Snow
-
అమెరికాలో వరదలు
లూయిస్విల్లే: ప్రకృతి వైపరీత్యాలు అమెరి కాను వణికిస్తున్నాయి. ఆగ్నేయాన భారీ వర్షాలు, ప్రమాదకరమైన వరదలు అతలా కుతలం చేస్తుండగా ఈశాన్య ప్రాంతంలో తీవ్రంగా మంచు కురుస్తోంది. మైదాన ప్రాంతాల్లో చలి వణికిస్తోంది. కెంటకీలోని క్లే కౌంటీలో సంభవించిన వరదల్లో శనివారం ఒకరు ప్రాణాలు కోల్పోయారు. వరద హెచ్చరికల నేపథ్యంలో జాక్సన్లోని కెంటకీ రివర్ మెడికల్ సెంటర్‌ను మూసివేశారు. కెంటకీలో నివాస భవనాలు, కార్లు వరదల్లో చిక్కుకుపోగా వర్జీనియాలోని రోడ్లను బురద కమ్మేసింది. టెన్నెస్సీ, అర్కా న్సాస్లోనూ అధికారులు వరద ప్రమాద హెచ్చరికలను జారీ చేశారు. 10 దక్షిణాది రాష్ట్రాల్లో అత్యవసర పరిస్థితి ప్రకటించారు. న్యూఇంగ్లండ్, న్యూయార్క్‌ల్లో చాలా ప్రాంతాలను భారీగా మంచు కప్పేసింది. నెబ్రస్కా, అయోవా, విస్కాన్సిన్, మిషిగన్, డెన్వర్‌లో ఉష్ణోగ్రతలు మైనస్ 10 డిగ్రీలకు పడిపోయాయి. మొంటానా, డకోటా, మిన్నెసోటాల్లో మైనస్ 51 డిగ్రీల వరకు పడిపోయతాయని అధికారులు చెప్పారు. -
ఫలరాజుపై మంచు పంజా!
మామిడి రైతుకు దిగుబడి దిగులు పట్టుకుంది. వాతావరణంలో మార్పుల కారణంగా ఈ ఏడాది మామిడి పూత ఆలస్యమవుతోంది. జనవరి (January) మాసం ప్రారంభమై పక్షం రోజులైనా ఆశించిన మేర పూత రాలేదు. ఏటా డిసెంబర్ చివరికల్లా మామిడిచెట్లు పూతతో నిండి కళకళలాడేవి. ఈసారి చలి తీవ్రత, పొగమంచు ప్రభావంతో ఆ పరిస్థితి కనిపించకపోవడంతో ఎన్నో ఆశలతో వేలాది రూపాయలు పెట్టుబడి పెట్టిన రైతులు తీవ్ర ఆందోళన చెందుతున్నారు.ఇక్కడ కనిపిస్తున్న మామిడితోట (Mango Field) కర్నూలు మండలం శివరామపురం గ్రామం రైతుది. ఎలాగైనా ఈసారి మంచి దిగుబడులు సాధించాలని పైరు చీడ పీడల బారిన పడకుండా కంటికి రెప్పలా కాపాడుకుంటూ వచ్చాడు. వేలాది రూపాయలు పెట్టి ఎప్పటికప్పుడు మందులు పిచికారీ చేశాడు. చివరకు చలి తీవ్రత, పొగమంచు ఆశలపై నీళ్లు చల్లాయి. ఇప్పటి వరకు చెట్లకు పూత పూయలేదు.కర్నూలు(అగ్రికల్చర్): ఈసారి వ్యవసాయం రైతులకు కలిసి రాలేదు. తొలుత అధిక వర్షాలు, తర్వాత వర్షాభావంతో ఖరీఫ్(Kharif) నిరాశకు గురి చేస్తే, వరుస తుఫానులు రబీ ఆశలను దెబ్బతీశాయి. ఈ క్రమంలో కొందరు రైతులు మామిడి తోటలపై నమ్మకం పెంచుకుంటే ప్రస్తుతం నెలకొన్న చలి తీవ్రత ప్రతికూలంగా మారింది. మామిడి తోటలు ఎక్కువగా ఉన్న జిల్లాల్లో ఉమ్మడి కర్నూలు జిల్లా కూడా ఒకటి. ఈ జిల్లాలో మామడి తోటలు భారీగానే ఉన్నాయి. మామిడితోటలకు పెట్టింది పేరు బనగానపల్లె ప్రాంతం. బనగానపల్లె, అవుకు, సంజామల, కోవెలకుంట్ల, కొలిమిగుండ్ల, పాణ్యం, వెల్దురి, బేతంచెర్ల తదితర మండలాల్లో భారీగా మామడి తోటలున్నాయి. దీనికి తోడు గత ప్రభుత్వ ప్రోత్సాహంతో 2019 నుంచి 2024 వరకు ఉమ్మడి జిల్లాలో మామిడి తోటలు విస్తారంగా అభివృద్ధి చెందాయి. ఒకవైపు ఉపాధి నిధులతో 100 శాతం సబ్సిడీ ఇస్తుండటం, మరోవైపు ఉద్యాన శాఖ ఆకర్షనీయమైన రాయితీల వల్ల మామిడితోటలు పెరిగాయి.కర్నూలు జిల్లాలో విభిన్న పరిస్థితిజిల్లాలోని పశ్చిమ ప్రాంతంలో మామిడి పూత కొంత కనిపిస్తుండగా..తూర్పు ప్రాంతంలో ఇంకా పట్టే దశలోనే ఉంది. ఈభిన్న పరిస్థితికి వాతావరణంలో మార్పే కారణంగా కనిపిస్తోంది. గతంలో ఎప్పుడూ లేని విధంగా జిల్లాలో చలి వాతావరణం నెలకొంది. ఉష్ణోగ్రతలు 10–11 డిగ్రీలకు పడిపోయాయి. ఈ వాతావరణం మామిడికి ఇబ్బందికరంగా మారింది. చల్లని వాతావరణం ఉంటే తోటల్లో కొత్త చిగుళ్లు వస్తాయి. నేడు పలు ప్రాంతాల్లో చలి ఎక్కువగా ఉంది. ఈ కారణంగా మామిడిలో కొత్త చిగుళ్లు కనిపిస్తున్నాయి. పత్తికొండ, దేవనకొండ. తుగ్గలి, గూడూరు, సి.బెళగల్ ప్రాంతాల్లో 50 శాతం వరకు మామిడి పూత వచ్చింది. వెల్దుర్తి, ఓర్వకల్లు, బేతంచెర్ల, అవుకు, బనగానపల్లి, కృష్ణగిరి, కల్లూరు, కోవెలకుంట్ల తదితర ప్రాంతాల్లో 30 నుంచి 40 శాతం వరకే పూత వచ్చింది. మామూలుగా అయితే జనవరి మొదటి పక్షంలోపు అన్ని ప్రాంతాల్లోని మామిడిలో 80 శాతంపైగా పూత రావాలి. వాతావరణం చల్లగా ఉండటం, పొగమంచు ప్రభావం ఎక్కువగా ఉండటం ద్వారా పలు ప్రాంతాల్లో పూత ఆలస్యమవుతోంది. ఒకతోటలో 100 చెట్లు ఉంటే ఇందులో 35–40 శాతం చెట్లు పూతకు వచ్చాయి. మిగిలిన చెట్లలో పూత ఆలస్యమవుతోంది. జనవరి మొదటి పక్షం గడుస్తున్నా ఆశించిన మేర పూత పట్టకపోవడం రైతులను తీవ్ర ఆందోళనకు గురిచేస్తోంది. మరోవైపు చలి తీవ్రత వల్ల తేనెమంచు, పురుగుల బెడద పెరుగుతోంది. ఇది మామిడి రైతులను నిరాశకు గురి చేస్తోంది.వచ్చిన పూత నిలిచేనా...కొన్ని ప్రాంతాల్లో పూత ఆశాజనకంగా వచ్చినప్పటికీ నిలిస్తేనే కాపు బాగుంటుంది. సంక్రాంతి తర్వాత ఉష్ణోగ్రతలు పెరుగుతాయి. ఉష్ణోగ్రతలు పెరిగినప్పుడు పూత పిందె రాలిపోతుంది. 2022–23, 2023–24 సంవత్సరాల్లో ఆరంభంలో పూత బాగానే వచ్చినప్పటికి తర్వాత ఎండల ప్రభావంతో 60 శాతంపైగా రాలిపోయింది. ఈ సారి కొన్ని ప్రాంతాల్లో పూత విశేషంగా వచ్చినప్పటికి ఎంత వరకు నిలిచి కాపుగా మారుతుందనేది ప్రశ్నార్థకం. ఉమ్మడి కర్నూలు జిల్లాలో 16000 ఎకరాల్లో మామిడి తోటలు ఉన్నాయి.ఇందులో కర్నూలు జిల్లాలో 4848 ఎకరాలు, నంద్యాల జిల్లాలో 10,167 ఎకరాల్లో మామిడి తోటలు అభివృద్ధి చెందాయి. ఇప్పటి వరకు 40 శాతం తోటల్లో 50 శాతంపైగా పూత వచ్చింది. 50 శాతం తోటల్లో 30 శాతం వరకే పూత వచ్చింది. 10 శాతం తోటల్లో ఇంకా పూత రాలేదు. పూత రావడంలో హెచ్చు తగ్గులుండటానికి వాతావరణ పరిస్థితులే కారణమని ఉద్యాన అధికారులు పేర్కొన్నారు. జిల్లాలో అభివృద్ధి చెందిన మామిడిలో 70 నుంచి 80 శాతం వరకు బేనిసా ఉంటోంది. బేనిసా చెట్లు ఒక ఏడాది బాగా కాపు ఇస్తే... మరుసటి ఏడాది కాపునకు రావు. మామిడిలో చాల వరకు పూత రాకపోవడానికి ఇది కూడా ఒక కారణమేనన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది. ఇదిలా ఉంటే పూతను బట్టి మామడి కొనుగోలు యత్నాలు జరుగుతాయి. పూత బాగా నిలిస్తే ఎకరాకు 7–8 టన్నుల వరకు దిగుబడి వస్తుంది. ఈ సారి వాతావరణం ప్రతికూలతతో దిగుబడులు తగ్గే అవకాశం ఉందని రైతులు ఆందోళన చెందుతున్నారు.గతేడాది పూత బాగుండేదినాకు రెండు ఎకరాల్లో మామిడి తోట ఉంది. గతంలో ఈ సమయానికి మామిడి చెట్లకు పూత బాగా ఉండేది. ఇప్పటి వరకు ఆశించిన మేర పూత లేదు. తేమశాత ఎక్కువ కవడామో లేక వాతావరణ ప్రభావమో తెలియదు. వేలాది రూపాయలు పెట్టుబడి పెట్టాను. పంట రాకపోతే ప్రభుత్వం అదుకోవాలి. – కురువ శంకర్, మామిడి రైతు, పూడురు గ్రామందిగుబడిపై ప్రభావం నేను బనగానపల్లె, పాణ్యం, బేతంచర్ల మండలాల్లో సుమారు 14 ఎకరాల తోటలను రూ.3 లక్షల కౌలు ఇచ్చి తీసుకున్నాను. దీనికితోడు మందుల పిచికారీ తదితర వాటి కోసం ల్చక్షకు పైగా ఖర్చు చేశాను. సాధారణంగా ఈ సమయానికి పూత వచ్చి ఉండాలి. ఆలస్యం కావడంతో దిగుబడిపై ప్రభావం పడే అవకాశం ఉంది.– పాంషా, మామిడి తోటల కౌలు రైతు, బనగానపల్లెమామిడిలో పూతరాకపోతే ఇలా చేయాలి పలు ప్రాంతాల్లో మామిడిలో పూత రావడం ఆలస్యమ్చవుతోంది. పూత రాని పక్షంలో 13–0–45 రసాయన ఎరువు 10 గ్రాములు, 3 గ్రాముల సల్పర్, 1.6 ఎంఎల్ మోనోక్రోటోపాస్ లీటరు నీటికి కలిపి పిచికారీ చేయాలి. దీంతో పాటు పూత రానితోటల్లో పొగపెట్టాలి. ఇలా చేయడం ద్వారా పూత వచ్చే అవకాశం ఉంది. మరో 10–15 రోజుల్లో అన్ని ప్రాంతాల్లోని అన్ని తోటల్లో పూత వచ్చే అవకాశం ఉంది. పూత వచ్చిన తర్వాత చెట్లకు ఎరువులు వేసి తేలికపాటి నీటి తడులు ఇవ్వాలి. పూత వచ్చిన తోటల్లో చీడపీడల యాజమాన్యంలో భాగంగా సాఫ్–2 జిఎం, క్లోరోఫైరిఫాస్ 2 ఎంఎల్, బోరాన్ ఒక గ్రాము లీటరు నీటికి కలిపి పిచికారీ చేయాలి. పచ్చి పూత ఉన్నట్లైతే ఇమిడాక్లోఫ్రిడ్ 0.3 గ్రాములు, హెక్షాకొనజోల్ 1 ఎంఎల్ లీటరు నీటికి కలిపి పిచికారీ చేయాల్సి ఉంది. – పి.రామాంజనేయులు, జిల్లా ఉద్యాన అధికారి, కర్నూలు -
అమెరికాలో ‘మంచు’ బీభత్సం
వాషింగ్టన్: తుఫాను కారణంగా తూర్పు అమెరికా అంతటా భారీ మంచు బీభత్సం సృష్టిస్తోంది. ఐదుగురు మృతి చెందారు. విద్యుత్ సరఫరాకు అంతరాయం కలగడంతో లక్షలాది మంది అంధకారంలో ఉండిపోయారు. 2,400కు పైగా విమానాలు రద్దయ్యాయి. వాషింగ్టన్లో ఒక అడుగు వరకు మంచు కురిసే అవకాశం ఉందని నేషనల్ వెదర్ సర్వీస్ (ఎన్‌డబ్ల్యూఎస్) అంచనా వేసింది. పరిస్థితులను అధ్యక్షుడు జో బైడెన్ నిశితంగా పరిశీలిస్తున్నారని, ప్రభావిత రాష్ట్రాలకు మద్దతు ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నారని వైట్‌హౌస్ ప్రతినిధి ఒకరు తెలిపారు. అమెరికా రాజధానిలోని ఇళ్లన్నీ మంచులో కూరుకుపోయాయి. వాతావరణ పరిస్థితుల దృష్ట్యా నగరంలోని పాఠశాలలు మూసివేశారు. కాన్సాస్, మిస్సోరి సహా పలు రాష్ట్రాల్లో మంచు తుఫాను పరిస్థితులు నెలకొన్నాయి. తుపాను సంబంధిత ఘటనల్లో ఇప్పటివరకు ఐదుగురు మృతి చెందారు. కెంటకీ, మిస్సోరి, వర్జీనియా, మేరీల్యాండ్ సహా పలు రాష్ట్రాల్లో అత్యవసర పరిస్థితిని ప్రకటించారు. రోడ్లను క్లియర్ చేయడానికి అత్యవసర నిర్వహణ పనులు జరుగుతున్నాయని, ప్రజలు ఇళ్లలోనే ఉండాలని గవర్నర్లు, స్థానిక అధికారులు కోరారు. ఆగ్నేయ రాష్ట్రాల్లో ఉరుములు, మెరుపులతో కూడిన వర్షాలు పడతాయని, వడగండ్లు, టోర్నడోలు వస్తాయని ఎన్‌డబ్ల్యూఎస్ హెచ్చరించింది. మంచు దట్టంగా పేరుకుపోతుందని, శక్తివంతమైన గాలులతో చెట్లు కూలిపోతాయని, దీర్ఘకాలిక విద్యుత్ అంతరాయం కలిగే అవకాశముందని తెలిపింది. -
మంచు సున్నితం.. వడగళ్లు కఠినం.. ఆకాశంలో ఏం జరుగుతుంది?
శీతాకాలంలో కొన్ని ప్రాంతాల్లో మంచు కురుస్తుంటుంది. ఈ మంచును ముట్టుకున్నప్పుడు ఎంతో సున్నితంగా ఉంటుంది. తాకగానే మంచి మెత్తని పూలను తాకిన అనుభూతినిస్తుంది. ఇదేవిధంగా వర్షాకాలంలో చాలా ప్రాంతాల్లో వడగళ్లు పడుతుంటాయి. అవి ఎంతో గట్టిగా రాళ్లలా ఉంటాయి. వెంటనే కరిగిపోవు. ఒకే ఆకాశం నుంచి పడే మంచు మృదువుగా, వడగళ్లు గట్టిగా ఎందుకు ఉంటాయి. దీనికి విజ్ఞానశాస్త్రం ఏమి సమాధానం చెబుతుంది?మంచు ఎందుకు కురుస్తుంది?చలికాలంలో రాత్రి వేళ భూమి అధికంగా ఉష్ణశక్తిని విడుదల చేస్తుంది. అలా వెలువడిన వేడి క్రమంగా వాతావరణపు పైపొరల్లోకి చేరుకోవడంతో భూమికి దగ్గరగా ఉండే పొరల్లో ఉష్ణోగ్రత తగ్గుతూ వస్తుంది. అప్పుడు భూమిపై ఉన్న గాలిలోని నీటి ఆవిరి మరింత చల్లబడి ఘనీభవించి చిన్న నీటి బిందువులు ఏర్పడతాయి. వాటికి దుమ్ము, ధూళి లాంటి అతి చిన్న కణాలు ఆవరించి గాలిలో మంచు ఏర్పడుతుంది. దీనినే పొగమంచు అంటారు. భూమికి దగ్గరగా ఒక తెరలాగా ఏర్పడడంతో పొగమంచు కురుస్తున్నట్లుగా కనిపిస్తుంది. చలికాలంలో భూమి అధికంగా చల్లబడడం వలన నీటి ఆవిరితో కూడిన గాలి నేలపై ఉండే చెట్ల ఆకులను, పూలను, పచ్చని గడ్డిపరకలను తాకి వాటిపై ఘనీభవిస్తుంది. అవే మెరిసే మంచు బిందువులుగా కనిపిస్తాయి.వడగళ్లు ఎలా ఏర్పడతాయంటే..మేఘాల్లో ఉండే నీరు వాతావరణ మార్పులకు కరిగి భూమిపై పడడాన్నే వర్షం అని అంటారు. సాధారణంగా మేఘాల్లోని నీరు సున్నా డిగ్రీల సెంటిగ్రేడ్ వద్ద సూపర్ కూల్డ్ స్టేట్‌లో ఉంటుంది. ఇది చిన్న చిన్న మంచు ముక్కలుగా మారి వర్షంగా కురుస్తుంది. అయితే ఆ మంచు ముక్కలు నేలను చేరుకునే సరికి గాలి తాకిడికి నీరుగా మారుతాయి. అయితే కొన్ని సందర్భాల్లో ఆ మంచు ముక్కలు గట్టిగా తయారై వడగళ్లుగా వర్షంతో పాటు కిందకు పడతాయి.ఎక్కువ ఎత్తులో ఉంటూ బలమైన ఉరుములతో కూడిన మేఘాలు వర్షించినప్పుడు మేఘంలోని సూపర్‌కూల్డ్ నీటితో ముందుగా చిన్న మంచు ముక్కలు తయారవుతాయి. వాతావరణంలోని మార్పుల కారణంగా కింది నుంచి గాలి పైకి ఒత్తిడి తెచ్చినప్పుడు కొన్నిసార్లు ఆ ముక్కలు కింద పడకుండా తిరిగి మేఘాలపైకి వెళ్తాయి. ఈ క్రమంలో ఆ మంచు ముక్కలకు మరింత సూపర్ కూల్డ్ వాటర్ తోడవడంతో మరికొన్ని మంచు ముక్కలు దగ్గరగా అతుక్కుంటాయి. దాంతో అవి మరింత బలంగా, దృఢంగా మారతాయి. ఈ చర్య జరుగుతున్న కొద్దీ మంచు ముక్కలు ఇంకా పెద్దవిగా రూపాంతరం చెందుతుంటాయి. వీటినే మనం వడగళ్లు అని అంటాం. మేఘం నుంచి వర్షం కురిసేటప్పుడు కొన్ని వడగళ్లు మధ్యలోనే కరుగుతాయి. పెద్ద మంచు ముక్కలు మాత్రం కరగకముందే నేలను చేరుతుంటాయి. వాతావరణ పరిస్థితుల్లో నిలకడ లేనప్పుడు ఇలాంటి వడగళ్ల వానలకు అవకాశం ఉంటుంది.ఇది కూడా చదవండి: Year Ender 2024: హృదయాలను దోచిన ఐదు పర్యాటక ప్రాంతాలు -
వణుకుతున్న తెలుగు రాష్ట్రాలు.. చలిపులి పంజా (ఫొటోలు)
-
అహో.. మైమరిపిస్తున్న మంచు అందాలు (ఫొటోలు)
-
మంచు కొండల్లో విహారానికి సై
స్నో అడ్వెంచర్లకు కులుమనాలి అనువైన ప్రదేశంగా పేరొందింది. డిసెంబరులో కులుమనాలి చూసేందుకు వేలాది మంది సందర్శకులు వెళుతున్నారట. ఈ ప్రాంతం ప్రపంచంలోనే మంచు క్రీడలకు ప్రత్యేకమైనదిగా ఖ్యాతి గడించింది. అదే సమయంలో ఎన్నో కొత్త జంటలకు మనాలి హనీమూన్ స్పాట్‌గానూ పిలచుకుంటారు. ఉత్తరాఖండ్‌లోని ఔలి ప్రాంతం నుంచి చూస్తే హిమాలయాలు స్పష్టంగా కనిపిస్తాయి. హిమాచల్‌ప్రదేశ్‌లోని సిమ్లా పర్యాటకుల మనసు దోచుకుంటుంది. అక్కడి ఇళ్లపై మంచు దుప్పటిలా పరుచుకుంటుంది. లద్దాఖ్‌లో మంచు వర్షం పర్యాటకులను కనువిందు చేస్తుంది. జమ్మూకశ్మీర్‌లో కేబుల్ కార్ ప్రత్యేక ఆకర్షణ. శ్రీనగర్, డార్జిలింగ్, కొడైకెనాల్, ఊటీ తదితర ప్రదేశాలకు పర్యాటకులు ఆసక్తి చూపిస్తున్నారు. అయితే ఈ సమయంలో తగిన జాగ్రత్తలు తీసుకోవాలని నిపుణులు హెచ్చరిస్తున్నారు. వేడిని తట్టుకునే బట్టలు వెంట తీసుకోవడంతో పాటు, వైద్యుల సూచనల మేరకు మందులు సిద్ధంగా ఉంచుకోవాలని పేర్కొంటున్నారు. అక్కడి రహదారులపై అవగాహన కలిగి ఉండాలని సూచిస్తున్నారు. కొత్త అనుభూతినిచ్చింది.. కుటుంబ సభ్యులంతా కలసి మనాలి టూర్ వెళ్లాం. ఎనిమిది రోజుల లాంగ్ టూర్ అది. హైదరాబాద్ నుంచి ఢిల్లీ వరకూ విమానంలో వెళ్లాం. అక్కడి నుంచి రాత్రంతా బస్సు ప్రయాణం. మనాలిలో ఒక రోజు బస చేశాం. కొత్త ప్రాంతం మంచు కొండలు, ప్రకృతి అందాలు, గ్రీనరీ మనసుకు హాయిగా అనిపించాయి. నదిలో రాప్టింగ్ చేశాం. హోటల్లో రాత్రి ఫైర్ క్యాంప్ ఏర్పాటు చేశారు. అక్కడి వాతావరణం, వస్త్రధారణ కొత్త అనుభూతినిచ్చింది. – విజయ్ కుమార్ జైన్, హైదరాబాద్ప్రయాణం ఇలా.. హైదరాబాద్ నుంచి ఢిల్లీ వరకూ విమానంలో ప్రయాణించి, అక్కడి నుంచి వివిధ ప్రాంతాలకు రహదారి మార్గంలో చేరుకోవాలి. యువత కార్, మోటారు సైకిళ్లను అద్దెకు తీసుకుని మంచు కొండల్లో రయ్.. రయ్..మంటూ దూసుకుపోతున్నారు. -
14 రాష్ట్రాలకు వాతావరణశాఖ హెచ్చరిక
న్యూఢిల్లీ: దేశంలోని పలు ప్రాంతాల్లో వాతావరణంలో మార్పులు చోటుచేసుకుంటున్నాయి. కొన్ని చోట్ల చలి వాతావరణం నెలకొనగా, మరికొన్ని చోట్ల వర్షం కురుస్తోంది. కోస్తాంధ్రలో బలమైన గాలులు వీచే అవకాశాలు ఉన్నాయని, పలు రాష్ట్రాల్లో పొగమంచు ఆవరించే అవకాశం ఉందని వాతావరణశాఖ తెలిపింది. భారత వాతావరణ శాఖ (ఐఎండీ) రాబోయే వారంలో దేశంలోని 14 రాష్ట్రాల్లో వాతావరణం ఎలా ఉండబోతోందో తెలియజేసింది.ఐఎండీ అందించిన వివరాల ప్రకారం నవంబర్ 25న నైరుతి బంగాళాఖాతం, దానిని ఆనుకుని ఆగ్నేయ బంగాళాఖాతం శ్రీలంక తీరం వెంబడి 45 నుంచి 55 కి.మీ వేగంతో గాలులు వీచే అవకాశం ఉంది. నవంబర్ 26న తమిళనాడు, పుదుచ్చేరి, దక్షిణ ఆంధ్రప్రదేశ్, నైరుతి బంగాళాఖాతం, పశ్చిమ మధ్య బంగాళాఖాతంలో నవంబర్ 27,28 తేదీల్లో గంటకు 50 నుంచి 60 కి.మీ వేగంతో గాలులు వీచే అవకాశం ఉంది. ఆగ్నేయ బంగాళాఖాతం, ఆ పక్కనే ఉన్న తూర్పు భూమధ్యరేఖ హిందూ మహాసముద్రంపై అల్పపీడనం ఏర్పడింది. నవంబర్ 25-29 మధ్య తమిళనాడు, పుదుచ్చేరిలో భారీ నుండి అతి భారీ వర్షాలు కురిసే అవకాశాలున్నాయి. నవంబర్ 27-28 తేదీలలో కోస్తాంధ్రలో ఉరుములు, మెరుపులతో కూడిన తేలికపాటి వర్షాలు కురిసే అవకాశం ఉంది. నవంబర్ 25న మత్స్యకారులు సముద్రతీరానికి వెళ్లవద్దని వాతావరణ శాఖ సూచించింది.పలు రాష్ట్రాల్లో దట్టమైన పొగమంచు కురిసే అవకాశం ఉంది. పంజాబ్, హర్యానా, చండీగఢ్‌లోని వివిధ ప్రాంతాలలో నవంబర్ 27 నుంచి 29 వరకు, హిమాచల్ ప్రదేశ్‌లో నవంబర్ 25 నుంచి 28 వరకు, ఉత్తరప్రదేశ్‌లో నవంబర్ 28 నుంచి 30 ఉదయం వరకు పొగమంచు కురియనుంది. ఢిల్లీ, హర్యానా, చండీగఢ్, హిమాచల్ ప్రదేశ్, యూపీ, రాజస్థాన్, బీహార్, పశ్చిమ బెంగాల్, సిక్కిం, అస్సాం, మేఘాలయ, అరుణాచల్ ప్రదేశ్, అండమాన్, నికోబార్ దీవుల్లో చలిగాలులు వీస్తున్నాయి. ఇది కూడా చదవండి: Jharkhand: ఇలా గెలిచి.. అలా రాజీనామాకు సిద్ధమై.. ఏజేఎస్‌యూలో విచిత్ర పరిణామం -
మంచు కురిసిన వేళ: కశ్మీర్ సొగసు చూడ తరమా!
శీతాకాలం మంచు అనగానే ఇండియాలో తొలుతగా గుర్తొచ్చే ప్రదేశం జమ్ము కశ్మీర్. రాష్ట్రంలో లోని పలు ప్రాంతాల్లో మంచు విపరీతంగా కురుస్తోంది. దీనికి సంబంధించిన వీడియోలు, దృశ్యాలు సోషల్ మీడియాలో విపరీతంగా షేర్ అవుతున్నాయి. #WATCH | J&K: Upper reaches of Bandipora, including border areas of Gurez, Tulail & Kanzalwan, covered under a white sheet of snow as snowfall continues in the region. pic.twitter.com/UL23aw4xwX— ANI (@ANI) November 16, 2024 కాశ్మీర్‌లోని పర్యాటక ప్రాంతం, స్కీయింగ్‌కు ప్రసిద్ధి చెందిన గుల్మార్గ్లో శనివారం తొలి మంచు ప్రవాహమై మెరిసింది. ఇంకా కుప్వారా జిల్లా , బందిపొరా జిల్లా, గురెజ్ , కంజల్వాన్ తదితర ప్రాంతాల్లో కూడా భారీగా మంచు కురుస్తోంద. కొండలపై ఎటు చూసిన వెండి వెన్నలలా మంచుకురుస్తున్న దృశ్యాలు ఆకట్టుకుంటున్నాయి. కాశ్మీర్‌లోని ఎగువ ప్రాంతాల్లోని కొన్ని ప్రాంతాల్లో శుక్రవారం తేలికపాటి మంచు కురుస్తుందని, మైదాన ప్రాంతాల్లో కొన్ని చోట్ల వర్షం కురిసిందని అధికారులు ఇక్కడ తెలిపారు. కొన్ని చోట్ల తేలికపాటి వర్షం లేదా మంచు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది . Snowing heavily over Sonamarg, almost 1-2 inches snowfall accumulated in the area. pic.twitter.com/RTAGuMPGaP— Kashmir Weather Forecast (@KashmirForecast) November 16, 2024 -
మంచు కురిసే వేళలో మనాలి విహారం
మనాలి, కులులోయ... ఈ రెండు పర్యాటక ప్రదేశాలను విడిగా చెప్పుకోవడం మనకు అలవాటు లేదు. కులూమనాలిగా కలిపేస్తాం. ఎందుకంటే ఈ రెండింటినీ ఒకే ట్రిప్‌ల కవర్ చేయవచ్చు. మనాలి పక్కనే ఉన్న లోయ ప్రాంతం కులు. ఈ శీతల ప్రదేశాల పర్యటనకు వేసవి ఒక ఆప్షన్. స్నో ఫాల్‌ని కళ్లారా చూడాలంటే నవంబర్ రెండవ వారం నుంచి టూర్ ప్లాన్ చేసుకోవాలి. నవంబర్ నుంచి మంచు కురవడం మొదలవుతుంది. డిసెంబర్లో పతాకస్థాయికి చేరుతుంది. చెట్ల ఆకులు మంచుతో బరువుగా వంగిపోతాయి. నేల కనిపించనంత దట్టంగా ఉంటుంది. మనాలి నుంచి కేబుల్‌కార్‌లో విహరిస్తూ కులు లోయను చూడవచ్చు. తెల్లటి హిమాలయాలను ఆస్వాదించడానికి ఇదే సరైన సమయం. ఇంత అద్భుతంగా ఉంటుంది కాబట్టి ఈ ప్రదేశాన్ని వ్యాలీ ఆఫ్ ద గాడ్స్ అంటారు. ఇక్కడ మనువు గుడి ఉంది. మనువు ఆలయం అనే పేరు మీదనే దీనికి మనాలి అనే పేరు వచ్చింది. ఇదీ చదవండి: చలికాలంలో చుండ్రు బాధ, ఒళ్లు పగులుతుంది ఈ సమస్యలకు చెక్ పెట్టాలంటే! -
అయోధ్యలో.. తొలి మంచు కురిసింది..
అయోధ్య: రాముడు కొలువైన అయోధ్యలో ఈరోజు(ఆదివారం) శీతాకాలపు తొలి పొగమంచు కనిపించింది. వేడి నుంచి ఉపశమనం లభించడంతో పాటు అయోధ్యవాసులను చలి తాకింది. భక్తులు తొల పొగమంచును ఎంజాయ్ చేస్తున్నారు.అయోధ్యలో తొలి పొగమంచు ప్రభావం రోడ్లపై వెళుతున్న వాహనాలపై పడింది. వాహనాలు నెమ్మదిగా నడుస్తున్నాయి. సరయూ తీరం, రామ్ కీ పైడీ, రాంపథ్.. ఇలా అన్ని చోట్లా పొగమంచు కనిపిస్తోంది. అయోధ్య చేరుకున్న భక్తులు చల్లదనాన్ని ఆస్వాదిస్తున్నారు. ఇది చలికాలం ఆగమనానికి ప్రతీక అని స్థానికులు అంటున్నారు.చలి ప్రవేశంతో అయోధ్యకు వచ్చే భక్తులకు ఎండ వేడిమి నుంచి ఉపశమనం కలుగుతోంది. అయోధ్యలో తొలిసారిగా పొగమంచు కమ్ముకోవడం శుభపరిణామమని భక్తులు భావిస్తున్నారు. కౌశాంబి నుండి అయోధ్యకు వచ్చిన భక్తురాలు రాణి మాట్లాడుతూ అయోధ్యలో పొగమంచు మాత్రమే ఉందని, చలి అంతగా లేదన్నారు. గోరఖ్‌పూర్ నుంచి అయోధ్యకు వచ్చిన నవీన్ అనే భక్తుడు మాట్లాడుతూ అయోధ్యలో కురుస్తున్న పొగమంచు చక్కని అనుభూతిని ఇస్తున్నదన్నారు.ఇది కూడా చదవండి: కార్తీకం స్పెషల్.. దేశంలోని ప్రముఖ శివాలయాలు -
హిమ శిఖరాల్లో పెళ్లి సందడి!..వణికించే చలిలో ఫోజులిస్తున్న జంట!
జీవితంలో ఒక్కసారి జరిగే మధురమైన ఘట్టం 'పెళ్లి'. అది తమ జీవితంలో మరుపురాని గుర్తులా ఉండేలా గ్రాండ్‌గా చేసుకోవాలనుకుంటోంది యువత. అందుకోసం తమ తాహతకు తగ్గా రేంజ్లో డీజే మ్యూజిక్‌లు లేదా అందమైన టూరిస్ట్ ప్రదేశాల్లోనూ చేసుకుంటారు. విభిన్నంగా ఉండాలని ఆరాటపడుతుంటారు. అలానే ఇక్కడొక జంట ఏకంగా ఎముకలు కొరికే మంచు శిఖరాల్లో పెళ్లి జరగాలనుకుంది. అందుకని ఎక్కడకు వెళ్లారంటే..ఈ జంట ఏకంగా స్విట్జర్లాండ్‌లో జెర్మాట్‌లోని ఆల్ఫైన్ శిఖరాల వద్ద గ్రాండ్‌గా వివాహ వేడుకను జరుపుకుంది. బంధువుల, స్నేహితు ఆశ్వీరాదల నడుమ ఈ జంట వివాహబంధంతో ఒక్కటయ్యింది. గజగజ వణికించే చలిలో చక్కటి వయోలిన్ మ్యూజిక్, ఆ చుట్టూ ఉన్న వాతావరణానికి తగ్గట్లు మిల్కీ వైట్ పెళ్లి దుస్తులతో పైనుంచి భువిపైకి వచ్చిన దేవతాల్లా ఉన్నారు. అక్కడొక పెద్ద మంచు క్యూబ్ సెట్టింగ్‌లో వధువరులిద్దరు చక్కగా కెమరాలకు ఫోజలిలస్తూ నిలబడ్డారు. మంచు శిఖరాలే తమ పెళ్లికి సాక్ష్యంగా.. ఏకంగా రెండు వేలకు పైగా ఎత్తులో ఈ పెళ్లి వేడుక అంగరంగ వైభవంగా జరిగింది. చుట్టూ ఉన్న తెల్లటి మంచుకి తగ్గట్టూ పూల డెకరేషన్ ఓ రేంజ్లో అదరహో అన్నంతగా అద్భుతంగా ఉంది. అందుకు సంబంధించిన ఫోటోలు నెట్టింట వైరల్ అవ్వడంతో నెటిజన్లు ఈ వెడ్డింగ్ అడ్వెంచర్ అదిరిపోయింది బాస్, నిజజీవితంలో ఇలా మంచులో పెళ్లి చేసుకునే జంటను చూస్తానని అనుకోలేదంటూ కామెంట్లు చేస్తూ పోస్టులు పెట్టారు. View this post on Instagram A post shared by LEBANESE WEDDINGS (@lebaneseweddings) (చదవండి: ఆ బండరాయి.. కేవలం వేళ్లపైనే..! ఎలా అనేది నేటికీ మిస్టరీనే!) -
Russia Floods: రష్యాలో భారీ వరదలు
మాస్కో: రష్యాలో వరదలు ముంచెత్తుతున్నాయి. ఉరల్ పర్వతాలు, సైబీరియా ప్రాంతాల్లో మంచు కరిగి నదుల్లోకి చేరడం వల్ల వరదలు పోటెత్తుతున్నాయి. కజకిస్తాన్ సరిహద్దులోని ఒరెన్‌బర్గ్ ప్రాంతం వరదల ధాటికి తీవ్రంగా దెబ్బతిన్నది. ఇక్కడ 10వేల ఇళ్ల దాకా నీటిలో మునిగాయి. పశ్చిమ సైబీరియాలోని కొన్ని ప్రాంతాల్లో అత్యవసర స్థితిని ప్రకటించారు. ఉరల్ నది ప్రమాదకర స్థాయిలలో ప్రవహిస్తోంది. దీంతో నది తీర ప్రాంతాల్లో ఉండే వారిని వేరే ప్రాంతాలకు తరలించారు. ఈ నది ఒరెన్‌బర్గ్ మీదుగా కజకిస్తాన్ వెళుతుంది. సమీపంలోని డ్యామ్ కొట్టుకుపోవడంతో ఒర్స్క్ నగరం పూర్తిగా నీటిమయమైంది. ఇదీ చదవండి.. దైవ కణం ఉందన్న శాస్త్రవేత్త కన్నుమూశాడు -
కాలిఫోర్నియాలో మంచు తుపాను బీభత్సం (ఫొటోలు)
-
ఇదేందయ్యా ఇది..! డెస్టినేషన్ వెడ్డింగ్.. వేరే లెవల్!
ఆకాశమంత పందిరి, భూదేవి అంత పీట. అచ్చం..మురారీ సినిమాలోలాగ, అదీ కాదంటే తమ అభిమాన హీరో హీరోయిన్ల పెళ్లిలా..ఎవరైనా ఇలాంటి పెళ్లి సందడి కోరు కుంటారు. కానీ గుజరాత్‌కు చెందిన జంట మాత్రం వెరైటీ పెళ్లి చేసుకుని వార్తల్లో నిలిచింది. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. అదేంటో చూసేయండి మరి..! అందిరిలా మేమూ చేసుకుంటే ‘కిక్’ ఏంటి అనుకున్నారేమో ఈ జంట మైనస్ 25 డిగ్రీల ఉష్ణోగ్రతలో చలికి గజ గజ వణికిపోతూ మూడు ముళ్ల ముచ్చటను తీర్చుకున్నారు. హిమాచల్ ప్రదేశ్‌లోని మంచుతో కప్పి ఉండే స్పితి లోయలో వివాహం చేసుకున్నారు. ఒక పక్క మంచు పూలవర్షమే అక్షితలుగా చలికి వణికి పోతూ మంచులో ముచ్చటగా పెళ్లి చేసుకున్న దృశ్యాలు వైరల్ అవుతున్నాయి. అంతేకాదు అంతేనా ఈ పెళ్లి ఫోటోషూట్, కెమెరామెన్లు, బంధువులు, పంతుళ్లు ఇలా అందరికీ హ్యాట్సాఫ్ చెప్పాల్సిందే. పెళ్లికి సంబంధించిన వీడియోలను హిమాచల్ ప్రభుత్వ అసిస్టెంట్ పబ్లిక్ రిలేషన్స్ ఆఫీస్ అజయ్ బన్యాల్, గో హిమాచల్ ట్విటర్ ఖాతాలో షేర్ అయ్యాయి. కుండలినీ యోగాతో అల్జీమర్స్‌కు చెక్: తాజా పరిశోధన లవర్ మాట కాదనలేక ఈ పెళ్లికి ఒప్పుకున్నాడట అబ్బాయి. స్పితిలోని మురాంగ్లో జరిగిన అపూర్వ వివాహం జరిగింది. డెస్టినేషన్ వెడ్డింగ్‌కి అనే మాట ఇది వేరే లెవల్ అంటూ నెటిజన్లు కమెంట్ చేశారు. అంతేనా 'ఓవర్‌యాక్టింగ్' అని ఒకరు, "షాదీ అండ్ హనీమూన్ డన్’’ అటూ మరొకరు కమెంట్ చేశారు. మరి ఇంకెందుకు ఆలస్యం మీరూ ఓ లుక్కేసి, మీకే మనిపించిందో కమెండ్ చేయండి. అంతలోనే ఎంత విషాదం : మాజీ మిస్ ఇండియా కన్నుమూత एक विवाह ऐसा भी! गुजरात का प्रेमी जोड़ा, प्रेमिका की जिद्द ने स्पीति पहुंचाया, फिर माईनस 25 डिग्री तापमान में सजाया मंडप, यह अपने आप में पहली तरह का मामला है। स्पीति के मुरंग में आज हुआ अनोखा विवाह। यह है डेस्टिनेशन वेडिंग का example। pic.twitter.com/4lnaRl0c5h — Ajay Banyal (@iAjay_Banyal) February 26, 2024 Gujarat couple gets married at -25 degrees in Himachal Pradesh's Spiti Valley.😍 pic.twitter.com/nGLImoguLh — Go Himachal (@GoHimachal_) February 29, 2024 -
Vizag : పొగమంచు ఎఫెక్ట్.. పలు విమానాలు రద్దు
విశాఖపట్నం: పొగమంచు కారణంగా విశాఖ విమానాశ్రయంలో విమాన రాకపోకలకు తీవ్ర ఆటంకం కలుగుతుంది. విశాఖపట్నం నుంచి వేర్వేరు రాష్ట్రాలు, దేశాలకు వెళ్లాల్సిన ప్రయాణికులు నిర్ణీత సమయానికి విమానాశ్రయానికి చేరుకుంటున్నా.. వాతావరణం అనుకూలించక కొన్ని సర్వీసులు రద్దు అవుతున్నాయి. విమానాశ్రయ పరిసర ప్రాంతాల్లో పొగ మంచు ప్రభావం.. మరో రెండు రోజులు ఉండనున్న దృష్ట్యా మరిన్ని సర్వీసులు రద్దయ్యే అవకాశాలున్నట్లు తెలుస్తుంది. రద్దు అయిన ఫ్లైట్ వివరాలు: 1) 6E6336/5309 VOBL-VOVZ-VOBL 2) 6E626/783 HS-VOVZ- HS 3) 6E5176/2776 DP-VOVZ-DP. ఈరోజు రద్దయిన విమానాల వివరాలు... 1) బెంగళూరు నుంచి..విశాఖపట్నం. విశాఖ టు బెంగళూర్.. 6E6336/5309 VOBL-VOVZ-VOBL 2) హైదరాబాద్. టు. విశాఖపట్నం. విశాఖ టు. హైదరాబాద్.. 6E626/783 HS-VOVZ- HS 3) ఢిల్లీ. టు. విశాఖపట్నం అండ్ ఢిల్లీ.. 6E5176/2776 DP-VOVZ-DP. -
కమ్మేసిన పొగమంచు
వరంగల్: తెలంగాణలోని పలు ప్రాంతాలను పొగమంచు కమ్మేసింది. హైదరాబాద్ శివారు ప్రాంతాల్లో మంచుప్రభావం అత్యధికంగా ఉంది. రహదారులు సరిగా కనిపించక వాహనదారులు ఇబ్బందులు పడుతున్నారు. పొంగమంచు కారణంగా వరంగల్- హైదరాబాద్ జాతీయ రహదారిపై వాహనాలు నెమ్మదిగా కదులుతున్నాయి. సంక్రాంతి సెలవులు ముగించుకొని తిరుగు ప్రయాణం అయిన వాహనదారులకు దట్టమైన పొగమంచు కారణంగా తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. వరంగల్ - హైదరాబాద్ మధ్య జాతీయ రహదారిని కమ్మేసిన పొగమంచు రాకపోకలకు తీవ్ర అంతరాయం ఏర్పడింది. -
China: చైనాను వణికిస్తున్న మంచు తుఫాన్లు
బీజింగ్ : వాయువ్య చైనాను వరుస మంచు తుఫాన్లు బెంబేలెత్తిస్తున్నాయి. డజన్ల కొద్దీ వస్తున్న మంచు తుఫాన్ల ప్రభావంతో ఈ ప్రాంతంలో తీవ్రంగా మంచు కురుస్తోంది. దీంతో ఈ ప్రాంతంలో వారం రోజుల్లో 1000 మంది దాకా మంచులో చిక్కుకుపోయారు. మంచు తుఫాన్ల దాటికి జింజ్యాంగ్ ప్రాంతంలో పలు రోడ్లు బ్లాక్ అవడంతో ఇక్కడున్న పలు గ్రామాల వారికి కనెక్టివిటీ లేకుండా పోయింది. దీంతో ఇక్కడి వారికి ఆహారం, ఇంధనం తదితర నిత్యావసరాలను హెలికాప్టర్లో సరఫరా చేస్తున్నారు. మంచులో చిక్కుకున్న వారిని కూడా హెలికాప్టర్ల సాయంతో తరలిస్తున్నారు. ఈ విషయాలను చైనా అధికారిక టీవీ సీసీటీవీ ప్రసారం చేసింది. చిక్కుకుపోయిన వారిలో కొందరు పర్యాటకులు కూడా ఉన్నారు. మంచు తుఫాన్ల దాటికి వాయువ్య చైనాలో మొత్తం 350 కిలోమీటర్ల దాకా రోడ్లుబ్లాక్ అయ్యాయి. ఇదీచదవండి.. సౌత్ కొరియా ఆక్రమణే లక్ష్యం: కిమ్ -
పొద్దుపొద్దునే ప్రయాణాలొద్దు!
సాక్షి, హైదరాబాద్: ఈ చలికాలంలో పొగ మంచు ముప్పు పొంచి ఉంటోంది. దట్టమైన పొగమంచు ఎదుటి వాహనాలను కానరాకుండా చేసి వాహనదారులను కాటికి పంపుతోంది. గత వారం రోజులుగా రాష్ట్రవ్యాప్తంగా తెల్లవారుజాము సమయంలో పొగ మంచు తీవ్రంగా కురియడంతో రోడ్డు ప్రమాదాల సంఖ్య పెరిగింది. దాంతో వీలైనంత వరకు తెల్లవారుజాము నుంచి ఉదయం 7 గంటల వరకు ప్రయాణాలు వాయిదా వేసుకోవడమే ఉత్తమమని రోడ్డు భద్రత నిపుణులు సూచిస్తున్నారు. అత్యవసరంగా ప్రయాణం చేయాల్సి వస్తే.. తప్పకుండా రోడ్డు భద్రత నియమాలు, జాగ్రత్తలు పాటించాలని స్పష్టం చేస్తున్నారు. పొగ మంచు వల్ల జరిగిన రోడ్డు ప్రమాదాలు ♦ ఈనెల 5న(శుక్రవారం తెల్లవారుజామున 4 గంటల సమయంలో ) రంగారెడ్డి జిల్లా అబ్దుల్లాపూర్ మెట్ మండలం కుద్బుల్లాపూర్ గ్రామానికి చెందిన తండ్రీకొడుకులు కుతాడి కుమార్, ప్రదీప్ బైక్‌పై వస్తుండగా పాపయ్యగూడ చౌరస్తా వద్ద టిప్పర్ లారీ ఢీకొట్టడంతో మృతి చెందారు. పొగమంచు కారణంగా రోడ్డు మసకబారడంతోనే ఈ ప్రమాదం జరిగినట్టు పోలీసులు తెలిపారు. ♦ 25 డిసెంబర్, 2023న నల్లగొండ జిల్లా నిడమనూరు మండలం వేంపాడు వద్ద రాత్రి 10 గంటలకు జరిగిన రోడ్డు ప్రమాదంలో 19 ఏండ్ల యువకుడు రమావత్ శివనాయక్ ద్విచక్రవాహనంతో 55 ఏండ్ల బల్లూరి సైదులు అనే వ్యక్తిని ఢీకొట్టిన ప్రమాదంలో ఇద్దరూ మృతి చెందారు. ఈ సమాచారం తెలుసుకున్న మృతుడు శివ నాయక్ బంధువులు టాటాఏస్ వాహనంలో ప్ర మాద ఘటన స్థలానికి బయలుదేరారు. తెల్లవా రుజామున 3 గంటల సమయంలో వారు ప్ర యాణిస్తున్న టాటాఏస్ వాహనాన్ని ఎదురుగా వస్తున్న ఆయిల్ ట్యాంకర్ నిడమనూరు మండలం 3వ నంబర్ కెనాల్ వద్ద ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో నలుగురు మృతిచెందారు. దట్టమైన పొగమంచు కారణంగానే ఈ వరుస ప్ర మాదాలు జరిగినట్టు పోలీసులు పేర్కొన్నారు. ♦ డిసెంబర్ 31న తెల్లవారుజామున జయశంకర్ భూపాలపల్లి జిల్లా రేగొండ పోలీస్ స్టేషన్ పరిధిలో ఆర్టీసీ బస్సు, డీసీఎం ఎదురెదురుగా వస్తూ ఢీకొన్న ప్రమాదంలో డీసీఎం డ్రైవర్ చనిపోగా, ఆర్టీసీ బస్ డ్రైవర్‌తోపాటు ఆ బస్సులోని మరో 10 మంది ప్రయాణికులు తీవ్రంగా గాయపడ్డారు. పొగమంచుతో రోడ్డు సరిగా కనిపించకపోవడంతోనే ప్రమాదం జరిగినట్టు తెలిపారు. ♦ డిసెంబర్ 25న హైదరాబాద్ నుంచి వికారాబాద్ జిల్లా అనంతగిరి ఔటింగ్‌కు వెళ్లి తిరిగి వస్తున్న మిత్రుల బృందం కారు పొగమంచు కారణంగా రోడ్డు పక్కన ఉన్న శివారెడ్డిపేట్ చెరువులోకి దూ సుకెళ్లింది. కారులో ఉన్న ఒకరు గల్లంతు కాగా, మిగిలిన నలుగురిని స్థానికులు కాపాడారు. ప్రయాణం తప్పనిసరైతే ఇవి మరవొద్దు ♦ పొగమంచు కురుస్తున్నప్పుడు మీకు కేటాయించిన లేన్‌లోనే వాహనం నడపాలి. వీలైనంత వరకు ఓవర్టేక్ చేయకపోవడమే ఉత్తమం. ♦ సింగిల్ రోడ్డులో వాహనం నడపాల్సి వస్తే.. వీలైనంత వరకు మీ వాహనం ఎడమవైపు ఉండేలా చూసుకోవాలి. ♦ డ్రైవింగ్ సమయంలో ఏ సంశయం ఉన్నా..రోడ్డు పూర్తిగా కనిపించకపోయినా మీ వాహనాన్ని రోడ్డు పక్కకు నిలపడమే ఉత్తమం. మీరు వాహనాన్ని పార్క్ చేసినట్టుగా సూచిస్తూ పార్కింగ్ లైట్లు వేయాలి. ♦ పొగమంచు వాతావరణం ఉన్నప్పుడు వాహన వేగాన్ని వీలైనంత వరకు తక్కువగా ఉండేలా చూసుకోవాలి. ఎదుటి వాహనం కనిపించని పరిస్థితుల్లో వేగంగా వెళితే వాహనాన్ని కంట్రోల్ చేయడం కష్టం. అదేవిధంగా ప్రమాద తీవ్రత పెరిగే అవకాశం ఉంటుంది. ♦ పొగమంచు కురుస్తున్నప్పడు డ్రైవర్లు సాధారణంగా హైబీంలో లైట్లు పెడతారు. ఇలా చేయడం వల్ల రిప్లెక్షన్ వల్ల డ్రైవర్‌కు సరిగా కనిపించదు. విజిబిలిటి 100 మీటర్లలోపు ఉన్నట్లయితే హెడ్లైట్లు లోబీంలో ఉంచాలి. మీ వాహనానికి ఫాగ్ ల్యాంప్‌లు ఉంటే వాటిని తప్పక ఆన్ చేయాలి. ఎదుటి వాహనదారుడిని అప్రమత్తం చేసేలా మీ వాహనానికి ఇండికేటర్లు వేసు కుని వెళ్లడం ఉత్తమం. మీ వాహన అద్దాలు వీలైనంత వరకు శుభ్రంగా ఉండేలా చూసుకోవాలి. మీ కారులోని డీఫాగర్‌ను ఆన్ చేసుకోవాలి. ♦ వీలైనంత వరకు ఎదురుగా ఉన్న రోడ్డు స్పష్టంగా కనిపించేలా అవసరం మేరకు డ్రైవింగ్ సీట్‌ను సర్దుబాటు చేసుకోవాలి. ♦ పొగమంచు ఉన్నప్పుడు వాహనం ఒక్క క్షణం అదుపు తప్పి పెను ప్రమాదం జరిగే అవకాశం ఉంటుంది. కాబట్టి డ్రైవింగ్‌పైనే దృష్టి పెట్టాలి. నిద్రమత్తు లేకుండా జాగ్రత్త పడాలి. ♦ వాహనం పూర్తి కండీషన్లో ఉండేలా చూసుకోవాలి. టైర్లు, బ్రేక్‌లు ముందుగానే చెక్ చేసుకోవాలి. మీ కారులోని హీటర్ ఆన్ చేయాలి. దీనివల్ల బయటి పొగమంచుతో అద్దంపై ప్రభావం లేకుండా ఉంటుంది. ♦ లేన్ మారుతున్నప్పుడు, మూల మలుపుల వద్ద తప్పకుండా హారన్ మోగించాలి. ♦ మొబైల్ ఫోన్ వాడడం, రేడియోలో ఎఫ్ఎం వినడం, పాటలు వింటూ డ్రైవింగ్ చేయవద్దు. -
ఒకదాన్ని వెంట ఒకటి ఢీకొన్న వాహనాలు.. పొగమంచుతో ప్రమాదం
బాలానగర్: పొగమంచు కారణంగా ఓ లారీని డీసీఎం, డీసీఎంను కారు.. ఇలా ఐదు వాహనాలు ఒకదాన్ని వెంట ఒకటి ఢీకొన్న ఘటన శుక్రవారం మహబూబ్‌నగర్ జిల్లా బాలానగర్‌లో చోటుచేసుకుంది. ఎస్ఐ శ్రీనివాస్ వివరాల మేరకు.. 44వ నంబర్ జాతీయ రహదారిపై ఉదయం 9:30 గంటల ప్రాంతంలో దట్టమైన పొగమంచు కారణంగా హైదరాబాద్‌వైపు వెళ్తున్న లారీని గమనించని ఓ డీసీఎం డ్రైవర్ ఢీకొట్టి, రోడ్డుపైనే వాహనం నిలిపివేశాడు. ఈ క్రమంలో వెనుకాలే వస్తున్న మరో కారు డీసీఎంను ఢీకొట్టింది. ఇలా మరో మూడు కార్లు ఒకదాన్ని వెంట ఒకటి ఢీకొన్నాయి. ప్రమాదంలో మూడు కార్లు పాక్షికంగా దెబ్బతిన్నాయి. ఈ ఘటనలో ఎవరికి ఎలాంటి గాయాలు కాలేదు. కారు యజమాని బంటుసింగ్ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు జరుపుతున్నట్లు ఎస్ఐ తెలిపారు. -
ఆరుగురి జీవితాలను కమ్మేసిన పొగమంచు
నిడమనూరు: మృత్యువు దారికాచి వెంటపడినట్టు పొగ మంచు ఓ కుటుంబాన్ని రోడ్డు ప్రమాదంలో బలితీసుకుంది. రోడ్డు ప్రమాదంలో మృతిచెందిన యువకుడి వద్దకు వస్తున్న కుటుంబ సభ్యులు కూడా రోడ్డు ప్రమాదం బారినపడ్డారు. పొగ మంచుకు అతివేగం, నిర్లక్ష్యం తోడై ఆరు ప్రాణాలు గాలిలో కలిసిపోయాయి. నల్ల గొండ జిల్లా నిడమనూరు మండలంలో ఆదివారం రాత్రి, సోమవారం తెల్లవారు జామున ఈ ప్రమాదాలు జరిగాయి. బైక్‌పై స్వగ్రామానికి వస్తూ.. ఉమ్మడి నల్లగొండ జిల్లా పెద్దవూర మండలం నిమ్మానాయక్ తండా ఆవాస గ్రామమైన మల్లెవానికుంట తండాకు చెందిన రమావత్ శివనాయక్ (19) ఏపీలోని గుంటూరులో వేడుకల్లో డీజే సిస్టమ్, పూల అలంకరణ పనిచేస్తూ జీవిస్తున్నాడు. ఆదివారం రాత్రి గుంటూరు నుంచి బైక్‌పై స్వగ్రామానికి బయలుదేరాడు. రాత్రి 10 గంటల సమయంలో నిడమనూరు మండలంలోని వేంపాడు స్టేజీ వద్ద రోడ్డు దాటుతున్న బల్గూరి సైదులు (55)ను ఢీకొట్టాడు. ఈ ఘటనలో వేంపాడుకు చెందిన బల్గూరి సైదులు తలకు తీవ్ర గాయాలై అక్కడికక్కడే మృతి చెందగా.. శివనాయక్ తలకు తీవ్ర గాయాలయ్యాయి. అతడిని మిర్యాలగూడ ఏరియా ఆస్పత్రికి తరలించగా.. చికిత్స పొందుతూ మృతిచెందాడు. కుమారుడి వద్దకు వస్తూ.. శివనాయక్ రోడ్డు ప్రమాదానికి గురైన విషయం తెలిసి హైదరాబాద్‌లో ఉంటున్న తండ్రి రమావత్ ప్రభాకర్, బంధువులతో కలసి టాటా ఏస్ వాహనంలో మిర్యాలగూడకు బయలుదేరారు. వాహనంలో శివనాయక్ తండ్రి ప్రభాకర్, మేనమామ మూడావత్ పాలేఖ, రమావత్ వినోద్‌తోపాటు పెదనాన్న రమావత్ గనియా (43), బావ దుమావత్ నాగరాజు(25), మేనత్త రమావత్ బుజ్జి (44), డ్రైవర్ రమావత్ పాండు (42) ఉన్నారు. సోమవారం తెల్లవారుజామున 3 గంటల సమయంలో వారి వాహనం నిడమనూరు మండలంలోని 3వ నంబర్ కెనాల్ సమీపంలో ప్రయాణిస్తోంది. అదే సమయంలో ఏపీలోని జగ్గయ్యపేట నుంచి కర్నాటకలోని మంగళూరుకు వెళ్తున్న డీజిల్ ట్యాంకర్ టాటా ఏస్ వాహనాన్ని ఎదురుగా ఢీకొట్టింది. శివనాయక్ బైక్ ప్రమాదం జరిగిన కిలోమీటరు దూరంలోనే ఈ ప్రమాదం జరగడం గమనార్హం. నలుగురు అక్కడిక్కడే మృతి.. ట్యాంకర్, టాటా ఏస్ ఢీకొన్న ప్రమాదంలో రమావత్ బుజ్జి, రమావత్ పాండు, గనియాలతోపాటు ఏపీలోని దొర్నాలకు చెందిన దుమావత్ నాగరాజు అక్కడిక్కడే మృతి చెందారు. రమావత్ ప్రభాకర్, రమావత్ వినోద్, మూడావత్ పాలేఖకు తీవ్ర గాయాలయ్యాయి. ప్రమాద విషయం తెలిసిన పోలీసులు వెంటనే ఘటనా స్థలికి చేరుకుని క్షతగాత్రులను మిర్యాలగూడ ఏరియా ఆస్పత్రికి, తర్వాత స్థానికంగా ఉన్న వేర్వేరు ప్రైవేట్ ఆస్పత్రులకు తరలించి చికిత్స అందిస్తున్నారు. నలుగురి మృతదేహాలను మిర్యాలగూడ ఏరియా ఆస్పత్రికి తరలించారు. ట్యాంకర్‌ను నడుపుతున్న క్లీనర్.. ఈ రెండు ప్రమాదాలకు పొగ మంచు, అతి వేగంతోపాటు నిర్లక్ష్యంగా నడపడం కూడా కారణమని గుర్తించినట్టు పోలీసులు తెలిపారు. ప్రమాద సమయంలో డీజిల్ ట్యాంకర్‌ను డ్రైవర్ శ్రీను కాకుండా క్లీనర్ జయప్రకాశ్ నడుపుతున్నట్టు తేల్చారు. బైక్ ఘటనలో మృతిచెందిన బల్గూరి సైదులు కుమారుడు బల్గూరి వెంకన్న ఫిర్యాదు మేరకు ఒక కేసు.. ట్యాంకర్, టాటా ఏస్‌ను ఢీకొన్న ప్రమాదంలో మృతుడు గనియా భార్య లక్ష్మి ఫిర్యాదు మేరకు మరో కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్టు ఎస్సై గోపాల్‌రావు తెలిపారు. -
నీలగిరిలో మంచుదుప్పటి.. అలరిస్తున్న వీడియో!
ఢిల్లీతో సహా ఉత్తర భారతంలో విపరీతమైన చలి నెలకొంది. జమ్మూకశ్మీర్‌లోని శ్రీనగర్‌లో ఈరోజు(ఆదివారం) మైనస్ రెండు డిగ్రీల సెల్సియస్ ఉష్ణోగ్రత నమోదైంది. ఇప్పుడు దక్షిణ భారతంలోనూ ఇటువంటి వాతావరణం నెలకొంది. తమిళనాడులోని నీలగిరిలో ఈరోజు ఉదయం(ఆదివారం) ఉష్ణోగ్రత సున్నా డిగ్రీలకు చేరుకుంది. ఈ విధమైన వాతావరణం శాస్త్రవేత్తలను సైతం ఆశ్చర్యానికి గురి చేస్తోంది. వార్తా సంస్థ ఏఎన్ఐ షేర్ చేసిన వీడియోలో నీలగిరిలో భూమిపై మంచు వ్యాపించడాన్ని చూడవచ్చు. కనిష్ట ఉష్ణోగ్రతల కారణంగా జంతువులు కూడా ఇబ్బంది పడుతుండటాన్ని గమనించవచ్చు. అయితే ఇక్కడి వాతావరణాన్ని చూసేందుకు జనం తరలివస్తున్నారు. ఇదిలావుండగా గత కొన్ని రోజులుగా తమిళనాడులో భారీ వర్షాలు కురుస్తున్నాయి. వర్షాల కారణంగా రాష్ట్రంలోని అనేక జిల్లాల్లో వరదలు సంభవిస్తున్నాయి. గత రెండు రోజులుగా దక్షిణాది జిల్లాల్లో అత్యధిక వర్షపాతం నమోదైంది. భారీ వర్షాలు, వరదల కారణంగా 10 మంది ప్రాణాలు కోల్పోయారు. ఇది కూడా చదవండి: ఐదుగురు సీఈఓల అర్ధాంతర రాజీనామా.. 2023లో ఊహించని పరిణామం! #WATCH | Nilgiris, Tamil Nadu: A layer of frost covered the Thalaikundha area of Nilgiris after 0 degrees Celcius temperature was recorded this morning. pic.twitter.com/Z43LzgaGvb — ANI (@ANI) December 24, 2023 -
అలా డ్యాన్స్ చేయాలంటే చాలా కష్టం: శృతిహాసన్
తెలుగు, తమిళ భాషల్లో గుర్తింపు తెచ్చుకున్న స్టార్ నటి శృతిహాసన్. హిందీ, తెలుగు, తమిళ భాషల్లో కథానాయికగా నటిస్తూ అగ్ర కథానాయికగా కొనసాగుతున్నారు. ఇటీవల సోషల్ మీడియాలోనూ ఎప్పుడు యాక్టివ్‌గా ఉంటోంది. ఈ ఏడాదిలో సంక్రాంతికి రిలీజైన మెగాస్టార్ వాల్తేరు వీరయ్య, బాలయ్య వీరసింహారెడ్డిలో నటించిన సంగతి తెలిసింగదే. తాజాగా కోలీవుడ్ భామ శృతిహాసన్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. తాజాగా ఓ ఇంటర్వ్యూకు హాజరైన శృతిహాసన్ వాల్తేరు వీరయ్య సాంగ్‌పై కామెంట్స్ చేశారు. శృతిహాసన్ మాట్లాడుతూ..'మంచులో డ్యాన్స్ చేయడం అంటే చాలా కష్టం. హీరోలు మాత్రం చలిని తట్టుకునేలా జాకెట్స్ వేసుకుంటారు. కానీ మాకు అలాంటివేమీ ఇవ్వరు. కనీసం కోట్, శాలువా కూడా ఇవ్వరు. మేము కేవలం శారీ, జాకెట్ ధరించి ఆ గడ్డ కట్టిన మంచులో డ్యాన్స్ చేయాలి. దయచేసి హీరోయిన్ల విషయంలో ఇలాంటివి ఆపాలని కోరుకుంటున్నా. ఎందుకంటే నాకు ఇటీవలే ఇలాంటి అనుభవం ఎదురైంది' అని చెప్పుకొచ్చారు. కాగా.. చిరంజీవి నటించిన వాల్తేరు వీరయ్య చిత్రంలో ఓ సాంగ్‌ను పూర్తిగా మంచుకొండల్లో చిత్రీకరించారు. -
‘ముంచు’కొస్తున్న సముద్రం
సాక్షి, అమరావతి: సముద్ర నీటిమట్టాలు ఏటా పెరుగుతున్నాయని నాసా తాజాగా ప్రకటించింది. ప్రపంచవ్యాప్తంగా 2021–22లో 0.27 సెం.మీ మేర పెరిగిన సముద్రజలాలు తీరంలో అలజడిని సృష్టించాయని పేర్కొంది. సముద్రజలాలు కొద్దిగా పెరిగినా తీరం వెంబడి ఆవాసాలు ఏర్పరుచుకున్న వారికి ఆందోళన కలిగిస్తుందని వెల్లడించింది. ఉపగ్రహాల ద్వారా సముద్రజలాలపై నాసా చేసిన అధ్యయన నివేదికను ఇటీవల వెల్లడించడంతోపాటు గత 30 సంవత్సరాల సముద్ర మట్టాలను విశ్లేషించింది. 1993 నుంచి ఇప్పటివరకు సముద్ర జలాల మట్టం 9.1 సెం.మీ పెరిగిందని పేర్కొంది. గతేడాదిలో 0.27 సెం.మీ పెరిగిన సముద్ర జలాలు ఇకపై ఏడాదికి సగటున 0.66 సెం.మీ చొప్పున పెరిగి 2050 నాటికి మొత్తం 17.82 సెం.మీకు చేరుతుందని వెల్లడించింది. సముద్రాలపై ‘ఎల్‌నినో’ తీవ్రప్రభావం చూపడం, వాతావరణ మార్పులతో ఇలాంటి పరిస్థితి తలెత్తుతోందని, పెరుగుతున్న గ్రీన్హౌస్ వాయువులు, వాయుకాలుష్యం వంటివాటిని తగ్గించుకోకపోతే తీరప్రాంతాల్లో నివసించే ప్రజలకు కష్టాలు తప్పవని హెచ్చరించింది. సముద్ర నీటిమట్టం పెరుగుదలను పరిశీలించేందుకు అమెరికా–ఫ్రెంచ్ ప్రభుత్వాలు సంయుక్తంగా 1993లో ‘టోపెక్స్ మిషన్’ను చేపట్టాయి. ప్రత్యేక రాడార్లతో సముద్ర ఉపరితలంపైకి మైక్రోవేవ్ తరంగాలని పంపించి కచ్చితమైన సమాచారాన్ని సేకరిస్తున్నారు. వేగంగా కరుగుతున్న అంటార్కిటిక్ మంచు వాతావరణ మార్పులకు, సముద్ర మట్టం పెరుగుదలకు మానవ తప్పిదాలే ప్రధాన కారణమని నాసా విశ్లేషించింది. పరిమితికి మించిన కాలుష్యకారక వాయువుల కారణంగా వాతావరణంలో వేడి పెరిగి మంచు ప్రాంతాలు కరిగిపోయి హిమనీ నదాల్లో నీరు పెరుగుతోందని గుర్తించింది. వేసవి ఉష్ణోగ్రతలకు 2022లో అంటార్కిటిక్ ఖండంలోని మంచు పలకలు సాధారణ సగటు కంటే ఎక్కువగా కరిగిపోయినట్టు పేర్కొంది. దీనికి గ్రీన్‌ల్యాండ్ ఐస్ ప్యాక్ కరిగి అదనపు నీరు తోడవడంతో సముద్ర మట్టాలు వేగంగా పెరిగినట్లు ప్రకటించింది. అర మీటర్ మునిగింది.. గతేడాది పెరిగిన సముద్ర జలాలతో మియామి, న్యూయార్క్, బ్యాంకాక్, షాంఘై, లిమా (పెరూ), కేప్‌టౌన్‌తో పాటు అనేక తీర ప్రాంతాలు అర మీటర్ మేర నీటమునిగినట్టు నాసా శాస్త్రవేత్తలు పేర్కొన్నారు. ఈ పెరుగుదల కష్టాలను కనీసం 800 మిలియన్ల మంది ఎదుర్కొంటారని వాతావరణ శాస్త్రవేత్తలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. అమెరికా దేశస్తుల్లో సగం మందికి పైగా తీరప్రాంతాల్లోనే ఉన్నారు. ప్రధాన సీపోర్టులు, వినోద ప్రాంతాలు, ఇతర సౌకర్యాలు తీరంలోనే ఉన్నాయి. సముద్ర మట్టం పెరిగితే వీటిపై తీవ్రంగా ప్రభావం ఉంటుందని చెబుతున్నారు. ఈ ముంపు ప్రభావం అడవులు, వన్యప్రాణుల పైన కూడా పడుతుందని హెచ్చరిస్తున్నారు. నాసా వెల్లడించిన అంశాలు వాతావరణాన్ని ఏ స్థాయిలో కలుషితం చేస్తున్నామో.. గ్రీన్హౌస్ వాయువులను ఏస్థాయిలో విడుదల చేస్తున్నామో హెచ్చరికగా పేర్కొన్నారు. నాసా లెక్కల ప్రకారం 2050 నాటికి సముద్ర మట్టం 17.82 సెం.మీ పెరిగితే.. 300 నుంచి 500 మీటర్ల మేర తీర ప్రాంతం సముద్ర గర్భంలో కలిసిపోతుందని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. -
అంటార్కిటికా కరిగిపోతోంది!
పర్యావరణ మార్పులు, గ్లోబల్ వార్మింగ్ ప్రమాద ఘంటికలు మోగిస్తున్నాయి. వాటి దెబ్బకు హిమ ఖండమైన అంటార్కిటికాలోనే మంచు రికార్డు స్థాయిలో కరిగిపోతోంది! ఈ పరిణామంపై పర్యావరణ నిపుణులు ఆందోళన చెందుతున్నారు. ఇప్పటికైనా మేల్కొని దిద్దుబాటు చర్యలకు పూనుకోకుంటే పెను విపత్తులను చేజేతులా ఆహ్వనించినట్టే అవుతుందని హెచ్చరిస్తున్నారు! అంటార్కిటికాలో సముద్రపు మంచు పరిమాణం ఫిబ్రవరి 25న ఏకంగా 17.9 లక్షల చదరపు కిలోమీటర్లకు పడిపోయింది. అక్కడి తేలియాడే మంచు పరిమాణాన్ని ఉపగ్రహ పరిశీలనల సాయంతో ఎప్పటికప్పుడు కచ్చితంగా లెక్కించడం మొదలు పెట్టిన గత 40 ఏళ్లలో నమోదైన అత్యల్ప స్థాయి ఇదే! ఇలా అంటార్కిటికాలో మంచు పరిమాణం అత్యల్ప స్థాయిలకు పడిపోవడం గత ఆరేళ్లలోనే ఏకంగా ఇది మూడోసారి కావడం ప్రమాద తీవ్రతకు అద్దం పడుతోంది. 2022లో అది 19.2 లక్షల చదరపు కి.మీ.గా తేలింది. 1979లో ఉపగ్రహ ఆధారిత గణన మొదలైన నాటినుంచీ అదే అత్యల్పం! ఈ రికార్డు గత ఫిబ్రవరిలో బద్దలై మంచు పరిమాణం 17.9 లక్షల చదరపు కి.మీ.గా నమోదైంది. అంటే ఏడాది కాలంలోనే ఏకంగా 1.36 లక్షల చదరపు కి.మీ. మేరకు తగ్గిందన్నమాట! ధ్రువ ప్రాంతాలపై పరిశోధనలు చేస్తున్న శాస్త్రవేత్తలను ఇదిప్పుడు ఎంతగానో కలవరపరుస్తోంది. అంటార్కిటికాలో ఎక్కడ చూసినా మంచు పరిమాణం బాగా తగ్గిపోతోందంటూ ఆ్రస్టేలియాలోని టాస్మేనియా యూనివర్సిటీలో అంటార్కిటికా ఖండపు మంచుపై ఎంతోకాలంగా పరిశోధనలు చేస్తున్న డాక్టర్ విల్ హాబ్స్ ఆందోళన వ్యక్తం చేశారు. ముఖ్యంగా ఖండపు పశ్చిమ భాగంలో గతేడాది మంచు ఊహాతీతంగా కరిగిపోయిందని, ఆ నష్టం నుంచి ఆ ప్రాంతాలింకా తేరుకోనే లేదని చెప్పారాయన. ‘‘నిజానికి సముద్రపు మంచుకు పరావర్తన గుణం చాలా ఎక్కువ. కనుక సూర్యరశ్మి కి పెద్దగా కరగదు. కానీ దాని వెనకాల నీరు చేరితే మాత్రం కిందనుంచి కరుగుతూ వస్తుంది. ఇప్పుడదే జరుగుతోంది’’ అని వివరించారు. – సాక్షి, నేషనల్ డెస్క్ తీరాలన్నీ మునకే! ♦ అంటార్కిటికా మహాసముద్రంలో ఉండే అపార హిమ రాశి తీరానికి కాస్త సమీపంలో ఉండే మంచుపై తుఫాను గాలుల ప్రభావాన్ని బాగా తగ్గిస్తుంది. ఆ హిమ రాశి ప్రస్తుత వేగంతో కరిగిపోతూ ఉంటే అలల తాకిడి వేగం బాగా పెరుగుతుంది. దాంతో సముద్రంలో తీరానికి సమీపంలో ఉన్న మంచూ క్రమంగా బలహీనపడి కరుగుతుంది. తర్వాత ఆ ఖండంలో నేలపై ఉన్న అపారమైన మంచుకు, హిమానీ నదులకు స్థిరత్వమిచ్చే ఈ ఆసరా శాశ్వతంగా కనుమరుగవుతుంది. ♦ పశ్చిమ అంటార్కిటికాలోని అముండ్సెన్, బెలింగ్హసన్ సముద్రాల్లో మంచు ఊహాతీత వేగంతో కరగడం శాస్త్రవేత్తలను మరీ కలవరపెడుతోంది. అంటార్కిటికాలో సగటు మంచు పరిమాణం 2014 దాకా ఎంతో కొంత పెరిగిన సమయంలో కూడా ఈ సముద్రాల్లో మంచు కరుగుతూనే వచ్చింది! ♦ పశ్చిమ అంటార్కిటికాలోనే ఉన్న త్వాయిట్స్ హిమానీ నదం కూడా క్రమంగా కరుగుతోంది. కేవలం ఇదొక్కటి గనక పూర్తిగా కరిగిందంటే సముద్ర మట్టాలు ఏకంగా అర మీటరు పెరుగుతాయి! అందుకే దీన్ని ‘డూమ్స్‌డే గ్లేసియర్’గా పిలుస్తారు! ♦ గత ఫిబ్రవరిలో తొలిసారిగా అంటార్కిటికా ఖండపు తీర రేఖలో ఏకంగా మూడింట రెండు వంతులు ఏ మాత్రం మంచు లేకుండా సముద్రపు జలాలతో బోసిపోయి కనిపించిందట! ♦అంటార్కిటికా సముద్రంలోని అపారమైన మంచు ఇలా కరుగుతున్న కొద్దీ ప్రపంచవ్యాప్తంగా సముద్ర మట్టాలు మీటర్ల మేరకు పెరుగుతాయి! ♦ దాంతో తీర ప్రాంతాలన్నీ ముంపు బారిన పడతాయి. ప్రపంచవ్యాప్తంగా ఉన్న మహా నగరాలెన్నో ఈ జాబితాలోకి వస్తాయి! అది కోట్లాది మందిని నిర్వాసితులను చేసి ఊహించని పెను విషాదానికి దారి తీస్తుంది. మున్ముందు మరింత ముప్పే! సమీప భవిష్యత్తులో అంటార్కిటికాలో మంచు కరిగే వేగం తగ్గే సూచనలేవీ పెద్దగా లేవని సైంటిస్టులు చెబుతున్నారు. ‘‘గ్లోబల్ వార్మింగ్ ప్రభావం అంటార్కిటికాపై కొన్నేళ్లుగా చాలా పడుతోంది. కనుక సముద్రపు మంచు కరిగే వేగానికి ఇప్పుడప్పట్లో అడ్డుకట్ట పడుతుందని భావించడం అత్యాశే’’ అని యూనివర్సిటీ ఆఫ్ న్యూ సౌత్‌వేల్స్‌కు చెందిన ఓషనోగ్రాఫర్, వాతావరణ శాస్త్రవేత్త ప్రొఫెసర్ మాథ్యూ ఇంగ్లండ్ కుండబద్దలు కొట్టారు. అక్కడి మంచు ఈ స్థాయిలో కరగడం కచ్చితంగా పెను ప్రమాద సూచికేనని స్పష్టం చేశారు. శాస్త్రవేత్తలు ఇప్పుడు అంటార్కిటికా సముద్రంలోని మంచు ఈ స్థాయిలో కరిగిపోతుండటం వెనక గ్లోబల్ వారి్మంగ్‌తో పాటు ఇంకేమేం కారణాలున్నాయో వెదికి వాటికి అడ్డుకట్ట వేసే పనిలో పడ్డారు. కోల్‌కతా, చెన్నైలకు ముంపు ముప్పు.. సముద్ర మట్టాల పెంపు వల్ల ముప్పు ముంపున్న మహా నగరాల జాబితాలో కోల్‌కతా, చెన్నై ముందున్నాయి. గ్లోబల్ వార్మింగ్ ఇలాగే పెరుగుతూ ఉంటే 2100 నాటికి ఆ రెండు నగరాల్లో సముద్ర మట్టాలు 20 నుంచి 30 శాతం దాకా పెరిగే ప్రమాదముందని తాజాగా ఓ అధ్యయనంలో తేలింది. ఆసియాలో యాంగూన్, బ్యాంకాక్, హోచిమిన్ సిటీ, మనీలా కూడా ఇదే జాబితాలో ఉన్నాయి. ♦ సముద్ర ప్రవాహాల్లో మార్పుల వల్ల సముద్ర మట్టాల్లో పెరుగుదల ఒక్కో ప్రాంతంలో ఒక్కోలా ఉంటుంది. వీటితో పాటు ఎల్ నినో తదితరాల ప్రభావాలను కూడా అధ్యయనం చేసి న మీదట ఈ నివేదికను రూపొందించారు. విశేషాలు... ♦ సముద్ర మట్టాల్లో పెరుగుదల కేవలం వాతావరణ మార్పులతో పోలిస్తే అంతర్గత వాతావరణ మార్పులూ తోడైనప్పుడు మరో 20, 30 నుంచి ఏకంగా 50 శాతం దాకా ఎక్కువగా ఉంటుంది! ♦ అమెరికా పశ్చిమ తీరంతో పాటు ఆ్రస్టేలియాకు కూడా ఈ ముంపు సమస్య ఎక్కువగా ఉంటుంది. ♦ దీన్ని పరిగణనలోకి తీసుకుంటే కోల్‌కతా, ముంబై తీర ప్రాంతాల్లో వరదలు 2006తో పోలిస్తే 2100 నాటికి కనీసం 18 రెట్ల నుంచి ఏకంగా 96 రెట్ల దాకా పెరిగే ఆస్కారముంది. -
3,500 ఏళ్ల నాటి ఎలుగు కళేబరం...
మాస్కో: దాదాపుగా 3,500 ఏళ్ల నాటి ఎలుగుబంటి కళేబరం ఏమాత్రం చెక్కుచెదరని స్థితిలో దొరికి సైంటిస్టులను సంభ్రమాశ్చర్యాలకు లోను చేసింది. అది పూర్తిగా అతిశీతల వాతావరణంలో మంచులో కూరుకుపోవడమే ఇందుకు కారణం. రష్యాలో మాస్కోకు 4,600 కిలోమీటర్ల దూరంలో న్యూ సైబీరియన్ ఆర్చిపెలాగోలో భాగమైన బొల్షోయ్ ల్యాక్షోవ్స్కీ ద్వీపంలో జింకల వేటగాళ్లు దీన్ని 2020లో గుర్తించారు. ‘‘అది ఆడ ఎలుగుబంటి. గోధుమ రంగుతో, 1.55 మీటర్ల ఎత్తు, దాదాపు 78 కిలోల బరువుంది. చనిపోయేనాటికి బహుశా మూడేళ్ల వయసుంటుంది’’ అని తూర్పు సైబీరియాలోని లజరేవ్ మామూత్ మ్యూజియం లేబొరేటరీ చీఫ్ మాక్సిం చెప్రసోవ్ అంచనా వేశారు. ఆయన సారథ్యంలోని సైంటిస్టుల బృందం దానికి శవపరీక్ష జరిపింది. ‘‘దాని ఒంట్లోని అతి మృదువైన కణజాలం కూడా గులాబి రంగులో ఇప్పటికీ ఏమాత్రం పాడవకుండా ఉండటం నిజంగా అద్భుతం. అలాగే పసుపు రంగులోని కొవ్వు కూడా. అంతేగాక దాని చివరి తిండి తాలూకు పక్షి ఈకలు, మొక్కలు కూడా పొట్టలో అలాగే ఉన్నాయి. అంత పురాతన కాలపు జంతువు తాలూకు కళేబరం ఇంత చక్కని స్థితిలో పరిపూర్ణంగా దొరకడం ఇదే తొలిసారి’’ అని పేర్కొంది. దాని మెదడు, అంతర్గత అవయవాలను కోసి లోతుగా పరిశీలిస్తున్నారు. ముఖ్యంగా కణజాల, సూక్ష్మజీవ, జన్యుపరమైన పరీక్షల్లో తలమునకలుగా ఉన్నారట. -
అద్భుతమైన బైక్.. దీనికి ముందువైపు చక్రం బదులుగా..
మనదేశంలో వీథుల్లోను, రహదారుల్లోను మంచు పేరుకుపోయే సమస్య దాదాపు లేదు గాని, ప్రతిఏటా శీతకాలంలో పాశ్చాత్యదేశాల్లో ఇదొక పెద్ద సమస్య. మంచులో చక్రాలు చిక్కుకుపోయి వాహనాలు ముందుకు సాగవు. మంచుదారిలో కాలినడక మరీ ప్రమాదకరం. రహదారులపై మంచు పేరుకుపోయినా సరే, ఏమాత్రం ఇబ్బందిలేకుండా ప్రయాణించడానికి వీలుగా అమెరికన్ కంపెనీ ‘మూన్‌బైక్స్’ ఇటీవల ఒక అద్భుతమైన బైక్‌ను రూపొందించింది. దీనికి ముందువైపు చక్రం బదులు, మంచును చీల్చుకుపోయే పదునైన పరికరాన్ని అమర్చారు. వెనుకవైపు యుద్ధట్యాంకుల మాదిరిగా చైన్లతో కూడిన రెండు చక్రాలు ఉండటం వల్ల ఎగుడుదిగుడు మంచుదారిలో కూడా ఈ బైక్ మహాజోరుగా సాగిపోగలదు. ఇది పూర్తిగా ఎలక్ట్రిక్ బైక్ కావడం వల్ల దీనివల్ల పర్యావరణానికి కూడా ఎలాంటి ఇబ్బందీ ఉండదు. దీని ధర 8500 డాలర్లు (రూ.6.94 లక్షలు) మాత్రమే! చదవండి: జియో బంపర్ ఆఫర్.. ఈ ప్లాన్‌తో 23 రోజుల వ్యాలిడిటీ, 75జీబీ డేటా.. ఫ్రీ, ఫ్రీ! -
Bomb Cyclone: అమెరికాలో కొనసాగుతున్న మంచు విలయం
బఫెలో: అమెరికాలో మంచు తుఫాను (Bomb Cyclone) విలయం కొనసాగుతూనే ఉంది. ఈ శతాబ్దంలోనే ఎన్నడూ ఎరగనంతటి చలి గాలులు, తుఫాన్లు, మంచు ధాటికి మంగళవారం కూడా దేశమంతా అతలాకుతలమైంది. 4,000 పై చిలుకు దేశీయ, అంతర్జాతీయ విమాన సర్వీసులు రద్దయ్యాయి. అత్యంత ప్రతికూల వాతావరణ పరిస్థితుల వల్ల దేశవ్యాప్తంగా మరణించిన వారి సంఖ్య 60 దాటింది. ఒక్క న్యూయార్క్ రాష్ట్రంలోనే కనీసం 30 మంది దాకా చనిపోయారు. ఇక్కడి బఫెలో కౌంటీలో పరిస్థితి దారుణంగా ఉంది. ఎటు చూసినా కనీసం 50 అంగుళాల మేర మంచు పరుచుకుపోయింది. 1880ల తర్వాత ఈ ప్రాంతం ఈ స్థాయిలో హిమపాతాన్ని చూడటం ఇదే తొలిసారి! నిత్యావసరాల కొరత పలుచోట్ల లూటీలకు కూడా దారితీస్తోంది. అయితే గత ఆరు రోజులతో పోలిస్తే మంగళవారం పరిస్థితి కాస్త మెరుగైందని, పలు ప్రాంతాల్లో చలి తీవ్రత తగ్గుతోందని వాతావరణ శాఖ పేర్కొంది. న్యూయార్క్ రాష్ట్రంలోని ఎల్మ్వుడ్లో మంచుమయమైన రహదారి పొంచి ఉన్న వరద ముప్పు ఉష్ణోగ్రతలు పెరిగితే ఇప్పటిదాకా పేరుకుపోయిన అపారమైన మంచు ఒక్కసారిగా కరిగి ఆకస్మిక వరదలకు దారితీసే ప్రమాదం పొంచి ఉందని వాతావరణ శాఖ హెచ్చరిస్తోంది. ముఖ్యంగా బఫెలో వంటి ప్రాంతాలకు ఈ ముప్పు చాలా ఎక్కువని పేర్కొంది. దాంతో వరద పరిస్థితులను ఎదుర్కొనేందుకు యంత్రాంగాన్ని ఇప్పట్నుంచే సిద్ధం చేస్తున్నారు. -
అమెరికాపై " స్నో బాంబు "
-
Japan Snow Storm: జపాన్‌లో మంచు తుఫాన్ విధ్వంసం..17 మంది మృతి
టోక్యో: జపాన్ వాసులు మంచు తుపాను ధాటికి వారం రోజులుగా వణికిపోతున్నారు. సంబంధిత ప్రమాద ఘటనల్లో 17 మంది చనిపోగా వంద మంది గాయపడ్డారు. వేలాదిగా ఇళ్లకు విద్యుత్ సరఫరా నిలిచిపోయింది. తీవ్రంగా మంచు పేరుకుపోవడంతో రహదారులపై ట్రాఫిక్ ఎక్కడికక్కడే నిలిచిపోయింది. సరుకు రవాణాకు తీవ్ర అంతరాయం ఏర్పడింది. ఈశాన్య జపాన్‌లో ఈ సీజన్లో సాధారణం కంటే మూడు రెట్లు ఎక్కువగా మంచు పడింది. చదవండి: అమెరికాను ముంచేసిన మంచు -
అమెరికాలో మంచు తుఫాను బీభత్సం (ఫొటోలు)
-
విశాఖలో అరుదైన వాతావరణం.. నగరమంతా మసకబారినట్టుగా..
సాక్షి, విశాఖపట్నం: విశాఖలో శుక్రవారం అరుదైన వాతావరణం నెలకొంది. వేకువ జాము నుంచే వర్షం మొదలైంది. తెల్లారేసరికి దానికి పొగమంచు కూడా తోడైంది. ఇలా ఉదయం ఆరంభమైన వాన 10 గంటల వరకు కురిసి ఆ తర్వాత తగ్గుముఖం పట్టింది. కానీ పొగమంచు మాత్రం మధ్యాహ్నం దాటే దాకా కొనసాగింది. దీంతో విశాఖ నగరమంతా మంచు ముసుగు తొడుక్కుని మసకబారినట్టుగా మారిపోయింది. మంచు వర్షం కురిసినట్టు అగుపించింది. దీంతో కాస్త దూరంగా ఉన్న వాహనాలు, వాటి కదలికలు స్పష్టత లేకుండా పోయాయి. వాహనాలు లైట్లు వేసుకుని నెమ్మదిగా వెళ్లాల్సి వచ్చింది. విశాఖ నగరంతో పాటు ఉమ్మడి విశాఖలోని పలు ప్రాంతాల్లో ఇదే పరిస్థితి ఏర్పడింది. ఇటీవల కాలంలో ఇలాంటి వాతావరణ పరిస్థితి కనిపించలేదు. సాధారణంగా ఈ సీజనులో తరచూ మన్యం ప్రాంతంలోనే చిరుజల్లులు, పొగమంచు ఏర్పడుతుంటుంది. కానీ అందుకు భిన్నంగా విశాఖలో మన్యాన్ని తలపించే వాతావరణం అందరిలోనూ ఒకింత ఆశ్చర్యానికి, ఆసక్తికి గురిచేసింది. ఇదీ కారణం..! గాలిలో తేమ ఎక్కువగా ఉండడం, పొడి గాలులు లేకపోవడం వల్ల పొగమంచు ఏర్పడడానికి కారణమని వాతావరణ నిపుణులు చెబుతున్నారు. ఈ పరిస్థితి శనివారం కూడా కొనసాగే అవకాశం ఉందని విశాఖ తుపాను హెచ్చరికల కేంద్రం అధికారి ‘సాక్షి’కి చెప్పారు. రెండు రోజుల్లో కనిష్ట ఉష్ణోగ్రతలు క్షీణిస్తూ చలి తీవ్రత పెరిగే అవకాశం ఉందని తెలిపారు. -
ఆ అద్భుతం వెనకాల కష్టం మామూలుది కాదు!
అదో అరుదైన జీవి. మనిషి కంటపడకుండా తిరగడం దాని నైజం. అలాంటి జీవిని.. అంతే అద్భుతంగా కెమెరాలో బంధించింది ఓ ఫీమేల్ ఫొటోగ్రాఫర్. అదీ ఎముకలు కొరికే చలిలో.. ఎంతో కష్టపడి మరీ!. అమెరికాకు చెందిన ఫొటోగ్రాఫర్ కిట్టియా పాలోస్కి.. మంచు పర్వత శిఖరాన ఠీవిగా కూర్చున్న మంచు చిరుతను కెమెరాలో బంధించింది. నేపాల్ ఖుంబు గ్లేసియర్‌లో ఫాంటోమ్ అల్లేగా పిలువబడే చోట ఆమెకు ఈ దృశ్యం తారసపడింది. కాలినడకన దాదాపు.. 165 కిలోమీటర్ల దూరం ప్రయాణించి ఆమె ఈ అద్భుతాన్ని బంధించారట!. View this post on Instagram A post shared by Kittiya Pawlowski (@girlcreature) ఈ ఫొటో మాత్రమే కాదు.. ఎవరెస్ట్ పర్వతం, పుమోరి పర్వతాల నీడన మంచు చిరుత పయనిస్తున్న ఫొటోలను ఎంతో సుందరంగా తీశారు పాలోస్కి. ఎప్పుడైతే అవి సోషల్ మీడియాలో పోస్ట్ అయ్యాయో.. అప్పటి నుంచి అవి వైరల్ కావడం ప్రారంభించింది. యానిమల్ప్లానెట్తో పాటు కొన్ని ప్రభుత్వ సంస్థలు సైతం ఆమె ఫొటోల్ని వాడేస్తున్నాయి. పాంథెరా జాతికి చెందిన మంచు చిరుతకు.. ఘోస్ట్ ఆఫ్ మౌంటెయిన్స్గా పేరుంది. సిగ్గుపడే స్వభావం కారణంగా అది మనుషుల కంట పడదు.. పడినా దాడి చేసిన సందర్భాలు లేవు!. అయితే వేట, అక్రమ రవాణా కారణంగా వీటి జనాభా బాగా తగ్గిపోతూ వస్తోంది. 2040 నాటికి ఇవి అంతరించుకునే పరిస్థితికి చేరుకుంటాయనే ఆందోళన నెలకొంది. ఇదీ చదవండి: ఫ్రస్ట్రేషన్ పీక్స్‌కి వెళ్తే ఇలాగే ఉంటది! వీడియో వైరల్ -
‘లైట్’ తీస్కోవద్దు.. హెడ్ లైట్లు, వెనక లైట్లు వేసుకోని వెళ్లండి
సాక్షి, హైదరాబాద్: రోడ్డు ప్రమాదాలు బెంబేలెత్తిస్తున్నాయి. నిత్యం ఎక్కడో ఒకచోట రహదారులు రక్తమోడుతున్నాయి. నగర శివారు ప్రాంతాల్లో, ప్రత్యేకంగా హైవేలపై ఇటీవల జరిగిన ప్రమాదాల్లో కనీసం పలువురు మృత్యువాతపడ్డారు. మరికొందరు గాయాలపాలయ్యారు. ఉదయం పూట మంచు కురిసే వేళలో సరైన జాగ్రత్తలు పాటించకుండా వాహనాలు నడపడంతోనే తెల్లవారుజామున ఎక్కువ ప్రమాదాలు చోటుచేసుకుంటున్నట్లు రహదారి భద్రతా నిపుణులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. సంగారెడ్డి సమీపంలో ఓ ఆర్టీసీ బస్సు కారును ఢీకొన్న ఉదంతంలోనూ పొగమంచే ప్రధాన కారణమని రవాణాశాఖ అధికారులు అంచనా వేస్తున్నారు. అప్పుడే చలికాలం మొదలైంది. మరో రెండు మూడు నెలల పాటు చలి తీవ్రంగా ఉండే అవకాశం ఉంది. దీంతో పాటే దట్టమైన పొగ మంచు కూడా కమ్ముకొనే అవకాశం ఉంది. ఈ క్రమంలో హైవేలపై వాహనాలను నడిపేటప్పుడు రోడ్డు భద్రతా నిబంధనలను పాటించాలని నిపుణులు సూచిస్తున్నారు. లైట్ ఆర్పితే అంతే సంగతులు.. ►దట్టమైన పొగమంచు కమ్ముకొని ఉన్న సమయంలో వాహనాలను నడిపేటప్పుడు కచ్చితంగా హెడ్లైట్లు వెలుగుతూనే ఉండాలి. ఏ మాత్రం నిర్లక్ష్యంగా వ్యవహరించినా ఎదురుగా వచ్చే వాహనాలు ఢీకొనే ప్రమాదం ఉంది. ►ప్రధాన రహదారులపై డివైడర్ల వల్ల ఎదురెదురు వాహనాలు ఢీకొనే అవకాశం తక్కువగానే ఉండొచ్చు. కానీ సరైన వెలుతురు లేకపోవడం వల్ల డివైడర్లే మృత్యు ఘంటికలు మోగించే ప్రమాదం ఉంది. పొగమంచు కమ్ముకొని ఉన్నప్పుడు లైట్లు ఆర్పినా, కాంతి తక్కువగా ఉన్నా డివైడర్లను గుర్తించడం కష్టమవుతోంది. ►సాధారణంగా హైవేలపై కార్లు, ఇతర వాహనాలు గంటకు 80 కిలోమీటర్ల వేగంతో వెళ్లేందుకు అనుమతి ఉంటుంది. తెల్లవారుజామున 4 నుంచి ఉదయం 8 గంటల వరకు 50 నుంచి 60 కి.మీ వేగం మించకుండా వాహనాలను నడపాలని ఆర్టీఏ అధికారులు సూచిస్తున్నారు. వెనక లైట్లూ వెలగాలి.. ►రోడ్డు పక్కన బండి నిలిపి ఉంచినప్పుడు హెడ్ లైట్లతో పాటు, వెనుక లైట్లు కూడా వెలుగుతూ ఉండాలి. దీనివల్ల ఇతర వాహనాల రాకపోకలకు ఎలాంటి ఇబ్బంది ఉండదు. నిలిపి ఉంచిన వాహనం ఉనికిని ఈజీగా గుర్తించేందుకు అవకాశం లభిస్తుంది. దీంతో ప్రమాదాలను నివారించవచ్చు. ►వాహనం చుట్టూ రేడియం టేప్ తప్పనిసరి. దీనివల్ల మంచు కురిసే సమయంలోనూ వాహనం ఉనికి తెలుస్తుంది. చాలా వరకు వాహనదారులు ఈ చిన్న నిబంధనను పాటించకపోవడంతోనూ ప్రమాదాలు చోటుచేసుకుంటున్నాయని రవాణా శాఖ డిప్యూటీ ట్రాన్స్‌పోర్టు కమిషనర్ డాక్టర్ పుప్పాల శ్రీనివాస్ ఆందోళన వ్యక్తం చేశారు. ఆ సమయాలు శ్రేయస్కరం.. చలికాలంలో పొగమంచు కారణంగా రహదారులపై ప్రయాణం ఇబ్బందికరంగా మారింది. మంచు కారణంగా ఎదుటి వాహనాలు కనిపించక వాహనాలు ఢీకొట్టుకోవటం, రోడ్డు సరిగా కనిపించక వాహనాలు దారితప్పడం వంటివి జరుగుతున్నాయి. ఈ నేపథ్యంలో సైబరాబాద్ ట్రాఫిక్ డీసీపీ శ్రీనివాస రావు వాహనదారులకు పలు సూచనలు చేశారు. రాత్రి 10.30 లోపు, ఉదయం 6 గంటల తర్వాత మాత్రమే ప్రయాణించాలన్నారు. రెండేళ్ల కాలంలో 50 మంది మృత్యువాత.. గత రెండేళ్లలో శీతాకాలంలో రోడ్డు ప్రమాదాల డేటాను ఆయన విశ్లేషించారు. నవంబర్, డిసెంబర్, జనవరి నెలల్లో సుమారు 50 మంది ప్రాణాలు కోల్పోయారని తెలిపారు. ఔటర్ రింగ్ రోడ్డు, జాతీయ రహదారుల వెంబడి కుటుంబ సబ్యులతో వాహనాల్లో ప్రయాణించడం ఇబ్బందికర విషయమన్నారు. తప్పనిసరి పరిస్థితులలో ప్రయాణం చేయాల్సి వస్తే.. సొంత డ్రైవింగ్ కాకుండా నైపుణ్యం ఉన్న డ్రైవర్‌ను వెంట తీసుకెళ్లడం ఉత్తమం. అది కూడా డ్రైవర్‌కు తగినంత విశ్రాంతి ఇచ్చిన తర్వాతే ప్రయాణం మొదలుపెట్టాలని సూచించారు. ‘బే’లలోనే పార్కింగ్.. ట్రక్లు, ఇతరత్రా పెద్ద వాహనదారులు శీతాకాలంలో ఓఆర్ఆర్, హైవేలపై ఎక్కడ పడితే అక్కడ వాహనాలను నిలుపకూడదు. రాత్రి సమయంలో విశ్రాంతి కోసం తప్పనిసరి పరిస్థితులలో వాహనాలను నిలపాల్సి వస్తే... రోడ్డు నుంచి పూర్తిగా ఎడమ వైపు తీసుకొని వాహనాలను పార్కింగ్ చేయాలి. ఓఆర్ఆర్, హైవేలపై కేటాయించిన పార్కింగ్ బే, లైన్లలోనే ఆయా వాహనాలను నిలిపివేయాలి. లేకపోతే పొంగమంచుతో ప్రయాణిస్తున్న చిన్న వాహనాలు పార్కింగ్ చేసి ఉన్న వాహనాలను ఢీకొట్టే ప్రమాదం ఉంది. నిద్ర మత్తు వీడాలి.. ► తెల్లవారుజామున జరిగే ప్రమాదాల్లో డ్రైవర్లు నిద్ర మత్తులో ఉండడం కూడా మరో కారణం. సాధ్యమైంత వరకు ఉదయం 4 గంటల నుంచి 6 గంటల వరకు వానాలను నడపకపోవడమే మంచిది. ఒకవేళ తప్పనిసరిగా వెళ్లాల్సి వస్తే డ్రైవర్ పూర్తిగా ఆరోగ్యంగా ఎలాంటి నిద్రమత్తు లేకుండా ఉండాలి. ► రెప్పపాటు క్షణంలోనే ప్రమాదాలు జరుగుతాయి. ఒకవైపు మంచు కురుస్తుండగా, మరోవైపు నిద్రమత్తుతో బండి నడిపితే రోడ్డు ప్రమాదాలకు మరింత ఊతమిచ్చినట్లవుతుందని డాక్టర్ పుప్పాల శ్రీనివాస్ హెచ్చరించారు. -
ఉత్తరాఖండ్ లో భారీ మంచు తుఫాన్
-
మంచుతెరలు.. సూర్యోదయం అందాలు అదుర్స్.. ఎక్కడంటే!
సాక్షి, అరకు(అల్లూరి సీతారామరాజు జిల్లా): ప్రముఖ పర్యాటక కేంద్రం అరకు – అనంతగిరి ఘాట్‌మార్గంలో గాలికొండ వ్యూపాయింట్ వద్ద ప్రకృతి అందాలు మంత్ర ముగ్ధులను చేస్తున్నాయి. గురువారం ఉదయం తరలివచ్చిన పర్యాటకుల సెల్ఫోన్ల వీటిని బంధించారు. మలుపుల వద్ద మంచు అందాలను తిలకించి పులకించిపోయారు. వంజంగి హిల్స్‌లో మంచుతెరలు పాడేరు : మేఘాలు, మంచు అందాల నిలయంగా విశ్వవ్యాప్తి పొందిన పాడేరు మండలం వంజంగి హిల్స్‌లో గురువారం ప్రకృతి కనువిందు చేసింది. అనేక ప్రాంతాలకు చెందిన పర్యాటకులు బుధవారం రాత్రే వంజంగి హిల్స్‌కు చేరుకుని కల్లాలబయలు, బోనంగమ్మ పర్వతంపై గుడారాలు వేసుకుని బస చేసారు. తెల్లవారుజాము 4.30 గంటల సమయంలో సూర్యోదయం అందాలు పర్యాటకులను అబ్బురపరిచాయి. కొండల నిండా మంచు నెలకొనడంతో ఇక్కడ ప్రకృతి రమ్యతను చూసి పర్యాటకులంతా మంత్రముగ్ధులయ్యారు. ఉదయం పది గంటల వరకు మంచుతెరలు ఆకట్టుకున్నాయి. (క్లిక్: అందమైన పెళ్లికి ఆదివాసీలే పేరంటాలు) -
కెమెరాకు చిక్కిన మంచు చిరుత.. ఎక్కడంటే!
మంచు చిరుత.. వీటి ఫొటోలు అంత ఈజీగా దొరకవు. ఎందుకంటే.. అవి పరిసరాల్లో కలిసిపోయి ఉంటాయి.. వీటిని క్లిక్‌మనిపించడానికి ఫొటోగ్రాఫర్లు నెలలతరబడి వేచి చూసిన సందర్భాలు అనేకం.. ఇక్కడ కూడా వన్యప్రాణి ఫొటోగ్రాఫర్ సషా ఫొన్సెకా అలాగే ఎదురుచూశారు. ఫలితం.. ఇదిగో.. తన ఫొటోను క్లిక్‌మనిపిస్తున్న కెమెరా వైపు కోపంగా లుక్కులిస్తు మరీ చిక్కింది ఈ స్నో లెపర్డ్. దీన్ని లడఖ్ పర్వత ప్రాంతంలో తీశారు. ఇంటర్నెట్లో షేర్ చేయగానే.. జనమంతా ఎగబడి చూశారు. దీంతో మంచు చిరుత ఫొటోలు సామాజిక మాధ్యమాల్లో వైరల్‌గా మారాయి. ( విమానంలోంచి గుట్టలు గుట్టలుగా చేపలు.. వీడియో వైరల్) View this post on Instagram A post shared by Sascha Fonseca (@sascha.fonseca) -
ఇదే తొలిసారి.. అంటార్కిటిక్ మహాసముద్రంలో ప్లాస్టిక్ కాలుష్యం
ప్లాస్టిక్.. ప్టాస్టిక్.. భూగోళాన్ని వణికిస్తున్న భూతం. మనిషి ఉనికి ఉన్న ప్రతి చోటా ప్లాస్టిక్ ఆనవాళ్లు విధిగా కనిపిస్తున్నాయి. నీటితోపాటు గాలిలోనూ కంటికి కనిపించని ప్లాస్టిక్ రేణువులు తిష్ట వేశాయి. దీనివల్ల పర్యావరణానికి, తద్వారా మానవాళి మనుగడకు పెను ముప్పు పెరుగుతోందని శాస్త్రవేత్తలు హెచ్చరిస్తున్నా పరిస్థితిలో మార్పు రావడం లేదు. ప్రపంచమంతటా ప్లాస్టిక్ వాడకం నానాటికీ భారీగా పెరుగుతోంది. ఈ నేపథ్యంలో ఆంటార్కిటిక్ మహాసముద్రంలో కొత్తగా కురిసిన మంచులో కూడా సూక్ష్మ ప్లాస్టిక్ రేణువులు బయటపడటంఆందోళన కలిగిస్తోంది. అక్కడి మంచులో, ఉపరితల జలంలో ప్లాస్టిక్‌ను గతంలోనే గుర్తించినా కొత్తగా కురిసిన మంచులోనూ ఆ రేణువులు బయట పడటం ఇదే తొలిసారని పరిశోధకులు చెప్పారు. దీనివల్ల మంచు కరిగే వేగం బాగా పెరుగుతుందని చెబుతున్నారు. ఫలితంగా సముద్ర తీర ప్రాంతాలు నీట మునిగి అక్కడి జనం నిరాశ్రయులవుతారు. తీర నగరాలకు ముంపు ప్రమాదం మరింత పెరుగుతుంది. మారుమూలల్లో ప్లాస్టిక్ కాలుష్యం న్యూజిలాండ్‌లోని యూనివర్సిటీ ఆఫ్ కాంటర్బరీకి చెందిన పీహెచ్డీ విద్యార్థిని అలెక్స్ అవెస్ ఈ పరిశోధన చేపట్టారు. 2019లో అంటార్కిటిక్‌లోని రాస్ ఐస్ షెల్ఫ్ నుంచి మంచు నమూనాలు సేకరించారు. వాటిని కెమికల్ అనాలిసిస్ టెక్నిక్‌తో అధ్యయనం చేయగా సూక్ష్మ ప్లాస్టిక్ రేణువులు కనిపించాయి. 19 నమూనాలను సేకరించగా ప్రతిదాంట్లోనూ ప్లాస్టిక్ ఆనవాళ్లున్నాయి. ఇది చాలా బాధాకరమైన విషయమని అవెస్ అన్నారు. మానవ సంచారం లేని అత్యంత మారుమూల ప్రాంతంగా భావించే రాస్ ఐస్ షెల్ఫ్లోనూ ప్లాస్టిక్ కోరలు చాస్తుండటం ఆందోళనకరమన్నారు. సముద్రంలో 13 రకాలు కరిగిన ప్రతి లీటర్ మంచులో సగటున 29 మైక్రోప్లాస్టిక్ రేణువులున్నట్లు తేలింది! ఇటాలియన్ హిమానీ నదాల్లో కంటే అంటార్కిటిక్‌లోని రాస్ ఐలాండ్, స్కాట్ బేస్‌ల్లో ప్లాస్టిక 3 రెట్లు ఎక్కువగా ఉన్నట్లు గుర్తించారు. అంటార్కిటిక్‌లో 13 రకాల ప్లాస్టిక్లున్నాయి. కూల్‌డ్రింక్ సీసాలు, వస్త్రాల తయారీకి వాడే పీఈటీ రకం ప్లాస్టిక్ ఎక్కువగా కన్పించింది. ఈ సూక్ష్మ ప్లాస్టిక్ వ్యాప్తికి ప్రధాన వాహకం గాలే. ప్లాస్టిక్ రేణువులు గాలి ద్వారా వేల కిలోమీటర్లు సులువుగా ప్రయాణిస్తాయి. అయితే పర్యాటకుల ద్వారానే ప్లాస్టిక్ అంటార్కిటిక్ దాకా చేరి ఉంటుందని పరిశోధకుల అంచనా. ప్లాస్టిక్‌తో భారీ నష్టం 85 లక్షల చదరపు కిలోమీటర్లలో విస్తరించిన అంటార్కిటిక్ మహాసముద్ర పర్యావరణ వ్యవస్థ ప్లాస్టిక్ వల్ల బాగా దెబ్బతింటోంది. సముద్ర జీవులు ఆహార పదార్థాలుగా భ్రమించి విషపూరిత ప్లాస్టిక్‌ను తిని మృత్యువాత పడుతున్నాయి. రొయ్యల జాతికి చెందిన క్రిల్ అనే జీవులకు ఈ ముప్పు అధికంగా ఉన్నట్లు గమనించారు. సౌందర్య ఉత్పత్తుల వల్ల గత పదేళ్లలో భారీ పరిమాణంలో మైక్రోప్లాస్టిక్, టూరిజం వల్ల 25.5 బిలియన్ సింథటిక్ ఫైబర్లు అంటార్కిటక్ సముద్రంలో చేరుతున్నట్టు లెక్కగట్టారు. వాస్తవానికి ఈ పరిమాణం ఎన్నోరెట్లు ఎక్కువగా ఉంటుందంటున్నారు. చేపల వేట తదితరాల వల్ల కూడా సముద్రంలోకి ప్లాస్టిక్ వచ్చి చేరుతోంది. సముద్ర ఉపరితలంలోనే గాక అన్ని పొరల్లోనూ మైక్రో ప్లాస్టిక్ విస్తరించింది. ఉపరితలం నుంచి 6 నుంచి 11 మీటర్ల లోతులో ప్రతి చదరపు మీటర్‌కు 766 మైక్రోప్లాస్టిక్ రేణువులు కనిపించాయి! అంటార్కిటిక్, పరిసరాల్లో ప్లాస్టిక్ బెడద, పర్యావరణంపై దాని ప్రభావంపై పూర్తిస్థాయి అధ్యయనం తక్షణావసరమని బ్రిటిష్ యూనివర్సిటీ ఆఫ్ హల్ మెరైన్ బయాలజిస్టు డాక్టర్ కేథరిన్ వాలర్ అంటున్నారు. -
కొంపముంచిన మంచు తుపాన్.. ఏకంగా 50 కార్లు ఒకదానిపై మరొకటి.. వీడియో వైరల్
వాషింగ్టన్: అమెరికాలోని పెన్సిల్వేనియా హైవేపై సోమవారం భారీగా మంచు ఏర్పడింది. దీంతో ఆ హైవేపై వాహనాల రాకపోకలకు ఇబ్బందిగా మారింది. ఈ క్రమంలో మంచు కారణంగా పెద్ద సంఖ్యలో వాహనాలు ఢీకొట్టుకున్నాయి. వివరాల ప్రకారం.. హారిస్బర్గ్కు ఈశాన్యంగా 50 మైళ్ల దూరంలో ఉన్న షుయ్కిల్ కౌంటీలోని ఇంటర్‌స్టేట్ 81లో ఉదయం 10:36 గంటలకు ఈ ఘటన చోటు చేసుకుంది. జీరో విజిబిలిటీతో 50 నుంచి 60 వాహనాలు పరస్పరం ఢీకొట్టుకున్నట్టు అధికారులు వెల్లడించారు. ఈ ప్రమాదంలో ముగ్గురు మృతి చెందడంతో పాటు 12 మందికి పైగా గాయపడ్డారు. ఘటనలో గాయపడిన వారిని చికిత్స నిమిత్తం ఘటన సమీపంలో నాలుగు ఆసుపత్రులకు తరలించినట్లు పెన్సిల్వేనియా స్టేట్ పోలీసులు తెలిపారు. ఈ వాహనాల్లో కార్లతోపాటు ట్రక్కులు, ట్రాక్టర్ ట్రాలీలు ఉన్నాయి. హైవేపై ఉన్న మంచును తొలగించేందుకు స్థానిక అధికారులు తీవ్రంగా శ్రమిస్తున్నారు. ఇక్కడ శీతాకాలం మొదలుకాగానే వాతావరణం మంచుతో కప్పేస్తుండడంతో వాహనదారులకు రోడ్డు సరిగా కనిపించక ఇలాంటి ప్రమాదాలు చోటు చేసుకుంటుంటాయి. ఈ తరహా ఘటన జరగడం ఒకే నెలలో ఇది రెండోసారి అని పోలీసులు పేర్కొన్నారు. ఈ ప్రమాద ఘటనకు సంబంధించిన వీడియో సోషల్‌మీడియాలో వైరల్ అవుతోంది. -
ఆ ప్రాంతాన్ని నల్లటి మంచు కమ్మేస్తోంది.. భయాందోళనలో స్థానికులు
ప్రకృతికి సంబంధించిన ప్రతీది అందంగానూ, మనల్ని సంతోషపెట్టేలాగా ఉంటాయి. అయితే కొందరు స్వలాభం కోసం చేసే కొన్ని పనుల వల్ల ప్రకృతి ప్రకోపాన్ని గురికావాల్సి ఉంటుంది. ఇప్పటికే ప్రకృతి వైపరీత్యాలు పేరిట ప్రతి ఏటా మనం నష్టపోతూనే ఉన్నాం. కొందరు అంటుంటారు.. ప్రకృతితో ఆడుకుంటే అది మనతో ఆడుకుంటుందని. అలాంటి ఘటనే తాజాగా రష్యాలో వెలుగు చూసింది. సైబీరియాలోని మగడాన్ ప్రాంతంలోని ఓంసుచన్‌లో ప్రకృతి కన్నేర్రకు నిదర్శనగా ఆ ప్రాంతమంతా నల్లటి దుప్పటి కప్పినట్లు మంచు కప్పేసింది. అదేంటి మంచు కురవడం సాధారణమే కదా అనిపిస్తుంది. కానీ అక్కడ కురిసే మంచు తెల్లగా కాకుండా నల్లగా కురుస్తూ ఆ ప్రాంత ప్రజలని భయపెడుతోంది. అయినా మంచు నల్లరంగులో కురవడం ఏంటి అనుకుంటున్నారా..? ప్రకృతి ప్రకోపం.. నల్లటి మంచు అసలు విషయమేంటంటే.. బొగ్గుతో పనిచేసే వేడి నీటి ప్లాంట్ ఓంసుచన్ ప్రాంతంలో ఉంది. ఈ ప్లాంట్ సహాయంతో ఆ ప్రాంతంలోని నాలుగు వేల మందికి అవసరమైన వేడిని అందిస్తున్నారు. బొగ్గ ఆధారిత ప్లాంట్ అంటే ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. దీని నుంచి వెలువడే దుమ్ము, మసి వాతావారణంలో కలిసి కాలుష్యంగా మారింది. దీంతో ఆకాశం నుంచి పడుతున్న మంచు భూమిపై పడకముందే నల్లగా కాలుష్యంతో నిండిపోయిన ఆ ఆవరణంలోకి రాగానే.. అది కూడా నల్లగా మారి కురుస్తుంది. బూడిద, నల్లటి మంచుతో కప్పబడిన వీధుల్లోతమ పిల్లలు ఆటలాడుకోవల్సి వస్తుందని అక్కడి స్థానికులు వాపోతున్నారు. ప్రస్తుతం ఈ నల్లటి మంచుకు సంబంధించిన ఫోటోలు, వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. #Russia is a country of outstanding natural beauty and diversity. But the sheer lack of environmental regulations is a devastating effect for residents in #Kuzbass, where last night there was BLACK SNOW. pic.twitter.com/zMiEWBJbnh — Mikhail Khodorkovsky (English) (@mbk_center) February 14, 2019 -
గ్రీస్ ను కప్పేసిన మంచు దుప్పటి
-
మంచుపూల స్నోయగం
శ్రీకాకుళం జిల్లా కొత్తూరు ఆర్సీఎం చర్చి ఆవరణలో ఓ మొక్క ధవళవర్ణంలో కనువిందు చేస్తోంది. స్నో ట్రీగా పిలిచే ఈ మొక్కను పాండిచ్చేరి నుంచి తీసుకొచ్చారు. ఏడాదిలో పది నెలలు పచ్చగా కనిపించే ఈ మొక్క ఆకులు డిసెంబర్, జనవరిలో మాత్రం తెలుపు రంగులోకి మారిపోతాయి. మంచు ముద్దలా ఆకర్షణీయంగా కనిపిస్తున్న ఈ మొక్కను చూడటానికి స్థానికులు ఆసక్తి చూపుతున్నారు. – కొత్తూరు -
Snow Park: రాష్ట్రంలో ఇదే తొలిసారి.. విశాఖలో ‘స్నోపార్క్’ ఏర్పాటుకు సన్నాహాలు
సాక్షి ప్రతినిధి, విశాఖపట్నం: మంచు కురిసే వేళలో... మల్లె విరిసేదెందుకో అని హమ్ చేస్తూ మంచులో ఆటలాడాలనుకుంటున్నారా? ఏదైనా మంచు పర్వతాన్ని ఎక్కాలనుకుంటున్నారా? అయితే, మీరు ఎక్కడికో వెళ్లాల్సిన అవసరం లేదు. మన విశాఖలోనే మంచులో పాటలతో పాటు ఆటలూ ఆడుకునేందుకు సిద్ధం కండి. నగరంలో స్నో పార్కును ఏర్పాటు చేయాలని ప్రభుత్వం ప్రాథమికంగా నిర్ణయించింది. గ్రేటర్ విశాఖపట్నం స్మార్ట్ సిటీ కార్పొరేషన్ (జీవీఎస్సీసీఎల్) ఆధ్వర్యంలో రెండు ఎకరాల్లో రూ. 20 కోట్ల అంచనా వ్యయంతో ఈ పార్కును ఏర్పాటు చేయనున్నారు. ఇందుకోసం అనువైన స్థలం కోసం స్మార్ట్ సిటీ కార్పొరేషన్ అధికారులు అన్వేషిస్తున్నారు. ఈ స్నో పార్కులో మంచులో బాస్కెట్‌బాల్ ఆడేందుకూ ఏర్పాట్లు చేయాలని నిర్ణయించారు. అంతేకాకుండా మంచు హోటల్‌ను కూడా ఈ పార్కులో నిర్మించనున్నారు. మంచు పర్వతారోహణ ఏర్పాట్లు చేయడం ద్వారా.. ఇక్కడకు వచ్చేవారు పూర్తిస్థాయిలో మంచును ఎంజాయ్ చేసే విధంగా దీనిని రూపుదిద్దాలనేది యోచన. ఈ పార్కు ఏర్పాటు కోసం అనువైన స్థలం లభించిన వెంటనే పనులు మొదలు పెట్టనున్నట్టు తెలుస్తోంది. ఈ పార్కు ఏర్పాటు కోసం పూర్తిస్థాయి ప్రాజెక్టు నివేదిక (డీపీఆర్)ను తయారుచేసే పనిలో స్మార్ట్ సిటీ కార్పొరేషన్ అధికారులు పడ్డారు. మంచు పర్వతారోహణ కూడా.. స్నో పార్కు అంటే కేవలం పూర్తిస్తాయిలో మంచు కప్పబడి ఉన్న ప్రదేశంగా కాకుండా అన్ని విధాలా ఆకర్షణీయంగా దీనిని తీర్చిదిద్దాలనేది ప్రభుత్వ ఆలోచనగా ఉంది. పైనుంచి సన్నటి మంచు పడటంతో పాటు అక్కడే ఒక హోటల్‌ను కూడా ఏర్పాటు చేస్తారు. ఒక బాస్కెట్ బాల్ గ్రౌండ్‌ను కూడా ఏర్పాటు చేయనున్నట్టు తెలుస్తోంది. అదేవిధంగా చిన్నపాటి మంచు పర్వతాలను కూడా ఈ పార్కులో ఏర్పాటు చేయనున్నారు. మంచు పర్వతారోహణ (స్నో మౌంటెయిన్ క్లైంబింగ్) అనుభవాన్ని కూడా ఇక్కడకు వచ్చే వారికి లభించే విధంగా అభివృద్ధి చేయనున్నట్టు తెలుస్తోంది. అదేవిధంగా వివిధ టీవీ, ఫిల్మ్ షూటింగ్‌ల కోసం అనువైన ప్రదేశంగా కూడా దీనిని అభివృద్ధి చేయాలనేది ప్రభుత్వ ఆలోచనగా ఉంది. ఈ పార్కును బీచ్ రోడ్లో ఏర్పాటు చేయాలని యోచిస్తున్నట్టు తెలుస్తోంది. అయితే, ఇప్పటివరకు ఇంకా స్థలాన్ని ఎంపిక చేయలేదని అధికారులు పేర్కొంటున్నారు. ప్రస్తుతానికి పార్క్ హోటల్ పక్కన ఉన్న వీఎంఆర్డీఏ స్థలంలో ఏర్పాటు చేస్తే ఎలా ఉంటుందని యోచిస్తున్నారు. దీనిపై పూర్తిస్థాయి ప్రాజెక్టు నివేదిక (డీపీఆర్)ను తయారు చేయాలని స్మార్ట్ సిటీ కార్పొరేషన్ బోర్డులో నిర్ణయించారు. మొత్తం దక్షిణ కొరియా సాంకేతిక పరిజ్ఞానంతో దీన్ని ఏర్పాటు చేయనున్నట్టు సమాచారం. బోర్డులో చర్చించాం విశాఖలో స్నో పార్కును ఏర్పాటు చేయాలని భావిస్తున్నాం. రెండు ఎకరాల్లో రూ.20 కోట్ల మేర అంచనా వ్యయంతో ఏర్పాటు చేయాలనేది ఆలోచన. ఈ మేరకు స్మార్ట్ సిటీ కార్పొరేషన్ బోర్డులో చర్చించాం. దీనిపై పూర్తిస్థాయి ప్రాజెక్టు నివేదిక (డీపీఆర్) తయారుచేయిస్తాం. ఈ పార్కు ఏర్పాటుకు స్థలాన్ని అన్వేషిస్తున్నాం. – గన్నమనేని వెంకటేశ్వరరావు, స్మార్ట్ సిటీ కార్పొరేషన్ చైర్మన్ పర్యాటకానికి అడ్డాగా... దేశంలోనే మొదటిసారిగా విశాఖలో మెగా వీల్ ఏర్పాటుకు ప్రయత్నాలు చేస్తున్న ప్రభుత్వం.. తాజాగా స్నో పార్క్ ఏర్పాటుకు సై అంటోంది. ఇప్పటికే విశాఖలో పర్యాటకరంగంలో పెట్టుబడులు పెట్టేందుకు భారీ సంస్థలు అనేకం ఆసక్తి చూపుతున్నాయి. స్టార్ హోటల్స్, రిసార్టులను అభివృద్ధి చేసేందుకు ప్రభుత్వంతో ఒప్పందాలు కూడా చేసుకుంటున్నాయి. ఈ నేపథ్యంలోనే మెగావీల్, స్నో పార్కు వంటి ఆహ్లాదకర ప్రదేశాల ఏర్పాటుతో విశాఖను పర్యాటకరంగానికి అడ్డాగా రూపుదిద్దాలనేది ప్రభుత్వ యోచనగా ఉంది. ఇటువంటి స్నో పార్కు విశాఖలో ఏర్పాటుచేయడం రాష్ట్రంలో ఇదే తొలిసారి. -
Photo Feature: గ్రీన్ బ్యూటీ.. ‘స్నో’యగాలు
సాక్షి, అరకులోయ/ పాడేరు: అందాల అరకు వర్షాకాలంలో చూపే హొయలు అంతా ఇంతా కాదు. ఏ వైపు చూసినా ఆకుపచ్చని చీర ధరించిన ప్రకృతి కాంత అద్భుతంగా మారి కనువిందు చేస్తుంటుంది. ఉన్నత పర్వత శ్రేణులు ఒక వైపు, పచ్చని పంట భూములు మరోవైపు.. వానా కాలంలోనూ ప్రభాత వేళ దర్శనమిచ్చే మంచు తెరలతో వన సీమ మనోజ్ఞరూపం నేత్రపర్వం చేస్తోంది. పాడేరు ఘాట్‌లో ఒక వైపు వర్షం కురుస్తుండగా మరో వైపు కొండల నిండా మంచు తెరల నడుమ మేఘాలు కమ్ముకోవటంతో అమ్మవారి పాదాల నుంచి వంట్లమామిడి ప్రాంతం దిగువుకు మబ్బులు దారిపొడవునా ఆహ్లాదపరిచాయి. -
Mars: మార్స్ మీద మంచు.. ఇసుక
ఇసుక తిన్నెల్లో మంచుతో ఫొటో బాగుంది కదూ.. ఎక్కడిదీ ఫొటో తెలుసా? ఆ.. ఏముందీ.. ఏదో ఓ ఎడారిలో తీసి ఉంటారు అనుకుంటున్నారా.. కాదు.. ఇది ఎడారిలోనో, ఆ చుట్టూ ఉన్న ఏదో ఓ దేశంలోనో తీసిన ఫొటో కాదు. అసలు భూమి మీద ఏ ప్రాంతం కూడా కాదు.. మనకు కోట్ల కిలోమీటర్ల దూ రంలో ఉన్న అంగారక గ్రహం (మార్స్) మీద తీసిన ఫొటో ఇది. అంగారకుడి చుట్టూ పరిభ్రమిస్తున్న ‘మార్స్ ఆర్బిటార్’ శాటిలైట్ తీసిన ఫొటో ఇది. మార్స్ మీద ఉన్న ఓ పేద్ద బిలంలో ఉన్న ఇసుక తిన్నెలను ‘మార్స్ ఆర్బిటార్’కు అమర్చిన హైరైజ్ కెమెరాతో చిత్రీకరించారు. సౌర కుటుంబంలో మన భూమి మాత్రమేనా.. మరో గ్రహం మీద మనిషి బతకగలడా.. అంతరిక్ష శాస్త్రవేత్తల్లో చాలా మందిని తొలిచేస్తున్న ప్రశ్నలివి. శాస్త్రవేత్తలకే కాదు చాలా మంది సాధారణ జనానికీ ఇదే ఆసక్తి. అందుకే భూమితో పోలిస్తే దగ్గరి పోలికలు ఉండే అంగారకుడిపై శాస్త్రవేత్తలు ఏనాడో దృష్టి పెట్టారు. అమెరికా అంతరిక్ష పరిశోధనా సంస్థ నాసా సహా చాలా దేశాలు మార్స్ దగ్గరికి శాటిలైట్లను, ఆర్బిటర్లను పంపాయి. అలా నాసా పంపిన ‘మార్స్ ఆర్బిటర్’ అంగారకుడికి సంబంధించిన ఎన్నో రహస్యాలను గుర్తించింది. ఈ క్రమంలోనే తాజాగా ఫొటోలు పంపింది. ఆ ఫొటోలను విశ్లేషించిన శాస్త్రవేత్తలు.. అంగారకుడిపై మంచు ఏర్పడుతూ, అప్పుడప్పుడూ కరిగి ప్రవహిస్తోందని గుర్తించారు. అందుకే కాలువల్లాంటి నిర్మాణాలు ఏర్పడినట్టు తేల్చారు. ఇక్కడ చదవండి: మార్స్‌పై తొలి నగరం ఇలా ఉంటుందా..! మార్స్ సంచలన నిజాలు బయటపెట్టిన నాసా...! -
వైరల్ వీడియో: బర్త్‌డే పార్టీలో అపశ్రుతి..
‘పుట్టినరోజు’.. ఇది ప్రతి ఒక్కరి జీవితంతో ఎంతో ప్రత్యేకమైన రోజు. స్నేహితులు, కుటుంబంతో కలిసి ఆరోజు గ్రాండ్‌గా సెలబ్రెట్ చేసుకుంటాం. అయితే ఎంతో సంతోషంగా జరుపుకుంటున్న ఓ వ్యక్తి బర్త్‌డే పార్టీలో అపశ్రుతి చోటుచేసుకుంది. మహరాష్ట్రలో జరిగిన ఈ ఘటన తాజాగా వెలుగులోకి వచ్చింది. ఓ యువకుడు ఈ నెల ప్రారంభంలో పుట్టిన రోజు వేడుకలు జరుపుకున్నాడు. అయితే కేక్ కటింగ్ సమయంలో స్ప్రే చల్లుతుండగా వెలుగుతున్న క్యాండిల్ కారణఃగా ప్రమాదవశాస్తు ముఖానికి మంట అంటుకుంది. వెంటనే అప్రమత్తమైన వ్యక్తి కంగారుగా వెనకకు పరిగెత్తాడు. భయాందోళనకు గురైన అతని స్నేహితులు మంటను ఆర్పేందుకు ప్రయత్నించారు. ఈ ఘటన వల్ల ఆ వ్యక్తి పుట్టిన రోజు వేడుక విషాదంగా మారింది. ఇదంతా అక్కడున్న వ్యక్తి వీడియో తీస్తుండగా రికార్డయ్యింది. ఒళ్లు జలదరించే ఈ వీడియోను పునేట్రావెల్క్స్ అనే ఇన్స్టాగ్రామ్ పేజీలో పోస్ట్ చేశారు. పార్టీల సందర్భంగా చల్లే ఫోమ్స్పట్ల జాగ్రత్తగా ఉండాలని అందులో పేర్కొన్నారు ‘పుట్టినరోజు స్నో ఫోమ్ ఉపయోగించవద్దు. దాని నురుగు కంటికి మంచిగానే కనిపిస్తుంది కానీ రసాయనాలను కలిగి ఉంటుంది. మండే గుణం ఉండటం వల్ల కంటికి ప్రమాదాన్ని కలిగిస్తుంది. అంతేగాక ఫోమ్ మంటగా ఉంటుంది. ఇక చాలా స్ప్రే బాటిల్స్‌పై హెచ్చరిక సంకేతాలు ఉంటాయి. అందులో మంటల వద్ద స్పే చేయవద్దని సూచిస్తుంది. అయినప్పటికీ పుట్టిన రోజు వంటి వేడుకల్లో కొవ్వుత్తులు మండుతుండగా స్నో ఫోమ్స్‌ను స్ప్రె చేస్తుంటారు. ఫలితంగా ఇలాంటి ప్రమాదాలు జరుగుతుంటాయి.’ అని పేర్కొన్నాడు. మరోవైపు ఈ వీడియో సామాజిక మాధ్యమాల్లో వైరల్ అయ్యింది. నెటిజన్లు దీనిపై భిన్నంగా స్పందించారు. ఆ బర్త్‌డే బాయ్‌కు పెద్ద ప్రమాదం జరుగలేదని, జాగ్రత్తగా ఉండాలని సూచిస్తున్నారు. View this post on Instagram A post shared by Pune travel Blogger (@punetravelx) -
కూల్‌గా.. మంచు కొండల్లో పాండాల ఆటలు!
వాషింగ్టన్: మంచులో సరదాగా గడపడం ఎవరికి ఇష్టం ఉండదు. ఆహ్లాదాన్ని కలిగించే మంచుతో ఆటలాడటం ఓ మధురానుభూతి. జంతువులు సైతం తెల్లని మంచును చూసి మైమరచిపోతాయి. అందులోపడి దొర్లుతూ పరవశిస్తాయి. తాజాగా రెండు పెద్ద పాండాలు మంచులో వేసిన గంతులు చూపరులను ఆకట్టుకుంటున్నాయి. దానికి సంబంధించిన ఓ వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. ఓ పాండా మంచు కొండపై నుంచి ఆనందంగా కిందకు దొర్లుకుంటూ వస్తుంది. అలాగే మరోసారి పైకి ఎక్కి మళ్లీ కిందకు జారుకుంటూ ఆడుకుంటుంది. మరో పాండా కూడా అదే విధంగా మంచులో కిందకు జారుతూ అల్లరి చేస్తుంది. పాండాలకు సంబంధించిన ఈ వీడియోను వాషింగ్టన్ డీసీలోని స్మిత్సోనియన్ నేషనల్ జూ తన ట్వీటర్ ఖాతాలో షేర్ చేసింది. అదే విధంగా ‘స్వచ్ఛమైన జియాంగ్, టిమాన్ టియన్ పాండాల ఆనందం’ అని కాప్షన్ కూడా జత చేసింది. ఈ వీడియోను 70 లక్షల మంది వీక్షించగా, 1.16 లక్షల మంది లైక్ చేశారు. ‘ఈ రోజు చూసిన ఓ గొప్ప వీడియో ఇది, వాటిని చూస్తే చాలా ఆనందంగా ఉంది’.. ‘మంచులో ఆటలు మనుషులు, జంతువులకు ఒక్కటే’ అని నెటిజన్లు కామెంట్ల వర్షం కురిపిస్తున్నారు. చదవండి: రెడ్ హ్యాండెడ్‌గా దొరికిన కుక్క! చదవండి: మాధురీ దీక్షిత్‌ను ఫిదా చేసిన యువతి -
కాశ్మీరి అందాలను ఎంజాయ్ చేస్తోన్న హన్సిక
-
మంచు కురిసే వేళలో..
-
హార్బిన్ ఐస్ అండ్ స్నో ఉత్సవం వద్ద సందర్శకుల సందడి
-
వైరల్ వీడియో: మంటకలిసిన మంచు
మానవ మెదడుకు పదును పెడితే ఎలాంటి సమస్యకైనా సులువుగా పరిష్కారాన్ని కనిపెట్టవచ్చిని ఓ వ్యక్తి నిరూపించాడు. కష్టతరమైన పనిని మనిషి మేధస్సుతో సునాయాసంగా అధిగమించి ప్రశంసలు పొందుతున్నాడు. చలికాలం వచ్చిందంటే చాలు అమెరికాలో విపరీతమైన మంచు అక్కడి ప్రజలను తీవ్ర ఇబ్బందుల పాలు చేస్తుంది. రాత్రి రోడ్డుపై పార్క్ చేసిన కారు కాస్తా.. ఉదయం లేచేసరికి మంచులో మునుగుతుంది. తాజా సీజన్లోనూ హిమపాతం అమెరికన్స్‌ను వణికిస్తోంది. రోడ్లతో పాటు ఇంటి పరిసర ప్రాంతాలు సైతం మంచులో ముగినిపోతున్నాయి. రోజూ గంటల తరబడి మంచును తొలగించడం స్థానికులకు కష్టతరంగా మారింది. ఇటీవల జరిగిన క్రిస్మస్ వేడుకల సందర్భంగా పెద్ద ఎత్తున ప్రజలు రోడ్ల మీదుకు చేరి మంచును తొలగిచేందుకు నానా తిప్పలు పడ్డారు. ఈ క్రమంలోనే టోరంటోకు చెందిన వ్యక్తికి ఓ ఆలోచన తట్టింది. తోటివారి కష్టాలను చూసి చలించి.. మంచును తొలగించేందుకు సునాయాసమైన పద్దతిని కనిపెట్టాలని ఆలోచించసాగాడు. బుర్రకు పదునుపెట్టి అనుకున్నదే తడువుగా ఓ యంత్రాన్ని కనిపెట్టి ఔరా అనిపించాడు. చేతితో పట్టుకునే ఓ గొట్టంతో కూడాని యంత్రాన్ని కనిపెట్టాడు. దానిలో నుంచి వేగంగా వచ్చే మంట మంచును క్షణాల్లో కరిగిస్తుంది. దీనికి సంబంధించిన వీడియోను స్థానికులు సోషల్ మీడియాలో షేర్ చేయగా అదికాస్తా నెట్టింట వైరల్‌గా మారింది. ఆ వ్యక్తి మేదస్సుకు చాలామంది ప్రశంసలు కురిపిస్తున్నారు. మనిషి తలచుకుంటే సాధించలేనిది ఏమీ లేందటూ కామెంట్స్ పెడుతున్నారు. అతని ఆలోచనకు ఫిదా అవుతున్నారు. -
మంచులో కుక్క విన్యాసాలు.. వీడియో వైరల్
సాధారణంగా కుక్కలకు మంచు అంటే చాలా ఇష్టం. మంచును చూస్తే అవి ఉత్సాహంతో ఉరకలేస్తాయి. వాటికి ఇష్టం వచ్చినట్లు పరుగులు తీస్తాయి. మంచుపై అవి చేసే విన్యాసాలు నవ్వులు పూయిస్తాయి. తాజాగా అలాంటి వీడియో ఒకటి సోషల్ మీడియాలో వైరల్ అయింది. వీడియో ప్రకారం.. మంచుతో కప్పబడిన సుందరమైన ప్రాంతాన్ని చూసిన ఓ బొచ్చు కుక్క.. ఉత్సాహంతో ఆ ప్రాంతం అంతా కలియతిరిగింది. ప్రతి క్షణాన్ని ఆస్వాదిస్తూ... మంచులో బొర్లాడింది. జారుడు బల్లపై జారినట్లు.. మంచుపై పడుకొని కిందికి జారింది. కుక్క చేసే విన్యాసాలు నవ్వులు పూయిస్తోంది. ఇక ఈ అరుదైన వీడియో నెటిజన్లను విపరీతంగా ఆకట్టుకుంది. ఇప్పటి వరకు ఈ వీడియోకు 57000 వ్యూస్, 4000 లైకులు వచ్చాయి. ‘కుక్క వీడియోలతో ఇదొక అద్భుత వీడియో, ఈ వీడియో చూస్తే నాకు చక్కిలిగింతలు పెట్టినట్లు అవుతుంది, ఈ వీడియో చూసి నవ్వు ఆపుకోలేక పోతున్నాను’ అంటూ నెటిజన్లు కామెంట్లు చేస్తున్నారు. -
మంచు ముసుగులో అరకు అందాలు
ప్రకృతి గీసిన చిత్రంలా కనులను కట్టిపడేసే సహజ సౌందర్యం.. మనసును ఆహ్లాదపరిచి సేద తీర్చే సుందర సువిశాల సాగరతీరం.. విశ్వవిఖ్యాతినొందిన కేంద్రాల్లో ప్రశాంతతను చేకూర్చే ఆధ్యాత్మిక సమీరం.. ఇలా అనిర్వచనీయ అనుభూతిని సందర్శకులకు అందించే ఆకర్షణీయ కేంద్రం విశాఖ.. దేశవిదేశాల నుంచి వచ్చే సందర్శకులను ఆకట్టుకునేలా అరకు పర్యాటక వైభవాన్ని సంతరించుకుంటోంది. ప్రోత్సాహకాలు, రాయితీలతో పెట్టుబడులను ఆకర్షించేలా ప్రభుత్వం రూపొందించిన నూతన పాలసీతో పర్యాటకం పరుగులు తీయనుంది. సందర్శకుల మనసు దోచేలా ఈ సౌందర్యసీమను పర్యాటకంలో అగ్రభాగాన నిలిపేందుకు కొత్త ప్రాజెక్టులెన్నో పట్టాలెక్కనున్నాయి. సాక్షి, విశాఖపట్నం: పర్యాటకాభివృద్ధి కోసం రాష్ట్ర ప్రభుత్వం పక్కా ప్రణాళికతో ముందుకెళ్తోంది. టీడీపీ పాలనలో గతితప్పిన పర్యాటకానికి ఊపిరిపోసి కొత్త చిగురులు తొడిగేందుకు నూతన టూరిజం పాలసీ (2020–2025)ని ప్రవేశపెట్టంది. అనేక ప్రోత్సాహకాలు, రాయితీలతో పాటు కరోనా కారణంగా కోలుకోని టూరిజం ఆధారిత యూనిట్లకు ఊపిరి పోసే రీస్టార్ట్ ప్యాకేజీతో ప్రపంచాన్ని ఆకట్టుకునే పాలసీని రూపొందించింది. ఈ పాలసీతో ప్రతి జిల్లా ప్రముఖ పర్యాటక కేంద్రంగా భాసిల్లుతుందనడంలో ఎలాంటి అతిశయోక్తీ లేదు. చదవండి: ఆంధ్రా ఊటి అరకు స్టార్ హోటల్స్.. రిసార్టులు సాధారణంగా ఒక పర్యాటక రంగ ప్రాజెక్టు స్థాపించాలంటే 6 ప్రభుత్వ కార్యాలయాల నుంచి అనుమతులు తప్పనిసరి. దీనికి మూడు నుంచి ఆరు నెలల సమయం పడుతుంది. దీని బదులు సింగిల్ డెస్క్ విధానం మాదిరిగా కేవలం 30 నుంచి 90 రోజుల్లోపునే అనుమతులు వచ్చేలా విధానాన్ని మార్చారు. అదేవిధంగా.. 90 ఏళ్ల లీజుగడువు, పలు విభాగాల్లో 100 శాతం రీయింబర్స్మెంట్, యూనిట్ విద్యుత్ రూ.2 కే అందివ్వడం.. ఇలా ఎన్నో కొత్త రాయితీల కారణంగా విశాఖ జిల్లాకు సరికొత్త ప్రాజెక్టులు వచ్చే అవకాశాలున్నాయి. జిల్లా చుట్టూ.. పర్యాటకానికి కావల్సినంత ప్రకృతి సంపద ఉంది. దీన్ని అభివృద్ధి చేసేందుకు అనుగుణంగా ఉన్న భూములపై ఇప్పటికే దృష్టి సారించారు. టూరిజం శాఖకు సంబంధించిన 650 ఎకరాల స్థలాల్లో కొత్త ప్రాజెక్టులు తీసుకొచ్చేందుకు కసరత్తులు చేస్తున్నారు. ఇందులో ఏయే ప్రాంతాల్లో ఎలాంటి ప్రాజెక్టులు అమలు చేస్తే పర్యాటకుల నుంచి మంచి స్పందన వస్తుందనే అంశంపై ఇప్పటికే నివేదిక సిద్ధం చేసి పర్యాటక శాఖ మంత్రి ముత్తంశెట్టి శ్రీనివాసరావుకు పంపించారు. ముఖ్యంగా ఏజెన్సీ ప్రాంతంలో హోటల్స్, రిసార్టులతో కొత్త కళ తీసుకువచ్చేలా, నగర పరిధిలోనూ వినూత్న ప్రాజెక్టులకు అనుమతులిచ్చి దేశ విదేశీ పర్యాటకులను ఆకట్టుకునే దిశగా పాలసీలో పొందుపరిచిన అంశాలు అనుకూలిస్తాయి. త్వరితగతిన ప్రాజెక్టులు వచ్చి పర్యాటక విశాఖ మరింత అభివృద్ధి చెంది పెద్ద ఎత్తున ఆదాయం వచ్చే అవకాశాలున్నాయని అధికారులు చెబుతున్నారు. చదవండి: ఎగసిన ఉత్తేజం.. పర్యాటకం కళకళ.. ఫ్లోటింగ్ రెస్టారెంట్.. వాచ్ టవర్.. జిల్లాలో మూడు టూరిజం సర్క్యూట్లు అభివృద్ధి చేసేందుకు ప్రభుత్వం కసరత్తు చేస్తోంది. ఇప్పటికే దీనికి సంబంధించిన ప్రణాళికలు సిద్ధం చేసింది. అరకు టూరిజం సర్క్యూట్‌కు కేంద్ర ప్రభుత్వం నుంచి అనుమతుల రావాల్సి ఉండగా మిగిలిన సర్క్యూట్లు కూడా కొత్త పాలసీ వచ్చాక ప్రారంభించేందుకు సన్నాహాలు చేస్తున్నారు. ఇప్పటికే రూ.156 కోట్లతో అరకు ఎకో టూరిజం సరూŠయ్క్ట్ త్వరలోనే అమల్లోకి రానుంది. బౌద్ధ కేంద్రాలైన బొజ్జనకొండ, తొట్లకొండ, బావికొండను సందర్శించేలా రూ.20.70 కోట్లతో బుద్ధిస్ట్ సర్క్యూట్ అభివృద్ధి చేసేందుకు ప్రణాళికలు సిద్ధమయ్యాయి. అదేవిధంగా తెన్నేటి పార్కు సమీపానికి కొట్టుకొచ్చిన బంగ్లాదేశ్ షిప్‌ను ఫ్లోటింగ్ రెస్టారెంట్‌గా మార్చేందుకు సన్నాహాలు చేస్తున్నట్లు మంత్రి అవంతి ప్రకటించారు. షిప్ యాజమాన్యంతో చర్చలు చివరిదశలో ఉన్నాయని, అవి కొలిక్కి వచ్చాక స్పష్టత వస్తుందని తెలిపారు. కైలాసగిరిపై నుంచి సాగర తీరం అందా లు, విశాఖ నగర సొగసులు చూసేందుకు వాచ్ టవర్ నిర్మాణానికి సన్నాహాలు చేస్తున్నట్లు తెలిపారు. ఈ ప్రాజెక్టులు సిద్ధమైతే విశాఖ పర్యాటకానికి మరింత సొబగులు చేకూరనున్నాయి. ఎస్పీవీ ద్వారా పారదర్శకంగా.. టూరిజం పాలసీ చాలా అద్భుతంగా ఉందని ఇప్పటికే స్టేక్ హోల్డర్లు, టూరిజం ఆపరేటర్లు కితాబిచ్చారు. పెట్టుబడులను ఆకర్షించేలా ఫ్రెండ్లీ పాలసీ రూపొందించాలన్న ముఖ్యమంత్రి సూచనలకు అనుగుణంగా కొత్త పర్యాటక విధానం తీసుకొచ్చాం. స్పెషల్ పర్పస్ వెహికల్(ఎస్పీవీ) ద్వారా పెట్టుబడులకు పారదర్శకంగా, అవినీతికి తావులేకుండా అనుమతులిస్తాం. చిన్న హోటల్స్, రెస్టారెంట్లు రీస్టార్ట్ ప్యాకేజీ ద్వారా తీసుకునే రుణాలపై 4.5 శాతం వడ్డీ ప్రభుత్వమే భరిస్తుంది. ప్రస్తుతం అసంఘటితంగా ఉన్న టూర్ ఆపరేటర్లు, గైడ్లకు వృత్తిపరమైన శిక్షణ ఇచ్చి ప్రొఫెషనలిజం ఉండేలా మారుస్తాం. అతిథి దేవోభవ సంప్రదాయాన్ని పాటిస్తాం. రాష్ట్రంలోని అన్ని పర్యాటక కేంద్రాలు కొత్త పాలసీతో టూరిజం పరంగా భాసిల్లుతాయి. ముఖ్యంగా విశాఖ జిల్లా పర్యాటక ఖిల్లాగా మారుతుంది. – ముత్తంశెట్టి శ్రీనివాసరావు, పర్యాటక శాఖ మంత్రి -
8 నెలలుగా అక్కడే సైనికుడి మృతదేహం
శ్రీనగర్ : జనవరి నెలలో తప్పిపోయిన భారత ఆర్మీ జవాన్ హవల్దర్ రాజేంద్ర సింగ్ నేగి(36) మృతదేహాన్ని భారత సైన్యం కనుక్కొంది. దాదాపు ఎనిమిది నెలల తర్వాత శనివారం కశ్మీర్‌లోని నియంత్రణ రేఖ(ఎల్ఓసీ) సమీపంలో మంచు చరియల కింద ఆయన మృతదేహాన్ని గుర్తించారు. ఈ విషయాన్ని నేగి కుటుంబ సభ్యులకు తెలియజేశారు. భారతీయ సైన్యం యొక్క 11 గర్హ్వాల్ రైఫిల్స్‌కు అనుబంధంగా ఉన్న నేగి, ఈ ఏడాది జనవరిలో కశ్మీర్‌లోని గుల్మార్గ్ ప్రాంతంలోని నియంత్రణ రేఖకు సమీపంలో విధుల్లో ఉన్నప్పుడు ప్రమాదవశాత్తు భారీ మంచులో పడిపోవడంతో తప్పిపోయాడు. అతని మృతదేహాన్ని కనుగొనడంలో విఫలమైన సైన్యం జూన్‌లో అతన్ని 'అమరవీరుడు' గా ప్రకటించి, ఈ విషయాన్ని జూన్ 21న నేగి కుటుంబ సభ్యులకు తెలియజేసింది. అయితే, అతని భార్య రాజేశ్వరి దేవి నేగిని అమరవీరుడిగా అంగీకరించడానికి నిరాకరించింది. తన భర్త మృతదేహాన్ని కళ్లతో చూసే వరకు అతను మరణించినట్లు భావించనని ఆమె తేల్చి చెప్పారు. ఇదిలా ఉంటే శనివారం స్వాతంత్ర్య దినోత్సవం సందర్భంగా నేగి మృతదేహం లభించిన విషయాన్ని ఆతని కుటుంబ సభ్యులకు తెలియజేశారు. నేగి మృతదేహాన్ని శ్రీనగర్‌లోని మిలిటరీ ఆసుపత్రికి తీసుకెళ్లినట్లు తెలియజేశారు. అక్కడ వైద్య పరీక్షల అనంతరం మృతదేహాన్ని కుటుంబ సభ్యులకు అప్పగించనున్నారు. ఆదివారం సాయంత్రం నాటికి మృతదేహం డెహ్రాడూన్‌కు చేరుకుంటుందని ఆర్మీ అధికారులు పేర్కొన్నారు. డెహ్రాడూన్‌కు చెందిన నేగి..2001లో సైన్యంలో చేరారు. అతనికి భార్య,ముగ్గురు పిల్లలు ఉన్నారు. -
గులాబీ రంగులోకి మంచు.. కారణం!
రోమ్: 2020 అంటేనే ప్రజల్లో భయం పుడుతోంది. ఎన్నో భయంకరమైన సంఘటనలు ఈ ఏడాదిలోనే చోటు చేసుకుంటున్నాయి. గతేడాది డిసెంబర్లో చైనాలో పుట్టిన కరోనా మహమ్మారి ప్రపంచమంతా కోరలు చాస్తున్న తరుణంలో 2020లో యుగాంతం అంటూ ఇటీవల పుకార్లు పుట్టుకొచ్చాయి. ఊహించని ఎన్నో భయంకర సంఘటనలతో ప్రజలు బిక్కుబిక్కుమంటున్నారు. ఈ తరుణంలో ఇటలీలోని ఆల్ప్స్ పర్వతాల్లో గులాబీ రంగులోకి మారిన మంచును చూసి అక్కడి ప్రజలు భయాందోళనకు గురవుతున్నారు. ఇది సహజంగా జరిగే ప్రక్రియ అని, ఎటువంటి ప్రమాదం లేదని శాస్త్రవేత్తలు అంటున్నారు. ‘వేగంగా మంచు కరగడం వల్ల ఇలాంటి మార్పులు చోటుచేసుకుంటాయి. మంచు ఆల్గేలు వేడిని గ్రహించి హిమనదిని త్వరగా కరిగిస్తాయి. వాతావరణంలో వేగంగా మార్పులు చోటుచేసుకుంటున్నాయని చెప్పడానికి గులాబి మంచు ఉదాహరణ’ అని ఇటలీ నేషనల్ రీసెర్చ్ కౌన్సిల్ శాస్త్రవేత్త బియాజియో డి మౌరో పేర్కొన్నారు. ‘సాధారణంగా మంచు సూర్యుని రేడియేషన్ 80 శాతానికి పైగా ఉన్నపుడు వాతావరంలో తిరిగి సాధారణ స్థితికి వస్తుంది. కానీ ఆల్గే మాత్రం మంచును డార్క్ చేయడంతో మంచు వేడెక్కి తొందరగా కరుగుతుంది. మంచు మరింత వేగంగా కరుగుతున్నప్పుడే ఇటువంటి ఆల్గేలు కనిపిస్తాయి. తద్వారా పొసోగావియా వద్ద 8,590 అడుగుల ఎత్తులో ఉన్న తెల్లటి మంచు ఇలా వివిధ రంగుల్లోకి మారుతుంది. ఇలాంటి సంఘటన ఇప్పటికే స్విట్జర్లాండ్‌లో చోటుచేసుకుంది. దీనిపై గతంలో అధ్యయనం చేశాం. ఆల్గే ప్రమాదకరమైనది కాదు. ఇది వసంత రుతువుకు, వేసవి కాలం మధ్య ధ్రువాల వద్ద సంభవించే సహజమైన మార్పు’ అని బియాజియో చెప్పుకొచ్చారు. మనుషులు చేసే తప్పిదాల వల్ల వాతావరణంలో మార్పులు చోటుచేసుకుంటున్నాయని, మంచు కరగడానికి సూర్యుడి వేడితో పాటు మంచుపై హైకర్తో పాటు స్కై లిఫ్టులు చేయడం కూడా ప్రధాన కారణమని డీ మౌరో అభిప్రాయపడ్డారు. మంచు గులాబీ రంగులోకి మారడంతో అక్కడి పర్యాటకులు ఆందోళన చెందుతున్నారు. ‘భూమి వేడెక్కడమనేది పెద్ద సమస్య.. అందులో చివరిది ఆల్గే’ అని ‘మనం కోలుకోలేని స్థితిలో ఉన్నాము. ఇక ఎప్పటికీ దీనిని నుంచి బయటపడలేము’, ‘మనం చేసినదే భూమి తిరిగి ఇస్తుంది’, ‘2020 ప్రత్యేకమైనది. ఎన్నో భయంకరమైన సంఘటనలు ఈ ఏడాదిలోనే చోటుచేసుకుంటున్నాయి’ అంటూ పర్యాటకులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. -
భయం గొలిపే ఎరుపు రంగు మంచు!
సాధారణంగా మంచు తెల్లగా ఉంటుందన్న విషయం తెలిసిందే. కానీ అంటార్కిటికా ఖండంలోని మంచు ఎర్రని రక్తం రంగులోకి మారింది. అది చూసేవారికి భయం గొలిపేలా ఉంది. ఈ ఎరుపు రంగులోకి మారిన మంచు అంటార్కిటికాలోని మాజీ బ్రిటిష్ పరిశోధనా కేంద్రం వద్ద దర్శనమిచ్చింది. అత్యంత తక్కువ ఉష్ణోగ్రతల్లో గడ్డ కట్టిన మంచులో జీవించే మైక్రోస్కోపిక్ ఆల్గే కారణంగా ఎరుపు రంగులోకి మారినట్టు తెలుస్తోంది. ఈ ఎరుపు రంగులో ఉన్న మంచుకు సంబంధించిన ఫోటోలను ఓ ట్విటర్ యూజర్ తన ట్విటర్ ఖాతాలో పోస్ట్ చేశారు. ‘షాక్‌కు గురి చేసే విధంగా ఎరుపు రంగులోకి మారిన అంటార్కిటికా మంచు.. వాతావరణ మార్పులు అరిష్టం అనే సంకేతాన్ని ఇస్తోంది. మంచుతో నిండిన ఈ ఖండం చట్టూ వాతావరణం వేడెక్కుతోంది’ అంటూ కాప్షన్ పెట్టారు. ఈ చిత్రాలను ఉక్రెయిన్ దేశ విద్యా, విజ్ఞాన మంత్రిత్వ శాఖ తన ఫేస్బుక్ ఖాతాలో పోస్ట్ చేసింది. ‘అంటార్కిటికా ఖండంలోని మంచు.. వేసవి కాలం ఆరంభ సమయంలో మైక్రోస్కోపిక్ ఆల్గే కారణంగా ఎరుపు రంగులోకి మారుతుంది’ అని పేర్కొంది. ప్రస్తుతం ఈ ఎరుపు రంగులో ఉన్న మంచు చిత్రాలు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతున్నాయి. ఈ ఫోటోలపై ‘అంటార్కిటికాలో ‘బ్లడ్ ఫాల్స్’ అనే నది ఉంది. ఇది క్రమం తప్పకుండా ఎర్రటి ద్రవంతో ప్రవహిస్తోంది. తెల్లని మంచుకు రక్త స్రావం అవుతున్నట్లు కనిపిస్తోంది. అది చల్లగా ఉంటుందా?’ అని ఓ నెటిజన్ కామెంట్ చేశారు. ఎరుపు రంగులోకి మారుతున్న మంచు -
ప్రపంచపు అత్యుత్తమ వరుడు.. వధువు కోసం
డెహ్రాడూన్ : ఓ వయసుకు వచ్చాక ఎవరికైనా పెళ్లి అనగానే ఉత్సాహం ఉరకలెత్తిస్తుంది. కాబోయే భార్యను తొలిసారి చూడాల్సిన సమయం ఆసన్నమైనప్పుడు ఉండే ఆతృతే వేరు. ఆమె ఎక్కడున్నా సరే రెక్కల గుర్రం వేసుకుని ఇట్టే వాలిపోవాలని కలలుకంటుంటారు. భారతీయ సమాజంలో వివాహానికి అంతటి అనుబంధం ఉంది. ఉత్తరాఖండ్‌కు చెందిన ఓ యువకుడి తనకు కాబోయే భార్య కోసం చేసిన పని నెటిజన్లను విపరీతంగా ఆకట్టుకుంటోంది. హిమాలయ రాష్ట్రంలో గల చిమోలీ జిల్లా సమీపంలోని ఓ కుగ్రామం బిజ్రా. ఆ గ్రామానికి వెళ్లాలంటే కాళ్లకు పనిచెప్పాల్సింది. ఎటు చూసిన ఎత్తయిన మంచు పర్వతాలు తప్ప మరేమీ కనిపించవు. ఈ గ్రామానికి కనీసం వాహన సదుపాయం కూడా లేదు. నాలుగు కిలోమీటర్ల దూరంలో నుంచి కాలినడకన చేరుకోవాల్సింది. అయితే ఓ యువకు ఈ గ్రామంలోని యువతిని వివాహం చేసుకోవాలని నిర్ణయించుకున్నాడు. ఈ నేపథ్యంలో తన స్నేహితులతో కలిసి ఆమెను తొలిసారి చూడటానికి ఏకంగా నాలుగు కిలోమీటర్లు నడక ద్వారా చేరుకున్నాడు. ఎత్తయిన మంచుకొండలు ఓ వైపు, పైనుంచి వర్షాన్ని తలపించేలా కురుస్తున్న హిమపాతం మరోవైపు ఇవేవీ అతన్ని ఆపలేకపోయాయి. చేతిలో రక్షణగా గొడుగులు పట్టుకుని ఈ హిమాలయ కొండలను ఛేదించుకుంటూ పెళ్లి కుమార్తె ఇంటికి చేరుకున్నారు. అయితే దీనికి సంబంధించిన ఫోటోలు అతని స్నేహితులు సోషల్ మీడియాలో షేర్ చేశారు. దీంతో అవి నెట్టింట వైరల్‌గా మారాయి. ప్రేయసి కోసం పాట్లు అని కొందరు కామెంట్ చేయగా.. మరికొందరు మాత్రం ప్రపంచపు అత్యుత్తమ పెళ్లికొడుకు అని ప్రశంసిస్తున్నారు. -
పొగమంచుతో నిలిచిన ట్రాఫిక్
సాక్షి, న్యూఢిల్లీ : దేశ రాజధాని ఢిల్లీని పొగమంచు కమ్మేయడంతో రోడ్డు, రైలు, విమాన ప్రయాణాలకు తీవ్ర అంతరాయం నెలకొంది. మంచు కప్పేయడంతో రహదారి కనిపించక ఢిల్లీ సమీపంలోని గ్రేటర్ నోయిడాలో కాలవలో కారు పడిపోవడంతో ఇద్దరు చిన్నారులు సహా ఆరుగురు మరణించారు. మంచు ప్రభావంతో ఐదు విమానాలు రద్దవగా, 500 విమానాల రాకపోకల్లో జాప్యం నెలకొంది. ఢిల్లీ మీదుగా రావాల్సిన 21 విమానాలను దారిమళ్లించారు. ఇక దాదాపు 30 రైళ్లు ఆలస్యంగా నడుస్తున్నాయని అధికారులు వెల్లడించారు. మరోవైపు దేశరాజధానిలో వాయు కాలుష్యం ప్రమాదకరస్ధాయికి చేరుకుంది. మంచు కారణంగా రహదారులు కనిపించక మెయిన్ రోడ్లపై వాహనాలు నిదానంగా కదులుతున్నాయి. -
కోల్డ్ బ్లాస్ట్...మంచుసునామీ
సునామీ సృష్టించే విధ్వంసాన్ని మనమెరుగుదుం. కానీ చల్లటి మంచు కూడా సునామీని సృష్టించగలదని ఊహించలేం. ఉన్నట్టుండి తెల్లటి మంచుకొండ మనఇళ్లను తొలుచుకొని లోపలికి చొచ్చుకొస్తుంది. తీవ్రమైన వాతావరణ పరిస్థితులే మంచు సునామీకి కారణం. గుట్టలుగా కొట్టుకొచ్చే ఈ మంచు మరో మంచుపర్వతాన్ని తలపించేలా కుప్పగా పడుతుంది. ఈ మంచుతుపానుని మించిన మంచు సునామీ ఇళ్లనూ, ఊళ్లనూ కమ్మేస్తుంది. మంచు సునామీ ఎత్తు 30 అడుగులకి మించి కూడా ఉంటుంది. సాధారణంగా శీతాకాలంలో ధృవప్రాంతాల్లో ఈ మంచు సునామీలు వస్తుంటాయి. మంచు సునామీలను 1822లోనే గుర్తించారు. మంచు సునామీలనే ‘‘ఐస్ షక్షవ్స్’’, ఇవూ అని కూడా పిలుస్తారు. దాదాపు గంటకు 74 మైళ్ల వేగంతో ఈ మంచు సునామీ వస్తుంది. ఇటీవల నార్త్ అమెరికా, కెనడాల్లో మంచు సునామీ కారణంగా తీవ్రమైన నష్టం వాటిల్లింది. ఎరీ సరస్సు, ఓంటారియో సరస్సుల్లో వచ్చిన మంచు సునామీ కారణంగా ఇళ్లు కొట్టుకుపోయాయి. 30 అడుగుల ఎత్తువరకు మంచు వరసగా గోడకట్టినట్టు కుప్పలుగాపడిపోయింది. న్యూయార్క్ స్టేట్‌లోని హూవర్ బీచ్‌లో వచ్చిన మంచు సునామీ ఆ ప్రాంతంలోని ప్రజల ఇళ్లను, ఆస్తులను ధ్వంసం చేసింది. -
రానున్న మూడ్రోజులు తేలికపాటి వర్షాలు
సాక్షి, హైదరాబాద్: మాల్దీవుల నుంచి తెలంగాణ వరకు ఇంటీరియర్ తమిళనాడు, రాయలసీమ మీదుగా ఉపరితల ద్రోణి ఏర్పడటంతో రానున్న మూడు రోజుల పాటు రాష్ట్రంలో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశముందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం తెలిపింది. శని, ఆదివారాల్లో పొడి వాతావరణం ఉండటంతో ఉదయం పూట పొగమంచు ఏర్పడే అవకాశం ఉన్నట్లు పేర్కొంది. -
షికాగో థెరిస్సా
గడ్డ కట్టించే చలిలో అందరూ సొంత భద్రత చూసుకుంటారు.కాని ఆమె మాత్రం రోడ్డుపై నివసించే వారి కోసం ఏకంగా హోటల్ రూములే బుక్ చేసింది. చికాగోలో మొన్నటి బుధవారం నుంచి జీవితం తెల్లబోయింది. పనులు గడ్డకట్టాయి. ఉత్తర ధ్రువపు మంచు ఫలకాలపై చోటు చేసుకున్న వాతావరణమార్పు అమెరికాలోని కొన్ని నగరాలను వొణికించడం మొదలెట్టింది. ముఖ్యంగా చికాగోని. వాతావరణ శాఖ వెంటనే హెచ్చరికలు మొదలెట్టింది. బయట పది నిమిషాలు నిలుచున్నా మంచుకాటు తప్పదని భయపెట్టింది. ఉష్ణోగ్రతలు ఏకంగా మైనస్ 27 డిగ్రీల సెల్సియస్‌కు పడిపోయాయి. స్కూళ్లు, కాలేజీలు, యూనివర్సిటీలు మూతపడ్డాయి. కొంచెం ధైర్యం ఉన్న జనం బయట ఆటలకు ప్రయత్నించారు. బయట గుడ్డు పగలకొట్టి ఆమ్లెట్ వేయడం అసంభవం అని నిరూపించారు. గుడ్డు పగలగొట్టిన మరుక్షణం అది గడ్డకట్టుకుపోతే ఆమ్లెట్ ఎలా వేయడం? వేడి నీళ్లను తీసుకొచ్చి బయటకు చిమ్మితే ఆ నీళ్లు కిందపడేలోపు ఐసుగడ్డలుగా మారుతున్నాయి. ఎవరో వండిన నూడుల్స్ బయటకు తెచ్చి ఫోర్క్‌తో పైకి ఎత్తితే నూడుల్స్ బిగుసుకుపోయి వాటిని చుట్టుకున్న ఫోర్క్ గాలిలో నిలబడింది. జనం ఇలా ఎవరి గొడవల్లో వారు ఉన్నారు. కాని ఒక్క మహిళ మాత్రం తానొక మనిషినని ఇది సాటి మనుషులకు సాయం చేయాల్సిన సమయం అని గుర్తించింది.ఆమె పేరు కాండిస్ పేనె. వయసు 36. షికాగోలో ఒక రియల్ ఎస్టేట్ ఆఫీసులో మామూలు ఉద్యోగి. ఆమె రోజూ ఆఫీసుకు వెళ్లే దారిలో రోడ్డు పక్క డెబ్బై ఎనభై మంది పేవ్మెంట్ మీద నివసించే వారిని గమనించేది. వారంతా అక్కడ చిన్న చిన్న గుడారాలు వేసుకొని జీవిస్తుంటారు. ఆ ఏరియాలో స్థానికులు ‘టెంట్ సిటీ’ అంటారు. ఇప్పుడు మారిన వాతావరణానికి పెద్ద పెద్ద భవంతులలో ఉన్నవారే వొణికే పరిస్థితి ఉంటే మంచు కమ్ముకుంటున్న ఈ రాత్రి వీరికి ఆసరా ఎవరు అనే ఆలోచన కాండిస్ పేనెకు వచ్చింది. బుధవారం రాత్రి వాళ్లు కనుక పేవ్మెంట్ల మీద ఉంటే గడ్డకట్టుకుని చనిపోతారని ఆమెకు అర్థమైంది. వాళ్లను తీసుకెళ్లి ఎక్కడైనా పెట్టేందుకు హోమ్ లేదు. తన ఇల్లు చాలదు. అందుకని తన దగ్గర ఉన్న డబ్బుతో వారికి హోటల్ రూములు బుక్ చేయాలని అనుకుంది. ఆ ప్రాంతంలో ఎన్ని హోటళ్లకు ఫోన్ చేసినా పేవ్మెంట్ మనుషులను తమ హోటల్లోకి రానివ్వమని చెప్పారు. కాని ఒక్క హోటల్ ‘అంబర్ ఇన్’ అందుకు అంగీకరించింది. వెంటనే ఒక్క రోజుకు 70 డాలర్ల లెక్కన కాండిస్ అందులో 20 గదులు బుక్ చేసింది. అంతే కాదు తన ట్విట్టర్ అకౌంట్లో ‘నేను ఇలా రూములు బుక్ చేశాను. టెంట్ సిటీలో ఉన్న దిక్కులేని వారిని కాస్త హోటల్ వరకూ తెచ్చి వదిలిపెట్టండి’ అని నగర వాసులను అభ్యర్థించింది. అంతే. దానిని చూసిన సహృదయులు వెంటనే స్పందించారు. వెంటనే సాయానికి ముందుకు వచ్చారు. డబ్బులు తమకు తామే అంబర్ ఇన్ హోటల్‌కు పంపడం మొదలెట్టారు. బుధవారం నుంచి ఆదివారం వరకు (మంచు తుఫాను అధికంగా ఉంటుందని తెలిసిన ఐదు రోజులు) యాభై రూములు బుక్ అయ్యాయి. అంతే కాదు టెంట్ సిటీలో ఉన్న 80 మందినే కాక మరో ముప్పై నలభై మంది దిక్కులేనివారిని తీసుకొచ్చి హోటల్లో పెట్టారు.‘మొదట వాళ్లు టెంట్లను వదిలి రావడానికి సిద్ధపడలేదు. మా వస్తువులు పోతాయి అన్నారు. పోయిన వస్తువులకు కూడా డబ్బు ఇస్తాను అని వారిని తీసుకొచ్చాను’ అంది కాండిస్.మంచి మనసుతో ఒకరు ప్రయత్నిస్తే దానికి అందరూ తోడవుతారనేదానికి ఉదాహరణగా చాలామంది ఇప్పుడీ నిరుపేదల ఆహారానికి ఏర్పాట్లు చేశారు. దుస్తులు అందచేశారు. కాండిస్ని ప్రశంసలతో ముంచెత్తారు.‘నేను మామూలు మనిషిని. ఇదంతా నాకు కొత్త. కాని ఈ పని చేశాక ఇలా రోడ్డు మీద నివసించేవారి కోసం శాశ్వతంగా ఒక హోమ్ నిర్మించాలని తలంపు మాత్రం వచ్చింది’ అంది కాండిస్.ప్రభుత్వాలే అన్నీ చేయవు. ప్రభుత్వాలకు అన్నీ తెలిసే వీలు ఉండదు.కాని తెలిసిన మనుషులం వెంటనే సాయానికి దిగాలని కాండిస్ని చూస్తే అనిపిస్తుంది.అన్నార్తుల కోసం దిగి వచ్చిన నల్ల థెరిసా అని కూడా అనిపిస్తుంది. -
నీళ్లు చల్లి చూడండి!
గాల్లోకి వేడి నీళ్లు చల్లి చూడండి.. ఏం జరుగుతుంది. ఎక్కడైనా అయితే అవే నీళ్లు కింద పడతాయి. కానీ అమెరికాలో అదీ గడ్డకట్టుకుపోయే మంచుగాలుల్లో వేడి నీళ్లు చల్లితే గాల్లోనే గడ్డకట్టి వేడినీళ్ల స్ఫటికాలుగా మారి కుప్పలా నేల రాలుతున్నాయి. అదెలాగో చూడండి.. అమెరికాలో ఎడతెరిపి లేకుండా కురుస్తున్న మంచుకు అక్కడి సాధారణ పౌరుల జీవనం అస్తవ్యస్తంగా తయారయ్యింది. పాఠశాలలు మూతపడ్డాయి. ఆఫీసులకు సెలవులు ప్రకటించేశారు. తపాలా కార్యాలయాలు సైతం పనిచేయని స్థితికి చేరింది. రైళ్ల రాకపోకలు సైతం నిలిచిపోయాయి. విమానాలు గాల్లోకి ఎగిరే పరిస్థితి లేక నేలమీదే చతికిలపడ్డాయి. మంచు తప్ప వీధుల్లో మనుషుల అలికిడే లేకుండా పోయింది. ఈ పరిస్థితులతో విసిగిపోయిన ప్రజలు మంచు వాన నుంచి కాస్త ఊరట పొందేందుకు వినోదం కోసం వేడి నీళ్లను గాలిలోకి చల్లుతున్నారు. అయితే చల్లిన వేడి నీళ్లు సైతం భూమ్మీద రాలకుండానే క్షణాల్లో గడ్డకట్టుకుపోయి వేడి నీటి బిందువులుగా నేల రాలుతున్నాయి. ఈ విచిత్రమైన పరిస్థితిని వీడియోల్లో షూట్ చేసి విసుగు పుట్టించే అవిశ్రాంత మంచువాన నుంచి వినోదం పొందుతున్నారు. ఇంట్లో కప్పులు, మగ్గులతో వేడినీళ్లు గాల్లోకి చల్లి గడ్డకట్టే సీన్‌ను వీడియోల్లో బంధించి, ఈ వీడియోలను పోస్ట్ చేస్తున్నారు. అవి ఇప్పుడు ప్రపంచవ్యాప్తంగా వైరల్ అవుతున్నాయి. -
‘మంచు’కొచ్చిన ముప్పు
డిచ్పల్లి: దైవదర్శనం చేసుకొని వస్తున్న ఆ కుటుంబ పెద్దలను మృత్యువు మంచు రూపంలో కబళించింది. వీరు ప్రయాణిస్తున్న వాహనం అదుపుతప్పి డివైడర్‌ను ఢీకొట్టడంతో పల్టీలు కొట్టింది. ప్రమాదంలో దంపతులు అక్కడికక్కడే మృతి చెందగా.. 8 మంది తీవ్రంగా గాయపడ్డారు. ఘటన నిజామాబాద్ జిల్లా డిచ్పల్లి మండల పరిధిలో గురువారం జరిగింది. అతివేగం.. దట్టమైన పొగ మంచు కారణంగానే ఈ ప్రమాదం జరిగిందని చెబుతున్నారు. డిచ్పల్లి ఎస్ఐ నవీన్‌కుమార్ కథనం ప్రకారం.. ఆదిలాబాద్‌లోని గంజ్‌రోడ్ కాలనీలో గనిశెట్టివార్ ప్రకాశ్ (74) (రిటైర్డ్ ఉద్యోగి), ఆయన భార్య చాంద (68), కొడుకులు శ్రీనివాస్, శివప్రసాద్, కోడళ్లు సుస్మిత, హారిక, మనవళ్లు శౌర్య, శితిజ్, జగన్నాథ్, మనవరాలు గాయత్రి ఈ నెల 11న ఒడిశాలోని పూరీ జగన్నాథుడిని దర్శించుకోవడానికి వెళ్లారు. బుధవారం శంషాబాద్ నుంచి ఆదిలాబాద్‌కు తిరుగు ప్రయాణం అయ్యారు. తెల్లవారుజామున వీరి వాహనం నాకాతండా సమీపంలోకి రాగానే పొగమంచు కమ్ముకోవడంతో పల్టీలు కొట్టింది. దీంతో ప్రమాదం చోటుచేసుకుంది. క్షతగాత్రులను నిజామాబాద్‌లోని ప్రైవేటు ఆస్పత్రికి తరలించారు. -
చైనా ఐస్ ఫెస్టివల్
-
ఈ వీడియో చూస్తే మీరే విజేత!
హైదరాబాద్ : జీవితంలో ఒక్క ఎదురుదెబ్బ తగిలితేనే ఎంతో కుమిలిపోతాం.. కుంగిపోతాం. ఇక అలాంటి ఎదురుదెబ్బలు వరుసగా తగిలితే ఈ జీవితమే వద్దనుకుంటాం. కానీ ఈ పిల్ల ఎలుగు బంటిని చూస్తే.. మాత్రం జీవితమంటే పోరాటమని.. సమస్యలపై పోరాడితినే విజయం ఉంటుందని అవగతం అవుతోంది. అవును ప్రస్తుతం సోషల్‌మీడియాను షేక్ చేస్తున్న ఈ పిల్ల ఎలుగు బంటి వీడియో నెటిజన్లు విపరీతంగా ఆకట్టుకుంటోంది. ఆకట్టుకోవడమే కాదు జీవిత పాఠాన్ని బోధిస్తోంది. ఈ వీడియోను కెనడియన్ టీవీ పర్సన్ ఒకరు ‘ఈ పిల్ల ఎలుగుబంటి నుంచి మనం చాలా నేర్చుకోవచ్చు’అనే క్యాప్షన్‌తో ట్వీట్ చేశారు. ఇంతకీ ఈ వీడియోలో ఏముందంటే.. తల్లి ఎలుగు బంటి.. పిల్ల ఎలుగుబంటి రెండూ కలిసి మంచు కొండను ఎక్కుతుంటాయి. తల్లి ఎలుగు బంటి సులువుగానే మంచు కొండపైకి చేరగా.. పిల్ల ఎలుగుబంటికి మాత్రం నానా కష్టాలు పడుతుంటుంది. పైకి ఎక్కుతున్నా కొద్దీ మంచుతో కిందికి జారిపోతుంటుంది. అయినా పట్టు విడవని పిల్ల ఎలుగుబంటి తన లక్ష్యాన్ని చేరుకోవాడినికి ప్రయత్నిస్తూనే ఉంటుంది. ఒక సారి అయితే పూర్తిగా చివరకు వచ్చిన తర్వాత తల్లి ఎలుగు బంటే నెట్టేస్తోంది. ఆ దెబ్బతో అమాంతం కిందికి పడిపోతుంది. అయినా నిరాశ చెందని ఆ పిల్ల ఎలుగు బంటి మళ్లీ తన ప్రయత్నం మొదలు పెడుతోంది. ఇలా చివరకు ఎలాగోలా పైకి చేరి తన లక్ష్యాన్ని చేరుకుంటుంది. ఈ వీడియోను గమనిస్తే మనకు జీవిత సత్యం బోధపడుతుంది. పిల్లల సమస్యలను వారినే పరిష్కరించుకునేలా సిద్ధం చేయాలని ఆ తల్లి ఎలుగుబంటి చెబితే.. అడ్డంకులెన్ని ఎదురైన నిరాశ పడకుండా లక్ష్యాన్ని చేరుకోవాలని పిల్ల ఎలగుబంటి చాటి చెప్పింది. -
ఈ పిల్ల ఎలుగుబంటిని చూసి చాలా నేర్చుకోవాలి!
-
జమ్ము కశ్మీర్‌ను కప్పేసిన మంచు తుఫాను
-
మంచు కరిగితే.. పెనుముప్పే...
వాతావరణ మార్పుల ప్రభావం కారణంగా ధ్రువ ప్రాంతాల్లోని మంచు వేగంగా కరిగిపోతోంది. పరిస్థితి ఇలాగే కొనసాగి అక్కడున్న మంచు మొత్తం కరిగిపోతే సముద్ర మట్టాలు కనీసం 1.2 మీటర్లు పెరుతాయని అంటోంది తాజా అధ్యయనం. అంటార్కిటికా ప్రాంతంలోని అనేక హిమనదాల్లో కొన్ని లక్షల ఏళ్లుగా మంచు గడ్డకట్టుకుని ఉందని, ఒక్క ద అమున్డ్సేన్ సీ ఎంబేయ్మెంట్ హిమనదంలోనే డెన్మార్క్ దేశం మొత్తాన్ని 11 కిలోమీటర్ల ఎత్తులో కప్పేయగలిగినంత నీరు మంచురూపంలో ఉందని, ఇదంతా ఒక్కసారిగా కరిగితే ప్రపంచ వ్యాప్తంగా సముద్ర మట్టాలు 5 అడుగుల మేర పెరుగుతాయని ఈ అధ్యయనంలో పాల్గొన్న శాస్త్రవేత్త టెర్రి విల్సన్ (ఒహాయో స్టేట్ యూనివర్శిటీ) అంటున్నారు. సుమారు 1.15 లక్షల ఏళ్ల నుంచి ఇక్కడ పేరుకుపోతున్న మంచు అడుగుభాగంలోని భూమిపై విపరీతమైన ఒత్తిడిని సష్టిస్తోందని వీరు అంటున్నారు. అయితే గత 200 ఏళ్లుగా ఈ హిమనదం కొద్దోగొప్పో స్థిరంగా ఉందని.. 2005 నుంచి మాత్రం కరిగిపోవవడం వేగం పుంజుకున్నట్లు వివరించారు. మంచు కరిగిపోవడంతో ఒత్తిడి తొలిగి భూ ఉపరితలం ఎత్తు కూడా పెరుగుతోందని విల్సన్ వివరించారు. -
రంగు పడింది
తెల్లగా వెండిలా మెరిసిపోవాల్సిన మంచుకొండలు నారింజ రంగు పులుముకున్నాయి. రష్యా, ఉక్రెయిన్, బల్గేరియా,రుమేనియాలతోపాటు తూర్పు యూరప్ అంతటా ఇదే తీరు! భూమ్మీద కాకుండా అరుణగ్రహంపై ఉన్నామా? అనేంత నారింజ రంగు! ఎందుకిలా? పోటెత్తిన పర్యాటకులకు వచ్చినా.. సమాధానం మాత్రం నాసా తీసిన ఫోటోల ద్వారా శాస్త్రవేత్తలు తెలుసుకోగలిగారు. ఆఫ్రికాలోని సహారా ఎడారి నుంచి ఎగసిన ఇసుక గాలులే ఈ మార్పునకు కారణమని శాస్త్రవేత్తలు తేల్చారు. అక్కడి దుమ్ము, ధూళి, ఇసుక రేణువులు మంచుకొండల్ని చుట్టేయడంతో అవి నారింజ రంగులోకి మారిపోయాయని చెబుతున్నారు. యూరప్‌లో ఇలా జరగడం ఇదే మొదటి సారి. దీంతో పర్వతారోహకులు, మంచులో స్కేటింగ్ చేసే వాళ్లు ఈ అరుదైన కొండల్ని చూస్తూ ఎంజాయ్ చేస్తున్నారు. కొందరు శాస్త్రవేత్తలు మాత్రం ఇది సర్వసాధారణమైన విషయమని ప్రతీ అయిదేళ్లకు ఒకసారి ఇలా జరుగుతుందని చెబుతున్నారు. ఒక ప్రాంతంలో ఎగిసిపడే దుమ్ము, ధూళి ఇంకో ప్రాంతంలో వాతావరణంపై ప్రభావం చూపించిన సందర్భాలు గతంలోనూ ఉన్నాయి. 2007లో దక్షిణ సైబీరియాలోనూ ఇలాగే మంచు ఆరెంజ్ రంగులోకి మారిపోయిన విషయాన్ని వారు గుర్తు చేస్తున్నారు. -
వణుకుతున్న ఐరోపా
-
ఊహించని ప్రమాదం.. ఉత్త చేతులతో కాపాడారు
కాలిఫోర్నియా : ఉవ్వెత్తున్న ముంచుకోచ్చిన హిమపాతంతో అక్కడంతా గందరగోళంగా మారింది. స్నోబోర్డింగ్ కోసం వెళ్లిన ఐదుగురు చెల్లాచెదురు అయిపోయారు. వారిని చూసేందుకు వచ్చిన ప్రేక్షకులు హాహాకారాలు చేయసాగారు. అంత సురక్షితంగా ఉన్నారనుకున్న క్రమంలో ఓ మహిళ తన భర్త కనిపించటం లేదంటూ బిగ్గరగా అరిచింది. రక్షణ సిబ్బందితోపాటు ప్రేక్షకులు కూడా రంగంలోకి దిగి అతన్ని వెతకటం ప్రారంభించారు. దాదాపు 20 నిమిషాల తర్వాత మంచు పొరల్లో కూరుకుపోయిన అతన్ని గుర్తించారు. గడ్డ కట్టిన మంచును ఉత్త చేతులతో తవ్వి అతని ప్రాణాలు కాపాడారు. వెంటనే ఆస్ప్రతికి తరలించగా అతను ప్రాణాలతో బయటపడ్డాడు. కాలిఫోర్నియా, నెవాడా మధ్యలో ఉన్న స్క్వా వ్యాలీలో శుక్రవారం ఈ ఘటన చోటుచేసుకుంది. తన పుట్టినరోజు జరుపుకునేందుకు భార్యతోసహా వచ్చిన వ్యక్తికి ఈ అనుభవం ఎదురైంది. స్థానికుల చొరవతో అతను ప్రాణాలతో బయటపడ్డాడని పోలీసులు తెలిపారు. మంచు కప్పేయటంతో ఆ రిసార్ట్‌ను తాత్కాలికంగా మూసేస్తున్నట్లు నిర్వాహకులు తెలిపారు. ప్రస్తుతం ఆ వీడియో సోషల్ మీడియాలో హల్ చల్ చేస్తోంది. -
ఊహించని ప్రమాదం.. ఉత్త చేతులతో కాపాడారు
-
ఈఫిల్ టవర్ మూసివేత
ఫ్రాన్స్ : పారిస్ అనగానే మనకు ముందుగా గుర్తుకువచ్చేది ఈఫిల్ టవర్. ప్రపంచంలోనే అత్యంత ప్రతిష్టాత్మక నిర్మాణాల్లో ఒకటైన ఈఫిల్ టవర్‌ను సందర్శించటానికి దేశ విదేశాల నుంచి భారీ ఎత్తున్న పర్యాటకులు తరలివస్తుంటారు. కానీ పారిస్ సందర్శకులకు ఓ చేదువార్త. శుక్రవారం, శనివారం రెండు రోజులు ఈఫిల్ టవర్ సందర్శనకు పర్యాటకులను అధికారులు అనుమతించడం లేదు. గత నెలలో కురిసిన భారీ వర్షాల నుంచి తేరుకోకముందే.. గత రెండు రోజులుగా దట్టమైన పొగ మంచు పారిస్ నగరవాసులను ఇబ్బందులకు గురిచేస్తోంది. శుక్రవారం మరింతగా మంచు కురిసే అవకాశాలు కనిపిస్తున్నాయి. దీంతో ముందస్తు జాగ్రత్తగా అధికారులు సందర్శనను నిలిపివేస్తున్నట్టు ప్రకటించారు. పొగ మంచు దట్టంగా కమ్ముకుపోవడంతో అక్కడ రవాణ వ్యవస్థ స్తంభించిపోయింది. వందల కొద్దీ వాహనదారులు రోడ్లపైనే జాగరం చేయాల్సి వచ్చింది. రైల్వే వ్యవస్థకు కూడా అంతరాయం కలగడంతో, 700 మందికి పైగా ప్రయాణికులు స్టేషన్లలోనే నిద్రించాల్సి వచ్చింది. ఓర్లీలో కొన్ని విమానాలు రద్దయ్యాయని తెలిసింది. మరింత పొగమంచు సంకేతాలు వస్తుండటంతో, దేశంలో ఈ క్వార్టర్లో అత్యంత దారుణమైన పరిస్థితి ఏర్పడుతుందని ముందస్తుగా ప్రజలకు అధికారులు హెచ్చరికలు జారీచేస్తున్నారు. -
భలే ‘మంచు’ కారు
అది కెనడాలోని ఓ నగరం.. అక్కడ భారీగా మంచు కురుస్తోంది. రోడ్లపై మంచు చాలా పేరుకుపోయింది. దీంతో మంచు తొలగించే ప్రాంతంలో కారును పార్క్ చేయడం నిషేధం. అయితే అదే చోట ఓ కారు పార్క్ చేసి ఉంది. దీంతో ఆ కారు దగ్గరికి ట్రాఫిక్ పోలీసులు హడావుడిగా వచ్చారు. ఓ పోలీసు అధికారి దాని దగ్గరికి వెళ్లి కారుకు చలానా విధించాడు. ఆ పోలీసులకు కొద్ది సేపటికి కానీ తెలియలేదు అది నిజమైన కారు కాదని! అది మంచుతో తయారు చేసింది. రోడ్లపై మంచును తొలగించే సైమన్ లాప్రైజ్ అనే ఉద్యోగి సరదాగా మంచుతో కారును చెక్కాడు. టొయోటా సుప్రా కారు మాదిరిగా చెక్కేందుకు ప్రయత్నించాడు. కొంచెం అటూ ఇటుగా అలాగే వచ్చిందనుకోండి. అయితే కారుపై మంచు పేరుకుపోయిందేమో అనుకుని పొరబడ్డ ఆ పోలీసు కారుకు చలానా విధించాడు. పాపం నిజం తెలిశాక ముక్కుపై వేలు వేసుకుని అక్కడి నుంచి వెళ్లిపోయారు. దీనికి సంబంధించిన ఫొటోలు నెట్లో హల్చల్ చేస్తున్నాయి. వీటిని చూసిన నెటిజన్లు నవ్వు ఆపుకోలేకపోతున్నారు! -
కశ్మీర్లో మంచు తూఫాన్ నలుగురు మృతి
-
ముంచుకొస్తున్న మంచుముప్పు
సాక్షి, అమరావతి బ్యూరో: మంచు దుప్పటి కప్పుకున్నట్లు ఉండి మనం మంచు ఖండంగా పిలుచుకునేది.. అంటార్కిటికా. దీని అంచున వేలాడదీసినట్లు 44,200 చ.కి.మీ విస్తీర్ణంలో భారీ మంచు ద్వీపకల్పం ఉంది. దీన్ని లారెన్స్–సి అని వ్యవహరిస్తుంటారు. దీని నుంచి ఈ ఏడాది జూలైలో ఐస్‌బర్గ్ ఏ–68 అనే భారీ మంచు ఫలక బద్దలై విడిపోయింది. ఇది సముద్రంలో తేలియాడుతూ నిదానంగా కరుగుతోంది. ఇది 5800 చదరపు కిలోమీటర్ల విస్తీర్ణంలో.. మన రాష్ట్రంలో శ్రీకాకుళం జిల్లా అంతటి వైశాల్యంలో ఉంది. ఈ నేపథ్యంలో ప్రపంచమంతా కలవరపడుతోంది. ఇంత భారీ మంచు ఫలక కరిగిపోతే సముద్ర జలాల మట్టం పెరిగిపోతుంది. సముద్రం ముందుకు చొచ్చుకు వస్తుంది. తీర ప్రాంతాలు దెబ్బతింటాయి. అంతేకాదు ఏకంగా కొన్ని ప్రాంతాల ఉనికే లేకుండా పోతుంది. అభివృద్ధి పేరిట విచక్షణ రహితంగా ప్రకృతిని విధ్వంసం చేయడం వల్లే ఇలా జరుగుతోందని పర్యావరణవేత్తలు అంటున్నారు. కరుగుతున్న మంచు ఖండం అంటార్కిటికాలో మంచు ఫలకలు 10 వేల ఏళ్ల నుంచి స్థిరంగా ఉంటున్నాయని శాస్త్రవేత్తలు భావిస్తున్నారు. అడవుల నరికివేత, విపరీతమైన పారిశ్రామికీకరణ, వాయు కాలుష్యం, గ్రీన్హౌస్ ఎఫెక్ట్.. ఇలా అన్నీ తీవ్ర వాతావరణ కాలుష్యానికి దారితీస్తున్నాయి. దీంతో భూఉపరితల ఉష్ణోగ్రత అమాంతం పెరిగిపోతోంది. ఇది అంటార్కిటికా ఖండంపై తీవ్ర ప్రతికూల ప్రభావం చూపుతోంది. అర్ధ శతాబ్దం కిందట నుంచి అంటార్కిటికాలో మంచు ఫలకలు కరగడం ప్రారంభించాయి. ప్రతి ఏటా ఇలా జరగడం ఎక్కువవుతుండటం ఆందోళన కలిగిస్తోంది. తాజాగా అంటార్కిటికా ఖండం నుంచి విడిపడిన భారీ మంచు ఫలకతో పెనుముప్పు ముంచుకొస్తోంది. పెనుముప్పు.. ఏదీ కనువిప్పు? మంచు ఫలకలు కరగడం వల్ల సముద్ర జలాల మట్టాలు పెరిగి పెను ఉపద్రవం ఏర్పడుతుందని ఇంటర్ గవర్నమెంటల్ ప్యానల్ ఆన్ క్లైమేట్ ఛేంజెస్ (ఐపీపీసీ) హెచ్చరిస్తోంది. ఇప్పటికే గ్రీన్ హౌస్ ఎఫెక్ట్ వల్ల ఏటా సముద్ర జలాల మట్టం 3.40 మిల్లీ మీటర్లు పెరుగుతోంది. అంటే దాని దుష్పరిణామాలను ప్రపంచం ఎదుర్కొంటోంది. - మన రాష్ట్రంలో విశాఖపట్నం, కాకినాడలలో సముద్రం ఏటా ముందుకు చొచ్చుకు వస్తుండటం తెలిసిందే. దీంతో విలువైన సారవంతమైన భూములు సముద్రంలో కలిసిపోతున్నాయి. ఈ రెండు చోట్లే కాకుండా రాష్ట్రంలోని దాదాపు 200 కి.మీ. తీర ప్రాంతం సముద్రం కోతకు గురవుతోంది. భూగర్భ జలాలు కలుషితమై పంటలు నాశనమవుతున్నాయి. ఇక పశ్చిమ తీరంలోనూ సముద్రం ముందుకు దూసుకొస్తూ ప్రమాద ఘంటికలు మోగిస్తోంది. ఇక అంతర్జాతీయ స్థాయిలో తీవ్ర ఆందోళనకరంగా మారింది. ఏటా ప్రపంచంలో దాదాపు 2 లక్షల కి.మీ. తీర ప్రాంతం సముద్ర కోతకు గురవుతోందని శాస్త్రవేత్తలు అంచనా వేశారు. - సముద్ర జలాల నీటిమట్టం పెరిగితే భారీ వర్షాలు, తుపానులు జన జీవనాన్ని అతలాకుతలం చేస్తాయి. తాజాగా అమెరికాలో హరికేన్ల ప్రళయం, మన దేశంలో ముంబై వంటి నగరాల్లో ఆకస్మిక భారీ వర్షాలు మొదలైనవి ఇందుకు సంకేతాలని శాస్త్రవేత్తలు చెబుతున్నారు. - ఇదే పరిస్థితి కొనసాగితే భూమిపై కొన్ని ప్రాంతాల ఉనికే ప్రమాదంలో పడుతుంది. ఇప్పటికే కరేబియన్ దీవుల్లో కొన్ని ప్రాంతాలు పూర్తిగా సముద్ర గర్భంలో కలసిపోయాయి. హిందూ మహా సముద్రంలో ఉన్న అతి చిన్న దేశం మాల్దీవుల ఉనికే ప్రమాదంలో పడనుందని ఇప్పటికే శాస్త్రవేత్తలు తేల్చిచెప్పారు. దాంతో ఆ దేశ ప్రభుత్వం ప్రత్యామ్నాయ దీవుల కోసం అన్వేషిస్తోంది కూడా. - ఎన్నో జీవజాతుల ఉనికి అంతర్ధానం అయ్యే ప్రమాదం ఏర్పడుతోంది. అంటే సముద్ర జలాల మట్టాలు పెరగడం ఎంతటి విపత్తుకు దారితీస్తుందో స్పష్టమవుతోంది. గతంలో లారెన్స్– ఏ, బి వేల టన్నుల బరువుతో ఉన్న ఐస్‌బర్గ్ ఏ–68 భారీ మంచు ఫలక పూర్తిగా కరిగితే సముద్ర జలాల మట్టం ఏడాదికి అదనంగా 0.10 మిల్లీమీటర్లు పెరుగుతుందని శాస్త్రవేత్తలు అంచనా వేస్తున్నారు. గతంలో 1995లో 2 వేల చ.కి.మీ వైశాల్యం కలిగిన లారెన్స్ –ఏ’ , 2002లో 3,250 చ.కి.మీ వైశాల్యం ఉన్న లారెన్స్–బి మంచు ఫలకలు వేరుపడి సముద్ర జలాల్లో కలిసిపోయాయి. ఇప్పుడు ఏకంగా 5,800 చ.కిమీ. వైశాల్యం కలిగిన ఐస్‌బర్గ్–68 వేరవడంతో సముద్ర జలాల మట్టం మరింతగా పెరగనుంది. ఏటా పెరుగుతున్న 3.40 మిల్లీమీటర్లకు అదనంగా మరో 0.10 మిల్లీ మీటర్లు సముద్ర జలాల మట్టం పెరుగుతుందన్నమాట. ఇంతటితోనే ప్రమాదం ముగిసిపోలేదు. అంటార్కిటికా ఖండంలో లారెన్స్ సి’ని ఆనుకుని మరో భారీ మంచు ఫలక ఉంది. ఏకంగా 22,600 చ.కి.మీ. వైశాల్యం కలిగిన దీనికి ‘లారెన్స్ డి’ అని పేరు పెట్టారు. ఉష్ణోగ్రతల పెరుగుదల ఇలాగే కొనసాగితే ఆ మంచు ఫలక కూడా త్వరలోనే వేరుపడి కరిగిపోవడం ఖాయమని శాస్త్రవేత్తలు హెచ్చరిస్తున్నారు. వాతావరణ సమతౌల్యం కాపాడటం సమష్టి బాధ్యత మంచు ఫలకల రూపంలో వస్తున్న ముప్పును ఎదుర్కోవడానికి అంతర్జాతీయ సమాజం వెంటనే సమష్టి కార్యాచరణ ప్రారంభించాలి. పర్యావరణ పరిరక్షణకు అత్యధిక ప్రాధాన్యమిచ్చి కాలుష్య నివారణ చర్యలు యుద్ధ ప్రాతిపదికన చేపట్టాలి. అభివృద్ధి పేరుతో ప్రకృతి విధ్వంసానికి పాల్పడితే భవిష్యత్ తరాలకు తీవ్ర నష్టాన్ని కలిగించినవారమవుతాం. – మనోజ్ నలనాగుల, వాతావరణ శాస్త్రవేత్త -
ఎవరెస్ట్ ఎత్తు ఎంతో తెలుసా?
కఠ్మాండు: భూతాపోన్నతి కారణంగా మంచు కరిగి హిమాలయాల ఎత్తులో మార్పు వచ్చిందా? నేపాల్‌లో 2015లో వచ్చిన పెను భూకంపం వల్ల కొండలు కుంచించుకుపోయాయా? భూమి పొరలు కదలడం వల్ల ఎత్తు మరింత పెరిగిందా? ఈ ప్రశ్నలకు త్వరలోనే సమాధానం దొరకనుంది. ప్రపంచంలోనే ఎల్తైన హిమాలయాలను కొలిపించాలని నేపాల్ ప్రభుత్వం నిర్ణయించింది. మొదటిసారి హిమాలయాలను 1856లో కొలిచారు. బ్రిటీష్ సర్వేయర్ సర్ జార్జ్ ఎవరెస్ట్ బందం దీన్ని కొలచి సముద్ర మట్టానికి 8,840 మీటర్ల ఎత్తున ఉందని తేల్చింది. ఆయన పేరుతోనే హిమాలయాల్లో ఎవరెస్ట్ శిఖరం అనే పేరు వచ్చింది. ఆ తర్వాత 1955లో రెండోసారి కొలచి హిమాలయాల ఎత్తును 8,848 మీటర్లుగా తేల్చారు. అప్పటి నుంచి ఇప్పటి వరకు అదే ఎత్తును ప్రమాణంగా తీసుకుంటున్నారు. కాలక్రమంలో హిమాలయాల ఎత్తులో మార్పు వచ్చినట్లు మూడు శాస్త్రీయ పరిశోధనలు తెలియజేస్తున్నాయని, అందుకని ఎత్తును కొలవాల్సిన బాధ్యత నెపాల్కుందని నేపాల్ సర్వే విభాగం డైరెక్టర్ గణేష్ ప్రసాద్ భట్టా తెలిపారు. ఈ సర్వేకు దాదాపు 15 లక్షల డాలర్లు ఖర్చవతాయన్నది ఓ అంచనా. నేపాల్‌లోని ఉదయపూర్ జిల్లాలో సముద్ర మట్టానికి దాదాపు 1500 మీటర్ల ఎత్తులో కొంతమంది సర్వేయర్లు ఎవరెస్ట్‌ను కొలవడం మొదలు పెట్టారని నేపాల్ అధికారులు తెలిపారు. ప్రతి రెండు కిలీమీటర్లకు ఒక స్టేషన్‌ను ఏర్పాటు చేస్తామని, ఒక్క మిల్లీమీటరు కూడా వదలకుండా కొలుస్తామని వారు చెప్పారు. జూలై మధ్యలో అధికారికంగా కొలిచే కార్యక్రమం మొదలవుతుందని, ఆగస్టు నాటికి ఊపందుకుంటుందని, దాదాపు 50 మంది సర్వేయర్లు పాల్గొంటారని వారు వివరించారు. జీపీఎస్ సాంకేతిక పరిజ్ఞానం ద్వారా అమెరికా జాతీయ జియోగ్రఫిక్ సొసైటీ 1999లో ఎవరెస్ట్ ఎత్తును కొలచి 8,850 మీటర్లని తేల్చింది. అయితే సంప్రదాయక పద్ధతుల్లో ఎత్తును కొలవలేదన్న కారణంగా దాన్ని గుర్తించేందుకు నేపాల్ ప్రభుత్వం తిరస్కరించింది. 2005లో చైనా బందం సర్వే జరిపి 8,844 మీటర్లని తేల్చింది. దాన్ని కూడా గుర్తించేందుకు నేపాల్ తిరస్కరించింది. ఎవరెస్ట్ శిఖరం అధికారికంగా నేపాల్ భూభాగంలో ఉన్న విషయం తెల్సిందే. -
మంచు కప్పేసింది
-
ఉత్తర భారతాన్ని వణికిస్తున్న మంచు
ఢిల్లీ: దేశ రాజధానిలో పొగమంచు వల్ల జనజీవనం అస్తవ్యస్తమవుతోంది. దట్టమైన పొగమంచు కప్పుకోవడంతో రైళ్ల రాకపోకలకు తీవ్ర అంతరాయం వాటిల్లుతోంది. ప్రస్తుతం మంచు ఎఫెక్ట్‌తో 17 రైళ్లు ఆలస్యంగా నడుస్తున్నాయి. 6 రైళ్ల రాకపోకల సమయాల్లో మార్పులు చేయగా మరో రెండు రైళ్లను తాత్కాలికంగా రద్దు చేశారు. మరోవైపు జమ్ము కాశ్మీర్లో విపరీతమైన మంచు కురుస్తుండటంతో.. జమ్ము నుంచి శ్రీనగర్ వెళ్లే జాతీయ రహదారిని మూసివేశారు. పత్నిటాప్లోని జవహర్ టన్నల్ వద్ద మంచు తీవ్రత ఎక్కువగా ఉండటంతో.. రహదారిని మూసివేస్తున్నట్లు అధికారులు తెలిపారు. దీంతో శ్రీనగర్‌కు రాకపోకలు నిలిచిపోయాయి. -
'మంచు'చేసింది
అసలే శీతాకాలం.. వణికించే చలి.. దానికితోడు దట్టమైన పొగమంచు దుప్పటి నగరాన్ని కప్పేసింది. భోగి పండుగ అయిన శుక్రవారం తెల్లవారుజాము నుంచి ఎనిమిది గంటల వరకు ఎదురుగా ఏముందో కూడా కనిపించనంతగా మంచుతెరలు ప్రజలను ఉక్కిరిబిక్కిరి చేశాయి. నగరాన్ని మంచు ముంచేసింది. దట్టమైన పొగమంచు భోగి పండగకు స్వాగతం పలికింది. సిటిజనులు మంచుకురుస్తున్న వేళ నిత్య కార్యక్రమాల్లో మునిగిపోయారు. – విశాఖపట్నం -
చలి పంజా..
11.4 డిగ్రీల కనిష్ట ఉష్ణోగ్రత నమోదు సాక్షి, సిటీబ్యూరో: సంక్రాంతి సమీపిస్తున్న తరుణంలో నగరంపై చలి పంజా విసురుతోంది. వేకువజామున కురుస్తున్న మంచు, ఉదయం, రాత్రి వేళల్లో వీస్తున్న శీతలగాలులు సిటీజన్లను గజగజలాడిస్తున్నాయి. శుక్రవారం సాధారణం కంటే 4 డిగ్రీలు అనూహ్యంగా ఉష్ణోగ్రతలు పడిపోవడం గమనార్హం. తెల్లవారుజామున కనిష్టంగా 11.4 డిగ్రీలు, గరిష్టంగా 30.5 డిగ్రీల మేర ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. చలితీవ్రత పెరగడంతో జలుబు, వైరల్ జ్వరాలతో జనం సతమతమవుతున్నారు. చలితీవ్రత పెరగడంతో వాహనదారులు, పాదచారులు, వృద్ధులు, రోగులు, చిన్నారులు విలవిల్లాడుతున్నారు. స్వెట్టర్, మంకీక్యాప్, జర్కిన్ లేనిదే బయటికి వెళ్లలేని పరిస్థితి నెలకొనడంతో ఆయా దుకాణాల వద్ద కొనుగోళ్లు పెరిగాయి. రోగులు, చిన్నారులు చలిబారిన పడకుండా జాగ్రత్తలు తీసుకోవాలని స్పష్టంచేస్తున్నారు. రాగల 24 గంటల్లో ఉష్ణోగ్రతల్లో స్వల్ప హెచ్చుతగ్గులుంటాయని బేగంపేట్‌లోని వాతావరణ శాఖ తెలిపింది. -
అబ్బురపరిచే అందాన్నిసంతరించుకున్న సహారా
-
ముత్యాల పందిరి
-
హిమము.. మనము.. వేకువ దీపము..
మంచు పాడే సుప్రభాతానికి మనం తల మాత్రమే ఆడించం. ఒళ్లంతా ఒణికిస్తాం. చలి కదా. కౌగిలించుకోవడానికి వస్తుంది. మెడలో చేతులు వేస్తుంది. వద్దు.. వద్దు... కాస్త దూరం ఉండు అని దానిని దూరం పెట్టడానికి రగ్గు కప్పుకుంటాం. స్వెటర్ ధరిస్తాం. మఫ్లర్ మెడకు చుట్టుకుంటాం. తలకు ఉన్ని టోపీ ధరిస్తాం. వింటుందా శీతల పవనం? ఇది నా కాలం. నేను వచ్చి వెళ్లే కాలం. మీరు పిలిచినా పిలవకపోయినా సరే మీ ఇళ్లల్లోకి అడుగు పెట్టాల్సిందే అని తెరచిన చీకటిలో నుంచి నెర్రెలిచ్చిన గోడల లోనుంచి పగుళ్లు బారిన పైకప్పుల్లో నుంచి ఇళ్లల్లోకి వచ్చేస్తుంది. అప్పుడిక చేసేదేముంది? కుంపటి దగ్గర కూలబడటమే. నిజానికి చలి చాలా మంచిది. అందరినీ దగ్గర చేస్తుంది. దగ్గర దగ్గరగా కూర్చొ నేలా చేసి వారి మనసుల్లో పరస్పరం వెచ్చని అభిమానం పెంచుతుంది. టీ పొగలను ముఖాన ఊదుతుంది. ఎండ విలువ తెలిసొచ్చేలా చేస్తుంది. ధాన్యాన్ని ఇంటికి తెస్తుంది. విష్ణువుకు ప్రీతికరమైన మార్గశిరాన్ని తెస్తుంది. ధనుర్మాసపు ముగ్గులను ముంగిళ్ల ముందు పరుస్తుంది. గుమ్మడిపూలు, డిసెంబరాలు, మంచులో తడిసిన ముద్దబంతులు... ఇవన్నీ చలికాలపు కానుకలు. వేడి నీళ్ల స్నానమూ వేడి వేడి భోజనమూ చలిమంటా... ఇవన్నీ ఎంత సుఖాన్ని ఇస్తాయో ఇంత చలిలో కూడా భగవంతుడా నీ మీద నా మనసు లగ్నం తప్పదు అని కోనేట మునిగి పవిత్ర స్నానం ఆచరించడం కూడా అంతే సంతృప్తిని ఇస్తాయి. బద్ధకం వల్ల నిద్ర లేవని మగవాళ్లు, స్కూళ్లకు వెళ్లడానికి మారాము చేసే చిన్నవాళ్లు, పొగమంచు పూలకుండీలు, ఆ దూరాన దేవాలయపు గంట మరెక్కడో అజా పిలుపు, ఎక్కడే వేలాడగట్టిన క్రిస్మస్ తార – ఇవన్నీ చలికాలాన కొత్త అనుభూతులు పంచే అనుభవాలు. ఈ కాలంలో మార్నింగ్ వాక్ ఒక గొప్ప ప్రసాదం. మంచుకప్పిన ఒంటరి దారిలో అడుగులేస్తూ నడవడం ఒక ఉల్లాసం. రాత్రి పూట కిటికీలన్ని మూసి దీపాలను మందగింప చేసి రేడియో వింటే అదో పెద్ద మన్చాహే గీత్. అనవసర వేళలో అనవసర కాఫీ తాగడం కూడా ఈ కాలపు వైచిత్రే. పులకించే మనసు ఉండాలే కాని చలికి మించిన నెచ్చెలి ఉండదు కదా! -
ఎడారిలో మంచు కురిసింది!
గల్ఫ్ దేశాలు అంటే ఎవరికై నా ముందుగా గుర్తుకొచ్చేది అక్కడి ఎడారులే. కానీ, ఇప్పుడు మాత్రం అక్కడి ఎడారులన్నీ తెల్లటి మంచుతో మెరిసిపోతున్నాయి. జనం ఏసీలు వేసుకోడానికి బదులు రూం హీటర్లు పెట్టుకోవాల్సి వస్తోంది. బయటకు వెళ్తే ఎప్పుడూ లేనట్లుగా స్వెటర్లు, మఫ్లర్లు లాంటి దుస్తులతో వెళ్లాల్సి వస్తోంది. ఆరు బయట కురుస్తున్న మంచుతో అమెరికా లాంటి దేశాల్లో కనబడే ’’స్నోమాన్’’ బొమ్మలు కూడా కనిపిస్తున్నాయి. ఒక్కసారిగా ఉష్ణోగ్రతలు -3 డిగ్రీల సెల్సియస్ స్థాయికి పడిపోయాయి. దేశంలోని ఉత్తర ప్రాంతాల్లో చలిగాలులు వీస్తున్నాయి. సాధారణంగా ఇక్కడ అక్టోబర్ వరకు ఓ మాదిరి వర్షపాతం ఉంటుంది. కానీ ఇప్పటికీ అక్కడ వర్షాలు కొనసాగుతూనే ఉన్నాయి. సాధారణంగా ఇక్కడ శీతాకాలంలో ఇంత పెద్ద ఎత్తున మంచు పడటం ఉండదు. దాంతో ఇప్పుడు కొత్తగా కురుస్తున్న మంచుతో సౌదీ అరేబియన్లు, అక్కడ ఉంటున్న ఇతర దేశాల పౌరులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. స్నోమాన్ బొమ్మలు చేసి వాటితో సెల్ఫీలు దిగుతున్నారు. -
స్నో'యగం'
పాడేరు రూరల్/ విశాఖపట్నం: ఏజెన్సీలో ముందస్తుగా చలిగాలులు వ్యాపిస్తున్నాయి. నవంబర్ నుంచి ఫిబ్రవరి వరకు మన్యంలో చలిగాలులు విజృంభిస్తాయి, పొగమంచు దట్టంగా కురుస్తుంది. అయితే బుధవారం సాయంత్రం నుంచే మన్యంలో చలిగాలులు ప్రారంభమయ్యాయి. రాత్రంతా ఉష్ణోగ్రతలు తగ్గుముఖం పట్టడంతో ప్రజలను చలి వణికించింది. గురువారం తెల్లవారుజాము నుంచి పొగమంచు దట్టంగా కురిసింది. ఉదయం 8గంటల వరకు మంచు తెరలు వీడలేదు. వాహన చోదకులు లైట్లు వేసుకునే వాహనాలను నడిపారు. మన్యాన్ని మంచు కమ్ముకోవడంతో సాలెగూడులు మంచు బిందువులతో ఆకర్షించాయి. గురువారం వేకువజామున 4 గంటల నుంచే అన్ని ప్రాంతాల్లో మంచు దుప్పటి పరుచుకుంది. ఉదయం 9 గంటల వరకు మంచు తెరలు వీడలేదు. కొంతమంది గిరిజనులు చలిమంటలు కాగుతూ ఉపశమనం పొందారు. సముద్ర మట్టానికి 3500 అడుగుల ఎత్తులో ఉన్న పర్యాటక ప్రదేశమైన మండలంలోని డల్లాపల్లి ప్రాంతంలో 14డిగ్రీలు, మోదకొండమ్మ అమ్మవారి పాదాలులో 16డిగ్రీలు, మినుములూరు కాఫీ పరి«శోధన కేంద్రంలో 17 డిగ్రీలు, పాడేరు పరిసర ప్రాంతాల్లో 18 డిగ్రీల ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. గురువారం సాయంత్రం 4గంటల నుంచే చలిగాలులు వేయడంతో ముందస్తుగానే చలికాలం ప్రారంభమైందని గిరిజనులు వాఖ్యానిస్తున్నారు. -
మైనస్ 30 డిగ్రీల్లో...ఓ అరవై రోజులు
ఏదైనా చల్లని ప్రదేశానికి ఇలా వెళ్తామో లేదో.. నిమిషాల వ్యవధిలో గజగజ వణకడం మనకి సహజం. దూరం నుంచి మంచు ఎంత ఆకర్షణీయంగా ఉన్నప్పటికీ దగ్గరికెళ్తే ఎముకల్ని సైతం కొరికెయ్యగలదు. అందుకే అలాంటి ప్రాంతాలు ఆవాసయోగ్యంగా ఉండవు. కానీ, యూరప్‌లాంటి దేశాల్లో మంచు తిప్పలు సాధారణం. ఇలా దట్టంగా మంచు కురుస్తున్నా తన కారును ముందుకే పోనిచ్చాడు స్వీడన్‌కు చెందిన పీటర్ స్కిల్‌బర్గ్. ప్రయాణం సాగించిన ఈయన ఉత్తర స్వీడన్‌లోని ఉమియా పట్టణానికి కూతవేటు దూరంలో ఉండగా మంచు దిబ్బల మధ్య ఇరుక్కుపోయాడు. కొద్దిసేపటికి వాతావరణం మారుతుందనుకుని కారులోనే ఉండిపోయాడు. అనూహ్యంగా మంచువాన ఎక్కువైంది. కారు నుంచి వెలుపలికి అడుగుపెడితే ఎముకలు కొరికేసే మైనస్ 30 డిగ్రీల ఉష్ణోగ్రత! దీంతో కారులోనే గడిపేశాడు.వెంట తెచ్చుకున్న కొద్దిపాటి స్నాక్స్‌తో కాలక్షేపం చేస్తూ కూర్చున్నాడు. ఎలా గడిచాయో ఏమోగాని రెండు నెలలు అలా గడిచిపోయాయి. స్కిల్‌బర్గ్ కారు మంచు దిబ్బల మధ్య బయటివారికి కనిపించకుండా పోయింది. ఆయన కూడా దీర్ఘ నిద్రలోకి జారుకున్నాడు. చివరకు జనవరిలో కొందరు ఆయనను కారు నుంచి బయటకు తీసేసరికి అపస్మారక స్థితిలో ఉన్నాడు. అత్యంత ప్రమాదకరమైన స్థితి నుంచి అతడు బతికి బట్టకట్టడం వైద్యులను సైతం ఆశ్చర్యపరిచింది. నిజమే రెండు నెలల పాటు అంత దట్టమైన మంచులో ఎలా ప్రాణాలు నిలబెట్టుకున్నాడో అన్నదే మిలియన్ డాలర్ల ప్రశ్న. -
స్నోయగం
గొలుగొండ: ఆరిల్లోవ అటవీ ప్రాంతంలో సోమవారం ఉదయం మంచు కురిసింది. ఉదయం దట్టంగా మంచు కురవడంతో వాహనదారులు లైట్లు సహాయంతో ప్రయాణం చేశారు. ప్రస్తుతం వర్షాలు కురుస్తున్న సమయంలో మంచు కురవడంతో పలువురు వింతఅనుభూతికి లోనయ్యారు. ఉదయం నర్సీంగబిల్లి, జానికిరాంపురం, ఆరిల్లోవ అటవీ ప్రాంతంలో ఈ మంచు ప్రభావం కనిపించింది. -
జవాను సునీల్ రాయ్ మృతదేహం లభ్యం
శ్రీనగర్ : జమ్ముకశ్మీర్ సియాచిన్‌లో మంచు తుపానులో గల్లంతు అయిన జవాను సునీల్ రాయ్ మృతదేహం లభ్యమైంది. సియాచిన్ తుర్టక్ సెక్టార్ లడక్‌లో ఆర్మీ గస్తీ బృందంపై హిమపాతం పడటంతో ఒక జవాను మృతిచెందగా, మరో జవాను నిన్న గల్లంతు అయిన విషయం తెలిసిందే. గాలింపు చర్యల్లో భాగంగా సునీల్ రాయ్ మృతదేహాన్ని గుర్తించినట్లు ఆర్మీ అధికారి ఒకరు శనివారం తెలిపారు. మృతి చెందిన సునీల్ రాయ్‌కు తల్లిదండ్రులతో పాటు ఇద్దరు సోదరులు ఉండగా, ఇక తమాంగ్కు భార్య, ఆరేళ్ల కుమార్తె ఉన్నారు. ఇద్దరు జవాన్ల కుటుంబాలకు ఆర్మీ కమాండర్, లెఫ్టినెంట్ జనరల్ డీఎస్ హుడా తన సంతాపాన్ని ప్రకటించారు. గత నెలలో సియాచిన్ గ్లేసియర్‌లో హిమపాతం దెబ్బకు లాన్స్ నాయక్ హనుమంతప్పతో పాటు పది మంది సైనికులు మత్యు ఒడికి చేరిన విషయం తెలిసిందే. -
అక్కడ నిత్యం మృత్యువుతో పోరాటమే...
కారకోరమ్: ప్రపంచంలోనే అత్యంత ఎత్తై యుద్ధ క్షేత్రంగా పేరుగాంచిన సియాచిన్ మంచు పర్వత శ్రేణుల్లో శత్రు సేనలను ఎదుర్కోవడం చాలా సులభం. అక్కడి వాతావరణ పరిస్థితులను ఎదుర్కోవడమే చాలా కష్టం. అక్కడ భారత సైనికులు నిత్యం సాగించేది జీవన్మరణ పోరాటమే. అక్కడ పొరపాటున గ్లౌజు లేకుండా తుపాకీ ట్రిగ్గర్ను 15 సెకండ్లపాటు పట్టుకున్నామంటే చేతి వేళ్లకు ‘ఫ్రాస్ట్‌బైట్ (అతి శీతలం వల్ల జన్యువులు చచ్చిపోవడంతో పుండవడం)’ వస్తుంది. వెంటనే ఆ వేళ్లను కోసివేయాల్సిందే. సాక్స్ నుంచి బొటన వేళ్లు బయటకు వచ్చినా పరిస్థితి అంతే. ఒంటిలో అంగుళం కూడా వాతావరణానికి ఎక్స్పోజ్ కాకుండా నిండా చలి దుస్తులు ధరించాల్సిందే. సముద్ర మట్టానికి దాదాపు 19వేల అడుగుల ఎత్తులో శత్రువుల ఉనికి కోసం నిరంతర నిఘా కొనసాగిస్తున్న భారత సైనికులకు నిద్ర పట్టదు. ఆకలి వేయదు. కంటి చూపు మసకబారుతుంది. గొంతు పూడుకపోతోంది. మాట సరిగ్గా రాదు. మతి మరుపు ముంచుకొస్తుంది. ఈ లక్షణాలు ఎక్కువైనప్పుడు వారిని బేస్ క్యాంప్‌కు తీసుకొచ్చి చికిత్స చేస్తారు. సరైన ఆహారం కూడా అందుబాటులో ఉండదు. మైనస్ 45 డిగ్రీల నుంచి మైనస్ 60 డిగ్రీల వరకు శీతలీయంగా ఉండే సియాచిన్ మంచు పర్వతాల్లో గాలిలో ఆక్సిజన్ శాతం కేవలం పది శాతం (మైదాన ప్రాంతాలతో పోలిస్తే) మాత్రమే ఉంటుంది. ఆపిల్ పండుగానీ, నారింజ పండుగానీ క్షణాల్లోనే క్రికెట్ బాల్లా గట్టిగా తయారవుతుంది. ఆలుగడ్డను సుత్తిపెట్టి కొట్టినా ముక్కలవదు. అందుకని సైనికులు ఎక్కువగా కేన్‌లో భద్రపరిచిన డ్రై ఫుడ్‌నే తీసుకుంటారు. అది కూడా అతి తక్కువ మోతాదులో. నెలకు ఒక్కసారో, రెండు సార్లో తాజా ఆహారం అందుతుంది. చీతా హెలికాప్టర్ల ద్వారా సైన్యం 20 వేల అడుగులో తాజా ఆహార పదార్థాలను పడేసి వెళుతుంది. శత్రువుల కంటపడకుండా క్షణాల్లో పని ముగించాల్సి ఉంటుంది. భారత సైనికులు కనపడని శత్రువు కోసం కళ్లు కాయలు కాసేలా నిరంతర నిఘా కొనసాగించడంతోపాటు అస్తమానం కిరోసిన్ స్టౌను వెలిగించి తుపాకులను ఎప్పటికప్పుడు వేడిచేస్తుండాలి. లేకపోతే తుపాకీ గొట్టం మంచుతో గడ్డకట్టుకుపోతుంది. గంటకు వంద కిలోమీటర్ల వేగంతో శీతల గాలులు వీస్తూనే ఉంటాయి. నెలకు మూడువారాలు ఈ గాలులను తట్టుకొని నిలబడాల్సిందే. నెలకు ఒకసారి మాత్రమే స్నానం చేస్తారు. డీఆర్డీవో ప్రత్యేకంగా తయారు చేసిన టబ్‌లోనే స్నానం చేయాలి. రోజూ కళ్లు మాత్రమే కడుక్కుంటారు. మంచు కరగించి ఆ నీటినే తాగుతారు. 20 లీటర్ల నీటికోసం దాదాపు గంటసేపు మంచును వేడి చేయాల్సి ఉంటుంది. మంచు తుపానుల కారణంగా గడచిన 30 ఏళ్లలో 846 మంది భారత సైనికులు మరణించారని లోక్‌సభలో ప్రభుత్వమే ప్రకటించింది. శత్రువుల కాల్పుల్లో చనిపోయింది వారిలో పదోవంతు మంది కూడా ఉండరు. ఇంతటి దారుణ పరిస్థితులు సరిహద్దుకు ఆవల కాపలాకాస్తున్న పాకిస్తాన్ సైనికలకు ఎదురుకావు. కారణం...మంచు పర్వతాలకు దిగువున వారి సైనిక స్థావరం ఉంది. వారు అక్కడి నుంచి పర్వతాలపైకి ఎక్కకూడదు. భారత సైనికులు పర్వతాల నుంచి ఆవలివైపు కిందకు దిగకూడదు. అందుకోసమే ఇరువైపుల కాపలా కొనసాగుతోంది. ఇంతటి మృత్యువాతావరణంలో సైనిక నిఘాను కొనసాగించాల్సిన అవసరం ఉందా ? అంటూ అక్కడి భారత సైనికులు తరచూ చర్చించుకున్న సందర్భాలు అనేకం. ఫిబ్రవరి మూడవ తేదీన మంచు తపానులో కూరుకుపోయి చనిపోయిన పది మంది సైనికులతో కలసి అక్కడ రెండు సార్లు విధులు నిర్వహించి ప్రస్తుతం సెలవులో ఉన్న ఓ సైనికుడి కథనం ఇది. పేరు వెల్లడించడానికి ఆయన ఇష్టపడలేదు. -
పొగమంచుతో నిలిచిన వాహనాలు
నందిగామ: భారీగా కమ్ముకున్న పొగమంచు కారణంగా హైదరాబాద్-విజయవాడ జాతీయ రహదారిపై వాహనాల రాకపోకలకు అంతరాయం ఏర్పడింది. శనివారం ఉదయం నుంచి దట్టమైన మంచు కురుస్తుండటంతో నందిగామ, దొనబండ, జగ్గయ్యపేట పరిసర ప్రాంతాల్లో దాదాపు 30 కిలోమీటర్ల మేర మంచు కమ్ముకుంది. దీంతో వాహనదారులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. హెడ్లైట్లు వేసుకున్నా వాహనం అతి సమీపంలోకి వచ్చే వరకు కనిపించక పోవటంతో తక్కువ వేగంతో నడుపుతున్నారు. కొన్ని చోట్ల వాహనాలను నిలిపి వేసుకున్నారు. -
అమెరికా అతలాకుతలం
-
మంచు జల్లుల హాయిలో!!
-
మంచు లంచ్
మంచి లంచ్ గురించి వినే ఉంటారు. మీకు సర్ప్రైజ్ ఇవ్వడానికి జమ్ము-కశ్మీర్ నుంచి మంచు లంచ్ తెచ్చాం! ఈ చలికాలం కశ్మీర్‌ని తలచుకుంటూ... వేడి వేడిగా స్టార్టర్స్‌కి టీ అండ్ స్నాక్.. మెయిన్ కోర్స్‌కి నోరూరించే పలావ్.. డెజర్ట్‌లో డ్రైఫ్రూట్ షుఫ్తా.. ఈ త్రీ-కోర్స్ లంచ్ లాగించండి. కెహ్వా (కాశ్మీర్ టీ) దీనిని ముగిలీ ఛాయ్ అని కూడా అంటారు. ఇది కాశ్మీరీయుల తేనీరు. అతిథులకు ముందు, సూప్ బదులుగా వేడి వేడి తేనేటిని అందిస్తారు. కావల్సినవి: 4 కప్పుల నీళ్లు, చిటికెడు దాల్చిన చెక్క పొడి, 1/2 టీ స్పూన్ తాజా తేయాకు (పొడి చేయాలి), 2 ఏలకులు, 3 బాదంపప్పులు (పొడి చేయాలి), పంచదార - రుచికి తగినంత. (ఈ టీ లో పంచదారకు బదులుగా తేనెను కూడా కలుపుకోవచ్చు.) తయారీ: పాత్ర లేదా టీ కెటిల్లో నీళ్లు పోసి, అందులో తేయాకులను వేసి మరిగించాలి. దీంట్లో తగినంత పంచదార, బాదాం, దాల్చిన చెక్క, ఏలకుల పొడులను వేసి కలిపి పైన మూత పెట్టి మరిగించి కప్పులో పోయాలి. టీ తాగేటప్పుడు తేయాకు రావడం ఇష్టపడని వారు ముందుగా తేయాకును వడకట్టుకొని తర్వాత మిగతా పొడులను వేసి మరిగించాలి. దీనిని వేడి వేడిగా సర్వ్ చేయాలి. యాజి ఇది కాశ్మీర్ గ్రామీణ ప్రాంత స్నాక్.కావల్సినవి: కేజీ బియ్యప్పిండి, టేబుల్‌స్పూన్ ఉప్పు, పావు కేజీ వాల్నట్స్, టేబుల్‌స్పూన్ జీలకర్ర, వాము పొడి, పావు కప్పు ఆవనూనె లేదా రిఫైండ్ ఆయిల్.తయారి: వాల్‌నట్స్‌ను నీళ్లలో వేసి ఉడికించి, ఒక పాత్రలోకి తీసుకోవాలి. దీంట్లో ఉప్పు, రెండు కప్పుల నీళ్లు, జీలకర్ర, వాము, బియ్యప్పిండి వేసుకుంటూ బాగా కలపాలి. ఈ మిశ్రమం మృదువుగా అవడానికి తగినన్ని నీళ్లు కలుపుకోవచ్చు. కలిపిన పిండి ముద్దను కొద్దిగా తీసుకొని ‘కప్పు’ షేప్(దీనిని యాజి అంటారు) లో చేతులతోనే మౌల్డ్ చేయాలి. ఇలా చేసుకున్నవాటిని నూనెలో వేసి బాగా వేయించుకోవాలి. వేడిగానూ, చల్లగానూ, టీ తోనూ వీటిని సర్వ్ చేయవచ్చు. కాశ్మీర్లో కొన్ని చోట్ల వీటిని ఆవిరిమీద అరగంటపాటు ఉడికిస్తారు. రిస్తా కావల్సినవి: కేజీ గొర్రె మాంసం, అరకప్పుడు ఆవ నూనె, అర టీ స్పూన్ చొప్పున సోంపు, అల్లంపొడి, పసుపు, కారం, గరం మసాలా, మిరియాలపొడి, దాల్చిన చెక్కపొడి. 2 టేబుల్స్పూన్ల తరిగిన ఉల్లిపాయలు, తగినంత ఉప్పు, చిటికెడు కుంకుమపువ్వు. తయారి: పాత్రలో నూనె పోసి వేడయ్యాక వెల్లుల్లి, జీలకర్ర వేగాక, కారం, పసుపు వేసి దీంట్లో లీటర్ నీళ్లు పోసి అల్లంపొడి వేయాలి. బాగా మరిగాక దీంట్లో విడిగా వేయించుకున్న ఉల్లిపాయ ముక్కలు, ఉప్పు వేసి కలపాలి. ఈ నీళ్లు మరుగుతుండగా మెత్తటి మటన్ బాల్స్ వేసి సన్నని మంటమీద అరగంటపాటు ఉడికించాలి. మాంసం ఉడికి, గ్రేవీ చిక్కగా అయ్యాక అందులో ఏలకులు, దాల్చిన చెక్క పొడి, గరంమసాలా, కుంకుమపువ్వు వేసి స్టౌ సిమ్‌లో ఉంచి మరో ఐదు నిమిషాలు ఉంచాలి. వేడి వేడిగా ఈ రిస్తాను భోజనంలోకి వడ్డించాలి. కాశ్మీరీ పులావ్ కావల్సినవి: 3 కప్పుల బాస్మతీ బియ్యం, ఐదున్నర కప్పుల నీళ్లు, అర కప్పుడు వెన్నతీయని పాలు(హోల్‌మిల్క్), టేబుల్ స్పూన్ నిమ్మరసం, 2 టేబుల్స్పూన్ల నెయ్యి లేదా బటర్, 3 ఏలకులు, 3 లవంగాలు, 2 అంగుళాల దాల్చిన చెక్క, బిర్యానీ ఆకు, అర కప్పుడు సన్నగా తరిగిన క్యారట్ ముక్కలు, అరకప్పుడు పచ్చి బఠాణీలు, పావుకప్పు పైనాపిల్ ముక్కలు, పావుకప్పు దానిమ్మ గింజలు, 8 పిస్తాపప్పు, పావుకప్పు కిస్మిస్, ఒక కట్ట ఉల్లికాడలు తయారి: బియ్యాన్ని కడిగి 30 నిమిషాలు నానబెట్టాలి. వెడల్పాటి పెద్ద పాత్ర లేదా నాన్‌స్టిక్ పాన్‌ను మీడియమ్ హీట్‌లో ఉంచి అందులో బటర్ వేసి వేడి చేయాలి. దీంట్లో ఏలకులు, లవంగాలు, బిర్యానీ ఆకు, దాల్చిన చెక్క వేసి కొద్దిగా వేయించాలి. దీంట్లో వడకట్టిన బియ్యం వేసి కొద్దిగా వేగనివ్వాలి. తర్వాత నీళ్లు, పాలు పోసి కలపాలి. తర్వాత తగినంత ఉప్పు వేసి కలపాలి. పైన నిమ్మరసం వేసి కలపకుండానే బియ్యాన్ని ఉడికించాలి. పైన మూతపెట్టి మీడియమ్ హీట్ ఉంచి ఉడికించాలి. పూర్తిగా ఉడికిందా లేదా సరిచూసుకొని, మంట తీసేయాలి. క్యారట్ ముక్కలు, పచ్చబఠాణీ, పైనాపిల్, నెయ్యిలో వేయించిన డ్రై ఫ్రూట్స్ అన్నీ ఉడికిన అన్నంలో వేసి కలపాలి. వేడి వేడిగా వడ్డించే ముందు దానిమ్మ గింజలు, సన్నగాతరిగిన ఉల్లికాడలతో పైన గార్నిష్ చేయాలి. కావాలనుకుంటే వాల్నట్స్, బాదంపప్పులు, ఆపిల్ ముక్కలు, ద్రాక్ష పండ్లు గార్నిష్‌గా వాడుకోవచ్చు. శుఫ్తా డిజర్ట్ కాశ్మీరీ సంప్రదాయ వంటకాలలో చివరలో తప్పక ఉండే స్వీట్ ఇది. రకరకాల డ్రై ఫ్రూట్స్‌ని కొద్దిగా పంచదార పాకంతో కలిపి తయారుచేస్తారు.కావల్సినవి: ఎండు ఖర్జూరం, ఎండుకొబ్బరి, బాదంపప్పు, పిస్తా, జీడిపప్పు వాల్నట్స్... ఇలా అన్ని రకాల డ్రై ఫ్రూట్స్ అరకప్పు చొప్పున, అరకప్పు నెయ్యి, 2 కప్పుల పంచదార, టీస్పూన్ మిరియాల పొడి, అల్లం తరుము, ఏలకుల పొడి, చిటికెడు కుంకుమ పువ్వు, 2 టేబుల్ స్పూన్ల ఎండు గులాబీ రేకలు. తయారి: డ్రై ఫ్రూట్స్ అన్నీ తగినన్ని నీళ్లు పోసి అరగంట నానబెట్టాలి. వడకట్టి మరో పాత్రలోకి తీసుకోవాలి. ఖర్జూరాలను సన్నగా తరిగి గింజలు తీసేయాలి. పాన్‌లో నెయ్యి వేసి వేడి చేసి కొబ్బరిని ముదురు గోధుమరంగు వచ్చేవరకు వేయించుకోవాలి. కొబ్బరి ముక్కలను ప్లేట్లోకి తీసుకొని, అదే నెయ్యిలో పనీర్ ముక్కలు వేసి వేయించాలి. దాంట్లో నీళ్లన్నీ ఆరిపోయాక డ్రై ఫ్రూట్స్ వేయాలి. తర్వాత కొబ్బరి ముక్కలు, పంచదార, మిరియాలపొడి, ఏలకుల పొడి, అల్లంపొడి, దాల్చిచెక్క పొడి, కుంకుమపువ్వు, గులాబీ రేకలు వేసి పంచదార అంతా కరిగేవరకు వేడి మీద ఉంచాలి. వెంటనే దించి సర్వ్ చేయాలి. డా.బి.స్వజన్ మినిస్ట్రీ ఆఫ్ టూరిజమ్ (ఐఐటిటిఎమ్) భువనేశ్వర్ -
మంచు కాగడా
షబ్నమ్ అంటే తుషారం. సులువుగా చెప్పాలంటే మంచు. హల్లా బోల్... నినదించు... అని అన్న సఫ్దార్ హష్మి ఆమెకొక ధిక్కార స్వరం ఇచ్చాడు. తాను రాలిపోతూ ఆమె చేతికి చైతన్యం అనే కాగడా అందించాడు. మాస్కోలో చదువుకుంటున్న యువతి షబ్నమ్... చదువును వదిలేసి కెరీర్‌ని వదిలేసి... ఏసి గదుల్లోని సౌఖ్యాలను వదిలేసి జనంలో పడింది. జనంతో నడిచింది. మైనారిటీ స్త్రీల, దళిత మహిళల ఆక్రందనలకు ప్రతిధ్వని అయ్యింది. మంచు మండదని ఎవరన్నారు? షబ్నమ్ కాగడాని అందుకోండి. 1989... జనవరి. ఉత్తరప్రదేశ్ ఘజియాబాద్ మున్సిపల్ ఎన్నికల సమయం. ప్రచారం జోరు మీద ఉంది. 21 ఏళ్ల షబ్నం హష్మి అప్పుడే మాస్కో నుంచి సెలవులు గడపడానికి వచ్చింది. ఆమె అక్కడ పోస్ట్‌గ్రాడ్యుయేషన్ చేస్తోంది. ఇక్కడ అన్నా వదినలతో సంతోషంగా నాలుగు రోజులు గడుపుదామని వచ్చింది. కాని ఆమె ఊహించినట్టుగా సంతోషం ఎదురవలేదు. విషాదం అలముకుంది. ఆమె అన్న సఫ్దార్ హష్మీ ప్రజాఉద్యమకర్త, థియేటర్ ఆర్టిస్ట్, విశేషమైన ప్రజాదరణ ఉన్నవాడు. ఆ ఎన్నికల్లో ప్రజలను చైతన్యపర్చడం కోసం ‘హల్లా బోల్’ (నినదించు!) అనే నాటకాన్ని ప్రదర్శిస్తున్నాడు. ఇది కొందరికి నచ్చలేదు. వేదిక మీద నాటకం నడుస్తుండగానే వందలాది మంది చూస్తుండగానే దుండగుల చేత సఫ్దార్ మీద దాడి చేయించారు. తీవ్రంగా గాయపడ్డాడు. ఆ రాత్రి హాస్పిటల్ ముందు వేలాదిమంది జనం. దేశమంతా వార్తలు... ప్రజాస్వామికవాదుల ఖండనలు. కాని జరగవలసిన నష్టం జరిగిపోయింది. తెల్లవారి ఆ తార రాలిపోయింది. షబ్నం కుటుంబానికి ఇది ఊహించని శోకం. అంత బాధలోనూ ఆమెది ఒకటే ఆలోచన.. అన్న ఆశయం అర్ధంతరంగా ఆగిపోకూడదు అని. ఆ బాధ్యత తను తీసుకోవాలి అనుకుంది. ఆ పూట నుంచే అమలు పర్చింది. అన్న పోయిన దుఃఖాన్ని మోస్తూనే ఆయన ఆశయాన్ని సాధించే కర్తవ్యాన్ని తలెకెత్తుకుంది. సగంలో ఆగిన హల్లాబోల్ ప్రదర్శనను దుండగులు ఎక్కడైతే ఆయనపై దాడి చేశారో అక్కడి నుంచే పునఃప్రారంభించింది. ఈసారి ప్రత్యర్థులు నిస్సహాయంగా మిగిలారు. శివంగిలా పోరాటానికి దిగిన షబ్నం ముందు తల వంచారు. నాటకం నిరాటంకంగా సాగిపోయింది. ఆ ఎన్నికల ఫలితాల మీద ఆ నాటకం చాలా ప్రభావం చూపింది. జనం షబ్నంను అన్న స్థానంలో పెట్టి చూసుకోవడానికి సిద్ధమయ్యారు. ఆ తర్వాత షబ్నం మాస్కో వెళ్లలేదు. ఇక్కడ ప్రజాఉద్యమాల్లో పాలుపంచుకుంటూ ఉండిపోయింది! పాతికేళ్లు గడిచిపోయాయి. ఇప్పుడామెకు 54 ఏళ్లు. కాని ఎక్కడ ఏ ప్రజావ్యతిరేక నిర్ణయ చర్య జరిగినా ఆమె గొంతు వినిపిస్తుంది. హల్లా బోల్! నిలదీస్తుంది. అన్హద్ (ఊఏఅఈ..యాక్ట్ నౌ ఫర్ హార్మనీ అండ్ డెమొక్రసి) నాటకం మనుషులను చైతన్య పరుస్తుంది. నిజమే. కాని ప్రదర్శన స్థలికి ఆవల చాలా జరుగుతోంది. ప్రజల మనసులను కలుషితం చేసే పని చాలా జరుగుతోంది. మతం పేరుతో విద్వేషం బీజాలు వేసుకుంటోందనీ లౌకిక భావనలకు భంగం వాటిల్లే పరిస్థితులు వస్తున్నాయని ఆమెను ఉత్తర భారతదేశంలో అప్పుడప్పుడే చోటు చేసుకుంటున్న మతఘర్షణలు, దళిత, మైనార్టీ వర్గాల స్త్రీల మీద జరుగుతున్న అత్యాచారాలు, అఘాయిత్యాలు హెచ్చరించాయి. మత ఛాందసానికి వ్యతిరేకంగా మానవత్వం కోసం ‘అన్హద్’ అనే సంస్థను ఏర్పాటు చేసిందామె. దేశంలో లౌకికత్వాన్ని కాపాడ్డంలో మిగిలిన ప్రజాఉద్యమ సంస్థలకు మద్దతుగా నిలబడింది. అంతే. అన్న మీద పగబట్టిన శక్తులే ఆమె మీద కూడా పగబట్టాయి. ప్రతిసారీ దాడులకు దిగాయి. ప్రతిసారీ ఆమె ఎదుర్కొంది. ‘నేను చేసిన పనులకు నాకు వచ్చిన అవార్డులు కాదు నిదర్శనం.. నా తల మీద పడ్డ కుట్లు’ అంటారు హష్మీ నవ్వుతూ! గుజరాత్.. గోద్రా 2002. గోధ్రా ఘటన జరిగింది. ఆ తర్వాత గుజరాత్ అంతా అల్లర్లు చెలరేగాయి. మత ఛాందసానికి వ్యతిరేకంగా పని చేస్తున్న షబ్నం వెంటనే తన భర్త గౌహర్ రజా, కొడుకును తీసుకొని అక్కడకు వెళ్లింది. పరిస్థితి చూసి హతాశురాలైంది. అప్పుడే నిర్ణయించుకుంది.. తన శేష జీవితాన్ని ఆ దమనకాండకు బలైన వారికి న్యాయం జరిపించడానికే అంకితం చేయాలని. ఇప్పటికీ ఆ నిర్ణయానికి కట్టుబడి ఉంది హష్మీ. గోద్రా అల్లర్లలో గ్యాంగ్‌రేప్‌కి గురైన 50 మందిని ఇంటర్వ్యూ చేసింది హష్మీ. ‘ఆ ఇంటర్వ్యూలలో బయటపడ్డ నిజాలు నా కాళ్ల కింది భూమిని కదిలించాయి. నాగరికులమనుకునే మనం ఇంత దారుణానికి పాల్పడగలమా అని షాకయ్యాను. అల్లర్ల కంటే ముందు స్త్రీలను ఎలా వెంటాడాలి? ఎలా రేప్ చేయాలి? అని శిక్షణ ఇచ్చారట. అలాంటి వాళ్లంతా ఈ రోజు సమాజంలో స్వేచ్ఛగా.. నిర్భయంగా తిరుగుతున్నారు. ఎంత అమానవీయం?’ అంటుంది హష్మీ. రేప్‌కి గురైన స్త్రీలకు, అనాథలైన పిల్లలకు పునరావాసం కల్పించడంలో అనహద్ చేసిన కృషి అంతా ఇంతా కాదు. మతసామరస్య భావన కోసం ఈ రేప్ బాధితులతో కశ్మీర్ నుంచి కన్యాకుమారి వరకు ఓ యాత్రనూ నిర్వహించింది. ‘ఒక మనిషిని మరో మనిషి చంపాలని ఏ మతమూ చెప్పదు’ అంటుంది షబ్నమ్. భన్వరీ కేస్ 1992లో రాజస్థాన్‌లో బాల్యవివాహాన్ని అడ్డుకున్నందుకు ఊళ్లోని అగ్రకులాల వాళ్లచేత గ్యాంగ్ రేప్‌కి గురైంది భన్వరీదేవి. ఆమె న్యాయపోరాటానికి సంఘీభావం తెలిపింది షబ్నమ్ హష్మీ. ‘చేయాల్సినదానితో పోలిస్తే మేం చేస్తున్నది చాలా తక్కువే. ప్రయత్నం చిన్నదే అని ఎక్కడా ఆగిపోం. ఇప్పుడు మాకున్న ప్రధాన డిమాండ్లలో ‘మత హింస బిల్’ ఒకటి. దీన్ని ప్రవేశపెట్టాలని ప్రజాఉద్యమ సంస్థలన్నీ రికమెండ్ చేస్తున్నాయి. మా సిఫార్సులను నేషనల్ అడ్వయిజరీ కౌన్సిల్ కూడా ఒప్పుకుంది. అసహనం అంతకంతకూ పెరిగిపోతున్న ప్రస్తుత పరిస్థితుల్లో ఈ బిల్‌ను తేవాల్సిన అవసరం ఎంతైనా ఉంది’ అంటారు షబ్నం హష్మి. ఢిల్లీ వేదికగా పనిచేసే ‘అన్హద్’ అంటే హద్దులు లేనిదీ అని అర్థం. నిజంగానే వీళ్ల ఈ సంస్థ చేసే పనులకు ఆకాశమే హద్దు. కశ్మీర్ నుంచి కన్యాకుమారి దాకా ప్రతి ప్రజాఉద్యమ సంస్థకు అన్హద్ సంఘీభావం తెలపడమే కాదు.. భాగస్వామ్యమూ నెరుపుతుంది. ప్రతికూల పరిస్థితులు ఎన్ని ఎదురైనా అలుపెరగక పోరాడుతున్న ఈ ధీర వనితను నోబెల్పీస్ ప్రైజ్కీ సిఫారసు చేసింది ఆ కమిటీ. - (ది వీకెండ్లీడర్స్ డాట్ కామ్ సౌజన్యంతో) రాజీలేని పోరాటం మానవ హక్కుల, ప్రజాస్వామ్య హక్కుల పట్ల ప్రజల్లో చైతన్యం కల్పించే పోరాటంలో జీవితాన్ని అంకితం చేసిన షబ్నం హష్మీ ఢిల్లీ వేదికగా పనిచేస్తున్నారు. ఇటీవల దేశంలో అసహనం అలుముకుందంటూ నిరసన వ్యక్తం చేస్తున్న బృందాలతో కలిసి ఆ కార్యక్రమాల్లో చురుకుగా పాల్గొంటున్నారు ఆమె. 2002 అల్లర్ల తర్వాత వచ్చిన గుజరాత్ అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ విజయానికి కాంగ్రెస్ ఉదాసీనతే కారణమని కేంద్రంలో తను సభ్యత్వం వహిస్తున్న... సెంట్రల్ అడ్వయిజరీ బోర్డ్ ఆఫ్ ఎడ్యుకేషన్, మౌలానా అజాద్ ఎడ్యుకేషన్ ఫౌండేషన్, నేషనల్ మానిటరింగ్ కమిటీ ఫర్ మైనార్టీ ఎడ్యుకేషన్, నేషనల్ లిట్రసీ మిషన్ కౌన్సిల్, అసైన్మెంట్ అండ్ మానిటరింగ్ ఆథారిటీ ఆఫ్ పస్లానింగ్ కమిషన్ మొదలైన అయిదు గవర్నమెంట్ ప్యానల్స్ నుంచి వైదొలగిన రాజీలేని పోరాటం ఆమెది. -
మంచు కురిసే వేళలో..
-
మంచు కురిసే వేళలో..
-
2100 నాటికి మంచులేని ఎవరెస్ట్!
హిమాలయ హిమానీనదాలు పూర్తిగా కనుమరుగు కఠ్మాండు: ఎవరెస్ట్ పర్వత ప్రాంతంలోని గ్లేసియర్లు(హిమానీనదాలు) ఈ శతాబ్ది చివరిలోగా కనుమరుగయ్యే ప్రమాదముందని శాస్త్రవేత్తలు హెచ్చరించారు. గ్రీన్‌హౌజ్ వాయువుల ఉద్గారం వల్లే ఈ ముప్పు తలెత్తుతోందన్నారు. ఈ వాయువులను నియంత్రించకుంటే ఎవరెస్ట్ సానువుల్లోని మంచు 70 శాతం మేర కరిగిపోతుందని లేదా మొత్తమే కనుమరుగవుతుందని నేపాల్, ఫ్రాన్స్, నెదర్లాండ్స్ పరిశోధకుల బృందం అంచనా వేసింది. గ్లోబల్‌వార్మింగ్ ప్రభావంతో 21వ శతాబ్ది ముగిసేలోగా మంచు పొరలు పూర్తిగా నాశనమవుతాయని శాస్త్రవేత్తలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఉష్ణోగ్రతల్లో పెరుగుదలను బట్టి మంచు తగ్గిపోతుందన్న సంకేతాలు స్పష్టంగా కనిపిస్తున్నాయని కఠ్మాండులోని ఇంటర్నేషనల్ సెంటర్ ఫర్ ఇంటిగ్రేటెడ్ మౌంటెయిన్ డెవలప్మెంట్(ఐసీఐఎంవోడీ) అధ్యయనానికి నేతృత్వం వహిస్తున్న శాస్త్రవేత్త జోసెఫ్ షియా పేర్కొన్నారు. 2100 సంవత్సరం నాటికి ఎవరెస్ట్ వద్ద ఉన్న గ్లేసియర్లు 70 నుంచి 99 శాతం కరిగిపోతాయని తెలిపారు. ప్రధానంగా దూద్కోసి బేసిన్‌లోని అతిపెద్ద గ్లేసియర్ క్రమంగా కరుగుతోందని, ఉష్ణోగ్రతలు పెరిగితే ఇది మరింత తీవ్రమవుతుందని అధ్యయనంలో తేలింది. దీనివల్ల దిగువన కోసీ నదిలో నీరు పెరిగి నదుల ప్రవాహంపైనా ప్రభావం పడే అవకాశముందని పరిశోధకులు అభిప్రాయపడ్డారు. మంచు భారీగా కరిగిన తర్వాత తీవ్ర నీటి కొరత ఏర్పడుతుందని, దీంతో వ్యవసాయం, జల విద్యుదుత్పత్తి ప్రభావితమవుతాయని విశ్లేషించారు. గ్లేసియర్లకు సంబంధించిన గత 50 ఏళ్ల సమాచారం, గ్రీన్‌హౌజ్ వాయువుల ఉద్గారాల తదితరాలను విశ్లేషిస్తూ ఈ అధ్యయనం సాగింది. -
ఎవరెస్ట్‌పై మంచు బీభత్సం..
కఠ్మాండు: భూకంపం తీవ్రతకు ఎవరెస్ట్ పర్వతంపై మంచు చరియలు విరిగిపడ్డాయి. ఎవరెస్ట్ బేస్ క్యాంపుపై మంచు కొండలు విరిగిపడడంతో 10 మంది పర్వతారోహకులు మరణించారని అధికారులు వెల్లడించారు. వీరిలో కొందరు విదేశీయులు కూడా ఉన్నారన్నారు. ప్రమాదంలో పర్వతారోహకులు చెల్లాచెదురైనట్లు వివరించారు. పర్వతారోహకుల ట్వీట్లు ప్రపంచవ్యాప్తంగా వివిధ దేశాలనుంచి ఎవరెస్ట్ శిఖరాన్ని అధిరోహించాలని వచ్చిన అనేకమంది పర్వతారోహకులు భూకంపం ధాటికి బేస్ క్యాంపుల్లో చిక్కుకున్నారు. ఈ దుర్ఘటన నుంచి తేరుకున్న కొందరు తమ ఆత్మీయులకు క్షేమ సమాచారాన్ని ట్వీటర్లో అందించారు. ఇంగ్లండ్‌కు చెందిన డేనియల్ మజుర్ అనే పర్వతారోహకుడు మధ్యాహ్నం 12 గంటల సమయంలో ‘తీవ్ర భూకంపం ఇప్పుడే ఎవరెస్టును తాకింది. బేస్‌క్యాంపు పూర్తిగా ధ్వంసమయింది. మా బృందంలోని సభ్యులంతా బేస్‌క్యాంపు 1లో చిక్కుకున్నాం. దయచేసి మా క్షేమం కోసం ప్రార్ధించండి’ అని ట్వీట్ చేశారు. మరి కొద్ది నిమిషాల తరువాత ‘షాక్‌నుంచి తేరుకొని చూస్తే బృందంలోని సభ్యులంతా బేస్‌క్యాంప్‌లో వేలాడుతున్నాం. మంచు చరియలు మార్గాన్ని ధ్వంసం చేశాయి’ అని ట్వీట్ చేశారు. మధ్యాహ్నం మూడు గంటల ప్రాంతంలో మజర్ మరోమారు ట్వీట్ చేస్తూ ‘ బేస్ క్యాంపు 1 పూర్తిగా తుడిచిపెట్టుకుపోయింది. మా బృందం మొత్తం ఈ దుర్ఘటనలో చిక్కుకుంది’ అన్నారు. ఈ ట్వీట్‌కు సమాధానమిస్తూ అతని స్నేహితుడు మజుర్ ‘సురక్షిత స్థానానికి చేరుకో డేనియల్.. మేమంతా నీ గురించే ఆలోచిస్తున్నాం.. నువ్వు సరక్షితంగా ఇంటికి చేరుకుంటావు’ అని ట్వీట్ చేశారు. మధ్యాహ్నం 12 గంటల సమయంలో అమెరికాకు చెందిన అడ్రియాన్ బల్లింజర్ ‘ భూకంపం ఇప్పుడే ఎవరెస్ట్ బేస్‌క్యాంపును తాకింది. పెద్ద మొత్తంలో రాళ్లు, మంచు పెళ్లలు విరిగి పడుతున్నాయి. మేమంతా సురక్షితంగా ఉన్నాము. దక్షిణ భాగంలో ఉన్నవారు కూడా సురక్షితంగానే ఉంటారని భావిస్తున్నాం.. బలమైన ప్రకంపనలు ఉత్తర భాగంలో కొనసాగుతూనే ఉన్నాయి’ అని ట్వీట్ చేశారు. -
మస్తాన్ మృతదేహం తరలింపులో ఆటంకాలు
⇒ మంచు తీవ్రతతో ఇబ్బందులు పడుతున్న హెర్నన్ బృందం సంగం: నెల్లూరు జిల్లాకు చెందిన పర్వతారోహకుడు మల్లి మస్తాన్‌బాబు మృతదేహం తరలింపులో హెర్నన్ బృందానికి మంచు తీవ్ర ఆటంకం కలిగిస్తోంది. ముందుగా వేసుకున్న ప్రణాళిక ప్రకారం ఆదివారం సాయంత్రం 4 గంటలకు లాస్గ్రాట్స్ అనే ప్రాంతానికి మృతదేహాన్ని చేర్చాల్సి ఉంది. అయితే మంచు కారణంగా రోడ్డు కూడా కనపడని పరిస్థితి నెలకొనడంతో హెర్నన్ బృందం ముందుకు సాగేందుకు అవాంతరం ఏర్పడుతోంది. దీంతో ప్రస్తుతానికి బృందం గుహల వద్దకు వెనక్కు వెళ్లింది. -
టూకీగా ప్రపంచ చరిత్ర 79
ఏలుబడి కూకట్లు మంచు కరిగేకొద్దీ ఉత్తరంగా జరుగుతూ, ఉత్తర ఆఫ్రికాతీరం నుండి ఆదిమకాలంలోనే యూరప్ ఖండాన్ని చేరుకున్న ‘ఐబేరియన్’ తెగలు కొన్ని అప్పటికే యూరప్‌లో ఉన్నాయి. యూరప్ ఉత్తరార్థంలో వాటి జనసంఖ్య పలుచన. దానికితోడు సామాజిక స్థాయిలో ఎదుగుదల కూడా అంతంత మాత్రమే. అందువల్ల, తారసపడిన తెగలను తమలో జీర్ణించుకుంటూ, పోలెండ్, ఆర్మీనియా, జర్మనీ, స్కాండినేవియా ప్రాంతాల్లో ఆర్యుల ఆక్రమణ నల్లేరు మీద బండి నడకలా సాగింది. నడిమి యూరప్‌లోని రుమేనియా, హంగెరీ, ఆస్ట్రియా, స్విట్జర్లాండ్, ఫ్రాన్స్ ప్రాంతాల్లో సవాళ్లు ఎదురైనా సత్తాతో జవాబిస్తూ, స్థానికులతో పలురకాల సంబంధాలు నెరుపుతూ, దొంతర్లు దొంతర్లుగా వాళ్లు ఇంగ్లండు చేరుకున్నారు. అప్పటికి కూడా ఆ స్థానికులూ వ్యవసాయదారులు కాదు, వచ్చినవాళ్లకూ వ్యవసాయం తెలీదు. మట్టిగోడలూ, పూరికప్పుతో తాత్కాలిక మజిలీగా పనికొచ్చే గుడిసెలే తప్ప, క్రీ.పూ. 3000 వరకు అక్కడ స్థిరనివాసానికి అనువైన కట్టడం దొరకదు. పగలంతా పశువులు మేపుకుంటూ ఆరుబయట గడపడం, చీకటిపడే ముందు మందలను మళ్లించుకుని, రాత్రి వేళ తలదాచుకునేందుకు పూరిపాకకు చేరడం వాళ్ల దినచర్య. వేదాలు విధించిన కర్మకాండ ఆ ఆర్యులకు తెలిసినట్టు లేదు. అక్కడ దొరికే పొట్టిజాతి గుర్రాలు ఆహారానికేగానీ వాహనంగా పనికొచ్చేవిగావు. కాస్పియన్ సముద్రం వెనక్కు తీసిన అంచుల్లో పచ్చదనం ఏర్పడినప్పుడు ఆర్యుల దృష్టి తూర్పు దిశకు మళ్లింది. ఆ సందుగుండా వాళ్లకు ‘బొటాయ్’ నివాసులతో సంబంధాలు ఏర్పడ్డాయి. బొటాయ్ ప్రాంతం ఇప్పటి కజికిస్థాన్లోని పడమటి రాష్ట్రం. అక్కడి నివాసులు మంగోలియన్ తెగలనుండి ఎదిగినవాళ్ళు; వ్యవసాయం, లోహం తెలిసినవాళ్లు; క్రీ.పూ. 4000 సంవత్సరాల నాడే వాళ్లు గుర్రాలను మచ్చిక చేసుకున్నవాళ్లు. అక్కడ దొరికేది భారీ శరీరం, అమితమైన వేగంగల గుర్రాలజాతి. వ్యవసాయానికీ, చక్రాలుండే బండ్లును లాగటానికీ వాళ్లు అప్పటికే గుర్రాలను ఉపయోగిస్తున్నారు. వాళ్లతో పరిచయం ఏర్పడిన తరువాతే ఆర్యులకు గుర్రమూ, దానివల్ల ప్రయోజనమూ తెలిసొచ్చింది. వాళ్ల స్నేహంవల్ల గుర్రాలూ, వాటి తర్ఫీదు, రథాలు ఆర్యులకు అందుబాటయ్యాయి. వాళ్ల సంపర్కం వల్ల ఆర్యులకు ఉరల్ పర్వతాల తూర్పు పాదం వెంట ఉత్తరంగా ఉన్న రష్యాలోకీ, కాస్పియన్ సముద్రం తూర్పు తీరం వెంట దక్షిణ దిశగా పర్షియా (ఇప్పటి ఇరాన్)లోకి మార్గం దొరికింది. కాస్పియన్ తూర్పుతీరం వెంట దక్షిణంగా దిగివస్తున్న ఆర్యుల్లో యజ్ఞ యాగాదుల ఆచూకీ కనిపిస్తుంది. అక్కడి మొదలు ఆఫ్గనిస్తాన్ వరకు ‘సోమలత’ సమృద్ధిగా దొరుకుతుంది. సోమరసం లేకుండా యజ్ఞం లేదు. బహుశా కాస్పియన్ దక్షిణానికి చేరుకున్న దశలో ఒకే మూసగా ఉన్న ఆర్యులమధ్య విభేదాలు ఏర్పడినట్టు కనిపిస్తుంది. అవి కేవలం తాత్విక వైరుధ్యాలు. యజ్ఞయాగాదులనూ, సురాపానాన్నీ విసర్జించినవాళ్లు ‘అసురులు’. వాళ్లే తరువాతి జొరాస్ట్రియన్లు. వైదికకర్మలను ఆచరించేవాళ్లు ‘ఆర్యులు’. ఇక్కడ గమనించవలసిన అంశం ఏమిటంటే - సుర, సోమరసాలు వేరువేరు పానీయాలని! సోమలతను నలగదంచి పిండగా వచ్చేది సోమరసం. తృణధాన్యాన్ని పులియబెట్టి, కాచినప్పుడు వచ్చే ఆవిరిని చల్లబరిస్తే తయారయ్యేది సుర. అసురులు విసర్జించింది సురాపానమేగాని, సోమపానం గాదు. కొన్ని పండుగ సందర్భాలకు ఎండినదైనా సరే, ఎన్ని తంటాలైనా పడి, ఇప్పటికీ సోమలతను సంపాదించుకుంటున్నవాళ్లు జొరాస్ట్రియన్ తత్వాన్ని అనుసరించే పారసీలు మాత్రమే. రుగ్వేదం పుట్టిన తొలినాటి ఆర్యుల్లో వర్ణభేదం కనిపించదు. పశుపోషణ మినహా ఇతర వ్యాపకం లేని రోజుల్లో సామాజిక అంతస్తులు ఏర్పడే అవకాశం ఉండదుకూడా. తాత్కాలిక మజిలీలకు పరిమితమైన తావులు మారే సంచారజాతికి సంతలూ వ్యాపారాలూ ఊహకందని విషయాలు. కాకపోతే ఇప్పుడు చక్రాలమీదే దొర్లే రథాలూ, వాటిని పరిగెత్తించే గుర్రాలూ చేతికి చిక్కడంతో పశువులు మేపుకురావడం సులభతరమయింది; వలసల్లో వేగం పుంజుకుంది. రుగ్వేదం నడిమి దశలో ‘రాజు’ అనే పదం అరుదుగా కనిపిస్తుంది. యజ్ఞాలు నిర్వహించేవాళ్లల్లో ఎక్కువభాగం యజమానులే. రుక్కులు నిర్మించిన రుషివర్గ మొక్కటీ ప్రత్యేక హోదాకు ఎదిగింది. సోమలతను నలగదంచి పిండగా వచ్చేది సోమరసం. తృణధాన్యాన్ని పులియబెట్టి, కాచినప్పుడు వచ్చే ఆవిరిని చల్లబరిస్తే తయారయ్యేది సుర. అసురులు విసర్జించింది సురాపానమేగాని, సోమపానం గాదు. కొన్ని పండుగ సందర్భాలకు ఎండినదైనా సరే, ఎన్ని తంటాలైనా పడి, ఇప్పటికీ సోమలతను సంపాదించుకుంటున్నవాళ్లు జొరాస్ట్రియన్ తత్వాన్ని అనుసరించే పారసీలు మాత్రమే. రచన: ఎం.వి.రమణారెడ్డి -
శ్రీనగర్ ను కప్పేసిన మంచు దుప్పటి
-
మన్యంలో మళ్లీ చల్లదనం
మంచుతో పాటు గాలులు తగ్గుతున్న కనిష్ట ఉష్ణోగ్రతలు విశాఖపట్నం: విశాఖ మన్యం మళ్లీ చల్లబడుతోంది. చ లిగాలులకు మంచు కూడా తోడవుతోంది. దీంతో ఇప్పుడిప్పుడే చలి ప్రభావం తగ్గుతోందని సంబరపడుతున్న ఏజెన్సీ వాసులకు ఆ చాన్స్ లేకుండా చేస్తోంది. తాజాగా రెండ్రోజుల నుంచి మన్యంలో కనీస ఉష్ణోగ్రతలు 10 డిగ్రీలకంటే తక్కువగా నమోదవుతున్నాయి. సోమవారం కనిష్టంగా పాడేరులో 12 డిగ్రీలు, చింతపల్లిలో 11, లంబసింగిలో 9 డిగ్రీలు రికార్డయ్యాయి. వాస్తవానికి ఫిబ్రవరి నెలలో ఈ సమయానికి 15 డిగ్రీల వరకూ కనిష్ట ఉష్ణోగ్రతలు నమోదు కావాలి. కానీ ప్రస్తుతం సాధారణం కంటే నాలుగైదు డిగ్రీలు తక్కువే రికార్డవుతూ వణికిస్తున్నాయి. ఒకపక్క ఉదయం వరకూ పొగమంచు కురుస్తూ ఉండడం, దానికి చలిగాలులు తోడవడం వల్ల అక్కడ శీతల వాతావరణం కనిపిస్తోంది. దీంతో ఉదయం పొద్దెక్కినా ద్విచక్ర వాహనాలపై వెళ్లడానికి వీల్లేకుండా పోతోంది. మధ్యాహ్నానికి మాత్రం సూర్యుడు చుర్రుమనిపిస్తున్నాడు. ఎండ తీవ్రతతో రాత్రి వేళ కాస్త ఉపశమనం కలుగుతుందనుకుంటున్న మన్యం వాసులకు ఆశాభంగమే ఎదురవుతోంది. మరోవైపు మైదానంలో పరిస్థితి ఒకింత మెరుగ్గా ఉంది. పగటి, రాత్రి ఉష్ణోగ్రతలు కొన్నిచోట్ల సాధారణంగాను, మరికొన్ని ప్రాంతాల్లో సాధారణంకంటే ఒకట్రెండు డిగ్రీలు ఎక్కువగానూ నమోదవుతున్నాయి. ఫలితంగా మైదాన ప్రాంతాల్లో చలి ప్రభావం ఏమంత కనిపించడం లేదు. అయితే పగటి పూట మాత్రం ఎండ తీవ్రత కనిపిస్తోంది. ఉత్తర గాలుల వల్లే.. ప్రస్తుతం ఏజెన్సీలో చలి కొనసాగడానికి ఉత్తర గాలులే కారణమని వాతావరణ నిపుణులు చెబుతున్నారు. పొరుగున ఉన్న మధ్యప్రదేశ్, చత్తీస్‌గఢ్‌లలో చలి తీవ్రత ఇంకా కొనసాగుతోంది. అటు వైపు నుంచి వీస్తున్న గాలుల ప్రభావం మన్యంపై పడుతున్నందు వల్ల అక్కడ శీతల పరిస్థితికి దోహదపడుతోందని విశాఖలోని తుపాను హెచ్చరికల కేంద్రం మాజీ అధికారి ఆర్.మురళీకృష్ణ సోమవారం రాత్రి ‘సాక్షి’కి తెలిపారు. ఉదయం వేళ ఆకాశం నిర్మలంగా ఉంటూ గాలిలేకుండా తేమ ఉంటే పొగమంచు ఏర్పడటానికి కారణమవుతుందని చెప్పారు. ప్రస్తుతం విశాఖ ఏజెన్సీల్లో ఈ పరిస్థితులున్నాయన్నారు. మరో వారం రోజుల పాటు ఇదే వాతావరణం మన్యంలో కొనసాగే అవకావం ఉందని వివరించారు. -
చంపేస్తోంది!
మరిపెడ/కొత్తగూడ/రేగొండ : ఉత్తరాది నుంచి వీస్తున్న చలిగాలులు.. అనూహ్యంగా పడిపోతున్న ఉష్ణోగ్రతలతో జిల్లావాసులు గజగజలాడుతున్నారు. గతంలో ఎప్పుడూ లేని విధంగా ఉష్ణోగ్రతలు తగ్గడంతో జనం బెంబేలెత్తుతున్నారు. వారం, పది రోజులుగా చలి, తెల్లవారుజామున మంచు కురుస్తుండడంతో ప్రజలు బయటకు రాలేని పరిస్థితులు నెలకొన్నారుు. మూడు రోజుల వ్యవధిలో జిల్లా కనిష్ట ఉష్ణోగ్రత 15 డిగ్రీల సెల్సియస్ నుంచి 10 డిగ్రీల సెల్సియస్‌కు పడిపోరుుంది. ఈ నెల 7, 8వ తేదీన గరిష్ట ఉష్ణోగ్రత 30.. కనిష్ట ఉష్ణోగ్రత 15 నమోదైంది. తొమ్మిదో తేదీన గరిష్టం 29 కా గా, కనిష్ట ఉష్ణోగ్రత మూడు డిగ్రీల సెల్సియస్ తగ్గి 12కు చేరుకుంది. పదో తేదీన కనిష్ట స్థారుు ఉష్ణోగ్రత 10 డిగ్రీల సెల్సియస్‌కు తగ్గింది. సోమవారం ఇదే రీతిన కొనసాగగా.. మంగళవారం కనిష్ట ఉష్ణోగ్రత ఒక డిగ్రీ సెల్సియస్ పెరిగింది. సుమారు వారం రోజులుగా కనిష్ట ఉష్ణోగ్రత తగ్గుతూ వస్తుండడంతో చలి విపరీతంగా పెరిగింది. దీంతో వృద్ధులు మరణాల బారిన పడుతుండగా... పిల్లలు, శ్వాసకోస వ్యాధులతో బాధపడుతున్న వారు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఇప్పటి వర కు పదుల సంఖ్యలో వృద్ధులు మృతి చెందారు. గత నెల 23న చలి తీవ్రతను తట్టుకోలేక కేసముద్రం మండలం పెనుగొండ గ్రామానికి చెందిన నలుగురు పాపమ్మ (75), పూసపాటి ఉప్పల య్య (68), ముదిగిరి కొమురయ్య (70), గాడిపల్లి ఖాసిం (85) ఒకే రోజు మృత్యువాత పడ్డా రు. ఇదే క్రమంలో రోజుకు ఒకరిద్దరు చలితో ప్రాణాలొదలగా.. మంగళవారం తాజాగా మరి పెడ మండలంలోని వీరా రం గ్రామానికి చెందిన అల్లి మల్లమ్మ(80), కొ త్తగూడ మండలంలోని వేలుబెల్లి చిర్ర సమ్మక్క(67), రేగొండ మండలంలోని దమ్మన్నపేట గ్రామానికి చెందిన స్వాతంత్య్ర సమరయోధుడు కుచన రాజకనకయ్య (90) మృత్యువాత పడ్డారు. -
చలిగింతలు..!
13 డిగ్రీలకు పడిపోయిన ఉష్ణోగ్రతలు పగటివేళ చల్లగాలులు పల్లెలను కమ్మేసిన మంచు తెరలు తిరుపతి తుడా: ఎండలు మండే జిల్లా ఒక్కసారిగా ఊటీగా మారిపోయింది. ఎటుచూసినా మంచు తెరలు.. చల్లటి గాలులు. ఉదయం తొమ్మిది గంటలైనా సూర్యుడు కనిపించడం లేదు. మిట్టమధ్యాహ్నం కూడా చలి. రాత్రయితే చాలు, గడప దాటి బయట అడుగుపెట్టలేని పరిస్థితి. డిసెంబర్ లో ఇలాంటి పరిస్థితి జిల్లా వాసులకు కొత్త. ఉష్ణోగ్రతలు 13 డిగ్రీలకు పడిపోయాయి. గత శనివారం కుప్పం, పలమనేరు ప్రాంతాల్లో 13 డిగ్రీల గరిష్ట సెల్సియస్‌గా నమోదైంది. పడమటి మండలాల్లో చలితీవ్రత విపరీతంగా ఉంది. జిల్లాకు తూర్పు తీరం నుంచి చలిగాలులు పెద్ద ఎత్తున వీస్తున్నాయి. దీంతో ప్రజలు చలికి అల్లాడిపోతున్నారు. ప్రజలు సూర్యకిరణాలను చూసి సుమారు వారం కావస్తోంది. సముద్ర తీరంలో వాతావరణంలో మార్పులు చోటుచేసుకోవడంతోనే ఈ పరిస్థితి నెలకొందని శాస్త్రవేత్తలు చెబుతున్నారు. గంటకు 20-30 కి.మీ వేగంతో చలిగాలులు వీస్తున్నాయి. కుప్పం, మదనపల్లి, పలమనేరు ప్రాంతాల్లో ఉష్ణోగ్రత 14 డిగ్రీలకు పడి పోయింది. వారం నుంచి ఉష్ణోగ్రత వివరాలు సోమవారం: తిరుపతి-17, కుప్పం - 14, మదనపల్లి-15 డిగ్రీల సెల్సియస్ మంగళవారం: తిరుపతి -22, కుప్పం, పలమనేరు-18, మదనపల్లి 17 బుధవారం: తిరుపతి -22, కుప్పం, పలమనేరు-18, మదనపల్లి 17 గురువారం: తిరుపతి -21, కుప్పం, మదనపల్లి-17 శుక్రవారం: తిరుపతి -15.5, కుప్పం, పలమనేరు -14, మదనపల్లి-14.5 శనివారం: తిరుపతి -14, కుప్పం, పలమనేరు-13, మదనపల్లి -14, ఆదివారం: తిరుపతి 19, కుప్పం, పలమనేరు, మదనపల్లి -17.5 డిగ్రీల సెల్సియస్. -
హైదరాబాద్‌లో చ..చ.. చలి
నగరం గజగజ.. ఉత్తరాది నుంచి చలిగాలులు.. విలవిల్లాడుతున్న పిల్లలు, వృద్ధులు, రోగులు గ్రేటర్‌పై చలి పంజా విసురుతోంది. ఉత్తరాది నుంచి వీస్తున్న చలిగాలులకు తోడు మంచు ప్రభావంతో సిటీజనులు గజగజలాడుతున్నారు. గురువారం తెల్లవారు జామున 5.30 గంటలకు కనిష్ట ఉష్ణోగ్రత ఏకంగా 12.2 డిగ్రీలకు పడిపోయింది. ఈ శీతాకాలంలో ఇప్పటి వరకు నమోదైన కనిష్ట ఉష్ణోగ్రతల్లో ఇదే అత్యల్పం. కేవలం 24 గంటల వ్యవధిలోనే ఉష్ణోగ్రతలు 4.4 డిగ్రీల మేర పడిపోయాయి. గరిష్ట ఉష్ణోగ్రత సైతం 28.4 డిగ్రీలకు చేరుకుంది. రాగల 24 గంటల్లో చలి తీవ్రత మరింత పెరిగే అవకాశం ఉందని బేగంపేట్‌లోని వాతావరణ శాఖ తెలిపింది. ఇళ్లలో ఉన్నవారు సైతం చలికి వణికిపోతున్నారు. ఎముకలు కొరికే చలితో చిన్నారులు, వృద్ధులు, చర్మ వ్యాధిగ్రస్తులు, ఆస్తమా రోగులు విలవిల్లాడుతున్నారు. గ్రేటర్ పరిధిలో గత పదేళ్ల కాలాన్ని పరిశీలిస్తే 2005లో కనిష్ట ఉష్ణోగ్రత 8.7 డిగ్రీలకు పడిపోవడం ఇప్పటివరకు ఉన్న రికార్డు. ఈసారి అప్పటి పరిస్థితి ఎదురవుతుందేమోనని జనం వణికిపోతున్నారు. స్వెట్టర్, మఫ్లర్, మంకీక్యాప్, జర్కిన్లు ధరించకుంటే బయటికి వెళ్లలేని పరిస్థితి నెలకొంది. చాదర్‌ఘాట్, నారాయణగూడ, అబిడ్స్, సికింద్రాబాద్ తదితర ప్రాంతాల్లో ఉన్ని, లెదర్ దుస్తుల దుకాణాలు వినియోగదారులతో సందడిగా మారాయి. సరైన జాగ్రత్తలు తీసుకోకపోతే అనర్థాలు తప్పవని వైద్యులు హెచ్చరిస్తున్నారు. -
మంచు ముల్లె!
పల్లె మంచు ముల్లైంది.. పట్టణం వణుకుతోంది.. ఆకులపై మంచు బిందువులు ముత్యాల్లా మెరుస్తున్నారుు.. ముట్టుకుంటే చలిగింతలు పెడుతున్నారుు.. పట్టణాల్లో ఉదయం ఎనిమిదైనా మంచుతెరలు తొలగడం లేదు.. ఏజెన్సీలో సూరీడి ఆచూకీ పదైన కానరావడం లేదు.. ఆ తర్వాత మంచుతెరలను చీల్చుకుంటూ.. నేనొస్తున్నానంటూ ఎరుపెక్కుతున్నాడు.. రాత్రి ఏడు గంటలకే తండాలు ముసుగేస్తున్నారుు.. పట్టణ రహదారులపై జనం పలుచబడుతున్నారు.. జిల్లాలో చలి తీవ్రత ఒక్కసారి పెరిగింది. రెండు రోజుల నుంచి కనిష్ట ఉష్ణోగ్రతలు నమోదవుతున్నారుు. బుధవారం ఈ ఏడాదిలోనే కనిష్టంగా 12 డిగ్రీల సెల్సియస్ ఉష్ణోగ్రత నమోదైంది. పగటి ఉష్ణోగ్రతలు 27 డిగ్రీల సెల్సియస్ మించడం లేదు. రెండు రోజులుగా గంటకు ఐదు కిలోమీటర్ల వేగంతో చలి గాలులు వీస్తున్నాయి. ఈ సీజన్లో నవంబర్‌లో చలి తీవ్రత 14 డిగ్రీల సెల్సియస్ నమోదు కాగా.. డిసెంబర్ మధ్య నుంచి ఒక్కసారిగా తీవ్రత పెరిగింది. డిసెంబర్ 1 నుంచి కనిష్ట ఉష్ణోగ్రతల్లో తగ్గుదల నమోదవుతున్నా.. పగటి వేళ సగటు ఉష్ణోగ్రత నమోదవుతుండడంతో చలి తీవ్రత పెద్దగా లేదు. అయితే రెండు రోజులుగా కనిష్ట, గరిష్ట ఉష్ణోగ్రతల్లో తగ్గుదల మొదలైంది. ఉదయం పది గంటల వరకు చలి తీవ్రత తగ్గడం లేదు. సాయంత్రం ఆరు గంటల తర్వాత ఉష్ణోగ్రత తగ్గుముఖం పడుతోంది. డిసెంబర్ 1 నుంచి రాత్రి వేళలో కనిష్ట ఉష్ణోగ్రతలు 14 నుంచి 16 సెల్సియస్ డిగ్రీల మధ్య నమోదవుతుండగా.. పగటి వేళ గరిష్టంగా ఉష్ణోగ్రత 33 డిగ్రీల సెల్సియస్ నమోదవుతోంది. ఉష్ణోగ్రతలు పడిపోతుండటంతో అస్తమా రోగులు, చంటిపిల్లలు, వృద్ధులు అవస్థలు పడుతున్నారు. చలిబారి నుంచి రక్షణ చర్యలు తీసుకోకుంటే పిల్లలు, వృద్ధుల్లో శ్వాసకోస సమస్యలు తలెత్తుతాయని వైద్యులు సూచిస్తున్నారు. చలి నుంచి తట్టుకోవడానికి స్వెట్టర్లు, మంకీ క్యాప్‌లు వాడుతున్నారు. ఏజెన్సీలో చలిమంటలు వేసుకుంటున్నారు. ముఖ్యంగా నేపాలి వ్యాపారులకు గిరాకీ పెరిగింది. మరో నాలుగు రోజులపాటు తక్కువ ఉష్ణోగ్రతలు నమోదవుతాయని వాతావరణ శాఖ నిపుణులు చెబుతున్నారు. -
ఇక చలి, మంచు ప్రతాపం
ఉత్తరాది గాలులే కారణం సాక్షి, విశాఖపట్నం: దాదాపు నెలరోజుల పాటు దూరంగా ఉన్న చలి ఇప్పుడిప్పుడే విజృంభిస్తోంది. వాస్తవానికి నవంబర్ ఆరంభం నుంచే చలి ప్రభావం మొదలవుతుంది. కానీ నెలన్నర రోజులుగా బంగాళాఖాతంలో అల్పపీడనాలు, ద్రోణులు ఏర్పడడంతో ఆకాశంలో మేఘాలు ఏర్పడుతున్నాయి. దీనివల్ల చలి చొచ్చుకురావడానికి వీల్లేకుండా పోయింది. ఫలితంగా నవంబర్ నెలంతా తెలుగు రాష్ట్రాల ప్రజలు సాధారణ వాతావరణాన్నే చవిచూశారు. ఇప్పుడు పరిస్థితుల్లో మార్పు వచ్చింది. నైరుతి బంగాళాఖాతంలో తాజాగా కొనసాగుతున్న అల్పపీడనం దక్షిణ శ్రీ లంక వైపు (హిందూ మహాసముద్రానికి అనుకుని) పయనిస్తోంది. దీంతో మేఘాలు కూడా అటువైపు ఆవరించాయి. మరోవైపు కొద్ది రోజులుగా ఉత్తరాదిలో చలి పెరుగుతోంది. అదే సమయంలో అటు నుంచి ఆంధ్ర, తెలంగాణల వైపు చల్లగాలులు వీస్తున్నాయి. ఫలితంగా రెండు, మూడు రోజులుగా చలి ప్రభావం అధికమవుతోంది. దీనికి మంచు కూడా తోడవుతోంది. ఆకాశంలో మేఘాలు కూడా కనిపించడం లేదు. వెరసి కనిష్ఠ ఉష్ణోగ్రతలు తగ్గుముఖం పడుతున్నాయి. ఇప్పటికే ఆంధ్రప్రదేశ్, తెలంగాణల్లో సాధారణం కంటే 2-5 డిగ్రీల వరకు ఉష్ణోగ్రతలు తక్కువగా రికార్డవుతున్నాయి. రానున్న రోజుల్లో చలి, మంచు ప్రభావం మరింత అధికమవుతుందని విశాఖలోని తుపాను హెచ్చరికల కేంద్రం మాజీ అధికారి మురళీకృష్ణ గురువారం రాత్రి ‘సాక్షి’కి తెలిపారు. గడచిన 24 గంటల్లో రాష్ట్రంలో ఎక్కడా వర్షపాతం నమోదు కాలేదు. ఆంధ్రప్రదేశ్‌లోని ఆరోగ్యవరంలో 15, తెలంగాణలోని ఆదిలాబాద్‌లో 11 డిగ్రీల కనిష్ఠ ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. -
చలాకీ నవ్వులకు కేరాఫ్ అడ్రస్!
విదేశాలలో... పిల్లలకు ఆనందం మాత్రమే కావాలి. పిల్లలున్న చోట ఆనందం మాత్రమే ఉంటుంది. వారి కళ్లల్లో ఆశ్చర్యం, మోములో సంతోషం తుళ్ళి తుళ్ళి ఆడాలంటే పర్యటనలు చేయాలి. వారి సంబరం అంబరాన్ని అంటాలంటే ఆ పర్యటనలు పసందుగా మారాలి. ఈ ఏడాది ప్రపంచంలో పిల్లలు మెచ్చే అత్యుత్తమమైన విహార ప్రదేశాలను అతి పెద్ద ట్రావెల్ గైడ్ వెబ్సైట్ ‘లోన్లీప్లానెట్’ శోధించి మరీ మన ముందుంచింది. ‘చిల్డ్రన్స్ డే’ సందర్భంగా! పిల్లలను ఆనందసాగరంలో ఓలలాడించే ఈ పర్యాటక ప్రదేశాలను వీలును బట్టి ప్లాన్ చేసుకోవచ్చు. మంచులో షికార్లు... లాప్లాండ్ ఫిన్లాండ్ దేశంలోని ‘లాప్లాండ్’ చలికాలం అద్భుతం గురించి ఎంత చెప్పినా తక్కువే! ఇక్కడి ‘రిసిటంటూరి’జాతీయ ఉద్యానంలో చలికాలమంతా మంచు కిరీటాలను ధరించిన వృక్షాలతో అలరారుతుంటుంది. గడ్డకట్టిన మంచులో బండ్లు లాగే కుక్కలు, జింకల పరుగులు, ఉండుండి చేపలు ఎగరడం.. వాటి మధ్యే మనం తిరగడం ఆ ఆనందాన్ని మాటల్లో వర్ణించలేం. రాత్రుళ్లు ఎక్కువ సమ యం ఉండే నెలలు అక్టోబర్ - మార్చి. ఈ ఆరు నెలలు మంచుపై పడే సన్నని సూర్య కిరణాలు అబ్బురపరుస్తాయి. జూన్- ఆగస్టు వరకు రోజంతా పగటి వాతావరణమే ఉంటుంది. అంటే అర్థరాత్రి కూడా సూర్యుడు వెలుగుతుంటాడన్నమాట. ఇసుక గూళ్లు... బెలిజ్ మధ్య అమెరికాలోని బెలిజ్ ప్రాంతంలో వందల సంఖ్యలో దీవులు ఉన్నాయి. అక్కడి బీచ్‌లో ఇసుక గూళ్లు కట్టుకుంటూ ఆహ్లాదకర వాతావరణంలో ఆనందాన్ని ఆస్వాదించవచ్చు. 7-12 ఏళ్ల పిల్లలకైతే ఈ ప్రాంతం పండగ సంబరాన్ని ఇస్తుంది. ముఖ్యంగా ఇక్కడ వన్యప్రాణుల జీవనశైలిని పిల్లలు అతి సమీపం నుంచి పరిశీలించవచ్చు. బీచ్‌లలో డ్రమ్స్‌ను ఎలా వాయించాలో నేర్చుకోవచ్చు. నీటిలోని అందాలను చూడటానికి, సుదూరంగా ఉండే అటవీ ప్రాంతానికి బోట్లలో స్విమ్మింగ్ హోల్స్ ద్వారా చేరుకోవచ్చు. జలపాతాల హోరు ఐస్లాండ్ యూరోప్‌లో అతి పెద్ద జలపాతపు ప్రవాహాలు, అతి పెద్ద హిమనీనద ప్రవాహం, నిరంతరం మండే అగ్నిపర్వతాలు, వేడినీటి కొలనులు... ఏ వయసు వారికైనా థ్రిల్ కలిగించే అద్భుతాలకు ఐస్లాండ్ చక్కని వేదిక. ఇక్కడ గుర్రపు స్వారీలు, నీటిపై పడవలతో షికార్లు, కీచురాళ్ల రొదలు, తిమింగిలాలు,.. ఇవన్నీ పిల్లల్ని మరో లోకంలో విహరించేలా చేస్తాయి. విదేశీ పర్యాటకులకు ఈ దేశం చక్కని విడిదిని ఏర్పాటు చేస్తుంది. యూరోప్ దేశాల నుంచి ఐస్‌ల్యాండ్‌కు విమానయాన సదుపాయాలు ఉన్నాయి. కథల పందిరి.. డెన్మార్క్ మిగతా దేశాలతో పోల్చితే డెన్మార్క్‌లో పిల్లల ఆనందానికి ఆకాశమే హద్దుగా నిలిచే అంశా లు లెక్కకు మించి ఉన్నాయి. ‘టివోలి’ ప్రాంతంలో కథలలో చెప్పినట్టు కళ్లకు కట్టే అమ్యూజ్మెంట్ పార్క్ ఉంది. ఇందులో సంగీత హోరులో ఉరకలెత్తవచ్చు. రాత్రిళ్లు మిరుమిట్లు గొలిపే బాణాసంచా వెలుగుల ను తిలకిస్తూ పసందైన ఆహారాన్ని ఆరగించవచ్చు. ఇక ‘లెగోల్యాండ్ బిల్లండ్’లో ప్రపంచంలోని విగ్రహాల నమూనాలు 20 కోట్ల దాకా ఉన్నాయి. ఇక్కడి రంగులరాట్నంలో తిరగడం.. పిల్లలకు ఎనలేని థ్రిల్ ఇస్తుంది. గుర్రపు బగ్గీలు... ప్రేగ్ చెక్ రిప్లబ్లిక్లోని ప్రేగ్ వారాంతపు వినోదాలకు పెట్టింది పేరు. ఇక్కడ గుర్రపు బగ్గీలపై ప్రయాణం మరచిపోలేనిది. ఇక్కడి ఎత్తై పర్వతప్రాంతాలు, నిర్మాణాలన్నీ జానపద కథలలోగా అనిపిస్తాయి. నలుచదరంగా ఉండే పాత పట్టణం, చార్లెస్ బ్రిడ్జి, పెట్రిన్ హిల్‌లోని అద్దాల గది, కొయ్యబొమ్మలు, అపార్ట్మెంట్ నెంబర్ 46 అనే అద్భుతమైన భవనపు దీపాల సొగసు... పిల్లలను, పెద్దలనూ ఆకట్టుకుంటాయి. -
మంచు వేసవి
కర్నూలు(అగ్రికల్చర్): విపరీతమైన ఉక్క.. నిప్పులు కక్కుతున్న సూరీడు.. మిట్ట మధ్యాహ్నం బయటకు వెళ్లాలంటే భయం.. అలాగని ఇది ఎండాకాలం కాదు. మంచు కురిసే మాసంలో మండుతున్న ఎండాకాలమిది. వాతావరణంలో విచిత్ర పరిస్థితి. ఎన్నడూ లేని విధంగా ముందే వేసవి వచ్చేసినట్లు ఉంది. రోజు రోజూ పెరుగుతున్న ఎండల ధాటికి ప్రజలు అల్లాడిపోతున్నారు. పొలాలకు వెళ్లే రైతులు, వ్యవసాయ కూలీలు ఎండ వేడిమికి తాళలేక అస్వస్థతకు గురవుతున్నారు. సాధారణంగా అక్టోబరు నెలకు వాతావరణం పూర్తిగా చల్లబడాలి. పగటి ఉష్ణోగ్రతలు 30 నుంచి 34 డిగ్రీల లోపు మాత్రమే ఉండాలి. అయితే ఈ ఏడాది ఇవి 37 డిగ్రీలు దాటి పోతున్నాయి. రాత్రి పూట మంచు కురవాల్సిన సమయం ఇది. ఉదయం 9 గంటల వరకు.. మళ్లీ సాయంత్రం 6 గంటల నుంచి చలి గాలులు వీచాల్సిన అక్టోబర్ నెలలో ఉదయం 7 గంటలకే సూర్యుడు భగ్గుమంటున్నాడు. జిల్లాలో ఈ ఏడాది జూన్ నుంచి ఇప్పటి వరకు వర్షాలు నామమాత్రంగా కురిశాయి. నైరుతి రుతుపవనాలు సైతం వెనక్కి పోవడం, గాలిలో తేమ శాతం తగ్గడంతో ఎండల తీవ్రత పెరిగినట్లు తెలుస్తోంది. సాధారణంగా ఈ సమయంలో చెరువులు, కుంటలు నీటితో నిండి కళకళలాడుతూ ఉండాలి. వాగులు, వంకలు ప్రవహిస్తూ ఉండాలి. అడవులు, బీడు, బంజరు భూములు, కొండలు పచ్చితో పచ్చదనాన్ని సంతరించుకోవాలి. ఈసారి వర్షాభావ పరిస్థితులతో పచ్చదనం జాడ కరువైంది. ఇదీ కూడా ఎండల తీవ్రత పెరగడానికి కారణమవుతోందనే అభిప్రాయం వ్యక్తమవుతోంది. ఉక్కపోతతో జిల్లాలో విద్యుత్ వినియోగం పెరుగుతోంది. ఫలితంగా అప్రకటిత కోతలు తప్పడం లేదని అధికారులు చెబుతున్నారు. ఇదిలా ఉండగా ఎండల తీవ్రతకు భూముల్లో ఉన్న అంతంత మాత్రం ఉన్న తేమ హరించుకుపోయి పంటలు వేగంగా ఎండిపోతున్నాయి. రైతులు కోలుకోలేని విధంగా నష్టపోయే ప్రమాదం ఏర్పడింది. భవిష్యత్‌లో పశు గ్రాసానికి తీవ్ర సమస్య ఏర్పడే అవకాశం ఉంది. ఎండవేడిమికి తాళలేక కొబ్బరి బోండాలు, శీతల పానీయాలకు డిమాండ్ పెరిగింది. మంచి నీటి సమస్య పెరుగుతోంది. గతేడాది అక్టోబరు నెలతో పోలిస్తే ప్రస్తుతం ఉష్ణోగ్రతలు ఇలా ఉన్నాయి.. తేదీ గతేడాది ఈ ఏడాది 01 32.5 35.5 02 32.4 36.3 03 30.1 ---- 04 33.4 36.3 05 32.6 36.9 06 30.0 35.8 07 34.1 37.0 -
కేదార్నాథ్ యాత్రకు బ్రేక్!
డెహ్రాడూన్: చార్ధామ్ యాత్రలో ఒకటైన కేదార్నాథ్ యాత్రకు అవాంతరాలు ఏర్పడ్డాయి. హిమాలయ పర్వత సానువుల్లో ఉన్న ఈ ఆలయం వద్ద, పరిసర ప్రాంతాల్లో తాజాగా మంచు కురవడంతో యాత్ర నిలిచిపోయింది. కేదార్నాథ్ వ్యాలీ అంతటా ఆదివారం ఉదయం మంచు కురిసిందని, దాంతో యాత్ర నిలిపివేసినట్లు రుద్రప్రయాగ ఎస్పీ బరీందర్‌జిత్ సింగ్ తెలిపారు. యాత్రీకులను సోన్ప్రయాగ వద్దే ఆగిపోయి, వాతావరణ పరిస్థితులు మెరుగుపడే వరకు వేచి ఉండాలని కోరినట్లు ఆయన చెప్పారు. ఆరు నెలల శీతాకాలం విరామం తర్వాత కేదార్నాథ్ ఆలయాన్ని ఈ నెల 4న తిరిగి భక్తుల కోసం తెరిచిన విషయం తెలిసిందే. ఈ నెల 13 వరకు చార్ధామ్ (కేదార్నాథ్, బద్రీనాథ్, గంగోత్రి, యమునోత్రి) యాత్రా మార్గంలో, హిమాలయాల్లోని 3,500 మీటర్ల ఎత్తయిన ప్రాంతాల్లో ఉరుములతో కూడిన ఓ మోస్తరు జల్లులు పడతాయని వాతావరణ శాఖ స్థానిక కార్యాలయం అంచనా వేస్తోంది. మరోవైపు ఆలయ ప్రధాన పూజారి భీమశంకర్‌లింగ కూడా వారం రోజుల పాటు యాత్రను వాయిదా వేసుకోవాలని భక్తులకు సూచించారు. రోడ్ల పరిస్థితి బాగోలేకపోవడంతో యాత్రను కొనసాగించడం ప్రమాదకరమని చెప్పారు. ప్రభుత్వం రోడ్ల మరమ్మతు, నిర్మాణ పనులను చేపట్టినా అవి ఇంకా పూర్తి కాలేదన్నారు. ప్రముఖ హిందుస్థానీ గాయకుడు పండిట్ జస్రాజ్ ఆదివారం మందిరం వద్ద తన ప్రదర్శన ఇవ్వాల్సి ఉంది. అయితే, వాతావరణం అనుకూలించకపోవడంతో ఆయన డెహ్రాడూన్లోనే ఉండిపోయారు. గతేడాది చార్ధామ్ యాత్రా సమయంలో భారీ వర్షాలకు వరదలు ముంచెత్తడంతో సుమారు 5వేల మంది భక్తులు జలసమాధి అయిన విషయం తెలిసిందే. -
జపాన్‌లో మంచు తుఫాన్ బీభత్సం
-
మంచుతెరల్లో మహిమాన్వితుడు
వైకుంఠ ఏకాదశి, ద్వాదశి కోసం ముస్తాబయ్యే తిరుమల పరిసరాలను చూడడానికి రెండు కళ్లూ సరిపోవు. సుగంధభరిత పుష్పాలు, విద్యుద్దీపాలతో ఇలవైకుంఠాన్ని తలపించే ఆ పరిసరాలకు ఆదివారం తెల్లవారుజామున ప్రకృతి మంచు తెరలతో మరిన్ని వన్నెలద్దింది. దీంతో ఆ మంచు తెరల్లోనుంచి దేదీప్యమానంగా వెలుగుతున్న శ్రీవారి ఆలయం భక్తులను ఆనందపారవ శ్యంలో ఓలలాడించింది. శ్రీవారి పుష్కరిణి సైతం కొత్త శోభను సంతరించుకుంది. చక్రస్నానం సందర్భంగా పుష్కరిణి వద్దకు వచ్చిన భక్తులు మహదానందంతో పుణ్యస్నానాలు ఆచరించారు. -సాక్షి, తిరుమల -
అగ్రరాజ్యానికి ‘చలి’మంట!
సంపాదకీయం: శీతాకాలం అనగానే ఆకులు రాల్చుకున్న చెట్లు, వేకువజామున వీధి చివర కనబడే చలిమంట, దాని చుట్టూ అల్లుకునే కబుర్లు, దారీతెన్నూ తెలియనీయని పొగమంచు, మెరిసే మంచు ముత్యాలను సిగన తగిలించుకున్న పూలు గుర్తొస్తాయి. మన శ్రీనాథ మహాకవి క్రీడాభిరామంలో ‘ప్రక్కలు వంచు వంచి... మునిపండ్లను రాచు రాచి...రొమ్మిక్కిల జేసి చేసి....’ అంటూ తెల్లారగట్ట వణకించే చలి నిలువెత్తు మనిషిని మూటలా మార్చిన వైనాన్ని కళ్లకుగడతాడు. ఆ పద్యాన్ని చదివితే మండే ఎండలో సైతం చలి చేష్టలు గుర్తొచ్చి వణకాల్సిందే. నిన్నటివరకూ అమెరికాను చుట్టుముట్టిన హిమోత్పాతం వణికించడంతో ఆగలేదు. పౌరులను భీతావహుల్ని చేసింది. కంటినిండా కునుకులేకుండా చేసింది. ఉత్తర ధ్రువంవైపు నుంచి విరుచుకుపడిన చలి పులి ఆగడాలముందు అగ్రరాజ్యం నిస్సహాయంగా గడ్డకట్టుకుపోయింది. తెల్లారేసరికి ఇంటి ముందూ, పైనా, పక్కలా... ఎటు చూసినా గుట్టలుగా పేరుకుపోతున్న మంచును చూసి జనం విస్తుపోయారు. ఎన్ని పొరల వస్త్రాలున్నా,వాటికి ఎన్ని రగ్గుల్ని తోడు తెచ్చుకున్నా ఎలాగోలా ఒంట్లోకి దిగబడుతున్న చలి మనిషిని నిటారుగా నిలబడనీయలేదు. కార్లు కదలడానికి లేదు. విమానాలు ఎగరడానికి లేదు. చెట్ల కొమ్మలు ఊగడానికి లేదు. అన్నీ మంచులో కూరుకుపోయాయి. నిత్యం అంతెత్తునుంచి దూకే నయాగరా జలపాతం సైతం నిర్ఘాంతపోయినట్టు శిలాసదృశమైంది. జనజీవనం పూర్తిగా స్తంభించిపోయింది. అమెరికాలో పరచుకున్న వాతావరణం... అంగారకుణ్ణి చూడటానికి ఉబలాటపడే ఔత్సాహికులందరికీ ఇక్కడే ఆ అనుభవాన్ని పంచింది. అంగారకుడిపై పచార్లు చేస్తున్న మార్స్ రోవ ర్ అక్కడి ఉష్ణోగ్రతలు మైనస్ 25 నుంచి మైనస్ 31 డిగ్రీల సెల్సియస్ వరకూ ఉంటున్నదని సమాచారం చేరేస్తుండగా అమెరికాలోని చాలా రాష్ట్రాల్లో అంతకంటే తక్కువ ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. పర్యావరణ పరిశోధనలకని అంటార్కిటికా వెళ్లి తిరిగొస్తున్న రష్యన్ శాస్త్రవేత్తల నౌక మంచు పలకల మధ్య కొన్ని గంటలపాటు ఆగిపోయింది. దాదాపు నాలుగురోజులపాటు అమెరికాను ఒక పెద్ద ఫ్రిడ్జ్‌గా మార్చిన వాతావరణం ఇప్పుడిప్పుడే తేరుకుంటున్నది. ఈలోగా అది 21 మంది ఉసురుతీసింది. ఎందుకీ హిమప్రళయం? ఏమైంది భూమాతకు? అన్ని ప్రకృతివైపరీత్యాల్లాగే ఇది కూడా మన స్వయంకృతమేనని శాస్త్రవేత్తలు చెబుతున్న మాట. ఊళ్లను మింగే వరదలు, కడుపుమాడ్చే కరువు, క్షణాల్లో అన్నిటినీ మింగేయగలిగే సునామీలు, చెప్పా పెట్టకుండా వచ్చి చేటుచేసే భూకంపాలు... వీటన్నిటి తరహాలోనే ఈ హిమోత్పాతం కూడా భూతాపం పర్యవసానంగా సంభవించినదేనని వారి వివరణ. పెను చలిగాలులతోకూడిన హిమోత్పాతం సాధారణంగా ఉత్తర ధ్రువంలో ఉద్భవించి అక్కడే నిత్యమూ సంచరిస్తుంటుంది. కానీ, అది ఈసారి కట్టుదాటింది. పర్యవసానంగానే అమెరికాలోని 50 రాష్ట్రాలూ చిగురుటాకుల్లా వణికాయి. మంచు ఎడారులను తలపించాయి. ఇది అమెరికాతో ఆగదు... భవిష్యత్తులో యూరప్‌ను, అటు తర్వాత ఆసియానూ కూడా చుట్టుముడుతుందని శాస్త్రవేత్తలు చెబుతున్నారు. దురాశ దుఃఖహేతువన్న సామెతను ఈ ఉత్పాతాలు గుర్తుకుతెస్తాయి. సంపన్న దేశాలన్నీ తమ సంపదను మరింత పోగేసుకోవడానికి వినాశకర ఉద్గారాలను నిత్యమూ వాతావరణంలోకి వదులుతున్నాయి. అందువల్ల జీవావరణమంతా దెబ్బతిని భూ వాతావరణం పెను మార్పులకు లోనవుతున్నది. మూడు కాలాలూ, ఆరు రుతువులన్న మాట చిన్నప్పుడు చదివే పాఠ్యపుస్తకాల్లో తప్ప కనబడటం తగ్గింది. ఒక్కరోజులోనే అన్ని కాలాలనూ దర్శించే దుస్థితి దాపురించింది. అకాల వర్షాలు, అత్యధిక ఉష్ణోగ్రతలు మనకు నిత్యానుభవమవు తున్నాయి. ప్రధాన వాతావరణ వ్యవస్థలు ఎల్‌నినో, లానినోలు అనావృష్టిని, అతివృష్టిని, అతి శీతలాన్ని క్రమం తప్పకుండా కమ్ముతున్నాయి. భూతాపం వల్ల సముద్రమట్టాలు పెరిగి తీరంలో ఉండే మాల్దీవులు, కిరిబతి, మార్షల్ ఐలాండ్స్ వంటి ద్వీపదేశాలు జలప్రవేశం చేస్తాయని అంచనాలొస్తున్నాయి. అలాంటిదేమైనా జరిగితే అక్కడి నుంచి సురక్షిత ప్రాంతాలను వెతుక్కుంటూ వచ్చే అయిదుకోట్ల మంది పర్యావరణ శరణార్థులకు నీడనిచ్చేదెవరన్న ప్రశ్నను ప్రపంచదేశాలు ఇంకా పరిశీలనలోకి తీసుకోలేదు. పారిశ్రామికదేశాలు 70 శాతం కర్బన ఉద్గారాలకు కారణమవుతున్నాయని గత అరవైయ్యేళ్ల గణాంకాలు చెబుతున్నాయి. అందులో అమెరికాదే అగ్రస్థానమని వేరే చెప్పనవసరం లేదు. దాని తలసరి కర్బన ఉద్గారాల పరిమాణం దాదాపు 20 మెట్రిక్ టన్నులు. మూడునెలలక్రితం పోలాండ్‌లో జరిగిన వాతావరణ సదస్సులో సైతం తమ తప్పులను పారిశ్రామిక దేశాలు గుర్తెరగలేదు. 2020నాటికల్లా భూతాపం తగ్గింపునకు చర్యలు తీసుకోవాలనుకున్న సంకల్పం వార్సాలో నీరుగారిపోయింది. ఎలాంటి వాగ్దానాలూ లేకుండానే సదస్సు ముసింది. 1990 స్థాయికన్నా తాము 2020కల్లా 25శాతం ఉద్గారాలను తగ్గించుకోగలమని చెప్పిన జపాన్ సైతం వార్సాలో చేతులెత్తేసింది. వచ్చే ఏడాది పారిస్‌లో కుదరగలదం టున్న ఒప్పందం రూపురేఖలు ఎలా ఉండబోతాయో ఇంకా చెప్పే పరిస్థితి లేదు. పారిశ్రామిక దేశాల మొండివైఖరే ఇందుకు కారణం. వాస్తవం చెప్పనిదానిని సైతం కళ కళ్లకు కడుతుందంటారు. లోగడ భూతాపంపైనా, దాని ప్రమాదకర పర్యవసానాలపైనా రూపొంది, అందరినీ చకితుల్ని చేసిన ‘ద డే ఆఫ్టర్ టుమారో’, ‘వాటర్ వరల్డ్’ వంటి చిత్రాలు ఎప్పుడో ఒకప్పుడు పచ్చి నిజాలుగా మారగలవని హిమోత్పాతం హెచ్చరిస్తున్నది. మొండివైఖరి అవలంబించేవారిలో ముందు వరసలో ఉండే అమెరికాకు ఒకవిధంగా ప్రకృతి చేసిన హెచ్చరికే హిమపాతం. దీన్నుంచి అయినా అగ్రరాజ్యం గుణపాఠం తీసుకుని పర్యావరణంపట్ల తనకున్న బాధ్యతను గుర్తెరుగుతుందేమో చూడాలి. -
మంచు దుప్పట్లో హస్తిన
6 డిగ్రీలకు పడిపోయిన ఉష్ణోగ్రతలు ఐజీఐ ఎయిర్‌పోర్టును కప్పేసిన పొగమంచు భారీస్థాయిలో విమానాల రద్దు, దారి మళ్లింపు సాక్షి, న్యూఢిల్లీ: దేశ రాజధాని ఢిల్లీని పొగమంచు కమ్మేసింది. పగటి ఉష్ణోగ్రతలు 16 నుంచి 6 డి గ్రీలకు చేరుకోవడం, దీనికితోడు పొగమంచు దట్టంగా కురుస్తుండడంతో జనజీవనానికి తీవ్ర ఇబ్బందులు ఎదుర య్యాయి. గడచిన 8 ఏళ్లలో ఎన్నడూ లేనంతగా పొగమంచు కమ్మేయడంతో అన్ని ప్రజా రవాణా సాధనాలకు తీవ్ర అంతరాయాలు ఎదురయ్యాయి. ముఖ్యంగా పొగమంచు ప్రభావం విమాన, రైళ్ల రాకపోకలపై తీవ్రంగా పడింది. దీని కారణంగా స్థానిక ఇందిరాగాంధీ అంతర్జాతీయ విమానాశ్రయంలో 600లకు పైగా విమానాలకు తీవ్ర అంతరాయం ఏర్పడింది. దీంతో వందల సంఖ్యలో ప్రయాణికులు అగచాట్లు పడ్డారు. ఐజీఐ విమానాశ్రయాన్ని ఇంతటి భారీస్థాయిలో పొగమంచు కప్పేయడం గడచిన 8 ఏళ్లలో ఇదే తొలిసారని అధికారులు తెలిపారు. ఆదివారం రాత్రి 8 గంటల నుంచి సోమవారం మధ్యాహ్నం 12 గంటల వరకు పొగమంచు రన్‌వేను కప్పేసిందని దీంతో ఢిల్లీ నుంచి బయల్దేరాల్సిన 140 విమానాలను రద్దు చేశామని, 52 విమానాలను దారి మళ్లించామని, 463 విమానాలు ఆలస్యంగా నడుస్తున్నాయని తెలిపారు. హైదరాబాద్ నుంచి ఢిల్లీకి రావాల్సిన ఇండిగో విమానాన్ని అహ్మదాబాద్‌కు, హాంకాంగ్ నుంచి ఢిల్లీ చేరాల్సిన రెండు క్యాథే పసిఫిక్ విమానాలను హైదరాబాద్‌కు మళ్లించినట్టు పేర్కొన్నారు. ఢిల్లీ నుంచి పలు ప్రాంతాల కు వెళ్లాల్సిన విమానాలు 2 నుంచి 3 గంటలు ఆలస్యంగా బయలుదేరాయన్నారు. కొన్నింటిని పూర్తిగా రద్దు చేసినట్టు అధికారులు వివరించారు. రైళ్లకూ తీవ్ర అంతరాయం ఢిల్లీని కమ్మేసిన పొగమంచు రైలు ప్రయాణికులను సైతం ముప్పుతిప్పలు పెట్టింది. దట్టంగా అలముకున్న పొగమంచుతో ట్రాక్ కనిపించని కారణంగా అన్ని ప్రధాన రైళ్లను గంటలకొద్దీ ఆలస్యంగా నడిపినట్టు రైల్వే వర్గాలు పేర్కొన్నాయి. ఢిల్లీ నుంచి బయల్దేరే రైళ్లు, వివిధ ప్రాంతాల నుంచి ఢిల్లీకి చేరాల్సిన రైళ్లు 2 నుంచి 4 గంటల ఆలస్యంగా నడుస్తున్నాయని తెలిపాయి. హైదరాబాద్ నుంచి ఢిల్లీ రావాల్సిన ఏపీ ఎక్స్‌ప్రెస్, దక్షిణ్ ఎక్స్‌ప్రెస్ సహా తమిళనాడు తదితర ముఖ్యమైన రైళ్లు ఆలస్యంగా నడుస్తున్నట్టు అధికారులు తెలిపారు. -
మన్యంపై మంచు దుప్పటి
సాక్షి నెట్వర్క్: విశాఖ ఏజెన్సీ వాసులు చలి గుప్పిట చిక్కి వణికిపోతున్నారు. ఇక్కడ పలు ప్రాంతాల్లో అత్యంత కనిష్ట ఉష్టోగ్రతలు నమోదవుతున్నాయి. మరోవైపు రంగారెడ్డి జిల్లా తాండూరులోనూ కనిష్ట ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. విశాఖ మన్యంలో ఎన్నడూలేని విధంగా డిసెంబర్ రెండో వారం నుంచే చలి తీవ్రత అధికమవడంతో స్థానికులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. అత్యవసరమైతే తప్ప ఇంటికే పరిమితమవుతున్నారు. ఆదివారం పాడేరుఘాట్‌లోని మోదమాంబ పాదాలు వద్ద 1 డిగ్రీ, లంబసింగిలో 2 డిగ్రీలు, మినుములూరు కేంద్ర కాఫీ బోర్డు వద్ద 4 డిగ్రీలు, చింతపల్లిలో 5 డిగ్రీల కనిష్ట ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. దీంతో కాఫీతోటల్లో పనులకెళ్లే కార్మికులు ఇక్కట్లను ఎదుర్కొంటున్నారు. గతేడాది జనవరిలో ఈ ప్రాంతాల్లో తక్కువ ఉష్ణోగ్రతలు నమోదవగా.. ఈ సారి డిసెంబర్లోనే ఆ పరిస్థితి నెలకొంది. మధ్యాహ్నం అయితే కానీ, సూర్యుడి వెలుగులు కనిపించడం లేదు. మొత్తానికి మన్యంపై మంచు దుప్పటి పరచుకుంది. చీకటి పడితే బయటకు రాలేని పరిస్థితి ఇక్కడ ఉంది. ఏజెన్సీకి వస్తున్న పర్యాటకులు కూడా చలికి తట్టుకోలేక మైదాన ప్రాంతాలకు తిరిగి వెళ్లిపోతున్నారు. కాగా, రంగారెడ్డి జిల్లా తాండూరులో కూడా చలి వణికిస్తోంది. ఈనెల 9న 5.5 డిగ్రీలు, 10న 6.7, 11న 5.6, డిగ్రీల సెల్సియస్ ఉష్ణోగ్రతలు నమోదవగా.. ఆదివారం ఇది 8.5 డిగ్రీలుగా ఉంది. ఉదయం 10 గంటలైనా మంచు కురుస్తుండడంతో ఈ ప్రాంత వాసులు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. -
రాష్ట్రాన్ని మంచు కమ్మేస్తోంది
-
విహారం: మంచు సోయగాల నగర సౌందర్యం
పముక్కలే : ప్రకృతి కాంత మంచు మేనిముసుగు ధరించిన శీతాకాలపు సోయగం ‘పముక్కలే’ సొంతం. అందమైన మంచు దుప్పటి కప్పుకొన్న పర్వతాలు.. చూడముచ్చటైన సెలయేటి ఒంపులు.. సీజన్ల వారీగా మారే వాతావరణం.. ప్రకృతిని ఆస్వాదించడానికి ఇంతకన్నా గొప్ప ప్లేస్ ఏముంటుంది? అన్నట్టుగా ఉంటుంది ‘పముక్కలే’ ప్రాంతం. టర్కీలోని పర్యాటక ప్రాంతాలను పూర్తిగా చూడాలంటే మూడు నెలలు పడుతుందనేది ప్రసిద్ధ నానుడి. ప్రపంచంలోని ప్రముఖ పర్యాటక కేంద్రంగా ప్రసిద్ధి చెందిన టర్కీ విషయంలో ఈ నానుడి తప్పు అని నిరూపిస్తుంది ‘పముక్కలే’. ప్రకృతి సౌందర్యాలనెన్నో ఒడిలోదాచుకొన్న ఈ దేశంలో పముక్కలే అందాన్ని ఆస్వాదించడానికే ఆరు రుతువులు సరిపోవు! ఎందుకంటే ఒక్కో రుతువు ఒక్కో రకమైన సౌందర్యాన్ని తెచ్చి పెట్టుకుంటుంది. అందానికి మంచు రూపంలో నిర్వచనం చెబితే అది పముక్కలే! టర్కీ భాష లో పముక్కలే అంటే ‘కాటన్ క్యాజల్’ అని అర్థం. పట్టులా కనిపించే తెల్లని మంచు వల్ల దీనికి ఈ పేరు వచ్చింది. టర్కీ దేశానికి ఒక ప్రత్యేకత ఉంది. ఇది రెండు ఖండాల్లో విస్తరించిన దేశం మాత్రమే కాదు, రెండు ఖండాల్లో విస్తరించిన (ఇస్తాంబుల్) నగరం ఉన్న దేశమూ ఇదే. యూరప్ కు సంబంధించి కొన్ని శతాబ్దాల చరిత్రలో టర్కీ ప్రాముఖ్యతకు, ప్రాధాన్యతకు నిదర్శనం పముక్కలే. క్రీస్తు పూర్వం రెండో శతాబ్దం నుంచే పముక్కలే ఒక పర్యాటక ప్రాంతంగా పేరు పొందింది. అప్పటి నుంచి ఇక్కడికి పర్యాటకులు వస్తూనే ఉన్నారు. ఇంకా తనివితీరలేదు. మెట్లు మెట్లుగా ఉన్న లైమ్ స్టోన్ కొండ చరియలను మంచు కప్పి ఉంటుంది. అందులో ఉండే నీరు స్పష్టంగా, స్వచ్ఛంగా ఉంటుంది. ఒక అందమైన అనుభూతిని మిగులుస్తుంది. చారిత్రకం, ఆధునికం, రమణీయం... నేడు టూరిస్టులను బాగా ఆకర్షిస్తున్న దేశాల్లో టర్కీ ప్రముఖమైన స్థానాన్ని ఆక్రమించింది. అటు చారిత్రక ప్రాధాన్యం, మధ్యయుగపు వైభవం, ఆధునిక నిర్మాణాలు, ప్రకృతి సోయగాలతో కూడిన దేశం టర్కీ. ఈ దేశంలోని అపెండస్థియేటర్, బండ్రమ్ క్యాజల్, లైబ్రరీ ఆఫ్ సెల్సస్లు చారిత్రక ప్రాధాన్యం కలిగిన నిర్మాణాలు. ఇక రాజధాని నగరం ఇస్తాంబుల్ అభివృద్ధి చెందిన మానవ నాగరకతకు ప్రతినిధి లాంటిది. చల్లని ఆహ్లాదకరమైన వాతావరణం, కాలుష్య కారకాలను జయించి నిర్మితమైన నగరాలు, ప్రకృతి సోయగాలు, అద్భుత నిర్మాణాలు టర్కీలోని ప్రధాన ఆకర్షణలు. సౌకర్యాల పరంగా ఇస్తాంబుల్ ప్రపంచంలోని ప్రముఖ నగరాల్లో నిలుస్తోంది. ఇక పతారా బీచ్, పముక్కలే వంటివి టర్కీ సిగలోని ప్రకృతి సోయగాలు. వీటిలో పముక్కలే ప్రపంచ ప్రసిద్ధి చెందిన సహజ దృశ్యం. ‘మినరల్ వాటర్’లో స్నానం! పముక్కలే మంచు కొండల మధ్యన కొన్ని చిన్న చిన్న నీటి చెలమలు ఉంటాయి. స్థానిక వాతావరణానికి అనుగుణంగా ఈ నీటి ఉష్ణోగ్రతలు మారుతూ ఉంటాయి. వేసవి కాలంలో చుట్టూ మంచు ఉన్నప్పటికీ, ఆ మంచు కరగకపోయినా ఈ చెలమల్లోని నీరు వెచ్చగా ఉంటుంది. ఆ సమయంలో ఈ నీటిలో స్నానం చేస్తే రక్తపోటు, నేత్ర, చర్మ సంబంధిత అనారోగ్య సమస్యలు తొలగిపోతాయని నమ్మకం. కొన్ని శతాబ్దాలుగా ఈ నమ్మకం ఉంది. దీనికి శాస్త్రీయమైన వివరణ కూడా ఉంది. నీటిలోని రేడియో యాక్టివ్ మినరల్స్ అయిన కాల్షియం, హైడ్రోజన్కార్బోనేట్ చర్య చెంది కాల్షియం కార్బోనేట్‌ను సృష్టిస్తాయి. దీన్నే ట్రావెటైన్ అంటారు. పముక్కలేలో ఏర్పడే చిన్న నీటి చెలమల్లో నీరు ఇలాంటి గుణాలను కలిగి ఉంటుంది. ఇందులో స్నానం చేయడం మంచిదనే భావన యూరోపియన్లలో కొన్ని శతాబ్దాలుగా ఉంటూ వస్తోంది. ఈ నమ్మకం పముక్కలేకు విజిటర్ల సంఖ్యను పెంచుతోంది. ఒకవైపు ప్రకృతి సౌందర్యం, మరోవైపు ట్రావెటైన్‌లో స్నానం ఇవి పముక్కలే ప్రాధాన్యతను పెంచుతున్నాయి. ఇక్కడ క్లియోపాత్ర అనే కొలను ఉంటుంది. అందులో నీరు స్వచ్ఛతకు ప్రసిద్ధి. ఎంతమంది స్నానాలు చేస్తున్నా ఆ నీరు చాలా స్వచ్ఛంగా అలాగే ఉంటుంది. నీటి కింద ఈదుతున్న వారిని కూడా స్పష్టంగా చూడొచ్చు. ఇక్కడ జలకాలాటకు జనం పోటీ పడుతుంటారు. పురాణాల్లో ప్రస్తావన ఉంది... ఈ ప్రాంతానికి గ్రీకు, రోమన్ మైథాలజీల్లో స్థానం ఉంది. ఆ గ్రంథాల్లో ఇదొక పవిత్ర నగరంగా స్థానం పొందింది. ఇప్పటికీ ప్రజల్లో ఈ నమ్మకం కొనసాగుతోంది. రోమ్ మైథాలజీలో స్పా సిటీగా దీని ప్రస్తావన ఉంది. పురాతన రోమన్లు నిర్మించిన పవిత్ర ‘హైరపొలిస్’ అనే పూల్కూడా ఇక్కడ ఉంది. దీనిని దైవ సంబంధమైనదిగా పరిగణిస్తారు స్థానికులు. ఇందులోని నీరు పవిత్రమైనదిగా భావిస్తారు. చిన్న టౌన్... డెనిజిల్ ప్రావిన్స్ పరిధిలో నాలుగు వీధులున్న ఒక చిన్న టౌన్ పముక్కలే. చిన్న చిన్న హోటళ్లు, రెస్టారెంట్లు, సర్వీసెస్ షాపులు, బస్ టికెట్ ఆఫీసులుంటాయి. టూరిజం పరంగా చాలా అభివృద్ధి చెందిన ఈ ప్రాంతంలో బస చేసే అవకాశాలకు కొదవలేదు. సంవత్సరమంతా పముక్కలేని సందర్శించవచ్చు. అయితే శీతాకాలంలో మాత్రం పముక్కలే అందం వర్ణింప శక్యం కానిది. డెనిజిల్ సిటీ నుంచి అక్కడికి బస్సు ద్వారా చేరుకోవచ్చు. క్రీస్తు పూర్వం నాటి సమాధి నిర్మాణాలు, ఇక్కడి మ్యూజియం ప్రధాన ఆకర్షణలు. భిన్నమైన వాతావరణం... టర్కీ పరిధిలో ఇఇఎస్టీ కాలమానాన్ని ఫాలో అవుతారు. ఈస్టర్న్ యూరోపియన్ సమ్మర్‌టైమ్ అనే ఈ సూచిక ప్రకారం వీరు మనకన్నా రెండు గంటల పాటు వెనుక ఉంటారు. పముక్కలేలో వేసవి కాలంలో ఉదయం ఐదున్నరకే సూర్యుడు పలకరిస్తాడు. రాత్రి ఎనిమిది గంటలకు గానీ సూర్యాస్తమయం కాదు. అదే శీతాకాలంలో అయితే పగటి సమయం మరీ తక్కువ. ఏ పది గంటలో కాస్తంత వెలుగు ఉంటుంది. ఆ తర్వాత చీకట్లు కమ్ముకొంటాయి. సూర్యోదయం, సూర్యాస్తమయాల్లో కాంతి పరావర్తనంతో మంచు విభిన్న రంగుల్లో మెరుస్తూ ఆకట్టుకుంటుంది. ప్రపంచ వారసత్వ స్థలం.. 1988లో పముక్కలేని ప్రపంచ వారసత్వ స్థలాల్లో ఒకటిగా ప్రకటించారు. అప్పటి నుంచి ఈ ప్రాంతాన్ని సంరక్షించడం మొదలు పెట్టారు. అంత వరకూ ఇక్కడ రూల్స్ ఏమీ ఉండేవి కాదు. తర్వాత మాత్రం స్ట్రిక్ట్‌గా రూల్స్ ఫాలో అవుతున్నారు. ఈ మంచు కొండలపైకి నడుచుకొంటూ వెళ్లేటప్పుడు చెప్పులు కూడా వేసుకోకూడదనే నియమం ఉంది. ఇప్పుడు ఇక్కడ వాహనాల రాకను నిషేధించారు. నమ్మకాలు, చరిత్ర ఎలా ఉన్నా... మంచును మనసారా ఆస్వాధించడానికి పముక్కలే ఒక చక్కటి ప్రదేశం. చేరుకోవడం సులువే! పముక్కలేకు చేరుకోవాలంటే టర్కీ రాజధాని ఇస్తాంబుల్ ఎయిర్పోర్ట్ ప్రధాన విమానాశ్రయం. ప్రపంచంలోని దాదాపు అన్ని పెద్దదేశాల్లోని ప్రధాన నగరాల నుంచి ఇక్కడకు విమానాలుంటాయి. అక్కడి నుంచి డెనిజిల్ ఎయిర్‌పోర్ట్‌కు చేరుకుని 45 నిమిషాలు కారులో ప్రయాణిస్తే పముక్కలే వస్తుంది. లేకపోతే ఇస్తాంబుల్ నుంచే నేరు బస్సు ద్వారానో, కారు ద్వారానో చేరుకోవచ్చు. రోడ్లు అంత బాగోకపోయినా చుట్టూ పరిసరాలు మాత్రం అద్భుతంగా ఉంటాయి. -
రాష్ట్రాన్ని మంచు కమ్మేస్తోంది
నగరాల్ని, పల్లెలను మంచు కమ్మేస్తోంది. ఉదయం లేవగానే ఆహ్లాద దృశ్యం కళ్లముందు ఆవిష్కారమవుతోంది. గంట తొమ్మిది కొట్టినా... కాంక్రీట్ జంగిల్ పొగతెర మాటున సరికొత్తగా దర్శనమిస్తోంది. ఇక మంచు కురిసే వేళ జీవరాసులూ పరవశిస్తున్నాయి. ఈ మనోహర చిత్రాలు చూసి నగరవాసులు మంత్రముగ్ధులవుతున్నారు.