Wildlife photographer
-
Aarzoo Khurana: ఆమె ఉన్న చోట పులి ఉంటుంది
మన దేశంలో దాదాపు 55 టైగర్ రిజర్వాయర్లు ఉన్నాయి. వాటన్నింటినీ తన కెమెరాలో నిక్షిప్తం చేసింది ఆర్జూ ఖురానా. సరిగా చెప్పాలంటే పులి ఉన్న చోటల్లా ఆమె ఉంటుంది. వృత్తి రీత్యా అడ్వకేట్ అయినా ఆ పని మానేసి కెమెరాను నేస్తంగా అడవిని నివాసంగా చేసుకుని తిరుగుతూ ఆమె తీస్తున్న ఫొటోలు పెద్ద గుర్తింపునిచ్చాయి. ఆర్జూ పరిచయం. అక్టోబర్ 1, 2023 నుంచి నేటి వరకూ 29 ఏళ్ల ఆర్జూ ఖురానా అడవుల్లోనే ఉంటూ వందల మైళ్లు తిరుగుతూ ఉందంటే నమ్ముతారా? నిజం. ‘ఆల్ టైగర్ రిజర్వ్స్ ప్రాజెక్ట్’ (ఏటిఆర్) కోసం ప్రభుత్వం అప్పజెప్పిన పనిలో ఆమె తలమునకలుగా నిమగ్నమైంది. మన దేశంలో 55 టైగర్ రిజర్వ్‌లు ఉన్నాయి. అయితే వాటిలో కొన్నింటికే టూరిస్ట్ అట్రాక్షన్ ఉంది. మిగిలిన వాటిని కూడా అందంగా ఫొటోలలో బంధించి, ప్రచారానికి ఉపయోగించి, టూరిస్ట్‌లను ఆకర్షించేందుకు నిర్దేశించిన ప్రాజెక్టే ఏ.టి.ఆర్. దానిలో భాగంగా అక్టోబర్ 1న రాజస్థాన్‌లోని సరిస్కా టైగర్ రిజర్వ్‌తో మొదలెట్టి మధ్యప్రదేశ్, మహరాష్ట్ర, కర్నాటక, కేరళ, తమిళనాడు, ఆంధ్రప్రదేశ్‌లలో 43 టైగర్ రిజర్వ్‌లను కవర్ చేసి మరో రెండు నెలల్లో మిగిలినవి చేసి ఆఖరున నైనిటాల్లో ఉన్నా జిమ్ కార్బెట్ రిజర్వ్ ఫారెస్ట్‌ను ఫొటోలు తీయడం ద్వారా ఆమె పని ముగిస్తుంది. ‘రోజుకు 14 గంటలు పని చేస్తున్నాను. మానసికంగా శారీరకంగా చాలా కష్టమైనది ఈ పని. కాని ఇందులో నాకు ఆనందం ఉంది’ అంటుంది ఆర్జూ ఖురానా. లా చదివి ‘మాది ఢిల్లీ. మా నాన్నకు నేను అడ్వకేట్ కావాలని కోరిక. నాకేమో వైల్డ్‌లైఫ్ ఫొటోగ్రాఫర్ కావాలని చిన్నప్పటి నుంచి కల. ఒక్కతే కూతురుని. అడవుల్లో కెమెరా పట్టుకుని తిరగడానికి అమ్మా నాన్నలు ఒప్పుకోలేదు. నాన్న కోసం లా చేశాను కాని చివరకు ఒప్పించి వైల్డ్‌లైఫ్ ఫొటోగ్రాఫర్‌ని అయ్యాను. ఇందుకోసం నేను ఢిల్లీలో బేసిక్ ఫొటోగ్రఫీ కోర్సును చేశాను. కాని వైల్డ్‌లైఫ్ ఫొటోగ్రఫీ వేరు. దానికి వేరే శిక్షణ కావాలి. నెట్లో వెతికితే సుధీర్ శివరామ్ అనే ప్రసిద్ధ వైల్డ్‌లైఫ్ ఫొటోగ్రాఫర్ మాలాంటి వారి కోసం క్యాంప్స్ నిర్వహిస్తారని తెలిసింది. ఆయన రాజస్థాన్‌లోని భరత్పూర్ రిజర్వ్‌ఫారెస్ట్‌లో వైల్డ్‌లైఫ్ ఫొటోగ్రఫీ క్యాంప్ నిర్వహించినప్పుడు హాజరయ్యి పని కొంత తెలుసుకున్నాను. రెండు సారస్ కొంగల సరదా సంప్రదింపులను నేను మొదటిసారి ఫొటో తీశాను. అది అందరికీ నచ్చింది. ఆ క్షణమే అనుకున్నాను... అరణ్యానికి జనారణ్యానికి మధ్య వారధిగా నేను ఉండగలను అని. అడవుల్లో ఉండే పక్షులు జంతువుల తరఫున వకాల్తా పుచ్చుకోగలను అని’ అంటుంది ఆర్జూ ఖురానా. కలిసి బతకాలి ‘మనుషులు కలిసి బతకడానికి కష్టపడుతుంటారు. అడవుల్లో తిరిగితే వందల వేల జీవులు ఎలా ఒకదానితో ఒకటి కలిసి బతుకుతాయో తెలుస్తుంది. అవి మనతో కూడా కలిసి బతకాలనే అనుకుంటాయి. కాని మన స్వార్థం కోసం అడవులు ధ్వంసం చేస్తూ వాటిని నాశనం చేస్తున్నాం. గత 50 ఏళ్లలో భూమి మీద ఉన్న జంతువులలో 50 శాతం నశించిపోయాయంటే నమ్ముతారా? ఇది నిజం. మనలో ప్రతి ఒక్కరం అడవుల పరిరక్షణకు, తద్వారా వన్యప్రాణి పరిరక్షణకు పూనుకోవాలి. లేకపోతే మిగిలేదేమీ ఉండదు. ఒక పులి ఉండదు. ఒక నక్కా కనిపించదు’ అంటోంది ఆర్జూ ఖురానా. -
Pranay Patel-Wildlife photographer: క్లికింగ్
పదమూడు సంవత్సరాల వయసులోనే కెమెరాతో స్నేహం మొదలుపెట్టిన ప్రణయ్‌కి, ఇప్పుడు ఆ కెమెరానే ప్రాణం. అరణ్యానికి సంబంధించిన అద్భుతదృశ్యాలను అమితంగా ఇష్టపడే ప్రణయ్ వైల్డ్‌లైఫ్ ఫొటోగ్రాఫర్‌గా అంతర్జాతీయ స్థాయిలో పేరు తెచ్చుకున్నాడు. ఇంకా ఎన్నో అద్భుతాలు సాధించడానికి ఉత్సాహంగా ఉన్నాడు..... పదమూడు సంవత్సరాల వయసులో కెమెరాతో అనుబంధం పెంచుకున్నాడు గుజరాత్‌లోని అహ్మదాబాద్‌కు చెందిన ప్రణయ్ పటేల్. అది ఆ వయసుకు మాత్రమే పరిమితమైన ఉత్సాహమై ఉంటే వైల్డ్‌లైఫ్ ఫొటోగ్రాఫర్‌గా ప్రణయ్ అంతర్జాతీయ స్థాయిలో పేరు తెచ్చుకునేవాడు కాదు. దేశవిదేశాల్లో అరణ్యానికి సంబంధించిన ఎన్నో అద్భుతమైన దృశ్యాలను ఫొటోలలో బంధించాడు. ఈ చిత్రాలు జాతీయ,అంతర్జాతీయ క్యాలెండర్లను అలంకరించాయి. అడవిలో ఫొటోగ్రఫీ అనేది అంతా వీజీ కాదు. ‘మేము రెడీ. ఇక మీరు ఫొటో తీసుకోవచ్చు’ అన్నట్లుగా ఉండదు అక్కడ. ఏ క్షణంలో ఏ అద్భుతం ఆవిష్కారం అవుతుందో తెలియదు. ఒళ్లంతా కెమెరా కన్నులై ఉండాలి. అడవి నాడి తెలిసిన ప్రణయ్‌కి ఈ విషయం తెలియనిదేమీ కాదు. అందుకే అడవిలోని అద్భుతదృశ్యాలను సమర్థవంతంగా పట్టుకోగలిగాడు. ‘లొకేషన్లోకి ప్రవేశించిన వెంటనే బ్యాక్‌ప్యాక్ ఓపెన్ చేసి కెమెరా సెట్ చేసుకోవాలి. బోర్ కొట్టవచ్చు. అలసటగా అనిపించవచ్చు. అయితే మన లక్ష్యం...అద్భుత దృశ్యం అనే విషయాన్ని మరవకూడదు. ఓపికతో కూడిన నిరీక్షణ నన్ను ఎప్పుడూ నిరాశ పరచలేదు’ అంటాడు ప్రణయ్. ప్రణయ్ ఫొటోలతో రూపుదిద్దుకున్న ‘ది వండర్ఫుల్ వైల్డ్‌లైఫ్ ఆఫ్ గుజరాత్’ ‘ది బేర్స్ ఆఫ్ కమ్చట్క–రష్యా’ ‘ది వైల్డ్ ఎర్త్ ఆఫ్ ఆఫ్రికా’... మొదలైన క్యాలెండర్లకు ఎంతో పేరు వచ్చింది. గుజరాత్ టూరిజం కార్పొరేషన్ అధికారిక ఫొటోగ్రాఫర్‌గా చిన్న వయసులోనే నియమించబడ్డాడు. ‘ఫొటోగ్రాఫర్‌కు దృశ్యజ్ఞానమే కాదు శబ్దజ్ఞానం కూడా ఉండాలి’ అంటున్న ప్రణయ్ శబ్దాల ద్వారా కూడా దృశ్యాలను ఊహించగలడు. వాటిని అందంగా ఛాయాచిత్రాలలోకి తీసుకురాగలడు. తన వెబ్సైట్ ద్వారా ఎంతో మంది ఔత్సాహిక ఫొటోగ్రాఫర్లకు స్ఫూర్తిని, ఉత్సాహాన్ని ఇస్తున్న ప్రణయ్ అమెరికాతో సహా ఎన్నో దేశాల్లో జరిగిన ఫొటోఎగ్జిబిషన్లలో పాల్గొన్నాడు. ‘వర్తమానం నుంచే కాదు గతం నుంచి కూడా ఎన్నో అద్భుత విషయాలను నేర్చుకోవచ్చు’ అంటున్న ప్రణయ్ అలనాటి బ్లాక్ అండ్ వైట్ ఫొటోలలోని అద్భుతాలను ఆసక్తిగా విశ్లేషిస్తుంటాడు. ‘ప్రతి ఫొటో ఒక కొత్త విషయాన్ని మనకు పరిచయం చేస్తుంది’ అంటాడు ప్రణయ్. స్కూల్‌బ్యాగ్ మోసుకెళ్లాల్సిన వయసులో కెమెరా బ్యాగు మోసుకెళుతున్న ప్రణయ్‌కి వెక్కిరింపులు ఎదురయ్యాయి. ‘ఇక నీకు చదువు ఏం వస్తుంది!’ అని ముఖం మీదే అన్నవాళ్లు కూడా ఉన్నారు. అయితే ఆ మాటలు విని తాను ఎప్పుడూ బాధపడలేదు. వెనక్కి తగ్గలేదు. కెమెరాతో స్నేహం వీడలేదు. దేశవిదేశాలలో ప్రణయ్ చేసిన ఫొటోగ్రఫీ టూర్లు వంద దాటాయి. ‘ప్రతి టూర్‌కు సంబంధించిన అనుభవాలను ఒక పుస్తకంగా రాసుకోవచ్చు’ అని మురిసిపోతుంటాడు ప్రణయ్. ‘కెమెరా పట్టుకోగానే అద్భుతాలు చోటుచేసుకోవు. పర్ఫెక్ట్ షాట్ కోసం రోజులే కాదు సంవత్సరం పాటు ఎదురుచూసిన సందర్భాలు కూడా ఉన్నాయి’ అంటాడు ప్రణయ్. ఫొటోగ్రఫీ గురించి ఓనమాలు తెలియని వారే కాదు, ఆ విద్యలో కొమ్ములు తిరిగిన ఫొటోగ్రాఫర్లు కూడా ప్రణయ్‌ని ప్రశంసలతో ముంచెత్తున్నారు. 25 సంవత్సరాల ప్రణయ్ పటేల్ భవిష్యత్‌లో మరిన్ని విజయాలు సాధించాలని ఆశిద్దాం. దేశవిదేశాల్లో అరణ్యానికి సంబంధించిన ఎన్నో అద్భుతమైన దృశ్యాలను ఫొటోలలో బంధించాడు ప్రణయ్. ఈ చిత్రాలు జాతీయ, అంతర్జాతీయ క్యాలెండర్లను అలంకరించాయి. -
Gudisa Grassland: ఆ 3 జాతులు.. అత్యంత అరుదు!..
సాక్షి, అమరావతి: దేశంలోనే అత్యంత అరుదైన సీతాకోక చిలుకలు అల్లూరి సీతారామరాజు జిల్లా గుడిస గ్రాస్ ల్యాండ్‌లో కనువిందు చేస్తున్నాయి. వైల్డ్ లైఫ్ ఫొటోగ్రాఫర్, పర్యావరణవేత్త పొలిమాటి జిమ్మీకార్టర్ గుడిస ఘాట్ రోడ్, గ్రాస్ ల్యాండ్‌లో 70 జాతుల సీతాకోక చిలుకల్ని రికార్డు చేశారు. వాటిలో అత్యంత అరుదైన మూడు సీతాకోక చిలుక జాతులు ఉండటం విశేషం. బ్రాండెడ్ ఆరెంజ్ ఆలెట్(బురారా ఒడిపొడియా)ను ఇటీవలే ఆయన రికార్డు చేశారు. హెస్పెరిడే కుటుంబానికి చెందిన ఈ సీతాకోక చిలుకలు ఇప్పటివరకు హిమాలయాలు, ఈశాన్య రాష్ట్రాల్లో మినహా ఎక్కడా కనిపించలేదు. తొలిసారి దక్షిణాదిలోని గుడిసలో దర్శనమిచ్చాయి. శ్రీలంక, బర్మా, మలేషియా, థాయ్‌లాండ్, వియత్నాం దేశాల్లో ఆ జాతి సీతాకోక చిలుకలు ఎక్కువగా కనిపిస్తాయి. ఇవి ఉదయించే సమయంలోనూ, చీకటిపడే సమయంలోనూ చురుగ్గా ఉంటాయి. పగలు చాలా అరుదుగా కనిపిస్తాయి. హిస్టేజ్ కాంబ్రిటమ్ జాతుల మొక్కలపై జీవించే ఈ సీతాకోక చిలుక గుడిసలో లాంటనా మొక్కపై కనిపించింది. పశి్చమ కనుమలు, ఈశాన్య రాష్ట్రాల్లో మాత్రమే కనిపించే పియరిడే కుటుంబం, ఏపియాన్ ఇంద్రా జాతికి చెందిన ప్లెయిన్ పఫిన్‌ను గుడిసలో మొదటిసారి గుర్తించారు. హిమాలయాలు, ఈశాన్య రాష్ట్రాల్లో మాత్రమే కనిపించే నింఫాలిడ్ కుటుంబానికి చెందిన ఎల్లో పాషా(హెరోనా మరాధస్) ఇటీవల గుడిసలో రికార్డయింది. గతేడాది దీన్ని పాడేరు అడవుల్లో తిరుపతి ఐఐఎస్ఈఆర్ సిటిజన్ సైంటిస్ట్ రాజశేఖర్ బండి, ఈస్ట్‌కోస్ట్ కన్సర్వేషన్ టీమ్ వ్యవస్థాపకుడు శ్రీచక్ర ప్రణవ్ గుర్తించారు. పర్యావరణ సమతుల్యం.. అత్యంత అరుదైన సీతాకోక చిలుకలు అక్కడ కనిపిస్తుండడాన్ని బట్టి గుడిస గ్రాస్‌ల్యాండ్ అత్యంత ప్రత్యేకమైనదిగా చెప్పుకోవచ్చు. తెలుగు రాష్ట్రాల్లో ఉన్న ఏకైక పర్వత ప్రాంత(షోలా) గ్రాస్‌ల్యాండ్ గుడిస. తూర్పు కనుముల్లో అత్యంత విశిష్టత కలిగిన మూగజీవాలు, అరుదైన మొక్కలు, పక్షులు, సీతాకోక చిలుకలకు ఇది ఆవాసంగా ఉంది. పర్యావరణ సమతుల్యంతో గొప్ప జీవవైవిధ్యం ఇక్కడ నెలకొందని పర్యావరణవేత్తలు చెబుతున్నారు. మారేడుమిల్లికి 40 కిలోమీటర్ల దూరంలో ఇది ఉంటుంది. దట్టమైన అడవి నుంచి ఈ కొండలపైకి వెళ్లే ఘాట్ రోడ్‌పై ప్రయాణం సరికొత్త అనుభూతినిస్తుంది. కొండలపైకి వెళ్లగానే సరికొత్త లోకంలోకి వెళ్లిన అనుభూతి కలుగుతుంది. చుట్టూ ఎత్తయిన కొండలు, ఆ కొండల్లోంచి ఉదయించే సూర్యుడిని చూడటం గుడిస గ్రాస్ ల్యాండ్‌లో మరచిపోలేని జ్ఞాపకంగా ఉంటుంది. ప్రకృతి ప్రేమికులు శీతాకాలం గుడిస అందాలను వీక్షించేందుకు సుదూర ప్రాంతాల నుంచి తరలివస్తున్నారు. కానీ పర్యాటకులు పడేసే ప్లాస్టిక్ వ్యర్థాలు, మద్యం సీసాలతో కాలుష్యం పెరిగిపోతోందని, గుడిస వైవిధ్యాన్ని పరిరక్షించాలని పర్యావరణవేత్తలు కోరుతున్నారు. చదవండి: ఇక రైతులే డ్రోన్ పైలట్లు -
ఆ అద్భుతం వెనకాల కష్టం మామూలుది కాదు!
అదో అరుదైన జీవి. మనిషి కంటపడకుండా తిరగడం దాని నైజం. అలాంటి జీవిని.. అంతే అద్భుతంగా కెమెరాలో బంధించింది ఓ ఫీమేల్ ఫొటోగ్రాఫర్. అదీ ఎముకలు కొరికే చలిలో.. ఎంతో కష్టపడి మరీ!. అమెరికాకు చెందిన ఫొటోగ్రాఫర్ కిట్టియా పాలోస్కి.. మంచు పర్వత శిఖరాన ఠీవిగా కూర్చున్న మంచు చిరుతను కెమెరాలో బంధించింది. నేపాల్ ఖుంబు గ్లేసియర్‌లో ఫాంటోమ్ అల్లేగా పిలువబడే చోట ఆమెకు ఈ దృశ్యం తారసపడింది. కాలినడకన దాదాపు.. 165 కిలోమీటర్ల దూరం ప్రయాణించి ఆమె ఈ అద్భుతాన్ని బంధించారట!. View this post on Instagram A post shared by Kittiya Pawlowski (@girlcreature) ఈ ఫొటో మాత్రమే కాదు.. ఎవరెస్ట్ పర్వతం, పుమోరి పర్వతాల నీడన మంచు చిరుత పయనిస్తున్న ఫొటోలను ఎంతో సుందరంగా తీశారు పాలోస్కి. ఎప్పుడైతే అవి సోషల్ మీడియాలో పోస్ట్ అయ్యాయో.. అప్పటి నుంచి అవి వైరల్ కావడం ప్రారంభించింది. యానిమల్ప్లానెట్తో పాటు కొన్ని ప్రభుత్వ సంస్థలు సైతం ఆమె ఫొటోల్ని వాడేస్తున్నాయి. పాంథెరా జాతికి చెందిన మంచు చిరుతకు.. ఘోస్ట్ ఆఫ్ మౌంటెయిన్స్గా పేరుంది. సిగ్గుపడే స్వభావం కారణంగా అది మనుషుల కంట పడదు.. పడినా దాడి చేసిన సందర్భాలు లేవు!. అయితే వేట, అక్రమ రవాణా కారణంగా వీటి జనాభా బాగా తగ్గిపోతూ వస్తోంది. 2040 నాటికి ఇవి అంతరించుకునే పరిస్థితికి చేరుకుంటాయనే ఆందోళన నెలకొంది. ఇదీ చదవండి: ఫ్రస్ట్రేషన్ పీక్స్‌కి వెళ్తే ఇలాగే ఉంటది! వీడియో వైరల్ -
కెమెరాకు చిక్కిన మంచు చిరుత.. ఎక్కడంటే!
మంచు చిరుత.. వీటి ఫొటోలు అంత ఈజీగా దొరకవు. ఎందుకంటే.. అవి పరిసరాల్లో కలిసిపోయి ఉంటాయి.. వీటిని క్లిక్‌మనిపించడానికి ఫొటోగ్రాఫర్లు నెలలతరబడి వేచి చూసిన సందర్భాలు అనేకం.. ఇక్కడ కూడా వన్యప్రాణి ఫొటోగ్రాఫర్ సషా ఫొన్సెకా అలాగే ఎదురుచూశారు. ఫలితం.. ఇదిగో.. తన ఫొటోను క్లిక్‌మనిపిస్తున్న కెమెరా వైపు కోపంగా లుక్కులిస్తు మరీ చిక్కింది ఈ స్నో లెపర్డ్. దీన్ని లడఖ్ పర్వత ప్రాంతంలో తీశారు. ఇంటర్నెట్లో షేర్ చేయగానే.. జనమంతా ఎగబడి చూశారు. దీంతో మంచు చిరుత ఫొటోలు సామాజిక మాధ్యమాల్లో వైరల్‌గా మారాయి. ( విమానంలోంచి గుట్టలు గుట్టలుగా చేపలు.. వీడియో వైరల్) View this post on Instagram A post shared by Sascha Fonseca (@sascha.fonseca) -
బొటానికల్ గార్డెన్లో అరుదైన తూనీగ
జడ్చర్ల టౌన్: జడ్చర్ల ప్రభుత్వ డిగ్రీ కళాశాల ప్రాంగణంలోని బొటానికల్ గార్డెన్లో రియోథెమిస్ వరిగేటా జాతికి చెందిన రంగురంగుల తూనీగను గుర్తించినట్లు గార్డెన్ సమన్వయకర్త డాక్టర్ సదాశివయ్య తెలిపారు. హైదరాబాద్‌కు చెందిన భరత్ అనే వైల్డ్‌లైఫ్ ఫొటోగ్రాఫర్ గార్డెన్‌ను సందర్శించి పక్షులు, జంతువులను కెమెరాలో బంధిస్తుండగా అరుదైన తూనీగను గుర్తించినట్లు తెలిపారు. సాధారణంగా ఇలాంటి తూనీగలు చిత్తడి నేలలో ఎక్కువగా నివసిస్తూ చిన్న చిన్న క్రిమి కీటకాలను తింటూ జీవిస్తాయన్నారు. ఈ రకమైన తూనీగలు మనదేశంతో పాటు, చైనా, వియత్నాం, జపాన్ దేశాల్లో మాత్రమే జీవిస్తాయన్నారు. అనేక అరుదైన మొక్కలు, జంతువులకు తెలంగాణ బొటానికల్ గార్డెన్ నిలయంగా మారుతోందన్నారు. -
వన్య ప్రాణుల కోసం...
‘ఆరెంజ్’ సినిమాలో వైల్డ్ లైఫ్ ఫొటోగ్రాఫర్‌గా కనిపిస్తారు రామ్‌చరణ్. అది సినిమా కోసం. ఇప్పుడు నిజంగానే వైల్డ్ లైఫ్ ఫొటోగ్రాఫర్‌గా మారారాయన. అయితే చరణ్ ఫొటోగ్రాఫర్ కావడం వెనక ఓ మంచి ఉద్దేశం ఉంది. ప్రకృతిని కాపాడటం కోసం ‘డబ్లూడబ్ల్యూఎఫ్’ అనే స్వచ్ఛంద సంస్థ 60 ఏళ్లుగా పని చేస్తోంది. ఇటీవలే ఈ సంస్థకు రాయబారిగా రామ్‌చరణ్ సతీమణి ఉపాసన ఎన్నికయ్యారు. ఇప్పుడు వన్యప్రాణి సంరక్షణ కోసం నిధుల సేకరణలో చరణ్ కూడా తన వంతు సాయం చేయనున్నారు. సింహాలు, చిరుతపులులు, జిరాఫీలు తదితర వన్య ప్రాణుల ఫొటోలతో చరణ్ తన కొత్త ఇంట్లో ‘వైల్డెస్ట్ డ్రీమ్స్’ పేరుతో ఓ విభాగాన్నే ఏర్పాటు చేశారు. ఈ ఫొటోలను ప్రదర్శించి ప్రజల్లో చైతన్యం ఏర్పరచాలన్నది వీరి ఉద్దేశం. ‘‘భూమిని పరిరక్షించుకోవాల్సిన బాధ్యత మన అందరిదీ’’ అన్నారు చరణ్. -
కట్టిపడేశారు
ఇక్కడున్న ఫొటో చూశారుగా! హీరోయిన్ అమలాపాల్ కాళ్లు, చేతులు కట్టిపడేశారు. కంగారు పడాల్సింది ఏమీ లేదు. ఇదంతా ఆమె కథానాయికగా నటిస్తున్న ‘అదో అంద పరవై పోల’ సినిమా కోసమే. ఈ చిత్రానికి కేఆర్ వినోద్ దర్శకత్వం వహిస్తున్నారు. ‘‘అదో అంద పరవై పోల’ సినిమా యాక్షన్ సీక్వెన్స్‌లో భాగంగా ఇలా నన్ను కట్టిపడేశారు. ఒకవేళ నన్ను ఇలానే వదిలి వెళ్లిపోతారా? ఏంటి? అని కంగారు పడ్డాను’’ అని ఈ ఫొటోను సరదాగా షేర్ చేశారు అమల. ఈ చిత్రం షూటింగ్ దాదాపు పూర్తయింది. ఇందులో అమలాపాల్ కొన్ని యాక్షన్ స్టంట్స్ చేశారు. ఈ క్రమంలో ఆమె గాయపడ్డ సంగతి కూడా గుర్తుండే ఉంటుంది. ఇందులో వైల్డ్‌లైఫ్ ఫొటోగ్రాఫర్‌గా ఆమె నటిస్తున్నట్లు తెలిసింది. ఇక ఇటీవల అమల ‘కడవేర్’ అనే సినిమాతో నిర్మాతగా మారిన విషయం తెలిసిందే. ఇందులో ఆమె ప్రధాన పాత్రలో నటిస్తున్నారు. -
థాంక్ యు అప్పో...
అప్పటివరకూ గట్టిగా కొట్టుకున్న పికిన్ గుండె ఇప్పుడిప్పుడే కుదుటపడుతోంది.. అప్పోను గట్టిగా పట్టుకుంది.కొన్ని నిమిషాల క్రితం వరకూ అప్పో ఎవరో పికిన్కు తెలియదు..కానీ ఇప్పుడీ ప్రపంచంలో అందరికంటే ఎంతో ఆప్తుడిలా కనిపిస్తున్నాడు..అప్పో దగ్గరుంటే..అమ్మ దగ్గరున్నట్లుంది..ఎలాంటి భయం లేకుండా.. భద్రంగా..అచ్చం అమ్మ కడుపులో ఉన్నట్లు..అమ్మ జన్మనిస్తే.. అప్పో పునర్జన్మనిచ్చాడు.. థాంక్ యు అప్పో.. పికిన్–అప్పోల ఈ చిత్రం వైల్డ్ లైఫ్ ఫొటోగ్రాఫర్ ఆఫ్ ద ఇయర్ 2017లో ప్రతిష్టాత్మక పీపుల్స్ చాయిస్ పురస్కారాన్ని గెలుచుకుంది. 50 వేల ఎంట్రీలు రాగా.. కెనడాకు చెందిన ఫొటోగ్రాఫర్ జొఆన్ తీసిన ఈ చిత్రం మొదటి స్థానాన్ని గెలుచుకుంది. ‘ఇద్దరు స్నేహితుల అపురూపమైన చిత్రమిది. పికిన్ ఓ గొరిల్లా.. అప్పోలినేర్ ఏప్ ఆఫ్రికా తరఫున పనిచేస్తుంటాడు. పికిన్ను కొందరు వేటగాళ్లు పట్టుకున్నారు. మాంసం కోసం దాన్ని చంపి. ఆమ్మేయాలన్నది వాళ్ల ప్లాన్.. చివరి నిమిషంలో విషయం తెలుసుకుని.. అప్పోలినేర్ బృందం పికిన్తో పాటు మరికొన్నిటిని కాపాడారు. వాటిని కెమరూన్లోని నేషనల్ పార్క్‌కు తరలించాలనుకున్నారు. ఎంతైనా అడవి గొరిల్లాలు. దీంతో వాటికి మత్తుమందు ఇచ్చారు. అప్పో పికిన్ను వేరే ఎన్‌క్లోజర్‌లోకి మారుస్తుండగా.. అది మెలకువలోకి వచ్చింది. అయితే.. ఆశ్చర్యకరంగా పికిన్ వైల్డ్‌గా ప్రవర్తించలేదు.. చాలా ప్రశాంతంగా ఉంది.. తనను రక్షించిన అప్పోను గుర్తించినట్లుగా.. అతడిని పట్టుకుని అలా ఉండిపోయింది.. ఏదో కృతజ్ఞతలు తెలుపుతున్నట్లుగా.. ఇది ఇద్దరు మిత్రుల మధ్య చోటుచేసుకున్న ఓ అద్భుతమైన సన్నివేశం’అని జొఆన్ చెప్పారు. వన్యప్రాణుల పట్ల మరింత దయతో ప్రవర్తించేలా తన ఈ చిత్రం దోహదం చేస్తుందని ఆశిస్తున్నట్లు ఆమె పేర్కొన్నారు. -
సాహసం ఆమె పథం
సింహాలకు బెదరదు.. పులులొచ్చినా కదలదు.. ఏనుగులు వెంటాడినా.. పాములు కాటేసినా.. ఆ ఒక్కటి దక్కేవరకూ చచ్చినా మెదలదు.. అదే.. ఒక పర్ఫెక్ట్ పిక్చర్.. దాని కోసం ఎంతకైనా తెగిస్తుంది.. ప్రాణాలను సైతం పణంగా పెడుతుంది.. షానన్ బెన్సన్(36).. వైల్డ్ లైఫ్ ఫొటోగ్రాఫర్ అంటేనే సాహసంతో కూడిన వృత్తి. అందులోనూ షానన్ ఒకడుగు ముందునే ఉంటుంది.. దక్షిణాఫ్రికాలోని సఫారీల్లో వన్యప్రాణుల మధ్యే తిరుగుతూ వాటిని ఫొటోలు తీస్తుంది. తనను పలుమార్లు చిరుతలు గాయపరిచాయని.. ఏనుగుల మంద వెంటాడిందని.. పాములు, బల్లులు లాంటివైతే లెక్కనేనన్ని సార్లు కరిచిఉంటాయని షానన్ చెబుతోంది. అయితే.. చేయి కాలనిదే మంచి చెఫ్ కాలేనట్లు.. ఇలాంటివి లేకుండా మంచి వైల్డ్‌లైఫ్ ఫొటోగ్రాఫర్ ఎలా అవుతామని ప్రశ్నిస్తుంది. ఈ వృత్తిలో ఉన్న థ్రిల్లే తనను ముందుకు నడిపిస్తోందని ఆమె చెబుతోంది. -
కెమేరా కన్నుల్లో... ప్రకృతి బంధనం
ఆశపడడానికీ, ఆశించింది అందుకోవడానికీ మధ్య చాలా తేడా ఉంది. ఆశపడడం సులభమే. కానీ ఆశించినదాన్ని అందుకోవడం మాత్రం అంత సులభం కాదు. సమయం మరచి, సాధన చేయాలి. అవిశ్రాంతంగా శ్రమించాలి. అప్పుడే అనుకున్నది దక్కుతుంది. లక్ష్యాన్ని ఛేదించడం సాధ్యపడుతుంది. ఇవన్నీ రతికా రామస్వామి అనుభవం తెలిపే మాటలు. ఇటీవలే హైదరాబాద్ వచ్చి ఫొటోగ్రఫీ వర్క్‌షాప్‌ను నిర్వహించిన వైల్డ్‌లైఫ్ ఫొటోగ్రాఫర్ రతిక సాగించిన ప్రయాణం ఆసక్తికరం, స్ఫూర్తిదాయకం! మహిళలు అన్ని రంగాల్లోనూ దూసుకెళ్తున్నా, ఇప్పటికీ పురుషులు మాత్రమే అడుగుపెట్టే రంగాలు కొన్ని ఉన్నాయి. వాటిలో ఫొటోగ్రఫీ ఒకటని చెప్పవచ్చు. బరువైన కెమెరాను భుజాన వేసుకుని, ఎక్కడెక్కడికో వెళ్లి, ఏవేవో దృశ్యాలను ఒడిసిపట్టడం అంత తేలికేమీ కాదు. ఇక వైల్డ్‌లైఫ్ ఫొటోగ్రఫీ అయితే... ఆ కష్టం రెట్టింపు ఉంటుంది. మనిషిని కదలకుండా ఆగమంటే ఆగుతాడు. కానీ జంతువులు, పక్షులు ఆగవు. అలాంటి వాటి వెంటపడి, వాటిని కెమెరాలో బంధించడం సామాన్యమైన విషయం కాదు. అయినా అది చేయడానికే ఇష్టపడ్డారు రతిక. మగవాళ్లకే చాలెంజింగ్‌గా ఉండే వైల్డ్‌లైఫ్ ఫొటోగ్రఫీ రంగంలో అడుగుపెట్టి, దశాబ్దకాలంగా తిరుగులేకుండా వెలుగుతున్నారు! ఆసక్తిగా మొదలై... తమిళనాడులోని తేని ప్రాంతంలో జన్మించారు రతిక. తండ్రి సైనిక అధికారి. తల్లి టీచర్. ఒక్కగానొక్క కూతురు కావడంతో కోరుకున్నవన్నీ కాళ్ల దగ్గరకు వచ్చేవి. చిన్నతనం గురించి తలచుకున్నప్పుడు రతికకి మొదట గుర్తొచ్చేది సెలవుల గురించే. బడి ఇలా మూయగానే విహార యాత్రలకు వెళ్లేది వారి కుటుంబం. సైనికాధికారి అయిన తండ్రి వివిధ ప్రాంతాల్లో విధులు నిర్వర్తించడంతో చాలా ప్రదేశాలు చూసే అవకాశమూ కలిగింది. అయితే ఎక్కడికి వెళ్లినా అక్కడి ప్రకృతి, జంతువుల మీదే ఉండేది రతిక దృష్టి. అది గమనించిన ఆమె తండ్రి, పదకొండో తరగతి చదువుతున్నప్పుడు రతికకు ఒక కెమెరాను బహూకరించారు. ఫొటోగ్రఫీ వైపు అడుగులు వేయడానికి ఆ సంఘటనే పురికొల్పింది! మొదట్లో ఇంటినీ, గార్డెన్నీ ఫొటోలు తీస్తుండేవారు రతిక. వెళ్లిన ప్రతిచోటా అందాలను బంధించాలని చూసేవారు. అయితే 2003లో భరత్పూర్ వన్యప్రాణి సంరక్షణ కేంద్రాన్ని సందర్శించినప్పుడు ఫొటోగ్రఫీ మీద ఆమెకున్న మమకారం రెట్టింపయ్యింది. అక్కడున్న జంతువులు, పక్షులను రకరకాల కోణాలలో ఫొటోలు తీసింది. అవి అద్భుతంగా వచ్చాయి. దాంతో వైల్డ్‌లైఫ్ ఫొటోగ్రాఫర్‌ను కావాలన్న కోరిక రతిక మనసులో బలంగా నాటుకుపోయింది. ఆమె అభిరుచి గురించి విన్న ఇంట్లోవాళ్లు అభ్యంతర పెట్టలేదు. కంప్యూటర్ ఇంజినీరింగ్ , ఎంబీయే పూర్తి చేసిన కూతురు లక్షలు సంపాదించే ఉద్యోగం చేయాలనుకోకుండా జంతువుల వెంట పడి తిరుగుతానన్నా కాదనలేదు. దాంతో రతిక కోరుకున్న మార్గంలో నిరాటంకంగా కొనసాగిపోయారు. ఎడతెగని ఉత్సాహంతో... వైల్డ్‌లైఫ్ ఫొటోగ్రాఫర్లకి పెను సవాలు... ప్రకృతి. ఫొటోషూట్ ప్లాన్ చేసుకుని, అన్నీ అమర్చుకుని, రహస్యంగా ఓ మూల నక్కి జంతువుల కోసం ఎదురు చూస్తుంటారు. అలాంటప్పుడు హఠాత్తుగా ఆకాశం మేఘావృతమై సూర్యకాంతి తగ్గిపోతే? ఊహించని విధంగా వర్షం కురవడం మొదలుపెడితే? అలా చాలాసార్లు జరిగిందంటారు రతిక. ‘ప్రకృతి ఎప్పుడెలా మారుతుందో తెలియదు. అన్ని ఏర్పాట్లూ చేసుకున్న తర్వాత మార్పులు ఏర్పడి షూట్ క్యాన్సిలయ్యే పరిస్థితి చాలాసార్లు ఏర్పడుతుంది. కానీ ఏం చేస్తాం... ప్రకృతిని మనం నియంత్రించలేం కదా’ అంటారావిడ. అడవుల్లో, కొండల్లో, లోయల్లో సంచరిం చడం తేలికైన విషయం కాదుగా అంటే... ‘ఎడతెగని ఉత్సాహం ఉంటే ఏదీ కష్టం కాదు. నేనెప్పుడూ దీన్ని కష్టమను కోలేదు’ అంటారు దృఢంగా. మిగతా రంగాల్లో మాదిరిగా ఇక్కడ కూడా మహిళలకు ఇబ్బందులు ఎదురవుతాయా అంటే... ‘వివక్షకు తావే లేదు. ఎందుకంటే ఫొటో తీస్తున్నది ఆడో మగో జంతువులకి తెలియదుగా’ అంటూ నవ్వేస్తారు. రతిక మాట్లాడే ప్రతి మాటలోనూ ఆత్మవిశ్వాసం కనబడుతుంది. ఆమె తీసే ప్రతి ఫొటోలోనూ ఆమె శ్రమ, తపన కనిపిస్తాయి. అవే ఆమెను సక్సెస్ ఫుల్ వైల్డ్‌లైఫ్ ఫొటోగ్రాఫర్‌ని చేశాయి. ఈ రోజు ఆమె గురించి ప్రపంచమంతా మాట్లాడుకునేలా చేశాయి. వైల్డ్ లైఫ్ ఫొటోగ్రాఫర్‌కి ఉండాల్సిన ప్రధానమైన లక్షణం... ఓర్పు. ఎందుకంటే మనుషుల మాదిరిగా జంతువులు ఫొటోలకి ఫోజులివ్వవు. మనకు కావలసిన ఎక్స్‌ప్రెషన్‌ని మనమే పట్టుకోగలగాలి. అది వచ్చే వరకూ వేచి ఉండాలి. ఆ ఓర్పు లేకపోతే కష్టం. మరో విషయం ఏమిటంటే... జంతువుల ప్రవర్తన గురించి పూర్తిగా అధ్యయనం చేయాలి. ఏ జంతువు ఎలా ప్రవర్తిస్తుంది, దేనికెలా స్పందిస్తుంది అన్న విషయాలు క్షుణ్ణంగా తెలుసుకోవాలి. ఎందుకంటే వాటి మూడ్స మీదే మన ఫొటోగ్రఫీ ఆధారపడి ఉంటుంది. ఈ రెండూ తెలిసినవాళ్లు మంచి ఫొటోగ్రాఫర్ అయి తీరుతారు!