Photo Feature: సప్తగిరులపై ‘స్నో’యగాలు | Photo Feature in Telugu: Tirumala Hills Snowfall, Rainbow Prakasam Barrage | Sakshi
Sakshi News home page

Photo Feature: సప్తగిరులపై ‘స్నో’యగాలు

Published Tue, Nov 23 2021 8:16 PM | Last Updated on Wed, Nov 24 2021 10:51 AM

Photo Feature in Telugu: Tirumala Hills Snowfall, Rainbow Prakasam Barrage - Sakshi

విస్తార వర్షాలతో గిరులు పచ్చదనాన్ని పరుచుకున్నాయి. నీలిమేఘాలు సప్తగిరులను కమ్మేశాయి. పొగమంచు కొత్త అందాలను నెరిపాయి. తిరుమల రహదారుల నుంచి శ్రీవారి మెట్టుమార్గం వైపు చూసినప్పుడు మేఘాలు పరుచుకున్న దృశ్యాలు కనువిందు చేస్తున్నాయి. ఈ హిమ సోయగాలు కొత్త అనుభూతిని కల్గిస్తున్నాయి. కశ్మీర్‌ లోయను తలపించేలా సప్తగిరులపైన నీలిమబ్బులు పరుచుకున్నాయి. వానలు, మంచు, పచ్చదనం, కమ్మేసిన మబ్బుల దృశ్యాలు సందర్శకులను విశేషంగా ఆకట్టుకుంటున్నాయి. తాము కొత్త లోకాలకు వచ్చామా అన్న అనుభూతిని కలిగిస్తున్నాయి.
– తిరుమల


కృష్ణమ్మకు ‘ఇంద్ర’హారం

చిరుజల్లులకు సూర్యకిరణాలు తోడై సప్తవర్ణ మిళితమైన ఇంద్రధనస్సు విజయవాడ ప్రకాశం బ్యారేజ్‌ వద్ద సోమవారం ఇలా కనువిందు చేసింది. 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement