మంచు చిరుత.. వీటి ఫొటోలు అంత ఈజీగా దొరకవు. ఎందుకంటే.. అవి పరిసరాల్లో కలిసిపోయి ఉంటాయి.. వీటిని క్లిక్‌మనిపించడానికి ఫొటోగ్రాఫర్లు నెలలతరబడి వేచి చూసిన సందర్భాలు అనేకం.. ఇక్కడ కూడా వన్యప్రాణి ఫొటోగ్రాఫర్ సషా ఫొన్సెకా అలాగే ఎదురుచూశారు. ఫలితం.. ఇదిగో.. తన ఫొటోను క్లిక్‌మనిపిస్తున్న కెమెరా వైపు కోపంగా లుక్కులిస్తు మరీ చిక్కింది ఈ స్నో లెపర్డ్.
దీన్ని లడఖ్ పర్వత ప్రాంతంలో తీశారు. ఇంటర్నెట్‌లో షేర్ చేయగానే.. జనమంతా ఎగబడి చూశారు. దీంతో మంచు చిరుత ఫొటోలు సామాజిక మాధ్యమాల్లో వైరల్‌గా మారాయి. ( విమానంలోంచి గుట్టలు గుట్టలుగా చేపలు.. వీడియో వైరల్)
Comments
Please login to add a commentAdd a comment