ramcharan tej
-
తొలి విహార యాత్ర!
రామ్‌చరణ్, ఉపాసన ఇటలీ వెళ్లారు. తమ కుమార్తె క్లీం కారని తీసుకుని ఈ విహార యాత్రకు వెళ్లారు. కుమార్తెతో చరణ్, ఉపాసన వెళ్లిన ఫస్ట్ వెకేషన్ ఇది. ప్రస్తుతం శంకర్ దర్శకత్వంలో ‘గేమ్ ఛేంజర్’ సినిమాలో నటిస్తున్నారు రామ్ చరణ్. ఈ సినిమా తాజా షెడ్యూల్ మంగళవారంతో పూర్తయింది. తర్వాతి షెడ్యూల్‌కి కాస్త గ్యాప్ రావడంతో కుటుంబంతో కలిసి బుధవారం ఇటలీ వెకేషన్‌కు బయలుదేరారు రామ్‌చరణ్. దాదాపు వారంరోజుల పాటు ఈ ట్రిప్‌ని ΄్లాన్ చేసుకున్నారని సమాచారం. -
పలు గెటప్స్‌లలో కనిపించనున్న టాప్ హీరోలు
అభిమాన హీరోలు వెండితెరపై ఒక గెటప్‌లో కనిపిస్తేనే ఫ్యాన్స్ ఖుషీ అవుతారు. అలాంటిది ఆ స్టార్ హీరో పలు రకాల గెటప్స్‌లో కనిపిస్తే ఆ ఖుషీ డబుల్ అవుతుంది. అలా డిఫరెంట్ గెటప్స్‌లో కనిపించే కథలు కొందరు స్టార్స్‌కి సెట్ అయ్యాయి. ఒక్కో హీరో మినిమమ్ నాలుగు, ఇంకా ఎక్కువ గెటప్స్‌లో కనిపించనున్నారు. గెట్.. సెట్.. గెటప్స్ అంటూ ఆ స్టార్స్ చేస్తున్న చిత్రాల గురించి తెలుసుకుందాం. విభిన్న భారతీయుడు విభిన్నమైన గెటప్స్‌లో కనిపించడం కమల్‌హాసన్‌కు కొత్తేం కాదు. ‘దశావతారం’లో కమల్ పది పాత్రల్లో పది గెటప్స్ చేసి ఆడియన్స్‌ను ఆశ్చర్యపరిచారు. అన్ని పాత్రల్లో కాదు కానీ ‘ఇండియన్ 2’లో కమల్‌హాసన్ డిఫరెంట్ గెటప్స్‌లో కనిపించనున్నారని తెలుస్తోంది. 1996లో హీరో కమల్‌హాసన్, దర్శకుడు శంకర్ కాంబినేషన్లో వచ్చిన ‘ఇండియన్’ (తెలుగులో ‘భారతీయుడు’) సినిమాకు సీక్వెల్‌గా ‘ఇండియన్ 2’ వీరి కాంబినేషన్లోనే రూపొందుతోంది. 1920 నేపథ్యంలో ఈ సినిమా కథనం సాగుతుందని, ఇందులో కమల్‌హాసన్ నాలుగుకి మించి గెటప్స్‌లో కనిపిస్తారని కోలీవుడ్ టాక్. వీటిలో లేడీ గెటప్ ఒకటనే టాక్ తెరపైకి వచ్చింది. మహిళగా, 90 ఏళ్ల వృద్ధుడిగా, యువకుడిగా.. ఇలా విభిన్నంగా కనిపించడానికి కమల్‌కి ప్రోస్థటిక్ మేకప్ వేసుకోవడానికి, తీయడానికి మూడు గంటలకు పైగా పడుతోందని యూనిట్ అంటోంది. ఈ చిత్రం వచ్చే ఏడాది రిలీజ్ కానుంది. పెయింటరా? సైంటిస్టా? పెయింటరా? రైతా? సైంటిస్టా? అసలు ‘ఈగిల్’ సినిమాలో రవితేజ క్యారెక్టర్ ఏంటి? అనే సందేహం తీరాలంటే ఈ సంక్రాంతి వరకూ వెయిట్ చేయాల్సిందే. ఎందుకంటే ఈ సినిమా రిలీజ్ అయ్యేది అప్పుడే. కార్తీక్ ఘట్టమనేని దర్శకత్వం వహిస్తున్న యాక్షన్ ఫిల్మ్ ‘ఈగిల్’. ఈ చిత్రంలో అనుపమా పరమేశ్వరన్ ఓ లీడ్ హీరోయిన్గా నటిస్తున్నారు. ఇందులో రవితేజ ఐదారు గెటప్స్‌లో కనిపించనున్నట్లు తెలుస్తోంది. వీటిలో ప్రొఫెషనల్ స్నైపర్ గెటప్ ఒకటి అని భోగట్టా. ఇంకా రవితేజ లుక్ విడుదల కాలేదు. పదికి మించి.. ప్రయోగాత్మక పాత్రలకు సూర్య ముందుంటారు. ‘సుందరాంగుడు’, ‘సెవెన్త్ సెన్స్’, ‘24’, ‘బ్రదర్స్’... ఇలా సూర్య కెరీర్లో వైవిధ్యమైన చిత్రాల జాబితా ఎక్కువే. ఈ కోవలోనే సూర్య నటించిన మరో చిత్రం ‘కంగువా’. శివ దర్శకత్వం వహించారు. ఈ సినిమాలో సూర్య పదమూడు గెటప్స్‌లో కనిపిస్తారనే టాక్ ఎప్పట్నుంచో వినిపిస్తోంది. 17వ శతాబ్దంలో మొదలై 2023కి కనెక్ట్ అయ్యేలా ‘కంగువా’ కథను రెడీ చేశారట శివ. రెండు భాగాలుగా విడుదల కానున్న ‘కంగువా’ తొలి భాగం వచ్చే ఏడాది ఏప్రిల్‌లో విడుదల కానున్నట్లు తెలుస్తోంది. స్టూడెంట్.. రాజకీయ నాయకుడు కాలేజ్ స్టూడెంట్, ఐఏఎస్ ఆఫీసర్, రాజకీయ పార్టీ కార్యకర్త... ఇలా ‘గేమ్ చేంజర్’ సినిమాలో రామ్‌చరణ్ ఏడు గెటప్స్‌లో కనిపిస్తారనే టాక్ ఫిల్మ్‌నగర్ సర్కిల్స్‌లో వినిపిస్తోంది. శంకర్ దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రంలో ప్లాష్‌బ్యాక్ ఎపిసోడ్స్ కూడా ఉన్నాయి. రాజకీయ నాయకులకు, ఐఏఎస్ ఆఫీసర్లకు మధ్య నెలకొని ఉండే అంశాల నేపథ్యంలో ఈ సినిమా కథనం ఉంటుందట. ఈ చిత్రం వచ్చే ఏడాది విడుదల కానుంది. 2 దశాబ్దాలు.. 4 గెటప్స్ ‘తొలిప్రేమ’ (2018)లో వరుణ్ తేజ్ క్యారెక్టర్లో డిఫరెంట్ షేడ్స్ కనిపిస్తాయి. కాలేజీ కుర్రాడిలా, ఉద్యోగం చేసే వ్యక్తిగా కనిపిస్తారు. ఇదే తరహాలో వరుణ్ తేజ్ మరో సినిమా చేస్తున్నట్లు తెలుస్తోంది. అదే ‘మట్కా’. ఈ చిత్రంలో వరుణ్ తేజ్ నాలుగు గెటప్స్‌లో కనిపిస్తారని చిత్ర యూనిట్ వెల్లడించింది. వైజాగ్ నేపథ్యంలో 1958 నుంచి 1982 టైమ్ పీరియడ్‌లో ‘మట్కా’ కథనం ఉంటుంది. ‘పలాస’ ఫేమ్ కరుణకుమార్ దర్శకత్వంలో రూపొందనున్న ఈ చిత్రం రెగ్యులర్ షూటింగ్ అక్టోబరు మొదటి వారంలో ప్రారంభం కానుంది. వచ్చే ఏడాది ఈ సినిమాను విడుదల చేస్తారు. పలు అవతారాల్లో స్మగ్లింగ్ స్మగ్లింగ్ చేస్తున్నారట కార్తీ. అది కూడా గోల్డ్ స్మగ్లింగ్. ఇందులో భాగంగా అధికారులను బోల్తా కొట్టించేందుకు తన గెటప్ మార్చుతుంటారట. ఇదంతా ‘జపాన్’ సినిమా కోసం. రాజు మురుగన్ దర్శకత్వంలో రూపొందుతున్న చిత్రం ఇది. గోల్డ్ స్మగ్లింగ్ నేపథ్యంలో ఈ సినిమా ఉంటుందని, ఇందులో కార్తీ డిఫరెంట్ గెటప్స్‌లో కనిపిస్తారని సమాచారం. ఈ చిత్రం ఈ దీపావళికి విడుదల కానుంది. -
‘సిరివెన్నెల’ చివరి పాట మా సినిమాలో ఉండడం అదృష్టం: నిర్మాత
‘‘ప్రేక్షకుడిగా నేనో సినిమా చూసినప్పుడు కథలో కొత్తదనం ఉండాలని కోరుకుంటాను. ‘బెదురులంక 2012’ కథలో అలాంటి కొత్తదనాన్ని చూపించారు క్లాక్స్’’ అని నిర్మాత బెన్నీ ముప్పానేని అన్నారు. కార్తికేయ గుమ్మకొండ, నేహా శెట్టి జంటగా క్లాక్స్ దర్శకత్వం వహించిన చిత్రం ‘బెదురులంక 2012’. సి. యువరాజ్ సమర్పణలో రవీంద్ర బెనర్జీ (బెన్నీ) ముప్పానేని నిర్మించిన ఈ చిత్రం ఈ నెల 25న విడుదలవుతోంది. ఈ సందర్భంగా బెన్నీ ముప్పానేని మాట్లాడుతూ– ‘‘సినిమాలపై ఉన్న ఆసక్తితో సాఫ్ట్వేర్ ఉద్యోగం వదిలి, నిర్మాతగా మారాను. ఓ ఊహాజనిత గ్రామంలో 2012లో 21 రోజులు ఏం జరిగింది? అనేది ‘బెదురులంక 2012’ చిత్రకథ. మనం చని΄ోతాం అని తెలిస్తే చివరి క్షణాల్లో ఎలా ఉంటాం? అనేది సినిమా కోర్ పాయింట్. కార్తికేయ చాలా ప్రొఫెషనల్. అతనితో మరో సినిమా చేద్దామనుకుంటున్నాం. నేహా శెట్టి పల్లెటూరి అమ్మాయి పాత్రలో ఒదిగి΄ోయారు. మణిశర్మగారు అద్భుతమైన సంగీతం ఇచ్చారు. ‘సిరివెన్నెల’ సీతారామశాస్త్రిగారు రాసిన చివరి పాట మా సినిమాలో ఉండటం మా అదృష్టం. మా సినిమా ట్రైలర్ రిలీజ్ చేసిన రామ్‌చరణ్‌గారు కథని అడిగి తెలుసుకున్నారు. ప్రస్తుతం మా బ్యానర్లో మూడు ్రపాజెక్ట్స్ ఓకే చేశాం’’ అన్నారు. -
దుబాయ్‌లో బేబీ షవర్
రామ్‌చరణ్–ఉపాసన ఫుల్ జోష్‌లో ఉన్నారు. తల్లి దండ్రులు కాబోతున్న ఆనందం అది. ఇటీవల లాస్ ఏంజిల్స్‌లో జరిగిన ఆస్కార్ అవార్డు వేడుకకు హాజరైన ఈ దంపతులు ప్రస్తుతం దుబాయ్‌లో ఉన్నారు. అక్కడి నమ్మోస్ బీచ్ క్లబ్లో ఉపాసన బేబీ షవర్ జరిగింది. ఈ వేడుకలో రామ్‌చరణ్, ఉపాసనల స్నేహితులు, కజిన్స్ పాల్గొన్నారని సమాచారం. కొన్ని ఫొటోలను ఉపాసన షేర్ చేశారు. వేడుకలో తెలుపు రంగు గౌనులో ఆమె మెరిసిపోయారు. కొన్నాళ్లు దుబాయ్‌లో వెకేషన్‌ని ఎంజాయ్ చేసి, చరణ్–ఉపాసన ఇండియా చేరుకుంటారట. ఆ తర్వాత శంకర్ దర్శకత్వంలో చేస్తున్న ‘గేమ్ చేంజర్’ సినిమా షూట్లో పాల్గొంటారు చరణ్. -
ఆర్ఆర్ఆర్ ఖాతాలో మరో అరుదైన అవార్డు
ఎన్టీఆర్, రామ్‌చరణ్ హీరోలుగా రాజమౌళి దర్శకత్వంలో డీవీవీ దానయ్య నిర్మించిన ‘ఆర్ఆర్ఆర్’ ఇప్పటికే పలు అంతర్జాతీయ అవార్డులు సాధించిన విషయం తెలిసిందే. తాజాగా 46వ జపాన్ అకాడమీ ఫిల్మ్ ప్రైజ్‌కు సంబంధించి ‘అవుట్ స్టాండింగ్ ఫారిన్ ఫిల్మ్’ విభాగంలో ‘ఆర్ఆర్ఆర్’ అవార్డు సాధించింది. ‘అవతార్: ద వే ఆఫ్ వాటర్’, ‘టాప్‌గన్: మ్యావరిక్’ వంటి హాలీవుడ్ చిత్రాలను దాటి ‘ఆర్ఆర్ఆర్’ ఈ జపాన్ అవార్డును సాధించడం విశేషం. గత ఏడాది జపాన్‌లో విడుదలైన ‘ఆర్ఆర్ఆర్’ అక్కడి బాక్సాఫీస్ వద్ద భారీ వసూళ్లు రాబడుతున్న సంగతి తెలిసిందే. ఇక 95వ ఆస్కార్ అవార్డ్స్‌కు బెస్ట్ ఒరిజినల్ స్కోర్ విభాగంలో ‘నాటు నాటు’ పాట (మరికొన్ని విభాగాల్లో ‘ఆర్ఆర్ఆర్’ నామినేషన్ పోటీలో ఉంది), ‘బెస్ట్ ఫారిన్ ఫిల్మ్’ విభాగంలో గుజరాతీ ఫిల్మ్ ‘ఛెల్లో షో’, డాక్యుమెంటరీ ఫీచర్ ఫిల్మ్ విభాగంలో ‘ఆల్ దట్ బ్రీత్స్’, డాక్యుమెంటరీ షార్ట్ ఫిల్మ్ ‘ఎలిఫెంట్ విష్పర్స్’ ఆస్కార్స్ షార్ట్ లిస్ట్ జాబితాలో ఉన్నాయి. ‘ఆర్ఆర్ఆర్’, ‘ఛెల్లో షో’లతో కలిపి పది ఇండియన్ చిత్రాలు ఆస్కార్ రిమైండర్ లిస్ట్‌లో ఉన్నాయి. కాగా నేడు ఆస్కార్ నామినేషన్స్ వెల్లడి కానున్నాయి. మరి.. ఎన్ని ఇండియన్ చిత్రాలు నామినేషన్స్ దక్కించుకుంటాయో చూడాలి.. -
SS Rajamouli: ప్రసంశల గురించి పెద్దగా ఆలోచించను నాకు కావాల్సింది అదే!
‘ఆర్ఆర్ఆర్’ చిత్రం 95వ ఆస్కార్ అవార్డ్స్‌కు ఇండియా తరఫున అఫీషియల్ ఎంట్రీగా ఎంపిక కాకపోవడం అనేది కాస్త నిరుత్సహపరిచిందని దర్శకుడు రాజమౌళి పేర్కొన్నారు. ఓ ఆంగ్ల ఆన్లైన్ పోర్టల్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో రాజమౌళి ఈ విధంగా స్పందించారు. ‘‘మన దేశం తరఫున ‘ఆర్ఆర్ఆర్’ సినిమాకు అధికారిక ఎంట్రీ లభించకపోవడంతో నిరాశ చెందాను. ‘ఆర్ఆర్ఆర్’కు ఆఫీషియల్ ఎంట్రీ లభిస్తే బాగుండేదన్నట్లుగా విదేశీయులు సైతం అనుకుంటున్నారు. అయితే మా సినిమాకు ఎందుకు అధికారిక ఎంట్రీ లభించలేదు? అని పదే పదే ఆలోచిస్తూ ఉండే మనస్తత్వాలు కావు మావి. జరిగిందేదో జరిగిపోయింది. మనం ముందుకు సాగిపోవాలి. అయినా ఫిల్మ్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా (ఎఫ్ఎఫ్ఐ) కమిటీ నియమ, నిబంధనలు, మార్గదర్శకాలు వంటి అంశాల గురించి నాకు తెలియదు కాబట్టి నేను ఈ విషయంపై కామెంట్ చేయాలనుకోవడం లేదు. ఇక దేశం తరఫున అఫీషియల్ ఎంట్రీగా పంపిన ‘ఛెల్లో షో’ (గుజరాతీ ఫిల్మ్, ఇంగ్లిష్‌లో ‘లాస్ట్ ఫిల్మ్ షో) చిత్రానికి ఆస్కార్ షార్ట్ లిస్ట్‌లో స్థానం లభించినందుకు నాకు సంతోషంగా ఉంది. ఎందుకంటే ఇది కూడా ఇండియన్ సినిమాయే’’ అని చెప్పుకొచ్చారు రాజమౌళి. కాగా ‘ఆర్ఆర్ఆర్’లోని ‘నాటునాటు’ సాంగ్‌కు ఆస్కార్ షార్ట్ లిస్ట్‌లో స్థానం లభించింది. ఇక గుజరాతీ ఫిల్మ్ ‘ఛెల్లో షో’ ఇండియా తరఫున అధికారిక ఎంట్రీగా బెస్ట్ ఇంటర్నేషనల్ ఫిల్మ్ విభాగంలో షార్ట్‌లిస్ట్ కాగా, ‘ఆర్ఆర్ఆర్’తో పాటు మరో ఎనిమిది ఇండియన్ చిత్రాలు ‘ఆస్కార్ రిమైండర్ లిస్ట్’లో ఉన్న సంగతి తెలిసిందే. ఇక 95వ ఆస్కార్ అవార్డ్స్‌కు సంబంధించిన నామినేషన్స్ ఈ నెల 24న వెల్లడికానున్నాయి. అవార్డ్ ఫంక్షన్ మార్చిలో జరగనుంది. ‘ఆర్ఆర్ఆర్’ విషయానికి వస్తే.. ఎన్టీఆర్, రామ్‌చరణ్‌లు హీరోగా రాజమౌళి దర్శకత్వంలో డీవీవీ దానయ్య నిర్మించిన విషయం తెలిసిందే. డబ్బు కోసమే... డబ్బు, ప్రేక్షకులను దృష్టిలో పెట్టుకునే ఓ దర్శకుడిగా నేను సినిమాలు తీస్తాను. విమర్శకుల ప్రసంశల గురించి పెద్దగా ఆలోచించను. ‘ఆర్ఆర్ఆర్’ ఓ కమర్షియల్ ఫిల్మ్. బాక్సాఫీస్ వద్ద నా సినిమా కమర్షియల్‌గా సక్సెస్ అయితే నేను హ్యాపీ. అవార్డ్స్‌ను బోనస్‌లా భావిస్తాను. అయితే ఓ సినిమా కోసం పడిన కష్టానికి గుర్తింపు లభిస్తే నాకు, నా చిత్రబృందానికి సంతోషం అనిపిస్తుంది’’ అని కూడా పేర్కొన్నారు రాజమౌళి. ఇక మహేశ్‌బాబు హీరోగా రాజమౌళి తర్వాతి సినిమా తెరకెక్కనున్న సంగతి తెలిసిందే. -
Seattle Film Critics Society: ఆర్ఆర్ఆర్ ఫైట్స్‌కి అవార్డ్
ఎన్టీఆర్, రామ్‌చరణ్ హీరోలుగా రాజమౌళి దర్శకత్వంలో డీవీవీ దానయ్య నిర్మించిన ‘ఆర్ఆర్ఆర్’ ఇప్పటికే పలు అంతర్జాతీయ అవార్డులు అందుకున్న విషయం తెలిసిందే. ఈ జాబితాలో మరో అవార్డు చేరింది. సియాటెల్ ఫిలిం క్రిటిక్స్ సొసైటీ అవార్డ్స్‌లో బెస్ట్ యాక్షన్ కొరియోగ్రఫీ కేటగిరీలో అవార్డు దక్కించుకుంది. ఈ విషయాన్ని సదరు సొసైటీ సోషల్ మీడియా ద్వారా ప్రకటించింది. విక్కీ ఆరోరా, ఇవాన్ కోస్టాడినోవ్, నిక్ పావెల్, రాయిచో వాసిలెవ్ స్టంట్స్ కో ఆర్డినేటర్లుగా చేయగా, ప్రేమ్ రక్షిత్, దినేశ్ కృష్ణన్ స్టంట్స్ కొరియోగ్రఫీ చేశారు. హాలీవుడ్ చిత్రాలు ‘అవతార్: ది వే ఆఫ్ వాటర్, ఎవ్రీథింగ్ ఎవ్రీవేర్ ఆల్ అట్ ఒన్స్, ది నార్త్మేన్, టాప్ గప్: మ్యావరిక్’లతో పోటీపడి ‘ఆర్ఆర్ ఆర్’ అవార్డు దక్కించుకోవడం విశేషం. -
నాటు నాటుకు ఆస్కార్ అవార్డు.. ఆస్కార్ రావాలంటే ఎలాంటి అర్హతలుండాలి
-
Golden Globe Awards 2023: తెలుగు నాటు యమా హిట్టు
నాటుదనంలో మాయామర్మం ఉండదు. నాటుదనంలో కల్లాకపటం ఉండదు. నాటుదనంలో హొయలు వగలు ఉండవు. నాటుదనంలో తళుకూ జిలుగూ ఉండవు. నాటుదనం గ్రామీణం. నాటుదనం భోళాతనం. నాటుదనం సాంస్కృతిక వరం. నాటుదనం మేకప్పు లేని సౌందర్యం. అందుకే ప్రపంచం మెచ్చింది. తెలుగు నాటుదనానికి చరిత్రాత్మక గుర్తింపునిచ్చింది. 78 ఏళ్లుగా ఇస్తున్న హాలీవుడ్ గోల్డెన్ గ్లోబ్ అవార్డ్స్‌లో భారతదేశం నుంచి అందునా తెలుగు నుంచి మొట్ట మొదటిసారి ‘బెస్ట్ ఒరిజినల్ సాంగ్’గా ఆర్.ఆర్.ఆర్‌లోని ‘నాటు నాటు’ పాట అవార్డు గెలుచుకుంది. సంగీత దర్శకుడు కీరవాణి తెలుగు కీర్తిని పెంచారు. రాసినవారు, పాడినవారు, ఆడినవారు, ఆడించినవారు, ఆదరించిన తెలుగు కుటుంబాలు సెలబ్రేట్ చేసుకోవాల్సిన సమయం ఇది. పరమ నాటు సమయం. పాట కూడా ఒక్కోసారి బాకులా గుచ్చుకుంటుంది. గజమో రెండు గజాలో దూరం కాకుండా సముద్రాలు దాటి తియ్యటి గాటు పెడుతుంది. పల్లవి చెంప నిమురుతుంది. చరణం గుండె తడుముతుంది. పదం పదం కలిసి జ్వరం తెప్పించి వెర్రెక్కిస్తుంది. భాష తెలియని భావం అక్కర్లేని నాదం ముందుకు దుముకుతుంది. హోరున తాకే జలపాతం కింద నిలబడినవాడి జాతి ఏదైతే ఏంటి... రీతి ఏదైతే ఏంటి... నిలువునా తడిపేస్తుంది. పాట కూడా అంతే. ప్రణతి, ఎన్టీఆర్, రాజమౌళి, రమ, శ్రీవల్లి, కీరవాణి, ఉపాసన, రామ్‌చరణ్, కార్తికేయ, శోభు యార్లగడ్డ పొలం గట్టు దుమ్ములోన పోట్ల గిత్త దూకినట్టు పోలేరమ్మ జాతరలో పోతరాజు ఊగినట్టు... అది గుంటూరు మిర్చి పొలం కావచ్చు. బహుశా నెల్లూరు పోలేరమ్మ జాతర కావచ్చు. కాకుంటే లష్కర్ బోనాలు కావచ్చు. అయితే మేడారం మహా సంగమం కావచ్చు. తెలుగుదనం అది. తెలుగు ఘనం. తెలుగు జనం. తెలుగు జయం. గ్రామీణ తేటదనం. అమాయక నాటుదనం. అది ఊరి పెద్దమనిషి తలపాగ. పేదరైతు భుజాన కండువ. నిండు గాజుల ఇల్లాలి నుదుటి బొట్టు. రోకలి దంచే యువతి చెంపన చెమట చుక్క. అది నిర్మల్ కొయ్యబొమ్మ. కొండపల్లి పూలకొమ్మ. ఉత్త నాటు సౌందర్యం. బహుమేటి సౌందర్యం. నాటు నాటు నాటు నాటు నాటు వీర నాటు నాటు నాటు నాటు నాటు నాటు ఊర నాటు ఈ నాటు ఇప్పడు ప్రపంచాన్ని గెలిచింది. సినిమా ద్వారా అయితేనేమి తెలుగు మాట ఖండాతరాలలో మోగింది. తెలుగు బాణి దేశదేశాల వాళ్లతో చిందులు వేయించింది. తెలుగు దరువు భూగోళాన్ని డండనకర ఆడించింది. తెలుగువారికి ఏం తక్కువ? మనకంటే ఎవరు ఎక్కువ? చులకన చేయని ఘనత ఆర్.ఆర్.ఆర్‌లో ‘నాటు నాటు’ పాట వచ్చే సందర్భం ఆంగ్లేయులు తమను తాము గొప్ప చేసుకుంటూ తెలుగు వారికి ఏం వచ్చు అని ప్రశ్నించే సందర్భం. వాళ్ల స్టయిలు డాన్సులు, నైసు స్టెప్పులే గొప్ప అనుకుంటూ కథా నాయకులైన రామ్‌ను, భీమ్‌ను నిలదీసే సందర్భం. దానికి జవాబుగా తెలుగువారు రంగంలోకి దిగితే పరిస్థితి ఎంత నాటుగా ఉంటుందో హీరోలు చెప్పాలి. అందుకు పాట కావాలి. గీత రచయిత చంద్రబోస్‌కు సిట్యుయేషన్ చెప్పి ‘నువ్వు ఏదైనా రాయి మన ఘనత చాటుకునేలా ఉండాలి. ఎదుటివారిని అవమానించేలా తిట్టేలా ఉండకూడదు’ అన్నాడు దర్శకుడు రాజమౌళి. ఇంగ్లిష్ వాణ్ణి తిట్టకుండా చెంప పగులగొట్టాలన్న మాట. చల్లగరిగ (జయశంకర్ భూపాలపల్లి జిల్లా) లాంటి చిన్న పల్లెలో పుట్టిన చంద్రబోస్‌కి తెలుగు వేగం, తెలంగాణ యోగం తెలియనిది ఏముంది? పాట పుట్టింది. కిర్రు సెప్పులేసుకుని కర్రసాము సేసినట్టు మర్రిసెట్టు నీడలోన కుర్రగుంపు కూడినట్టు ఎర్రజొన్న రొట్టెలోన మిరపతొక్కు కలిపినట్టు నా పాట చూడు నాటు నాటు నాటు నాటు నాటు నాటు వీర నాటు చంద్రబోస్ మొత్తం పాట రాశాక కీరవాణి దానికి ట్యూన్ చేశాడు. పాట రాశాక ఫైనల్ వెర్షన్‌గా పాట బయటపడటానికి మధ్య దాదాపు 19 నెలలు ఉన్నాయి కరోనా వల్ల. ‘లోపలున పానమంతా దముకు దుముకులాడేలా’ చంద్రబోస్ రాయడం, ‘వొంటిలోన రగతమంతా రంకెలేసి ఎగిరేలా’ కీరవాణి ట్యూన్ చేయడం... దాంతో అది కోటి ఈలల పాటైంది. జపాన్ వాడి ఈల.. రష్యావాడి ఈల... చైనా వాడిదీ... వమెరికా వాడిదీనూ. పాదాల తుఫాను రికార్డింగ్ థియేటర్లో వాయుగుండం బలపడింది. ఇక అది తెర మీద తుఫానులా తాకాలి. గంటకు 240 కిలోమీటర్ల వేగంతో గాలులు వీయాలి. పులి ఒకరు, బెబ్బులి ఒకరుగా ఇద్దరు హీరోలు... ఎన్టీఆర్, రామ్ చరణ్ సిద్ధంగా ఉన్నారు. వీరి కాళ్లకు గజ్జెలు కట్టే వీరుడు కావాలి. ప్రేమ రక్షిత్. ఈ పాండిచ్చేరి కుర్రాడు హైదరాబాద్‌నే తన రెండో ఇల్లు చేసుకున్నాడు. కొరియోగ్రఫీని ఒంట్లో నింపుకున్నాడు. ‘ఈ పాటను నువ్వు ఎలాగైనా కంపోజ్ చెయ్. కాని ఇద్దరు హీరోలు ఈక్వల్‌గా కనిపించాలి’ అనేది దర్శకుడి షరతు. ‘ఎవరి ఎనర్జీ లెవల్ కూడా తగ్గినట్టుగా స్క్రీన్ మీద ఉండరాదు’ అన్నాడు దర్శకుడు. ప్రేమ్ రక్షిత్ పాటను అందుకున్నాడు. నెల రోజులు తపస్సు చేశాడు. హుక్ స్టెప్ (వైరల్ అయిన స్టెప్) కోసం యాభై రకాల మూవ్మెంట్స్ సిద్ధం చేస్తే దర్శకుడికి ఇప్పుడు ఉన్నది నచ్చింది. పాట కోసం మొత్తం 94 రకాల మూవ్‌మెంట్స్‌ని కంపోజ్ చేశాడు ప్రేమ్ రక్షిత్. పాటను ఉక్రెయిన్‌లో ప్రెసిడెంట్ ప్యాలెస్ దగ్గర 20 రోజులు షూట్ చేశారు. ఇద్దరూ సింగిల్ టేక్ ఆర్టిస్టులే అయినా పర్ఫెక్ట్ సింక్ కోసం దాదాపు 46 రీటేకులు అయ్యాయి. నాటు నాటు నాచో నాచో తెలుగు తమిళ మలయాళ హిందీ భాషల్లో నాటు నాటు వీర నాటు హిట్ కొట్టింది. ఇందులోని హుక్ స్టెప్‌ను ఆబాల గోపాలం ఇమిటేట్ చేసింది. యూ ట్యూబ్ షాట్స్, ఇన్‌స్టా రీల్స్ వందల వేలుగా తయారయ్యాయి. సల్మాన్ ఖాన్, ఆమిర్ ఖాన్ కూడా ఈ స్టెప్‌ను రిపీట్ చేశారు. ప్రపంచమంతా తెలుగు మోత మోగింది. ఒకప్పుడు రాజ్ కపూర్ చేసిన ‘ఆవారా హూ’ పాట ఇంత పెద్ద హిట్ అయ్యింది. తమిళంలో రహెమాన్ చేసిన ‘తిల్లానా తిల్లానా’ ఇలాగే హిట్ అయ్యింది. ఇప్పుడు తెలుగు వంతు. మన జానపదం, మన నాటుదనం ఇప్పుడు కేకమీదున్నాయి. ఇది తెలుగు ఘనం. ఇది తెలుగు జయం. ఇద్దరు స్టార్స్‌కి కొరియోగ్రాఫ్ చేయడం అనేది పెద్ద సవాల్. ఎందుకంటే ఒక్కో స్టార్‌కి ఒక్కో స్టైల్ ఉంటుంది. ‘నాటు నాటు..’కి రెండు స్టయిల్స్ తీసుకుని, ఒకే స్టయిల్‌గా మార్చడం జరిగింది. నేను సవాల్‌గా తీసుకుని ఈ పాట చేశాను. కొరియోగ్రాఫ్ చేయడానికి నాకు రెండు నెలలు పట్టింది. చిత్రీకరణకు 20 రోజులు. 43 రీటేక్స్ తీసుకోవడం జరిగింది. మొదట్లో కొంచెం భయం అనిపించింది. ఎందుకంటే ఇద్దరు స్టార్స్‌ని సమానంగా చూపించాలి. అందుకే చివరి వరకూ పాటకు మెరుగులు దిద్దుతూనే ఉండేవాళ్లం. – ప్రేమ్ రక్షిత్, కొరియోగ్రాఫర్ కీరవాణి సార్‌తో నా ప్రయాణం ఒక దశాబ్దం నాటిది. సార్ నన్ను న మ్మి ‘నాటు నాటు..’ ని నాలుగు భాషల్లో పాడేలా చేశారు. ఇది నాకు అద్భుతమైన అవకాశం. ‘ఆర్ఆర్ఆర్’కి పాడటం అనేది నాకో పెద్ద చాలెంజ్. నిరూపించుకోవాలని చాలా కష్టపడి పాట పాడాను. ఈ పాటను పెద్ద హిట్ చేసినందుకు యావత్ భారతదేశానికి ధన్యవాదాలు. – రాహుల్ సిప్లిగంజ్, గాయకుడు ‘‘నా జీవితంలో మరచిపోలేని మధుర క్షణాలివి. ఎందుకంటే ‘నాటు నాటు’ పాట విశ్వ వేదిక మీద విజయం సాధించింది. రచయితగా చాలా చాలా సంతోషంగా, గర్వంగా ఉంది’’ అన్నారు చంద్రబోస్.‘‘28 ఏళ్ల ప్రస్థానం, 850 చిత్రాలు, 3,600లకు పైగా పాటలు.. మొట్ట మొదటి పాట ‘తాజ్‌మహల్’లోని ‘మంచు కొండల్లోన చంద్రమా..’ నుండి ఇప్పటి ‘వాల్తేరు వీరయ్య’లోని పాట వరకూ.. ప్రతి పాటకూ తపస్సే, మథనమే జ్వలనమే. 3500 సార్లకు పైగా తపస్సు చేస్తే ఒక్కసారైనా భగవంతుడు ప్రత్యక్షమవుతాడు కదా. ఈసారి ‘నాటు నాటు..’ పాటకు భగవంతుడు ప్రత్యక్షం అయి, వరం ఇచ్చాడని భావిస్తున్నాను. – చంద్రబోస్, రచయిత ప్రతి భారతీయుడిని గర్వించేలా చేసింది ‘‘ఈ విజయం చాలా ప్రత్యేకం. కీరవాణి, ప్రేమ్ రక్షిత్, కాలభైరవ, చంద్రబోస్, రాహుల్ సిప్లిగంజ్‌లకు అభి నందనలు. ఎస్.ఎస్. రాజమౌళి, జూనియర్ ఎన్టీఆర్, రామ్‌చరణ్‌తో పాటు ‘ఆర్ఆర్ఆర్’ చిత్ర బృందానికి అభినందనలు. ఈ ప్రతిష్టాత్మక గౌరవం ప్రతి భారతీయుడిని ఎంతగానో గర్వించేలా చేసింది’’ అన్నారు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ. చిత్ర బృందాన్ని అభినందిస్తూ ట్వీట్ చేశారు. – నరేంద్ర మోదీ, ప్రధానమంత్రి మరిన్ని విజయాలు సాధించాలి ‘నాటు నాటు’ గోల్డెన్ గ్లోబ్ అవార్డు సాధించి నందుకు ‘ఆర్ఆర్ ఆర్’ యూనిట్‌ని గవర్నర్ విశ్వ భూషణ్ హరి చందన్ అభినందించారు. ఈ పాటకు అవార్డు రావడం ద్వారా తెలుగు సినిమా ప్రపంచ సంగీత వేదికపై గర్వించదగ్గ స్థాయిలో నిలిచిందన్నారు. తెలుగు సినీ పరిశ్రమ భవిష్యత్‌లో అంతర్జాతీయ స్థాయిలో మరిన్ని విజయాలు సాధించా లని గవర్నర్ ఆకాంక్షించినట్లుగా రాజ్ భవన్ వర్గాలు ఓ ప్రకటనలో తెలిపాయి. – విశ్వభూషణ్ హరిచందన్, గవర్నర్ ఆర్ఆర్ఆర్ టీమ్‌కు అభినందనలు ప్రతిష్టాత్మకమైన గోల్డెన్ గ్లోబ్ అవార్డు సాధించి తెలుగుజెండాను రెపరెపలాడించిన ‘ఆర్ఆర్ఆర్’ చిత్ర యూనిట్‌ని ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి అభినందించారు. ‘ఆర్ఆర్ఆర్’ సాధించిన ఈ విజయాన్ని చూసి గర్వపడుతున్నామని పేర్కొన్నారు. ఈ మేరకు ముఖ్యమంత్రి జగన్మోహన్రెడ్డి బుధవారం ట్వీట్ చేశారు. చిత్ర మ్యూజిక్ డైరెక్టర్ ఎం.ఎం. కీరవాణి, దర్శకుడు ఎస్ఎస్ రాజమౌళి, హీరోలు తారక్ (జూనియర్ ఎన్టీఆర్), రామ్ చరణ్‌తోపాటు ‘ఆర్ఆర్ఆర్’ సినిమా టీమ్ మొత్తానికి అభినందనలు తెలిపారు. – వైఎస్ జగన్ మోహన్‌రెడ్డి, ఏపీ ముఖ్యమంత్రి తెలుగు పాటకు దక్కిన గౌరవం ‘నాటు నాటు’ పాటకు గోల్డెన్ గ్లోబ్ అవార్డు దక్కడం భారతీయ సంగీతానికి, ప్రత్యేకంగా తెలుగు పాటకు దక్కిన అద్భుత గౌరవమని కేంద్ర సాంస్కృతిక, పర్యాటక శాఖ మంత్రి జి. కిషన్‌రెడ్డి కొనియాడారు. ఈ సందర్భంగా చిత్ర సంగీత దర్శకుడు కీరవాణి, దర్శకుడు రాజమౌళి, నటులు రామ్‌చరణ్, ఎన్టీఆర్‌తో పాటు యావత్ చిత్ర యూనిట్‌కు ఆయన అభినందనలు తెలియజేశారు. భవిష్యత్తులో మన సంగీతం, మన కొరియోగ్రఫీ, మన దర్శకత్వం, మన చిత్రాలు మరింత గుర్తింపును అందుకోవాలని కోరుకుంటున్నట్టు తెలియజేశారు. – కిషన్ రెడ్డి, కేంద్రమంత్రి -
నాటు నాటుకు డ్యాన్స్ చేశా!
షారుక్ ఖాన్, దీపికా పదుకోన్ జంటగా నటించిన చిత్రం ‘పఠాన్’. సిద్ధార్థ్ ఆనంద్ దర్శకత్వంలో యశ్ రాజ్ ఫిలింస్ నిర్మించిన ఈ హిందీ సినిమా ఈ నెల 25న విడుదలవుతోంది. కాగా ఈ చిత్రం తెలుగు ట్రైలర్‌ను సోషల్ మీడియా ద్వారా విడుదల చేశారు హీరో రామ్‌చరణ్. ఈ సందర్భంగా ట్విట్టర్లో తనదైన స్టైల్లో రామ్‌చరణ్‌కి కృతజ్ఞతలు చెప్పారు షారుక్ ఖాన్. ‘‘థ్యాంక్యూ సో మచ్. నా మెగా పవర్‌స్టార్ రామ్‌చరణ్. మీ ‘ఆర్ఆర్ఆర్’ టీమ్ ఆస్కార్ అవార్డును ఇండియాకు తీసుకొచ్చినప్పుడు దయచేసి నన్ను తాకనివ్వండి.. లవ్యూ’’ అని ట్వీట్ చేశారు షారుక్. ‘‘తప్పకుండా ఎస్ఆర్కే సార్. ఈ అవార్డు ఇండియన్ సినిమాకు చెందింది’’ అని పోస్ట్ చేశారు చరణ్. కాగా ‘నాటు నాటు..’ పాటకు గోల్డెన్ గ్లోబ్ అవార్డు లభించడం పట్ల షారుక్ ఖాన్ హర్షం వ్యక్తం చేశారు. ఉదయం వార్త తెలిసిన వెంటనే ‘నాటు నాటు..’ పాటకు డ్యాన్స్ చేశానని ట్విట్టర్లో వెల్లడించారు. భారత్‌ను గర్వపడేలా చేశారని ప్రశంసించారు. -
బాలీవుడ్ హీరోల రెమ్యూనరేషన్ ను దాటేస్తున్న టాలీవుడ్ హీరోలు
-
నేను తీసిన సినిమాలలో నా ఫేవరెట్ సీను అదే : రాజమౌళి
-
హీరోలను మించిపోతున్న వారి భార్యల క్రేజ్
-
చరణ్ - శంకర్ సినిమాలో మోహన్ లాల్
-
ఆర్ఆర్ఆర్ మరో రికార్డ్.. హాలీవుడ్ చిత్రాలను సైతం వెనక్కి నెట్టి..!
ఈ ఏడాది మరో పాన్ ఇండియా చిత్రం ‘ఆర్ఆర్ఆర్’ చిత్రంతో టాలీవుడ్ సత్తాను ప్రపంచానికి తెలియజేశాడు రాజమౌళి. యంగ్ టైగర్ ఎన్టీఆర్, మెగాపవర్‌స్టార్ రామ్ చరణ్ నటించిన ఈ మూవీ మార్చి 25న విడుదలై, అంచనాలకు తగ్గట్టుగానే బాక్సాఫీస్ వద్ద భారీ వసూళ్లు రాబట్టింది. రూ. 550 కోట్లతో నిర్మించిన ఈ చిత్రం.. దాదాపు రూ.1100 కోట్లకు పైగా వసూళ్లు సాధించి టాలీవుడ్లో చరిత్ర సృష్టించింది. ఈ చిత్రానికి ఇప్పటికే పలు అంతర్జాతీయ అవార్డులు దక్కాయి. తాజాగా ఈ చిత్రం సైట్ అండ్ సౌండ్ మ్యాగజైన్-2022 జాబితాలో 50 ఉత్తమ చిత్రాల్లో 9వ స్థానాన్ని పొందింది. ఆస్కార్ నామినేషన్స్ చిత్రాలైన టాప్ గన్ మావెరిక్, టార్లను అధిగమించింది. సౌండ్ అండ్ సైట్ మ్యాగజైన్-2022 రూపొందించిన జాబితాలో తెలుగు చిత్రం చోటు దక్కించుకుంది. అదే జాబితాలో చేరిన మరో భారతీయ చిత్రం షౌనక్ సేన్ డాక్యుమెంటరీ ఆల్ దట్ బ్రీత్స్ చిత్రానికి 32వ స్థానం దక్కింది. స్కాటిష్ చలనచిత్ర దర్శకుడు షార్లెట్ వెల్స్ దర్శకత్వం వహించిన తొలి చిత్రం ఆఫ్టర్ సన్ జాబితాలో మొదటి స్థానంలో నిలిచింది. ఆర్ఆర్ఆర్ ఈ జాబితాలోని టామ్ క్రూజ్ మూవీ టాప్ గన్: మావెరిక్, డేవిడ్ క్రోనెన్‌బర్గ్ చిత్రం క్రైమ్స్ ఆఫ్ ది ఫ్యూచర్, కేట్ బ్లాంచెట్ సినిమా టార్, గిల్లెర్మో డెల్ టోరో చిత్రం పినోచియో, ఎవ్రీవేర్ ఆల్ ఎట్ ఒన్స్ వంటి అతిపెద్ద హాలీవుడ్ సినిమాలను అధిగమించింది. And the winner is… AFTERSUN (dir. Charlotte Wells) Find out what Sight and Sound critics have voted as the 50 best films of 2022 https://t.co/tGxmSad8jq — Sight and Sound magazine (@SightSoundmag) December 20, 2022 -
అరుదైన రికార్డు సాధించిన ధనుష్..
-
ఆర్ఆర్ఆర్ చిత్రం మరో ఘనత.. ప్రతిష్ఠాత్మక అవార్డులు కైవసం
దర్శకధీరుడు రాజమౌళి తెరకెక్కించిన ఆర్ఆర్ఆర్. బాక్సాఫీస్ వద్ద ఆ మూవీ ప్రభంజనం సృష్టించిన సంగతి తెలిసిందే. ఈ చిత్రం జపాన్‌లోనూ కలెక్షన్లతో దూసుకెళ్తోంది. అక్టోబర్ 21న జపాన్‌లో విడుదలైన 'ఆర్ఆర్ఆర్' పలు రికార్డులు సృష్టించింది. ఈ చిత్రం అంతర్జాతీయ అవార్డుల పరంపరను కొనసాగిస్తోంది. తాజాగా మరో రెండు అంతర్జాతీయ అవార్డులు గెలుచుకుంది. ఎస్ఎస్ రాజమౌళి రూపొందించిన ఆర్ఆర్ఆర్ హాలీవుడ్ క్రిటిక్స్ అసోసియేషన్ (HCA)లో స్పాట్లైట్ అవార్డును కైవసం చేసుకుంది. ఈ విషయాన్ని ఆర్ఆర్ఆర్ టీం ట్విటర్ ద్వారా వెల్లడించింది. వచ్చే ఏడాది ఫిబ్రవరి 24న లాస్ ఏంజెల్స్‌లో జరగనున్న 6వ హెచ్‌సీఏ ఫిల్మ్ అవార్డ్స్‌లో ఈ అవార్డును అందజేయనున్నారు. మరోవైపు అట్లాంటా ఫిల్మ్ క్రిటిక్స్ సర్కిల్ అవార్డ్స్’ ఉత్తమ అంతర్జాతీయ చిత్రంగానూ ‘ఆర్ఆర్ఆర్’ ఎంపికైంది. ఉత్తమ అంతర్జాతీయ చిత్రంగా ‘సన్‌సెట్ సర్కిల్’, ‘శాటర్న్’ అవార్డులూ గెలుచుకుంది. ఇటీవల.. న్యూయార్క్ ఫిల్మ్ క్రిటిక్స్ సర్కిల్ (ఎన్.వై.ఎఫ్.సి.సి) పురస్కారాల్లో ఉత్తమ దర్శకుడిగా రాజమౌళి ఎంపికయ్యారు. ఇండియాలో సంచలనం సృష్టించిన ఈ సినిమా విదేశాల్లోనూ విడుదలై సత్తా చాటింది. కొమురం భీమ్, అల్లూరి సీతారామరాజు జీవితాల్ని స్ఫూర్తిగా తీసుకుని ఓ కల్పిత కథతో రూపొందించిన ఈ సినిమాలో ఎన్టీఆర్, రామ్‌చరణ్ అద్భుతంగా నటించారు. Thank you so much @ATLFilmCritics 🙏🏻🙏🏻 #RRRMovie https://t.co/gczgxrsmWY — DVV Entertainment (@DVVMovies) December 5, 2022 We RRR elated... 🤩 The cast and crew of #RRRMovie bags the prestigious HCA Spotlight Winner Award! We'd like to thank the @HCAcritics jury for recognising #RRRMovie ! pic.twitter.com/j5S8B2Rgvq — RRR Movie (@RRRMovie) December 6, 2022 -
రీమేక్ లకు గుడ్ బై చెప్పిన మెగా బ్రదర్స్..!
-
2023 లో బాక్సాఫీస్ ని షేక్ చెయ్యబోతున్న సినిమాలివే..
-
శంకర్- రామ్‌చరణ్ సినిమా; పది కోట్ల పాట?
దర్శకుడు శంకర్ సినిమాల్లో సాంగ్స్ విజువల్స్ పరంగా, లొకేషన్స్ పరంగా చాలా గ్రాండియర్‌గా ఉంటాయన్న సంగతి తెలిసిందే. తాజాగా శంకర్ మరో గ్రాండియర్ సాంగ్‌ను తీసేందుకు రంగం సిద్ధం చేస్తున్నారు. రామ్‌చరణ్ హీరోగా శంకర్ దర్శకత్వంలో ఓ పాన్ ఇండియా మూవీ రూపొందుతున్న సంగతి తెలిసిందే. ఈ సినిమా కోసమే శంకర్ పది కోట్ల బడ్జెట్‌తో పాట ప్లాన్ చేశారట. ఈ సినిమా కొత్త షెడ్యూల్ షూటింగ్ న్యూజిల్యాండ్‌లో జరగనున్న సంగతి తెలిసిందే. ఈ షెడ్యూల్ ఈ నెల 20 నుంచి డిసెంబరు 2 వరకు జరుగుతుందట. హీరో రామ్‌చరణ్, హీరోయిన్ కియారా అద్వానీలపై గ్రాండ్‌గా డ్యూయట్ సాంగ్ చిత్రీకరించనున్నారని సమాచారం. వార్తల్లో ఉన్న ప్రకారం ఈ పాటకు దాదాపు పదికోట్ల రూపాయలకు పైనే బడ్జెట్‌ను కేటాయించారట. బాలీవుడ్ కొరియోగ్రాఫర్ బాస్కో మార్టిస్ ఈ పాటకు నృత్యరీతులు సమకూర్చుతారని సమాచారం. పొలిటికల్ యాక్షన్ డ్రామాగా రూపొందుతున్న ఈ సినిమాకు తమన్ సంగీతదర్శకుడు. ‘దిల్’ రాజు, శిరీష్ నిర్మిస్తున్న ఈ సినిమాను వచ్చే ఏడాది చివర్లో రిలీజ్ చేయాలనుకుంటున్నారు. -
కృష్ణ పార్థివదేహానికి నివాళులర్పించిన రామ్ చరణ్
-
ఆర్ఆర్ఆర్ సీక్వెల్.. రాజమౌళి క్లారిటీ ఇదే..!
యంగ్ టైగర్ జూనియర్ ఎన్టీఆర్, మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ మల్టీస్టారర్లుగా తెరకెక్కిన చిత్రం ఆర్ఆర్ఆర్ (రౌద్రం.. రణం.. రుధిరం). దర్శక ధీరుడు రాజమౌళి తెరకెక్కించిన ఈ చిత్రం మార్చి 24న విడుదలై బాక్సాఫీస్ వద్ద రికార్డులను బద్దలు కొట్టింది. రూ.1200 కోట్లకుపైగా వసూళ్లు సాధించిన తెలుగు సినిమాగా సత్తా చాటింది. ప్రపంచవ్యాప్తంగా సంచలనం సృష్టించిన ఈ చిత్రం ఇటీవలే జపాన్‌లోనూ విడుదలైంది. జపాన్‌లోనూ కలెక్షన్ల వర్షం కురిపిస్తోంది. (చదవండి: ఆర్ఆర్ఆర్ మరో రికార్డ్.. హాలీవుడ్ చిత్రాలను సైతం వెనక్కి నెట్టి..!) అయితే ప్రస్తుతం టాలీవుడ్ ఫ్యాన్స్ ఆర్ఆర్ఆర్ సీక్వెల్‌పై అంతా చర్చించుకుంటున్నారు. ఈ విషయంపై తాజాగా దర్శకుడు రాజమౌళి స్పందించారు. ఆర్ఆర్ఆర్ సీక్వెల్ ఉంటుందని ప్రకటించారు. ఇటీవల చికాగోలో జరిగిన ఓ కార్యక్రమంలో ఆయన మాట్లాడారు. రాజమౌళి మాట్లాడుతూ.. 'నా చిత్రాలకు మా నాన్నే రచయిత. మేమిద్దరం ఆర్ఆర్ఆర్-2 పై చర్చించాం. కథ రూపొందించే పనిలో మా నాన్న నిమగ్నమై ఉన్నారు.' అని అన్నారు. ఈ ప్రకటనతో అభిమానులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. రాజమౌళి ఎట్టకేలకు ఆర్ఆర్ఆర్ సీక్వెల్ ఉంటుందని ప్రకటించడంతో ఎన్టీఆర్, రామ్ చరణ్ ఫ్యాన్స్ ఖుషీ అవుతున్నారు. -
బుచ్చిబాబు తో రామ్ చరణ్ సినిమా ..?
-
జపాన్‌లో రామ్ చరణ్ వీరాభిమాని.. ఆమె ప్రతిభకు చెర్రీ ఫిదా
ఆర్ఆర్ఆర్ ప్రమోషన్ల కోసం జపాన్ వెళ్లిన చిత్రబృందానికి అక్కడ అభిమానులు ఘనస్వాగతం పలికారు. జూనియర్ ఎన్టీఆర్, రామ్ చరణ్ ఎక్కడికెళ్లినా ఫోటోల కోసం ఫ్యాన్స్ ఎగబడ్డారు. జపాన్ లో కూడా ఈ హీరోల క్రేజ్ ఏ మాత్రం తగ్గలేదు. విదేశియులు సైతం మన ఆర్ఆర్ఆర్ హీరోల నటనకు ఫిదా అయిపోయారు. ఈ క్రమంలోనే రామ్ చరణ్ ఓ డై హర్డ్ ఫ్యాన్‌ను కలుసుకున్నారు. (చదవండి: రామ్ చరణ్ మాటలకు ఏడ్చేసిన జపాన్ ఫ్యాన్స్) చరణ్‌కు వీరాభిమాని అయిన ఆ మహిళ వయసు దాదాపు 70 ఏళ్లకు పైగానే ఉంటుంది. రామ్ చరణ్ సినిమాలు గతంలో జపాన్‌లో విడుదల కావడంతో ఫ్యాన్స్ ఫాలోయింగ్ పెరిగింది. తాజాగా ఆర్ఆర్ఆర్ ప్రమోషన్ల కోసం వెళ్లిన స్టార్ హీరో ఆమెను కలుసుకుని ఓ జ్ఞాపికను అందజేశారు. దీంతో సంతోషం వ్యక్తం చేశారు. ఆమె వేసిన పెయింటింగ్స్ అద్భుతంగా ఉన్నాయని రామ్ చరణ్ ప్రశంసించారు. ఇంతకీ ఆమె ఎవరంటే.. జపాన్‌కు చెందిన నోరికో కాసై అనే మహిళ ఓ ఆర్టిస్ట్. రామ్ చరణ్ చిత్రాలను గీసి తన అభిమానాన్ని చాటుకుంటోంది. ఆమెతో సరదాగా మాట్లాడిన చెర్రీ ఫోటోలు దిగి ఆశ్చర్యానికి గురిచేశారు. ఆ ఫోటోలు కాస్తా సోషల్ మీడియాలో వైరల్ కావడంతో అభిమానులు క్రేజీ కామెంట్స్ చేస్తున్నారు. రామ్‌చరణ్, జూనియర్ ఎన్టీఆర్ మల్టీస్టారర్లుగా నటించిన చిత్రం 'ఆర్ఆర్ఆర్'. దర్శకధీరుడు రాజమౌళి తెరకెక్కించిన ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద సంచలన విజయం సాధించింది. విడుదలైన అన్ని భాషల్లో ఈ మూవీ కాసుల వర్షం కురిపించింది. ప్రపంచవ్యాప్తంగా రూ. 1200కోట్లకు పైగా వసూళ్లను రాబట్టింది. రీసెంట్ ఈ సినిమాను జపాన్‌లో విడుదల చేసిన సంగతి తెలిసిందే. అక్టోబర్ 21న జపాన్ వ్యాప్తంగా ఆర్ఆర్ఆర్ మూవీ రిలీజ్ అయ్యింది. -
జపాన్ వీధుల్లో చరణ్, తారక్ హంగామా