snowfall
-
పుల్వామాలో మంచు అందాలు చూద్దామా..
-
వీర లెవల్లో అందాలు అదరహో.. మంచుకురిసే వేళలో మైమరపిస్తున్న కశ్మీరం (చిత్రాలు)
-
Snowfall Destinations: అత్యధిక మంచు కురిసే ప్రాంతాలివే..
భారతదేశంలోని ఉత్తరాదిన పలు ప్రాంతాల్లో ప్రస్తుతం విపరీతంగా మంచుకురుస్తోంది. దీంతో పర్యాటకులు ఆ మంచుతో కూడిన ప్రాంతాలను చూసేందుకు క్యూ కడుతున్నారు. ఆ మంచులో చాలాసేపు ఆడుకోవాలని తహతహలాడుతున్నారు. మరి ప్రపంచంలో అత్యధికంగా మంచుకురిసే ప్రాంతాలు ఎక్కడున్నాయో తెలుసా?నూతన సంవత్సరం ప్రారంభంలో ప్రపంచంలోని పలు దేశాల్లో మంచు కురుస్తుంటుంది. అయితే కొన్ని ప్రాంతాలు భారీ హిమపాతం కారణంగా ఎంతో ప్రసిద్ధి చెందాయి. ఈ సమయంలో టూరిస్టులు ఆయా ప్రాంతాలకు తరలివచ్చి, తనివితీరా ఎంజాయ్ చేస్తుంటారు. ఆ ప్రాంతాలేవో, ఎక్కడున్నాయో ఇప్పుడు తెలుసుకుందాం.మౌంట్ డెనాలి, అలాస్కా ఉత్తర ధ్రువానికి సమీపంలోని అందమైన ప్రాంతం అలస్కా(Alaska). ఇది అమెరికాలో ఉంది. హిమపాతానికి ఈ ప్రాంతం ఎంతో ప్రసిద్ధి చెందింది. అలాస్కాలో ఏడాది పొడవునా మంచు కురుస్తుంటుంది. అయితే శీతాకాలంలో డెనాలి పర్వతంపై హిమపాత దృశ్యం ఎంతో ఆకర్షణీయంగా కనిపిస్తుంది.వెర్ఖోయాన్స్క్ అండ్ ఐమ్యాకాన్, రష్యారష్యాలోని వెర్కోయాన్స్క్, ఐమ్యాకాన్లు ప్రపంచంలోనే అత్యంత శీతల ప్రదేశాలలో ఒకటిగా గుర్తింపు పొందాయి. శీతాకాలంలో వెర్ఖోయాన్స్క్లో ఉష్ణోగ్రత -48 డిగ్రీల సెల్సియస్ వరకుచేరుకుంటుంది. ఐమ్యాకాన్(iMacon)లో ఉష్ణోగ్రత -71 డిగ్రీల సెల్సియస్‌కు చేరుకుంటుంది. అందుకే ప్రతీయేటా నూతన సంవత్సరంలో హిమపాతాన్ని చూసేందుకు పర్యాటకులు రష్యాకు తరలివస్తుంటారు.ఫ్రేజర్, కొలరాడోకొలరాడో అమెరికాలోని రెండవ అత్యంత శీతల ప్రదేశంగా గుర్తింపు పొందింది. ముఖ్యంగా శీతాకాలంలో కొలరాడోలో భారీ హిమపాతంతో పాటు, తెల్లటి మంచు పలకలు కనిపిస్తాయి. కొలరాడోలోని ఫ్రేజర్లో మంచు కురుస్తున్న దృశ్యం టూరిస్టులను సంబ్రమాశ్చర్యాలకు లోనయ్యేలా చేస్తుంది.మిన్నెసోటా అండ్ యుకాన్, అమెరికాఅమెరికాలోని మిన్నెసోటాలో గల అంతర్జాతీయ జలపాతం(International Falls) ప్రపంచంలోని అత్యంత శీతల ప్రదేశాలలో ఒకటిగా గుర్తిస్తారు. ఈ జలపాతాన్ని ‘ఐస్ బాక్స్ ఆఫ్ ది నేషన్’ అని కూడా పిలుస్తారు. అమెరికాలోని యుకాన్లో గల స్నాగ్ అనే చిన్ని గ్రామం కూడా భారీ హిమపాతానికి ప్రపంచ వ్యాప్తంగా ప్రసిద్ధి చెందింది.ఉలాన్బాతర్, మంగోలియామంగోలియా రాజధాని ఉలాన్బాతర్ ప్రపంచంలోని అత్యంత శీతల ప్రదేశాలలో ప్రత్యేక స్థానం దక్కించుకుంది. శీతాకాలంలో ఇక్కడి ఉష్ణోగ్రత -16 డిగ్రీల సెల్సియస్‌కి పడిపోతుంది. ఫలితంగా భారీగా హిమపాతం కురుస్తుంది.ఇది కూడా చదవండి: భారత్‌పై ‘బంగ్లా’ విషం.. ఈ అంశాలతో స్పష్టం -
అహో.. మైమరిపిస్తున్న మంచు అందాలు (ఫొటోలు)
-
మంచు కురిసే వేళలో.. మూడింతలైన కశ్మీర్ అందాలు
జమ్ము: జమ్ముకశ్మీర్‌లోని పర్వత ప్రాంతాల్లో కురుస్తున్న హిమపాతం మైదాన ప్రాంతాలను కూడా తీవ్రంగా ప్రభావితం చేస్తోంది. దీంతో మైదాన ప్రాంతాల్లోనూ చలి తీవ్రత పెరిగింది. కాశ్మీర్‌లోని పర్వతప్రాంతాల్లో మంచు కురిసిన అనంతరం జమ్ముకశ్మీర్‌లో విపరీతమైన చలి వాతావరణం ఏర్పడింది. కనిష్ట ఉష్ణోగ్రతలు ఒక్కసారిగా తగ్గుముఖం పట్టాయి. సోన్మార్గ్లో కనిష్ట ఉష్ణోగ్రత మైనస్ 5.3 డిగ్రీలుగా నమోదైంది.కుప్వారాలోని మచిల్ సెక్టార్లో మంచు కురవడంతో ఆ ప్రాంతం మరింత అందంగా కనిపిస్తోంది. భారీగా పేరుకున్న హిమపాతం పర్యాటకులను అమితంగా ఆకర్షిస్తోంది. గురేజ్, తులైల్, కంజల్వాన్ సరిహద్దు ప్రాంతాలతో సహా బందిపోరా ఎగువ ప్రాంతాలలో కూడా తెల్లటి మంచు దుప్పటి అందంగా పరుచుకుంది.మైదాన ప్రాంతాల్లో కురుస్తున్న పొగమంచు ప్రభావం సిమ్లా వరకు వ్యాపించింది. పొగమంచు కారణంగా మైదాన ప్రాంతాల నుంచి రైళ్లు ఆలస్యంగా నడిచాయి. దీంతో కల్కా నుంచి సిమ్లా వెళ్లే నాలుగు రైళ్లు నాలుగు గంటలు ఆలస్యంగా నడిచాయి. దీంతో వారాంతాల్లో సిమ్లా వచ్చే పర్యాటకులు ఇబ్బందులు పడుతున్నారు. రాబోయే మూడు రోజుల పాటు మైదాన ప్రాంతాల్లో మంచుకురిసే అవకాశాలున్నాయని వాతావరణశాఖ అధికారులు తెలిపారు. దీంతో రైళ్ల రాకపోకలపైనా ప్రభావం పడనుంది.హిమాచల్ ప్రదేశ్‌లో చలి తీవ్రత అధికమయ్యింది. ఆదివారం నాడు 13,050 అడుగుల ఎత్తయిన రోహ్తంగ్ పాస్‌తో సహా పలు పర్వత శిఖరాలపై భారీగా మంచు కురిసింది. లాహౌల్-స్పితి, కులులో ఉష్ణోగ్రతలు గణనీయంగా పడిపోయాయి. దీంతో నదులు, వాగులు, జలపాతాలు గడ్డకడుతున్నాయి.ఇది కూడా చదవండి: కార్తీక వనసమారాధనలో గలాటా -
సౌదీలో ఎన్నడూ చూడని వింత.. తెగ ఆశ్చర్యపోతున్న జనం
రియాద్: సౌదీ అరేబియాలో ఎన్నడూ కానరాని వింత ఇప్పుడు అందరినీ ఆశ్చర్యానికి గురిచేస్తోంది. ఎడారి ప్రాంతమైన సౌదీ అరేబియాలోని కొన్ని ప్రాంతాల్లో భారీ వర్షాలు కురియడతో పాటు మంచుకురుస్తోంది. సౌదీ చరిత్రలో ఎన్నిడూ చూడని వాతావరణాన్ని ఇప్పుడు చూస్తున్నామని స్థానికులు అంటున్నారు.మీడియాకు అందిన వివరాల ప్రకారం అల్-జౌఫ్ ప్రాంతంలో భారీగా మంచుకురిసింది. దేశంలో తొలిసారిగా శీతాకాలపు వాతావరణం కనిపించింది. ఈ ప్రాంతంలో భారీ వర్షాలు కురియడం, వడగళ్ల వానలు పడటం, హిమపాతం ఏర్పడటమనేది ఎన్నడూ జరగలేదు. అల్-జౌఫ్ ప్రాంత ప్రజలు ఉదయం నిద్ర నుంచి లేవగానే తెల్లని మంచును చూశామని ఎంతో గొప్పగా చెబుతున్నారు. 📹 Incredible: Snow Blankets Parts of Saudi Arabia After Heavy Rain & Hail pic.twitter.com/mhn3VHHe5D— RT_India (@RT_India_news) November 4, 2024సౌదీ ప్రెస్ ఏజెన్సీ ఈ ప్రాంతంలోని హిమపాతాన్ని, జలపాతాలను హైలైట్ చేసి చూపిస్తోంది. అయితే రానున్న రోజుల్లో ప్రతికూల వాతావరణం ఏర్పడవచ్చని సౌదీ వాతావరణ శాఖ హెచ్చరికలు జారీ చేసింది. తుఫాను వచ్చే అవకాశం ఉందని, భారీ వర్షంతో పాటు వడగళ్ల వానలు కురిసే అవకాశం ఉందని తెలిపింది. అధికారులు అప్రమత్తంగా ఉండాలని సూచించింది. ఇంతకుముందు యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ (యూఏఈ)లో ఇలాంటి వాతావరణ మార్పులు కనిపించాయి.ఇది కూడా చదవండి: అమెరికా ఎన్నికల వేళ.. ఉత్తర కొరియా వరుస క్షిపణి ప్రయోగాలు -
కేదార్నాథ్ సమీపంలో భారీ హిమపాతం
రుద్రప్రయాగ్: కేదర్నాథ్లో దైవదర్శనం కోసం విచ్చేసిన భక్తులకు అద్భుత దృశ్యం ఆహ్వానం పలికింది. హిమాలయ పర్వత శిఖరాల నుంచి భారీ ఎత్తున మంచు కిందకు కూలుతున్న ‘హిమపాతం’ దృశ్యం అక్కడి వారిని ఆశ్చర్యం, ఒకింత ఆందోళనకు గురిచేసింది. ఆదివారం ఉదయం ఉత్తరాఖండ్‌లోని కేదర్నాథ్ ఆలయం వెనకవైపు నాలుగు కిలోమీటర్లదూరంలోని పర్వతం నుంచి ఒక్కసారిగా భారీ ఎత్తున మంచు విరిగిపడటం ప్రారంభమైంది. భక్తులు ఒకింత భయపడుతూనే ఆ దృశ్యాలను మొబైళ్లలో బంధించేందుకు పోటీపడ్డారు. మేరు–సుమేరు పర్వతశ్రేణుల్లోని చోరాబారీ హిమానీనదం పరిధిలో గాంధీ సరోవర్‌పై హిమపాతం పడింది. మంచంతా లోయలో పడిపోవడంతో కేదర్నాథ్ ఆలయం దాకా దూసుకురాలేదు. దీంతో భక్తులు ఊపిరిపీల్చుకున్నారు. దాదాపు ఐదు నిమిషాలపాటు గుట్టలకొద్దీ మంచు కిందకు పడుతున్న వీడియో వైరల్‌గా మారింది. -
తెలంగాణ:నేడు, రేపు రాష్ట్రంలో మోస్తరు వర్షాలు
సాక్షి, హైదరాబాద్: వేసవి తాపం నుంచి కాస్త చల్లబడ్డ రాష్ట్రంలో రానున్న రెండ్రోజులు పలుచోట్ల వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ తెలిపింది. సౌరాష్ట్ర ప్రాంతంలో ఏర్పడిన ఉపరితల ఆవర్తనం.. మధ్య మహారాష్ట్ర, ఉత్తర లోతట్టు కర్ణాటక మీదుగా దక్షిణ కర్ణాటకకు విస్తరించింది. దీని ప్రభావంతో రాష్ట్రంలోని పలుచోట్ల ఉరుములు, మెరుపులతో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉన్నట్లు వివరించింది. ఆదిలాబాద్, కుమురంభీం ఆసిఫాబాద్, నిర్మల్, నిజామాబాద్, జగిత్యాల, సూర్యాపేట్, మహబూబాబాద్, యాదాద్రి భువనగిరి, రంగారెడ్డి, హైదరాబాద్, మేడ్చల్ మల్కాజ్గిరి, వికారాబాద్, సంగారెడ్డి, మెదక్, కామారెడ్డి జిల్లాలకు వాతావరణ శాఖ ఆరెంజ్ అలర్ట్‌ను జారీ చేసింది. సోమవారం నుంచి రాష్ట్రంలో పొడివాతావరణం ఉంటుందని వెల్లడించింది. ప్రస్తుతం రాష్ట్రంలో ఉష్ణోగ్రతలు సాధారణం, కొన్నిప్రాంతాల్లో అంతకంటే తక్కువగా నమోదవుతున్నాయి. కాగా, సోమవారం నుంచి గరిష్ట ఉష్ణోగ్రతలు పెరుగుతాయని వాతావరణ శాఖ అధికారులు చెబుతున్నారు. శుక్రవారం రాష్ట్రంలోని ప్రధాన ప్రాంతాల్లో గరిష్ట, కనిష్ట ఉష్ణోగ్రతలు పరిశీలిస్తే.. నల్లగొండలో గరిష్ట ఉష్ణోగ్రత 40.0 డిగ్రీల సెల్సియస్, అలాగే ఆదిలాబాద్‌లో కనిష్ట ఉష్ణోగ్రత 21.7 డిగ్రీల సెల్సియస్‌గా నమోదైంది. శుక్రవారం రాష్ట్రంలోని పలు ప్రాంతాల్లో గరిష్ట ఉష్ణోగ్రత సాధారణం కంటే 1 నుంచి 3 డిగ్రీల మేర తక్కువగా నమోదైనట్లు గణాంకాలు చెబుతున్నాయి. -
Manali Hidimba Temple Photos: మంచు ముద్దగా.. హిడింబ దేవాలయం అద్భుతమైన దృశ్యలు (ఫోటోలు)
-
కిడ్స్ తో కలిసి సమ్మర్ వెకేషన్ ఎంజాయ్ చేస్తున్న నమ్రత (ఫొటోలు)
-
ఆఫ్ఘనిస్తాన్‌లో భారీ వర్షాలు.. 39 మంది మృతి!
ఆఫ్ఘనిస్తాన్‌లో భారీ వర్షాలతో పాటు హిమపాతం కారణంగా 39 మంది మృతి చెందారు. మరో 30 మందికి పైగా జనం గాయపడ్డారు. ఈ వివరాలను ఖామా ప్రెస్ వెల్లడించింది. విపత్తు నిర్వహణ మంత్రిత్వ శాఖ ప్రతినిధి జనన్ సయెక్ మాట్లాడుతూ హిమపాతం కారణంగా వేలాది పశువులు కూడా మృతి చెందాయన్నారు. హిమపాతం, వర్షం కారణంగా 637 నివాస గృహాలు ధ్వంసమయ్యాయి. 14 వేల పశువులు చనిపోయాయని తెలిపారు. కాగా నాలుగు రోజులుగా కురుస్తున్న హిమపాతం, మంచు తుఫాను తర్వాత సోమవారం సలాంగ్ హైవేను తెరిచారు. సార్ ఎ పుల్ నివాసి అబ్దుల్ ఖాదిర్ మాట్లాడుతూ భారీవర్షాలు, కురుస్తున్న హిమపాతం తమను ఆందోళనకు గురిచేస్తున్నదని అన్నారు. మంచు కారణంగా భారీ సంఖ్యలో పశువులు మృతి చెందుతున్నాయన్నారు. పలు రోడ్లు బ్లాక్ అయ్యాయని, ప్రభుత్వం అత్యవసర సహాయక చర్యలు చేపట్టాలని కోరారు. కాగా పశువుల యజమానులు ఎదుర్కొంటున్న సమస్యలను పరిష్కరించేందుకు ప్రత్యేక కమిటీని ఏర్పాటు చేస్తున్నట్లు ప్రభుత్వం ప్రకటించింది. బాల్ఖ్, జాజ్జాన్, బద్గీస్, ఫర్యాబ్,హెరాత్ ప్రావిన్సులలో పశువుల యజమానులకు ప్రభుత్వం ఆర్థిక సాయం ప్రకటించింది. -
మంచులో చిక్కుకున్న పర్యాటకులను కాపాడిన ఆర్మీ సిబ్బంది
తూర్పు సిక్కింలోని గ్యాంగ్‌టక్‌లో భారత సైన్యానికి చెందిన త్రిశక్తి కార్ప్స్ సైనికులు మంచులో చిక్కుకున్న పర్యాటకుల ప్రాణాలను కాపాడారు. బుధవారం అకస్మాత్తుగా భారీ హిమపాతం కురియడంతో తూర్పు సిక్కింలోని నటులాలో 500 మంది పర్యాటకులు మంచులో చిక్కుకుపోయారు. వీరిని గమనించిన ఆర్మీ సైనికులు వెంటనే అప్రమత్తమై పర్యాటకులను రక్షించే ప్రయత్నాలను ముమ్మరం చేశారు. అకస్మాత్తుగా కురిసిన భారీ మంచు కారణంగా 500 మంది పర్యాటకులతో పాటు దాదాపు 175 వాహనాలు ఆ ప్రాంతంలో చిక్కుకుపోయాయి. వారిని ఆర్మీ బృందం కాపాడింది. భారత సైన్యానికి చెందిన త్రిశక్తి కార్ప్స్ పర్యాటకులను కాపాడేందుకు ఎల్లప్పుడూ సిద్ధంగా ఉంటుందని ఆర్మీ తెలిపింది. దీనికిముందు ఫిబ్రవరి 20న జమ్మూ కాశ్మీర్‌లోని అనంత్‌నాగ్‌లో భారీ హిమపాతం కారణంగా చిక్కుకుపోయిన వాహనాలను తరలించడంలో సీఆర్పీఎఫ్ సైనికులు సహాయం అందించారు. భారీ వర్షం, హిమపాతం కారణంగా శ్రీనగర్-జమ్మూ జాతీయ రహదారిలో కొండచరియలు విరిగిపడటంతో వాహనాల రాకపోకలకు అంతరాయం ఏర్పడుతోంది. 𝐒𝐮𝐝𝐝𝐞𝐧 𝐒𝐧𝐨𝐰𝐟𝐚𝐥𝐥 𝐢𝐧 𝐄𝐚𝐬𝐭 𝐒𝐢𝐤𝐤𝐢𝐦, 𝟓𝟎𝟎 𝐒𝐭𝐫𝐚𝐧𝐝𝐞𝐝 𝐓𝐨𝐮𝐫𝐢𝐬𝐭𝐬 𝐑𝐞𝐬𝐜𝐮𝐞𝐝 𝐛𝐲 𝐓𝐫𝐨𝐨𝐩𝐬 𝐨𝐟 𝐓𝐫𝐢𝐬𝐡𝐚𝐤𝐭𝐢 𝐂𝐨𝐫𝐩𝐬 𝐈𝐧𝐝𝐢𝐚𝐧 𝐀𝐫𝐦𝐲 Due to sudden heavy snowfall, approximate 175 vehicles with more than 500 tourists got… pic.twitter.com/vdQTbdQ6jJ — Trishakticorps_IA (@trishakticorps) February 21, 2024 -
కశ్మీర్లో విపరీతమైన మంచు.. రహదారుల మూసివేత
జమ్మూకశ్మీర్‌లో భారీగా మంచు కురుస్తోంది. హిమపాతంతో కశ్మీర్‌లోని అనేక ప్రాంతాలు పూర్తిగా మంచుతో కప్పుకుపోయాయి. కశ్మీర్ లోయలోని ఎత్తైన ప్రాంతాలైన పిర్ కీ గలి, జోజిలా, గుల్మార్గ్లలో శుక్రవారం తొలి హిమపాతం నమోదైందికొండలపై నుంచి భారీగా మంచు గడ్డలు కిందకు పడుతున్న దృశ్యాలు సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి. మంచు కారణంగా నిలిచిపోయిన కొన్ని వాహనాలను అధికారులు తొలగించినట్లు అధికారులు తెలిపారు. స్థానిక వాతావరణ కార్యాలయం ప్రకారం, రాత్రిపూట భారీగా మంచు కురిసే అవకాశం ఉంది. కాబట్టి హైవే మూసి ఉంటుందని వారు తెలిపారు. హిమపాతం ముగిసిన తర్వాత హైవేను క్లియర్ చేసే పని ప్రారంభమవుతుందని వారు తెలిపారు. చాలా ప్రాంతాల్లో రోడ్లపై విపరీతమైన మంచు పేరుకుపోవడంతో అధికారులు రహదారులను మూసేశారు. కాశ్మీర్‌ను దేశంలోని ఇతర ప్రాంతాలతో కలిపే ప్రత్యామ్నాయ లింక్ అయిన మొఘల్ రోడ్‌ను హిమపాతం కారణంగా గురువారం వాహనాల రాకపోకలకు మూసివేసినట్లు అధికారులు తెలిపారు. పోషణ- పీర్ కి గలి మధ్య మంచు కురుస్తుండటంతో రహదారి మూసుకుపోయిందని పేర్కొన్నారు. ఈ రోడ్డు జమ్మూలోని పూంచ్, రాజౌరి జిల్లాలను దక్షిణ కాశ్మీర్‌లోని షోపియాన్ జిల్లాతో కలుపుతుంది. రహదారులపై మంచు పేరుకుపోవడంతో దాన్ని తొలగించేందుకు అధికారులు ప్రయత్నిస్తున్నారు. ఈ క్రమంలో రోడ్లపై పలు వాహనాలు నిలిచిపోయాయి. రాత్రి సమయాల్లో భారీగా మంచు కురిసే అకాశం ఉందని స్థానిక వాతావరణశాఖ అధికారులు తెలిపారు. #WATCH | Jammu and Kashmir: Gulmarg receives season's first snowfall. pic.twitter.com/xGHbRm46Wa — ANI (@ANI) November 10, 2023 -
ప్రపంచంలో అధికంగా మంచు కురిసే దేశాలు
-
Char Dham Yatra 2023: 30దాకా కేదార్నాథ్ రిజిస్ట్రేషన్ నిలిపివేత
రిషికేశ్: ఎగువ హిమాలయాల ప్రాంతం గర్వాల్ హిమాలయాల్లో వర్షం, హిమపాతం కారణంగా కేదార్నాథ్ యాత్ర కోసం రిషికేశ్, హరిద్వార్‌లలో జరిగే యాత్రికుల రిజిస్ట్రేషన్లను ఈ నెల 30వ తేదీదాకా నిలుపుదల చేస్తున్నట్లు అధికారులు ప్రకటించారు. మరోవైపు కేదార్నాథ్ ఆలయ ద్వారాలు మంగళవారం తెరుచుకోనున్న సంగతి తెల్సిందే. వాతావరణ పరిస్థితులకు అనుగుణంగా తదుపరి నిర్ణయాలు తీసుకుంటామని సంబంధిత అధికారులు తెలిపారు. బద్రీనాథ్, గంగోత్రి, యమునోత్రి ధామ్‌ల దర్శనాలకు సంబంధించిన రిజిస్ట్రేషన్ కొనసాగుతోంది. -
జోషీమఠ్‌లో మళ్లీ కూల్చీవేతలు
డెహ్రాడూన్: ఉత్తరాఖండ్‌లోని జోషీమఠ్‌లో మంచు, వర్షం కారణంగా నిలిచిపోయిన భవనాల కూల్చీవేత పనులు శనివారం నుంచి మళ్లీ మొదలయ్యాయి. 269 కుటుంబాలను తాత్కాలిక సహాయ కేంద్రాలకు తరలించామని అధికారులు పేర్కొన్నారు. వీరికి హీటర్లు, ఉలెన్ దుస్తులు, వేడి నీరు, ఆహారపదార్థాల కిట్లు అందజేశామన్నారు. కాగా రాష్ట్రంలోని అనేక ప్రాంతాల్లో మంచు కురవడం, తుంపర్ల వర్షం కారణంగా చలి తీవ్రత పెరిగింది. ప్రతికూల వాతావరణం కారణంగా.. జోషీమఠ్‌లో ప్రమాదకరంగా మారిన హోటళ్లు, ఇళ్లను కూల్చివేయడాన్ని తాత్కాలికంగా నిలిపివేసిన విషయం తెలిసిందే. కాగా ప్రకృతిలో సహజసిద్ధంగా వచ్చే మార్పులు కొన్ని, మానవ తప్పిదాలు మరిన్ని మొత్తంగా ఉత్తరాఖండ్‌నే ముంచే పరిస్థితులు ఏర్పడుతున్నాయి. భూగర్భ పొరల్లో జరుగుతున్న మార్పులు, కొండల్ని తొలచి కట్టే అభివృద్ధి ప్రాజెక్టులు హిమాలయాల్లో కొన్ని పట్టణాలకు పెను ముప్పుగా మారుతున్నాయి. భూమి కుంగిపోవడంతో జోషీమఠ్‌లో 849 ఇళ్లకు పగుళ్లు రావడం తెలిసిందే. అంతేగాక జోషిమఠ్ తరహాలో మరిన్ని పట్టణాలు కుంగిపోయే ప్రమాదం ఉందని అధ్యయనాలు హెచ్చరిస్తున్నాయి. -
విశాఖ ఏజేన్సీలో చలి బీభత్సం
-
‘బాంబ్’ కోరల నుంచి బయటపడని అమెరికా.. కనీవినీ ఎరగని విధ్వంసం
బఫెలో: ఈ శతాబ్దంలోకెల్లా అత్యంత తీవ్రమైన మంచు తుపాన్ (Bomb Cyclone) కోరల నుంచి అమెరికా ఇంకా బయట పడలేదు. గత వారం రోజులతో పోలిస్తే హిమపాతం కాస్త తగ్గినా దేశవ్యాప్తంగా అతి శీతల వాతావరణం కొనసాగుతోంది. రోడ్లపై దట్టంగా పేరుకున్న మంచును తొలగించడంతో పాటు విద్యుత్ సరఫరాను పునరుద్ధరించడం వంటి పనులు యుద్ధ ప్రాతిపదికన జరుగుతున్నాయి. దాంతో తుఫాన్ విధ్వంసం తాలూకు తీవ్రత క్రమంగా వెలుగులోకి వస్తోంది. మంచులో కూరుకుపోయిన కార్లలో నిస్సహాయంగా మరణించిన వారి శవాలు ఒక్కటొక్కటిగా బయట పడుతున్నాయి. మంచు తుఫాన్ ధాటికి కనీసం 100 మందికి పైగా మృత్యువాత పడ్డట్టు భావిస్తున్నారు. దీన్ని తరానికి ఒక్కసారి మాత్రమే సంభవించే మహోత్పాతంగా వాతావరణ శాఖ అభివర్ణిస్తోంది. మెరుగవని రవాణా వ్యవస్థ దేశవ్యాప్తంగా వారం రోజులుగా దాదాపుగా స్తంభించిపోయిన రవాణా వ్యవస్థ ఇంకా కుదురుకోలేదు. మంగళవారం కూడా 6,000కు పైగా విమానాలు రద్దయ్యాయి. బుధవారం బయల్దేరాల్సిన 3,500 పై చిలుకు విమానాలను ముందస్తుగానే రద్దు చేశారు. దాంతో విమానాశ్రయాల్లో గందరగోళ వాతావరణం నెలకొంది. చిక్కుబడిపోయిన ప్రయాణికులతో కిక్కిరిసిపోయాయి. బయటికెళ్లే పరిస్థితి లేక ప్రయాణికులంతా టెర్మినల్స్‌లోనే కాలం గడుపుతున్నారు. డిసెంబర్ 22 నుంచి రద్దయిన విమానాల సంఖ్య 25 వేలు దాటింది. సకాలంలో సేవలను పునరుద్ధరించడంలో సౌత్‌వెస్ట్ ఎయిర్‌లైన్స్ వైఫల్యం పరిస్థితిని మరింత జటిలంగా మార్చింది. సంస్థకు చెందిన వేలాది విమాన సర్వీసులు వరుసగా ఆరో రోజూ రద్దవడంపై అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ కూడా ఆగ్రహించారు. ఎయిర్‌లైన్స్ నుంచి భారీగా నష్టపరిహారం వసూలు చేయాలని ప్రయాణికులకు సూచించారు! కానీ పరిస్థితి చక్కబడేందుకు కనీసం ఇంకో వారం పట్టొచ్చని సౌత్‌వెస్ట్ ప్రకటించింది. యథేచ్ఛగా లూటీలు రవాణా వ్యవస్థ స్తంభించడంతో అమెరికాలో చాలా ప్రాంతాల్లో నిత్యావసరాలు తదితరాల సరఫరాకు తీవ్ర అంతరాయం కలిగింది. దాంతో చాలా రాష్ట్రాల్లో ఆకలి కేకలు విన్పిస్తున్నాయి. బయటికెళ్లే పరిస్థితి లేక జనం రోజుల తరబడి ఇళ్లకే పరిమితం కావడంతో ఆహార పదార్థాలు నిండుకున్నాయి. నాలుగైదు రోజులుగా దుకాణాలూ తెరిచుకోక సమస్య మరింతగా విషమించింది. ఫలితంగా మొన్నటిదాకా బఫెలో నగరంలోనే వెలుగు చూసిన లూటీ ఉదంతాలు ఇప్పుడు పలు రాష్ట్రాల్లోనూ నమోదవుతున్నాయి. ముఖ్యంగా నిత్యావసరాల కోసం దుకాణాల్లోకి చొరబడుతున్న ఘటనలు పెరుగుతున్నాయి. అమెరికాలోని పలు ప్రాంతాల్లో ఉంటున్న లక్షలాది మంది తెలుగువాళ్లు కూడా నానా ఇక్కట్లు ఎదుర్కొంటున్నారు. కెనడాలోనూ పరిస్థితి దారుణంగా ఉంది. ఉష్ణోగ్రతలు మైనస్ 50 డిగ్రీల కంటే తక్కువ నమోదవున్నాయి! వరద ముప్పు క్రమంగా పెరుగుతున్న ఉష్ణోగ్రతలతో అమెరికా ఇప్పుడు వరద ముప్పును ఎదుర్కొంటోంది. మంచు శరవేగంగా కరగడం వల్ల ఊహాతీత వేగంతో ఆకస్మిక వరదలు ముంచెత్తవచ్చని పలు రాష్ట్రాలను వాతావరణ శాఖ ఇప్పటికే హెచ్చరించింది. పూర్తిగా మంచులో కూరుకుపోయిన బఫెలో వంటి ప్రాంతాలకు ఈ ప్రమాదం ఎక్కువగా ఉందని పేర్కొంది. బఫెలో.. దయనీయం! పశ్చిమ న్యూయార్క్‌లోని బఫెలో నగరంలో ఇంకా పరిస్థితి ఆందోళనకరంగానే ఉంది. చాలాచోట్ల ఇంకా 8 అడుగుల ఎత్తున మంచు పేరుకుపోయింది. దాంతో అవసరాల్లో ఉన్నవారిని ఆదుకునేందుకు అత్యవసర సర్వీసులు కూడా సకాలంలో చేరుకోలేని పరిస్థితి! నగరంలోకి వెళ్తుంటే యుద్ధరంగంలోకి ప్రవేశిస్తున్నట్టుగా ఉందని న్యూయార్క్ గవర్నర్ కేథీ హోచల్ వాపోయారు. నగరం, పరిసరాల్లో రోడ్డు ప్రయాణాలపై నిషేధం ఇంకా అమల్లోనే ఉంది. దాని అమలుకు మిలిటరీ పోలీసులు రంగంలోకి దిగారు. పొరుగు రాష్ట్రం న్యూజెర్సీ నుంచి ఎమర్జెన్సీ సేవల సిబ్బంది న్యూయార్క్‌కు తరలుతున్నారు. చాలామంది కార్లలోనే చిక్కుకుపోయి ఉన్నారు. 30కి పైగా మృతదేహలను వెలికితీసినట్టు చెబుతున్నారు. ఇంతటి ప్రతికూల వాతావరణాన్ని తమ సర్వీసులోనే ఎన్నడూ చూడలేదని వాతావరణ విభాగం అధికారులు చెబుతున్నారు. సహాయక చర్యల్లో భాగంగా సిబ్బంది ఇంటింటికీ తిరుగుతున్నారు. చావు అంచుల దాకా వెళ్లాం మంచు తుఫాను బారిన పడి అదృష్టవశాత్తూ బతికి బయటపడ్డవాళ్లు తామెదుర్కొన్న కష్టాలను కథలుగా చెబుతున్నారు. మేరీలాండ్కు చెందిన డిట్జక్ ఇలుంగా అనే వ్యక్తి తన ఆరు, పదహారేళ్ల కూతుళ్లతో కలిసి కార్లో హామిల్టన్ వెళ్తూ బఫెలో వద్ద తుఫానులో చిక్కాడు. చూస్తుండగానే కారు చుట్టూ మంచు పేరుకుపోవడంతో గంటల తరబడి కారు ఇంజన్ ఆన్‌లో ఉంచి బిక్కుబిక్కుమంటూ కాలం గడిపారు. ‘‘చివరికి ప్రాణాలకు తెగించాం. ధైర్యం చేసి కష్టమ్మీద కారు దిగాం. చిన్న కూతుర్ని వీపున వేసుకుని, పెద్దమ్మాయీ నేనూ భయానక వాతావరణంలో అతికష్టమ్మీద షెల్టర్ హోమ్ దాకా వెళ్లాం. లోపలికి అడుగు పెడుతూ నేనూ నా పిల్లలూ ఒక్కసారిగా ఏడ్చేశాం. ఇంతటి భయానక అనుభవం జీవితంలో ఎన్నడూ ఎదుర్కోలేదు. ఒక్క అడుగూ వేయడానికి ప్రాణాలన్నీ కూడదీసుకోవాల్సి వచ్చింది. కానీ సాహసం చేయకపోతే కార్లోనే నిస్సహాయంగా మరణించేవాళ్లం’’ అంటూ డిట్జక్ గుర్తు చేసుకున్నాడు. -
అమెరికాలో మంచు తుఫాను బీభత్సం (ఫొటోలు)
-
Photo Feature: వంజంగి కొండలపై పాల సముద్రం..
సాక్షి, పాడేరు: వంజంగి హిల్స్‌లో మూడు రోజులుగా పొగమంచు, మేఘాల అందాలు అలరిస్తున్నాయి. శనివారం వేకువజామున 5గంటలకు సూర్యోదయం కనువిందు చేసింది. ఆహ్లాదకర వాతావరణంతో పాటు సూర్యోదయం అందాలను పర్యాటకులు ఆస్వాదించారు. వంజంగి హిల్స్‌లో మంచు అందాలు నెలకొనడంతో మళ్లీ పర్యాటకుల సందడి మొదలైంది. చదవండి: Photo Feature: మేమా.. టైంకు రావడమా.. సీలేరు: దారాలమ్మతల్లి ఆలయం సమీప అటవీ ప్రాంతం పొగమంచుతో కనువిందు చేసింది. శనివారం వేకువజాము నుంచి ఉదయం 8 గంటల వరకు దట్టంగా పొగమంచు కురిసింది. ఘాట్ మీదుగా ప్రయాణం సాగించిన వాహనదారులు, స్థానికులు ఈ పొగమంచు అందాలను వీక్షించి ఎంతో పరవశించారు. -
అమెరికాను వణికిస్తున్న ఇజ్జీ.. 1,200 విమానాలు రద్దు
అట్లాంటా: అమెరికా ఆగ్నేయ ప్రాంతాన్ని చలి తుఫాను, పెనుగాలులు, హిమపాతం వణికిస్తున్నాయి. వీటి ప్రభావంతో చాలాచోట్ల విద్యుత్ సరఫరాకు అంతరాయాలు, వృక్షాలు నేలకూలడం, రోడ్లన్నీ మంచుతో నిండిపోవడం జరుగుతోంది. జార్జియా, ఉత్తర కరోలినా, దక్షిణ కరోలినా, ఫ్లోరిడా తదితర ప్రాంతాలన్నీ ఆదివారం నుంచి చలిపులి చేతికి చిక్కి వణుకుతున్నాయి. పలు ప్రాంతాల్లో రోడ్డు ప్రమాదాలు జరిగినట్లు హైవే పెట్రోల్ అధికారులు తెలిపారు. (చదవండి: లైన్లో నిలబడితే డబ్బులే డబ్బులు.. గంటకు రూ.2 వేలు పక్కా!) కారును మంచు కప్పేసిన దృశ్యం ఫ్లోరిడాలో గంటకు 190 కిలోమీటర్ల వేగంతో బలమైన ఈదురుగాలులతో విరుచుకుపడ్డ టోర్నడో బీభత్సంతో ఒక ట్రైలర్ పార్క్ నాశనమైంది. చార్లట్ డగ్లస్ విమానాశ్రయం నుంచి 1,200కు పైగా విమానాలను రద్దు చేశారు. కరోలినాలో దాదాపు 1.5 లక్షల మంది ఇళ్లకు విద్యుత్ సరఫరా నిలిచిపోయింది. న్యూయార్క్ పై ప్రభావం ఉండకపోయినా, లాంగ్ ఐలాండ్, కనెక్టికట్ తీరప్రాంతాల్లో ప్రభావం ఉంటుందని అంచనా. ఒహాయో, పెన్సిల్వేనియాల్లో 6– 13 అంగుళాల మేర హిమపాతం ఉండొచ్చని వాతావరణ శాఖ తెలిపింది. (చదవండి: అఫ్గనిస్తాన్‌లో భారీ భూకంపం.. 26 మంది మృతి) -
అమెరికా: కాలిఫోర్నియాను వణికిస్తోన్న మంచు తుఫాను
-
మంచు దుప్పటి కప్పుకున్న కాశ్మీర్
-
రానున్న 12-18 గంటల్లో తీవ్ర మంచు వర్షాలు! రహదారుల మూసివేత..
శ్రీనగర్: జమ్మూ కశ్మీర్, లడఖ్ ఎగువ ప్రాంతాల్లో ఆదివారం (డిసెంబర్ 5) తీవ్రంగా మంచు కురువడంతో బందిపోరా-గురెజ్, సింథన్-కిష్త్వార్, మొఘల్ రహదారులతో సహా సరిహద్దు రహదారులను మూసివేశారు. రానున్న 12 నుంచి 18 గంటల్లో తీవ్రత క్రమంగా పెరిగే అవకాశం ఉందని వాతావరణ అధికారి తెలిపారు. కాశ్మీర్ మెట్రోలాజికల్ డిపార్ట్మెంట్ అంచనా వేసినట్లుగా, అనేక హిల్ స్టేషన్లతో సహా యూనియన్ టెరిటరీ ఎగువ ప్రాంతాల్లో ఉదయం నుండి మంచు వానలు కురుస్తున్నాయి. నిరంతరంగా కురుస్తున్న మంచు కారణంగా అధికారులు ముందు జాగ్రత్త చర్యగా కొన్ని రోడ్లను మూసివేయాల్సి వచ్చిందని వాతావరణ శాఖ తెలిపింది. ఆయా ప్రాంతాల్లో 3 నుంచి 4 అంగుళాలమేర మంచు పేరుకుపోయింది. మరొపక్క ఉష్ణోగ్రతలు గణనీయంగా పడిపోతున్నాయి. దీంతో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని వాతావరణ శాఖ సూచనలు జారీ చేసింది. చదవండి: కేవలం మూడున్నర గంటల్లో మట్టి ఇళ్లను నిర్మిస్తున్న ఇటలీ.. కారణం తెలుసా.. -
Photo Feature: సప్తగిరులపై ‘స్నో’యగాలు
విస్తార వర్షాలతో గిరులు పచ్చదనాన్ని పరుచుకున్నాయి. నీలిమేఘాలు సప్తగిరులను కమ్మేశాయి. పొగమంచు కొత్త అందాలను నెరిపాయి. తిరుమల రహదారుల నుంచి శ్రీవారి మెట్టుమార్గం వైపు చూసినప్పుడు మేఘాలు పరుచుకున్న దృశ్యాలు కనువిందు చేస్తున్నాయి. ఈ హిమ సోయగాలు కొత్త అనుభూతిని కల్గిస్తున్నాయి. కశ్మీర్ లోయను తలపించేలా సప్తగిరులపైన నీలిమబ్బులు పరుచుకున్నాయి. వానలు, మంచు, పచ్చదనం, కమ్మేసిన మబ్బుల దృశ్యాలు సందర్శకులను విశేషంగా ఆకట్టుకుంటున్నాయి. తాము కొత్త లోకాలకు వచ్చామా అన్న అనుభూతిని కలిగిస్తున్నాయి. – తిరుమల కృష్ణమ్మకు ‘ఇంద్ర’హారం చిరుజల్లులకు సూర్యకిరణాలు తోడై సప్తవర్ణ మిళితమైన ఇంద్రధనస్సు విజయవాడ ప్రకాశం బ్యారేజ్ వద్ద సోమవారం ఇలా కనువిందు చేసింది. -
జవాన్‌ను మింగేసిన మంచు.. చిత్తూరు జిల్లాలో విషాదం
ములకలచెరువు(చిత్తూరు జిల్లా): రోడ్డుకు అడ్డుగా పడిన మంచును తొలగిస్తుండగా మంచు చరియలు విరిగిపడి చిత్తూరు జిల్లాకు చెందిన జవాన్ మృతిచెందాడు. ఈ వార్త తెలిసిన వెంటనే ములకలచెరువు మండలం వేపూరికోట పంచాయతీ బంగారువాండ్లపల్లె గ్రామం కన్నీటిపర్యంతమైంది. ఆ జవాన్ తల్లి రోదనలు మిన్నంటాయి. పెద్దావుల నారాయణరెడ్డికి ఇద్దరు కుమారులు. చిన్న కుమారుడు కార్తిక్ కుమార్‌రెడ్డి 2011లో ఇండియన్ ఆర్మీ ఎంఈజీ (మద్రాస్ ఇంజినీరింగ్ గ్రూప్)కి ఎంపికయ్యాడు. కర్ణాటక రాష్ట్రం బెంగళూరులో శిక్షణ పూర్తి చేసుకుని మొదటిగా జమ్ము–కశ్మీర్ రాష్ట్రం శ్రీనగర్‌లో విధుల్లో చేరాడు. అనంతరం అక్కడి నుంచి ముంబైలోని ఆర్మీ సెక్టార్‌కి బదిలీ అయ్యాడు. గతేడాది మే నెలలో తండ్రి నారాయణరెడ్డి అనారోగ్యంతో మృతిచెందాడు. తల్లి సరోజమ్మ ఇంటి వద్ద ఉండేందుకు ఇబ్బంది పడుతుండటంతో ఈ ఏడాది మేలో సెలవుపై ఇంటికొచ్చాడు. బెంగళూరులో ఉద్యోగం చేసుకుంటున్న అన్నయ్య క్రాంతికుమార్‌రెడ్డికి వివాహం జరిపించి తల్లిని వారి సంరక్షణలో ఉంచి వెళ్లాడు. సరిగ్గా నాలుగు నెలల కిందట ముంబై నుంచి హిమాచల్‌ప్రదేశ్ రాష్ట్రం ఉదయ్‌పుర్–టిండి సెక్టార్‌కు బదిలీ అయ్యాడు. దీపావళినాడు గురువారం మంచు చరియలు రోడ్డుకు అడ్డంగా పడ్డాయి. వాహనాల రాకపోకలకు అంతరాయం కలిగింది. దీంతో సహచర జవానులతో కలిసి మంచును తొలగించే పనిలో నిమగ్నమయ్యాడు. సాయంత్రం నాలుగు గంటల సమయంలో ఒక్కసారిగా పెద్ద ఎత్తున మంచు గడ్డలు జవానులపై పడ్డాయి. ఈ ప్రమాదంలో కార్తిక్‌కుమార్‌రెడ్డి(29) మృతిచెందాడు. సుమారు 8 గంటల పాటు సహచర జవానులు మంచు గడ్డలను తొలగించి కార్తీక్‌కుమార్‌రెడ్డి మృతదేహాన్ని బయటకు తీశారు. పోస్టుమార్టం నిమిత్తం దగ్గర్లోని కీలాంగ్ ప్రభుత్వాస్పత్రికి తరలించారు. ఆర్మీ అధికారులు శుక్రవారం తెల్లవారుజామున కార్తీక్‌కుమార్‌రెడ్డి అన్నయ్య క్రాంతికుమార్‌రెడ్డికి ఫోన్ ద్వారా ఈ విషయాన్ని తెలియజేశారు. కుమారుడు మరణవార్త విన్న తల్లి సరోజమ్మను ఓదార్చడం ఎవరి తరం కాలేదు. (చదవండి: రెండ్రోజులు కోస్తాంధ్రకు వర్ష సూచన ) -
1765కు ముందు గాలి నాణ్యత ఎలా ఉండేదో తెలుసా?
పరిశ్రమలతో ప్రస్తుతం వాతావరణం ఎంతగా కలుషితం అవుతోందో మనకు తెలుసు. ప్రపంచంలో పారిశ్రామిక విప్లవం రాక ముందు గాలి నాణ్యత ఎలా ఉండేది? అప్పటి పరిస్థితులను తెలుసుకోవడం ఎలా? ఈ ఆలోచనతో కళాకారుడు, రాయల్ కాలేజీ ఆఫ్ ఆర్ట్స్ పీహెచ్డీ అభ్యర్థి వేన్ బినిటీ గాజుతో కూడిన ఓ శిల్పాన్ని రూపొందించారు. దానిలో 1765కు ముందు గాలిని నింపి త్వరలో స్లాట్లాండ్‌లోని గ్లాస్గోలో జరగబోయే కాప్–26 సదస్సులో భాగంగా నిర్వహించే ‘పోలార్ జీరో ఎగ్జిబిషన్’లో ప్రదర్శనకు ఉంచనున్నారు. అంటార్కిటికా ఐస్ నుంచి.. శిల్పంలో నింపిన గాలిని అంటార్కిటికా మంచు పొరల నుంచి సేకరించారు. గాలిని సేకరించడానికి బ్రిటిష్ అంటార్కిటిక్ సర్వే (బీఏఎస్) సైంటిస్టులతో కలసి బినిటీ ఐదేళ్ల పాటు ఆ మంచు ఖండంలో డ్రిల్లింగ్ చేశారు. 170 మీటర్ల లోతు వరకూ తవ్వకాలు జరిపి మంచును సేకరించారు. దానిని విశ్లేషించి డబ్బాల్లో నింపి పెట్టారు. పర్యావరణ మార్పులను మంచు పొరల్లో గుర్తిస్తూ 1765కు నాటి పరిస్థితులను అంచనా వేశారు. ఆ పొరల్లోని చిన్ని చిన్ని బుడగల నుంచి గాలిని సేకరించారు. ‘‘నా కళ హిమ ఖండాల భూత, వర్తమాన, భవిష్యత్ పరిస్థితులను తెలుపుతుంది. చదవండి: అమెరికా అణు జలాంతర్గామికి ప్రమాదం.. ఆందోళన వ్యక్తం చేసిన చైనా ధ్రువ ప్రాంతాలపై ప్రజలకు అవగాహన కలిగిస్తుంది’’ అని బినిటీ అభిప్రాయపడ్డారు. లిక్విడ్ సిలికాన్‌తో నింపిన గాజు సిలిండర్‌లో 1765 నాటి గాలిని నింపి ఆ కళాఖండాన్ని రూపొందించారు. లిక్విడ్ సిలికాన్ మనకు కనిపిస్తుంది. దానిపైన అత్యంత జాగ్రత్తగా సేకరించిన ఆనాటి గాలి నిండి ఉంటుంది. సాంకేతికంగా సవాలుగా నిలిచే ఈ శిల్పాన్ని ఆధునిక ఇంజనీరింగ్ సామర్థ్యాలతో బీఏఎస్ ల్యాబ్‌లో రూపొందిస్తున్నారు. దీన్ని మొత్తాన్ని వీడియో తీసి ఆన్లైన్లో ఉంచనున్నారు. చదవండి: అఫ్గనిస్తాన్‌లో భారీ బాంబు పేలుడు.. 100 మందికి పైగా మృతి 1765 కీలకమైన సంవత్సరం బీఏఎస్ శాస్త్రవేత్త ముల్వానే మాట్లాడుతూ.. ‘‘మంచు నీటి మాలిక్యూల్స్‌లోని ఐసోటోపిక్ కంపోజిషన్ ద్వారా ఆ మార్పులను గుర్తించవచ్చు. 10 వేల సంవత్సరాల క్రితం నుంచి సుమారు 1765 వరకూ గాలిలో బొగ్గుపులుసు వాయువు స్థాయి దాదాపు ఒకేలా ఉంది. ఆ ఏడాది వరకూ 280 పీపీఎమ్ ఉండేది. ఆ దశకంలో జేమ్స్ వాట్ ఆవిరి యంత్రం రూపొందించాక పారిశ్రామిక విప్లవం మొదలైంది. అప్పటి నుంచే కార్బన్ డైయాక్సైడ్ క్రమంగా పెరుగుతూ వస్తోంది. ఈ ఏడాది మే నెలలో వాతావరణంలో బొగ్గుపులుసు వాయువు స్థాయి 419 పీపీఎంకు చేరింది. ఇప్పుడు ఈ శిల్పం ప్రజల ఊహకు ఓ ప్రేరణగా నిలుస్తుంది. వాతావరణంలో మార్పులను మంచు పొరలను పరిశీలించడం ద్వారా సులువుగా తెలుసుకోవచ్చు’’ అని ఆయన పేర్కొన్నారు. -
అమెరికాలో మంచు తుపాను
బోస్టన్: అమెరికాలోని ఈశాన్య రాష్ట్రాలు తీవ్ర మంచు తుపానుతో అల్లాడుతున్నాయి. ఈ ప్రాంతంలో రెండు రోజులుగా రవాణా వ్యవస్థ పూర్తిగా స్తంభించింది. కరోనా వైరస్ వ్యాక్సినేషన్ కార్యక్రమం కూడా నిలిచిపోయింది. మయిన్, పెన్సిల్వేనియా, న్యూజెర్సీ రాష్ట్రాల్లోని కొన్ని ప్రాంతాలు, మస్సాచుసెట్స్‌లోని బోస్టన్‌లో భారీగా మంచుకురిసింది. మంచుమయంగా మారిన ఓ రహదారి న్యూజెర్సీలో 76 సెంటీమీటర్ల మేర, మన్‌హట్టన్ సెంట్రల్ పార్కులో 43 సెంటీమీటర్ల మేర మంచు పడిందని వాతావరణ శాఖ తెలిపింది. న్యూహాంప్‌షైర్ ఉత్తరభాగంలో అడుగు మేర మంచు పేరుకుపోయింది. మంచు కారణంగా న్యూజెర్సీలో 661 వాహన ప్రమాదాలు చోటుచేసుకున్నట్లు పోలీసులు తెలిపారు. వచ్చే రెండు వారాలపాటు ఇవే వాతావరణ పరిస్థితులు కొనసాగుతాయని భావిస్తున్నారు. -
మంచు ముసుగులో కశ్మీర్ అందాలు
-
మంచు కురిసే వేళలో.. కశ్మీర్ అందాలు చూడ తరమా..
-
హిమపాతంతో ఇద్దరు జవాన్ల మృతి
జమ్మూ: హిమపాతం కారణంగా ఇద్దరు ఆర్మీ జవాన్లు శనివారం తెల్లవారుజామున మృతి చెందారు. లద్ధాఖ్లోని దక్షిణ సియాచిన్ హిమానీనదం వద్ద సుమారు 18 వేల అడుగుల ఎత్తులో పెట్రోలింగ్ నిర్వహిస్తుండగా హిమపాతం సంభవించిందని రక్షణ అధికార ప్రతినిధి కల్నల్ రాజేశ్ కలియా తెలిపారు. హిమపాత సహాయక బృందం ఘటనా స్థలానికి చేరుకుందని, పెట్రోలింగ్ నిర్వహిస్తున్న వారందరినీ గుర్తించి బయటకు తీయగలిగామని ఆయన చెప్పారు. హిమపాతంలో చిక్కుకున్న బాధితులను రక్షించడానికి ఆర్మీ హెలికాప్టర్ల సేవలను కూడా అందుబాటులోకి తెచ్చామన్నారు. వైద్య బృందాలు శాయశక్తులా ప్రయత్నించాయని, అయితే ఇద్దరు జవాన్లు మృతి చెందినట్లు తెలిపారు. -
ఆకలి.. చలి : అరుదైన జంతుజాతి బలి
ఒక పక్క కండరాలను నలిపేసే గడ్డకట్టించే చలి.. మరోవైపు పేగులు మెలిపెట్టే ఆకలి అరుదైన మూగ జీవుల పాలిట అశని పాతంలా తగిలింది. దీంతో ఈశాన్య రాష్ట్రం సిక్కిం పర్వత ప్రాంతాల్లో అరుదైన జంతు జాలి బలైపోయింది. కనీసం 300 అరుదైన హిమాలయన్ జడల బర్రెలు ప్రాణాలొదిలాయి. తాజాగా మంచు కరుగుతుండటంతో వీటి కళేబరాలు బయపడుతున్నాయి. ప్రభుత్వ అధికారి రాజ్ యాదవ్ అందించిన సమాచారం గత ఏడాది డిసెంబర్నుంచి సుదీర్ఘ కాలంగా కురుస్తు మంచు ఈ విషాదానికి దారితీసింది. ఉత్తర సిక్కింలోని ముగుతాంగ్, యమ్తంగ్ పర్వతాలను సందర్శించే స్థానిక నిర్వాహకులు, పశువైద్యులు బృందం వీటి కళేబరాలను శుక్రవారం కనుగొన్నారని ఉత్తర సిక్కిం జిల్లా మేజిస్ట్రేట్ రాజ్ యాదవ్ చెప్పారు. ముగాతాంగ్ , యమ్తంగ్ లోయ ప్రాంతాల్లో హెలికాప్టర్ ద్వాకరా ఆహారం జార విడవడానికి అధికారులు పలుసార్లు ప్రయత్నించినా, వాతావరణ అననుకూల పరిస్థితుల కారణంగా విఫలమయ్యారని యాదవ్ చెప్పారు. వీపరీతంగా కురుస్తున్న మంచు కారణంగా వాటికి ఆహారాన్ని సరఫరా చేయాల్సింది స్థానికులను కోరినట్టు తెలిపారు. 500 జడల బర్రెలు చనిపోయినట్టుగా స్థానికుల ద్వారా తెలుస్తోందని, ఈ సంఖ్యని ధృవీకరించడానికి ప్రయత్నిస్తున్నాయని యాదవ్ తెలిపారు. మరికొన్నింటికి తక్షణ వైద్య సహాయం అందిస్తున్నట్టు వెల్లడించారు. అలాగే పశు సంరక్షణ శాఖ వైద్య బృందం ముకుతాంగ్‌కు ఇప్పటికే చేరుకున్నట్టు తెలిపారు. మరోవైపు చనిపోయిన పశువులను పాతిపెట్టడానికి అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు. -
ఐస్ ఆమ్లెట్
ఐస్ ఆమ్లెట్... ఎప్పుడైనా తిన్నారా? కనీసం పేరైనా విన్నారా? బహుశా వినకపోవచ్చు. ఎందుకంటే.. గతంలో ఎవరూ ఇలాంటి ఆమ్లెట్ వేయలేదు. కానీ అమెరికాలో కురుస్తున్న హిమపాతానికి అక్కడి నదులు, సరస్సులు గడ్డకట్టిపోవడం, రహదారులు, ఇళ్లు మంచుమయం కావడంతో యువత కాస్త భిన్నంగా ఆలోచిస్తున్నారు. వేడివేడి పెనంపై ఆమ్లెట్ వేస్తే మజా ఏముంది? గడ్డకట్టిన మంచుపై వేసి చూద్దామనుకున్నారు. తీరా వేస్తే.. వెడల్పు చేసే అవకాశం ఇవ్వకుండా వెంటనే గడ్డకట్టి పోతోందట. ఇలా మంచుతో ఎన్నో ప్రయోగాలు చేస్తూ సోషల్ మీడియాలో చేస్తున్న పోస్టులు భలే ఫన్నీగా ఉంటున్నాయి. ఇక్కడ చూడండి.. ఏ ఆధారం లేకుండానే ఈ ప్యాంట్లు ఎలా నిలుచున్నాయో.. అంతా మంచు మహత్యం! -
రెండు రోజులుగా రోడ్లపైనే వాహనాలు..
జమ్ము కశ్మీర్ : జమ్ము కశ్మీర్‌లోని ఉదయ్పుర్లో జాతీయ రహదారిపై కిలో మీటర్ల మేర వాహనాలు నిలిచిపోయాయి. గత రెండు రోజులుగా ఎక్కడున్న వాహనాలు అక్కడే ఆగిపోయాయి. భారీగా వర్షం, మంచు కురుస్తుండటంతో కిలోమీటర్ల మేర ట్రాఫిక్ జామ్ అయింది. వాహనదారులు సేదతీరడానికి రోడ్ల పక్కన తాత్కాలిక ఏర్పాట్లను జిల్లా అధికారులు చేశారు. హెల్ప్‌లైన్ నెంబర్‌ను కూడా జారీ చేశారు. మరోవైపు రోడ్డు క్లియర్ చేయడనికి ప్రత్యేక ఏర్పాట్లు చేశారు. -
జమ్మూకశ్మీర్‌లో భారీ హిమపాతం
శ్రీనగర్: మంచువర్షంతో హిమాలయ రాష్ట్రాలు శ్వేతవర్ణం అద్దుకున్నాయి. జమ్మూకశ్మీర్‌తోపాటు హిమాచల్‌ప్రదేశ్, ఉత్తరాఖండ్‌ల్లో గత నాలుగురోజులుగా భారీగా హిమపాతం నమోదవుతోంది. శ్రీనగర్‌లోని అనేక ప్రాంతాలను తొలకరి మంచు పలకరించింది. రాజౌరీ, సోన్మార్గ్లో రోడ్లపై అడుగులమేర మంచు పేరుకుపోవడంతో.. అధికారులు క్లీనింగ్ చర్యలు చేపట్టారు. ఉత్తరాఖండ్‌లోని కేదార్నాథ్తోపాటు గంగోత్రి, యమునోత్రి క్షేత్రాల్లోనూ భారీగా మంచు కురుస్తోంది. హిమాచల్‌ప్రదేశ్‌లోని కులు, మనాలీ మంచువర్షంతో తడిసిముద్దవుతున్నాయి. ప్రఖ్యాత కల్ఫ పర్వతాలు మంచు దుప్పటి కప్పుకున్నాయి. మంచు పెరగడంతో హిమాచల్‌కు పర్యాటకుల తాకిడి పెరిగింది. టూరిస్టులు మంచులో కేరింతలు కొడుతూ ఎంజాయ్ చేస్తున్నారు. ఇక భారీ మంచువర్షంతో జమ్మూకశ్మీర్‌లో జనజీవితం స్తంభించిపోయింది. విద్యుత్ సరఫరా నిలిచిపోవడంతో విద్యార్థులు పట్టపగలే కొవ్వొత్తుల మధ్య పరీక్షలు రాయాల్సిన పరిస్థితి ఏర్పడింది. -
ఆమె రాకుండానే మంచు కురిసింది...
ఆమె వచ్చింది.. ఎడారిలో మంచు కురిసింది... ఇలాంటి వర్ణనలు కవులకు కామనే.. అయితే...ఇక్కడ ఆమె రాకుండానే మంచు కురిసింది. అదీ ప్రపంచంలోనే అతి పెద్ద ఎడారిగా పేరొందిన సహారాలో.. గత 40 ఏళ్లలో ఇలా జరగడం ఇది మూడోసారట. అల్జీరియాలోని ఇన్సెఫ్రా పట్టణానికి సమీపంలో ఉన్న ఎడారిలో ఆదివారం మంచు కురిసింది. కొన్ని ప్రాంతాల్లో 16 అంగుళాల మందం మేర మంచు పేరుకుందని స్థానికులు తెలిపారు. అయితే వాతావరణంలో నెలకొన్న అసమానతల వల్లే మంచు కురిసినట్లు వాతావరణ శాఖ అధికారులు చెబుతున్నారు. -
శ్వేతవర్ణ శోభితమైన సిమ్లా
-
జమ్మూ కశ్మీర్లో భారీ హిమపాతం
జమ్మూ/శ్రీనగర్: కశ్మీర్‌లోని ఎత్తయిన ప్రాంతాల్లో భారీగా మంచు కురుస్తోంది. మైదాన ప్రాంతాల్లో భారీ వర్షాలు కురుస్తున్నాయి. దీంతో మొఘల్ రోడ్డు, శ్రీనగర్–లేహ్ జాతీయ రహదారిలో వాహనాల రాకపోకలను నిలిపివేశారు. శ్రీనగర్‌లో 2.9 డిగ్రీల కనీస ఉష్ణోగ్రత నమోదైందని, లేహ్‌లో మైనస్ 6.4 డిగ్రీలు నమోదైనట్లు వాతావరణ శాఖ తెలిపింది. ‘మొఘల్ రోడ్డును మూసివేశాం. పూంచ్, షోపియాన్ జిల్లాల నుంచి ఒక్క వాహనాన్ని కూడా వెళ్లనివ్వలేదు’ అని డిప్యూటీ సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్ మొహమ్మద్ అస్లామ్ తెలిపారు. కొండచరియలు విరిగిపడే ప్రమాదం ఉన్న నేపథ్యంలో రాష్ట్రవ్యాప్తంగా రాత్రిపూట ప్రయాణాలు చేయవద్దని వాహనదారులకు అధికారులు సూచిస్తున్నారు. మరోవైపు ఉత్తర కశ్మీర్‌లోని గుల్మార్గ్లో శుక్రవారం రాత్రి 2 అంగుళాల మేర మంచు కురిసిందని వాతావరణ శాఖ తెలిపింది. అలాగే కుప్వారాలో అత్యధికంగా 8.9 మిల్లీమీటర్ల వర్షం కురిసినట్లు వెల్లడించింది. -
హిమనిపాతం.. కశ్మీర్ అందాలు అద్భుతం
-
జమ్ము కశ్మీర్లో మరో విషాదం
శ్రీనగర్: జమ్ము కశ్మీర్లో మంచు చరియలు విరిగిపడిన ఘటనలో మరో ఐదుగురు సైనికులు మరణించారు. సోమవారం మచిల్ సెక్టార్లో ఐదుగురి మృతదేహాలను వెలికితీశారు. సైనికుల మృతదేహాలను మంగళవారం వారి స్వస్థలాలకు పంపుతామని ఉన్నతాధికారులు చెప్పారు. ఈ నెల 28న మచిల్ సెక్టార్లో మంచు చరియలు విరిగిపడటంతో సైనికులు గల్లంతయ్యారు. వీరి కోసం సైన్యం గాలింపు చర్యలు చేపట్టగా, ఈ రోజు మృతదేహాలు లభ్యమయ్యాయి. కశ్మీర్లో ఇటీవల పలు ప్రాంతాల్లో మంచు చరియలు విరిగిపడిన ఘటనలో 20 మంది మరణించిన సంగతి తెలిసిందే. వీరిలో 14 మంది సైనికులు ఉన్నారు. మరికొంత మంది సైనికులు గాయపడ్డారు. -
20కి చేరిన హిమపాత మృతుల సంఖ్య
-
హిమపాత మృతులు 20
కశ్మీర్లో మంచు బీభత్సం శ్రీనగర్: కశ్మీర్లో హిమపాతం, కొండచరియలు పడి మరణించిన వారి సంఖ్య ఇరవైకి చేరింది. వారిలో 14 మంది సైనికులే. శుక్రవారం కూడా హిమపాత బీభత్సం కొనసాగింది. సహాయక బృందాలు మరో నలుగురు సైనికుల మృతదేహాలను గుర్తించాయి. నాలుగు రోజులుగా కురుస్తున్న హిమపాతం కారణంగా సైనికులు, సాధారణ ప్రజలు తీవ్ర ఇక్కట్లు పడుతున్నారు. వాతావరణం మెరుగైన తరువాత జవాన్ల మృతదేహాలను వారి స్వస్థలాలకు పంపుతామని రక్షణశాఖ అధికారి తెలిపారు. హిమపాతాల్లో మరణించిన సైనికులకు రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ సంతాపం ప్రకటిస్తూ ఆర్మీ చీఫ్ బిపిన్ రావత్‌కు లేఖ రాశారు. గాయపడిన జవాన్లు త్వరగా కోలుకోవాలని ఆకాంక్షించారు. కర్ణాటక జవాన్ మృతి: జమ్మూకశ్మీర్‌లోని సోనామార్గ్ లో సైనిక శిబిరాలపై గురువారం మంచు చరియలు విరిగిపడిన ఘటనలో కర్ణాటక రాష్ట్రానికి చెందిన సైనికుడు సందీప్‌శెట్టి(28) మరణించారు. అలాగే మేజర్ శ్రీహరి గాయపడ్డారు. హసన్ జిల్లా శాంతిహోబళి దేవిహళ్లి గ్రామానికి చెందిన సందీప్‌శెట్టి ఏడేళ్ల క్రితం సైన్యంలో చేరారు. ఫిబ్రవరి 22న ఆయన వివాహం జరగాల్సి ఉంది. అయితే శెట్టి మరణంపై ఆర్మీ నుంచి జిల్లా అధికారులకు ఇంకా ఎలాంటి సమాచారం అందలేదని తెలిసింది. కొండచరియల కింద చిక్కుకున్న బెళగావికి చెందిన మేజర్ శ్రీహరి తృటిలో ప్రాణాపాయం తప్పించుకున్నారు. -
హిమపాతాల హెచ్చరికలు
-
హిమపాతాల హెచ్చరికలు
చండీగఢ్: జమ్మూ కశ్మీర్, హిమాచల్‌ప్రదేశ్ రాష్ట్రాల్లోని కొన్ని ప్రాంతాల్లో అత్యంత ప్రమాదకర స్థాయిలో హిమపాతాలు చోటుచేసుకునే అవకాశాలున్నాయని మళ్లీ హెచ్చరికలు జారీ అయ్యాయి. గురువారం సాయంత్రం 5 గంటల నుంచి 24 గంటల పాటు ఇవి అమల్లో ఉంటాయని చండీగఢ్‌లోని మంచు, హిమపాతాల అధ్యయన కేంద్రం(ఎస్ఏఎస్ఈ) ప్రకటన జారీచేసింది. జమ్మూ కశ్మీర్లో కుప్వారా, బందీపురా, అనంత్‌నాగ్, బారాముల్లా సహా 12 జిల్లాలకు , హిమాచల్‌ప్రదేశ్‌లో కులూ, చంబా, మండి, షిమ్లా, కిన్నౌర్ తదితర జిల్లాలకు ఈ హెచ్చరికలు జారీచేసినట్లు వెల్లడించింది. ప్రజలు తమ ఇళ్లపై పడిన మంచును ఎప్పటికప్పుడు తొలగించుకుంటూ ఉండాలని సూచించింది. -
హిమాచల్, ఉత్తరాఖండ్‌లలో భారీ హిమపాతం
-
హిమాచల్, ఉత్తరాఖండ్‌లలో భారీ హిమపాతం
సిమ్లా/నైనిటాల్: ఉత్తర భారతం మంచు, శీతల గాలుల గుప్పిట్లో చిక్కుకుంది. హిమాచల్ ప్రదేశ్, ఉత్తరాఖండ్‌లలో శనివారం భారీ హిమపాతం నమోదైంది. ఉత్తరాఖండ్‌లోని పర్యాటక ప్రాంతమైన నైనిటాల్ను రెండేళ్ల విరామం తర్వాత మంచు ముంచెత్తింది. వాహనాల రాకపోకలు, టెలికమ్యూనికేషన్లు, విద్యుత్, నీటి సరఫరాలకు అంతరాయం కలిగింది. సిమ్లాలో మధ్యాహ్నానికి 40 సెం.మీ. ఎత్తున మంచు కురవగా 0.2 సెల్సియస్ డిగ్రీల ఉష్ణోగ్రత నమోదైంది. హిమాచల్‌తోపాటు కశ్మీర్‌లోని కొండ ప్రాంతాల్లో మంచుచరియలు విరిగిపడొచ్చని అధికారులు హెచ్చరికలు జారీ చేశారు. హిమపాతం వల్ల కశ్మీర్లో పలు ప్రాంతాల్లో శనివారం రెండో రోజూ జన జీవనం స్తంభించింది. దేశంలోని ఇతర ప్రాంతాలతో రవాణా సంబంధాలు తెగిపోయాయి. శ్రీనగర్ సహా పలు చోట్ల ఉష్ణోగ్రతలు భారీగా పడిపోయాయి. పంజాబ్, హరియాణాల్లో పలుచోట్ల భారీ వర్షాలు కురిశాయి. -
సమయం లేదు మిత్రమా.. స్వీట్ వార్నింగ్!
శ్రీనగర్: నేలతల్లి ఇంటికి మంచుమామ విచ్చేశాడు. భారీగా హిమపాతం కురిపిస్తూ ఉత్తరభారతాన్ని గిలిగింతలు పెట్టాడు. అసలే అందంగా ఉండే కశ్మీర్‌ను ఇంకాస్త రసవత్తరంగా మార్చేశాడు. ఇటు హిమాచల్ ప్రదేశ్, ఉత్తరాఖండ్‌లోనూ ధవళవర్ణంలో మెరిపోతూ కనిపించాడు. ఈ శీతాకాలపు అతిథి ఇంకా కొన్ని రోజులు మాత్రమే అక్కడ కొలువైఉంటాడు. తన మ్యాజిక్ కరిగిపోయి నీరులా మారకముందే చూడటానికి రమ్మంటూ పర్యాటకులను ఆహ్వానిస్తున్నాడు.‘సమయంలేదు మిత్రమా..’ అంటూ ‘స్వీట్ వార్నింగ్’ ఇస్తున్నాడు. మధ్యధరా ప్రాంతంలో ఆవిర్భవించి, వాయువ్య దిశగా కదులుతూ హిమాలయాల వద్ద మంచు వర్షాన్ని కురిపించే Western Disturbance(పశ్చిమ కలవరాలు) జనవరి 3 నుంచి ఉత్తరభారతంపై ప్రభావాన్ని చూపుతున్నాయి. జమ్ముకశ్మీర్‌లోని చాలా ప్రాంతాల్లో, హిమాచల్‌ప్రదేశ్, ఉత్తరాఖండ్‌లోని పలు ప్రాంతాల్లో శుక్రవారం రాత్రి నుంచి ఎడతెరిపిలేకుండా హిమం, వర్షం కురుస్తోంది. దీంతో అక్కడి ఇళ్లు, చెట్లు, రోడ్లు, వాహనాలు.. అన్నింటిపైనా ఇంచులకొద్దీ మంచు పేరుకుపోయింది. ఆ దృశ్యాలను ఆస్వాదించేందుకు పర్యాటకులు పెద్ద సంఖ్యలో తరలివెళుతున్నారు. రాగల 24 గంటలూ హిమపాతం కొనసాగే అవకాశాలున్నాయని భారత వాతావరణ శాఖ(ఛండీగఢ్) అధికారి మృత్యుంజయ్ మహాపాత్ర చెప్పారు. (మంచుదుప్పటిలో ఉత్తరభారతం: ఫోటో గ్యాలరీ కోసం ఇక్కడ క్లిక్ చేయండి) -
మంచుదుప్పట్లో ఉత్తరభారతం
-
ఎడారిలో మంచు కురిసింది!
గల్ఫ్ దేశాలు అంటే ముందుగా గుర్తుకొచ్చేది అక్కడి ఎడారులే. కానీ, ఇప్పుడు మాత్రం అక్కడ ఎడారులన్నీ తెల్లటి మంచుతో మెరిసిపోతున్నాయి. జనం ఏసీలు వేసుకోడానికి బదులు రూం హీటర్లు పెట్టుకోవాల్సి వస్తోంది. బయటకు వెళ్తే ఎప్పుడూ లేనట్లుగా స్వెటర్లు, మఫ్లర్లు.. ఇలాంటి దుస్తులతో వెళ్లాల్సి వస్తోంది. ఆరు బయట కురుస్తున్న మంచుతో అమెరికా లాంటి దేశాల్లో కనబడే ''స్నోమాన్'' బొమ్మలు కూడా కనిపిస్తున్నాయి. ఒక్కసారిగా ఉష్ణోగ్రతలు -3 డిగ్రీల సెల్సియస్ స్థాయికి పడిపోయాయి. దేశంలోని ఉత్తర ప్రాంతాల్లో చలిగాలులు వీస్తున్నాయి. సాధారణంగా ఇక్కడ అక్టోబర్ నెల వరకు ఓ మాదిరి వర్షపాతం ఉంటుంది. కానీ ఇప్పుడు కూడా అక్కడ వర్షాలు కొనసాగుతూనే ఉన్నాయి. సాధారణంగా ఇక్కడ శీతాకాలంలో ఇంత పెద్ద ఎత్తున మంచు పడటం ఉండదు. దాంతో ఇప్పుడు కొత్తగా కురుస్తున్న మంచుతో సౌదీ అరేబియన్లు, అక్కడ ఉంటున్న ఇతర దేశాల పౌరులు మంచి సంబరంగా కనిపిస్తున్నారు. వాస్తవంగా ఇక్కడి వర్షపాత కాలం ముగిసిపోయి 40 రోజులు అయిపోయినా, ఇప్పుడు మళ్లీ రెండో వర్షాకాలం మొదలైందని ఖాసిమ్ యూనివర్సిటీలో వాతావరణ శాస్త్రాల ప్రొఫెసర్ అబ్దల్లా అల్ ముసానద్ తెలిపారు. గత సంవత్సరం ఏప్రిల్ నెలలో సౌదీ అరేబియాలో వచ్చిన వరదల కారణంగా 18 మంది మరణించారు. ఇప్పటికైతే మాత్రం కొత్తగా కురుస్తున్న మంచుతో సౌదీలు సరదాలు తీర్చుకుంటున్నారు. స్నోమాన్ బొమ్మలు చేసి వాటితో సెల్ఫీలు దిగుతున్నారు. -
మంచు కురిసే లోపల మారణహోమం!
సర్జికల్ దాడులపై ప్రతీకారేచ్ఛతో పాక్ రగిలిపోతోందా? అంటే తాజగా ఇంటిలిజెన్స్ విడుదల చేసిన రిపోర్టులు దీన్నే సూచిస్తున్నాయి. అంతేకాకుండా నియంత్రణ రేఖ(ఎల్వోసీ), అంతర్జాతీయ సరిహద్దుల్లో భద్రతా దళాలపై పాకిస్తాన్ రేంజర్లు జరుపుతున్న వరుస కాల్పులు మరో మూడు రోజుల పాటు కొనసాగుతాయని ఇంటిలిజెన్స్ రిపోర్టులు వచ్చాయి. మంచు కురవడం ప్రారంభమయ్యే నాటికే టెర్రరిస్టులను భారత్ లోకి పంపి సర్జికల్ దాడులకు ప్రతీకారం తీర్చుకునేందుకు పాక్ చూస్తున్నట్లు సమాచారం. గడచిన నాలుగు రోజులుగా నియంత్రణ రేఖ వద్ద పాకిస్తాన్ ఎస్ఎస్ జీ కమాండో ప్లటూన్లను మోహరిస్తుండటం ఇంటిలిజెన్స్ హెచ్చరికలను బలపరుస్తున్నాయి. పాక్ కు చెందిన 14 నుంచి 15 ఎస్ఎస్ జీ ప్లటూన్లను ఓ కల్నల్ ర్యాంకు ఆఫీసర్ ఎల్వోసీ వద్ద లీడ్ చేస్తున్నట్లు తెలిసింది. గత రెండు రోజులుగా పాకిస్తాన్ పదే పదే బీఎస్ఎఫ్ జవానుల క్యాంపులపై మోటర్లతో కాల్పులు చేస్తున్న విషయం తెలిసిందే. అంతర్జాతీయ సరిహద్దులో గల కతువా, హీరానగర్, సాంబా, ఆర్నియా, ఆర్ఎస్ పురా, అక్నూర్ ప్రాంతాలతో పాటు ఎల్వోసీ వెంబడి తంగ్ ధర్, పూంచ్ సెక్టార్లలో విచక్షణారహితంగా పాక్ రేంజర్ల కాల్పులు జరిపారు. అయితే, ఈ దాడులన్నింటిని బీఎస్ఎఫ్ దళాలు సమర్ధవంతగా తిప్పికొట్టిన విషయం తెలిసిందే. -
హిమపాతంలో జవాను మృతి
కనిపించని మరొకరి జాడ సియాచిన్‌లో మరో దుర్ఘటన జమ్మూ/శ్రీనగర్: సియాచిన్‌లో ప్రాణాలను పణంగా పెట్టి దేశ రక్షణకు పాటుపడుతున్న సైనికులపై మరోసారి హిమపాతం విరుచుకుపడింది. ఇటీవల పది మంది జవాన్లు మంచులో మృత్యువుతో పోరాడి ప్రాణాలు విడిచిన విషాదం మరువక ముందే మరో దుర్ఘటన సంభవించింది. శుక్రవారం సియాచిన్ తుర్టక్ సెక్టార్ లడక్‌లో ఆర్మీ గస్తీ బృందంపై హిమపాతం పడటంతో ఒక జవాను మృతిచెందగా, మరో జవాను గల్లంతయ్యారు. ‘ప్రపంచంలోనే ఎత్తయిన యుద్ధభూమి తుర్టక్లో పెట్రోలింగ్ చేస్తున్న ఆర్మీ బృందంపై ఉదయం 8 గంటల సమయంలో ఒక్కసారిగా మంచు పడింది. ఇద్దరు జవాన్లు అందులో చిక్కుకుపోయారు. వెంటనే డ్రిల్లింగ్‌తో మంచు తొలగించి లాన్స్ హవల్దార్ భవన్ తమాంగ్‌ను బయటకు తీశాం. తీవ్ర గాయాలతో ఉన్న అతడిని వెంటనే ఆసుపత్రికి తరలించగా చికిత్స పొందుతూ మృతిచెందారు’ అని ఆర్మీ ప్రతినిధి తెలిపారు. ప్రతికూల వాతావరణంలోనూ మరో జవాను కోసం తీవ్రంగా ప్రయత్నాలు చేశామని, అయినా అతడి జాడ తెలియలేదని చెప్పారు. డార్జిలింగ్‌లోని లోప్షూనకు చెందిన తమాంగ్ మరణం పట్ల ఆర్మీ కమాండర్, లెఫ్టినెంట్ జనరల్ డీఎస్ హుడా తన సంతాపాన్ని ప్రకటించారు. గత నెలలో సియాచిన్ గ్లేసియర్‌లో హిమపాతం దెబ్బకు లాన్స్ నాయక్ హనుమంతప్పతో పాటు పది మంది సైనికులు మత్యు ఒడికి చేరిన విషయం తెలిసిందే. -
జమ్మూకశ్మీర్ లో హైవేల మూసివేత
జమ్మూ: భారీ వర్షాలు, హిమపాతంతో జమ్మూకశ్మీర్ లో జనజీవన స్తంభించింది. మంచు బాగా కురుస్తుడడంతో పలు రహదారులు మూతపడ్డాయి. శ్రీనగర్-లెహ్, జమ్మూ-శ్రీనగర్ జాతీయ రహదారులను మూసివేశారు. గత 24 గంటలుగా వర్షాలు కురుస్తుండడంతో రామబాన్ జిల్లాలోని రామసో, మాగర్ కోటె ప్రాంతంలో పెద్ద ఎత్తున కొండచరియలు విరిగిపడ్డాయి. దీంతో జమ్మూ-శ్రీనగర్ హైవేను మూసివేయాల్సి వచ్చిందని, కశ్మీర్ లోయలోని ప్రజలకు వస్తువులు సరఫరా చేస్తున్న దాదాపు 500 వాహనాలు నిలిచిపోయాయని అధికారులు తెలిపారు. భారీ హిమపాతంతో శ్రీనగర్-లెహ్ రహదారిని మూసేశారు. రోడ్డు 2 అడుగుల మేర మంచు పేరుకుపోయిందని, దీంతో వాహనాలను అనుమతించడం లేదని అధికారులు వెల్లడించారు. అయితే వర్షాలు క్రమంగా తగ్గుముఖం పట్టే అవకాశముందని వాతావరణ శాఖ అధికారులు తెలిపారు. -
ఆకర్షిస్తున్న మంచుకొండలు
-
ఎవరెస్టుపై మంచు కొండలు విరిగిపడి 18 మంది మృతి
-
ఎవరెస్టుపై మంచు కొండలు విరిగిపడి 18 మంది మృతి
ఖాట్మండు : నేపాల్ లో సంభవించిన పెను భూకంపం అనంతరం ప్రపంచంలో ఎత్తైన శిఖరం మౌంట్ ఎవరెస్టుపై మంచు కొండలు విరిగి పడటంతో 18 మంది మృతిచెందారు. శనివారం సాయంత్రం ఈ దుర్ఘటన చోటుచేసుకుంది. అయితే వీరు యాత్రికులా? పర్వతారోహకులా ? ఎవరన్నది పూర్తి వివరాలు తెలియరాలేదు. నేపాల్ లో సంభవించిన భూకంపంలో 700మందికి పైగా మరణించిన విషయం తెలిసిందే. -
మంచు, నీళ్లతో నిండిన ఉత్తర భారతం
ఉత్తర భారతంలోని పలు ప్రాంతాలు అకస్మాత్తుగా వచ్చిన వర్షం కారణంగా అస్తవ్యస్తంగా తయారయ్యాయి. జమ్మూకశ్మీర్, హిమాచల్ ప్రదేశ్, ఉత్తరాఖండ్‌లలో భారీగా మంచు పడింది. కొండచరియలు విరిగిపడ్డాయి. ఢిల్లీ, హర్యానా, ఛండీగడ్, రాజస్థాన్, ఉత్తరప్రదేశ్, మధ్యప్రదేశ్, గుజరాత్‌లలో కూడా ఓ మోస్తరుగా వర్షాలు, మంచు కురిసింది. ఢిల్లీలోని చాలా చోట్ల నీళ్లు నిలిచిపోయి, రవాణా రాకపోకలు సోమవారం నిలిచిపోయాయి. జమ్ముశ్రీనగర్లో తీవ్రంగా మంచు కురవడంతోపాటు కొండచరియలు విరిగి పడటంతో కొన్ని రహదారులు మూసి వేశారు. చాలా చోట్ల రైళ్ల రాకపోకలు నిలిచిపోయాయి. ఒక్కసారిగా ఉష్ణోగ్రతలు పడిపోయినట్లు భారత వాతావరణ శాఖ తెలిపింది. -
హిమపాతంతో జమ్మూ-శ్రీనగర్ హైవే మూసివేత
శ్రీనగర్: అధిక హిమపాతంతో జమ్మూ- శ్రీనగర్ జాతీయ రహదారిని మూసివేసినట్టు పోలీసులు తెలిపారు. హిమపాతానికి తోడు కొండచరియలు విరిగి పడడంతో హైవేపై రాకపోకలు నిలిపివేసినట్టు వెల్లడించారు. విరిగిపడిన కొండచరియలను తొలగించేందుకు అధికారులు ప్రయత్నిస్తున్నారు. -
'తెల్ల'బోయిన కాశ్మీర్, ముంచెత్తుతున్న మంచు
ఎడతెరిపి లేని హిమపాతం కాశ్మీర్ ని మృత్యువస్త్రంలా కప్పుకుంది. కొండల్లో కురిసిన హిమపాతం లోయల్లోకి దొర్లడంతో ఇద్దరు సైనికులు సహా పదిమంది హిమసమాధి అయిపోయారు. మరో వంద మందిని సురక్షిత ప్రాంతాలకు తరలించాల్సి వచ్చింది. దాదాపు 150 కట్టడాలు మంచు దెబ్బకి కుప్పకూలిపోయాయి. గత కొద్దిరోజులుగా హిమపాతం కాశ్మీర్ ని అతలాకుతలం చేస్తోంది. మంచుతో రోడ్లన్నీ కప్పుకుపోయాయి. అటు విమాన ప్రయాణాలూ ఆగిపోయాయి. హిమపాతం బరువుకి ఇళ్లు కూలిపోతున్నాయి. కొండ చరియలపై జీవిస్తూ మేకలను మేపుకునే గుజ్జర్లు, బకర్వాల్ ల పరిస్థితి మరీ దారుణంగా ఉంది. ఉత్తర కాశ్మీర్ లోని కుప్వారా జిల్లాలో పరిస్థితి అత్యంత భీకరంగా ఉంది. బయటి ప్రపంచంతోనే కాదు, పొరుగూళ్లతోనూ సంబంధాలు తెగిపోయాయి. భూతల స్వర్గం లాంటి కాశ్మీర్ భూలోక నరకంగా మారింది. ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలించేందుకు హెలికాప్టర్లు సిద్ధంగా ఉన్నాయని ముఖ్యమంత్రి ఉమర్ అబ్దుల్లా ట్విట్టర్ ద్వారా ప్రజలకు తెలియచేశారు. -
వణికిపోతున్న అగ్రరాజ్యాలు
అగ్రరాజ్యాలను మంచు తుఫాను గజగజ వణికిస్తోంది. యూకే, అమెరికాలలో విపరీతంగా మంచు కురుస్తోంది. దీంతో జనజీవనం అస్తవ్యస్థమైంది. యూకే వాతావరణంలో ఇంకా మార్పు రాలేదు. బ్రిటన్‌లో వరదలు ముంచెత్తుతున్నాయి. తాజాగా మరో ఇద్దరు చనిపోయినట్టు అధికారులు చెబుతున్నారు. సెంట్రల్ లండన్‌లో మినిక్యాబ్లో వెళ్తున్న మహిళపై బిల్డింగ్ కూలడంతో ఆమె అక్కడికక్కడే ప్రాణాలు వదిలింది. ఎక్కడికక్కడే సింక్ హోల్స్ ఏర్పడడంతో జనం ప్రాణాలను అరచేతిలో పెట్టుకుని కాలం వెళ్లదీస్తున్నారు. అత్యవసర పరిస్థితుల్లో తప్ప ఇళ్లల్లోంచి బయటకు రావట్లేదు. వరద పీడిత ప్రాంతాల నుంచి రెస్క్యూ టీమ్, ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలిస్తోంది. మరోవైపు రంగంలోకి దిగిన ఆర్మీ వరదలో చిక్కుకుపోయిన వారిని రక్షించే పనిలో పడింది. మృతుల సంఖ్య పెరిగే ప్రమాదముందని అధికారులు చెబుతున్నారు. బ్రిటన్‌లో గంటకు 128 కిలోమీటర్ల వేగంతో చలిగాలులు వీస్తున్నాయి. ఎడతెరిపిలేకుండా మంచు కురుస్తుండడంతో జనం ఇళ్లల్లోంచి బయటకు రాలేని పరిస్థితి నెలకొంది. మరోవైపు థేమ్స్ నది ఉప్పొంగి ప్రవహిస్తోంది. ఐర్లాండ్‌లో ఉష్ణోగ్రతలు పూర్తిగా పడిపోయాయి. ఇప్పటికే లక్షలాది కుటుంబాలు కరెంట్ లేక కష్టాలు పడుతున్నాయి. యూకే, యూఎస్‌లలో పలు విమాన సర్వీసులను రద్దు చేశారు. జపాన్‌లో కూడా మంచు తుపాను బీభత్సం సృష్టిస్తోంది. ప్రకృతి ప్రకోపానికి ముగ్గురు మృతిచెందగా, సుమారు 850మంది గాయాలపాలయ్యారు. జనజీవనం పూర్తిగా దెబ్బతింది. విపరీతంగా మంచు కురుస్తుండడంతో పలు ప్రాంతాల్లో 26 సెంటీమీటర్ల మేర మంచు పేరుకుపోయింది. రోడ్డు, రైల్వే, విమాన సర్వీసులకు తీవ్ర అంతరాయం ఏర్పడుతోంది. జపాన్‌లో గత 45 ఏళ్లల్లో ఎప్పుడూ లేనట్టు భీకర తుపాను ముంచెత్తింది. పెరూలో వరదలు బీభత్సాన్ని సృష్టిస్తున్నాయి. హువలంగా నది కట్టలు తెంచుకుని ప్రవహిస్తోంది. వరద నీరు ఏరులై పారుతుండడంతో జనజీవనం అస్తవ్యస్థమైంది. 45 ఇళ్లు, 15 బిల్డింగ్స్ పూర్తిగా నాశనమయ్యాయి. చెట్లు నేలకొరిగాయి. పంటలన్నీ నీటిపాలయ్యాయి. మరోవైపు వ్యాధులు ప్రబలే ప్రమాదముండడంతో అధికారులు అప్రమత్తమయ్యారు. ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలించే పనిలో పడ్డారు. మరికొన్ని రోజులు వాతావరణంలో మార్పు ఉండబోదని అందరూ అప్రమత్తంగా ఉండాలని సూచించారు. ఉత్తర భారతదేశంలో కూడా హిమపాతం కప్పేస్తోంది. ఎడతెరిపి లేకుండా కురుస్తున్న మంచుతో ప్రజాజీవనం స్తంభించిపోతోంది. హిమాచల్‌ప్రదేశ్ లోని ప్రముఖ పర్యాటక ప్రాంతం సిమ్లా మంచులో కూరుకుపోయింది. విరామం లేకుండా కురుస్తున్న మంచుతో ఇళ్లు, రహదారులు అన్నీ హిమమయం అయ్యాయి. ఓ వైపు మంచుతో స్థానికులు ఇబ్బంది పడుతుంటే సందర్శకులు మాత్రం ఎంజాయ్ చేస్తున్నారు. మంచులో తడిసి ముద్దవుతూ ఆనందం పంచుకుంటున్నారు.