సిమ్లా/నైనిటాల్: ఉత్తర భారతం మంచు, శీతల గాలుల గుప్పిట్లో చిక్కుకుంది. హిమాచల్ ప్రదేశ్, ఉత్తరాఖండ్‌లలో శనివారం భారీ హిమపాతం నమోదైంది. ఉత్తరాఖండ్‌లోని పర్యాటక ప్రాంతమైన నైనిటాల్‌ను రెండేళ్ల విరామం తర్వాత మంచు ముంచెత్తింది. వాహనాల రాకపోకలు, టెలికమ్యూనికేషన్లు, విద్యుత్, నీటి సరఫరాలకు అంతరాయం కలిగింది. సిమ్లాలో మధ్యాహ్నానికి 40 సెం.మీ. ఎత్తున మంచు కురవగా 0.2 సెల్సియస్ డిగ్రీల ఉష్ణోగ్రత నమోదైంది.
హిమాచల్‌తోపాటు కశ్మీర్‌లోని కొండ ప్రాంతాల్లో మంచుచరియలు విరిగిపడొచ్చని అధికారులు హెచ్చరికలు జారీ చేశారు. హిమపాతం వల్ల కశ్మీర్‌లో పలు ప్రాంతాల్లో శనివారం రెండో రోజూ జన జీవనం స్తంభించింది. దేశంలోని ఇతర ప్రాంతాలతో రవాణా సంబంధాలు తెగిపోయాయి. శ్రీనగర్ సహా పలు చోట్ల ఉష్ణోగ్రతలు భారీగా పడిపోయాయి. పంజాబ్, హరియాణాల్లో పలుచోట్ల భారీ వర్షాలు కురిశాయి.
హిమాచల్, ఉత్తరాఖండ్‌లలో భారీ హిమపాతం
Published Sun, Jan 8 2017 8:22 AM | Last Updated on Tue, Sep 5 2017 12:45 AM
Advertisement