రామ్‌చరణ్
‘ఆరెంజ్’ సినిమాలో వైల్డ్ లైఫ్ ఫొటోగ్రాఫర్‌గా కనిపిస్తారు రామ్‌చరణ్. అది సినిమా కోసం. ఇప్పుడు నిజంగానే వైల్డ్ లైఫ్ ఫొటోగ్రాఫర్‌గా మారారాయన. అయితే చరణ్ ఫొటోగ్రాఫర్ కావడం వెనక ఓ మంచి ఉద్దేశం ఉంది. ప్రకృతిని కాపాడటం కోసం ‘డబ్లూడబ్ల్యూఎఫ్’ అనే స్వచ్ఛంద సంస్థ 60 ఏళ్లుగా పని చేస్తోంది. ఇటీవలే ఈ సంస్థకు రాయబారిగా రామ్‌చరణ్ సతీమణి ఉపాసన ఎన్నికయ్యారు. ఇప్పుడు వన్యప్రాణి సంరక్షణ కోసం నిధుల సేకరణలో చరణ్ కూడా తన వంతు సాయం చేయనున్నారు. సింహాలు, చిరుతపులులు, జిరాఫీలు తదితర వన్య ప్రాణుల ఫొటోలతో చరణ్ తన కొత్త ఇంట్లో ‘వైల్డెస్ట్ డ్రీమ్స్’ పేరుతో ఓ విభాగాన్నే ఏర్పాటు చేశారు. ఈ ఫొటోలను ప్రదర్శించి ప్రజల్లో చైతన్యం ఏర్పరచాలన్నది వీరి ఉద్దేశం. ‘‘భూమిని పరిరక్షించుకోవాల్సిన బాధ్యత మన అందరిదీ’’ అన్నారు చరణ్.
Comments
Please login to add a commentAdd a comment