాబోతున్నాడట. సమత అనే అమ్మాయితో శనివారం (మే 20న) ఏడడుగులు వేయబోతున్నాడంటూ ఓ వార్త నెట్టింట వైరల్‌గా మారింది. మాదాపూర్‌లో ఈ వివాహం జరగనున్నట్లు సమాచారం. ఈ శుభకార్యానికి టాలీవుడ్ నుంచి పలువురు సెలబ్రిటీలు హాజరై వధూవరును ఆశీర్వదించనున్నారట. ఇకపోతే కల్యాణ్ అధీరా అనే సూపర్ హీరో సినిమాతో త్వరలో హీరోగా ఎంట్రీ ఇస్తున్నాడు. గతేడాది వేసవిలో డైరెక్టర్ రాజమౌళి, హీరో జూనియర్ ఎన్టీఆర్‌ల సమక్షంలో ఈ సినిమా ప్రారంభమైంది. జాంబి రెడ్డి ఫేమ్ ప్రశాంత్ వర్మ ఈ సినిమాకు దర్శకుడిగా వ్యవహరిస్తున్నారు. తనయుడి సినిమా బాధ్యతలను దానయ్య తండ్రిగా తన భుజానికెత్తుకున్నాడు. ఇకపోతే ఆర్ఆర్ఆర్ సినిమాతో దానయ్య పేరు మార్మోగిపోయింది. రాజమౌళితో సినిమా చేయడం కోసం ఆయనకు 2006లోనే అడ్వాన్స్ ఇచ్చి బుక్ చేసుకున్నాడు దానయ్య. దీంతో తన చేతిలో ఉన్న సినిమాలను పూర్తి చేసి ఆర్ఆర్ఆర్ సినిమా నిర్మాణ బాధ్యతలను దానయ్యకు అప్పగించాడు జక్కన్న. ఈ సినిమా కోసం కోట్లాది రూపాయలు బడ్జెట్ పెట్టిన దానయ్య ఆస్కార్ ప్రమోషన్స్‌లో మాత్రం పాల్గొనలేదు. అయితే తను నిర్మించిన ఆర్ఆర్ఆర్ సినిమాకు బెస్ట్ ఒరిజినల్ సాంగ్ కేటగిరీలో అకాడమీ అవార్డు రావడంతో ఉప్పొంగిపోయాడు. ప్రస్తుతం ఆయన పవన్ కల్యాణ్‌తో ఓజీ సినిమా చేస్తున్నాడు. ఈ చిత్రానికి సుజీత్ డైరెక్షన్ అందిస్తున్నాడు. చదవండి: హీరోయిన్ను ముప్పుతిప్పలు పెట్టిన అమ్మాయిలు, ఎందుకిలా టార్చర్ చేస్తారు? -
ఆర్ఆర్ఆర్ నిర్మాత దానయ్య లేకుండా సన్మానమా? సిగ్గుచేటు: నట్టి కుమార్
ఆర్ఆర్ఆర్ చిత్ర నిర్మాత డీవీవీ దానయ్య లేకుండా అభినందన సభ ఏర్పాటు చేయడం సిగ్గుచేటు అని మండిపడ్డారు నిర్మాత నట్టి కుమార్. ఆస్కార్ గ్రహీతలను అంత అర్జెంటుగా ఎవరికీ తెలియకుండా ఎందుకు సన్మానించారని ప్రశ్నించారు. 95వ అకాడమీ అవార్డు వేడుకల్లో ఆర్ఆర్ఆర్ సినిమాలోని నాటునాటు పాటకు బెస్ట్ ఒరిజినల్ సాంగ్ కేటగిరీలో ఆస్కార్ దక్కిన విషయం తెలిసిందే! ఈ సందర్భంగా తెలుగు చలన చిత్ర పరిశ్రమ ఆధ్వర్యంలో ఆస్కార్ గ్రహీతలు కీరవాణి, చంద్రబోస్‌లను ఆదివారం నాడు హైదరాబాద్‌లో ఘనంగా సత్కరించారు. ఈ అభినందన కార్యక్రమంపై సంచలన వ్యాఖ్యలు చేశాడు నిర్మాత నట్టి కుమార్. 'తెలుగు సినిమాకు ఆస్కార్ రావడం అందరూ గర్వించదగ్గ విషయం. కానీ ఆస్కార్ గ్రహీతలకు సరైన గౌరవం దక్కలేదు. నిన్న జరిగిన ఈవెంట్‌కు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ పెద్దలు రాలేదు. కేవలం సినిమాటోగ్రఫీ మంత్రి మాత్రమే వచ్చారు. ఈ కార్యక్రమం కోసం తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వాలతో ఎందుకు సంప్రదించలేదు? ఆస్కార్ సాధించినవాళ్లను అంత అర్జెంట్‌గా ఎవరికీ తెలియకుండా ఎందుకు సన్మానించారు? నిన్న జరిగిన ఈవెంట్ గురించి చాలామందికి సమాచారమే అందలేదు. సన్మానం చేయాలి. కానీ ఇది సరైన పద్ధతి కాదు. ఈసీ అప్రూవల్ లేకుండా ప్రొడ్యూసర్స్ కౌన్సిల్ నుంచి రూ.25 లక్షలు తీసి ఎలా ఖర్చు చేస్తారు? తెలంగాణ వచ్చాక ఇండస్ట్రీకి అది చేస్తున్నాం, ఇది చేస్తున్నాం అని మంత్రి శ్రీనివాస్ గౌడ్ అన్నారు. కానీ తెలంగాణలో చిన్న సినిమాలకు ఏం చేయట్లేదు. పెద్ద సినిమాలకు మాత్రమే గుర్తింపు వస్తుంది. చిన్న సినిమాలకు ఐదో షో కావాలని అడుగుతున్నాం. దీనిపై ఇంతవరకు స్పందించనేలేదు. తెలంగాణలో ఎక్కువ లాభాలు వస్తున్నాయని శ్రీనివాస్ గౌడ్ అన్నారు. కానీ ఇక్కడ 32%, ఆంధ్రప్రదేశ్‌లో 62% లాభాలు వస్తున్నాయి. అయినా చాలా కంపెనీలు తెలంగాణలోనే జీఎస్టీ కడుతున్నాయి. సినిమా ఇండస్ట్రీలో ఏపీ, తెలంగాణ అంటూ ఎలాంటి విభేదాలు లేవు. అందరం కలిసే ఉన్నాం' అన్నారు నట్టి కుమార్. -
ఆర్ఆర్ఆర్కు చిరంజీవి ఇన్వెస్ట్ చేశారా? దానయ్య క్లారిటీ
ఇండియన్ సనిమాకు కలలగా మిగిలిన ఆస్కార్‌ను ఆర్ఆర్ఆర్ నిజం చేసింది. భారత్ గర్వించేవిధంగా ట్రిపుల్ ఆర్ అకాడమీతో పాటు గ్లోల్డెన్ గ్లోబ్, హాలీవుడ్ క్రిటిక్ వంటి ప్రతిష్టాత్మక అవార్డులను గెలిచి విశ్వవేదికలపై సత్తా చాటింది. నాటు నాటు పాట బెస్ట్ ఓరిజినల్ సాంగ్ కాటగిరిలో ఆస్కార్క గెలవడంతో ట్రిపుల్ ఆర్ పేరు ఇప్పుడు ప్రపంచవ్యాప్తంగా మారుమ్రోగిపోతుంది. ఆస్కార్ గెలిచిన సందర్భంగా ఈ మూవీ నిర్మాత డివివి దానయ్య తాజాగా ఓ ఇంటర్య్వూలో మాట్లాడుతూ ఆసక్తికర విషయాలను పంచుకున్నారు. ఈ సందర్భంగా ట్రిపుల్ ఆర్‌పై వస్తున్న పలు రూమర్లపై స్పందించారు. చదవండి: ఆస్కార్ కోసం రూ. 80 కోట్లు ఖర్చు పెట్టారా? నిర్మాత దానయ్య ఏమన్నాడంటే.. అంతేకాదు నిర్మాత ఆయనే అయినప్పటికీ ఆర్ఆర్ఆర్ ఇన్వెస్టర్ మెగాస్టార్ చిరంజీవి అనే ఊహాగానాలపై కూడా ఆయన క్లారిటీ ఇచ్చారు. ఆర్ఆర్ఆర్ బడ్జెట్ ఇంత అంతా అంటూ ఎన్నో వార్తలు వచ్చాయని, నిజానికి రూ. 400 కోట్ల నుంచి రూ. 450 కోట్ల వరకు అయ్యిందన్నారు. అసలు ఆర్ఆర్ఆర్ మూవీ ఆయనకే రావడంపై ఆసక్తికర విషయాలు బయటపెట్టారు. ‘రాజమౌళితో సినిమా కోసం 200లోనే ఆయనను సంప్రదించాను. అప్పుడే కొంత మొత్తం అడ్వాన్స్ కూడా ఇచ్చాను. అప్పటికే రాజమౌళి రెండు మూడు సినిమాలకు కమిట్ అయ్యారు. అయినా నాతో ఓ సినిమా తప్పకుండ చేస్తానని మాట ఇచ్చారు. చెప్పినట్టే ‘మర్యాద రామన్నా’ కథ ఒకే అడిగారు. నాకు పేరు కావాలి. పెద్ద సినిమా చేయాలనుకుంటున్నా అని చెప్పడంతో సరే అన్నారు’’ అని ఆయన చెప్పారు. ఇక ‘‘బాహుబలి’ తర్వాత ఓ రోజు రాజమౌళి నాకు ఫోన్ చేసి ‘మీకు కొన్ని కాల్స్ రావచ్చు’ అన్నారు. అదే సమయంలో రామ్ చరణ్, ఎన్టీఆర్‌తో ఆయన ఇంట్లో సమావేశం అయ్యారు. అప్పుడే ముగ్గురి కలిసి ఉన్న ఫొటో బయటకు లీక్ చేశారు. దీనిపై మీకు కాల్స్ వస్తాయని చెప్పడంతో నాకు అర్థమైంది. రాజమౌళి మెగా హీరో, నందమూరి హీరోతో భారీ చిత్రమే ప్లాన్ చేశారని తెలిసి ఆనందపడిపోయా. అలా ఆర్ఆర్ఆర్ నాకు వచ్చింది’ అని చెప్పుకొచ్చారు. చదవండి: సినీ పరిశ్రమలో విషాదం.. ప్రముఖ నటుడు హఠాన్మరణం అనంతరం ఈ మూవీకి చిరు ఇన్వెస్ట్ చేశారా? అని అడగ్గా.. ఇదింతా అవాస్తం. అలాంటి గాలి వార్తలు పట్టించుకోవాల్సిన అవసరం లేదు. అసలు చిరంజీవి గారికి ఆ అవసరం ఏముంది. ఏ నిర్మాతకైనా డబ్బు ఇన్వెస్ట్ చేయడానికి ప్రత్యేకంగా ఫైనాన్షియర్లు ఉంటారు. అంది అందరికి తెలిసిందే. అయినా చిరంజీవి గారు ఆ అవసరం ఏముంది. కావాలంటే తన సొంత సినిమాకు లేదా ఆయన కొడుకే పెట్టుకుంటారు కదా. ఆయనకే నిర్మాణ సంస్థ ఉంది. అలాంటప్పుడు ఆర్ఆర్ఆర్ చిత్రంలో ఆయన ప్రమేయం ఎందుకు ఉంటుంది. ఎవరో మతిలేక అన్న మాటలు అని కొట్టిపారేశారు. ఇలా మాట్లాడినవాళ్లు నా ఆఫీస్‌కి వచ్చారా? నా బ్యాంక్ స్టేట్మెంట్స్ చూశారా?’ అంటూ ఈ పుకార్లను దానయ్య తీవ్రంగా ఖండించారు. -
ఆస్కార్‌కు రూ. 80 కోట్లు ఖర్చు పెట్టారా? నిర్మాత దానయ్య ఏమన్నాడంటే..
ఆర్ఆర్ఆర్.. భారత సినీచరిత్రలో ఎప్పటికీ నిలిచిపోయే చిత్రం ఇది. ఈ సినిమాలో నాటు నాటు పాట ఆస్కార్‌ను గెలవడంతో యావత్ భారత్ గర్విస్తోంది. అంతేకాదు విశ్వ వేదికలపై గ్లోల్డెన్ గ్లోబ్, హాలీవుడ్ క్రిటిక్ వంటి ప్రతిష్టాత్మక అవార్డులను గెలిచిన తొలి భారత చిత్రంగా ఆర్ఆర్ఆర్ సత్తా చాటింది. ఇక ఆస్కార్ వేడుకలో భాగంగా దర్శక-దీరుడు రాజమౌళి, ఎమ్ఎమ్ కీరవాణి, చంద్రబోస్, రామ్ చరణ్, జూ. ఎన్టీఆర్‌తో పాటు ఇతర ఆర్ఆర్ఆర్ టీం మొత్తం అమెరికాలో సందడి చేశారు. చదవండి: సినీ పరిశ్రమలో విషాదం.. ప్రముఖ నటుడు హఠాన్మరణం అయితే చలన చిత్ర రంగంలో అత్యంత ప్రతిష్టాత్మకమైన ఈ అకాడమీ అవార్డు వేడుకలో అడుగుపెట్టే అవకాశం రావడమంటే అందని ద్రాక్ష వంటిదే. అలాంటి ఈ కార్యక్రమంలో పాల్గొనే అవకాశం ఉన్నా ఆర్ఆర్ఆర్ నిర్మాత డివివి దానయ్య పాల్గొనకపోవడం గమనార్హం. నిజానికి అన్నీ తానై చూసుకోవాల్సిన ఆయన ఆస్కార్ సెలబ్రెషన్స్‌లో భాగం కాకపోవడంతో అందరిలో ఎన్నో అనుమానాలు రేకిత్తించాయి. దీంతో రకరకాల పుకార్లు తెరపైకి వచ్చాయి. రాజమౌళి పూర్తిగా దానయ్యను పక్కన పెట్టారని, అవార్డు కోసం జక్కన్న దాదాపు రూ. 80 కోట్లు ఖర్చు పెట్టారంటూ రూమర్స్ గుప్పుమన్నాయి. ఈ నేపథ్యంలో తాజాగా ఓ చానల్‌కు ఇచ్చిన ఇంటర్యూలో ఈ వార్తలపై దానయ్య స్పందించాడు. ఈ మేరకు ఆయన మాట్లాడుతూ.. ట్రిపుల్ ఆర్ నిర్మాత ఎవరంటే చెప్పే పేరు డివివి దానయ్యే కదా.. తనకు అంది చాలన్నారు. నాటు నాటుకు ఆస్కార్ రావడం గర్వంగా ఉందన్నారు. అనంతరం ‘ఆస్కార్ అవార్డు వేడుకకు రాజమౌళి నన్ను దూరంగా పెట్టాడు అనే వార్తల్లో ఏమాత్రం నిజం లేదు. ఆయన అలాంటి వారు కాదు. తన సినిమా నిర్మాతలకు రాజమౌళి చాలా గౌరవం ఇస్తారు. అలా అవైయిడ్ చేసే వ్యక్తిత్వం రాజమౌళిది కాదు. ఆయన చాలా మంచి వ్యక్తి. నాకు ఇష్టంలేకే నేను వెళ్లలేదు. నేను చాలా సింపుల్‌గా ఉంటాను. చదవండి: మోహన్ బాబు బర్త్‌డేలో కొత్త కోడలు మౌనిక సందడి! విష్ణు ఫ్యామిలీ ఎక్కడా? ఆర్బాటాలు నాకు నచ్చవు. అందుకే ఆస్కార్‌కు దూరంగా ఉన్నా. ఇష్టం లేక ఈ అవార్డు ఫంక్షన్‌కు వెళ్లలేదు. ఈ సినిమాతో నాకు మంచి పేరు రావాలి అనుకున్నా. అది వచ్చింది. నాకది చాలు’ అంటూ వివరణ ఇచ్చారు. అలాగే ఆస్కార్ కోసం రూ. 80కోట్లు పెట్టారనడంలో నిజమెంత? అని ప్రశ్నించగా.. తాను అయితే ఎలాంటి డబ్బు పెట్టలేదన్నారు. మరి రాజమౌళి గారు ఏమైనా పెట్టారా? అనేది మాత్రం తనకు తెలియదంటూ ఆసక్తిగా సమాధానం ఇచ్చాడు. అనంతరం అసలు రూ. 80 కోట్లు ఎలా పెడతారంటూ పుకార్లను ఖండిచాడు. సినిమాకే అంత లాభం ఉండదు.. అలాంటిది రూ. 80కోట్లు ఖర్చు పెట్టడం ఎలా సాధ్యమవుతుందంటూ అభిప్రాయం వ్యక్తం చేశాడు దానయ్య. -
రాజమౌళితో మాట్లాడటానికి ప్రయత్నించా, కానీ: RRR నిర్మాత
నాటు నాటు పాట ఆస్కార్ అందుకోవడంతో యావత్ భారతదేశం గర్విస్తోంది. ఈ క్రమంలో ఆర్ఆర్ఆర్ టీమ్‌కు అమెరికాలోని లాస్ ఏంజిల్స్‌లో గ్రాండ్ పార్టీ ఇచ్చాడు రాజమౌళి. అయితే ఈ సినిమాకు కావాల్సినంత బడ్జెట్ సమకూర్చిన నిర్మాత దానయ్య మాత్రం ఏ వేడుకలోనూ పాల్గొనడం లేదు. ఆస్కార్ ప్రమోషన్స్ కోసం చిత్రయూనిట్ అంతా అమెరికా చెక్కేసినా దానయ్య మాత్రం ఇక్కడే ఉండిపోయాడు. ఏ అవార్డు ఫంక్షన్లోనూ ఆయన కనిపించలేదు. తాజాగా తన సినిమాకు ఆస్కార్ రావడంపై తొలిసారి స్పందించాడు. 'తెలుగు ఇండస్ట్రీలో తొలిసారి ఓ పాటకు ఆస్కార్ రావడం గర్వించదగ్గ విషయం. 2006లో రాజమౌళికి అడ్వాన్స్ ఇచ్చి సినిమా చేద్దామన్నాను. అప్పటినుంచి ఆయనతో జర్నీ చేస్తున్నా. మర్యాద రామన్న చేయమని ఆఫర్ ఇచ్చారు. కానీ ఇంకా పెద్ద సినిమా చేయాలనుంటున్నానని చెప్పాను. తన రెండు ప్రాజెక్టులు అయిపోయాక చెప్తానన్నారు. సరే అన్నాను. అలా ఆర్ఆర్ఆర్ నా చేతికి వచ్చింది. ఇద్దరు స్టార్లతో ఇంత పెద్ద సినిమా తీస్తారని ఊహించలేదు. కానీ కరోనా వల్ల ఎన్నో కష్టాలు పడ్డాం. బడ్జెట్ అనుకున్నదానికంటే ఎక్కువే అయింది. నాటు నాటు ఒక్క పాటనే 30 రోజులు రిహార్సల్ చేసి ఉక్రెయిన్‌లో 17 రోజులు షూట్ చేశాం. ఆ కష్టానికి ప్రతిఫలంగానే ఆస్కార్ వచ్చింది. సంతోషంగా ఉంది. ఈ అవార్డు క్రెడిట్ అంతా రాజమౌళికే దక్కుతుంది. ఆయన కష్టానికి ప్రతిఫలమే ఈ పురస్కారం. ఆస్కార్ అందుకున్నాక రాజమౌళి వాళ్లతో మాట్లాడేందుకు ప్రయత్నించాను కానీ వాళ్లు ఫంక్షన్లో బిజీగా ఉన్నట్లున్నారు. కాబట్టి మాట్లాడలేకపోయాను' అన్నాడు దానయ్య. -
ఆర్ఆర్ఆర్ ఖాతాలో మరో అరుదైన అవార్డు
ఎన్టీఆర్, రామ్‌చరణ్ హీరోలుగా రాజమౌళి దర్శకత్వంలో డీవీవీ దానయ్య నిర్మించిన ‘ఆర్ఆర్ఆర్’ ఇప్పటికే పలు అంతర్జాతీయ అవార్డులు సాధించిన విషయం తెలిసిందే. తాజాగా 46వ జపాన్ అకాడమీ ఫిల్మ్ ప్రైజ్‌కు సంబంధించి ‘అవుట్ స్టాండింగ్ ఫారిన్ ఫిల్మ్’ విభాగంలో ‘ఆర్ఆర్ఆర్’ అవార్డు సాధించింది. ‘అవతార్: ద వే ఆఫ్ వాటర్’, ‘టాప్‌గన్: మ్యావరిక్’ వంటి హాలీవుడ్ చిత్రాలను దాటి ‘ఆర్ఆర్ఆర్’ ఈ జపాన్ అవార్డును సాధించడం విశేషం. గత ఏడాది జపాన్‌లో విడుదలైన ‘ఆర్ఆర్ఆర్’ అక్కడి బాక్సాఫీస్ వద్ద భారీ వసూళ్లు రాబడుతున్న సంగతి తెలిసిందే. ఇక 95వ ఆస్కార్ అవార్డ్స్‌కు బెస్ట్ ఒరిజినల్ స్కోర్ విభాగంలో ‘నాటు నాటు’ పాట (మరికొన్ని విభాగాల్లో ‘ఆర్ఆర్ఆర్’ నామినేషన్ పోటీలో ఉంది), ‘బెస్ట్ ఫారిన్ ఫిల్మ్’ విభాగంలో గుజరాతీ ఫిల్మ్ ‘ఛెల్లో షో’, డాక్యుమెంటరీ ఫీచర్ ఫిల్మ్ విభాగంలో ‘ఆల్ దట్ బ్రీత్స్’, డాక్యుమెంటరీ షార్ట్ ఫిల్మ్ ‘ఎలిఫెంట్ విష్పర్స్’ ఆస్కార్స్ షార్ట్ లిస్ట్ జాబితాలో ఉన్నాయి. ‘ఆర్ఆర్ఆర్’, ‘ఛెల్లో షో’లతో కలిపి పది ఇండియన్ చిత్రాలు ఆస్కార్ రిమైండర్ లిస్ట్‌లో ఉన్నాయి. కాగా నేడు ఆస్కార్ నామినేషన్స్ వెల్లడి కానున్నాయి. మరి.. ఎన్ని ఇండియన్ చిత్రాలు నామినేషన్స్ దక్కించుకుంటాయో చూడాలి.. -
సాహో డైరెక్టర్‌తో పవన్ కల్యాణ్ నెక్ట్స్ మూవీ.. పోస్టర్ రిలీజ్
పవన్ కల్యాణ్ అభిమానులకు గుడ్‌న్యూస్. ఆయన నెక్ట్స్ సినిమాకు సంబంధించి అప్డేట్ వచ్చేసింది. ఆర్ఆర్ఆర్ లాంటి బ్లాక్ బస్టర్ సినిమాలు తీసిన డీవీవీ ఎంటర్‌టైన్స్‌మెంట్స్ బ్యానర్లో పవన్ హీరోగా ఓ సినిమాను ప్రకటిస్తూ పోస్టర్ రిలీజ్ చేశారు. యంగ్ డైరెక్టర్ సుజీత్ ఈ చిత్రానికి దర్శకత్వం వహించనున్నారు. రన్రాజారన్తో దర్శకుడిగా మారిన సుజీత్ ప్రభాస్‌తో సాహో వంటి పాన్ ఇండియా చిత్రాన్ని రూపొందించిన సంగతి తెలిసిందే. ఇప్పుడీ యంగ్ డైరెక్టర్ పవన్‌తో సినిమా చేయనున్నారు. దీనికి సంబంధించిన పోస్టర్ ప్రస్తుతం నెట్టింట చక్కర్లు కొడుతుంది. మొత్తం ఎరుపు రంగుతో డిజైన్ చేసిన పోస్టర్లో జపనీస్ అక్షరాలు కూడా ఉన్నాయి. జపాన్ బ్యాక్‌డ్రాప్‌లో తెరకెక్కే గ్యాంగ్‌స్టర్ డ్రామా అని టాక్ వినిపిస్తుంది. ప్రస్తుతం ప్రీ ప్రొడక్షన్ పనులు జరుపకుంటున్న ఈ చిత్రం వచ్చే ఏడాది సెట్స్‌మీదకి వెళ్లనుంది. We are extremely elated to associate with @PawanKalyan Garu, for our next production.⚡️⭐️ Directed by @SujeethSign, DOP by @DOP007.#FirestormIsComing 🔥🔥 pic.twitter.com/Dd91Ik8sTK — DVV Entertainment (@DVVMovies) December 4, 2022 -
ఆస్కార్ ఎంట్రీలో ఆర్ఆర్ఆర్.. రాజమౌళికి అరుదైన అవార్డు
‘ఆర్ఆర్ఆర్’ సినిమా ఆస్కార్ నామినేషన్ ఎంట్రీ రేసులో ఉన్న విషయం తెలిసిందే. ఎన్టీఆర్, రామ్‌చరణ్ కాంబినేషన్లో రాజమౌళి దర్శకత్వంలో డీవీవీ దానయ్య నిర్మించిన ఈ చిత్రం ఘనవిజయం సాధించింది. కాగా ఈ చిత్రం ఎన్నో అవార్డులు రివార్డులు పొందింది. తాజాగా రాజమౌళికి ‘న్యూయార్క్ ఫిల్మ్ క్రిటిక్స్ సర్కిల్’ బెస్ట్ డైరెక్టర్ అవార్డు దక్కింది. గతంలో న్యూయార్క్ ఫిల్మ్ క్రిటిక్స్ సర్కిల్ వారు ప్రకటించిన 22మందిలో దాదాపు 16మందికి ఆస్కార్ నామినేషన్స్ వచ్చాయట. అందుకే ‘ఆర్ఆర్ఆర్’కి నామినేషన్ ఆస్కారం ఉందనే ఊహాగానాలు మొదలయ్యాయి. ఇక ‘ఫర్ యువర్ కన్సిడరేషన్’ (సాధ్యం ఉన్న విభాగాల్లో) అంటూ ఈ చిత్రాన్ని ఆస్కార్ రేసుకి పంపింది ఈ చిత్రం యూనిట్. వచ్చే ఏడాది జనవరిలో నామినేషన్స్ ప్రకటన రానుంది, మార్చిలో అవార్డుల వేడుక జరగనుంది. ఇక ఉత్తమ విదేశీ చిత్రం విభాగంలో భారతదేశం తరఫున గుజరాతీ ఫిల్మ్ ‘ఛెల్లో షో’ను ఫిల్మ్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా ఎంపిక చేసిన సంగతి తెలిసిందే. -
బాలయ్య నెక్ట్స్ మూవీ.. 'ఆర్ఆర్ఆర్' నిర్మాతతో భారీ ప్రాజెక్ట్?
నందమూరి బాలకృష్ణ కొత్త మూవీపై గాసిప్స్ గుప్పుమంటున్నాయి. 'ఆర్ఆర్ఆర్' నిర్మాత డీవీవీ దానయ్యతో ఓ భారీ ప్రాజెక్ట్ ప్లాన్ చేస్తున్నట్లు సమాచారం అందుతోంది. ఇందుకు సంబంధించిన ఏర్పాట్లు జరుగుతున్నట్లు తెలుస్తోంది. ఈ చిత్రానికి యంగ్ డైరెక్టర్ ప్రశాంత్ వర్మ దర్శకత్వం వహిస్తున్నట్లు వార్తలొస్తున్నాయి. అయితే దీనిపై ఇంకా ఎలాంటి అధికారిక ప్రకటన రాలేదు. (చదవండి: అన్‌స్టాపబుల్ సీజన్–2 ఆ రేంజ్లో ఉంటుంది : బాలయ్య) ఇప్పటికే యంగ్ డైరెక్టర్ ప్రశాంత్ వర్మ బాలయ్య అన్‌స్టాపబుల్- 2 టీజర్‌కు దర్శకత్వం వహించారు. అయితే బాలయ్య కూడా ప్రశాంత్ వర్మతో ఒక సినిమా చేసేందుకు ఆసక్తిగా ఉన్నట్లు సమాచారం. మరి ఈ ప్రాజెక్ట్ ఎప్పుడు సెట్స్‌పైకి వస్తుందో చూడాలి. మరోపక్క బాలయ్య, దర్శకుడు పూరి జగన్నాధ్‌తో ఒక సినిమా చేస్తున్నాడని రూమర్స్ వినిపిస్తున్నాయి. ఇటీవల కృష్ణా జిల్లా పెనమలూరు మండలం కానూరులో నందమూరి బాలకృష్ణ సందడి చేశారు. ఆహా ఓటీటీ అన్‌స్టాపబుల్ సీజన్–2 ఈవెంట్ లాంచింగ్ కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు. ఆహా ఓటీటీ ప్లాట్ఫారంలో అన్‌స్టాపబుల్ సీజన్–2 అన్ని వర్గాల ప్రజలను ఆకర్షించే విధంగా ఉంటుందని తెలిపారు. -
ప్రభాస్ విషయంలో ఆ నిర్మాత వెనుకడుగు.. కారణం అదేనా?
Producer Is Change To Prabhas Maruthi Raja Deluxe Movie: 'బాహుబలి'తో పాన్ ఇండియా స్టార్‌గా ఎదిగాడు ప్రభాస్. అప్పటి నుంచి ప్రభాస్‌కు విపరీతమైన క్రేజ్ పెరిగింది. ప్రభాస్ డేట్లు దొరికితే చాలు అని అనుకుంటున్నారు నిర్మాతలు. అలాంటి ప్రభాస్‌తో సినిమా అంటే వద్దనుకుంటున్నాడట ఓ నిర్మాత. కొన్నేళ్ల క్రితం ఓ సినిమా కోసం అడ్వాన్స్ ఇచ్చిన నిర్మాత ప్రస్తుతం ఆ డబ్బు ఇస్తే చాలు, సినిమా అవసరం లేదని భావిస్తున్నట్లు టాక్ వినిపిస్తోంది. అయితే ప్రభాస్, మారుతి కాంబినేషన్లో 'రాజా డీలక్స్' అనే సినిమా రానున్నట్లు వార్తలు వచ్చిన విషయం తెలసిందే. ఈ సినిమా గురించి ఎక్కడా కన్ఫర్మ్గా చెప్పలేదు కానీ, కథ, హీరోయిన్లు, చిత్రం కోసం సెట్ వంటి తదితర పుకార్లు షికార్లు చేశాయి. ఇప్పుడు తాజాగా ఈ సినిమాకు నిర్మాత మారే అవకాశం ఉందని టాలీవుడ్లో గుసగుసలు వినిపిస్తున్నాయి. ఈ సినిమాను నిర్మిద్దామనుకున్న నిర్మాత డీవీవీ దానయ్య రెమ్యునరేషన్ కింద ప్రభాస్‌కు రూ. 50 కోట్లు ఇచ్చారని ఆ మధ్య టాక్ నడిచింది. అందుకు తగినట్లుగానే మారుతి బృందం పని చేసినట్లు సమాచారం. చదవండి: Hyderabad AMB థియేటర్లో దళపతి విజయ్.. ఏ సినిమా చూశారంటే? నేను పెళ్లి చేసుకునే సమయానికే ఆమెకు ఒక బాబు: బ్రహ్మాజీ అయితే ఆ మూవీ ఎప్పటికీ సెట్స్‌పైకి వెళ్లకపోయేసరికి, మరి ఎప్పుడు స్టార్ట్ అవుతుందన్న క్లారిటీ లేకపోవడంతో డీవీవీ దానయ్య వెనక్కి తగ్గుతున్నారని టాలీవుడ్ వర్గాల నుంచి సమాచారం. ఎవరైనా నిర్మాత ముందుకొస్తే ఆ రెమ్యునరేషన్ డబ్బు తీసుకుని ప్రభాస్ డేట్స్‌ను ఇచ్చేందుకు ఫిక్స్ అయ్యారను భోగట్టా. అయితే ఇందులో ఎంత నిజం ఉందనేది క్లారిటీ లేదు. కాగా ఈ విషయంపై ఒకట్రెండు రోజుల్లో స్పష్టత వస్తుందని సమాచారం. చదవండి: రానున్న 'ది డర్టీ పిక్చర్' సీక్వెల్ ! సిల్క్ స్మితగా విద్యా బాలన్ డౌటే ? -
డీవీవీ దానయ్య కుమారుడు కల్యాణ్ మూవీ నుంచి ఫస్ట్ స్ట్రైక్ అవుట్
ప్రముఖ నిర్మాత డీవీవీ దానయ్య కుమారుడు కల్యాణ్ హీరోగా త్వరలో వెండితెర ఎంట్రీ ఇవ్వబోతున్న సంగతి తెలిసిందే. యంగ్ అండ్ టాలెంటెడ్ డైరెక్టర్ ప్రశాంత్ వర్మ దర్శకత్వంలో కల్యాణ్ హీరోగా అధీర అనే మూవీ తెరకెక్కనుంది. తాజాగా ఈ మూవీకి సంబంధించిన ఫస్ట్ గ్లింప్స్‌ను డైరెక్టర్ రాజమౌళి, జూనియర్ ఎన్టీఆర్, రామ్ చరణ్‌లు విడుదల చేశారు. ఈ ‘అధిర ఫస్ట్ స్ట్రైక్’ను హాలీవుడ్లో రెంజ్లో విజువల్ ఎఫెక్ట్స్‌ను చూపించారు. చూస్తుంటే మరో సూపర్ హీరో సినిమాను ప్రశాంత్ వర్మ సిద్ధం చేసినట్లు తెలుస్తోంది. ఇందులో కల్యాణ్ టైటిల్ రోల్ పోషిస్తున్నట్లు తెలుస్తోంది. శ్రీమతి చైతన్య సమర్పణలో ప్రైమ్‌షో ఎంటర్టైన్మెంట్ పతాకంపై కె నిరంజన్ రెడ్డి ఈ చిత్రాన్ని భారీ బడ్జెట్‌తో నిర్మించనున్నారు. ఈ చిత్రానికి గౌరీహరి సంగీతం అందిస్తుండగా, దాశరధి శివేంద్ర కెమెరాను హ్యాండిల్ చేస్తున్నారు. -
హీరోగా డీవీవీ దానయ్య తనయుడు ఎంట్రీ, డైరెక్టర్ ఎవరంటే!
‘ఆర్ఆర్ఆర్’ నిర్మాత డివివి దానయ్య తనయుడు కల్యాణ్ హీరోగా తెలుగు వెండితెరకు త్వరలో పరిచయం కాబోతున్నాడు. తనయుడిని లాంచ్ చేసే బాధ్యతను దానయ్య యంగ్ డైరెక్టర్ ప్రశాంత్ వర్మకు అప్పగించినట్లు టాక్ నడుస్తోంది. అ, కల్కి, వంటి సినిమాలతో యంగ్ టాలెంటెడ్ డైరెక్టర్‌గా గుర్తింపు తెచ్చుకున్న ప్రశాంత్ వర్మ తేజ సజ్జను హీరోగా పరిచయం చేశాడు. మరోసారి తేజ హీరోగా హను-మాన్ అనే సూపర్ హీరో చిత్రాన్ని తెరకెక్కిస్తున్న సంగతి తెలిసిందే. ఈ టాలెంటెడ్ డైరెక్టర్ ప్రశాంత్ వర్మను కళ్యాణ్ తొలి చిత్రానికి దర్శకత్వం వహించడానికి ఖరారు చేసినట్లు తెలుస్తోంది. కల్యాణ్ కోసం ప్రస్తుతం ప్రశాంత్ వర్మ ఓ విభిన్నమైన కథను సిద్ధం చేసినట్లు సమాచారం. దీనికి అదిరా అనే టైటిల్ పరిశీలిస్తున్నాడట వర్మ. త్వరలోనే దీనిపై అధికారిక ప్రకటన రానుందని సమాచారం. మరోవైపు కళ్యాణ్ హీరోగా మారేందుకు అన్నివిధాల ట్రైన్ అయ్యాడట. నటన, ఫైట్స్ తదితర అంశాల్లో స్పెషల్‌గా శిక్షణ కూడా తీసుకున్నాడట. మరోవైపు దానయ్య ఎస్ఎస్ రాజమౌళి దర్శకత్వంలో ఎన్టీఆర్, రామ్ చరణ్ నటించిన ‘ఆర్ఆర్ఆర్’ విడుదల కోసం డివివి దానయ్య ఎదురు చూస్తున్నాడు. ‘ఆర్ఆర్ఆర్’ మార్చ్ 25న విడుదలకు సిద్ధంగా ఉంది. -
మా కోసం చిరంజీవి ఎన్నో మాటలు పడ్డారు: రాజమౌళి
సాక్షి, బెంగళూరు: ‘‘ఆర్ఆర్ఆర్’ స్వాతంత్య్ర పోరాట యోధుల సినిమా కాబట్టి నేను ఈ వేడుకకు వచ్చాను. ఎంతోమంది తమ ప్రాణాలను త్యాగం చేసి స్వాతంత్య్రం తెచ్చారు. వారి గురించి, ఆ పోరాటం గురించి అందరికీ తెలియాలి’’ అన్నారు కర్నాటక ముఖ్యమంత్రి బసవరాజ బొమ్మై. స్వాతంత్య్ర సమరయోధులు కొమురం భీమ్ పాత్రలో ఎన్టీఆర్, అల్లూరి సీతారామరాజు పాత్రలో రామ్‌చరణ్ నటించగా రాజమౌళి దర్శకత్వంలో డీవీవీ దానయ్య నిర్మించిన చిత్రం ‘ఆర్ఆర్ఆర్’. ఈ నెల 25న విడుదల కానున్న ఈ చిత్రం ప్రీ రిలీజ్ ఈవెంట్ కర్నాటకలోని చిక్‌బళ్లాపూర్‌లో జరిగింది. శనివారం జరిగిన ఈ వేడుకలో ముఖ్య అతిథిగా పాల్గొన్న కర్నాటక ముఖ్యమంత్రి సీఎం బసవరాజ బొమ్మై మాట్లాడుతూ – ‘‘దేశం గర్వించదగ్గ సినిమా ‘ఆర్ఆర్ఆర్’ను తెరకెక్కించారు రాజమౌళి. దేశం మీద ప్రేమ ఉన్న ప్రతి ఒక్కరూ ఈ సినిమాను థియేటర్లో చూడాలి. కన్నడలోనూ ఈ సినిమా రావడం గర్వంగా ఉంది. ‘ఆర్ఆర్ఆర్’ విజయవంతమై చరిత్రలో నిలిచిపోవాలి. ఈ సమయంలో పునీత్ రాజ్‌కుమార్‌ను మరవడం సాధ్యం కాదు. విజేతలు మరణించాక కూడా జీవిస్తారనే వివేకానందుడి మాటలు పునీత్ జీవితంలో నెరవేరాయి. పునీత్‌కు ప్రకటించిన కర్ణాటక రత్న అవార్డును త్వరలో ఆయన కుటుంబ సభ్యులకు అందిస్తాం’’ అన్నారు. ‘‘ఆర్ఆర్ఆర్ అంటే రికార్డ్స్.. రికార్డ్స్.. రికార్డ్స్ ఒక్కటే’’ అని మరో అతిథి, కర్నాటక వైద్యారోగ్య శాఖ మంత్రి డాక్టర్ కె. సుధాకర్ అన్నారు. ‘‘కొంచెం సంతోషం, కొంత బాధగా ఉంది. మా తమ్ముడు పునీత్ మరణంతో నాలుగు నెలలుగా సినీ పరిశ్రమ, కన్నడనాడు దుఃఖంలో ఉంది. రామ్‌చరణ్, తారక్ (ఎన్టీఆర్)లో పునీత్‌ను చూస్తున్నాను. దక్షిణాది నుంచి అంతర్జాతీయ స్థాయికి ఒక దర్శకుడు (రాజమౌళి) ఎదగడం గర్వంగా ఉంది’’ అన్నారు మరో అతిథి, కన్నడ హీరో శివరాజ్‌కుమార్. రాజమౌళి మాట్లాడుతూ– ‘‘పునీత్ అందరి మనసుల్లో ఉన్నారనడానికి ఇటీవల విడుదలైన ఆయన ‘జేమ్స్’ సినిమా విజయమే నిదర్శనం. ‘ఆర్ఆర్ ఆర్’ తెలుగు సినిమాకి గర్వకారణం కాబట్టి టికెట్ రేట్లు పెంచుకునేందుకు అనుమతిచ్చిన ఏపీ సీఎం వైయస్ జగన్ మోహన్‌రెడ్డిగారికి, మంత్రి పేర్ని నాని, కొడాలి నానీగార్లకు, తెలంగాణ సీఎం కేసీఆర్‌గారికి, మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్‌గారికి, ఎంపీ సంతోష్‌కుమార్‌గారికి, ప్రకాశ్‌రాజ్‌కి కృతజ్ఞతలు. ముఖ్యమంత్రి జగన్ మోహన్‌రెడ్డిగారితో ఉన్న సాన్నిహిత్యంతో ఆయనతో మాట్లాడి టికెట్ రేట్ల సమస్యలను పరిష్కరించేందుకు కృషి చేసిన చిరంజీవిగారికి కృతజ్ఞతలు. మమ్మల్ని నెగ్గించేందుకు చిరంజీవిగారు చాలామందితో ఎన్నో మాటలు పడ్డారు. ఇండస్ట్రీ పెద్ద అంటే ఆయనకు ఇష్టం ఉండదు. కానీ నేను మాత్రం ఆయన్ను ఇండస్ట్రీ పెద్దగానే గౌరవిస్తాను. నేను అడిగిన వెంటనే ఎలాంటి ప్రశ్నలు అడగకుండా నా రాముడు (రామ్‌చరణ్), నా భీముడు (ఎన్టీఆర్) శరీరంలోని ప్రతి అణువును పెట్టారు’’ అన్నారు. రామ్‌చరణ్ మాట్లాడుతూ – ‘‘ఏపీ, తెలంగాణ తర్వాత కర్నాటక పెద్ద మార్కెట్. ప్రతి ఒక్కరూ థియేటర్లోనే సినిమా చూడాలి’’ అన్నారు. ఎన్టీఆర్ మాట్లాడుతూ– ‘‘ప్రాంతీయ సినిమాల అడ్డంకులను చెరిపివేసి తన సినిమాల ద్వారా భారతదేశ ఐక్యతను చాటుదామనుకుంటున్న ఓ గొప్ప దర్శకుడి కల ‘ఆర్ఆర్ఆర్’. ఇది ఒక భారతదేశ సినిమా అని గర్వంగా ఉంది’’ అన్నారు. ‘‘రామ్‌చరణ్, ఎన్టీఆర్, రాజమౌళి... ముగ్గురూ అత్యుత్తమ ప్రదర్శనను ఈ సినిమాలో కనబరిచారు’’ అన్నారు చిత్ర సంగీతదర్శకుడు కీరవాణి . ‘‘ఆంధ్రప్రదేశ్‌లో టికెట్ రేట్లు పెంచుకోవడానికి అవకాశం కల్పించిన ఏపీ సీఎం వైయస్ జగన్మోహన్రెడ్డిగారికి, మంత్రులు పేర్ని నాని, కొడాలి నానిగార్లకు ధన్యవాదాలు. తెలంగాణ సీఎం కేసీఆర్‌గారికి, సినిమాటోగ్రఫీ మంత్రి శ్రీనివాస్ యాదవ్‌గారికి కృతజ్ఞతలు’’ అన్నారు చిత్రనిర్మాత దానయ్య. సినిమాను కర్ణాటకలో విడుదల చేస్తున్న వెంకట నారాయణ్ మాట్లాడుతూ– ‘‘ఆర్’ అనే అక్షరానికి ఎంతో పవర్ ఉంది. ఏపీలో ఎన్టీఆర్, తమిళనాడులో ఎంజీ ఆర్, కర్నాటకలో రాజ్‌కుమార్, హిందీలో రాజ్‌కపూర్.... ఇలా ‘ఆర్’కు ఎంతో పవర్ ఉంది. అలాంటిది ఇప్పుడు మూడు ‘ఆర్’లు కలసి వస్తున్నారు’’ అన్నారు. -
సీఎం వైఎస్ జగన్‌తో భేటీపై జక్కన్న స్పందన
SS Rajamouli Met Ap Cm YS Jaganmohan Reddy: ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి తనను చాలా బాగా రిసీవ్ చేసుకున్నారని దర్శక ధీరుడు రాజమౌళి తెలిపారు. తనతో చక్కగా మాట్లాడారని కృష్ణ జిల్లా గన్నవరం విమానాశ్రయం వద్ద జక్కన్న పేర్కొన్నారు. సోమవారం దర్శక ధీరుడు రాజమౌళి ఏపీ సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డితో భేటీ అయిన విషయం తెలిసిందే. ఈ భేటీలో నిర్మాత డీవీవీ దానయ్య కూడా ఉన్నారు. ఈ నెల 25న ప్రపంవచవ్యాప్తంగా ఆర్ఆర్ఆర్ సినిమా విడుదల కానుంది. ఈ సినిమా రిలీజ్, తదితర అంశాలపై జక్కన్న సీఎంతో చర్చించినట్లు తెలుస్తోంది. ఈ క్రమంలో ఆర్ఆర్ఆర్ బాగా ఖర్చుతో కూడిన సినిమా కాబట్టి, అందుకు ఏం చేయాలో అది చేస్తామని సీఎం జగన్మోహన్ రెడ్డి హామీ ఇచ్చారని రాజమౌళి వెల్లడించారు. కాగా ఇటీవలే ఆంధ్రప్రదేశ్‌లో సినిమా రేట్ల విషయంలో సవరణలు చేస్తూ ప్రభుత్వం జీవో జారీ చేసింది. ఈ విషయంపై తెలుగు సినీ సెలబ్రిటీలు హర్షం వ్యక్తం చేసిన విషయం విధితమే. పలువురు సీఎం జగన్మోహన్ రెడ్డిని కలిసి కృతజ్ఞతలు తెలియజేస్తామని చెప్పారు. -
సీఎం వైఎస్ జగన్‌తో రాజమౌళి భేటీ
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి ప్రముఖ డైరెక్టర్ రాజమౌళితో భేటీ అయ్యారు. ఆయనతో పాటు నిర్మాత డీవీవీ దానయ్య కూడా సీఎం జగన్‌ను కలిశారు. ఈనెల 25న ప్రపంచ వ్యాప్తంగా ఆర్ఆర్ఆర్ సినిమా విడుదల కానున్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో సీఎం జగన్‌తో రాజమౌళి భేటీ ప్రాధ్యాన్యత సంతరించుకుంది. కాగా ఇటీవలే ఏపీలో సినిమా టికెట్ రేట్ల విషయంలో సవరణలు చేస్తూ ప్రభుత్వం జీవో జారీ చేసిన సంగతి తెలిసిందే. -
ఆర్ఆర్ఆర్ స్టార్స్ రెమ్యునరేషన్
-
అభిమానులు అర్థం చేసుకోవాలి.. సినిమాల వాయిదాపై దిల్ రాజు
Producer Dill Raju Reaction On Movies Postponed: వచ్చే సంక్రాంతి పండగ రిలీజ్ రేసులో ఎన్టీఆర్-రామ్‌చరణ్‌ల ‘రౌద్రం.. రణం.. రుధిరం’ (ఆర్ఆర్ఆర్), ప్రభాస్ ‘రాధేశ్యామ్’, పవన్ కల్యాణ్-రానాల ‘భీమ్లా నాయక్’ చిత్రాలు ఉన్నాయి. అయితే ‘యాక్టివ్ తెలుగు ప్రొడ్యూసర్స్ గిల్డ్ (Active Telugu Producers Guild)’ అభ్యర్థన మేరకు సంక్రాంతి రేసు నుంచి ‘భీమ్లా నాయక్’ తప్పుకుంది. ఈ విషయం గురించి యాక్టివ్ తెలుగు ప్రొడ్యూసర్స్ గిల్డ్ తరఫున నిర్మాతలు ‘దిల్’ రాజు, డీవీవీ దానయ్య స్పందించారు. ‘‘సంక్రాంతి రేసులో ‘ఆర్ఆర్ఆర్’, ‘రాధేశ్యామ్’, ‘భీమ్లా నాయక్’ చిత్రాలు నిలిచాయి. ‘ఆర్ఆర్ఆర్’, ‘రాధేశ్యామ్’ పాన్ ఇండియన్ సినిమాలు. ఈ రెండు సినిమాలు దాదాపు మూడేళ్లుగా వర్క్స్ జరుపుకుంటూనే ఉన్నాయి. ఈ రెండు సినిమాలు విడుదలవుతున్నాయన్న కారణంగానే జనవరి 7న విడుదల కావాల్సిన ‘గంగూబాయి కతియావాడి’ చిత్రం ఫిబ్రవరికి వాయిదా పడింది. అలాగే ఒకేసారి మూడు పెద్ద సినిమాలు విడుదలైతే స్క్రీన్స్ షేరింగ్ విషయంలో కొన్ని సమస్యలు ఉత్పన్నం కావొచ్చు. ఈ పరిస్థితిలోనే సంక్రాంతి రేసు నుంచి ‘భీమ్లా నాయక్’ తప్పుకోవాల్సిందిగా ఈ చిత్రనిర్మాత రాధాకృష్ణ, హీరో పవన్‌ను కోరితే, వారు సానుకూలంగా స్పందించారు. జనవరి 12న విడుదల కావాల్సిన ‘భీమ్లా నాయక్’ ఫిబ్రవరి 25న విడుదలవుతుంది. అలాగే ఫిబ్రవరి 25న విడుదల కావాల్సిన ‘ఎఫ్ 3’ (వెంకటేశ్, వరుణ్ తేజ్ హీరోలు) సినిమాకు నిర్మాతను నేనే. ‘ఎఫ్ 3’ని ఏప్రిల్ 29కి వాయిదా వేస్తున్నాం. తమ అభిమాన హీరోలను వీలైనంత త్వరగా థియేటర్స్‌లో చూసుకోవాలని ఫ్యాన్స్‌కు ఉంటుంది. అనివార్య పరిస్థితుల్లో వాయిదా వేస్తున్నాం. ఈ విషయాన్ని అందరి హీరోల అభిమానులు అర్థం చేసుకోవాలి’’ అని దిల్ రాజు పేర్కొన్నారు. ‘‘భీమ్లా నాయక్’ రిలీజ్‌ను వాయిదా వేసుకున్నందుకు నిర్మాత చినబాబు, త్రివిక్రమ్, పవన్‌లకు థ్యాంక్స్’’ తెలిపారు నిర్మాత డీవీవీ దానయ్య. ఈ సమావేశంలో నిర్మాతలు దామోదర ప్రసాద్, స్రవంతి రవికిశోర్ తదితరులు పాల్గొన్నారు. ఇక రాజమౌళి దర్శకత్వంలో రూపొందిన ‘ఆర్ ఆర్ఆర్’ జనవరి 7న, ప్రభాస్ హీరోగా రాధాకృష్ణకుమార్ దర్శకత్వంలో తెరకెక్కిన ‘రాధేశ్యామ్’ జనవరి 14న ప్రేక్షకుల ముందుకు రానున్నాయి. -
జనని పాట ఆర్ఆర్ఆర్ ఆత్మ
‘‘జననీ.. ప్రియ భారత జననీ..’ అనే పాట ‘ఆర్ఆర్ఆర్’ సినిమాకి ఆత్మలాంటిది. ఈ పాట కోసం పెద్దన్న (కీరవాణి) రెండు నెలలు శ్రమించారు. ఆయనే ఈ పాటకు లిరిక్స్ కూడా రాశారు’’ అని దర్శకుడు ఎస్ఎస్ రాజమౌళి అన్నారు. ఎన్టీఆర్, రామ్‌చరణ్ హీరోలుగా రాజమౌళి దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం ‘ఆర్ఆర్ఆర్’ (రౌద్రం రణం రుధిరం). అజయ్ దేవగణ్ కీలక పాత్రలో ఆలియా భట్, ఒలీవియా మోరీస్ కథానాయికలుగా నటించారు. డీవీవీ దానయ్య నిర్మించిన ఈ సినిమా జనవరి 7న విడుదలవుతోంది. ఈ నేపథ్యంలో చిత్రయూనిట్ ప్రమోషన్స్‌ని ప్రారంభించింది. ఇందులో భాగంగా నేడు ‘జనని..’ అనే పాటను విడుదల చేయనుంది. దేశభక్తిని చాటే విధంగా రూపొందించిన ఈ పాటను ఒక్కరోజు ముందుగా గురువారం హైదరాబాద్‌లో విలేకరుల కోసం ప్రత్యేకంగా ప్రదర్శించారు. ఈ సందర్భంగా రాజమౌళి మాట్లాడుతూ– ‘‘డిసెంబరు మొదటి వారంలో ట్రైలర్ విడుదల చేస్తాం. వరుసగా ప్రీ రిలీజ్ వేడుకలు ఏర్పాట్లు చేస్తున్నాం. ‘జనని..’ పాటలో కనిపించని భావోద్వేగాలుంటాయి. ఒక మణిహారంలో ఉన్న దారం ఎలాగైతే కనిపించదో.. అలానే సాఫ్ట్ ఎమోషన్ కనిపించదు. కానీ సినిమా సోల్ మొత్తం ఆ పాటలోని భావోద్వేగంలోనే దాగి ఉంటుంది’’ అన్నారు. నిర్మాత డీవీవీ దానయ్య పాల్గొన్నారు. -
జోరు పెంచిన మెగాస్టార్..మరో యంగ్ డైరెక్టర్‌కి గ్రీన్ సిగ్నల్
మంచి దూకుడు మీద ఉన్నారు చిరంజీవి. వరుసగా సినిమాలు కమిట్ అవుతున్నారు. ఇప్పటికే ‘గాడ్‌ఫాదర్’, ‘బోళాశంకర్’, దర్శకుడు బాబీతో సినిమాలు కమిట్ అయిన చిరంజీవి తాజాగా మరో కొత్త సినిమా అంగీకరించారని తెలిసింది. ‘ఛలో’, ‘భీష్మ’ చిత్రాలను తెరకెక్కించిన వెంకీ కుడుముల దర్శకత్వంలో ఓ సినిమా చేయడానికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చారని సమాచారం. ప్రముఖ నిర్మాణ సంస్థ డీవీవీ ఎంటర్టైన్మెంట్స్ పతాకంపై డీవీవీ దానయ్య ఈ సినిమాను నిర్మిస్తారని భోగట్టా. ఆల్రెడీ చిరంజీవికి వెంకీ స్టోరీలైన్ వినిపించారట. ఈ సినిమా గురించి త్వరలో అధికారక ప్రకటన వచ్చే అవకాశం ఉంది. -
ఎవరో ఏదో మాట్లాడితే పరిశ్రమకు సంబంధం లేదు: నిర్మాత
-
Tollywood Producers Meet: సినీ సమస్యల పరిష్కారానికి ఏపీ ప్రభుత్వం చొరవ
-
మంత్రి పేర్ని నానితో సినీ నిర్మాతల భేటీ
సాక్షి, మచిలీపట్నం: సినీ పరిశ్రమ సమస్యలపై ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం చొరవ చూపుతోంది. ఈ క్రమంలోనే కృష్ణాజిల్లాలోని మచిలీపట్నంలో మంత్రి పేర్ని నాని సినీ ప్రముఖులతో సమావేశమయ్యారు. ఆన్లైన్ పద్ధతిలో సినిమా టికెట్ల విక్రయాలపై టాలీవుడ్ నిర్మాతల బృందం భేటీ అయ్యింది. మచిలీపట్నంలోని ఆర్అండ్బీ అతిథి గృహంలో జరిగిన సమావేశానికి నిర్మాత దిల్ రాజు, డీవీవీ దానయ్య, బన్నీ వాసు, సునీల్ నారంగ్, వంశీరెడ్డి, మైత్రీ మూవీ మేకర్స్ నవీన్ తదితరులు పాల్గొన్నారు. చదవండి: ‘కిన్నెరసాని’ నుంచి సాంగ్, ఆకట్టుకుంటున్న సాహిత్యం -
ఆర్ఆర్ఆర్: ప్రీ రిలీజ్ బిజినెస్ రూ.900 కోట్లు!
చరిత్రలో ఎన్నడూ కలవని స్వాతంత్ర్య సమరయోధులు ఓ మంచి పని కోసం ఏకమైతే ఎలా ఉంటుంది? అన్న కాన్సెప్ట్‌తో వస్తున్న చిత్రం ఆర్ఆర్ఆర్(రౌద్రం రణం రుధిరం). కొమురం భీమ్‌గా జూనియర్ ఎన్టీఆర్, అల్లూరి సీతారామరాజుగా రామ్‌చరణ్ ప్రధానపాత్రల్లో నటిస్తున్నారు. పాన్ ఇండియా సినిమాగా తెరకెక్కుతున్న ఆర్ఆర్ఆర్ ప్రీ రిలీజ్ లెక్కలు జనాలకు షాక్‌నిస్తున్నాయి. దీని థియేట్రికల్ హక్కులు ఏకంగా రూ.570 కోట్లకు అమ్ముడుపోయినట్లు సమాచారం. డిజిటల్, శాటిలైట్ హక్కుల పేరిట అప్పుడే రూ.300 కోట్లు వచ్చాయట. బాలీవుడ్‌కు చెందిన పెన్ స్టూడియోస్ సంస్థ ఈ సినిమా నార్త్ ఇండియా థియేట్రికల్ హక్కులతో పాటు భారతీయ భాషల డిజిటల్, శాటిలైట్, ఎలక్ట్రానిక్ హక్కులను సొంతం చేసుకుంది. ఈ పీరియాడికల్ మూవీకి ఆంధ్రా, నైజాం ఏరియాలో రూ. 240 కోట్ల బిజినెస్ జరిగినట్లు తెలుస్తోంది. ఇక హిందీలో రూ.140 కోట్లు, దక్షిణాది రాష్ట్రాలైన తమిళనాడులో రూ.48 కోట్లు, కర్ణాటకలో రూ.45 కోట్లు, కేరళలో రూ.15 కోట్ల మేర ప్రీ రిలీజ్ బిజినెస్ జరిగిందట. అలాగే ఓవర్సీస్లో రూ.70 కోట్లకు ఆర్ఆర్ఆర్ హక్కులు అమ్ముడుపోయినట్లు సమాచారం. మ్యూజిక్ రైట్స్‌కు మరో రూ.20 కోట్లు సాధించినట్లు టాక్. మొత్తంగా ఆర్ఆర్ఆర్ ప్రీరిలీజ్ బిజినెస్ దాదాపు రూ.900 కోట్లుగా ఉన్నట్లు తెలుస్తోంది. గతంలో రాజమౌళి 'బాహుబలి 2'కు రూ.500 కోట్ల ప్రీరిలీజ్ బిజినెస్ జరగ్గా ఆర్ఆర్ఆర్ ఈ రికార్డును తిరగరాసింది. దీనికంటే దాదాపు రెట్టింపు మొత్తానికి హక్కులు అమ్ముడుపోయి అందరినీ ఆశ్చర్యపరిచింది. గతంలో ఏ తెలుగు సినిమాకు ఇంత భారీ మొత్తంలో బిజినెస్ జరగకపోవడం విశేషం. రాజమౌళి సినిమా అంటే సూపర్ హిట్టు పక్కా అని భావించిన డిస్ట్రిబ్యూటర్లు భారీ మొత్తం ఇన్వెస్ట్ చేసినట్లు తెలుస్తోంది. ఆర్ఆర్ఆర్ సినిమా బడ్జెట్ సుమారు రూ.400 కోట్లుగా ఉండగా.. ప్రీ రిలీజ్ బిజినెస్‌తో నిర్మాతలు భారీగా లాభపడినట్లేనని సినీ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. ఈ భారీ మల్టీస్టారర్ అక్టోబర్ 13న దసరా పండగకు సోలోగా రిలీజ్ అవుతోంది. చదవండి: రామ్‌చరణ్ పోస్టర్: కానీ ఎన్టీఆర్‌కు విషెస్ చెప్పిన సింగర్ -
ఆర్ఆర్ఆర్ నిర్మాతకు కరోనా పాజిటివ్
సాక్షి, హైదరాబాద్: టాలీవుడ్‌కు కరోనా గండం పట్టినట్లు కనిపిస్తోంది. ఇప్పటికే దర్శకుడు తేజ, ఆర్ఆర్ఆర్ డైరెక్టర్ రాజమౌళి, సింగర్ స్మిత కరోనా బారిన పడిన విషయం తెలిసిందే. తాజాగా ఆర్ఆర్ఆర్ నిర్మాత డీవీవీ దానయ్యకు కరోనా సోకినట్లు నిర్ధారణ అయింది.. ఆయన 'జంబలకిడి పంబ' అనే వైవిధ్యభరితమైన కామెడీ చిత్రంతో నిర్మాతగా వెండితెరపై ప్రవేశించారు. అది సూపర్ డూపర్ హిట్ సాధించడంతో తొలి చిత్రంతోనే హిట్ ప్రొడ్యూసర్‌గా పేరు సంపాదించుకున్నారు. ఆ తర్వాత ఆయన నిర్మించిన మావిడాకులు, సముద్రం కూడా ప్రేక్షకు మనసు గెలుచుకున్నాయి. దానయ్య చివరిసారిగా 'వినయ విధేయ రామ' చిత్రానికి నిర్మాతగా వ్యవహరించారు. (నిర్మల్ బొమ్మ నేపథ్యంలో...) ప్రస్తుతం ఆర్ఆర్ఆర్ సినిమాను నిర్మిస్తున్నారు. ఈ సినిమా వచ్చే ఏడాది జనవరి 8న సంక్రాంతి బరిలో నిలవనున్నట్లు చిత్రయూనిట్ ఈ పాటికే ప్రకటించింది. షూటింగ్ కూడా 70 శాతానికి పైగా పూర్తి కాగా గ్రాఫిక్ వర్క్ ఇంకా మిగిలే ఉంది. ఇంతలో దర్శకుడు జక్కన్నకు, నిర్మాత దానయ్యకు కరోనా రావడంతో పనులు మరింత ఆలస్యమయ్యేలా ఉంది. దీంతో చెప్పిన సమయానికి ఈ చిత్రాన్ని విడుదల చేస్తారా? లేదా? అనే సందేహాలు వ్యక్తమవుతున్నాయి. ఏదైతేనేం కానీ, ఈ ఇద్దరూ కరోనా నుంచి త్వరగా కోలుకోవాలంటూ సినీ నటులు, అభిమానులు ఆకాంక్షిస్తున్నారు. (ఆర్ఆర్ఆర్: అన్నీ సవ్యంగా సాగి ఉంటేనా!) -
ఆర్ఆర్ఆర్ అభిమానులకు చేదు వార్త
యంగ్‌టైగర్ ఎన్టీఆర్, మెగాపవర్‌స్టార్ రామ్ చరణ్‌లతో దర్శకధీరుడు రాజమౌళి తెరకెక్కిస్తున్న పీరియాడిక్ చిత్రం ‘ఆర్ఆర్ఆర్’ (రణం రుధిరం రౌద్రం). ఈ భారీ బడ్జెట్ చిత్రాన్ని డీవీవీ దానయ్య నిర్మిస్తున్నారు. సగానికిపైగా షూటింగ్ జరుపుకున్న ఈ చిత్రాన్ని 2021 సంక్రాతికి విడుదల చేయాలని చిత్రబృందం ప్లాన్ చేసింది. అయితే లాక్డౌన్ కారణంగా సినిమా విడుదల షెడ్యూల్లో మార్పులు చోటుచేసుకునే అవకాశాలు కనిపిస్తున్నాయి. సాధారణంగా రాజమౌళి సినిమా షూటింగ్ కంటే పోస్ట్ ప్రొడక్షన్ పనులకు ఎక్కువ సమయం తీసుకుంటారు. అయితే మరో 30 శాతం షూటింగ్ మిగిలి ఉండటం, గ్రాఫిక్స్ పనులు ఎక్కువగా ఉండటంతో ఈ సినిమా ముందుగా అనుకున్న సమయానికి విడుదలవడం కష్టంగా మారింది. దీంతో 2021 సంక్రాంతికి రావాల్సిన `ఆర్ఆర్ఆర్` ఇప్పుడు వేసవికి వెళ్లిపోయినట్టు సమాచారం. ‘సంక్రాంతి కానుకగా జనవరి 8న ఈ సినిమాను విడుదల చేయాలని అనుకున్నాం. అధికారికంగా ప్రకటించాము. అయితే లాక్ డౌన్ కారణంగా మా ప్రణాళికలు దెబ్బతిన్నాయి. ఇంకా చిత్రీకరించవలసిన సన్నివేశాలు వున్నాయి. పోస్ట్ ప్రొడక్షన్ పనులు మిగిలే ఉన్నాయి. దీంతో సినిమా విడుదల తేదీలో మార్పులు జరగే అవకాశం ఉంది' అని ఓ జాతీయ మీడియాకు ఇచ్చిన ఇంటర్వ్యూలో డీవీవీ దానయ్య పేర్కొన్నారు. అయితే ఈ చిత్ర విడుదల వాయిదా పడే అవకాశాలు ఉన్నాయని ఆ మధ్యన రాజమౌళి కూడా తెలిపారు. షూటింగ్ మళ్లీ ప్రారంభం అయితే గానీ.. ఈ సినిమాకు రిలీజ్ డేట్‌ను అనౌన్స్ చేయలేమంటూ జక్కన్న పేర్కొన్నారు. కాగా ఈ చిత్రంలో అల్లూరి సీతారామరాజుగా చరణ్, కొమురం భీమ్‌గా ఎన్టీఆర్ కనిపించనున్నారు. ఆలియా భట్, ఒలీవియా, అజయ్ దేవగన్, సముద్రఖని కీలక పాత్రలు చేస్తున్నారు. చదవండి: దసరాకు ‘అఖిల్’.. రిస్క్ వద్దంటున్న ఫ్యాన్స్ యువ దర్శకుడు మృతి.. విషాదంలో శంకర్ -
‘ఆర్ఆర్ఆర్’ తర్వాత మహేశ్‌తోనే.. జక్కన్న క్లారిటీ
రౌద్రం రణం రుధిరం(ఆర్ఆర్ఆర్) తర్వాత తన తదుపరి చిత్రం టాలీవుడ్ సూపర్‌స్టార్ మహేశ్ బాబుతో ఉంటుందని దర్శకధీరుడు ఎస్ఎస్ రాజమౌళి స్పష్టం చేశారు. నిర్మాత కేఎల్ నారాయణ, మహేశ్, తన కాంబినేషన్లో ఓ సినిమా ఉంటుందని ఎప్పట్నుంచో చెబుతున్నానని, డీవీవీ దానయ్య చిత్రం తర్వాత ఆ ప్రాజెక్ట్ పట్టాలెక్కుతుందని అన్నారు. ఆర్ఆర్ఆర్ తర్వాత జక్కన్న ప్రభాస్‌తో మరో చిత్రం లేక ఈగ సీక్వెల్ చేస్తాడని సోషల్ మీడియాలో అనేక వార్తలు వస్తున్నాయి. అయితే తాజాగా ఓ ఛానల్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో తన తదుపరి చిత్రం గురించి స్పష్టతనివ్వడంతో రూమర్స్‌కు చెక్ పడింది. ఇక రాజమౌళి-మహేశ్ సినిమా కోసం సినీ అభిమానులు ఎంతో ఆత్రుతగా ఎదురుచూస్తున్న విషయం తెలిసిందే. అయితే ఈ కాంబినేషన్లో ఓ సినిమా ఉంటుందని అనధికారికంగా తెలిసినా.. ఇప్పటివరకు వీరిద్దరి నుంచి ఎలాంటి ప్రకటన రాలేదు. దీంతో ఈ సినిమాపై అనుమానాలు రేకెత్తాయి. అయితే ఆ అనుమానాలన్నింటినీ పటాపంచలు చేస్తూ మహేశ్ సినిమాపై దర్శకధీరుడు స్పష్టతనిచ్చాడు. ఈ సినిమాపై జక్కన్న తొలిసారి స్పందించడంతో మహేశ్ ఫ్యాన్స్ ఆనందానికి అవధులు లేకుండా పోయింది. అంతేకాకుండా మహేశ్ కోసం జక్కన్న ఏ కథను సిద్దం చేస్తున్నాడనే ఆసక్తిని కూడా కనబరుస్తున్నారు. ఇక ప్రస్తుతం మెగాపవర్‌స్టార్ రామ్ చరణ్, యంగ్ టైగర్ ఎన్టీఆర్‌లు హీరోలుగా భారీ మల్టీస్టారర్ చిత్రం ‘ఆర్ఆర్ఆర్’ను రాజమౌళి తెరకెక్కిస్తున్న విషయం తెలిసిందే. చరణ్ బర్త్‌డే సందర్భంగా ‘భీమ్ ఫర్ రామరాజు’ పేరుతో విడుదలైన ప్రత్యేక వీడియోతో సినిమా ఏ రేంజ్లో ఉంటుందో ప్రేక్షకులకు అర్థమైపోయింది. ఇక మే 20న ఎన్టీఆర్ బర్త్‌డే సందర్భంగా మరొ సర్ప్రైజ్ ఉంటుందని ఫ్యాన్స్ ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. భారీ బడ్జెట్‌తో రూపొందుతున్న ఈ చిత్రాన్ని డీవీవీ దానయ్య నిర్మిస్తుండగా కీరవాణి సంగీతమందిస్తున్నాడు. మరోవైపు పరుశురామ్ దర్శకత్వంలో ఓ సినిమాను ప్లాన్ చేస్తున్నారు సూపర్‌స్టార్. ఈ సినిమాను వచ్చే సంక్రాంతి విడుదల చేయాలని భావిస్తున్నారు. చదవండి: సుధీర్ డ్యాన్స్ స్టెప్పులకు టైగర్ ఫిదా 10 కోట్ల వ్యూస్.. సంబరంలో మహేశ్ ఫ్యాన్స్ var request = 'https://www.sakshi.com/knowwidget/kwstr_931254882.json'; $.ajaxPrefilter( function (request) { if (request.crossDomain && jQuery.support.cors) { var http = (window.location.protocol === 'http:' ? 'http:' : 'https:'); request.url = http + '//cors-anywhere.herokuapp.com/' + request.url; } }); $.get( request,function (response){ if(response == ''){ $('#frameId').hide(); }else{ $('#frameId').show(); } }); -
కరోనా విరాళం
బ్రహ్మానందం – 3 లక్షలు (’సీసీసీ మనకోసం’కి) చదలవాడ శ్రీనివాస్ – పది లక్షలా పదకొండు వేల నూట పదకొండు రూపాయిలు (’తెలుగు చలనచిత్ర నిర్మాతల మండలి’ కోసం ) తెలంగాణ స్టేట్ ఫిల్మ్ చాంబర్ ఆఫ్ కామర్స్ – 25 లక్షలు (తెలంగాణ ప్రభుత్వానికి) రాజమౌళి, డీవీవీ దానయ్య – 10 లక్షలు. (‘సీసీసీ మన కోసం’కి). -
అనుకున్న సమయానికే వస్తారు
‘రౌద్రం రణం రుధిరం’ (ఆర్ఆర్ఆర్) విడుదల వాయిదా పడుతుందని, ఇందులో ఆలియా భట్ నటించడం లేదనే పుకార్లకు ఫుల్స్టాప్ పెట్టారు ఈ చిత్రనిర్మాత డీవీవీ దానయ్య. ‘బాహుబలి’ వంటి బ్లాక్‌బస్టర్ తర్వాత రాజమౌళి దర్శకత్వంలో తెరకెక్కుతోన్న చిత్రం ‘రౌద్రం రణం రుధిరం’. ఎన్టీఆర్, రామ్‌చరణ్ హీరోలుగా నటిస్తున్న ఈ చిత్రాన్ని డీవీవీ దానయ్య నిర్మిస్తున్నారు. ఎన్టీఆర్ సరసన ఓలివియా మోరిస్, రామ్‌చరణ్‌కు జోడీగా ఆలియా భట్‌ను ఎంపిక చేశారు. ప్రస్తుతం లాక్డౌన్ కారణంగా ఈ సినిమా చిత్రీకరణ నిలిచిపోయింది. ఈ షెడ్యూల్స్ తారుమారు వల్ల ‘ఆర్ఆర్ఆర్’ విడుదల వాయిదా పడుతుందని, ఈ సినిమాకి ఇచ్చిన డేట్స్‌ని ఓ హిందీ చిత్రానికి కేటాయించడంతో ఆలియా ఈ చిత్రం నుంచి తప్పుకుందనే వార్తలు ప్రచారంలోకొచ్చాయి. వీటిని కొట్టిపారేశారు దానయ్య. ‘‘ఈ నెల 15నుంచి ఆలియా భట్ ‘ఆర్ఆర్ఆర్’ షూట్లో జాయిన్ కావాల్సింది. లాక్డౌన్ కారణంగా షూటింగ్‌కు బ్రేక్ పడటంతో ఆమె దగ్గర కొత్త కాల్షీట్లు తీసుకున్నాం. మేలో జరగబోయే పుణే షెడ్యూల్లో ఆలియా జాయిన్ అవుతారు. లాక్డౌన్ పూర్తయిన వెంటనే హైదరాబాద్‌లో ‘ఆర్ఆర్ఆర్’ షూటింగ్‌ను మొదలుపెడతాం. ఆ తర్వాత పుణే షెడ్యూల్ ఉంటుంది. మరోవైపు మేజర్ గ్రాఫిక్స్ వర్క్ కూడా పూర్తి కావొస్తున్నాయి. అనుకున్న ప్రకారమే ‘ఆర్ఆర్ఆర్’ చిత్రాన్ని వచ్చే ఏడాది సంక్రాంతి సందర్భంగా జనవరి 8న విడుదల చేస్తాం’’ అని ఓ ఆంగ్ల పత్రికతో పేర్కొన్నారు డీవీవీ దానయ్య. -
అజయ్ ఆగయా
ఎన్టీఆర్, రామ్‌చరణ్ హీరోలుగా రాజమౌళి దర్శకత్వంలో తెరకెక్కుతోన్న చిత్రం ‘ఆర్ఆర్ఆర్’. ఇందులో ఎన్టీఆర్ సరసన ఒలీవియా మోరిస్, రామచరణ్‌కు జోడీగా ఆలియా భట్ నటిస్తున్నారు. ఈ చిత్రాన్ని డీవీవీ దానయ్య నిరి్మస్తున్నారు. అజయ్ దేవగన్, రే స్టీవెన్సన్, అలిసన్ డూడీ, సముద్రఖని కీలక పాత్రలు పోషిస్తున్నారు. ప్రస్తుతం ఈ సినిమా చిత్రీకరణ హైదరాబాద్‌లో జరుగుతోంది. మంగళవారం నుంచి ఈ సినిమా చిత్రీకరణలో పాల్గొనడానికి అజయ్ ఆగయా (వచ్చారు). ‘‘రాజమౌళిగారిని వివిధ సందర్భాల్లో కలుసుకున్నప్పుడు ఆసక్తికర విషయాలు మాట్లాడుకున్నాం. ఇప్పుడు ‘ఆర్ఆర్ఆర్’లో రాజమౌళిగారితో కలిసి పని చేయడాన్ని గౌరవంగా భావిస్తున్నాను’’ అన్నారు అజయ్ దేవగన్. ఈ షెడ్యూల్ చిత్రీకరణ ఇంకా 25 రోజుల పాటు సాగుతుందని తెలిసింది. 1920 నేపథ్యంలో తెరకెక్కుతున్న ఈ సినిమా షూటింగ్ 70 శాతానికి పైగా పూర్తయింది. ఈ సినిమాను పది భాషల్లో ఈ ఏడాది జూలై 30న విడుదల చేయనున్నట్లు చిత్రబృందం గతంలో ప్రకటించింది. అయితే విడుదల తేదీ మారుతుందనే ప్రచారం జరుగుతోంది. -
హీరోయిన్ దొరికింది
ఎన్టీఆర్ సరసన హీరోయిన్ కుదిరింది. ‘ఆర్ఆర్ఆర్’ సినిమాలో ఎన్టీఆర్‌కు జోడీగా ఇంగ్లీష్ నటి డైసీ ఎడ్గర్ జోన్స్ నటిస్తారని గతంలో ప్రకటించారు. అయితే ఆమె ఈ సినిమా నుంచి తప్పుకున్నారు. దాంతో కొత్త హీరోయిన్‌పై చాలా వార్తలు వచ్చాయి. తాజాగా ఎన్టీఆర్‌తో ఒలివియా మోరిస్ నటిస్తున్నారని చిత్రబృందం ప్రకటించింది. ఎన్టీఆర్, రామ్‌చరణ్ హీరోలుగా రాజమౌళి తెరకెక్కిస్తున్న పీరియాడికల్ చిత్రం ‘ఆర్ఆర్ఆర్’. డీవీవీ దానయ్య నిర్మాత. ఈ సినిమాలో ఎన్టీఆర్ సరసన నటించనున్న హీరోయిన్, నెగటివ్ రోల్స్‌లో కనిపించే పాత్రలను బుధవారం ప్రకటించారు. ఐరిష్ నటి అలిసన్ డూడీ, రే స్టీవెన్సన్ విలన్లుగా కనిస్తారు. జెన్నీఫర్ పాత్రలో ఒలీవియా మోరిస్, స్కాట్ పాత్రలో రే స్టీవెన్సన్, అలిసన్ డూడీ లేడీ స్కాట్‌గా నటిస్తున్నారు. అజయ్ దేవగన్, ఆలియా భట్, సముద్రఖని ముఖ్య పాత్రల్లో నటిస్తున్న ఈ సినిమా వచ్చే ఏడాది పది భాషల్లో విడుదల కానుంది. -
ఏడాది ముగిసింది... ముప్పై శాతం మిగిలింది
ఈ ఏడాది చివర్లో ఉత్తరం వైపునకు పయనం కానుంది ‘ఆర్ఆర్ఆర్’ టీమ్. ఎన్టీఆర్, రామ్‌చరణ్ హీరోలుగా రాజమౌళి దర్శకత్వంలో తెరకెక్కుతున్న చిత్రం ‘ఆర్ఆర్ఆర్’. డీవీవీ దానయ్య నిర్మిస్తున్న ఈ భారీ బడ్జెట్ చిత్రం షూటింగ్ ప్రస్తుతం హైదరాబాద్ పరిసర ప్రాంతాల్లో జరుగుతోంది. డిసెంబరు రెండో వారంలో ఈ చిత్రబృందం నార్త్ ఇండియాకు పయనం కానుందని తెలిసింది. అక్కడ దాదాపు 25 రోజుల పాటు ఈ షెడ్యూల్ చిత్రీకరణ జరుగుతుంది. ఎన్టీఆర్, రామ్‌చరణ్‌లతో పాటు అజయ్ దేవగన్ కూడా ఈ షెడ్యూల్లో పాల్గొంటారని సమాచారం. కీలక సన్నివేశాలను హర్యానాలో జరపడానికి ప్లాన్ చేశారు. ‘‘ఆర్ఆర్ఆర్’ చిత్రీకరణ మొదలై ఏడాది అవుతోంది. 70 శాతం చిత్రీకరణ పూర్తయింది. ఎన్టీఆర్ సరసన హీరోయిన్గా ఎవరు నటించబోతున్నారు అనే విషయాన్ని బుధవారం ప్రకటిస్తాం’’ అని చిత్రబృందం వెల్లడించింది. రామ్‌చరణ్ సరసన ఆలియా భట్ కథానాయికగా నటిస్తున్నారు. ఈ సినిమాకు కీరవాణి సంగీతం అందిస్తున్నారు. ‘ఆర్ఆర్ఆర్’ చిత్రం వచ్చే ఏడాది జూలై 30న విడుదల కానుంది. -
కోర్టులో అల్లూరి
కోర్టు బోనులో నిలబడి వాదిస్తున్నారు రామ్‌చరణ్. ఈ వాడివేడి వాదనను వచ్చే ఏడాది జూలైలో విడుదల కానున్న ‘ఆర్ఆర్ఆర్’ చిత్రంలో చూడొచ్చు. ఎన్టీఆర్, రామ్‌చరణ్ హీరోలుగా రాజమౌళి దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రం షూటింగ్ హైదరాబాద్‌లో జరుగుతోంది. ఇందులో స్వాతంత్య్ర సమర యోధులు అల్లూరి సీతారామరాజు పాత్రను చరణ్, కొమరం భీమ్ పాత్రను ఎన్టీఆర్ చేస్తున్నారు. ప్రస్తుతం అల్లూరి సీతారామరాజు పాత్రకు సంబంధించిన సన్నివేశాలను చిత్రీకరిస్తున్నారు. కోర్టులో అల్లూరి తన వాదన వినిపించే సీన్స్ తీయడం కోసం హైదరాబాద్‌లోని ఓ ప్రముఖ స్టూడియోలో కోర్టు సెట్ వేశారు. డీవీవీ దానయ్య నిర్మిస్తున్న ఈ చిత్రం వచ్చే ఏడాది జూలైలో విడుదల కానుంది. -
చిన్న గ్యాప్ తర్వాత...
ప్రఖ్యాత రాయల్ ఆల్బర్ట్ హాల్లో ‘బాహుబలి: ది బిగినింగ్’ సినిమా స్క్రీనింగ్ కోసం గతవారం లండన్‌లో గడిపారు దర్శకులు రాజమౌళి. ఈ కార్యక్రమం వల్ల ‘ఆర్ఆర్ఆర్’ (వర్కింగ్ టైటిల్) చిత్రీకరణకు చిన్న అంతరాయం ఏర్పడింది. లండన్ నుంచి రాజమౌళి తిరిగి రావడంతో మళ్లీ ‘ఆర్ఆర్ఆర్’ సినిమా పనులు ఊపందుకున్నాయి. ఎన్టీఆర్, రామ్‌చరణ్ హీరోలుగా రాజమౌళి దర్శకత్వంలో తెరకెక్కుతోన్న చిత్రం ఇది. 1920 నేపథ్యంలో సాగే ఈ సినిమాలో స్వాతంత్య్ర సమరయోధులు కొమురం భీం, అల్లూరి సీతారామరాజు పాత్రల్లో ఎన్టీఆర్, చరణ్ నటిస్తున్నారు. ఈ సినిమా తాజా షెడ్యూల్ సోమవారం హైదరాబాద్‌లో ప్రారంభం అవుతుందని సమాచారం. ఈ షెడ్యూల్లో ఎన్టీఆర్, రామ్‌చరణ్‌ల కాంబినేషన్లో కీలక సన్నివేశాలను తెరకెక్కించబోతున్నారని తెలిసింది. డీవీవీ దానయ్య నిర్మిస్తున్న ఈ సినిమా వచ్చే ఏడాది జూలై 30న విడుదల కానుంది. -
ఇంటర్వెల్‌కు 40 కోట్లు?
రాజమౌళి ఆలోచనలు గ్రాండ్‌గా ఉంటాయి. ఆ ఆలోచనల్ని స్క్రీన్ మీద చూపించడానికి అదే రేంజ్లో ఖర్చు చేస్తుంటారు. తాజాగా ‘ఆర్ఆర్ఆర్’లో ఇంటర్వెల్ ఎపిసోడ్ కోసం సుమారు 40 కోట్లు ఖర్చు చేస్తున్నారని తెలిసింది. ఎన్టీఆర్, రామ్‌చరణ్ హీరోలుగా రాజమౌళి తెరకెక్కిస్తున్న మల్టీస్టారర్ చిత్రం ‘ఆర్ఆర్ఆర్’. డీవీవీ దానయ్య నిర్మిస్తున్నారు. కొమరమ్ భీమ్ పాత్రలో ఎన్టీఆర్, అల్లూరి సీతారామరాజు పాత్రలో చరణ్ కనిపిస్తారు. రామ్‌చరణ్ సరసన ఆలియాభట్ కథానాయికగా నటిస్తున్నారు. ప్రస్తుతం ఈ సినిమా ఇంటర్వెల్ సీన్‌ను హైదరాబాద్‌లో చిత్రీకరిస్తున్నారు. ఈ సీన్లో సుమారు 1000 మందికిపైనే జూనియర్ ఆర్టిస్ట్‌లు పాల్గొంటున్నారు. వీళ్లందర్నీ ఎన్టీఆర్ ఎదుర్కొంటున్నారు. మరో రెండు మూడు రోజుల్లో చరణ్ కూడా ఈ షూటింగ్లో జాయిన్ అవుతారు. ఈ ఇంటర్వెల్ సీక్వెన్స్ చిత్రీకరణ నుసుమారు నెలరోజుల పాటు ప్లాన్ చేసిందట చిత్రబృందం. ఈ ఎపిసోడ్ ఖర్చు 40 కోట్లు అని తెలిసింది. ఎన్టీఆర్ సరసన హీరోయిన్గా ఎవరు నటిస్తారు? అనే విషయం ఇంకా కన్ఫర్మ్ కాలేదు. కీరవాణి సంగీతం అందిస్తున్న ఈ చిత్రానికి కెమెరా: సెంథిల్ కుమార్. -
హస్తినలో నెల రోజులు
నెల రోజుల పాటు ఢిల్లీలో మకాం వేయడానికి పక్కా ప్రణాళికను సిద్ధం చేసుకుంటున్నారు ‘ఆర్ఆర్ఆర్’ టీమ్. మరి... అక్కడి నుంచి కెమెరాలో ఏం బంధించి తీసుకొస్తారు? అనే విషయాలను మాత్రం వెండితెరపై చూస్తేనే అసలు మజా. రాజమౌళి దర్శకత్వంలో ఎన్టీఆర్, రామ్‌చరణ్ హీరోలుగా నటిస్తున్న చిత్రం ‘ఆర్ఆర్ఆర్’. దాదాపు 350 కోట్ల భారీ బడ్జెట్‌తో రూపొందుతున్న ఈ సినిమాను డీవీవీ దానయ్య నిర్మిస్తున్నారు. ఎన్టీఆర్ సరసన విదేశీ నటి డైసీ ఎడ్గర్ జోన్స్, రామ్‌చరణ్‌కు జోడీగా ఆలియా భట్ నటిస్తున్నారు. బాలీవుడ్ హీరో అజయ్‌దేవగన్, తమిళ నటుడు, దర్శకుడు సముద్రఖని కీలక పాత్రల్లో కనిపిస్తారు. ఈ చిత్రంలో స్వాతంత్య్ర సమరయోధులు కొమరం భీమ్ పాత్రలో ఎన్టీఆర్, అల్లూరి సీతారామరాజు పాత్రలో రామ్‌చరణ్ నటిస్తున్నారు. 1920 నేపథ్యంలో సాగే ఈ సినిమా కొత్త షెడ్యూల్ వచ్చే వారం ఢిల్లీలో మొదలు కానున్నట్లు తెలిసింది. ఈ షెడ్యూల్లో ఆలియా, ఎడ్గర్ జోన్స్ కూడా పాల్గొంటారు. రియల్ లొకేషన్స్‌లో సీన్స్‌ను ప్లాన్ చేశారు. నెల రోజులపాటు సాగే ఈ షెడ్యూల్లో యాక్షన్ సన్నివేశాలను తీస్తారు. ఇక తన వందో చిత్రం ‘తన్హాజీ: ది అన్ సంగ్ వారియర్’ సినిమా చిత్రీకరణ ఓ కొలిక్కి వచ్చాక ‘ఆర్ఆర్ఆర్’ ప్లాష్‌బ్యాక్ ఎపిసోడ్స్ కోసం అజయ్ దేవగన్ ఈ సెట్లో జాయిన్ అవుతారు. ఎం.ఎం. కీరవాణి సంగీతం అందిస్తున్న ఈ సినిమా 2020 జూలై 30న రిలీజ్ కానుంది. -
‘ఆర్ఆర్ఆర్’ అసలు కథ ఇదిగో
‘ఆర్ ఆర్ ఆర్’... రాజమౌళి, ఎన్టీఆర్, రామ్‌చరణ్... వీరు ముగ్గురూ కలిసి ఉన్న ఫొటో బయటకు వచ్చినప్పటి నుంచి అటు ఇండస్ట్రీ వర్గాల్లో ఇటు ప్రేక్షకుల్లో ఎంతో క్రేజ్ నెలకొంది. ఈ కాంబినేషన్లో సినిమా అనౌన్స్ చేయగానే కథేంటి? హీరోల పాత్రలేంటి? సినిమా ఎలా ఉండబోతోంది? ఇద్దరు స్టార్ హీరోల ఫ్యాన్స్‌ని రాజమౌళి ఎలా సంతృప్తిపరచనున్నారు? అనే చర్చలు మొదలయ్యాయి. హైదరాబాద్‌లో గురువారం నిర్వహించిన విలేకరుల సమావేశంలో ఈ చిత్రానికి సంబంధించిన పలు విశేషాలు చెప్పారు హీరోలు రామ్‌చరణ్, ఎన్టీఆర్, డైరెక్టర్ రాజమౌళి, నిర్మాత డీవీవీ దానయ్య. అలాగే పాత్రికేయులు అడిగిన పలు ప్రశ్నలకు సమాధానాలిచ్చారు. రాజమౌళి మాట్లాడుతూ ‘‘జనరల్‌గా సినిమా షూటింగ్ మొదలు పెట్టకముందే కథ చెబుతాను. కానీ కొన్ని కారణాల వల్ల ఈ సినిమాకి చెప్పలేకపోయా. అయినా ఇంకా బిగినింగ్ స్టేజ్‌లోనే ఉన్నాం.. అందుకే ఈ రోజు చెబుతున్నాం. ► 1897లో ఆంధ్రప్రాంతంలో అల్లూరి సీతారామరాజు పుట్టారు. అది అందరికీ తెలిసినదే. ఆయన ఇంగ్లీష్ చదువులే కాకుండా వేదాలు, పురాణాల్లోని ఇతిహాసాలన్నీ బాగా చదువుకున్నారు. యుక్తవయసులో ఉన్నప్పుడు ఇల్లు వదిలి వెళ్లిపోయారు. రెండు మూడేళ్లు ఇంటివద్ద లేరు. ఎక్కడికెళ్లారు? ఏం చేశారు? అన్నది ఎవరికీ తెలియదు. తిరిగొచ్చాక ఆయన ఆదివాసీల హక్కుల కోసం స్వాతంత్య్ర ఉద్యమం మొదలుపెట్టారు. అక్కడి నుంచి బ్రిటీష్‌వారి చేతుల్లో చనిపోయేవరకూ అల్లూరి ప్రయాణమంతా మనకు తెలిసిన కథే. ► 1901లో అంటే.. అల్లూరి పుట్టిన రెండు మూడేళ్లకు ఉత్తర తెలంగాణ ఆదిలాబాద్ జిల్లాలో కొమరం భీమ్ పుట్టారు. ఆయన కూడా యుక్త వయసులో ఇంటి నుంచి వెళ్లిపోయారు. ఆ తర్వాత ఏం జరిగిందనేది ఎవరికీ తెలీదు. ఆయన వెళ్లిపోయేటప్పుడు నిరక్షరాస్యుడు.. కానీ చదువుకున్న వ్యక్తిగా తిరిగొచ్చా. ఆయన కూడా నిజాం ప్రభుత్వానికి వ్యతిరేకంగా గిరిజనులకోసం, వారి స్వాతంత్య్రం కోసం పోరాడారు. అల్లూరిలాగే కొమరం భీమ్ కూడా పోరాడారు. చివరికి బ్రిటీష్ వారి చేతుల్లో చనిపోయారు. ఇద్దరి చరిత్ర చదువుతున్నప్పుడు ఒకేటైమ్‌లో పుట్టడం.. ఒకేటైమ్‌లో వెళ్లిపోవడం... వెళ్లాక ఏం జరిగిందనేది తెలియకపోవడం? తిరిగొచ్చాక ఒకేవిధానంలో పోరాటం చేయడమన్నది నాకు చాలా ఆసక్తిగా, ఎగై్జటింగ్‌గా అనిపించింది. ఆ విషయాలనే మా సినిమాలో కథగా చూపించబోతున్నాం. స్వాతంత్య్ర పోరాటంలో పాల్గొన్న ఇద్దరు మహావీరులు.. చరిత్రలో ఎప్పుడూ కలవనివాళ్లు.. ఒకరికొకరు సంబంధంలేని వీరులు... నిజంగా మనకు తెలియని టైమ్‌లో వారిద్దరూ కలిసి ఉంటే, ఒకరికొకరు స్ఫూర్తి అయ్యుంటే.. తర్వాతి కాలంలో వారు బ్రిటీష్‌వారిపై, నిజాం ప్రభుత్వంపై పోరాడుతున్నప్పుడు వారి మధ్య స్నేహం ఏర్పడి ఉండుంటే ఎలా ఉండేది? అన్నది నాకు చాలా ఎగై్జటింగ్‌గా, ఆసక్తిగా అనిపించింది. ఇప్పటి వరకూ మనకు తెలిసిన స్టోరీ ఈ చిత్రంలో చెప్పడం లేదు. పూర్తిగా తెలియని కథ బిగ్ ప్లాట్ఫామ్లో చెబుతున్నాం. 1920 ప్రాంతంలో ఉత్తర భారతదేశంలో జరిగిన కథ కాబట్టి ఈ సినిమా కోసం చాలా పరిశోధనలు చేయాల్సి వచ్చింది. ► ఇలాంటి కథకు, ఇంతపెద్ద హీరోలు ఉన్న స్టోరీకి సహాయపాత్రలు కూడా భారీగానే ఉండాలి. అజయ్ దేవగణ్ ఫ్లాష్‌బ్యాక్‌లో పవర్ఫుల్ పాత్ర చేస్తున్నారు. కథ చెప్పగానే ఎగై్జట్ అయ్యి డేట్స్ ఎప్పుడు కావాలని అడిగారాయన. చరణ్‌కు జోడీగా ఆలియా భట్ నటిస్తారు. బాంబే నుంచి వస్తుంటే అనుకోకుండా ఎయిర్‌పోర్ట్‌లో కలిశాం. రఫ్‌గా కథ చెప్పి, నిన్ను అనుకుంటున్నాం అనగానే ‘ఏ పాత్రైనా చేస్తాను’ అన్నారు. తారక్‌కు జోడీగా విదేశీ నటి డైసీ ఎడ్గర్ జోన్స్ చేస్తున్నారు. సముద్రఖని కూడా మంచి పాత్ర చేస్తున్నారు. ► ‘ఆర్ ఆర్ ఆర్’ అని వర్కింగ్ టైటిల్ అనుకున్నాం. కానీ డిస్ట్రిబ్యూటర్స్, ఫ్యాన్స్ నుంచి అదే బాగుంది.. దాన్నే టైటిల్‌గా పెట్టండి’ అంటూ ఒత్తిడి వచ్చింది. అన్ని భాషల్లో ‘ఆర్ఆర్ఆర్’ అనే కామన్ టైటిల్‌తోనే విడుదల అవుతుంది. కానీ ఒక్కో భాషలో ఒక్కో అర్థంతో విభిన్నమైన టైటిల్ ఉంటుంది. అయితే ఆ టైటిల్ ఏంటనేది అభిమానులనే గెస్ చేయమంటున్నాం. ఈ చిత్రంలో యువకుడిగా ఉన్నప్పటి సీతారామరాజు పాత్రను రామ్‌చరణ్, యంగర్ కొమరం భీం పాత్రను తారక్ చేస్తున్నారు’’ అన్నారు. రామ్‌చరణ్ మాట్లాడుతూ– ‘‘ఎప్పటినుంచో రాజమౌళిగారితో మళ్లీ పని చేయాలనుకోవడం.. నా బెస్ట్‌ఫ్రెండ్, నాకు బాగా దగ్గరైన వ్యక్తి, చాలా చాలా నచ్చే వ్యక్తి తారక్‌తో కలిసి, మాకు తెలిసిన దానయ్యగారితో పని చేయడం సంతోషంగా ఉంది. ఏడాది క్రితం ఒకరోజు ఊరు వెళ్తున్నప్పుడు రాజమౌళిగారు ఓసారి ఇంటికి వచ్చి వెళ్లు అంటే వెళ్లాను. ఆయన ఇంట్లోకి వెళ్లగానే నేలపై కూర్చుని రిలాక్స్ అవుతున్న తారక్ కనిపించారు. అక్కడికి తారక్ వస్తాడని నాకు. నేను వస్తానని తారక్‌కి తెలియదు. ఇద్దరం కన్ఫ్యూజ్ అయ్యాం. అప్పుడు రాజమౌళిగారు ‘ఆర్ఆర్ఆర్’ గురించి చెప్పడంతో ఇద్దరం ఆయన్ను కౌగిలించుకుని ధన్యవాదాలు చెప్పాం. ఆ తర్వాత మేం ముగ్గురం కలిసి సోఫాలో కూర్చుని తీసిన ఫొటోనే మీరు చూశారు. మరచిపోలేని, గౌరవప్రదమైన, బాధ్యతతో కూడిన పాత్రల్లో నటిస్తున్నాం. ఇదొక ఫిక్షనల్ స్టోరీ. చాలా జాగ్రత్తగా చేస్తున్నాం. మా ఇద్దరి కాంబినేషన్లో (చరణ్, ఎన్టీఆర్) వస్తున్న ఈ సినిమా పెద్ద హిట్ అవ్వాలి. ఇంకా మా పాత్రల చిత్రీకరణ మొదలు కాలేదు’’అన్నారు. ఎన్టీఆర్ మాట్లాడుతూ– ‘‘జక్కన్న (రాజమౌళి)తో నాకిది నాలుగో చిత్రం. అన్నింటికంటే ఈ చిత్రం చాలా ప్రత్యేకమైనదిగా నా కెరీర్లో మిగిలిపోతుంది. ఎందుకంటే.. జక్కన్నతో పనిచేయడం, దాంతోపాటు చరణ్‌తో కలిసి తెర పంచుకోవడం.. మా ఇద్దరి స్నేహం (చరణ్–ఎన్టీఆర్) ఈ సినిమాతో మొదలవ్వలేదు. నాకు మంచి మిత్రుడు.. నా కష్ట సుఖాలు పంచుకునే స్నేహితుడు చరణ్. ఈ సినిమాకు మేం కలిసేసరికి మా స్నేహం వేరే లెవల్‌కు వెళ్లిపోయింది. మేమిద్దరం ఎప్పటికీ ఇలాగే స్నేహితులుగా మిగిలిపోవాలని ఆ దేవుణ్ణి వేడుకుంటున్నా. ఎందుకంటే.. మంచి బంధాలు వచ్చినప్పుడు దిష్టి తగులుతుందని మా అమ్మ చెబుతుంటుంది. మాకు ఎలాంటి దిష్టి తగలకూడదు. ఇక సినిమా విషయానికొస్తే... అల్లూరి, కొమరం భీం గురించి మనకు తెలిసిన గీత ఒకటి ఉంది. ఇప్పుడు వారిద్దరి గురించి మనకు తెలీని కోణం, వారిద్దరూ కలిసి ఉంటే ఏం జరిగి ఉండేది? అనే కన్‌క్లూజన్ దర్శకుడు ‘ఆర్ఆర్ఆర్’ చిత్రంలోకి తీసుకురావడం నటులుగా మాకు కొత్తగా అయిపోయింది. ఒక నటుడికి ఎంత ఇన్ఫర్మేషన్ తక్కువ ఉంటే అంత తన ఎఫర్ట్ బయటికొస్తుందని నమ్మే వ్యక్తిని నేను. ఈ చిత్రం నాకు, చరణ్‌కి నటులుగా ఎదగడానికి దోహదపడుతుంది. ఇప్పటి వరకు నేను చేసిన 28 సినిమాల కంటే ఈ సినిమా కోసం తీసుకున్న శిక్షణ భవిష్యత్ సినిమాలకు సహాయపడుతుంది. జక్కన్న బుర్రలో పుట్టిన ఈ ఆలోచన 101 శాతం ఓ గొప్ప చిత్రంగా నిలబడుతుందని నా ప్రగాఢ విశ్వాసం. ఈ చిత్రానికి ఆయన అడగ్గానే ఒక్క క్షణం కూడా ఆలోచించకుండా, భేషజాలు లేకుండా స్క్రీన్ షేర్ చేసుకునేందుకు ఒప్పుకొన్నందుకు చరణ్‌కి హ్యాట్సాఫ్. మా తరంలో ఈ సినిమా రాబోతున్నందుకు గర్వంగా ఉంది’’ అన్నారు. డీవీవీ దానయ్య మాట్లాడుతూ– ‘‘భారతదేశం గర్వించే దర్శకుడు రాజమౌళిగారితో ఈ సినిమాను తెరకెక్కించడం నా పూర్వజన్మ సుకృతమో, నా అదృష్టమో.. ఈ అవకాశాన్ని నాకు కల్పించారు. రెండు పెద్ద కుటుంబాల నుంచి వచ్చిన, ఇద్దరు సమ ఉజ్జీలు (చరణ్, ఎన్టీఆర్)లతో ఈ సినిమా చేసే అవకాశం కల్పించిన రాజమౌళిగారికి జీవితాంతం రుణపడి ఉంటాను. ఇప్పటికి రెండు షెడ్యూళ్లు పూర్తయ్యాయి. ఈ చిత్రాన్ని 2020 జులై 30న తెలుగు, హిందీ, తమిళం, మలయాళం.. ఇలా 10 భారతీయ భాషల్లో విడుదల చేయాలనుకుంటున్నాం’’ అన్నారు. వివాదాలు వస్తాయని మానేయాలా? – రాజమౌళి కొమరం భీమ్, అల్లూరి సీతారామరాజు ఇద్దరూ బ్రహ్మచారులు. వారి జీవితాల్లో పెద్దగా రొమాన్స్ లేదు. ఇందులో ఒక బాలీవుడ్, ఒక హాలీవుడ్ హీరోయిన్ ఉన్నారు? చరిత్రలో కొమరం భీమ్‌కి ఇద్దరు భార్యలు. అల్లూరి సీతారామరాజుకి సీత అనే మరదలు ఉంది. సీతతో రామరాజు వివాహం జరగలేదు కానీ ఇద్దరి మధ్య రొమాన్స్ ఉండేది. నేను తెలిసిన కథ చెప్పడం లేదు. తెలియని కథ చెబుతున్నాను. రియల్ లైఫ్ క్యారెక్టర్స్‌తో ఈ సినిమా కథ కల్పితమా? సహజ కథేనా? రియల్ క్యారెక్టర్స్‌తో తీస్తున్న ఫిక్షనల్ స్టోరీ ఇది. ఆంధ్ర, తెలంగాణ, ఉత్తరభారతదేశం (నటీనటులు, కథని ఉద్దేశించి) ఇలా దేశం మొత్తాన్ని కనెక్ట్ చేశారు! అనుకుని చేసింది కాదు. తెలంగాణ నుంచి వచ్చిన ఒక ఉద్యమ వీరుడు, ఆంధ్ర నుంచి వచ్చిన ఒక ఉద్యమ వీరుడు. వారిద్దరి మధ్య స్నేహం అనేది ఎగై్జటింగ్‌గా అనిపించింది. ఆ తర్వాత తెలిసింది. వారిద్దరూ వేరే వేరు ప్రాంతాల నుంచి వచ్చారని. బ్రహ్మాండంగా ఉంటుందనిపించింది. ఈ ప్రశ్న తర్వాత ఉత్తర భారతదేశాన్ని కూడా కనెక్ట్ చేశానని నాకూ అనిపిస్తోంది. ప్రీ– ఇండిపెండెన్స్ నేపథ్యంలోనే ఉంటుందా? లేక కథ ఈ తరంలో కూడా జరుగుతుందా? కథ అంతా 1920 నేపథ్యంలోనే ఉంటుంది. మేలో ఎన్టీఆర్ బర్త్‌డే. మార్చిలో రామ్‌చరణ్ బర్త్‌డే. ‘ఆర్ఆర్ఆర్’ సినిమాలోని లుక్స్‌ను రిలీజ్ చేస్తారా? సినిమాను జూలై 30, 2020న విడుదల చేస్తున్నాం. ఇప్పుడే లుక్స్ రిలీజ్ చేయడం చాలా ఎర్లీ అవుతుంది. ఎన్టీఆర్ కల్పించుకుంటూ... 2020 లో కూడా ఓ మే, ఓ మార్చి ఉంది (నవ్వు). స్వాతంత్య్ర సమరయోధుల జీవితాల ఆధారంగా సినిమా తీస్తూ కాస్త స్వేచ్ఛ తీసుకుంటున్నారు. వివాదాలు రావొచ్చు. మీకు ఎలా అనిపిస్తోంది? ఏ సినిమాని అయినా ఇదే తొలి సినిమా అనుకుని చేస్తుంటాను. ఇంతకుముందు నా సినిమాలు హిట్ అయ్యాయి. ఆ అంచనాలు ఉంటాయి ప్రేక్షకుల్లో. నా జడ్జ్మెంట్ కోసం సిన్సియర్‌గా వర్క్ చేస్తాను. వివాదాలు వస్తూనే ఉంటాయి. ఏ సంబంధం లేకుండా తీసిన ‘బాహుబలి’ సినిమాకే వివాదాలు వచ్చాయి. ఇప్పుడు వివాదాలు రావడం కామన్ అయిపోయింది. కొమరం భీమ్, అల్లూరి సీతారామరాజు జీవితాల్లోని ఎవరికీ తెలియని సంఘటనలు చూపిస్తాం అంటున్నారు. కంప్లీట్ ఫిక్షన్‌గా వెళ్తున్నారా? లేక ఏదైనా పరిశోధన జరుగుతుందా? సినిమా స్టార్ట్ చేయకముందు వారిద్దరి గురించి పూర్తిగా చదివాం. ధ్రువీకరించి రాసిన నవలల్లో చాలా తక్కువ సమాచారం ఉంది. స్పష్టమైన సమాచారం ఏం లేదు. ఉండి ఉంటే నేను వర్రీ కావాల్సి వచ్చేది. లేదు కాబట్టి ఫ్రీడమ్ వచ్చినట్లైంది. కథను ఎలా కావాలంటే అలా ప్రెజెంట్ చేసే అవకాశం వచ్చింది. పూర్తిగా కల్పిత గాథ. చరిత్రలో వీరులగాథలు కరెక్ట్‌గా ఉండాలి. అందుకోసం మీరెలాంటి జాగ్రత్తలు తీసుకుంటున్నారు? నేను మామూలుగా మన హీరోలనూ సూపర్ హ్యూమన్‌గా చూపించి నిలబెడతాను. అలాంటిది ఇద్దరు రియల్ సూపర్ హీరోస్‌ని ఎలాంటి స్థాయిలో ఉంచుతానో ఆలోచించుకోండి. కృష్ణగారు ‘అల్లూరి సీతరామరాజు’ తీసినప్పుడు వివాదాలు వచ్చాయి. అలాగని ఆయన మానేయ్యాలా? ‘అన్నమయ్య’ తీసినప్పుడు వివాదాలు వినిపించాయి. మానేయాలా? వివాదాలు వచ్చాయని భయపడి మనం నమ్మిన ఒక అద్భుతమైన స్టోరీ మన దగ్గర ఉన్నప్పుడు దాన్ని తీయడం మానకూడదని నా నమ్మకం. హీరోల స్క్రీన్ టైమ్ ఎలా ఉంటుంది? టాప్ స్టార్డమ్ ఉన్న ఇద్దరు హీరోలు సినిమాలో నటిస్తున్నప్పుడు... కొంచెం అటు ఇటు అయితే అభిమానులు నొచ్చుకుంటారని ఒకరికి ఒక ఫైట్, ఇంకొకరికి ఇంకో ఫైట్, ఒక సాంగ్ పెడితే ఇంకో సాంగ్, ఫైట్‌లో ఒక పంచ్ పెడితే.. ఇంకొకరికి ఇంకో పంచ్. ఇలా పంచుకుంటూ పోతే... కథలో రసం అనేది పోతుంది. ఒక ఫిల్మ్‌మేకర్‌గా స్టోరీ స్ట్రాంగ్‌గా ఉందా? లేదా? అని చూసుకుంటాను. ఆడియన్స్ సినిమా చూడ్డానికి థియేటర్స్‌కి వచ్చి.. చరణ్‌ని, తారక్‌ని చూడటం మర్చిపోయి తెరపై చూపించిన క్యారెక్టర్స్‌ను చూడగలరా? లేదా అన్న విషయంపై పెద్ద కసరత్తు చేశాం. మాకు ఆత్మవిశ్వాసం వచ్చి, ఇద్దరి హీరోల ఇంట్రడక్షన్ అయిపోయిన తర్వాత స్ట్రాంగ్ స్క్రీన్ ప్లే అండ్ స్టోరీ మన దగ్గర ఉంది అని నమ్మాక ముందుకు వెళ్లాలి. నేను నమ్మి వెళ్తున్నాను. బ్యాలెన్స్ ఉండాలి. ఆడియన్స్ క్యారెక్టర్స్‌ను హత్తుకునే దగ్గర బ్యాలెన్స్ ఉండాలి. ఒకరిని ఎక్కువ ఇష్టపడేలా, మరొకరిని తక్కువ ఇష్టపడేలా చేస్తే అది అన్బ్యాలెన్స్డ్ స్టోరీ అవుతుంది. సినిమా కంప్లీట్ అయ్యేసరికి కొమరం భీమ్ పాత్రలో ఆడియన్స్‌కు తారక్ ఎంతబాగా నచ్చుతారో, అల్లూరి పాత్రలో చరణ్ కూడా అంతే బాగా నచ్చుతారు. 1920లో సినిమా నేపథ్యం. 2020లో సినిమా విడుదల. సరిగ్గా శతాబ్దం. కావాలని ప్లాన్ చేశారా? కథ చూసుకుంటే 1920, 21లో ఉంటుంది. 2020, 2021 వరకు సినిమా వెళ్లదు. కచ్చితంగా 2020లోనే విడుదల అవుతుంది. మీ సినిమాకు సంబంధించి ఫలానా సీన్ కాపీ, ఫలానా పోస్టర్ కాపీ అనే మాటలు వినిపిస్తుంటాయి? ఈ సినిమాతో వాటికి బ్రేక్ వేస్తారా? రాకపోతే ఆశ్చర్యపోవాలి. ఎక్కడెక్కడో వెతికి తెలియని దాన్ని కూడా తెచ్చి పెడుతుంటారు. అది ఫిల్మ్‌మేకింగ్‌లో ఓ పార్ట్. దానిగురించి ఒక్క సెకను కూడా ఆలోచించను. జాతీయ స్థాయిలో మన ఫ్రీడమ్ ఫైటర్స్ కథ ఇతర భాషల వారికి కూడా రీచ్ అవుతుందా? అని ఏమైనా ఆలోచిస్తున్నారా? గొప్ప గొప్ప వీరుల కథలు అందరికీ తెలియాలి. ‘ఆర్ఆర్ఆర్’లో ఇద్దరు తెలుగు వీరుల గురించి చెబుతున్నారట కదా? అని మిగతావారు గూగుల్ చేసినప్పుడు హ్యాపీ ఫీల్ అవుతాను. ఇద్దరు యోధులు వీరమరణం పొందారు. సినిమా ఎలా ఎండ్ అవుతుంది? సీక్వెల్ ఏదైనా? వారు తిరిగి వచ్చి స్వాతంత్య్ర పోరాటం స్టార్ట్ చేసే నేపథ్యంలో మనకు తెలిసిన అన్ని కథలు ఉన్నాయి. కానీ నా కథ వారు తిరిగి రావడంతో అయిపోతుంది. ఏ విధంగా వారు మనకు తెలిసిన లెజెండ్స్‌గా మారారు అనే దానితో ఈ కథ ముగుస్తుంది. వారు వీరమరణం పొందటం. ఆంధ్రా, తెలంగాణకు వచ్చి వారు ఏ విధంగా పోరాడారు అన్నది నా కథలో భాగం కాదు. నిడివి ఎక్కువగా ఉండటం వల్లే ‘బాహుబలి’ సినిమాను రెండు పార్టులుగా తీశాం. ‘ఆర్ఆర్ఆర్’ ఒక సినిమానే. ఈ సినిమా ఆలోచన ఎవరది? నాదే. చాలా ఏళ్ల క్రితం ‘మోటర్ సైకిల్ డైరీస్’ సినిమా చూశాను. సినిమాలో షే అనే వ్యక్తి గురించి కథ సాగుతుంటుంది. క్లైమాక్స్‌లో అదిరిపోయే ట్విస్ట్ ఉంటుంది. చాలా బాగుంది. రాజు అనే కుర్రాడి గురించి చెప్పి, అతనే తర్వాత బ్రిటిషర్లకు వ్యతిరేకంగా పోరాడాడు అని చెబితే ఎలా ఉంటుంది? అనిపించింది. అలాగే అల్లూరి, కొమరం భీమ్ ఇద్దరు ఇంచుమించు ఒకే కాలానికి చెందినవారు కావడం, ఒకేసారి ఎక్కడికో వెళ్లిపోవడం, తిరిగొచ్చిన తర్వాత ఇద్దరు గెరిల్లా వార్‌లా ఫైట్ చేయడం... ఇది అద్భుతమైన ఆలోచన అనిపించింది. అలా ఈ సినిమా వచ్చింది. అల్లూరి సీతారామరాజు బ్రిటిషర్స్పై, కొమరం భీమ్ ముస్లిం నేపథ్యం ఉన్నవారిపై ఫైట్ చేశారు. మీరు ఈ కథను అనుకున్నప్పుడే ఏమీ ఉండకపోవచ్చు. రేపు మీరు ఈ కథను రిలీజ్‌కు రెడీ చేసినప్పుడు ఏమైనా ప్రాబ్లమ్స్ వచ్చే అవకాశం ఉందా? ఎక్కడి నుంచి ఎక్కడికి లింక్ (నవ్వులు). కొమరం భీమ్ నిజాం పాలకులకు వ్యతిరేకంగా పోరాడారు. అల్లూరి సీతారామరాజు బ్రిటిషర్స్‌కు వ్యతిరేకంగా పోరాడారు. ఇప్పుడు కథ చెప్పడం మానేయాలా? చెప్పకూడదా? ఇలాంటివి ఏదో ఒకటి వస్తూనే ఉంటాయి. నేను పెద్దగా పట్టించుకోను. కథను ఎంత బలంగా, నిజాయతీగా చెబుతున్నామన్నదే ముఖ్యం మనకు. అల్లూరి పాత్రలో కృష్ణగారు నటించారు. ఈ సినిమాలో ఆ పాత్రకు మహేశ్‌బాబు గుర్తుకు రాలేదా? ఒక ఫంక్షన్లో మహేశ్‌బాబుతో మీ సినిమా ఎప్పుడు అని ఫ్యాన్స్ అడిగితే.. మహేశ్‌బాబును ఏ పాత్రలో చూడాలనుకుంటున్నారని అడిగాను. అల్లూరి సీతరామరాజు అన్నప్పుడు అంత స్పందన రాలేదు వారి దగ్గర్నుంచి. జేమ్స్‌బాండ్‌గా చూడాలనుకుంటున్నారా? అంటే ఎక్కువ రెస్పాన్స్ వచ్చింది. అదే సమాధానం. ఏ హీరో పేరు టైటిల్ ముందు పడుతుంది స్క్రీన్‌పై? సినిమాలో ఫస్ట్ ఎవరు కనిపిస్తే వారిది వస్తుంది. ‘ఇన్ ఆర్డర్ ఆఫ్ కాస్ట్. ఇన్ ఆర్డర్ ఆఫ్ అప్పియరెన్స్’. ఇంగ్లీష్‌వారికి కూడా ఆ ప్రాబ్లమ్ వచ్చి అది కనిపెట్టారు. మీరు ఎంత బిజినెస్ అయినా చేసి ఉండొచ్చు. 2020 జూలై వరకు ఎన్టీఆర్, తారక్‌లను బ్లాక్ చేయడం ఎంత వరకు కరెక్ట్? ఎన్టీఆర్, తారక్‌లు మధ్యలో ఒక సినిమా చేసినా ఆ సినిమాకన్నా ఈ ఒక్క సినిమాకు వారు చేసే వర్కింగ్ డేస్ ఎక్కువగా ఉంటాయి. ఈ ఒక్క సినిమాతోనే చాలామందికి లైవ్లీహుడ్ లభిస్తోంది. మోర్ వర్క్ జనరేట్ అవుతోంది. ఈ యాంగిల్లో చూస్తే ఇది బెటర్. అంటే ఫ్యాన్స్‌కి ఇద్దర్నీ ఏడాదిలో రెండు సినిమాలు చూడాలనే కోరిక ఉంటుంది కదా? చరణ్ మాట్లాడుతూ– ఈ మధ్య ఏ సినిమా ఏడాది లోపు కావడం లేదు. ఈయన ఏడాది లోపు వదిలేస్తున్నారు.. వదిలేస్తున్నారుగా రాజమౌళి వైపు చూస్తూ.. (నవ్వులు). ఏ ప్రొడ్యూసర్‌కి అయినా, ఏ డైరెక్టర్‌కి అయినా, ఏ హీరోకైనా రాజమౌళిగారితో ఓ సినిమా చేస్తే అది ఓ పదేళ్లు గుర్తుండిపోయే సినిమా అవుతుంది. రెవెన్యూ పరంగా.. ఓ 5–10 ఇయర్స్ వరకు ఆ సినిమా రెవెన్యూను కొట్టడానికి లేకుండా ఉంటుంది. ఏం చేసినా అది ఇన్టు త్రీ, ఇన్టు ఫోర్ అవుతుంది. అలాగే వర్క్వైజ్గా చాలామందికి లైవ్లీహుడ్ దొరుకుంది. మాకు కంగారు లేదు. ఎన్ని రోజులు తీసినా ఓకే. తారక్ కల్పించుకుంటూ... మాకు ఎడ్యుకేషన్ హాలీడేలా ఉంటుంది. కంగారుగా సినిమాలు చేయకుండా... కొత్తకొత్తగా ఏం చేయాలో నేర్చుకుంటున్నాం. ‘మహాభారతం’ ఎప్పుడు స్టార్ట్ అవుతుంది? అది ఏ స్టేజ్‌లో ఉంది? ‘మహాభారతం’ నా డ్రీమ్‌ప్రాజెక్ట్ అని చెప్పాను. అది నా లాస్ట్ సినిమా కావొచ్చు. అది సిరీస్‌లా వస్తుంది. రాజమౌళిగారు కాకుండా ఏ దర్శకుడైనా అప్రోచ్ అయితే ఈ మల్టీస్టారర్ వర్కౌట్ అయ్యేదా? ఎన్టీఆర్: ఇంకో దర్శకుడు అప్రోచ్ అయ్యుంటే జరిగి ఉండేదా? అంటే అది భవిష్యత్. దాని గురించి ఇప్పుడు మాట్లాడలేను. రాజమౌళి కాబట్టే ఇది జరిగింది. వందకోట్లు ఇస్తాం.. ఈ సినిమాను వదులుకోమని మీకు ఆఫర్ వచ్చింది? అయినా మీరు ఈ సినిమాను ఎందుకు వదులుకోలేదు? దానయ్య: వచ్చింది. రాజమౌళిగారితో ఎప్పట్నుంచో ట్రావెల్ అవుతున్నాను. ఆయనతో సినిమా చేయాలని నా కోరిక. ఈ సినిమా బడ్జెట్ 350 టు 400 కోట్లు. మీరు అల్లూరి పాత్రలో, మీ నాన్నగారు ఉయ్యాలవాడ నరసింహారెడ్డి పాత్రలో.. ఇలా ఒకేసారి స్వాతంత్య్ర సమరయోధుల సినిమాలు చేయడం ఎలా ఉంది? చరణ్: అస్సలు అనుకోలేదు. ఈ ఏడాది సెకండాఫ్‌లో నాన్నగారి ‘సైరా’ విడుదల కాబోతుండటం. ఇప్పుడు ‘ఆర్ఆర్ఆర్’లో నేను చేస్తుండటం కాకతాళీయం. ‘అరవింద సమేత వీరరాఘవ’ సినిమాలో రాయలసీమ మాండలికం పలికారు. ఇప్పుడు ‘ఆర్ఆర్ఆర్’ సినిమాలో తెలంగాణ మాండలికం నేర్చుకుంటున్నారా? ఎన్టీఆర్: కొమరం భీమ్‌గారి మాండలికం ఏదైతే నా మాండలికం అదే. ‘ఆర్ఆర్ఆర్’ ఇంపాక్ట్ ఎలా ఉంటుంది? ఎన్టీఆర్: దేశవ్యాప్తంగా తెలుగు హీరోలు (అల్లూరి, కొమరంభీమ్)ల గురించి చాటిచెప్పేలా ఈ సినిమా ఇంపాక్ట్ ఉంటుంది. డీవీవీ దానయ్య, ఎన్టీఆర్, రాజమౌళి, రామ్‌చరణ్ -
పరిగణిస్తున్నారట
హీరోయిన్ను ఫిక్స్ చేయకుండానే రాజమౌళి తాజా మల్టీస్టారర్ చిత్రం సెకండ్ షెడ్యూల్ కూడా స్టార్ట్ చేశారు. అయితే ఈ సినిమాలో హీరోయిన్ను కన్ఫార్మ్ చేశారన్నది తాజా సమాచారం. ఎన్టీఆర్, రామ్‌చరణ్‌లతో రాజమౌళి తెరకెక్కిస్తున్న భారీ మల్టీస్టారర్ చిత్రం ‘ఆర్ఆర్ఆర్’ (వర్కింగ్ టైటిల్). డీవీవీ దానయ్య నిర్మిస్తున్నారు. ఈ హీరోల సరసన యాక్ట్ చేస్తున్నారంటూ చాలా మంది పేర్లే వినిపించాయి. ఇప్పుడీ సినిమాలో ఓ హీరోయిన్గా బాలీవుడ్ భామ పరిణీతీ చోప్రాను పరిగణిస్తున్నట్టు సమాచారం. పరిణీతితో కథా చర్చలన్నీ పూర్తయ్యాయని, పారితోషికం విషయంలోనే డిస్కషన్స్ నడుస్తున్నట్లు టాక్. ఈ సినిమా కోసం ఎక్కువ రోజులు డేట్స్‌ను కేటాయించనున్నారట పరిణితి. ఈ చిత్రంలో మరో హీరోయిన్గా కీర్తీ సురేశ్, ముఖ్య పాత్రలో తమిళ దర్శకుడు సముద్రఖని నటించనున్నారు. ఈ ఏడాది చివరలోపు షూటింగ్ పూర్తి చేసుకోనున్న ఈ చిత్రం వచ్చే ఏడాదిలో రిలీజ్ కానుంది. ఈ చిత్రానికి సంగీతం: కీరవాణి, కెమెరా: సెంథిల్. -
సెట్ చేస్తున్నారు
అంతా సెట్ చేస్తున్నారు. నెక్ట్స్ షెడ్యూల్‌ను స్టార్ట్ చేయడానికి ‘ఆర్ఆర్ఆర్’ టీమ్ అంతా సెట్ చేస్తున్నారు. ‘బాహుబలి’ వంటి విజయవంతమైన చిత్రం తర్వాత రాజమౌళి దర్శకత్వంలో రూపొందుతున్న మల్టీస్టారర్ మూవీ ‘ఆర్ఆర్ఆర్’ (వర్కింగ్ టైటిల్). ఎన్టీఆర్, రామ్‌చరణ్ హీరోలుగా నటిస్తున్నారు. డీవీవీ దానయ్య నిర్మిస్తున్న ఈ సినిమా తొలి షెడ్యూల్ ఇటీవలే ముగిసింది. నెక్ట్స్ షెడ్యూల్ ఈ నెల 21న ప్రారంభం కానుంది. కీలక తారాగణంపై ముఖ్య సన్నివేశాలను చిత్రీకరించడానికి ప్లాన్ చేస్తున్నారు. అలాగే ఈ సినిమాలోని కథనాయికల పేర్లను ఈ నెలలోనే అనౌన్స్ చేయడానికి ‘ఆర్ఆర్ఆర్’ టీమ్ రెడీ అవుతోందని సమాచారం. కీర్తీ సురేశ్, కియారా అద్వానీ పేర్లు తెరపైకి వచ్చాయి. మరి.. ఆ పేర్లనే చెబుతారా చూడాలి. పీరియాడికల్ నేపథ్యంలో రూపొందుతున్న ఈ సినిమాకు యం.యం. కీరవాణి సంగీతం అందిస్తున్నారు. ఈ సంగతి ఇలా ఉంచితే... భార్య ఉపాసనతో కలిసి రామ్‌చరణ్ ఓ పది రోజులు హాలిడేకి వెళ్లారట. అంటే ఈ ట్రిప్ తర్వాత ‘ఆర్ఆర్ఆర్’ షూటింగ్లో రామ్‌చరణ్ జాయిన్ అవుతారని ఊహించవచ్చు. -
అలాంటి సినిమాలు చేయలేను
‘‘సినిమాలో ఫోర్స్‌గా ఫైట్ పెట్టను. యాక్షనే కావాలంటే ఇంగ్లీష్ సినిమా చూడొచ్చు. కానీ ప్రేక్షకులు మన సినిమాలనే ఎందుకు ఎంజాయ్ చేస్తున్నారు? అంటే మన సినిమాలో ఒక ఎమోషన్ ఉంటుంది. ఓ రిలేషన్ ఉంటుంది. ‘భద్ర’ నుంచి నా సినిమాలను గమనిస్తే ఫ్యామిలీ, సొసైటీ అంశాలు తప్పనిసరిగా ఉన్న విషయం తెలుస్తుంది’’ అన్నారు బోయపాటి శ్రీను. రామ్‌చరణ్, కియారా అద్వానీ జంటగా బోయపాటి శ్రీను దర్శకత్వంలో డీవీవీ దానయ్య నిర్మించిన ‘వినయ విధేయ రామ’ చిత్రం ఇవాళ విడుదలవుతోంది. ఈ సందర్భంగా బోయపాటి చెప్పిన సంగతులు. ► పోయిన ఏడాది పడిన కష్టాలన్నింటినీ మరచిపోయి కొత్త ఏడాదిలో అందరూ జరుపుకునే మొదటి పండగ సంక్రాంతి. ఈ పండగలాంటి సినిమా ‘వినయ విధేయ రామ’. ఫ్యామిలీ కోసం తలవంచే వినయుడిలా, అయినవారి కోసం ఏమైనా చేసే ఒక విధేయుడిగా, తనది అనుకున్న దాన్ని సాధించే రాముడిలోని పరాక్రమవంతుడిగా రామ్‌చరణ్ క్యారెక్టర్ ఉంటుందీ సినిమాలో. ఈ సినిమాకు ఎంత కావాలో అంతా చేశారు రామ్ చరణ్. అజర్ బైజాన్ షెడ్యూల్ కోసం ఆయన బాగా బాడీని బిల్డప్ చేశారు. ఈ కథను రామ్‌చరణ్ కోసమే రాశాను. ఒకరినొకరు బాగా నమ్మి ఈ సినిమా చేశాం. సోషల్ అవేర్‌నెస్‌కు సంబంధించిన ఓ పాయింట్‌ను కూడా ఈ సినిమాలో టచ్ చేశాం. ► సినిమా ప్రేక్షకులు కొత్త పోస్టర్‌నే కోరుకుంటారు. కొత్త లుక్స్‌నే చూడాలనుకుంటారు. కుటుంబ కథా చిత్రం అన్నప్పుడు ఆర్టిస్టుల కటౌట్స్, వారి లుక్స్ కూడా ముఖ్యం. ప్రశాంత్‌గారు, ఆర్యన్ రాజేశ్, రవివర్మ, మధు నందన్, స్నేహ, మధుమిత, హిమజ, ప్రవీణ.. ఇలా అందరూ బాగా చేశారు. విలన్ పాత్ర కోసం వివేక్ ఒబెరాయ్‌ను సంప్రదించినప్పుడు క్యారెక్టర్ ఆర్టిస్టుగా ముందు ఆసక్తిగా లేదన్నారు. కానీ నేను కథ చెప్పిన వెంటనే ఒప్పుకున్నారు. నా సినిమాలోని ప్రతి పాత్రకు జస్టిఫికేషన్ ఉండేలానే ప్లాన్ చేస్తాను. జ్యూస్ నాదైనా గ్లాస్ దానయ్యగారిదే. నిర్మాత సహకారం బాగా ఉంటే సినిమా బాగుంటుంది. స్ట్రాంగ్ విజువల్‌ని దేవిశ్రీ ప్రసాద్ ముందు పెడితే ఎలాంటి ఆర్ఆర్ ఇస్తారో సినిమాలో చూస్తారు. నా ఆర్టిస్టు నుంచి సినిమాకు కావాల్సింది రాబట్టుకోవడం కోసమే సెట్లో యాక్టివ్‌గా ఉంటాను. నేను రాయడం, తీయడం మీదనే ఎక్కువగా దృష్టి పెడతాను. బిజినెస్‌లో అంతగా కల్పించుకోను. ► చిరంజీవిగారు 150 సినిమాలు చేశారు. వెయ్యి కథలు విని ఉంటారు. ఆయన ఇచ్చే సలహాలు సినిమా బాగా రావడం కోసమే. ఈ కథ విన్న తర్వాత నాన్నగారికి ఓసారి చెబుదాం అన్నారు చరణ్. ఇప్పుడే వద్దు.. పది రోజులు తర్వాత చెబుదాం అన్నాను. ఆయనకు ఫుల్‌గా చెప్పాను. నచ్చింది. బాగుంది. నువ్వు బాగా చేస్తావనే నమ్మకం ఉంది అన్నారు. ► తండ్రి ఎవరైనా తన కొడుక్కి స్పోర్ట్స్ బైకో, స్పోర్ట్స్ కారో గిఫ్ట్‌గా ఇస్తారు. కానీ చిరంజీవిగారు రామ్‌చరణ్‌కు ఓ యుద్ధ ట్యాంకర్ (వారసత్వం)ని ఇచ్చారు. అది తోలుతూనే ఉండాలి. గెలుస్తూనే ఉండాలి. నిలబెడుతూనే ఉండాలి. ఒకటే మాట ఏంటంటే.. చరణ్ దానికి సమర్థుడు. ► చిన్న సినిమాలు, స్మూత్ సినిమాలు చేయలేను. ఆడియన్స్ నా దగ్గర నుంచి ఒకటి ఎక్స్పెక్ట్ చేస్తున్నారు. దాన్నుంచి నేను బయటికి రాలేను. కథలుగా మారుతూనే వస్తున్నాను. యాక్షన్ పార్ట్ ఒక భాగం మాత్రమే. అంటే.. పదిమంది చూసే సినిమాలు చేస్తాను కానీ ఒకరు చూసే సినిమాలు చేయను. మంచి సినిమాలు చేస్తాను. బయోపిక్ పట్ల ఆసక్తి ఉంది. చేసినా దానికి ఓ దమ్ము ఉంటుంది. నా బ్రాండ్‌ను నూటికి నూరు శాతం బాధ్యతగా ఫీల్ అవుతున్నాను. ఆ బాధ్యతను పెంచుకుంటూనే వెళ్తాను. ► ఇండస్ట్రీలో బోయపాటి చేసే ప్రతి సినిమా ఫస్ట్ సినిమానే. నా గత సినిమాల రేంజ్‌ని మించి నా సినిమాలు ఉండాలని ఎప్పటికప్పుడు తాపత్రయపడుతుంటాను. ఏ హీరోతో నేను సినిమా చేస్తున్నానో ఆ హీరో ఫ్రంట్ సీట్ అభిమానిగానే నేను ఫీల్ అవుతాను. చరణ్‌ని అలా ఫీలయ్యే ‘వినయ విధేయ రామ’ సినిమా చేశాను. ► ప్రేక్షకులు తమ జీవితాల్లో నుంచి కొంత సమాయాన్ని మన కోసం వెచ్చిస్తున్నారు. వాళ్లు కష్టపడి సంపాదించుకున్న డబ్బును ఫ్యామిలీ కోసం కాకుండా సినిమా చూడటానికి ఖర్చు పెడుతున్నారు. లక్షల్లో ఆడియన్స్ సినిమాను చూస్తారు. వారందరి అంచనాలను అందుకోవాల్సిన బాధ్యత నాపై ఉంటుంది. అంటే చావుతో చెలగాటం ఆడతాం. నిద్ర ఉండదు. నేను నిద్రపోయి ఆరు రోజులైంది. డీటీఎస్ నుంచి ప్రింట్ వెళ్లేవరకు ఆరు రోజులు. ఆ తర్వాత పబ్లిసిటీ, సినిమాను ప్రజల ముందుకు ఎలా తీసుకెళ్లాలి. ఇలా ప్రాణాలతో చెలగాటం ఆడతాం. ఎందుకంటే మనకంటే ఎంతోమంది మేధావులు ఉన్నా దేవుడు సినిమా చేసే అవకాశం నాకు ఇచ్చాడు. ► బాలకృష్ణగారితో నేను చేయబోయే సినిమా గురించి తర్వాత మాట్లాడతాను. రామ్‌చరణ్‌కు ఓ లైన్ చెప్పాను. ఈ సినిమాకు బాగా టైమ్ పట్టొచ్చు. చిరంజీవిగారితో కూడా ఓ సినిమా ఉంటుంది. నా టీమ్ 180 మెంబర్స్ ఉంటారు. నా సినిమాలో స్పాన్ ఎక్కువగా ఉంటుంది కాబట్టి అంతమంది ఉంటారు. అందరినీ కో ఆర్డినేట్ చేయాలంటే సెట్లో కాస్త గట్టిగానే ఉండాలి. అప్పుడే టైమ్ సేవ్ అయ్యి నిర్మాతకు నష్టం వాటిల్లదు. నా సెట్‌కి ఒకసారి వస్తే ఈ విషయం అర్థం అవుతుంది. -
ఇదో మంచి లెర్నింగ్ ఎక్స్పీరియన్స్
రామ్‌చరణ్ హీరోగా బోయపాటి శ్రీను దర్శకత్వంలో రూపొందిన చిత్రం ‘వినయ విధేయ రామ’. ఇందులో కియారా అద్వానీ కథానాయికగా నటించారు. డీవీవీ దానయ్య నిర్మించిన ఈ సినిమా సెన్సార్ కంప్లీట్ చేసుకుంది. ఈ నెల 11న విడుదల కానున్న ఈ చిత్రం 2గంటల 26 నిమిషాల నిడివి ఉందని సమాచారం. అలాగే ఈ సినిమాలోని ‘రామా లవ్స్ సీత..’ పాటను ఈరోజు సాయంత్రం నాలుగు గంటలకు విడుదల చేయనున్నట్లు చిత్రబృందం పేర్కొంది. ఈ సినిమా గురించి రామ్‌చరణ్ మాట్లాడుతూ– ‘‘ఇందులో బ్యూటిఫుల్ అండ్ బ్యాలెన్డ్స్ క్యారెక్టర్ చేశాను. పూర్తి స్థాయి మాస్ ఫిల్మ్‌లా ఉంటుంది. మంచి కుటుంబ కథా చిత్రం కూడా. సినిమాలో అజర్ బైజాన్ లొకేషన్స్‌ను నేపాల్–బీహార్ సరిహద్దు ప్రాంతంలా చూపించాం. కియారా ఫైన్ ఆర్టిస్టు. ఆ అమ్మాయి కళ్లతో మంచి హావభావాలు పలికించగలదు. మంచి డ్యాన్స్ పార్టనర్. ‘రామా లవ్స్ సీత’ సాంగ్ విజువల్‌గా హైలైట్‌గా ఉంటుంది. ప్రశాంత్, స్నేహ, వివేక్ ఒబెరాయ్గార్లతో పనిచేయడం నాకు లెర్నింగ్ ఎక్స్‌పీరియన్స్‌లా అనిపించింది. లొకేషన్లో బాగా ఎంజాయ్ చేశాం కూడా. పెద్ద సినిమాలకు బ్రాండ్ అంబాసిడర్‌గా మారారు దానయ్యగారు. ఆయనతో చేస్తే మా హోమ్ బ్యానర్ కొణిదెల ప్రొడక్షన్స్‌లో చేసినట్లే ఉంటుంది. బోయపాటిగారు మంచి కన్విక్షన్‌తో సినిమా చేస్తారు’’ అన్నారు. ఇంకా ‘ఆర్ఆర్ఆర్’ సినిమా గురించి చెబుతూ– ‘‘ఎన్టీఆర్ కాంబినేషన్లో సినిమా అనగానే సర్ప్రైజ్ కాలేదు. సెట్లో ఎలా ఉంటామని కూడా ఆలోచించలేదు. బయట మేం మంచి స్నేహితులం. అదే షూటింగ్లో కూడా ట్రాన్స్‌ఫార్మ్ అయ్యింది. చాలా ఆనందంగా ఉంది. ‘ఆర్ఆర్ఆర్’ గురించి ఎక్కువ రివీల్ చేయకూడదు. ఫస్ట్ షెడ్యూల్ పూర్తయింది’’ అని పేర్కొన్నారు. -
హోమ్‌ఫుడ్ ఇస్తే ఫ్రెండ్ అయిపోతా
‘‘నాకు నార్త్ అండ్ సౌత్ అనే తేడా లేదు. యాక్టర్‌గా అన్ని రకాల పాత్రలు చేస్తూ గ్లోబల్ ఆడియన్స్‌కు రీచ్ అవ్వాలన్నదే నా లక్ష్యం. వీలైనంతమంది ప్రేక్షకులను ఎంటర్టైన్ చేయాలనే ఉద్దేశంతోనే డిజిటల్ ప్లాట్‌ఫామ్స్‌వైపు కూడా ముందుకు అడుగులు వేస్తున్నాను. ‘బాహుబలి’ చిత్రం భాషాభేదాలను చెరిపేసింది. ప్రస్తుతం ద్విభాషా, త్రిభాషా చిత్రాలు కూడా రూపొందుతున్నాయి’’ అని కియారా అద్వానీ అన్నారు. బోయపాటి శ్రీను దర్శకత్వంలో రామ్‌చరణ్, కియారా అద్వానీ జంటగా రూపొందిన సినిమా ‘వినయ విధేయ రామ’. డీవీవీ దానయ్య నిర్మించిన ఈ చిత్రం ఈ నెల 11న విడుదల కానుంది. ఈ సందర్భంగా కియారా అద్వానీ చెప్పిన సంగతులు. ► ‘భరత్ అనే నేను’ సినిమాలో నేను చేసిన వసుమతి క్యారెక్టర్‌కి ‘వినయ విధేయ రామ’ చిత్రంలో నా సీత క్యారెక్టర్‌కి డిఫరెన్స్ ఉంది. మంచి మాస్ కమర్షియల్ సినిమా ఇది. ఫ్యామిలీ మెంబర్స్ అందరూ ఉన్నప్పుడు సైలెంట్‌గా ఉంటుంది సీత. అదే ఎవ్వరూ లేకుండా రాముడు మాత్రమే ఉన్నప్పుడు డామినేట్ చేయాలని చూస్తుంది. అప్పుడు సీతనే బాస్ అన్నమాట (నవ్వుతూ). సినిమాలో రామ్‌చరణ్‌కి, నాకు మంచి కెమిస్ట్రీ కుదిరింది. అమేజింగ్ ఎక్స్పీరియన్స్. బోయపాటిగారు బాగా తీశారు. దానయ్యగారు కాంప్రమైజ్ కాకుండా నిర్మించారు. ► బోయపాటిగారు ఫస్ట్ టైమ్ ఈ కథ చెప్పినప్పుడు మంచి ఫ్యామిలీ సినిమా చేయబోతున్నాననే ఫీలింగ్ కలిగింది. ప్రశాంత్‌గారు, స్నేహగారు, వివేక్ ఒబెరాయ్గారు.. ఇలా సిల్వర్‌స్క్రీన్‌పై 15 మంది మంచి నటీనటులు కనిపిస్తారీ సినిమాలో. వీరందరితో కలిసి నటించడం హ్యాపీగా ఉంది. ప్రతి సినిమాకు ప్రిపేర్ అయినట్లే ఈ సినిమాకు డైలాగ్స్ ప్రిపేర్ అయ్యాను. ఒత్తిడికి గురి కాలేదు. ► తెలుగు సినిమా అయినా, హిందీ సినిమా అయినా డైరెక్టర్ విజన్‌ను నేను పూర్తిగా నమ్ముతాను. సినిమాలో నా స్క్రీన్ టైమ్ ఎంతసేపు ఉందన్నది కాదు. నా బెస్ట్ పెర్ఫార్మెన్స్ ఇచ్చానా? లేదా? అని మాత్రమే ఆలోచించుకుంటాను. స్క్రీన్‌పై కనిపించే టైమ్‌లో నా పాత్రతో ఆడియన్స్‌ను ఎంత ఎంగేజ్ చేశానన్న అంశాన్నే ముఖ్యంగా భావిస్తాను. క్వాలిటీ బాగా రావాలని కోరుకుంటాను. ► చిన్నప్పటి నుంచే నాకు డ్యాన్స్ అంటే ఇష్టం. భరతనాట్యం, కథక్‌లలో ప్రవేశం ఉంది. ఈ సినిమాలో బాగా డ్యాన్స్ చేసే అవకాశం వచ్చింది. ఇక రామ్‌చరణ్‌గారు ఎంత బాగా డ్యాన్స్ చేస్తారో మీ అందరికీ తెలుసు. సాంగ్స్ షూట్ టైమ్‌లో టీమ్ నుంచి నాకు మంచి కాంప్లిమెంట్స్ వచ్చాయి. ‘రామా లవ్స్ సీత, తస్సాదియా...’ సాంగ్స్ నా ఫేవరెట్. ► యాక్టర్స్ అందరికీ మంచి టైమ్ వస్తుంది. ‘ఎమ్ఎస్. ధోని: ది అన్ టోల్డ్ స్టోరీ’ సినిమాలో సాక్షి మహేంద్రసింగ్ పాత్ర చేశాను. ఆ టైమ్‌లో ధోని సినిమా సాక్షి కదా అన్నారు కొందరు. హ్యాపీగా అనిపించింది. ఆ తర్వాత ‘భరత్ అనే నేను’ సినిమాలో అవకాశం వచ్చింది. మహేశ్‌బాబు కో–స్టార్ అంటే తెలుగులో ఒక హీరోయిన్‌కి ఇంతకన్నా డ్రీమ్ లాంచ్ ఏం ఉంటుంది? అనిపించింది. నాకు టర్నింగ్ పాయింట్ అనిపించింది. ► బాలీవుడ్లో కరణ్‌జోహార్‌కి పెద్ద అభిమానిని నేను. ఓ రోజు ఆయన డైరెక్ట్‌గా కాల్ చేశారు. ఏదో పార్టీ అనుకున్నాను. కానీ ఆయన ‘లస్ట్ స్టోరీస్’లో నేను చేయనున్న పాత్రకు తాను డైరెక్ట్ చేయనున్నట్లు చెప్పారు. అది చిన్న మినీ ఫిల్మ్‌లా అనిపించింది. సెన్సిబిలిటీగా, నెర్వస్‌గా అనిపించింది. ఆడిషన్ కూడా చేయలేదు. డైరెక్ట్‌గా సెట్లోకి వెళ్లిపోయాం. ఈ వెబ్ సీరీస్‌తో నాకు ఫీమేల్ ఆడియన్స్‌లో గుర్తింపు పెరిగింది. ► విజయ్ దేవరకొండకు నేను పెద్ద ఫ్యాన్‌ని. మంచి టాలెంటెడ్ యాక్టర్. తెలుగు ‘అర్జున్‌రెడ్డి’ హిందీ రీమేక్ ‘కబీర్ సింగ్’ చిత్రంలో హీరోయిన్గా నటిస్తున్నాను. ఆడియన్స్ పోలిక పెడతారని తెలుసు. కబీర్ (షాహిద్ కపూర్), ప్రీతి క్యారెక్టర్స్‌ను ఆడియన్స్ ఇష్టపడతారని అనుకుంటున్నాను. మేం కష్టపడుతున్నాం. సందీప్ వంగాగారు ప్యాషనేట్ డైరెక్టర్. ఇప్పటి వరకు వచ్చిన అవుట్‌పుట్ పట్ల ఆయన హ్యాపీగా ఉన్నారు. హిందీ నేటివిటీకి తగ్గట్లు అక్కడక్కడ మార్పులు చేశాం. ► మహేశ్‌బాబు, రామ్‌చరణ్ ఫ్యామిలీ ఓరియంటెండ్ పీపుల్. అందుకే వారి ఫ్యామిలీ మెంబర్స్‌తో కూడా మంచి రిలేషన్ ఉంది నాకు. ‘భరత్ అనే నేను’ సినిమా షూటింగ్ టైమ్‌లో నమ్రత, మహేశ్‌బాబు, సితారలతో స్నేహం ఏర్పడింది. ‘వినయ విధేయ రామ’ టైమ్‌లో చరణ్, ఉపాసనలతో రిలేషన్ కుదిరింది. హోమ్‌ఫుడ్ అంటే చాలా ఇష్టం. ఎవరైనా హోమ్‌ఫుడ్ ఇస్తే ఇట్టే ఫ్రెండ్ అయిపోతా(నవ్వుతూ). ► బాలీవుడ్లో ‘కళంక్’ చేశా, ‘గుడ్‌న్యూస్, కబీర్‌సింగ్’ చేస్తున్నా. తెలుగులో కొన్ని కథలు వింటున్నాను. నా పాత్ర ఆసక్తికరంగా ఉండే మంచి సినిమాల్లో నేను భాగమైతే అంతే చాలు. -
అది నా బాధ్యత
‘‘అనిల్ కడియాల, ప్రవీణ కడియాల జంట నాకు టీవీ రంగం ద్వారా ఎప్పటి నుంచో పరిచయం. నేను ఏ సినిమా ఓపెనింగ్లకు వెళ్లను. కానీ అనిల్, ప్రవీణల మొదటి సినిమా ప్రారంభోత్సవానికి వచ్చి వాళ్లను మనసారా ఆశీర్వదించటం నా బాధ్యతగా అనిపించింది’’ అని గాయకులు ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం అన్నారు. ‘ఆర్ఎక్స్ 100’ ఫేమ్ కార్తికేయ హీరోగా అర్జున్ జంధ్యాల దర్శకత్వంలో తెరకెక్కనున్న సినిమా గురువారం హైదరాబాద్‌లో ప్రారంభమైంది. జ్ఞాపిక ఎంటర్టైన్మెంట్స్, స్ప్రింట్ టెలీఫిలిమ్స్ పతాకాలపై అనిల్ కడియాల, తిరుమల్ రెడ్డి నిర్మిస్తున్నారు. ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం సినిమా స్క్రిప్ట్‌ను హీరో, దర్శకుడు, నిర్మాతలకు అందించారు. దర్శకుడు బోయపాటి శ్రీను గౌరవ దర్శకత్వం వహించడంతో పాటు హీరోపై క్లాప్ ఇచ్చారు. నటులు అలీ, ప్రవీణ కడియాల కెమెరా స్విచ్చాన్ చేశారు. బోయపాటి శ్రీను మాట్లాడుతూ– ‘‘నాతో పన్నెండేళ్లుగా అసోసియేట్‌గా ప్రయాణం చేసిన అర్జున్ నాకు తమ్ముడులాంటివాడు. తనలో మంచి టాలెంట్, టైమింగ్ ఉంది. ఈ చిత్రనిర్మాతలు నాకు మంచి మిత్రులు. ఈ సినిమా ద్వారా కార్తికేయకి మంచి పేరు వస్తుందని చెప్పగలను’’ అన్నారు. ‘‘ఆర్ఎక్స్ 100’ చిత్రం తర్వాత నేను విన్న అన్ని కథల్లో బెస్ట్ కథ ఇది’’ అని కార్తికేయ అన్నారు. ‘‘నా గురువు, సోదరుడు అన్నీ బోయపాటిగారే. ఇది నా తొలి సినిమా అయినా ఆయన పేరు ఎక్కడా తగ్గకుండా తీస్తా’’ అన్నారు అర్జున్ జంధ్యాల. ‘‘ఈ కథపై ఉన్న నమ్మకంతో నిర్మాణ రంగంలోకి అడుగుపెట్టాం’’ అని అనిల్ కడియాల అన్నారు. ప్రారంభోత్సవంలో నిర్మాతలు డీవీవీ దానయ్య, మిర్యాల రవీందర్ రెడ్డి, ప్రవీణ్, నటి హేమ తదితరులు పాల్గొన్నారు. ఈ చిత్రానికి సంగీతం: చైతన్య భరధ్వాజ్, కెమెరా: రామ్, ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్: శివ మల్లాల. -
చరణ్ చిందేస్తే...
రామ్‌చరణ్ డ్యాన్స్‌లో గ్రేస్ ఎలా ఉంటుందో మనందరికీ తెలిసిందే. ఇప్పుడు ‘వినయ విధేయ రామ’ కోసం మరోసారి విజిల్ కొట్టే స్టెప్స్‌ను అభిమానులకు చూపించడానికి రెడీ అవుతున్నారట. బోయపాటి శ్రీను దర్శకత్వంలో రామ్‌చరణ్, కియారా అద్వానీ జంటగా రూపొందుతున్న చిత్రం ‘వినయ విధేయ రామ’. డీవీవీ దానయ్య నిర్మాత. ఈ సినిమా ప్రీ– రిలీజ్ వేడుక హైదరాబాద్‌లో ఈ నెల 27న జరగనుంది. ఈ సందర్భంగా నిర్మాత దానయ్య మాట్లాడుతూ– ‘‘ఆల్రెడీ విడుదల చేసిన రెండు పాటలకు మంచి రెస్పాన్స్ లభిస్తోంది. ఒక్క పాట మినహా షూటింగ్ పూర్తయింది. ప్రస్తుతం భారీ సెట్లో ఓ సాంగ్‌ను షూట్ చేస్తున్నాం. ప్రీ–రిలీజ్ ఈవెంట్‌ను భారీ లెవల్లో నిర్వహిస్తాం. సంక్రాంతి కానుకగా ఈ సినిమాను విడుదల చేయనున్నాం’’ అన్నారు. -
త్వరలో తస్సదియ్యా...
మంచి కుర్రాడిలా కనిపించేవాణ్ణి ఎవరైనా వినయం ఉన్నవాడు అంటారు. పెద్దవాళ్లు చెప్పిన పని చెప్పినట్లు చేసేవాణ్ని విధేయుడు అంటారు. ఈ రెండు లక్షణాలతో ఉన్న రామ్ అనే కుర్రోడి కథే ‘వినయ విధేయ రామ’. రామ్‌చరణ్, కియరా అద్వానీ జంటగా నటిస్తున్నారు. మాస్ చిత్రాలకు ట్రేడ్ మార్క్‌గా మారిన దర్శకుడు బోయపాటి శ్రీను ఈ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నారు. డీవీవీ ఎంటర్టైన్మెంట్స్ పతాకంపై డీవీవీ దానయ్య నిర్మిస్తున్నారు. భారీ యాక్షన్ ఎంటర్టైనర్గా తెరకెక్కుతున్న ఈ చిత్రం రెండు పాటలు మినహా షూటింగ్ మొత్తం పూర్తి చేసుకుంది. పోస్ట్ ప్రొడక్షన్ కార్యక్రమాలు పూర్తి చేసే పనిలో ఉన్నారు చిత్రబృందం. ఈ సందర్భంగా చిత్రనిర్మాత డీవీవీ దానయ్య మాట్లాడుతూ– ‘‘ఈ రోజు నుండి ఈ నెల 26 వరకు జరిగే షెడ్యూల్‌తో షూటింగ్ కంప్లీట్ అవుతుంది. ఈ షెడ్యూల్లో రెండు పాటలను చిత్రీకరిస్తాం. 2 పాటల్లో ఒకటి స్పెషల్ సాంగ్. ఆ పాటలో రామ్‌చరణ్ సరసన బాలీవుడ్ నటి ఈషా గుప్తా డ్యాన్స్ చేస్తారు. ఈ మధ్యే మేం విడుదల చేసిన మొదటి పాట ఆల్రెడీ సోషల్ మీడియాలో ట్రెండింగ్‌లో ఉంది. డిసెంబర్ 17న ‘తస్సదియ్యా’ అనే మరో పాటను విడుదల చేయనున్నాం. మెగాభిమానుల అంచనాలకు ఏ మాత్రం తగ్గకుండా మా చిత్రదర్శకుడు బోయపాటి శ్రీను తెరకెక్కించారు. ఈ సంక్రాంతికి విడుదలయ్యే మా ‘వినయ ..’ ప్రేక్షకులకు కనువిందు చేయనుంది’’ అన్నారు. ఈ చిత్రానికి కెమెరా: రిషీ పంజాబి, ఆర్థర్ కె. విల్సన్, సంగీతం:దేవిశ్రీ ప్రసాద్ -
‘ఆర్ఆర్ఆర్’ టైటిల్ అదేనా..?
బాక్సాఫీస్ రికార్డులను తిరగ రాసిన ‘బాహుబలి’ చిత్రం తర్వాత రాజమౌళి దర్శకత్వంలో రూపొందనున్న మల్టీస్టారర్ మూవీ ‘ఆర్.ఆర్.ఆర్’ (వర్కింగ్ టైటిల్) ఆదివారం ఆరంభమైంది. ఎన్టీఆర్, రామ్‌చరణ్ క్రేజీ కాంబినేషన్ ఈ సినిమాపై అంచనాలను పెంచింది. డి. పార్వతి సమర్పణలో డీవీవీ ఎంటర్టైన్మెంట్స్ పతాకంపై డీవీవీ దానయ్య నిర్మిస్తున్నారు. ముహూర్తపు సన్నివేశానికి దర్శకుడు వీవీ వినాయక్ కెమెరా స్విచ్చాన్ చేయగా, నటుడు చిరంజీవి క్లాప్ కొట్టారు. దర్శకులు కె. రాఘవేంద్రరావు గౌరవ దర్శకత్వం వహించడంతో పాటు స్క్రిప్ట్‌ను చిత్రబృందానికి అందించి, శుభాకాంక్షలు తెలిపారు. నటులు ప్రభాస్, రానా, కల్యాణ్ రామ్, దర్శకులు బోయపాటి శ్రీను, కొరటాల శివ, వంశీ పైడిపల్లి, మెహర్ రమేష్, వెంకీ అట్లూరి, నిర్మాతలు బి.వి.ఎస్.యన్. ప్రసాద్, డి.సురేశ్‌బాబు, అల్లు అరవింద్, ‘దిల్’ రాజు, శ్యామ్‌ప్రసాద్ రెడ్డి, కె.ఎల్. నారాయణ, ఎన్.వి. ప్రసాద్, సాయి కొర్రపాటి, పీవీపీ, శోభు యార్లగడ్డ, నవీన్ ఎర్నేని, చెరుకూరి మోహన్, యలమంచలి రవిశంకర్, వంశీ, విక్రమ్, పరుచూరి ప్రసాద్, రచయిత గుణ్ణం గంగరాజు తదితరులు ముఖ్య అతిథులుగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా నిర్మాత దానయ్య మాట్లాడుతూ– ‘‘తెలుగు సినిమా సత్తాను ‘బాహుబలి’తో ప్రపంచానికి చాటి చెప్పిన ఎస్.ఎస్. రాజమౌళి దర్శకత్వంలో ఎన్టీఆర్, రామ్‌చరణ్ హీరోలుగా మా బ్యానర్లో సినిమా చేస్తున్నందుకు ఆనందంగా ఉంది. ఓ కలలా అనిపిస్తోంది. ప్రేక్షకులతో పాటు, హీరోల అభిమానుల అంచాలను మించేలా సినిమా ఉంటుంది. తెలుగు సినిమా స్థాయిని మరోసారి ప్రపంచానికి చాటేంత గొప్ప సాంకేతిక విలువలతో కాంప్రమైజ్ కాకుండా ఈ సినిమాను భారీగా రూపొందిస్తాం. రెగ్యులర్ షూటింగ్ ఈ నెల 19న ప్రారంభిస్తాం. రెండు వారాలపాటు ఎన్టీఆర్, రామ్‌చరణ్‌లపై యాక్షన్ సన్నివేశాలను చిత్రీకరించబోతున్నాం. సినిమాలో భాగమైన ఇతర నటీనటుల వివరాలను త్వరలో ప్రకటిస్తాం’’ అని అన్నారు. ఈ సంగతి ఇలా ఉంచితే...ఈ సినిమాకు ‘రామరావణ రాజ్యం’ అనే టైటిల్‌ని చిత్రబృందం పరిశీలిస్తోందన్న ప్రచారం ఫిల్మ్ నగర్లో సాగుతోంది. ఈ సినిమాకు కథ: విజయేంద్ర ప్రసాద్, సంగీతం: ఎం.ఎం. కీరవాణి, మాటలు: సాయిమాధవ్ బుర్రా, ఛాయాగ్రాహకుడు: కె.కె. సెంథిల్ కుమార్. -
ఏదైనా ఓకే... సెలెక్ట్ చేస్కో
‘భయపెట్టడానికైతే పది నిమిషాలు, చంపేయడానికైతే పావుగంట. ఏదైనా ఓకే.. సెలెక్ట్ చేస్కో’ అంటూ పవర్ఫుల్ డైలాగ్స్ పలుకుతున్నారు రామ్ చరణ్. బోయపాటి శ్రీను దర్శకత్వంలో రామ్ చరణ్, కియారా అద్వానీ జంటగా రూపొందుతున్న చిత్రం ‘వినయ విధేయ రామ’. డీవీవీ ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్‌పై డీవీవీ దానయ్య నిర్మిస్తున్నారు. శుక్రవారం రిలీజ్ చేసిన ఈ చిత్రం టీజర్ చూస్తుంటే బోయపాటి శ్రీను మార్క్ మాస్ అంశాలు కనిపిస్తున్నాయి. ఈ చిత్రంలో రామ్ కొణిదెల పేరుతో కనిపించనున్నారు చెర్రీ. ‘నువ్వు పందెం పరశురామ్ అయితే నేను రామ్ కొ.ణి.దె.ల’ అంటూ చరణ్ చెప్పిన ఈ డైలాగ్ టీజర్లో హైలైట్‌గా నిలిచింది. ఆర్యన్ రాజేశ్, ప్రశాంత్‌లు రామ్ చరణ్ అన్నయ్యలుగా కనిపించనున్నారు. బాలీవుడ్ యాక్టర్ వివేక్ ఓబెరాయ్ విలన్ పాత్ర చేశారు. సంక్రాంతికి విడుదల కానున్న ఈ చిత్రానికి సంగీతం: దేవిశ్రీ ప్రసాద్. -
వెనక్కి వెళతారా?
రాజమౌళి మళ్లీ వెనక్కి వెళుతున్నారు. అంటే.. ‘మగధీర’ కోసం 400 ఏళ్లు వెనక్కి వెళ్లిన విషయం గుర్తుండే ఉంటుంది. ‘బాహుబలి’ కోసం రాజుల కాలానికి వెళ్లారు. ఇప్పుడు మళ్లీ ఆయన వెనక్కి వెళ్లనున్నారు. ఎన్టీఆర్, రామ్‌చరణ్‌లతో రాజమౌళి తెరకెక్కించబోయేది పీరియాడికల్ మూవీ (‘ఆర్ఆర్ఆర్’ అనేది వర్కింగ్ టైటిల్) అని సమాచారం. ఈ భారీ ప్రాజెక్ట్‌ను డీవీవీ దానయ్య నిర్మిస్తారు. ఈ చిత్రం విశేషాలకు వస్తే... ఈ సినిమా స్వాతంత్య్రం రాక ముందు టైమ్‌లో జరిగే కథ అని సమాచారం. ఈ పీరియాడికల్ చిత్రంలో ఎన్టీఆర్, చరణ్ ఇద్దరూ మునుపు ఎన్నడూ కనిపించని గెటప్స్‌లో కనిపిస్తారట. ఆల్రెడీ ఎన్టీఆర్ ఆ పాత్రకు సంబంధించిన శిక్షణ మొదలుపెట్టారు కూడా. రామ్‌చరణ్, బోయపాటి చిత్రంతో బిజీగా ఉన్నారు. దాన్ని పూర్తి చేసిన వెంటనే ఇందులో జాయిన్ అయిపోతారట. ఈ చిత్రం రెగ్యులర్ షూటింగ్ ఈ నెల 18న స్టార్ట్ కానుందని టాక్. ఈ పీరియాడికల్ కథకు కావల్సిన భారీ సెట్‌ను హైదరాబాద్ అవుట్‌స్కర్ట్స్‌లో వేయిస్తున్నారని సమాచారం. మరోవైపు మ్యూజిక్ సిట్టింగ్స్ కూడా ముమ్మరంగా సాగుతున్నాయట. రాజమౌళి గత చిత్రాలకు చేసినట్టే చిత్రం ప్రారంభోత్సవం రోజునే ఈ చిత్ర కథను చెబుతారా? లేక సస్పెన్స్‌గా ఉంచుతారా? వేచి చూడాలి. ఒకవేళ సస్పెన్‌గా ఉంచదలిస్తే గాసిప్రాయుళ్ల ఊహాజనిత స్టోరీలు రోజుకొకటి వినొచ్చు. ఈ సినిమాలో ఎన్టీఆర్, రామ్‌చరణ్‌ల సరసన హీరోయిన్లు ఎవరన్నది అధికారికంగా ప్రకటించలేదు. కానీ ఈ చిత్రంలో ముగ్గురు హీరోయిన్స్ ఉండే వీలుందని టాక్. అందులో ముఖ్యంగా సమంత, కీర్తీ సురేశ్ పేర్లు వినిపిస్తున్నాయి. 2020లో రిలీజ్ కానున్న ఈ చిత్రానికి కెమెరా: సెంథిల్ కుమార్, సంగీతం: కీరవాణి. సంక్రాంతికే వస్తున్నాం రామ్‌చరణ్–బోయపాటి శీను చిత్రం వాయిదా పడిందని పలు వార్తలు వచ్చాయి. వాటిని కొట్టిపారేస్తూ అధికారికంగా ప్రెస్‌నోట్ రిలీజ్ చేసింది చిత్రబృందం. రామ్‌చరణ్, కియారా అద్వానీ జంటగా బోయపాటి శీను దర్శకత్వంలో తెరకెక్కుతున్న యాక్షన్ ఎంటర్టైనర్ ‘వినయ విధేయ రామ’ (టైటిల్ అధికారికంగా ప్రకటించలేదు) నిర్మాత దానయ్య మాట్లాడుతూ– ‘‘మా చిత్రాన్ని రామ్‌చరణ్ అభిమానులు, ప్రేక్షకుల అంచనాలకు తగ్గకుండా నిర్మిస్తున్నాం. చిత్రం షూటింగ్ తుది దశకు చేరుకుంది. నవంబర్ 10 నాటికి రెండు పాటలు మినహా షూటింగ్ కంప్లీట్ అవుతుంది. నవంబర్ 9 నుంచే డబ్బింగ్ పనులు కూడా ప్రారంభిస్తాం. త్వరలోనే ఫస్ట్ లుక్ విడుదల చేసి, 2019 సంక్రాంతికి సినిమా విడుదల చేయనున్నాం’’ అన్నారు. -
‘దంగల్’ ఆమిర్‌లా ఎన్టీఆర్!
ఇప్పటినుంచి 6 నెలల పాటు స్టీవ్స్ లాయిడ్ చెప్పిందే తింటారు, వింటారట ఎన్టీఆర్. ఇదంతా ఆయన నెక్ట్స్ సినిమాలో చేయబోయే పాత్రకు సంబంధించిన ప్రిపరేషన్లో భాగమే. రాజమౌళి దర్శకత్వంలో ఎన్టీఆర్, రామ్ చరణ్ హీరోలుగా ఓ మల్టీస్టారర్ చిత్రం తెరకెక్కనున్న సంగతి తెలిసిందే. డీవీవీ దానయ్య ఈ చిత్రాన్ని నిర్మించనున్నారు. ‘ఆర్ఆర్ఆర్’ అనేది వర్కింగ్ టైటిల్. ఇందులో ఎన్టీఆర్ సరికొత్త లుక్‌లో కనిపించనున్నారన్న విషయం తెలిసిందే. ఈ కొత్త లుక్ కోసం ఎన్టీఆర్ సుమారు 5–6 నెలల పాటు కఠినమైన బాడీ ట్రైనింగ్ తీసుకోనున్నారట. ఈ శిక్షణంతా స్లిమ్‌గా కనిపించడం కోసం కాదండోయ్ పూర్తి కండలు తిరిగిన దేహంతో కనిపించడం కోసమట. ‘దంగల్’ సినిమాలో ఆమిర్‌ఖాన్ యంగ్ లుక్‌లో కనిపించినట్టుగా ఎన్టీఆర్ కండలు తిరిగిన గెటప్‌లో కనిపిస్తారట. ఈ శిక్షణ కాలం మొత్తం స్టీవ్స్ లాయిడ్ చెప్పిన డైట్ ప్రకారమే ఎన్టీఆర్ ఆహారం తీసుకుంటారు. ఈ కొత్త లుక్ అభిమానులను కచ్చితంగా ఆశ్చర్యపడేలా చేస్తుందని ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. ప్రస్తుతం ప్రీ ప్రొడక్షన్ వర్క్ జరుపుకుంటున్న ఈ చిత్రం వచ్చే నెలలో ముహూర్తం జరుపుకోనుంది. సాయిమాధవ్ బుర్రా సంభాషణలు అందిస్తారట. 2020లో ఈ చిత్రం రిలీజ్ కానుంది. -
న్యూ లుక్ ఆన్ ది వే...
‘నాన్నకు ప్రేమతో’లో సరికొత్త హెయిర్ స్టైల్, ‘అరవింద సమేత వీర రాఘవ’లో ఆరు పలకల దేహం... ఇలా పాత్రకు అనుగుణంగా తన బాడీని, బాడీ లాంగ్వేజ్‌ని మొత్తం మార్చేస్తున్నారు ఎన్టీఆర్. ఇప్పుడు మరోసారి తన లుక్‌ని పూర్తీగా మార్చేసే పనిలో పడ్డారు. రాజమౌళి దర్శకత్వంలో ఎన్టీఆర్, రామ్‌చరణ్ హీరోలుగా ఓ భారీ మల్టీస్టారర్ చిత్రం తెరకెక్కనున్న సంగతి తెలిసిందే. ‘ఆర్ఆర్ఆర్’ అనేది వర్కింగ్ టైటిల్. డీవీవీ దానయ్య నిర్మాత. ఈ చిత్రంలో ఎన్టీఆర్ పాత్ర లుక్ చాలా కొత్తగా ఉంటుందని సమాచారం. దానికోసం ఎన్టీఆర్‌కు ‘అరవింద సమేత..’ కోసం శిక్షణ అందించిన ఫిట్నెస్ ట్రైనర్ స్టీవెన్స్ లాయిడ్ వర్క్ చేయనున్నారు. ఈ విషయం తెలుపుతూ – ‘‘ఎన్టీఆర్ లుక్ చర్చించడానికి లెజండరీ దర్శకుడు రాజమౌళిగారిని కలిశాను. చాలా ఎగై్జటింగ్‌గా ఉంది. ఏం చేయబోతున్నామో చూడండి’’ అని స్టీవెన్స్ పేర్కొన్నారు. ఈ కొత్త లుక్ కోసం ఎన్టీఆర్ సుమారు 45 రోజుల పాటు ఫిజికల్ వర్కౌట్స్ చేయనున్నారట. ఈ చిత్రం రెగ్యులర్ షూటింగ్ వచ్చే నెల 16న స్టార్ట్ కానుందని సమాచారం. ఎన్టీఆర్ లుక్ ఓకే. మరి రామ్‌చరణ్ లుక్ ఎలా ఉండబోతోందో అని అభిమానుల్లో తీవ్ర ఆసక్తి నెలకొనడంలో ఆశ్చర్యం లేదు. -
దసరాకి విధేయ రాముడు!
అజర్బైజాన్ షెడ్యూల్ పూర్తయిన తర్వాత రామ్‌చరణ్ తాజా సినిమా టైటిల్ ప్రకటన ఉంటుందన్న వార్తలు వచ్చాయి. అప్పటి నుంచి ఈ సినిమా టైటిల్ గురించి రకరకాల పేర్లు ప్రచారంలోకి వచ్చాయి. తాజాగా ‘వినయ విధేయ రామ, విజయ విధేయ రామ’ అనే టైటిల్స్ తెరపైకి వచ్చాయి. ‘వినయ విధేయ రామ’ అనే టైటిల్‌ను నిర్మాత డీవీవీ దానయ్య ఫిల్మ్ చాంబర్లో రిజిస్టర్ చేయించారని లేటెస్ట్ టాక్. దీంతో ఈ టైటిలే ఫైనల్ కావొచ్చనే ఊహాగానాలు వినిపిస్తున్నాయి. ఈ సినిమాలో రామ్‌చరణ్ పాత్రకు ముగ్గురు బ్రదర్స్ ఉంటారని వార్తలు వచ్చాయి. సో.. ‘వినయ విధేయ రామ’ టైటిల్ ఫిక్స్ అంటున్నారు చరణ్ అభిమానులు. ఈ విషయంపై ఎటువంటి అధికారిక ప్రకటన లేదు. ఈ సినిమా టైటిల్ అనౌన్స్‌మెంట్‌తో పాటు ఫస్ట్‌లుక్ రిలీజ్ ఈ దసరా పండక్కి ఉండే అవకాశం ఉందట. బోయపాటి శ్రీను దర్శకత్వంలో రూపొందుతున్న ఈ సినిమాలో కియారా అద్వానీ కథానాయికగా నటిస్తున్నారు. దేవిశ్రీ ప్రసాద్ సంగీతం అందిస్తున్న ఈ సినిమాలో ఆర్యన్ రాజేష్, స్నేహ, వివేక్ ఒబెరాయ్ కీలక పాత్రలు చేస్తున్నారు. ప్రస్తుతం ఈ సినిమా చిత్రీకరణ హైదరాబాద్‌లో జరుగుతోందట. ఈ చిత్రాన్ని వచ్చే ఏడాది సంక్రాంతి సందర్భంగా జనవరి 11న విడుదల చేయాలనుకుంటున్నారట చిత్రవర్గాలు. -
ముహూర్తం ఖరారు?
పాత్రల గురించి ఏవేవో ఊహలు. ఎన్నో పుకార్లు. హీరోయిన్గా వారు, వీరు అంటూ తెరపైకి అగ్ర తారల పేర్లు. కానీ ఇప్పటివరకైతే అధికారికంగా దర్శకుడు, హీరోలు, నిర్మాత తప్ప ఇంకెవ్వరూ ఖరారు కాలేదు. అవును.. ఇదంతా రాజమౌళి దర్శకత్వంలో ఎన్టీఆర్, రామ్‌చరణ్ హీరోలుగా డీవీవీ దానయ్య నిర్మించనున్న మల్టీస్టారర్ మూవీ ‘ఆర్ఆర్ఆర్’ (వర్కింగ్ టైటిల్) గురించే. ఇప్పుడీ చిత్రం తాజా సమాచారం ఏంటంటే.. ఈ సినిమా ప్రారంభోత్సవం నవంబర్ చివరి వారం లేదా డిసెంబర్ మొదటి వారంలో జరుగుతుందట. రెగ్యులర్ షూటింగ్ మాత్రం వచ్చే ఏడాది జనవరిలో మొదలవుతుందని టాక్. ఇదివరకే రాజమౌళి అండ్ టీమ్ ఈ సినిమా కోసం లొకేషన్ హంట్ స్టార్ట్ చేసిన విషయం గుర్తుండే ఉంటుంది. ప్రస్తుతం ఎన్టీఆర్ హీరోగా నటించిన ‘అరవింద సమేత వీరరాఘవ’ సినిమా ఈ నెల 11న విడుదల కానున్న విషయం తెలిసిందే. ఈ సినిమా తర్వాత ఓ నెల బ్రేక్ తీసుకుంటారట ఎన్టీఆర్. ఇక రామ్‌చరణ్ కూడా ప్రస్తుతం బోయపాటి శ్రీను దర్శకత్వంలో చేస్తున్న సినిమా వచ్చే ఏడాది సంక్రాంతికి రిలీజ్ కానుంది. ఎలాగూ ఈ సినిమా చిత్రీకరణ కూడా నవంబర్‌కి పూర్తవుతుంది. సో... ఎన్టీఆర్, రామ్‌చరణ్ నవంబర్ కల్లా ఫ్రీ అయిపోతారు. ఆ తర్వాత ఏవో శిక్షణా తరగతులకు హాజరవుతారట. ఈ సినిమా 2020లో విడుదలవుతుందని టాక్. -
స్పెషల్ గెస్ట్
అజర్ బైజాన్ వెళ్లారు చిరంజీవి. అదేంటీ ‘సైరా’ సినిమా కోసం ఆయన జార్జియాలో కదా ఉండాలి? అంటే అది నిజమే. కానీ చిరంజీవి ఇంకా జార్జియా సెట్లో జాయిన్ అవ్వలేదట. రామ్‌చరణ్ హీరోగా బోయపాటి శ్రీను దర్శకత్వంలో డీవీవీ దానయ్య ఓ సినిమాను నిర్మిస్తున్న సంగతి తెలిసిందే. ఇందులో కియారా అద్వానీ కథానాయికగా నటిస్తున్నారు. స్నేహ, ఆర్యన్ రాజేశ్, ప్రశాంత్, వివేక్ ఒబెరాయ్ కీలక పాత్రలు చేస్తున్నారు. ప్రస్తుతం ఈ సినిమా షెడ్యూల్ అజర్బైజాన్లో జరుగుతోంది. ముఖ్యంగా రామ్‌చరణ్, వివేక్ ఒబెరాయ్‌లపై కీలక సన్నివేశాలను చిత్రీకరిస్తున్నారు. ఈ సినిమా సెట్స్‌ను విజిట్ చేశారు చిరంజీవి. సినిమా ప్రోగ్రెస్ గురించి అడిగి తెలుసుకున్నారట. అంటే తనయుడి సినిమా లొకేషన్‌కు చిరంజీవి స్పెషల్ గెస్ట్‌గా వెళ్లారన్న మాట. దాదాపు 25 రోజుల పాటు అజర్ బైజాన్‌లో షూటింగ్ చేసి, యూనిట్ ఇండియా చేరుకుంటుంది. దేవిశ్రీ ప్రసాద్ సంగీతం అందిస్తున్న ఈ సినిమాను వచ్చే ఏడాది సంక్రాంతికి రిలీజ్ చేయనున్న సంగతి తెలిసిందే. -
లొకేషన్ సెర్చ్
అక్కడికి, ఇక్కడికి ఎక్కడ బాగుందంటే అక్కడికి వెళ్తున్నారట రాజమౌళి. ఏం బాగుండాలి అంటే ప్లేస్ విశాలంగా ఉండాలట. ఎందుకు? అంటే..‘ఆర్ఆర్ఆర్’ మూవీ సెట్ కోసం. బాక్సాఫీస్ వద్ద భారీ విజయాన్ని సొంతం చేసుకున్న ‘బాహుబలి’ సినిమా తర్వాత రాజమౌళి దర్శకత్వంలో ఎన్టీఆర్, రామ్‌చరణ్ హీరోలుగా ఓ మల్టీస్టారర్ మూవీ రూపొందనున్న సంగతి తెలిసిందే. డీవీవీ ఎంటర్టైన్మెంట్స్ పతాకంపై డీవీవీ దానయ్య నిర్మించనున్నారు. ఈ సినిమాకు ‘ఆర్ఆర్ఆర్’ అనే వర్కింగ్ టైటిల్‌ను అనుకుంటున్నారు. ఈ సినిమా కోసం భారీ సెట్ వేసేందుకు కెమెరామెన్ సెంథిల్ కుమార్‌తో కలిసి లొకేషన్స్ సెర్చ్ చేస్తున్నారు రాజమౌళి. రీసెంట్గా హైదరాబాద్‌కు సమీపంలోని కొల్లూరు గ్రామ పరిసర ప్రాంతాలను టీమ్ పరిశీలించారని సమాచారం. ప్రస్తుతం బోయపాటి సినిమాతో రామ్‌చరణ్, త్రివిక్రమ్ సినిమాతో ఎన్టీఆర్ బిజీగా ఉన్నారు. అక్టోబర్‌లో ఎన్టీఆర్ సినిమా రిలీజ్ అవుతుంది. రామ్‌చరణ్ సినిమా కూడా అక్టోబర్ నాటికి ఓ కొలిక్కి వస్తుంది. సో.. ‘ఆర్ఆర్ఆర్’ సినిమా నవంబర్‌లో మొదలయ్యే అవకాశాలు ఉంటాయని ఊహించవచ్చు. -
స్క్రీన్ ప్లే 17th July 2018
-
ఎవరికీ పేమెంట్లు ఎగ్గొట్టలేదు: నిర్మాత దానయ్య
ప్రముఖ నిర్మాణ సంస్థ డీవీవీ ఎంటర్టైన్మెంట్పై సంచలన ఆరోపణలు చక్కర్లు కొట్టాయి. భరత్ అనే నేను చిత్రానికి సంబంధించిన కొందరు టెక్నీషియన్ల(కొరటాల, కైరా పేర్లను ప్రముఖంగా ప్రచురించాయి) పేమెంట్లను ఎగ్గొట్టారంటూ నిర్మాత దానయ్యపై ఆరోపణలు చేస్తూ కొన్నికథనాలు వెలువడ్డాయి. ఈ నేపథ్యంలో ఆయన ఓ ప్రకటనలో స్పందించారు. ‘ప్రొడక్షన్ హౌజ్ మీద వచ్చిన పుకార్లు చాలా బాధించాయి. భరత్ అనే నేను చిత్రానికి సంబంధించి ఎవరికీ, ఎలాంటి పెమెంట్లు ఎగ్గొట్టలేదు. ఈ విషయంలో ఎవరికైనా ఇంకా అనుమానాలు ఉంటే. హైదరాబాద్‌లోని మా కార్యాలయానికి నేరుగా వచ్చి నివృత్తి చేసుకోవచ్చు. ఇకపై ఇలాంటి చెత్త కథనాలు ఇకపై ప్రచురించకండని జర్నలిస్టులకు విజ్ఞప్తి చేస్తున్నా’ అంటూ ఆయన ప్రకటనలో పేర్కొన్నారు. ఇదిలా ఉంటే మహేష్ బాబు హీరోగా కొరటాల శివ దర్శకత్వంలో తెరకెక్కిన భరత్ అనే నేను బ్లాక్ బస్టర్హిట్ గా నిలిచింది. కైరా అద్వానీ హీరోయిన్గా నటించిన ఈ చిత్రంలో ప్రకాశ్ రాజ్, శరత్ కుమార్, రావు రమేష్ కీలక పాత్రలు పోషించగా, దేవీశ్రీ ప్రసాద్ మ్యూజిక్ అందించాడు. మరోవైపు రామ్‌చరణ్-బోయపాటి చిత్రానికి దానయ్యే నిర్మాత కాగా.. రాజమౌళి డైరెక్షన్లో తెరకెక్కబోయే భారీ మల్టీస్టారర్‌కు కూడా డీవీవీ ఎంటర్టైన్మెంట్ బ్యానర్‌పైనే రూపొందబోతోంది. A statement from our Producer Sri Danayya DVV garu. pic.twitter.com/QHjLL6jro5 — DVV Entertainment (@DVVEnts) 15 July 2018 -
అక్టోబర్‌లో ఆరంభం
ఎన్టీఆర్, రామ్‌చరణ్ స్క్రీన్ షేర్ చేసుకోబోయే టైమ్ ఫిక్స్ అయింది. ఈ ఇద్దరితో రాజమౌళి భారీ మల్టీస్టారర్ తెరకెక్కించనున్న విషయం తెలిసిందే. ఈ సినిమా రెగ్యులర్ షూటింగ్ అక్టోబర్‌లో స్టార్ట్ కానుందట. డీవీవీ ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్‌పై డీవీవీ దానయ్య నిర్మించనున్నారు. ‘ఆర్ఆర్ఆర్’ అనేది వర్కింగ్ టైటిల్. ఈ ఇద్దరి హీరోల కోసం ఓ అద్భుతమైన కథ రెడీ చేశారట. దాన్ని హీరోలకు కూడా న్యారేట్ చేశారట. ‘ఆర్ఆర్ఆర్’ సినిమా రెగ్యులర్ షూట్ స్టార్ట్ కాకముందే త్రివిక్రమ్‌తో చేస్తున్న ‘అరవింద సమేత వీర రాఘవ’ చిత్రాన్ని ఎన్టీఆర్, బోయపాటితో చేస్తున్న చిత్రాన్ని రామ్‌చరణ్ కంప్లీట్ చేసేస్తారట. ఆ తర్వాత ఇద్దరి ఫుల్ కాన్సంట్రేషన్ ‘ఆర్ఆర్ఆర్’ పైనే అని ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. వీఎఫ్ఎక్స్ ఎక్కువగా ఉండే ఈ సినిమా షూటింగ్, రిలీజ్‌కు రెండేళ్లు పట్టనుందని సమాచారం. 2020లో రిలీజ్ కానున్న ఈ చిత్రానికి సంగీతం: కీరవాణి, కెమెరా: సెంథిల్‌కుమార్. -
క్లైమాక్స్ స్టార్ట్
రౌడీలను చిత్తు చిత్తు చేయడానికి రామ్ చరణ్ రంగం సిద్ధం చేశారు. బ్యాడ్ బాయ్స్ బెండు తీయడానికి స్కెచ్‌లు రెడీ చేస్తున్నారు. ఈ సెటప్పంతా బోయపాటి దర్శకత్వంలో రామ్ చరణ్ చేస్తున్న సినిమా క్లైమాక్స్ కోసం. రామ్ చరణ్ హీరోగా బోయపాటి శ్రీను ఓ చిత్రానికి దర్శకత్వం వహిస్తున్న సంగతి తెలిసిందే. డీవీవీ ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్‌పై డీవీవీ దానయ్య ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఇందులో కియారా అద్వానీ కథానాయిక. స్నేహా, ప్రశాంత్, ఆర్యన్ రాజేశ్, బాలీవుడ్ నటుడు వివేక్ ఒబెరాయ్ కీలక పాత్రల్లో నటిస్తున్నారు. ఈ సినిమా క్లైమాక్స్ షూటింగ్‌ను ఈ నెల 10న స్టార్ట్ చేయనున్నారని సమాచారం. ఈ నెలాఖరు వరకు జరిగే ఈ షెడ్యూల్లో రామ్‌చరణ్‌తో పాటు బాలీవుడ్ నటుడు వివేక్ ఒబెరాయ్ కూడా పాల్గొననున్నారట. ఈ షెడ్యూల్ తర్వాత ఫారిన్లో మరో షెడ్యూల్ కూడా ప్లాన్ చేశారట దర్శకుడు బోయపాటి శ్రీను. సంక్రాంతికి రిలీజ్ కానున్న ఈ చిత్రానికి సంగీతం: తమన్. -
కొత్త హీరోతో కాజల్..!
మరో స్టార్ వారసుడి వెండితెర అరంగేట్రానికి రంగం సిద్ధమవుతున్నట్టుగా వార్తలు వినిపిస్తున్నాయి. ఇటీవల వరుస విజయాలు సాధిస్తున్న డీవీవీ ఎంటర్టైన్మెంట్స్ అధినేత దానయ్య తన కుమారుడ్ని హీరో పరిచయం చేసేందుకు ప్లాన్ చేస్తున్నారట. ఎంతో మంది నటులను వెండితెరకు పరిచయం చేసిన దర్శకుడు తేజ ఈ చిత్రానికి దర్శకత్వం వహించే అవకాశం ఉన్నట్టుగా తెలుస్తోంది. ప్రస్తుతం చర్చల దశలో ఉన్న ఈ ప్రాజెక్ట్‌లో హీరోయిన్ గా కాజల్ అగర్వాల్‌ను ఫైనల్ చేసే ఆలోచనలో ఉన్నారు. ఇప్పటికే స్క్రిప్ట్ ఫైనల్ అయ్యిందని, త్వరలోనే ప్రీ ప్రొడక్షన్ పనులు ప్రారంభించనున్నారన్న టాక్ వినిపిస్తోంది. -
స్పెషల్ సాంగ్‌కి సై
దర్శకుడు బోయపాటి శీను సినిమా అంటేనే ఫుల్ మాస్. అభిమానులంతా కోరుకునే హై వోల్టేజ్ యాక్షన్‌తో పాటు ఊర మాస్ స్పెషల్ సాంగ్ కూడా ఉంటుంది. ‘తులసి’లో ‘నే చుకు చుకు బండిని రో...’, ‘సరైనోడు’లో ‘బ్లాక్‌బస్టరు బ్లాక్‌బస్టరే..’ అందుకు ఉదాహరణలు. ప్రస్తుతం రామ్ చరణ్ హీరోగా బోయపాటి శీను ఓ చిత్రం తెరకెక్కిస్తున్న సంగతి తెలిసిందే. డీవీవీ ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్‌పై దానయ్య నిర్మిస్తున్నారు. ఇందులో కియారా అద్వానీ కథానాయిక. ఈ సినిమాలో కూడా ఓ స్పెషల్ సాంగ్ ప్లాన్ చేశారట బోయపాటి. ఈ సాంగ్‌లో రామ్ చరణ్‌తో పాటు రకుల్ ప్రీత్‌సింగ్ ఊర మాస్ స్టెప్పులు వేయనున్నారని ఫిల్మ్‌నగర్ టాక్. ఇప్పటివరకూ రకుల్ స్పెషల్ సాంగ్స్ చేయలేదు. ఒకవేళ ఈ పాటకు గ్రీన్ సిగ్నల్ ఇస్తే.. ఫస్ట్ టైమ్ ఈ స్పెషల్ సాంగ్‌లో ఏ రేంజ్లో స్టెప్పులతో అదరగొడతారో చూడాలి మరి. రకుల్ ప్రీత్ సింగ్ ప్రస్తుతం తమిళంలో కార్తీతో ఓ సినిమా, హిందీలో అజయ్ దేవగన్‌తో ఓ సినిమాతో బిజీగా ఉన్నారు. -
సంక్రాంతికి..
అరవైమంది ఆర్టిస్టులు... 500 మంది బాడీ బిల్డర్స్.. 5 కోట్ల ఫైట్‌లోకి హీరో రామ్‌చరణ్ దిగితే... ఇక చెప్పేది ఏముంది? విలన్స్‌కు ఊచకోతే. ఈ యాక్షన్ పండగ థియేటర్స్‌లోకి వచ్చేది సంక్రాంతి పండక్కే. అంటే.. వచ్చే ఏడాది సంక్రాంతి బరిలో రామ్‌చరణ్ రెడీ అన్నమాట. బోయపాటి శీను దర్శకత్వంలో రామ్‌చరణ్ హీరోగా డీవీవీ ఎంటర్టైన్మెంట్స్ పతాకంపై డీవీవీ దానయ్య ఓ చిత్రం నిర్మిస్తున్న సంగతి తెలిసిందే. ఇందులో కియారా అద్వానీ కథానాయిక. ప్రస్తుతం ఈ సినిమా నాలుగో షెడ్యూల్ షూటింగ్ హైదరాబాద్‌లో జరుగుతోంది. యాక్షన్ సన్నివేశాలను చిత్రీకరిస్తున్నారు. ఈ సీన్స్‌లో కియారా అద్వానీ కూడా పాల్గొంటున్నారు. నిర్మాత డీవీవీ. దానయ్య మాట్లాడుతూ– ‘‘రామ్‌చరణ్, మాస్ డైరెక్టర్ బోయపాటి కాంబినేషన్లో మా బ్యానర్లో సినిమా చేయడం ఆనందంగా ఉంది. రీసెంట్గా బ్యాంకాంక్ షెడ్యూల్‌ను కంప్లీట్ చేశాం. ఇప్పుడు హైదరాబాద్‌లో భారీ యాక్షన్ సన్నివేశాలను చిత్రీకరిస్తున్నాం. రామ్‌చరణ్‌ను సరికొత్త యాంగిల్లో ప్రజెంట్ చేస్తున్నారు బోయపాటి. ఫ్యామిలీ ఎమోషన్స్‌కు పవర్ ప్యాక్డ్ యాక్షన్‌ను జోడిస్తున్నాం. ఈ సినిమాను వచ్చే ఏడాది సంక్రాంతికి రిలీజ్ చేస్తున్నాం’’ అన్నారు. ఈ చిత్రానికి దేవిశ్రీ ప్రసాద్ స్వరాలు అందిస్తున్నారు. -
‘స్వీటెస్ట్ మ్యాంగోస్ ఫ్రం స్వీటెస్ట్ కపుల్’
మెగాపవర్ స్టార్ రామ్ చరణ్, ఉపాసన వివాహబంధంతో ఒక్కటై గురువారం(జూన్ 14) నాటికి ఆరేళ్ళు అయింది. తమ పెళ్ళి రోజు సందర్భంగా రామ్ చరణ్‌తో ఉన్న ఫొటోలను ఉపాసన సోషల్ మీడియాలో పోస్టు చేసిన విషయం విదితమే. ప్రస్తుతం ఆ రొమాంటిక్ ఫొటోలు వైరల్ అయ్యాయి. మెగా ఫ్యామిలీ సంబరాల్లో మునిగిపోయింది. ఈ సందర్భంగా తమ తోటలో పండిన మ్యాంగోస్‌ను కొంతమంది సన్నిహితులకు చెర్రీ దంపతులు పంపించారు. నిర్మాత డీవీవీ దానయ్యకు కూడా మామిడి పండ్ల బుట్టను ఈ దంపతులు పంపించారు. చెర్రీ దంపతులు పంపించిన మామిడి పండ్ల బుట్టను డీవీవీ సోషల్ మీడియా వేదికగా పంచుకున్నారు. ‘స్వీటెస్ట్ మ్యాంగోస్ ఫ్రం స్వీటెస్ట్ కపుల్ రామ్ చరణ్, ఉపాసన కొణిదెల. థ్యాంక్యూ సో మచ్. ఇద్దిరికీ పెళ్లి రోజు శుభాకాంక్షలు’ తెలిపారు. గతంలో రామ్ చరణ్ హీరోగా నటించిన ‘బ్రూస్లీ’, ‘నాయక్’ చిత్రాలను కూడా డీవీవీ దానయ్య నిర్మించారు. -
బ్యాంకాక్ టు హైదరాబాద్
బ్యాంకాక్ నుంచి తిరిగొచ్చిన రామ్‌చరణ్ కుటుంబం మరికొన్ని రోజులు సకుటుంబ సపరివార సమేతంగా హైదరాబాద్‌లో సందడి చేయనుంది. మరి హైదరాబాద్‌లో మకాం ఎన్ని రోజులంటే పది రోజులకుపైనే అట. ఏం చెప్తున్నామో అర్థం కావట్లేదా? రామ్ చరణ్ కొత్త చిత్రం షూటింగ్ విశేషాలండి. ఒక సినిమా ఒప్పుకున్న తర్వాత స్టార్టింగ్ టు ఎండింగ్ యూనిట్‌ని ఫ్యామిలీయే అనుకుంటారు కదా. బోయపాటి శ్రీను దర్శకత్వంలో రామ్ చరణ్ హీరోగా డీవీవీ దానయ్య ఓ చిత్రం నిర్మిస్తోన్న విషయం తెలిసిందే. ఇందులో కియారా అద్వానీ కథానాయిక. స్నేహా, ఆర్యన్ రాజేశ్, ప్రశాంత్, బాలీవుడ్ నటుడు వివేక్ ఒబెరాయ్ కీలక పాత్రల్లో నటిస్తున్నారు. ఈ సినిమాకు సంబంధించిన బ్యాంకాక్ షెడ్యూల్ కంప్లీట్ చేసిన బృందం ఇప్పుడు హైదరాబాద్‌కి షిఫ్ట్ అయ్యారు. జూన్ 14 నుంచి స్టార్ట్ అయ్యే ఈ షెడ్యూల్లో ఫ్యామిలీ సీన్స్ షూట్ చేయనున్నారు. ఇందులో చరణ్, కియారాతో పాటు మిగతా తారాగణం పాల్గొననుంది. ఈ షెడ్యూల్ పదిహేను రోజులపాటు సాగనుంది. తమన్ స్వరాలు సమకూరుస్తున్న ఈ చిత్రం దసరాకు విడుదల కానుంది. -
ప్యాకప్ కే బాద్
రామ్ చరణ్ ఏదైనా జోక్ చెప్పారా? లేక వర్కౌట్స్ సెషన్స్‌లో ఫన్నీ ఇన్సిడెంట్ ఏదైనా జరిగిందా? ఇలాగే డౌట్స్ వస్తాయి కదూ... పక్కనున్న ఫొటోలో బాగా నవ్వుతున్న హీరోయిన్ కియారా అద్వానీని చూస్తే. ఇంతకీ చరణ్, కియారా వర్కౌట్స్ చేస్తోంది ఎక్కడో తెలుసా? థాయిలాండ్‌లో. బోయపాటి శ్రీను దర్శకత్వంలో రామ్‌చరణ్, కియారా అద్వానీ జంటగా డీవీవీ ఎంటర్టైన్మెంట్స్ పతాకంపై డీవీవీ దానయ్య ఓ సినిమాను నిర్మిస్తున్నారు. ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ బ్యాంకాక్‌లో జరుగుతోంది. షూటింగ్ ప్యాకప్ కే బాద్ వర్కౌట్స్ చేయడానికి జిమ్‌కి వెళ్తున్నారట రామ్ చరణ్ అండ్ కియారా. ‘‘షూటింగ్ ప్యాకప్... నెక్ట్స్ కో–స్టార్‌తో కలిసి వర్కౌట్స్ చేస్తున్నా’’ అని రామ్ చరణ్‌తో కలిసి వర్కౌట్స్ చేసిన వీడియోను సోషల్ మీడియాలో షేర్ చేశారు కియారా. -
చెర్రీతో పోటీపడుతూ మరీ...
బ్యాంకాక్: రంగస్థలం లాంటి ఘనవిజయం తరువాత మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ ఇప్పుడు బోయపాటి శ్రీను దర్శకత్వంలో ఓ సినిమా చేస్తున్నాడు. మాస్ కమర్షియల్ ఎంటర్టైనర్గా తెరకెక్కుతున్న ఈ సినిమాలో కైరా అద్వానీ హీరోయిన్. డీవీవీ ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్‌పై దానయ్య భారీ బడ్జెట్‌తో నిర్మిస్తున్నారు. ప్రస్తుతం ఈ సినిమా షెడ్యూల్ బ్యాంకాక్‌లో జరుగుతోంది. అక్కడ చెర్రీ-కైరా ఇద్దరూ పోటీపడి మరీ వర్కవుట్లు చేస్తున్నారు. బోయపాటి చిత్రం కోసం సరికొత్త యాంగిల్లో కనిపించేందుకు రామ్ చరణ్ బాడీని డెవలప్ చేస్తుండగా, కైరా కూడా తానేం తక్కువ కాదంటూ ఎక్సర్సైజులు చేసింది. సరదాగా ఆ వీడియోను ఆమె తన ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్టు చేయగా, వైరల్ అవుతోంది. ఇక ఫ్యామిలీ ఎమోషన్స్‌తో పాటు యాక్షన్ ఎలిమెంట్స్‌తో ఎంటర్టైనర్గా బోయపాటి ఈ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నట్లు నిర్మాత దానయ్య చెబుతున్నారు. వివేక్ ఒబేరాయ్, ప్రశాంత్ తదితరులు కీలకపాత్రలు పోషిస్తున్న ఈ చిత్రానికి దేవీశ్రీప్రసాద్ సంగీతం అందిస్తున్నాడు. -
చెర్రీతో పోటీగా కైరా అద్వానీ..
-
బ్యాంకాక్ బంగ్లాలో
బ్యాంకాక్‌కి పయనం అయ్యారు రామ్‌చరణ్. ఇరవై రోజులు అక్కడే ఉంటారు. వెకేషనేమో అనుకుంటున్నారా? నో చాన్స్ అంటున్నారు రామ్‌చరణ్. ఈ హీరోగారు వెళ్లింది షూటింగ్ కోసం. బోయపాటి శ్రీను దర్శకత్వంలో చరణ్ హీరోగా డీవీవీ దానయ్య ఓ సినిమా నిర్మిస్తున్న విషయం తెలిసిందే. ఇందులో కియారా అద్వానీ కథానాయిక. ఈ సినిమా కొత్త షెడ్యూల్ కోసం టీమ్ అంతా బ్యాంకాక్ వెళ్లింది. సుమారు 120 మంది ఆర్టిస్టులతో అక్కడ భారీ షెడ్యూల్‌ను ప్లాన్ చేశారు బోయపాటి. బ్యాంకాక్‌లోని పెద్ద బంగ్లాలో షూట్ చేయనున్నారట. ఈ సీన్స్‌లో సినిమాలోని కీలక పాత్రధారులందరూ పాల్గొననున్నారు. ఈ ఫ్యామిలీ ఎంటర్టైనర్ను సెప్టెంబర్‌లో రిలీజ్‌కు ప్లాన్ చేస్తున్నారు. ఈ సినిమాకు సంగీతం: యస్.యస్. తమన్. -
వివాదంలో ‘భరత్ అనే నేను’
సాక్షి, హైదరాబాద్: సూపర్ స్టార్ మహేశ్ బాబు హీరోగా కొరటాల శివ దర్శకత్వంలో తెరకెక్కిన సూపర్ హిట్ సినిమా ‘భరత్ అనే నేను’. ఏప్రిల్ 20న ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ సినిమా ఇప్పటికీ మంచి కలెక్షన్లతో ప్రదర్శితమవుతోంది. తాజాగా ఈ చిత్రం ఓ వివాదంలో చిక్కుకుంది. సినిమాలో వాడిన రాజకీయ పార్టీ పేరు, గుర్తు కూడా తమదేనని నవోదయం పార్టీ అధ్యక్షుడు దాసరి రాము ఆరోపిస్తున్నారు. తమ పార్టీకి ఎన్నికల గుర్తింపు కూడా ఉందని.. అలాంటిది పార్టీ పేరు, గుర్తు చిత్రంలో ఎలా ఉపయోగించారని ఆయన ప్రశ్నించారు. ఈ అంశంపై దర్శక, నిర్మాతలకు నోటీసులు పంపనున్నట్టు దాసరి రాము పేర్కొన్నారు. -
బ్యాంకాక్‌కు చెర్రీ, బోయపాటి
రంగస్థలం లాంటి ఘనవిజయం తరువాత మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ ప్రస్తుతం బోయపాటి శ్రీను దర్శకత్వంలో ఓ సినిమా చేస్తున్నాడు. మాస్ కమర్షియల్ ఎంటర్టైనర్గా తెరకెక్కుతున్న ఈ సినిమాలో కియారా అద్వానీ హీరోయిన్గా నటిస్తుండగా డీవీవీ ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్‌పై దానయ్య భారీ బడ్జెట్‌తో నిర్మిస్తున్నారు. తాజాగా ఈ సినిమాకు సంబంధించిన మేజర్ షెడ్యూల్ హైదరాబాద్‌లో పూర్తయ్యింది. తదుపరి షెడ్యూల్ మే 12 నుంచి బ్యాంకాక్‌లో జరగనుంది. ఈ సందర్భంగా చిత్ర నిర్మాత దానయ్య మాట్లాడుతూ ‘మాస్ ఇమేజ్ ఉన్న హీరో రామ్ చరణ్, మాస్ డైరెక్టర్ బోయపాటి శ్రీను కాంబినేషన్లో సినిమా అంటే సినిమాపై ఎన్ని అంచనాలుంటాయో అందరికీ తెలిసిందే. ఆ అంచనాలకు ధీటుగా సినిమాను రూపొందిస్తున్నాం. సినిమా చిత్రీకరణ శరవేగంగా జరుగుతోంది. హైదరాబాద్‌లో మేజర్ షెడ్యూల్ పూర్తయ్యింది. అందులో భాగంగా రామోజీ ఫిలిం సిటీలో ఫ్యామిలీ సన్నివేశాలను, అల్యూమినియం ఫ్యాక్టరీలో యాక్షన్ ఎపిసోడ్‌ను పూర్తి చేశాం. ఈ 20 రోజుల షెడ్యూల్లో రామ్ చరణ్, ప్రశాంత్, స్నేహ, కియారాలతో పాటు ప్రధాన తారాగణంపై సన్నివేశాలను చిత్రీకరించారు. అంతుకు ముందుకు చిత్రీకరించిన 15 రోజుల షెడ్యూల్లో వివేక్ ఒబెరాయ్ సహా ప్రధాన తారాగణంపై సన్నివేశాలను చిత్రీకరించాం. తదుపరి షెడ్యూల్ కోసం యూనిట్ బ్యాంకాక్ వెళుతోంది. ఈ షెడ్యూల్ 15 రోజుల పాటు సాగుతుంది. మెగాభిమానులు, ప్రేక్షకులను అలరించేలా రామ్ చరణ్‌ను సరికొత్త యాంగిల్లో ప్రెజెంట్ చేస్తున్నారు డైరెక్టర్ బోయపాటి శ్రీను. ఫ్యామిలీ ఎమోషన్స్‌తో పాటు పవర్ ప్యాక్డ్ యాక్షన్ ఎలిమెంట్స్‌తో కమర్షియల్ ఎంటర్టైనర్గా సినిమాను రూపొందిస్తున్నాం’ అన్నారు. -
‘భరత్...’ అన్‌సీన్ వీడియోస్
సూపర్ స్టార్ మహేష్ బాబు హీరోగా కొరటాల శివ దర్శకత్వంలో తెరకెక్కిన సూపర్ హిట్ సినిమా భరత్ అనే నేను. ఏప్రిల్ 20న రిలీజ్ అయిన ఈ సినిమా ఇప్పటికీ హౌస్‌ఫుల్ కలెక్షన్లతో రన్ అవుతోంది. తాజాగా సూపర్ స్టార్ అభిమానుల కోసం చిత్రయూనిట్ ఓ సర్ప్రైజ్ ఇచ్చింది. ఎలాంటి ఎనౌన్స్మెంట్ లేకుండానే సినిమాలో లేని నాలుగు వీడియో క్లిప్‌లను రిలీజ్ చేశారు. నిడివి కారణంగా సినిమాలో తొలగించిన సన్నివేశాలను యూట్యూబ్ లో రిలీజ్ చేశారు చిత్రయూనిట్. అసెంబ్లీలో బడ్జెట్‌కు సంబంధించిన డిస్కషన్‌తో పాటు మరో మూడు సన్నివేశాలను చిత్రయూనిట్ రిలీజ్ చేశారు. పోస్ట్ ప్రొడక్షన్ వర్క్ కూడా పూర్తి కాని ఈ సన్నివేశాలు ఈ ఇప్పుడు సోషల్ మీడియాలో ట్రెండ్ అవుతున్నాయి. -
భరత్ అనే నేను అన్‌సీన్ వీడియోస్
-
ఫైట్ ముగిసింది
నాలుగు రోజులుగా వీర లెవల్లో విలన్స్‌ను వాయించారు రామ్‌చరణ్. ఈ ఉతుకుడు ఎలా ఉందనేది వెండితెరపై చూడాల్సిందే. రామ్‌చరణ్ హీరోగా బోయపాటి శ్రీను దర్శకత్వంలో డీవీవీ దానయ్య ఓ సినిమాను నిర్మిస్తున్న సంగతి తెలిసిందే. ఇందులో కియారా అద్వానీ కథానాయిక. ఈ చిత్రం కోసం హైదరాబాద్‌లో ఓ భారీ ఫైట్ చిత్రీకరించారు. మొత్తం నాలుగు రోజుల పాటు జరిగిన ఈ హై యాక్షన్ సీక్వెన్స్‌కి కణల్ కన్నన్ ఫైట్ మాస్టర్‌గా చేశారు. గురువారంతో ఈ ఫైట్ సీన్ పూర్తయింది. బోయపాటి సినిమాల్లో యాక్షన్ సీక్వెన్సెస్ సమ్‌థింగ్ స్పెషల్‌గా ఉంటాయి. మరి... ఈ ఫైట్ ఏ రేంజ్లో ఆడియన్స్‌ను హుషారెత్తిస్తుందో తెలుసుకోవడానికి బొమ్మ థియేటర్స్‌లో పడేంతవరకు ఆగాల్సిందే. -
ఎవరినీ నొప్పించాలనుకోను
‘‘నేను ఏ సినిమా తీసినా ఎవర్నీ హర్ట్ చేయకూడదనుకుంటాను. నా కాన్సంట్రేషన్ అంతా ఆడియన్స్ పైనే. పర్సనల్‌గా సెటైర్ వేసి సినిమాకు మైలేజ్ పొందుదామనుకునే చీప్ ఫిల్మ్ మేకర్ని కాను నేను. ప్రజలను మోటివేట్ చేయాలనుకున్నాను. అందుకే ఇష్యూస్‌ను అడ్రస్ చేశాను. పీపుల్స్‌కు నా సినిమా రీచ్ అవ్వాలి, నిర్మాతకు డబ్బులు రావాలి, ఎప్రిషియేషన్ కూడా రావాలి అనే ఫ్యాక్టర్స్‌ని కూడా ఆలోచిస్తా’’ అన్నారు దర్శకుడు కొరటాల శివ. మహేశ్‌బాబు హీరోగా ఆయన దర్శకత్వంలో డీవీవీ దానయ్య నిర్మించిన సినిమా ‘భరత్ అనే నేను’. ఈ సినిమా సక్సెస్‌ను చిత్రబృందం ఎంజాయ్ చేస్తోంది. ఈ సందర్భంగా హైదరాబాద్‌లో ఏర్పాటు చేసిన విలేకర్ల సమావేశంలో కొరటాల శివ మాట్లాడుతూ –‘‘సినిమా బ్లాక్‌బస్టర్‌గా నిలిచి, ఇంత ఎప్రిషియేషన్ రావడం చాలా ఆనందంగా ఉంది. కేటీఆర్‌గారు, జయప్రకాశ్ నారాయణ లాంటి వారు సినిమా బాగుందని చెప్పడం హ్యాపీ. ఎవరైనా కొత్త ఆలోచనలతో వస్తే నేను ప్రొడ్యూస్ చేస్తా. ఆ ఆలోచన ఉంది. ‘శ్రీమంతుడు’ అంటే గ్రామాల దత్తత మాత్రమే. అదే సీయం క్యారెక్టర్ మోర్ పవర్ఫుల్ అయితే మరిన్ని ఇష్యూస్ అడ్రెస్ చేయవచ్చని ఈ కథను తీసుకున్నాం. ప్రతి సినిమాలో కొత్త చాలెంజ్‌ను కోరుకునే నటుడు మహేశ్‌బాబు. ఆలా ప్రయోగాలు చేసే హీరో కెరీర్లో ఓన్లీ హిట్స్ మాత్రమే ఉండకపోవచ్చు. నేను రెండు సార్లు మహేశ్‌గారికి లైఫ్ ఇచ్చానని ఆయన చెప్పారు. అది మహేశ్‌గారి గొప్పదనం. బాలీవుడ్లో ఆఫర్లు వచ్చాయి. ‘మిర్చి’ సినిమాను రీమేక్ చేయమని చాలామంది అడిగారు. టాలీవుడ్లో నాకు కంఫర్ట్ అనిపించింది. రామ్‌చరణ్‌గారితో రెండు సినిమాలు ఉన్నాయి. మహేశ్‌గారితో మరో సినిమా ఉంటుంది. ఎప్పుడు అనేది ఇప్పుడే చెప్పలేను. అయితే నెక్ట్స్ సినిమా ఏంటి? అనేది ఇంకా ఫిక్స్ కాలేదు. హాలిడేకి వెళ్లాలనుకుంటున్నా. వచ్చిన తర్వాత పక్కా కమర్షియల్ ఎలిమెంట్స్ ఉన్న సినిమాను తెరకెక్కించాలనుకుంటున్నా’’ అన్నారు. ‘భరత్ అనే నేను’ గురించి ఇంకా చెబుతూ – ‘‘మొదట్లో టు పార్ట్స్ చేస్తే బాగుండు అనుకున్నాం. అంత కంటెంట్ కూడా ఉంది.చెప్పాల్సిన ఇష్యూస్ ఇంకా ఉన్నాయి. అందుకే అలా అనిపించింది. ఏమో ఎప్పటికైనా చెస్తామేమో! మహేశ్ క్యారెక్టర్ కోసం ఓన్లీ పొలిటీషియన్స్నే రిఫరెన్స్‌గా తీసుకోలేదు. లీడర్‌కి ఉండాల్సిన క్వాలిటీస్‌ను తీసుకొన్నాను. ఆ లీడర్ ఒక సోషల్ వర్కర్ అయ్యి ఉండచ్చు. ఇన్స్ట్యూషన్ హెడ్ అయ్యి కూడా ఉండచ్చు. ఏ ఇండస్ట్రీ అయినా ఫస్ట్ చాన్స్ వారసులకే ఇస్తుంది. సినిమాలో భరత్ రామ్ క్యారెక్టర్ అలానే సీయం అయ్యాడు’’ అన్నారు. ఇటీవల పోసానిగారు మీ కథలను కొందరు తీసుకున్నారు అన్నారు. దీని గురించి ఏమంటారు? అన్న ప్రశ్నకు బదులిస్తూ– ‘‘ఆ విషయం ఇక్కడ అప్రస్తుతం. పాత ఇష్యూస్ అవి. ఒక జాబ్‌లోకి వెళ్లినప్పుడు పాజిటివ్స్ అండ్ నెగటివ్స్ ఉంటాయి. ఇది ఇండస్ట్రీలో ఉంది. వాటిని ఓవర్‌కమ్ చేసుకుని ముందుకు వెళ్లాలి’’ అని అన్నారు. -
ఇంటర్వెల్‌తో ఎంట్రీ
ఫుల్ మాస్ హీరోకు మాస్ డైరెక్టర్ తోడైతే ఇక పిక్చర్ ఊర మాసే. థియేటర్స్‌లో ఆడియన్స్ విజిల్సే. రామ్‌చరణ్ హీరోగా బోయపాటి శ్రీను దర్శకత్వంలో డీవీవీ ఎంటర్టైన్మెంట్స్ పతాకంపై డీవీవీ దానయ్య ఓ సినిమాను నిర్మిస్తున్న సంగతి తెలిసిందే. ఇందులో కియారా అద్వానీ కథానాయిక. ఈ సినిమా షూటింగ్ ప్రస్తుతం శరవేగంగా జరుగుతోంది. ఈ సినిమాలో న్యూ లుక్‌లో కనిపించడం కోసం రామ్‌చరణ్ ఆల్రెడీ హెవీ వర్కౌట్స్ చేసిన సంగతి తెలిసిందే. ఈ ఆదివారం నుంచి ఈ షూటింగ్లో పాల్గొంటున్నారు హీరో రామ్‌చరణ్. ప్రస్తుతం ఇంటర్వెల్‌కి ముందు వచ్చే లీడ్ సీన్ తీస్తున్నారని సమాచారం. ఇంటర్వెల్ బ్యాంగ్ అంటే కచ్చితంగా అదిరిపోయేలా ఉంటుందని ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. సో.. రామ్‌చరణ్ ఇంటర్వెల్ సీన్స్‌తో ఈ సెట్స్‌లోకి ఎంటరయ్యారన్నమాట. కియారా అద్వానీ కూడా సెట్స్‌లోకి అడుగుపెట్టింది. ఆ సంగతలా ఉంచితే.. ఈ షూటింగ్ లొకేషన్లో బుధవారం బోయపాటి బర్త్‌డే జరిగింది. చిత్రబృందం సమక్షంలో బోయపాటి కేక్ కట్ చేశారు. -
నా లైఫ్‌లో అదే పెద్ద అభినందన
‘‘రెండేళ్లుగా నాకు చాలా ఎమోషనల్‌గా, ఒత్తిడిగా ఉండేది. ఇప్పుడు రిలీఫ్. ఎలా రియాక్ట్ అవ్వాలో తెలియడం లేదు. చాలా ఆనందంగా ఉంది. ‘భరత్ అనే నేను’ని హిట్ చేసిన ప్రేక్షకులు, నాన్నగారి, నా ఫ్యాన్స్‌కు థ్యాంక్స్’’ అని మహేశ్‌బాబు అన్నారు. మహేశ్‌బాబు, కియారా అద్వాని జంటగా కొరటాల శివ దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం ‘భరత్ అనే నేను’. డి. పార్వతి సమర్పణలో దానయ్య డీవీవీ నిర్మించిన ఈ సినిమా గత శుక్రవారం విడుదలైంది. ఈ సందర్భంగా హైదరాబాద్‌లో నిర్వహించిన థ్యాంక్స్ మీట్లో మహేశ్‌బాబు మాట్లాడుతూ– ‘‘బ్రహ్మాజీ నాతో యాక్ట్ చేసినప్పుడల్లా 99 పర్సెంట్ బ్లాక్‌బస్టర్సే. తెలుగు చిత్ర పరిశ్రమకి కియారా లాంటి ఇంకో పెద్ద హీరోయిన్ వచ్చినందుకు హ్యాపీగా ఉంది. శివగారికి ఎప్పుడూ రుణపడి ఉంటా. ‘శ్రీమంతుడు’ సినిమాకి ముందు కూడా ఇదే ఫేజ్ ఉండేది నాకు. ‘శ్రీమంతుడు’ లాంటి బ్లాక్‌బస్టర్ ఇచ్చారు. తర్వాత అదే రిపీట్ చేశారు. నేను పడుతున్న టెన్షన్ ఆయనకు తెలుసు. మళ్లీ ఓ బ్లాక్‌బస్టర్ ఇచ్చారు. ‘ఐ యామ్ ఆల్వేస్ గ్రేట్ఫుల్ టు యు సర్’. నేనెప్పుడూ ఏ సినిమాకీ ఇంత కష్టపడి పనిచేయలేదు. మా సినిమా రిలీజ్ ముందు ఏప్రిల్ 27న అనుకున్నాం. 20కి వచ్చాం. అది మా అమ్మగారి పుట్టినరోజు. ఆ రోజు రిలీజ్ డేట్ ప్రకటించిన నిర్మాతకి, యూనిట్‌కి థ్యాంక్స్. ఆ రోజు సినిమా విడుదల అవడం వల్లే ఇన్ని బ్లెసింగ్స్ వచ్చాయేమో మాకు. 20న సినిమా రిలీజ్ అంటే పదో తారీఖు నా డబ్బింగ్ పూర్తయింది. ఈ టెన్షన్ తట్టుకోలేక ఫ్యామిలీతో కలిసి ఐదు రోజులు వెకేషన్ వెళ్లా. దేవి ఈజ్ నాట్ ఏ మ్యూజిక్ డైరెక్టర్. నేపథ్య సంగీతంతో స్టోరీ చెప్పేశారు. ఎప్పటి నుంచో నాతో సినిమా చేయాలని దానయ్యగారికి ఉండేది. ‘భరత్ అనే నేను’ చేశాం. పెద్ద హిట్ అయింది. రిలీజ్ రోజు సాయంత్రం ఆయన్ని కలిసి.. ‘కొట్టేశాం దానయ్యగారు పెద్ద హిట్’ అంటే.. ‘అవ్వుద్దండీ.. ఎందుకు అవ్వదు.. అవ్వాలి కదా!’ అన్నారు. ‘మీతో మళ్లీ మళ్లీ సినిమా చేస్తాను సార్’. థ్యాంక్యూ. సినిమాలో ఇంకా చాలా ఎగై్జటింగ్ సీన్స్ ఉన్నాయి. అవన్నీ పెట్టలేకపోయా మనే బాధ ఉంది. నాన్నగారికి (కృష్ణ) సినిమా విపరీతంగా నచ్చింది. ఈ చిత్రం ఫస్ట్ ఓత్ విడుదలైనప్పుడు ‘అరే.. ఇది నా వాయిస్‌లా ఉందే’ అన్నారు. రమేశ్ అన్నయ్య చెన్నైలోనే ఎక్కువగా పెరిగారు. శివాజీ గణేశన్, ఎంజీఆర్గార్లంటే ఆయనకి ఇష్టం. వారికి బిగ్ ఫ్యాన్. ‘భరత్ అనే నేను’ సినిమా చూడగానే నాకు వాళ్లు గుర్తొచ్చారు అని చెప్పారు. అది నా లైఫ్‌లో బిగ్ కాంప్లిమెంట్’’ అన్నారు. నిర్మాత దానయ్య మాట్లాడుతూ– ‘‘మా సినిమా ప్రీ–రిలీజ్ ఫంక్షన్లో కృషగారు, మహేశ్ అభిమానులకు ఓ హామీ ఇచ్చా. అది నిలబెట్టుకున్నందుకు హ్యాపీగా ఉంది. ఈ మూవీ చూసి, చిరంజీవి గారు ఫోన్ చేసి మంచి సినిమా తీశావని అభినందించారు. నా బంధువులు, ఫ్రెండ్స్ గొప్ప సినిమా తీశావని ఫోన్లు, మెసేజ్‌లు చేశారు. గొప్ప సినిమా ఇచ్చిన శివగారికి, మహేశ్‌గారికి థ్యాంక్స్. హిట్ చేసిన ప్రేక్షకులకు ధన్యవాదాలు. 27న శుక్రవారం తిరుపతిలో సక్సెస్ మీట్ నిర్వహిస్తాం’’ అన్నారు. కొరటాల శివ మాట్లాడుతూ– ‘‘నేను నా స్క్రిప్ట్‌ని ఎంత ప్రేమిస్తానో నా నటీనటులు, టెక్నీషియన్స్ కూడా అంతే ప్రేమిస్తారు. మహేశ్‌లాంటి యాక్టర్ ఉన్నప్పుడు ఇంకా ఇంకా ఏదో రాయాలనే ఉంటుంది. ఆయన మంచి సపోర్ట్, కాన్ఫిడెన్స్ ఇచ్చారు. ఆయనతో ఎప్పుడెప్పుడు సినిమా చేద్దామా అని ఉంటుంది. గొప్ప సినిమా తీయాలని చెప్పిన దానయ్యగారి నమ్మకాన్ని నిలబెట్టాననుకుంటున్నా. మా కష్టం అంతా మరచిపోయేలా చేసినందుకు జీవితాంతం ప్రేక్షకులకు రుణపడి ఉంటాను. ‘శ్రీమంతుడు, భరత్ అనే నేను’ సినిమాలను మించిన లైన్ దొరికినప్పుడు మహేశ్‌గారి ఇంటికెళ్లి కాలింగ్ బెల్ నొక్కుతా’’ అన్నారు. ‘‘సక్సెస్, బ్లాక్ బస్టర్ హిట్స్ ఇండస్ట్రీలో అందరికీ వస్తుంటాయి. ఈ సినిమా ఎందుకు ప్రత్యేకం అంటే.. సమాజంలో ఏదైతే జరగాలో.. ఇలాంటోడు ఒకడు రావాలనుకుంటామో అలాంటి వాడు రావడంతో అందరూ కనెక్ట్ అయ్యారు’’ అన్నారు దేవిశ్రీ ప్రసాద్. ‘‘ఈ మూవీలో భాగమైనందుకు గర్వంగా ఉంది. మహేశ్ సార్‌లాంటి కో–స్టార్‌తో పనిచేయడం గ్రేట్ ఎక్స్పీరియన్స్. మిమ్మల్ని చూసి ఇన్స్పైర్ అవుతున్నా. నన్ను ఆదరించిన ప్రేక్షకులకు థ్యాంక్స్’’ అన్నారు కియారా. నటుడు బ్రహ్మాజీ, పాటల రచయిత రామజోగయ్యశాస్త్రి పాల్గొన్నారు. -
‘భరత్ అనే నేను’ రివ్యూ
టైటిల్ : భరత్ అనే నేను జానర్ : కమర్షియల్ డ్రామా తారాగణం : మహేష్ బాబు, కైరా అద్వానీ, ప్రకాశ్ రాజ్, శరత్ కుమార్, బ్రహ్మాజీ, రావు రమేష్ తదితరులు సంగీతం : దేవీశ్రీ ప్రసాద్ స్టోరీ-డైలాగులు-స్క్రీన్‌ప్లే-దర్శకత్వం : కొరటాల శివ నిర్మాత : డీవీవీ దానయ్య టాలీవుడ్ అగ్రహీరోల్లో ఒకరైన మహేష్ బాబుకు గత కొంత కాలంగా సరైన సక్సెస్ పడటం లేదు. ఈ క్రమంలో శ్రీమంతుడితో తనకు ఇండస్ట్రీ హిట్ అందించిన దర్శకుడు కొరటాల శివతో మరోసారి మన ముందకు వచ్చాడు. కంప్లీట్ పొలిటికల్ అండ్ కమర్షియల్ డ్రామాగా కొరటాల దీనిని తెరకెక్కించాడు. పొలిటికల్ సబ్జెక్ట్.. పైగా ముఖ్యమంత్రి పాత్రను మహేష్ పోషించటం విశేషం. భారీ అంచనాల మధ్య ఈ చిత్రం ఈరోజు ప్రేక్షకుల ముందుకు వచ్చింది. మరి ఫలితం ఎలా ఉందో ఇప్పుడు చూద్దాం .. కథ: భరత్ రామ్(మహేష్ బాబు)కు కొత్త విషయాలను నేర్చుకోవటమంటే చాలా ఇష్టం. అందుకే లండన్ ఆక్స్‌ఫోర్డ్ యూనివర్సిటీలో డిగ్రీలు చేస్తూనే ఉంటాడు. అలాంటి సమయంలో తండ్రి రాఘవ(శరత్ కుమార్) మరణం అతని జీవితాన్ని మలుపు తిప్పుతుంది. ప్రజలకు సేవ చేయాలన్న ఉద్దేశంతో నవోదయం పార్టీని స్థాపించి ముఖ్యమంత్రిగా ఎదిగిన రాఘవ మృతితో పార్టీలో చీలిక రాకుండా ఉండేందుకు రాజకీయ గురువు వరద(ప్రకాశ్ రాజ్) భరత్‌ను సీఎంను చేస్తాడు. అదుపు తప్పిన ప్రజా జీవితాన్ని భరత్ తన మొండి నిర్ణయాలతో గాడిన పెట్టే యత్నం చేస్తుంటాడు. భరత్ దూకుడు స్వభావం రాజకీయ వ్యవస్థ మీద కూడా తీవ్ర ప్రభావం చూపుతుంది. ముఖ్యంగా ప్రతిపక్ష పార్టీ నాయకుడి కుమారుడి కేసులో భరత్‌కు తొలి ఎదురుదెబ్బ తగులుతుంది. ప్రజల నుంచి భరత్‌కు మద్ధతు పెరుగుతున్నా.. సొంత పార్టీ నుంచే ప్రతిఘటన ఎదురవుతుంటుంది. ఈ పోరాటంలో భరత్ ఎలాంటి సమస్యలు ఎదుర్కొన్నాడు..? వాటన్నింటిని అధిగమించి భరత్ తన ప్రామిస్‌లను ఎలా పూర్తి చేస్తాడు? అన్నదే కథ. నటీనటులు భరత్ రామ్‌గా మహేష్ బాబు నటన గురించి ఎంత చెప్పుకున్నా తక్కువే. పొలిటికల్ డ్రామాగా తెరకెక్కిన కథను పూర్తిగా తన భుజాల మీదే నడిపించాడు. ముఖ్యమంత్రి పాత్రకు కావాల్సిన హుందాతనం చూపిస్తూనే, స్టైలిష్‌గా రొమాంటిక్‌గానూ ఆకట్టుకున్నాడు. తన కెరీర్లో మహేష్ క్లాస్ రోల్స్ చేసినప్పటికీ.. వాటిలో ఏదో వెలితిగా అనిపించేది. కానీ, భరత్‌గా ఓ ఛాలెంజింగ్ రోల్లో మహేష్ పూర్తిస్థాయిలో ఆకట్టుకున్నాడు. యంగ్ అండ్ డైనమిక్ చీఫ్ మినిస్టర్ పాత్రలో పర్ఫెక్ట్ గా ఒదిగిపోయాడు. తన కెరీర్ బెస్ట్ పెర్ఫార్మెన్స్ ఇచ్చాడు. యాక్షన్ ఎపిసోడ్స్ కూడా సూపర్ స్టార్ అభిమానులను అలరిస్తాయి. ఇక గాడ్ ఫాదర్ పాత్రలో ప్రకాశ్ రాజ్ మెప్పించాడు. ఇలాంటి పాత్రలను తాను తప్ప మరెవరూ పోషించలేనన్న రీతిలో ఆయన నటించాడు. హీరోయిన్ గా పరిచయం అయిన కైరా అద్వానీది చిన్న పాత్రే.. అయినా ఉన్నంతలో మంచి నటన కనబరిచింది. అందంతో పాటు అభినయంలోనూ మంచి మార్కులు సాధించింది. సీఎం భరత్ పర్సనల్ సెక్రటరీగా బ్రహ్మజీ.. పోసాని కామెడీ ట్రాక్‌లు ఆకట్టుకున్నాయి. శరత్ కుమార్, ఆమని, సితార, అజయ్, రావు రమేష్, దేవరాజ్, తమ పాత్రల మేర అలరించారు. విశ్లేషణ హ్యాట్రిక్ బ్లాక్బస్టర్లతో జోరు మీదున్న కొరటాల.. మహేష్‌తో చేసిన ప్రయత్నం ఆకట్టుకుంది. సమకాలీన రాజకీయ అంశాలు.. వాటికి తగ్గట్లు కమర్షియల్ అంశాలను జోడించి ప్రేక్షకులను ఎంగేజ్ చేశాడు. రాజకీయాలపై అవగాహన లేని వ్యక్తి ఏకంగా సీఎం అయిపోవటం, త్వరితగతిన నిర్ణయాలు తీసుకుని అందరినీ ఇబ్బంది పెట్టడం, అసెంబ్లీలో సరదాగా సాగిపోయే సన్నివేశాలు... ఫస్టాఫ్‌ను ఎంటర్టైనింగ్గా మలిస్తే, దుర్గా మహల్ ఫైట్.. సామాజిక సందేశం, హీరోయిజం ఎలివేట్ అయ్యే సన్నివేశాలు... ఇవన్నీ సెకండాఫ్‌ను నిలబెట్టాయి. పది నిమిషాల్లో అసలు కథలోకి ఎంటర్ అయిన దర్శకుడు తరువాత కథనాన్ని నెమ్మదిగా నడిపించాడు. అయితే కొరటాల మార్క్ డైలాగ్స్, మహేష్ ప్రజెన్స్ ఆడియన్స్‌ను ఎంగేజ్ చేస్తాయి. సీఎం స్థాయి వ్యక్తి రోడ్డు మీద అమ్మాయిని చూసి ప్రేమించటం లాంటి విషయాల్లో కాస్త ఎక్కువగానే సినిమాటిక్ లిబర్టీ తీసుకున్నట్టుగా అనిపిస్తుంది. కొరటాల గత చిత్రాల్లో కనిపించిన వీక్నెస్ ఈ సినిమాలో కూడా కొనసాగింది. క్లైమాక్స్ అభిమానులు ఆశించిన స్థాయిలో లేదు. భరత్ సీఎంగా రాజీనామా-తిరిగి పగ్గాలు చేపట్టడం లాంటి సన్నివేశాల్లో దర్శకుడు నాటకీయత ఎక్కువగా జోడించాడు. ఇక టెక్నీకల్ టీమ్ మంచి తోడ్పాటును అందించింది. సినిమాటోగ్రఫర్ రవి కే చంద్రన్, తిర్రు టాప్ క్లాస్ పనితనాన్ని అందించారు. ముఖ్యంగా పాటలు, యాక్షన్స్ సీన్స్ పిక్చరైజేషన్స్ వావ్ అనిపిస్తుంది. దేవీ పాటలు, బ్యాక్ గ్రౌండ్ స్కోర్‌తో మెప్పించాడు. ముఖ్యంగా ఒక్కో పాత్రకు ఒక్కో సిగ్నేచర్ బ్యాక్ గ్రౌండ్ స్కోర్‌తో పాత్రలను మరింతగా ఎలివేట్ చేశాడు శ్రీకర్ ప్రసాద్ ఎడిటింగ్ బావుంది. నిర్మాణ విలువలు బాగున్నాయి. భరత్ పాత్ర.. దానిలో మహేష్ కనబరిచిన నటన.. కొరటాల అందించిన డైలాగులు ఇలా అన్ని హంగులు అన్నివర్గాల ప్రేక్షలను అలరించేవిగా ఉన్నాయి. ఫ్లస్ పాయింట్లు : మహేష్ బాబు కథా-కథనం పాటలు, బ్యాక్ గ్రౌండ్ స్కోర్ సమకాలీన రాజకీయాంశాలను సమతుల్యంగా చూపించటం మైనస్ పాయింట్లు: స్లో నెరేషన్ సాగదీత సన్నివేశాలు క్లైమాక్స్ -
నా టెన్షన్ ఎప్పుడూ ఆయన గురించే – కొరటాల శివ
‘‘భరత్ అనే నేను’ కథ మహేశ్‌బాబు వినగానే ఇంట్రెస్టింగ్గా ఉంది. ఎలాంటి కాంట్రవర్సీ లేకుండా ఇంత స్పాన్ ఉన్న కథ రాయడం కష్టం అన్నారు. మహేశ్ ఇన్వాల్వ్ అయి, కేర్ తీసుకొని ఈ సినిమా చేశారు’’ అని కొరటాల శివ అన్నారు. మహేశ్‌బాబు, కియారా అద్వాని జంటగా కొరటాల శివ దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం ‘భరత్ అనే నేను’. డి. పార్వతి సమర్పణలో దానయ్య డీవీవీ నిర్మించిన ఈ సినిమా ఈరోజు విడుదలవుతోంది. కొరటాల శివ మాట్లాడుతూ– ‘‘మిర్చి’ తర్వాత దానయ్యగారికి సినిమా చెయ్యాలి. ‘జనతా గ్యారేజ్’ తర్వాత ఆయనతో మహేశ్‌గారితో సినిమా చేద్దాం అన్నాను. ‘మహేశ్‌తో సినిమా నా కల. బాగా రెస్పెక్ట్ వచ్చే, రిచ్‌గా ఉండే చిత్రం కావాలి’ అన్నారు దానయ్య. అప్పటినుంచి నాకెప్పుడూ ఆయన గురించే టెన్షన్ ఉండేది. ఫ్యాన్స్‌ని ఈజీగా శాటిస్ఫై చెయ్యొచ్చు. ఈ సినిమా స్క్రిప్ట్ రాసేటప్పుడు ప్రతి సీన్ రిచ్‌గా, గ్రాండ్‌గా ఉండాలనుకున్నా. ఇది రెగ్యులర్ సినిమా కాదు. కమర్షియల్ ఎంటర్టైన్మెంట్తో కూడిన పొలిటికల్ టచ్‌తో ఉంటుంది. పెద్ద కంటెంట్ ఉంది. రెండు పార్ట్‌లుగా తీయాల్సిన చిత్రమిది. నాలుగు గంటలు వచ్చింది. అంత పెద్ద స్పాన్ ఉన్న సినిమాని శ్రీకర్ ప్రసాద్ మూడు గంటలకు అద్భుతంగా ఎడిట్ చేశారు. కథకు తగ్గ పాటలిచ్చిన రామజోగయ్య శాస్త్రికి, మంచి సంగీతం అందించిన దేవిశ్రీ ప్రసాద్‌కి థ్యాంక్స్’’ అన్నారు. దానయ్య మాట్లాడుతూ– ‘‘నేను గర్వంగా చెప్పుకునే సినిమా ఇచ్చారు శివగారు. సినిమా బ్లాక్ బస్టర్ అని అందరూ ముందుగానే కంగ్రాట్స్ చెపుతుంటే హ్యాపీగా ఉంది’’ అన్నారు. ‘‘ఇది చాలా హానెస్ట్ మూవీ’’ అన్నారు పాటల రచయిత రామజోగయ్య శాస్త్రి. -
రాజకీయాల గురించి చాలా తెలుసుకున్నా
ప్రయోగాలా.. నాన్నగారి ఫ్యాన్స్ కొడతారండి.నాన్న గారి సినిమాల రీమేక్స్లోనా.. చెడగొట్టనండి. ఇండియా బెస్ట్.. ఫారిన్లో వారం మించి ఉండలేమండి. రాజకీయాలా.. మనవల్ల కాదండి.ఇలా సరదా సరదా మాటలతో బుధవారం మహేశ్‌బాబు మీడియాతో ముచ్చటించారు. మహేశ్‌బాబు హీరోగా కొరటాల శివ దర్శకత్వంలో డీవీవీ దానయ్య నిర్మించిన ‘భరత్ అనే నేను’ ఈ శుక్రవారం విడుదల కానుంది. ఈ సందర్భంగా మహేశ్‌బాబు చెప్పిన విశేషాలు. ► జనరల్‌గా సినిమా రిలీజ్ తర్వాత ఫ్యామిలీతో టూర్ వెళతారు.. ఈసారి రిలీజ్‌కు ముందే వెళ్లారు? ప్రతీసారి సినిమా రిలీజ్ అయ్యాక టూర్‌కి వెళ్లేవాళ్లం. కానీ ఈసారి ముందే వెళ్లిపోయాం. సినిమా మీద కాన్ఫిడెన్స్. నా కెరీర్లోనే బెస్ట్ ప్రీ రిలీజ్ ఫేజ్ అనుకోవచ్చు. ఇంత ఆనందంగా ఎప్పుడూ లేను. సినిమా రిలీజ్ అవ్వకముందే ఒక బ్లాక్బాస్టర్ వైబ్‌లా ఉంది. ► రాజకీయాలంటే అస్సలు శ్రద్ధ లేని మీకు సీయం క్యారెక్టర్ చేయడం ఎలా అనిపించింది? శివగారు ఈ సబ్జెక్ట్ చెప్పగానే ఎగై్జటింగ్‌గా అనిపించింది. సేమ్‌టైమ్ భయంగానూ అనిపించింది. సీయం క్యారెక్టర్ చేయడం ఒక పెద్ద హానర్, పెద్ద రెస్పాన్సిబులిటీ కూడా. ఈ కథతో రెండు సంవత్సరాలు ట్రావెల్ అవడంతో చాలా విషయాలు నేర్చుకున్నాను. అయితే రాజకీయాల్లోకి రావాలని కాదు (నవ్వుతూ). ► సీయం పాత్ర కోసం హోమ్ వర్క్ చేశారా? లేదు. మా బావ జయదేవ్ గల్లాగారి పార్లమెంట్ వీడియోస్ కొన్ని చూశాను. అంతే. పెద్దగా హోమ్ వర్క్ ఏం చేయలేదు. శివగారి ఇన్‌పుట్సే తీసుకున్నాను. మొత్తం క్రెడిట్ ఆయనకే ఇస్తాను. ఒక పొలిటికల్ సినిమాకు డైలాగ్స్ రాయడం అంటే చాలా కష్టం. లాజిక్స్ కరెక్ట్‌గా ఉండాలి. నేనెక్కడా నెర్వస్‌గా కాకుండా పర్ఫెక్ట్గా కనిపించడానికి చాలా వర్క్ చేశాం. ఎక్స్ట్రార్డినరీగా క్యారెక్టర్ని డిజైన్ చేశారు. పొలిటికల్ సినిమాల్లో డైలాగ్స్ మనం రోజూ మాట్లాడుకునే మాటల్లా ఉండవు. ఫస్ట్ టైమ్ నా కెరీర్లో పెద్ద పెద్ద డైలాగ్స్ చెప్పాను. పేజీల పేజీల డైలాగ్స్ అన్నమాట (నవ్వుతూ). కొంచెం కష్టం అనిపించింది. శివగారి హెల్ప్‌తో ఈజీగా పుల్ ఆఫ్ చేశాను. ► ట్వీట్స్‌లో ‘మేం మాస్టర్ పీస్ తీశాం’ అన్నారు. సినిమా చేస్తున్నప్పుడు ఎప్పుడు ఆ ఫీలింగ్ కలిగింది? ఫస్ట్ డే కథ విన్నప్పటి నుంచి ఈ ఫీలింగ్ ఉంది. దానికి దేవి ఇచ్చిన థీమ్ సాంగ్ ఓ కారణం. ఆ సాంగ్ ఫస్ట్ విన్నప్పుడు నేను చెన్నైలో ఉన్నాను. అది విన్నప్పుడే ఒక వైబ్ స్టార్ట్ అయిపోయింది మా అందరిలో. అసెంబ్లీ సెట్ అవ్వనీయండి. ఆ సెట్ డిజైన్ అద్భుతంగా వేశారు మా ఆర్ట్ డిజైనర్ సురేశ్. అసెంబ్లీలో షూట్ ఉన్నా లేకున్నా అందరం వచ్చేవాళ్లం. ఒక నిజమైన అసెంబ్లీ సెషన్ ఎలా జరుగుతుందో అలానే చేశాం. ► ప్రజెంట్ రాజకీయ పరిస్థితి మీద ఈ సినిమా సెటైర్‌గా ఉండబోతోందా? అస్సలు కాదు. స్ట్రైట్ ఫార్వార్డ్ , హానెస్ట్ కథ. సర్ప్రైజ్ అవుతారు. ఈ సినిమాను అందరు రాజకీయ నాయకులు చూసి మమ్మల్ని అప్రిషియేట్ చేస్తారనుకుంటున్నాను. ► ఈ సినిమా చేశాక రాజకీయాల మీద ఇంట్రెస్ట్ ఏమైనా పెరిగిందా? రాజకీయాలకు, నాకు అస్సలు సంబంధం లేదండి. సినిమానే నా ఫస్ట్ ప్రిఫరెన్స్.. నా ప్రాణం. నా జీవితం సినిమాలకు అంకితం. ► సినిమాలో ‘మాట మీద ఉండాలి’ అన్నారు. మీరేం నేర్చుకున్నారు ఈ కథ నుంచి? ‘భరత్’ పాత్ర నుంచి బయటకు రావడానికి ఎన్ని రోజులు పట్టింది? ఒక సంవత్సరం ఒక కథతో జర్నీ చేస్తే కచ్చితంగా దాని ప్రభావం మన మీద ఉంటుంది. ఇంకా రెస్పాన్సిబుల్ సిటిజన్లా ఉండాలని ఫీల్ అయ్యాను. ఒక పాత్ర నుంచి త్వరగా డిస్కనెక్ట్ అవ్వడం కొంచెం కష్టమే. అందుకే సరదాగా ఫ్యామిలీతో ట్రిప్‌కు వెళ్లాను (నవ్వుతూ). ► పాలిటిక్స్ గురించి స్ట్రాంగ్ మెసేజ్ ఉంటుందా? శివగారి ప్రతీ సినిమాలోనూ ఏదో ఒక మెసేజ్ ఉంటుంది. అలాగే ఇందులోనూ ఉంది. పర్టిక్యులర్‌గా వీళ్లకు అని చెప్పను కానీ.. అందరూ ఈ సినిమా చూడాలి. ఒక పొలిటికల్ ఫిల్మ్ వచ్చి నాకు గుర్తుండి చాలా రోజులైపోయింది. మళ్లీ ఈ జానర్‌ని తీసుకొచ్చాం అనిపిస్తుంది. ► ప్రస్తుతం ఉన్న రాజకీయ పరిస్థితుల్లో ఈ సినిమా ఇంపాక్ట్ ఇస్తుందనుకుంటున్నారా? నేను కామెంట్ చేయదలుచుకోలేదు. సినిమా అనేది ఎంటర్టైన్మెంట్ మాత్రమే అని నమ్ముతాను. దాంట్లో ఏదైనా మెసేజ్ ఇచ్చి, అది ఆడియన్స్ కనెక్ట్ అయి ఫాలో అయితే ఇంకా ఆనందపడతాం. మా సినిమా ఇలా చేంజ్ చేస్తుంది అని నేను చెప్పలేను. ► సినిమా అంటేనే కమర్షియల్. ఇందులో కమర్షియల్ ఎలిమెంట్స్ ఏంటి? శివగారు కమర్షియల్, మాస్ ఎలిమెంట్స్‌ని ఎప్పుడూ వదలరు. పొలిటికల్ ఫిల్మ్‌లో కమర్షియల్ పాయింట్స్ ఎలా మిక్స్ చేశారు? అనే క్యూరియాసిటీ అందరికీ ఉండి ఉంటుంది. సీయం ఎలా ఫైట్ చేస్తాడు? సీయం ఎలా డ్యాన్స్ చేస్తాడు? అని. అదే మా సినిమాలో యూనిక్ సెల్లింగ్ పాయింట్. ► ‘శ్రీమంతుడు’ అప్పుడు చాలామంది గ్రామాలను దత్తత తీసుకున్నారు. ఈ సినిమా తర్వాత కూడా అలా ఏదైనా జరుగుతుంది అనుకుంటున్నారా? ఆడియన్స్ కూడా పాలిటిక్స్ మీద ఇంకా రెస్పాన్సిబుల్‌గా ఫీల్ అవుతారనుకుంటున్నాను. ఇంకా బాగా కనెక్ట్ అవ్వాలనుకుంటున్నాను. ► సీయం క్యారెక్టర్ ప్లే చేశాక ఆ పదవి లగ్జరీగా అనిపించిందా? లేక బాధ్యత ఎక్కువ అనిపించిందా? బాధ్యత. అది నార్మల్ జాబ్ కాదండి. అలాంటి పాత్రను చేయడం నేను చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నాను. సీయం అనగానే జడ్ ప్లస్ క్యాటగిరీ సెక్యూరిటీతో కాన్వాయ్ వేసుకొని తిరగడం కాదు, దానికి మించిన రెస్పాన్సిబులిటీలు ఉంటాయి. ఒక స్టేట్‌ని ఎలా కాపాడాలి? అని ఆలోచిస్తుంటారు. సీయం పదవి చాలా గొప్ప బాధ్యత. జనాన్ని రిప్రజెంట్ చేయడం, వాళ్లను లుక్ ఆఫ్టర్ చేయడం నిజంగా జోక్ కాదు. ఇవన్నీ నేనెలా మాట్లాడుతున్నానంటే నేను స్క్రిప్ట్‌తో ట్రావెల్ చేశాను. సినిమా వల్ల రాజకీయాల మీద అవగాహన పెరిగింది. ► ఫస్ట్ ఓత్ అంటూ ప్రమాణస్వీకారం చెప్పారు కదా. ఇంట్లో పిల్లలు అవేమన్నా చెబుతున్నారా? చెప్పట్లేదు. పొలిటికల్ పదాలు అయ్యేసరికి వాళ్లకి సరిగ్గా చెప్పటం రావడంలేదు. అయితే పాటలు పాడుతున్నారు. ► గత రెండు సినిమాలు ఆశించిన ఫలితం ఇవ్వలేదు. సో.. ఈ సినిమా హిట్ అవ్వాల్సిందే అనే ప్రెజర్ ఏమైనా ఉందా? ప్రతి సినిమా బాగా ఆడాలనే చేస్తాం. ప్రతి సినిమా అప్పుడు ప్రెజర్ ఉంటుంది. ఏ సినిమా చేసినా సూపర్ హిట్ అవ్వాలనే చేస్తాం. కానీ ఈ సినిమాకు మాత్రం ప్రీ రిలీజ్ వైబ్ చాలా బాగా అనిపిస్తోంది. ఇంతకు ముందు ఎప్పుడూ అనిపించలేదు. ► సినిమా మీద అంత కాన్ఫిడెన్స్ ఎలా వచ్చింది? శివగారు ఈ సినిమా కథ ఐదు గంటలు చెప్పారు. ఇదంతా సినిమాలో ఎలా పడుతుందనుకున్నాను. ప్రతీ సీన్ ఎగై్జటింగ్‌గా అనిపించింది. అయితే చాలా సీన్స్ సినిమాలో పెట్టలేకపోయాం. చాలా బాధగా ఉంది. ఈ ఐదు గంటల సీన్స్ సినిమాలో పెట్టాలంటే రెండు పార్ట్స్‌గా తీయాలి. ► సినిమా మొత్తం సీయంగానే కనిపిస్తారా? స్టార్టింగ్ పది నిమిషాల నుంచి సినిమా మొత్తం సీయంగానే కనిపిస్తాను. ► 2019 ఎలక్షన్స్‌లో ప్రచారం చేయనున్నారా? అస్సలు లేదు. 2019 సమ్మర్లో ఎక్కడో ఫారిన్లో షూటింగ్‌లోనో, హాలీడేలోనో ఉంటానేమో (నవ్వుతూ) ► ఈ సినిమా చేస్తున్నప్పుడు సొసైటీ ఇంకా మారడం లేదేంటి? అని ఎప్పుడైనా బాధేసిందా? నేను సినిమాలో సీయంగా చేశాను అని చెప్పడం కాదు కానీ వాళ్లంతా వాళ్ల బెస్ట్ ఇస్తూనే ఉన్నారు. ఇండియా చాలా పెద్ద దేశం. అందరూ తమ వంతుగా కృషి చేస్తూనే ఉన్నారు. ► ఇంతకీ మీ బెస్ట్ సీయం ఎవరు? రెండు రోజుల్లో సినిమా రిలీజ్ ఉంది. కాంట్రవర్శీ వద్దు. ఇంత టెన్షన్లో ఏదో ఒకటి నా నుంచి రాబట్టాలనే (నవ్వుతూ). ► నటుడిగా మీ నాన్నగారి ప్రభావం మీ మీద ఏమైనా? డెఫినెట్‌గా ఉంటుంది. ఈ సినిమాలో ఇంకా ఎక్కువ ఫీల్ అయ్యాను. ముఖ్యంగా ఫస్ట్ ఓత్ అప్పుడు చాలామంది ‘అచ్చం నాన్నగారి గొంతులాగే ఉంది’ అని చెప్పారు. నేను చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాను. ఎవరో అడిగారు ‘డిజిటల్‌గా ఏదైనా మార్చారా?’ అని. ‘అలా అవ్వదండి. నా గొంతే’ అని చెప్పాను. డబ్బింగ్ థియేటర్లో నాన్నగారి వాయిస్‌లా అనిపించిందని నేనే అన్నాను. ఆయన ‘అల్లూరి సీతారామరాజు’ సినిమాలోనో, ‘ఈనాడు’లోనే∙ఇలాంటి హైపిచ్ డైలాగ్స్ పలికారు. ► ఇప్పుడు ఫస్ట్ 10 డేస్ సినిమా కలెక్షన్స్ బెంచ్ మార్క్. ప్రెజర్ ఫీలవుతున్నారా? అలా ఏమీ లేదు. పెద్ద సినిమాలు హిట్ టాక్ తెచ్చుకుంటే మంచి కలెక్షన్స్ వస్తున్నాయి. ఇప్పుడు చాలా థియేటర్స్ ఉన్నాయి. ఫస్ట్ వీక్‌లోనే డబ్బులన్నీ లాగేయడానికి ట్రై చేస్తున్నాం. మార్నింగ్ షో నుంచే టాక్ బాగుంటే ఆన్ బిలీవబుల్‌గా ఉంటోంది. ‘రంగస్థలం’ సినిమా అంత పెద్ద హిట్ అవడం చాలా ఆనందంగా ఉంది. ► ఫారిన్ వెళ్తుంటారు.. ఇక్కడకన్నా అక్కడ బాగుం టుందా? మన ఇండియాలో ఉన్నట్లు వేరే ఎక్కడా∙ఉండదు. ఆనందం అంతా ఇక్కడే. ఫారిన్ వెళ్లినప్పుడు వన్ వీక్ తర్వాత ఎప్పుడెప్పుడు ఇండియాకి వచ్చేద్దామా అనిపిస్తుంటుంది. ► ప్రొడ్యూసర్ దానయ్యగారు మీతో సినిమా చేయాలని 2006 నుంచి ట్రై చేస్తున్నానని చెప్పారు? నిజానికి 2006 నుంచి కాదు. 2002 నుంచే. ‘మురారి’ షూటింగ్ జరుగుతున్నప్పుడే అడిగారు. వెయ్యి రూపాయల నోట్ లాంచ్ చేశారు. చూశారా? అని నాకు చూపించారు. మీరు ఒప్పుకుంటే అడ్వాన్స్ కూడా ఇలానే ఇస్తాను అన్నారు. నాకు ఇంకా గుర్తు (నవ్వుతూ). నేనూ దానయ్యగారితో వర్క్ చేయాలనుకున్నాను. కుదర్లేదు. ఫైనల్‌గా ఈ సినిమాతో కుదిరింది. ► మీ నాన్నగారు నటించినవాటిలో ఏదైనా మూవీని రీమేక్ చేయాలనుకుంటున్నారా? లేదండి. ఆయన సినిమాలు రీమేక్ చేసి చెడగొట్టడం నాకు ఇష్టం లేదు. ఆ విషయం ముందే చెప్పేశాను. ► వంశీ పైడిపల్లితో చేయబోయే మూవీ గురించి? చాలా బావుంటుంది. వంశీకి థ్యాంక్స్ చెప్పాలి. నాకోసం ఒక ఏడాది పాటు బెంచిలో కూర్చున్నాడు. ఏ సినిమా ఒప్పుకోకుండా. ► త్రివిక్రమ్, సుకుమార్, సందీప్ రెడ్డిలతో సినిమాలు ఉన్నాయట? ఉంటాయి. అన్నీ డిస్కషన్ స్టేజ్‌లో ఉన్నాయి. ► ఆడియో ఫంక్షన్లో ఎన్టీఆర్ ‘మహేశ్ అన్న చాలా ప్రయోగాలు చేశారు’ అన్నారు. మరి.. ఇంకా కొనసాగించాలనుకుంటున్నారా? ప్రయోగాలు చేసే ఓపిక పోయింది. అలసిపోయాను. నాన్నగారి అభిమానులందరూ ఇంటికొచ్చి కొట్టేలా ఉన్నారు. సో... కమర్షియల్ సినిమాలపై ఫోకస్ పెట్టాలనుకుంటున్నాను. ► రామ్‌చరణ్, ఎన్టీఆర్, మీరు చాలా క్లోజ్‌గా ఉంటారు. మీరంతా కలిసినప్పుడు ఏం మాట్లాడుకుంటారు? సినిమాలు తప్ప అన్నీ మాట్లాడుకుంటాం. మేం కూడా సినిమాలు మాట్లాడుకుని ఏం చేస్తాం? (నవ్వుతూ). బయటి ఫ్రెండ్స్ ఎలా మాట్లాడుకుంటారో అలానే మాట్లాడుకుంటాం. ► ఆడియో ఫంక్షన్లో ‘మీరూ మీరూ బాగుండాలని ఫ్యాన్స్‌తో అన్నారు. అంటే ఫ్యాన్స్‌లో ఏమైనా చేంజ్ కోరుకుంటున్నారా? ఫ్యాన్స్‌లో చేంజ్ ఎక్స్పెక్ట్ చేయడం లేదు. సోషల్ మీడియా ఇంపాక్ట్ తెలిసిందే. ఒక పెద్ద హీరో సినిమా రిలీజ్ అవుతున్నప్పుడు.. మిగతా పెద్ద హీరోల ఇంకొన్ని సినిమాలు తీసుకుని ఆ సినిమాపై కాన్సంట్రేట్ చేయడం ట్రెండ్ అయింది. ఇట్స్ నాట్ ఫెయిర్. సినిమా అంటే మేం (హీరోలు) ఒక్కళ్లమే కాదు. ఎన్నో కుటుంబాలు ఆధారపడి ఉన్నాయి. అందరిలో పాజిటివ్ వైబ్ కావాలనుకుంటున్నాను. -
దానయ్య అనే నేను హామీ ఇస్తున్నా
‘‘నాది పశ్చిమ గోదావరి జిల్లా తాళ్లపూడి గ్రామం. అప్పట్లో మా ప్రాంతంలో సినిమా షూటింగ్‌లు ఎక్కువగా జరుగుతుండేవి. కృష్ణగారి ‘పాడి పంటలు’ షూటింగ్ చూసేందుకు వెళ్లా. జనం ఎక్కువ కావడంతో పోలీసులు అడ్డుకున్నారు. ‘మీరు సైలెంట్‌గా ఉంటే షూటింగ్ చేస్తాం.. లేకుంటే వెళ్లిపోతాం’ అని కృష్ణగారు అనడంతో నిశ్శబ్దంగా ఉండి షూటింగ్ చూశాం. ఇలాంటి షూటింగ్‌లు చూస్తూ ఉండటంతో సినిమా రంగంపై ఆసక్తి పెరిగి ఇండస్ట్రీకొచ్చా’’ అన్నారు నిర్మాత దానయ్య డీవీవీ. మహేశ్‌బాబు, కియారా అద్వాని జంటగా కొరటాల శివ దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం ‘భరత్ అనే నేను’. డి. పార్వతి సమర్పణలో దానయ్య డీవీవీ నిర్మించిన ఈ సినిమా ఈ నెల 20న విడుదలవుతోంది. ఈ సందర్భంగా దానయ్య చెప్పిన విశేషాలు. ∙ఈవీవీ సత్యనారాయణతో కలిసి జంధ్యాలగారి వద్ద అసోసియేట్‌గా వర్క్ చేశా. నా స్నేహితులు భగవాన్, పుల్లారావులతో కలిసి ఈవీవీ దర్శకత్వంలో 1992లో ‘జంబలకిడి పంబ’ సినిమా నిర్మించా. ఆ చిత్రంతో నిర్మాతగా మొదలైన నా ప్రయాణం పాతికేళ్లు అయ్యింది. మహేశ్‌గారితో సినిమా అనుకున్నప్పుడు శివగారు ‘భరత్ అనే నేను’ కథ చెప్పారు. నాకు నచ్చింది. మహేశ్గారికీ బాగా నచ్చింది. కథ విన్నప్పుడే కాంప్రమైజ్ కాకుండా సినిమా చేయాలనుకున్నాం. అసెంబ్లీ సెట్‌కు 2 కోట్లు, ‘వచ్చాడయ్యో సామీ’ పాటకు 4 కోట్లు ఖర్చు పెట్టాం. ∙ఉమ్మడి రాష్ట్రంలో ఉన్న కథతో సాగే చిత్రమిది. ఏ పార్టీకీ సంబంధం ఉండదు. మంచి ముఖ్యమంత్రి ఎలాంటి పనులు చేశాడన్నదే సినిమా. ఎవరినీ విమర్శించేలా ఉండదు. మహేశ్‌గారితో సినిమా చేయడం నా కల. అది కొరటాలగారి ద్వారా కుదరడం హ్యాపీగా ఉంది. ∙మంచి కంటెంట్ ఉంటే నిడివి ఎక్కువైనా ప్రేక్షకులు ఆదరిస్తారు. ‘రంగస్థలం’ సినిమా అందుకు ఉదాహరణ. ఈ నెల 20న ‘భరత్ అనే నేను’ రిలీజ్ అనుకున్నాం. అదే రోజు మహేశ్‌గారి అమ్మ ఇందిరమ్మగారి పుట్టినరోజు అని మాకు తెలియదు. ఈ విషయాన్ని మహేశ్‌గారు చెప్పారు. మా సినిమా చాలా చాలా బాగుంటుందని దానయ్య అనే నేను హామీ ఇస్తున్నా. మహేశ్‌గారు ఉదయం ఏ మూడ్‌తో నవ్వుతూ షూటింగ్‌కి వస్తారో అదే మూడ్‌తో సాయంత్రం నవ్వుతూ వెళతారు. రామ్‌చరణ్‌గారు హీరోగా బోయపాటిగారి దర్శకత్వంలో నిర్మిస్తోన్న సినిమా రెండు షెడ్యూల్స్ పూర్తయ్యాయి. రాజమౌళిగారు, ఎన్టీఆర్‌గారు, చరణ్‌గారు కలిసి చేసే సినిమా ఈ ఏడాదే స్టార్ట్ అవుతుంది. ఆ సినిమా చేయడాన్ని గర్వంగా ఫీలవుతున్నా. రాజమౌళిగారితో సినిమా చేయడం నా కల. 2006 నుంచి ప్రయత్నిస్తే ఇప్పటికి కుదిరింది. -
రెండు పాటలకు ఆరు కోట్లు
సూపర్ స్టార్ మహేష్ బాబు హీరోగా తెరకెక్కిన తాజా చిత్రం భరత్ అనే నేను. శ్రీమంతుడు లాంటి ఘన విజయాన్ని అందించిన కొరటాల శివ దర్శకత్వంలో మహేష్ మరోసారి హీరోగా నటిస్తుండటంతో ఈ సినిమాపై భారీ అంచనాలు ఏర్పడ్డాయి. అందుకు తగ్గట్టుగా చిత్రయూనిట్ భారీ బడ్జెట్ తో ఈ సినిమాను తెరకెక్కించారు. ఈ శుక్రవారం రిలీజ్ అవుతున్న ఈ చిత్ర ప్రమోషన్ లో భాగంగా యూనిట్ సభ్యులు ఆసక్తికర విషయాలను వెల్లడించారు. ఈ సినిమాలో హీరో మహేష్ బాబు ముఖ్యమంత్రిగా నటిస్తుండటంతో కీలక సన్నివేశాలు అసెంబ్లీ నేపథ్యంలో తెరకెక్కించారు. అందుకోసం 2 కోట్లతో అసెంబ్లీ సెట్ వేసినట్టుగా తెలిపారు. ఈ సెట్లో పలు సన్నివేశాలతో పాటు ‘హామీ ఇస్తున్నా’ పాటకు సంబంధించిన సీన్స్ కూడా చిత్రీకరించినట్టుగా తెలుస్తోంది. ఇప్పటికే సూపర్ హిట్ అయిన ‘వచ్చాడయ్యో సామీ’ పాట కోసమే నాలుగు కోట్లు ఖర్చు చేసినట్టుగా తెలుస్తోంది. మహేష్ సరసన కిరా అద్వాని హీరోయిన్గా నటిస్తున్న ఈ సినిమాను డీవీవీ ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్‌పై దానయ్య నిర్మిస్తున్నారు. -
భరత్ అనే నేను మేకింగ్ వీడియో విడుదల
-
మహేశ్ అన్న అరుదైన నటుడు.
‘‘మహేశ్, శివ కాంబినేషన్లో వచ్చిన ‘శ్రీమంతుడు’ ఎంత హిట్టో తెలిసిందే. ఆ చిత్రం అన్ని రికార్డులు తిరగరాసింది. ‘భరత్ అనే నేను’ డైలాగ్స్, ట్రైలర్స్, సాంగ్స్ చూస్తుంటే ఈ సినిమా ‘శ్రీమంతుడు’ని క్రాస్ చేసి, పెద్ద హిట్టవుతుందని నమ్ముతున్నా. మహేశ్ లైఫ్‌లోనే ఈ సినిమా నంబర్ వన్ అవుతుందనే నా నమ్మకాన్ని మీ అందరి ఆశీస్సులతో నిజం చేయాలని కోరుకుంటున్నా’’ అన్నారు సూపర్‌స్టార్ కృష్ణ. మహేశ్‌బాబు, కియారా అద్వానీ జంటగా కొరటాల శివ దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం ‘భరత్ అనే నేను’. డి. పార్వతి సమర్పణలో దానయ్య డీవీవీ నిర్మించిన ఈ సినిమా ఈ నెల 20న రిలీజవుతోంది. ‘భరత్ అనే నేను బహిరంగ సభ’లో నిర్మాత ‘దిల్’ రాజు మాట్లాడుతూ– ‘‘నేను ఇండస్ట్రీకి వచ్చిన 23ఏళ్లలో హైదరాబాద్‌లో ఇలాంటి ఫంక్షన్ చూడలేదు. ఓ స్టార్ హీరో సినిమాకి ఇంకో స్టార్ హీరో ముఖ్యఅతిథిగా రావడం తెలుగు ఫిల్మ్ ఇండస్ట్రీలో కొత్త ఒరవడి. థ్యాంక్యూ తారక్(ఎన్టీఆర్). ఈ సినిమా బ్లాక్‌బస్టర్ అయి టాప్ 5లో నిలవాలి’’ అన్నారు. ముఖ్య అతిథిగా విచ్చేసిన ఎన్టీఆర్ మాట్లాడుతూ– ‘‘మా ఇద్దర్నీ (మహేశ్‌బాబు, ఎన్టీఆర్) ఇలా చూస్తే మీకు (ఫ్యాన్స్)కు కొత్తగా ఉందేమో కానీ మాకు కాదు. మీరందరూ ఆయన్ని ప్రిన్స్, సూపర్‌స్టార్ అంటారు. నేను మహేశ్ అన్నా అంటాను. ఈ చిత్రం అద్భుతమైన విజయం సాధించాలనీ, రికార్డులు తిరగ రాయాలని కోరుకుంటున్నా. ఒక కమర్షియల్ స్టార్ అయ్యుండి కూడా మహేశ్ అన్న చేసినటువంటి ప్రయోగాత్మక చిత్రాలు ఎవరూ చేయలేదు. రిజల్ట్‌తో సంబంధం లేకుండా ప్రయోగాలు చేస్తున్నారు. మేం ఇప్పుడిప్పుడు చేస్తున్నాం. దానికి స్ఫూర్తి ఆయనే. ఆయన చాలా అరుదైన నటుడు. అలాగే ఉండనిద్దాం. ‘భరత్ అనే నేను’ ఆయన కెరీర్లో ఓ మైలురాయిగా నిలిచిపోవాలి. నాది, శివగారి జర్నీ ‘బృందావనం’తో మొదలైంది. సమాజం పట్ల బాధ్యత కలిగిన దర్శకుడు ఆయన’’ అన్నారు. మహేశ్‌బాబు మాట్లాడుతూ – ‘‘కృష్ణగారి అబ్బాయి అనే నేను... తమ్ముడు తారక్ నుంచి నేర్చుకున్నాను ఈ మాటలన్నీ (నవ్వుతూ). ఇక్కడ ప్రీ–రిలీజ్ ఫంక్షన్ చూస్తున్నట్లు లేదు. 100 డేస్ ఫంక్షన్‌కు వచ్చినట్లు ఉంది. తారక్ ‘ఆది’ సినిమా ఆడియో ఫంక్షన్‌కు నేను వెళ్లాను. ఇప్పుడు తను నా సినిమా ప్రీ–రిలీజ్ ఈవెంట్‌కు రావడం ఆనందంగా ఉంది. ఐ థింక్ ఇక ఫంక్షన్ల ట్రెండ్ మారుద్ది. అందరు హీరోలు వెళతారు. ఎందుకంటే మన ఇండస్ట్రీలో ఉంది ఐదారుగురు పెద్ద హీరోలే. తిప్పి కొడితే ఏడాదికి ఒక్కో సినిమానే చేస్తాం. అందరి సినిమాలూ ఆడితే ఇండస్ట్రీ ఇంకా బాగుంటుంది. మేం మేం బాగానే ఉంటాం. మీరూ మీరే (ఫ్యాన్స్) ఇంకా బాగుండాలి. సీయం క్యారెక్టర్ అనగానే కాస్త భయం వేసింది. ఎందుకంటే రాజకీయాలు నాకు అసలు సంబంధం లేదు. కానీ శివగారు కథ చెప్పినప్పుడు ఇన్స్పైర్ అయ్యాను. ఫైనెస్ట్ పర్ఫార్మెన్స్ చేశాను. ‘శ్రీమంతుడు’ సినిమా నా కెరీర్లో ఒక టర్నింగ్ పాయింట్. మళ్లీ అదే టర్నింగ్ పాయింట్ రాబోతోంది. దానయ్యగారు సినిమా గ్రాండ్‌గా ఉండాలంటారు. సినిమా అలానే ఉంటుంది. దేవికి నేను పెద్ద ఫ్యాన్. మొన్న ‘రంగస్థలం’ చూశాను. మా సినిమాకు, ‘రంగస్థలం’కు ఫుల్ డిఫరెంట్ మ్యూజిక్ ఇచ్చాడు.‘భరత్ అనే నేను’ థీమ్ సాంగ్, ‘వచ్చాడయ్యో సామి..’ సాంగ్స్ నా కెరీర్లోనే ది బెస్ట్ అని నేను అనుకుంటున్నాను. సినిమాకు పనిచేసిన అందరికీ థ్యాంక్స్. ఎంతమందికి తెలుసో కానీ.. ఏప్రిల్ 20న మా అమ్మ ఇందిరమ్మగారి పుట్టినరోజు. అమ్మ ఆశీస్సులు, దీవెనలకు మించింది ఇంకేమీ లేదంటారు. సో.. ఆ రోజు రిలీజ్ అవ్వడం చాలా ఆనందంగా ఉంది’’ అన్నారు. కొరటాల శివ మాట్లాడుతూ – ‘‘మహేశ్‌గారికి కథ చెప్పడానికి వెళ్లినప్పుడు ఫస్టాఫ్ 2:30 గంటలు, సెకండాఫ్ 2:30 గంటలు చెప్పా.ఐదు గంటలు కథ చెబుతారా? అంటారనుకున్నా. కానీ, ఆయన సినిమా కూడా ఐదు గంటలు ఉంటుందా? అని అడిగారు. మోస్ట్ హ్యాండ్సమ్ అండ్ డైనమిక్ ముఖ్యమంత్రి పాత్రలో నటించారాయన. నాకొక గ్రాండ్ సినిమా ఇవ్వండన్నారు దానయ్యగారు. అందుకు తగ్గట్టే ఖర్చుకు వెనకాడకుండా తీశారు. నాకంటే ఎక్కువ ఇన్స్పైర్ అయ్యి మంచి పాటలిచ్చారు దేవిశ్రీ. రామజోగయ్యశాస్త్రిగారు ప్రాణం పెట్టి మంచి లిరిక్స్ ఇచ్చారు. నేను ఏ హీరోతో సినిమా చేస్తే ఆ హీరోకి పిచ్చి ఫ్యాన్ అయిపోతా. నాతో పోలిస్తే మీరు (అభిమానులు) నథింగ్. మహేశ్, తారక్, రామ్‌చరణ్ అంతా స్నేహపూర్వక వాతావరణంలో ఉంటారు. అభిమానులు కూడా ఇలాగే కలిసుండాలి’’ అన్నారు. ‘‘మా బ్యానర్లో ఇంత పెద్ద సినిమా చేసినందుకు కొరటాల శివగారికి రుణపడి ఉంటా. మహేశ్‌గారితో సినిమా చేయాలనే కోరిక ఇంత మంచి సినిమాతో తీరినందుకు ఆనందంగా ఉంది. ‘భరత్ అనే నేను’ సినిమా ఎంత గొప్పగా ఉంటుందని మహేశ్ అభిమానులు అనుకుంటున్నారో అంతకంటే గొప్పగా ఉంటుందని హామీ ఇస్తున్నా. ఈ నెల 20న సినిమా చూస్తే మీరే ఈ మాట అంటారు’’ అన్నారు డీవీవీ దానయ్య. ‘‘కొరటాలగారి నాలుగు సినిమాలకూ నేనే సంగీతం అందించా. డీవీవీగారి బ్యానర్లో చేసే అవకాశం ఇచ్చిన దానయ్యగారికి థ్యాంక్స్. మహేశ్ సూపర్‌స్టారే కాదు. ఆయన హార్ట్ కూడా సూపర్‌స్టారే’’ అన్నారు దేవిశ్రీ ప్రసాద్. -
వచ్చాడయ్యో సామి
మహేశ్‌బాబు హీరోగా కొరటాల శివ దర్శకత్వంలో రూపొందుతున్న సినిమా ‘భరత్ అనే నేను’. డీవీవీ దానయ్య నిర్మిస్తున్నారు. కియారా అద్వానీ కథానాయిక. ఈ సినిమాలో మూడో పాట ‘వచ్చాడయ్యో సామి..’ని గురువారం సాయంత్రం రిలీజ్ చేయనున్నారు. ఇక్కడ పంచెకట్టులో మహేశ్ కనిపిస్తున్న ఈ స్టిల్ ఆ పాటలోనిదే. స్టిల్ రిలీజైన వెంటనే భారీ రెస్పాన్స్ వచ్చింది. దేవీశ్రీ ప్రసాద్ మ్యూజిక్ అందించిన ఈ సినిమా ఆడియో ఈ నెల 7న రిలీజ్ కానుంది. -
ఐ డోంట్ నో
అందరికీ అన్ని విషయాలపై అవగాహన ఉండకపోవచ్చు. అందరికీ అన్ని విషయాలు తెలియాల్సిన రూలూ లేదు. కానీ మనకు తెలిసింది కొంత. తెలియాల్సింది ఇంకెంతో అని కొత్త విషయాలు నేర్చుకోవడానికి ఉవ్విళ్లూరుతుంటారు కొంతమంది. అందులో సీయం భరత్ ఒకరు. ‘యూనివర్శ్ అనే ఎన్సైక్లోపీడియాలో తెలుసుకున్న కొద్దీ ఉంటాయి ఇంకెన్నో. ఆర్ట్ ఆఫ్ లివింగ్ అంటే ఆర్ట్ ఆఫ్ లెర్నింగ్’ అంటున్నారు భరత్. మహేశ్‌బాబు, కియారా అద్వాని జంటగా కొరటాల శివ దర్శకత్వంలో రూపొందుతున్న సినిమా ‘భరత్ అనే నేను’. డీవీవీ ఎంటర్టైన్మెంట్స్ పతాకంపై డి.వి.వి దానయ్య నిర్మిస్తున్నారు. ఈ సినిమాలోని సెకండ్ సాంగ్ ‘ఐ డోంట్ నో’ను ఆదివారం రిలీజ్ చేశారు. పైన చెప్పినదంతా ఈ పాటలోని సారాంశమే. దేవిశ్రీ ప్రసాద్ సంగీతం అందించిన ఈ పాటను బాలీవుడ్ డైరెక్టర్, యాక్టర్, సింగర్ ఫర్హాన్ అక్తర్ పాడటం విశేషం. రామజోగయ్య శాస్త్రి రచించారు. రామజోగయ్య ఇన్స్పిరేషనల్ లిరిక్స్, ఫర్హాన్ వాయిస్ బాగా కుదరటంతో సంగీత ప్రియులను ఈ పాట విశేషంగా ఆకట్టుకుంటోంది. ఈనెల 7న హైదరాబాద్‌లోని ఎల్బీ స్టేడియంలో బహిరంగ సభ(ఆడియో విడుదల) నిర్వహిస్తున్నారు. ఈ చిత్రాన్ని ఈ నెల 20న విడుదల చేయాలనుకుంటున్నారు. ఈ చిత్రానికి సంగీతం: దేవిశ్రీ ప్రసాద్, కెమెరా: రవి కె.చంద్రన్, తిరు, ఎడిటింగ్: శ్రీకర్ ప్రసాద్. -
చరణ్ కొత్త సినిమా లుక్
రంగస్థలం సినిమా రిలీజ్ కోసం వెయిట్ చేస్తున్న మెగా పవర్ స్టార్ రామ్‌చరణ్, బోయపాటి శ్రీను దర్శకత్వంలో తెరకెక్కబోయే మాస్ యాక్షన్ ఎంటర్టైనర్ కోసం రెడీ అవుతున్నాడు. ఇన్నాళ్లు రంగస్థలం సినిమా కోసం డిఫరెంట్ లుక్‌లో కనిపించిన చెర్రీ బోయపాటి సినిమా కోసం సరికొత్త లుక్‌ను ట్రై చేస్తున్నట్టుగా వార్తలు వినిపించాయి. తాజా చరణ్ పుట్టిన రోజు సందర్భంగా చరణ్ కొత్త సినిమా లుక్ ను రివీల్ చేశారు. డీవీవీ ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్‌పై డీవీవీ దానయ్య నిర్మిస్తున్న ఈ సినిమాను బోయపాటి పక్కా కమర్షియల్ ఎంటర్టైనర్గా తెరకెక్కిస్తుండగా మరోసారి దేవీ ప్రసాద్ చరణ్ సినిమాకు సంగీతమందిస్తున్నాడు. ఈ సినిమాలో చరణ్ స్టైలిష్‌గా కనిపించనున్నాడు. బోయపాటి మార్క్ యాక్షన్ ఎలిమెంట్స్ తో రూపొందుతున్న ఈ సినిమా షూటింగ్ ఇప్పటికే ప్రారంభమైంది. రంగస్థలం ప్రమోషన్కార్యక్రమాలు పూర్తి చేసి త్వరలోనే చరణ్ ఈ సినిమా షూటింగ్ కు హాజరయ్యేందుకు ప్లాన్ చేసుకుంటున్నాడు. సుకుమార్ దర్శకత్వంలో తెరకెక్కిన రంగస్థలం ఈ శుక్రవారం ప్రేక్షకుల ముందుకు రానుంది. -
మహేష్ సందడి మొదలవుతోంది
సాక్షి, సినిమా : గత రెండు చిత్రాలు తీవ్ర నిరాశ పరచటంతో భరత్ అనే నేనుతో ఎలాగైనా హిట్ కొట్టి తీరాలన్న కసితో సూపర్ స్టార్ మహేష్ బాబు పని చేస్తున్నాడు. కొరటాల శివ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ పొలిటికల్ కమర్షియల్ డ్రామా షూటింగ్ దాదాపు ఆఖరు దశకు చేరుకుంది. ఇక ఈ వైవిధ్యంగా సాగుతున్న ఈ చిత్రం ప్రమోషన్లకు మంచి ఆదరణ లభిస్తుండగా.. ఇప్పుడవి ఓ కొలిక్కి వచ్చాయి. భరత్ అనే నేను నుంచి తొలి పాటను మార్చి 25న ఉదయం 10గంటలకు విడుదల చేయబోతున్నారు. దేవీశ్రీ ప్రసాద్ స్వరాలు అందిస్తున్న ఈ చిత్ర పాటలను లహరి మ్యూజిక్ ద్వారా విడుదల చేయనున్నారు. కైరా అద్వానీ మహేష్‌కు జోడీగా కనిపించబోతున్న భరత్ అనే నేను ఏప్రిల్ 20న విడుదల కాబోతున్న విషయం విదితమే. Launching our First Single from #BharatAneNenu, #TheSongOfBharatOn25th pic.twitter.com/jkz85k0gxX — #BharatAneNenu (@DVVEnts) 23 March 2018 -
ఆర్ ఆర్ ఆర్ : జక్కన్న మల్టీ స్టారర్
-
జక్కన్న మల్టీ స్టారర్ : ఆర్ ఆర్ ఆర్
బాహుబలి సినిమా తరువాత లాంగ్‌గ్యాప్ తీసుకున్న రాజమౌళి ఇంత వరకు తన తదుపరి చిత్రాన్ని ప్రకటించేందుకు చాలా సమయం తీసుకున్నాడు. కొద్ది రోజులు రామ్ చరణ్, ఎన్టీఆర్ ల కాంబినేషన్లో ఓ మల్టీ స్టారర్ సినిమా చేస్తున్నట్టుగా వార్తలు వినిపించినా.. అధికారికంగా మాత్రం ప్రకటించలేదు. ఇటీవల ఈ సినిమా కోసమే ఎన్టీఆర్, రామ్ చరణ్‌లు విదేశాలకు కూడా వెళ్లొచ్చారు. అన్ని ఒకే అవ్వటంతో సినిమాను అధికారికంగా ప్రకటించారు చిత్ర నిర్మాతలు. డీవీవీ ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్లో తెరకెక్కుతున్న ఈ సినిమాకు సంబంధించిన ఓ వీడియో టీజర్ ను రిలీజ్ చేశారు. ఆర్ ఆర్ ఆర్ అనే లోగో తో రిలీజ్ అయిన ఈ టీజర్ లోని మూడు ఆర్లు రాజమౌళి, రామ్‌చరణ్, రామారావు (ఎన్టీఆర్)ల పేర్లు ప్రతిబింభించేలా డిజైన్ చేశారు. ఆర్ ఆర్ ఆర్ అనేది టైటిల్ కాదు కేవలం ఈ మెగా కలయికకు ప్రతీకగా ఈ లోగోను రిలీజ్ చేసినట్టుగా చిత్రయూనిట్ ప్రకటించారు. ఏదీ ఏమైన భారీ మల్టీ స్టారర్ సినిమాపై అధికారిక ప్రకటన రావటంతో మెగా, ఎన్టీఆర్ అభిమానులు పండగ చేసుకుంటున్నారు. -
భరత్ విజన్ ఏంటో?
విజన్ ఉన్న వ్యక్తి సీయం అయితే ప్రజలంతా బహుత్ ఖుషీగా ఉంటారు. అతని విజన్ భవిష్యత్ తరాలకు భరోసా ఇస్తుంది. ప్రజలకు ప్రభుత్వంపై నమ్మకాన్ని పెంచుతుంది. భరత్ అనే సీయం విజన్ ఎలా ఉంటుందో సిల్వర్ స్క్రీన్‌పై చూడాల్సిందేనని అంటున్నారు ‘భరత్ అనే నేను’ చిత్రబృందం. మహేశ్‌బాబు హీరోగా కొరటాల శివ దర్శకత్వంలో డి.పార్వతి సమర్పణలో డీవీవీ ఎంటర్టైన్మెంట్స్ పతాకంపై డీవీవీ దానయ్య నిర్మిస్తున్న సినిమా ‘భరత్ అనే నేను’. ఇందులో కియారా అద్వానీ కథానాయిక. సీయం భరత్ పాత్రలో మహేశ్‌బాబు కనిపించనున్నారు. ఈ సినిమాకు సంబంధించిన ‘ది విజన్ ఆఫ్ భరత్’ను మార్చి 6న రిలీజ్ చేయనున్నట్లు చిత్రబృందం తెలిపింది. ప్రకాశ్‌రాజ్, శరత్‌కుమార్ ముఖ్య తారలుగా నటిస్తున్న ఈ సినిమాకు దేవిశ్రీప్రసాద్ స్వరకర్త. ఈ సినిమాను ఏప్రిల్ 20న విడుదల చేయాలనుకుంటున్నారు. -
మార్చిలో షురూ
కొబ్బరికాయ కొట్టి ఒకే ఒక్క నెల అయింది. ఈలోపే ‘ఇన్కమ్’ స్టార్ట్ అయితే ఆనందమే ఆనందం. రామ్‌చరణ్–బోయపాటి శ్రీను–డీవీవీ దానయ్య అలాంటి ఆనందంలోనే ఉన్నారు. షూటింగ్ స్టార్ట్ అయిన కొన్ని రోజులకే ‘రైట్స్’ రూపంలో ఫ్యాన్సీ ఆఫర్ వస్తే అది ఆ హీరో, డైరెక్టర్ స్టామినాని తెలియజేస్తుంది. చరణ్–బోయపాటి కాంబినేషన్లో దానయ్య నిర్మిస్తోన్న సినిమా ఇప్పటికి దాదాపు 47 కోట్లు రాబట్టిందని విశ్వసనీయ వర్గాల సమాచారమ్. రిలీజ్‌కి ముందే ఇన్ని కోట్లంటే నిర్మాతకు పండగే. ఇంతకీ 47 కోట్లు ఎలా రాబట్టిగలిగిందంటే... హిందీ శాటిలైట్, డబ్బింగ్ రైట్స్, తెలుగు శాటిలైట్ రైట్స్ ద్వారా ఇంత మొత్తం వచ్చిందని భోగట్టా. చిత్రీకరణ ప్రారంభించిన కొన్ని రోజులకే ఇంత పెద్ద బిజినెస్ జరగటంతో చిత్రంపై అంచనాలు రెట్టింపయ్యాయి. ఇక షూటింగ్ విషయానికి వస్తే.. ఇప్పటివరకు రెండు షెడ్యూల్స్ పూర్తయ్యాయి. శుక్రవారంతో రెండో షెడ్యూల్ ముగిసింది. హైదరాబాద్ పరిసరాల్లో ఈ భారీ షెడ్యూల్ జరిగింది. బాలీవుడ్ హీరో వివేక్ ఒబెరాయ్ విలన్‌గా నటిస్తున్నారు. సినిమాలో ఎంతో Mీలకమైన యాక్షన్ సన్నివేశాలను చిత్రీకరించారు. ‘జీన్స్’ ఫేమ్ ప్రశాంత్, ఆర్యన్ రాజేశ్‌లు హీరో రామ్‌చరణ్‌కు అన్నదమ్ములుగా నటిస్తున్నారు. ఇప్పటివరకు జరిగిన సన్నివేశాల్లో హీరో పాల్గొనలేదు. నెక్ట్స్ మంత్ 8న ప్రార ంభమయ్యే మూడో షెడ్యూల్లో రామ్‌చరణ్ పాల్గొంటారని చిత్రబృందం తెలియజేసింది. -
తీపి కబురు
కారం, తీపి, వగరు, పులుపు, ఉప్పు, చేదు అనే షడ్రుచులు కలిసిన ఉగాది పచ్చడి పిచ్చ టేస్టీగా ఉంటుంది. అలాగే ఓ ఫైట్, సాంగ్, సీన్, డైలాగ్, రొమాన్స్, ఎమోషన్ కలగలిపి ఉన్న ఓ సూపర్ టీజర్‌ను రెడీ చేస్తోందట భరత్ అండ్ టీమ్. మహేశ్‌బాబు హీరోగా కొరటాల శివ దర్శకత్వంలో డీవీవీ దానయ్య నిర్మిస్తున్న చిత్రం ‘భరత్ అనే నేను’. ఇందులో కియారా అద్వాని కథానాయిక. సీయం భరత్ పాత్రలో మహేశ్‌బాబు కనిపించనున్నారు. రిపబ్లిక్ డే సందర్భంగా భరత్ ఫస్ట్ ఓత్ అండ్ లుక్‌ను రిలీజ్ చేశారు. ఈ ఏడాది తెలుగు సంవత్సరాది ఉగాదికి టీజర్‌ను విడుదల చేయాలని ప్లాన్ చేస్తున్నారట. టీజర్ రిలీజ్ వేడుక ఫ్యాన్స్ సమక్షంలో జరిగే అవకాశం ఉందని కొందరు అంచనా వేస్తున్నారు. ఇదే నిజమైతే ఫ్యాన్స్‌కు ఇంతకంటే తీపి కబురు ఏముంటుంది. ఈ నెల 25 నుంచి 28 వరకూ జరిగే షెడ్యూల్లో మహేశ్‌బాబు పాల్గొంటారు. ఆ తర్వాత లండన్‌లో ఓ షెడ్యూల్ ఉంటుందని సమాచారం. సినిమా ఎంటైర్ షూటింగ్ మార్చి 27కల్లా కంప్లీట్ చేసేలా చిత్రబృందం ప్లాన్ చేసింది. ఈ చిత్రాన్ని ఏప్రిల్ 20న రిలీజ్ చేయాలనుకుంటున్నారు. -
సంక్రాంతికి మినహాయింపు
ఇలా అండర్‌స్టాండింగ్‌కి రావడానికి ఏర్పాటైన సమావేశంలో ఆ రెండు చిత్రాల నిర్మాతలతో పాటు నిర్మాత ‘దిల్’ రాజు, కె.ఎల్ నారాయణ పాల్గొన్నారు. ‘‘రెండు భారీ చిత్రాల మధ్య కనీసం రెండు వారాల గ్యాప్ ఉండాలని మాట్లాడుకున్నాం. అందుకే ‘భరత్ అనే నేను’ చిత్రాన్ని ఏప్రిల్ 20న, ‘నా పేరు సూర్య నా ఇల్లు ఇండియా’ చిత్రాన్ని మే 4న రిలీజ్ చేయాలని నిర్ణయించాం. ఇండస్ట్రీలో ఆరోగ్యకరమైన వాతావరణం ఉండాలన్న అభిప్రాయంతో తీసుకున్న ఈ నిర్ణయాన్ని సపోర్ట్ చేసిన మా హీరోలు, దర్శకులకు కృతజ్ఞతలు’’ అన్నారు నిర్మాతలు డివీవీ దానయ్య, లగడపాటి శ్రీధర్, ‘బన్నీ’ వాసు. ‘‘సంక్రాంతి సీజన్‌ను మినహాయించి మిగిలిన సందర్భాల్లో రెండు భారీ చిత్రాల మధ్య ఇలా రెండు వారాల గ్యాప్ ఇచ్చి రిలీజ్ డేట్స్ ప్లాన్ చేయడం వల్ల పరిశ్రమకు ఎంతో మేలు జరగుతుంది. ‘భరత్ అనే నేను, నా పేరు సూర్య నా ఇల్లు ఇండియా’ సినిమాల నిర్మాతల మధ్య మంచి అండర్స్టాండింగ్ కుదరడం శుభపరిణామంగా భావిస్తున్నాం’’ అన్నారు నాగబాబు. ఏప్రిల్ 20న ‘భరత్ అనే నేను’, ఆరు రోజుల గ్యాప్ తర్వాత 27న ‘కాలా’, ఆ నెక్ట్స్ వీక్ మే 4న ‘నా పేరు సూర్య నా ఇల్లు ఇండియా’ వస్తాయి. ఎలాగూ ఏప్రిల్ 5న నితిన్ ‘ఛల్ మెహన్రంగ’, ఏప్రిల్ సెకండ్ వీక్‌లో నాని ‘కృష్ణార్జున యుద్ధం’ వచ్చేస్తాయి. అటు ఆ రెండు సినిమాలకూ.. ఆ తర్వాత విడుదల కానున్న సినిమాలకూ మధ్య గ్యాప్ రావడంతో ఏప్రిల్ వార్ వేడి తగ్గింది. -
స్పెషల్ ట్రైనింగ్!
పక్కా ప్లానింగ్‌తో సినిమాలను కంప్లీట్ చేస్తారు రాజమౌళి. అంతేకాదు.. ఆయన సినిమాలు కూడా సమ్‌థింగ్ స్పెషల్‌గానే ఉంటాయి. సినీ ప్రపంచాన్ని ఉర్రూతలూగించిన ‘బాహుబలి’ వంటి చిత్రం తర్వాత రాజమౌళి దర్శకత్వంలో రామ్‌చరణ్, ఎన్టీఆర్ హీరోలుగా ఓ మల్టీస్టారర్ మూవీ రూపొందనుందని ఇండస్ట్రీలో వార్తలు వస్తున్న సంగతి తెలిసిందే. ఇప్పుడీ చిత్రం గురించి ఓ లేటెస్ట్ అప్డేట్ ఫిల్మ్‌నగర్‌లో వినిపిస్తోంది. ఈ సినిమాలో రామ్‌చరణ్, ఎన్టీఆర్ బాక్సర్స్‌గా కనిపించనున్నారట. అంతేకాదు అన్నదమ్ముల్లా కూడా నటిస్తారని కొందరి గాసిప్రాయుళ్ల ఊహ. బాక్సర్లుగా వీరిద్దరూ ఎవరి భరతం పడతారన్నది స్క్రీన్‌పై చూడాల్సిందే. అయితే.. ఈ సినిమాలోని పాత్రల కోసం కొన్ని రోజుల పాటు స్పెషల్ ట్రైనింగ్ తీసుకోనున్నారట చరణ్ అండ్ ఎన్టీఆర్ . ఈ ట్రైనింగ్‌లో స్పెషల్ డైట్ ఫాలో అవ్వనున్నారట వీరిద్దరూ. నిర్మాత దానయ్య నిర్మించబోయే ఈ సినిమా షూటింగ్ ఈ ఏడాది సెప్టెంబర్ నుంచి స్టార్ట్ అవుతుందని ఫిల్మ్‌నగర్ టాక్. వచ్చే ఏడాది సమ్మర్లో రిలీజ్ ప్లాన్ చేస్తున్నారట. మరోవైపు ఈ సినిమాలో రామ్‌చరణ్ సరసన రాశీఖన్నా నటించనున్నారన్న వార్త కూడా హల్చల్ చేస్తోంది. -
చరణ్ సినిమాకు భారీ డీల్
రంగస్థలం షూటింగ్ దాదాపుగా పూర్తి కావటంతో మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ తన తదుపరి చిత్రం మీద దృష్టి పెట్టాడు. ఇప్పటికే మాస్ యాక్షన్ చిత్రాల దర్శకుడు బోయపాటి శ్రీను దర్శకత్వంలో ఓ సినిమాను ప్రారంభించాడు చెర్రీ. తొలి షెడ్యూల్ పూర్తి చేసుకున్న ఈ సినిమా ప్రస్తుతం రెండో షెడ్యూల్ షూటింగ్ జరుపుకుంటోంది. తాజాగా ఈ సినిమాకు సంబంధించిన ఆసక్తికర వార్త ఒకటి టాలీవుడ్ సర్కిల్స్ లో వినిపిస్తోంది. ఇంతవరకు రామ్ చరణ్ షూటింగ్ కూడా హాజరు కాకముందే ఈ సినిమా బిజినెస్ మొదలైపోయిందట. డీవీవీ దానయ్య నిర్మిస్తున్న ఈ సినిమా హిందీ శాటిలైట్, డిజిటల్ రైట్స్‌ను ఓ ప్రముఖ సంస్థ 22 కోట్ల మొత్తానికి సొంతం చేసుకుంది. జంజీర్ సినిమాతో చరణ్ బాలీవుడ్‌కు సుపరిచితుడు కావటంతో పాటు ఈ సినిమాలో బాలీవుడ్ నటుడు వివేక్ ఒబెరాయ్ విలన్‌గా నటిస్తుండటంతో ఇంత ధర పలికిందని భావిస్తున్నారు. ప్రస్తుతం హైదరాబాద్‌లో ఈ సినిమా షూటింగ్ జరుగుతోంది. ఈ సినిమా కోసం చెర్రీ సరికొత్త లుక్ ట్రై చేస్తున్నాడట. -
27న గుమ్మడికాయ పాలాభిషేకం
అవును.. 27న ‘భరత్ అనే నేను’కి గుమ్మడికాయ కొట్టేస్తారట. ఏ 27న అంటే వచ్చే నెల అన్నమాట. ఆ రోజుకల్లా షూటింగ్ మొత్తం కంప్లీట్ చేసేసి, గమ్మడికాయ కొట్టేయనున్నారు. ఇక సినిమా రిలీజ్ రోజున అభిమాన హీరో కటౌట్స్‌కి ఫ్యాన్స్ ఎలానూ పాలాభిషేం చేస్తారు కదా. ఏప్రిల్ 27కి మహేశ్‌బాబు అభిమానులు పండగ చేసుకోవడానికి రెడీ అయిపోవచ్చు. సీయం భరత్‌గా మహేశ్‌బాబు నటిస్తోన్న చిత్రం ‘భరత్ అనే నేను’. కొరటాల శివ దర్శకత్వంలో డీవీవీ దానయ్య నిర్మిస్తున్న ఈ చిత్రం షూటింగ్‌ను మార్చి 27కల్లా కంప్లీట్ చేసి, ఏప్రిల్ 27న విడుదల చేయడానికి చిత్రబృందం ప్లాన్ చేసినట్లు సమాచారం. శ్రీమంతుడు’ వంటి హిట్ సినిమా తర్వాత మహేశ్–కొరటాల కాంబినేషన్లో వస్తున్న ఈ సినిమాపై భారీ అంచనాలు నెలకొన్నాయి. ఇటీవలే రిలీజ్ చేసిన ‘ఫస్ట్ ఓత్’ కు విశేష స్పందన లభించింది. మహేశ్ సరసన కియారా అద్వానీ కథానాయికగా నటిస్తున్న ఈ చిత్రానికి కెమెరా: తిరు, సంగీతం: దేవీశ్రీ ప్రసాద్. -
మహేష్ వరుసబెట్టి ఇచ్చేశాడు
సాక్షి, సినిమా : గణతంత్ర్య దినోత్సవ కానుకగా ‘భరత్... అను నేను’ పేరిట ఆడియో బిట్‌ను విడుదల చేసిన దర్శకుడు కొరటాల శివ మరికాసపేటికే ఇంకో ట్రీట్ ఇచ్చేశాడు. టైటిల్ లోగోతోపాటు మహేష్ లుక్కును కూడా రివీల్ చేస్తూ ఓ పోస్టర్ వదిలాడు. స్టైలిష్ అవతారంలో సీరియస్‌గా బ్యాగ్ పట్టుకుని ఆఫీస్‌లో నడుచుకుంటూ బయటకు వస్తున్న మహేష్ పోస్టర్ స్టన్నింగ్ గా ఉంది. ముఖ్యమంత్రి ఛాంబర్‌తో ఉన్న బ్యాక్ గ్రౌండ్ థీమ్ కూడా బాగుంది. ఇక ఇంతకాలం ఊరిస్తూ వస్తూ... మేకర్లు ఇప్పుడు ఒక్కోక్కటిగా వరుసపెట్టి వదులుతుండటంతో సూపర్ స్టార్ అభిమానులు పండగ చేసుకుంటున్నారు. ప్రస్తుతం భరత్ అను నేను యాష్ ట్యాగ్ ట్రెండింగ్‌లో కొనసాగుతోంది. ప్రమోషన్లలో కూడా కాస్త వైవిధ్యం కనిపిస్తుండటం విశేషం. కొరటాల శివ డైరెక్ట్ చేస్తున్న ఈ చిత్రానికి డీవీవీ దానయ్య నిర్మాత. బాలీవుడ్ భామ కైరా అద్వానీ హీరోయిన్గా నటిస్తోంది. దేవీశ్రీప్రసాద్ సంగీతాన్ని సమకూరుస్తున్నాడు. పొలిటికల్ డ్రామాగా తెరకెక్కుతున్న భరత్ అను నేను... ఏప్రిల్‌లో ప్రేక్షకుల ముందుకు రానుంది. Presenting the logo of #BharathAneNenu pic.twitter.com/eXMKVtDqry — #BharathAneNenu (@DVVEnts) 26 January 2018 Ladies & Gentlemen, meet Bharath#BharathAneNenu pic.twitter.com/LwaaEBEXYw — #BharathAneNenu (@DVVEnts) 26 January 2018 -
సోషల్ మీడియాలో మహేశ్ ఫస్ట్ పోస్ట్.. వైరల్
సాక్షి, హైదరాబాద్: ఇటీవల ఇన్‌స్టాగ్రామ్‌లో అకౌంట్ ఓపెన్ చేసిన టాలీవుడ్ సూపర్ స్టార్ కేవలం రెండు రోజుల్లోనే 6.8 లక్షల మంది ఫాలోయర్లను సొంతం చేసుకుని రికార్డు సృష్టించారు. తాజాగా ఆయన చేసిన ఇన్స్టాగ్రామ్ పోస్ట్ సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. మహేశ్ తొలి పోస్టుకు అనూహ్యమైన స్పందన వస్తోంది. తన లేటెస్ట్ ప్రాజెక్టకు సంబంధించిన ఓ ఫొటో అప్లోడ్ చేసిన మహేశ్.. ‘రేపు ఉదయం 7 గంటలకు’ అంటూ చేసిన తొలి పోస్టును గంట వ్యవధిలోనే 22 వేల మంది లైక్ చేశారు. గతంలో తనకు శ్రీమంతుడు లాంటి భారీ హిట్ అందించిన కొరటాల శివ దర్శకత్వంలో మహేశ్‌బాబు హీరోగా డీవీవీ దానయ్య నిర్మాణంలో ఓ సినిమా రూపొందుతున్న సంగతి తెలిసిందే. ఈ చిత్రానికి ‘భరత్ అనే నేను’ అనే టైటిల్‌ను పరిశీలిస్తున్నారు. ఇందులో కియారా అద్వాని కథానాయిక. మహేశ్ సీఎం పాత్రలో కనిపించనున్నారని ఫిల్మ్ నగర్ టాక్ కాగా, రిపబ్లిక్ డే.. ఉదయం ఏడు గంటల సమమానికి రెడీగా ఉండండి. ఆల్ ఆడియో ప్లాట్‌ఫామ్స్‌లో భరత్ ఫస్ట్ ఓత్ (ప్రమాణం) వినడానికి అంటూ ఇటీవల యూనిట్ అనౌన్స్ చేసింది. ఈ నేపథ్యంలో లేటెస్ట్ మూవీ పోస్టర్ ను మహేశ్ అప్లోడ్ చేయగా ఆయన ఫాలోయర్లు టాలీవుడ్ ప్రిన్స్ తొలి ఇన్స్టాగ్రామ్ సందేశంపై స్పందించి లైక్స్, కామెంట్లతో అభిమానాన్ని చాటుకుంటున్నారు. 7 AM. Tomorrow. A post shared by Mahesh Babu (@urstrulymahesh) on Jan 25, 2018 at 1:48am PST -
చరణ్, బోయపాటి మొదలెట్టేశారు..!
ప్రస్తుతం సుకుమార్ దర్శకత్వంలో రంగస్థలం సినిమాలో నటిస్తున్న మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ తన కొత్త సినిమా ప్రారంభించాడు. ఇప్పటికే రంగస్థలం షూటింగ్ దాదాపుగా పూర్తి కావటంతో తరువాతి ప్రాజెక్ట్‌పై దృష్టి పెట్టాడు చరణ్. బోయపాటి శ్రీను దర్శకత్వంలో తన కొత్త సినిమాను శుక్రవారం మొదలు పెట్టాడు. ఈ సినిమాలో చరణ్ సరసన కైరా అద్వానీ హీరోయిన్ గా నటిస్తోంది. ఇటీవల ఈ సినిమాపై రకరకాల వార్తలు టాలీవుడ్ లో హల్చల్ చేశాయి. ఈ సినిమా మల్టీ స్టారర్ జానర్లో తెరకెక్కనుందన్న టాక్ తో పాటు సినిమా ఆగిపోయిందన్న ప్రచారం కూడా జరిగింది. అయితే ఆ రూమర్స్‌కు చెక్ పెడుతూ కొత్త సినిమాను సెట్స్ మీదకు తీసుకొచ్చాడు. ఈ సినిమాను డివివి ఎంటర్టైన్మెంట్స్ పతాకంపై దానయ్య నిర్మిస్తున్నారు. రామ్ చరణ్ ఫుల్ మాస్ లుక్‌లో కనిపిస్తున్న రంగస్థలం సినిమా టీజర్‌ను జనవరి 24న విడుదల చేయనున్నారు. -
రిపబ్లిక్ డేకి ప్రమాణం
ఈ నెల 26న మహేశ్‌బాబు ప్రమాణం చేయబోతున్నారు. ఏమని ప్రమాణం చేస్తారు? అంటే.. వెయిట్ అండ్ సీ. మహేశ్‌బాబు హీరోగా కొరటాల శివ దర్శకత్వంలో డీవీవీ ఎంటర్టైన్మెంట్స్ పతాకంపై డీవీవీ దానయ్య నిర్మాణంలో ఓ సినిమా రూపొందుతున్న సంగతి తెలిసిందే. ఈ చిత్రానికి ‘భరత్ అనే నేను’ టైటిల్ అనుకుంటున్నారట. ఇందులో సీయం భరత్ పాత్రలో మహేశ్‌బాబు కనిపించనున్నారని ఫిల్మ్‌నగర్ టాక్. ముఖ్యమంత్రి పదవి చేపట్టే ముందు ప్రమాణ స్వీకారం చేస్తారుగా. బహుశా.. మహేశ్ 26న చేయబోయేది అలాంటిదే అయ్యుండొచ్చు. సో.. 26న సినిమాలోని డైలాగ్స్ వినిపిస్తారేమో? లేక ప్రమాణం చేస్తున్నట్లుగా ఉన్న లుక్‌ని విడుదల చేస్తారేమో? ‘‘రిపబ్లిక్ డే సందర్భంగా సూపర్‌స్టార్ మహేశ్‌బాబు ఫస్ట్ ఓత్ (ప్రమాణం) చేయనున్నారు’’ అని సంక్రాంతి సందర్భంగా సినిమా అప్డేట్ను తెలియజేసింది చిత్రబృందం. ఈ సినిమా క్లైమాక్స్ షూటింగ్‌ను రేపటి నుంచి స్టార్ట్ చేసి నెలాఖరు వరకు షూట్ చేయనున్నారు. -
జనవరి 26న మహేష్ ప్రమాణ స్వీకారం
‘భరత్ అనే నేను’ సినిమా కొరటాల శివ దర్శకత్వంలో మహేష్‌బాబు హీరోగా తెరకెక్కుతున్న విషయం తెలిసిందే. ఈ సినిమాకు సంబంధించిన ఫస్ట్‌లుక్‌ను జనవరి 26 గణతంత్ర దినోత్సవం సందర్భంగా విడుదల చేయనున్నట్లు చిత్ర బృందం ఓ పోస్టర్‌ను విడుదల చేసింది. డీవీవీ ఎంటర్టైన్మెంట్స్ వారు తన ట్విట్టర్లో ఆసక్తికరమైన పోస్టర్ని పోస్ట్ చేశారు. భారీగా ప్రజలు హాజరైన ఫొటోపై ‘‘శాసనం ద్వారా నిర్మితమైన.. భారత రాజ్యాంగం పట్ల.. నిజమైన విశ్వాసం.. విధేయత చూపుతానని, భారతదేశ సార్వభౌమాధికారాన్ని, సమగ్రతను కాపాడతానని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా నా కర్తవ్యాలను శ్రద్ధతో, అంతః కరణ శుద్ధితో నిర్వహిస్తానని, భయంగానీ, పక్షపాతం గానీ, రాగ ద్వేషాలు గానీ లేకుండా రాజ్యాంగాన్ని శాసనాలను అనుసరించి ప్రజలందరికీ న్యాయం చేకూరుస్తానని దైవ సాక్షిగా ప్రమాణం చేస్తున్నాను’’ అనే ప్రమాణ స్వీకార పాఠాన్ని పోస్టర్‌పై ఉంచారు. అయితే ఈ పోస్టర్లో భరత్ పేరు ఎక్కడా ప్రస్తావించలేదు. ఈ సినిమాను డీవీవీ ఎంటర్టైన్మెంట్ పతాకంపై డీవీవీ దానయ్య నిర్మిస్తున్నారు. దేవిశ్రీ ప్రసాద్ సంగీతం అందిస్తున్నారు. ఈ చిత్రాన్ని ఏప్రిల్ 27న విడుదల చేస్తామని చిత్రబృందం ప్రకటించింది, అదే తేదీన ముందుగానే ‘నా పేరు సూర్య నా ఇల్లు ఇండియా’ సినిమా బృందం కూడా ప్రకటించిన విషయం తెలిసిందే. Superstar Mahesh Babu's #MB24, directed by Siva Koratala, will take the First Oath this Republic Day!#MB24FirstOathOn26Jan pic.twitter.com/qYgjTnRtXh — DVV Entertainments (@DVVEnts) 15 January 2018 -
న్యూ ఇయర్‌కి నయా లుక్
ఈ ఇయర్ ఎండింగ్ ఎంతో దూరంలో లేదు. 2017కి గుడ్ బై చెప్పి న్యూ ఇయర్‌కి వెల్కమ్ చెప్పడానికి ఎవరి ప్లానులు వాళ్లు వేసుకుంటున్నారు. మహేశ్‌బాబు మాత్రం ఇంకా ప్లాన్ చేసుకోలేదనే చెప్పాలి. ఎందుకంటే ఈ 13 నుంచి 26 వరకూ మహేశ్ బిజీ. కొరటాల శివ దర్శకత్వంలో మహేశ్‌బాబు హీరోగా డీవీవీ దానయ్య నిర్మిస్తోన్న (‘భరత్ అనే నేను’ టైటిల్ పరిశీలనలో ఉంది) చిత్రం షూటింగ్ షెడ్యూల్ ఇది. త్వరలో మహేశ్ లుక్‌ని విడుదల చేయాలనుకుంటున్నారు. బహుశా న్యూ ఇయర్ కానుకగా నయా లుక్‌ని రిలీజ్ చేస్తారనే ఊహాగానాలు ఉన్నాయి. ఈ చిత్రాన్ని ఏప్రిల్ 27న విడుదల చేస్తామని చిత్రబృందం ప్రకటించడం, అదే తేదీని ముందుగానే ‘నా పేరు సూర్య నా ఇల్లు ఇండియా’ బృందం ప్రకటించడంతో డేట్ క్లాష్ ఇష్యూ సీన్లోకొచ్చిన విషయం తెలిసిందే. ‘బన్నీ’ వాసు, దానయ్య ఈ విషయంలో ఓ అండర్‌స్టాండింగ్‌కి రావాలనుకుంటుండగా ఏప్రిల్ 27న ‘2.0’ని రిలీజ్ చేస్తామనే ప్రకటన వచ్చింది. దాంతో మరో ఇష్యూ మొదలైంది. ఈ నేపథ్యంలో మహేశ్ సినిమాని ఏప్రిల్ 13న విడుదల చేస్తారని రెండు మూడు రోజులుగా ఓ వార్త హల్చల్ చేస్తోంది. ‘‘ఇంకా ఏమీ అనుకోలేదు. ‘బన్నీ’ వాసు గోవాలో ఉన్నారు. ఆయన హైదరాబాద్ రాగానే మాట్లాడుకుని ఓ నిర్ణయానికి వస్తాం’’ అని ‘సాక్షి’తో దానయ్య అన్నారు. సో.. ప్రస్తుతానికి ముందు ప్రకటించిన రిలీజ్ డేట్ ఏప్రిల్ 27 అలానే ఉంది. ఏది ఏమైనా ఇటు ‘భరత్ అనే నేను’ అటు ‘నా పేరు సూర్య నా ఇల్లు ఇండియా’ నిర్మాతలిద్దరూ విడుదల తేదీ విషయంలో వివాదం చేయకుండా సామరస్యంగానే పరిష్కరించుకోవాలనుకుంటున్నారని తెలుస్తోంది. -
కొట్టేద్దామా పోస్టర్!
ఒకటోసారి.. రెండోసారి.. మూడోసారి... ఇదేదో వేలం పాటలా ఉందే! ఇంతకీ, వేలం పాట దేని కోసం? అనేగా మీ డౌట్. ఇక్కడ వేలం పాట లేదు... మీరు పోటీలో పాడుకోవాల్సిన అవసరం అంతకంటే లేదు. అసలు విషయం ఏంటంటే... రామ్‌చరణ్, రకుల్‌ప్రీత్ సింగ్‌లది హిట్ కాంబినేషన్. ‘బ్రూస్లీ, ధృవ’ సినిమాలతో హిట్ పెయిర్ అని పేరు తెచ్చుకున్నారు. ముచ్చటగా మూడోసారి వీళ్లిద్దరూ జోడీ కట్టనున్నారని ఫిల్మ్‌నగర్ టాక్. రామ్‌చరణ్ హీరోగా బోయపాటి శ్రీను దర్శకత్వంలో డీవీవీ దానయ్య నిర్మించనున్న సినిమా ఇటీవల పూజా కార్యక్రమాలు జరుపుకున్న సంగతి తెలిసిందే. అందులో చరణ్ సరసన రకుల్ నటిస్తారనే టాక్ వినిపిస్తోంది. చిత్రవర్గాలు కూడా ఆమెను తీసుకోవాలనే ఆలోచనలో ఉన్నారట. పైగా, ‘సరైనోడు, జయ జానకి నాయక’ చిత్రాల్లో రకుల్ ప్రతిభ, అంకితభావం చూసిన బోయపాటి తన తర్వాతి సినిమాకి రకుల్‌ని తీసుకోనున్నట్లు గతంలోనే వార్తలొచ్చాయి. దీనిబట్టి చూసినా చరణ్ సరసన రకుల్‌కి మరో ఛాన్స్ ఫిక్స్ అయినట్లే అని ఊహించవచ్చు. ఆ సంగతలా ఉంచితే ‘బ్రూస్లీ’లో ‘మెగా మెగా మెగా మీటర్.. కొట్టేద్దామా పోస్టర్’ అని రామ్‌చరణ్, రకుల్ పాడతారు. మరోసారి నటిస్తే.. మళ్లీ పోస్టర్ కొట్టేస్తారు. అదేనండీ.. కొత్త సినిమాకి పోస్టర్లు వేస్తారు కదా! ప్రస్తుతం సుకుమార్ ‘రంగస్థలం’లో నటిస్తున్న చరణ్, అది పూర్తయిన తర్వాత బోయపాటి సినిమా షూటింగ్ స్టార్ట్ చేస్తారట. -
బోయపాటితో మొదటిది... చరణ్‌తో మూడోది!
-
బోయపాటితో మొదటిది... చరణ్‌తో మూడోది!
రామ్‌చరణ్ హీరోగా బోయపాటి శ్రీను దర్శకత్వంలో డీవీవీ ఎంటర్టైన్మెంట్స్ సంస్థ నిర్మించనున్న సినిమా శుక్రవారం సంస్థ కార్యాలయంలో పూజా కార్యక్రమాలతో లాంఛనంగా ప్రారంభమైంది. డీవీవీ దానయ్య నిర్మాత. చరణ్‌తో ఆయనకు మూడో చిత్రమిది. ఇంతకు ముందు చరణ్ హీరోగా ‘నాయక్’, ‘బ్రూస్లీ’ చిత్రాలను నిర్మించారాయన. డీవీవీ ఎంటర్టైన్మెంట్స్లోనూ, రామ్చరణ్తోనూ బోయపాటికి మొదటి చిత్రమిది. ఆల్రెడీ స్క్రిప్ట్ వర్క్ కంప్లీట్ అయ్యిందట. పక్కా కమర్షియల్ ఎంటర్టైనర్గా రూపొందనున్న ఈ సినిమా చిత్రీకరణ వచ్చే ఏడాది జనవరిలో ప్రారంభం అవుతుందని సమాచారమ్! ఈలోపు కథకు తుది మెరుగులు అద్దడంతో పాటు మిగతా నటీనటులను, సాంకేతిక నిపుణులను ఎంపిక చేసే పనిలో దర్శకుడు బోయపాటి శ్రీను బిజీ అవుతారట! ఈ సిన్మాను వచ్చే ఏడాది దసరాకు విడుదల చేయాలనుకుంటున్నారని సమాచారమ్! ఇప్పుడు సుకుమార్ దర్శకత్వంలో ‘రంగస్థలం’ చేస్తున్నారు చరణ్. అలాగే, రాజమౌళి దర్శకత్వంలో ఎన్టీఆర్‌తో కలసి మల్టీస్టారర్ చేసే విషయమై చర్చలు కూడా జరుపుతున్నారట!! -
డిసెంబర్లో ముహూర్తం... దసరాకు వచ్చేస్తాం!
మాస్... రామ్‌చరణ్ మాంచి మాస్ హీరో! మాస్... బోయపాటి శ్రీను ఊర మాస్ దర్శకుడు! వీళ్లిద్దరూ కలసి సినిమా చేస్తే ఎలా ఉంటుందో ఒక్కసారి ఊహల్లో బొమ్మేసుకోండి! ఎందుకంటే... ఈ బొమ్మ వచ్చే ఏడాది దసరాకు థియేటర్లలోకి వచ్చేస్తుందట! థియేటర్లలోకి బొమ్మ రావాలంటే... ముందు రామ్‌చరణ్, బోయపాటి కాంబినేషన్ ఓకే కావాలి, సినిమాకి కథ కుదరాలి, తర్వాత కొబ్బరికాయ కొట్టాలి, సెట్స్‌పైకి వెళ్లాలి కదా. బోలెడు తతంగం ఉందిలే అనుకుంటున్నారా? చెర్రీ (రామ్‌చరణ్), బోయపాటిలు ఆల్రెడీ ఆ ప్లానింగులోనే ఉన్నారని ఫిల్మ్‌నగర్ టాక్! డిసెంబర్లో సిన్మాను ప్రారంభించాలనుకుంటున్నారట. రామ్‌చరణ్ హీరోగా బోయపాటి శ్రీను దర్శకత్వంలో రూపొందే ఈ చిత్రాన్ని డీవీవీ దానయ్య నిర్మిస్తారట! ఇప్పుడు సుకుమార్ దర్శకత్వంలో రామ్‌చరణ్ హీరోగా నటిస్తున్న ‘రంగస్థలం’ షూటింగ్ డిసెంబర్‌కి పూర్తవుతుంది. వెంటనే... బోయపాటి సినిమా షూటింగ్ స్టార్ట్ చేసి, వచ్చే ఏడాది విజయదశమికి విడుదల చేయాలనుకుంటున్నారు. బోయపాటి శ్రీను సినిమా తర్వాత కొరటాల శివ దర్శకత్వంలో రామ్‌చరణ్ ఓ సినిమా చేయనున్నారు. -
కన్ఫర్మ్: రాజమౌళి నెక్స్ట్ రెండు సినిమాలు ఇవే!
'బాహుబలి' సినిమాల భారీ విజయం తర్వాత దర్శకధీరుడు రాజమౌళి.. ఏ సినిమా తీయబోతున్నారన్నది తీవ్ర ఆసక్తి రేపుతోంది. 'బాహుబలి' సిరీస్‌తో అంతర్జాతీయంగా పాపులర్ అయిన రాజమౌళి తాను తీయబోయే తదుపరి రెండు చిత్రాల గురించి క్లారిటీ ఇచ్చారు. అంతర్జాతీయ మ్యాగజీన్ 'వెరీటీ'కి ఇంటర్వ్యూ ఇచ్చిన రాజమౌళి.. తన తదుపరి సినిమాలను కన్ఫర్మ్ చేశారు. టాలీవుడ్ సూపర్ స్టార్ మహేశ్‌బాబుతో సినిమా తీయబోతున్నట్టు ఆయన ప్రకటించారు. ప్రముఖ నిర్మాత కేఎల్ నారాయణ తెరకెక్కించే ఈ సినిమా 2019లో సెట్స్‌పైకి వెళ్లే అవకాశముంది. 'క్షణ క్షణం', 'హాలోబ్రదర్', 'రాఖీ' వంటి ప్రముఖ సినిమాలకు నిర్మాతగా వ్యవహరించిన కేఎల్ నారాయణ నిర్మించే ఈ సినిమా టైటిల్, ఇతర వివరాలు తెలియాల్సి ఉంది. ఈ లోపే డీవీవీ దానయ్యతో సినిమా తీస్తానని రాజమౌళి స్పష్టం చేశారు. 'బాహుబలి' సిరీస్ తర్వాత వెంటనే తీయబోయే సినిమా ఇదే కానుంది. 'దానయ్యకు నేను కమిట్ అయ్యాను. ఇదే నా నెక్స్ట్ సినిమా కానుంది' అని రాజమౌళి స్పష్టం చేశారు. 'ఏ భాషలో ఈ సినిమాను నిర్మించనున్నాం. ఈ చిత్రంలో నటీనటులు ఎవరు? అన్నది ఇంకా తెలియదు' అని ఆయన చెప్పారు. డీవీవీ దానయ్య ప్రస్తుతం మహేశ్‌బాబుతో 'భరత్ అను నేను' సినిమాను నిర్మిస్తున్న సంగతి తెలిసిందే. కొరటాల శివ దర్శకత్వంలో రూపొందుతున్న ఈ సినిమా అనంతరం రాజమౌళితో సినిమాను దానయ్య సెట్స్‌పైకి తీసుకెళ్లే అవకాశముంది. -
రాజకీయాలు తక్కువ.. కుటుంబమే ఎక్కువ!
రాజకీయాలు తక్కువేంటి? అసలు, మహేశ్‌బాబు రియల్ లైఫ్ డిక్షనరీలో రాజకీయాలకు ఎప్పుడూ ప్లేస్ లేదు. ‘నన్ను రాజకీయాల్లోకి తీసుకెళితే పరిస్థితి దారుణంగా ఉంటుంది. మా అబ్బాయిని తీసుకెళ్లినంత పనవుతుంది. మా ఇద్దరికీ రాజకీయాల గురించి ఏం తెలీదు’ అని మహేశ్ ఓ సందర్భంలో పేర్కొన్నారు. కానీ, రీల్ లైఫ్ డిక్షనరీలో మాత్రం అప్పుడప్పుడూ రాజకీయాలకు కొంచెం చోటిస్తారు. ‘దూకుడు’లో కాసేపు ఎమ్మెల్యే డ్రస్సులో కనిపించి అభిమానుల్ని ఖుషీ చేశారు. ప్రస్తుతం కొరటాల శివ దర్శకత్వంలో నటిస్తున్న ‘భరత్ అనే నేను’ సినిమాలో ముఖ్యమంత్రిగా కనిపిస్తారనే వార్త అభిమానుల్ని మరింత ఖుషీ చేస్తోంది. అయితే... ఇందులో రాజకీయాల కంటే ఫ్యామిలీ డ్రామా ఎక్కువ ఉంటుందట. ఇది రాజకీయ పార్టీలు, నాయకులను దృష్టిలో పెట్టుకుని రూపొందిస్తున్న సినిమా కాదట. ‘భరత్ అనే నేను’ టైటిల్లోనే పొలిటికల్ ఫ్లేవర్ ఉంది. ఆ ఫ్లేవ ర్తో పాటు కొరటాల శివ మార్క్ ఫ్యామిలీ డ్రామా, ఎమోషన్స్, రొమాన్స్ ఉంటాయట. డీవీవీ దానయ్య నిర్మిస్తున్న ఈ సినిమాకు దేవిశ్రీప్రసాద్ స్వరకర్త. -
ఆల్మోస్ట్ అమెరికాలో...
నాని, నివేదా థామస్, ఆది పినిశెట్టి ముఖ్యతారలుగా శివ నిర్వాణను దర్శకుడిగా పరిచయం చేస్తూ డీవీవీ దానయ్య నిర్మిస్తున్న చిత్రం బుధవారం ప్రారంభమైంది. ముహూర్తపు సన్నివేశానికి దర్శకులు కొరటాల శివ కెమేరా స్విచాన్ చేయగా, వీవీ వినాయక్ క్లాప్ ఇచ్చారు. నిర్మాత మాట్లాడుతూ - ‘‘అమెరికాలో 80 శాతం, మిగతా చిత్రాన్ని హైదరాబాద్, విశాఖలో చిత్రీకరిస్తాం. డిసెంబర్ 5న రెగ్యులర్ షూటింగ్ ప్రారంభిస్తాం’’ అన్నారు. ‘‘సున్నితమైన అంశాన్ని వినోదాత్మకంగా చెప్పే ప్రయత్నం చేస్తున్నాం. కోన వెంకట్ స్క్రీన్‌ప్లే కథకు బలం’’ అన్నారు శివ నిర్వాణ. ‘‘నాకు ఇష్టమైన వ్యక్తులు, చిత్ర బృందంతో కలసి పని చేయడం హ్యాపీగా ఉంది’’ అని నాని తెలిపారు. దర్శకులు రవిరాజా పినిశెట్టి, నిర్మాతలు శివలెంక కృష్ణప్రసాద్, దామోదర ప్రసాద్, ‘దిల్’ రాజు, శిరీష్, రవిశంకర్ పాల్గొన్నారు. -
తెలుగు.. తమిళ్..మళ్లీ మహేశ్?!
ప్రస్తుతం ఏఆర్ మురుగదాస్ దర్శకత్వంలో మహేశ్ బాబు హీరోగా నటిస్తున్న సినిమా తెలుగు, తమిళ భాషల్లో తెరకెక్కుతోంది. ఈ సినిమా తర్వాత డీవీవీ దానయ్య నిర్మాణంలో దర్శకుడు కొరటాల శివతో ఓ సినిమా చేయనున్నారు. ఈ రెండూ పూర్తయిన తర్వాత మరోసారి తెలుగు, తమిళ ద్విభాషా చిత్రంలో మహేశ్ నటించే అవకాశాలున్నాయి. ప్రముఖ తమిళ నిర్మాత కలైపులి ఎస్.థాను మహేశ్ బాబు హీరోగా ద్విభాషా చిత్రం నిర్మించడానికి సన్నాహాలు చేస్తున్నారు. ‘రాజా రాణి’, విజయ్ ‘పోలీస్’ సినిమాల ఫేమ్ అట్లీ సహాయ దర్శకుడు బాస్కో మన ప్రిన్స్ మహేశ్‌ను దృష్టిలో పెట్టుకుని ఓ కథ రాసుకున్నారు. ప్రస్తుతం మురుగదాస్ సినిమా షూటింగ్ నిమిత్తం చెన్నైలో ఉన్న మహేశ్‌ను కలసి దర్శక-నిర్మాతలు చర్చించారట. కథపై డిస్కషన్స్ జరుగుతున్నాయని నిర్మాత సన్నిహిత వర్గాల సమాచారం. మహేశ్ బాబు గ్రీన్ సిగ్నల్ ఇస్తే... రజనీకాంత్ ‘కబాలి’తో సహా తమిళంలో పలు భారీ సినిమాలు నిర్మించిన కలైపులి ఎస్.థాను నేరుగా తెలుగులో సినిమా తీస్తున్నట్లు అవుతుంది. విజయ్ ‘పోలీస్’ (తమిళంలో ‘తెరి’) నిర్మించింది కూడా థానూనే. ఆ సినిమా షూటింగ్ టైమ్‌లోనే అట్లీ అసోసియేట్ బాస్కోపై నిర్మాతకు నమ్మకం కలిగిందట. ఇటీవల ఓ ఆడియో వేడుకలో నా అసోసియేట్‌తో థానుగారు సినిమా నిర్మిస్తానని చెప్పారని అట్లీ వ్యాఖ్యానించారు. -
బ్రూస్ లీ దర్శక, నిర్మాతలపై ఐటీ ఎటాక్
హైదరాబాద్ : నిన్న కోలివుడ్ ...తాజాగా టాలీవుడ్‌పై ఐటీ శాఖ కన్నేసింది. భారీ బడ్జెట్ తో నిర్మించిన బ్రూస్ లీ చిత్రమే ప్రధాన లక్ష్యంగా సినిమా రంగంపై ఆదాయపు పన్నుశాఖ గురువారం పంజా విసిరింది. ప్రముఖ దర్శకుడు శ్రీను వైట్ల, నిర్మాత డీవీవీ దానయ్య, సంగీత దర్శకుడు థమన్, ప్రముఖ నిర్మాత దిల్ రాజు నివాసాలపై ఐటీ శాఖ అధికారులు దాడులు చేశారు. కాగా రామ్ చరణ్ హీరోగా రూ. 50కోట్లు బడ్జెట్‌తో తెరకెక్కిన బ్రూస్ లీ చిత్రం శుక్రవారం ప్రేక్షకుల ముందుకు రానున్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో ఐటీ శాఖ అధికారులు దాడులు చేసి, సోదాలు నిర్వహిస్తున్నారు. శ్రీనువైట్ల, దానయ్య నివాసాలతో పాటు, వారి కార్యాలయాలు, వారి సమీప బంధువుల ఇళ్లలోనూ తనిఖీలు చేపట్టారు. ఇందుకు సంబంధించి పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది. కాగా కొద్దిరోజుల క్రితం పులి చిత్ర హీరో విజయ్, హీరోయిన్లు సమంత, నయనతార ఇళ్లపై దాడులు నిర్వహించింది. నిర్మాతలు కలైపులి ఎస్ థాను, మదురై అన్బు ఇళ్లలో సోదాలను నిర్వహించిన విషయం తెలిసిందే. ఐటీ సోదాల్లో పెద్ద ఎత్తున నగదుతో పాటు బంగారు ఆభరణాలు స్వాధీనం చేసుకున్నారు. -
బ్యాంగ్ బ్యాంగ్ బ్యాంకాక్
రామ్‌చరణ్ యాక్షన్ సీన్లు బ్యాంకాక్‌లో బ్యాంగ్ బ్యాంగ్ చేస్తున్నాయి. పది రోజులుగా రామ్‌చరణ్ షూటింగ్ అక్కడే జరుగుతోంది. మరో ఐదు రోజులు అక్కడే సందడి చేస్తారు. ఈ సందడంతా శ్రీను వైట్ల దర్శకత్వంలో చేస్తున్న చిత్రం కోసమే. డి. పార్వతి సమర్పణలో డీవీవీ ఎంటర్టైన్మెంట్స్ ఎల్ఎల్పి పతాకంపై డీవీవీ దానయ్య ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. రామ్‌చరణ్, రకుల్ ప్రీత్‌సింగ్, నదియా, కృతీ కర్బందా తదితరులపై పతాక సన్నివేశాలు చిత్రీకరిస్తున్నారు. ఈ సందర్భంగా డీవీవీ దానయ్య మాట్లాడుతూ - ‘‘ఫైట్‌తో పాటు టాకీ కూడా చిత్రీకరిస్తున్నాం. ఈ 13 నుంచి హైదరాబాద్‌లో మరో షెడ్యూల్ ప్రారంభిస్తాం. విజయ దశమికి చిత్రాన్ని విడుదల చేయాలనుకుంటున్నాం’’ అని చెప్పారు. ఫ్యామిలీ ఎంటర్టైన్మెంట్ నేపథ్యంలో సాగే యాక్షన్ మూవీ ఇది అని, భారీ తారాగణంతో, అత్యున్నత సాంకేతిక విలువలతో రూపొందిస్తున్న ఈ చిత్రం అన్ని వర్గాలవారూ చూసే విధంగా ఉంటుందని దర్శకుడు తెలిపారు. ఈ చిత్రానికి కథ: కోన వెంకట్-గోపీ మోహన్, మాటలు: కోన వెంకట్, సంగీతం: తమన్ ఎస్.ఎస్., కెమెరా: మనోజ్ పరమహంస, లైన్ ప్రొడ్యూసర్: కృష్ణ, ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్: వి.వై. ప్రవీణ్‌కుమార్. -
దోపిడీకి గురైన ప్రముఖ సినీ రచయిత
ప్రముఖ సినీ రచయిత కోన వెంకట్ దారి దోపిడీకి గురయ్యారు. అచ్చంగా సినిమా ఫక్కిలో చోరీ జరిగింది. సినిమాల్లో చూపించినట్లే దుండగులు రోడ్డుకు అడ్డంగా చెట్టు పడవేసి మరీ దోపిడీకి పాల్పడ్డారు. నటుడు ప్రకాష్ రాజ్ పుట్టినరోజు వేడుకలకు వెళ్లి తిరిగి వస్తూ కోన వెంకట్‌తో పాటు నిర్మాత డీవీవీ దానయ్య కూడా దొంగల బారిన పడగా, దర్శకుడు శ్రీను వైట్ల, మ్యూజిక్ డైరెక్టర్ థమన్ తృటిలో తప్పించుకున్నారు. నగర శివార్లలో జరిగిన ఈ విషయం ఆలస్యంగా వెలుగు చూసింది. వివరాల్లోకి వెళితే ఈనెల 26న షాద్ నగర్లో ప్రకాష్ రాజ్ ఫాంహౌస్‌లో ఆయన పుట్టినరోజు వేడుకలు జరిగాయి. ఈ కార్యక్రమానికి పలువురు సినీప్రముఖులు హాజరయ్యారు. పార్టీ అనంతరం రాత్రి 2 గంటల సమయంలో కోన వెంకట్, దానయ్య ..సిటీకి తిరిగి వస్తుండగా కొందరు దుండగులు దారికాచి దోపిడీకి పాల్పడ్డారు. గొడ్డళ్లతో కారు అద్దాలు పగులగొట్టి వారి వద్ద నుంచి బంగారు గొలుసులు, ఉంగరాలు, డబ్బులు దోచుకు వెళ్లారు. దుండగులు దోచుకు వెళ్లిన సొత్తు మొత్తం రూ.3లక్షల ఉంటుందని అంచనా. కాగా వీరి వెనుకనే వస్తున్న శ్రీనువైట్ల, థమన్, గోపీ మోహన్.... దోపిడీ వ్యవహారాన్ని గమనించి తమ వాహనాలను వెనక్కి తిప్పి వెళ్లిపోయారు. అనంతరం కోన వెంకట్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. మరోవైపు దారిదోపిడీ విషయాన్ని షాద్ నగర్ పోలీసులు ధ్రువీకరించారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు షాద్ నగర్ సీఐ శంకరయ్య తెలిపారు. ఇక ఈ సంఘటనపై కోన వెంకట్ మాట్లాడుతూ తన జీవితంలో మర్చిపోలేని సంఘటన అని, దుండగుల దాడి నుంచి ప్రాణాలతో బయటపడినందుకు హ్యాపీగా ఉందన్నారు. మెడపై కత్తిపెట్టి డబ్బులు ఇవ్వాలని దొంగలు బెదిరించినట్లు ఆయన తెలిపారు. కాగా.. డబ్బు పోతే పోయింది కానీ, తన తదుపరి చిత్రానికి మంచి కథ దొరికిందని కోన వెంకట్ వ్యాఖ్యానించటం కొసమెరుపు. ఈ దారిదోపిడీకి సంబంధించిన సన్నివేశాలు క్రైమ్, కామెడీ నేపథ్యంలో తెరకెక్కుతున్న 'శంకరాభరణం' చిత్రంలో ప్రేక్షకుల్ని అలరించవచ్చు. -
చరణ్ సినిమా షురూ!
‘గోవిందుడు అందరివాడేలే’ చిత్రం తర్వాత కొంత విరామం తీసుకున్న రామ్‌చరణ్ మళ్లీ షూటింగ్‌లతో బిజీ అవుతున్నారు. ఎప్పటి నుంచో ఊరిస్తున్న శ్రీను వైట్ల కాంబినేషన్లో ఓ సినిమా షూటింగ్ లాంఛనంగా గురువారం హైదరాబాద్‌లో మొదలైంది. డీవీవీ దానయ్య నిర్మిస్తున్న ఈ చిత్రం పూజా కార్యక్రమాలు సంస్థ కార్యాలయంలో జరిగాయి. దేవుని పటాలపై చిత్రీకరించిన మహూర్తపు దృశ్యానికి వినాయక్ కెమేరా స్విచాన్ చేయగా, చిరంజీవి సతీమణి సురేఖ క్లాప్ ఇచ్చారు. సినిమా స్క్రిప్ట్‌ను చిరంజీవి దర్శక -నిర్మాతలకు అందించారు. ఈ సందర్భంగా శ్రీను వైట్ల మాట్లాడుతూ - ‘‘రామ్‌చరణ్‌తో పనిచేస్తున్నందుకు ఆనందంగా ఉంది. కొంత గ్యాప్ తర్వాత మళ్లీ నేను, గోపీమోహన్, కోన వెంకట్ కలిసి మంచి కథ తయారుచేశాం. మా కాంబినేషన్లో వచ్చిన గత చిత్రాలన్నిటి లానే ఈ సినిమా కూడా హిట్టవుతుంది’’ అని చెప్పారు. సినిమా మొత్తం ఎనర్జిటిక్‌గా ఉంటుందని కోన వెంకట్ పేర్కొన్నారు. నిర్మాత డీవీవీ దానయ్య మాట్లాడుతూ- ‘‘రామ్‌చరణ్, శ్రీను వైట్ల కాంబినేషన్లో వస్తున్న ఈ చిత్రాన్ని నిర్మించే అవకాశం ఇచ్చినందుకు చిరంజీవి గారికి కృతజ్ఞతలు. ఫ్యామిలీ, యాక్షన్ ఎంటర్టైనర్గా దీన్ని రూపొందిస్తున్నాం’’ అని తెలిపారు. ఈ చిత్రానికి మాటలు: కోన వెంకట్, ఆర్ట్: నారాయణ రెడ్డి, ఫైట్స్: అనల్ అరసు, లైన్ ప్రొడ్యూసర్: కృష్ణ, ఎగ్జిక్యూటివ్ నిర్మాత: వి.వై ప్రవీణ్ కుమార్. -
కొత్త సంవత్సరంలో కొరటాల శివ సినిమా
ప్రతిభ అనే పదానికి పర్యాయపదం తారక్. నూనూగు మీసాల ప్రాయంలోనే చిరంజీవి, బాలకృష్ణ లాంటి గ్రేటెస్ట్ మాస్ హీరోలు చేయాల్సిన పాత్రలను చేసేసి శభాష్ అనిపించుకున్నారాయన. అయితే... తారక్ టాలెంట్‌ని సరిగ్గా ఉపయోగించుకునే దర్శకులే ప్రస్తుతం కరువయ్యారు. కథ, కథనం, పాత్ర, దర్శకుడు.. ఇలా అన్నీ పర్ఫెక్ట్గా సెట్ అయితే... తెరపై తారక్ నట విశ్వరూపాన్నే చూడచ్చు. ఇందులో ఏ మాత్రం సందేహం లేదు. గత రెండేళ్ళ కాలంలో తారక్ నుంచి వచ్చిన సినిమాలు... గతంలో ఆయన చేసిన సినిమాల స్థాయిలో ఉండటంలేదన్నది పలువురి అభిప్రాయం. ఆ మాటకొస్తే ప్రేక్షకాభిప్రాయం కూడా అదే. అందుకే... మాస్లో తారక్‌కు ఉన్న అనూహ్యమైన ఇమేజ్‌ని దృష్టిలో పెట్టుకొని అద్భుతమైన కథను తయారు చేశారు దర్శకుడు కొరటాల శివ. ‘మిర్చి’తో బాక్సాఫీస్‌కి ఘాటెక్కించిన శివ... తారక్‌ను ఆయుధంగా తీసుకొని ద్వితీయ విఘ్నాన్ని అధిగమించడానికి సమాయత్తమయ్యారు. వీరిద్దరి కాంబినేషన్లో తెరకెక్కబోతున్న చిత్రాన్ని డీవీవీ దానయ్య నిర్మించబోతున్నారు. డిసెంబర్లో ఈ చిత్రం ముహూర్తం జరుపుకోబోతోంది. కొత్త సంవత్సరంలో చిత్రీకరణ మొదలుకానుంది. ఎన్టీఆర్ గత విజయాలకు దీటుగా అత్యంత శక్తిమంతంగా ఈ చిత్ర కథా కథనాలు ఉంటాయని సమాచారం. దేవిశ్రీ ప్రసాద్ ఈ చిత్రానికి స్వరాలందించనున్నారు. ఇంకా ఈ సినిమాలో నటించే కథానాయిక, ఇతర నటీనటులు, సాంకేతిక నిపుణుల వివరాలు తెలియాల్సి ఉంది.