Photo feature
-
పచ్చ పచ్చాని దారిలో సాగిపోదామా..
కనువిందు చేసే పచ్చని చెట్లు... బడలికను పోగొట్టే చల్లగాలి... ఎవరైనా సరే ఆ మార్గంలో ఒకసారి ప్రయాణిస్తే ఫిదా అవ్వాల్సిందే. మళ్లీ మళ్లీ ఆ దారిలో వెళ్లాలనే కోరిక తట్టాల్సిందే. రహదారికి పచ్చటి తోరణం కట్టినట్లుండి.. వాటి కిందకు వెళ్లగానే ఏదో గుహలోకి ప్రవేశించినట్లుగా కలిగే అనుభూతి ప్రయాణికులను కొద్దిసేపు అక్కడ ఆగేలా చేస్తోంది. అనంతపురం జిల్లా గార్లదిన్నె నుంచి మిడ్‌పెన్నార్ డ్యాంకు వెళ్లే మార్గంలో రోడ్డుకిరువైపులా చెట్లు ప్రయాణికులను ఎంతగానో ఆకర్షిస్తున్నాయి. – సాక్షి ఫొటోగ్రాఫర్, అనంతపురంగుంటూరు జిల్లా ప్రత్తిపాడు పరిసర ప్రాంతాలు అంటే గుర్తుకువచ్చేది పత్తి, మిర్చి సాగు. దశాబ్దాలుగా ఇవే పంటలు ఈ ప్రాంతంలో సాగుచేస్తుంటారు. కానీ ఇటీవల ప్రత్యామ్నాయ పంటల వైపు దృష్టి సారిస్తున్నారు. అందులో భాగంగానే బంతి పూల తోటలు కూడా సాగుచేశారు. గుంటూరు పర్చూరు పాత మద్రాసు రోడ్డు వెంబడి పుల్లడిగుంట సమీపంలో పండించిన బంతి పూలు పసుపు, ఆరెంజ్ రంగుల్లో చూపరులను ఆకర్షిస్తున్నాయి.నిత్యం అలలతో ఎగసి పడే సంద్రం.. వెనక్కు తగ్గింది. ఇప్పటి వరకు అలల మాటున ఉన్న శిలలు అందమైన ఆకృతులతో సరికొత్తగా పరిచయం చేసుకున్నాయి. వాతావరణ మార్పులతో సముద్రం వెనక్కు వెళ్లడంతో విశాఖ బీచ్‌లోని వైఎంసీఏ ప్రాంతంలో నల్లని రాళ్లు కనువిందు చేశాయి. దీంతో సందర్శకులు సెల్ఫీలు, ఫొటోలు తీసుకుంటూ సందడి చేశారు. – సాక్షి ఫొటోగ్రాఫర్, విశాఖపట్నం కాకినాడ జిల్లా తుని పట్టణంలోని ఓ రైతుకు చెందిన నాటుకోడి అతి చిన్న గుడ్డు పెట్టడం పలువురిని ఆశ్చర్యానికి గురి చేసింది. రైతు గండి రమణ నాటు కోళ్లు పెంచుతున్నారు. ఇందులో ఒక పెట్ట ముందు రోజు సాధారణ పరిమాణం కలిగిన గుడ్డు పెట్టగా.. మంగళవారం చిన్న గుడ్డు పెట్టింది. జన్యుపరమైన లోపం వల్ల ఇలా జరుగుతుందని పశు వైద్యుడు శ్రీధర్ చెప్పారు.విశాఖ కేంద్ర కారాగారం ఆవరణలో సీజనల్ పంటలు పండిస్తున్నారు. ప్రస్తుతం శీతాకాలం కూరగాయల పంటలు ప్రారంభమయ్యాయి. కొన్ని కాపు దశకు వచ్చాయి. జైలులో ఉండే ఓపెన్ ఎయిర్ ఖైదీలచే రసాయనిక ఎరువుల్లేకుండా అధికారులు ఇక్కడ పంటలు పండిస్తుంటారు. జైలు లోపల మామిడి, కొబ్బరితోపాటు, బయట ఆవరణ సుమారు 20 ఎకరాల్లో సీజనల్ పంటలు పండించి వాటిని ఖైదీలకు వినియోగిస్తుంటారు. మిగిలిన వాటిని జైలు గేటు ముందు బీఆర్టీఎస్ పక్కన సుధార్ కేంద్రంలో విక్రయిస్తుంటారు. ప్రస్తుతం వంగ, బీర, క్యాబేజీ, టమాటా, ఆనప (సొర) సాగు చేస్తున్నారు. ఈ పంటలతో జైలు ఆవరణ అన్ని కాలాల్లోను పచ్చదనంతో కళకళలాడుతోంది.తాగునీటి కోసం మహిళలు రోడ్డెక్కిన ఘటన సీఎం చంద్రబాబు ప్రాతినిధ్యం వహిస్తున్న కుప్పం నియోజకవర్గంలోని రామకుప్పం మండలంలో మంగళవారం చోటుచేసుకుంది. మండలంలోని వీర్నమల ఎస్సీ కాలనీలో మూడు నెలలుగా తాగునీటి సమస్యతో సతమతమవుతున్నామని మహిళలు ఆగ్రహం వ్యక్తం చేస్తూ రోడ్డెక్కారు. ఎస్సీ కాలనీలో ఉన్న బోరులో నీరు ఇంకిపోవడంతో తాగునీటి సమస్య తీవ్రరూపం దాల్చిందని, డబ్బులిచ్చి నీళ్లు కొనుక్కోవాల్సిన ఖర్మ పట్టిందని ఆవేదన వ్యక్తం చేశారు. అధికారులకు ఎన్నిసార్లు చెప్పిన పట్టించుకోకపోవడంతో వారంతా ఖాళీ బిందెలతో ఆంధ్ర–తమిళనాడు సరిహద్దు రోడ్డుపై ఆందోళనకు దిగారు. ఈ కారణంగా వాహన రాకపోకలకు అంతరాయం కలిగింది.చౌక దుకాణాల వద్ద రేషన్ కోసం లబ్ధిదారులు గంటల తరబడి క్యూలో నిల్చోవాల్సిన పరిస్థితి మళ్లీ ఎదురైంది. గత వైఎస్సార్సీపీ ప్రభుత్వ పాలనలో ఇంటి వద్దకే రేషన్ పథకాన్ని అమలు చేసింది. ప్రస్తుతం కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక జిల్లాల్లో ఈ వ్యవహారాన్ని తూతూ మంత్రంగా నిర్వహిస్తున్నారు. చిత్తూరులోని 27వ వార్డు చామంతిపురం రేషన్‌షాపు వద్ద మంగళవారం ప్రజలు రేషన్ కోసం గంటల కొద్దీ పడిగాపులు కాశారు. గంటల కొద్దీ నిలబడలేక తాము తెచ్చుకున్న సంచులను వరుస క్రమంలో పెట్టారు. సమీపంలోని 28వ వార్డులో, మరికొన్ని మండలాల్లో సైతం ఇదే పరిస్థితులు ఉన్నట్లు సమాచారం. దీంతో ప్రజలు గత ప్రభుత్వ పాలనే బాగుందని వ్యాఖ్యానిస్తున్నారు. చదవండి: ఆంధ్రప్రదేశ్ తీర రేఖ పొడవు 1,027.58 కిలో మీటర్లు -
Photo Feature: పండగొచ్చింది పద బసవా..!
మకర సంక్రాంతి వేళ పల్లెలతో పాటు పట్టణాలు కూడా సరికొత్త శోభను సంతరించుకున్నాయి. ముచ్చటగా మూన్నాళ్లు చేసే పండుగకు బసవయ్యలతో గంగిరెద్దోళ్లు కూడా సిద్ధమయ్యారు. పీ..పీ ఊదుతూ గంగిరెద్దును పట్టుకొని ఇంటింటికీ వెళ్లి ఇచ్చింది తీసుకెళ్తుంటారు. హైటెక్ యుగంలోనూ బసవయ్యలను దైవంగా భావిస్తూ తమ కులవృత్తిని చేసుకుంటూ జీవనం సాగిస్తున్నారు . – సాక్షి ఫొటోగ్రాఫర్, అనంతపురం -
Vijayawada: బెజవాడను కప్పేసిన మంచు దుప్పటి
విజయవాడను సోమవారం మంచు దుప్పటి కప్పేసింది. నగరం అంతా పొగమంచుతో నిండిపోయింది. ఉదయం పది గంటల వరకూ భానుడు సైతం మంచులో చిక్కుకున్నాడు. వాహనాలన్నీ లైట్ల వెలుగుల్లో రాకపోకలు సాగించాయి. పొగ మంచులో నగరం సరికొత్త అందాలతో కనువిందు చేసింది. ప్రకాశం బ్యారేజీ, రైలు వంతెన, కనకదుర్గ ఫ్లైఓవర్, బెంజ్ సర్కిల్, రైల్వే స్టేషన్ రోడ్డు సహా నగరమంతా పొగమంచు అలముకోవడంతో బెజవాడ వాసులు ఇబ్బందులు పడ్డారు. – సాక్షి ఫొటోగ్రాఫర్, విజయవాడ -
వాహ్! విజయవాడ అందాలు.. తనివితీరా చూడాల్సిందే..
నీలాకాశం, తెల్లటి మేఘాల నీడలో బెజవాడ నగరం కొత్త అందాలను సంతరించుకుంది. దుర్గాఘాట్, కృష్ణా నది తీరం, ప్రకాశం బ్యారేజ్.. బ్యూటీఫుల్‌గా మెరిసిపోయాయి. మనసును రంజింప చేసే ఈ సుందర దృశ్యాలను ‘సాక్షి’ కెమెరా క్లిక్ మనిపించింది. సమర్పణం విజయవాడ దుర్గాఘాట్‌లో సోమవారం కృష్ణవేణి సాక్షిగా అర్ఘ్యం సమర్పిస్తున్న దృశ్యం దర్పణం మేఘాల ఘుమఘుమలు.. పుడమికి నీలి ఆకాశం సరిగమలు.. దుర్గాఘాట్‌లో దర్పణంలా వాననీటిలో ఆకాశం ప్రతిబింబం మేఘాల తెరచాప ఇంద్రకీలాద్రి దుర్గమ్మ అమ్మవారి ఆలయంపై దట్టంగా అలుముకున్న మేఘాల తెరచాప మేఘాల హొయలు కృష్ణా నది తీరంపై అందంగా హొయలు పోతున్న మేఘమాలలు నీలాకాశం నీడలో.. నీలాకాశం నీడలో కొత్త అందాలు సంతరించుకున్న ప్రకాశం బ్యారేజ్ పరిసరాలు సంస్మరణం అక్టోబర్ 21న జరగనున్న పోలీసు అమరవీరుల సంస్మరణ దినోత్సవ సన్నాహకాల్లో భాగంగా ఇందిరా గాంధీ మునిసిపల్ కార్పొరేషన్ స్టేడియంలో నీలాకాశం నీడలో పోలీసు సిబ్బంది కవాతు. – సాక్షి ఫొటోగ్రాఫర్, విజయవాడ -
మంచుతెరలు.. సూర్యోదయం అందాలు అదుర్స్.. ఎక్కడంటే!
సాక్షి, అరకు(అల్లూరి సీతారామరాజు జిల్లా): ప్రముఖ పర్యాటక కేంద్రం అరకు – అనంతగిరి ఘాట్‌మార్గంలో గాలికొండ వ్యూపాయింట్ వద్ద ప్రకృతి అందాలు మంత్ర ముగ్ధులను చేస్తున్నాయి. గురువారం ఉదయం తరలివచ్చిన పర్యాటకుల సెల్ఫోన్ల వీటిని బంధించారు. మలుపుల వద్ద మంచు అందాలను తిలకించి పులకించిపోయారు. వంజంగి హిల్స్‌లో మంచుతెరలు పాడేరు : మేఘాలు, మంచు అందాల నిలయంగా విశ్వవ్యాప్తి పొందిన పాడేరు మండలం వంజంగి హిల్స్‌లో గురువారం ప్రకృతి కనువిందు చేసింది. అనేక ప్రాంతాలకు చెందిన పర్యాటకులు బుధవారం రాత్రే వంజంగి హిల్స్‌కు చేరుకుని కల్లాలబయలు, బోనంగమ్మ పర్వతంపై గుడారాలు వేసుకుని బస చేసారు. తెల్లవారుజాము 4.30 గంటల సమయంలో సూర్యోదయం అందాలు పర్యాటకులను అబ్బురపరిచాయి. కొండల నిండా మంచు నెలకొనడంతో ఇక్కడ ప్రకృతి రమ్యతను చూసి పర్యాటకులంతా మంత్రముగ్ధులయ్యారు. ఉదయం పది గంటల వరకు మంచుతెరలు ఆకట్టుకున్నాయి. (క్లిక్: అందమైన పెళ్లికి ఆదివాసీలే పేరంటాలు) -
Photo Feature: పుడమితల్లి ఒడిలో.. అంతులేని ఆనందం
డైనింగ్ టేబుల్ లేదు.. వడ్డించే వారూ ఉండరు.. కూర్చొనేందుకు సరైన సౌకర్యమూ ఉండదు. అయితేనేం.. తినే ప్రతీ మెతుకులోను అంతులేని ఆనందం వారి సొంతం. పుడమితల్లి ఒడిలో.. చేలగట్లపై సమయానికి తినే పట్టెడు అన్నమే వారికి బలం. ఆ శక్తితోనే ఎంతో మందికి అన్నం పెట్టేందుకు పొలంలో శ్రమిస్తారు. శ్రమైక జీవన సౌందర్యానికి మించినది లేదని చాటిచెబుతారు. విజయనగరం జిల్లా కుమిలి రోడ్డులో పొలం గట్లపై సామూహికంగా భోజనాలు చేస్తూ సోమవారం ‘సాక్షి’ కెమెరాకు చిక్కిన మహిళా రైతుల చిత్రమే దీనికి సజీవ సాక్ష్యం. – సాక్షి ఫొటోగ్రాఫర్, విజయనగరం చకచకా ఈ–క్రాప్ జిల్లాలో ఈ–క్రాప్ నమోదు చకచకా సాగుతోంది. సచివాలయ వ్యవసాయ సహాయకులు, వ్యవసాయ, రెవెన్యూ అధికారుల సమక్షంలో పంటల నమోదు ప్రక్రియ జరుగుతోంది. ఉచిత పంటల బీమా, సున్నావడ్డీ, పంట రుణాలు, నష్ట పరిహారం, రైతు భరోసా, ధాన్యం కొనుగోలు వంటి ప్రయోజనాలు రైతులకు చేరాలంటే ఈ–క్రాప్ నమోదు తప్పనిసరి. రైతులు కూడా బాధ్యతగా ఈ నెల 31లోగా ఈ క్రాప్ నమోదు చేయించుకునేందుకు చొరవచూపాలని అధికారులు సూచిస్తున్నారు. – నెల్లిమర్ల రూరల్ ముందస్తు వైద్యం వర్షాలు కురిసే వేళ.. కలుషిత మేత, నీరు తాగడంతో జీవాలు వ్యాధుల భారిన పడే అవకాశం ఉంది. జీవాల సంరక్షణే ధ్యేయంగా ప్రభుత్వం ముందస్తుగా ఉచిత వైద్యసేలందిస్తోంది. ఊరూరా పశువైద్య శిబిరాలు నిర్వహించి నట్టల నివారణ మందు వేయిస్తోంది. జిల్లా వ్యాప్తంగా 6,04,665 జీవాలు ఉండగా వీటిలో గొర్రెలు 4,48,154, మేకలు 1,56,511 ఉన్నాయి. జీవికి రూ.2.50 పైసల చొప్పున సుమారు రూ.18 లక్షల విలువైన డోసులను సరఫరా చేసింది. ఈ నెల 16న ప్రారంభమైన నట్టనివారణ మందు వేసే ప్రక్రియ ఈ నెల 31 వరకు సాగనుందని పశుసంవర్థకశాఖ జేడీ వైవీ రమణ తెలిపారు. – రామభద్రపురం ఐదు అడుగుల అరటిగెల.. చీపురుపల్లిరూరల్(గరివిడి): అరటిగెల సాధారణంగా 3 నుంచి నాలుగు అడుగుల పొడవు ఉంటుంది. అయితే, గరివిడి పట్టణంలోని బద్రీప్రసాద్ కాలనీలో ఓ విశ్రాంత ఫేకర్ ఉద్యోగి ఇంటి పెరటిలోని అరటిచెట్టు ఐదు అడుగుల గెల వేసింది. 300కు పైబడిన పండ్లతో చూపరులను ఆకర్షిస్తోంది. (క్లిక్: మొబైల్ మిస్సయ్యిందా..? జస్ట్ ఇలా చేస్తే చాలు.. మీ ఫోన్ సేఫ్!) -
Photo Feature : ప్రకృతి గీసిన మల్లాపూర్ అందాలు
పచ్చని పల్లె ప్రకృతి సోయగం కనువిందు చేస్తోంది. ఏటా శ్రావణమాసంలో మల్లాపూర్ శివారు సోమేశ్వర కొండపైన కొలువుదీరిన శ్రీకనకసోమేశ్వర స్వామిని దర్శించుకు నేందుకు తరలివచ్చే భక్తులు ప్రకృతి అందాలను తిలకిస్తూ పులకించిపోతుంటారు. పచ్చని పొలాలు, గుట్టల మధ్యన ప్రకృతి గీసిన మల్లాపూర్ (పల్లె) అందాన్ని సోమవారం భక్తులు సోమేశ్వర కొండపై నుంచి ఆస్వాదిస్తూ ఆనందించారు. -మల్లాపూర్(కోరుట్ల) -
Photo Feature: చెట్టుకు రాఖీ.. సేమ్యాలపై జాతీయ గీతం
చెట్లను కూడా కుటుంబ సభ్యుల్లా సాకాలనే సందేశంపై ప్రజల్లో అవగాహన కల్పించేందుకు విశాఖ నగరంలోని రైల్వే స్టేషన్ సమీపంలో వందేళ్ల వయసున్న మర్రి చెట్టుకు గ్రీన్ క్లైమేట్ టీమ్ ప్రతినిధులు బుధవారం రక్షాబంధన్ కట్టారు. రాఖీ పౌర్ణమి సందర్భంగా విత్తన రాఖీ కట్టి చెట్లను కాపాడతామని ప్రతినబూనారు. – సాక్షి, విశాఖపట్నం సేమ్యాలపై జాతీయ గీతం ఆజాదీకా అమృత్ మహోత్సవ్ సందర్భం పాస్తా(సేమ్యా)లపై జాతీయ గీతాన్ని రాసి అబ్బురపరుస్తోంది బాపట్ల జిల్లా కారంచేడు మండలం స్వర్ణ గ్రామానికి చెందిన అన్నం మహిత. కేవలం మూడు గంటల వ్యవధిలోనే ఈ గీతాన్ని రాయగలిగినట్టు ఆమె తెలిపింది. – కారంచేడు ముందుకొచ్చిన సముద్రం బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం ప్రభావంతో విజయనగరం జిల్లా భోగాపురం మండలంలోని ముక్కాం, కొండ్రాజుపాలెం, చేపలకంచేరు తీరంలో ‘అల’జడి నెలకొంది. ముక్కాం, చేపలకంచేరు మధ్య బుధవారం 50 మీటర్ల మేర సముద్రం ముందుకు వచ్చింది. కెరటాల తాకిడికి ముక్కాం గ్రామ తీరంలోని రోడ్డు, మత్స్యకారుల ఇళ్లు కోతకు గురయ్యాయి. రెవెన్యూ, సచివాలయ సిబ్బంది తీర ప్రాంతాల్లో పర్యటించి మత్స్యకారులను అప్రమత్తం చేశారు. ప్రతికూల వాతావరణం దృష్ట్యా వేటకు వెళ్లవద్దని మత్స్యకారులను హెచ్చరించారు. (క్లిక్: ఉగ్ర కృష్ణ.. మహోగ్ర గోదావరి) – భోగాపురం మనోహర దృశ్యం శ్రీశైలం డామ్ పదిగేట్లు ఎత్తివేయడంతో వరద నీరు దిగువకు పరవళ్లు తొక్కుతోంది. ఈ మనోహర దృశ్యాన్ని ప్రత్యక్షంగా చూసేందుకు సందర్శకులు శ్రీశైలం ప్రాజెక్ట్ వద్దకు తరలివస్తున్నారు. పాల నురుగులా పొంగుతున్న నీటి ప్రవాహాన్ని చూస్తూ పర్యాటకులు పరశించిపోతున్నారు. (క్లిక్: ఆ కుటుంబాలకు వజ్రాల రూపంలో లక్షలు..) -
Photo Feature: త్రివర్ణ కాంతుల్లో రామప్ప
రామప్ప ఆలయం సోమవారం రాత్రి త్రివర్ణ కాంతుల్లో మెరిసిపోయింది. స్వతంత్ర భారత వజ్రోత్సవాల్లో భాగంగా కేంద్ర పురావస్తుశాఖ ఆధ్వర్యంలో ఆలయానికి మూడు రంగుల విద్యుత్ దీపాలు ఏర్పాటు చేయడంతో ఆ గొప్ప కట్టడం కాంతులీనింది. స్వాతంత్య్ర దినోత్సవం రోజున ఇక్కడ జాతీయజెండాను ఆవిష్కరించడంతోపాటు స్వాతంత్య్ర సమరయోధులను సన్మానించనున్నట్లు పురావస్తుశాఖ అ«ధికారులు తెలిపారు. – వెంకటాపురం(ఎం), ములుగు జిల్లా -
Photo Feature: వంజంగి కొండలపై పాల సముద్రం..
సాక్షి, పాడేరు: వంజంగి హిల్స్‌లో మూడు రోజులుగా పొగమంచు, మేఘాల అందాలు అలరిస్తున్నాయి. శనివారం వేకువజామున 5గంటలకు సూర్యోదయం కనువిందు చేసింది. ఆహ్లాదకర వాతావరణంతో పాటు సూర్యోదయం అందాలను పర్యాటకులు ఆస్వాదించారు. వంజంగి హిల్స్‌లో మంచు అందాలు నెలకొనడంతో మళ్లీ పర్యాటకుల సందడి మొదలైంది. చదవండి: Photo Feature: మేమా.. టైంకు రావడమా.. సీలేరు: దారాలమ్మతల్లి ఆలయం సమీప అటవీ ప్రాంతం పొగమంచుతో కనువిందు చేసింది. శనివారం వేకువజాము నుంచి ఉదయం 8 గంటల వరకు దట్టంగా పొగమంచు కురిసింది. ఘాట్ మీదుగా ప్రయాణం సాగించిన వాహనదారులు, స్థానికులు ఈ పొగమంచు అందాలను వీక్షించి ఎంతో పరవశించారు. -
Photo Feature: మేమా.. టైంకు రావడమా..
సాక్షి, ఖమ్మం: జిల్లా కేంద్రంలోని పలు ప్రభుత్వ కార్యాలయాల్లో ఉద్యోగులు సమయపాలన పాటించడం లేదు. అధికారులు సహా ఉద్యోగులు, సిబ్బంది అందరూ తమకు ఇష్టం వచ్చిన సమయంలో విధులకు రావడం పరిపాటిగా మారింది. దీంతో వివిధ పనులపై వచ్చే ప్రజలు పడిగాపులు కాస్తున్నారు. జిల్లా కేంద్రంలోని డీఆర్డీఏ కార్యాలయంలో శనివారం ఈ పరిస్థితి కనిపించింది. ఉదయం 10.30 గంటలు దాటినా చాలామంది అధికారులు కార్యాలయానికి రాలేదు. ఆసరా మేనేజర్ సెక్షన్, సెర్ప్ విభాగం, సెర్ప్ ఫైనాన్స్ విభాగం, హెచ్ఆర్ విభాగంతోపాటు పలు సెక్షన్లలో ఉద్యోగులు రాక ఖాళీ కుర్చీలు దర్శనమిచ్చాయి. సెర్ప్ ఫైనాన్స్ విభాగంలో.. సెర్ప్ విభాగంలో.. హెచ్ఆర్ విభాగంలో ఖాళీ కుర్చీలు -
వావ్ అనిపించే వాటర్‌ఫాల్స్.. చూపు తిప్పుకోలేరు!
సాక్షి, ముంచంగిపుట్టు: పరవళ్లు తొక్కుతున్న నదీ జలాలు.. వాగులు, సెలయేర్లు.. కొండలు, కోనలు.. ఇలా ఒకటేమిటి ప్రతిదీ మన్యంలో అద్భుత దృశ్యంగా పర్యాటకుల మనసు దోచుకుంటున్నాయి. ప్రస్తుతం కురుస్తున్న వర్షాలకు ఆంధ్ర–ఒడిశా సరిహద్దులో జలపాతాలు హొయలొలుకుతున్నాయి. తొలకరి వర్షాలతో కొండ ప్రాంతాల నుంచి వరద నీరు పోటెత్తడంతో జలపాతాల నీటి ఉధృతికి తోడై మరింత కనువిందు చేస్తున్నాయి. చిన్న జలపాతాలు సైతం ఎంతో అద్భుతంగా కనిపిస్తూ ప్రకృతి ప్రేమికులను మంత్రముగ్ధుల్ని చేస్తున్నాయి. ఆంధ్ర–ఒడిశా సరిహద్దులో డుడుమ జలపాతం 2,700 అడుగుల పైనుంచి మంచు తెరల మధ్య జాలు వారుతూ ఆహ్లాద పరుస్తోంది. ముంచంగిపుట్టు మండలం కుమడ పంచాయతీ జడిగూడ జలపాతం సైతం విశేషంగా ఆకట్టుకుంటోంది. ముంచంగిపుట్టు, పెదబయలు మండలాల సరిహద్దులో తారాబు జలపాతం నింగికి ఎగసి పడుతున్నట్లు కనిపిస్తోంది. బరడ పంచాయతీ హంశబంద, జర్జుల పంచాయతీ బురదగుంట జలపాతాలు పరవళ్లు తొక్కుతున్నాయి. వీటిని చూసేందుకు ఆంధ్ర, ఒడిశా సరిహద్దులతోపాటు విశాఖపట్నం, విజయనగరం, శ్రీకాకుళం, అనకాపల్లి ప్రాంతాల నుంచి అధిక సంఖ్యలో పర్యాటకులు వచ్చి విశేష అనుభూతిని పొందుతున్నారు. అక్కడ చుట్టు పక్కల వంటలు చేస్తూ పాటలు పాడుతూ డ్యాన్సులు చేస్తూ, సెల్ఫీలు, ఫొటోలు తీసుకుంటూ సందడి చేస్తున్నారు. పాల కడలి స్నోయగాలు మేఘాల కొండగా విశ్వవ్యాప్తి పొందిన పాడేరు మండలం వంజంగి హిల్స్ పొగమంచు, మేఘాలతో గురువారం ఉదయం పాలసముద్రంలా దర్శనమిచ్చింది. వేకువజాము నుంచి ఉదయం 10గంటల వరకు కొండల నిండా మంచు పరుచుకుంది. ఇక్కడి ప్రకృతి అందాలు పర్యాటకులను అబ్బురపరిచాయి. పలు ప్రాంతాల నుంచి వచ్చిన పర్యాటకులు ప్రకృతి అందాలను వీక్షించి పరవశించారు. – సాక్షి, పాడేరు -
Photo Feature: పాలనురగలా జలపాతం
సాక్షి ఫొటోగ్రాఫర్, నిర్మల్: ఎత్తైన కొండలు.. చుట్టూ అడవి పచ్చనికొండల మధ్యన ప్రకృతి అందాలు ఇదెక్కడో కాదు.. జిల్లా కేంద్రానికి 10 కి.మీ దూరాన మహబూబ్‌ఘాట్ వద్ద కనిపిస్తోంది. ఇక్కడ జలపాతం వద్ద పర్యాటకుల సందడితో ఉంటుంది. కురుస్తున్న వర్షాలకు ఘాట్ పైనుంచి నల్లని రాతిపై పాలనురుగులా నీరు ప్రవహిస్తోంది. దాదాపు 70 అడుగుల ఎత్తు నుంచి జాలువారే నీటిధారలు ప్రకృతి ప్రేమికులను మంత్రముగ్ధులను చేస్తున్నాయి. చదవండి: ‘చీకోటి’ కేసులో సంచలన విషయాలు.. సినీ హీరోయిన్లకు కళ్లు చెదిరే పారితోషికాలు -
Photo Feature: పచ్చని గిరులపై మేఘాల పల్లకి
పాడేరు–విశాఖపట్నం ప్రధాన రహదారిలోని ఘాట్‌లో ఆదివారం మేఘాలు కనువిందు చేశాయి. కొండలను తాకుతున్న మేఘాలను చూసి పర్యాటకులు, రోడ్డు ప్రయాణికులు, మోదమ్మ పాదాలు సందర్శనకు వచ్చిన భక్తులు పరవశించిపోయారు. కొద్ది రోజులుగా కురుస్తున్న వర్షాలకు ప్రకృతి.. పచ్చదనంతో చూపరులను కట్టిపడేస్తోంది. – సాక్షి, పాడేరు -
Photo Feature: అందాలలో అహో మహోదయం
మన్యంలోని మారుమూల ప్రాంతాల్లో ప్రకృతి అందాలు చూపరులను కనువిందు చేస్తున్నాయి. నెల రోజులుగా కురుస్తున్న వర్షాలకు మాదల పంచాయతీలోని దోమలజోరు, రత్తకండి, ఆంధ్ర–ఒడిశా సరిహద్దు ప్రాంతం సుంకి, పరిసర ప్రాంతాలు ఆకుపచ్చగా మారి ముచ్చటగొల్పుతున్నాయి. శీతాకాలం తలపించేలా ఉదయం వేళ మంచు సోయగాలు మరింతగా ఆహ్లాదపరుస్తున్నాయి. పర్యాటకులు ప్రకృతి అందాలను ఆస్వాదిస్తూ.. మనోహర లోకంలో విహరిస్తున్నారు. –అరకులోయ రూరల్ అరకులోయలో మంచు సోయగాలు మాదల పంచాయతీ ఆంధ్ర–ఒడిశా సరిహద్దు ప్రాంతంలో ప్రకృతి అందాలు -
Photo Feature: కుక్క.. కోతి సయ్యాట
సాక్షి, ఖమ్మం: గ్రామాలు, పట్టణాల్లో ఇటీవల కోతుల సంచారం పెరిగింది. కోతి కనిపిస్తే చాలు కుక్కలు వెంటపడి తరుముతుంటాయి. కానీ ముదిగొండ మండల కేంద్రంలో జాతి వైరాన్ని మరిచి ఓ కోతి కుక్కపైన ఇలా పడుకుని సేద తీరింది. ఆ తర్వాత కోతి, కుక్క కలిసి ఆడుకోవడం కనిపించింది. ఈ సన్నివేశాలను అటుగా వెళ్తున్న వారు ఆసక్తిగా చూశారు. చదవండి: Photo Feature: హరివిల్లుతో పులకింత -
Photo Feature: హరివిల్లుతో పులకింత
సాక్షి ఫొటోగ్రాఫర్, తిరుపతి: తిరుపతి నగరంలో ఆదివారం సాయంత్రం ఓ వైపు ఎండ కాయగా మరోవైపు వర్షం కురిసింది. ఈ క్రమంలో ఆకాశంలో హరివిల్లు విరిసింది. తద్వారా నగర వాసులను పులకింపజేసింది. కొందరు హరివిల్లును తమ మొబైల్ ఫోన్లలో బంధించారు. -
Photo Feature: మన్యం అందం.. ద్విగుణీకృతం
కవుల వర్ణనలో కనిపించే అందాలెన్నో మన్యంలో కనువిందు చేస్తున్నాయి. ఎడతెరపిలేకుండా కురుస్తున్న వర్షాలకు పలు ప్రాంతాల్లో జలపాతాలు పొంగిపొర్లుతూ.. కొత్త సోయగాలు సంతరించుకుంటున్నాయి. ఆకాశం నుంచి నేలకు తాకుతున్న మబ్బులతో కొత్తందాలు ఆవిష్కృతమవుతున్నాయి. ప్రకృతి పచ్చని తివాచీ పరిచిందా అన్నట్లు అబ్బురపరిచే పొలాలు పర్యాటకులను విపరీతంగా ఆకట్టుకుంటున్నాయి. సీలేరు జలాశయం వ్యూ పాయింట్, గుంటవాడ డ్యాం, సీలేరు సమీపంలోని తురాయి జలపాతం, జి.మాడుగుల మండలంలోని కొత్తపల్లి జలపాతం, గుర్రాయి, ఎగ కంఠవరంలోని అక్కాచెల్లెల జలపాతాలు, కుంబిడిసింగి మార్గంలో జలపాతం అందాలు పర్యాటకులను ఆహ్లాదపరుస్తున్నాయి. అరమ, సొవ్వ, సాగర, కొర్రా తదితర ప్రాంతాలు పచ్చదనంతో ముచ్చటగొల్పుతున్నాయి. కొండ ప్రాంత అందాలకు ప్రకృతి ప్రేమికులు పరవశించిపోతున్నారు. – సీలేరు, జి.మాడుగుల, డుంబ్రిగుడ (అల్లూరి సీతారామరాజు జిల్లా) -
Photo Feature: తొలి పువ్వు పదహారేళ్లకు..
శాయంపేట: హనుమకొండ జిల్లా శాయంపేట మండల కేంద్రంలోని పెద్దకోడెపాక గ్రామానికి చెందిన వనప్రేమికుడు కోమనేని రఘు ఇంటి ఆవరణలో పదహారేళ్ల క్రితం సీయర్స్ జామకారు మొక్కను నాటారు. మండకారు అని కూడా పిలిచే క్యాక్టస్ జాతికి చెందిన ఈ మొక్క ఇదిగో ఇప్పుడు తొలి పువ్వును పూసింది. తెల్లటి రేఖలతో వికసించిన ఈ పువ్వును చూసేందుకు గ్రామస్తులు తరలివస్తున్నారు. చదవండి: చీమ.. బలానికి చిరునామా.. -
Photo Feature: అలుగు దుంకిన అందం
సాక్షి, హైదరాబాద్: ఎడతెరిపి లేని వర్షాలతో ఊరూ వాడా.. వాగూ వంకా.. ఏరులై పారుతున్నాయి. కొన్నిచోట్ల అలుగు దుంకుతున్న చెరువులతో అందాలు జాలువారుతున్నాయి. మరికొన్ని కట్టలు తెగి ఊళ్లను, చేలను ముంచెత్తుతున్నాయి. కొన్ని రోజులుగా కురుస్తున్న భారీ వర్షాలతో మంగళవారం నాటికి రాష్ట్రంలో 49 చెరువులు పూర్తిగా తెగిపోయాయి. మరో 43 చెరువులకు గండ్లు పడ్డాయని అధికారులు చెబుతున్నారు. అలాగే, 25 కాల్వలకు సైతం గండ్లు పడ్డాయి. -
Photo Feature: చీమ.. బలానికి చిరునామా..
ఇండోనేసియా: మనుషులను బాహుబలి బాహుబలి అంటాం గానీ.. అసలైన బాహుబలులు ఈ చీమలే.. చూశారుగా.. వాటి బలం.. తమ బరువుకు 10 రెట్ల బరువును అవి అలవోకగా మోయగలవు. ఇండోనేసియాకు చెందిన ఫొటోగ్రాఫర్ జాల్ఫిక్రి ఈ చిత్రాన్ని తీశారు. -
Photo Feature: అక్కడే తరగతి.. వసతి
ఆదిలాబాద్ జిల్లా బేలలోని గిరిజన సంక్షేమ ఆశ్రమ పాఠశాలలో ఆరు నుంచి పది తరగతులకు 12 గదులు మాత్రమే ఉన్నాయి. అందులో ఆరు గదులను తరగతి గదులకు, రెండు గదులను విద్యార్థుల వసతికి కేటాయించారు. మిగతా నాలుగు గదులను ఆఫీస్, స్టోర్, ల్యాబ్, వంటకు ఉపయోగిస్తున్నారు. అయితే 267 మంది విద్యార్థులు పడుకునేందుకు రెండు గదులు సరిపోకపోవడంతో, తరగతి గదులనే వసతికీ వాడుతున్నారు. వాటిలోనే విద్యార్థులు రాత్రిపూట పడుకుంటున్నారు. ఉదయం ఆ గదుల్లోనే క్లాసులు నిర్వహిస్తున్నారు. విద్యార్థులెవరైనా అనారోగ్యానికి గురైతే.. ఇదిగో ఇలా పాఠాలు బోధిస్తున్న గదిలోనే విశ్రాంతి తీసుకోవాల్సిన దుస్థితి దాపురించింది. ఉన్నతాధికారులు, ప్రజాప్రతినిధులు స్పందించి, అదనపు తరగతి గదులను నిర్మించి, తమ అవస్థలు తొలగించాలని విద్యార్థులు, ఉపాధ్యాయులు కోరుతున్నారు. (క్లిక్: ఓయూలో ఐడియాలకు ఆహ్వానం) – సాక్షి ఫొటోగ్రాఫర్, ఆదిలాబాద్ -
Photo Feature: మిడ్ పెన్నార్ రిజర్వాయర్.. కొత్త అందాలు
చుట్టూ పచ్చని గిరులు.. ఆ పైనే గాలిమరలు.. మధ్యన పెన్నార్ నీరు.. పక్కన గలగల పారే కాలువ.. ఏపుగా పెరిగిన చెట్లు.. స్వచ్ఛమైన గాలి..స్వేచ్ఛగా తిరుగుతున్న పశుపక్ష్యాదులు... సందర్శకులను ఇట్టే ఆకట్టుకుంటున్నాయి. అనంతపురం జిల్లా గార్లదిన్నె మండలం పెనకచర్ల వద్ద గల మిడ్ పెన్నార్ రిజర్వాయర్ (ఎంపీఆర్) కొత్త అందాలను సంతరించుకుని పర్యాటకులను మంత్ర ముగ్ధులను చేస్తోంది. – డి.మహబూబ్‌బాషా, సాక్షి ఫొటోగ్రాఫర్, అనంతపురం -
Photo Feature: అధికారులూ! మేల్కోండి..!!! గుడిలో బడి
సాక్షి, హైదరాబాద్: ఇది బంజారాహిల్స్‌లోని కట్టమైసమ్మ గుడి. ఈ ఆలయ ఆవరణలో సుమారు 250 మంది చిన్నారులు చదువుకుంటున్నారు. అదేంటి?.. గుడిలో పిల్లలు చదువుకోవడమేంటి? అని ఆశ్చర్యపోతున్నారా? ఇది నిజంగా నిజమే. నాలుగేళ్ల క్రితం ఏర్పడిన ఇక్కడి ప్రభుత్వ ప్రాథమిక పాఠశాలకు సొంత భవనం లేకపోవడంతో స్థానిక ఉదయ్‌నగర్ కమ్యూనిటీ హాల్లో కొనసాగేది. మొన్నటిదాకా ఇక్కడ 100 మంది పిల్లలు మాత్రమే ఉండేవారు. ఈ ఏడాది కొత్త అడ్మిషన్లతో విద్యార్థుల సంఖ్య 250కి చేరింది. పిల్లల సంఖ్యకు అనుగుణంగా కమ్యూనిటీ హాల్ లేకపోవడంతో దీనికి ఆనుకుని ఉన్న కట్టమైసమ్మ గుడి ఆవరణలోనే టీచర్లు చదువు చెబుతున్నారు. గుడిలో ఫంక్షన్లు జరిగిన సందర్భాల్లో పాఠశాలకు సెలవు ప్రకటిస్తున్నారు. 250 మంది విద్యార్థులకు ఇద్దరు టీచర్లు, రెండు గదులు మాత్రమే ఉండటం గమనార్హం. ఒకవైపు మన బస్తీ.. మన బడి కార్యక్రమంతో సర్కారు బడులను బాగు చేస్తున్న ప్రభుత్వం ఇక్కడో బడి నిర్మిస్తే బావుటుంది. అధికారులూ! మేల్కోండి...!!! చదవండి: కానిస్టేబుల్‌పై దాడి.. నడిరోడ్డుపై ఈడ్చుకుంటూ ఎంపీ రఘురామ ఇంటికి -
Photo Feature: బల్తాల్ మార్గంలో అమర్నాథ్ యాత్ర
మంచు పర్వతాల్లో కొలువైన మంచురూప అమరేశ్వరుడి దర్శనార్థం వేలాది మంది శివభక్తులు ‘అమర్నాథ్’ యాత్రగా బయల్దేరారు. 43 రోజులపాటు కొనసాగే అమర్నాథ్ యాత్ర గురువారం మొదలైంది. ఆర్టికల్ 370 రద్దు, కోవిడ్ సంక్షోభాల నేపథ్యంలో దాదాపు మూడేళ్ల తర్వాత యాత్ర ప్రారంభమవడంతో ఈసారి భక్తుల తాకిడి విపరీతంగా ఉండే అవకాశముంది.