మిస్టర్‌ సీ.. జిమ్‌కి వచ్చేసీ... మరి మీరూ? | Upasana Shares Picture Of Charan Heading Back To Gym | Sakshi
Sakshi News home page

మిస్టర్‌ సీ.. జిమ్‌కి వచ్చేసీ...

Published Fri, Sep 18 2020 7:08 AM | Last Updated on Fri, Sep 18 2020 8:04 AM

Upasana Shares Picture Of Charan Heading Back To Gym - Sakshi

కోవిడ్‌ బ్రేక్‌ వల్ల జిమ్‌కి సెలవు పెట్టారట రామ్‌చరణ్‌. గురువారం జిమ్‌లోకి ఎంటరై, మళ్లీ వర్కవుట్లు మొదలుపెట్టారు చరణŠ.. ఈ విషయాన్ని ఆయన సతీమణి ఉపాసన తన ఇన్‌స్టాగ్రామ్‌లో షేర్‌ చేశారు. ‘మిస్టర్‌ సీ (చరణ్‌ను ఆమె అలానే పిలుస్తారు) మళ్లీ జిమ్‌లోకి  వచ్చారు. మరి మీరు?’ అని ఓ ఫోటోను షేర్‌ చేశారామె. రామ్‌చరణ్‌ ప్రస్తుతం రాజమౌళి దర్శకత్వంలో ‘ఆర్‌ఆర్‌ఆర్‌’ చిత్రం చేస్తున్న సంగతి తెలిసిందే. ఎన్టీఆర్‌ మరో హీరో. ఈ సినిమాలో అల్లూరి సీతారామరాజు పాత్రలో చరణ్‌ నటిస్తున్నారు. ఇందుకోసం తన శరీరాకృతిని కొత్తగా తయారు చేశారు. ఆ మధ్య విడుదల చేసిన ట్రైలర్‌లో తన కండలు తిరిగిన దేహాన్ని చూపించారు. అక్టోబర్‌లో ఈ సినిమా చిత్రీకరణ తిరిగి ప్రారంభం
కానుందట!

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement