సాక్షి, అరకులోయ/ పాడేరు: అందాల అరకు వర్షాకాలంలో చూపే హొయలు అంతా ఇంతా కాదు. ఏ వైపు చూసినా ఆకుపచ్చని చీర ధరించిన ప్రకృతి కాంత అద్భుతంగా మారి కనువిందు చేస్తుంటుంది. ఉన్నత పర్వత శ్రేణులు ఒక వైపు, పచ్చని పంట భూములు మరోవైపు.. వానా కాలంలోనూ ప్రభాత వేళ దర్శనమిచ్చే మంచు తెరలతో వన సీమ మనోజ్ఞరూపం నేత్రపర్వం చేస్తోంది.
పాడేరు ఘాట్‌లో ఒక వైపు వర్షం కురుస్తుండగా మరో వైపు కొండల నిండా మంచు తెరల నడుమ మేఘాలు కమ్ముకోవటంతో అమ్మవారి పాదాల నుంచి వంట్లమామిడి ప్రాంతం దిగువుకు మబ్బులు దారిపొడవునా ఆహ్లాదపరిచాయి.
Comments
Please login to add a commentAdd a comment