రాజమౌళి, స్టీవెన్స్, ఎన్టీఆర్
‘నాన్నకు ప్రేమతో’లో సరికొత్త హెయిర్ స్టైల్, ‘అరవింద సమేత వీర రాఘవ’లో ఆరు పలకల దేహం... ఇలా పాత్రకు అనుగుణంగా తన బాడీని, బాడీ లాంగ్వేజ్‌ని మొత్తం మార్చేస్తున్నారు ఎన్టీఆర్. ఇప్పుడు మరోసారి తన లుక్‌ని పూర్తీగా మార్చేసే పనిలో పడ్డారు. రాజమౌళి దర్శకత్వంలో ఎన్టీఆర్, రామ్‌చరణ్ హీరోలుగా ఓ భారీ మల్టీస్టారర్ చిత్రం తెరకెక్కనున్న సంగతి తెలిసిందే. ‘ఆర్‌ఆర్‌ఆర్’ అనేది వర్కింగ్ టైటిల్. డీవీవీ దానయ్య నిర్మాత. ఈ చిత్రంలో ఎన్టీఆర్ పాత్ర లుక్ చాలా కొత్తగా ఉంటుందని సమాచారం.
దానికోసం ఎన్టీఆర్‌కు ‘అరవింద సమేత..’ కోసం శిక్షణ అందించిన ఫిట్‌నెస్ ట్రైనర్ స్టీవెన్స్ లాయిడ్ వర్క్ చేయనున్నారు. ఈ విషయం తెలుపుతూ – ‘‘ఎన్టీఆర్ లుక్ చర్చించడానికి లెజండరీ దర్శకుడు రాజమౌళిగారిని కలిశాను. చాలా ఎగై్జటింగ్‌గా ఉంది. ఏం చేయబోతున్నామో చూడండి’’ అని స్టీవెన్స్ పేర్కొన్నారు. ఈ కొత్త లుక్ కోసం ఎన్టీఆర్ సుమారు 45 రోజుల పాటు ఫిజికల్ వర్కౌట్స్ చేయనున్నారట. ఈ చిత్రం రెగ్యులర్ షూటింగ్ వచ్చే నెల 16న స్టార్ట్ కానుందని సమాచారం. ఎన్టీఆర్ లుక్ ఓకే. మరి రామ్‌చరణ్ లుక్ ఎలా ఉండబోతోందో అని అభిమానుల్లో తీవ్ర ఆసక్తి నెలకొనడంలో ఆశ్చర్యం లేదు.
Comments
Please login to add a commentAdd a comment